Cloud text సత్యాన్వేషి కథ_576_2stOct24_Updated_part3

 వారికి తెలియదనీ, వార్తలు రావడము విచిత్రమనిపిస్తూవుంది. మొదట

దొంగిలించిన దొంగలు అసలు వజ్రాల విషయము బయటికి రావడానికి,

నకిలీ వజ్రములను సృష్టించి ఆలయములో పెట్టివుండవచ్చును అని

అనుకొన్నాము. అయితే ఇప్పుడు ఆ నకిలీ వజ్రములు కూడా దొంగిలించ

బడినాయని అంటున్నారు. మొదట దొంగిలించినవారు మునెప్ప

మనుషులనీ, దానిని తపస్విబాబాయే చేయించాడని మనకు తెలుసు.

రెండవమారు నకిలీ వజ్రములను దొంగిలించిన వారు ఎవరైవుంటారు?

దీనినిబట్టి చూస్తే మొదటి మారు కూడా వీరు ప్రయత్నము చేసివుంటారనీ,

వజ్రములు తిరిగి ఆలయమునకు వచ్చాయని తెలిసి ప్రయత్నము చేస్తూ

వుండి, చివరకు దోపిడీ చేశారని అర్థమగుచున్నది. వజ్రముల మీద చూపున్న

వారు తపస్వి బాబా తప్ప మన దృష్ఠిలో ఎవరూ లేరు. అయితే ఒక్కమారుగా

తెరమీదికి వచ్చిన ఈ రెండవ దొంగలు ఎవరైవుంటారు?


రాఘవ :- మొదటి దొంగలైన తపస్విబాబాగారికి మనమూ, మనకు తపస్వి

బాబాగారు తెలుసు. ఇప్పుడు ఈ రెండవ దొంగ మనకు తెలియనట్లే

తపస్విబాబాగారికి కూడా తెలిసివుండడు. అట్లే ఈ రెండవ దొంగకు

మన విషయముగానీ, తపస్విబాబా విషయముగానీ తెలిసి ఉ

౦డదనుకొంటాను.


రాజయోగానంద :- మనము ఈ రెండవ దొంగ ఎవరైనది తెలుసుకోవలసిన

అవసరమున్నది. ఈ విషయములో పోలీస్వారి దర్యాప్తు ఎలా జరుగు

తుందో కొద్దిరోజులు చూచిన తర్వాత, వారికి అర్థముకాని పక్షములో మనము

తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.


(భువనేశ్వరి దేవాలయములో జరిగిన దోపిడీ విషయమును దర్యాప్తు


చేయుటకు యస్.పి గారి సలహా మేరకు సి.ఐ. గారు పూనుకొన్నారు.

దర్యాప్తులో భాగముగా పూజారిని ఇలా అడిగాడు.)

సి.ఐ :- దేవాలయములో మీరు రాత్రిపూట ఎన్ని గంటల వరకు ఉంటారు?

పూజారి :- ప్రతి దినము 9 గంటల వరకు ఉంటాను. తర్వాత గర్భగుడి

తలుపులు మూసి, తాళమువేసి ధర్మకర్తకు ఒక తాళము చెవి ఇచ్చి, నావద్ద

ఒకటి పెట్టుకొని పోతాను.


సి.ఐ :- ఆలయములో దోపిడీ జరిగిందని మొదట మీకు ఎప్పుడు తెలిసింది?

పూజారి :- మీరు వచ్చి చెప్పినప్పుడే నాకు తెలిసింది. మొదట నేను మీ

మాటను నమ్మలేదు.

సి.ఐ :- దొంగలు వ్రాసిన కాగితము మీద తేదీని బట్టి ఫలానా రోజు

దొంగతనము జరిగిందని అనుకొంటున్నాను. ఆ దినము మీరు గుడిలో

ఎన్ని గంటల వరకు ఉన్నారు?

పూజారి :- ఆ దినము ఇక్కడ భజన కార్యక్రమము ఉండుట వలన రాత్రి

11 గంటల వరకు ఉండవలసి వచ్చినది. 11 గంటల తర్వాత అందరికీ

తీర్థమిచ్చి గర్భగుడి తలుపులువేసి పోయాను.

సి.ఐ :- అలా రాత్రి తలుపులు మూసిపోయిన తర్వాత తిరిగి ఇక్కడికి

ఎప్పుడు వచ్చారు?

పూజారి :- ఉదయము ఐదు గంటలకే వచ్చి తలుపులు తెరిచాను.

ఉదయము ఐదు గంటలనుండి భజన కార్యము ఉండుట వలన ఐదు (5)

గంటలకే తెరిచాను. లేకపోతే ఉదయము ఆరు (6) గంటలకు తలుపులు

తీసేవాడిని.

సి.ఐ :- ఆ దినము భజన కార్యము ఎవరు చేశారు?

పూజారి :- భక్తులందరూ చేశారు. అది జఠాజూట స్వామిగారి భజన

కార్యము. దాదాపు వారము రోజులు జరిగి ఉంటుంది.


సి.ఐ :- వారము రోజులు జరుగు భజన కార్యము ఎప్పుడు మొదలైంది?

పూజారి :- దోపిడీ జరిగిన రోజునుంచే ప్రారంభమైనది.

సి.ఐ :- జఠాజూట స్వామి ఎక్కడుంటారు?

or

పూజారి :- ఇక్కడే గుడికి ఎడమ ప్రక్కనవున్న పై అంతస్థులో ఉంటాడు.

దేవస్థానము ఆయనకు ఉచితముగా ఆ ఇల్లును ఇచ్చింది.

సి.ఐ :- ఆ రోజు ఉదయము ఐదు గంటలకు తలుపుతీసినపుడు లోపల

ఏదైనా క్రొత్తగా కనిపించడముగానీ లేక దొంగతనము జరిగినట్లు ఏదైనా

తేడా కనిపించిందా?

పూజారి :- అలా ఏమీ కనిపించలేదు. అట్లు ఏమైనా కనిపించివుంటే

అప్పుడే చెప్పి ఉండేవారము కదా!

S

సి.ఐ :- గర్భగుడిలోపల ఏమీ తెలియకపోయిన బయట ఏదైనా

అనుమానముగా గానీ, క్రొత్తగాగానీ కనిపించిందా?

పూజారి :- గర్భగుడిలోపల ఏమీ కనిపించలేదు. కానీ గర్భగుడితలుపులు

తెరుస్తూనే నేను ఇంకా గర్భగుడిలోనికి అడుగుపెట్టకనే బయట అలజడి

లేచింది. అప్పుడే గుడిలోపల పాము కనిపించిందని భజనకు వచ్చిన

వారంతా అన్ని వైపులా పరుగుతీసారు. పది పదిహేనుమంది పాము

భయమునకు నన్ను త్రోసుకుంటూ గర్భగుడిలోనికి కూడా వచ్చారు. నేను

కూడా భయపడి గర్భగుడిలోనికి వచ్చాను. గుడిలోపలినుండి నేను చూస్తూండ

గానే ఎవరో కట్టెను తీసుకవచ్చి పామును చంపారు. పామును చంపిన

తర్వాత అందరము బయటికి వచ్చాము. భయముతో కొందరు గర్భగుడి

లోనికి వచ్చిన దానివలన గుడి అంతా కడిగి శుభ్రము చేసుకోవలసి వచ్చినది.

ఆ అలజడి వలన ఆ దినము భజన కార్యము కూడ అరగంట ఆలస్యముగా

మొదలుపెట్టారు.

సి.ఐ :- రాత్రి గర్భగుడి తలుపు వేయునపుడు గర్భగుడి అంతా చూచి,


అందులో ఎవరు లేనపుడు తలుపులు వేశావా? లేక నీవు తలుపులు

వేసినపుడు గర్భగుడిలో ఎవరైనా ఉన్నారా?

పూజారి :- లోపల ఎవరైనా ఉంటే నేను ఎందుకు తలుపులు వేస్తాను.

ప్రతి రోజు వేసినట్లే వేశాను. అంతేకాని వెదికి చూడలేదు. గర్భగుడిలోనికి

ఎవరూ పోరు. లోపలికి పోయేదానికి అందరూ భయపడుతారు.

సి.ఐ :- నీవు గర్భగుడి తలుపులు వేసినపుడు నీకు తెలియకుండా లోపల

ఎవరో ఉండి ఉంటారు. నీ ధ్యాసను ప్రక్కకు మళ్ళించి నీకు తెలియకుండా

ఎవరో లోపలికి పోయి, రాత్రంతా లోపలేవుండి వజ్రములను దొంగిలించి

తిరిగి తలుపులు తీయునపుడు ముందుగా వేసుకొన్న పథకము ప్రకారము

పామును గుడిలో వదిలి గందరగోళమును సృష్టించి, కొందరు నిన్ను ప్రక్కకు

త్రోసి నీకంటే ముందు గర్భగుడిలోనికి పోయివుంటారు. అప్పుడు

లోపలవున్న దొంగ వారితో సులభముగా కలిసిపోయివుంటాడు. తర్వాత

అందరితోపాటు బయటికి వచ్చివుంటాడు.

పూజారి :- గర్భగుడి తాళము తీసి తలుపులు త్రోస్తున్నట్లే వారు నన్ను

ప్రక్కకు నెట్టి గబగబాలోపలికి పోయారు. వారు పోయిన తర్వాతే నేను

పోయాను.

సి.ఐ :- ఆ దినము నిన్ను త్రోసి లోపలికి పోయినవారు ఎవరో నీకు

గుర్తుందా?

పూజారి :- అందరూ జఠాజూట స్వామి భక్తులే పోయారు. వారంతా

నాకు తెలిసిన వారే. స్వామికి దగ్గర ఉండువారే.

సి.ఐ :- వారంతా ఎటువంటి వారు?

పూజారి :- వారు అందరూ సాత్వికులు, అందరూ మంచివారే, నాకు

బాగా పరిచయమున్నవారే.


(ఈ విధముగా సి.ఐ. తెలివిగా పూజారిని ఇంటరాగేషన్ చేసిన

తర్వాత ఆ దొంగతనము పథకము ప్రకారము జరిగిందనే నిర్ణయానికి

వచ్చి ఆ విషయమును అంతటిని యస్.పి గారికి తెలియజేశాడు. అప్పుడు

యస్.పి గారికి విషయమంతా అర్థమైనది. జఠాజూట స్వామి వద్దకు పోయి

అతని చేతి వ్రాతను తీసుకురమ్మని చెప్పాడు. అలాగేనని సి.ఐ అక్కడినుండి

వచ్చి రెండవరోజు జఠాజూట స్వామివద్దకు పోయాడు. సి.ఐ. స్వామివద్దకు

పోకనే కుడిచేతి హస్తమునకు గాయమునకు కట్టుకట్టినట్లు బ్యాండేజ్

కట్టుకొన్నాడు. తర్వాత చేయిని కొద్దిగ పైకి పట్టుకొని జఠాజూట స్వామివద్దకు

పోయాడు. అక్కడకు పోయి స్వామితో ఇలా మాట్లాడినాడు.)


సి.ఐ :- స్వామిగారూ! ఈ మధ్యన భువనేశ్వరి దేవాలయములో దొంగ

తనము జరిగినట్లు మాకు తెలిసి దానిని గురించిన దర్యాప్తు చేయుచున్నాము.

వారము దినములు మీ భజన కార్యము అక్కడ జరిగిందని తెలిసింది.

అందువలన ఆ దొంగతనమును గురించి నేను అడుగునది ఏమంటే, మీ

భజనలో ఎవరైనా క్రొత్త వ్యక్తులుగానీ, అనుమానాస్పద వ్యక్తులుగానీ మీకు

ఏమైనా కనిపించారా? అట్లు ఏమైనా మీకు తెలిసివుంటేగానీ, తెలియక

పోయినగానీ వివరముగా వ్రాసి ఇవ్వండి. నేను వ్రాసుకోనే దానికి నా

చేయి బాగలేదు. మీకేమైనా తెలిసివుంటే వ్రాయండి, తెలియకపోయినా

ఏమి తెలియదనే వ్రాసి ఇవ్వండి.


స్వామి :- మా భజనకు క్రొత్తవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వారు

ఎవరు, ఏ ప్రాంతమువారను విషయము మాకు తెలియదు కదా!


సి.ఐ :- మేము సేకరించిన సమాచారమంతయూ యస్.పి గారికి పంపు

చుంటాము. అందరివద్దా విచారించినట్లు ఆయనకు తెలియాలి కదా! మీరు


వ్రాసి ఇచ్చిన సమాచారమును పై అధికారులకు అందజేస్తాము. మా

దర్యాప్తుకు మీరు కూడా సహకరించాలి.


స్వామి :- సరే అలాగే వ్రాసి ఇస్తాను. క్రొత్తవారున్నారు కానీ వారు ఎవరో

తెలియదనే వ్రాస్తాను.


(అని స్వామి తను ఏమి వ్రాయాలనుకొన్నాడో అదే వ్రాసి ఇచ్చాడు.

దానిని సి.ఐ, యస్.పి గారికి తీసుకపోయి చూపించాడు. యస్.పి. గారు

చూపిం

దేవాలయమునకు వ్రాసిన లెటర్ను, ఇప్పుడు వ్రాసిన పేపరును బాగా

చూచి రెండిటిలోను ఉన్నది ఒకే చేతివ్రాత అని గ్రహించాడు. దీనితో ఈ

దొంగతనము స్వామియే చేయించాడని యస్.పి గారికి అర్థమైంది. కానీ

కొంతకాలము ఆగి కాచుకొనివుండి ఆ దొంగతనమునకు సంబంధించిన

ఆధారములను సేకరించాలనుకొన్నాడు. అప్పటికీ ఆ విషయమును సి.ఐ

గారికి కూడా చెప్పకుండా పంపివేశాడు. తర్వాత ఆ కేసును సి.ఐ.డి

పోలీస్ లకు అప్పచెప్పి తొందరగా సాక్ష్యాధారములు సంపాదించమని

ఆదేశించాడు.)


(ఈశ్వర్ జీవితములో ఒక్కొక్క సంవత్సరము గడిచిపోతూ ఉన్నది.

ఈశ్వర్ మాత్రము అందరి దృష్ఠిలో మంచివాడుగా పేరు తెచ్చుకొన్నాడు.

ఒక దినము అతను స్కూల్కు పోవుచున్నాడు. ఆ ఆ దారిలోనేవున్న ఒక

ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అయినది. అది పెద్ద ఇల్లు, ఆ ఇంటిలో

దాదాపు 20 మంది ఒకే కుటుంబమువారున్నారు. ఆ ఇంటిలో నుండి

అందరూ బయటపడ్డారు. కానీ చివరకు చూచుకోగా నాలుగు

సంవత్సరముల అబ్బాయి ఒక రూములో నిద్రిస్తుండగా ఎవరూ

చూచుకోకుండా అందరూ బయటికి వచ్చారు. ఇంటి చుట్టూ, ఇంటిలోపల

కొంత భాగము మంటలు అంటుకొని భీకరముగా మండుచున్నది. లోపల


నిద్రించుచున్న బాలుడులేచి అరవను మొదలుపెట్టాడు. ఆ బాలుని తల్లి

హృదయ విదారకముగా పిల్లవాని కొరకు ఏడుస్తున్నది. ఆమెను కొందరు

పట్టుకొన్నారు. లోపలికి పోయి ఆ బాలున్ని రక్షించే దానికి ఎవరికీ

ధైర్యము చాలడములేదు. లోపలికి పోతే తిరిగి బయటికి రాలేమని అందరూ

అనుకొంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఈశ్వర్ అక్కడికి పోయాడు.

తల్లి బాధనూ, ఇతరుల నిస్సహాయతను చూచాడు. ఈశ్వర్ ఏమాత్రము

ఆలోచించకుండా తన పుస్తకముల బ్యాగ్ను ప్రక్కకు విసరి ఒక్కమారుగా

ఇంటిలోనికి మంటల మధ్యలో దూరి పోయాడు. అది చూచిన అందరూ

భయపడిపోయారు. లోపలవుండే బాలునితో పాటు ఈశ్వర్ కూడా అగ్నికి

ఆహుతి అయిపోతాడని అందరూ అనుకొన్నారు. ఈశ్వర్ లోపలికి పోయిన

విషయమును జమీందారు ఇంటిలో తెలుపగా, ఆ ఇంటిలోని వారందరూ

పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఈశ్వర్ లోపలికి పోయి పది

నిమిషములైనా బయటికి రాలేదు. అక్కడున్న వారందరూ లోపలవున్న

ఇద్దరి మీద ఆశను వదలు కొన్నారు. మంటలు భారీస్థాయికి చేరుకొన్నాయి.

అప్పుడు ఆ మంటల మధ్యలోనుండి ఈశ్వర్ నాలుగు సంవత్సరముల

పిల్లవాడితో సహ బయటికి వచ్చాడు. వారు అలా మంటలలోనుండి

వచ్చినప్పటికీ ఈశ్వర్ శరీరము మీదగానీ, ఆ బాలుని శరీరముమీదగానీ

ఒక్కచోట కూడా కాలలేదు. చిన్న బొబ్బకూడా కనిపించ లేదు. అలావారు

రావడము అందరికీ ఆశ్చర్యమైనది. ఆ చిన్నపిల్లవాని తల్లి తన కొడుకును

రక్షించినందుకు ఈశ్వర్ కాళ్ళమీద పడింది. ఈశ్వర్ ఇంటినుండి

వచ్చినవారు ఈశ్వర్ను ఇంటికి తీసుకొని పోయారు. ఆ సంఘటనతో ఆ

ఊరిలోగానీ, ప్రక్క ఊర్లలోగానీ ఈశ్వర్ అంటే తెలియని వారేలేరు.)


(యస్.పి గారి ఆదేశానుసారము సి.ఐ.డి. పార్టీ పోలీసులు వజ్రాల


దొంగతనములోని ఆధారముల కొరకు శోధిస్తూవుండిరి. సి. ఐ.డి. పోలీసు

ఒకడు జఠాజూట స్వామి భక్తులలో కలిసిపోయాడు. ఒక సంవత్సరము

రోజులుగా అదే పనిలో నిమగ్నమై స్వామి భక్తులలో ఒక భక్తునిగా తయారై

పోయాడు. సంవత్సర కాలమునుండి అనేక భక్తి కార్యములలో పాల్గొనుచూ

సేవచేస్తూ స్వామికి కొంత సన్నిహితముగా మారిపోయాడు. ధనుంజయ

అను సి.ఐ.డి పోలీస్ పూర్తి స్వామి భక్తునిగా మారిపోయాడు. అటువంటి

సమయములో స్వామితో సన్నిహితులుగా నున్నా వారంతా ధనుంజయతో 

బాగా కలిసివుండిరి. అలా ధనుంజయ తమ మనిషే అనునట్లు స్వామి

దగ్గరగానీ, మిగత భక్తుల దగ్గరగానీ మెలగజొచ్చెను. అలాంటి సమయము

లో ఒక దినము జఠాజూట స్వామివద్దకు పోయి ఇలా అన్నాడు.)

ధనుంజయ :- స్వామీ! నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఒక వజ్రాలనిధిని

చూపుతానన్నాడు. దానిని తీసి ఇస్తే రెండింతలు మనకు ఇచ్చి మూడింతలు

అతను తీసుకొంటానన్నాడు. దానికి నేను ఇద్దరము సమానముగా పంచు

కొందామని చెప్పాను. అతను చాలా రోజులనుండి నా మాటను

ఒప్పుకోలేదు. తర్వాత ఒకవంతు మనకు రెండు వంతులు తనకు అని

చెప్పుతూవచ్చాడు. దానికి నేను ఒప్పుకోలేదు. చాలా రోజుల తర్వాత

ఇప్పుడు నేను చెప్పినట్లే సగభాగము తీసుకొనునట్లు ఒప్పుకొన్నాడు. దానిని

ఎలా తీయాలో నాకు కూడా తెలియదు. మీరు దానికి ఏమైనా ఉపాయము

చెప్పండి.


(ధనుంజయ చెప్పిన మాటను విన్న జఠాజూట స్వామి దీర్ఘముగా

యోచించి ఇలా అన్నాడు.)


జఠాజూటస్వామి : ముందు నిధిని చూపమను, తర్వాత రెండు రోజుల్లో

తీసి ఇస్తానని చెప్పు. అతను నీకు ఒక భాగము ఇచ్చి రెండు భాగములు


అతనే తీసుకొనినా ఫరవాలేదు. నేను నీకు నిధిని సులభముగా తీయుటకు

ఉపాయమును చెప్పెదను. నిధి ఉన్నచోటును ముందు చూపితే ఒక

దినము ఆ స్థలములో పూజ నిర్వహించిన తర్వాత రెండవ దినము నిధి

సులభముగా లభించును. నీవు ముందు నిధివున్న జాగాను తెలుసుకొనిరా,

తర్వాత అక్కడ ఏమి పూజ చేయాలో నేను చెప్పుతాను. దానిప్రకారము

ఆ నిధిని సులభముగా తీసి ఇవ్వవచ్చునన్నాడు.

ధనుంజయ :- అలాగే స్వామీ! ఈ రోజే ఆ విషయమును అతనితో మాట్లాడి

వస్తాను.


(ఆ విధముగా పోయిన ధనుంజయ మరుసటి దినమే జఠాజూట

స్వామి దగ్గరకు వచ్చాడు. ధనుంజయ స్వామిని చూచి నవ్వుతూ ఇలా

అన్నాడు.)


ధనుంజయ :- అడిగివచ్చాను స్వామీ, అతను సంతోషముతో ఆ స్థలము

నాకు చూపించాడు. రేపు పూజచేసి ఎల్లుండి నిధిని తీసి ఇస్తామని చెప్పాను.

ఇక మీరు ఎట్లు చెప్పితే అట్లు చేస్తాను.


జఠాజూటస్వామి :- నేను ఆ స్థలమును చూచి ఆ స్థలమునుబట్టి ఎటువంటి

పూజ చేయాలో చెప్పెదను. ముందు మనము ఆ స్థలమును చూచి రావాలి.

(స్వామి మాట ప్రకారము ధనుంజయ స్వామిని పిలుచుకొని పోయి

20 మైళ్ళదూరములో ఒక గుట్టప్రక్కన ఒక స్థలమును చూపాడు.

స్థలమును చూచిన జఠాజూట స్వామి ఇలా అన్నాడు. )


జఠాజూటస్వామి :- ఇది రేగడి నేల కావున రేపు సాయంత్రము మూడు

గంటలకు పూజచేయాలి. ఈ పూజలో రక్తము ఉండకూడదు. అనగా

జంతుబలి పనికి రాదు. అందువలన ఎర్రని కుంకుమ నీళ్ళను వాడవలెను.

ఈ పూజలో ఈ రెండే ముఖ్యము, మిగతావన్నీ సాధారణ పూజయే

చేయవచ్చును.


(అలా స్వామి చెప్పిన ప్రకారము చేస్తానని ధనుంజయ చెప్పాడు.

ఇద్దరూ కలిసి వెనక్కు వచ్చారు. అలా వచ్చిన తర్వాత ధనుంజయ రేపటి

పూజకు ఏర్పాట్లు చేసుకుంటానని వెళ్ళిపోగా జఠాజూట స్వామి తన

మందిరమునకు వచ్చాడు.


మరుసటి దినము ధనుంజయ ఆ స్థలములో పూజచేయవలసి

వున్నది. అంతలోపల ఈ రోజు రాత్రికే జఠాజూటస్వామి తనవద్దనున్న

నకిలీ వజ్రములను ఆ స్థలములో ఒక అడుగులోతులోనే ఉంచవలెనను

కొన్నాడు. అలా ఉంచుట వలన రేపు ధనుంజయ అక్కడ పూజచేసి కొద్దిగ

త్రవ్వినంతమాత్రముననే అతనికి తాను అడుగులోతులో ఉంచిన వజ్రములు

కనిపించును. అపుడు అతను వజ్రములు దొరికినవను తృప్తితో అక్కడినుండి

పోవును. అలా అతను తానువుంచిన నకిలీ వజ్రములను తీసుకపోయిన

తర్వాత రెండవ రోజుపోయి భూమిలోపలనున్న అసలైన వజ్రముల నిధి

తాను తెచ్చుకోవచ్చుననునది జఠాజూట స్వామి మనసులోనున్న పథకము.


రేపు ఉదయమే నిధివున్న చోట పూజచేయాలని పోయిన

ధనుంజయ, స్వామిగారికి భక్తునిగా నటిస్తున్న ఇన్వెస్టిగేషన్ చేయుచున్న

పోలీసు. కావున ధనుంజయ మనసులోని పథకము ఏమనగా! నిధి ఉన్న

స్థలమును చూపించిన తర్వాత జఠాజూటస్వామి తన దగ్గరున్న భువనేశ్వరి

ఆలయములో నుండి దొంగిలించిన నకిలీ వజ్రములను అక్కడికి తెచ్చిపెట్టి,

అసలైన వజ్రాల నిధిని తాను కొట్టివేయాలని అనుకొనుననీ, ఆ పని

చేయుటకు ఆ రోజు రాత్రికే నకిలీ వజ్రములను తీసుకొని నిధి ఉన్నదని

తాను నమ్మించిన స్థలము వద్దకు వచ్చుననీ, అపుడు స్వామివద్ద

వజ్రములున్నట్లే రెడ్ హ్యాండెడ్గా జఠాజూట స్వామిని పట్టుకోవచ్చునని

అనుకొన్నాడు. అంతేకాక ఆ  విషయమునంతటినీ యస్.పి గారికి చెప్పి

స్వామిని అరెస్టు చేయుటకు కొందరు పోలీసులను గుట్టదగ్గర చెట్ల


చాటునుండి గమనించునట్లు చేసి స్వామి వచ్చిన వెంటనే అతనిని అరెస్టు

చేయుటకు తగిన ఏర్పాట్లు చేసిపెట్టాడు. ఈ విధముగా భక్తునిగా

మారువేషములోనున్న ధనుంజయ ప్లాన్ ఉండగా, స్వామి ఆ రాత్రికే

తనవద్దనున్న వజ్రములను ఎవరికీ తెలియకుండా ధనుంజయ చూపిన

స్థలములో ఉంచుటకు తన ప్లాన్ ప్రకారము తాను వచ్చాడు. చీకటిలో

తన కోసమే పోలీసులు చెట్లచాటున దాగి ఉన్నారను విషయము ఏమాత్రము

జఠాజూటస్వామికి తెలియదు. కావున స్వామి ధైర్యముగా అక్కడికి వచ్చి

అడుగులోతు త్రవ్వను మొదలు పెట్టాడు. అదే అదనుగా అక్కడే నక్కివున్న

పోలీసులు వచ్చి జఠాజూట స్వామిని, అతనివద్ద నున్న వజ్రములతో సహా

పట్టుకొన్నారు. ఊహించని ఆ పరిణామముకు స్వామి ఖంగుతిన్నాడు.

అరెస్టు చేసిన పోలీసులు స్వామిని యస్.పి ముందర హాజరు పరిచారు.

అప్పుడు యస్.పి గారు స్వామిని ఇలా ఇంటరాగేషన్ చేశాడు.)


యస్.పి :- స్వామీ! మీవద్దనున్న వజ్రములు ఎక్కడివి?

జఠాజూట :- అవి చాలా కాలమునుండి మాదగ్గరే ఉన్నాయి.

యస్.పి :- చాలా కాలమునుండి అంటే ఎంత కాలమునుండి?

జఠాజూట :- మా పెద్దల కాలము నుండి ఉన్నాయి.

యస్.పి :- మీ పెద్దల కాలమునుండి ఉన్న వజ్రములను మీరు రాత్రివేళ

అక్కడికి ఎందుకు తీసుకెళ్ళారు?

జఠాజూట :- కొంత కాలము అక్కడ దాచిపెట్టాలని తీసుకెళ్ళాము.

యస్.పి :- మీరు వాటిని దాచవలెనని ఎందుకు అనుకొన్నారు?

జఠాజూట :- భద్రత కోసము.

యస్.పి :- అక్కడే ఎందుకు దాచాలనుకొన్నారు?

జఠాజూట :- అక్కడ గుట్ట గుర్తుగా ఉంటుందనుకొన్నాను.


యస్.పి :- ఇంతవరకు నీవు చెప్పినదంతా బాగానే ఉంది. ఇందులో నీ

తప్పు ఏమీ లేదు. కానీ మేము నిన్నటి దినము నిన్ను అరెస్టు చేయకముందే

ధనుంజయను అరెస్టు చేసి విచారించాము. మాకు అన్ని విషయములు

చెప్పాడు. విచారణలో అన్ని విషయములు తెలిసిన తర్వాత కూడా మీరు

చెప్పిన మాటను నమ్మమంటారా! మేము దొంగిలించినది నకిలీ వజ్రములని

దేవాలయమునకు వ్రాసిన మీ హస్తములతో వ్రాసిన ఉత్తరమును చూచిన

తర్వాత కూడా మీరు చెప్పిన మాటను నమ్మమంటారా? రేపు పూజ చేయమని

ధనుంజయకు చెప్పి, అతనిని మోసము చేయుటకు రాత్రికి రాత్రే అక్కడికి

పోయి, ప్రత్యక్షముగా దొరికిన తర్వాత కూడా మీరు చెప్పిన మాటను

నమ్మమంటారా? సరే! మీరు చెప్పే ప్రతిమాటను నేను గ్రుడ్డిగా నమ్మేస్తాను.

నేను నమ్మినా ధనుంజయ నిన్ను నమ్మడే! ఇపుడు అతడే నిన్ను అడుగుతాడు.

అతనికి నీవు ఏమి చెప్పుతావో మేము ప్రక్కనుండి వింటాము.


(అంతలోనే ధనుంజయ చేతులకు బేడీలు తగిలించుకొని అతనిని

అక్కడికి తెచ్చారు. అపుడు ధనుంజయ స్వామిని చూచి ఇలా అన్నాడు.)

ధనుంజయ :- స్వామీ! నేను నిధిని తీయుటకు పోవుచున్నానని పోలీసులకు

చెప్పి పట్టించావు. నీకు ఇది న్యాయమేనా?

జఠాజూట :- నేను నిన్ను గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు.

ధనుంజయ :- అయితే నీవు ఎందుకు అక్కడికి పోయావు? నన్ను ఇక్కడ

పట్టించి అక్కడికి పోయి నీవు నిధిని కొట్టివేయాలనే కదా! నీ ఉద్దేశ్యము.

జఠాజూట :- లేదు నిన్ను పట్టించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.

ధనుంజయ :- అయితే నీవు అక్కడికి ఎందుకు పోయావు? అక్కడికి పోయి


నేను చూపిన నిధిని నీవు ఎందుకు తీసుకొన్నావు? మీరు ఒక స్వామియైవుండి

కూడా అబద్దము చెప్పితే ఎలా? నీవు ఆ నిధిని తీసుకొన్నట్లు నాకు తెలిసింది.

నీ దగ్గర ఆ నిధి వజ్రములు దొరికినట్లు కూడా తెలిసింది. ప్రత్యక్షముగా

వజ్రములు దొరికినా అబద్ధము చెప్పడములో అర్థములేదు.


(ధనుంజయ చెప్పిన మాటలు విని స్వామి సందిగ్ధములో పడి

పోయాడు. ఇపుడు రెండు వైపులా ఉచ్చు ఉన్నదని నిధి తీసుకోలేదనినా

తన దగ్గర దొరికిన వజ్రములను గురించి ఉచ్చు తగులుకోక తప్పదు.

ఒకవేళ తనదగ్గరున్న వజ్రములు నిధిలో దొరికినవని చెప్పినా ప్రభుత్వ

అనుమతి లేకుండా నిధిని తీయడము నేరమే అవుతుంది. కావున అట్లు

చెప్పినా ఉచ్చు తగులుకోగలదు. ఇన్ని చిక్కులకంటే నిజము చెప్పి శిక్షను

తగ్గించుకోవడము మంచిదనుకొన్నాడు. )


యస్.పి :- ధనుంజయ మాటకు ఏమి సమాధానము చెప్పగలరు?

జఠాజూట :- ఒక్క విషయము మాత్రము సత్యము. నేను ధనుంజయ

చూపిన నిధిని తీయలేదు. నావద్దవున్న నకిలీ వజ్రములను అక్కడ పెట్టి

రావాలనుకొన్నాను. ఆ నకిలీ వజ్రములను ధనుంజయ తీసుకొని పోయిన

తర్వాత, ఆ నిధిలోనున్న వజ్రములను తీసుకోవాలనుకొన్నాను. నేను

ధనుంజయను మోసము చేయాలనుకొన్నాను. కానీ మోసము జరుగకముందే

నేను మీకు దొరికిపోయాను. ఇక నావద్దవున్న వజ్రములు మీరు చెప్పినట్లు

భువనేశ్వరి దేవాలయములోనివే. నా మనుషులచేత నేనే వాటిని దొంగి

లించాను. అవి నావద్దకు చేరిన తర్వాత మేము దొంగిలించిన వజ్రములు

నకిలీవని తెలిసింది. ఇప్పుడు సమయము వచ్చింది కాబట్టి నిధివద్ద అడుగు

లోపలే నావద్దగల నకిలీ వజ్రములను ఉంచిపోవాలనుకొన్నాను. అలా

ఉంచిన వజ్రములను నిధిగా భావించి ధనుంజయ వాటిని తీసుకొని పోయిన

భువనేశ్వరి దేవాలయములోనివే.


తర్వాత, ఆ నిధిలోని అసలైన వజ్రములను తీసుకోవాలనుకొన్నాను. కానీ

నేను నా నకిలీ వజ్రములతో అక్కడికి పోగానే నావద్దనున్న వజ్రములతో

సహా దొరికిపోయాను. జరిగిన వాస్తవ సంగతి ఇంతే. ఇంతకంటే మించి

ఏమీలేదు.


యస్.పి :- నీవు నిజము ఒప్పుకొన్నావు. కావున నీకు శిక్ష తగ్గేలా మేము

ప్రయత్నము చేస్తాము. నీవు ఇంకా కొన్ని నిజములు చెప్పవలసి వున్నది.

భువనేశ్వరి దేవాలయములోని అసలైన వజ్రములు పోయి వాటి స్థానములో

నకిలీ వజ్రములు చేరిపోయాయి. ఆ విషయము నీకు తెలియక అక్కడున్నది

నిజమైన వజ్రములనే ఉద్దేశ్యముతోనే వాటిని దొంగిలించారు. అవి మీ

చేతికి వచ్చి నకిలీ వజ్రములని తెలిసిన తర్వాత దేవాలయ కమిటీ వారికి

నీవు లేఖ వ్రాశావు. ఆ లేఖలో గుడిలోనివి నిజమైన వజ్రములు కాదని

పేర్కొన్నావు. అలా వ్రాయడములో నీ ఉద్దేశ్యము ఏమిటి?


జఠాజూట :- అలా వ్రాయుట వలన అసలైన వజ్రముల ప్రస్తావన ఎక్కడో

ఒకచోట తెలుస్తుందని అనుకొన్నాను. అవి నకిలీ వజ్రములని తెలుపడము

వలన ఇటు పోలీసువారు అసలైన వజ్రముల కొరకు విచారిస్తారు కదా!

అప్పుడు వాటి ఆచూకీ తెలుస్తుందనీ, తెలిసిన తర్వాత వాటిని ఎలా

కాజేయాలో అప్పుడు ఆలోచిస్తామని అనుకొన్నాను.


(ఈ విధముగా జఠాజూట స్వామి చట్టము చేతిలో తాను దోషిగా

ఒప్పుకొన్నాడు. కానీ అంతవరకు ధనుంజయ ఒక పరిశోధనా విభాగపు

(సి.ఐ.డి) పోలీస్ అని జఠాజూటస్వామికి తెలియదు. ధనుంజయ చాలా

తెలివిగా పనిచేసి, జఠాజూటస్వామిని తప్పించుకొను అవకాశము లేకుండా

చేసినందుకు యస్.పి. గారు ధనుంజయను అభినందించి, తాటిమాను

మునెప్ప క్రైమ్ ఫైలును ధనుంజయకు ఇచ్చి, అతన్ని కూడ సాక్ష్యాధారములతో

పట్టించమని చెప్పాడు. జఠాజూట స్వామిని కోర్టుకు అప్పజెప్పి ఆ కేస్


తొందరగా ట్రైల్కు వచ్చునట్లు చేశారు. చివరకు జఠాజూట స్వామికి శిక్ష

పడింది. ఆయన జైలుకెళ్ళడముతో జఠాజూటస్వామి అధ్యాయము

అంతటితో ముగిసినట్లయినది.)


(జఠాజూట స్వామి దొరికిపోయి జైలుకెళ్ళడమును పత్రికలు

ప్రచారము చేయగా ఆ వార్త అందిరికీ తెలిసిపోయింది. అట్లే మునెప్పకూ,

మునెప్ప మనుషులకూ విషయము తెలిసిపోయింది. మునెప్ప అసలైన

వజ్రాల కొరకు ప్రయత్నము చేయమని తన తమ్ముడైన వెంకుకు చెప్పాడు.

వెంకు తనకు కూడా స్నేహితుడైన హీరోతో కలిసి వజ్రముల ఆచూకీ

కొరకు తీవ్రముగా ప్రయత్నించను మొదలు పెట్టారు. తమ చేతినుండి

పాము జారిపోయి నప్పటినుండి కొన్ని సంవత్సరములు వజ్రాల ఆచూకీ

తెలియక పోవడము వారు జీర్ణించుకోలేక పోవుచున్నారు. ఇక ఏదో ఒక

ప్రయత్నము చేయాలనుకొన్నారు. వారు అట్లుండగా పై అధికారులనుండి

ప్రశంసలు పొందిన ధనుంజయ, మునెప్ప ముఠాను ఎలాగైనా

పట్టుకోవాలనుకొన్నాడు. దాని కొరకు తమ డిపార్టుమెంటులోని నలుగురు

వ్యక్తులను తీసుకొని ఐదుమంది ఒక బృందముగా ఏర్పడినారు.

ఐదుమంది సభ్యుల గుంపులో ధనుంజయ గుంపు నాయకుడుగా ఉండునట్లు

మాట్లాడుకొన్నారు. ఈ మారు ధనుంజయ, ఆ నలుగురు సభ్యులు దొంగల

ముఠా అవతారము ఎత్తారు. ఈ ఐదుగురు ముందే ఏర్పాటు చేసుకొన్నట్లు,

ఒక ఘాట్రోడ్డులో పోలీసుల కారును ఆపి నలుగురు పోలీసులను, ఒక

యస్.ఐ ని తాళ్ళతో కట్టివేసి వారు తెస్తున్న పది లక్షల ట్రెజరి డబ్బును

దోచుకొని పోయారు. ఆ దోపిడీ ఎలా జరిగినదీ వివరిస్తే, ఒక

ఘాట్ రోడ్డులో ఐదుమంది దొంగలగుంపు తమకారును రోడ్డుకు అడ్డముగా

ఆపి, అందులో ముగ్గురు ఇద్దరిని కొట్టుచుండిరి. అంతలోనే పోలీసు


వారు అక్కడికిపోయి రోడ్డులో కారు నిలిపివుండడమూ, ముగ్గురు మనుషులు

ఇద్దరిని కొట్టుచుండడమునూ చూచి, తాగిన మత్తులో పోట్లాడుచున్నారనుకొని

తమవద్దనున్న లాఠీకట్టెలను తీసుకొని కారు దిగిపోయి, ముగ్గురిని పట్టుకొని

ఆపి ఎందుకు వారిని కొట్టుచున్నారని అడిగారు.


అప్పుడు అక్కడ పోట్లాడుచున్న ఐదుమంది ఒక్కమారు వారివద్ద

నున్న రివాల్వార్లు తీసి పోలీసులకు గురిపెట్టి కదలకూడదనీ, చేతులు

పైకి ఎత్తమని తాము దొంగలమని చెప్పారు. అకస్మాత్తుగా జరిగిన ఆ

సంఘటనకు బిత్తర పోయిన పోలీసులు, ఏమి చేయునది లేక చేతులు

ఎత్తి నిలబడ్డారు. దొంగలలో ఇద్దరు వచ్చి వారివద్దనున్న తాళ్ళతో పోలీసుల

చేతులు కట్టి వేశారు. తర్వాత అందరూ కలిసి రోడ్డుకు దూరముగా ప్రక్కకు

పోలీసులను తీసుకపోయి అక్కడ చెట్టుకొకరిని కట్టివేసి, రోడ్డుమీదకు వచ్చి

తమ కారులో పారిపోయారు. తర్వాత పోలీస్ స్టేషన్కు ఫోన్చేసి మీ

పోలీస్లను ఫలానాచోట కట్టి వేశామని, ట్రెజరీడబ్బును మేము దోచుకున్నా

మని చెప్పారు. ఆ దోపిడీతో ప్రజలలో పోలీసులకు మర్యాద పోయినట్లయి

నది. వారిని ఎలాగైనా పట్టుకొని తీరుతామని పోలీసులు ప్రకటించారు.

ఈ విషయమునంతటినీ పేపర్లో గమనించిన మునెప్ప మరియు అతని

ముఠాలోని అందరూ ఆశ్చర్య పోయారు. తమకంటే మించిన దొంగలు

తయారైనారని అనుకొన్నారు. పోలీసులనే కట్టివేసి ట్రెజరీ డబ్బును దోచుకున్న

వారు చాలా ధైర్యముగల దొంగలని అనుకొన్నారు. కొంత కాలానికి ఆ

క్రొత్త దొంగల నాయకుడు ధనుష్ అనీ, వారు అన్ని రాష్ట్రములలో పెద్ద

పెద్ద దోపిడీలు చేశారనీ, ప్రస్తుతము వారు ఆంధ్రరాష్ట్రములో ఉన్నారనీ,

వారు బ్యాంకులను దోచుకోవాలను పథకముతో ఉన్నారనీ, అందువలన


బ్యాంకులన్నీ అప్రమత్తముగా ఉండవలెననీ, పోలీసులు న్యూస్ పేపర్లలో

తెలిపారు. అలా వచ్చిన వార్తను మునెప్ప మరియు అతని సభ్యులు అందరూ

చూచారు. ఆ దొంగల నాయకుడైన ధనుష్తో ఎలాగైనా పరిచయము

చేసుకోవాలనుకొన్నాడు.


మారువేషములో దొంగ ధనుష్వలె నటిస్తున్న ధనుంజయ కూడా

మునెప్ప మనుషులను కలుసుకోవాలని ఉన్నాడు. మునెప్ప మనుషులను

ముందు నుండి అనుమానిస్తున్న ఇంటలిజెన్స్ వారు ఒకనాడు మునెప్ప

ముఠాలోని నూకా అనారోగ్యముతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు

ధనుంజయకు తెలిపారు. అప్పుడు ధనుంజయగుంపులోని సురేష్ అనునతడు

కూడా అదే ఆసుపత్రిలో చేరునట్లు ధనుంజయ చెప్పిపంపాడు. సురేష్

ధనుంజయ చెప్పినట్లు ఆస్పత్రిలో చేరాడు. మునెప్ప మనిషి ఫలానావాడని

ధనుంజయ ముందే తెలిపిన దానివలన, సురేష్ అతనితో మాట్లాడుటకు

అవకాశము ఏర్పరుచుకొన్నాడు. సాయంకాలము మునెప్ప మనిషితో సురేష్

ఇలా మాట్లాడినాడు.)


సురేష్ :- నీకు ఏమి


జబ్బు బ్రదర్?

నూకా :- న్యూమోనియా అని డాక్టరు చెప్పాడు.

సురేష్ :- న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల జ్వరము అంటారు కదా!

నూకా :- అవును అదే.

సురేష్ :- ఎన్ని రోజులు ఉండమన్నారు?

నూకా :- ఒక వారము రోజులు ఉండమన్నారు.

సురేష్ :- నాకు కూడా నెల క్రిందట ఇదే జ్వరము వచ్చింది. అప్పుడు

మూడురోజులే ఆస్పత్రిలో ఉన్నాను.


నూకా :- న్యూమోనియా రాత్రిపూట చలిలో మేల్కొనివుంటే వస్తుందట.

నీకు ఎందుకు వచ్చింది?

సురేష్ :- ఆ మాట వాస్తవమే, నేను కూడా ఆరురోజుల క్రిందట చలిలో

రాత్రంతా మేల్కొన్నాను. దానికే నాకు ఇప్పుడు అదే జ్వరము వచ్చింది.

ఇప్పుడు చలికాలము కదా! అందువలన చాలామందికి ఈ రోగమే వస్తుంది.

అయినా ఇంటిలో చలి తగలకుండా ఉండేవారికి రాదు కదా!

నూకా :- ఇంట్లో ఉండే వారికి రాదేమో! కానీ నేను బయట ఉండుట

వలన వచ్చింది.


సురేష్ :- ఏమి చేస్తాము, కొన్ని సమయాల్లో తప్పనిసరిగా బయట

ఉండవలసిన పనిపడుతుంది. నాకు ఒకరోజు రాత్రిపూట డ్యూటీ చేయవలసి

వచ్చింది. ఒకరోజు చలిలో ఉంటూనే ఈ జ్వరము వచ్చింది. అందువలన

రాత్రిపూట ముక్కులకు గుడ్డను అడ్డముగా కట్టుకొమ్మని డాక్టరు చెప్పాడు.

నూకా :- నీవు ఏమి డ్యూటీ చేస్తావన్నా.


సురేష్ :- డ్యూటీ అంటే ప్రభుత్వ ఉద్యోగము కాదు. కానీ స్వంత డ్యూటీ

అనుకో, బ్రతికేదానికి ఏదో ఒకటి చేయాలి కదా!

నూకా :- ఇంతగా పరిచయమేర్పడిన తర్వాత నాకు చెప్పేదానికి

మొహమాటు పడుచున్నావు. బ్రతికే దానికి ఏ డ్యూటీ చేస్తే ఏమిటి? నీ

డ్యూటీ నాకు చెప్పకూడదా?

సురేష్ :- నీకు చెప్పే దానికి ఏముందన్నా? నా డ్యూటీని చెప్పాలంటే నాకే

సిగ్గయైనట్లుంది. నీవు ఏమీ అనుకోనంటే చెప్పుతాను. నేను చిన్నచిన్న

దొంగతనములు చేసి బ్రతుకుతుంటాను.

నూకా :- నీవు నాముందర సిగ్గుపడవలసిన పనిలేదు. నేనూ నీలాంటి

దొంగనే, నేను ఏమి సిగ్గుపడలేదు కదా! నీవు చిన్న దొంగవే అయితే నేను


నీకంటే పెద్దదొంగను. దానికేముంది బ్రతికేదానికి ఎవరి పని వారిది.

సురేష్ :- అయితే నాకు ఒక సహాయము చెయ్యన్నా, బ్రతికినన్నాళ్ళు నీ

పేరే చెప్పుకొంటాను.

నూకా :- ఏమి సహాయము చెయ్యాలి, చెప్పు.


సురేష్ :- నేను నాతోపాటు ఇంకా నలుగురు నాకు తెలిసిన వాళ్ళున్నారు.

మేము ఈ చిన్న దొంగతనాలు ఎన్ని చేసినా బ్రతకలేకున్నాము. మాకు

కూడా ఏదైనా పెద్ద దొంగతనము ఉంటే చెప్పు. అది ఎలా చేయాలో

కూడా చెప్పితే ఎట్లయినా చేస్తాము. పెద్ద దొంగతనములు ఎట్లు చేయాలో

మాకు తెలియదు.

నూకా :- తెలియనపుడు చెప్పితే చేసేది కష్టమవుతుంది. పెద్ద దొంగతనము

లలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. చెప్పితే మీరు

చేయలేరు, కావున మీరు మేము పోయేటప్పుడు మా వెంటరాండి, మేము

చేసేటప్పుడు ఎలా చేస్తున్నామో చూచి నేర్చుకోవచ్చును.

సురేష్ :- ఈ రోజు నీతో కలిసి మాట్లాడినందుకు నాకు చాలా మేలైనది.

బ్రతికే దానికి క్రొత్త దారి దొరికినట్లయినది. నీ వెంట మమ్ములను రమ్మని

ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాము.

(ఈ విధముగా నూకా, సురేష్ ఇద్దరూ పరిచయమయ్యారు. సురేష్

అడ్రస్ నూకాకు ఇచ్చి పంపాడు. నూకా తన మనస్సులో ఇలాంటి చిల్లర

దొంగలు తమ చేతిలో ఉండడము మంచిదనుకొన్నాడు. కొంతకాలము

గడచిన తర్వాత సురేష్ ను నూకా పిలిచాడు.)


(ప్రబోధ ఆశ్రమములో రాఘవ, రాఘవ భార్యలు దుందుభి,


రాధేశ్వరి, రాజయోగానందస్వామివద్ద దైవజ్ఞానమును సంపూర్ణముగా

తెలుసుకొంటున్నారు. భూమిమీద ఎక్కడ అసలైన దైవజ్ఞానముంటుందో

అక్కడికి ఖగోళములోని కొన్ని గ్రహములు వచ్చి పోవుచుండెను. దైవజ్ఞానము

సంపూర్ణముగ ఉన్న మనుషుల తలలనుండి ఒక ప్రత్యేకమైన కిరణములు

వెలుగురూపముతో బయటికి వచ్చుచుండును. ఆ వెలుగు బయల్పడుచోట

సంపూర్ణ జ్ఞానమున్నదని గ్రహించిన గ్రహములు దైవజ్ఞానమును తాము

కూడా తెలుసుకొనుటకు వచ్చి పోవుచుందురు. ఆ విధముగా రాజ

యోగానందస్వామి ఆశ్రమమునకు ఎన్నో గ్రహములు వచ్చి స్వామిని

దర్శించుకొని పోవుచుండును. ఒక దినము రాఘవ ఆశ్రమములో ఒక

చోటవుండగా, అక్కడ ఉన్నట్లుండి మంచి సువాసన రావడం

మొదలుపెట్టింది. ఆ సువాసనను రాఘవ ఎప్పుడూ చూడలేదు. దానిని

పీల్చుకొనేకొద్దీ ఇంకా పీల్చుకోవాలనిపిస్తుండెను. కొద్దిసేపు తర్వాత రాఘవ

బయటికి పనిమీద పోయి పది నిమిషముల తర్వాత తిరిగి మొదటవున్న

జాగాలోనికే వచ్చాడు. అప్పుడు కూడా అక్కడ సువాసన వెదజల్లుచుండెను.

ఆ విధముగా సువాసన రావడము రాఘవకు ఏమీ అర్థము కాలేదు. దానిని

గురించి రాజయోగా నంద స్వామిని అడగవలెనని అనుకొన్నాడు.


నెల రోజుల తర్వాత ఒక దినము అమావాస్య రాత్రి దాదాపు

ఒంటి గంట సమయములో రాఘవ నిద్రనుండి మేల్కొన్నాడు. కళ్ళు

తెరిచి చూసాడు. నల్లని చీకటిలో తెల్లని వస్తువు కనిపించింది. అటువంటి

దృశ్యమును రాఘవ ఎప్పుడూ చూడలేదు. ఇదేమిటని జాగ్రత్తగా చూచాడు

భూమికి రెండు అడుగుల ఎత్తులో అదే దృశ్యము కనిపించింది. చిన్న

నిమ్మపండువలె గుండ్రముగానున్న తెల్లని కాంతితో కూడుకొన్న ఆకారము

రెండవమారు రాఘవ చూచిన అరనిమిషమునకే వేగముగా క్రిందికి


పడిపోయినట్లయి కనిపించకుండా పోయినది. ఒకమారు సువాసనను

చూచిన రాఘవ, తర్వాత నెలరోజులకే తెల్లని వెలుగును కల్గిన ఆకారమును

చూడడము జరిగింది. ముక్కుకు తెలిసిన సువాసన, కంటికి కనిపించిన

ప్రకాశమును గురించి రాజయోగానంద స్వామిని ఒకరోజు రాఘవ

అడిగాడు. రాఘవ చెప్పినదంతావిన్న రాజయోగానంద స్వామి రాఘవతో

ఈ విధముగా అన్నాడు.)


రాజయోగానంద :- భూమిమీద మనిషి ఎంతో విజ్ఞానమును పొందినా,

ఇంకా మనిషికి తెలియనివి చాలా ఉన్నాయి. ఇంతవరకు తెలియనిది

క్రొత్తగా తెలిసినపుడు అది ఒక వింతగానే ఉంటుంది. మనిషికి ఇంతవరకు

తెలియనివాటిలో నీవు చూచినవి కూడా ఉన్నవి. వాటిని గురించి మనిషి

వింతగా చెప్పుకోవడము తప్ప, ఇది ఫలానిది అని చెప్పలేని స్థితిలో

ఉన్నాడు. నీవు అడిగావు కావున, నీకు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది.

కనుక చెప్పుచున్నాను. జాగ్రత్తగా విను. మనము నివసిస్తున్న భూమిమీదనే

కాక ఖగోళములో కూడా కొన్ని కోట్ల గ్రహములున్నవి. అవి అన్నియూ

జీవము కల్గివున్నవే. వాటిలో చిన్నవి, పెద్దవి, సామాన్యమైనవి,

అసామాన్యమైనవి. గొప్పవి, మహా గొప్పవి ఇట్లు ఎన్నో రకములు గలవు.

అందులో కొన్ని గ్రహములకు దైవజ్ఞానమంటే అమితమైన ఇష్టము. దైవ

జ్ఞానము మీద ఇష్టముగల గ్రహములు భూమిమీద ఉత్తమమైన జ్ఞానము

ఎక్కడున్నదో అక్కడికి వచ్చిపోవుచుందురు. అలా వచ్చుట వలన వారు

కూడా గొప్ప జ్ఞానమును తెలుసుకొంటున్నారు. తెలుసుకోవడమే కాకుండా,

జ్ఞానము ప్రకారము ఆచరించుచున్నారు.


ఇప్పుడు ముఖ్యముగా చెప్పునదేమనగా! ప్రస్తుత కాలములో భూమి

మీద మన ఆశ్రమములో తప్ప ఎక్కడా నిజమైన దైవజ్ఞానములేదు. ఈ


విషయము తెలిసిన కొన్ని గ్రహములు ఎన్నో లెక్కలేనన్ని ఇక్కడికి వచ్చి

పోవుచున్నవి. వాటిలో ఎన్నో రకములున్నవని చెప్పానుగా! ఒక ప్రత్యేకమైన

లక్షణములుగల గ్రహము ఇక్కడికి వచ్చినపుడు, దానిని తాకిన గాలికి

సువాసన ఏర్పడుచున్నది. ఆ గాలిని నీవు పీల్చి సువాసనను గ్రహించగలి

గావు. సువాసన నీకు తెలిసినా, అక్కడేనున్న గ్రహము యొక్క ఉనికి

నీకు తెలియలేదు. అలాగే నీకు కనిపించిన వెలుగు కూడా అటువంటిదే.

ఆ వెలుగు బహుశా నాగమణిదై ఉంటుంది. నాగమణిగల నాగుపాము

గ్రహము వచ్చినపుడు మణిని మనము చూడవచ్చును. కానీ అటువంటి

గ్రహాలు భూమిమీదికి అరుదుగా వస్తాయి. మణిగల పాము గ్రహము

భూమిమీద ఎవరికీ కనిపించదు. కొందరు దైవశక్తిగలవారు మాత్రమే

వాటిని చూడగలరు. మణి గ్రహములు తమను ఎవరైనా చూచుచున్నారని

తెలిసిన వెంటనే కనిపించకుండా పోవును. అలాంటి సంఘటనే నీకు

జరిగిందని తెలియుచున్నది. దీనినిబట్టి నీలో కొంతదైవశక్తి ఇమిడి

ఉన్నదని అర్థమగుచున్నది.


రాఘవ :- స్వామీ! మన ఆశ్రమమునకు మీరు చెప్పినట్లు గ్రహములు ఈ

మధ్యనే వస్తున్నాయా? లేక ముందునుండి వస్తున్నాయా?

రాజయోగానంద :- నాకు తెలిసి గత ముప్పయి సంవత్సరముల నుండి

వస్తున్నవి. ఖగోళములోనున్న గ్రహశక్తులేకాక, కనిపించని ఎందరో

మహర్షులూ, దేవతలు కూడా వచ్చిపోవుచున్నారు. వారందరూ ఇక్కడున్న

జ్ఞానము మీద ఆసక్తితోనే వచ్చారు.


రాఘవ :- మేము మీవద్ద చాలాకాలమునుండి ఉన్నాము కదా! మాకు ఈ

విషయము ఏమాత్రము తెలియదు. ఇక్కడికి ఎందరో కనిపించనివారు


వచ్చిపోతున్నా, వారు వచ్చినట్లుగానీ, పోయినట్లు గానీ ఏమీ తెలియదు.

మీరు చెప్పితే అర్థమైనది. కనిపించని వారు ఎందరో వచ్చి పోతున్న

విషయము మాకెందుకు తెలియడము లేదు. మాకు తెలియుటకు మేము

ఏమి చేయాలి?


రాజయోగానంద :- నీకే కాదు నాకు కూడా కనిపించలేదు. వారు ఎవరికీ

కనిపించరు. నీకు వెలుగు కనిపించినట్లు, సువాసన వచ్చినట్లు తెలిసింది.

కదా! అలాగే నా శరీరమును ముట్టుకున్నట్లు నాకు అప్పుడప్పుడు స్పర్శ

ద్వారా తెలియుచుండును. కానీ ఎవరు ముట్టుకొన్నదీ తెలియదు. వేరే

శరీరములోనికి ప్రవేశించి గ్రహములు చెప్పినపుడు ఎవరెవరు వస్తున్నది

తెలిసింది. ఇతర గ్రహములు వేరే శరీరమునుండి మాట్లాడి తెలిపినపుడు

తెలిసిన విషయమునే నేను చెప్పాను. కానీ నేను చూచి చెప్పినది కాదు.

నా పాదములకు, కాళ్ళకు తగిలిన స్పర్శ వలన ఎవరో నాదగ్గరికి వచ్చారని

మాత్రము తెలుసు. అట్లే నేను జ్ఞానమును చెప్పునపుడు నా జ్ఞానమును

వినేదానికి కనిపించని వారు కొన్ని వందలమంది వచ్చి వినిపోవునట్లు

కూడా తెలుసు. ఇదంతా ఇక్కడ తెలియబడు జ్ఞానము వలన జరుగుచున్నదే

గానీ వేరుకాదు. అందువలన మీరు కూడా సంపూర్ణ జ్ఞానులు కావలెనని

తెలుపుచున్నాను. అట్లు సంపూర్ణ జ్ఞానము మనవద్ద ఉన్నపుడు జ్ఞానము

యొక్క విలువ తెలిసినవారు ఎవరైనా మనవద్దకు తప్పకుండా రాగలరు.


( ఈ విషయము అంతా  స్వామి ద్వారా తెలుసుకొన్న రాఘవ అప్పటి 

నుండి జ్ఞానము మీద ఎక్కువ ఆసక్తికల్గి తెలుసుకొనుటకు ప్రయత్నించు

చుండెను.)


(నూకా రమ్మని చెప్పిన వెంటనే సురేష్, ధనుష్క చెప్పి బయలుదేరి


వచ్చాడు. తను పిలువగానే వచ్చిన సురేషను చూచి నూకా ఇట్లనెను.)

నూకా :- ఏమి సురేష్ ఎలా ఉన్నావు?

సురేష్ :- బాగున్నానన్నా, ఏమన్నా పిలిచినావు, ఏమైనా ప్రోగ్రామ్

ఉందా?


నూకా :- ముందు మీవాళ్ళందరిని పిలుచుకొని వచ్చి చూపి, నాకు

పరిచయము చేయి. నన్ను గురించి చెప్పావా?

సురేష్ :- చెప్పాను. మొదట మన పరిచయమెలా అయినది చెప్పాను.

అందుకు మావాళ్ళు బాగా నవ్వారు. నేను చిన్న దొంగతనాలు చేస్తుంటానని

చెప్పాను కదా! దానికి మా పెద్దన్న ధనుష్ నన్ను బాగా మెచ్చుకొన్నాడు.

ధనుష్ అన్నే మాకు పెద్దగా ఉంటాడు. మనము ఎంత పెద్దవారమైనా

ఎదుట వారిముందు అణిగి ఉండాలన్నది అన్న ధనుష్ నీతి.

ఉండాలన్నది అన్న ధనుష్ నీతి.

నూకా :- ధనుష్ అంటే మీ అందరికీ నాయకుడా? మీ వాళ్ళందరినీ

ఒకమారు పిలుచుకొనివస్తే, మా నాయకుడు మునెప్పకు పరిచయము

చేస్తాను. మీ విషయము మునెప్పకు చెప్పాను. ఒకమారు వచ్చి

పొమ్మన్నాడు.


సురేష్ :- తప్పకుండా వస్తాము. ఎప్పుడు రమ్మంటావు, ఎక్కడికి

రమ్మంటావు?

నూకా :- వీలైతే రేపేరండి. మీరు అందరూ రేపు ఇదే టైముకు, ఇదే

చోటికి వస్తే నేను మా నాయకుడైన మునెప్పవద్దకు తీసుకుపోతాను.

సురేష్ :- అలాగే రేపు ఈ వేళకు ఇక్కడికే వస్తాము. అయితే నేను

ఇప్పుడే బయలుదేరి పోయి, అందరికీ విషయము తెల్పి పిలుచుకొనివస్తాను.

(ఆ విధముగా మాట్లాడిన సురేష్ వెంటనే అక్కడినుండి బయలు

దేరి పోయాడు. ధనుష్కు ఈ విషయమంతా చెప్పాడు. ఆ సమయము


కొరకే వేచియున్న ధనుంజయ (ధనుష్) తన మనుషులను తీసుకొని సురేష్

వెంట రెండవ రోజు నూకా చెప్పిన చోటికి వచ్చారు. అప్పటికే నూకా

అక్కడ సురేష్ కొరకు వేచియున్నాడు. సురేష్ వచ్చిన వెంటనే తన

వారందరినీ నూకాకు పరిచయము చేశాడు. అందరూ కలిసి బయలుదేరి

పోయారు. కొంత దూరము కిరాయి కారులో ప్రయాణము చేసిన తర్వాత

ఒక ఊరిలో దిగి అక్కడినుండి చిన్న ప్యాసింజర్ వ్యాన్లో ప్రయాణించారు.

అది అడవిలో పోతున్నపుడు ఒక రైల్వే గేటు దగ్గర వారంతా దిగినారు.

అక్కడ ఏ స్టేజీకానీ, ఏ ఊరికి పోయే దారికానీ లేదు. అడవిలోనికి

వెదురుకట్టెలకు పోయేవారు అక్కడ దిగి అడవిలోనికి పోవడము అలవాటు.

వీరు అక్కడ దిగడము వలన అక్కడున్న గేటుమ్యాన్ కూడా వీరంతా కట్టెలకు

అడవిలోనికి పోయేవారనుకొన్నాడు. అక్కడినుండి అడవిలోనికి దూరినవారు

కాలినడకన రెండు గంటలు ప్రయాణించి పూర్తి అడవిలోనికి పోయారు.

అక్కడ చుట్టూ అల్లుకొనిన పొదలమధ్యలో, కొంత ఖాళీస్థలములో ఒక

టెంట్ కట్టబడివున్నది. అక్కడికి పోవాలంటే ఒక చెట్టు పొదలో మాత్రము

దారి కలదు. అదియూ కంపచెట్లతో మూయబడి ఉన్నది. అక్కడికి

పోకముందే, అక్కడికి రెండు వందల మీటర్ల దూరములో ఉండగా, నూకా

ఒక పక్షి అరుపులాగా అరువగా, అలాంటి అరుపే దూరము నుండి

వినిపించింది. తర్వాత ఒక చెట్టు పొద వద్దకు వచ్చి మొదట అరిచినట్లే

అరిచాడు. అప్పుడు ఆ పొదమధ్యలో నున్న కంపను పొదలోపలనుండి

ఎవరో తీయగా పొదమధ్యలో ఇరుకుగా ఒక దారికనిపించింది. ఆ దారి

నుండి అందరూ ఆ పొదను దాటిపోగా కొంత ఖాళీ స్థలములో గల

తారపాలెంటు కనిపించింది. టెంటు వెనుకనే దాదాపు 60 అడుగుల

ఎత్తున్న చెట్టున్నది. ఆ చెట్టు మీద ఎత్తులో ఎ.కె. 47 రైఫిల్ కల్గిన ఒక



మనిషి చుట్టూ చూచుటకు అనుకూలముగా కొమ్మ మీద కూర్చొని ఉ

న్నాడు. 20 అడుగల వెడల్పు, 40 అడుగుల పొడవుగల పెద్దటెంటు ప్రక్కన

బయట నాలుగు మూలలలో నలుగురు మనుషులు ఎ.కె. 47 రైఫిల్స్ కలిగిఉ

న్నారు. అక్కడున్నవారంతా నూకాకు నమస్కరించారు. అందరూ బయటనే

నిలబడి ఉండగా ఐదు నిమిషములు తర్వాత టెంట్ లోపల నుండి ఒక

మనిషి వచ్చి లోపలికి పొమ్మని నూకాకు సైగ చేశాడు. అప్పుడు నూకా

అందరినీ పిలుచుకొని లోపలికి పోయాడు. టెంటు లోపల సకల

సౌకర్యములతోనున్న మునెప్పకు అందరూ నమస్కరించారు. అక్కడ పది

కుర్చీలున్నవి. అందులో కుర్చోమని నూకా చెప్పి తాను కూడా ఒక కుర్చీలో

కూర్చొన్నాడు. మునెప్ప అందరివైపు చూచి నూకా వైపు చూచాడు. అప్పుడు

నూకా తన కుర్చీని మునెప్ప ముందరకు దగ్గరగా లాగుకొని ఇలా చెప్పాడు.)


నూకా :- నేను చెప్పినది వీరిని గురించే. ఇతను సురేష్, సురేష్తోనే నాకు

మొదట పరిచయము ఏర్పడినది. సురేష్ తర్వాత ఇతను ధనుష్ ఈయన

ఈ నలుగురు సభ్యులకు లీడర్గా ఉన్నాడు.


మునెప్ప :- హలో ధనుష్ ! మిమ్ములను కలుసుకోవడము మాకు సంతోషము.

మేము ప్రస్తుతానికి ఇలా ఉన్నాము. మా పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది.

మిమ్ములను గురించి మీరే చెప్పాలి. మీరు చేసిన పెద్ద దోపిడీ ఒక దానిని

గురించి చెప్పండి.


ధనుష్ :- మేము ఎంత పెద్దది చేసినా మమ్ములను మేము చిన్నగానే

చెప్పుకుంటావుంటాము. మీరు అడిగారు కాబట్టి చెప్పుచున్నాము. మేము

ఈ ప్రాంతములో చేసిన వాటిలో ట్రెజరీ డబ్బును పోలీసులనుండి లాక్కొని

పోవడము ఒకటే పెద్దదనుకుంటాను.


(ఆ మాట వింటూనే మునెప్ప ఆశ్చర్యముగా చూస్తూ ఇలా

అన్నాడు.)


మునెప్ప :- మీ గ్రూపేనా ఆ పని చేసినది? అయితే మీరు చిన్నవారేమీ

కాదు. మాకంటే పెద్దవారే. మరి మా నూకాతో చిన్నవారిగా చెప్పారు.

నూకా చెప్పిన దానినిబట్టి మా గుంపులోనికి మిమ్ములను చేర్చుకోవాలను

కొనివుంటిని. కానీ ఇప్పుడు మీ గుంపులోనికే మేము చేరాలి.

ఆ మాటను మునెప్ప అంటూనే అందరూ ఫక్కున నవ్వుకున్నారు.)

ధనుష్ :- మేము ఎంతది చేసినా వాస్తవానికి మా గుంపు క్రొత్తగా

తయారైనది. ఎక్కువ కాలము అనుభవములేదు. అనుభవమున్న వారివద్ద

పనిచేసి ఇంకా కొంత అనుభవమును సంపాదించుకోవాలనుకొన్నాము.

అదీకాక మా గుంపు ఐదుమంది సభ్యులతోనే ఉంది. కనీసము 20

మంది సభ్యులైనా ఉంటే అన్ని పనులూ జరుగుతాయి. ఐదుమంది అదీ

నాతో కలిసి ఐదుమంది బయట చెప్పుకొనే దానికి కూడ వీలువుండదు

కదన్నా.


మునెప్ప :- చాలామంది వుంటే మంచిదే, కానీ తెలివైనవారు నలుగురున్నా

చాలుకదా!


ధనుష్ :- ఎంత తెలివి ఉన్నా ఒక్కొక్కమారు బలము కూడా అవసరమవు

తుందికదా! ఆ రోజు పోలీసులు ఐదుమందే ఉన్నారు. కాబట్టి మేము

బయటపడినాము. వాళ్ళు పదిమంది ఉండివుంటే మేము వారిచేత్లులో

ఇరుక్కొనేవారమే కదా! అందువలన జనములేని గుంపు పనికి రాదను

కొన్నాను. మేము మీలాంటి వారితో కలిసి పోయేది మంచిది. నేను చాలా

రోజులనుండి ఎవరితో కలవాలా అని ఆలోచిస్తూవుంటిని. ఇంతలో మా


సురేష్ వచ్చి మాకు మంచి జాగా చూపించాడు. ఇప్పుడు మిమ్ములను

చూచిన తర్వాత మీ గుంపులో ఉంటే ఏమైనా చేయగలమను ధైర్యము

వచ్చింది. పోలీసు వారిని ఆట ఆడించగలను.


మునెప్ప :- నీవు చెప్పేమాట మంచిదే. మేము మరొకరి ఆధీనములో

పని చేస్తున్నాము. అందువలన ఆయన అనుమతి తీసుకొని మాలోనికి

కలుపు కుంటాను. మీలాంటి వారు నావద్ద ఉండడము మంచిదే కదా?

మీవద్ద వెపన్స్ ఏమైనా ఉన్నాయా?


ధనుష్ :- మా ఐదుమందికి రివాల్వర్లు కొన్నాము. అందులో ఒకటి పని

చేయడములేదు. నాలుగు కండీషన్లో ఉన్నాయి. అంతకంటే పెద్దవిలేవు.


మునెప్ప : పని చేయని రివాల్వరు మనవాళ్ళు రిపేరు చేస్తారు. మీకు

మిగతా రైఫిల్స్ మీద పనిచేయడము వచ్చునా.


ధనుష్ :- ఇంతవరకు రివాల్వర్ తప్ప మాకు ఏదీ తెలియదు. ఒకమారు

చూస్తే చాలు నేర్చుకుంటాము.


మునెప్ప :- మీరు అన్ని రాష్ట్రములలో దోపిడీలు చేసినట్లూ, ప్రస్తుతము

బ్యాంకు దోపిడీ చేయాలని ఉన్నట్లూ ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయనీ,

బ్యాంకువారు అప్రమత్తముగా ఉండాలని న్యూస్ చూచాను. అందులో

ధనుష్ ముఠా అని కూడా వ్రాసివుంది.


ధనుష్ :- పోలీసువారు ఒకటివుంటే రెండు వ్రాస్తుంటారు. మొదట

కర్నాటక లో చేశాము. ఆ డబ్బుతో రివాల్వర్లు కొన్నాము. మేము చేసినది

మొత్తము ఐదు మాత్రమే. ఇప్పుడు బ్యాంకును దోపిడీ చేయాలనుకోలేదు.

బ్యాంకులోని లాకర్ను మాత్రమే దోచుకోవాలనుకొన్నాము. కానీ అదికూడా


ఒక పది రోజుల తర్వాత చేయాలనుకొన్నాము. మా లెక్కలో ఇంతవరకు

చేసినవి చిన్నచిన్నవే. ఏదైనా పెద్దది చేయాలనివుంది.

మునెప్ప :- పెద్దదంటే ఏది?

ధనుష్ :- ఒక బ్యాంక్ లాకర్లో పది వజ్రాలున్నాయట, వాటిని తీయగలిగితే

పెద్దదవుతుంది.

మునెప్ప :- లాకర్లో ఉన్నట్లు ఎలా తెలిసింది? మీకు తెలిసినది వాస్తవమో

కాదో!


ధనుష్ :- మేము ఐదుమందిమి ఉన్నాము కదా! నేను, సురేష్ తప్ప మిగత

ముగ్గురూ బయట కారుడ్రైవర్ పని చేస్తున్నారు. ఇద్దరు బ్యాంకు మేనేజర్ల

కారు డ్రైవర్లుగా ఉన్నారు. ఒకరు మాత్రము సుక్ల్ సేట్ దగ్గర కారు

డ్రైవర్గా ఉన్నాడు. అలా ఉంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని పెట్టాను.

ఒక దినము బ్యాంకు మేనేజర్ కారులో పోతూ తన భార్యతో మాట్లాడు

చున్నపుడు, మన మనిషి డ్రైవర్ కారు నడుపుతూ వినడము జరిగింది.

ఎవరో తన బ్యాంక్లో పది వజ్రాలను పెట్టాడట. అవి చాలా బాగున్నాయనీ

ఎప్పటికైనా అటువంటి వజ్రమును ఒక దానినైనా కొనిస్తాననీ, దానిని

నెక్లెస్లో పొదిగి వజ్రము నెక్లెస్ చేయిస్తానని చెప్పడము విన్నాడు. తన

బ్యాంకులో 1,11 రెండు లాకర్లు బ్యాంకుకు బాగా అచ్చువాటైనవనీ, ఈ

రెండు లాకర్లలో ఒకదానిలో వజ్రాలదండ ఉందనీ, 11వ నంబరు లాకరులో

వజ్రములన్నవనీ చెప్పుతున్నపుడు మన మనిషి విన్నాడు. అందువలన

మేము ఈ రెండు లాకర్లను ఎట్లయినా దోచివేయాలని అనుకొన్నాను.

కానీ మనుషులు తక్కువ ఉన్నాము కదా! అందువలన ఆ పని

చేయలేకపోతున్నాము.



మునెప్ప :  బ్యాంక్ లాకర్లు దోపిడీ చేయడము చిన్నపనియేనా! అనుభవము

లేదంటావు. ముందుచూపుగా మీవారిని ఇన్ఫర్మేషన్కు కారు డ్రైవర్లగా

పెట్టావు. మా దగ్గర మీవద్ద ఉండే వాటికంటే పెద్ద ఆయుధములున్నాయి.

కానీ పెద్ద తెలివిలేదు. మాకంటే మీ బుర్రే పెద్దది. అయితే ఒకపని

చేస్తాము. లాకర్ల దోపిడీకి బయటకొందరు, లోపల కొందరూ, వెహికల్

దగ్గర ఒకరూ ఉంటే కానీ పనికాదు. మొత్తము పదిమందైనా ఉండవలెను.

లేకపోతే కష్టము. రేపటి వరకు మీరు ఇక్కడే ఉండండి. అంతలోపల

నేను మా బాస్ను కనుక్కొని మీ దోపిడీలో మా మనుషులను కలిసేటట్లు

చేస్తాను.


ధనుష్ :- అలాగైతే రేపే అయినా చేయగలను.


(తర్వాత విషయమంతా చెప్పుతామని మునెప్ప ధనుష్ గుంపును

అందరినీ బయటికి పంపాడు. తాను ఒక్కడు రేడియోసెట్ ఆన్ చేసి

తపస్వి బాబాతో ధనుష్ విషయమంతా చెప్పాడు. అంత తెలివైనవారు

దొరకడము మంచిదేనని చెప్పిన తపస్విబాబా ఆ పది వజ్రములు భువనేశ్వరి

దేవాలయములో మనము తీసినవే. అవి అక్కడకు ఎలా చేరాయో మనకు

తెలియదు. ఇప్పుడు వాటి అడ్రస్ మనకు దొరికినట్లే. ముందు ధనుష్

మన మనుషులను పంపుతామని చెప్పు. అందులో ఒకటి మా బాస్కు

ఇవ్వవలెనని మిగత తొమ్మిదింటినీవారే తీసుకొమ్మని చెప్పు. పని అంతా

అయిన తర్వాత ఆ తొమ్మిదింటినీ వారినుండి తీసుకోవచ్చు. వారిని మనవద్దే

పెట్టు కోవచ్చు. వీరు దొరకడము మన అదృష్టమేనని బాబా చెప్పి

వయర్స్ ఆఫ్ చేశాడు. తర్వాత మునెప్ప ధనుష్ తో మాట్లాడి తమ బాస్

చెప్పినదంతా చెప్పాడు. దానికి ధనుష్ అన్ని విధాలా ఒప్పుకొన్నాడు. ఆ

రోజు ధనుష్ వాళ్ళు అడవి వాతావరణములో విశ్రాంతి తీసుకొన్నారు.


మరుసటి దినము ఉదయము ప్రక్కనేనున్న సెలయేటిలో స్నానము చేసి

రెడీ అయి పోయారు. అందరూ ఉదయము ఎనిమిది గంటలకే అన్నము

తిన్నారు. తర్వాత మునెప్ప ధనుష్తో ఇలా అన్నాడు.)


మునెప్ప :- నీవుకాక మీవాళ్ళు నలుగురున్నారు. వారికి తోడుగా నేను

ఆరుమందిని పంపుతాను. అప్పటికి మొత్తము పదకొండుమంది అవుతారు.

వారిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకో.


ధనుష్ :- ఈ రోజు శనివారము. రేపు ఆదివారము బ్యాంకు సెలవు.

రేపు రాత్రికి మేము పని ప్రారంభిస్తాము. మీరు పంపేవారిని నాకు

పరిచయము చేస్తే, వారికి ముందే కొన్ని సూచనలిచ్చి, ఈ దినమే ఇక్కడే

వారికి కొంత రిహార్సల్ చేసినట్లు దోపిడీ నమూనాను చేసి చూస్తాము.


(మునెప్ప తన తమ్ముడు వెంకును మొదట ధనుష్కు పరిచయము

చేశాడు. తర్వాత నూకా మొదలగు ఐదుమందిని పరిచయము చేశాడు.

అందరితో ఒకరికొకరు పరిచయము చేసుకొన్న తర్వాత ధనుష్ తన తెలివిని

ఉపయోగించి బ్యాంక్ లాకర్ల దోపిడీ ఎలా చేయాలో వివరించి చెప్పి,

అదే విధముగా అందరూ ట్రయల్ చేయునట్లు చేశాడు. ఆ విధముగా

బ్యాంకు లాకర్ల దోపిడీ విషయములో కొంత తర్ఫీదు పొందినట్లయినది.

ఆదివారము రాత్రికి అన్ని ఏర్పాట్లు చేసుకొని, అందరూ ఒక కారులో

బయలుదేరి పోయారు. ఆదివారము దోపిడీ చేయవలసిన బ్యాంకును

ఒకమారు చూచుకొని, ఆ దినము అందరూ ఒక లాడ్జిలో దిగినారు. అలా

లాడ్జిలో అందరినీవుంచి ధనుష్ ఒకడు బయటికివచ్చి ఫోన్ బ్బూతుండి

యస్.పి గారికి సమాచారమును అందించాడు. తర్వాత అందరితోపాటు

తన రూముకువచ్చి ఉండిపోయాడు. రాత్రి 9 గంటలకే లాడ్జి ఖాళీ చేసి

ఊరి బయట హైవే మీదవున్న డాబా హెూటల్కు పోయి, అక్కడ


రాత్రిపదకొండు గంటలవరకు తింటూ గడిపారు. తర్వాత మరియొక

డాబా హెూటల్కు వచ్చి, అక్కడ టీ త్రాగుటకు అరగంటసేపు గడిపి,

రాత్రి 12.45 లకు బయలు దేరి ఒంటిగంటకు బ్యాంకు దగ్గరకు పోయారు.

బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డు, బ్యాంక్ ముందర కూర్చొని నిద్ర పోతున్నాడు.

అదే అదునుగా కారులోనుండి ధనుష్ దిగి చేతిరుమాలులో క్లోరోఫామ్న

వేసుకొని నిద్రిస్తున్న గార్డు ముక్కుదగ్గర పెట్టాడు. క్లోరోఫామ్ మత్తుమందు

కావున అతనిని గాఢనిద్రలోనికి పంపింది. అప్పుడు కారును బ్యాంకు

ప్రక్కన కొద్దిదూరములో చీకటిగానున్న చోట పెట్టి, డ్రైవర్ సీటులో

నిద్రించుచున్నట్లు నటిస్తూ ఒక మనిషి కూర్చోగా, మిగతా పదిమంది బ్యాంకు

దగ్గరకు పోయారు. బ్యాంకు ముందు భాగములో కాకుండా ప్రక్కనున్న

ఒక కిటికీవద్దకు చేరుకొని, దాని ఇనుప ఊచలకు వారివద్దనున్న ఐరనిమిల్ట్

పేస్టును చుట్టూ పూసారు. కొద్దిసేపటిలోపే ఆ ఊచలు మెత్తగా మారిపోయి

కరగడము మొదలు పెట్టాయి. అప్పుడు బలముగా ఊచలను లాగి ప్రక్కన

పెట్టి, లోపలనున్న అద్దములను తమవద్దనున్న మిర్రర్ కట్టర్తో కోసి ప్రక్కన

పెట్టి, ఆ కిటికీ ద్వారా అందరూ లోపలికి సులభముగా పోయారు. అందరూ

ముఖాలకు గుడ్డలు కట్టుకొని సి.సి. కెమెరాల కంటపడకుండా, అవి

ఎక్కడున్నదీ గమనించి వాటిని పెరికివేశారు. తర్వాత లాకర్రూమ్ లాక్ను

తీయకుండా దానికి కూడా మెటలిమిల్ట్ పేస్టును పూసారు. ఒక నిమషములో

అది కూడా కరిగి పోయింది. ఎక్కడా వేలిముద్రలు పడకుండా ధనుష్

అందరికీ ముందే హ్యండ్ గ్లోవ్స్ ఇచ్చాడు. అందరూ వాటిని చేతులకు

తగిలించుకొని ఉండుట వలన ఎవరి వేలి ముద్రలూ ఎక్కడా పడలేదు.

సులభముగా లాకర్ రూమ్లోనికి ప్రవేశించిన వారు కొందరు ఒకటవ

నంబరులాకరు వద్దకు వచ్చారు. కొందరు బ్యాంకు మధ్యహాలులో


ఉండగా, ఒకరు మెయిన్ రోడ్డు ఎదురుగానున్న కిటికిలోనుండి ఎవరైనా

అటువైపు వస్తారేమోనని బయటికి చూస్తున్నాడు. బయట కారులో డ్రైవర్

సీటులో కూర్చున్న మనిషి ధనుష్ గుంపులోని మనిషి. అలాగే మెయిన్

రోడ్డు కిటికీ దగ్గర బయటికి చూస్తున్నది కూడా ధనుష్ మనిషే. బ్యాంక్

మొదటిహాలులో ఒకరు ధనుష్ మనిషి, ఇద్దరు మునెప్ప మనుషులు

ఉండగా, నలుగురు మునెప్ప మనుషులలో ఒకరు వెంకు ఒకరు నూకా

కాగా మిగతా ఇద్దరు అట్లే ధనుష్, సురేష్ ఆరుమంది బ్యాంక్ లాకర్ రూములో

ఉన్నారు. ఐదు నిమిషములు కష్టపడి 1వ నంబర్ లాకర్ తీశారు. అందులో

అన్నీ నగలే ఉన్నాయి. వాటినన్నిటినీ బ్యాగ్ లో వేసుకొన్నారు. తర్వాత

11వ నెంబర్ లాకర్ దగ్గరకు పోయారు. అంతలో బయట కొంత అలజడి

అయినది. ఏమిటా అలజడి అని లాకర్రూమ్లోనున్నవారు బయటికి

వచ్చి చూడాలని బయటికి రాబోయారు. అంతలోనే సాయుధులైన పోలీస్

ఆఫీసర్లు ఆరుమంది లాకర్ రూమ్లోనికి వచ్చి, అక్కడున్న వారిని

కదలకుండా చేతులు పైకి ఎత్తమన్నారు. పరిస్థితి చేయిదాటి

పోయిందనుకొన్న వెంకు మొదలగు వారు చేతులు పైకి ఎత్తారు. వెంటనే

బయటనుండి ఇంకా పదిమంది పోలీస్ లు వచ్చి చేతులకు బేడీలు

తగిలించారు. పోలీసులు ఎలా వచ్చారో వెంకూకు, నూకాకు అర్థముకాలేదు.

తమవద్దనున్న బ్యాంక్ లాకర్ సొమ్ముతో సహా రెడ్్యండెడ్గా పోలీసులకు

దొరికిపోయారు.


ఇదంతా ధనుష్ అను మారుపేరుతోనున్న ధనుంజయ వేసిన

పథకమని మునెప్ప మనుషులకు తెలియదు. ధనుష్ గుంపుకూడా తమతో

పాటు దొరికిపోయిందని మునెప్ప మనుషులు అనుకున్నారు. అయితే

ధనుష్, అతని గుంపు అందరూ పోలీసులేనని వారికి తెలియదు. ధనుష్


అందరికి చేతి తొడుగులు ఇచ్చి, సి.సి. కెమెరాలను పగల గొట్టింది చూస్తే,

నిజముగా దొంగలు చేసినట్లే, ఆ పని అంతా నిజమైన దొంగతనమన్నట్లే

ఉంది. ధనుంజయ ధనుష్ మారి, దొంగల గ్రూప్ నాయకుడుగా

మారినట్లు నటిస్తూ, ఎంతో కాలమునుండి దొరకని మునెప్ప మనుషులను

బ్యాంక్ దోపిడీ అను పేరుతో ఉచ్చులోనికి లాగి చిక్కుకొనునట్లు చేశాడు.

మునెప్ప మనుషులందరూ పోలీసులకు దొరికిన తర్వాత కూడా ధనుష్

పోలీస్ గ్రూప్ మనిషి అని మునెప్పకుగానీ, మునెప్ప మనుషులకుగానీ

తెలియదు. ఈ విధముగా రాటుతేలిన దొంగలను పట్టి ఇచ్చినందుకు

ధనుంజయకు పోలీస్ శాఖనుండి మంచి బహుమతి లభించింది. అట్లే

ప్రమోషన్ కూడా లభించింది. అడవిలో మునెప్ప, అతని ముఖ్య అనుచరులు

ముగ్గురు మిగిలి పోయారు. తపస్విబాబాగారికి మునెప్ప జరిగినది అంతా

చెప్పగా! బాబా ఆశ్చర్యపోయాడు.)

X X X X

X X X X X


(రావుబహదూర్ జమీందారు ఇంటిలో ఈశ్వర్ వయస్సు పది

హేనవ (15) సంవత్సరము జరుగుచున్నది. ఈశ్వర్కు వయస్సు పెరిగే

కొద్ది అందముగా, ఆకర్షణీయగా కనిపించసాగాడు. ఈశ్వర్ను చూస్తూనే

దయ్యాలుగానీ, పిశాచాలుగానీ భయపడి పారిపోయేవి. ఒకరోజు మూడు

సంవత్సరముల పిల్లవానిని పాము కరిచింది. తల్లిదండ్రులు పాము కరిచిన

వెంటనే వైద్యునివద్దకు తీసుకపోయినా ఆ పిల్లవాడు బ్రతుకలేదు.

దంపతులకు ఒక్కడే కొడుకు అయిన దానివలన చాలా బాధపడుచుండిరి.

తల్లిబాధను చూడలేక అక్కడికి పోయిన వారు కూడా కంటతడి పెట్టుకొను

చుండిరి. పిల్లవానికి పాము కరిచి చనిపోయిన వార్త ఊరంతా ప్రాకింది.

ఆ విషయము ఇంటిలోని ఈశ్వర్కు కూడా తెలిసింది. ఈశ్వర్కు ఆ


విషయము తెలిసిన వెంటనే తన ఇంటిలోని పనిమనిషిని పిలిచి ఆ

పిల్లవానిని తన దగ్గరకు తెమ్మని చెప్పి పంపాడు. ఆ పనిమనిషి రోదిస్తున్న

ఆ బాలుని తల్లిదండ్రులకు ఆ విషయము చెప్పాడు. ఈశ్వర్ అంటే అతను

గొప్పవ్యక్తి అను అభిమానము అందరిలో ఉండుట వలన, ఈశ్వర్ చెప్పి

నాడంటూనే ముందూ వెనుక చూడకుండా, ఏ ఆలోచన చేయకుండా,

చనిపోయిన పిల్లవానిని ఈశ్వర్ ఇంటివద్దకు తీసుకపోయారు. ఆ పిల్లవాని

తల్లిదండ్రుల వెంట చాలామంది పోయారు. ఈశ్వర్ పిలిచాడు అంటే

ఎందుకు పిలిచాడో అని, ఆయన మాటను గౌరవించి అక్కడికి పోవడము

జరిగింది. ఈశ్వర్ ఇంటివద్దకు పోయిన జనము ఇంటిలోని ఈశ్వర్కు

చనిపోయిన పిల్లవానిని తీసుకవచ్చినట్లు తెలిపారు. వెంటనే ఈశ్వర్

బయటికి వచ్చి అందరినీ చూచాడు. అందరూ విచారముగా కనిపిస్తూవుంటే,

కొందరు ఏడుస్తూ కనిపించారు. దరినీ చూచిన ఈశ్వర్, “మీరు


బాధపడవలసిన పనిలేదు. ఈ పిల్లవాడు చనిపోలేదు, నిద్రపోతున్నాడు.

నేను లేపుతాను చూడండి అని ఆ పిల్లవాని దగ్గరకు పోయి చేతితో తట్టి

"మీ అమ్మానాన్న ఏడుస్తున్నారు. నీవు మేల్కొని బయటికి రా!” అన్నాడు.

ఆ మాట అని చేతితో తట్టి లేపగా నిద్రనుండి మేల్కొన్నవానివలె ఆ పిల్లవాడు

కళ్ళు తెరిచి చూచాడు. ఆ సంఘటనతో అక్కడున్న వారంతా ఈశ్వర్ను

దేవునితో సమానముగా పొగడసాగారు. ఈశ్వర్ వారి అమాయకత్వానికి

నవ్వుకొని ఇంటిలోపలికి పోయాడు. కొద్దిసేపటికే చనిపోయిన పిల్లవానిని

ఈశ్వర్ బ్రతికించాడను విషయము ఊరంతా ప్రాకిపోయినది. ఆ పిల్లవాని

తల్లిదండ్రులు ఈశ్వర్ నిజముగా దేవుడే అని అందరికి చెప్పసాగారు.

జమీందారు రావుబహదూర్ కూడా ఈశ్వర్లో ఏదో గొప్పశక్తివుందని నమ్మి,

అతను తనకు కొడుకుగా దొరకడము తమ పూర్వజన్మ అదృష్టమనుకొన్నాడు.


సాయంకాలమునకు ఈశ్వర్ చనిపోయిన పిల్లవానిని బ్రతికించాడని

జిల్లా అంతా తెలిసిపోయింది. దానితో కొందరు న్యూస్ పత్రికల విలేఖరులు

వచ్చి ఈశ్వర్ను పిల్లవానిని బ్రతికించిన విషయమును గురించి అడగను

మొదలు పెట్టారు. ఎవరు అడిగినా అందరికీ పిల్లవాడు చనిపోలేదు,

నిద్రపోయేవాన్ని లేపాను, నేను చనిపోయినవాన్ని బ్రతికించలేదు.” అని

ఈశ్వర్ ఒకే జవాబు చెప్పుచుండెను. “పాము కరచి చనిపోయింది అందరికి

తెలుసు కదా” అని విలేఖరులు అడిగితే “చనిపోలేదు అని నేను

చెప్పుచున్నానుకదా” అని జవాబు చెప్పుచుండెను. ఆయన చెప్పునది

ఎవరికీ అర్థము కాలేదు. అయినా వారివారి పత్రికలలో “చనిపోయిన

బాలున్ని బ్రతికించిన ఈశ్వర్" అని వ్రాస్తూ, ఈశ్వరన్ను అడిగితే నేను

చనిపోయిన వానిని బ్రతికించలేదు, అని జవాబు చెప్పినట్లు కూడా వ్రాశారు.

ఈ వార్త రెండవ రోజు స్టేట్లో అందరికీ తెలిసిపోయింది.


(రాజయోగానంద స్వామికి రాఘవ ప్రతికలలో వచ్చిన వార్తను

చూపించి ఇలా అడిగాడు.)

రాఘవ :- స్వామీ! మనము అష్టగ్రహ కూటమి దినమున పుట్టిన బాలుడని

ఎవనిని అయితే అనుకొంటున్నామో అతనే ఈశ్వర్. ఈశ్వర్కు ఇప్పటికి

పదిహేను సంవత్సరముల వయస్సే. ఆ అబ్బాయి నిన్నటి దినము పాము

కరిచి చనిపోయిన మూడు సంవత్సరముల పిల్లవానిని కొన్ని గంటల తర్వాత

బ్రతికించాడని వార్త వ్రాశారు. చనిపోయిన వానిని బ్రతికించడానికి

సాధ్యమవుతుందా? దానిని గురించి అడిగిన విలేఖరులకు “అతను

చనిపోలేదు నిద్రపోవువానిని లేపాను” అన్నాడట. ఈ మాట వాస్తవమేనా?

రాజయోగానంద :- శ్వాస ఆడనంతమాత్రమున చనిపోయాడు అని


అనుకోవడము పొరపాటే అగును. ఒక విధముగా "ఇతను చనిపోలేదు.

నిద్రపోయినవానిని లేపాను” అని ఈశ్వర్ చెప్పినమాట వాస్తవమే. మనము

చూస్తున్నట్లే ఎంతోమంది చనిపోయారు కదా! కానీ, వాస్తవముగా అంత

మందిలో కొందరే చనిపోయారు. కొంతమంది చనిపోయినట్లు కనిపించినా,

వారి శరీరములో కదలికలు, శ్వాస నిలచిపోయినా వారు నిజముగా చని

పోలేదు. వారు చనిపోకుండా శరీరములో సజీవముగానే కొంత కాలము

ఉందురు. ఆ విషయము చాలామంది జ్ఞానులకు కూడా తెలియదు.

శ్వాస ఆగిపోయింది, చైతన్యము నిలిచిపోయింది, చనిపోయాడని అజ్ఞానులు

అనుకొన్నట్లే ఆధ్యాత్మిక రంగములో కొంత తెలిసినవారు కూడా

అనుకొనుచుందురు. ఒక ఆధ్యాత్మికవేత్త అనిపించుకొన్న వ్యక్తి కూడా తన

తాతగారు నిజముగా చనిపోకున్నా, శ్వాస ఆగిపోతానే చనిపోయాడనుకొని

తన పుస్తకములో ఇలా " మా తాతగారు చనిపోవటము, స్మశానానికి

తీసుకొని వెళ్ళే మధ్యలో దింపినపుడు, మరల అతను శరీరములోనికి వచ్చి

లేచి, ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలము బ్రతికారు” అని వ్రాశారు.

అంతో, ఇంతో తెలిసిన వారు కూడా ఇలా పొరపాటుపడుచున్నారు.

వాస్తవముగా ఒక్కమారు శరీరములో నుండి జీవుడు బయటికి పోయి

చనిపోతే తిరిగి ఆ శరీరము లోనికి వచ్చుటకు వీలులేదు. శరీరములోనుండి

జీవుడు బయటికి పోనప్పుడు శరీరము మృతి చెందినట్లు కనిపించినా,

అతడు శరీరములోనే ఉన్నాడు, కనుక తిరిగి లేవగలడు. ఈ విషయమును

విపులముగా “మరణ రహస్యము” అను గ్రంథములో వ్రాయబడి ఉన్నది.

ఇంకొక విషయము ఏమనగా! పాము కరిచి మృతి చెందిన వారి శరీరములో

జీవుడు శరీరమును వదలి బయటికి పోకుండా దాదాపు 4 గంటల నుండి

24 గంటల వరకు ఉండగలడు. అందువలన పాముకాటు వలన

మరణించినట్లు కనిపిస్తున్న మూడేళ్ళ బాలున్ని ఈశ్వర్ లేపగలిగాడు.


అటువంటి మరణమును “తాత్కాలిక మరణము” అంటారని మరణ

రహస్యము గ్రంథములో కూడా పేర్కొన్నాము. ఈ విషయము చాలామంది

మేధావులకు కూడా తెలియదు. కావున దీనిని మరణ రహస్యము

అంటున్నాము. ఈశ్వర్రీ ప్రత్యేకమైన జాతకము. అందువలన ఎవరికీ

తెలియని విషయములు అతనికి అవగాహనలో ఉన్నాయి. అట్లే ఎవరికీ

లేని శక్తులు కూడా ఈశ్వర్కు ఉన్నాయి. ఈశ్వర్కు ఇప్పుడు 15 సంవత్సర

ములు జరుగుచున్నవి. అతనికి 15 సంవత్సరములు పూర్తిగా అయిపోయి

16లో పడినపుడు ఆరునెలలు ప్రతి అమావాస్యకు అతనిలో విశేషశక్తులు

ప్రవేశించును. అతనిలో శక్తులు కొన్ని ఇప్పటికే ఉన్నాయి.


ఈశ్వర్ యొక్క ప్రతి విషయమును తపస్విబాబా గమనిస్తూ

ఉండును. బాబా అనుకొన్న పనికి కొన్ని నెలలే బాకీ ఉన్నాయి. అతనికి

ముఖ్యముగా పనిచేసిపెట్టు మునెప్ప మనుషులు బ్యాంక్ దోపిడీలో

పోలీసులకు చిక్కారు. చివరకు మునెప్ప, అతని అనుచరులు కొందరు,

ఇద్దరు మాంత్రికులు బాబా ప్రక్క మిగిలివున్నారు. మునెప్ప బయటకు

రాకుండా ఎవరికీ తెలియని చోటికి చేరిపోయాడు. మొత్తానికి బాబా

బలము తగ్గి పోయిందనుకోవచ్చును.


రాఘవ :- స్వామీ! ఈశ్వర్కు పదిహేనవ సంవత్సరము ముగియుటకు

ఇంకా ఎంతకాలమున్నది?


రాజయోగానంద :- ఇంక రెండు నెలలు మాత్రమే కలదు. మూడవ

నెలనుండి 16వ సంవత్సరము ప్రారంభమగును. 16వ సంవత్సరము

మూడు అమావాస్యల తర్వాత నాలుగు, ఐదు, ఆరు నెలలలో వచ్చు

అమావాస్యలలో వచ్చు శక్తులు చాలా గొప్పవి. అప్పటికి తగినట్లు మనము

ప్రవర్తించాలి. తపస్విబాబా కూడా అప్పుడే మనలను అడ్డుతొలగించు


కోవాలని చూడగలడు. అంతవరకు మన ఉద్దేశ్యము ఆయనకు తెలియదు.

మనము అతనికి వ్యతిరేఖముగా ఉన్నామని తెలిసిన వెంటనే బాబాద్వారా

మనకు కొన్ని కష్టాలు రాకతప్పవు.


(వెంకూ, నూకా మొదలైన ఆరుమంది పోలీసులకు దొరకడము

మునెప్పకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బ్యాంకు దోపిడీలో లాకర్లో

దోచిన సొమ్ముతో సహా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడము ఎలా జరిగిందో

మునెప్పకు అర్థముకాకుండా పోయినది. ధనుష్ వాళ్ళు పెద్ద మొనగాళ్ళను

కొని వారివెంట తనవారిని పంపడము తప్పయినదని మునెప్ప అనుకొన్నాడు.

వాస్తవానికి ధనుష్ పోలీసు మనిషని మునెప్పగానీ, మునెప్ప మనుషులు

గానీ గ్రహించలేక పోయారు. చేతికి గ్లోవ్స్ వేసుకోవాలని చెప్పడమూ,

ఐరన్ మిల్టింగ్ యాసిడ్ పేస్టు తీసుక రావడము వలన మునెప్ప, ధనుషు

పూర్తిగా నమ్మిపోయాడు. వారికి ఎక్కడా అనుమానము రాకుండా ధనుష్

ప్రవర్తించాడు. కారులో తన మనిషిని కూర్చోపెట్టడము, ఊచలు పెరికిన

కిటికీ వద్ద కూడ తన మనిషినే ఉంచడము వలన బయట పోలీసులు

వచ్చినా కూడ మునెప్ప మనుషులకు తెలియకుండా పోయినది. కిటికీ

దగ్గరా, కారులో వున్నది పోలీసు మనుషులని మునెప్ప మనుషులకు

ఎవరికీ తెలియదు. తర్వాత హాలులో కూడా ఒక మనిషి ధనుష్క

సంబంధించిన వాడు ఉండుట వలన అతను తనప్రక్కనవున్న మునెప్ప

మనుషుల ధ్యాసను ప్రక్కకు మళ్ళించి పోలీసులు బ్యాంకులోనికి వచ్చువరకు

చూచుకోకుండా చేశాడు. ధనుష్ పథకము ప్రకారము, మునెప్ప

మనుషులను అక్కడ దొరుకునట్లు చేశాడు. ముందే అన్ని విషయములు

యస్.పి తో సంప్రదించి కరెక్టు టైము ప్రకారము పోలీసులను రమ్మని

చెప్పివుండుట వలన, బయట కాపలాకున్న వ్యక్తులు పోలీసువారే,


అయినందున మునెప్ప మనుషులు సులభముగా దొరికారు. వారితో

పాటు ధనుష్ను, అతని మనుషులను కూడా పోలీస్ కస్టడీకి పంపిన

దానివలన, అరెష్టయిన తర్వాత కూడా మునెప్ప మనుషులకు ధనుష్ మీద

అనుమానము రాలేదు. మునెప్పకు కూడా ధనుష్ మీద ఏమాత్రము

అనుమానము రాలేదు. )


(తపస్వి బాబా ఈశ్వర్కు పదహారవ సంవత్సరము

రాబోతున్నందున తాను చేయవలసిన పనికొరకు ముందుగానే పథకములను

తయారు చేసుకొన్నాడు. తాను రచించిన పథకములను నెరవేర్చుటకు

ఇద్దరు మాంత్రికులను ఉపయోగించుకోవాలనుకొన్నాడు. అందువలన

మాంత్రికులతో ముందే మాట్లాడి జరుగబోవు సమయములో తాము

చేయబోవు కార్యములను గురించి ముందే వివరించి చెప్పాలనుకొన్నాడు.

తాను బయటికి పోకుండా, ఎవరికీ ఏ అనుమానము రాకుండా, తన

పనిని ఇద్దరు మాంత్రికులతోనే చేయించాలనుకొన్నాడు. తర్వాత

తనవద్దనున్న కొన్ని శక్తులను కూడా వారి వశములో పెట్టి, వారిచేత అన్ని

పనులు సమయానుకూలముగా చేయించుకోవడము మంచిదనుకొన్నాడు.

దాని కొరకు మునెప్పతో తనవద్దకు ఇద్దరు మాంత్రికులను తన మనిషితో

పంపమని చెప్పాడు. దానికి మునెప్ప తన మనిషిని పంపి ఇద్దరు

మాంత్రికులను తనవద్దకు రప్పించుకొన్నాడు. మాంత్రికులు మునెప్ప వలన

తమ జీవితములో ఎప్పుడూ చూడని డబ్బును చూచిన దానివలన, మునెప్ప

పిలిచిన వెంటనే ఇద్దరూ సంతోషముగా వచ్చారు. మునెప్ప వరకే పరిమిత

మైన మాంత్రికులు ఈ మారు తపస్విబాబావరకు పోవుటకు అవకాశము

ఏర్పడినది. మునెప్ప మాంత్రికులను ఒకరోజు తనవద్దనే ఉంచుకొని తపస్వి

బాబా దగ్గరకు పంపుచున్నాననీ, అక్కడికి పోయిన తర్వాత బాబాదగ్గర


చాలా భయము కల్గి, వినయముగా మాట్లాడాలనీ, ఆయన ఏమి చెప్పితే

దానిని జాగ్రత్తగా విని, ఏమి చేయమంటే అలాగే దానినే చేస్తామని, తర్వాత

తనవద్దకు రమ్మని చెప్పి, తన మనిషిచేత ఇద్దరినీ తపస్విబాబా వద్దకు

పంపాడు. మునెప్ప తన మనిషిచేత పంపిన మాంత్రికులను బాబా తన

మందిరములోనికి ఏకాంతముగానున్నపుడు రప్పించుకొన్నాడు.

విధముగా ఎవరూ లేనపుడు బాబాను కలిసిన మాంత్రికులతో ఇట్లు

మాట్లాడెను.)


తపస్విబాబా :- భవిష్యత్తులో ఎవరితోనూ మీరు నా దగ్గరికి వచ్చి

మాట్లాడినట్లు చెప్పకూడదు. అంతేకాక ఇక్కడ నేను మీకు చెప్పు

విషయములు చాలా రహస్యమైనవి. అందువలన వాటిని ఎక్కడా ఎవరికీ

తెలియనట్లు మీ దగ్గరే ఉంచుకోవలెను. నేను మాటిమాటికీ కలిసి మాట్లాడే

వీలుండదు. కావున మీకు విషయమునంతటినీ ఇప్పుడు ఒక్కమారే

చెప్పగలను. అందువలన వినిన విషయమును జాగ్రత్తగా జ్ఞప్తికి ఉంచు

కోవలెను. మీకు ఏమైనా అర్థముకాని విషయములుంటే ఇప్పుడే అడిగి

తెలుసుకోండి. ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మీకు

దేవతలు ఎవరైనా వశములో ఉన్నారా?

మల్లయ్యతాత :- నాకు కాటేరి, భగళాముఖి, కర్ణపిశాచి, ముగ్గురూ నా

వశములో ఉన్నారు.

తపస్విబాబా :- మంత్ర యోగాలుగానీ, మంత్ర ప్రయోగాలుగానీ ఎన్ని

తెలుసు?

మల్లయ్యతాత :- నాకు రెండూ కలిపి వందవరకు తెలుసు. ప్రస్తుతము

దేశములో నాకు తెలిసినన్ని తంత్రములు తెలిసినవారులేరు.

తపస్విబాబా :- బదనికలు ఎన్ని ఉన్నాయి?


మల్లయ్యతాత :- నావద్ద ముఖ్యమైనవి నాలుగు బదనికలు మాత్రమే

ఉన్నాయి. మూలికలు అరవై వరకు తెలుసు.

తపస్విబాబా :- నాగభూషణము! నీదగ్గర వశములోనున్న వారున్నారా?

నీకు ఏమి తెలుసో, ఏమేమి ఉన్నాయో చెప్పు.

నాగభూషణము :- నాకు ఎవరూ వశములో లేరు. మంత్రచిట్కాలంటే

రెండు రకములు కలిసి నలభైవరకు ఉన్నాయి. బదనికలు ఆరున్నాయి,

మూలికలు దాదాపు నలభైవరకు తెలుసు.

తపస్విబాబా :- మీరు చెప్పిన దానినిబట్టి మీరు ఇద్దరూ కలిసివుంటే

మిమ్ములను మించినవారు ఎవరూ ఉండరు. అంతేకాక నావద్దనున్న

చాలామంది క్షుద్రదేవతలను మీకు వశములో ఉండి, మీరు చెప్పినట్లు

చేయమని చెప్పి పంపుతాను. అందువలన మీకు ఏ క్షుద్రదేవతల వలనగానీ

ఇబ్బంది కలుగకుండ నేను మీ వెంట పంపిన శక్తులు చూచుకోగలవు.

మల్లయ్యతాత :- బాబాగారు! మాకు చిన్న అనుమానము, అది ఏమంటే

మా వశములోనున్న శక్తులకున్న నియమముల ప్రకారము మేము నడుచు

కొంటున్నాము. ఇప్పుడు మీరు మావెంట కొన్ని శక్తులను పంపితే వాటికున్న

నియమము ప్రకారము నడుచుకోవలెనా, లేదా?


తపస్విబాబా :- నేను నా వశములోని శక్తులను మీ మాట వినునట్లు చేసి

పంపుచున్నాను. అంతమాత్రమున వాటి నియమమును మీరు పాటించ

వలసిన పనిలేదు. వాటి నియమములను నేను పాటిస్తాను, మీకు

సంబంధములేదు. ఇప్పుడు మీకు చెప్పు విషయమును జాగ్రత్తగా వినండి.

ఇప్పటికి దాదాపు 16 సంవత్సరముల క్రిందట అష్టగ్రహ కూటమి జరిగింది.

మీరు మాంత్రికులు అయినందున మీకు ఆ విషయము బాగా జ్ఞాపకము

ఉంటుంది. ఆ సమయములో మొదట పుట్టిన మగశిశువుకు కొన్ని ప్రత్యేక


మైన శక్తులు ఉంటాయి. మనము మంత్రసాధన చేసినా లభించని శక్తులు

అతనికి ఏ సాధనా లేకుండానే ఉంటాయి. అతనికున్న శక్తులు మనకు

లభించాలంటే అతనికి 16వ సంవత్సరము వచ్చేంత వరకు కాచుకొని

ఉండవలసిందే. ఆ బాలుని పేరు ఈశ్వర్, ఆ బాలుడు మన జిల్లాలోనే

ధనికునిగా పేరుగాంచిన రావుబహదూర్ జమీందారు ఇంట్లో దత్తపుత్రునిగా

పెరిగాడు. అతనికి పదహారవ సంవత్సరము ఈ నెలతో ప్రారంభమవు

చున్నది. ఈ సంవత్సరములో అతనికి ఇంతవరకు ఉన్న శక్తులే కాకుండా

క్రొత్తశక్తులు చాలావస్తాయి. అతనికి వచ్చు శక్తులను మనము అతని

ద్వారా సంపాదించుకోవాలంటే, అతనిని మనము వశము చేసుకోవాలి.

అతనిని వశము చేసుకొను పనిని మీరు చేయవలెను. దానికొరకు మీరు

ఇప్పటినుండి ఆ పనిలో నిమగ్నము కావలెను. మేము ఇంతవరకు మీరు

అడుగకముందే డబ్బులు ఇచ్చాము. అవసరమొచ్చిపుడు పనిని చెప్పు

తామన్నాము. ఇప్పుడు మీరు చేయవలసిన పని వచ్చినది. ఇప్పుడు

కూడా మీతో ఉచితముగా పని చేయించుకోము. మేము చెప్పిన పనిని

చేయుట వలన మీకు ఒక్కొక్కరికి పదిలక్షల రూపాయలను ఇస్తాము. మీరు

ఇంతవరకు అంతడబ్బును చూచికూడా ఉండరు. మీరు చేసే పనికంటే

మేము ఎక్కువ డబ్బు ఇస్తున్నాము. ఏమంటారు చెప్పండి.

మాంత్రికులు :- మీరు అంత డబ్బును మేము అడుగకున్నా ఇస్తున్నారు.

మీరు చెప్పిన పనిని మేము తప్పక చేస్తాము. ఒకవేళ అది కష్టమైన పని

అయినా మేము చేసి చూపిస్తాము.


తపస్విబాబా :- సంతోషము. మీరు ఎలాగైనా చేయగలరు. కానీ ఇందులో

కష్టమేమీ ఉండదు. మీకు ప్రతి పని మునెప్ప ద్వారాగానీ, మునెప్ప మనుషుల

ద్వారాకానీ ఎప్పటికప్పుడు తెలుస్తూవుంటుంది. వారు ఎట్లు చెప్పితే అట్లు


చేయండి. తర్వాత మీరు నాతో కలియుటకు వీలుండదు. అన్నీ మునెప్ప

ద్వారానే తెలుస్తాయి. ఇక మీరు ఇక్కడి నుండి పోయి మునెప్పకు

అందుబాటులోగానీ, మునెప్పదగ్గరకానీ ఉండండి. తర్వాత నేను

తెలియజేస్తాను. పోయిరండి.



(తపస్విబాబాగారితో మాట్లాడిన మాంత్రికులిద్దరు మునెప్ప దగ్గరే

ఉండుటకు నిశ్చయించుకొని బయలుదేరి మునెప్ప దగ్గరకు వచ్చారు.

వీరి మునెప్ప దగ్గరకు వచ్చారు.

మునెప్ప దగ్గరకు రాగానే మునెప్ప ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు

ఇచ్చి, ఈ డబ్బులు మీ ఇంటిదగ్గర ఇచ్చిరమ్మని చెప్పాడు. అలాగే

మాంత్రికులు ఇద్దరు డబ్బులు తీసుకొని పోయి వారి ఇళ్ళదగ్గర ఇచ్చి

తిరిగి మునెప్ప దగ్గరకు వచ్చియున్నారు.)


(ఈశ్వర్కు 16వ సంవత్సరము వచ్చి కొన్ని రోజులు గడిచిన

తర్వాత అమావాస్య వచ్చినది. ఈశ్వర్ పదహారవ ఏట మొదట వచ్చిన

అమావాస్య అది. ఆ దినము ఈశ్వర్కు శరీరములో చురుకుతనము

లేకుండా నిద్రమత్తు ఎక్కువగా ఉన్నట్లుండేది. ఆ దినము తనకు ఆరోగ్యము

బాగాలేదనిపించి కాలేజికి కూడా పోకుండా ఈశ్వర్ ఇంటివద్దనే ఉండి

పోయాడు. తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఈశ్వర్ నిద్రపోకున్నా ఒక

విధమైన మత్తులాగ ఉండడము వలన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు.

మెలకువలో ఉండినా కళ్ళు తెరిచి చూడాలనిపించడము లేదు. కళ్ళు

మూసుకుంటే హాయిగా ఉన్నట్లుంది. అందువలన కళ్ళు మూసుకొని కుర్చీలో

కూర్చొని ఉన్నాడు. ఉదయము స్నానము చేసి, టిఫిన్ తిన్న తర్వాత అలా

ఉండడము వలన ఈశ్వర్ బయటికిపోలేదు. ఈశ్వర్ అమ్మగారు అతనికి


చూపింది.

వేడిపాలు ఇచ్చి రమ్మని పని మనిషిచేత పంపించింది. పాలగ్లాసును తీసుకొని

పని మనిషి ఈశ్వర్రాూములోనికి వచ్చింది. ఈశ్వర్ స్టడీ టేబుల్ ముందర

కుర్చీలో కూర్చొని ఉన్నాడు. పని మనిషి పాలగ్లాసును తీసుకొని ఈశ్వర్కు

వెనుక వైపునుండి వచ్చి, అతని ముందర టేబుల్ మీద గ్లాసును పెట్టి

అమ్మగారు పాలు త్రాగమన్నారని చెప్పి, ఈశ్వర్ ముఖమువైపు చూచింది.

ఈశ్వర్ను చూస్తూనే అదిరిపోయింది. భయముతో కెవ్వున అరిచి

అక్కడినుండి పరుగెత్తి పోయింది. ఈశ్వర్ రూము నుండి గాబరాగా పరిగెత్తి

వచ్చిన పనిమనిషిని జమీందారు, జమీందారు భార్యా ఇద్దరూ చూచారు.

వారు “ఏమి, ఎందుకు భయపడుచున్నావు, ఏమి జరిగింది?” అని అడిగారు.

పని మనిషికి నోటమాటరాలేదు. భయముతో ఈశ్వర్ గదివైపు చేయి

అలా ఆమె భయపడి మాట్లాడలేక చేయి చూపడము వలన

ఈశ్వర్కు ఏమైందోనని గాబరాతో జమీందారూ, అతని భార్య ఇద్దరూ

ఈశ్వర్ రూము వైపు వచ్చారు. పనిమనిషి వద్దు, పోవద్దు అంటున్నా

వారు వినిపించు కోకుండా, ఈశ్వర్ రూములోనికి పోయి ఈశ్వర్ అని

గట్టిగా పిలిచారు. ఈశ్వర్ సాధారణముగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు.

రూములో ఏమిలేదు. ఈశ్వర్ కుర్చీలో టేబుల్ ముందర కూర్చొని ఉ

న్నాడు. అంతేతప్ప అక్కడ భయపడు పరిస్థితి వారికి ఏమీ కనిపించలేదు.

తర్వాత రావుబహదూర్ ఈశ్వర్ అని అతనిని పిలిచాడు. ఈశ్వర్ తిరిగి

చూడలేదు. ఇంత గందరగోళము జరిగినా, రావుబహదూర్ పిలిచినా

అతను తిరిగి చూడలేదు. ఈశ్వర్ ఎందుకు పలకలేదని జమీందారు

మరియు అతని భార్య ఇద్దరూ ఈశ్వర్ దగ్గరకు పోయి ఈశ్వర్ను చూచారు.

ఒక్కమారు వెయ్యి వాట్సు కరెంటు షాక్ కొట్టినట్లయినది. ఇద్దరు తమకు

తెలియకుండానే గది బయటికి పరిగెత్తివచ్చారు. మిగతా ఇంటిలోని

వారు అందరూ అక్కడకు వచ్చి, ఏమి జరిగిందోనని ఆశ్చర్యముగా వారిని


అడిగారు. వారు ఏమీ చెప్పలేదు. అంతలో మిగతావారు కూడా ఈశ్వర్

గదివైపు పోవాలని ప్రయత్నించగా, రావుబహదూర్ వద్దని వారించి ఎవరినీ

ఈశ్వర్ రూమువైపు పోనీయలేదు. అందరూ మౌనముగా ఉండిపోయారు.

పనిమనిషి ఏమీ చెప్పలేకపోవుచున్నది. అలాగే రావుబహదూర్ కూడా ఏమి

చెప్పలేదు. ఆ ఇంటిలో అంతా నిశ్శబ్దము ఆవహించింది. అలా గంటసేపు

గడిచింది. ఈశ్వర్ తన రూమునుండి బయటికి వచ్చి “అమ్మా! నేను పాలు

ఇమ్మన్నాను కదా! నా టేబుల్ మీద చల్లని పాలున్నాయి. పైగా గ్లాసుమీద

మూతలేకుండా పెట్టివచ్చారు. అవి చల్లగైపోయాయి. నాకు పాలను వేడిచేసి

ఇవ్వండి” అని సర్వసాధారణముగా ఈశ్వర్ తన అమ్మను అడిగాడు.


ఈశ్వర్ సర్వసాధారణముగా వచ్చి వేడిపాలిమ్మనినా, ఈశ్వర్ అమ్మ

అతనిని చూచి భయముతో వణికి పోతూవున్నది. తొందరగా వేడిపాలు

పంపమని చెప్పి ఈశ్వర్ తిరిగి తన గదిలోనికి పోయాడు. అయినా

ఈశ్వరు పాలను ఎవరూ తీసుకపోలేదు. తర్వాత కొంతసేపటికి ఈశ్వర్

రెండవమారు బయటికి వచ్చి బయట హాలులోనే కూర్చున్నాడు. “నేను

పాలు అడిగిపోయాను, మీరు మరిచిపోయారు. నాకు నిద్రమత్తుగా ఉంది

తొందరగా కాఫీని చేసి ఇవ్వండి” అని అడిగాడు. రెండవమారు ఈశ్వర్

హాలులో కూర్చొని కాఫీని అడిగినప్పుడు అందరికీ కొంత ధైర్యము వచ్చింది.

కాఫీని చేసి ఇచ్చారు. ఈశ్వర్ కాఫీత్రాగి హాలులోనే పేపర్ చదువుతూ

కూర్చుండి పోయాడు. జమీందారు, అతని భార్య, పని మనిషి మాటిమాటికి

ఈశ్వర్ను చూస్తూ కొంత ధైర్యము తెచ్చుకొన్నారు. ఇంటిలోని మిగతావారు

అసలు విషయము ఏమి జరిగిందో అర్థముకాక తికమక పడిపోయారు.

పనిమనిషిగానీ, జమీందారు దంపతులు గానీ ఆ దినము గదిలో ఏమి

జరిగినది ఎవరికీ చెప్పలేదు. చెప్పదలచుకోలేదు.


ఈశ్వర్ విషయమును జమీందార్ ఎవరైనా గొప్పవారివద్ద అడిగి

తెలుసుకోవాలనుకొన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తులు ఎవరున్నారని

జమీందారు రావుబహదూర్ చాలామందిని అడిగి చూచాడు. అలా అడుగగా

చాలామంది రాజయోగానంద స్వామి పేరును చెప్పారు. అయితే ఆ

స్వామి తన దగ్గర దైవజ్ఞానమును తెలుసుకొను వారికి మాత్రమే ఏదైనా

సలహా ఇచ్చుననీ, మిగతావారికి ఏమీ చెప్పడని చెప్పారు. అయినా

రావుబహదూర్, రాజయోగానందస్వామివద్దకు పోయి ప్రాధేయపడి తన

సమస్యను గురించి అడగాలనుకొన్నాడు. అమావాస్య పోయిన నాలుగు

రోజులకు బయలుదేరి రాజయోగానందస్వామి ఆశ్రమమునకు పోయాడు.

అక్కడ స్వామిని కలిసి ఇలా మాట్లాడాడు.)


జమీందారు :- స్వామీ! నాకు దైవజ్ఞానము అంటే ఏమిటో తెలియదు.

నాకు భక్తి మాత్రమున్నది. నేను ఇప్పటినుండి మీ ఆశ్రమానికి అప్పుడప్పుడు

వచ్చి జ్ఞానమును తెలుసుకొంటాను. అలాగే జ్ఞానము అభివృద్ధి అగుటకు

ఏదైనా విధానముంటే, దానికి డబ్బు ఖర్చుపెట్టి జ్ఞానము ప్రచారమగునట్లు

సేవ చేస్తాను. అంతేకాక మీరు ఎట్లు చెప్పితే అట్లు నడుచుకొంటాను.

ప్రస్తుతము నాకున్న సమస్యకు మీరే పరిష్కారము చెప్పాలి.


రాజయోగానంద :- నేను ఇక్కడ ప్రపంచ విషయములకు ఎక్కువ ప్రాధాన్యత

ఇవ్వను. నీవు దైవజ్ఞానమును తెలుసుకుంటానని చెప్పుచున్నావు, కాబట్టి

ఈ ఒక్కమారు నీ సమస్యకు పరిష్కారమును చెప్పగలను. అసలుకు నీ

సమస్య ఏమిటి?


జమీందారు :- నాకు సంతతి లేదు. కావున నేను చిన్నతనములోనే తల్లి

చనిపోయిన అనాధ బాలున్ని తెచ్చుకొని పెంచుకొన్నాను. అతనికి ఈశ్వర్

అని పేరు పెట్టాను. ఈశ్వర్ అష్టగ్రహ కూటమి రోజున పుట్టిన బిడ్డ.


అతనిని గురించి చాలామంది చాలా రకములుగా చెప్పారు. నేను ఎవరి

మాటవినలేదు. ఈశ్వర్ మీద ఎక్కువ ప్రేమను కల్గియున్నాను. ఈశ్వర్

కూడా మంచి బుద్ధిమంతుడు, చదువును బాగా చదువుచున్నాడు. అంతేకాక

అతనికి పుట్టుకతోనే కల్గిన శక్తుల వలన చాలామందికి మంచిని చేశాడు.

అతను చిన్న వయస్సులోనే ఇంటిలోనేకాక బయట ప్రజలందు కూడా

మంచి పేరును తెచ్చుకొన్నాడు. అతనిని బయట ప్రజలందరూ

అభిమానిస్తారు. ఈ మధ్యన పాము కరచి చనిపోయిన అబ్బాయిని బ్రతికించి

ప్రజలలో పూజ్యభావమును కల్గినవాడైనాడు. అతన్ని గురించి చెప్పితే

అంతా మంచే తప్ప చెడు ఏమాత్రము లేదు. అటువంటి వానిలో గడచిన

అమావాస్య రోజున ఒకే ఒక చెడు కనిపించింది. దానిని మేము

జీర్ణించుకోలేక పోవుచున్నాము. ఎందుకలా జరిగిందో మీరు తప్ప

చెప్పెడివారు ఎవరూ లేరని చాలామంది మీ పేరునే చెప్పారు. అందువలన

మీవద్దకు వచ్చి చెప్పుకొంటున్నాను.


రాజయోగానంద :- నీ బాధంతా నాకు అర్థమైనది. గడచిన అమావాస్య

రోజున ఏమి జరిగిందో వివరముగా చెప్పు. అప్పుడు దానిని గురించి

యోచిస్తాను.


జమీందారు :- అమావాస్య రోజున ఈశ్వర్ చురుకుతనముగా లేకుండా

మజ్జుగా ఉన్నదనీ, నిద్రమత్తుగా ఉన్నదనీ చెప్పాడు. ఆ దినము కాలేజీకి

కూడా పోలేదు. పగలు దాదాపు పది గంటలపుడు ఈశ్వర్ అమ్మ పని

మనిషితో ఈశ్వర్కు పాలు ఇచ్చిరమ్మని చెప్పి పాలు పంపింది. అప్పుడు

ఈశ్వర్ తన గదిలోనే కూర్చొని ఉన్నాడు. పాలు తీసుకొని పోయిన పని

మనిషి పాలగ్లాసును బల్లమీద పెట్టి, ఈశ్వర్ ముఖమువైపు చూచిన వెంటనే

ఆమె భయపడి అరుస్తూ బయటికి పరుగెత్తి వచ్చింది. తర్వాత మేము


ఏమి జరిగిందోనని లోపలికి పోయి ఈశ్వర్ను చూచాము. మనిషి అంతా

బాగానే ఉన్నాడు. కానీ ముఖము వికృతాకారముగా మారి భయంకరముగా

ఉన్నాడు. అది ఇట్లుందని చెప్పుటకు వీలులేనంత భయంకరముగా

ఉంది. మేము కూడా భయపడి బయటికి వచ్చాము. తర్వాత మేము

ఎవరూ లోపలికి పోలేదు. ఒకగంట తర్వాత ఈశ్వర్ సాధారణముగా

బయటికి వచ్చి మాతో మాట్లాడాడు. బయటికి వచ్చినపుడు ప్రతి రోజూ

ఉన్నట్లే ఉన్నాడు, ఏ మార్పులేదు. అతనిని ఆ విధముగా మేము ముగ్గురమే

చూచాము. మేము చూచిన విషయము ఇంతవరకూ బయట ఎక్కడా

చెప్పలేదు. అప్పుడు ఎందుకు అట్లు కనిపించాడో, ఇంతవరకు మాకు

అర్థము కాలేదు. ఆ విషయమును అన్నీ తెలిసిన పెద్దలైన మీవద్ద తెలుపు

కొనుటకు వచ్చాను. ఈశ్వర్ ఎందుకు అలా కనిపించాడో? తర్వాత ఏమి

తెలియనట్లు మామూలుగా ఎందుకున్నాడో, మీరు చెప్పేంతవరకు మాకు

అర్థముకాదనుకొన్నాము.


రాజయోగానంద :- మీరు పెంచుకొంటున్న ఈశ్వర్ సామాన్యుడు కాదు.

అతడు ప్రత్యేకమైన జాతకములో పుట్టాడు. ఎనిమిది గ్రహబలముల శక్తి

అతనిలో ఇమిడి ఉన్నది. అందువలన అతను సాధారణమైన మనిషికాడు.

అతడు అసాధారణమైన మనిషి. ఇప్పుడతనికి 15 సంవత్సరములు పూర్తి

అయిపోయి 16వ సంవత్సరము వచ్చింది. 16వ సంవత్సరములో నిన్న

గడచినది మొదటి అమావాస్య. పోయిన అమావాస్య దినమున ప్రపంచమును

వినాశనము చేయు భయంకరమైన శక్తి ఒకటి ఈశ్వర్లో చేరిపోయింది.

అది చేరుట వలన, అతని మెదడులో అది ప్రతిబింబించి, అది

చేరినట్లు బయటికి తెలియుటకు దాదాపు ఒక గంటసేపు, అతని ముఖము

వికృతాకారముగా మారిపోయివుంటుంది. ఆ సమయములో ఈశ్వర్కు


బయటి ధ్యాస వుండదు. అందువలన పని మనిషి ఎదురుగా చూచి

అరచి నప్పుడుగానీ, రెండవమారు మీరు గాబరాగా అతని గదిలోనికి పోయి

చూచినప్పుడుగానీ, ఈశ్వర్ మిమ్ములను ఏమాత్రమూ గుర్తించలేదు. మీరు

అతనిని చూచి అరచినా అతని నుండి ఏ స్పందనా ఉండదు. అప్పుడు

అతడు పూర్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అందువలన ఈశ్వర్కు మీరు

గదిలోనికి వచ్చి పోయిన విషయము ఏమాత్రము తెలియదు. మీరు తన

ముఖములో వికృతాకారమును చూచిన విషయము కూడా ఆయనకు

తెలియదు. తర్వాత అతనికి జ్ఞాపకము వచ్చిన తర్వాత తన రూములో

చల్లని పాలున్నట్లు చూచి, అతడు స్వయముగా బయటకు వచ్చి, సర్వ

సాధారణముగా వేడిపాలు ఇమ్మన్నాడు. అప్పటికే ఒక వినాశకరశక్తి ఈశ్వర్

లో ఇమిడిపోయింది. ఇదంతయూ మీకు తెలియదు. కావున మీరు భయపడి

పోయారు. ఆ దినము అమావాస్య కావున ఉదయము నుండి ఈశ్వర్కి

మగతగా ఉండడమూ, నిద్రమత్తుగా ఉండడము జరిగి ఉంటుంది. ఒక

సాధారణ దయ్యము ఒక మనిషిలోనికి చేరపోయే ముందుగానీ, చేరినపుడు

గానీ ఆ మనిషిలో ఆవులింపులు, త్రేనుపులు వచ్చినట్లు, ఈశ్వర్లో కూడా

ఒక భయంకర వినాశకరశక్తి చేరబోయేముందు అతనికి మగతగా, నిద్ర

మత్తుగా ఉండడము జరిగి ఉంటుంది. కావున ఆ దినము అతను కాలేజికి

కూడా పోలేదు. అతను అష్టగ్రహ కూటమి రోజున పుట్టిన కారణమున

అతనిలో కొన్ని శక్తులు ముందే ఇమిడి ఉన్నవి. అందువలన ఈశ్వర్ను

చూస్తూనే దయ్యాలు భయపడి పారిపోయాయి. అందరూ చనిపోయాడను

కొన్న బాలున్ని చనిపోలేదని గుర్తించగలిగాడు. అతని మీదికి వచ్చిన

గుర్రము చనిపోయింది. ఇంతకాలము అతనిలో చిన్నచిన్న శక్తులు చేరి

ఉండగా, 16వ సంవత్సరము అతనిలో భయంకరమైన లోక వినాశకర


శక్తులు చేరవలసివున్నది. అందువలన రేపు వచ్చు అమావాస్యకు కూడా

మరొక శక్తి ఈశ్వర్లో చేరిపోగలదు. ఈ విధముగా ఆరు అమావాస్యలు

జరిగి తీరును. అతనిలోనికి ఆ శక్తులు ఆవహించకుండా ఎవరూ అడ్డుపడ

లేరు. అందువలన మీరు రాబోయే అమావాస్య దినములలో ముందే

అతనిని బయటకు పోకుండా ఇంటిలోనే ఉంచుటకు తగిన ఏర్పాట్లు

చేసిపెట్టండి. అమావాస్య దినములలో ఈశ్వర్ బయటికి పోకుండా ఆయనకు

ముందే మత్తు ఏర్పడును. కావున ఆ దినము ఈశ్వర్ బయటికి పోకుండా

ఇంటిలోనే ఉంటాడు. ఆ సమయములో అతని గదిలోనికిగానీ, అతనివద్దకు

గానీ ఎవరూ పోవద్దండి. ఆ దినము అతను సర్వ సాధారణముగా తన

గది నుండి బయటికి వచ్చేంతవరకు, ఎవరూ అతనిని గురించి యోచించక

మీ పనులలో మీరు ఉండండి. ఆయనలో చేరవలసిన శక్తి చేరిపోయిన

ఒక గంట తర్వాత అతను సాధార మనిషిగా మారిపోయి బయటికి

వచ్చును. అప్పుడు అతనితో కలిసి మాట్లాడినా, కలిసివుండినా మీకు

అతని ద్వారా ఎటువంటి హానిగానీ, ఎటువంటి భయముగానీ ఉండదు.

ఇప్పుడు నా ద్వారా ప్రతి  అమావాస్య కు జరుగు  విషయము మీకు తెలిసి

పోయింది కదా! కావున మీరు ఏమీ ఆందోళన చెందకుండా ఉండవచ్చును.

నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఏమీ జరగదని నేను అనుకొంటున్నాను.

తర్వాత మీకు ఏదైనా అనుమానము ఉండినా, ఏదైనా అర్థము కాకపోయినా,

లేక ఇంకా ఏమైనా జరిగినా నా దగ్గరకు వచ్చి తెలియజేయండి. 


(రాజయోగానంద స్వామి చెప్పిన అనూహ్యమైన విషయమును

విన్న తర్వాత జమీందారుకు తల తిరిగినంత పని అయింది. ఈశ్వర్కు

గత అమావాస్య దినమున ఇట్లు జరిగినదని చెప్పినదీ, స్వామి జరుగబోవు


నని చెప్పినదీ పూర్తి అర్థమైనది. జరుగబోయే దానిని ఎవరూ ఆపలేరన్న

విషయము కూడా అర్థమైనది. రాజయోగానంద స్వామి జరిగిన దానినీ,

జరుగబోయే దానినీ, వివరించి చెప్పడము వలన వారు కొంత కుదుట

పడినారు. ఈశ్వర్కు జరిగిన మరియు జరుగబోవు రహస్యములను

ముందుగానే గ్రహించి చెప్పడము ఎవరితోనూ సాధ్యమయ్యే పనికాదను

కొన్నారు. స్వామి చాలా గొప్పవాడని వారి మనస్సులో అర్థమైనది. తర్వాత

జమీందారు రావుబహదూర్ స్వామితో ఇలా అన్నాడు.)


జమీందారు :- స్వామీ, ఈశ్వర్కు తనను గురించి తనకు తెలియదా?

తనకు ఇట్లు జరిగిందని కొద్దిగైనా తెలియదా!


రాజయోగానంద :- ఏమాత్రము తెలియదు. తెలియుటకు అవకాశమే

లేదు. మీరు కూడా ఏమీ చెప్పవద్దండి.


జమీందారు :- స్వామీ, ఈ విధముగా జరుగుట వలన ఈశ్వర్ ఆరోగ్యానికి

ఏమీ ఇబ్బంది ఉండదా?


రాజయోగానంద :- ఆయన ఆరోగ్యాన్ని గురించి ఇప్పట్లో చింతించవలసిన

పనిలేదు. ముఖ్యముగా నేను చెప్పునదేమనగా! మీకు తెలియనివి

భవిష్యత్తులో ఎన్నో జరుగును. అందువలన వాటిని గురించి మీరు తెలుసు

కొని చింతించినా ఏమీ ప్రయోజన ముండదు. జరిగేది జరుగక మానదు.



(అక్కడేనున్న రాఘవ, దుందుభి, రాధేశ్వరి ముగ్గురూ స్వామి చెప్పిన

మాటలన్నీ విని ఆశ్చర్యపోయారు. జమీందారు కూడ చేయునది లేక

స్వామికి నమస్కరించి స్వామి పాదాలవద్ద లక్షరూపాయలను దక్షిణముగా

పెట్టి తర్వాత వస్తానని చెప్పి బయలుదేరిపోయాడు.)



(తపస్వి బాబా తన మందిరములో ఉండి ఈశ్వర్కు అమావాస్య

రోజున ఏమి జరిగినది, తనవద్దనున్న శక్తుల ద్వారా తెలుసుకొన్నాడు.

ఇక ఆలస్యము చేస్తే బాగుండదనీ, ఇప్పటికే తన కార్యము ప్రారంభించ

వలెనని అనుకొన్న బాబా వెంటనే, మునెప్పను తనవద్దనున్న రేడియో ఫ్రీక్వెన్సీ

ద్వారా సంప్రదించి జరిగినదంతా చెప్పి నాగోతులు నాగభూషణమునూ,

మంత్రాల మల్లయ్యనూ, ఇద్దరినీ ఈశ్వర్ ఉన్న ఊరులో మకాము వేసి

ఉండమన్నాడు. అలా అక్కడ ఉండడమేకాక, ఎలాగైనా ఈశ్వర్ను ఆకర్షించి

వారితో స్నేహముగా ఉండునట్లు చేసుకోమన్నాడు. అలా స్నేహమును

ఏర్పరచుకొన్న తర్వాత ఈశ్వర్ ద్వారా వారి ఇంటిలోని వారిని కూడా

స్నేహము చేసుకొని, అప్పుడప్పుడు ఈశ్వర్ ఇంటికి పోయివచ్చునట్లు

అనుకూలము చేసుకోమన్నాడు. ఇంటిలోని వారితో స్నేహము పెరిగిన

తర్వాత వీలైతే ఈశ్వర్ ఇంటిలోనే తాము ఉండునట్లు చేసుకోమన్నాడు.

అలా చేత కాకపోతే ఈశ్వర్ ఇంటికి దగ్గరగా ఉండునట్లు అయినా

అనుకూలము చేసుకోమన్నాడు. తపస్విబాబా చెప్పిన మాటలన్నీ విన్న

మునెప్ప అలాగే చేయిస్తానని చెప్పాడు. తర్వాత తనవద్దనున్న మాంత్రికులు

ఇద్దరికీ బాబాగారు చెప్పిన మాటలన్నీ వివరించి చెప్పారు. మాంత్రికులు

ఇద్దరూ సరేనని ఒప్పుకోగా మునెప్ప వారి ఖర్చులకు డబ్బులిచ్చి పంపాడు.

ఈశ్వరున్న చెన్నపట్నము చాలా పెద్దది కాబట్టి మాంత్రికులు ఇద్దరూ ఒక

ఇల్లు కిరాయికి తీసుకొని చెన్నపట్టణములో చేరి పోయారు. అలా చేరిన

వారు మూలికావైద్యము చేస్తామని బోర్డు పెట్టుకొన్నారు. అంతేకాక చిన్న

పిల్లలకు బాలగ్రహ దోష నివారణకు తావెత్తులు కట్టడమూ, దయ్యములున్న

వారికి మంత్రించి నీళ్ళు ఇవ్వడము మొదలగు పనులు పెట్టుకొన్నారు.

అట్లు వారు కొద్ది రోజులలోనే ఆ ఊరిలో గుర్తింపు తెచ్చుకొన్న వైద్యులుగా

మారిపోయారు. కొందరికి జ్యోతిష్యము కూడా చెప్పుచూ ప్రజల దృష్ఠిని



ఆకర్షించుకొన్నారు. ఆ విధముగా ఆ ఊరిలో వారి పేరు ప్రాకిపోగా

ఒక రోజు జమీందారు రావుబహదూర్ తన ఇంటి పరిస్థితి గురించి వారిని

అడగాలనుకొని,  ఆ ఇద్దరు మాంత్రికులవద్దకు వచ్చాడు. మల్లయ్య

తాత అక్కడ జ్యోతిష్యునిగా ఉండుట వలన మల్లయ్య తాతతో ఇలా

మాట్లాడినాడు.)


జమీందారు :- తాతగారూ, మా ఇంటిలో ఈ మధ్యన కొన్ని సమస్యల

వలన నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. మాకు వచ్చిన సమస్యలన్నీ

లేకుండా పోయి నాకు మనశ్శాంతి కలుగుతుందా లేదా?


(జమీందారు చెప్పిన మాటలు వినిన మల్లయ్య తాతకు జమీందారు

విషయమూ, అతని కొడుకు ఈశ్వర్ విషయమూ, గత అమావాస్య దినమున

జరిగిన విషయమూ అన్నీ మునెప్ప ద్వారా తెలుసుకొని, వారి కోసమే ఆ

ఊరికి వచ్చారు కనుక జమీందారు తమవద్దకు రావడముతో మల్లయ్య

తాతకు మొత్తము సీన్ అంతా అర్థమైనది. అప్పుడు జమీందార్ ఇలా

చెప్పాడు.)


మల్లయ్య :- (ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని తెరిచి) నీ సమస్య నాకు

అర్థమైనది. ఈ దేశములోగానీ, ఈ రాష్ట్రములోగానీ, ఈ చెన్నపట్టణములో

గానీ ఎవరికీ లేని సమస్య నీకు ఉంది. గడచిపోయిన అమావాస్య నీ

జీవితమును పూర్తి చీకటి చేసింది. నీకే అమావాస్య పట్టినట్లయినది.

అంతేనా!


జమీందారు :- (తన మనస్సులోని సమస్యను ఉన్నదున్నట్లు చెప్పిన తాత

సామాన్యుడు కాడనుకొని) తాతగారూ! మీరు చెప్పినది నూటికి నూరుపాల్లు

సత్యము. నాకు ఆ దిగులు పోయి మనశ్శాంతి కావాలంటే దానికి మీరు

ఉపాయము చెప్పాలి.


మల్లయ్య :- నీవు ఈ విషయమునే ముందు ఒక స్వామీజీ దగ్గరకు పోయి

అడిగి వచ్చావా లేదా చెప్పు.


జమీందారు :- (ఆశ్చర్యపోతూ) అవును తాతగారూ పోయి అడిగి వచ్చాను.

మల్లయ్య :- ఆయన జరిగింది చెప్పాడు, జరుగబోయేది చెప్పాడు. కానీ

నీకు మనశ్శాంతి ఎట్లు కల్గుతుందో చెప్పలేదు. అవునా, కాదా!

జమీందారు :- అవును తాతగారూ. ఆయన నా మనశ్శాంతి గురించి

చెప్పలేదు.


మల్లయ్య :- నీకు మీ ఈశ్వర్ గురించి చెప్పిన స్వామి చాలా గొప్పవాడు.

ఆయనకు తెలియంది లేదు. నీకు మనశ్శాంతి లభించాలంటే చాలా

కష్టమని ఆయనకు బాగా తెలుసు. అందువలన చెప్పలేదు. అది కష్టమే

అయినా దానికి ఉపాయమును నేను చెప్పగలను. అయితే దానికి మా

ఫీజు ప్రత్యేకముగా ఉంటుంది.


జమీందారు :- అయినా ఫరవాలేదు. మీరు అడిగినది ఇచ్చుకుంటాను.

నాకు ఏదైనా పరిష్కారమును చూపండి.


మల్లయ్య :- అవకాశమొచ్చిందని అన్యాయముగా నేను అడిగేవాణ్ణి కాదు.

ఏది చెప్పినా, ఏది చేసినా నీతిగా, నిజాయితీగా చేస్తాము. నీ సమస్య

పరిష్కారము కావాలంటే మొదట ఈశ్వర్ను మాకు పరిచయము చెయ్యి.

తర్వాత మేము ఇక్కడి నుండి నీ సమస్య పరిష్కారము చేయలేము. నీ

సమస్య పెద్దది కాబట్టి మేము మీ ఇంటిలోనే ఉండి సమస్యను పరిష్కారము

చేయవలసి ఉంటుంది. మీ ఇంటిలోనే మేముండుట వలన అన్నము మీ

ఇంటిలోనే తినవలసి వస్తుంది. కావున చివరిలో మాకు ఒక ఆవునుగానీ,

ఆవుకు అయ్యే డబ్బునుకానీ మీరు మాకు ఫీజు క్రిందికి ఇవ్వవలసి వస్తుంది.

మీ సమస్య కొరకు ఇప్పటినుండి ఐదు, ఆరు నెలల కాలము మేము మీ

ఇంటిలో ఉండవలసి వస్తుంది. దీనికి మీరు ఏమంటారు?

జమీందారు :- మీరు చెప్పిన దానికి సంతోషముగా ఒప్పుకుంటాను. మీరే

మా ఇంటికివస్తే అంతకంటే భాగ్యమేముంది?


మల్లయ్య : - మేము మీ ఇంటికి పది రోజుల వరకు రాలేము. అంతలోపల

మీ అబ్బాయి ఈశ్వర్ను మాకు చూపించి పరిచయము చేయి.


(అలాగేనని చెప్పిన జమీందారు రెండు రోజుల తర్వాత ఈశ్వర్ను

తీసుకువచ్చి మాంత్రికులకు చూపించి పరిచయము చేశాడు. అప్పటి

నుండి ఈశ్వర్ వారికి బాగా పరిచయమయ్యాడు. పది రోజుల తర్వాత

మునెప్ప చెప్పినట్లు తమ మకామును జమీందారు ఇంటికి మార్చివేశారు.

తర్వాత మునెప్పకు ఆ విషయమును తెలియజేశారు. తొందరగా తమ

మనుషులు జమీందారు ఇంట్లో పాగా వేయడము మునెప్పకు సంతోషమైనది.

ఆ విషయమును తపస్వి బాబాకు తెలియజేశారు. ఆ విషయమును తెలుసు

కొన్న తర్వాత తపస్వి బాబా తన పథకము సులభముగా నెరవేరుతుందని

సంతోషించాడు. తర్వాత మునెప్పకు చెప్పవలసినదంతా చెప్పి ఆ

విషయమును మాంత్రికులకు తెలియజేయమన్నాడు. మునెప్ప, తపస్వి బాబా

చెప్పిన సమాచారమును ఇద్దరి మాంత్రికులకు అందించాడు. వార్తలను

తెలుపుటకు చెన్నపట్నములోనే తన మనిషిని ఉండునట్లు మునెప్ప చేశాడు.


అంతలో రెండవ అమావాస్య వచ్చినది. గడచిన అమావాస్య

దినమున ఉన్నట్లే రెండవ అమావాస్య దినమున కూడా ఈశ్వర్కు నిద్రమత్తు

ఆవహించి మగతగా ఉండెను. ఆ దినము కూడా ఈశ్వర్ కాలేజీకి పోలేదు.

తన రూములోనే ఉండి పోయాడు. కళ్ళు తెరిచి చూచుటకు ఇష్టము లేని

దానివలన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఆ దినము అమావాస్య అని

మాంత్రికులకు కూడా తెలుసు. తపస్వి బాబా మునెప్ప ద్వారా తెలిపిన

విషయములో ఆ దినము ఈశ్వర్ శరీరములోనికి ఒక శక్తి ప్రవేశించునని

తెలుసు. అతనిలోనికి శక్తి ప్రవేశించునపుడుగానీ, ప్రవేశించుటకు ముందు

గానీ, ప్రవేశించిన తర్వాత గంటలోపలగానీ ఈశ్వర్ ముఖము మీద, బాబా


వలన

ఇచ్చి పంపిన విభూదిని బొట్టు పెట్టాలి. అలా విభూదిని ఈశ్వర్కు పెట్టుట

ఆ విభూది ఎవరిదో, వారి మాట ప్రకారము ఈశ్వర్లోనికి

ప్రవేశించిన శక్తి నడుచుకొనును. వివరముగా చెప్పితే విభూది ఎవరిదో

వారికి ఈశ్వర్లోని శక్తి వశమగును. అందువలన ఇద్దరు మాంత్రికులు

జమీందారుకు ధైర్యము చెప్పి, మేము అతనికి ఏమీ జరుగకుండా

చూచుకుంటామని ఈశ్వర్ రూములోనికి వచ్చుటకు వేచి వున్నారు.

నాగభూషణము కుంకుమ, పసుపు కలిపిన బియ్యమును (అక్షింతలను)

చేతిలో పట్టుకొని ఉండగా మల్లయ్య విభూది పొట్లమును తీసుకొనివుండెను.

వారి అంచనా ప్రకారము పగలు 10 గంటల సమయములో శక్తి అతనిలో

చేరునని ముందే బాబా చెప్పిపంపివుండెను. సరిగా పదిగంటల నుండి

పదిహేను నిమిషముల కాలము ఈశ్వర్ లోనికి శక్తి చేరుటకు సమయము

పట్టునని వారికి ముందే తెలిసివుండుట చేత ఇద్దరు మాంత్రికులు పదిగంటల

రెండు నిమిషములకు ఈశ్వర్ గదిలోనికి ప్రవేశించారు. ఈశ్వర్ మౌనముగా

కుర్చీలో కూర్చోని ఉన్నాడు. అక్కడ చూచుటకు అంతా సర్వసాధారణముగా

ఉన్నది. ఈశ్వర్ అటువైపు తిరిగి కూర్చున్న దానివలన అతని ముఖము

కనిపించలేదు. ఆ సమయములో పదిహేను నిమిషముల కాలము

అతనిలోనికి శక్తి ప్రవేశించుచుండును. ఈ సమయములోనే ఈశ్వర్కు

విభూది బొట్టు పెట్టవలెను. గదిలోనికి పోయిన మాంత్రికులకు అక్కడ ఏ

తేడా కనిపించక పోవడముతో ధైర్యముతో మల్లయ్య ముందుకు పోయాడు.

ఏదైన తాము ఊహించని సంఘటన జరిగితే, మంత్రోచ్ఛాటన చేసిన

అక్షింతలను చల్లి, ఏ ఆపద జరగకుండా చేయుటకు నాగభూషణము

సిద్ధముగా నిలబడివుండగా, మల్లయ్యతాత ఈశ్వర్కు బొట్టు పెట్టుటకు

ఈశ్వర్ ముందుకు పోయాడు. ముందుకు పోయి చూచిన మల్లయ్యకు

మతిపోయినంత పని అయినది. ఒక్కమారు ఈశ్వర్ ముందు నుండి


ప్రక్కకు జరిగి నాగభూషణము వద్దకు వచ్చాడు. ఏమి అన్నట్లు

నాగభూషణము మల్లయ్యవైపు చూచాడు. వెనుకనుండి ఈశ్వరైవైపు చూస్తూ

మల్లయ్య "అతనికి అక్కడ తలే కనిపించలేదు, బొట్టు ఎక్కడ పెట్టాలి?”

అన్నాడు. వెనుకవైపునుండి నాగభూషణముకు, మల్లయ్యకు ఇద్దరికి ఈశ్వర్

తల కనిపిస్తూనే ఉన్నది. నాగభూషణము ఈశ్వర్వైపు చూస్తూ "ఇక్కడినుండి

కనిపిస్తావుంది కదా!" అన్నాడు.


రెండవమారు నాగభూషణము, మల్లయ్య ఇద్దరూ కలిసి ఈశ్వర్

ముందుకు పోయారు. అక్కడికి పోయిన ఇద్దరికీ ఈశ్వర్ తల కనిపించలేదు.

ఇద్దరూ ఒకరి ముఖము ఒకరు చూచుకొని ప్రక్కకు వచ్చారు. వారు

తీసుక పోయిన ఒక చిన్న చేతిసంచిని మొదట నాగభూషణము నిలబడివున్న

చోట పెట్టివుండిరి. దానిలో కొన్ని వారికి అవసరమైన సామాగ్రిని తీసుకొని

పోయి ఉండిరి. ఆ సంచికొరకు వెనకవైపు వచ్చి సంచిని తీసుకొని ఈశ్వర్

వైపు చూచారు. ఈ మారు ఇద్దరికీ వెనుకవైపు నుండి కూడా అతనికి తల

లేనట్లే ఉన్నది. కుర్చీలో తలలేని మొండెము మాత్రము కూర్చునట్లు కనిపి

స్తున్నది. వారు ఇద్దరూ మాంత్రికులే అయినా, అప్పుడు ఏ మంత్రమును

ప్రయోగించాలో వారికి అర్థముకాలేదు. అటువంటి సమయములో కూడా

వారు ధైర్యముగానే ఉన్నారు. సంచిలోనుంచి చిన్న కాటుక డబ్బాను

బయటకు తీశారు. మర్మాంజనమును బయటికి తీసి దానిని ఇద్దరూ

కళ్ళకు కాటుకగా ధరించారు. ఆ కాటుకను కనురెప్పలకు పెట్టుకుంటే

అంతవరకు కనిపించక మర్మముగా ఉన్నవేవైనా కనిపించును. అందువలన

ఆ కాటుకను పెట్టుకొన్నారు. అలా పెట్టుకొనినా వారికి ఈశ్వర్ తల

ఏమాత్రము కనిపించ లేదు. అంతేతప్ప అక్కడ ఏమీ జరుగలేదు. అప్పుడు

ఆ గదియంతా తన చేతిలోని అక్షింతలను నాగభూషణము చల్లాడు. ఈ


విధముగా లోపల జరుగుచుండగా బయట జమీందారూ, అతని భార్యా

ఇద్దరూ లోపల ఏమి జరుగుచున్నదోనను ఆందోళనతో ఉన్నారు.

వచ్చిన ఇద్దరు మాంత్రికులకు తలేలేని మనిషికి తాము బొట్టు ఎలా పెట్టాలో

అర్థము కాలేదు. ఈ విధముగా లోపల పదిహేను నిమిషములు గడిచి

పోయినవి. అప్పటికి అతనిలోనికి రావలసిన శక్తి పూర్తిగా వచ్చేసింది.

ఇంకా గంట కాలములోపల ఆ మాంత్రికులు విభూదిని బొట్టుగా ఈశ్వర్కు

పెట్టాలి. ఈ మారు మల్లయ్యకు ఒక ఆలోచన వచ్చినది. ప్రక్కన ఉన్న

అద్దమును తీసుకొని ఈశ్వర్ ముందుర పెట్టితే దానిలో అంతవరకు

కనిపించని తల అద్దములో కనిపించుననీ అప్పుడు అద్దములో చూస్తు

కనిపించని ముఖమునకు బొట్టు పెట్టవచ్చుననుకొన్నారు. మల్లయ్య అప్పుడు

ఆ విషయమును నాగభూషణమునకు చెప్పి నాగభూషణము అద్దమును

పట్టుకొనునట్లు చేశాడు. అప్పుడు అద్దములో చూడగా దానిలో పూర్తి

మనిషే కనిపించలేదు. అద్దములో కనిపించని మొండెము బయట

కనిపిస్తావున్నది. అది ఒక విధముగా మాంత్రికులకైనా భయానక పరిస్థితే

అయినా వారు ధైర్యము గానే ఆ గదిలో అంతవరకు ఉన్నారు. ఒక ప్రక్క

మర్మాంజనమూ పని చేయలేదు. రెండవ ప్రక్క అద్దమూ పని చేయలేదు.

మూడవ విధముగా వారు వేసిన అక్షింతల ప్రభావమూ లేకుండా పోయినది.

ఇక వారు ఏమి చేయాలో ఆలోచించసాగారు. అప్పటికి మిగిలిన గంటలో

ఇరవై (20) నిమిషములు గడచిపోయినవి. ఇకవారు ఏమి చేసినా నలభై

(40) నిమిషములలోనే చేయాలి. అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది.

భూజరీ మంత్రమును పది నిమిషములు పఠించి, ఆ మంత్రమును

జాగృతీచేసి చూడాలనుకొన్నారు. అప్పుడు మల్లయ్య తాత భూజరీ

మంత్రమును జపించను మొదలు పెట్టాడు. పది నిమిషములలో 108

మార్లు ఆ మంత్రమును జపించి, ఆ మంత్రమును జాగృతీ చేసి,


మంత్రముతో నీటిని మంత్రించి  ఆ గది నాలుగు మూలల్లో చల్లారు.

అలా చేయుట వలన ఆ గదిలో తమకు తెలియకుండా ఉండి, ఈశ్వర్

తలను కనిపించకుండా చేయుశక్తి ఏదైనా ఉంటే ఆ గదినుంచి బయటికి

పోతుందని అప్పుడు ఈశ్వర్ తల తమకు కనిపిస్తుందని వారి ఉద్దేశము.

ఆ విధముగా నీటిని చల్లినా ఏ ప్రయోజనము లేకుండా పోయినది. ఇదంతా

జరుగు లోపల (20) నిమిషములు గడచిపోయింది. ఇక మిగిలినది కేవలము

ఇరవై నిమిషములు మాత్రమే. అప్పుడు వారు తమవద్దనున్న విభూదిని

ఇల్లంతా చల్లి చూడాలనుకొన్నారు. అలాగే విభూదిని ఆ గది అంతా చల్లి

చూచారు. అప్పటికి కూడా ఈశ్వర్ తల వారికి కనిపించలేదు. అలా

కనిపించకపోగా వారికి చర్మమంతా నవ్వలు (దురదలు) కొద్దికొద్దిగా మొదలు

పెట్టాయి. అప్పుడు వారు చర్మమును గోక్కుంటూ ఇక ఏమి చేయాలని

ఆలోచిస్తుండగానే వారికి ఒళ్ళంతా విపరీతమైన నవ్వలు వచ్చాయి. అంతలో

సమయము కూడా అయిపోయినది. ఇక అక్కడుండకూడదని ఇద్దరు 

మాంత్రికులు గది బయటకు వచ్చారు. అలా బయటికి వచ్చిన వారిని

జమీందారు ఏమైంది అని ప్రశ్నించాడు. దానికి వారు “మేము ఏమి

చేయాలో అది చేశాము. మీరు ధైర్యముగా ఉండండి అని వారి గదిలిలోనికి

పోయి గుడ్డలు విప్పి శరీరమంతా గోక్కున్నారు. బయట జమీందారు ఆ

మాంత్రికులు ఇంతసేపు లోపల ఉన్నారు కాబట్టి ఈశ్వర్కు గత నెల

జరిగినట్లు జరుగకుండా చేశారని అనుకొన్నారు.


రెండు గంటల తర్వాత స్నానము చేసి వారిగది నుండి ఇద్దరు

మాంత్రికులు బయటకు వచ్చి జమీందారుకు చెప్పి బజారుకు పోయారు.

బజారులో మునెప్ప ముందే సమాచార సేకరణకు ఏర్పాటు చేసిన మనిషితో


జరిగిన విషయమంతా చెప్పి పంపారు. జరిగిన విషయమును తమ వార్తా

హరుని ద్వారా తెలుసుకొన్న మునెప్ప ఆ సమాచారమును తపస్విబాబాకు

చేరవేశాడు. తాను అనుకొన్న కార్యము జరుగక పోవడానికి కారణము

ఏముంటుందని బాబా యోచించను మొదలు పెట్టాడు. )


(రాజయోగానంద స్వామికి జమీందారు ఇంటిలో మునెప్ప

మనుషులైన ఇద్దరు మాంత్రికులు చేరియున్నారని గానీ, వారు రెండవ

అమావాస్య దినమున ఈశ్వర్కు విభూదిబొట్టు పెట్టాలని విశ్వప్రయత్నము

చేసి విఫలమైనారనిగానీ తెలియదు. తపస్విబాబా ముందుగానే తన

పథకమును నెరవేర్చుటకు మాంత్రికులను జమీందారు ఇంటిలోనే చేర్పించా

డనీ, అలా చేయగల్గుతాడనీ రాజయోగానందస్వామి ఏమాత్రము ఊహించ

లేదు. రాబోయే మూడవ అమావాస్య ఆదివారము రాబోతున్నది. కావున

ఆ దినము కంటికి కనిపించని సూక్ష్మములకు ఎక్కువశక్తి ఉండును.

అందువలన ఆ దినము జమీందారు ఇంటిలో ఈశ్వర్లోనికి ఒక ప్రత్యేకమైన

శక్తి ప్రవేశించునని స్వామి అనుకొన్నాడు. ఈశ్వర్కు జరిగేది జరుగక

మానదనీ, దానిని గురించి ఏమీ పట్టించుకోకుండా ఉండమని ముందే

జమీందారుకు చెప్పియుండుట వలన, ఆ ఇంటివారికి ఏమీ జరుగదని

స్వామి అనుకొన్నాడు. స్వామి చెప్పినా, స్వామి మాటలను ఖాతరు

చేయకుండా, ఎవరో మాంత్రికులు చెప్పిన మాటను జమీందారు విన్నాడనీ,

ఈశ్వర్కు ఏదో మంచి చేయాలని ఉద్దేశముతో మాంత్రికులను ఇంటిలోనే

పెట్టుకొన్నాడను విషయము స్వామికి తెలియదు. అందువలన రాబోయే

అమావాస్య ఆదివారము వస్తున్నా దానిని గురించి పెద్దగా చింతించ

వలసిన అవసరములేదనుకొన్నాడు. అంతేకాక రాబోయే నాల్గవ, ఐదవ,

ఆరవ అమావాస్యలు కీలకమైన దినములు కాబట్టి అప్పుడు తాము కూడా


ఆశ్రమము వదలి చెన్నపట్నములోనే ఉండవలెనని స్వామి నిశ్చయించు

కొన్నాడు. అదే విషయమునే రాఘవతో చెప్పాడు.)

రాజయోగానంద :- రాఘవా! ఈశ్వర్కు 16వ సంవత్సరము రెండు

అమావాస్యలు గడచిపోయాయి. అతనిలోనికి ప్రకృతిలోని అతి పెద్దశక్తులు

రెండు ప్రవేశించి ఉంటాయి. మూడవ అమావాస్య ఆదివారము రాబోవు

చున్నది. ఆ దినము కొంత ప్రత్యేకత కల్గినదైనా అందులో మనము

చేయునది ఏమీ లేదు. తర్వాత రాబోయే నాల్గు, ఐదు, ఆరు అమావాస్యలు

చాలా కీలకమైనవి. అప్పుడు మనము కూడా ఈశ్వర్ ఉన్న చెన్నపట్నములోనే

ఉండవలసిన పని వస్తుంది.


రాఘవ :- స్వామీ, ఈశ్వర్లోనికి చేరునవి అతి పెద్దశక్తులు అన్నారు

కదా! అవి ఏ శక్తులు?

రాజయోగా :- పంచభూతములు మహాశక్తులు కదా, ఆ మహా భూతములు

ప్రళయములో సృష్టిని అంతటినీ నాశనము చేయును కదా! వాటి తర్వాత

ఉన్న భూతములు సృష్ఠిని అంతటినీ నాశనము చేయలేవు. సృష్ఠిలో కొంత

భాగమును నాశనము చేయగల శక్తులు మహాభూతముల తర్వాత ఉన్న

స్వల్ప భూతములని అర్థము చేసుకో. వీటి తర్వాత పెద్దవి మహా భూతములు

ఐదు మాత్రమే గలవు. మహాభూతముల తర్వాత పది అతి పెద్ద

భూతములున్నవి. వాటి తర్వాత స్థాయివి కొన్ని ఉండగా, వాటి తర్వాత

కొన్ని ఉండగా, వాటి తర్వాత కొన్ని ఇట్లు అనేక స్థాయిలలో కోట్లాది

భూతములున్నవి. ఐదు మహాభూతముల తర్వాత స్థాయి భూతములు

పది ఉన్నాయన్నాము కదా! వాటిలో మొత్తము ఆరు ఒక్కొక్క అమావాస్య

దినమున ఒక్కొక్కటి ప్రకారము ఆరు అమావాస్యలకు ఆరు ఈశ్వర్లో

చేరును. అందువలన ప్రకృతి తర్వాత పెద్దశక్తి గల భూతములు అని

అన్నాను.


రాఘవ :- ఆ భూతముల శక్తులు ఈశ్వర్లో చేరి ఏమి చేయును?


రాజయోగానంద :- ఏమి చేయునో ఖచ్చితముగా మనము కూడా

చెప్పలేము. ఒకటి మాత్రము చెప్పగలము. ఆ శక్తులు ప్రపంచములో

కొంతవరకు జీవ రాసులను నాశనము చేయునని మాత్రము చెప్పగలము.

అలా జరుగకూడదనే మనము కోరుకొనుచున్నాము. ఆ శక్తులను వశము

చేసుకొని వాటితో వినాశనమును సృష్టించాలని తపస్విబాబా అనుకొంటున్నా

డని, దానిని మనము నిరోధించాలని ముందే చెప్పాను కదా!

రాఘవ :- ఆ శక్తులను నిరోధించుటకు మనము ఏమి చేయాలి?

రాజయోగానంద :- మనము శక్తులను నిరోధించలేము. వాటిని నిరోధించు

టకు మనచేత కాదు. మనము చేయవలసినది వాటిని ప్రేరేపించి వాటి

శక్తిని వినియోగించు దుర్మార్గులను నిరోధించాలి. ఆ శక్తులు గొప్పవే

అయినా, వాటిశక్తి చాలా వినాశకరమైనదైనా, అవి ఏమీ చేయవు. వాటిని

వశము చేసుకొని ప్రపంచములో ఆధిపత్యమును సంపాదించుకోవాలనుకొను

వారిని మనము నిరోధించాలి. దానికొరకు మనము ఇప్పటినుండి

ప్రయత్నము చేయాలి. ఆ శక్తులను దుర్మార్గులు వశము చేసుకోకుండా

చూడాలి.


(ఆ విధముగా చెప్పిన రాజయోగానంద స్వామి, తపస్విబాబా ఏమి

ప్రయత్నము చేస్తాడో చూచి, దానికి తగినట్లు స్పందించాలని అనుకొన్నాడు.)


(మునెప్పద్వారా చెన్నపట్నములో జమీందారు రావుబహదూర్

ఇంటిలో జరిగిన విషయమంతా తెలుసుకొన్న తపస్విబాబా, తమ

మాంత్రికులు ఒక గంటసేపు ప్రయత్నము చేసి ఈశ్వర్ ముఖమున బొట్టును


పెట్టలేక పోయారనీ, ఎందుకు ఆ సమయములో ఈశ్వర్ తల కనిపించ

కుండా పోయిందనీ బాబా చాలాసేపు ఆలోచించాడు. ఆ విషయము

బాబాగారికి ఏమాత్రము అర్థము కాలేదు. మాంత్రికులు తమ లోపము

ఏమీ లేకుండా ప్రయత్నించారనీ, ఒకగంటసేపు ధైర్యముగా ఈశ్వర్ గదిలో

ఉండి, ఎన్నో విధముల ప్రయత్నించిన వారిని పొగడవలసిందే గానీ

తప్పుపట్టుటకు వీలు లేదనుకొన్నాడు. రాబోయే అమావాస్య దినమున

మాంత్రికులకు తమ సహాయమును అందించి ఈ మారు తప్పనిసరిగా

బొట్టు పెట్టునట్లు చేయాలి. అని తపస్విబాబాగారు అనుకోవడము

జరిగినది. వారికి తాము ఒక శక్తి ప్రభావముతో కూడిన కాటుకను

తయారు చేసి ఇవ్వాలని అనుకొన్నాడు. అలా తాము తయారు చేసిన

కాటుకను నొసలుకు నల్లని బొట్టుగా పెట్టుకొంటే ఏదైనా కనిపించకుండా

పోయే ప్రసక్తే ఉండదు. అందువలన ఆ కాటుకను తయారు చేయమని

తన మనుషులకు బాబా ఆదేశించాడు. బాబా ఆదేశానుసారము అడవిలో

తిరుగుచున్న పదకొండు జాతుల యొక్క పక్షుల నుండి పదకొండు రంగుల

ఈకలను సేకరించి, వాటిని కాల్చి మసి చేసి ఆ మసి నువ్వుల నూనెతో

కలిపి కాటుకను తయారు చేశారు. అలా చేసిన కాటుక దేనికి పనికివస్తుందో

మాంత్రికులకు చెప్పి ఇచ్చి రావడము జరిగింది. ఆ కాటుక అధిపతియైన

దేవత యొక్క మంత్రమును చెప్పి, ఆ మంత్రమును ఎలా సిద్ధి చేసుకోవాలో

కూడా చెప్పారు. దాని ప్రకారమే మాంత్రికులు కాటుక పని చేయునట్లు

మంత్రసిద్ధిని కూడా చేసుకొన్నారు. ఆ కాటుక యొక్క పనితనమును

పరీక్షించుటకు మాంత్రికుడు మల్లయ్య దానిని నొసలుకు బొట్టుగా పెట్టుకొని

ఊరిలోనికి పోయాడు. అతనితో పాటు నాగభూషణము కూడా పోయాడు.

అలా ఊరిలో పోవుచుండగా ఒక ఇంటిముందర వాకిలి ప్రక్కన ఒక వ్యక్తి

చినిగిన గుడ్డలు ధరించి ఏడ్చుకొంటూ కూర్చుచున్నాడు. అతను వాకిలి




ప్రక్కనే కూర్చొని ఏడుస్తున్నా అతని ప్రక్కనే ఇంటిలోనికి పోవువారుగానీ,

బయటికి వస్తున్నవారుగానీ, ఇంటిలోని వారుగానీ అతనిని చూడనట్లు

ఏమీ పట్టించుకోలేదు. అప్పుడు మల్లయ్యతాత నాగభూషణమును చూచి

“అతను వాకిలి ప్రక్కనే కూర్చొని ఏడుస్తున్నా అతనిని ఎవరూ పట్టించుకో

లేదు” అని అనెను. ఆ మాటను విన్న నాగభూషణము “ఆ వాకిలి ప్రక్కన

మనిషే లేడుకదా! లేని మనిషిని ఎవరు పట్టించుకుంటారు” అని అన్నాడు.

అప్పుడు మల్లయ్యతాతకు తాను చూచినది మనిషిని కాదనీ, తాను చూచినది

అక్కడ ఎవరికీ కనిపించని దయ్యముననీ, తాను కాటుక బొట్టు పెట్టుకొన్న

దానివలన వారికి కనిపించని దయ్యము (సూక్ష్మశరీరము) తనకు

కనిపించిందని తెలిసింది. అప్పుడు ఆ విషయమును నాగభూషణము

నకు కూడా చెప్పాడు. తమవద్దనున్న కాటుక ప్రభావముతోనే ఎవరికి

కనిపించనిది తనకు కనిపించింది అని అనుకొన్నారు.


ఇంకా కొంతదూరము పోయిన తర్వాత వారు పోవుచున్న దారిలో

ఒక బలిసిన దున్నపోతు రోడ్డుకు ప్రక్కన నిలబడివుండెను. దానిని చూచిన

మల్లయ్య దానికి దగ్గరగా పోకుండా నడిరోడ్డులోనికి పోయి దానిని దాటిన

తర్వాత రోడ్డుప్రక్కకు వచ్చి నడిచెను. వెనుకవస్తున్న నాగభూషణము

మల్లయ్యను చూచి "మేము పోయినట్లు రోడ్డు ప్రక్కనే పోకుండా నడి

రోడ్డులోనికి పోయి తిరిగి ప్రక్కనెందుకు వచ్చావు” అని అడిగెను. అప్పుడు

మల్లయ్యతాత నాగభూషణమును చూచి "అక్కడ రోడ్డు ప్రక్కన అంత

పెద్ద దున్నపోతు నిలబడివుంది కదా! దానికి దగ్గరగా పోకుండా రోడ్డు

మీదికి వచ్చి, దానిని దాటిన తర్వాత రోడ్డు ప్రక్కకు వచ్చాను. దానిని

ఎందుకడు గుచున్నావు” అని అనెను. అప్పుడు నాగభూషణము మల్లయ్యను

చూచి నవ్వి “నీకు చూపు తగ్గిపోయింది. అక్కడ దున్నపోతులేదు. లేని


దున్నపోతును ఉంది అంటున్నావు" అని అన్నాడు. ఆ మాటవినిన మల్లయ్య,

నాగ భూషణమును చూచి "ఒరే తిక్కోడా! నీకు కనపడనిది నాకు

కనిపించింది అంటే అది దున్నపోతు దయ్యమురా. నేను కాటుక బొట్టు

పెట్టుకొన్నాను కాబట్టి అది నాకు కనిపించింది, నీకు బొట్టులేదు కాబట్టి

అది కనిపించలేదు” అని అన్నాడు. దానికి నాగభూషణము నవ్వి

“దున్నపోతు దయ్యము కూడా ఉంటుందా” అన్నాడు. అప్పుడు

మల్లయ్యతాత “పూర్తి చనిపోని ఏ జీవరాసులైనా, పూర్తి చావు వచ్చేంతవరకు

దయ్యముగా ఉండవలసిందే. దాని ప్రకారము మనుషులేకాదు, కుక్కలు,

నక్కలూ, గాడిదలూ, గుర్రాలూ అన్ని దయ్యాలుగా ఉన్నాయి. అట్లున్నాయి

కాబట్టే ఇక్కడ బజారులో దున్నపోతు దయ్యము నాకు కనిపించింది నీకు

కనిపించలేదు” అని అన్నాడు. ఆ మాట వినిన తర్వాత భూమిమీద ఏ

జీవరాసులైనా దయ్యములుగా ఉండవచ్చునని నాగభూషణమునకు

తెలిసింది. అంతేకాక మల్లయ్యతాతకు కూడా తాను ధరించిన కాటుక

బాగా పని చేస్తున్నదని కూడా తెలిసింది. ఈ విధముగా కాటుకను పరీక్షించి

చూచి ఇద్దరు మాంత్రికులూ, మునెప్పకు కాటుక బాగా పనిచేయుచున్నదని

చెన్నపట్నములోనే ఉన్న మనిషి ద్వారా తెలియజేశారు.


మూడవ అమావాస్య రేపు అనగా ముందురోజే తపస్విబాబాగారు

మునెప్పద్వారా తెలియజేసిన సమాచారము వారికి అందినది. ఈ

అమావాస్య దినమున ఎలాగైనా అతనిలోనికి శక్తి ప్రవేశించునపుడు గానీ,

ప్రవేశించిన తరువాత గంటలోపలగానీ విభూదిని ఏ విధముగానైన పెట్టి

తీరవలెనని బాబాగారు పంపిన సమాచారములోని సారాంశము.

మాంత్రికులు ఇద్దరూ కూడా, తాము అడగకుండినా లక్షలాది రూపాయలు

తమకు ఇచ్చి ఎంతో మేలు చేసిన బాబాగారికి ఎటు తిరిగి వారు చెప్పిన


పని చేసిపెట్టాలని దృఢ నిశ్చయములో ఉన్నారు. శనివారము గడిచి

పోయింది, ఆదివారము వచ్చింది. ఆ దినము ఆదివారముతో పాటు

అమావాస్య కూడ వచ్చిన దానివలన జమీందారు రావుబహదూర్ తన

కొడుకు విషయములో కొంత చింతించినా, తర్వాత పోయిన నెల అమావాస్య

దినమున ఈశ్వర్కు ఏమి జరుగలేదని మాంత్రికులు తెలియజేశారు.

కావున ఈ నెలకూడా వారు ఇద్దరూ ఈశ్వర్ గదిలోనే కూర్చొని ఏమీ

జరుగకుండా చూస్తారను ధైర్యముతో ఉన్నాడు. ఆదివారము అమావాస్య

దినమున, ముందు రెండు నెలలలో ఉన్నట్లే ఈశ్వర్కు ఆ దినము కూడా

నిద్రమత్తుగా ఉన్నది. ఆ దినము ఈశ్వర్ బయటికి ఎక్కడికి పోకుండా

ఇంటిలోనే ఉండిపోయాడు. ఆ దినము ఆ విధముగా ఉండడము గతములో

కూడా చూచిన దానివలన జమీందారు రావుబహదూర్ ఈశ్వర్

ఆరోగ్యమును గురించి చింతించలేదు. మాంత్రికులు కూడా సర్వ

సన్నద్ధముగా ఉన్నారు. ఉదయము పది గంటలు కాబోతున్నది. ఈశ్వర్

తనగదిలోనే ఉండిపోయాడు. సరిగా పది గంటలకు ఖగోళములోని శక్తి

దిగివచ్చి ఈశ్వర్ శరీరములోనికి ప్రవేశించను మొదలు పెట్టింది. అప్పుడే

ఆ గదిలోనికి మాంత్రికులు ప్రవేశించారు. మాంత్రికులు ఇద్దరూ పక్షుల

ఈకల కాటుకను పెట్టుకొని దాని మంత్రమును జపించుకున్నారు. గదిలో

ఈశ్వర్ దగ్గరకు పోయి అతని ముఖము మీద విభూది బొట్టును పెట్టాలను

కున్నారు. ఈశ్వర్ ముందువైపుకు నాగభూషణము, మల్లయ్య ఇద్దరు

పోయారు. మల్లయ్యకు ఈశ్వర్ కనిపిస్తున్నాడు. అతను కళ్ళు మూసుకొని

కూర్చున్నాడు. ఆ గదియంతా నిశ్శబ్ధముగా ఉంది. మల్లయ్య తనవద్దనున్న

విభూదిని తీసి ఈశ్వర్ ముఖాన పెట్టబోయాడు. అయితే మల్లయ్య ఈశ్వర్

ముఖాన బొట్టు పెట్టకనే కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడు. వెంటనే

నాగభూషణము అతనిని పైకి లేపి “ఏమైంది” అని అడిగాడు. అప్పుడు


మల్లయ్య బాగా నిలబడి "పైత్యము వలన కళ్ళు తిరిగాయి” అన్నాడు.

“నీవు ప్రక్కకు రా! నేను పెట్టుతాను” అని నాగభూషణము మల్లయ్యను

ప్రక్కకు జరిపి, మల్లయ్య చేతిలోని విభూదిని తీసుకొని ఈశ్వర్కు

పెట్టబోయాడు. అప్పుడు అతనిని ఎవరో లాగి ప్రక్కకు త్రోసినట్లయినది.

నాగభూషణము కూడా ప్రక్కకు వచ్చి క్రిందపడ్డాడు. దానిని చూచిన

మల్లయ్యతాతకు తమకు తెలియకుండా ఏదో జరుగుచున్నదని అనుమానము

వచ్చినది.


ఇక లాభము లేదనుకొన్న మల్లయ్య తన వశములోనున్న కాటేరిని

గురించి జపించాడు. కాటేరి అక్కడికి రావాలని చూచింది. కానీ అది

రాలేకపోయింది. ఆ గదిలో ఒకమూల కట్టివేయబడి నిలిచిపోయింది.

మల్లయ్య కర్ణపిశాచి ద్వారా కాటేరి కట్టివేయబడిందని తెలుసుకోగలిగాడు.

తర్వాత భగళాముఖి దేవతను పిలిచాడు. ఆ దేవత ఆ పరిసర ప్రాంతాలకు

కూడా రాలేకపోయింది. పేరు పొందిన ఆ దేవతలే అక్కడ ఏమీ చేయలేక

పోవడముతో మిగతా దేవతల చేత కూడా ఏమీ కాదనుకొన్నాడు. అంతలో

పదిహేను నిమిషములు గడచిపోయింది. ఈశ్వర్లోనికి ప్రవేశించవలసిన

శక్తి ప్రవేశించింది. తర్వాత గంటకాలములో తమ పని నెరవేరాలని తలచిన

మాంత్రికులు క్రొత్త ప్రయోగము చేయాలనుకొన్నారు. మూత్రమును ఒక

గిన్నెలోనికి పోసి దానిలో మంత్రించిన పసుపు, కుంకుమను కలిపి

గది అంతటా చల్లారు. దానివలన తమ మీద ఏ శక్తులూ పని చేయవని

వారి ఉద్దేశము. ఇక తమకు ఎవరూ అడ్డము రారనుకొని మల్లయ్య

విభూదితో ముందుకు పోయాడు. నాగభూషణము మల్లయ్య ప్రక్కనే

నిలబడినాడు. మల్లయ్య తన చేతితో విభూదిని తీసుకొని ఈశ్వర్ తలకు

రెండించుల దూరము వరకు తన చేయిని చాచాడు. ఇక ఒక క్షణములో

ఈశ్వర్ నుదిటి మీద మల్లయ్యబొట్టు పెట్టగలడు. అయితే అప్పుడు


ఒక్కమారుగా ఈశ్వర్ కళ్ళు తెరిచి చూచాడు. ఢామ్ అని పెద్దశబ్దము

ఏర్పడింది. మాంత్రికులిద్దరు ఆరు అడుగుల దూరము విసిరివేయబడినారు.

మల్లయ్యకు కుడిచేయి పనిచేయకుండా పోయింది. నాగభూషణముకు

కుడికాలు పని చేయలేదు. వారు లేవలేని స్థితిలో నీరసముగా పడిపోయారు.

గదిలో పెద్ద బాంబు పగిలినంత శబ్దము ఏర్పడినా ఈ శబ్దము బయటవున్న

జమీందారుకుగానీ, ఆ ఇంటిలోనివారికిగానీ ఎవరికీ వినిపించలేదు.


తర్వాత గంటకాలము గడిచిపోయింది. ఈశ్వర్ మెలుకువలోనికి

వచ్చి చూచాడు. గది అంతా రంగునీళ్ళను విదిలించినట్లు కనిపించింది.

అంతేకాక తన ముందర మాంత్రికులిద్దరూ నిస్సహాయస్థితిలో లేవలేక పడి

వున్నారు. ఈశ్వర్కు ఏమీ అర్థము కాలేదు. వెంటనే బయటకు వచ్చి

తాను చూచిన దానిని జమీందారుకు తెలిపాడు. అప్పుడు జమీందారు

అతని అనుచరులు లోపలికి పోయి చూచి మాంత్రికులిద్దరిని లేపి బయటకు

తెచ్చారు. వారికి ఒకరికి కాలు, ఒకరికి చేయి పని చేయడములేదని

జమీందారుకు కూడా అర్థమైనది. వారికొరకు తమ ఫ్యామిలీ డాక్టరును

పిలిచి చూపించాడు. మల్లయ్యకు చేయి, నాగభూషణమునకు కాలు

నరములు పని చేయలేదని డాక్టరు చెప్పి మందులిచ్చి మూడు రోజులు

విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి పోయాడు. ఇద్దరు మాంత్రికులనూ వారి

గదిలోనికి చేర్చి ఎవరూ లేని సమయములో జమీందారు వారిని గదిలో

ఏమి జరిగిందని అడిగాడు. దానికి వారు తమ విభూది విషయమును

చెప్పకుండా మేము గదిలో ఉండగా పెద్దశబ్దము వినిపించింది వెంటనే

మాకు ఇలా అయినదని కప్పి పుచ్చి చెప్పారు. వారి మాటలు నమ్మిన

జమీందారుకు తమకు ఏ శబ్దము వినిపించలేదే అని అనుమానము వచ్చింది.



మాంత్రికుల సమాచారము కొరకు చెన్నపట్నములోనే కాచుకొని

వున్న మనిషికి సాయంకాలము మాంత్రికులు వస్తారని బజారులో కాచుకొని

చూచాడు. వారు రాత్రి ఏడు గంటల వరకు రాలేదని తానే మాంత్రికుల

వద్దకు వచ్చి విభూది విషయమును తెలుసుకొని పోయి మునెప్పకు తెలుపా

లనుకొన్నాడు. వార్తాహరుడే జమీందారు ఇంటికి వచ్చి నాగభూషణము

వద్దకు వైద్యము కొరకు వచ్చానని, మందులు తీసుకొని పోవాలన్నాడు.

ఆ మాటవిన్న జమీందారు అతనిని మాంత్రికుల రూమువద్దకు పంపాడు.

అప్పుడు వార్తాహరుడు ఇద్దరి మాంత్రికుల పరిస్థితిని స్వయముగా చూచాడు.

విభూదిని పెట్టలేక పోయిన విషయమును కూడ తెలుసుకొని అక్కడినుండి

పోయి, రెండవ రోజు మునెప్పకు ఆ విషయమంతా తెలియజేశాడు.

చివరకు ఈశ్వర్గదిలో జరిగిన సమాచారమంతా తపస్విబాబాకు

తెలిసిపోయింది.


ఇదేమి విచిత్రము అని బాబా బాగా యోచించను

మొదలుపెట్టాడు. జమీందారు ఇంటిలో మాంత్రికుల ఆరోగ్యము

గంటగంటకు క్షీణించుచున్నది. చివరకు చేయునది లేక మాంత్రికుల

బంధువులకు సమాచారమును అందివ్వగా వారు అందరూ అక్కడికి వచ్చారు.

డాక్టరు జమీందారు ఇంటిలోనే ఉండి వారికి వైద్యము చేయుచున్నాడు.

అయినా వారు రెండవరోజు విచిత్రముగా ఇద్దరు ఒకే నిమిషములో

చనిపోయారు. ఆ సంఘటన జమీందారుకు ఏమి అర్థము కాకుండా

చేసింది. ఇంకా ఏమి జరుగుతుందోనని ఆయనలో భయము పుట్టింది.

ఈశ్వర్కు మాత్రము ఏమీ అర్థము కాలేదు. తన గదిలోనికి మాంత్రికులు

ఎందుకు వచ్చారో కూడా తెలియదు. ఎవరిని అడిగినా మాకు తెలియదని

దాటవేస్తున్నారు తప్ప ఎవరూ ఏమీ చెప్పలేదు. జమీందారు రావుబాహ

దూర్కు మాంత్రికులు ఇద్దరూ ఒకే నిమిషములో చనిపోవడమునకు ఏదో

బలమైన కారణముంటుందని భయపడిపోయాడు. ఆ భయము పోవాలంటే


రాజయోగానంద స్వామి వద్దకు పోయి జరిగిన విషయమంతా

చెప్పాలనుకొన్నాడు. )


(రాజయోగానంద ఆశ్రమములో రాఘవ, దుందుభి, రాధేశ్వరి

ఇంకా కొంతమంది కూర్చొనివుండగా స్వామి జ్ఞానమును వారికి చెప్పు

చుండెను. అప్పుడు రాఘవ స్వామిని ఈ విధముగా అడిగాడు.)


రాఘవ :- ఒక మనిషిని దైవజ్ఞానముకంటే విషయజ్ఞానమే తొందరగా

మార్చగలదన్నారు. విషయజ్ఞానమునకు ఉన్నంత శక్తి దైవజ్ఞానమునకు

లేదా?



రాజయోగానంద :- ఇక్కడ విషయ జ్ఞానము, దైవ జ్ఞానము రెండూ శక్తి

కల్గినవే అయినా వాటి శక్తులు వేరువేరు కోవకు చెందినవిగా ఉన్నవి.

విషయ జ్ఞానములోని శక్తి మనిషిని మాయవైపు పంపించగలదు. అలాగే

దైవ జ్ఞానములోని శక్తి మనిషిని దేవునివైపు పంపగలదు. ఈ రెండూ

వేరువేరు శక్తులు, వాటివలన కల్గు ఫలితములు కూడా వేరువేరుగా

ఉన్నవి. ప్రపంచ విషయములలో ఆసక్తియున్నవారికి విషయ జ్ఞానము

యొక్కశక్తి, దైవజ్ఞానము యొక్కశక్తికంటే పెద్దదే అని చెప్పవచ్చును.

ఎందుకనగా వారికున్న ఆసక్తినిబట్టి వారిపట్ల విషయజ్ఞానము చూపినంత

ప్రభావము దైవజ్ఞానము చూపలేదు. అందువలన ఆ సందర్భములో విషయ

జ్ఞానముశక్తికంటే దైవజ్ఞానశక్తియే చిన్నదగును. అలాగే దైవజ్ఞానము

ఆసక్తియున్న వారిమీద దైవజ్ఞానము చూపినంత ప్రభావము విషయజ్ఞానము

చూపలేదు. అందువలన ఆ సందర్భములో విషయజ్ఞానశక్తికంటే దైవజ్ఞాన

శక్తియే గొప్పదగును. మనుషుల ఆసక్తినిబట్టి ఒకమారు దైవశక్తి గొప్పదని,

విషయ జ్ఞానము చిన్నదని చెప్పినా, అదే మనుషుల మరియొక సందర్భములో



ఆసక్తినిబట్టి దైవజ్ఞానశక్తి చిన్నది, విషయజ్ఞానశక్తి పెద్దదని చెప్పవచ్చును.

రాఘవ :- స్వామీ! కొందరు దైవజ్ఞానము మీద ఆసక్తితో కొంతకాలము

దైవజ్ఞానమును బాగా తెలుసుకొని తర్వాత వారు ప్రపంచ విషయములకే

ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వాటిలోనే మునిగి పోవుచుందురు. తర్వాత

దైవ జ్ఞానమును తెలుసుకొనుటకు కూడా ఆసక్తి లేకుందురు. అటువంటి

వారిలో ముందున్న దైవజ్ఞానము మీద ఆసక్తి ఎక్కడికి పోయివుంటుంది?


రాజయోగానంద :- అటువంటి వారిలో విషయజ్ఞానము మీద ఆసక్తి

ఉండి దైవజ్ఞానము మీద ఆసక్తి తక్కువ ఉండును.అందువలన వారు

కొంత కాలము దైవజ్ఞానము మీద శ్రద్ధను కనబరచినా చివరకు వారికి

ఏది ఎక్కువ ఆసక్తి ఉన్నదో దానివైపు పోవుచుందురు. అటువంటి వారిని

చూచి మొదట వారిని దైవజ్ఞానులుగా మనము లెక్కించినా, చివరకు వారి

అసలు ఆసక్తి బయటపడి, అసలు స్వభావమునే కనబరుస్తూ, దైవవిషయము

లకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రపంచ విషయములకే ప్రాధాన్యత

నిచ్చుచుందురు. అందువలననే భగవంతుడు భగవద్గీతలో "శ్రద్ధావాన్

లభతే జ్ఞానమ్” అన్నాడు ఈ వ్యాకములో చివరన “జ్ఞానమ్” అన్నాడు

కదా! అది ఏ జ్ఞానమునైనా కావచ్చును. శ్రద్ధ వలన ప్రపంచ జ్ఞానమూ

రావచ్చునూ, అలాగే శ్రద్ధ వలన దైవజ్ఞానమూ రావచ్చును. ప్రపంచ

జ్ఞానము మీద శ్రద్ధను (ఆసక్తిని) చూపు వారికి అదే గొప్పదగును,

దైవజ్ఞానము చిన్నదగును. అట్లే పరమాత్మ జ్ఞానము మీద శ్రద్ధను (ఆసక్తి)

చూపువారికి అదే గొప్పదగును, ప్రపంచ జ్ఞానము చిన్నదగును. వారివారి

శ్రద్ధను బట్టి వారికున్నదే గొప్పదగును. అందువలన ఫలానిది గొప్పదని

చెప్పలేము. ఎక్కువ 99 శాతము ప్రజలలో విషయజ్ఞానమే గొప్పదిగా

ఉన్నదని చెప్పవచ్చును. 99 శాతము విషయజ్ఞానమును గొప్పగా


పెట్టుకొన్నవారి మధ్యలో ఒకడు దైవ జ్ఞానమును గొప్పగా భావించేవాడుంటే

వానిని తక్కువ వానిగా, తెలివి తక్కువ వానిగా లెక్కించి, నీచంగా చూస్తారు.

ఈ విషయము సహజముగా ఉండేదే. మనము ప్రపంచ విషయములలో

మునిగివున్న వారిని అజ్ఞానిగా వ్యర్థజీవిగా భావిస్తాము. అలాగే ప్రపంచ

విషయములలో ఉన్నవారు జ్ఞాన విలువని తెలియనివారై మనలను తెలివి

తక్కువవారిగా, తిక్కవారిగా లెక్కించి చూస్తారు.


(ఈ విధముగా ప్రపంచ విషయములను, దైవజ్ఞాన విషయములను

చర్చిస్తూవుండగా అక్కడికి జమీందారు దీనవదనముతో వచ్చాడు. అతని

రాకతో తమ జ్ఞాన చర్చను నిలిపివేసి జమీందారు దేనికొచ్చాడోనని అతనితో

మాట్లాడను మొదలు పెట్టారు.)


రాజయోగానంద :- రావుబహదూర్ గారూ! క్షేమమేనా? ఏదో దిగులుగా

కనిపిస్తున్నారు?


జమీందారు :- స్వామీ. నేను ఇక్కడినుండిపోయాక మా ఊరిలో పేరు

పొందిన ఇద్దరు మాంత్రికులను కలిసాను. వారు నాకంటే ముందే నా

ఇంటి సమస్యను చెప్పారు. ఈశ్వర్ వలన జరిగే మీ ఇంటిలోని సమస్యను

లేకుండా చేస్తామన్నారు. వారు అలాచేస్తే నాకూ మంచిదే కదా! అని

అనుకొన్నాను. వారు ఈశ్వర్ ఆరోగ్యమును బాగుచేస్తామన్నారు. రెండవ

అమావాస్యకే మా ఇంటికి వచ్చారు. ఆ దినము ఈశ్వర్ రూములోనే

ఉండి బయటికి వచ్చారు. వారు ఆ దినము ఈశ్వర్ గదిలోనే గడుపుట

వలన ఈశ్వర్లో చేరు శక్తి రాకుండా పోయిందట. అందువలన ఆ

దినము ఏ గందరగోళమూ జరుగులేదు. వారు ఈశ్వర్కు ఏమీ జరుగకుండా

చూడడము మాకు కూడా సంతోషమైనది. మూడవ అమావాస్య దినము

కూడా వారు ఈశ్వర్ గదిలోనే గడిపారు. ఆ దినము కూడా మేము


అందరమూ గది బయటే ఉన్నాము. పదకొండున్నర గంట తర్వాత ఈశ్వర్

సాధారణముగా బయటికి వచ్చి, మాంత్రికులు తన రూములో ఎందుకు

పడివున్నారని అడిగాడు. ఈశ్వర్ చెప్పిన మాటలనుబట్టి లోపల ఏమి

జరిగిందోనని పోయి చూచాము. అక్కడ ఒకడికి కాలు పనిచేయలేదు,

మరొకరికి చేయి పనిచేయలేదు. వారిని బయటికి తెచ్చి మా ఇంటిలోనే

పెట్టుకొని చికిత్స చేయించాను. అయినా వారు బ్రతుకలేదు. రెండవ

రోజు ఇద్దరూ ఒకే నిమిషములో ప్రాణమును వదిలారు. అలా ఇద్దరూ

ఒకే నిమిషములో ఒకేమారు చనిపోవడము మాకు ఏమీ అర్థము కాలేదు.

ఆ దినము ఆదివారము అమవాస్య కావడము వలనా, ఇద్దరు మాంత్రికులు

ఆ దినము చేయిని, కాలును పొగొట్టుకొనిన దానివలనా, తర్వాత రెండవ

రోజు ఒకే నిమిషములో ఇద్దరూ చనిపోవడము వలనా, మాకు కూడా

ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయమేస్తున్నది. దీని విషయము మీరే

చెప్పాలి.


రాజయోగానంద :- నేను చెప్పేది ఏముందో అదంతా ముందే చెప్పాను.

ఈశ్వర్ విషయములో ఏమి జరుగాలో అది జరిగితీరుతుంది. నీవు దానిని

గురించి ఏమీ చేయలేవు. నీవు ఊరకనే తటస్థముగా ఉండమని ముందే

చెప్పాను. నీవు ఇక్కడ సరేనని పోయావు. అక్కడికి పోయిన తర్వాత నా

సలహాను తుంగలోత్రొక్కి నీ ఇష్టమొచ్చినట్లు చేశావు. ఈశ్వర్ విషయములో

ఎవరూ ఏమీ చేయలేరని చెప్పాను కదా! మేము చెప్పినది కాదనీ ఎవరో

ఏమో చేయగలరని మాంత్రికులను తీసుకపోయి ఇంటిలో పెట్టుకొన్నావు.

నీ అజ్ఞానముతో, నీ అవిశ్వాసముతో రెండు నిండు ప్రాణాలను పోవునట్లు

చేశావు.



జమీందారు :- (రాజయోగానంద కాళ్ళమీద పడి) నాది తప్పేస్వామీ,!


మీరు చెప్పిన మాటను వినకపోవడము నాది చాలా పెద్దతప్పు. మాంత్రికులు

చెప్పిన మాటలు విని అలా చేశాను. ఇక మీదట మీరు ఎలా చెప్పితే అలా

చేస్తాను. జరిగిన విషయము చెప్పాలని వచ్చాను.


రాజయోగానంద :- నీవు ఏదో మంచి జరుగుతుందని మాంత్రికులను నీ

ఇంటికి తీసుకొనిపోయావు. ఆ విషయమును మాకు తెలిపివుంటే, అలా

చేయడము మంచిదికాదని అప్పుడే చెప్పి ఉండేవారము. నా ఆలోచన

ప్రకారము మీ ఇంటికి వచ్చినవారు మీకు మంచి చేయాలని కాదు, స్వార్థము

కొరకు నీ ఈశ్వరు వాడుకోవాలని వచ్చినవారు. వారి వెనుక గూడుపుఠాణి

ఉంది. నీవు చెప్పిన పేర్లుగల మాంత్రికులు నాకు ముందే తెలుసు. వారు

తపస్విబాబా ఆధ్వర్యములో, మునెప్ప దర్శకత్వములో పని చేయువారు.

బాబా తన స్వార్థము కొరకు మాంత్రిక మీ ఇంటికి వచ్చునట్లు చేశాడు.

అమావాస్య దినము కొరకు వారు కాచుకొని ఉండేవారు. అమావాస్య

దినమున మీకు ఏదో సాకు చెప్పి వారు ఈశ్వర్ గదిలో పెద్దతంతు నడిపి

వుంటారు. అయినా వారి ప్రయత్నము నెరవేరి ఉండదు. “మారి ముందర

ముక్కెర తెగులా” అన్నట్లు (మరణము ముందర ముక్కు జలుబు పెద్దది

కాదు అన్నట్లు) ఈశ్వర్లోనికి చేరు శక్తి ముందర మంత్రశక్తి పెద్దది

కాదు. వారు చేయు ప్రయత్నములకు ఆ శక్తులు వారిని చనిపోవునట్లు

చేశాయి. గదిలోపలే చనిపోకుండా అక్కడ వారిలో ప్రవేశించి రెండవ

రోజు వారిని చంపివేశాయి. అమావాస్య రోజు మాంత్రికుల కాలు చేయి

పని చేయకుండా పడిపోయినపుడే, ఆ విషయము మాకు తెలిపివుంటే

దానికి తగిన ఉపాయము చెప్పివుండేవారము. వారిని ఈశ్వర్ గదిలోనే

కొన్ని రోజులు పెట్టివుంటే వారు చనిపోయే వారు కాదు. వారిని ఆ

గదినుండి బయటకు తెస్తూనే గంట, గంటకూ వారు చావువైపు పోయారు.


అందువలన రెండవ రోజే చనిపోయారు. అమావాస్య దినమున ఒక్కొక్కరిలో

ఒక్కొక్క శక్తి ప్రవేశించింది. ఒకరిలో కాలు ద్వారా ప్రవేశించి దానిని పని

చేయకుండా చేసింది. అలాగే రెండవశక్తి రెండవ వ్యక్తి చేయిలో ప్రవేశించి

చేయిని పని చేయకుండా చేసింది. ఒక్కమారు ఇద్దరిలో ప్రవేశించిన

శక్తులు ఒకమారే బయటికి పోయాయి. అవి బయటికి పోతూ

శరీరములోని జీవములను కూడా తీసుకపోవడము వలన ఇద్దరూ ఒకేమారు

చనిపోయారు. నీవు చేసిన అజ్ఞాన పనికి రెండు ప్రాణములు బలైపోయాయి.

మేము ఏదైతే జరుగకూడదనుకొన్నామో అదే జరిగింది.


ఈశ్వర్లోని శక్తులను తమ వశము చేసుకోవాలని కొందరు

ప్రయత్నిస్తున్నారనీ, వారి ప్రయత్నములను జరుగకుండా చేయాలనీ నేను

చాలామార్లు చాలామందికి చెప్పాను. అటువంటి వారి ప్రయత్నమే ఆ

మాంత్రికులు మీ ఇంటికి వచ్చి అక్కడే నిలిచిపోవడము. ఆ ప్రయత్నములో

భాగముగానే అమావాస్య దినములలో ఈశ్వర్ గదిలోనికి పోయారు.

చివరకు చనిపోయారు. వారిని ప్రేరేపించి పంపినవారు హాయిగా ఉన్నారు.

ఈశ్వర్కు ఇంకా మూడు నెలలు, మూడు అమావాస్యలు గడచిపోవాలి.

రాబోయే మూడు అమావాస్యలు, గడచిపోయిన అమావాస్యలకంటే చాలా

ముఖ్యమైనవి. అప్పుడు మేము స్వయముగా అక్కడికి వచ్చి కొన్ని పనులు

జరుగకుండా చూడాలనుకొన్నాము. ఈ మూడు అమావాస్యలు ముఖ్యమైన

వని తపస్వి బాబాకు కూడా తెలుసు. అందువలన ఆయన ప్రయత్నము

ఆయన చేయగలడు. లోక సంరక్షణార్థము మా పని మేము చేయగలము.

ఈ మూడు నెలల కాలములో మీకుగానీ, మీ కుటుంబములోని ఎవరికిగానీ,

ఏ హానీ కలుగదు. కానీ నీవు చేసిన తెలివితక్కువ పని వలన ఇప్పటికి

తొమ్మిది నెలల తర్వాత మీ కుటుంబములో ఒక ఘోరము జరిగిపోతుంది.


జమీందారు :– ఏమి జరుగుతుంది స్వామీ, దానికి మేము తట్టుకోగలమా,

ఎవరికైనా ప్రమాదము జరుగుతుందా?

రాజయోగానంద :- నీవు ఏమీ చలించనంటే, గుండెను రాయి చేసుకొని

వింటానంటే చెప్పగలను. అయితే ఈ మాటను బయట ఎవరికీ తెలుప

కూడదు.


జమీందారు :- అలాగే స్వామీ, మీరు చెప్పినట్లు ఎవరికీ చెప్పను. అంతేకాక

అది ఎటువంటిదైనా నాలోనే దాచుకోగలను.

రాజయోగానంద :- జరుగబోయే మూడు నెలలు గడచిపోయిన తర్వాత

ఆరు నెలలకు ఈశ్వర్కు ప్రాణగండము గలదు. నాకు తెలిసినంత వరకు

అప్పటికి అతనికి మరణము తప్పదని అనుకుంటున్నాను.

(జమీందారుకు ఆ మాట వింటూనే, ఆకాశము కూలిపోయినట్లయి

నది. దిగులుతో ఇలా అన్నాడు.)


జమీందారు :- ఆ గండమునుండి తప్పించుకొను ఉపాయమే లేదా?

రాజయోగానంద :- అది గండమే అయితే తప్పించుకొను ఉపాయమును

వెతకవచ్చును. కానీ అది గండము కూడా కాదు. నీవూ, నేనూ ఏమీ

చేయలేము. నీవు ఇంటికి పోయి సర్వసాధారణముగా ఏమీ తెలియనట్లు

ఉండిపో. ఏమి జరగాలని నిర్ణయమై ఉందో అది జరిగి తీరుతుందను

నమ్మకముతో ఉండు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను.


(అప్పుడు జమీందారు, రాజయోగానందస్వామివద్ద సెలవు

తీసుకొని నమస్కరించి అక్కడినుండి వెళ్ళిపోతాడు. ప్రక్కనవుండి స్వామివారు

చెప్పిన అన్ని మాటలను గ్రహించిన రాఘవ, స్వామిని చూచి ఇలా అన్నాడు.)

రాఘవ :- స్వామీ! ఈశ్వర్కు, జరుగుచున్న తతంగము ఏమీ తెలియదన్నారు


కదా! అలాంటపుడు అతనిది ఏ తప్పు లేదు కదా! ఏ తప్పు చేయకుండానే

అతనికి మరణము రావడము న్యాయము కాదుకదా!


రాజయోగానంద స్వామి :- న్యాయము అనునది బ్రహ్మవిద్యా శాస్త్రమునకు

సంబంధించినది కాదు. నీతి, న్యాయములు లోక సంబంధము, జ్ఞానము

ధర్మము దైవసంబంధమని గుర్తుంచుకొనుము. అతను ఈ జన్మలో చేసిన

తప్పుకు శిక్ష అని చెప్పలేదు కదా! గతజన్మలో చేసుకొన్న దానిని బట్టి ఈ

జన్మలో అనుభవములుండును. అలాగే మరణము కూడా గతజన్మ

ఫలితమేనని జ్ఞప్తివుంచుకో.


(అంతటితో వారి సంభాషణ ముగిసిపోవును. జరుగబోవు

కార్యముల గురించి ఆ రాత్రికి యోచించాలని అనుకుంటారు.)


(మునెప్పకు నాగభూషణము, మల్లయ్య చనిపోయిన వార్త

ఆలస్యముగా కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ముఖ్యమైన ఇద్దరు

మాంత్రికులు చనిపోవడము మునెప్పకు చాలాబాధను కల్గించినది. ముందే

తన అనుచరులు ముఖ్యమైనవారు బ్యాంకు దోపిడీలో పోలీసులకు చిక్కి

పోవడముతో డీలాపడిన మునెప్పకు, మాంత్రికుల మరణవార్త గొడ్డలిపెట్టు

లాగ అయినది. తనకు తెలిసిన వార్తను తపస్వి బాబాకు తెలియజేశాడు.

ఆ వార్త విన్న బాబా విస్తుపోయాడు. బాబాకు ఆ వార్త మండుచున్న

పుండు మీద కారమును చల్లినట్లైయినది. ముందే మునెప్ప మనుషులు

కొందరు పోలీసుల చేతిలో దొరికిపోవడము వలన, ఇక మీదట బయటికి

పోయి పని చేయువారు తమవద్ద లేకుండా పోయారు. ఈశ్వర్ విషయములో

మిగిలినవి మూడు నెలలు మాత్రమే. ఆ మూడు నెలలలోనే తమ విభూదిని


ఈశ్వర్కు బొట్టుగా పెట్టాలి. అలా పెట్టగలిగినపుడే బాబా అనుకొన్న

పని నెరవేరును. అలా చేయుటకు స్వయముగా మునెప్పగానీ, బాబాగారు

గానీ బయటకు రావలసివుంది. మునెప్ప మీద చాలాకాలమునుండి

పోలీసుల కన్నువుంది. కాబట్టి మునెప్ప మారువేషములో బయటికి పోవాలి.

అట్లుకాక పోతే బాబాగారైనా బయటికి పోవాలి. నాల్గవ అమావాస్యకు

ముందే ఏదో ఒకటి నిర్ణయము చేసుకొని దానికి తగిన కార్యాచరణను

రూపొందించు కోవాలి. అలా రెండు రోజులు తపస్వి బాబా యోచించిన

తర్వాత మునెప్పను మారువేషములో చెన్నపట్నమునకు పంపాలనుకొన్నాడు.

మునెప్ప ఏ వేషములో పోవాలి, అలా పోయినవాడు ఏమి చేయాలి, ఎలా

తన విభూదిని ఈశ్వర్ నొసట బొట్టుగా పెట్టాలని యోచించి, దానికి తగినట్లు

పథకమును తయారు చేసుకొని, తన యోచనలన్నిటినీ మునెప్పకు

తెలియజేసెను. మునెప్ప బాబాగారు చెప్పిన మాటలను జాగ్రత్తగా విని

అలాగే చేస్తానని బాబాగారికి మాట ఇచ్చాడు. అంతలో చూస్తునట్లే

అమావాస్య వచ్చింది. దానికంటే నాలుగు రోజుల ముందే మునెప్ప

బయలుదేరి చెన్నపట్నము చేరుకొన్నాడు.


ఊరి బయట గుడిదగ్గర మునెప్ప దిగినాడు, మునెప్పతోపాటు

వంట చేయుటకు ఒక ఆడమనిషిని, ఇద్దరు మగవారిని పిలుచుకొని మొత్తము

నలుగురు బయలుదేరి వచ్చారు. నలుగురు పెద్దమ్మ దేవతను తలమీద

ఎత్తుకొని అడుక్కొను వారి వేషములో ఉన్నారు. ఆ గ్రూపులో మునెప్ప

కొరడా తీసుకొని దేవతను గురించి చెప్పుచూ అటు, ఇటు తిరిగి డబ్బులు

అడుక్కొనుచుండగా, ఒక మనిషి పెద్దమ్మ గూడును తలమీద ఎత్తుకొని

వుండును. మరియొక మనిషి డోలు కొట్టుచుండును. ఆడ మనిషి కూడా

కొందరికి అమ్మవారి బండారును ఇస్తూ డబ్బులు అడుగుచుండును. ఈ


విధముగా అడుక్కొను గ్రూప్ వారు బయలుదేరివచ్చి, ఊరి బయట

గుడివద్ద బయలులో ఒక గుడారమును వేసుకొని ఉన్నారు. అలా అన్నీ

ముందే ఏర్పాట్లు చేసుకొని చెన్నపట్నము వచ్చారు. మూడు రోజులు ఎవరికీ

అనుమానము రాకుండా ఊరిలో అడుక్కొన్నారు. నాల్గవ రోజు అమావాస్య

కావున ఉదయమే జమీందారు ఇంటివద్ద పెద్దమ్మను ఎత్తుకొని నిలబడినారు.

ఒకడు డోలు కొట్టుచుండగా మునెప్ప పైన గుడ్డలేకుండా క్రిందమాత్రము

గోసికట్టి కొరడా తీసుకొని నేలకు కొట్టుచూ అటూ ఇటూ తిరిగి మాట్లాడుచు

ఉన్నట్లుండి. పెద్దమ్మ దేవత పూనినట్లు మాట్లాడజొచ్చెను. అప్పుడు

మారువేషములోనున్న మునెప్ప ఇలా మాట్లాడాడు “ఒరే జమీందారూ!

నేను నీ ఇంటిముందుకు వచ్చినా నీవు బయటికి రాలేదురా. నేను నిన్ను

దయదలచి నీ ఇంటికి వచ్చానురా” అని అనుచుండగా లోపలనున్న

జమీందారు తను జమీందారునని, తన మీద దయకల్గి రావడమేమిటని

బయటికి వచ్చి చూచాడు. అప్పుడు పెద్దమ్మ పూనకము వచ్చిందని

తెలిసింది. చేతులు ఎత్తి నమస్కరించుచూ నిలబడినాడు. అప్పుడు

జమీందారు ఫలానా వాడని ఫోటో చూచిన దానివలన అతనిని సులభముగా

మునెప్ప కనుగొన్నాడు. పెద్దమ్మ దేవతగా నటించు మునెప్ప జమీందారుని

చూచి ఒరే బాలా! నీవు చాలా చిక్కుల్లో ఇరుక్కున్నావురా! నీ ఇంటిలో

భూతాలు చేరాయి, దయ్యాలు వచ్చి పోతున్నాయి. రెండు ప్రాణాలు

పోయాయి కదురా బాలా? మీ పెద్దలు నన్ను పూజించారు. దానికే నేను

వచ్చానురా, ఈ ఇంటిలో ఇంకా రెండు ప్రాణాలు పోతాయి. నాకు చిన్న

బలి ఇచ్చుకో. నీ ఇంటిలో ఏమీ జరుగకుండా చేస్తాను” అన్నాడు.

అప్పుడు జమీందారు ముందుకు వచ్చి “అమ్మ తల్లీ నేను నిన్నే పూజిస్తానమ్మా,

నీకు చిన్నపోతును బలి ఇస్తాను. నా ఇంటిలో ఏమీ జరుగకుండా చూడు


తల్లీ” అన్నాడు. అప్పుడు మునెప్ప అటూ ఇటూ ఊగుతూ బాలా! నీ

ఇంటికి నడిరాత్రిలో ఒక పిశాచి వస్తావుంది. దానిని లేకుండా చేస్తాను,

నీ ఇంటిలో ప్రాణాలు పోకుండా చూస్తాను. నీవు నన్నే నమ్ముకొని నా

బండారును బొట్టు పెట్టుకో, అట్లే నాబండారును నీ కొడుక్కి కూడా

పెట్టు. నాబండారు పెట్టుకోకపోతే నీ ఇంటినుండి మీ రెండు ప్రాణాలు

పోతాయి. నా బండారును ఉదయము, సాయంకాలము నన్ను మొక్కి

నన్ను తలచుకొని పెట్టుకోండి" అని మునెప్ప, పెద్దమ్మ తేలిపోవునట్లు ఒక

చోట పడుకొని నిమిషము తర్వాత లేచాడు. పెద్దమ్మను చెప్పుచున్నానని

అంతకుముందు జరిగిన విషయములను చెప్పేటప్పటికి జమీందారు

నిజముగా దేవతే చెప్పిందని అనుకొన్నాడు. మునెప్పకు ముందే జమీందారు

ఇంటి విషయమంతా తెలుసు కాబట్టి దానిని దేవత పూని చెప్పినట్లు చెప్పి

జమీందారున్ని నమ్మించాడు. తాను చెప్పకనే జరిగినవన్ని చెప్పేటప్పటికి

రాజయోగానందస్వామిని జమీందారు మరిచి పోయాడు. ఒకమారు స్వామి

జ్ఞప్తి వచ్చినా దేవతే చెప్పుచున్నది కదా అనుకొన్నాడు. మునెప్పతోపాటు

దేవతనెత్తుకొన్న మనిషి దేవత గూడులో నుండి బండారును తీసి ఇచ్చారు.

ఆ బండారును తపస్విబాబా ఇచ్చి పంపాడనిగానీ, వచ్చినవారు

మారువేషములో తన కోసమే వచ్చినవారనిగానీ జమీందారుకు ఏమాత్రము

తెలియదు. తన అదృష్టముకొద్దీ పెద్దమ్మ పూని తన ఇంటిలో జరుగుచున్నవి,

జరిగిపోయినవి, జరుగబోవునవి చెప్పినదను కొన్నాడు. వాళ్ళు ఇచ్చిన

బండారును తీసుకొన్నాడు. చిన్నపోతు అంటే ఏమిటని వారిని అడిగాడు.

వారు పొట్టేలని చెప్పగా వారికి డబ్బులు ఇచ్చి పంపాడు. ఆ దినము

నుండి వారు ఇచ్చిన బండారును ప్రతి దినమూ ఈశ్వర్కు బొట్టుపెట్టుచూ,

తాను కూడా పెట్టుకొనుచుండెను.


అలా ప్రతి దినమూ పెట్టుకొనినా ఏమి ఇబ్బందిలేదు. కానీ

అమావాస్య రోజున ఆ బండారును ఈశ్వర్ బొట్టు పెట్టుకోకూడదు.

ఎందుకనగా! ఆ బండారును తపస్విబాబా ప్రత్యేకముగా ఈశ్వర్ కొరకే

పంపాడు. దానిని సులభముగా జమీందారు ఇంటికి మునెప్ప మారు

వేషములో చేర్చాడు. అమావాస్య దినమున ఈశ్వర్ ఉదయమునే స్నానము

చేసి బొట్టుపెట్టుకోవడము వలన, ఆ దినము అతనిలోనికి శక్తి చేరునప్పుడు

బండారు బొట్టు ఈశ్వర్ నుదిటి మీద ఉండుట వలన, అతనిలో ప్రవేశించు

శక్తి బాబా వశమైపోవును. అది బాబాయొక్క అసలైన పథకము. బాబా

పథకము ప్రకారము ఈశ్వర్ ప్రతి దినమూ బొట్టు పెట్టుకోవాలనుకొన్నాడు.

ఆ రోజు అమావాస్య కావున ఉదయమే స్నానము చేసి పెద్దమ్మ పెట్టిన

బండారును స్వయముగా జమీందారే ఈశ్వర్ నొదుట బొట్టు పెట్టాడు.


రాజయోగానంద స్వామి రాఘవతో ముందే నాల్గవ, ఐదవ

అమావాస్యలకు స్వయముగా చెన్నపట్నము వచ్చి ఏమి జరుగుతుందో

చూడాలనుకొన్నాడు. అమావాస్యకు మూడు రోజులు ముందే వచ్చి క్రొత్త

సెంటు బాటిళ్ళను అమ్మువారిగా రాఘవ మారువేషములో ఇల్లిల్లు తిరిగి

ఇంటిలోని వారితో కలిసి ఇవి విదేశమునుండి తెచ్చిన సెంట్లని చెప్పి,

తక్కువరేటుకు ఇచ్చుచుండెను. అలా రెండు రోజులు చెన్నపట్నములో

తిరుగుచూ జమీందారు ఇంటిని తెలుసుకొని అమావాస్య దినమున

ఉదయము తొమ్మిది గంటలకు జమీందారు ఇంటికి రాఘవ వచ్చాడు. ఆ

ఇంటిలోని వారందరికీ తన వద్దనున్న సెంటు బాటిల్స్ను క్రింద పెట్టి

చూపుచుండెను. అంతలో ఈశ్వర్ తన గదినుండి బయటికి వచ్చి తనకొరకు

ఒక సెంటు బాటిల్ను తీసుకొని పోయాడు.  అప్పుడు రాఘవ అతని

ముఖము మీద బండారు బొట్టును గ్రహించాడు. అక్కడినుండి తొందరగా




రాఘవపోయి ఆ విషయమును రాజయోగానంద స్వామికి తెలిపాడు.

రాజయోగానంద స్వామి కొంతసేపు ఆలోచించి, ఉన్న కొద్దిపాటి

సమయములో తాము ఏమీ చేయలేమని అనుకొన్నాడు. అప్పటికి

పదిగంటలకు పది నిమిషములు మాత్రమే కొదవ ఉండెను. ఈశ్వర్కు

కొద్దిగా తలనొప్పి కూడా ఉండుట వలన తన గదిలోనే ఉన్నాడు.

దినము అమావాస్య అని తెలిసిన దానివలన జమీందారు కూడా ఇంటిలోనే

ఉన్నాడు. అప్పుడు ఉన్నట్లుండి కరెంటు పోయింది. ఈశ్వర్ గదిలో

ఫ్యాన్ నిలిచిపోయింది. ఫ్యాన్ నిలిచి పోవడముతో గాలి తగలకుండా

పోయింది. దానితో ఈశ్వర్కు చెమటలు పట్టసాగాయి. ముఖము మీద

చెమట పట్టడముతో ప్రక్కనే ఉన్న చేతి రుమాలును తీసుకొని ముఖమును

తుడుచుకొన్నాడు. అప్పుడు ముఖానికి ఉన్న బండారు బొట్టు లేకుండా

పోయింది. అప్పటికి పదిగంటలకు రెండు నిమిషములే మిగిలిఉంది.

సరిగా పదిగంటలకు ఈశ్వర్కు ఏమీ తెలియకుండా పోయింది. అప్పుడు

ఈశ్వర్ శరీరములోనికి శక్తి ప్రవేశించను మొదలు పెట్టింది. ఆ దినము

తన పథకము నెరవేరి తీరుతుందనుకొన్న బాబాకు నిరాశే మిగిలింది.

నాల్గవ అమావాస్య దినమున కూడా తనకు శక్తి దక్కకుండా పోయినది.

ఈశ్వర్ గదిలో ఏమి జరుగుచున్నదీ తెలియునట్లు తన మందిరములో

ఏర్పాటు చేసిపెట్టుకొన్నాడు. అందువలన శక్తి ప్రవేశించుటకు రెండు

నిమిషముల ముందు తన ప్లాన్ వృథా అయిపోయినట్లు తెలుసుకోగలిగాడు.

నిజానికి ఆ దినము జమీందారు ఇంట్లో కరెంటు పోలేదు. అయినా

ఈశ్వర్ గదిలో మాత్రము పోయింది. అది ఎందుకు జరిగిందో ఎలా

జరిగిందో తపస్విబాబాకు అర్థము కాలేదు.


ఈశ్వర్కు పదహారవ సంవత్సరము మొదలైనప్పటినుండి ఆరు

అమావాస్యలలో, ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క శక్తి అతనిలో చేరునని


తెలుసుకొన్నాము. ఇప్పటికి నాల్గు అమావాస్యలు గడచిపోగా, మొదటి

అమావాస్యను వదిలిపెట్టి రెండు, మూడు, నాల్గవ అమావాస్య దినములలో

తపస్విబాబా ప్రయత్నించినా ఆ శక్తులు కూడా వశముకాలేదు. ఇక ఐదు,

ఆరు నెలల శక్తులను ఏమాత్రము వదలకుండా బాబా తన వశము

చేసుకోవాలను కొన్నాడు. రాజయోగానంద స్వామి నాల్గు, ఐదు, ఆరు

మూడు నెలలవి కీలకమైన శక్తులని వాటిని ఎలాగైనా తపస్విబాబా వశము

కాకుండా చూడాలనుకొన్నాడు. అయినా నాల్గవ అమావాస్య దినమున

తొమ్మిది గంటల తర్వాత కూడా ఈశ్వర్ ముఖాన బొట్టువున్నదని రాఘవ

ద్వారా తెలుసుకొన్న స్వామి అప్పుడు తాము ఏమీ చేయలేమని అనుకొన్నారు.

నాల్గవ అమావాస్య దినమున ఈశ్వర్ నొదుట మీదున్నది బాబాగారి

బొట్టయితే, ఆ దినము ఈశ్వర్లోనికి వచ్చినశక్తి బాబాగారికి వశమైపోయి

వుంటుందనుకొన్నాడు. అది బాబాగారి బొట్టా కాదా అని తెలుసుకొనుటకు

రెండు రోజుల తర్వాత జమీందారు రావు బాహదూర్ను తన ఆశ్రమానికి

రమ్మని చెప్పి పంపాడు. రాజయోగానందస్వామి దగ్గరనుండి పిలుపు

రావడముతో రావుబహదూర్ వెంటనే బయలుదేరి పోయాడు.

ప్రబోధాశ్రమమునకు పోయిన తర్వాత స్వామివారి దర్శనమునకు కొంత

సేపు కాచుకొని, స్వామి వచ్చిన వెంటనే జమీందారు రావుబాహదూర్

నమస్కరించాడు. అప్పుడు రాజయోగానంద స్వామి జమీందారుతో

ఇట్లన్నాడు.)


రాజయోగానంద : - రావు బాహదూర్గారు! ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు

సూటిగా జవాబు చెప్పాలి.


జమీందారు :- తప్పకుండా చెప్పగలను స్వామి.

రాజయోగానంద :- గడచిపోయిన అమావాస్య దినమున ఈశ్వర్ ముఖము

మీద బండారు బొట్టు ఉంది. ఆ బొట్టును ఎవరు పెట్టారు?


జమీందారు :- ఆ బొట్టును నేనే పెట్టాను. ఆ దినమే కాదు ప్రతి దినమూ

పెట్టుచున్నాను. అది పెద్దమ్మ బండారు, అందువలన ఈశ్వర్కు పెట్టడమే

కాక, నేను కూడా పెట్టుకొనుచున్నాను.


రాజయోగానంద :- ఆ బండారును నీకు ఎవరు ఇచ్చారు?


జమీందారు :- పెద్దమ్మ గంప (బుట్టను) ఎత్తుకొని వచ్చి కొరడా పట్టుకొని

అడుక్కొను పెద్దమ్మ పూజారులు ఇచ్చారు.


రాజయోగానంద :- వారు ఏమని చెప్పి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు?

ఉన్నది ఉన్నట్లు చెప్పు.


జమీందారు :- అమావాస్య దినము ఉదయము ఆరు లేక ఆరున్నర

గంటలకు ఇంటిముందుకు పెద్దమ్మను ఎత్తుకొని పూజార్లు వచ్చారు.

మొత్తము నలుగురు వచ్చారు. ఒకరు దేవతను తలమీద ఎత్తుకొని

ఉండగా, ఒకరు డోలును కొట్టుచుండగా, ఒకరు కొరడాను తీసుకొని

నేలకు కొట్టుచూవుండెను. ఒక ఆడమనిషి అమ్మవారు బండారును కొందరు

ఆడవారికి బొట్టు పెట్టుచుండెను. బండారును పూసుకొని, కొరడాను

చేతబట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొన్న వ్యక్తికి అమ్మవారు పూనకము

వచ్చి మాట్లాడుచూ, "నేను నీ ఇంటిముందుకు వచ్చినా నీవు బయటికి

రాలేదు బాలా, నీకు నేను కనిపించలేదా” అని అనడము నేను విని వెంటనే

బయటకువచ్చి నిలబడ్డాను. అప్పుడు పూనకము వచ్చిన పెద్దమ్మ “నీ

ఇంటిలో జరగరానిది జరుగుచున్నది బాలా, రాత్రిపూట నీ ఇంటికి భూతాలు,

పిశాచాలు వచ్చి పోతున్నవి. ఈ మధ్యన రెండు ప్రాణాలు పోయాయి.

నీవు నన్ను నమ్మి పూజ చేయకపోతే ఇంకా రెండు ప్రాణాలు పోతాయి”

అని చెప్పగా నేను “నీపూజ ఎలా చేయాలి?” అని అడిగాను. అప్పుడు

పెద్దమ్మ “మీ పెద్దలు నన్ను పూజించేవారు నీవు నా పూజ వదిలివేశావు.


అందుకే నీకు కష్టాల సుడిగుండాలు వచ్చాయి. అవి పోవాలంటే నాకు

చిన్న పోతును బలి ఇచ్చి పూజచేయి. ప్రతి దినము నేను ఇచ్చు బండారును

బొట్టుపెట్టుకో, ఇంటిలోని మగవారు అందరూ పెట్టుకోవలెను. నీ కొడుకుకు

కూడా పెట్టు. అతనికి ఉండే గండములు పోతాయి” అని చెప్పింది.

అందువలన అమ్మవారు ఇచ్చిన బండారును మేము ఇద్దరము పెట్టు

కొనుచున్నాము.


రాజయోగానంద :- ఆ బండారును అందరికి ఇచ్చే బండారులోనించి

ఇచ్చారా లేక ప్రత్యేకముగా ఇచ్చారా?


జమీందారు :- ప్రత్యేకముగా పెద్దమ్మ బుట్టలోనిది ఇచ్చారు.

రాజయోగానంద :- ఇప్పటికి నీవు రెండు మార్లు తప్పు చేశావు. ఈశ్వర్

విషయములో ఏమి చేసినా నాకు చెప్పి చేయమన్నాను. నీవు ఏమీ చేయవద్దని

కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత కూడా పెద్దమ్మ బండారును బొట్టుగా

ఎందుకు పెట్టావు?


జమీందారు :- దేవత ఇచ్చినది కదా! అని తర్వాత ఇంటిలో రెండు ప్రాణాలు

పోయాయి, ఇంకా రెండు ప్రాణాలు పోతాయి అని చెప్పుట వలన దేవత

మనము చెప్పకనే ఆ విషయమును చెప్పడము వలన, ఆ దేవత చెడుగా

ఏమీ చెప్పలేదు కదా! ఒకమారు పోతును బలి ఇచ్చి తన బండారును

ప్రతి దినమూ పెట్టుకొమ్మన్నది కదాయని పెట్టుకొన్నాము. ఇందులో నాకు

ఏమీ చెడుగా కనిపించలేదు. అందువలన అలా చేశాను.


రాజయోగానంద :- నీ ఇంటిలో జరుగునదేదో నాకు తెలుసు, నీకు తెలుసు,

ఆ తపస్విబాబాకు తెలుసు. మన ముగ్గురుకు తప్ప మధ్యలో ఎవరికీ

తెలియదు. ఇప్పుడు వచ్చి చెప్పేందుకు పెద్దమ్మకు తెలిసే సామాన్యమైన

విషయముకాదది. అక్కడికి వచ్చినవారు బాబా మనుషులు కారని నీకు


తెలుసునా? తపస్వి బాబా ఎంతో తెలివైనవాడు. రెండుమార్లు మాంత్రికుల

చేత అమావాస్య దినమున తన విభూదిని బొట్టుగా ఈశ్వర్కు పెట్టాలని

చూశాడు. రెండు మార్లు విఫలమైపోయింది. ఇప్పుడు తెలివిగా బండారును

పంపి నీ చేతనే అమావాస్య దినమున ఈశ్వర్కు పెట్టించాడు. అమావాస్య

దినమున తొమ్మిది గంటల సమయములో ఈశ్వర్ నుదుట బొట్టును చూచిన

వారు నాతో చెప్పగా, అది నిజమా అబద్దమా అని తెలుసుకొనుటకు

నిన్ను పిలిచి అడిగాము. ఇప్పుడు నీవు స్వయాన చేసిన తప్పు వలన ఒక

భయంకరమైన శక్తి బాబావశమై పోయినది. నీవు చాలా తెలివితక్కువ

పని చేశావు.


జమీందారు :- ఇంత పెద్ద మోసములుంటాయని నేను కలలో కూడా

అనుకోలేదు. భక్తిగా దేవత ఇస్తున్నదనుకొని పొరపాటు పడినాను

క్షమించండి. ఇప్పటినుండి మీరు ఎలా చెప్పితే అలా చేస్తాను.


రాజయోగానంద :- ఇప్పటికి రెండు మార్లు ఈ మాట చెప్పావు. చివరకు

మేము చెప్పినట్లు వినకుండా నీ ఇష్టమొచ్చినట్లు చేస్తావు. ఇంకా రెండు

అమావాస్యలు ఈశ్వర్ జీవితములో కీలకమైనవి. ఇప్పటికైనా మేము

చెప్పినట్లు విను. ఈశ్వర్కు సంబంధించిన ఏ చిన్న విషయమునైనా నాతో

చెప్పనిదే చేయవద్దు. అంతేకాక ఇప్పుడు నీవద్దనున్న బండారును బొట్టుగా

పెట్టుచుండు. దానిని తపస్విబాబా వాళ్ళు గమనించి తాము చెప్పినట్లు

చేయుచున్నావని నమ్మివుంటారు. అట్లు ప్రతిరోజు చేసినా దానివలన ఏ

ఇబ్బంది ఉండదు. కానీ ఒక్క అమావాస్య రోజు మాత్రము ఈశ్వర్కు

బొట్టు పెట్టవద్దు. ఆ దినము కూడా బొట్టు పెట్టావని బాబావారు అను

కుంటారు. ఇంతకంటే నీవు చేయవలసిన పని ఏమీ లేదు. రాబోయే

అమావాస్య దినమున మేము కూడా చెన్నపట్నములోనే ఉంటాము.

అవసరమైతే నీకు అందుబాటులో ఉంటాము.


(రాజయోగానంద స్వామి చెప్పినదంతావిని, ఈమారు ఏమాత్రము

పొరపాటు పడకుండా స్వామి చెప్పినట్లు నడుచుకోవాలనుకొని, అక్కడ

నుండి జమీందారు బయలుదేరి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత

ప్రతిదినము స్వామి చెప్పినట్లు ఈశ్వర్కు బండారు బొట్టుపెట్టుచూ, తాను

కూడా పెట్టుకొనుచుండెను. తర్వాత వచ్చు అమావాస్య వరకు అప్పుడప్పుడు

మునెప్ప మనుషులు ఈశ్వర్ బండారు బొట్టు పెట్టుకొనుచున్నాడా లేదా

అని గమనించి చూచారు. వారికి ప్రతి దినమూ ఈశ్వర్ నుదుట బండారు

బొట్టు కనిపించుట వలన తపస్వి బాబా వచ్చే అమావాస్య దినము కూడా

ఈశ్వర్ బొట్టు పెట్టుకుంటాడను నమ్మకముతో ఉండెను. కానీ తమ బొట్టు

విషయమును రాజయోగానంద స్వామి గ్రహించాడని, తమను మోసము

చేయుటకు ప్రతి దినమూ బొట్టును పెట్టుకుంటున్నారని, తమ ఎత్తుకు

స్వామి పై ఎత్తు వేశాడని బాబాకు తెలియదు. అంతలోనే ఐదవ అమావాస్య

వచ్చినది. ఆ దినము తమ పథకము సులభముగా నెరవేరునని బాబా

అనుకొన్నాడు. అదే ఉద్దేశముతోనే మునెప్ప కూడా ఉన్నాడు. ఆ దినము

అమావాస్య అయిన దానివలన రాజయోగానంద స్వామి చెప్పినట్లు

జమీందారు రావుబహదూర్ తన కొడుకు ఈశ్వర్కు బొట్టుపెట్టలేదు. అన్ని

అమావాస్య దినములలో జరిగినట్లే ఈశ్వర్కు మత్తుగా మగతగా (మజ్జుగా)

ఉండుట వలన ఈశ్వర్ బయటికి పోకుండా తన గదిలోనే ఉండిపోయాడు.

తపస్విబాబా తన మందిరము నుండే చెన్నపట్నములోని ఈశ్వర్ను

గమనిస్తున్నాడు. ప్రతి దినము తప్పకుండా బొట్టు పెట్టుకొను ఈశ్వర్,

దినము తన బండారును బొట్టుగా పెట్టుకోలేదని బాబా తన మందిరము

నుండే గ్రహించాడు. అప్పటికప్పుడు ఏమి చేయుటకు అవకాశములేని

దానివలన ఈ నెల కూడా తన ప్రయత్నము వృథా అయినట్లేనని

అనుకొన్నాడు. ఆ దినము చూస్తున్నట్లే కాలము గడచి పోయింది.


అమావాస్య దినమున రాఘవ ఉదయము ఎనిమిది గంటలకే జమీందారు

రావుబహదూర్ ఇంటికి వచ్చి రావుబహదూర్తో ఏదో వ్యాపార విషయము

లను మాట్లాడుచూ కాలమును గడిపాడు. ఆ దినము ఈశ్వర్ను తపస్విబాబా

ఏమీ చేయలేదని నిశ్చయించుకొని తిరిగి స్వామివద్దకు పోయి ఆ

విషయమును స్వామికి తెలిపాడు. ఐదవనెలలో బాబా పథకము

విఫలమైనందుకు రాజయోగానంద స్వామి సంతోషించాడు. ఇక మిగిలినది

ఆరవ అమావాస్య మాత్రమే! దానిని వదలకూడదని తపస్విబాబా ప్రయత్నము

చేయగలడనీ, దానిని కూడా నెరవేరకుండా చేయాలనీ, రాజయోగానంద

స్వామి అనుకొన్నాడు.


రాబోయే అమావాస్య ఒక్కటే తమ పనికి చివరి ఆశగా మిగిలింది.

ఎంత ప్రయత్నము చేసినా నాలుగు అమావాస్యలు విఫలమైపోయాయి.

ఇక ఎట్టి పరిస్థితుల్లోను ఆరవ అమావాస్యను వదలకూడదని తపస్విబాబా

అనుకొన్నాడు. ఆ దినము స్వయముగా తపస్విబాబాయే మారువేషములో

చెన్నపట్నము రావాలనుకొన్నాడు. ఆ విషయమును మునెప్పకు కూడా

తెలిపి, ఆ దినము తాము చేయవలసిన కార్యములను గురించి ముందే

మాట్లాడుకొని, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొనుటకు ప్రారంభించారు.

వారు ఆ విధముగా వారి కార్యాచరణలో మునిగిపోగా, రాజయోగానంద

స్వామి ఆశ్రమములో రాఘవ, రాజయోగానందస్వామి ఇద్దరూ కలిసి ఆ

దినము తమ కార్యముల గురించి మాట్లాడుకొన్నారు. ఈ మారు

స్వయముగా రాజయోగానంద స్వామి కూడా చెన్నపట్నమునకు రావాలను

కొన్నాడు. తమ పనికి రాజయోగానందస్వామి అడ్డుపడుచున్నాడని

తపస్విబాబాకు తెలియదు. అట్లే ఇంతవరకు ఒక్క అమావాస్యకు కూడా

బాబా పని నెరవేర లేదని స్వామికి తెలియదు. నాల్గవ అమావాస్య దినమున


ఈశ్వర్లో చేరిన శక్తిని బాబా తన వశము చేసుకొన్నాడని అనుకొన్నాడు.

అలా జరుగలేదనీ, బాబాకు ఎటువంటి శక్తి ఈశ్వర్నుండి వశము కాలేదనీ

రాజయోగానంద స్వామికి తెలియదు. నాల్గవ అమావాస్య దినమున ఈశ్వర్

నుదుటి బొట్టు ఉన్నదని స్వామి అనుకొన్నాడు. కానీ ఆ దినము ఈశ్వర్

గదిలో కరెంటు పోయిన విషయముగానీ, ముఖము చెమట పట్టిన దానివలన

పదికి రెండు నిమిషముల ముందు ఈశ్వర్ బొట్టును గుడ్డతో, చెమటతో

పాటు బొట్టును కూడా తుడచివేశాడని స్వామికి తెలియదు.


ఆరవ అమావాస్య వచ్చినది. రాజయోగానందస్వామి రాఘవ

ఇద్దరూ జమీందారు రావుబహదూర్ ఇంటిలోనే ఉన్నారు. ఆ దినము

కూడ ఈశ్వర్ బయటికి పోకుండా ఇంటిలో తన గదియందే ఉండిపోయాడు.

ఉదయము ఎనిమిది గంటల ముప్పయి నిమిషములకు అందరూ టిఫిన్

తిని కూర్చున్నారు. ఈశ్వర్ కూడా రెండు ఇడ్లీలు తిని తన గదిలోనికి

పోయాడు. ఆ రోజు శుక్రవారము. ప్రతి శుక్రవారము ఒక ముస్లీమ్

వచ్చి ఇంటిలో సాంబ్రాణి పొగవేసి, నెమలి ఈకలకట్టను తలమీద పెట్టి

దీవించి పోవడము కొన్ని సంవత్సరముల నుండి జరిగెడిది. ఆ దినము

కూడా కొన్ని సంవత్సరములనుండి వచ్చు ముస్లీమ్ వృద్ధుడు తొమ్మిదిగంటల

నలభై నిమిషములకు ఇంటిలోనికి వచ్చి ఇల్లంతా సాంబ్రాణి పొగపెట్టి

నెమలి ఈకలతో దీవించి పోయాడు. ఆ ముస్లీమ్ వృద్ధుడు ఈశ్వర్ గదిని

వదలి హాలులో పొగవేసిపోగా అందరూ దానిని పీల్చి పది నిమిషముల

తర్వాత అందరూ నిద్రలోనికి పోయారు. ఆ విధముగా ఇంటిలోని

వారందరూ నిద్రలోనికి పోగా, అంతవరకు అదనుకొరకు కాచుకొనివున్న

మునెప్ప మరియు బాబా ఇద్దరూ పెద్దమ్మ పూజారి వేషముతో జమీందారు


ఇంటిలోనికి ప్రవేశించారు. అప్పటికి తొమ్మిది గంటల యాభైఐదు

నిమిషములైనది. మునెప్ప నేరుగా ఈశ్వర్ గదిలోనికి ప్రవేశించి

కళ్ళుమూసుకొని కూర్చొని వున్న ఈశ్వర్ను గమనించాడు. కొద్దిసేపు

ఈశ్వర్ రూములోనే ఉన్న తపస్విబాబా సరిగా పదిగంటల ఐదు

నిమిషములకు ఈశ్వర్ నుదుట తాను తెచ్చిన విభూదిని బొట్టుగా పెట్టి

వెంటనే ఇద్దరూ బయటికి వచ్చారు. పదిగంటలనుండి ఈశ్వర్లోనికి శక్తి

వచ్చువేళ కావున పదిగంటల ఐదు నిమిషములకు తమ పనిని నెరవేర్చుకొని

బాబా మరియు మునెప్ప బయటికి పోయారు. ఇంటిలోని వారందరికి

దాదాపు పదకొండు గంటలప్పుడు మెలుకువ వచ్చింది. సాంబ్రాని పొగ

పీల్చిన రాఘవా, రాజ యోగానందస్వామి కూడా మత్తు ప్రభావమునకు

నిద్రలోనికి పోయారు. తర్వాత లేచిన రాజయోగానంద స్వామికి

అనుమానము వచ్చింది. జరుగకూడనిది ఏదో జరిగిందని అనుకొన్నాడు.

అంతలోనే పదకొండున్నర గంట కావడమూ, ఈశ్వర్ బయటికి రావడమూ

జరిగింది. అప్పుడు ఈశ్వర్ నుదుట విభూది బొట్టు ఉండుటను స్వామి

చూచి జమీందారుని అడిగాడు. తనకేమి తెలియదని జమీందారు చెప్పాడు.

రాఘవదృష్ఠి సాంబ్రాణి పొగవేసిన ముస్లీమ్ వృద్దుని మీదకు పోయింది.

వెంటనే ముస్లీమ్ వృద్ధుని గురించి అడిగాడు.)


రాఘవ :- ముస్లీమ్ వచ్చి పొగవేసి పోయిన తర్వాత అందరికీ మత్తు వచ్చి

నిద్రలోనికి పోయాము. దీనికి కారణము ఆ ముస్లీమ్ వృద్ధుడే! అతను

ఎవరు?


జమీందారు :- ఆ ముస్లీమ్ వృద్ధుడు నాకు పది సంవత్సరములనుండి

తెలుసు. అతను చాలామంచివాడు. అతనిలో ఏ దురుద్దేశమూ ఉండదు.


అతను ఈ వీధిలోనే చివరి ఇంట్లో ఉంటాడు. కావలసివస్తే పిలిచి అడుగు

తాము.


రాజయోగానంద :- అతను నీకు తెలిసినవాడే, వీధి చివరిలో ఉండువాడే,

మంచివాడే అయివుండవచ్చును. కానీ అతను వేసిన సాంబ్రాణి వలననే

అందరూ నిద్రలోనికి పోవడము జరిగింది. అతను మంచివాడే అయినా

అతను వేసిన సాంబ్రాణి మంచిదికాదు. అతనికి ఆ సాంబ్రాణి ఎక్కడిదో

విచారించండి.


(ఆ ముస్లీమ్ వృద్ధుని కొరకు జమీందారు తన మనుషులను ఇద్దరిని

పంపి ఎక్కడ ఉండినా అతనిని పిలుచుకొని రమ్మన్నాడు. అలా పోయిన

మనుషులు పదినిమిషములకే అతనిని పిలుచుకొని వచ్చారు. ఆ రోజు

సాయంత్రము వరకు పొగవేసుకొంటూ తిరిగే వృద్ధుడు అంత తొందరగా

ఎలా దొరికాడని జమీందారు అనుకొని ఇలా అడిగాడు.)



జమీందారు :- ఇతను పది నిమిషములలోనే ఎలా దొరికాడు. సాయం

కాలము వరకు దొరకడని అనుకొని వుంటిని.


పని మనిషి :- మేము అలాగే అనుకొని ఊరంతా వెతకాలని అనుకున్నాము.

కానీ ఈయన తన పనిని ఎగరగొట్టి ఈ వీధిలోనే గోడక్రింది నీడలో పడుకొని

నిద్రపోతున్నాడు. లేపి పిలుచుకొని వచ్చాము.


జమీందారు :- వహీద్ గారూ! మీరు మాకు పొగవేసి పోయారు. ఆ పొగ

వాసన తగిలిన వారంతా మత్తులో మునిగిపోయి నిద్రపోయారు. నీవు

ఎన్నో సంవత్సరములు నుండి నమ్మకముగా మా దగ్గరకు వస్తున్నావు కదా!

మాకు నిద్రవచ్చే సాంబ్రాణి పొగను ఎందుకు వేశావు?


వహీద్ :- అల్లాసాక్షిగా నాకు ఏమీ తెలియదు. మీ ప్రక్క ఇంటిలోను,


ఇక్కడ, తర్వాత రెండు ఇళ్ళలో అల్లాదువా కోసము పొగవేశాను.

నాలుగిళ్ళు తప్ప ఐదో ఇంటికి పోకనే నాకు నిద్రవచ్చి గోడ ప్రక్కలో పడుకొని

నిద్ర పోయాను. వీళ్ళు వచ్చి లేపితే లేచాను.


రాఘవ :- నీ తప్పు ఏమీలేదు. తప్పంతా సాంబ్రాణిది. అది నీకు ఎక్కడిది?

వహీద్ :- మీరు చెప్పినట్లు నిజమే అయి ఉంటుంది. ఆ సాంబ్రాణి

నాదికాదు. నేను ప్రక్కనే ఉన్న దర్గాకు మ్రొక్కుకొని పక్కింటినుండి

మొదలుపెట్టి మొదట ఈ వీధి అయిపోయిన తర్వాత మిగతా చోటికి

పోతాను కదా! ఈ రోజు నేను దర్గాదగ్గర దర్గాకు తిరిగేటప్పుడు ఒక

మనిషి వచ్చి అక్కడే నిలబడినాడు. నేను దర్గాచుట్టు తిరిగేది అయిపోయిన

తర్వాత అక్కడినుండి వచ్చేటప్పుడు ఆ మనిషి నన్ను పిలిచి “నేను సాంబ్రాణి

ఇస్తాను తీసుకొని పో” అన్నాడు. “నాకెందుకిస్తున్నావు?” అన్నాను. దానికి

అతను "ప్రతి శుక్రవారము మీలాంటి బీదవారికిగానీ, దర్గాకుగానీ

వందరూపాయలు ఖర్చు పెట్టుచుంటాము. ఈ దినము వందరూపాయల

సాంబ్రాని తెచ్చాను. నీవు తీసుకొనిపో!” అన్నాడు. ఇచ్చేది ఎందుకు

వద్దనాలని తీసుకొన్నాను. అక్కడినుండి వచ్చి ప్రక్క ఇంటిలో వేశాను. ఆ

ఇంటిలో వేసిన తర్వాత ఈ ఇంటిలో వేశాను, తర్వాత రెండిల్లలో వేశాను

నాకు నిద్రవచ్చి పడుకొన్నాను.


రాజయోగానంద :- సరే ఇందులో నీ తప్పు ఏమీలేదు, నీవు వెళ్ళు.

(వహీద్ వెళ్ళిపోయాడు. జమీందారు ఇంటికంటే ముందు

ఇంటిలోనూ, జమీందారు ఇంటి తర్వాత రెండు ఇళ్ళలోను విచారించగా

వారు కూడా నిద్రపోయినట్లు తెలిసింది. దానివలన ఇదంతా తపస్విబాబా


పనియేనని అనుకొన్నారు. స్వామి ఎంత జాగ్రత్తపడినా తపస్విబాబా ఈ

మారు సులభముగా తన పట్టును నెగ్గించుకొన్నాడు. కనీసము నాలుగు

ఐదు అమావాస్యల రోజులలోనైనా ఈశ్వర్ నుండి శక్తులను పొంది, కొన్ని

దేశములను తన చేతిలోనికి తెచ్చుకోవాలనుకొన్న తపస్విబాబాకు, చివరికి

ఆరవ అమావాస్య దినమున ఒక శక్తి లభించింది. ఆ ఒక్క శక్తితో సగము

భారతదేశమును నాశనము చేయగల స్థోమత బాబాకు వచ్చినది.

రాజయోగానంద స్వామి చేయునది లేక తన ఆశ్రమమునకు పోయాడు.

తపస్విబాబా ఈశ్వర్ ద్వారా వచ్చిన శక్తిని వినియోగించుకొనుటకు మూడు

నెలలు వ్యవధి మాత్రమున్నది. మూడు నెలలలోపు ఏమి చేయాలి, ఎలా

చేయాలి అను యోచనలో బాబా ఉండిపోయాడు. చివరకు సరిగా

ఒకటిన్నర నెలకు పౌర్ణమి దినమున ఆ శక్తిని వినియోగించుకోవాలను

కొన్నాడు. ఆ శక్తి వినియోగింబడిన ఆరు నెలలకు ఈశ్వర్ చనిపోవడము

జరుగుతుంది. ఒకవేళ ఈశ్వర్లో చేరిన శక్తులు ఒక్కటి కూడా బయటి

కార్యములకు వినియోగించబడకపోతే ఈశ్వర్కు చావు తప్పిపోవును.

తర్వాత అతని జీవితము గొప్ప దశలతో నిండిపోవును. అతని శక్తులు

ఎవరి వశము కాకూడదనీ, అవి ఎవరి వశమైనా వాటిని ప్రపంచ పనులకు

వినియోగించి, వారు గొప్పవారు కాగలరనీ, దానివలన ఈశ్వర్ చనిపోవుననీ

రాజయోగా నంద స్వామికి తెలుసు. అందువలన తపస్విబాబా

ప్రయత్నమును అనేక మార్లు భంగము చేశాడు. చివరిలో బాబా

మోసముచేసి ఈశ్వర్ శక్తిని వశము చేసుకొన్నాడు.


తపస్విబాబా వశము చేసుకొన్న ఆరవ అమావాస్యశక్తి చాలా

గొప్పది. అది ఆకాశములో సుడిమేఘములలాంటి మేఘములను


సృష్టించగలదు. ఒకటి రెండుకాక వంద సుడిమేఘములను సృష్ఠించు

స్థోమత ఆరవ అమావాస్య దినమున ఏర్పడిన శక్తికి ఉన్నది. దానివలన

తపస్విబాబా రెండవ పౌర్ణమి దినమున మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక,

ఆంధ్ర, తమిళనాడు, కేరళ మొత్తము ఆరు రాష్ట్రాలలో సుడిమేఘములను

సృష్ఠించి వాటివలన జన జీవనాన్ని నాశనముచేసి, ఏ ఒక్కరూ మిగలకుండా

చేయాలన్నది తపస్విబాబా ఉద్దేశము. అలా చేయడము వలన అందరూ

చనిపోగా మిగిలిన ఆస్తులన్నిటిని తనే దోచుకోవాలనుకొన్నాడు. నామ

మాత్రము పన్నుకట్టి ఉన్న భూమినంతటిని తానే ఆక్రమించుకోవాలను

కొన్నాడు. అందరు చనిపోగా వారి ధనమును, బంగారమునూ తానే

తీసుకోవాలనుకొన్నాడు. వచ్చే రెండవ పౌర్ణమికి దక్షిణ దేశమంతటినీ

నాశనము చేయుటకు దానికి సంబంధించిన కార్యములను మొదలు పెట్టాడు.


తన మందిరములోనే రాజయోగానంద స్వామి మనిషి ఉన్నాడనీ,

ఇక్కడి విషయములు ఏవైనా అతని ద్వారా రాజయోగానందస్వామికి తెలియ

గలవనీ తపస్విబాబాకు తెలియదు. బాబా మునెప్పను తన మందిరమునకు

పిలుచుకొని సుడిమేఘములను గురించి రహస్యముగా చర్చించిన విషయ

మంతయు రాజయోగానంద స్వామికి తెలిసిపోయింది. రాజయోగానంద

స్వామి ఇంతవరకు తపస్విబాబాకు ఈశ్వర్ వద్దనుండి నాల్గవ అమావాస్య

శక్తి, ఆరవ అమావాస్యశక్తి వశమైనాయని అనుకొనెడివాడు. కానీ తపస్వి

బాబావద్దనున్న తన అనుచరుడి ద్వారా బాబాకు నాల్గవ అమావాస్యశక్తి

రాలేదనీ, అతనికి లభ్యమైనది ఆరవ అమావాస్యశక్తి ఒక్కటేనని ఇప్పుడు

తెలిసిపోయింది. అంతేకాక వచ్చే రెండవ పౌర్ణమి దినమున దక్షిణ

దేశమంతా తనకున్న శక్తితో ఒక వంద సుడిమేఘాలను సృష్టించి వాటివలన


ప్రతి ఊరునూ నాశనము చేయాలనుకొన్నాడని స్వామికి తెలిసింది.

విషయమును రాఘవకు స్వామి తెలపాలని ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- రాఘవా! మనమనుకొన్నట్లు తపస్విబాబాకు రెండు

అమావాస్యల శక్తులు లభ్యముకాలేదు. ఆరవ అమావాస్య దినమున వచ్చిన

శక్తిని మాత్రమే అతను సాధించగలిగాడు. నాల్గవ అమావాస్య దినమున

విచిత్రముగా రెండు నిమిషముల ముందు ఈశ్వర్ తనబొట్టును తుడిపి

వేశాడని తెలిసింది. అందువలన మనము అనుకొన్నట్లు నాల్గవ అమావాస్య

దినమున అతనికి శక్తి లభించలేదని నిర్ధారణ అయిపోయినది.

రాఘవ :- అయితే బాబాగారికి లభించినది ఆరవ అమావాస్య దినమున

వచ్చిన శక్తిమాత్రమే. ఆ ఒక్క శక్తి వలన ఆయన ఏమి చేయగలడు?

రాజయోగానంద :- ఒక్క శక్తి అయినా ఎంతో శక్తివంతమైనది. దానివలన

ప్రళయమును సృష్ఠించినట్లు మారణ హెూమము చేయగలడు. బాబాగారు

వచ్చే రెండవ పున్నమి రోజున కనీసము వంద సుడిమేఘములను సృష్టించి

దక్షిణ దేశములోని జీవకోటినంతటిని నాశనము చేయాలనుకొన్నాడని

తెలిసింది.


రాఘవ :- సుడి మేఘములంటే ఏమిటి? అవి జీవకోటిని ఎలా నాశనము

చేయగలవు?

రాజయోగానంద :- సుడి మేఘాలను గురించి "దయ్యాల భూతాల యదార్థ

సంఘటనలు" అను గ్రంథములో పూర్తిగా వ్రాయబడివుంది. ఆకాశము

నుండి భూమివద్దకు సుడి తిరుగుచూ వచ్చే మేఘమును సుడి మేఘము

అంటాము. సుడిమేఘములను “టోర్నడోలు” అని ఇంగ్లీషుభాషలో


అంటారు. “టోర్నడోలు” అను సుడిమేఘములు సహజసిద్ధముగా మేఘముల

నుండి పుట్టుచుంటాయి. కానీ ఇక్కడ ఆరవ అమావాస్య రోజున ఈశ్వర్

శరీరము నుండి వచ్చినశక్తి సహజముగా ప్రకృతిలో పుట్టు సుడిమేఘము

(టోర్నడోలు) కంటే వందరెట్లు పెద్దదిగా మరియు వందరెట్లు బలమైనదిగా

ఉంటుంది. ఆరవ అమావాస్య దినమున పుట్టిన శక్తి సుడిమేఘముగా

మాత్రము మారగలదు. ఈ సుడిమేఘము, సహజముగా పుట్టిన

సుడిమేఘము పొలాలలో కూడా ప్రయాణించినట్లు ప్రయాణించక, బాబాగారి

మనో సంకల్పము ప్రకారము జనావాసములైన పల్లెలమీదనూ, పట్టణముల

మీదనూ ప్రయాణించును. సాధారణ సుడిమేఘముకంటే వందరెట్లు

పెద్దదయిన సుడిమేఘము ప్రళయమునకు మారురూపముగా కనిపించు

చుండును. అది జననివాసములైన పల్లెల మీదికి వచ్చినపుడు పల్లెను

మొత్తము ఒక్కమారుగా కదిలించివేయును. సుడిమేఘము యొక్క

బలమునకు మనుషులూ, జంతువులూ కార్లు బస్సులు సుడిలో చిక్కుకొని

వంద నుండి రెండు వందల అడుగుల ఎత్తులో ఎగరవేయబడి వంద

కిలోమీటర్ల స్పీడుతో సుడి తిరుగుచుండును. అలా తిరగడములోనే సగము

జీవరాసులు తమ ప్రాణాలు కోల్పోతాయి. అలా పది నిమిషముల సేపు

త్రిప్పి సుడినుండి బయటికి విసిరివేయుచుండును. అలా విసిరివేయబడిన

మనుషులుగానీ, జంతువులు గానీ క్రిందపడి చనిపోవడము జరుగుతుంది.

అట్లే వాహనములను కూడా త్రిప్పి విసిరివేయడము జరుగుచుండును.

సుడి మేఘము ఏ ఇంటిని వదలక అన్నిటినీ నేలమట్టము చేయును. కొన్నిటి

పైకప్పులను త్రిప్పి విసిరివేయును. అది ఒక ఊరిలోనికి వచ్చిపోతే ఎక్కడ

ఎవరి ఇల్లు ఉండేదో దాని గుర్తులు కూడా తెలియకుండా పోవును. ఒక్క

ఇంటిగోడ కూడా మిగలకుండా క్రిందపడి విడిపోయి వుండును. మొత్తము


మీద ఒక ప్రళయములాగ ఉండును. ఆరవ అమావాస్య శక్తికి

అంతబలమున్నదని తెలిసిన తపస్విబాబా, ఆ శక్తితో సుడిమేఘములను

సృష్టించి ఆరు రాష్ట్రములలో ఎవరినీ మిగలకుండా చేయాలనుకొన్నాడు.

అప్పుడు మనము కూడా ఆ శక్తి ముందర ఏమీ చేయలేము. అది అష్టగ్రహ

ప్రభావముల వలన ఏర్పడిన శక్తి. కావున అది మనలను కూడా లెక్కచేయక

విసిరివేయగలదు. ఆ సమయమునకు ఆరు రాష్ట్రాలు దాటిపోతేనే మనము

బ్రతకగలము. లేకపోతే దాని తాకిడికి మనము కూడా మరణించక తప్పదు.

రాఘవ :- ఆరవ అమావాస్య రోజున ఈశ్వర్లో ప్రవేశించు ఒక్క శక్తియే

ఇంత నాశనమును సృష్టించునదియైతే, మిగతా ఐదు అమావాస్యల

శక్తులన్నిటిని బాబా వశము చేసుకొనివుంటే ఏమయ్యేదో?


రాజయోగానంద :- ప్రపంచమునంతటిని మారణము చేయగల అనేక

శక్తులు ఏర్పడేటివి. అందువలననే అతని ప్రయత్నమును భంగము

చేయాలని మనము ఎంతగానో ప్రయత్నించాము. కానీ ఆ ప్రయత్నములో

నాలుగు మార్లు బాబా ఓడిపోయినా చివరకు ఒక్కమారు గెలువగలిగాడు.

ఆ ఒక్కమారు కూడ గెలువకుండా చేసివుంటే బాగుండేది. కానీ అతని

ఎత్తుగడను గమనించలేక పోయాము. పొగపెట్టి నిద్రలోనికి పంపి తన

పనిని నెరవేర్చుకొన్నాడు. ఇప్పుడు రెండవ పున్నమికి మనము ఏదో ఒక

దారి చూచుకొని ఇక్కడనుండి పోవలసిందే.


(ఈ విధముగా రాజయోగానంద స్వామి చెప్పడము రాఘవకు

విచిత్రముగా తోచింది. అంతలేనిది స్వామి చెప్పడని అనుకొన్నాడు.

అంతలోనే మొదట పున్నమి వచ్చింది. పున్నమి గడచిపోయిన నాలుగవ


దినము రాజయోగానంద స్వామికి, తపస్వి బాబా మందిరమునుండి స్వామి

అనుచరుడి ద్వారా ఒక విచిత్రమైన వార్త తెలిసింది. పున్నమి రోజు రాత్రి

ఒక పెద్దపాము బాబా ఆశ్రమములో కనిపించిందట. దానిని చంపాలని

ప్రయత్నించగా అది కనిపించలేదట, చంపాలని ప్రయత్నించిన పది మందికి

రెండవ రోజు చూపు లేకుండా పోయిందట. మూడవ దినము రాత్రి

తిరిగి కనిపించిన పాము చివరకు మునెప్పను కాటువేయగా అతను

విచిత్రముగా ఒకే నిమిషములో ప్రాణము వదిలాడట. మునెప్ప

చనిపోవడము వలన తపస్విబాబా చాలా బాధపడ్డాడని స్వామికి తెలిసింది.

అలా జరగడము స్వామికి ఆశ్చర్యము అయినది. మునెప్ప అంత్యక్రియలు

అయిపోయిన తర్వాత బాబా తన ఉద్దేశమును మార్చుకొన్నాడు. మొదట

రెండవ పౌర్ణమికి వినాశనము సృష్టించాలనుకొన్న బాబాగారు అంతవరకు

లేకుండా పది రోజులలో వచ్చే అమావాస్య రోజే తన పనిని చేయాలను

కొన్నాడు. అలా బాబా తన ఉద్దేశ్యమును మార్చుకొని, వచ్చే అమావాస్య

దినమే వినాశనమును ప్రారంభించాలని అనుకొన్న విషయము బాబా

మందిరములోనున్న స్వామి అనుచరునికి కూడా తెలియదు. అందువలన

ఆ విషయము రాజయోగా నంద స్వామికి కూడా తెలియకుండా పోయింది.


ఉన్నట్లుండి ఎంతో భద్రతగల స్వామి మందిరములోనికి పాము

ఎలా పోయిందని స్వామి ఆలోచించాడు. అక్కడికి చిన్న చీమ కూడా

పోలేదు. ఎంతో శుభ్రముగానున్న బాబా మందిరములోనికి పాము పోవుటకు

వీలులేనేలేదు. అయినా అక్కడికి పాము పోవడము ఏమిటి, దానిని చంపను

పూనుకొన్న పదిమందికి కళ్ళు కనిపించకుండా పోవడమేమిటి, అది కరిచిన

నిమిషమునకే మునెప్ప చనిపోవడమేమిటి, అని ఎంత ఆలోచించినా స్వామికి

ఏమాత్రము అర్థముకాలేదు. చివరకు ఇది దైవ నిర్ణయము ప్రకారమే

జరిగిందని అనుకొన్నాడు.


అంతలో అమావాస్య వచ్చింది. రేపే అమావాస్య అనగా అప్పుడు

బాబా తన నిర్ణయము మార్చుకొన్నాడని అమావాస్య దినమున రేపే తన

వినాశన కార్యమును ప్రారంభించుచున్నాడని, బాబా మందిరమునుండి

స్వామికి వార్త వచ్చింది. అదియూ సాయంకాలము ఆరుగంటల

సమయములో ఆ వార్త తెలియడముతో ఆ సమయములో తాము ఎక్కడికీ

పోలేమని తాము కూడా సుడిమేఘము యొక్క ఉదృతిలో చిక్కుకోవలసిందేనని

స్వామి అనుకొన్నాడు. అదే విషయమును రాఘవకు కూడా చెప్పి, ఇక్కడ

కూడా బాబా తన ఉద్దేశమును మార్చుకొని మనలను కూడా అపాయములో

ఇరికించాడని అనుకొన్నారు. తాము ఇప్పుడు ఎటూ పోలేమనీ, తమను

దేవుడే కాపాడవలెననీ, దేవుని మీద భారము వేసి ఆశ్రమములో

ఉండిపోయారు. తెల్లవారగానే స్వామికి మరొక వార్త అందింది.

అదేమనగా! ఆ తెల్లవారు జామున బాబాలేచి కార్యక్రమములు తీర్చుకొని

తన గదిలో కూర్చొని ఈశ్వర్నుండి వచ్చిన శక్తిని బయటికి ఆహ్వానించి

తన ఉద్దేశమును ఆ శక్తికి చెప్పి పంపాలనుకొన్నాడు. ఆ శక్తిని పిలువగానే

ఎదురుగా ముక్కు మూతిలేని ఒక ఆకారము వచ్చి నిలబడింది. అప్పుడు

ఆరు రాష్ట్రముల గురించి బాబా చెప్పి వాటినన్నిటిని ఒక గంట వ్యవధిలో

నాశనము చేయమన్నాడు. సరేనని ఆ ఆకారము చెప్పింది. అంతలో

ఒకనాగుపాము అక్కడ ప్రత్యక్షమైనది. దాని ప్రక్కనే ఒక పొడవుగడ్డమున్న

మహర్షి ప్రత్యక్షమైనాడు. అప్పుడు రూపములేని ఆకారమువైపు ఆ మహర్షి

చూచి "వీడు నిన్ను వశపరుచుకొని దక్షిణ దేశమును తల్లి పిల్ల అనకుండా

అందరినీ నాశనము చేయమన్నాడు. వీడు చెప్పినట్లు నీవు వినవలసిందే.

నీవు వీడు చెప్పినట్లే చేయి. కానీ నీవు నాశనము చేయవలసినది దక్షిణ

దేశమును కదా! ఆ దక్షిణ దేశము నా దక్షిణ హస్తములోనే కలదు. నా


దక్షిణ హస్తములో ఏడు రాష్ట్రములు కలవు. అందులో ఆరింటిని నీవు

నాశనము చేసి, ఏడవ దానిలో అణిగిపో" అని చెప్పగానే అలాగే మీ

ఆజ్ఞప్రకారమే చేయగలను. అని ఆ ఆకారము బహు చిన్నదిగా ఈగ

పరిమాణముగా మారి, మహర్షి హస్తము మీద మొదట బొటనవ్రేలి మొదట

గెనుపుమీద వ్రాలి అక్కడినుండి రెండవ గెనుపు మీదికి వచ్చింది. అక్కడి

నుండి మూడవ గెనుపు మీదికి వచ్చింది. అక్కడినుండి బొటనవ్రేలు

క్రిందగల విశాల భాగములోనికి వచ్చింది. అప్పటి నాలుగు రాష్ట్రములు

అయిపోయాయి అని పెద్దగా చెప్పింది. దాని తర్వాత రెండు రేఖల మధ్యనున్న

ఒకటవ భాగములోనికి వచ్చింది, అప్పుడు ఐదు రాష్ట్రములు అయిపోయాయి

అని గట్టిగా చెప్పింది. అక్కడినుండి దాని ప్రక్కన పైనగల రెండు రేఖల

మధ్యనున్న రెండవ భాగములోనికి వచ్చింది. ఇప్పటికి ఆరురాష్ట్రములు

దక్షిణదేశమంతా అయిపోయింది అని బిగ్గరగా చెప్పింది. తర్వాత ఏడవ

భాగమైన ఉత్తర దేశములో అణిగిపోతున్నాను అని చెప్పి ఒక రేఖకు పైన

వ్రేళ్ళకు కిందనున్న భాగములో అణిగి కనిపించకుండాపోయింది.

ముందరే జరుగుచున్న ఆ దృశ్యమును తపస్విబాబా ఆశ్చర్యముగా చూస్తూ

నిలిచిపోయాడు. అది అంతా అయిపోయిన తర్వాత అక్కడవున్నది ఎవరని

అతనివైపు బాబా చూడగానే ప్రక్కనేవున్న పాము పైకిలేచి తపస్విబాబా

మెడకు చుట్టుకొని తలమీద కాటువేసింది. అప్పుడు బాబాగారు ఒక్క

నిమిషములోనే ప్రాణమును వదలి మరణించాడు. అప్పుడు మహర్షి

అక్కడినుండి వెళ్ళిపోగా పాము కూడా పోయింది. ఇది మందిరములో

జరిగిన సమాచారము. బాబామందిరములో ఈ సంఘటనను ప్రత్యక్షముగా

చూచిన రాజయోగానంద స్వామి ఏర్పరచిన మనిషి చెప్పగా, రాజయోగా

నందస్వామి రాఘవకు తాను బాబామందిరమునుండి తెలుసు కొన్నదంతా



తెలిపాడు. అదంతా విన్న రాఘవకు ప్రమాదము తప్పి పోయిందని

నవ్వాలనిపించినా, గుహలోని మహర్షి అవసరము వచ్చినపుడు నేనే వస్తానని

చెప్పిన మాట జ్ఞాపకము వచ్చి ఆయన దర్శన భాగ్యము లభించలేదని

ఏడ్వాలనిపించింది. విషయమంతా స్వామి ద్వారా వినిన రాఘవ ఏమీ

మాట్లాడక నిలిచిపోవడమును చూచిన రాధేశ్వరి ఇలా అన్నది.)

రాధేశ్వరి :- ఏమండీ! స్వామి చెప్పిన మాటకు ఏమీ మాట్లాడక నిలిచి

పోయారు?


రాఘవ :- ఏమీ లేదు. నేను ఆలోచనలో పడిపోయాను. ఇప్పుడు

జరుగబోవు ప్రమాదమునుండి మనము బయట పడినందుకు సంతోషమే.

అయినా ప్రమాదమునుండి రక్షించినది గుహలోని మహర్షియని, తపస్వి

బాబాను కాటువేసి నిమిషములో చంపినది గుహలోని పామేనని నాకు

అర్థమైనది. తర్వాత నాకు మహర్షి “నీవు ఇక్కడికి రావద్దు సమయము

వచ్చినపుడు నేనే వస్తాను” అనిన మాటలు జ్ఞాపకము వచ్చాయి. ఆ దినము

ఆయన దర్శనము కొరకు తిరిగి వస్తానని నేను అడిగినపుడు ఆయన

అలా చెప్పాడు. అంతేకాక ఈ పాము చేయవలసిన పాత్ర చాలా ఉన్నదని

కూడా చెప్పాడు. ఆయన మాట ప్రకారము మునెప్పను కరిచి చంపిన

పామూ, తపస్విబాబాను కరిచిన పామూ అదేనని, ఆ పాము కరుచుట

వలనే ఒకే నిమిషమునకు ఇద్దరూ చనిపోవడమూ జరిగినదనీ అర్థమైనది.

ఇవన్ని ముందే జరుగునని తెలిసిన ఆ మహాత్ముడు సమయమువచ్చినపుడు

అని మాత్రము చెప్పాడు. ఆ రోజు నేను ఆ మహానుభావుని దర్శనమునకు

అడుగగా, నేనే వస్తాను నీవురావద్దు అన్నాడు. కానీ ఆయన వచ్చాడు

ఎంతో పెద్ద మారణశక్తిని తన చేతిలోనే అణిగిపోవునట్లు చేశాడు. ఆయన


పనిని ముగించుకొని పోయాడు. కానీ ఆయన వచ్చినా ఆయన దర్శనము

దొరకలేదు కదా అని బాధగా ఉంది. అందువలన పలకలేకపోయాను.

రాజయోగానంద :- రాఘవా! నీవు అలా అనుకోవడము పొరపాటని నేను

చెప్పగలను. ఎందుకనగా! నీవు అడిగినది ఆయన దర్శనమును కదా!

అప్పుడు ఆయన చెప్పినది. నీవు నా దర్శనమునకు రావద్దు. సమయము

వచ్చినపుడు నేనే వస్తానని చెప్పాడు. ఆ మాటలో నేనే వచ్చి దర్శనమిస్తానని

చెప్పినట్లు అర్థమగుచున్నది. నేను వచ్చినపుడు నీవు నా దర్శనము కొరకు

రమ్మని చెప్పలేదు కదా! అందువలన ఆయనే వచ్చి దర్శనమిస్తానని బాగా

తెలియుచున్నది. అందువలన నీవు చింతించవలసిన పనిలేదు.


(అంతలోనే జమీందారు కారువచ్చి ఆశ్రమము ముందర ఆగింది.

అందులోనుండి అపస్మారక స్థితిలోవున్న ఈశ్వర్ను జమీందారు రావు

బహదూర్ గారు తీసుకొని వచ్చాడు. జమీందారు, జమీందారు భార్య

ఇద్దరూ వచ్చి స్వామితో బాధపడుచూ ఇలా అన్నారు.)


జమీందారు :- స్వామీ! ఈశ్వర్ తెల్లవారుజామున నాలుగుగంటల ముప్పయి

నిమిషములపుడు గట్టిగా అరిచి అపస్మారక స్థితిలోనికి పోయాడు. ఇప్పటి

పరిస్థితిలో బయట ఎవరితోను (ఏ డాక్టరుతోనూ) చూపించుకోవడము

మంచిదికాదని పించింది. వెంటనే మీవద్దకు తీసుకొని వచ్చాము.


రాజయోగానంద :- ఈశ్వర్ను గురించి మీరు గాబరా పడవలసిన పనిలేదు.

ఆరవ అమావాస్య రోజు ఆయన శరీరములో ప్రవేశించిన శక్తి ఈ తెల్లవారు

జామున నాలుగున్నర గంటలకు దేవునిలోనికి ఐక్యమైపోయినది. ఆ శక్తికి

ఈశ్వర్ శరీరమునకు కొంత అనుబంధము ఉండుట వలన, అది లేకుండా

పోయిన సందర్భములో ఈశ్వర్కు అలా జరిగి ఉండవచ్చును. అందరినీ


రక్షించుశక్తి ఒకటున్నది. ఆ శక్తివలననే ఈశ్వర్కు ఏమి జరిగినా జరగాలి.

ఆ శక్తియే వచ్చి కాపాడుతాదను నమ్మకముతో ఉండండి.


(జమీందారు, అతని భార్య, ఈశ్వరన్ను తీసుకవచ్చిన తర్వాత

జమీందారు ఈశ్వరు గురించి చెప్పునప్పుడు అందరి దృష్టి జమీందారు

చెప్పు విషయము మీదనే ఉండెను. అప్పుడు వారి ప్రక్కన మరొక మనిషి

నిలబడి ఉండినా, అతను ఎవరు అని ఎవరూ అతనివైపు చూడలేదు.

రాజయోగానంద స్వామి మాట్లాడునప్పుడు కూడా అందరి దృష్ఠి స్వామి

మీదనే ఉండెను. అందరి ధ్యాస అలా ఉండుట వలన ఎవరో తమతో

పాటు ఉన్నాడని అనుకున్నారు. కానీ అతను ఎవరు అని ధ్యాసగా అతని

వైపు ఎవరు చూడలేదు. రాఘవ అకస్మాత్తుగా రాజయోగానందస్వామి

మాటలు విన్న తర్వాత ప్రక్కనున్న మనిషిని చూచాడు. అలా చూచిన

రాఘవ ఒక్కమారు ఆశ్చర్యపోయాడు. తనకళ్ళను తానే నమ్మలేకపోయాడు.

అక్కడ రాఘవకు కనిపించినదీ, అంతవరకు తమతోపాటు అక్కడే

నిలుచున్నదీ, సాక్షాత్తు గుహలోని మహర్షి. రాఘవ కళ్ళవెంట ఆనంద

భాష్పములు రాగా, వెంటనే అక్కడున్న మహర్షి పాదాల మీద పడిపోయాడు.

రాఘవ ఉన్నట్లుండి అలా కాళ్ళమీద పడినపుడు ఎవరి కాళ్ళ మీద పడినాడని

అప్పుడు ఆ మహర్షిని అందరూ చూచారు. అతను అక్కడున్న వారందరికీ

క్రొత్తవ్యక్తి. అందువలన ఆయన ఫలానా అని గుర్తించలేక పోయారు.

మహర్షి పాదాలకు నమస్కరించి లేచి నిలుచున్న రాఘవతో మహర్షి ఇలా

అన్నాడు.)


మహర్షి :- నీ కోరిక నెరవేరిందా?

రాఘవ :- నెరవేరింది. ఇంతకుముందే రాజయోగానంద స్వామి మీరే

వచ్చి నాకు దర్శనమిస్తారని చెప్పాడు. కానీ మీరు వచ్చినా ఇక్కడే

ఉండినా మిమ్ములను మేము చూడలేదు. ప్రక్కధ్యాసలో పడిపోయాము.


(అప్పుడు రాఘవ మాటలను బట్టి అక్కడున్న వారికి ఆయనే

భూగర్భమునుండి వచ్చిన మహర్షి అని అర్థమైనది. జమీందారుకు ఏమీ

అర్థముకాలేదు. అప్పుడు రాజయోగానంద స్వామి జమీందారుతో ఇలా

అన్నాడు.)


రాజయోగానంద :- రావు బహదూర్ గారూ! నేను ఒక్క నిమిషము

ముందు నీతో ఏమి చెప్పానో జ్ఞాపకముందా! అందరినీ రక్షించుశక్తి

ఒకటున్నదని అన్నాను కదా! ఆ శక్తియే ఈ మహర్షిరూపములో వచ్చినది.

ఆయన వలననే ఈశ్వర్కు ఏమి జరిగినా జరుగుతుంది. ఆయనే వచ్చి

కాపాడుతాడని చెప్పాను. ఈ పాటికి మనమంతా సుడిమేఘము వలన

చనిపోయేవారము. మనమేకాదు దక్షిణ దేశమంతా సర్వనాశనమై పోయేది.

నన్ను నిన్ను మాత్రమే కాకుండా దక్షిణ దేశ ప్రజలనందరినీ ఆపదనుండి

కాపాడిన దేవుడు ఈయనే!


(అని రాజయోగానంద స్వామి అనగానే అక్కడున్న వారందరూ

ఆ మహర్షి పాదాలమీద వాలిపోయారు. అందరిని లేపిన రాజయోగానంద

మళ్ళీ ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- రాఘవకు ఇంతకుముందే, నీవు బాధపడవద్దు ఆయనే

వచ్చి దర్శనమిస్తాడు అని చెప్పాను. అలాగే రాఘవకే కాక మనందరికీ

ఆయన దర్శనము దొరికింది. నిమిషము ముందే చెప్పాను. ఆయనే వచ్చి

ఈశ్వర్ను కాపాడుతాడని, అలాగే ఆయన వచ్చారు. ఆయన ఏమి చేయాలో

అదే చేస్తాడు. కాని మనము ఆయనను కోరవలసింది ఆయన జ్ఞానమును.


(రాజయోగానంద స్వామి అలా చెప్పుచుండగా అక్కడున్న మహర్షి

చిరునవ్వు నవ్వుతూ మౌనముగా చూస్తూవుండెను. అప్పుడు రాఘవకు

తపస్విబాబాగారి మందిరములో సుడిమేఘమునకు మహర్షి చెప్పిన

విషయము జ్ఞాపకము వచ్చి ఇలా అడిగాడు.)


రాఘవ :- మహాత్మా! తమరు సుడిమేఘములను సృష్ఠించు అమావాస్య

శక్తిని మీ దక్షిణ హస్తము (కుడిచేతి) లో అణిగిపొమ్మన్నారు. అప్పుడు

దక్షిణమునగల ఆరు రాష్ట్రములను సంచరించి అక్కడ వినాశనము చేసి

చివరకు ఏడవ భాగమైన ఉత్తరదేశములో అణిగిపొమ్మని ఆ శక్తికి ఆజ్ఞ

చేశారు. ఆ శక్తి మీరు చెప్పినట్లే చిన్న ఈగ పరిమాణములోనికి మారి,

మీ హస్తములోని ఆరు భాగములతో తిరిగి ఏడవ భాగములో అణిగిపోయి

కనిపించకుండా పోయిందని విన్నాను. హస్తములోని ఏడు భాగములు

ఏమిటో, అందులో ఆరు దక్షిణదేశముకాగా, ఒక్కటి మాత్రము ఉత్తరదేశమను

పోలిక ఏమిటో నాకు అర్థముకాలేదు. రాజయోగానందస్వామి మిమ్ములను

ప్రపంచ కోర్కెలడుగకుండా మీ జ్ఞానమునే అడగమన్నాడు. అందువలన

మీరు ఆ శక్తికి చెప్పిన భావమేమిటో, మీరు చెప్పు జ్ఞానమువలననే మేము

తెలుసుకోగలము.



మహర్షి :- రాఘవా! అన్ని విషయములు తెలిసిన వ్యక్తి, అన్ని జ్ఞానములు

తెలిసిన వ్యక్తి అయిన రాజయోగానంద స్వామి ఉండగా నన్ను అడగడము

ఎందుకు? ఆయనకు తెలియని జ్ఞానము నాకు తెలుసునా? మీరు ఆయననే

అడగండి.


(స్వయానా మహర్షియే ఆ మాటను రాజయోగానంద స్వామి

ముందర చెప్పగా ఆశ్చర్యముగా స్వామివైపు రాఘవ చూచాడు. అప్పుడు

ఇంకా ఆశ్చర్యమైన దృశ్యము రాఘవకు కనిపించింది. ఏ పామైతే

మునెప్పనూ, తపస్విబాబాను ఒక్క నిమిషములో అంతము చేసిందో,

పామైతే గుహలో మహాత్ముని ప్రక్కన కనిపించిందో అదే పామే రాజయోగా

నంద స్వామి ప్రక్కన ఉన్నది. అంతేకాక అక్కడున్న వారందరూ అక్కడ


కనిపించిన మహర్షికి నమస్కరించి పాదాలమీద పడినా స్వామి మాత్రము

కనీసము నమస్కారమని కూడా ఆయనకు చెప్పలేదు. స్వామియేమో

మహర్షిని దేవునితో సమానముగా చెప్పగా, మహర్షియేమో స్వామిని

ఆయనకు తెలియని జ్ఞానము నాకు తెలుసునా! అంటాడు. రాజయోగా

నందయేమో రాత్రి కూడా మనకు చావు తప్పదని భయపడిపోయాడు.

ఉదయము మహర్షియే మనలనందరిని కాపాడిన దేవుడన్నాడు.  ఇప్పుడు

మహర్షి స్వామిని గొప్పగా చెప్పడమేకాక ఎల్లప్పుడు మహర్షి దగ్గర చూచిన

పాము రాజయోగానంద స్వామి దగ్గర ఉన్నది. ఇదంతా గమనిస్తే వీరి

ఇరువురులో ఎవరు గొప్పో, ఎవరు తక్కువో రాఘవకు ఏమీ అర్థము కాలేదు.

రాఘవ ఇలా యోచిస్తుండగానే రాజయోగానంద స్వామి హస్తమును గురించి

చెప్పను మొదలుపెట్టాడు.)


రాజయోగానంద :- మన శరీరములో రెండు కుడి, ఎడమ భాగములున్నవి.

కుడి భాగమును దక్షిణ భాగమని, ఎడమ భాగమును ఉత్తర భాగము అని

అనవచ్చును. అలా ఉత్తర, దక్షిణ భాగములనుటకు కారణము కలదు.

అది ఏమనగా! ఉదయము సూర్యుడు పుట్టుచున్నపుడు సూర్యునికి ఎదురుగా

నిలబడితే అప్పుడు సూర్యునికి ఎదురుగావున్న ముఖమును తూర్పు

భాగమని, వీపును పడమర భాగమని, దక్షిణ దిక్కుకు ఉన్న కుడి భాగమును

దక్షిణ భాగమని, అలాగే ఎడమ భాగము ఉత్తర దిక్కుకు ఉండుట వలన

ఎడమ భాగమును ఉత్తర భాగమని అనుచుందుము. ఇవి మన శరీర

నాల్గు ప్రక్కలకు పెట్టిన పేర్లుకాగా స్థూలశరీరములో జ్ఞానేంద్రియములు,

కర్మేంద్రియములని రెండు రకముల బయటి అవయవములు గలవు.

వాటియందు జ్ఞానేంద్రియములలో కన్ను ప్రధానమైనది, అలాగే

కర్మేంద్రియములలో చేయి ప్రధానమైనది. జ్ఞానేంద్రియమైన కన్ను సూర్యునికి


ఎదురుగా తూర్పు దిశనవున్నది. అందువలన కన్నును తూర్పు కన్ను అని

అనవచ్చును. చేతులు ఉత్తరమున ఒకటి, దక్షిణమున ఒకటి కలవు.

అందువలన కుడిచేయిని దక్షిణ హస్తమని, ఎడమ చేయిని ఉత్తర హస్తమని

అనడము జరుగుచుచున్నది.


జ్ఞానేంద్రియమైన కన్ను, కర్మేంద్రియములైన హస్తములో ఎంతో

విశేషమైన దైవజ్ఞానము ఇమిడి ఉన్నదని ముందే తెలుసుకొన్నాము.

నేత్రములో త్రిఆత్మల (జీవాత్మ, ఆత్మ, పరమాత్మల) సూచన ఉన్నదని

చెప్పుకొన్నాము. హస్తములో మూడు ఆత్మల గుర్తులేకాక, ప్రకృతి జనిత

ములైన గుణముల గుర్తులు కూడా కలవని తెలుసుకొన్నాము. ఇప్పుడు

మహర్షి సుడిమేఘమను శక్తికి, హస్తములోని దక్షిణ దేశములోని ఆరు

రాష్ట్రములు (ఆరు భాగములు) దాటి ఉత్తర దేశములోని ఒక్క భాగములో

అణిగిపొమ్మని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలోని జ్ఞానమును వివరించి

చెప్పుకుంటే జీవుడు అజ్ఞానమునుండి జ్ఞానమువైపు పోయి, దానిని కూడా

దాటి చివరకు మోక్షమును చేరమని చెప్పడము జరిగింది. ఒక మనిషి

మాయను దాటి దైవజ్ఞానమువైపు పోయి, దానిని కూడా వదలి యోగములో

లేకుండా పోవలెనని అర్థము. ఒక మనిషి ఆరు భాగములను దాటినపుడు

ప్రకృతి మాయనూ, దేవుని జ్ఞానమునూ దాటి యోగము అను ఏడవ

భాగమును చేరి అందులోనే లేకుండా పోవడము ఎలాగో, మనిషి హస్తము

లోనే చూపబడినది. అది ఎలాగో అర్థము కావాలంటే మానవుని హస్తమును

ఒకమారు తర్వాత గల పేజీ చిత్రపటములో చూడండి. హస్తములో ఏడు

భాగములు గుర్తించబడినవి. అందులో నాలుగు ప్రకృతి సంబంధమైనవి.

మూడు పరమాత్మ సంబంధమైనవని చెప్పవచ్చును. అట్లే ఆరు ఇహ

లోకములోనివని, ఏడవది పరలోక సంబంధమైనదని చెప్పవచ్చును. వాటినే




మొఖచిత్రము 493 పేజీ లో చూడండి .  

మొఖచిత్రము భాగములు  ఈ విధముగా ఉన్నాయ్. 

1. తామస రాష్ట్రము (రాజ్యము)

2. రాజస రాష్ట్రము (రాజ్యము)

3. సాత్విక రాష్ట్రము (రాజ్యము)

4. ప్రకృతి రాష్ట్రము (రాజ్యము)

5. జీవుని రాష్ట్రము (రాజ్యము)

6. ఆత్మ రాష్ట్రము (రాజ్యము)

7. పరమాత్మ దేశము (సామ్రాజ్యము)} ఉత్తర దేశము


ఆత్మ సంబంధ భాగములు 5,6,7.

ఉత్తర దేశము : 7.

దక్షిణ దేశము: 1,2,3,4,5,6.

ప్రకృతి సంబంధ భాగములు: 1,2,3,4.


ఇహమునకు సంబంధించిన ఆరు భాగములను ఆరు రాష్ట్రములని

పరమునకు సంబంధించిన ఒక్క భాగమును (ఏడవ భాగమును) ఉత్తర

దేశమని చెప్పుచున్నాము. ఆరు రాష్ట్రములను జయించి లేక నాశనము

చేసి ఏడవ భాగమును చేరడమునే మోక్షమును పొందడమని అర్థము

చేసుకోవలెను.


హస్తమును వివరించి చెప్పుకుంటే ప్రకృతి నుండి పుట్టినది మాయ.

ప్రకృతి జనితమైనది మాయ. మాయ మూడు భాగములుగా ఉన్నది.

ఉదాహరణగా చెప్పుటకు ఒక కోడిపెట్టను తీసుకొని చూస్తాము. ఒక

కోడికి మూడు పిల్లలున్నాయి. మూడు కోడి పిల్లలు, కోడి రెక్కల క్రింద

ఉంటాయి. ఒక పిల్లల కోడిని ప్రకృతిగా లెక్కించి చూస్తే దానికి పుట్టిన

పిల్లలు అను మాయ మూడు భాగములుగా ఉన్నది. ఆ మూడు భాగము

లలో ఒకటి తామస గుణభాగముకాగా, రెండవది రాజస గుణభాగము,

మూడవది సాత్త్వికగుణభాగము. నాల్గవది ఈ మూడు భాగములకు తల్లి

అయిన ప్రకృతి. ఐదవ భాగము, ఆరవ భాగము, ఏడవ భాగము మూడు

ఆత్మ సంబంధ భాగములు.  అందులో జీవాత్మకు సంబంధించినది ఐదవ

భాగము. ఆత్మకు గుర్తుగా చెప్పుకొనునది ఆరవ భాగము. చివరి ఏడవ

భాగము పరమాత్మకు గుర్తుగా, మోక్షమునకు చిహ్నముగా చెప్పబడుచున్నది.

ఇందులో ఆరు భాగములను దాటి ఏడవ భాగములో చేరిపోతే, అక్కడ

చేరినవాడు తర్వాత లేకుండా దేవునిలోనికి ఐక్యమైపోవును.


ఈశ్వర్ 16వ సంవత్సరములో ఆరవ అమావాస్య రోజున పుట్టిన

శక్తిని లేకుండా చేయుటకు, ఆధ్యాత్మిక అర్థముతో ఏడవ భాగమైన ఉత్తర

దేశమును చేరి అణిగిపొమ్మని చెప్పడము జరిగింది. ఒక్కమారు మోక్షము


అందువలన

పొందినవాడు తిరిగి పుట్టడు. వాడు ఎక్కడా ఉండడు.

అమావాస్య శక్తిని ఎక్కడా లేకుండా చేయుటకు ఏడవ భాగములో అణిగి

పొమ్మని చెప్పడము జరిగింది. ఈ జ్ఞానము అర్థముకావాలంటే హస్తము

లోని మూడు రేఖలను గురించి, వ్రేలిలోని మూడు భాగముల గురించి

తెలిసివుండవలెను. మూడు రేఖలు మూడు ఆత్మలని, వ్రేలి మూడు గెనుపులు

మూడు గుణములని తెలిసివుండవలెను. అట్లు తెలిసిన వారికి ఆరు

రాష్ట్రముల విషయము బాగా అర్థమగును.


(రాజయోగానంద స్వామి, మహర్షి చెప్పిన ఆరు రాష్ట్రముల

విషయమును ఆధ్యాత్మికరీత్యా వివరించి చెప్పడము అక్కడున్న వారందరికీ

ఆశ్చర్యము అయినది. ఇంతకుముందే హస్తములోని రహస్యమునంతటినీ

చెప్పిన రాజయోగానంద స్వామి హస్తములోని ఉద్దేశ్యమును, హస్తములో

ఏడు భాగములున్న విషయమును ఎప్పుడూ చెప్పలేదే అనుకొన్న రాఘవ

ఈ విధముగా అడిగాడు.)


రాఘవ :- స్వామీ! ఇంతకు ముందు హస్తములో మూడు ఆత్మల వివరమును

సంపూర్ణముగా చెప్పిన మీరు మోక్షమును చేరి తిరిగి పుట్టని విధానము

హస్తములో సూచించబడి ఉన్నదనీ, అందువలననే రేఖల మధ్యన ఏడు

భాగములుగా హస్తములో కనిపిస్తున్నవనీ, హస్తమును చూచుకొన్న వానికి

ఈ భాగములను దాటిపో! అను సందేశము తెలుస్తున్నదనీ ఎప్పుడూ

చెప్పలేదు.


రాజయోగానంద :- అప్పుడు ఈ విషయము నాకు తెలిసివుంటే నేనెందుకు

చెప్పను? ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడే చెప్పాను. నా మాట నీకు

అర్థముకాలేదు కదా! అయితే బాగా అర్థమయ్యేటట్లు వినండి. చెప్పినట్లు


కనపించేది నేను. చెప్పినట్లు ఎవరికీ తెలియకుండా ఉండువాడు మరొకడు.

నాకు తెలిసింది నేను మీకు చెప్పాను, తెలియంది నాకు ఆయన చెప్పాడు.

విన్నవారు మీరు, చెప్పిన వానిని నేను. నాకు చెప్పినవాడు మీకు తెలియ

కుండా ఉన్నాడు. నాకు తెలిసిన తర్వాత మీకు చెప్పిన నేను గొప్పనా?

తెలియకముందు నాకు చెప్పిన ఆయన గొప్పవాడా మీరే చెప్పండి. భూమి

మీద ఎవరికీ తెలియకముందు చెప్పినవాడు గొప్పగానీ, తెలిసిన తర్వాత

చెప్పువాడు గొప్పవాడు కాదు. ప్రపంచములో ఎవరికీ తెలియకముందు

చెప్పినవాడే గురువు. తెలిసిన తర్వాత చెప్పు నాలాంటివాడు గురువు

కాదు కేవలము బోధకుడు మాత్రమే అగును. అందువలననే కాలజ్ఞానమును

చెప్పిన బ్రహ్మముగారు మనకు గొప్పగా కనిపించినా ఆయన మాత్రము

తన కాలజ్ఞానములో నాకు మీకు గురువు ఒకడున్నాడని చెప్పాడు.


రాఘవ :- జగతిలో గురువు చెప్పిన జ్ఞానమునే బోధకులు చెప్పినపుడు,

ఆ బోధకులు చెప్పిన జ్ఞానమును ఇంకొక బోధకులు చెప్పినపుడు, భూమిమీద

బోధకుల పరంపర గుచున్నదని అర్థమగుచున్నది. అలాంటపుడు భూమి

మీద ఉన్నది బోధకుల పరంపరేగానీ, గురుపరంపర లేనట్లే కదా!

రాజయోగానంద :- లేదనే కదా నేను చెప్పుచున్నది. గతములో నాకు

హస్తములోని భాగముల జ్ఞానమే తెలియదు. ఇప్పుడు తెలిసింది. కాబట్టి

చెప్పాను. నాకు తెలిసిన దానిని చెప్పే బోధకున్ని మాత్రమే, నేను గురువును

కాను. ఎవరికీ ఇంతవరకు తెలియని జ్ఞానమును తెల్పినవాడే నిజమైన

గురువు.


రాఘవ :- అటువంటి నిజ గురువును మేము చూడవచ్చా, చూడలేమా?

రాజయోగానంద :- ఆయనను చూడవచ్చును. ఆయన భూమిమీదికి


వచ్చినపుడు కనిపిస్తూనే జ్ఞానమును తెలియజేయును కదా! భూమిమీద

లేనప్పుడు ఎవరూ చూడలేరు. ఆయన కనిపించి చెప్పగలడు, కనిపించకా

చెప్పగలడు.


రాఘవ :- మీరు గురువును చూచారా?


రాజయోగానంద :- చూచాను. నేను చూచినట్లు చెప్పినా మీరు నమ్మరు.

రాఘవ :- మీరు గురువును చూచినప్పుడు ఎప్పుడైనా నమస్కరించారా?

రాజయోగానంద :- రాఘవా నీవు సత్యాన్వేషివి అను పేరును నిలబెట్టు

కొనుటకు క్రైమ్ ప్రశ్నలు అడిగినట్లు అడుగుచున్నావు. నేను కూడా నేరస్థుడు

చెప్పినట్లే చెప్పుతాను. ఈ విధముగా అడిగినందుకు నాకు సంతోషము.

అయితే చెప్పెదను విను. గురువును నేను చూచినప్పుడు ఎప్పుడూ

నమస్కరించలేదు.


రాఘవ :-గురువును చూచినప్పుడు ఎవరైనా నమస్కరిస్తారు కదా!

మీరెందుకు నమస్కంచలేదు?

రాజయోగానంద :- నేను ఆయనకు శిష్యుడను కాదు కదా!

రాఘవ :- మీరు ఆయన ద్వారా జ్ఞానమును తెలుసుకొని ఆయనను

గురువు అని అన్నపుడు మీరు ఆయనకు శిష్యులే కదా!

రాజయోగానంద :- (ఒక్క మారుగా నవ్వి) భూమిమీద మనుషులకు గురువు

ఉండవచ్చును. కానీ గురువుకు శిష్యులుండరు. ఎందుకనగా ఇతను గురువు

అని ఎవరూ నిరూపించలేరు.

రాఘవ :- నేను ఇలా అడుగుచున్నందుకు క్షమించండి స్వామీ! నేను

వినయముగా అడుగు ప్రశ్న ఏమనగా! మీరు ఇంతకు ముందే ఒకమాట


చెప్పారు. నాకు ఇంతవరకు తెలియని జ్ఞానము ఇప్పుడు తెలిసింది.

అందువలన మీకు చెప్పుచున్నాను అన్నారు. మీ గురువు మీకు కనిపించి

చెప్పాడా? కనిపించకుండా చెప్పాడా?

రాజయోగానంద :- కనిపించి చెప్పివుంటే అతనిని మీకు కూడా

చూపేవాడిని, కనిపించకుండా చెప్పాడు కాబట్టి మీకు ఈయనే గురువని

చెప్పలేను.

రాఘవ :- గురువు ప్రస్తుత కాలములో భూమిమీద ఉన్నాడా? భూమి

మీద లేడా?

రాజయోగానంద :- గురువు కొంతకాలము భూమిమీద ఉంటాడు, కొంత

కాలము భూమిమీద ఉండడను మాట వాస్తవమే. అయినా ప్రస్తుతము

భూమిమీదనే ఉన్నాడు.

రాఘవ :- మరొక్క మాట అడుగుదునా? వద్దా?

రాజయోగానంద :- ఒక్కమాట కాదు వేయి మాటలు అడిగినా సమాధానము

చెప్పగలను. భయము లేకుండా, సంశయించక అడుగువాడే తొందరగా

జ్ఞాని కాగలడు. ప్రశ్నించనివాడు జ్ఞాని అగుటకు చాలాకాలము పట్టును.

అందువలన నీవు అడుగు.

రాఘవ :- ప్రస్తుతము భూమిమీద కనిపిస్తూ ఇక్కడేవున్న ఈ మహర్షిగారినే

మీ గురువుగా మేము గుర్తించగలుగుచున్నాము. మీరు కాదనగలరా?


(అక్కడేనున్న మహర్షి ఆ మాటకు నవ్వుకొన్నాడు.)

రాజయోగానంద :- నేను కొద్దిసేపు ముందే చెప్పాను. నాకు ఇప్పుడే

జ్ఞానము తెలిసింది అని అన్నాను. వెంటనే మీకు చెప్పుచున్నాను అని


కూడా అన్నాను. నా గురువు నా శరీరములోపల తెలియజేసిన జ్ఞానమునే

చెప్పాను. బయట విని చెప్పలేదు కదా! నాకు ఇప్పుడే తెలిసిన జ్ఞానము

ఇక్కడున్న ఈయన నాకు ఏమాత్రము చెప్పలేదు కదా! అలా చెప్పివుంటే

వెంటనే ఈయన ఎవరికీ తెలియని విషయమును చెప్పాడు కాబట్టి ఇతనే

నా గురువని మీకు అప్పుడే చెప్పేవాడిని కదా!


(రాఘవ ఎంత తెలివిగా సత్యశోధన చేయాలనుకొన్నా రాజయోగా

నంద స్వామి జవాబులు సత్యశోధనకు అందకుండా సత్యము తెలియకుండా

చేయుచున్నవి. చివరకు రాఘవ వద్ద ప్రశ్నలు లేకుండా పోయాయి. చివరికి

ఒకే ఒక ప్రశ్న అడిగాడు.)


రాఘవ :- స్వామీ మేము గురువును ఎలా తెలియగలము.


రాజయోగానంద :- అలా అడిగావు మంచిది. సంపూర్ణ జ్ఞానము తెలిసి

కర్మను లేకుండా చేసుకొన్ననాడు గురువును గుర్తించగలవు. అంతవరకు

దేవుడు అంటే దేవులాడబడేవాడన్నట్లు, గురువు అంటే గుర్తింపబడనివాడని

అనవచ్చును.




(అంతటితో రాఘవ తన ప్రశ్నలను ఆపివేశాడు. ప్రక్కనే ఈశ్వర్

ఆరోగ్యము బాగలేకుండడమును చూచిన రాజయోగానంద స్వామి

జమీందారు వైపు చూచి మహర్షికి తమ బాధను చెప్పుకోమన్నట్లు సైగ

చేశాడు. అప్పుడు జమీందారు రావుబహదూర్ అక్కడేనున్న మహర్షి పాదాల

మీద పడి తన కుమారున్ని గురించి చెప్పను మొదలుపెట్టాడు.)

జమీందారు :- స్వామీ! ఇతను నాకు కన్న కొడుకు కాకున్నా, పెంచుకొన్న

కొడుకు అయినా మేము ఇతని పరిస్థితి చూచి తట్టుకోలేక పోవుచున్నాము.

ఈ తెల్లవారుజామునుండి అపస్మారక స్థితిలో ఉండిపోయాడు. ఇంతకు


ముందు మమ్ములను ఎందరో మోసపుచ్చారు. అన్ని సమయములలో

రాజయోగానంద స్వామియే మమ్ములను కాపాడాడు. ఈ అబ్బాయి ఈశ్వర్

అష్టగ్రహకూటమి రోజున పుట్టుట వలన ఇతని వలన ఏదో సాధించాలని

చాలామంది చాలా ప్రయత్నములు చేసినా మాకు కష్టము రాకుండా

రాజయోగానందస్వామి చేశాడు. ఇంతవరకు ఇట్లు అనారోగ్యముగా

ఎప్పుడూ పడిపోలేదు. ఇలా ఉండడము వలన నాకు చాలా భయముగా

ఉంది. రాజయోగానంద స్వామి, ఈశ్వర్ విషయములో ఏమీ చేయలేను

ఇతనికి మరణము కూడ సంభవించవచ్చును అని తెలిపాడు. ఇప్పుడు

మాకు మీరే దిక్కు.


మహర్షి :- మీకు రాజయోగానంద స్వామి చెప్పినది వాస్తవమే. ఇతనికి

పదహారవ సంవత్సరము పూర్తి జరుగులోపల మరణించు ప్రమాదము

కలదు. దానిని ఎవరూ తప్పించలేరు.


జమీందారు :- మీరు సమస్తము తెలిసినవారు మీరు ఇతనిని కాపాడి

మమ్ములను ఉద్ధరించమని కోరుచున్నాము.


మహర్షి :- మీ ఈశ్వర్ను కాపాడుటకు రాజయోగానంద స్వామియే

సమర్థుడు. ఆయననే అడగండి.


రాజయోగానంద :- మహాత్మా నిజము చెప్పాలంటే మీ ముందర మేము

సూర్యుని ప్రకాశము ముందర మిణుగురు పురుగులాంటి వారము. అతని

కర్మను మార్చువారు భూమిమీద మీరు తప్ప ఎవరూ లేరు. అతని మరణము

జాతకములోనే నిర్ణయింపబడి ఉన్నది. నిర్ణయింపబడిన కర్మను మార్చుటకు

నాలాంటి వారు వేయిమంది గుమికూడినా కాని పనియే. ఇతని నుదుటి

వ్రాతను తుడిపి తిరుగు వ్రాతను వ్రాయగల శక్తి మీకు ఒక్కరికే గలదు.

ఏమి చేసినా మీరే చేయాలి.


(ఆ మాటలువిన్న రాఘవకు శ్రీ మహర్షియే గురువై ఉండవచ్చు

నేమో అన్న అనుమానము వచ్చింది. ఎందుకనగా నుదుటి వ్రాతను తుడిచి

వేసి క్రొత్త వ్రాత వ్రాయగల స్థోమత ఒక్కగురువుకే ఉండునని స్వయాన

రాజయోగానంద స్వామియే ఒకప్పుడు చెప్పగా విన్నాడు. అందువలన ఆ

మహర్షిని గురువు అని అనుకోవడానికి ఆధారము దొరికినట్లయినది.

అప్పుడు మహర్షి ఇలా అన్నాడు. )


మహర్షి :- జమీందారుగారూ! రాజయోగానందస్వామి నా మీద గౌరవ

భావముతో అలా అంటున్నాడు. ఆయనకంటే అన్ని రంగములలో ఎన్నో

రెట్లు చిన్నవాడిని, ఆయనతో కాని పని నాచేత అవుతుందనడము హాస్యాస్పద

మౌతుంది. నాకు తెలిసిన ఉపాయమును ఒక దానిని చెప్పగలను. దాని

ప్రకారము ప్రయత్నము చేసి చూడండి.


రాజయోగానంద :- అన్ని రంగాలలో అనకూడదు కానీ కొన్ని రంగములలో

ఆయనకంటే నేను గొప్పవాడినే అయితే ఏమి ప్రయోజనము? ఆయన

దేనిలో గొప్పవాడో దానిలో నేను చాలాచిన్నవాడిని. అందువలన ఆయన

చెప్పు ఉపాయమునే శ్రద్ధగా విని అనుసరించు.


జమీందారు :- మీరు ఎలా చెప్పితే అలా నేను చేయగలను. నేను ఏమి

చేయాలో చెప్పండి స్వామి.


మహర్షి :- నీవు ఈ అబ్బాయిని ఇంటికి తీసుకొనిపో. తర్వాత ఆలోచిస్తాను.

(ఆ మాట విన్న జమీందారుకు మహర్షి మాట సందిగ్ధములో

పడ వేసింది. ఈశ్వర్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అటువంటి వానికి

తోచిన వైద్యమును చేసి అపస్మాకర స్థితి నుండి బయటపడునట్లు

చేయకుండా ఇంటికి తీసుకపొమ్మనడము రుచించలేదు. చేయునది లేక

ఈశ్వర్ మీద అక్కడున్న వారు శ్రద్ధను చూపడము లేదని అనుకొన్న


జమీందారు ఈశ్వర్ను ఇంటికి తీసుపోయే ప్రయత్నములో ఉండెను.

అంతలో దురదృష్టవశాత్తు ఈశ్వర్ శరీరములో శ్వాస నిలిచిపోయింది.

అతని శరీరములో కదలిక శక్తి ఆగిపోయింది. దానిని గమనించిన

జమీందారు రావుబహదూర్ భోరున విలపించాడు. ఈశ్వర్ ఇకలేడనీ,

ఎవరి సహాయముతో పని లేకుండా పోయాడనీ, ఎంతగానో తాను బ్రతిమ

లాడినప్పటికీ ఏమాత్రము పట్టించుకోకుండా తమ విషయములు మాట్లాడు

కొనుచు కాలమును వృథా చేసి ఇంటికి తీసుకొని పో, తర్వాత ఆలోచిస్తా

మనడము తనకు నచ్చలేదనీ, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమి చేస్తారని

జమీందారు నిలదీసి అడిగాడు. అప్పుడు రాజయోగానందస్వామి

జమీందారుతో ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- రావుబహదూర్ గారు. నేను కొద్ది నిమిషముల

ముందరే చెప్పాను. ఇతని జాతకములో కర్మనిర్ణయము ప్రకారము మరణము

తప్పదని చెప్పడము మీరు వినలేదా! ఆ కర్మను మార్చుటకు నాలాంటి

వారు వేయి మంది ప్రయత్నించినా జరగని పని అనికూడా చెప్పాను. ఈ

మహర్షియే ఏమి చేసినా చేయగలడనీ, ఆయన చెప్పినట్లు వినమని చెప్పాను.

నీవు మీరు ఎలా చెప్పితే అలా చేస్తానని చెప్పావు. మహర్షి నీకు ఈశ్వర్ను

ఇంటికి తీసుకొనిపో. తర్వాత ఆలోచిస్తానన్నాడు. ఆ మాట విన్న వెంటనే

అంతవరకు నీకు మా మీద నీకున్న విశ్వాసము లేకుండా పోయింది.

మేము నీ విషయములో శ్రద్ధ తీసుకోలేదనీ, అశ్రద్ధగా మాట్లాడుచున్నామని

అనుకొన్నావు. నీవు మా మీద విశ్వాసము లేకుండా మనస్సులో అలా

అనుకోవడము వలననే ఇప్పుడిలా నీ కొడుకు ఈశ్వర్ మరణించడము

జరిగింది. ఇప్పటికైనా నీ తప్పును నీవు తెలుసుకోక చనిపోయిన తర్వాత

ఏమి చేస్తారని గౌరవము లేకుండా ప్రశ్నించుచున్నావు. మీలాంటి


అజ్ఞానులకు మంచి చేయాలనుకోవడమే పొరపాటని మేము అనుకొనునట్లు

చేశావు. నేను నిన్ను ఒక ప్రశ్నను అడుగుతాను జవాబు చెప్పగలవా?

ఈశ్వర్ మీద మాకున్న శ్రద్ద నీకు కలదా? ఈశ్వర్ విషయములో నీవు

చేయలేని పనులను ఎన్నో చేశాము. మా జోక్యము లేకపోతే నీ కొడుకు

ఎప్పుడో చనిపోయేవాడు. ఆ రోజు మాంత్రికులు ఈశ్వర్కు నీ చేతనే

బొట్టును పెట్టించగా, నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోగా

ఊరంతా కరెంటు పోకున్నా, చివరకు మీ ఇంటిలో కరెంటు ఉండినా

ఒక్క ఈశ్వర్ రూములోనే కరెంటు లేకుండా పోవడమునకు కారణము

ఎవరో తెలుసా? ఇపుడు ఇక్కడున్న ఈ మహర్షియే కారణము. నిన్ను నీ

కుటుంబమును వెంటాడుచున్న తపస్విబాబాను, మునెప్పను భూమిమీద

లేకుండా చేసినది ఎవరో తెలుసా? దానికి కారణము ఈయనే. ఇలా

నీకు తెలియని ఎన్నో జరుగుటకు, చివరకు ఈ దక్షిణ దేశములో ఉన్న

మనుషు లందరూ ఈ రోజు జరుగు వైపరీత్యమునకు చనిపోకుండా

మిగిలివుండుటకు ఈయనే కారణము. ఈ దినము మాకు కూడా చావు

తప్పదని ఎంతో భయపడిపోయాము. చివరకు మమ్ములను ప్రాణాలతో

నిలిపిన వ్యక్తి ఈయన. మనందరి శ్రేయస్సు కోసము భూమిమీదలేని

వ్యక్తి భూమీమీదకు వచ్చాడు. భూమిమీద కనిపించనివాడు మన ఎదురుగా

కనిపిస్తే, ఆయనను హేళన భావముతో మాట్లాడడము నీ తెలివి

తక్కువతనము మరియు నీ అజ్ఞానము. ఇప్పటికైనా మించి పోయిందిలేదు.

ఆయనకు నమస్కరించి క్షమాపణ చెప్పుకో!


జమీందారు :- స్వామీ నేను పూర్తి అజ్ఞానినే. తెలియని ఆవేశములో

కొడుకు చనిపోయాడను బాధతో అలా మాట్లాడాను. నా పరిస్థితి అర్థము


చేసుకొని నన్ను మీరు క్షమించండి. నన్ను మీ కోపమునకు గురి కాకుండా

చూడండి.


మహర్షి :- నీవు మాట్లాడినందుకు మాకు ఏమీ కోపములేదు. ఎందుకనగా

నీ స్థానములో ఎవరున్నా అలాగే మాట్లాడగలరు. మీరు ఎట్లు చెప్పితే

అట్లు చేస్తానని చెప్పిన వానివి. నేను చెప్పినట్లు చేయకుండా నీవు

మాట్లాడడము నిజముగా నీ పొరపాటే కదా! అంతకూ నేను చెప్పినట్లు

వింటానని ఎంతో భక్తిగా చెప్పావు కదా! తర్వాత నేను చెప్పినట్లు ఎందుకు

చేయలేకపోయావు?


జమీందారు :- స్వామీ! మీరు ఎలా చెప్పితే అలా చేస్తాను. ఇప్పుడు నేను 

ఏమి చేయాలి?



మహర్షి :- అయితే నీవు వెంటనే ఈశ్వరన్ను తీసుకొని పోయి, ఇతని

మరణవార్తను అందరికి తెలియజేసి, తర్వాత నీవు చేయవలసిన కార్యములు

చేసుకో. ఇప్పుడు దాదాపు ఎనిమిది గంటలవుచున్నది. ఇక్కడినుండి

నీవు ఇంటికి పోవుటకు అర్థగంటకంటే ఎక్కువ సమయమగును. ఎటు

తిరిగి ఇంటికి తొమ్మిది గంటలకు పోగలవు. ఈ రోజు సంధ్యవేళ

రాకముందే సాయంకాలము ఐదు గంటలకే ఇతనిని స్మశానానికి తీసుకొని

పోండి...


(జమీందారు పైకి భక్తిగా మాట్లాడినా, లోపల మాత్రము మీరు

చెప్పినా చెప్పకున్నా మేము చేసేది ఆ పనేలే అనుకొని, అక్కడినుండి

ఈశ్వర్ను తన కారులో తీసుకొని పోయెను. ఇదంతా ప్రక్కనుండి

గమనిస్తున్న రాఘవకు ఏమీ అర్థముకాలేదు. కొన్ని రంగములలో మహర్షి

కంటే తానే పెద్దనని చెప్పుచున్న రాజయోగానంద స్వామి, చివరకు తమను

చావకుండా రక్షించినవాడు ఈయనే అని మహర్షిని గురించి జమీందారుకు



చాలా గొప్పగా చెప్పాడు. అంతేకాక జమీందారు ఇంటిలో ఈశ్వర్ గదిలో

కరెంటు పోయిన విషయమును చెప్పుచూ, దానికి కారణము మహర్షియేనని

గొప్పగా చెప్పాడు. చివరకు జమీందారును ఏడిపించి, మేము చెప్పినట్లు

వినక పోవడము నీదే తప్పు అని చెప్పిపంపారు. ఈశ్వర్ చనిపోయినా

ఏమీ పట్టనట్లు మామాట వినడమే నీ కర్తవ్యము. సాయంకాలము ఐదు

గంటల లోపే స్మశానానికి తీసుకు పొమ్మన్నాడు. ఇందులో వీరి మాట

వినడమేముంది? ఆయన చేసేది అదేకదా! రాజయోగానందస్వామి

జ్ఞానములో ఎంతో ఉన్నతమైనవారు, గుహలోని మహర్షి సర్వము తెలిసిన

మహాత్ముడు. ఇంత గొప్పవారు జమీందారును అలా పంపడము చూచేదానికి

కొంత విడ్డూరముగా కనిపించినా, ఇందులో నాకు అర్థముకాని ఏదో

తతంగము ఉంటుంది. పైకి కనిపించునది మానవున్ని వక్రమార్గము

పట్టిస్తుందని రాజయోగానంద స్వామి చెప్పగా విన్నాను. కాబట్టి కనిపించు

దానిని వదలి కనిపించనిది ఏమైనా ఉందేమో వేచి చూస్తామని రాఘవ

అనుకొన్నాడు.


జమీందారు రావుబహదూర్ ఈశ్వర్ శరీరమును చెన్నపట్నముకు

తీసుకొని వచ్చి, ఈశ్వర్ చనిపోయిన వార్తను తన బంధువులకూ, మిత్రులకూ

తెలిపాడు. ఈశ్వర్ మరణవార్త చెన్నపట్నము ప్రజలందరికి తెలిసింది.

ఊరి ప్రజలలో ఉన్నతమైన గౌరవమును, అపారమైన ప్రేమను సంపాదించు

కొన్న ఈశ్వర్ చనిపోయాడన్న వార్తను చెన్నపట్నము యొక్క ప్రజలు జీర్ణించు

కోలేకపోయారు. రావుబహదూర్ ఇంటి దగ్గరకు వేలాది ప్రజలు వచ్చారు.

ఈశ్వర్ విషయమును విన్న వెంటనే ఎవరికీ ఆకలి కూడా కాకుండా

పోయింది. కొన్ని వేలమంది ప్రజలు జమీందారు ఇంటి ముందరకు

రావడముతో అక్కడ తొక్కిసలాట జరుగకుండా పోలీసు బందోబస్తు కూడా


చేయబడింది. అక్కడికి వచ్చినవారు యువకుడైన ఈశ్వర్ చనిపోవడము

వలన దిగులుతో వారివారి ఇంటికి పోకుండా అందరూ జమీందారు

ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఈశ్వర్ను గురించి అతని గొప్పతనము

గురించి మాట్లాడని వారేలేరు. అటువంటి యువకుడైన ఈశ్వర్

చనిపోయినందుకు దేవునివద్ద న్యాయములేదనీ, మంచివారిని తొందరగా

తీసుకపోతాడనీ, దేవున్ని నిందించడము మొదలు పెట్టారు. అంతలో

సాయంకాలము నాలుగు గంటలైనది. ఈశ్వర్ను భారీ ఊరేగింపుతో

స్మశానానికి తీసుకొని పోవుటకు మేళతాలాలు కూడా వచ్చాయి.


సాయంకాలము నాలుగున్నర గంటలకు రాజయోగానంద స్వామి,

భూగర్భమునుండి బయటికి వచ్చిన మహర్షి, రాఘవ, రాఘవ భార్యలు

మిగతా ఆశ్రమవాసులు అందరూ జమీందారు ఇంటివద్దకు వచ్చారు.

స్వామి, మహర్షి తమ ఇంటివద్దకు రావడము జమీందారుకు ఊహించని

విషయమైనది. అలా వారు రావడముతో అంతవరకు బాధగానున్న రావుబహ

దూరు తెలియని సంతోషమైనది. స్వామిని, మహర్షిని ఆహ్వానించి వారు

కూర్చొనుటకు కొంత ఎత్తయిన ప్రాంతములో ఏర్పాటు చేశారు. అప్పుడు

అక్కడున్న ప్రజలను చూచి రాజయోగానంద స్వామి ఏదో చెప్పుటకు

ప్రయత్నించగా, వెంటనే ఆయన మాట్లాడుటకు మైకును ఏర్పాటు చేశారు.

అప్పుడు మైకులో రాజయోగానంద స్వామి ఇలా చెప్పాడు. అప్పుడు

అక్కడ గుమికూడిన కొన్ని వేలమంది ప్రజలు స్వామి ఏమి చెప్పునో అని

శ్రద్ధగా వినవలెనని తమకు తాముగా నిశ్శబ్దముగా ఉండిపోయారు.)

రాజయోగానంద :- ఈశ్వర్కు జరిగిన ఘటన చాలా ముఖ్యమైనది.

అందువలన అతనిని గురించి చెప్పు విషయము ఇంకా ముఖ్యమైనది.

కాబట్టి మీరందరూ మా మాటలను జాగ్రత్తగా వినవలెనని కోరుచున్నాను.


ఇక్కడికి ఎన్నో వేలమంది ఈశ్వర్ మరణవార్త విని వచ్చారు. ఇంతమందిని

చూచిన తర్వాత ప్రజల హృదయాలలో ఈశ్వర్ ఎంతగా ఉండిపోయాడో

మాకు బాగా అర్థమగుచున్నది. ఇంతగా ఈశ్వర్ను ప్రేమించు మీకు

ఈశ్వర్ యొక్క పూర్తి చరిత్ర తెలిసివుండకపోవచ్చు. అటువంటి మీ అందరికి

చెప్పునదేమనగా! ఈశ్వర్ పుట్టుక చాలా ప్రత్యేకమైనది. అతను ఇప్పటికి

పదహారు సంవత్సరముల క్రితము జరిగిన అష్టగ్రహ కూటమి సమయమున

పుట్టిన తొలిబిడ్డ. అలా ఆ సమయములో మొదట పుట్టడము వలన

అతనిలో కొన్ని ప్రత్యేకతలు ఏర్పడినాయి. అతనికున్న ప్రత్యేకశక్తుల వలన

కొందరు రోగములనుండి బయటపడినారనీ, కొందరిలో దయ్యములు

పారి పోయాయనీ, కొందరికి కొన్ని విపత్తులు తొలగిపోయాయనీ విన్నాము.

అన్నిటికంటే ముఖ్యము. అతని జీవితములో పదహారవ సంవత్సరము.

పదహారవ సంవత్సరము మొదలైనప్పటినుండి ఈశ్వర్కు కొన్ని కష్టాలు

ఎదురైనాయి. అతనికి పదహారవ సంవత్సరములో ప్రతి అమావాస్యకు

ఒక భయంకరమైన లోక వినాశకర శక్తి అతనిలో చేరిపోవుచుండును. ఆ

విధముగా ఆరు నెలలలో ఆరు అమావాస్యల దినములలో భయంకరమైన

శక్తులు ఆరు చేరిపోయినవి. ఆ విధముగా అతనిలో చేరిపోవునని ఈశ్వర్

జాతకములోనే ఉన్నదనీ, అతని పుట్టుకే అటువంటిదనీ, ఈ లోకములో

ముగ్గురు వ్యక్తులకే తెలుసు. ఆ ముగ్గురిలో నేను ఒక్కడిని, రెండవవారు

నా ప్రక్కన ఉన్న మహర్షి, మూడవ వ్యక్తి తపస్విబాబాగారు.


తపస్విబాబాగారు ఎంతో ధనికుడు, కొన్ని వేలకోట్ల రూపాయలు

అతనివద్దకలవు. అయినా అతనిలోని ఆశ అను గుణము వలన ఇంకా

ఏదో కావాలని, దేశమునకే అధిపతిని కావాలని అనుకొన్నాడు. అలా


దేశమునకే అధిపతి అగుటకు, దేశములోని ఆస్తులు, ధనము, బంగారు

అన్నీ తనకు కావాలనుకొన్నాడు. అలా అన్నీ అతనికి కావాలంటే దేశములో

మనుషులందరూ లేకుండా పోవాలి. దేశములో అందరూ ఒక్కమారు

చనిపోతే అందరి ఆస్తులు అతనికే వచ్చునని అతని ఊహ. అలా అందరినీ

చంపుటకు ఈశ్వర్లోని శక్తుల చేతనవుతుందని బాబాగారికి తెలుసు.

అందువలన అమవాస్య రోజులలో చేరు శక్తులను తన వశము చేసుకోవాలని

అనుకొన్నాడు. దానికొరకు ప్రతి అమావాస్య రోజున ఈశ్వర్ను అనారోగ్యము

పాలు చేసి శక్తులను తన వశము చేసుకోవాలని తీవ్రముగా ప్రయత్నము

చేశాడు. నాకు ఆయన ప్రయత్నములన్నీ ఎప్పటి కప్పుడు తెలిసిపోయేవి.

అందువలన అతని ప్రయత్నమును ప్రతి నెల నెరవేరకుండునట్లు చేసేడి

వాడిని. అతని ప్రతి పని తెలిసి అడ్డుకుంటున్నానని అతనికి తెలియదు.

చివరి ఆరవ అమావాస్య రోజున తపస్విబాబా చాలా తెలివిని ఉపయోగించి

మమ్ములనూ, జమీందారు రావుబహదూరూ మభ్యపరచి, మా మీద మత్తు

మందును సాంబ్రాణిపొగగా వహీద్ ప్రయోగించి మమ్ములను నిద్రమత్తు

లోనికి పంపి, ఆరవ అమావాస్య దినమున ఈశ్వర్ లోనికి వచ్చిన శక్తిని

వశపరచుకొని పోయాడు. ఆ ఒక్క శక్తిని ఈ దినము పున్నమి రోజు

ఉపయోగించి దక్షిణదేశములోని ఆరు రాష్ట్రములను అతలాకుతలము చేసి

జీవరాసులనన్నిటినీ చనిపోవునట్లు చేయాలనుకొన్నాడు. వంద సుడి

మేఘములను సృష్ఠించి వాటిద్వారా దక్షిణ దేశములో ప్రళయమును

సృష్టించాలనుకొన్నాడు. అంతపెద్ద మారణ హెూమము జరుగుతుందని

నిన్నటి రోజు సాయంత్రము వరకు మాకు కూడా తెలియదు. వచ్చే

అమావాస్యకు తను వశపరుచుకొన్నశక్తిని ఉపయోగిస్తాడని అనుకున్నాము


కానీ ముందే పౌర్ణమి రోజే అలా చేస్తాడని మేము కూడా ఊహించలేదు.

అమావాస్యకైతే కొంత వ్యవధి ఉండుట వలన ఆ మారణ హెూమమును

గురించి కొందరికైనా తెలియజేసి, మేము మా ప్రాణములను రక్షించుకొను

టకు ఉత్తర దేశమునకు పోవాలని అనుకొనివుంటిమి. కానీ ఉన్నట్లుండి

తెల్లవారితే పౌర్ణమి అని, పౌర్ణమికే ఆ శక్తిని ప్రయోగిస్తున్నాడని తెలిసి

మేము అప్పుడు ఎక్కడకూ పోలేమని అనుకొన్నాము. వచ్చే ఆపద తెలియని

మీరూ, వచ్చే ఆపద తెలిసినా ఎటూ పోలేని మేమూ, ఈ దినము తప్పక

చనిపోతామని భయపడిపోయాము. మా ప్రాణములను రక్షించుకొను

ఉపాయమే మాకు తెలియకుండా పోయింది. చివరకు దేవుడే దిక్కని

అనుకొన్నాము. అప్పుడు మేము ఊహించని పరిణామము జరిగింది.

దేవుడు మా ప్రార్థన ఆలకించాడు అన్నట్లు ఈ దినము ఉదయము ఐదు

గంటలకు తపస్విబాబా చనిపోయినట్లు వార్త తెలిసి సంతోషపడిపోయాము.

బాబా ఈ దినము ఉదయమే చనిపోకపోయివుంటే, ఈ వేళకు మనమంతా

చనిపోయి ఉండేవారము. ఈ పాటికి ఇల్లువాకిళ్ళు అందరివీ నేలమట్టమై

ఉండేవి. ఎంతో పెద్ద ప్రభయము సంభవించేది. అదంతా జరుగకుండా

పోవుటకు కారణము ఒకే ఒకవ్యక్తి కలడు. మమ్ములను, మిమ్ములను

రక్షించిన ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తపస్వి బాబా తెల్లవారు

జామున ఐదుగంటలకే పాముకాటుతో చనిపోయాడు. ఆ పాము కూడ

ఇక్కడే మావద్దేవుంది. తపస్విబాబా ప్రేరేపించిన శక్తిని సమయానికి వచ్చి

ఆపి, దానిని లేకుండా చేసి బాబాను చనిపోవునట్లు చేసిన వ్యక్తి ఎవరో

కాదు, ఇక్కడ మా ప్రక్కనే సర్వసాధారణముగా కనిపిస్తున్న ఈ మహర్షియే!

ఈ రోజు ఈయనే మనందరికి ప్రాణదాత!


ముఖ్యమైన విషయమేమనగా! ఈశ్వర్ శరీరములో ఆరవ

అమావాస్య దినమున ప్రవేశించిన శక్తిని బాబా వశము చేసుకొని పోగా,

ఆ శక్తిని, తపస్విబాబాను ఒకేమారు లేకుండా చేయడము వలన దాని

ప్రభావము ఈశ్వర్ మీద పడినది. తనలోని శక్తి మరియు బాబా చనిపోయిన

వెంటనే ఈశ్వర్ అపస్మారక స్థితిలోనికి పోయాడు. ఈశ్వర్ పుట్టుక

విషయము తెలిసిన మేము, అతని మరణ విషయమును కూడా ముందే

తెలిసి ఈశ్వర్ పదహారవ సంవత్సరమే చనిపోవునని ముందే తెలిసివుంటిమి.

అదే విషయమే కొన్ని నెలలముందు జమీందారు రావుబహదూర్ గారికి

కూడా చెప్పడమైనది. మేము అనుకొన్నట్లే ఈ దినము ఉదయము ఈశ్వర్

చనిపోవడము జరిగినది. ఈశ్వర్ చనిపోవడము నాకు చాలా బాధను

కల్గించింది. నాకే కాదు మీకు కూడా బాధకల్గినదని తెలియుచున్నది. ఒక

ముఖ్యమైన విషయమేమనగా! ఈ రోజు అందరము చనిపోవలసిన వారమే.

అయినా ఆ గండమును తప్పించి ఈ మహాత్ముడు మనలను కాపాడాడు.

అంత గొప్ప వ్యక్తి, ఎప్పుడూ భూమి మీద కనిపించని వ్యక్తి, ఈశ్వర్

చనిపోయినప్పుడు అక్కడే ఉండగా నేనే స్వయముగా జమీందారుకు చెప్పి

ఈశ్వరు కాపాడమని మహర్షిని వేడుకొమ్మన్నాను. నా మాట ప్రకారము

జమీందారు ఈ మహర్షిని, ఈశ్వరన్ను కాపాడమని ఈశ్వర్కు ప్రాణము

పోకనే అడిగాడు. అప్పుడు మహర్షిగారు “నేను చెప్పినట్లు విను” అన్నాడు.

“అలాగే వింటాను” అని జమీందారు చెప్పాడు. ఆ నిమిషమే ఈశ్వర్

ప్రాణము పోయింది. దానిని చూచిన రావుబహదూర్ చాలా బాధపడి

పోయాడు. తిరిగి నేను చెప్పడముతో మహర్షిని నేనేమి చేయాలని అడిగాడు.

అప్పుడు ఈ మహర్షిగారు ఈశ్వర్ను ఇంటికి తీసుకొనిపోయి నీ ఏర్పాట్లు

నీవు చేసుకొని ఐదుగంటలకు స్మశానానికి తీసుకపొమ్మన్నాడు. ఆ మాటతో


అక్కడున్న మా అందరికి చెప్పుకోలేని బాధకల్గినది. జమీందారు ఈశ్వర్ను

ఇక్కడికి తెచ్చాడు. ఈశ్వర్ మరణవార్త మీ అందరికి తెలిసి మీరందరూ

కూడా బాధపడిపోయారు.


జమీందారు రావుబహదూర్ రోదిస్తూ ఈశ్వర్ను తన కారులో

తెచ్చుకొన్న తర్వాత ఈ మహర్షిగారిని ఎంతగానో ప్రార్థించాను. దక్షిణ

దేశమును మొత్తము ప్రాణాహాని నుండి తప్పించిన మీరు, ఈశ్వర్ బ్రతికి

ఉండగా అతనిని ఎందుకు కాపాడలేకపోయారని అడిగాను. ఈశ్వర్కు

ప్రాణమున్నపుడే జమీందారు మిమ్ములను ప్రార్థించి ఈశ్వర్ను కాపాడ

మని అడగగా, అయితే నేను చెప్పినట్లు వినమన్నారు. అలాగే అతను

వింటానన్నాడు. మీరు చెప్పినట్లు వింటానన్న తర్వాత కూడా ఈశ్వర్

ప్రాణాలు పోయాయి ఎందుకు అని అడిగాను. అప్పుడు మహర్షి నాతో

ఇలా అన్నాడు. “నామాట వినమన్నాను కానీ ఈశ్వర్ ప్రాణాలను గురించి

నన్ను అడగమనలేదు. ఈశ్వర్ చనిపోయాడని నామీద మీకు విశ్వాసము

లేకుండా పోయింది. నా మాట మీద విశ్వాసము లేకుండా పోయిందని

దానికి శిక్షగా మీరు బాధపడడమే మంచిదనుకొన్నాను. తర్వాత ఇప్పుడేమి

చేయాలని చివరగా నీ ప్రోద్భలమున జమీందారు నన్ను అడిగాడు. అప్పుడు

మీరు ఇంటికి తీసుకొని పోయి మీ పని మీరు చేసుకొమ్మని చెప్పాను.

దానివలన సాయంకాలము ఐదు గంటల వరకు మీరు బాధపడుతారని,

అలా బాధపడవలెనని, ఆ బాధ నా మాటను నమ్మని దానివలన పడిన

శిక్ష అనీ, దానిని అలా అనుభవించడము వలన నా మాటను విశ్వసించని

ఫలితము అంతటితో అయిపోవుననుకొన్నాను. నా మాట ఒక్కమారే

వస్తుంది. వచ్చినమాట భూమి, ఆకాశము ఒక్కటైనా, సూర్యచంద్రులు

తల్ల క్రిందులైనా మారదు. మీరు ఈశ్వర్ ప్రాణము పోకముందే నన్ను


ఈశ్వర్ను కాపాడమని అడిగారు. నేను ఏమిచేయునదీ, ఎలా చేయునదీ

ఎవరికీ తెలియదు. అందువలన మీ దృష్ఠిలో చనిపోయిన ఈశ్వర్ను

చూచి నన్ను శంకించారు. నా దృష్ఠిలో ఈశ్వర్ చనిపోలేదు. నాకు

జీవాత్మ విషయము, ఆత్మ విషయము, పరమాత్మ విషయము తెలుసు.

మూడు ఆత్మల విషయము మీకు తెలియదు. మీ దృష్ఠిలో ఈశ్వర్

చనిపోయినా అతనిని తిరిగి లేపగలను" అన్నాడు. ఆ మాటవిన్న నాకు

సంతోషమైనది. అందరి ప్రాణదాత అయిన ఈ మహర్షిని నేను ఇక్కడికి

తెచ్చాను. మనముందరే ఈ మహాత్ముడు ఈశ్వర్కు పునర్జన్మ ఇవ్వగలడని

ఆశిస్తున్నాము.


(అంతలో అక్కడ అందరి ముఖములలో మార్పువచ్చింది.

చనిపోయిన మనిషిని ఎలా బ్రతికించగలడు అని ఒకరి ముఖమును ఒకరు

చూచుకొన్నారు. అంతలో మహర్షి అక్కడున్న ప్రజలనందరిని ఉద్దేశించి

ఇలా మాట్లాడాడు.)


మహర్షి :- మీకు మీ శరీరములోని జ్ఞానము తెలియదు. మీకు మీ శరీరముల

బయటి జ్ఞానమే తెలుసు. అందువలన శరీరము లోపల జరుగు మరణ

విషయము మీకు తెలియదు. మరణములు మూడు రకములున్నవి. మూడు

రకములలో ఇప్పుడు ఈశ్వర్ మరణము కూడా ఒక రకము. మనిషి

శరీరములో శ్వాస లేకుండా నిలచిపోతే మీరు మనిషిని మరణించాడని

అనుకుంటారు. కానీ శ్వాస లేకుండా బయటికి పోయిందా, లోపలికి

పోయిందా అని ఎవరూ యోచించడములేదు. ఆ ధ్యాస ఎవరి బుద్ధికీ

రాదు. దానిని గురించి వివరముగా చెప్పితే, బ్రతికిన మనిషి శరీరములో

ఉన్న శ్వాసను “ప్రాణము” అంటున్నాము. శిశు శరీరరములోనికి శ్వాస

వచ్చినపుడు ప్రాణము వచ్చింది అనియు, శరీరమునుండి శ్వాస పోయినపుడు

పోయిందా..


ప్రాణము పోయింది అంటాము. ప్రాణము అనగా గాలి. శరీరములో

పంచ ప్రాణములు గలవు. అవియే 1) వ్యాన 2) సమాన 3) ఉదాన

4) ప్రాణ 5) అపాణ అనునవి. ఈ పంచవాయువులకు నాగ, కూర్మ,

కృకుర, దేవ దత్త, ధనంజయ అను ఐదు ఉప వాయువులు గలవు. ఈ

పది వాయువులు శరీరములోపల నిలిచి పోయినా, శరీరము బయటికి

పోయినా బయట చూచు వారికి అది మరణమే అయినా, మా దృష్ఠిలో

వాయువులు బయటికి పోతే మరణము. లోపలవుంటే తాత్కాలిక మరణము

అంటాము. ఇప్పుడు ఈశ్వర్ తాత్కాలిక మరణమును పొందాడు.

అందువలన అతని శరీరములో కీళ్ళన్నియూ సులభముగా కదులుచున్నవి.

దీనివలన ఈశ్వర్ శరీరములోని దశ వాయువులను తిరిగి వాటి వాటి పని

చేయుటకు ఎన్నో విధానములున్నవి. అందులో ఒక విధానమును

ఉపయోగించి నేను ఈశ్వర్ను తిరిగి బ్రతికించగలను. ఇప్పుడు ఇది

మీకు విచిత్రముగా కనిపించినా, నా లెక్కలో కేవలము వైద్యము మాత్రమే.


ఈశ్వర్ శరీరములోని పది వాయువులను తిరిగి పని చేయించుటకు

పది వజ్రములు కడిగిన నీటిని అతని ముఖము మీద, తల మీద వేగముగా

చల్లితే వజ్ర స్పర్శతోవున్న నీటి వలన వాయువులు తిరిగి పని చేయును.

భువనేశ్వరి దేవాలయములో చాలా సంవత్సరముల క్రితము దోపిడీ

చేయబడిన పది వజ్రములు నావద్ద ఉన్నవి. వాటిని దొంగల వద్దనుండి

రక్షించి కొంత కాలముగా వీటిని నావద్దే ఉంచుకొన్నాను. ఈ పది వజ్రము

లతో పని అయిపోయిన తర్వాత, ఈ పది వజ్రములతో ఒక జీవిని

బ్రతికించిన తర్వాత వీటిని తిరిగి భువనేశ్వరి దేవాలయములో అర్పించ

వలెననుకొని నావద్ద ఉంచుకోవడము జరిగినది. ఇప్పుడు ఆ పని ఈ

వజ్రముల ద్వారా నెరవేరుచున్నది.


(అని మహర్షి తనవద్దనున్న పది వజ్రములను బయటికి తీసి

అందరికి చూపి వాటిని ఒక చెంబులోనికి వేసి అందులో నీళ్ళు పోసి

బాగా అల్లాడించి ఆ నీటిని అందరూ చూస్తుండగా చనిపోయిన ఈశ్వర్

ముఖము మీద, తలమీద చల్లి "ఈశ్వర్! ఇక నిద్రనుండి లేచి కూర్చో! నీవు

పడుకొని చాలాసేపయినది" అని చేతితో తట్టి గట్టిగా పిలువగా ఈశ్వర్,

నిద్రపోవు వాడు మేల్కొన్నట్లు లేచి కూర్చున్నాడు. అది చూచిన అందరూ

ఆశ్చర్య పోవడమేకాక ఈశ్వర్వైపు చూచారు. ఈశ్వర్ అందరి వైపుచూచి

జరిగిన విషయము రాఘవ ద్వారా తెలుసుకొని తనను తిరిగి బ్రతికించిన

మహర్షి యొక్క పాదముల మీద పడి నమస్కరించగా, రాఘవ అందరివైపు

చూచి ఈ మహర్షి అందరిలా సామాన్యమైన మనిషికాడనీ, దేవునితో

సమానుడైన భగవంతుడని చెప్పి, సంతోషముతో భగవాన్ మహర్షికి జై!

అన్నాడు. అక్కడున్న వారంతా భగవాన్ మహర్షికి జైజై!! అన్నారు.


సమాప్తము.

(ఇందులోని పాత్రలూ, సంఘటనలూ కేవలము కల్పితము. ఎవరిని

ఉద్దేశించి వ్రాసినవి కావు. కానీ ఇందులోని జ్ఞానమూ, వైద్యమూ,

మంత్రములూ, మహత్యములూ అన్నీ వాస్తవమే.)



అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము గాదు.

సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము గాదు.


నా చివరి మాట.


చివరివరకు ఈ కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చినది.

ఇందులో ముఖ్యముగా రాజయోగానంద స్వామీ, భూగర్భములోని మహర్షీ

గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించబడినారు. అయితే అందులో ముఖ్యముగా

గమనించవలసిన విషయమేమనగా! కొన్ని చోట్ల రాజయోగానంద స్వామి

కంటే భూగర్భమునుండి బయటికి వచ్చిన మహర్షి గొప్పగా కనిపించు

చున్నాడు. మరికొన్నిచోట్ల మహర్షికంటే రాజయోగానంద స్వామి గొప్పగా

కనిపించుచున్నాడు. కొన్నిచోట్ల ఇద్దరూ సమానమే అన్నట్లు తెలియుచున్నది.

కొన్నిచోట్ల జరిగిన సంఘటనలనుబట్టి 'ఎవరు గొప్ప?' అను ప్రశ్న

వచ్చుచున్నది. అయితే గ్రంథములో ఎవరు పెద్ద, ఎవరు చిన్న అను

విషయమును చివరివరకూ తేల్చి చెప్పలేదు. అలా ఎందుకు చెప్పలేదు?

అని అంటే, ఈ గ్రంథములో ఎన్నో విషయములను ప్రస్తావించినా, అన్నిటి

కంటే ముఖ్యముగా దైవజ్ఞానమును దృష్టిలో పెట్టుకొని, బ్రహ్మవిద్యా

శాస్త్రమును అనుసరించి వ్రాయడము జరిగినది. అందువలన రాజయోగా

నంద స్వామినిగానీ, మహర్షినిగానీ పెద్దగా తేల్చి చెప్పలేదు. అలా చెప్పక

పోవడానికి ఒక కారణము కలదు. అది ఏమనగా! మహర్షిని పెద్దగా

చెప్పితే రాజయోగానందస్వామి చిన్నగా కనిపించును. అప్పుడు రాజయోగా

నందస్వామిని శిష్యునిగా, మహర్షిని గురువుగా చెప్పవలసి వచ్చును.

ఫలానా వాడు గురువు అనిగానీ, ఫలానావాడు శిష్యుడు అనిగానీ

దైవజ్ఞానము ప్రకారము చెప్పుటకు వీలులేదు. ఒకవేళ ఇతను గురువు

అనిగానీ, ఇతను శిష్యుడు అని గానీ చెప్పితే ఆ మాట దైవజ్ఞానములో

ప్రశ్నార్థకమగును.


దైవజ్ఞానమంతయూ బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి

యుండును. బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి గతములో మేము


“గురువు” అను చిన్న గ్రంథమును వ్రాయడము జరిగినది. అందులో

గురువు గుర్తింపబడనివాడు అని చెప్పాము. అంతేకాక గురువుకు

శిష్యులుంటారా? అని కూడా వ్రాశాము. గురువు ఎవరికీ తెలియబడ

నప్పుడు ఆయనకు శిష్యులు అనేవారుండరని చెప్పాము. అక్కడ చెప్పినది

శాస్త్రబద్ధమైన విషయము. అదే విధానమును అనుసరించి "సత్యాన్వేషి

కథ” అను ఈ గ్రంథములో ఫలానావాడు గురువు అనిగానీ, ఫలానావాడు

శిష్యుడు అనిగానీ తేల్చి చెప్పలేదు. ఇతను శిష్యుడు అని చెప్పితే వానికి

గురువు ఇతనే అని చెప్పవలసి వచ్చును. అప్పుడు గురువును

గుర్తించినట్లగును. అప్పుడది శాస్త్రవిరుద్ధమగును. బ్రహ్మవిద్యా శాస్త్రమును

అనుసరించి ఇతనే గురువు అని తేల్చి చెప్పుటకు వీలులేదు. అందువలన

ఈ గ్రంథములో 'ఎవరు గురువు' అనునది అర్థము కాకుండా వ్రాయవలసి

వచ్చినది.


భూమిమీద ఎక్కడయినా 'గురువు', 'శిష్యులు' అను పదములు

వినపడుచునే ఉండును. చిన్నవయస్సులో ప్రాథమిక పాఠశాలకు

పోయినప్పుడు అక్కడ అక్షరములను నేర్పు వ్యక్తిని గురువు అని చెప్పెడివారు.

ఏ విద్య అయినా గురువు వలనే వస్తుందనీ, గురువు లేనిది ఏ విద్యా

రాదనీ అనెడివారు. దానివలన ఒక భాషలో అక్షరములను నేర్పు టీచర్ను

(బోధకున్ని) గురువు అని పెద్దలు చెప్పగా, బడిలోని టీచర్నే గురువు అని

మొదట మేము నమ్మడము జరిగినది. చిన్నతనములో బడిలోని టీచర్ నే

నేను గురువుగా లెక్కించి నమస్కరించెడివాడిని. సంవత్సరమునకు ఒకమారు

వచ్చు గురుపూజ దినోత్సవము రోజున ఎండు కొబ్బరి గిన్నెలు ఇచ్చి

నమస్కారము చేసి వచ్చేవారము. మేము చదువుకొన్న అరవై

సంవత్సరములప్పుడు ఆ విధముగా ఉండేది. ఇప్పుడు ఆ సాంప్రదాయము


నా చివరి మాట

బహుశా లేదనుకొంటాను. అయినా విద్య చెప్పువానిని గురువు అనడము

అక్కడక్కడ ఇప్పటికీ మిగిలియున్నది. ఆ విధముగా చిన్నవయస్సులో

మొదలయిన గురువు అనుమాట నాకు వయస్సు వచ్చుకొలదీ ఎన్నో

ప్రశ్నలమయమయినది.


చిన్న వయస్సునుండి ప్రతి విషయమును ప్రశ్నించి తెలుసుకొను

అలవాటు నాకు ఎక్కువగాయున్నది. ఒకటి ఇట్లువుంది అంటే, అది అట్లు

ఎందుకువుంది? అని అడిగి దాని వివరము తెలుసుకోవాలను అభిలాష

ఎక్కువగా ఉండేది. ఆ విధానమును హేతువాదము అంటారు అని నేను

పెద్దవాడినయిన తర్వాత నాకు తెలిసినది. దానికి ఏ వాదమని పేరు

పెట్టినా మొదటినుండీ నాలో ఉండేది అదే. చిన్నవయస్సులో గురువును

పూజ్యుడుగా భావించిన నాకు కొంతయుక్త వయస్సు వచ్చుకొలది గురువు

అను వ్యక్తి మీద ప్రశ్నలు రావడము మొదలుపెట్టాయి. అందులో మొదట

వచ్చిన ప్రశ్న ఇలాగయున్నది. ప్రాథమిక పాఠశాలలోగానీ, ఉన్నత విద్యా

పాఠశాలలోగానీ (హైస్కూల్లోగానీ) బోధించు టీచర్ను ఉపాధ్యాయుడు

అనడము జరుగుచున్నది. ఉపాధ్యాయుడును విడదీసి చూస్తే

ఉప+అధ్యాయుడు=ఉపాధ్యాయుడు అని కలదు. 'ఉప' అన్నప్పుడు తక్కువ

వాడనేగా అర్థము. నది పెద్దదయితే దానికి గల ఉపనది చిన్నదేయగును.

అలాగే అధ్యాయుడు పెద్దవాడయితే ఉపాధ్యాయుడు చిన్నవాడేయగును.

అటువంటప్పుడు చిన్నవాడిని గురువు అనుటకు వీలులేదు. ఎందుకనగా

గురువు అంటే అన్నిటికంటే, అందరికంటే మించినవాడనీ, అన్నీ తెలిసిన

వాడనీ అర్థము. అటువంటప్పుడు చిన్నవాడు అన్నట్లు 'ఉప' అను పదమును

ఎందుకు ఉపయోగించారు? అన్నదే ప్రశ్న అయినది. ముఖ్యమంత్రికంటే

అధికారములో చిన్నవాడు ఉపముఖ్యమంత్రి అయినప్పుడు, రాష్ట్రపతికంటే


అధికారములో తక్కువవాడు ఉపరాష్ట్రపతి అయినప్పుడు, గురువు

(అధ్యాయుడు) కంటే ఉపాధ్యాయుడు తక్కువే అని అందరికీ తెలియుట

వలన ఉపాధ్యాయుడు గురువుకాదు అని స్పష్టముగా తెలియుచున్నది.

దీనినిబట్టి బడిలోయున్న టీచర్లు, కాలేజీలోయున్న లెక్చరర్లు, యూనివర్సిటీలో

యున్న ప్రొఫెసర్లు గురువుతో సమానము కాదని అర్థమయినది.


ఇక్కడ ఒక ప్రశ్న రాగలదు, అదేమనగా! 'విద్య నేర్పువాడు గురువు'

అను నానుడి వాక్యము ప్రకారము మనకు తెలియని పాఠములు చెప్పి,

తెలియని విషయములన్నీ తెలుపు టీచర్లు మొదలుకొని ప్రొఫెసర్ల వరకు,

అందరూ గురువులే కదా! అను ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు మేము ఈ

విధముగా సమాధానము చెప్పుచున్నాము. ఒకమారు నేర్చిన విద్యను

తర్వాత ఎన్నిమార్లు నేర్చినా నేర్పినవాడు గురువు కాడు. నేర్చినవాడు

శిష్యుడు కాడు అను సూత్రము ప్రకారము ఎవరూ గురువులు కాదు,

ఎవరూ శిష్యులు కాదు. ఇక్కడ మరొక ప్రశ్న రాగలదు. చిన్నవయస్సులో

ఏ విద్యా రాని సమయమునుండి నేర్చు విద్యలన్నీ క్రొత్త విద్యలే కదా!

ఇంతకుముందు అవి తెలియని విద్యలే కదా! అటువంటప్పుడు క్రొత్తగా

నేర్చుకొనువాడు శిష్యుడు, క్రొత్తగా నేర్పువాడు గురువు అగును కదాయని

ఎవరయినా ప్రశ్నించవచ్చును. దానికి సమాధానము ఈ విధముగా కలదు.

క్రొత్తగా నేర్చువాడు శిష్యుడు, క్రొత్తగా నేర్పువాడు గురువు అనుమాట

వాస్తవమే అయినా ఏ వ్యక్తీ క్రొత్తగా ఏ విద్యనూ నేర్వలేదు. అలాగే ఏ

వ్యక్తీ క్రొత్తగా ఏ విద్యనూ ఇతరులకు నేర్పలేదు. ఈ మా మాట అందరికీ

క్రొత్తగా, వింతగా కనిపించినా ఇది ముమ్మాటికీ సత్యము. ఈ విషయము

అర్థము కావాలంటే ఉదాహరణగా ఒక సమాచారమును చూచి అందులోని

సత్యా సత్యములను తెలుసుకొందాము.


నా చివరి మాట

మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు కల్పనాచావ్లా

పేరు విననివారుండరు. భారతీయ మహిళా సాహసానికీ, మేధస్సుకూ

చిహ్నముగా నిలిచిపోయిన పంజాబ్ రాష్ట్రమునకు చెందిన కల్పనాచావ్లా,

అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA (నాసా)

లో పని చేసేది. అంతరిక్షములోనికి ప్రయోగించిన కొలంబియా స్పేస్ షిప్

ఇతర ప్రాశ్చాత్య అంతరిక్ష యాత్రికులతోపాటు అంతరిక్ష యాత్రలో

పరిశోధకురాలిగా పాల్గొని అంతరిక్షములోనికి ప్రయాణించింది.

ఆకాశములోనే కొంతకాలము గడిపి పరిశోధన సాగించిన తర్వాత

కొలంబియా స్పేన్షిప్ భూమికి తిరుగు ప్రయాణము మొదలు పెట్టింది.

2003వ సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన ఇంకో పదహారు (16)

నిమిషములలో భూమిమీద దిగబోతున్న కొలంబియా స్పేస్ షిప్ దురదృష్ట

వశాత్తూ ఊహించని పరిణామముల వలన ఆకాశములోనే భూమి

వాతావరణము లోనికి ప్రవేశిస్తూనే ప్రేలిపోయింది. దానితోపాటు అందులో

ప్రయాణిస్తున్న అంతరిక్ష యాత్రికులందరూ చిన్నచిన్న ముక్కలై చనిపోయారు.

భారతీయ వ్యోమగామి కల్పనాచావ్లా కూడా ఆ ఘోర ప్రమాదములో

ప్రాణాలు కోల్పోవడము జరిగింది. అయితే ఆమె కొద్ది రోజులకే తిరిగి

భూమి మీద పుట్టడము జరిగింది.


కల్పనాచావ్లా తిరిగి పుట్టిన సమాచారమును (ఎస్.బి.యన్ 7) ఛానల్

మరియు ఇండియాటుడే పత్రిక, కల్పనాచావ్లా మళ్ళీ జన్మించిన కథనాన్ని

ప్రసారము చేసి ప్రపంచానికి అందించడము జరిగింది. ఆ వివరాలను

చూస్తే, ఉత్తర భారతదేశములో ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనున్న బులంద్

షహర్ అనే గ్రామములో రాజీకుమార్ అనే సాధారణ వ్యవసాయ కూలీగా

పని చేయుచున్న వ్యక్తి కుటుంబములో అతనికి కల్పనా చావ్లా కుమార్తెగా


జన్మించింది. 2003వ సంవత్సరము మార్చి 23వ తేదీన ఉపాసన అను

పేరుతో ఆ కుటుంబమున కల్పనా చావ్లా జన్మించడము జరిగింది.

ఉపాసన (కల్పనాచావ్లా)కు నాలుగు సంవత్సరాల వయస్సులో మాటలు

వచ్చాయి. మాట్లాడడమును ప్రారంభించిన ఉపాసన, తాను గతజన్మలో

కల్పనాచావ్లా అను పేరుగల అంతరిక్ష పరిశోధకురాలిననీ, తన తండ్రి

పేరు బనార్సీదాస్యనీ, నాలుగు సంవత్సరముల క్రితము తాను తోటి

అంతరిక్ష పరిశోధకులతో కలిసి ఒక విమానములో ఆకాశమునుండి

దిగివస్తుండగా, తమ విమానానికి ప్రమాదము జరిగి తామందరమూ

చనిపోయామని చెప్పడము జరిగింది.


గత జన్మ వివరాలను పూసగ్రుచ్చినట్లు చెప్పుచున్న ఉపాసన (కల్పనా

చావ్లా) యొక్క పేరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా క్రమంగా తెలిసి పోయింది.

ప్రస్తుతము ఉత్తరప్రదేశ్లోని ఎత్వా జిల్లాలోని “పఠా” అనే గ్రామములో

కూలి పని చేసుకొంటున్న తండ్రి రాజ్కుమార్ తో పాటు జీవిస్తున్న

ఉపాసన తనను ఇంటర్యూ చేయడానికి వచ్చిన ప్రపంచస్థాయి మీడియా

ప్రతినిధులతో మాట్లాడుచూ మేము భూమిమీదకు తిరిగి వస్తున్న

అంతరిక్షనౌకకు ఆకాశములో సంచరిస్తున్న ఒక పెద్ద మంచుగోళము

గుద్దుకున్నదనీ, దానివలన తమ అంతరిక్షనౌక ప్రేలిపోయి అందులోని

తామందరమూ యామనీ చెప్పినది. 2003వ సంవత్సరము ఫిబ్రవరి

1వ తేదీన నాసాకేంద్రము వారు అంతరిక్ష నౌకకు బయటప్రక్కన చుట్టూ

అమర్చిన ప్లేటు ఊడిపోయిన దానివలన ఆ నౌక భూమి వాతావరణము

లోనికి వస్తూనే వాతావరణ రాపిడి వేడికి ప్రేలిపోయిందని చెప్పారు.

నాసావారనుకొన్నట్లు అక్కడ జరగలేదనీ, ఆకాశములో భూమికి 70

కిలోమీటర్ల దూరములోనే మంచుగోళమునకు అంతరిక్షనౌక గుద్దుకోవడము


నా చివరి మాట

వలన ప్రమాదము జరిగిందని ప్రత్యక్ష సాక్షి అయిన కల్పనాచావ్లా చెప్పడము

వలన తెలిసిపోయింది.


ఇక్కడ పునర్జన్మల విషయములో అంతరిక్ష పరిశోధకురాలు కల్పనా

చావ్లా చనిపోయి తిరిగి పుట్టిన విషయము తెలిసినది. తెలిసిన సమాచారము

ప్రకారము అమె చనిపోయినది ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ 2003వ

సంవత్సరము. అమె తిరిగి పుట్టినది మార్చి 23,2003. దీనిప్రకారము

కల్పనాచావ్లా చనిపోయిన తర్వాత 52 రోజులకు తిరిగి పుట్టినదని తెలిసి

పోయినది. అమె పుట్టిన తర్వాత చిన్న వయస్సునుండి తిరిగి చదువుకొని

చదువులన్నీ, విద్యలన్నీ నేర్వవలసియున్నది. ఇప్పుడు అసలు విషయమునకు

వచ్చి చూస్తే ఈ జన్మలో నేర్వవలసిన విద్యలన్నీ కల్పనాచావ్లా ముందు

జన్మలోనే తెలిసియున్నది. కల్పనాచావ్లా అనబడు జీవునికి ముందు జన్మలోనే

అన్ని విద్యలూ తెలిసియున్నా ఈ జన్మలో ఆ విద్యలను జ్ఞాపకము చేయు

మనస్సు లేనిదానివలన తనకు తెలిసిన విషయములన్నీ తెలియవను భ్రమలో

జీవుడుండి క్రొత్తగా నేర్వాలని అనుకొనుచున్నాడు. వాస్తవానికి ఇప్పుడు

నేర్వవలెనని అనుకొను విద్యలన్నీ గతములోనే ప్రతి జీవుడూ నేర్చియున్నాడు.

అందువలన నేర్చిన విద్యను నేర్చువాడు శిష్యుడు కాదు, నేర్పువాడు గురువు

కాదని చెప్పాము. ప్రతి జీవుడు తనకు అన్ని విద్యలు తెలిసియున్నా

తెలియనను భ్రమలోయున్నాడు. తాను గత జన్మలో ఫలానా పేరుతోయున్నా,

ఫలానా ఊరులోయున్నా, తాను గతములో లేననీ ఇప్పుడు పుట్టినప్పటినుండే

ఉన్నానని అనుకొంటున్నాడు. గతములో తాను ఇప్పుడు పుట్టిన ఊరిలోనే

నివసించినా, తిరిగి అదే ఊరిలో పుట్టినప్పటికీ తాను గతములో అక్కడ

లేనను భ్రమలోయున్నాడు. గడచిన గతకాలములో వంద సంవత్సరము

లప్పుడు ఇదే భూమిమీద తాను నివసించినా, నేను అప్పుడు ఉంటిని అను


ధ్యాస ఎవరికీ లేదు. ప్రతి మనిషీ గతములో ద్వాపరయుగములో తాను

యున్నా ఎలాగయితే నమ్మలేని స్థితిలోయున్నాడో, అలాగే గతములో తాను

అన్ని విద్యలూ నేర్చియున్నా, తాను ఇప్పుడు క్రొత్తగా విద్యలు నేర్వాలను

భ్రమలోయున్నాడు. గతములో నేర్చిన విద్యనే ఇప్పుడు తిరిగి నేర్చినా

వాడు శిష్యుడు కాదు, నేర్పువాడు గురువు కాదు అను నానుడి వాక్యము

ప్రకారము నేడు విద్యలు నేర్చు ఎవడూ శిష్యుడు కాదు, అట్లే నేర్పువాడు

ఎవడూ గురువు కాదని చెప్పవచ్చును.


అయితే ఇక్కడ మరొక ప్రశ్న రాగలదు. అదేమనగా! ఈ జన్మలో

నేర్వవలసిన విద్య పోయిన జన్మలోనే తెలిసియుండినట్లయితే, అది కూడా

అప్పుడు నేర్చినది కాదు కదా! గడచిన జన్మలోనిది అంతకు ముందే

గడచిపోయిన జన్మలో తెలిసియుండును కదా! గడచిన ఏదో ఒక జన్మలో

నయినా జీవుడు విద్యను నేర్చియుండును కదా! అప్పుడయినా ఒకనికి

చెప్పువాడు మరొకడు ఉండును కదా! అప్పుడు నేర్చిన వాడు శిష్యుడు,

నేర్పినవాడు గురువు అగుదురు కదా! అని అడుగవచ్చును. దానికి మా

జవాబు ఈ విధముగా కలదు. ఇక్కడ బాగా ఆలోచించి చూస్తే మనిషి

లేక జీవుడు తెలియవలసిన జ్ఞానము లేక విద్యలు రెండు విధములు గలవు.

ఒకటి ప్రపంచ సంబంధమైన జ్ఞానముకాగా, రెండవది పరమాత్మ సంబంధ

జ్ఞానము. మనిషికి కావలసిన ద్వివిధ జ్ఞానములను ద్వివిధ విద్యలుగా

చెప్పవచ్చును. ఏ జ్ఞానమయినా నేర్వవలసి వచ్చినప్పుడు దానిని విద్య

అనడము జరుగుచున్నది. విద్య అనగా తెలియబడునదని, జ్ఞానము అనగా

తెలియవలసినదని చెప్పవచ్చును. ఎట్లు చూచినా విద్య అనునది, జ్ఞానము

అనునది రెండూ ఒకే అర్థమునిచ్చుచున్నవి. ప్రపంచ విద్యలుగానీ లేక

ప్రపంచ జ్ఞానముగానీ, అట్లే పరమాత్మ విద్యగానీ లేక దైవజ్ఞానముగానీ


నా చివరి మాట

రెండూ ఒక మనిషికి ఇతరులనుండే అందవలసియున్నది. ఇక్కడ జ్ఞానమును

అందుకొనువాడు శిష్యుడు, అందించువాడు గురువు అని చెప్పినా, ఈ

గురువు శిష్యుల సంబంధములో అందరికీ తెలియని రహస్యము ఒకటి

గలదు. అది ఏమనగా!


ప్రపంచ విద్యలను నేర్పువాడు ఉన్నప్పటికీ అతడు ప్రత్యక్షముగా

మరో వ్యక్తిగాయుండడు. ఒక మనిషికి ప్రపంచ జ్ఞానమును నేర్పువాడు

ప్రత్యక్షముగా ఉండడు, కావున ప్రపంచ విద్య నేర్పినవాడు ఫలానావాడని

చెప్పలేకపోవుచున్నాము. ఇతనే నాకు ప్రపంచ జ్ఞానమును నేర్పినవాడని

ఎవరికీ చూపలేకపోవుచున్నాము. ఇంకొక విషయమేమంటే పరమాత్మ

జ్ఞానమును తెలుపువాడు ప్రత్యక్ష మనిషిగాయుండును. అయితే నాకు

పరమాత్మ జ్ఞానమును ఇతనే చెప్పాడని మనిషి ఒప్పుకోడు. అందువలన

ఇతనే నాకు దైవజ్ఞానమును బోధించిన గురువని ఇతరులకు చూపలేడు.

ప్రపంచ జ్ఞానమును బోధించినవాడు కనిపించడు, కాబట్టి ఇతరులకు

చూపలేకపోవడము ఒక కారణమైతే, పరమాత్మ జ్ఞానమును బోధించిన

వానిని శిష్యుడే నమ్మడు కాబట్టి ఇతరులకు చూపలేకపోవుచున్నాడు. ప్రపంచ

జ్ఞానమును బోధించినవాడు గురువే అయినా అతను శిష్యునికే తెలియ

బడలేదు. కాబట్టి అక్కడ ప్రపంచ విద్యను నేర్పిన గురువు లేడు, కావున

ఆయనకు శిష్యుడు కూడా లేడనియే చెప్పవచ్చును. అట్లే పరమాత్మ విద్యను

నేర్పినవాడు గురువే అయినప్పటికీ అక్కడ గురువు కనిపించినా శిష్యుడే

గురువును ఒప్పుకోవడము లేదు. కావున ఇక్కడ కూడా ఫలానావాడు

గురువు అని చెప్పలేకపోవుచున్నాడు. గురువే లేకపోయినప్పుడు శిష్యుడు

కూడా లేడని చెప్పవచ్చును. ఒక విధముగా రెండు విద్యలను నేర్చిన

శిష్యులు ప్రత్యక్షముగాయున్నా వారికి గురువులు ఎవరని నిర్ణయించలేక


పోవడము వలన ఫలానావాడు గురువు అనిగానీ, ఈ గురువుకు ఫలానా

వాడు శిష్యుడు అనిగానీ తేల్చి చెప్పలేకపోవుచున్నాము. అందువలన

“గురువు” అను గ్రంథములో గురువును గుర్తించలేము అని వ్రాశాము.

అంతేకాక గురువుకు శిష్యులుంటారా? అని కూడా వ్రాశాము.


నేడు భూమిమీద గురు శిష్య సాంప్రదాయములున్నా, వాస్తవానికి

అవి పేరుకు మాత్రమే సాంప్రదాయములుగానీ, వారిలో శిష్యుడు గురువు

అని ఇద్దరు వ్యక్తులున్నా, వారు గుర్తింపుకు మాత్రము ఉందురుగానీ,

వాస్తవానికి శాస్త్రబద్ధముగా గురువు లేడు, శిష్యుడూ లేడు. ఎక్కడ

గురువులున్నా వారు నేర్పిన విద్యను నేర్పువారే తప్ప క్రొత్త విద్యను నేర్పు

వారు కాదు. అలాగే ఎక్కడ శిష్యులున్నా వారు నేర్చిన విద్యను నేర్చువారే

తప్ప క్రొత్త విద్యను నేర్చువారు కారు. అందువలన శాస్త్రబద్ధముగా

అందరినీ శిష్యులని అనలేము. అట్లే అందరినీ గురువులని కూడా అనలేము.

ప్రపంచ విద్యను నేర్పువాడు గురువే, అలాగే పరమాత్మ విద్యను నేర్పువాడు

గురువే అయినా ఆ గురువులలో ప్రపంచ విద్యను నేర్పువాడు కనిపించని

గురువని, దైవజ్ఞానమును (పరమాత్మ విద్యను నేర్పువారు కనిపించే గురువని

కూడా చెప్పాము. కనిపించని గురువును ఫలానావాడని చూపలేకపోయినా

లేక చెప్పలేకపోయినా కనిపించే గురువును ఫలానావాడని చూపవచ్చును

కదా! లేక చెప్పవచ్చును కదా! అయితే శిష్యుడయిన వాడు రెండు రకములా

ఇద్దరు గురువులను ఎందుకు గుర్తించలేకపోవుచున్నాడని కొందరుగానీ,

అందరుగానీ ప్రశ్నించ వచ్చును. ఈ ప్రశ్నకు మా జవాబు ఈ

విధముగాయున్నది చూడండి. గురువు శిష్యులు అనేది గొప్ప రహస్యమైన

జ్ఞానము. అంతపెద్ద రహస్యమును చెప్పాలంటే పెద్ద సాహసముతో

కూడిన పనియగును. అందువలన నేను ముందే చెప్పునది ఏమనగా!



నా చివరి మాట


ఇక్కడ నాకు తెలిసింది నేను వ్రాయుచున్నాను. నేను కూడా ఇదే నిజమని

తేల్చి చెప్పను. ఒకవేళ నేను చెప్పింది సత్యమని అర్థమయితే నా మాటను

నమ్మండి, అర్థము కాకపోతే వదలివేయండి. అంతేగాని నేను చెప్పింది

అంతా సత్యమని ఇక్కడ నేను కూడా చెప్పలేదు.


సృష్ట్యాదిలో మనిషి పుట్టిన తర్వాత ముందు పరమాత్మ జ్ఞానమే

సంపూర్ణముగా చెప్పబడినది. తర్వాత ప్రపంచ జ్ఞానము అంచెలంచెలుగా

చెప్పబడినది. మనిషి అవసరమునుబట్టి ఎప్పుడేది ఎంత చెప్పవలెనో

అంతే ప్రపంచ జ్ఞానమును చెప్పడము జరిగినది. ఆ విధముగా ప్రపంచము

పుట్టినప్పటినుండి ప్రపంచ జ్ఞానము మనుషులకు నేర్పబడుచున్నది. మనిషి

ప్రపంచ జ్ఞానమును అంచెలంచెలుగా నేర్చుకుంటూ వస్తున్నాడు. ఒకమారు

నేర్చిన తర్వాత తిరిగి ఒకరికొకరు చెప్పుకోవడము జరుగుచున్నది. అలా

తెలుసుకొన్న ప్రపంచ జ్ఞానమునే జన్మ జన్మకు మరణములో మరచిపోతూ

జీవితములో నేర్చుకోవడము జరుగుచున్నది. ప్రపంచము పుట్టినప్పటినుండి

మనిషికి ప్రపంచ జ్ఞానము నేర్పబడినదని చెప్పినా, అవసరమునుబట్టి

నేర్పినవాడు గురువే అయినా, నేర్చిన మనిషి ప్రత్యక్షముగా కనిపించుచున్నా

నేర్పిన గురువు మాత్రము ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా వుండి

చెప్పుచున్నాడు. ప్రపంచములో ఏ మనిషికి ఎంత కర్మయున్నదో

కర్మనుబట్టి అతనికి ఎంత తెలియవలెనో అంతే జ్ఞానమును, వాని శరీరములో

యున్న ఆత్మయే ఊహలు లేక యోచనల రూపములో వాని మెదడుకు

అందించుచున్నది. ఉదాహరణకు రేడియోను మార్కోనీ అను ఇటలీ దేశస్థుని

మెదడులో ఆత్మ అందించిన వివరము ఊహ రూపములో వచ్చి రేడియో

వివరము తెలియబడినది. అంతవరకు ఏ మనిషికీ తెలియబడని విద్యుత్

అయస్కాంత తరంంగాల ద్వారా శబ్ద తరగాంలను ఆకాశములోనికి


ప్రసారము చేయవచ్చను విషయము తెలిసింది. అప్పుడు ఆ విషయమును

మొదట తెలుసుకొని తర్వాత ప్రయోగము ద్వారా నిరూపించుకొని దానిని

స్వయముగా తానే కనిపెట్టానని మనిషి అనుకోవడము జరిగినది.

వాస్తవానికి అంతవరకు ప్రపంచములో ఎవరికీ తెలియని విషయమును

ఆత్మ మార్కోనీ అను జీవునకు తెలియజేస్తే ఆ జీవుడు ఆత్మ తెలియజేసిందనీ,

ఆత్మే తనకు ఈ విషయములో గురువనీ అనుకోక తానే స్వయముగా ఆ

విషయమును (రేడియోను) కనిపెట్టినట్లు ప్రకటించుకొన్నాడు. దానితో

అందరూ రేడియో యొక్క విషయమును మార్కోనీయే చెప్పాడని

అనుకొన్నారుగానీ, అతనిలోని ఆత్మ అతనికి గురువుగా బోధించినదని

అనుకోలేదు. ఈ విధముగా సృష్ట్యాదినుండి నేటివరకు అవసరమునుబట్టి

మానవుని కర్మనుబట్టి ఎప్పుడేది తెలుపవలెనో అప్పుడు దానిని గురించి

ఆత్మ గురువుగాయుండి తెలియజేయుచున్నది.


మనిషి శరీరములోని ఆత్మ ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా

నేటివరకు కంప్యూటర్లు, సెల్ఫోన్లు తయారుచేయు విద్యలను కూడా నేర్పినది.

అయినా మనిషి సెల్ఫోన్లను, కంప్యూటర్లను కనిపెట్టినది నేనే అని

అంటున్నాడు. వాస్తవముగా అన్నిటికీ గురువు ఆత్మని ఎక్కడా చెప్పలేదు.

తనకు తెలియని విషయము ఎలా తెలిసింది? అని ఏమాత్రము

ఆలోచించడమూ లేదు. ప్రపంచములో గత యాభై సంవత్సరముల నుండి

ఆత్మ అనేకమైన క్రొత్త విషయములను నేర్పినది. ఆత్మ నేర్పిన విషయము

లను మనిషి ప్రత్యక్షముగా అనుభవించి ఆనందించుచున్నాడు. శరీరము

నుండి బయటకు చూచు మనిషి తన శరీరములోయున్న ఆత్మయను

గురువును చూడలేకున్నాడు. శరీరములో ఆత్మగాయున్న పరోక్ష గురువు

మనిషి అడగకున్నా మనిషికి కావలసిన దూర శ్రవణమును, దూరదృష్టిని,


నా చివరి మాట

దూర సంభాషణను కూడా కల్పించాడు. కేవలము యాభై సంవత్సరముల

నుండి మాత్రమే అందుబాటులోనికి వచ్చిన యంత్రసామాగ్రి సృష్ట్యాదినుండి

కూడా లేదు. సృష్ట్యాదినుండి తెలియని ఎన్నో ప్రపంచ విద్యలు ఈ మధ్య

కాలములో ఆత్మ నేర్పింది. ప్రపంచములో గణిత, ఖగోళ, రసాయన,

భౌతికశాస్త్రములన్నిటినీ ఆత్మే నేర్పినది. మనిషికి ఉపయోగపడు చిన్నా

పెద్దా పరిశోధనలన్నిటినీ ఆత్మే చెప్పి చేయించింది. మనిషికి తెలియని

అన్ని విషయములనూ ఆత్మ నేటివరకూ నేర్పినది. భవిష్యత్తులో ఇంకా

ఎన్నో నేర్వవలసిన విషయములను ఆత్మే నేర్పవలసియున్నది. మనిషికి

కనిపించకుండా ఆత్మ అన్ని విషయములనూ చెప్పుచున్నా, మనిషి ఆత్మను

గురువుగా గుర్తించలేక తననే గురువుగా చెప్పుకొంటున్నాడు. ఇదంతయూ

ప్రపంచ జ్ఞానముపట్ల యున్న విధానముకాగా, ఇక పరమాత్మ జ్ఞాన

విషయములో ఎట్లున్నదో చూస్తాము.


పరమాత్మ జ్ఞానము ప్రపంచ జ్ఞానమువలె అంచెలంచెలుగా చెప్పబడ

లేదు. పరమాత్మ జ్ఞానము సృష్ట్యాదిలో ఒకేమారు చెప్పబడినది. అయితే

మొదట చెప్పిన దైవజ్ఞానమును మనుషులు అర్థము చేసుకోకపోవడము

వలన దేవుడు ప్రత్యక్ష గురువుగా వచ్చి తిరిగి చెప్పవలసి వచ్చినది.

చెప్పిన జ్ఞానము కొంతకాలమునకు మరుగున పడిపోయి, ధర్మములు

తెలియనప్పుడు, అధర్మములు చెలరేగినప్పుడు దేవుడు మనిషివలె వచ్చి,

తన జ్ఞానమును మనుషులకు బోధించవలసియున్నది. అయితే ప్రత్యక్షముగా

బోధించువాడు తనవలె మనిషి అయినందున, బోధించువాని బోధను చూడక

కేవలము బోధించువానినే చూస్తున్నారు. అప్పుడు నాలాంటి మనిషి చెప్పు

జ్ఞానము సరియైనది కాదను నిశ్చయములోనికి వచ్చుచున్నారు. అంతేకాక

బోధించువాడు మనిషిరూపములోయున్న దేవుడయినా, మనిషిగాయున్న


వాని బోధలను చూడక అతనిలోని నిత్యకృత్యములను చూస్తున్నారు. అప్పుడు

భావములో తక్కువ భావము ఎదుట బోధించు వానిమీద ఏర్పడుట వలన

అతని బోధలను గొప్పగా తలువక, అతనిని గురువుగా భావించక, సాధారణ

మనిషిగా చూడడము జరుగుచున్నది. మనిషి తాను దేవున్నని చెప్పుకొంటే

మనుషులు నమ్ముచున్నారు. దేవుడు మనిషిగావచ్చి బోధిస్తే అతనిని

మనిషిగా లెక్కించుచున్నారు. దేవుడు మనిషిగా రావచ్చునుగానీ, మనిషి

దేవుడు కాలేడని చాలామందికి తెలియదు. అధర్మములను బోధించు

మనిషిని గురువుగా నమ్ముచున్నారుగానీ, ధర్మములను బోధించు దేవున్ని

గురువుగా మనుషులు గుర్తించడము లేదు. గతములో దేవుడు మనిషిగా

వచ్చి తన ధర్మములను విడదీసి చెప్పినా అతనిని మనిషికంటే హీనముగా

చూచారు. అందువలన ప్రపంచ జ్ఞానమును పరోక్షముగాయున్న గురువు

బోధించినా ప్రజలు గుర్తించుటకు వీలులేదు. అట్లే ప్రత్యక్షముగా వచ్చి

చెప్పినా గురువు ఎవరిచేతా గుర్తింపబడడు. అందువలన మేము “సత్యాన్వేషి

కథ” లో ఎవరు గురువు, ఎవరు శిష్యుడు అని తేల్చి చెప్పలేదు. మహర్షి,

రాజయోగానందస్వామి అను రెండు పాత్రలలో ఎవరు పెద్ద? అని తేల్చి

చెప్పక వదలివేశాము. గురు, శిష్యుల విషయము ఎవరికి వారు స్వయముగా

తెలుసుకొను విషయము. ఒకరు చెప్పితే నమ్మే విషయముకాదు. ప్రపంచ

విషయమునకుగానీ, పరమాత్మ విషయమునకుగానీ ప్రతి విషయమునకూ

గురువు ఉన్నాడు. ఆ గురువు వచ్చి “నేనే మీకు గురువును” అని చెప్పినా

మనిషి వినే పరిస్థితిలో లేడు. మనిషి మతమును వీడి పథమును

ఆశ్రయించినప్పుడే గురువు ఎవరో తెలియుటకు ఆస్కారము గలదు.


ఇట్లు,

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


హిందూ రక్షణా! హిందూ భక్షణా!!

భగవద్గీతయే చదవనివాడు హిందూ రక్షకుడా?

హిందూ ధర్మమే తెలియనివారు హిందూ రక్షకులా?


హిందువులు నేడు కులాలుగా చీల్చబడి, అందులో హెచ్చుతగ్గు

కులములుగా వర్ణించబడియున్నారు అనుట అందరికీ తెలిసిన సత్యమే.

దేవుడు మనుషులందరినీ సమానముగా పుట్టించితే కొందరు మనుషులు

తమ స్వార్థ బుద్ధితో హిందూ (ఇందూ) సమాజమును ముక్కలు ముక్కలుగా

చీల్చి బలహీనపరచి హిందూసమాజమునకంతటికీ తామే గొప్పవారమనీ,

తాము చెప్పినట్లే అందరూ విని అన్ని కార్యములు చేసుకోవాలనీ ప్రచారము

చేసుకొన్నారు. ఎన్నో కులములుగా యున్న హిందూ సమాజములో తమ

కులమే అగ్రకులమని చెప్పుకోవడమే కాకుండా, ఇతర కులముల వారందరికీ

తామే మార్గదర్శకులమనీ, గురువులమనీ ప్రకటించుకొన్నారు. భవిష్యత్తులో

తమకు ఎవరూ అడ్డురాకుండునట్లు, అన్ని కులములను అంటరాని

కులములను చేసి, హిందూ సమాజమునకు తీరని అన్యాయము చేశారు.

అంతటితో ఆగక నేటికినీ హిందూ సమాజ రక్షకులుగా చెప్పుకొనుచూ,

హిందూ సమాజమును సర్వనాశనము చేయుచూ, హిందూ సమాజము

ఇతర మతములుగా మారిపోవుటకు మొదటి కారకులగుచున్నారు.

అటువంటివారు హిందూ సమాజమునకు చీడ పురుగులుగాయున్నా,

మిగతా కులముల వారందరూ వారి నిజ స్వరూపమును తెలియక వారు

చెప్పినట్లే వినుట వలన, హిందూ సమాజమును పూర్తిగా అజ్ఞాన దిశవైపుకు,

అధర్మ మార్గమువైపుకు మళ్ళించి, ప్రజలకు ఏమాత్రము దైవజ్ఞానమును

తెలియకుండా చేసి, తాము చెప్పునదే దైవబోధయని నమ్మించారు.


అటువంటి స్థితిలో నేడు త్రైత సిద్ధాంతకర్తగా ఆచార్య ప్రబోధానంద

యోగీశ్వరులవారు అజ్ఞాన దిశవైపు నిలిచి పోయిన హిందూసమాజమును

సరియైన దారిలో పెట్టుటకు, భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను

అధ్యాయమున బోధింపబడిన క్షర, అక్షర, పురుషోత్తమ అను ముగ్గురు

పురుషుల విషయమును "త్రైతసిద్ధాంతము” అను పేరుతో ప్రతిపాదించి

దైవజ్ఞానమును అందరికీ అర్థమగులాగున గ్రంథరూపములో వ్రాయడము,

బోధించడము జరుగుచున్నది. దానివలన నేడు ప్రజలు అసలైన జ్ఞానము

తెలియుచున్నదని సంతోషపడుచున్నారు. అగ్రకులముగానున్న వారిలో

కూడా ఎందరో తమ అజ్ఞాన చీకటులను వదలి, ఇంతవరకూ తమకు

తెలియని జ్ఞానము యోగీశ్వరుల ద్వారా ఇప్పుడు తెలియుచున్నదని

సంతోషపడి శిష్యులుగా చేరిపోవుచున్నారు. అయితే అగ్రకులములో

కొందరు మాత్రము యోగీశ్వరులు తెలియజేయు జ్ఞాన విషయములను

చూచి ఈ జ్ఞానము వలన ప్రజలు జ్ఞానములో చైతన్యులై, జ్ఞానము తెలియని

తమను గౌరవించరని భావించి, దానివలన సమాజము మీద తమ

ఆధిపత్యము లేకుండా పోవునని తలచి, యోగీశ్వరులు తెలుపుచున్న త్రైత

సిద్ధాంతము గానీ, త్రైతసిద్ధాంత భగవద్గీతగానీ హిందువుల జ్ఞానమేకాదనీ,

అది క్రైస్తవ మతమునకు సంబంధించినదనీ, దానిని ఎవరూ చదవకూడదనీ

ప్రచారము చేయను మొదలుపెట్టారు. అంతేకాక తాము హిందూ

ధర్మరక్షకులమని, కొంత రాజకీయరంగు పూసుకొని, మా జ్ఞాన ప్రచారము

నకు అక్కడక్కడ అడ్డుపడడము జరుగుచున్నది. తమ మాట విను ఇతర

కులముల వారికి కూడా ప్రబోధానందయోగీశ్వరులు చెప్పు జ్ఞానము హిందూ

జ్ఞానము కాదు, క్రైస్తవుల జ్ఞానమని హిందువుల ముసుగులో క్రైస్తవ మత

ప్రచారము చేయుచున్నారని చెప్పడమేకాక, అటువంటివారిని ప్రేరేపించి

మా ప్రచారమునకు అడ్డు తగులునట్లు చేయుచున్నారు.


హిందూ రక్షణా!-హిందూ భక్షణా!!

యోగీశ్వరులు నెలకొల్పిన "హిందూ (ఇందూ) జ్ఞాన వేదిక”

ఇటువంటి ఆగడాలను కొంతకాలముగా ఓర్పుతో చూడడము జరిగినది.

మాలో ఓర్పు నశించి, మమ్ములను అన్యమత ప్రచారకులుగా వర్ణించి చెప్పు

అగ్రకులము వారిని, వారి అనుచరులను మేము ఎదురుతిరిగి ప్రశ్నించడము

జరిగినది. మేము ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా వారు సరియైన

సమాధానము ఇవ్వలేదు. ఆ జవాబులు ఎలా ఉన్నాయో పాఠకులుగా

మీరు చూడండి.


మా ప్రశ్న :- ఇంతవరకూ ఏ హిందువూ చేయని విధముగా ఊరూరు

తిరిగి, ఊరిలో ఇల్లిల్లూ తిరిగి హిందూ ధర్మములను ప్రచారము చేయు

చున్నాము కదా! అటువంటి మమ్ములను మీరు అన్యమత ప్రచారకులుగా

ఎందుకు చెప్పుచున్నారు?


వారి జవాబు :- హిందూమతములో ఎందరో స్వామీజీలు ఉన్నారు. వారు

ఎవరూ ఇల్లిల్లూ తిరిగి ప్రచారము చేయలేదు. హిందువులు అట్లు ఎవరూ

ప్రచారము చేయరు. క్రైస్తవులయితేనే బజారు బజారు, ఇల్లిల్లూ తిరిగి

ప్రచారము చేస్తారు. మీరు హిందువుల ముసుగులో ఇల్లిల్లూ తిరిగి

క్రైస్తవమును ప్రచారము చేయుచున్నారు.


మా ప్రశ్న :- మేము క్రైస్తవులమయితే భగవద్గీతను ఎందుకు ప్రచారము

చేస్తాము?


వారి జవాబు :- మీరు ప్రచారము చేయునది త్రైత సిద్ధాంత భగవద్గీత.

అది క్రైస్తవులది. బైబిలుకే మీరు అలా పేరు పెట్టారు.

మా ప్రశ్న :- క్రైస్తవులు తమను క్రైస్తవులుగానే చెప్పుకుంటారు. అలాగే

బైబిలును బైబిలుగానే చెప్పుకొంటారు. వారి ప్రచారము క్రైస్తవము, బైబిలు


అయినప్పుడు అదే పేరుమీద ప్రచారము చేస్తారు తప్ప హిందువులుగా

భగవద్గీత పేరుతో ఎందుకు ప్రచారము చేస్తారు? ఇంతవరకు అట్లు ఎక్కడా

జరుగలేదు. ఏ మతమువారు ఆ మతము పేరు చెప్పుకొంటారు గానీ

ఇతర మతముపేరు చెప్పరు. అంతెందుకు మీరు మా భగవద్గీతను తెరచి

చూచారా? అందులో భగవద్గీత శ్లోకములున్నాయా? బైబిలు వాక్యము

లున్నాయా?


వారి జవాబు:త్రైత సిద్ధాంతమని యున్నది కదా! త్రైతము అంటే

త్రిత్వము అని ట్రినిటి అని మాకు బాగా తెలుసు.


మా ప్రశ్న :- హిందూ ధర్మములలో అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరా

చార్యుడు ప్రతిపాదించాడు. విశిష్టాద్వైతమును రామానుజాచార్యులు

ప్రతిపాదించాడు, ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. ఇప్పుడు

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు.

సిద్ధాంతకర్తలు, సిద్ధాంతములు వేరయినా అందరూ హిందువులని మీరు

ఎందుకు అనుకోలేదు?


వారి జవాబు :- మీ త్రైతసిద్ధాంత భగవద్గీతలో యజ్ఞములను చేయకూడదని

వ్రాశారు కదా! నిజముగా భగవద్గీతలో అలా లేదు కదా!


మా ప్రశ్న :- మీరు హిందువులలో ముఖ్యులుగా వుండి అంత మూర్ఖముగా

మాట్లాడితే ఎలా? ప్రపంచమునకంతటికీ ఒకే భగవద్గీతయుంటుంది గానీ,

మీ భగవద్గీత, మా భగవద్గీతయని వేరుగా ఉండదు. భగవద్గీతకు వివరము

ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారికి అర్థమయినట్లు చెప్పియుండవచ్చును

గానీ, అందరికీ భగవద్గీత మూల గ్రంథమొక్కటేనని గుర్తుంచుకోండి. త్రైత

సిద్ధాంత భగవద్గీత అన్నిటికంటే సరియైన భావముతో యున్నదని చదివిన


హిందూ రక్షణా!-హిందూ భక్షణా!!

జ్ఞానులందరూ పొగడుచూయుంటే, మీ కులములో ఎందరో ప్రశంసించు

చూయుంటే, మీకు కొందరికి మాత్రము వ్యతిరేఖముగా కనిపించిందనడము

అసూయతోనే అని మాకు అర్థమగుచున్నది. యజ్ఞములు చేయవద్దని

మేము ఎక్కడా చెప్పలేదు. యజ్ఞముల వలన పుణ్యము వస్తుంది, స్వర్గము

వస్తుంది అని చెప్పాము. యజ్ఞముల వలన మోక్షము రాదు, దేవుడు

తెలియడని చెప్పాము. అంతెందుకు మీరు మేము అన్ని కులములకంటే

స్వచ్ఛమయిన హిందువులమని చెప్పుకొంటున్నారు కదా! భగవద్గీతలో

చెప్పిన ఒక్క హిందూ ధర్మమును చెప్పండి.


వారి జవాబు :- అవన్నీ మాటలు వద్దు... మీరు హిందువులు కాదు.

మా ప్రశ్న :- మొండిగా మాట్లాడవద్దండి. మీరు అగ్రకులమువారమని

ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. మేము హిందువులము కాము అనుటకు

ఆధారము ఏమైనా చూపగలరా? మా కథ అట్లుంచి మీరు సరియైన

హిందువులే అయితే భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను

అధ్యాయములో 48వ శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ భగవంతుడు

ఏమి చెప్పాడో మీరే చెప్పండి.


వారి జవాబు :- మేము ఇంతవరకు భగవద్గీత చదువలేదు. మీకు కావలసి

వస్తే సంపూర్ణానందస్వామితో చెప్పిస్తాము.


మా ప్రశ్న :- కనీసము భగవద్గీతను కూడా చదువని మీరు యోగీశ్వరులయిన

ప్రబోధానందస్వామిని దూషించడము మంచిదా? ఒక్క హిందూ ధర్మమును

కూడా తెలియని మీరు హిందూ ధర్మ రక్షకులమని చెప్పడము మంచిదా?

యోగీశ్వరుల వారు వ్రాసిన ఒక్క గ్రంథము కూడా చదువకుండా మేము

తప్ప పూజ్యులుగా, గురువులుగా ఎవరూ ఉండకూడదను అసూయతో

ఇలాగ మాట్లాడితే దేవుడు ఓర్చుకోడని చెప్పుచున్నాము.


వారి జవాబు :- హిందూ మతములో ఎందరో దేవుళ్ళున్నారు. శివుడు

దేవుడే, శివుని కొడుకు గణపతి దేవుడే, రాముడు దేవుడే, రాముని సేవకుడు

ఆంజనేయుడూ దేవుడే. అలాంటి హిందూ మతములో దేవుడు ఒక్కడే

అని చెప్పడము మీది తప్పు కాదా?


మా మాట :- మేము మతమును గురించి చెప్పలేదు. హిందూ మతములో

ఎందరో దేవుళ్ళుండడము నిజమే, అయితే హిందూ జ్ఞానములో, హిందూ

ధర్మము ప్రకారము విశ్వమునకంతటికీ ఒకే దేవుడని చెప్పాము. భగవద్గీతలో

దేవుడు చెప్పినదే చెప్పాము తప్ప మేము దేవతలను గురించి లేరని చెప్పలేదే!

దేవతలకందరికీ అధిపతియైన దేవుడు ఒక్కడున్నాడని, ఆయనే దేవదేవుడనీ,

అతనిని ఆరాధించమని చెప్పాము.


వారి జవాబు :- మీరు రాముని పేరు చెప్పరు, శివుని పేరు చెప్పరు,

వినాయకుని పేరు చెప్పరు. ఎవరి పేరూ చెప్పకుండా దేవుడు అనీ,

సృష్టికర్తయనీ అనేకమార్లు పేర్కొన్నారు. దేవుడు అను పదమునుగానీ,

సృష్టికర్తయను పదమునుగానీ క్రైస్తవులే వాడుతారు. హిందువులు వాడరు.

అందువలన మిమ్ములను హిందువులు కాదు క్రైస్తవులు అంటున్నాము.


మా ప్రశ్న :- క్రైస్తవ మతము పుట్టి రెండువేల సంవత్సరములయినది.

సృష్ఠిపుట్టి ఎన్ని కోట్ల సంవత్సరములయినదో ఎవరూ చెప్పలేరు. సృష్ట్యాది

నుండి “సృష్ఠికర్త” అను పదమును “దేవుడు” అను పదమును హిందూ

సమాజము వాడుతూనే యున్నది. మొదటినుండి హిందూసమాజములో

యున్న “దేవుడు, సృష్ఠికర్త” అను పేర్లను హిందువులు క్రైస్తవులకేమయినా

లీజుకిచ్చారా? లేక పూర్తిగా వారికే అమ్మేశారా? అని అడుగుచున్నాము.

సృష్టికర్త అనిగానీ, దేవుడు అనిగానీ హిందువులయినవారు అనకూడదని

ఎక్కడయినా ఉన్నదా అని అడుగుచున్నాము?


హిందూ రక్షణా!-హిందూ భక్షణా!!

వారి జవాబు :- మీరు హిందూమతమును కాకుండా అన్యమతమును

బోధించుచున్నారనుటకు, మిమ్ములను మీరు హిందువులుగా చెప్పుకో

లేదు. హిందువులుగా కాకుండా ఇందువులుగా చెప్పుకొంటున్నారు.

అటువంటప్పుడు మీరు హిందూమతమును చీల్చినట్లు కాదా! ప్రత్యేకించి

ఇందూ మతము అను దానిని ప్రచారము చేసినట్లు కాదా! మీరు హిందువులే

అయినప్పుడు మీ గ్రంథములలోగానీ, మీ బోధలలో గానీ ప్రత్యేకించి

ఇందువులు అని ఎందుకు చెప్పుచున్నారు?


మా మాట :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము జవాబు చెప్పండి.

హిందువు, ఇందువు అను పదములో కొద్దిపాటి శబ్ధము తప్ప ఏమి

తేడాయుందో మీరే చెప్పండి. తెలుగుభాషను వ్రాసే వారందరూ

హిరణ్యకశ్యపున్ని చంపినది నరశింహస్వామి అని చెప్పుచుందురు అలాగే

వ్రాయుచుందురు. ప్రస్తుతకాలములో 'నరశింహులు' అని పేరున్నవాడు

కూడా వాని పేరును నరశింహులు అని వ్రాయడము అందరికీ తెలుసు.

అయితే ఆ మాట తప్పు అలా వ్రాయకూడదు దానిని నరసింహ అని

వ్రాయవలెను అని చెప్పుచున్నాము. అడవిలో మృగరాజును సింహము

అని అంటాము తప్ప శింహము అని అనము అనికూడా చెప్పుచున్నాము.

'సింహము' అంటే అర్థమున్నది గానీ, 'శింహము' అంటే అర్థము లేదు

అని కూడా చెప్పాము. అలా ఉన్నది ఉన్నట్లు చెప్పితే 'ఇందువు' అనే

దానికి అర్థమున్నదిగానీ 'హిందువు' అనే దానికి అర్థములేదు అని చెప్పాము.

సృష్ట్యాదిలో పుట్టినది ఇందూ సమాజమనీ, అది మధ్యలో పేరుమారి దృష్ఠి

జిష్ఠి అయినట్లు ఇందూ అను శబ్ధము హిందూ అని పలుకబడుచున్నదని

చెప్పాము. ఇందూ పదము ఎందుకు వాడాలి హిందూ పదమును ఎందుకు

వాడకూడదని కూడా వివరముగా మా గ్రంథములలో గలదు. ఉన్న సత్యము


మీకు తెలిసినా మీరు మాకంటే పెద్ద ఎవరూ ఉండకూడదను అసూయతో

మాట్లాడుచున్నారు.


అగ్రకులములో ఎందరో పెద్దలు మా జ్ఞానమును తెలిసి

సంతోషించుచుండగా, కొందరు మాత్రము వీధి రౌడీలలాగా తంతాము,

పొడుస్తాము, కాలుస్తాము మీరు ప్రచారము చేయవద్దండని చెప్పడము

మంచిది కాదు. మా గ్రంథములు ఏవీ చదువకుండా మాట్లాడడమూ,

మేము చెప్పిన మాటలను వినకుండా ఇవన్నీ డ్రామాలు, నాటకాలు

అనడము మంచిది కాదు. మీరు ఎవరైనా మా గ్రంథములలో ఇతర

మతములను ప్రచారము చేసినట్లుగానీ, ఫలానా మతములోనికి చేరమని

చెప్పినట్లుగానీ ఉంటే నిరూపణ చేయండి, అలా నిరూపించినవారికి ఇందూ

జ్ఞానవేదిక తరపున పది లక్షల రూపాయలను ఇవ్వగలము. నిరూపించ

లేకపోతే మీరు లక్ష రూపాయలు ఏ ఊరిలో శ్రీకృష్ణుని గుడికయినా

ఇవ్వవలెను. ఈ షరతుకు ఎవరైనా ముందుకు వస్తారా? అని అడుగు

చున్నాము.


ఇట్లు,

ఇందూ జ్ఞానవేదిక.



చరిత్రలో జరిగిన అన్యాయము .


హిందువులలో జరుగుచున్న యదార్థము.


నాలుగువందల సంవత్సరముల క్రిందట ఆధ్యాత్మిక రంగములో

మెరిసిన వజ్రము వేమనయోగి. ఆధ్యాత్మికమను పాలను చిలికి దైవజ్ఞానము

అనే వెన్నను తీసి ఇచ్చినవాడు వేమన. వేమన తన పద్యములలో చెప్పిన

ఒక్కొక్క జ్ఞాన విషయము విపులముగా వ్రాసుకొంటే ఒక్కొక్క గ్రంథము

కాగలదు. వేమన స్వచ్ఛమైన తెలుగు భాషలో పద్యమును వ్రాసి చెప్పాడు.

సంస్కృతము జోలికి పోలేదు. ఒక ప్రక్క పద్యములు వ్రాసి కవిగా

కనిపించినా, ఒక ప్రక్క అంతు తెలియని ఆధ్యాత్మికవేత్త వేమనయోగి.

అయితే ఆయన పుట్టినది రెడ్డి కులమున. చరిత్రలో మాకంటే ఎవరూ

పెద్దగా ప్రశంసింపబడకూడదని గర్వములోయున్న అగ్రకులములోని

కొందరు పనిగట్టుకొని వేమనయోగిని పిచ్చివానిగా జమకట్టి, అతను చెప్పింది

జ్ఞానమేకాదని ప్రజలలో ప్రచారము చేశారు. పిచ్చివాని మాటలు పిచ్చివారే

వింటారు అని హేళనగా మాట్లాడడము జరిగినది. అనేక కులములుగా

యున్న హిందువులకు జ్ఞాన విషయములో పరిచయము లేనిదానివలన,

అగ్రకులము వారు వేమన చెప్పినది జ్ఞానమే కాదనడము వలన, వేమన

తన జ్ఞానమునకు తగినట్లుగా ప్రకాశింప లేకపోయాడు. తాము అగ్రకులము

వారమనీ, మిగతా వారందరూ తగ్గు కులము వారనీ విభజించి, తాము

చెప్పినట్లు వినవలెననీ, అట్లు వింటేనే మిగతా కులముల వారందరూ

సుఖముగా బ్రతుకగలరనీ, అగ్రకులమువారు ప్రచారము చేసుకొన్నారు.

అలా తమను తాము గొప్పగా ప్రకటించుకోవడమేకాక హిందువుల ఇళ్ళలో


జరుగు ప్రతి మంచి పనికీ, చెడు పనికీ, చావుకూ పుట్టుకకూ, పెళ్ళికీ

పేరంటానికీ ప్రతి కార్యమునకూ తాము చెప్పునట్లు చేయాలనీ, తాము

నిర్ణయించు కాలములోనే చేయాలనీ, అట్లు చేయకపోతే నష్టము, కష్టము

కలుగుతుందని భయపెట్టడము వలన, భయముతో జ్ఞానము తెలియని

మిగతా కులముల వారందరూ వారు చెప్పిన దానిని నమ్మడము జరిగినది.

ఈ విధముగా హిందూమతములో అగ్రకులము వారు భయము అను

బ్లాక్మెయిల్ చేసి, తగ్గు కులము వారందరినీ తమమాట వినునట్లు

చేసుకొన్నారు. ఆనాటినుండి హిందూ సమాజమును మోసము చేస్తూ

ఎవరికీ హిందూ జ్ఞానమును తెలియకుండా చేసి, తాము హిందూ

సమాజమును అనేక పేర్లతో దోచుకొంటూ బ్రతకడమేకాక, మిగతా

కులములలో ఎవరు జ్ఞానులుగా పుట్టినా, వారిని హేళన చేయడమూ,

అజ్ఞానిగా వర్ణించడమూ జరిగినది.



చరిత్రలో నాలుగు వందల సంవత్సరముల క్రితము వచ్చిన

వేమనను  పిచ్చివానిగా వర్ణించి, శాస్త్రము తెలియనివాడని వర్ణించారు.

తర్వాత మూడు వందలయాభై సంవత్సరముల క్రిందట వచ్చిన పోతులూరు

వీరబ్రహ్మముగారు గొప్ప జ్ఞానిగా తయారై, భవిష్యత్తు కాలములో జరుగు

సంఘటనలను ముందే తెలియజేసి గొప్ప కాలజ్ఞానమునే వ్రాశాడు. ఆయన

వ్రాసిన భవిష్యత్తు కాలక్రమమున నేటికినీ జరుగుచునేయున్నది. అంతటి

గొప్ప జ్ఞాని అయిన వీరబ్రహ్మముగారు అగ్రకులమువాడు కాకపోవుట వలన,

విశ్వకర్మ (ఆచారుల) కులమున పుట్టుట వలన, అగ్రకులము వారు బ్రహ్మము

గారు బ్రతికియున్న కాలములోనే, తమ ఊరిలోనికి రాకుండా, ఆయన

జ్ఞానమును ప్రచారము చేయకుండా అడ్డుకొన్నారు. ఆ రోజు ఇతరులు

జ్ఞానులు కాకూడదను 'అసూయ' అను గుణముతోనూ, మేమే తెలిసిన



వారమను గర్వముతోనూ ఆ పని చేశారు. హిందూ సమాజములో

ఇటువంటి వారుండుట వలన విసిగిపోయిన హిందువులు హిందూ

మతమును వీడి ఇతర మతములోనికి పోవుచున్నారు. ఇందూమతములో

దేవునికి గుడికి అంటరాని వారిగా ఉండలేని వారందరూ కొందరు జ్ఞానము

కొరకు, కొందరు కులవివక్ష లేని స్వతంత్రము కొరకు మతమును

మారజొచ్చారు. ఈ విధముగా హిందూమతములోనివారు ఇతర

మతములోనికి పోవుటకు మొదటి కారకులు హిందూమతములోని

అగ్రకులములవారేనని అనుమానము లేకుండా చెప్పవచ్చును.


తమ వలననే హిందువులు ఇతర మతములలోనికి పోవుచున్నారని

అగ్రకులమువారికి కూడా తెలుసు. అయితే తమ తప్పును ఎవరూ

గుర్తించనట్లు తాము హిందూమతమును ఉద్ధరించువారిగా, హిందూధర్మ

రక్షకులుగా వర్ణించుకొని హిందూ ధర్మ భక్షకులుగా నేటికినీ సమాజములో

కొనసాగుచున్నారు. వారిని హిందూ ధర్మ భక్షకులు, హిందూ ధర్మ నాశకులు

అని చెప్పుటకు అనేక ఆధారములు గలవు. అటువంటి వాటిని

పరిశీలించితే, హిందువులలోని మిగతా కులమువారివద్ద భగవద్గీతను

బోధించు కృష్ణుడు అర్జునుడు యున్న చిత్రపటము (ఫోటో) యుంటే దానిని

ఇంటిలో ఉంచుకోకూడదనీ, ఆ పటము ఇంటిలో ఉంటే ఇంటిలో కూడా

యుద్ధాలు వస్తాయనీ, అనేక కష్టాలు వచ్చి పాండవులు అరణ్యవాసము

పోయినట్లు బాధపడవలసివస్తుందనీ అగ్రకులమువారు నేటికినీ చెప్పుచునే

యున్నారు. అటువంటి భగవద్గీత ఫోటోలను గుడులలో ఉంచవలెననీ

లేకపోతే ఏటిలోని నదీ ప్రవాహములో పారవేయాలనీ చెప్పడము,

చేయించడము కూడా జరిగినది. అంతేకాక భగవద్గీతను ఇంటిలో ఉంచు

కోకూడదని భగవద్గీతను ఎవరూ చదువకూడదనీ, చదివితే కష్టాలు


వస్తాయనీ, భగవద్గీతను ఎవరి ఇంటిలోనూ లేకుండునట్లు చేయుచున్నారు.

భగవద్గీత అర్జునునికి యుద్ధరంగములో యుద్ధము చేయుటకు చెప్పినది,

అందువలన చదువకూడదు, చదివితే చదివినవారు కూడా అనేక తగాదాల

లోనూ, కోర్టు వ్యవహారములలోనూ చిక్కుకోవలసి వస్తుందని చెప్పడము

జరుగుచున్నది. ఇంకనూ హిందువులకు వేదములు ముఖ్యమైనవనీ వాటిని

అన్ని కులముల వారు చదువకూడదనీ, వేదములను తామే చదువవలెననీ

చెప్పడము కూడా జరుగుచున్నది. ఈ విధముగా భగవద్గీతకు వ్యతిరేఖముగా

మాట్లాడువారు హిందూ సమాజమునకు చీడపురుగులుకాక ఏమవుతారో

మీరే ఆలోచించండి?


ఇదంతయూ గతములో జరిగిన విషయములు, అవి చాలక ప్రస్తుత

కాలములో వీరి ఓర్వలేనితనము, మేమే పెద్ద అను గర్వము ఎలాగుందో

చూడండి. వేమనయోగిని, పోతులూరి వీరబ్రహ్మముగారిని అగ్రకులము

వారు ఎంత హేళన చేసినా వేమనయోగిని రెడ్డి కులస్థులు వేమారెడ్లుగా

గుర్రముల నెక్కి ప్రచారము చేయుట వలన, వీరబ్రహ్మముగారిని విశ్వకర్మ

(ఆచారి) కులమువారు కాలజ్ఞానమును ప్రచారము చేయుట వలన, వేమన

సంఘములు, విశ్వకర్మ సంఘములు తయారై వేమనను, బ్రహ్మముగారిని

ప్రచారము చేయుట వలన, కొంతమంది ప్రజలకు వేమనయోగి పద్యములు,

వీరబ్రహ్మము గారి కాలజ్ఞానము కొంతవరకు తెలియును. వేమనయోగి

ఆ కాలములోనే తన పద్యములలో అగ్రకులమువారు చేయు తప్పులను

ఎండగట్టడము జరిగినది. వీరబ్రహ్మముగారి చరిత్రలో కూడా బ్రహ్మము

గారికి అగ్రకులమువారు చేసిన ఆటంకములను వ్రాయడము జరిగినది.


వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో "ప్రబోధాశ్రమము

ఉన్నతమైన జ్ఞానముకలది” అని మూడువందల యాభై సంవత్సరములప్పుడే



వ్రాసియుంచాడు. కాలజ్ఞానములో ప్రబోధాశ్రమము యొక్క పేరుండడము

ఈ మధ్యన ఐదు సంవత్సరముల క్రితము మాకు తెలిసినది. తర్వాత

బ్రహ్మము గారు వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమునకు, ప్రబోధానంద

యోగీశ్వరులకు సంబంధించిన చాలా విషయములు వ్రాసినట్లు తెలిసినది.

ఎంతో గొప్ప జ్ఞాని, కాలజ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధా

శ్రమాధిపతియైన ప్రబోధానంద యోగీశ్వరులవారిని గొప్పగా చెప్పుచూ

"ప్రబోధాశ్రమమువారు శయనాధిపతి గుణములు కల్గియున్నారు.

శయనాధిపతియే ఆనందగురువు. ఆనంద గురువే నాకు గురువు, మీకూ

గురువు” అని వ్రాయడము జరిగినది. ప్రబోధానందయోగీశ్వరుల

జ్ఞానమేమిటో ఎంత శక్తివంతమైనదో జ్ఞాన జిజ్ఞాసులకు కూడా

తెలియుచున్నది. ఎందరో జ్ఞానులయినవారు యోగీశ్వరులు చెప్పుచున్న

జ్ఞానము ఎంతో గొప్పదని ప్రశంసించుచున్నారు. బ్రహ్మముగారే స్వయముగా

తన గురువుగా చెప్పుకొన్న వ్యక్తి ఎంతటి వాడయివుంటాడో మనము

కూడా ఆలోచించ వలసియున్నది. అయినా ప్రబోధానందయోగీశ్వరుల

వారు ఒక్క దైవజ్ఞానములో తప్ప మిగతా అన్నిటిలో సాధారణ వ్యక్తిగానే

కనిపిస్తాడు. ఎదురుగా చూస్తే ఇతనికి జ్ఞానము తెలియునా! అన్నట్లు

కనిపించినా, అవును ఆయన ఎవరికీ తెలియని గొప్పవాడే అన్నట్లు ఆయన

వ్రాసిన గ్రంథములే గొప్ప శక్తులుగా నిరూపించుకొన్నాయి. ఒక గ్రంథము

దగ్గరకు వస్తూనే కొందరిలో మార్పు కనిపించడమూ, కొందరు గ్రంథమును

చదివిన వెంటనే అంతవరకూ నయముగాని రోగములు పోవడము

జరుగుచున్నది.


పైకి కనిపించని శక్తి యోగీశ్వరులలో నిక్షిప్తమైయుండుట బయటికి

కనిపించకపోయినా ఆయన చెంతకు పోయినవారికి దేహములో నయము


కాని, మందులులేని ఎయిడ్స్, క్యాన్సర్, జ్వరములు

కాని, మందులులేని ఎయిడ్స్, క్యాన్సర్, డెంగీజ్వరములు సహితము

శాంతించి పోవడము జరుగుచుండుట వలన యోగీశ్వరులు ఎంతటివారో

ఎవరికయినా సులభముగా అర్థమయిపోగలదు.


వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఆనంద యోగిని

దూషించినవారు చాలా ఇబ్బందుల పాలవుతారని వ్రాయడము జరిగినది.

అలాగే ఆయననుగానీ, ఆయన గ్రంథములనుగానీ దూషించినవారు

ఇంతవరకు ఎవరూ సురక్షితముగా లేరు. తెలియని రోగములతో,

అర్థముకాని బాధలతో కొందరుండగా, కొందరు చిత్రహింసలపాలై

చనిపోవడము జరిగినది. అలా ఎందుకు జరుగుచున్నదో తెలియనివారు,

పాపమును మూటగట్టుకొనుటకు యోగీశ్వరులవారి జ్ఞానమునకు అక్కడక్కడ

ఆటంకములను కలుగజేయుచున్నారు. హిందూమతములో ఆది

శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. తర్వాత

కొంతకాలమునకు విశిష్టాద్వైత సిద్ధాంతమును రామానుజాచార్యులు

ప్రతిపాదించాడు. మరికొంత కాలమునకు ద్వైత సిద్ధాంతమును

మధ్వాచార్యులు ప్రకటించాడు. వీరు ముగ్గురూ అగ్రకులమువారు కావడము

విశేషము. గత ముప్ఫైఆరు సంవత్సరముల నుండి త్రైత సిద్ధాంతమును

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు, ప్రకటించి ఆ సిద్దాంతమునే

ప్రచారము , త్రైత సిద్ధాంతము ప్రకారము భగవద్గీతను వివరించి

వ్రాయడము జరిగినది. హిందూమతములోని సిద్ధాంతముల వివరము

తెలియని ప్రజలకు, అగ్రకులమువారు "త్రైతము అంటే క్రైస్తవులకు

సంబంధించినదనీ, త్రైత సిద్ధాంత భగవద్గీతయని పైకి చెప్పుచూ లోలోపల

క్రైస్తవ మతమును బోధించుచున్నారని” యోగీశ్వరులకు, యోగీశ్వరుల

జ్ఞానమునకు వ్యతిరేఖముగా చెప్పడము జరిగినది. హిందుత్వమును ఒక



వైపు సర్వనాశనము చేయుచున్న అగ్రకులములవారు, హిందూమతమును

కాపాడువారివలె నటించుచూ యోగీశ్వరుల జ్ఞానమునకు కొన్నిచోట్ల

ఆటంకము కల్గించడము జరిగినది. మూడుచోట్ల అన్యమతప్రచారమని

భగవద్గీతను, ప్రచారము చేయు యోగీశ్వరులు శిష్యుల మీద కేసులు

పెట్టడడము కూడా జరిగినది. కొన్నిచోట్ల ప్రత్యక్ష దాడులకు దిగడము

జరిగినది. అయినా ప్రబోధానంద శిష్యులు అన్నిటికీ ఓర్పు వహించి

జ్ఞానప్రచారము చేయుచున్నారు. ఈ మధ్యకాలములో నల్గొండ జిల్లా

భువనగిరిలో దేవేంద్ర అను మా సంఘ సభ్యునిమీద అన్యమత ప్రచారము

చేయుచున్నాడని ఆరోపించి కేసు పెట్టడము జరిగినది. అంతేకాకుండా

మా ప్రచార వాహనము భువనగిరిలోనికి పోయినప్పుడు మా ఊరిలో

ప్రచారము చేయవద్దని అడ్డుపడి పంపించడము జరిగినది. కరీంనగర్లో

గోడమీద "త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి" అని వ్రాస్తే, అగ్రకులము

వారువచ్చి ఇది క్రైస్తవ మతప్రచారము దానిని తుడిపివేయమని చెప్పడము

జరిగినది. రెండు రోజుల క్రిందట ఆళ్లగడ్డలో ప్రచార వాహనముండగా

అక్కడికి ఒక అగ్రకులస్థుడు వచ్చి ఇది క్రైస్తవ ప్రచారము, ఈ ప్రచారమును

నిలిపివేయండని ఘర్షణపడగా ఆ సమయానికి మా గ్రంథములు చదివిన

వారు అక్కడుండుట వలన వారే అగ్రకులమువారికి బుద్దిచెప్పి పంపడము

జరిగినది. అక్కడున్న ప్రజలు అనిన మాటలు “ఇది ఎంతో గొప్ప జ్ఞానము.

ఇంతకాలానికి గొప్ప జ్ఞానము దొరికిందని మేము సంతోషపడుచుంటే,

సమాజాన్ని సర్వనాశనము చేసిన మీరు దీనిని జ్ఞానము కాదంటారా?

ఇట్లే మాట్లాడితే ఊరిలో లేకుండా మిమ్ములను మేమే పంపుతాము” అని

అనడము జరిగినది. ఈ విధముగా ప్రజలే తిరగబడి బుద్ధిచెప్పు సమయము

అన్నిచోట్లా వస్తుంది.


గౌతమబుద్ధుడు జ్ఞానము చెప్పితే అతను అగ్రకులము వాడు

కాదని, ఆయనది వేరు మతమని ప్రచారము చేశారు. ఆ దినము గౌతముడు

హిందువే కదా! తమ ఆధిపత్యము కొరకు హిందూమతమునుండి బుద్దున్ని

చీల్చి అతనిది బౌద్ధమతమని చెప్పి హిందూమతమునుండి వేరు చేశారు.

ఈ దినము బౌద్ధమతము విదేశాలలో వ్యాపించియున్నా స్వదేశములో

లేకుండా చేసినది అగ్రకులము వారు కాదా! ఈ దినము బుద్ధుడు మావాడే

బౌద్ధము హిందూమతమే అని చెప్పుకోలేని పరిస్థితి మనకు ఏర్పడినది.

అలాగే ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పు త్రైత సిద్ధాంతమును హిందూ

మతములోని భాగము కాదనడమూ, త్రైత సిద్ధాంత భగవద్గీతను భగవద్గీతే

కాదనడమును ఒకవైపు ప్రజలు గమనిస్తున్నారు. ప్రబోధానంద యోగీశ్వరులు

గత 36 సంవత్సరములుగా బోధించుచున్న బోధ హిందుత్వములోనే

ఎంతో గొప్పదని అన్ని మతములవారు ఒప్పుకొనుచుండగా, తగ్గుకులము

వారని అగ్రకులముచే అనబడినవారందరూ హిందూ (ఇందూ) జ్ఞానమును

తెలుసుకొని చైతన్యవంతులై అగ్రకులము వారికి తిరగబడి జ్ఞానము చెప్పు

స్థితికి ఎదిగారు. తగ్గుకులము వారిమీద ఆధారపడి బ్రతుకుచున్న

అగ్రకులమువారిని తగ్గుకులము వారందరూ ఒక్కమారు వెలివేస్తే, మీతో

మాకు సంబంధము వద్దు అంటే ఏమవుతుందో చెప్పనవసరము లేదు.

అటువంటి స్థితి రాకుండుటకు మా జ్ఞానమునకు అడ్డురావద్దని అగ్రకులము

వారికి మరీమరీ చెప్పుచున్నాము.


ఇట్లు,

ప్రబోధ సేవాసమితి,

అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,

సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.


జ్ఞాన పరీక్ష.

శ్రీకృష్ణమందిరము, చిన్నపొడమల (గ్రా), తాడిపత్రి (మం), అనంతపురం (జిల్లా), ఎ.పి.

తేదీ : 04-04-2015.


సహజముగా ప్రతి మనిషి తనను తాను గొప్పగా తలచుకొను

చుండును. ప్రపంచ జ్ఞాన విషయములోగానీ, పరమాత్మ జ్ఞాన విషయములో

గానీ ఇతరులకంటే తాను తెలిసినవాడినని అనుకొనుచుండును. జ్ఞానము

ధనములాంటిది. అందువలన పెద్దలు జ్ఞానధనము అని జ్ఞానమును

ధనముతో సమానముగా పోల్చారు. ప్రపంచ ధనము ఎంతయున్నా తనవద్ద

ధనమున్నదని చెప్పుకోని మనిషి, జ్ఞానధనము ఏమాత్రము లేకున్నా

తనయొద్ద అందరికంటే ఎక్కువున్నదని చెప్పుకొనుచుండును. ప్రపంచ

ధనమును ఉన్నా లేదని చెప్పు మనిషి, జ్ఞానధనమును లేకున్నా ఉన్నదని

చెప్పుకోవడము జరుగుచున్న విషయమే. కొందరు దేవుడు చెప్పిన

జ్ఞానమును మార్చివేసి, తమ సొంత భావములను దేవుని భావములుగా

చెప్పుచూ, సమాజములో గొప్ప జ్ఞానులుగా చలామణి అగుచుందురు.

వాస్తవానికి వారివద్ద యున్నది ఏమాత్రము జ్ఞానము కాకున్నా, తమది

జ్ఞానమేయని ఇతరులను నమ్మించి మోసము చేయుచుందురు. దైవ

జ్ఞానమును కబ్జా చేసినవారు భూమిమీద అన్ని సమాజములలో ఉన్నారు.

జ్ఞానమును కబ్జా చేసినవారు ఎవరూ గుర్తుపట్టని పెద్ద మోసగాళ్ళుగా

యున్నారు. అయితే కొందరు ఒకరివద్దయున్న జ్ఞానమును హైజాక్ చేసి,

ఇతరులు చెప్పు జ్ఞానము తమ జ్ఞానమే అని ప్రచారము చేసుకొని, బయట

సమాజములో పెద్ద జ్ఞానులుగా చలామణి అగుచున్నారు. వాస్తవానికి

వారివద్ద జ్ఞానము లేకున్నా, తాము కూడా గురువులుగా చలామణి కావలెనను

ఉద్దేశ్యముతో, గురువు జ్ఞానమునే హైజాక్ చేసి గురువుకంటే తమనే పెద్దగా

ప్రచారము చేసుకొనుచుందురు.




మనుషులకొరకు దేవుడు జ్ఞానమును గ్రంథరూపములో చెప్పితే

దానిని కబ్జా చేసి, దేవుని గ్రంథముకంటే తమనే గొప్పగా ప్రటించుకొన్న

సమాజ పెద్దలు కొందరుండగా, కొన్నిచోట్ల జ్ఞానమును చెప్పువారివద్ద చేరిన

కొందరు, గురువుగారి జ్ఞానమును హైజాక్ చేసి తమను గురువుకంటే

పెద్దగా ప్రకటించుకొన్నవారు కూడా కలరు. ఈ విధముగా ఎవరికి వారు

మేము పెద్ద జ్ఞానులము అను ఉద్దేశ్యములో ఉన్నారని తెలిసిన దేవుడు

వారి నిజస్వరూపము వారికే అర్థమగులాగున, వారికి జ్ఞానములో ఎంత

హోదావున్నదో తెలియునట్లు అక్కడక్కడ పరీక్షకు గురిచేసి ఎవనిది వానికి

అర్థమగునట్లు చేయుచుండును. దేవుడు మనిషిని సమస్యల రూపములో

పరీక్షించుచుండును. దేవుని జ్ఞానమును దేవుడు సమస్యల రూపములో

పరీక్షించి ఎవరి స్థోమత ఎంతయుందో వారికే అర్థమగునట్లు చేయు

చుండును. అది దేవుని పనికాగా ఒక మనిషిగా మేము ప్రశ్నల రూపములో

ప్రశ్నించి అందులో మీరు వ్రాసిన జవాబులనుబట్టి మీకు జ్ఞానము ఎంత

యున్నదో తెలియునట్లు చేయుచున్నాము. ఇక్కడ ప్రశ్నించువారము మేమే

అగుటవలన వాటికి సరియైన జవాబును చెప్పవలసిన బాధ్యత కూడా

మాకున్నది. అందువలన ఇక్కడ జ్ఞానపరీక్షలో ప్రశ్నించిన మేము

ప్రశ్నలకు జవాబులను కూడా పొందుపరచి వ్రాయుచున్నాము. జవాబులు

చెప్పవలసినది మేమని మా ఇష్టము వచ్చిన జవాబును మేము చెప్పలేదు.

ప్రశ్నకు సరియైన జవాబుగా ఉండునట్లు, బ్రహ్మవిద్యాశాస్త్రమునకు లోబడి

యుండునట్లు, దైవజ్ఞానమునకు ఎక్కడా వ్యతిరేఖము లేనట్లు జవాబులు

వ్రాయడము జరిగినది. ఈ జ్ఞానపరీక్ష 04-04-2015లో జరిగినది.

కావున అందరికీ వెంటనే తెలియునట్లు ఇప్పుడు రెండవ ముద్రణ

జరుగుచున్న “సత్యాన్వేషి కథ” గ్రంథములోనికి జవాబులను చేర్చాము.


1)

ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.

ఏ చరిత్రకూ అందనివాడు ఒకడు గలడు. అతనిని మూడు

అక్షరముల పేరుతో పిలుస్తాము. రెండు అక్షరముల అర్థముతో

చెప్పుకొంటాము. అతను ఎవరు?

 జవాబు: 

ఈ ప్రశ్నకు జవాబు వ్రాసిన వారందరూ 'దేవుడు' అని జవాబు

వ్రాయడము జరిగినది. చరిత్రకు అందనివాడు అని అన్నప్పుడు చరిత్ర

లేనివాడు దేవుడే కదా!యని అందరూ అనుకోవడము జరిగినది. అంతేకాక

మూడు అక్షరముల పేరుకలవాడు అని అన్నప్పుడు దేవుడేయని నిర్ణయించు

కొని అదే జవాబునే అందరూ వ్రాయడము జరిగినది. అయితే ఇక్కడ

దేవునికి పేరు లేదు కదా!యను విషయమును అందరూ మరచిపోయారు.

వాస్తవానికి పేరు, ఆకారము జీవునికి, ఆత్మకు రెండిటికే కలదని, దేవుడు

పేరు, ఆకారము లేనివాడని మరచిపోయారు. అందువలన అందరూ

తప్పు జవాబును వ్రాయడము జరిగినది. ఈ ప్రశ్నకు అసలు జవాబును

క్రింది పేరాలో చూడండి.


జీవుడు సృష్ట్యాదినుండి ఉన్నాడు. ఒకే జీవుడు ఒకమారు పుట్టి,

ఒకమారు చస్తూ జన్మలు మారుచూ వచ్చుచున్నాడు. జనన మరణ

గమనములో ప్రయాణించుచున్న జీవుడు సృష్ట్యాదినుండి నేటివరకు

ఉన్నాడు. ఈ దినము ఒక మనిషిగాయున్న నేనుగానీ, నీవుగానీ మొదటి

నుండి ఈ భూమిమీదనే జీవించుచున్నాము. అయితే గతములో భూమిమీద

మనము జీవించిన చరిత్ర మనకున్నా గడచిన చరిత్ర ఎవరిది వారికి

తెలియదు. ఒకనిది మరొకనికీ తెలియదు. అందువలన జీవున్ని చరిత్రకు

అందనివాడు అని అనవలసివచ్చినది. ఒక మనిషి (జీవుడు) గత జన్మలో

ఎన్నో కష్టసుఖములను అనుభవించియున్నా గతజన్మల అనుభవములను

ఎవడూ చరిత్రగా వ్రాయలేడు. ఏమాత్రము ఊహించుకొని కూడా ఇలా



జరిగిందని చెప్పలేడు. ఈ విధముగా జీవుడు చరిత్రకు అందనివాడేకాక

అతడు ఆత్మశక్తితో కూడుకొని జీవించుచున్నాడు. అందువలన

రెండక్షరముల అర్థముతో జీవ+ఆత్మ=జీవాత్మ అని చెప్పబడుచున్నాడు.

ప్రతి జీవునితోనూ ఆత్మ కూటస్థునిగాయుండుట వలన ప్రతి జీవున్నీ

జీవాత్మయని పిలువవచ్చును. అంతేకాక ప్రతి శరీరములోని జీవుడు

జీవాత్మగా పిలువబడినా, జీవునిగా పిలువబడినా అతను మూడక్షరముల

పేరుతోనే పిలువబడుచున్నాడు. అందువలన ఈ ప్రశ్నలో చరిత్రకు అందని

వానిని మూడక్షరముల పేరుతో పిలువబడువాడు అని అడిగాము. ఈ

ప్రశ్నకు అన్ని విధములా సరియైన జవాబు 'జీవుడు' అని వ్రాయవలెను.

అయితే అందరూ 'దేవుడు' అని వ్రాసిన దానివలన పూర్తి తప్పు జవాబుగా

లెక్కించడము జరిగినది. ఈ పరీక్షలో ఏడువందలమంది పాల్గొంటే అందరూ

తప్పు జవాబును వ్రాసి రావలసిన మార్కును పోగొట్టుకున్నారు.


2)ఆకాశమని దేనిని అంటారు?


 జవాబు : ఈ ప్రశ్నకు చాలామంది ఏమాత్రము బుద్ధితో ఆలోచించకుండా

'శూన్యము' అని వ్రాశారు. 'గగనము శూన్యము' అను మాట ప్రకారము

నూటికి తొంభైమంది శూన్యమను జవాబును వ్రాయడము జరిగినది.

శూన్యము అనడములో తప్పులేదుగానీ, ఇక్కడ అడిగిన విధానమునకు

చెప్పిన సమాధానము సరియైనది కాదు. ఇక్కడ 'ఆకాశమని దేనిని

అంటాము' అని అడగడము జరిగినది. ఒకవేళ దేనిని ఆకాశమని,

ఆకాశమును వెనుక చెప్పియుంటే శూన్యమను జవాబు కొంతవరకు

సరిపోయేది. అయితే ఇక్కడ ప్రశ్నలో ఆకాశమని ముందే చెప్పి దేనిని

అని వెనుక చెప్పాము. ముందు చెప్పినా, వెనుక చెప్పినా మీరు అడిగినది

ఆకాశమునే కదా!యని అడుగవచ్చును. అయితే ముందు వెనుక



అడగడములో కొంత తేడా యున్నది. 'ఆకాశమని దేనిని అంటాము' అని

అడిగినప్పుడు రంగు, రూపు, పరిమాణమున్న ఒక పదార్థముగా చెప్పవలసి

వచ్చినది. ఏదో ఒక ముక్కను చూపి దానిని ఆకాశమని చెప్పవలసియున్నది.

ఒకవేళ ‘శూన్యము’ అని చెప్పిన జవాబు, ఒకటి అయిన దేనినీ చూపించదు.

శూన్యము అనినా అది అంతటా వ్యాపించినదై రంగు రూపులేనిదైవుంటూ

ఒక వస్తువుగా లేక ఒక పరిమాణముగల ఆకారముగా కనిపించదు.

అటువంటప్పుడు ‘దేనిని' అను మాట సరిపోదు. 'దేనిని' అన్నప్పుడు అది

గుర్తింపబడునదిగా ఉండవలెనను సూక్ష్మమును ఈ ప్రశ్నలో జ్ఞాపకముంచు

కోవలెను.


ఆకాశము పంచభూతములలో మొదటిది, పెద్దది మరియు అంతటా

వ్యాపించినది. అటువంటప్పుడు ఒక భాగముగానో, ఒక ఆకారముగానో

వర్ణించి చెప్పుటకు వీలులేకుండా ఉండును. ప్రకృతి రూపములోయున్న

పంచభూతములు ఒక్కొక్కటి ఒకరకమైన పనిని చేయుచుండును. ఏ పనీ

లేనివాడు క్రియారహితుడు దేవుడు ఒక్కడే. పని చేయునది ప్రకృతి

అయినందున ప్రకృతిలోని ఐదు భాగములయిన ఆకాశము, గాలి, అగ్ని,

నీరు, భూమి అన్నీ వాటివాటి పనులు చేయవలసియున్నది. భూమి

పంటలనిచ్చునదేకాక, భూకంపములను సృష్ఠించును. నీరు పైరుకు,

మనుషులకు ఒక భాగమైన ఆహారముగా ఉండుటయేకాక వరదలు,

సునామీలను సృష్ఠించును. అగ్ని ఆహారమును పచనముచేయడమేకాక

దావానలమై అన్నిటినీ దహించివేయును. గాలి అన్ని జీవరాసులకు

ప్రాణవాయువును ఇచ్చునదేకాక దేనినైనా కూలద్రోయును. ఇకపోతే

ఆకాశము అక్కడక్కడ మేఘముగా మారిపోయి వర్షించునదే కాక మనిషికి

తెలియని ఎన్నో కార్యములను చేయుచున్నది. ఆకాశము మేఘరూపమై


వ్యాధులను భూమి మీద వదలుచున్నది. తర్వాత ఆ వ్యాధులను

భూమిమీదనుండి తీసుకొని పోవుచున్నది. ఈ విధముగా ఆకాశము

'మేఘము' అను పరిమాణముగల ఒక ఆకారముగా మారి తన కార్యమును

తాను చేయుచున్నది. ఆకాశము మేఘముగా మారుటవలన మేఘమునకు

రంగు, రూపు, కార్యము అని ఏర్పడినవి. అందువలన ఒక పరిమాణమున్న

మేఘమును ఒక దానిగా భావించి ‘దేనిని?' అని ప్రశ్నించడము జరిగినది.

ఆకాశమును ఒక పరిమాణముగలు దేనిగాయున్నదని ప్రశ్నించడము

జరిగినది. 'దేనిని?' అని ప్రశ్నవచ్చినప్పుడు ఆకాశము ఒక ఖండము

(ఒక ముక్క) కాదు కదా! అలాంటప్పుడు 'దేనిని' అని ఒక గుర్తింపుగా

ఎందుకు అడిగారని జవాబు చెప్పువారు ఆలోచించవలసియున్నది. అయితే

అటువంటి ఆలోచన చేయకుండా మేఘమంటే శూన్యమని వ్రాయడము

వలన ఆ జవాబును తప్పుగా లెక్కించవలసి వచ్చినది. ఈ ప్రశ్నకు

వాస్తవమైన జవాబు “మేఘము” అని వ్రాయవలెను.


3) “నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారా తప్ప తండ్రి

యొద్దకు ఎవడూ రాలేడు.” ఈ మాటను ఎవరన్నారు?


ఈ ప్రశ్నకు కూడా బహుకొద్దిమంది తప్ప మిగతా వారందరూ

ఏసు అని వ్రాశారు. బైబిలులో ఏసు అలా చెప్పాడని క్రైస్తవులు అనుచుండుట

వలన ఆ మాటను విన్నవారంతా ఏసు అని జవాబు వ్రాశారు. ఇక్కడ

కూడా ఈ జవాబును తప్పుగా పరిగణించడము జరిగినది. ఇందులో

తప్పు ఏముంది? ఆ మాట అన్నది ఏసే కదా!యని అందరూ

అనుకోవచ్చును. అయితే ఇక్కడ అందరికీ తెలియని తతంగము

ఒకటిగలదు. అదేమనగా! 'నేనే మార్గమును' అని మొదటే చెప్పడము

జరిగినది. మార్గము అన్న తర్వాత దానికి గమ్యము కూడా ఉంటుంది.



ఇక్కడ ఆధ్యాత్మికరీత్యా “గమ్యము” అనునది "మోక్షము లేక దేవున్ని

చేరడము” అని చెప్పవచ్చును. “దేవునివద్దకు చేరుటకు నేనే మార్గమును,

నా ద్వారా తప్ప తండ్రియొద్దకు ఎవడూ రాలేడు” అని ఉండడము గమనిస్తే

దేవుడు ఎవరికి తండ్రి అని ముందు చూసుకోవలసిన అవసరమున్నది.


దేవుడు ఆత్మకు తండ్రికాగా, ఆత్మ భౌతికముగా కనిపించు ఏసుకు

తండ్రిగాయున్నది. ఏసు అని జవాబు చెప్పితే అతను తనకు తండ్రియను

చెప్పుకొను ఆత్మవద్దకు పోవాలంటే 'నేనే మార్గము' అని చెప్పియుండాలి.

ఆధ్యాత్మికరీత్యా అసలయిన గమ్యము, అందరికీ గమ్యము దేవుడే

అయినందున ఆత్మ గమ్యము కాదని తెలిసిపోయినది. భౌతికముగా

కనిపించు ఏసుకు ఆత్మ తండ్రికాగా, ఆత్మకు తండ్రి దేవుడైయున్నాడు. ఏ

మనిషి అయినా చివరికి చేరవలసింది దేవునివద్దకే కావున, ఈ మాటను

ఏసు చెప్పలేదనీ, ఏసు లోపలయున్న ఆత్మయే చెప్పినదని చెప్పవలసి

యున్నది. ఎవడయినా కానీ దేవునివద్దకు చేరాలంటే ఆత్మ ద్వారానే

చేరవలసియున్నది. అందువలన ఏసు అని వ్రాయబడిన జవాబు తప్పుగా

లెక్కించవలసి వచ్చినది. ఎవరయితే ఆత్మయని వ్రాశారో వారి జవాబును

సరియైనదిగా పరిగణించడమైనది.


4) రోగములు, ఔషధములు ఒక్కచోటే ఉన్నాయి, ఎక్కడ?

ఈ ప్రశ్నకు జవాబు ‘రోడ్డు ప్రక్కన' అని బహుకొద్దిమంది వ్రాయగా,

ఎక్కువమంది 'శరీరములో' అని వ్రాశారు. అంతేకాక ఒకరు లేక ఇద్దరు

సరియైన జవాబు వ్రాయడము కూడా జరిగినది. రోగములు, ఔషధములు

శరీరములోనే ఉన్నాయి అని వ్రాయడము కొంతవరకు సమంజసమే అయినా

దానికంటే మెరుగైన జవాబు మరొకటియుండడము వలన 'శరీరములో”

అనుమాటను అసలయిన జవాబుగా తీసుకోలేదు. ఒక జవాబు చెప్పితే


దానిని గురించి రెండవ ప్రశ్న ఉండకూడదన్నదే మా ఉద్దేశ్యము.

అందువలన 'శరీరములో” అను మాటకంటే ఉత్తమమైన జవాబును

పరిగణలోనికి తీసుకోవడము జరిగినది. రోగములు ఔషధములు ఒక్కచోట

ఉన్నాయి అన్నప్పుడు, అ ఒక్కచోటును ఖచ్చితముగా గుర్తించి చెప్పవలసిన

అవసరమున్నది. ఒకవేళ 'శరీరములో అన్నమాటను తీసుకొంటే రోగములు

ఔషధములు శరీరములో ఉన్నమాట వాస్తవమే, అయినా రెండవ జవాబుగా

శరీరములో ఫలానాచోటనే ఉన్నాయి అని చెప్పవలసివచ్చును. అందువలన

శరీరము అను జవాబుకంటే ఉత్తమమైన జవాబుగా శరీరములో ఒక

ప్రత్యేకమైన జాగాను చెప్పవలసివచ్చినది. రోగములు పాపము వలన,

ఔషధములు పుణ్యమువలన ఉంటాయి. దీనినిబట్టి రోగములకు,

ఔషధములకు మూలకారణమైన పాపపుణ్యములు ఎక్కడుంటాయో అక్కడే

రోగములు, ఔషధములు ఉన్నాయని చెప్పవచ్చును. రోగములకు,

ఔషధములకు మనిషి కర్మే కారణమైనందున మనిషి శరీరములో కర్మ

ఎక్కడుండునో అక్కడే అతని రోగములు, ఔషధములున్నాయని చెప్పవచ్చును.

మనిషి శరీరములోని కర్మ అతని తలలోని కర్మచక్రములో యున్నది. కర్మ

చక్రములోని కర్మ రోగములకు, ఔషధములకు నిలయమైనందున ఈ

ప్రశ్నకు సరియైన జవాబుగా 'కర్మలోయని చెప్పవచ్చును. లేకపోతే 'కర్మ

చక్రములోయున్న కర్మలో యని కూడా చెప్పవచ్చును. 'శరీరములో” అను

మాటకంటే 'కర్మలో' అనుమాట ఉత్తమమైన జవాబుగాయున్నట్లు తలచ

వలెను.


5) దైవజ్ఞానమును ఒక్కరు తప్ప ఎవరూ చెప్పలేరు? ఆ ఒక్కరు ఎవరు?

'దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదు' అని

ఒక దైవగ్రంథములో వ్రాయబడియున్నది. ఒక మనిషి దైవజ్ఞానమును



తెలియాలంటే మరొక మనిషి ద్వారానే తెలియవలసియున్నది. అయితే

దైవగ్రంథములోని వాక్యములో దేవునికి తప్ప వేరెవరికీ తెలియదని

యుండుట వలన దేవుని జ్ఞానమును దేవుడే చెప్పవలసియున్నది. అయితే

దేవునికి రూపములేదు మరియు దేవుడు మాట్లాడడు అను నియమముతో

యున్నాడు. అందువలన దేవుడు ప్రత్యక్షముగా తన జ్ఞానమును మనిషికి

తెలుపడు అని అర్థమయినది. అయితే దేవుని జ్ఞానము దేవునికి తప్ప

ఇతరులకు ఎవరికీ తెలియని దానివలన, దేవుడే ప్రత్యక్షముగా కాకున్నా

పరోక్షముగానయినా చెప్పవలసియున్నది. దేవుడు పరోక్షముగా చెప్పవలసి

వస్తే మనుషుల ఆకారములోనికి వచ్చి, మనుషుల భాషలోనే

చెప్పవలసియున్నది. దేవుడు మనిషిగా రావచ్చునుగానీ, మనిషి దేవుడు

కాలేడు. దేవుడు మనిషిగా వచ్చినప్పుడు దేవుడుగా కాకుండా మనిషిగా

కనిపించినా, అతను మనిషి కాడు. దేవుని జ్ఞానమును చెప్పువాడు

దేవుడే అయినా అటు దేవుడూకాక, ఇటు మనిషీకాక రెండిటికీ తప్పిన

వాడుగాయుండును. కనిపించేది మనిషి ఆకారమే అయినా అతను

మనిషి కాడు. చెప్పేది దేవునిజ్ఞానమే అయినా అతను దేవుడు కాడు. అటు

మనిషీ కాకుండా, ఇటు దేవుడూ కాకుండా మనిషిగా కనిపించు వానిని

మనిషి అని అనలేము, అట్లే దేవుడు అని కూడా అనకూడదు. మనిషికి

దేవునికి మధ్యలో మరొక పేరుగల వానిగా చెప్పవచ్చును. ఆ పేరే

భగవంతుడు. భగవంతుడు అంటే దేవుడూ కాదు, మనిషి కాదని అర్థము.

దేవుడు తన జ్ఞానమును మనుషులకు చెప్ప వలసివచ్చినప్పుడు భగవంతుడు

అను మారుపేరుతో, మారువేషముతో వచ్చి చెప్పిపోవును. భగవంతుడు

మనిషిగాయున్నా అతని శరీరములో పరమాత్మయే ఆత్మగా, జీవాత్మగా

చీలి పని చేయుచుండును. జీవాత్మగా ప్రపంచములో కలుగు కష్ట

సుఖములను అనుభవించుచూ సాధారణ మనిషివలెయున్నా, భగవంతుడుగా


జ్ఞానము చెప్పవలసి వచ్చినప్పుడు ఆత్మగా జ్ఞానమును చెప్పుచున్నాడు.

పరమాత్మగా సాక్షిభూతుడై ఒకే శరీరములో యుండడము జరుగుచున్నది.

దైవజ్ఞానమును భగవంతుడు లేక గురువు అనబడు మనిషి చెప్పినా

అతనిలోని ముగ్గురు పురుషులయిన జీవాత్మ, ఆత్మ, పరమాత్మలలో రెండవ

వాడయిన ఆత్మయే జ్ఞానమును చెప్పును. అందువలన ఈ ప్రశ్నలో

“దైవజ్ఞానమును ఒకరు తప్ప ఎవరూ చెప్పలేరు, ఆ ఒక్కరు ఎవరు?" అని

అడిగాము. చాలామంది 'గురువు' అని వ్రాశారు. ఇంకా కొందరు

‘భగవంతుడు' అని వ్రాశారు. గురువు, భగవంతుడు అని వ్రాసినా రెండూ

సరియైన జవాబులే అయినప్పటికీ, ఇంకా లోతుగా చెప్పగలిగితే ఆత్మ

అని చెప్పడమే సరియైన జవాబగును. గురువు లేక భగవంతుడు అని

చెప్పితే అందులో కూడా దేవుడు ముగ్గురు పురుషులుగా విభజింపబడి

యుండుట వలన ముగ్గురిలో ఖచ్చితముగా ఎవరు అను ప్రశ్న రాగలదు.

చివరికి ప్రశ్న మిగలకుండా చెప్పబడు జవాబే సరియైన జవాబగును.

అందువలన ఈ ప్రశ్నకు ఆత్మ అని చెప్పడమే సక్రమమైన జవాబుగా

లెక్కించడము జరిగినది.


6) పాము అని పిలువబడుచు పాముకానిది ఏది?

ఇక్కడ మేము ప్రశ్నించినది ఆధ్యాత్మిక రంగములోని ప్రశ్న.

అందువలన జవాబు కూడా ఆధ్యాత్మికముగానే ఉండవలెను. ఈ ప్రశ్నలను

పొడుపు ప్రశ్నలుగా లెక్కించకూడదు. కొందరు అలాగే లెక్కించి అటువంటి

జవాబునే వ్రాశారు. పాముకాని పాము వానపాము అని వ్రాశారు. అయితే

దానిని మేము ఏమాత్రము జవాబుగా లెక్కించలేదు. కొందరు అలా వ్రాసినా

చాలామంది సరియైన జవాబును వ్రాసి మార్కును సంపాదించుకొన్నారు.

ఈ ప్రశ్నకు సరియైన జవాబు 'వెన్నుపాము' అని వ్రాయుట సరియైన



జవాబగును. పాము తల తోక కలిగి కొంత పొడవుగాయుండి తలనుండి

తోకవైపు పోనుపోను చిన్నగా ఉండును. మన శరీరములోని బ్రహ్మనాడి

అనబడు పెద్ద నరము పాము ఆకారమును పోలియుండుట వలన

వెన్నుపాము అని పేరుపెట్టి బ్రహ్మనాడిని పిలువడము జరుగుచున్నది.


7) కర్మలేనిది జన్మలేదు అంటారు వాస్తవమేనా?

ప్రతి మనిషికి కర్మలేనిది జన్మ కలుగదు అనుమాట వాస్తవమే

అయినా ఇక్కడ కొంత ఆలోచించవలసిన అవసరమున్నది. మనిషిగానీ,

ఏ జీవరాసిగానీ పుట్టిందంటే దాని పుట్టుకకు కారణము కర్మయని అందరికీ

తెలిసిన విషయమే. అయితే దేవుడు మనిషికి తన జ్ఞానమును తెలియజేయు

నిమిత్తము మనిషిగానే వచ్చి పుట్టవలసియున్నది. అలా దేవుడు కనిపించు

మనిషిగా పుట్టినా అతనికి కర్మ ఉండదు. దేవుడు మనిషిగా వస్తే ఆయన

జన్మకు కర్మ కారణము కాదు. దేవుడు కర్మలేనివాడు. కర్మలేని దేవుడు

భగవంతుడు అనబడు మనిషిగా పుట్టునప్పుడు ఆయనకు కర్మలేదు.

భగవంతుడు పుట్టిన తర్వాత లేని కర్మను సృష్టించుకొంటాడుగానీ, ఆయన

పుట్టక ముందు ఆయనకు కర్మలేదని చెప్పవచ్చును. అందువలన

భగవంతుని పుట్టుకకు కర్మలేదనీ, కర్మలేకుండా పుట్టువాడు భగవంతుడని

చెప్పవచ్చును.


8) కన్నును నేత్రమని ఎందుకు అన్నారు?

జవాబు။ 'కన్ను' అను పదము 'కన్నము' అను పదమునుండి పుట్టినది.

కన్నము అనగా రంధ్రము అని అర్థము. ముఖములో ఎముకచేత ఏర్పడిన

రంధ్రములో నేత్రము ఉండుట వలన కన్నములోనిది అని తెలియునట్లు

దానిని కన్ను అని అనడము జరుగుచున్నది. అందరూ నేడు నేత్రమును

కన్ను అను పదముతోనే పలుకుచున్నారు. ఎక్కువ శాతము మనుషులు


కన్ను అను పదమునే చెప్పుచున్నా కొన్ని సందర్భములలో కొన్నిచోట్ల

మాత్రము కన్నును నేత్రము అంటున్నారు. నేత్రమును కన్ను అని ఎందుకు

అన్నారో తెలిసిపోయినది. అయితే కన్నును నేత్రమని ఎందుకు అన్నారో

ఇప్పుడు చెప్పుకోవలసియున్నది. కన్నములోయున్నది కన్ను అన్నట్లే

త్రైతముతో యున్నది నేత్రము అని చెప్పవచ్చును. నేను ఇప్పుడు చెప్పునది

కాదుకానీ, పూర్వము పెద్దలు మూడు భాగములుగాయున్నది నేత్రము అని

అన్నారు. నేత్రము యొక్క అర్థమును పరిశీలించి చూస్తే, ఈ నేత్రము

పదములో 'నేత్ర' అను రెండు అక్షరముల సారాంశముగల అర్థముతో

కూడుకొన్నదని చెప్పవచ్చును. 'ము' అను అక్షరమునకు అర్ధము లేదు

పదమును ముగించుటకు 'ము' అను శబ్దమును వాడవలసివచ్చినది.

నేత్రము అను మూడక్షరముల పదములో రెండక్షరములకే మనము అర్థము

చెప్పుకోవలసియున్నది. "త్ర" అను అక్షరమును గమణించితే మూడు

అని తెలియగలదు. త్రయము అనగా మూడు అని అర్థము. త్రయము

అను పదములో మొదటి అక్షరమును తీసుకొని నేత్రములో రెండవ

అక్షరముగా చెప్పారు. 'నేత్ర' అను రెండు అక్షరములలో 'త్ర' పోగా

మిగిలినది నే అను అక్షరము. నే అను అక్షరము నేర్పుట లేక నేర్చుట

అను పదములో మొదటి అక్షరముగా వాడబడుచున్నది. నేర్పుట అను

అర్థమునుండి నే అను అక్షరమును తీసుకొని నేత్ర అని పదముగా చెప్పడము

జరిగినది. నేత్ర అను పదమునకు ముగింపు అక్షరముగా 'ము' అను

అక్షరమును చేర్చి నేత్రము అని అన్నారు. నేత్రము లేక నేత్ర అనగా

మూడును నేర్పునదని అర్థము. మూడు భాగములుగా కన్ను కలదు.

తెల్లని గుడ్డులో నల్లని గుడ్డు ఉండగా, నల్లని గుడ్డులో చిన్నగా మరియొక

గుండ్రని భాగము నల్లగా కనిపించుచుండును.  అలా ఎవరి కన్నును

చూచినా మూడు భాగములుగానే ఉండును. నేత్రములోని మూడు





భాగములకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తింపుగలదు. అందులో పూర్తి

తెల్లగయున్న విశాల భాగమునకు లేక పెద్ద భాగమునకు పరమాత్మ గుర్తుగా

చెప్పవచ్చును. తెల్లని భాగము తర్వాత దానికంటే చిన్నదిగా నల్లని గుండ్రని

భాగము కలదు. తెల్ల భాగములోని నల్ల భాగమును ఆత్మగా చెప్పవచ్చును.

ఆత్మ యొక్క గుర్తుగాయున్న నల్లని భాగములో మధ్యన నల్లని చిన్న

ఆకారముండును. దానిని జీవాత్మగా చెప్పవచ్చును. సృష్ట్యాదినుండి

పరమాత్మలోనూ, ఆత్మలోనూ ఎటువంటి మార్పులేదు. అందువలన

కంటిలోని ఆ రెండు భాగములలో ఏ మార్పు కనిపించకయుండును. అయితే

జీవాత్మ అయిన వాడు ఒక జన్మలో తక్కువ కర్మతోనూ, మరియొక జన్మలో

ఎక్కువ కర్మతోనూ పుట్టుచున్నాడు. జీవుడు కర్మనుబట్టి మారుచుండును.

అంతేకాక కొన్నిచోట్ల జ్ఞానిగా, కొన్ని చోట్ల అజ్ఞానిగా కూడా ఉండడము

జరుగుచున్నది. జీవునిలో అటువంటి మార్పులు ఉండుట వలన జీవాత్మగా

గుర్తింపుపొంది చిన్నగా యున్న నల్లని భాగము కూడా మార్పులతో

కూడియుండును. ఒక సమయములో చిన్నగా ముకులించుకొనియుండి

మరియొక సమయములో పెద్దగా వ్యాకోచము చెందడము కూడా

జరుగుచున్నది. వెలుగులో చిన్నగాయున్న జీవము అను కంటిపాప చీకటిలో

పెద్దగా మారడము జరుగుచున్నది. జీవుడు అనేక సందర్భములలో అనేక

అనుభవములను పొందుటవలన కష్టాలలో ఒక విధముగా, సుఖాలలో

మరొక విధముగా ఉండుట వలన జీవుని ప్రతి రూపముగాయున్న చిన్న

నల్లని భాగము కూడా చీకటిలో ఒక రకముగా, వెలుగులో మరొకరకముగా

ఉండును. దీనితో కష్ట సుఖాలకు స్పందించువాడు లేక మార్పు చెందువాడు

జీవుడు అని తెలియుచున్నది. దేవుడు మూడు భాగములుగా, మూడు

ఆత్మలుగా ఉన్నాడని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమను

అధ్యాయమున 16,17 శ్లోకములలో కలదు. అక్కడ చెప్పిన త్రయితము


కన్నులో కనిపించుచున్నది. అందువలన కన్నును నేత్రము అని

పెద్దలనడమైనది.


9) అత్యంత మెత్తనిది, అత్యంత గట్టిది ఏది?

జవాబు: ఈ ప్రశ్నకు కొందరు తప్పు జవాబు వ్రాయగా, కొందరు సరియైన

జవాబు వ్రాశారు. కొందరు మాయ అని అన్నారు. కొందరు దేవుడని,

కొందరు రాయి అని వ్రాయడము జరిగినది. కొందరు మాత్రము “మనస్సు”

అని వ్రాశారు. మనస్సు అను జవాబే సరియైనదని మేము చెప్పడము

జరిగినది. ఒక విషయమును నేను నా ఇష్టమొచ్చినట్లు చెప్పకుండా

శాస్త్రబద్దముగా ఉండునట్లు, జ్ఞానులందరూ ఒప్పుకొన్నదిగా సరిపోవునట్లు

చెప్పుచుందుము. మన శరీరములో స్థూల అవయవములు కొన్నియుండగా,

సూక్ష్మ అవయవములు కొన్ని గలవు. అందులో కంటికి కనిపించనిది,

చేతికి దొరకనిది, కొలతలేనది మనస్సు. మనస్సు కొన్ని విషయములలో

చాలా మెత్తగా, కొన్ని విషయములలో చాలా గట్టిగా (కఠినముగా)

ఉండునని పెద్దలు చెప్పుచుందురు. ఈ విషయమును ధృవీకరించుచూ

వేమనయోగి ఒక పద్యమును కూడా చెప్పాడు.


పద్యము


ఇనుమున చేసిన మైనపుకడ్డీ

ముంటిమొన నర్రావుల దొడ్డి

కూర్చుండి మేపిన కుందనపుగడ్డి

విప్పి చెప్పురా వేమారెడ్డి.


ఈ పదములో మొదటి చరణములో కడ్డీ అని కలదు.  ఆ కడ్డీ 

ఇనుముతో చేసినదని చెప్పుట వలన చాలాగట్టిగా ఉండి, వంగక ఉండునని

అర్థమగుచున్నది. అట్లే వాక్యము చివరిలో మైనపుకడ్డీ అని చెప్పడము




వలన అది సులభముగా వంగిపోవునని కూడా తెలియుచున్నది. ఈ

విధముగా ఒకే మనస్సు కొన్ని సందర్భములలో ఇనుమువలె కఠినముగా

ఉండుననీ, కొన్ని సందర్భములలో మైనపుకడ్డీవలె మెత్తగా ఉండునని చెప్పకనే

తెలియుచున్నది. కొందరు సినిమాను చూచునప్పుడు దృశ్యములో

బాధాకరమైన సంఘటనయుంటే చూచేవానికి కూడా కన్నీరు రావడము

జరుగుచున్నది. దీనినిబట్టి కొందరి మనస్సు కొన్ని సంఘటనలలో వెన్నవలె

కరిగిపోతుందని కూడా చెప్పుచుందురు. దీనిని గురించి చెప్పుకొంటే

ఎంతో లోతయిన సమాచారము ఉన్నది. అయితే ఇక్కడ సందర్భానుసారము

అత్యంతమెత్తనిది, అత్యంతగట్టిది మనస్సని జవాబు చెప్పవచ్చును.


10) అత్యంత కష్టమైనది, అత్యంత సులభమైనది ఏది?


ఈ ప్రశ్నకు సరియైన జవాబును నూటికి తొంభైమంది వ్రాశారు.

కొందరు మాత్రము 'దేవుడు' అని కూడా వ్రాశారు. దేవుడు అనుమాట

కొంతవరకు నిజమే అయినా దానికంటే ఉత్తమమైన జవాబు మరొకటి

ఉండడము వలన దేవుడు అనుమాటను మేము ఒప్పుకోలేదు. దేవున్ని

తెలియుటకు మొదట దేవుని జ్ఞానము అవసరము. దేవుని జ్ఞానము దేవుడే

దిగివచ్చి చెప్పినా మనిషి అర్థము చేసుకోలేని స్థితిలోయున్నాడు. భూమిమీద

ఎంతో మేధావులున్నా వారికి దేవుని జ్ఞానము అవగాహనకు రాలేదు.

మనిషికి శ్రద్ధయున్నప్పుడే జ్ఞానము లభించునని దేవుడు తన ప్రథమ దైవ

గ్రంథమయిన భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున 39వ శ్లోకములో

చెప్పియున్నాడు. శ్రద్ధయుండవలెనంటే చాలా కష్టము. ప్రకృతి ఆకర్షణ

చేత మనిషి శ్రద్ధయంతయూ ప్రపంచమువైపు పోవుచున్నది. మనిషి తలలోని

గుణముల ప్రభావమును మాయ అని అనుచున్నాము. గుణ ప్రభావమను

మాయచేత మనిషి తన శ్రద్ధను దేవునివైపు నిలుపలేకపోవుచున్నాడు.


మనిషికున్న శ్రద్ధయంతయూ ప్రపంచమువైపు పోవుట వలన దేవుని జ్ఞానము

మనిషికి ఏమాత్రము అర్థముకాక జ్ఞానము అత్యంత కష్టముగా కనిపించు

చున్నది.


మనిషి శ్రద్ధ దేవునిమీద వుంటే దేవుని జ్ఞానము అత్యంత

సులభముగా అర్థము కాగలదు. అయితే మనిషి శ్రద్ధను మాయ దారి

మళ్ళించి ప్రపంచమువైపు పంపుటవలన మనిషి ఎంత మేధావియైనా

దేవుని జ్ఞానము ఏమాత్రము అతనికి అర్థముకాకుండా పోయినది. మనిషి

దేవుని జ్ఞానము తెలియాలని అనుకొని ప్రయత్నము చేసినా, దేవుని

జ్ఞానమును అర్థము కాకుండునట్లు మాయ మనిషి శ్రద్దను ప్రక్కకు

మళ్ళించడము వలన మనిషి జ్ఞానమును తెలియలేకపోతే అది మనిషి

తప్పుకాదు కదా! మనిషికి శ్రద్ధను లేకుండా చేసిన మాయది తప్పుకదా!యని

కొందరు అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగాయున్నది.

ఇక్కడ పైకి కనిపించు తప్పు మాయదే అయినా ఆ తప్పు మనిషిదేయనీ,

మనిషిని బట్టి మాయ అలా చేసిందని చెప్పవచ్చును. వివరములోనికి

పోయి చూస్తే, దేవునిమీద పైకి ఇష్టమును కనపరచి లోపల ప్రపంచ

ధ్యాసలోయున్న వానిని దేవుడు ఇష్టపడడు. దేవునిమీద విశ్వాసమున్నట్లు

అందరికీ కనిపించినా లోపల దేవునిమీదగానీ, దేవుని జ్ఞానముమీదగానీ

విశ్వసించని వానిని దేవుడు ఇష్టపడడు. ఇంకా వివరముగా చెప్పితే తన

మతమును ప్రేమించుటయందు శ్రద్దకలిగి దేవుని వాక్యమును సహితము

లెక్కించని వానిని దేవుడు ఇష్టపడడు. అటువంటి వానిని మాయ కనుకొని

దేవునికి ఇష్టములేని వానికి దేవుని జ్ఞానము అర్థము కానట్లు చేయును.

అప్పుడు వానికి దేవుని జ్ఞానము అత్యంతకష్టముగా కనిపించును.



ఉదాహరణకు ఈ మధ్యకాలములో శ్రీకాకుళము జిల్లాలో ఒక

ముస్లీమ్ వ్యక్తి మేము వ్రాసిన “అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు”

అను గ్రంథమును చూచి మా భక్తులతో వాదించడము జరిగినది. ముస్లీమ్

సమాజములో పునర్జన్మలు లేవు అని సమాజము మొత్తము

చెప్పుకొనుచుండగా మీరు అందరికీ పునర్జన్మలున్నాయని వ్రాశారు. అలా

వ్రాస్తే మా సమాజమును కించపరిచినట్లే కదా!యని అడిగాడు. దానికి

మా భక్తులు దైవగ్రంథమును దానిని వ్రాసిన ప్రవక్తను గౌరవిస్తూ ఖుర్ఆన్

గ్రంథములోయున్న వాక్యము ప్రకారమే చెప్పాముగానీ మాస్వంతముగా

చెప్పలేదు కదా!యని అడిగారు. దానికి అతను ఖుర్ఆన్ గ్రంథములో

రెండు ఆయతులను చూపి మా సమాజమునకు వ్యతిరేఖముగా చెప్పితే

మంచిదా!యని అడిగాడు. అలా అతను మాట్లాడడము వలన అతనికి

దేవుని వాక్యము మీద నమ్మకము లేదని తెలియుచున్నది. అంతేకాక

అతను మతములో మతపెద్దలు చెప్పవలెనంటూ, మతమునకే ప్రాధాన్యత

నిచ్చాడుగానీ, దేవుని వాక్యమునకు ప్రాధాన్యత నివ్వలేదు. అటువంటి

వారిని మాయ కనుగొని దేవునికి ఇష్టములేనివారికి దైవజ్ఞానము మీద

శ్రద్ధలేకుండా చేసి వానిని మతము వైపే పంపునుగానీ, దేవుని వైపు

పంపదు. అందువలన దైవగ్రంథమయిన భగవద్గీతలో “నన్ను ఆరాధించని

వానిని, నా మాట మీద నమ్మకము లేని వానిని మాయ నావైపు రానివ్వదు”

అని చెప్పాడు. అటువంటి వానికి మాయ దుస్సాధ్యముగా ఉండును.

అటువంటివాడు మాయను జయించనిదే నా వద్దకు రాలేడు అని కూడా

చెప్పాడు. అందువలన శ్రద్ధలేనివానికి జ్ఞానము అత్యంత కష్టమైనదిగా

ఉండును. శ్రద్ధయున్నవానికి జ్ఞానము అత్యంత సులభముగాయుండును.


ఇంతవరకు ఒక జ్ఞానపరీక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పడము

జరిగినది. ఇప్పుడు రెండవ జ్ఞానపరీక్ష ప్రశ్నలకు జవాబులు ఇచ్చుచున్నాము.

ఈ పరీక్షలో ప్రశ్నలకు క్రింద నాలుగు జవాబులు ఇవ్వబడియుండును.

ఆ నాలుగు జవాబులలో ఒకటి సరియైన జవాబు ఉండును. నాలుగు

జవాబులలో సరియైన జవాబును గుర్తించి వ్రాయవలెను. అయితే ఇక్కడ

ఇచ్చిన ప్రశ్నలలో ఒక ప్రశ్నకు మాత్రము నాలుగు జవాబులలో కూడా

సరియైన జవాబు ఉండదు. ఆ ప్రశ్న ఏదో గుర్తించవలెను. దానికి సరియైన

జవాబును స్వంతముగా వ్రాయకున్నా ఫరవాలేదు. ఇప్పుడు రెండవ

పరీక్షలోని ప్రశ్నలను జవాబులను క్రింద చూడవచ్చును.


1) వీటిలో అక్షయ ఆహారమేది?


1) చిత్రాన్నము 2) పాలన్నము 3) పెరుగన్నము 4) పరమాన్నము


జ॥ పరమాన్నము.


వివరము :- భూమిమీద మనిషికి కావలసిన ఆహారములు రెండు విధములు

గలవు. ఒక రకమైన ఆహారమును క్షయ ఆహారము అనీ, రెండవ దానిని

అక్షయ ఆహారము అనీ అంటాము. క్షయము అనగా నాశనమనీ, అక్షయము

అనగా నాశనముకానిదని అర్ధము. క్షయ ఆహారమనగా జీర్ణాశయములో

జీర్ణమైపోవునదని అర్థము. అక్షయ ఆహారమనగా నాశనముకాని

ఆహారమనీ, ఎల్లకాలము ఒకే విధముగాయుండు ఆహారమని అర్ధము.

ఇక్కడ పై ప్రశ్నకు క్రింద ఇచ్చిన నాలుగు జవాబులలో జీర్ణమగు ఆహారములు

మూడు గలవు. అవి వరుసగా చిత్రాన్నము, పాలన్నము, పెరుగన్నము.

ఇకపోతే అక్షయ ఆహారము చివరిలో పరమాన్నము గలదు. పరమాన్నమును

వీడదీసి చూస్తే పరము +అన్నము = పరమాన్నము అని చెప్పవచ్చును.

పరమాన్నము అనగా అన్నముకంటే వేరయినదని చెప్పవచ్చును. రెండు



రకముల ఆహారములలో మొదటిదయిన క్షయాహారము జీర్ణమై (నాశనమై)

పోవును. రెండవ రక ఆహారమైన అక్షయాహారము నాశనము కాని (జీర్ణము

కాని) ఆహారముగా ఉన్నది. అటువంటి ఆహారము దేవుని జ్ఞానమే అని

దైవగ్రంథములలో చెప్పబడినది. “దేవున్ని విశ్వసించిన వానికి జీవాహారము

ఇవ్వబడును” అని చెప్పబడినది. ఇక్కడ జీవాహారము అన్నది దైవజ్ఞానమునే

అని తెలియవలెను. ఒక మనిషి దైవ జ్ఞానమును తెలియగలిగితే అది

వానివద్ద ఆ జన్మలోనేకాక రాబోవు జన్మలలో కూడా వానివెంటనే ఉండును.

అలా ఒక మనిషిని అంటుకొని ఎప్పటికీ వానివద్దయుండు జ్ఞానమును

నాశనములేని ఆహారమనియూ, అక్షయ ఆహారమనియూ పెద్దలు

చెప్పుచున్నారు. దైవ గ్రంథములయిన మూడు గ్రంథములలో అక్షయ

ఆహారము సంపూర్ణముగాయున్నది. క్షయాహారము కొరకు మనిషి

శ్రమించినా అది మూడు గంటలకే జీర్ణమై పోవును. అక్షయ ఆహారమునకు

శ్రమించవలసిన పనిలేదు. ఒకమారు సంపాదించుకొన్నది శాశ్వితముగా

అతనిని వదలదు.


2)మోసములలో పెద్ద మోసము ఏది?


1) భార్య భర్తను మోసము చేయుట 2) భర్త భార్యను మోసము చేయుట

3) మనిషిని దేవునిగా మ్రొక్కడము 4) దేవున్ని మనిషిగా మ్రొక్కడము.

మనిషిని దేవునిగా మ్రొక్కడము.


వివరము :- భార్య భర్తను మోసము చేసినా, భర్త భార్యను మోసము

చేసినా, అవి మోసములే అయినా, వాటన్నిటి కంటే పెద్ద మోసము మనిషిని

దేవునిగా భావించి మ్రొక్కడమని చెప్పవచ్చును. ఇక్కడ కొందరు ఒక

ప్రశ్నను అడుగవచ్చును. దేవుడు మనిషి అవతారముగా వచ్చునని మీరే


అంటున్నారు కదా! అలా దేవుడు మనిషిగా వచ్చినప్పుడు మనిషిని దేవుడని

నమ్మి మ్రొక్కవచ్చును కదా! అందులో తప్పులేదు కదా! అయితే మీరు

మనిషిని దేవుడుగా మ్రొక్కడము పెద్ద మోసమంటున్నారు ఎలా? అని

అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! దేవుడు మనిషిగా

రావచ్చునుగానీ, అలా వచ్చిన వానిని ఎవరూ గుర్తించలేరు. దేవుడు

మనిషిగా వచ్చి దేవుని జ్ఞానమును చెప్పినా, వచ్చినవాడు ఫలానా వాడని

మనిషి గుర్తించలేడు. అంతేకాక దేవుడు మనిషిగా వచ్చినా అతను ఎవరి

చేత కూడా గుర్తింపబడడు. గుర్తింపబడనివానిని గుర్తించి మ్రొక్కలేము.

అయితే మనిషే తాను దేవుడు కాకున్నా తానే దేవుడనని ప్రకటించుకోవడము

వలన ఇతరులు మనిషిని దేవుడని నమ్ముచున్నారు. అలా ఎవరు నమ్మినా

నేను దేవుడనని నమ్మించువాడు ఎప్పటికీ దేవుడు కాడు. దేవుడు

మనిషివలె రావచ్చునుగానీ, మనిషి దేవునివలె నటించినా

మహత్యములను చూపినా దేవుడు కాలేడు. అందువలన తాను

దేవుడనని మ్రొక్కించు మనిషి ఇతరులను మోసము చేసినట్లగును. అంతేకాక

అది దేవుని విషయమైనందున అతను చేయునది మోసములలోకెల్ల పెద్ద

మోసమని చెప్పవచ్చును.


3)వీటిలో పండు అని పిలువబడు కాయ ఏది?


1) కొబ్బరికాయ 2) గుండెకాయ 3) మెడకాయ 4) కరక్కాయ

జవాబు:

నాలుగు జవాబులలో ఒక్కటి కూడా సరియైన జవాబు కాదు.

ఇందులో పండు అని పిలువబడు కాయ ఏది లేదు. ఇక్కడ ముందే

చెప్పినట్లు ఒక ప్రశ్నకు మాత్రము జవాబు ఉండదు. ఆ ప్రశ్న ఇదేనని

ఇక్కడ ఇచ్చిన నాలుగు జవాబులలో ఒకటి కూడా సరియైనది లేదని



తెలిసినది. జవాబులుగా ప్రకటించిన నాలుగు కాయలలో కొబ్బరికాయ

అనునది ఎప్పుడూ అదే పేరుతో పిలువబడుచున్నదిగానీ, కొబ్బరిపండు

అని పిలువబడలేదు. అట్లే కరక్కాయ ఎప్పటికీ అదే పేరుతో

పిలువబడుచున్నదిగానీ కరకపండు అని ఎప్పుడూ పిలువబడలేదు.

కొబ్బరికాయ, కరక్కాయ రెండూ భూమిమీద వృక్ష జాతులకు కాయునవి

కాగా, వృక్షముకాని వృక్షమయిన అశ్వర్థ వృక్షమను మానవ శరీరములో

కాయ అని పిలువబడు గుండెకాయ, మెడకాయ అను రెండు పేర్లు

చెప్పబడినవి. అశ్వర్థ వృక్షమునకు కాయబడిన ఈ రెండు కాయలు ఎప్పటికీ

అదే పేరుతో పిలువబడుచున్నవి, ఎప్పటికీ గుండెపండనిగానీ, మెడపండని

గానీ ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఈ నాలుగు కాయలు సరియైన జవాబు

కాదని తెలిసిపోయినది.


4) అన్నిటికంటే వేగముగా పోవునది ఏది?


1) కాలము 2) విమానము 3) మనస్సు 4) ఆత్మ

జవాబు: ఆత్మ.


వివరము :- ఈ ప్రశ్నకు చాలామంది మనస్సు అని జవాబు వ్రాశారు.

ఆత్మను వదలితే అన్నిటికంటే వేగమయినది మనస్సే అగును. అయితే

ఆత్మయుండుట వలన మనస్సుకంటే వేగమయినది ఆత్మని చెప్పవలసివచ్చి

నది. వివరములోనికి వెళ్ళితే కాలము నిదానముగా ఒకే వేగముగా

నడుచుచుండును. అందువలన కాలము అనునది ఏ విధముగా కూడా

ఈ ప్రశ్నకు జవాబుకాదు. రెండవది విమానము అని కలదు. విమానము

నాలుగువందల నుండి వెయ్యి కిలోమీటర్ల వేగముతో మాత్రమే పోగలదు.

మనస్సుకంటే అతి తక్కువ వేగముకలది విమానము అయినందున



విమానము అనునది కూడా సరియైన జవాబుకాదు. కాలము బయట

గడియారములో గంటలు, నిమిషములుగా లెక్కించబడుచున్నది. అలాగే

విమాన వేగము కూడా కొలవబడుచున్నది. ఈ రెండూ బాహ్య

సంబంధమైనవి కాగా, శరీరములో అంతర్ముఖముగా మనస్సు, ఆత్మ గలవు.

అయితే ఆత్మ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మా

గ్రంథములలో మాత్రము ఆత్మ అనునది ప్రత్యేకముగా ఉన్నదని చెప్పు

చున్నాము. మనిషి శరీరముతో బ్రతికియున్నప్పుడు ఆత్మ చలించక

శరీరములోనేయుండును. అయితే మనస్సు మాత్రము మనిషి

బ్రతికియున్నన్నాళ్ళు విషయముల మీదికి వేగముగా ప్రాకుచుండును.

మనస్సు ప్రాకు వేగమును 'మనోవేగము' అని కొందరనుచుందురు. మనిషి

బ్రతికినప్పుడు మాత్రము వేగముగా విషయముల మీదికి ప్రాకు మనస్సు

మనిషి చనిపోయినప్పుడు లేకుండా పోవుచున్నది. అప్పుడు మనస్సు

లేదు, మనస్సుకు వేగము లేదు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏమాత్రము

చలనములేని ఆత్మ మనిషి చనిపోయిన వెంటనే ఆ శరీరములోని జీవున్ని

అతని కర్మలను తీసుకొని బయలుదేరి, ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళవలసి

యున్నదో అక్కడికి అదే క్షణమే చేరిపోవును. జీవుడు ఇండియాలో చనిపోయి

అమెరికాలో పుట్టవలసియున్నా అదే సెకండులోనే ఆత్మ జీవునితో సహా

వెళ్ళిపోవుచున్నది. ఒకవేళ భూమండలములో కాకుండా చనిపోయిన జీవుడు

వేరే గోళము మీద పుట్టవలసియుంటే ఆ గోళము ఖగోళములో ఎంత

దూరమున్నా ఆత్మ అదే క్షణము అక్కడికి పోవు వేగము కలదిగాయున్నది.

మనస్సుకంటే అతి వేగమయినది ఆత్మ అయినందున ఈ ప్రశ్నకు సరియైన

జవాబు ఆత్మయనియే చెప్పవచ్చును.


5) ఎక్కువ ఆనందము ఎక్కడ ఉన్నది?

1) సుఖములోనా 2) దేవునిలోనా 3) ఆత్మలోనా 4) జ్ఞానములోనా


జవాబు: జ్ఞానములో.


వివరము :- ఈ ప్రశ్నకు నూటికి 95 శాతము సరియైన జవాబు వ్రాశారు.

వాస్తవముగా జ్ఞానములో ఉన్న ఆనందము దేనిలోనూ ఉండదని

చెప్పవచ్చును. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశమున్నది.

అదేమనగా! సుఖములో లేని ఆనందమును మనిషి జ్ఞానములో

పొందుచున్నాడు అంటే అది నమ్మదగిన మాటే. అయితే దేవుడు మరియు

ఆత్మ తర్వాతనే జ్ఞానము గలదు. దేవునికి మరియు ఆత్మకు సంబంధించినదే

జ్ఞానము. దేవునిలో లేని ఆనందము దేవుని జ్ఞానములో ఉంటుందా?

ఆత్మలోలేని ఆనందము ఆత్మజ్ఞానములో ఉన్నదా? యని అడుగవచ్చును.

దానికి మా సమాధానము ఈ విధముగాయున్నది. మనిషి అనేక

విషయములలో లేక అనేక సంఘటనలలో సుఖము పొందుచున్నాడు.

సుఖమును పొందినా ఆ అనుభూతిలో మనిషి పూర్తి ఆనందమును

పొందలేకపోవుచున్నాడు. ఎప్పుడయితే ఆత్మజ్ఞానమును పొందుచున్నాడో

అప్పుడు చెప్పలేని అనుభూతిని పొందుచున్నాడు. ఆత్మ జ్ఞానమును

పొందినప్పుడు అనుభవించిన ఆనందము అంతవరకు ప్రపంచ సుఖములు

ఎన్ని అనుభవించినా ఎక్కడా కలుగలేదని తెలిసిపోవుచున్నది.

ఆనందములో పొందిన ప్రత్యేకమయిన అనుభవము వలన మనిషి కళ్ళలో

నీళ్ళు వస్తున్నవి. దైవజ్ఞానములోగానీ లేక ఆత్మజ్ఞానములోగానీ అంత

ఆనందమును మనిషి పొందుచున్నాడని చెప్పు మేము దేవునిలోగానీ,

ఆత్మలోగానీ మనిషి జ్ఞానములో పొందిన ఆనందమును పొందలేడని

చెప్పుచున్నాము. ఇక్కడ ఈ మాట విన్న ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానములో

యున్న ఆనందము ఆత్మలో లేదా? దైవజ్ఞానములోయున్న ఆనందము

దేవునిలో లేదా?యని ప్రశ్నించవచ్చును. ఈ ప్రశ్న పద్ధతి ప్రకారము


అందరికీ వచ్చును. అయితే మేము అలా చెప్పుటకు కొంత కారణము

కలదు. అదేమనగా! మనిషిగాయున్నవాడు అనగా మనిషి శరీరములోని

జీవాత్మ బ్రహ్మయోగము చేసినప్పుడు శరీరములోనే యున్న ఆత్మలో

కలిసిపోవును. 'పరుసవేది' అను ఆకుపసరు చేత ఇనుపముక్క బంగారుగా

మారి పోయినప్పుడు అక్కడ ఇనుపముక్క అనునది లేదు కదా!

అలాంటప్పుడు ఇనుపముక్క నల్లగాయున్నదని లేని ఇనుపముక్కను గురించి

చెప్పలేము కదా! అలాగే బ్రహ్మయోగముచేత జీవాత్మ ఆత్మలో

కలిసిపోయినప్పుడు ప్రత్యేకించి జీవున్ని గురించి మాట్లాడుటకు జీవుడు

లేడు కదా! పరుసవేది చేత బంగారుగా మారిపోయిన ఇనుపముక్కను

గురించి ఎలా మాట్లాడలేమో, అలాగే బ్రహ్మయోగముచేత ఆత్మగా

మారిపోయిన జీవాత్మ గురించి మాట్లాడ లేము. ఎందుకనగా బంగారుగా

మారిపోయిన తర్వాత ఇనుపముక్క లేదు, ఆత్మగా మారిపోయిన తర్వాత

జీవాత్మలేదు. అందువలన లేని ఇనుమును గురించి, లేని జీవున్ని గురించి

మాట్లాడలేము.


ఆత్మలో కలిసిపోయిన జీవాత్మ లేనిదానివలన జీవాత్మ

అనుభవించునది ఏదీలేదు. అదే విధముగా దేవునిలో కలిసిపోయిన జీవుడు

పూర్తి దేవునిగా మారిపోయివుండును. అటువంటి సమయములో జీవుడు

ప్రత్యేకముగా మిగిలిలేడు కాబట్టి దేవునిలోయున్న జీవుడు ఏమీ అనుభవించు

టకు వీలులేదు. అందువలన ఆత్మలోగానీ, దేవునియందుగానీ జీవుడు

ఆనందమును పొందలేడని చెప్పుచున్నాము. జీవుడు దేవునిజ్ఞానమును

పొందినప్పుడు ఆనందమును అనుభవించుచున్నాడు. యోగము

పొందినప్పుడు జీవుడు ఆత్మగాయుండుట వలన, మోక్షము పొందినప్పుడు

జీవుడు దేవునిగాయుండుట వలన ఎవడుగానీ (ఏ జీవుడుగానీ)

ఆనందమును అనుభవించుటకు వీలులేదు. మరొక్క విషయమేమంటే


ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు

బ్రహ్మయోగములో ఆత్మలో కలిసియున్న జీవుడు యోగమును వీడిన వెంటనే

ఆత్మనుండి బయటికి వచ్చి ప్రత్యేక జీవునిగా ఉండును. అయితే

దేవునియందు ఒకమారు ఐక్యమై మోక్షము పొందినవాడు, తిరిగి దేవుని

నుండి బయటపడుట అసంభవము. ఒకమారు మోక్షము పొందిన జీవుడు

శాశ్వితముగా దేవునియందే నిలిచిపోవును. అటువంటివాడు తిరిగి ఎప్పటికీ

జీవుడుగా బయటపడి జన్మలెత్తడము జరుగదు. ఆత్మలో కలిసిన జీవుడు

ఆత్మనుండి బయటికి రావచ్చునుగానీ, దేవునియందు కలిసినవాడు తిరిగి

బయటికిరాడు. అన్ని విధములా ఈ ప్రశ్నకు జవాబు జీవుడు జ్ఞానమును

పొందినప్పుడు ఆనందమును పొందునని చెప్పవచ్చును.


6) జ్ఞానములలో ఏ జ్ఞానము గొప్పది?

1) ప్రకృతి జ్ఞానము 2) పరమాత్మ జ్ఞానము 3) ఆత్మ జ్ఞానము

4) జీవాత్మ జ్ఞానము


*   : ప్రకృతి జ్ఞానము.



వివరము :- ఈ ప్రశ్నకు సరియైన జవాబును ఎవరూ వ్రాయలేదు.

చాలామంది పరమాత్మ జ్ఞానమనియో లేక ఆత్మజ్ఞానమనియో వ్రాశారు.

వాస్తవానికి జ్ఞానములలో పరమాత్మ జ్ఞానము గొప్పదయినా, మనిషి

నేర్చుకొనుటకు ప్రకృతి జ్ఞానమే గొప్పదని చెప్పవచ్చును. భగవద్గీతలోని

విజ్ఞాన యోగమందు 14వ శ్లోకమున “నాచేత తయారు చేయబడిన

మాయను దాటుట దుస్సాధ్యము” అని భగవంతుడే చెప్పాడు. ఆ మాట

ప్రకారము మనిషి దేవునివైపు రావాలంటే మొదట ప్రకృతి సంబంధ

జ్ఞానమును తెలియవలసియుంటుంది. ప్రకృతి సంబంధ జ్ఞానము అంటే

ప్రపంచ విషయములని అనుకోకూడదు. ప్రకృతి జ్ఞానము అంటే ప్రకృతి


జనితములయిన గుణములను గురించి, గుణముల సమ్మేళనమైన మాయను

గురించి తెలుసుకోవడమని అర్థము. మాయను గురించి తెలియనిదే

మాయను జయించి, దేవునివైపు రావడము చాలా కష్టమైన పనియగును.

దేవున్ని తెలియాలంటే, దేవుని జ్ఞానము అర్థము కావాలంటే, ముందు

మాయను జయించవలసి వచ్చును. మాయను జయించుటకు లేక

దాటుటకు ముందు మాయను గురించి తెలియవలసియుండును. మాయ

దుస్సాధ్యమైనది కనుక దేవున్ని నమ్మువాడు ముందు మాయను గురించి

పూర్తి తెలియకుండ కేవలము దేవున్ని గురించి తెలియవలెనంటే అది జరిగే

పని కాదు. అందువలన ముందు తెలియవలసిన జ్ఞానమేదో అదే మనిషికి

గొప్ప జ్ఞానముగాయున్నది. దాని ప్రకారమే ప్రకృతి జ్ఞానమని సమాధానము

చెప్పవలసి వచ్చినది. భూమిమీద చాలామంది ప్రకృతి జ్ఞానమును వదలి

నేరుగా దైవజ్ఞానమును ఆశ్రయించారు. అయినా వారికి దేవుని జ్ఞానము

అర్థము కాకుండా పోయినది. భూమిమీదున్న మూడు ముఖ్య

మతములయిన ఇందూ, ఇస్లామ్, క్రైస్తవముల వారు ప్రకృతి జ్ఞానమును

వదలి దానిని తెలియకుండా నేరుగా దేవుని జ్ఞానము చెప్పుకొనుచుండినా,

వారు మాత్రము మాయలో చిక్కుకొని పోయారు. మాయ కరుణించనిదే

దేవుని వాక్యము ఎవరికీ అర్థముకాదు. అందువలన ఎంతో అనుభవ

మున్న జ్ఞాని, యోగి అయిన వేమనయోగి తన పద్యములో "పతియొప్పిన

సతియొప్పును” అని చెప్పాడు. పతి అనగా దేవుడు అనియూ, సతి అనగా

ప్రకృతి అని ఆయన భావము. దేవుడు ఒప్పుకొంటేనే దేవుని అనుమతితోనే

దేవునికి సతి అయిన మాయ మనిషికి జ్ఞానమును అర్థమగునట్లు చేయును.

పతి సతి ఇద్దరి సహకారముంటేనే మనిషికి జన్మరాహిత్యము ఏర్పడును.

అందువలన దేవుని జ్ఞానము అర్థము కావాలంటే ముందు మాయ జ్ఞానము

తెలియవలెను. దేవుని జ్ఞానముకంటే మనిషికి మాయ జ్ఞానము చాలా




కష్టమయినది. మాయా విధానము శరీరములో ఎలాగున్నదని తెలియకుండా

బయట మేము దేవున్ని విశ్వసించాము, మేము దేవుని భక్తులము అనువారికి

ఇంతవరకు దేవుని జ్ఞానము అర్థముకాలేదు. ఏ విధముగా ఒక మనిషికి

తల్లితండ్రి ఎంత ముఖ్యమో, అదే విధముగా మనిషికి ప్రకృతి పరమాత్మ

ముఖ్యముగాయున్నారు. తల్లిలేకుండా ఏ మనిషీ పుట్టలేదో అదే విధముగా

ప్రకృతి లేకుండా ఏ మనిషీ పుట్టలేదు. తల్లి సహకారము లేనిది తండ్రి

ఎలా తెలియబడడో అలాగే మాయ (ప్రకృతి) సహకారము లేనిది దేవుడు

ఎవరయినది తెలియదు. నేడు మాయ విధానము తమ శరీరములలో

ఎలాగున్నదో తెలియకుండా చాలా మతములవారు నేరుగా దేవుడు ప్రార్థన

అని అంటున్నారు. అందువలన వారికి దైవగ్రంథరూపములోయున్న దేవుని

జ్ఞానము ఏమాత్రము అర్థము కాలేదు. అయినా వారికి మీకంటే

తెలిసినవారు లేరని మాయ వారిని నమ్మించి, ఎంతకాలమున్నా వారికి

దేవుని విధానమే తెలియకుండా చేసినది. అటువంటివారు జ్ఞానమంతా

మాకు తెలుసు అను గర్వముతోయున్నారు. వాస్తవముగా వారికి ఏమాత్రము

దేవుని జ్ఞానము అర్థము కాలేదని తెలియకుండా పోయినది. నేడు మేము

మిగతా ప్రజలకంటే గొప్ప జ్ఞానులము అనుకొను మిగతా మతపెద్దలుగానీ,

హిందూమతములో మిగతా ప్రజలకు బోధించూ బోధకులుగా యున్నవారు

గానీ, మాయ విధానమును తెలియక దైవజ్ఞానమంతా తెలుసు అని

అనుకొంటున్నారు. వారి చూపు వారి శరీరములోనున్న మాయ మీదకు

ఏమాత్రము పోలేదు. వారికి మాయ జ్ఞానమయిన ప్రకృతి జ్ఞానము

తెలియదు. జ్ఞానములలోకెల్ల గొప్పదయిన ప్రకృతి జ్ఞానమును తెలియని

వారు తర్వాత సులభమయిన పరమాత్మ జ్ఞానమును తెలియక మేము

తెలిసినవారమని ఇతరులతో వాదించుచున్నారు. తల్లి ద్వారా తండ్రిని

తెలిసినట్లు ప్రకృతి ద్వారానే పరమాత్మను తెలియవలెనను సూత్రమును

మరువకూడదు.


7) మూలి ముగ్గురిని చెరిస్తే, వాని ఆలి నలుగురిని చెరిసింది. మూలి

ఎవరు? వాని ఆలి ఎవరు?


1) గ్రుడ్డివాడు 2) కుంటివాడు 3) ఏమీ చేయనివాడు 4) ఏమీ చేతగాని వాడు.

1) గ్రుడ్డివాని భార్య 2) కుంటివాని భార్య 3) ఏమీ చేయనివాని భార్య

4) ఏమీ చేతకానివాని భార్య.


ఏమీ చేయని వాడు, ఏమీ చేయని వాని భార్య.


వివరము :- ఈ ప్రశ్నకు కూడా ఎవరూ సరియైన జవాబును వ్రాయలేదు.

మూలి అను పదమే కొందరికి అర్థము కాలేదు. మూలి అను పదమును

కొన్ని ప్రాంత్రములలో విరివిగా వాడుచుండగా, కొన్ని ప్రాంతములలో

తక్కువగా వాడుచున్నారు. అంతేగానీ మూలి అను పదము పూర్తి క్రొత్త

పదముకాదు. మాటలు వచ్చి మాట్లాడక మౌనముగా ఉండువానినీ,

చేయగలిగి ఏమీ చేయక ఊరకుండువానిని మూలి అని అంటున్నాము.

ఊరకుండు వానిని ముని అంటున్నాము. ముని అను పదము మూలిగా

కూడా పిలువబడుచున్నది. మూలి అంటే ఇప్పుడు అందరికీ అర్థమయి

ఉంటుంది. మూలి ముగ్గురుని చెరిస్తే అనడము ఎవరికీ అర్థము కాలేదు.

చెడిపోవు మూడు ఏవి అనునది కూడా ఎవరికీ తెలియదు. మూలి అన్న

తర్వాత మూలి ఆలి అని అతని భార్యను గురించి కూడా ప్రస్తావన వచ్చినది.

మూలి భార్య ఎవరో ఒకరుండవచ్చునుగానీ, ఆమె నలుగురుని చెరిసింది

అని అన్నప్పుడు, ఆ నలుగురు ఎవరో ఎవరికీ అర్థము కానందున ఈ

ప్రశ్నకు సరియైన జవాబును ఎవరూ వ్రాయలేకపోయారు.


ఈ ప్రశ్నకు జవాబు ఆరవ ప్రశ్న జవాబుకు దగ్గర సంబంధముగా

ఉండును. అక్కడ ప్రకృతి పరమాత్మను సతి పతి అని చెప్పాము. ఇక్కడ

అదే విధముగా పరమాత్మను మూలియని, ప్రకృతిని వాని ఆలియని



చెప్పాము. ఇక్కడ పరమాత్మ పనిచేయనివాడని, అట్లే ఏదీ చెప్పువాడు

కాదని మౌనముగా సాక్షిగా ఉండువాడని తెలియునట్లు మూలి అని అనడము

జరిగినది. మూలి అనగా పరమాత్మ (దేవుడు) అనియు, ఆయన భార్య

అనగా ప్రకృతియని తెలిసిపోయినది. ఇక మనకు ముగ్గురు ఎవరు అను

విషయము, అట్లే నలుగురు ఎవరు అన్న విషయము తెలియవలసియున్నది.

దేవుని అధికారము ఆయన భార్య అయిన ప్రకృతి మీద ఉన్నది. ప్రకృతి

దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుచున్నది. భార్య భర్తను అనుసరించి

యుండునట్లు ప్రకృతి పరమాత్మను అనుసరించి పరమాత్మ ఆదేశానుసారము

నడుచుచున్నది. ప్రకృతి బయట పంచభూతములుగాయుండినా, శరీరము

లోపల దైవాజ్ఞ ప్రకారము నడుచుటకు అనుకూలముగా మూడు గుణముల

రూపములోయున్నది. మూడు గుణములను కలిపి మాయ అని

అంటున్నాము. పంచ భూతముల రూపములో బయటయున్న దానిని

ప్రకృతియనీ, మూడు గుణముల రూపములో శరీరములోపలయున్నదానిని

మాయ అని అనడము జరుగుచున్నది.


ఒక మనిషి దైవమార్గములో యున్నానని అనుకొనినా వాడు

సరియైన మార్గములో ఉండవచ్చును లేక ఉండకపోవచ్చును. ఎవడయితే

తల్లితండ్రులను గౌరవించినట్లు, ప్రకృతి పరమాత్మను సరిగా అర్థము

చేసుకొని సమానముగా గౌరవించునో, వానికి మాత్రము దేవుడు కరుణించి

తన భార్య అయిన మాయకు ఆ జీవున్ని తనవైపుకు పంపునట్లు ఆజ్ఞ

చేయును. అప్పుడు ప్రకృతియైన మాయ తన భర్త మాటను గౌరవించి

అలాగే చేయును. ఇక్కడ దేవుడు మాయకు ఆజ్ఞను చేయడమును అందరికీ

అర్థముకానట్లు, జ్ఞానులకు మాత్రమే అర్థమగునట్లు చెప్పడమునే “మూలి

ముగ్గురిని చెరిస్తే” అని అనడము జరిగినది. మూలి అనగా దేవుడనీ,

ముగ్గురు అనగా తామసము, రాజసము, సాత్త్వికము అను మూడు


గుణములనీ, చెరిస్తే యనగా మూడు గుణములను పని చేయనట్లు

చేయడమని అర్థమగునట్లు ఆ విధముగా చెప్పారు. మనిషి శరీరములో

దేవుని జోక్యముతో మూడు గుణములు ఏమాత్రము పని చేయనప్పుడు

బ్రహ్మయోగము ఏర్పడును. అలా బ్రహ్మయోగి అయినవాడు యోగములో

వచ్చు జ్ఞానాగ్ని వలన కర్మను కాల్చుకోగలిగి అనతి కాలములోనే మోక్షమును

పొందగలుగును.


పరమాత్మ అనుకుంటే ఏ మనిషికయినా బ్రహ్మయోగము

లభ్యమగును. ఇది ఒక విధానముకాగా, ఇక రెండవ విధానము కూడా

మరొకటి కలదు. ఆ రెండవ విధానములో పరమాత్మ ఆలి అయిన ప్రకృతి

అనుకొంటే నలుగురిని చెరుస్తుందని కలదు. నలుగురు అనగా! మూడు

గుణముల భాగములను ముగ్గురిగా లెక్కించవచ్చును. నాల్గవ గుణరహిత

భాగమును నాల్గవ వానిగా లెక్కించవచ్చును. ప్రకృతి అనుకుంటే నాలుగుకు

సంబంధములేని కర్మయోగములో మనిషిని నిలుపుచున్నది. తమ బిడ్డకు

తల్లితండ్రులు ఇరువురు ఎలా సహాయము చేయుచున్నారో అలాగే ఒక

మనిషి దేవునివైపు పోవుటకు కావలసిన రెండు యోగములను ప్రకృతి,

పురుషులయిన మాయ, దేవుడు చేకూర్చుచున్నారు. స్త్రీ అయిన ప్రకృతి

కర్మయోగమును, పురుషుడయిన దేవుడు బ్రహ్మయోగమును శరీరములో

జీవునికి కల్పించుచున్నారు. ఈ విషయమును తెలియజెప్పుటకు జ్ఞానులకు

మాత్రము అర్థమగునట్లు మూలి ముగ్గురుని చెరుసును, వాని ఆలి

నలుగురుని చెరుసును అని అన్నారు.


8) సృష్ట్యాదిలో దేవుడు ఆకాశవాణి ద్వారా జ్ఞానమును చెప్పునప్పుడు

మూడు ధర్మములను మాత్రము చెప్పాడు. తర్వాత ద్వాపర యుగములో

తన దూత లేక భగవంతుడయిన శ్రీకృష్ణుని ద్వారా జ్ఞానమును చెప్పినప్పుడు



నాలుగు అధర్మములను చెప్పాడు. మొదట చెప్పిన మూడు ధర్మములు

ఏవి? తర్వాత ద్వాపరయుగమున చెప్పిన నాలుగు అధర్మములు ఏవి?

మూడు ధర్మములు బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగము

అనునవికాగా, ద్వాపరయుగమున చెప్పిన అధర్మములు నాలుగు అధర్మ

ములలో ఒకటి యజ్ఞములు, రెండు వేదములు, మూడు దానములు, నాలుగు

తపస్సులు అని చెప్పవచ్చును.


వివరము :- ఇప్పుడు మేము చెప్పిన జవాబులు కొందరికి వింతగా

కనిపించినా చెప్పిన విషయము మాత్రము వాస్తవమే. ఇది నేను ప్రత్యేకించి

చెప్పినది కాదు. బ్రహ్మవిద్యాశాస్త్రమయిన భగవద్గీతలోనే ఈ విషయములు

కలవు. మొదట సృష్ట్యాదిలో వాణి ద్వారా చెప్పబడిన జ్ఞానములో మూడు

ధర్మములు దేవున్ని చేరు మార్గములైన మూడు యోగములుగాయున్నవి.

తర్వాత మనుషులు దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి అధర్మములను

ఆచరించను మొదట పెట్టారు. అధర్మముల ఆచరణ ఎక్కువయిన తర్వాత

వాటిని అణచివేయు నిమిత్తము, ధర్మములను తెలియజేయు నిమిత్తము

ద్వాపరయుగమున దేవుడు మనిషిగా వచ్చి జ్ఞానమును చెప్పాడు. అప్పుడు

ధర్మములయిన బ్రహ్మ, కర్మ, భక్తి యోగములను తెలియజేయడమేకాక

వాటితో పాటు అధర్మములను కూడా తెలియజేశాడు.


దేవుని ధర్మములను యోగముల రూపములో చెప్పినప్పటికీ మనిషి

వాటిని అర్థము చేసుకోలేకపోయాడు. మనిషి దేవునివైపు పోవాలను ధృడ

సంకల్పము లేనివాడైనందున, దేవుని సతి అయిన ప్రకృతి తన మాయచేత

మనిషికి దేవుని జ్ఞానమును అర్థము కాకుండా చేసి ప్రక్క దారిలోనికి

పోవునట్లు చేసినది. మనిషి దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేని స్థితిలో

ఉండికూడా తాను అన్నీ తెలిసిన వాడినని గర్వపడడము వలన అతనికి


అధర్మములను కూడా దేవుడే జతచేశాడు. దేవుని ఆదేశానుసారము ప్రకృతి

మనిషికి నాలుగు అధర్మములను అంటగట్టినది. ఆ నాలుగు అధర్మములను

అంటగట్టి వాటినే ధర్మములుగా లెక్కించునట్లు చేసినది. దానితో మనిషి

ధర్మములయిన యోగముల స్థానములో అధర్మములైన యజ్ఞ, దాన, వేద,

తపస్సులను ఉంచుకొన్నాడు. అసలయిన ధర్మాచరణలయిన మూడు

యోగములను మనిషి మరచిపోయి అధర్మములైన యజ్ఞ, దాన, వేద,

తపస్సులను ఆచరణగా పెట్టుకొన్నాడు. ఈ విధముగా మనిషి ధర్మములను

అర్థము చేసుకోలేక వాటిని పూర్తి మరచిపోయి, వాటి స్థానములో యజ్ఞ,

దాన, వేద, తపస్సులను కల్పించుకొన్నాడు. ఇదే విషయమునే భగవద్గీతలో

భగవంతుని రూపములోయున్న దేవుడు తిరిగి చెప్పినా, ఈ నాటికి మనిషి

దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి అధర్మములను ఆచరించుచున్నాడు.

ఇతరులచేత అధర్మ ఆచరణే ముఖ్యమన్నట్లు వాటినే చేయిస్తున్నాడు. నేడు

స్వాములు, గురువులుగాయున్నవారే అధర్మములను ధర్మములని

ఆచరించడము వలన, ఏమీ తెలియని మిగతా ప్రజానీకము వారినే

ఆశ్రయించి, వారు చెప్పినదే జ్ఞానమనుకొని, అధర్మ ఆచరణలు చేయుటకే

అలవాటు పడిపోతున్నాడు. ఏదో ఒక భక్తి ఉంటే చాలని అనుకొన్నారు

తప్ప, నేను చేయునది ధర్మాచరణా లేక అధర్మాచరణాయని ఏమాత్రము

ఆలోచించకుండ ఉన్నారు. దానితో భూమిమీద అధర్మాచరణ పెరిగి

పోయినది, ధర్మములంటే ఏమో తెలియనిస్థితిలో మనిషి ఉండి పోయాడు.


ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే

ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024