సిద్ధాంత కర్తలు part1

 


మొదట 'సిద్ధాంతము' అంటే ఏమిటో తెలుసుకొందాము. ఒక

గ్రంథములో ఎన్నో కాగితములున్నట్లు, ఒక శాస్త్రములో ఎన్నో సిద్ధాంతములు

ఉండును. కొన్ని సిద్ధాంతములు కలిసి ఒక శాస్త్రముగా ఉండును. గణిత

సిద్ధాంతములన్నిటినీ కలిపి 'గణిత శాస్త్రము' అని అనవచ్చును. అట్లే

రసాయన సిద్ధాంతములన్నీ కలిసి రసాయన శాస్త్రమయినది. ఉదాహరణకు

H,O=Water అనునది రసాయన శాస్త్ర సంబంధ సూత్రము. ఈ సూత్రము

ప్రకారము “రెండు కొలతలు హైడ్రోజన్ వాయువు, ఒక కొలత ఆక్సిజన్

వాయువును కలిపితే నీరు అగును” అనునది సూత్రము లేక సిద్ధాంతము.

సిద్ధాంతమును 'సూత్రము' అని కూడా అనవచ్చును. రెండింతలు హైడ్రోజన్

ను చెప్పుటకు H2 అని షార్ట్కట్గా చెప్పారు. అలాగే ఒక్కింత ఆక్సిజన్ను

చెప్పుటకు O అని కుదింపు అక్షరముగా చెప్పారు. నీరును రసాయన

శాస్త్రము ప్రకారము కుదింపు అక్షరములలో చెప్పితే HO=Water_ అని

చెప్పవచ్చును. ఈ విధముగానే అన్ని శాస్త్రములు ముందే నిర్ధారింపబడిన

లేక కనిపెట్టబడిన సూత్రములతో నిండుకొనియుండును. శాస్త్రములు

భూమిమీద ఆరే గలవు. వాటినే షట్ శాస్త్రములని అంటాము. శాస్త్రము

అనగా శాసనములతో కూడుకొన్నది అని నిర్వచనమును లేక అర్థమును

చెప్పవచ్చును. దీని ప్రకారము శాసనము అనినా, సూత్రము అనినా,

సిద్ధాంతము అనినా ఒక్కటే అర్థమని తెలియుచున్నది. శాసనము అనగా

జరిగి తీరునదని అర్థము. 'శాసనము' అను పదము 'శాపము' అను

పదమునుండి పుట్టినది. శాపము అనగా "చెప్పినది చెప్పినట్లు జరుగును”

అని అర్థము. దీనిప్రకారము శాస్త్రము అనగా 'సత్యము' అని చెప్పవచ్చును.

ఏదయితే శాస్త్రమో, లేక ఏదయితే సూత్రమో, ఏదయితే సిద్ధాంతమో

అదియంతయూ జరిగితీరు ప్రత్యక్ష సత్యమని చెప్పవచ్చును. అందువలన

శాస్త్రము అనగా సత్యమునకు మారుపేరుయనీ, అట్లే సత్యము శాస్త్రమునకు



మారుపేరనీ చెప్పవచ్చును. అందువలన ఏ విషయమైనా శాస్త్రబద్ధముగా

ఉండవలెనని చెప్పుచుందురు. శాస్త్రబద్ధముగాయుంటే సత్యబద్ధముగా

ఉన్నట్లేయని గుర్తు.


ఏ శాస్త్రమునకయినా సిద్ధాంతములే ఆధారము. సిద్దాంతములతోనే

శాస్త్రము ఆధారపడియుంటుంది. శాస్త్రము అంటే అర్థమగులాగున విడదీసి

చెప్పుకొన్నాము. శాస్త్రమునకు ఆధారమైన సిద్ధాంతము అంటే దాని అర్థము

ప్రకారము వివరించి చెప్పుకొందాము. సిద్ధాంతమును విడదీసి చెప్పితే

సిద్ధ+అంతము=సిద్ధాంతము అని గలదు. 'సిద్ధాంత' పదములోని సిద్ధకు

మరియు అంతముకు వేరువేరుగా అర్థమును చెప్పుకోగలిగితే ఇలా కలదు.

సిద్ధ అను పదమును సిద్ధము అని కూడా చెప్పవచ్చును. సిద్ధ అనినా,

సిద్ధము అనినా, సిద్ధమ్ అనినా మూడు ఒకే అర్థముతో కూడుకొనియున్నవి.

సిద్ధి అను పదమునుండి సిద్ధ అను శబ్దము పుట్టినది. కావున సిద్ధి అను

పదమునకు చెప్పు అర్థమునే సిద్ధ అను పదమునకు కూడా చెప్పవచ్చును.

సిద్ధ లేక సిద్ధమ్ లేక సిద్ధము అను పదమునకు ఒకే అర్థము కలదు. అదే

‘వెతకగా దొరికినది' అని అర్ధము. 'అన్వేషించగా దొరికినది' అని అర్థము.

పరిశోధన చేయగా వచ్చిన ఫలితమును, లేక దొరికిన అర్థమును సిద్ధాంతము

అని అనుచున్నాము. ఒక పరిశోధకుడు ఒక విషయమును పూర్తిగా

పరిశోధించిన తర్వాత వచ్చిన ఫలితమును, లేక తెలిసిన సత్యమును

‘సిద్ధాంతము' అని అంటున్నాము. ఒక మనిషి తన పరిశోధనలో కనుగొన్న

సత్యమును సిద్ధాంతము అనడము జరుగుచున్నది. ఒక మనిషి కనుగొన్న

సిద్ధాంతమును అతని సిద్ధాంతము అని చెప్పుచున్నాము. ఒక శాస్త్రములో

ఎంతోమంది కనుగొన్న సిద్ధాంతములుండును. శాస్త్రమునకు ఒకే పేరున్నా,

అందులోని సిద్ధాంతములకు వాటిని కనుగొన్న వారి పేర్లుండును.


'సిద్ధాంతము' అను పదములో సిద్ద అనగా వెతికితే లభించినదను

భావము తెలిసిపోయినది. అదే పదములో చివరిలోయున్న అంతము

అనగా శేషము లేకుండా, లేక పూర్తి అయిపోయినది అని అర్థము కలదు.

శేషము లేకుండా ఉన్న ఫలితమంతా తెలియబడినదను అర్థముతో

'సిద్ధాంతము' అని అంటున్నాము. ఒక సిద్ధాంతము తెలియబడినదంటే

పూర్తి అర్థముతో లేక ఏమీ మిగలని అర్థముతో పూర్తి తెలిసిపోయినదని

భావము. అందువలన ఏ సిద్ధాంతమయినా సంపూర్ణముగా యుండునుగానీ,

అసంపూర్ణముగా యుండదు. ఈ విధముగా సిద్ధాంతము అంటే పూర్తి

సత్యమయినదను భావము కూడా కలదు. సత్యమయిన సిద్ధాంతములతో

కూడుకొన్నది శాస్త్రమైనందున, శాస్త్రము ఏదయినా అది సత్యముతోనే

కూడుకొనియుండును. అంతము వరకు అసత్యము లేకుండా లభించిన

సత్యమును సిద్ధాంతము అని చెప్పవచ్చును. సిద్ధ అనగా లభించినదని

అంతము అనగా చివరి వరకు లభించిన సత్యమును సిద్ధాంతము అని

చెప్పినా, ప్రపంచ సిద్ధాంతములతో కూడుకొన్న శాస్త్రములు నాలుగు

గలవు. దేవునికి సంబంధించిన సిద్ధాంతములతో కూడుకొన్నది ఒక శాస్త్రము

గలదు. ఇట్లు ప్రపంచ సంబంధముగా కొంత, దైవసంబంధముగా కొంత

సంబంధపడి యుండు శాస్త్రము ఒకటి కలదు. అదే జ్యోతిష్య శాస్త్రము.

ప్రపంచ సంబంధ నాలుగు శాస్త్రములు వరుసగా 1) గణిత శాస్త్రము

2) ఖగోళ శాస్త్రము 3) రసాయన శాస్త్రము 4) భౌతిక శాస్త్రము గలవు.

పరమాత్మ సంబంధ శాస్త్రము బ్రహ్మవిద్యా శాస్త్రమొక్కటే గలదు.

షట్ శాస్త్రములలో అన్నిటికంటే ముందు పుట్టినది బ్రహ్మవిద్యా

శాస్త్రము. మొదట పుట్టిన బ్రహ్మవిద్యా శాస్త్రము సంపూర్ణముగా పుట్టినది.

తర్వాత పుట్టిన ఐదు శాస్త్రములు అసంపూర్ణముగా పుట్టినవి. మిగతా


ఐదు శాస్త్రములలో ఎన్నో సిద్ధాంతములు అప్పుడప్పుడు కనుగొన

బడుచున్నవి. ఇంకా ఎన్ని సిద్ధాంతములు తెలియవలసియున్నదో ఎవరికీ

తెలియదు. ఐదు శాస్త్రముల సిద్ధాంతములు ఎప్పటికి సంపూర్ణమవుతాయను

విషయము ఎవరికీ తెలియదు. మేము చూచినంతలో గత యాభై (50)

సంవత్సరములలో నాలుగు శాస్త్రములలో ఎన్నో సిద్ధాంతములు మనుషుల

చేత కనుగొనబడినవి. ప్రత్యేకించి జ్యోతిష్య శాస్త్రములో పరిశోధన చాలా

తక్కువ యున్నది. అందువలన జ్యోతిష్యములో క్రొత్త సిద్ధాంతములు

బయటికి రాలేదు. ఈ మధ్య కాలములో మేమే ఒకటి, రెండు

సిద్ధాంతములను క్రొత్తగా చెప్పాము. జ్యోతిష్యము ప్రపంచముతో ముడి

పడియున్నది. కనుక అది మాకు సంబంధించిన శాస్త్రము కాదు. అయినా

రెండు క్రొత్త సిద్ధాంతములు మేము వ్రాసిన "జ్యోతిష్య శాస్త్రము” అను

గ్రంథములో చెప్పబడినవి. ప్రపంచ సంబంధ శాస్త్రములలోనికే జ్యోతిష్య

శాస్త్రము కూడా లెక్కించబడుచుండుట వలన మాకు దానిమీద ఆసక్తి

లేదు. బ్రహ్మవిద్యా శాస్త్రము తప్ప మిగతా ఐదు శాస్త్రములు అసంపూర్ణ

శాస్త్రములేనని చెప్పుచున్నాము. మా ఆసక్తియంతయూ బ్రహ్మవిద్యా శాస్త్రము

మీదనే ఉంటుంది. అందువలన మేము ఏమి చెప్పినా బ్రహ్మవిద్యా

శాస్త్రములోని విషయములనే చెప్పుచుందుము.


ప్రశ్న :- మీరు సిద్ధాంతములను, శాస్త్రములను బాగా అర్థమయ్యేలాగున

చెప్పారు. మీరు చెప్పిన మాటలలో బ్రహ్మవిద్యా శాస్త్రము సృష్ట్యాదిలోనే

సంపూర్ణముగా చెప్పబడినదని చెప్పారు. సృష్ట్యాదిలోనే సంపూర్ణముగా

చెప్పబడిన విషయమును తిరిగి చెప్పవలసిన అవసరములేదు కదా!

సృష్ట్యాదిలో దేవుడే స్వయముగా బ్రహ్మవిద్యా శాస్త్రమును చెప్పినప్పుడు దానిని

గురించిన క్రొత్త విషయములు ఏమీ లేనప్పుడు మీరు క్రొత్తగా త్రైత


సిద్ధాంతమును ఎలా చెప్పారు? త్రైత సిద్ధాంతమును మీరు చెప్పినట్లు మీ

పేరుకంటే ముందు "త్రైత సిద్ధాంత ఆదికర్త” యని పేరు కూడా

పెట్టుకొన్నారు. దేవుడు ముందే చెప్పిన విషయమును హైజాక్ చేసి దానిని

మీరే చెప్పినట్లు ప్రకటించుకోవడము తప్పు కాదా?


జవాబు :- దేవుడు సృష్ట్యాదిలోనే బ్రహ్మవిద్యా శాస్త్రమును సంపూర్ణముగా

చెప్పాడని నేను తప్ప ఎవరయినా చెప్పారా? మీరే ఒకమారు వెనుదిరిగి

చూచుకోండి. ప్రపంచ శాస్త్రములు అసంపూర్ణమనీ, దైవశాస్త్రము

సంపూర్ణమను విషయమును చెప్పిన వారిలో మొదటివాడిని నేనేయని

ధైర్యముగా చెప్పుచున్నాను. అటువంటప్పుడు దైవ సిద్ధాంతమయిన త్రైత

సిద్ధాంతమును నేను చెప్పానని ఎలా చెప్పగలను? నేను ఎక్కడ త్రైత

సిద్ధాంతమును గురించి చెప్పినా ఈ విషయము ప్రథమ దైవగ్రంథమయిన

భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమందు 16, 17 శ్లోకములలో

కలదనియే చెప్పుచున్నాము. భగవద్గీతను దేవుడు సృష్ట్యాదిలోనే

బోధించాడనీ, దానినే ద్వాపరయుగ చివరిలో భగవంతుడుగా వచ్చిన

శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పాము. అట్లు చెప్పడమే కాక మేము చెప్పుచున్న

త్రైత సిద్ధాంతమును భగవద్గీతలోనే చెప్పబడినదని కూడా చెప్పాము.

అటువంటప్పుడు త్రైత సిద్ధాంతమును చెప్పడములో మా తప్పు ఉందేమో

మీరే చెప్పండి. త్రైత సిద్ధాంతము సృష్ట్యాదిలో చెప్పినా, తిరిగి దానిని

ద్వాపర యుగము చివరిలో చెప్పినా అది ఎవరికీ తెలియని సిద్ధాంతమై

యున్నది. హిందువుల గ్రంథము భగవద్గీతయని చాలామంది చెప్పుచున్నా

భగవద్గీతలోని త్రైత సిద్ధాంతమును గురించి ఈనాటికీ హిందువులకే

తెలియదు. ఎవరికీ తెలియని సిద్ధాంతమును గురించి మేము చెప్పాము.

కావున అది అందరికీ క్రొత్తగానే యున్నది. అందువలన త్రైత సిద్ధాంతము

మీకు క్రొత్తదని చెప్పానుగానీ మాకు పాతదేనని తెలుసు.


మా పేరు విషయానికి వస్తే మా పేరు ముందర త్రైత సిద్ధాంత

ఆదికర్తయని ఉండడము వాస్తవమే. అలా వ్రాయుటకు కారణము చెప్పితే

కొందరికి ఆశ్చర్యముగా ఉండును. ఎందుకనగా ఆ పేరు నాదికాదు.

తప్పు దొరికిందని పేరు నాదికాదని తప్పించుకొంటున్నాడని కొందరను

కోవచ్చును. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా వాస్తవానికి అందరూ

నాది అనుకొన్న పేరు నాది కాదు. అంతెందుకు 'మీది' అని మీరు

చెప్పుకొంటున్న మీ పేరు కూడా మీది కాదు. నేను చెప్పు విషయము

వలన నాకు మతిభ్రమించినదని మీరు అనుకోవచ్చును. నాకు చిన్న

వయస్సులో నిజానికి మతిభ్రమించి, తల్లితండ్రులు నాకు పెట్టిన పేరును

నాదేనని నేను అనుకొనెడివాడిని. తల్లితండ్రులు కూడా నాకే పేరు పెట్టామని

అనుకొన్నారు. అప్పటికి అది సక్రమమే అనుకొన్న నేను యుక్తవయస్సు

వచ్చిన తర్వాత, కొంత ఆధ్యాత్మిక జ్ఞానము తెలిసిన తర్వాత, నేను ఎవరో

నాకు తెలిసిన తర్వాత అప్పుడు తెలిసింది 'నాది' అనుకొను పేరు నాది

కాదని తెలిసినది. ఈ విషయములో తల్లితండ్రులు కూడా పొరపాటు

పడినారని అర్థమయినది. ఒక తల్లితండ్రులే కాదు ప్రతి ఒక్కరూ

పొరపడినారని, ప్రపంచములో ఎవరికీ పేరు లేదని అందరూ ప్రస్తుతము

'నాది' అను పేరు వాస్తవానికి వారిది కాదని అర్థమయినది. అలా అందరూ

భ్రమించడమునకు కారణము వారి ఆధ్యాత్మిక జ్ఞానము వారికే తెలియక

పోవడమేనని తెలిసినది. ఎప్పుడు మనిషికి తనను గురించి తనకు

తెలుస్తుందో అప్పుడు తాను ఎవరో తెలిసిపోవడము వలన, అంతవరకు

తన పేరు అనుకొన్నది పొరపాటనీ, వాస్తవానికి తన పేరు అది కాదని

తెలిసి పోవుట వలన ప్రపంచములో యున్న వారందరికీ తెలియని సత్యము

తెలిసిపోవుచున్నది.


ఎప్పుడయితే తన ఆత్మను గురించిన సత్యము తెలిసిపోయినదో

అప్పుడు తనెవరో తెలిసిపోవుచున్నది. తాను ఎవరో తెలిసిపోయినప్పుడు

అంతవరకు తనది అని చెప్పుకొను పేరు తనది కాదని తెలిసిపోవుచున్నది.

అదే విధముగా నా ఆత్మను గురించి నేను తెలుసుకున్న రోజు నేను

ఎవరో నాకు తెలిసిపోయినది. కావున అంతవరకు నాది అనుకొన్న పేరు

నాది కాదని తెలిసిపోవడమేకాక ఈ విషయములో మనుషులందరూ

పొరపడినారని తెలిసిపోయినది. అప్పటినుండి ఏ పనిని చేసినా, ఏ మాటను

మాట్లాడినా అది నేనే చేశానని, నేనే మాట్లాడినానని అందరూ అనుకొనినా,

ఆ పనిని చేసినది, ఆ మాట మాట్లాడినది నేను కాదు అను భావన నాలో

వచ్చినది. అటువంటప్పుడు త్రైత సిద్ధాంతమును చెప్పినది, దానిని గురించి

మాట్లాడినది నేనేయని అందరూ అనుకొనినా వాస్తవానికి ఆ పనిని చేసినది,

ఆ మాట మాట్లాడినది నేను కాదని వారికి తెలియక పోయినా,

తెరవెనుకయున్న సత్యమేమిటో నాకు తెలియును కనుక త్రైత సిద్ధాంతమును

ఎవరు చెప్పారో వారి పేరునే అక్కడ వ్రాయడము జరిగినది.ఆ పేరు

నాదియని మీరు అనుకోవడము మీ పొరపాటేగానీ, అందులో నా

ఏమరుపాటు ఏమీ లేదు!


ప్రశ్న :- మసిపూసి రేణికాయను మారేడుకాయగా చూపినట్లు, పేరు నాది

కాదని మొదటికే తప్పించుకొన్నావు. ప్రబోధానంద అను పేరు నీది కాకపోతే

నీ పేరేమిటి? చెప్పగలవా?


జవాబు :- సత్యము తెలిసిన తర్వాత నా పేరును నేను చెప్పడములో

నాకేమిటి సిగ్గు. మసిపూసి రేణి కాయను మారేడు కాయగా చూపవలసిన

అవసరము నాకు లేదు. నీవు మొదటికే మారేడు కాయవు పొరపాటుగా


రేణి కాయనని అనుకొంటున్నావు. పైన రంగును చూచి మోసపోవలసిన

పని లేదు. రేణికాయ పుల్లగ ఉంటుంది. మారేడు కాయ వగరుగా

ఉంటుంది. నీ రుచి ఏమిటో చూచుకో, పుల్లగయుంటే రేణికాయవు,

వగరుగ వుంటే మారేడు కాయవని తెలిసిపోతుంది. నా రుచిని నేను

చూడగలిగాను. నా రుచి వగరని తెలిసింది. నా రంగు నలుపని తెలిసింది.

నలుపురంగు, వగరు రుచి వున్న కాయ మారేడు కాయ కాకపోతే ఏమి

కాయ అవుతుందో మీరే చెప్పండి. నా విషయము నాకు తెలిసింది,

మిగతా ప్రజలు కూడా నాలాగే యుండువారు, నా జాతివారే కావున మిగతా

అందరి విషయము కూడా తెలిసింది. అందువలన "మీవి అనుకొన్న మీ

పేర్లు మీవి కావు" అని చెప్పాను.


ప్రశ్న :- ఇంతకూ నీవెవరో చెప్పలేదు. నీపేరు ఏమిటి?


జవాబు :- నేను ఒక అనాదిని. అవిటివాడిని, నాకు పేరంటూలేదు.

నాకు పేరును ఎవరూ పెట్టలేదు. అయితే ఒక బిరుదు మాత్రము ఉన్నది.

నేను శరీరములో జీవించువాడను, జీవితములో జీవించువాడను కనుక

“జీవుడు” అను బిరుదు కలదు. దానితోనే నన్ను జీవుడు అని చెప్పవలసి

యుంటుంది. నా విషయము అటుంచి నీ విషయము కూడా అంతే!

ప్రశ్న :- నీవు ఏమి చెప్పుచున్నావో మాకు ఏమాత్రము అర్థము కాలేదు.

ఇంతవరకు నీవు 'అసత్యము చెప్పవు' అను నమ్మకము నీ మీద ఉండేది.

అయితే ఇప్పుడు నీవు చెప్పే మాటలనుబట్టి ఆ నమ్మకము లేకుండా

పోవుచున్నది. నీకు ఏమి తెలిసిందో ఏమోగానీ, మాకు మాత్రము నీకు

మతిభ్రమించినదని తెలిసిపోయినది.


జవాబు :- ఇంతకాలము నిజముగా నాకు మతిభ్రమించి యుండేది.

ఇప్పుడిప్పుడే నామతి భ్రమను వీడి సత్యములోనికి వచ్చినది. ఇప్పుడు మీ

మతియే భ్రమలో యున్నది.


ప్రశ్న :- నా పుట్టిన రోజు నాకు తెలుసు, నా తల్లితండ్రులు నాకు తెలుసు,

నా అన్నదమ్ములు నాకు తెలుసు. నేను తినే తిండి తెలుసు, నేను త్రాగే

నీరు తెలుసు. ఇవన్నీ నీకు ఉన్నాయి. అయితే ఇందులో నాకున్న భ్రమ

ఏమిటి? నీకు లేని భ్రమ ఏమిటి?


జవాబు :- నేను ఎంత చెప్పినా నీ లోకము నీది, నా లోకము నాది

అన్నట్లున్నది. నీ లోకమేమిటో? నా లోకమేమిటో? అనగా నీ భ్రమ

ఏమిటో? నా బోధ ఏమిటో? నీకు అర్థమగుటకు ఒక ఉదాహరణను

చేకూర్చి చెప్పెదను వినుము. ఒక వ్యక్తి సన్నాసత్వము తీసుకుని, కాషాయ

గుడ్డలు ధరించి, గడ్డము పెంచి పైకి కైలాసము నుండి దిగివచ్చిన ఈశ్వరుని

వలె కనిపించుచుండెను. ఒక దినము అతను మా వద్దకు రావడము

జరిగినది. ఒక దినమంతయూ మావద్దనే యున్న ఆ సన్న్యాసి స్వామివారు,

మేము, ఇంకా కొందరు అందరమూ కలిసి మా ఇంటివద్దనే ఆరుబయట

పడుకోవడము జరిగినది. రాత్రి ఒంటిగంట సమయములో కాషాయ

గుడ్డలు ధరించియున్న స్వామిగారు స్వప్నములోనికి పోవడము జరిగినది.

స్వప్నములో ఆయన ఒక తోటలో నివాసము ఏర్పరచుకొని యుండగా,

ప్రక్కతోటలో గల వ్యక్తి స్వామిగారి దగ్గరకు వచ్చి తన కోడి కనిపించలేదనీ,

ఎర్రరంగు ఈకలుగల కోడియనీ, దాని గుర్తుతో సహా రంగుతో సహా

చెప్పాడు. ఆ స్వామిగారు ప్రక్కతోట యజమాని అడిగిన కోడిని చూడలేదని

చెప్పాడు. అంతటితో ఆ కోడి యజమాని కోడిని గురించి బాధపడుచూ


అక్కడినుండి పోయాడు. అతను పోయే సమయములో తనకోడి ఎక్కడయినా

కనిపిస్తుందేమోనను ఆశతో అటు ఇటు చూస్తూ పోయాడు. అప్పుడు

అతనికి తనకోడి కనిపించలేదుగానీ, తనకోడి ఎర్రనిఈకలు ఒక కంది

చెట్టు క్రింద కనిపించాయి. అప్పుడు అతనికి తన కోడి ఈకలు స్వామి

వున్న తోటలోనే కనిపించడము వలన, ఆ ప్రాంతములో స్వామి తప్ప

ఎవరూ లేనిదానివలన, స్వామియే తన కోడిని చంపి వండుకొని తిని

వుంటాడను అనుమానము వచ్చినది. వెంటనే స్వామివారి దగ్గరకు వచ్చి

తన కోపమునంతటినీ స్వామిమీద వెల్లగ్రక్కాడు. అప్పుడు ఆ స్వామి

నాకు కోడి విషయము తెలియదని చెప్పినా కోడియజమాని వినలేదు.

ఇద్దరి మధ్యన మాటా మాటా పెరిగి పోయినది. ఇదంతయూ స్వప్నములో

జరుగుచున్నా ప్రత్యక్ష ప్రసారమువలె స్వామిగారి మాటలన్నీ బయటికి

వినిపించుచున్నవి. స్వామివారు నిద్రపోయాడు అని మేము అనుకొన్నా

అక్కడ ఆయన మాట్లాడు మాటలను బట్టి స్వామివారు స్వప్నములో

ఉన్నాడని అర్థమయినది. అక్కడే పడుకొన్న పదిమంది నిద్రనుండి లేచి

స్వామి మాటలు వింటున్నారు.


అంతలో స్వప్నములో కోడి యజమాని స్వామివారిని బూతు

పదములను ఉపయోగించి తిట్టాడు. దానికి ప్రతిగా స్వామివారు కూడా

బూతుమాటలనే తిట్టడము మాకు వినిపిస్తున్నది. అంతలో కోడి యజమాని

స్వామివారిని కొట్టినట్లు పైకి వినిపించే మాటలను బట్టి మాకు అర్థమయినది.

స్వామివారు నన్నే కొడతావా!యని కోడి యజమానిని కొట్టడము ఆ ఘర్షణ

అంతయూ మాకు తెలిసింది. అప్పుడు మేము దానిని నివారించుటకు

ఎటూ స్వప్నములోనికి వారి మధ్యలోనికి పోలేము. అందువలన స్వామివారిని

గట్టిగా తట్టి లేపడము జరిగినది. అప్పుడు ఆయన స్వప్నము నుండి


బయటికి వచ్చాడుగానీ, స్వప్నములో జరిగినదంతయూ మాకు తెలిసినదని

ఆయనకు తెలియదు. స్వామివారు లేచిన తర్వాత అది స్వప్నమని

దానినుండి బయట పడినానని తెలిసినా, అప్పుడు కోడి యజమాని మీద

వచ్చిన కోపము అతనిలో ఉండడమూ, పోట్లాటలో కోపముతో ఊగిపోయిన

ఊపుడు శరీరములో ఇంకా కొంత ఉండడమూ, తోటప్రక్కన వాడు నన్ను

కొట్టాడను అవమాన భారము పది నిమిషముల వరకు అతన్ని వీడకుండా

ఉండడమునుబట్టి స్వప్నములో జరిగినదంతా నిజమే అన్నట్లుండినా,

మెలుకువలో అదంతయూ అసత్యమని మన భ్రమయని తెలియుచున్నది.

జరిగినది భ్రమ అని అనుకొన్నా దానికి సరియైన సమాధానము లేదు.

స్వప్నమునుండి బయటపడిన పది నిమిషముల వరకు ఆ సంఘటనలో

యున్న కోపము, గుండెదడ, భయము, శరీరములో వణుకుడు (ఊపుడు)

మొదలగునవన్నీయుండుట వలన అది అసత్యము కాదు సత్యమేయనునట్లు

అనిపిస్తున్నది. ఎంత సత్యమనిపించినా మెలుకువలోనికి వచ్చిన తర్వాత

ఎవరయినా దానిని అసత్యమని, భ్రమయని చెప్పక తప్పదు. స్వప్నములోనికి

పోయి వచ్చినవాడు స్వప్నములోని అనుభవములన్నిటినీ అనుభవించి

యుండుట వలన అతను సందిగ్ధములో పడిపోయి, సత్యమని గానీ,

అసత్యమని గానీ నిర్ధారణకు రాలేకయుండును.


స్వప్నమునకు బయటయున్నవాడు మాత్రము జరిగినది అసత్యమే

అని చెప్పును. ఎందుకనగా! తన కళ్ళ ఎదుటే స్వామి పడుకొని యుండడము

వలన బయటివారి దృష్టిలో తోటలేదు, కోడిలేదు, కోడి యజమాని లేడు.

అందువలన స్వామివారి మాటలన్నీ వట్టి భ్రమయే అని అనుచుందురు.

స్వామివారి విషయమునకు వస్తే, ఆయన స్వయముగా అనుభవించిన

అనుభవములనుబట్టి దానిని 'భ్రమ' అని అనలేడు. ఈ విధముగా


స్వప్నమునకు బయట ఉన్న పదిమంది కోడి, కోడి యజమాని ఏదీలేదు

ఇదంతా అసత్యమని అనుచుండగా, స్వప్నమును పొందిన వాడు మాత్రము

నిజమే అని అనగలుగుచున్నాడు. ఈ విషయము చాలామందిని నిజమా!

అబద్దమా!! అని సందిగ్ధములో పడవేయుచున్నది.


ప్రశ్న :- ఈ విషయములో మీరేమంటారు?

జవాబు :- ఒక్కరికి సత్యమయినది, పదిమందికి అసత్యమయినది అయి

వుండుట వలన ఆ స్వప్నము అతనికి ఒక్కనికి నిజమే అయినా అందరికీ

అబద్దమే అవుతుంది. అబద్దమును 'కల్ల' అనడము కూడా జరుగుచున్నది.

కల్ల అనగా అసత్యమని అర్థము కలదు. స్వప్నము ఒకరి దృష్ఠిలో సత్యమైనా

వందమంది దృష్టిలో కూడా అసత్యమే అగుట వలన స్వప్నమును కల్ల

అని అన్నారు. 'కల్ల' అనుమాట కాలక్రమేపీ 'కల'గా మారిపోయినది.

'కల్ల' అను పదము 'కల'గా మారిపోయినా అది అసత్యమని అర్థము

చేసుకోవలెను. ఒక్కరి విషయములో నిజమైనా అనేకమంది విషయములో

అసత్యమగుట వలన ఎక్కువ సాంద్రతయున్న విషయము ప్రచారమయినది.

‘కల్ల' అను పదములో 'ల' క్రింద ల వత్తు లేకుండా పోవడము వలన కల్ల

కలగా మారిపోయినది. ఈ విషయమై నన్ను అడిగిన దానివలన స్వామికి

వచ్చిన స్వప్నమును గురించి విశ్లేషించి చూచితే, ఈ విధముగా అర్థమగు

చున్నది. 'స్వప్నము' అను పదములోనే దానికి కొంత అర్థము ఉన్నది.

స్వప్నము అను పదమును విడదీసి చూస్తే ఈ విధముగా కలదు.

స్వ+పనము= స్వప్నముగా పలుకబడుచున్నది. స్వ అనగా నీ స్వంతమునకు

మాత్రమే అని అర్ధము. నీకొక్కనికే అని కూడా అర్థము రాగలదు. స్వ

అనగా నీది అనియూ, పనము అనగా ధనము అనియు అర్థము. నీ

స్వంత ధనము అనుమాటను నీ స్వంత అర్థము అని కూడా చెప్పవచ్చును.


స్వంతానికి అది నిజమనిపించినా, నిజమే అయినా చివరికి అందరి చేత

అది అసత్యముగా, లేక కల్లగా తేల్చబడినది.


అదే విధముగా నీకు తల్లితండ్రులున్నట్లు తెలిసినా, నీ పుట్టిన

రోజు నీకు తెలిసినా, నీవు తినేది త్రాగేది నీకు తెలిసినా అది అంతయూ

కల్లయే. నీవు అనుకున్న తల్లితండ్రులు నీవారు కారు. వారు అసత్యము.

సత్యముగా నీ తల్లి తండ్రులు వేరుగాయున్నారు. నీ పుట్టిన రోజు నీకు

తెలిసినా అది కల్లయే. నీవు నిజముగా సృష్ట్యాదిలోనే పుట్టావు. నీవు

తిన్నాను త్రాగాను అనుమాట కూడా నీకు సత్యమనిపించినా వాస్తవముగా

అది అసత్యమేయగును. స్వప్నము అంతరంగములో జరుగు సత్యమయినా

బాహ్యరంగములో అది అసత్యమగును. అదేవిధముగా నీ స్వంత భావములో

ఎంత నిజమున్నా బయట సత్యము ప్రకారము స్వంత భావములను

మించిన శాస్త్రభావమే సత్యమగును. అందువలన నాకు ఫలానా వారు

తల్లితండ్రులు అని అనుకొన్నా అది స్వంత భావమేగానీ సత్యమని

చెప్పలేము. సత్యమును పరిశోధించి చూస్తే, శాస్త్రమును అనుసరించి

చూచినా ప్రకృతి పరమాత్మ తల్లితండ్రులని, బాహ్యముగా కనిపించువారు

నీ తల్లితండ్రులు కాదని తెలియుచున్నది. జగతిలో యున్న ప్రతి మనిషి

ప్రతి విషయములోనూ తప్పు భావము కల్గియున్నాడని తెలియుచున్నది.

మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానము తెలియనంతవరకు తన భ్రమ ఏమిటో? తనకే

తెలియదు. అందువలన నేడు ఆత్మల జ్ఞానము తెలియని మనుషులందరూ

తనెవరో తెలియక, తనది కానిదానిని తనదే అనుకొంటున్నాడు. తాను

వ్రాయని దానిని తానే వ్రాశానని అనుకొంటున్నాడు. సత్యముగా జీవుడు

ఏమీ చేయనివాడు, చేతకానివాడు. ప్రస్తుతము నేను దైవజ్ఞానమును

అనుసరించి నా స్థితిని తెలియగలిగాను. అందువలన సిద్ధాంతమును


కనిపెట్టినది నేను కాదు అని చెప్పగలుగుచున్నాను. మనిషి శరీరమంతయూ

వ్యాపించియున్న ఆత్మయే అన్ని పనులు చేస్తున్నది. శరీరము మొత్తము

ఆత్మదే అయినప్పుడు శరీరమునకున్న పేరు కూడా ఆత్మదేయగును.

ప్రశ్న :- ఇప్పుడు మీరు ఏమి చెప్పదలుచుకొన్నారు?


జవాబు :- ఇప్పుడుగానీ, ఎప్పుడుగానీ నేను ఏమీ చెప్పదలుచుకోలేదు.

'నేను చెప్పెదను' అని అనుకోవడము పొరపాటని తెలిసినది. వాస్తవముగా

ఏమి చేయదలుచుకొన్నా అది ఆత్మయే చేయాలి. వ్యవహారికముగా

మిగతావారు తెలియనితనములో నన్ను ప్రబోధానందగా అనుకొనినా

ఆధ్యాత్మికము తెలిసినవారు నన్ను జీవునిగానే లెక్కించి, ప్రబోధానంద పేరు

గల వానిని ఆత్మగా లెక్కింతురు. మీరు ఏమి ప్రశ్న అడిగినా జవాబును

ఆత్మయే చెప్పుతుంది. నేను (జీవుడను) శరీరములో ప్రక్కనయుండి చెప్పే

దానిని వింటున్నాను.


ప్రశ్న :- మీమాట ప్రకారమే మీరు చెప్పలేదు, మీ లోపలయున్న ఆత్మయే

చెప్పుచున్నదని అనుకొంటాము. అందరిలో కూడా అట్లే యున్నదని మీరు

చెప్పుచున్నారు. అటువంటప్పుడు కొన్ని సందర్భములలో మనిషి

పొరపాటుగా మాట్లాడడము, అజ్ఞానముగా మాట్లాడడము, అసత్యముగా

మాట్లాడడము జరుగుచున్నది కదా! అప్పుడు ఆత్మకూడా అజ్ఞానముగా

మాట్లాడినట్లేనా? ఆత్మకూడా అసత్యమును చెప్పినట్లేనా? జ్ఞానస్వరూపమైనది

ఆత్మయని మీరే చెప్పారు. ఆత్మకు తెలియనిదంటూ లేదన్నారు.

అటువంటప్పుడు ఆత్మ స్వయముగా ఎందుకు అట్లు మాట్లాడినది? ఒక

ప్రశ్నకు జవాబును కూడా తప్పు చెప్పునప్పుడు ఆత్మ చెప్పుచున్నదను మీ

మాటను ఎలా నమ్మాలి?


జవాబు :- మనిషిలో ఆత్మ మాట్లాడుచున్నదని నమ్మకూడదనే ఉద్దేశ్యము

తోనే ఆత్మ అలా అబద్దమును చెప్పుచున్నది. ఒక అసత్యమునే కాదు,

అక్రమముగా, అన్యాయముగా కూడా మాట్లాడుచున్నది. అలా మాట్లాడుట

వలన ఎవరి దృష్ఠి ఆత్మమీదికి పోకుండా జీవాత్మ మీదికే పోవాలను

ఉద్దేశ్యముతోనే ఆత్మ ఆ విధముగా మాట్లాడుచున్నది. మనిషి మాట్లాడు

బూతు మాటలను, మనిషి చేయు అత్యాచారములను, హత్యలను ఆత్మే

చేయుచున్నదని ఘంటాపథముగా చెప్పుచున్నాను. ఆ విధముగా శరీరము

లోని ఆత్మ శరీరమును కదిలించి చేయించు కార్యములను చూచిగానీ,

మాట్లాడించు మాటలను చూచిగానీ, ఎవడు కూడా ఈ పని చేయునది

ఆత్మయనీ, ఈ మాట మాట్లాడునది ఆత్మేనని ఎవడూ నమ్మడు, నమ్ముటకు

ఏమాత్రము వీలులేనట్లు ఆత్మే చేయుచున్నది. సత్యమును తెలిసిన మాలాంటి

వారు ఏమి చెప్పినా నమ్మనట్లు ఆత్మే చేయుచున్నది. ఈ విధముగా

చేయడము వలన ఆధ్యాత్మికము (ఆత్మను అధ్యయనము చేయడము) అను

దాని వైపు ఎవరూ పోకూడదను ఉద్దేశ్యము తప్ప వేరు ఏమీ లేదు.

దానివలన మనుషులు ఇంతవరకు ఆత్మవైపు దృష్టి సారించలేదు. ఎంత

పెద్ద స్వాములకయినా, వేదాంతులమని చెప్పుకొను వారికయినా వారి

శరీరములోని ఆత్మ వారికి తెలియదు.


ప్రశ్న :- మీ మాటలు ఒకవైపు సత్యమనిపించినా, మరొకవైపు అసత్యమని

పించుచున్నవి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థము కాలేదు. ఆత్మ

శరీరములోయున్న దేవుడని మీరే కొన్నిచోట్ల చెప్పారు. ఆత్మను శరీరములోని

దేవునిగా, జీవునికి దేవునిగా చెప్పినప్పుడు దేవుడు కూడా మోసాలు

చేయునా? అసత్యాలు చెప్పునా? దీనికి జవాబు మీరే చెప్పండి!


జవాబు :

శరీరములోయున్న ఆత్మే జీవాత్మకు దేవునిగా, అధిపతిగా

యున్నాడు. ప్రపంచమంతా వ్యాపించియున్న దేవునితో జీవునికి సంబంధము

లేదుగానీ, జీవునికి ఆత్మే అన్ని విధముల దేవుడు అని చెప్పవచ్చును. ప్రతి

మనిషిని ఆడించువాడు ఆత్మే. అన్నీ తెలిసినవాడు ఆత్మ అయినందున

ఆయనకు జ్ఞానము తెలుసు, అజ్ఞానము తెలుసు, మంచి తెలుసు, చెడు

తెలుసు. ఆయన మంచిగా అయినా కనిపించగలడు. చెడుగానయినా

కనిపించగలడు. రెండు రకముల కనిపించుట వలన ఆయనను ఫలానా

వాడని ఎవరూ పోల్చుకోలేరు. అందువలన తమ శరీరములోనే యున్న

ఆత్మను ఇంతవరకు ఎవరూ గుర్తించలేకపోయారు. కొందరిలో మంచిగా

ప్రవర్తించు ఆత్మ, కొందరిలో చెడుగా కూడా ప్రవర్తించుటకు కారణము

గలదు. మనిషి చేసుకొన్న కర్మను అనుసరించి ఆత్మ అలా ప్రవర్తించును.

అలా చెడుగా మంచిగా ప్రవర్తించునది ఆత్మే అయినా జీవుడు అజ్ఞానముతో

తనది కాని శరీరమును తనదియనుకొని తాను చేయని కార్యములను,

ఆత్మ చేసిన కార్యములను తానే చేశానని అనుకోవడము వలన ఆ పనికి

తానే బాధ్యుడు అగుచున్నాడు. జరిగిన కార్యములోని కర్మ ఏదయినా

(పాపమయినా, పుణ్యమయినా) జీవునికే తగులుకొనుచున్నది. నిత్యము

ఆత్మ చేయు అనేక కార్యములలో కొన్ని మంచి, కొన్ని చెడు కార్యములు

మిశ్రమముగా ఉండును. మనిషి చేసినట్లు పైకి కనిపించు కార్యములన్నిటినీ

ఆత్మే చేయుచుండినా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకముగా చేయుచుండును.

అలా వేరువేరు మనుషులలో వేరువేరుగా ఆత్మ చేయుటకు కారణము ఆ

శరీరములోయున్న జీవుడు చేసుకొన్న కర్మయేనని చెప్పవచ్చును. గత

జన్మలో జీవుడు చేసుకొన్న కర్మప్రకారము ఆత్మ కార్యములను చేస్తే

కార్యములలో కల్గు సుఖదుఃఖములను జీవుడు అనుభవించును. జీవుడు


చేసుకొన్న పాపపుణ్యములను జీవుడే అనుభవించుటకు తగిన కార్యములను

ఆత్మ చేయవలసియున్నది. జీవుడు సుఖదుఃఖములను అనుభవించుటకు

అనగా! స్వర్గ నరకములను అనుభవించుటకు శరీరములోని ఆత్మయే

పనిచేసి, ఆ పనిలో వచ్చు సుఖదుఃఖములను జీవుడు అనుభవించునట్లు

చేయుచున్నది. ఆత్మ శరీరములోని జీవునికి స్వర్గనరకములను కల్గించుటకు

కొన్ని మంచి పనులు, కొన్ని చెడుపనులు చేయుచున్నది. ఆత్మ చెడు

పనిని చేసినా, మంచి పనిని చేసినా ప్రతి దానికి ఒక లెక్కయుంది. అదియే

కర్మ గణితము. కర్మపత్రములో వ్రాయబడిన దానిని జీవుడు ఎప్పుడెంత

అనుభవించవలయునో అప్పుడు దానికి తగిన మంచి పనినో లేక చెడు

పనినో ఆత్మ శరీరముతో చేయగా, లోపలయున్న జీవుడు లోపలే

అనుభవించును. ఆత్మ చేసిన పనినిబట్టి జీవుడు సుఖమునో దుఃఖమునో

అనుభవించుట జరుగుచున్నది. ఇదంతయూ ఒక లెక్క ప్రకారము

జరుగవలసియుండుట వలన, అదే విధముగా ఆత్మ చేయుచున్నది.

అంతేగానీ ఆత్మ స్వయముగా తప్పు చేయలేదు. స్వయముగా ఒప్పు

చేయలేదు. కర్మ విధానము కొరకు, జీవుని అనుభవము కొరకు దేవుని

పాలనలో ఒక భాగముగా ఈ పనులు జరుగుట వలన ఆత్మను మంచి

పని చేసినదిగా గానీ, చెడుపనిని చేసినదిగా గానీ చెప్పలేము.

ప్రశ్న :- చేసేది ఒకరు దానిని అనుభవించేది ఇంకొకరు. ఇది అన్యాయము

కాదా! గొలుసులేని కుక్క కోడిని తినిపోతే గొలుసుతో కట్టివేసిన కుక్క

దానిని దూరముగాయుండి చూచినదని కొట్టారట! తిన్న కుక్కను కొట్టకుండా

చూచిన కుక్కను కొట్టడము పూర్తి అన్యాయము కాదా! మీరు న్యాయాన్ని

సమర్థిస్తారా? అన్యాయాన్ని సమర్థిస్తారా? చెప్పండి.


జవాబు :- మేము చెప్పునది ఆధ్యాత్మికము. ప్రపంచ సంబంధమైన

విషయము కాదు. ప్రకృతి సంబంధ విషయమునకు పరమాత్మ సంబంధ

విషయమునకు చాలా తేడావుండును. నీతి న్యాయము ప్రపంచ

సంబంధమైనవి. జ్ఞానము, ధర్మము ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధ

విషయములలో జ్ఞానము, ధర్మములు లెక్కించబడును. నీతి న్యాయములు

ఉండవు. దీనికి సాక్ష్యము కావాలంటే భగవద్గీతలో మోక్ష సన్నాస

యోగమున 17వ శ్లోకము ఈ విధముగా చెప్పారు చూడండి...


17వ శ్లో॥

యస్య నాహంకృతోభావో బుద్ధిర్యస్య న లిప్యతే |

హత్వాపి స ఇమాన్ లోకాన్న హస్తి నని బధ్యతే |


భావము :- "ఎవని భావములో అహంకారము లేదో, ఫలితము మీద

బుద్ధి ఎవనికి లేదో, అతడు ఈ లోకములోనున్న వారందరినీ చంపినా,

వాడు హంతకుడు కాదు, వానికి పాపము అంటుకోదు." ఇక్కడ

అహము లేనివాడు ఎంతమందిని చంపినా వాడు హంతకుడు కాదు, పాపము

రాదు అని చెప్పు మాటలో ప్రపంచములో పూర్తి అన్యాయమే కనిపించినా,

దైవికముగా అది పూర్తి ధర్మమైయున్నది. అందువలన పాపము రాదు

వాడు హంతకుడు కాడు అని చెప్పారు.


ఇటువంటి విషయమునే “మధ్య దైవగ్రంథమయిన సువార్త

బైబిలు”లో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 28వ వాక్యములో ఇలా

చెప్పారు. "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే

తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును" ఇది

కూడా ఎటు చూచిన అన్యాయము మాటే అగును. ఒక కార్యమును


చేయకున్ననూ భావము వలననే చేసినట్లు లెక్కించబడుచున్నది. ప్రథమ

దైవగ్రంథమయిన భగవద్గీతలో పనిని చేసినా భావములో లేనిదానివలన

చేయనట్లేయగుచున్నది. అదే విధముగా భావమే ప్రధానమగుట వలన

మనస్సులో భావమును పొందినా, పనిని చేయకున్నా చేసినట్లేయగుచున్నది.

దీనినంతటినీ గమనిస్తే ఆధ్యాత్మికములో భావమే ముఖ్యముగాయున్నది.

ఎప్పుడు అహంభావమున్నదో అప్పుడు పనిని చేయకున్నా చేసినట్లేయగును.

ఎప్పుడు అహంభావము లేదో అప్పుడు పనిని చేసినా చేయనట్లే అగుచున్నది.

ఇది ప్రపంచరీత్యా అన్యాయముగానే కనిపించును. అయినా దైవికముగా

ధర్మబద్దముగా యున్నది. అందువలన శరీరములో జీవుడు పనిని

చేయకున్నా, లోపలయుండి అహంకార భావముతో కూడియుండుట వలన

అతడు చేసినట్లే లెక్కించబడుచున్నది. జరిగిన దానిలోని కర్మ అతనికే

(జీవునికి) అంటగట్టబడుచున్నది.


ప్రశ్న :- ఒకరు జ్ఞాని, మరొకరు అజ్ఞాని ఇద్దరు మనుషులు కలిసి ఒకనిని

చంపారనుకొందాము. అప్పుడు ఇద్దరూ కలిసి చేశారు కావున అక్కడ

పాపము రాదా? అది హత్యకాదా? వారు హంతకులు కారా?

జవాబు :- భూమిమీద ఒక కార్యము జరగాలంటే దానిని ఒకరయినా

చేయవచ్చు లేక ఎక్కువమంది అయినా చేయవచ్చును. ఇద్దరు కలిసి ఒక

మనిషిని చంపారు. అప్పుడు అక్కడ జరిగినది హత్యయే. ప్రపంచ లెక్కలో

వారు ఇద్దరూ హంతకులే. అయితే ఆ పనిని చేసినప్పుడు ఒకడు నేను ఈ

పనిని చేయుచున్నానను భావముతో చేశాడు. మరొకడు ఆత్మజ్ఞానము

తెలిసినవాడై ఆత్మే ఈ పనిని చేయుచున్నదను భావముతోయున్నాడు.

మరొకడు ఆత్మజ్ఞానము తెలియనివాడై నేనే చేయుచున్నానను


అహంభావముతో యున్నాడు. ఈ విధముగా ఒకే పనిని ఇద్దరు చేసినా

అందులో అహం (నేను) అను భావము ఒకనికుండగా, మరొకనికి అహం

అను భావము లేదు. ఆధ్యాత్మికము ప్రకారము భావమును బట్టి కర్మవచ్చును.

భావమును బట్టి ఆ పనిని చేశాడా లేదా అని నిర్ణయించబడును. ఇద్దరిలో

ఒకనికి నేను చేయుచున్నానను భావమున్నది, మరొకనికి ఆత్మ చేయుచున్న

దను భావము కలదు. నేను చేయుచున్నానను భావము కల్గినవాడు ఆ

పనిని చేసినట్లేయగుచున్నది. నేను కాదు శరీరమునకు అధిపతిగాయున్న

ఆత్మయే చేయుచున్నదను భావమున్న వాడు ఆ పనిని చేయనట్లేయగు

చున్నది. ఆ పనిని ఆత్మే చేయునట్లు లెక్కించబడుచున్నది. వాస్తవముగా

చేసినది కూడా ఆత్మయే. అందువలన వారిలో 'నేను చేశాను' అను అహం

భావము కల్గిన వాడు మాత్రమే ఆ పనిని చేసినట్లు లెక్కంచబడి అతనిని

‘హంతకుడు’ అని చెప్పవలసి వచ్చినది. హంతకుడయిన వానికే ఆ పనిలో

కల్గు కర్మ చేరిపోయినది. అప్పుడు వాడు హత్యా పాపమును పొందిన

వాడయినాడు. మరొకరు కూడా ఆ పనిని చేసినా వాస్తవము తెలిసినవాడై,

తాను శరీరములో లోపల తలలో యున్నానని, తాను ఏమీ చేయలేని

అవిటివాడననీ, జరుగుచున్న పనిని చూస్తున్నా అది నాకు సంబంధములేని

పనియనీ, ఆ పనిని చేయునది శరీరమంతా వ్యాపించిన ఆత్మేనని, తాను

ఏమాత్రము కాదను భావములో యుండుట వలన ఆ పనిని అతడు

చేయనట్లేయగుచున్నది. అందువలన అతనికి ఆ కార్యములోని పాపము

రాలేదు. అప్పుడు వాడు హంతకుడుగా లెక్కించబడలేదు. ఈ విధముగా

ప్రపంచములో జరుగు ఏ కార్యమునయినా చేసిన వారి భావమును బట్టి

వాడు చేశాడా, చేయలేదా అని నిర్ణయించబడును. అన్ని పనులను ఆత్మయే

చేయుచుండగా, తెలివి తక్కువతో నేను చేశానని అనుకోవడము అజ్ఞానము


కాదా! పుట్టిన ప్రతివాడు ముందు తన విషయమును తాను తెలిసి

బ్రతుకవలెను. అటువంటి వానిని 'జ్ఞాని' అంటారు. శరీరములో తన

స్థానమేదో, తన బలమెంతో తెలియనివాడు అజ్ఞాని అగును.


ముందు తన వివరము తనకు తెలియకపోతే వాడుయున్న

శరీరములో జరుగు పనులన్నియూ వాడే చేసిన భావమును పొందును.

జీవుడు నివశిస్తున్న శరీరములో ఆత్మ చేయు పనులను నేనే చేశానని భ్రమించి

అహంభావమును పొంది ఆ పనులకు తానే బాధ్యుడగును. నేడు

ప్రపంచములో సామాన్య జీవితమును గడుపుచూ ఏమాత్రము దైవ సంబంధ

జ్ఞానము తెలియనివారికి ఆత్మ విషయము ఏమాత్రము తెలియదు. సాధారణ

మనుషులను వదలి మేము జ్ఞానులము, భక్తులము, యోగులము,

సన్యాసులము, మేము అన్యదేవతారాధన చేయని మతములోనివారము,

మా మతము దేవునికి దగ్గరగాయున్న మతము, మమ్ములను మా దేవుడు

మా పాపమునంతటినీ లేకుండా చేయును, మేము దైవమార్గములోయున్న

వారము అని అనుకొను వారిని గుర్తించి వారిలో ఎందరికి ఆత్మయొక్క

విషయము తెలియును అని చూస్తే, దాదాపు అందరికీ ఆత్మయొక్క వివరము

తెలియదనీ, తమ వివరము కూడా తమకు తెలియదనీ, వారందరూ మేము

మనుషులమేననీ, అన్ని పనులు మేమే చేస్తున్నామను భావములో యున్నారు.

నేను గొప్ప జ్ఞానిని అని సన్న్యాసత్వం తీసుకొని, ప్రజలకు భారత, భాగవత,

పురాణములను అనర్హళముగా చెప్పు స్థితిలోయున్న స్వామీజీలు కూడా

నేను ఆ పూజ చేశాను, నేను ఈ యజ్ఞము చేశాను, నేను పూజ చివరిలో

మంగళహారతి ఇచ్చాను అని చెప్పుకొంటున్నారు. పైకి ఎలా చెప్పినా

ఫరవాలేదుగానీ, లోపల భావములో 'నేను చేశాను' అను భావముతోనే

యున్నారు. కావున వారు ఎంత పెద్ద స్వామీజీలయినా, వారికి ఆత్మజ్ఞానము


తెలియదనియే చెప్పవచ్చును. ఆత్మజ్ఞానము తెలియనప్పుడు అతడు ఎంత

పెద్ద స్వామి అయినా సాధారణ మనిషివలె పాపపుణ్యములను పొందు

చుండును. అతడు చేయు యజ్ఞముల వలన, దానముల వలన,

వేదాధ్యయణముల వలన, తపస్సుల వలన పుణ్యము వచ్చును. యజ్ఞ,

దాన, వేదపఠన, తపస్సులను నేనే చేయుచున్నానను భావముండుట వలన

వాటి వలన వచ్చు కర్మఫలము అతనికే చేరుచున్నది. ఇందులో ఏమాత్రము

అనుమానము లేదు.


ప్రశ్న :- మేము అడిగినది రవ్వంత, మీరు చెప్పినది పేరంత. మాకు

కొంతవరకు అర్థమయినది. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పుచున్నారని

అర్థమయినది. నేడు ఎంతో పెద్ద స్వామీజీలున్నారు. భగవద్గీతను వివరించి

వ్రాసినవారు కూడా యున్నారు. భగవద్గీతలోనే ఆత్మల వివరమున్నదని

మీరు చెప్పారు. మీ సిద్ధాంతము కూడా భగవద్గీత ఆధారముతో చెప్పినదే.

అటువంటి భగవద్గీతకు భాష్యము చెప్పినవారు ఎందరో కలరు. వారికి

కూడా ఆత్మ విషయము తెలియదంటారా?


జవాబు :- భారత దేశములో ఆధ్యాత్మిక పీఠములను స్థాపించినవారికే

ఆత్మ విషయము తెలియదు. వారికి పరమాత్మ విషయము మాత్రము

తెలుసు. జీవునికి దేవునికి మధ్యలోయున్న ఆత్మను ఎవరూ గుర్తించలేదు.

భగవద్గీతలో ఆత్మను గురించి దాదాపు 70 శాతము భగవంతుడు

చెప్పియున్నా దానిని ఎవరూ తెలియలేదు. భగవద్గీతకు అనేక భాషలలో

వివరము వ్రాసినవారు కూడా ఆత్మను గురించి చెప్పినచోట దానిని

పరమాత్మగా చెప్పుకొన్నారు. కొందరు కొన్ని సందర్భములలో ఆత్మను

జీవాత్మగా లెక్కించుకొన్నారు. మూడు ఆత్మలు మన శరీరములో యున్నవను


విషయమే తెలియనివారైనారు. అందువలన గతములో ఆధ్యాత్మిక

సిద్ధాంతములను కనుగొన్న సిద్ధాంతకర్తలు కూడా రెండు ఆత్మలను కొందరు

చెప్పగా, ఆదిశంకరాచార్యుడు ఉన్నది ఒక ఆత్మేనని చెప్పి దానిని అద్వైత

సిద్ధాంతముగా ప్రతిపాదించాడు. ఈ విధముగా ఆధ్యాత్మిక విద్యలో

పెద్దవారని పేరుగాంచిన ముగ్గురు సిద్ధాంతకర్తలు ఆత్మను విస్మరించి

తమ సిద్ధాంతములను చెప్పారు. మనుషులకు దైవజ్ఞానము నేర్పువారై

అందరికీ మార్గదర్శకులైనవారే మార్గము తప్పి ఆత్మను తెలియక పోవడము

వలన, వారిని అనుసరించు వారికి ఆత్మజ్ఞానమే తెలియకుండా పోయినది.


ప్రశ్న :- హిందూ మతమునకు పునాదులవంటి సిద్ధాంతకర్తలకే ఆత్మజ్ఞానము

తెలియదంటారా?


జవాబు :- నేను చెప్పేది కాదనుకో, వారు చెప్పిన సిద్ధాంతములను నీవే

చూడు. అందులో ఆత్మను గురించిన సమాచారమెక్కడయినా ఉందేమో

చూపగలవా?

ప్రశ్న:- అయితే వారు చెప్పినది ఏమిటి? ముగ్గురు సిద్ధాంతకర్తలు ఆత్మను

గురించి చెప్పలేదా?


జవాబు :- మొదటి సిద్ధాంతకర్తయిన ఆదిశంకరాచార్యులవారు ఒకే

పరమాత్మను గురించి చెప్పారు. మూడవ సిద్ధాంతకర్త దేవున్ని మరియు

జీవున్ని గురించి చెప్పారు. మధ్యలో రెండవ సిద్ధాంతకర్త అద్వైతమునే

సమర్థిస్తూ దానిలోని భక్తిని విశిష్టముగా చెప్పారు. దానినే 'విశిష్టాద్వైతము'

అన్నారు. మూడవ ఆయన చెప్పినది జీవుడు, దేవుడు అను ఇద్దరినీ

చెప్పుట వలన దానిని 'ద్వైత సిద్ధాంతము' అంటున్నాము.

ప్రశ్న :- దేవుడు ద్వాపరయుగము చివరిలో, కలియుగము మొదటిలోనే


భగవద్గీతను చెప్పి అందులో సంపూర్ణ జ్ఞానమును ఇచ్చాడు కదా!

అటువంటప్పుడు ఈ సిద్ధాంతములేమిటి? వీరెందుకు వచ్చారు?

జవాబు :- రాజ్యాంగము ఒకటే అయితే ప్రభుత్వములో నేనే ప్రభువును

కావాలను ఉద్దేశ్యముతో నేడు అనేక రాజకీయపార్టీలు వచ్చాయి. ఒక్కొక్క

పార్టీ ఒక్కొక్క రాజకీయ సిద్ధాంతముతో రావడము జరుగుచున్నది. అలాగే

దేవుడు ఒక్కడే ఆ దైవత్వములో 'మేమే పెద్దలము' అని అనిపించుకొనుటకు

రాజకీయపార్టీలలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతముతో వచ్చారు. ఆ

విధముగా గతములో వచ్చినవారు ముగ్గురుకాగా ప్రస్తుతము మరియొక

సిద్ధాంతము బయటికి వచ్చినది. దానితో ఇప్పుడు హిందూమతములో

మొత్తము నాలుగు సిద్ధాంతములున్నవని చెప్పవచ్చును.


ప్రశ్న :- నేడు హిందువులుగా యున్నవారికి హిందూమతములో ఇన్ని

సిద్ధాంతములున్నవనీ, ఇంతమంది సిద్ధాంతకర్తలున్నారనీ ఏమాత్రము

తెలియదు. హిందువులకే హిందూ సిద్ధాంతములను గురించిగానీ, సిద్ధాంత

కర్తలను గురించిగానీ తెలియనందు వలన హిందూమతము గొప్పదని

తెలియక సిద్ధాంతకర్తలు లేని మతములోనికి హిందువులు చేరడము

జరుగుచున్నది. ద్వాపరయుగము చివరిలో భగవంతుడు చెప్పిన భగవద్గీత

లోని జ్ఞానమే మిగతా మత గ్రంథములలో కూడా యున్నదను విషయము

మూడు మతముల వారికి తెలియకుండా పోయినది. క్రైస్తవ మతములో

ఏసునే సిద్ధాంతకర్తగా చెప్పాలి. ఇస్లామ్ మతములోనికి వస్తే ముహమ్మద్

ప్రవక్తగారినే ఆ మత సిద్ధాంతకర్తగా చెప్పవచ్చును. వారు ఆ మతమును

స్థాపించినప్పుడు మాత్రమే జ్ఞానమును చెప్పిపోయారు. అవే వారి

గ్రంథములయినవి. అయితే హిందూ మతమునకు ప్రస్తుతము నలుగురు


సిద్ధాంత కర్తలున్నా మొదట భగవంతుడు చెప్పిన భగవద్గీతయే ఆధార

గ్రంథము. హిందూ మతములో సిద్ధాంతకర్తలు చెప్పిన సిద్ధాంతములు

శాస్త్ర సమ్మతివేనా?యను అనుమానము వస్తున్నది. భగవద్గీతను చెప్పిన

భగవంతుడు భగవద్గీతయే నిజమైన జ్ఞానమనీ, సృష్టి ఆదిలో చెప్పిన జ్ఞానమే

భగవద్గీతయని చెప్పగా దానిని కాదని వేదములను కొందరు సిద్ధాంతకర్తలు

తేవడము జరిగినది. అంతేకాక ముందు వచ్చిన సిద్ధాంతకర్తలు ఒకరి

సిద్ధాంతమును మరొక సిద్ధాంతకర్త ఖండించడము జరిగినది. ఈ

విషయములన్నియూ చాలామంది హిందువులకు తెలియదు. తెలిసినవారు

కూడా ఏది నమ్మాలో తెలియని స్థితిలో ఇతర మతములను ఆశ్రయించారు.

తెలియనివారు ఇతర మతముల లోని బోధను చూచి కొందరు పోవడము

జరిగినది. ఈ విధముగా సిద్ధాంతకర్తల వలన హిందూమతము అభివృద్ధి

అయినది ఏమీలేదుగానీ, ఇంకా క్షీణించినదనియే తెలియుచున్నది. ఇప్పటి

కొందరి హిందువులలో హిందూ మత గ్రంథము భగవద్గీతనా? భగవద్గీత

కంటే ముందు వచ్చిన వేదములా? ఏదని తెలియకున్నది. దీనిని గురించి

మీరేమంటారు?

జవాబు :- మనిషిగా నీతో మాట్లాడినా చెప్పేది నేను (జీవుడు) కాదనీ,

చెప్పేదంతా ఆత్మేనని జ్ఞాపకముతో వినమని ముందే చెప్పుచున్నాను.

జీవుడుగా నేను కూడా మీతో పాటు వినేవాడినే, చెప్పేవాడిని కాను.

ఆత్మపాత్ర అంతయూ అపరిచిత పాత్రయున్నట్లుండును. స్వయముగా

ఆత్మ మాట్లాడుచున్నా మనుషులందరూ జీవాత్మయే మాట్లాడుచున్నాడని

ఎవరూ గుర్తించరు. మాట్లాడే ఆత్మ కూడా నేను జీవాత్మనుకాను ఆత్మను

అని కూడా చెప్పడు. జీవాత్మ చెప్పినట్లే నమ్మించి చెప్పును. అందువలన

అందరూ ఆత్మను గుర్తించలేక పోవుచున్నారు. అందువలన మీరు మోస


పోకుండా చెప్పునది నేను కాదు ఆత్మేనని జీవునిగా నన్ను బాధ్యున్ని చేయ

కూడదని నేను ముందే చెప్పుచున్నాను. హిందువులకు అసలయిన జ్ఞాన

గ్రంథము భగవద్గీతయే. అయినా కొందరు హిందూమతములోని ప్రముఖులే

వేదములను ప్రమాణ గ్రంథములుగా చెప్పుచున్నారు. దానితో నిజమైన

జ్ఞానులలో కొంత అసంతృప్తి ఏర్పడుచున్నది. దేవుని జ్ఞానమును తెలిసిన

వారు హిందూమతములో ప్రముఖులుగా లేనందున, ప్రముఖులుగా

యున్నవారంతా జ్ఞానము తెలియని వారైనందున వేదములు హిందువుల

ప్రమాణ గ్రంథములను మాట కొంతవరకు వ్యాపించినది. అయితే ఆత్మ

జ్ఞానము తెలిసిన వ్యక్తిగా ప్రబోధానంద యోగీశ్వరులుగా నేను 'వేదములు

ప్రమాణ గ్రంథములు' అను మాటను ఖండించుచున్నాను.


ఇందూ సమాజము ఇందూమతముగా మారకముందు, ఇందూ

మతము కాస్త మార్పుచెంది హిందూ మతముగా మారిపోకముందు

ఇందువులందరూ వేదములను దూరముగా పెట్టి భగవద్గీతను తమ

జ్ఞాన గ్రంథముగా చెప్పుకొనెడివారు. కలియుగము ప్రారంభమయిన తర్వాత

దాదాపు మూడు వేల సంవత్సరములకు భారత దేశమంతా ఒక్కటిగాయున్న

ఇందూ సమాజము ఇందూమతముగా మారిపోయినది. ఇందూ

సమాజములో అంతవరకు లేని సిద్ధాంతము బయటికి వచ్చినది. కొన్ని

వేల సంవత్సరములనుండి ఇందూ సమాజమును మార్చి తమకు

అనుకూలమైన సమాజముగా మార్చుకోవాలనుకొన్న ఆర్యసమాజము వారు

ఇందువులలో త్రేతాయుగము నుండి మార్పు తేవాలని పూర్తి ప్రయత్నము

చేయుచూ వచ్చారు. అయినా అప్పటి కాలములో ఇందువులలోని జ్ఞానము

ఆర్యుల మాటను చెల్లుబడి కానీయలేదు. త్రేతాయుగములో రావణబ్రహ్మ

ప్రభావముతో ఆర్యుల ఆటలు సాగలేదు. ద్వాపరయుగములో వారికి


కొంత బలము చేకూరి ఇందువులలో మార్చు తెచ్చుతూ వచ్చారు. ద్వాపర

యుగ చివరకు ఆర్యులు పూర్తి పట్టు సాధించి తమకు నచ్చిన వేదములను,

యజ్ఞములను, దానములను, తపస్సులను బాగా ప్రచారము చేసి ఇందూ

జ్ఞానమును లేకుండా చేశారు. భారతదేశమంతా యున్న ద్రావిడజాతిని

ఉత్తర భారతదేశములో లేకుండా చేసి, కేవలము దక్షిణ భారతదేశమునకే

పరిమితి చేశారు. ఇప్పుడున్న కర్నాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ నాలుగు

రాష్ట్రముల ప్రాంతముల వరకే ద్రావిడులు ఉండిపోయారు. దక్షిణ దేశము

వరకు పరిమితమైన ద్రావిడులను కూడా తమవైపు మార్చుకొనే దానికి

ఆర్యులు అనేక ప్రయత్నములు చేశారు. అయితే ద్వాపరయుగ అంత్యములో

భగవంతుడయిన కృష్ణుడు చెప్పిన బోధ ఆర్యులకు కొంత అడ్డుకట్ట వేసినా

అది కొంతకాలము వరకే అయినది. భగవద్గీతను చెప్పిన మూడువేల

సంవత్సరములకు దక్షిణ దేశములో ఆర్యుల ప్రయత్నములు కొంతకుకొంత

సఫలీకృతమైనాయి. అలా చిన్నచిన్నగా దక్షిణ భారతదేశములో పట్టు

సాధించను మొదలు పెట్టారు. అటువంటి ప్రయత్నములలో పూర్తి

దక్షిణమున చివరిలో యున్న మళయాళ రాష్ట్రములో వారి క్రియను మొదలు

పెట్టారు. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని తయారు చేసి, అతని ద్వారా

ఇందువులకు వేదములు ప్రమాణ గ్రంథములని చెప్పించడము జరిగినది.

ఆర్యులయిన తాము చెప్పితే ద్రావిడులు తమ కుట్రను కనిపెట్టగలరనీ,

ఆర్యులయిన వారు బయటికి కనపడకుండా, ద్రావిడులలో కలిసిపోయి,

ద్రావిడులలోనే తమకు సరిపోవు వ్యక్తిని తయారు చేసి ద్రావిడుల చేతనే

ద్రావిడులందరికీ తెలియునట్లు వేదములను గురించి చెప్పి భగవద్గీతను

అణచివేయాలనుకొన్నారు. అప్పుడు వారు చేసిన కుట్ర ఫలితముగా నేడు

చాలామంది హిందువుల ప్రమాణ గ్రంథము వేదములు అంటున్నారు.


నేడు ఎవరూ గుర్తించని ఆర్యుల కుట్రలను గుర్తించి త్రేతాయుగము

నుండి ఆర్యులు ఎలా భారతదేశములో ప్రవేశించారో, ఎలా ఉత్తర భారత

దేశమునంతటినీ ఆక్రమించుకొన్నారో, అప్పటినుండి వారు చేయుచున్న

ఆచరణలేమిటో, తెలియజేస్తూ వచ్చాము. త్రేతాయుగమున దక్షిణ భారత

దేశమునకు అనుబంధముగా యుండి భారతదేశములో ఒక భాగముగా

చెప్పబడు శ్రీలంకకు రాజయిన రావణబ్రహ్మ అప్పటి కాలములో ఆర్యులను

దక్షిణ దేశమువైపు రాకుండా చేశాడు. అంతేకాక తమ సైన్యముతో వారి

యజ్ఞ యాగాదులను జరుగకుండా చూచెడివాడు. కాలము జరిగిపోగా

రావణ బ్రహ్మ అంతటి జ్ఞానులు లేకపోవడముతో ఆర్యుల బలము పెరుగుతూ

వచ్చినది. ఈ విషయములన్నియూ తెలియజేసి నేడు ద్రావిడులను కొంత

కన్ను తెరిపించాము. అయినా ఆర్యుల ముందర మా కృషి చాలా చిన్నది.

కావున చాలామంది వేదములే ముఖ్య గ్రంథములని చెప్పుచూ యజ్ఞములను

చేయుచునే యున్నారు. సత్యమును చెప్పుచున్న మా మీద ఆర్యులు చెడు

బుద్ధితోనే కుట్రలు చేయుచున్నారు. అయినా మా పనిని మేము వదలలేదు.

భగవద్గీతను గురించే చెప్పుచున్నాము. అదియే హిందువుల ప్రమాణ

గ్రంథమంటున్నాము. వేదములను కాదంటున్నాము.


ప్రశ్న :- దక్షిణ దేశమునకు వచ్చిన ఆర్యులు కేరళ రాష్ట్రములో తమకు

అనుకూలముగా ఎవరిని మార్చగలిగారు? ఎవరిని గొప్పగా తయారు చేసి

అతనితో వేదములే గొప్పయని చెప్పించారో చెప్పగలరా?


జవాబు :- చెప్పగలము. జరిగిన చరిత్రను చెప్పడములో తప్పులేదు

కదా! నేను చెప్పునది జరిగిన చరిత్రే అయినా అది చాలామందికి తెలియదు.

కొందరికి తెలిసినా, వారికి తెలిసినదంతా సత్యము కాదు. అందువలన


చరిత్రలో మరుగున పడిపోయిన విషయములను బయటికి లాగి చెప్పవలెనని

అనుకున్నాము. కలియుగము వచ్చిన తరువాత దాదాపు రెండువేల

ఐదువందల (2500) సంవత్సరములు గడచిన తర్వాత గౌతమ బుద్ధుడు

జన్మించి, ఆయన పెద్దవాడై తాను అనుభవములో పొందిన జ్ఞానమును

ప్రజలకు చెప్పను మొదలిడెను. ఇప్పటికి 2600 సంవత్సరముల క్రితమే

ఆర్యులకు బుద్ధుడు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. బుద్ధుడు తనకు

తెలిసిన అష్టాంగ సూత్రములను ప్రచారము చేయగా, అప్పటికే కుల

వివక్షలతో ఇబ్బంది పడుచున్న ప్రజానీకమంతయు బుద్ధుడు ప్రతిపాదించిన

“అందరూ సమానమే. ఎవరినీ తక్కువగా చూడకూడదు. అందరికీ

మంచి జరగాలని కోరుకోవాలి. అందరినీ క్షమించు స్వభావముండాలి.

ఇతరుల ఆనందమే తన ఆనందమని తలచవలెను. ఇతరులు బాధపడు

పనులను చేయకూడదు. అందరి క్షేమాన్ని కోరుకోవలెను. సర్వప్రాణులను

సమదృష్టితో చూడవలెను” అను ఎనిమిది సూత్రములవైపు ఆకర్షితులై,

ఆర్యులనుండి బుద్ధునివైపు మొగ్గుచూపను మొదలిడినారు.


యుద్ధములలో అందరినీ హింసించి విసుగెత్తిన అశోకచక్రవర్తి

బుద్ధుని సూత్రములకు పూర్తిగా ఆసక్తుడైనాడు. అంతేకాక అశోకచక్రవర్తి

కూతురు, కొడుకు ఇద్దరూ దేశములోనూ, ఇతర ప్రాంతములలోనూ, బుద్ధుని

సూత్రములను ప్రచారము చేయసాగిరి. ఆయన చెప్పిన అష్ట సూత్రములను

పెద్ద స్థూపముల మీద వ్రాయించి అందరికీ తెలియునట్లు చేశారు.

ఇదంతయూ ప్రక్కనయుండి గమనించిన ఆర్యులు బుద్ధుడు ప్రచారము

కావడము ఇష్టములేక బుద్ధుని మీద కూడా అసూయపడసాగిరి. ద్రావిడులనే

భ్రష్టు పట్టించిన ఆర్యులకు బుద్ధుడు ఒక లెక్కనా అన్నట్లు, బుద్ధుడు హిందూ

మతమువాడే కాదు అని ప్రచారము చేసి, ఎవరినీ బుద్ధుని వైపు పోకుండా


చూడాలని పథకము వేశారు. దానిప్రకారమే బుద్ధుడు పరమతము వాడనీ,

హిందువులైన ఆర్యులకు వ్యతిరేఖముగా బోధిస్తున్నాడనీ, అట్లు బోధించుట

వలన హిందూమతము క్షీణించి పోయి చివరకు అందరూ బౌద్ధ మతస్థులుగా

మారిపోవుదురనీ ప్రచారము చేశారు. అంతవరకు మతముల ప్రసక్తే లేని

హిందువులలో బౌద్ధమతమను దానిని ఆర్యులే మొదట పేరు పెట్టి చెప్పారు.

గౌతమబుద్ధుడు మొదటినుండి హిందూ సమాజములోనే ఉండినా, అతడు

తమకంటే వేరు మతస్థుడుగా యున్నాడని ఆర్యులు ప్రచారము చేయసాగారు.


హిందూదేశముగా మారిపోయిన ఇందూదేశములో, కలియుగము

వచ్చిన తర్వాత కూడా 2500 సంవత్సరములు మతము అనుమాటయే

లేదు. ఉన్నది హిందూ సమాజము మరియు ఆర్య సమాజము. అటువంటి

సమయములో బుద్ధుడు హిందూసమాజములోనే పుట్టాడు. బుద్ధుడు

సన్న్యాసత్వము తీసుకొని, కాషాయగుడ్డలు ధరించి గుండు గీయించుకొని,

హిందూసన్న్యాసులవలె భార్యను కూడా వదలి, అన్నిటినీ సన్యసించిన

హిందూసన్న్యాసియే. అటువంటి సన్న్యాసి అయిన బుద్ధుని సూత్రములకు,

ఆయన జ్ఞానమునకు ప్రజలు, ప్రభువులు ఆకర్షితులగుచున్నారని

ఓర్వలేక తమ ఆర్యుల ప్రాబల్యము బుద్ధుని వలన తగ్గిపోతుందేమోనను

అనుమానముతో, బుద్ధుని మీద అసూయపడి, బుద్ధుడు హిందూ సన్న్యాసిగా

యున్నప్పటికీ ఆయనను పరమతస్థుడనీ, హిందూ మతమువాడు కాదు

అనీ, బౌద్ధమతము వేరు హిందూమతము వేరనీ, బుద్ధున్ని హిందూ

సమాజమునుండి చీల్చివేసి, బౌద్ధమతస్థునిగా వర్ణించి చెప్పారు. అప్పటికే

కొంతకాలమునుండి ప్రచారమవుతున్న బౌద్ధ సూత్రములను భారతదేశములో

ఎవరూ తెలుసుకోకుండునట్లు ఆర్యులు కట్టడి చేశారు. ఆర్యుల మాటలు

వినుచున్న వారందరూ బౌద్ధ సూత్రములను వదిలివేయగా, బౌద్ధ మతము


అయితే ఆర్యుల

భారతదేశములో అభివృద్ధి చెందలేక పోయినది.

ప్రభావములేని చైనా, టిబెట్, జపాన్, శ్రీలంక, రష్యా మొదలగు ఆసియా

దేశములలోనూ, ఐరోపా ఖండములోనూ బౌద్ధమతము బాగా అభివృద్ధి

చెందినది. ఆర్యుల అసూయవలన భారతదేశములో పుట్టిన బౌద్ధమతము

భారతదేశములో అభివృద్ధి చెందలేక పోయినా, నేడు మిగతా దేశములలో

హిందూ మతముకంటే గొప్పగా యున్నది.


ఆనాడు అసూయతో హిందువులలోని బుద్దున్ని హిందువులనుండి

వెలివేయక బుద్దుడు కూడా భారతదేశములోని హిందువే కదా!యని

అనుకొనియుంటే బౌద్ధము నేడు హిందువులలో హిందూ సమాజముగానే

యుండేది. అలా బౌద్ధము హిందూ సమాజమైయుండి వుంటే నేడు

బౌద్ధమతమనునది ఉన్న దేశములలో కూడా హిందూ మతమున్నదని

చెప్పుకొను అవకాశము ఉండేది. అట్లు హిందూ మతము ఎన్నో దేశములలో

విస్తరించినదిగా యుండేది. అయితే ఆర్యులు స్వార్థ బుద్ధితో చేసిన

పనివలన, బుద్ధున్ని హిందూమతమునుండి వెలివేసిన దానివలన, ఆర్యులు

హిందూ సమాజమును నాశనము చేశారనియే చెప్పవచ్చును గానీ,

ఉద్ధరించారని చెప్పలేము. తమ ఆధిపత్యము కొరకు, తమ సుఖముల

కొరకు హిందూమతమునకు తీరని ద్రోహము చేశారని చెప్పవచ్చును.

ఆర్యులు తెలివైనవారు గనుక వారు తప్పు చేసినా ఏమాత్రము

బయటపడకుండా ఇతరుల దృష్ఠిలో తమ తప్పు లేదన్నట్లు నేడు హిందూ

ధర్మరక్షణ అను నినాదమును మొదలు పెట్టారు. వారు అట్లుండగా ఆర్య

సంతతి కాని ద్రావిడులు తెలివితక్కువగా యుంటూ సమాజములో ఆర్యుల

వలన ఏ పని జరిగినా, ఇది మంచిదా చెడుదాయనిగానీ, ఆర్యులు హిందూ

సమాజమును ఉద్ధరిస్తున్నారా లేక నాశనము చేయుచున్నారా అనిగానీ



గ్రహించలేకపోవుచున్నారు. అంతేకాక ద్రావిడ జాతినుండి మభ్యపడి

శూద్రులైన వారిని ఆర్యులైనవారు వాడుకొంటూ, తమకు ఎవరైనా

శత్రువులుగానో, విమర్శకులుగానో కనిపిస్తే శూద్రులనే ప్రేరేపించి వారినే

వాడుకొని, వారి చేతనే ఇతరులను అణచివేయుచున్నారు. తమకు

ఆటంకముగా యున్న శూద్రులను శూద్రులచేతనే కొట్టించి, తిట్టించి తమకు

అడ్డు లేకుండా చేసుకొంటున్నారు.


హిందువులలో శూద్రుడయిన బుద్ధున్ని తమవాడు కాదంటూ

దుర్భుద్ధితో, శూద్రుల చేతనే దూరము చేయించిన ఆర్యులు, ఎవరైనా

శూద్రుడు తమకు వ్యతిరేఖముగా కనిపిస్తే, వారిని పరమతము వాడని

ముద్రవేసి, శూద్రుడయిన వానిని శూద్రులచేతనే హింసించి, వారి దారికి

అడ్డులేకుండా చేసుకోవడము జరుగుచున్నది. అయితే శూద్రులు ఆర్యుల

చేతిలోని ఆయుధములాగ తయారై, శూద్రులయిన వారినే శూద్రులే

బాధించడములో ఆర్యుల తెలివి కనిపించినా, వారికి ఉపయోగపడు శూద్రుల

తెలివితక్కువ పని బాగా కనిపించుచున్నది. నేడు శూద్రులైన వారు ఎంతో

నేర్చుకోవలసియున్నది. ఎవరో ఏదో చెప్పితే అదియే నిజమని నమ్మి,

ఒక శూద్రుడు మరొక శూద్రున్ని బాధించడము, హింసించడము శూద్రుల

తెలివితక్కువపని కాదా!యని అడుగుచున్నాము. శూద్రులు ఆర్యుల ఇంటి

కుక్కలవలె వ్యవహరిస్తూ, వారు ఎవరిని కరువమంటే వారిని కరుస్తూపోతే,

హిందూసమాజము క్షీణించక ఎలా అభివృద్ధి కాగలదు? హిందూ ధర్మరక్షణ

అను సాకుతో హిందువునే హిందువుల మీదికి ప్రేరేపించు ఆర్యులు

ఉన్నంత వరకు, ఆర్యులు ప్రేరేపిస్తే వెనుకా ముందు చూడకుండా ఇతరుల

మీద దాడిచేయు శూద్రులు ఉన్నంతవరకు, హిందూ సమాజము

క్షీణించడము తప్ప, అభివృద్ధి చెందడము ఉండదు.


ఈ గ్రంథమును చదివేవారు ఎవరైనా న్యాయముగా బుద్ధుని

విషయమును గురించి చెప్పండి. అప్పటివరకు మచ్చుకైనా ఇతర మతమే

లేని ఆ రోజులలో, బుద్ధుడు నా మతము వేరని ఎక్కడైనా చెప్పాడా? నేను

కూడా హిందూ సమాజము వాడినేనని, హిందుత్వమునకు గుర్తింపు

రంగుగాయున్న కాషాయమును ధరించినా, సన్న్యాసిగా మారినా, నీవువేరు,

నీ జ్ఞానము వేరు, నీ మతము వేరని హిందూ సమాజమునుండి

వెలివేసినవారు హిందుత్వమును ఉద్దరించువారా? హిందూ ధర్మరక్షణ

చేయువారా? ఈ ప్రశ్నలకు జవాబును న్యాయముగా చెప్పితే

హిందుత్వమును సర్వనాశనము చేసినవారని చెప్పవచ్చును. హిందూ

ధర్మములను భక్షించినవారని చెప్పవచ్చును. ఆనాడు ఆర్యులు అసూయతో

బుద్ధున్ని వెలివేసి, నేడు బౌద్ధము హిందుత్వములోని భాగమే అని చెప్పుకోలేని

స్థితిలోనికి పోయి, హిందుత్వమునకు, హిందూ ధర్మములకు తీరని ద్రోహము

చేశారనియే చెప్పవచ్చును.


ప్రశ్న :- ఇంతవరకు ఆర్యులకు ఎవరూ అడ్డు తగలలేదా? వారి తెలివికంటే

మించినవారు పుట్టలేదా?


జవాబు :- ఆర్యులకు అడ్డుతగిలిన వాడు గౌతమ బుద్ధుడు, కలియుగము

రెండువేల ఐదు వందల (2500) సంవత్సరములు గడచిన తర్వాత ఇందూ

దేశమని చెప్పబడుచున్న భారతదేశములో కాశీకి ఉత్తరమున, అయోధ్యకు

ఈశాన్యమున భుయిలా అను గ్రామములో గౌతమ బుద్ధుడు జన్మించాడు.

తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోధనుడు అయితే బుద్ధుడు అను పేరు

ఆయనకు జ్ఞానోదయము అయిన తర్వాత వచ్చినది. పుట్టినప్పుడు పెట్టిన

పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అనగా మోక్షమును అర్థించువాడు లేక ముక్తిని

అడుగువాడని అర్థము. ఆ దినము వారి తల్లి తండ్రులైన శుద్ధోధనుడు


మాయాదేవి తెలిసో, తెలియకో మంచి అర్థమున్న పేరును సిద్ధార్థుడని

పెట్టడము జరిగినది. సిద్దార్థుడు పుట్టిన కొద్దికాలమునకే, సంవత్సరము

గడువకముందే తల్లి క్షయ రోగముతో చనిపోగా, ఆయన పినతల్లి అయిన

గౌతమీదేవి చిన్నప్పటినుండి సాకినందువలన, ఆయనను అందరూ

గౌతముడు అని పిలిచెడివారు. ఈ విధముగా గౌతముడను రెండవ పేరు

ఆయనకు రావడము జరిగినది. గౌతముడు పెరిగి పెద్దయి వివాహము

జరిగి, కుమారుడు పుట్టిన తర్వాత జ్ఞాన జిజ్ఞాస కలవాడై, వైరాగ్యమును

పొంది ఒక దినము అర్థరాత్రి భార్య యశోధరాదేవినీ, సంవత్సరపు

కుమారున్నీ వదిలి ఇంటినుండి పోయినవాడు తిరిగి ఇంటికి రాలేదు.

భారతదేశములోని బీహారు రాష్ట్ర ప్రాంతములో పుట్టినవాడైనందున

భారతదేశములోని ఇందూ సాంప్రదాయముల ప్రకారము శిరోముండనము

చేయించుకొని, కాషాయ గుడ్డలు ధరించి, సర్వసంగసన్న్యాసిగా మారి

పోయిన గౌతముడు జన్మనుండి కడతేరు జ్ఞానము కొరకు అనేక

గురువులనూ, మహర్షులనూ, పండితులనూ కలిసి జ్ఞానమును తెలుసు

కొనినా, వారు చెప్పిన మాటలకు అసంతృప్తి చెంది, చివరకు 'గయ' అను

ప్రాంతములో బోధి చెట్టుక్రింద (రావి చెట్టు క్రింద) కూర్చొని యోచించు

చుండగా ఆయనకు జ్ఞానోదయమైనదని తెలిసినది. అప్పటినుండి

గౌతముడు గౌతమబుద్ధుడుగా పిలువబడెను. ఈ విధముగా బుద్దుడు

అని మూడవ పేరు వచ్చినది. బుద్ధుడు అనగా బుద్ధి ప్రకాశించిన వాడనీ,

జ్ఞాని అనియూ అర్థము రాగలదు. ఈ విధముగా జ్ఞానిగా మారిన గౌతముడు

ఆయన ప్రతిపాదించిన ఎనిమిది సూత్రములను అందరికీ బోధించెను.

అష్టాంగమార్గములను ఆ ఎనిమిది సూత్రములే బుద్ధుని బోధలో ముఖ్య

అంశములు.


అప్పటి ఆర్యులు సృష్ఠించిన కుల వివక్షలకు బుద్ధుని సూత్రములు

ఆటంకములై కూర్చోవడమూ, దానికి బుద్దుని మీద అసూయచెందిన ఆర్యులు

హిందువు అయిన బుద్ధున్ని పరాయి మతమువానిగా సృష్టించి, హిందూ

సమాజమునుండి బౌద్ధమతమను దానిని చీల్చివేయడమూ అందరికీ తెలిసిన

విషయమే. ఈనాడు అదే బౌద్ధీయము ఆసియా ఖండములోనే కాకుండా

ఐరోపా ఖండములోనికి కూడా ప్రాకియున్నది. నేడు ఎంతో పెద్ద

సమాజముగా తయారైన బౌద్ధ సమాజమును ఆర్యులు అసూయతో హిందూ

సమాజమునుండి చీల్చి బయటికి వేసినదేనని జ్ఞప్తికి ఉంచుకోవలెను.

దీనిప్రకారము ఆర్యులు హిందూ సమాజమునకు తీరని ద్రోహము చేశారు.

అంతేకాకుండా బుద్ధుడు పుట్టిన తర్వాత దాదాపు ఐదువందల

సంవత్సరముల కాలములో భారతదేశమున ఎందరో ఆర్య సాంప్రదాయము

లను వదిలి బౌద్ధ సూత్రములను అనుసరించుచుండుటను సహించలేక

భారతదేశములోనున్న బుద్ధ సమాజమును లేకుండా జేయుటకు, బుద్ధునివలె

పూర్తిగా సన్యసించినవాడై, బుద్ధునివలె శిరోముండనము చేయించుకొని

బుద్ధునివలె పూర్తిగా ఇల్లు వదలినవాడై ఉండునట్లు, దక్షిణ దేశమున పూర్తి

ద్రావిడ దేశము అనిపించుకొన్న కేరళ (మళయాళ) బ్రాహ్మణున్ని అతి

చిన్న వయస్సులోనే బయటికి తెచ్చి, ఆయనకు శంకరుడని పేరుపెట్టారు.

ఆయనే ఆది శంకరాచార్యులుగా చెప్పబడినాడు. ఆదిశంకరాచార్యులు

ఆనాడు బౌద్ధమతము నుండి హిందూ మతమును కాపాడుటకు దివినుండి

భువికి వచ్చిన సాక్షాత్తు కైలాస శంకరుడని ఆర్యులు ప్రచారము చేశారు.

తమ తరపున బుద్ధునికి సమానరూపుగా కనిపించు శంకరాచార్యున్ని

తయారుచేసి, ఆనాడు ఆర్యుల మాతృభాష అయిన సంస్కృత భాషను

శంకరాచార్యునికి పూర్తిగా నేర్పి, ఇరవై సంవత్సరముల వయస్సుకే ఆయనను

హిందూ సమాజమునకంతటికీ గురువుగా ప్రకటించారు.


బుద్ధుని సూత్రములకు ఆకర్షితులైన వారిని తిరిగి హిందూ

సమాజములోనికి వచ్చునట్లు, బుద్ధునికి బద్ద శత్రువుగా శంకరాచార్యున్ని

తయారు చేసి పంపారు. దక్షిణ భారతదేశమునుండి ఉత్తర భారతదేశము

వరకు అనగా ఆసేతు హిమాలయముల వరకు (దక్షిణమున భారతదేశము

చివరిలోనున్న సముద్రతీర ఇసుక దిబ్బలనుండి హిమాలయములలోని

పర్వతముల వరకు) శంకరాచార్యుడు రెండుమార్లు కాలినడకన ప్రయాణము

సాగించాడు. అలా కాలినడకన తిరుగుచూ ఎక్కడ బుద్ధుని సూత్రములున్నవో

అక్కడ వాదోపవాదములకు దిగి తనవాదననే గొప్పదని చెప్పి వాదించడమే

ఆయనవంతు. తర్వాత శంకరుడే గెలిచాడని ప్రచారము చేయడము

ఆర్యులవంతు. ఈ విధముగా 20 సంవత్సరముల చిన్నపిల్లవాడైన

శంకరునికి ఆచార్యుడని బోర్డు తగిలించి, రెండుమార్లు భారతదేశమంతా

కాలినడకన తిరుగునట్లు చేశారు. రెండుమార్లు తిరుగుటకు పన్నెండు

సంవత్సరములు పట్టింది. పన్నెండు సంవత్సరములు నడిచేదానికి

శరీరములోని సారమంతయూ అయిపోయి చివరకు నడకవలనే ఆయన

ముఫ్పైరెండు (32) సంవత్సరములకే చనిపోయాడు. పదహారు

సంవత్సరముల వయస్సులోనే సన్న్యాసత్వము తీసుకొన్న శంకరుడు పూర్తిగా

నాలుగు సంవత్సరములు సంస్కృతములోని వేదములను, ఉపనిషత్తులను

నేర్వగలిగాడు. తర్వాత ప్రణాళిక ప్రకారము అందరితో వాదిస్తూ పన్నెండు

సంవత్సరములు తిరిగాడు. చివరకు చిన్నవయస్సులోనే చనిపోయాడు.


శంకరాచార్యుల పర్యటనలో ఎందరో పండితులు, జ్ఞానులు కలిసి

శంకరాచార్యులు బోధించు అద్వైత సిద్ధాంతమును గురించి వాదించారు.

అయితే అన్నిచోట్లా శంకరాచార్యుడు వాదనలో గెలువలేదు. ఎన్నోచోట్ల

తనమాటల చతురతతో గెలిచినా, కొన్నిచోట్ల తప్పనిసరిగా ఓడిపోవలసి


వచ్చినది. అలా ఓడిపోయిన వాటిని బయటికి ప్రొక్కకుండా చేసి, గెలిచిన

వాదనలను మాత్రము బయటికి తెలిపి శంకరుడు గొప్పవాడు, శంకరుని

అద్వైత సిద్ధాంతము గొప్పదని ఆర్యులు శంకరాచార్యున్ని వెనకేసుకు వచ్చెడి

వారు. ఈ విధముగా శంకరాచార్యున్ని ద్రావిడులనుండే తీసి, వారి స్వార్థము

కొరకు ఆర్యులు శంకరున్ని పావువలె వాడుకొన్నారు. ఉత్తర దేశ

బ్రాహ్మణున్ని శంకరాచార్యులుగా ప్రకటించడముకంటే, ద్రావిడజాతి

నుండియే తీసుకొని గురువుగా చేసి, ద్రావిడులకు బౌద్ధులకు బుద్ధి చెప్పించి

తమవైపు మరల్చుకోవాలని అనుకొన్నారు. ద్రావిడుల నుండి తమకు

అనుకూలముగా తయారు చేస్తే, మిగతా ద్రావిడులందరూ దారికి వస్తారను

ఉద్దేశ్యముతోనే, శంకరాచార్యులను ఏరికోరి దక్షిణ దేశమువాడినే

తీసుకొన్నారు. అట్లు తీసుకోవడమేకాక బుద్ధుడు ఏ విధముగా

సన్న్యాసియైనాడో, అదే విధముగా కనిపించునట్లు సన్న్యాసిని చేశారు.

(బుద్ధుడు ముసుగువేయని సన్న్యాసికాగా, శంకరాచార్యుడు ముసుగు వేసిన

సన్న్యాసిగాయున్నాడు. ) హిందూ సమాజమంతయూ బౌద్ధ సమాజములో

కలిసిపోవు సమయములో, ఆదిశంకరాచార్యుడు వచ్చి హిందూ

సమాజమును రక్షించాడని చాలామంది చెప్పుచుండగా మేము విన్నాము.

చరిత్ర తెలియనివారు మాట్లాడు విధానము అంతేకదా!యని అనుకొన్నాము.

హిందూ సమాజమును విదేశములలో ఇతర ఖండములలో ప్రాకునట్లు

చేసిన బుద్ధున్ని పరమతమువాడని చెప్పడము, హిందుత్వమును రక్షించడమో

లేక భక్షించడమో మీరే అర్థము చేసుకోండి. నేటికినీ తమకు మించిన

బోధను ఎవరు చెప్పినా, వేదములను యజ్ఞములను ఎవరు ఖండించితే

వారినందరినీ పరమతమువారని పేరుపెట్టి ముద్ర వేసెడివారు. ఈనాడు

కూడా ఆర్యులు అదే పనినే చేయుచునేయున్నారు. ఆర్యుల అద్వైత


సిద్ధాంతమును అతిక్రమించిన త్రైత సిద్ధాంతమును మేము ప్రతిపాదించగా,

మమ్ములను కూడా పరమతమని చెప్పి, శూద్రుడనైన నామీదికి శూద్రులనే

దాడికి పంపిన సంఘటన, నాలుగు సంవత్సరముల క్రిందట ఇక్కడే

అనంతపురము జిల్లాలోని గుంతకల్లులోనే జరిగినది. దీనినిబట్టి ఆర్యులు

ఈనాటికీ తమకంటే ఇతరులు ముందుకు రాకూడదను చెడు ఉద్దేశ్యముతోనే

ఉన్నారని తెలియుచున్నది.


ప్రశ్న :- బుద్ధుని తర్వాత భారతదేశములో ఆర్యులకు గట్టిగా పోటీనిచ్చు

వారు ఎవరూ రాలేదా?


జవాబు :- బుద్ధుడు వచ్చిపోయిన ఐదువందల సంవత్సరములకు ద్రావిడ

బ్రాహ్మణుడైన (కేరళ బ్రాహ్మణుడైన శంకరాచార్యున్ని ఒక పావుగా

వాడుకొని, తమ అద్వైతమును శంకరాచార్యుల ద్వారా ప్రచారము చేసి,

ముందునుండి యున్న తమ అద్వైత సిద్ధాంతమును, అప్పుడే శంకరుడు

కనిపెట్టినట్లు చూపించారు. అయితే హిందూత్వములో ఒక సిద్ధాంతము

అద్వైత సిద్ధాంతమని వారు చెప్పగా, ఇది ఫలానా సిద్ధాంతము అని

అందరికీ తెలిసినది. శంకరాచార్యుడు చనిపోయిన తర్వాత ఆర్యులకు

ఆటంకము లేకుండా పదిహేనువందల సంవత్సరములు గడచిపోయినది.

తర్వాత పూర్తి ద్రావిడ రాజ్యముగానున్న తమిళనాడులో ఆర్యసిద్ధాంతమును

వ్యతిరేఖిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతముతో రామానుజాచార్యులు పుట్టుకు

వచ్చాడు. రామానుజాచార్యులవారు ద్రావిడ బ్రాహ్మణుడే అయినా, కొంత

ఆర్యులకు వ్యతిరేఖముగాయున్నా ద్రావిడులకు మాత్రము అనుకూలముగా

ఉండెడివాడు కాదు. ఆర్యులు తమకంటే గొప్పవారు కావాలనుకొన్న వారిని

ఎవరినీ వదలరన్నట్లు, రామానుజాచార్యులవారిని ఆర్యులు భయపెట్టి రహస్య


జీవనము సాగించునట్లు, బయటికి రాకుండునట్లు చేశారు. అయినా

రామానుజాచార్యుల వారు 120 సంవత్సరములు పూర్తిగా బ్రతికి, తన

విశిష్టాద్వైత సిద్ధాంతమును, వైష్ణవ సాంప్రదాయముగా బోధించెను.

ఆర్యులది శైవ సాంప్రదాయముకాగా, రామానుజాచార్యుల వారిది వైష్ణవ

సాంప్రదాయము. రామానుజాచార్యుల వలన దేశములో ఎందరో వైష్ణవులు

తయారై విశిష్టాద్వైతమును అనుసరించిరి. దానిని ఓర్వలేని ఆర్యులు

అద్వైతులను పేరుతో విశిష్టాద్వైతుల మీదికి అప్పుడప్పుడు వాదించుచూ,

వీలైతే దాడులు చేయుచూ వైష్ణవులైన వారిని అణచివేయాలని ఎంతో

ప్రయత్నము చేశారు. అయినా వారి ప్రయత్నము పూర్తి కాలేదు. ఇప్పటికీ

వైష్ణవ సాంప్రదాయములతో కూడిన విశిష్టాద్వైత సిద్ధాంతము దేశమంతా

అక్కడక్కడ కనిపించుచున్నది. రామానుజాచార్యులు వచ్చిపోయిన కొంత

కాలమునకు మధ్వాచార్యుల వారు కర్ణాటక రాష్ట్రములో పుట్టి, తనదైన

ద్వైత సిద్ధాంతమును బోధించాడు. ద్వైత సిద్ధాంతము కూడా అద్వైత

సిద్ధాంతమునకు పూర్తి విరుద్ధముగా యుండును. మధ్వాచార్యులను

అనుసరించిన వారు బహుకొద్దిమంది యుండినా, వారు కూడా నేటికినీ

అక్కడక్కడ కనిపించుచున్నారు. మంత్రాలయ రాఘవేంద్రస్వామి వారు

ద్వైత సిద్ధాంతమునకు సంబంధించిన వాడే. ద్వైత సిద్ధాంతము వేరుగా

యున్నా పైకిమాత్రము కట్టుబొట్టు రూపములో విశిష్టాద్వైతము వారిని

పోలియుండును. విశిష్టాద్వైతులు, ద్వైతులు ఇరువురు వైష్ణవ నామమునే

ధరించడము విశేషము.


నేడు ప్రస్తుత కాలములో త్రైత సిద్ధాంతము ఆచార్య ప్రబోధానంద

యోగీశ్వరులను మాతోనే ప్రారంభమైనది. త్రైత సిద్ధాంతము ఇందుత్వములో

ముఖ్యమైన సిద్ధాంతమైనా, ఇది మిగతా అద్వైత, ద్వైత సిద్ధాంతములకు


పూర్తి భిన్నముగాయుండును. అయితే త్రైత సిద్ధాంతము సృష్ట్యాదిలో దేవుని

చేత మొట్టమొదటగా బోధింపబడిన మూడు ఆత్మల జ్ఞానము, దీనినే

ఆకాశవాణి చెప్పగా, సూర్యుడు కూడా దీనినే భూమిమీద మనుషులకు

చెప్పడము జరిగినది. ఇంతవరకు ఆర్యుల అద్వైతమునకు మొదట బుద్ధుని

సూత్రములు అడ్డము రాగా, దానిని ఆర్యులు పూర్తిగా అధిగమించారు.

తర్వాత వచ్చిన విశిష్టాద్వైత, ద్వైతముల వలన కొంత ఘర్షణ ఏర్పడినా,

వాటిని ఆర్యులు పూర్తిగా తొలగించలేక పోయారు. అయితే ఇప్పుడు

వచ్చినది ఆదిలోని త్రైత సిద్ధాంత జ్ఞానము అయినందున, అసలైన ద్రావిడుల

మూడు ఆత్మల జ్ఞానము అయినందున, పూర్వమువలె ప్రస్తుత కాలములో

తెలివి తక్కువ ద్రావిడులు లేనిదానివలన, ఉన్నవారంతా తెలివైన ద్రావిడులే

ఉండుట వలన, ముఖ్యముగా మూడు ఆత్మల ద్రావిడ జ్ఞానము నేడు

సిద్ధాంతమును సంతరించుకొని త్రైత సిద్ధాంతముగా వచ్చియుండుట వలన,

త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినది, మహర్షి గానీ, తపస్వి గానీ, వేదాంతి

గానీ కాకుండా యోగి అయిన ప్రబోధానంద యోగీశ్వరులు అయినందున,

ఈ జ్ఞానము ఆర్యులకు అడుగడుగున ఆటంకముగాయుండును.


కృతయుగము చివరినుండి, త్రేతాయుగము మొదటినుండి,

ఆటంకములేని పెత్తనమును నడిపిన ఆర్యులు నేడు త్రైత జ్ఞానము ముందర

తమ పెత్తనమును మూటగట్టి ప్రక్కన పెట్టవలసి వస్తున్నది. అందువలన

బుద్ధుని కాలమునుండి మొదలై చివరికి ఆర్యులకు ఇప్పుడు గట్టి పోటీ

ఏర్పడుచున్నది. "వెయ్యి ఏనుగులను తిన్న రాబందులైనా ఒక్క గాలివానతో

చనిపోవునని” పెద్దలు చెప్పిన వాక్యము ప్రకారము రెండు యుగముల

కాలము భారతదేశములో పెత్తనము చెలాయించిన ఆర్యులు నేడు త్రైత

సిద్ధాంతము ముందర తలవంచవలసిన అవసరమొస్తుందని చెప్పక తప్పదు.


ఆర్యులు గతములో చేసిన తప్పులకు తప్పక శిక్షను అనుభవించ వలసి

వస్తుంది.


ప్రశ్న :- భారతదేశములో పుట్టిన గౌతమ బుద్ధునిది ఇతర మతముగా

చెప్పిన ఆర్యులు, రామానుజాచార్యులను రహస్య జీవనము గడుపునట్లు

భయపెట్టిన ఆర్యులు, ఈ మధ్య కాలములో పద్య రూపములో జ్ఞానమును

చెప్పిన వేమనను కూడా చెడుగా చెప్పక వదలియుందురా?


జవాబు :- తాము తప్ప ఎవరూ తమకంటే గొప్పగా ఉండకూడదను

స్వభావమున్నవారు ఆర్యులు. అందువలన చేతనైనా చేతకాకపోయినా

తమ అసూయపనులు చేయుచునే పోవుచుందురు. మేము తెలివైనవారమను

ధీమా వారిని అలా చేయించుచున్నది. మొదటినుండి కుట్రలు చేసి,

కుతంత్రములు చేసి, ఎవరి కన్నును వారి వ్రేలితో పొడవడము ఆర్యులకు

వెన్నతో పెట్టిన విద్య అయినది. అందువలన శూద్రులైన బ్రహ్మముగారిని

గానీ, వేమన యోగిని గానీ వారు వదలలేదు. ఒక గ్రంథములోని

సారాంశమును ఒక పద్యములో ఇమిడ్చి చెప్పిన ఘనత వేమన యోగికి

(వేమారెడ్డికి) ఉన్నది. వేమనయోగి ప్రతి విషయమును ముక్కుసూటిగా

చిన్న వాక్యములలోనే చెప్పిన మనిషి. వేమనయోగి ఎవరు తప్పుచేసినా

వదలకుండా వారి బండారమును ఉన్నదున్నట్లు చెప్పిన వ్యక్తి. తన

పద్యములలో ఆర్యులను ఏమాత్రము వదలక, ప్రజలకు వారు చేసిన

మోసములను కొన్ని పద్యములలో విప్పి చెప్పాడు. వేమన తమను నూటికి

నూరుపాళ్ళు విమర్శించినందుకు బదులుగా ఆర్యులు వేమనను తిక్కవాని

క్రిందికి జమకట్టి చెప్పారు. వేమనకు తిక్కబట్టి గుడ్డలూడతీసుకొని

తిరుగుచూ చెప్పిన మాటలు తిక్కమాటలు కాక ఏమగునని, ఆర్యులైన

బ్రాహ్మణులు కొందరు వేమనను గురించి అనడము విన్నాను. తిక్కవాని


మాటలు తిక్కవారు కాకుండా మంచివారు వినరని, వేమన మాటను

వినేవారందరినీ ఆర్యులు తిక్కవారనిన సందర్భములు గలవు. వేదములు

తెలిసినవారు జ్ఞానులగుటకు అవకాశమున్నదనీ, వేదములు తెలియనివారికి

నిజజ్ఞానము తెలియదనీ అన్నవారు, వేదములు వేశ్యలవంటివని చెప్పిన

వేమన జ్ఞాని ఎట్లగునని ఆర్యులు ప్రశ్నించిన సందర్భములు కూడా కలవు.

తమ శాయశక్తులా పనిచేసి, వేమన పద్యములను తాము ఎక్కడా చెప్పకుండా

అణచివేశారు. కొందరితో వేమన పద్యములలో జ్ఞానము లేదని చెప్పారు.

ఇట్లు తమకు చేతనైనంత వరకు వేమన పద్యములను ఆర్యులు ఎక్కడా

బయటికి చెప్పడము లేదు. ఆర్యులు ఎక్కడ ఉపన్యసించినా అక్కడ సంస్కృత

శ్లోకములను చెప్పుదురుగానీ, వేమన పద్యమును మాత్రము చెప్పరు. మిగతా

బ్రాహ్మణులందరికీ వేమన సాహిత్యమును ఎవరూ చదువరాదని

చెప్పడమేకాక, వేమన బ్రాహ్మణ ద్వేషి అని ప్రచారము చేశారు.

అంతేకాకుండా వేమన యోగి అని పేరుపెట్టుకొని ప్రజలలో నాస్తికత్వమును

ప్రజలకు బోధించాడనీ, రాతిబొమ్మలు దేవుళ్ళెలా అవుతాయని హిందూ

దేవతలను వేమన దూషించాడనీ, వేమనలో దైవభక్తి లేదనీ, చాలా

పద్యములలో దేవతలను, బ్రాహ్మణులను దూషించాడని కూడా చెప్పారు.

ఈ విధముగా తమకు చేతనైనంత వేమనను గురించి చెడుగానే ప్రచారము

చేశారు.


ఇక పోతులూరి వీరబ్రహ్మముగారు కాలజ్ఞానమను పేరుతో జరుగ

బోవు ఎన్నో విషయములను వ్రాసి పేరుపొందిన వ్యక్తి. అయితే ఆచారి

(విశ్వబ్రాహ్మణ) కులమున పుట్టినవాడైనందున, బ్రహ్మముగారు ఆర్య

బ్రాహ్మణుడు కానందున, ఆచారి కులము శూద్రుల కులములలో యుండుట

వలన బ్రహ్మంగారిని కూడా హేళనగా మాట్లాడి, బ్రహ్మముగారు ఆచారుల


కులము వారికి మాత్రమే గురువనీ, మిగతా ఎవరికీ గురువు కాదనీ, వారి

కులమువారికే జ్ఞానము చెప్పాడనీ, బ్రహ్మముగారు ఆచారుల కులగురువుగా

ఉన్నాడని ఆర్యులు చెప్పారు. అంతేగాక ఆత్మజ్ఞానమును తత్త్వముల

రూపములో వ్రాసిన బ్రహ్మముగారినీ, పద్యముల రూపములో వ్రాసిన వేమన

యోగినీ వారి రచనలలో వ్రాసిన విధానమును బట్టి, వాడిన భాషనుబట్టి

శూద్రులైన బ్రహ్మముగారిమీద, వేమనమీద ఎంత అసూయ ఉన్నదో

తెలియగలదు. మీకు స్వయముగా అర్థమగునట్లు “జ్ఞాన సూర్యోదయము”

అను గ్రంథములో వ్రాసిన కొన్ని వాక్యములను యథాతథముగా పొందు

పరచుచున్నాము చూడండి. అట్లే మేము ఈ గ్రంథమున వేదములు ఆర్యుల

కల్పనయనియూ, రామాయణము కూడా ఆర్యులైనవారు వ్రాయించి

నదేననియూ, అది అసత్యములతో కూడుకొన్నదనియూ చెప్పాము కదా!

నేనేకాదు నాలాంటివారు నాకంటే ముందు కూడా చెప్పియుందురు.

కల్పితమని మేము అనిన మాటలకు బదులుగా, వారి గ్రంథమున ఎట్లు

వ్రాశారో ఒకమారు మీరే గ్రహించండి.


"స్వయంభువులైన వేదములను కొందరు కల్పితములను

చున్నారు. అట్లే, రామాయణమును కూడా కల్పించారని

అంటున్నారు. కల్పించారన్న ఎవరు కల్పించారు? కల్పితములైన

వానిని సమకాలీకులు ఒప్పుకొందురా? భిన్నాభిప్రాయములు

గలవారొకరు సృష్టించిన దానిని మరియొకరు సహింతురా?

రామాయణము కల్పితమన్నచో నేటికినీ సర్వ ప్రపంచమున

ననుష్టింపబడు రామజయంతి (శ్రీరామనవమి) ఎట్లు ప్రజలలో

ప్రవేశించినది? ఆయా గ్రంథ ప్రతిపాదితములైన మహా


విషయములు కాల పరిణామమున అజ్ఞానులైన ఇప్పటి వారికి

వింతగా కనిపించవచ్చును. అంతమాత్రమున అవి కల్పితములా?

వాల్మీకి లేనిపోని విషయములన్నిటినీ రామాయణ గ్రంథముగా

కూర్చి లోకమును మోసగించుచుండగా, అప్పటి సమకాలికులు

ఎట్లు ఊరకున్నారు? సమకాలికులందరూ వాల్మీకి చేయుచున్నది

మోసమని తెలియలేనంత మూర్ఖులా? అట్లయిన మూఢ

నిక్షిప్తమగు అపవిత్ర గ్రంథమే అయితే, అది నేటివరకు మన

మధ్యలో ఎలా నిలువగలిగినది? ఒకవేళ అప్పటి వారు

రామాయణము కల్పితము యని విమర్శించియుంటే

రామాయణము నేటి వరకు వచ్చినట్లు వారి విమర్శలు నేటి వరకు

ఆ గ్రంథము వెంట ఎందుకు రాలేదు?


ఒక్కొక్క శాస్త్రము (వేదము, రామాయణము) ఎంత

విస్తారముగా, ఎంత ప్రౌఢముగా, ఎంత గంభీరముగా యున్నదో

పరిశీలింపుము. గురు ముఖమున వినియూ అర్థము చేసుకోలేక

బాధపడుచున్నాము. అట్టివాటిని ఎవడో గాలికి పోవువాడు

కల్పితములనిన సరిపోవునా? గురుకులవాసము చేసి శాస్త్రములను,

వేదములను అభ్యసించిన వారికి వాటి యదార్థ స్వరూపమూ, వాటి

మహిమా బోధపడును. అట్లు గురుకులవాసము చేయక, వేద,

పురాణ, ఇతిహాస గ్రంథములను చవిచూడక, భాషా పరి

జ్ఞానమును నేర్వక, ఆ గ్రంథములను వ్రాసిన మహర్షుల శక్తి ఎట్టిదో


తెలియక, ఆర్య సాంప్రదాయములను పరిశీలించక, ఇంద్రియ

లోలుడై ఇచ్చవచ్చినట్లు మొక్కుచూ, ఇష్టమొచ్చినరీతి

జరిపించుచూ, నోటికి వచ్చినట్లు మాట్లాడుచూ, బొజ్జ,

తొండమును చూచి బ్రహ్మదేవుడనుకొన్నాను అన్నట్లు, వేద

ఉపనిషత్ శాస్త్రముల చూచి కల్పితములనియు, అబద్దము

లనియూ వదరిన లాభమేమి? ఎవరు ఏమనినా సామాన్య

మానవుని యుక్తి వాదము వేదములను అసత్యమని చెప్పినా,

సింహము ముందర నక్క మౌనము వహించినట్లు,

వేదాంతశాస్త్రము ముందు విమర్శకులు మౌనము వహించక

తప్పదు అని ఒక సుభాషితకారుడు సమస్త శాస్త్రసారమైన

వేదములను ప్రశంసించెను. కావున వేదాంతశాస్త్రములు

(వేదములు) సర్వదా సత్యములు.


(‘వైదిక వేషధారణ' అను పేరుతో బ్రాహ్మణులైన వారు ఇదే

వస్త్రధారణ, ఇదే వేషధారణ ఉండవలెనను నియమమును పాటించు

చున్నారు. అలా వేషధారణ వస్త్రధారణ బ్రాహ్మణులకు వేరుగాయుండుటను

చూచి, మిగతా ప్రజలందరిలో బ్రాహ్మణులు పవిత్రులుగా కనిపించుచుండగా

ఆ వేషధారణ లేని మిగతా ప్రజలందరూ అపవిత్రులుగా కనిపించుచున్నారు.

ఆ విధ వేషధారణ మిగతా వారందరూ నీచులు, శూద్రులు, అంటరాని

వారు అని సూచించునట్లున్నది. అందువలన వైదిక వేషధారణ అనేది

జీవనోపాధి కొరకుగానీ, భక్తి కాదు. దానిలో ఇతరులను కించపరచడమే

ఎక్కువ కనిపించుచున్నదనీ, “భక్తి శ్రద్ధలు మనస్సులో ఉండవలెనుగానీ,


శరీరము మీద వస్త్రధారణ వలన భక్తి శ్రద్ధలు రావు” అను మాలాంటివారికి

బదులుగా వారు గ్రంథమునందు ఇలా వ్రాశారు చూడండి.)


వైదిక వేషధారణ జీవనోపాయమెట్లగును? తమకదివరకున్న

జీవనములను తృణప్రాయముగా విసర్జించి, ఇంద్రియముల

సహజ ప్రవృత్తిని కష్టముమీద ఆపి, యమ నియమాదులను

ఆచరించి, భగవంతుని ఆరాధనా తత్పరులై లోకమును వదిలి

తమ మార్గమును అనుసరింప వచ్చిన వారికి వేదములు బోధించు

వైదికులు వంచకులా? వేషధారులా? ఇతరులను కించ పరుచు

వారా? ఎంతటి అన్యాయమైన మాట?


వైదిక జ్ఞాన శూన్యులైనవారు, ఈ లోకమే సత్యమనుకొని,

దానియందే లగ్నులైయున్న వారి దృష్టిలో లోకమునెరిగి వేద

శాస్త్రముల దృష్టిచే దూరముగానున్న పరలోకములను కూడా

దర్శించు కూపస్థమండూకము తెట్లగుదురు? (బావిలోని కప్పలు

ఎట్లగుదురు?) పుత్రకామేష్టి యజ్ఞము మొదలగు కార్యములచే

వాటి ఫలితములు ప్రత్యక్షముగా అందినప్పటికీ, వైదిక కర్మలు,

యజ్ఞములు సత్యము కాదంటారా? అవి జీవనోపాధియని అంటారా?

ఆర్య సాంప్రదాయములను అసత్యములని అంటారా?

(ఇక్కడ వేమననూ, వీరబ్రహ్మముగారినీ కలిపి ఆర్య బ్రాహ్మణులు

ఏమని చెప్పుచున్నారో చూడండి.)

"1

"ఐహిక వశ్యతత్త్వ మెరిగి నిత్య సుఖాభిలాషులయ్యు


సరియైన మార్గము దొరకక, సద్గురువు లభించక, సత్సాంగత్యము

లేక, శాస్త్ర పరిచయము ఏమాత్రము లేక, వేదముల జ్ఞానము

తెలియక, కుమత పతిష్టులై ప్రాకులాడుచూ, అచల సాంప్రదాయ

మని లేనిదానిని చెప్పుచూ, కొందరు పద్యములను, కొందరు

పాటలను (తత్యములను) పాడుచూ గురువులుగా చలామణీ

కావలెనని ప్రాకులాడువారు కొందరు కలరు. అటువంటివారు

పాండిత్యము లేని ప్రజల మధ్యన చలామణీ అగుచూ, నాసు

కవిత్వమును చెప్పుచుందురు. అందులో తత్త్వవేత్తలమని కొందరు

ఇలా పాట చెప్పుచున్నారు.

1)

చూడచక్కని చిన్నది కడమేడ గదిలోనున్నది.

ఏడు రంగుల మడుగులో జలక్రీడలాడుచున్నది.

1) రెక్కముక్కు లేని పక్షి రేయింబవలు తపస్సు చేసి

ఒక్క చెరువులో చేపలన్ని ఒక్కటే మ్రింగైరా.

1)

పోగా పోగా గోడుంది

గోడకు తగ్గ గూడుంది

గూడుకు తగ్గ ప్రమిదుంది.

1)

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

కంటిలోని నలుసు కాలిముల్లు

ఇంటిలోని పోరు ఇంతింత గాదయా

విశ్వదాభిరామ వినుర వేమా!


1)

పన్నెండు కొమ్మల పట్టామట్టి

దానిపై పంచవన్నెల రామ చిలుక

దానిమీద చుక్కవలె ప్రకాశించు నక్క

దానిలోనే భగవంతుడుండు.


1)

గుంటూరి కవతలాగున్న చింతలకాడ

గుఱ్ఱం కడుపున గొర్రె పుట్టేనయా

నందామయా గురుడ నందామయా

ఆనంద దేవికి నందామయా


ఇవి వీరి ఉపనిషత్ సూక్తులు, తత్త్వవాచకములు. వీటికేమో

అంతరార్థముట ! వీరి శ్రాద్ధమట !! ఉభయ భ్రష్టులై చెడుట తప్ప

వీరికి వేరు ఫలములేదు. ఇదియా వీరి వేదాంతము! ఇట్ట పిచ్చి

మతములను చూచియే నవీనులు మహాపవిత్రములైన వైదిక

మతములను కూడా నిట్టివేయని దూషించుచున్నారు.


"తెలుసునను వానికి ఏమీ తెలియదు, తెలియదనుకొనువానికి అన్నీ

తెలుసు” అను సామెత ప్రకారము పై విషయములను వ్రాసిన గ్రంథకర్త

తనను తాను అన్నీ తెలుసుననుకోవడము వలన, ఏమీ తెలియని వాడైనాడని

చెప్పవచ్చును. పైన ఉదాహరణకు గ్రంథకర్త వ్రాసిన తత్త్వముల వాక్యములు,

పద్యముల వాక్యములు ఎంతో గొప్ప అర్థముతో కూడుకొనియున్నవని

తెలియుచున్నది. అయినా గ్రంథకర్తకు వేదముల, ఉపనిషత్తుల స్థూల

జ్ఞానము తెలిసియుండుట చేత, శరీరములోని ఆత్మల విషయము తెలియక


పోవడము వలన, నాలుకలేనివానికి రుచే తెలియదన్నట్లు, తత్త్వములలోని

జ్ఞానము, పద్యములలోని జ్ఞానము ఏమాత్రము తెలియకుండాపోయినది.


ఇక్కడ వివరముగా జ్ఞానముతో కూడుకొన్న తత్త్వములను,

పద్యములను వ్రాసి, వాటికి కూడా విలువనియ్యక వాటిని దూషించడమూ,

వాటిని చదివేవారిని "వీరి శ్రాద్ధమట” అని దూషించడము చూస్తే, వేమన

యోగిమీద, కాలజ్ఞాని అయిన బ్రహ్మముగారిమీద ఎంత అసూయ

ఉన్నదో చూడకనే బయటికి కనిపిస్తూయున్నది. ఆర్యులైన వారి దృష్ఠిలో

వేదములు, ఉపనిషత్తులే ముఖ్యమైన శాస్త్రములుగా యున్నవి. వేదములను

శాస్త్రములనడము ఎనుమును (గేదెను) ఎద్దు అన్నట్లున్నది. వేదములువేరు,

శాస్త్రములు వేరు. 'వేదములు నాలుగు, శాస్త్రములు ఆరు' అని తెలియనివారు

వేద శాస్త్రములని పలుకుచూ వేదములను శాస్త్రములనడము పొరపాటు.

దీనిని బట్టి ఎదుటి వారిని వెక్కిరించు జ్ఞానము తప్ప, ఎదుటి విషయమును,

ఎదుటి వ్యక్తిని అర్థము చేసుకొను శక్తి ఆర్య బ్రాహ్మణులకు లేదని

అర్థమగుచున్నది.


ప్రశ్న :- శంకరాచార్యులు ఆర్యుల వలన తయారు చేయబడిన వాడను

విషయము మీరే మొదట చెప్పుచున్నారు. ఇంతవరకు ఆ మాటను ఎవరూ

చెప్పలేదు. శంకరాచార్యుల వారే స్వయముగా అలా తయారై సిద్ధాంతకర్త

అయినాడనుకొన్నాము. బుద్ధునికి పోటీగా తయారు చేయబడిన వాడని

మాకు తెలియదు. శంకరాచార్యుల వారు చాలా తెలివైనవారనీ, చిన్న

వయస్సులోనే సకల విద్యలను నేర్చిన వాడనీ, సంస్కృతములో మేథావియనీ

దేనినయినా తొందరగా గ్రహించుకొను శక్తికలవాడని విన్నాము. అటువంటి

వాడు ఆర్యుల కుట్రను గ్రహించలేకపోయాడా?


జవాబు :- 'ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడను' సామెత ప్రకారము

అనుకూల శత్రువులుగాయున్న ఆర్యులను శంకరుడు గ్రహించలేకపోయాడు.

పైగా స్వకులస్థులను భ్రమలో వారిని పూర్తిగా నమ్మియుండి వారు

చెప్పునదంతా తన మంచికే అనుకొన్నాడు. చిన్నవయస్సులోనే తనను

బాగా ప్రచారము చేసిన ఆర్యులను పూర్తి విశ్వసించాడు. తనను ఒక

సిద్ధాంతకర్తగా తీర్చిదిద్ది అందరిలో గొప్పవానిగా చేసిన వారిని శంకరా

చార్యుల వారు ఎటువంటి అనుమానము లేకుండా నమ్మడము జరిగినది.

ఆర్యులు తమ స్వార్థముతో తనను పావుగా వాడుకొనుచున్నట్లు శంకరునకు

తెలియదు. ఎప్పుడయితే తనచేత దేశములో నాలుగు చోట్ల నాలుగు

రాష్ట్రములలో నాలుగు అద్వైత పీఠములను స్థాపింపజేసి దేశపర్యటన చేసిన

తర్వాత ఆర్యుల మీద కొంత అనుమానము వచ్చినది. అయినా దానిని

ఎక్కడా బహిర్గతము చేయకుండా తనయందే దాచు కోవడము జరిగినది.

అయితే తూర్పున ఒరిస్సా రాష్ట్రములో పూరి జగన్నాథ్ నూ, పడమర

గుజరాత్ రాష్ట్రములో ద్వారకా జామ్నగర్లోనూ, ఉత్తరమున ఉత్తరాఖండ్

రాష్ట్రములో బద్రినాథ్లోనూ, దక్షిణమున కర్నాటక రాష్ట్రమున శృంగేరిలోనూ

నాలుగు పీఠములను స్థాపించాడు. తర్వాత తనలో మార్పును ఎవరూ

గుర్తించనట్లు ఐదవ పీఠమును కూడా తమిళనాడు లో కంచిలో స్థాపించడము

జరిగినది.


శంకరాచార్యుడు భారతదేశమునకు పశ్చిమ భాగమున గల

గుజరాత్లో ద్వారకాయందు ద్వారక పీఠమును 491 B.C లోనే స్థాపించాడు.

తర్వాత రెండవ పీఠమును ఉత్తరాఖండ్ లోని బద్రినాథ్ 486 B.C లో

అనగా 5 సంవత్సరముల తర్వాత రెండవ పీఠమయిన జ్యోతిర్ పీఠమును

స్థాపించాడు. మూడవ పీఠమును భారతదేశమునకు తూర్పువైపున


ఒరిస్సాలోని పూరిలో పూరిపీఠమును 485 B.C లో స్థాపించాడు. రెండవ

పీఠమునకు మూడవ పీఠమునకు ఒక సంవత్సరము తేడాయని గ్రహించండి.

ఇక నాల్గవ పీఠమును దక్షిణ దేశమున కర్నాటక రాష్ట్రమున శృంగేరిలో

శారదా పీఠమును 484 B.C లో స్థాపించాడు. మూడవ పీఠమునకు

నాల్గవ పీఠమునకు కూడా కేవలము ఒక సంవత్సరము తేడానే గలదు.

ఈ విధముగా నాల్గు పీఠములను నాల్గు వేదములకు గుర్తుగా స్థాపించడము

జరిగినది.


దేశము నలుమూలలా తిరిగిన శంకరుడు నాలుగు పీఠములను

నాల్గు వేదములకు గుర్తుగా స్థాపించినప్పుడు ఆయనది పేరు మాత్రమే.

శంకరుడు మొదటి పీఠమును గుజరాత్లో స్థాపించినప్పుడు అక్కడ అద్వైత

మఠమును ఆర్యులే కట్టించి సిద్ధముగాయుంచిన మఠమునకు శంకరున్ని

బొమ్మగా తీసుకొనిపోయి ఆయనచేత ద్వారకా పీఠమును స్థాపింపజేశారు.

తర్వాత ఐదు సంవత్సరముల వ్యవధిలో ఉత్తరదేశమున చివరిలోగల

బద్రినాథ్ జోతిర్హీఠమును స్థాపించడము జరిగినది. శంకరుడు అక్కడకు

రాకమునుపే బద్రినాథ్ అద్వైత మఠమును స్థాపించడము జరిగినది.

అక్కడినుండి మూడవ పీఠము కొరకు ఒరిస్సాకు రావడము జరిగినది.

ఉత్తరాఖండనుండి కాలినడకన ఒరిస్సాకు రావడమునకు దాదాపు ఒక

సంవత్సర కాలము పట్టినది. అంతలోపే ఆర్యులు పూరి పట్టణములో

అద్వైత మఠమును తయారు చేసి శంకరాచార్యులను తీసుకొనిపోయి మూడవ

పీఠమును స్థాపింపజేశారు. నాల్గవ పీఠమైన శారదా పీఠమును కర్నాటకలోని

శృంగేరి పట్టణములో స్థాపించడము జరిగినది. ఒరిస్సాలోని పూరి నుండి

కర్నాటకలోని శృంగేరి వరకు కాలినడకన వచ్చుటకు దాదాపు సంవత్సర

కాలము పట్టును. కర్నాటకలో సంవత్సరమునకే అక్కడ పీఠమును శంకరుడు


పోయి స్థాపించడము జరిగినది. శంకరుడు అక్కడికి పోక మునుపే అక్కడ

రెండు మూడు సంవత్సరములనుండి అక్కడ మఠమును నిర్మించవలసి

యున్నది. ఒక మఠమును నిర్మించుటకు దాదాపు రెండు నుండి మూడు

సంవత్సరముల వ్యవధి అయినా పట్టును. బాగా ఆలోచించినా ఆలోచించక

పోయినా, తెలివియున్న వారికయినా, తెలివిలేని వారికయినా ఆ పీఠములకు

సంబంధించిన మఠములను తయారు చేసినది శంకరుడు కాదనీ, శంకరుడు

దృశ్యరూపమైన బొమ్మగా ఉన్నాడనీ, కార్యరూపమైన వారు ఆర్యులేననీ,

ఆర్యులు ముందే నిర్ణయించుకొన్నట్లు శంకరుడు ఆ ప్రాంతములోనికి

రాకముందే మఠములను తయారు చేశారను విషయము తెలిసిపోవుచున్నది.


ఒక పీఠమును స్థాపించుటకు అక్కడ ఒక మఠముండాలి. అట్లే

నాల్గు పీఠములకు కావలసిన నాల్గు మఠములను ఆర్యులు దాదాపు మూడు

సంవత్సరముల కాలమయినా శ్రమపడి తయారు చేయించి యుండాలి.

ప్రతి మఠములోనూ ఒక దేవతను ప్రతిష్ఠించడము జరిగినది. పీఠమునకు

మఠములే ఉండాలిగానీ, దేవతాలయములు ఉండకూడదు. శరీరములోని

తత్త్వమును తెలుపునది పీఠమయినప్పుడు ఆ పీఠము మఠములోనే

ఉండాలి. ఆత్మలు శరీరములోనే ఉండును. ఆది శంకరాచార్యుల వారి

సిద్ధాంతము “అద్వైత సిద్ధాంతము”. అద్వైతము ఆత్మకు సంబంధించినదే

గానీ వేరు కాదు. రెండు ఆత్మలులేవు, ఉన్నది ఒకే ఆత్మ అనునదే

శంకరాచార్యులవారి సిద్ధాంతము. సిద్ధాంతము అనగా కనుగొనబడినదని

ముందే తెలుసుకొన్నాము. శంకరుడు తన సిద్ధాంతములో 'ద్వైతము లేదు'

అని చెప్పాడు. ద్వైతము అనగా రెండు అని అర్థము. ఏకము అనగా

ఒకటి అని అర్థము. ఏకమునకు ముందు “అ” అను అక్షరమునుంచితే

‘అనేకము’ అని చెప్పవచ్చును. అనేకము అనగా ఒకటి కానిదని ఒకటికంటే


ఎక్కువ కలదని అర్థము. ఎక్కువ సంఖ్యయున్నప్పుడు అనేకము అనుమాటను

అందరూ వినియేయుందురు. అదే విధముగా ద్వైతము అన్నప్పుడు రెండు

అయితే దానికి ‘అ’ను చేర్చి అద్వైతము అని అంటే రెండు కానిది ఒక్కటే

అని చెప్పవచ్చును. ప్రపంచములో దేవుడు ఒక్కడు తప్ప ఇతరము ఏదీ

లేదని, అంతా పరబ్రహ్మ స్వరూపమై యున్నదని చెప్పడమే అద్వైతము.

ప్రతి దానిని దైవముగానే చూడవలెననీ, ప్రతి వస్తువుయందు, ప్రతి

ప్రాణియందు ఏకైక పరబ్రహ్మ స్వరూపమే నిండి యున్నదను సూత్రమే

లేక సిద్ధాంతమే శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతము.


శంకరాచార్యుడు రాక పూర్వము భారతదేశములో గల భగవద్గీతా

జ్ఞానమును లేకుండా చేయుటకు కంకణము కట్టుకొన్న ఆర్యులు గౌతమ

బుద్ధున్ని సాకుగా చూపి హిందువే అయిన బుద్ధున్ని హిందువుకాదని,

కాషాయ గుడ్డలు ధరించి తలలు బోడులు చేసుకొని సన్యసించిన వారిని

కూడా హిందువులు కాదని బుద్ధున్ని పరాయి మతమును సృష్ఠించిన

వానిగా ప్రజలకు చూపి బుద్ధుడు చెప్పిన జ్ఞానమును హిందూమత జ్ఞానమే

కాదనీ, అతను చెప్పిన దానిని బౌద్ధమతముగా ప్రకటించారు. బుద్ధుని

బోధలకు ఆకర్షితులైన అశోక చక్రవర్తితో సహా మిగతా వారినందరినీ

హిందువులు కాదనీ, హిందూమతమును ఉద్దరించడానికి ఆదిశంకరుడు

వచ్చాడనీ ప్రచారము చేశారు. వృక్షమునుండి పుట్టిన కట్టెను తీసుకొని,

అదే కట్టెకు గొడ్డలిని తగిలించి, అదే వృక్షమును నరికినట్లు, హిందువులలో

ద్రావిడునిగా పుట్టిన శంకరాచార్యులను 'కట్టె'గా తయారుచేసి తమ 'కుట్రలు'

అను గొడ్డలి తగిలించి ద్రావిడ వృక్షమునే నరుకను ఆర్యులు ప్రయత్నము

చేశారని శంకరుడు కూడా మొదట గ్రహించలేదు. ద్రావిడుల వ్రేలు తీసి

ద్రావిడులు కన్నునే పొడిచినట్లు స్వచ్ఛమయిన ఆధ్యాత్మిక జ్ఞానముగల


ద్రావిడులను లేకుండా చేయుటకు చేసిన కుట్రయే శంకరాచార్యులను

అద్వైత సిద్ధాంత కర్తగా ప్రచారము చేశారు.

హిందూమతము వారు తప్ప సన్యాసత్వము తీసుకొనువారు లేరు,

కాషాయమును ధరించువారు లేరు. హిందుత్వమునకు కాషాయము గుర్తుగా

యున్నది. అయిననూ కాషాయమును ధరించిన బౌద్ధులను (బుద్ధులను)

ప్రత్యేక మతముగా వర్ణించి చెప్పడము హిందూమతమును చీల్చినట్లు కాదా!

హిందువులే అయిన బుద్ధులను విడదీయడము వలన దాదాపు 60 కోట్ల

జనాభాయుండి జనాభాలో నాల్గవ స్థానమైన బుద్ధులను వదలుకోవడము

వలన హిందూమతము క్షీణించినట్లు కాదా! నేడు హిందూమత జనాభా

120 కోట్ల వరకు యున్నది. మత జనాభాలో మూడవ స్థానములో

హిందువులుండగా, రెండవ స్థానములో ముస్లీమ్లు 170 కోట్ల వరకు

గలరు. జనాభాయందు మూడవ స్థానములో యున్న హిందువులు, నాల్గవ

స్థానములో యున్న బుద్ధులను కలిపితే 180 కోట్ల జనాభా కాగలదు.

నేడు రెండుగా చీలిపోయిన హిందూ, బౌద్ధులు కలిసియుంటే నేడు హిందూ

మతము రెండవ స్థానములో ఉండేది. 50 లేక 60 లక్షలమంది హిందువులు

క్రైస్తవులుగా మారితే హిందూమతము క్షీణించిపోతుందని గొంతు చించుకొను

హిందూ రక్షకులు ఆర్యులు చేసిన పనిని చూచీచూడనట్లు ఎందుకు

ఉలుకు పలుకు లేకున్నారో! శంకరాచార్యులు బుద్దులనుండి హిందూ

మతమును కాపాడినాడని చెప్పుకోవడము ఎంతమాత్రము సమంజసమైన

మాటో మీరే ఆలోచించండి!!


ప్రజలకు తెలియని వాస్తవములెన్నో గలవు. ఆర్యులు ఒక ఫతకము

ప్రకారము ద్రావిడ రాష్ట్రమయిన మళయాల రాష్ట్రమున పేద బ్రాహ్మణ


అతనికి 14

కులమున పుట్టిన శంకరాచార్యులను ఎన్నుకున్నారు.

సంవత్సరముల వయస్సున్నప్పుడే ఆర్యుల కన్ను శంకరాచార్యుల మీద

పడినది. పేద బ్రాహ్మణ కుటుంబమయిన దానివలన వారికి ధనము

యొక్క ఆశచూపి తమ మాట వినునట్లు చేసుకొన్నారు. శంకరుడు 14

సంవత్సరముల వయస్సున్నప్పుడే సన్యాసము స్వీకరించునట్లు చేశారు.

తర్వాత 15వ సంవత్సరము అనగా ఒక సంవత్సరముపాటు శంకరునికి

వేదవిద్యలు నేర్పారు. శంకరుడు చురుకుదనము కలవాడు కావున ఒక

సంవత్సర కాలములో శ్రమపడి కొంతవరకు వేదములను చదువగలిగాడు.

అయినా 15 సంవత్సరముల పిల్లవాడు ఎంత యోగ్యుడుగా ఉంటాడో

మనము కూడా కొంత ఆలోచించవచ్చును. ఏ మనిషికయినా దాదాపు

18 సంవత్సరములు పూర్తిగా నిండినప్పుడు అతనిలో వ్యక్తిత్వ ఛాయలు

బయట పడుటకు మొదలు పెట్టును. అప్పటినుండి అతను జీవితములో

అడుగుపెట్టి నడువను ప్రారంభించును. అయితే ఆర్యుల తొందరపాటుతో

శంకరున్ని అతి చిన్నవయస్సులోనే 15 సంవత్సరములకే అద్వైత సిద్ధాంత

కర్తగా ప్రకటించారు. ఆర్యులు ఆ పనిని చేసినప్పుడు శంకరునికి

అద్వైతమంటే కూడా ఏమిటో తెలియదు.


శంకరాచార్యుని 16వ ఏట అద్వైతమును గురించి అతనికి

అవగాహన వచ్చునట్లు చేశారు. 16 సంవత్సరములు పూర్తి నిండకనే

శంకరుని చేత అద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయుచూ దేశములో

తిరుగునట్లు అద్వైత సిద్ధాంత ప్రచారయాత్రను మొదలు పెట్టారు. బాల్యము

కూడా పూర్తి నిండని శంకరునిచేత, ముక్కుపచ్చారని వయస్సులోనే

శంకరాచార్యున్ని దేశ పర్యటన చేయునట్లు చేశారు. కాలినడకన ఊరూరూ

త్రిప్పుచూ శంకరున్ని బొమ్మగా చేసి చూపుచూ తమ అద్వైత సిద్ధాంతమును


ఆర్యులు ప్రచారము చేయసాగారు. శంకరున్ని ఒక పావువలె కదుపుచూ,

ఒక బ్రాహ్మణ సన్యాసి చిన్నవయస్సులోనే అద్వైతమును ప్రచారము చేయు

చున్నాడని దేశమంతా తెలియునట్లు ముందే రూపొందించుకొన్న ఫతకము

ప్రకారము భారతదేశము నలుమూలలా నాలుగు వేదములకు గుర్తుగా

నాలుగు అద్వైత పీఠములను స్థాపించాలనుకొన్నారు. ఆ ఫతకములో

భాగముగా మొదట గుజరాత్ రాష్ట్రములో గల ద్వారకా జామ్నగరమునకు

శంకరాచార్యులను ఆర్యులు తీసుకుపోవడము జరిగినది. శంకరాచార్యుల

చేత 16 సంవత్సరములకే కాలినడకన దేశపర్యటన ప్రారంభించి దాదాపు

రెండు సంవత్సరములకు ద్వారకాజామ్ నగరమును చేరడము జరిగినది.

శంకరాచార్యుల వారు అక్కడికి చేరకముందే ఆర్యులు తమ ఫతకము

ప్రకారము ఒక పెద్ద ఆలయమును తయారు చేసి అందులో కాళికాదేవిని

ప్రతిష్ఠించియుంచారు. శంకరాచార్యుల చేతులమీద దానిని ప్రారంభించా

లనుకొన్నారు. శంకరుడు గుజరాత్ రాష్ట్రములోని ద్వారకా జామ్నగర్

చేరేటప్పటికి అతనికి 18 సంవత్సరముల వయస్సు జరుగుచుండెడిది. ఆ

వయస్సులో శంకరునికి పూర్తిగా కాళికాదేవి చరిత్ర కూడా తెలియదు.

అయినా శంకరున్ని ఒక బొమ్మగా చూపిస్తూ, ఆయన చాలా గొప్పవాడని

ప్రజలలో ప్రచారము చేసి, ఆయనతోనే ద్వారకా జామ్నగర్లోని కాళికా

పీఠమును స్థాపింపజేశారు. గుడిని ప్రారంభించి దానికి శంకరాచార్య

మఠమని పేరు పెట్టారు.


శరీరములోని ఆత్మను పరిశోధించువారు నివసించు దానిని

“మఠము” అంటారు. దానినే మరొక విధముగా “ఘట శోధకులు

మఠములో ఉంటారు” అని కొందరు పెద్దలు అనడము జరిగినది. దీనినిబట్టి

“ఆత్మ శోధకులు నివశించునది ‘మఠము” అను పేరు గలదు. అయితే


పూర్తి మఠమునకు విరుద్ధముగా వారు స్థాపించిన మఠములో కాళికాదేవతను

ప్రతిష్ఠించి, అది కాళికా పీఠము అనడము జరిగినది. అప్పటికే బుద్ధుని

బోధనలు దేశమంతా వ్యాపించియుండడము వలన, బుద్ధుని బోధలలో

వేదముల ప్రసక్తే లేనిదానివలన, అంతేకాక బుద్ధులు ఎవరూ యజ్ఞ

యాగములు చేయక కేవలము ధ్యానమునకే ప్రాధాన్యత ఇవ్వడము వలన,

వేదములకు, యజ్ఞములకు బుద్ధులు వ్యతిరేఖముగా ఉండుట వలన అది

ఆర్యులకు మ్రింగుడుపడని విషయమైనది. ద్వాపరయుగము చివరిలో

భగవంతుడు చెప్పిన భగవద్గీతలో వేదములను, యజ్ఞములను దేవుని

మార్గములో పనికిరాని క్రియలని గీతలో చెప్పడము ఆర్యులకు ఏమాత్రము

సరిపోలేదు. భగవద్గీతలో చెప్పిన జ్ఞానము ప్రకారము బౌద్ధులు నడుచుట

వలన బౌద్ధులను అణచివేస్తే వారి వెనుకయున్న భగవద్గీతలోని జ్ఞానము

అణిగిపోతుందని తలచిన ఆర్యులు భారతదేశములో యజ్ఞములను గురించి,

వేదములను గురించి ఎక్కువగా ప్రచారము చేయాలనుకొన్నారు.


ద్వాపరయుగములో భగవంతుడు ధర్మపరిరక్షణకై వచ్చి భగవద్గీతను

బోధించాడు. భగవద్గీతా జ్ఞానము అప్పుడు కృష్ణుడు చెప్పినా అది సృష్ట్యాదిలో

దేవుడు చెప్పిన బోధయని భగవద్గీతలోనే తెలిసిపోయినది. ద్వాపరయుగము

కంటే ముందు త్రేతాయుగమున రావణబ్రహ్మ లంకా రాజ్యమునకు రాజుగా

యున్నప్పుడు, అతను బ్రహ్మజ్ఞాని అయినందున ఆయనకూడా సృష్ట్యాదిలోని

జ్ఞానము ప్రకారము వేదపఠనమును, యజ్ఞములను వ్యతిరేఖించుచుండెను.

అప్పటికే ఆర్యులు యజ్ఞములను భారతదేశములో ప్రవేశింపజేసి కొందరిచేత

ఆచరింపజేయగా, రావణబ్రహ్మ యజ్ఞములను అణచి వేశాడు. యజ్ఞము

లను చేయువారిని శిక్షించడము కూడా చేశాడు. ఎక్కడయినా దొంగచాటుగా

జరుగు యజ్ఞములను తన మనుషులచేత ధ్వంసము చేయించాడు.


“ధర్మస్థాపన” అను పేరుతో భగవద్గీతను చెప్పినప్పుడు అదే విషయమునే

చెప్పుచూ యజ్ఞముల వలన, వేదాధ్యయనముల వలన దేవుడు తెలియబడడు

అని విశ్వరూప సందర్శనయోగములో 48వ శ్లోకమున మరియు 53వ

శ్లోకమున చెప్పియుండడము ఆర్యులకు మ్రింగుడు పడని విషయమై

పోయినది. భగవద్గీతలోని జ్ఞానమును రూపు మాపుటకు వేదములను

యజ్ఞములను ప్రజలలో ప్రవేశపెట్టుటకు అనేక ప్రయత్నములు చేసి వాటి

వలన ఆశించిన ఫలితము లేదని గ్రహించి చివరకు 'అద్వైత సిద్ధాంతము'

అను ప్రచారముతో ఒక స్వామీజీ చేతనే యజ్ఞములను, వేదములను

ప్రవేశపెట్టాలనుకొన్నారు. దానికొరకే శంకరాచార్యులను అద్వైత సిద్ధాంత

కర్తగా సృష్టించారు. ఆర్యులు ఎక్కడా కనిపించకుండా ద్రావిడుడయిన

శంకరుని చేతనే వేదములను యజ్ఞములను ప్రచారము చేయించారు.

అద్వైతమును అడ్డము పెట్టుకొని తమ పబ్బము గడుపు కోవాలనుకొన్నారు.

అలాగే చేస్తూ వచ్చారు.


491 B.C లో దేశమునకు పడమర వైపుగల గుజరాత్లోని ద్వారకా

జామ్నగర్లో కాళికా పీఠమును స్థాపించి ఆ పీఠము సామవేదమునకు

గుర్తుగా ఉన్నదని చెప్పారు. ఈ విధముగా వేదముల వ్యతిరేఖత ప్రజలలో

లేకుండా పోవాలను ఉద్దేశ్యముతోనే ఆ విధముగా ద్వారకాలోని కాళికా

పీఠము సామవేదమునకు గుర్తని చెప్పడము జరిగినది. హిందూమతములో

పెద్ద సిద్ధాంతకర్త, సన్యాసి వేషధారిణి అంతవరకు ఎవరూ స్థాపించని

అద్వైత పీఠమును స్థాపించి సామవేదమునకు గుర్తని చెప్పడము వలన

హిందువులలోయున్న వేద వ్యతిరేఖత లేకుండా పోవునని ఆర్యులు శంకరా

చార్యుల చేత చేయించడము జరిగినది. అప్పటికి కేవలము 18

సంవత్సరములే యున్న శంకరునికి అద్వైతమును ఆర్యులే బోధించి, అతని


చేత చెప్పించారు. దీనినిబట్టి బాల్యములోనే యున్న శంకరున్ని ప్రజలందరికీ

కనపడు బొమ్మను చేసి, వారి ఇష్టమొచ్చినట్లు ఆడించారని తెలిసినది.

ఆర్యుల దురుద్దేశ్యముతో చిన్నవయస్సులోని శంకరుడు తల్లితండ్రులను

వదలివచ్చి, ఒంటరివాడై ఆర్యుల వలన ఎంతో బాధపడ్డాడు. అయినా ఆ

విషయమును ప్రజలు ఎవరూ గ్రహించలేదు. శంకరుడు బయటికి

చెప్పుకోనూలేదు.


గుజరాత్నండి బయలుదేరి రెండవ పీఠమును ఉత్తరదేశమున

స్థాపించాలనుకొన్నారు. దానికొరకు ముందే అన్ని సన్నాహములు చేసిన

ఆర్యులు ఆ కాలములో దారి ఏమాత్రము లేని అతని మార్గము, పర్వత

మార్గములలో శంకరున్ని ఉత్తరాఖండ్ యున్న కేదార్నాథ్, బద్రినాథ్ వరకు

తీసుకపోవడము జరిగినది. 2013వ సంవత్సరము వర్షాకాలములో కేదార్

నాథ్, బద్రినాథ్క పోయిన భక్తులందరూ వేల సంఖ్యలో చనిపోయిన

విషయము అందరికీ తెలుసు. ఎంతో పెద్ద వరదలు వచ్చి అక్కడున్న

ఊర్లతో సహా కొట్టుకపోయిన విషయము చాలామందికి తెలుసు. ఈ

కాలములో కూడా కొండప్రాంతములలో కాలినడకన పోవుటకు సరియైన

దారి కూడా లేదు. ఆ కాలములో మరీ కష్టముగా ఉండవచ్చును. అయినా

అక్కడికి చాలా కష్టపడి చేరుకోవడము జరిగినది. మొదటి పీఠమును

గుజరాత్లో స్థాపించిన తర్వాత ఐదు (5) సంవత్సరములకు రెండవ

పీఠమును బద్రినాథ్ స్థాపించడము జరిగినది. దీనినిబట్టి చూస్తే పూర్తి

ఉత్తర దేశమయిన ఆ ప్రాంతమును చేరుకొనుటకు చాలా కష్టపడవలసి

వచ్చినదని తెలియుచున్నది. అంతేకాక అప్పుడది నిర్మానుష స్థలముగా

యుండుట వలన అక్కడ మఠమును నిర్మించుటకు బయట ప్రాంతమునుండి

మనుషులను తీసుక పోవలసియుండుట వలన అక్కడ మఠమును తయారు


చేయుటకు చాలా ఆలస్యమయినది. ఐదు సంవత్సరముల తర్వాత అనగా

486 B.C కాలములో ఆదిశంకరాచార్యుల చేత రెండవ పీఠమయిన

జ్యోతిర్లింగ పీఠమును అధర్వణ వేదమునకు గుర్తుగా స్థాపించడము

జరిగినది. అక్కడ మఠములో లింగప్రతిష్ఠ చేసి శంకరునిచే ప్రారంభించి

నందువలన దానిని రెండవ పీఠముగా శంకరుడు స్థాపించినట్లయినది.

ఉత్తరాఖండ్లో స్థాపించిన రెండవ జ్యోతిర్లింగ పీఠము అధర్వణ

వేదమునకు గుర్తుగా పేరు పెట్టబడినది. ఈ విధముగా భారత దేశమునకు

పడమర సామవేదము, ఉత్తరమున అధర్వణ వేదము యొక్క గుర్తుగా

రెండు పీఠములను శంకరుల చేత ఆర్యులు స్థాపింపచేశారు. అక్కడినుండి

దేశమునకు తూర్పువైపునగల ఒరిస్సా రాష్ట్రమందు పూరి జగన్నాథ్

పట్టణములో గోవర్ధన పీఠమును స్థాపించుటకు బయలుదేరి శ్రమపడి

సంవత్సర కాలములోనే అక్కడకు చేరిపోయి 485 B.C సంవత్సరములో

పూరి జగన్నాథ్ పట్టణమున గోవర్ధన పీఠమును స్థాపించడము జరిగినది.

గోవర్ధన పీఠము ఋగ్వేదమునకు గుర్తుగా చెప్పడము జరిగినది. ఉత్తరా

ఖండ్నుంచి శంకరుడు ఒరిస్సాలోని జగన్నాథపురమును చేరుకోకముందే

ఆర్యులు గోవర్ధన పీఠమునకు తగిన ఆలయమును నిర్మించిపెట్టారు. ఆ

పనిని చేయుటకు ఆర్యులకు కనీసము మూడు సంవత్సరములైనా పట్టి

యుండవచ్చును. అట్లు శంకరుని రాకకంటే ముందే తయారయిన గోవర్ధన

పీఠము ఋగ్వేదమునకు ప్రతీకగా నిలిచినది. భారతదేశమునకు తూర్పు

వైపున గోవర్ధన పీఠము తయారుకాగా, అక్కడినుండి కాలినడకన కన్నడ

రాష్ట్రములోని శృంగేరి పట్టణమునకు చేరుకొనుటకు ఒక సంవత్సర కాలము

పట్టినది. అక్కడ కూడా శంకరాచార్యులు రాకముందే తయారు చేయబడిన

శారదా పీఠమునకు సంబంధించిన కట్టడములను ఆర్యులు ముందే తయారు


చేసిపెట్టారు. సరస్వతి దేవిని ప్రతిష్ఠించి దానిని శారదా పీఠముగా పేరు

పెట్టారు.


భారతదేశమునకు పూర్తి దక్షిణమునగల శృంగేరి పట్టణమునకు

శంకరాచార్యుల వారు చేరుకొని అక్కడ నాల్గవ పీఠమయిన శారదా

పీఠమును స్థాపించడము జరిగినది. శారదాపీఠము యజుర్వేదమునకు

గుర్తుగా చెప్పబడినది. ఈ విధముగా నాలుగు పీఠములను నాలుగు

దిశలలో, నాలుగు పేర్లతో, నాలుగు వేదములకు గుర్తుగా స్థాపించబడినవి.

నాల్గవ పీఠమయిన శారదా పీఠమును 484 B.C లో స్థాపించడము

జరిగినది.


1)పడమర దిశలో 'సామవేద' గుర్తుగా కాళికా పీఠమును గుజరాత్లోని

ద్వారకా జామ్నగర్, 491 B.C లో శంకరునికి 18 సంవత్సరముల

వయస్సులో మఖ శుక్ల సప్తమి రోజున స్థాపించడము జరిగినది.

2)దేశమునకు ఉత్తరమున 'అధర్వణ' వేదమునకు గుర్తుగా,

ఉత్తరాఖండ్ రాష్ట్రములో బద్రినాథ్ జ్యోతిర్లింగ పీఠమును

486 B.C పుష్యశుద్ధ పౌర్ణమి రోజు శంకరుని 23 సంవత్సరముల

వయస్సులో స్థాపించడము జరిగినది.

3) దేశమునకు తూర్పుదిశన 'ఋగ్వేదము'నకు గుర్తుగా, ఒరిస్సా

రాష్ట్రములోని పూరి జగన్నాథ్ పురములో 485 B.C లో వైశాఖ

శుక్ల నవమి రోజున శంకరునికి 24 సంవత్సరముల వయస్సులో

గోవర్ధన పీఠమును స్థాపించడము జరిగినది.

4)దేశమునకు దక్షిణమున 'యజుర్వేదమునకు గుర్తుగా, కర్నాటక

రాష్ట్రములోని శృంగేరి పట్టణమున శారదా పీఠమును 484 B.C లో



పుష్య పౌర్ణమి రోజు శంకరునికి 25 సంవత్సరముల వయస్సులో

స్థాపించడము జరిగినది.


ఈ విధముగా 25 సంవత్సరముల వయస్సులోనే శంకరుడు

నాలుగు దిక్కుల నాలుగు పీఠములను స్థాపించాడు అని చెప్పవచ్చును,

లేక స్థాపింపజేయబడ్డాడు అనికూడా చెప్పవచ్చును. ఆర్యుల చేతిలో కీలు

బొమ్మవలె శంకరుడు నడువవలసి వచ్చినది. 16 సంవత్సరముల వయస్సు

నుండి ఏకధాటిగా తొమ్మిది (9) సంవత్సరములు అనగా 25 సంవత్సరముల

వయస్సు వరకు కాలి నడకన నాలుగు దిశల భారతదేశములో తిరుగవలసి

వచ్చినది. పేరుకు శంకరాచార్యుని పర్యటన అని చెప్పినా అతని వెంట

ఆర్యులు దాదాపు వందనుండి వందయాభై వరకు ఉండేవారు. శంకరా

చార్యుడు పండితులతో వాదోపవాదములు చేయుచూ వారిని ఓడించి

ముందుకు పోయెడివాడని ప్రచారము చేశారు. అలా చేసియుంటే భారత

దేశము నలుమూలలు తిరిగే దానికి తొమ్మిది సంవత్సరములు కాదు తొంభై

(90) సంవత్సరములు పట్టేది. అప్పుడు ఊరూరికీ అంతో ఇంతో భగవద్గీత

జ్ఞానము తెలిసిన వారుండేవారు. అలా ప్రతి ఊరులోనూ వాదోపవాదములు

చేయుటకు చాలాకాలము పట్టును. ఒకరితో వాదోపవాదములు చేయుటకు

ఒక రోజుతో ఎటూ సరిపోదు. కనీసము ఒకరితో పరిచయము, వారి

వాదనకు పూనుకోవడము, వాదనలోని నిబంధనలు చెప్పుకోవడము

ఇవన్నియూ ఒకరోజుకాగా, వాదోపవాదములకు రెండు నుండి ఐదు రోజుల

వరకు పట్టును. తర్వాత వారు ఊరు వదలిపోవుటకు, రెండవ ఊరిలో

ఉండుటకు కావలసిన జాగా చూచుకొనుటకు కనీసము ఒకరోజు కాలము

పట్టును. మార్గమధ్యములో ఊరికి ఊరికి మధ్యలో కాలము ఒకరోజయినా

పట్టవచ్చును. ఈ విధముగా లెక్కించి చూస్తే వారు వాదోపవాదములు


ఎక్కువగా చేయలేదని పీఠమునకు పీఠమునకు మధ్య ఒకటి రెండు వాదనలు

తప్ప ఎక్కువ ఉండవని అనుకొంటున్నాము. జరిగిన ప్రతివాదనలోనూ

శంకరుడే గెలిచాడని చెప్పలేము. ఈ విధముగా ఉన్నవి లేనివి ఆర్యులు

శంకరున్ని అడ్డము పెట్టుకొని చెప్పుతూ పోయారు.


ఒకచోట ఒక హరిజనునికి శంకరునికి వాదము జరిగితే అందులో

శంకరుడు ఓడిపోయినట్లు ఒప్పుకొన్నాడు. శంకరుడు ఓడిపోయిన

విషయము అందరికీ తెలిసిపోయినా జరిగిన చర్చ “శరీరము, శరీరములో

నివసించే జీవాత్మ"ను గురించి, అద్వైతమను పేరుపెట్టుకొన్నా జీవాత్మ

విషయము శంకరునికి పూర్తి తెలియదు. ఆర్యులకు కూడా వారి

అద్వైతమును గురించి వారు చెప్పగలరుగానీ, జీవుని విషయము వారికి

కూడా తెలియదు. ఒక దారిలో పోతూ అంటరానివాడవని హరిజనున్ని

అన్నప్పుడు అక్కడ ఇరువురికి మధ్య అంటరానిది 'శరీరమా లేక జీవాత్మనా’

అని చర్చ వచ్చినప్పుడు శంకరునికి జీవాత్మ విషయమే తెలియని దానివలన

అక్కడ ఆ చర్చలో హరిజనుని చేతిలో ఓడిపోవలసి వచ్చినది. అయితే ఆ

ఓటమిని ఒప్పుకొనినా హరిజనుడు మనిషికాడని సాక్ష్యాత్తూ పరమేశ్వరుడే

హరిజనుని రూపములో వచ్చాడని, ఈశ్వరుని చేతిలో ఓడిపోయాముగానీ

మనిషి చేతిలో ఓడిపోలేదని చాటుకొన్నారు. అంతేకాక ఎక్కడయినా

ఓడిపోయిన విషయములను బయటికి చెప్పుకోలేదు. వారి దేశ పర్యటన

మొత్తము మీద పది లేక పదిహేను వాదనలు తప్ప ఎక్కువ జరిగియుండవని

మేము అనుకొంటున్నాము. మేము చెప్పునదంతా క్రొత్తగా కనిపించినా

మేము చెప్పు మాటలలో సత్యమే ఉందని మేము చెప్పుచున్నాము.

అంతెందుకు మీరే స్వయముగా ఆలోచించండి. మీకే కొన్ని విషయములలో

మేము చెప్పునదే సత్యమని తెలియగలదు. అయినా ఆర్యులు తెలివైన


వారు కావున శంకరున్ని బొమ్మలాగా ఆడించడమేకాక, వారు చెప్పు

మాటలను అందరూ నమ్మునట్లు చేశారు.


ప్రశ్న :- ఆర్యులే కాదు శంకరుడు కూడా ధీశాలియే, మేథావియే అని

మీరే చెప్పారు. అటువంటప్పుడు శంకరుడు వారి కుట్రను గ్రహించలేక

పోయాడా? తనకు మంచి చేయుచున్నారా, చెడు చేయుచున్నారా అని

తెలియలేకపోయాడా?


జవాబు :- అనుకూల శత్రువులను అంత తొందరగా ఎవరూ గ్రహించలేరు.

ఎంతపెద్ద మేథావి అయినా త్వరగా గుర్తింపలేడుగానీ, మొదట కొంత

అనుమానము వచ్చును. తర్వాత ఆ అనుమానమునకు తగినట్లు

సాక్ష్యాధారములు దొరుకుకొద్దీ అనుమానము బలమై చివరికి సత్యము

తెలిసిపోవును. అలాగే శంకరాచార్యుల వారికి కూడా ఆర్యులమీద మొదట

అనుమానము మొదలై కాలము గడుచుకొలది అనుమానమునకు సరియైన

జవాబు దొరికినది. అప్పుడు ఆర్యులు తెలివిగా చేయు మోసపూరిత

కార్యము శంకరాచార్యులు గ్రహించగలిగారు.


ప్రశ్న :- శంకరునికి మొదట ఆర్యుల మీద ఎట్లు అనుమానము కల్గినది?

తర్వాత వారి మోసమును ఎలా గుర్తించగలిగాడు?


జవాబు :- నాకు తెలిసినది నేను చెప్పగలనుగానీ, ఇప్పుడు చెప్పబోయే

విషయము చరిత్రలో ఎవరికీ తెలియని విషయము. శంకరాచార్యుల

వారి చరిత్ర చదివిన వారికి ఆర్యులు అందులో ఏమాత్రము కనిపించరు.

ఆర్యుల మాటే వినిపించదు. అందువలన మేము ఇప్పుడు చెప్పినా ఆర్యుల

విషయము నమ్మశక్యము కాకుండా ఉండును. అయినా మీ బుద్ధికి కొంత

పదును పెట్టగలిగితే మేము చెప్పు మాటలలోని సత్యము తెలియగలదు.


శంకరాచార్యులవారు చిన్నతనమునుండి మేథావియే. అయితే ఆ మేథాశక్తి

అతను నేర్చు విద్యలలో పనిచేసింది. చిన్నతనములోనే అనగా పదిహేను

సంవత్సరములకే ఆర్యుల మాటననుసరించి నాల్గు వేదములను నేర్వగలి

గాడు. నాల్గువేదములను కంఠాపాటముగా చెప్పెడివాడు. తనను

విద్యావంతుని చేసినందుకు బంధువులవలెయున్న ఆర్యులకు తాను ఋణపడి

యున్నానని మొదట అనుకొనెడివాడు. తన కులస్థులేనని వారిని నమ్మినాడు.

శంకరుడు వయస్సులో చాలా చిన్నవాడు అయినందున తనకు అండగా

యుండి గొప్ప హోదాను కల్పించుతూ సిద్ధాంతకర్తగా అద్వైత సిద్ధాంతమునకు

అధికర్తగా, అద్వైత పీఠమునకు అధిపతిగా చేసి ప్రజలలో గొప్ప వ్యక్తిగా

ప్రచారము చేయడము వలన అటువంటి వారిని ఎవరయినా మంచివారిగా,

తన శ్రేయోభిలాషులుగా తప్పక నమ్మగలరు. శంకరాచార్యులు కూడా

తనకు అన్ని విధములా మేలు చేయు ఆర్యులను పూర్తిగా నమ్మినాడు.

వారి స్వార్థముకొరకు తనకు మంచి చేయుచున్నారని మొదట గ్రహించ

లేకపోయాడు.


అయితే తనను వేదములను చదువమని చెప్పి, భగవద్గీత వైపు

పోకుండా చేసి, దానిని మనము చదువకూడదని, భగవద్గీత వేదములకు

యజ్ఞములకు శత్రువులాంటిదని చెప్పడము వలన ఎందుకు అలా

చెప్పుచున్నారను అనుమానము శంకరునిలో మొదలయినది. ధర్మసంస్థాపన

కొరకు వచ్చిన భగవంతుడు చెప్పినది భగవద్గీతయని అందరూ

అనుచుండగా, దానిలో ఏముందో తెలియకుండా చేసి, కనీసము ఒక్కమారు

కూడా దానిని (భగవద్గీతను) చూడనట్లు జాగ్రత్త పడడముతో చిన్నమొక్కగా

సంశయము మొదలయినది. శంకరుడు పుట్టుకతోనే ద్రావిడ బ్రాహ్మణుడు

అయినా, అతనిని ఆర్యులు ద్రావిడ బ్రాహ్మణునివి కాదనీ ఆర్య బ్రాహ్మణుడ


వనీ చెప్పడములో కొన్ని విషయములలో మాత్రము ఎందుకు అలా

చేయుచున్నారో తెలియకపోయినా అతనిలో ఆర్యుల మీద కల్గిన

అనుమానము కొన్ని ఆర్యుల కార్యముల వలన బలమవుతూ వచ్చినది.


శంకరాచార్యుల వారిని ఎంతో మంచిగా చూచుకొను ఆర్యులు,

శంకరున్ని గురించి గొప్పగా చెప్పు ఆర్యులు, దేశము నలుమూలలా

శంకరున్ని పాదయాత్ర చేయించడము వలన శంకరుడు కొంత ఋగ్మతకు

గురి కావలసి వచ్చినది. చిన్నపిల్లవాడని తలువక, కాలినడక అలవాటు

లేని వాడని తలువక కాళ్ళ నొప్పుల వలన బాధపడుచున్నా లెక్కచేయక

ప్రతి దినము శంకరున్ని ప్రతి ఊరిలోనూ ఊరు ఎరిగింపుగా (ఊరేగింపుగా)

ప్రజలకు చూపుతూ త్రిప్పడము వలన, అలా చేయడములో ఆర్యులకు

ఏదో లాభమున్నదని శంకరుడు అనుకోవలసి వచ్చినది. దానికి తోడుగా

అతివేగముగా దేశము నలుమూలలా నాలుగు అద్వైత పీఠములను

స్థాపించడమూ, వాటికి నాలుగు వేదములు గుర్తుగా పెట్టడము వలన

తనకు పూర్తి తెలియని పనిని మ్రొక్కుబడిగా ఆర్యులు చెప్పినట్లు చేయవలసి

వచ్చినది. దానితో అతనిలో ఆర్యులమీద అనుమానము మొదలయి అది

చివరికి పెద్దగా మారిపోయినది. ఏమాత్రము ఎక్కడా ఆలస్యము లేకుండా

యుద్ధప్రాతిపదికముగా నాలుగు పీఠములను నెలకొల్పడములో తన

అనుమానము పెనుభూతమయినది. ఏ విధముగా ఆలోచించినా అంత

తొందరగా చేయవలసిన అవసరము ఏమాత్రము లేదు. శంకరుడు

తెలివైనవాడనీ తమ ఉద్దేశ్యమును ఎక్కడ ఎప్పుడు తెలుసుకొంటాడో అను

అనుమానము ఆర్యులలో ఉండుట వలన శంకరుడు మారిపోకముందే,

శంకరుడు తమచేతినుండి జారిపోకముందే తమ కార్యములను శంకరునితో

చేయిస్తే తర్వాత కాలములో ద్రావిడుల వలన ఎటువంటి బెడద ఉండదను

కొన్నారు.


ఆర్యుల తలలో ఆ ఉద్దేశ్యము ఉండుట వలన శంకరుని చేత

సాధ్యమైనంత తొందరగా ఆ కార్యములను చేయించారు.

సంవత్సరముల వయస్సునుండి దేశమంతా తొమ్మిది సంవత్సరముల పాటు

త్రిప్పి 25 సంవత్సరముల వయస్సు వచ్చులోపల నాలుగు పీఠములను

స్థాపింపజేశారు. తన 25 సంవత్సరముల వయస్సులో దేశమంతా తిరిగి

చూచిన శంకరునకు కొంత ప్రపంచ అనుభవము, కొంత స్వయం తెలివి

కలిపి చూచుకొని ఎవరికీ తెలియనట్లు తన జాగ్రత్తలో తానుండవలెనని

అనుకొన్నాడు. శంకరున్ని ఒంటరిగా వదలి ఆర్యులుండెడివారు కాదు.

శంకరునితో ఆర్యుల అనుమతి లేనిది ఎవరినీ కలువనిచ్చేవారు కాదు.

అదంతా శంకరుని గౌరవార్ధము ఆర్యులు అలా చేయుచున్నారని అందరూ

అనుకొనెడివారు. అయితే శంకరునికి ఎవరయినా ఆర్యుల ఉద్దేశ్యమును

వివరిస్తారేమోనను భయముతో అతని వద్దకు తమ అనుమతి లేనిది ఎవరినీ

పోనిచ్చేవారు కాదు.


ప్రశ్న :- ఇంతవరకు ఈ విషయము ఎవరి ఊహకు రాలేదు. ఇప్పుడు

ఆలోచించి చూస్తే అప్పుడు జరిగిన దానికి మీరు చెప్పేదానికి చాలా దగ్గర

సంబంధమున్నట్లు కనిపించుచున్నది. మీ మాట ప్రకారము ఆర్యులు

ఎంతో తెలివిగా ప్రవర్తించుచున్నా శంకరునికి కొంత అనుమానము

వచ్చిందని చెప్పావు. ఆర్యులమీద అనుమానము వచ్చి అది కొంత కొంత

ధృవీకరణకు వచ్చిన తర్వాత శంకరుడు ఆర్యులనుండి ఎందుకు విడిపోలేదు?

ఆయన చనిపోవు వరకు ఆర్యులతోనే ఎందుకు కలిసియున్నాడు?


జవాబు :- ఎవరు ఎంత తెలివైనవారయినా విధి చేతిలో అందరూ కీలు

బొమ్మలే! ముందే నిర్ణయింపబడిన కర్మప్రకారమే పైన కనిపించు

వ్యవహారములన్నియూ జరుగుచుండును. ఆర్యుల విషయములోనూ,


శంకరుని విషయములోనూ అదే జరిగినది. ప్రతి మనిషి శరీరములోనున్న

కనిపించని కర్మ ప్రతి మనిషిని ప్రేరేపించి ఆడించుచున్నట్లు తత్త్వ

వేత్తలయిన వారు చెప్పుచుందురు. లోపలయున్న కర్మ జరిగే పనులలో

తెలియబడుచుండును. అదే విధముగా శంకరుని విషయములో కూడా

ఏమి జరుగవలెనో అదే జరిగినది. మీరు అడిగిన ప్రశ్నకు జవాబును ఈ

విధముగా చెప్పవచ్చును.


శంకరుడు భారతదేశములోని నలుమూలలు తిరిగి వచ్చిన తర్వాత

తన స్వగ్రామమునకు వచ్చి ఒక నెలరోజులు తన ఇంటిలోనే విశ్రాంతి

తీసుకొన్నాడు. శంకరుడు తన స్వగ్రామములో యుండుట వలన, విశ్రాంతి

తీసుకొనుటకు కాలమును వినియోగించుట వలన, ఆర్యులు శంకరున్ని

స్వతంత్రముగా వదలి తమ తమ పనులలో లగ్నమైయుంటూ వారు

కూడా విశ్రాంతి తీసుకొనెడివారు. శంకరుని స్వగ్రామమైన 'కాలడి'

గ్రామము చాలా చిన్న గ్రామము. అక్కడ ఆర్యులు శంకరునితోయుండుటకు

అనుకూలము లేదు. వారికి తగిన వసతులు లేవు. శంకరుడు చిన్న

పూరిపాకలో నివశించెడివాడు. అందువలన ఒక నెలరోజులు శంకరున్ని

వదలి వేరు ప్రాంతములో ఉండెడివారు. అప్పుడప్పుడు వచ్చి శంకరున్ని

పలుకరించెడివారు. అలాయున్న నెల రోజుల కాలములో శంకరుడు

భారతములోని భగవద్గీతను ఆర్యులకు తెలియకుండా చదువగల్గినాడు.

శంకరుడు తన 26వ సంవత్సరములో భగవద్గీతను చదివి అందులోని

జ్ఞానమును అంతా కాకున్నా కొంతవరకు తెలుసుకొన్నాడు. శంకరునికి

తెలిసిన అద్వైతమే ఆయనకు కనిపించినది. భగవద్గీతలో యున్న పూర్తి

జ్ఞానము తెలియకపోయినా కొంతవరకైనా అర్థమయినది. భగవద్గీతలోని

జ్ఞానము ఎవరికయినా ఒక్కమారే అర్థము కావాలంటే చాలా కష్టము.


అందువలన శంకరునికి పూర్తి అర్థము కాకపోయినా, భగవద్గీతలో

యున్న అద్వైతము, ద్వైతము, త్రైతములో అద్వైతము మాత్రము

అర్థమయినది. మిగతా రెండు తత్త్వములు అర్థము కాలేదు. అయితే

భగవద్గీతలో భగవంతుడు వేదములను గురించి చెప్పిన విషయము మాత్రము

బాగా అర్థమయినది. “త్రైగుణ్యా విషయా వేదా” అనుమాట శంకరునిలో

అలజడిని లేపింది. ధర్మరక్షణ నిమిత్తమై వచ్చిన భగవంతుని మాటలలో

ఆ మాట యుండడము శంకరునికి ఆశ్చర్యమును కల్గించినది. భగవద్గీత

ప్రారంభములో సాంఖ్యయోగమను అధ్యాయమున గల 45వ శ్లోకములోని

ఆ మాట శంకరుని మనోఫలకములో శాశ్వితముగా నిలిచిపోయినది. దానికి

తోడు విశ్వరూప సందర్శనయోగము అను అధ్యాయములో 48, 53

శ్లోకములు కూడా బాగా అర్థమయినాయి. అక్కడగల రెండు శ్లోకములలో

"వేదముల వలన దేవుడు తెలియబడడు” అను విషయము పూర్తిగా

తెలిసి పోయినది. అంతేకాక దానికంటే ముందుగల అక్షర పరబ్రహ్మ

యోగము అను అధ్యాయములో 28వ శ్లోకమందు వేదముల వలన,

యజ్ఞముల వలన పుణ్యఫలము వచ్చునని తెలిసిపోయినది. అదే భగవద్గీతలో

పుణ్యము వలన సుఖములు కల్గుననీ, మోక్షము కలుగదనీ చెప్పబడి

యుండుట వలన శంకరుడు గ్రహించగలిగాడు.


ఈ విధముగా శంకరుడు భగవద్గీతను చదివిన తర్వాత

భగవద్గీతలో భగవంతుడు చెప్పిన దానినిబట్టి తాను అంతవరకు వేదములు

గొప్పవనీ, అవియే ఆధ్యాత్మిక విద్యకు ప్రమాణమని చెప్పిన మాటలు పూర్తి

అసత్యమనీ శంకరునికి తెలిసిపోయినది. నాలుగు వేదములను, అష్టాదశ

పురాణములను, వందల సంఖ్యలో ఉపనిషత్లను వ్రాసిన వ్యాసుడు తన

రచనలలో వేదములను గొప్పగా చెప్పి చతుర్వేద రచన గావించి 'వేద


వ్యాసుడని' పేరుగాంచిన వ్యాసుడు చివరిలో అర్జునుని ద్వారా కృష్ణుడు

చెప్పిన భగవద్గీతను తెలియగలిగి, ఆత్మజ్ఞానమేమిటో గ్రహించగలిగినవాడై,

తాను వ్రాసిన వేదములకు ఆత్మజ్ఞానమునకు ఏమాత్రము సంబంధము

లేదని తెలిసినవాడై, తాను వేదములను రచించి ప్రజలను తప్పుదారి

పట్టించినందుకు బాధపడినవాడై తన జీవితములో చివరిగా మంచి పనిని

చేయదలచి, ఆ మంచిపనే 'భగవద్గీతను వ్రాయడము' అని అనుకున్నాడు.

భగవద్గీత అంతవరకు మాటల రూపములోయున్న దానిని అక్షర రూపము

లోనికి మార్చి భగవద్గీత గ్రంథమును వ్రాయగలిగాడు. వేదములను వ్రాసి

అసంతృప్తి పొందిన వ్యాసుడు చివరిలో భగవద్గీతను వ్రాసి తన జీవితము

ధన్యమయినదని అనుకొన్నాడు.


కృష్ణుడు భగవంతునిగా భూమిమీద ధర్మసంస్థాపన కొరకు భగవద్గీత

రూపములో చెప్పిన జ్ఞానము సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి

తెలిసిన జ్ఞానమని శంకరుడు తెలియగలిగాడు. అదే జ్ఞానమునే కృష్ణుడు

అర్జునునికి చెప్పగా దానిని వ్యాసుడు విని ఇంతకంటే మంచి అవకాశము

తన జీవితములో రాదని తెలిసి, ఆనాడు గ్రంథములు వ్రాయగల స్థోమత

వ్యాసునికి ఉండుట చేత భగవద్గీతను గ్రంథరూపములో వ్రాయడము

మహా ప్రసాదముగా భావించి, ఎంతో ఉత్సాహముతో వ్యాసుడు భగవద్గీతను

వ్రాశాడు. తనకు భగవంతుడు ధర్మముల రూపములో చెప్పిన ఆత్మల

జ్ఞానము తెలియక, గుణమయమయిన వేదములను వ్రాసి తప్పు

చేసినందుకు ఎంతో పశ్చాత్తాపము చెందిన వ్యాసుడు భగవద్గీతను వ్రాసి

తన జీవితము ధన్యమయినదని అనుకొన్నాడు. వ్యాసుడు తన జీవితములో

భగవద్గీతను వ్రాసి తృప్తిపొందినట్లు శంకరుడు గ్రహించాడు. ద్వాపర

యుగములో యున్న వ్యాసుడు వేదములను గురించి 'గుణమయి' అని


తన శ్లోకములో చెప్పడము శంకరుని కళ్ళు తెరిపించినట్లయినది.

అంతవరకు నాల్గు వేదములను గురించి చెప్పిన తనమాటలే తనకు తప్పుగా

కనిపించినవి. అంతవరకు గుణ విషయముల సంబంధ జ్ఞానమున్న

వేదముల మీదయున్న శ్రద్ధ విరక్తిగా మారిపోయినది. అప్పటినుండి ఆత్మల

విషయ జ్ఞానమున్న బ్రహ్మవిద్యాశాస్త్రమయిన భగవద్గీత మీద శ్రద్ధ పుట్టి

అది ఆసక్తిగా మారిపోయినది. వేదముల మీద విరక్తి భగవద్గీత మీద

ఆసక్తి కల్గిన వెంటనే తనతో వేదములను ప్రచారము చేయించిన ఆర్యుల

మీద శంకరునికి కోపము మొదలయినది.


ఆర్యుల అంతరంగములోని ఉద్దేశ్యము శంకరునికి కొద్దికొద్దిగా

అవగాహనకు వచ్చినది. ఆర్యులు ఏదయితే శంకరునికి తెలియకూడదను

కొన్నారో అది శంకరునికి పూర్తిగా తెలిసిపోయినది. తాను ద్రావిడ

బ్రాహ్మణుడయినందున తన చేత వేదములను, యజ్ఞములను ప్రచారము

చేయించి ద్రావిడులనందరినీ సులభముగా తమవైపు లాగుకొనుటకు చేసిన

ప్రయత్నమే తనను గొప్పగా ఆర్యులు ప్రచారము చేసి, అద్వైత సిద్ధాంత

కర్తగా చూపించారని అర్థమయినది. అప్పటినుండి ఆర్యులకు తనలోని

మార్పు కనిపించక మసలుకొని, వారు చెప్పిన మాటను విన్నట్లు

నటించాలనుకొన్నాడు. ఒక్కమారుగా కాకుండా క్రమేపీ ఆర్యులతో

సంబంధము లేకుండా దూరము కావాలనుకొన్నాడు. అంతేకాకుండా

అంతవరకు చేసిన వేద ప్రచారమును కొద్దికొద్దిగా మానుకొంటూ,

అప్పటినుండి భగవద్గీత ప్రచారమును కొద్దికొద్దిగా చేయాలనుకొన్నాడు.

అంతవరకు శంకరుడు ఆచార్యునిగా (గురువుగా) అద్వైత సిద్ధాంతకర్తగా

తయారు చేసిన దేశములోని నాలుగు మూలల పీఠములు నాల్గు వేదములకు

ప్రతీకగా చేసినవయినందున, ఆ నాలుగు పీఠములను కాకుండా వేద


రహితముగా ఆత్మజ్ఞాన సహితముగా యుండునట్లు తనకంటూ ప్రత్యేకముగా

ఒక పీఠమును నిర్మించాలనుకొన్నాడు.


ప్రశ్న :- ఆర్యులు ద్రావిడులను తమ మాట వినునట్లు, తమ ఆధీనములో

యుండునట్లు చేయడమేకాక, ద్రావిడులలో వేదసాంప్రదాయములను, యజ్ఞ

ఆచరణను కలుగజేయడానికి పన్నిన కుట్రలో భాగముగా శంకరున్ని

ఆచార్యునిగా చేసి దేశమంతా ప్రచారము చేయడమేనని శంకరునికి తెలిసిన

తర్వాత వారి సంబంధము అంతటితో తెంచుకోకుండా ఎందుకు

కొనసాగించాలి? శంకరుని అవసరము ఆర్యులకుండవచ్చునుగానీ, ఆర్యుల

అవసరము శంకరునికి లేదు కదా! శంకరుడు కూడా తెలివైనవాడే కదా!


జవాబు :- ఆర్యుల కుట్రయంతయూ శంకరునికి తెలిసిన తర్వాత వారితో

ఇంకా కొంతకాలము సంబంధపడి యుండాలనుకొనుటకు ఒకే ఒక

కారణము కలదు. “ధనమూల మిదమ్ జగత్” అన్నట్లు ప్రపంచములో

ధనము అన్నిటికీ మూలమైయున్నది. ప్రపంచములో పనులు జరుగుటకు

కనిపించని కర్మ వెనుకయున్నా, కనిపించే ధనము ప్రత్యక్షముగా మన

ముందరుండాలి. ఆర్యులకున్నది, శంకరాచార్యునికి లేనిది ధనమొక్కటే.

ఆర్యులు ధనికులు, శంకరుడు పేదవాడు. శంకరుడు తెలివైనవాడు కనుక

ఆర్యులతో సత్సంబంధము కల్గియుండి, వారిచేతనే తనకంటూ ఒక ప్రత్యేక

మఠమును (పీఠమును) తయారు చేయించుకోవాలనుకొన్నాడు. ఆ ఆలోచన

సంబంధముగా ఆర్యులతో ముందు ఎట్లున్నాడో తర్వాత కూడా అట్లే

యుండెను. ఆర్యులతో కలిసియుండి ఆర్యులు తనయెడల భక్తిగాయుంటూ

తనను గౌరవించుట వలన వారికి ఐదవ పీఠమును దక్షిణదేశమయిన

తమిళనాడులో తయారు చేయవలసినట్లు చెప్పెను. నాల్గు వేదములు

సారాంశమునకు గుర్తుగా ఐదవ పీఠమును స్థాపించునట్లు శంకరుడు


ఆర్యులకు సలహా ఇచ్చాడు. అంతేకాక నాల్గు వేదములను వేదవ్యాసుడు

వ్రాయగా ఐదవ వేదమును స్వయముగా శంకరుడే వ్రాయునట్లు ఆర్యులకు

చెప్పాడు. తాను వ్రాయబోవు ఐదవ వేదము పేరు 'ఆయుస్ వేదము' అని

కూడా చెప్పడము వలన వేదముల ప్రచారమే పరమావధిగా పెట్టుకొన్న

ఆర్యులు శంకరుని మాట విని సంతోషపడినారు. శంకరుని చేత ఐదవ

వేదమును వ్రాయించి ద్రావిడ బ్రాహ్మణులందరినీ తమవైపు లాగు

కోవాలనుకొన్నారు.


శంకరుడు చెప్పిన మాటను వినిన ఆర్యులు వెంటనే యుద్ధ

ప్రాతిపదిక మీద పనులు ప్రారంభించి రెండు సంవత్సరములలో కంచిలో

“కామకోటి పీఠము” ను తయారు చేశారు. కామకోటి పీఠము అని ఐదవ

పీఠమునకు పేరు పెట్టడములో కూడా కొంత విశేషము కలదు. కామ

అనగా ‘ఆశ” అని అర్థము కలదు. కోటి అనగా లెక్కలేనంత, చెప్పలేనంత

అని అర్థము కలదు. అట్లు కాకున్నా 'కోటి ఆశలు' అని కూడా చెప్పవచ్చును.

తెలుగులో ఒక సామెతను మీరు వినియేయుందురు. అది "కోటి విద్యలు

కూటి కొరకే” అని చెప్పుచుందురు. అటువంటిదే కోటి ఆశలు లేక కోటి

కోర్కెలు అని చెప్పవచ్చును. మనిషికి తన ప్రాణము మీద చెప్పలేనంత

ఆశ ఉండుట వలన మనిషి ఎల్లకాలము బ్రతకాలనుకొంటాడు. అన్ని

ఆశలకంటే తాను బ్రతకాలను ఆశ ప్రతి మనిషికి ఎక్కువ ఉంటుంది.

కావున "కోటి విద్యలు కూటి కొరకు” “కోటి ఆశలు ప్రాణము కొరకు”

అన్నారు. ప్రాణము ఆయుస్ ను బట్టి యుంటుంది. అందువలన అందరికీ

ఆయుస్ అవసరమన్నట్లు శంకరుడు తన పీఠమునకు ఆ పేరును పెట్టాలను

కొన్నాడు. ఇది భౌతికమయిన అర్థముకాగా, అభౌతికమైన, దైవికమయిన

అర్థము కూడా ఈ వాక్యమునకు కలదు. జనన మరణములేని ఆయుస్సును


అనగా మోక్షమును కోరుకొనుటకు కూడా “కామకోటి" అను పదమును

వాడవచ్చును. అన్నిటికంటే సంఖ్యలలో పెద్ద సంఖ్య 'కోటి' అయినందున

ఆ విధముగా చెప్పినట్లు కలదు. ఆ దినము శంకరుడు ఆర్యులకు ఈ

విధమైన రెండు అర్థములను చెప్పి వారితో ఒప్పించాడు.


తమిళనాడు రాష్ట్రములో కంచి పట్టణమున కామకోటి పీఠము

482 B.C లో తయారైనది. ఆ విధముగా తన పీఠమును నాల్గువేదములలో

ఏ వేదమునకు సంబంధము లేకుండా చేసుకొన్న శంకరుడు ఒక సంవత్సర

కాలములో అనగా 481 B.C లో భగవద్గీతకు భావమును వ్రాశాడు.

దానినే ఈనాడు "ఆదిశంకరాచార్య భాష్య భగవద్గీత”గా చెప్పుచున్నారు.

శంకరుడు ఆర్యులకు తెలియకుండా, వారు చూడకుండా ఐదవ వేదమును

వ్రాస్తున్నట్లు చెప్పి ఏకంగా భగవద్గీతకు తన భావమును వ్రాశాడు. శంకరుడు

పూర్తిగా భగవద్గీతను వ్రాసిన తర్వాత ఆ విషయము ఆర్యులకు తెలిసినది.

ఆర్యులు తెలివైన వారయినందున శంకరాచార్యుల వారిలోని మార్పును

పసిగట్ట గలిగారు. శంకరుడు తన 28వ సంవత్సరమే భగవద్గీతా భాష్యము

వ్రాయగలిగితే తర్వాత జరుగబోయే కాలములో తమ మాట వినడని వారు

అనుకోవడము జరిగినది. శంకరుని అంతర్భావమును గ్రహించిన ఆర్యులు

తమలో మార్పులేనట్లు నటిస్తూ శంకరునితో ఎటువంటి భావభేదము

లేకుండా ప్రవర్తించుచుండిరి. అట్లుంటూ తిరిగి వేదముల వైపు వచ్చునట్లు

భగవద్గీతకు వ్యతిరేఖముగా మారునట్లు అనేక ప్రయత్నములు చేయుచుండిరి.

శంకరుడు వారి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గ్రహించుట వలన వారి

భావములోనికి శంకరుడు మారలేదు. అయినా శంకరుడు కూడా వారి

మాటను వినునట్లు నటిస్తుండెను. ఈ విధముగా ఇరువైపులా నటనలే

యుండేవిగానీ వాస్తవముండేది కాదు.


ఆర్యులు శంకరునిలో మార్పు కొరకు దాదాపు ఒక సంవత్సరము

వేచి చూచారు. అయినా శంకరునిలో మార్పు కనిపించలేదు. శంకరుని

మనోభావము ఎట్లున్నదో గుర్తించలేకపోయిన ఆర్యులు శంకరుడు ఇక

మారడనీ, భవిష్యత్తులో వారిమాట వినడనీ వారికి అర్థమయినది.

అంతేకాకుండా అంతవరకు ఊరకనే యున్న శంకరుడు భవిష్యత్తులో

ఊరకయుండక వేదములకు వ్యతిరేఖముగా భగవద్గీతను ప్రచారము

చేయునేమో! అను భయము ఆర్యులలో నెలకొన్నది. అదే జరిగితే శంకరుడు

గొప్పవాడనీ, తామే ప్రజలలో చేసినదంతా శంకరునికి అనుకూలముగా,

తమకు వ్యతిరేఖముగా మారిపోవుననీ, ప్రజలలో బాగా ప్రచారమయిన

శంకరుని మాటనే ప్రజలందరూ వినగలరనీ అనుకొన్నారు. ఆ విధముగా

భగవద్గీత ప్రచారము జరిగి వేదముల విలువ తగ్గిపోతే తాము 12

సంవత్సరముల నుండి శంకరున్ని పెంచి పోషించి గొప్పవానిగా చేసినదంతా

తమకే అడ్డము తిరుగునని ఆర్యులకు బాగా తెలిసిపోయినది. శంకరున్ని

పోషించిన ఆర్యులందరూ కలిసి శంకరునికి తెలియకుండా ఒకచోట

రహస్యముగా సమావేశమయి శంకరుని విషయమును బాగా చర్చించు

కొన్నారు. అందరూ కలిసి శంకరుని మార్పు కొరకు ఉత్తరదేశ పర్యటన

చేయించాలని, అతని మార్పుకొరకు అది చివరి ప్రయత్నమనుకొన్నారు.

తర్వాత కొద్దిరోజులకు ఉత్తర దేశ పర్యటనను గురించి శంకరునికి తెలియ

జేశారు. నాలుగు పీఠములలో ప్రస్తుతమున్న పీఠాధిపతులను పలుకరించి

వారి కార్యక్రమములను పరిశీలించి రావలసినదిగా శంకరునికి చెప్పారు.

వారి పనిని చూచి వారిని ఉత్తేజపరుచుటకు పలకరింపు అవసరమని తలచిన

ఆర్యుల మాటను శంకరుడు వ్యతిరేఖించలేదు. ఆర్యులు చెప్పిన వెంటనే

ఒప్పుకొన్నాడు. అప్పుడు అనగా! 480 B.C లో శంకరుడు ఉత్తర దేశ


పర్యటనను సాగించాడు. రెండవమారు ప్రయాణములో కేవలము

కాలినడకనే కాకుండా వాహనములుగా గుర్రములను కూడా వినియోగించు

కొన్నారు. వారి పర్యటన కర్నాటకలోని శృంగేరి పీఠమును చేరి, అక్కడ

నుండి ఒరిస్సాలోని పూరి జగన్నాథ పీఠమునకు పోవడము జరిగినది.

అక్కడనుండి గుజరాత్లోని ద్వారాకా పీఠమును చేరి అక్కడ పీఠములో

పది రోజులు గడిపి చివరిదయిన హిమాలయములలోయున్న బద్రినాథ్

పీఠముల వరకు పోవడము జరిగినది. శంకరాచార్యుల వారికి కొందరు

శిష్యులు కూడా ఆయనవెంట పోవడమయినది. ఆయన శిష్యులు కూడా

అందరూ ఆర్యులే అయివుండడము విశేషము.


కేదార్నాథ్ శివాలయములో శంకరుల విడిది యుండెను.

ఆలయములో అందరూ ఉండేదానికి వీలులేదు. మిగతా వారందరూ

వేరువేరు జాగాలలో విడిది చేయగా శంకరుడు ఆయనతోపాటు ఇద్దరు

శిష్యులు అక్కడ ఆలయములో ఉండిరి. అక్కడ శంకరులు వారము రోజులు

ఉండవలెనని నిర్ణయించుకొన్నారు. కేదార్నాథ్ గుడి అరణ్యప్రాంతములో

ఉన్నది. అక్కడికి పోయేదానికి అప్పటికాలములో సరియైన దారికూడా

లేదు. పర్వతపు అంచులలో జాగ్రత్తగా నడుస్తూపోవాలి. జనవాసములకు

చాలా దూరముగా యుండుట వలన అక్కడ ఇతర మనుషులు కనిపించెడి

వారు కాదు. అది అరణ్య ప్రాంతము అగుట వలన, దారి లేనందున

కేదార్నాథ్ బయటి ప్రపంచముతో సంబంధము లేనట్లు ఉండెడిది. అక్కడి

విషయము బయటి ప్రపంచమునకు తెలియాలంటే అప్పటికాలములో

దాదాపు వారము దినములు పట్టెడిది. సంవత్సరమునకు ఒక నెలలో శివ

భక్తులు అక్కడికి వచ్చి దర్శనము చేసుకొని పోయెడివారు. సంవత్సరములో

పదకొండు నెలలు అక్కడున్న పూజారులు తప్ప ఎవరూ ఉండెడివారు కారు.


అది హిమాలయ పర్వత ప్రాంతమయిన దానివలన అక్కడ ఇతర మనుషులు

బ్రతికే వనరులు ఏమాత్రము లేవు. అందువలన బయట జనాభా అక్కడ

ఏమాత్రము లేకుండెడివారు. అటువంటి వాతావరణమున్న చోట కేదార్నాథ్

గుడి కట్టబడినది.


శంకరాచార్యుల పర్యటనలో పది రోజులు కేదార్నాథ్

ఉండాలనుకొన్నారు. వారము రోజులు గడచినది, పది రోజులకు రెండు

రోజుల కొదవయుండగా, ఆ రోజు రాత్రి ఆలయములోనికి దొంగలు

ప్రవేశించారు. అప్పుడు గుడిలో శంకరుడు ఆయన శిష్యుడు ఒకడు

ఉన్నారు. మరియొక శిష్యుడు జ్వరముతో బాధపడుచుండుట వలన మిగతా

వారితోపాటు ఆలయమునకు కొంత దూరములో యున్న గుడారములలో

ఉండెను. కేదార్నాథ్ గుడి మందాకిని నది ఒడ్డున ఉండుట వలన అక్కడ

భూమి చదును లేకపోవడము వలన మిగతా వారందరూ ఆలయమునకు

కొంత దూరములో వారి గుడారములను నిర్మించుకొన్నారు. బద్రినాథ్

యాత్ర చాలా కష్టమైనది కావడముచేత, శంకరుని వెంట పోయిన

వందమందిలో సగము మంది క్రిందనే నిలిచి పోయారు. పెద్ద వయస్సు

వారు, నడువలేనివారు పర్వత క్రింది ప్రాంతములోనే నిలిచిపోగా, నడువ

గలిగిన వారు చిన్నవయస్సువారు మాత్రము పర్వతముల పైకి పోవడము

జరిగినది. కేదార్నాథ్ యున్న దాదాపు యాభైమంది కేదార్నాథ్ గుడికి

కొంత దూరములోయుండుట వలన, అక్కడ గుడిలోగానీ, పరిసర

ప్రాంతములో గానీ విద్యుత్తు లేనిదానివలన గుడిలో ఏమి జరుగుచున్నది

ప్రక్కకు తెలిసే అవకాశమే లేదు. అటువంటి స్థితిలో గుడిలోనికి దొంగలు

ప్రవేశించి అక్కడున్న శంకరుల శిష్యున్ని, శంకరున్ని కొట్టడము జరిగినది.

శిష్యుడు స్పృహ తప్పి పడిపోగా, శంకరుడు వారు కొట్టిన దెబ్బలకు


తట్టుకోలేక మరణించాడు. ఆలయములో యున్న కొద్దిపాటి నగలు మరియు

సొమ్మును దొంగలు అపహరించుకుపోవడము జరిగినది.

శంకరాచార్యుల వారు దొంగల చేతిలో చనిపోయిన విషయము

తెల్లవారే వరకు అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కొద్దిదూరములో

నున్న గుడారములలోని వారికి శంకరుల మరణ విషయము తెల్లవారిన

తర్వాత తెలిసినది. వెంటనే ఆ విషయము బయటికి తెలిసేదానికి అవకాశమే

లేదు. అందువలన శంకరుల వెంటపోయి పర్వతముల క్రిందనే నిలిచి

పోయిన సగము మందికి కూడా శంకరుల మరణ విషయము తెలియదు.

మూడు రోజుల తర్వాతగానీ, ఆ విషయము క్రిందనున్న వారికిగానీ బయటి

ప్రపంచమునకుగానీ తెలియదు. ఇప్పటి కాలములోవలె అప్పుడు

ప్రసారసాధనాలు అయిన ఫోన్ల సౌకర్యము లేకుండుట వలన, రైలు, బస్సు

సౌకర్యము లేనిదానివలన ఒక వార్త తెలియాలంటే మనుషులు పోయి

చెప్పితేగానీ తెలియదు. ఇప్పటికి దాదాపు 2500 (2492) సంవత్సరముల

క్రిందట ఇప్పటివలె ఏదీ లేదు. అందువలన శంకరాచార్యుల మరణవార్త

శంకరుని స్వగ్రామమునకు దాదాపు సంవత్సరము కాలము పాటు

తెలియదనియే చెప్పవచ్చును. శంకరుడు చనిపోయిన దినమున అక్కడ

దాదాపు యాభైమంది మాత్రము ఉండుట వలన వారే శంకరుల

అంత్యక్రియలను కేదార్నాథోనే జరిపినారు.


ప్రశ్న :- శంకరుల వారు దొంగల దాడిలో చనిపోయారని మిగతావారికి

తెల్లవారిన తర్వాత ఎలా తెలిసింది?


జవాబు :- శంకరునితోపాటు అక్కడేయున్న శిష్యుడు చెప్పగా ఆ విషయము

అందరికీ తెలియడము జరిగినది.


ప్రశ్న :- శంకరుల వారి మరణ విషయమును అక్కడేయున్న శిష్యుడు

వచ్చి మిగతా వారికి తెలియజేయవచ్చును కదా! అట్లు కాకుండా తెల్లవారే

వరకు శిష్యుడు మిగతావారికి ఎందుకు చెప్పలేదు?


జవాబు :- దొంగలు ఆలయములో ప్రవేశించిన సమయములో శంకరుడు

మరియు ఆయన శిష్యుడు తప్ప అక్కడ ఎవరూ లేరు. దొంగల దాడిలో

శిష్యునికి కాలు ఎముక విరిగినది. తర్వాత అతడు మూర్ఛపోవడము

జరిగినది. మూర్ఛ నుండి కొద్దిసేపటికి తేరుకోవడము జరిగినా, అతని

కాలు కదపలేనందున అతడు బయటికి రాలేకపోయాడు. తెల్లవారిన

తర్వాత మిగతావారు (పూజారులు) అక్కడికి పోయిన తర్వాత శంకరుల

మరణము తెలిసినది. అక్కడే గుడిలోనే యున్న శిష్యునికి కూడా శంకరుడు

మరణించాడను విషయము తెలియదు. దొంగల దాడి జరిగిన విషయము

తెలిసిన శిష్యునికి శంకరుడు ఏమయ్యాడను విషయము తెలియదు. అతనికి

కూడా తెల్లవారిన తర్వాత ఇతరులకు తెలిసిన తర్వాత తెలిసినది.


ప్రశ్న :- అది అరణ్యప్రాంతము, తర్వాత ఎవరూ సులభముగా అక్కడికి

పోలేని పర్వతప్రాంతము. జనవాసములు లేని ప్రాంతము. అటువంటి

చోటికి దొంగలు ఎందుకు పోయారు?

జవాబు :- శంకరుడు ఆయన శిష్యులు అక్కడికి పోయిన విషయము

పర్వత క్రింది ప్రాంతములో తెలిసిపోవడము వలన, అక్కడ ఆలయములో

విలువయిన బంగారు ధనము దొరుకునను ఉద్దేశ్యముతో దొంగలు వచ్చి

యుండవచ్చును. పూర్వము దేవాలయములలో బంగారును దేవతలకు

అర్పించడము పరిపాటిగా యుండేది. అందువలన మరియు శంకరుడు

వచ్చి అక్కడ బంగారమును సమర్పించాడను నమ్మకముతో దొంగలు


రావడము జరిగినది. అంతేకాక శంకరుని వద్ద కొంత ధనము ఉండవచ్చు

నను అంచనాతో దొంగలు అక్కడికి వచ్చి ఆలయములో నగలకొరకు

ధనముకొరకు గాలించడము జరిగినది. బంగారు దొరికినా ధనము

దొరకనందుకు శంకరున్ని కొడితే ఇస్తాడనుకొని శంకరున్ని కొట్టడము

జరిగినది. శంకరునివద్ద వారి పర్యటనకు కావలసిన ధనముండడము

నిజమే, అయినా దొంగలకు శంకరున్ని కొడితే డబ్బు దొరుకునను

ఉద్దేశ్యముతో వారు శంకరున్ని కొట్టడము జరిగినది. శంకరుడు దొంగలకు

ధనమిచ్చినా వారు కొట్టిన దెబ్బలకు ఆయన ప్రాణము పోయినది.


ప్రశ్న :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము, మీరు సూటిగా

జవాబును చెప్పండి. శంకరుడు ఆర్యుల కుట్రవలన చనిపోయాడా? లేక

దొంగలు డబ్బుకొరకు కొట్టగా చనిపోయాడా?


జవాబు :- మేము ఎటూ చెప్పలేము. ఆర్యులకు శంకరుని మీద చెడు

భావముండుట నిజమే. అయినా అక్కడ ఆర్యులే ఆ పనిని చేశారనుటకు

ఎటువంటి సాక్ష్యాధారములులేవు. అందువలన అదే నిజమని చెప్పుటకు

అవకాశము లేదు.


ప్రశ్న :- సాక్ష్యాధారములుంటే అది బయటికి తెలుస్తుంది. బయటికి

విషయము పొక్కకూడదంటే సాక్ష్యాధారములు లేకుండా ఉండాలి.

అంతవరకు జరిగిన సంఘటనల దృష్ట్యా ఆర్యులే ఆ పనిని తెలివిగా చేసి

యుండకూడదా?


జవాబు :- శంకరుడు చనిపోకముందు జరిగిన విషయములకంటే, ఆయన

చనిపోయిన తర్వాత జరిగిన దానినిబట్టి శంకరాచార్యుని మరణము ఆర్యుల

కుట్రలో భాగమేనని తెలియుచున్నది. నాకు కల్గిన అనుమానమును గురించి


నేను చెప్పెదను.

చెప్పడము లేదు.

అయినా నా ఊహనే మీరందరూ నమ్మమని నేను

నా ఉద్దేశ్యము నిజము కావచ్చు, కాకపోవచ్చు.

అందువలన తుది నిర్ణయమును మీకే వదలుచున్నాను. శంకరుని జీవిత

మంతా 15 సంవత్సరములనుండి 27 సంవత్సరముల వరకు దేశపర్యటన

పీఠముల స్థాపనలో జరిగిపోయినది. శంకరుడు చిన్నవయస్సులోనే సంస్కృత

విద్యను నేర్వడము, వేదపఠన జరుపడము మొదలగునవన్నీ నేర్చినా

పరకాయ ప్రవేశ విద్య నేర్వలేదు. ఆయన పరకాయ ప్రవేశము చేయలేదు.

శంకరుడు చనిపోయిన తర్వాత ఆర్యులు శంకరున్ని ఇంకా ఎక్కువగా

ప్రచారము చేయుటకు శంకరుడు పరకాయ ప్రవేశము చేసి, చనిపోయిన

ఒక రాజు శరీరములోనికి దూరి, అక్కడ ఒక సంవత్సర కాలము వరకు

రాజు భార్యతో కాపురము చేసి, శృంగార విషయములను అందులోని

మెలుకువలను ఎన్నో నేర్చుకొన్నట్లు ప్రచారము చేశారు. వాస్తవముగా

శంకరుని జీవితములో జరుగని దానిని జరిగినట్లు చెప్పడములో ఆర్యులు

అదే పనిగా అసత్యమును చెప్పారని తెలియుచున్నది. శంకరుడు గొప్ప

వాడని చెప్పు ప్రయత్నములో ఈ అసత్యమును చెప్పారని తెలియుచున్నది.

అట్లు అబద్దము చెప్పవలసిన అవసరము ఏమి వచ్చిందని చూస్తే, శంకరుడు

గొప్పవాడని ఆయన చనిపోయిన తర్వాత కూడా చెప్పుటనుబట్టి ఆయన

మీద ఆర్యులకు ఎంతో భక్తి విశ్వాసములున్నవని తెలియుచున్నది.


అయితే శంకరుడు తన జీవితములో పరకాయ ప్రవేశ విద్యను

ఎప్పుడూ నేర్వలేదు. 2500 సంవత్సరముల పూర్వము మళయాల

రాష్ట్రములో (కేరళ)లో పరకాయ ప్రవేశ విద్య నేర్పే గురువులు ఉండేవారు.

విక్రమార్క మహారాజు కూడా కేరళ రాష్ట్రమందు పరకాయ ప్రవేశవిద్య

నేర్చినట్లు చరిత్రలో గలదు. ఆ విద్యను నేర్చుటకు కావలసిన కాలము


12 సంవత్సరములు. శంకరుని జీవితము వడ్డించిన విస్తరిలాగ అందరికీ

తెలిసినదే. అతి చిన్నవయస్సులోనే 14 సంవత్సరముల నుండే శంకురుని

మీద ఆర్యుల కన్ను పడింది. తర్వాత పదహారవ సంవత్సరమునుండి

ఆర్యులు శంకరున్ని ఉత్సవ ప్రతిమలాగ వాడుకున్నారు. శంకరున్ని చూపి

వేదములను, యజ్ఞములను ప్రచారము చేశారు. ఆర్యుల చేతిలో కీలు

బొమ్మగ యున్న శంకరుడు 12 సంవత్సరములు పరకాయ ప్రవేశ విద్య

కొరకు వినియోగించలేదు. పరకాయ ప్రవేశవిద్యను తెలియని శంకరుడు

పరకాయము చేశాడని చెప్పడము వలన వారి కుతంత్రము కొంత

బయటపడినది. అలా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనను

గొప్పగా చెప్పుట వలన శంకరున్ని ఆర్యులు హత్య చేశారను అనుమానము

ఎవరికీ భవిష్యత్తులో రాకుండుటకే వారు అలా చెప్పుచున్నారని

అర్థమయినది. ఈ ఒక్క ఆధారముతోనే మేము ఆర్యులను అనుమానించు

చున్నాము.


దేశములో నాలుగు మూలలా నాలుగు అద్వైత పీఠములను

శంకరుడు స్థాపించిన తర్వాత ప్రత్యేకముగా ఐదవ పీఠమును తన నివాసము

కొరకు ఏర్పరచుకొన్నాడు. మొదట ఏర్పరచిన నాలుగు తన స్వంత పీఠములే

అయినప్పుడు శంకరునికి ఐదవ పీఠమును ఏర్పాటు చేసుకోవలసిన

అవసరమేమిటి? అను ప్రశ్న రాగలదు. అలా ఏర్పరచుకోవడము వలన

ఆ నాలుగు పీఠములు తనకు ఇష్టము లేనట్లే కదా! అలా ఇష్టము లేకుండా

పోవడమునకు కారణమేమిటి? అను ప్రశ్న కూడా రాగలదు. వీటన్నిటికీ

జవాబును వెదకగలిగితే చిన్నవయస్సులో తాను చేసిన పని వయస్సు

వచ్చిన తర్వాత తనకే సరిపోలేదని అర్థమగుచ్నుది. మొదటి నాలుగు

పీఠములు 'నాలుగు వేదములకు' గుర్తుగా తయారు చేయబడినవి.


భగవద్గీతలోని జ్ఞానములో వేదములంటే ఏమిటో? వాటికి దేవుని దృష్ఠిలో

యున్న స్థానము ఏమిటో భగవద్గీతను చదివిన తర్వాతే శంకరునికి

అర్థమయిన దానినిబట్టి అతనికి నాలుగు పీఠముల మీద ఇష్టము లేకుండా

పోయినదని అర్థమయినది. అక్కడినుండి శంకరునిలో వచ్చిన మార్పు

ఆర్యులకు నచ్చకపోవడము కూడా మనకు తెలిసిన విషయమే. రెండు

లేక మూడు సంవత్సరములు శంకరున్ని తిరిగి తమ దారిలోనికి

తెచ్చుకోవాలని ఆర్యులు ప్రయత్నము చేసినది వాస్తవమే. ఆర్యులు శంకరుడు

ఒకరికొకరు సరిపోని భావముతో కొంతకాలము గడిపిన తర్వాత కూడా

శంకరుడు మారనప్పుడు, ఆర్యులకు లోలోపల శంకరునికి వ్యతిరేఖముగా

యున్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత శంకరుని గురించి అనేకచోట్ల,

అనేక విధముల పొగడడము ఎందుకని ప్రశ్న రాగలదు. అంతేగాక

శంకరునికి తెలియని పరకాయ ప్రవేశమును ఆయనకు తెలుసునని

చెప్పడము ఎందుకు? అంతేకాక ఆయన చేయని మహత్యములను చేశాడని

కల్పించి చెప్పడము ఎందుకు? అను ప్రశ్నలు ఏకధాటిగా రాగలవు.


శంకరుడు కేదార్నాథ్ గుడిలో చనిపోయినప్పుడు అదే దినమే

గుడి ప్రక్కననే శంకరున్ని పూడ్చిపెట్టి సమాధిని కట్టారు. అయితే శంకరునికి

ఇచ్చిన గౌరవమును శంకరుని సమాధికి ఇవ్వలేదనీ, శంకరున్ని ప్రచారము

చేసినట్లు శంకరుని సమాధిని ప్రచారము చేయలేదు. శంకరుని సమాధికి

ఎటువంటి భద్రత కల్పించలేదు. అందువలన 2013వ సంవత్సరములో

కురిసిన వర్షమునకు అక్కడ మందాకిని నదికి వచ్చిన వరదలో శంకరుని

సమాధి పూర్తిగా నామరూపములు లేకుండా నీటి ప్రవాహములో కొట్టుకొని

పోయినది. తామే సృష్టించి శంకరుని ద్వారా ప్రచారము చేయించిన

అద్వైత పీఠమును ప్రచారము చేసిన శ్రద్ధను శంకరుని సమాధి నీటిలో


కొట్టుకుని పోయిన తర్వాత ఆయన సమాధి మీద చూపలేదు. సానుభూతిగా

ఎక్కడా మాట్లాడలేదు. దీనిని అంతటినీ ఆలోచిస్తే శంకరుని మీద బయటికి

కనబరచిన ప్రేమ లోపల లేదని అర్థమగుచున్నది. శంకరుడు చనిపోయిన

తర్వాత అద్వైతము యొక్క ప్రచార బాధ్యతను ఆర్యులు స్వీకరించి, అద్వైతము

కంటే వేరే సిద్ధాంతమునుగానీ, వేరే జ్ఞానమునుగానీ చెప్పిన వారిమీద

దాడులు చేసి, భయపెట్టి అద్వైత సిద్ధాంతమును హిందూమతములో

నేటికినీ మొదటి స్థానములో యుండునట్లు చేశారు. శంకరులవారు

చనిపోయిన తర్వాత దాదాపు 1500 సంవత్సరములకు రామానుజాచార్యుల

ద్వారా బయటికి వచ్చిన విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రచారము కాకుండా

ఆర్యులు అనేకచోట్ల అడ్డుకొన్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తయిన రామాను

జాచార్యుల వారిని దొరికితే చంపేటట్లు నిర్ణయించుకొన్నారు. దానితో

రామానుజాచార్యుల వారు జీవితమంతా రహస్యముగా బ్రతుకవలసి

వచ్చినది. విశిష్టాద్వైతులను ఎలా హింసించినది 'దశావతారము' సినిమా

చూస్తే తెలిసిపోతుంది. ఆర్యుల ముందర విశిష్టాద్వైతమును గురించి

చెప్పినవారిని అనేక విధముల హింసించి చంపినట్లు ఆ చలనచిత్రములో

తెలియుచున్నది.


అద్వైతమే తమ ప్రాణముగా, వేదములే తమ ఊపిరిగా బ్రతికిన

ఆర్యులు శంకరుడు వేదములకు వ్యతిరేఖముగా మారినాడని తెలిసిన

తర్వాత, తమ వేదపీఠములను కాదని ప్రత్యేక పీఠమును తయారు చేసుకొన్న

తర్వాత, శంకరునిచేత తయారు చేయించిన అద్వైత సౌధములను శంకరుడే

కూల్చివేయుటకు ప్రయత్నము చేయుచున్నాడని తెలిసిన తర్వాత, ఆర్యులు

శంకరున్ని తిరిగి తమ మార్గములోనికి మార్చవలెనని ప్రయత్నము రెండు

మూడు సంవత్సరములు చేసినా శంకరుడు మారకపోయినప్పుడు,


శంకరుడు భవిష్యత్తులో తమకు పూర్తి వ్యతిరేఖముగా మారిపోవునని తెలిసి

నప్పుడు ఆర్యులు శంకరున్ని తుదముట్టించవలెనని ఎందుకు అనుకో

కూడదు? అలాగే అనుకొనియుండవచ్చును కదా! ఆర్యులందరూ ఒకచోట

చేరి శంకరున్ని నిర్మానుష్యమయిన కేదార్నాథ్ వరకు తీసుకుపోయి అక్కడ

బయటి ప్రపంచమునకు తెలియకుండా చంపవలెనను పథకమును ఎందుకు

వేసియుండకూడదు? ఈ ప్రశ్నలన్నిటికీ శంకరుడు చనిపోయిన స్థలము,

శంకరుడు చనిపోయిన సంఘటనా విధానమును అన్నిటినీ అనుసరించి

శంకరున్ని ఆర్యులే దొంగలదాడిని సృష్టించి చంపియుంటారను జవాబును

తెస్తున్నవి. అట్లు చేశారను ఆధారము కూడా దొరకకుండా, ఆధార

రహితముగా ఆర్యులు తమ తెలివితో చేశారని తెలియుచున్నది. ఈ పనిని

చేశారు అని చెప్పుటకు ఆధారము లేనట్లు, ఈ పనిని చేయలేదు అని

చెప్పుటకు కూడా ఆధారము లేదు. శంకరుడు చనిపోకముందు ఐదు

సంవత్సరములుగా జరిగిన చరిత్రనుబట్టి, జరిగిన తర్వాత ఆర్యులు శంకరుని

మీద ప్రేమను ప్రచారము చేసిన దానినిబట్టి శంకరున్ని ఆర్యులే చంపారని

చెప్పవచ్చును.


ప్రశ్న :- అద్వైతము శంకరునిదా, లేక ఆర్యులదా? దీనికి ఉన్నదున్నట్లు

సమాధానము చెప్పండి?

జవాబు :- త్రైతాయోగము (త్రేతాయుగము) నుండి ఆర్యులు అద్వైతమునే

చెప్పుచున్నారు. అయితే అది ఒక సిద్ధాంతముగా చెప్పబడలేదు. దానికి

ఒక సిద్ధాంతకర్త లేడు. అద్వైతమును ఒక సిద్ధాంతముగా రూపొందించి

ఒక సిద్ధాంతకర్త ద్వారా ప్రకటించాలని కలియుగము మొదటిలోనే

అనుకొన్నారు. సిద్ధాంతకర్తగా ద్రావిడులనుంచి ఒకరిని తయారుచేస్తే,

తమకు వ్యతిరేఖమయిన ద్రావిడులనుండి వ్యతిరేఖతయుండదని, ద్రావిడు


లలో ఒక ముఖ్యమైన మనిషి ప్రతిపాదించిన సిద్ధాంతమును ద్రావిడులే

వ్యతిరేఖించరని తలచి దక్షిణ దేశములో సిద్ధాంతకర్తకు సరిపోవు తెలివైన

వ్యక్తికోసము అన్వేషిస్తూయుండిరి. అయితే దక్షిణ దేశమున కొందరు

బాల్య దశలోనే మేథావులు కనిపించినా వారు బ్రాహ్మణులు కాకపోయిన

దానివలన వారిని పరిగణలోనికి తీసుకోలేదు. చివరకు కేరళ రాష్ట్రములో

ఒక బ్రాహ్మణ కుటుంబమున శివగురు, ఆర్యాంబ అను దంపతులకు

జన్మించిన శంకర నామధేయుడయిన 14 సంవత్సరముల బాలుడు మహా

మేథావిగా ఆర్యులకు కనిపించగా, శివగురు కుటుంబముతో పరిచయము

ఏర్పరచుకొన్న ఆర్యులు చిన్నగా శంకరున్ని తమవైపు ఆకర్షితుని

చేసుకొన్నారు. శంకరుని తల్లితండ్రులు కడు పేదవారయినందున వారికి

ఆర్థిక సహాయము చేయుచూ వారిని తమ మాట వినునట్లు చేసుకోసాగారు.

చివరకు శంకరుని తల్లి అయిన ఆర్యాంబకు నచ్చచెప్పి శంకరున్ని 14వ

సంవత్సరమే సన్న్యాసత్వము స్వీకరించునట్లు చేశారు. 15వ సంవత్సరము

నుండి శంకరున్ని తమవెంట తీసుకొనిపోయి, బయట ప్రపంచమునకు

శంకరాచార్యున్ని చిన్నవయస్సులోనే పరిచయము చేసి, అతనిని అద్వైత

సిద్ధాంతకర్తగా ప్రకటించారు. వాస్తవముగా ఆ వయస్సులో శంకరునికి

అద్వైతము అంటే ఏమిటో కూడా తెలియదు. అందువలన "ఇంటిపేరు

భోగము, తినేది మాత్రము సంకటి, కారము” అన్నట్లు అద్వైతమునకు కర్త

శంకరుడే అయినా శంకరునికి అద్వైతమును గురించి ఒక ముక్క కూడా

తెలియదు. అయితే శంకరుని వెనుకయుండి అద్వైతమును చెప్పి ప్రచారము

చేసినది ఆర్యులే. అందువలన అద్వైతము త్రేతాయుగమునుండి ఆర్యులదే

అని చెప్పవచ్చును.


ప్రశ్న :- ఆర్యులు అద్వైతమునే ఎందుకు ఎన్నుకొన్నారు?


జవాబు :- ఫుట్బాల్ గ్రౌండ్లో ఎటయినా పరిగెత్తవచ్చును. అలాగే

అద్వైతములో ఎటైనా మాట్లాడవచ్చును. దానికి ఒక హద్దుపద్దు అంటు

తేడాలేమీ ఉండవు. అందువలన ఆర్యులు అద్వైతమునే ఎంచుకొన్నారు.

ఎదుటివాడు ఏమి ప్రశ్నవేసినా దానికి జవాబును తెలియనప్పుడు కూడా

అద్వైతములో తప్పించుకొని తెలిసిన వానివలె ప్రవర్తించవచ్చును. చిన్న

ఉదాహరణ చెప్పుకొంటే ఒకడు లక్షరూపాయల బాకీ చేసి బాకీ ఇచ్చిన

వానికి తిరిగి కట్టలేదు. బాకీ ఇచ్చినవాడు ఒక దినము బాకీ తీసుకొన్న

వానివద్దకు వచ్చి "అయ్యా! నీవు నా బాకీ తీర్చమని" అడిగాడు. అపుడు

బాకీ తీసుకొన్నవాడు అద్వైతమును మాట్లాడినాడట. అతను అద్వైతమును

ఇలా చెప్పాడు. "బాకీ ఇచ్చినవాడు పరబ్రహ్మస్వరూపమే, బాకీ తీసుకొన్న

వాడు పరబ్రహ్మ స్వరూపమే. అక్కడున్నది, ఇక్కడున్నది ఒకే పరబ్రహ్మ

స్వరూపము. పరబ్రహ్మము పరబ్రహ్మమునకే ఇచ్చినది. ఆయన సొమ్మును

ఆయనకే ఇచ్చుకొన్నాడు. ద్వైతము (రెండు) లేకుండా ప్రపంచమంతా

అద్వైతమే (రెండుకాని ఒక్కటే) యున్నప్పుడు నీది, నాది అనునది లేదు,

అంతా ఒక్కటే. నీవు పరబ్రహ్మస్వరూపమే, నేను పరబ్రాహ్మ స్వరూపమే.

అలాంటపుడు నీవు నాకిచ్చావు అనునది భ్రమమే, నేను తీసుకొన్నాను

అనునది భ్రమయే. తెలియనితనముతో నీవు బాకీ అని వచ్చావు. నిజానికి

నేను లేను, నీవు లేవు. ఇద్దరముగా కనిపించు మనము ఒక్కరమే. దానినే

అద్వైతము అంటాము. నీవు ఇంటికిపోయి తీరికగా ఆలోచించు, నీవు

పరబ్రహ్మ స్వరూపమేనని తెలుస్తుంది”. అని అన్నాడట.


ఈ విధముగా అద్వైతమును ఎక్కడయినా, ఏ సందర్భములో

అయినా చెప్పుకొనుటకు వీలుగాయుండును కనుక ఆర్యులు అద్వైతమునే

జ్ఞానబోధగా చెప్పుకొన్నారు. వాస్తవముగా ఆలోచిస్తే 'అద్వైతము' ఒక


సిద్ధాంతమే కాదు. సిద్ధాంతమయితే శాస్త్రము అగును. అద్వైతమును

ఆధారము చేసుకొన్న, అద్వైత సిద్ధాంతములతో కూడిన శాస్త్రమే లేనప్పుడు,

దానిని (అద్వైతమును) సిద్ధాంతము అనడమే తప్పగును. అద్వైతమును

ప్రపంచములో ఇంతవరకు ఎవడూ అనుభవించలేదు. అనుభవమునకు

రాని విషయము సిద్ధాంతము కాదు. సిద్ధాంతము కానప్పుడు శాస్త్రము

కాదు. శంకరాచార్యుల వారు కూడా తన జీవితములో అద్వైతమంటే

ఏమిటో తెలియకుండా గడిపాడు. అటువంటప్పుడు అద్వైతము ఆధ్యాత్మిక

సిద్ధాంతమే కాదు. సిద్ధాంతము కానిదానిని సిద్ధాంతముగా ఆర్యులు

సృష్ఠించారు తప్ప వేరు ఏమీ లేదు. అనుభవమునకు రానిది, శాస్త్రమనుటకు

వీలులేదు. మనిషి చనిపోయిన తర్వాత మోక్షము పొందితే అప్పుడు

అద్వైతమగును. ఇప్పుడు అద్వైతమే ఎవరికీ లేదు.


ప్రశ్న :- శంకరుడు భగవద్గీతను వ్రాశాడు కదా! భగవద్గీతలో అద్వైతమును

గురించి చెప్పాడు. లేని అద్వైతమును శంకరుడు ఎందుకు చెప్పాడు?

జవాబు :- కర్మ సన్న్యాసయోగములో 18వ శ్లోకముకు వివరము వ్రాసిన

చాలామంది స్వామీజీలు అందరూ అక్కడ అద్వైతమును గురించి చెప్పారు.

అలా చెప్పిన వారిలో శంకరుడు కూడా ఒకడు. శంకరాచార్యుల వారు

భగవద్గీతకు భాష్యము వ్రాసినప్పుడు భగవద్గీతలో ఎన్నో విషయములు

కనిపించినవి. 25 సంవత్సరముల వయస్సులో అన్ని విషయములు క్రొత్తవే

అయినా సంస్కృత పాండిత్యము తెలియుట వలన భగవద్గీతను వివరించి

చెప్పడమైనది. మానవుని నిజ జీవితములో తెలియని అద్వైతమును, కర్మ

సన్న్యాసయోగము యొక్క 18వ శ్లోకములో అందరూ పొరపడి చెప్పారు.

ఆ శ్లోకములో దేవుడు భగవంతుని రూపములో వచ్చి చెప్పిన భావము

వేరు. వ్రాసిన స్వామీజీల వ్రాతలోని భావము వేరుగా యున్నది.


భగవంతుడు చెప్పిన భావమును ఎవరూ చెప్పలేక అద్వైతమును

చెప్పడమైనది.


శ్లో॥ 18.

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని |

శుని చైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః |


భావము :- “విద్య వినయము కల్గు బ్రాహ్మణులయందు, గోవులయందు,

ఏనుగులయందు, కుక్కలయందు, కుక్కలను తిను చండాలురయందు

పండితుల దృష్ఠి సమ భావముననే యుండును." ఈ విధముగా శ్లోకములోని

భావమును చెప్పవచ్చును. అయితే “సమదర్శినః" అను పదమువద్ద

అందరూ అద్వైతములోనికి పోవడము జరిగినది. అయితే ఆ పదము

అద్వైతములో వినియోగించినది కాదని చాలామంది తెలియలేకపోయారు.

అందరిలో యున్న ఆత్మను చూడమని అక్కడ చెప్పితే ఆత్మ విషయమే

తెలియని వారందరూ పరమాత్మను సమానముగా చూడవలెనని

అనుకొన్నారు. బ్రతికి యున్న మనిషి ఎంత గొప్పవాడైనా పరమాత్మను

చూడలేడను విషయము వారికి తెలియదు.


ప్రశ్న :- భగవద్గీతలో అద్వైతమును గురించి చెప్పలేదా?

జవాబు :- భగవద్గీతలో అద్వైతము, ద్వైతము, త్రైతము మూడు ఉన్నాయి.

మనిషి మోక్షము పొందినప్పుడు అద్వైతములో చేరిపోతాడు. లేక అద్వైతిగా

మారిపోతాడు అని చెప్పవచ్చును. మనిషికి పూర్తి కర్మ రాహిత్యమైనప్పుడు,

జన్మకు పోకుండా మోక్షమును పొందినప్పుడు అద్వైతమును మనిషి

పొందును. అప్పుడు వాడు జీవాత్మగా లేకుండా పరమాత్మగా మారిపోవును.

అలా జీవుడు దేవునియందు చేరి జీవ భావము లేకుండా పోయినప్పుడు

అద్వైతిగా మారిపోగలడు. ఇదంతయూ మనిషి బ్రతికినప్పుడు జరిగేది


కాదు. అందువలన ప్రపంచములో ఎవరికీ అద్వైతము తెలియదనియే

చెప్పవచ్చును.


ప్రశ్న :- అద్వైతమంటే ఏమిటి?

జవాబు :- ముందు త్రైతమును తెలిస్తే తర్వాత ద్వైతము తెలుస్తుంది.

ద్వైతమును తెలిస్తే చివరిలో అద్వైతము తెలుస్తుంది. మనిషి జీవిత

కాలములో అద్వైతము తెలియుట అసంభవము. అద్వైతము అంటే రెండు

కానిది ఒక్కటిగా యున్నదని అర్థము. ద్వైతము అనగా రెండు అని అర్థము.

అద్వైతము అనగా రెండు కానిది అని అర్థము. రెండు కానిది ఒకటి అని

చెప్పవచ్చును. అంతేకాకుండా రెండు కానిది మూడు అని కూడా

చెప్పవచ్చును. ఇక్కడ అద్వైతము అను పదమునకు అర్థము తీసుకొంటే

రెండు కానిది ఒకటి అని అయినా చెప్పవచ్చును లేక రెండు కానిది మూడు

అని కూడా చెప్పవచ్చును. రెండు రకముల అర్థములలో ఏదయినా

కావచ్చును. మా దృష్టిలో అద్వైతము అంటే రెండు కానిది మూడనియే

చెప్పుదుము. అలా ఎందుకు చెప్పుచున్నామనగా! మనిషి బ్రతికినప్పుడు

రెండుకానిది ఒకటి అనగా అద్వైతము ఎప్పటికీ తెలియదు. మనిషి

బ్రతికినప్పుడు తెలియునది రెండు కానిది మూడు మాత్రమే. అనగా

త్రైతము మాత్రమే. మనిషి జీవితము లేనప్పుడు అద్వైతము తెలియును

గానీ, మనిషి బ్రతికియున్నప్పుడు తెలియబడునది త్రైతము మాత్రమే. ఈ

విషయమును భగవద్గీతను వ్రాసినవారు ఎవరూ వ్రాయలేదు.



అద్వైతము అంటే అందరూ ఒకటి అని చెప్పువారే కలరు గానీ,

మూడు అని చెప్పువారు లేరు. మీరే ఆలోచించండి! రెండు కానిది మూడు

కావచ్చును కదా! రెండు కానిది ఒకటి అని ఎలా చెప్పగలుగుచున్నామో


అలాగే రెండు కానిది మూడు అని చెప్పవచ్చును. ఒక ఉదాహరణ

చెప్పుకొంటే ఇలా కలదు. ఒకనివద్ద మూడు వస్తువులు గలవు. అలాగే

మరియొకనివద్ద రెండు వస్తువులు గలవు. రెండు వస్తువులు గలవానివద్ద

ఒకటి చిన్నది రెండవది పెద్ద వస్తువుండెను. వస్తువులు అంటే కట్టెలని

అర్థము చేసుకోవలెను. ఒకటి పొట్టికట్టె, రెండవది పొడవుకట్టె యుండెను.

అట్లే మూడు వస్తువులు అని చెప్పిన వానివద్ద పొట్టి పొడవు మధ్యరకముగ

మూడు కట్టెలుండెను. వారి పై అధికారివచ్చి రెండు కట్టెలున్నవానిని

పొడవు కట్టెను చూపమన్నప్పుడు తనవద్దయున్న రెండు కట్టెలలో రెండవ

పొడవు కట్టెను చూపెను. రెండవవాని వద్దకు పోయి నీవద్దయున్న పొడవు

కట్టెను చూపమన్నప్పుడు అతడు అతనివద్దయున్న మూడవ కట్టెను చూపెను.

పై అధికారి ఇద్దరివద్ద ఒకే మాటను అడిగాడు. పొడవుకట్టెను చూపమన్నాడు

అప్పుడు ఇద్దరూ పొడవు కట్టెలే చూపారు. అయితే మొదటివాడు రెండవ

కట్టెను చూపగా, రెండవవాడు మూడవ కట్టెను చూపాడు. ఇక్కడ అడిగిన

మాట ఒక్కటే అయినా ఇరువురు చూపిన కట్టెల సంఖ్య మారిపోయినది.

అదే విధముగా ఇద్దరు మనుషుల వద్దకు పోయి రెండు కానిదానిని

చూపమన్నప్పుడు మొదటివాడు రెండుకాని మొదటి సంఖ్యను చూపితే

రెండవ వాడు రెండుకానిది మూడవదని చూపాడు. అట్లే అద్వైతి ఒక

భావమును కల్గియున్నాడు. త్రైతి మరొక భావము కల్గియున్నాడు.

అద్వైతము, ద్వైతము, త్రైతము అనునది ఆత్మలకు సంబంధించిన

విషయమైయుండుట వలన చాలా జాగ్రత్తగా ఈ విషయమును

చూడవలసియుండును.


ప్రశ్న :- ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయములో మొత్తము ఎన్ని

సిద్ధాంతములు కలవు?


జవాబు :- మూడు సిద్ధాంతములు ముఖ్యముగాయున్నవి. అయితే భారత

దేశములో ఇంతవరకు రెండు సిద్ధాంతములు మాత్రమే తెలియబడినాయి.

మూడవ సిద్ధాంతము ఇప్పుడిప్పుడే పుట్టినదని చెప్పుచున్నాము.

ప్రశ్న :- ఇప్పటికే ముందునుండి మూడు సిద్ధాంతములున్నాయి కదా!

మీరు రెండేయని చెప్పుచున్నారు.


జవాబు :- ఇంతకు ముందునుండి యున్నవి మూడయినా వాస్తవానికి

అవి రెండేనని చెప్పవచ్చును. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము మూడు

గలవు. ఇందులో అద్వైతము, ద్వైతము అనునవి రెండు మాత్రమే

సిద్ధాంతములు. అద్వైతమునకు, ద్వైతమునకు మధ్యలోయుండునది

విశిష్టాద్వైతము. ఇది వేరు సిద్ధాంతమని చెప్పుటకు బదులు అద్వైతములోనే

ఒక భాగమని చెప్పవచ్చును. అద్వైతము అనగా రెండు కానిది ఒకటి అని

అర్థము. అట్లే ద్వైతము అనగా రెండు అని అర్ధము. ఇక మధ్యలోని

విశిష్టాద్వైతము అనగా! విశిష్టమైన అద్వైతము అని అర్థము. అందువలన

రెండూ అద్వైతములోనివే. ద్వైతము అద్వైతమునకంటే, విశిష్టాద్వైతమున

కంటే వేరయినదని చెప్పవచ్చును.


ప్రశ్న :- అయితే భూమిమీద హిందూమతములో యున్న ఆధ్యాత్మిక

సిద్ధాంతములు మొత్తము ఎన్ని?


జవాబు :- హిందూమతములో ఆధ్యాత్మిక సిద్ధాంతములు మొత్తము నాలుగు

కలవు. 1) అద్వైతము 2) విశిష్టాద్వైతము 3) ద్వైతము 4) త్రైతము. ఈ

నాలుగు సిద్ధాంతములను నలుగురు సిద్ధాంతకర్తలు ప్రతిపాదించారు.

ప్రస్తుతము 37 సంవత్సరములనుండి వచ్చిన త్రైత సిద్ధాంతము యొక్క

సిద్ధాంతకర్త తప్ప మిగతా ముగ్గురు కాలధర్మము చెందియున్నారు, అనగా


చనిపోయారు. త్రైత సిద్ధాంతకర్త ఒక్కడు మాత్రమే బ్రతికి సజీవముగా

యున్నాడు. తర్వాత సిద్ధాంతములను చెప్పినప్పుడు సిద్ధాంతకర్తలను గురించి

చెప్పగలము.


ప్రశ్న :- అద్వైత సిద్ధాంతకర్త అయిన శంకరున్ని ఆదిశంకరాచార్యుడు

అని ఎందుకు అంటున్నారు?


జవాబు :- తమిళనాడులోగల శంకరుని 'కామకోటి' పీఠమునకు ఎందరో

గురువులు పీఠాధిపతులుగా ఉంటూ వస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు

పీఠాధిపతులుగా రావడము జరుగుచున్నది. వారిలో చాలామంది శంకరా

చార్యుల వారి పేరు కల్గియున్నారు. అంతేకాక పీఠాధిపతిగా ఎవరు

పీఠమును అధిష్ఠించినా అతను శంకరుని పేరుతోనే చలామణి కావలసి

యుండును. పీఠాధిపతులుగా ఎక్కిన వారిపేరు ఏది ఉండినా, శంకరుని

తర్వాత వచ్చిన వారందరిని రెండవ శంకరాచార్యులు, మూడవ శంకరా

చార్యులు నాల్గవ శంకరాచార్యులు అని వరుస క్రమములో శంకరాచార్యుల

వారి పేరే చెప్పడము వలన వారిలోనికి శంకరుడు కలిసిపోకుండా, అద్వైత

పీఠమునకు మొదటివాడయిన శంకరున్ని అందరూ గుర్తుపట్టులాగున

ఆదిశంకరా చార్యులు అని శంకరున్ని పిలువడము జరిగినది. అందరిలో

కలిసిపోకుండా మొదటివాడను గుర్తింపువచ్చునట్లు ఆదిశంకరాచార్యులని

చెప్పారు.


ప్రశ్న :-:- ఆది శంకరులు తన జీవితములో ఎన్నో మహత్యములు కూడా

చేశాడని విన్నాము. అది నిజమేనా?

జవాబు :- ఆదిశంకరుల వారు తన జీవితములో ఏ మహత్యములు

చేయలేదు.


ప్రశ్న :- అయినా కొన్ని గ్రంథములలో శంకరుల వారి మహత్యాలను

గురించి వ్రాశారు. దానినేమంటారు?


జవాబు :- కొన్ని గ్రంథములలో ఆది శంకరాచార్యుల వారి గురించి ఎంతో

గొప్పవాడని, ఎన్నో మహత్యములు చేశాడని వ్రాశారు. అయితే అందులో

పూర్తి సత్యములేదని చెప్పవచ్చును. ఆదిశంకరులు బ్రతికియున్నప్పుడు

ఆయన ఏ మహత్యములను చేయలేదు. ఆర్యులే శంకరున్ని ప్రచారము

చేసి తమ పబ్బము గడుపుకోవాలని చూచారు. శంకరుడు చిన్నవయస్సులో

ఏ మహత్యములు చేయలేదు.


ప్రశ్న :- శంకరాచార్యుడు పుట్టిన తేదీలను గురించి రెండుమూడు

రకములుగా చెప్పుచున్నారు. ఒకటి 788 ఎ.డిలో పుట్టి 820 AD లో

చనిపోయినట్లు అక్కడ కూడా 32 సంవత్సరములు బ్రతికినట్లు చెప్పారు.

ఇక్కడ 509 BC లో పుట్టి 477 BC లో చనిపోయినట్లు చెప్పారు. ఇక్కడ

కూడా 32 సంవత్సరములే బ్రతికినట్లు కలదు. ఏది నిజమంటారు?


జవాబు :- ఈ రెండు సమాచారములలో ఏది నిజము ఏది అబద్ధము

అనునది ముఖ్యమే కాదు. ఆయన బ్రతికినది రెండుచోట్ల 32

సంవత్సరములనే వ్రాశారు కదా! అదే ముఖ్యము. ఒక విధముగా చూస్తే

బుద్ధునికంటే కొంత వెనుక శంకరుడు పుట్టాడని తెలియుట వలన క్రీస్తుకంటే

509 సంవత్సరముల ముందు పుట్టాడనునదే నిజమని చెప్పవచ్చును.

అవసరము లేని విషయములకంటే అవసరమైన విషయములే ముఖ్యము.

అవసరమైన విషయము శంకరుడు ఎన్ని సంవత్సరములు బ్రతికాడనునదే

ముఖ్యము. శంకరాచార్యుల వారు 32 సంవత్సరములు బ్రతికినది

వాస్తవము. ఆయన 32 సంవత్సరములు బ్రతికి తన స్వస్థలమునకు


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024