హిందూ మతములో కుల వివక్ష. cloud text 4thOct24 Updated
హిందూ మతములో కుల వివక్ష.
యోగీశ్వరుల వారి రచనల సారాంశము
1) త్రైత సిద్ధాంత గ్రంథములలో అక్షర సముదాయమే, ఆత్మ సమాచారమై ఉన్నది.
త్రైత సిద్ధాంత గ్రంథములలో క్షయ అక్షయ సమాచారము,
పరమాత్మ సమాచారము ఉన్నది.
2) త్రైత సిద్ధాంత సంబంధ గ్రంథములను భౌతికముగా వ్రాసినది యోగీశ్వర్లు.
త్రైత సిద్ధాంత అనుబంధ గ్రంథములలో అభౌతికముగా యోగశక్తి ఉన్నది.
3) త్రైత సిద్ధాంతము ఇందూ (హిందూ) ధర్మములలో విప్లవాత్మకమైనది.
త్రైత సిద్ధాంత గ్రంథములలోని జ్ఞానము సంచలనాత్మకమైనది, చదివి చూడండి.
4) త్రైత సిద్ధాంతము లోకములో అన్నిటికంటే గొప్పది. త్రైత సిద్ధాంత
గ్రంథములు అన్ని గ్రంథములను మించినవి, దాని రచయిత యోగులకు
ఈశ్వరుడైన యోగీశ్వరుడు.
5) త్రైత సిద్ధాంత గ్రంథములు కనిపిస్తే దుష్టశక్తులు భయముతో వణికిపోతాయి.
త్రైత సిద్ధాంత గ్రంథములను దగ్గర ఉంచితే యోగశక్తికి తాళలేక
భయపడిపోతాయి.
6) త్రైత సిద్ధాంత జ్ఞానము భగవద్గీత తరువాత చెప్పబడిన అతి గొప్ప జ్ఞానము.
త్రైత సిద్ధాంత గ్రంథములలో కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా
యోగీశ్వర్లు చెప్పారు.
7) త్రైత సిద్ధాంత జ్ఞానము మానవ జీవితమునకు గొప్ప వెలుగు.
త్రైత సిద్ధాంత వెలుగులోనికి పోయిన వానికి అది దైవశక్తి అని తెలియును.
8) త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసినది యోగీశ్వర్లు. అందువలన
త్రైత సిద్ధాంతము అంటే ఏమిటో, అది ఎంత గొప్పదో తెలియబడినది.
9) త్రైత సిద్ధాంతమును గురించి తెలియగలిగితే, యోగీశ్వరుల గ్రంథములను
చదువగలిగితే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరును, దానిని ఆచరించును.
10) త్రైత సిద్ధాంతము ప్రత్యక్షముగా భగవంతుడు చెప్పినది. అందువలన అన్ని
మతముల సారాంశము త్రైత సిద్ధాంత గ్రంథములలో కలదు.
11) త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కావు, వ్యక్తిలోని శక్తి వ్రాసినవి.
అందువలన అన్నీ రహస్యములే చదివి తెలుసుకోండి.
12) త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో కలదు. అయినా
హిందువులకుగానీ, క్రైస్తవులకుగానీ, ముస్లీమ్లుగానీ ఆ విషయము
తెలియదు.
మతము మధ్యలో పుట్టినది. కులము గుణాదిలోనే పుట్టినది.
మనిషి పుట్టిన తర్వాత శిశుదశ కొంతకాలముండును. శిశుదశ పోయిన
తర్వాత బాల్యదశ వచ్చును. శిశుదశలో ఏమీ తెలియని స్థితిలో, ఏ విచక్షణా
లేని స్థితిలో మనిషి ఉండును. అప్పుడు శరీరములోని బుద్ధి, మనస్సు
లేతగా యుండుట వలన, ఆ రెండూ పూర్తి పని చేయని స్థితిలో ఉండును.
శిశు దశలోనే కొంతకాలము జరుగగా, ఆరు లేక ఏడు నెలలనుండి మనస్సు
పని చేయను మొదలు పెట్టును. అంతవరకు శిశుదశలో శిశువును ఆత్మే
నడుపుచున్నది. మనస్సు కొద్దిగా ముదిరేకొద్దీ చిన్నగా పనిచేయుటకు
మొదలు పెట్టును. శరీరములో మొదట పని చేయుటకు మొదలు పెట్టునది
మనస్సే. తర్వాత పని చేయుటకు స్థోమత కల్గునది బుద్ధి. చనిపోవునప్పుడు
కూడా చివరిగా ముందు బుద్ధి నిలిచిపోగా తర్వాత మనస్సు నిలిచి
పోవుచున్నది. మనస్సు నిలిచిపోతేనే మరణము అగును.
మనిషి పుట్టిన తర్వాత మొదట పని చేయునది మనస్సే. కొన్ని
రోజుల తర్వాత బుద్ధి పని చేయుట మొదలుపెట్టును. తర్వాత అహము,
ఆ తర్వాత చిత్తము పని చేయుట మొదలుపెట్టును. మనస్సు, బుద్ధి,
చిత్తము, అహము పని చేయని వరకు వాటి పనిని కూడా శరీరములోని
ఆత్మే చేయుచుండును. శరీరములో గుణములు మార్పు చెందక గతజన్మలో
యున్న గుణములే ఉండును. గుణములు, జీవాత్మ, ఆత్మ, కర్మ అన్నియూ
గత జన్మలోనివే రెండవ జన్మకు వచ్చియుండును. వాటిలో దేనియందు
ఏ మార్పు ఉండదు. కాల, కర్మ, గుణచక్రములలోనివి మరియు శరీరము
మారుచున్నవి తప్ప అందులో ఏ తేడాలు లేవు. శిశు శరీరము పెద్దగయి
బాల్యములోనికి రాగానే అనగా పుట్టిన తర్వాత ఒక సంవత్సరము వరకు
శిశుదశ జరుగగా సంవత్సరము తర్వాత బాల్యదశ మొదలగును. అప్పుడు
క్రొత్తగా పుట్టిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను నాలుగు
అంతఃకరణములు కొద్దికొద్దిగా పని చేయుట మొదలు పెట్టును. శరీరము
లోని 24 భాగములన్నీ క్రొత్తగా పుట్టిన దానివలన బాల్యము నుండి అన్నీ
క్రొత్తగా పని చేయను మొదలు పెట్టును. శరీరములోని గుణములు పుట్టునవి
కావు, చచ్చునవి కావు. గత శరీరములో యున్నవే ఉండును. అందువలన
గుణములు పూర్తి స్థాయిలో పని చేయు సామర్థ్యము కల్గియున్నవి. అయితే
గుణముల భావమును గ్రహించుకొను బుద్ధియే పని చేయలేకపోవడము
వలన గుణముల ప్రాబల్యము బాల్యదశలో కనిపించదు.
మనిషి బాల్యదశలో ఉండగానే ఐదు సంవత్సరముల నుండి
గుణముల భావములను బుద్ధి గ్రహించుటకు మొదలు పెట్టుచున్నది. అప్పుడే
హిందూ మతములో యున్న వారందరిలోనూ గుణాదిలోనే నాది ఫలానా
కులము అను భావము వచ్చుచున్నది. గుణములు మొదట పనిచేయను
మొదలు పెట్టగా, పెద్దలను చూచి పిల్లలు కూడా కుల భావమును పొందు
చున్నారు. నేను ఐదు సంవత్సరముల పిల్లప్పుడే, ఏమీ తెలియని వయస్సు
లోనే త్రాగే నీళ్ళను ఇతరులు అడుగగా ఇంటిలోని పెద్దలు నీళ్ళు అడిగిన
వారి కులమునుబట్టి గ్లాసుతో నీళ్ళు ఇవ్వడము, లేకపోతే చెంబుతో ఎత్తి
నీళ్ళను పోయడము జరిగేది. మా ఇల్లు ఊరికి బయట ఉండుట వలన
పొలములో పనిచేయువారు వచ్చి త్రాగే నీళ్ళను అడిగేవారు. ఎక్కువగా
మాదిగ కులమువారు వచ్చి అడిగే వారు. అప్పుడు వారి చేతులలోనికి
నీళ్ళు పోస్తే, వాళ్ళు వంగి చేతులలో నీళ్ళను త్రాగేవారు. వారి చేతికి
చెంబుగానీ, గ్లాసుగానీ ఇచ్చేవారు కాదు. అవన్నీ ప్రత్యక్షముగా చూచుట
వలన మాదిగ వారు మాకంటే తక్కువ కులమువారనీ, వారిని తాకకూడదనీ,
వారు చెంబునుగానీ, గ్లాసునుగానీ ముట్టుకొంటే తిరిగి దానిని వెంటనే
కడిగి తీసుకోవలెననీ, లేకపోతే ఏదో చెడు జరుగునను భావము పెద్దల
వలన తెలియగలిగాము. మొదటనే శరీరములోని గుణముల వలన కులము
అను తేడా కనిపించడము, మేము పెద్ద, మాకంటే వారు చిన్న
అనుకొనేవారము.
మేము ఎప్పుడయినా సరుకుల కొరకు బజారుకు పెద్దల వెంటపోతే
మేము త్రాగే దానికి నీళ్ళు అడిగేవారము. అప్పుడు అంగడి అమ్ము కోమటి
వారు నీళ్ళు గ్లాసుతో ఇచ్చినా, గ్లాసు మీద నీళ్ళు చల్లి తీసుకొనేవారు.
అలా ఎందుకు చేయుచున్నారని అడుగగా, మనము తక్కువ కులము
వారము, వాళ్ళు మనకంటే పెద్ద కులము వారు. మనము గ్లాసును
తాకినప్పుడు దానిని అలాగే తీసుకొంటే అంటు వస్తుందనీ, దానివలన
చెడు జరుగుతుందనీ, అందువలన కడిగి తీసుకొంటే ఆ దోషము పోతుందని
చెప్పేవారు. అప్పుడు కొంత అర్థమయినది. మాకంటే తక్కువ కులము
వారున్నారు. అట్లే మాకంటే ఎక్కువ కులము వారున్నారనీ, మతము
విషయము తెలియకముందే కులము విషయము తెలిసిపోయినది. అప్పుడు
కొద్దికొద్దిగా కులములను గురించి తెలియసాగింది.
దాదాపు పది సంవత్సరముల వయస్సు వచ్చేసరికి కులములలో
పెద్ద చిన్న కులములు ఉన్నాయని తెలిసింది. మనుషులలో కులములు
మాత్రమే తెలిసిన మాకు మతముల గురించి తెలియదు. మనుషులందరి
లోను కులములే ఉన్నాయని అనుకొనేవారము. అక్కడక్కడ ముస్లీమ్లు
కనిపించినా అందరిలాగా వారిది ఒక కులము అని అనుకొన్నాము. నాకు
పద్నాలుగు సంవత్సరములు వచ్చువరకు మతాల గురించి తెలియదు.
ముస్లీమ్లు, క్రైస్థవులు కనిపించినా వారిది కూడా కులమే అనుకున్నాము.
పీర్లపండుగను చూచేవారము. వారు చక్కెరను పీర్లకు చదివించుచుండగా,
దేవతారాధనలలో అది కూడా ఒక ఆరాధన యనుకొన్నాము. పీర్లపండుగలో
హిందువులే చక్కెర ఇచ్చి పీర్లకు మొక్కుబడి చెల్లించుకొనేవారు. పీర్లు
కూడా దేవతలలో ఒక రకము దేవతలు అని అనుకొన్నాము. తర్వాత మా
వయస్సు దాదాపు 18 నుండి 20 సంవత్సరముల వయస్సులో చదివే
చదువులో మత ప్రస్థావన వచ్చేది. అలా వయస్సు వచ్చేకొలది ‘మతము’
అనునది ఒకటి గలదు అని తెలిసినది. ముస్లీమ్లు దేవతలను ఆరాధించరు,
వారు నమాజ్ చేస్తారు. హిందువులు దేవతారాధన చేస్తారు అని
యుక్తవయస్సు వచ్చేటప్పటికి తెలిసిపోయినది. బాల్యములో కులములు
తెలియగా, యవ్వనములో మతములు తెలిసినవి.
నేడు కూడా హిందువులలో యుక్తవయస్సు వచ్చు వరకు మతముల
విషయము తెలియకుండాపోయినది. అయితే ముస్లీమ్ మతములోగానీ,
క్రైస్థవ మతములోగానీ ఎనిమిది సంవత్సరముల వయస్సుకే మాది ఫలానా
మతము అని వారికి తెలిసిపోవుచున్నది. ముస్లీమ్లు, క్రైస్తవులు చిన్న
వయస్సులోనే వారి ప్రార్థనా మందిరములకు వారి పెద్దలవెంట పోవుట
వలన, వారి బోధకులు చెప్పే బోధల వలన, మతము అనేది వారికి చిన్న
వయస్సులోనే ఎనిమిది సంవత్సరములకే తెలిసిపోవుచున్నది. హిందూ
మతములోని పిల్లలకు దేవుడు అనిగానీ, పెద్దలవెంట దేవాలయములకు
పోవడముగానీ, అక్కడ చేయు పూజలుగానీ తెలియని దానివలన
హిందువులకు మతము అనునది ప్రత్యేకముగా కలదని చాలామందికి
తెలియదు. హిందువుల పిల్లలకు కులముల విషయము తెలియవచ్చు
నేమోగానీ, మతముల విషయము తెలియదనియే చెప్పవచ్చును. ఒక్క
మత విషయమేకాక దేవుడుగానీ, దేవుని భక్తిగానీ ఏమీ తెలియదు.
ఇది యాభై, అరవై సంవత్సరముల క్రిందట మాకు జరిగిన
విషయమును మేము చెప్పాము. అయితే అప్పటికీ ఇప్పటికీ కొంత తేడా
సమాజములో కనిపిస్తావుంది. హిందువులలో కులాల విషయము కూడా
యుక్తవయస్సు వరకు తెలియకుండా పోయినది. యుక్తవయస్సులో కులాల
విషయము తెలుస్తున్నది. ముస్లీమ్లు, క్రైస్థవులలో చిన్నవయస్సులోనే ఏడు,
ఎనిమిది సంవత్సరములకే వారిలో మతము అనునది ఘాడముగా
నాటుకొనుచున్నది. వారిని చూచిన హిందువులు కూడా మతము అను
పాట పాడుచున్నారు. మాది హిందూమతము అని అంటున్నారు. అలా
అందరూ మతములను తెలియగల్గినా, కులము అనునది పూర్వము
తెలిసినంత వేగముగా తెలియడము లేదు. ముందు తెలిసినా, వెనుక
తెలిసినా, నేడు కొన్ని కులములు ఒక దానిలో ఒకటి కలిసిపోయినా,
కొన్ని మాత్రము పూర్తి విభేదముగా యున్నవి. పూర్వమున్నంత కులముల
సంఖ్య లేకుండా కొంత తగ్గినా, నూరు కులములలో నాలుగు లేక ఐదు
కులములు లేకుండా పోయినా, ఇతర కులములలో కలిసిపోయినా, మిగతా
కులములన్నియూ అలాగే గలవు.
ప్రపంచములో నేడు గల పన్నెండు మతములలో లేని కుల వివక్షలు
ఒక్క హిందూమతములో గలవు. కులము అనునది మనిషి అజ్ఞానము
వలన పుట్టినదని తెలియుచున్నది. ఏ కులము వారు ఆ కులములోనే
వివాహమును చేసుకోవడము జరుగుచున్నది. అలా వివాహములు కట్టుబాట్లు
అక్కడక్కడ లేకుండా పోయి, కులాంతర వివాహములు కొన్నిచోట్ల
జరుగుచున్నవి. కులములు అజ్ఞానము వలన ఏర్పడినవని జ్ఞానమును
తెలియగల్గిన రోజు తెలియును. అయితే నేడు ఎవరూ జ్ఞానమును
తెలియడము లేదు. కులాంతర వివాహములు ఎక్కడ జరిగినా అవి
అరుదుగా జరుగుచున్నవి. మనుషులలో మతభేదములు, కులభేదములు
లేకుండా చేయాలని మేము ఎన్నోమార్లు మా ఉపన్యాసములలో చెప్పాము.
మొదటనే ఆ పనిని చేస్తే బాగుంటుందని నేను కులాంతర వివాహము
చేసుకొన్నాను. తర్వాత నా కుమారునికి కూడా కులాంతర వివాహమును
చేశాము. అంతేకాక నా సమక్షములో మా ఆశ్రమములో జరిగినవి ఇప్పటికి
దాదాపు 150 దాకా యుండవచ్చును. అందులో మూడు లేక నాలుగు
తప్ప మిగతావన్నీ కులాంతర వివాహములుగానే చేశాము. ఇరువైపులా
పెద్దలను ఒప్పించే చేశాము తప్ప దొంగ పెళ్ళిల్లు కాదు.
ప్రపంచములో గల పన్నెండు మతములలో ముఖ్యమైనవి, పెద్దవి
అయినవి మూడు మతములే గలవు. అవే హిందూ, ఇస్లామ్, క్రైస్థవ
మతములు. మొదటినుండి ఉన్నది హిందూమతమని చెప్పవచ్చును. తర్వాత
కలియుగములో ఇస్లామ్, క్రైస్థవము వచ్చాయి. ఆ రెండు మతములు
ఒకటి ఇంజీలు, రెండు ఖుర్ఆన్ అను గ్రంథముల ఆధారముతో తయారయిన
వని చెప్పినా, వాస్తవానికి ఆ గ్రంథములలో మతము అను ప్రసక్తి లేదు.
అయినా మాయ ప్రభావము వలన మతములు తయారయినవి. హిందువులు
కృతయుగము నుండి యున్నారు. దాదాపు 24 లక్షల సంవత్సరముల
నుండి యున్న హిందువులలో మతము అను ప్రసక్తి లేకుండా బ్రతికారు.
అయితే కలియుగములో మూడు వేల సంవత్సరములు గడచిన తర్వాత
హిందువులలో మతము అనునది వచ్చినది. కలియుగములో ఇతర
మతములు వచ్చిన తర్వాత మతము అను పేరు హిందువులకు వచ్చినది.
వాస్తవముగా నేడు హిందూమతము అని పిలువబడు పేరు 150
సంవత్సరముల పూర్వము వరకు ఇందూమతము అను పేరుతో యుండేది.
ఇప్పుడు దాదాపు 150 సంవత్సరముల నుండి ఇందూమతము కాస్తా
హిందూమతముగా మారిపోయినది.
క్రైస్థవ మతమునకు ఇంజీలు (బైబిలు) గ్రంథము ఆధారముగా
యున్నట్లు, బైబిలు క్రైస్థవ మత గ్రంథమన్నట్లు వారు చెప్పుచున్నారు. 1400
సంవత్సరముల క్రిందట తయారయిన ఇస్లామ్ మతమునకు ఖుర్ఆన్
గ్రంథము ఆధారము అని అంటున్నారు. ఖుర్ఆన్ ముస్లీమ్ల మత
గ్రంథమని కూడా చెప్పుకొంటున్నారు. వాస్తవముగా ఆ రెండూ దైవ
గ్రంథములు. అందులో మత ప్రసక్తి లేదు. ఆ రెండు గ్రంథములు సర్వ
మానవులకు హితోపదేశమును చేయుచున్నవి తప్ప మతోపదేశమును
చేయలేదు. ఈ రెండు గ్రంథములకంటే ముందు, ఐదు వేల సంవత్సరముల
పూర్వమే భగవద్గీత పుట్టినది. అందులో కూడా మత ప్రసక్తి లేదు. అయినా
మూడు దైవ గ్రంథములకు మూడు మతములను మనుషులే కరిపించారు.
బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో దైవ జ్ఞానమేయున్నా, వాటిలో మతమును
చొప్పించుకొని కొంతవరకు చూపడము జరిగినది. భగవద్గీత విషయానికి
వస్తే భగవద్గీత గ్రంథములో స్వచ్ఛమైన జ్ఞానముండగా కొందరు స్వార్థవరులు
అందులో కూడా తమ పైత్యమును ఎక్కించారు. అలా చేయడమేకాక
మొదటి కృతయుగమునుండి యున్న కులమునకు బలము చేకూర్చుటకు
గీతలోని వాస్తవ శ్లోకములకు అవాస్తవ భావములను కల్పించి చెప్పి
కులమునకు బలమును చేకూర్చారు.
క్రైస్థవులు, ముస్లీమ్లు మతమునకు బలమును చేకూర్చుకొనునట్లు
వారి గ్రంథములను, వాటిలోని భావములను మార్చి వ్రాసుకోగా,
హిందువులు భగవద్గీతలో మతముకంటే ముందు కులమునకు బలము
చేకూర్చుకొనునట్లు శ్లోకముల భావమును వ్రాసుకొన్నారు. హిందువులను
భగవద్గీతను అనుసరించి నాల్గు భాగములు చేశారు. భగవద్గీతలో
జ్ఞానయోగమందు గల 13వ శ్లోకమును చూడండి.
శ్లో॥ 13.
చాతుర్వర్ణ్వం మయాసృష్టం గుణకర్మ విభాగశః |
తస్యకర్తార మపి మాం విద్ధ్వకర్తార మవ్యయమ్ ॥
భావము :- “నాల్గు వర్ణములు నాచేత సృష్టింపబడినాయి. కర్మల గుణముల
విభాగము వలన నాల్గు కులములు ఏర్పడినాయి.” అని చెప్పినట్లు గలదు.
భగవద్గీతలో ఈ శ్లోకము గొప్ప జ్ఞానమును తెలుపుచుండగా
బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులను నాలుగు కులములను వర్ణించి
చెప్పడమైనది. కృతయుగము నుండి కలియుగము వరకు కులములు
మాత్రమే యుండగా, కలియుగములో భగవద్గీతయందు అన్ని కులములను
కలిపి, మొత్తము హిందూ సమాజమును నాలుగు భాగములుగా
విభజించడము జరిగినది. అప్పటికే బ్రాహ్మణ కులము ఒకటికాగా,
వైశ్యుల కులము కూడా ఒకటి గలదు. క్షత్రియుల కులము కూడా ఒకటి
కలదు. మొత్తము హిందూ సమాజములో మూడు కులములు ఐదు లేక
పది శాతము ప్రజలుండగా మిగతా కులములన్నియూ దాదాపు 90 లేక
95 శాతముల గలవు. 90 శాతము గల కులములన్నియూ నీచమైనవను
భావము వచ్చునట్లు శూద్రులు అని అన్నారు. ఎన్నో కులములన్నీ కలిపి
90 శాతము ప్రజలను శూద్రులు అను పేరుతో విడదీయడమే కాకుండా,
శూద్రులయిన వారు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు సేవ చేయు నిమిత్తము
యున్నారని చెప్పుచుందురు. కొన్నిచోట్ల వైశ్య, క్షత్రియులు కూడా బ్రాహ్మణుల
సేవ నిమిత్తమేయని చెప్పియున్నారు. దైవగ్రంథమైన భగవద్గీతలోనే
కులముల తేడాలను, కులముల గుంపులను తయారు చేసి చూపడమైనది.
వాస్తవముగా భగవద్గీతలో కులముల ప్రస్థావనే లేదు. అయినా భగవద్గీతను
చెప్పు పండితులు బ్రాహ్మణులే అయియుండుట వలన వారు తమ
ఇష్టానుసారము శ్లోకము యొక్క భావమును వ్రాసి చెప్పడమైనది.
వాస్తవమేమియని చూచిన మాకు ఆ శ్లోకములో శరీర అంతర్గత జ్ఞానమును
చెప్పియుండగా, దానిని చెప్పక అందులో కులముల ప్రసక్తిని తెచ్చి చెప్పారు.
ఇప్పుడు పై శ్లోకములోని నిజ భావమును వివరించుకొందాము.
భగవంతుడు నాలుగు వర్ణములు సృష్టించాడు వాస్తవమే. అవి
ఏవి? అనుటయే ఇక్కడ పెద్ద సమస్య. ఇంతవరకు ఆ నాల్గు వర్ణములను
గురించి చాలామంది నాల్గు కులాలుగ వర్ణించుకోవడము జరిగినది.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా నాల్గువర్ణములు సృష్టించబడినవని
ప్రచారమైనది. అది నిజమా!యని చూచిన, సమస్త ప్రపంచమును సృష్టించిన
పరమాత్మ ప్రపంచములో ఉన్న మనుషులను కూడా ప్రకృతి చేత తయారు
చేశాడు. కానీ ప్రపంచ జనాభాలో ఈ నాల్గు కులాలు ఎక్కడా కనిపించవు.
దీనినిబట్టి మనకు సంశయమేర్పడుచున్నది. భగవంతుడు చెప్పిన ప్రతి
మాట సర్వజీవరాసులకు వర్తించునదై ఉండగా, ఈ నాల్గు వర్ణములు నాలుగు
కులాలనుమాట, విదేశాలలోనే కాదు ఇండియాలో కూడా వర్తించదు.
పరమాత్మ బాహ్యముగా ఉన్న ఏ మతమునుగానీ, ఏ కులమునుగానీ
ఇంతవరకు ఏర్పరచలేదు. కులాలు, మతాలు భూమిమీద ఏర్పరచుకొన్న
వారు మనుషులే. కుల, మత భేదములు మనుషులు ఏర్పరచుకున్నవే
కానీ పరమాత్మ సృష్ఠించలేదు. ఇంకా కొందరు "భగవంతుడు గుణకర్మ
విభాగ అన్నాడు కదా! మనుషులు చేయు పనులనుబట్టి, గుణములను
బట్టి వారిని విభజించుకోవచ్చును. వ్యాపారము చేయువారు ఎవరైనా
వైశ్యులనీ, నీచ పనులు చేయువారు శూద్రులనీ, రాజ్యమునేలు వారిని
క్షత్రియులని చెప్పుకోవచ్చును. వారి పుట్టుకతో వచ్చిన కులము ముఖ్యము
కాదు. వారు చేయు పనులనుబట్టి కులమేర్పరచాలి. పుట్టుకతో
బ్రాహ్మణుడైనప్పటికీ నీచపనులు చేస్తే శూద్రుడని చెప్పాలి.” అని
అంటున్నారు. ఆయన చేసినది కానీ, చెప్పినది కానీ ప్రతి జీవరాసికి
వర్తించునదిగా ఉన్నప్పుడు, మనుషులలో అయితే నాల్గు కులాలు
ఏర్పరచినట్లు చెప్పుకోవచ్చు. మిగతా జీవరాసులెన్నో ఉన్నాయి కదా! వాటిని
ఏ కులాలుగా చెప్పగలము? కుక్కలను, నక్కలను, పిల్లులను, ఎలుకలను
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించి చెప్పగలరా? అట్లు
చెప్పుటకు వీలులేదు. కావున ఈ నాల్గు వర్ణములు పరమాత్మ చెప్పినవి
కావు. మానవులు సృష్ఠించుకొన్నవే అని తెలియాలి. పై శ్లోకములో నాల్గు
వర్ణములు నాచేత సృష్ఠింపబడినాయి అన్నాడు. కానీ అవి బ్రాహ్మణ,
క్షత్రియ కులములని పేరు పెట్టలేదు కదా! ఈ విధముగా యోచిస్తే
ఇంతవరకు ఈ శ్లోకమునకు వ్రాసుకొన్న భావము సరియైనది కాదని
తేలిపోవుచున్నది. ఇది సరియైన అర్థము కానప్పుడు ఏది సరియైనదనుట
అందరికీ వచ్చు ప్రశ్నయే. దానికి జవాబు క్రింద చూస్తాము.
భగవంతుడైన శ్రీకృష్ణుడు తన తలమీద నెమలి పింఛమును
ధరించాడు. ఎవరూ ధరించని పింఛమును ఆయన ధరించడములో ప్రత్యేకత
ఏమిటని ఎవరూ ఇంతవరకు యోచించలేదనియే చెప్పవచ్చును. ఇప్పుడు
మనము యోచిస్తాము. శ్రీకృష్ణుడు నెమలి పింఛమును అందమునకో,
అలంకారమునకో ధరించలేదు. తానున్న స్థితిని గూర్చి నెమలి పింఛము
ద్వారా తెలుపుచూ, మీరు కూడా ఈ మాదిరే ఉండవలెనని బహిర్గతము
చేయు ఆధ్యాత్మిక రహస్యమే పింఛము ధరించడములోని విశేషార్థమని
తెలియాలి. నెమలి పింఛము గొప్ప ఆధ్యాత్మిక రహస్యమును గూర్చి బోధించు
విశిష్ఠత కల్గివున్నది. దాని విశేషమేమనగా! పింఛము యొక్క మధ్య భాగము
నలుపు కలిసిన నీలిరంగుతో కూడుకొని కొద్దిగా గుండ్రముగా ఆకర్షణగా
కనిపిస్తూ ఉండును. ఈ భాగము పింఛములో అన్ని రంగులకంటే
ముఖ్యముగా తెలియునట్లుండును. దానికి చుట్టు మెరుపు గల ఆకుపచ్చ
రంగు ఉండును. దాని తర్వాత లేత గోధుమ రంగుగల ఆకారము చుట్టు
ఉండును. ఈ లేత గోధుమరంగు చుట్టు చివరియందు మెరియుచుండును.
దీని చివరి అంచు మెరుపు తర్వాత చుట్టు గుర్తించలేనంత లేతగా ఒక
రంగు భాగముండును. వీటినిబట్టి పింఛములో మొత్తము నాలుగు
భాగములున్నట్లు గుర్తు తెలియుచున్నది. 1) మధ్యలో నలుపు రంగు
కలిసిన నీలిరంగు ఉన్నది. 2) గుండ్రని మెరుపుగల ఆకుపచ్చ భాగము
3) లేత గోధుమ రంగు 4) రంగు గమనించ లేనంతగా ఒక భాగముండును.
నాల్గవ దాని అంచు చివరలో కూడా సులభముగా గుర్తించవచ్చును. బయటి
నుండి మూడు గుండ్రని భాగములనుండి మధ్యలో కన్నుగ లేక కేంద్రముగ
యున్న నెమలి పింఛమును బ్రహ్మవిద్యయైన మరియు యోగశాస్త్రమైన
గీతా శాస్త్రమును చెప్పిన శ్రీకృష్ణుడు ధరించడము గొప్ప అర్థమై ఉన్నది.
దాని వివరమేమనగా!
మన శరీరములో శిరో భాగమునందు గుణములు కలవు.
శరీరముచే జరుగు కార్యములన్నిటికీ కారణమైన గుణములు ఒక పద్ధతిగా
అమర్చబడి ఉన్నవి. ఒక పద్ధతి ఒక చక్రముగా నిర్మితమై ఉన్నది.
గుణములు మూడు రకములుగా విభజింపబడి ఉన్నవి. వాటి పేర్లు 1)
సాత్త్వికము 2) రాజసము 3) తామసము. ఈ మూడు రకముల గుణములు
గుణచక్రములో మూడు భాగములుగా విభజింపబడి ఉన్నాయి. ఆ మూడు
భాగములకు సాత్విక భాగము, రాజస భాగము, తామస భాగము అని
పేర్లు పెట్టబడినవి. ఈ మూడు భాగములకు మధ్యలో గుండ్రని
భాగమొకటున్నది దానినే బ్రహ్మనాడి అనుచున్నాము. దానియందే ఆత్మ
నివాసమైయున్నది. ఆత్మ నివాసమున్న బ్రహ్మనాడిని ఇరుసుగా చేసుకొని
కంటికి కనిపించని గుణచక్రము అమరివున్నది. దాని అమరిక క్రిందగల
పటములో చూడవచ్చును.
నేనుకానీ, నీవుకానీ, సర్వజీవులుగానీ ఈ గుణచక్రములోనే
చిక్కుకొని ఉన్నాము. ఈ మూడు భాగములలో జీవుడు ఎక్కువ ఏ
భాగములో ఉండునో, ఆ జీవునికి ఆ భాగము యొక్క పేరు పెట్టబడినది.
తామస భాగములో ఎక్కువ కాలమున్న జీవున్ని తామసుడనీ, రాజస
గుణభాగములో ఉన్న జీవున్ని రాజసుడనీ, సాత్వికములో ఉన్న జీవున్ని
సాత్త్వికుడనీ పేరు పెట్టడమైనది. ఏ భాగములో ఉన్న జీవునికైనా మధ్యలో
ఉన్న ఆత్మయే సాక్షిగా ఉన్నది. మధ్యలో ఉన్న ఆత్మకు తెలియని జీవరాసి
లేదు. ప్రతి శరీరములో గల గుణచక్రము మధ్యలో ఉన్న ఆత్మ తన చుట్టు
ఉన్న గుణములతో సంబంధము లేక సాక్షిగా ఉన్నది.
గుణ చక్రము చిహ్నము ను 22 పేజీ లో చూడండి.
తామసము ,రాజసము,సాత్త్వికము గుణ చక్రము లో భాగములు చిహ్నము ను 22 పేజీ లో చూడండి.
నెమలి పింఛము.
ప్రతి జీవరాసి గుణముల వలన పనులు చేయుచున్నది. జరిగెడి
పనుల వలన పాపపుణ్యములు ఆ జీవునికి సంభవించుచున్నవి. పాపపుణ్య
కర్మలు జీవాత్మకే గానీ మధ్యనున్న ఆత్మకు అంటవు. ఆత్మశక్తియే శరీరమంతా
వ్యాపించి కదలిక నిచ్చునదైనప్పటికీ, ఆ కదలికలు గుణములననుసరించి
ఉండును. ఆ గుణములు కర్మననుసరించి ఉండును. శరీరములో
గుణముల ఆదేశాల ప్రకారము వివిధ పనులు జరుగుచున్నప్పటికీ,
పనులకు శక్తినిచ్చునదైన ఆత్మకు మాత్రము కర్మ అంటక అన్నిటికీ సాక్షిగా
ఉన్నది.
నెమలి పింఛములో మధ్యనగల గుర్తింపు భాగము గుణచక్రములో
మధ్యనగల ఆత్మ నివాస స్థానమని తెలియాలి. దానికి చుట్టుగల రెండవ
భాగమును సాత్విక భాగమనియూ, దానిచుట్టు గల మూడవ భాగమును
రాజస భాగమనియూ, అట్లే చివరి నాల్గవ భాగమును తామస భాగమనియూ
తెలియాలి. ఈ విధముగా నెమలి పింఛముతో గుణచక్రముకు సమాన
పోలికలున్నవి. శ్రీకృష్ణుడు నేను పనులు చేయుచున్నాను, నాకు ఏ గుణకర్మ
అంటదు, నేను మూడు గుణముల మధ్య కర్మ అంటని ఆత్మగా ఉన్నానని
తెలుపు నిమిత్తమే మూడు రంగుల మధ్యలో గుర్తింపుగా కనిపించు ప్రత్యేక
రంగున్న పింఛమును ధరించాడు.
మన శరీరములో బ్రహ్మనాడి తలనుండి గుదస్థానము వరకు
వెన్నెముక మధ్యలో వ్యాపించి ఉన్నది. ఈ నాడియందే ఆత్మ నివాసముంటు,
తన శక్తిని వెన్నెముకకు ఇరువైపుల బ్రహ్మనాడి నుండి చీలిపోయిన చిన్న
నరముల ద్వారా శరీరమంతా వ్యాపింప చేసి, అన్ని అవయవములను
కదలునట్లు చేయుచున్నది. పైన శిరస్సులోని గుణచక్రము నుండి వచ్చు
ఆదేశములు బ్రహ్మనాడి నరముల ద్వారా చివరకు అవయవములకు
చేరుచున్నవి. అవయవముల నుంచి వచ్చు విషయములు కూడా బ్రహ్మనాడి
నుంచే పైకి చేరుచున్నవి. బ్రహ్మనాడి యొక్క చిన్న నరముల అమరిక
నెమలి పింఛమును గమనిస్తే అర్థమగును. పింఛము యొక్క కాడ లావుగా,
తెల్లగా మొదలై పొడవుగా ఉండును. ఆ కాడను బ్రహ్మనాడిగా అర్థము
చేసుకోవలెను. పింఛము యొక్క కాడ పొడవునా చిన్నచిన్న ఈక వెంట్రుకలు
రెండువైపులా వ్యాపించి ఉండును. వాటిని బ్రహ్మనాడి నుంచి బయల్పడిన
చిన్నచిన్న నాడులుగా గుర్తించుకోవలెను. పింఛము పైన కనిపించు నాల్గు
భాగములను గుణచక్ర భాగములుగా లెక్కించుకోవలెను.
తలలోని గుణచక్రమును మరియు బ్రహ్మనాడిని పోలు పింఛము
శ్రీకృష్ణుడు ధరించడములో విశేషములు 1) సర్వజీవరాసుల శరీరములో
ఈ విధ అమరిక ఉన్నదను జ్ఞానము తెలుపు నిమిత్తము పింఛము ధరించాడు.
2) సర్వ జీవులకు ఆత్మసాక్షిగా ఉన్నదను సూచన నిమిత్తము పింఛము
ధరించాడు. 3) ఆత్మ మూడు గుణములకు మధ్యన ఉండి, ఏ గుణములకు
సంబంధము లేదని తెలుపు నిమిత్తము పింఛము ధరించాడు. 4) ఏ
పనులు చేయుచున్ననూ వాటి కర్మ మధ్యనగల నాకంటదని తెలుపు నిమిత్తము
పింఛము ధరించాడు. 5) సర్వజీవరాసుల శిరస్సులలోనే ఆత్మ మరియు
గుణములున్నాయను తెలుపు నిమిత్తము తల మీదనే పింఛము ధరించాడు.
6) చివరి అంచు రంగు లేతదై, రెండవది దానికంటే ఎక్కువ కనిపించునదై,
మూడవది రెండవ దానికంటే మరీ ఎక్కువ కనిపించునదై, నాల్గవది అన్నిటి
కంటే మిన్నగా కనిపించునదై ఉన్నది. అటువంటి పింఛము ధరించడములో
ఏ జీవరాసియైన చివరకు ఇక్కడకు రావలసిందేనని అర్థము తెలియవలెను.
7) రెండవ అధ్యాయమైన కర్మయోగము 28వ శ్లోకమున "తత్త్వ విత్తు
మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తన్త ఇతి మత్వాన సజ్జతే"
గుణకర్మ విభాగములు తెలిసినవాడు ఆత్మను తెలిసినవాడగును. అటువంటి
వాడు గుణముల వలన జరిగెడి పనులు ఎన్ని చేయుచున్ననూ, చేయని
వాడేనని తెలుపు నిమిత్తము శ్రీకృష్ణుడు పింఛము ధరించాడు.
ఇప్పుడు అసలు విషయానికొస్తాము. భగవంతుడు పై శ్లోకములో
చెప్పిన నాలుగు వర్ణములు గుణచక్రములోని నాలుగు భాగములేయని
తెలియాలి. వాటి ప్రకారము బయట మొదటి భాగములో ఉన్నవారు
తామసులు, రెండవ భాగములో ఉన్నవారు రాజసులు, మూడవ భాగములో
ఉన్నవారు సాత్త్వికులు, నాల్గవ భాగములో ఉన్నవారు యోగులు. యోగ
మాచరించువారు గుణరహితులై ఆత్మను పొందినవారు కనుక వారిని
యోగులనుట జరిగినది. ఈ లెక్క ప్రకారము సర్వ జీవరాసులలోనూ
నాల్గువర్ణములు కలవని అవియే తామసులు, రాజసులు, సాత్త్వికులు,
యోగులని పిలువబడుచున్నవని తెలియుచున్నది. ఈ నాల్గు వర్ణములతో
పరమాత్మ సంబంధము లేనివాడై ఉన్నాడు. కనుక వాటికి కర్తనై
కాకుండనున్నానన్నాడు. ఇప్పుడు దైవ నిర్మితమైన నాల్గు వర్ణములు
సర్వజీవరాసులకు సంక్రమించిన నాల్గువర్ణములని తెలిసిందా!
భగవద్గీత శ్లోక భావమునుబట్టి దాని వివరమునుబట్టి చూస్తే
దేవుడు తాను సృష్టించిన మనుషులను గుణములు గలవారు మూడు
భాగములలో, గుణములు లేనివారు ఒక భాగములో ఉండుటకు అవకాశము
కలదని చెప్పాడు. దీనినిబట్టి మూడు గుణ భాగములలో యున్నవారే
ప్రపంచమంతా యున్నారు. గుణ రహిత భాగమయిన ఒక భాగములో
ప్రపంచ జనాభా మొత్తము మీద ఒకరు లేక ఇద్దరు అంతకంటే ఎక్కువ
అంటే ఏకసంఖ్య మించకుండా తొమ్మిదిమంది వరకు ఒక కాలములో
ఉండవచ్చును.
ప్రశ్న :- స్వామీ! మీరు గతములో ఒకమారు మాతో మాట్లాడుచూ జ్ఞానమును
చెప్పునప్పుడు మా జ్ఞానము తెలిసి కొందరు గుణరహిత యోగులుగా
తయారయ్యారు. అటువంటి వారి సంఖ్య దాదాపు రెండు అంకెల సంఖ్య
తొంభై తొమ్మిది (99) వరకు యుండవచ్చును అని చెప్పారు. ఇప్పుడు
ఏకసంఖ్య తొమ్మిదియని చెప్పుచున్నారు. ఇందులో వాస్తవము ఏది?
జవాబు :- అప్పుడు చెప్పినది ఇప్పుడు చెప్పినది రెండూ వాస్తవమే. ఎలా
అనగా యోగులలో కర్మయోగులు వేరు, బ్రహ్మయోగులు వేరు. ఇప్పుడు
చెప్పు గుణరహిత యోగులు రెండు అంకెల సంఖ్య మించకుండా పది
నుండి తొంభై తొమ్మిది వరకు యుండవచ్చును. 80 లేక 90 మంది
ఉండారనుకొందాము. వారు ఎల్లవేళలా గుణరహిత బ్రహ్మయోగములో
ఉండరు కదా! ఏదో కొంత సమయము మాత్రము గుణములు లేకుండా
బ్రహ్మయోగములో ఉండి తర్వాత గుణములలో చేరిపోవుచుందురు.
అలాంటివారు ఏక కాలములో లెక్క చూస్తే బ్రహ్మయోగములో లగ్నమై
యున్నవారు ఒకటి నుండి తొమ్మిది వరకు యుండవచ్చును అన్నాను.
మొదట చెప్పినది బ్రహ్మయోగము చేయుటకు యోగ్యులు (అర్హులు) అయిన
వారు 10 నుండి 99 వరకు యుండవచ్చును. వారిలో యోగమునందు
లగ్నమైయుండే వారు దాదాపు 1 నుండి 9 వరకు యుండవచ్చును అని
చెప్పాను. నేను చెప్పినది సత్యమే. మీకు అర్థము కావడములో తేడా
వచ్చినది.
కర్మ అనగా పాపపుణ్యములు రెండూ కలిసినదని అర్థము. బ్రహ్మ
అనగా పెద్దయని అర్థము. ఒకవైపు పాపపుణ్య కర్మలతో జరుగు కార్యములు
శరీరములో ఆత్మ చేయుచున్నా, శరీరములోని జీవుడు ఆ కార్యములకు
తనకు సంబంధము లేదని తాను ఏమీ చేయనివాడిననీ, కార్యములను
చేయునది శరీరములోని ఆత్మేనని తెలిసి, తాను కానను జ్ఞానములో, తనకు
నేనే చేయుచున్నానను భావమును కల్గించు అహము మాట వినక, అహము
అసత్యమును చెప్పుచున్నదని, దాని భావమును ఎవడయితే పొందడో వాడు
కర్మయోగి అగును. కర్మయోగి గుణములతో కూడి పని చేయుచూ గుణము
లందే నివశించుచూ యోగమును పొందును. కావున అతను మూడు
గుణ భాగములలోనే యుండును. మూడు గుణ భాగములలో ఉంటూనే
కర్మయోగమును ఆచరించును. గుణముల వలన జరుగు పనులను
గుణములందే కూడి ఆచరించుచుండును. ఆత్మే అలా చేయుచుండును.
అట్లు గుణములలో యుండి చేయునది కర్మయోగము. అందువలన దానిని
గుణరహిత యోగము అని చెప్పము. అది గుణరహిత యోగము కాదు.
గుణరహిత యోగమును బ్రహ్మయోగము అని అంటాము. నేను చెప్పునది
గుణరహిత యోగము యొక్క విషయము. కర్మయోగములో ఎంతమంద
యినా యుండవచ్చును. కానీ బ్రహ్మయోగములో ఒకే కాలములో 1
నుండి 9 మంది వరకు యుండవచ్చునని చెప్పాను. 9 వరకు అని
చెప్పానుగానీ, ఖచ్చితముగా 9 మందియని చెప్పలేదు. ఒక కాలములో
ఒక్కడయినా యుండవచ్చును లేక ఇద్దరయినా ఉండవచ్చును.
ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో ధర్మయుక్తమైన యోగము
లను రెండిటినే చెప్పారు. ఆ రెండులో ఒకటి కర్మయోగము, రెండు
బ్రహ్మ యోగము. రెండు యోగములు కర్మల నుండి తప్పించుకొని మోక్షము
పొందుటకే పనికి వచ్చును. అందువలన రెండు యోగములు ఒక
విధముగా సమానమేయని చెప్పినా, వాటిని ఆచరించడములో కొంత
సులభమైనది కర్మయోగము, చాలా కష్టమైనది బ్రహ్మయోగము. కష్టమైన
యోగము అయిన దానివలన దానిని బ్రహ్మ (పెద్ద) యోగము అని అన్నారు.
ఫలితములో రెండూ సమానమే అయినా, సాధనలో పెద్దది బ్రహ్మయోగమే.
బ్రహ్మ అనగా పెద్దయని అర్థము. బ్రహ్మము అనగా దేవుడు అని అర్థము.
పరబ్రహ్మము అనగా దేవుడుకంటే వేరుగా యున్నవాడు అని అర్థము.
దేవుడు అనగా ఆత్మయని చెప్పవచ్చును. నీవు నివశించు శరీరములో
ఆత్మే పెద్దది. శరీరములో అధిపతి ఆత్మే, శరీరములో దేవుడు ఆత్మే.
శరీరములో బ్రహ్మ ఆత్మే. శరీరములో బ్రహ్మ (పెద్ద గా యున్నవాడు
ఆత్మకాగా, ఆత్మను దేవునిగా నియమించి, మనిషి కర్మను తీర్పు చేసి
ప్రారబ్ధకర్మను నిర్ణయించి మరణములో రెండవ జన్మకు పంపు అధికారమును
ఆత్మకు ఇచ్చినవాడు, ఆత్మకంటే వేరుగాయున్న పరమాత్మ. పరమాత్మ
ప్రపంచమును సర్వమును సృష్టించిన తర్వాత ఆత్మను దేవునిగా నియమించి,
మనుషుల మరణములో తీర్పు తీర్చి లోకములోనికి పంపడముగానీ, తీర్పులో
కర్మ అయిపోయివుంటే పరలోకము (మోక్షము)నకు పంపడము గానీ చేయు
అధికారమును ఆత్మకు ఇచ్చాడు. అంతేకాక ఆయన ఆత్మకంటే వేరయిన
దేవుడు అనగా బ్రహ్మకంటే వేరుగా యున్న పరబ్రహ్మ అయిన దేవుడు.
సర్వమానవులందరూ ఆరాధించుటకు అర్హుడైన దేవుడు ఆత్మేయని, ఆత్మను
అందరి దేవునిగా నిర్ణయించి, అధికారములు సర్వము ఇచ్చి, ఆయన
మౌనముగా ఏమీ చేయని వాడుగా, సాక్షిగా శరీరములోనూ, శరీరము
బయట ఉండిపోగా, శరీరములో నివశించు జీవాత్మకు పెద్దగా, దేవునిగా,
జన్మలకుగానీ, మోక్షమునకుగానీ పంపువానిగా ఆత్మే యున్నాడు.
అధికారములన్నీ ఆత్మకు ఇచ్చిన పరమాత్మతో ఎవరికీ పని లేదు.
అందరూ ఆరాధించుటకు యోగ్యత పొందిన దేవుడు ఆత్మయే. ఈ మాట
మూడు దైవగ్రంథముల సారాంశముతో చెప్పుచున్న సత్యము. 'పెద్ద' అను
మాట వర్తించేది ఆత్మకే. ఆత్మను సృష్టించి అన్ని అధికారములు ఇచ్చిన
పరమాత్మ ఆత్మకంటే పెద్ద అయినా, ఆయన మానవులతో సంబంధము
లేనివాడై ఏదీ చేయనివాడై, ఏదీ కానివాడై పోయాడు. కేవలము
సాక్షిగాయున్న పరమాత్మ ఎవరి ఆరాధ్య దైవము కూడా కాకుండా, అన్నిటికీ
అతీతముగా మనిషితో ఏ సంబంధము లేనివాడుగా, మనిషికి తెలియకుండా
ఉండిపోయాడు. అందరికీ తెలిసిన దేవుడు, అందరికీ పెద్ద అయినవాడు
ఆత్మే. అందువలన మనిషి నేర్వవలసినది ఆత్మజ్ఞానమునే గానీ, పరమాత్మ
జ్ఞానమును కాదు. ఆత్మయొక్క సంపూర్ణ జ్ఞానమును తెలియగలిగితే ఆత్మను
దేవునిగా నియమించి తెరచాటుకు కనిపించకుండా పోయినవాడు
పరమాత్మయని తెలియగలదు. ఆత్మజ్ఞానమునే బ్రహ్మవిద్యయని అన్నారు.
బ్రహ్మవిద్య అనగా పెద్దవిద్య యని అర్ధము. శాస్త్రములలో ఆత్మజ్ఞానము
గల శాస్త్రమునే బ్రహ్మవిద్యా శాస్త్రము అని అన్నారు.
ప్రపంచములో ఏ విద్య నేర్చితే వానికి ఆ పేరు పెట్టడము
పరిపాటిగా గలదు. న్యాయవిద్య నేర్చితే వానిని న్యాయవాది అంటారు.
మోటారు కారును నడిపితే డ్రైవర్ అంటారు. యంత్రములను రిపేరు
చేసేవాడిని మెకానిక్ అంటారు. నిర్మాణ పనుల విద్య నేర్చితే ఇంజనీరు
అంటారు. పాటలుపాడే సంగీతమును నేర్చితే వాడిని సింగర్ యనీ,
నటించేది నేర్చితే యాక్టర్ అనీ, వైద్య విద్య నేర్చితే డాక్టర్ యనీ ఆ విద్యనుబట్టి
వానికి పేరు రావడము జరుగుచుండును. అలాగే ఆధ్యాత్మిక విద్య నేర్చితే
వాడు బ్రహ్మవిద్య నేర్చినవాడు అయినందున వానిని 'బ్రాహ్మణుడు' అనడము
జరుగుచున్నది. ఇవన్నియూ పూర్వము నుండి వచ్చు సహజమైన పేర్లు.
భూమిమీద ఏ మతస్థుడయినా, ఏ కులస్థుడయినా న్యాయవిద్య నేర్చితే
వానిని లాయర్ (న్యాయవాది) అన్నట్టు, బ్రహ్మవిద్యను ఎవడు నేర్చినా, ఏ
మతస్థుడు నేర్చినా, ఏ కులస్థుడు నేర్చినా వానిని బ్రాహ్మణుడు అని
అనవచ్చును. చట్టము తెలిసినవానిని (లా తెలిసిన వానిని) లాయర్ అన్నట్లు,
బ్రహ్మవిద్యను తెలిసిన వానిని బ్రాహ్మణుడు అని అనవచ్చును.
బ్రాహ్మణుడు అన్న పదము కుల మతములకు అతీతముగా
యున్నది. బండిని నడుపు విద్యను నేర్చినవాడు ముందే ఏదో ఒక కులము
వాడై యుండును. వాడు ఏ కులమువాడైనా ఆ కులముతో ఏమాత్రము
సంబంధము లేకుండా ఎలా వానిని డ్రైవర్ అంటున్నామో, అలాగే బ్రహ్మ
విద్య నేర్చువాడు ముందే ఏదో ఒక కులమునకు సంబంధించినవాడై
యుంటాడు. బ్రహ్మవిద్య నేర్చినవాని కులముతో సంబంధము లేకుండా
వాడు నేర్చిన విద్యనుబట్టి వానిని బ్రాహ్మణుడు అని అనవచ్చును.
ప్రపంచములో ఏ విద్యను నేర్చితే వాని కులముతోగానీ, వాని మతముతో
సంబంధముగానీ లేకుండా వానికి ఆ విద్యకు సంబంధించిన పేరును
పెట్టుచున్నాము. ఉదాహరణకు బండిని నడుపువాడు హిందువులలో ఏ
కులమువాడైనా వానిని డ్రైవర్ అనియే అంటాము. కులమునుబట్టి వీడు
బలిజ డ్రైవర్, వీడు కాపు డ్రైవర్, వీడు కమ్మ డ్రైవర్ అని ఎలా అనమో,
అలాగే ఇతర మతముల వారైన ముస్లీమ్లనుగానీ, క్రైస్థవులనుగానీ
మతములకు అతీతముగా అతనిని డ్రైవర్ అంటాము గానీ, తురక డ్రైవర్
అనిగానీ, క్రైస్థవ డ్రైవర్ అనిగానీ అనము. అలాగే బ్రహ్మవిద్యను నేర్చినవాడు
ఏ మతస్థుడుగానీ, ఏ కులస్థుడుగానీ వాని కుల మతమునకు అతీతముగా
వానిని 'బ్రాహ్మణుడు' అని అంటాము.
డ్రైవర్ విద్యను నేర్చిన దానినిబట్టి వానిని డ్రైవర్ అన్నట్లు, బ్రహ్మ
విద్యను నేర్చిన వానిని 'బ్రాహ్మణుడు' అనవలెను. ఎట్లయితే డ్రైవర్లది
డ్రైవర్ కులము కాదో, అట్లే బ్రాహ్మణులది బ్రాహ్మణ కులము కాదు. డ్రైవర్
అనేది నేర్చిన విద్యనుబట్టి చేసే వృత్తి. అలాగే బ్రాహ్మణుడు అనేది నేర్చిన
బ్రహ్మవిద్యను బట్టి చేసే సాధకుడుగా యుండును. అంతతప్ప బ్రాహ్మణుడు
అనేది ప్రత్యేక కులము కాదు. అయితే నేడు భూమి మీద బ్రాహ్మణులు
అనే కులము పేరుతో చాలామంది యున్నారు కదా! వారిది కులము
కాదా?యని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి నా జవాబు ఏమనగా!
నేడు ఒక బడిపోలో 500 మంది డ్రైవర్లు పని చేయుచున్నారు.
అందరూ కాకీ గుడ్డల డ్రస్ వారి వృత్తి చేయుచున్నారు. అట్లని
డ్రైవర్లందరినీ ఒకే కులము వారని ఎలా చెప్పలేమో అలాగే బ్రాహ్మణు
లందరినీ ఒకే కులము వారని చెప్పలేము. బస్ డ్రైవర్లకు డ్రస్కోడ్ యున్నట్లు
బ్రాహ్మణులకు కూడా వారు చేసే వృత్తినిబట్టి డ్రస్కోడ్ కలదు. డ్రైవర్లకు
డ్రస్కోడోయుంది, బ్రాహ్మణులకు డ్రన్కోడ్ యుంది. డ్రైవర్లకు డ్రైవర్ వృత్తి
కాగా, బ్రాహ్మణులకు బ్రాహ్మణ వృత్తి కలదు. డ్రైవర్లు ఒకే కులము వారు
కాదు, బ్రాహ్మణులు ఒకే కులము వారు కాదు అని చెప్పుదుము.
ప్రశ్న :- మా ఊరిలో ‘దూదేకుల' కులము వారు చాలామంది యున్నారు.
పూర్వమునుండి వారి వృత్తి దూదిని ఏకి పరుపులు కుట్టడము. అయితే
నేటి కాలములో రెడిమేడ్ పరుపులు, స్పాంజీ పరుపులు తయారగుట వలన
దూదేకుల కులము వారికి పరుపులు కుట్టే పని లేకుండా పోయినది. అప్పుడు
వారు ఒక్కొక్కరు డ్రైవర్ పనిని నేర్చుకుంటూ, కొన్నాళ్ళకు వారందరూ
డ్రైవర్లుగా మారిపోయారు. నేడు అందరూ బస్ డ్రైవర్లుగా పనిచేయుచున్నారు.
అయినా వారు పూర్వమున్న వృత్తిని, కులమును మరచిపోలేదు. వారిని
“మీది ఏ కులము?” అని అడిగితే "మాది దూదేకుల కులము” అని
చెప్పుచున్నారు తప్ప, “మాది డ్రైవర్ కులము” అని చెప్పలేదు. వారు
తమ కులమును ఏమాత్రము సిగ్గుపడకుండా ధైర్యముగా చెప్పుచున్నారు.
వివాహములను కూడా వారి కులములోనే చేసుకొంటున్నారు. మేము
డ్రైవర్లము కదా!యని వేరే కులము డ్రైవర్ల ఇంటిలో పెళ్లి చేసుకోలేదు.
ఎంత డ్రైవర్లయినా వారి కులము మీద వారికి అభిమానమున్నది. వారి
కులము పేరే చెప్పుచున్నారు. అయితే నేడు బ్రాహ్మణులు తమ పూర్వపు
వృత్తిని, పూర్వపు కులమును చెప్పకుండా ప్రస్తుతము చేయు బ్రాహ్మణ
వృత్తి పేరు చెప్పుచున్నారు. మేము బ్రాహ్మణులము అంటున్నారు. నిజముగా
వారిది బ్రాహ్మణ కులమే కాదు కదా! వారు ఏ కులమువారై యుండవచ్చును?
తమ పూర్వము కులమును వదలి తమది కాని కులము పేరు ఎందుకు
చెప్పుచున్నారు? పూర్వము వారికి కులము లేదా?
జవాబు :- నీది మంచి ప్రశ్నే! ఇంతవరకు చెప్పిన దానిని బట్టి నీవే
జవాబును తెలుసుకోవచ్చును. క్రొత్తగా అడుగవలసిన పని లేదు. అయినా
నీవు అడిగావు. నేను చెప్పే విషయమును జాగ్రత్తగా విని గ్రహించుకోవలెను.
నీవు ప్రశ్నలో దూదేకుల కులము వారు ఒకేసారి వారు అందరూ డ్రైవర్
వృత్తి నేర్చుకున్నట్లు, నేడు అనేక కులములవారు డ్రైవర్లుగా మారుచున్నారు.
అట్లే నేడు ఏ కులమువాడైనా బ్రహ్మవిద్యను నేర్చితే బ్రాహ్మణుడు కాగలడు.
డ్రైవర్ అయ్యేదానికి ఫలానా కులమువారే అర్హులు అని చెప్పనట్లు,
బ్రాహ్మణులుగా మారేదానికి కూడా ఫలానా కులము వారే యోగ్యులు అని
చెప్పలేము. అయితే పూర్వము దూదేకుల కులము వారు అందరూ డ్రైవర్లుగా
మారినట్లు, ఇప్పుడు కూడా ఒకే కులమువారైనా, ఇతర కులములవారైనా
ఎవరైనా బ్రాహ్మణులుగా మారవచ్చును. బ్రాహ్మణులుగా మారుటకు కుల
నియమము అంటూ ఏదీ లేదు. నేడు ఏ కులమువారైనా డ్రైవర్ అయినట్లు,
ఏ కులము వాడైనా బ్రాహ్మణుడుగా మారవచ్చును. అయితే పూర్వము
ఒక ఊరిలోని దూదేకుల కులమువారు అందరూ డ్రైవర్లుగా మారినట్లు
బ్రాహ్మణులు కూడా ఒక ఊరిలోని ఒకే కులము వారందరూ తమ
ఉపాధిని కోల్పోయి అందరూ బ్రాహ్మణులుగా మారిపోయారు. తర్వాత
పూర్వపు తమ కులమును వారు చెప్పక చేసే పనినే కులముగా
బ్రాహ్మణులుగా చెప్పుకొంటున్నారు. వారి పూర్వపు విషయమును నేడు
వారు పూర్తిగా మరచిపోయి చివరికి బ్రాహ్మణకులమే తమ కులమని
నేడు దృఢ విశ్వాసముతో యున్నారు. వారిది పూర్వము బ్రాహ్మణ కులము
కాదనీ, తమ చరిత్రవేరనీ, నేడున్న వారికి ఏమాత్రము తెలియదు. నేడు
బ్రాహ్మణులము అని చెప్పుకొను వారి చరిత్ర వారికి తెలియకున్నా, నాకు
కొంత తెలుసు దానినే చెప్పుచున్నాను వినండి.
ప్రశ్న :- బ్రాహ్మణులని చెప్పుకొను వారి చరిత్ర వారికే తెలియనిది నీకు
ఎలా తెలుసు? నీవు ఎలా చెప్పగలవు?
జవాబు :- ఎన్నో వేల, లక్షల సంవత్సరములు గడచిపోయిన దానిని
చరిత్రయని అంటారు. చరిత్ర ఆయుష్షు చాలా పెద్దది. మనిషి ఆయుష్షు
చాలా చిన్నది. ప్రస్తుతము గడచు జీవితములోనిదే మనిషికి సరిగా
జ్ఞాపకముండదు. ఒకవేళ జ్ఞాపకమున్నా ప్రస్తుత జన్మలో జరిగినదే
జ్ఞాపకముండును. మనిషి నేటి కాలములో 70, 80 లేక 90 సంవత్సరముల
కన్నా ఎక్కువ కాలము బ్రతకడము లేదు. ఎవడో ఒకడు నూరు
సంవత్సరములు బ్రతికినా ఆ నూరు సంవత్సరముల విషయములే వానికి
తెలిసియుండును. ఆ నూరు సంవత్సరముల సమాచారమే వానికి
జ్ఞాపకముండవచ్చును. అంతకంటే వెనుక కాలములోనిది జ్ఞాపకముండు
టకు అవకాశము లేదు. వంద సంవత్సరముల పూర్వముదే ఏమాత్రము
తెలియనప్పుడు వేల, లక్షల సంవత్సరముల పూర్వము ఏమి జరిగినదో
ఎలా తెలియగలదు? వెనుక గడచిన కాలములో జరిగిన దానిని చరిత్రయని
అంటున్నాము. ప్రస్తుత కాలములో ఒక మనిషి తన ముందర జరిగిన
చరిత్రను మాత్రము తెలియగలడుగానీ, అంతకు ముందు గడచిన చరిత్రను
చెప్పలేడు. ప్రస్తుత జన్మకంటే ముందు ఎన్నో జన్మలు గడచిపోయినా,
ఎన్నో లక్షల సంవత్సరములనుండి మనిషియున్నా, వాని జీవితము జన్మలతో
ముడిపడియుండుట వలన, ఒక్కొక్క జన్మలో వంద సంవత్సరములకంటే
ఎక్కువ లేనందున, ప్రతీ జన్మకు క్రొత్త మనస్సు, క్రొత్త శరీరము వచ్చుట
వలన, జ్ఞాపకములు గల మనస్సు ఒకే జన్మలో యుండి రెండవ జన్మకు
రాకపోవడము వలన, ఏ జన్మ జ్ఞాపకము ఆ జన్మకే ఉండును. అందువలన
ప్రస్తుత జన్మ జ్ఞాపకము తప్ప గతములో ఏమి జరిగినది ఎవరికీ తెలియదు.
మనిషి ప్రస్తుత జన్మలోని విషయములనే సరిగా జ్ఞప్తికి పెట్టుకొను స్థితిలో
లేడు. డబ్బు విషయమైతే అన్ని జ్ఞాపకములుంటాయి. మిగతా విషయముల
మీద శ్రద్ధలేని దానివలన అవి సరిగా జ్ఞాపకము ఉండవు. మనుషులయిన
వారందరిలో ఇదే విధానము గలదు.
మనిషి స్వయముగా గత చరిత్రను తెలియలేడు. అయితే గత
చరిత్రలో ఏది అవసరముంటే దానిని తెలియుటకు కూడా ఒక అవకాశము
కలదు. అది ఎలా అనగా! ఎవడయితే ఆత్మజ్ఞానమును తెలియగలిగి,
దానివలన ఆత్మను తెలియగలడో, వాడు ఆత్మతో పరిచయము కల్గినవాడై
పోవును. అటువంటి వాడు స్వార్థ విషయము కానిది ఏదయినా జ్ఞాన
సంబంధిత విషయమును తెలియవలెనను కోర్కెతో గతములో
విషయమునకు సంబంధించిన విషయమును తెలియకోరితే అప్పుడు ఆత్మ
ఆ విషయమునకు సంబంధించిన జ్ఞాపకమును జీవునికి కలుగజేయును.
అలా ఆత్మ అందించిన జ్ఞాపకము వలన వెనుకటి చరిత్రను మనిషి తెలియు
అవకాశము గలదు. ఇప్పుడు నేను గత చరిత్రలో బ్రాహ్మణులు ఏయే
కులముల నుండి వచ్చారో తెలియకోరినాను. నా కోర్కెను తెలిసిన నా
ఆత్మ గతములో సృష్ట్యాది నుండి ఉండుట చేత అన్ని విషయములు తెలిసిన
వాడై యున్నాడు. అందువలన నా కోర్కెను మన్నించి నాకు బ్రాహ్మణులుగా
మారినవారు గతములో ఏయే కులములనుండి వచ్చారో, వారి చరిత్రను
తెలియజేశాడు. మనస్సు జ్ఞాపకము వలన ప్రస్తుత జన్మలోని విషయమే
తెలియును. ఆత్మ ఎప్పటికీ మారనిదైయుండుట వలన చరిత్ర విషయము
లన్నియూ తెలిసియుండును.
శరీరములో ఆత్మ ఒక్కటేకాక జీవుడు కూడా అప్పుడూ ఇప్పుడూ
ఉన్నా జీవునికి స్వయముగా జ్ఞాపకము అను శక్తి లేనందున జీవునికి
ఏమీ తెలియదనియే చెప్పవచ్చును. ఆత్మకు అన్ని జ్ఞాపకములు ఉండుట
వలన తనకు ఇష్టమైతే ఏ విషయమునైనా తెలియజేయగలడు. నేను
ఆత్మకు ఇష్టుడను కనుక నా కోర్కెను నెరవేర్చుచూ కొన్ని లక్షల
సంవత్సరముల పూర్వము జరిగిన చరిత్ర తెలియజేశాడు. ఇప్పుడు నేను
చెప్పబోవు చరిత్ర దాదాపు పది లక్షల సంవత్సరముల క్రిందటిదని
తలచుచున్నాను. అప్పుడు జరిగినదని చెప్పునది నేను కల్పించి చెప్పునది
కాదు. ఆత్మ తెలియజేయాలనుకొని తెలియజేసినది తప్ప వేరు విషయము
కాదు. ఏ విషయమును ఎవరు కోరినా వారు ఆత్మకు ఇష్టులైయున్నట్లయితే
ఆ విషయమును ఆత్మ తెలియజేయును. అయిష్టులైతే ఏమాత్రము తెలుపడు.
నాకు ఆత్మ తెలియజేసిన విషయము వలన బ్రాహ్మణుడు అనుట కులము
పేరు కాదు, అది వృత్తి పేరు అని తెలిసినది. నేర్చిన విద్యనుబట్టి బ్రాహ్మణుడు
అయితే అతని కులము వేరేయుండును. ఆ చరిత్రను విప్పి తెలుసుకోగలిగితే
ఆత్మ ఇలా తెలుపుచున్నది.
సృష్ఠి జరిగి మనుషులు తయారయిన తర్వాత మనుషులు స్వచ్ఛమైన
వారుగా ఉండేవారు. వారిలో ఏ కులమత కలుషితములు లేవు. అటువంటి
సమయములో సూర్యుడు భూమిమీద మనువుకు జ్ఞానమును తెల్పిన తర్వాత
కొంతకాలము అందరికీ జ్ఞానము తెలియలేదు. మొదట మనువుకు తెలిసిన
జ్ఞానమును ఆయన ఇక్ష్వాకుడు అను రాజుకు అందించాడనీ, అతని ద్వారా
ఇంకొకరికీ అట్లే ఒకరినుండి ఒకరికీ ప్రాకి, కొన్ని వేల సంవత్సరములకు
పూర్తిగా ప్రజలందరికీ తెలిసినదనీ, తర్వాత కాలము జరుగగా కాలక్రమమున
జ్ఞాపకము లేకుండా పోతూ వచ్చినదనీ, భగవద్గీతలో కృష్ణుడు చెప్పగా
విన్నాము. గ్రంథము ద్వారా తెలుసుకొన్నాము. మొదట మనువు అను
వ్యక్తి తనకు సూర్యుని ద్వారా తెలిసిన జ్ఞానమును మొదట రాజుకు
తెలుపుటకు కారణమున్నది. రాజుకు చెప్పితే రాజు ద్వారా ప్రజలందరికీ
చేరిపోవునను మంచి ఉద్దేశ్యముతో అప్పుడు పాలించు రాజుకు తెలియజేయా
లనుకొన్నాడు. మనువు మారుమూల ప్రాంతములో ఉండే వ్యక్తి
అయినందున రాజువద్దకు నేరుగా పోవు స్థోమతగానీ, పలుకుబడిగానీ
లేనివాడు. అందువలన రాజుగారి సభలో (కొలువులో) పని చేయువారిని
వెదకి వారి ద్వారా రాజుగారికి జ్ఞానమును అందించాలని అనుకొన్నాడు.
అప్పుడు రాజుగారికి సలహాదారుడుగా యున్న ఆస్థాన విద్వాంసుడు అయిన
వ్యక్తిని పరిచయము చేసుకొన్నాడు. రాజుగారికి, మంత్రిగారికి తెలివిగా
సలహా చెప్పు స్థానములో యున్న వ్యక్తులకు రాజుగారివద్ద మంచి పలుకుబడి,
గౌరవము ఉండేవి.
ఆ కాలములో దైవజ్ఞానము, దేవుడు అను విషయము తెలియకున్నా
కొంత భక్తి కల్గియుండేవారు. వారి భక్తి ప్రకృతి మీద ఎక్కువ ఉండేది.
సూర్యుని వలన తమ జీవనము సుఖముగా సాగుచున్నదనీ, చంద్రుని
వలన వర్షములు వస్తున్నవనీ, భూమి వలన పంటలు పండుచున్నవనీ
సూర్యున్ని, చంద్రున్ని, భూమిని ఆరాధించేవారు. పాముల బాధ వలన
చనిపోకుండా పాములను, తేళ్లను పూజించేవారు. మొత్తము మీద కొంత
బుద్ధిని ఉపయోగించి ఆనాడు భక్తి భావమును పొందేవారు. రాజుకు
సలహాలు ఇచ్చే మనుషులు తెలివైనవారు, విద్యావంతులు అయినందున
వారే ప్రజలలో భక్తి భావమును కూడా కల్పించారు. అటువంటి పండితుడు
మనువుకు పరిచయమైన తర్వాత మనువు ప్రతి దినము ఒక అరగంటసేపు
జ్ఞానమును వివరించి రాజుగారి సలహాదారునికి చెప్పితే, అతను వినిన
జ్ఞానమును ప్రతి రోజు రాజుగారికి తెలియజేయుచుండెను. ఇట్లు
మనువునకు తెలిసిన జ్ఞానమును వివరించి చెప్పుటకు ఒక సంవత్సర
కాలము పట్టినది. ఇక్ష్వాకుడను రాజు తన సలహాదారుడు చెప్పిన జ్ఞానము
తెలియుటకొద్దీ సలహాదారుని మీద ఎక్కువ గౌరవమును చూపడమేగాక,
జ్ఞానము చెప్పిన గురువువలె భక్తి భావముతో గొప్పగా చూడను
మొదలుపెట్టాడు. మనువు దగ్గర నేర్చిన జ్ఞానమని రాజుకు అతని
సలహాదారుడు చెప్పలేదు. అంతవరకు చెప్పిన జ్ఞానమునంతా సలహాదారుడే
చెప్పాడని రాజుగారు అనుకొని, తన ఆస్థాన పండితునిగాయున్న
సలహాదారున్ని ఆస్థాన గురువుగా మార్చి గొప్పగా సన్మానము చేసి
గౌరవించాడు. తనవద్ద జ్ఞానమును విన్న మనిషి అంతటి గౌరవమును
పొందాడని మనువుకు ఏమాత్రము తెలియదు. అప్పుడు ఆస్థాన
పండితునిగా యున్న వ్యక్తిలో స్వార్థము పనిచేయగా జ్ఞానమునంతటినీ
తెలిసిన తరువాత మనువును రాజుగారితో పరిచయము కూడా చేయకుండా
ఏదో సాకులు చెప్పి తనవద్ద నుండి పంపివేశాడు.
మనువు తన జ్ఞానమును మధ్యవర్తి ద్వారా రాజుగారికి
అందించానను తృప్తితో అక్కడనుండి పోయాడు. మనువు జ్ఞానము
ఇక్ష్వాకుడికి మధ్యవర్తి ద్వారా చేరినా, చివరికి మధ్యవర్తి స్వార్థము వలన
తనకు గౌరవము ఎక్కడ తగ్గుతుందేమోనని మనువును రాజుకు చూపించ
లేదు. మీరు చెప్పిన జ్ఞానమంతా రాజుగారికి చేరవేశానని మనువుకు
చెప్పి పంపాడు. రాజుకు జ్ఞానమును చెప్పిన దానివలన ఏర్పడిన గౌరవము
చాలా గొప్పదయిన దానివలన, తనను గురువుగా భావించుట వలన,
ఇలా ఇతరులకు జ్ఞానము చెప్పితే అందరికీ గురువుగా మారిపోవచ్చును.
అందరూ గురువుగా తననే పూజింతురు, గౌరవింతురనే స్వార్థము ఆస్థాన
పండితునిలో మొదలయినది. మనువు నిస్వార్థముగా చెప్పిన జ్ఞానమును
స్వార్థముతో నింపివేసుకొన్నాడు. అక్కడనుండి ఇతరులకు జ్ఞానమును
చెప్పు పని తాను, తన కుమారులు తన బంధువులు చేసి తాను తనవారు,
అందరూ పూజ్యులుగా అందరిచేత గౌరవింపబడాలనుకొన్నాడు. అప్పుడే
బ్రహ్మవిద్యను నేర్చినవాడయిన దానివలన విద్యనుబట్టి పేరు వచ్చినట్లు
తనను బ్రాహ్మణునిగా చెప్పుకోవడము మొదలుపెట్టాడు. ఆ రోజు అందరికీ
విద్యవలన ఏర్పడిన పేరనీ, అది వృత్తి పేరనీ అందరికీ తెలిసిన విషయమే.
ఆ రోజు బ్రాహ్మణత్వము బ్రహ్మవిద్య నేర్చిన వారి వృత్తియని అనుకొన్నారు
గానీ, బ్రాహ్మణుడు అనునది కులము అని ఎవరూ అనుకోలేదు. ఆ రోజు
ఆస్థాన పండితుడు కూడా బ్రాహ్మణత్వము బోధించు వృత్తియనీ, అది బ్రహ్మ
విద్య నేర్చినవారికే 'బ్రాహ్మణుడు' అను పేరు వచ్చునని అనుకొన్నాడు.
సృష్ట్యాదిలో మొట్టమొదట ఆకాశవాణి ద్వారా దేవుడు జ్ఞానమును
తెలియజేయగా ఆ దినము శబ్దరూపములో (ఉరుముల శబ్దముతో) వచ్చిన
జ్ఞానమును సూర్యుడు గ్రహించగలిగాడు. సూర్యుడు గ్రహించిన జ్ఞానము
కొంత కాలము జరిగిన తర్వాత సూర్యుడు మనువుకు తెలియజేశాడు.
సూర్యుడు జ్ఞానమును గ్రహించిన వెంటనే భూమిమీద తెలుపలేదు. కొన్ని
వేల సంవత్సరములు గడచిన తర్వాత జ్ఞానమును తెలియుటకు అర్హుడైన
మనిషి 'మనువు' అను వ్యక్తి దొరికినప్పుడు అతనికి సూర్యుడు చెప్పాడు.
సూర్యుడు దాదాపు 360 రోజులు అనగా దాదాపు ఒక సంవత్సర కాలము
మనువుకు బోధించాడు. తర్వాత మనువు రాజుకు జ్ఞానము తెలుపాలని
ఒక సంవత్సరము కాలము వేచిచూసి చివరకు మధ్యవర్తి ద్వారా ఇక్ష్వాకుడను
రాజుకు తన జ్ఞానమును అందించాడు. సృష్ఠి జరిగిన తర్వాత కొన్ని వేల
సంవత్సరములకు సూర్యునికి జ్ఞానము చెప్పబడినది. ఈ విధముగా
భూమిమీద జ్ఞానము ప్రాకుటకు దాదాపు లక్ష సంవత్సరముల కాలము
పట్టియుండవచ్చును. అప్పటికి భూమిమీద మాయ ప్రభావము వలన
కులములు పుట్టుకొచ్చాయి. అప్పటికే కొందరు దేవతల భక్తిని బోధించుచూ
గురువులుగా తయారయి ప్రజలచేత బాగా గౌవవించబడేవారు.
భూమిమీద మనువు ద్వారా జ్ఞానము తెలియబడినప్పటికీ ఆత్మ
జ్ఞానము లేకున్నా దేవతల జ్ఞానము బాగా ఉండేది. సూర్యుని చేత
మనువుకు చెప్పబడిన విద్య బ్రహ్మవిద్య. అంతవరకు భూమిమీద బ్రహ్మవిద్య
లేకుండెడిది. ఎప్పుడు బ్రహ్మవిద్య వచ్చినదో అప్పుడు ఆ విద్యను నేర్చిన
వాడు బ్రాహ్మణుడు అని చెప్పబడేది. వైద్య విద్యను నేర్చినవాడు ఎలా
డాక్టర్ అని పిలువబడుచున్నాడో, అలాగే బ్రహ్మవిద్యను నేర్చినవాడు
బ్రాహ్మణుడు అని చెప్పబడుట చేత ఆ రోజు బ్రాహ్మణుడు అనునది వృత్తి
పేరుగా ఉండేది. భూమిమీద ఆత్మజ్ఞానమయిన బ్రహ్మవిద్య తెలియక
ముందే దేవతలు, దేవాలయములు, ప్రకృతిలోని చెట్లను, పాములను,
జంతువులను పూజించేవారు. ముఖ్యముగా సూర్యచంద్రులను, భూమిని
ఆరాధించేవారు. ఆనాడు దేవాలయములలో ఆరాధన విధానమును ఏర్పరచి
ఆరాధనలు చేయు పూజార్లు కూడా ఉండేవారు. అయితే ఆనాడు దేవతలను
పూజించు పూజార్లు శుభము చేయువారుగా యుండేవారు.
ఆ రోజు
ఉన్న కులములలో 'మంగళమ్' అను కులము ఉండేది. మంగళమ్ అనగా
'శుభము' అని అర్ధము. వారినే శుభకరమైనవారనీ, వారు పవిత్రులనీ
వారి చేతనే దేవతల పూజలు చేయించేవారు. ఆ రోజు పూజలలో
వేదపఠనములు ఉండేవి కావు. అసలు వేదముల విషయమే వారికి
తెలియదు. దేవతల పూజార్లుగాయున్న వారు దేవాలయములలో వేదమంత్ర
పఠన బదులు వారు పూజ కొరకు తయారు చేసుకొన్న వాయిద్యములను
వాయించే వారు. అదే ఆనాటి వేదపఠనముగా భావించవచ్చును. వాయిద్య
ఆరాధన చేత ఊరిలోని అందరికీ పూజలు జరుగుచున్నట్లు తెలియును.
గుడిముందర కొందరు వాయిద్యములు వాయించుచుండగా, కొందరు
గుడిలోపల అభిషేకము చేసి, వస్త్ర అలంకరణ చేసి, నామములు దిద్ది,
నైవేద్యములు పెట్టి, కొబ్బరికాయలు కొట్టేవారు.
మంగళమ్ అను పదము పవిత్రమైనదను అర్థముతో యుండగా
ఆ కులము వారు పవిత్రముగానే పూజలు నిర్వర్తించేవారు. మంగళమ్
అను కులము పేరు కాలక్రమమున 'మంగళ' యను పేరుగా తయారైనది.
పూజలు చేయు మంగళమ్ అను వారు నేడు మంగళవారుగా
మారిపోయారు. అయితే నేడు వారి స్థానములలో దేవాలయములందు
పూజలు చేయువారు బ్రాహ్మణులు వచ్చారు. బ్రహ్మవిద్యను నేర్చినవారు
బ్రాహ్మణులుగా తయారగుచూ వృత్తి పేరును కులము పేరుగా
మార్చుకొన్నారు. నేడు క్రైస్తవ మతములోనికి హిందూమతములోని ఏ
కులస్థుడు చేరినా వానిని ఫలానా కులస్థుడు అనకుండా క్రైస్థవుడు అన్నట్లు
ఏ మతస్థుడు బ్రహ్మవిద్యను నేర్చినా వానిని బ్రాహ్మణుడు అనడము,
బ్రాహ్మణత్వమునే కులముగా మార్చుకొని వాని మొదటి కులము పేరు
చెప్పకుండా బ్రాహ్మణుడు అని దానినే కులముగా చెప్పుకొంటున్నారు.
అనేక కులములనుండి వచ్చినవారు బ్రహ్మవిద్యను నేర్చి బ్రాహ్మణ
కులముగా తమ కులమును మార్చుకొంటున్నారు. అలా కొంతకాలము
చాలా కులముల వారు బ్రాహ్మణులుగా ప్రకటించుకొన్నారు. అప్పుడు
అగ్రకులముగా యున్నవారు గుడిలో పూజలు చేయు మంగళమ్ అను
కులమువారే. బ్రహ్మవిద్యను నేర్చినవారు మేము మంగళమ్ వారికంటే
గొప్పవారమని చెప్పుకోవడము, ఒకరికొకరు పోటీపడడము, మేము పెద్దంటే
మేము పెద్దయని అనుకోవడము జరిగేది. అంతటితో బ్రాహ్మణులు ఒక
కులముగా కలిసికట్టుగా ఏర్పడడముతో క్రొత్తగా బ్రహ్మవిద్య నేర్చి
బ్రాహ్మణులుగా మారువారు లేకుండా పోయారు. అంతవరకు మారిన
వారే బ్రాహ్మణులుగా యుండేవారు. బ్రాహ్మణ కులము మధ్యలో పుట్టుకొచ్చిన
కులము. వాస్తవముగా అది కులము కాకున్నా, అది వృత్తి పేరు అయినా
చివరికి అది కులముగా మారిపోయినది. బ్రాహ్మణ కులముగా మారిన
వారిలో అన్ని కులముల వారు ఉన్నా, చివరికి కాలము జరిగేకొద్దీ, వారు
ఏ కులమునుండి వచ్చారో పూర్తిగా మరచిపోయి పూర్వమునుండి మాది
బ్రాహ్మణ కులమేయని అనుకోవడము జరుగుచున్నది. బ్రాహ్మణ కులములో
అనేక కులముల మిశ్రమములున్నవని నేడు బ్రాహ్మణులుగా యున్న వారికే
తెలియదు. వారి శరీరములలో అనేక కులాల లక్ష్యణములు, జీన్సు
ఉండడము వలన వారిలో అనేక భావములున్నవి. పూర్వము వారి పెద్దలు
ఉన్నత కులమువారై, ఉన్నత భావములు గలవారై, శాఖాహారులుగా
యున్నవారు ఇప్పటికీ శాఖాహారులుగానే యున్నారు. కొందరి పెద్దలు
మాంసాహారులుగా యున్నవారైతే నేడు బ్రాహ్మణ కులములో యున్నవారు
దొంగగా మాంసమును తింటూనే యున్నారు. ఇంటిలో తినకున్నా క్రొత్త
ఊరికి పోయినప్పుడు అక్కడ తమరెవరు అన్న విషయము ఎవరికీ తెలియదు
కావున అక్కడ హోటళ్లలో ప్రత్యక్షముగా తినడము నేనే ఎన్నోమార్లు
చూచాను. పూర్వపు వారి పెద్దల భావములనుబట్టి నేడు అవే భావములే
కొందరిలో కనిపించు చున్నవి.
మొదట దేవాలయములలో పూజ చేయువారు మంగళమ్ వారు
కాగా, వారికి పోటీగా "బ్రహ్మవిద్యను నేర్చినవారము మేము” అని
బ్రాహ్మణులు రావడము, వారికంటే మేమే పెద్దయని చెప్పుకోవడము, తర్వాత
చిన్నగా దేవాలయములలో అర్చన (పూజ) చేయు కార్యములను తామే
చేయడము చేయుచూ చిన్నగా దేవాలయములలో మేమే హక్కుదారులము
అని ప్రకటించుకోవడము జరిగినది. కొంతకాలమునకు వారు, వీరు
పూజలు చేయుచూ పూర్తిగా కలిసిపోయారు. అప్పుడు వారిలో ఎక్కడో
ఒకచోట సంక్రమనము ఏర్పడినది. అర్థము కాకపోతే అక్రమ సంబంధము
అని చెప్పవచ్చును. ఎలా అనగా! అప్పుడు ఒక బ్రాహ్మణునికి ఇద్దరు
భార్యలుండే వారు. వారిలో ఒకరు బ్రాహ్మణ స్త్రీకాగా మరొకరు మంగళమ్
స్త్రీ యుండేది. అప్పుడు ఇద్దరికి కలిగిన సంతానము బ్రాహ్మణులేయని
చెప్పవలసి వచ్చినది. అలా కాలక్రమమున మంగళవాళ్లు కూడా
బ్రాహ్మణులేయనీ, బ్రాహ్మణ సంతతి వలన వచ్చినవారేయనీ చెప్పడము
జరిగినది. ఎక్కడో ఒకరో ఇద్దరో అలా ఉండుట వలన అందరికీ అదే
పేరు వచ్చినది. చివరికి అక్రమ సంబంధము వలన బ్రాహ్మణులకు
పుట్టినవారని మంగళమ్ వారికి పేరు రావడము జరిగినది. మంగళమ్
వారని పేరున్నా వారు బ్రాహ్మణ సంతతేయనీ కొందరు చెప్పేవారు.
అంతేకాక మంగళము వారిని బ్రాహ్మణులుగానే లెక్కించి ప్రజలు
పిలిచెడివారు. ఇట్లు కొన్ని వేలు, కొన్ని లక్షల సంవత్సరములు గడచిపోయే
కొద్దీ పూర్వము ఏమి జరిగినదో నేటి బ్రాహ్మణులకుగానీ, అలాగే
మంగళవారికిగానీ తెలియదు. ఈ మధ్య 1500 సంవత్సరముల క్రితము
వరకు అందరూ బ్రాహ్మణుల పేరుతో చెలామణి అయ్యేవారు. అయితే
కృష్ణదేవరాయల కాలములో బహుశా 15 లేక 16 వందల సంవత్సరము
లప్పుడు పూర్తి బ్రాహ్మణ కులమున పుట్టిన తెనాలి రామలింగడు అను
వ్యక్తి మంగళవారు బ్రాహ్మణులుగా పిలువబడుట అతనికి సరిపోలేదు.
మొదటినుండి వారిలో మంగళవారు బ్రాహ్మణుల అక్రమ సంతానమను
మాట ఉండేది. అది కృష్ణ దేవరాయల కాలములో తెనాలి రామకృష్ణుని
ద్వారా కొంతమార్పు జరిగినది. కృష్ణ దేవరాయలు కాలములో మార్పులు
ఎలా చోటు చేసుకొన్నాయో గతములో “సుబోధ” గ్రంథమందు కొంత
వ్రాశాము. ఇప్పుడు ఆ గ్రంథములోని సమాచారమును ఇక్కడ పొందు
పరచుచున్నాము చూడండి.
బ్రాహ్మణ - నాయి బ్రాహ్మణ.
బ్రాహ్మణులను, నాయిబ్రాహ్మణులను తెలియని వారుండరను
కొంటాను. ఎందుకనగా! ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా వారివద్దకు
పోవలసిన అవసరము అందరికీ ఉన్నది. ఇంటిలో ఎవరైనా పుట్టితే వారికి
నామకరణము కొరకు, జాతకము కొరకు, ఎవరైనా మరణిస్తే వారి కర్మ
తంత్రముల కోసము, బ్రతికినపుడు పంచాంగము అడగడము కోసము,
బ్రాహ్మణుల దగ్గరకు తప్పక పోవలసి ఉన్నది. నాయిబ్రాహ్మణులు (మంగళ
వారి) వద్దకైతే తలవెంట్రుకలు పెరిగినప్పుడు, గడ్డము పెరిగినప్పుడు
నెలకొకమారైనా పోవలసి ఉన్నది. అందువలన బ్రాహ్మణులు, నాయి
బ్రాహ్మణులు ఇద్దరూ ప్రజలకు సుపరిచితులేనని చెప్పవచ్చును. నేటి
కాలములో వీరి పని అందరికీ తెలిసినదే, అయినప్పటికీ పూర్వ కాలములో
వీరు ముఖ్యముగా చేయుచున్న పని ఏమిటి? వారికాపేరు ఎలా వచ్చింది?
అని యోచించిన కొన్ని క్రొత్త విషయాలు తెలుస్తున్నవి. అవి ఏమిటో
చూద్దామా!
పూర్వము కృతయుగము తర్వాత త్రేతాయుగములోనే బ్రాహ్మణ
కులము పెద్ద కులముగా పేరుగాంచినది. అన్ని కులములకంటే పెద్ద
కులముగా పేరుగాంచడమునకు కారణమేమంటే బ్రాహ్మణులు మాత్రము
బ్రాహ్మవిద్యను గురించి బోధించెడివారు. అన్ని విద్యలకంటే పెద్ద విద్య
అయిన బ్రహ్మవిద్యను బోధించెడివారు, కనుక ఆ కులమును పెద్ద కులముగా
పరిగణించెడివారు. బ్రహ్మవిద్యను బోధించెడు వారు కనుక బ్రాహ్మణులని
పేరు వచ్చినది. ఆనాటి రాజులవద్ద కూడా గురువులుగా, ఆస్థాన
పండితులుగా స్థానమును బ్రాహ్మణులు పొందియుండిరి. బ్రాహ్మణుల
మాటకు రాజులు కూడా ఎదురు చెప్పెడివారు కాదు. ఈ విధముగా
కొంత కాలము జరుగుచుపోగా, భూమి మీద దేవాలయములు ఎక్కువై
పోయాయి. ప్రతి దేవునికి ఇద్దరు భార్యలను దేవాలయములలో పెట్టడము
జరిగినది. దేవాలయములను నిర్మించినదీ, అందులో ప్రతిమలను
ప్రతిష్ఠించినది బ్రాహ్మణులే. ప్రజలలో దేవతలతో సమానమైన గౌరవమున్న
బ్రాహ్మణులు కూడా గుడిలోని దేవతలవలె ఇద్దరు భార్యలను వివాహ
మాడనారంభించిరి. గుడిలోని దేవుళ్ళకు ఇద్దరు భార్యలున్నట్లు ఆనాటి
బ్రాహ్మణులకు కూడా ఇద్దరు భార్యలుండడము వలన బ్రాహ్మణులు
భూమిమీద దేవతలనీ, భూసురులనీ పేరుగాంచిరి. బహు భార్యత్వమును
ఆనాటి బ్రాహ్మణులే ఎక్కువ కల్గియుండెడివారు. అంతేకాక ఆనాటి రాజులు
కూడా కొందరు ఇద్దరు భార్యలు కల్గిన వారుండెడి వారు. అప్పటి త్రేతాయుగ
ములోనే దశరథుడు ముగ్గురు భార్యలు కల్గియుండుట అందరికీ తెలుసు.
ఆనాటి రాజులుగానీ, బ్రాహ్మణులుగానీ మొదటి భార్యకు పుట్టిన
సంతానమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చెడివారు. అదే విధానముతోనే
పెద్ద భార్యకు పుట్టిన రామునికి రాజ్యమును కట్టాలని దశరథుడు
అనుకోవడము, దానిని చిన్న భార్య వ్యతిరేఖించడము జరిగినది.
ఆనాటి బ్రాహ్మణులలో కూడా మొదటి భార్య సంతతికి ప్రాధాన్యత
ఇచ్చెడివారనుకొన్నాము కదా! దాని ప్రకారమే దేవాలయములో బ్రహ్మ
జ్ఞానమును బోధించు కార్యమును రెండు విధములుగా విభజించి, ఒకటి
లోపల బోధించువారూ, రెండు బయట కార్యరూపముగా చూపించువారూ
అను రెండు కార్యములనుంచారు. ఆనాటి బ్రాహ్మణులు మొదటి భార్య
కుమారులకు లోపల బోధించు సులభమైన కార్యములను చేయమని చెప్పి,
బయటి కార్యమును రెండవ భార్య కుమారులకు చెప్పారు. అప్పటినుండి
గుడిలోని కార్యము, గుడి బయటి కార్యము రెండూ బ్రాహ్మణులే చేయు
చున్నారు. కానీ కాలక్రమములో గుడిలోని వారు బ్రాహ్మణులుకాగా, గుడి
బయటివారు మాత్రము నాయీ బ్రాహ్మణులైనారు. ఈనాటి బ్రాహ్మణ,
నాయీ బ్రాహ్మణ ఇద్దరూ త్రేతాయుగములో బ్రాహ్మణ సంతతే అని నేడు
తెలియకుండా పోయినది. ఆనాడు తండ్రి ద్వారా వచ్చిన కార్యములను
సోదర బ్రాహ్మణులైన బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణులు ఇద్దరు క్రమము
తప్పక గుడి లోపలా, గుడి బయటా బ్రహ్మవిద్యకు సంబంధించిన పనిని
చేయుచూనే ద్వాపర యుగము వరకు వచ్చారు. మనము అక్కడి నుండి
వివరించుకొందాము.
బ్రహ్మజ్ఞానము తెలుపువాడు లేక తెలిసినవాడు బ్రాహ్మణుడు
అనుమాట పూర్వముండెడిదన్నాము కదా! ఆ మాట ప్రకారమే బ్రాహ్మణులు
బ్రహ్మజ్ఞానము ఇతరులకు తెలుపు పనియే ముఖ్యముగా పెట్టుకొని జీవనము
సాగించెడివారు. మానవ జీవిత ధ్యేయము మోక్షమును సాధించుటయేనని
తెల్పెడివారు. పురములో జీవించు పౌరులకు జీవితంలో 'దైవప్రాప్తి కోసము
హితమును బోధించువారు కావున పౌరోహితులని' కూడా వీరిని పిలుచుట
గలదు. పౌరులకు హితమును బోధించుచూ, పౌరోహితులని పేరుగాంచిన
బ్రాహ్మణులు, అందరి తలయందు దైవము నివాసమున్నాడనీ, మన తలలోని
గుణములు పని చేయుచున్నంత వరకు దైవమును తెలుసుకోలేమనీ, లెక్కింప
నలవికాని గుణముల యొక్క ఆలోచనలను అణచివేసినపుడే, శిరస్సులో
నివాసమున్న ఆత్మ అనుభవమునకు వచ్చి తెలియుచున్నదనీ, ఆత్మ దర్శనము
లేని జీవితము వ్యర్థమనీ బోధించెడివారు. బ్రాహ్మణులు ఈ విధముగా
ప్రజలకు బోధిస్తూ మంచి కార్యము చేయుచుండగా, నాయి బ్రాహ్మణులని
పేరుగాంచిన మంగళవారు మీకంటే మేము ఏమీ తక్కువలేమని, మీరు
ఆత్మ జ్ఞానమును బోధిస్తే దానిని మేము అర్థమగునట్లు చూపించు వారమని
బ్రాహ్మణులకు పోటీ కార్యములు చేసెడివారు.
ఈ విధముగా బ్రహ్మజ్ఞానమును తెలుపువారు రెండు తెగలుగా
విడిపోయి ఉండెడివారు. ఒక తెగ వారు బ్రహ్మజ్ఞానమును నోటితో బోధిస్తే
మరొక తెగవారు నోటితో బోధించక చేతితో చేసి అర్థమగునట్లు చేసెడివారు.
బోధించెడి వారికంటే చూపించేవారు ఎక్కువని కొందరూ, చూపించే
వారికంటే బోధించేవారే గొప్పయని మరికొందరూ, ఒకరికొకరు వాదించు
కొనెడివారు. ఏది ఏమైనా బ్రహ్మజ్ఞానము ఏదో ఒక విధముగా తెలుపు
వారు కావున రెండు తెగల వారికి సోదర బ్రాహ్మణులు అని పేరు
ఉండెడిది. రెండు తెగల బ్రాహ్మణులు అనేక విషయములలో పోటీపడుచూ
ఎవరికి వారు గొప్పయనుకొనెడివారు. ఆ విధముగానే అనేకమగు
తలంపులు మన తలయందున్నాయనీ, ఆ తలంపులను లేకుండా చేసుకొంటే
ఆత్మ దర్శనమగునని బ్రాహ్మణులు తెలుపగా, అనేక తలంపుల చిహ్నమే
తలమీది అనేక వెంట్రుకలనీ, ఆ తలవెంట్రుకలు పూర్తి కొరిగితే 'గుండుగ’
మారి క్రొత్త ఆకారము దర్శనమగుననీ, అదే విధముగా తలంపులు లేని
స్థానములో క్రొత్తగా ‘ఆత్మ' దర్శనమగుననీ పూర్తి వివరముగా అర్థమగునట్లు,
ఒక మనిషి తలమీద వెంట్రుకలు పూర్తి కొరిగి చూపించి, లోపల కూడా
తలంపులు లేకుండా చేసుకొమ్మని నాయీ బ్రాహ్మణులు చేసి చూపించారు.
ఇట్లు అనేక విషయములలో బ్రాహ్మణ, నాయిబ్రాహ్మణ అను
దాయాది తెగల బ్రాహ్మణులు పోటీ కార్యములు నిర్వహిస్తూ ఉండెడివారు.
వాటిలో కొన్నిటిని ఇపుడు వివరించుకొందాము. బ్రాహ్మణులు
దేవాలయములలోనికి పోయి అందులోని ప్రతిమ ముందర ప్రాతఃకాలము
ననే బ్రహ్మవిద్యా పారాయణము చేయుచూ, అనేక శ్లోకములను చదువుచూ,
దేవున్ని ఆరాధించుచూ, ప్రజలందరూ దేవుని మంత్రోచ్ఛాటన శబ్దముతో
మనస్సు లగ్నము చేసి ఆరాధించవలెననీ, జ్ఞాన మంత్రశబ్దము దైవ
సమానమనీ అటువంటి నాదమే 'బ్రహ్మమని' బోధించగా, నాయి
బ్రాహ్మణులు జ్ఞానమంత్ర శబ్దముకంటే గొప్పదైన నాదము వేరున్నదనీ,
జ్ఞానమంత్ర నాదముకంటే తాము మ్రోగించు నాదము చాలా మంగళకర
మైనదనీ చెప్పెడివారు. మంగళవాయిద్యముల నుండి పుట్టు నాదములలో
మనస్సు లగ్నమైన, నిత్యము మనలను పీడించు అనేక విషయములను
మరచిపోయి గొప్ప అనుభూతిని మానవుడు పొందగలడనీ, అది దేవునికి
చాలా దగ్గరైనదనీ, ప్రపంచ విషయములనుండి సులభముగా బయట
పడుటకు మంత్రనాదముకంటే మా నాదమే మేలని వాయించి, మనుష్యుల
మనసులను ఆ నాదము మీదనే నిలబడునట్లు క్రొత్త నాదములను వాయించి
చూపారు. అట్లు చేయుట వలన తలంపులు లేకుండా పోయి క్రొత్తగా
ఆత్మ దర్శనమగునని ఆ అర్థముతోనే మనుషుల తలలు కొరిగి చూపించారు.
కొరుగుటకు కావలసిన పరికరములు, శబ్దము చేయుటకు కావలసిన
వాయిద్యములు ఆనాటి నుండే సమకూర్చుకొని పెట్టుకొన్నారు.
గుడి లోపల మీరు మంత్రములు చదివితే, గుడి బయటే మేము
వాయిద్యములు మ్రోగిస్తామని పోటీకి కూర్చున్నారు. అట్లే వివాహ
సమయంలో బ్రాహ్మణులు మంత్రములు చదివితే, నాయి బ్రాహ్మణులు
వాయిద్యములు మ్రోగించెడివారు. పెళ్లి మీరు చేస్తే, పెళ్లి కుమారునిగా
చేసేది మేమేయనీ, మేము లేనిదే పెళ్లి కుమారుడే లేడు అని అన్నారు.
ఇప్పటికీ నాయి బ్రాహ్మణులు పెళ్లి కుమారుని చేయుట గలదు. ఆ
విధముగానే ఒక మనిషి చనిపోయినప్పుడు బ్రాహ్మణులు మంత్రములు
చదివి కర్మతంత్రము నిర్వహించి చనిపోయిన మనిషికి బ్రతికియున్న వారికి
నేటితో సంబంధము తెగిపోయినది, ఇంతవరకు ఇచటనే తిరుగుచున్న
జీవాత్మ, ఆ దినముతో పూర్తి సంబంధము లేకుండా పోతుందని తెలుపగా,
నాయిబ్రాహ్మణులు బ్రతికియున్న వారికి గడ్డము పెంచుకొమ్మని ఆ దినము
వాటిని కొరిగి ఇంతవరకు మీకు కరుచుకొని ఉన్న గడ్డపు వెంట్రుకలు,
తల వెంట్రుకలు ఎలా ఇప్పుడు సంబంధము లేకుండా పోయినాయో,
అలాగే చనిపోయిన వారి జీవాత్మ నేటి నుండి మీతో సంబంధము లేకుండా
పోతున్నదని తెల్పుచూ కర్మతంత్రములు చేసెడివారు. ఇట్లు బ్రాహ్మణుల
చొరవయున్న చోటంతా దాయాదులైన నాయిబ్రహ్మణుల చొరవ యున్నదని
తెలియాలి.
అనేకచోట్ల పోటీపడిన రెండు తెగల బ్రాహ్మణులు తమ తమ
ఆధిపత్యము చాటుకొనుచూ, ఒక తెగయైన బ్రాహ్మణులు మేము
'భూసురులమని’ చాటుకొనిరి. భూమిమీద ప్రత్యక్ష దేవతలమని బ్రాహ్మణులు
చాటుకొనగా, రెండవ తెగయైన నాయి బ్రాహ్మణులు మేము బ్రాహ్మణులకంటే
శుభకరమైనవారమనీ, మంగళ ప్రదమైన మేము మంగళవారమనీ (శుభ
కరమైనవారమని) ప్రకటించుకొనిరి. మొదట రెండు తెగలవారికి
బ్రాహ్మణులని పేరుండెడిది. నాయి బ్రాహ్మణులనెడి పేరు మధ్యలో మంగళ
కరమైన వారికి వచ్చినది, కానీ మొదట ఉండెడిది కాదు. పూర్వకాలము
లోనే బ్రాహ్మణుల మధ్యలో భేదాభిప్రాయములు వచ్చినప్పుడు 'భూసురులని'
ఒక తెగకు, ‘మంగళవారని' ఒక తెగకు పేరు వచ్చినది. మంగళవారను
పేరు ఒక తెగకు అట్లే నిలిచిపోగా, భూసురులని పేరు మరియొక తెగకు
అంతగా ప్రచారముకాక బ్రాహ్మణులను పేరుగానే నిలిచిపోయినది. నువ్వా
నేనా గొప్పయని పోటీ పడుచూ వచ్చిన రెండు తెగల బ్రాహ్మణులు
ఒకరినొకరు ద్వేషించుకొను వరకు వచ్చి, ఎవరైనా కార్యనిమిత్తమై
పోవునప్పుడు మంగళవాడు ఎదురైన అపశకునమనీ, ఆ కార్యము భంగమై
పోవుననీ, మంగళవారిని అమంగళులుగా బ్రాహ్మణులు చెప్పి ప్రచారము
చేసిరి. దానిని చూచిన మంగళ బ్రాహ్మణులు అదే విధమైన అపవాదును
బ్రాహ్మణులకు అంటకట్టదలచి, ఎవరైనా కార్యనిమిత్తమై పోవునప్పుడు
బ్రాహ్మణుడు ఎదురైతే అపశకునమనీ, ఆ కార్యము భంగమైపోవుననీ,
ప్రచారము చేసిరి. అపశకునములలో ఈనాటికీ అవి ప్రచారములో గలవు.
ఇట్లు కాలము గడుస్తూరాగా పాతవారు పోతూ, క్రొత్తవారు వస్తూ
పూర్వమున్న అభిప్రాయములు మారిపోయి వారి పెద్దలు ఏమి చేశారో,
పూర్వమున్న పద్ధతులేమిటో తెలియక, బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానమును వదలి
కేవలము బ్రతుకుతెరువు కొరకే అన్నట్లు ఆలయములో ఆరాధన మొదలు
కొని, చచ్చినవారి కర్మతంత్రముల వరకు చేయుచున్నారు. ఆనాటికీ
ఈనాటికీ వారు చేయు పనులలో కూడా మార్పులు చేసుకొన్నారు.
బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానమును వదలి వేదమంత్రములలో పడిపోయారు.
అట్లే మంగళవారియందు కూడా అర్థాలు తెలియని ఆచారాలు మిగిలి
పోయినవి. వారు ముందు చేయుచున్న పనులే నేడు చేయుచున్నప్పటికీ
ఆనాటి పనులు భావయుక్తమై ఉండెడివి. నేడు భావరహితమై కేవలము
వృత్తి విద్య అన్నట్లున్నవి. ఇలా రెండు తెగలవారు గాడితప్పి పాత
విధానమునూ, అర్థమునూ వదలి పనులు చేయుచున్నారు.
పూర్వకాలము బ్రాహ్మణులు మంగళవారు సమానముగా
ఒకరికొకరు పోటీపడుచు వచ్చినప్పటికీ, కొంత కాలమునకు మంగళవారే
ఎక్కువ ప్రచారములోకి వచ్చి, వారిదే రాజుల వద్దనూ, ప్రజల వద్దనూ పై
చేయిగా మారింది. దానిని చూచిన బ్రాహ్మణులు పట్టుదల కలిగి మంగళ
వారిని క్రిందికి పంపి తాము పైకి రావాలనుకొని బుద్ధిని ఉపయోగించి
దానికి తగిన పథకమును యోచించారు. తాము కూడా రాజులతో స్నేహం
చేసి, అధికారమును తమవైపు ఉపయోగించుకొని తమ ప్రాబల్యమును
సంపాదించుకోవాలనుకొన్నారు. అప్పటినుండి ఎక్కువ రాజుల సాన్నిధ్యంలో
చేరి, వారికి అనేక విషయములు బోధిస్తూ, రాజుల దగ్గర ఆసనమును
సంపాదించి రాజ గురువుల హోదా కల్గి చలామణి అగుచూ, 'మంగళవారి'
కంటే ఎక్కువ ప్రాబల్యమును అన్ని విధముల గొప్పతనమును సంపాదించు
కొనిరి. ఏ పథకము లేకుండా సాధారణంగా తమ పనులు చేయుచూ
వచ్చి కొంత కాలమునకు తాము బ్రాహ్మణులకంటే చాలా తక్కువవారిగా
ఉన్నట్లు, తమకంటే వారు ఎన్నోరెట్లు ఎక్కువగా ఉన్నట్లు మంగళవారు
తెలుసుకొనిరి. తాము ఎటులైనా బ్రాహ్మణులతో సమానముగా ఉండాలని
తలచి, తాము కూడా వారివలె రాజుల వద్దనే స్థానము సంపాదించుకోవాలని
యోచించారు. ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయలగారి ఆస్థానంలో మంగళి
ఒకడు "మేము కూడా ఒకప్పుడు బ్రాహ్మణులమే, మమ్ములను కూడా
బ్రాహ్మణుల స్థానము కల్పించి ఆదరించవలెనని” శ్రీకృష్ణ దేవరాయలను
కోరగా అప్పుడు వారి పూర్వాపరాలు తెలియని రాయలవారు, బ్రాహ్మణులను
చూసి ఇతనిని కూడా బ్రాహ్మణునిగా చేయమన్నాడట. అప్పుడు వారు
రాయల వారి ఆజ్ఞ ప్రకారము అతనిని తుంగభద్రా నదికి తీసుకపోయి
మంత్రములు చదువుచూ, నీటిని పోయుచూ నేటితో నీచత్వము పోయి
బ్రాహ్మణత్వము రావాలని సంస్కృతమున మంత్రములను చెప్పుచుండిరట.
ఆ విషయం బ్రాహ్మణుల కులస్థుడైన తెనాలి రామకృష్ణకు తెలిసినది.
'మంగళవారు మాకు సాటియా?” అని ఆగ్రహించిన రామకృష్ణుడు ఆ
కార్యమును భంగము చేయుటకు యోచించి, ఒక 'కుక్క'ను తన వెంట
పెట్టుకొని తాను కూడా తుంగభద్రా నదికి పోయాడు. అక్కడ జరుగుచున్న
తంతును చూచి, తాను వారికంటే కొన్ని గజముల పై భాగమునకు పోయి,
కుక్కమెడలో తాడుకట్టి తాడును కాలిక్రింద అదిమిపట్టి తాను మంత్రములు
చెప్పుచూ, ఈ కుక్క కామధేనువు (ఆవు) గా మారవలెనని చెప్పుచూ కుక్క
ముఖము మీద నీరు చల్లుచుండెనట. అప్పుడు ఆ కుక్క నీటి తాకిడికి
తట్టుకోలేక అరుస్తూ నీటిలో ఎగరడం మొదలు పెట్టెను. నీటి వాలుకు పై
ప్రక్క ఉన్నందువల్ల కుక్క త్రొక్కిన నీరు మిగతా బ్రాహ్మణులవైపు
వచ్చుచుండెను. పైగా కుక్క అక్కడ అరవడం, నీరు అంతయూ మురికి
కావడం వారికి సరిపోక రామకృష్ణను దూరముగా పొమ్మనీ, నీ వలన
మా కార్యము చెడిపోవుచున్నదనీ, కుక్క శరీరము మీద పడిన నీరు తమ
వైపు పారుచున్నదనీ, ఎంత చెప్పినా రామకృష్ణ వినకుండెను. పైగా తెనాలి
రామకృష్ణయే వారి మీదకు వాదనకు దిగెను. అప్పుడు చేయునది లేక ఆ
విషయమును రాజుగారికి తెలియజేసి మా కార్యము రామకృష్ణ వల్ల
భంగమైనదనిరి. అప్పుడు రాయలవారు రామకృష్ణ చేసిన పనికి ఆగ్రహించి
సభలోనికి అతనిని పిలిపించెను. నేను మంగళవాన్ని బ్రాహ్మణునిగా
చేయమని చెప్పగా వారి పనికెందుకు అడ్డు తగిలావని రామకృష్ణున్ని
దండించెను. అప్పుడు రామకృష్ణుడు వినయముగా కుక్కను ఆవుగా
చేయాలని అక్కడకెళ్లి కుక్కను మంత్రోదకముతో శుద్ధి చేయుచుంటిని. వారికి
నేనేమీ అడ్డురాక నా పనిని నేను చేసుకొనుచుంటిననెను. ఆ మాట విన్న
రాయలు ఆశ్చర్యపడి మంత్రోదకమున శుద్ధి చేస్తే కుక్క గోవుగా ఎట్లు
మారును? అని అడిగెను. దానికి రామకృష్ణ తెలివిగా “మంత్రోదకముతో
శుద్ధి చేస్తే ‘మంగళవాడు’ బ్రాహ్మణుడిగా ఎట్లు మారునో, అట్లే కుక్క కూడా
మారునని” సమాధానము చెప్పెను. రాయలు విచిత్రంగా చూస్తూ "ఏమి
చేసినప్పటికీ కుక్క ఆవుగా మారుట అసంభవము” అన్నాడు. వెంటనే
రామకృష్ణ “అయితే ఏమి చేసినా మంగళవాడు బ్రాహ్మణుడుగా మారడము
అసంభవం” అని సమాధానము చెప్పాడు. రామకృష్ణ యొక్క వాక్
చాతుర్యమునకు రాయలు మెచ్చుకొని నేను మంగళివాడికి ఇచ్చిన
మాటయేమి కావలెననగా? దానికి రామకృష్ణుడు మార్గము యోచించి రాజు
గారికి సంతోషము కల్గునట్లు "ప్రభూ! మంగళిని బ్రాహ్మణునిగా మారుస్తానని
తమరు మాట ఇచ్చారు. అట్లు మారుటకు నా కుక్క అడ్డు వచ్చినమాట
నిజమే. రాజుగారి మాట వృథా కాకుండా ఉండునట్లు కుక్క కారణమున
ఆ కార్యము నిలిచిపోయినది కావున, నేటి నుంచి మంగళివాడిని 'నాయి
బ్రాహ్మణ' అని పిలుచునట్లు ఊరూరు దండోర వేయించవలెనని నా మనవి.
మంగళివాడు బ్రాహ్మణుడిగా మారుటకు కుక్క అడ్డు వచ్చిన కారణమున
నాయి బ్రాహ్మణ అని ఫలానా రాయల వారి కాలంలో ఈ కార్యము జరిగి
ఈ పేరు వచ్చినదని తమ పేరు స్థిరస్థాయిగా ఉండునట్లు ఇదే తగిన
పేరు” అని చెప్పెను. రామకృష్ణ తెలివికి సంతోషించిన రాయలు ఆనాటి
నుండి 'మంగళివాన్ని' నాయి బ్రాహ్మణునిగా పిలుచునట్లు దండోర
వేయించెను. ఇట్లు పూర్వము నుండి నాయి బ్రాహ్మణ అను పేరు
లేకుండినప్పటికీ, రాయలవారి కాలము నుండి క్రీ.శ॥ 1600
సంవత్సరముల నుండి ఆ పేరు 'మంగళవారికి' వచ్చినది.
పూర్వము వాస్తవానికి బ్రాహ్మణులే అయినప్పటికీ, ఆచార
వ్యవహారములలో వేరుపడి మరియొక తెగగా మారిన వారు నేడు మంగళ
వారిగా పిలువబడినప్పటికీ, నాయి బ్రాహ్మణ అను పేరు అతికించబడి
ఉన్నది. రాయలవారి ఆస్థానము హంపి. హంపి ఈనాడు కర్నాటకలో
ఉన్నది. ఆనాడు హంపి కూడా ఆంధ్రలోనే ఉంది. అప్పుడు కన్నడ
భాష కొంత హంపిలో ఉండెడిది. కన్నడ భాషలో నాయి అనగా కుక్క
అని అర్థము. నేడు బ్రాహ్మణులు సంఘములో విలువగా ఉంటే, నాయి
బ్రాహ్మణులు వారికంటే తక్కువ వారిగా ఉన్నారు. ఇదంతయూ
కాలక్రమమున మారిన విచిత్రమని తెలియాలి. కానీ ప్రజలకేమో డబ్బు
తీసుకొన్నా ప్రతిఫలముగా చేతల రూపముగా ఉపయోగపడు వారు నాయి
బ్రాహ్మణులనీ, కేవలము మాటలు చెప్పి సరిచేయువారు బ్రాహ్మణులనీ
ప్రజలు అనుకొంటున్నారు.
అదే విషయమునే వేమనయోగి కూడా తన పద్యములో మంత్ర
జలముకన్నా మంగళి జలమెచ్చు అన్నాడు. బ్రాహ్మణుడు డబ్బు తీసుకొని
మంత్రపు నీటిని తలమీద చల్లితే దానివలన సుఖము కనిపించదు. అదే
డబ్బు తీసుకొని తలకొరుగుటకు మంగళి నీళ్ళు చల్లి తలమీద చేయి పెట్టగానే
ఎంతో హాయి కనిపిస్తుంది. దానివలననే వేమన అట్లన్నాడు. నేడు
సమాజములో బ్రాహ్మణులకంటే మంగళవారే ఎక్కువ ఉపయోగపడు
చున్నారు. అయినప్పటికీ పూర్వపరాలు తెలియని దానివలన బ్రాహ్మణులు,
మంగళవారు ఒకే జాతియని తెలియకుండా పోయినది. తమ విషయము
తమకే తెలియని మంగళవారు ఇప్పుడున్నారు. బ్రాహ్మణ అను పేరుకంటే
మంగళ అను పేరు గొప్పదని తెలియని మంగళవారు నేడున్నారు. బ్రాహ్మణ
అంటే కేవలము జ్ఞానమనీ, మంగళ అంటే మోక్షమనీ, జ్ఞానము మార్గము
కాగా, గమ్యము మోక్షమని తెలియని మంగళవారు నేడు గలరు. ప్రపంచము
లోనే అత్యున్నతమైన శబ్దము మంగళమను శబ్దమనీ, అదే మంగళమను
మాటను దేవాలయములలో కూడా దేవుని ఆరాధన చివరిలో హారతియందు
చివరిగా పలుకుచుందురనీ తెలియనివారుండుట వలన, మంగళవారు
బ్రాహ్మణులకంటే అన్ని విధముల తక్కువగా యున్నారు. పూర్వము గుడిలో
ప్రారంభమైన తల కొరుగు కార్యము నేడు బ్రతుకుతెరువుకన్నట్లు
బజారులోని షాపులలోనికి మారినది. ముఖ్యముగా చెప్పుకోతగ్గ వింత
ఏమనగా! గౌరవప్రదమైన మరియు పవిత్రమైన మంగళమను పదమును
వదలి, అగౌరవమైన మరియు అపవిత్రమైన కుక్క అనుటకు మారుగాయున్న
'నాయి' అనే పేరును తగిలించుకొని 'నాయీబ్రాహ్మణ' అని పేరు
పెట్టుకోవడము విచిత్రము కాదా! ఏ షాప్లో చూచినా నాయీ బ్రాహ్మణ
సంఘము అని బోర్డు పెట్టుకోవడము హాస్యాస్పదము కాదా! చదువురాని
కొంతమందికి నాయి అంటే ఏమిటని అర్థము తెలియక ఆ పేరు పెట్టు
కొనియుండవచ్చును. కానీ చదువుకొన్నవారు ఎందరో ఆ కులములో
ఉండీ, ఇది మనకు మంచిపేరా, చెడ్డపేరా అని యోచించకపోవడము
విచిత్రము కాదా! నాయీ బ్రాహ్మణ అంటే కుక్క బ్రాహ్మణుడని అర్థము
కదా! అటువంటి అర్థముతో మాది కుక్క బ్రాహ్మణ సంఘమని బోర్డు
పెట్టుకోవడము మంచిదా? ఇప్పటికైనా కన్ను తెరిసి సమాజములో
అవమానమును కల్గించు ఆ పేరును వదలిపెట్టి పూర్వపు ఆచరణతో
అర్థముతోనే ఉంటూ, మొదటి మాదిరే మంగళ ప్రదమైన బ్రాహ్మణులై
తమ పని పవిత్రమైనదనీ, మా పేరు నాయీ బ్రాహ్మణులు కాదని సమాజానికి
చాటవలెను. అట్లు చాటుటకు మొదట జ్ఞానమును తెలుసుకొని కుల
ఆచారమైన నాదమును మ్రోగించుటకు, తలకొరుగుటకు దైవ సంబంధ
అర్థమును చెప్పి నిజమైన మంగళ ప్రదాతలుగా మంగళవారుండవలెనని
తలచుచున్నాను.
చరిత్రలో మధ్యలో వచ్చిన బ్రాహ్మణులు, చరిత్రలో పూర్వము నుండి
యున్న శుభకరులు అను అర్థముతోగల మంగళ వారిని, అశుభులుగా
చిత్రించి, వారి స్థానమును వీరు ఆక్రమించి, చివరికి వారిని బజారుపాలు
చేశారు. మంగళవారు బ్రాహ్మణులున్న చోటంతా వదలక యున్నా వారిని
తక్కువ పనులు చేసేవారిగా చిత్రించారు. మంగళవారికి నేడు తమ కులము
ప్రసక్తే తెలియక ఈ మధ్య 1600 సంవత్సరముల నుండి వచ్చిన పేరును
నాయీ బ్రాహ్మణ అని చెప్పుచూ తాము మంగళ వారమనీ, మా వలన
శుభములు జరుగునని చెప్పలేకపోవుచున్నారు. కాలక్రమమున వారి
చరిత్రను వారు మరచిపోయారు. అలాగే బ్రాహ్మణులు కూడా వారు
పూర్వము ఇతర కులములనుండి వచ్చి బ్రాహ్మణులుగా మిగిలి పోయామని
చరిత్రను మరచిపోయారు. నేడు వారి చరిత్ర వారికి తెలియక మాది
ప్రత్యేకమైన కులమనీ, మేము అందరికంటే గొప్ప (పెద్ద) కులములో
యున్నామని అనుకొంటున్నారు. కొన్ని లక్షల సంవత్సరముల క్రిందట
బ్రాహ్మణులు ఎలా వచ్చారో, కొన్ని వందల సంవత్సరముల క్రిందట నాయీ
బ్రాహ్మణులు ఎలా వచ్చారో మనము కొంత తెలియగలిగాము.
నేడు బ్రాహ్మణులు హిందూ సమాజము మొత్తము పైకి పెద్ద
కులముగా చలామణి అగుచున్నారు. మొదట దేవాలయములలో పూజలు
చేయడములో హక్కుదారులుగా యున్నవారు చివరకు వారి విధానము
వారికి తెలియకుండా పోయినది. బ్రాహ్మణులుగానీ, నాయీ బ్రాహ్మణులు
గానీ వారి చరిత్రను వారు తెలియుటకు ఏమాత్రము సుముఖముగా లేరు.
వారి చింతయంతా ఎలా డబ్బు సంపాదించుకోవాలియను ఆలోచనలలో
పడిపోయారు. నేడు మేము వారి చరిత్రను త్రవ్వి చెప్పినా వినే స్థితిలో
లేకుండా సత్యమును చెప్పుచున్న మమ్ములను అసూయతో చూస్తున్నారు.
అయినా బ్రాహ్మణులలో కొందరు సాత్త్విక భావమును కల్గి తమ చరిత్ర
వినగలుగుచున్నారు. చరిత్ర తెలిసినందుకు సంతోషపడుచున్నారు.
ప్రశ్న :- మీరు చెప్పేదంతా ఒక ప్రక్క వాస్తవమే అనిపిస్తాయున్నది. చరిత్రలో
జరిగిన సంఘటనలను, మార్పులనుబట్టి అంతా సత్యమేయని 99 శాతము
అనిపించినా ఇంకా ఒక శాతము సత్యము కాదేమో? అనిపిస్తా ఉన్నది.
మిగతా కులముల నుండి వచ్చి బ్రాహ్మణులు అయినవారే మొదటి
బ్రాహ్మణులు అని చెప్పారు. బ్రాహ్మణత్వము వృత్తే కానీ కులము కాదు
అని చెప్పారు. అయినా ఇతర కులముల వారే బ్రాహ్మణులుగా తయారయినా
రనీ, బ్రహ్మవిద్యను నేర్చినందువలన బ్రాహ్మణత్వము రాగా, దానినే
కులముగా చెప్పుకొన్నారను విషయము ఎక్కువగా సత్యమేయున్నా, ఎక్కడో
ఒక శాతము సత్యము కాదేమో? అని అనుమానము కల్గుచున్నది. మా
అనుమానము పోవునట్లు, పూర్తి సత్యము అర్థమగునట్లు చెప్పవలెనని
కోరుచున్నాము.
జవాబు :- అలా అనుమానము రావడము సహజమే! అయితే అనుమానము
వచ్చినంత మాత్రమున దానిని అసత్యమనుటకు వీలులేదు. అందువలన
మీకు అర్థమగుటకు ఇంకా వివరముగా చెప్పదలచుకొన్నాము. బాగా
బుద్ధిని ఉపయోగించి గ్రహించండి. ఈ విషయము నేను చెప్పినట్లు పైకి
మీకు కనిపించినా వాస్తవముగా చెప్పువాడను నేను కానని మరొక మారు
తెలియజేయుచున్నాను. మనిషిలో ఉండి మాట్లాడువాడు, పనులు
చేయువాడు దేవుడయిన ఆత్మేననీ ఆ విషయము ఎవరికీ తెలియక మేమే
మాట్లాడుచున్నామని, మేమే చేయుచున్నామని అనుకోవడము జరుగుచున్నది.
నా విషయము నాకు తెలుసు. నేను ఏమీ చేయనివాడిని, ఏమీ మాట్లాడని
వానిననీ, అయినా అందరూ నేనే మాట్లాడుచున్నానని భ్రమించుచున్నారు.
సత్యము ఆత్మయిన దేవునికి తెలుసు కావున చెప్పునదంతా సత్యమే
ఉంటుంది. అసత్యము ఏ కొద్దిగ కూడా ఉండదు. ఇప్పుడు తెలియజేయడ
మేమనగా! మీకు వచ్చిన ప్రశ్న ఎవరికయినా రావచ్చును. అందువలన
దానికి జవాబును తెలియుట అవసరమే యగును.
సృష్ఠి తర్వాత మానవ సమాజము ఏర్పడిన తర్వాత వావి వరుసల
కొరకు, మనుషులు జంతువులవలె ప్రవర్తించకుండుటకు ఒకరికొకరు ఏమి
అవుతారో, ఏమని పిలువాలో, వావివరుసలను నిర్ణయించి అమ్మ, అత్త,
అవ్వ అను మూడు వరుసలను ముందు ఆడవారిలో నియమించి తర్వాత
వారి ఆధారముతో మిగతా వరుసలన్నీ ఏర్పరచారు. మొదటి అక్షరము
ఒకే అక్షరము ‘అ’ ఉండునట్లు పెట్టి రెండవ అక్షరమును అదే అక్షరము
వత్తుతో ఉండునట్లు చేశారు. ప్రకృతి నుండే శరీరము పుట్టుచున్నది కావున
ఆడవారినుండే ఆ పదములను నిర్ణయించడము జరిగినది. ప్రకృతి నుండి
మూడు ఆడవారి మొదట అక్షరములను తీసుకొని తర్వాత మూడు వత్తులు
గల అక్షరములను తీసుకొన్నారు.
అమ్మ , అత్త , అవ్వ చిత్రమును 58 పేజీ లో చూడండి.
తర్వాత మగవారిలో మూడు ముఖ్యమైన వరుసల పదములను
తీసుకొని ఒకరికొకరి బాంధవ్యమును ఏర్పరచారు. మూడు బాంధవ్యముల
పదములు పురుష సంబంధమైనవి. అవి ఈ విధముగా గలవు. నానా,
మామా, తాతా.
నానా, మామా, తాతా చిత్రమును 58 పేజీ లో చూడండి.
ఈ విధముగా ఆరు వరుసలు చేసి వారికి మిగతా ఆరు వరుసలను
చేశారు తర్వాత పేజీలో చూడండి.
అమ్మ - కూతురు = నానా - కొడుకు (ప్రకృతి పురుషుడు)
అత్త - కోడలు = మామా - అల్లుడు (ప్రకృతి పురుషుడు)
అవ్వ - మనవరాలు = తాతా - మనవడు (ప్రకృతి పురుషుడు)
ఈ విధముగా పన్నెండు వరుసలు కల్పించి వీరితో వారు
వివాహమాడ వచ్చుననుటకు మనుషులను రెండు తెగల ఇంటి పేర్లతో
రెండుగా విభజించి ఒకరికొకరు వివాహములు చేసుకొనుటకు ఏర్పాటు
చేశారు. ఆ నేపథ్యములో కొన్ని కులములకు కొన్ని ఇంటి పేర్లు కేటాయించి
వారిలో రెండు వరుసలు చేసి ఒకరికొకరు పెళ్లిల్లు చేసుకొనునట్లు చేశారు.
ఇంటిపేర్లు వాటికి అనుబంధముగా, ఇంటి పేర్లు మరచిపోకుండా
గోత్రములను ఏర్పాటు చేశారు. ఫలానా కులము, ఫలానా గోత్రము,
ఫలానా ఇంటి పేరు అని అడ్రన్లాగ ఉండేవి. రెండు మూడు కులములకు
ఒక ఇంటి పేరును, ఇంకా ఎక్కువ కులముల వారికి గోత్రము పేరును
గుర్తించి వారి పూర్తి అడ్రస్ అనేలాగున చేసిపెట్టారు.
గతములో పూర్వమే కొన్ని కులముల వారు వచ్చి బ్రాహ్మణులుగా
మారియుండుట చేత ఇది వారి పూర్వపు అడ్రస్ (చిరునామా) యన్నట్లు
బ్రాహ్మణుల ఇంటిపేర్లు కొంత దారి చూపుచున్నవి. బోయ (వాల్మీకి)
కులము వాడు పూర్వము బ్రహ్మవిద్యను నేర్చి బ్రాహ్మణుడుగా మారినాడు
అనుటకు సాక్ష్యముగా అతను నేడు బ్రాహ్మణుడుగా యున్నా ఆనాడు
బోయకులములో యున్న ఇంటి పేరే నేడు కూడా యుండును. "నెట్టి
కంటి" అను ఇంటి పేరుగల ఒక బోయవాడు బ్రాహ్మణుడుగా మారి
బ్రాహ్మణునిగా నిలిచిపోయాడనుకొనుము. అది సత్యము అని తెలియుటకు
అతని ఇంటి పేరు మిగతా బోయవారిలో కూడా ఉండడము వలన అతను
పూర్వము ఫలానా కులమునుండి ఫలానా ఇంటి పేరునుండి వచ్చాడని
తెలియుచున్నది. అప్పుడు అతని పూర్వము కులము బోయకులము అనుట
సత్యమగుచున్నది.
ఉదాహరణకు 'తుపాకుల' అను ఇంటిపేరు ఒక హరిజనుడి
ఇంటి పేరుగా యున్నదనుకొనుము. అదే 'తుపాకుల' అను ఇంటి పేరు
బ్రాహ్మణులలో ఉందనుకొనుము. అప్పుడు పూర్వము ఒక హరిజనుడు
బ్రాహ్మవిద్యను నేర్చిన దానివలన బ్రాహ్మణుడుగా లెక్కించబడినాడు. తర్వాత
అతను బ్రాహ్మణుడిగా నిలిచిపోవుట వలన అతని ఇంటి పేరు నేడు
బ్రాహ్మణ కులములో కూడా ఉందని చెప్పవచ్చును. ఈ విధముగా పూర్వము
ఇంటిపేర్లు ఎక్కడయినా ఏ బ్రాహ్మణుని ఇంటిపేరుగా యున్నా ఇది మధ్య
వచ్చిన కులమగుట వలన అతని పూర్వ కులము ఫలానాయని చెప్పవచ్చును.
అట్లు ఎందరో ఇతర కులముల నుండి వచ్చి బ్రాహ్మణులుగా తయారై
బ్రాహ్మణులుగా నిలిచిపోయారను సత్యము వారి ఇంటి పేర్ల ఆధారముతో
కొంత వరకు గుర్తించవచ్చును. సత్యము తెలియుట కొరకు ఈ విధముగా
చెప్పుచున్నాము తప్ప బ్రాహ్మణులనుగానీ, ఇతర కులములనుగానీ కించ
పరచుటకు చెప్పలేదని తెలియవలెను. ఇది సత్యాన్వేషణ తప్ప ఇతర
భావము ఏమీ లేదని తెలియవలెను.
పూర్వము గడచిపోయినది గడచిపోయింది. ఇప్పుడు గడువ
బోవునది, గడచుచున్నది చూచుకోవలసిన అవసరమున్నది. నేడు మనము
తెలుసుకోవలసిన కోణములో చూస్తే నేడుగానీ పూర్వముగానీ హిందూ
సమాజమునకు బ్రహ్మవిద్య దీపములాంటిది. ఎందుకనగా! నేడు హిందూ
సమాజము అని పిలువబడునది పూర్వము ఇందూ సమాజము అను పేరుతో
యుండేది. ఈ మధ్య నూరు నుండి నూటయాభై (100-150)
సంవత్సరముల లోపల ఇందూ అను పదము హిందూ అను పదముగా
మార్చబడినది. ఎలా పూర్వమునుండి బ్రాహ్మణకులము తయారయినదో
తెలియని మనము నూరు సంవత్సరముల క్రింద నుండి ఇందూ హిందూగా
మారిపోయినదను విషయము తెలియలేక మనది హిందూమతమేయని
చెప్పుకొంటున్నాము. చరిత్ర తెలిసిన మేము మనది హిందూ పదము
కాదు ఇందూ అను పదము అని చెప్పితే మేము పరమతమును బోధించు
చున్నామని మమ్ములను ప్రచారము చేసిన హిందువులు కలరు. మతభక్తిని
పెంచుకొని పూర్తి గ్రుడ్డివారిగా తయారై పూర్వము మన ఉనికి ఏమి? మన
మతము పేరు ఏమి? అని తెలియక జ్ఞానులు అను అర్థమున్న ఇందూ
పదమును వదలి అర్థము లేని హిందూ పదమును పట్టుకొన్నారు. మేము
చెప్పినది నిజమనుటకు తర్వాత పేజీలో ఒక న్యూస్పేపర్లో వచ్చిన
సమాచారమును చూడండి.
న్యూస్ పేపర్ వార్తలతోనయినా కళ్ళు తెరచి మనము హిందువుల
పదముతో పిలువబడకూడదు, ఇందూ పదముతో పిలువబడవలెనని
తెలుసుకోగలరని అనుకుంటున్నాము. హిందూ సమాజము దైవజ్ఞానము
మీద ఆధారపడియున్నది. నేడు మిగతా మతములు కూడా వారు
దైవజ్ఞానమును, వారి దైవగ్రంథములను ఆధారము చేసుకొని వారికి తెలిసిన
జ్ఞానము వారు చెప్పుకొనుచూ వారి మతములను ముందుకు
తీసుకపోవుచున్నారు. అట్లే హిందువులు కూడా దైవజ్ఞానము ఆధారముగా
ముందుకు పోవలసియున్నది. అయితే బ్రాహ్మవిద్య అనునది ఏమాత్రము
తెలియని బ్రాహ్మణులు హిందూమతములో ఉండుట వలన, హిందువులకు
దారిచూపువారు ఎవరూ లేనందున, హిందువులకు హిందువుల జ్ఞానము
ఏదో తెలియకపోవడము వలన జ్ఞానముతో ముందుకు పోవు
హిందూమతము ముందుకు పోలేక కుంటుపడి పోయినది. జ్ఞాన దీపము
(అనంతపురం, సాక్షి న్యూస్పేపర్, 12-10-2015)
'హిందూ పదానికి
నిర్వచనం తెలియదు'
ఇండోర్: రాజ్యాంగం, న్యాయపరంగా
హిందూ పదానికి నిర్వచనం తెలియదని కేంద్ర
హోంశాఖ తేల్చింది. హిందూ పదం నిర్వచనం
చెప్పాల్సిందిగా మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశే
ఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టానికి
చేసుకున్న దరఖాస్తుకు బదులిస్తూ హోంశాఖ
పై విధంగా స్పందించింది. ఆ పదానికి సంబం
ధీంచిన ఎలాంటి సమాచారంలేదని కేంద్ర
పౌరసంబంధాల శాఖ అధికారి పేర్కొన్నట్లుగా
కేంద్రం తెలిపింది. ఎలాంటి నిర్వచనం లేన
ప్పుడు ఫలానా వర్గంవారు హిందువులని ఎలా
నిర్ధారిస్తున్నారని, దేశంలో హిందువులు మెజా
రిటీగా ఉన్నారని ఎలా చెబుతున్నారని గౌర్
ప్రశ్నించారు.
ప్రముఖుల లేఖ.
(సాక్షి న్యూస్పేపర్, 21-01-2014)
ఇందు దేశమే ఇండియా!
హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యా
వర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశ
పటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు
కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు
వచ్చింది. ఇందు దేశమే హిందూదేశమయింది.
రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం
పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో
చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన
కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు,
ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా
ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహా
గ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ
ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన
దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే
వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా
వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని
పెద్దలు అంటూ ఉండరు.
* నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి
తమ మతములో కనిపించకపోయే సరికి ఎక్కడ జ్ఞానము వెలుగు కనిపిస్తే
అక్కడికి హిందువులు పోయి ఆ మతములలో చేరిపోవుచున్నారు.
త్రేతాయుగములో, ద్వాపరయుగములో రాజుల చెంత, చక్రవర్తుల
చెంత చేరి వారి ఆస్థాన పండితులుగనో లేక వారి ఆస్థాన గురువులుగనో
బ్రాహ్మణులు చక్రము తిప్పేవారు. రాజుల పరిచయముండుట వలన
వారికి దైవజ్ఞానమును బోధించుచూ రాజులను సహితము సక్రమముగా
నడుచుకొనునట్లు చేసెడివారు. త్రేతాయుగములో రాజులు బ్రాహ్మణుల
వలన బ్రహ్మవిద్యను తెలియగలిగి, వారి జీవితమును సాఫల్యము
చేసుకోవడమేకాక ప్రజలకు సక్రమమైన పాలన అందించుచుండిరి.
మనుషులలో ఎక్కువగా పాప భావము లేనందున, బాధలు అనుభవించు
వారు తక్కువగా యుండేవారు. నెలకు మూడు వానలు కురిసి, పంటలు
సస్యశ్యామలముగా పండేవి. ఎక్కడ చూచినా సంవత్సరము పొడవునా
నదులు, వాగులు చిన్నగా పారుచుండేవి. నీటి కొరత ఎక్కడా లేకుండెను.
ప్రకృతి వైపరీత్యములు ఇప్పటికంటే అప్పుడు తక్కువగా యుండేవి. పాలనలో
పెద్దవాడయిన రాజుగానీ, రాజు క్రింద యున్న పాలనలో చిన్న ఉద్యోగిగానీ
దైవజ్ఞానమును తెలియుచుండిరి. అప్పుడు ఎందరో బ్రాహ్మణులే గురువులుగా
యుండి ప్రజలకు జ్ఞానమును బోధించుచుండిరి. వారు బోధను చెప్పి
సుఖముగా బ్రతికేవారు. ఆ కాలములో బ్రాహ్మణులను ప్రతి ఒక్క
కులమువారు గౌరవముగా చూస్తూ నమస్కరించెడివారు. బ్రాహ్మణులు
అంటే 'కనిపించే దేవతలు' అను స్థాయిలో వారికి గౌరవముండేది.
దీనికంతటికీ కారణము వారికి బ్రహ్మజ్ఞానము తెలిసియుండడమే.
బ్రాహ్మణులు తమ పిల్లలకు చిన్నప్పటినుండే జ్ఞానము నేర్పేవారు.
ఈ విధముగా త్రేతాయుగమంతయూ గడచిపోగా, ద్వాపర
యుగములో బ్రాహ్మణులు బ్రహ్మవిద్య మీద దృష్ఠి నిలుపక, ఎక్కువగా
ప్రపంచ విషయముల మీద దృష్ఠి సారించుచుండిరి. అందువలన అక్కడక్కడ
ఒక్కొక్కరిగా అజ్ఞానమువైపు పయనించసాగారు. రాజుల వద్దయుండి
రాజ్యము యొక్క బాగోగులు కోరు బ్రాహ్మణులు, రాజులకు మంచి
సలహాలను ఇచ్చి రాజ్యములో ఏ అరిష్టములు జరుగకుండా బాధ్యతగా
చూచుకొను బ్రాహ్మణులు, కొద్దికొద్దిగా జ్ఞానము మీద శ్రద్ధ తగ్గించుకొనుచూ
అజ్ఞానము వైపు మొగ్గు చూపుచుండిరి. అలా వారు మారుటకు కొంత
కారణము గలదు. ప్రభువులకు (రాజులకు) దగ్గరగాయుండి రాజు ఇచ్చు
కానుకలతో జీవించు బ్రాహ్మణులు కొంత ప్రజలకు కూడా దగ్గరగాయుండి
ప్రజలతో కూడా లాభమును పొందాలను ఆశను పెంచుకొన్నారు.
దానివలన బ్రహ్మవిద్య మీద శ్రద్ధ తగ్గిపోయినది. బ్రహ్మజ్ఞానము మీద
ప్రజలకు శ్రద్ధ లేదు. కావున దానిని ప్రజలు వినరని భావించిన బ్రాహ్మణులు
ప్రజలకు జ్ఞానము చెప్పేది తగ్గించారు. అప్పటి ప్రజలకు అరవై (60)
శాతము జ్ఞానము మీద శ్రద్ధ లేనివారుండగా, నలభై (40) శాతము
శ్రద్దకలవారు ఉండేవారు. 60 శాతము మందిని వదలి 40 శాతము
మందికి జ్ఞానము చెప్పవలసిన బాధ్యత గురువులుగా యున్న బ్రాహ్మణులకు
ఉన్నది. వారికి చెప్పడమేకాక మిగతా శ్రద్ధలేని 60 శాతము మందికి
కూడా జ్ఞానము మీద శ్రద్ధ కల్గించవలసిన బాధ్యత బ్రాహ్మణులకు కలదు.
అయితే వారు అలా చేయలేదు.
జ్ఞానము స్థానములో జ్యోతిష్యమును చేర్చి ప్రతి పనికి
ముహూర్తమును చెప్పి ప్రజలకు మేలు చేయువారివలె కనిపించి,
ముహూర్తము కొరకు తమవద్దకు వచ్చిన ప్రతివారు అంతో ఇంతో ధనమో,
ధాన్యమో ఇచ్చునట్లు చేసుకొన్నారు. అట్లు ప్రతి చిన్న పనికి ముహూర్తమనో,
జాతకమనో, జ్యోతిష్యమనో, మంచి రోజులనో ఏదో ఒక పనికి బ్రాహ్మణుల
వద్దకు పోవలసి వచ్చేది. పోయినవారు ఊరక పోతే వారు పలకరనీ,
తమతో మాట్లాడరనీ, బ్రాహ్మణులను తమవారిగా చేసుకొని వారు అడిగినది
చెప్పుటకు ప్రజలు పోటీపడి డబ్బులు ఇచ్చేవారు. ఈ విధానమును ఎక్కువ
మంది బ్రాహ్మణులు కొనసాగించిరి. అంతేకాక అంతవరకు రాజులకే
పరిమితియైన యజ్ఞ యాగాదులను ప్రజల చేత కూడా చేయించుటకు
మొదలు పెట్టారు. దానివలన ధనము చేకూరునను ఆశతో ఆ విధముగా
చేయుచూ, ధనమును సముపార్జన చేయుచూ ప్రజలలో అత్యంత ధనికులుగా
బ్రాహ్మణులే యుండిరి. ఈ విధముగా ద్వాపరయుగము చివరి వరకు
మారుచూ వచ్చిన బ్రాహ్మణులు చివరికి జ్ఞానము కల్గినవారు అరుదుగా
కనిపించగా, బ్రహ్మ జ్ఞానము లేనివారు, పంచాంగమును చెప్పువారు, యజ్ఞ
యాగాదులను చేయించువారు ఎక్కడ చూచినా కనిపించేవారు. ఈ
విధముగా బ్రాహ్మణ సమాజము మారుచూ రాగా, కలియుగ ప్రారంభమున
కల్లా ఇరవై (20) శాతము బ్రహ్మజ్ఞానులుండగా ఎనభై (80) శాతము
జ్ఞానము లేనివారు ఉండేవారు.
కలియుగము ప్రారంభములో నాలుగు అధర్మములు పూర్తికలవని
చెప్పవచ్చును. ద్వాపర యుగములో బలమును పెంచుకొంటూ వచ్చిన
అజ్ఞానము తన ఆయుధములైన అధర్మములను ప్రజలలో పూర్తి ప్రాకునట్లు
చేసినది. ఒక విధమైన ప్రజలేకాక గొప్పవారు అయిన సన్న్యాసులు,
మహర్షులు అయిన వారు కూడా అజ్ఞాన మార్గములోనికి తెలియకనే
ప్రవేశించి దానినే పొరపాటుగా జ్ఞానమార్గము అనుకొన్నారు. మనిషి
శరీరములోని గుణముల మాయ ఆ విధముగా అందరినీ భ్రమించునట్లు
చేయుట వలన, తమది జ్ఞానమే అన్నట్లు ముందుకు పోవుచుండిరి.
కలియుగ ప్రారంభములో బ్రాహ్మణులు అత్యంత ధనికులుగా మారిపోయారు.
భూమిమీద వారివలె డబ్బు సంపాదించేవారు లేరు. అట్లే వారివలె డబ్బు
ఖర్చు చేసేవారు లేరు. సుఖవంతమైన జీవితము కొరకు ధనమును
విపరీతముగా ఖర్చు చేయుచూ రాజులు అనుభవించని సుఖములను
అనుభవించుచుండిరి. అత్యంత రుచికరమైన పదార్థములను తినేవారిలో
బ్రాహ్మణులే మొదటి వారుగా యుండేవారు. నెయ్యిని ఎక్కువగా వాడేవారు.
ఎంత డబ్బు ఖర్చు చేసయినా నెయ్యి అన్నము తినేవారు.
ఈ విధముగా విలాస జీవితములకు అలవాటుపడిన వారిలో
బ్రాహ్మణులు తప్ప ఇతరులు ఎవరూ లేరు. ఇట్లు బ్రతుకుచున్న బ్రాహ్మణులు
ఇతరులకు బోధించు వృత్తిని తామే సాగించాలనుకొన్నారు. బోధించు
వృత్తి వలన సుఖ జీవనము కలదనీ అందువలన భూమిమీద సుఖ జీవనము
తమదే కావాలనీ, ఇతరులకు అది దక్కకూడదని తలచిన బ్రాహ్మణులు
బోధానా వృత్తిలోనికి ఎవరినీ రానీయకుండిరి. త్రేతాయుగమునుండి
కొద్దికొద్దిగా యున్న యజ్ఞములను అందరిచేత చేయించుచుండిరి. వేదములు
తాము తప్ప ఇతరులు చదువుట నేరముగా చూపుచూ ఎవడయినా తమవలె
బోధకులుగా మారితే వాడు వేదములు చదివాడనీ, శూద్రులు వేదములు
చదువకూడదనీ రాజుల చేత శిక్షలు వేయించేవారు. వేదములు చదివిన
వానికి నాలుక కోయించిన శిక్షలు అనేకము వేయించారు. దానములు
తమకే ఇవ్వవలెనని నియమమును ఏర్పరచారు. ధ్యానము కూడా ప్రజల
మంచి కొరకు మేమే చేయుచున్నామని ప్రచారము చేశారు. భగవద్గీతలో
అధర్మములని బోధించిన యజ్ఞ, వేద, దాన, తపస్సులను బాగా ప్రోత్సహించి
వాటి ద్వారా బాగా లాభమును పొందారు.
ద్వాపర యుగములోనూ, కలియుగములోనూ ఎక్కువగా రాజులను
యజ్ఞముల వైపు మళ్లించారు. ప్రతి కార్యము నెరవేరుటకు యజ్ఞము
చేయాలని సూచనలిచ్చేవారు. సంతతి కూడా యజ్ఞముల వలన కలుగు
తుందని బోధించినవారు బ్రాహ్మణులే. ఈ విధముగా బోధనా వృత్తిని
తమ చేతిలో పెట్టుకొని సర్వ భోగములను అనుభవించుచుండిరి.
సుఖవంతమైన జీవితమును, రుచికరమైన ఆహారములను తినుటలో వారే
మొదటివారై భూమిమీద భోజనప్రియులు అని పేరు తెచ్చుకొన్నారు. అత్యంత
సుఖ భోజన ప్రియులు వారే అయివుండిరి. నేడు సుఖ భోజనము కొరకే
వారి ఆస్తులను కూడా సులభముగా పోగొట్టుకొని నేడు ఆస్తులు లేనివారిగా
మిగిలిపోయారు. అయినా నేడు కూడా వారు సుఖ జీవనము కొరకే
ప్రాకులాడుచున్నారు. నేటి పరిస్థితి ఎలాయున్నా పూర్వము ద్వాపర
యుగములోనూ, ద్వాపర యుగము గడచిన తర్వాత కూడా బ్రాహ్మణులే
మనుషులలో ఉత్తములుగా చలామణి అవుతూ వచ్చారు.
ద్వాపర యుగము చివరిలో తయారయిన భగవద్గీత బ్రాహ్మణులకు
పూర్తి వ్యతిరేఖముగా యున్నదని తెలిసినవారై భగవద్గీతకంటే వేదములే
ముఖ్యమని, హిందువుల దృష్ఠియంతటినీ వేదములవైపు మళ్లించి భగవద్గీత
వైపు పోకుండా చేశారు. వేదములను కూడా బ్రాహ్మణులే చదువవలెననీ
అటు వేదములను చదువనీయక, ఇటు భగవద్గీతను చదువనీయక ప్రజలను
జ్ఞానము వైపు పోకుండా అజ్ఞానములోనే ఉండునట్లు చేశారు. ఒకవైపు
మేము పురోహితులమని, పౌరులకు (ప్రజలకు) హితము చేయువారమని
చెప్పుచూ ప్రజలకు చెడునే బోధించుచూ మంచిని బోధించునట్లు నటించు
చుండిరి. ఎవరయినా భగవద్గీతను చదువుతారేమోననీ, అందులోని
జ్ఞానమును తెలియగల్గుతారేమోననీ తలచి భగవద్గీతను ఇంటిలో
పెట్టుకోవడము మంచిది కాదనీ, ప్రజలు భగవద్గీతను చదువకూడదనీ,
భగవద్గీత దేవాలయములలో ఉండవలెననీ, భగవద్గీతను బ్రాహ్మణులచేతనే
చదివించుకోవాలని చెప్పుతూ వచ్చారు. అట్లుకాకుండా భగవద్గీతను ఎవరు
ఇంటిలో పెట్టుకొన్నా వారింటిలో అశుభములు జరుగుననీ, కలహములు
కలుగునని బోధించిరి. అంతేకాక భగవద్గీత చిత్రపటమును సహితము
ఎవరూ ఇంటిలో పెట్టుకోకూడదని బోధించారు.
ద్వాపర యుగము చివరిలో వచ్చిన భగవద్గీతను కృష్ణుడు చెప్పగా
వ్యాసుడు దానిని గ్రంథరూపముగా వ్రాయుటకు దాదాపు రెండు
సంవత్సరములు పట్టినది. అయినా అది ప్రజలలోనికి వచ్చి ఇది
భగవద్గీతయని తెలియుటకు దాదాపు పది సంవత్సరముల కాలము
పట్టినదని అనుకొంటాను. అప్పుడు చేతితో వ్రాసిన ఒక ప్రతిని ఎవరో
ఒకరు చూచారు తప్ప ప్రజలందరూ ఈ దినమువలె భగవద్గీతను
చూడలేదు. భగవద్గీతను వ్రాసిన వ్యాసుడు చనిపోయిన తర్వాత వ్యాసుడు
వ్రాసిన భగవద్గీత శిథిలావస్థకు రాగా, దానిని కొన్ని ప్రతులుగా వ్రాసినవారు
బ్రాహ్మణులే. ఆ దినములలో చదువు వచ్చిన వారు వారే అయినందున
వారే భగవద్గీతను కొన్ని ప్రతులుగా వ్రాశారు. అలా రెండవమారు ప్రతుల
రూపములోనికి వ్రాయునప్పుడు బ్రాహ్మణులకు అనుకూలమైన శ్లోకములను
కల్పించి వ్రాసి భగవద్గీతలో చొప్పించడము జరిగినది. ఆ విషయము
నేటికీ ఎవరికీ తెలియదు. ఇట్లు భగవద్గీతలో కల్పిత శ్లోకములను
వ్రాసినవారు, ఉన్న శ్లోకములను తీసివేసే సాహసము చేయలేదు. ఒకవేళ
తీసివేస్తే తమకు ఏమైనా చెడు జరుగునేమోయని భయపడి శ్లోకములను
తీసివేయలేదుగానీ శ్లోకములను అందులో కలిపారు.
ఈ మధ్య కాలములో మేము వ్రాసిన “త్రైత సిద్ధాంత భగవద్గీత”
లో కల్పిత శ్లోకములను బయటపెట్టాము. ద్వాపరయుగము తర్వాత
కలియుగములో కూడా బోధనా పద్ధతిని తమ చేతులలో పెట్టుకొన్న
బ్రాహ్మణులు భగవద్గీతకు భావమును, వివరమును వ్రాశారు. అప్పుడు
దాని భావములను వారికి అనుకూలముగా వ్రాసుకొన్నారు. శ్లోకములో
ఆ విషయమును చెప్పకున్నా బ్రాహ్మణులే కల్పించి వ్రాయడము చేత
బ్రహ్మవిద్యను ఏమాత్రము తెలియనివారు, వారు వ్రాసినదే సత్యమని
చదువుకొనుట వలన దేవుడు చెప్పిన జ్ఞానమునకు దూరముగా పోయారు
తప్ప దగ్గర కాలేదు. కలియుగ ప్రారంభము నుండి తాము అభివృద్ధి
పొందుటకు అనేకమైన విధానములు ఆచరించుచూ ప్రజలను తప్పుదారి
పట్టించి భవిష్యత్తులో తమకు ఎవరూ పోటీకి రాకుండా చేసుకొన్నారు.
హిందువులకు ముఖ్యమైన జ్ఞానము కలది భగవద్గీతకాగా, దానితో
హిందువులకు సంబంధము లేదు, హిందువులకు వేదములే ప్రమాణములు
అని చెప్పారు. ఆ వేదములు తెలియాలంటే మేము చెప్పవలసిందేగానీ
స్వయముగా ఎవరూ చదువకూడదను నియమమును ఉంచారు.
ముస్లీమ్ల పెద్దలు బ్రాహ్మణులను చూచి నేర్చుకొన్నట్లు తాము
ఎలా చెప్పితే అలా నడచుకోవాలని ముస్లీమ్లకు షరియత్ అను
నియమమును ఉంచినట్లు, హిందువులలో కూడా హిందూ పెద్దలని
పేరుగాంచిన బ్రాహ్మణులు హిందూ షరియత్ అన్నట్లు భగవద్గీతను చదువ
కూడదు, వేదములను చదువకూడదను నియమమును ఉంచారు.
వేదములను ఆడవారు చదువకూడదని చెప్పి తమ ఇంటిలోని బ్రాహ్మణ
స్త్రీలను కూడా వేదములకు దూరముగా పెట్టారు. "బ్రాహ్మణ స్త్రీలు వేదములు
చదివితే తాము చేయుచున్న సామాజిక తప్పు బయటపడునని తమ స్త్రీలను
సహితము వేదములకు, భగవద్గీతకు దూరముగా పెట్టారు. వారి ఇళ్లలో
కూడా స్త్రీలకు ఏమాత్రము స్వతంత్రము ఇవ్వలేదు. స్త్రీలను చాలా తక్కువ
భావముతో చూచు అలవాటు బ్రాహ్మణులకు మొదటినుండి కలదు. వారి
ఇంటిలో భర్త చనిపోయిన స్త్రీని గుండు కొరిగించి అందహీనము చేసి,
కుజ గ్రహ రంగయిన ఎరుపు వస్త్రమును కట్టించేవారు. ఈ మధ్య కాలములో
అటువంటి వారు తక్కువగా కనిపించినా గత ముఫ్పై, నలభై (30,40)
సంవత్సరముల క్రిందటి వరకు బ్రాహ్మణ ఇళ్లలో భర్తలు చనిపోయినవారు
ఎర్రచీర కట్టుకొని కనిపించేవారు. వారికి జ్యోతిష్యము తెలియుట వలన
ఎరుపు రంగు కుజగ్రహము రంగని తెలిసి ఎర్రరంగు వస్త్రము కట్టుకొంటే
కుజగ్రహ చూపు వారి మీదపడి వారు కుజదోషము కలవారై పురుషులకు
దూరముగా ఉండగలరనీ, పురుషుల ఆలోచనలుగానీ వారిలోనికి రావని
తెలిసి అలా ఎర్రరంగు చీరను కట్టించెడివారు. గుండు గీయించి,
అందహీనము చేయడమేకాక వారి ముఖము ఎవరూ చూడకూడదనీ
ముండ మోసిన బ్రాహ్మణ స్త్రీ ముఖము చూస్తే అన్నీ అరిష్టములు కల్గునని,
వారే చెప్పియుండుట చేత విధవ బ్రాహ్మణ స్త్రీల ముఖమును చూచేదానికి
అందరూ భయపడేవారు. అలా భయమును కల్పించి భవిష్యత్తులో వారిని
ఎవరూ చూడకుండా చేసిపెట్టారు. ఈ విధముగా తమ కులములోని
స్త్రీలను కూడా చాలా తక్కువ భావముతో చూచెడివారు. మిగతా కులములలో
కూడా భర్త చనిపోయిన స్త్రీల ముఖము చూస్తే చెడు జరుగునని చెప్పుచూ
మిగతా కులములలో ముండమోసిన వారు తెల్లచీర కట్టుకొనునట్లు చేశారు.
ప్రశ్న :- బ్రాహ్మణులలో భర్త చనిపోయిన విధవ స్త్రీలకు ఎర్రచీరను కట్టించి,
మిగతా కులముల విధవ స్త్రీలకు తెల్లచీర కట్టించడములో ఆంతర్యము
ఏమయినా కలదా?
జవాబు :- ఉన్నది ఉన్నట్లు చెప్పమంటావా? కొంత దాచిపెట్టి చెప్ప
మంటావా? ఉన్నది ఉన్నట్లు చెప్పితే నమ్మరేమో?
ప్రశ్న :- ఉన్నది ఉన్నట్లే చెప్పమంటాము. సత్యమయిన దానిని నమ్మి
తీరవలసిందే కదా! దాచిపెట్టకుండా చెప్పండి.
జవాబు :- ఇది ఒక కుట్రపూరితమైన పని. బ్రాహ్మణులు జ్యోతిష్యము
తెలిసినవారైనందున ఏయే గ్రహములు ఏయే ఫలితములను ఇచ్చునో వారికి
బాగా తెలుసు. కుజగ్రహము, శుక్రగ్రహము రెండు వ్యతిరేఖమైన గ్రహములు.
శుక్రుడు తెలుపురంగు కలవాడు, కుజుడు ఎరుపురంగు కలవాడు.
శుక్రుడు స్త్రీ సుఖములకు అనుకూలుడు. కుజుడు స్త్రీ సుఖములకు వ్యతిరేఖి.
కుజదోషము ఉన్నవానికి పెళ్ళి కావడము కూడా కష్టమే. ఒకవేళ పెళ్ళి
అయినా భార్యాభర్తల మధ్య పొందిక తక్కువయుండును. ఒకరికొకరు
ఘర్షణ పడుచూ యవ్వనమును అడవిగాసిన వెన్నెలవలె చేసుకొందురు.
అందువలన కుజదోషము యున్నవారికి ఎవరూ పిల్లను కూడా ఇవ్వరు.
కుజగ్రహము శరీర సుఖముల మీద ధ్యాసలేకుండా చేయగలదు.
అందువలన భర్త చనిపోయిన బ్రాహ్మణ స్త్రీలకు కుజగ్రహమునకు
సంబంధించిన రంగు అయిన ఎర్రరంగు చీరను కట్టించేవారు. దానివలన
వారికి పురుష ధ్యాస రాదనీ, వచ్చినా కుజగ్రహ రంగు చీర ధరించిన
దానివలన పురుష సుఖములకు దూరముగా ఉంచుననీ అందువలన
బ్రాహ్మణ స్త్రీలు భర్త చనిపోయిన తర్వాత తప్పుదారి పట్టకుండా ఉందురనీ,
ఎక్కడా వారికి చెడ్డపేరు రాకుండుటకు, ఎక్కడా తప్పు జరుగకుండుటకు
వారి స్త్రీలకు ఎర్రచీరలు ధరింపజేయుచున్నారు.
జ్యోతిష్యము తెలిసిన బ్రాహ్మణులకు ఈ విషయములన్నియూ
బాగా తెలుసు. కావున వారి ఇళ్లలో విధవ స్త్రీలకు ఎర్రరంగు చీరను
కట్టించెడివారు. అదే ఇతర కులములలో భర్త చనిపోయిన విధవ స్త్రీలకు
తెల్లచీర కట్టించెడివారు. తెల్లచీర ధరించవలెనని బ్రాహ్మణులు చెప్పడము
వలన వారి మాటను గొప్పగా మిగతా కులముల వారందరూ తలచుట
చేత వారు చెప్పినట్లు తెల్లచీరను ధరింప చేసెడివారు. ఈ పనిలోని
రహస్యమేమనగా! తెల్లరంగు శుక్రగ్రహముది. శుక్రగ్రహము
కళత్రకారకుడనీ, కుజుడు యవ్వన కారకుడనీ చెప్పుచుందురు. శుక్ర
గ్రహము వలన స్త్రీలకు భర్త సుఖము, భర్తకు భార్య సుఖములు
కలుగుచుండును. శుక్రగ్రహము అనుకూలముగా యున్న వారికి
సుఖములు బాగా యుండును. స్త్రీలకయితే పురుష సుఖములు బాగా
యుండును. శుక్ర గ్రహము యొక్క ఫలితమే అలాగ ఉండును. శుక్ర
గ్రహము యొక్క రంగు తెల్ల అయిన దానివలన తెల్లరంగు చీర కట్టుకోవడము
వలన వారిలో పురుష సుఖముల జ్ఞాపకములు వచ్చి, ఆ సుఖములను
పొందు అవకాశము గలదు. ఇతర కులముల వారికి తెల్లచీరలు కట్టడము
వలన విధవలు అయినా ఎక్కడో ఒకచోట, ఏదో ఒక విధముగా వారు
పురుషులతో సంబంధపడడమో, లేక పురుష సంబంధ ఆలోచనలు రావడమో
జరగవలెననీ, దానివలన మిగతా కులములు బ్రాహ్మణ కుటుంబముల
వలె పవిత్రముగా లేకుండా పోవుననీ, దానివలన మిగతా కులములలో
బ్రాహ్మణులకే ఎక్కువ గౌరవముండునని తలచి ఇతర కులముల విదవ
స్త్రీలకు తెల్లరంగు చీరలు, తమ కుటుంబములోని విధవ స్త్రీలకు ఎర్రరంగు
చీరను కట్టుకొనునట్లు చేశారు. ఇతరులు చెడిపోయి నవ్వులపాలు
కావలెననీ, తాము స్వచ్ఛముగా ఉండవలెనను ఉద్దేశ్యముతో ఆ విధముగా
రంగుల వస్త్రములు నిర్ణయించారు అని చెప్పక తప్పలేదు.
ఈ విధముగా ఆలోచనలు గల బ్రాహ్మణులు తాము ఇతర
కులములకంటే పెద్దకులము వారనిపించుకోవాలనీ, ఇతర కులము
లన్నియూ తమకంటే చిన్న కులములేయన్నట్లు, విధవల స్త్రీల విషయములో
ఒక ప్రయోగమును చేశారు. బ్రాహ్మణులు ఎక్కడున్నారో అక్కడంతా తమదే
ఆధిపత్యము ఉండవలెనని తలచుచుందురు. దానివలన వారిలో ఇతర
కులముల మీద పూర్తి కుల వివక్ష గలదు.
బ్రాహ్మణులలో 'కులవివక్ష' అనునది నేటిదికాదు. దానికి వెనుక
ఎంతో పెద్ద చరిత్రగలదు. త్రేతా యుగములోనే బ్రాహ్మణులు కుల వివక్షతో
శూద్రులు వేదము చదువకూడదు, ఎక్కడయినా వేదము చదివితే కాగిన
సీసము నోటిలో పోయునట్లు రాజులచేత చట్టము చేయించారు. వేదమును
చదివిన వారికి దానిని అమలు చేశారు. త్రేతాయుగములోనే మనుషులను
దేవతా పూజలవైపు మళ్లించారు. బ్రాహ్మణులలో ఎవరుగానీ, ఏ దేవత
మీద భక్తి లేకున్నా భక్తియున్నట్లు నటించెడివారు. అలా నటించి ఇతర
కులముల వారందరూ వారిచేతనే ఆరాధనలు (పూజలు) జరుపునట్లు
చేశారు. మేము పూజ చేస్తేనే దేవతలు ఒప్పుకుంటారనీ, ఆ పూజను
స్వీకరిస్తారని నమ్మించారు. కృతయుగములో సూర్యుడు చెప్పిన జ్ఞానము
ఫలానాయని బ్రాహ్మణులకు తెలుసు. ఆనాడు అది గ్రంథరూపములో
లేకున్నా జ్ఞానసమాచారము అందరికీ తెలిసియుండేది. కృతయుగములో
ఒకరికొకరు చెప్పుకోవడము వలన సూర్యుడు మనువుకు చెప్పిన జ్ఞానము
అందరికీ తెలిసియుండేది. కృతయుగము చివరినుండి ప్రజలు దానిని
మరచిపోవడము మొదలు పెట్టారు. త్రేతాయుగము ప్రథమ భాగములోనే
నేడు భగవద్గీతగా యున్న జ్ఞానము ఆనాడు సూర్యుడు చెప్పిన జ్ఞానము
ప్రజలందరూ మరచిపోగా అక్కడక్కడ కొందరు మహర్షులు, బ్రాహ్మణులు
తెలిసియుండిరి.
ఆనాడు అందరూ మరచిపోయిన జ్ఞానమునే ఈనాడు భగవద్గీతగా
కృష్ణునిచేత చెప్పబడినది. ఆనాటిది, ఈనాటిది రెండూ ఒకటే జ్ఞానమయిన
దానివలన ఆనాడు బ్రాహ్మణులు ప్రజలను అదే పనిగా అజ్ఞానమువైపు
ఎలా మరల్చినారో తెలియుచున్నది. ఆనాడు ప్రజలకు తెలియని జ్ఞానము
తమకు తెలిసియుండుట వలన భగవద్గీతలో ఏ పద్ధతుల వలన దేవుడు
తెలియబడడు అని చెప్పియున్నారో ఆ పద్ధతులనే ప్రజలకు బోధించి,
ప్రజలను ఆ పద్ధతులనే ఆచరించునట్లు చేయించారు. ప్రజల చేత ఆ
పనులు చేయించుచూ, ఆ పనులకు కావలసిన ఖర్చులన్నీ ప్రజలే
పెట్టుకొనునట్లు చేసి, ఆ ఆరాధనలన్నీ తామే ముందుండి ప్రజల పేరు
చెప్పి, ప్రజలే ఈ పనులు చేయుచున్నారని వాని పేరు, ఇంటిపేరు, గోత్రము
పేరు చెప్పి తామే చేయుచూ, తాము వారి పనిని చేసినందుకు ప్రజలనుండి
డబ్బును తీసుకొనెడివారు. ఫలానా ఆరాధన చేయమని చెప్పేది బ్రాహ్మణులే
అయినా ఆ పనిని మేమే చేసిపెట్టవలెననీ, మీరు చేయుటకు అనర్హులని
చెప్పి ఆ పనిని చేయుటకు ఇంత డబ్బు కావాలని అడిగి తీసుకొనెడివారు.
వారు తీసుకొన్న ధనము వలన వారికి భుక్తి జరిగిపోయినా, ప్రజలు
మాత్రము తప్పుదారి పట్టిపోవడము జరిగేది. అలా తప్పుదారి పట్టించుటే
మా పని యన్నట్లు త్రేతాయుగములోనే అలా చేయుటకు మొదలు పెట్టి
ద్వాపర యుగము అంతా అలాగే చేశారు.
జ్ఞానము తెలియని ప్రజలు యజ్ఞములయందు, దేవాతా ఆరాధనల
యందు లగ్నమగునట్లు చేసి దానము అను దానిని వారినుండి
పొందుచుండిరి. ప్రజలనుండి పొందు డబ్బును కోరి ఇప్పించుకొనుచూ
దానికి దానము అను పేరు పెట్టారు. కోరకనే ఇచ్చునదైతే దానము
అగును. అట్లుకాక ఈ పనికి ఇంత అని రేటు పెట్టి ఇప్పించుకొన్న దానిని
దానము అనడము సరికాదు. అయినా వారు అలాగే చెప్పేవారు. దానము
అను అధర్మమును అలా చేయించారు. అంతో ఇంతో దేవుడు, మోక్షము
అనువారు ఎవరయినా ఉంటే వారికి మంత్రోపదేశము చేసి ధ్యానము
చేయునట్లు చేసెడివారు. నేడు కూడా ధ్యానము మంత్రోపదేశము మంచి
పనులేయని అందరూ అనుకొంటున్నారుగానీ, ధ్యానము కూడా దేవుని
మార్గములో సరియైన పనికాదు అని అందరికీ తెలియదు.
ద్వాపరయుగము చివరికి వచ్చేటప్పటికి బ్రాహ్మణులు విత్తిన
విత్తనములు అయిన యజ్ఞ, దాన, వేద, తపస్సులు (ధ్యానములు) భారతదేశ
మంతా వ్యాపించి పోయి ఎక్కువగా ఆ పనులు చేయుచుండిరి. ఎక్కడయినా
భక్తి ఉంది అంటే అక్కడ యజ్ఞములు ఉంటాయి. యజ్ఞములు ఉంటే
వేద పఠనము ఉండును. ఆ రెండూ ఉంటే అవి చేసినందుకు ప్రజలు
ఇచ్చే దానములు కూడా ఉండును. ఈ మూడు ఒకదానికొకటి అంటుకొని
యుండును. ఈ మూడు చేయనివాడు ప్రత్యేకమైన భక్తిమార్గమును కోరు
వానికి ప్రత్యేకించి మంత్రమును చెప్పి ధ్యానము చేయమని చెప్పెడివారు.
యజ్ఞములకంటే గొప్పపనియని మంచిమార్గముయని నమ్మి మంత్ర
ధ్యానమును (తపస్సును) చేయువాడు జీవితములో తప్పుదారి పట్టిపోయానని
ఏమాత్రమూ తెలియక కాలమునంతటినీ ధ్యానములో వృథా చేసు
కొంటున్నాడు. భగవద్గీతలో ఇవి పనికి రావు అని ఏ పనులను చెప్పారో
ఆ పనులనే ప్రజలకు బోధించి బ్రాహ్మణులు అదేపనిగా తప్పుదారి
పట్టించారని ఎవరికీ తెలియదు.
భూమిమీద జరిగే అక్రమాలు అన్నిటినీ దేవుడు, దేవదూతలు
గమనించుచూనే యుందురు. భక్తి అను పేరుతో ప్రజలు తప్పుదారి పట్టి
పోయారనీ, బ్రాహ్మణులు తప్పుదారి పట్టించుట వలన వారిని నమ్మిన
ప్రజలు ఏమాత్రము వెనుతిరిగి చూడకుండా అజ్ఞానములోనికి, అధర్మముల
లోనికి దూకుచున్నారని తెలిసి మానవులను ఉద్ధరించవలసిన వాడు,
ధర్మములను తెలియజేయువాడు దేవుడే అయినందున ప్రజలకు సత్యమును
తెలిపి ధర్మములను తెలియజేయాలని దేవుడు నిర్ణయించుకొని తాను
భగవంతునిగా భూమిమీదికి వచ్చాడు. దేవుడు భూమిమీదికి మనిషివలె
రావాలంటే భూమిమీద అజ్ఞానము పూర్తి వ్యాపించినదని అర్థమగుచున్నది.
ఎంతో తప్పుదారిలో ప్రజలు పోవుచుయుంటే, అధర్మములు పూర్తిగా
పుంజుకొని ధర్మములు క్షీణదశకు వచ్చినప్పుడు దేవుడు అవతరించి వచ్చి
తిరిగి ధర్మములను పునరుద్ధరించి అధర్మములను అణచివేయును.
అందువలన అధర్మములు ఎలా వచ్చినా వాటిని అణచివేసి ధర్మములను
పైకి తేవడమే భగవంతుని ఆశయము అయినందున మొదట సూర్యుడు
మనువుకు చెప్పిన జ్ఞానమునే చెప్పుచున్నానని దానినే భగవద్గీతగా చెప్పి
పోయాడు.
కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమున 48,
53 శ్లోకములలో అధర్మములను గురించి చెప్పాడు. వాటివలన దేవుడు
తెలియబడడు అని చెప్పాడు. ఆ రెండు శ్లోకములను క్రింద చూడండి.
శ్లో॥ 48. నవేదయజ్జద్యయనైర్న దానైర్న చక్రియా భిర్న తపోభిరుగైః |
ఏవంరూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురువవీర! ॥
భావము :- “భూమిమీద నీవు తప్ప ఈ విశ్వరూపమును చూచినవారు
ఎవరూ లేరు. వేదాధ్యాయణము వలనగానీ, దానముల వలనగానీ,
యజ్ఞముల వలనగానీ, ఉగ్రమైన తపస్సుల వలనగానీ ఈ రూపము
తెలియుట శక్యముకాదు”
శ్లో॥ 53.
నాహం వేదైర్న తపసాన దానేన న చేజ్యయా ।
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా ॥
భావము :- “తపస్సుల చేతగానీ, దానముల చేతగానీ, యజ్ఞముల చేతగానీ,
వేదపఠనముల చేతగానీ ఇప్పుడు నీవు చూచిన ఈ విశ్వరూపమును
(దేవున్ని) తెలియుట దుర్లభము, శక్యము కాదు.”
భగవద్గీతలో కృష్ణుడు ఈ రెండు శ్లోకములను చెప్పి భూమిమీద
బ్రాహ్మణులు ప్రచారము చేసిన నాలుగు కార్యములు దేవున్ని తెలియుటకు
పనికిరావు అని చెప్పాడు. మిగతా భగవద్గీతయంతా ధర్మములయిన
యోగములను గురించి చెప్పాడు. ద్వాపరయుగము చివరిలో దేవుడు
చెప్పవలసిన జ్ఞానమంతయూ చెప్పాడు. అదే జ్ఞానమే సృష్ట్యాదిలో దేవుడు
ఆకాశవాణి ద్వారా చెప్పగా దానినే సూర్యుడు విని భూమిమీద మనువుకు
తెలిపాడు. అది భూమిమీద అంతా ప్రాకినా, కొంత కాలమునకు ప్రజలలో
లేకుండా పోవడము జరిగినది. అయితే అంతో ఇంతో సూర్యుడు చెప్పిన
జ్ఞానమును తెలిసిన బ్రాహ్మణులు అదే పనిగా జ్ఞానమునకు వ్యతిరేఖ దిశలో
ప్రజలను నడిపించగా, ఆ నడక ద్వాపరయుగ చివరికి పెద్దదికాగా, దేవుడు
దానిని అణచివేయుటకు భూమిమీద మనిషిగా అవతరించి, అధర్మములను
ధర్మములను చెప్పిపోవడము జరిగినది. దానివలన బ్రాహ్మణులు మూడు
యుగముల పర్యంతము చేసిన మోసము తెలిసినది.
కలియుగము మొదటిలో దేవుడు ఇది మంచి, ఇది చెడ్డ అని
చెప్పిన భగవద్గీతా జ్ఞానము బయటికి వచ్చినా భగవద్గీత ఏమిటో ఎవరికీ
తెలియకపోవడము వలన బ్రాహ్మణులు తమ కార్యములను యథాతథముగా
సాగించుచూ వచ్చారు. నేడు కూడా సాగించుచునే యున్నారు. పూర్వము
నుండి మిగతా కులములన్నీ నీచకులములనీ, తమ బ్రాహ్మణ కులమొక్కటే
పవిత్రమైనదని చెప్పుచూ వచ్చిన వారు, ఇతరులకు బోధకులుగా యుండి
ప్రజలకు మార్గదర్శకులుగా మారి తప్పుదారి చూపి అజ్ఞానములోనికి
చేరునట్లు చేశారు. పూర్వము తప్పుదారి పట్టించి, మేము మీకు మార్గదర్శకుల
మని చెప్పారు. కుల వివక్ష ద్వాపరయుగము వరకు కొంత శాతము
ఉండేది. నేడు కలియుగములో తొంభై (90) శాతము అంటరాని తనమును
ప్రవేశ పెట్టారు. తాము పవిత్రులనీ, మిగతా కులములవారు అపవిత్రులనీ,
అందువలన మిగతా కులములవారిని శూద్రులుగా చెప్పుచున్నామని
అన్నారు. భగవద్గీతలోని చాతుర్వర్ణము అను శ్లోకమునకు, కులములను
చొప్పించి చెప్పడమేకాక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను మూడు కులములు
తప్ప మిగతా ఎన్ని కులములున్నా అన్ని కులములు శూద్రులుగా (క్షుద్రమైన
వారిగా) చెప్పడము జరిగినది. శూద్రులు అంటే నీచమైనవారని చెప్పారు.
భగవద్గీతలో దేవుడే ఈ విషయమును చెప్పాడు అన్నట్లు నమ్మించి
చూపించారు.
కలియుగము మొదటినుండి కుల వివక్ష అనునది చాలా తీవ్రముగా
ఉండెడిది. ఇప్పటికీ ఉన్నప్పటికీ నలభై, యాభై (40-50) సంవత్సరము
లప్పుడున్నంత లేవు. ఇప్పుడు బ్రాహ్మణులకు ఉపాధి తగ్గిపోయినది.
పూర్వకాలమువలె వారి మాటలు వినేవారు లేరు. నాగరికత పెరిగేకొద్దీ
బ్రాహ్మణుల ప్రాబల్యము తగ్గినది. నేడు బ్రాహ్మణులలో కొందరి స్థితి
చాలా దయనీయముగా తయారయినది. ఇప్పటి విషయము తర్వాత
చెప్పుకొందాము. కలియుగము మొదటిలోని బ్రాహ్మణుల విషయమును
గమనిద్దాము. ద్వాపర యుగములో రాజులను మాత్రమే తప్పుదారి పట్టించి
యజ్ఞములను చేయించిన వారు, కలియుగములో ధనికుల చేత, మిగతా
ప్రజల చేత యజ్ఞములను చేయించడమేకాక మంత్రోపదేశము చేసి, దానినే
గురు ఉపదేశమని చెప్పి వారిని శిష్యులుగా చేసుకొని గురువులుగా చలామణి
అయ్యేవారు. కలియుగములో అంటరానితనము అనే దానిని ప్రవేశ పెట్టి
ప్రజలను దూరముగా పెట్టి, ప్రజలందరూ అపవిత్రులన్నట్లు, తాము
పవిత్రులమన్నట్లు ఎవరినీ తాకకుండిరి. ఎవరూ వారిని తాకకూడదను
నియమమును పెట్టి ప్రజల మీద పూర్తి వివక్ష చూపెడివారు.
బ్రాహ్మణులకు ఒక్కరికే బ్రహ్మజ్ఞానము తెలుసుననీ, ఇతరులకు
తెలియదనీ, ఇతరులు తమకు శిష్యులుగా యుండి సేవ చేస్తే వారికి
ఉపదేశమునిచ్చి జ్ఞానమునకు అర్హులుగా చేతుమని చెప్పెడివారు. దానితో
చాలామంది వారికి శిష్యులుగా మారిపోయేవారు. స్వయముగా ఎవడయినా
జ్ఞానమును తెలియబూనినా, ఎవడయినా జ్ఞానమును బోధించినా అది
వారికి సరిపొయ్యేది కాదు. అటువంటి సమయములో గౌతమ బుద్ధుడు
వైరాగ్యము పొంది, ఇల్లు వదలిపోయి జ్ఞానము కొరకు చింతించి చింతించి
చివరికి ఒకరోజు జ్ఞానోదయముకాగా, ఆయన తన బోధలను అశోక
చక్రవర్తికి కూడా వినిపించి తాను జ్ఞానిగా తయారగుటయే కాక ఇతరులను
ఎందరినో జ్ఞానులుగా తయారు చేశాడు.బుద్ధుడు సన్యాసిగా మారి
మిగతా వారిని కూడా అదే మార్గములో ఉండునట్లు చేయడము చూచిన
బ్రాహ్మణులు బుద్ధుడు ప్రత్యేకముగా తయారైపోయి, ప్రత్యేక సమాజమును
తయారు చేశాడనీ అతని మీద నిందారోపణ చేశారు.
బ్రాహ్మణులు సమాజములో మేము గురువులుగా ఉండడము తప్ప
ఇతరులు ఎవరూ గురువుగా ఉండకూడదను భావము వారిలో ఉండేది.
అప్పటికే బుద్ధుని సూత్రములు ఉపయోగించి కొందరు సన్న్యాసులుగా
మారిపోవడము ఏమాత్రము సరిపోని బ్రాహ్మణులు బుద్ధున్ని ఎదుర్కోవడము
తమ చేతకాదని, బుద్ధుని బోధలు విన్న వారు తమ బోధలను లెక్కచేయడము
లేదని తలచి బుద్ధున్ని, బుద్ధుని బోధలను ఎదుర్కొనకపోతే తమ భోగ
భాగ్యములన్నీ అంతటితో లేకుండా పోవుననీ, తమను బోధకులుగా ఎవరూ
ఒప్పుకోరని తలచినవారై చివరకు వారిలో ఎవరూ కాకుండా ఒక క్రొత్త
మనిషిని, క్రొత్త సిద్ధాంతముతో తీసుకొని వచ్చి తాము వెనుకయుండి బుద్ధుని
బోధలు ఎదుర్కొనునట్లు చేయాలని తలచి, తమకు సంబంధము లేని క్రొత్త
మనిషిని, క్రొత్త సిద్ధాంతముతో తెరమీదికి తెచ్చారు. కేరళ రాష్ట్రములో
ఒక మారుమూల గ్రామమునుండి పది సంవత్సరములు కూడా నిండని
ఒక బ్రాహ్మణ బాలున్ని ఎంచుకొని ఆ బాలునికి వేదములలో కొంత
శిక్షణ ఇచ్చి, చిన్న వయస్సులోనే తెరమీదికి తెచ్చారు.
అలా తెచ్చిన బాలున్ని శంకరాచార్యులని నామకరణము చేశారు.
శంకరాచార్యులు చిన్నవయస్సులోనే జ్ఞానము చెప్పుచున్నాడనీ, ఆయన పరమ
శివుని అవతారమని, సాక్ష్యాత్తూ ఈశ్వరుని అవతారమగుట చేత అందరూ
ఆయనను ఆశ్రయించవలెనని ప్రచారము చేశారు. ఈ విధముగా ఏమీ
తెలియని అమాయక బాలున్ని బయట ప్రపంచములో పూర్తి ప్రచారము
చేశారు. ఆది శంకరాచార్యునికి ఏమీ తెలియకున్నా ఆయనది అద్వైత
సిద్ధాంతమని చెప్పి బుద్ధుని జ్ఞానమునకు పోటీగా శంకరున్ని నిలబెట్టారు.
ఆ బాలున్నే ఆది శంకరాచార్యుడని చెప్పుచూ వచ్చారు. శంకరాచార్యున్ని
తమ చెప్పుచేతులలో పెట్టుకొని బయటికి ఆయన సాక్ష్యాత్తూ ఈశ్వరుడని
ప్రచారము చేశారు. (గమనిక :- ఆది శంకరాచార్యుల పుట్టుక నుండి
చావు వరకు జరిగిన సంఘటనలన్నియూ మేము వ్రాసిన "హిందూ
మతములో సిద్ధాంతకర్తలు" అను గ్రంథములో వ్రాశాము చూడవచ్చును.)
ఆది శంకరాచార్యులు అని బ్రాహ్మణులు ప్రచారము చేసిన బాలునికి
వారు చిన్నతనములోనే నేర్పిన వేదములు కొంత తెలుసునుగానీ, అద్వైత
సిద్ధాంతము అంటే ఏమిటో? ఆయనకు ఏమాత్రము తెలియదు. శంకరునికి
అద్వైతము అంటే ఏమిటో తెలియని రోజులలోనే శంకరుని సిద్ధాంతము
అద్వైత సిద్ధాంతమని బ్రాహ్మణులు ప్రచారము చేశారు. ఆ రోజులలో
బుద్ధున్ని ఎందుకు అంతగా బ్రాహ్మణులు వ్యతిరేఖించారు అని అంటే దానికి
ఒకే ఒక కారణము కలదని చెప్పవచ్చును. అదేమనగా! గౌతమ బుద్దుడు
బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు కానివాడు ఎవడయినా గురువుగా
మారుటకుగానీ, బోధకుడుగా మారుటగానీ బ్రాహ్మణులకు ఏమాత్రము
సరిపోదు. దానివలన భవిష్యత్తులో ప్రస్తుతము తమకున్న హోదా, గౌరవము
పోవునని భయము. బోధకులై, గురువులై తమకే బ్రహ్మవిద్య, బ్రహ్మజ్ఞానము
తెలుసునని చెప్పుకొని ప్రజలను మభ్యపరుస్తూ తప్పుదారి పట్టించిన
విషయము తెలుస్తుందను భయముతో ఇతర కులముల వారిని ఎవరినీ
తమ స్థానము వరకు రానీయకూడదని అనుకొన్నారు. బుద్ధుడు జ్ఞానము
చెప్పి, గురువయి కొందరిని మార్చగలిగాడు. అందువలన మారినవారిని
చూచి ఇంకా కొందరు మారిపోయారు. అలా కొందరు ఇతరులను
ఆశ్రయించి జ్ఞానులుగా తయారు కావడము బ్రాహ్మణులకు ఏమాత్రము
ఇష్టము లేదు. మాకంటే మిగతా వారందరూ తక్కువ కులమువారేననీ,
తమకంటే తక్కువ కులము వారు ఎవరూ తమ ముందర పైకి రాకూడదని
ఉండుట వలన తమకు దైవజ్ఞానము తెలియకున్నా జ్ఞానులుగా చెలామణి
అగు బ్రాహ్మణులకు బుద్ధుని విషయము ఏమాత్రము సరిపోలేదు. కుల
వివక్ష బ్రాహ్మణులలో కలియుగమందు పూర్తిగా యుండుట వలన
బ్రాహ్మణులు అప్పటికీ ఇప్పటికీ ఇతరులను అసూయతో చూస్తున్నారు.
బుద్ధుని కాలములో బుద్ధుని మీద పోటీకి పంతముతో తాము
కాకుండా తమకంటే క్రొత్తవాడు, క్రొత్త సిద్ధాంతముతో వచ్చినట్లు చేసి,
తామే శంకరున్ని తయారు చేసి, శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతమును
కూడా వారే తయారు చేసి దానికి అద్వైత సిద్ధాంతమని పేరు పెట్టారు.
ఇట్లు ఆనాడు అద్వైత సిద్ధాంతకర్తను, అద్వైత సిద్ధాంతమును ప్రచారము
చేశారు. అదంతా బుద్ధున్ని ఎదుర్కొనేదానికే. అయితే బుద్ధునికి ఆ
విషయము ఏమాత్రము తెలియదు. అట్లే ఇటువైపున్న ఆది శంకరాచార్యులకు
కూడా ఈ విషయము తెలియదు. బుద్ధుడు చనిపోయిన తర్వాత కూడా
బౌద్ధప్రచారము ఆగలేదు. స్వయముగా అశోక చక్రవర్తి, అశోక చక్రవర్తి
కూతురు బుద్ధుని సూత్రములను బాగా ప్రచారము చేశారు. వారి విషయము
అట్లుండగా, బుద్ధుని ధర్మప్రచారములను ఎదుర్కొని హిందూమతమును
కాపాడుదుమని బ్రాహ్మణులు విస్తృతముగా ప్రచారము చేయనారంభించారు.
అప్పుడు కొందరు వివేకవంతులు బుద్ధుడు కూడా హిందూ
మతములోని వాడే కదా! బుద్ధుని ధర్మసూత్రములు కూడా హిందూ
ధర్మములో భాగములే కదా!యని బ్రాహ్మణులను ప్రశ్నించగా! కాదు బుద్ధుడు
చెప్పునది హిందూమతమునకు సంబంధము లేదు. ఆయనది ప్రత్యేక
మతము అని ఆనాడు బ్రాహ్మణులే హిందూమతములోని బుద్ధుని పరాయి
మతమును ప్రచారము చేయు పరాయివాడనీ, హిందువు కాడనీ, ఆయన
జ్ఞానము హిందూ జ్ఞానమునకు సంబంధము లేదని, మొట్టమొదట హిందూ
మతములో చీలికలు తెచ్చినది బ్రాహ్మణులే. ఆ రోజు బుద్ధుడు ప్రజలకు
తన జ్ఞానమును చెప్పాడు తప్ప తనది హిందూమతము కాదని ఎక్కడా
చెప్పలేదు. అనవసరముగా ఆనాడు బ్రాహ్మణులే హిందూమతమును
ముక్కలు చేసి, హిందూమతము క్షీణతకు మొదటి కారకులయినారు. చరిత్ర
తెలియని హిందూ సంస్థలకు ఈ విషయము తెలియదు. బౌద్ధమతము
అను చీలిక హిందూ మతములోనిదేయని, దానిని హిందూమతమునుండి
బలవంతముగా చీల్చి బయటికి పంపించి బౌద్ధమతము అని పేరు పెట్టినది
బ్రాహ్మణులేయను విషయము నేడు హిందూ మత రక్షకులమని
పేరుపెట్టుకొన్న వారికి సహితము తెలియదు.
నేడు హిందూ మత రక్షణ సంస్థలలో ముఖ్యస్థానములలో యున్న
బ్రాహ్మణులు బుద్ధుని విషయము బయటికి రాకుండా ఇతర హిందువుల
చూపు ఆ విషయముల మీదకి పోకుండా చేయుచూ తామే నిజమైన దేశ
భక్తులము అనీ, తామే నిజమైన హిందువులము అని ప్రచారము చేయు
చున్నారు. నేటికినీ బౌద్ధమతము గలదు. బౌద్ధ మతములో కాషాయ
గుడ్డలే కట్టుచున్నారు. కాషాయ గుడ్డలు ధరించువారు పూర్వమునుండి
హిందువులు తప్ప ఎవరూ ధరించలేదు. ఏ మతము వారికీ కాషాయ
గుడ్డ లేదు. అటువంటప్పుడు కాషాయము ధరించినవారు ఇతర మతము
వారెట్లగుచున్నారని ఏమాత్రము ఎవరూ ఆలోచించ లేకపోయారు. నేడు
హిందూ రక్షణ సంస్థల వారు ఎందుకు ఆలోచించడము లేదు?
హిందుత్వములో సన్న్యాసత్వమును స్వీకరించడము, తల కొరిగించుకొని
కాషాయ గుడ్డలు ధరించడము ఉన్న పనే కదా! అదే పనినే బుద్ధుని
అనుసరించిన వారు చేస్తే వారు హిందువులు కాకుండా ఇతర మతము
వారు ఎలాగయినారు? మొదటివాడయిన బుద్ధుడు (గౌతముడు) హిందూ
మతములోని బోధలు విని, హిందూ మతములోని గ్రంథములు చదివి
ఒక్కమారుగా సన్న్యాసత్వమును తీసుకోవాలని ఇల్లు వదలి భార్య పుత్రులను
వదలిపోయాడు. తర్వాత సన్న్యాసత్వమును స్వీకరించి బిక్షాటన చేశాడు.
సన్న్యాసత్వము, బిక్షాటన ఒక్క హిందూమతములో తప్ప ఏ ఇతర
మతములలో లేదు. అటువంటప్పుడు ఎందుకు ఇతర మతముగా
కనిపించినదోయని ఆలోచిస్తే దానికంతటికీ ఒకే ఒక కారణము కలదు.
అదే కుల వివక్ష. గౌతముడు బుద్ధునిగా మారకముందు హిందూ
సమాజములోని వాడే. గౌతముడు బుద్ధుడు అను పేరుతో సంచరించడము
హిందూ మతములోని విధానము. హిందువు ఎవడయినా పూర్తి జ్ఞానిగా
మారిన తర్వాత నాదపుత్రుడు (జ్ఞాన శబ్ద పుత్రుడు) అవుతున్నాడు.
అందువలన తండ్రి వీర్యబింధువుకు పుట్టినప్పుడు పెట్టిన పేరుతో చలామణి
కాకూడదు అన్నది హిందూ మతములో ఆధ్యాత్మిక ధర్మము. హిందూ
మత ధర్మము ప్రకారము గౌతముడు అను పేరుగల వ్యక్తి బుద్ధుడు (జ్ఞాని)
అను అర్థముతో సంచరించడము హిందూధర్మమేయగును గానీ ఇతర
మత ధర్మము కాదు కదా! మేము హిందూ మత రక్షకులము అనువారికి
ఇవన్నీ కనిపించలేదా? ఏ కోణములో చూచినా గౌతముడు (బుద్ధుడు)
హిందువే అగునుగానీ, ఇతర మతము వాడు కాదు కదా! అటువంటప్పుడు
గౌతమున్ని పరాయి మతమువాడని, మన చేయిని మనమే నరికి
వేసుకున్నట్లున్నది. అన్నిటిలోనూ హిందూ మత ఆచారములతో సమాన
ఆచారములు గల బౌద్ధమతమును నేటికయినా కళ్లు తెరిచి మన తప్పు
మనము తెలుసుకొని హిందుమతములో కలుపుకొని, హిందూమతము
గొప్పదను భావము అందరిలో కల్గునట్లు చేయగలిగితే హిందూమతములో
బలము చేకూరగలదు.
హిందూ మతములోని బ్రాహ్మణులలో యున్న కుల వివక్ష చేత
హిందూమతమునే బ్రాహ్మణులు చీల్చివేశారు. నేడు ఎన్నో కోట్ల జనాభా
గలిగి, కొన్ని దేశములలో పూర్తిగా వ్యాపించుకొన్న బౌద్ధమతమును చీల్చి
పరాయి మతమని చెప్పిన బ్రాహ్మణులు హిందూమతమునకు ఎంతో
ద్రోహము చేశారు. తమకున్న కులవివక్షతో ఆనాడు నేడు హిందూమతములో
ఎవరూ పైకి రాకూడదని తలచి, అలా ఎవరయినా పైకి వస్తే తమ గౌరవ
మర్యాదలకు భంగము ఏర్పడునని ముందే వారిని దూరముగా పెట్టి తమ
ప్రాధాన్యతను చాటుకొంటున్నారు. అంత కుల వివక్ష మాకు ఎక్కడా
కనిపించలేదే!యని కొందరు అడుగవచ్చును. నేను అడిగిన ప్రశ్నలన్నీ
కుల వివక్షకు సంబంధించినవే కదా! బ్రాహ్మణులు ఈనాడు మరియు
ఆనాడు వివక్షను చూపుచునే యున్నారు. 'పిల్లి కళ్ళుమూసుకొని పాలు
త్రాగుచూ నన్ను ఎవరూ చూడలేదు' అన్నట్లు మేము సక్రమమైనవారమే
అంటే కాదు అనేదానికి ఎన్నో ఆధారములు గలవు. పూర్వమే ఆది
శంకరాచార్యుల సమక్షములోనే జరిగిన ఒక సంఘటనను వివరించుకొని
చూస్తే ఏమర్థమవుతుందో మీరే చూచుకోండి. మేము ఒకరిమీద నింద
వేయునప్పుడు ఎన్నో కోణములలో చూచిన తర్వాతే చెప్పుదుము.
ఒక రోజు భారత దేశములోనే ఒక పట్టణములో ఒక దారిలో
నలుగురు బ్రాహ్మణులతో కలిసి శంకరాచార్యుల వారు పోవుచుండిరి.
శంకరాచార్యుల వారి ప్రక్కలో ఆయనకు శిష్యులుగా యున్నవారే నలుగురు
పోవుచుండిరి. అప్పుడు అదే దారిలో ఒక శూద్రుడయిన హరిజనుడు
వేటకు పోవుచూ ఎదురయ్యాడు. అప్పుడు శంకరాచార్య శిష్యులు ఎదురు
వచ్చే హరిజనునితో "అక్కడే ఆగు! దూరముగా ఉండు. మేము పోయిన
తర్వాత పొమ్మని” చెప్పిరి. అప్పుడు ఆ హరిజనుడు ఎదురు ప్రశ్న వేశాడు.
“నేను ఎందుకు ఆగాలి?” అని అడిగాడు. దానికి “మేము బ్రాహ్మణులము,
నీవు నీచకులము వాడివి. నీ వలన మాకు అంటు ఏర్పడును. తర్వాత
మేము శుద్ధి చేసుకోవలసి యుండును. అందువలన నీవు అక్కడే ప్రక్కన
నిలబడమని” చెప్పారు. అప్పుడు అక్కడున్న మాదిగవాడు అనేక ప్రశ్నలతో
వారిని అడగడములో వారివద్ద జవాబు లేకుండా పోయినది. ఆత్మకు
అంటు లేదు అని ఆత్మజ్ఞానము గలదు. "శరీరము నీచమైనదయితే, నీది
ఎంత నీచమో నాది అంతే నీచమగును. నీవు శరీరమును చూచి అంటు
అంటున్నావా? లేక ఆత్మను అంటు అంటున్నావా?" యని ప్రశ్నలడిగెను.
చివరికి శంకరాచార్యుల వారు అతనికి జవాబు చెప్పలేక నమస్కారము
చేసి “నీవు ఇంత గొప్ప జ్ఞానివి అని అనుకోలేదు. మావారు నిన్ను
అనవసరముగా ప్రశ్నించారు. వారు అలా ప్రశ్నించడము తప్పేయని”
శంకరుడు అక్కడున్న హరిజనునితో అన్నాడు. అప్పుడు వారు ఎవరి
దారిన వారు పోయారు.
అప్పుడు శంకరాచార్యుల వారు మాదిగవానికి నమస్కారము
చేశాడు అంటే మర్యాద పోతుందని లెక్కించిన బ్రాహ్మణులు, అప్పుడు
దారిలో ఎదురైనవాడు సాక్ష్యాత్తూ ఈశ్వరుడేయనీ, అందువలన శంకచార్యుల
వారు ఆయనకు నమస్కరించాడని అల్లిక చేసి చెప్పారు. అక్కడ కుల
వివక్ష తెలియకుండా హరిజనుని స్థానములో ఈశ్వరుడే వచ్చాడని చెప్పి
సర్దుపాటు చేశారు. ఈ విధముగా ఎక్కడయినా కుల వివక్ష కనిపించకుండా
చేయుటకు అనేక రకముల అల్లి చెప్పుచున్నారని తెలియుచున్నది. అయినా
తెలివైనవారు దీనిని గ్రహించగలరు.
ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా హిందూమతములో కులవివక్ష
సాగుతున్నది. పెద్ద కులముగా ప్రచారమయిన వారు చిన్న కులముల
వారిని పూర్తి వివక్షకు లోనుచేయుచున్నారు. దానివలన ముఖ్యముగా
హిందూ మతమే క్షీణించుటకు అవకాశము ఏర్పడుచున్నది. ఆనాడు
శంకరాచార్యుల వారు హరిజనునదే సత్యమనీ, అతనిదే నిజమైన జ్ఞానమనీ
తెలిసి నమస్కరించాడు. అది ఆనాడు బ్రాహ్మణులకు ఏమాత్రము
సరిపోలేదు. అయినా ఆ విషయము వలన బ్రాహ్మణులైన వారికే నష్టమని
తలచి హరిజనున్ని ఈశ్వరుడే మారువేషములో వచ్చాడని అసత్యము
చెప్పి సరి చేశారు. ఆది శంకరులను బొమ్మను చేసి, అద్వైత సిద్ధాంతకర్తయని
చాటి చెప్పినవారు బ్రాహ్మణులే. ఆ విషయములు శంకరులకు వయస్సు
వచ్చు కొలదీ కొంతవరకు అర్థమయినది. అద్వైతమంటే ఏమిటో తెలియని
నన్ను అద్వైత సిద్ధాంతకర్తగా చెప్పడములో ఏదో కుట్ర దాగియుందను
కొని గమనిస్తూ పోగా, ఆయన వెనుకయున్న వారి ఉద్దేశ్యము అంతయూ
శంకరాచార్యుల వారికి అర్థమయినది. శంకరాచార్యుల వారు బ్రాహ్మణ
కులములో పుట్టినప్పటికీ ఆయన ఎంతో ఉత్తముడు, ధీశాలి. అందువలన
వయస్సు 30 సంవత్సరములు జరిగేటప్పటికి శంకరుల వారికి అర్థమయిన
దానిని బట్టి చూస్తే, అతనికి ఆయన చుట్టూ యుండే బ్రాహ్మణుల చర్యలు
దోషపూరితమయినవిగా, హిందూమతమునకు హాని చేయునవిగా
కనిపించినవి. అప్పటికే వారి చేతులలో చిక్కియున్న ఆయన కొన్ని
విషయములలో వారిని ఎదురించడము జరిగినది. వారికి ఇష్టము లేని
భగవద్గీతకు వివరమును వ్రాయడము జరిగినది.
ఎప్పుడయితే 27వ సంవత్సరము తర్వాత శంకరుడు భగవద్గీతకు
వివరమును వ్రాశాడో అప్పుడే ఆయన తమ ఆధీనములో లేకుండా
పోవుచున్నాడనీ, ఆయనను ప్రచారము చేసిన వారికి అర్థమయినది. అప్పటి
నుండి శంకరుని భావములు గ్రహించిన బ్రాహ్మణులు అతను 20
గ్రంథములు వ్రాసినట్లు ప్రచారము చేసి వాటిని తామే సృష్టించి పెట్టారు.
అప్పుడు శంకరుడు వ్రాసిన భగవద్గీత మీద దృష్టి తగ్గి మిగతా గ్రంథముల
మీద వారి ధ్యాస పోవునని అలా చేశారు. ఇదంతా ఆది శంకరాచార్యుల
వారికి నచ్చడము లేదు. ఎప్పుడయినా శంకరుడు ఉన్న విషయమంతా
బయటి వారికి చెప్పితే తాము దోషులుగా మిగిలిపోతామని తలచిన ఆనాటి
పెద్దలు అందరూ కలిసి సమావేశములో చర్చించుకొని, అదేపనిగా
శంకరున్ని నిర్మానుష్యమైన కేదార్నాథ్కు తీసుకొనిపోయి, మంచి
ఆరోగ్యముగా యున్న శంకరున్ని 32 సంవత్సరముల వయస్సులో కేదార్నాథ్
గుడిలో హత్య చేసి, బయట ప్రపంచమునకు ఆయన చనిపోయాడని
చెప్పారు. ఏ రోగము లేదు, మంచి యుక్తవయస్సులో యున్న బ్రహ్మచారి
ఉన్నట్లుండి ఎలా చనిపోయాడని ఎవరూ నేటికీ ప్రశ్నించుకోకపోవడము
హిందువుల లోపమేయని చెప్పవచ్చును.
హిందూ మతములో ఒక సిద్ధాంతకర్త ఎందుకు చనిపోయాడు?
ఎలా చనిపోయాడు? చనిపోవుటకు తగిన వాతావరణముగానీ, రోగముగానీ
లేదే. ఎన్నో ప్రశ్నలున్నా ఒక్క ప్రశ్నను కూడా ఎవరూ వేయకుండా ఆనాడే
తెలివిగా ఆయన చనిపోయిన మూడు రోజులకు బయటి ప్రపంచమునకు
తెలిపారు. ఆయనను కేదార్నాథోనే సమాధి చేసి, ఏ ఆనవాళ్లు దొరక
కుండా చూచి అప్పుడు బయట ప్రపంచమునకు చెప్పారు. దీనికంతటికీ
కారణము ఆయన కుల వివక్షకు సహకరించక పోవడమే. వారు ఎలా
తయారు చేయాలనుకొన్నారో అలా తయారు కాకపోవడమే. వద్దని చెప్పినా
వినకుండా వారికి తెలియకుండా భగవద్గీతకు భాష్యము వ్రాయడమే
తప్పయినది. ఏది ఏమయిందోగానీ తర్వాత కాలములో కూడా అదే
ఉద్దేశ్యమే బ్రాహ్మణులలో కొనసాగినది.
తర్వాత ఈ మధ్య నాలుగు వందల సంవత్సరముల కాలము నాడు
దేశములో ఎక్కడ చూచినా బ్రాహ్మణులు అత్యధిక ధనవంతులుగా
ఉండేవారు. వారు ఊరిలో ఒక ప్రక్క భాగములో ప్రత్యేకముగా గుంపుగా
నివశించేవారు. వారు నివశించే వాడలను బ్రాహ్మణ బజారులు అనేవారు.
లేకపోతే అగ్రహారములు అని అనేవారు. అగ్ర అంటే మొదటిది లేక
పెద్దది యని అర్థము. అంటే వారుండే జాగానే ఊరి పైకి పెద్ద విలువయిన
దని అర్థము. వీరబ్రహ్మముగారు ఒక రోజు ప్రయాణము చేయుచుండగా
వారి అగ్రహారములలో ఆయనను పోనివ్వలేదు. ఆనాడు ఆయనను కూడా
కుల వివక్షతోనే నిలబెట్టారు. ఎక్కడయినా ఏ కులస్థుడయినా జ్ఞాన బోధ
చేయును అంటే వానిమీద ఏదో ఒక విధముగా అసూయను చూపుదురు.
బోధకులుగా అయినా, గురువులుగా అయినా తాము తప్ప భూమిమీద
ఎవరూ ఉండకూడదనుటయే వారి ముఖ్య ఉద్దేశ్యము. అదే ఉద్దేశ్యము
ప్రకారము పూర్వము నుండి నేటి వరకు ప్రవర్తించుచున్నారు.
భగవద్గీతను చెప్పినవాడు శ్రీకృష్ణుడు. అతను బ్రాహ్మణుడు కాదు.
ఆ ఒక్క కారణముచేత ప్రజలను భగవద్గీతను చదువవద్దని చెప్పుచుందురు.
ఎక్కడయినా భగవద్గీత ముఖ్యమని ఎవడయినా అంటే వానికి మంచిని
చెప్పినట్లు చెప్పుచూ వానిని తప్పుదారి పట్టించుచున్నారు. భగవద్గీతలోని
శ్లోకములను చదవకపోయినా ఫరవాలేదు భగవద్గీత చివరిలోని గీతా
మహత్యమును చదివితే గీతను మొత్తము చదివిన పుణ్యమేగాక అనేకమైన
లాభములు కల్గునని బోధించారు. అలా చెప్పి వారిని భగవద్గీతను
చదవకుండా చేయుచున్నారు. దేవుడు జ్ఞానమును తెలియమని తెలుపగా
వారు గీతా మహత్యమును చేర్చారు.
ప్రశ్న :- మీరు చెప్పే దానిలో సత్యము లేనట్లు తెలియుచున్నది. ఎందుకనగా!
నేడు చాలామంది బ్రాహ్మణులుగాయున్న స్వామీజీలు, భగవద్గీత యజ్ఞమను
పేరుతో కొన్ని రోజులు గీతను వివరించి చెప్పుచున్నారు. వారు భగవద్గీతను
ద్వేషించేవారయితే భగవద్గీతనే చెప్పరు కదా! అంతేకాక ఎవరికీ రాని
విధముగా వారికి భగవద్గీతా శ్లోకములన్నీ కంఠస్తమైయున్నవి. నేను
చూచినంతలో ఒక సన్న్యాసి స్వామి, గతములో మళయాళ బ్రాహ్మణుడే
అయిన స్వామీజీ ఎంతో చక్కగా శ్లోకములు చెప్పి బోధించాడు. ఆయన
బోధలు వినినవారు ఆయన ఉపన్యాసములకు మెచ్చుకొని వెంటనే ఆయన
ఆశ్రమానికి 30 ఎకరముల భూమి ఇచ్చారు. ఆయన సంవత్సరములో
ఒక నెల కూడా ఖాళీ లేకుండా, ప్రతి నెల ఎక్కడో ఒకచోట భగవద్గీత
ప్రవచనములు చెప్పుచున్నారు. ఇప్పటికి ఒక సంవత్సరము క్రితము మా
ఊరిలో చెప్పినప్పటికే 204వ గీతాయజ్ఞము అని బోర్డుకట్టి యుండుటను
చూచాను. దానిని బట్టి అప్పటికే 204 మార్లు గీతను గురించి
ఉపన్యాసములు చెప్పియున్నాడని తెలియుచున్నది. ఇప్పటికి ఇంకా రెండు
మూడు చోట్లయినా గీతా బోధలు చేసియుండును. ఎక్కడ చెప్పినా వారము
రోజులు చెప్పుచున్నాడు. ఆయన ఎంతో గొప్పగా ఇప్పటికీ రెండు వందలకు
పైగా ఊర్లలో గీతను వారము రోజులకు తగ్గకుండా చెప్పుచున్నాడు.
అంతేకాక ఆయన భగవద్గీతలో ప్రతి శ్లోకమును వివరించి అందరికంటే
గొప్పగా రెండువేల పేజీల గ్రంథమును, నాల్గు భాగములుగా వ్రాశాడు.
అంత పెద్దగా, అంత వివరముగా, అన్ని పేజీలు వ్రాసినవారు ఇంతవరకు
ఎవరూ లేరు. అంతగా బ్రాహ్మణ కులములో పుట్టిన ఆ స్వామీజీ గీతను
గురించి చెప్పడమేకాక మిగతా వారు కూడా పూర్వము బ్రాహ్మణులుగా
యుండి ఇప్పుడు సన్న్యాసులుగా యున్నవారు భగవద్గీత ప్రచారము
చేయుచున్నారు. ఇంతవరకు భగవద్గీతను గ్రంథముగా వ్రాసిన వారందరూ
నేడు స్వామీజీలుగా యున్నా గతములో వారు బ్రాహ్మణులే కదా! దీనికి
మీరు ఏమంటారు?
జవాబు :- మీరు చెప్పేదంతా సత్యమే! అయితే మీకు తెలియకుండా
దానిలో అసత్యము కూడా దాగియున్నది. నాకు బ్రాహ్మణులంటే కక్షకాదు,
వివక్ష కాదు. సామాజికముగా జరిగే మంచి, చెడులను చెప్పుచున్నాను.
శంకరాచార్యుల వారు కూడా కేరళ బ్రాహ్మణుడే కదా! ఆయన పక్షములో
ఎందుకు మాట్లాడాను? ఆయనకు బ్రాహ్మణులే అన్యాయము చేశారు.
అన్యాయమైతే ఫరవాలేదు, ఏకంగా హత్యే చేశారు. ఒక సిద్ధాంతకర్తయని
పేరు పెట్టిన వ్యక్తినే చంపారు. రెండవ వారు రామానుజులు. రామానుజులు
కూడా తమిళనాడు బ్రాహ్మణుడు. ఆయన స్వయముగా విశిష్టాద్వైత
సిద్ధాంతమును ప్రకటించాడు. చిన్న వయస్సులోనే బ్రాహ్మణులకు
వ్యతిరేఖముగా యుంటూ, బ్రహ్మవిద్యను అందరికీ సమానముగా బోధించ
వలెనని చెప్పినవాడు. ఆయన కూడా బ్రాహ్మణుడే అయినా బ్రాహ్మణులు
తమ స్వార్థముతో చంపాలనుకొని పథకము పన్నలేదా? ఆయనను కూడా
చంపినట్లు చెప్పవలసిందే. ఆఖరి క్షణములో రామానుజులు తప్పించుకొని
పోయాడు. లేకపోతే ఒక్క క్షణము ఆ రోజు ఆలస్యమయి వుంటే 20
సంవత్సరముల వయస్సులోనే రామానుజులు అడవి జంతువుల దాడిలో
చనిపోయినట్లు ప్రచారమయివుండేవాడు. శంకరాచార్యుల వారిని కేదార్నాథ్
తీసుకపోయినట్లు, రామానుజులను అడవిలోనికి పథకము ప్రకారము తీసుక
పోలేదా? ఆయన అదృష్టము బాగుండి చిన్న అనుమానముతో ఒక్కక్షణము
ముందు అడవిలో అడ్డముగా పారిపోయాడు. దీనికంతటికీ కారణము
కుల వివక్షయేనని చెప్పవచ్చును.
ఇతర కులముల వారు జ్ఞానులయినా, బోధకులయినా, గురువు
లయినా తమ సామ్రాజ్యము అంతాపోవునని తెగ బాధపడుట వలన ఇతర
కులముల వారిని పైకి రాకుండా చేశారు. అంతేకాక మిగతా కులముల
వారందరినీ కలిపి నీచులు అను అర్థము వచ్చునట్లు శూద్రులు అన్నారు.
అందరూ సమానమే అని చెప్పిన శంకరాచార్యులను పూర్తి చంపివేశారు.
రామానుజాచార్యులను చంపుటకు ప్రయత్నము చేశారు. అంతెందుకు
మీరు ఇంతవరకు చెప్పారు కదా! ఒక స్వామీజీ బ్రాహ్మణుడే అయివుండి
భగవద్గీతను గొప్పగా చెప్పాడు, చెప్పుచున్నాడు అని అన్నావు. నీవు చెప్పునది
లోకము తెలిసిన సత్యము. లోకము తెలియని సత్యము ఏముందో
చూడగలిగితే, తెలియగలిగితే నీవు అలా చెప్పేవాడివే కాదు. లోకము
తెలియని సత్యము ఏమనగా! కృష్ణుడు అంటేనే వారికి సరిపోదు. దానికి
ఒకేఒక కారణము కలదు. అది ఏమనగా! ఆయన బ్రాహ్మణుడు కాదు.
ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేఖమైన శ్లోకములతో భగవద్గీతను చెప్పాడు.
నేడు బ్రాహ్మణులైన స్వామీజీలు ఎందరో భగవద్గీతను బోధించు
చున్నారు అనుట వాస్తవమే. అయితే వారికి భగవద్గీత మీద ప్రేమతోనో,
భక్తితోనో వారు దానిని ఉపన్యాసములుగా బోధించడము లేదు. భగవద్గీత
శ్లోకములలోని వివరము ఇతరులకు తెలియకూడదని, ఆ శ్లోకములను
వారే చెప్పి దాని అసలు భావమును కాకుండా వేరే భావమును చెప్ప
వలెనను ఉద్దేశ్యముతో చెప్పుచున్నారు. అలా వారే భావము మార్చి
చెప్పడము వలన అసలు కృష్ణుడు చెప్పిన సత్యము మీద ఎవరి ధ్యాసపోదు,
దాని అసలు అర్థము తెలియదు. అలా ఎన్నో శ్లోకములను మూసి చెప్పినవి
కలవు. ఉదాహరణకు “చాతుర్వర్ణం” శ్లోకములోని అసలు భావమును
కప్పివేసి, సంబంధములేని భావమును చెప్పారు, చెప్పుచూనే యున్నారు.
విశ్వరూప సందర్శన యోగములో 48, 53 శ్లోకములను మూసివేసి తప్పు
భావములనే ప్రచారము చేశారు. అలా తామే ముందు చెప్పుటకు గీతా
యజ్ఞములను పేరుతో బోధలు చెప్పుచున్నారు. అలా చెప్పడమే కర్తవ్యముగా
పెట్టుకొన్నారు.
నేడు భగవద్గీతను వెయ్యి పేజీలుగా వ్రాసినవారు వారే, రెండు
వేల పేజీలుగా వ్రాసినవారు వారే. ఎక్కడ వ్రాసినా అందులో తప్పు
భావములు తప్ప వేరే ఏమీ లేవు. అంతేకాకుండా అందులో కల్పిత
శ్లోకములు కూడా బయటికి తెలియకుండా ఉండుటకు వారే భగవద్గీతను
చెప్పుచున్నారు. వారు భగవద్గీతను చెప్పడము వలన ప్రజలకు నష్టమేగానీ,
లాభము ఏమీ లేదని ఎవరికీ తెలియనట్లు చెప్పుచూ, చెప్పినందుకు
పారితోషికముగా రెండు మూడు లక్షలు రేటు పెట్టి తీసుకొంటున్నారు.
కృష్ణుడు భగవద్గీత చెప్పి బ్రాహ్మణులకు వ్యతిరేఖియైనాడు. అదే
రాముడయితే వారిని గురించి ఏమీ చెప్పలేదు. అందువలన రామున్ని
గొప్పగా చెప్పుచూ, రాముని ముందర కృష్ణున్ని తక్కువ చేసి చెప్పుచున్నారు.
ఈ మధ్యకాలములో బ్రాహ్మణ స్వామీజీ ప్రవచనములు చెప్పడములో గొప్ప
పేరుగాంచిన వాడు కృష్ణున్ని గురించి చెప్పుచూ రాముడు గొప్ప రాజుల
ఇల్లలో పుట్టాడు. కృష్ణుడు తలకడిగితే మొలకడగని, మొలకడిగితే తలకడగని
యాదవుల ఇల్లలో పుట్టాడు అని, యాదవులను ఒకవైపు కించపరుస్తూ
అటువంటి వారి ఇంటిలో పుట్టాడని కృష్ణున్ని కూడా కించపరచినట్లు
చెప్పాడు. వాస్తవానికి కృష్ణుడు క్షత్రియుల ఇల్లలో పుట్టాడు. యాదవుల
ఇంటిలో కృష్ణుడు పుట్టలేదని ఆయనకు కూడా తెలుసు, అయినా అదే
పనిగా ఆయన అలా చెప్పాడు. గొల్లవాళ్ల ఇల్లలో పుట్టాడని స్వామీజీలందరూ
చెప్పుచున్నారు. అందరికీ ఆయన యాదవుల ఇల్లలో పుట్టలేదని తెలుసు.
యాదవుల ఇల్లలో పెరిగిన మాట వాస్తవమే. పుట్టినది అవాస్తవము.
ఇంకొకటేమిటంటే యాదవులు ఎప్పుడూ గొర్లను కాయలేదు. వారు
ఆవులను కాయడము జరిగినది. ఆ రోజు రేపల్లెలో గోసంతతి ఎక్కువగా
యుండి పాడిపరిశ్రమ ఎక్కువగా యుండేది. ఆవు పాలు, పెరుగు, వెన్న,
నెయ్యి సమృద్ధిగా ఉండేవి.
గొర్లను కాచేవారు కురువ వాళ్లు. యాదవులు గోవులను కాచారు.
అందువలన వారిని గోపాలురు అని అనెడివారు. గోపాలురు అనగా
గోవులను పాలించేవారు లేక గోవులను కాచేవారు అని అర్థము. అయినా
కృష్ణుడు గోపాలుర ఇంటిలో పెరిగి ఆయన కూడా గోపాలుడు అయినాడు.
అంతేగానీ ఆయనగానీ, రేపల్లె వాసులుగానీ గొర్లను కాయలేదు. నేడు
మేము "త్రైత సిద్ధాంత భగవద్గీత”ను వ్రాయడము వలన భగవద్గీత అసలు
రహస్యము బయటపడినది. అయితే మేము బ్రాహ్మణ కులము వాడిని
కాని దానివలన, కమ్మ కులములో పుట్టినవాడనైనందువలన వారి వివక్ష
నేడు నా మీద చూపను మొదలుపెట్టారు. నేడు మత రక్షణయని సంస్థలు
స్థాపించి అందులో బ్రాహ్మణులే అగ్రముగా యుంటూ వారి మాటనే
చెల్లునట్లు చేస్తున్నారు. బయటికి కనపడకుండా గుంపులో గోవింద యన్నట్లు
తెలివిగా తమకు వ్యతిరేఖముగా యున్న వారిమీదగానీ, ఇతర కులములలోని
స్వామీజీల మీదగానీ కక్ష సాధించుటకు వారిని అణచి వేయుటకు హిందూ
రక్షణ సంస్థలు బాగా ఉపయోగపడుచున్నవి. హిందూ మత రక్షణ సంస్థలలో
అన్ని కులముల వారున్నా అందులో బ్రాహ్మణులదే పైచేయి. వారు
చెప్పినట్లు మిగతా వారందరూ వినునట్లు చేసుకొన్నారు. మనము దేశము
కొరకు పని చేయుచున్నాము, రెండవది మత రక్షణ కొరకు పని
చేయుచున్నామని అందరికీ బోధించుచున్నారు. దేశభక్తి, మతభక్తిని
తెలుపుచూ, మత రక్షణే మన ధ్యేయమని చెప్పుచూ, ఇతర మతములను
అణచి వేస్తూ, హిందూమతమును అభివృద్ధి చేయాలనునదే ధ్యేయముగా
పెట్టుకొన్నారు.
ఎక్కడయితే బ్రాహ్మణేతర కులమువారు హిందూ జ్ఞానమును
బోధిస్తున్నా, భగవద్గీతను చెప్పుచున్నా వారిని పరమత ప్రచారకులుగా
చిత్రించి, వారిమీద సంఘములోని మిగతా కులము వారందరినీ దాడికి
పంపించి పైన చూచుచుందురు. హిందూ మత రక్షణ సంస్థలలోని వారికి
ఏమాత్రము హిందూ జ్ఞానము తెలియదు. అప్పుడు తమ పెద్దలు ఏమి
చెప్పితే అదే సత్యమని నమ్మువారు ఉండుట చేత ఎవరయినా బ్రాహ్మణేతర
స్వామి, గురువు కనిపిస్తే వారు హిందూ సమాజము పేరుతో హిందూ
ముసుగులో పరమతమును బోధిస్తున్నారని ఆ సంఘములో ఉండే
బ్రాహ్మణుడు ఒక్కడు చెప్పితే మిగతా కులముల వారందరూ ఆ సంఘములో
యున్నా, ఇది కుల వివక్షతో చెప్పునదని తెలియక హిందువులుగా
యున్నవారు హిందువుల మీదనే దాడి చేయుచున్నారు. ఇదంతా
ప్రత్యక్షముగా మా విషయములోనే జరిగినది, జరుగుచునే యున్నది. మేము
త్రైత సిద్ధాంతమును ఆధారము చేసుకొని భగవద్గీతను వ్రాస్తే దానిని
హిందూ ముసుగులోనున్న బైబిలుగా చిత్రించి చెప్పారు. మేము హిందూ
ముసుగులోయున్న పరమత ప్రచారకులమని చెప్పారు. హిందూ మత
రక్షణ సంఘములో గల ఇతర మతముల వాళ్లు కొందరు వారి మోచేతి
నీళ్ళు త్రాగుచూ, వారు చెప్పినదే సత్యమని తలచి ఎదుటి వారు కూడా
హిందువులే అను మాటను మరచి బ్రాహ్మణులు చెప్పిన మాటప్రకారము
దాడికి దిగుచున్నారు. దీనికంతటికీ కారణము ఒక్క కులవివక్ష యని
చెప్పక తప్పదు. హిందూమతములో బ్రాహ్మణుల చూపు, కుల వివక్ష
వలన ఇంతవరకు హిందూమతము చీలిపోయి క్షీణించి పోయినది. ఇక
తర్వాత కూడా బ్రాహ్మణుల పెత్తనముంటే హిందూ మతము సర్వనాశనము
కాగలదు. హిందువులు ఇకనైనా మేల్కొని హిందూమతమును కుల వివక్ష
నుండి రక్షించుకోండి. ఇతర మతముల వలన హిందువులు మత మార్పిడి
చెందలేదు. హిందుమతములోని బ్రాహ్మణుల వివక్ష వలన, అంటరాని
తనమును ప్రదర్శించుట వలన, హిందువులు అవమానమును పొందలేక
మతమును మార్చుకొంటున్నారు. కుల వివక్ష తగ్గితే మతమార్పిడి
తగ్గుతుంది. కుల వ్యవస్థను వ్యతిరేఖిద్దాము. కుల వివక్షను రూపు
మాపుదాము.
సమాప్తము.
అసత్యమును వేయిమంది చెప్పినా, అది అసత్యము కాదు.
సత్యమును వేయిమంది కాదనినా, అది సత్యము కాదు,