ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు. part1 cloud text 6thOct24 Updated
ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
రచయిత ముందు మాట.
మొదటి భాగము.
పాఠకులకు మేము ముందుగా తెలియజేయు విషయమేమనగా! ఈ పుస్తకములో కేవలము ఆధ్యాత్మికమునకు
సంబంధించిన 1030 ల ప్రశ్నలు వాటికి జవాబులు గలవు. ఈ ప్రశ్న-జవాబులను రెండు భాగములుగ వ్రాయడము జరిగినది.
మొదటి భాగములోని 388 ప్రశ్నలు ఇతరులు మమ్ములనడిగినవి. అలాగే రెండవ భాగములోని 642 ప్రశ్నలు మేము
ఇతరులనడిగినవి. మొదటి భాగములో ఇతరులడిగిన ప్రశ్నలకు, రెండవభాగములో మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు మేమే
వ్రాయడము జరిగినది. ఇంక కొంత వివరముగ చెప్పాలంటే 1988 నుండి 1992 వరకు మాచే ప్రచురింపబడిన “ప్రబోధాత్మజమ్”
అను మాసపత్రిక ద్వార పాఠకులు మమ్ములనడిగిన ప్రశ్నలకు పత్రికా ముఖముగ జవాబులిచ్చెడివారము. ఆ ప్రశ్న జవాబులే
మొదటి భాగముగ ముద్రింపబడినవి. ఇక రెండవ భాగములోని ప్రశ్నలను మేము 1986 నుండి నిర్వహించుచున్న జ్ఞానపరీక్షలలో
ఇచ్చినవి. మేము ప్రశ్నించిన ప్రశ్నలకు తర్వాత వివరముగ జవాబులు కూడ మేమే చెప్పాము. వాటినన్నిటిని కూర్చి ఆధ్యాత్మిక
ప్రశ్నలు-జవాబులను పుస్తకము చేశాము. ఆత్మ జ్ఞానమునకు సంబంధించిన ప్రశ్నలగుటవలన దీనికి ఆ పేరు పెట్టవలసి
వచ్చినది.
ఆధ్యాత్మికములో మనిషికి ఎన్నో ప్రశ్నలు రావడము సహజము. ప్రశ్నలు రావడము సహజమే అయినప్పటికి కొందరు
అన్ని ప్రశ్నలకు జవాబులు వెతకరు. కొందరు మాత్రము ప్రశ్నలకు జవాబులు దొరుకు వరకు అన్వేషిస్తారు. అలాంటివారికి
గురువులు స్వాములనువారు జవాబులు చెప్పకపోతే వారు దేవుడే లేడను నిర్ధారణకు వచ్చి నాస్తికులైనారు. జవాబులను పూర్తి
తెలుసుకోక సర్దుబాటగువారు ఆస్తికులుగ మిగిలిపోయారు. సరియైన వివరముతో జవాబు తెలుసుకోక ఎవరు ఏది చెప్పిన
నమ్ము ఆస్తికులకంటే పూర్తి వివరము కొరకు అన్వేషిస్తు సరియైన జవాబివ్వనపుడు ఎంతటి వారినయిన తోసిపుచ్చు వారే
మేలనుకుంటాము. ప్రశ్నకు జవాబు లేక ఆధ్యాత్మికమంతా కల్పితమను భావముతో కొందరు నాస్తికులైనారు, కాని జవాబు
దొరికితే జ్ఞాన మార్గములో ఇపుడున్న ఆస్తికులకంటే ముందుండగలరు. ఒకప్పుడు మేము కూడ చాలామంది స్వాములను
గురువులను కొన్ని ప్రశ్నలడిగాము. కాని వారినుండి సంతృప్తియైన జవాబు రాలేదు. చివరకు నిజము ఎవరు చెప్పక పోయేసరికి
సత్యమేదో మేము తెలుసుకొని అందరికి అన్ని ప్రశ్నలకు జవాబివ్వాలను కొన్నాము. నావలె ప్రశ్నించి జవాబు దొరకక
నిరుత్సాహముతో ఎవరు ఉండకూడదనుకొన్నాము. మా ధ్యేయములో ఎవరు ఏ విధముగ ప్రశ్న అడిగిన దానికి సమాధానమివ్వాలను
కొన్నాము. ఆ ఉద్దేశ్యముతోనే వ్రాయబడినదీ పుస్తకము. ఈ పుస్తకములోని 1030 ల ప్రశ్నలలో నాస్తికులు ఆస్తికులు అడిగెడివి
అన్ని ఉన్నాయి. కొందరి ఊహకు కూడ రాని ప్రశ్నలను కూడ మేమే ప్రశ్నించి వాటికి జవాబివ్వడము కూడ జరిగినది.
ఎన్నో విధముల ప్రశ్నలను వాటికి జవాబులను అందించినప్పటికి కొందరు వాటిని అర్థము చేసుకోలేనివారు కూడ
కలరు. అటువంటి వారు తమకు సంబంధములేని తమకు ఉపయోగపడని కొన్ని ప్రశ్నలను పట్టుకొని, వాటికి
జవాబులడుగుచుందురు. ఆ ప్రశ్నలకు దేవుడు దిగివచ్చిన జవాబు చెప్పలేడు. ఆ ప్రశ్నలకు జవాబే ఉండదు. అటువంటి
అవసరము లేని వాటిని పట్టుకొని కాలమును వృథా చేసుకొనుచున్నారు. జవాబులు లేని ప్రశ్నలెలా ఉండునని కొందరడుగవచ్చును.
అటువంటి వాటికి ఉదాహరణగా ఒక ప్రశ్నను చెప్పెదను చూడండి. ఒక జొన్నదంటును ఒక దూడ తింటున్నది. జొన్నదంటు
తొమ్మిది అడుగుల పొడవున్నది. దూడ మూడు అడుగుల పొడవున్నది. మూడు అడుగుల పొడవున్న దూడ, తొమ్మిది అడుగుల
దంటును తింటున్నపుడు, ముందర నోటి ద్వార లోపలికి పోవు దంటు, వెనకల రావడము లేదే అని అడుగుచుందురు. వారి
ఉద్ధేశ్యములో దూడ ఆరు అడుగుల దంటును తిన్నపుడు ఇటువైపు నోటి ప్రక్క మూడు అడుగులు కన్పిస్తున్నది అటువైపు వెనక
ప్రక్క మూడు అడుగులు కనిపించవలయును కదా! అన్నది వారి భావము. అట్లు కనిపించదని చెప్పిన అది జవాబుగ తలచరు.
కన్పించునని చెప్పితేనే వారి దృష్టిలో జవాబగును. అటువంటి వారికి ఈ లోకములో జవాబు ఎక్కడ దొరకదు. ఇటువంటి
ప్రశ్నలను చొప్పదంటు ప్రశ్నలనవచ్చును. వారికి సత్యము చెప్పితే అర్థముకాదు. అటువంటపుడు వారి ప్రశ్నలకు జవాబే
ఉండదు.
జవాబు చెప్పిన అర్థము కాని వారు వారి ప్రశ్నలకు జవాబే లేదనుకోవడము జరుగుచున్నది. అటువంటివారు రెండు
రకములు గలరు. ఒక రకమువారు చొప్పదంటు ప్రశ్నలవారు. రెండవ రకమువారు ధర్మవిరుద్ధ ప్రశ్నలు గలవారు. చొప్పదంటు
ప్రశ్నల ఉదాహరణ చెప్పుకొన్నాము కదా! ఇపుడు రెండవరకమైన ధర్మవిరుద్ధ ప్రశ్నలవారిని చెప్పెదము చూడండి. దేవునికి
సంబంధించినవి ధర్మములు. పరమాత్మ భూమి మీదకు వచ్చినపుడు ఆయన తన ధర్మములనే తెలియజేసి పోవును. ఆయన
భూమి మీద ఉన్నపుడు ఆయన ధర్మములనే ఆచరించును. అటువంటి ధర్మములు మానవునికి అర్థము కానపుడు తెలుసుకోవలెను.
అలా తెలుసుకోకుండ భగవంతుడు నడచిన నడకనే తప్పు పట్టుచుందురు. ధర్మ విరుద్ధమైన ప్రశ్నల నడుగుచుందురు. ధర్మబద్దముగ
శాస్త్రబద్ధముగ సమాధానము చెప్పినప్పటికి ధర్మ విరుద్ధ భావములో నుండువారికి అది జవాబేకాదనుకొందురు. వారి భావము
ఎట్లుండునో కొంత వివరించుకొని చూచినట్లయితే, వారు ప్రపంచ ధర్మములను తీసుకొని, పరమాత్మ ధర్మములతో పోల్చుకొని,
రెండు ఒకే మాదిరి ఉండవలెను కదా! అనుకొనుచుందురు. ప్రపంచ ధర్మములకు పరమాత్మ ధర్మములకు పోలిక ఉండదను
మాట వారికి తెలియక ఒక మారు ఒక పనిని చేయగలిగిన వాడు తర్వాత ఎపుడైన ఆ పని చేయును కదా! అని ఒక మారు
అద్దము ద్వార ఒక వస్తువును చూచినపుడు ఆ అద్దము ద్వార ఎపుడైన ఏ వస్తువునయిన చూడవచ్చును కదా! అని ప్రపంచ
ధర్మమును తీసుకొని అడుగుచుందురు. ఒక మారు ఒక రోగి యొక్క రోగమును నయము చేసిన యోగి ఎపుడైన ఏ
రోగినయిన బాగుచేయవలెను కదా! అని ఏసుప్రభువు గ్రుడ్డి వానిని కుష్టు రోగిని బాగుచేసి చనిపోయిన వానిని కూడ లేపాడందురు.
మిగత కుష్టురోగులను, మిగత గ్రుడ్డి వారిని, మిగత చనిపోయిన వారిని ఎందుకు బాగుచేయలేదు, ఇతరుల చావును పోగొట్టిన
వాడు తనెందుకు చావునుండి తప్పించుకోలేదు. అని ప్రపంచ సూత్రములను పరమాత్మ సూత్రములతో పోల్చి జ్ఞానము జ్ఞానశక్తి
అంతా బూటకమని అందురు. పరమాత్మ జ్ఞానము జ్ఞానశక్తి ప్రపంచములోని శక్తివలె ఉండవలెనని వారి భావము. పరమాత్మ
ధర్మము వేరు, ప్రపంచ ధర్మము వేరని చెప్పిన అవగాహనకాక జ్ఞానమనునదే బూటకమని అనుకొందురు. ప్రపంచము
అవగాహనైనట్లు పరమాత్మ కూడ అవగాహన కావలెనన్నది వారి భావము. ఆ భావము ప్రకారము సరియైన జవాబు కూడ
వారికి సరికానిదనియే తెలియును. అటువంటి వారికి జవాబు దొరకదు.
ఈ రెండు రకముల వారికి ఎక్కడ జవాబులుండవు. మేము ఈ పుస్తకములో చాలా వరకు అందరికి అర్థమగులాగున
ప్రశ్న-జవాబు సమకూర్చి ఉన్నాము. మా ప్రశ్నలకు ఒక్క పదము లేక ఒక్క వాక్యములో జవాబుండును. ఆ జవాబును
వివరించిన ఎడల కొద్దిగ పెద్దదగును. అర్థము చేసుకొనువారికి ఒక మాట లేక ఒక పదముతోనే అర్థమగును. అక్కడికి అర్థము
కాని వారికి వివరము చదవవలసి ఉండును. మా భావములో అందరు వివరము చదవడమే మంచిదని అనుకొంటాము. అలా
చదువుటవలన ఆ ప్రశ్నలో ఎటువంటి సంశయము మిగలదు. 1030 ప్రశ్నలకు జవాబులు చదివిన తర్వాత ఎవరి బుర్రలోను
ఎటువంటి ప్రశ్నలేకుండ పోవునని, పూర్తి ఆధ్యాత్మిక విద్యయంతయు తెలిసి పోవునని మా ఉద్దేశము. ఆధ్యాత్మికములో ఎవరికి
ఏ ప్రశ్న వచ్చిన ఆ ప్రశ్నకు జవాబు ఈ పుస్తకములో తప్పక ఉండునని మేము తలచుచున్నాము. ఈ పుస్తకములోని మొదటి
భాగము అందరి తలలలోని ప్రశ్నలు కాగ రెండవ భాగము మా ఒక్క తలలోనివి మాత్రమేనని తెల్పుచున్నాము. మీ తలలోని
మా తలలోని ప్రశ్నలు ఆధ్యాత్మికమును పూర్తి ప్రశ్నించి వేరు ప్రశ్న మిగులకుండ చేసినవని అనుకుంటాము. ఈ పుస్తకము
చదివి బ్రహ్మ విద్యలో ప్రశ్నలిలా ఉంటాయని జవాబులు కూడ ఈ విధముగా ఉండునని తెలియవలెనని కోరుచున్నాము.
ఇట్లు,
త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.
మొదటి - భాగము.
ఈ మొదటి భాగములోని 388 ప్రశ్నలు ఎంతో మంది పాఠకులు అడిగినవి. ఒక్కొక్కరు ఒక ప్రశ్న మొదలుకొని
పది ప్రశ్నల వరకు అడిగారు. ఎవరు ఏ ప్రశ్నలు అడిగినది తెలియుటకు ఆ ప్రశ్నల పై భాగమున వారి పేరు,
ఊరిపేరు కూడ ఇవ్వడము జరిగినది. ఎందరో ఎన్నో సంశయములతో అనేక రకములుగ అడిగిన ప్రశ్నలన్ని మొదటి
భాగములోనే సమకూర్చాము. రెండవ భాగములోనున్న 642 ప్రశ్నలు మా బుర్రనుండి వచ్చినవి. అవి అర్థము
కావాలంటే ముందు మొదటి భాగములో ప్రశ్నలు అర్థము కావలసి ఉన్నది. మొదటి భాగములో జవాబులు అర్థమైతే
మా భావము కొంత వంటబట్టును. తర్వాత కొంత క్లిష్టమైన మాప్రశ్నలు సులభముగ అర్థము కాగలవు. మొదట మీ
నుండి వచ్చిన ప్రశ్నలు మీకర్థమైతే తర్వాత మా నుండి వచ్చిన ప్రశ్నలు అర్థము కాగలవు. అందువలన ప్రథమముగ
మొదటి భాగము చదివి తర్వాత రెండవ భాగములోనికి ప్రవేశించుదురని కోరుచున్నాము.
ఆదిలక్ష్మి, మేలాలత్తూరు, రాయవేలూరు (జిల్లా).
1. దేవుడున్నాడనుచున్నారు ఉంటే ఎందుకు కనిపించడు?
జవాబు: హారములో దారము ఉన్నది, కాని కనిపించదు. అట్లే దేవుడున్నాడు కాని కనిపించడు. కనిపించునదంతయు
ప్రపంచమే. కనిపించనిదే దేవుడు, దేవుడు ఒక వస్తువు కాదు, ఒక పదార్థము కాదు, ఒక ఆకారము కాదు, ఒక
పేరు కాదు, ఒక స్థానము కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, పోల్చి చెప్పుటకు ఈ ప్రపంచములో ఏ దానికీ
సాటియైన వాడుకాదు. రంగు, రుచి, వాసన, ఆకారము లేనివాడు, ఇంద్రియములైన కంటికి కనిపించు దృశ్యము
కాదు, చెవికి వినుపించు శబ్దము కాదు, ముక్కుకు తెలియు వాసన కాదు, నాలుకకు తెలియు రుచి కాదు, చర్మమునకు
తెలియు స్పర్శ కాదు, ఇంద్రియాగోచరుడు. అందువలన ఇంద్రియముల సంబంధమున్న వారికి ఎవరికి తెలియడు.
ఇంద్రియ విషయములకు అతీతునిగా ఉన్నపుడే ఇంద్రియాతీతుడైన దేవుడు తెలియును. అందువలన ఇంద్రియ
విషయములందే ఎల్లవేళల సంబంధపడి ఉన్న వారికి తెలియడు. పూలహారమునకు ఆధారమై ఉన్న దారమును
హారమందే వెదకిన కనిపించినట్లు ఎల్ల శరీరములకు ఆధారమైన దేవున్ని శరీరములందే వెదకి తెలుసుకొనదగును.
సి. నారాయణ రెడ్డి, తాడిపత్రి.
2. చాలామంది పాపమును మాత్రము కర్మ అనుచున్నారు. పుణ్యమును ఏమనవలయును?
జవాబు: చాలా మంది పాపమును ఉద్దేశించే కర్మ అనుచుండుట వాస్తవమే. కర్మంటే ఒక్క పాపమే కాదు, పాపము
మరియు పుణ్యము యొక్క మిశ్రితమును కర్మ అనవలయును. పుణ్యము సుకర్మ, పాపము దుష్కర్మ. సుకర్మయిన,
దుష్కర్మయిన కర్మ ఒక్కటియే అగును.
పి. ధనలక్ష్మి, కర్నూల్.
3. గురువుకు గుణములున్నట్లు తెలిపారు. గుణములున్నపుడు గురువెట్లగును?
జవాబు: శరీరము కదలుచు ఒక పని చేయుచున్నదంటే లోపల ఆ పనికి కారణమైన గుణము పని చేయుచుండును.
ఆ గుణము కర్మ వలన ప్రేరేపింపబడి ఉండును. ప్రతి కార్యమునకు మూల కారణము కర్మ. కర్మ గుణములచే
శరీరమును శాశించుచున్నది. గుణములకు అనుగుణముగ శరీరము పనిచేయుచున్నది. గురువు కూడ శరీరముతో
కార్యము జేయుచున్నాడు. కావున సూత్రము ప్రకారము గురువు శరీరములో కూడ గుణములు పనిచేయుచుండును.
అందరివలె గుణములు కర్మ వలనే ప్రేరేపింపబడి ఉండును. కాని జరుగు కార్యములో క్రొత్తగ వచ్చు కర్మ గురువునకు
అంటదు. సామాన్యునికి చేయుచున్న పనియందు గల కర్మ అంటును. గురువు గుణములచే అందరివలె పని చేసిన
కర్మ అంటదు. కావున గురువును కర్మాతీతుడు, గుణాతీతుడు అనుట జరిగినది. కర్మము వలన కల్గు గుణములు
పనిచేసినా గుణముల వలన కల్గు కర్మ అంటదు. కావున గురువును గుణాతీతుడని చెప్పుట జరిగినది. గురువునందు
గుణములేదని చెప్పుట సరికాదు. అన్ని గుణములచే అన్ని పనులుజేయుచు ఏ కర్మ అంటని వాడు గురువు. గురువైన
వాడు కర్మ యోగియై, కర్మను అంటనివాడై ఉండును.
శరీరమందు కర్మ గుణముల విభాగము తెలియని అజ్ఞానులు పనులు చేయువాడు గురువు కాదని తలచి,
గురువులు ఏ పని చేయక అందరికి దూరముగ గుహలలోనో అడవులలోనో ఉంటారని అనుకొనుచుందురు.
పద్యము :
గుహలలోన జొచ్చి గురువుల
నెదుకంగ కౄర మృగ మొకండు
తారసిల్లిన ముందుగ ముక్తి మార్గమదియే చూపు
విశ్వదాభి రామ వినుర వేమ.
పై విధముగ వేమన యోగి కూడ అన్నాడు. గుహలలో అడవులలో మృగములుంటాయి కాని
గురువులెందుకుంటారు? గురువు మనుష్యుల మధ్యలోనే ఉండి, అందరివలె కనిపించుచు, అందరివలె గుణములచే
పని చేయుచు గుణాతీతుడై ఉంటాడు. గీతయందు కూడ పనులు మానునతడు జ్ఞానికాడు అని శ్రీకృష్ణుడు తెలిపాడు.
4.తామరాకు నీటియందుండి తేమ అంటనట్లు గురువు గుణములందుండి గుణాతీతుడుగ ఉన్నాడు.
సయ్యద్వలి, రాజమండ్రి.
4. దేవుడొక్కడేయైనపుడు మత కలహములెందుకున్నాయి?
జవాబు: దేవుడొక్కడే అని తెలియకపోవడమే కలహమునకు కారణము.
తులసిదాసు, నర్సాపురము
5.గుణములు ఎన్ని ఉన్నవి?
జవాబు: ఆరు మంచివి, ఆరు చెడ్డవి రెండు గుంపులుగ ఉన్నవి. ఒక్కొక్క గుణము 9 భాగములుగ ఉంటు 12 x 9 =
108 గుణములుగ ఒక గుణ భాగములో ఉన్నవి. సాత్త్విక గుణభాగములో 108, అలాగే రాజస భాగములో 108,
తామసములో 108 గుణములు గలవు.
జి. వెంకటనారాయణ, మాల్యవంతము.
6. ప్రాణము, జీవుడు వేరు వేరుగ ఉన్నారా? వేరుగ ఉంటే వాటికున్న వ్యత్యాసమేమి?
జవాబు:
ప్రాణము వేరు, జీవుడు వేరుగ ఉన్నారు. శరీరములోని 25 భాగములలో ప్రాణము ఒక భాగము, జీవుడు
ఒక భాగము. నిర్ణీతమైన పని చేయు శరీర అవయవమును నిర్ణీత భాగముగ తెలిపి ఉన్నాము. ప్రాణము నిర్ణీతమైన
పని చేయుచున్నది. అట్లే జీవుడు నిర్ణీతమైన పని చేయుచున్నాడు. అందువలన ప్రాణమును జీవున్ని వేరువేరు భాగములుగ
గుర్తించుచున్నాము. కొందరు శరీరములోని ప్రాణమును జీవముగ పోల్చుకొని ప్రాణమన్న జీవమన్న ఒక్కటేనను
యోచనలో ఉన్నారు, అది తప్పు భావము. ప్రాణము జీవము వేరువేరని గ్రహించ వలయును. శరీరములో వేరుగ
ఉన్న ప్రాణమున్నపుడే జీవముండును, జీవమున్నపుడే ప్రాణముండును. ఇపుడు ప్రాణమునకు జీవునకు ఉన్న
వ్యత్యాసములు క్రింద చూడవచ్చును.
జీవుడు
1. జీవుడు అనగ శూన్యము.
2. జీవుడు విభజింపబడక
ఉన్నవాడు.
3. జీవుడు తలలో గుణచక్ర మూడు
భాగములలో ఏదో ఒక భాగములో
ఉన్నాడు.
4. జీవుడు ఒక్క భాగమై ఉండి
శరీరములోని కార్యములకు ఏ
మాత్రము ఉపయోగపడక సుఖ
దుఃఖములను అనుభవించుటకే
నియమింపబడి ఉన్నాడు.
5. జీవమే తానుగ ఉన్నాడు. కావున
ఎవడు తన్ను తాను
స్థంభించుకోలేడు.
6. శరీరములోని ఐదు భాగముల గాలి
జీవితమున్నంత వరకు అహర్నిశలు
పని చేయుచునే ఉండును.
ప్రాణము.
1. ప్రాణము అనగ గాలి.
2. ప్రాణము ఐదు భాగములుగ
విభజింపబడి ఉన్నది. వాటినే పంచ
ప్రాణములనుచున్నాము.
3. ప్రాణము శరీరమంతట
వ్యాపించి ఉన్నది.
4. ప్రాణము ఐదు భాగములుగ
ఉండి శరీరములో ఐదు నిర్ణీతమైన
పనులు చేయుచున్నది.
5. శరీరములోని గాలిని సాధన
ద్వార స్థంభింప జేయవచ్చును.
6. శరీరములోని జీవుడు
నిద్రయందు ఏ అనుభవము లేక
ఉండును.
తెన్మఠం సత్యగోపాలాచార్యులు, నరసాపురము
7. జ్ఞానులగువారు పూర్వ జన్మములను చూచినారా? జ్ఞానమునకు, పూర్వ జన్మ స్మృతికి సంబంధము కలదా?
జవాబు: జ్ఞానులకంటే గొప్పవారు యోగులు. యోగులకు కూడ పూర్వ జన్మ విషయము తెలియదు. కావున జ్ఞానులు
పూర్వ జన్మ విషయములను చూడలేరు. జ్ఞానమునకు, పూర్వ జన్మ స్మృతికి ఎలాంటి సంబంధము లేదు.
8. పూర్వ జన్మములను తెలుసుకొనుటకు సాధన మార్గములు కలవా?
జవాబు:
బ్రహ్మ విద్యలో జన్మలు కడతేరుటకు సాధనలున్నవి. కాని జన్మలు తెలుసుకొనుటకు ఏమాత్రము సాధనలు
లేవు. ప్రపంచ విద్యలలో “హిప్నాటిజం" ద్వార తెలుసుకోవచ్చునన్నారు. దానిని కూడ మేము నమ్మడము లేదు.
9.బ్రహ్మవేత్తలకు పునర్జన్మ కలదా?
జవాబు:
కర్మ పూర్తిగ లేకుండ పోవునంత వరకు బ్రహ్మవేత్తలకైన జన్మ కలదు. ఆత్మను తెలిసినంత మాత్రమున కర్మ
కాల్చు శక్తి ఏర్పడుచున్నది. కర్మంతయు ఒక్క మారు భస్మము కాదు. తత్త్వవేత్తయిన (ఆత్మ దర్శనమైన) వానికి ఆ
జన్మలోనే మోక్షము ప్రాప్తించునని చెప్పలేము. అదివాని కర్మ నిలువను బట్టి ఉండును. ఒక వేళ కర్మంతయు ఆ
జన్మలోనే అయిపోతే ఆ జన్మలోనే ముక్తి పొందవచ్చును. లేకపోతే మరు జన్మముండును.
10. పాపాత్ములు తిరిగి ఎప్పటికి మానవులుగ పుట్టరా? వారికి ముక్తి లేదా?
జవాబు:
పాపాత్ములు తిరిగి మానవులుగ పుట్టవచ్చును. పాపాత్ములు మానవులుగ పుట్టకపోతె భూమి మీద ఘోరమైన
బాధలు, రోగములు అనుభవించు వారు కనిపించరు. పాపాత్ములు వారుచేసుకొన్న పాపమును మానవులందు
అనుభవించుట చూస్తున్నాము కదా! పాపము చేసుకొన్న వారికి పరిమితి జన్మలు లేవు. ఏ జన్మలకైన పోవచ్చును.
మానవ జన్మకైన రావచ్చును. అది వాని కర్మే నిర్ణయించును.
పాపాత్ములకు ఎన్నటికి ముక్తి లేదనుట అసత్యము. అనేక జన్మల తర్వాతనైన వారు పాపము లేనివారై జ్ఞానమును
సంపాదించుకొని ముక్తులు కావచ్చును.
11. మరణించిన తర్వాత ఆత్మ ఉన్నదని కొందరు, లేదని కొందరు అనుచున్నారు. ఏది నిజము?
జవాబు: మరణము శరీరమునకే గాని ఆత్మకు కాదు. మరణించిన తర్వాత కూడ ఆత్మ ఉన్నది. ఈ ప్రశ్న కేవలము
జీవాత్మను గూర్చి అడిగినదిగ లెక్కించుకొను చున్నాము. ఆత్మ అన్ని శరీరములందు ఉన్నది. జీవాత్మ ఒక్క శరీరమునందు
మాత్రమున్నది. వేరువేరు శరీరములందు వేరువేరు జీవాత్మలు గలవు. ఉద్యోగి ఉద్యోగము చేయు ఊరు అప్పుడప్పుడు
మారునట్లు, జీవాత్మ నివశించు శరీరములలును అప్పుడప్పుడు మారుచుండును. ఊరు మారినంత మాత్రమున
ఉద్యోగి ఉన్నాడు కదా! అట్లే శరీరము మారినంత మాత్రము జీవాత్మ వేరొక చోటున్నాడు. కాని పూర్తిగా లేదనలేము.
చింతా నారాయణ, నరసాపురము.
జవాబు:
12. మానవుని తెలివి (బుద్ధి)ప్రయత్నము చేత ఏదైనా సాధింపబడుచున్నదా? లేక వాని కర్మనుబట్టి జరుగుచున్నదా?
కార్య సాధనలో ఉపయోగపడు తెలివి కూడ కర్మను బట్టియే ఉన్నదని తెలియవలయును. కర్మననుసరించి
ఒక్కొక్కనికి ఒక్కోవిధముగ తెలివి ఉండును. అందువలన ఒక్కొక్కడు ఒక్కోవిధముగా పనులు చేయుచున్నాడు. ఎవరి
తెలివి వారి సొంతము కాదు. వారి వారి తెలివి వారి వారి కర్మను బట్టియే పని చేయుచుండును. ఎంత గొప్ప
తెలివియైన వారి కర్మానుసారమేనని తెలియ వలయును. అందువలన ఏ పనియైన వారి కర్మానుసారమేనని చెప్పవచ్చును.
చింతా తులసిదాసు, నరసాపురము.
పరమాత్మకు సంకల్పమున్నదా?
జవాబు: ఉన్నది. పరమాత్మ సంకల్ప ఫలితమే ఈ ప్రపంచము. కాని మన కొచ్చినట్లు ఆయనకు సంకల్పములు
అనేకములు రావు. ఒక్క సంకల్పఫలితమే ఈ యావత్ ప్రపంచము పరంపరగ సాగుచున్నది. దీనికి ప్రమాణము
గీతలోని "మద్భావా మానసాజాతా" అను శ్లోకము చూడుము.
ధనలక్ష్మి, కర్నూలు.
14. కుటుంబమునకు ఒక యజమాని, ఊరికొక ప్రెసిడెంటు, మండలానికొక మండలాధిపతి, జిల్లాకొక కలెక్టరు,
రాష్ట్రానికొక ముఖ్యమంత్రి, దేశానికొక ప్రధాని ఉన్నట్లు మొత్తము ప్రపంచానికి ఎవరైన అధిపతి ఉన్నారా?
జవాబు:
ఉన్నారు. మీరు చెప్పు అధికారులందరు కేవలం మనషులకే. మనుషులకే కాక యావత్ ప్రపంచములోని
సర్వజీవరాసులకు అధిపతి ఉన్నాడు. అతనే పరమాత్మ అతనికి నిజమైన పేరు లేదు, అతడు కనిపించడు. భూమి
మీద కనిపించువారు చేయలేని పరిపాలనజేయువాడు. సర్వాధిపతి పరమాత్మ ఒక్కడేనని తెలియవలయును. వానినే
పురుషోత్తముడని, ఖుదాయని, ఎహోవాయని, అల్లాయని, చెప్పుకొనుచున్నాము.
బి. రవీంద్రరెడ్డి, చెన్నేకొత్తపల్లి.
15.కుంటి, గ్రుడ్డి అనాధలను చూస్తున్నాము. వారు పోయిన జన్మలో పాపము చేసి ఉందురా?
జవాబు: బాధ ఏదైన అది పాప ఫలితమే. కుంటి, గ్రుడ్డివారు పాపము చేశారు. కావుననే వారికి ఆ కర్మననుసరించి
అంగలోపమేర్పడి ఉన్నది. ఈ జన్మ అంగలోపమునకు కారణమైన పాపము వెనుకటి జన్మదేనని చెప్పలేము. రెండు
జన్మల క్రితముదో లేక మూడు జన్మల క్రితముదో, దానికంటే ముందుదో కూడ అయిఉండవచ్చును. వరుస క్రమముగా
వచ్చు కర్మ గడచిన జన్మలలోనిదే కాని వెనుకటి జన్మదేనని చెప్పలేము.
16. నైవేద్యములను ప్రసాదములుగ మనమే స్వీకరించుటయందు అంతరార్థమున్నదా?
జవాబు: లేదు. నైవేద్యము భావము కోసము పెట్టుచున్నాము. దేవుడేమి తినడు కదా! ఆ పదార్థము వ్యర్థము కాకుండ
మనమే తీసుకొనుచున్నాము. పూజా విధానమునకే అర్థమున్నది మనము తినే దానికి అర్థము లేదు. పూజా విధానము
యొక్క అర్థము తెలిసి పూజ చేస్తే పదార్థము ప్రసాదముగ మారగలదు. లేకపోతే పదార్థము నైవేద్యముగనే ఉండగలదు.
ప్రసాదమునకు 798 ప్రశ్నలోను జవాబు చెప్పబడినది.
చింతా చౌడప్ప, నరసాపురము.
17. ఒక వ్యక్తి రోగ బాధ అనుభవిస్తు మా పెద్దలు చేసిన పాపము నేను అనుభవిస్తున్నానని అంటున్నాడు.
వాస్తవముగ పెద్దలు చేసిన పాపము పిల్లలకంటుతుందా?
జవాబు:
ఏ వ్యక్తి తిన్న తిండి ఆ వ్యక్తియే అరిగించుకోవలయును. ఒక వేళ తిన్న తిండి అరగకపోతే ఆ వ్యక్తే బాధపడవలసి
ఉంటుంది. కాని వానికి బదులుగ ఇంకొకడు బాధపడడు. అట్లే ఏ వ్యక్తి చేసుకొన్న కర్మ ఆ వ్యక్తి తిరిగి అనుభవింపవలసి
ఉంటుంది. వానికి బదులుగ ఇంకొకడు అనుభవించుటకు వీలులేదు. పెద్దలు చేసిన కర్మ చిన్నలకంటేటట్లయితే
పెద్దల జాతకమును చూచి పిల్లల భవిష్యత్తు చెప్పవలసి ఉంటుంది. కాని అట్లు జరగడము లేదు. ఎవరి జాతకము
వారికే చెప్పుచున్నారు కదా!
పూర్వము వాల్మీకి నారదుని వద్ద కూడ ఇదే సంశయము తెలుపగా అందులకు నారదుడు ఎవరు చేసిన కర్మ
వారు అనుభవించవలసి ఉంది. నీవు చేసుకొన్న కర్మ నీవే అనుభవించవలసి ఉండునని చెప్పగ సంశయము తీరని
వాల్మీకి వారి తల్లిదండ్రులను చివరకు భార్యను కూడ అడిగెను. నారదమహర్షి చెప్పిన వాక్యమునే వారు చెప్పగ తాను
చేస్తున్న కర్మను తలచి వాటినుండి తప్పించుకొనుటకు జ్ఞానమార్గమవలంభించెను.
ఒక వేళ తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు వస్తే ఉన్న సంతతి అంతయు సమముగా కర్మ
అనుభవించవలయును, అట్లు జరగడము లేదు. నలుగురు పుత్రుల్లో ముగ్గురు బాగుంటే ఒకడు చెడిపోయి నానా
బాధలు అనుభవిస్తున్నాడు. తల్లి తండ్రులు తాతలు మంచివారై వారు ఏ పాపము చేయని వారైనా వారి సంతతి
కొందరు చాలా బాధపడుచున్నారు. కొందరు తల్లి తండ్రులు ఎంతో పాపము చేసినా వారి పిల్లల జీవితము ఏబాధ
లేక సుఖముగ సాగిపోవుచున్నది. ఇట్లు అనేక యదార్థసంఘటనల ద్వార తల్లి తండ్రుల పాపము పిల్లలకు రాదని
తెలుస్తున్నది.
చిప్పల ఆదినారాయణ, నరసింహునిపల్లె.
18. భూత, భవిష్యత్, వర్తమాన కాలములు తెలుసుకొనుటకు జ్ఞానము పనికి వచ్చునా?
జవాబు:
జ్ఞానము వలన భూత భవిష్యత్తు వర్తమాన కాలములు తెలియవు. జ్ఞానము వలన తెలియబడునది తనలోని
ఆత్మ (దేవుడు) ఒక్కడేనని తెలియవలయును.
19. ఆత్మ, అనాత్మ అంటే ఏమిటి?
జవాబు:
ఆత్మ అనగా సర్వ జీవశరీరములకు కదలిక శక్తి నిచ్చునది. అనాత్మ అంటే ఆత్మ కానిది, అంతకంటే వేరైనది
పరమాత్మ అని అర్థము.
20. మానవుడు ఐదువందల సంవత్సరములు బ్రతకగలడా?
జవాబు:
శ్వాసను బంధించి ఎన్ని సంవత్సరములైన ఉండవచ్చును.
21. గాలిలో పరమాత్మ ఎక్కడ ఉంటాడు?
జవాబు:
గాలిలోనే కాదు శూన్యములో కూడ పరమాత్మ అణువణువున వ్యాపించి ఉన్నాడు. కంటికి కనిపించడు కావున
చూడలేము.
కె. గంగప్ప, కిరికెర.
22. భగవంతుడు సాకారుడా? నిరాకారుడా? వివరముగ తెలుపవలయు నని కోరుచున్నాము.
జవాబు:
భగవంతుడు సాకారుడే, నిరాకారుడు కాడు. నిరాకారుడు పరమాత్మ. నిరాకారమైన పరమాత్మ ఒక
శరీరమును ధరించి పుట్టినప్పుడు భగవంతుడు అవుతాడు. భగము అనగ జన్మ స్థానము (స్త్రీ గర్భ స్థానము).
భగవంతుడనగ స్త్రీ గర్భము నుండి పుట్టినవాడని అర్థము. శరీరము ధరించిన వానినే భగవంతుడనడము జరుగుతుంది.
శరీర ఆకారము లేని నిరాకారుని పరమాత్మ అనడము జరుగుతుంది. శ్రీకృష్ణుడు సాకారుడు కావున భగవంతుడని
అనుచున్నాము.
బి. రవీంద్ర రెడ్డి, చెన్నేకొత్తపల్లి.
23. యోగములు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
యోగములు రెండు విధములు. అవి 1. రాజయోగము (కర్మయోగము), 2. బ్రహ్మయోగము (జ్ఞానయోగము)
అని అందురు. అహము మీద ఆధారపడినది రాజ యోగము. మనస్సు మీద ఆధారపడినది బ్రహ్మయోగము. ఈ
రెండు మార్గములు తప్ప కర్మనాశనమగు విధానము ఏది లేదు. దేవుని ధర్మములకు సంబంధించినవి ఈ రెండు
యోగములే. ధర్మములకు అతీతమైనది కూడ ఒక యోగము కలదు. అది భక్తియోగమని చెప్పబడినది.
రాజయోగము విధానము వలన ఆగామి కర్మ (జరుగుచున్న పనిలో వచ్చుకర్మ) నాశనమగును. బ్రహ్మయోగ
విధానము వలన సంచిత కర్మ నాశనమగును.
సి. చిదంబర రెడ్డి, అనంతపురము.
24. మన వెంట వచ్చేది జ్ఞాన ధనమని, ఖర్చు కానిదని అంటారు అట్లే అజ్ఞానము జన్మ జన్మలకు ఎందుకు
అంటి పెట్టుకొని ఉండదో తెల్పుము?
జవాబు:
అజ్ఞానము ఎందుకు అంటిపెట్టుకొని ఉండదు? తప్పనిసరిగ అంటి పెట్టుకొని ఉండును. జన్మ సంస్కారమును
బట్టి జ్ఞానమున్నట్లే అజ్ఞానము కూడ ఉండును. ఏ గుణములో చనిపోయిన జీవుడు తిరిగి ఆ గుణములోనే జన్మించునని
గీతలో దేవుడు కూడ చెప్పాడు.
25. మీ వద్దకు విచ్చేసిన ఆశ్రితుల మనోగతముల గూర్చి స్వాముల వారి విధానము ఎట్టిది?
జవాబు:
వారి వారి మనో భావములను బట్టి మా విధానముండును. మూఢులకు మూఢునిగ, జ్ఞానులకు జ్ఞానిగ,
అజ్ఞానులకు అజ్ఞానిగ కనిపిస్తుంటాము. ప్రత్యేకించి స్వామి మాదిరి కనిపించము.
26. ఒకరి కర్మలు మరొకరు పంచుకుంటారంటారు. అది ఎంత వరకు నిజము?
జవాబు: అలా పంచుకొనుట దుస్సాధ్యము. ఎవరి కర్మ వారనుభవించవలసిందే కాని వాని బదులు ఇంకొకడు
అనుభవించడు.
27. దైవశక్తి అనగానేమి? మానవుడు ఆ శక్తిని ఎపుడు పొందుతాడో వివరించి తెల్పుము?
జవాబు:
పాప పుణ్య కర్మను భస్మీపటలము చేయు అగ్నియే దైవశక్తి దానిని మానవుడు యోగమాచరించినపుడే పొందును.
28.దైవజ్ఞానమును పొందుట ఎట్లు? అట్లు పొందిన వానికి ప్రయోజనమేమిటి?
జవాబు: దైవజ్ఞానము మీద శ్రద్ధ ఉన్నపుడు అంచలంచెలుగ జ్ఞానమును పొందవచ్చును. జ్ఞానమును పొందుట వలన
మానవుడు తన్ను తాను తెలుసుకోగల్గును. యోగమాచరించి కర్మను కాల్చుకోగల్గును.
29. నిజమైన మనశ్శాంతి మానవునికెప్పుడు కల్గును?
జవాబు:
తనలో ఏమాత్రము ప్రపంచ విషయము జ్ఞప్తికి రానపుడు.
30.“పెంజీకటికవ్వల నెవ్వండే కాకృతి వెలయునతనినే సేవింతున్” వీటిని నిర్వచించి వెలయునతడు ఎవరో
అతనిని గూర్చి తెల్పుము?
జవాబు:
ఏ గుణ జ్ఞప్తిలేని నిర్వికారమైన స్థితిని పెంచీకటని పోతనగారు వర్ణించారు. అట్టి స్థితి లభించిన తర్వాతనే
అసలైన దైవము (ఆత్మ) తెలియును. అందువలన పెంజీకటి కవ్వల అని వర్ణించారు. ఆత్మ అందరియందు ఒక్కటిగా
ఉన్నది. కావున ఏకాకృతి వెలయు అన్నారు. అందరియందు సర్వ వ్యాపిగా ఉన్న దైవమునే నేను ఆరాధింతునని పోతన
అన్నాడు.
31.ముక్తికాంతను గూర్చి వివరింపుము?
ముక్తి కాంతను గూర్చి నేను కాదు కదా ఎవరు చెప్పలేరు. దానిని ఎటు చెప్పలేని స్థితిలో కాంత అన్నారు.
కాని నిజముగ అది కాంత కూడ కాదు, సత్యము చెప్పవలయునంటే అది ఏది కానిది.
జవాబు:
32."ముగ్గురు మూర్తులు జూట! మూలము నెరుగుట బాట!" అన్నారు. ముగ్గురు ఎవరు? మూలము ఏమిటి?
జవాబు: తామస, రాజస, సాత్త్విక గుణములను ముగ్గురు మూర్తులుగ వర్ణించారు. మూడు గుణములు కావలయున్న
ఆత్మను మూలముగ చెప్పారు. మూడు గుణములను వదలి ఆత్మను చేరమనడమే పై మాట అర్థము.
33. “ఓం” కార స్వరూపమేనా దైవము? లేక ఓంకారమున కావల ఉన్నదా దైవము తెల్పుము?
జవాబు:
ఓం కారమునకు ఆధారమైనది దైవము. ఓం కారమును పల్కించు శక్తి దైవము. మన శరీరమున శ్వాసలో
ఓంకార శబ్దము మ్రోగుచున్నది. ఆ శ్వాసకు చైతన్య శక్తియైన ఆత్మయే దైవము.
34. మానవుడు దైవముగా పూజింపబడవలెను. అది ఎట్లు సాధ్యమో తెల్పుము?
జవాబు:
మానవుడు దైవముగ మారినపుడు సాధ్యమగును. దైవముగ మారవలెనంటే సంపూర్ణముగ జ్ఞానము తెలిసి
యోగివై ఆత్మ శక్తిని సంపాదించవలసి ఉంటుంది.
టి. రంగనాథము, దంపెట్ల.
35. జ్ఞానము తెలిసి పద్దతి ప్రకారము ధ్యానము చేసిన కర్మ తొలగునన్నారు. కావున దయచేసి ధ్యానము చేయు
పద్దతి తెలియగోరు చున్నాము?
జవాబు:
"శ్రేయోలి జ్ఞాన మభ్యాసాత్" అని గీతయందు కూడ కలదు. అభ్యాసము చేయుటకంటే ముందు జ్ఞానము
తెలుసుకొమ్మన్నారు పెద్దలు. దారి తెలియక మునుపు ప్రయాణము సాగదు కదా! అట్లే జ్ఞానము తెలియక మునుపు
ధ్యానము కూడ సాగదు, కుదరదు. అందువలన మొదట జ్ఞానము తెలుసుకొంటే ధ్యానము చేయు పద్ధతి ఎలాగ
ఉండునో తెలియును.
ఒక విధముగ చెప్పవలయునంటే నీలో ఉండు మనస్సును నీవు పని చేయక నిలిపి వేయడమే ధ్యానము లేక
యోగ సాధన అవుతుంది. అలా మనస్సును జయించవలయునంటే ముందు మనస్సు విషయము పూర్తిగా తెలిసి
ఉండవలయును. ఒక శత్రువును జయించవలయునంటే ఏ విధముగ వాని విషయములన్ని సేకరించి వాడు ఎక్కడ
ఉండేది, ఎంత మందితో ఉండేది, వారి వద్ద ఏ ఆయుధాలు ఉండేది, ఎప్పుడు ఆయుధాలుండవు అని తెలుసుకున్నట్లు
మనస్సు గూర్చి పూర్తి తెలిసినపుడు ధ్యానము చేయుట కూడ తెలియును. అందువలన మొదట సంపూర్ణ జ్ఞానులుకండి
తర్వాత సంపూర్ణ యోగులుకావచ్చును.
బి. రవీంద్ర రెడ్డి, చెన్నేకొత్తపల్లి.
36. దేవాలయముల ముందు మరియు దేవాలయములయందు జీవహింస చేయుచున్నారు. అలా చేయమని
ఏ దేవుడైన చెప్పినాడా?
జవాబు:
పరమాత్మ మినహ ఎన్నియో దేవతలను మానవుడు ఆరాధిస్తున్నాడు. ఆ దేవతలలో మహాదేవతలు, క్షుద్రదేవతలని
రెండు విధములుగ ఉన్నవి. మహాదేవతలుగ చెప్పబడిన వారికి బలి అను పేర జీవహింస పూజ చేయరు. క్షుద్రదేవతలను
వారికి మాత్రము పూజా విధానములో జీవహింస చేయుచున్నారు. క్షుద్రదేవతలు వేరొకరి శరీరములను ఆవహించి
జీవులను తమకు అర్పించమని కోరుచున్నవి. అందువలన అవి చెప్పినట్లు కొందరు క్షుద్ర దేవాలయముల వద్ద
జీవహింస చేయుచున్నారు. ఏది ఏమైన జీవహింస చేసెడి వారికి పాపమే వస్తుంది. దాని వివరము తెలియని వారు
మూర్ఖముగ చేయుచు పోవుచున్నారు.
కె. శివరాము, ఎర్రగుంట్ల.
37. గురువు శిష్యుని వెతకవలయునా? శిష్యుడు గురువుని వెతకవలయునా? తెల్ప ప్రార్థన.
జవాబు:
గురువు శిష్యుని వెతకవలయునంటే శిష్యులను వెతికే దానికి గురువు ఆయుస్సు అయిపోతుంది. జ్ఞానము
బోధించేదెపుడు? ఆకలికొన్న వారి దగ్గరకు వెదకుచు అన్నము పెట్టు వాడొస్తాడనుట ఎంత సమంజసమో అట్లే
శిష్యుల వద్దకు గురువు వస్తాడను మాట కూడ అంతే సమంజసము. ఒక్కనిని అందరు వెతకవచ్చును గాని అందరిని
ఒకడు వెతకవలయునంటే సాధ్యమా? శాస్త్రాను సారము శిష్యుడే గురువును అన్వేషించవలయును. అప్పుడే గురువు
మీద భయము భక్తి సేవా భావము ఏర్పడును. వెతకంగ వెతకంగ దొరికిన వస్తువును భద్రముగ దాచి పెట్టు కుంటారు
కదా! అట్లే వెతికితే దొరికిన గురువును ఎన్నటికి వదలము. వెతకకనే గురువే తనవద్దకు వస్తే చులకనగ చూచుకొనే
శిష్యులుంటారు. అందువలన గీతా శాస్త్రములోని “తద్విద్ది” అను శ్లోకము ప్రకారము శిష్యుడే గురువు వద్దకు చేరవలయును.
38. మాయను జయించడము ఎట్లు?
జవాబు:
నన్ను శరణుబొందిన వారు మాత్రమే మాయను జయించగలరని " మా మేవ యే ప్రపద్యస్తే మాయా మేతాం
తరన్తితే" అని దేవుడన్నాడుగా! దేవుని యొక్క ధర్మాన్ని ఆశ్రయించడముగాని, భగవంతున్ని ఆశ్రయించడము గాని
చేయవలెను.
39. మనస్సును బంధించడము ఎట్లు?
జవాబు:
మనస్సును గూర్చిన జ్ఞానము సంపూర్ణముగ తెలుసుకొని అభ్యాసము చేస్తే సాధ్యమగును.
40. ప్రళయము అయిన తర్వాత సృష్ఠి ఎందుకు వచ్చినది?
జవాబు:
బ్రహ్మచక్రము తిరుగుచున్నది. కావున వేయి యుగములకొక మారు ప్రళయము. వేయి యుగములకొకమారు
ప్రభవము జరుగుచుండును. మనకు రాత్రింబవళ్ళు ఏర్పడినట్లు ప్రళయ, ప్రభవములు దానంతకవే జరుగుచుండును.
41. జ్ఞానము దేనిని ఆచరించితే వస్తుంది?
జవాబు:
ఆచరించితే వచ్చేది జ్ఞానము కాదు. జ్ఞానము గురువుల వద్ద వినయముగ ఉండి శ్రద్ధ కల్గి తెలుసుకోవడము
వలనగాని, పుస్తకములు చదవడము వలనగాని వస్తుంది. శ్రద్ధయున్నంత జ్ఞానము లభిస్తుంది. జ్ఞానమును ఆచరించితే
వచ్చేది యోగము.
తెన్మరం సత్యగోపాలాచార్యులు, నరసాపురము.
42. సర్వరక్షకులైన శివకేశవాది ప్రధాన దేవతలుండగ తిరిగి గ్రామ దేవతలను ఎందుకు పూజించాలి?
జవాబు: తుబలులు ఎందుకివ్వాలి?
జవాబు:
సర్వ ప్రపంచానికి మూలము ఆదిశక్తియైన పరమాత్మ ఉండగ అందరు అతనినే పూజించక ఎందరో దేవతలను
పూజించుట, వారి వారి గుణముల సంస్కారమని తెలియవలయును. బహుదేవతలను ఆరాధించుటకంటే ఒక్క దేవుని
ఆరాధించుట మంచిదని శాస్త్రము తెలియజేయుచున్నది. బహు దేవతా పూజ జంతుబలులు మానవుని తప్పు దారి
పట్టించుచున్నవి.
43. శివ కేశవుల ఆరాధించిన భక్తులు మరణించిన తర్వాత వారికి ఏ మార్గము లభించును?
జవాబు:
"యాన్తి దేవ వ్రతాన్ దేవాన్" అన్నట్లు శివకేశవుల నారాధించిన వారు శివకేశవుల వద్దకే చేరుదురు.
44. పాపములు చేసిన వారిని నిర్ణయించుటకు శిక్షించుటకు అధికారము యమధర్మరాజుకు తప్ప ఇతరులకు
లేదా?
జవాబు:
నిజము చెప్పాలంటే యమధర్మరాజే లేడు. మనము చేసుకొన్న పాప పుణ్యములు రెండు మన కపాలములోని
కర్మచక్రములో చేరి ప్రతిష్టింపబడి తిరిగి మరు జన్మలలో కష్ట సుఖరూపములుగ ఆచరణకొస్తున్నవి. అందువలన
యమ లోకములో ఉన్నవను సంఘటనలన్ని ఇక్కడే చూస్తున్నాము. కాలమే కాలుడై భూమి మీదనే బాధిస్తున్నాడని
తెలియవలయును. కర్మచక్రమునకు సాక్షిగా ఉన్న ఆత్మే యమధర్మరాజు, కర్మచక్రమే చిత్రగుప్తుని గ్రంథముగ ఉన్నది.
45. ఆత్మ అంతట నిండి ఉన్నపుడు అన్ని ప్రాణులకు ముక్తి ఉండాలి. అటువంటపుడు వృక్షములకు
పశుపక్ష్యాదులకు ముక్తి ఉన్నట్లే కదా! తెల్పవలయును?
జవాబు:
సిద్ధాంతము ప్రకారము ఏ జీవియైన ఆత్మనారాధించి ముక్తి పొందవచ్చును. అయితే ఎంతో యోచించు తెలివి
ఉన్న మానవులే బ్రహ్మవిద్య నేర్వ లేక అర్థముకాక ఆచరణ లేక ముక్తి పొందలేక ఉన్నారు. తెలివి తక్కువ జన్మలైన
మిగతా జీవరాసులు జ్ఞానమును తెలుసుకోలేవుకాని మానవులకంటే ముక్తి మార్గములో ముందు కలవని చెప్పవచ్చును.
మానవునికంటే మిగతావి కర్మ సంపాదించడములో తక్కువ, కర్మ అనుభవించడములో ఎక్కువ. మానవులకున్నంత
బంధనములు గుణముల ప్రేరణ వాటికుండదు. ఎప్పటికైన మిగత పశుపక్షి మృగాదులు వృక్షలతాదులు మోక్షము
పొందవలసిందే.
46. బ్రహ్మ ప్రళయమున ఆయనను ఆశ్రయించిన జ్ఞానవంతులు (ఉపాసకులు) జీవించి ఉందురా? వారికి
ముక్తికలుగునా?
జవాబు:
ప్రళయము సంభవించినప్పటికి కర్మ ఏ మాత్రము శేషము లేకుండ పోయివుంటే ముక్తి పొందుదురు. కర్మ
కొద్దిగ శేషమున్న మరియు ప్రభవములో పుట్టవలసిందే. ఎంత ఉపాసకులైన కర్మను బట్టియే ముక్తి లేక జన్మ
ఉండును. అందువలన యోగులందరు కర్మ నాశనము చేయు ఆరాధనయైన యోగమునే ఆచరించుచుందురు.
పి. పుల్లయ్య, తేరన్నపల్లి.
47. స్వామి! ఏ విత్తనము వేస్తే ఆ చెట్టే మొలుస్తుంది కదా! అట్లే మానవులు చనిపోతే మానవ జన్మకు, ఆవు
చనిపోతే ఆవు జన్మకు పోవుచున్నారని, ఒక జాతి మరొక జాతిలో జన్మించదని కొందరు తెల్పుచున్నారు. ఇది
నిజమేనా? తెల్ప ప్రార్థన.
జవాబు:
ఏ విత్తనము వేస్తే ఆ మొలకే వస్తుంది. విత్తనము స్థూల ఆకారము గలది, కంటికి కనిపిస్తు ఉన్నది. అట్లే ఆ
విత్తనమునకు మొలచు మొలక కూడ కంటికి కనిపిస్తు ఉన్నది. అందువలన ఏ విత్తనమునకా మొలక అనుచున్నాము.
మనిషి స్థూలముగ కంటికి కనిపిస్తు ఉన్నాడు, అతనికి పుట్టు శిశువు కంటికి కనిపిస్తున్నాడు. అందువలన మనిషికి
మనిషి, జంతువుకు జంతువు పుట్టుచున్న దనుటలో తప్పులేదు. కాని ఇక్కడ సమస్యేమిటంటే స్థూలముగ ఉన్న
శరీరముగాక సూక్ష్మముగ కనిపించని జీవాత్మ యొక్క విషయము కావలయును. అందువలన పై ఉదాహరణ సరిపోదు.
మనిషి శరీరానికి మనిషి శరీరమే పుట్టినప్పటికి, పుట్టిన శిశువులోనికి వెనుక జన్మలో ఏ జాతి శరీరము ధరించి ఉండిన
జీవరాసియైన ప్రవేశించి ఉండవచ్చును.
పుట్టిన మానవ శిశువులో పలానా జీవుడే ప్రవేశించాడని ఎవరు నిర్ణయించ లేరు. అటువంటపుడు మానవుడు
తిరిగి మానవునిగానే పుట్టుననుట సత్య దూరము. కర్మననుసరించి మానవజన్మలోని జీవాత్మ తిరిగి మానవజన్మకైనా
రావచ్చు లేక ఇతర జన్మలకైన పోవచ్చును కావున కర్మానుసారము జన్మలు కాని గత శరీరమును బట్టి జన్మలు
ఉండవు.
48. సర్వ జీవులందు ఆత్మ ఒక్కటే ఉండినప్పటికి వృక్షములందు చైతన్యము లేదని కొందరనుచున్నారు. తమ
అభిప్రాయము కోరుచున్నాము.
జవాబు: ఆత్మ చైతన్య స్వరూపము. అన్నిటియందు ఆత్మ ఉండినప్పుడు అన్నిటి యందు చైతన్యముండును. ఒక
స్థలము నుండి మరొక స్థలమునకు పోవు చలనము లేనంత మాత్రమున చైతన్యమే లేదనుట సమంజసముకాదు.
చైతన్యములేనిదే చెట్టు పెరగ జాలదు. చైతన్యములేనిదే భూమి నుండి నీటిని, గాలినుండి కార్బన్ డై ఆక్సైడ్ను
గ్రహించి సూర్యరశ్మి చేత పిండి పదార్థములను ఆకులందు తయారు చేసుకోజాలదు. అత్తపత్రి చెట్టును తాకినంత
మాత్రముననే ఆకులన్నిటిని ముడుచుకొనుచున్నది కదా! చైతన్యములేనిదే అట్లు ముడుచుకొన లేదు. అందువలన
చెట్లయందు కూడ చైతన్యము ఉన్నదని చెప్పగలము.
యమ్. నాగభూషణము, ధర్మవరము
49. ధ్యాన మనగా ఏమి? యోగమనగా ఏమి? ఈ రెండింటి యొక్క భేదాన్ని వివరముగ తెలియగోరుచున్నాము.
జవాబు:
ధ్యాస లేక మనోజ్ఞప్తి అనునది మన శరీరములో ఉన్నది. మనోజ్ఞప్తి ఏ వైపు మళ్ళితే ధ్యాస అక్కడికి పోయింది
అనుట గలదు. మనకు ఎక్కువగ అహర్నిశలు విషయ ధ్యాసలే ఉండును. ఐదు జ్ఞానేంద్రియములకు సంబంధించిన
ధ్యాసలను విషయ ధ్యాసలనుచున్నాము. మొదట ఆత్మ జ్ఞానమును సంపాదించు కొన్న వ్యక్తి తన ధ్యాసను ఇంద్రియ
విషయముల నుండి మరల్చుకొనుటకు చేయు ప్రయత్నమే ధ్యానము. ధ్యాస అను పదము నుండి పుట్టినది ధ్యానము.
బయట ధ్యాసను అంతర్ముఖముగ మళ్ళించడమే ధ్యానము అంటున్నాము. ఇదియే యోగసాధన అని కూడ చెప్పవచ్చును.
ధ్యానము వలన లభించునది యోగము. ఉడికే బియ్యమునకు మన చేతికి మధ్యన గరిట లాంటిది ధ్యానము.
చేరవలసిన గమ్యమునకు చేరవలసిన వానికి మధ్యన గల దారిని ధ్యానము అంటున్నాము. ఉడికే బియ్యము యోగమైతే,
చేయి జ్ఞానము, జ్ఞానమునకు యోగమునకు మధ్యన గరిటగ ధ్యానమున్నది. చేయి లేనిది గరిటె తనకు తాను ఉడికే
బియ్యములోనికి పోదు. అందువలన ధ్యానము కంటే ముందు జ్ఞానము శ్రేష్ఠము. దాని తర్వాత ధ్యానము శ్రేష్టమని
గీతయందు కూడ తెలుపబడినది. జ్ఞానము లేనిది ధ్యానము ఏమాత్రము యోగమును చేర్చలేదు. ఇప్పటి కాలములో
జ్ఞానము లేకనే చాలా మంది ధ్యానము చేయుచున్నారు. అటువంటివారు నిజమైన యోగమును పొందలేరు. నీలోని
ఆత్మను కలిసినపుడు ఉండే స్థితినే యోగము అంటున్నాము. యోగసమయములో యోగ శక్తి లభించుచుండును.
బి. మోహన్ రావు, హస్తినాపురము.
50. రూపాకారములేని పరిపూర్ణమును ఆకారముగల మానవుడు ఎలా తెలుసుకొనును?
జవాబు:
ఆకారముగల మానవుడు యోగమాచరించుచు పూర్తిగ కర్మను నాశనము చేసుకొన్నపుడు, కర్మ ఏ మాత్రము
శేషము లేకుండ పోయినపుడు, శరీరమును వదలి నిర్వికార పరిపూర్ణమందు ఐక్యమై తానే పరి పూర్ణ పరబ్రహ్మమై
పోవును. అపుడే పరిపూర్ణ పరబ్రహ్మము తెలియనగును. కాని శరీరమున్నపుడు నిర్వికార పరమాత్మను ఎవడు
తెలియలేడు. శరీరమున్నపుడు యోగమాచరించితే ఆత్మ తెలియును, కాని పరమాత్మ తెలియడు.
51. యోగి త్రి అవస్థాతీతుడు. అట్టి యోగి అవస్థల చెందడము ఎలా?
జవాబు:
అఖండమైన యోగమును యోగి ఆచరించలేడు కనుక యోగ అవస్థయైన తురీయము నుండి త్రి అవస్థలు
పొందుచున్నాడు. ఎంత యోగి అయిన త్రి అవస్థలను అనుభవించుట సహజము. ఒకే అవస్థయందు ఉండుట అరుదు.
52. జ్ఞాని మరణమునకు అజ్ఞాని మరణమునకు తేడా ఏమిటి?
జవాబు:
జ్ఞాని అజ్ఞాని మరణములకు ఏమి తేడా ఉండదు. కర్మ శేషము లేని యోగికి కర్మ శేషమున్న యోగికి
మరణములో తేడా ఉండును. కర్మ శేషములేని యోగి సూర్య ప్రకాశము బాగ ఉన్న పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము
కల్గిన సమయములోనే మరణించును. కర్మశేషమున్న యోగి ఆ సమయము తప్పి మరణించును.
యమ్. వెంకటరాముడు, బెంగుళూరు.
53.
ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి జేర్చి
మూటి నాల్గింటకుడు వస్యములుగ జేసి
యైదిటిని గెల్చి యారింటననిచి
యేడు విడచి వర్తించువాడు వివేక ధనుడు.
ఈ పద్యమునకు వివరము తెల్పగోరుచున్నాము.
జవాబు:
మన శరీరములో అంతరేంద్రియములకు బాహ్యేంద్రియములకు మధ్యన ఉన్నది మనస్సు. మనస్సు ఒక్కటి
పని చేసిన మన శరీరములోని స్థూల సూక్ష్మ అవయవములన్ని పని చేయును. అది ఒక్కటి నిలిచిపోయిన అన్ని
నిలిచిపోవును. అందువలన అన్నిటికంటే ముఖ్యమైనది మనో నిలకడయని పెద్దలందరన్నారు. ఈ పద్యమందు ఆ
విషయమే తెలియజేసారు.
ఒకటిగొని= మనస్సు ఒక దానిని బంధించిన,
రెంటి నిశ్చలయుక్తి జేర్చి= ఆత్మ జీవాత్మలను ఒకటిగజేసి,
మూటి= మూడు గుణములు,
నాల్గింటి= మూడు గుణ భాగములకావలయున్న నాల్గవ
స్థానమైన ఆత్మ స్థానమందు,కడు వస్యముగ జేసి= అణిచి వేసి,
ఐదిటిని గెల్చి= ఐదు జ్ఞానేంద్రియముల స్తంబింపజేసి,
ఆరింటినణచి= గుణ భాగములలోని ఆరు గుణములననచి వేసి,
ఏడు విడచి= సప్తనాడీ కేంద్రముల పని వదలి,
వర్తించు వాడు= యోగము పొందిన వాడు,
వివేకధనుడు= జ్ఞాన ధనము కల్గిన వాడు.
భావము : ఒక మనస్సును నిలుపుట వలన శరీర అంతర్గతమున ఉన్నవన్నియు నిలిచిపోవును ఆ విషయమునే ఈ
పద్యములో వివరించడము జరిగినది. మనస్సు నిలిచి పోయినపుడు జీవాత్మ ఆత్మయందు చేరి ఉండును. మూడు
గుణములు నాల్గవ స్థానమైన ఆత్మయందు లయమై ఉండును. బాహ్యేంద్రియము లైన ఐదు జ్ఞానేంద్రియములు పని
చేయని స్థితిలో ఉండును. గుణభాగములలోని ఆరు గుణములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు
అణగి పోయి ఉండును. శరీరములోని సప్త నాడీ కేంద్రముల పనియే మాత్రము లేకుండ ఉండును. ఏడు స్థానముల
పని కూడ లేదు కావున దానిని యోగసిద్ధి అంటారు. ఈ స్థితిని పొందినవాడు కొంత కాలమునకు శరీరమును కూడ
వదలి పరమాత్మ యందైక్యమగును.
54.
కన్నెవరుడు చేరి కలియంగ నొక్కప్పు
డుచ్చ యందు పిండ ముద్భవించు
హెచ్చు కులజుడెవడు? హీనుడెవండురా?
విశ్వదాభిరామ వినుర వేమ.
దయచేసి ఈ పద్యమునకు కూడ భావము తెల్ప ప్రార్థన.
జవాబు:
పరమాత్మ పురుషుడు, ప్రకృతి స్త్రీయని గీత యందు చెప్పబడినది. సర్వ జీవరాసులకు తల్లి ప్రకృతి తండ్రి
పరమాత్మ. ప్రకృతి పరమాత్మ కలయిక చేతనే చైతన్యమైన జీవ శరీరములు భూమి మీద ఉద్భవించినవి. ప్రకృతి చేత
శరీరము, పరమాత్మ చేత చైతన్యము కల్గుచున్నవి. పుట్టిన ప్రతిజీవి కర్మ బంధములో చిక్కి జీవితమును సాగించుచున్నది.
ఈ విధముగ జన్మతః అన్ని జీవరాసులు సమానమే. కాని హెచ్చుతగ్గు అను రెండు కులములు ఆది నుంచి ఉన్నవి.
అవి ఏవో నీకు తెలియునా అని వేమన ప్రశ్నించుచున్నాడు. నీకు తెలియునా? తెలియక పోతే కొద్దిగ తెలియవలయునంటే
పరమాత్మ వైపు పయణించువాడు హెచ్చుకులజుడు. ప్రకృతివైపు పయణించువాడు హీనకులమువాడు. పై పద్యమందు
కన్య అనగ ప్రకృతి, వరుడనగ పరమాత్మ అని తెలియవలయును. పిండమనగ శరీరము, ఉచ్ఛయందనగ కర్మయందని
తెలియవలయును.
చితంబరరెడ్డి, అనంతపురము.
55. అచల యోగమనగా ఏమి?దాని ద్వారా మోక్షమెలా పొందవలెను?
జవాబు:
అచల మనునది యోగము కాదు. అచల మనగ పరమ పదము లేక మోక్షమని చెప్పవచ్చును. వాస్తవముగ
అచలమనునది ఏది కాని పరమాత్మ అని అర్థము. సర్వ యోగులకు అదియే గమ్యము, దానిని అచేలమని చెప్పవలెను.
అచేలమనునది మార్గము కాదు గమ్యమని తెలియవలయును. అచలమను పదము అచలము అను పదముగ మారినది.
56. సాంఖ్య తారక అమనస్కములనగా ఏమి?
జవాబు:
సాంఖ్య మనగ శరీర యంత్రాంగ మంతయు తెలిసి యోగమాచరించుట, తారకమనగా మన శరీరములోని
శ్వాస ఆధారముతో యోగము ఆచరించుట, అమనస్కమనగ మనో సంకల్పములను అణిచి వేసి మనస్సును ఆత్మ వైపు
మరల్చడము. వీటినే సాంఖ్య, తారక, అమనస్క యోగములంటాము. వీటి ద్వార సిద్ధించునదే అచలము. పూర్వము
అచలమును అచేలమనెడివారు.
57. ఆదిశక్తి, పరాశక్తి, మహాశక్తిని గురించి వివరింపుము?
జవాబు:
ఆది శక్తి అనిన, పరాశక్తి అనిన, మహాశక్తి అనిన, పరమాత్మ శక్తియేనని ఇవి మూడు ఒకటేనని తెలియవలయును.
పురాణములననుసరించి గాని, శాస్త్రములననుసరించి గాని కొందరు నిత్య జీవితమును గడుపలేరు వారి
58.ఎడల మీ ఉద్ద్యేశము ఏమిటి?
జవాబు: మొదట భక్తి తర్వాత జ్ఞానము మానవునికి తప్పనిసరిగ ఉండవలయును. భక్తిని బోధించు పురాణములను
గాని, జ్ఞానమును బోధించు శాస్త్రములను గాని ఆచరించనివాడు నిష్ప్రయోజకుడు. ఏదో ఒక దానిని ఆచరించవలెను.
తెన్మరం సత్యగోపాలాచార్యులు, నరసాపురము.
59. ముక్తిని పొందుటకు యోగసాధనములు ఏవి?
జవాబు:
1. కర్మయోగము, 2. జ్ఞానయోగము వీటినే రాజయోగము, బ్రహ్మయోగములని కూడ అందురు. ఈ రెండు
యోగములే కాకుండ మరి ఒక భక్తియోగ మార్గము కూడ కలదు.
జవాబు:
60. విగ్రహారాధన పద్ధతి ఎందుకు ప్రవేశపెట్టారు?
నిరాకారమైన ఆత్మను తెలియుటకు విగ్రహారాధన ప్రవేశ పెట్టారు. పద్దతులు తెలిసి విగ్రహారాధన చేస్తే
జ్ఞానమగును. తెలియక చేస్తే మూఢనమ్మకమగును. మా రచనలలోని "దేవాలయ రహస్యములు” అను పుస్తకము
చదివిన విగ్రహారాధన యొక్క అంతరార్థము తెలియగలదు.
61.సాకారముతోనే భక్తి కలుగునని నాభావన, లేదు నిరాకారముతోనే భక్తి కలుగ గలదని మరియొకరి వాదన
మీరే మంటారు?
జవాబు:
నిరాకారము అన్నపుడు ఆకారములేనివాడని అర్థము, ఆకారము లేనివానిని ఆకారముతో చూడడమును సాకారము
అంటాము. నిరాకారునికి సాకారరూపమును ప్రతిమల రూపములో కల్పించి కొందరు చూపారు. ఇంకొక విధముగ
నిరాకారుడైన పరమాత్మ అవతారమెత్తి మనిషిగ పుట్టినపుడు ఆ ఆకారమును కూడ సాకారము అన్నారు. దీనిని బట్టి
సాకారమనగా రెండు విధములని తెలిసిపోయినది. భక్తి అనునది నమ్మికను బట్టి ఉంటుంది. కొందరికి సాకారమైన
కదలని ప్రతిమల మీద భక్తి ఉంటుంది. వారికి సాకార భగవంతుని మీద గాని, నిరాకారము మీద గాని భక్తి ఉండదు.
మరికొందరికి సాకార భగవంతుని మీద భక్తి ఉంటూ సాకారమే నిరాకారమని నిరాకారమే సాకారమని తెలిసియుందురు.
అటువంటి వారికి సాకార ప్రతిమల మీద భక్తి ఉండదు. ప్రతిమల మీద భక్తి ఉన్న వారికి నిరాకారము మీద గాని,
భగవంతుడైన సాకారము మీద గాని భక్తి ఉండదు. అలాగే నిరాకారము మీద భక్తి ఉన్నవారికి ప్రతిమల మీద
ఉండదు. మొత్తానికి రెండు పద్ధతులలోను భక్తి కలుగునని తెలియుచున్నది.
62. భక్తియందు రకములున్నవా?
జవాబు:
భక్తియందు ఎన్నో రకములున్నవి. జ్ఞానము మాత్రము కొన్ని రకములే ఉన్నది. యోగము రెండు రకములే
ఉన్నది. మూడవ యోగము ప్రత్యేకముగ ఉన్నది.
63. మనో నిశ్చలత సాధన సమయములో భౌతిక విషయములు ఉద్భవించి తికమక పరచుచుండును. తరుణోపాయ
మేమిటి?
జవాబు:
ఈ విషయమే అర్జునుడు పరమాత్మనడిగాడు. భగవంతుడు పట్టుదల, అభ్యాసము అవసరమన్నాడు.
64.త్రిమతాచార్యుల వారి ద్వైత అద్వైత విశిష్ఠ ద్వైతములు మతములుగు ఎట్లు రూపొందెను?
జవాబు: త్రిమతాచార్యుల వారి సిద్ధాంతములు త్రివిధములైనప్పటికి వారి మతములు వేరుకాదు.
మతము హిందూమతమే.
వారి మువ్వురి,పరిమినాగరాజు, ఎ. కొండాపురము.
65.విగ్రహారాధనపై మీరిచ్చే సందేశమేమిటి?
జవాబు: మా సందేశము ఒక గ్రంథరూపమై ఉన్నది. అంతటి పెద్ద సందేశమును ఇక్కడ వివరించుట కష్టము కనుక
మీరు మా రచనలలోని "దేవాలయ రహస్యములు" అను పుస్తకము చదవండి.
66.దేవుడున్నాడనుటకు నిదర్శనమేమిటి?
జవాబు: దేవుడున్నాడనుటకు ప్రబల నిదర్శనము నీవే. ఆ దేవుడు ఉన్నపుడే నీవు ఉంటావు. కనుక దేవునికి నిదర్శనము
నీవే. ఆ దేవుని నిజముగ తెలియవలయునంటే నిన్ను నీవు పరిశోదించుకో నిదర్శనమే కాక నిజముగనే తెలియబడును.
67. అష్టాదశ పురాణములను అసత్యమన్నారు. భగవద్గీతా శాస్త్రాన్ని కూడ అసత్యము, కవుల కల్పన అని
ఎందుకు అనకూడదు?
జవాబు:
పురాణములు నిరూపనకు రావు కనుక అసత్యమన్నాము. గీతా శాస్త్రము నిరూపణకు అనుభవమునకు వస్తుంది
కావున కల్పన, అసత్యమని అనలేక పోయాము. చంద్రునిలోని మచ్చలలాగ గీతయందు కూడ కల్పన కవిత్వము
కన్పించుచున్నది. దానిని తీసివేసి సశాస్త్రీయముగ బహిర్గతము చేయబడినదియే మేము రచించిన " త్రైత సిద్ధాంత
భగవద్గీత” గీతశాస్త్రమని సత్యమని తెలియవలయును.
ఆదిమూలమ్ రెడ్డి, పెద్దమిట్టూరు, తమిళనాడు.
68. ద్వైతము, అద్వైతము అంటే ఏమిటి?
జవాబు:
జీవాత్మ ఆత్మ వేరు వేరుగ ఉండడము ద్వైతము. జీవాత్మ ఆత్మను చేరి ఒక్కటై పోవడము అద్వైతమని
తెలియవలయును. ద్వైతమంటే రెండని, అద్వైతమంటే రెండు గాని ఒకటని అర్థము.
69.మూడవస్థలంటారు అవి ఏవో తెలుపవలయును?
జవాబు:
1. జాగ్రత్త, 2. నిద్ర, 3. స్వప్నము. ఇవియే మూడవస్థలు. వీటిని ప్రతిదినము మనము అనుభవించుచున్నాము.
యమ్. నాగభూషణము, విజయనగర్, బెంగుళూర్.
70.గురువర్యా! జ్ఞానార్జనకై గురువులు నాశ్రయించి శిష్యుడు ప్రణవ మంత్రమైన “ఓం” ను కాని పంచాక్షరి
అయిన “ఓం నమః శివాయ" కాని, అష్టాక్షరి అయిన 'ఓం నమో నారాయణ' అని మొదలగు మంత్రములను
పఠించవలెనా? లేక సర్వకాల సర్వావస్తలయందు గురునామమును ఉచ్చరించవలెనా? ఏది శ్రేష్టము?
జవాబు:
నిజముగ ఏది శ్రేష్టము కాదు. గురువు తెల్పిన యోగమును అహర్నిశలు ఆచరించవలయును. మంత్రములను
జపించకూడదు. నిజమైన జ్ఞాని మంత్రములకు చాలా దూరముగ ఉండును. నిజ గురువులు కూడ మంత్రములను
ఉచ్చరింపమని చెప్పరు. గురువులు దేవునియందైక్యమగు యోగమునే బోధించుదురు. దానినే ఆచరించమని చెప్పుదురు.
మంత్రము చెప్పువాడు మద్యముడు, ఊరకుండు మనువాడు ఉత్తముడని వేమన యోగి కూడ చెప్పాడు.
71. “పైకి వ్రేళ్లు క్రిందికి కొమ్మలు వ్యాపించిన పురాతన మైన అశ్వర్థ వృక్షమిది. ఇదే శుద్దము, ఇదే బ్రహ్మ,
అమృతము ఏదియు దీనిని అతిక్రమింపలేదు. ఇదియే ఆత్మ" అని ఎవరో జ్ఞానసంపన్నులు వ్రాసారు. అర్థము
కాలేదు. తమరు వివరింతురని కోరుచున్నాము.
జవాబు:
ఊర్ధ్వ మూల మదశ్శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్
చన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్.
పైకి వ్రేళ్లు క్రిందికి కొమ్మలుగ వేదములే ఆకులుగ వెలసి ఉన్న అశ్వర్థ వృక్షమును తెలిసినవాడు వేదములు
తెలిసినవాడే అని భగవంతుడన్నాడు. అశ్వర్థ వృక్షమనగ మన శరీరములోని గుణప్రభావములు గల నాడీమండలము.
ఇది ఆత్మ కాదు. పరమాత్మ కాదు, కేవలము గుణ కర్మ మిళిత ప్రభావ శరీరాంతర్గత భాగము. దీనిని తెలిసిన జన్మలకు
కారణమైన మొత్తము గుణములు, కర్మ తెలియును. అందువలననే “సవేదవిత్” అన్నాడు. "తై గుణ్య విషయా లేదా” అని
గీతలో చెప్పబడినట్లు మూడు గుణ విషయములే వేదములు, ఆ మూడు గుణముల చేత వృద్ధి అగు అశ్వర్థ వృక్షమును
తెలిసినవాడు వేదములు తెలిసినవాడే.
ఇక్కడ అశ్వర్థ వృక్షము గుణములకు సంబందించినదేనని పూర్తిగ తెలిసిపోతూ ఉన్నది. కావున అది శుద్ద
బ్రహ్మ కాదు. పరబ్రహ్మకాదు. పరమాత్మను తెలియగోరు వాడు గుణ రాహిత్యముచే ఈ అశ్వర్థ వృక్షమును నరికివేయ
వలయునని గీతయందు శ్లో. "అశ్వర్ధ మేనం సువిరూఢమూల మసంగ శస్త్రన దృఢన చిత్వా" అని దేవుడన్నాడు.
అటువంటపుడు అశ్వర్థ వృక్షము ఎలా దేవుడగును. అశ్వర్థ వృక్షము కేవలము గుణ కర్మలతో కూడుకొన్న శరీర
యంత్రాంగ మండలమని తెలియవలెను. అది ప్రతి ఒక్కరియందు ఉన్నది. దానిని నాశనము చేసినవాడే మోక్షము
పొందును.
యమ్. పురుశోత్తమనాయుడు, కూచివారిపల్లి.
72. భగవంతుడు మనిషిలో ఉంటాడా?
జవాబు:
భగవంతుడు మనిషిలో ఉండడు. ఆత్మ, పరమాత్మ మనిషిలో ఉంటారు. పరమాత్మ అంశ ప్రత్యేకముగ
పుట్టినపుడు భగవంతుడు మనిషిగ ఉంటాడు. అంతే కాని సాధారణ మనిషి భగవంతుడు కాడు.
73. భగవంతుని పూజించిన వానికి కష్టాలెక్కువంటారు నిజమా?
జవాబు: శుద్ధ అబద్ధము. వచ్చేకష్టాలు భగవంతుని పూజించిన పూజించకుండిన వస్తాయి. కష్టాలు సుఖాలు కర్మను
బట్టి ఉంటాయి. పూజలు, భక్తిని బట్టి ఉండవు.
74.మానవుడు మట్టికుండతో సమానమంటారు ఎందుకు?
జవాబు: పగిలిపోతే పనికిరాని కుండవలె చనిపోతే ఎందుకు పనికిరాని శరీరమున్నది కనుక అలా అంటారు.
75.స్వామి మీరు ఎంతవరకు చదువుకొన్నారు?
మీరు ఏ చదువు అడిగారో! ప్రపంచ చదువైతే 11 తరగతులు, పరమాత్మ చదువైతే మూడు పూర్తి చదివి
నాలుగులో ఉన్నాను. ఐదుకు పోవాలని.
యమ్. ఖాజామైనుద్దీన్, గరుగుచింతలపల్లె.
76. “కామము వలన అర్థము కల్గుచున్నది" అని మీరన్నారు ఇది ఎంత వరకు సమంజసము?
జవాబు:
ధర్మార్థకామ మోక్షములనడము సహజము. దీని అర్థము ధర్మము వలన అర్థము, కామము (ఆశ) వలన
మోక్షము లభించునని అంటున్నారు. మరి కొందరు ధర్మముతో కూడుకొన్న అర్ధము (ధనము), ధర్మముతో కూడుకొన్న
కామము, ధర్మముతో కూడుకొన్న మోక్షము అని కూడ అంటున్నారు. ఈ రెండు అర్థములు సరికానివి. ఎందుకనగా!
ధర్మము వలన ధనము రాదు. మోక్షము ఎట్లు లభించునని తెలియజేయునదే ధర్మము. ధర్మము డబ్బు వచ్చుటకు
మార్గము తెలియజేయునది కాదు. ధర్మమనగా దేవుని తెలుసుకొను శాసనముతో కూడుకొన్నది. అందువలన ధర్మముల
వలన ధనము రాదు, ధర్మార్థ అను పదము సరికాదని తెలియవలయును.
కామము అనగ ఆశ, ఆశ వలన ప్రపంచ డబ్బును సంపాదించు కోవచ్చును. కాని మోక్షము రాదు. ఆశ ఒక
గుణము. గుణముల వలన కర్మ ఏర్పడి జన్మకు పోవును. కాని మోక్షమునకు పోవుననుట సమంజసము కాదు.
అందువలన కామ మోక్షము అనుమాట సత్యము కాదు. “ధర్మార్థ కామ మోక్షము” అను వాక్యము సరికాని వాక్యమనుటలో
సందేహము లేదు. ధర్మము వలన మోక్షము తెలియును అట్లే ఆశ వలన ధనము లభించును. కావున “కామార్థ ధర్మ
మోక్షము" లనడము సరియైన వాక్యము.
మరి కొందరు ధర్మముతో కూడుకొన్న కామము ధర్మముతో కూడుకొన్న అర్ధము (ధనము), ధర్మముతో
కూడుకొన్న మోక్షమనడము కూడ సరికాదు. ధర్మమునకు వ్యతిరేఖమై, జ్ఞానమునకు నిత్యము వైరము కల్గినది కామమని
గీతయందు వర్ణించబడినది. ధర్మమునకు కామమునకు ఏ మాత్రము పొత్తు కుదరదు. అందువలన ధర్మముతో
కూడిన కామమనడము సరికాదు. అట్లే ధర్మముతో కూడిన ధనమంటున్నారు. ధర్మము ఆత్మ విషయము తెలియ
జేయునదియే కాని ప్రపంచ డబ్బును సంపాదించడములో ఏమాత్రము ఉపయోగపడునది కాదు. ధర్మమునకు ఆత్మకే
సంబంధమున్నది. కాని ఏ ప్రపంచ విషయములతో సంబంధము లేదు. కావున ధర్మముతో కూడుకొన్న ధనమనుటలో
ఏమాత్రము అర్థము లేదు. అదే విధముగనే ధర్మముతో కూడుకొన్న మోక్షమంటున్నాము. ధర్మము తెలియనిది
మోక్షము రాదు. మోక్షమెప్పుడు ధర్మముల మీద ఆధారపడి ఉన్నది. కావున ధర్మముతో కూడుకొన్న మోక్షము అని
అనవలసిన అవసరమే లేదు.
నిజముగ పూర్వము ధర్మార్థకామ మోక్షములని ఎవరు అనలేదు. పూర్వము పెద్దలు “కామార్థ ధర్మ మోక్షము”లనెడి
వారు. కాలక్రమమున ఆ మాట ధర్మార్థ కామ మోక్షములుగ మారినది. కామము (ఆశ) వలన ధనము, ధర్మము
వలన మోక్షము లభించునను భావముతో ఆనాడు పెద్దలు కామార్థ ధర్మ మోక్షములు అన్నారు.
77.
చందా చిన్నమునెప్ప, నరసాపురము.
గ్రుడ్డివాల్లకు, కుంటివాల్లకు, కుష్టు రోగులకు దానము చేస్తే పుణ్యము వస్తుందని చాలామంది అంటున్నారు.
ఈ మాట నిజమేనా ?
జవాబు:
గీతాశాస్త్రములో ఇచ్చే దానము ఎవరికియ్యవలయునని ఆలోచించి దానమునకు పాత్రుడా కాదా అని యోచించి
పాత్రుడైనపుడే ఇమ్మన్నాడు. అంతలోతుగ చెప్పడములో ఏదో ఒక అర్థముంటుంది కదా! ఎందుకంత యోచనగ
చెప్పాడంటే ఇచ్చే దానములో పుణ్యము వస్తుంది మరియు పాపము వస్తుంది. పుణ్యము రావడము వలన మనకు
ఇబ్బంది లేదు. కాని పాపము రావడము వలన దాని ఫలితముగ కష్టమనుభవింపవలసి వస్తుంది.
అందువలన
యోచించి మరీ దానము ఇమ్మన్నాడు.
నీవు ఇచ్చే దానము మంచి పనికి ఉపయోగింపబడితే నీకు పుణ్యము వస్తుంది. లేక చెడ్డ పనికి ఉపయోగింపబడితే
పాపమొస్తుంది ఇది సూత్రము. ఈ సూత్రము ప్రకారము మీరే దానముల విషయములు లెక్కించుకోవచ్చును. కుంటి
గ్రుడ్డివారికిచ్చు దానము పెద్దదిగ ఉండదు. ఏమి ఇచ్చిన ఒక పూట భోజనమునకు ఇస్తాము. ఆ దానము వాని ఆకలి
తీర్చుచున్నది. మూడు గంటల కాలము వానిని ఆకలి నుండి కాపాడుచున్నది. అందువలన పుణ్యమే వస్తుంది. కాని
వాడు తిని ఊరకుండక కడుపు నిండిన తర్వాత మూడు గంటల కాలములో ఏదైన చెడ్డపని చేశాడా! అందులో
భాగముగ నీకు కూడ పాపమొస్తుంది. అందువలన కుంటి గ్రుడ్డి అనునది ముఖ్యము కాదు. వారు నడుచుకొను
ప్రవర్తన ముఖ్యమని తెలియవలయును.
ఈ విషయము సర్వ సాధారణ వ్యక్తికి వర్తించును. అహంకారమును అణచివేసి కర్మ యోగమాచరించు
వానికి పైన చెప్పినట్లు పాపము గాని, పుణ్యము గాని రాదు. అటువంటివాడు దానము చేయుటయందేకాక ఏ
కార్యము చేసినప్పటికి వానికి పాప పుణ్యములంటవు.
యమ్. ఖాజామైనుద్దీన్, గరుగుచింతలపల్లె.
78. “అండ, పిండ, బ్రహ్మాండము నిశ్శబ్దములో నిక్షిప్తమైనాయి” వాస్తవమా?
జవాబు:
అండమనగ అండము (గ్రుడ్డు) నుండి పుట్టినవి. పిండ మనగ పిండము (గర్భము) నుండి పుట్టినవి. అట్లే
బ్రహ్మాండమనగ చెట్లు చేమలు మొదలగు కనిపించు ప్రకృతి అంతాయున్నవని అర్థము. పుట్టిన జీవరాసులనన్నిటిని
ప్రపంచమును విభజించి చెప్పడమే అండ పిండ బ్రహ్మాండమని అనుచున్నారు. పుట్టిన జీవరాసులు నిశ్శబ్దముతో
ఏమాత్రము కూడుకొని లేవు. అన్ని శబ్దముతోనే కూడుకొని ఉన్నాయి. ప్రకృతితో పుట్టినది శరీరము. ఆ శరీరముల
పుట్టుకను బట్టి అండ పిండ బ్రహ్మాండమనుచున్నాము. ప్రకృతి శరీరములోని ఒక భాగము శబ్దము. శబ్దము
శరీరములలో ఒక భాగమైనపుడు అండ పిండ బ్రహ్మాండము నిశ్శబ్దముతో లేదని చెప్పవచ్చును.
ప్రపంచమంత ముగిసి ప్రళయమేర్పడినపుడు అండ పిండ బ్రహ్మాండ మంతయు అనగ యావత్ ప్రపంచమంతయు
అవ్యక్తమై పోవుచున్నది. కంటికి కనిపించక పోయిన అప్పటి స్థితి ఏమియు చెప్పలేనిది. అపుడు ఆకాశమే లేదు
కావున అది ఏ శూన్యముగనుండునో చెప్పలేము. అపుడు ప్రకృతియే లేదు. కావున నిశ్శబ్దమను మాట కూడ
చెప్పలేనిదై ఉన్నది. అందువలన అండ పిండ బ్రహ్మాండమున్నపుడు అంతా శబ్దముతోనే కూడుకొని ఉన్నది. అండ
పిండ బ్రహ్మాండము లేనట్టి స్థితియేమిటో ఊహించరానిది. నిశ్శబ్దమని కూడ నిర్ణయించలేని అగమ్యగోచరమైనది.
పొత్తురు క్రిష్టయ్య, బి. పప్పూరు.
79. మానవుడు గత జీవితంలో చేసుకొన్న పాపము ఇపుడు పుణ్య కార్యములు చేయుట ద్వార, తీర్థయాత్రలు
చేయుట ద్వార, యజ్ఞయాగాది వ్రతక్రతువులు చేయుట ద్వార పరిహారమౌతుందా?
జవాబు:
మానవుడు జీవితములో చేసుకొన్న పాపము ఎటువంటి పుణ్యకార్యముల వలన తొలగదు. పుణ్యకార్యములు
చేయుట వలన పుణ్యము వచ్చును. పాపకార్యములు చేయుట వలన పాపమొచ్చును. తీర్థయాత్రల ద్వార మరియు
యజ్ఞయాగాది వ్రత క్రతువుల ద్వార విశేషమైన పుణ్యము వచ్చును. జీవితములో జరిగెడి కాలములో పాపము కాని,
పుణ్యము కాని నీ తలలోని కర్మ చక్రములోనికి చేరుచునే ఉండును. పాపము వలన పుణ్యము, పుణ్యము వలన
పాపము తీసి వేయబడవు. పాపము కాని అట్లే పుణ్యము కాని ఒక్క జ్ఞానాగ్ని చేత మాత్రమే దహించబడును. ఇతరత్రా
ఏ కార్యముల వలన తీసి వేయబడవు.
ఈ కాలములో పాపము చేసినవారు దాని పరిహారార్థము దానము చేయుట, అభిషేకములు చేయించుట,
అనేక పుణ్య క్షేత్రములు దర్శించుట మొదలగునవన్నియు చేయుచున్నారు. అట్లు చేయుట వలన పుణ్యమొచ్చును.
కాని పాపము పోదని వారికి తెలియదు. గీతయందు దేవుడు నేను ఎవరి పాపమును, ఎవరి పుణ్యమును తొలగించను
అని అన్నాడు. వాస్తవముగ జ్ఞానాగ్ని చేతనే పాపము మరియు పుణ్యము పోవును. కాని జ్ఞానాగ్నిలేని వానికి ఏ
విధముగ కర్మ పోదు. చివరకు చేసుకొన్నది తప్పక అనుభవించవలయును. అందువలననే పెద్దలు కర్మను విష్ణు,
ఈశ్వర, బ్రహ్మలు కూడ అనుభవించక తప్పించుకోలేరని అన్నారు.
కె. శీతారామయ్య, ప్రొద్దుటూరు.
80. భగవంతుడు సాక్షిభూతుడు నిమిత్త మాత్రుడు అని పెద్దలు చెప్పగా వింటున్నాము. మన కర్మ వలన
మనకు జన్మలు వచ్చునని చెప్పుదురు. అటువంటపుడు భగవంతుని ధ్యానించినందున ప్రయోజనము లేదు.
పూజించక పోయినందు వలన నష్టం ఉండదు గదా! అటువంటి పరిస్థితులలో భగవంతుని ఎందుకు పూజించవలెనో
చెప్పకోరినాము.
జవాబు:
భగవంతుడనగా భగము నుండి పుట్టినవాడని అర్థము. ధర్మసంస్థాప నార్ధము పుట్టిన సాకార రూపమునే
భగవంతుడని అందురు. నిరాకారమైన ఆత్మను సాక్షిభూతుడని పెద్దలందురు. కాని భగవంతుని సాక్షిభూతుడన
కూడదు. మీ ఉద్దేశ్యములో దేవుని గూర్చి అడిగిన ప్రశ్న కావున భగవంతుడను పదము వద్ద ఆత్మ లేక దేవుడని
వ్రాసుకొనిన ప్రశ్న సారాంశమైన అర్థముతో కూడుకొన్నదవును.
వాస్తవముగ కర్మ వలననే మనకు సర్వము కలుగుచున్నవి. గీత యందు సాకారమైన భగవంతుడు కూడ నేను
ఎవరి కర్మను తీసివేయువాడను కాదని కర్మ సన్యాస యోగమను అధ్యాయములో 15వ శ్లోకమున "నాదత్తేకస్యచి
త్పాపంన చైవసుకృతం విభుః" అన్నాడు. తప్పు చేశానని ఎన్ని నమస్కారములు చేసినా దేవుడు పాపమును తీసివేయడు.
అటువంటపుడు దైవాన్ని ఆరాధించడము దేనికని ప్రశ్న ఉద్భవించకమానదు. ఆ విధమైన విమర్శ వచ్చినపుడే మానవునికి
జ్ఞానముత్పన్నమగును.
దేవుడు కర్మకు దూరముగ ఉండువాడు. కర్మంతయు ప్రకృతి సంబంధించి ఉన్నది. ప్రకృతి పరిపాలనలోని
కర్మను దేవుడు తీసివేయడు. కర్మ నుండి బయటపడవలయునంటే దేవుడే ఒక మార్గము తెలిపియున్నాడు.
మార్గము అనుసరించినపుడు మాత్రమే మానవుడు కర్మనుండి బయటపడగలడు. ఆ మార్గమునే "యజ్ఞ కర్మ”
అంటున్నాము. దేవుడు కర్మను తీసివేయకుండ కర్మ నుండి బయటపడు మార్గమును తెలుపుట వలన మానవుడు
సంతోషపడవలసి ఉన్నది.
దైవజ్ఞానము తెలుసుకొని దేవుని మనసు చేత ధ్యానించుట వలన మన శరీరములో యోగాగ్ని అనునది
ఉద్భవించును. ఆ యోగాగ్ని కర్మను కాల్చగలదు. ఆ విధముగ కర్మను కాల్చు విధానమునే యజ్ఞకర్మ లేక జ్ఞానయజ్ఞము
అని అందురు. దేవుడు స్వయముగ కర్మ తీసివేయడు. కాని దైవ ధ్యానము వలన జనించెడి యోగశక్తి చేత కర్మకాలిపోవును.
కావున దేవుని ధ్యానించవలసి ఉన్నది.
"జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్" అను గీత వాక్యము ప్రకారము జ్ఞానము చేత ఉద్భవించిన అగ్ని చేతనే కర్మ
కాలిపోవును. మరి ఏ ఇతర విధానము వలన పోదు. కావున జ్ఞానమును తెలిసి పద్ధతి ప్రకారము దైవ ధ్యానము చేసిన
కర్మ తొలగును. అట్లుకాక ఎన్ని మ్రొక్కులు మ్రొక్కిన దైవము కర్మను తీసివేయ జాలడు.
81. తేది 28-02-88 ప్రబోధాత్మజమ్ మాస పత్రికయందు సంపాదకీయములో అపాయము తెలియని పసిపిల్లలకు
బూచివాడున్నాడని అసత్యములు చెప్పి భయపెట్టి రక్షణ చేస్తామని, అదే విధముగ భక్తి ఏ మాత్రములేని వారికి
కల్పిత పురాణములు చెప్పి ఆశ కల్పించి భక్తి మార్గమును అవలంభింప చేసి, అజ్ఞానమునకు దూరము చేస్తారని
వ్రాశారు. ఆ ఉదాహరణ మాకు బాధ కల్గించినది. పురాణములు కల్పితములు అయిన అవి పెద్దలు మానవునికి
భక్తి కల్గించుటకేనని వ్రాశారు. పురాణములు అసత్యములుకావని మా భావము. దేవున్ని మానవుడు అర్థి, అర్థార్థి,
జిజ్ఞాసు, జ్ఞానిలాగ ఆరాధిస్తారని మీలాంటి పెద్దలు చెప్పుతారు. అర్థార్థికి పురాణములే ఆధారము కదా! పురాణములు
ఎట్లు అసత్యములో తెలియ చెప్పకోరుచున్నాము.
జవాబు:
పురాణములు చెడ్డవని మేము చెప్పలేదు. అసత్యములైనప్పటికి మూఢుని భక్తి గల వానిగ జేయుటకే పెద్దలు
వ్రాశారని చెప్పాము. బాధకల్గవలసిన విషయము అందులో ఏమి ఉంది? ఇంకా ముందుకు పోవు విషయమున్నది.
కావున సంతోషించక పోగా బాధ కల్గినదని వ్రాయుట చూస్తే మీరు పురాణ విషయములలో లోతుగ ఉన్నట్లు
తెలియుచున్నది.
వాస్తవముగ పురాణముల వలన ఏమి తెలియనివారు ఆశ కోసము భక్తులగుచున్నారు. పురాణములవలన
భక్తులైనవారు ఆత్మజ్ఞానమును తెలుసు కోవలయునని ప్రయత్నము చేసి జ్ఞానులు కాకపోగా నాస్తికులగుచున్నారు.
జ్ఞాన మార్గములో వచ్చిన అనేక సంశయములను పురాణములు తీర్చలేక పోగా, పురాణములు అనేకమైన అనుమానములు
కల్గించి, చివరకు దేవుడే లేడను వారిగ మార్చి వేయుచున్నవి. ఈనాడు నాస్తికులను చూడండి వారికి శాస్త్రమొకటున్నదని
తెలియక పురాణ విషయముల ఆధారముతోనే దేవుడు లేడని వాదిస్తున్నారు. వారికి శాస్త్రమేదో, పురాణమేదో తెలియదు.
బహుళ ప్రచారములో ఉన్న పురాణములను ఆధారము చేసుకొని వాదించడమే వారి పనియై పోయినది. పురాణ
విషయము ద్వారా వారి ప్రశ్నలకు జవాబులేదు. కావున నాస్తికులను ఆస్తికులుగ మార్చలేని స్థితిలో మన పెద్దలున్నారు.
మేము అలాంటి స్థితి ఇందూ మతములో రాకూడదని నాస్తికులను కూడ ఆస్తికులుగ చేయు శాస్త్రములనే
బోధించుచున్నాము. అటువంటి సందర్భములో పురాణముల గూర్చి వాస్తవము చెప్పవలసి వస్తున్నది. అలా కాకపోతే
ఇందూ మతము క్షీణించి ఇతర మతములలో లీనమగుటకు అవకాశమున్నది. అలాంటపుడు ఇందూ మతమును
ఆదుకొనుటకు ఉన్న ఏకైక మార్గము శాస్త్ర ప్రచారము తప్ప మరి ఏమి లేదు. అందువలన పురాణముల నుండి
దూరము చేసి శాస్త్రముల వైపు మల్లించడమే మా ముఖ్య ఉద్దేశ్యమైన దానివలన పురాణములను విమర్శించ వలసి
వచ్చినదని తెలుపుచున్నాము. పురాణములకంటే సారాంశము నిచ్చు శాస్త్రము తెలియుట వలన సంతోషపడవలెను
కాని బాధ ఎందుకు ?
శాస్త్రములకు పురాణములకు చాలా భేదమున్నది. పురాణములు కేవలము కల్పితములు. శాస్త్రములు కల్పితములు
కావు. శాస్త్రములు అనగా శాసనములను తెలియజేయునవి. శాసనము అంటే మనము చేయు పనులు ఏవి అయిన
ఈ విధముగానే జరుగవలయునని చేసిన నిబంధనని తెలుసుకొనుము. ఏ విషయములకైన సిద్ధాంతములను తెలియజేయు
శాసనములుగల గ్రంధమునే శాస్త్రము అని అందురు. పురాణములు ఏ విధమైన శాసనములతో కూడుకొని ఉండవు.
చరిత్రను ఆధారముగా తీసుకొని దానికి ఎన్నో కల్పితములు చేసి వ్రాయబడినవే పురాణములు మరియు ఇతి హాసములు.
పురాణములు విచారణ విమర్శలకు నిలువవు. శాస్త్రములు కల్పితములు కావు కాబట్టి ఎటువంటి విచారణకు అయిన
నిలుచును. శాస్త్రముల సిద్ధాంతములు ఎప్పటికి మారునవి కావు. ఉదాహరణకు గణిత శాస్త్రములో 3 X 3 = 9 అని
ఉన్నది. అది ఎప్పటికి అట్లే ఉండును. ఎప్పటికి మారునది కాదు. హెచ్చించిన, భాగించిన, కూడిన, తీసి వేసిన
విలువ మారక ఉండును.
పురాణములు కల్పితముగా ఎందుకున్నవంటే చిన్న పిల్లలకు ఖాళీ చేయి పిడికిలిగా పట్టుకొని చూపి పప్పులు
ఇస్తాను దగ్గరకు రమ్మని పిలిచినట్లుగా, మూఢులుగ, భక్తిహీనులుగా ఉన్న ప్రజలలో మొదట భక్తి బీజములు నాటుటకు,
జ్ఞానమునకు దూరముగా ఉన్న వారిని దగ్గరగా చేయుటకు, కల్పితములు చేసి పురాణములను మన పెద్దలు సృష్టించారని
తెలియుచున్నది. పురాణములు శాస్త్రములు తెలియని వారికి మాత్రము అవసరము. జ్ఞానములో ప్రవేశించి ముందుకు
పోవువారు పురాణములను పూర్తిగా వదలి వేయడము మంచిది. ఈ కాలములో కొంత మంది ప్రజలయందు పురాణముల
ప్రభావము పూర్తిగా ఇమిడి ఉన్నది. అందువలన పురాణ ఆచారముల ప్రకారము ప్రవర్తించుచు ఇంతకంటే మించిన
భక్తిమార్గము లేదని పూర్తిగా చెడిపోవుచున్నారు. జ్ఞానమార్గము ఏమాత్రము గుర్తించకున్నారు. కొందరు గురువుల
వలన జ్ఞానము పొంది ఎప్పుడో ఒకప్పుడు పురాణ విషయములు తెలిసినంతనే తనకున్న జ్ఞానము మీద నమ్మకము
విడచి అజ్ఞాన మార్గమున వర్తించుచున్నారు. నిజముగ చూచిన పురాణముల వలన ఒకటి మేలు రెండు చెడ్డగ ఉన్నది.
పురాణముల విషయముల ప్రభావములు తెలియని వారు జ్ఞానమార్గము నుండి కూడ బ్రష్టులగుటకు వీలున్నది. కావున
పురాణముల యొక్క వాస్తవమును విమర్శించడమైనదని తెలుసుకొనుము. నేను పురాణములను విమర్శించునది మీకు
జ్ఞానము తెలిసి మోక్షమొచ్చుటకు కాని నాకు మోక్షమొచ్చుటకు కాదని తెలుసుకొనుము.
పురాణములు భక్తిని బోధించునవియై ఉన్నవి. కాని జ్ఞానమునకు చాలా ఆటంకమయినవి. శకుని దుర్యోధునునికి
మేలు చేకూర్చునట్లు నటించుచు కీడు చేకూర్చినట్లు మన పురాణములు కూడ మానవునికి మేలు చేకూర్చునట్లు ఉన్నవి.
కాని వాటి వల్ల చివరకు అజ్ఞానమే మిగులుచున్నది. పురాణములు మొత్తము పదునెనిమిది కలవు. వాటినే అష్టాదశ
పురాణములు అని అనుచుందురు. అవి 1. బ్రహ్మ పురాణము, 2. పద్మ పురాణము, 3. విష్ణు పురాణము, 4. శివ
పురాణము, 5. భాగవతము, 6. నారద పురాణము, 7. మార్కండేయ పురాణము, 8. అగ్ని పురాణము,
9. భవిష్యత్పురాణము, 10. బ్రహ్మకైవర్తన పురాణము, 11. లింగ పురాణము, 12. వరాహ పురాణము, 13. స్కంద
పురాణము, 14. వామన పురాణము, 15. కూర్మ పురాణము, 16. మత్స్య పురాణము, 17. గరుడ పురాణము,
18. బ్రహ్మాండ పురాణము. ఇవికాక ఉప పురాణములు అనేకముగ గలవు. ఈ పదునెనిమిది పురాణములు భక్తిని
బోధించుచున్నవి. వీటియందు భాగవతము ఎక్కువ పేరు గాంచినది. ఇవి అనేక వ్రతముల తోను, వివిధ ఆచార
ఆరాధనలతోను కూడుకొని ఉన్నవి. జ్ఞానమును బోధించు శాస్త్రములకు కొంత వ్యతిరిక్తముగ పురాణములు
బోధించుచున్నవి. శాస్త్రములు ఆరు మాత్రము గలవు. బ్రహ్మ విద్యకు సంబంధించిన శాస్త్రములలో ముఖ్యమైనది నేడు
మన అందరికి దగ్గరగా ఉన్న భగవద్గీతా శాస్త్రమే. బ్రహ్మ విద్య నిలయమని, యోగశాస్త్రమనియు పేరు పొందినది
మరియు పరమాత్మయే స్వయముగా పల్కినది అయిన భగవద్గీతా శాస్త్రమునకే విరుద్ధముగ పురాణములు బోధించుచున్నవి.
అందువలన పురాణములకొన్నిటిని విమర్శించవలసి వచ్చినది. విమర్శ చేయని ఎడల భగవద్గీతను వదలి కొందరు
పురాణములనే అనుసరించి జ్ఞానమార్గములో చెడి పోవుటకు కారణమున్నది.
ఉదాహరణకు : శివ పురాణాంతర్గతమైన మాఘ పురాణమందు ఒక విషయము ఇట్లున్నది. రాముడు అయోధ్యకు
తిరిగి వచ్చి రాజ్యమేలుచున్న సమయమున, ధర్మము నాల్గుపాదముల నడచుచున్న సమయమున, ఒక బ్రాహ్మణుని
ఇంట 5 సంవత్సరముల వయస్సు గల బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడట. అపుడు ఆ కుమారుని తండ్రి
శవమును తీసుకొని వచ్చి రాముని మందిరము ముందరుంచి వాపోవుచు అయ్యో కుమారా! నీకింతలోనే నూరు
సంవత్సరములు ఆయువు తీరినదా! తల్లిదండ్రులు సజీవులైయుండ తనయులు మృతినొందు అన్యాయము ఈ
అయోధ్యయందుకాక ఇంకెందైననున్నదా! ఓ రామచంద్ర ప్రభూ! మేము పుత్రశోకముతో నిటు విలపించుచుండ, ఈ
అన్యాయము జరుగుటకేమి కారణమని విచారింపక రాజసౌధములో కూర్చుండి ఉండుటయేనా నీ రాజ్యపాలన లోని
ప్రత్యేకత? ఇదియేనా ధర్మము? ఇదియేనా రాజనీతి? మేమిటు శోకించుచుండ వలసిందేనా అని బ్రాహ్మణుడు
వాపోవుచుండ, అంతట రాముడు మేడదిగి వచ్చి శోకించవలదని చెప్పి, ఈ అన్యాయమునకు కారణము విచారించెదనని
పుష్పక విమానము ఎక్కి, ఎచ్చట అధర్మము నారాజ్యములో తలెత్తినదో అచ్చటికి పొమ్మని విమానమును ఆజ్ఞాపింపగ
విమానము ఆకాశ మార్గమున పోయి ఒక చోట దిగెను. అప్పుడు రాముడు అక్కడ పరికించగా ఒకడు తపస్సు
చేయుచుండెను. అతనిని రాముడు సమీపించి అయ్యా నీవెవరవు? ఎందులకు తపమొనరించుచుంటివి అని అడుగగ,
ఆయన రామచంద్రా నేను శంభుకుండను శూద్రుడను, బొందితో కూడ స్వర్గమునకు పోవు ఉద్దేశ్యమున తప
మాచరించుచుంటినని జవాబు చెప్పెనట. అందులకు రామచంద్రుడు “నీవు శూద్రుడవు కాన తప మాచరించుటకు
అనర్హుడవు. నీవు చేయుచున్న తపస్సు అధర్మయుతము, శూద్రుడవైన నీవు తపమాచరించుట వలన మా రాజ్యములో
ఒక విప్రకుమారుడు చనిపోయెను. ఈ అధర్మ కార్యము చేసినందులకు నీ శిరస్సు ఖండించుచున్నాను, దీనితో నీవు
కోరుచున్న మోక్షము లభించును. ధర్మరక్షణ జరుగును” అని అతని శిరస్సు ఖండించినట్లు వ్రాయబడినది. ఈ కథలో
శరీరముతో స్వర్గమున కేగవలయునని శూద్రుడు అడిగినట్లు ఉన్నది. రాముడు నీవు కోరుచున్న మోక్షము ఇచ్చెదనని
చెప్పినట్లు ఉన్నది. వాడు కోరుకొన్నది స్వర్గము కాని మోక్షము కాదు కదా! అదియు శరీరముతోనే. రాముడు
ఇచ్చినది మోక్షము. ఈ కథలో స్వర్గమునకు మోక్షమునకు భేదమేలేనట్లు ఉన్నది. ఈ పురాణము రాసిన వారికి
స్వర్గమునకు మోక్షమునకు భేదము తెలియనట్లున్నది. ఇందులో శాస్త్రవిరుద్దము ఏమనగా! శూద్రుడు
తపమాచరించకూడదను మాట. పరమాత్మను తెలుసుకొను నిమిత్తము మానవుని పవిత్రము చేయు సాధనలలో
తపస్సు ఒకటి. అట్టి తపస్సు శూద్రుడు చేయకూడదనుటకు ఏ ప్రమాణము లేదు. సర్వ మానవులు భక్తి సాధనలు
చేయవచ్చుననుటకు ప్రమాణము కలదు. గీతాశాస్త్రములో రాజ విద్యా రాజగుహ్య యోగమున "మాం హి పార్థ! వ్య
పాశ్రిత్య యేపిస్యుః పాపయోనయః స్త్రీ యో వైశ్యా స్తథా శూద్రాస్తేపి యాన్తి పరాంగతిమ్" నన్ను పూజించుట వలన
పాపయోనియందు పుట్టినప్పటికి, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు నా అనుగ్రహము పొందినవారై ముక్తిని పొందగలుగుచున్నారని
పరమాత్మ పలికినాడు. యోగశాస్త్రమైన భగవద్గీతకు వ్యతిరిక్తముగ శూద్రుడు తపమాచరించ కూడదనుట అధర్మము.
శాస్త్రమునకు వ్యతిరేఖమైన మాటలు పురాణములు చెప్పుచున్నవి. దీని వలన శాస్త్రములకు పెద్ద ఆటంకమేర్పడుచున్నది.
ఉన్న వాస్తవము మట్టిపాలై పోతున్నది. పై కథలో స్వర్గమును శూద్రుడు కోరినట్లు ఉన్నది. రాముడు నీ వడిగిన
మోక్షము నిచ్చుచున్నానని చెప్పినట్లు ఉన్నది. ఇక్కడ మోక్షము స్వర్గము రెంటికి భేదములేనట్లు వ్యక్తమగుచున్నది.
దీనితో మోక్షము యొక్క నిజస్థితి నాశనమై పోవుచున్నది. స్వర్గము మోక్షము రెండు ఒకటేనను భావన ప్రజలలో
పుట్టుచున్నది. జ్ఞాన మార్గములో పోవు కొందరికి మోక్ష స్వర్గములు రెండు ఒకటేనని తెలియడముతో మేము చేయు
సాధనయంతయు సుఖముల కోసమా? పరలోక ప్రాప్తి కోసమా? అని వారంతకు వారు వెనుకంజ వేయుస్థితి ఏర్పడుచున్నది.
జన్మరాహిత్యమంటే ఏమిటి? అను ప్రశ్న ఉద్భవించి వారిని పీడింప మొదలు పెడుతుంది. గీతా శాస్త్రములో మోక్షమనునది
నాశనము కాని స్థితిగా ఉండి, పరలోకముకానిది, కాల ప్రమాణములేనిది, సుఖదుఃఖములకంటనిది అని తెలిపి
ఉండగ, ఈ పురాణములలో అందులకు విలక్షణముగా ఉండుట ఎట్లున్నదో చూడండి.
మార్కండేయ పురాణమందు యమధర్మరాజు మార్కండేయుని కొని పోవుటకు రాగ, ఆ సమయములో
మార్కండేయుడు శివలింగమును కౌగిలించుకొని కదలక ఉండెనని, యమధర్మరాజు మార్కండేయుని మెడకు పాశము
వేసి లాగుచుండగ, ఈశ్వరుడు ప్రత్యక్షమై నాభక్తుని లాగుటకు నీకెంత భయములేదని యమధర్మరాజును తన ఎడమ
కాలితో తన్ని నటుల, ఆ దెబ్బకు యమధర్మరాజు మూర్చిల్లెనని, దేవతల ప్రార్థనతో యమధర్మరాజుకు ఈశ్వరుడే తిరిగి
జ్ఞప్తికి వచ్చునట్లు చేశాడని, పైకి లేచిన యమధర్మరాజును నా భక్తుడైన మార్కండేయుని దగ్గరకు నీవు రాకూడదు.
మార్కండేయుడు చిరంజీవిగా ఉండునని చెప్పినట్లును, మరియు మార్కండేయుడే కాక ఎవరైన శివభక్తులైన వారి
వద్దకు పోవలదనియు ఈశ్వరుడు యమధర్మరాజుకు చెప్పినట్లు ఉన్నది. ఈ విషయము "జాతస్య హి ద్రువో మృత్యు
ధ్రువం జన్మ మృతస్యచ" అని ఉన్న గీతా ధర్మమునకు వ్యతిరేఖముగా ఉన్నది. కొందరు గీతనే ఎందుకు ప్రమాణముగా
తీసుకోవలయును పురాణములను ఎందుకు తీసుకోకూడదని అడుగవచ్చును. మరియు ఎన్నో పురాణములు చెప్పిన
వాక్కులు తీసివేయడము, ఒక్క భగవద్గీతను మాత్రము ముందుకు తేవడము, గీత మీద పక్ష పాతముండుటయేనని
అనవచ్చును. దానికి సమాధానము ఏది నిజమో దానినే తెలిపిన వారు ఒప్పుకొందురు. నిజము కాని దానిని ఎట్లు
ఒప్పుకొనదగును. పలువురాడు మాట నిజము, ఒక్కడాడు మాట నిజము కాదని ఎట్లు చెప్పనగును. ఒక్కడు పల్కినంత
మాత్రమున నిజము అబద్దమగునా! పది మంది పల్కినంత మాత్రమున అబద్దము నిజమగునా! ప్రతి దానిని
యోచించి నిజమేది అబద్దమేది అని విశదీకరించినపుడే వాస్తవము తెలియును. విన్న దానినంతయు గ్రుడ్డిగ నమ్ముచు
పోయిన వాస్తవమును పొందలేరు. మార్కండేయుడు చిరంజీవైన ఇప్పటికి ఉండవలయును కదా! ఇప్పుడు మార్కండేయుడు
ఎక్కడ లేనట్లే తెలియుచున్నది. మరియు శివభక్తులను యముడు వదలివేయవలయునంటే వారికి మరణము రాకూడదు
కదా! ఇపుడు శివ భక్తులైన వారు కూడ అందరూ మరణించుచునే ఉన్నారు కదా! కావున మార్కండేయుని కథ ఎట్లు
నిజమగును. ఈ కథ నిజము కాక పోవడమేకాక "పుట్టినవాడు చావ వలసినదే, చచ్చినవాడు పుట్టవలసినదే” అను
గీతా వాక్యమునకు ఎంతో వ్యతిరేఖముగా ఉన్నది. అందువలన మార్కండేయ పురాణము కూడ శాస్త్రవిరుద్దమై ఉన్నదనుటకు
ఎటువంటి సందేహము లేదు.
సావిత్రి పురాణమందు సావిత్రి భర్తయగు సత్యవంతుని ప్రాణమును యమ ధర్మరాజు తీసికొని పోవుచుండగ,
సావిత్రి భర్త ప్రాణముల కోసము యమ ధర్మరాజును వెంబడించెనని, చివరకు యముడు ఎంత భయము చెప్పిన వినక
యమపట్టణము వరకు యముని వెంటపోయి, యమపురిలో యమునితోనే పుత్ర సంతతి వరము బడసి, చివరకు
భర్తను విడిపించుకొని వచ్చెనని ఉన్నది. ఈ కథలో యమలోకమనునది నిజముగా ఉన్నదని, దానికి రాజైన యమధర్మరాజు
జీవులనుకొని పోవుననియు తెలియుచున్నది. ఈ పురాణముల ప్రభావమువలననే నేటి మానవులలో యమలోకముందని,
అచ్చట పాపములకు శిక్ష వేయబడునను విషయము పూర్తిగా జీర్ణించి పోయినది. ఈ విధముగ యమలోకమనునది
వేరుగా ఉందని తెలియుట వలన మానవులలో పాపభీతి అనునది ఏమాత్రము లేకుండ పోయినది. ప్రతి ఒక్కరు ఎంత
పెద్ద పాపమునైన భయము లేకుండ చేయుచున్నారు. యమలోకమునకు పోయిన రోజు కదా పాపమనుభవించేది.
ఎప్పుడో వచ్చు కష్టమునకు ఈ రోజు వచ్చు సుఖములను ఎందుకు వదలు కోవలయును. యమలోకముండునని
అనుకొనుచున్నాము, కాని ఎవ్వరయిన చూచి వచ్చినారా? ఒక వేళ ఉండుననుకొందాము అయిన అక్కడ ఏమి
అనుభవించేది మనకు తెలియదు కదా! ఒక వేళ అనుభవించిన అక్కడది ఇక్కడకు జ్ఞప్తికి ఉండదు కదా! జ్ఞప్తికి లేని
దానిని ఎవరు చూడని దానిని ఉన్నదని ఊహించుకొని మనకు అనుకూలమైన పనులను పాపము అని వదలి వేయుట
తెలివి తక్కువ అనువారు చాలామంది ఉన్నారు. కొందరు నీవు చేయు పాపపు పనికి చిత్రహింస యమలోకములో
అనుభవించుతావు అని చెప్పిన అక్కడకు పోయినప్పుడు అనుభవించుతానులే అని అనువారున్నారు. ఈ విధముగ
మానవులలో పాపభీతి లేకుండ పోవడానికి కారణము పురాణములే. యమలోకమనునది భూమి మీదనే ఉన్నదని,
ప్రతి క్షణము మనము అనుభవించు కష్టములే యమబాధలని తెలియక పోవుటవలన, మానవుడు భయము లేకుండ
ఏ పని చేయుటకైన వెనుకాడుట లేదు. పురాణములో యమలోకమనునది ఎక్కడో ఉన్నదని, మానవులను
భయపెట్టవలయునని, పురాణములను వ్రాసిన వారి ఊహ ఉండవచ్చును కాని వారనుకున్నట్లుకాక అందులకు
వ్యతిరేఖముగా ప్రజలలో భయమే లేకుండ పోయినది. యదార్థముగ యమలోకము భూమి మీదనే ఉన్నదని తెలిసిననాడు,
యమలోకములో ఉండు బాధలన్ని ఇక్కడ భూమి మీదనే ఉన్నవని తెలిసిననాడు, ప్రత్యక్షముగ ఒక బండి క్రిందపడి
ముక్కలు ముక్కలుగా చీలి పోయిన శరీరమును చూచి ఇదియే యమ బాధ, ఇది మనము చేసుకొన్న పాపఫలితమే అని
తెలిసిననాడు పాపభీతి ఏర్పడగలదు. యమలోకములో ఉన్నవని అనుకొనుచుండిన కుక్కలు కరచుట, పాములు
కరచుట, తేల్లు కుట్టుట, బల్లెములతో చెక్కుట, నూనెలో కాలుట, అగ్నిలో మండుట, బండిక్రింద పడవేయుట, కట్టెలతో
కొట్టుట, కత్తులతో నరకుట, జంతువులతో హింసింపజేయుట మొదలగునవి అన్నియు ఇక్కడే ప్రత్యక్షముగా జరుగుచున్నవని
తెలిసిననాడు మానవులలో పాపభీతి పుట్ట గలదు. పాపమునకు ఉన్న ప్రతి ఫలిత మెట్టిదో నిజముగ తెలిసిననాడు
మానవుడు పాపము చేయుటకు వెనుకాడును. పాపము చేయువారు తగ్గిపోదురు.
నేడు భూమి మీద పాపము చేయు వారు పెరిగి పోయినారంటే పురాణముల ప్రభావమేనని తెలుసుకొనుము.
పురాణములు మనకు మేలు చేకూర్చుతాయని కొందరభిప్రాయముండవచ్చును. కాని పురాణములు మనకు ఎక్కువ
నష్టమునే చేకూర్చినాయని గట్టిగ చెప్పవచ్చును. భక్తి బీజమును నాటుటకు ప్రయత్నించిన పురాణములు చివరకు
మానవుని దైవజ్ఞానమునకు దూరము చేయుచున్నవని చెప్పవచ్చును.
పంచమ వేదమని పేరుగాంచిన భాగవతమందు అజామీ లోపాఖ్యాణములో అజామీలుడు తన జీవితకాలములో
ఎన్నో పాపకృత్యములను చేసి భయంకర పాపము సంపాదించుకొని ఉన్నవాడై, కొంత కాలమునకు మరణ సమయము
రాగ, ఆ సమయములో మంచము మీద పరుండినవాడై నారాయణ అను పేరు గల తన చిన్న కుమారుని మీద ఎక్కువ
ప్రేమ ఉండుట వలన, వానిని చూడవలయునను తలంపుతో నారాయణ అని పిలిచెనట. అవసాన దశలో నారాయణ
అనుటవలన వైకుంఠము నుండి విష్ణు దూతలు వానిని కొనిపోవుటకు వచ్చిరట, వాడు జీవిత కాలములో ఎక్కువ
పాపము చేసిన వాడు గనుక యమలోకము నుండి యమభటులు వచ్చిరట. అక్కడికి వచ్చిన విష్ణు దూతలు అజామీలుడు
అంత్యములో నారాయణ అన్నాడు కావున మా లోకమునకు తీసుకొని పోయెదమని యమదూతలతో పల్కిరట. అందులకు
యమదూతలు వీడు ఎక్కువ పాపము చేసినవాడు యమలోకమునకే తీసుకొని పోయెదమని వాదించిరట. ఈ
విధముగ అజామీలునికథ ఉన్నది. ఇందు అజామీలుడు తన కుమారుని పిలువగా ఎవరినిపిలుస్తున్నాడని గ్రహించక
తన దూతలను పంపిన విష్ణువు అంత అవగాహన లేనివాడుగ యుండునా!
ఎవడు ఏ భావమును అంత్యములో కలిగి ఉండునో దానినే పొందునని శాస్త్రమన్నది కదా! అజామీలుడనుకొన్నది
తన కుమారుడనయితే విష్ణుదూతలు ఎందుకు రావలయును?
"యం యం వాపిస్మరన్ భావం త్య జత్యక్తే కలే బరమ్,
తం తమే వైతి కౌంతేయ, సదా తద్భావ భావితః"
అను గీతవాక్యమునకు అజామీలుని కథ వ్యతిరిక్తమైనది. శరీరమును వదిలి పోవునపుడు ఏది స్మరణకు వచ్చునో
దానినే వాడు పొందునని ఉన్నది. అట్లుకాక అనుకొన్నది కుమారుని, ఫలితముగా వచ్చినది విష్ణుదూతలు. అంటే
మానవుని ఎడల దేవుడు పెట్టిన సిద్ధాంతములను ఆటంకపరచడమే కానివేరు కాదు. ధర్మమునకు ముప్పు తెచ్చు
కథలను మేము ఏ మాత్రము ఒప్పుకోము.
అజామీలుని కథ వలన చాలామంది ప్రాణము పోవునపుడు దేవుని స్మరించుకుంటే చాలుకదా!. ఇప్పటి
నుంచి ఎందుకు అనుకోవలయును? ఇప్పటి నుంచి దైవస్మరణ మన పనులకు ఆటంకముగా ఉండును. అజామీలుడు
అనుకున్నట్లు చివరిసమయములో దేవుని అనుకుంటే సులభముగా దైవసాన్నిధ్యము చేరవచ్చునని భ్రమించుచున్నారు.
తెలిసిన వారు జ్ఞానమును గురించి బోధించి ఇప్పటి నుంచి సాధన చేయమని చెప్పితే ఆ మాట వినక భాగవతములో
అజామీలుడు ఎంతో చెడ్డవాడైనప్పటికి చివరిలో నారాయణ అన్న మాత్రమున విష్ణుదూతలు వచ్చారట. ఆ విధముగానే
మేము చివరిలో అనుకుంటాము. ఈ విషయము మీకు తెలియక ఇప్పటి నుంచి ప్రయత్నము చేయమని చెప్పుచున్నారని
ఎక్కిరించుచున్నారు. గీతలో అక్షర పరబ్రహ్మ యోగమున చెప్పిన "త స్మాత్స ర్వేసు కాలేసు మా మనుస్మర యుధ్యచ,
మయ్యర్పిత మనో బుద్ధి ర్మా మే వైష్య స్య సంశయః” “సర్వ కాలములో మనస్సు బుద్దియు నా మీదనే ఉంచి నన్నే
స్మరించుకొను చుండిన చివరకు నన్నే చేరగలవు" అను మాట వీరి ఎడల వృథా అయిపోవుచున్నది. ఒక్క పురాణకథ
శాస్త్రమైన వాక్యమునే క్రిందబడదోయుచున్నది. కొందరు పురాణమువైపే మళ్ళి శాస్త్రమునే వెక్కిరించుచున్నారు.
పురాణములను నమ్మి చిన్న దారము వలన పర్వతముల పైకి ప్రాక గలమనుకొని చెడిపోవుచున్నారు. అటువంటి
వారిని బాగుపరచు నిమిత్తము మేము పురాణములను విమర్శించడమైనది.
వరాహ పురాణాంతర్గతమైన గీతామహత్యములో విష్ణువు భూదేవికి భగవద్గీత మహత్యమును గురించి చెప్పుచు,
గీతను అధ్యయనము చేయుట వలన పుణ్యము లభించునని, గంగా స్నాన ఫలితము లభించుననియు, సోమ యాగ
ఫలము లభించుననియు, కైలాసములో ప్రథమ గణములో నివాసము లభించుననియు, మన్వంతరము వరకు మానవ
జన్మయే ప్రాప్తించుననియు, చంద్రలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి గలుగుననియు పల్కినట్లు ఉన్నది. ఈ మాటతో చెప్పబడిన
మహత్యముల మీద మానవులు ఆశతోనే గీతను పఠింతురు, కాని మోక్షము లభించునను ఉద్ద్యేశము వారిలో ఏమాత్రము
ఉండదు. గీతను చదివి గీతామహత్యము చదవని వానికి ఏ ఫలితముండదని, ఫలశూణ్యమగు కార్యము చేసినట్టి
వాడగునని గీత మహాత్యములో వ్రాసియుండుట వలన గీత మహత్యము తప్పక చదివి తీరవలయునని, ప్రజలు
గీతకంటే గీతామహత్యమే ముఖ్యమని ప్రజలు తలంచకపోరు. అప్పుడు గీత మహత్యము ముందర గీతయే
తక్కువదనిపించుకొను భావము ఏర్పడుచున్నది. బ్రహ్మవిద్యయైన గీతకే పెద్దలోటు గీతామహత్యము వలన ఏర్పడుచున్నది.
గీతా మహత్యమునే ముఖ్యముగ ఎంచుకొన్నవారు, అందు చెప్పినటుల గీతను చదువుట వలన ఫలితములు కలుగుననియే
పూర్తిగా నమ్ముచున్నారు. గీత పుణ్య పాపములనెడు బంధములను తొలగించుటకు, మోక్షమును ప్రాప్తింపజేయుటకు
ఉన్నది. అట్లుకాక సోమ యాగ పుణ్యము, గంగా స్నాన పుణ్యము కలుగజేసి చంద్రలోకప్రాప్తి, వైకుంఠప్రాప్తి
కలుగజేయుననుట యోగశాస్త్రమునకు పెద్దకళంకము కలుగ జేసినట్లువుచున్నది. బ్రహ్మవిద్యా ధర్మ శాస్త్రమునకు గీతా
మహాత్యము చేత అధర్మముల అంటగట్టుట సరియైన పని కాదు.
భగవద్గీత ఒక యోగశాస్త్రము, గీతామహత్యము వరాహ పురాణము. గీత యొక్క మహత్యము వెదజల్లు
నిమిత్తము పైకి కనిపించిన, లోపల గీత పైనే అనుమానం కల్గించు గీతామహత్యమును ఏమనవలెనో! అందులకే నేను
దుర్యోధనుని మేలుకోరు శకుని లాంటివి పురాణములని అనుచున్నాను. శకుని మాటలు చేతలు దుర్యోధనుని మేలు
కోరునవిగా పైకి కనిపించినను చివరకు ఫలితము దుర్యోధనుని నాశనమే. ఆ విధముగానే పురాణముల పలుకులు
భక్తిని బోధించి జ్ఞానిగా చేయునట్లు పైకి కనిపించినను వాటి ద్వార చివరకు మిగులునది అనేక సంశయములతో
కూడిన అజ్ఞానమే.
భాగవతమునందు హిరణ్యకశిపుడు బ్రహ్మ గూర్చి మరణము జయించుటకు పదివేలేండ్లు తపమొనర్చెనని
ఉన్నది. వరము పొంది ఇంటికి రాగ కుమారునికి ఐదు సంవత్సరములని ఉన్నది. తపస్సుకు పోవునపుడు భార్య
గర్భిణికాగ వేల సంఖ్యలో తపము చేసి ముగించిన తర్వాత కుమారునికి ఐదు సంవత్సరముల వయస్సు అనడము
ఎంత విడ్డూరము. ఎంత పురాణములైన ఇంత అసత్యములా! దీని వలన ఇందూ మతము పరమతములకంటే తక్కువ
కాదా! నీ దేవుడెక్కడున్నాడను హిరణ్యకశిపుని మాటకు ప్రహ్లాదుడు అందుగలడిందు లేడని సందేహము వలదని
సమాధానమిచ్చాడు. ఆ మాట నిజమని నమ్మిన వానికి గజేంద్రమోక్షములో అలవైకుంఠపురములో ఆ మేడలో అన్న
మాట వినగానే ముందు ప్రహ్లాదుని మాట నిజమా లేక అసత్యమా అని అక్కడనే ఆ పురాణము మీదనే అపనమ్మకము
ఏర్పడుచున్నది. ఈ విధముగా ఉండుట ఇందూ మతమునకు క్షేమమా?
వామన ఘట్టములో బలిచక్రవర్తి ఇచ్చిన మూడడుగుల దానమును వామనుడు కొలుచుకొనుచు ఒక అడుగు
ఆకాశమునకు మరియొక అడుగు భూమండలమునకు పెట్టినపుడు సమస్త భూభాగము రెండవ పాదమునకే
సరిపోయినపుడు భూమి మీద ఉన్న బలిచక్రవర్తి ఎలా మిగిలి ఉండును. మూడవ పాదము బలిచక్రవర్తి తల మీద
పెట్టాడనుటకు బలిచక్రవర్తి నిలుచుకొనుటకు కొంతయిన భూమి ఉంటే కదా అది సాధ్యము. యోచించువారికి
సంశయములు కల్గును. కావుననే ఇందూ మతములో నాస్తికులు తయారైనారు. మరియే ఇతర మతములలో
నాస్తికులు లేరు. ఒక్క హిందూ మతమునందే నాస్తికులున్నారంటే అది మన పురాణముల ప్రచారము వలన,
శాస్త్రములు తెలియక పోవడము వలన అని తెలియాలి. ఇప్పటికైనా పెద్దలు, గురువులు పురాణములు ఎంత వరకు
అవసరమని గ్రహించి, పురాణములు చెప్పవలసిన వారికి పురాణములు చెప్పి, తర్వాత శాస్త్రములు తెలియజెప్పవలయునని
సవినయముగ కోరుచున్నాము.
మా అనుభవములో శాస్త్రమును చెప్పి నాస్తికులను కూడ ఆస్తికులుగా చేశాము. కావున పురాణములను
విమర్శించామని అనుకోక విశాలమైన భావముతో అర్థము చేసుకొంటారని, ఇందూమతమును ఉద్ధరించుతారని
తలచుచున్నాము.
కె. సీతారామయ్య, శ్రీరాములపేట, ప్రొద్దుటూరు.
82. పురాణములు ప్రతి మానవునికి ప్రారంభవిద్య. ఆ తర్వాత శాస్త్ర విద్య అవసరమని మా ఉద్ద్యేశము.
మీరు 18 పురాణముల పేర్లు తెల్పారు. అట్లే శాస్త్ర వివరాలు కూడ తెల్పవలెనని కోరుచున్నాము?
జవాబు:
విజ్ఞానవంతులైన తమవంటివారు గ్రహించగలరను భావముతో పురాణ వివరములు తెలిపాము. అందులో
మేము కూడ పురాణములు ప్రాథమిక విద్య అనియే తెల్పాము. సాధారణ మానవునికి జ్ఞానము గ్రహించని స్థితిలో
పురాణములు అవసరమని చెప్పాము కదా!
ఇప్పుడు మీరు అడిగారు కావున శాస్త్ర విషయములు తెలుపవలసి ఉన్నది. సవ్యమైన మీ ప్రశ్నల వలన ఎంతో
మందికి సత్యము తెలుసుకొను అవకాశము కల్గినది కావున సంతోషముగ తెల్పుచున్నాము. శాస్త్రములు ఆరు ఉన్నవి.
వాటినే షట్ శాస్త్రములని అందురు. సిద్ధాంత నిబంధనలతో కూడుకొన్నదే శాస్త్రము. అందువలన శాసనములతో
కూడుకొన్నదే శాస్త్రమని పెద్దలను చున్నారు. శాసనము నుండి పుట్టిన పదమే శాపము. శాపమనగ జరిగి తీరునదని
మనకు తెలిసిన విషయమే. అట్లే శాసనమనగ తూచ తప్పకుండ జరిగి తీరునదని అర్థము అటువంటి శాసనములతో
కూడుకొన్నదే శాస్త్రము. ఉదాహరణకు "జాతస్య హి దృవో మృత్యు (పుట్టిన వాడు చచ్చి తీరవలయును) అను మాట
తూచ తప్పకుండ జరుగుచున్నది కదా! అట్లే 5 X 4 = 20 అని గణిత శాస్త్రములో ఉంది. అది ఏ దేశములోయైన
అమలుకు వచ్చుచున్నది. ఈ విధముగ మార్పు చెందక నిరూపణకు వచ్చు నిర్ణయమైన శాసనములతో కూడుకొన్నదే
శాస్త్రము.
శాస్త్రములు ఆరు అన్నాము కదా! అవి 1. గణిత శాస్త్రము, 2. జ్యోతిష్య శాస్త్రము, 3. ఖగోళ శాస్త్రము, 4.
రసాయన శాస్త్రము, 5. భౌతిక శాస్త్రము, 6. యోగశాస్త్రము. వీటికి అనుబంధమైనవి కూడ కొన్ని గలవు.
ఉదాహరణకు వాస్తు శాస్త్రమనునది ఉందనుకొండి అది వేరు శాస్త్రము కాదు. జ్యోతిష్యశాస్త్రము లోని భాగమే వాస్తుశాస్త్రమని
తెలియవలయును. అట్లే వృక్ష శాస్త్రమని ఒకటుందనుకోండి అది భౌతిక శాస్త్రమునకు అను బంధమైనదే కాని వేరు
కాదని తెలియవలయును. ఇంకా అనేకముగ శాస్త్రములుకాకున్న శాస్త్రములను పేరుతో చలామణి అగు పుస్తకములు
కూడ కలవు. వాటిని మన జ్ఞానముతో శాస్త్రములు అవునా కాదా! అని తెలుసుకోవచ్చును.
శాస్త్రములు ఆరు వేరు వేరుగ ఉండిన ఒక దానితో ఒకటి సంబంధము కల్గి ఉన్నవి. గణిత శాస్త్రమునకు
జ్యోతిష్య శాస్త్రమునకు సంబంధము కలదు. అట్లే జ్యోతిష్య శాస్త్రమునకు ఖగోళ శాస్త్రమునకు సంబంధమున్నది.
ఖగోళమునకు రసాయనిక శాస్త్రము, రసాయనిక శాస్త్రమునకు భౌతిక శాస్త్రము, భౌతిక శాస్త్రమునకు యోగ శాస్త్రమునకు
సంబంధమేర్పడి ఉన్నది.
అన్నిటికంటే ముఖ్యమైనది చివరిది యోగ శాస్త్రము. అది అన్ని మతముల వారికి ఉన్నది. ఒక్కొక్క మతము
వారు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఆ శాస్త్రమును పిలుచుచున్నారు. అట్లే ఇందూ మతములో కూడ భగవద్గీత అను పేరున
యోగ శాస్త్రమున్నది. అది ఒక్క ఇందువులకేకాక సర్వ జీవరాసులకు వర్తించునదిగ ఉన్నది. అన్ని శాస్త్రములకంటే
యోగశాస్త్రము ఉన్నతమైనది, పవిత్రమైనది కావున సర్వశాస్త్ర శిరోమణి గీత అనుచున్నారు. మిగత ఐదు శాస్త్రములు
దీనియందు మిళితమై ఉన్నవి. అందువలన "సర్వ శాస్త్రమయి గీత” అని పెద్దలంటున్నారు.
శాస్త్రముల గూర్చి మేము చెప్పు విషయమువిన్నారుగా! ఇపుడు మరికొందరు శాస్త్రముల గూర్చి వ్రాసిన విషయము
కూడ కొద్దిగ తెలుపుతాము. ఈ రెండు విషయములకు మీరు తక్కెడ (త్రాసు) లాంటివారు. ఏది బరువు (సత్యము)
గల విషయమో మీరే ఆలోచించండి.
1. శిక్ష, 2. వ్యాకరణము, 3. ఛందము, 4. నిరుక్తము, 5. జ్యోతిష్యము, 6. కల్పము. ఇవి షట్ శాస్త్రములని
అనుట గలదు. వీటిలో ఐదవది జ్యోతిష్యము తప్ప మిగతావేవి ఎలా శాస్త్రములో మాకు అర్థము కాలేదు. వాటిని
గూర్చి ఇంకా వివరమడిగిన ఇలా ఉన్నవి.
1. శిక్ష : ఇందు వేద శబ్దముల యొక్క అక్షరముల స్థాన జ్ఞానములను ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరముల
జ్ఞానమును జెప్పబడును. ఉదాత్తమనగ ఉచ్చము, అనుదాత్తమనగ నీచము స్వరితమనగ సమానము అని
తెలియవలయును. ఈ శిక్షా శాస్త్రమును వ్యాస శిక్షా, భరద్వాజ శిక్ష, నారద శిక్ష అను మూడు విధములుగ చెప్పుచున్నారు.
2. వ్యాకరణ : ఇందు వేద శబ్దము యొక్క ప్రకృతి ప్రత్య జ్ఞానము వివరింపబడి ఉన్నది.
3. ఛందము : దీని యందు వేదములలో చెప్పబడిన గాయత్రి మొదలగు ఛందముల యొక్క పరిజ్ఞానముండును.
4. నిరుక్తము : ఇందులో వేదమంత్రముల యొక్క ప్రయోజనమును స్పష్టపరచు నిమిత్తము అప్రసిద్ధ
పదముల యొక్క అర్థములు బోధింపబడి ఉన్నవి. మరియు వేద శబ్ద వివరణ శాఖ పూర్ణ నిరుక్తమును ఇందు గలవు.
5. జ్యోతిష్యము : ఇందు వైదిక కర్మల నారంభించుటకు తగు ముహూర్త జ్ఞానమును ఆ ముహూర్త
బలమును, భవిష్యత్ సూచనలు వివరింపబడి ఉన్నవి.
6. కల్పము : ఇందు వేదములందు జెప్పబడిన యజ్ఞ కర్మల ననుష్టించు రీతిని బోధించుట గలదు.
చూచారా ఇవీ మన శాస్త్రముల విషయములు. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు పొడవు
గదా! అని హేళన చేయక వెనుక వచ్చినవియైన చెవులకంటే గట్టివి, పొడవైనవను మాట నిజమేనని సత్యము
గ్రహించవలయునని కోరుచున్నాము. అట్లే ముందు చెప్పిన పెద్దల కంటే నేడు నీవు చెప్పుమాట ముఖ్యమా? అని
అనక ముందు వెనుకతో పని లేక సత్యమొక్కటే నిత్యమైనదని తెలుసుకోవలయును.
83. జనన మరణములకు కారకుడు ఈ జన్మ పరంపరలలో జీవుడొక్కడే కదా! జన్మ పరంపరలో ఆ జీవుడు
చేసిన కర్మను బట్టి జన్మ వచ్చునని పెద్దల వలన విన్నాము. ఆ జన్మ మానవ జన్మ కావచ్చు, పశుపక్షాదులు,
క్రిమికీటకాదుల జన్మ కావచ్చును కాని ఇంత మానవ జనాభా వృద్ధి అగుటకు కారణము తెల్పప్రార్థన. 20/30
సంవత్సరముల నాటికి ఇప్పటికి జనాభా బాగా వృద్ధి అయినది దీనికి కారణము తెల్ప ప్రార్థన?
జవాబు:
ఈ ప్రశ్నకు జవాబు మీ ప్రశ్నలోనే ఇమిడి ఉన్నది. జన్మ మానవ జన్మ కావచ్చు, పశుపక్షి, క్రిమి కీటకమైన
కావచ్చు అన్నారు కదా! కర్మను బట్టి క్రిమి కీటక పశు పక్షి శరీరములలోని జీవాత్మ మానవ జన్మ తీసుకొని ఉండవచ్చు
కదా! అందువలన మానవ జాతి సంఖ్య ఎక్కువైనది.
జీవుడు చేసిన కర్మను బట్టి జన్మ వచ్చునని మీ ప్రశ్నలో ఉన్నది కదా! ఆ మాట నిజమే. పశు పక్షి మృగాలుగ
ఉన్న జీవుల పుణ్య ఫల విశేషము వలన మానవ జన్మలోనికి వచ్చాయనుకుంటాము. మీరు చెప్పినట్లు 20 లేక 30
సంవత్సరములలో మానవుల సంఖ్య ఎక్కినది. మేము చెప్పునట్లు అడవులలో పక్షుల, మృగముల సంఖ్య తగ్గినది.
అసలుకు కొన్ని జాతులు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వము వారు వాటిని స్వయం రక్షణ చేస్తున్నారు.
మానవుడు మానవునిగ జంతువు జంతువుగానే జన్మ తీసుకొనునని, మానవుడు జంతు జన్మలోనికి, జంతువు
మానవ జన్మలోనికి రాదను వాదనను బ్రహ్మకుమారి సమాజము వారు చెప్పుచున్నారు అయిన అది అసత్యము.
శాస్త్రబద్దము కాని మాటయని తెలియవలెను.
84. మా స్నేహితుడు గొప్ప ధనవంతుడు, వ్యాపారి, మంచి ధార్మికుడు సత్య భావములు గల వ్యక్తి తెలిసిన
వారందరు మంచివాడని కొనియాడబడిన వ్యక్తి 30 సంవత్సరముల వయస్సులో అతని ఫ్యాక్టరీ కూలీలలో కొందరి
వల్ల హత్య చేయబడినాడు. ఫ్యాక్టరీ కూలీలందరు చాలా మంచి వ్యక్తి అని బాధపడినారు. దీనికి అనగా ఈ
అకాల దుర్మరణమునకు కారణము తెల్పగోరినాను?
జవాబు:
ప్రతి పనికి కారణము ఒకటి ఉంటుంది. దానినే కర్మ అంటాము. కర్మ లేనిది ప్రపంచములో ఏ కార్యము
జరుగదు. మీ స్నేహితుని హత్యకు బయటి రూపములు ఎన్ని ఉండిన అన్నిటికి కారణము కంటికి కనిపించని
కర్మయేనని తెలియవలయును. మీ స్నేహితుడు మంచివాడు అన్నారు. అందువలన అన్ని విధముల ఆయనకు
పుణ్యమే ఈ జన్మలో వచ్చి ఉంటుంది. ఇంత మంచి వానికి దాన దయ గుణములు గలవానికి హత్యకావింపబడు
దుష్కర్మ ఎందుకు పట్టిందని మీ మనస్సునందు ప్రశ్న ఉద్భవించి ఉన్నది. మనము చేయు పనులయందు దుష్కర్మ, సత్
కర్మ అను రెండు విధములగు కర్మలున్నవి. వాటినే పాప పుణ్యములు అంటాము. మీ స్నేహితుడు ఈ జన్మలో మీ
మాట ప్రకారము పుణ్యమే ఆర్జించి ఉండవచ్చును. ఈ జన్మ పుణ్య ఫలము తర్వాత వచ్చు జన్మలలో ఆచరణకు
వచ్చును. అందువలన అతడు సంపాదించిన పుణ్యమునకు, హత్యకు ఎలాంటి సంబంధము లేదు.
హత్యకు సంబంధమున్న కర్మ వెనుకటి జన్మలలో అతడు సంపాదించు కొన్నదని తెలియవలయును. వెనుకటి
జన్మల సంచితము ఈ జన్మ ప్రారబ్దముగ మారి హత్యాకార్యమునకు కారణమైనది. వివరముగ చెప్పవలయునంటే
మనము ఈ జన్మలో చేసుకొన్న పుణ్యము గాని, పాపము గాని ఈ జన్మలోనే అనుభవించలేము. ఇపుడు కంటికి
తెలియకుండ వచ్చు పాప పుణ్యములు తర్వాత జన్మలలో అనుభవానికి వచ్చును. ఈ జన్మలో మనమనుభవించు సుఖ
దుఃఖములన్నియు గడచిన జన్మలలో మనము సంపాదించుకొన్నవేనని తెలియవలయును. ఉదాహరణకు మూడు
నెలల శిశువుకు భయంకర వ్యాధి సంభవించి ఆ శిశువు విపరీత బాధ అనుభవించుచున్నాడు. నిజముగ ఆ శిశువు
ఈ జన్మలో ఏ కార్యము చేయలేదు. పాపము కాని పుణ్యము కాని సంపాదించుకోలేదు. ఈ జన్మలో ఏ పాపము
చేయని వానికి భయంకర బాధ ఎందుకు లభించినదని యోచిస్తే వెనుకటి జన్మ కర్మయే కారణమని తెలియుచున్నది.
ఈ విధముగ ఈ జన్మలోని ప్రతి సంఘటన వెనుకటి జన్మలోని కర్మ కారణము చేతనే జరుగుచున్నవి.
బహుశ కొన్ని జన్మల వెనుకల మీ స్నేహితుడు ఈ జన్మలోని సంఘటనకు కారణమైన కర్మ సంపాదించి
ఉండును. అది కాలక్రమమున ఈ జన్మలో అనుభవానికి వచ్చింది. ఎంతటి మంచివానికయిన వెనుకటి జన్మల పాప
ఫలము వలన కష్టములు, ఎంతటి చెడ్డవానికైన వెనుకటి జన్మల పుణ్య ఫలముల వలన సుఖములు అనుభవించుట
మనము చూస్తున్న సత్యమే కదా!
ఒక వైపు అనుభవానికి వచ్చి కర్మ అయిపోవుచు ఉంటే మరియొక వైపు క్రొత్త కర్మను మానవుడు
సంపాదించుకొనుచున్నాడు. అందువలన కర్మ కారణము చేతనే జరిగిన హత్య కార్యములో హత్య చేసినవారు కూడ
కర్మ సంపాదించు కోవడము జరిగి ఉంటుంది. తిరిగి ఆ కర్మ వచ్చే జన్మలలో వారిని కూడా హత్యకే గురి చేయును.
ఇది కర్మ సిద్ధాంతము. కర్మ చేత జరిగే ప్రతి పనిని తానే చేయుచున్నానని అనుకొను ప్రతివానికి క్రొత్త కర్మవచ్చుచునే
ఉండునని యోగశాస్త్రము తెలియజేయుచున్నది. అట్లుకాక కర్మ యోగమాచరించుచు ప్రపంచములో ఏ కార్యము
చేసిన చివరకు హత్య చేసిన కర్మ అంటదని యోగశాస్త్రమే తెలుపుచున్నది. హత్య చేసినవారు బహుశ కర్మ యోగులై
ఉండరనుకొంటాను. అందువలన వారికి తిరిగి బంధనము (కర్మ) అంటి ఉండును.
మీరు చెప్పు విధానమును బట్టి మీ స్నేహితుడు అకాల మరణము పొందినాడు. కావున ఆయనకు కాల
మరణము సంభవించు వరకు వేరు జన్మకు పోక సూక్ష్మరూపముగ ఈ జన్మలోనే ఉండును. అతని దృష్టికి మీరు
కనిపిస్తూనే ఉంటారు. అయిన ఆయన మీ కంటికి కనిపించడు. అంత మాత్రమున ఆయనలేడనుకోవద్దు. ఆయన మీ
మధ్యనే ఉంటాడు.
ఆదిమూలమ్ రెడ్డి, పెద్దమిట్టూరు, తమిళనాడు.
85. రుద్రాక్ష కాయలను ధరించుట వలన లాభమేమిటి?
జవాబు:
రుద్రము అనగ నాశనము. రుద్ర భూమి అనగ శరీరములు నాశనమగు భూమి, అనగ శ్మశానము.
రుద్రుడనగ రుద్ర భూమి నందు సంచరించువాడు శంకరుడు (శివుడు) అని అర్థము. రుద్ర భూమినందు భూత ప్రేత
పిశాచములు, యక్ష కిన్నెర కింపురుష, గరుడ గంధర్వ గ్రహాలు అనేకములు నివశించుచుండును. వాటన్నిటికి
రుద్రుడు అధిపతి. ఆ రుద్రుడు ధరించిన పూసలను రుద్రాక్షలని అనుచుందురు. ఆ రుద్రాక్షలను మనము ధరించుటవలన
పిశాచ గణముల బాధలుండవని పూర్వమనుకొనెడివారు. రుద్రాక్షలను పిశాచ గణములు రుద్రునితో సమానముగ
చూచుకొనునని పూర్వము అనుకొనెడివారు. రక్షణ నిమిత్తము రుద్రుని పేరుతో ధరించు కాయ కావున వానిని రుద్రాక్ష
అనుచున్నారు. ఒక యంత్రమును (తావెత్తును) ధరించుటను కూడ రక్ష కట్టుకొనుట అని అనుచుందురు. తావెత్తులు
కట్టుకొనుట కూడ పిశాచ గణ పీడల నివారణకేనని అందరికి తెలుసు. అటువంటి రక్షణ నిమిత్తమే రుద్రాక్షను కూడ
కట్టుకొనెడివారు. అందువలన దానిని రుద్ర రక్ష అని కూడ విడదీసి చెప్పెడివారు. అది ఉండుట వలన రుద్రుడే తమ
వద్ద నుండి రక్షణ నిచ్చునని ధైర్యము కలిగి ఉండెడి వారు. పూర్వము పిశాచ బాధలు కలవారు మరియు వాటికి
భయపడు వారు కట్టుకొనెడివారు. కాలము గడచుకొలది భావనలు మారిపోయాయి. శివుడు ధరించాడు కదా అని
శివభక్తులు ధరించను మొదలు పెట్టినారు. చివరకు వేదాంతులు స్వాములు ధరించను మొదలు పెట్టారు. వీరందరిని
చూచిన మానవుడు రుద్రాక్ష పిశాచ గణ నిమిత్తమని తెలియక రుద్రాక్షలు ధరించిన వారికి మ్రొక్కను మొదలు పెట్టాడు.
ఈ విధముగ రుద్రాక్ష అర్థము ఏనాడో మారిపోయినది. రుద్రాక్షలు వేసుకొనుట వలన ఇంకాకొన్ని శరీర ఆరోగ్యములు
కూడ చేకూరును. అన్నిటికంటే ముఖ్యముగ దయ్యాల బాధల భయముకే వాటిని వాడవచ్చును దయ్యాలకు భయపడువారు
వాడినా ఫరవాలేదు కాని జ్ఞానమున్నవారు కూడ రుద్రాక్షలు వాడుట ఆశ్చర్యముగనున్నది. ఒకరు వేశారు కదా! అని
ఇంకొకరు వేసుకొనుచున్నారు. కాని నిజముగ అర్థము తెలిసివేసుకోవడము లేదు.
కె. సీతారామయ్య, శ్రీరాములు పేట, ప్రొద్దుటూరు.
86. పూర్వ జన్మలలోని కర్మలు ఈ జన్మలో అనుభవించక తప్పదను విషయము సత్యము. అయితే ఈ జన్మలో
దైవకార్యములు కాని తోటి మానవులకు ఆపదలో మంచి చేసిన, మంచి కార్యములు కాని ఇంకా మనో నిష్ఠతో
చేసిన జప తపాదుల వలన ఈ జన్మలోని కర్మ తీవ్రత తగ్గదా? చేసిన పాపము ఈ జన్మలో చేసిన సత్కర్మ పుణ్యము
వలన తగ్గదా? పాపమునకు పుణ్యము చెల్లుబెట్టకూడదా! తప్పనిసరిగ పాపమును అనుభవింపవలసినదేనా?
జవాబు:
ఈ జన్మలో మంచి చేస్తే పుణ్యము, చెడ్డ చేస్తే పాపము సంభవిస్తాయి. ఈ జన్మలో ఎంత సత్కర్మ పుణ్యము
చేసుకొన్న అది వరుసక్రమములో చేరి తర్వాత అనుభవానికి వచ్చును. పాపమునకు పుణ్యము చెల్లు బెట్టుట కర్మ
సిద్ధాంతములో లేదు. టేపురికార్డులో శబ్దము రికార్డు అయినట్లు కర్మ చక్రమందు కర్మ రికార్డవుచుండును. టేపు
తిరుగుచు ఉంటే ముందు పాడిన పాట ముందు వెనుక పాడిన పాట వెనుక వచ్చినట్లు, ముందు చేసుకొన్న పాపము
కష్టరూపముగ అనుభవించిన తర్వాత ఇపుడు చేసుకొన్న పుణ్యము తర్వాత జన్మలలో సుఖ అనుభవముగ తటస్థించును.
ఈ జన్మలో ఎంత దైవారాధన చేసిన, ఎన్ని పుణ్య కార్యములు చేసిన వెనుకటి కర్మను ఏ మాత్రము మాన్పలేవు. కర్మను
నశింప చేయునది ఒక్క జ్ఞానాగ్ని తప్ప మరియొకటి లేదు. కర్మ నాశన వివరము తెలియవలయునంటే మా రచనలలోని
"త్రైత సిద్ధాంత భగవద్గీత” చదువుము.
87. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ “చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగ శ” అన్నాడు. శ్రీ స్వామి
వారు కూడ కులము మతము మనము ఏర్పరచుకొన్నవేనని వ్రాసినారు. అయితే “చాతుర్వర్ణం మయా సృష్టం”
అనేది వివరించవలయునని కోరుచున్నాము?
జవాబు:
"చాతుర్వర్ణం" అని గీతలో దేవుడు చెప్పాడు. వాస్తవమే మేము కూడ ఒప్పుకుంటున్నాము. ఆయన చెప్పిన
మాటలో నాలుగు పలాన కులములని ఏ మాత్రము లేదు కదా! ఆ శ్లోకములో లేని కులములను మనము ఊహించుకొని
పేర్లు పెట్టుకొని పైగా ఆయన చెప్పాడని దేవుని మీద నిందవేయడము ఏమయిన మంచిదా? ఆయన ఆ వర్ణములను
కూడ "గుణ కర్మ విభాగశః" అన్నాడు. "కార్య విభాగశః" అనలేదు. ఈ శ్లోకమేకాదు గీతలోని చాలా భాగము భూమి
మీద ఇంత వరకు అర్థము కాలేదని మా భావన. మనము ఆపాదించుకొన్న బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర కులములు
కాకపోతే చాతుర్వర్ణం అను పదము యొక్క భావము ఏమిటని మీకు సంశయము వచ్చి ఉంటుంది.
మన శరీరములో కర్మ ఉన్నవి, కర్మ లేనివి మొత్తము నాలుగు భాగములు ఉన్నవి. కర్మ ఉన్నవి మూడు, కర్మ
లేనిది ఒక్కటి. ఈ మొత్తము నాలుగు భాగములను గుర్తించుటకు వీలుగ ఉన్న నెమలి పింఛమును కృష్ణుడు ధరించి
చూపించాడు కూడ. వీటినే బయటి నుంచి 1. తామస గుణ భాగము, 2. రాజస గుణ భాగము, 3. సాత్త్విక గుణ
భాగము, 4. గుణ రహిత (ఆత్మ) భాగము అంటాము. వీటిని కర్మ గుణముల చేత విభాగించి చెప్పు కుంటున్నాము.
అందువలననే "గుణ కర్మ విభాగశః" అని గీతయందన్నారు. మన శరీరములోని నాల్గు భాగములను పటములో
చూడవచ్చును. బయటి నుండి మొదటిది తామస గుణభాగము రెండవది రాజస గుణభాగము మూడవది సాత్త్విక
గుణభాగము నాల్గవది గుణ రహిత భాగము మూడు భాగములలో గుణములుండును, నాల్గవ భాగములో ఆత్మ
ఉండును. వీటిని బట్టి మనుషులను నాల్గు వర్ణములుగ విభజించవచ్చును. 1. తామసులు, 2. రాజసులు,
3. సాత్త్వికులు, 4. యోగులు. ఇవియే దేవుడు చెప్పిన నాలుగు వర్ణములు. ఇవియే దేవుడు నెమలి పింఛము ద్వార
చూపిన నాలుగు వర్ణములు.
దేవుడు ఏమి తెల్పిన జ్ఞాన పరముగ తెల్పును కాని మానవులు ఏర్పరుచు కొన్న కుల మతములను తెల్పునా!
ఆయనే మానవులందు కుల భేదములు కల్పించి వీనికి మంచి పనులు, వీనికి చెడ్డ పనులని నిర్ణయించునా!! దేవుడు
ఏమి తెల్పిన ఉన్నత విషయములనే తెల్పును.
88. గృహ వాస్తుశాస్త్రము యొక్క ఫలితములు గృహ యజమాని జీవితము మీద పని చేయునా? గృహ
యజమాని జాతకము _ బాగుంటే ఇంటి వాస్తు దోషములు యజమాని జీవితము మీద పని చేయునా?
జవాబు:
మానవుడు పుట్టినప్పటి నుండి మరణించువరకు ప్రారబ్ధ కర్మ ఆధీనములో ఉండును. ప్రతి క్షణము ప్రతి
పనిని కర్మయే నడుపుచుండును. యోగ శాస్త్రరీత్యా జీవుని సుఖపెట్టుటకు దుఃఖపెట్టుటకు కర్మయే కారణమై ఉన్నపుడు
గృహఫలితము మానవుని సుఖదుఃఖములకు కారణమనుట పూర్తి అసత్యము. మానవుని జాతకమును ఏ ఫలితములు
ఏ దోషములు మార్చలేవు. అలా మార్చగలిగే శక్తి మానవుని చేతిలో ఉంటే కర్మతో పనిలేకనే తమంతట తామే
జీవితమును సుఖవంతము చేసుకోవచ్చును కదా! జరుగునంత వరకు తన తెలివి గొప్ప అని, జరగనపుడు కర్మయను
మానవుడు సృష్టించుకొన్న గృహములు జాతకములను మార్చగలవనుమాట హాస్యాస్పదము. కర్మ తప్ప ఏ ఫలితములు
మానవుని మార్చలేవు. "సర్వం కర్మమయం" అని తెలియవలెను.
89.వాస్తు శాస్త్ర దోషము ఉంటే ఆ ఇల్లు వదలివేయవలెనా? ఆ దోషములకు ఏదైన పరిహారమున్నదా? మత్స్య
కూర్మ యంత్రముల చేత దోషములను పరిహారము చేయవచ్చునా?
జవాబు:
అటువంటి
వాస్తు శాస్త్రమన్నది జ్యోతిష్య శాస్త్రములోని ఒక భాగము. అది కొలతలు, ఆయములు, మూలలు అను
పద్ధతిలో ఉండదు. మానవుని వాస్తు జాతక చక్రమందు నిర్ణయించబడి ఉండును. దానిని బట్టి వీనికి పలానా రకము
ఇల్లు ఉండునని చెప్పవచ్చును. ఒక వేళ జాతకములో వాస్తునందు దోషమున్న వీని ఇల్లు బాగుండదు. అందులో
సౌకర్యములు ఉండవు అని కూడ చెప్పవచ్చును. వాస్తు దోషములుంటే జాతకములోనే ఉండును.
దోషము ఉంటే అవి తూచ తప్పక జరుగును, ఏ మానవుడు తప్పించకోలేడు. కొందరు ఇంటిలో దోషములున్నవని
వాటిని శాంతుల ద్వార లేక కొలతలు, మూలలు మార్చుట ద్వార సవరించవచ్చు ననుచుందురు. జాతకచక్రములో
కర్మ బాగలేనంత వరకు ఎవరు ఏ శాంతుల ద్వారా, ఏ యంత్రముల ద్వార వాటిని నివారింప లేరు. యంత్రములు
భూత ప్రేత పిశాచముల మీద పని చేయును. కాని ఇంటి యజమాని జాతక చక్రము (కర్మ చక్రము) మీద పని
చేయవు.
పనిలేని పండితులు కొందరు వాస్తుశాస్త్రమని ఒక దానిని సృష్టించి దానికి వీదులు, సందులు, మూలలు,
కొలతలు, హెచ్చుతగ్గులని చెప్పి మానవునికి అనుమానములు కల్గించి, వాటిని సరి చేయుటకు వాటి వివరము
తెలిసిన వారము మేమున్నామని గ్రుడ్డిగ నమ్ము ప్రజలను తమ చుట్టు త్రిప్పుకొనుచు వ్యాపార జీవితమును గడుపుచున్నారు.
స్థాన బలము గాని, తన బలము కాదని వేమన చెప్పిన పద్యములు కూడ ప్రమాణముగ చూపించుచు, తన
జాతక బలముకంటే స్థానమైన ఇల్లు బలము గొప్పదని బుకాయిస్తున్నారు. తానంటే జీవాత్మనా? లేక శరీరమా?
శరీరము నివశించునది ఇల్లు అయితే, జీవాత్మ శరీరములోని గుణచక్రములో నివశించునది. వేమన చెప్పుచున్నది
శరీరమునకా, లోపల ఉన్న జీవాత్మకా అని తెలియలేనివారు ఆయన పద్యములు ఎందుకు వాడుకోవాలి? వేమన
చెప్పినది జాతకచక్రములోని 12 స్థానముల బలమేకాని బాహ్యమైన ఇల్లు బలము కాదు. జ్యోతిష్యశాస్త్రములో 4వ
ఇంటిలో గురువు, 5వ ఇంటిలో శని అనుట లేక 4వ స్థానములో గురువు, 5వ స్థానములో శని అనుట వినుచునే
ఉందుము గదా! ఇల్లు, స్థానము అంటే మేష వృషభాది స్థానములనే ఇల్లులని తెలియవలయును.
వాస్తు శాస్త్రీయమైనది కాదు కావున జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధము లేదు. ప్రత్యేక శాస్త్రముగ వెలసిన
గృహ వాస్తుశాస్త్రము సిద్ధాంతములతో కూడుకొన్నది కానే కాదు. ఇది నిరూపణకురాని మాటలతో కూడుకొన్నది.
కావున ఇది శాస్త్రము కాదు. మానవుని ఇల్లు యొక్క విషయము జ్యోతిష్య శాస్త్రము ప్రకారము జాతక కుండలిలోనే
ఉండునని దానినుండే ఇంటి ఫలితములు, దోషములు గ్రహించనగునని తెలియవలెను.
90.మానవుడు చేసుకొన్న కర్మ వలన జన్మ వచ్చును. పూర్వ కర్మవలన ఈ జన్మలో ఫలితములు జరుగుచుండును
అని తమ బోటి మహాత్ములు చెప్పుదురు. అటువంటి పరిస్థితులలో గృహవాస్తు దోషము మానవుని జీవితములో
జన్మతః వచ్చిన కర్మల మీద పని చేయునా?
జవాబు:
కర్మ సిద్ధాంతముల ప్రకారము కర్మ వలన జన్మ, కర్మ వలన జన్మలోని సుఖ దుఃఖములు మొదలగు జీవితము
ఉండును. అటువంటి పరిస్థితులలో జన్మతః వచ్చిన కర్మను ఎవరు మార్చలేరు. ఏ దోష నివారణలు మానవుని కర్మ
మీద పని చేయవు. ఇంతకు ముందు చెప్పాముగ అసలు వాస్తు దోషములు లేవు, కర్మ దోషములే మానవునకున్నవని.
నాకు తెలిసిన ఒక విషయము ఉదాహరణకు తెల్పుచున్నాము. ఒక గ్రామమందు ఒక ధనికునికి కర్మ ప్రకారము
కష్టములు మొదలు పెట్టాయి. ఆ సమయములో అతనికి తను నివశించు ఇంటిలో దోషమున్నదని వాస్తు తెలిసిన
వారు చెప్పారు. అపుడా ఇల్లు వదలి వాస్తు శాస్త్రవేత్తల సలహామేరకు క్రొత్త ఇల్లు కట్టించాడు. ఆ ఇంటిలో కాపురము
చేసిన అతనికి ముందు వచ్చులాగానే కష్ట నష్టములు తరచు సంభవించుచు ఉండెను. తెలిసిన వారిని అడిగితే దశ
బాగలేదన్నారు. మరి కొందరి సలహామేరకు ఆ ఇల్లు కూడ వదలి మరియొక ఇల్లు చేరిన అతనికి అలాగే కష్టములుండుట
వలన కర్మే కారణము గాని ఇల్లుకాదని ఆయన తెలుసుకొన్నాడు.
జాతక చక్రములోని స్థానముల బలమే కాని, నా బలమేమి కాదని, నేను శరీరము ద్వార వచ్చు కష్ట సుఖముల
అనుభూతిని అనుభవించు జీవాత్మనని గ్రహించుకొని ఒక్క జ్ఞానాగ్ని తప్ప కర్మను ఏ క్రియలు మార్చలేవని తెలియవలెను.
డి. అనూరాధ, ధర్మవరము.
91. శ్రీ రామక్రిష్ణ పరమహంస, ఆయన శిష్యులు, శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు విగ్రహారాధకులే.
విగ్రహారాధన కూడదని నిరసించి బ్రహ్మ సమాజములో చేరిన కేశవ చంద్రసేన కూడ శ్రీ పరమహంస వల్ల
మారిపోయారు. విగ్రహారాధన మూలంగా బ్రహ్మమునే చేరిన గొప్ప మహానుబావులంతా మీ దృష్టిలో ఎటువంటి
వారు. విగ్రహారాధన ఎందువలన చేయరాదు?
జవాబు:
మేము ఎప్పుడు విగ్రహారాధన మంచిది కాదు చేయవద్దు అని చెప్ప లేదు. మా ఉద్దేశ్యమును మీరు పూర్తి
అవగాహన చేసుకోలేదని తెలుపుచున్నాము. మా ఉద్ద్యేశమును మరొకమారు మీకు తెలుపుచున్నాము. అర్థములేని
విగ్రహారాధన చేయకూడదు. అర్థము తెలిసి చేయండి అన్నాము. అర్థములేని ఆచరణ నిష్ప్రయోజనము కదా! అందువలన
ఆచరణకు అర్థము తెలిసినపుడు తెలుసు కొనునంతవరకు ఆ పని మానివేసి తెలిసిన తర్వాత చేయవచ్చునన్నాము.
ఎద్దు ఈనిందంటే గాటికి కట్టివేయమనడము సమంజసమేనా? కాదు కదా! ఎద్దు ఏ విధముగ ఈనునని వివరణ
తెలియక కనిపించిన దూడను కట్టి వేస్తే మంచిది కాదని చెప్పడము తప్పు కాదు. దూడను ఆవు ఈనిందని తెలిసి కట్టి
వేస్తే పరవాలేదు. ఉన్నది ఒకటయితే అనుకొన్నది వేరొకటయితే అది పొరపాటని చెప్పడములో మా తప్పులేదు. నేటి
సమాజములో దేవాలయములు కోర్కెలు కోరు కేంద్రములుగ, పూజార్లు దేవుళ్ళకు రెకమండెషన్ చేయువారిగ, దేవుళ్ళు
కోర్కెలు తీర్చువారిగ, మనము సమర్పించు నైవేద్యములు, మొక్కుబడులు వారికి ఇచ్చు ప్రతి ఫలితముగ లెక్కించి
పూజలు చేయడముకంటే పూర్తి మానివేయడము మంచిది. ఆ విధముగ పూజలు చేసిన దైవత్వమునకు ఏమాత్రము
అర్థమే లేకుండ పోవును.
కొబ్బరి కాయలు (టెంకాయలు) కొట్టమన్నాము కాని అర్థము తెలిసి, దీపము పెట్టమన్నాము కాని అర్థము
తెలిసి, నైవేద్యము పెట్టమన్నాము అది కూడ అర్థము నెరిగి, అట్లే విగ్రహమును ఆరాధించమన్నాము. పూర్వకాలములో
పెద్దలు ఏ దృష్టితో దేవాలయములు స్థాపించారో ఆ భావముతోనే పూజలు చేయమన్నాము. భావములేని పూజ,
అర్థము తెలియని ఆచరణ వ్యర్ధమన్నాము. కోర్కెల నిమిత్తమే దేవుళ్ళు దేవాలయములు పూజలు అంటే వాటిని పూర్తి
నిరసిస్తాము. మీరు పూర్తి దేవాలయముల విషయము విగ్రహారాధన విషయము తెలియవలయునంటే మా రచనలలోని
“దేవాలయ రహస్యములు" అను పుస్తకమును చదవండి.
92. సమాజములో శకున అపశకునాలు ఎక్కడ చూచిన ఉన్నాయి. బల్లి మీదపడితే స్నానము చేయాలంటారు.
వాస్తవముగ శకునములున్నవా?
జవాబు:
వాస్తవముగ చెప్పాలంటే శకునములనునవి మూఢ నమ్మకములు. మనము చేసుకొన్న కర్మ ప్రకారము ప్రతిది
జరుగును. చెడ్డ జరిగిన మంచి జరిగిన అది అంతయు మన కర్మ కారణము చేతనే జరుగుచున్నది. శకునములు మన
కర్మను మార్చలేవు. నిత్య జీవితములో జరుగు మంచి చెడును శకునములతో పోల్చుకుంటే నిజమేననిపించును. ప్రతి
దినము మనకు మంచి చెడ్డ జరుగుచునే ఉన్నది కదా! అయితే ప్రతి దినము మంచి చెడ్డ శకునములు మనకు
కనిపించలేదు కదా! అందువలన వాస్తుశాస్త్రమున్నట్లే శకున శాస్త్రము కూడ ప్రొద్దుపోని పెద్దలు తయారు చేశారు.
వాస్తవముగ అవి శాస్త్రములు కావు. వాటిని తమ బోటివారు నమ్మ వలసిన పని లేదు. బల్లి చర్మము మీద చిన్న చిన్న
విష గ్రంధులుండును. అది పడుట వలన దాని విషము మన చర్మమునకు అంటుకొని ఉండవచ్చు, అందువలన
స్నానము చేయమన్నారు. ఈ వివరము తెలియక దానికి ఒక శకునము సృష్టించారేమో కాని స్నానము చేయుట వలన
భౌతికశాస్త్రము ప్రకారము మంచిది.
93. వివాహ శుభ కార్యములలో పట్టు బట్టలను ధరించడము శుభముగ తలుస్తారు, పవిత్రము అంటారు. పట్టు
పురుగుల్ని చంపడము వలన వస్తుంది పట్టు అది హింస కాదా? హింస వలన తయారు చేయబడిన పట్టు
ఎందువలన పవిత్రముగ భావింపబడుచున్నది.
జవాబు:
పట్టు బట్టలు పవిత్రమనుటకు ఏ ఆధారము లేదు. డబ్బున్న వారు హోదాను చూపుకొనుటకు పట్టు బట్టలు
పనికి వస్తాయి కాని పవిత్రతను చూపుటకు కాదని తెలియవలయును.
94. మీరు “ప్రబోధాత్మజమ్”లో శాస్త్రము అనగ ఎప్పటికి మారనిది, నిరూపణకు వచ్చునది, హేతువాదనకు
నిలబడి సమాధానము చెప్పునదని వ్రాసినారు. శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్రము కూడ ఒకటని మీరే అన్నారు.
అటువంటపుడు జ్యోతిష్య శాస్త్రము హేతు వాదమునకు ఎదురొడ్డి నిలచి సమాధానము చెప్పగలగాలి. కాని
“సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు" గ్రహీత మరియు బల్గేరియా ప్రభుత్వ “జార్జి డిమిటోవ్” స్వర్ణ పతకము గ్రహీత
అయిన శ్రీ జె. నరేంద్రదేవ్ గారు 30 సంవత్సరములు కృషి చేసి వ్రాసిన “విశ్వ విజ్ఞాన దర్శిని” అను
గ్రంధములో జ్యోతిష్య శాస్త్రమనే విభాగమునందు ఈ విధముగ తెలిపారు.
శాస్త్రవేత్తల ఖండన.
సూర్య చంద్ర గ్రహాల కదలికను బట్టి మానవ జీవిత విధానము ఉండుననుట అబద్దమని, జ్యోతిష్యము అశాస్త్రీయమైనదని,
ఆధారము ఏమి లేని కట్టు కథ మాత్రమేనని, 192 మంది శాస్త్రవేత్తలు వివరిస్తు “అబ్జెక్షన్ టు ఆస్ట్రాలజీ" అనే ప్రకటన విడుదల చేశారు.
దాని పై సంతకము చేసిన వారిలో ప్రపంచ ప్రసిద్ది చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు, అంతరిక్ష పరిశోధనల వివిధ రంగాల్లో నిష్ణాతులు
ఉన్నారు. ఆ పత్రము మీద సంతకము చేసిన వారిలో 19 మంది “నోబుల్ బహుమతి పొందిన శాస్త్రజ్ఞులు కూడ ఉన్నారు. జ్యోతిష్యానికి
సైంటిఫిక్ ఆధారము ఏమాత్రము లేదని వారు తమ ప్రకటనలో తెలియ జేసారు.
పై విధముగ ఆ గ్రంథములో ఉన్నది. ప్రజలు దేనిని నమ్మాలి? ప్రజలు అసలు ఏ మార్గములో పోవాలో తెలియక వారి వారి
స్వంత అభిప్రాయము ప్రకారము నడచుకొంటూ పోతూ ఉంటే ఇందులకు బాధ్యులెవరు? ఆధారము లేదని చెప్పిన శాస్త్రవేత్తలా?
శాస్త్రవేత్తలకు జవాబు చెప్పలేని జ్యోతిష్యులా? ఎవరు బాధ్యులు? దయ చేసి సర్వజ్ఞులు మరియు సత్యమునే ప్రకటించు మీరు ఈ
విషయమై పూర్తి వివరాలతో వివరిస్తారని ఎదురు చూస్తుంటాము?
జవాబు:
మీరు చాలా పెద్ద ప్రశ్న వేసి మా మెదడుకు కొద్దిగా పని కల్పించారు. జవాబు అడిగింది మీరైన నేను
చెప్పవలసింది మేధాశక్తిలో అతిరథ మహారథులైన శాస్త్రజ్ఞులకు నిజముగ చెప్పవలసిన బాధ్యత జ్యోతిష్య శాస్త్రవేత్తలది.
నేను జ్యోతిష్య శాస్త్ర పరిశోధకుడను గాను, ఆ శాస్త్రవేత్తను గాను. నేను కేవలము యోగ శాస్త్రపరిశోధకుడను. ఇది మా
యోగశాస్త్రములోని ప్రశ్నకాదు. అయినప్పటికి మీ ప్రశ్న సమంజసమైనది కావున మీ ప్రశ్నకు జవాబు చెప్పుచున్నాను.
ప్రజలను తప్పుదారి పట్టించుటకు బాధ్యులు జ్యోతిష్య శాస్త్రమును విమర్శించిన శాస్త్రజ్ఞులా? జ్యోతిష్యులా?
అన్నారు కదా! సత్ విమర్శ అనగ హేతుబద్ధముగ విమర్శించుటలో శాస్త్రజ్ఞులది తప్పులేదు. వారికి హేతు బద్ధముగనే
సమాధానము చెప్పలేని జ్యోతిష్యులదే బాధ్యత. కాని నేటి కాలములో ఎవరు జ్యోతిష్యులో తెలియలేకున్నాము.
చిలకశాస్త్రమని చిలక చేత చీటి తీయించు వారిని మొదలుకొని గవ్వలు వేసి చెప్పువారు, పుస్తకములో పుల్ల పెట్టి
చెప్పువారు రకరకములైన జ్యోతిష్యులు తయారై జ్యోతిష్య శాస్త్రము చీడ బట్టి పోయినది. ఆదిత్యాది గ్రహముల
వివరము తెలిసి వాటి మూలముగనే జ్యోతిష్యమున్నదని తెలిసిన వారు కూడ కలరు. నిజమైన జ్యోతిష్యులు సూర్య
చంద్ర గ్రహములను ఆధారము చేసుకొన్నవారె. వారిలో జ్యోతిష్యశాస్త్రమును క్షుణ్ణముగా తెలిసినవారు కొందరుండగ,
అనేక కారణాల వలన పూర్తి శాస్త్రమును తెలియని వారు కూడ కొందరున్నారు. ముఖ్యమైన కారణము ఆర్థిక లోపము,
ఏ ప్రభుత్వము జ్యోతిష్య శాస్త్రమునకు విలువ ఇవ్వలేదు. అందులో పరిచయమున్న వారిని ఎవరు పోషించడములేదు.
జ్యోతిష్యులంటే పొట్ట కూటికి ఏవో నాలుగు మాటలు చెప్పువారిగ సమాజము లెక్కించుచున్నందులకు అందరు ముందుకు
పోలేక పోయారు. ఏది ఏమైన ప్రజలలో జ్యోతిష్యులపైన నమ్మకమున్నది. జ్యోతిష్యులకు సమాజములో విలువ
ఉన్నది. ఇది జ్యోతిష్యుల విషయము.
మరి ఖగోళ శాస్త్రజ్ఞుల విషయమందామ, వారు విస్తృతమైన పరిశోధనలు చేయుచు చివరకు అనంతాకాశములోని
“బ్లాక్ హోల్” నే కనుగొనగలిగారు. పూర్వకాలము నుండి వీరు కూడ అనేక రకములైన పరిశోధనలు చేయుచునే
ఉన్నారు. ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొన్న విషయము అది అప్పటికి సత్యమే అన్నట్లు నిరూపించబడిన, మరియొక
శాస్త్రజ్ఞుడు ఇంకా గొప్ప పరిశోధన చేసి ముందు కనుగొనబడిన సిద్ధాంతమునకు అనుసంధానమైన మరికొన్ని విషయము
లను తెలుసుకొని నిరూపించి మొదటి శాస్త్రజ్ఞునికంటే ముందుకు పోవుచున్నాడు. అపుడు ముందు కనిపెట్టబడిన
సిద్ధాంతము ఖండింపబడి దానికంటే సత్యమైన సిద్ధాంతము బయల్పడుట వలన ముందు చేయబడిన సిద్ధాంతము
తెరమరుగై పోవుచున్నది. ఈ విధముగ శాస్త్రవేత్తలు బహిర్గతము చేసిన ఎన్నో సిద్దాంతములను మార్చివేయగల క్రొత్త
సత్యమైన సిద్ధాంతములు కనుగొన బడుచున్నవి.
ఉదాహరణకు 05-08-1988 ఉదయము వార్తా పత్రికలో ప్రచురించిన "న్యూటన్ సిద్ధాంతానికి సవాల్”
వార్త చదివితే మేము చెప్పినట్లు సత్యము కాని సిద్ధాంతములు మాయమవుచుండునని తెలియును. 300 ఏళ్ల క్రితము
ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతము పూర్తిగ సత్యము కాదని నేటి శాస్త్రవేత్తలు తెలుపుచున్నారు. గ్రీన్ లాండ్లోని
మంచు ప్రాంతములో భూమి ఉపరితలము నుండి ఒక మైలు లోతు వరకు వేసిన పెద్ద రంద్రమందు శాస్త్రజ్ఞులు చేసిన
పరిశోధనలో లోపలికి వెళ్ళే కొద్ది గురుత్వాకర్షణలో మార్పులు వస్తాయన్న న్యూటన్ సిద్ధాంతము నిరూపణకు రాలేదట.
ఈ విధముగా కొన్ని సిద్ధాంతములు ఖండింపబడుటకు కారణము సిద్ధాంతమునకు పూర్తి అనుసంధాన విషయములు
తెలియకపోవడమే. అన్ని విషయములు తెలిసిన రోజు ముందు సిద్ధాంతము మారి పోవును. ఇవి ఖగోళ శాస్త్రజ్ఞుల
అగచాట్లు.
ఖగోళ శాస్త్రవేత్తల విషయమును అవగాహన చేసుకొంటే ఆ శాస్త్రమునందు కొన్ని విషయములలో సత్యమును
తెలుసుకొని ప్రకటించారు. ఇంకా ఎన్నో విషయములలో ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుసుకోవలసి ఉన్నది. ఎన్నో ఖగోళములో
ఊహాగానాలుగనే నిలిచిపోయిన విషయములున్నవి. ఉదాహరణకు ఉత్తర అమెరికాకు దాదాపు 1500 మైళ్ల దూరమున
అట్లాంటిక్ మహాసముద్రములో “బెర్ముడా” అను పేరుగా గుర్తించిన ముక్కోణాకారము గల సముద్ర స్థలము యొక్క
ప్రభావము నేటికి అంతుదొరకడము లేదు. సూర్య కుటుంబములోని గ్రహ కిరణములుపడు భూగోళమున కొంత
సముద్ర భాగములోని విషయము అగమ్యగోచరముగా శాస్త్రజ్ఞుల పాలిట నిలిచిపోయినది. ఆ సముద్ర స్థల పరిధిలోనికి
పోవు నావలుకాని, పైన ఆకాశములో పోవు విమానములుగాని, అదృశ్యమై పోవడమే అక్కడి విశేషమైనపుడు, అది
అర్థము కానపుడు, ఖగోళమున కంటే ముందు కనుగొనబడిన జ్యోతిష్యము ఎట్లు అర్థమగును. "ఫ్లెయింగ్ సాసర్స్”
ఎగిరే పల్లాలను గురించి చాలాసార్లు విన్నాము. వాటిని ఒక సందర్భములో యుద్ధ విమానాలు కూడ వెంబడించాయి.
వాటిని పట్టుకోవడమో లేక కూల్చి వేయడమోనని వెంబడించిన వారికి వాటికి సమీపించగానే నీలి రంగు పొగ వాటినుంచి
వచ్చి అవి అదృశ్యమైనట్లు కూడ చదివాము. వాటిని గూర్చి కూడ ఊహాగానాలే ఉన్నాయి.
ఈ విధముగ ఎన్నో ఖగోళములో తెలియని విషయములు పెట్టుకొని శాస్త్రములలో ఒకటయిన జ్యోతిష్య
శాస్త్రమును ఖండించడము సమంజసముకాదు. పైన తెలిపిన విషయములకన్నిటికి జవాబు చెప్పలేక పోయిన ఖగోళ
శాస్త్రమునకు అబ్జెక్షన్ మేము కూడా ప్రకటించవచ్చును కదా! కాని మేము ఏ శాస్త్రమును తీసివేయము. శాస్త్రము
నేడు అర్థముకాక పోయిన రేపయిన అర్థమగును. శాస్త్రము ముమ్మాటికి సత్యమైనది. కాని దానిని అర్థము చేసుకొనుటకు
కొంత సమయము పట్టును. దానిని పూర్తి తెలుసుకొను ఓపిక లేక శాస్త్రమేలేదంటే ఏమి బాగుండును. ఎప్పుడు
జ్యోతిష్యశాస్త్రము అబద్దమగునో అపుడు ఖగోళ శాస్త్రము కూడ అబద్దమగును. ఆరు శాస్త్రములు ఒక దానికొకటి
అనుసంధానమైనవి అందువలన ఏ శాస్త్రము ఖండింపబడదు.
జ్యోతిష్య శాస్త్రము రెండు భాగములుగ ఉన్నది. కొంత గణిత శాస్త్రముతో కూడుకొని ఉన్నది. మరికొంత
శాస్త్ర ఫలితముతో కూడుకొని ఉన్నది. నేటి కాలములో జ్యోతిష్య శాస్త్రఫలిత భాగము జ్యోతిష్యులకు పూర్తి అవగాహన
లేక పోవుటచే గ్రహముల స్థితిగతుల బట్టి ఈ ఫలితము జరుగుచున్నదని చెప్పి నిరూపించలేక పోవుచున్నారు. అందువలన
ఖగోళశాస్త్రజ్ఞులు గ్రహములకు మానవుని జీవితఫలితమునకు సంబంధములేదని వాదించి ఉండవచ్చును.
ముఖ్యముగ తెలుసుకోవలసిన విషయము ప్రతి జీవరాసి తల భాగములో సూక్ష్మముగ ఉన్న 12 భాగముల
చక్రములో 9 గ్రహములు ప్రతిబింబించి ఉన్నాయని వాటి ద్వార ప్రతి జీవరాశి కదలికలు జరుగుచున్నవని, ఆకాశముననున్న
గ్రహములను మానవున్ని బాహ్యముగ చూచిన మధ్యనగల సంబంధము తెలియదని అంతమాత్రమున జ్యోతిష్యము
అబద్దముకాదని ఖగోళ శాస్త్రవేత్తలకు తెలియజేస్తున్నాము.
95. మాంసాహారము వలన తామస గుణాలు వచ్చే అవకాశ ముందంటారు. నేను మాంసాహారము మానివేశాను.
గోవుకు పులికి ఉన్న తేడా వాటి ఆహార మూలంగానే అనిపిస్తున్నది. ఇదే ప్రశ్న ఎవర్నో అడిగితే "ఏసు ప్రభువు
మాంసాహారే కదా! ఆయనలో ఎంతో గొప్ప దేవుని గుణాలున్నాయి ఏమంటారని ప్రశ్నించారు” సమాధానము
చెప్ప లేక పోయాను. మీరు సందేహాన్ని తీరుస్తారని ప్రార్థిస్తున్నాను.
జవాబు:
మనము తీసుకొను ఆహారము కేవలము స్థూల శరీరమునకే సంబంధ మగును. శరీరము స్థూల సూక్ష్మమని
వేరయినపుడు ఆహారములు కూడ వేరు వేరుగ ఉన్నవని తెలియవలయును. మనము తీసుకొను ఆహారములో శరీర
పోషక పదార్ధములుండును. అవి జీర్ణింపబడి చిన్న ప్రేవుల ఆంత్ర సూచకముల నుండి కాలేయము చేరి అక్కడ
శుద్ధిగావింపబడి తర్వాత శరీర ధాతువులలో చేరి శరీర ఆరోగ్యమును కాపాడును. తినెడి ఆహారములను బట్టి శరీర
ఆరోగ్య అనారోగ్యములు, బలము బలహీనములుండును. కాని తినెడి ఆహారము మనస్సును నిగ్రహింప చేయలేదు,
బుద్ధిని మార్చలేదు. గుణములను స్థంబింప చేయలేదు. ఆహారమునకు మనస్సుకు గుణములకు ఎలాంటి సంబంధము
లేదు.
మంచి వారి సహవాసము, మంచి వినుట, మంచిని చూచుట, సద్భోదలు సత్ సాంగత్యము ఇవియే మనస్సుకు
మంచి ఆహారము. వీటి వలన మనస్సు మంచిగ మారి మంచి గుణములే అలవడును. చెడ్డను చూచుట వినుట
చెడ్డవారి సహవాసము అజ్ఞాన బోధలు ఇవి అన్నియు మనస్సుకు చెడ్డ ఆహారము. వీటి వలన మనస్సు చెడ్డగ మారి
చెడు గుణములే అలవడును. స్థూల శరీరమునకు ఆహారము ప్రధానమైనట్లే సూక్ష్మమైన మనస్సు బుద్ధికి అలవాట్లు
ఆహారముగ ఉన్నవని తెలుసుకొనుము.
గీతయందు సాత్త్వికాహారముచే సాత్త్విక గుణములు, రాజసాహారముచే రాజస గుణములు, తామసాహారముచే
తామస గుణములు కల్గునని ఉన్నట్లు చాలామంది తెలుపుచున్నారు. సంస్కృతమును తెలుగులోనికి అనువదించిన
స్వాములు కొందరు గీత యందు ఆహారమును బట్టి గుణములున్నాయని వ్రాశారు. తెలియని వారందరు అదియే
నిజమని నమ్ముచున్నారు. సంస్కృతపాండిత్యము గల గురువులు కూడ ఆ విధముగనే చెప్పి గీతను వారికి అనుకూలముగ
మార్చుకొన్నారు.
గీతయందు గుణముల బట్టి ఆహారముందని దేవుడు తెలిపినాడు. కాని ఆహారమును బట్టి గుణములున్నాయని
తెలుపలేదు. “సాత్త్విక ప్రియాః” అంటే సాత్విక గుణము కల వారికి ప్రియమైనదని ఎందుకు యోచించకూడదు. అట్లే
తామస ప్రియమ్ అన్నపుడు ముందు గుణముల వలన ఆహారము మీద ప్రేమ వస్తా ఉందని ఎందుకు అర్థము
చేసుకోకూడదు.
కర్మచేత సర్వము లభించుచున్నది. అట్లే ఆహారము కూడ లభించుచున్నది. నీకు మంచి ఆహారము మీద ప్రీతి
ఉండినప్పటికి కర్మాను సారము అది లభించనపుడు, చెడ్డ ఆహారమే లభించినపుడు, ప్రీతిని బట్టి సాత్విక గుణము
కలవానిగనే లెక్కించుకోవలయును. కాని కర్మ వశమున చెడ్డ ఆహారము తిన్నంత మాత్రమున తామసునిగ లెక్కించకూడదు.
అట్లే చెడ్డ ఆహారము మీద ప్రీతి ఉండిన, కర్మరీత్యా మంచి ఆహారమే లభించిన, వానిని మాత్రము తామసునిగనే
లెక్కించవలయును. కాని సాత్వికునిగ లెక్కించ కూడదు. ప్రీతిని బట్టి గుణమును, కర్మను బట్టి ఆహారములు
ఉండునని తెలియవలయును. గీతయందు కూడ తినువాడు అని చెప్పక ప్రీతి గలవాడు అని చెప్పుటను గమనించవలెను.
యోగులు మిత ఆహారము తీసుకోవలయునని గీత యందు దేవుడు చెప్పాడు. కాని పలానా ఆహారము
తీసుకొమ్మని, పలానా ఆహారము తీసుకోవద్దని తెలుపలేదు. దేవుడు మితాహారమన్నాడు కాని అంతకు మించి తెలుపలేదే!
తెలియకనా!! సర్వము తెలుసుకనుక!!! కర్మ వలననే మంచి చెడు ఆహారము లభించునని తెలుసు కనుక ఆయన
ఆహార నియమములుంచలేదు. అనుభవరీత్య తెలుసుకొనిన మంచి ఆహారమును తీసుకొను ధనికులంతా సాత్త్వికులుగా
ఉన్నారా? లేరు కనుక ఆహారమును బట్టి గుణములు లేవని తెలియుచున్నది. చెడ్డవానికైన మంచి ఆహారము
లభించుట వాని పుణ్యమని తెలియుచున్నది. మరియు ఒకే రక ఆహారమును భుజించు సైనికులందరికి ఒకే గుణము
లేదు. కనుక ఆహారమును బట్టి గుణములు లేవని, గుణములను బట్టి ఆహారము మీద ప్రీతి ఉందని, ఆహారము
లభించుట కర్మను బట్టి ఉండునని తెలియవలయును.
నర్మదమ్మ, తాడిపత్రి.
96. సూక్ష్మములో మోక్షమని అంటారే నిజమేనా?
జవాబు: సర్వ ప్రపంచమునకంతటికి అధిపతి, సర్వాంతర్యామి, అనంతుడైన పరమాత్మ యొక్క సాకారము (మానవరూపు)ను
ఎవడయితే కనుగొనగల్గునో వానికి ఏ యోగ సాధనతో, ఏ జ్ఞాన విషయములతో సంబంధము లేకనే, ఎటువంటి
కృషి చేయకనే మోక్షము పొందగల్గును. దానినే సూక్ష్మములో మోక్షమంటారు. కొన్ని జన్మల సహితము కృషి చేసిన
లభించని మోక్షము సులభముగ లభించడమునే సూక్ష్మములో మోక్షమని అంటారు. ఉదాహరణకు భీష్ముడు అటువంటి
మోక్షమునే శ్రీకృష్ణ పరమాత్మ ద్వార పొందగలిగాడు.
పెద్దకోట్ల మోహన్, ధర్మవరము.
97. మానవుడు సంతతి కోసము ఎందుకు తాపత్రయపడుచున్నాడు?
జవాబు:
మానవునిలో ఆరు ముఖ్య గుణములున్నవి. అందులో ప్రముఖ పాత్రవహించు మోహమను గుణమున్నది. ఆ
గుణము నాదియను భావములోనే ముంచి వేయును. నా అను ప్రతిది మోహ గుణము వలననే కల్గుచున్నది. ఆ
గుణమే నా కుమారులను బంధము కల్గించి సంతతి కోసము తాపమునపడునట్లు చేయుచున్నది. కర్మానుసారమే
ప్రతిది లభించును. కర్మ ప్రకారమే సంతతి లభించును. తాపత్రయపడినంత మాత్రమున సంతతి కల్గునని నమ్మకము
ఏమిలేదు. ప్రాప్తానుసారమే సంతతి సంసారము ఉండును.
నర్మదమ్మ, తాడిపత్రి.
98. భగవంతుడే పలికించాడని అంటూ ఉంటారు. నిజముగ భగవంతుడు మనుషుల ద్వారా పలికిస్తాడా?
జవాబు:
అసంభవము. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కాదు. శరీరము ధరించిన పరమాత్మను భగవంతుడనడము
జరుగుతుంది. వేరొకరి శరీరములోని నోటి మాటను సాకారుడైన భగవంతుడెట్లు పలికించును. గుణముల చేత
ప్రేరేపింపబడి పలుకు మానవుడు భగవంతుడు పలికిస్తు ఉన్నాడని దేవుని మీద నిందవేయడము క్షమింపరాని పాపము
నెత్తికెత్తు కోవడమే కాని వేరు కాదు.
99.
"సర్వ భూతస్థ మాత్మానం సర్వ భూతాని చాత్మని
యీక్షతే యోగ యుక్తాత్మా సర్వ త్ర సమదర్శనః"
ఈ శ్లోకము ప్రకారము యోగమాచరించువాడు అందరిని సమానముగ చూడవలెనని, అందరియందు ఆత్మ
ఉందని, అందరు ఆత్మ సంబంధులేనని, వేరొకడు నిందించినప్పటికీ ఆత్మే తనను నిందించినదని అనుకోవలయునని
అంటుంటారు నిజమంటారా?
జవాబు:
దేవుడు చెప్పిన శ్లోకమేమో బాగున్నది కాని అర్థము చేసుకొను మానవుని బుద్ధిహీనత ఇందులో కనిపిస్తున్నది.
యోగ యుక్తాత్ముడు అని శ్లోకములో ఉన్నది. ఏ యోగ యుక్తుడని యోచించడము మానవుని కర్తవ్యము. పై శ్లోకము
బాహ్య సంబంధము త్యజించిన బ్రహ్మయోగులకు చెప్పినది. కాని బయట ప్రపంచ సంబంధము కల్గిన కర్మ యోగులకు
అది వర్తించదు.
బ్రహ్మయోగులకు మిత్ర శత్రు భేదములు లేవు. వారు ఆత్మ మీదనే దృష్టి కల్గి బాహ్య ప్రపంచమునే మరచి
ఉందురు. కర్మ యోగులకు మిత్ర శత్రు భేదములుండును. అందువలన గీతయందు దేవుడే రాక్షసులైన వారిని
పాపయోనులందు పుట్టించి జ్ఞానము యొక్క గట్టు తెలియకుండ జేస్తానని దైవాసుర సంపద్విభాగ యోగమను అధ్యాయము
19, 20 శ్లోకములలో చెప్పాడు. అందరు అక్కడ దేవునికే సమానముగ లేరే? దేవతలు రాక్షసులను భేదము
ఆయనకెందుకు కల్గినది దీనికి సమాధానము చెప్పగలరా? ముందు గీతలో చెప్పిన కర్మ బ్రహ్మ యోగములను గురించి
తెలుసుకొని, ఎవరికి ఏ శ్లోకము వర్తించునని ఆలోచించు. అపుడు తెలుస్తుంది గీత యొక్క రహస్యము, గీతను
అర్థము చేసుకోలేనివారు అన్న మాటలు శాస్త్రబద్ధముగ హేతుబద్దముగ నిలువ జాలవు.
100. రాహు కేతువుల పుట్టుక పురాణములలో ఉన్నది. మీరేమో పురాణములు అసత్యమని అన్నారు. జ్యోతిష్య
శాస్త్రములో రాహు కేతువులున్నారని అంటున్నారు. అటువంటపుడు రాహు కేతువులను నమ్మాల, వదలివేయాలా?
జవాబు:
పురాణము మాట అబద్దమే. రాహువు కేతువుల విషయము నిజము చెప్పితే అర్థముకాదని నా మాటే
అబద్దమనుకుంటారని 10 సంవత్సరముల క్రితము మేము రాహు కేతువుల పుట్టుక కథ పురాణ సంబంధముగనే
చెప్పాము. కాని ఈనాడు పూర్తిగ ఖండించుచు సత్యమే ప్రకటించవలెనని తెలుపుచున్నాము. రాహు కేతువులు
ఖగోళమున సూర్య కుటుంబములోనికి మధ్యలో వచ్చిన వారు. వాటికి నిజముగ స్థూలశరీరము లేదు. కేవలము
సూక్ష్మ శరీరములు మాత్రమే గలవు. ఖగోళములో జరిగే మార్పుల వలన రాహు కేతు ఛాయగ్రహములు మధ్యలో
సూర్యకుటుంబములోనికి ప్రవేశించాయి. విచిత్రమేమంటే మిగత ఏడు గ్రహములకంటే ఈ రెండు గ్రహములు చాలా
శక్తివంతమైనవి. నిజము చెప్పాలంటే రాహు కేతువులు గురు శని పార్టీలలో గ్రహముల మీద ఆధిపత్యము
వహించి వాటి గమనములలో మార్పు జరగకుండ చూస్తున్నవి. మానవ జీవితములకు సప్త గ్రహములకు మధ్య
రాహు కేతువుల వలన పూర్తి సంబంధమేర్పడినది. వాటి విషయము చాలా ఉన్నది. కనుక ఇంతటితో ముగిస్తు అవి
శాస్త్రబద్ధమైనవని తెలుపుచున్నాము.
101. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ సామాన్య దేవతలుగ మీరు తెల్పారు. గీతలో బ్రహ్మపగలు, బ్రహ్మరాత్రి అని గొప్పగ
మీరే చెప్పారు. కారణము?
జవాబు:
గీత చెప్పిన బ్రహ్మకు త్రిమూర్తుల బ్రహ్మకు చాలా తేడా ఉన్నది. గీతలో పరమాత్మకే బ్రహ్మ అని పేరు
పెట్టబడినది. అందువలన గీతలో బ్రహ్మను గొప్పగ చెప్పాము. బ్రహ్మ అనగ పెద్ద అని అర్థము గలదు. గీతలో చెప్పిన
బ్రహ్మను పరమాత్మగ అర్థము చేసుకోవాలి.
102. శాస్త్రజ్ఞులు బుధ గ్రహము మీద మనుషులున్నట్లు తెలియజేశారు. వారు దేవతలై ఉంటారా?
జవాబు:
బుధ గ్రహము మీద మనషులున్నారేమోనని శాస్త్రజ్ఞులు ఊహించి ఉండవచ్చును. కాని అక్కడ మనుషులు
లేరు. దేవతలనువారు గుణములబట్టి వారికున్న దైవశక్తిని బట్టి ఉంటారు కాని ఇతర గ్రహాల మీద ఉండువారు
దేవతలుకారు.
103. కొందరు భూమి మీద కొంత ఎత్తులో ఏ ఆధారము లేకుండ కూర్చొని యోగమాచరించారని విన్నాము
నిజముండునా?
జవాబు:
ఉండవచ్చును. అది ప్రాణాయామము చేయువారికే సంభవము. శరీరములోని గాలి పీడనశక్తికి శరీరము
పైకి లేచి గాలిలో తేలియాడును.
పురుషోత్తమనాయుడు, కూచివారిపల్లి.
104. ప్రబోధానంద స్వామిగారు మీకు దేవుడు కనిపిస్తే ఏమి అడుగదలచు కొన్నారు?
జవాబు:
దేవుడు కనిపించడు నాయనా! కనిపించే వాడు వినిపించేవాడు దేవుడు కాదు. కర్మ ప్రకారము అన్ని
జరుగునని నిశ్చయములో ఉండాలి, గాని కోర్కెలు కోరే ఆశలో ఉండకూడదు.
105. దేవుడు ఒక్కడే అంటారు మరి త్రిమూర్తులు ముగ్గురున్నారు కదా! వారేమవుతారు?
జవాబు:
దేవునికి ఆకారములేదు. త్రిమూర్తులకు ఆకారమున్నది కావున వారు మన మాదిరి వ్యక్తులే. మనకంటె
యోగశక్తి ఎక్కువ కలవారని చెప్పవచ్చును. వీరిని పరమాత్మతో పోల్చకూడదు. సాధారణ దేవుళ్ళుగ చెప్పుకోవచ్చును.
106. దేవుడు లేకుండ మానవుడు, మానవుడు లేకుండ దేవుడు ఉన్నాడా?
జవాబు:
తలలేకుండ శరీరము, శరీరము లేకుండ తల ఉన్నదా? అట్లే దేవుడు మానవుడు ఉన్నారు.
నారాయణ శంకరనారాయణ, రాజంపేట.
107. కుల భేదములు మొదట వచ్చాయంటున్నవి గీతలోని కొన్ని శ్లోకములు దానికి మీ సమాధానము?
జవాబు:
శాస్త్ర వాక్యము చేత ఖండింపబడనిదే శాస్త్రమగును. మీరు చెప్పిన కొన్ని శ్లోకములు గీత చేతనే
ఖండింపబడుచున్నవి. అందువలన అవి గీత కాదని చెప్పుచున్నాము. గీత వాక్యము చేత ఖండింపబడునది గీతలోనిదియైన
శాస్త్రము కాదు, నిరూపణకు రాదు. గీతలో కుల భేదములు లేవు, గీతలో గుణ భేదములున్నవని తెలుసుకోవాలి.
పి. రాంబొజ్జి, ధర్మవరము.
108. ధ్యానము చేయునపుడు లౌకిక విషయములే జ్ఞప్తికి వస్తుంటాయి వాటిని నిరోధించుటకు మార్గము ఏమున్నది?
జవాబు: గీతలో భగవంతుడు చెప్పినట్లు వైరాగ్య అభ్యాసముల చేతనే వీలగును.
ఇల్లూరు సూర్యనారాయణ శెట్టి, గుంతకల్.
109. మీ "ప్రబోధాత్మజమ్" పత్రిక మీద హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు సంబంధించిన చిత్రము వేసినారు.
అదియే ధర్మాచరణయో తెల్పవలయును.
జవాబు:
అది నా స్వహస్తములతో వేసిన చిత్రము. అందులో ఉన్నవి ఎన్ని మతాలైనా మతముల ధ్యేయము దైవ
సామీప్యము చేరడమే, కావున ఆత్మ ధర్మము ప్రకారము ఆ చిత్రమును అందులో వేయడము జరిగినది. ఓం
కారములోనే మిగత రెండు చిత్రాలు ఇమిడి ఉన్నాయి కావున మీకు ఓంకారమే దేవుడైతే, పూజ్యనీయమైతే అన్ని
మతములు దేవునిలోనివే, దేవుడు అన్ని మతములవాడే, ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క దేవుడు లేడని, అందరికి ఒక్కడే
దేవుడని తెలియవలయును. దేవుని ఒక్క అంశతోనే ఈ జగత్తంతయు ఉన్నది, కావున అన్ని మతములు ఆ ఒక్క
అంశలోనివే కావున ఏకాత్మతా ధర్మము ప్రకారము ఆ చిత్రము వేయబడినది.
కె. గంగప్ప, కిరికెర.
110. ఆత్మ ఎట్టిది?
జవాబు:
అన్ని శరీరములందు జీవాత్మతో పాటు సూక్ష్మముగ ఉన్న నాశనము లేని అంశ ఆత్మ.
111. పరబ్రహ్మము యొక్క రూపు ఎట్లుండును?
జవాబు:
పరబ్రహ్మమునకు ఆకారము లేదు.
112. గురువును దూషించిన వారికి ఏమి సంప్రాప్తమగును?
జవాబు: క్షమించరాని పాపము.
113. శిష్యుని దూషించిన గురువుకు ఏమి సంప్రాప్తమగును?
జవాబు: గురువు శిష్యుని దూషించుట భావ్యము, సవ్యము. కావున పాపమును క్షమించ గలుగు శక్తి కలుగును.
గురువు శిష్యునికి శిక్షణ నివ్వడములో దూషణలుండవచ్చును. శిక్ష నుండి శిక్షణ అను పదము శిష్యుడు అను పదము
పుట్టినది. కావున శిక్షణలో దూషణ కూడ ఉండవచ్చును.
114. మాయ ఎవరి స్వాధీనములో ఉన్నది?
ప్రకృతి పరమాత్మ స్వాధీనములో ఉన్నది. కావున మాయ కూడ పరమాత్మ స్వాధీనములోనే ఉన్నది.
బి. సాంబశివ, అనంతపురము.
115. ఆర్యా!
ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దే శేర్జునతిష్టతి!
బ్రామయన్ సర్వ భూతానియంత్రా రూఢానిమాయయా
“సంసార యంత్రమున తగుల్కొని ఉన్న ఈ చరాచర భూతములను తన మాయాశక్తి చేత ఆడించుచు పరమేశ్వరుడు
హృదయములందు నెలకొని ఉన్నాడు అని గీతావాక్యము” అయితే ఆ హృదయ స్థానమేది? జీవుల
శరీరములందు ఈశ్వరుడు నివశించు స్థానమేది? అను విషయము భిన్నాభిప్రాయములుగనున్నది?
1.
(ఎ). తైత్తీరీయోపనిషత్తు : పద్మకోశ ప్రతీకారం హృదయం చాప్యథో ముఖం
(బి). సుచోలోపనిషత్తు : హృదయస్య మధ్యేలో హితం మాంస పిండం మధ్యే అను శ్లోకాలలో జీవుల కంఠమునకు
జేనెడు క్రిందుగను నాభికి జేనెడు పై భాగమునను మాంస పిండమయమై వ్రేలాడుచున్న తామర కమలాకృతిలో ఉన్న
దానియందు మధ్య రంధ్రమున గల జలములో ఈశ్వరుడు విరాజిల్లుచున్నాడు. అదియే హృదయ పద్మము అని
నిర్ణయింపబడినది.
2.(ఎ). ఉమాసహస్రము గ్రంధమందు,
తస్య దక్షిణతో ధామ హృత్పీరెనైవ నామతః
తస్మాత్ ప్రవహతి జ్యోతిః సహస్రారం సుషుమ్నయా
"ఈశ్వరుడు (ఆత్మ) స్వయంగా ప్రకాశించు చోటు దహరాకాశము అను పేరుగల హృదయము. ఇది వక్ష స్థలమునకు
కుడివైపు ఉన్నది.” అని ఉద్ఘాటించుచున్నది. భగవద్గీతాచార్యుడు చెప్పిన ఈశ్వరుడు నివశించు జీవుల హృదయ
స్థానము ఏది? సహస్రారమందున్న పరమాత్మ (గురు) స్థానమునకు హృదయ కమల మద్యవర్తి ఈశ్వరునకు సమన్వయ
మెట్లు?
జవాబు:
ఉపనిషత్తులంటేనే నూటికి నూరుపాల్లు సత్యమని నమ్మువారు చాలామంది కలరు. అందువలన ఉపనిషత్
వాక్యరీత్యా గుండెనే హృదయముగ అందరు లెక్కించుచున్నారు. వాస్తవముగ గుండెకు హృదయానికి సంబంధము
లేదు. అవి రెండు వేరుగ వేరుగ ఉన్నవి. వాటి పనిలోను తేడా ఉన్నది. గుండె రక్తమును మాత్రము పంప్
చేయుచున్నది. అది పని చేయుటకు కూడ ఒక శక్తి అవసరము ఆ శక్తి బ్రహ్మనాడి నుండి వస్తున్నది. కావున గుండెకు
స్వయంశక్తి లేనిదని తెలియుచున్నది. చైతన్యమే లేనిది అందులో ఆత్మ నివాసముందనుట అసత్యమగును. ఆత్మ
చైతన్య స్వరూపమైనది. ఆత్మ చైతన్యము చేతనే జీవరాసుల శరీరములు కదలుచున్నవి. అటువంటపుడు వేరొక చోటు
నుంచి ప్రవహించు ఆత్మ శక్తి చేత కదలు గుండెయందు ఆత్మ కేంద్రముగ ఉందనడము అసత్యమగును.
గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమను అధ్యాయములో 15 వ శ్లోకము "సర్వస్య చాహం హృదిసన్ని విష్ణో మత్తః
స్మృతిర్ జ్ఞాన మపోహనంచ" నేను (ఆత్మ) సర్వ జీవుల హృదయ స్థానములలో ఉన్నాను. నా వలననే జ్ఞప్తి, జ్ఞానము,
ఊహ కలుగుచున్నవి. అను దేవుని వాక్యము ప్రకారము గుండెలో దేవుడు లేడని తెలియుచున్నది. గుండెవలన
జ్ఞానము జ్ఞప్తి ఊహలు కలుగలేదు కావున గుండెకు హృదయమునకు తేడా ఉన్నదని తెలియుచున్నది. ఎక్కడయితే
హృదయమున్నదో అక్కడ నుండే జ్ఞప్తి ఊహలు కలుగుచున్నవని పై శ్లోకము ప్రకారము తెలియుచున్నది. కావున జ్ఞప్తి
జ్ఞాన ఊహలు కలుగు మెదడునే హృదయమని శాస్త్రబద్ధముగ చెప్పవచ్చును. శరీర మద్యలో ఉన్న మెదడు నుండి
క్రిందికి ప్రాకిన వెన్ను పాము (బ్రహ్మనాడి)నే హృదయమని చెప్పవచ్చును. దేవునిశక్తి నివాసముండు నాడి కనుక దీనిని
బ్రహ్మనాడి అనడము జరుగుచున్నది. ఆ శక్తికి మూలస్థానము మెదడు. అందువలన మొత్తము మెదడు దాని నుండి
బయలుదేరిన వెన్ను పామును హృదయము అనవచ్చును. మెదడు దాని నాడి వెన్నుపాము చేతనే సర్వ జీవరాసులు
కదలించపబడుచున్నవి. కావున నేను హృదయ స్థానములో ఉండి జంత్రగాడు బొమ్మల నాడించురీతిగ కనిపించక
ఆడించుచున్నానని గీతయందు చెప్పాడు.
మీరు చెప్పిన 1) తైత్తీరీయోపనిషత్ శ్లోకములో హృదయము పద్మాకారముగ ఉండి అదో ముఖముగ వ్యాపించి
ఉన్నదని ఉన్నది. పద్మమువలెనున్నది మెదడు దాని నుండి బయలుదేరిన నాడి అదో ముఖముగ ఉన్నది కనుక ఆ
శ్లోకము సరిపోయింది. ఎన్ని విధములు పరిశోధన జేసిన హృదయమను పదము మెదడుకే వర్తిస్తుంది కాని గుండెకు
ఏ మాత్రము వర్తించదని తెలియవలయును. హృదయమే గుండె అనువారి వాదనను గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమను
అధ్యాయములో 15వ శ్లోకమొక్కటే ఖండించి వేస్తుంది.
యం. రామక్రిష్ణయ్య, బి. పప్పూరు.
116. మానవుడు పుట్టినప్పటి నుండి మానవునిలో పెరగనిది తరగనిది ఏది? అని ప్రశ్నించగా పరమాత్మ అని
చెప్పబడినది. కాని మానమ్మకము శరీరములోని శ్వాస అని ఉన్నది మీరేమంటారు?
జవాబు:
పరమాత్మ అను సమాధానమే సరియైనది. మానవుడు పుట్టినప్పటి నుండి పెరగనిది తరగనిది పరమాత్మ
సంబంధమైనదే కాని ప్రకృతి సంబంధముకాదు. శ్వాస ప్రకృతితో తయారయినది కావున అది ఒకప్పుడు పెరగడము
ఒకపుడు తరగడము జరుగుచున్నది. మనస్సు ఏకాగ్రత పొందినపుడు శ్వాస తగ్గిపోవడము, మనస్సు ఉద్రేకము
పొందినపుడు శ్వాస ఎక్కి పొడవురావడము జరుగుచున్నది. అందువలన శ్వాస పెరుగునది తరుగునదని తెలియవలయును.
దూళిపాటి శ్రీనివాసయ్య, రాజంపేట.
117. దేవుడు మన ఇంట జంట వెంట సర్వత్ర ఉన్నాడు అనే సత్యాన్ని మానవులు తెలిసి తెలియక ఎక్కడో
దేవుడున్నాడను భావముతో దూర ప్రదేశములకు పుణ్యక్షేత్రములకు పరుగిడుచున్నారు. అట్లు పోవుటకు కారణమేమి?
జవాబు:
అంతట దేవుడు ఉన్నాడను సత్యము తెలియకపోవడము ఒక కారణము. ఆ కారణముకంటే మించినది
మానవునిలో ఆశ అను గుణము అక్కడికి పోతే ఏదో నెరవేరునను భావము కల్పించి కష్ట నష్టములనైన ఓర్చి అక్కడికి
పోవునట్లు చేయుచు ఉన్నది. నిజ జ్ఞానము కలవాడు ఏ క్షేత్రములకు పోనవసరము లేదు. తెలిసిన వానికి శరీరమే
దేవాలయము అందులోని ఆత్మ దేవుడు.
118. మీరు గత సంచికలో మంత్ర జపముకంటే యోగసాధనే ముఖ్యమన్నారు. ముసలి తనములో నుండు
మానవుడు శరీరము కృషించి ఉండుటచేత యోగ మాచరింపనలవి కాదు కదా! అట్టి వాడు ఆత్మానందము
పరబ్రహ్మ ఐక్యము పొందుటకు సాధ్యమగునా?
జవాబు:
పరమాత్మను పొందుటకు రెండే మార్గములున్నవని చాలాసార్లు మేము చెప్పాము. ఒకటి ఆసనము వేసి మనో
నిగ్రహము పొంది ఆత్మను చేరు యోగము. దానినే బ్రహ్మయోగము అంటారు. రెండవది ఆసనము వేయక మనో
నిగ్రహముతో పనిలేక కేవలము అహంకారమును అనచి వేసి అన్ని పనులు చేయడము, దీనినే కర్మయోగము అంటారు.
వృద్ధులకు బ్రహ్మయోగమాచరించుటకు శరీరము అనుకూలించదు కావున కర్మ యోగమాచరించ వచ్చును. అన్ని
వయస్సుల వారికి అనుకూలమైనది కర్మయోగము. మనో నిగ్రహము మీద ఆధారపడినది బ్రహ్మ యోగము. అహంకార
నిగ్రహము మీద ఆధారపడినది కర్మ యోగమని తెలియవలయును.
బి. కాటమయ్య, బి. పప్పూరు.
119. రాజయోగి, బ్రహ్మయోగి వీరిద్దరిలో ఎవడు అద్వైతుడు?
జవాబు:
జీవాత్మ ఆత్మ ఏకమైనవాడే అద్వైతుడు. కావున బ్రహ్మయోగియే అద్వైతుడగును. రాజయోగి అద్వైతుడు కాడు.
120. పెళ్లి కాని వారిని బ్రహ్మచారి అందురు. పెళ్లి చేసుకొన్న వారిని కూడ బ్రహ్మచారి అందురా?
జవాబు:
బ్రహ్మచారి అను పదము పెళ్లిని బట్టి ఉండునని చాలా మంది అభిప్రాయము. కాని పెళ్లి చేసుకోని వానికి
బ్రహ్మచారి పదమునకు సంబంధము లేదు. బ్రహ్మ యొక్క ఆచరణ ఆచరించువాడు బ్రహ్మచారి అగును. అంటే
దేవుడు చెప్పినట్లు జ్ఞానము ప్రకారము నడచుకొను వాడు బ్రహ్మచారి అగును. వివాహము అయిన వాడు కాని,
కానివాడు గాని జ్ఞానము ప్రకారము నడచినపుడే బ్రహ్మచారి అగును. అట్లు నడచుకోలేని వివాహితులు గాని అవివాహితులు
గాని బ్రహ్మచారులు కారు. బ్రహ్మచారి అను పదములోనే ఉన్నది అందులోని అర్ధము.
121. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ వేరు వేరుగా ఉన్నారని మీరే తెలిపారు, వీరు ముగ్గురు ఒకటై పోయేదెపుడు?
జవాబు: జీవుడు మోక్షము పొందినపుడు.
122.పంచ భూతములకు ఆత్మకు తేడా ఉన్నదా?
జవాబు: పంచభూతములు నాశనమగునవి, ఆత్మ నాశనము కానిది ఇంతే తేడా.
123. పంచ భూతములతో శరీరము తయారైనదని మీరే తెలిపారు.అది ఏ విధముగనో వివరముగ
తెలుపవలయును?
జవాబు: దేహ నిర్మాణము.
2. గాలి, 3. అగ్ని, 4. నీరు, 5. భూమి. ఈ
ప్ర అనగ పుట్టినదని అర్థము. ఐదు చేత
ప్రకృతి అనగా పంచభూతములని అర్థము. అవి 1. ఆకాశము,
ఐదు భాగముల చేత ఏర్పడినదే ప్రపంచము. పంచము అనగ ఐదని,
ఏర్పడిన దానినే ప్రపంచమను పేరు పెట్టబడినది. పంచ భాగములు ఉన్న ప్రకృతి, రెండు విధములుగ ఉన్నది.
1. మార్పు చెందని ప్రకృతి, 2. మార్పు చెందు ప్రకృతి. మార్పు చెందని ప్రకృతి అనగా నేడు మనకు గోచరమగు
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఇవి ప్రపంచ పుట్టుక నుంచి ప్రపంచ అంత్యము వరకు ఒకే ధర్మము కల్గి
ఉన్నవి. ఉదాహరణకు అగ్ని కాలును కదా! అది ఎప్పటికి ఆ స్వభావమే కల్గి ఉండును. ఇపుడు మనము
ముఖ్యముగ తెలుసుకోవలసినది మార్పు చెందు ప్రకృతిని.
మార్పు చెందు ప్రకృతి (ప్రపంచము) జీవరాసులు శరీర రూపములుగ ఉన్నది. పంచ భూతముల చేతనే
శరీరములు తయారయినవి. పంచభూత నిర్మితమైన శరీరములు బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యమను మార్పు
గలిగి నిత్యము ప్రతి క్షణము మార్పుతో కూడుకొని ఉన్నవి. అందువలన శరీర నిర్మాణమైన పంచ భూతములను
మార్పు చెందు ప్రకృతి అనుచున్నాము. మార్పు చెందు ప్రకృతి నుండి శరీరములు ఎలా తయారైనది తెలుసుకోవడము
ఇక్కడ ముఖ్యాంశము.
మార్పు చెందు ప్రకృతియైన పంచభూతములు ఒక్కొక్కటి ఐదు భాగములుగ చీలిపోయినవి. అపుడు మొత్తము
25 భాగములయినవి.
ఆకాశము 5 భాగములు (ఆకాశము 1+1+1+1+1 = 5)
గాలి 5 భాగములు (గాలి 1+1+1+1+1 = 5)
అగ్ని 5 భాగములు (అగ్ని 1+ 1+1+1+1+1 =5)
నీరు 5 భాగములు (నీరు 1+1+1+1+1 = 5)
భూమి 5 భాగములు(భూమి 1+1+1+1+1 = 5).
మొత్తము 25 భాగములైనవి కదా! అందులో ఆకాశము మొదటి భాగము, గాలి రెండవ భాగము అగ్ని
మూడవ భాగము, నీరు నాల్గవ భాగము, భూమి ఐదవ భాగము ఒక్కొక్కటి 5 భాగములుగ చీలి పోయినవి. ఇక్కడ
పంచ భూతముల 1వ, 2వ, 3వ, 4వ, 5వ భాగములు మాత్రమే తిరిగి 5 భాగములుగ చీలిపోయినవని గమనించవలెను.
పంచ భూతములలో ప్రతి దానియందు 4 భాగములు చీలక మిగిలినవి. ఇపుడు చీలినవి 25, చీలనివి 20 భాగములు
ఉన్నవి. ఆకాశము 1వ భాగము, గాలి 2వ భాగము, అగ్ని 3వ భాగము, నీరు 4వ భాగము, భూమి 5వ భాగములు
చీలికలైనవి 25 పదార్థములు, మిగత చీలని 20 పదార్థములతో కలిసి మార్పు చెంది క్రొత్త పదార్థములుగ ఏర్పడిన
భాగములే శరీర అవయవములు. ఒక పదార్థము వేరొక పదార్థముతో కలిసినపుడు క్రొత్త పదార్థము ఏర్పడునను
సైన్సు సూత్రము ప్రకారము అయిదు భాగముల చీలికలైన 25 భాగములు మిగత 25 భాగములతో కలసినపుడు ఒక
క్రొత్త భాగములు ఏర్పడినవి. అవియే శరీర భాగములు. అదియే దేహ నిర్మాణము. ఇక్కడొక అనుమానము
రావచ్చును. అది ఏమనగా! చీలికలు 25 ఉన్నవి కదా! మిగత చీలనివి 20 మాత్రమే కదా అపుడు 5 భాగములు
తక్కువవచ్చును కదా అని సంశయము ఏర్పడును. దానికి సమాధానము తక్కువ బడిన ఆ ఐదు భాగముల స్థానములలో
ఆత్మ అంశ చేరినది. అందువలన చీలని భాగములు 20 + ఆత్మ అంశ 5 భాగములు మొత్తము 25 భాగములైనవి.
ఇపుడు చీలిన 25 భాగముల పదార్థములు, చీలని 20 + 5 = 25 పదార్థములు కలసి శరీరము ఏర్పడిన విధానము
క్రింద తెలుపుచున్నాము.
1. ఆకాశము మొదటి భాగములోని 1వ భాగము + ఆత్మ 1వ అంశ = జీవుడు
ఆకాశము మొదటి భాగములోని 2వ భాగము + గాలి 1వ భాగము = మనస్సు
ఆకాశము మొదటి భాగములోని 3వ భాగము + అగ్ని 1వ భాగము = బుద్ధి
ఆకాశము మొదటి భాగములోని 4వ భాగము + నీరు 1వ భాగము=చిత్తము
ఆకాశము మొదటి భాగములోని 5వ భాగము+భూమి 1వ భాగము = అహంకారము
ఈ విధముగ ఆకాశము మొదటి భాగములోని 5 చీలికల చేత పుట్టినవి అయిదు అంతఃకరణములు
2. గాలి రెండవ భాగములోని 1వ భాగము + ఆత్మ 2వ అంశ = వ్యాన వాయువు,
గాలి రెండవ భాగములోని 2వభాగము+ఆకాశము 2వభాగము = సమాన వాయువు,
గాలి రెండవ భాగములోని 3వ భాగము + అగ్ని 2వ భాగము = ఉదాన వాయువు,
గాలి రెండవ భాగములోని 4వ భాగము + నీరు 2వ భాగము = ప్రాణ వాయువు,
గాలి రెండవ భాగములోని 5వ భాగము + భూమి 2వ భాగము అపాణ వాయువు.
ఈ విధముగ గాలి రెండవ భాగములోని 5 భాగముల చేత పుట్టినవి పంచ వాయువులు.
3. అగ్ని మూడవ భాగములోని 1వ భాగము + ఆత్మ 3వ అంశ = కన్ను,
అగ్ని మూడవ భాగములోని 2వ భాగము + ఆకాశము 3వ భాగము = చెవులు,
అగ్ని మూడవ భాగములోని 3వ భాగము + గాలి 3వ భాగము = చర్మము,
అగ్ని మూడవ భాగములోని 4వ భాగము + నీరు 3వ భాగము = నాలుక,
అగ్ని మూడవ భాగములోని 5వ భాగము + భూమి 3వ భాగము = ముక్కు,
ఈ విధముగ అగ్ని మూడవ భాగములోని 5 భాగముల చేత పుట్టినవి జ్ఞానేంద్రియములు.
4. నీరు నాల్గవ భాగములోని 1వ భాగము + ఆత్మ 4వ అంశ = రుచి,
నీరు నాల్గవ భాగములోని 2వ భాగము + ఆకాశము 4వ భాగము = శబ్దం,
నీరు నాల్గవ భాగములోని 3వ భాగము + గాలి 4వ భాగము =స్పర్శ,
నీరు నాల్గవ భాగములోని 4వ భాగము + అగ్ని 4వ భాగము = రూపు,
నీరు నాల్గవ భాగములోని 5వ భాగము + భూమి 4వ భాగము = గంధ,
ఈ విధముగ నీరు నాల్గవ భాగములోని 5 భాగముల చేత తయారైనవి పంచతన్మాత్రలు.
5.భూమి ఐదవ భాగములోని 1వ భాగము + ఆత్మ 5వ అంశ = గుదము
భూమి ఐదవ భాగములోని 2వ భాగము + ఆకాశము 5వ భాగము = వాక్కు
భూమి ఐదవ భాగములోని 3వ భాగము + గాలి 5వ భాగము = చెతులు
భూమి ఐదవ భాగములోని 4వ భాగము + అగ్ని 5వ భాగము = పాదములు
భూమి ఐదవ భాగములోని 5వ భాగము + నీరు 5వ భాగము = గుహ్యము.
ఈ విధముగ భూమి అయిదవ భాగములోని 5 చీలిన భాగముల చేత తయారయినవి 5 కర్మేంద్రియములు.
84 లక్షల రకముల జీవరాసులు శరీరములు పై విధముగ తయారై నిలచినవి. ముఖ్యముగ గమనించవలసిన
విషయమేమంటే తల్లి తండ్రికి పుట్టిన బిడ్డ తల్లి తండ్రి శరీర పోలికలున్నట్లు పంచ భూతముల చేత తయారయిన శరీర
25 భాగములలో ఆ భూత భాగముల లక్షణములు ఇమిడి ఉన్నవి. ఉదాహరణకు ఆకాశ మొదటి భాగము, గాలి
మొదటి భాగము కలిసి తయారైన మనస్సు ఆకాశ గాలి లక్షణములు కలిసి ఉన్నది. ఆకాశము (శూన్యము) కనుపించునది
కాదు కావున ఆకాశముతో తయారైనవి కనిపించని లక్షణము కలిగివున్నవి. అందువలన మనస్సు కనుపించునది
కాదు. అట్లే గాలి లక్షణము చలించుట కావున మనస్సు కూడ చంచల స్వభావము కల్గి ఉన్నది. ఈ విధముగ మన
శరీర భాగములు పంచ భూతముల లక్షణములను కల్గి ఉన్నవని తెలియవలయును. బ్రహ్మ విద్యాభ్యాసములో శరీర
నిర్మాణము తెలియుట ముఖ్య జ్ఞానము. ఈ విషయము తెలియకపోతే ఎవరు జ్ఞానులు కారని పెద్దలు ఈ విధముగ
అన్నారు.
పద్యము :
పంచ తత్వములను పంచీకరించక
మంచి యతుల మన్న మాటలన్న
కుంచమందు గజము గ్రుడ్డు పెట్టినవిదంబు
అఖిల జీవసంగ ఆత్మ లింగ.
“పంచ భూతములు విభజింపబడి శరీరమెట్లు తయారైనదని తెలియకపోతే ఏనుగు గంప క్రింద గ్రుడ్డు పెట్టుననుట
ఎంత సత్యమో అటువంటివారు జ్ఞానులను మాట కూడ అంతే సత్యమగును.” అందువలన బ్రహ్మవిద్యలో ప్రాథమిక
పాఠమైన శరీర నిర్మాణమును అందరు తెలియండి ఇతరులకు తెలుపండి.
వి. శంకరనారాయణ బి.ఎ., ధర్మవరము.
124. సంపూర్ణ జ్ఞానులు అయిన తర్వాత దైవ ధ్యానము చేయమన్నారు. మనము సంపూర్ణ జ్ఞానము పొందినాము
అని ఏ విధముగ తెలియవలయును. జ్ఞానమునకు ఏమైన హద్దు ఉన్నదా? తెలియజేయ ప్రార్థన.
జవాబు:
సంశయ రహితముగ సవివరముగ ఆత్మ విషయాలు తెలిసినపుడే సంపూర్ణ జ్ఞానమనబడును. ఆత్మ సంబంధమైన
ప్రతి ప్రశ్నకు సమాధానము వెదకకనే ఎవనికయితే వచ్చునో అతనినే సంపూర్ణ జ్ఞానులందుము. అటువంటి సంపూర్ణ
జ్ఞానులను తెలుసుకొను నిమిత్తము జ్ఞానపరీక్ష మేము నిర్వహిస్తూ ఉంటాము.
125. శ్వాసను బంధించి ఎన్ని వందల సంవత్సరములైన ఉండవచ్చును, కాని ఈ దేహమునకు మరణమున్నది
కదా! అన్ని వందల సంవత్సరముల వరకు భౌతికదేహము ఎట్లుండగలదు?
జవాబు:
మన శరీరమునకు శ్వాస సంఖ్యను బట్టియే మరణము సంభవించును. ప్రారబ్ధము ప్రకారము ఎన్ని శ్వాసలు
నియమించబడి ఉన్నాయో అన్ని అయిపోవు వరకు దేహమునకు మరణము లేదు. శ్వాస నిలుపుటకు ముందు
ఏవయస్సు ఉండునో నిలిపిన తర్వాత ఎంతకాలమైనప్పటికి అదే వయస్సే ఉండును. శ్వాస జరిగినపుడే వయస్సు
జరుగునని తెలియవలయును.
126. పుట్టిన వెంటనే ప్రతి శిశువు “కేర్” మని అరుస్తారు. ఇది ఏ భాష పదము అట్లు అరవడానికి
కారణమేమిటి?
జవాబు:
పుట్టిన బిడ్డ అరుపులు ఒక “కేర్” మనియే కాక "క్వా" అని, ఊంగ అని రకరకములుగ అరుస్తుంటారు.
ప్రపంచములోని దాదాపు రెండు వేల భాషలలో ఏ భాషకైన ఆ పదములు సంబంధించి ఉండును. అంతమాత్రమున
వీరి అరుపులకు అర్థములు లేవు. వారు అర్థములతో అరవడము లేదు. ఉన్న స్థితిని కోల్పోయి క్రొత్త స్థితి పొంది దిక్కు
తెలియని అయోమయ స్థితిలో అరిచే అరుపే కాని వేరు కాదు. ఒక్కసారిగా పాత ఇంద్రియముల సంబంధము
కోల్పోయి సామర్థ్యములేని లేతవైన క్రొత్త ఇంద్రియముల సంబంధము ఏర్పడుటను జన్మ అంటాము. జన్మ సమయములో
పాత వాటిని కోల్పోయినానను జ్ఞాపకము కూడ లేని జీవుడు అర్ధములేని అరుపులు అరచును. వాటికి మన పెద్దలు
కొందరు నేనెక్కడికి వచ్చానని, నా ఇంద్రియములు లేవని రక రకములుగ అర్థములు చెప్పారు. కాని అప్పటి జీవునకు
ఏ యోచన కాని, ప్రశ్నించు తెలివి కాని ఏ మాత్రము లేవు. అందువలన మనము అర్థములు చెప్పుకొనిన వాడు
మాత్రము ఏ అర్థముతో అరవడము లేదు.
127. ఆహారములో ఉప్పు పులుపు కారము తగ్గిస్తే కామము (స్త్రీ సంబంధ ఆశ) తగ్గుతుందంటారు వాస్తవమేనా?
జవాబు: ఆహారము శరీర ఆరోగ్య అనారోగ్యముల మీద పని చేయును. మానసికముగ గుణముల మీద ఏ మాత్రము
పని చేయదు. ఆహారలోపము వలన శరీరమునకు స్త్రీ సంయోగ కార్యము చేయలేని బలహీనస్థితి ఏర్పడవచ్చును.
కాని గుణము మాత్రము లోపల ఉండనే ఉండును. ఆహార మార్పిడివలన శరీరము బలాబలములుగ మారవచ్చును
కాని శరీరములోని గుణము మారదు. చింత చచ్చిన పులుసు చావదన్నట్లు శరీరము కృశించిన అందులోని గుణములు
కృశించవు. అందువలన మీలాంటి యువకులు అనుభవమునకు రాని, శాస్త్రము కాని, మూఢ నమ్మకములైన మాటలను
ఖండించి నిరూపణకు వచ్చు విషయముల మీద ఆధారపడవలెను. ఎంతో ఉన్నతమైన దైవజ్ఞానము అశాస్త్రీయమాటలతో
మూఢ నమ్మకములతో నేడు నిండి ఉన్నది. అందువలన హేతువాదమునకు నిలువ లేక పోవుచున్నది. మీలాంటి
యువకులు హేతుబద్దము కాని మాటలను ఖండించి దైవ విషయములకు వెలుగును చేకూర్చుదురని కోరుచున్నాము.
బత్తల నాగేశ్వరరావు, రెడ్డిపల్లి.
128. స్వామి! దేవుడు ఉన్నాడని అంటున్నారు కదా! ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఆయనకు ఆకారము ఏమైన
ఉన్నదా?
జవాబు:
దేవుడు సర్వ జీవరాసుల శరీరములలో ఉన్నాడు. ఆ దేవునికి ఆకారము లేదు.
129. మానవుడు చనిపోయిన తర్వాత అతని తల వెనుక భాగమున దీపమును వెలిగిస్తారు. దీనికి కారణము
ఏమైన ఉన్నదా?
జవాబు:
పూర్వకాలములో పెద్దలు చేసిన ప్రతి దానికి అర్థముండెడిది. కాని నేడు అది లోపించింది. ముఖ్యముగ
పూర్వకాలములో పరకాయ ప్రవేశ విద్య నేర్చినవాడు శరీరమును వదలి వేరొక శరీరమును ఆశ్రయించినపుడు ఆ
శరీరము యొక్క తల వెనుకల దీపముంచెడివారు. ఆ విధముగ పెట్టమని శరీరము వదలి పోయేవాడే చెప్పియుండును.
అదియు రాత్రిపూట మాత్రమే ఆ విధముగ పెట్టేవారు. పగలు అవసరమే లేదు. శరీరము వదలిన వాడు తిరిగి
శరీరమును చేరవలయునంటే చీకటిలో తన శరీరమును గుర్తించలేడు కనుక వెలుగు కోసము ఆ విధముగ పెట్టేవారు.
శరీరము యొక్క ముఖమును చూచియే కదా ఎవరైనది గుర్తించగలము. అందువలన ముఖము కనిపించునట్లు తలకు
దగ్గరగ ముంతనో లేక చెంబునో బోర్లించి దాని మీద దీపము పెట్టి ముఖము స్పష్టముగ కనిపించునట్లుంచేవారు. ఆ
విధముగ ఉంచుటవలన తిరిగి శరీరము చేరే వానికి ఏ ఇబ్బంది ఉండదు. ఇది పూర్వకాల పద్ధతి ఇపుడేమో చనిపోయిన
వారికి కూడ దీపముంచడము మొదలు పెట్టాము. ఒకరిని చూచుకొని ఒకరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నామను
యోచన మానవునికి రాలేదు. మీ అటువంటి జిజ్ఞాసులు అడుగుట వలన మేము ఉన్న సత్యమును చెప్పినప్పటికి నేటి
మానవుడు వినిపించుకొనే స్థితిలో లేడు. పెద్దలు చేసినది మనము చేయాలను రోగము జాడ్యమై ఇమిడి ఉన్నది.
పూర్వము పెద్దలు ఎందుకు చేసారు, ఏ సందర్భములో చేసారు అను యోచన ఏ మాత్రము లేదు.
130. మానవుడు చనిపోయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి జీవి ఎక్కడకు పయణిస్తుంది? మానవునిలో
ఉన్నది గాలి అని కొందరు జీవి అని కొందరు అంటున్నారు. జీవికి గాలికి ఏమైన తేడా ఉన్నదా?
జవాబు:
మానవుడు చనిపోయిన తార్వత ఆ జీవి కర్మానుసారము వెంటనే మరొక శరీరమును ధరించడము జరుగుతుంది.
మానవునిలోని గాలిని ప్రాణము అంటారు. అది మన ముక్కురంధ్రములలో చలించునపుడు ప్రాణముందని, చలించనపుడు
ప్రాణములేదని అందురు. మన శరీరములోని పంచవాయువులనే పంచప్రాణము లని కూడ అందురు. గాలి వేరు,
జీవుడు వేరు. జీవునికి ప్రాణమునకు ఎంతో తేడా ఉన్నది. గాలి కూడ కాని ఆత్మతత్త్వము జీవుడు.
131. స్వామి! ఆడవారు భర్తను పోగొట్టుకొన్న తర్వాత నిత్యము ధరిస్తున్న గాజులు, కుంకుమ, పూవులు, భర్తతో
పాటు పోగొట్టుకుంటారు కారణము ఏమిటి?
జవాబు:
భర్త లేడను గుర్తుకు భర్తతో పాటు వచ్చిన తాళిబొట్టు, మెట్టెలు భర్త చనిపోయిన తర్వాత తీసివేయవచ్చును.
గాజులు మొదటి నుండి వచ్చినవి. కుంకుమ పూవులు కేవలము దేవుని నిమిత్తము పెట్టిన వస్తువులు వాటికి భర్తకు
సంబంధము లేదు. అయినా మానవుడు భర్త లేని స్త్రీని అందహీనము చేయవలయునను ఉద్దేశ్యముతో చేసిన ఆచారమే
కాని మరివేరు కాదు. బ్రాహ్మణులలో మరీ విపరీతముగ తల వెంట్రుకలు కూడ కోల్పోవలసి వస్తున్నది. అట్లే రంగు
రంగుల చీరలు కూడ వదలి కాషాయ గుడ్డకు దగ్గరగ ఉన్న ఎర్రగుడ్డనే ధరించవలసి వస్తున్నది. అంతే కాకుండ
విధవ ముఖము చూడరాదని అపశకునమని భర్తను కోల్పోయి మానసిక వ్యథకులోనైన స్త్రీని మరి నీచముగ చూడడము
కూడ జరుగుచున్నది. కొన్ని ప్రాంతములలో విధవను బంధువులు కూడ ఇంటిలోనికి రానివ్వరు.
సాటి మనిషిగ పుట్టి ఎన్నో సేవలందించిన స్త్రీని మానవుడు స్వార్థ బుద్ధితో అనుమానించి అందవిహీనము
చేయవలయునను ఉద్దేశ్యము తప్ప చిన్న తనము నుండి ఉన్న జుట్టు బొట్టులను మార్చడములో మరియే అర్థము లేదు.
ఇది అంతయు కపటమని తెలిసిన పెద్దలు చనిపోయే ముందు తమ భార్యలను ముండ మోయవద్దని చెప్పిన సంఘటనలు
కూడ కలవు.
132. భారతములో అర్జునుని కృష్ణుని నరనారాయణులందురు.
ఏమిటి?
జవాబు:
ఎందుకు? నరునికి నారాయణునికి తేడా
నారాయణుడంటే నాశనములేని వాడని, నరుడంటే నాశనము కలవాడని కొందరనుచుందురు. పరమాత్మయే
మానవునిగ వచ్చినపుడు మానవుని పరిధిలోనే ఉండి ధర్మములు నెలకొల్పును. సామాన్య మానవుడు పుట్టి ఎంత గొప్ప
యోగిగ మారిన విన్న ధర్మములను ప్రచారము చేయగలడు గాని నశించిన ధర్మములను తిరిగి తెలియబరచలేడు.
నరునికి నారాయణునికి అంతే తేడా.
పి. యన్. వెంకటనాయుడు, కూచివారిపల్లి.
అందరికి డబ్బు అవసరము. మరి డబ్బు లేనివారు ఎవరు?
133. డబ్బు ఎవరికి చేదు.
జవాబు:
తృప్తి లేనివాడు ఎప్పటికి లేనివాడే.
134. దేహమేరా దేవాలయము జీవుడేరా సనాతన దైవము అంటారు. మరి దేవుడెక్కడ?
జవాబు:
దేహము దేవాలయము కావచ్చు జీవుడు దేవుడు కాడు సుమా! ఆత్మ దేవుడుగ శరీర దేవాలయములో ఉంటే
ఆ దేవుని అదే గుడిలోని భక్తుడైన జీవాత్మ పూజించాలి. అందువలన దేహము దేవాలయము, జీవుడు పూజించువాడు,
ఆత్మ దేవుడు, ఇది సరియైన పద్ధతి. అట్లుకాక జీవుడే దేవుడైతే పూజారి లేని గుడి దేహమవుతుంది. కనుక జీవుడేరాదైవమను
మాట అసత్యము.
135. దేవుని నమ్మినవాడు చెడిపోడు అని అంటారు. మరి దేవుని నమ్మిచెడి పోయిన వారున్నారె?
జవాబు:
తనను నమ్మినవాడు ప్రపంచములో బాగుపడగలడని, నమ్మనివాడు చెడిపోగలడని దేవుడు ఎక్కడ చెప్పలేదు.
నమ్మిన వానికి మోక్షము, నమ్మని వానికి కర్మ జన్మలు కలుగుతాయన్నాడు. కాని లాభమొస్తుంది, నష్టము రాదు,
సుఖమొస్తుంది, కష్టమురాదని ఎప్పుడు చెప్పలేదు.
136. నేను దేవుని పూజించునపుడు మనస్సులో పిచ్చి ఆలోచనలు వస్తాయి అవి రాకుండ చేసుకోవాలంటే ఏమి
చేయాలి?
జవాబు:
మనస్సులో పిచ్చి ఆలోచనలన్నావు కదా! ఆ నీలోని మనస్సును గూర్చి సంపూర్ణముగ తెలుసుకో ఆ తర్వాత
అన్ని ఆలోచనలు రాకుండ పోవు విధానము సులభముగ తెలుస్తుంది.
ఎ. నల్లప్ప, కొర్రకోడు.
137. తిరుపతి దేవునికి ఆయన అడగకనే లక్షలు వేసి వస్తారు. సాటి మనిషి కష్టపడుచు అవసరము పది
రూపాయలిమ్మంటే ఇవ్వరు ఎందుకు స్వామి?
జవాబు:
కదిలే మనిషికంటే కదలని ఆ రాయి ఎక్కువ లాభము చేకూర్చుతుందని వారి నమ్మకము. అందువలన
కష్టపడే మనిషిని వదలి కష్టపడని ఆ ప్రతిమకు ఎక్కువ మనుషులే లాభము చేకూర్చుతుంటారు. సత్యము చెప్పాలంటే
మానవునికి ప్రతిది కర్మ ప్రకారమే లభ్యమగుచున్నది. అది తెలియని మనిషి మనము మ్రొక్కిన మ్రొక్కకున్నవచ్చు
దానిని ఆ దేవుడిచ్చాడని భ్రమపడి లేని దానికి ఆశపడి ఉన్న దానిని ఇచ్చి వస్తున్నాడు.
తెన్మఠం సత్యగోపాలాచార్యులు, నరసాపురము.
138. సుఖ దుఃఖ, ఆకలి దప్పులు, ధన కాంక్ష, కామ క్రోధ, జరామరణములు బాధించని మార్గము తెలియజేయండి.
జవాబు: జ్ఞానము తెలిసి ధర్మ మార్గమనుసరించినపుడు లభించు మోక్షగమ్యమొక్కటే మీరడిగిన స్థితిని కలుగజేయు
ఏకైక స్థానము.
139. అదృశ్యమైన దేహానికి పితృ దేవతా ప్రీతితో శ్రార్దాలు, పిండ ప్రదానములు హావ్యకావ్యాలు ఎందుకు
ఆచరించాలి?
జవాబు:
ఎవరో చెప్పారని అందరు చేస్తున్నారు. అవన్ని అనవసరమని మా భావము. చనిపోకమునుపే మంచిగ
చూచుకుంటే బాగుండును. బ్రతికున్నపుడు అన్నము పెట్టలేని వాడు కూడ చనిపోయిన తర్వాత పిండ ప్రధామని అన్ని
వంటలు వండి పెట్టిన కాకులు గ్రద్దలు తినవలసిందేగాని ఏమి ప్రయోజనముండదు.
140. జీవుడు ప్రేతముగ మారుటకు కారణమేమి? ప్రేత రూప విమోచనానికి విధులెవ్వి?
జవాబు:
ప్రారబ్ధములో శారీరక కర్మ అయిపోయి మానసిక కర్మమాత్రము మిగిలిన వారికి మరణము తర్వాత ప్రేత
మగుట గలదు. విమోచనానికి ఏ విధులు ఉపయోగపడవు. వాని కర్మ అయిపోయినపుడే విమోచనమై మరుజన్మకు
పోవును.
141. జీవుడు ఏ కోరికతో ప్రాణము వీడునో మరల ఆ కోరిక తీర్చుకొనుటకై అనువగు శరీరము ధరించగలడా?
జవాబు:
అంత్య సమయములో ఉన్న జ్ఞప్తిని బట్టి జన్మ కలగడము సహజము, ఆ జ్ఞప్తి బ్రతికిన జీవిత సారాంశమును
బట్టి ఉండును. అంత్యకాలములో ఏ జ్ఞప్తి ఉండునో ఆ విషయ సంబంధ జన్మ కలుగునని శాస్త్ర సిద్ధాంతము కూడ
గలదు. చివరి జ్ఞప్తి దైవము మీద ఉంటే శరీరము ధరించక దైవమును చేరును. భగవద్గీత అక్షర పరబ్రహ్మ
యోగములో ఆరవ శ్లోకమును చూచిన పూర్తి వివరము అర్థము కాగలదు.
142. తమకు చేసిన మంచిని మరచి పోయి కృతఘ్నులై, ఉపకారము చేసిన వారికే అపకారము తలపెట్టిన
గురుద్రోహులు యమదండనకు శిక్షార్హులా? లేక ప్రేత రూపులగుదురా?
జవాబు:
ప్రేత రూపము మానసిక కర్మ మీద ఆధారపడినది. అందువలన ప్రేత రూపము రాదు. మరుజన్మలలో భూమి
మీదనే యమదండనకు (కర్మ ప్రభావమునకు) గురి అవుదురు.
143. ప్రకృతి సంబంధ ప్రళయము ఎప్పుడు వస్తుంది?
జవాబు:
గీతలో చెప్పినట్లు కలియుగము 250 మార్లు జరిగినపుడు. 250వ మారు జరుగు కలియుగ అంత్యములో
ప్రళయము సంభవిస్తుంది. అనగ మొత్తము వెయ్యి యుగములు జరిగినపుడు.
సి. చిదంబర రెడ్డి, అనంతపురము.
144. ధ్యానము లేనిది యోగమును చేరలేమా?
జవాబు:
జ్ఞానమును ఆచరించడమే ధ్యానమంటాము. అది బ్రహ్మయోగములోనే ముఖ్యముగ చెప్పబడుచున్నది. కళ్ళు
లేకనే దృశ్యమును చూడలేనట్లు ధ్యానము లేకనే ఆత్మను తెలియలేము.
145. ఇంతకు ముందు ప్రశ్న జవాబులందు ఒక ప్రశ్నకు మీ జవాబు పరమాత్మ చదువైతే “మూడు పూర్తి
చేసి నాలుగులో ఉన్నాను ఐదుకు పోవాలని అన్నారు. మూడు నాలుగు ఐదు అంటే ఏమిటో అర్థము కాలేదు
తెల్ప ప్రార్థన.
జవాబు:
మూడు గుణ స్థానములను వదలి నాల్గవదైన ఆత్మ స్థానములో ఉన్నాను. ఐదవదైన మోక్షము పొందాలని
వ్రాశాము. పరమాత్మ చదువు గుణములు ఆత్మ పరమాత్మ మీద ఉండును. కనుక నేను చదివిన దానిని గూర్చి
చెప్పాను.
146. పుత్రులు లేని వారికి పున్నామ నరకమన్నారు నిజమేనా?
జవాబు:
శుద్ధ అబద్దము. ఎవని కర్మను బట్టి వానికి నరకముండును. కాని పుత్రులను బట్టిగాని మరి ఏ ఇతరులను
బట్టి కర్మ మార్పు ఉండదు.
147. బాల్యములో బాల బాలికలకు ఆధ్యాత్మిక చింతన అనవసరమని కొందరు పెద్దలు అంటారు నిజమేనా?
జవాబు:
కొంత కాలమే ఉపయోగపడు ప్రపంచ విద్య నేర్పుటకు బాల్యము రాకమునుపే శిశుదశలోనే మొదలు పెట్టించే
పెద్దలు శాశ్వితమైన గొప్పదైన బ్రహ్మ విద్యను బాల్యములో ఎందుకు నేర్పరాదన్నారంటే బ్రహ్మవిద్య యొక్క విలువ
వారికి తెలియదు కనుక వారు వయస్సుకు పెద్దలే కాని తెలివికి పెద్దలు కారు. బాల్యములో నుండి నేర్పితేనే
బ్రహ్మవిద్య బాగా పట్టుబడును. బ్రహ్మవిద్య కాషాయ గుడ్డలు వేపిస్తుందని కొందరు భయపడి ఆ విధముగ కూడ చెప్పి
ఉండవచ్చును. నిజమైన బ్రహ్మవిద్యలో కాషాయగుడ్డలు వేయవలసిన అవసరము లేదు. ఈ విషయములో ఇస్లామ్
మతమును, క్రైస్తవమతమును చూచి నేర్చుకోవలసి ఉన్నది. వారు చిన్న తనములోనే ఇస్లామ్ను గురించి క్రైస్తవమును
గురించి పిల్లలకు తెలియజేస్తున్నారు.
148. గ్రామ దేవతలు, క్షుద్ర దేవతలు ఎవరు? వారి ద్వారా మోక్షము పొందవచ్చునా?
జవాబు:
గ్రామ దేవతలు క్షుద్ర దేవతలు ఇరువురు ఒకటే వేర్వేరు కాదు. వారి ద్వార కర్మలు వస్తాయి కాని మోక్షము రాదు.
జి. మల్లేశ్వరి, మద్రాసు.
149. కాలక్రమేపి ధర్మాల స్థానములో అధర్మాలు తయారైతాయని మీరే అన్నారు అటువంటపుడు ఏమి
తెలియని మేము దేనిని ధర్మము అనుకోవాలి?
జవాబు:
నిరూపణకు వచ్చునది ధర్మము, రానిది అధర్మము. కావున శాస్త్రము ప్రకారము నిరూపణకు వచ్చునదే
ధర్మమని తెలియవలయును.
150. ధర్మము అంటే ఏమిటి?
జవాబు:
దేవుని గూర్చి తెలియజేయు శాసనము లేక సిద్ధాంతము.
151. కాలము విలువైనదా, జ్ఞానము విలువైనదా?
జవాబు:
కాలమును తెలుపునది జ్ఞానము. జ్ఞానము తెలిసిన తర్వాతే కాలమంటే ఏమిటో తెలియును. అందువలన
మొదట జ్ఞానము తర్వాత కాలము గొప్పది.
కాలమే నేనని పరమాత్మ గీతలో విశ్వరూపసందర్శన సమయమున
జవాబిచ్చాడు. దైవ స్వరూపమైన కాలము యొక్క నిజస్వరూపమును తెలియవలయునంటే మొదట జ్ఞానమవసరము.
152. తుమ్ములు, కట్టెలు అశుభముగ తమలపాకులు, టెంకాయలు శుభ సూచకముగ భావిస్తారు నిజమా?
జవాబు: తుమ్ములు, కట్టెలు అశుభము గాదు. తమలపాకులు, టెంకాయలు శుభముగాదు. గ్రహచారము బాగలేనపుడు
తుమ్ములు, కట్టెలు అశుభమనిపించును గ్రహచారము బాగున్నపుడు అన్ని శుభములే అవుతాయి.
153. కొన్ని పంచాంగములలో పలాన సమయములో ప్రయాణిస్తే బాగుండునని, ఇది మంచి కాలము, ఇది చెడ్డ
కాలమని వ్రాసి ఉంటారు. అది నిజమేనా?
జవాబు:
మంచిచెడులు జ్యోతిష్యశాస్త్రము ప్రకారము పంచాంగము ద్వార తెలుసుకొను ఫలితమని, నామ నక్షత్రమును
బట్టి చూచుకోవచ్చని వ్రాసినవి సత్యములు కావు. పంచాంగము తిథి వార నక్షత్రములను గణిత రూపముగ తెలుప
గలదు, కాని ఫలితములను తెలుప లేదు. అందులో ఉన్నవన్ని సత్య ఫలితములు కావు.
154. మేము మనస్సు ద్వార చేయు ప్రార్థనలు గురువుకు చేరుతాయని దాని ద్వార ఆశీర్వాదములు గురువు
నుండి లభిస్తాయని మా నమ్మకము మీరేమంటారు?
జవాబు:
ఒక విధముగ నమ్మకము చాలా గొప్పది. ఆ నమ్మకము ఎంతటి గొప్ప కార్యములనయిన చేయగలదు. నిజ
గురువు మీలోనే ఉన్నాడు కాని ఆయనకు దయలేదు ఆశీర్వాదము ఇవ్వడు. అట్లని ఊరకుండు వాడు కాడు. మీకు
ఆయన మీద ఎంత భక్తి శ్రద్దలు పెరుగుతాయో అంత జ్ఞానము ఆయన వద్ద నుండి లభించగలదు.
155. సూర్య గ్రహణ సమయములో కొన్ని కిరణాల వల్ల చెడు జరుగునని, వాటి దోష నివారణకు ధర్భలు
అన్నిటిలోను వేయాలని స్నానము చేయాలని ఇల్లంతా కడుగుకోవాలని చాలా నియమాలు చెప్తారు అవన్ని అవసరమా?
జవాబు: సూర్య గ్రహణ సమయములో సూక్ష్మ కిరణాలు ప్రసరించడము నిజమే కాని వాటి వలన అందరికి
ప్రమాదముండదు. జాతకరీత్యా సూర్యుడు వ్యతిరేఖియై ఆరవ స్థానమున ఉన్నపుడు గానీ ఆ స్థానమును చూచుట గాని
జరిగిన అటువంటి వారికి సూర్య గ్రహణ సమయములో ప్రసరించు కిరణముల ద్వార దోషముండ వచ్చును. మిగత
వారికి ఏ దోషములేదు. ఆ కిరణములు ఏవైన మానవునికి దేహము మీదనే పని చేయును. కావున అన్నిటిలో దర్భలు
వేయడమునకు అర్ధము లేదు. కొన్ని రోగములు కలవారు సూర్య గ్రహణ సమయములో బయట సూర్యరశ్మిలో
ఉండుట వలన వారి రోగములు నివారణ అయిన సంఘటనలు గలవు. కావున సూర్య గ్రహణము అందరికి కీడు
చేయదు.
156. చెట్టు చేమలకు ప్రాణమున్నదన్నారు. మన ఆహారము వాటి మీదనే ఆధారపడినది. చివరకు కూరలు
తినిన వాటిని బాధించిన వారవుతాము. ఆహార పచనమునకు ఉపయోగించు కట్టెలు కూడ చెట్టు కొట్టనిది రాదు.
అటువంటపుడు మనకు పాపము వస్తుందంటారా?
జవాబు:
హింస అన్న తర్వాత ఏదైన హింసే కదా! పాపమన్న తర్వాత ఏదయిన పాపమే కదా!! మనము చేసే ప్రతి
పనికి పాపమో పుణ్యమో ఉండి తీరును. కావున హింసకు పాపము తప్పకవచ్చును. అట్లని ఆహారము మానుకోలేము.
అహింసగ ఉండి బ్రతుక జాలము. ఇటువంటి సమయములో గీతలో దేవుడు చెప్పిన "యజ్జర్ధా త్కర్మణోన్య త్ర
లోకోయం కర్మ బద్దనః" అను విధానమాచరించిన ఏ కర్మ అంటక బ్రతుకగలము.
157. వీరబ్రహ్మము గారు ఏడవ మాసములోనే గర్భమందు శిశువుకు ప్రాణము వచ్చునన్నారు. మీరేమో గర్భము
నుండి శిశువు బయటపడిన తర్వాతే ప్రాణము వచ్చునన్నారు. ఏది నమ్మాలి?
జవాబు:
గ్రుడ్డిగ దేనిని నమ్మవద్దండి ఏది నిరూపణకొస్తే దానిని నమ్మండి. వీర బ్రహ్మము గారు భవిష్యత్ కాలమును
గూర్చి తాటి ఆకుల మీద వ్రాసాడు కాని గర్భస్థ శిశువును గురించి వ్రాయలేదు. ఆయన ఉన్నపుడు ఆయన బోధవిన్నవాడు
ఒక సిద్ధయ్య మాత్రమే. ఆ బోధ సిద్ధయ్య వరకే పరిమితమైనది. ఈనాడు బ్రహ్మముగారి పేరు పెట్టి వ్రాసినవారు
ఆనాటివారు కారు. వీరు ఆయన పేరు మీద వ్రాసిన వ్రాతలు ఆయన (బ్రహ్మము) గారివి కావు. బ్రహ్మము గారు
రహస్యముగ సిద్దయ్యకు తెల్పిన షట్చక్రవివరమును గూర్చి ఆనాడు దొంగగ విన్న కక్కయ్యకే అర్థము కాలేదు.
విషయమును ఈనాటి వారు ఎలా వ్రాయగలిగారు? ఆయన తాటి ఆకులను గ్రంధరూపము చేసిన కాల జ్ఞానము
తప్ప ఆయన పేరు మీద వెలువడుకొన్ని విషయములు చెట్టు పేరు చెప్పి కాయలను అమ్ముకోవడము లాంటిది.
బ్రహ్మముగారు గొప్ప యోగి. నేటికి సజీవముగ యోగమునందున్న వాడు. ఆయన ఎప్పటికి అసత్య వాక్యములు
చెప్పి ఉండరు. నిరూపణకు రాని విషయములు ఆయన పేరు మీద కల్పించినవని తెలియాలి. శిశు జన్మ గురించి
మేము ప్రకటించినది నూరుపాల్లు శాస్త్రబద్ధమైన సత్యము. దానికి గీత ఆధారమున్నది. నేడు ప్రత్యక్షముగ జరుగుచున్నది.
158. ప్రతి జీవి మరణించిన వెంటనే జన్మిస్థాడా లేక ఏవైన లోకములలో కొంత కాలముంటాడా?
జవాబు:
చనిపోయిన క్షణమే వేరు శరీరమును ధరించడము జరుగుచున్నది. వేరు లోకములకు పోయేది ఏ మాత్రము
లేదు, వేరే లోకములు అసలుకు లేవు. అకాల మృత్యువు పొందినవారు మాత్రము వారి ఆయుస్సు అయిపోయి కాల
మరణము వచ్చువరకు సూక్ష్మముగ ఉందురు. పూర్తి మరణము సంభవించిన తర్వాత క్రొత్త దేహము ధరింతురు.
159. అంగ సౌష్టవము ఉన్న వారికి తొందరగ జ్ఞానము పట్టుబడునని అందహీనముగ మెల్లకన్ను, పిల్లి కన్నులు,
తుట్టె పెదవులు ఉన్న వారికి పరమార్థ విషయములు ఆలస్యముగ పట్టుబడునని అంటారు నిజమేనా?
జవాబు:
అంగ సౌష్టవమునకు జ్ఞాన అవగాహనకు సంబంధము లేదు.
160. రామ క్రిష్ణ పరమ హంస, రమణ మహర్షి, వివేకానంద మొదలగు వారు గొప్ప యోగులని వారు
దేవునియందైక్యమైన వారని నమ్ముచున్నాము. మీరే మంటారు.
జవాబు:
గీతయందు దేవునియందైక్యమగు సమయము ఒక సూత్రము ప్రకారము నిర్ణయమై ఉన్నది. యోగులకు
మాత్రమే ఆ సూత్రము వర్తించును. యోగులు మరణించిన సమయమును బట్టి వారు మోక్షము పొందినది లేక జన్మకు
పోయినది తెలుసుకోవచ్చును. ముగ్గురు రాత్రిపూట చనిపోయారు, కావున పై ముగ్గురు మోక్షమునకు పోలేదు.
యం. ఖాజామైనుద్దీన్, గరుగుచింతలపల్లి.
161. మానవునికి ఆలోచన మాటలు రావడము వల్ల కుల మత వర్గ వైషమ్యాలకు దారి తీస్తున్నదని లేకున్న సర్వ
మానవజాతి ఒక్కటేమోననిపిస్తుంది మా అభిప్రాయము.
జవాబు:
మీ అభిప్రాయమే నా అభిప్రాయము గుణముల వలననే ప్రపంచములో మానవుడు అనేక వక్రమార్గములు
పట్టుచున్నాడు. అందులో మతము మరియు మత ద్వేషమనునది కూడ ఒక వక్ర మార్గమే. నూటికి నూరు పాల్లు
మనుషులంతా ఒక్కటే కాని మనలోని గుణములే వేరు వేరుగ ఉన్నవి.
162. స్త్రీలలో "Y Y" క్రోమోజోములు, పురుషులలో "X Y" క్రోమోజోముల ఉనికిని బట్టి వారియందు స్త్రీ పురుష
లక్షణములుంటాయి. స్త్రీ పురుష జననానికి పురుషుడే కారణ భూతుడైనపుడు ఇందులో స్త్రీ పాత్ర ఎంత?
జవాబు:
ఈ ప్రశ్న భౌతిక శాస్త్రమునకు సంబంధించినది. మానవ జాతి ఉత్పత్తికి పురుషుని పాత్ర కొంత వరకే
పాత్ర చాలా ఎక్కువ ఉన్నది. స్త్రీ పురుష శరీరములు స్త్రీ గర్భములోని క్రోమోజోముల మీద ఆధారపడి తయారగు
చున్నవి. కాని పురుషుని పాత్ర అందులో ఏమి లేదు. పురుష వీర్య కణములు స్త్రీ పురుష భేదము లేనివై అన్ని ఒకే
మాదిరి ఉండును. ఆ వీర్యకణములు స్త్రీ గర్భములో అండముతో చేరిన తర్వాత గర్భము నిలచి, స్త్రీ గర్భమందు గల
క్రోమోజోముల మీద ఆధారపడి స్త్రీ పురుష శిశు శరీరము తయారగును.
163. పురుషుని వీర్య కణము ద్వార ఉద్భవించిన స్త్రీ శరీరములో త్వరిత ఆలోచన, నిర్ణయము, చిత్తచాంచల్యము,
పట్టుదల, ఇతరుల మాటలపై తొందరగ నమ్మకము, శక్తిని మించిన పనులు చేయుట, వెనుక ముందు ఆలోచించక
పనిలో దిగుట, ఆలోచన నిర్ణయములో కఠిన వైఖరి మొదలగునవి ప్రత్యేకించి ఉండడములో మీ కూలంకశ అభి
ప్రాయము తెల్ప ప్రార్థన.
జవాబు:
స్త్రీలలో మనస్సు బుద్ధి చిత్తము అహము ఈ నాలుగు పురుషులకంటే చాలా కఠినమైనవి మరియు చాలా
సున్నితమైనవిగ ఉన్నవి. కావున ప్రత్యేకించి వారిలో పై మీరు చెప్పిన లక్షణములున్నవి. స్త్రీలయంతటి సున్నితము,
స్త్రీలయంతటి కఠినము ఏ పురుషులలో ఉండక పోవచ్చును.
164. ఆడ శిశువు గర్భ విచ్ఛిత్తి వల్ల అంతరించి పోతున్న స్త్రీ జాతిపై మీ ప్రబోధాత్మక సందేశము ఏమిటి?
జవాబు: కర్మ కారణము వలన గుణముల ప్రేరేపణచే జరుగు పని అని మా సందేశము. జాతిలేని మనుగడ
అసాధ్యమనిపించి ఆ పనిని మాన్పించడము కూడ కర్మ చేతిలో ఉన్నది.
165. స్త్రీ శక్తిస్వరూపిణి, ఆదిశక్తి అంటారు. దీని భావమేమి?
జవాబు:
అది ప్రకృతికి పెట్టిన పేరు వాస్తవముగ శరీర స్త్రీకి వర్తించదు. దేవుని తర్వాత దేవునంతటిది ప్రకృతి.
ప్రకృతిని స్త్రీతో పోల్చి గీతలో కూడ చెప్పాడు. దేవుని విషయము తెలియని వారు స్త్రీ శక్తిస్వరూపిణి ఆదిశక్తి అనడములో
తప్పు లేదు.
166. స్త్రీ చూపు భస్మీపటలము, పలుకు ప్రళయము, నడక చుక్కాని లేని పడవ ప్రయాణము, ఇది పురుషునిపై
ప్రభావము. దీనిపై తమ అమూల్య సందేశము ఏమిటి?
జవాబు:
స్త్రీల వ్యామోహములోపడిన పురుషులకు స్త్రీ చూపు, పలుకు, నడక మీరన్నట్లు ఏమైన కావచ్చును. కాని
వ్యామోహము లేని పురుషులకు స్త్రీల చూపులో చల్లదనము పలుకులో ప్రశాంతత, నడకలో ఆదరణ కనిపిస్తాయి.
అనసూయ, నంద్యాల.
167. తల్లి గర్భములో శిశువుకు గత జన్మ జ్ఞాపకాలు వస్తాయని కొన్ని పుస్తకములలో ఉన్నది. ఆ విషయము
వాస్తవమేనా?
జవాబు:
ముమ్మాటికి అసత్యము. తల్లి గర్భములోని శిశు శరీరములో జీవుడే లేడు. మీరు మా రచనలలోని "జనన
మరణ సిద్ధాంతము” అను పుస్తకము చదవండి.
మందుల నారాయణ, బిల్కల గూడూరు.
168. మరణించిన తర్వాత జీవుడు యమలోకానికి పోయి అక్కడ పాప ఫలితము అనుభవిస్తాడని, కాగుతున్న
నూనెలో వేస్తారని, రంపములతో కోస్తారని, అగ్నిలో కాలుస్తారని, శూలములతో పొడుస్తారని మొదలగునవి ఉన్నవి
కదా! ఇది నిజమేనా?
జవాబు:
మీది చాలా మంచి ప్రశ్న. ఈ విషయములో చాలా మంది మీరు చెప్పినవన్ని యమలోకములో ఉన్నాయని
పొరపడుచున్నారు. కాని వాస్తవముగ యమలోకమనునది ఎక్కడోలేదు. అక్కడ ఏమో అనుభవిస్తామనునది ఏమిలేదు.
జీవులు చేసుకొన్న పాపమును భూమి మీదనే తర్వాత జన్మలో అనుభవిస్తున్నారు. మీరు యమలోకములో ఉన్నాయని
ఏవయితే తెలిపారో అవి అన్నియు భూమి మీదనే చూడవచ్చును. డాక్టర్ల సూదులు ఇనుప ముక్కు కాకులు గాదా!
అగ్నిలో కాలేవారు లేరా! నూనెలో కాలినవారు లేరా! పార్టీలలో ఈటెలతో (శూలములతో) చెక్కించుకొను వారు లేరా!
అందువలన భూమి మీదనే యదార్థముగ యమలోకము, స్వర్గలోకము రెండు ఉన్నవి. మానవుడు ఎక్కడయితే పాప
ఫలితమైన కష్టమును అనుభవించుచున్నాడో అప్పుడది వానికి యమలోకము, ఎక్కడయితే సుఖపడుచున్నాడో అప్పుడది
వానికి స్వర్గలోకమని తెలియవలయును. కనపడని అసత్యమును వదలి కనపడు సత్యమును నమ్మలేకున్నారు. తమలాంటి
వారు ఇది నిజమని జ్ఞానము నిరూపణకు వచ్చేదని తెలిసినదానిని ఇతరులకు తెలుపండి.
169. ఆడవారు మగవారు అని మానవులలో రెండు జాతులున్నవి కదా! వారు మరణించిన తర్వాత ఆడవారు
మగవారుగ, మగవారు ఆడవారుగ పుట్టవచ్చునా?
జవాబు:
శరీరములో ఉన్న జీవులకు ఆడ మగ అని తేడా ఏ మాత్రము లేదు. శరీరములు మాత్రమే ఆడ మగ అని
వేరుగ ఉన్నవి. జీవుడు చేసుకొన్న కర్మ ప్రకారము మగవారు తర్వాత జన్మలో ఆడవారుగ, ఆడవారు మగవారుగ కూడ
పుట్టవచ్చును.
కె. శీతారామయ్య, ప్రొద్దుటూరు.
170. ఆరు సంవత్సరముల పిల్లవాడు అకాల మృత్యువు కాకుండ సహజ మరణము పొందినాడు. ఇంత చిన్న
వయస్సులో చనిపోవుటకు కారణము? ఈ జన్మలో పాపపుణ్యములు చేసే వయస్సు కాదు, కావున అతనికి
భవిష్యత్ జన్మ విషయము తెల్ప ప్రార్థన.
జవాబు:
సంచిత కర్మ నుండి కేటాయించబడిన కర్మను ప్రారబ్ధము అంటారు. అది పుట్టినప్పటి నుండి చనిపోవు వరకు
నిర్ణయించబడి నడిపించ గలదు. మీరు తెల్పిన బాలునికి ప్రారబ్ధములో మానవ జన్మ అంత వరకే నిర్ణయమై ఉండును.
అతని సంచితములో మానవ జన్మకు అవసరమగు కర్మ ఆరు సంవత్సరములంతే ఉండును. తర్వాత వేరు జన్మకు
సరితూగు కర్మ ఉండును. అందువలన మానవ జన్మ ప్రారబ్ధము అయిపోయిన వెంటనే చనిపోయి ఉండును.
చిన్న వయస్సులో పాప పుణ్యములు సంపాదించలేరు కావున ఈ ఆరు సంవత్సరముల వయస్సులో కర్మను
అనుభవించడమే జరిగినది కాని క్రొత్త అగామి కర్మను సంపాదించి ఉండడు. ఒక జన్మలో క్రొత్త కర్మ సంపాదించకున్నను
పాత కర్మ అనగ సంచిత కర్మ కొన్ని జన్మలకు సరిపోవునట్లు మిగులు ఉండును. కనుక ఆ బాలునికి వాని సంచితము
నుండియే ప్రారబ్ధము నిర్ణయించబడి రెండవ జన్మకు పోయి ఉండును. మీకు ఈ విషయము బాగ అర్థము కావలయునంటే
త్రి కర్మల విషయము బాగ తెలిసి ఉండవలెను. ఇక్కడ కొద్దిగ తెల్పుచున్నాము.
ప్రారబ్ధ కర్మ : పుట్టినప్పటి నుండి మరణించువరకు అనుభవింపబడునది.
అగామిక కర్మ : పుట్టినప్పటి నుండి మరణించు వరకు క్రొత్తగా సంపాదించుకొనునది.
సంచిత కర్మ : జన్మల పరంపరలో మిగులుబడినది (జమ ఖర్చు పోగ మిగిలినది)
ఒక జన్మలో సంపాదించుకొన్న అగామిక కర్మ వెంటనే సంచిత చివరి భాగములో చేరి సంచితముగ
మారుచుండును.
171. భారత భూమి పుణ్యభూమి అని సర్వ మోక్ష సాదకులకు భారత భూమి తగినదని, ధర్మమునకు, మోక్షసాధనకు,
జ్ఞానసముపార్జనకు ఆలవాలమైనదని పెద్దలు చెప్పుదురు. అటువంటి భారత భూమిలో మానవుడు తెలిసి ఊహించరాని
భరించరాని క్షమించరాని తప్పులు చేయుచున్నాడు దీనికి పరిహారము గలదా?
జవాబు:
ప్రపంచ దేశములలో ఏ దేశములోనైన చేసిన తప్పును బట్టి పాపము వచ్చి చేరుచుండును. ఘోరమైన తప్పు
చేసినపుడు ఘోరమైన పాపమే ఆగామిక కర్మగ వచ్చి సంచిత కర్మ వరుసలో చేరి తిరిగి ప్రారబ్ధమై ఎప్పుడో ఒక జన్మలో
వరుస క్రమమున అనుభవానికివచ్చును. అపుడు చేసుకొన్న జీవుడు చేసుకొన్నంత అనుభవించును. అపుడు బాధపడుచు
ఏ జన్మ కర్మో అనిన, నేనెంత పాపినో అనిన, కర్మమాత్రము అనుభవించు వరకు పోదు. చేసుకొన్న వాడు తిరిగి
అనుభవించినపుడే పరిహారమవుతుంది.
తల్లం సుబ్బ నరసింహ్ములు, ప్రొద్దుటూరు.
172. జ్ఞానాన్ని యోగంగా మార్చుకోవడము ఎలాగా?
జవాబు:
ఆత్మ సంబంధ విషయములు తెలుసుకోవడమే జ్ఞానము. తెలుసుకొన్న విషయములు అమలు పరచడమే
యోగసాధన.
173. యోగాలు అనేకము ఉన్నవి కదా?
జవాబు:
దేవుని తెలుసుకొనుటకు ఉన్నవి రెండే యోగములు, జ్యోతిష్యములోనికి పోతే యోగాలు చాలా ఉంటాయి.
అవి ప్రపంచసంబంధమైనవి. ఇక్కడ మనకు కావలసినవి దైవ సంబంధమైనవి. 1. కర్మయోగము (రాజ యోగము),
2. జ్ఞాన యోగము (బ్రహ్మయోగము).
174. జ్ఞానాగ్నిని నిరూపించిన బ్రహ్మము గారు, ఏసు ప్రభువు మొదలగు యోగులు పూర్వముండిరని తెల్పినారు.
అటువంటి వారు మోక్షాసక్తి గలవారికి జ్ఞానాన్ని యోగంగా మార్చి బోధించి నిరూపనాత్మకంగా కర్మ నాశనము
చేయగల శక్తిని నిరూపించగల వారు మాకు కావాలి. ఎక్కడయిన ఉన్నారా దయచేసి తెలుప ప్రార్థన.
జవాబు: ఎక్కడున్నారో మాకు తెలియదు. మీకు యోగశక్తిని సంపాదించు కోవాలను ఆసక్తి ఉంటే, నిరూపనాత్మకముగ
తెలుసుకోవాలంటే మేము అనుసరించు మార్గమునే మీరు అనుసరించండి. మీకు ఆ శక్తి నిరూపణకు రాగలదు.
మేము అహముతో ఈ మాట చెప్పడము లేదు. ఉన్న సత్యమును తెల్పుచున్నాము. జ్ఞానాగ్ని నిరూపణార్థము మా వద్ద
చాలా మంది కర్మలు కాలి పోయిన సంఘటనలు కూడ జరిగాయి.
యం. మారుతినాయుడు, కూచివారిపల్లి.
175. జీవుల ప్రళయ సంభవములకు నా ప్రకృతియే కారణమన్నాడు దేవుడు ఈ విషయము జ్ఞానులకేనా? లేక
అజ్ఞానులకు జ్ఞానులకు వర్తిస్తుందా?
జవాబు:
మోక్షము పొందని వారికందరికి వర్తించు సూత్రమిది. అజ్ఞానులకు జ్ఞానులకు అందరికి ప్రళయము తప్పదు,
కాని మోక్షము పొందిన వారికి ప్రళయము లేదు, ప్రభవము లేదు.
176. బ్రహ్మరాత్రి ప్రారంభములో జీవులన్నియు ప్రళయము ఎందుకు చెందును?
జవాబు:
అది సృష్టి విధానము. మనకు రాత్రి అయిన వెంటనే నిద్ర వచ్చును కదా! దానిని ఆపలేము కదా! రాత్రి
అయిన వెంటనే నిద్ర ఎందుకు వచ్చునో అట్లే బ్రహ్మరాత్రి వచ్చినపుడు ప్రళయము నిర్ణయించబడినది.
177. వెయ్యి యుగములు ఎన్ని సంవత్సరములు?
జవాబు:
108 కోట్ల సంవత్సరములు. ఈ సంఖ్యను బట్టియే మంత్రారాధనలో 108 సంఖ్యకు ఎక్కువ విలువ ఉన్నది.
ఈ సంఖ్య మరువకుండునట్లు జపమాలలో 108 పూసల మాల అన్ని మతములలో ఉండడము గమనించవచ్చును.
178. బ్రహ్మరాత్రి వచ్చినపుడు సూర్య చంద్రులు ఉండరా?
జవాబు:
విశ్వమే లేకుండా పోయినపుడు సూర్య చంద్రులు ఎలా ఉంటారు. సూర్య చంద్రులు కాని, నక్షత్రములు కాని,
ఆకాశము కాని ఏమి ఉండవు. దైవముచే సృష్టి యొక్క క్రమమే అలా నిర్ణయించబడినది.
బి. రవీంద్ర రెడ్డి, చెన్నేకొత్తపల్లి.
179.యుగ యుగములో పరమాత్మ భగవంతునిగా అవతరిస్తారని అంటారు నిజమేనా?
జవాబు: అధర్మములు చెలరేగినపుడు పరమాత్మ భగవంతునిగా పుట్టడము వాస్తవమే. కాని ప్రతి యుగములోను పుట్టవచ్చును
పుట్టకపోవచ్చును. ఒక యుగములో రెండు మార్లయిన పుట్టవచ్చు లేక రెండు యుగములకొక మారయిన పుట్టవచ్చు.
ముఖ్యముగ అధర్మములు చెలరేగినపుడు పుట్టుట వాస్తవము.
ఇ. అంజిన రెడ్డి, చంద్రగిరి.
180. ప్రబోధాత్మజమ్ పత్రికలో కూచివారి పల్లె పురుషోత్తమ నాయుడు గారి ప్రశ్నకు జవాబుగ దేవుడు కనిపించడు.
చూపుకు కనిపించు వాడు దేవుడుకాదని అన్నారు. ఒకప్పుడు వివేకానందుడు రామక్రిష్ణ పరమహంసను సమీపించి
తాము దేవుని చూచారా అని ప్రశ్నించినపుడు జవాబుగ అవును చూచాను. నేను నిన్ను ఎట్లు చూచుచున్నానో
అట్లే దేవుని చూడవచ్చును. అని సమాధానము రామక్రిష్ణ ఇచ్చాడు. మీ జవాబుకు రామక్రిష్ణ పరమహంస
జవాబుకు చాలా తేడా ఉన్నది. వివరింపగోరుచున్నాము.
జవాబు:
అవును ఆయన జవాబుకు మా జవాబుకు చాలా తేడా ఉన్నది. ఆయన పరమహంస, నేను యోగిని అందువలన
చాలా తేడా వచ్చింది. మా జవాబు తరపున మేమిచ్చు వివరము ఏమనగా! దేవుడు ఇంద్రియ అగోచరుడని గీతలో
దేవుడు కూడ చెప్పాడు. అందువలన ఇంద్రియములకు తెలియునది దేవుడుకాదను సూత్రము ప్రకారము
కనుపించునదంతయు దేవుడు కాదని చెప్పవచ్చును. అట్లయినపుడు దేవుడే భగవంతునిగా పుట్టినపుడు ఆ భగవంతుడు
కంటికి కనిపిస్తున్నాడు కదా! అపుడు దేవుని చూచినట్లవును కదా అని కొందరికి అనుమానము రావచ్చును. దానికి
సమాధానమేమనగా! దేవుడు భగవంతునిగా వచ్చిన పైన కనిపించు శరీరము ప్రకృతిదే కావున దేవుని చూడలేము.
భగవంతుడే ఎదురుగ వచ్చినప్పటికి ఆ శరీరము కనిపించును కాని అందులోని దేవుడు కనిపించడు కదా! కనిపించు
నదంతయు ప్రకృతియే, కాని లోపలి దేవుడు కనిపించడు. కావున మేము కనిపించువాడు దేవుడు కాదు అన్నాము.
దేవుడు కనిపించడు అనే దానికి శాస్త్ర ఆధారమున్నది. దేవుడు కనిపించును అనే దానికి శాస్త్ర ఆధారము లేదు.
ఆధారమున్న మాట నిజమో, ఆధారము లేని మాట నిజమో మీరే యోచించండి. దేవుడు ఇంద్రియాగోచరుడు అనగ
ఇంద్రియములైన కన్నుకు కనిపించడు అన్నది దేవుడే చెప్పిన వాక్యము. కావున ఏది నిజమో ఆలోచించండి.
పి. రంగయ్య, యు.డి.సి., మడకశిర.
181. జీవన్ముక్తి అంటే ఏమిటి? ప్రస్తుతము ప్రపంచములో జీవన్ముక్తులు ఉండు అవకాశమున్నదా?
ముక్తి అనగ విడుదల అని అర్ధము. జీవన్ముక్తి అనగ జీవుడు శరీరమను జైలు నుండి కర్మ అను శిక్ష లేకుండ
అయిపోయినపుడు బయట పడడమని అర్థము. కర్మ ఉన్నంత వరకు శరీరముండును. కర్మ అయిపోయినపుడు
జవాబు:
శరీరము లేకుండ పోయి ఆ శరీరములో ఉన్న జీవుడు అణువణువున ఉన్న పరమాత్మలో వ్యాపించి పోవును. దానినే
జీవన్ముక్తి అని అందురు. జీవుడు ముక్తి పొందడమే జీవన్ముక్తి అను మాటకర్థము. ముక్తి పొందిన జీవుడు అనూహ్యమైన
పరమాత్మలో ఐక్యమై ఉండి కంటికి తెలియడు. కావున వారు ప్రపంచములో దృశ్యరూపమై ఉండరు. అందువలన
ప్రపంచములో జీవన్ముక్తులను వారు ఉండు అవకాశము లేదు.
182. "ఓం త్రయం బకం యజామహే సుగందమ్ పుష్టి వర్ధనమ్
వుర్వారు కమిప బందనాత్ మృత్యోర్మత్యీయ మామృతాత్"
దీనిని మృత్యుంజయ మంత్రమని అన్నారు. దీనర్థము తెలియజేయాలని కోరుచున్నాము.
జవాబు:
అర్థమా! నేను సంస్కృత పండితుడను కాను. నేను కేవలము బ్రహ్మ విద్యా పండితుడను. అందువలన
అర్థము చెప్పలేము. మీరు అడిగారు కావున కష్టపడి కొద్దిగ అర్థము చెప్పగలము. దాని సత్యము పూర్తి చెప్పగలము.
శరీరము దృఢముగ బలముగ తయారయి మృత్యువు మృతించి అమృతము గలిగి నేను సజీవముగ ఉండవలెనను
భావము పై మంత్రములో ఇమిడి ఉన్నది.
ఇక సత్యము చెప్పాలంటే ఈ మంత్రము 108 సార్లు జపించవలెనను నియమ సంఖ్య కూడ ఉన్నది. ఈ
మంత్రము జపించువారు ఎందరో ఉన్నారు. అయిన ఈ మంత్రములో మృత్యువును జయించబడు శక్తి లేదు.
మృత్యుంజయము అనునది ప్రపంచములో లేనేలేదు. పుట్టిన ప్రతి జీవి మరణించవలెనను యోగ శాసనమును ఈ
మంత్రము వ్యతిరేకిస్తున్నది. ఈ మంత్ర ఫలితము ఏ మాత్రము నిరూపింపబడదను నిరూపణ కూడ ఒకటి
తెలియజేస్తున్నాము. అనంతపురము వాస్తవ్యుడు టి.కె. కోదండరామ నాయుడు గారి పెద్ద కుమార్తె టి.కె. సరస్వతి
యం.యస్.సి., 1956 లో హృషీకేశ్ శివానంద స్వామిగారి వద్ద ఉపదేశముగ పై మంత్రాన్ని స్వీకరించి నియమము
తప్పక ఉదయము సాయంత్రము జపిస్తు ఉండేది. 1957 ఆగస్టు 3వ తేదీన పై మంత్రమును ఎదిరించిన మృత్యువు
ఆమెను కబళించి వేసింది. ఈ అనుభవము పై మంత్రము యొక్క సారాంశమును తెలియబరుస్తున్నది కావున మీరే
యోచించండి.
దండా జయరామ్, ఉరవకొండ.
183. మరణించిన జీవాత్మలు బ్రతికి ఉన్న శరీరములోనికి ఆవహించుట మీరు విశ్వసిస్తారా?
జవాబు:
విశ్వసించము. మరణించిన జీవాత్మలు ఆ క్షణమే మరుజన్మకు పోవును కాని బ్రతికి ఉన్న వారి లోనికి చేరవు.
మరణించకుండ స్థూలశరీరమును కోల్పోయి సూక్ష్మశరీరము కల్గి ఉన్నవారు మాత్రము బ్రతికి ఉన్న శరీరములోనికి
ప్రవేశించు అవకాశము గలదు. మరణించినప్పటికి మరుజన్మకు పోనివారు చావని వారితో సమానమే. వారు
కాలమరణముకాక అకాలమరణము పొంది ఉందురు. అట్టివారు ఇతరుల శరీరములలోనికి ప్రవేశించుటకు వీలున్నది.
ఈ విషయము పూర్తి అర్థము కావలయునంటే మా రచనలలోని “ప్రబోధ” గ్రంధములో “గ్రహాలు - విగ్రహాలు”
అను అధ్యాయము చదువవలెను.
యం. రామారావు, కలుగొట్ల.
184.
1. నీవు ఎవరు?
జవాబు:
నేను జీవాత్మను
2.
ఎచటి నుండి వచ్చితివి?
జవాబు:
పరమాత్మ నుండి
3.
ఎచటికి పోవుదువు?
జవాబు:
పరమాత్మ లోనికే
4.
రాకపోకల అంతర్యమేమిటి?
జవాబు:
కర్మననుభవించుటయే.
చాగము నారాయణ రెడ్డి, టి. తిమ్మాపురము.
185. భాగవతము 18 పురాణములలోనిదని మీరు చెప్పారు. అది ఉప పురాణములోనిదని అనుకొన్నాము మా
సందేహము తీర్చ ప్రార్థన.
జవాబు:
భాగవతము ఉప పురాణము కాదు. దీని పూర్తి పేరు భాగవత పురాణము. ఇందులో 18 వేల శ్లోకములుండును.
ఉప పురాణములు 1. సనత్కుమారము, 2. నారసింహము, 3, స్కందము, 4, శివ దర్శనము, 5, దౌర్వాసము,
6. నారదీయము, 7. కపిలము, 8. వామనము, 9. ఔశనము, 10. బ్రహ్మాండము, 11. వారుణము, 12. కౌశికము,
13. లైంగము, 14. సాంబము, 15. సౌరవము 16. పరాశరము, 17. మారీచము, 18. భార్గవము. ఇవి మాత్రము
ఉప పురాణములు.
186. భాగవతము కల్పితములైనపుడు భగవద్గీత ఎలా వాస్తవమగును? భారతములు భాగవతములను రచించినది
వ్యాసుడే కావున భాగవతము కల్పన అయితే భారతము కూడ కల్పనే అగును. భాగవతాన్ని విమర్శించిన మీరు
భారత యుద్ధసందర్భములో కృష్ణుడు అర్జునునికి చెప్పిన కొన్ని శ్లోకముల (భగవద్గీత)ను శాస్త్రమని ఎలా చెప్పుచున్నారు?
జవాబు: చూడండి మన ఇంటిలో గాటికి కట్టేసేవన్ని పశువులే. కట్టేసేవాడు ఒకడే అయినంత మాత్రాన అన్ని ఒకటే
కావు. వాటిలో కొన్ని ఎనుములు, కొన్ని ఆవులు ఉంటాయి కదా! అట్లే వ్యాసుడొక్కడే చెప్పినంత మాత్రాన వ్రాసినవన్ని
గ్రంథములే అయినంత మాత్రమున అన్ని ఒకటే కాదు. వాటిలో కొన్ని సత్యములు కొన్ని అసత్యములు ఉంటాయి.
మన ఇంటిలోనివి పశువులే అయిన వాటికి ఎనుములు ఆవులు అను ప్రత్యేకమైన పేర్లు మనమే పెట్టినట్లు ఆనాడు
వ్రాసిన వ్రాతలకు ఆ పెద్దలే 1. పురాణములు, 2. ఇతిహాసములు అను పేరు పెట్టారు. మీరు అనుకొన్న భాగవతము
భారతము వ్యాసుడొక్కడే వ్రాసినప్పటికి భాగవతాన్ని పురాణమని, భారతమును ఇతిహాసమని అనుట అందరికి తెలిసిన
విషయమే. భాగవత భారతములను ఒక్కటిగ ఎప్పటికి పోల్చుకోకూడదు. జరిగిన చరిత్రను తెలుపునది ఇతిహాసము,
కావున ఇతిహాసమను పేరుగాంచిన భారతము అబద్దము కాదు. అందులోని గీత అసత్యము కాదు. గీత అన్ని
విషయములను నిరూపిస్తున్నది. అన్ని విషయములు శాసనములుగ ఉన్నవి. కావున గీతను యోగశాస్త్రముగ వ్యాసుడే
ప్రతి అధ్యాయము చివర తెలియజేశాడు. వ్యాస విరచితమైన గీత ప్రతి అధ్యాయములో "యోగ శాస్త్రే" అను మాటను
మీరు చూడగలరు ఒకడే వ్రాశాడు కావున భాగవతము కల్పన అయితే భారతము కూడ కల్పననుట, ఒకడే కట్టి
వేశాడు కావున ఒకటి ఎనుమయితే అన్ని ఎనుములే అయి ఉంటాయన్నట్లు ఉంటుంది.
187.
మూడు త్రోవల లోపల ముఖ్యమైన
నడిమి త్రోవను జనిలోన నాగకన్య
నూరడించిన వాడెపో యుచిత యోగి
నవ్య తర బోగి శ్రీసదానంద యోగి.
దీని భావమేమి?
జవాబు: మన శరీరమునందు అన్ని నాడులపైకి ముఖ్యమైన నాడులు మూడు ఉన్నవి. అవియే సూర్య చంద్ర బ్రహ్మనాడులని
అందురు. వాటిలో ముఖ్యమైనది బ్రహ్మనాడి. దీనియందే తల నుండి ఆత్మశక్తి శరీరమంత ప్రాకి చైతన్యము
కలుగజేయుచున్నది. ఈ నాడి నుండియే ఊపిరితిత్తులు కదలింపబడి శ్వాస ఆడుచున్నది. శ్వాసకు కారణమైన శక్తి
బ్రహ్మనాడియందే ఉన్నది. కావున శ్వాస నాడించు శక్తిని నాగకన్యగ పోల్చి ఎవడయితే సూర్య చంద్ర నాడులకు మధ్య
ఉన్న బ్రహ్మనాడియందు మనస్సు లగ్నము చేయునో, వాడు అక్కడి శక్తిని (ఆత్మను) పొంది
యోగిగ ఉన్నాడను
అర్థమును సూచించుచు పై పద్యమును తెల్పారు. మూడు త్రోవలు అనగ మూడు నాడులు, ముఖ్యమైన నడిమి త్రోవ
అనగ బ్రహ్మనాడి, లోన నాగకన్య అనగ ఆ నాడియందు గల, ఆత్మ నూరడించువాడు ఆత్మను పొందినవాడు అని
అర్థము. బ్రహ్మనాడి చైతన్యము చేత ఆడు శ్వాస పాము బుసకొట్టినట్లుండును కనుక ఆత్మశక్తిని నాగకన్య అన్నారు.
చింతా నారాయణ, నరసాపురము.
188. వేయి యుగములు 108 కోట్ల సంవత్సరములని దాని సంఖ్య జపమాలకు కూడ ఉన్నదని తెల్పారు, 108
కోట్ల సంవత్సరములు ఎలాగో తెల్ప ప్రార్థన.
జవాబు:
ప్రపంచ ఆయుస్సు వేయి యుగములని గీతయందు తెల్పబడినది. యుగములకు నాల్గు పేర్లు పెట్టబడినవి. 1.
కృత యుగము, 2. త్రేతా యుగము, 3. ద్వాపర యుగము, 4. కలియుగము అని వాటి పేర్లు. సంవత్సరమునకు
365 దినములైన దినములకు ఏడు పేర్లు పెట్టినట్లు యుగములు వేయి అయిన నాలుగు పేర్లతో గడువ వలసిందే.
ఆదివారము అవుతునే సోమవారము మొదలయినట్లు కలియుగమై పోతానే కృతయుగము అమలుకొచ్చును. 250
మార్లు 4 యుగములు జరిగినపుడే 1000 యుగములు అయిపోయి ప్రపంచ అంత్యము ఏర్పడును. దానినే
ప్రళయమంటారు. వేయి యుగములు 108 కోట్ల సంవత్సరములని లెక్క తేలుచున్నది.
కలియుగము 4,32,000 సంవత్సరములు
ద్వాపరయుగము 8,64,000 సంవత్సరములు
త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు
కృత యుగము 17,28,000 సంవత్సరములు
నాలుగు యుగముల మొత్తము 43,20,000 సంవత్సరములు
250 మార్లు 4 యుగములు జరిగితే 43,20,000 × 250
మొత్తము సంవత్సరములు 108,00,00,000
ఈ విధముగ ప్రపంచ ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములని గీత మూలముగ తెలియుచున్నది. ఆ సంఖ్యను
మరచి పోకుండునట్లు, ప్రపంచము ఉన్నంత వరకు ఆ సంఖ్య అందరి మధ్యలో ఉండునట్లు 108 పూసల
జపమాలను మన పెద్దలుంచారు. ఎవరికైన దానము ఇచ్చిన, పెళ్లిలో డబ్బు చదివించిన, విరాళాలు ఇచ్చిన 108
రూపాయలనే ఇచ్చుట ఇందువుల సాంప్రదాయమని తెలియాలి.
జవాబు:
రాధేయ, పందిళ్ళపల్లి.
189. తపస్సుకు, యోగానికి తేడా ఏమిటి? యోగములో సాధించ గలిగేదేమిటి? తపస్సులో సాధించగలిగేదేమిటి?
తపనతో కూడుకొన్నది తపస్సు. ఏమి లేనిది యోగము. తపస్సు వలన తపశ్శక్తి లభించును. యోగము
వలన యోగ శక్తి (జ్ఞానాగ్ని) లభించును. తపస్సు వలన లభించు శక్తితో ప్రపంచములో అసాధారణమైన, అసంభవమైన
పనులు కూడ చేయవచ్చును, ప్రపంచ ఖ్యాతి కాంచవచ్చును. యోగము వలన బయటి మహత్యములను చేయలేరు,
కేవలము అంతరంగమున ఉన్న కర్మను మాత్రము యోగశక్తి కాల్చి వేయును. తపస్సు ప్రపంచ భూతములతో తయారైన
జ్ఞానేంద్రియముల సంబంధముతో ఉండి జేయునది. ఉదాహరణకు మంత్రమునో లేక నామమునో జపించడము.
అది శబ్దముతో వినికిడిగ నీకు తెలిసినది కావున చెవుకు సంబంధించినది. యోగము మొత్తము జ్ఞానేంద్రియముల
సంబంధమునే వీడి ఉండును. ఏ ఇంద్రియ సంబంధముండిన అది యోగము కానేరదు. తపస్సు వలన జన్మలే
కలుగును. యోగము వలన జన్మరహిత మోక్షము లభించును. అన్ని విధముల తపస్సుకంటే యోగము గొప్పది.
అందువలన గీతయందు ఆత్మ సంయమ యోగములో చివర 42వ శ్లోకములో
తపస్వి భ్యోధికో యోగి జ్ఞాని భ్యోపి మతో ధికః
కర్మ భ్య శాధికో యోగి తస్మా ధ్యోగీ భవార్జున!
“యోగి తపస్వికులకంటే ఉత్తముడు, జ్ఞానవంతులకంటే ఘనుడు, పనులతో కూడుకొన్న నానా ఆరాధనల చేయు
వారికంటే అధికుడు, అందువలన నీవు యోగివే కమ్ము" అన్నాడు. దీనిని బట్టి యోగమునకు తపస్సుకు ఎంతో తేడా
ఉన్నదని చెప్పకనే తెలియుచున్నది మరియు గీతయందు విశ్వరూప సందర్శన యోగములో 48, 53 శ్లోకములలో
తపస్సు వలన దైవమును తెలియుటకు శక్యము కాదని పునరుద్ఘాటించడము కూడ జరిగినది.
నేడు యోగులంటే ఎవరో, తపస్వికులంటే ఎవరో వారి వ్యత్యాస మేమో తెలియక పోయింది. తపశ్శక్తి వలన
మహిమలు చూపె తపస్వికులే ఎక్కువ గౌరవించబడుచున్నారు. తపస్సు చేసి తపస్వి అయిన వారు తపస్వి అని పేరు
పెట్టుకోక యోగి అని పేరు పెట్టుకోవడము జరుగుచున్నది. మేము ధర్మము ప్రకారము నడువాలనుకొన్నాము కావున
యోగులను తప్ప తపస్వికులను గౌరవించమని ఖచ్చితముగ చెప్పాము.
గోనుగుంట్ల వెంకటనారాయణ, తాడిపత్రి.
190. శిశువు ప్రాణమెప్పుడు పొందుచున్నాడని తెలుసుకొను అవసరము ఏమిటి?
జవాబు: జీవికి శరీరమెట్లు సంభవించినది తెలియకపోతే భగవంతునికి దేవునికి తేడా తెలియదు. ఈ విషయము
తెలియకనే చాలా మంది స్వాములు సహితము పరమాత్మ అని చెప్పవలసిన చోట భగవంతుడని, భగవంతుడని
చెప్పవలసిన చోట పరమాత్మ అని చెప్పుచున్నారు. శరీరములోనికి జీవుడెప్పుడొస్తున్నాడో తెలియక పోతే ఆధ్యాత్మికము
ఎట్లు తెలిసినట్లగును. నీ శరీరములో నీవు ఎప్పుడు ప్రవేశించినది తెలియుట ఆధ్యాత్మికములో ఒక భాగమే.
191. పరమాత్మకు దశావతారములు నిజమేనా?
జవాబు:
విష్ణువుకు దశావతారములు ఉన్నాయంటున్నారు కాని పరమాత్మకు లేవు. దశావతారములను మాట
పురాణాంతర్గతమైనది గాని శాస్త్రబద్దమైనది కాదు. ఆధ్యాత్మికులకు దశావతారములతో పనే లేదు. భక్తి కోసము
పురాణములు, జ్ఞానము కోసము శాస్త్రములున్నాయని తెలియుము.
192. నేటి కాలములో మీరు ధైర్యముగ ఉన్నది ఉన్నట్లు చెప్పగల్గుచున్నారు. మీవలె ఇంకా ఎవరైన చెప్పగల్గుచున్నారా?
జవాబు:
ఈనాడు దినపత్రికలో ప్రతి సోమవారము రెండు వారముల నుండి “పరదేశి పాఠాలు" అను శీర్షికలో గురు
శిష్య సంవాదమను పేరుతో “కొండ వీటి వెంకట కవి” గారిచే వ్రాయబడుచున్న వ్యాసములు ఉన్నాయి. నవంబరు 7,
14 తేదీలలో వచ్చిన పేపర్లు చూచాము. అటువంటి రచనలు బయటికి వస్తే మానవుడు సత్యము తెలుసుకొంటాడు.
వెంకట కవి గారు గురు శిష్య సంవాద రూపమున చరిత్రలోని విషయములను వివరిస్తు ఆనాటి అసత్యములను
అద్దంపట్టి చూపించారు. రెండవ వారములో వచ్చిన "గురు శిష్య సంవాదము -2” లో చివరన వ్రాసినది క్రింద
చూడొచ్చు.
పురుష సూక్తమునకు బొట్టు కాటుక పెట్టి
వేద జనుడుకేక వేసి నాడు
కల్పితము నెల్ల కాదనగా లేక
దీన జనుడు సమ్మతించినాడు
అట్లే ఆయన వ్యాసము మొదట వ్రాసినది క్రింద చూడండి.
1.నమ్మి నమ్మలేని ఉమ్మడి దమ్మిడి
కూత వ్రాత పొట్ట కూటి కొరకు
సాగినంత వరకు జాతి నిర్వీర్యమై
నీరసించు ప్రగతి నిర్గమించు
2.పాత తరములోని పండుటాకులు
పోక యున్న చిగురు పుట్టబోదు
రాతి యుగములోని పాత చట్టాలెల్ల
పోక యున్న మేలు పుట్టబోదు
ఉన్న వాస్తవమును చెప్పిన వెంకటకవి గారు ధన్యులు. వీలైతే మీరు కూడ ఆయన వ్యాసాలు ఈనాడు పేపర్లో
చదవండి.
గూనిపూటి గౌరిదేవి, రాజంపేట.
193. ఒక జీవి సాధారణముగ మరణిస్తే మరణము అంటారు. విషము త్రాగి చనిపోతే ఆత్మ హత్య అంటారు.
గీతశాస్త్రము ప్రకారము ఆత్మ చావదు, శస్త్రములు చేధించదు, అగ్ని కాల్చదు, నీరు తడుపదు అంటారు కదా!
అలాంటపుడు ఆత్మహత్య అనడము ఎంతమాత్రము నిజము? తెల్ప ప్రార్థన.
జవాబు:
గీతలో ఆత్మ నాశనము కాదు కత్తిచే తెగదు అన్నారు. ఇక్కడ మూడు ఆత్మలున్నవి. అందులో ఏ ఆత్మ
గురించి చెప్పారో మీకు తెలియదు. కావున ఈ ప్రశ్న వేశారు. ఆత్మహత్య కావింపబడుట వాస్తవమే. కావున ఆత్మ
హత్య అని పెద్దలన్నారు. తెగనిది, నాననిది, కాలనిది జీవాత్మ. కత్తికి తెగేది అగ్నికి కాలేది ఆత్మ. ఈ మాట
ఆశ్చర్యముగ ఉంది కదా! ఇంకొక ఆశ్చర్యమేమిటంటే ఒకరి చేత చంపబడడము మీరు హత్య అంటారు అలాగే తనకు
తాను చనిపోవడము ఆత్మహత్య అంటారు. మేమలా అనము ఒకరి చేత చంపబడడము ఆత్మహత్యయని, తనకు తాను
చనిపోవడము హత్య అంటాము. ఈ విషయమంతా అర్థము కావాలంటే మా రచనలలోని "త్రైత సిద్ధాంత భగవద్గీత”
చదవండి.
194. ఆధ్యాత్మికంగా మొట్టమొదట ప్రవేశించు జీవి యోగసాధన ద్వార ముక్తి పొందుటకు అర్హులా?
జవాబు:
మొదట ప్రవేశించిన వారు అన్ని విధముల జ్ఞానము తెలిసిన తదుపరి సాధన చేస్తే తప్పక అర్హులగుదురు.
జ్ఞానము తెలియకుండ యోగము సాదిస్తామంటే అడ్రసు లేకుండ ఊరికి పోతానన్నట్లు ఉంటుంది. ఇప్పటి కాలములో
జ్ఞానమంటే ఏమిటో తెలియని వారు మేము సాధన చేస్తున్నామనడము చాలా విచిత్రముగ ఉంటుంది.
195. జీవుడు మనస్సు నిలుపుటకు సులభమైన మార్గము తెలుపుదురని కోరుచున్నాము.
జవాబు:
ఇందులో సులభము కష్టము అనునవి లేవు. ఉన్నది ఒకే ఒక పద్ధతి. అది మనస్సు చేయు విషయ
జ్ఞాపకములను వదలివేస్తు ఉండడము. అలా చేయంగ చేయంగ మనస్సు విషయ జ్ఞాపకములు తెచ్చి పెట్టకుండ
లోపల ఉన్న ఆత్మ జ్ఞప్తిని కల్గజేయును. మనస్సును నిలుపుటకు ముందు మనస్సంటే ఏమిటి? అది ఎక్కడున్నది?
దానిపనేమిటి? దాని ఆహారమేమిటి? దానికి మిత్ర శత్రువులున్నారా? అది ఎంతలావు ఉన్నది మొదలగు ప్రశ్నలకు
జవాబు తెలిసి ఉండవలెను.
196. మాయ అనగ తల్లి ప్రసవించు శిశువుకు కప్పుకొన్న తొడుగు అని అంటారు. దీని పై మీ అభిప్రాయము
ఏమి?
జవాబు:
శిశువులు కప్పుకొన్న తొడుగును మాయ అనకూడదు. దాని పేరు “మావి” అనాలి. మాయ అంటే గుణముల
సమ్మేళనమని శాస్త్రము తెల్పుచున్నది. మావి అనునది ఒక తిత్తిలాంటిది. మావి ప్రాణములేని శిశువును కప్పియున్నదైతే,
మాయ అనునది కనిపించకుండ ప్రాణమున్న మనిషిని కప్పి ఉన్నది.
దండా జయరామ్, ఉరవకొండ
197. మనస్సు నిరంతర ప్రాప్తి కోసము ఆకాంక్షిస్తూ ఉంటే అది దమన హేతువు కదా?
జవాబు:
నిరంతర ప్రాప్తి కోసము ఆకాంక్షించడము కోర్కె అవుతుంది. ఆ కోర్కె కోసము తపన అవుతుంది కావున
మనస్సును బయటి పనుల జ్ఞప్తితో సంబంధము వదలి వేయించిన అది లోపలి జ్ఞప్తిని తెచ్చి పెట్టుతుంది. అపుడు
బయట విషయములు మనసు ద్వార తెలిసినట్లే లోపలి విషయములు (ఆత్మ) కూడ మనస్సు ద్వారానే తెలియుచున్నది.
కావున అది దమన హేతువు కాదు. మనస్సును పూర్తి అణిచివేసిన కదా దమన హేతువగును. ప్రపంచ విషయములలోను
ఆత్మ విషయములలోను మనస్సు లేనిది జీవునకు ఏమి తెలియదు. ఎల్లవేళల పంచేంద్రియముల జ్ఞాపకాలు చేయుమనస్సు,
యోగసాధనలో ఆత్మ విషయ జ్ఞాపకము చేయుచుండును.
198. అహం కృతిని కర్తృత్వాన్ని మీరెలా సమన్వయ పరుస్తారు?
జవాబు:
అహంకారాన్ని కర్తృత్వాన్ని మేము సమన్వయ పరచడము లేదు. కర్మ యోగ సిద్ధాంతము ప్రకారము
అహంకారమును నిర్వీర్యము చేయడమే మా విధానము. గీతలో మోక్ష సన్న్యాస యోగములో 17వ శ్లోకము "న అహం
కృత భావో" అన్నట్లు మేము నడుచుకొంటాము.
మచ్చావెంకటరామయ్య, ఉరవకొండ
199. పునర్జన్మ నిజముగ కలుగుతుందా? వాటిని నమ్మమంటారా?
జవాబు:
కర్మ ఉన్నంత వరకు పునర్జన్మలు కలుగుచునే ఉంటాయి. పునర్జన్మ జ్ఞప్తి కల్గిన వారి చరిత్రలు భూమి మీద
ఎన్నో ఉన్నాయి. ఇపుడు మీరున్నది కూడ పునర్జన్మయేనని తెలియవలెను.
200. ఎరుకకు మాయకు తేడా ఏమిటి?
కె. గంగప్ప, కిరికెర
జవాబు: ఎరుక అనునది మనస్సు. మాయ అనునది గుణములు. మాయను అనుసరించి మనస్సు పని చేయుచుండును.
201. వేదాంతమనగనేమి?
జవాబు:
"త్రైగుణ్య విషయా లేదా" అని గీతలో ఉన్నది. దీనిని బట్టి మూడు గుణముల విషయములే వేదములని
తెలియుచున్నది. గుణముల విషయములను వదలివేసి ఏ గుణ జ్ఞప్తి లేకుండ చేసుకోవడమును వేదాంతము
అంటారు. అట్లు సాధన సమయములో గుణ విషయముల జ్ఞప్తిరాని నిశ్చలుని “వేదాంతి” అంటారు.
202. మనకు ఈ ప్రపంచములో ప్రీతి కలిగించునది ఏది?
జవాబు:
203.
జవాబు:
మన శరీరములో ప్రేమ అనే గుణమువలన ప్రీతి కలుగును.
యమ్. వెంకటరాముడు, బెంగుళూరు.
ముండ మోపితోడ మునుగుచు దేలుచు
నుండగనే మోహముండె గాక
అండ బాయు వెనుక నాయాశలే లేవు.
విశ్వదాభిరామ వినుర వేమ.
మనస్సు విషయ సంబంధమున్నంత వరకు జీవుడు గుణములలోనె మునిగి ఉండును. ఆ మనస్సు విషయ
చింతన వదలిన తర్వాత ఆశ మొదలగు గుణములందు జీవుడు తగుల్కొనడు. ముండ అనగ మనస్సని తెలియవలయును.
మునిగి తేలు వాడు జీవుడు.
యమ్. రామారావు, కలుగొట్ల.
204. నిన్ను జూచెనేని తన్ను దామరచును
తన్ను జూచెనేని నిన్ను మరచు
నే విధమున జనుడు నెరుగు నిన్నును దన్ను
విశ్వధాబి రామ వినుర వేమ.
జవాబు: జీవాత్మ సాధన చేత ఆత్మను కలిసిన తన మీద జ్ఞప్తి లేక ఆత్మ జ్ఞప్తితో ఉండును. దానినే యోగమందురు.
యోగ సమయములో బాహ్య శబ్ద, రూప రస గంధములతో సంబంధము లేక జీవాత్మ తన్ను తాను మరచి ఉండును.
అందువలన ఆత్మను నిన్ను అని చెప్పుచు నిన్ను జూచెనేని తన్ను తామరచును అన్నారు.
యోగము వీడి ఆత్మ జ్ఞప్తిని వదలి తిరిగి ప్రపంచ ధ్యాసలోనికి వచ్చిన వాడు ఆత్మను మరచిపోవును. అందువలన
తన్ను జూచెనేని నిన్ను మరచునన్నాడు. శరీరముతో ఉన్నంత వరకు యోగమాచరించిన సమయములో జీవాత్మ ధ్యాస
పోవును. యోగమాచరించని సమయములో ఆత్మ ధ్యాస పోవును. అట్లుకాక పూర్తిగ జీవాత్మ మూడవ పురుషుడైన
పరమాత్మలో ఐక్యమై పోయినపుడు తాను ఆత్మకు జీవాత్మకు సాక్షిగ ఉన్నాడు. సమస్త జీవులందు బయట గలడు.
గనుక నిన్ను అను ఆత్మను, తన్ను అను జీవాత్మను చూడగల స్థితి మోక్ష స్థితి. అందరికి ఈ విషయము తెలియదు
గనుక ఏవిధముగ నెరుగు నిన్నును దన్నును అన్నారు.
పి. ప్రకాశనాయుడు, కూచివారిపల్లి.
205. జీవాత్మకు, ఆత్మకు, పరమాత్మకు తేడా ఏమిటి?
జవాబు:
శరీరములో ఒక్కచోట గలది జీవాత్మ. శరీరమంత వ్యాపించి ఉన్నది ఆత్మ. అన్ని శరీరములందు మరియు
బయట అణువణువున వ్యాపించి ఉన్నది పరమాత్మ.
206. దేవుడెక్కడున్నాడంటే ఆత్మలో అంటారు. ఆత్మను పరిశుద్ధముగ ఉంచుకోవాలంటే ఏమి చేయాలి?
జవాబు: ఆత్మలో దేవుడు లేడు. ఆత్మే దేవుడని తెలియవలయును. ఆత్మను పరిశుద్ధముగ ఉంచుకోవలసిన పని ఏమి
లేదు. అది ఎప్పుడు పరిశుద్ధముగనే ఉంటుంది. పరిశుద్ధముగ ఉంచుకోవలసింది మనస్సునని తెలియవలయును.
దండా మల్లికార్జున, ఉరవకొండ.
207. మనిషి శక్తికి, సంపదకి, శౌర్యానికి, వివేకానికి, లౌకిక జ్ఞానానికి, విజ్ఞానానికి అతీతమైనది ఏది?
"న హి జ్ఞానేన సదృశ్యం" జ్ఞానాగ్నికి సమానమైనది లేదు. అని భగవద్గీతా శాస్త్రములో భగవంతుడు చెప్పాడు.
అందువలన జ్ఞానానికి సమానమైనది లేదు.
జి. పద్మ, జి. యశోద, గుంతకల్.
208.నారదుడు అంజనేయుడు ఇద్దరు బ్రహ్మచారులే అయిన అంజనేయుని మాత్రమే పూజిస్తారు నారదునికి
పూజ లేదు కారణము తెల్ప ప్రార్థన.
జవాబు:
అంజనేయుడు రామ భక్తుడవడము ముఖ్య కారణము. తర్వాత అంజనేయుడు నారదునికంటే ఎక్కువ శక్తి
పరుడు ధైర్యవంతుడని భూత ప్రేత బాధలు అంజనేయుని వలన తొలగునను నమ్మకముతో పూజిస్తారు. తనను
నమ్మిన యయాతిని మొదలగు వారిని రక్షించాడను కథ ఉండుట వలన కూడ అంజనేయుని నమ్మి పూజిస్తారు.
నారదునికి అటువంటి చరిత్ర లేదు కావున నారదుని ఎవరు పూజించరు.
209. కొందరు పుట్టిన కొన్ని దినములకే మరణిస్తారు. కొందరు శతాయుస్కులుగ ఉంటారు ఎందువలన?
జవాబు:
వారి ప్రారబ్ధ కర్మను బట్టి జీవిత కాలముండును కనుక అట్లు జరుగుతుంది. చేసుకొన్న వారికి చేసుకొన్నంత
అనునానుడి ప్రకారము వారి వారి కర్మను బట్టి జీవిత కాలముండును.
210. భూలోకములో పార్వతి అవతరించిందంటే శివుడు కూడ అవతరిస్తాడు అంటారు. అటులనే ఒక జన్మలో
కి భర్తగా ఉన్నవాడు రెండవ జన్మలో కూడ ఆ కి అతనే భర్త అవుతాడా?
జవాబు:
శివుడు పార్వతి అనునది పురాణ కల్పిత కథలు వాటిని నమ్మవద్దండి. కర్మ సిద్ధాంతము ప్రకారము ఒకే
పురుషుడు మరు జన్మలలో భర్త అవుతాడనుటకు ఆధారము లేదు.
ఎ. నల్లప్ప, కె. శీతారామయ్య, సి. నారాయణ రెడ్డి.
211. నవంబరు పత్రికలో శిశువు తల్లి గర్భము నుండి బయటపడిన తర్వాతనే ప్రాణమువచ్చునని తెల్పారు.
కాని ప్రహ్లాదుడు తల్లి గర్భములోనే నారాయణ మంత్రోపదేశము పొందాడని, అష్ట వక్రుడు తన తండ్రి విద్యను
గర్భమునుండే గ్రహించాడని శాస్త్రములు చెప్పుచున్నవి. అదియుగాక అర్జునుని భార్య సుభద్రకు పద్మవ్యూహము
చెప్పుచుండగ గర్భములో ఉన్న అభిమన్యుడు విన్నాడని కూడ ఉన్నది. మరియు గర్భిణి స్త్రీలను విచారించగ 7
నెలలకే తమ గర్భములో ప్రాణమున్నట్లు చెప్పుచున్నారు. ఈ సందేహములను తీర్చ ప్రార్థన.
జవాబు:
మీ ప్రశ్నలో కొన్ని శాస్త్రాలలో చెప్పారు అని అన్నారు. అన్నట్లు అవి శాస్త్రములు కావు పురాణములు, ఇతిహాసములే.
ఇతి హాసములు చరిత్రలే అయినా వాటికి కూడ కవులు రంగులు పూశారని మరువకండి. నేడు మేము శాస్త్ర
సహితమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికి నమ్మని విమర్శకులు, తెలివైనవారు, గత వ్రాతలను ఎందుకు
విమర్శించలేకున్నారో అర్థము కావడములేదు.
చేప కడుపులో మత్య్స గంది పుట్టిందంటే చేప అండమునుత్పత్తి చేయును పిండము ఎలా పుట్టిందని ఎందుకు
అడగరాదు.? వీర్యమును చేప మింగడము వలన గర్భమొచ్చిందన్నారు. నోటి ద్వార మ్రింగిన పదార్థము జీర్ణకోశమును
చేరును కాని గర్భకోశము చేరేదానికి దారేలేదే అని ఎందుకు అడగలేక పోయారు.? ద్రోణుడు గిన్నెలోను, కర్ణుడు
చెవులోను పుట్టాడంటే సులభముగ నమ్మి నారె మన సూక్ష్మదృష్టి అక్కడ ఎందుకు పని చేయలేదు.? మేము చెప్పిన
విషయమును మీ ప్రశ్నలకు ఇంకా పదును పెట్టునట్లు ఈ విషయము గూర్చి ఇంకా కొన్ని ప్రశ్నలను మీకు జత
చేయుచున్నాను. నేను జెప్పు ప్రశ్నలకు మీరు జవాబులు వెదకండి.
1.
వెనుకటి జన్మ జ్ఞప్తి కల్గి చెప్పిన వారినైన మనము భూమి మీద చూడవచ్చును. కాని గర్భస్థ స్థితిని గూర్చి
చెప్పినవారున్నారా? అసలు మీకు ఆ జ్ఞప్తి ఉందా?
2.
జ్యోతిష్య శాస్త్రరీత్యా తల్లి గర్భము నుండి బయటపడిన తర్వాతనే లెక్కించి దశా శేషమును తెల్పుచున్నారు.
దశలు తల్లి గర్భము చేరినప్పటి నుండి ఎందుకు లెక్కించలేదు? దశా భుక్తిని గత జన్మ భుక్తి అని వ్రాయుచున్నారు
ఎందుకు? (గర్భ భుక్తి అని కొందరంటారు. గర్భములో సంవత్సరముల తరబడి ఉండరు కనుక గర్భ భుక్తి అనకూడదు
గత జన్మ భుక్తి అనాలి. )
3. తల్లి గర్భము నుండి బయటపడిన శిశువుకు కొన్ని నిమిషములు, కొన్ని గంటల పాటు శ్వాస, రక్త ప్రసరణము,
కదలిక, చైతన్యము ఎందుకు లేవు.?
4. మంత్రసానులు కొందరు మావిలో ప్రాణమున్నది, శిశువులోనికి రావాలని అంటుంటారు. అసలు గర్భములో
ప్రాణమొచ్చినది మావికా, శిశువుకా?
5. కొన్ని ఆస్పత్రులలో ప్రసవింపబడిన శిశువులు చనిపోయినారని డాక్టర్లు నిర్ధారణ చేసిన కొంతసేపటికి ఎలా
ప్రాణము పొందినాయి?
6. గర్భస్థశిశువుకు ప్రాణము లేనిదే పెరగదని, శిశువు తల్లి శరీరములో మరణిస్తే తల్లికి ప్రమాదమని అంటారు.
గర్భము నిలచినప్పటి నుండి ప్రాణము రాని ఆరు నెలల కాలము ఎలా పెరుగగలిగింది. ఆ ఆరు నెలల కాలములో
శిశువుకు ప్రాణములేనట్లయితే తల్లికెందుకు ప్రమాదము జరగలేదు?
7. యోగశాస్త్రమైన గీతలో జీవుడు శరీరమును పొందినప్పటి నుండి బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య మరియు
మరణావస్థలన్నారు కాని గర్భస్థావస్థ అని చెప్పలేదెందుకు?
8.
గీతలో పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును జీవుడు ధరిస్తున్నా డన్నాడు. క్రొత్తదంటే పూర్తి తయారైనదా?
లేక ఆరు నెలలకు అసంపూర్ణముగ ఉన్నదా?
9.
భగము (యోని) నుండి ప్రాణముతో పుట్టినపుడు అందరు భగవంతులే అవుతారు కదా! అలా అందరము
భగవంతులుగ ఎందుకు లేము?
ఇక్కడ మేము కొద్దిగ చెప్పు జవాబు ఏమంటే మన శరీరములో పంచ భూతములలో ఒకటైన వాయువు (గాలి)
ఉన్నది. అది ఐదు భాగములుగ ఉన్నది. వాయువును ప్రాణము అనవచ్చును. అందువలననే పంచవాయువులను
పంచ ప్రాణములు అన్నారు. మన ముక్కురంధ్రములో గాలి ఉన్నపుడే ప్రాణమున్నదని, గాలిలేనపుడు ప్రాణములేదని
చెప్పడము కూడ పరిపాటి. శరీరములో ప్రాణమున్నపుడే జీవుడు కూడ ఉండును. ప్రాణములేనపుడు జీవుడుండడు.
ముక్కురంధ్రములలో శ్వాస ఆడనంత వరకు శిశువుకు ప్రాణములేదని గ్రహించవలయును. తల్లి గర్భములో మావి
అను తిత్తియందు ఉమ్మి నీరు అనుద్రవములో శిశువు మునిగి ఉండును. అందువలన శ్వాస ఆడుటకు అవకాశమేలేదు.
జీవుడసలే లేడు. జననము గురించి మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు మీరు వెదకండి. సత్యా సత్యములు మీకే
అర్థమవుతుంది.
212. మేము చదివిన కొన్ని విషయములు గ్రంధ ప్రమాణములు, కాని శాస్త్ర ప్రమాణములు కావని మీరే
అన్నారు. మీరు విశ్వసించే భగవద్గీత భారత చరిత్రలోని ఒక భాగము కదా! పరమాత్మ మానవ రూపములో
నీతిని బోధించాడు. అదే ప్రకారము మిగత అవతారములలో భాగవత రామాయణములలో చెప్పినవి శాస్త్ర
ప్రమాణములుగ పరిగణించవలసి ఉన్నది. జన్మ మాకు ఎట్లు వచ్చిందని కాదు. ఎందుకు వస్తుంది దాని
రాహిత్యమునకు మార్గమేమిటి అన్నది తెల్పాలి?
జవాబు:
మేము ఎవరికో సమాధానమిచ్చిన విషయమును చూచి గర్భస్థ శిశువును గురించి మీరు అష్ట వక్రుని దగ్గర
నుంచి అభిమన్యుని వరకు వివరించి ప్రశ్న అడిగింటేనే మేము జవాబిచ్చాము. అది మాకవసరము లేదు, మాకు
ఇంకొకటి కావాలంటే, అంగడిలో తీసుకొన్న సరుకు నోటిలో వేసుకొని రుచి సరిగ లేదని ఇది మాకు ఎందుకు! వేరేది
కావాలని అడిగినట్లుంటుంది. మీరు అడక్కపోతే మేమెందుకు చెప్తామండి.
పరమాత్మ మానవ రూపమున నీతిని బోధించాడని మీరన్నారు. తెలియక అడుగుతాను యుద్ధరంగములో
చంపనని కూర్చొని ఉన్న అర్జునుని తిరిగి యుద్ధము చేయునట్లు చేయుట నీతి ఎట్లగును? కృష్ణుని జీవిత చరిత్రలో
ఎనిమిది మంది భార్యలు కాక ఎందరో పర స్త్రీల సంబంధము ఏ నీతి? యుద్ధములో ఆయుధము పట్టనని చెప్పి
భీష్ముని పైకి చక్రము ధరించడము ఏ నీతి? దుర్యోధనునికి పాండవుల సందేశము చెప్పి దుర్యోధనుని అభిప్రాయము
తెలుసుకోకమునుపే, ఒక వేళ నీవు ఐదు ఊళ్లయిన ఇవ్వని పక్షములో నిన్ను భీముడు, కర్ణుని అర్జునుడు చిత్రవధ
చేస్తారని బెదిరించి అదే పనిగ యుద్ధమునకు ప్రేరేపింపడము ఏ నీతి. యుద్ధ రంగములో ఆయుధములు వదలి వేరే
పనిలో నిమగ్నమై ఉన్న కర్ణుని చంపించడము ఏ నీతి?
వాస్తవముగ ఆయన తన జీవితములో ఏ నీతి బోధించలేదు. ఆయన తెల్పినది జ్ఞానాన్ని ధర్మమును. నీతిని
న్యాయమును ఏ మాత్రము తెల్పలేదు. నీతి న్యాయము లోక సంబంధము, జ్ఞానము ధర్మము ఆత్మ సంబంధము అని
ముఖ్యముగ తెలియవలయును.
ఇంతకు ముందు మా వ్రాతలలో శాస్త్రములంటే ఏమిటని చాలా మార్లు తెల్పాము. శాస్త్రములు ఆరు, వాటి
ఆధారము మీదనే ప్రపంచమంత ఆధారపడింది. శాస్త్రములంటే పంచ భూతములనుండి పరమాత్మ వరకు వ్యాపించి
ఉన్న శాసనములు. చరిత్రలువేరు, శాస్త్రములువేరని గ్రహించవలెను. ఉదాహరణకు గణిత శాస్త్రమున్నది. అది
ప్రపంచమున్నంత వరకు 4 X 5 = 20 అన్న శాసనాన్ని తెల్పుతుంది. కాని అది మారేది కాదు. అది ఏ చరిత్రకు
సంబంధముండదు. అట్లే ఖగోళ శాస్త్రమున్నది సూర్య గోళము నుండి కాంతి కిరణముల ప్రయాణము 1 సెకండుకు
1,86,000 మైళ్లు అన్నది శాసనము. అది చరిత్రకాదు, ప్రపంచమున్నంత వరకు చరిత్రలలో ఎక్కడయిన శాస్త్ర
ప్రస్తావన వచ్చి ఉండవచ్చును కాని అంతా శాస్త్రమెలాగగును. భారత చరిత్రలో ప్రస్తావనకు వచ్చిన గీత జీవాత్మ
ఆత్మల మధ్య ఉన్న శాసనములు, కావున వ్యాసుడు కూడ యోగశాస్త్రే అని గీతనన్నాడు. కాని గీతలో కూడ మధ్యలో
కల్పింపబడిన విషయములున్నవి. అవి శాసనములు కావని సూత్రము ప్రకారము సులభముగ తెలియును.
గణిత శాస్త్రము 4 X 5 = 20 ఖండించబడని పద్దతి అన్నట్లు యోగ శాస్త్రములో కూడ అట్లే ఉండును.
అసలుకు శాస్త్రము అంటే ఖండింపబడనిది అమలుకు వచ్చునదని తెలియవలయును. ఏదయితే ఖండించబడునో అది
శాస్త్రము కాదు. ఉదాహరణకు 2X 9 = 16 అని గణిత శాస్త్రములో ఉందనుకోండి. అది తప్పు నిరూపణకు ఎటు
ఎంచిన రాదు. ఖండింపబడునది కనుక దానిని గణిత శాస్త్రమనము. అట్లే యోగశాస్త్రములో కూడ ఎక్కడయిన
తప్పులుంటే వెంటనే తెలిసిపోతుంది. అమలుకురానివి ఖండింపబడునవి శాస్త్రమే కాదన్న సూచన అన్ని శాస్త్రములకు
వర్తిస్తుంది.
గ్రంథములన్నింటిని శాస్త్రములనుకొంటే మాత్రలన్ని మనిషి మింగేటివే కదా అన్నట్లుంటుంది. బేదికి వచ్చేదేదో,
బేదికి నిలిచేదేదో తెలియాలి కదా! అన్ని మందులే కదా! వైద్యుడే కదా తయారు చేసింది అనుకుంటే అతి సార
రోగమున్నపుడు బేదికి నిలిచే మాత్రవేసుకోక వచ్చేది వేసుకుంటే మరి బాధపడవలసి వస్తుంది. అట్లే గ్రంథములలో
ప్రపంచము వైపు పోయేవి కొన్ని, పరమాత్మ వైపు పోయేటివి కొన్ని ఉన్నాయి. అన్ని శాస్త్రములే కదా అని అన్నిటిని
తయారు చేసిన వాడు వ్యాసుడే అని అనుకుంటే ఎలాగ?
ఏది ఏమైన వయసు గడచిన వారికి ముందు విన్నదంత ఒకటి, నేడు మేము చెప్పేది ఒకటైతే గందరగోళము
ఏర్పడి నమ్మలేకున్నారు. మా బోధలు యువకులే ఎక్కువగ అర్థము చేసుకొనుచున్నారు. మరియు విమర్శనా దృష్టి
ఉన్న ప్రతివారు అర్థము చేసుకోగలుగుచున్నారు. విమర్శనాత్మకముగా చూడనివారు, గత చరిత్రలలో కవులు పూసిన
రంగులన్ని నిజమనుకొన్న వారు మా బోధల వలన చాలా ఇబ్బందిపడుచున్నారు.
ఉదాహరణకు రైలు ప్రయాణములో పురాణాల పూర్ణయ్యతో మా శిష్యుడు మాట్లాడడము జరిగింది.
రామాయణము కొంత నిజము కొంత కల్పన అని మా శిష్యుడన్నపుడు పూర్ణయ్య గారు అట్లు కాదు అంతా నిజమేనని
మీసము మెలివేసి చెప్పాడట. అందులకు మా భక్తుడు శాంతముగా "రామాయణములో అంజనేయుడు సీత కోసము
లంకకు లంఘించినపుడు ఆయన నుదుటి చమట సముద్రములో పడిందట, ఆ చెమట నీటిలో పడక ముందే ఒక చేప
మ్రింగిందట, ఆ చేప చెమట వలన గర్భము ధరించి మశ్చవల్లభుడను కుమారుని కనిందట, ఆ వల్లభుడు పాతాళములో
మైరావణుని ద్వారపాలకునిగ ఉంటే, తండ్రి అయిన అంజనేయుడు పోయి అతని చేతిలో ఓడిపోయాడని ఉంది.
అంజనేయుడు సీతను వెతకటానికి పోయినప్పటి నుండి పాతాలమునకు పోయినప్పటి వరకు నెల రోజులు కూడ
సమయము లేదే! అంతలో చేపకు గర్భమవడము 18 సంవత్సరముల ద్వారపాలకుడు కావడము ఇంత ఎలా జరుగును?
చెమటకు పిల్లలు పుట్టుదురా? నోటితో మ్రింగితే గర్భమెలా నిలిచింది.” దయచేసి చెప్పండన్నాడట. అందులకు
పూర్ణయ్య “రామాయణములో ఉంది గదయ్యా, జరగంది వారు ఎందుకు వ్రాస్తారు వారు తిక్కవార” అని అన్నాడట.
ఈ విషయమెట్లుందంటే కుందేలుకు మూడే కాల్లు ఉండాయని అన్నాడట ఒకడు, కాదయ్య కుందేలుకు నాలుగు
కాళ్లుంటాయని వేరొకడంటే, చూడవయ్య నాదగ్గరున్న కుందేలు అని మూడు కాళ్లు దానిని చూపాడట. చూచిన రెండవ
వాడు ఇది మూడు కాల్లదే నేను కాదనడము లేదు. దీనికి ఒక కాలు పుట్టనే లేదు. దీనికి లోపముంది ఇది కుంటిది,
సహజముగ కుందేలుకు నాలుగు కాల్లే ఉంటాయనిన నమ్మలేదట మొదటివాడు.
జన్మ ఎలా వచ్చింది అనేది వద్దు, జన్మ ఎందుకు వచ్చిందో తెలుపమన్నారు. మేము చాలా మార్లు తెలిపాము.
గత జన్మలలో చేసుకొన్న కర్మ ప్రకారము జన్మ కలుగుచున్నదని, కర్మను కాల్చుకొను జ్ఞానాగ్నిలేనంత వరకు జన్మలు
కలుగుచునే ఉంటాయి.
డి. శ్రీధర్ నాయుడు, పుట్టపర్తి.
213. దేవుడున్నాడా? ఉంటే ఎక్కడ?
జవాబు:
దేవుడున్నాడు. మన శరీరమందే. నీకు చాలా దగ్గరలో చూడాలను కొంటే జ్ఞాననేత్రముతో చూడవచ్చును.
214. దేవుడున్నాడని ఖచ్చితముగా ఎలా చెప్పుచున్నారు?
జవాబు:
దేవుడు అనేవాడు ఒక గుడిలో ప్రతిమ కాదు. మన శరీరములో ఉన్న చైతన్యశక్తియే దేవుడు. ఆ చైతన్యము
మన శరీరమందు నిత్యము ఉపయోగ పడుచున్నది. కావున దేవుడున్నాడనుటకు ఖచ్చితమైన నిదర్శనమిదే. శరీరమందు
దేవుడు లేనిది మనము కదిలేదానికే వీలులేదు.
215. దేవుడుంటే మీరు చూచారా?
జవాబు:
దేవుడు ఎవరి అవయవములకు తెలియువాడు కాడు. మీలో ఉన్న కదలికకు కారణమైన శక్తిని మీరు చూచారా
లేదు కదా! దేవుడనబడు ఆ శక్తి ఇంద్రియ అగోచరమైనది. దేవునికి ఆకారము, పేరు రెండు లేవు కావున దేవున్ని
చూచానని ఎవరైన అనిన అది శుద్ధ అబద్దము. దేవుడు జ్ఞానదృష్టికి మాత్రము తెలియువాడు. అందువలన దేవుడంటే
ఏమిటో నా జ్ఞానానికి తెలుసుకాని నాకంటికి తెలియదు. నా కన్నులతో చూడలేదు.
డి. హనుమంతు రెడ్డి, వెంకటాపురము.
216. లోకములో ప్రజలు ఆడ దానికి ఐదో తనము ముఖ్యము అంటారు ఐదో తనమంటే ఏమిటి? అది
లేకుంటే ఆడవారు ఆడ మనిషిగ ఉండరా?
జవాబు:
స్త్రీకి తాళి ఉండడమును ఐదో తనము కల్గి ఉండుటని అంటారు. భర్త ఉన్నపుడు ఐదో తనము ఉన్నదని
లేనపుడు లేదని అంటారు. భర్త ఉన్నపుడు స్త్రీ అయిన వారు భర్త లేనపుడు స్త్రీ కాకుండా పోతారా? ఐదోతనము
ఉండిన ఆడవారే, లేకున్న ఆడవారే. ఐదోతనము ఉన్నవారిని ఒక రకముగ, లేని వారిని ఒక రకముగ చూచుకొను
దురలవాటు మనము కల్పించుకొన్నదే గాని దేవుడు పెట్టినది కాదు. ఇది ప్రాపంచిక విషయము, ఇకపోతే ఆధ్యాత్మికముగ
నిజమైన అర్థము ప్రకారము ఐదో తనమును ఆడ తనమును వివరించుకొందాము.
జగద్భర్త అనగ జగత్తుకంతటికి భర్తయైన వాడని అర్థము. జ అనగ పుట్టుట గతి అనగా గతించునదని చాలా
మందికి తెలుసు. పుట్టుట గిట్టుటను బట్టి జగతి అని పేరు పెట్టగ పుట్టి గిట్టే మానవాళికి మరియు సమస్త జీవరాసులకు
భర్త ఒకడు గలడు. వానినే జగద్భర్త అంటున్నాము. జగత్తుకంతటికి భర్తయైనవాడు పరమాత్మ ఒక్కడే. ప్రపంచములో
తాళి కట్టినవాడు భర్తయైతే జ్ఞానపరముగ జన్మనిచ్చిన పరమాత్మయే భర్తయని తెలియాలి. మనమనుకొన్నా అనుకోకపోయిన
అందరికి భర్త ఆ పురుషోత్తముడే. స్త్రీకి ఐదో తనము తాళి కట్టిన భర్త అయితే, స్త్రీకి పురుషునికి అందరికి ఐదో తనము
జగద్భర్తయైన పరమాత్మ. పరమాత్మ భర్త అయితే మనమందరము ఒక విధముగ ఆడవారమే అన్నమాట. ఆడవారను
పేరు ఎట్లా వచ్చిందో కొంత ఆలోచిద్దాము.
హిందీ, ఉర్దూ మరియు చాలా భాషలలో ఆడ అనగ అడ్డము అని అర్థము. పూర్వము తెలుగు భాషలో కూడ
అడ్డమును ఆడ అనెడివారు ఇపుడది కాల క్రమమున అడ్డముగ మారినది. ఆడగాని అడ్డము గాని దేనికి అని యోచిస్తే
జ్యోతిష్యశాస్త్రములో 1వ స్థానాధిపతికి 7వ స్థానాధిపతి ఎప్పటికి వ్యతిరేఖమున్నట్లు యోగ శాస్త్రములో పరమాత్మకు
ప్రకృతి (మాయ) అనునది ఎప్పటికి వ్యతిరేఖముగ ఉన్నది. జగతిలో పరమాత్మ పక్షము, ప్రకృతి పక్షము అను రెండు
పక్షములలో మనము ఎల్లపుడు ప్రకృతి పక్షములో ఉన్నాము. యోగ శాస్త్రరీత్యా పరమాత్మకు ప్రకృతి వ్యతిరిక్తమన్నట్లు
ప్రకృతి పక్షమైన మనము పరమాత్మకు వ్యతిరిక్త దిశలోనే నడుస్తున్నాము. మనలో నుండి ఎవడైన పరమాత్మవైపు
ప్రయాణించాలని ప్రయత్నము చేస్తే అందరు వానికి వ్యతిరేఖత తెలుపుట వాస్తవము. ఒక ఇంటిలో భర్త దేవునివైపు
పోవాలనుకొన్నపుడు భార్య మిగతవారు ఆటంకపరచడము, ఒక వేళ భార్య దేవుని వైపు ప్రయాణించాలను కొన్నపుడు
భర్త ఆటంకపరచడము జరుగుచున్న సత్యము. స్త్రీలు పురుషులు అందరు ప్రకృతి పక్షములో ఉండుట వలన పరమాత్మ
వైపు పోవాలనుకొన్న వానిని ఇతరులు అడ్డగించడము సహజమే అన్నాము కదా! అందువలననే ఆటంకపరచు వారందరిని
పూర్వము ఆడవారనడము జరిగినది. ఈ కాలములో ఆడవారనగా కేవలము స్త్రీలే అనుకోవడము జరుగుచున్నది. అది
పొరపాటు ఆడవారనగా ప్రకృతి వైపువారని అర్థము చేసుకోవాలి. పరమాత్మ పురుషుడు, ప్రకృతి స్త్రీయని భగవద్గీత
గుణత్రయ విభాగయోగములో కూడ చెప్పబడి ఉన్నది. ప్రకృతివైపు ఆడ అను పదమునకు స్త్రీ అను అర్థము గలదు.
దీనిని బట్టి కేవలము భౌతిక స్త్రీలే ఆడవారని, భౌతిక పురుషాకారులను పురుషులనుకోవడము పొరపాటు. అట్లనుకోక
ప్రకృతి వైపు ఉన్న స్త్రీ పురుషులందరికి ఆడవారను పేరు వర్తింస్తుందని తెలియాలి.
స్త్రీ పురుషులనందరిని ఆడవారనుకోవడమేమిటి ప్రత్యక్షముగ నేను పురుషున్నని కనిపిస్తు ఉంటే స్త్రీగ ఎట్లు
పోల్చుకోవాలని కొందరు మగవారికి కొంత బాధగ కనిపించి ఉండవచ్చును. దానికి సమాధానమేమనగా! వాస్తవముగ
నీవు శరీరము కావు. నీవు కేవలము జీవాత్మవే. నీవు నివశించు శరీరమును బట్టి నేను పురుషుడనని, నేను స్త్రీనని
అనుకోవడము జరుగుచున్నది. శరీరమును బట్టి ప్రపంచపరముగ సమాజములో స్త్రీ పురుషులనుకోవచ్చును. కాని
ఆధ్యాత్మికరీత్యా పై లెక్క పనికి రాదు. అట్లయిన శరీర భేదములు ఎందుకున్నవని కొందరికి ప్రశ్నరావచ్చును దానికి
సమాధానము ఏమనగా! పరమాత్మ సృష్టి ఆదిలో ప్రకృతిని తయారు చేసి తనకు సాటిగ పెట్టుకొన్నాడు. ప్రకృతి చేతనే
సమస్తమును సృష్టించాడు. పరమాత్మ తనను పురుషునిగ, ప్రకృతిని స్త్రీగ చెప్పుచు నా వలన ప్రకృతి చేత సమస్తము
సృష్టింపబడినదని చెప్పాడు. సృష్టించబడిన జీవాత్మలకు స్త్రీ అంటే ఏమిటో పురుషుడంటే ఏమిటో అర్థముగాదు. కనుక
పరమాత్మ జీవులకు సృష్టి వివరము తెలియునట్లు స్త్రీ పురుష శరీరములను తయారు చేసి, పురుషుని చేత స్త్రీ గర్భము
దాలుస్తుందని, పురుషుడు బీజ దాతయని వారి వలననే సృష్టి జరుగుచున్నదని తెలియునట్లు చేశాడు. శరీరములు
ప్రకృతి పరమాత్మలకు గుర్తులని తెలియక, ఆధ్యాత్మికములో సృష్టి వివరమును ప్రకృతి పురుషుల గుర్తింపును తెలుపునవని
గ్రహించక, శరీరమును బట్టి నేను పురుషుడనని అనుకోవడము పొరపాటు. కొందరు శిష్యులు మా గురువు పురుషుడు
స్త్రీలకు ప్రవేశము, దర్శనము లేదన్నపుడు మీరాబాయి నవ్వి నేనింత వరకు ఒకడే పురుషుడున్నాడనుకొన్నాను, మీ
గురువు కూడ పురుషుడేనా అని అన్నదట. పరమాత్మ ఒకడే పురుషుడని అందరు స్త్రీలేననుకొన్న మీరాబాయికి శిష్యులు
మా గురువు పురుషుడంటునే నవ్వి, ఆశ్చర్యముగ ఇక్కడ మరొక పురుషుడున్నాడా అని అడిగిందట. ఆమె మాటవిన్న
గురువు బయటకు వచ్చి నేను పురుషుడను కాను, జగతిలో అందరము స్త్రీలమే అని ఒప్పుకొన్నాడట.
పరమాత్మ తన విధానమును తెలుపు నిమిత్తము స్త్రీ పురుష శరీరములను తయారు చేశాడని, వాస్తవముగ
మనము ఆడవారమేనని, ఆడ తనము ప్రకృతిదేనని, ప్రకృతివైపు నుండి పరమాత్మ వైపు మనము పయనించాలని, అలా
ప్రయాణించువారికి మనము ఆడ కాకూడదని గ్రహించాలి. సహజముగ బయటి ప్రపంచములో స్త్రీ శరీరమునకు
యుక్త వయస్సు వస్తూనే పురుషుని మీద ధ్యాస ప్రారంభమగును. ఆ స్త్రీ పురుషుని చేరుకొనుటకు ప్రయత్నిస్తుండును.
పురుషున్ని చేరుకోవాలనుకొన్న స్త్రీకి ఎటువంటి ఆటంకములు వచ్చిన లెక్క చేయదు. ఎన్ని ఆటంకములు ఎదురైన
పురుషుని దరి చేరాలన్న ధ్యాస మాత్రము పోదు. అలాగే మనమందరము ఆధ్యాత్మిక దేశములో ఆడవారమే. స్త్రీకి
యుక్త వయస్సు వచ్చి పురుష ధ్యాస వచ్చినట్లు మనలో ఎవనికో ఒకనికి జ్ఞానవయస్సు వచ్చి పురుషోత్తముని
కలుసుకోవాలను ధ్యాస వస్తుండును. అటువంటి వారికి భార్య బంధువులు ఎందరు ఆటంకమొచ్చిన లెక్క చేయరు.
లోపల మాత్రము తన పురుషున్ని చేరుకొనుటకు శతవిధాల ప్రయత్నము చేయుచుండును. ఒక వేళ నీవు నీ పురుషున్ని
చేరుకోవాలనుకొన్నపుడు నీ ఇంటిలో వారు గాని, నీ ఊరిలో వారు గాని, నీ దగ్గర బంధువులు గాని, నిన్ను హేళన
చేయడముగాని, భయపెట్టడముగాని, పంచాయితీ పెట్టి ఛీ అని పించడము గాని, చివరకు నీ ఆలి (భార్య) నీకు
అన్నము పెట్టకుండ పోవడము గాని, మరేమైన జరగవచ్చును. ఎన్ని జరిగిన, ఎన్ని ఆటంకములడ్డు వచ్చిన,
ధ్యాసలోనికి పురుషుడు వచ్చిన తర్వాత ఆమె అటువైపే ప్రయాణించుటకు ఏదో ఒక దారి వెతుక్కున్నట్లు పరమాత్మ
చింతన కల్గిన వానికి ఎన్ని ఆటంకములొచ్చిన వెనుకాడడు.
యోగశాస్త్రరీత్యా మనమందరము ప్రకృతి స్వభావమున్న ఆడవారము. నీకు నాకు అందరికి పురుషుడనువాడు
కావాలి. పురుషున్ని చేరుకొనేంతవరకు మనకు తపన ఆగదు. అంతవరకు ధన ధాన్యములున్నా వస్తు వాహనములుండినా,
అధికారము హోదాలుండిన, ఎన్ని ఉండిన ఏదో లోటుగనే ఉండును. ఐదో తనమైన భర్త లభించినపుడే తృప్తి పరిపూర్ణత
ఏర్పడును. జ్ఞానము తెలియని వారికి ఈ మాటలు చాలా విచిత్రముగ తోచుచుండును. మాకు పెళ్లి అయినది భార్య
భర్తలమున్నాము కదా! అనుకోవచ్చును. వాస్తవముగ నీకు జరిగిన పెళ్లి పెళ్లికాదు. అది దైవత్వమును తెలియజేయు
తంతు. మీరు భార్య భర్తలనుకోవడము వలన భార్య భర్తలు కారు. భార్య భర్తలను మాట ప్రకృతి పరమాత్మలను
తెలియజేయు విధానము. భర్త అనగ భరించువాడని భార్య అనగ భరింపబడునదని అర్థము. ఈ అర్ధము ప్రకారము
ఆలోచించిన నీవు ఎవరిని భరిస్తున్నావు? నిజానికి నిన్ను నీవు భరించుకోలేదు. నిన్ను భరించువాడు నీ శరీరములో
గలడు. వాడు భరించునంత వరకు శరీరములో నీవుండగలవు. అందరము అలాగే ఉన్నాము. అందరికి భర్త గలడు.
వాడే అందరికి ఐదోతనము. ఐదో తనమనే మాట చాలా చోట్ల వింటున్నాము. ఐదో తనమనడములో అర్థమేమిటి?
ఐదో తనమని ఎందుకనాలి భర్తను మూడో తనమో లేక నాల్గవ తనమో అనకూడదా అని మనము ఆలోచించలేదు.
తెలియనివాడు ప్రశ్నవేస్తే ఏదో ఒకటి చెప్పి సరిచేయక నిజార్థమేమిటో ఆలోచించి చూద్దాము.
ఒకప్పుడు నన్ను వేరొకరు నీవేమి చదువుకొన్నావని ప్రశ్నించారు. అపుడు నేను రెండు విధముల జవాబిచ్చాను.
ప్రపంచ పరముగ అయితే పదకొండు చదివాను. పరమాత్మ పరముగ అయితే నాలుగు చదువుచున్నాను, ఐదుకు
పోవాలన్నాను. ఈ రెండో జవాబును విపులముగ చెప్పాలంటే ఈ విధముగనున్నది. మన శరీరములో వరుసగ మూడు
గుణ భాగములున్నాయి. నాల్గవది గుణములేని భాగము కూడ ఉన్నది. మానవునికి ఇవి తరగతులులాంటివి. జ్ఞానములో
మూడు గుణములను అతిక్రమించినవాడు, మూడు గుణములను జయించినవాడు, మూడు గుణముల కర్మ అంటని
వాడు త్రిగుణాతీతుడన్నమాట. అనగా మూడు తరగతులను దాటిన వాడని అర్థము. ఆ మూడు తరగతులే తామస,
రాజస, సాత్త్వికములన బడునవి. ఇక నాల్గవ తరగతిని యోగము అంటారు. యోగమును పూర్తి చవిచూచిన తర్వాత
యోగమును కూడ అతిక్రమించినవాడగును. అటువంటి వానిని యోగీశ్వరుడని అందురు. అట్లుకాక యోగములో
ఉండిన వానిని యోగి అని అందురు. నాకు నాల్గు తరగతులు పూర్తి కావచ్చినవి, కావున యోగీశ్వరుడనై ఐదో తరగతికి
పోవాలని ఉన్నానన్నాను. నాల్గవదైన యోగము తర్వాత ఉన్నది మోక్షము. దానినే బయలని, అచేలమని, ముక్తియని,
పరమపదమని అనేక రకములుగ చెప్పుచుందురు. నాల్గవ దాని తర్వాత ఉన్న ఐదో తరగతైన మోక్షమే మానవునికి
చివరి తరగతి. ప్రపంచ చదువులెన్ని తరగతులుగ ఉండిన అవి అన్నియు యోగశాస్త్రములో మూడు తరగతులలోనివేనని
తెలియాలి. ఎంత పెద్ద డిగ్రీలు సహితము నాల్గవ తరగతి వరకు రాలేవు అన్ని మూడవ తరగతిలోనివే. నేను
యోగశాస్త్రములో నాల్గు తరగతులు చదివి చివరిదైన ఐదుకు పోవాలని కాచుకొన్నాను.
అలాగే ప్రతి మనిషికి ఈ ఐదు తరగతులు గలవు. చివరిదైన దానినే ఐదో తనము అని కూడ పూర్వము
పెద్దలనెడివారు. అన్ని ఉన్నా ఐదోతనము తప్పనిసరిగ కావాలన్నారు. అందువలననే అన్నిటికంటే
మించిన భాగ్యము ఐదో తనమని దానినే సౌభాగ్యమని కూడ అన్నారు. సౌభాగ్యమనగ భర్తను కల్గి ఉండడము. భర్తను
కల్గియుండడమే ఐదో తనము. బయట శరీర భర్త ఐదోతనము కాదు. నిజముగ మూడవ తనమే అగును. నిజమైన
భర్త పరమాత్మ. ఆ జగద్భర్తను వెదకుటకు ప్రయత్నించి ఐదోతనమును సాధించుకోవలెను. ప్రపంచములో
పురుషులకెవరికైన ఐదోతనము అవసరము. చాలామంది తామసమైన ఒకటిలోనో, రాజసమైన రెండులోనో, సాత్త్వికమైన
మూడులోనో ఉన్నారు. కనీసము నాల్గవదైన యోగము వరకు కూడ రాలేదు. జనాభాలో ఎక్కువ శాతము రెండవతరగతే
దాటడము లేదు. 99 శాతము మూడునే దాటలేదు. అటువంటి వారు నాల్గు ఎప్పుడు దాటగలరు. ఒక వేళ నాల్గు
వరకు వచ్చిన ఎన్నో ఆటంకములచే అక్కడ పాసుకాలేక పోవుచున్నారు. కొందరేమో నాల్గులో ఉన్నామనుకొంటూ
మూడులోనే ఉన్నారు. మరి కొందరేమో ఒకటిలో ఉంటూ ఐదులో కూర్చున్నామనుకొంటున్నారు. మా గురువు మోక్షములో
కూర్చో బెట్టాడంటున్నారు. అయిదుకు పోయిన వాడు కంటికే కనిపించక పరమాత్మలోనికి ఐక్యమైపోవును కదా!
అలాంటపుడు కనిపించే గురువు, కనిపించే శిష్యులను మోక్షములో పెట్టాడంటే గురువు శిష్యులు అందరు ఒకటో
తరగతిలో ఉన్నారన్న మాటే. ఎవరెట్లు పోయిన పరవాలేదు. నీవు మాత్రము నీ భర్తను చూచుకో, నీ భర్తకే మ్రొక్కు నీ
భర్తకే సేవ చేయి, నీ ఐదోతనము పోకుండ చూచుకో. ముత్తయిదువుగ బ్రతుకు, ముండమోపిగ బ్రతుకవద్దు.
మనమందరము ఆడవారమే కనుక మన ఆడవారందరికి ఐదోతనమే ముఖ్యమని తెలుసుకో.
బి. పద్మావతి, బండి ఆత్మకూరు.
217. మనుషులందరు ఒకటే కదా! మరి కొందరు బీదవారిగ కొందరు షావుకార్లుగ ఎందుకు పుట్టుతారు?
జవాబు: గత జన్మలలో చేసుకొన్న పాప పుణ్యముల బట్టి బీద ధనికులుగా పుట్టుట జరుగుచుండును. పాప ఫలితము
కష్టము, పుణ్య ఫలితము సుఖము అనుభవించక తప్పదు. అందరు మానవులే అయినప్పటికి వారు చేసుకొన్న కర్మలు
ఒకే విధముగ ఉండవు. అందువలననే రకరకముల వారు భూమి మీద ఉందురు.
నాగయ్య, ప్రొద్దుటూరు.
218. ప్రతి మనిషి కర్మ ప్రకారము నడచునని మీరు చెప్పారు. మరి కర్మ ఎవరి ప్రకారము ఉంటుంది? ఈ
కర్మకు ఎవరు మూల పురుషులు? ఈ కర్మ అనుపదానికి ఎవరు బాధ్యులు? ఈ కర్మ అను పదమును
సృష్టించినవారు మీరా లేక అంతకు ముందువారా?
జవాబు:
మనము చేయు పనుల ప్రకారము కర్మ ఉండును. మంచి పనులు జరిగిన పుణ్యము, చెడ్డ కార్యములు జరిగిన
పాపము అను ఫలితములు ఏర్పడుచుండును. కర్మ ప్రకారమే ప్రతి పని జరిగిన, ఆ జరిగిన పని కర్మ వలన కాదు
నావలన జరుగుచున్నదని ఎవడనుకొనుచుండునో వానికి మాత్రమే క్రొత్త కర్మ ఏర్పడును. అలా కాక ప్రతి పనికి కర్మే
కారణమని నేను కానని అనుకొనువానికి కర్మ ఏర్పడదు. పాత కర్మను అనుభవిస్తు క్రొత్త కర్మను సంపాదించుకొనేవాడు,
వాడు సంపాదించుకొన్న కర్మకు వాడే బాధ్యుడు. ఈ కర్మ సిద్ధాంతమును ఉంచిన వాడు మూల పురుషుడైన పరమాత్మ.
కర్మ అను పదమును ఏ మానవుడు సృష్టించ లేదు. పరమాత్మ చేత సృష్టింపబడిన ప్రకృతిలో కర్మనునది ముఖ్యమైన
భాగము. కర్మలేనిది సృష్టి ముందుకు సాగదు. కర్మ రహస్యమును అవగాహన చేసుకొంటే ప్రకృతి రహస్యమునే
తెలిసినట్లగును. సర్వ సంపూర్ణజ్ఞానము కర్మను తెలుసుకోవడములోనే ఉన్నది. ఇది పురాణము కాదు. శాస్త్రబద్ధమైన
మాట.
వెంకట్, ఉరవకొండ.
219. శరీరములో నుంచి స్వతహాగా ప్రేమ వెల్లివిరుస్తు ప్రాపంచిక చింతలేమి స్పృశించకుండా వ్యక్తిని
జవాబు: బ్రహ్మానందములో లీనము చేసుకొను సిద్ధ వ్యవస్థ మానవునికి శరీరము ఉండగా ప్రాప్తించడము అసంభవమా?
శరీరముతో సంభవము కాదు. ప్రేమ ప్రకృతిసిద్ధముగ పుట్టినది బ్రహ్మానందములో లీనము చేసుకొను సిద్ధ
వ్యవస్థ అనగ జ్ఞానముతో లభించు మోక్షము ప్రకృతి సిద్ధముగ పుట్టినది కాదు. ప్రాప్తించబడునవి కర్మను బట్టి
ఉంటాయి. మోక్షము కర్మను బట్టికాక శ్రద్ధను బట్టి ఉండును.
యం. నాగభూషణం, బెంగుళూరు.
220. ఎవరికైన గొప్ప వారికి ఉత్తరము వ్రాసినపుడు శ్రీశ్రీశ్రీ అని పేరు ముందర ప్రస్తావించుతారు అందులో
జ్ఞానపరముగ అర్థమున్నదా?
జవాబు:
సాత్త్విక, రాజస, తామస గుణములలో శుభమైన గుణముకలవాడని మూడు శ్రీలు వ్రాస్తారు. మూడు
గుణములలోను మంచి గుణములే ఉన్నవాడని అర్థము.
221. పరిపూర్ణమనగా నేమి?
జవాబు:
మోక్షము (పరమాత్మ) దానినే అచేలము అని కూడ అంటారు.
222. గురువులు శిష్యునికి మాయ తొలగించి పరిపూర్ణమును స్థూల కన్నులకు చూపించుదురని, అలా చూపించలేని
వారు గురువులు కారని కొందరి వాదన తమ అభిప్రాయము తెల్ప ప్రార్థన.
జవాబు:
పరిపూర్ణము స్థూల కన్నులకు కనుపించునది కాదు. చూపుకు గోచరించునది ప్రకృతేనని తెలియవలెను.
పరిపూర్ణము ఇంద్రియ అగోచరమని యోగ శాస్త్రము కూడ తెల్పుచున్నది. పరిపూర్ణమును ఏ గురువులు భూమి మీద
చూపలేరు. అలా పరిపూర్ణమును గురువులే చూపునట్లయితే శిష్యులకు సాధనతో జ్ఞానముతో పని లేదని చెప్పవచ్చును.
అలా చూపుదునని చెప్పువాడు గురువే కాదు.
223. అకాల మరణమైన సూక్ష్మ దేహములు కాలమరణము వరకు కర్మలు చేయుచుందురా? అందువలన
వచ్చు పాపపుణ్యములు వారికి అంటునా? వారికి కర్మను తొలగించుకొను అవకాశము గలదా?
జవాబు:
అకాల మరణమైన వారికి 10 భాగములు స్థూలశరీరము మాత్రము లేదు. మిగత 15 భాగముల
సూక్ష్మశరీరమున్నది కనుక వారు కూడ కార్యములాచరింతురు, కర్మల సంపాదించుదురు. జ్ఞానాగ్నిని సంపాదించుకొని
వారు కూడ కర్మల కాల్చివేసుకోవచ్చును. స్థూల కన్నులకు మాత్రము కనిపించు అవకాశము లేదు కాని మిగతావన్ని
వాటికి మనవలె కలవు.
224. కొన్ని పనులు చేయునపుడు ఇది మంచిది ఇది చెడ్డది అంతర్గతముగ ఏదో హెచ్చరిస్తూ ఉంటుంది దీనినే
“అంతరాత్మ ప్రబోధం” అని అంటారు. మీరేమో ఆత్మసాక్షిగ చూస్తు ఉంటుంది ఏమి చెప్పదన్నారు. అలా ఏమి
చెప్పనపుడు లోనుండి జరుగు సూచనలను అంతరాత్మ ప్రబోధమని ఎందుకనాలి?
జవాబు:
వాస్తవముగ ఆత్మ అన్ని జీవరాసులకు సాక్షిగ చూస్తు ఉన్నది. ఏ ప్రబోధము చేయలేదు. శరీరాంతర్గములో
జరుగు మంచి చెడు విమర్శలు, మంచి చెడు గుణములతో చేయు బుద్ధి యొక్క పని అని తెలియవలయును. ఒకే
బుద్ధి రెండు విధముల మంచి చెడును యోచించును. ఆ బుద్ధి యోచించిన దానిలో ఏదో ఒక దానిని చిత్తము
నిర్ణయించును. చిత్తము నిర్ణయించినదే కార్యాచరణకొచ్చును. శరీరాంతర్గత యంత్రాంగము తెలియని మతితక్కువ
మానవుడు లోపల జరుగు యోచనలను నిర్ణయములను “ఆత్మ ప్రబోధ” మనుకొనుచున్నాడు. ఆత్మ ప్రబోధమనుట
అధర్మము. బుద్ధి గుణానుసారిని, చిత్తము కర్మానుసారిని, జీవుడు అనుభవానుసారిని, ఆత్మ ఆడించి అనుభవింపజేయు
అధికారిని అను వాక్యములను మరువకూడదు.
పల్లా వెంకటరమణ, చిలమకూరు.
225. 108 కోట్ల సంవత్సరముల ప్రపంచ ఆయుస్సులో జీవికి మానవ జన్మ ఎన్ని మార్లు కలుగును?
కర్మను బట్టి ఎన్ని మార్లయిన కలుగ వచ్చును. జన్మలు ఏవి వస్తాయి ఎన్ని మార్లు వస్తాయన్నది కర్మను బట్టి
జవాబు:
ఉండును.
226. జీవికి మానవ జన్మ ఎంత పవిత్రమైనది?
జవాబు:
జ్ఞాన పరముగ అయితే చెప్పలేనంత పవిత్రమైనది. అజ్ఞాన పరముగ నడచుకొంటే చెప్పలేనంత నీచమైనది.
మొత్తానికి మానవ జన్మే మాయలో కూరుకు పోయి దేవునికి దూరముగ ఉన్న జన్మని చెప్పవచ్చును.
దండా జయరామ్, ఉరవకొండ.
227. ఏక ముఖ రుద్రాక్షంటే ఏమిటి? రుద్రాక్ష ధరించడము వలన ప్రత్యేకతున్నదా? ఏ రాశివారు
ధరించవలయును?
జవాబు:
రుద్రాక్షకున్న భావము (ముఖము)లను బట్టి వాటికున్న శక్తిలో తేడా ఏమైన ఉన్నదో లేదో పూర్తి మాకు కూడ
తెలియదు. దయ్యాల బాధలు కలవారు, వాటి భయమున్నవారు పూర్వము రుద్రాక్షలు ధరించెడివారని గతములో
కూడ తెల్పాము. రుద్రాక్షలు ధరించడము వలన చూపరులకు అలంకారము, వేసుకొన్న వారికి మెడలో బరువు తప్ప
ప్రత్యేకత ఏమి కన్పించడము లేదు. పూర్వము అజ్ఞానులు వేసుకొనెడివారు. కాలక్రమేపి ఇపుడు స్వాములు
వేసుకొనుచున్నారు. అంత తప్ప వీరు వేసుకోవచ్చు వీరు వేసుకోకూడదను నిబంధన ఏమి ఈ కాలములో లేదు.
పూర్వమైతే రుద్ర రక్ష (రుద్ర యంత్రము) అవసరమనుకొను వారు వేసుకొనెడివారు.
జి. గౌరి, రాజంపేట.
228. మృత్యువు పొందిన వారు వెంటనే వేరొక శరీరమును కర్మాను కూలముగ ధరిస్తారని తమరు తెల్పారు.
మరణించిన వారికి చేయు పిండ ప్రదానములు, అమావాస్య తర్పణములు ఎవరికి చేరుతాయి?
జవాబు:
మరణించిన వారు క్రొత్త శరీరమును పొంది అక్కడ కర్మానుసారము అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ మనము
పెట్టు పిండ ప్రదానములు వారికి చేరవు. వారి పేరు మీద పెట్టు తిండి కాకులకు, డబ్బు ఇతరులకు పెట్టాననుకుంటే
పుణ్యమయిన మనకు చెందుతుంది. ఉన్న వారికి ఊడేది తప్ప పోయినవారికి చెందేది ఏమి లేదు. పిండ ప్రదానములు,
అమావాస్య తర్పణములు మనము కల్పించుకొన్నవే.
229. వైష్ణవులకు దానము ఇచ్చేటపుడు క్రిష్ణార్పణమని ఇస్తే స్వీకరిస్తారు. శివార్పణమని ఇస్తే స్వీకరింపరు. అట్లే
శివ మతస్తులు శివార్పణమని ఇస్తే స్వీకరిస్తారు. క్రిష్ణార్పణమని ఇస్తే స్వీకరింపరు. వీటి తేడా ఏమిటి?
జవాబు:
ఇది వారివారి వర్గపరమైన ఆచారము తప్ప ఇందులో జ్ఞానపరమైన ఆర్థము ఏమిలేదు. శివుడు క్రిష్ణుడు
ఒక్కడేనని తెలిస్తే అలా నడుచుకోరు. పరిపూర్ణ జ్ఞానము కల్గిన రోజు ఇద్దరు ఒక్కటేనని తెలియగలదు.
230. కొందరు మనుష్యుల నుదుటిపైన మడతల బట్టి మడతకు 20 సంవత్సరములు ఆయుస్సు ప్రమాణమని
చెప్పుతారు నిజమేనా?
జవాబు:
నిజము కాదు. నుదుటి మీద మడతలు చూస్తే తెలియదు నుదుటిలోపల వ్రాతలు చూస్తే తెలుస్తుంది.
231. నాకు కలలో పాము కనిపించి కరిచింది. యదార్థముగ బాధను అనుభవించినట్లయినది. కలలో పాము
కనిపించుట కొందరు చెడని, కొందరు మంచని అంటారు. ఏది నిజము?
జవాబు:
చెడు కాదు, మంచి కాదు. బాధ అనుభవించు కర్మ ఉన్నది. కావున అది కలలో అనుభవించారు.
వాస్తవముగ శరీరానికి పాము కరిచే కర్మలేదు. కాని పాముకాటు అనుభూతి బాధ అనుభవించు కర్మ మాత్రమున్నది.
అటువంటపుడు స్థూలమునకు జరుగక సూక్ష్మముచేత అలా అనుభవింపవలసి వచ్చినపుడు అది స్వప్నములో మాత్రమే
జరుగును. అందు నిమిత్తమే స్వప్నములున్నాయి.
వెంకట్, ఉరవకొండ.
232. బిడ్డ నుదుటి వ్రాతను తల్లి నిద్ర పోతున్నపుడు బ్రహ్మ రాస్తాడంట నిజమేనా?
జవాబు:
శుద్ధ అబద్దము. మన కవుల కలాలకు పుట్టిన బ్రహ్మ ఏమైన ఉంటాడేమో, కాని నుదుటి వ్రాతను వ్రాసే
బ్రహ్మలేడు. ఎవరు చేసుకొంటున్న కర్మ వారి కపాలములో కర్మచక్రమందు నిత్యము రికార్డు అవుచున్నది. కాని
ప్రత్యేకించి వ్రాయు వారు ఎవరు లేరు.
యల్. చండ్రాయుడు, చిన్న మాండెము.
233. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే
అన్న గీతాచార్యుని వాక్యాను సారము శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షపాతియా? కౌరవ పక్షపాతియా?
జవాబు:
పీర్ల పండుగకు సుబ్బరాయుని షష్టికి సంబంధము లేనట్లు మీరడిగిన శ్లోకమునకు పక్షపాతానికి సంబంధమే
లేదు. నిజమునకు కృష్ణుడు ఎవరి పక్ష పాతి కాడు. ఐదూర్లతోనైన తృప్తి పడగల పాండవులకు రాయబారిగ పోయి,
దుర్యోధనుడు ఇచ్చు అవకాశమే లేకుండ మాటలతో రెచ్చగొట్టి, యుద్ధమును కల్పించి ఇరువైపుల వారిని వినాశనము
చేశాడు. కావున ఎవరి పక్షమని కూడ చెప్పుటకు వీలులేదు. ప్రపంచములో ఆయన పాత్ర ధర్మసంస్థాపనే కాని
మిగతావన్ని నాటకాలే ఎవరి ప్రక్కలేడు. ఒక వేళ పాండవ పక్షపాతియే అయివుంటే ఆనాడు కురుక్షేత్రములో తాను
కూడ యుద్ధము చేసి ఉండే వాడు. అట్లు ఎవరి పక్షమువాడు కాదు కనుక తాను షరతుపెట్టి తప్పించుకొన్నాడు.
యం.సి. రామలింగయ్య, చిన్న మాండెము.
234.ఓం శ్రీం అను ప్రణవ బీజాక్షరములకు అంతరార్థముగ తేడా ఏమిటి?
జవాబు: ప్రతి మాట మంత్రమేనని వేమన యోగి చెప్పినట్లు మనము పలుకు శబ్దములో కనిపించని ఒక శక్తి ఉంటుంది.
వాటిలో బీజాక్షరమునకు మరీ ఎక్కువ శక్తి ఉంటుంది. అందువలన బీజాక్షరముల జపమంత్రము క్రమబద్దమై ఇన్ని
వందలు, ఇన్ని వేలు అని సంఖ్య నిర్ణయింపబడి ఉండును. అటువంటి బీజాక్షరములు ఎన్నో ఉన్నాయి కాని ఓంకారము
అన్ని బీజాక్షరములకు ముందు ఉచ్ఛరించవలయును. అందువలన ఏ మంత్రమునకైన ఓం అను అక్షరముతోనే
మొదలవును. ఓంకార శబ్దము నీలో ఉన్నపుడే తర్వాత అక్షరములన్ని నీవు ఉచ్ఛరించగలవు. కావున అన్నిటికి
ముందు ఓంకారమును పెట్టడమైనది. అది లేకుండా ఏ మంత్రము జపించరాదను నియమము మంత్ర భాగములో
ఉండును. ఎర్త్ (భూమి) కనెక్షన్ లేనిది కరెంటు శక్తి ఉపయోగపడనట్లు ఓంకారము లేనిది ఏ బీజాక్షరముల శక్తి
ఉపయోగపడదు. కరెంటు తీగలలో ఎర్త్ తీగకు కరెంటు తీగకు ఉన్నంత తేడా ఓంకారమునకు మిగతా బీజాక్షరములకు
ఉన్నది.
డి.వి. శ్రీనివాసన్, మదనపల్లి.
235. మీ పత్రికలో కొన్ని అచ్చు పొరపాటులున్నవి. ఒక చోట ప్రబో "ధా” శ్రమము అని మరియొక చోట
ప్ర“భో”దాశ్రమమని ఉన్నది. అసలు మీ పత్రిక ప్రభోదాత్మజమ లేక ప్రబోధాత్మజమ మీరే తెల్పవలయును. అది
అటుంచండి మీరు యోగివికమ్మన్నారు యోగికి అర్థము చెప్పారు. జ్ఞానికి అర్థము చెప్పారు. జన్మలు కర్మలు బట్టి
వస్తాయని గీతలో చెప్పారన్నారు. ఈ ప్రశ్నలన్ని షరామామూలే. నా ప్రశ్న మీకు కొంచము కటువుగ ఉండవచ్చు
జన్మలు లేకుండ పరబ్రహ్మలో ఐక్యమయ్యే పద్దతి ఏది? అది ఉత్తర గీతలో వేదములలో ఉందా? సంశయములకు
పరిష్కారము వేదములే కదా!
జవాబు:మా పత్రికలో అచ్చు పొరపాటులున్న విషయము మేమే గత సంచికలో చెప్పాము. ఎక్కడో ఒక చోట ఏ
పుస్తకములో అయిన పొరపాట్లు ఉండవచ్చును. తెలిసిన వారు సవరించి చదువుకుంటారు కాని విమర్శిస్తూ జాబు
వ్రాయరు. మేము హెడ్డింగ్ సక్రమముగ కంపోజ్ చేసి “ప్రబోధాత్మజమ్” అని పేరు పెట్టాము. కాని వెనుక ప్రక్కర్యాపర్
మీద బ్లాకు ఉన్నది దానిని మేము మార్చే దానికి కాలేదు కావున అట్లే వేయుచున్నాము. అది బ్లాకు వ్రాసిన ఆర్టిస్టు
పొరపాటు.
బోధ :చెప్పడము
భోద:చెత్త గడ్డి
మీరడిగారు కదా మీ పత్రిక పేరేదని మాది జ్ఞానులకు “ప్రబోధాత్మజమ్" అజ్ఞానులకు “ప్రభోదాత్మజమ్” అని
నేడు తెల్పుచున్నాము. ముందు ఒక రకము వెనుక ఒక రకము ఉండడము కూడ మంచిదేనని ఇపుడిపుడు
అనుకొనుచున్నాము. ఎందుకనగా తెలియని వారికి మా జ్ఞానము చెత్త గడ్డిగనే ఉండును. కావున అర్థము చేసుకోలేని
వారికి, అర్థము కాని వారికి మా పత్రిక “ప్రభోదాత్మజమ్”. అర్థము చేసుకొను వారికి “ప్రబోధాత్మజమ్”.
అది అటుంచమని జ్ఞానము యోగము షరామామూలే. నా ప్రశ్న మీకు కొంచము కటువుగా ఉంటుందన్నారు.
మీ ప్రశ్నకేమి కొమ్మలు పొడుచుకరాలేదు. జ్ఞాన యోగముల ప్రశ్నలు షరా మామూలైనపుడు మీది ఆ కోవకు చెందినది
కాదా? మేము చెప్పే బోధ జన్మలు లేకుండా పరబ్రహ్మములో ఐక్యమయ్యేది కాక మరియేది? మీ ప్రశ్న మాకు కటువుగ
ఉండదు. మా జవాబు మీకు కటువుగ ఉండవచ్చును. గురువులను ప్రశ్నించునపుడు “పరిప్రశ్నేన” అను విధానమును
మరచారు. "తై గుజ్య విషయా లేదా" అని గీతా వాక్యమును మరచి వేదము సంశయములకు పరిష్కారము కదా
అన్నారు. వాస్తవానికి వస్తే వేదాలు గుణములని, ఆ గుణములే మాయయని గీత బోధిస్తున్నది. 15వ అధ్యాయములో
గుణముల చేత పోషింపబడు శరీరాంతర్గత వృక్షమును (విషయము) పూర్తి తెలిసినవాడే వేదములను తెలిసినవాడని
కూడ ఉన్నది. కేవలము పుస్తకములు వేదములు కావు. వేదములు ప్రతి మనిషి తలలో గుణముల రూపముతో
ఉన్నవి. వేదములు సంశయముల కలుగజేస్తాయేకాని సంశయములు తీర్చలేవు. నేనేదో నా జ్ఞానమే పెద్దదని సొంత
డబ్బా కొట్టుకున్నాడనుకోకు. మా బోధలు నేటి సమాజములో అజ్ఞానాన్ని కూకటి వ్రేళ్లతో సహ పెరికి వేయుచున్నవి.
నాస్తికులను సహితము జ్ఞానులుగ మార్చుచున్నవి. అన్ని మతాల వారిని ఒప్పించగల్గుచున్నవి.
ఆదిమూలమ్ రెడ్డి, పెరియమిట్టూరు, తమిళనాడు.
236. మన దేశములో హిందువులు విగ్రహారాధన చేస్తారు. మిగత ఇస్లామ్ మతమువారు, క్రైస్తవ మతమువారు
విగ్రహారాధన చేయరు ఎందుకు?
జవాబు:
నిరాకారమైన దేవున్ని తెలుసుకోవడానికి సులభముగ ఉండునట్లు గుళ్లు గోపురాలు ఉన్నాయి విగ్రహారాధన
కూడ ఉన్నది. మిగతా మతము వారు నిరాకారానికి ఆకారము పెట్టడము బాగుండదని, అది మనము కల్పించిన
వారమైతామని, అలా చేస్తే ప్రజలు పొరపాటు పడగలరని, విగ్రహారాధన పెట్టకుండ నిరాకారమునే ఆరాధిస్తున్నారు.
ఇది పూర్వపు భావన, ఇపుడేమో ఆరాధనలలో దేవున్ని తెలియడము ముఖ్య ఉద్దేశ్యమనుకోక ఆరాధనలే ముఖ్యమనుకొని
ఎవరికి చేతనైనంత వారు చేయుచున్నారు. ఎవరు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేస్తే వారిదే పెద్ద భక్తి అను
కాలమిది. ఇందువులు ఇలా పొరపాటు పడడము విచారకరము.
కె. గంగప్ప, కిరికెర.
237. జీవుడు అకాల మృత్యువు పొందిన తర్వాత కూడ ఆత్మతో సంబంధపడి ఉండునా? ఆకలి దప్పులు, కష్ట
సుఖములుండునా?
జవాబు:
జీవుడు ఉన్నంత వరకు ఆత్మ సంబంధము కలిగే ఉండును. జీవుడు ఆత్మ రెండు జంట పక్షులలాంటివారు.
అకాల మృత్యువు పొందిన తర్వాత కూడ అన్ని అవస్థలు ఉండును.
పి. రామబొజ్జ, ధర్మవరము.
238. రాత్రివేళ స్వప్నములు కొన్ని మంచిగ,కొన్ని భయంకరముగ వస్తాయి కారణము?
జవాబు:
అవి కూడ కర్మ ప్రకారమే వస్తాయి. శరీరముతో అనుభవించని కర్మను స్వప్నములో మానసికముగ
అనుభవించవలసి ఉండును.
239. ఎవరైన పనులు జరగక పోతే ఈ దినము లేచిన సమయము బాగ లేదంటాము. అలా సమయము
బాగుండదా?
జవాబు: లేచిన సమయమునకు పనులకు సంబంధము లేదు. పనులు జరగనపుడు సమయము బాగలేదనకూడదు.
గ్రహచారము బాగలేదనాలి.
240. కొందరు తిరుపతి దేవుడు రాయి అంటున్నారు. కొందరు వైకుంఠము నుండి విష్ణువు వచ్చి శిలగ
మారినాడంటారు. ఏది నిజము?
జవాబు:
మొదటి వారిదే నిజము. చంద్రగిరి కోటను పాలించిన రాజులు నిర్మించినదే తిరుపతి దేవస్థానము. ఆ దేవుని
మీద భక్తి పెరగాలని వ్రాసినది వెంకటేశ్వర పురాణము. అందులో వైకుంఠము నుండి విష్ణువు వచ్చినట్లు వ్రాశారు.
241. అందరికి ఒక్కడే దేవుడన్నారు. మరి మత మార్పిడి దేనికి?
జవాబు:
మానవునకున్న అజ్ఞానము వలన మత మార్పిడి జరుగుచున్నది.
వెంకటస్వామి, ఎల్లుట్ల.
242. స్వర్గలోకము, నరకలోకము అంటే ఏమిటి? ఇంతకు అవి ఉన్నాయా?
జవాబు:
ఎక్కడ సుఖము కలుగుచున్నదో అదే స్వర్గము. ఎక్కడ కష్టము అనుభవింపబడుచున్నదో అదే నరకము. ఇవి
రెండు భూమి మీదనే చూస్తున్నాము. ప్రతి దినము మనము అనుభవిస్తున్నాము. ఇంత తప్ప ఏ లోకము ఎక్కడ లేవు.
243. మానవుడు మరణించిన తర్వాత మానవ జన్మగ పుట్టునా?
జవాబు:
పుట్టవచ్చును, పుట్టక పోవచ్చును అది వారువారు చేసుకొన్న కర్మను బట్టి ఉండును.
యమ్. మారుతినాయుడు, కూచివారిపల్లి.
244. ప్రపంచ జనాభా పెరుగుచున్నది కదా! వచ్చే క్రొత్త జీవులు ఎక్కడివి?
జవాబు:
వారు క్రొత్త జీవులు కారు పాత జీవులే. మిగతా జీవరాసుల జన్మల నుండి మానవ జన్మకు వచ్చిన వారని
తెలియవలయును.
కె. జయచంద్రా రెడ్డి, రామనగర్, అనంతపురము.
245. ప్రతి పనికి కర్మ వలన ప్రేరేపితమైన గుణములే కారణమని మీరు తెల్పారు. కొందరు పెద్దలు అన్నిటికి
పరమాత్మయే మూల కారణము పరమాత్మయే సమస్తాన్ని కదిలిస్తున్నాడని అన్నారు. పరమాత్మ కదిలిస్తున్నాడా?
గుణములు కదలిస్తున్నవా?
జవాబు:
సమస్తము పరమాత్మ వలన పుట్టినవే, పరమాత్మ లేనిది ఏది లేదు, ఏది కదలదు. వివరముగ తెలుసుకొంటే
పరమాత్మ ప్రకృతి చేతనే అన్నిటిని కదలించుట వలన మూల కారణము పరమాత్మ అనుట తప్పులేదు. వివరిస్తు పోతే
ప్రకృతిలో తయారైనవి గుణ కర్మలు. ఇవి అవినాభావ సంబంధము కలవి. గుణముల వలన కర్మ ఏర్పడడము, కర్మ
వలన గుణములు కదలడము జరుగుచుండును. కర్మ వలన ప్రేరేపితమైన గుణముల చేతనే సమస్త శరీరములు
కదలుచున్నవి. అందువలన
"ప్రకృతేః క్రియ మణాని గుణైః కర్మాణి సర్వశః" ప్రకృతిచే తయారైన గుణముల చేతనే సర్వ పనులు జరుగుచున్నవని
గీత మూడవ అధ్యాయములో 27వ శ్లోకమున కూడ చెప్పబడినది. మరియొక చోట 18వ అధ్యాయములో జంత్రగాడు
బొమ్మల నాడించురీతిగ సమస్త ప్రపంచమును ఆడించుచున్నానని అన్నాడు. పరమాత్మ, ప్రకృతియనుదాని చేత
ప్రపంచములోని అందరిని నడుపుచున్నాడని తెలిసినపుడు, ప్రకృతి సంబంధ గుణముల చేత పనులు జరుగుచున్నవని
తెలియును.
246. సంకల్పము లేకుండ ఎరుక ఉన్న స్థితిని యోగమని మీరు తెల్పారు. ఎరుక ఉంటే మనస్సు ఉన్నట్లే కాదా!
మనస్సు ఉన్నపుడు యోగమెలా అగును?
జవాబు:
మనస్సు లేకుండ పోతే ఏమి తెలియని నిద్ర అవుతుంది. మనస్సు పంచేంద్రియములకు సంబంధించిన
విషయములను జ్ఞప్తికి తెచ్చుచు ఉంటే జాగ్రత్తవును. పంచేంద్రియ విషయముల ఎరుక మాని శరీరములోపలి ఆత్మ
మీద ఎరుక కల్గి ఉంటే యోగమవును. సంకల్పములు ఉన్నపుడు జాగ్రత్త అగును. సంకల్పములు లేనపుడు యోగమవును.
పూర్తి ఎరుక లేకుండ పోవు స్థితిని నిద్ర అగునని తెలియవలయును.
శ్రీలత, గడివేముల.
247. కొందరు ఆత్మహత్య చేసుకొని చనిపోతారే వాల్లు దయ్యాలవుతారట నిజమేనా? సరిపడని వారిని పట్టి
సాధిస్తారట నిజమా?
జవాబు:
నిజమే. వారు వారి ఆయుస్సు పూర్తి అయిపోవు వరకు సూక్ష్మశరీరము అనగ 15 భాగముల శరీరముతో
ఉంటారు. వారు మన మధ్యలోనే ఉంటారు. కాని వారు మనకు కనిపించరు. అందువలన వారి ఉనికి మనకు
తెలియదు. వారి దృష్టికి మనము కన్పిస్తూ ఉంటాము. ఏమాత్రము జ్ఞానము లేని వారికి వీరు పట్ట వచ్చును. కాని
జ్ఞానము ఉన్నవారికి పట్ట లేరు. "గ్రహాలు - విగ్రహాలు" అను శీర్షిక మా రచనలలోని “ప్రబోధ” గ్రంథమందు చదివితే
వాటి విషయము సంపూర్ణముగ అర్థమగును.
దండా జయరామ్, ఉరవకొండ.
248. కృష్ణుడు పుట్టినపుడు అందరిని నిద్రలో ముంచేశాడని జంతువులు కూడ నిద్రలో మునిగాయని అంటారు.
మరి ఆ సమయములో గాడిద అరవడము ఏమిటి?
జవాబు: అది మధ్యరాత్రి సమయము కావున అందరు నిద్రలో మునిగి ఉండుట సహజమే. ప్రసవము జరిగిన వెంటనే
నీవు కాపలా ఉంటూ హెచ్చరిక చేస్తూ గట్టిగ అరవమని గాడిదలాంటి మనిషికి చెప్పి ఉంటారు. అట్లుకాక నాల్గు కాల్ల
గాడిద అరిచిందని మీరు నమ్మినారా.
వెంకట్, ఉరవకొండ.
249. వియోగము అహంకారాన్ని ఎలా నశింపజేస్తుంది?
జవాబు:
యోగము అహంకారాన్ని నశింపజేస్తుంది కాని వియోగము చేయదు. అది కూడ కర్మయోగము మాత్రమే
అహంకారమును లేకుండ చేస్తుంది.
పి. వెంకటరమణ, చిలమకూరు.
250. మానవ శరీరము నుండి జీవునకు మోక్షము పొందాలంటే పరమాత్మను ధ్యానించితే మోక్షమొస్తుందా?
జవాబు: పరమాత్మను కాదు. ఆత్మను ధ్యానించాలి. పరమాత్మను ధ్యానించుటకు వీలు కాదు. భగవంతున్ని
ధ్యానించవచ్చును లేక ఆత్మను ధ్యానించ వచ్చును.
251. ప్రతి జీవి పాప పుణ్యములను శరీరమునందు అనుభవించునా? లేక శరీరము పోయిన తర్వాత
అనుభవించునా?
జవాబు:
శరీరమున్నపుడే పాప పుణ్యములు అనుభవింపబడుతాయి. శరీరము పోయిన వెంటనే తిరిగి క్రొత్త శరీరమును
ధరించును. శరీరము పోయిన తర్వాత యమలోకమను మాట అసత్యము. మరణించిన క్షణమే జన్మ కల్గుచున్నది.
కావున శరీరములోనే అనుభవించవలసి ఉన్నది.
252. శ్రీ మహా విష్ణువుకు 10 అవతారములంటారు.
జవాబు:
కలియుగములో ఎన్ని అవతారములు ఎత్తినాడు?
విష్ణువు శివుడు అన్నది పురాణాలు, శాస్త్రము కాదు. యోగశాస్త్రము ప్రకారము "ద్వౌ భూత సర్గా లోకేస్మిన్ దైవ
అసుర ఏవచ" అన్నట్లు భూమి మీదనే రెండు రకముల జీవరాసులు ఉద్భవించుచున్నవి. ఆ రెండు రకముల పేర్లు
దేవతలు రాక్షసులు. మానవులలోనే గుణములను బట్టి దేవతలు రాక్షసులను వారున్నారు, భూమి మీదనే అన్ని
లోకములున్నవి. ఎవని లోకము వానిదని మనము ఎన్నో సందర్భములలో వారి వారి ధ్యాసలను బట్టి అంటుంటాము.
మా మాటలు కొంత విరుద్ధముగ ఉన్నను యదార్థ సత్యములు. ఈ మాటలు శాస్త్రబద్దమైనవి కూడ. కావున విష్ణువు
అవతారములు అను విషయము విడచి పరమాత్మ, ఆత్మ, జ్ఞానము అనునవి తెలుసుకోవాలని కోరుచున్నాము.
కె. సోమప్ప, యర్రగుంట్ల.
253. దంభో దర్పోభి మానశ్చ క్రోదః పారుష్య మేమచ
అజ్ఞానం చాభి జాతస్య పార్థ! సమ్పదమాసురీమ్
ఈ శ్లోకమునకు సరియైన అర్థము మీరు ఏ విధముగ తెల్పెదరో తెలుసుకోవాలని ఉన్నది.
జవాబు:
పై శ్లోకమునందు అర్థము చాల సులభముగ అందరికి అర్థమగులాగుననే ఉన్నది. కాని మీరు ప్రత్యేకించి
అడిగారు కావున తెల్పుచున్నాము. దంబ, దర్పములు, కఠినత్వము, క్రోధాభి మానములు, అజ్ఞానము మొదలైనవి
భూమి మీద రాక్షస తెగకు చెందిన మనుజులకుండునని భావము. ముఖ్యముగ తెలుసుకోవలసి ఉన్నదేమనగా!
దేవతా గుణములకు, రాక్షస గుణములకు సంబంధములేని యోగులకు పై శ్లోకము యొక్క భావము వర్తించదు.
గుణముల వలన కర్మ అంటుకొనువారికి మాత్రమే మంచి చెడ్డ, పాప పుణ్య, దేవత రాక్షస అను నిర్ణయము యోగశాస్త్రరీత్యా
ఏర్పడినది. అదే శాస్త్రములో కర్మ యోగులకు గుణ సంబంధము ఉన్నను కర్మ అంటదని తెలుపబడినది. గుణముల
ఫలితమైన కర్మలు అంటని వారు గుణాతీతులు. గుణములతో పని చేయుచున్నప్పటికి దానికి అతీతముగ ఉంచునది
కర్మ యోగము. ఏ శ్లోకము ఎవరికి వర్తించుననుట ముఖ్యముగ తెలియవలసి ఉన్నది. అట్లు లేక పోతే దైవాసుర
సంపద్వి భాగ యోగములోనే 19వ శ్లోకమున చెడ్డ వారిని, కౄరులను, అధమ జన్మలలో చిక్కుకొనునట్లు జేతు అనిన
కృష్ణునికి కూడ కోపమున్నట్లు, అసుర గుణమైనట్లు, ఆయన కూడ అసుర తెగకు చెందిన వానిగ లెక్కింపనగును.
ఆయనకే కాదు. ముక్కోపి అని పేరుగాంచిన దుర్వాస, విశ్వామిత్ర మొదలగు వారు కోపముతో శాపముల నొసగిన
ఎందరో పెద్దలను కూడ అసుర తెగగ లెక్కింపనగును. అట్లు కాక ఈ శ్లోకము కర్మలు అంటు మనుషులకు చెప్పబడినదని
కర్మలను తమ జ్ఞానాగ్నితో భస్మీపటలము చేయు యోగులకు కాదని తెలియవలయును.
రాము, కర్నూల్.
254. భర్త అంటే భరించువాడని కదా అర్థము. భార్య భర్తలు ఇద్దరు కర్మ జీవులుగ భూమి మీదకు వచ్చినపుడు
భర్త ఎట్లు భరిస్తాడు?
జవాబు:
భరించువాడు భర్త అనుమాట నిజమే, సర్వ జీవులను భరించువాడు దేవుడే. కనుక ఆయనే అందరికి
నిజమైన భర్త, స్త్రీలకు పురుషులకు దేవుడే భర్త. బాహ్య దృష్టితో స్త్రీ శరీరమునకు తిండి పెట్టి పోషించి భరించువాడు
మగవాడు కనుక భర్త అంటున్నామని, మగవారి చేత భరింపబడు స్త్రీని భార్యని అంటున్నామని కొందరు అంటున్నారు.
భరించువారు భర్తలు, భరింపబడువారు భార్యలను సూత్రము ప్రకారమైతే కొందరు మగవారు ఇంటిలో కూర్చుంటే,
వారి సతీమణులైన వారే వారిని పోషించి భరిస్తున్నారు. అపుడు సూత్రము ప్రకారము ఆ సతీమణులనే భర్తలనాలి,
పతులనే భార్యలనాలి. బాహ్య దృష్టితో భర్త అనుపదము మగవారికి తగిలించుకొనిన, సూత్రము ప్రకారము ఒక్కొక్కప్పుడు
అర్థము తల్లక్రిందులవుతుంది. కావున పూర్వము పరమాత్మను భర్తని, ప్రకృతిని భార్యని అనెడివారు. తాలి కట్టిన
వారిని “పతి” అని కట్టించుకొనిన వారిని “సతి” అని పిలిచెడివారు. కాల క్రమేపి “సతి పతులు” భార్య భర్తలైనారు.
బి. రవీంద్ర రెడ్డి, చెన్నేకొత్తపల్లి.
255.రావణాసురునికి పది తలలున్నాయని రామాయణములో వ్రాసినట్లు ఉన్నది. అలా ఉన్నాయా?
జవాబు: మనము మాటల సందర్భములో తెలివైన వానిని గూర్చి వీనిది పెద్ద బుర్ర అనియో లేక వీనిది పెద్ద తలకాయ
అనియో అంటుంటాము. పెద్ద బుర్ర, తల అని అన్నంత మాత్రమున వానికి నిజముగ తల లావుగ ఉండదు కదా!
అట్లే రావణాసురునికి పది తలలన్నారు. పది మందికున్న తెలివి అతనికొక్కనికున్న దని కాని పదితలలు లేవని దాని
అర్థము. అలా పది తలలుంటే అతను చక్కగ పడుకొని చక్కగ లేవవలసి ఉన్నది. ఇటు అటు తిరిగే దానికి కూడ
తలలు అనుకూలించవు. ఒక తల ఉన్న మనకే పళ్లుతోముకొనే దానికి, ముఖము కడుక్కోవడానికి, నూనె పెట్టి తల
దువ్వుకోవడానికి కనీసమంటే అర్థగంట పట్టును. ఇక పది తలల రావణునికి ఐదు గంటలు పట్టును. మిగత పనులు
ఆయనెప్పుడు చేసుకోవాలి? అందువలన ఆయనకు మన మాదిరి ఒక తల తప్ప పది లేవని తెలియవలయును.
256. త్రేతా యుగములో శ్రీరాముడు భగవంతుడని కొందరి వాదన అది నిజమేనా?
జవాబు:
శ్రీ రాముడు విష్ణువాంశ చెందిన వాడే కాని భగవంతుడు కాదు. పరమాత్మ అంశతో పుట్టిన వాడు భగవంతుడని
తెలియాలి.
గడుగు క్రిష్ణమూర్తి, బనగానిపల్లె.
257. స్వామి! నాల్గు యుగములకు ఏది మొదలు? దేవుని పగలు ఎన్ని యుగములు, రాత్రి ఎన్ని యుగములు
తెలుప ప్రార్థన.
జవాబు:
నాల్గు యుగములలో మొదటిది కృతయుగము. పరమాత్మకు పగలు వేయి యుగములు, అట్లే రాత్రి వేయి
యుగములు గలవు. పరమాత్మ పగలు మాత్రమే మనకు 108 కోట్ల సంవత్సరములని తెలియాలి.
ఎ.జి. రవి, చిత్తూరు.
258. అకస్మాత్తుగ మరణించిన వారికి అవసానదశ కల్గుతుందా?
జవాబు:
అకస్మాత్తుగ మరణించువారికి అవసాన దశ లేదు. వారికి సూక్ష్మ శరీరములో మరణమాసన్నమైనపుడు
అవసానదశ కల్గును.
టి, సత్యగోపాలాచార్యులు, నరసాపురము.
259. ప్రళయ కాలములో ప్రపంచముండినదా లేదా?
జవాబు:
పంచభూతములు లేకుండ పోవడమే ప్రళయము కావున అప్పుడు ప్రపంచములేదు.
260. భగవంతుని స్వరూపము పెరుగుట తరుగుట లావెక్కుట చిక్కిపోవుట మొదలగు మార్పులు కలుగునా?
జవాబు:
శరీరము ధరించినపుడే కదా భగవంతుడనేది. పద్దతి ప్రకారము భగవంతుని శరీరమునకు కూడ పెరుగుట
తరుగుట ఉండును. భగవంతునికి కూడ కర్మ ఉండును కావున అన్ని ఉండునని చెప్పవచ్చును.
261. ద్విజుల పురుషులకే గాక స్త్రీలకు శూద్రులకు ఉపనయన సంస్కారములు సంధ్యావందన వేదాధ్యాయన సర్వ
కర్మలు ఆచరించుటకు హక్కు కలదా?
జవాబు:
అందరికి హక్కు ఉన్నది. దేవుని దృష్టిలో అందరు సమానులే.
ఆర్. రంగస్వామి, హిందూపురము.
262.మనిషి చనిపోయిన తర్వాత కాకికే పిండా కూడు ఎందుకు పెట్టాలి? మిగత పక్షులకు పెట్ట కూడదా?
జవాబు: అన్నమును అన్ని పక్షులు తినవు. అన్నముతినే అలవాటు కాకికి మాత్రమే ఎక్కువగ ఉన్నది. పైగా స్మశానమునకు
ఎగిరి రాగలిగేది అది ఒక్కటే కావున అదే తింటూ ఉన్నది. కాని ఇతర పక్షులకు పెట్టకూడదని ఏమి లేదు. స్మశానానికి
కోళ్ళను ఎత్తుకొని పోయిన అవి కూడ పిండాకూడును తినగలవు.
షరీఫ్ ఖాన్, యాడికి.
263. కొందరు దేవతల మహత్యములను ప్రచారము చేస్తు మాకు కరపత్రములు పంపారు. ఆ పత్రములను
చూచిన మేము కూడ అలాగే కరపత్రములను అచ్చువేసి కొందరికి పంపవలెనని అందులో నిబంధన ఉన్నది.
అట్లు చేయుట సమంజసమేనా? దాని మీద మీ ఉద్ద్యేశము తెలుపవలెను?
జవాబు:
ఇటువంటి కర పత్రములు చాలా మార్లు మేము చూచాము. అందులో దైవికముగ ముందుకు పోవు మార్గము
ఏమి లేక పోవడమేకాక స్వార్థము ఆశ తప్ప ఏమి కనిపించడము లేదు. అందువలన అట్లు చేయుట కొందరికి నచ్చిన
మాకు మాత్రము నచ్చదు. ఆ పని చేయక పోవడము వలన వచ్చే నష్టము కష్టము ఏమి ఉండదు.
యస్.యన్. బాష, నందివర్గము.
264. ఇచ్చిన ప్రతి ప్రశ్నకు ప్రతి వారికి సూటిగా సమాధానము ఇస్తున్నారు. కనుక మీ గతాన్ని గురించి
తెలుసుకోవడము మీకేమైన అభ్యంతరమా?
జవాబు:
గతాన్ని దాచుకోవడము వలన లాభము లేదు, కనుక మాకేమి అభ్యంతరము లేదు. నేను అందరిలాగ పుట్టిన
వాడినే. అందరిలాగ కష్ట నష్టములు సుఖదుఃఖములు అనుభవించినవాడినే, భార్య పిల్లలతో పాటు మీలాగ సంసారములో
ఉన్నవాడినే, మొత్తము మీద ప్రపంచపరముగ మీకు మాకు ఏమి తేడా ఉండదు.
265. మీరు ఏమి చదువుకున్నారు?
జవాబు:
మేము ప్రపంచ చదువులైన డిగ్రీలు చదువ లేదు. కాని పరమాత్మ చదువైన బ్రహ్మవిద్యను ఎవరు ఊహించలేనంత
చదువుకోలేదు. ఎచ్చట వినలేదు కాని చెప్పలేనంత నేర్చుకొన్నాను.
266. మీకు ఆలు బిడ్డలు లేరా? మీ వయస్సు ఎంత?
జవాబు:
ఎందుకు లేరు నలుగురు కుమారులు కూడ ఉన్నారు. నా వయస్సు 2002 ఏప్రిల్ 5వ తేదికి 51 దాటి 52 చేరింది.
267. మీకు తల్లి దండ్రులు పెట్టిన పేరేమిటి? మీరు ఇంతటి జ్ఞానాన్ని గురించి ఎలా చెప్పగలుగుచున్నారు.
జవాబు: తల్లి దండ్రులు పెట్టిన పేరు పెద్దన్న. గురువు పెట్టిన పేరు మీకు తెలుసుకదా! శ్రద్దను బట్టి జ్ఞానము,
ఆచరణను బట్టి అనుభవము వస్తుంది. ఆ రెండు మాలో ఉన్నాయి. కావున అనుభవమైన జ్ఞానాన్ని మీకు మేము
చెప్పుచున్నాము.
268. చేతిలోని రేఖలు మనిషి భవిష్యత్తును నిర్ణయించునా?
జవాబు:
ప్రపంచములో ఎన్నో రకాల అనుభవాలు జీవిత నడకలు కలవారున్నారని మనకు బాగ తెలుసును కదా! అన్ని
రకములుగ చేతిలో రేఖలున్నాయా? లేవు. రేఖలు బట్టియే జీవితాలుంటే అందరి చేతులలోను కొన్ని భేదములు కల్గిన
రేఖలేవున్నాయి. కావున కొన్ని రకముల భేదములు కల్గిన జీవితాలే భూమి మీద ఉండాలి. అలా లేవు కదా! ఎన్నో
రకములుగ మనుజుల జీవితాలున్నవి. కావున చేతి రేఖలను బట్టి భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తంతా జ్యోతిష్య శాస్త్రము
ప్రకారము నవగ్రహములను బట్టి నిర్ణయింపదగును.
269. మనిషి పాపము చాలా పవర్ఫుల్ దశలో ఉన్నపుడు మనిషి జంతువుగ పుట్టగలడా?
జవాబు:
కర్మ వలన జన్మలు కావున పాపము ఎక్కువున్నపుడు మనిషి జంతువుగ, పుణ్యము ఉన్నపుడు జంతువు మనిషిగ
పుట్టవచ్చును. కాని మనిషి జన్మకంటే జంతు జన్మ, జంతు జన్మకంటే వృక్ష జన్మ దేవునికి దగ్గరగా గలవని తెలియాలి.
270. కొందరు ఆడ మగ అందవికారముతో చాలా మానసిక వ్యథ పొందుతుంటారు. వీరు జరిగిన జన్మలో
శిక్షార్హనీయులా?
జవాబు:
జరిగిన జన్మలో చేసుకొన్న పాపమును బట్టి ఈ జన్మలో శిక్షార్హులై బాధను అనుభవిస్తున్నారు.
యమ్. రాబియాబి (బి.పి.సి.), చియ్యేడు.
271.ఈ దిగువనున్న శ్రీ వేమన గారి పద్యములోని అంతరార్థమేమిటో తెల్ప ప్రార్థన.
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభి రామ వినుర వేమా.
జవాబు: భావము : మానవుని శరీరము లోపల జీవుడు నివాసమున్నాడు. లోపలనున్న జీవునికి బయటి ఇంద్రియముల
ద్వార ప్రపంచ విషయములు తెలియుచున్నవి. ఇంద్రియాలు మనస్సు ద్వార ప్రతి విషయమును జీవునికి చేరవేయుచున్నవి.
ఆ విధముగ విషయములు చేర వేయు ఇంద్రియ భాగములు ఐదు మాత్రము కలవు. వాటినే జ్ఞానేంద్రియములను
చున్నాము. అవి 1. కన్ను, 2. చెవి, 3. ముక్కు, 4. నాలుక, 5. చర్మము. పంచ జ్ఞానేంద్రియముల ద్వార వచ్చు
విషయములను అనుభవించుచు, జీవుడు ఎడ తెరపిలేని కర్మననుభవిస్తు, తేనెలో చిక్కిన ఈగ మాదిరి అల్లాడు
చున్నాడు. పంచేంద్రియముల విషయములు, సుఖమును చూపి కష్టమును కలుగజేయునవి. జీవాత్మ పంచేంద్రియ
విషయ వాసనలకు లోనయి కర్మములను సంపాదించుకొనుచున్నాడు.
చర్మ స్పర్శ వలన కలిగెడు కర్మను చెప్పులోని రాయి అన్నారు. చెవి శబ్ద విషయము వలన గలిగెడు కర్మను
చెవిలోని జోరీగ అన్నారు. కంటి దృశ్య విషయము వలన గలిగెడు కర్మను కంటిలోని నలుసు అన్నారు. ఇంద్రియ
విషయములు మనస్సు వలననే అనుభవమున కొచ్చును. కావున మనస్సును ముల్లుగ వర్ణించారు. శరీరములో అన్ని
ఇంద్రియముల విషయములు అనుభవమునకొస్తున్నవి. కావున శరీరమును ఇల్లుగ చెప్పి అనుభవములను పోరుగ
పోల్చి ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని అన్నారు. ఇది శరీరాంతర్గతముగ చెప్పిన విషయము.
మచ్చా వెంకటరామయ్య, ఉరవకొండ.
272. శ్రాద్ధ కర్మలు మూఢ నమ్మకాలా?
జవాబు:
అర్థము తెలియకుండ చేయువారికి శ్రాద్ధకర్మలు మూఢనమ్మకాలే అవును. అర్థము తెలిస్తే మోక్షము పొందినవారికి
చేయు ఆచరణలుగ ఉన్నవి. మోక్షము పొందని వారికి చేయడము వ్యర్థము.
273. ప్రకృతులేవి ఎన్ని? వాటి విశ్లేషణ గురించి తెలియజేస్తారా?
జవాబు:
ప్రకృతి ఒక్కటే ఉన్నది. అది ఐదు భాగములుగ విభజింపబడినది.
1. ఆకాశము, 2. గాలి, 3. అగ్ని, 4. నీరు, 5. భూమి. ఆ ఐదు భాగములు వరుసగ
ఈ ఐదు భాగములను కలిపి ప్రకృతి అంటున్నాము.
ప్రకృతి ఒకటి చర, అచర అను రెండు రకములుగ ఉన్నది.
జి. సుబ్రమణ్య రెడ్డి, తిరుపతి.
274. ప్రాణాయామము అంటే ఏమి?హఠ యోగమంటే ఏమి? వాటి కొకదానికొకటి సంబంధమున్నదా?
జవాబు:
ప్రాణాయామము అంటే ఊపిరిని బిగ పట్టి నిలిపి వేయుట, పట్టుదలగ కష్టముతో చేయు దానిని హఠ
యోగమంటారు. ప్రాణాయామము పట్టుదలతో కష్టముగ చేయు పనియే కావున ప్రాణాయామమును హఠ
యోగమనవచ్చును. హఠ యోగమనునది చేయు పద్ధతికున్న పేరు మాత్రమే. కావున మొండిగ కష్టముగ చేయు
పద్ధతులన్నిటిని హఠ యోగమునకు సంబంధించినవేనని తెలియవలయును.
మావిళ్ళపల్లి గౌరి శంకర్, నంద్యాల.
275. రాజయోగము మూడు విధములని అవి సాంఖ్య, తారక, అమనస్కములని విన్నాము. వీటిని వివరించి
చెప్ప ప్రార్థన.
జవాబు:
రాజ యోగము మూడు విధములనుట తప్పు. రాజ యోగము మారు పేరు సాంఖ్య యోగమనవచ్చును.
అమనస్క తారక యోగములు రెండు బ్రహ్మ యోగమునకు సంబంధించినవి. మనస్సు నిలుపుటయే బ్రహ్మయోగము.
మనస్సును ప్రపంచ సంబంధము నుండి లేకుండ చేయడము అమనస్కమంటారు. శ్వాసను నిలుపుట తారకమంటాము.
తారకము ద్వార కూడ మనస్సే నిలిచి పోవును. కావున అమనస్కమనిన తారకమనిన బ్రహ్మ యోగమునకు
సంబంధించినవే. ఇక పోతె సాంఖ్యమనగా శరీర అంతరేంద్రియ బాహ్యేంద్రియ వివరము తెలుపుచు పోవునది. అట్లు
శరీర యంత్రాంగములో ఏది ఏమి చేయుచున్నదని తెలిసి చివరకు అహంకారమును దాని పాత్రను తెలిసి, దానిని
నిలిపి వేయడమే రాజ యోగము. కావున రాజ యోగమును సాంఖ్య యోగమని కూడ అనవచ్చును. గృహస్థులకు
సాధ్యపడునది రాజయోగమని తెలియవలయును.
సి.వి. రమణ, జి. సుబ్రమణ్యం, ఎన్. సత్యనారాయణ,
ఎన్. మల్లికార్జున, గడివేముల.
276. బ్రహ్మ దేవునికి మూడు తలలున్నాయని మాస్నేహితులు వాదించారు. ఈ సందేహాన్ని తీర్చవలెను.
జవాబు: బ్రహ్మ దేవునికి మూడు తలలు కాదు నాలుగు తలలని కూడ అంటున్నారు, చతుర్ముఖుడని అంటుంటారు.
పరమాత్మ సృష్టించిన సృష్టిని పురాణ రూపముగ బ్రహ్మదేవుడు పుట్టించువాడని, కర్మ జరిపించు జీవితములను విష్ణువు
జరిపించు చున్నాడని, శివుడు చంపుచున్నాడని వ్రాశారు. అలా వ్రాసిన దానిలో బ్రహ్మ దేవునికి నాల్గు ముఖములున్నవని
ఒక్కొక్క ముఖము ద్వార ఒక్కొక్క రక అండజ, పిండజ, ఉద్భిజ, స్వేదజ అను రకములను పుట్టించుచున్నాడని పురాణవాదన,
శాస్త్రపద్ధతి ప్రకారము పరమాత్మ సృష్టికర్తని, ఆ పరమాత్మ కర్మననుసరించి జన్మలు కలుగునట్లు చేశాడని ఉన్నది.
శాస్త్రము నిరూపణకు వచ్చునది, పురాణము కేవలము కల్పితము కావున నిజము కాదు. బ్రహ్మదేవునికి మూడు గాని,
నాల్గు గాని తలలు లేవు. కవుల కలాలకు పుట్టే తలలు ఎన్నియైన ఉండవచ్చును. దైవసృష్టిలో ప్రతి ఒక్కరికి ఒకే తల
అని తెలియాలి.
277. కలియుగము క్రీ. శ. 2000 సంవత్సరముల నాటికి ప్రపంచము అంతమగునని 18-03-1989 తేదీన
పేపరులో ఒక పరిశోధకుడు సవాలు చేసి చెప్పాడు అది నిజమా?
జవాబు:
కలియుగము 4,32,000 సంవత్సరములు పూర్తి గడవాలి. కాని ఇపుడు 5,150 సంవత్సరములు మాత్రమే
గడిచినది. ఖగోళశాస్త్రమే పూర్తి తెలియక దానిని గురించి పరిశోధన చేసుకొంటూ వారు కనుగొన్న దానినే అతిక్రమించి
ఇంకొక దానిని కనుగొనుచున్నారు. మొదటి పరిశోధన తప్పని వేరొక దానిని కనుగొను చున్నారు. మొదటి పరిశోధన
తప్పని దాని కంటే భిన్నముగ ఉన్న ఫలితము తేలిందని పేపరులో వేయడము చూస్తూనే ఉన్నాము కదా! కావున
యోగశాస్త్ర పద్ధతి ప్రకారము ప్రపంచములో క్రీ॥శ॥ 2000 సంవత్సరములకు ప్రపంచము అంతము కాదు. పూర్తి
ప్రళయము వచ్చుటకు 108 కోట్ల సంవత్సరములు గడవాలి.
పల్లా విశ్వనాథం, ఆళ్ళగడ్డ.
278. పరమాత్మ నిరంతరము ఉన్నాడని విన్నాము. ఆయనకు వేయి యుగములు రాత్రి, వేయి యుగములు
పగలు అని మీరు మార్చి పత్రికలో తెలిపారు. ఇట్లు కాల ప్రమాణము జరిగినపుడు ఆయనకు కూడ ఆయుస్సు
ఉన్నదని మాబోటివారు అనుకోవాలి. ఆయనకు ఆయుస్సు లేదని మేము విన్న మాట నిజమా? మీరు వ్రాసినది
సత్యమా?
జవాబు:
జవాబు అనేది శాస్త్రబద్ధముగ ఉండాలనే మా వాదన. అలా శాస్త్రబద్ధము కానపుడు అది సత్యము కాదని
ఎన్నో మార్లు తెలియజెప్పాము. మేము మార్చి నెల పత్రికలో వ్రాసినది వేయి యుగములు పగలు వేయి యుగములు
రాత్రి అనుమాట భగవద్గీతా శాస్త్రములోని విషయమే కదా! మేము కల్పించి వ్రాసినది కాదు కదా!! పరమాత్మ
నిరంతరము లేనివాడని మేము చెప్పలేదు కదా!!! అందులో ప్రకృతికి ఆయుస్సు చెప్పబడినది కాని ప్రకృతికంటే
అతీతుడైన పరమాత్మకు ఆయుస్సు చెప్పబడలేదు. పరమాత్మకు ఆయుస్సు లేదు. ఇంతని ఎవరు నిర్ణయించలేదు.
నిర్ణయించువారు లేరు, పరమాత్మ తనకొక పగలు ఒక రాత్రి అను కొలత ప్రకారము ప్రపంచ ఆయుస్సు నిర్ణయించాడు.
కాని తన కింత ఆయుస్సని చెప్పలేదు. మేమిచ్చిన జవాబును సరిగ అర్థము చేసుకోలేక పరమాత్మకు ఆయుస్సున్నట్లే
కదా! మీరు చెప్పినట్లే కదా అంటే నేనెక్కడ చెప్పాను? మీరు ఎంత ఆయుస్సని అనుకున్నారు? పరమాత్మకు
ఆయుస్సు లేదన్నమాట సత్యము. అందులకు భిన్నముగ మేము ఎక్కడ ఏ సందర్భములో చెప్పలేదు.
వి. క్రిష్ణారెడ్డి, గౌనిపల్లి.
279. జీవునకు అవసాన దశయందు బ్రహ్మనాడి వరకు చైతన్యశక్తి లేదన్నారు. జీవుడు మత్తు సేవించి మత్తులో
ఉండినపుడు బ్రహ్మనాడి వరకు చైతన్యము లేనట్లేనా?
జవాబు:
మత్తు సేవించినపుడు జీవుడు మత్తులో ఉండినప్పటికి చైతన్యము శరీరమంత ఉండును. చైతన్యము వెనక్కు
ముకిలించుకొని బ్రహ్మనాడిలోని ఆరు నాడి కేంద్రములను కూడ వీడి పోవునది రెండే రెండు సందర్భములలో జరుగును.
1. జీవుడు బ్రహ్మ యోగములో ఉన్నపుడు, 2. జీవుడు మరణావస్థ చేరునపుడు. ఈ రెండు సందర్భములు కాక మిగత
ఏ పరిస్థితిలోను చైతన్యము బ్రహ్మనాడిలోని ఆరు కేంద్రములను వదలదు.
పి.వి. చలపతి, కర్నూలు.
280. సూక్ష్మశరీరము యొక్క ఆయుస్సు అయిపోయి, స్థూలశరీరము యొక్క ఆయుస్సు ఉంటే అపుడు ఆ జీవి
యొక్క గతి ఏమి?
జవాబు:
సూక్ష్మము నాధారము చేసుకొని స్థూలము ఉన్నది కాని స్థూల మాధారముతో సూక్ష్మము లేదు. స్థూలము
జడము, స్థూలమును ఆడించునది సూక్ష్మము. సూక్ష్మములేనపుడు స్థూలము లేదు. సూక్ష్మమెపుడై పోవునో అపుడు
వేరొక జన్మకు పోవలసి ఉండును. సూక్ష్మమైపోకపోతే అయిపోవు వరకు స్థూలము లేకుండిన సూక్ష్మరూపముతోనే
అదే జన్మలో ఉండవచ్చును.
281. మంత్రము అనగానేమి? యంత్రము అనగా నేమి? వీటి వల్ల ఉపయోగములు ఉన్నావా? కర్మ
సిద్దాంతములో వీటికి స్థానమున్నదా?
యమ్. అంజనేయులు, కరీంనగర్.
జవాబు: మంత్రమనగా భాషాక్షరముల వరుస క్రమమైనది మరియు మహిమగలది. యంత్రమనగ ఒక శక్తిని ఉత్పత్తి
చేయునది. యంత్రములు పరికరములచే నిర్మింపబడునవే కాక భాషాక్షరముల చేత కూడ నిర్మింపవచ్చును. వీటి
వలన ఉపయోగములు కలవు. మంత్రము వలన మహిమతో కూడిన పని, యంత్రము వలన మానవుని చేత కాని పని
జరుగుచున్నది. మంత్ర యంత్రములన్ని కర్మ సిద్ధాంతములకు లోబడి ఉన్నవే కాని అతిక్రమించి ఉండునవి కావు.
ఒక్క జ్ఞాన మొక్కటే కర్మనతిక్రమించి ఉండును. మంత్రమనగ మహిమ గలది, యంత్రమనగ శక్తి కలది అని అర్థము.
282. ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి సంతతి పిండ ప్రదానములు చేయుదురు. అదే విధముగ
సంవత్సరీకములు కూడ చేయుదురు ఎందులకు?
జవాబు:
యోగశాస్త్రములో జీవుడు చనిపోతే మరుజన్మకు పోవునని ఉన్నది. కాని వారి సంతతి ఇచ్చు పిండ ప్రదానముల
కోసము అచ్చటనే ఉండునని లేదు. మోక్షము పొందిన వారికి పిండ ప్రధానము చేయాలి, అందరికి చేయకూడదు.
ఈ విషయము తెలియాలంటే మా రచనలలోని “ఇందూసాంప్రదాయములు" అను పుస్తకము చూడండి.
283. పిండ ప్రధాన కర్మతంత్రములు తల్లితండ్రులకే కాక తాతముత్తాతలకు కూడ చేయుచున్నారు. నాకు
తెలిసినవారు కొందరు వారికున్నా లేక పోయిన అప్పులు చేసి సంవత్సరీకములు చేయుచున్నారు. అసలుకు వారు
ముత్తాతలను చూచి కూడ ఉండరు. అలా చేయడము అవసరమా?
జవాబు: ఆ విధముగ చేయకపోతే ఏదైన తమకు ముప్పు వస్తుందేమోనను భయముతో తప్ప భక్తితో ఎవరు చేయడము
లేదు. వారి పెద్దలు చనిపోక ముందు పలానా పదార్థము తినాలని కోరినప్పటికి పెట్టనివారు చనిపోయిన తరువాత
దినాల పేరుతో పెద్దలకని కాకుల గ్రద్దలకు పెట్టుచున్నారు. అదే చనిపోక ముందు పెట్టి ఉంటే తిని తృప్తిపడేవారు
కదా! పెద్దలు చనిపోక ముందు వచ్చిన రోగమునకు ఐదు పైసాలు ఖర్చు చేయనివాడు చనిపోయిన తర్వాత కర్మతంత్రాలకు
ఐదువేలైన ఖర్చు చేస్తున్నాడంటే అర్థముందా మీరే యోచించండి. పెద్దలు చనిపోకముందు ఏనాడు నమస్కరించనివాడు
చనిపోయిన తర్వాత గోరీకి నమస్కరిస్తున్నాడంటే ఏమైన అర్ధముందా? పెద్దలు బ్రతికి ఉన్నపుడు గుడ్డలుకొని
ఇవ్వనివాడు వారు చనిపోయిన తర్వాత జతల గుడ్డలు పెట్టడములో అర్థమేమున్నది? ఇతరులు పెట్టిన భయము
వలన తనకు తెలియని దాని వలన ఈ కర్మ తంత్రము మానవుడు చేయుచున్నాడే కాని వేరు అర్థము ఏ మాత్రము
తెలియదు. చనిపోయిన వారికి కర్మ తంత్రాలను పేరుతో ఈ అర్ధము లేని పనులు చేయుటకంటే వారు బ్రతికి
ఉన్నపుడే సంవత్సరమునకు ఒకమారు వారికి మంచి తిండి, మంచి గుడ్డలు పెట్టి భక్తితో నమస్కరించితే వారికి తృప్తి
వీరికి భక్తియైన కుదురుతుంది. ఇందూ ధర్మములో కాలమైనవారికి అనగా మోక్షము పొందిన వారికి కర్మతంత్రాలు
చేయవలెను. అది తెలియక అందరికి చేయడము అర్థములేని పని.
కె. మదుసూదన, ధర్మవరము.
284. ఒక వ్యక్తి మరణించినపుడు అతనిని స్మశానమునకు ఎత్తుక పోయేటపుడు శవానికి బొరుగులు చల్లుతాపోతారు
ఎందుకు?
జవాబు:
ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క అలవాటు పెట్టుకొన్నారు. రాగులు చల్లుతుపోయే వారిని కూడ మేము చూచాము.
ఎందుకలా చల్లాలని మేము అడిగినపుడు “స్మశానమునకు పోయిన వారు భూతమై తిరిగి ఇంటికి రాకుండ ఉండడానికి.
వారు రావాలంటే ఇపుడు చల్లిన రాగులు కాని, బొరుగులు కాని ఏరుకుంటు రావాలి. అట్లు ఏరుకుంటు వచ్చే దానికి
చాలా సంవత్సరములు పట్టుతాయి. అందువలన వారు రాలేరు. అట్లు వారు తిరిగి రాకుండ ఉండడానికి ఇలా
చల్లుచున్నాము” అని చెప్పారు. వీరు చల్లినవి వారు ఏరాలని ఏ దేవుడు చెప్పాడో మాకు తెలియదు. చేసే వారిది తప్పు
కాదు కాని మీకు హితులమని అభూత కల్పనలు చెప్పి చేయించు వారిది తప్పు. విన్న దానిని యోచించక అర్థము లేని
వ్యర్థమైన పనులు చేయు వారిది మరీ తప్పు.
సి. లక్ష్మణ మూర్తి, చిన్నపొలమడ.
285. భక్తి శక్తి యుక్తి డబ్బు వీటిలో ఏది గొప్పది? ఎలా గొప్పది?
జవాబు:
డబ్బు ఉండిన దానిని ఉపయోగించు యుక్తి లేనిది ఏమి ప్రయోజనము లేదు. పిచ్చివాని వద్ద డబ్బు ఉన్న
ప్రయోజనము లేదు కదా! అందువలన డబ్బు కంటే యుక్తి గొప్పది. డబ్బు యుక్తి రెండు ఉండినప్పటికి శరీరములో
శక్తి లేని రోగ గ్రస్తునికి ఏమి ప్రయోజనము లేదు. యుక్తి ఉండినప్పటికి డబ్బు విలువను యుక్తి నైపుణ్యతను తాను
ఉపయోగించినప్పటికి, శక్తి కృశించి మంచములో ఉన్న వానికి డబ్బు యుక్తి ఉండినప్పటికి డబ్బు విలువను నైపుణ్యతను
తాను అనుభవించలేడు. వాని యుక్తి డబ్బు రెండు ఇతరులకు ఉపయోగపడునవే అగును, కాని శరీరములో శక్తి లేక
నామమాత్రమున్నవారికి ఏమి పనికిరావు. కావున డబ్బు యుక్తికంటే శక్తి ముఖ్యము. డబ్బు, యుక్తి, శక్తి ఉన్న వానికి
భక్తి లేక పోతే ఆ జీవితమే నిరర్థకమగును. పుట్టినందులకు అర్థమే లేకుండ పుట్టుక అను ప్రశ్నకు జవాబు లేకుండ
పోవును. జీవితము మనకంటే పెద్దయైన దేవుని తెలియుటకు గలదు. అందులకు భక్తి అవసరము. కావున భక్తి లేని
జీవితమే వ్యర్థము. ఈ విధముగ తెలుస్తు వస్తే అన్నిటికంటే భక్తియే గొప్పదని తెలియుచున్నది. ఇక్కడ ముఖ్యముగ
తెలియవలసినదేమంటే శక్తి యుక్తి డబ్బు మూడు ప్రపంచ సంబంధమైనవి, భక్తి ఒకటి పరమాత్మ సంబంధమైనది.
సుఖమయమైన జీవితము సాగుటకు ఈ మూడు అవసరమే. అట్లే జ్ఞాన మార్గములో సాగుటకు కూడ భక్తి అవసరము.
భక్తి లేనివాడు జ్ఞానమును, దైవమును పొందలేనట్లు, శక్తి యుక్తి డబ్బు లేనివాడు ప్రపంచములో రాణించలేడు.
అందువలన ప్రపంచ సంబంధమైన శక్తి యుక్తి డబ్బు, దైవ సంబంధమైన భక్తి ఉన్నవాడు మానవులలో మేటివాడని
తెలియవలయును.
జి. వెంకటనారాయణ, తాడిపత్రి.
286. మరణము అంటే ఏమిటి?
జవాబు:
జీవుని ప్రారబ్ధకర్మమంతయు అయిపోయిన తర్వాత స్థూల సూక్ష్మ శరీరములను వదలి పోవుటను మరణము
అంటారు. రణము అనగ యుద్ధము. మరణము అనగ మళ్లీ యుద్ధ ప్రారంభమని అర్థము. కొత్త సైన్యముతో జీవి.త
యుద్ధము ప్రారంభించడమును మరణము అంటారు. క్రొత్త సైన్యమనగ క్రొత్త శరీరములోని క్రొత్త ఇంద్రియములని
తెలియాలి.
287. చనిపోవుట, చచ్చిపోవుట అని అంటా ఉంటారు. ఈ రెండు పదములలో మరణమునకు ఏది సరియైన
పదము?
జవాబు:
ఈ రెండు పదములు నిజముగ తప్పే. వీటికి సత్యమైన మూల పదము “సత్తు పోవుట” అని ఉండేది.
సత్తుపోవుట అను పదము పలకడములో కొంత కాలమునకు చచ్చిపోవుటగ మారింది. అట్లే మరికొంత కాలమునకు
చనిపోవుటగ మారింది. అయినప్పటికి చచ్చిపోవుట కొంత మొరటు పదముగ, చనిపోవుట కొంత నాగరిక పదముగ
వాడుచున్నారు. ఏది ఏమైన మనము అసలైన దానిని వదలి నకిలీ పదములను పట్టుకొని ఉన్నామన్న మాట. సత్తు
పోవుట అను పదము ఎట్లు అసలైనదో వివరిస్తాము.
సత్తు అంటే సారము అని అర్థము గలదు. మన శరీరములయందు సత్యమైన సారాంశమైన శక్తి గలదు.
దానినే ఆత్మ లేక దైవము అని అంటారు. ఆ ఆత్మనే సత్తు అని కూడ అంటున్నాము. ఆ సత్తు ఉన్నంత వరకు మన
శరీరములు కదలుచున్నవి. అనగ మన శరీరములలో గల చైతన్య శక్తినే సత్తు అంటున్నామన్న మాట. సత్తు లేకపోతే
శరీరములు ఏ మాత్రము కదలలేవు. ఈ సత్తు అనే పదమునే పూర్వము సత్తువ అని కూడ అనెడి వారు. సత్తు
శరీరములో ఉన్నపుడే శరీరములో జీవుడు కూడ ఉంటాడు, శరీరము సజీవమై ఉంటుంది. శరీరములో సత్తు అనబడు
ఆత్మ ఎపుడైతే బయటకి పోవునో అపుడు జీవాత్మ కూడ శరీరము వదలి పోవుట జరుగుచున్న సత్యము. అటువంటి
శరీరమును సత్తు పోయిన శరీర మంటాము. ఒక ఆవు మరణించిందనుకోండి, పూర్వము దానిని ఆవు సత్తు పోయింది
అనెడి వారు. అట్లే ఎనుము సత్తుపోయింది, దున్న పోతు సత్తు పోయింది అనెడివారు. కాల క్రమేపి పద మార్పిడి
జరిగి ఇపుడు ఆవు చచ్చిపోయింది, ఎనుము చచ్చి పోయిందనుచున్నాము. అందువలన చనిపోవుట గాని, చచ్చి
పోవుట గాని మరణమునకు సరియైన పదములు కావు నిజమైన పదము సత్తు పోవుటని తెలియాలి.
వి. చిదానందప్ప, హోలగొంద.
288. మనిషి దైవాంశసంభూతుడంటారు. కాన మనిషికి దైవానికి గల సంబంధమేమిటి?
జవాబు:
బాహ్యముగ మనకు మన నీడకు గల సంబంధము లాగ లోపల దైవానికి జీవానికి సంబంధమున్నది. మనిషి
ఉన్నంత వరకు నీడ ఉన్నట్లు జీవాత్మ ఉన్నంత వరకు దైవము అంటి ఉంటుంది. అందువలన దైవ అంశతో కూడి
శరీరమందున్న వాడని దైవాంశ సంభూతుడన్నారు. భగవద్గీతలో కూడ దైవమును కూటస్థుడని అన్నారు. జీవుడు
ఎక్కడైతే ఉండునో వానితో పాటు కూటస్థునిగా దైవము కూడ గలదను గీతావాక్యము ప్రకారము మనిషి దైవాంశ
సంభూతుడని తెలియవలెను.
టి. ఓబుల నారాయణ రెడ్డి, చిన్న పొలమడ.
289. మన మంతట ఉపయోగించు విద్యుత్ శక్తి పుట్టుక స్థానము జనరేటర్లయినట్లు జీవరాసులలోనే కాక
విశ్వమంతట వ్యాపించిన పరమాత్మ శక్తికి కేంద్రమేది. ఏ కేంద్రము నుండి ఆ శక్తి అంతట వ్యాపించుచున్నది?
జవాబు: విశ్వవ్యాపియైన పరమాత్మశక్తికి కేంద్రము ఒక చోట అన్నది లేదు. ప్రతి అణువులోను ఒక కేంద్రమున్నది.
ప్రతి అణువులోను ఆ శక్తి కేంద్రీకృతమై ఉన్నది. కావున విశ్వమంత ఏక శక్తిగ ఇమిడి ఉన్నది.
పి. చెంచిరెడ్డి, జిల్లెల్ల
290. కొందరు చిన్నప్పటి నుండి తిక్కతో తిరుగుచుంటారు. వారికి పాపము తెలియదు పుణ్యము తెలియదు.
అహంకారము ఉండదు. అటువంటి వారికి మరు జన్మ ఉంటుందా?
జవాబు:
అటువంటి సందర్భములో వారికి క్రొత్త పాప పుణ్యములు రావు. పాత కర్మ ఆ జన్మలో అయిపోయి ఉంటే
వారికి మరుజన్మ లేదు. ఒక వేళ పాత కర్మ ఇంకా మిగులు ఉంటే జన్మ తప్పదు. తిక్కవారు కర్మ ప్రకారము ఒక
జన్మలో అలా అయి ఉంటారు. వారికి కర్మ మిగిలి ఉంటుంది. కావున జన్మ కూడ ఉంటుంది.
291. చదువు గొప్పదా? భక్తి గొప్పదా? దైవజ్ఞానము గొప్పదా?
జవాబు:
మూడిటిలోను జన్మరాహిత్యమును చేయు దైవజ్ఞానమే గొప్పది.
292. గర్వము, కోరికలను ఎట్లు చంపవలెను?
జవాబు:
సాధన ద్వారా సాధ్యమగును. అభ్యాసము పట్టుదల ఉంటే సాధ్యము కానిది లేదు. రెండు గుణములనే
అడిగారు మిగత గుణములు పది ఉన్నాయి వాటన్నిటిని జయింపవలెను.
293. మనుషులకు దేవతలు ఒల్లులోనికి వస్తుంటారు. అపుడు మనుషులు దేవతలవుతారా? అసలుకు దేవతలొస్తారా?
జవాబు: దేవతల పేర్లు చెప్పి దయ్యములు కూడ వస్తుంటాయని అవి నిజ దేవతలుకావని తెలుసుకోండి. మనుషుల
శరీరములలోనికి గ్రహాలు కాక విగ్రహాలు కూడ రావచ్చును. శరీరములో ఎవరు ఉంటే అప్పటికి వారే అవుతారు.
294. ఈ కాలములో కొందరు బాబాలు మహిమలు చూపుచుంటారు. అవి ఎట్లు చేయుచుంటారు?
జవాబు:
మేము వ్రాసిన సత్యాన్వేషి కథ చదవండి తెలుస్తుంది. చాలా వరకు మహిమలు బూటకము. బాబాలు చేసే
మహిమలన్ని మా శిష్యులలో చేయువారు కూడ గలరు. కొన్ని పచ్చి బూటకమైతే, కొన్నిటిని కనిపించని
సూక్ష్మశరీరములతో చేయిస్తారు. అవి అన్ని మనకు మహిమలవలెతోస్తాయి.
వెంకట్, ఉరవకొండ.
295. కళ అనగ ఏమిటి? దానికి మూలము ఎక్కడ?
జవాబు:
కళ అనగా ఎన్నో అర్థములు కలవు. కాని మీ ప్రశ్నకు జవాబు కళ అనగా ఒక విద్యలోని నైపుణ్యత అంటారు.
దీనికి మూలము హృదయ స్థానము. హృదయ మనగ బ్రహ్మనాడి అగ్రస్థానమని తెలియవలయును.
296. భగవానుని సాన్నిధ్యములో, భక్తుల హృదయాలలో, గుడి గంటల్లో, నిశ్చల జ్యోతిలో, అమాయకుని హృదిలో,
శ్రమ జీవుల నీడల్లో విలసిల్లే హాయి మీ పై ప్రసరించాలని నా ఆకాంక్ష?
జవాబు:
మీరు కాంక్షించడములో తప్పులేదు. కాని నేను ఆ హాయి కోసము భూమి మీదకు రాలేదు. మా జీవితమే
ఎవరికి అర్థము కాని భూమిక, (పాత్ర) పైకి హాయిగ కనిపిస్తాములోన హాయి ఉండదు. అట్లే కష్టాల్లో దుఃఖాలలో
ఉన్నట్లు కన్పిస్తాము కాని మాకు దుఃఖముండదు.
కె.వి. సత్యనారాయణ, పెనుకొండ.
297. జీవునికి ప్రతి క్షణము బ్రహ్మానందములో జీవితాన్ని కొనసాగించా లంటే ఆత్మ సాక్షాత్కారము చేసుకొన్నవారికి
మాత్రమే సాధ్యమా? నిత్య కర్మలలో అది అసాధ్యమా?
జవాబు:
ఇట్లు నిత్య కర్మలలో కాని, అట్లు ఆత్మ సాక్షాత్కారములో గాని, ప్రతి క్షణము బ్రహ్మానందము అన్న మాట
దుస్సాధ్యము. ఆత్మ సాక్షాత్కారమన్నది ఆనందము కూడ కాదు మరి బ్రహ్మానందము ఎలా అవుతుంది. నిత్య కర్మలలో
కర్మాను సారము ఎపుడైన సంతోషము కలుగవచ్చును. కాని ప్రతి క్షణము కలుగదు.
కె. హైదర్ బాషా, హంపాపురము.
298. ఈ భూమి మధుకైటభుడనే రాక్షసుని మెదడు చేత ఏర్పడిందని, అందువలన “మేధిని” అంటారని గ్రంధాలలో
వ్రాయబడినది. ఇది నిజమా?
జవాబు:
పురాణములు, శాస్త్రములు, ఇతి హాసములు (చరిత్రలు) అన్నవి ఉన్నాయి. వాటిలో మీరు చెప్పిన విషయము
పురాణములలో వ్రాయబడి ఉండును. కావున నమ్మనవసరము లేదు. భూమి ఎవరి మెదడుతో ఏర్పడినది కాదు.
భూమి ఒకటే కాక నీరు, అగ్ని, ఆకాశము, గాలి అన్నియు ఒక్క మారుగ ఏర్పడినవి. వీటి సృష్టికర్త పరమాత్మ ఒక్కడే.
299. సూర్య చంద్రులను పురాణాలలో దేవతలుగ వర్ణించారు. ఈనాడు చరిత్రలు గ్రహాలని తెలుపుచున్నవి.
ఇవి గ్రహాలా? దేవతలా?
జవాబు:
దేవతలంతా శక్తి కల్గిన గ్రహాలు. స్థూలముగ గోళాలుగ కూడ ఉన్నాయి. వాటిలో సూక్ష్మముగ జీవుడు కూడ
ఉన్నాడు. ఆ జీవుడు సూక్ష్మ శరీరముతో భూగోళము మీదికి కూడ వచ్చి మాట్లాడగలడు. అందువలన పురాణాలలో
దేవుడని వ్రాసి ఉండవచ్చును.
శ్రీ సీతారామ, ఆయిల్ మిల్, ప్రొద్దుటూరు.
300. చర్మాసనము మీద కాకుండ పీట, సాప మీద కూర్చుంటే యోగ శక్తి నష్టము అవుతుందా?
జవాబు:
యోగశక్తిని భూమ్యాకర్షణ శక్తి నుండి చర్మములు తప్ప పీటలు, సాపలు మరియే ఇతర సాధనములు నివారింప
లేవు.
యం. రంగయ్య, విద్వాన్, హంపాపురము.
301. ఉపవాసములు దివ్యఔషదమంటారు పెద్దలు ఇది నిజమా?
జవాబు:
ఎందువలన?
ఉపవాసములు దివ్య ఔషదమనుట నిజమైన మాటయే. ఉపవాసము ఉండుట వలన శరీరములో గ్రంధులు
ఉత్తేజమై వాటి రసాన్ని సక్రమముగ విడుదల చేయగలవు. మానవుని శరీర ఆరోగ్య పరిస్థితి అంతా గ్రంధుల మీద,
అవి విడుదల చేయు హార్మోన్ల మీద ఆధారపడి ఉన్న దానివలన గ్రంధులు ఉత్తేజమగు ఉపవాసము దివ్య ఔషదముతో
సమానమే. ఉపవాసమని పూరీలు, ఉప్మాలు తినే వారికి వర్తించదు. ఖాళీ కడుపు చేసుకొను వారికి మాత్రము
ఉపవాసము ఔషద సమానము.
302. దేవునికి నమస్కరించినపుడు మనము టెంకాయలు కొట్టుతాము. ఇది ఆచారమా లేక తరతరాలుగ వస్తున్న
సాంప్రదాయమా?
జవాబు:
ఇది ఆచారమే కానీ ఈనాడు అది అర్థము తెలియని సాంప్రదాయమై పోయినది. అర్థము చేసుకొంటే ఎంతో
అర్థముతో కూడుకొన్న ఆచరణని తెలియును.
దండా జయరామ్, ఉరవకొండ.
303. సూర్య గ్రహణానికి కారణము శాస్త్రరీత్యా తెలిసినప్పటికి, మనవాల్లు రాహువు కేతువు అనే ఇద్దరు రాక్షసులు
సూర్యున్ని మ్రింగి వేస్తున్నారనే మూఢ నమ్మకాలను మీరెంత వరకు ఏకీభవిస్తారు?
జవాబు:
నేను మూఢ నమ్మకాలతో ఏకీభవించను. శాస్త్రాన్ని విశ్వసిస్తాను. రాహు కేతువులు రాక్షసులు కారు.
మచ్చా వెంకటరామయ్య, ఉరవకొండ.
304. జీవితములో మానవుడు ఖర్చుపెట్టేది సంపాదించేది ఏది?
జవాబు:
మానవుడు బాహ్యముగ ఏ పని చేయకున్నను జీవితములో ఖర్చు పెట్టేది సంపాదించేది ఒకే ఒకటున్నది. అదే
కర్మ. మొదటి ప్రారబ్ధకర్మ ఖర్చవుతూనే ఆగామి కర్మ సంపాదించబడుతున్నది.
డి. శ్రీధర్ నాయుడు, పుట్టపర్తి.
305. ప్రతి దానికి సృష్టికర్త ఒకడున్నాడని అతనే పరమాత్మని మీరంటున్నారు. ప్రతి దానికి సృష్టికర్త ఒకడున్నపుడు
మరి పరమాత్మకు సృష్టికర్త ఎవరు?
జవాబు:
ప్రతి దానికి సృష్టికర్త పరమాత్మ అయిన మాట నిజమే. ప్రతి దానికి సృష్టి కర్త ఒకడున్నాడను సూత్రము
పరమాత్మకు వర్తించదు. ఎందుకనగ పరమాత్మ ఏది కాదు. పరమాత్మ ప్రతి దాని మాదిరి ఒక పదార్థము కాదు.
ఏదైన అయితే దానికి సృష్టికర్త ఉంటాడు. ఏది కాని దానికి సృష్టికర్త ఉండడను సూత్రము తెలియాలి.
306. పురాణ గాధలన్నిటిలో తప్పులున్నవని అనేక సందర్భాలలో తెల్పిన మీరు “ పురాణ రహిత శాస్త్ర సహిత”
ఏకైక మాస పత్రికలో ప్రతి దానికి పురాణ సహితమైన గీతను ఉదహరించడము పొరపాటు కాదా?
జవాబు:
పురాణములు ఏవి, శాస్త్రములేవని తెలియక పోవడమువలన మీరలా అడిగారు. పురాణములు 18 మాత్రమే.
అందులో గీత లేదు. గీత పురాణము కాదు. గీత యోగశాస్త్రము.
307. యోగీశ్వరుడు అను పదమునకు నిర్వచణము తెల్పేది?
జవాబు:
యోగ + ఈశ్వరుడు = యోగీశ్వరుడు అవుతుంది. యోగమంటే మీకు అర్థము తెలుసుగ, అలాగే ఈశ్వరుడంటే
అధిపతి అని అర్థము. యోగమునకధిపతి అను డిగ్రీయే యోగీశ్వరుడను మాట.
308. లోకులకు పరమాత్మ గూర్చి తెల్పి, పరమాత్మ ఒకడేనని తెల్పి, అనేక జ్ఞాన బోధలు చేయు మీరు సత్యాన్వేషి
సీరియల్ "హింసకు ప్రతి హింస” సిద్ధాంతాన్ని తెల్పడము అంత మంచిది కాదనుకుంటాను. దీనిని గూర్చి
మీరేమంటారు?
జవాబు:
హింస చేయనని, హింస పాపమని చెప్పి ఆయుధముల నేల వేసిన అర్జునునికి కృష్ణుడు హింసే చేయమన్నాడని
మరువబోకండి. కర్మనుశక్తి ఆడించు ఆట బొమ్మలమే కాని మనము నిజముగ ఏమి చేయమని జరుగు పనులలో
హింస అహింస అనుకోవడము అజ్ఞానమే అవుతుందను గీతావాక్యమును విస్మరించరాదు.
జి. గోవిందు, ఎద్దులపల్లి.
309. గుప్పెడంత చిన్నది, విశ్వమంత విశాలమైనది, క్షణాలలో చనిపోతు జీవించేది, జీవిస్తు మరణించేది,
ఏడిపిస్తు నవ్వేది, నవ్విస్తు ఏడిపించేది, కఠిన మయినది, సున్నితమైనది, అన్ని వైరుద్య లక్షణాలను కలబోసుకున్నది.
సృష్టిలో ఒకే ఒకటున్నది. అది ఏది?
జవాబు:
మనలోని మనస్సు.
టి. ఓబుల నారాయణ రెడ్డి, చిన్నపొలమడ.
310. శ్రీమద్భగవద్గీతలో దేవుని గురించి రూపరహిత, నామ రహిత, సర్వాంతర్యామిగ ఉన్నాడని తెల్పుచుండగ
హిందూ తత్వం అనేక రూపాలుగ అనేక పేర్లతో దేవుని పిలుచుచున్నారు ఎందుకు?
జవాబు:
నామ రూప రహిత దేవున్ని అందుకోడానికే ఉపాయముగ నామ రూప సహిత దేవుళ్ళును కల్పించి, వాటి
వెనుకల ఎన్నో అర్థములతో కూడుకొన్న ఆచరణలను నింపి పెట్టారు పూర్వపు మన పెద్దలు. కాని నేడు అర్థమును
మరచిపోయిన మన మద్య అర్థరహితములైన ఆచరణలు మిగిలి ఉన్నాయి. అందువలన రూప నామములనే దేవుళ్ళుగ
మనము నమ్ముచున్నాము. అది చాలా పొరపాటు. రూప నామముల వెనకల అర్థాన్ని చూస్తే, ఏది కాని దేవుడే
తెలుస్తాడను ఉద్ద్యేశముతో పెద్దలు ఎన్నో విధానములను రూప నామములకు ముడి పెట్టి ఉంచారు. కాని ఆనాటి
ఇందూ తత్త్వ రహస్యము తెలియని ఈనాటి పెద్దలందరు పొరపడి దేవునికి రూప నామములున్నాయనుకొన్నారు.
311. జీవులకు తమ తమ పూర్వ జన్మ జ్ఞాపకముండదు ఎందుకు?
జవాబు:
జ్ఞాపకశక్తికి మారు పేరైన మనస్సు ఆయా జన్మలతోనే అంతమై పోవుచున్నది. విషయములను జ్ఞాపకము
తెచ్చు మొదటి మనస్సు రెండవ జన్మలో లేదు, కావున ముందు జ్ఞాపకాలు రెండవ జన్మలో ఉండవు.
యల్లపు శ్రీరాములు, ధర్మవరము.
312. సత్యానికి అసత్యానికి మధ్య ఎంత దూరముంది?
జవాబు:
బెత్తడు (3 ఇంచులు) దూరము మాత్రమే ఉన్నది. ఎలాగంటే కంటితో చూచేది ప్రత్యక్ష సత్యము. చెవుతో
వినేది అసత్యము కూడ కావచ్చును. కావున కంటికి చెవికి గల మధ్య దూరమే సత్యానికి అసత్యానికి ఉన్న దూరమని
తెలియవలయును.
దండాజయరామ్, ఉరవకొండ.
313. "బ్రహ్మ సత్యము జగన్మిత్య" అనే వేదాంత సూక్తి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినంత వరకు ఇది
బాగానే ఉంది. ఈ సూక్తిని వాస్తవ జగత్తుకు వర్తింపజేస్తే?
జవాబు:
జగత్తున్నంత వరకు జగత్తు సత్యమే కావున జగన్మిత్య అనుమాట తప్పుగ జగత్తులోని వారికి తోస్తుంది. అట్లే
బ్రహ్మ (దైవము) అనునదియెదో జగత్తుకు ఏ మాత్రము తెలియదు కావున బ్రహ్మ సత్యము అనుమాట కూడ జగత్తునకు
పొరపాటుగానే తోస్తుంది. ప్రపంచమంత ప్రళయము పొందినపుడు జగత్ అనిత్యము బ్రహ్మ సత్యమగును. కావున పై
సూక్తి ప్రళయమైనపుడు వర్తించుతుంది కాని ఇపుడు ప్రత్యక్షముగ ఉన్న జగత్తుకు వర్తించదు.
నారాయణ, నరసాపురము.
314. మోక్షము అంటే ఏమిటి?
జవాబు:
జీవుడు జన్మలు లేకుండ అనంత ప్రపంచమంతట వ్యాపించి పోవడము.
315. కారణ జన్ముడంటే ఏమిటి?
జవాబు:
ఉద్దేశపూర్వకముగ పుట్టిన వానిని కారణ జన్ముడంటారు. కారణ జన్ముడనగా ఒక కారణమును పెట్టుకొని
పుట్టడమని అర్థము. అలా పుట్టువాడు పరమాత్మ ఒకడు మాత్రమేనని తెలియాలి. ఆయన పుట్టుటకు కారణము
ధర్మములు తెలియజేయాలను ఉద్దేశమే.
యం. జయపాల్, హంపాపురము.
316. ప్రతి దినము ఉదయమున కొందరు సూర్యునికి నమస్కారములు చేస్తారు. ఇది ఆచారమా? లేక
సాంప్రదాయమా? తెలిపేది.
జవాబు:
ఉదయమున సూర్యోదయము మొదలు దాదాపు ఒక గంట వరకు సూర్యుని నుండి వచ్చు కిరణములు మానవుని
శరీరమునకు మేలు చేయునవై ఉన్నవి. అందువలన ఆ సమయములో నడుముకు మాత్రము గుడ్డ చుట్టుకొని మిగతా
శరీరమంతా సూర్యరశ్మి తగిలేటట్లు ఉంచుకొని సూర్యునికి ఎదురుగ నిలుచుకొంటే మంచిది. మాకు గంట సమయము
లేదు ఓపిక లేదు మా ఆరోగ్యము బాగుంది కదా అని అంటారని భక్తిగ నమస్కరించడమంటే క్రమము తప్పక చేస్తారను
భావముతో పెద్దలు సూర్యనమస్కారమను తంతు పెట్టారు. శరీరము శుభ్రముగ ఉంటే సూర్యరశ్మి ద్వార ఎక్కువ
లాభము పొందవచ్చును. అందువలన స్నానము చేసి సూర్య నమస్కారములు చేయడము మంచిది.
యం. రంగయ్య విద్వాన్, హంపాపురము.
317. ఉదయము నిద్ర లేచేటప్పుడు కుడి ప్రక్కన లేవాలంటారు పెద్దలు. ఎడమ ప్రక్కన లేస్తే ఏమైన నష్టమా?
తెలిపేది.
జవాబు:
పూర్వము పెద్దలు అన్ని విషయములలోని అంతరార్థము తెలిసి మానవునికి ఉపయోగార్ధము ఈ పనులు
తెల్పారు. కావున ఆనాడు అవి ఆచారములై ఉండేవి. కాని నేడు అర్థము తెలియక మనము చేయుచున్నాము కావున
ఇపుడు అన్ని సాంప్రదాయములై పోయాయి. మన శరీరములో ఎడమ ప్రక్క నరములకు ఒత్తిడి లేక బరువు కలిగిస్తే
మనస్సు కుడి ప్రక్క సూర్య నాడి మీదికి పోతుంది. అలాగే కుడి ప్రక్క ఒత్తిడి కలిగిస్తే ఎడమ ప్రక్కన గల చంద్ర
నాడిలోనికి పోతుంది. ఉదయము లేచినపుడు మనస్సు చంద్రనాడి మీద ఉంటే ఆ దినము ఎక్కువ ప్రపంచ విషయములు
దుర్మార్గ విషయములు మనస్సుకు రావని, అట్లే సూర్యనాడి మీద ఉంటే ఎక్కువ ప్రపంచ విషయములు జ్ఞప్తికి వస్తూ
ఉంటాయని పూర్వపు పెద్దలకు తెలుసును. జ్యోతిష్య శాస్త్రము ప్రకారము చంద్రుడు జ్ఞాన చిహ్నము, సూర్యుడు
అహంకార చిహ్నము. అలాగే చంద్రుడు యుక్తికి మూల కారకుడైన మంత్రి పదవికి కారకుడైతే, సూర్యుడు ఒకరి
యుక్తి మీద ఆధారపడు ప్రభు (రాజు) పదవికి కారకుడు. అందువలన సూర్య చంద్రులు అధిపతులైన రెండు అతి పెద్ద
నాడుల మీదనే అన్నిటిని యోచించు జ్ఞప్తియైన మనస్సు నివసిస్తున్నది. కావున ఉదయము లేచేటపుడే చంద్రనాడి మీద
మనస్సు ఉండుట వలన మనస్సుకు మంచి ఉపాయములు గల యోచనలు, దైవిక జ్ఞాన సంబంధ యోచనలు కల్గుతాయని,
సూర్యనాడి మీద మనస్సుండుట వలన ఆ దినమంత తెలివి తక్కువ యోచనలు, అజ్ఞాన యోచనలు కల్గుతాయని
తెలిసి, లేచేటప్పుడు కుడి ప్రక్క శరీర బరువు నంతటిని మోపి లేచుట వలన కుడి ప్రక్క నరములకు వత్తిడి కల్గుట వలన
ఎడమ ప్రక్క గల చంద్రనాడి మీద మనస్సుండునని కుడి ప్రక్కన లేవాలనెడివారు. పూర్వము అర్థము తెలుసును
కావున అందరు కుడి ప్రక్కనే లేచెడివారు. అలాగే పడుకొనేటపుడు దక్షణ దిశకే తల పెట్టుకొని పడుకొనేవారు.
318. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే మంచిదంటారు ఎందుకు? కంప చెట్టు ఉంటే నష్టమా?
జవాబు:
వేప చెట్టు ఉంటే నీడ, కంప చెట్టు ఉంటే ముల్లు రాలి గ్రుచ్చుకోవడము ఉంటుంది. ఏది మంచిదైనది
బాహ్యముగ అందరికి తెలుసు కదా! ఇది కాక ఇంటి దగ్గర వేప చెట్టు ఉండుట వలన వేపాకు మీద నుండి వచ్చు గాలి
వలన అనేక రక చర్మవ్యాధి క్రిములు నశించును. విషవాయువులు నిర్వీర్యమై పోవును. అందువలన తెలిసిన వారందరు
వేప చెట్టును పెంచుకొనెడి వారు. పూర్వము ఇంటి వాకిలికి ఇరువైపుల పంచ గూళ్ళు పెట్టి ఆ గూళ్ళులో కల్లు
ముంతలు వేపాకు పెట్టెడి వారు. కాని ఇపుడు కట్టే ఇల్లకు పంచ గూళ్ళే లేకుండ పోతున్నాయి. పంచ గూళ్ళు ఉన్న
ఇల్లకు కల్లు ముంతలు లేవు, వేపాకులేదు. కల్లు వేపాకు ఉంచుట వలన వాకిలి వద్దనే రోగ క్రిముల నాశనము జరిగి
ఇంటిలోనికి ఏ రోగములు ప్రాకెడివి కావు. అమ్మ వారు అను పేరుతో చిన్న పిల్లలకు వచ్చు చర్మవ్యాధులకు వేపాకు
గాలి మంచి ఔషధముగ పని చేయును. కావున పూర్వము అమ్మవారు సోకిన పిల్లలకు వేపాకుతో విసరడము, వారి
చుట్టు వేపాకును పెట్టడము జరిగెడిది. ఇపుడు కూడ అక్కడక్కడ ఈ ప్రక్రియ ఇంకనూ ఉన్నది. వైద్యము ప్రకారము
కుష్టు రోగులు కూడ 5 సంవత్సరములు వేప చెట్టు క్రిందనే నివాసము చేస్తూ, ఆ చెట్టు క్రింద ఉండిన నీరునే
త్రాగుతూ, ఆ చెట్టు క్రింద 12 గంటలు పెట్టిన నీరుతోనే స్నానము చేస్తూ ఉంటే వారి కుష్ఠు రోగము కూడ నయమవునని
తెలియవలెను. అంతయేకాక ఈ చెట్టు గాలి భూత ప్రేతములకు ఇబ్బంది కలుగ జేయును. అందువలననే మాంత్రికులు
వేపాకుతో విసరుతూ మంత్రించుతూ ఉంటారు. అందులో వారికి తెలిసిన తెలియకున్న మంత్ర బలముకంటే వేపాకు
బలమే ఎక్కువగా ఉన్నది. ఇట్లు అనేక ఉపయోగములు గల వేప చెట్టును పెంచుకొంటే కంప చెట్టుకంటే మంచిది.
చింతా రామదాసు, చిన్నపొలమడ.
319. ప్రపంచములో ఎందరో మహనీయులు తపస్సు, యోగము, ప్రార్థన భజన అని వీటిని ఆచరిస్తూ ఉంటారు.
ఇవి అన్ని ఎవరి కోసము దేని నిమిత్తము ఎందుకు చేస్తున్నారు?
జవాబు:
ఇవన్నియు కొందరు తమ కోర్కెలు నెరవేరునను ఉద్ద్యేశముతో చేస్తున్నారు. కొందరేమో దైవము కొరకు దైవ
నిమిత్తము చేయుచున్నారు. కాని యోగము వలన తప్ప మరియే ఇతర క్రియల వలన దైవము తెలియడని గీతయందు
విశ్వరూప సందర్శన యోగమందు దేవుడే తెల్పాడు.
వెలుగుబాల లక్ష్మినారాయణ, గొల్లపల్లి.
320. ప్రేమంటే ఏమిటి? దాని స్వభావము ఏమిటి?
జవాబు:
ప్రేమంటే మన శరీరములోని ఒక గుణము. అసూయ అను గుణమునకు వ్యతిరిక్తముగ ఉండునట్లు చేయుట
దాని స్వభావము. అనగ అసూయ గుణము యొక్క స్వభావమునకు ప్రేమ గుణ స్వభావము వ్యతిరిక్తము. మనుషుల
మీద గాని, జంతువుల మీద గాని, వస్తువుల మీద గాని ప్రీతిని పెంచుకోవడమునే ప్రేమ అంటారు. ప్రీతిని పెంచడమే
దాని స్వభావమని తెలియాలి.
321. ప్రేమ దైవస్వరూపమా లేక కామస్వరూపమా?
జవాబు: గడిచిన కాలములో ప్రచురించిన పత్రికలలో ప్రేమ కామ (ఆశ) అను గుణము వేరు వేరని తెలిపాము. ప్రేమ
ఆశ అనునవి రెండు రెండు గుణములే. రెండు వదలితేనే దైవ స్వరూపము తెలియును. కాని ఏ ఒక్క గుణము దైవ
స్వరూపము కాదు.
రామభజన సంఘము, యాడికి.
322. ధరణిలోన కర్మను కాల్చేది జ్ఞానశక్తి అన్నారు కదా! జ్ఞానశక్తి నార్జించిన పురుషునకు పునర్జన్మ లేదన్నారు.
మరణము వారికి ఉండదంటారే. పునర్జన్మలేదంటే వారికి మరణములేనట్లేనా? అది సాధ్యమా?
జవాబు:
జ్ఞానశక్తి ఆర్జించిన వారికి వారి కర్మ అయిపోయిన తర్వాత ఇక పుట్టవలసిన పనిలేదు కావున వానికి పునర్జన్మ
లేదనుట నిజమే. అటువంటి వానికి చచ్చిన తర్వాత జన్మ లేదు, కాని పుట్టిన తర్వాత చావు లేదనుట శుద్ధ అసత్యము.
కర్మ అయిపోతే చనిపోతాడు. చనిపోయిన తర్వాత జన్మకు రాడు.
పి. అంకాల్ రెడ్డి, గుత్తి.
323. స్వామి! భారతములో ఉండే పాంచాలిని పతివ్రత అనవచ్చా?
జవాబు:
అనకూడదు. ఎందుకనగా పతినే వ్రతముగ ఆచరించునది పతివ్రత. భరించువాడు భర్త కావున సర్వ
జీవరాసులను భరించు పరమాత్మయే జగత్ భర్త జగత్ పతి. జీవుడను వానిని కాక కేవలము శరీరమును భరించువాడు
భర్తకాడు. అందువలన జీవులందరికి పతియైన పరమాత్మనే ఆరాధించు ఆడవారిని కాని మరియు మగవారిని కాని
పతివ్రత అనవచ్చును. ఇక్కడ మగవారిని కూడ కలుపుటకు ఒక కారణమున్నది తర్వాత తెలుపుతాము.
ప్రత్యేకించి మగ వారిని బ్రహ్మచారి అంటారు. పరమాత్మ యొక్క అనగా బ్రహ్మ యొక్క ఆచరణ ఆచరించు
వానిని బ్రహ్మచారి అని పూర్వమనెడి వారు. ఇపుడేమో పెళ్లి చేసుకోక భార్య లేని వానిని బ్రహ్మచారి అని, పెళ్లి చేసుకొని
భర్త కలిగిన వారిని పతివ్రత అని అంటున్నారు. అది కాదయ్య ఇది సత్యమంటే నమ్మే వారు లేరు. కావున మనము
అందరి మాట ప్రకారమే పోతే పాంచాలి పతివ్రతయే. లేదు ఇది సత్యమని మనము సత్యమునే పట్టుకొంటే ఆమె
పతివ్రత కాదు కదా!
వై. పార్వతీశం, తాడిపత్రి.
324. గీత 18 అధ్యాయములు, భారత యుద్ధము 18 దినములు, సైన్యము 18 అక్షౌహిణులు, భారతము 18
పర్వములు, అలాగే భాగవతము 18 స్కందములు, పురాణములు 18 గా ఉన్నాయి. ఇలా ఒకే సంఖ్య 18
ఎందుకున్నది?
జవాబు:
అంతియే కాక అయ్యప్ప స్వామి దేవాలయ మెట్లు కూడ 18 గా ఉన్నాయి. అర్థము తెలిస్తే ఆచారము,
తెలియకపోతే సాంప్రదాయము. పూర్వపు ఆచారము ప్రకారము వాటి అర్ధము ఇలా ఉన్నది. ప్రతి జీవరాసి సాత్త్విక,
రాజస, తామసములనెడు మూడు గుణ భాగములందే చరించుచున్నవి. ఆ మూడు గుణ భాగములలో ఒక్క దానియందు
పేరుగాంచిన శత్రు గుణములు కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యమను ఆరు గుణములున్నవి. ఇట్లు ఈ
గుణములు మూడు గుణ భాగములందుండుట వలన మొత్తము జీవరాసులు మూడు స్థానములలో గల మొత్తము 18
గుణములందే నివసిస్తున్నారని తెలియుచున్నది. ఆ గుణముల వలననే జరిగెడి పనుల వలన పాపమును సంపాదిస్తున్నారని,
మొత్తము ప్రపంచ పాపపు పనులన్నియు ఉన్నవని, ఆ పదునెనిమిది సంఖ్యను మరువక ఉండునట్లు, ఈ పదునెనిమిది
వలననే పాపము జరుగుచున్నదని తెలియునట్లు, ఆ 18 సంఖ్యను ఉంచారు. భక్తిమార్గములో మూడు గుణభాగములలోని
18 గుణములను తొక్కి వేయాలని అయ్యప్ప దేవాలయములో కాలి క్రింద మెట్లగుంచారు. అలాగే ఈ దుర్గుణముల
మీద ఎల్లపుడు జ్ఞప్తికల్గి వాటి ఆచరణకు పోకుండునట్లు ముఖ్యమైన చోటంత 18 సంఖ్యను ఇరికించారు. గీతలో,
భారతములో, భాగవతములో, పురాణములలో 18 సంఖ్యనుంచడము వలన తెలియని వారు దీని విశేషమేమని
ఆలోచించగలరు. ఆలోచించుటవలన ప్రశ్న వచ్చి చివరకు ఎక్కడైన వాస్తవము తెలియగలరు. 18 చెడు గుణములని,
మరియు శత్రు గుణములని తెలిసిన రోజు వాటి పట్ల జాగ్రత్త కల్గి ఉంటాము. అందువలన పెద్దలు 18 సంఖ్యను
అనేక చోట్ల తెలియునట్లు చేశారు.
నాగభూషణ చౌదరి, తగ్గుపర్తి.
325. మనస్సు జడమా? లేక చేతనమా?
జవాబు:
శరీరములోని ప్రతి భాగము ఆత్మ చైతన్యము చేత చేతనమయ్యాయి కాని వాటికి స్వయం శక్తి లేదు. అందువలన
మనస్సు చేతనమే, నిద్రలో యోగములో కదలక ఉంటుంది. జ్ఞప్తిలో కదలుచునే ఉంటుంది.
326. హస్త మస్తక సంయోగమంటే ఏమిటి?
జవాబు:
గురువు తన హస్తము చేత జ్ఞానాగ్నిని శిష్యుని తలలోనికి ప్రవేశింప జేయుటను హస్తమస్తక సంయోగమంటారు.
327. నాకు తెలిసినంత వరకు ఆకాశ మొక్కటే ఉన్నది. కాని కొన్ని పుస్తకాలలో చిదాకాశము, చిత్తాకాశము
అనే పేర్లు కూడ చదివాము. అవి ఉన్నవా?
జవాబు:
మీకు తెలిసినంత వరకేకాక సర్వ ప్రపంచమునకు తెలిసేటట్లు ఒకే ఆకాశమున్నది. యోగపద్ధతిలో కూడ
మాకు తెలిసినంత వరకు ఇతర ఆకాశములు ఏవి లేవు.
328. మనము ఎక్కడికైన ప్రయాణమై పోవునపుడు గాని, పరీక్షకు పోవునపుడు గాని, శ్వాసను కుడి ముక్కురంధ్రములో
ఆడునట్లు చేసి బయలు దేరితే పనులు నెరవేరునని పరీక్షలలో ఉత్తీర్ణులగుదురని ఒక గ్రంధములో వ్రాసినారు.
ఇది నిజమా?
జవాబు: అలాగే ఆచరించి చూచినపుడు పుస్తకములో వ్రాసినట్లు నిరూపణకు రాలేదు కావున ఆచరించినా అనుభవానికి
రానివి శాస్త్రములు కావు. అవి మానవుని తృప్తి కోసము చెప్పినవే కాని నిజము కావు.
329. మీ రచనలైన ప్రబోధ పుస్తకములో ఆది మంగళ గురువారములలో కుడి ముక్కున, బుధ శుక్ర శని
వారములందు ఎడమ ముక్కున, శుక్ల పక్ష సోమ వారము కుడి ముక్కున, కృష్ణ పక్ష సోమవారము ఎడమ ముక్కున
శ్వాస ఆడవలయునని వ్రాసారు. కాని మరియొక గ్రంథమందు ఆది మంగళ శని వారములలో కుడి ముక్కున
సోమ శుక్ర బుధ వారములలో ఎడమ ముక్కున కృష్ణ పక్ష గురువారము కుడి ముక్కున శుక్ల పక్ష గురువారము
ఎడమ ముక్కున అని వ్రాయబడినది. మీరు వ్రాసిన దానికి దీనికి భేదమున్నది. వీటికి శాస్త్ర ప్రమాణములు లేవా?
ఉంటే ఎవరు చెప్పిన ఒకటే ఉండాలి కదా?
జవాబు:
శాస్త్ర ప్రమాణము కాని విషయములు మేము చెప్పమని చాలాసార్లు ప్రకటించాము. జ్యోతిష్య శాస్త్రరీత్యా
ఒకటవ స్థానములోనున్న గ్రహకు ఏడవ స్థానములోనున్న గ్రహ బద్ద శత్రువను మాట గలదు. అందువలన ఆ శాస్త్ర
ప్రమాణమును బట్టి మేష రాసికధిపతియైన కుజునకు ఎదురుగ ఏడవ స్థానమైన తులారాశిలోని శుక్రుడు బద్ద శత్రువు.
ఈ సూత్రము ప్రకారము 1. కుజునకు శుక్రుడు, 2. గురువునకు బుధుడు, 3. సూర్య చంద్రులకు శని శత్రువులగుతున్నారు.
అదే జ్యోతిష్య శాస్త్రమును బట్టి 1,5,9 స్థానాదిపతులంతయు ఒక గ్రూపు గ్రహాలైతే వారికి వ్యతిరిక్తులు మరియొక
గ్రూపు గ్రహాలగుచున్నవి. అందువలన జ్యోతిష్య శాస్త్ర ప్రమాణము చేత గురు, కుజ, సూర్య, చంద్రులు ఒక గుంపని,
శని, బుధ, శుక్రులు మరియొక గుంపని తెలిసి యోగ శాస్త్రానురీత్యా శరీరముతో యోగ మాచరించు వారు వారి
గ్రహస్థానములను బట్టి ఆయా దినములలో ఆయా ప్రక్కలే శ్వాస ఆడవలయునని తెలిపాము. కావున మాది శాస్త్ర
ప్రమాణము. తెలియని వారు వేరు విధముగ చెప్పిన దానికి ప్రమాణముండదని గ్రహించవలెను.
యం. వెంకటేసు, చిన్నపొలమడ.
330. కర్మ వలన జన్మ ఉంటుందంటారు. ఒక రోగము వస్తే అది గత జన్మ కర్మ వలన వచ్చినదా లేక ఈ
జన్మ కర్మ వలన వచ్చినదా?
జవాబు:
రోగాలు వస్తే ఈ జన్మలో చేసుకొన్న కర్మేనని కొందరంటారు. కాని అది వాస్తవము కాదు. ఎందుకనగ
పుట్టినపుడు కొన్ని దినములకే రోగము వచ్చిందను కొందాము. అపుడు అతను పుట్టిన తర్వాత ఏ పాపము చేయలేదు
కదా! అందువలన ఒకనికి రోగము కాని, భోగము కాని ఏది సంభవించిన అది గత జన్మల కర్మ వలననే సంభవించునని
తెలియాలి.
331. వర్ష మొచ్చునపుడు పిడుగు పడుతుందని అంటారు. ఆ పిడుగు అర్జునుని రథచక్రమునకున్న సీలయని,
అది ఊడి క్రిందపడితే పిడుగు పడిందని అంటారు నిజమేనా తెల్పాలి.
జవాబు:
వర్ష మొచ్చునపుడు పిడుగు పడుట నిజమే కాని అది అర్జునుని రథ చక్ర సీల కాదు. అది అర్జునుని రథ చక్ర
సీల అయితే ఆ సీలే పిడుగుయైతే ఒక వేళ చక్రము పడితే మహా ప్రళయమే కావలసి ఉంటుంది. సీలపడిన తర్వాత
చక్రము కూడ క్రిందపడాలి కదా! అలా అది సీల కాదు. అక్కడ రథము లేదు. వాస్తవమేమంటే వర్షమొచ్చునపుడు
ఆకాశములో కరెంటు తయారగును. ఎండాకాలము తర్వాత మొదట వచ్చు వర్షములలో ఎక్కువ పిడుగులుపడు
అవకాశము గలదు. ఎందుకనగ భూమంతయు వేడెక్కి భూమికి కొంత ఎత్తులో వాతావరణమందు విద్యుత్ అయస్కాంత
శక్తి ఏర్పడి అది పాజిటివ్ శక్తిగ ఉండును. భూమి నెగిటివ్ చార్జి గల్గి ఉండును. వర్షమొచ్చునపుడు తడి గాలికి పైన
ఉన్న పాజిటివ్ శక్తి భూమిలో ఉన్న నెగిటివ్తో కలియుట జరుగుచుండును. ఇంటిలో 200 ఓల్టేజి కరెంటును
పాజిటివ్ నెగిటివ్్ను కలిపితే పట్ మని శబ్దముతో అగ్గి రవ్వలేర్పడును. బయలులో ప్రకృతిలో తయారైన కొన్ని లక్షల
ఓల్టేజి కరెంటు పాజిటివ్ వచ్చి నెగిటివ్ అయిన భూమిని తాకితే ఎంతో పెద్ద శబ్దము పెద్ద అగ్ని మెరుపు ఏర్పడును.
దానినే పిడుగు పడడము అంటాము. అది ఎక్కువ శక్తి గల కరెంటుగాన ఆ తీగ మెరుపు భూమికి దగ్గరికి వస్తే అది
మన కరెంటు తీగలకు తగిలితే ఫీజులన్ని ఎగిరిపోవును. ఒక వేళ ఏదైన చెట్లకు తగిలితే అంత బలమైన కరెంటుకు
చెట్టు రెండు భాగములుగ చీలి పోవును. బావికి దగ్గరగ మెరిస్తే ఆ బావిలో నీరంత ఇంకిపోయి ఎండిపోవును.
మనుజులకు దగ్గరగ మెరిసిన లేక తగిలిన వెంటనే చనిపోవుదురు. అందువలన వర్షము వచ్చునపుడు బయలు
ప్రాంతములో ఉండకూడదు. పిడుగు ఇనుప కడ్డీ కాదు ఆకాశ కరెంటని తెలియాలి. హిందీలో ఆస్మాని బిజిలి
అంటారు.
టి. అనుమంతు, యమ్. అగ్రహారము.
332. నాకు చాలా దినముల నుండి దేవుడెట్టుంటాడో చూడాలనిపించింది. దేవుడు ఎట్లుంటాడు, మేము ఎట్లు
చూడగలుగుతాము.
జవాబు:
మనకు చూడాలని కోర్కె ఉండడములో తప్పులేదు కాని దేవుడిట్లున్నాడని చెప్పుటకు అతనికి ఆకారము లేదు.
అతను కంటికి కనిపించు వాడు కాదు చూచేదానికి. రూపములేని దేవున్ని చూడాలంటే మనకు జ్ఞాననేత్రముండాలి.
అంటే బాగా జ్ఞానము తెలియాలి. అపుడు మనయందే గల దేవున్ని సులభముగ తెలియవచ్చును. అతను మనకు
చాలా దగ్గరగ మనయందే ఉన్నాడు. కావున జ్ఞానము తెలిస్తే సులభముగ చూడవచ్చును.
ప్రహ్లాదరావు, గంగావతి.
333.అహము అంటే ఏమిటి? దానిని త్యజించాలంటే ఏమి చేయాలి?
జవాబు: మన శరీరమందు గల 25 భాగములలో అహమనునది ఒక భాగము అది శరీర లోపలి భాగములైన మనస్సు,
బుద్ధి, చిత్తము, అహము జీవుడు అను అంతఃకరణములందు ఒకటై ఉన్నది. శరీరమందు జరుగు పనులన్నిటిని నీ
వలన జరుగునవేనని జీవునికి బోధించడమే దాని పని. దాని వలననే జీవునికి నేను అను భావము ప్రతి పనిలోను
పుట్టుచున్నది. దానిని త్యజించాలంటే ముందు దానిని గూర్చి, శరీరములో దాని పాత్రను గూర్చి, అది శరీరమున
ఎక్కడున్నది అను విషయము గూర్చి తెలియాలి. అలా తెలిసిన తర్వాత దానిని సులభముగ త్యజించవచ్చును. దానిని
త్యజించడమే కర్మ యోగమంటారు.
334. యోగమనగా నేమి?
జవాబు:
యోగమనుసరించుటకు క్రమ నియమములు ఏవైన ఉన్నవా?
బ్రహ్మవిద్యయందు యోగమనగ కలయిక అని అర్థము. జీవాత్మ ఆత్మల కలయికనే యోగమనుచున్నాము.
ఈ యోగములు రెండు విధములు 1. కర్మ యోగము, 2. బ్రహ్మయోగము. వీటికి ఏ నియమములు లేవు గాని
క్రియలు మాత్రమున్నవి. అవి ఏమనగా! కర్మ యోగమును సాధించాలంటే మనలోని అహమును అణచివేయాలి.
బ్రహ్మయోగమును సాధించాలంటే మనలోని మనస్సును అణచివేయాలి. అహమును అణచి వేయుటవలన కర్మ
యోగమును, మనస్సును అణచివేయుట వలన బ్రహ్మయోగమును పొందవచ్చును. కర్మయోగమును పొందాలంటే
మనలోని అహమును గురించి బాగ తెలిసి ఉండాలి. అట్లే బ్రహ్మయోగమును పొందాలంటే మనలోని మనస్సును
గురించి బాగా తెలిసి ఉండాలి. మానవుడు ముక్తుడగుటకు ఈ రెండుమార్గములు కలవు.
డి. చెన్నప్ప, న్యామద్దల.
335. మానవుడు శిశువుగా పుట్టుతానే ఏడ్చుతాడు. మరి ఇతర జంతువులు ఏవి పుట్టినపుడు ఏడ్చవు. ఆవుకు
దూడ పుట్టినపుడు అరవదు మిగత జీవరాసులు అంతే కాని కేవలము మానవ శిశువు మాత్రమే ఏడ్చును ఎందుకు?
జవాబు:
సమస్త జీవరాసులకంటే దుఃఖము మానవ జన్మయందే ఎక్కువ ఉన్నదని సూచనగ ఆ ఏడ్పు ఉన్నది. దుః
ఖములకు కారణమైన పాప కర్మ సంపాదించడము మానవ జన్మయందే అధికమని తెలియ జేయుటకు మరియు అన్ని
జన్మలకంటే మానవ జన్మయందే దుఃఖమధికమని తెలియ జేయుటకు మానవ శిశువు పుట్టినపుడే ఏడ్పు ప్రారంభమగునట్లు
సృష్టిలో నిర్ణయింపబడినది. ఈ విధముగ మానవ జన్మలో ఎన్నో జ్ఞాన సూచనలు చేయు మాటలు కూడ మానవునికి
తెలియకనే వచ్చుట గమనార్హము. అయ్యో పాపమని, నా కర్మ అని ఇంకా ఎన్నో మాటలు తెలియకనే పలుకుచుండును.
అట్లే చిన్న తనమున ఏడ్పు కూడ తెలియకనే వచ్చును.
336. ఆధ్యాత్మికమనగా నేమి? అట్లే వేదాంతమనగా నేమి?
జవాబు:
ఆధ్యాత్మికమనగా నేమి అని గీతలో అర్జునుడు అడిగాడు. అక్కడ శ్రీకృష్ణుడు "స్వ భావో ధ్యాత్మ ముచ్యతే"
అన్నాడు దీని అర్థమేమనగా స్వంత భావమునే ఆధ్యాత్మికమని అన్నాడు. స్వంత భావమనగ ఇంతకు ముందే చెప్పాము.
స్వభావమంటే తాను ఎవరైనది తెలిసి ఉండడమే స్వభావము కల్గియుండడమని అర్థము. దీనినే స్వ ధర్మమని కూడ
తెలియబరచబడినది. స్వభావము, స్వధర్మము, స్వ అర్థముయను పదములన్నిటియందు “స్వ” అను అక్షరము
గుర్తింపదగినది. స్వంతమను నీ ఆత్మను, లేక స్వభావమను నీ భావమైన ఆత్మను, లేక స్వ ధర్మమైన నీ ఆత్మను, లేక
స్వ అర్థము అను నీధనమైన ఆత్మను తెలియడమును ఆధ్యాత్మికము అంటున్నాము. ఆత్మను ఆధ్యాయనము చేయడమును
ఆధ్యాత్మికము అంటాము.
అట్లే వేదాంతమనగ వేదముల అంత్యమందు గలదని అర్థము. అనగ వేదముల తర్వాత గలది అని భావము.
"తై గుజ్య విషయా లేదా" అను గీతా వాక్యము ప్రకారము మూడు గుణముల విషయములే వేదములని తెలియుచున్నది.
ఆ మూడు గుణముల తర్వాత ఉన్న ఆత్మనే వేదాంతమనుచున్నాము. మూడు గుణముల విషయములు వదలిన తర్వాత
ఉన్న అనుభవమునే ఆత్మ అనుభవమన వచ్చును. దానినే వేదాంతమంటున్నాము.
బి. శకుంతలమ్మ, యాడికి.
337. మీరు సత్యాన్వేషి కథలో ఖగోళములో గోళములోని సూక్ష్మ శరీరములు భూమి మీద మానవులను
సామూహికముగ హింసించునన్నారు. కలరా, మశూచిలాగ కాక వేరు విధముగ హింసించిన సంఘటనలెక్కడైన
ప్రమాణికముగ ఉన్నాయా?
జవాబు:
ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. యాడికియందు దాదాపు పది సంవత్సరముల క్రితము పెద్ద గాలి లేచింది.
సంతలో ఉన్న జనమంత ఉక్కిరి బిక్కిరై కొందరు అక్కడే గల ఒక షెడ్లోనికి పోయినారు. అపుడు ఆ షెడ్ విచిత్రముగ
ఒక్కమారు కుప్ప కూలిపోయి కొందరు చనిపోయినారు. అక్కడే ఉన్న వేపచెట్టుపడి దాని క్రింద కొందరు చనిపోయారు.
అపుడక్కడ ఉన్న కొందరికి మాత్రము ఆకాశము నుండి ఒక పెద్ద వికృతాకారము కాలుతో ఆ షెడ్ను త్రొక్కినట్లు
కనిపించింది. వారు ఆ విషయమును గూర్చి ఇలా ఏదో పెద్ద ఆకారము షెడ్పై కాలు పెట్టి త్రొక్కడము చూచామని
కూడ చెప్పారు. అయినప్పటికి వారి మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయమును యోచిస్తే గోళముల గ్రహాలె
హింసించినవనుటకు తార్కాణము. అంతేకాక మోటారుబండ్ల ప్రమాదానికి ఎక్కువ సూక్ష్మశరీరములే కారణము
అవుతుంటాయి. ప్రత్యేకించి పెళ్లి బృందాల మీద వాటి ప్రభావము ఎక్కువగ ఉంటుంది. కావున ఎక్కువ పెళ్లి బృందాలు
ప్రమాదానికి గురి అవుతుంటాయి.
మెట్టం తిమ్మప్ప, దురదకుంట.
338. ఒక చోట కృష్ణుని భగవంతుడన్నావు. వేరొక చోట ఏసు భగవంతుడన్నావు. భగవంతుడనగా అర్థమేమి?
భగవంతుడను పదము పరమాత్మకా లేక అందరికి వర్తిస్తుందా?
జవాబు:
భగవంతుడనగా భగము నుండి పుట్టినవాడు. అనగ స్త్రీ యోని మార్గమున పుట్టినవాడని అర్థము. ఈ
అర్థము ప్రకారమైతే మనమంతా భగము నుండి పుట్టిన వారమే కదా! అయితే మనమంతా భగవంతులమేనా అని
అడుగవచ్చును. ఆ సూత్రప్రకారమైతే మనము భగమునుండి పుట్టి ఉంటే భగవంతులమేకాని మనము భగము నుండి
పుట్టలేదు కదా! అందువలన భగవంతులముకాము. ఈ మాటవింటే ఆశ్చర్యమై ఇదేమిమాట మనము భగము నుండి
కాక మరి ఎట్లు పుట్టామని అడుగ వచ్చును. భగము నుండి మన శరీరము పుట్టినది కాని మనము పుట్టలేదు. మన
శరీరము పుట్టిన తర్వాత కొన్ని నిమిషములకో లేక కొన్ని గంటలకో శరీరమందు మనము చేరుచున్నాము అపుడు
అరుస్తున్నాము. అంత వరకు ప్రాణము రాలేదని మిగతావారు చూస్తూంటారు. ఇదంత ఒక్క సారిగా అర్థము కాదు.
మా రచనలోని "జనన మరణ సిద్ధాంతము” అను పుస్తకమును చదవండి విశదముగ అర్థము కాగలదు. ఒక్క
పరమాత్మ మాత్రమే సజీవముగ భగము నుండి పుట్టుచున్నాడు. కావున అతనినొక్కనినే భగవంతుడనవచ్చును. శ్రీ
కృష్ణుడు, ఏసు మన మాదిరి కాక ఎరుకతో పుట్టినవారని, వారిని భగవంతుడు అనుచున్నాము. వారు సూత్రము
ప్రకారము భగవంతులే. ఆ పరమాత్మ ఏది కానిదయ్యు తన ధర్మములను మానవాళికి తెల్పుటకు భూమి మీద
మానవజన్మ ఎత్తవలసివచ్చును. అటువంటపుడు దానిని భగవంతుడనడము జరుగుచున్నది. నాకు పుట్టుక లేదు,
చావు లేదు, నేను సర్వ జీవరాసులకు అధిపతినయ్యు, నాచే సృష్టింపబడిన నా ప్రకృతితో కూడి, ఒక శరీరము ధరించి
భూమి మీద మాయ జన్మ ఎత్తుచున్నానని గీతయందు కూడ భగవంతుడుగ పరమాత్మ పల్కి ఉన్నాడు. అందువలన
పరమాత్మ అనబడు అతీత శక్తి మానవునిగా పుట్టినపుడు భగవంతుడనబడునని తెలియాలి.
339. జీవునికి అవస్థలు నాలుగు, తనువులు నాలుగు అని కొన్ని గ్రంధములందు వ్రాశారు. స్థూల సూక్ష్మ కారణ
మహాకారణ శరీరములు అన్నారు. అట్లే హిరణ్య గర్భయని కూడ తెల్పారు. జాగ్రత్త, నిద్ర, స్వప్న తురీయ
తురీయాతీతమును గూర్చి కూడ తెల్పారు. వారి విషయమేమి?
జవాబు:
జ్ఞానమంతయు సూత్రబద్దమై ధర్మయుక్తమై ఉండాలి. అట్లే అది అనుభవమునకు వచ్చునదై కూడ ఉండాలి.
తనువులు నాలుగని కొన్ని గ్రంథములందు ఉండుట మేము కూడ చూశాము. స్థూలము తప్ప సూక్ష్మ శరీరమును
తెలుసుకొను జ్ఞానము కూడ లేని మానవునికి కారణము మహా కారణమని హిరణ్య గర్భ అని అంటే అర్థమవుతాయా?
స్థూలమంటే కంటికి కనిపించు శరీరము అందరికి తెలిసినదే. సూక్ష్మ మంటే కంటికి కనిపించని శరీరము. ఇట్లు
వివరముగ అర్థమగునట్లు కారణ మహా కారణ శరీరముల గూర్చి ఎవరైన చెప్పగలరా? వాస్తవానికి అవి శరీరములా?
నిజానికి చూస్తే కారణమనునది కూడ శరీరము కాదు, మహా కారణమెట్లుండును? ఎవరైన అనుభవించి వ్రాసిన
మాటలా లేక పరంపరగ మా నాయన చెప్పె నేను చెప్పుచున్నానంటున్నారా? అని యోచించాలి. అట్లే అవస్థలు
మూడున్నాయి వాటిని అనుభవిస్తున్నాము. ఎవరు అనుభవించని తురీయాతీతమును గూర్చి పుస్తకాలలో వ్రాసినప్పటికి
అవి అసత్యములే అనుకోవాలి. మాకు ఎక్కడ తురీయాతీతమన్నది అనుభవానికి రాలేదు. మీకేమైన వచ్చినవా? వచ్చి
ఉండవు. కావున కొన్ని మాటలు పుస్తకాల వరకే వదలి వేయాల్సి ఉంటుంది. అనుభవమునకు రానివి తప్పక వదలాలి.