సత్యాన్వేషి కథ part1 cloud text 1st oct 24 Updated.
నేను చెప్పు ముందుమాట.
మనుషులకు తెలియని ఎన్నో క్రొత్త విషయములు తెలియవలయు
నను ఉద్దేశముతో ఈ కథను వ్రాయడము జరిగినది. ఈ కథ పేరు
సత్యాన్వేషి, కావున ఈ కథలో తెలియునవన్నియు సత్యములేనని
తెలియజేయుచున్నాము. ఈ కథలో జరుగు సన్నివేశములను కల్పించి వ్రాసినా,
అందులోని సారాంశము మాత్రము సత్యము. ఒక సందర్భములో మంత్రము
లను గురించి చెప్పడము జరిగింది. అయితే ఆ విషయములు మాంత్రికులకు
కూడా తెలియనివై ఉండును. అట్లే మహత్యములను గురించి కూడా చెప్పడము
జరిగినది. కానీ మహత్యములు చేయువారికి కూడా ఆ మహత్యములు
ఎలా జరుగుచున్నవో తెలియవు. మహత్యముల విషయములో ఇటు
ఆస్తికులకుగానీ, అటు నాస్తికులకుగానీ తెలియని సత్యమును పూర్తిగా చెప్పడము
జరిగినది. ఒక మనిషి (బాబా) కొన్ని మహత్యములను స్వయముగా చేయాలని
చేయగలడు. కానీ కొన్ని మహత్యములు అతని ద్వారా, అతనికి తెలియకుండానే
జరుగును. ఈ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యమేనని
చెప్పవచ్చును. ఇటువంటి మహత్యముల విషయములో ఆస్తికులు, నాస్తికులు,
హేతువాదులు పూర్తి పొరపడిపోయి వాటిని ఒక మనిషి చేయుచున్నాడని
అనుకొనుచున్నారు. మిగతా ప్రజలు కూడా అలాగే అనుకోవడము
జరుగుచున్నది. అలా అనుకోవడము వలన కొందరు ఆ వ్యక్తిని గొప్పగా
భావించుకోవడము జరుగుచున్నది. కొందరు హేతువాదులు ఆ వ్యక్తిని
విమర్శించడము కూడా జరుగుచున్నది. వాస్తవముగా ఆ వ్యక్తికి ఎటువంటి
సంబంధము లేని కొన్ని మహత్యములు, మనిషి మేధస్సుకు అందని
రహస్యమేనని చెప్పవచ్చును. అటువంటి గొప్ప రహస్యమును ఈ కథలో
ప్రత్యక్ష ప్రమాణములతో చూపుచూ, వివరముగా చెప్పడము జరిగినది.
ఇటువంటి తెలియని రహస్యములను తెలుపుట వలనా, ఈ రహస్యములలోని
అసలైన యధార్థములను తెలుపడము వలనా, ఈ కథ పేరు సత్యాన్వేషి
అయినది.
ఈ కథలో ఎన్నో సంఘటనలున్నా, అవి ఎన్నో ప్రపంచ పనులకు
సంబంధించినవైనా, వాటిలో చివరకు సందర్భానుసారము దైవ జ్ఞానమునే
చెప్పడము జరిగినది. కథ ఎన్ని మలుపులు తిరిగినా ప్రతి మలుపులోనూ
దైవజ్ఞానమును జోడించడము జరిగినది. అందువలన ఈ కథను చదవడము
వలన అన్నిటికంటే జ్ఞానమే గొప్పదను భావము తప్పనిసరిగా కలుగుతుంది.
సత్యము దైవజ్ఞానముతోనే ముడిపడి ఉంటుంది. జ్ఞానములేని చోట
అసత్యమును సత్యము అనుకొను అవకాశము కలదు. కానీ ఈ కథలో ప్రతి
చోటా జ్ఞానమే ఉన్నది, కనుక ఎక్కడా అసత్యమునకు తావులేదు. వైద్య
విధానములో అత్యంత ప్రాముఖ్యమైనదీ, మనిషికి అత్యంత ప్రమాదకరమైనదీ,
అయిన పాముకాటు నుండి బయటపడు విధానమును ఈ కథలో అమర్చి
చెప్పడము జరిగినది. ఈ కథను చదివిన వారు ఎవరైనా పాము కాటునుండి
స్వయముగా బయటపడడమే కాకుండా, ఎవరినైనా పాము విషమునుండి
రక్షించవచ్చును. ప్రతి ఆకూ ఔషధమేననీ, ప్రతి చెట్టులో ఒక విధమైన శక్తి
ఉన్నదనీ, ప్రతి చెట్టులో ప్రత్యేక కొమ్మగా పుట్టిన బదనికకు ఒక ప్రత్యేకశక్తి
ఉండుననీ, అటువంటి బదనికల చేత కొన్ని అసాధారణమైన పనులు
జరుగునని కూడా చెప్పడము జరిగినది. అటువంటి బదనికలలో మోదుగచెట్టు
బదనిక ఎలా ఉపయోగపడుచున్నదో ఈ కథలో చెప్పడము జరిగినది.
ముఖ్యముగా సంపూర్ణ జ్ఞానముగల యోగికీ, మంత్రాల మరియు
మాయ మహత్యములుగల ఒక బాబాకూ మధ్యలో జరిగిన పోరాటమునూ,
దోపిడీ దొంగలు దేవాలయములోని వజ్రముల కొరకు ప్రయత్నించిన
ప్రయాసనూ కంటికి కట్టినట్లు చూపించి చెప్పడము జరిగినది. మంత్ర
విధానములో ఇద్దరు మాంత్రికుల మధ్య జరిగిన ఘర్షణను “మోడి” అను
పేరుతో చూపించిన విధానము, ఇంతవరకు ఎవరికీ తెలియని ఒక ప్రత్యేక
ఆటగా చూపడము జరిగినది. నేటి సమాజములో మనుషులకు పూర్వము
మోడి ఎలా జరుగుచున్నదో, మోడి అంటే ఏమిటో దానివలన తెలిసిపోవు
చున్నది. అంతేకాక ఇందులో జ్యోతిష్యశాస్త్ర సంబంధమైన కొన్ని విధానము
లను తెల్పుచూ, అష్టగ్రహకూటమి అంటే ఏమిటి? దానిలో ఎంత ప్రభావ
మున్నదీ, సాధారణ మనిషికి కూడా అర్థమగునట్లు వ్రాయడము జరిగినది.
దీనివలన నేటి నవయువ సమాజములో గ్రహములూ, వాటి ప్రాధాన్యతా
కొంతకు కొంత తెలిసిపోగలదు. అంతేకాక గ్రహముల కలయికలో ఎంతో
ప్రభావమున్నదనీ, ఆ ప్రభావము మనుషుల జీవితముల మీద పడుచున్నదనీ
తెలియుచున్నది.
ఈ విధముగా చెప్పుకుంటూ పోతే మనిషికి తెలియని ఎన్నో
సత్యములు ఈ గ్రంథములో తెలియడమేకాక, మనిషి ముఖ్యముగా తెలుసు
కోవలసిన విషయము కూడా తెలియబడినది. మనిషికి అంత ముఖ్యమైన
విషయమేమనగా! మనిషి జీవితమునకు అత్యంత ప్రాధాన్యమైనది ఒకే ఒక
దైవ జ్ఞానము. మనిషి పుట్టిన తర్వాత దేవుని సమాచారమును గురించి
తెలియకపోతే ఆ జీవితము పశుపక్షులవలె, క్రిమికీటకములవలె వృథా
అయిపోవును. అందువలన వేమనయోగి కూడా ఒక సందర్భములో పుట్టలోని
చెదలు పుట్టదా గిట్టదా అన్నాడు. అలా మనిషి పశుపక్షులవలె జీవించకుండా
తన జీవితమునకు సార్థకత ఏర్పరచుకోవాలంటే, ముందు ముఖ్యమైన రెండు
ప్రశ్నలకు జవాబులను తెలిసివుండాలి. ఒకటి తాను ఎవరు? రెండవది
దైవము ఎవరు? ఈ రెండు ప్రశ్నలతోగానీ, వీటి జవాబుతోగానీ ఏమాత్రము
సంబంధములేకుండా మనిషి బ్రతకవచ్చును. ఈ రెండు ప్రశ్నలకు జవాబు
తెలియకున్నా, మనిషి జీవితములో ఏ లోపమూ కనిపించదు. అంతేకాక
ఈ ప్రశ్న జవాబులతో సంబంధము లేకుండా మనిషి హాయిగా బ్రతకవచ్చును.
అందువలన నేడు ప్రపంచములో ఎందరో మేధావులు సహితము, తన
జీవితములో ఎన్నో ప్రశ్నలకు సమాధానములు తెలిసినా, ఏ సమస్యకైనా
ఇది పరిష్కారమని చెప్పగలిగినా, ప్రజల దృష్టిలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు
పొందినా చివరకు వారి జీవితమూ, వారి పుట్టుకా వృథాయని చెప్పవచ్చును.
అలా ఎంతటివారికైనా వారి జీవితము వృథా కాకుండా ఉండాలంటే పైన
చెప్పుకొన్న రెండు ప్రశ్నలకు జవాబులను తెలుసుకొని తీరాలి.
ఈ రెండు ప్రశ్నలు కొందరి లెక్కలో పెద్దగా కనిపించక పోయినా,
వీటి రెండు జవాబులలో ఒకటి మాత్రము మనిషి తన జీవితములో తెలుసు
కోగల్గినా, రెండవ జవాబు మాత్రము జీవితాంతము వరకు ఎవరికీ
తెలియదు. అంతేకాక రెండవ జవాబు కొరకు మనిషి యొక్క ఒక జన్మ
సరిపోతుందని చెప్పలేము. రెండవ జవాబు కొరకు కొన్ని జన్మల సమయము
పట్టవచ్చును. కొన్ని జన్మల వరకు జవాబులు తెలియని ప్రశ్నలంటే అవి
ఎంత గొప్పవో అర్థమైపోగలవు. అంత గొప్ప ప్రశ్నలు మనిషి మెదడులో
మెదలాలంటే అతను వ్యక్తిత్వములో గొప్పవాడైయుండాలి. ప్రతి విషయమును
క్షుణ్ణముగా యోచించు స్వభావముగలవాడై ఉండాలి. సత్యాన్వేషణ దృష్ఠి
గలవాడై ఉండాలి. గ్రుడ్డిగా ఏ దానినీ నమ్మనివాడై ఉండాలి. హేతు
దృక్పథముకలవాడై ఉండాలి. కానీ నేడు అటువంటి వారు అరుదుగా
ఉన్నారు. తనను గురించిన ప్రశ్న ఎవరికీ రావడము లేదు. కొన్ని లక్షల
మందిలో ఎవరికైనా వచ్చినా, వాడు సరియైన జవాబు కొరకు వెతకడము
లేదు.
జగతిలో 90 శాతము మంది దేవుని మీద భక్తికల ఆస్తికులై
ఉన్నారు. అయితే వారు విశ్వసించునది సరియైన మార్గమో కాదో, తాము
ఆరాధించుచున్న దేవుడు నిజమైన దేవుడో కాదో తెలియలేకున్నారు. వీరిలో
కొందరు ఒక గురువును ఎంచుకొని, ఆ గురువు ద్వారా దైవమార్గమును
తెలియాలనుకొనుచున్నారు. కానీ గురువు అంటే ఎవరో తెలియక, ఎవరినంటే
వారిని గురువుగా ఎంచుకొనుచున్నారు. మనిషి జీవితమునకు ఎంతో
ముఖ్యమైన దైవజ్ఞానమును మరియు జీవజ్ఞానమును తెలుసుకొను ప్రశ్నవచ్చినా,
వాటికి జవాబులను తెలియబరచు సక్రమమైన గురువు ఎవరో, సక్రమమైన
విధానమేదో, ఈ గ్రంథములో ముఖ్యముగా తెలియజేయడమైనది. ఎంతో
పెద్ద విషయమైన రెండు ప్రశ్నలనూ, వాటి జవాబులనూ తెలుసుకొను
విధానములో కొంత స్వచ్ఛత కొరకు ఈ సత్యాన్వేషి కథలో ఒక బాబాపాత్రను,
ఒక యోగి పాత్రను వ్రాయవలసి వచ్చినది. ఈ గ్రంథములోని రెండు
పాత్రలను చూచిన తర్వాత మనిషి సరియైన దైవజ్ఞానమార్గములో ప్రయాణించ
గలడని మేము అనుకొనుచున్నాము. రెండు పాత్రలలో ఒకటి మాయ
మహత్యములతో కూడుకొన్న బాబాగారూ, రెండు దైవజ్ఞానముతో కూడుకొన్న
యోగీశ్వరులుగారూ ఉన్నారు. ఈ రెండు పాత్రలను అర్థము చేసుకొనుటకు
ఉదాహరణగా ప్రస్తుతకాలములో జరుగుచున్న, జరిగిపోయిన ఒక
విషయమును చెప్పి, అందులో మనుషులు ఏ విధముగా పొరపడి పోవు
చున్నారో కొంత వివరిస్తాము. ఈ వివరణతో ఈ గ్రంథములోని రెండు
పాత్రలను సులభముగా అర్ధముచేసుకోవచ్చును. అందువలన ఇప్పుడు
చెప్పబోయే ఉదాహరణ విషయమును విచక్షణా దృష్ఠితో చూచి చదవండి.
ప్రస్తుత కాలములో ఒక వ్యక్తి కొన్ని టక్కుటమారా, ఇంద్రజాల
మహేంద్రజాల విద్యలను నేర్చి, వాటి ద్వారా మహత్యములను చూపెడి
స్థోమత కల్గియుంటే, అతను బాబా స్థాయికి ఎదిగి ఏదో ఒక బాబాగా
మారిపోవును. "బాబా” అను పదమునకు కన్నడ భాషలో అయితే “రారా”
అను అర్థముగలదు. ఒక విధముగా 'రారా' అను అర్థముతో ప్రజలను రమ్మని
పిలిచినట్లు, మహత్యములను చూపువారివద్దకు ప్రజలు పోవుచుందురు.
మనుషులలో మాయ అనునది గుణముల రూపములో ఉన్నది. ఆ
గుణములలో అత్యంత బలమైనదీ, అన్నిటికంటే పెద్దదీ “ఆశ” అను గుణము.
పశువులకు పచ్చిగడ్డిని చూపితే రమ్మని పిలిచినట్లు ఎలాగైతే పశువు గడ్డిని
చూపిన వానివద్దకు పోవునో, అలాగే మనుషులకు మహత్యములను చూపితే
రమ్మని పిలిచినట్లు మనుషులు మహత్యములను చూపిన వానివద్దకు
పోవుదురు. అలా పశువులు పోవుటకుగానీ, ఎంతో తెలివియున్న మనుషులు
పోవుటకుగానీ కారణము ఆశ అను గుణమేనని తెలియుచున్నది. దీనివలన
మనిషిలోని మాయను ప్రేరేపించుటకు బాబాలు ఉన్నారని తెలియుచున్నది.
ఇకపోతే దైవజ్ఞానమును తెలిసినా దానిప్రకారము ఆచరించువానిని “యోగి”
అని చెప్పవచ్చును. యోగి అయినవాడు తనయందు మాయ రూపములోనున్న
గుణములను అణచివేచి, అదే పద్దతిని ఇతరులకు కూడా చెప్పుచుండును.
మాయను వదలి మనిషి బ్రతుకుటకు ఏమాత్రము ఇష్టపడడు. కావున
యోగి మాటను వినేవారు చాలా అరుదుగా ఉందురు. అలాంటి గుణ
రహిత యోగమును బోధించు యోగివద్దకు ఎవరూ పోవుటకు ఇష్టపడరు.
అందువలన మాయకు విరుద్ధమైన యోగివద్ద మనుషులు చేరరు. మాయకు
అనుకూలమైన బాబావద్దకు మనుషులు అనేకముగా చేరుదురు. ఈ సూత్రము
ప్రకారము నాకు తెలిసిన ఒక బాబా దగ్గరికి విపరీతముగా ప్రజలు
పోయెడివారు. అట్లే నాకు తెలిసిన యోగివద్దకు ఎవరూ పోయెడి వారు
కాదు. ఒకవేళ ఎవరైనా పోయినా వారి శాతము చాలా తక్కువగా
ఉండెను. బాబాగారివద్దకు లక్షమంది పోతే, యోగివద్దకు ఒక్కరు పోయెడి
వారు. ఆ లెక్క ప్రకారము బాబావద్దకు పోయెడివారు కోటిమంది ఉంటే,
యోగివద్దకు పోయెడివారు కేవలము వందమంది మాత్రమే అని చెప్పవచ్చును.
యోగి అయిన వాడు తనలోని గుణములను (మాయను) జయించిన
వాడై, అదే మార్గమును ఇతరులకు కూడా చూపుచుండును, బాబా అయిన
వాడు తనలోని గుణములను జయించక అందులోనే (మాయలోనే)
చిక్కుకొనినవాడై, ఇతరులను కూడా మాయలోనే ఉండునట్లు చేయుచుండును.
మాయ అనునది దేవునికి వ్యతిరిక్తముగా పని చేయునది. దానిని ఇస్లామ్
మతములో సైతాన్ అనగా, క్రైస్తవ మతములో సాతాన్ అని అనుచుందురు.
మాయ అన్ని మతములలోను దేవునివైపు ఎవరినీ పోకుండా చేయుచుండును.
బాబా అనబడు వ్యక్తి కూడా మాయవశములో ఉండుట వలన అతనికి
కూడా 'ఆశ' అను గుణము బలముగా ఉండును. ఆశ అను గుణముచేత
తాను ధనికుడు కావలెనను ఉద్దేశము అతనిలో ఉండెను. దానికి తగినట్లు
మాయ అతని మహత్యములను బయటికి చూపుట వలన ప్రజలందరూ
బాబావద్దకు చేరడము తమకు ఏదో మంచి జరిగినదనీ ఆయనకు కానుకలు
ఇవ్వడము జరిగెడిది. అంతేకాక ఎందరో ధనికులు తమదగ్గరున్న
నల్లధనమును బాబాకు ఇస్తే తమకు బాబాద్వారా మంచి జరుగునని తలచి
కొన్ని కోట్ల ధనమును ఆయనకు ఇచ్చెడివారు. ఇట్లు బాబాలైన వారు
అనతికాలములోనే వేలకోట్లకు, లక్షల కోట్లకు అధిపతులైపోవుచున్నారు. ఈ
విధముగా చేరు ధనము బాబా అయిన వ్యక్తి యొక్క జేబులు, సంచులు,
మూటలు నిండిపోయి చివరకు వజ్రాలరూపములోనూ, బంగారు రూపము
లోనూ ధనము ఉండి పోవుచున్నది. అలా ఉంటూ మితిమీరి ఎక్కువైన
ధనముతో బాబా తన ఉదారత్వమును చాటుకొనుటకు, ప్రజలలో పేరు
ప్రఖ్యాతులు సంపాదించుకొనుటకు ప్రజల కొరకు వినియోగించును. అలా
తన ఉదారత్వమును బయటికి చూపుటకు ఉచిత విద్య, ఉచిత భోజనము,
ఉచిత నీరు బీద ప్రజలకు అందించి తాను ప్రజలకు సేవ చేయును.
ఆ విధముగా ప్రపంచములో మనిషికి అవసరమైన వాటిని కొందరికి
బాబా అందించుట వలన బాబా తన భక్తులలోనే కాకుండా, ఇతర ప్రజా
నీకములో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనును. బాబాగారు
ప్రభుత్వము చేయలేని పనిని కూడా చేస్తున్నాడనీ, ఎందరికో ఎన్నో విధముల
ఉపయోగపడుచున్నాడనీ, విద్య, వైద్యములను అందిస్తున్నాడనీ, మంచి నీరు
లేనిచోట నీరునూ, కరువున్నచోట ప్రజలకు ఉచిత భోజనమునూ అందిస్తున్నా
డనీ ఎందరో ఆయనను ప్రశంసించుచుందురు. బాబా నిస్వార్థముగా ప్రజలకు
సేవ చేస్తున్నాడను వార్త విదేశముల వరకు ప్రాకి పోవును. అప్పుడు అక్కడున్న
ధనికులు బాబాగారు చేయుచున్న సేవలో తాముకూడా భాగస్వాములు
కావలెనని, వారు కూడా కోట్లాది రూపాయలను బాబాగారికి ఇవ్వడము
జరుగుచున్నది. ఈ విధముగా బాబా ధనికుడై, అందులో కొంత ప్రజలకు
వినియోగించడము వలన ప్రజల దృష్ఠిలో బాబాగారు ప్రత్యక్షదైవముగా,
మనిషి రూపములోనున్న దేవునిగా చలామణి అయిపోవుచుండును.
విధముగా బాబా అను వ్యక్తి ఉండగా, యోగి అను వ్యక్తి తాను ప్రజలకు ఏ
విధమైన ప్రపంచ సహాయమును చేయకుండా పేదవారికి ఎటువంటి సేవ
చేయకుండా తన జ్ఞానమును మాత్రము ప్రచారము చేయుచూ, మనిషికి
అన్నిటికంటే ముఖ్యము దైవజ్ఞానమని చెప్పుచుండెను. ఒక దినము ఒక
పత్రికా విలేఖరి యోగివద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగాడు, అవి ఇలా
ఉన్నాయి.
విలేఖరి :- బాబాగారు ప్రజలకు ఎన్నో కోట్ల డబ్బులు ఖర్చుపెట్టి సేవ
చేస్తున్నారు. ఎందరికో విద్యా, వైద్య సదుపాయములు కల్పించాడు. ఒక
జిల్లాకు నాలుగువందల కోట్లరూపాయలు ఖర్చుపెట్టి బీద ప్రజల అవసరాలను
తీర్చాడు. అటువంటి వాటిలో మీరు ఒక్కటైనా ప్రజలకు చేశారా? మీరు
ప్రజలకు ఏమి చేయుచున్నారు?
యోగి :- బాబాగారు చేయుచున్న ప్రజాసేవలలో నేను ఏ ఒక్క సేవ కూడా
చేయలేదు. నేను అలా చేయదలచుకోలేదు. నేను అలా చేయవలెనన్నా
నావద్ద అంత డబ్బు లేదు. నాకు ఎవరూ ప్రజాసేవకనిగానీ, నాకని గానీ
ఎలాంటి ధనము ఇవ్వలేదు. అందువలన నేను బాబాగారు చేయుచున్న ఏ
సేవా చేయలేదు. ఇంకా వివరముగా చెప్పితే నేను యోగిని, ఆయన బాబా.
బాబా అను వ్యక్తికి, యోగి అను వ్యక్తికి ఏ విషయములోనూ పోలికలుండవు,
ఉండకూడదు. ఒక డాక్టర్కు, యాక్టర్కు ఎట్లు తేడా ఉండునో అట్లే ఒక
యోగికి, బాబాకు అన్నిటిలోనూ తేడా ఉండును. డాక్టర్ చేసిన వైద్యమును
యాక్టర్ చేయలేడు. అట్లే యాక్టర్ చేసిన నటనను డాక్టర్ చేయలేడు. అదే
విధముగా యోగియొక్క మనస్తత్వమునకూ, బాబాయొక్క మనస్తత్వమునకూ
ఎంతో తేడా ఉండును. బాబా ఎప్పుడూ ప్రపంచ సంబంధముగా యోచిస్తాడు,
ప్రపంచ సంబంధముగా చేయాలనుకుంటాడు. అయితే యోగి అయినవాడు
ఎప్పుడూ ప్రపంచ సంబంధముగా యోచించడు, ప్రపంచ సంబంధమైన
పనులను చేయడు. యోగి ఎప్పుడూ దైవసంబంధముగా యోచిస్తాడు. అలాగే
దైవసంబంధమైన పనులనే చేస్తాడు. అశాశ్వతమైన ప్రపంచ పనులను తాను
చేయడు, ఇతరులను కూడా చేయనివ్వడు. అందువలన నాకూ, బాబాకూ
ఎటువంటి పోలికలు ఉండవు. బాబా మనుషులకు అశాశ్వితమైన వాటిని
ఇస్తున్నాడు. శాశ్వతమైన దానిని ఇవ్వడము లేదు. ప్రజలకు దైవజ్ఞానమును
అందివ్వడము అన్నిటికంటే మించిన సేవయగును. నేను ప్రజలకు దైవ
జ్ఞానమును ఇచ్చి శాశ్వతమైన మంచిని చేయుచున్నాను. ఆయన (బాబా)
విద్య, వైద్యములనిచ్చి అశాశ్వతమైన సేవ చేయుచున్నాడు, ప్రపంచ
సంబంధమైనవి ఏవీ కూడా శాశ్వతమైనవి కావు. అందువలన ఆయన
శాశ్వితమైన మంచి పనిని ప్రజలకు చేయడము లేదని చెప్పుచున్నాను.
విలేఖరి :- ఒక మనిషి అవసరానికి పనికి వచ్చేదానిని బాబాగారు చేయు
చున్నారు. మీరు అవసరానికి పనికిరాని దానిని చేస్తామంటున్నారు.
అవసరానికి పనికిరానిది ముఖ్యముకాదు కదా! దానివలన ప్రజల అవసర
నిమిత్తము అందించు సేవయే గొప్పదిగానీ, మీరు చేయునది గొప్పది కాదు
కదా!
యోగి :- నీవు ఒక విలేఖరివి. అయినా నీ పేరులో ఉండే అంతరార్థము
నీకు తెలియదు. నీవు కేవలము వార్తలను వ్రాసేవాడినే అనుకొంటున్నావు.
అలాగే ప్రజలు అను పేరులో ఉండే అంతరార్థము ప్రజలకు తెలియదు.
అవసరాల కొరకు బ్రతికేవారమని అనుకొంటున్నారు. అయితే విలేఖరిలో
ఏ అర్థము దాగి ఉందని చూస్తే లేఖ అనగా జాబు అనీ, ఉత్తరము అనీ
ఉన్న సమాచారమును లిఖితముగా చూచునదనీ తెలియుచున్నది. లేఖరి
అనగా సమాచారమును వ్రాయువాడు లేక తెలియజేయువాడు అని
చెప్పవచ్చును. విలేఖరి అనగా విశేషమైన సమాచారమును అందించువాడని
అర్థము. ఇది చాలామంది విలేఖరులకే తెలియదు. అదే విధముగా “జ”
అంటే పుట్టుటయనీ “ప్ర” అంటే ముఖ్యమైన లేక ప్రధానమైన అనీ అర్థము
గలదు. 'ప్రజ' అనగా విశేషమైన పుట్టుకగలవాడనీ లేక ప్రాధాన్యతమైన
జన్మ పొందినవాడనీ, లేక ముఖ్యమైన జన్మ అని అర్థము నివ్వగలదు. అయితే
ఏ మనిషికీ ప్రజ అను శబ్దమునకు అర్థము తెలియదు. తనది అన్ని జన్మలకంటే
బుద్ధిలో ప్రాధాన్యతగల జన్మయనీ, దానికి తగినట్లు ప్రవర్తించవలెననీ ఎవరూ
అనుకోవడములేదు. మనిషి జన్మించిన తర్వాత తన జీవితములో ఏది
ముఖ్యమైనదో, తాను ఏ దానిలో ప్రాధాన్యతగలవానిగా బ్రతకవలెనో
తెలియకుండా అప్రజగా, అప్రాధాన్యముగా బ్రతుకుచున్నాడు. అటువంటి
వారే ప్రాధాన్యత లేని ప్రపంచ సుఖముల కొరకు ప్రాకులాడుచున్నారు.
అశాశ్వతమైన ప్రపంచ కోర్కెల కొరకే తమ బుద్ధిని ఉపయోగించుచున్నారు.
తన విషయము తనకే తెలియని మనిషి తనకు ఏది అవసరమో, ఏది
అనవసరమో తెలియక అనవసరమైన వాటిని అవసరమనుకొనీ, అవసరమైన
వాటిని అనవసరమనీ అనుకొనుచున్నాడు. అందువలన మనిషికి అవసరమైన
కూడు, గుడ్డ, విద్య, వైద్యములను అందివ్వాలని అనుకొంటున్నాడు. కానీ
అవి అనవసర విషయములనీ ఏనాడో కర్మచేత నిర్ణయింపబడినవనీ, ఏ
సమయానికి ఏది లభించవలెనో అదియే లభించి తీరుననీ తెలియక తానే
సంపాదించుకొంటున్నానని ఒకడనుకుంటే, నేను ఇస్తున్నానని మరొకడు
అనుకొంటున్నాడు. వాస్తవానికి ప్రపంచ విషయములు కర్మాధీనమనీ అదియే
మనలను ప్రేరేపించి ఒక్కొక్కరి చేత ఒక్కొక్క పని చేయిస్తుందని తెలియకున్నారు.
మాకు కర్మ విషయము తెలుసు, కనుక మేము ప్రపంచ విషయములలో
ఎవరికీ ఏమీ చేయడములేదు. మేము ఏమి చేసినా దైవజ్ఞాన విషయములోనే
సేవ చేస్తున్నాము. మనిషికి అవసరమైనది దైవజ్ఞానము. అనవసరమైనది
ప్రపంచ విషయము. మనిషికి అవసరమైన జ్ఞానమును మేము ప్రజలకు
అందిస్తున్నాము. అట్లు చేయుటను మేము మనుషులకు సేవ చేసినట్లుగా
భావించడములేదు. మనుషులకు జ్ఞానమును తెలిపినా, దానిని మేము దేవుని
సేవగా భావించుచున్నాము.
బాబా అను వారు ఎవరైనా దేవునికి సేవ చేయకుండా మనుషులకు
సేవ చేస్తూ, దానిని మానవసేవయే మాధవసేవగా చెప్పుకొనుచున్నారు.
మానవసేవ కూడా వారు ఎంతమటుకు చేయుచున్నారో కొంత ఆలోచిస్తే
అర్థమైపోతుంది. వారి జేబులు నిండిపోయి చివరకు ఒలికిపోవుదానిని ప్రజలకు
ఖర్చు చేయుచున్నారు. కొన్ని లక్షల కోట్లలో నాలుగు లేక ఐదు వందల
కోట్లు ఖర్చు చేస్తే, అది బయటికి పెద్దమొత్తముగా కనిపించినా, దైవము
లెక్కలో అది పెద్ద దానముగా లెక్కించబడదు. ఉన్న దానిలో ఎంత ఇస్తున్నావని
దేవుడు చూస్తున్నాడుగానీ, ఇంత ఇచ్చావని మాత్రము చూడలేదు. పదిమంది
వేల రూపాయలను దానము చేసినపుడు, పదకొండవవాడు పది రూపాయలు
మాత్రమే దానము చేశాడట. చివరకు ఎవరు ఎక్కువ దానము చేశారని
ప్రశ్నించగా, పది రూపాయలు దానము చేసినవాడే ఎక్కువ దానము చేసినట్లు
తేలిపోయింది. ఎందుకనగా మిగతావారు తమకున్న దానిలో కొంత మాత్రమే
ఇచ్చారు, కానీ పది రూపాయలు ఇచ్చినవాడు తన దగ్గరున్నదంతా ఇచ్చి
వేశాడట. ఉన్నదంతా ఇచ్చినవాడు గొప్పగా ఇచ్చినవాడనీ, ఉన్నదానిలో
రవ్వంత మాత్రము ఇచ్చినవాడు గొప్పగా ఇచ్చినవాడు కాదనీ తెలిసిపోయినది.
అందువలన బాబా వందలకోట్లు డబ్బును దానముగా ఇచ్చినా, అది
గొప్పదానము కాదు. తనకు ఉన్న దానిలో కొంతే ఇచ్చినవాడుగా లెక్కించ
బడుచున్నాడు.
దానములో సూత్రమును తెలియని ప్రజలు కొద్దిగా ఇచ్చిన బాబాను
గొప్పగా ఇచ్చిన వానిక్రిందికి జమకట్టుకొనుచున్నారు. ఇటువంటి బాబాలను
పెద్దగా చెప్పుకొనుచు, దానములలో అన్నిటికంటే మించిన దానము జ్ఞాన
దానమని తెలియనివారు జ్ఞానదానము చేయు యోగులను తక్కువగా లెక్కించు
కొనుచున్నారు. అటువంటి పేరు ప్రఖ్యాతులుగాంచిన తపస్విబాబా అను
వ్యక్తియూ మరియు యోగులలో పేరుగాంచిన రాజయోగానంద అను వ్యక్తియూ
ఈ సత్యాన్వేషణ కథలో గలరు. ఈ కథ ఎక్కువ బాబా చుట్టూ మరియు
యోగి చుట్టూ తిరుగుచూ, వారి నిజ స్వభావమును బయట పెట్టగలిగింది.
చివరకు బాబాలు కూడా మరణిస్తారనీ, మరణించినప్పుడు సంపాదించుకున్న
ఆస్తులూ, పేరు ప్రఖ్యాతులూ అన్నీ ఇక్కడే నిలిచిపోవుననీ, ఏ ఒక్కటీ కూడా
బాబా వెంటపోవనీ తెలిపింది. యోగి చనిపోతే అతని వెంటపోవునది అతని
యోగశక్తియనీ, అది శరీరము వెంట జగతిలో మిగలక యోగి వెంటపోవుననీ
సత్యాన్వేషి కథలో తెలుపడమైనది. అందువలన ఈ గ్రంథమును అందరూ
చదివి జ్ఞానము యొక్క విలువను తెలుసుకోగలరని విశ్వసిస్తున్నాము.
ఇట్లు
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
సత్యాన్వేషి కథ.
1) జ్ఞాన, అజ్ఞానముల మధ్య జరుగు పోరాటము సత్యాన్వేషి.
2)బాబాల మహత్యాల మర్మములను తెలుపు సంచలన కథ సత్యాన్వేషి.
3) మాంత్రికులకు, యోగులకు మధ్య జరుగు ఘర్షణ సత్యాన్వేషి.
4) యంత్రశక్తికీ, మూలికాశక్తికీ మధ్య తేడా తెలుపునది సత్యాన్వేషి.
5) గురు శిష్యుల మధ్య సంబంధమును తెలియజేయునది సత్యాన్వేషి.
6) మానవునికి తెలియని ఎన్నో రహస్యములను తెలుపునది సత్యాన్వేషి.
7) బ్రహ్మవిద్యలో సంచలన సూత్రములను తెలియజేసినది సత్యాన్వేషి.
8) ప్రపంచ ధనమునకూ, జ్ఞాన ధనమునకూ మధ్య అగాధమును
తెల్పినది సత్యాన్వేషి.
9) విషమునకు విరుగుడు ఔషధము, మాయకు విరుగుడు యోగము
అని తెల్పినది సత్యాన్వేషి.
10) మంత్రాల గారడీ, యంత్రాల సత్తా, అంజనాల పనిని గురించి
తెలిపినది సత్యాన్వేషి.
11) షట్ శాస్త్రములలో బ్రహ్మవిద్యా శాస్త్రమే గొప్పదని తెల్పినది సత్యాన్వేషి.
12) యోగుల ఔన్నత్యము, భోగుల కుటిలత్వమును గురించి తెల్పినది
సత్యాన్వేషి.
13) ఆధ్యాత్మిక విద్యలో మూఢనమ్మకములను ఖండించునది సత్యాన్వేషి.
14) సాటి మనిషిని చిన్న చూపు చూచు అధికార మదమును ఖండించునది
సత్యాన్వేషి.
(ఇందులోని పాత్రలూ, సంఘటనలూ కేవలము కల్పితము. ఎవరినీ
ఉద్దేశించి వ్రాసినవి కావు. కానీ ఇందులోని జ్ఞానమూ, వైద్యమూ,
మంత్రములూ, మహత్యములూ అన్నీ వాస్తవమే.)
సత్యాన్వేషి కథ
మనిషి భౌతిక జీవితము ముఖ్యముగ మూడు బలముల మీద
ఆధారపడి ఉన్నది. ఒకటి శరీరబలము, రెండు బుద్ధిబలము, మూడు
ధన బలము. పుట్టుకతో వచ్చునది శరీరబలము, అందువలన దీనిని
ఒకటవదిగా చెప్పుకొన్నాము. పుట్టిన తర్వాత ఐదారు సంవత్సరములనుండి
వచ్చునది బుద్ధిబలము. అందువలన రెండవదిగా చెప్పుకొన్నాము.
యుక్తవయస్సు తర్వాత వచ్చునది ధనబలము. కావున చివరి మూడవదిగా
చెప్పుకొన్నాము. ఈ మూడు బలములు ఒక మనిషికి తప్పనిసరి, అయినా
అవి అందరికీ ఒకేలాగున ఉండవు. బయటికి ఈ మూడు బలములు
అందరికి తెలిసినవే, అయినా అవి అందరికీ ఒకేలాగున ఉండవు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉండును. మూడు బలములలో రెండు
ఉండి, ఒకటి లేకపోవచ్చును, ఒకటి ఉండి రెండు లేకపోవచ్చును, మూడు
ఉండినా ఒక బలము 10 శాతము, ఒక బలము 40 శాతము, మరియొక
బలము 50 శాతము ఉండవచ్చును. ఈ బలములు వారివారి కర్మ మీద
ఆధారపడివుండును, కావున ఒక్కొక్కరికి ఒక్కొక్క శాతములో ఉండును.
జగతిలో ఒకరికున్నట్లు మరొకరికి ఉండడము లేదు, కొద్ది తేడాతోనైనా
వేరువేరు బలములు ఉండడము తెలియుచున్నది.
పుట్టుకలో మూడవది అయిన ధనబలము జగతిలో మొదటి స్థానము
ఆక్రమించినది. రెండవస్థానమును బుద్ధిబలము ఆక్రమించగా, శరీర
బలము మూడవ స్థానమును ఆక్రమించినది. ధన బలము ఒక్కటి ఉంటే
జీవితములో అన్నీ ఉన్నట్లే అగుచున్నది. ఎక్కువ అవసరములన్నియూ
ధనము వలననే తీరుచున్నవి. ఒక్క ధనబలముచేత జగతిలో ఎక్కువ
పనులు జరిగిపోవుట వలన కొందరు “ధనమూల మిదమ్ జగత్" అని
అన్నారు. వాస్తవానికి "కర్మమూల మిదమ్ జగత్" కాగా, ధన బలమునకు
కూడా కర్మే కారణము కాగా, జ్ఞానము తెలియని ప్రజలు కనిపించక
వెనుకవుండి ఆడించు కర్మను తెలియక, కనిపించు ధనమునే అన్నిటికి
మూలమనుకొంటున్నారు. ధనబలము ఉన్నంతమాత్రమున దానిచేత
విద్యావంతున్ని కొనగలుగుచున్నాడు. శరీరబలముగల వానిని కొనగలుగు
చున్నాడు. అందువలన శరీరబలము లేనివాడుగానీ, చదువురాని
విద్యాబలము లేనివాడుగానీ, ఒక్క ధనబలముచేత సులభముగా
బ్రతుకగలుగుచున్నాడు. జగతిలో ఎక్కడైనా ధనమున్న వానికి గల మర్యాద,
విద్య ఉన్నవానికిగానీ, శరీర ధృఢత్వమున్న వానికిగానీ లేదు. అందువలన
శరీర బలమున్న పహిల్వాన్ గానీ, విద్యాబలమున్న పండితుడుగానీ ధనమున్న
వాని క్రింద పని చేయుచున్నాడు. చివరకు దేవాలయములలోనున్న
దేవుళ్ళవద్ద కూడా ధనమున్న వానికే విలువున్నది. అన్ని రంగములలో
కూడా ధనమున్న వానికే విలువవుండుట వలన, అందరి ఉద్దేశ్యములో
ధనమును (ధన బలమును) పొందాలని తప్ప వేరు ఆలోచనే లేదు. నేడు
కష్టపడి ఉన్నత విద్యలు చదువువారంతా, ఆ చదువుల వలన ఉద్యోగమును
పొంది, ధనమును సంపాదించు ఉద్దేశము తప్ప మరొక ఉద్దేశము లేదు.
ఒక్క ధనము చేతనే ప్రపంచ అవసరములు తీరుట వలన, చివరకు జీవిత
భాగస్వామిగా వచ్చు స్త్రీ కూడా ధనమున్న వానినే చేసుకోవాలనుకొనుచున్నది.
ఇంత తీవ్ర స్థాయిలో ధనబలముండుట చేత దానిముందర ఏ బలము
నిలువలేదు. ధనబలముకంటే మించిన మర్యాద ఏ బలమునకూ లేదు.
ఇప్పుడు మనము చదువబోవు కథ కూడా శరీరబలమూ, విద్యాబలమూ
ఉండి ఒక్క ధన బలములేని వ్యక్తిది, అతనే సత్యాన్వేషి, అతని పేరు రాఘవ.
ఈ లోకములో డబ్బు లేకుండా ఏ కార్యమూ జరుగదు.
అందువలన అందరి చూపు దానిమీదనే కేంద్రీకృతమై ఉంటుంది. అందరి
ధ్యాస డబ్బు మీదనే ఉండినా ఎందరికి డబ్బు చేకూరుచున్నది? అని
యోచిస్తే జవాబులు అనేక విధములుగా ఉంటాయి. కర్మనుబట్టి డబ్బు
ఉండుట వలన ఎవడు ఎన్ని ప్రయత్నములు చేసినా వాని కర్మ ప్రకారమే
డబ్బు చేకూరడము జరుగుచున్నది. కర్మ విధానము తెలియని మనుషులు
తమ ప్రయత్నము వలననే డబ్బు లభించునని ప్రయత్నము చేయుచున్నారు.
ఆ పనిలో నిత్యమూ గెలుపు ఓటములు పొందుచూనే ఉన్నారు. శరీర
బలమూ, బుద్ధి బలమూ రెండూ శరీరములో తయారుకాగా ఒక్క ధనబలము
బయట ఏర్పడుచున్నది. డబ్బును మానవుడే సృష్టించుకొనుచున్నాడు.
బయటికి కనిపించు శరీరమునూ, అందులోని కనిపించని బుద్ధినీ ప్రకృతి
తయారు చేయగా డబ్బును మాత్రము యంత్రములచేత మనిషే తయారు
చేయుచున్నాడు. మనిషి తయారుచేసిన డబ్బుకు మనిషే దాసోహమై
పోయాడు. జగతిలో మాయ అనునది శరీరములో గుణరూపములో
ఉండినా, శరీరము బయట డబ్బును చూపిస్తూ గుణములలో ముంచి
వేయుచున్నది. బయట పెద్ద మాయగా కనిపించు డబ్బుకు మానవుడు
లొంగిపోయి తన జీవితమునుగానీ, జీవితమును ఇచ్చిన దేవున్నిగానీ,
దైవజ్ఞానమునుగానీ విస్మరించి బ్రతుకుచున్నాడు. డబ్బు కోసమే మనిషి
అన్ని చింతలూ చేస్తూ, చివరకు తన ఆత్మను గురించిగానీ, తనను
గురించిగానీ మరిచిపోయి ప్రపంచములో బ్రతుకుచున్నాడు.
ఇలా జరుగుచున్న కాలములో యుక్తవయస్సుకు వచ్చిన రాఘవ
తన జీవితములో అడుగుపెట్టాడు. రాఘవకు తన తల్లి తండ్రులు చిన్న
వయస్సులోనే చనిపోయిన దానివలన అతను జీవితములో ఒంటరివాడై
పోయాడు. రాఘవకు శరీర బలము ఉన్నది, అలాగే బుద్ధిబలమూ
ఉన్నది. ఒక్క ధనబలము మాత్రము లేదు. భూమిమీద అందరి చూపూ
ధనబలము మీదనే ఉండుట వలన, రాఘవ అందమైన శరీరము
గలవాడైనా, అందరికంటే ఎంతో ఎక్కువ తెలివిగలవాడైనా, అతనిని మిగతా
వారు ఏమాత్రము లెక్కించక, ఏమాత్రము విలువనివ్వకపోవడమేకాక
అతనిని గౌరవముగా కూడా పలుకరించెడివారు కాదు. రాఘవకు ఆస్తిలేదని
అతనిని తక్కువ భావముతో చూడడమేకాక, అతనికి అమ్మాయినిచ్చి పెళ్ళి
చేయడానికి కూడా వెనుకడుగు వేసెడివారు. తనకు బయటి సమాజములో
ఏమాత్రము విలువలేదని గ్రహించగలిగిన రాఘవ, అటువంటి మనుషులతో
తనకు ఏమాత్రము పని లేదనుకొన్నాడు. ఇక అటువంటి సమాజములో
ఇమడ లేననుకొన్నాడు. ఈ సమాజమును వదలి దూరముగా పోవాలను
కొన్నాడు. అప్పుడే అతని తలలో ఎన్నో యోచనలు ప్రశ్నల రూపములో
వచ్చాయి. "ఈ మానవజాతి ఎందుకు సృష్టించబడినది? ఈ మానవ
జాతిలోనే ఇన్ని విధముల కుత్సితములు, కుతంత్రములు ఎందుకున్నాయి?
సాటి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించక డబ్బును బట్టి మర్యాద ఇవ్వడమెందుకు?
దేవుడెందుకు ఇటువంటి మనుషులను సృష్టించాడు? దేవుడు అందరికీ
సమానమైనవాడైతే అందరినీ సమానముగా సృష్టించక కొందరిని
ధనికులుగా, కొందరిని ధనము లేనివారిగా ఎందుకు సృష్టించాలి?
వాస్తవానికి మనుషులకు దేవుడు సమానుడా? లేక దేవునికి మనుషులు
సమానులా? ప్రపంచములో జరుగుచున్న దానినిబట్టి చూస్తే డబ్బున్న
దేవునికే మనిషివద్ద మర్యాదవున్నది. డబ్బులేని దేవునికి కూడా మర్యాద
లేదు. అలాగే డబ్బున్న ధనికునికే దేవుని వద్ద మర్యాదకలదు, డబ్బులేని
వానికి దేవుని దర్శనము కూడా దొరకదు. ఈ విషయము ఎన్నో
దేవాలయములలో కనిపిస్తూనే ఉన్నది. దీనినిబట్టి ఇటు ప్రపంచ విషయములే
కాకుండా, అటు దేవుని భక్తి కూడా డబ్బుతోనే ముడిపడి వున్నదని
తెలియుచున్నది. డబ్బులేనివాని తెలివి పనికిరాదు. అలాగే డబ్బులేని
వాని బలము పనికిరాదు. కేవలము ఒక డబ్బుతోనే తెలివీ, బలమూ
రెండూ లేకున్నా అన్ని పనులూ నెరవేరగలవు. ఇటువంటి డబ్బు
మహత్యమున్న ఈ సమాజములో డబ్బులేని నేను ఇమిడి బ్రతకలేను.
కావున నేను ఈ సమాజమును వదలి డబ్బు విలువ తెలియని, డబ్బు
విలువలేని జంతు ప్రపంచమున్న అడవిలోనికి పోయి జంతువుల మధ్యలో
బ్రతకడము మంచిది" అని అనుకొన్నాడు.
ఈ సమాజమును వదిలి పోవాలను కొన్న వెంటనే, రాఘవ అరణ్య
మార్గమునుబట్టి పోయాడు. ఎంతో తెలివీ, బలమూ ఉన్న రాఘవ
అరణ్యమును చేరి అక్కడ లభించు ఫలముల చేత కడుపు నింపుకొనుచూ,
ప్రకృతి సౌందర్యములను చూచి ఆనందపడుచూ, మానవ సమాజములో
లేని సుఖమును అక్కడ అనుభవిస్తూ ప్రశాంతముగా జీవితమును గడప
సాగెను. రాఘవ నివసించునది భయంకరమైన అడవి. ఆ అడవిలో
ఎన్నో మృగములు మనిషి యొక్క భయము లేకుండా విచ్చల విడిగా
సంచరించేవి. ఆ అడవిలో కొందరు చెంచు జాతి ప్రజలు అక్కడక్కడ
కొన్ని గూడెములలో నివసిస్తున్నారు. వారు కూడా ఎక్కువగా అడవిలో
దొరుకు దుంపలు, తేనె, కొన్ని రకముల పండ్లు, కొన్ని రకముల ఆకులను
తింటూ, కొన్ని అడవి జంతువుల చర్మములను దుస్తులుగా వాడుచూ,
అక్కడక్కడ పారు సెలయేర్లలోని నీరు త్రాగుచూ హాయిగా జీవించెడివారు.
వారికి డబ్బుతో పనేలేదు. అందువలన ప్రపంచములోని మనుషుల మాదిరి
డబ్బు మాయలో పడక, అవినీతి, అన్యాయము లేని బ్రతుకు బ్రతుకుచూ
మనశ్శాంతిగా కాలమును గడిపేవారు. అడవిలో కూౄరమృగములున్నప్పటికీ
అవి నివసించు ప్రాంతములోనికి చెంచు జాతికి చెందిన ఆటవికులు పోయే
వారు కాదు. అలాగే ఆటవికులున్న ప్రాంతములోనికి కూౄరమృగములు
వచ్చేవి కావు.
అటువంటి అడవిలో రాఘవ ఒంటరిగా ఇటు కూౄరమృగములు
గానీ, అటు చెంచు జాతివారుగానీ లేని ఒక ప్రాంతములో దాదాపు ఒక
నెల రోజులుగా ఉంటూ వచ్చాడు. ఒకనాడు రాఘవ నివాసమున్న
స్థలమునకు దూరముగా పులిగర్జన వినపడసాగెను. ఆ గర్జన శబ్దము
క్రమక్రమముగా దగ్గర కాజొచ్చెను. అపుడు రాఘవకు సమీప ప్రాంతములో
నున్న కుందేళ్ళూ, జింకలూ బెదురు చూపులు చూస్తూ అటూ ఇటూ
పరుగిడసాగాయి. అంతలో ఆరుమంది గల ఆటవికుల గుంపు రాఘవవున్న
ప్రాంతమువైపు పరుగిడుచూ వచ్చారు. రాఘవకు సమీపముగా పారిపోతూ
వారు రాఘవను చూచారు. పరుగిడుచున్న ఆరుమంది ఒక్కసారిగా ఆగి
రాఘవను చూచి ఆశ్చర్యపోయి "నీవు ఎవరు? ఇక్కడెందుకున్నావు? వెంటనే
పారిపో! మేము ఒక పులిని బాణముతో కొట్టాము, మా గురి తప్పి పోయింది.
పులి కోపముతో ఇటువైపే వస్తున్నది. దానికంటపడితే చంపేస్తుంది.
కనిపించకుండా పారిపో!" అని చెప్పి అక్కడినుండి వేగముగా పరుగిడి
పోయారు. వారి మాటలు విన్న రాఘవ చేయునది లేక వారి వెంటనే
పరుగిడసాగెను. అలా కొంత దూరము పోయిన తర్వాత రాఘవ దారి
తప్పిపోయాడు. ఆటవికులు ఒకవైపు పోగా, రాఘవ వారి జాడ తెలియక
మరొకవైపు పోయాడు. అలా దారి త్రప్పిపోయిన రాఘవ అలసిపోయి
నిదానముగా కాలినడక సాగిస్తూ పోవుచుండెను. అలా అలసిపోయి
నెమ్మదిగా నడుస్తూ, ఇక నాకు ఓపికలేదు ఒకచోట కూర్చోవాలనుకొను
సమయములో, అంతవరకూ తరుముచూ వచ్చిన పులి రాఘవకే ఎదురైనది.
ఆ సమయములో పులిని చూచిన రాఘవ చేయునది లేక
ఉన్నచోటనే కదలకుండా నిలబడిపోయాడు. రాఘవను చూచిన పులి
కోపముతో భయంకరముగా గర్జించి రాఘవ మీదికి రాబోయింది.
రెండడుగులు ముందుకు వేసిన పులికి కరెంట్హాక్ కొట్టినట్లయి నాలుగు
గజములు వెనక్కు ఎగిరిపడింది. అలా ఎగిరిపడిన పులి రెండవ మారు
రెట్టింపుగా గాండ్రించుచూ రాఘవ మీదికి రాబోయింది. రెండవమారు
కూడా పులికి అదే అనుభవము ఎదురైనది. ఈ మారు పులి భయపడి
వెనుతిరిగి పారిపోయింది. జరిగిన సంఘటన రాఘవకు క్రొత్త
అనుభవమును ఇచ్చినది. అపుడు జరిగిన విచిత్ర సంఘటనను ఆలోచిస్తూ
రాఘవ తాను నిలుచున్న స్థలము, చెట్టు నీడన చల్లగా ఉండుట చేత
కొద్దిసేపు విశ్రాంతి తీసుకొను నిమిత్తము ఆ చెట్టు మొదటిలోనే
కూర్చున్నాడు. పులి తనమీదికి రాబోయి, ఏదో దెబ్బతిన్నట్లు ఎందుకు
వెనుతిరిగి పోయిందో అర్థముకాక, ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోనికి
జారుకొన్నాడు. అతను మధ్యాహ్నము రెండు గంటలకు పడుకొని తిరిగి
సాయంకాలము ఆరు గంటలకు నిద్రనుండి లేచాడు. పూర్తి సాయంత్రమై
చీకటిపడు సమయమైన దానివలన ఆ రాత్రికి అక్కడే ఉండడము
మంచిదనుకొన్నాడు.
పరుగిడుచున్న ఆటవికులు తప్పిపోయిన రాఘవను గురించి
చింతించి పులికి చిక్కిపోయాడేమో అని తలచుచూ తమ గూడెమును చేరారు.
అడవిలో క్రొత్త మనిషి కనిపించినట్లు తమ గూడెము నాయకునికి తెలిపారు.
పులి తరుముచున్న సమయములో అతనిని తమవెంట తీసుకురావాలను
కొన్నా కుదరలేదనీ, అతను అడవిలో తప్పిపోయాడనీ చెప్పగా, వారి
నాయకుడు ఆ మాటలకు స్పందించి “అతను ఎవరో, ఎందుకు అడవిలోనికి
వచ్చాడో తెలియదంటున్నారు. ఈ అడవిలో ఒంటరిగా బ్రతకడము
కష్టము. ఏ మృగము ఎప్పుడైనా దాడిచేసి చంపగలదు. మనకు తెలిసి
ఊరకుండడము బాగుండదు. మీరు పోయి అతను కనిపిస్తే ఇక్కడికి
తీసుకొనిరండి” అన్నాడు. ఆ మాట విన్న చెంచువారు తమ నాయకుని
మాట ప్రకారము రెండవరోజు ఉదయమే బయలుదేరి రాఘవను వెదకుచూ
అడవిలోనికి పోయారు. అలా వెదకుచూ పోగా చివరకు రాఘవ ఉన్న
స్థలమునకు చేరి రాఘవతో తమ నాయకుని మాటను తెలిపారు. వారి
మాటలు విన్న రామవకు ప్రస్తుతానికి వారి వెంటపోవడమే
మంచిదనిపించింది.
అపుడు పులి విషయమును గురించి రాఘవను అడుగగా! పులి
తనమీదికి దాడిచేసిన విషయమూ, అది పారిపోయిన విషయమూ, అన్నిటినీ
పూసగ్రుచ్చినట్లు రాఘవ వారికి తెలిపాడు. ఆ విషయమును వినిన
ఆటవికులు రాఘవకు నీడనిచ్చిన వృక్షమే పులినుండి కాపాడిందని చెప్పారు.
అందుకు రాఘవ ఆశ్చర్యపోయి “ఈ వృక్షములో అంత మహత్యమున్నదా?
నన్ను ఎట్లు కాపాడగలిగింది” అని అడిగాడు. రాఘవ మాటలను విన్న
అడవి మనుషులలో ఒకడు " ఈ చెట్టు నీడ పులికి శత్రువులాంటిది. ఈ
వృక్షము పేరు వ్యాఘ్రశత్రువు. దీని నీడలోనికి పులి ఏమాత్రము రాదు.
ఒకవేళ పొరపాటుగా వచ్చినట్లయితే దానికి పెద్దదెబ్బ తగిలినట్లగును.
ఎవరో కొట్టినంత బాధతో వెనుతిరిగి పారిపోవును తప్ప ముందుకు రాదు.
ఈ వృక్షము యొక్క విషయము మా గూడెములోని వారందరికీ తెలుసు.
మేము అడవిలో తిరుగునపుడు పులి పంజా మా మీద విసరకుండా, అది
మమ్ములను సమీపించకుండా ఉండుటకు, ఈ చెట్టు వేరును తావెత్తులలో
పెట్టుకొని మా చేతికి కట్టుకొనివుందుము. ఎప్పుడైనా అతి ప్రమాద
సమయములో తావెత్తును తీసి చేతిలో పట్టుకొంటే పులి మా దగ్గరకు
రాజాలదు. ఈ వృక్షము యొక్క ఆకుల రసము మా అంబులకు తడిపి,
పులులను మా గూడెమువైపు రాకుండా తరిమి కొట్టుతాము. మా అంబుల
వలన తగిలిన చిన్న గాయమైనా ఈ చెట్టు పసరు ప్రభావము చేత పులిని
ఎక్కువ బాధించును. ఈ వృక్షమును మేము పులులనుండి కాపాడు అడవి
దేవతగా భావించి పూజిస్తాము. మా ఆరాధ్య దేవతైన 'భైరికాతల్లి' ఈ
చెట్టుమీద నివసిస్తుంటుందని మా పెద్దలు చెప్పుచుంటారు. నిన్ను ఆ
భైరికా దేవతే కాపాడింది" అన్నాడు. అతని మాటవిన్న రాఘవ ఆశ్చర్యపోయి
ఇలా అన్నాడు.
రాఘవ :- ఈ చెట్టులో అంత ప్రభావమున్న మాట నిజమే. నిన్న పులి
పారిపోయిన సంఘటనను చూస్తే, ఈ చెట్టులో ప్రభావమున్నదని ఎవరైనా
చెప్పగలరు.
ఆటవికులు :- నీవు ఎవరు? ఎందుకు ఈ అడవిలో ఉన్నావు?
రాఘవ :- నేను జనారణ్యములో నుండి వనారణ్యములోనికి కావాలనే
వచ్చాను. నాకు మనుషుల మనో భావములు సరిపోక ఇక్కడికి వచ్చాను.
నేను వచ్చి కేవలము నెల రోజులే అయింది. ఇంతలోనే ఈ సంఘటన
జరిగింది.
ఆటవికులు :- నీవు అరణ్యములో ఉండాలంటే ఒంటరిగా ఉండుటకు
కుదరదు. ఏ జంతువు వలనైనా ప్రమాదము జరుగవచ్చును. అందువలన
నీవు మా గూడెములోనికి వచ్చి ఉండుట మంచిదగును.
రాఘవ :- అలాగే! మీవెంట మీరున్న గూడెమునకు వస్తాను.
(అందరూ కలిసి గూడెమునకు వెళ్ళారు. గూడెమునకు కుల
పెద్ద అయిన మల్లుదొరకు రాఘవను గూడెము వారు పరిచయము చేశారు.
రాఘవ తెలివైనవాడు కనుక, ఆ గూడెము వారినుండి అడవికి సంబంధించిన
కొన్ని వృక్షములను, వృక్షముల శక్తులను గురించి తెలుసుకో com
ఒక నాలుగు రోజుల తర్వాత గూడెమునకు పెద్దయిన మల్లుదొరతో
బాగా పరిచయమేర్పరుచుకొన్నాడు. రాఘవ మీద మల్లుదొరకు మంచి
అభిమానము పెరిగింది. అలా ఉన్న సమయములో మల్లుదొరను రాఘవ
అడగను మొదలు పెట్టాడు.)
రాఘవ :- అయ్యా! ఈ అడవిలో వ్యాఘ్రశత్రువు వృక్షములాగ మరి ఏవైనా
మహత్తుగల చెట్లున్నాయా?
మల్లుదొర :- ఎన్నో ఉన్నాయి. కొన్ని చెట్లు గలవు, మరికొన్ని తీగలు
గలవు. అటువంటి చెట్లను మేము గౌరవించి పూజిస్తాము. అటువంటి
చెట్ల ఆకులను కోయాలన్నా, లేక తీగలను తెచ్చుకోవాలన్నా ముందు వాటికి
పూజచేసి తర్వాత ఆ చెట్లను ముట్టుకుంటాము. అవి మాకు దేవతలతో
సమానము. వాటి వలననే మేము రోగాల బారినపడకుండా ఆరోగ్యముగా
ఉన్నాము.
రాఘవ :- నోరులేని చెట్లు, నడువలేని తీగలు, నోరుగల మనుషులకు
ఇంత మేలు చేస్తున్నాయా?
మల్లుదొర :- అన్నీ వున్న మనిషి సాటి మనిషిని కాపాడలేకపోయినా,
సహాయము చేయకపోయినా, నోరులేని చెట్లే మనిషిని ఎన్నో విధముల
కాపాడుచున్నవి.
రాఘవ :- అయ్యా! నాకు మీరు చెప్పు విషయములు ఎంతో ఆశ్చర్యముగా
ఉన్నవి. ఎంతో గొప్పవైన ఈ చెట్లను గురించి తెలుసుకోవాలని ఉన్నది.
దయచేసి నాకు ముఖ్యమైన చెట్ల గురించి, వాటి పనితనమును గురించి
తెలుపుదురని కోరుచున్నాను.
మల్లుదొర :- ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మూలికాశక్తి కల్గివుండుట సహజము.
ఔషధముకాని ఆకు ఏదీ భూమిమీద లేదు.
ప్రతి చెట్టు ఆకు ఒక రోగమునకు ఔషధముగా పని చేయును.
వాటిని గురించి నిదానముగా నీవు ఇక్కడేవుండి తెలుసుకోగలవు. అయితే
మాకు కూడా అంతుదొరకని ఒక చెట్టు ఉన్నది. ఆ జాతి చెట్లు ఎన్నో
అడవిలో ఉన్నాయి. అయితే వాటిలో ఏ దానికీ లేని ఒక ప్రత్యేకశక్తి ఆ
ఒక్క చెట్టుకు మాత్రము గలదు.
రాఘవ :- ఏమిటా చెట్టు? ఎక్కడుంది? దానికి గల ప్రత్యేకత ఏమిటి?
వివరముగా చెప్పండి.
మల్లుదొర : అది చూచేదానికి మామూలు మర్రిచెట్టు. ఈ అడవిలో ఎన్నో
మర్రిచెట్లు ఉండినా వాటికంటే అది ఒక్కటే విభిన్నముగా ఉన్నది. ఆ చెట్టులో
ఏ ప్రభావమున్నదో గానీ, ఆ చెట్టు యొద్దకు పోయిన వారికి రోగములు
పోవుచున్నవి. దయ్యములు పట్టిన వారు అక్కడికి పోతే దయ్యములు
పోయి ఆరోగ్యవంతులగుచున్నారు. ఆ చెట్టు ఆకులను తెచ్చి తలమీద
పెట్టుకొని నిదురిస్తే తలకు సంబంధించిన రోగములన్నీ పోయాయి. ఇలా
ఆ చెట్టుకు ఎన్నో మహత్యములు గలవు.
రాఘవ :- మీరు చెప్పేకొలదీ నా మనస్సులో ఆ చెట్టును చూడాలని
పిస్తున్నది. దయచేసి ఆ చెట్టును చూపిస్తారా?
మల్లుదొర :- నీవు చూస్తానంటే మేమెందుకు చూపము? ఇప్పుడే బయలు
దేరి పోదాము పద.
(ఆ విధముగా ఇద్దరూ బయలుదేరి గూడెమునకు కొంత దూరము
లోనే ఉన్న మర్రివృక్షము వద్దకు చేరుకొన్నారు. అక్కడికి చేరిన రాఘవ
ఆశ్చర్యముగ ఆ చెట్టును చూస్తున్నాడు. చూచుటకు సర్వ సాధారణముగానున్న
మర్రివృక్షము అనేక శాఖోపశాఖలై కొన్ని ఊడలు కూడా క్రిందికి దిగి
ఉన్నాయి. అంతేకాక ఆ చెట్టుకు తూర్పు దిక్కున చెట్టు మొదలు వద్దనే
పాతిపెట్టబడిన శూలము, పాదుకలు రాఘవకు కనిపించాయి. పాదుకలను,
శూలమును చూచిన రాఘవ వాటి విషయమును తెలుసుకొనుటకు ఈ
విధముగా ప్రశ్నించాడు.)
రాఘవ :- అయ్యా! ఇక్కడున్న పాదుకలు ఎవరివి? ఈ శూలము ఎవరిది?
మల్లుదొర :- ఈ పాదుకలూ, శూలమూ రెండూ ఒక మునీశ్వరునివి.
ఇవి చాలా కాలమునుండి ఇక్కడే ఉన్నాయి. వీటిని మేము పూజిస్తుంటాము.
వీటిని ఉపయోగించిన ముని ఇక్కడే యోగము చేస్తున్నాడని మా పెద్దలు
చెప్పారు. మేము ఎప్పుడూ ఆయనను చూడలేదు. ఆయన విషయమును
మా పెద్దలు చెప్పగా విన్నాము.
రాఘవ :- ఈ మునీశ్వరుని విషయము మీ పెద్దలకు ఎలా తెలుసు?
మల్లుదొర :- మొదట మా పెద్దలే ఇక్కడ భూమిని త్రవ్వి లోపల యోగ
మందిరమును నిర్మించి ఇచ్చారు. అప్పటినుండి ఆ మునీశ్వరుడు లోపల
కూర్చొని యోగములో లగ్నమై పోయాడట. అప్పుడు లోపలికి పోయిన
ఆ యోగి ఇంతవరకు బయటికి రాలేదు. అప్పుడు మూసిన గుంతను
ఇప్పటి వరకు ఎవరూ తీయలేదు.
రాఘవ :- ఆయన ఎప్పటికీ బయటికి రానని చెప్పాడా? లేక ఎప్పటికైనా
వస్తానని చెప్పాడా? పోయేటప్పుడు ఏమీ చెప్పకుండా పోయాడా?
మల్లుదొర :- ఆయన లోపలికి పోయేటప్పుడు చెప్పి పోయాడని మా
పెద్దలు చెప్పేవారు. రాబోయే కాలములో అష్టగ్రహకూటమి జరుగుతుందట.
ఆ సమయానికి ఆయన బయటికి వస్తానని చెప్పాడట. ఆ సమయములో
దుష్టశక్తులు కొన్ని చెలరేగుతాయట. అప్పుడు ఆయన ఒక మనిషి చేత
వాటిని నివారింపజేస్తాడట. అప్పటివరకు బయటికి రానని చెప్పి పోయాడు.
ఇది రహస్యమైన విషయము ఎవరికీ చెప్పునది కాదు. అయినా నీకు
చెప్పాలనిపించింది చెప్పాను. కానీ మేము ఈ విషయమును గోప్యముగానే
ఉంచాము. ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఈ విషయమును నీవు
కూడా ఎవరికీ చెప్పవద్దు.
రాఘవ :- ఆ మునీశ్వరుడు ఎవరైనదీ మీకు తెలుసా? గతములో ఆయన
ఎక్కడుండేవాడు?
మల్లుదొర :- ఆయన ఎవరో, ఏ ప్రాంతము వాడో మాకు ఏమాత్రము
తెలియదు. మా గూడెములో ఒక మనిషి చనిపోయాడు. ఆ మనిషికి
అంత్యక్రియలు చేసి పూడ్చిపెట్టాలనుకొన్న సమయములో ఆ మునీశ్వరుడు
ఉన్నట్టుండి అక్కడికి వచ్చాడు. చనిపోయిన వ్యక్తిని గుంతలో పెట్టిన
సమయములో అక్కడికి వచ్చిన ఆయన, గుంతలో పెట్టిన వానిని చూచి
ఇతను చనిపోలేదు, నిద్రించుచున్నాడు, ఎందుకు పూడ్చుచున్నారని అడిగాడు.
అప్పుడు అక్కడున్న వారందరు ఈయన ఉదయము ఐదు గంటలకే
చనిపోయాడని చెప్పారు. ఆ మాటకు ఆ మునీశ్వరుడు నవ్వి మీరు పొర
పడినారు. ఆయన చనిపోలేదు నిద్రించుచున్నాడని తట్టి లేపాడట. అప్పుడు
చనిపోయిన మనిషి లేచి కూర్చున్నాడట. అప్పుడు ఆ మునీశ్వరున్ని అందరూ
గొప్పవ్యక్తిగ తలచి గౌరవించారు. అలా పరిచయమైన గూడెము మనుషులతో
చెప్పి, ఈ మర్రి చెట్టు క్రింద భూమిలో గదిని త్రవ్వించుకొని లోపలికి
పోయాడట. అప్పటినుండి ఈ ప్రాంతమును, ఈ చెట్టును మేము
పవిత్రముగా చూస్తుంటాము. అంతేకాక ఇక్కడున్న ఈ చెట్టునుండి మాకు
ఎంతో మేలు జరుగుచున్నది. ఈ చెట్టుచుట్టూ తిరిగితే రోగాలు పోవుచున్నవి.
రాఘవ :- అయితే మీరు చెప్పినట్లు ఇది శక్తితో కూడుకొన్న వృక్షము.
ఇక్కడుంటే మంచే జరుగుతుంది. అందువలన 24 గంటలు నేను ఇక్కడే
ఉంటాను. ఈ రాత్రికి ఇక్కడే నిద్రిస్తాను.
మల్లుదొర :- రాత్రిపూట నీవు ఒక్కనివే ఇక్కడుండడము మంచిది కాదు.
నీవు ఉండాలనుకుంటే ఇంకా కొంతమందిని గూడెము నుండి వెంట
తెచ్చుకొనివుండు.
రాఘవ :- అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను.
(ఆ రాత్రికి మల్లుదొర ఆదేశానుసారము ఎనిమిది మంది
చెంచువారు రాఘవ వెంట వచ్చి మర్రివృక్షము క్రింద పడుకొన్నారు.
రాఘవ ప్రొద్దు పోయేంతవరకు వారితో మాట్లాడుచు అక్కడి వివరములు
తెలుసుకొనుచుండెను. దాదాపు నడిరాత్రి కావచ్చింది. అంతలో ఆకాశము
మేఘావృతమైనది. ఉరుములు ఉరుముచూ, మెరుపులు మెరియుచూ
చిన్నగా వర్షపు చినుకులు పడసాగెను. అది చూచిన చెంచువారు ఇక్కడుంటే
పూర్తిగా తడిసిపోతాము, వెంటనే గూడెమునకు పోదామని రాఘవకు చెప్పగా
రాఘవ “మీరు వెళ్ళండి నేను రానని” చెప్పెను. తాను తడిసిపోయినా
ఫరవాలేదు 24 గంటలు తప్పకుండా ఇక్కడే ఉంటానని వారితో చెప్పాడు.
దానికి వారు చేయునది లేక రాఘవను అక్కడే వదలి తాము మాత్రము
గూడెమునకు పోయారు. రాఘవ ధైర్యముగా మర్రివృక్షము క్రింద ఆలోచిస్తూ
ఉండెను. అలా ఒక గంట గడిచిపోయింది. అంతవరకు ఒక రకముగా
వచ్చిన వర్షము కూడా నిలిచిపోయింది. ఆకాశములో మేఘములుండుట
వలన ఎటు చూచినా చీకటే కనిపిస్తూవున్నది. అప్పుడప్పుడు ఏవో జంతువుల
అరుపులు తప్ప మిగతా కాలమంతా నిశ్శబ్దముగా ఉన్నది. అలా
నిశ్శబ్దముగా ఉన్న సమయములో “నీవు నావద్దకు రా!” అను కంఠస్వరము
రాఘవకు వినిపించింది. ఆ మాటను విన్న రాఘవ ఉలిక్కిపడి లేచి నిలబడి,
తనను ఎవరు పిలిచారని చుట్టు ప్రక్కల చూచాడు. కానీ ఎవరూ
కనిపించలేదు. రాఘవకు ఒక ప్రక్క భయము కలుగగా, ఒక్క ప్రక్క
ఆశ్చర్యము కల్గినది. తనను ఈ నిర్జన ప్రదేశములొ ఎవరు పిలిచారని
యోచించుచుండ గానే మరియొకమారు అదే కంఠముతో అదే మాట
వినిపించింది. అప్పుడు రాఘవ "ఎవరు నీవు? నేను ఎక్కడికి రావలెను”
అని అడిగెను. రాఘవ పల్కిన మాటకు జవాబుగా మరియొకమారు ఈ
విధముగా వినిపించింది. “నేను నీ శ్రేయోభిలాషిని. నీవు భయపడవలసిన
పనిలేదు. నీవున్న స్థలమునుండి ముందుకు ఆరు అడుగులు వచ్చి, అక్కడ
కొంత మట్టిని తొలగించు. నీకు దారి కనిపిస్తుంది. ఆ దారిలో వస్తే నీవు
నావద్దకు రాగలవు.”
అప్పుడు రాఘవకు ఆ మాటలు వింటూనే, నిన్నటి దినమున
గూడెముపెద్ద చెప్పిన యోగి విషయము జ్ఞాపకము వచ్చినది. వెంటనే
మనస్సులో ఎంతో ధైర్యము, ఉత్సాహము వచ్చినది. తనను భూగర్భములో
నున్న యోగియే పిలుస్తున్నాడని తలచిన రాఘవ, సంతోషముతో ఆరు
అడుగులు ముందుకు వేశాడు. అక్కడనే ఉన్న కర్రతో తన కాళ్ళ క్రిందనున్న
భూమిని త్రవ్వను మొదలు పెట్టాడు. చీకటిగానున్నా, నూతన ఉత్సాహముతో
త్రవ్వసాగాడు. అలా రెండు అడుగుల లోతు మట్టిని త్రవ్వగానే మట్టిలేకుండా
పోయి ఇటుకలు కనిపించాయి. అంతలోనే ఆకాశములో మబ్బులు పోయి
కొంత వెన్నెల వచ్చింది. దానితో రాఘవకు కొంచెము కనిపించసాగింది.
ఆ కొద్దిపాటి వెన్నెల వెలుతురులో ఇటుకలను తొలగించాడు. అలా మూడు
వరుసల ఇటుకలను తొలగించగా క్రిందికి మెటికలున్న సొరంగము
కనిపించింది. ఆ సొరంగములోనికి రాఘవ ధైర్యముగా దిగి ముందుకు
పోగా, సొరంగము కుడిప్రక్కకు దారి కనిపించింది. అటు కుడిప్రక్కకు
తిరుగుతూనే ఒక దివ్యమైన వెన్నెలలాంటి ప్రకాశము కనిపించింది.
రాత్రివేళ, అందులోను ఒక గుహలో ఇలాంటి ప్రకాశమేమిటని చూడగా!
అక్కడ చంద్రబింబము ఛాయగల ఒక మణి ప్రకాశిస్తూ కనిపించింది. ఆ
మణి ప్రక్కనే ఒక నాగుపాము పడగవిప్పి చూస్తూవున్నది. చిత్రముగానున్న
ఆ దృశ్యమునుండి రాఘవ చూపును ప్రక్కకు త్రిప్పి చూచాడు. అప్పుడు
అతనికి చిరునవ్వు చిందిస్తూ కూర్చున్న వ్యక్తి కనిపించాడు. అత
ముఖ వర్చస్సులో, కన్నులలో ప్రత్యేకమైన కళ తొణికిసలాడినట్లు
కనిపించింది. అతనిని చూస్తూనే రాఘవకు గొప్ప వ్యక్తిని చూచినట్లు
అనుభూతికల్గి తెలియకుండానే చేతులు నమస్కారము చేశాయి. అప్పుడు
వినయముగా రాఘవ ఇట్లన్నాడు.)
రాఘవ :- నన్ను పిలిచింది మీరేనా? మీరు ఎవరో నాకు తెలియదు.
దయచేసి మీ నామధేయమును తెలుపండి.
మహర్షి :- నిన్ను పిలిచింది నేనే. నేను ఫలానా అని చెప్పుటకు వీలులేదు.
ఎందుకనగా నాపేరును నేనే మరచిపోయాను. నేను 90 సంవత్సరములుగా
యోగదీక్షలో లగ్నమై ఉన్నాను. కన్ను తెరచు కాలము ఆసన్నమైనది.
కనుక యోగమునుండి మేల్కొన్నాను. నీవు నావద్దకు రావలసి ఉన్నది,
కనుక వచ్చావు. నీ రాకను గమనించిన నేను నిన్ను పిలిచాను.
రాఘవ :- నన్ను ఎందుకు పిలిచారు.
మహర్షి :- నీవు సత్యాన్వేషివి కనుక పిలిచాను.
రాఘవ :- నేను సత్యాన్వేషినా! నేను ఏ సత్యము కొరకు, ఏ అన్వేషణ
చేయలేదే!
మహర్షి :- నీవు జన్మ రహస్యమేమిటో తెలుసుకోవాలనుకోలేదా? నేనెందుకు
పుట్టానని అనుకోలేదా? సాటి సమాజములో విసుగెత్తి అడవిని చేరలేదా?
వింత చెట్టును చూచిన నీవు ఇంకా వింతైన చెట్లను గురించి తెలుసు
కోవాలనుకోలేదా? ఆటవికులు తెల్పిన విషయములో సత్యమెంతవుందోనని
చూచుటకు, నీవు ఇక్కడికి వచ్చి పడుకోలేదా? వర్షమునకు ఉండలేక
గూడెమునకు వెళ్ళెదమని గూడెమువారు పిలువగా వారిమాట వినక నీవు
పట్టుదలగా ఇక్కడే ఉండలేదా? చెప్పు రాఘవా? నేను చెప్పుమాటలు సత్యము
కాదా!
రాఘవ :- మహాత్మా! మీరు ఎవరోగానీ, మొత్తము నా చరిత్ర అంతయూ
తెలిసినవారుగా ఉన్నారు. నా పేరు మీకు ఎలా తెలుసో? నా భావము
లన్నియూ ఎలా చెప్పగలుగుచున్నారో ఆశ్చర్యముగా ఉన్నది.
మహర్షి :- నీ చరిత్రేకాదు, నీ పుట్టుక రహస్యమును కూడా తెలిసినవాడిని.
నీ పుట్టుకేకాదు, నీ వెనుక జన్మను కూడా తెలిసినవాడిని. అసలుకు నీవెవరో
కూడా తెలిసినవాడిని.
రాఘవ :- స్వామీ! మీరు చెప్పునది నాకు అగమ్యగోచరముగా ఉన్నది.
అర్థము కావడములేదు. అసలుకు మీరెవరు?
మహర్షి :- నేను నేనే, ముందే చెప్పానుగా నా పేరును మరచిపోయానని,
అందువలన నాకు పేరే లేదనుకో.
రాఘవ :- నా రహస్యమంతయూ చెప్పుచున్న మీరు, మీ పేరును మరచి
పోవుటయా! నేను నమ్మలేకున్నాను.
మహర్షి :- నీవు నమ్మలేని నిజము, నాకు పేరులేదు. ఏ పేరు పెట్టుకొనినా
మానవుడు మానవుడే. ఎవనికి ఏ పేరుండినా పేరువలన వాడు
సాధించునది ఏమీలేదు. ఒకనికి రాముడని పేరు పెట్టినంతమాత్రమున
వాడు దశరథ పుత్రుడైన రాముడు కాలేడు. మానవత్వమును బట్టి మనిషిగానీ
పేరునుబట్టి కాదు.
రాఘవ :- మహాత్మా! రూపముంటే పేరు ఉంటుందంటారు, అట్లే పేరుంటే
రూపముంటుందంటారు. రూప, నామములు ఒకదానికొకటి అవినాభావ
సంబంధమంటారు. మీకు రూపమున్నది కావున పేరుండి తీరవలయును
కదా!
మహర్షి :- ఏ మాట మాట్లాడినా యోచించి మాట్లాడవలెను. నీవు చెప్పు
రూప, నామ అవినాభావము శాస్త్రబద్ధమైన మాటకాదు. అందువలన అది
ఖండింపబడుతుంది.
రాఘవ :- శాస్త్రబద్ధమైనదంటే ఏ విధముగా ఉంటుంది?
మహర్షి :- ఖండింపబడనిదీ, నిరూపణకు వచ్చునదీ శాస్త్రమంటాము. ఈ
సూత్రమునకు లోబడివున్న దానిని శాస్త్రబద్ధమైనదంటాము.
రాఘవ :- తెలియక అడుగుచున్నాను. రూపమున్న ప్రతి దానికీ పేరున్నది,
పేరున్న ప్రతి దానికీ రూపమున్నది. ఇది అంతటా అందరికీ తెలిసిన
విషయమే కదా! దీనిని శాస్త్రబద్ధత లేని విషయమంటామా? మీరు
మహాత్ములు. నాకు తెలియని విషయమును తెలుపుదురని కోరుచున్నాను.
మహర్షి :- శభాష్ రాఘవా! నీ ప్రశ్నలో హేతుబద్ధత ఉన్నది. అంతేకాక
నీవు సవినయముగా అడుగుచున్నావు. కావున ఈ విషయములోని
అశాస్త్రీయతను తెలుపుచున్నాను విను. కాలమనునది కూడా పేరే కదా!
పేరున్న కాలమునకు రూపము లేదు కదా! అందువలన రూప నామములు
అశాస్త్రీయమని చెప్పుచున్నాను.
రాఘవ :- మహాత్మా! మీరు చాలా మేధావులు. పేరున్నంత మాత్రమున
రూపముండదని ఒక్కమాటలో తేల్చి చెప్పారు. అంతేకాక అనాధగా,
అగౌరవముగా బ్రతుకుచున్న నన్ను ఆదరించి మాట్లాడుచూ నాకు ఎంతో
సంతోషమును కలిగించారు. సమాజములో అందరూ నన్ను హేళనగా
చూచినప్పటికీ, గొప్పవారైన మీరు నాకు విలువనిచ్చి మాట్లాడించడము,
నా అదృష్టముగా భావించుచున్నాను. మీకు నన్ను గురించి, నా జన్మ
రహస్యమును గురించి తెలుసునన్నారు. దయచేసి నా జన్మరహస్యమేమిటో
తెలుపమని మిమ్ములను కోరుచున్నాను.
మహర్షి :- రాఘవా! నీవు చాలా అదృష్టవంతునివి. బయట సమాజము
నిన్ను హేళనగా, అసమర్థునిగా చూడబట్టియే కదా! నీవు ఇక్కడికి
చేరగల్గినది? వారు అలా చూడకపోతే నీవు కూడా ఆ సమాజములోనే
ఉండి అందరి మాదిరి జీవించేవాడివి. నీ జాపథకము ప్రకారము నీవు
తులా లగ్నములో జన్మించిన వాడివి. గొప్ప పథకము కలవాడివి. నీకు
ఆ విషయము తెలియదు.
రాఘవ :- మహాత్మా! మీరు చెప్పు మాటలలో పథకమేమిటి? జాపథక
మేమిటి? నాకు అర్థముకాలేదు.
మహర్షి :- ముందే నిర్ణయించబడిన పద్ధతిని “పథకము” అంటాము. జా
పథకము అనగా పుట్టినపుడే జీవితములో జరుగబోవు విషయములను
క్రమ పద్ధతిగా నిర్ణయించబడినదని అర్థము. నీవు ఎప్పుడు ఏ కార్యములను
చేయాలో, ఎప్పుడు ఏమి అనుభవించాలో, ఎప్పుడు ఏమి జరగాలో ముందే
నిర్ణయించివున్న పద్ధతిని “జాపథకము” అంటాము. పూర్వము జాపథకము
అను మాట కాలక్రమేపి మార్పుచెంది జాపథకములో “ప” అను అక్షరము
లేకుండా పోయి, చివరకు జాథకము అను శబ్దముగా మిగిలిపోయినది.
ప్రస్తుత కాలములోని పేరు ప్రకారము చెప్పితే నీ జాతకము బాగుంది
అని చెప్పవచ్చును.
రాఘవ :- నేటికాలములో 'జాతకము'గా పిలువబడు మాట, పూర్వము
'జా పథకము' అను స్వచ్ఛమైన అర్ధముతో కూడుకొని ఉండేదన్నమాట.
నా జాతకము ప్రకారము నేను తులా లగ్నములో జన్మించానన్నారు. తులా
లగ్నములో జన్మించిన వారు అదృష్టవంతులనుట నాకు తెలియదు.
మహర్షి :- అవును రాఘవా! నీ పూర్వ జన్మ సుకృతకర్మ ఆ లగ్నములో
పుట్టునట్లు చేసినది. ఎందరో గొప్ప జాథకము కలవారందరూ తులా
లగ్నములోనే జన్మించారు. ఇదిగో నా ప్రక్కనవున్న ఈ పాము కూడా
తులా లగ్నములో జన్మించినదే.
రాఘవ :- జన్మ ఫలము, జాథక ప్రాబల్యము ఇతర జీవరాసులకు కూడా
ఉండుననుట నాకు ఆశ్చర్యముగా ఉన్నది. అయితే ఈ పాముకు కూడా
జాపథకము ఉన్నట్లేనా?
మహర్షి :- అవును షట్ శాస్త్రములు ప్రతి జీవరాసికీ వర్తిస్తాయి. ఆరు
శాస్త్రములలోని జ్యోతిష్యశాస్త్రము అన్ని జీవరాసులకూ వర్తిస్తుంది. కర్మ
అనబడు పాపపుణ్యములు ప్రతి జీవరాసికీ ఉన్నాయి. కర్మ చేతనే ప్రతి
జీవీ పుట్టుచున్నది. ఈ పాము కూడా నీవలె మానవజన్మలో ఉండి, ఆ
జన్మనుండి ఈ జన్మకు వచ్చినది. దాని కర్మప్రకారము చివరకు నా వద్దకు
చేరినది.
రాఘవ :- ఈ విషయము ఆసక్తిగావుంది. అభ్యంతరము లేకపోతే ఈ
పాము యొక్క పూర్వజన్మ విషయము తెలియజేయుదురని కోరుచున్నాను.
మహర్షి :- తప్పక తెలియజేస్తాను విను. ఈ జీవి గతజన్మలో గొప్ప
ధనికుడుగా ఉండేవాడు. ఇతనికి ఎన్నో భూములూ, గృహములూ
ఉండడమేకాక విపరీతమైన డబ్బు కూడా ఉండెడిది. ఈ జీవికి ఎంత
ఉండినా ఇంకా సంపాదించవలెనను ఆశ ఎక్కువగా ఉండెడిది. కష్ట
పడకుండా అందరికంటే సులభముగా సంపాదించుటకు వడ్డీ వ్యాపారమును
ఎన్నుకొన్నాడు. డబ్బును వడ్డీలకిచ్చి చక్రవడ్డీల రూపములో ఇతరుల శ్రమను
దోచెడివాడు. ఇతని వద్ద డబ్బులు తీసుకొన్న ఎందరో విపరీతముగా
పెరిగిన వడ్డీలతో తిరిగి డబ్బు చెల్లించలేని స్థితిలో వారి ఆస్తులను సహితము
ఇతనికే వదలిపెట్టేవారు. అట్లు తమ జీవనాధారమైన ఆస్తులను బాధపడుచు
వారు అప్పగిస్తుంటే తనకు ధనమే ముఖ్యమనుకొన్న ఈయన తనకు
వచ్చు ధనమునే చూచాడు. కానీ తనకు వచ్చు పాపమును ఏమాత్రము
గుర్తించలేదు. పాపపుణ్యములను గురించి ఎవరైనా చెప్పినా, నాకు
అంతమాత్రము తెలియదా అని సమాధానము చెప్పెడివాడు. ఒకవేళ
ఏదైనా పాపము వస్తే తాను చేయు పూజలకు రాముడు తనను
రక్షించుతాడని అనుకొనెడివాడు. తాను నమస్కరించు శ్రీరాముని
దయవుండుట చేత తాను ఎంతో ధనము సంపాదించాననీ, తాను చేయు
వడ్డీ వ్యాపారము దేవునికి సమ్మతమైనదేననీ, అందువలన తనకు పాపమే
రాదనీ అనుకొనెడి వాడు.
ఈ విధముగ జరుగుచున్న కాలములో ధనికుని దగ్గర అప్పు
తీసుకొన్న ఒక నిర్భాగ్యుడు తన వద్ద డబ్బులేనివాడై, తనకు ఏ ఆదాయము
లేనివాడై, పెరుగుచున్న వడ్డీకి భయపడి ధనికుని వద్దకు వచ్చి “నేను
ఆదాయమూ లేనివాడనైనాను, నాయందు ఏ దురలవాట్లు లేవు, అయినా
నా కర్మవశాత్తు నా పొలములో పంట పండని కారణమున నీకు ఏమాత్రము
డబ్బు జమకట్టలేని స్థితి ఏర్పడినది. నా భూమి అంతయూ అమ్మినా
బాకీ అసలుకు సరిపోదు. నేను ఇంకా ఎక్కడైనా అడుక్కొని నీ బాకీ
అసలును కట్టగలను. వడ్డీని కట్టలేను, నీవు వడ్డీని వదలిపెట్టు" అని
అడిగెను. అందులకు ధనికుడు ఏమాత్రము ఒప్పుకోలేదు. అటువంటి
సమయములో నిరుత్సాహముగా కాలము గడుపుచున్న పేద రైతును ఒక
మహర్షి చూచి, అతని బాధను గ్రహించి పేద రైతును ఓదార్చి ధనికుని
పిలిచి ఈ విధముగ చెప్పెను.
యోగి :- డబ్బున్న వానివద్ద నీ పద్ధతి ప్రకారము డబ్బును లాగినావాడు
బాధపడడు. కానీ లేనివానిని పీడించితే వాడు అహర్నిశలు బాధపడు
చుండును. అలా నీవు ఇతరులను బాధపెట్టడము వలన కంటికి కనిపించని
పాపము నీకు చేరును. నీవు కంటికి కనిపించు ధనము మీదనే ఆశ కల్గి
వున్నావు. దానివలన కనిపించని పాపమొస్తుందని నీకు తెలియదు.
ఇటువంటి పనులు మానుకో.
(అని యోగి చెప్పగా ఆయన మాటలను ఈ ధనికుడు తేలిగ్గా
తీసుకొని, యోగి మాటను లెక్కచేయక తనకు ధనమే ముఖ్యమనీ, తాను
చేయుచున్నది న్యాయబద్దమైన వ్యాపారమనీ బదులు చెప్పెను. ధనికుని
మాటలువిన్న యోగి ఈ విధముగా చెప్పెను.)
యోగి :- నేను చెప్పు మాటలు నీకు విలువగా కనిపించలేదు. నీవు
శాశ్వతమనుకొన్న నీ జీవితము అశాశ్వతమైనది. ఎవరూ శాశ్వితముగా
ఒకే జన్మలో ఉండలేరు. నీవు డబ్బే ముఖ్యమనుకొనినా అది కొంచెము
కూడా నీవెంట రాదు. నీవు చేసుకొన్న కర్మ మాత్రము నీవెంట వస్తుంది.
నాది, నావారు, నా ఆస్తి అను మోహగుణముతో నీవు చేయు ఇటువంటి
కార్యములు పాపమునే తెచ్చిపెట్టును. మానవజన్మలోనికి వచ్చినది
జ్ఞానధనము సంపాదించుకోవడానికిగానీ, ప్రపంచ ధనము అక్రమ
మార్గములో ఆర్జించడానికి కాదు. నీవు ప్రపంచ ధనములో ధనికునివైనా
ప్రయోజనము లేదు. జ్ఞానధనములో ధనికునివి కాకపోతే నీ జీవితమే
వ్యర్థమగును. జ్ఞానధనము వలన జీవితమునకు సాఫల్యమేర్పడును. అట్లు
లేనినాడు నీవు భూమికి రాజైనా ప్రయోజనము లేదు. నీవు చేసుకొన్న
పాపము తర్వాత జన్మలో బాధించును.
(ఈ విధముగా చెప్పిన యోగి మాటలను ధనికుడు వినకుండా
వీరు నన్ను మాటలతో మభ్యపెట్టుచున్నారు. వీరికంటే నాకు ఎక్కువ
తెలివియున్నది. వీరి మాటలు విని మోసపోయేంత మూర్ఖున్ని కాదను
కొనెను. ఆ ధనికుని ఉద్దేశ్యమును గ్రహించిన యోగి నేను చెప్పినా
విననపుడు నీ ఇష్టప్రకారమే నడుచుకొమ్మనెను. ఆ యోగి చెప్పిన మాటలను
కూడా వినని ఈ సర్ప రూప జీవి, పాపభీతి లేకుండా తన ఇష్టమొచ్చినట్లు
ఇతరుల శ్రమను వడ్డీల రూపములో దోచుకొనుచూ ఇంతకంటే ఆనందము
లేదనుకొని జీవింపసాగెను. తన మాటలను కూడా లెక్కించని ధనికుని
ఎడల చికాకుపడి, ఇటువంటి మూర్ఖులకు ఎంత జ్ఞానము చెప్పినా
ప్రయోజనములేదని తలచి, తన జ్ఞానమునకు కూడా విలువివ్వని అతనిని
ప్రపంచరీత్యా ఏమీ చేయలేని యోగి, తన మనోసంకల్ప బలము చేతనే
ఇతని చేత జ్ఞానము నాశ్రయింపజేస్తానని తలచి, యోగాసీనుడై కళ్ళు
మూసుకొని కూర్చొని " నా మాట వినని ఈ మూర్ఖునికి చాలా కాలము
బ్రతుకగల్గు పాము జన్మ లభించవలెను” అని తన మనస్సు చేత బలమైన
సంకల్పమును మెదడు నుండి శూన్యములోనికి వదలెను. ఆ సంకల్పము
కంటికి కనిపించనిదై తీక్షణమైన బాణమువలె ప్రయాణించి, ధనికుని వెదకి
అతనిలోనికి దూరిపోయి అతని తలలో సూక్ష్మముగనున్న కర్మచక్రములో
ప్రతిష్టింపబడెను.
ఆ రోజు యోగి సంకల్ప బలమే నేడు ధనికున్ని పాము జన్మకు
తెచ్చినది. ఈ జన్మ రాకముందు ధనికునిగావున్న రోజులలో విపరీతముగా
ధనమును సంపాదించినా చివరికి మనశ్శాంతి లేకుండా పోయినది. మధ్య
వయస్సు నుండే మానసిక బాధను అనుభవించాడు. చక్కెరవ్యాధి
రావడముతో తిండి తినడములో వైద్యులు నిబంధనలు పెట్టారు. పేదవాడు
కూటికి గతిలేక కొంచమే తిన్నట్లు తినవలసి వచ్చినది. డబ్బుతో సర్వము
లభించుననుకొన్న ధనికునికి ధనమున్నప్పటికీ సరియైన తిండికూడా తినలేని
కాలమొస్తుందను సత్యము మొదటిగా తెలిసింది. కొద్దిరోజులకు మూత్ర
పిండములు (కిడ్నీలు) పని చేయడము తక్కువైనదనీ, ఆహారములో
ఉప్పును వాడవద్దని చెప్పిన వైద్యుల సలహామేరకు రుచిలేని తిండి తినవలసి
వచ్చెను. డబ్బువుండి కూడా పశువులవలె రుచిలేని తిండి తినడము
వలన, చనిపోయిన తర్వాత ధనము వెంటరాదను మాట అటుంచి,
ధనముండి కూడా తినుటకు అర్హతలేదనీ, కర్మ ప్రత్యక్షముగా చూపుచున్నదనీ
ధనికుడు గ్రహించాడు. అట్లే కొంతకాలము గడువగా తనవారనుకొన్న
సొంత కొడుకులే, తన సొమ్మును వాడుకొనుచూ, తన ఆస్తిని అనుభవిస్తూ
తన మాటను లెక్కచేయకుండా పోవడమేకాక, నోరు మూసుకొని ఊరక
కూర్చోమని గద్దించసాగారు. ఆ పరిణామములకు బాధపడిన ధనికునికి
ఆనాటి యోగి మాటలు జ్ఞాపకము వచ్చాయి. ఆనాడు మహర్షి చెప్పిన
జీవిత సత్యములను వినకుండా, పైగా వారినే తెలివితక్కువ వారిగా లెక్కించు
కొన్నందుకు మనస్సులోనే బాధపడినాడు. ఆనాడు ఆయన మాటలు పెడ
చెవిన పెట్టినందుకు యోగిని క్షమాపణ కోరవలెనని, ఆయన పాదముల
మీదపడి ఏడ్వాలనుకొన్నాడు.
ఆ విధముగా తలచిన ధనికుడు తన వారిమీదా, తన ఆస్తిమీదా,
తన ధనముమీద విరక్తికల్గినవాడై యోగిని వెదకుచూపోయాడు. కొంత
కాలము తర్వాత యోగివద్దకు చేరగల్గి, ఆయన పాదముల మీదపడి తన
తప్పును క్షమించమనీ, తాను నమ్ముకొన్న ధనము ఎలాంటి సుఖమును
ఇవ్వలేదనీ, మీ మాటవినని నాకు ఎంత పాపమొచ్చినదోనని ఏడ్వసాగెను.
దానిని చూచిన యోగి ధనికునితో ఇలా అన్నాడు.)
యోగి :- అగ్ని కాలుతుందని చెప్పినా నీవు వినలేదు. మా మాటలనే
అవివేకముగా, నీ యోచనలనే వివేకముగా అనుకొన్నావు. ఇప్పుడు
అనుభవానికి వచ్చిన దానికి మా మాటలు జ్ఞాపకమొచ్చాయి. అయినా
నీవు అనుభవించినది ఈ జన్మలో చేసుకొన్న పాపము కాదు. ఇది
అంతయు పోయిన జన్మలో చేసుకొన్నదే. ఈ జన్మలో చేసుకొన్న పాపమును
రాబోయే జన్మలలో అనుభవించవలసి వస్తుంది. అది ఎంత భయంకరముగా
ఉంటుందో చెప్పలేము. మానవుడు తనకున్న నీచమైన తెలివియే గొప్పదను
కుంటాడు. జ్ఞానులు చెప్పిన మాటలను లెక్కించడు. అంతేకాక నాకు
ఆధ్యాత్మికము అంటే సరిపోదు అనుచూ, జ్ఞానులను కూడా కించపరచి
మాట్లాడుచుంటాడు. జ్ఞానులు చెప్పు మాటలు జీవిత సత్యాలనీ, జీవితము
తన ఇష్టమొచ్చినట్లు జరుగదనీ, తన జీవితమును కర్మప్రకారము నడిపించు
శక్తి ఒకటున్నదనీ, ఆ శక్తిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికమనీ తెలియక,
తాను చేయు ఎంత పెద్ద ప్రపంచ పనులైనా పొట్టకూటి కొరకేనని అనుకోక,
అత్యున్నతమైన ఆధ్యాత్మికమునే తక్కువ చేసి మాట్లాడుచుందురు. నేను
ముందే చెప్పిన జ్ఞానము నీకు జ్ఞప్తికి వచ్చింది. ఇప్పటికైనా ప్రపంచ రీత్యా
ఆలోచించడము తప్పని తెలిసింది. ఇప్పుడు నీవు ఏమి బాధపడినా
చేసుకొన్న పాపము పోదు. దానిని అనుభవించక తప్పదు. నీవు నావద్దకు
వచ్చి ఏడ్చినా నేను నిన్ను ఏమీ చేయలేను.
ధనికుడు :- స్వామీ! మీరు అలా అంటే నేను భరించలేను. నన్ను మీరే
రక్షించాలి, జ్ఞానులైన మీరు నేను ఈ పాపమునుండి బయటపడి మరు
జన్మలో డబ్బులేకున్నా శాంతిగా బ్రతుకుటకు మార్గమును చూపించండి.
ఇప్పటి నుండి మీరు చెప్పినట్లు నడుచుకుంటాను.
యోగి :- (నవ్వుచూ) కష్టమొచ్చినపుడు మమ్ములను మీరు మాన్యులంటారు.
ఏ కష్టమూ లేనపుడు మీరే మమ్ములను సామాన్యుల క్రిందికి జమకట్టి
హేళనగా మాట్లాడుతారు. ఇపుడు నీవు నన్ను గొప్పవాడని ఎంత
పొగడినా నేనేమీ చేయలేను. నీ కష్టమునుగానీ, నీ బాధనుగానీ లేకుండా
చేసుకొనుటకు నీవే ప్రయత్నించవలెను. అది నీ చేతిలోని పనియే. ఇప్పటి
నుంచయినా నీ శేష జీవితమును దైవచింతనతో పవిత్రముగా గడుపుము.
అలా చేయుట వలన నీవు క్రొత్తగా పాపమును సంపాదించుకోలేవు. పాత
దానిని నీవు తప్పక అనుభవించవలసివున్నది. దాని బాధ కూడా పోవాలంటే
ఒక విధముగా చెప్పితే అది పూర్తిగా పోదుగానీ, సాధ్యమున్నంతవరకు
దానిలో అనుభవించు శాతమును తగ్గించుకోవచ్చును. అలా తప్పించుకొను
విధానము మున్ముందు నీకే తెలియగలదు. ఇప్పుడు నేనిచ్చు సలహా,
“నీవు జ్ఞానమార్గములో జీవించు.” ఇంతకంటే నేనేమీ చెప్పలేను. (ఈ
విధముగా చెప్పి ధనికున్ని యోగి తనవద్దనుండి పంపివేసెను.)
మహర్షి :- చింతాక్రాంతుడైన ధనికుడు తాను చేసుకొన్న పాపమును తలచు
కొనుచూ, తాను ధనార్జన ఆశతో ఎంత నీచమైన బ్రతుకు బ్రతికానని
అనుకొనుచూ, ఇప్పటినుండి మహర్షి చెప్పినట్లు బ్రతుకవలెనని నిర్ణయించు
కొనెను. అలా అనుకొన్న అతను ఆనాటినుండి ఇతరులను నొప్పించక
తన చేతనైన సహాయము చేయసాగెను. అంతేకాక అక్రమముగా లాగుకొన్న
ఇతరుల ఆస్తులను వారికే ఇచ్చివేసెను. యోగి మాట ప్రకారము తన శేష
జీవితమును జ్ఞానమార్గములో గడుపసాగెను. అలా కొంతకాలము వరకు
జీవించి మరణమును పొందెను. యోగి సంకల్ప శాపము వలన పాము
జన్మలోనికి వచ్చి, అడవిలో అరువది సంవత్సరములు అనేక కష్టములను
అనుభవించి చివరకు నావద్దకు చేరి నాకు సేవ చేయుచూ కాలము
గడుపుచున్నాడు.
రాఘవ :- మహాత్మా! ఒక ప్రశ్న అడుగుచున్నాను తప్పయితే క్షమించండి.
మీరు చెప్పిన మాటలో ఈ పాము పూర్వజన్మలో పాపము చేసుకొన్న
ధనికుడనీ, అతని కర్మ విమోచనమునకే మీ వద్దకు వచ్చాడని నాకు
అర్థమైనది. ఇతను పామురూపములో ఉండి మీకు సేవ ఎట్లు చేయు
చున్నాడనునది నాకు అర్థము కాలేదు.
మహర్షి :- సేవ ఎవరైనా, ఏ విధముగానైనా చేయవచ్చును. ఈ పాము
రూపములోనున్న ఇతను ఇక్కడేవుంటూ కీటకములను నావద్దకు రాకుండా
చూచుకొంటున్నాడు. అంతేకాక తన నోటిలోని మణిని బయటపెట్టి నేనున్న
ఈ స్థలములో వెలుగుండునట్లు చేశాడు. ఈ విధముగా తనకు చేతనైన
సేవను చేయుచున్నాడు.
రాఘవ :- ఎక్కడో అడవిలో పుట్టి పెరిగిన ఈ పాము, ఈ గుహలోనున్న
మీవద్దకు ఎలా చేరగలిగింది?
మహర్షి :- గతజన్మలో ధనికుడైన జీవి, ఈ పాము రూపములో అడవిలో
పుట్టడమూ, అడవిలోనే తిరగడము జరిగింది. ఈ పాము మగదికాగా,
మరొక ఆడపామును దాదాపు యాభై సంవత్సరములు తోడు చేసుకొని
జీవించినది. యుక్తవయస్సునుండీ తోడుగా గడిపిన ఆడపామును ఒక
దినము వేటగాడు పట్టుకొని పోయాడు. ఆ విషయము ఈ పాముకు
తెలియదు. తన తోడు పాము కనిపించక పోవడము వలన ఈ పాము ఆ
పామును వెదకుచూ వచ్చి చివరకు నావద్దకు చేరినది.
రాఘవ :- మహాత్మా! ఒక సంశయము. ఇది నాగుపాము కదా! నాగుపాము
అంటే ఆడపామనీ, జెరిపోతు అంటే మగ పామనీ ఇతరులు చెప్పగా
విన్నాను. ఇపుడు మీరు ఈ నాగుపాము మగదనీ, దీనికి ఆడపాము
తోడుగా ఉండేదనీ అంటున్నారు. నాగుపాములలో మగపాము ఉంటుందా?
మహర్షి :- రాఘవా! నీకు తెలియని విషయములు ఎన్నో ఉన్నవి. నీకు
తెలియని రహస్యములన్నియూ తెలియబడుతాయి. నీకు తెలిసిన
రహస్యములు లోకమునకు తెలియబడుతాయి. నీవు అన్ని విషయములందు
ఆసక్తి కల్గి తెలుసుకొందువు. ప్రతి విషయములోని సత్యము నీకు తెలియ
బడును. అందువలన నేను నిన్ను "సత్యాన్వేషి” అంటున్నాను. ఇపుడు
ఈ పాము గురించిన విషయము తెలిపెదను విను. భూమండలములోని
పాములలో మొత్తము 80 జాతులున్నవి. ఇప్పటికి ఏడు లేక ఎనిమిది
జాతులు అంతరించిపోయాయి. మిగిలిన జాతులలో నాగుపాము అనునది
ఒక జాతికాగా, ఈ నాగుపాము జాతిలో పదకొండు (11) రకములున్నవి.
ఈ పదకొండు జాతులలో పదునెనిమిది (18) అడుగుల పొడవున్న నాగరాజు
(కింగ్ కోబ్రా) అనునది పెద్ద జాతికాగా, మిగిలిన పది జాతులలో మణిగల
పాము ఉత్తమమైనది. ఒకటి మణిజాతికాగ మిగతా తొమ్మిది (9) జాతుల
నాగు పాములున్నవి. పదకొండు జాతులలోనూ ఆడ, మగ రెండు రకములూ
ఉంటాయి. నాగుపాము పడగలనుబట్టి అది ఆడపామా లేక మగపామా
అని గుర్తించవచ్చును. మగపాము పడగ గుండ్రముగా ఉండును.
ఆడపాము పడగ గుండ్రముగా ఉండక, ఎడమవైపు కొలత కొద్దిగ
తక్కువయుండును. ఈ జాతియందు ఆడ, మగ ఉన్నవనుటకు
తార్కాణముగా నాగులకట్ట దగ్గరున్న నాగప్రతిమలను చూడవచ్చును.
నాగప్రతిమ ప్రతిష్టవున్న ప్రతి చోటా రెండు పడగవిప్పిన పాములు
పెనవేసుకొన్నట్లు ప్రతిమ ఉండును. నాగప్రతిష్టను చూచిన వారికి ఎవరికైనా
సులభముగా అర్థమగుటకు పెద్దలు అలా నాగప్రతిమను ఉంచారు. ఇకపోతే
జెరిపోతు అనునది కూడా ఒక ప్రత్యేకమైన తెగ పాములున్నవి. జెరిపోతు
తెగలో కూడా ఆడ, మగ పాములుండును. జెరిపోతు అంటే మగపాము
అని అర్థముకాదు. పోతు అను పదము వలన దీనిని మగపాము
అనుకోకూడదు. ఈ జాతి పాములు ఎక్కువ వేగముగా పోవునవి అగుట
వలన వాటికి ఆ పేరు వచ్చినది. ఏ పనిలో అయినా బాగా చేయుదురని
పేరు తెచ్చుకొన్న ఆడవారిని కూడా మగవానితో సమానముగా మనము
పొగడునట్లు, వేగములో ముందంజ వేసిన దానివలన ఈ పాము జాతిలోని
ఆడ, మగ అన్ని పాములనూ జెరిపోతులనడము జరగుచున్నది. జెరిపోతుల
వలె నాగజాతినంతటిని నాగుపాములు అనినా, వాటిలో ఆడ మగ వేరువేరని
తెలుసుకొన్నాము కదా! పాము పడగను బట్టి ఆడ, మగను గుర్తించవచ్చును
అని కూడా చెప్పుకొన్నాము. అలా గుర్తించిన ఆడపామును త్రాచుపాము
అంటున్నాము. అలాగే మగ పామును కోడెనాగు అంటున్నాము. దీనినిబట్టి
ఇక్కడున్న ఈ పామును కోడెనాగు అనవచ్చును.
రాఘవ :- మహాత్మా! మీ వలన ఇంతవరకు నాకు తెలియని రహస్యమొకటి
తెలిసినది. ఇలాంటి ఎన్నో విషయములను తెలుసుకోవాలని ఉంది.
మహర్షి :- జరుగబోవు ముందు కాలములో అన్నీ తెలియును. ఇపుడు నీ
కర్తవ్యము నీవు చేయుము.
రాఘవ :- మీకు తెలియనిది ఏముంది? నేను సమాజములో విసుగెత్తి
వచ్చినవాడిని. ఈ అడవిలోనికి వచ్చి కాలమును గడుపుచున్నాను. నా
జీవితమే నాకు సమస్యయై, ఎలా బ్రతకాలో కూడా తెలియనివాడిని.
జీవితములో ఏ ధ్యేయమూ లేనివాడిని, నా కర్తవ్యమేమిటో తెలియనివాడిని.
మీరు చెప్పినట్లు నడువాలనునదే ప్రస్తుత నా కర్తవ్యము తప్ప, నాకు ఈ
జగతిలో ఏ కర్తవ్యమూ లేదు.
మహర్షి :- నేను చెప్పినట్లు నడువాలన్నది నీ కర్తవ్యమైతే అలాగే చేయి.
నీవు ఇక్కడినుండి దక్షిణదిశగా ప్రయాణిస్తూ పోతూవుండు. ఏదో ఒకచోట
నీకు ఒక గురువులాంటి వ్యక్తి దొరుకుతాడు. అతను గొప్పయోగి. అతనిని
గురువుగా చెప్పుకొనినా ఒప్పుకోడు. అందరికి దేవుడే గురువు తప్ప
మనుషులు గురువుకాదు అనునది ఆయన సూత్రము.అందువలన నేను
కూడా ఆయనను గురువులాంటి వాడు అన్నాను తప్ప గురువు అని చెప్పలేదు.
ఆయన ఎంతో దైవజ్ఞానమును విపులముగా చెప్పు సమర్థుడు. ఆయన
తప్ప ఆధ్యాత్మికవేత్త ప్రస్తుత కాలములో ఎవరూ లేరనియే చెప్పవచ్చును.
ఇప్పటి కాలములో ఆధ్యాత్మికము మీద ఎవరికీ ఆసక్తి లేదు. కనుక ఆయన
ఎవరికీ తనకు తెలిసిన ఆత్మజ్ఞానమును చెప్పడము లేదు. జిజ్ఞాస ఉన్న
వారికే ఆధ్యాత్మికము అవసరము. జిజ్ఞాస లేనివారికి ఆదాయము
అవసరము. నేడు అందువలన ఎవరూ ఆధ్యాత్మిక కేంద్రమైన అసలైన
యోగులవద్దకు పోకుండా ప్రపంచ ధనమును కల్గించి, మహత్యములు
చూపు బాబాల వద్దకు పోవుచున్నారు. కొందరైతే ఏది ఆధ్యాత్మిక నిలయమో,
ఏది ఆదాయ నిలయమో తెలియక పొరపడుచున్నారు. అటువంటి చిక్కులు
ఏవీ లేకుండా నేను చెప్పు గురువు నీకు దొరుకుతాడు. ఆయన ద్వారా
ధర్మములను తెలుసుకో. తెలిపెడి శక్తి ఆయనకున్నది, తెలుసుకొనే ఆసక్తి
నీకున్నది. నీవు తెలుసుకొన్న ధర్మములను ఇతరులకు బోధించు,
అధర్మములను ఖండించు. అలా అధర్మములను ఖండించుట వలన నీకు
కొందరు శత్రువులు కూడా తయారగుదురు, అయినా ఫరవాలేదు. నీకేదైనా
ఆపద సమయమువస్తే అక్కడికి ఈ పాము వచ్చి నిన్ను కాపాడుతుంది.
నీవు ఇక్కడినుండి పోయిన కొంతకాలమునకు నీవున్న చోటికే ఈ పాము
కూడా వస్తుంది. అయితే ఈ పాము ఎవరికీ కనిపించక రహస్యముగా
ఉంటూ నీకు అండగా ఉంటుంది. ధైర్యముగా పో...
రాఘవ :- మహత్మా! మీ దర్శనము నాకు తిరిగి ఎప్పుడు లభిస్తుంది?
మహర్షి :- అష్టగ్రహ కూటమి వచ్చినపుడు నేనే నీకు కనిపిస్తాను. నీవు
ఇక్కడికి రానవసరములేదు. నీవు పోవునపుడు పై రంధ్రమును మూసిపో.
(ఈ విధముగ రాఘవ ఆ యోగివద్ద సెలవు తీసుకొని బయటికి
వచ్చి, తాను తీసిన రంధ్రమును ముందున్నట్లు ఇటుకలతో మూసి, మన్ను
కప్పి ఎవరికీ కనిపించనట్లు చేసెను. అంతలో తెల్లవారిపోయింది.
సూర్యుడు తూర్పు దిక్కున కనిపించసాగాడు. అప్పుడు రాఘవ దక్షిణదిశగా
ప్రయాణమును సాగించెను. ఉదయవేళలో అడవి దృశ్యముల ప్రకృతి
సౌందర్యము ఎంతో ఆహ్లాదముగా కనిపించుచుండెను. రాఘవ ముందుకు
సాగుకొలది ఎన్నో కూౄరమృగములు కనిపించిననూ, అవి రాఘవను
వింతగా చూస్తూ, రాఘవను ఏమీ అనకుండా వింతగా చూస్తూ నిలబడినవి.
కూృర మృగములు సహితము తనమీద దాడిచేయక నిలబడి చూడడము
మహర్షి యొక్క ఆశీర్వాదమేనని రాఘవ మనస్సులో అనుకొని ముందుకు
సాగి పోవుచుండెను. అట్లు చాలా దూరము పోయిన తర్వాత ఎవరో
పెద్దగా అరుస్తున్నట్లు వినిపించెను. ఆ అరుపు తనకు దగ్గరగానున్న
పొదలచాటునే ఉన్నది. ఆ అరుపు వలన ఎవరో ఏదో ఆపదలోనున్నట్లు
గ్రహించిన రాఘవ పరుగున అక్కడికి చేరాడు. అక్కడ ఒక ఎలుగుబంటి
(భల్లూకము) ఒక యువకుని గాయపరుస్తూ కనిపించినది. ఆ యువకుడు
ప్రతిఘటిస్తున్నా ఆ భల్లూకము లెక్కచేయలేదు. ఆ దృశ్యమును చూచిన
రాఘవ వెంటనే చెట్టుకొమ్మను త్రుంచి, యుక్తిగా భల్లూకము యొక్క
మూతిమీద కొట్టాడు. మూతిమీద దెబ్బ తగలగానే భయపడిన
ఎలుగుబంటి రాఘవను చూచి పారిపోయింది.
ఆ సమయమునకు రాఘవ అక్కడికి రాకపోయివుంటే, ఆ యువకు
నికి ప్రమాదము జరిగివుండేది. ఆ యువకుని చేతి గాయమునుండి రక్తము
కారుట చూచిన రాఘవ వెంటనే తన పంచెనుండి కొంత గుడ్డను చించి
అతని చేతికి కట్టాడు. అప్పుడు ఆ యువకుడు రాఘవతో ఇలా అన్నాడు.)
యువకుడు :- నీవు దేవునివలె సమయానికి వచ్చి రక్షించావు. సమయానికి
నీవు రాకపోతే ఈపాటికి నేను మరణించి ఉండేవాడిని. నా గురువు
సమయానికి నిన్ను పంపాడు. లేకపోతే ఈ అరణ్యములో నన్ను ఆదుకొను
వారెవరున్నారు.
రాఘవ :- నీ గురువు ఎవరు? నీవు ఎందుకు అడవిలోనికి వచ్చావు?
యువకుడు :- రాజయోగానంద స్వామి మా గురువుగారు. నేను మా
గురువుగారి ఆశ్రమమునకు వంట కట్టెలకొరకై నిన్నటి దినము ఈ
అడవిలోనికి వచ్చాను. వంటకట్టెలను మోపుకట్టుకొని బయలుదేరు
సమయములో దాహము అయింది. అపుడు కట్టెల మోపును ఒకచోట
పెట్టి నీటికై వెదకుచూ వచ్చి, నీరు కనపడగా నీరు త్రాగి తిరిగి కట్టెల
మోపు పెట్టిన స్థలమునకు పోవాలనుకొని దారితప్పి పోయాను. దారితప్పి
ఇంకా కొంత దూరము అడవిలోనికి వచ్చాను. రాత్రంతయూ ఈ అడవిలోనే
గడచినది. వర్షము వచ్చి తడిసిపోయి ఆకలిగా ఉన్నా నేను బాధపడలేదు.
తెల్లవారింది కదా! అని దారికోసము వెదకుచూ ఉంటే, ఈ ఎలుగుబంటి
నామీద దాడి చేసింది. సమయానికి నీవు వచ్చావు.
(అప్పుడు రాఘవ ఆ యువకునికి ఓదార్పుగ ధైర్యమును చెప్పి
తన వెంట రమ్మని చెప్పి, అతనిని పిలుచుకొని దక్షిణదిశగా రాసాగాడు.
అలా కొంతదూరము ఒక గంటసేపు నడచిన తర్వాత ఒకదారి దొరికింది.
ఆ దారి పడమర దిశనుండి వచ్చి దక్షిణమువైపు మలుపు తిరిగివున్నది.
రాఘవ పోవలసింది కూడా దక్షిణదిశయే, కావున ఆ దారివెంట దక్షిణ
దిశగా నడువసాగెను. అలా ఒక గంటకాలము నడువగా ఆ పరిసర
ప్రాంతమును గాయపడిన యువకుడు గుర్తించాడు. ఇంకాకొంత దూరము
పోతే తమ ఆశ్రమము ఉన్నదని చెప్పాడు. అలా ఒక అరకిలోమీటరు
దూరము నడువగా రాజయోగానంద స్వామి వారి ఆశ్రమము కనిపించినది.
అప్పుడు రాఘవకు గుహలోని యోగి చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చినవి.
శివ అను పేరుగల ఆ యువకుడు రాఘవను రాజయోగానంద స్వామి
వారికి పరిచయము చేశాడు. తర్వాత జరిగిన విషయమంతా చెప్పి
రాఘవయే ఆ ఎలుగుబంటి నుండి కాపాడాడు అని చెప్పాడు. ఆశ్రమము
నకు తిరిగి రాని శివకొరకు ఎదురుచూచిన రాజయోగానంద స్వామి రాఘవ
చేసిన సహాయమునకు రాఘవకు ధన్యవాదములు తెలిపెను. అందులకు
రాఘవ స్పందించి “మీరు నాకు గురువులు. నాకు ధన్యవాదములు చెప్పించు
కొను స్థోమతలేనివాడను” అని అన్నాడు.)
ఆ రాత్రివేళ మర్రిచెట్టు క్రింద రాఘవను వదలి తమ గూడెమునకు
వెళ్ళిన ఆటవికులు, రాఘవను గురించి యోచిస్తూ వర్షములో తడిసిపోయి
ఉండుననుకొనిరి. ఉదయమే లేచి, రాత్రి రాఘవను మర్రి చెట్టువద్ద వదలి
వచ్చిన విషయమును తమ కులపెద్ద, గూడెము నాయకుడు అయిన
మల్లుదొరకు చెప్పిరి. రాఘవ రానందుకు కారణము తెలియక పోవుట
వలన మల్లుదొర తన మనుషులను రాఘవను వెదకుటకు పంపెను.
అడవిలోని మర్రిచెట్టు వద్దకు పోయిన ఆటవికులు అక్కడ రాఘవ లేనందు
వలన ఆశ్చర్యపోయి, రాఘవను అడవి మృగములు ఏవైనా చంపాయేమోనని
అనుమానించారు. అలా జరిగివుంటే అచట మృగముల పాదముల
గుర్తులుంటాయని వాటికోసము వెదికారు. వర్షము వచ్చి తడిగానున్న ఆ
ప్రాంతములో ఏ మృగము యొక్క పాదగుర్తులూ కనిపించలేదు. అలా
వెదుకుచున్న సమయములో రాఘవ పాదగుర్తులు వారికి కనిపించాయి.
రాఘవ పాదగుర్తులు దక్షిణ దిశకు పోయినట్లు తెలుసుకొన్న ఆ చెంచువారు,
ఆ విషయమును తమ కులపెద్దయిన మల్లుదొరకు తెలియజేశారు.
విషయమును తెలుసుకొన్న మల్లుదొర రాఘవ అదే పనిగా దక్షిణమువైపు
ఎందుకు పోయాడు? అని యోచించి, ఆ విషయము అర్థముకాక చివరకు
తన వారిని రాఘవను వెదికే దానికి పొమ్మని చెప్పాడు. అప్పుడు ఎనిమిది
మంది ఆటవికులు తమ ఆయుధములైన బాణములను తీసుకొని రాఘవను
వెదకుటకు బయలుదేరారు. మొదట మర్రివృక్షము వద్దకు వచ్చి అక్కడనుండి
ప్రారంభమైన రాఘవ పాద గుర్తులను అనుసరిస్తూ ముందుకు పోసాగిరి.
(రాఘవ చెప్పిన మాటలను విన్న రాజయోగానంద స్వామి ఆశ్చర్య
పడుచూ ఇలా అన్నాడు)
రాజయోగా :- నేను నీకు గురువునా! ఇంతకు ముందు నీ ముఖమును
నేను చూడలేదు. నేను నీకు ఎలా గురువునగుదును.
రాఘవ :- అవును. ఇప్పటినుండి నాకు మీరు కాబోయే గురువులు.
అందువలన మిమ్ములను వెదకుచూ వచ్చాను. మార్గములో మీ భక్తుడు
శివ కనిపించాడు. శివ వలన మీ వద్దకు చేరుటకు నాకు మరీ సులభమైనది.
రాజయోగా :- నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. నీవు నన్ను ఎప్పుడూ
చూడలేదు. నా పరిచయమే లేనివానివి. నీవు నన్ను వెదకుచూ రావడ
మేమిటి? అలా వచ్చావంటే ఇంతకు ముందు నా విషయము నీకు
తెలిసివుండాలి. నా విషయము నీకు ముందే తెలుసా?
రాఘవ :- అవును స్వామీ! మీ గురించి నాకు ముందే తెలుసు. ఇక్కడికి
ఉత్తరముగానున్న అడవిలో ఒక మహాత్ముడు మీ గురించి తెలియజేశాడు.
మీవద్దకు పొమ్మన్నాడు. మిమ్ములను మించిన ఆధ్యాత్మికవేత్త ఈ భూమిమీద
ఎవరూలేరని చెప్పాడు. అందుకే నేను మీవద్దకు వచ్చాను.
రాజయోగా :- మహాత్ముడా! నన్ను గురించి తెలిపాడా!! అదియూ
ఉత్తరముగా నున్న అడవిలోనా!!! అటు ప్రక్క అడవిలో అమాయక
ఆటవికులు తప్ప ఎవరూ లేరే, ఎవరు చెప్పారు నీకు?
రాఘవ :- నేను చెప్పుమాట నిజమే స్వామీ! అడవిలో ఎవరికీ తెలియని
ఒక మహాత్ముడున్నాడు. ఆయన బయట ఎవరికీ కనిపించకుండా భూగర్భ
గుహలో ఉన్నాడు. ఆయనే మీ గురించి చెప్పాడు. అక్కడినుండి దక్షిణము
వైపు పొమ్మనీ, నీకు గురువు దొరుకుతాడని చెప్పాడు. ఆయన మాట
ప్రకారము మీరు నాకు దొరికారు.
రాజయోగా :- భూగర్భగుహలో ఉన్నాడా! భూగర్భములోనున్న ఆయనకు
నా విషయమెలా తెలిసివుండును?
రాఘవ :- మీ ఒక్కరి విషయమేకాదు, సర్వ విషయములు ఆయనకు
తెలుసు.
రాజయోగా :- ఆయన భూగర్భములో ఏమి చేయుచున్నాడు?
రాఘవ :- యోగమాచరిస్తున్నాడు. కొంత కాలమునకు బయటికి వస్తాడట.
రాజయోగా :- (కనుబొమ్మలు పైకి చాచి ఆశ్చర్యమును వ్యక్తము చేస్తూ)
అయితే ఆయన సాధారణ మనిషికాదు. ఏదో మహత్తర శక్తియై ఉంటాడు.
ఆయన పేరు ఏమని చెప్పాడు?
రాఘవ :- ఆయన నాకు పేరే లేదన్నాడు. పేరుతో సంబంధమే లేదన్నాడు.
పేరున్నంతమాత్రమున , రూపమున్నంతమాత్రమున పేరూ
ఉంటుందనుకోవడము పొరపాటని చెప్పాడు.
రాజయోగా :- అనంతశక్తి అయిన దైవమునకు కూడ పేరేలేదు. ఆయన
ఎవరో గొప్పవాడే అయివుంటాడు. సామాన్యుడైతే తన పేరును చెప్పేవాడు.
ఇంతకూ నీవు ఏ ఉద్దేశముతో ఇక్కడికి వచ్చావు. నీవు స్వయముగా
వచ్చావా? లేక ఆయన పంపగా వచ్చావా?
రాఘవ :- ఆయన పంపగానే వచ్చాను. దక్షిణదిశగా పోతే నీకు ఒక
గురువు లభిస్తాడని ఆయనే చెప్పి పంపాడు. మీ వలన అన్ని సత్యములను
తెలుసుకోమన్నాడు. అందువలన సత్యాన్వేషణే నా ఉద్దేశ్యము.
రాజయోగా :- అన్వేషిస్తానంటే వద్దంటానా! నా వలన నీ అన్వేషణ
సాగుతుందంటే మరీ సంతోషము. ఇపుడు నీవు విశ్రాంతిని తీసుకో.
సాయంకాలము నీ అనుమానములను తెలిపితే దానికి నేను అన్వేషణ
మార్గమును తెలిపెదను.
(ఎనిమిది మంది ఆటవికులు రాఘవను వెదకుచూ కొంత దూరము
పోయిన తర్వాత వారి వెంటనున్న కుక్కలు మొరగసాగెను. అప్పుడు ఆ
చెంచువారు తమకు దగ్గరగా ఏవో మృగములున్నవని తలచి వారి
బాణములను సిద్ధముగా చేతిలో పట్టుకొని నిలబడిరి. అంతలో ఏనుగుల
గుంపుయొక్క ఘీంకారము వినిపించెను. ఏనుగుల గుంపును తాము ఏమీ
చేయలేమని తలచిన ఆటవికులు ప్రక్కనున్న నదిలో దిగి ఈదుచూ అవతలి
గట్టుకు పోయిరి. ఏనుగుల గుంపు అక్కడినుండి పోయిన తర్వాత తిరిగి
ఇవతలి గట్టుకు వచ్చి రాఘవ పాదజాడల కొరకు చూచిరి. ఏనుగుల
గుంపు ఆ ప్రాంతమంతా త్రొక్కిన దానివలన రాఘవ అడుగుల జాడ
ఏమాత్రము కనిపించలేదు. అందువలన రాఘవ పోయిన దారి అర్ధము
కాకపోయెను. అపుడు ఆటవికులు తిరిగి తమ గూడెముకు పోయి ఉన్న
విషయమును తమ పెద్ద అయిన మల్లుదొరకు తెలియజేశారు. అప్పుడు
మల్లుదొర కొంత ఆలోచించి తమవారితో అంజనము వేసి చూడమని
చెప్పెను.)
(సాయంకాలము రాఘవ రాజయోగానంద స్వామి వద్దకు చేరి
నమస్కరించి, కూర్చుండి, సవినయముగా తన అనుమానమును ప్రశ్న
రూపములో స్వామి వారిని ఇలా అడిగెను.)
రాఘవ :- స్వామీ! దేశములో ఎన్నో ఆశ్రమములు గలవు. ఆ ఆశ్రమము
లలో గురువులందరూ కాషాయగుడ్డలను ధరించియున్నారు. మీరు మాత్రము
కాషాయ వస్త్రములను ధరించక అందరివలె సాధారణ దుస్తులనే ధరించి
యున్నారు. వారికి మీకు ఏమి తేడావున్నది?
రాజయోగా :- జ్ఞానులలో ముఖ్యముగా ఉండవలసినది జ్ఞానము. అలాగే
యోగులలో ముఖ్యముగ ఉండవలసినది జ్ఞానాగ్ని (యోగశక్తి). పైన ధరించు
గుడ్డలు ముఖ్యముకాదు. పై దుస్తులు గుర్తింపుకొరకు ధరించునవే. పూర్వ
కాలములో కాషాయగుడ్డలకు ఒక అర్థముండేది. కానీ నేడు వాటి అర్థము
తెలియకుండా పోయినది. అర్థము తెలియనివారు కూడా కాషాయరంగు
గుడ్డలను ధరించుచున్నారు.
రాఘవ :- పూర్వకాలములో కాషాయరంగు గుడ్డలకు ఏ అర్థముండేదో
దయచేసి తెలుప ప్రార్ధన.
రాజయోగా :- తప్పక తెలియజేస్తాను. కొన్ని చెట్ల మూలికలను నీటవేసి
బాగా వేడిచేసినపుడు ఆ మూలికల సారమంతయూ నీటిలోనికి దిగును.
అలా దిగిన మూలికలు లేక చెట్ల సమూలముల సారమును “కషాయము”
అనుట మన ఆయుర్వేదవైద్యములో గలదు. అట్లే కాలమను నీటిని జ్ఞానమను
అగ్నిచే వేడిచేసినపుడు జీవితము అను మూలికసారము మనస్సుకు
దిగినవాడు జీవిత కషాయమును పొందినవాడగును. కషాయము అను
మాట కాలక్రమమున కొంత మార్పుచెంది కాషాయము అను శబ్దముగా
మారినది. జీవిత సారాంశము తెలిసినవాడినను గుర్తింపుకు మూలికల
సారము యొక్క రంగు గుడ్డను ధరించెడివాడు. మూలికల సారము లేత
ఎరుపురంగు అయిన కషాయము యొక్క వర్ణముగానే ఉండును.
అందువలన అదే రంగుగుడ్డలను పూర్వము అర్థము తెలిసి ధరించెడివారు.
కానీ నేడు కషాయమంటే ఏమో తెలియదు. అట్లే కాషాయరంగు యొక్క
అర్థము తెలియకుండా పోయినది. అర్థము తెలియనివారు కూడా
కాషాయరంగు గుడ్డలు ధరిస్తున్నారు. నేను జీవిత సారాంశమైన ఆధ్యాత్మిక
మును తెలిసివాడినను గుర్తింపు నాకు అవసరములేదు. నేను ఆధ్యాత్మిక
వేత్తను అని బయటికి తెలియకుండుటకు ఆ రంగు దుస్తులు ధరించలేదు.
ప్రస్తుత కాలములో కొందరు సూర్యుడుదయించు వేళ ఉన్న రంగును
అనుసరించి ఆ రంగుగల కాషాయముగుడ్డలను ధరిస్తున్నామంటున్నారు.
ఆ రంగు సన్యాసులకు గుర్తని అంటున్నారు. కానీ ఈ రంగుకు సన్యాసు
లకు ఏమాత్రము సంబంధముగానీ, అర్థముగానీ కనిపించడములేదు.
భగవంతుడు చెప్పిన భగవద్గీతలో ఆత్మసంయమ యోగము అను
అధ్యాయముయందు మొదటి శ్లోకములో "అనాశ్రితః కర్మఫలమ్ కార్యమ్
కర్మ కరోతియః ససన్యాసేచ యోగీచ ననిరగ్ని ర్నచాక్రియః" అని కలదు.
ఆ శ్లోకము యొక్క భావమును చూస్తే “ఫలాపేక్షలేని వాడూ, అహంకార
రహితుడూ, జ్ఞానాగ్ని కలవాడూ నిజమైన సన్యాసి" అని అర్థమగుచున్నది.
జ్ఞానాగ్ని కలవాడు, అహంకారరహితుడు బయట దుస్తులు ఏవి ధరించినా
వాడు నిజమైన సన్యాసియే. రంగు గుడ్డలను బట్టి సన్యాసి అనక జ్ఞానాగ్నిని
బట్టి సన్యాసి అని గీతలో చెప్పడమైనది. అందువలన గుడ్డలు ముఖ్యము
కాదు. కాషాయగుడ్డలు బయటి ప్రజల గుర్తింపునకేగానీ, అంతరంగములోని
ఆత్మ గుర్తింపుకుకాదని తెలియుచున్నది. అందువలన నాకు బయట ప్రజల
గుర్తింపు అవసరములేదు. అందువలన నేను కాషాయగుడ్డలను ధరించలేదు.
కొందరు భార్యపిల్లలను వదలుకోవడమే సన్యాసమని కూడా అనుకొను
చుందురు. ఆ విధముగా అనుకోవడము కూడా తప్పే అగును.
కుటుంబమును వదలుకొని, పనులు మానుకొన్నవాడు సన్యాసికాడని
గీతలోనే "నచాక్రియః" అని కూడా చెప్పడము జరిగినది. భగవద్గీతలో
భగవంతుడు చెప్పినట్లుండడము నిజమైన సన్యాసముగానీ, కాషాయగుడ్డలు
ధరించడము ముఖ్యముకాదు. అందువలన ఆధ్యాత్మికమునకు రంగు
గుడ్డలకు ఏమీ సంబంధములేదని తెలియుచున్నది.
రాఘవ :- స్వామీ! మీరు చెప్పిన విషయము, మేము చిన్నతనమునుండి
రంగు గుడ్డలు వేసుకొన్నవారే సన్యాసులను ఉద్దేశమును తలక్రిందులు
చేసినది. అర్థము తెలియకున్నా కాషాయంబరములు ధరించినవారు ఏదో
ఒక విధముగ దేవుని మార్గమునే అనుసరించుచున్నారని అనుకుంటాను.
మిగతా మనుషులకంటే కాషాయము ధరించిన వారే ఉత్తములనుకొంటాను.
మీ ఉద్దేశ్యమును చెప్పండి.
రాజయోగా :- నీవు సత్యాన్వేషివి. కావున సత్యమునే తెలుసుకోవలయును.
సత్యమును తెలుసుకొనుటకు కాషాయంబరములు ధరించిన స్వాములున్న
కొన్ని ఆశ్రమములవద్దకు పోయి వారిని గురించిన సత్యమును తెలుసుకో.
అప్పుడు నీకు ఏదైనా సందేహము వస్తే నన్నడుగు తర్వాత చెప్పగలను.
రాఘవ :- అలాగే స్వామీ! మొదట నన్ను ఏ ఆశ్రమానికి పొమ్మంటారు?
రాజయోగా :- ఇక్కడికి తూర్పున ఇరవై ఆరుమైళ్ళ దూరములోనున్న
ఆశ్రమమునుండి ప్రారంభించు, కొన్ని ఆశ్రమములు తిరిగిన తర్వాత ఇక్కడికి
వచ్చి నీ అనుభవములను చెప్పు. రేపే నీ ప్రయాణము.
(తమ నాయకుడు మల్లుదొర చెప్పినట్లు అంజనమును చేసి దాని
ద్వారా రాఘవ జాడను ఆటవికులు తెలుసుకోవాలనుకొన్నారు. అంజన
మును తయారు చేయుటకు 1) తెల్ల ఈశ్వరి 2) తెల్ల బ్రహ్మదండి (తెల్ల
చెండు పూవు పూయు ఎర్రి కుసుమ చెట్టు) 3) తెల్ల ఉత్తరేణి 4) తెల్ల
గంజరి 5) తెల్లగన్నేరు 6) తెల్లజిల్లేడు యొక్క వేర్లను తెచ్చి, నీడన ఎండించి,
ఆదివారమున ఎండిన వేర్లను నువ్వుల నూనె దీపముతో కాల్చి అవి అగ్గిగ
మారినపుడు అదే నూనెలో ముంచి బొగ్గు చేసి పెట్టుకొని, తర్వాత వచ్చు
బుధవారమున పచ్చకర్పూరమును కాల్చగా వచ్చిన మసిని తీసి, తర్వాత
ఆరు మూలికల బొగ్గులను, పచ్చ కర్పూరము యొక్క మసిని నువ్వుల
నూనెలోనే అన్నీ సమానముగా కలిపి మెత్తగా కాటుకవలె చేసుకొనిరి.
అప్పటికి పూర్తిగా అంజనము తయారైనది. అలా తయారు చేసిన
అంజనమును చూడాలంటే చూపుయందు దోషము లేనివాడై ఉండాలి.
పిల్లికళ్ళవాడైతే బాగా చూడగలడని వారి గూడెములోనున్న ఒక పిల్లి కళ్ళవాని
చేత అంజనమును చూపించిరి. కనురెప్పకొట్టకుండా అంజనమును
చూడవలెను. చూచువానికి ఆ విధముగా చూచుట అలవాటై వుండుట
వలన వాడు చూడసాగెను. అంజనములో చూచువానికి మొదట, రాత్రిపూట
ఆకాశము కనిపించునట్లు నల్లగా ఆకాశము కనిపించసాగెను. తర్వాత
ఆకాశములో అక్కడక్కడ కొన్ని చుక్కలు (నక్షత్రములు) కనపడెను. వాటిలో
ఒక చుక్కను మాత్రము తదేక దీక్షతో అతను చూడసాగెను.
చూస్తుండగా ఆ చుక్క ఆకాశములో ప్రయాణించినట్లు ముందుకు జరిగిపోవు
చుండెను. రాఘవ ఎక్కడున్నది కనిపించవలెననీ, అతనిని చూడవలెననీ
మనస్సులో అంజనము ముందర కూర్చున్న వాడు అనుకోవడము వలన
అంజనములోని నక్షత్రము రాఘవను చూపుటకు రాఘవవున్న ప్రాంతము
మీద వరకు ఒక నిమిషములో చేరిపోయినది. అప్పుడు ఆ చుక్క చిన్నగ
తన కాంతిని విడిపోవునట్లు, ఆ నక్షత్రము యొక్క వెలుగు గుండ్రముగా
పది అడుగుల వెడల్పు వృత్తముగా విడిపోయింది. అలా విడిపోయిన
వెడల్పు వృత్తములో చిన్నగా దృశ్యము కనిపించసాగింది. ఆ దృశ్యము
మూడువందల అడుగుల ఎత్తునుండి చూస్తే ఎలా ఉంటుందో అలా పై
నుండి కనిపిస్తువున్నది. పై నుండి కనిపించు దృశ్యములో అడవి
ప్రాంతములోని చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు కనిపిస్తుండగా అది
అడవి ప్రాంతమని చూచేవానికి అర్థమైపోయినది. ఆ అడవిలో రాఘవ
ప్రయాణించి పోవుచుండడము కూడా కనిపించింది. అలా వారు చూచిన
విషయము వారి కుల పెద్దలకు తెలిపిరి. అప్పుడు వారి కులపెద్దయిన
మల్లుదొర రాఘవను తనవద్దకు పిలుచుకొని రమ్మని చెప్పెను. అందులకు
ఆటవికులలో ఒకడు ఇలా అనెను.)
ఆటవికుడు :- రాఘవతో మనకేమి పని వున్నది? అతను మనకేమన్నా
బంధువా? లేక కావలసిన వాడా? అతనితో మనకేమి ప్రయోజనము?
మల్లుదొర :- (చిరునవ్వు నవ్వుచూ) రాఘవ తెలివైనవాడు.
ఇక్కడే మన గూడెములోనే ఉంచుకుంటే బాగుంటుంది. అతనికి నా
కూతురునిచ్చి వివాహము చేయదలచాను. అందువలననే అతనిని
తెమ్మంటున్నాను.
ఆటవికులు :- ఈ మాటను మాకు ముందే చెప్పివుంటే రాఘవను ఒంటరిగా
వదలేవారమే కాదు కదా! (అందరూ నవ్వుచూ అన్నారు).
మల్లుదొర :- ఇపుడైనా మించిపోయినది లేదు. మన భైరికా దేవతకు
పూజచేసి బయలుదేరి పోండి, అతనికి నా ఉద్దేశమును చెప్పి పిలుచుకొని
రాండి.
ఆటవికులు :- అతను మా మాటను ఒప్పుకొనునో లేదో! వస్తాడో రాడో!
రాకపోతే ఏమి చేయాలి?
మల్లుదొర :- నేను చెప్పిన విషయమును చెప్పండి. మీరు ఏ దానికీ
బలవంతము చేయవద్దండి. (దీర్ఘముగా యోచిస్తూ అన్నాడు)
ఆటవికులు :- నాయకా? మేము ఈ దినమే బయలుదేరి పోతాము.
మాకు ఏ ప్రమాదములు జరుగకుండా బదనికలను తీసుకెళ్ళుతాము.
మల్లుదొర :- సరే అలాగే తీసుకెళ్ళండి.
ఆటవికులు :- రాఘవ వచ్చేదానికి ఒప్పుకొని కొంత ఆలస్యముగా
వస్తానంటే, మేము అతనితోపాటే ఉండి తీసుకురమ్మంటారా?
మల్లుదొర :- రెండు మూడు నెలలైనా ఉండి తీసుకురాండి. ఒకవేళ
ఇంకా ఏదైనా ఆలస్యమయ్యేటట్లుంటే నాకు తెలియజేయండి. ఇప్పుడు
మన ఆచారము ప్రకారము భైరికాదేవతకు పూజచేసి ఆమె సన్నిధిలోనున్న
బదనికలను తీసుకెళ్ళండి.
(ఆటవికులు ఎనిమిది మంది తమ నాయకుని మాట ప్రకారము
వారి దేవతకు పూజచేసి బదనికలను తీసుకొని బయలు దేరిపోయిరి.)
(కాషాయాంబరములు మరియు ఆశ్రమములను గురించిన
సత్యాన్వేషణ గురించి, రాజయోగానంద స్వామి పోయిరమ్మని చెప్పినట్లు
రాఘవ బయలుదేరి ప్రయాణము సాగించి, ఒక ఆశ్రమము చేరి అక్కడున్న
వారితో ఇలా సంభాషించాడు.)
రాఘవ :- నేను మీవద్ద కొంతకాలముండి, ఈ ఆశ్రమములో తెల్పు
దైవజ్ఞానమును తెలుసుకోవాలనుకొన్నాను. నేను నా ఖర్చును నేనే భరించు
కొని ఉంటాను. మీకు నా వలన ఏ ఇబ్బందీ ఉండదు.
ఆశ్రమము వారు :- దైవజ్ఞానమా! నీవు పొరపడినావు. ఇది దైవజ్ఞానము
చెప్పే ఆశ్రమము కాదు. పిల్లలకు చదువు చెప్పేది.
రాఘవ :- ఇది ఆశ్రమమన్నారు కదా! ఇచట గురువులేరా? ఆత్మజ్ఞానము
చెప్పరా? (ఆశ్చర్యముగా అడిగాడు.)
ఆశ్రమమువారు :- (నవ్వుచూ) మా గురువుగారు కాశీలో ఉన్నారు. నెలకొక
మారు వచ్చి పోతూవుంటారు. కానీ మా గురువుగారు ఆత్మజ్ఞానము
కంటే అన్నము పెట్టే విద్యా జ్ఞానము గొప్పదని చెప్పుచుంటారు. అందువలన
ఆత్మజ్ఞానమును చెప్పరు.
రాఘవ :- పరమాత్మ జ్ఞానముకంటే ప్రపంచ విద్య గొప్పదా, ఆత్మ జ్ఞానము
కంటే బడి చదువు గొప్పదా?
ఆశ్రమమువారు :- చూడు నాయనా! బ్రహ్మవిద్య అన్నము పెట్టదు, ఆకలి
తీర్చదు. అందువలన మొదట బ్రతికేదానికి విద్య నేర్పడము మా పని.
రాఘవ :- అటువంటపుడు విద్యాబోధన చేయు 'బడి' అని పేరు పెట్టు
కోవడము మంచిది, కానీ 'ఆశ్రమము' అని పేరు పెట్టడము దేనికి?
ఆశ్రమమువారు :- బడి అనునది పాత పదము. బడి అను పేరుకంటే
ఆశ్రమము అను పేరు మీద ఎక్కువ గౌరవమున్నది. అందువలన
ఆశ్రమమని పేరు పెట్టాము. సాధారణ బడులకంటే గురుకుల
ఆశ్రమములో చదువు బాగా చెప్పుదురని ప్రజల నమ్మకము. అందువలన
మా గురువుగారు ఎన్నో గురుకుల ఆశ్రమములు నెలకొల్పి, అన్నింటిలోనూ
పిల్లలకు చదువు చెప్పుచున్నారు. పెద్దలకు జ్ఞానము చెప్పే పనిని మా
గురువుగారు పెట్టుకోలేదు.
(మొదటి అనుభవమే రాఘవ తలలో ఎన్నో ప్రశ్నలనుద్భవింప
చేసింది. తన ప్రశ్నలకు అక్కడున్నవారు సరియైన సమాధానము చెప్పరని
తెలిసినప్పటికీ మరియొక ప్రశ్నను వారినడిగాడు)
చేసింది. తన ప్రశ్నలకు అక్కడున్నవారు న
రాఘవ :- ఇక్కడ చదువుకొను పిల్లలకు కొద్దిమాత్రమైనా దైవజ్ఞానమును
తెలుపరా?
ఆశ్రమమువారు :- ప్రతి దినము భగవద్గీతలోని శ్లోకములను పదింటినైనా
పారాయణము చేయిస్తాము. మావద్దనున్న పిల్లలందరికీ గీతా శ్లోకములు
బాగా వచ్చును.
రాఘవ :- శ్లోకములు మాత్రము తెలుసునా, లేక అందులోని అర్థము
కూడా తెలుసునా?
ఆశ్రమము వారు :- శ్లోకముల అర్థము సరిగా పెద్దలకే తెలియదు. మా
పిల్లలకు అర్థము తెలియదు గానీ, శ్లోకములు మాత్రము కంఠాపాటముగా
వచ్చును.
రాఘవ :- అర్థము తెలియని శ్లోకములతో ఏమి ప్రయోజనము?
ఆశ్రమమువారు :- శ్లోకముల వలన మాకు తెలిసిన ప్రయోజనము ఒకటి
గలదు. అదేమనగా! శ్లోకములలో ఎక్కువగా కఠిన పదములూ, వత్తులూ
ఉండును. వాటిని చదువుట వలన మిగతా తెలుగు పదములను సులభముగా
పలుకవచ్చునూ, వ్రాయవచ్చును. అందువలన శ్లోకములను ఎక్కువగా
చదివింతుము.
(ఆ మాటలతో రాఘవకు పిచ్చి ఎక్కినంత పనైంది. ఆశ్రమము
లోనే బ్రహ్మవిద్యకు విలువలేకుండా పోవడము విచిత్రముగా తోచినది.
అక్కడినుండి ఏదైనా బ్రహ్మవిద్యగల ఆశ్రమానికి పోవాలనుకొని వారిని
ఇలా అడిగాడు)
రాఘవ :- మీరు చెప్పు దానిని బట్టి ఇక్కడున్నది కేవలము ప్రపంచ చదువుకు
సంబంధించిన ఆశ్రమమని తెలిసినది. నాకు కావలసినది పరమాత్మ
చదువుకు సంబంధించిన ఆశ్రమము. అటువంటి ఆశ్రమము ఇక్కడెక్కడైనా
ఉంటే తెలుపండి. నేనక్కడికి పోతాను.
(అందులకు రాఘవవైపు దీనముగా చూస్తూ అక్కడివారు ఇలా చెప్పారు)
ఆశ్రమమువారు :- అటువంటి ఆశ్రమము కావలయునంటే చిన్నది కావల
యునా? పెద్దది కావలయునా?
రాఘవ :- చిన్నదంటే ఏమిటి?, పెద్దదంటే ఏమిటి? ఎక్కడైనా ఉండునది
జ్ఞానమొక్కటే కదా!
ఆశ్రమమువారు :- చూడు బాబూ! చిన్నదంటే జ్ఞానమును మాత్రము
తెలుపునది. పెద్దదంటే జ్ఞానము అని పేరు పెట్టి నీతిని గురించి చెప్పు
చుందురు. మరియు మహిమలు కూడా చూపుచుందురు.
రాఘవ :- అలాగైతే రెండు ఆశ్రమముల చిరునామా చెప్పండి. నేను చిన్న
పెద్ద రెండు ఆశ్రమములను సందర్శిస్తాను.
ఆశ్రమమువారు :- చిన్న ఆశ్రమము మనోడ అను జిల్లాలో, చైతన్యనగర్
అను మండలములో, ప్రకాశ్పరి అను గ్రామములో ఎత్తయిన గుట్టమీద
గలదు. అది ఇక్కడికి ఉత్తరమున పదిమైళ్ళ దూరములో గలదు. ఇక పెద్ద
ఆశ్రమమును గురించి చెప్పితే అది ఇక్కడికి దక్షిణమున వందమైళ్ళ
దూరములోనున్న అమ్మానగర్ జిల్లాలో, లక్ష్మీపురము మండలములో, శాంతి
పురము గ్రామములో విశాలమైన మైదానములో కలియుగ వైకుంఠములాగ
అందమైన కట్టడములతో కనిపిస్తూవుండును.
రాఘవ :- మిమ్ములను ఎన్నో ప్రశ్నలను
మిమ్ములను ఎన్నో ప్రశ్నలను అడిగి శ్రమింపజేసినందుకు
క్షమించండి, పోయివస్తాను.
(అని చెప్పి రాఘవ అక్కడినుండి బయలుదేరి మొదట ప్రకాశ్పరిలో
నున్న చిన్న ఆశ్రమప్రాంతానికి చేరాడు. ఆ సమయానికి సాయంకాలమై
చీకటి పడసాగెను. మసక చీకటిలో రాఘవ పోవుచుండెను. అతను
ఇంకనూ ఆశ్రమమును చేరలేదు. ఆశ్రమమును సమీపిస్తుండగానే ఎవరో
పెద్దగా అరిచినట్లు రాఘవకు వినిపించింది. ఏదైనా ప్రమాదమేమోనని
తలచిన రాఘవ తొందరగా ముందుకు పోయేదానికి ప్రయత్నించాడు.
అంతలోనే తనకు ఎదురుగా ఒక వ్యక్తి అరుస్తూ పరుగెత్తుకొని వస్తుండెను.
ఆ వ్యక్తి దయ్యము.. దయ్యమని అరుస్తూ పరుగిడుచున్నాడు. అతని వెనుక
పొట్టిగ మూడు అడుగుల ఎత్తున్న నల్లని ఆకారము అతనిని వెంబడించుచు
వస్తున్నది. మసక చీకటిలో అర్థముకాని ఆ ఆకారమును చూచి మొదట
రాఘవ కూడా కొంత అధైర్యపడినాడు. అంతలోనే రాఘవ ధైర్యమును
తెచ్చుకొని, భయపడి పరుగిడు మనిషికి ఎదురుపడి భయపడకు నేనున్నానని
ధైర్యము చెప్పి నిలిపెను. అంతలో వెనుకనే వచ్చు ఆకారము సమీపించినది.
ఒక్క దూకులో రాఘవ ఆ ఆకారము మీదపడి దానిని అదిమి పట్టబోయాడు.
రాఘవ చేతికి నల్లని కంబళి దొరికినది. కంబళిక్రిందనుండి కుక్క బయటికి
వచ్చినది. విచిత్రమైన ఆ సంఘటనను చూచి రాఘవకు ఏమీ అర్థము
కాలేదు. వెంటనే రాఘవ మనస్సులో దయ్యములు కుక్కలుగా మారి
కనిపిస్తాయని ఎవరో చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చినది. అప్పుడు దానిని
కొట్టుటకు ప్రక్కనున్న రాతిని చేతిలోనికి తీసుకొనేలోగా ఆ కుక్క మొదటి
వ్యక్తి వద్దకు చేరినది. మొదటి వ్యక్తి మరింత భయముతో ఆశ్రమము వైపు
పరుగిడసాగెను. అలా పరుగిడు అతని వెంట కుక్క, కుక్క వెంట రాఘవ
పరుగిడసాగారు. మొదటి వ్యక్తి ఆశ్రమములోనికి దూరి దయ్యము...
దయ్యమని అరవగా అక్కడున్న వారంతా అతనివద్దకు చేరారు. అంతలో
కుక్కా, కుక్క వెంట రాఘవ ఆశ్రమము దగ్గరికి చేరిరి. అక్కడ గుమికూడిన
వారు కుక్కను ఏమీ అనకుండా రాఘవను గట్టిగా పట్టుకొన్నారు. అలా
పట్టుకొన్న వారిలో కొందరు, ఇది దయ్యమేనని కొందరు అనగా, కాదు
ఇతను మనిషేనని కొందరనసాగిరి. ఆ సంఘటనకు రాఘవ అయోమయ
స్థితిలో పడిపోయి, నేను మనిషినేనని దయ్యమును కానని గట్టిగా అరిచి
చెప్పెను. అంతలో మొదట భయపడి పరుగిడిన మనిషి వచ్చి ఈయన
మనిషే, నేను కుక్కను చూచి భయపడ్డానని చెప్పాడు. అందులకు అక్కడి
భక్తులు అతనిని ఇలా అడిగారు.)
భక్తులు :- ఇది మన కుక్కే కదా! దీనిని చూచి ఎందుకు భయపడ్డావు?
భయపడిన వ్యక్తి :- నేను కంబళి భుజము మీద వేసుకొని పొలమువద్ద
కాపలాకు పోవాలనుకొని పోయాను. పొలమువద్దకు పోయిన తర్వాత
అరుగు మీద చాప పరుచుకోవాలనుకొని, నా భుజము మీదున్న కంబళిని
క్రిందవేశాను. ఆ కంబళి ఈ కుక్క మీద పడిన విషయము నాకు తెలియదు.
నేను చాపను పరచి ప్రక్కన చూచాను. కంబళి కుక్క మీద ఉండుట వలన
కుక్క కదలిక నల్లని ఆకారము కదలినట్లు కనిపించినది. నా ప్రక్కనే అలా
కదలడము వలన నేను నల్లని ఆకారమును నిజముగా దయ్యమనుకొని
అరుస్తూ పరుగిడినాను. అంతలో ఈయన వచ్చి నన్ను భయపడవద్దు
అని ఈ కుక్క మీద పడినాడు. ఇతని చేతికి కంబళి వచ్చింది. కుక్క
నావద్దకు వచ్చింది. అయినప్పటికీ చీకటిలో ఏమి జరిగిందో అర్థము
కాక, మన కుక్క జ్ఞప్తికిరాక, దయ్యమే కుక్కవలె నా దగ్గరకు వస్తున్నదని
భయపడి ఇక్కడికి పరిగెత్తి వచ్చాను. ఈయన కూడా నా వెంట వచ్చాడు.
(జరిగిన పొరపాటుకు అందరూ నవ్వుకొన్నారు. అపుడు రాఘవను
గురించి అక్కడి ఆశ్రమ భక్తులు ఇలా అడిగారు)
భక్తులు :- నీవు ఎవరు? ఈ ప్రాంతమునకు ఎందుకు వచ్చావు?
రాఘవ :- నేను దైవజ్ఞాన విషయములలో సత్యమును తెలుసుకొను
నిమిత్తము సత్యాన్వేషణ చేస్తూ, కొన్ని ఆశ్రమాలను సందర్శించి అక్కడున్న
గురువుల వలన జ్ఞానమును తెలుసుకోవాలనుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ
మంచి దైవజ్ఞానముకలదని ఇతరులు చెప్పగా విని వచ్చాను.
భక్తులు : :- మా గురువుగారు నీవు అడిగిన దానికంతటికీ జవాబు చెప్పగలడు,
కానీ నీవు ఆయనను అడుగలేవు. ఆయనకు చాలా చెవుడు నీవు అడిగేది
ఆయనకు వినిపించదు. ఈ మధ్య ఏమీ వినిపించకుండాపోయింది.
రాఘవ :- అలాగా! అయితే గట్టిగా అరచి అయినా అడుగుతాను.
(అక్కడి ఆశ్రమ భక్తులు రాఘవకు అన్నము పెట్టి, తిన్న తర్వాత
తమ గురువువద్దకు తీసుకపోయి గురువును చూపించి, గురువుగారికి చీటీలో
రాఘవ విషయమును వ్రాసి చూపించి, రాఘవను గురువుగారితో మాట్లాడ
మని చెప్పిరి. అప్పుడు రాఘవ గురువుగారికి నమస్కరించి వినయముగ
ఇలా ప్రశ్నించెను.)
రాఘవ :- స్వామీ! మనిషి పుట్టుకలోని అంతరార్థము ఏమిటి?
(రాఘవ మాట గురువుగారికి వినిపించలేదు. అపుడు చెవులు
చూపి చేయి అల్లాడించుచూ ఏమిటి? అన్నాడు గురువుగారు)
రాఘవ :- మనిషి ఎందుకు పుట్టాడు? (అని పిడికిలి బిగించి అల్లాడించుచు
అడిగాడు. అందులకు గురువు ఇలా అన్నాడు.)
గురువు :- తాంబూలము ఎందుకు వేసుకున్నావంటున్నావా? తిన్న
ఆహారము బాగా జీర్ణమవుతుందని వేసుకొన్నాను.
ఆ మాటవిని రాఘవకు నవ్వు వచ్చింది. అయినా ఆపుకొని ఆ
ప్రశ్నను వదలివేసి వేరొక ప్రశ్నను అడిగాడు.)
రాఘవ :- దేవుడంటే ఎవరు? (అని గట్టిగా అడిగాడు)
గురువు :- నేనేనయ్యా ఇక్కడి గురువును.
(గురువుగారు చెప్పిన సమాధానమునకు రాఘవకు దిక్కుతెలియక
తలబరుక్కొని ఈయనకున్నది మామూలు చెవుడు కాదు, బ్రహ్మచెవుడు
అని అనుకొన్నాడు. చెవుటి వాళ్ళకు చేతులు చూపి అడగవలసిందే గానీ
ఎంత గట్టిగా అరచి అడిగినా ప్రయోజనము లేదనుకొన్నాడు. ఈ మారు
తన చేతివేళ్ళను రెండిటిని చూపుచూ ఇలా అడిగాడు.)
రాఘవ :- జీవాత్మ, పరమాత్మ రెండు ఎక్కడున్నాయి?
గురువు :- దొడ్డికి వస్తావుందా పోయిరా పో, తర్వాత మాట్లాడవచ్చు.
(ఈమారు రెండు చేతివేళ్ళను చూపుట వలన గురువుగారు మరొక
విధముగ అర్థము చేసుకోవడముతో రాఘవ అలసిపోయినంత పని
అయినది. ఇక లాభము లేదు ఇక్కడినుండి పోయేది మంచిదనుకొని,
అక్కడినుండి ప్రక్కకు వచ్చి ఆ ఆశ్రమ భక్తునితో మాట్లాడసాగెను.)
రాఘవ :- ఏమయ్యా! మీ గురువుగారికి ఎంత అరిచి అడిగినా వినిపించదే,
సైగల ద్వారా అడిగినా వేరు విధముగా అర్థము చేసుకొంటాడు. ఈయన
వద్ద మీరెలా జ్ఞానమును తెలుసుకొంటారు.
భక్తుడు :- మేము ఏమీ అడగము. ఆయన చెప్పేది మాత్రము వింటాము.
రాఘవ :- మీకేదైనా అర్థము కాకపోయినా, లేక అనుమానము వచ్చినా
ఎలా అడుగుతారు?
భక్తుడు :- ఇక్కడి వారికి ఏ అనుమానము రాదు. ఎందుకంటే ఇక్కడికి
వచ్చేవారు జ్ఞానము మీద ఆసక్తి కల్గిరావడము లేదు. గురువుగారు చెప్పే
టప్పుడు అర్థమైనట్లు కనిపించే దానికి ఊరకనే తలూపుచుందురు. ఇక్కడికి
వచ్చేవారు పైకి జ్ఞానము కొరకు వస్తున్నట్లు కనిపించినా, వారు నిజముగా
జ్ఞానము కొరకు రావడము లేదు.
రాఘవ :- అయితే ఎందుకు వస్తునట్లు? (రాఘవ కనుబొమ్మలు ముడివేసి
అడిగాడు)
భక్తుడు :- ఎందరో విచిత్ర మనస్థత్వములు గల మనుషులు గురువుగారి
దగ్గరకు వస్తుంటారు. వచ్చినవారు జ్ఞానమును తెలుసుకొను నిమిత్తమే
వచ్చినట్లు కనిపించినా, వారు జ్ఞానమును తెలుసుకొని ఏమాత్రము మార్పు
చెందరు. గురువుగారు చెవిటివాడైనా ఆయన తెల్పు జ్ఞానము ఉత్తమమైనది.
అయితే దానిని తెలుసుకొన్నట్లు నటిస్తూ కొన్ని సంవత్సరములు ఇక్కడికి
వచ్చినా, చివరికి కొన్ని సంవత్సరముల తర్వాత కూడా జ్ఞానము ప్రకారము
కాక, మొదటినుండి వున్న వారి వారి సహజత్వము ప్రకారము నడుచుకొను
చుందురు. ఈ విధముగ చాలామంది ఎంత జ్ఞానమును తెలుసుకొన్నా
చివరికి, గురువుగారినే ఎదిరించి నీదే తప్పు, మేమే సరి అన్నట్లు కూడా
ప్రవర్తించుచుందురు.
రాఘవ :- గురువుగారు చెప్పిన జ్ఞానము ప్రకారము ఆచరించకపోతే,
ఇక్కడికి ఎందుకు రావలయును?
భక్తుడు :- “ముంతలు (మట్టితో చేసిన చెంబులులాంటివి) పెట్టి చెంబులు
ఎత్తుక పోయినట్లు" అను ఒక సామెత గలదు. అదే ప్రకారమే గురువుగారి
వద్ద కొందరు ప్రవర్తించుచుందురు. కొందరైతే ముంతలు కూడా పెట్టకుండా
చెంబులు ఎత్తుకపోయే వారున్నారు. గురువువద్దకు వచ్చి విలువలేని దానిని
ఇచ్చి దానికి బదులుగా విలువున్న దానిని తీసుకొని పోయేవారున్నారు.
కొందరైతే విలువలేనిది కూడా ఇవ్వకుండ విలువైన వాటిని ఎత్తుకొని పోయే
వారున్నారు. గురువుగారు వచ్చిన వారికి అన్నము పెట్టి, జ్ఞానము చెప్పుట
ఆయనకు ఖర్చుతో కూడుకొన్న పని అని అందరికీ తెలుసు. ఆ ఖర్చు
కూడా ఇవ్వని వారు కొందరుండగా, వందరూపాయలు ఇచ్చినవాడు
తనవెంట పదిమందిని తెచ్చుకోవడము జరుగుచున్నది. కొందరు అన్నము
పెట్టు గురువుగారిని తెలివితక్కువ వానిగా భావించి, అదేపనిగా జ్ఞానము
తెలుసుకొనే దానికే వస్తున్నామన్నట్లు నటిస్తూ, కొన్ని దినములు ఇక్కడేవుండి
కాలమును గడిపిపోవుచుందురు. ఇటువంటి వారికి జ్ఞానము అవసరము
లేదు. వారు గురువునే మోసము చేయుచుందురు.
రాఘవ :- ఇటువంటి వారందరూ మోసగాళ్ళని గురువుగారికి తెలియదా?
భక్తుడు :- తెలియకేమి! అన్నీ తెలుసు. నేను చెప్పినది కొందరినే. కానీ
ఆయన మిగతా అన్ని రకముల మోసగాళ్ళను కూడా గ్రహించాడు. చూచే
దానికి ఆయన చెవిటివాడే, కానీ ఆయన గొప్ప మేధావి. మిగతా
మోసగాళ్ళను గురించి కూడా ముందే మాకు చెప్పాడు. నేను నీకు చెప్పినది
ఒక రకమైతే గురువుగారు చెప్పినది దాదాపు ఇరవై రకముల మోసగాళు
న్నట్లు గ్రహించాడు. అందులో తనవద్ద కొంత జ్ఞానమును తెలుసుకొని,
అంతా తెలుసుకొన్నాననుకొని ప్రక్కకు పోయి, తాము కూడా గురువులుగా
చలామణి అగుచూ, దానివలన డబ్బులు సంపాదించుకోవాలనుకొనువారు
మొదటి మోసగాళ్ళని చెప్పాడు.
రాఘవ :- అటువంటపుడు తెలిసీ అటువంటి వారిని జ్ఞానము చెంతకు
ఎందుకు రానీయవలయును?
భక్తుడు :- మేము కూడా ఈ మాటే చెప్పాము. దానికాయన “మన
దగ్గరకు వచ్చేవారంతా అజ్ఞానులే. అందులోని వారు మనలను మోసగించా
లనుకోవడము విచిత్రమేమి కాదు. రోగమున్న వారికే వైద్యమన్నట్లు
అటువంటి వారికే మన జ్ఞానము అవసరము. ఒకవేళ మన వైద్యముతో
వారి రోగము పోనప్పుడు, మన వైద్యము వారికి పనికి రాదని పంపిస్తాము”
అన్నాడు.
రాఘవ :- ప్రస్తుతము ఇపుడు ఇటువంటి మోసగాళ్ళు మీవద్దకు వస్తున్నారని
తెలిసింది కదా! అటువంటివారికి మీరు జ్ఞానము ప్రకారము ఆచరించినపుడే
ఇక్కడికి రావచ్చును, లేకపోతే ఇక్కడ స్థానములేదని చెప్పవచ్చును కదా!
భక్తుడు :- మనమైతే అలాగే చెప్పుతాము. కానీ గురువుగారు అలా
చెప్పరు. ఆయన చెవిటివాడైనా అమోఘమైన యుక్తికలవాడు. ఎవరిని
ఏ విధముగా దూరము చేయాలో, ఆ విధముగానే చెప్పకుండా చేస్తాడు.
రాఘవ :- మీలాంటి నిజమైన భక్తులు ఎవరూ లేరా?
భక్తుడు :- కొందరున్నారు. అయినా వారు పైకి కనిపించక సేవా భావముతో
పనిని చేస్తూ, జ్ఞానప్రచారము కొరకు పాటుపడుచుందురు. అటువంటి
వారిని చూచి ఓర్చలేని అజ్ఞానులు, తమకంటే ఎక్కువగా ఎవరూ ఉండ
కూడదను భావముతో, గురువుగారి వద్దచేరి మంచివారిని గూర్చి చెడ్డగా
చెప్పడము కూడా జరుగుచుండును. అయినా గురువు గారికి అన్నీ తెలుసు.
ఎవరు ఎటువంటివారో, ఎవరు జ్ఞానము కొరకు పని చేస్తున్నారో, ఎవరు
తమ స్వార్థము కొరకు పని చేస్తున్నారో ఆయనకు తెలుసు. కనుక అప్పటికి
వారు చెప్పినది వినినా, తర్వాత వారికే గురువువద్ద స్థానము లేకుండా
పోవును. అట్లు మేమే గురువువద్ద మొదటివారమనుకొన్న వారంతా చివరకు
గురువువద్దకు కూడా రాలేకపోయారు. గురువు చెప్పిన జ్ఞానము మా
ద్వారానే మీకు తెలుస్తుంది. మేము గురువుకు దగ్గరవారము అన్నవారందరికీ
గురువు దర్శనము కూడా కరువైపోయింది. జ్ఞానములో మేమే మొదటి
వారమనుకొన్న వారందరూ చివరివారై పోయారు. గురువు యొక్క
సంకల్పముతో మాయ అటువంటి వారందరినీ ఆశ్రమానికి దూరము
చేసింది.
(ఇదంతా విన్న రాఘవకు ఏదో పెద్ద సంసార చిక్కు కథ
విన్నట్లయినది. తల విదిలించుకొని ఆ రాత్రి అక్కడే పడుకొని, ఉదయము
లేచి అక్కడి భక్తులతోనూ, గురువుగారితోనూ చెప్పి బయలుదేరి పెద్ద
ఆశ్రమమును చూడవలెనని ప్రయాణమును సాగించెను.)
(తమ అటవీప్రాంతము నుండి బయలుదేరిన ఆటవికులు మార్గ
మధ్యములో ఒక పెద్ద పట్టణమును చేరిరి. అంతలో ప్రొద్దుగుంకెను.
అందువలన వారు ఆ రాత్రి అక్కడే ఉండాలనుకొన్నారు.వారివెంట
తెచ్చుకొన్న తేనె, రొట్టెలు తిని పండుకొనుటకు స్థలమును వెదకసాగిరి.
వారు ఎప్పుడూ పట్టణ ప్రాంతమునకు వచ్చినవారు కాదు. అలా రావడము
అదే మొదటి అనుభవము. రోడ్డు మీద రద్దీగా తిరుగు మనుషులు, వేగముగా
పోవు వాహనములు వారికి వింతగా కనిపించుచుండెను. రాత్రి పదకొండు
గంటలైనా వారికి తగిన చోటు కనిపించలేదు. చివరికి ఒకచోట రోడ్డు
ప్రక్కగానే ఖాళీ వరండా కనిపించింది. దానిని చూచినవారు ఆ రాత్రి
అక్కడనే పడుకోవాలనుకొనిరి. అక్కడ పడుకొన్న వారికి క్రొత్తచోటు కావున
కొందరికి నిద్రరాలేదు, కొందరు నిద్రపోయారు. రాత్రి రెండు గంటల
సమయములో ఎవరో తమను లేపినట్లయినది. కళ్ళు తెరిచి చూచారు,
ఎదురుగా నలుగురు పోలీసువారున్నారు. ఆటవికులు ఎప్పుడు తమ
గూడెమును వదలి బయటికి రాలేదు. కావున తమను లేపిన వారు పోలీసు
లని కూడా తెలియదు. మమ్ములను ఎందుకు లేపారని పోలీసులను
ఆటవికులు అడిగారు. ఆ మాటకు పోలీసువారు జవాబు చెప్పకుండా
దురుసుగా ప్రవర్తిస్తూ, దొంగల ముఠాను పట్టుకొన్నంత సంతోషపడుచు
వ్యానును ఎక్కండి అని గద్దించారు. ఆటవికులకు వారి ప్రవర్తన ఏమీ
అర్థము కాలేదు. అంతలో మరో నలుగురు పోలీసులు, ఒక ఇన్స్పెక్టర్
వ్యాను దిగి వచ్చారు. నగరములో దోపిడీలు చేస్తూ ఇంతవరకు దొరకకుండా
పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన దొంగలముఠా ఆటవికుల గుంపేనని
తలచిన ఇన్స్పెక్టర్, వెంటనే వైర్లెస్ సెట్లో ఎవరితోనో మాట్లాడాడు.
మాట్లాడిన కొద్దిసేపటికే రెండు పోలీస్ జీపులు వచ్చాయి. అందులోని
పోలీసులు తుపాకులతో వచ్చారు. పోలీసులు అందరూ కలిసి ఆటవికులను
బలవంతముగా వ్యానులోనికి ఎక్కించారు. పోలీస్వరు ఏమి చేయు
చున్నారో, తమను వ్యానులో ఎక్కించి ఎందుకు తీసుకపోతున్నారో,
ఆటవికులకు ఏమాత్రము అర్థము కాలేదు. తమను బెదిరిస్తున్న ఒక పోలీస్ ను
ఆటవికులు ఇలా అడిగారు)
ఆటవికులు :- మమ్ములను ఎక్కడికి తీసుకపోతున్నారు?
పోలీస్ :- మీ అత్తగారింటికి.
ఆటవికుడు :- ఏమండోయ్ టోపీ మామ! మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడు
చున్నారు. మా అత్తగారిల్లు అడవిలోవుంది. కానీ ఇక్కడెందుకు ఉంటుంది.
పోలీస్ :- నోరు మూసుకొని కూర్చో! కొడకా!
ఆటవికుడు :- మేము మామ అని మర్యాదగ పిలిస్తే, మమ్ములను కొడకా
అంటావా, మా అడవి మనుషుల బలము మీ పట్టణము వాళ్ళకు తెలియదు.
మేము ఇంతవరకు ఊరకున్నాము. ఇక మాకు కోపము వచ్చిందంటే
ఏమాత్రము ఊరుకోము.
పోలీస్లు :- మీ కథ స్టేషన్కు పోయిన తర్వాత రా, మమ్ములనే బెదిరిస్తారా,
మిమ్ములను ఏమిచేస్తామో చూడండి!
(అంతలో పోలీస్ స్టేషన్ రానే వచ్చింది. స్టేషన్ ముందర వ్యాన్
ఆగింది. ఆటవికులనందరినీ దించి లాకప్ూములో పెట్టి తాళము వేశారు.
అంతలో స్టేషన్లోని ఫోన్ మ్రోగింది. ఫోన్ ను అందుకున్న ఇన్స్పెక్టర్
అవతలి మాటలు విని, ఫోన్ న్ను టక్కున పెట్టి, "రాణినగర్ లో మర్డర్
జరిగింది. వెంటనే పోవాలని” పోలీసులను పిలుచుకొని ఆత్రుతగా
పోయాడు. పోలీస్ స్టేషన్లో డ్యూటీలోనున్న సెంట్రీ (కాపలా) పోలీస్లు
ఇద్దరు మాత్రమున్నారు. లాకప్లో బందీలైన ఆటవికులకు సమస్య ఏమిటో,
తమను ఎందుకు అక్కడకు తెచ్చిపెట్టారో ఏమీ అర్థము కాలేదు. పోలీస్
వారి ప్రవర్తనకు విసుగుకొన్న ఆటవికులు అక్కడినుండి తప్పించుక పోవాలని
నిర్ణయించుకొన్నారు.
వెంటనే వారిలో ఒకరి చేతికి కడియములాగ తగిలించుకొన్న
మోదుగ చెట్టు బదనికను బయటికి తీసి అందరి తలమీద తాకించాడు.
అలా తగిలించిన బదనిక (మూలిక) ప్రభావము చేత వారి రూపములు
మసక మసకగా మారను మొదలిడెను. అలా కనిపిస్తున్న వారు కొద్దికొద్దిగ
మారుచూ, వారి ఆకారములు పూర్తి కనిపించకుండా పోవుటకు రెండు
నిమిషములు పట్టినది. ఆ విధముగా ఒక బదనిక ప్రభావము చేత లాకప్లో
నున్న ఎనిమిది మంది ఆటవికులు అదృశ్యమైపోయారు. అలా జరిగిన
కొంతసేపటికి కాపలాగానున్న పోలీస్ లాకపైవైపు చూడడము జరిగినది.
లాకప్లోని ఆటవికులు పోలీసు కనిపించలేదు. ఖాళీగానున్న లాకపన్ను
చూచిన పోలీస్ ఆశ్చర్యపోయి, వెంటనే లాకప్ తలుపులు తెరిచి
రెండడుగులు లోపలికి పోయాడు. దభీమని ఎవరో పోలీస్ మెడమీద
కొట్టినట్లయినది. ఆ వేటుకు పోలీస్ స్పృహతప్పి పడిపోయాడు.
అదృశ్యముగానున్న ఆటవికులు పోలీస్ లోపలికి వచ్చిన వెంటనే, మెడమీద
కొట్టి అతను క్రింద పడిపోయిన వెంటనే, అందరూ బయటికి వచ్చారు.
లాకప్లో క్రిందపడిన శబ్దమువిన్న రెండవ పోలీస్ ఆత్రుతగా లాకప్ రూమ్
దగ్గరకు వచ్చాడు. లాకప్ తెరిచి ఉండడము, తన తోటి పోలీస్ క్రిందపడి
ఉండడమును చూచి ఆశ్చర్యపోయి, క్రింద పడిన పోలీస్ ను లేపడానికి
లాకప్ లోనికి పోయాడు. వెంటనే లాకప్ తలుపులు మూసుకొన్నాయి.
తలుపుకు తాళము వేయబడింది. అదృశ్యముగానున్న ఆటవికులు చేస్తున్న
ఆ పని రెండవ పోలీస్కు అర్థము కాలేదు. తాను చూస్తున్నట్లే తలుపులు
అవే మూసుకోవడము, తాళము వేసుకోవడమును గమనించిన రెండవ
పోలీస్ భయపడి గట్టిగా అరిచాడు. అయినా వినుపించుకొను వారు
ఎవరూ అక్కడ లేరు.
పోలీస్ లాకప్ నుండి బయటపడిన ఎనిమిది మంది ఆటవికులు
ఇక ఇటువంటి పట్టణములలోనికి ప్రవేశించకూడదనుకొన్నారు. బదనిక
ప్రభావము తమను మూడు గంటలు మాత్రమే అదృశ్యముగా ఉంచునని
తెలిసిన ఆటవికులు, ఆ లోపే ఆ పట్టణమును వదలి రావాలని ప్రయాణము
సాగించారు. వారు పట్టణమును వదిలి కొంత దూరము వచ్చిన తర్వాత
తెల్లవారింది. తెల్లవారిన తర్వాత పోలీస్టేషన్లో జరిగిన విచిత్ర సంఘటన
యొక్క విషయము పట్టణమంతా ప్రాకింది. ఆ జిల్లా యస్.పి (S.P.)
గారు ఆ సంఘటనను దర్యాప్తు చేయుటకు ప్రత్యేక బృందమును ఏర్పాటు
చేశాడు. మాయాజాలముగా జరిగిన లాకప్ సంఘటనపై పోలీస్
డిపార్టుమెంటు స్పందించింది. వార్త డి.ఐ.జి వరకు ప్రాకింది. "దొంగల
ముఠా మాయా జాలమ్" అను పేరుతో వార్తా పత్రికలు ఆ విషయమును
ప్రచురించాయి. అసలు దొంగల ముఠా నాయకుడైన తాటిమాను మునెప్ప,
మునెప్ప ముఠాలోని సభ్యులు ఆ వార్తను చూచి ఆశ్చర్యపోయారు. తాము
ఆ దినము పట్టణములోనికి పోకున్ననూ, తమ ముఠా మీద వార్త రావడము
విచిత్రముగా తోచింది. అసలు సంగతి ఏమిటో, ఎలా జరిగిందో
తెలుసుకొని రావడానికి మునెప్ప తమ మనిషిని పట్టణానికి పంపాడు.
రాఘవ చెవిటి స్వామి వద్ద జరిగిన అనుభవాలను నెమరేసుకొంటూ
ప్రయాణించి చివరకు పెద్ద ఆశ్రమమును చేరెను. గొప్ప అందమైన మేడలూ,
పూలచెట్లతో కూడిన విశాలమైన పార్కులూ, వేలమందితో కూడిన
ప్రాంతమంతయూ ఎంతో అందముగా, చూచుటకు ఆనందముగా కలియుగ
వైకుంఠమువలె ఉన్నది. ఆ ప్రాంతమును అక్కడి భక్తి వాతావరణమును
చూస్తూనే రాఘవలో కూడా భక్తి భావము వచ్చినది. ఇక్కడున్న స్వామీజీ
ఎవరో గొప్పవాడను భావము అతనిలో కల్గినది. అక్కడి వాతావరణమే
అతనిని అలా మార్చి వేసినది. వెంటనే రాఘవలోనున్న హేతుబద్దత,
సత్యాన్వేషణ మెదిలినవి. బుద్ధితో సత్యము తెలియనిదే, దేనికైనా హేతుబద్దత
లేనిదే, ఒక నిర్ణయానికి ఏకపక్షముగా రాకూడదని, అలా ఒక నిర్ణయానికి
రావడము మూఢనమ్మకమగునను యోచన రాఘవకు వచ్చినది. రాఘవ
సత్యాన్వేషి కావున, పూర్తి పరిశోధన జరిగిన తర్వాతనే దేనినైనా, ఎవరినైనా
సరియైన పద్ధతిలో లెక్కించవచ్చునని అనుకొన్నాడు. అప్పుడు ఆ ఆశ్రమానికి
అధిపతియైన స్వామీజీని గురించి తెలుసుకోవాలని అక్కడేనున్న ఒక వృద్ధున్ని
ఇలా అడిగాడు.
రాఘవ :- తాతగారూ; ఇక్కడ స్వామి దర్శనము నాకు ఎప్పుడు దొరుకు
తుంది?
వృద్ధుడు :- ఆరు నెలలుగానున్న మాకే దొరకలేదు. అంత తొందరగా
నీకెలా దొరుకుతుంది? ఆయన దర్శనము అంతసులభముగా దొరకదు.
ఎంత కాలమైనా కాచుకొనివుండు ఓపిక కావాలి. అప్పుడు నీ పుణ్యము
కొద్దీ దొరుకుతుంది.
రాఘవ :- స్వామిగారి పేరేమిటి?
వృద్ధుడు :- (ఆశ్చర్యముగా రాఘవ వైపు చూచి) స్వామి పేరు తెలియదా?
ఆయన పేరు తెలియని వారే లేరే!
రాఘవ :- నిజముగ నాకు తెలియదు, నేను ఈ ప్రాంతమునకు క్రొత్తవాడిని.
వృద్ధుడు :- స్వామిగారి పేరు దాదాబాబా. ఆయన గొప్ప మహత్యముగల
వారు. మనదేశములోనే కాకుండా, విదేశములో కూడా దాదాబాబా గారికి
చాలా పేరున్నది. ఇక్కడున్న భక్తులలో చాలామంది విదేశీయులే ఉన్నారు.
ఇప్పటి కలియుగములో ఈయనే ప్రత్యక్ష దైవము.
రాఘవ :- ఇంత గొప్ప స్వామీజీని గురించి నిజముగా నాకు తెలియదు.
తెలిసివుంటే అప్పుడే వచ్చేవాడిని. ఇప్పుడిప్పుడే దైవజ్ఞానమును తెలుసు
కోవాలను ఆసక్తి కల్గినది. అందువలన ఆశ్రమములను చూడాలని, అక్కడి
జ్ఞానమును తెలుసుకోవాలని ఆసక్తితో తిరుగుచు ఇక్కడికి వచ్చాను. దాదా
బాబాగారిని చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నది.
వృద్ధుడు: నిజమే బాబు, నేను కూడా ఆయన దర్శనమునకే వేచి
ఉన్నాను. బాబావారు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాతనే
దర్శనము లభించగలదు.
రాఘవ :- స్వామి వారి చిత్రపటమునైనా చూస్తాను. మీవద్ద వుంటే
చూపించండి.
(అప్పుడు ఆ వృద్ధుడు బాబాగారి చిత్రపటమును చూపించుటకు
చాలా కాలమునుండి అక్కడేనున్న మరియొక వృద్ధుని వద్దకు తీసుకొని
పోయి, రాఘవను ఆ వృద్ధునికి పరిచయము చేసి బాబాగారి పటమును
చూపించమని చెప్పెను. అందులకు రెండవ వృద్ధుడు సంతోషపడి ప్రక్కనే
పూజలోనున్న దాదాబాబాగారి పటమును చూపెను. బుట్టతల బాబాగారి
చిత్రమును రాఘవ శ్రద్ధగా చూచాడు. తర్వాత రాఘవ బాబాగారి
విషయమును గురించి రెండవ వృద్ధుని అడగను మొదలుపెట్టెను.)
రాఘవ :- మీరు మొట్టమొదట ఎలా బాబాగారిని గుర్తించి ఇక్కడికి
రాగలిగారు?
వృద్ధుడు :- పది సంవత్సరముల క్రితము ఒక ఆక్సిడెంట్లో నా కాలు
విరిగినది. అపుడు అసుపత్రిలో చికిత్స నిమిత్తము ఉంటిని. అక్కడే నా
ప్రక్క మంచము మీద ఒక తలనొప్పి రోగి ఉండెను. అతనికి ఎన్ని వైద్యములు
చేసినా తలనొప్పి తగ్గలేదట. అందువలన అతను ఆసుపత్రిలో చేరి నెల
రోజులుగా చికిత్స చేయించుకొనుచున్నాడు. అయినా అతను తలనొప్పితో
అలాగే బాధపడుచుండెను. ఒకరోజు అతని బంధువు ఒకరు వచ్చి
దాదాబాబా గారి విభూదిని తెచ్చి ఇచ్చాడు. ఆ విభూదిని ఆ రోగి తలకు
వ్రాసుకొని పడుకొన్నాడు. ఉదయము లేచే సమయానికి అతని నొప్పి
లేకుండా పోయింది. ఆ విషయము నాకు తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ
సంఘటనతో బాబాగారు శక్తివంతుడని నాకర్థమైనది. అప్పుడు ప్రక్కనున్న
బాబా భక్తునితో విభూదిని కొద్దిగ ఇప్పించుకొని నా కాలికి కూడా కొద్దిగ
పూసి మనస్సులోనే బాబాగారిని వేడుకొన్నాను. నేనలా చేసిన సమయము
నుండే నా కాలి నొప్పిలో తేడా కనిపించసాగింది. అప్పటి వరకు నడువలేని
నేను మూడురోజులకే లేచి కట్టె సహాయముతో నడువసాగాను. కాలి
ఎముకకు స్టీల్రడ్ వేయాలన్న డాక్టర్లు నేను నడవడము చూచి ఆశ్చర్య
పోయారు. నా కాలును పరీక్షించిన డాక్టర్లు స్టీల్ రాడ్ అవసరము లేదన్నారు.
ఆ విధముగా నా కాలు ఎముక బాబాగారి విభూది వలననే సులభముగా
అతుక్కొని పోవడము నిజముగా బాబాగారి మహత్తేనని నాకర్థమైనది.
అప్పటి నుండి ఇక్కడికి వచ్చి బాబాగారి సన్నిధిలో ఉంటున్నాను.
సంవత్సరానికి మూడు నెలలు ఇక్కడే గడుపుచుంటాను.
రాఘవ :- మీరు ఇక్కడికి వచ్చినప్పుడంతా మూడు నెలల కాలముంటున్నారు
కదా! మీకు ఆహారము ఇక్కడ ఉచితముగా దొరుకుతుందా, లేక మీరు
స్వయాన వండుకుంటారా?
వృద్ధుడు :- లేదు నాయనా! ఎవరి ఖర్చు వారు పెట్టుకొని ఉండవలసిందే.
ఇక్కడికి వచ్చువారు ఎవరైనా సేవా భావముతోనే వస్తుంటారు. ఎవరి
ఖర్చుతో వారుండి పోతుంటారు.
రాఘవ :- దాదా బాబాగారు ఎంతో గొప్పవారై ఎందరినో భక్తులను
కల్గియున్నాడు కదా! ఇంత గొప్ప వ్యక్తి మన దేశములో ఇప్పుడుగానీ,
గతములోగానీ ఎవరూ లేరనుకుంటాను.
వృద్ధుడు :- ఎప్పటికీ బాబాగారి సమానులు లేరు. ఒక విషయమును
చెప్పదలుచుకొన్నాను. గత జన్మ కాలములోనూ బాబాగారే గొప్ప వ్యక్తిగా
ఉండేవారు. ఆ విషయము అందరికీ తెలియక ఈయనకంటే ఆయనే
గొప్ప అని కొందరంటున్నారు.
రాఘవ :- ఏమిటి తాతగారూ! ఈ బాబాగారి ముందు జన్మ కూడా మీకు
తెలుసా! ఎలాగ తెలుసు? బాబాగారు గత జన్మలో ఎలాగుండేవారు?
(వెంటనే ఆ వృద్ధుడు తన సూట్కేస్ లోని ఒక ఫోటోను తీసి
చూపించి ఇదే గత జన్మలోని బాబాగారి ఫోటోనని చెప్పాడు. రాఘవ ఆ
ఫోటోను ఆశ్చర్యముగా చూచాడు. బాబాగారి ఈ జన్మకు గతజన్మకు
ఏమాత్రము పోలికలు లేనట్లు గ్రహించాడు. కానీ రెండు ఫోటోలలోనూ
ఒకే ఒక గుర్తు కనిపించింది. అంతవరకు ఎవరూ గుర్తించని ఒక గుర్తును
రాఘవ గ్రహించగలిగి ఆ విషయమును బయటికి చెప్పకుండా తన మనస్సు
నందే ఉంచుకొన్నాడు. రాఘవ గుర్తించిన ఒక గుర్తు గత జన్మలోనూ, ఈ
జన్మలోనూ ఉన్న బాబాగారు ఒక్కరేనను బలమును చేకూర్చుచున్నది.
రాఘవ కనుగొన్న రెండు ఫోటోలలోని గుర్తేమిటో ఆ వృద్ధులకు కూడా
తెలియదు. )
రాఘవ :- తాతగారూ! గత జన్మలో బాబాగారి పేరేమిటి?
వృద్ధుడు :- దేశాయి బాబా అను నామధేయముతో గతజన్మలో ఉండేవారు.
ఆ జన్మలో ఎన్నో మహత్యములను చూపిన దేశాయి బాబాగారు, ఈ జన్మలో
దాదాబాబాగా అవతరించారు. గతజన్మ విషయమూ, అప్పుడు ఎక్కడున్నదీ,
ఏ పేరుతో ఉన్నదీ దాదాబాబాగారే స్వయాన చెప్పారు. బాబాగారు
స్వయముగా చెప్పినందున పోయిన జన్మ విషయము తెలిసింది. లేకపోతే
తెలిసేది కాదు. గత జన్మలోనే దేశాయి బాబాగారికి ఎంతోమంది భక్తులుండే
వారు. అందువలన ఈ జన్మలో దాదాబాబాగారి రూపములోనున్నది
దేశాయి బాబా అని తెలియుట వలన, ఆయన భక్తులందరూ ఒక్కమారుగా
ఈయన భక్తులైపోయారు. దాదాబాబాగారు కూడా పోయిన జన్మలో
మహిమలు చూపినట్లే, ఈ జన్మలో కూడా చూపడము వలన, దాదా
బాబాగారికి కోట్లాది మంది భక్తులై పోయారు.
(రాఘవ వృద్ధునితో మాట్లాడుచుండగనే ఆశ్రమప్రాంతములో
భక్తులు ఆతృతగ అటూ, ఇటూ తిరగడము పూల తోరణములు కట్టడమును
రాఘవ గమనించాడు. తాను చూచిన విషయమును ఆ వృద్ధునికి తెలిపి
ఎందుకు తోరణములు కట్టుచున్నారని అడిగాడు. వెంటనే ఆ వృద్ధుడు
కూడా అక్కడ జరుగుచున్న హడావిడిని చూచి బాబాగారు వస్తున్నట్లున్నది.
అందుకే అలంకరణములు చేయుచున్నారని సంతోషమును వ్యక్తపరుస్తూ
చెప్పాడు. తాను వచ్చిన దినమే బాబాగారు రావడము రాఘవకు కూడా
ఆనందమైనది. అందరూ బాబాగారి రాకకోసము ఎదురు చూస్తూవుండిరి.
కొన్ని గంటల తర్వాత కారు వెనుక కారు వస్తూ కనిపించినవి. ఆశ్రమ
ప్రాంతములోనికి ఎన్నో కార్లు వచ్చినవి. వాటి మధ్యలో ఖరీదైన కారులో
బాబాగారు వచ్చారు. దాదాబాబాగారు కారునుండి కాలు క్రిందపెట్టగనే
భక్తులనుండి పూలవర్షము కురిసింది. తాను వచ్చిన దినమే బాబాగారి
దర్శనము దొరికినందుకు రాఘవ సంతోషించాడు. రాఘవ ఐదు దినములు
అక్కడే గడిపాడు. ప్రతిదినము ఉదయమూ, సాయంకాలమూ బాబాగారు
అక్కడున్న ప్రజలకు దర్శనమిచ్చుచుండెను. దర్శన సమయములో తన
ఖాళీ చేతినుండి విభూదిని సృష్టించి కొందరికి ఇచ్చుచుండెను. ఒక భక్తునికి
బంగారు ఉంగరమును కూడా తన ఖాళీ చేతిలోనుండి తీసి ఇచ్చాడు.
అలా ఉన్నట్లుండి బంగారు వస్తువులనూ, విభూదినీ ఇవ్వడము రాఘవ
స్వయాన దగ్గరనుండి చూచాడు. అలా ఇవ్వడము చాలా గొప్ప మహత్యమని
రాఘవ అనుకొన్నాడు. దాదాబాబాగారి గొప్పతనమును చూచిన రాఘవ
సంతృప్తిగా అక్కడినుండి బయలుదేరి ప్రయాణమును సాగించాడు.)
(ఎనిమిది మంది ఆటవికుల గుంపులో యోగా, మేఘా, చక్రి
అను ముగ్గురు తెలివైన యువకులుండిరి. వారు పట్టణములో జరిగిన
సంఘటన తిరిగి జరుగకుండా జాగ్రత్తపడి, వారి ప్రయాణము దారుల
వెంబడి కాకుండా దారికి కొంత దూరముగా నడుస్తూ, దారిని ఆధారము
చేసుకొని ప్రయాణము సాగించుచుండిరి. అట్లు వారు ఒక రైలుమార్గమును
అనుసరిస్తూ, దానికి దాదాపు 200 గజముల దూరములో నడుస్తూ,
పోవుచుండిరి. వారు చూస్తున్నంత దూరములో ప్రయాణికుల రైలుబండి
వేగముగా వస్తుండెను. ఆటవికులు గతములో ఎప్పుడూ రైలుబండిని
చూడలేదు. కావున వస్తున్న రైలును నిలబడి వింతగా చూస్తున్నారు. వారు
నిలుచున్న చోటున వరుసగా చెట్లుండుట వలన వారు ఎవరికీ
కనిపించకుండిరి. కానీ వారికి రైలు చెట్ల సందులలోనుంచి బాగా
కనిపిస్తూవుండెను. ఆటవికులు చూస్తున్న రైలు వేగముగా వారున్న జాగాను
దాటిపోయింది. అలా రైలుబండి పోవునపుడు ఒక కంపార్టుమెంటు నుండి
రైలుకట్ట ప్రక్కనున్న చెట్ల పొదలలోనికి ఏదో పెట్టెలాంటిది పడినట్లు
ఆటవికులు చూచారు. యోగా, మేఘా దానిని గమనించినవారై మిగతా
వారికి కూడా ఆ విషయమును తెలిపారు. రైలు రెండు నిమిషములలోనే
కనుచూపుమేరలో కనిపించకుండా పోయెను. రైలు పోయిన తర్వాత
ఆటవికులు అందరూ పెట్టెపడిన చెట్లవద్దకు పోయి వెదకసాగిరి. వారిలో
చక్రీకి రైలునుండి క్రిందపడిన సూట్కేస్ కనిపించినది. వెంటనే దానిని
తీసుకొని అందరూ కాలిత్రోవలోనికి చేరిరి. అప్పుడు మధ్యాహ్నము రెండు
గంటలగుట చేత ఆకలికొన్నవారై, వారి వద్దనున్న తిండి తినుటకు అక్కడికి
సమీపములోనున్న నిమ్మతోటలోని బావివద్దకు చేరిరి. తమ వద్దనున్న
తిండి తిన్న తర్వాత నిమ్మచెట్ల క్రింద కూర్చొని సేద తీర్చుకోవలెననుకొనిరి.
నిమ్మచెట్ల క్రింద కొద్దిమాత్రము నీడవుండుట వలన, ఒక్కొక్క చెట్టుక్రింద
ఒక్కొక్కరు కూర్చొని, విశ్రాంతి తీసుకొనుచూ తమకు దొరికిన పెట్టెలో
ఏముందోనని యోచిస్తూ వుండిరి. అంతలో దూరముగా రెండు సైకిల్
మోటర్ల శబ్దము వినిపించెను. పట్టణములో జరిగిన సంఘటనతో
జాగ్రత్తగానున్న యోగా చెట్ల చాటునుండి చూడసాగెను. కాలిత్రోవన వస్తూ
మోటర్ సైకిళ్ళు రెండూ, సూట్కేస్ పడిన చోటికి దగ్గర ఆగినవి. అందులో
నుండి దిగిన ఇద్దరు వ్యక్తులు రైలుకట్ట ప్రక్కకు పోయి సూటకేస్ పడిన
జాగాలో వెదకసాగిరి. వారు అలా వెదకడమును ఆటవికులందరూ
ప్రక్కనేనున్న నిమ్మతోటలో నుండి గమనించుచుండిరి. వెదకి వేసారిన
ఇద్దరు వ్యక్తులు వారికి కావలసిన సూట్కేస్ దొరకలేదని, దానిని ఎవరో
కాజేశారను నిర్ణయానికి వచ్చారు. అక్కడినుండి ఇద్దరూ దారిలోనికి వచ్చి
ఇలా మాట్లాడసాగారు.
ఒకడు :- ఒరే వెంకూ! సూట్కేసు ఇక్కడే వేశానురా, అది ఎలా మాయ
మైందో అర్థము కాలేదు. మన నాయకునికి ఏమని చెప్పాలి?
వెంకు :- నూకా! నీవు భయపడవద్దురా, మన నాయకునికి ఉన్న
విషయమును చెప్పవచ్చును. కానీ సూట్కేస్లో లక్షల విలువైన
వజ్రాలున్నాయి కదరా! అవి మనము నష్టపోయినట్లే కదా!
నూకా :- మన నాయకుడు మనలను అనుమానిస్తే, మన ప్రాణాలకే
ముప్పు కదా!
వెంకు :- నీకు అటువంటి భయము ఏమీ వద్దు. నీతో పాటు నేనున్నాను
కదా! నాయకుడు నాకు స్వంత అన్నయ్యే కావున ఉన్న విషయమంతా
నేను మా అన్నతో చెప్పుతాను. కానీ నేను అర్థగంట క్రితమే సూట్కేసు
రైలునుండి క్రిందికి వేశాను. అప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. తర్వాత
ఎవరైనా వచ్చి దానిని తీసుకొనివుంటే, వారు చాలా దూరము పోయివుండరు.
అందువలన వెంటనే మనము వెదకడము మంచిది.
(వెంకూ, నూకా ఇద్దరు మాట్లాడు మాటలన్నిటిని ఆటవికులు
విన్నారు. తమవద్దనున్న సూట్కేస్ వజ్రములున్నవని తెలుసుకొన్న
ఆటవికులకు ఆశ్చర్యమైంది. అంతలో సైకిల్మెటర్ల మీద బయలుదేరబోవు
వెంకు దృష్ఠి నిమ్మతోట మీద పడింది. ఈ తోటలో ఎవరైనా తోటవారుండ
వచ్చును. ఒకవేళ వారు రైలునుండి పడిన సూట్కేసన్ను గమనించి వారు
తీసియుండవచ్చును. ఎందుకైనా మంచిది తోటలోనికి పోయి చూచి
వస్తామని వెంకు, నూకా నిర్ణయించుకొని ఇద్దరూ తోటవైపు వచ్చారు. )
(తాటిమాను మునెప్ప దొంగల ముఠానాయకుడు. మునెప్ప తమకు
సమయానికి చేరవలసిన వజ్రములు చేరనందుకూ, తమ మనుషులు కూడా
రానందుకు యోచిస్తూవుండెను. ఒకవేళ పోలీసులు బెడద తమవారికి
ఎదురైనదేమోనని తలచి, తన ముఠాలోని జాన్ అనే వాడిని పిలిచి ఇలా
చెప్పాడు.)
మునెప్ప :- మనవారు ఇప్పటికి వజ్రాలతో రావలసివుంది, కానీ ఇంతవరకు
రాలేదు. వారికేమైనా ఇబ్బంది కానీ, ప్రమాదముగానీ జరిగివుండవచ్చును.
ముఖ్యమైన విషయము కావున నా తమ్ముడు కూడా పోయాడు. నీవు
పోయి ఈ విషయమునంతటిని పూర్తిగా తెలుసుకొనిరా.
జాన్ :- అలాగే బాస్, ఒకవేళ మనవారు పోలీసులకు దొరికివుంటే నేనేమి
చేయాలి?
మునెప్ప :- మనవారు సులభముగా దొరకరు. ఒకవేళ వారు దొరికినప్పటికీ
మనవారి వద్దనున్న వజ్రాలను పోలీసులు గమనించలేరు. మనవారు
పోలీస్ కస్టడిలో వుంటే నీవు తెలివిగా వారిని కలుసుకో, మనవారు
దొరికిపోయి వజ్రములు దొరకనట్లయితే కుడి భుజమును బరుక్కొంటారు.
ఒకవేళ వజ్రాలతో సహా దొరికివుంటే ఎడమ భుజమును బరుక్కుంటారు.
నీవు వెంటనే వచ్చి ఆ విషయమును తెలియజేయి.
జాన్ :- బాస్! మనవారు పోలీసులకు దొరకలేదెమో!
మునెప్ప :- అలా దొరకకపోతే ఈ వేళకు వారు వచ్చి చేరివుండవలసింది.
ఇది వజ్రాల వ్యవహారము. ఇందులో మనకు కమీషన్ మాత్రము వస్తుంది.
వజ్రాలు పోతే మనము వాటి మొత్తము ఇవ్వాల్సి వస్తుంది. మనము పెద్ద
ఇబ్బందిలో పడతాము. అందువలన నీవు వెంటనే ఈ విషయమును
తెలుసుకొనిరా.
జాన్ :- అలాగే బాస్ (తన పెంపుడు కుక్క జానీతో సహా జాన్ బయలు
దేరిపోయాడు.)
(శాంతిపురములోని ఆశ్రమములో వృద్దుని వలన దాదాబాబా
గారిని గూర్చి అనేక విషయములు తెలుసుకొన్న రాఘవ తన అన్వేషణలో
ఇంకా కొంత ప్రయాణము సాగించాడు. అలా పోవుచున్న రాఘవకు
ఒకచోట సత్యాన్వేషణ సమితి అను పేరుగల ఒక బోర్డు కనిపించింది.
రాఘవకు కావలసింది సత్యాన్వేషణే కనుక వెంటనే అచటికి పోయి అక్కడేమి
తెలియబడునో అది తెలుసుకుందామనుకొన్నాడు. అలాగే పోయాడు.
తన ఉద్దేశమును తెలిపాడు. దానికి ఆ సమితివారు సంతోషించి, మంచి
భోజనమును పెట్టి, నీవు ఏదైనా అడిగి తెలుసుకోవచ్చును. ఇక్కడ చెప్పేదంతా
సత్యమేవుంటుంది. అసత్యమును ఖండించి సత్యమును తెలుపడమే తమ
పని అని రాఘవతో చెప్పారు.
సత్యాన్వేషణ సమితి అంటే ఏదో దైవజ్ఞానమును బోధించునదని
రాఘవ అనుకొన్నాడు. నిజానికి ఆ సమితి అలాంటిది కాదు. పేరు
మంచిదే అయినా అది ఒక హేతువాద సంఘములాంటిది. అలాగని
అనుకొనుటకు కూడా వీలులేదు. పైకి సత్యాన్వేషణ అని హేతువాదములాగ
కనిపించినా వాస్తవానికి అది నాస్తికవాదమునకు సంబంధించినదేనని
చెప్పవచ్చును. 'సత్యాన్వేషణ' అను పేరును అడ్డము పెట్టుకొని అన్నిటినీ
అడ్డముగా ఖండించడము తప్ప వేరే ఉద్దేశము అందులో లేనేలేదు. అందరిని
ఖండించుచూ, అందరికంటే నేనే తెలిసినవాడిననిపించుకోవాలను తపన
తప్ప సత్యమును అనుసరించి మాట్లాడడము ఏమీ ఉండదు. రాఘవ
సత్యాన్వేషణ ఏమాత్రములేని అటువంటి నాస్తికులను ఈ విధముగా
ప్రశ్నించను మొదలు పెట్టాడు.)
రాఘవ :- దేవుడున్నాడనీ, అతను కనిపించకుండా ఉన్నాడని కొందరు
అంటుంటారు. ఈ మాటలో సత్యమెంతవుంది?
సత్యవాది :- కనిపించని దేవుడున్నాడనడము సత్యము కాదు.
రాఘవ :- దయ్యముకలదనీ అది కొందరికి కనిపించిందని అంటుంటారు.
ఈ మాటలో సత్యమెంతవుంది?
సత్యవాది :- దేవుడు కనిపించడను మాట, దయ్యము కనిపిస్తుందను మాట
రెండూ సత్యము కాదు. వాస్తవానికి సత్యశోధనలో అభౌతికమైన దేవుడు
లేడూ, అట్లే అభౌతికమైన దయ్యము లేదు.
రాఘవ :- కొందరు స్వామీజీలు కొన్ని మహత్యములు కల్గివుంటారనగా
విన్నాను. ఈ మాటలో సత్యమెంతవుంది?
సత్యవాది :- ఈ మాటలో కూడా సత్యము ఏమాత్రము లేదు. అసలు
మహత్యమనునదే లేదు. ఒకవేళ ఎవరైనా మహత్యములు చూపుచున్నారంటే
అది తన మ్యాజిక్ు ఎవరికీ తెలియకుండా మహత్యముగా చెప్పుచున్నారనీ,
వారు ప్రజలను మభ్యపెట్టి మ్యాజిక్ చేసి చూపిస్తున్నారు తప్ప అవి
మహిమలు కావని చెప్పవచ్చును.
రాఘవ :- క్రైస్తవులకు ప్రవక్త ఏసు, హిందువులకు ప్రవక్త కృష్ణుడు అని
అంటుంటారు. ఈ మాటలో సత్యమెంతవుంది?
సత్యవాది :- ఏసు, కృష్ణుడు కొన్ని మాటలు చెప్పారు. అందువలన
కొందరు వారిని ప్రవక్తలంటున్నారు. నిజముగా వారు వక్తలు మాత్రమే,
ప్రవక్తలు కాదు.
రాఘవ :- వారు గొప్పవారని అందరూ అంటున్నారు కదా! వారు
గొప్పవారు కాదా?
సత్యవాది :- వారికంటే నేనే గొప్పవాడిని, నాకు తెలిసినంత కూడా వారికి
తెలియదు. వారిలో సత్యాన్వేషణే లేదు.
రాఘవ :- ఇప్పటి కాలములోనైనా గొప్ప జ్ఞానులు ఎవరైనా ఉన్నారా?
నైనా ఉన్నారా?
సత్యవాది : :- అలా లేరనేగా నేను సత్యాన్వేషణ సమితిని స్థాపించినది.
ఇతను జ్ఞాని అని ఎవరైనా అంటే అతను అభౌతికమైన దానిని గురించి
బోధిస్తుంటాడు. భౌతికము తప్ప అభౌతికము నిరూపణకు రాదు.
అందువలన అభౌతికమును ఖండించి సత్యమును తెలుపు నేను తప్ప ఎవరూ
నిజమైన జ్ఞానులు భూమిమీద లేరు. నేను ఎంతోమందితో వాదించాను.
నా వాదనకు అందరూ ఓడిపోయారు.
(ఆ మాటలతో రాఘవకు కొంత అనుమానము వచ్చినది.
ఇంతకూ ఈయన సత్యవాదియా లేక నాస్తికవాదియా అని మనస్సులో
ప్రశ్న వచ్చి దానిని దృఢపరచుకొనుటకు కొన్ని ప్రశ్నలు అడిగాడు).
రాఘవ :- మనిషి శరీరము కనిపించినా, శరీరములోని జీవుడు కనిపించడు.
కొందరు తత్త్వవేత్తలు కనిపించే శరీరమును పుట్టగా, కనిపించని జీవున్ని
పుట్టలోని పాముగా చెప్పుచుండుట విన్నాను. దీనినిబట్టి కనిపించు శరీరము
భౌతికము అయితే, కనిపించని జీవుడు అభౌతికము అగునుకదా! దీనిని
గురించి మీరేమంటారు?
సత్యవాది :- అభౌతికము అనునది లేనేలేదు. జీవుడు అనేవాడూ లేడూ,
దేవుడు అనేవాడూ లేడు. ఇదంతా సైన్సు (విజ్ఞానము) తెలియనివారు
మాట్లాడే విధానము. శరీరములో జీవకణములున్నాయి. జీవకణములు
పని చేసినంతవరకు మనిషి బ్రతుకుచున్నాడు. జీవకణములు పని చేయని
స్థితిలో మనిషి చనిపోతున్నాడు. అంతేతప్ప ప్రత్యేకముగా జీవుడు
ఉన్నాడనడము అసత్యవాదమగును.
(ఈ మాటతో రాఘవకు వీరు మాట్లాడునది నాస్తికవాదము తప్ప
సత్యవాదము కాదని కొంతవరకు అర్థమైనది.)
రాఘవ :- సృష్ఠి, సృష్టికర్త అని కొందరంటుంటారు.
ఒక వస్తువుంది
అంటే అది సృష్ఠింపబడినదనీ, దానిని సృష్టించినవాడున్నాడనీ చెప్పు
చుందురు. ఆ పద్ధతి ప్రకారము ఈ విశ్వమును సృష్ఠించినవాడు
ఒకడున్నాడా?
సత్యవాది :- మనిషి సృష్ఠిలోని ఒక భాగమే, అట్లే భూమి, ఆకాశము,
సముద్రములు కూడా సృష్ఠిలోని భాగములే. అయితే వీటికి సృష్టికర్త
ఒకడున్నాడనుకోవడము పొరపాటు. కనిపించే ఇవి మాత్రమే కాకుండా
సూర్యుడు, చంద్రుడు మొదలగు గ్రహములు, ఇంకా విశ్వములోని
నక్షత్రములు, నక్షత్ర సముదాయమైన పాలపుంతలు ఇంకా ఎన్నో పరస్పరము
వాతావరణ మార్పువలన ఏర్పడుచున్నవి, అట్లే నశించుచున్నవి. ఇదంతా
ఖగోళశాస్త్రమును చూస్తే తెలుస్తుంది. అంతేగానీ ఈ విశ్వమును పుట్టించిన
వాడుగానీ, నాశనము చేయువాడుగానీ లేనేలేడు అనుట సత్యము.
(ఈ మాటతో ఇతను పూర్తి నాస్తికవాదనీ, ఇతను సత్యవాదినను
ముసుగు తగిలించుకొన్నాడని అర్థమైనది.)
రాఘవ :- మీరు చాలా బాగా చెప్పుచున్నారు. అయినా నావద్ద అడిగే
దానికి ప్రశ్నలు లేకుండాపోయినవి. చివరిగా ఒక ప్రశ్న అడుగుచున్నాను.
అదేమనగా! సత్యమంటే ఏమిటి? అసత్యమంటే ఏమిటి?
సత్యవాది :- సత్యమంటే సైన్సు, సైన్సు కానిది అంతా అసత్యమే. ఇంకా
చెప్పితే సైన్సు అంటే విజ్ఞానము, సైన్సు కానిది అజ్ఞానము.
(ఈ మాటతో సత్యాన్వేషి అయిన రాఘవకు సత్యవాదిలో అసత్య
వాది, నాస్తికవాది కనిపించినట్లయినది. ఇంక ఇతనితో ఒక్కమాట
మాట్లాడినా అది వృథా ప్రయాసయే అనుకున్నాడు. అంతవరకు తనతో
మాట్లాడినందుకు అతనికి ధన్యవాదములు తెలిపి అక్కడినుండి బయటపడి,
తనకు మూడు చోట్ల ఎదురైన అనుభవములను తలచుకొంటూ ఇక
ఎక్కడికి పోయినా ప్రయోజనములేదని, రాజయోగానంద స్వామి వద్దకు
పోవుటకు నిర్ణయించుకొని తిరుగు ప్రయాణము సాగించెను. చివరకు
రాజయోగానంద స్వామి వద్దకు చేరిన రాఘవ తాను మూడు ఆశ్రమములకు
పోయి అక్కడ పొందిన అనుభవములను స్వామిగారికి చెప్పసాగెను. మొదట
సత్యాన్వేషణ సమితి వారితో జరిగిన సంభాషణ గురించి చెప్పెను.)
రాఘవ :- స్వామీ! మీరు కొన్ని ప్రాంతములకు పోయి, అచ్చట వారి
విధానములు తెలుసుకొనిరమ్మన్నారు. అలాగే పోయివచ్చాను. నేను
అక్కడికి పోయి రాకపోతే ఆధ్యాత్మిక లోకములో మనుషులు ఇన్ని
విధములున్నారని తెలిసేదేకాదు. పోయివచ్చిన దానివలన ఎంతో
అనుభవము కల్గినది. విచిత్రమేమి అంటే దేవుడున్నాడు అనువారు, తెలియక
సరియైన జ్ఞాన మార్గములో నడువలేదు అంటే, దానికి సమాధానముగా
వారికి తెలిసిన మార్గములో వారు నడుస్తున్నారులే అనుకోవచ్చును. కానీ
సత్యాన్వేషణ అని బోర్డు పెట్టుకొని దేవుని విషయములో ఏమాత్రము
సత్యమార్గమును కాకుండా, అసత్య మార్గమును అనుసరిస్తూ, తమదే
సత్యమని చెప్పుకొను వారుండుట, నాకు చాలా విచిత్రముగా తోచింది.
భౌతికము తప్ప అభౌతికము లేదని చెప్పడమే వారి సత్యవాదనట.
దేవుడేలేడని పూర్తి నాస్తికత్వమును బోధిస్తూ అంతకంటే సత్యము లేదనీ,
అలా చెప్పడమే సరియైన సత్యవాదన అని చెప్పడము జరిగినది. ఇది
నాకు చాలా క్రొత్త అనుభవము.
రాజయోగానంద :- సత్యాన్వేషణ సమితిని స్థాపించినది నీతో మాట్లాడిన
వ్యక్తియే. అతను తాను బయటికి తెలియాలను కోర్కెతో సైన్సు అనీ,
సత్యాన్వేషణ అని చెప్పుచూ, అందరికీ అడ్డముగా మాట్లాడి, తాను మిన్న
అనిపించుకోవాలని ఆయన ఉద్దేశము. ఆయన ఇప్పటివారికంటే నేను
గొప్ప అనడమే కాకుండా, పూర్వపు ప్రవక్తలకంటే నేనే గొప్పవాడిని అని
చెప్పుకోవడము ఆయనకు అలవాటు. సత్యాన్వేషణ అను ముసుగు
తగిలించుకొని అయినదానికీ కానిదానికీ సైన్సు అని చెప్పుచూ, ఇతరులను
తక్కువచేసి మాట్లాడడము ఆయనకున్న రోగము. అతను దైవజ్ఞానము
చెప్పే వారందరినీ మోసగాళ్ళంటుంటాడు.
రాఘవ :- అటువంటి వ్యక్తివద్దకు ఎవరు పోతారు? ఆయన బోధలు
ఎవరు వింటారు?
రాజయోగానంద :- ఏ జాతి పక్షి ఆ జాతి గూటికే చేరునన్నట్లు, అటువంటి
నాస్తికత్వ భావములుగలవారే ఆయనవద్దకు పోవుచుందురు. పైకి తమకే
చదువంతా వచ్చిన వారివలే, తమకే శాస్త్రములన్నీ తెలిసినట్లు కొన్ని
శాస్త్రముల పేర్లు చెప్పుచూ, ఆయా శాస్త్రములలో లేనిది కూడా ఉన్నదని
బుకాయిస్తుందురు. అందువలన వారి సంఘములు వారివరకే పరిమితమై
వుంటాయి. ప్రజలు ఎవరూ వారినీ, వారి మాటలనూ విశ్వసించరు.
రాఘవ :- వారు చెప్పే సైన్సు ప్రకారమైనా అభౌతికముగా కనిపించనిది
సైన్సుకాదని చెప్పుటకు వీలులేదు కదా! హాస్పిటల్స్లో తీయు ఎక్స్రే
కిరణములు కంటికి కనిపించవు కదా! కనిపించనంతమాత్రమున ఎక్స్రే
కిరణములను సైన్సుకాదంటామా? టీవీ రిమోట్ ద్వారా దూరమునుండి
టీవీని ఆన్ చేయవచ్చును, ఛానల్స్ను మార్చవచ్చును. అక్కడ రిమోట్
పని అంతయూ అభౌతికమే కదా! దానిని సైన్సుకాదన వచ్చునా, అట్లు
అభౌతికమును ఒప్పుకోకపోతే వారు సైన్సునే ఒప్పుకోనట్లగును.
రాజయోగానంద :- ఎవరు ఏమి మాట్లాడినా వారికి వ్యతిరేఖముగా మాట్లాడి
ఎదుటివారి వాదనను కాదనడమే వారి ముఖ్య ఉద్దేశ్యము. అందువలన
ఎక్స్రే కిరణములను గురించిగానీ, టీవీ రిమోట్స్ గురించిగానీ అడిగితే
అది మీకు తెలియని సైన్సు, అది అభౌతికము కాదు. అందులో ఎలక్ట్రికల్
కిరణములుండుట వలన అవి కనిపించవు. అవి కనిపించనంతమాత్రమున
మీరనుకొన్నట్లు అభౌతికము కాదు. అందులో కిరణములున్నవి, వాటి
వలన పనులు జరుగుచున్నవి. అందులో అవి భౌతికమే! మీరు అనుకొన్నట్లు
అభౌతికము కాదు అని చెప్పుచుందురు. ఈ విధముగా మనము టీవీ
రిమోటు గురించి, యక్స్రే కిరణములను గురించి అభౌతికము అంటే
అవి అభౌతికమైనప్పటికీ కాదు అవి భౌతికమే అని ఆ శాస్త్రము, ఈ
శాస్త్రము అని అడ్డము మాట్లాడి, ఎదుటివాని నోరు మూయించాలని
చూడడమే, సత్యాన్వేషణ సమితి ముఖ్య కార్యక్రమము. ఈ మొండి వారితో
ఎందుకు వాదించాలి, వాదించినా ఏమీ ప్రయోజనము ఉండదని,
ఎవరైనా వారితో వాదించడమును విరమించుకొంటే, మా వాదనకు వారు
ఓడిపోయారని ప్రచారము కూడా చేసుకొందురు. తెలివున్న వాడు ఎవడూ
మూర్ఖునితో మాట్లాడడు. ఇటువంటి వారికి శాస్త్రములు ఎన్నో తెలియవు,
మేము శాస్త్రవేత్తలమంటారు. పూర్వమునుండి పెద్దలు ఏర్పరచిన షట్
శాస్త్రములు ఏవో కూడా వారికి తెలియదు. ఎంతో తెలివిని ఉపయోగించి
వాక్ చాతుర్యముగా మాట్లాడినప్పటికీ, వారు కేవలము నాల్గు శాస్త్రములు
గురించే మాట్లాడుచుందురు. రెండు శాస్త్రముల కొడి, గోత్రము కూడా
వారికి తెలియదు. అయినా అందరికంటే మేమే గొప్ప సత్యవాదులమనీ,
సత్యాన్వేషులమనీ చెప్పుకొనుచుందురు. వారిదొక ముదిరిన పిచ్చివాదననీ,
వారికి ఏ శాస్త్రము మీద పూర్తి అవగాహన ఉండదనీ, మాట్లాడే దానికి
మాత్రము శాస్త్రముల పేర్లు వాడుకొనుచుందురనీ, ఎదుటి వారి వాదనను
ఖండించి, ఏదో ఒక విధముగా అడ్డదారిలో మాట్లాడడమే, వారి పని అని
తెలియుచున్నది.
రాఘవ :- నేను కొద్దిసేపు వారితో మాట్లాడిన తర్వాత మీరు చెప్పినట్లే
వీరితో మాట్లాడడము వలన ప్రయోజనము లేదనిపించింది. అంతేకాక
వారు ఒక విధమైన నాస్తికవాదులుగా కనిపించారు. మీరు చెప్పినట్లు
వారిది సత్యవాదన కాదని నాకు అర్థమైనది.
రాజయోగానంద : - కాలుకు వేస్తే మెడకూ, మెడకు వేస్తే కాలికీ వేయడమే
వీరిపని. ఇటువంటి మొండివారు కూడా సమాజములో ఎందరో కలరు.
అటువంటి వారిలో సత్యాన్వేషణ సంఘము వారు ఒక రకమనుకో.
ఇటువంటి వారితో వాదన కొరివితో తల కొరుగుకున్నట్లుండును.
అందువలన మంచివారు ఎవరూ వారితో సంబంధము పెట్టుకోరు.
ఇటువంటి వారి విషయము వదలిపెట్టి ఇతర విషయమేమైనా ఉంటే,
అందులో ఏదైనా అనుమానముంటే అడుగు.
రాఘవ :- స్వామీ! శాంతినగరము అను ఊరులో దాదాబాబాగారు అను
ఒక స్వామీజీని దర్శించుకొని వచ్చాను. అక్కడ వారి ఆశ్రమము ఇది
వైకుంఠపురమా! అన్నట్లున్నది. ఎన్నో వేలమంది స్వదేశీ భక్తులూ, వందల
మంది విదేశీ భక్తులు అక్కడున్నారు. దాదాబాబాగారు స్వయముగా తన
హస్తమునుండి విభూది ఇస్తున్నాడు. అంతేకాక కొన్ని వస్తువులను కూడా
సృష్ఠించి ఇస్తున్నాడు. అలా ఇవ్వడమేకాక ఎందరో భక్తుల ఇళ్ళలో దాదా
బాబాగారి ఫోటోనుండి విభూది రాలడము, కుంకుమ రాలడము జరుగు
చున్నది. ఇన్ని మహత్యములను బాబా ద్వారా చాలామంది చూస్తున్నారు.
ఇన్ని విధముల మహత్యములుగల బాబాగారు చాలా గొప్పవ్యక్తి అని నేను
అనుకొనుచున్నాను. ఎన్నో లక్షలమంది భక్తులు ఆయనను ప్రత్యక్ష దైవముగా
భావిస్తున్నారు, అలాగే పూజిస్తున్నారు. అంత గొప్పవ్యక్తిని నేను ఇంతవరకు
ఎక్కడా చూడలేదు. ఆయన దర్శనము కూడా నాకు లభించినది. దానిని
నేను గొప్ప భాగ్యముగా తలచాను. ఆయనను అక్కడి వారందరూ సాక్షాత్తూ
దేవుడని చెప్పడమును ప్రత్యక్షముగా చూచివచ్చాను. అందరూ అనుకొన్నట్లు
ఆయన ప్రత్యక్ష దేవుడా? లేక అసామాన్యమైన గొప్పవ్యక్తియా? అను
సంశయము నాలో కొద్దిగవున్నది. దానిని గురించి వివరించమని
కోరుచున్నాను.
(రాఘవ మాటలను విన్న రాజయోగానంద స్వామి చిన్నగ నవ్వి,
దీర్ఘముగా తలూపి ఇలా చెప్పాడు.)
రాజయోగానంద :- నీవు కూడా అందరివలె అజ్ఞానమను బుట్టలో పడి
పోయావు. నిన్ను సత్యాన్వేషణ చేయమన్నాను. సత్యాన్వేషణ చేయువారు
ఒక విషయములోని పూర్తి సత్యమును తెలుసుకొనువరకు, ఒక నిర్ధారణకు
రాకూడదు. ఒక నిర్ధారణకు వచ్చేముందు ఆ విషయము పూర్తి శాస్త్రబద్ద
మైనదో కాదో శోధించి చూడాలి. శాస్త్రబద్ధమైనపుడే ఆ విషయము మీద
నిర్ధారణకు వచ్చి అది సత్యమైనదిగా చెప్పవచ్చును. అట్లుకాకుండా ఎవరో
చెప్పిన అశాస్త్రీయ మాటలను నమ్మి, మనము కూడా అట్లే చెప్పితే అది
అసత్యవాదనగును. అప్పుడు మనది సత్యాన్వేషణ అని చెప్పుటకు వీలులేదు.
(రాఘవ తాను పొరపడ్డానని గ్రహించి, తన తప్పును అర్థము చేసుకొని
స్వామివారితో వినయముగా ఇట్లన్నాడు.)
రాఘవ :- స్వామీ! మీరన్నట్లు నేను సులభముగా పొరపడిపోయాను.
విన్న విషయము సత్యమా కాదాయని యోచించలేదు. నిర్ధారణ చేయక
ముందే అందరిలాగా సత్యమనుకొన్నాను. నా మెదడుకు అందని
విషయములు, నా యోచనకు కనిపించని విషయములు కొన్ని ఉన్నందున
నేను పొరపడ్డాను. నాకు తెలియని విషయములను మిమ్ములను అడిగి
తెలుసుకోవాలి. కానీ నేను అట్లు అడిగి తెలుసుకోకముందే ఒక నిర్ధారణకు
వచ్చాను. ఈ నా తప్పును క్షమించి నాకు అర్థము కానటువంటి
మహత్యముల వివరమును శాస్త్రీయముగా తెలుపమనికోరుచున్నాను.
రాజయోగానంద :- సరే, నీవు మహత్యములోని శాస్త్రీయతను కోరినందుకు
సంతోషము. ప్రపంచములో ఒక విషయము శాశ్వితముగా నిలువాలంటే
దానికి శాస్త్రీయత ఊపిరిలాంటిది. శాస్త్రీయత లేనిది ఏదీ సత్యముకాదు,
శాశ్వితముకాదు. నీవు పొరపడిన విషయము మహత్యము. మహత్యమువద్ద
నీవు ఒక్కనివే కాదు. నీకంటే పెద్ద మేధావులు కూడా పొరపడి పోయారు.
అందువలన ఈ విషయమును జాగ్రత్తగా వినుము. మహత్యము అను
పదములో గొప్పతనము అను అర్థము గలదు. మహ + ఆత్మ=మహాత్మ
అయినట్లు, మహ+ ఆత్య = మహాత్య అగుచున్నది. హత్య అనగా చంపడము
అని అర్థము, అలాగే ఆత్య అనగా జీవింపచేయడము అని అర్థము.
దీనినిబట్టి గొప్పగా జీవింపచేయడము అని అర్థమగుచున్నది. ఒక
మహత్యము ఒక మనిషిని గొప్పగా బయటి మనుషులకు కనిపించునట్లు
చేయడము వలన ఆ వ్యక్తి గొప్పగ జీవించుటకు అవకాశము కలదు.
'మహాత్య' అను శబ్దము కాలక్రమమున 'మహత్య' అని పలుకబడుచున్నది.
మహత్యములు మూడు రకములు గలవు. అందులో రెండు రకములను
మనిషి చేయగలడు. మనిషి చేయు రెండు రకములలో ఒక దానిని మనిషి
తన హస్త లాఘవము చేత చేయును. అట్లే రెండవ దానిని తాను నేర్చిన
ఒక రకమైన విద్యచేత చేయగలడు. మూడవ దానిని ఏ మనిషీ చేయలేడు.
మూడవ రక మహత్యము మనిషికి తెలియకుండా జరుగును.
మనిషి చేయగలుగు రెండు రకముల మహత్యములకు పేర్లు కూడా
కలవు. వాటినే టక్కుటమారా, ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ
విద్యలంటాము. ఈ మూడు రకముల పేర్లలో మనిషి చేయగల మొదటి
రక మహత్యమును టక్కుటమారా విద్య అంటారు. అలాగే మనిషి చేయు
రెండవ రక మహత్యమును ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ
విద్యలంటారు. ఈ రెండు రకముల మహత్యములను మనిషి నేర్చుకో
వచ్చును. అందువలన వీటిని విద్యలు అంటున్నాము. ఇకపోతే మూడవ
రక మహత్యమును ఏ మనిషీ చేయలేడు, ఏ మనిషీ నేర్వలేడు. అందువలన
అది ఏ విద్యాకాదు. మొదటి రెండు రకముల మహత్య విద్యలలో మొదటిది
టక్కుటమారా. దీనిని మనిషి హస్తలాఘవముచేత చేయుచున్నాడు.
ఉదాహరణకు ఒక రూపాయి నాణెమును చేతిలో పెట్టుకొని హస్త లాఘవము
చేత, లేనట్లు ఒకమారు, ఉన్నట్లు ఒకమారు చూపడము. దానిని చూచువారు
ఉన్న రూపాయిని మాయము చేశాడనీ, అట్లే లేని రూపాయిని సృష్టించి
చూపాడని అనుకొందురు. దానివలన అది మొదటి రక మహత్యమగు
చున్నది. ఇకపోతే రెండవరక మహత్యము మంత్ర విద్యవలన వస్తున్నది.
మనిషికి కనిపించని ఎంత పెద్ద వస్తువునైనా కనిపించునట్లు చేయడమూ,
అట్లే కనిపించు దేనినైనా కనిపించకుండా చేయడమును ఇంద్రజాల
మహేంద్రజాల విద్య అంటున్నాము. అదే విధముగా మనకు వినిపించని
శబ్దమును తాను విని చెప్పడమును గజకర్ణ గోకర్ణ విద్య అంటాము. రెండవ
రకమైన ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ విద్యలను మనిషి
మంత్రశక్తి చేత పొందుచున్నాడు. మూడవ రక మహత్యము మనిషికి
సంబంధములేనిది. దానిని స్వయముగా ప్రకృతి (మాయ)యే చేయును.
నీవు దాదాబాబాగారివద్ద జరుగుచున్న మహత్యమేమిటో చెప్పు అది ఏ
రకమైన మహత్యమో, అది ఎలా జరగుచున్నదో వివరించి చెప్పగలను.
రాఘవ :- స్వామీ! దాదాబాబాగారు తనచేతినుండి విభూది ఇస్తున్నారు.
అలాగే బంగారు ఉంగరములనూ, బంగారు దండలను ఇస్తున్నాడు.
బాబాగారు అలా ఇవ్వడమును ఏ మహత్యము అనవచ్చును? ఇది ఆత్మ
జ్ఞానమునకు సంబంధములేదా? ఇది బ్రహ్మవిద్యకాదా?
రాజయోగా :- ప్రపంచములో ఎక్కడ ఎవరు ఏ మహత్యమును చూపినా,
అది ప్రపంచ విద్యయే, కానీ పరమాత్మ విద్యకాదు. ఏ మహత్యమైనా
ప్రకృతి (మాయ) వలన జరుగునదే, కానీ పరమాత్మ వలన జరుగునది
కాదు. ఏ మహత్యమైనా ఆత్మజ్ఞానమునకు సంబంధములేదు. దాదాబాబా
గారు విభూది ఇచ్చారంటున్నావు కదా! అలా విభూది ఇచ్చువారు ఇంకా
కొందరున్నారు. అది టక్కుటమారా విద్యలలోనికి వచ్చును. విభూదిని
కొందరు బాబాలు ఇస్తుండగా అది మహత్యము కాదు, అది ఇతరులను
మభ్యపెట్టుటకు చేయు మోసపూరిత పనియనీ, అలాంటి ట్రిక్కును మేము
చేసి చూపించగలమనీ కొందరు నాస్తికవాదులు, విజ్ఞాన వేదికవారు కూడా
విభూదిని చేతినుండి ఇస్తున్నారు. అలాంటి పనిని ఎలా చేయవచ్చునో
కూడా వివరముగా చెప్పుచున్నారు. బాబాలు ఇచ్చునట్లు తాము కూడా
చేతినుండి విభూదిని ఇస్తూ, ఈ పనిని కొంత చాకచక్యము కలవారు
ఎవరైనా చేయవచ్చునని చూపిస్తున్నారు. అందువలన బాబాలు విభూది
ఇచ్చినా, బయటికి కొందరికి అది మహత్తుగా కనిపించినా, చివరకు అది
ప్రపంచ విద్యయేననీ తెలిసి పోయినది. హస్తలాఘవము చేత
తమవద్దవుంచుకొన్న విభూదిని అప్పుడే సృష్టించినట్లు నటించి ఇచ్చినా,
అది టక్కుటమారా విద్య అనీ, గారడీ చేయువాడు చేయు మ్యాజిక్ లాంటిదనీ
తెలిసిపోయినది. అందువలన అది ఆత్మజ్ఞానము కాదని చెప్పవచ్చును.
నాస్తికవాదులు కేవలము బాబాలను విమర్శించుటయే తమపనిగా
పెట్టుకొన్నారు. కాబట్టి కొందరు బాబాలు చేయు విభూది మహత్యమును
తాము కూడా చేసి చూపి, ఇది హస్తలాఘవము చేత చేయుపనియేననీ
మహత్యముకాదని ఋజువు చేయుచున్నారు. ఇటువంటి టక్కుటమారా
మహత్యములను కొన్నింటిని నాస్తికవాదులు, విజ్ఞానవాదులూ చేసి చూపించ
డమేకాక, మహత్యములు అన్నియు ఇతరులను మోసము చేయు మ్యాజిక్
విద్యలేనని ప్రచారము చేయుచున్నారు. కానీ మహత్యములు మూడు
రకములనీ, వాటిలో తమకు తెలిసినది ఒకరకమేనని నాస్తికవాదులకూ,
విజ్ఞానవాదులకూ తెలియదు. కొన్ని టక్కుటమారా విద్యలను చేసి
చూపించినా మిగత రెండవ రక మంత్ర విద్యలైన ఇంద్రజాల, మహేంద్ర
జాల, గజకర్ణ గోకర్ణ విద్యలను చేసి చూపలేరు. ఒకవేళ ఈ రెండవ రక
మహత్యములను కూడా టక్కుటమారా విద్యలలాగా హస్తలాఘవముతో
చేయు విద్యలేనని ఇతరులకు చెప్పి నమ్మించినా, వాస్తవముగా నాస్తికవాదులు
వాటిని చేసి చూపించలేరు. ఇకపోతే మూడవరక మహత్యము కేవలము
కొందరు ముఖ్యమైన స్వాములు, బాబాలవద్ద మాత్రమే జరుగుచుండును.
అటువంటి మహత్యములను నాస్తికవాదులు కూడా వివరముగా ఖండించ
లేరు. వాటి విషయములో మౌనముగా ఉందురు. మూడవ రక
మహత్యములను మ్యాజిక్ విద్యలుగా చెప్పుటకు కూడా వీలుండదు.
అందువలన వీటి విషయములో విజ్ఞానులమను వారుగానీ, నాస్తికులమను
వారు గానీ ఏమీ మాట్లాడరు. ఇపుడు రెండవ రక మహత్యములైన
ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ విద్యలను గురించి చెప్పెదను
విను.
ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ విద్యలు హస్త
లాఘవములు కావు. ఇవి మంత్రశక్తితో కూడుకొన్నవి. పూర్వము ఈ
విద్యలకు విలువా, ఆదరణా ఉండెడిది. కావున పూర్వకాలములో
చాలామంది ఈ విద్యలను నేర్చుకొనెడివారు. అందువలన మంత్రవిద్యల
వివరము ఆనాడు అందరికీ తెలిసివుండేది. కాలక్రమేపి ఆ మంత్ర విద్యలు
అడుగంటిపోయినవి. వాటి అవగాహన ఎవరికీ లేకుండాపోయినది.
అయినప్పటికీ ఇప్పటి కాలములో కూడా అరుదుగా కొద్దిమంది మాత్రమే
ఈ విద్యలను తెలిసినవారు ఉన్నారు. అటువంటివారు కేరళరాష్ట్రములో
ఉన్నారని చెప్పవచ్చును. మంత్రవిద్యలకు మళయాల దేశమైన కేరళరాష్ట్రము
పుట్టినిల్లులాంటిది. ఆంధ్రరాష్ట్రములో బహు అరుదుగా మంత్రవిద్య తెలిసిన
వారున్నారు. అలా తెలిసినవారు బాబాలుగా, స్వాములుగా చలామణి
అగుచున్నారు. తమ మంత్రవిద్యచేత కొన్ని మహత్యములు చేయగల్గిన
వారు, ఆ మహత్యములు తమకున్న దైవశక్తి చేత జరిగినవని ప్రచారము
చేయుట చేత, ప్రజల దృష్టిలో అటువంటివారు గొప్పగొప్ప స్వాములుగా
బాబాలుగా చలామణి అగుచున్నారు. అయితే విజ్ఞానవేత్తలు మంత్రశక్తిని
విశ్వసించరు. విజ్ఞానవేత్తలకు స్థూలము తప్ప సూక్ష్మము తెలియదు.
అటువంటివారు కేవలము కనిపించు భౌతికమును మాత్రమే నిజమనీ,
అభౌతికము అబద్దమని చెప్పుచుందురు. మంత్రశక్తి అభౌతికమైనది.
కావున విజ్ఞానులు మంత్రములనుగానీ, వాటి శక్తినిగానీ నమ్మరు. ఎవరు
నమ్మినా నమ్మక పోయినా మంత్రశక్తి ఉన్నది. కాబట్టి ఆ శక్తి వలన
కొన్ని పనులు జరుగుచున్నవి. ఆ పనులను కొందరు నాస్తికవాదులూ,
విజ్ఞానవేత్తలు మంత్రశక్తి వలన జరిగినవని తెలియక, వాటిని కూడా మనిషి
చేసిన పనులుగా వర్ణించుచున్నారు. ఉదాహరణకు మంత్రశక్తి వలన
జరిగిన ఒక పనిని వివరించుకొని, దానిని నాస్తికులు, విజ్ఞానులు ఎలా
ఖండించు చున్నారో వివరించుకొందాము.
ఒక స్వామీజీ సముద్ర ప్రాంతములోని ఒక బీచ్కు పోయాడు.
అప్పుడు ఆ స్వామి వెంట వందలాదిమంది జనము అక్కడికి పోవడము
జరిగినది. స్వామిగారి వెంట వచ్చిన భక్తులే కాకుండా, అక్కడ బీచ్లోనున్న
అనేకమంది కూడా స్వామిని చూచేదానికి అక్కడికి వచ్చారు. అలా ఎందరో
ఉన్న సమయములో బాబాగారు ఒక భక్తుని పిలిచి, నీకు ఒక కానుకను
ఇస్తాను తీసుకొమ్మన్నాడు. దానికి ఆ భక్తుడు మరియు ప్రక్కనున్నవారు
స్వామివారు ఏమి ఇస్తారోనని ఆత్రుతతో చూస్తున్నారు. అప్పుడు స్వామి
వారు తనకు ఆరడుగుల దూరములోనున్న ఇసుకవైపు చేయిని చూపి,
అక్కడ తీసి చూడమన్నాడు. అప్పుడు ఆ భక్తుడు అలాగే చేయగా ఇసుకలో
అతనికి భగవద్గీత గ్రంథము కనిపించింది. దానిని చూచిన ఆ భక్తుడు
మిగతావారందరూ అది స్వామి వారి మహత్యమని సంతోషించిరి. స్వామి
వారు చూడమన్న చోట కొద్దిగా ఇసుకను తొలగిస్తూనే గీతాగ్రంథము
లభించడము అక్కడున్నవారందరికీ అది గొప్ప మహత్యముగా, స్వామివారు
గొప్ప దైవశక్తి సంపన్నుడుగా తెలిసింది. అంతేకాక స్వామివారు ఇంకా
కొంత దూరము నడిచిపోయిన తర్వాత ఆయననే అనుసరిస్తున్న మరియొక
భక్తుని చూచి అతనిని పిలిచాడు. అతను ఒక విదేశీ సైంటిస్ట్, అతను
స్వామి గారు చేయునవి మహత్యములు కావు మోసపూరిత కార్యములనీ,
వాటిని ఆధారపూరితముగా కనిపెట్టి బయటికి తెలపాలని వచ్చిన వ్యక్తి.
స్వామివారు సాధారణముగా పిలిచినట్లే అతనిని పిలిచాడు. కానీ అతను
తన మీదనే పరిశోధన చేయుటకు వచ్చిన వ్యక్తియని వాస్తవముగా స్వామి
వారికి కూడా తెలియదు. సాధారణముగా స్వామి అతనిని పిలిచి ఇక్కడ
నీకు ఇష్టమొచ్చిన చోట ఇసుకను తీసి చూడు. అక్కడ నీకు బంగారు
గొలుసు దొరుకుతుంది. దానిని నీవు ధరించుకో. అది నీ మెడలో
ఉన్నంతవరకు నీకు అంతా మంచే జరుగునన్నాడు.
అప్పుడు ఆ విదేశీ భక్తుడు స్వామివారి మాట ప్రకారము ఇసుకను
తీసి చూడాలనుకొన్నాడు. అప్పుడు అతను తన పరిశోధన దృష్టిలో పెట్టుకొని
అక్కడున్న ప్రజలందరు చూస్తున్నట్లే స్వామిగారికి ఎడమ ప్రక్కన 20
అడుగుల దూరములో ఇసుకను తీసి చూడాలనుకొన్నాడు. అలా అనుకొన్న
వెంటనే దాదాపు 20 అడుగులు స్వామినుండి ఎడమవైపుకు పోయి అక్కడ
కూర్చొని కొద్దికొద్దిగా ఇసుకను తొలగించసాగెను. అలా ఒక అడుగు
లోతు తియ్యగానే అక్కడ స్వామి వారు చెప్పినట్లు బంగారు గొలుసు
కనిపించింది. అప్పుడు ఆ విదేశీ భక్తుడూ మరియు అక్కడున్న వారందరూ
ఆశ్చర్యపోయారు. మొదట ఒక భక్తునికి స్వామిగారు చూపించిన జాగాలో
భగవద్గీత గ్రంథము దొరికినది. రెండవమారు స్వామివారు జాగాను
చూపించకుండా నీ ఇష్టమొచ్చిన చోట త్రవ్వి చూడు బంగారు గొలుసు
దొరుకుతుందని చెప్పాడు. అలాగే దొరికింది, అక్కడి ప్రజలు స్వామిగారిని
నిజమైన దేవునిగా వర్ణించి చెప్పుకోవడము జరిగినది. ఈ విషయమంతా
రెండవరోజు వార్తాపత్రికలలో ప్రచురించబడినది. ఆ విషయము ఆ
సమయములో అక్కడున్న భక్తులకేగాక అక్కడలేని ప్రజలందరికీ పత్రికల
ద్వారా తెలిసిపోయినది. మరుసటి దినము “మహత్యమా-మోసమా” అను
వార్తను విజ్ఞానవాదులు చెప్పినట్లు వార్తాపత్రికలలో వచ్చినది. అందులో
స్వామివారు చేసినది మహత్యముకాదనీ, తాను ముందే భగవద్గీతను ఒక
జాగాలో పూడ్చిపెట్టి, ఆ జాగాలోనే త్రవ్వమని చెప్పాడనీ, అది మోసమనీ,
అలాగే తనకు అనుకూలమైన భక్తునితో నీ ఇష్టమొచ్చిన జాగాలో త్రవ్వి
చూడు, బంగారు గొలుసు దొరుకుతుందని చెప్పాడనీ, ఆ భక్తుడు ముందే
తాను పూడ్చిన జాగాలోనే త్రవ్వి బంగారు గొలుసును తీశాడనీ, ఇది ఆ
భక్తుడూ స్వామి ఇద్దరూ కలిసి ఆడిన నాటకమనీ, అందులో ఆ విదేశీ
భక్తుడు కూడా భాగస్వామిగా ఉన్నాడనీ, ఆ భక్తుడు అలా చేసినందుకు
కోటి రూపాయలు ఆ భక్తునికి ఇచ్చారనీ. ఇలా స్వామివారు తన
మహత్యమును, తన గొప్పతనమును మోసపూరిత పనులచేత బయటికి
కనిపించునట్లు చేసి, ప్రజలను తన భక్తులుగా మార్చుకొంటున్నారనీ
వార్తలలో వ్రాయడము జరిగినది.
ఇప్పుడు విజ్ఞానవాదులు, నాస్తికవాదులు వార్తా పత్రికలలో స్వామి
వారి మీద చేసిన ఆరోపణ పూర్తి అవాస్తవమైనది. స్వామివారు ఇలా
చేశాడని వార్తలు రాయడము పూర్తి తప్పు. విజ్ఞానవాదులు వివరించినట్లు
అక్కడ జరుగలేదు. కావున వారి ఆరోపణ పూర్తి ఆధారములేనిదని
చెప్పవచ్చును. వాస్తవానికి స్వామివారు చేసినది రెండవరకమైన మహత్యము.
అది స్వామివారి మంత్రశక్తి చేత జరిగింది. కానీ ముందే ఆ వస్తువులను
అక్కడ పూడ్చిపెట్టాడనడమూ, విదేశీభక్తుడు కూడా స్వామివారు చెప్పినట్లు
నటించారని చెప్పడమూ పూర్తి అవాస్తవము. ఒక విధముగా చెప్పితే
స్వామి చేసినది మహత్యము కాదు మంత్రము. అయినా స్వామికి మంత్రమని
తెలిసీ, ప్రజలను మహత్యమని నమ్మించాడు. స్వామి అలా చేసినప్పటికీ
విజ్ఞానులూ, నాస్తికవాదులు అనుకొన్నట్లు మాత్రము కాదు. స్వామిగారు
మొదటి భక్తునికి చెప్పినప్పుడు ఆయన సంకల్పముతోనే భగవద్గీత గ్రంథము
దొరికినది. అలాగే రెండవ విదేశీ భక్తునికి చెప్పినప్పుడు కూడా స్వామి
-
సంకల్పముతోనే అతనికి బంగారు గొలుసు దొరికినది. రెండు పనులలో
వారికి ఫలానా వస్తువులు దొరకాలని మాత్రమే స్వామివారి సంకల్పము
కలదు. కానీ ఎక్కడ దొరకాలి, ఎంత లోతులో దొరకాలి అనునది మాత్రము
స్వామివారికి కూడా తెలియదు. స్వామివారి మహత్యములను పరిశోధించా
లని వచ్చిన విదేశీ విజ్ఞాని తనకు బంగారు గొలుసు దొరికినపుడు, అది
నిజముగా స్వామిగారి మహత్యమే అనుకొన్నాడు. ఎందుకనగా స్వామి
ఏమాత్రము ఊహించని చోట తాను త్రవ్వినప్పటికీ, అక్కడ బంగారు
గొలుసు దొరకడము స్వామివారి మహత్యమే అనుకొన్నాడు. రెండవరోజు
“మహత్యమా మోసమా” అను వార్త చూచినప్పుడు, ఆ వార్తను ఆ
విదేశీయుడే ఖండించాడు. తాను ఒక పరిశోధకుడననీ, ఈ మహత్యము
తన సైన్సుకు అందనిదనీ, ఇందులో ఏ మోసమూ లేదనీ, న్యూస్ పేపర్కు
వార్తనిచ్చాడు. ఇక్కడ విదేశీ పరిశోధకుడు అనుకొన్నది కూడా ఒక విధముగా
తప్పే. ఎందుకనగా స్వామివారు చేసినది మహత్యము కాదు మంత్రమని
తెలుసుకోలేకపోయాడు. స్వామివారు సముద్రపు ఒడ్డున రెండు వస్తువులను
తన మంత్రశక్తి చేత ఇద్దరికి దొరుకునట్లు చేస్తే దానిని చూచిన నాస్తికులూ,
విజ్ఞానులూ అది మంత్రశక్తి అని గ్రహించక మోసమన్నారు. అలాగే
విదేశీయుడు ఆ పని మంత్రశక్తి చేత జరిగినది అని గ్రహించక మహత్యము
అన్నాడు. ఈ విధముగ ఇటు స్వదేశీయులూ, అటు విదేశీయులూ అక్కడ
జరిగిన వాస్తవికతను గ్రహించలేక ఇద్దరూ పొరపడిపోయారు.
వాస్తవానికి వారికి ఎవరికీ తెలియని మంత్రశక్తి అక్కడ పని
చేసిననదని స్వామికి తెలిసినా, అది మంత్రబలమేగానీ, మహత్యముకాదని
స్వామికి తెలిసినా, ఆ కార్యములోని పూర్తి వివరములు ఆయనకు కూడా
తెలియవు. ఆయన అనుకుంటేనే ఆ పని జరిగినప్పటికీ, ఆ పనిలోని
అన్ని వివరములు ఆయనకు తెలియవు. ఎందుకు తెలియవనగా! పనిని
ఆదేశించినది స్వామియే అయినప్పటికీ, ఆ పనిని స్వామి చేయలేదు
కదా! ఆ పనిని చేసినవారు ఇతరులు, కావున ఎంత లోతులో వస్తువులున్నదీ
ఆయనకు తెలియదు. ఆయనకంటే ముందు మనము అక్కడ ఏ విధముగా
ఆ పని జరిగిందో తెలుసుకొంటే, స్వామికి ఎలా అన్ని వివరములు తెలియవో
మనకు అర్థమవుతుంది.
గ, ఖ, ర, భౌ, జ్యో, బ్ర అను ఆరు బీజాక్షరములు ఆరు శాస్త్రము
లను తెల్పుచున్నవి. ఆరు శాస్త్రములలో మూడవ శాస్త్రమైన రసాయన
శాస్త్రమునకు సంబంధించినది వైద్యము. మానవ జీవితములో ఆరోగ్యము,
అనారోగ్యము అను రెండు స్థితులు గలవు. అనారోగ్యముగా మనిషి
ఉన్నపుడు, అతనికి వైద్యమును ఉపయోగించి తిరిగి ఆరోగ్యస్థితికి తేవచ్చును.
మానవ సృష్ఠి జరిగిన కొంత కాలమునకు వైద్యము అమలులోనికి వచ్చినది.
పూర్వము వైద్యమును “రసపట్టు” అనేవారు, వైద్యములోని మందులను
రసములు అనేవారు. వైద్యమునకు ఆ పేరు రావడానికి ముఖ్యకారణము
ఏమనగా! పూర్వము వైద్యము ఆకుల రసముతో మొదలైనది. ప్రతి
రోగమునకు దానికి సరిపడు చెట్టు ఆకు రసమును వాడేవారు. అందువలన
వైద్యము యొక్క మొట్టమొదటి పేరు రసపట్టు. వైద్యములోని మందులను
రసములు అనుట అప్పటినుండి వచ్చినది. కొంత కాలము గడచిన తర్వాత
రసాయన శాస్త్రము అభివృద్ధి పొందినదై, కొంత పరిశోధన తర్వాత
వైద్యములో కొంత మార్పువచ్చినది. మొదట అనారోగ్యమునకు చెట్టు
రసములే వాడేవారు కదా! అలా చెట్టు రసములే కాకుండా రసాయన
శాస్త్రములో కనిపెట్టబడిన మంత్రములను కూడా వాడేవారు. మంత్రము
మాటనుండి పుట్టినది, రసము ఆకునుండి పుట్టినది. ఆ దినములలో
వైద్యము ఆకు రసమునుండీ, మాట మంత్రమునుండీ జరిగెడిది. ఇప్పటి
కాలములో వైద్యము ఎంతో మార్పు చెంది, చివరకు వైద్యములో ఆకు
రసముగానీ, మాట మంత్రముగానీ కనిపించకుండా పోయాయి. వైద్య
విధానములో ఆకుల రసములు, మాటల మంత్రములు కనుమరుగై
పోయినప్పటికీ, అక్కడక్కడ పూర్వకాల వైద్యమునకు జీవము పోయు మాట
ఒకటి మిగిలివున్నది. భూమిమీద ఔషధముకాని ఆకూ లేదు, మంత్రముకాని
మాటా లేదు. అను వాక్యము పూర్వ వైద్యమునకు గుర్తుగా మిగిలినది.
దానినిబట్టి ప్రతి ఆకు ఔషధమే, ప్రతి మాట మంత్రమే అని మేము
చెప్పుచున్నాము. ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఔషధమూ, మంత్రమూ
ఒకే రసాయన శాస్త్రమునకు సంబంధించినవని తెలియుచున్నది.
ఈ మా మాటను నేటి విజ్ఞానులు ఒప్పుకోకపోవచ్చును. సత్యమును
వేయిమంది కాదనినా అది అసత్యముకాదు అను సూత్రము ప్రకారము,
మంత్రములు రసాయనిక శాస్త్రమునకు సంబంధించినవే. మా మాట
ఒక మాటను చెప్పితే, దానిని వినిన రెండవ వ్యక్తిలో ఒక మార్పు
జరుగుచున్నది. దానిని వివరముగా చెప్పితే ఒక వ్యక్తి చింతకాయ అను
మాటను అంటే దానిని వినిన రెండవ వ్యక్తి నోటిలో వెంటనే నీరు
ఊరుచున్నది. దీనినిబట్టి ఒకమాట మంత్రముగా పని చేసి రెండవ వ్యక్తిలో
ఒక యాక్షన్ (కదలిక) మొదలైనది. అప్పుడు చింతకాయ అను మాట
మంత్రముగా పని చేసినదని చెప్పవచ్చును. అలాగే లం... కొడకా అని ఒక
మనిషి ఇంకొక మనిషి ముందర అంటే, రెండవ మనిషిలో ఒక రియాక్షన్
(ప్రతిస్పందన) వస్తుంది. చింతకాయ అను నాలుగు అక్షరముల మాటకు
ఒక మనిషిలో ఎలా స్పందన వస్తున్నదో, అలాగే ఐదు అక్షరముల మరియొక
సత్యమనుటకు కొన్ని ను *
గమనించి చూస్తాము. ఒక వ్యక్తి *
మాటకు ప్రతిస్పందన కూడా వస్తున్నది. దీనినిబట్టి ఒక్కొక్క శబ్దముతో
ఒక్కొక్క స్పందన మనిషిలో ఏర్పడుచున్నదని తెలియుచున్నది. ఈ ఆధారము
లతో పూర్వము పెద్దలు చెప్పినట్లు ప్రతిమాట మంత్రమేననీ, మంత్రము
కూడా శాస్త్రబద్దమేనని అర్థమగుచున్నది.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. పూర్వము పెద్దలు కొన్ని
శబ్దములకు కొన్ని పనులు జరుగునని కనిపెట్టి, ఆ శబ్దములను గ్రంథ
రూపములలో లిఖించిపోయారు. పెద్దలు లిఖించిన మాటలను
మంత్రములు అని అనుచున్నాము. ఏ మంత్రమునకు ఏ పని జరుగునో
లిఖితముగా ఉండుట వలన, అటువంటి మంత్రములను తెలుసుకొని
సాధించిన కొందరు స్వాములుగా చలామణి అగుచున్నారు. వారు సాధించిన
మంత్ర ఫలములను మహత్యములుగా చాటుకొనుచున్నారు. అలాంటి
స్వామియే సముద్రము వద్ద బీచ్ లో తన మంత్రబలముచేత భగవద్గీతనూ,
బంగారుదండను ఇచ్చాడు. అది ఎలా సాధ్యమైనదని వివరములోనికి
పోతే, ఆ వివరమును ఈ విధముగా చెప్పవచ్చును. కొన్ని అక్షరముల
సమ్మేళనమైన ఒక్కొక్క మంత్రములో ఒక్కొక్క శక్తి ఉండును. మంత్రము
స్థూలమైనా మంత్రశక్తి సూక్ష్మముగా కనిపించనిదై ఉండును. ఖగోళములో
కోట్లాది గ్రహములున్నవి. వాటిలో ఎన్నో కోట్ల గ్రహములు భూమిమీదికి
సూక్ష్మముగా వస్తూ పోతూ వున్నవి. ఆ విధముగా భూమితో సంబంధము
పెట్టుకొన్న గ్రహములు, ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్కటి అధిపతిగా ఉ
న్నవి. ఒక మంత్రము ద్వారా ఒక పని జరుగుచున్నదంటే, అక్కడ ఏదో
మనకు తెలియని శక్తి పని చేయుచున్నదని అర్థమగుచున్నది. ఒక్కో
మంత్రమునకు ఒక్కో గ్రహము అధిపతిగా ఉండి, ఆ మంత్రము యొక్క
కార్యమును చేయుచున్నది. ఒక మంత్రము వలన ఒక పని
నెరవేరుచున్నదంటే, అక్కడ ఒక గ్రహశక్తి ఉపయోగపడుచున్నది. మంత్రము
ద్వారా ఉపయోగపడు గ్రహశక్తినే మంత్రశక్తి అని అంటున్నాము. ఒక
గ్రహము స్థూలముగా ఉంటే దానిలోని జీవుడు సూక్ష్మముగా ఉండును.
సముద్రము వద్దకు పోయిన స్వామి చెప్పిన మంత్రమునకు ఒక గ్రహము
అధిపతిగా ఉండుట వలన, ఆ స్వామి ఆ మంత్రమును తలచి ఒక పనిని
సంకల్పించిన వెంటనే, ఆ మంత్రమునకు అధిపతిగానున్న గ్రహము
సూక్ష్మముగా ఆ పనిని నెరవేర్చుచున్నది. సముద్రము వద్ద స్వామి "మొదట
నేను చెప్పినతనికి, నేను చెప్పిన స్థలములోనే భగవద్గీత గ్రంథమును ఇమ్మని”
సంకల్పించి మంత్రమును తలచుకొన్నాడు. మంత్రమును తలచిన వెంటనే,
ఆ మంత్రమునకు అధిపతియైన గ్రహము యొక్క సూక్ష్మశరీరము స్వామి
గదిలోనున్న భగవద్గీతను తెచ్చి స్వామి చెప్పిన చోట ఇసుకలో ఉంచినది.
గ్రహము యొక్క సూక్ష్మము కనిపించదు. కావున ఈ పని అంతయు
కనిపించకుండానే జరిగింది. స్వామి చెప్పినట్లు స్వామి చూపిన చోట
త్రవ్వి చూడగా భగవద్గీత దొరికినది. ఆ భగవద్గీత ఎలా వచ్చిందో స్వామికి
కూడా తెలియదు. మంత్రము జపిస్తే ఫలానా పని జరుగునని మాత్రము
స్వామికి తెలియును. అంతతప్ప మంత్రమునకు ఒక గ్రహము అధిపతియనీ,
ఆ గ్రహమే తాను చెప్పిన (అనుకొన్న) పనిని నెరవేర్చినదనీ తెలియదు.
స్వామికి తెలియకున్నా స్వామి అనుకొన్న పని జరిగినది. అలాగే విదేశీ
వ్యక్తిని స్వామి పిలిచి నీ ఇష్టమొచ్చిన చోట నీవు ఇసుకను తీస్తే బంగారు
గొలుసు దొరుకునని చెప్పాడు. స్వామి చెప్పినట్లే ఆ విదేశీ పరిశోధకుడు
చేయగా, అతనికి బంగారు గొలుసు దొరికింది. ఈ మారు స్వామి జాగాను
చూపకుండా నీ ఇష్టమొచ్చిన చోట త్రవ్వుకో అన్నపుడు, మంత్రశక్తి అయిన
గ్రహశక్తి స్వామిగారు ముందే తయారు చేసి తన రూములో ఉంచుకొన్న
బంగారు గొలుసును తీసుకొని వచ్చి అతను ఎచ్చట త్రవ్వను
ప్రారంభించాడో, అప్పుడు అక్కడ ఆ గొలును నుంచింది. అలా కనిపించని
గ్రహము ఇటు స్వామికిగానీ, అటు విదేశీ భక్తునికిగానీ కనిపించకుండా
చేయడము వలన, బంగారు గొలుసు దొరకడము పెద్ద మహత్యముగా
కనిపించినది.
మొదట గ్రహము ఇసుకలో పెట్టిన భగవద్గీత, స్వామి రూములో
ముందే ఉంచబడినదే! రూములో ఉన్న భగవద్గీత గ్రంథమునే గ్రహము
(మంత్రశక్తి) తెచ్చింది, కానీ వేరుగా తాను సృష్టించలేదు. అలా ఇసుకలో
దొరికిన భగవద్గీత ఏ ప్రెస్లో తయారైనది, దాని వెల ఎంత అనునదీ,
దాని రచయిత ఎవరైనదీ అన్నియు దానిమీద ఉన్నవి. అలాగే బంగారు
గొలుసు కూడా ముందే తయారు చేసి ఒకచోట పెట్టబడిన దానినే
మంత్రశక్తిగానున్న గ్రహము తెచ్చింది. కానీ ఆ గొలుసును స్వామి
స్వయముగా సృష్ఠించలేదు. అట్లే ఆ గ్రహము కూడా సృష్టించుకొని తేలేదు.
తాను మంత్రించు మంత్రము వలన తన రూములోని బంగారు గొలుసు
వచ్చునని స్వామికి తెలుసు, కానీ ఆ పని ఎలా జరిగినదో స్వామికి కూడా
తెలియదు. ఈ విధముగ ఒక మాంత్రికునికి మంత్రము యొక్క ఫలితము
(పని) తెలుసు, కానీ అది ఎలా అమలగుచున్నది, దానిని ఎవరు ఎట్లు
చేయుచున్నారని మాత్రము తెలియదు. ఏ మాంత్రికునికైనా మంత్రమూ
తెలుసు, దాని పనీ తెలుసు, కానీ అది ఎలా జరుగుచున్నదని మాత్రము
తెలియదు. ఒక మాంత్రికుడు ఒక మంత్రమును తన ఇష్టమొచ్చినపుడు
వాడుకొనుటకు, ఆ మంత్రమును ముందే సిద్ధింపజేసుకొనివుండవలెను.
ఒక మంత్రము ఒక మనిషికి సిద్ధించాలంటే, ఆ మంత్రమును కనిపెట్టిన
పరిశోధకులు దానికి గల నియమములను మంత్రముతో పాటు తెలిపి
వుందురు. మంత్రమును నిర్మించిన వారు ఎలా చెప్పివుంటే అలా చేసినపుడే
ఆ మంత్రము సిద్ధించును. మంత్రము యొక్క పనిని బట్టి, దానిలో
ఉపయోగపడు శక్తినిబట్టి, ఆ మంత్రమును మొదట వేల సంఖ్యలోనో, లేక
లక్షల సంఖ్యలోనో ఏకధాటిగా జపించవలసి ఉంటుంది. గా మొట్టమొదట
ఏ ఆటంకము లేకుండా కొన్ని నియమములు పాటిస్తూ, మధ్యలో
మంత్రమును ఆపకుండా జపించినపుడు ఆ మంత్రము సిద్ధించును. అలా
సిద్ధించిన మంత్రమునకు గ్రహశక్తి మంత్రశక్తిగా మారి, ఆ మంత్రము
యొక్క పనిని చేయును. సముద్రము వద్దకు పోయిన స్వామి తాను ఏది
తలచుకొంటే ఆ వస్తువు (తాను ముందే ఒక చోట ఉంచినది) వచ్చేటట్లు
గల మంత్రమును సిద్ధింప చేసుకొన్నాడు. ఆ మంత్రమునకు గల నియమము
ప్రకారము నడుచుకొంటూ, తాను సముద్రము ఒడ్డున తన భక్తులు
చూచునట్లు తన మంత్రశక్తిని వాడుకొన్నాడు. దానివలన తాను ముందే
తన గదిలో ఉంచుకొన్న వస్తువులు అక్కడికి రావడము వలన, ప్రజలకు
అది మహత్యముగ కనిపించినది. ప్రజల లెక్కలో ఆయన స్వామీజీ అయినా,
మా లెక్కలో ఆయన ఒక మాంత్రికుడే. అట్లే ఆయన చేసినది మహత్యముగ
అందరికి కనిపించినా, మా లెక్కలో మాత్రము అది మంత్ర విద్యయే.
స్వామి తాను మంత్రికుడైనప్పటికీ, ఆ విషయమును బయటికి తెలియనివ్వ
లేదు. కనుక ఆయన ఎల్లప్పుడూ స్వామిగానే లెక్కించబడుచున్నాడు.
ఈ విధముగ కొందరు కొన్ని వస్తువులను సృష్టిస్తుండడమును
ఇంద్రజాల విద్య అంటారు. అలాగే వస్తువులను కాకుండా ప్రాణమున్న
జంతువులను, మనుషులను చూపించడమును మహేంద్రజాల విద్య
అంటారు. కొన్ని వస్తువుల శబ్దములను విని చెప్పడమూ, కొన్ని అస్త్రములను
ప్రయోగించడమునూ గజకర్ణ అనియూ, కొన్ని జీవరాసుల శబ్దములనూ,
మనుషుల మాటలనూ విని చెప్పడము, కొన్ని మరణ చేతబడి ప్రయోగము
లను చేయడమూ గోకర్ణ విద్యలని అంటారు. ఇంద్రజాల మహేంద్రజాల,
గజకర్ణ గోకర్ణ విద్యలు మంత్రశక్తితో కూడుకొన్నవి. కావున జ్ఞానులు
జ్ఞానశక్తిని వదలి మంత్రశక్తివైపు పోరు. మాయ అనునది జ్ఞానులకు
వ్యతిరిక్త దిశలో ఉండును. కనుక మాయ జ్ఞానముకంటే గొప్పవారిగా
మాంత్రికులను చూపును. మాంత్రికులను మాంత్రికులుగా కాకుండా
దేవునితో సమానముగా, ప్రత్యక్ష దైవమని ప్రజలు నమ్మునట్లు చేయుటకు
మాయ ప్రత్యేకమైన పనిని చేయుచున్నది. మహత్యములు మూడు రకములని
ముందే చెప్పాను కదా! అందులో టక్కు టమారాలన్నీ ఒక రకమనీ,
ఇంద్రజాల మహేంద్ర జాల, గజకర్ణ, గోకర్ణ విద్యలన్నీ రెండవరకమనీ
కూడా తెలుసుకొన్నాము. ఈ రెండు రకముల మహత్యముల వలన ఏ
మనిషి అయినా ఒక గొప్ప వ్యక్తిగా, పెద్ద స్వామిజీగా పేరు తెచ్చుకొనును.
అటువంటి వ్యక్తి అన్ని రకముల గొప్పగ ప్రచారము పొందినప్పటికీ, ఈయనే
సాక్షాత్తు దేవుడు అను పేరును తెచ్చుకోలేడు. ఎంతటి గొప్పవాడినైనా
దేవునితో సమానుడని ప్రజలందురు, కానీ దేవుడని అనరు.
మాయ అనుకుంటే ఎవడినైనా ఇతనే దేవుడని గుర్తించునట్లు
చేయగలదు. ఇంతకు ముందు మనము చెప్పుకొన్న రెండు రకముల
మహత్యములకు సంబంధించిన విద్యలను ఏ మనిషి అయినా చేయవచ్చును.
ఒకవేళ చేయలేక పోయినా ఫలానా విద్యలవలననే ఈ మహత్యములు
జరుగుచున్నవని చెప్పవచ్చును. అందువలన విద్యల వలన జరుగు
మహత్యములను కాకుండ, మాయ (ప్రకృతి) ప్రత్యేకముగా తనశక్తి చేత
ఒక మనిషిని గొప్పగ ప్రజలకు చూపించగలదు. మాయ స్వయముగా
చూపించిన ఏ మనిషినైనా ప్రజలు దేవుడు అని తీరవలసిందే! మాయ
మనిషిని దేవునిగా చూపిస్తే, అటువంటి మనిషిని మనుషులు సాక్షాత్తు
దేవుడని కొనియాడడము జరుగును. ప్రపంచములో ఎంత పెద్ద మేధావు
లైనా, ఎంత పెద్ద హెూదాకల్గిన వ్యక్తులైనా, విద్యావంతులైనా, ధనవంతులైనా
ఎవరైనా మాయ గొప్పగ చూపించిన వ్యక్తిని ఏమాత్రము సంశయము
లేకుండా అతనినే ప్రత్యక్ష దైవమనీ, నడయాడే దేవుడనీ, కనిపించే పరమాత్మ
అని పొగుడుదురు. సాక్షాత్తు దేవునిగా ఒక మనిషిని ఇతరులు చెప్పాలంటే
మాయ అతని పేరు మీద, అతని ఆకారము మీద మూడవ రక
మహత్యమును ప్రదర్శించుచున్నది. ఇంతకు ముందు చెప్పిన రెండు
రకముల మహత్యములను మనిషి తాను నేర్చిన విద్యల ద్వారా తానే
ప్రదర్శించుకొని దేవుడంతటి వానిగా పేరు తెచ్చుకోవచ్చని చెప్పాము. కానీ
ఒక మనిషిని ఇతనే దేవుడని చెప్పుటకు మనిషి చేయు మహత్యములు
పనికి రావు. అందువలన ఒక మనిషిని మాయయే తన మహత్యముల
ద్వారా ఇతరుల చేత దేవుడని చెప్పించుచున్నది. మనిషి చేయు
మహత్యములు కాకుండా, ప్రత్యేకముగా మాయ చేయు మహత్యములు
ఎలాగుంటాయో కొన్ని సంఘటనల ద్వారా వివరించుకొందాము.
ఏ మనిషినైనా దేవునివైపు పోకుండా, దేవుని జ్ఞానము తెలియకుండా
చేయుటకు, మానవులకు దేవుని ధర్మములను తెలియకుండా చేయుటకు,
ఏ యోగి అయినా దేవుని జ్ఞానమును చెప్పితే, మనుషులు దానిని పట్టించు
కోకుండా ఉండుటకు, మహత్యములు అను తన వలను మాయ మనుషుల
మీద వేయుచున్నది. బహుశా ఆ వలలో చిక్కుకోని వారెవరూ ఉండరనియే
చెప్పవచ్చును. ఇది మాయ వల అని తెలిసిన జ్ఞానులు మాత్రమే
దానినుండి తప్పించుకొందురు. అటువంటి జ్ఞానులు భూమిమీద అరుదుగా
ఉందురు. అందువలన మాయవలలో దాదాపు అందరూ చిక్కుకొందు
రనియే చెప్పవచ్చును.
మాయ మనుషుల మీద విసరు వల రెండు
రకములుగా ఉండును. ఒక రకమైన వల తాను ఎవరినైతే గొప్పగ
చూపించవలెనో అతని పేరు మీద ఉండును. ఈ వలలో నుండి ఎవరైనా
తప్పించుకొనే అవకాశముంటే, అటువంటి అవకాశము లేకుండా మనిషి
ఆకారము మీద రెండవ వల ఉండును. రెండవ వలలో నుండి ఎవరూ
తప్పించుకొనుటకు వీలుండదు. మనిషి పేరుమీద మాయ ప్రయోగించు
వల ఎట్లుండునో వివరించుకొందాము.
ప్రపంచములో ఒక మనిషి తన స్వంత విద్యలచేత మహత్యము
చేయుచు, ప్రజలలో కొంత పేరు పొందిన తరువాత వానిని మాయ మొదట
తన ప్రతినిధిగా ఎన్నుకొని, అతనిని గొప్పగ ప్రపంచ ప్రజలకు చూపించ
తలచును. అలా మాయ ఒక వ్యక్తిని తన ప్రతినిధిగా తీసుకొని అతనిని
దేవునిగా చూపించుటకు ప్రయత్నించును. టక్కు టమారా, ఇంద్రజాల
మహేంద్రజాల మంత్ర విద్యలలో కొంత పేరు తెచ్చుకొన్న తన ప్రతినిధి
వద్దకు కోర్కెల కొరకు కొందరు వచ్చుచుండుటను గమనించిన మాయ
వారి కోర్కెలను నెరవేరునట్లు చేయును. అట్లు నెరవేరిన కోర్కెలు తన
ప్రతినిధి వలననే నెరవేరినట్లు ప్రజలను నమ్మించును. ఆ విధముగ తన
ప్రతినిధియైన వ్యక్తికి కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చునట్లు చేయును.
ఉదాహరణకు నీవు చూచిన దాదాబాబాగారినే తీసుకొందాము. దాదాబాబా
గారు మొదట చిన్నచిన్న మహత్యములను చేసి ప్రజలకు చూపించెడివాడు.
అలాంటపుడు ప్రజలు ఎక్కువగా దాదాబాబాగారి వద్దకు వచ్చేదానికి
అలవాటుపడ్డారు. అటువంటి వ్యక్తితో తన పని సులభముగా ఉండును.
కనుక మాయ, దాదాబాబా గారిని తన ప్రతినిధిగా ఎన్నుకొని అతని వలన
తమ కోర్కెలు నెరవేరుచున్నవను భ్రమను ప్రజలకు కల్గించినది. దానితో
దాదాబాబాగారి వద్దకు పదుల సంఖ్యలో వచ్చు భక్తులు వందల సంఖ్యలో
రాను మొదలుపెట్టారు. అప్పుడు దేశము యొక్క నలుమూలలనుండి
దాదా బాబాగారివద్దకు ఎక్కువ సంఖ్యలో ప్రజలను వచ్చునట్లు మాయ
చేయాలనుకొన్నది. అప్పుడు బొంబాయి నగరములో సినీపరిశ్రమలో పెద్ద
హీరోగా పేరుగాంచిన ఒకవ్యక్తికి ఏదో జబ్బు వచ్చునట్లు చేసి, అతనిని
ఆసుపత్రిలో చేరునట్లు చేసినది. ఆ జబ్బు ఏదో డాక్టర్లకు అర్థము కాలేదు.
దానివలన వారిచ్చు మందులు ఆ రోగము మీద పని చేయడము లేదు.
అప్పుడు ఆ పేరుగాంచిన హీరో మరింత అనారోగ్యము పాలైనాడు. అలా
అంత పెద్ద హీరో అనారోగ్యము పాలవడము దేశములోని ప్రజలందరికీ
తెలిసిపోయి, తమ అభిమాన హీరో ఏమౌతాడో ఏమో అని అందరూ
చింతించుచుండిరి. కొందరైతే ఆ హీరోపేరు మీద గుడిలో అర్చనలు
చేయించుచుండిరి. మరికొందరు ఆయన ఆరోగ్యము బాగుపడవలెనని
యజ్ఞములను కూడా చేయిస్తుండిరి. అలాంటి పరిస్థితిలో ఆ హీరోగారి
చెవిలో ఒక శబ్దము వినిపించసాగింది. ఆ శబ్దము దూరమునుండి ఎవరో
చెప్పినట్లు, తనతో మాట్లాడుచున్నట్లు వినిపిస్తున్నది. అప్పుడు ఆ హీరో,
ఆ మాటలను శ్రద్ధగా విన్నాడు. అతనికి ఆ మాటలు ఇలా వినిపించాయి.
“నేను దాదాబాబాను, శాంతినగరమునుండి చెప్పుచున్నాను. నీ రోగమును
నేనే తీసుకొన్నాను. ఈ దినమునుండి నీవు ఆరోగ్యవంతుడవు అవుతావు.
నా దయ నీ మీద ఎల్లప్పుడు ఉంటుంది.” ఆ మాటలను విన్న హీరోగారు
వెంటనే లేచి కూర్చొన్నాడు. తాను విన్న మాటలను ప్రక్కనేవున్న తన
బంధువులకు చెప్పాడు. మరుసటి దినమునకు తన ఆరోగ్యము బాగై
పోయింది. బాబాగారు తమ అభిమాన హీరోకు చెప్పిన మాటలు చివరకు
దేశవ్యాప్తముగా తెలిసి పోయాయి. ఆ ఒక్క సంఘటనతో దాదాబాబాగారి
పేరు దేశమంతా తెలిసిపోయింది. తర్వాత నాలుగు రోజులకే హీరోగారు
దాదాబాబా దర్శనమునకు వచ్చి పోయాడు. అప్పటినుండి వేల సంఖ్యలో
దాదాబాబా గారి దర్శనమునకు ప్రజలు రాను మొదలుపెట్టారు.
దాదాబాబాగారు ఈ దేశములోనేకాక ప్రపంచ వ్యాప్తముగా
విదేశాలలో కూడా ఈయనే దేవుడన్నట్లు మాయ చేయాలనుకొన్నది. ఒక
దినము విదేశీ భక్తుడు వచ్చి దాదాబాబాగారి దర్శనము చేసుకొని పోయాడు.
అతను భారతదేశమంతా పర్యటించి, ఈ దేశములోని సంస్కృతిని
పూర్తి అధ్యయనము చేసి పోయాడు. ఒక దినము భారతదేశములోని
సాంప్రదాయము ప్రకారము తమ దేశమైన అమెరికాలోనే యజ్ఞము
చేయాలనుకొన్నాడు. యజ్ఞము చేయుటకు భారత దేశమునుండి వేద
పండితులైన బ్రాహ్మణులను రప్పించుకొన్నాడు. శుభలగ్నము చూచి యజ్ఞము
మొదలు పెట్టారు. మొదట యజ్ఞగుండములోనికి అగ్ని కోసము కట్టెలను
రాపిడి చేయను మొదలు పెట్టారు. ఒక కట్టె రంధ్రములో మరొక కట్టెనుంచి
రాపిడిగా త్రిప్పుట వలన ఏర్పడిన అగ్నిచేత యజ్ఞము చేయవలసివుంటుంది.
వారు అగ్ని కొరకు శ్రమించు సమయములో వారికి ఒక శబ్దము
వినిపించింది. ఆ శబ్దములో తాను దాదాబాబాననీ, మీరు అగ్ని కొరకు
శ్రమపడవలదనీ, భారతదేశమునుండి నేనే అగ్నిని అక్కడికి పంపుచున్నాననీ,
నేను పంపిన అగ్ని చేతనే యజ్ఞము చేయమని వినిపించింది. దాదాబాబా
గారు అక్కడ లేకున్ననూ, ఆయన మాటలు అమెరికాలో వినిపించడము
అక్కడున్న అందరికీ ఆశ్చర్యము కలిగించింది. ఆ మాటలు వినిపించిన
నిమిషనమునకే వారున్న చోట పొగ వ్యాపించుకొన్నట్లయినది. అందరూ
చూస్తున్నట్లే ఆ పొగ ఒకచోట కుప్పగా చేరను మొదలుపెట్టింది. అలా
ఒకే కేంద్రములోనికి చేరిన పొగ ఒక్కమారు మండి యజ్ఞగుండములో
పడినది. అది చూచిన అందరూ దాదాబాబాగారు తాను చెప్పినట్లే అగ్నిని
పంపించాడనుకొన్నారు. రెండవదినము ఆ వార్త అమెరికా అంతా ప్రాకి
పోయినది. అలా జరగడము వలన దాదాబాబాగారు అమెరికాలో కూడా
అందరికీ తెలిసిపోయి, ఆయనకు అమెరికా భక్తులు కూడా ఎక్కువై పోయారు.
బొంబాయిలోని హాస్పిటల్లో సినిమా హీరోకు వినిపించిన మాటలు
గానీ, అమెరికాలో వినిపించిన మాటలుగానీ వాస్తవముగా దాదాబాబా
గారికి తెలియదు. దాదాబాబాగారికీ, ఆ మాటలకూ ఏమాత్రము
సంబంధము లేదు. దాదాబాబాకు ఏమాత్రము తెలియకుండానే అవి
జరిగిపోయినవి. అలా జరిగినట్లు తర్వాత దాదాబాబాకు తెలిసినా,
ఆయనకు అవి మంచిని చేకూర్చే సంఘటనలే కావున, ఆ కార్యములను
తానే చేసినట్లు మౌనముగా ఉండిపోయాడు. ఆ కార్యములకు, తనకు
ఏమాత్రము సంబంధము లేకున్నా ఆ విషయమును బయటికి చెప్పలేదు.
ఆ విషయములను ఇతరులు తన ముందర ప్రస్తావించినపుడు దానికి
తగినట్లు నటిస్తూ, తలూపుచూ, చేతితో దీవిస్తూ కనిపించుట వలన
దాదాబాబా గారిని అందరూ గొప్ప వాడనీ, నిజముగా దేవుడనీ
అనుకోవడము జరిగినది. బాబాగారికి ఆ విషయము ఏమాత్రము
అంతుబట్టకున్నా, అలా జరగడము తన గొప్పతనమేనని అనుకొన్నాడు.
దాదాబాబాగారిని ప్రత్యక్షదైవముగా ప్రజలకు చూపించడము మాయయొక్క
ముఖ్య ఉద్దేశము. కావున బాబాగారి పేరును చెప్పి మాయమాతే అలా
చేయడము జరిగింది. ఆ పనితో దేవుడూ, దేవుని జ్ఞానమూ అని ఎవరూ
ప్రాకులాడకుండ నిజమైన దేవుడితడేనని బాబాగారినే చెప్పుకొందురు.
ప్రజల దృష్ఠి అంతయూ అసలైన దేవుని మీదకు పోకుండా బాబామీదనే
ఉండును.
ఇటువంటి మహత్యములను స్వయముగా మాయయే చేస్తూ బాబా
గారిని దేవునిగా చూపించసాగింది. ఇంతవరకు బాబాగారి పేరును
మాత్రము చెప్పి, ఆయన మాటలుగా వినిపించిన మాయ, ఈ మారు
దాదాబాబాగారి రూపమును చూపి మహత్యమును చేయాలనుకొన్నది.
ఢిల్లీలో దాదాబాబాగారి భక్తుడు బాబాగారి ఫోటోను పెట్టుకొని ప్రతి దినమూ
ఉదయము నమస్కారము చేయుచుండెను. ఒక దినము బాబాగారి ఫోటోకు
నమస్కారము చేయుటకు ఫోటోవున్న గదిలోనికి పోయాడు. అక్కడ బాబా
గారి ఫోటోలో నిండా కుంకుమ కనిపిస్తూ కొద్దికొద్దిగా క్రిందికి రాలుచున్నది.
ఆ దృశ్యమును చూచిన ఆ భక్తుడు తన ఇంటిలో బాబాగారి ఫోటోనుండి
కుంకుమ రాలుచున్నదని ఇరుగు పొరుగు వారికి చెప్పెను. అలా ఆ
విషయము ఆ ప్రాంతమంతా ప్రాకిపోయి, జనము తండోప తండాలుగా
వచ్చి ఆ వింతను చూచి, బాబాగారు సాక్షాత్తు దేవుడేనని చెప్పుకొనసాగిరి.
ఈ విధముగా దేశములోని వివిధ పట్టణములలో బాబాగారి ఆకారము
నుండి సుగంధపు నూనె ఒకచోట, తేనె ఒకచోట, నీరు ఒకచోట, విభూది
ఒకచోట రాలడము వలన బాబాగారి మహత్యమూ, గొప్పతనమూ
దేశమంతా ప్రాకిపోయి, ఆయనను ప్రత్యక్ష దైవముగా భావించసాగిరి.
ఈ పనులకూ దాదాబాబాగారికీ ఏమాత్రము సంబంధములేదని జ్ఞాపక
ముంచుకోవలెను. ఈ పనులన్నిటినీ మాయయే బాబాగారి ఆకారమును
అడ్డము పెట్టుకొని చేయడము వలన ఆ పనులలోని కీర్తిప్రతిష్ఠలన్నియూ
బాబాగారికి దక్కినవి. మాయయే ఈ పనులు చేయుచున్నదను విషయము
ప్రపంచములో ఎవరికీ తెలియదు. చివరికి దాదాబాబాకు కూడా తెలియదు.
తనకున్న శక్తి వలన అలా జరిగినవని దాదాబాబా అనుకోవడము జరిగినది.
చిన్నచిన్న మహత్యములను తనకు తెలిసిన విద్యల చేత చేయు
బాబాగారికి చివరకు స్వదేశములోనూ, విదేశములలోనూ మంచి పేరు
ప్రఖ్యాతులు వచ్చినవి. బాబాగారు తనకు మంచియే జరుగుచున్నదను
కొన్నాడు. కానీ మాయవలన అట్లు జరుగుచున్నవని తనకు ఏమాత్రము
తెలియదు. ఇవి ప్రస్తుత కాలములో జరుగుచున్న మాయ యొక్క
మహత్యములు. ప్రస్తుత కాలములోనే కాకుండ, గత యుగములలో కూడా
మాయ ఇలాంటి పనినే చేసింది. గతములోగానీ, ప్రస్తుత కాలములోగానీ,
రాబోయే కాలములోగానీ మాయ కర్తవ్యమే అది అని చెప్పవచ్చును. దేవుడు
తన ప్రతినిధియైన భగవంతుని చేత తన ధర్మములను భూమిమీద స్థాపిస్తే
వాటిని మనుషులు తెలుసుకోకుండా చేయడమే మాయ యొక్క పని.
జగతిలో ఒక్కమారు ధర్మములను బోధించుటకు, దేవుడు భగవంతునిగా
మూడుమార్లు అవతరించాల్సిన అవసరమున్నది. ప్రస్తుత కాలములోనుండి
లెక్కించితే ఐదువేల సంవత్సరముల పూర్వము నుండి భగవంతుని జన్మలు
ప్రారంభ మైనవి. ఐదువేల సంవత్సరముల క్రితము కృష్ణుని జన్మగా
మొదలైన భగవంతునిరాక, రెండవ మారు కూడా అయిపోయినది. ఇక
మూడవమారు రావలసివుంది. మూడవ మారు వచ్చి ధర్మములకు
సంపూర్ణతను చేకూర్చి పోవును. అలా మూడుమార్లు రావడానికి కూడ
కారణమున్నది. దేవుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలుగా విభజింపబడి
వున్నాడు. అలాగే ప్రకృతి ఐదు భాగములుగా విభజింపబడివున్నది. దేవుడు
మూడు భాగములు కనుక మూడు భాగములుగానే తన ధర్మములను
బోధించాలి. అందువలన మూడుమార్లు అవతరించాలి. ప్రకృతి దేవునికి
వ్యతిరేఖమైన మాయగా భూమిమీద ఉన్నది. దేవుడు అవతరించినపుడు
ప్రకృతి తన మాయద్వారా మనుషులను దేవునివైపు పోకుండా, ఆయన
ధర్మములను తెలుసుకోకుండా చేయును. అలా చేయుటకు మాయ ఐదు
అవతారములను తీసుకొనును. భగవంతుడు భూమిమీదకు వచ్చిన
మూడుమార్లు మాయ ఏదో ఒక స్వామీజీని ఆవహించి తన మహత్యములను
చూపుచూ, ధర్మములవైపు పోకుండా చేయడమేకాక, భగవంతుని జన్మ
ప్రారంభముకాక ముందు ఒకమారు, భగవంతుని మూడు జన్మలు
అయిపోయిన తర్వాత ఒకమారు, మనుషులను ఆవహించి తన కార్యమును
తాను చేయును. మాయ భగవంతునివలె ప్రత్యేకమైన జన్మతీసుకోదు.
పుట్టిన మనిషిని ఎన్నుకొని అతనిని ఆవహించును. అలా ఐదు
జీవితములలో చేరి అధర్మములను ప్రచారము చేయుచు, ధర్మములను
అణచివేయాలని చూచును.
గత యుగములో దేవుడు భగవంతునిగా వచ్చి తన ధర్మములను
బోధించి పోయాడు. ఇప్పుడు కూడా భగవంతుడు తన ధర్మములను
బోధించుటకు అవతారములను ప్రారంభించాడు. ఒకమారు ధర్మములను
బోధించుటకు మూడుమార్లు భగవంతుడు పుట్టవలసివుంది అని చెప్పు
కొన్నాము కదా! ఇప్పటికి రెండుమార్లు వచ్చిపోయాడు. గతములో
భగవంతుడు వచ్చినపుడు రెండుమార్లు, రాకముందే ఒకమారు మాయ
కూడా మనుషులలో అవతరించి తన మూడు జన్మలను పూర్తి చేసుకొన్నది.
ఇక దేవునికి ఒక అవతారమూ, మాయకు రెండు అవతారములు మిగిలి
వున్నవి. మాయ గతములో తన ఒక అవతారమున ఒక స్వామీజీని
ఆవహించి, ఇప్పుడు దాదాబాబాగారినుండి మహత్యములు చూపినట్లు,
అప్పుడు ఆ స్వామిద్వారా మహత్యములు చూపుచూ, భగవంతుని వైపు
ఎవరినీ పోనీయకుండా, తను ఆవహించిన స్వామియే దేవుడన్నట్లు చేసింది.
అంతేకాక తాను ఆవహించిన మనిషికి భగవాన్ అని బిరుదును కూడా
ఇచ్చి ప్రజలచేత భగవాన్ స్వామిగా పిలిపించేది. భగవాన్ స్వామి ద్వారా
తన మహత్యములను ప్రజలకు చూపి, ఆయనను నిజముగా దేవుడన్నట్లు
చేసింది. ప్రజలచేత ప్రత్యక్ష దైవముగా, దేవుని అవతారముగా భావింప
చేసింది. ఆ కాలములో దేవుడు భగవంతునిగా భూమిమీద ఉన్నప్పటికీ,
ఆయనవైపు ఎవరినీ పోకుండా చేసి, అందరినీ భగవాన్స్వామి వైపు
ఆకర్షించింది. ఈనాడు దాదాబాబా ద్వారా మహత్యములు చూపినట్లు
భగవాన్ స్వామి పేరుమీద, ఆకారము ద్వారా ఎన్నో మహత్యములను
చూపింది. అటువంటి స్థితిలో ప్రజలు భగవాన్ స్వామినే గొప్పగా చెప్పుకొనెడి
వారు. భగవంతుని జ్ఞానమువైపు ఎవరూ పోయేవారు కాదు.
అను చూపుచున్నది. *
మాయ ఎప్పటికీ భగవంతుని రాకకంటే ముందే వచ్చి ముందే
పోవుచుండును. అప్పటికాలములో భగవంతుని అవతారముకంటే
ముప్పయి (30) సంవత్సరములు ముందే అవతరించిన మాయ ముందే
తన అవతారమును చాలించింది. మాయ ఒకవ్యక్తిని ఆవహించి తన
మహత్యములను చేయుననీ, ఆ మహత్యములకు, ఆ వ్యక్తికీ ఏమీ సంబంధ
ముండదని చెప్పుకొన్నాము కదా! అదేవిధముగా ప్రస్తుత కాలములో దాదా
బాబా శరీరమునుండి మహత్యములను చూపుచున్నది. దాదాబాబాగారిని
కూడా భగవాన్ బాబాగా చేసింది. ఆ కాలములో కూడా మాయ ఇప్పుడు
చేసినట్లే భగవాన్ స్వామినుండి చేసేది. భగవాన్ స్వామికీ, ఆయన పేరుమీద,
ఆకారము మీద జరిగెడి మహత్యములకూ ఏమాత్రము సంబంధము లేదు.
భగవాన్ స్వామిగా అవతారమును చాలించు సమయములోనూ, భగవాన్
స్వామి చనిపోయిన తర్వాతనూ జరిగిన సంఘటనలను బట్టి చూస్తే ఆ
స్వామి వేరు, ఆయనలోనున్న మాయవేరని తెలియగలదు. ఇప్పుడు ఆ
కాలములో జరిగిన సంఘటనలను గమనించి చూస్తాము.
భగవాన్ స్వామిని అమెరికా భక్తుడు ఒకడు తన ఇంటికి ఒక
శుభకార్యమునకు పిలుచుకొని పోవాలనుకొని, ఒక సంవత్సరము ముందు
నుండి స్వామిగారిని అడుగుచుండెను. స్వామి సరే వస్తానని ఒప్పుకొన్నాడు.
శుభకార్యము చేయు కాలమువచ్చింది, కావున అమెరికా భక్తుడు వచ్చి
స్వామి గారిని ప్రత్యేక విమానములో పిలుచుకొని పోవాలనుకొన్నాడు.
అలాగే ఏర్పాట్లు చేసుకొని ప్రత్యేక విమానములో బయలుదేరిపోయారు.
అప్పటికి ఒక దినముముందే మాయమాత ఆయన శరీరమునుండి
తొలగిపోయింది. భగవాన్ స్వామికి తన శరీరములో అంతకాలమూ
మాయ ఆవహించి ఉండేదనీ, ఇప్పుడది పోయిందని ఏమాత్రము తెలియదు.
తన అమెరికా ప్రయాణమునకు ఒకరోజు ముందే మాయ పోవడము వలన
ఆయనలో మహత్తులు ఏమీ లేకుండా పోయినవి. విమానములో
బయలుదేరిన వారు భారతదేశమును దాటకనే విమానములో సాంకేతిక
లోపము ఏర్పడినది. విమానము పేలిపోతుందని తెలిసింది. వెంటనే
విమానములోనున్న నలుగురూ భగవాన్ స్వామితో సహా పేరాచ్యూట్ల
సహయముతో విమానము నుండి క్రిందికి దూకారు. అలా దూకిన వారు
తలా ఒకదిక్కుకు పోయి దిగడము జరిగినది. స్వామిజీ ఒక అడవిలోనికి
పోయి దిగాడు. పేరాచ్యూట్లు గాలికి తమ ఇష్టమొచ్చినట్లు పోవడము
వలన స్వామిగారు అడవిలో ఒంటరిగా దిగాడు. అది కౄరమృగములుండే
అడవి, కావున స్వామికి ఎటువంటి రక్షణాలేదు. స్వామికి ఎటుపోవాలో
తెలియలేదు. ఎంతో పెద్ద స్వామి ఒంటరిగా అలా అడవిలో చిక్కుకు
పోయాడు. సాయంకాలమైంది. అపుడు రక్షణ కోసము ఒక చెట్టునెక్కి
కూర్చున్నాడు. స్వామి గారికి చెట్టు ఎక్కడమే కష్టమైనది, ఎక్కిన తర్వాత
దానిమీద ఉండడము మరీ కష్టమైనది. అలా చెట్టు మీద రెండు రాత్రులు,
రెండు పగళ్ళు గడిపాడు. తినేదానికి ఆహారము లేదు, త్రాగేదానికి నీరూ
లేదు. క్రిందికి దిగే దానికి వీలులేనట్లు కౄరమృగములు అక్కడికి వచ్చి
తిరిగి పోవుచున్నవి. రెండు రోజులు ఆ చెట్టు ఆకులు తిని కాలము
గడిపిన ఆయనకు ఇక శరీరములో శక్తి లేకుండా పోయింది. అలా
ఉండడముకంటే చనిపోవడమే మేలనుకొన్నాడు. అంతలోనే అక్కడికి ఒక
చిరుతపులి వచ్చి ఆయనను చూచి చెట్టు ఎక్కి ఆయనను చంపివేసింది.
అడవిలో అంత ఘోరము జరిగిపోయింది. కానీ బయటి ప్రజలకు ఆ
విషయము తెలియదు. విమానము నుండి పేరా చ్యూట్లో దిగిన స్వామి
ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటాడనీ, తిరిగి వస్తాడనీ గంటగంటకు వార్తలు
రానే వస్తున్నవి. స్వామి తప్పిపోయినప్పటినుండి ఇరవై (20) రోజుల
వరకు ఆయన కోసము హెలీక్యాప్టర్లలో గాలిస్తూనే ఉన్నారు. అంతవరకు
ఆయన ఆచూకీ తెలియలేదు.
భక్తులందరూ తమతమ ఇళ్ళలో స్వామిగారిని గురించి ఆయన
క్షేమముగా రావాలని భజనలూ, యజ్ఞములు చేయను మొదలు పెట్టారు.
ఆ విధముగా స్వామి గారు తప్పి పోయినప్పటి నుండి ఆయన భక్తులందరూ
ఆయనకొరకు తపిస్తున్నారు. స్వామిగారు తప్పి పోయిన మొదటి రోజే
ఒక భక్తుని ఇంటిలో స్వామివారి ఫోటోనుండి తేనె చుక్కలు రాలను మొదలు
పెట్టాయి. అలా తేనె కారు సమయములో బాబాగారు అడవిలో బ్రతికే
ఉన్నారు. అక్కడ ఆయనకు అడవిలో భయముతో చెమటలు కారుచున్నాయి.
ఆయన పూర్తి నీరసించి పోయాడు. ఆ సమయములో మాయ ఆయనలో
లేకున్నా ఆయన రూపమునుండి తేనెను కారునట్లు చేసినది. అలా తేనె
కారడము వలన స్వామి వారిమీద భక్తి ఏమాత్రము సడలిపోకుండ నిలచింది.
ఆ విధముగా స్వామిగారినే అందరూ నమ్మియుండునట్లు ఆయన ఫోటోల
నుండి అనేక చోట్ల సుగంధముతో కూడుకొన్న పన్నీరు కారడమూ, కుంకుమ
రాలడమూ, విభూది రాలడమూ జరుగుచుండెడిది. చివరకు 20 రోజుల
తర్వాత ఆయన చనిపోయినట్లు తెలిసినది. ఆయన చనిపోయిన చోట
స్వామిగారి చినిగిపోయిన గుడ్డలూ, శరీర అవశేషములు దొరకడముతో
స్వామి చనిపోయినట్లు నిర్ధారణ చేసి, గుడ్డలను ఎముకలను తెచ్చి సమాధి
చేశారు. ఆయనను సమాధి చేసిన తర్వాత కూడా ఆయన ఫోటోల నుండి
మహత్యము జరగడమూ, ఆయన కనిపించి మాట్లాడినట్లు జరగడమూ
వలన స్వామిగారు పోయిన తర్వాత కూడా, ఆయనను దేవుడనియే ప్రజలు
నమ్మి అసలైన దేవున్ని, నిజమైన జ్ఞానమును మరచిపోయారు. స్వామి
అడవిలో చిక్కుకొన్నపుడూ, ఆయన చనిపోయినపుడూ ఆయనకు
సంబంధము లేకుండానే మహత్యములు ఎలా జరిగినవని ఎవరూ
ఆలోచించలేదు. అలా ఆలోచన ఎవరికీ రాకపోవడముతో స్వామివేరూ,
మాయవేరని ఎవరికీ తెలియకుండా పోయినది. ప్రపంచములో ఎంత
పెద్ద మేధావినైనా, తన విషయములో ఏమాత్రము యోచించకుండా
నమ్మునట్లు, జ్ఞానమువైపు పోకుండునట్లు మాయ చేయుచున్నది.
రాఘవ :- స్వామీ! మీరు చెప్పిన మాయ యొక్క మహత్య విధానము
ప్రపంచములో ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. ప్రపంచములో ఎంత
తెలివున్నవారైనా మహత్యములను గురించి ఆలోచించక, దానికొక
విధానమున్నదని తెలియలేకున్నారు. మేధావులు కూడా గ్రుడ్డిగా నమ్ము
చున్నారు. ఇక విజ్ఞానవేదిక వారూ, నాస్తికులూ ఉన్నదానిని లేదనడమూ,
చెప్పిన దానిని కాదనడమూ తప్ప మహత్యములోని రహస్యములను వారు
కూడా యోచించడము లేదు. ప్రతి దానికీ శాస్త్రీయతా, శాస్త్రబద్ధత అని
చెప్పు విజ్ఞానవేత్తలు, మహత్యములు లేవు ఇవన్ని మ్యాజిక్ లు అని చెప్పు
చున్నారు కానీ శాస్త్రపద్ధతిలో ఖండించడములేదు. గ్రుడ్డిగా ఖండించు
చున్నారు. మీరు వైద్యమునకు, మంత్రములకు రసాయన శాస్త్రము
ఆధారమని విపులముగా చెప్పారు. నేటి విజ్ఞానులు మంత్రములకు
శాస్త్రబద్ధత లేదు అని చెప్పుచున్నారు. మీరు చెప్పినది విపులముగా
అర్థమైనది. నాకు ఇంకొక్క సంశయమున్నది. అదేమనగా! మంత్రశక్తి
చేత కొన్ని పనులను చేయవచ్చునని చెప్పారు. బాబాగారు ఇస్తున్న కొన్ని
వస్తువులు సూక్ష్మగ్రహములు అందించునవని చెప్పారు. కొందరు నాకు
చెప్పిన దానినిబట్టి ఆయన చిన్నతనమునుండి అలా ఇస్తున్నాడని చెప్పారు.
అటువంటపుడు ఆయన మంత్రసాధన చేయలేదని తెలియుచున్నది. మంత్ర
సాధన లేనిది వస్తువులివ్వడము ఎలా సాధ్యమగునో అర్థముకాని విషయ
మైనది. నాకున్న ఈ సంశయమునకు వివరముగా జవాబు చెప్పమని
కోరుచున్నాను.
రాజయోగా :- నీ సంశయము సరియైనదే, ఎవరికైనా ఈ ప్రశ్న రాగలదు.
దానికి నేను చెప్పు జవాబు ఏమనగా! దాదాబాబాగారు చిన్నవయస్సు
నుండి తాను నేర్చుకొన్న విద్యల వలన కొన్ని మహత్యములు చేయుట
వాస్తవమే. అయితే ఈ జన్మలో ఆయన ఏ విద్యలూ నేర్చుకోలేదు. ఆయన
ముందు జన్మలో ఎంతో తపోసాధన చేసి నేర్చుకొన్న విద్యల వలన అలా
చేయగల్గుచున్నాడు.
రాఘవ :- స్వామీ! ఇక్కడొక చిన్న సంశయము.
జ్ఞాపకాలు ఈ జన్మలో ఉండవు కదా!
పోయిన జన్మలో
రాజయోగా :- నీమాట వాస్తవమే రాఘవా! అయితే దాదాబాబాగా
చలామణి అగుచున్న జీవుడు పోయిన జన్మలో చనిపోలేదు. ఈ జన్మలో
పుట్టనూలేదు.
రాఘవ :- అదెలా సాధ్యము స్వామీ! అక్కడ చనిపోతే కదా ఇక్కడ పుట్టేది.
రాజయోగా :- అదే చెప్పుచున్నాను, ఆయన అక్కడ చనిపోలేదు. చనిపోయి
నట్లు శరీరమును వదలి అందరి దృష్ఠిలో చనిపోయినట్లు కనిపించాడు.
స్థూలశరీరమును మాత్రము వదలిన ఆయన, తన సూక్ష్మశరీరముతో వచ్చి
చిన్న వయస్సున్న బాలుని శరీరములోనికి చేరుకొన్నాడు. ఆ బాలున్ని
నిద్రలోనికి పంపి, ఆ శరీరమును తాను ఆక్రమించుకొన్నాడు. ఒక
దయ్యము మరొక శరీరములోనికి ప్రవేశించినట్లు, బాలుని శరీరములోనికి
ప్రవేశించాడు. అట్లు ప్రవేశించుటను జననము అనము. అట్లే సూక్ష్మ
శరీరముతో సహా బయటికి రావడము మరణము కూడా కాదు. అందువలన
దాదాబాబాగారు ముందుజన్మలో మరణించినట్లు గానీ, ఈ జన్మలో పుట్టినట్లు
గానీ చెప్పుటకు వీలులేదు. ఆయన పాత శరీరమును వదలి క్రొత్త శరీరము
లోనికి వచ్చినప్పటికీ, ఆయన వెనుక జన్మలో ఉన్నట్లే లెక్కించబడును.
రాఘవ :- అయితే అలా శరీరమును మారినప్పటికీ క్రొత్త జన్మ కాదుకదా!
అలాంటపుడు క్రొత్తశరీరములో కూడా పాత అలవాట్లే ఉండుననుకొంటాను.
రాజయోగా :- అవును, పాత అలవాట్లే కాదు, పాతవిద్యలు కూడా అలాగే
ఉండును. అందువలననే దాదాబాబాగారు వెనుక శరీరములో తాను
నేర్చిన విద్యలను క్రొత్త శరీరములో ఉపయోగించుకోవడము వలన చిన్న
వయస్సునుండే మహత్యములను చేయగలిగినాడు.
రాఘవ :- స్వామీ నేను ఇతరులవద్దనున్న ఒక ఫోటోను చూచాను.
ఫోటో దాదాబాబాగారి గతజన్మలోనిదని చూపించారు. నేను పోయిన
జన్మలోని ఫోటోలోనూ, ఈ జన్మ ఫోటోలోను ఆకారము అంతా వేరువేరుగా
ఉన్నా తలమీద మాత్రము రెండు ఫోటోలలోనూ ఒకేఒక గుర్తు మారనట్లు
కనిపించింది. మీరు ఇంతవరకు చెప్పిన పాత అలవాట్లు, పాతవిద్యలు
అలాగే ఉండుననుటకు నాకు కనిపించిన గుర్తు నిదర్శనమనుకుంటాను.
రాజయోగా :- నీవు పోయివచ్చిన ఈ చిన్న యాత్రవలన నీకు ఏమి
అర్థమైనది?
రాఘవ :- నేను చూచినప్పుడు నాకు ఏమీ అర్థము కాలేదు. ఇప్పుడు
మీరు చెప్పిన తర్వాత నేను ఒకచోట చూచినది పరమాత్మ జ్ఞానమనీ,
మరొక చోట చూచినది మాయ (ప్రకృతి) మహత్యమని తెలిసినది. అంతేకాక
జ్ఞానమున్న చోట, భక్తిలేని తప్పుడు భక్తులూ, తెలివితక్కువ భక్తులూ
ఉన్నారనీ, జ్ఞానము లేకుండ మాయ మహత్యములున్న చోట, మంచి
తెలివైన భక్తులూ, మంచి భక్తిశ్రద్ధలున్న వారూ ఉన్నారని కూడా అర్థమైనది.
ఇంకా ముఖ్యముగా చెప్పితే మాయ మహత్యముల మర్మములన్నీ తెలిసి
పోయినవి. ఎవరికీ తెలియని మాయ అవతారముల గురించి తెలిసింది.
(నూకా, వెంకూ ఇద్దరూ తామున్న నిమ్మతోట వైపు రావడమును
గ్రహించిన ఆటవికులు జాగ్రత్తగా ఉన్నారు. నూకా, వెంకూ తోటలోనికి
వచ్చి అక్కడున్న ఆటవికులనూ, వారివద్దనున్న తమ సూట్కేస్ న్ను చూచారు.
అపుడు వెంకు, నూకావైపు చూచి కనుబొమలతో సైగచేసి నేరుగా యోగా
వద్దకు వచ్చి ఇలా అన్నాడు.)
వెంకూ :- ఈ సూట్కేస్ మాది, పొరపాటుగ రైలునుండి క్రిందపడి
పోయింది. మేము ప్రక్క స్టేషన్లో దిగి ఈ సూట్కేస్ కొరకు వెదుకుచూ
వచ్చాము. ఇది క్రిందపడిన స్థలములో కనిపించలేదు. ఎవరికైనా
దొరికుంటుందని దీనికొరకే వెదుకుచున్నాము. ఇక్కడే దగ్గరే మీవద్ద
కనిపించినందుకు సంతోషిస్తున్నాము. మాది మాకిచ్చేయండి, మేము
తొందరగా పోవాలి.
యోగా :- ఇది మాకు దొరికిన మాట నిజమే. కానీ ఇది మీదేనని
గుర్తేమిటి? ఇది మీదైతే దీనిలోపల ఏముందో చెప్పండి. మీరు చెప్పినట్లు
ఉంటే మీదేనని నమ్మి ఇవ్వగలము. మీరు చెప్పినట్లు లేకపోతే ఇది మీది
కాదు, మరెవరిదోనని అనుకొంటాము.
ఆ సూట్కేస్లో ఏమున్నదో వెంకుకు నూకాకు తెలిసినప్పటికీ వారు
చెప్పలేదు. తర్వాత కొంత తీవ్రముగా ఇలా అన్నారు)
నూకా :- నా మాటను వినండి. మా సూట్కేసు మేము వెదుకుచూ
వచ్చాము. మీదగ్గరున్నట్లు చూచి మిమ్ములను అడుగుచున్నాము. ఇంతకంటే
సాక్ష్యము కావాలా! మా సూట్కేస్ మాకివ్యండి.
మేఘ :- మీ దానిని మీకిచ్చుటకు మాకు ఏమీ అభ్యంతరము లేదు. ఇది
ఎవరిదో వారికే ఇవ్వాలనునదే మా ఉద్దేశ్యము. మేము చెప్పేది మీరు
కూడా వినండి. ఈ పెట్టె రైలునుండి క్రిందపడినపుడు ఎవరైనా చూచి
ఉండవచ్చును. అలా చూచిన వారు ఎవరైనా ఇది మాదేనని అడుగు
అవకాశము గలదు. ఒకవేళ మీకిచ్చిన తర్వాత నిజముగా పోగొట్టుకున్న
వారు వస్తే మేము పొరపాటు చేసినట్లగును. అందువలన ఇది మీదే
అయితే ఇందులో ఏముందో చెప్పి చూపించి తీసుకపోండి. మాకు
ఎటువంటి అభ్యంతరములేదు.
వెంకు :- మీరు మర్యాదగా మాది మాకు ఇవ్వండి. లేకపోతే పెద్దగొడవ
జరుగుతుంది, జాగ్రత్త.
మేఘ :- మేము మీ బెదిరింపులకు బెదిరి పోవువారముకాదు. ఇందులో
ఏముందో చెప్పంది ఇవ్వము.
(వెంటనే వెంకు సూట్కేస్ యోగచేతినుండి లాక్కున్నాడు. ఆ
మరుక్షణమే వెంకు మెడమీద మేఘా పిడికిలి వేటుపడింది. క్రిందపడిన
వెంకు మీద నలుగురు ఆటవికులు పడి సూట్కేసు గుంజుకొన్నారు.
క్రిందపడిన వెంకును పైకి లేవకుండా అట్లే అదిమిపట్టారు. పరిస్థితిని
గమనించిన నూకా లోపలనున్న రివాల్వర్ను బయటికి తీసి ఆటవికులను
కాల్చివేస్తానని బెదిరించాడు. అది రివాల్వర్ అనీ, దానినుండి తూటాలు
బయటికి వస్తాయనీ తెలియని ఆటవికులు ఆ మాటలకు భయపడలేదు.
యోగా మెరుపులాగా నూకా వైపు పోయాడు. అంతలో నూకా తన
రివాల్వర్ను యోగా గుండెవైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. ఢామ్ అను
శబ్దము పెద్దగా చుట్టుప్రక్కల ప్రాంతము వరకు వినిపించింది. అర్థము
కాని అయోమయములో ఏమి జరిగిందోనని ఆటవిలకులందరూ అటువైపు
చూచారు. రివాల్వర్ ప్రేలినపుడు అందులోని తూటా సిటింగ్ సరిగా
లేనందున, తూటా ముందుకు పోకుండా అక్కడే పగిలిపోయింది. తూటా
బయటికి పోకుండా రివాల్వర్లో ప్రేలిన దానివలన రివాల్వర్ బారెల్ పగిలి
పోయి దాని ముక్కలు ఎగిరి నూకా నుదుటికి, చేతికి తగిలి గాయపరిచాయి.
కొద్దిగా గాయపడిన నూకాకు ఏమీ అర్థము కాలేదు. వెంటనే యోగా
మరియు మిగతావారు అతనిని పట్టుకొన్నారు. రివాల్వర్ పేలుడు విన్న
సమీప గ్రామమువారు అక్కడికి పరుగిడుచూ వచ్చారు. అలా వచ్చిన
గ్రామస్థులను చూచిన వెంకు, నూకా ఇద్దరూ “దొంగలు దొంగలు రక్షించండి
రక్షించండి, మా సూట్కేస్ లాక్కొని మమ్ములను కొట్టుచున్నారని” గట్టిగా
అరిచారు. ఆ మాటలు వినిన గ్రామస్థులు ఆటవికులను దొంగలనుకొని
వారిని పట్టుకొనుటకు ప్రయత్నించారు.
ప్రమాదమును గ్రహించిన ఆటవికులు కాలికి బుద్ధి చెప్పారు.
వెంకూ, గాయపడిన నూకా మరియు గ్రామస్థులు ఆటవికులను
వెంబడించారు. సమయము కాదని పరుగిడుచున్న ఆటవికుల చేతినుండి
సూట్కేస్ జారిక్రిందపడింది. క్రిందపడిన తాకిడికి సూట్కేస్ పగిలిపోయి
తెరుచుకుంది. అలా పగిలిపోయి తెరుచుకొన్న సూట్కేస్ నుండి పెద్ద
నాగుపాము బుసకొడుచూ బయటికి వచ్చింది. ఆ సంఘటనను చూచిన
ఆటవికులు ఆశ్చరపోయి నిలబడ్డారు. గ్రామస్థులు కూడా పామును చూస్తూ
నిలిచిపోయారు. అందరూ చూస్తున్నట్లే పాము అక్కడినుండి దూరముగా
పోవుచున్నది. వెంకు, నూకా మాత్రము పాము వెంటపడి పట్టుకోబోయారు.
పాము బుసకొడుచూ కోపముగా వారిరువురి మీదికి లేచింది. నిలబడి
చూస్తున్న ఆటవికులకు, గ్రామస్థులకు వారు దానివెంట ఎందుకుపడ్డారో
అర్థము కాలేదు. ప్రాణములకు తెగించి వెంకు పామును పట్టుకోబోయాడు.
పాము వెంకును కాటువేసి పారిపోయింది. పాముకాటు తిన్న వెంకూను
రక్షించేదానికి గ్రామస్థులు, ఆటవికులు పూనుకొన్నారు. అప్పుడు యోగ
తమ విషయమంతా గ్రామస్థులకు తెలిపి, తాము దొంగలము కాదని
వివరముగా చెప్పాడు.)
(రాజయోగనందస్వామి వద్ద మహత్యములను గురించి తెలుసు
కొన్న రాఘవకు వాటి విషయములో ఇంకాకొన్ని ప్రశ్నలను అడిగి తెలుసు
కోవాలనుకొన్నాడు. రెండవరోజు భోజనము చేసి విశ్రాంతిగ కూర్చున్న
రాజయోగనందస్వామి సన్నిధికి పోయిన రాఘవ, అదను చూచి
సవినయముగా ప్రశ్నించెను.)
రాఘవ :- స్వామీ! పూర్వము ఒకవ్యక్తి తాను అనుభవించవలసిన పాపమును
అనుభవించక తప్పించుకొన్నాడనీ, అది ఒక గురువు దగ్గరికి పోయి
ఉండుట వలన సాధ్యమైనదని చెప్పుచుందురు. అప్పుడు ఆ గురువుగారి
మహత్యముతో ఆ పాపమును అనుభవించకుండా పోయాడా? లేక మాయ
మహత్యముతో అనుభవించకుండా పోయాడా?
రాజయోగా :- మహత్యములను గురించి తెలుసుకొనుటకు ముందు ఒక
ముఖ్య సూత్రమును తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడము వలన ఏది
మహత్యమూ, ఏది మహత్యము కాదూ అని తెలియగలదు. ఎక్కడైతే
అనుభవించే కర్మ పోతూవున్నదో, అప్పుడది జ్ఞానశక్తి వలననే పోయినదని
లెక్కించవలయును. అనుభవించబడే కర్మ కాకుండా ఏది జరిగినా, అది
మాయ మహత్యము క్రిందికే లెక్కించనగును. ఉదాహరణకు ఒక ఫోటో
నుండి విభూది రాలింది అనుకుందాము, అప్పుడది మాయ యొక్క
మహత్యమని చెప్పవచ్చును. అట్లే ఒక విగ్రహమునుండి చక్కర రాలింది
అనుకుందాము, అప్పుడది కూడా మాయ మహత్తు క్రిందికే జమకట్టవలెను.
ఇవన్నీ జీవుని కర్మకు సంబంధించిన కార్యములు కావు. ఒక గురువు లేక
ఒక యోగి ఒక జీవుని కర్మను తొలగించితే అది మాయ మహత్యము
కాదు. అది జ్ఞానశక్తి వలన జరిగినదని చెప్పవచ్చును. భగవద్గీతలో
జ్ఞానయోగము అను అధ్యాయమున 37వ శ్లోకము ఈ విధముగా గలదు.
యదైదాంసి సమిద్దోగ్ని రస్మసాత్కురుతేర్జున .
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా |
దీని భావము ఏమనగా! ఏ విధముగా అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో,
ఆ విధముగనే జ్ఞానమను అగ్నిలో కర్మలను కట్టెలు కాలిపోవును.
భగవంతుడు చెప్పిన ఈ మాట ప్రకారము కర్మలు ఒక జ్ఞానమను అగ్ని
చేతనే లేకుండాపోవును. ఈ సూత్రమును అనుసరించి ఎక్కడ కర్మలు
లేకుండా నాశనమగుచున్నవో, అక్కడ జ్ఞానమే పని చేయుచున్నదనీ, అది
మాయ మహత్యముకాదనీ తెలియవచ్చును. జ్ఞానమును మభ్యపెట్టి
అజ్ఞానమును బహిర్గతము చేయడమే మాయయొక్క ముఖ్యమైన పనిగా
ఉండుట వలన, ఇక్కడ భగవంతుని మాటను కూడా అర్థముకాకుండా
చేయుటకు, మాయ ఒక విధముగా పని చేయుచున్నది. నేను పై శ్లోకమును
దాని వివరమును చెప్పినపుడు, ఆ మాటలో కూడా అనుమానమును
రేకిత్తించునట్లు మనుషుల తలలో మాయ ప్రశ్నను ఉద్భవింపచేయుచున్నది.
ఆ ప్రశ్నతో పై శ్లోకములోని భగవంతుని మాటనే తప్పుపట్టునట్లు
చేయుచున్నది. అందువలన ఆ ప్రశ్నకు కూడా ముందే మనము జవాబును
తెలుసుకొందాము. మాయ మనుషుల తలలోనే గుణముల రూపములో
నివాసము ఏర్పరచుకొన్నది. ఆ గుణముల మధ్యలోనే జీవుడుంటున్నాడు.
కావున ప్రతి జీవుడు పుట్టుకతోనే మాయలో ఉన్నాడని చెప్పవచ్చును. అలా
జీవుడు మాయలో ఉండుట వలన, మాయ మాటలనే ఎక్కువగా వినుటకు
అలవాటుపడ్డాడు. జ్ఞానము మాటలు ప్రతి మనిషికి క్రొత్తవిగా ఉంటాయి.
అందువలన బాగా యోచన చేయువారికి మాత్రమే జ్ఞానము అర్థమగును.
మాయ, యోచన చేయకుండినా సులభముగా అర్థమగును. సులభముగా
పై శ్లోకమునకు వ్యతిరేఖముగా వచ్చు ప్రశ్న ఏమి అనగా! ఒక దేశమునకు
ప్రధానమంత్రి అయిన వ్యక్తి రోగముతో అనేక దినములుగా హాస్పిటల్
లో ఉన్నాడనుకొనుము. అతనికున్న రోగము క్యాన్సర్ అనుకొనుము. ఆ
క్యాన్సర్ చివరి దశకొచ్చి శరీరమంతా క్యాన్సర్ కణములు నిండుకొనుట
వలన అతను కొన్ని గంటలే బ్రతుకునని డాక్టర్లు కూడా నిర్ధారణకు
వచ్చారు. అటువంటి సమయములో ఒక దేవత అతని కలలో కనిపించి
నీ రోగమును నేను లేకుండా చేయుచున్నాను, నీవు బ్రతుకగలవు. తర్వాత
నీవు నా గుడికి వచ్చి అక్కడ నా గుడిని అభివృద్ధి చేయమని చెప్పింది.
తెల్లవారిన తర్వాత ఆ విషయమును ఆ వ్యక్తి మిగతావారికి కూడా చెప్పాడు.
అప్పటి నుండి అతను మూడు రోజులలో పూర్తి ఆరోగ్యమును పొందాడు.
అతనిలో ఆ రోగము పూర్తిగా పోయింది. అతను ఆ దేవతా గుడికిపోయి
అక్కడ అభివృద్ధికని కొన్ని కోట్లు ప్రభుత్వమునుండి విడుదల చేశాడు. ఆ
దేవతా గుడి కూడ అభివృద్ధి అయినది. ఈ సంఘటన అంతయూ చూచిన
తర్వాత క్యాన్సర్ను ప్రధానిమంత్రి అనుభవిస్తున్నాడు కదా! అది అతను
అనుభవించే కర్మేకదా! అలాంటపుడు అతనికి ఏ జ్ఞానము లేకున్నా, ఒక
దేవత ఆయన కలలోనికి వచ్చి నీ రోగమును లేకుండా చేస్తానని చెప్పి
అలాగే చేసింది కదా! అలాంటపుడు అతను అనుభవించే కర్మ జ్ఞానము
వలన పోలేదు కదా! ఆ దేవత ఆయన కర్మను లేకుండా చేసింది, కావున
ఆ దేవతా రూపములో మాయయే అతని కర్మను లేకుండా చేసినదని
అర్థమగుచున్నది. అలాంటపుడు జ్ఞానము మాత్రమే కర్మను లేకుండా
చేయుచున్నది. మాయ అట్లు చేయలేదు అనుటకు వీలులేదు కదా! అని
ఎవరైనా అడుగ వచ్చును. మొత్తానికి భగవద్గీతలోని భగవంతుని మాట
మీదనే అనుమానము వచ్చునట్లు గుణరూపములోనున్న మాయ చేసిందని
చెప్పవచ్చును. దానికి జవాబును చెప్పవలసిన వంతు ఇపుడు మనదే,
కావున మా జవాబు ఏమనగా!
దేవుడు భగవంతుని రూపములో చెప్పిన జ్ఞానము శాస్త్రబద్ధమైనది.
అది శాసనములతో కూడుకొన్నది. కావున భగవంతుడు చెప్పిన మాట
ప్రకారము మాయ కర్మను లేకుండా చేయలేదు. ఒక్క జ్ఞానము మాత్రమే
కర్మను నాశనము చేయగలదు. అయితే దేవతా రూపములో మాయ
కర్మను లేకుండా చేసినది కదా! అను ప్రశ్నకు సరియైన జవాబును చూస్తే
ఈ విధముగా వివరము గలదు. మాయకు కర్మను స్థాన చలనము చేయుశక్తి
కలదు, కానీ నాశనము చేయు శక్తి లేదు. ఇంకా వివరముగా చెప్పుకొంటే
కర్మను కాలములో మార్చగల బలము మాత్రము మాయకున్నది, కానీ
కర్మను లేకుండా చేయు బలము మాయకులేదు. దేవతా రూపములో
కనిపించిన మాయ, అనుభవించే వ్యక్తి యొక్క రోగమును అంతటితో
ఆపి, దానిని యాభై సంవత్సరముల తర్వాత అనుభవమునకు వచ్చునట్లు
చేసింది. అంతేకానీ ఆ కర్మను శాశ్వితముగా లేకుండా చేయలేదు. ఒక
జీవుడు ఒక కర్మను ఒకమారు సంపాదించుకొంటే అది ఆ జీవుడు
ములో చెప్పిన జ్ఞానము శాస్త్రబద్ధమైనది.
అనుభవించిన తర్వాతే పోతుంది. లేకపోతే జ్ఞానము ద్వారా అయినా
కాలిపోవాలి. అట్లు కాకుండా ఆ కర్మ పోవుటకు వేరు విధానమేలేదు.
మాయ ఎప్పటికీ కర్మను పోగొట్టలేదు. మాయ ఎప్పటికైనా కర్మను
మార్చగలదు. ఇక్కడ దేవతా రూపములో ప్రధానమంత్రి క్యాన్సర్
యాభైసంవత్సరముల తర్వాతకాలానికి మార్చినది. తర్వాత జన్మలో అతను
దానిని తిరిగి అనుభవించాల్సిన పని ఏర్పడినది. అందువలన భగవంతుని
మాట ప్రకారము కర్మను కాల్చు శక్తి ఒక్క జ్ఞానమునకేగలదని
జ్ఞాపకముంచుకోవాలి.
రాఘవ :- ఎటువంటి అనుమానమూ రాకుండా వివరముగా మాయ
విషయమును తెలియజేశారు. గతములో నేను ఒకచోట చూచిన చిన్న
మహత్యమును గురించి మీరు వివరముగా చెప్పితేగానీ మాకు అర్థము
కాదు. అందువలన అడుగుచున్నాను. ఒకవ్యక్తి ఒక ఇంటిలోని వారికి
తమ ఇంటిలోని నీరును తెమ్మని చెప్పి, వారు తెచ్చిన నీటిని మీకు తీర్థముగా
ఇస్తున్నాను అని చెప్పి ఏదో మంత్రము చెప్పినట్లు నటించి, ఆ నీటిని తన
వ్రేలితో నాలుగు వైపులా విదిలించి, మీ ఇంటిలోని దోషములన్నీ ఈ తీర్థము
వలన పోయాయి. ఈ నీటిని అందరు తీర్థముగా తీసుకోండి, ఏవైనా
మీలో దోషములుండినా వెంటనే పోతాయి అన్నాడు. అప్పుడు ఆ నీటిని
ఆ ఇంటివారందరూ తీర్థముగా తీసుకొన్నారు. ఆ నీరు అందరికి తియ్యగా
కనిపించినది. తమ ఇంటిలోని నీరు అలా ఆయన ఇచ్చిన తర్వాత అంత
తియ్యగా కనిపించడము వలన, ఆయన మంత్రములో ఏదో శక్తి ఉందని
అందరూ అనుకొన్నారు. అంతేకాక తియ్యగా మారిపోయిన ఆ నీటి
వలన తమ ఇంటిలోని దోషములూ, తమ ఒంటిలోని దోషములూ
పోయాయని అనుకొన్నారు. అలా తమ దోషములను నివారించినందుకు
పదివేలు డబ్బులు అతనికిచ్చి పంపారు. వాస్తుదోషములను లేకుండా
చేస్తానని చెప్పి ఆయనలా చేశాడు. అట్లు చేయడము వలన వాస్తుదోషము
పోతుందో లేదో తెలియదు. కానీ నీరు ప్రత్యక్షముగా తియ్యగా మారి
పోయినది. ఆ నీరు ఎలా తియ్యగా మారినది అర్థము కాలేదు. అది
మంత్రమహిమే అయ్యి ఉండవచ్చునా, ఈ విషయము మీరు తెలుప
వలసిందేనని అడుగుచున్నాను.
రాజయోగా :- అది మాయాకాదూ, మంత్రమూ కాదు. టక్కు టమారా
విద్యలలో ఒక రకమైనది. అది కేవలము హస్తలాఘవము చేత చేయునది.
ఇంకొక విచిత్రమేమంటే వాస్తుదోషము అనునది కల్పించి చెప్పునదే. వాస్తు
అనునది అవాస్తవమైనది. నీరును తీర్థముగా ఇవ్వడము వలన ఒంటిలో
దోషము పోవుననడము కూడా అసత్యమే. ఆ మాటను నమ్ముటకు నీరును
ఆ వ్యక్తియే తన హస్తలాఘవము చేత తియ్యగా మార్చాడు. కానీ ఆ నీరు
మంత్రము చేతగానీ, మాయ చేతగానీ తియ్యగా మారలేదు. ఎవరికీ
తెలియకుండా నీరును తియ్యగా మార్చడమే అతను ముఖ్యముగ చేసిన
పని. అదెలా చేశాడనగా! వారు ఇంటిలోని నిండుబిందె నీళ్ళను గ్లాస్లో
తెచ్చినపుడు అవి సాధారణ నీళ్ళే. వాస్తు దోషమును నివారిస్తానని చెప్పిన
వ్యక్తి ఏదో మంత్రము చెప్పినట్లు నటించి, తన చేతివ్రేలిని నీటిలో ముంచి
గదిలో నాలుగువైపులా నీటిని ఆ వ్రేలితో విదిలించాడు. అప్పుడు ఆ పని
చేయుటకు ముందే తన వ్రేలికి సాక్రిన్ పౌడర్ను పూసుకొనివుండును.
తన వ్రేలిని నీటిలో ముంచినపుడు వ్రేలికివున్న సాక్రిన్ పౌడర్ వలన నీరు
తియ్యగా మారిపోవుచున్నది. వ్రేలితో నీటిని నాలుగు వైపులా అందరూ
చూచునట్లు విదిలించి ఆ నీటిని తీర్థముగా ఇచ్చును. ముందే నీరు తియ్యగా
మారివుండుట వలన ఆ తీర్థము తియ్యగా కనిపించును. వ్రేలు నీటిలో
అద్దుట వలన నీరు తియ్యగా మారినదని ఎవరికీ తెలియదు. అందువలన
అది మహత్యముగా కనిపిస్తున్నది. అది “టక్కు” పని తప్ప వేరుకాదు.
ఇటువంటి హస్తలాఘవము చేత చేయు పనులను చూచి ప్రజలు మోస
పోకుండుటకు జనవిజ్ఞాన సంస్థ వారు కూడా కొన్ని ఇలాంటి పనులను
చేసి చూపించుచుందురు. ఇవి ఇతరులను మోసము చేయుటకు మభ్యపెట్టు
పనులేగానీ, మంత్రముగాదు, మాయాగాదు.
రాఘవ :- ఇది అందరికీ తెలియవలసిన విషయము. ఈ విషయములో
ఇంత మోసమున్నదని వాస్తవముగా ఎవరికీ తెలియదు. ఈ విషయము
మీరు తెల్పుట మాకు చాలా సంతోషము. ఈ విషయములను మీరు తప్ప
ఎవరూ చెప్పలేరు. ఇటువంటి విషయమే మరొకటున్నది. అది మహత్యమో,
మోసమో మీరే చెప్పాలి. అదేమనగా! ఒక మాంత్రికుడు ఒక ఇంటిలోని
ఆర్థిక బాధలను పోగొట్టుటకు ఆ ఇంటికి వచ్చి, ఒక చిన్నపాటి పూజను
నిర్వహించి, ఆ పూజవద్ద తనవద్దనున్న తావెత్తులను కుప్పగా పోసి, ఆ
ఇంటి యజమాని పేరు చెప్పి, ఈయనకున్న ఆర్థిక బాధలు పోవుటకు ఈ
కుప్పలోని తావెత్తులలో ఏ తావెత్తు పనికివచ్చునో అది బయటకు రమ్మని
చెప్పెను. అలా చెప్పిన ఒక నిమిషము తర్వాత ఆ తావెత్తు కుప్పలోనుండి
ఒక తావెత్తు కదలుచూ బయటికి వచ్చినది. ఆ ఇంటిలోని వారందరూ
చూస్తుండగనే ఆ తావెత్తు కొద్దికొద్దిగా జరుగుచు వస్తున్నది. అలా జరుగుచూ
వస్తున్న తావెత్తును ఆ మాంత్రికుడు తీసుకొని, ఇంటి యజమాని చేతికి
కట్టి “ఇది నా మంత్రబలము చేత నీకు సరిపడు తావెత్తు దానంతకదే
వచ్చినది. ఇప్పటినుండి నీకు ఏ ఆర్థిక బాధలుండవు.” అని చెప్పాడు.
తావెత్తు దానంతకదే కదలుచూ రావడమును మంత్రశక్తి కాదంటారా?
రాజయోగా :- అలా తావెత్తు కదలి రావడమును ముమ్మాటికీ మంత్రశక్తి
కాదంటాను. ఇక్కడ తావెత్తు కదలిరావడమును, అదియూ కొన్ని
తావెత్తులలో ఒకటి మాత్రము కదలిరావడమును ఎవరైనా మంత్రశక్తిగానే
అనుకొందురు. కానీ అది ఏమాత్రము మంత్రశక్తి కాదు. మంత్రములకు
సంబంధము లేకుండా ఆ పని ఎలా జరుగుచున్నదో వివరిస్తాను శ్రద్ధగా
విను. స్త్రీరత్న, పురుషరత్న అను రెండు మొక్కలు గలవు. ఆ రెండు
మొక్కల మూలికలను ఒకే దినము, ఒకే నక్షత్రములో మాంత్రికులు తీసి
పెట్టుకొందురు. పురుష రత్న మూలికను ఒక తావెత్తులో ఉంచి, స్త్రీరత్న
మూలికను తన ప్రక్క జేబులో మాంత్రికుడు ఉంచుకొనును. పురుషరత్న
మూలికనుంచిన తావెత్తును, మరికొన్ని ఖాళీ తావెత్తులతో కలిపి ఒక సంచిలో
ఉంచుకొని ఉండును. ఆ మూలికలు రెండు ఒకదానికొకటి మూరెడు
దూరములో నున్నపుడు వాటిలో ఏ చలనమూ ఉండదు. ఎప్పుడైనా స్త్రీరత్న
మూలికకు పురుషరత్న మూలికను గజము లేక నాలుగు అడుగుల
దూరములో ఉంచితే, ఒక నిమిషము తర్వాత స్త్రీరత్న మూలికయొక్క
ఆకర్షణకు పురుష రత్న మూలిక కదలి స్త్రీరత్న వైపు వచ్చును. ఈ
విధానమును తెలిసివారు కొందరు మాంత్రికులవలె నటిస్తూ తనవద్ద
స్త్రీరత్న మూలికను ఉంచుకొని, ముందే ఖాళీ తావెత్తులలో కలిపివుంచుకొనిన
పురుషరత్న మూలిక గల తావెత్తును ఒక సంచిలో ఉంచుకొని, ఏ ఇంటిలో
ఆర్థిక బాధలను నివారిస్తానని మాట్లాడుకొన్నాడో, ఆ ఇంటికి మాంత్రికుడు
పోయి అక్కడ మంత్రించినట్లు నటించి, తనవద్ద సంచిలోవున్న తావెత్తులను
క్రింద కుప్పగా పోసి ఈ ఇంటి యజమాని ఆర్థికబాధలు పోవుటకు
సరిపోవునది ఇందులో ఏ తావెత్తు ఉన్నదో అది బయటి రావలెను” అని
మాంత్రికుడు చెప్పును. మాంత్రికుని ప్రక్కజేబులోనున్న స్త్రీరత్నకు గజము
దూరములో తావెత్తుల కుప్ప ఉండుట వలన, స్త్రీరత్న ఆకర్షణ శక్తికి
తావెత్తుల కుప్పలో పురుషరత్న ఉన్న తావెత్తు నిమిషము తర్వాత కదలి
స్త్రీరత్నవైపుకు రావడము జరుగును. అలా కుప్పనుండి ఒక అడుగు దూరము
కదలివచ్చిన పురుషరత్న తావెత్తును మాంత్రికుడు తీసుకొని, ఆ
ఇంటియజమాని చేతికి కట్టుచున్నాడు. ఇక్కడ జరిగినది మూలికల
ప్రభావమేగానీ, మంత్రముల ప్రభావము కాదు. స్త్రీరత్న మూలిక, పురుషరత్న
మూలికను ఆకర్షించుననీ, స్త్రీరత్నకు పురుషరత్న మూడు లేక నాలుగు
అడుగుల దూరములోనున్నపుడే పురుషరత్న మీద స్త్రీరత్న యొక్క ఆకర్షణ
అయస్కాంత శక్తివలె పనిచేసి తనవైపు కదలునట్లు చేయుచున్నదనీ, మూరెడు
లోపలగానీ నాలుగు అడుగుల వెలుపలగానీ ఉన్న పురుషరత్నను స్త్రీరత్న
ఆకర్షించదనీ, స్త్రీరత్న కదలని మూలికయనీ, పురుషరత్న కదలెడు
మూలికయనీ చాలామందికి తెలియదు. తెలియనపుడు తావెత్తు కదలి
రావడమును ఎవరైనా మంత్రశక్తిగానే తలచుదురు.
రాఘవ :- స్వామీ! మీరు ఇంతకు ముందు చెప్పిన టక్కు టమారా,
ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ విద్యలలో ఈ మూలికల పని
ఏ విద్యకు సంబంధించినది?
రాజయోగా :- ఒక రకముగా చెప్పితే మూలికలు అన్ని విద్యలలోను పని
చేయుచున్నవి. పాము, తేలు విషములను నివారింపజేయుటలోనూ, అనేక
వస్తువులను, జంతువులను సహితము చూపుటలోనూ, మనిషికి వినోదమును
రక్షణను ఇచ్చుటలోనూ పేరుగాంచిన ఇంద్రజాల మహేంద్రజాల విద్యల
యందు మూలికలు ఎక్కువగా ఉపయోగపడుచున్నవి. అట్లే అనేక
శబ్దములను, మాటలను వినిపించుటలోనూ, మారణ హెూమము చేయు
అస్త్రములు ఉపయోగించుటలోనూ, పేరుగాంచిన గజకర్ణ, గోకర్ణ విద్యల
యందు తక్కువగానూ మూలికలు ఉపయోగపడుచున్నవని చెప్పవచ్చును.
రాఘవ :- స్వామీ! మీరు చెప్పిన టక్కుటమార, ఇంద్రజాలా మహేంద్రజాల,
గజకర్ణ, గోకర్ణ విద్యలను నేర్చుకున్న మనిషి ప్రపంచములో అన్నిటిని చేయు
సామర్థ్యములుగల మనిషిగ తయారై తానే గొప్పవ్యక్తిగా కనిపించును.
మనిషిని గొప్పగా చూపు ఈ విద్యలకంటే ఇంకా ఏదైన గొప్ప విద్య కలదా?
పెంచును.
రాజయోగా :- ఈ విద్యలన్నీ ప్రపంచములో గొప్పవే, ఈ విద్యలు ఏ
మనిషినైనా గొప్పశక్తివంతునిగా, పూజ్యునిగా చూపించగలవు. వీటిని
కేవలము ప్రపంచ విద్యలనీ లేక ప్రకృతి విద్యలనీ చెప్పవచ్చును. ప్రకృతిని
సృష్ఠించినవాడు పరమాత్మ ఒకడున్నాడు. పరమాత్మ ప్రకృతికి పెద్ద
అయినందున పరమాత్మ జ్ఞానమును తెలుపు విద్య ప్రకృతి విద్యలకంటే
పెద్దదని చెప్పవచ్చును. దైవజ్ఞానమును తెల్పు విద్య అన్నిటికంటే పెద్దదీ
మరియు దానిని మించినది లేదు కాబట్టి దైవజ్ఞాన విద్యను పెద్ద విద్య
అంటున్నాము. దానినే బ్రహ్మవిద్య అనికూడా అంటున్నాము. బ్రహ్మ
అనగా పెద్ద అని అర్ధము. అన్నిటికంటే గొప్పదని తెలుయుటకు
బ్రహ్మవిద్యను ఇతర విద్యలతో పోల్చినపుడు వాటిని ఇదేమి బ్రహ్మవిద్యనా
అని అనుట జరుగుచుచున్నది. ఆ మాటతో ప్రపంచ విద్యలలో ఏదీ
బ్రహ్మవిద్య (పెద్ద విద్య) కాదని తెలియుచున్నది.
రాఘవ :- స్వామీ! మీరు ఎంతో పెద్ద మేధావులు. ప్రపంచములో పేరు
ప్రఖ్యాతులు తెచ్చు అన్ని విద్యలను వివరముగా తెల్పి, బ్రహ్మవిద్యయే అన్నిటి
కంటే గొప్ప విద్య అని సులభముగా అర్థమగునట్లు చేశారు. మీ వలన
ఈ విషయములను తెలుసుకోలేకపోయివుంటే, దైవత్వమును చేర్చలేని
ప్రపంచ విద్యలనే నేను కూడా గొప్పగా తలచి, వాటి మార్గములోనే
ప్రయాణించు వాడిని. ఇప్పుడు బ్రహ్మవిద్యయే గొప్పదని మీచే తెలిసింది.
కాబట్టి
నేను బ్రహ్మవిద్యకే ప్రాధాన్యతను ఇస్తాను. బ్రహ్మవిద్యా
ముసుగులోనున్న ఇతర విద్యలు అన్నియు ప్రపంచ విద్యలేనని, వాటి
రహస్యములను ప్రజలకు తెల్పి వారిని కూడ దైవమార్గములో నడుచునట్లు
చేస్తాను. నాకు ఆ బలమునిస్తూ దీవించండి
తమ నాయకుడు తాటిమాను మునెప్ప చెప్పినట్లు జాన్ తన కుక్క
జానీతో సహా బయలుదేరి, తమ మనుషులైన వెంకు, నూకా కొరకు వారు
పోయిన రైలులో ప్రయాణము చేయుచున్నాడు. రైలు సూట్కేస్ పడిన
స్థలమునకు సరిగాపోవు సమయములో జాన్ ప్రక్కనున్న కుక్క మొరగను
మొదలుపెట్టింది. జాన్ దాని మొరుగుడుకు అర్థమును గ్రహించి ప్రక్క
స్టేషన్లో దిగాడు. అక్కడినుండి కుక్క ముందు పోతూవుంటే జాన్ దాని
వెనుక పోసాగాడు. కుక్క ఒక గ్రామము వైపు పరుగిడసాగింది. దానివెంటే
జాన్ ఆ గ్రామమును చేరాడు. ఆ గ్రామము మధ్యలో పెద్ద జన
సముహమును జాన్ చూచాడు. ఆ జన సమూహమేమిటో చూడాలని
తానుకూడా అక్కడికి పోయాడు. ముఖమునకు కొద్ది గాయాలైన నూకా
కనిపించాడు. జాన్ మాత్రము నూకాకు కనిపించకుండా వుంటూ, తన
కుక్క కూడా కనిపించనట్లు దానికి సైగ చేసి, అక్కడ ఏమి జరుగుచున్నదో
చూచుచుండెను.
ఆ దినము నాగుల చవితి అయిన దానివలన, ఊరి మధ్యలో
నాగుల కట్టవద్ద చాలామంది స్త్రీలు నాగులపూజలో పాల్గొన్నారు. కొందరు
పురుషులు వారికి సహాయముగా అక్కడే ఉన్నారు. పూజార్లు పూజా
విధానములో లగ్నమైవున్నారు. ఆటవికులు అక్కడి భక్తులనూ, పూజార్లను
ప్రక్కకు పొమ్మని బ్రతిమలాడుచున్నారు. పూజార్లు ఆటవికుల మీద
కోపగించుకొనుచు మీరు ఎవరు మమ్ములను ప్రక్కకు పొమ్మనే దానికి,
ముందు మీరు ఇక్కడి నుండి పొమ్మని గద్దించారు. పాముకాటు వలన
ఒక మనిషి ప్రమాదములో ఉన్నాడనీ, అతనికి ఇక్కడే చికిత్స చేయాలనీ,
ఇక వేరు విధానములేదనీ, కొద్దిగా ఆలస్యము జరిగినా ఆ మనిషి
చనిపోవుననీ, ఆటవికులు పూజార్లకు ఎంతగా చెప్పినా వారు వినకపోయారు.
అప్పుడు ఆటవికులతో పాటు వెంకును మోసుకొని వచ్చిన గ్రామస్థులు
జోక్యము చేసుకొని, అక్కడి భక్తులను పూజార్లను ప్రక్కకు తొలగించారు.
వెంటనే ఆటవికులలో ఒకడు వేపచెట్టు ఎక్కి వేపకొమ్మను త్రుంచుకొని
దిగివచ్చి, వేపాకును పాముకాటుకు గురియైన వెంకు చేత తినిపించాడు.
తర్వాత వేపాకు చేదుగా ఉందా లేదా అని అడిగాడు. వేపాకును నమిలిన
వెంకు వేపాకు చేదుగా లేదు, చప్పగా ఉందని చెప్పాడు. ఆ మాటతో
ఆటవికులు పాము విషము వెంకు శరీరమంతా వ్యాపించి తలకు కూడా
ఎక్కినదని గ్రహించారు. వెంటనే రావి చెట్టును ఎక్కి రావికొమ్మను త్రుంచి
క్రిందికి తెచ్చారు. కొమ్మను త్రుంచిన భాగమును పైకి పట్టుకొన్నారు.
అప్పుడు యోగ రావి కొమ్మలనుండి రెండు ఆకులను కాడలతో సహా
పెరికి అక్కడే పడుకోబెట్టిన వెంకు యొక్క రెండు చెవులలోనికి రావి ఆకుల
కాడలను పెట్టాడు. ఆకుల కాడలు పూర్తిగా కర్ణభేరికి తగల కుండా, మరీ
బయటికి లేకుండా లోపల గుబిలికి తగులునట్లుంచాడు. ఆ విధముగా
పెట్టిన కాడలను రెండు లేక మూడు నిమిషములసేపు అట్లే ఉంచాడు.
వెంకు చెవులలో ఏదో బాధ కనిపించసాగింది. వెంకు విడిపించుకొనే
దానికి మొదలు పెట్టగా మిగత ఆటవికులు వెంకును కదలకుండా బలముగా
పట్టుకున్నారు. అట్లు పెట్టిన ఆకు కాడలను మూడు నిమిషములు తర్వాత
తీసి, మరియొక జత ఆకు కాడలను ముందు పెట్టినట్లే చెవులలో పెట్టి
మూడు నిమిషముల తర్వాత తీసివేశాడు. అట్లు మూడు జతల ఆకులను
పెట్టిన తర్వాత వెంకూ చేత వేపాకును తినిపించి రుచి ఎట్లున్నదని అడిగాడు.
కొద్దిగ చేదు కనిపిస్తున్నట్లు వెంకు చెప్పాడు. కొద్దిగ విషము ఇంకా వెంకు
శరీరములో ఉన్నదని గ్రహించిన యోగ మరియొక జత ఆకులను వెంకు
చెవులలో పెట్టి మూడు నిమిషముల తర్వాత తీసివేసి, తర్వాత వేపాకును
తినిపించి రుచిని అడుగగా వేపాకు పూర్తి చేదుగా ఉన్నట్లు వెంకు చెప్పాడు.
అప్పుడు అతని శరీరములో పాము విషము పూర్తి పోయినదని గ్రహించిన
యోగ ఇక అతనికి ప్రాణభయము లేదని చెప్పాడు. పాము విషము
పూర్తిగా ఆకులలోనికి వచ్చినదనీ, ఆ ఆకులను పశువులు తింటే వాటికి
విషము ఎక్కుతుందని ఆ ఆకులను పూడ్చిపెట్టమనీ, యోగా చెప్పాడు.
ఇదంతయూ వింతగా చూచిన అక్కడున్న గ్రామస్థులూ, భక్తులూ,
పూజార్లు ఆటవికులు చేసిన వైద్యమును గురించి అడిగారు. అప్పుడు
యోగా ఈ విధముగా చెప్పను మొదలుపెట్టాడు. "భూమిమీద ప్రతి ఆకు
ఒక ఔషధమే అను మాటను ఈనాటి ప్రజలు పూర్తిగా మరచిపోయారు.
పూర్వకాలమున పెద్దలు ఏ ఉద్దేశముతో ఒక పనిని సూచించారో ఆ
ఉద్దేశము ఈనాడు మనకు తెలియకుండా పోయినది. పూర్వ కాలములో
రోగ నివారణకు వైద్యులు పూర్తిగా ప్రకృతినుండి లభించు మూలికల మీద
ఆధారపడెడివారు. అమృతమయుడగు చంద్రుని కిరణముల ద్వారా
భూమిమీద చెట్లన్నియూ ఔషధ గుణము కల్గియున్నవనీ, తెలిసిన పెద్దలు
అనేక విధములుగా చెట్లను ఔషదములుగా ఉపయోగించి రోగ నిర్మూలన
చేసెడివారు. ఒక చెట్టు ఆకు ఒక రోగమునకు ఔషధమని గ్రహించిన
వైద్యులు పూర్వముండెడివారు. వారి వైద్య విధానమును వారి వద్దనున్న
శిష్యులకు నేర్పెడివారు. కొంతకాలమునకు వైద్యులలో ఒక దుష్ట
సాంప్రదాయము ఏర్పడినది. తమవద్ద వైద్యమును అభ్యసించు శిష్యులకు
తమకు తెలిసినన్ని వైద్య క్రియలను బోధించక ఏదో ఒక క్రియను మాత్రము
శిష్యులకు చెప్పకుండా తమవద్దనే దాచుకొనెడివారు.
ఉదాహరణకు ఒక వైద్య గురువుకు నూరు (100) రోగములకు
నూరు ఔషధములు తెలిసివుంటే, తన శిష్యులకు 99 రోగములకు మాత్రమే
వైద్యమును నేర్పించెడివారు. ఒక వైద్యమును మాత్రము తమవద్దనే దాచు
కొనెడివారు. తమవద్దయున్న విద్యనంతయూ చెప్పితే శిష్యులు తమతో
సమానులగుదురనీ, అలా కాకుండా తమకంటే తక్కువ వారుగా ఉండవలెనని
ఆనాటి వైద్య గురువులు అలా చేసెడివారు. అలా చెప్పక పోవడము
వలన ఆ ఒక్క విద్యకొరకు శిష్యులు గురువుకు వినమ్రులుగా ఉందురనీ,
అన్ని విద్యలు తెలిస్తే గురువును మించిన శిష్యులై గురువును
గౌరవించకుండా, గురువుమాట వినకుండా పోవుదురని ఆనాటి గురువుల
అభిప్రాయము. గురువు యొక్క అవసానదశ వరకు ఎవరైతే గురువును
గౌరవిస్తువుంటారో, ఆ శిష్యులకే తమవద్దనున్న ఒక్క వైద్య రహస్యమును
చెప్పి పోయెడివారు. ఒకవేళ ఆ గురువు మధ్యలోనే అకాలమరణమును
పొందితే, అతనివద్దనున్న రహస్యము శిష్యులకు తెలియకుండా అతనితోనే
అంతమై పోయేది. అట్లు చనిపోయిన గురువులవలన కొన్ని వైద్య
రహస్యములు కాలగర్భములో కలిసి పోయాయి. ఆనాటి వైద్య గురువులు
అతి ముఖ్యమైన వైద్య విధానమును ఒకదానిని తమవద్ద రహస్యముగా ఉ
ంచుకోవడము వలన వారి అకస్మాత్ మరణముతో ముఖ్యమైన వైద్య
రహస్యములే తెలియకుండా పోయెడివి. ఈ విధముగా కాలగర్భములో
ముఖ్యమైన వైద్య విధానములు నశించి పోవడమును గమనించిన కొందరు
పెద్దలు యోచించి అన్నిటికంటే ముఖ్యమైనది, వైద్యమునకు కాలవ్యవధి
లేనిది, గంటలోపే ప్రాణాపాయ స్థితికి తీసుకొని పోవునది, అయిన
పాముకాటు వైద్యము రహస్యముగా మారిపోకుండా ఉండుటకు తగిన
విధానమును అనుసరించాలనుకొన్నారు. వైద్యుల స్వార్థపూరిత విధానము
నుండి పామువైద్యమును మినహాయించి, పాముకాటుకు వైద్యము మరుగున
పడిపోకుండా, ప్రతి మనిషికీ తెలియునట్లు చేయాలనుకొన్నారు. అట్లు
తెలియుటకు ఆ రోజు ఆ వైద్యమును అందరికీ చెప్పినప్పటికీ కొంత
కాలమునకు తిరిగి మరుగునపడు అవకాశము కలదు. కావున శాశ్వితముగా
ఆ వైద్యము మరుగున పడిపోకుండా ఉండుటకు అందరికీ ప్రత్యక్షముగా
ఎల్లకాలము తెలియునట్లు దేశమంతా ప్రతి ఊరులోనూ పాముకాటు
వైద్యమునకు సంబంధించిన గుర్తునూ మరియూ ఆ గుర్తుదగ్గరే
పాముకాటుకు ఔషధములనూ ఉండునట్లు చేయాలనుకొన్నారు.
ప్రక్రియలో భాగముగా మొదట ప్రతి ఊరులోనూ నాగుపాముబొమ్మలను
ఒక కట్టమీద ఉంచారు. ఈ పాములు కరిస్తే దానికి వైద్యముగా ఈ
మూలికలను వాడమని, రెండవ ప్రక్రియగా ఆ ప్రతిమల వెనుక వేపచెట్టు,
రావిచెట్టు మొక్కలను పెంచారు. ఈ పాములు కరిస్తే ఈ మొక్కలే
పాముల విషమును హరించునని తెలిపారు. అలా ఆ రోజు పెద్దలు
యోచించి ప్రతిష్ఠించినవే ఈనాటి నాగులకట్టలు. ప్రతి ఊరులోనూ
నాగులకట్టా, ఆ కట్టమీద వేప రావి చెట్లను ఆనవాయితీగా పెట్టవలెనని
ఆనాడు పెద్దలు సూచించారు. అంతేకాక పాము కరిచినపుడు ఆ చెట్లను
ఎట్లు ఉపయోగించాలో కూడా తెలిపారు.
పూర్వము పెద్దలు నిర్మించిన నాగులకట్ట వలన అందరికీ పాము
కాటు వైద్యము తెలిసిపోయింది. పాముకాటు తిన్న ప్రతి ఒక్కరూ వేప
రావి చెట్ల ద్వారా వైద్యమును సకాలములో పొందుచుండిరి. పాముకాటు
వైద్యములో రావి ఆకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నవని ఆనాడు అందరికీ
తెలిసిపోయింది. అంతేకాక ప్రతి రావిఆకూ పాము పడగ ఆకారమును
పోలియున్నట్లు గ్రహించారు. ఏ పాము కరిచినా పాముపడగ ఆకారములో
నున్న రావిఆకు ఆ విషమును పీల్చుకొనునని చెప్పుకొనెడి వారు. ఈ
ఆనాటి
విధముగా పాములవైద్యము ప్రతి మనిషికీ తెలిసిపోయినప్పటికీ కాల
క్రమమున అజ్ఞానము పెరిగిపోయి, తన శరీరములోని దైవత్వమును
గుర్తించలేని మానవుడు చివరకు చెట్టుకూ, గుట్టకూ మొక్కడము మొదలు
పెట్టాడు. మానవుని అజ్ఞాన ప్రవాహములో ఆనాడు తెలిసిన పాము
వైద్యవిధానము చివరకు పూజావిధానముగా మారిపోయినది.
పెద్దల ఉద్దేశ్యము అడుగంటి పోయి ఏదైతే రహస్యము కాకూడదనుకొన్నారో,
అది ఈనాడు మనందరికి తెలియని రహస్యమైనది. ఈ వైద్య విధానమేమిటో
ఇప్పుడు మీకు తెలియని దానివలన, మేము చావుబ్రతుకుల మధ్యలోనున్న
మనిషిని తెచ్చి కొద్దిగ ప్రక్కకు పొమ్మనినా, ఈ మనిషికి వైద్యము చేయాలని
బ్రతిమలాడినా ఎవరూ వినిపించుకోక పోయారు. మీరు భక్తిగా పూజ
చేయుచుండగా, మేము దానిని భంగపరుచుటకు వచ్చినట్లు తలచారు.
తర్వాత ఎలాగో చివరకు వైద్యము చేసి ఇతనిని బ్రతికించాము. ఇప్పుడు
మీ అందరి ముందర రహస్యమైన పోయిన వైద్యమును చేసి బయట
పెట్టాము. ఇప్పుడు ప్రత్యక్షముగ చూచిన మీరు నేటినుండైనా, ఈ ఔషధ
వృక్షములు పాముకు వ్యతిరేఖమైనవని తలచి, వీటిని ఔషధములుగా మీరు
ఉపయోగించుకోవాలని కోరుచున్నాము.” అని యోగ ఏకధాటిగా చెప్పిన
మాటలను విని అక్కడున్న వారు ఒకరి ముఖము ఒకరు చూచుకొన్నారు.
అప్పుడు వారిలో ఒక పూజారి ఇలా అన్నాడు.
పూజారి :- అన్ని విషయములను తెలిసిన పెద్దలూ, ఎందరో మేధావులూ
మరియు ఎందరో నిష్టాగరిష్టులూ ఎంతో కాలమునుండి నాగప్రతిమలను
పూజిస్తున్నారు. వారికి తెలియని రహస్యముంటుందా? మీరు చెప్పినట్లు
వారు ఎక్కడా చెప్పలేదు. వారికంటే మీరు తెలిసినవారా? (అని ఆటవికులను
ఆయన విమర్శించగా? అక్కడి వారందరూ ఆయన మాటనే బలపరిచారు
అలా వారి మాటలను విన్న యోగా వెంటనే ఇలా అన్నాడు.)
యోగా :- ఇక్కడ ప్రస్థుతము పూజిస్తున్నవారూ మరియు పూజలు చేయకున్న
వారూ ఉండవచ్చును. పూర్వమునుండి ఈ పూజలను ప్రోత్సహించిన
వారూ ఉండవచ్చును. వారు ఏమి చెప్పినా ఆ మాటలనే పెద్దగ తలచి
గ్రుడ్డిగా నమ్మువారూ ఉండవచ్చును. అంతమాత్రమున వారు సర్వము
తెలిసినవారనుకోవడము పొరపాటు. మీరు నాగులను పూజిస్తున్నారు
కదా! అయితే ధైర్యముగా నాగుపాము చెంతకు పోగలరా? మమ్ములను
పూజిస్తు న్నారని అది మిమ్ములను కాటువేయక వదలునా? వారు చెప్పింది
అమలుకు రాని ఫలితము. మేము ఇంతవరకు ఏమి చెప్పామో అది
అమలుకు వచ్చు ఫలితము. వారు చెప్పినది భక్తిగా వీటిని పూజించమని,
మేము చెప్పునది తెలివిగా వీటిని వైద్యముగా వాడుకొమ్మని. మా మాట
నిజమనుటకు నిదర్శనము మీరు ఇప్పుడు చూచారు కదా!
పూజరి :- మీరు చెప్పినదీ, చేసి చూపించినదీ నిజమే. కానీ దీనివలన
భక్తిభావములు సన్నగిల్లిపోయి, దేవుడే లేడను నాస్తికత్వమునకు దారి
ఏర్పడగలదేమో?
యోగా :- మేము దేవుడు లేడని చెప్పలేదు. అసలైన దేవున్ని మరచి,
కల్పిత భక్తిలోపడి దేవునికి దూరమవుతున్నారని చెప్పుచున్నాము. మనలో
భక్తి ఉంది, అయితే అది దేవుని వైపు కాకుండ మరియొక వైపు వృథాగా
ఆచరింపబడుచున్నదనీ చెప్పుచున్నాము.
పూజారి :- మేము చేయునది వృథా భక్తియా! మా భక్తి సరియైనది కాదా!
యోగా :- అవును, నా మాటలో సత్యమును గ్రహించండి. నిజము
నిష్టూరముగా, కఠినముగా ఉండును. అందువలన కొద్దిగా యోచించి
అర్థము చేసుకోండి. కదలికలేని రాతిప్రతిమల పాములను భక్తిగా పూజిస్తున్న
మనము
మనము, ప్రాణమున్న పాము కనిపించిన వెంటనే చితకబాది దాని ప్రాణము
తీస్తున్నాము. అటువంటపుడు పాముల మీదున్న మన భక్తి నిజమైనదా?
రాతి బసవన్నకు మ్రొక్కువారు శక్తికి మించిన బరువును బ్రతికిన బసవన్నకు
పెట్టి, లాగలేక నిదానముగా అడుగులువేస్తే కట్టెలతో కొట్టి మరీ
లాగిస్తున్నారు. బ్రతికిన బసవన్ననుకొట్టి రాతి బసవన్నకు మ్రొక్కడమా
భక్తి. కుక్కను కాటమయ్యగా, పందిని వరాహ అవతారముగా పూజించు
వాటిని ఎంతమటుకు గౌరవిస్తున్నాము? మనము పూజించే
చెట్లను పొయ్యిలో పెట్టుచున్నాము. ఆరాధించే దేవతలను తిట్టుచున్నాము.
పైగా మాది భక్తికాదా? అని అడుగుచున్నారు. మీరే యోచించండి మన
భక్తి ఎలాంటిదో. మేము దైవములేడను నాస్తికత్వమును చెప్పలేదు.
దేవుడున్నా డనీ, ఆయన మన శరీరములోనే ఉన్నాడనీ, ఆయనను
తెలుసుకొనుటకు జ్ఞానము అవసరమనీ చెప్పుచున్నాము. జ్ఞానమును
తెలిసినవారే దైవమును తెలియగలరు. జ్ఞానము తెలియనపుడు మనభక్తి
దైవమువైపు కాకుండా చెట్టువైపు గుట్టలవైపు మరలిపోవును. నిజమైన
దైవమును తెల్పుటకు మన పెద్దలు ఎన్నో జ్ఞాన సూచనలు గల్గిన
దేవాలయములను నిర్మించి చూపించారు. కానీ నేడు వాటి అర్థమును
వదలివేసి, గ్రుడ్డిగా పూజలు చేయుచూ, కోర్కెలను కోరుటకు అనువుగా
మార్చుకొన్నారు. ఈ చెట్లనుండి వైద్యమును గ్రహించలేనట్లు
దేవాలయములనుండి దైవత్వమును గ్రహించ లేని స్థితిలోవున్నాము.
ప్రపంచమునకంతటికీ ఒకే దేవుడని తెల్పు దేవాలయ రహస్యములను
తెలుసుకోలేక వాటిలో కూడా ఇవి వైష్ణవ దేవాలయములు, ఇవి శైవ
దేవాలయములని పేర్లు పెట్టి తెగలుగా ఏర్పరుచుకొన్నాము. ఇది మన
భాషలో భక్తి అనుకొనినా దేవుని భావములో భక్తికాదు.
అడుగడుగునా, అణువణువునా నిండి కనిపించని శక్తిగాయున్న
దేవుడు ఇప్పుడున్న మన భక్తికి తెలియబడడు. మన శరీరములోనే ఉండి
మనకు చైతన్యమునిచ్చు దైవమును కనుగొనుటకు ఈనాడున్న భక్తి
మానవునికి ఉపయోగపడదు. (అలా ఉద్వేగభరితముగా యోగా చెప్పిన
మాటలను విన్న జనసముహములో కొద్దిగా మార్పువచ్చినది. దేవుడే లేడని
నాస్తికునిగా తిరుగుచున్న ఒక గ్రామస్థుడు గట్టిగా చప్పట్లుకొట్టి ఈ విధముగా
అన్నాడు. )
నాస్తికుడు :- శభాష్, ఈ విధముగా దేవుడున్నాడంటే నేను కూడా ఒప్పు
కొంటాను. ఈ విధముగా కాకుండా మూఢనమ్మకముతో గ్రుడ్డిగా చెప్పే
మాటలనూ, చేసే భక్తిని నేను ఒప్పుకోను. తిరునాళ్ళలో రథచక్రాలకు
కొబ్బరికాయలు కొట్టవలెనని చివరికి దానిక్రిందనే పడి చనిపోవడమూ,
యాత్రకు పోయినవారు దోపిడీలకు గురికావడమునూ చూచి దేవుడుంటే
తన భక్తులనే రక్షించలేదే, అలాంటివాడు దేవుడెలా అవుతాడని అనుకొను
చుంటిని. ఈనాడు ఈయన చెప్పు మాటలతో ఆ దేవుళ్ళు నిజ దేవుళ్ళు
కాదను సత్యమును విన్నాను. నిజదేవుడొకడున్నాడను విషయము ఈనాడు
నాకర్థమైనది. నేను కూడా ఈయన చెప్పు పద్ధతి ప్రకారము దేవుడున్నాడని
ఒప్పుకొంటున్నాను. (అలా ఒక నాస్తికుడు మాట్లాడడముతో ఆ ఊరి పెద్ద
కూడా ఇలా అన్నాడు.)
ఊరి పెద్ద :- ఇదంతా చూచిన తర్వాత, విన్న తర్వాత మేము ఏదో పొర
పడినామనీ, మాకు తెలియని రహస్యములు ఎన్నోవున్నవనీ అర్థమగుచున్నది.
మీరు మాకు తెలియని అమూల్యమైన పామువైద్యమును తెలిపారు. ఇంత
వరకు మాకు తెలియని దైవజ్ఞానమును కూడా కొన్ని రోజులు మీరు ఇక్కడే
వుండి తెలుపమని అడుగుచున్నాము. మీరు మాతో కొంతకాలముండి
నిజమైన భక్తినీ, జ్ఞానమునూ తెల్పి దేవుని మార్గమువైపు మరల్చగలరని
ఆశిస్తున్నాము.
(ఈ విధముగా ఆ గ్రామస్థులు మార్పుచెందినవారై అక్కడున్న
నాస్తికునితో సహా అందరూ ఆటవికులను కొన్ని రోజులు అక్కడే ఉ
ండమనగా! దానికి ఆటవికులు ఇప్పుడు కాదు. మేము ఇప్పుడు ఒక
పని నిమిత్తము వచ్చామనీ, తర్వాత ఎప్పుడైనా వీలుంటే వస్తామని
చెప్పుచుండిరి. ఇట్లు గ్రామస్థులు, ఆటవికులు మాట్లాడుకొనుచుండగా
జాన్ నూకాను కలుసుకొని జరిగిన విషయమంతా తెలుసుకొన్నాడు. తమ
నాయకుడు అదే పనిగా పంపితే వచ్చానని చెప్పిన జాన్ తాము తమ
నాయకునివద్దకు వెంటనే పోవాలని చెప్పాడు. అప్పుడు గ్రామస్థులు మాటల్లో
ఉండగా, వారు గమనించకుండా తమతోపాటు వెంకూను పిలుచుకొని
అక్కడినుండి తప్పించుకొని పోయారు. తర్వాత తమ నాయకుని వద్దకు
చేరి జరిగిన విషయమంతా చెప్పారు. పామునూ, అందులోని వజ్రములనూ
పోగొట్టు కొన్నందుకు నాయకుడు మునెప్ప వెంకూ, నూకా మీద
కోపగించుకొని చేయునది లేక ఇలా అన్నాడు. )
మునెప్ప :- పోయిన వజ్రములనుఎలా తెచ్చి ఇవ్వగలము? వజ్రములను
ఇవ్వకపోతే వాటి ఖరీదు మొత్తము డబ్బు ఇవ్వవలసి ఉండును. అంత
డబ్బు బ్యాంకులు దోపిడీ చేసినా సమకూర్చలేము. మిమ్ములను నమ్ము
కొన్నందుకు నన్ను నట్టేట ముంచారు. ఏమి చేయాలో అర్థము కాలేదు.
ఈ విషయమును ఉన్నదున్నట్లు వారికి చెప్పుకోవడము మంచిది. చివరకు
వారు ఏమంటారో చూడాలి.
వెంకు :- ఈ విషయము ఎవరికి చెప్పాలో చెప్పండి. మేము పోయి
వారికి జరిగినది జరిగినట్లు తెలియబరుస్తాము.
మునెప్ప :- ఇది చాలా రహస్యమైన వ్యవహారము. గొప్ప స్వామీజీగా
పేరుగాంచిన తపస్విబాబా అను స్వామికి ఈ విషయము తెలియాలి.
ఆయనకే మనము వజ్రాలను అందివ్వవలసివున్నది. వజ్రాలు పోయాయని
ఆయనకు తెలియజేసి తర్వాత ఆయన ఏమంటారో ఆ విషయమును
తెలుసుకొని రావాలి.
వెంకు :- జరిగిన దానికి బాధపడితే ఎలా అన్నా! మేము ఇప్పుడే బయలు
దేరిపోయి ఉన్నదున్నట్లు చెప్పి, జరిగిన దానికి మేము బాధ్యులముకాదని
చెప్పుతాము. మేము ఎక్కడికి పోయి చెప్పిరావాలో నీవు ఆ అడ్రస్ చెప్పు.
(అందులకు మునెప్ప విసుగ్గా ఇలా అన్నాడు)
మునెప్ప :- మీరు తొందరపడి ముందువెనుక ఆలోచించకుండా పనిచేసి
కష్టాలు తెచ్చుకొంటారు. అడ్రస్ తెలుసుకొని పోయినంతమాత్రమున అంత
సులభముగా నేను చెప్పిన పని నెరవేరదు. తపస్వి బాబా ఆశ్రమములో
నిత్యము వేయిమంది భక్తులుంటారు. తపస్వి బాబాగారితో కలిసి మాట్లాడ
డానికి ఎవరికీ వీలుండదు. ఆయన ఎవరి ప్రవేశమూ లేని రహస్య
మందిరములో ఉంటాడు. ఎవరూ ఆ మందిరములోనికి పోరు. ఆయన
కొన్ని సమయములలో మాత్రమే బయటికి వస్తాడు. అప్పుడు కూడా
అక్కడ చేరిన భక్తులకు దర్శనమివ్వడానికే వస్తాడు. తిరిగి ఆయన తన
మందిరములోనికి వెళ్ళిపోతాడు. కావున వజ్రాల విషయమును అంత
సులభముగా మీరు ఆయనకు చెప్పలేరు.
వెంకు :- మరి ఆయనకు మేము ఎలా ఈ విషయమును అందివ్వగలము.
దానికి నీవే ఉపాయమును చెప్పు.
మునెప్ప :- ఇలాంటి రహస్య విషయములను తెలియబరిచే దానికి ఇతరుల
కెవ్వరికీ అంతుచిక్కని సులభమైన విధానమొకటి ఉన్నది. అది ఏమంటే!
తపస్వి బాబాగారు భక్తులకు దర్శనమివ్వడానికి బయటికి వచ్చినపుడు
భక్తులందరూ నిశ్శబ్దముగా వరుసలు తీరి కూర్చొనివుందురు. కొందరు
భక్తులు వారివారి కష్టములనూ, కోర్కెలను ఉత్తరములో వ్రాసుకొని బాబాగారు
వారికి దగ్గరగా పోయినపుడు తమ ఉత్తరములను బాబాగారికి అందిస్తూ
వుంటారు. అటువంటి సమయములోనే మీరు ఈ విషయమును ఆయనకు
అందివ్వాలి. గోధుమరంగు పేపరు మీద విషయమంతా వ్రాసి నాలుగు
మడతలు పెట్టి అందివ్వండి. గోధుమరంగు పేపరు తనకు సంబంధించి
దని ఆయనకు తెలుసు కనుక తప్పక తీసుకొంటాడు. అలా ఒకరోజు
కుదరకపోతే రెండవ రోజైనా ఇవ్వండి. తపస్విబాబాగారు అందరి కాగితము
లతో పాటు మీ కాగితమును కూడా తీసుకొని పోయి, ఆ కాగితమును
ఎవరూ చూడకుండా తన మందిరములో తాను ఒక్కడు మాత్రమే చదువు
కొనును. తర్వాత ఆయన మనకు తెలుపు విషయమును కూడా ఎవరికీ
తెలియకుండా తెలియబరచును. ఆయనకు చీటీలు ఇచ్చిన భక్తులలో
ఒకరినో లేక ఇద్దరినో పిలిచి మాట్లాడును. అది కూడా ఎవ్వరూ లేని
ప్రత్యేక గదిలో, సమస్యలు వ్రాసుకొన్నవారికి తన ఆశీస్సులు ఇవ్వడమో,
లేక కోర్కెలు నెరవేరునట్లు హామీ ఇచ్చి పంపడమో, లేక వారి కష్టములు
విని సమాధాన పరచి పంపడమో జరుగుచుండును. ఆ విధముగనే నీకు
ఆయన పిలుపు వచ్చును. అప్పుడు నీకు తపస్వి బాబాగారితో ఏకాంతముగా
కలిసి మాట్లాడే దానికి అవకాశము దొరుకును. అప్పుడు నీవు ఒక్కనివే
ఉంటావు. కావున ఆయన తన వివరమును తెలియబరచి పంపును.
ఆయన తన సమాచారమును ఏ కాగితము మీదా వ్రాసి ఇవ్వడు.
కలిసినపుడు మాటల రూపముతోనే చెప్పును. కనుక నీవు జాగ్రత్తగా విని
రావలయును. ఇపుడు మనమంతా ఆయన కరుణ మీద ఆధారపడివున్నాము.
మనలను శిక్షించినా, రక్షించినా ఆయన ఇష్టము.
(దీర్ఘముగా విషయమంతా వినిన వెంకు తన అన్న అయిన
తాటిమాను మునెప్ప దగ్గర తపస్విబాబాగారి అడ్రస్ అంతా తీసుకొని తపస్వి
బాబాగారి ఆశ్రమమునకు బయలుదేరి పోయాడు.)
(గ్రామస్థుల కోర్కెను తిరస్కరించిన యోగ మొదలగు ఆటవికులు
బయలుదేరి రాఘవను వెదకుచూ పోయారు. కానీ ప్రతిచోట వారికి
ఏదో ఒక ఆటంకము ఏర్పడుచుండుట వలన రాఘవను తొందరగా
కనుక్కోలేక పోయారు. వారు ఒక గ్రామమును దాటిపోవుచుండగా ఆ
సమయానికే ఒక చిరుతపులి అడవినుండి దారితప్పి ఆ గ్రామములోనికి
ప్రవేశించి వీర విహారము చేయసాగింది. ఒక ఇంటిలోనికి దూరి పశు
వులను గాయపరచను మొదలుపెట్టింది. గ్రామస్థులు దానిని బెదిరించి
గ్రామమునుండి తరిమి వేయాలని ప్రయత్నించగా, వారిపైకి దాడిచేసి
గాయపరచను పూనుకొన్నది. కొందరు గ్రామస్థులు ఊరి బయటకు
భయముతో పరుగిడసాగిరి. కోపముతో చెలరేగిన పులి గ్రామములో
అల్లకల్లోలము పుట్టించింది. ఆ గందరగోళమంతయూ ఆటవికులు
చూస్తున్నట్లే జరుగుచుండెను. అడవిలో నివసించుటకు అలవాటుపడిన
ఆటవికులు పులిని ఎదిరించి గ్రామస్థులను కాపాడవలెననుకొన్నారు.
అంతలో పులి ఆటవికుల మీదికే వచ్చినది. పులి రాకను గమనించిన
ఆటవికులు ప్రక్కనే ఉన్న ఒక నులకతాళ్ళ మంచమును పట్టుకొని, పులి
వారిమీదికి దుమికిన వెంటనే మంచము అడ్డముపెట్టి మంచముతోనే భూమికి
పులిని అదిమిపట్టారు. నులక మంచము క్రింద ఇరుక్కొన్న పులి తప్పించు
కోవలెనని ప్రయత్నించుకొలది దానికాళ్ళు నులక తాళ్ళలో చిక్కుకొన్నాయి.
పులిని ఎటూ కదలనివ్వక నలుగురు ఆటవికులు పట్టుకోగా, మిగత
నలుగురు పులికాళ్ళను కట్టివేసిరి. సులభముగా పులిని బంధించిన
ఆటవికులను చూచి గ్రామస్థులు ధైర్యముగా అక్కడ గుమికూడారు.
ఆటవికులను అందరూ పొగడుచూ తమను గాయపరిచిన పులిని
వదలకూడదనుకొన్నారు. మంచము క్రింద చిక్కుకొని కట్టివేయబడిన పులిని
తలావొక వేటు కొట్టారు. ఆ దెబ్బలకు పులి చనిపోయింది.
అంతలోనే అటవీ శాఖ ఉద్యోగులు అక్కడికి చేరి పులి చనిపోయి
వుండడమును చూచి దీనిని ఎవరు చంపారని అడిగారు. పులిని చంపుట
చట్టరీత్యా నేరమని తెలిసిన గ్రామస్థులు మేముకాదని తప్పించుకొనిరి.
పులిని మేమే పట్టుకొన్నామని ఆటవికులు చెప్పగా, పులిని కూడా వారే
చంపివుంటారని అనుకొన్న అటవీశాఖవారు ఆటవికులను పట్టుకొని
పోయిరి. తాము మంచి చేసినా చెడ్డగా తలచు నాగరికత సమాజమును
చూచి ఆటవికులకు పెద్ద విసుగువచ్చినది. మరలా వేరొక చోట అలా
ఇరుక్కొని రాఘవను వెదకలేక పోయినందుకు చింతిస్తూ అటవీ అధికారుల
చేతినుండి తప్పించు కొను ఉపాయమును ఆలోచించసాగిరి. )
☑
(రాజయోగానంద స్వామివద్ద అనేక మహత్యములనూ, వాటి
పద్ధతులనూ తెలుసుకొన్న రాఘవ దైవజ్ఞానాసక్తుడై, దైవమును గూర్చి తెలుసు
కొనుటకు మొదలుపెట్టి తనలోనున్న ప్రశ్నలను ఇలా అడగను మొదలు
పెట్టెను.)
రాఘవ :- స్వామీ! ఈ జగత్తంతటికి ఎవరు అధిపతి?
రాజయోగా :- సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన పరమాత్మ ఒక్కడే ఈ
జగత్తుకు అధిపతి. ఆయనను క్రైస్తవులు పరలోక తండ్రియనీ, ముస్లీమ్లు
అల్లాయనీ, ఇందువులు పరమాత్మ అని అంటున్నారు.
రాఘవ :- అయితే పరమాత్మ అనబడే దేవుడు అందరికీ సమానుడే కదా!
రాజయోగా :- అవును ఆయన మనందరికీ, సర్వ జీవరాసులకు సమానుడే.
రాఘవ :- మనకు అందరికీ ఆయన సమానుడైనపుడు, ఆయనకు కూడా
అందరూ సమానమే కదా!
రాజయోగా :- సర్వజీవరాసులు ఆయనకు సమానమే. ఏ జీవరాసి ఎడల
ఆయనకు భేదము లేదు.
రాఘవ :- స్వామీ! ఇక్కడే నాకు పెద్ద సంశయమున్నది.
రాజయోగా :- ఏమిటి నీ అనుమానము.
రాఘవ :- భూమిమీద మనుషులలో కొందరు ధనికులుగా, కొందరు
పేద వారిగా, కొందరు మధ్యరకముగా జీవిస్తున్నారు. సర్వులను సృష్టించిన
దేవుడు అందరికి సమానమైతే, అందరినీ సమానముగా పుట్టించవలెను.
కానీ కొందరు బీదవారిగా కష్టములు అనుభవించడమూ, కొందరు
ధనవంతులై సుఖములను అనుభవించడము వలన దేవునికి వీరు సమానము
కాదని అర్థమగుచున్నది. దేవునికి అందరూ సమానమే అయితే అందరినీ
ఒకే రకముగా పుట్టించవలెను కదా!
రాజయోగా :- మనుషుల పుట్టుకలూ, అట్లే వారు అనుభవించు కష్ట
సుఖములూ దేవుడు చేయునవి, దేవుడు ఇచ్చునవి కావు. దేవుడు
మనుషులను సృష్ట్యాదిలో సృష్టించిన మాట వాస్తవమే. సృష్ఠి జరిగిన
తర్వాత దేవుడు పని చేయడు. అంతేకాదు దేవునికి రూపమూలేదు, పేరూ
లేదు. అందువలన దేవున్ని రూప, నామ, క్రియారహితుడు అని అంటారు.
దేవుడు అందరికి సమానుడే ఆయన ఎవరికి మిత్రుడూకాదు, శత్రువుకాదు.
మనమే ఆయనకు సమానముగ లేము. ఒక మనిషి దేవున్ని పొగడుచూ
ఉంటే, మరొక మనిషి దేవున్ని దూషిస్తూవుంటాడు. ఇంకొకడేమో దేవున్నే
లేడని అంటుంటారు. ఇకపోతే మనము అనుభవించు కష్టసుఖములూ
దేవుడు విధించునవి కావు. వాటన్నిటిని ప్రకృతియే మనము స్వయముగా
చేసుకొన్న కర్మలనుబట్టి విధించుచున్నది. జీవరాసులను పుట్టించుట,
చంపుట అనేక రకములుగా బ్రతికించుటను ప్రకృతియే చేయుచున్నది.
దేవుడు ఏమీ చేయలేదు.
రాఘవ :- అట్లయితే మనము ప్రకృతి ఆధీనములో ఉన్నామా? అయితే
సర్వజీవరాసులను తన ఆధీనములో ఉంచుకొనిన ప్రకృతి ఎవరి ఆధీనములో
ఉన్నది?
రాజయోగా :- పరమాత్మ ఆధీనములో ప్రకృతి ఉన్నది. ప్రకృతి ఆధీనములో
సర్వజీవరాసుల మనుగడ ఉన్నది. అందువలన ప్రతి జీవరాసి, ప్రతి
మనిషి ఆ చేతిలో అస్వతంత్రులమై కీలుబొమ్మలవలె ప్రకృతి
ఆడించుచున్నట్లు ఆడుచున్నాము.
రాఘవ :- ప్రకృతి మనలను ఎలా ఆడించుచున్నది?
రాజయోగా :- ప్రకృతి గుణముల రూపములో ప్రతి మనిషి తలలోను
ఉన్నది. ప్రకృతి జనితములైన గుణముల చేత మనిషి ఆడింపబడుచున్నాడు.
గుణములనే మాయ అని కూడా అంటున్నాము. ప్రకృతి యొక్క మాయ
చేత ప్రతి మనిషి పనులు చేయవలసివచ్చినది. కష్టసుఖములను అనుభవించ
వలసివచ్చినది. మనిషి సంపాదించుకొన్న పాపపుణ్యములనుబట్టి మాయ
కదిలించి కష్టసుఖములను అనుభవింపచేయుచున్నది. పాపపుణ్యములను
కర్మ అంటాము. కర్మ మాయ ఆధీనములో, మాయ పరమాత్మ ఆధీనములో
ఉన్నదని తెలియుచున్నది. అందువలన అన్నిటికీ మూలకర్త చివరికి
పరమాత్మయేనని చెప్పవచ్చును.
రాఘవ :- ప్రకృతి ఆధీనములోనుండి తప్పించుకొని నేరుగా దేవున్ని
చేరుకోవాలంటే ఏమి చేయాలి?
రాజయోగా :- గుణములు అను మాయనుండి తప్పించుకోవాలి. మాయ
తననుండి ఎవరినీ తప్పించుకోనివ్వదు. అందువలన మాయను
జయించాలి. మాయను జయించుట దుస్సాధ్యము. దేవున్ని ఆశ్రయించిన
వాడు మాత్రమే మాయను జయించగలడు. దేవున్ని ఆశ్రయించుటకు
దేవుని జ్ఞానమును పూర్తిగా తెలిసివుండాలి. జ్ఞానమును సంపూర్ణముగా
తెలిసినప్పుడే మాయను జయించి దేవున్ని చేరవచ్చును.
రాఘవ :- దేవుని జ్ఞానమును తెలుసుకొంటే మాయను ఎలా జయించ
వచ్చును. జ్ఞానమును తెలిసిన వారందరూ మాయను జయించగలిగారా?
రాజయోగా :- దేవుని జ్ఞానమును తెలిసిన వారు మాయను దాటవచ్చును.
కానీ జ్ఞానులనువారు అందరూ మాయను జయించలేక పోవుచున్నారు.
మాయను జయించలేక పోవుచున్నారంటే, వారు తెలుసుకొన్నది దేవుని
జ్ఞానముకాదని తెలియవచ్చును. తనను జయించకుండావుండుటకు, తాను
ఎవరి చేతిలో ఓడిపోకుండా ఉండుటకు మాయ స్వయముగా తన జ్ఞానమును
కా
మాయను
మనిషికి నేర్పి, అది దేవుని జ్ఞానమేనని నమ్మించుచున్నది. మనిషి మాయ
చేతిలో పొరపడి, మాయ జ్ఞానమునే తెలుసుకొని తనది దేవుని జ్ఞానమను
కోవడము వలన, చివరకది దేవుని జ్ఞానము కానందున,
జ్ఞానులందరూ జయించలేక పోవుచున్నారు. నిజమైన దేవుని జ్ఞానమేదో,
దేవుని జ్ఞానమువలెనున్న మాయ జ్ఞానము ఏదో తెలియని మనుషులు
చాలామంది మాయ జ్ఞానమునే ఆశ్రయించి పొరబడిన దానివలన మాయ
వారినందరినీ తన పక్షములోనే పెట్టుకొని దేవున్ని తెలియకుండా చేసింది.
అంతేకాక అటువంటి వారిని చాలామందిని గురువులుగా మార్చివేయడము
వలన వారిని ఆశ్రయించి వారు చెప్పెడి జ్ఞానమును అనుసరించు వారు
కూడా దేవున్ని తెలియలేకపోయారు.
నిజమైన దేవుని జ్ఞానమును తెలిసినవారు చాలా అరుదుగా
ఉందురు. అటువంటి వారు దేవున్ని తెలియుటకు ధర్మబద్ధమైన మార్గములు
రెండు ఉన్నవని తెలిసి, వాటిలో ఏదో ఒక దానిని అనుసరించి, చివరకు
మాయను జయించి దైవమును చేరగల్గుచున్నారు. దేవుడు భగవంతుని
రూపములో వచ్చి తనను చేరుటకు చెప్పిన మార్గములు ధర్మమైనవి రెండే
గలవు. అవియే ఒకటి బ్రహ్మయోగమూ, రెండవది కర్మయోగము.
బ్రహ్మయోగ మార్గములో పోవువాడు తన శరీరములోని మనస్సును
అదుపులో పెట్టు కోవలసివుండును. కర్మయోగమార్గములో పయణించువాడు
తన శరీరము లోని అహమును అదుపులో పెట్టుకోవలసివుండును.
దీనినిబట్టి మనిషి దేవున్ని చేరుటకు దేవుడే చెప్పిన రెండు మార్గములు
శరీరములోనే కలవని తెలియుచున్నది. శరీరములోనే గల మాయను
జయించుటకు, శరీరములోనే రెండు యోగమార్గములను దేవుడు
చెప్పినప్పటికీ, మాయ చెప్పెడు జ్ఞానము వలన అందరూ శరీరములో
కాకుండా బయటి మార్గములలోనే సాగుచున్నారు. అందువలన వారికి
దేవుని సాన్నిధ్యమైన మోక్షము లభించలేదు.
రాఘవ :- మనుషులను పుట్టించి కష్టసుఖములందు ముంచుచూ అందరినీ
తన ఆధీనములో పెట్టుకొన్న ప్రకృతినుండి తప్పించుకొని పరమాత్మను
చేరాలంటే ముఖ్యముగా మన శరీరములోని కనిపించని మనస్సు మీదా
మరియు కనిపించని అహము మీదా ఆధారపడవలసిందేనని నాకు బాగా
అర్థమైనది.
రాజయోగా :- అవును. శరీరములోని రెండిటి మీద రెండు యోగములు
ఆధారపడినవి. ఈ విషయము తెలియక బాహ్యములో భజనలు చేసినా,
వ్రతక్రతువులు చేసినా, బ్రహ్మోత్సవములు చేసినా, తీర్థయాత్రలు చేసినా
పరమాత్మను ఎవరూ చేరలేరు. అందువలన భగవద్గీతలో విశ్వరూప
సందర్శన యోగమున 48వ శ్లోకమున మరియు 53వ శ్లోకమున యజ్ఞముల
వలనగానీ, దానముల వలనగానీ, వేదాధ్యయనము వలనగానీ, తపస్సులు
చేయడము వలనగానీ దేవున్ని తెలియుటకు శక్యముకాదు అని స్వయముగా
భగవంతుడే చెప్పాడు.
రాఘవ :- స్వామీ ఇప్పుడు చాలా రాత్రి గడచిపోయినది. మీరు విశ్రాంతి
తీసుకోండి. రేపు నేను మరికొన్ని జ్ఞాన విషయములను మీనుండి తెలుసు
కొంటాను.
(మునెప్ప ముఠాలోని వెంకు తపస్విబాబాగారి ఆశ్రమమును చేరి,
అక్కడ పరిస్థితులను గమనించాడు. ఒక దినమునకే అక్కడ పరిస్థితి
అంతా వెంకూకు అర్థమైనది. ఉదయము, సాయంత్రము భక్తులందరూ
తపస్వి బాబాగారి దర్శనమునకు కూర్చుండుట చూచి తాను కూడా వారిలో
కలిసి పోయి అందరితో పాటు కూర్చున్నాడు. తమ నాయకుడు చెప్పినట్లు
ముందే విషయమునంతటిని గోధుమరంగు పేపరు మీద వ్రాసుకొని
జాగ్రత్తగా ఉంచుకొనివుండెను. ఆ దినము ఏదో పండుగైన దానివలన
భక్తులు ఎక్కువగా ఉండిరి. ఆ దినము తపస్విబాబాగారు తన సమీపమునకు
రాలేదు. కావున వెంకు తన కాగితమును బాబాగారికి ఇవ్వలేక పోయాడు.
రెండవ దినమూ అలాగే అయినది. మూడవరోజు బాబాగారు తన
సమీపమునకు వచ్చినపుడు వెంకు తన కాగితమును చేతిలో పట్టుకొన్నాడు.
ఆ కాగితమును గమనించిన బాబాగారు అందరి కాగితములను తీసుకొన్నట్లు
వెంకు చేతిలోని కాగితమును కూడా తీసుకొన్నాడు. తర్వాత అదే దినము
సాయంకాలము బాబాగారి వద్దనుండి వెంకూకు పిలుపువచ్చింది.
పిలుపు ప్రకారము అక్కడి భక్తులు వెంకూను బాబాగారి మందిరములోనికి
ఒంటరిగా పంపారు. బాబాగారు ఒక ఉన్నతాసనము మీద కూర్చొనివున్నారు.
వెంకు బాబాగారికి నమస్కరించి నేను తాటిమాను మునెప్ప వద్దనుండి
వచ్చానన్నాడు. అందుకు బాబా చిరునవ్వునవ్వి ఇలా అన్నాడు.)
బాబా :- వివరమంతా తెలిసింది. ఇప్పుడు మీరు ఏమి చేయదలచారు?
వెంకు :- మీరు ఎలా చెప్పితే అలా చేస్తామని మా నాయకుడు చెప్పాడు.
బాబా :- అయితే తప్పిపోయిన పామును వెదకండి. దానిని పట్టుకొని
రండి. అలా చేయడము తప్ప వేరే మార్గము లేదు.
వెంకు :- అది ఎలా సాధ్యము స్వామీ! ఎక్కడుందని వెదకాలి, పోయిన
పాము దొరకగలదా?
బాబా :- పాములు ఎప్పుడూ దూర ప్రయాణము చేయవు. నీటి వసతివున్న
సమీపములోనే స్థావరమును ఏర్పరుచుకొంటాయి. కావున పాము పారి
పోయిన చేరువలో నీటివసతులున్న చోట్ల వెదకండి. తప్పక దొరుకుతుంది.
ఎవరికీ ఏ అనుమానము రాకుండా అన్వేషణ చేయాలి. కొన్ని నెలలకైనా
ఆ పామును పట్టుకొండి. మీరు అడుక్కొని తిను యాచకులవలె ఆ
ప్రాంతములో గుడిసెలు వేసుకొని కొంతకాలము అక్కడేవుండి ప్రతి దినమూ
కుందేళ్ళ వేటకని, ఎలుకల వేటకని, పక్షుల వేటకని సాకుతో బయలుదేరి
ప్రతి దినమూ పాముకొరకు అన్వేషణ చేయండి. రంధ్రాలు కనిపిస్తే ఎలుకల
కొరకన్నట్లు త్రవ్వి చూడండి. పొదలు కనిపిస్తే కుందేళ్ళకన్నట్లు వెదకండి.
ముఖ్యముగా ఎవరికీ ఈ విషయము తెలియకుండా జాగ్రత్తగా వెదకండి.
పాము కడుపు దగ్గర చర్మము క్రింద వజ్రాలున్న విషయము ఎవరికీ
తెలియదు. కావున పామును మీరు బహిరంగముగా పట్టుకొనినా ఎవరు
దానిని గురించి పట్టించుకోరు. మీరు తెలివిగా ఈ పనిని చేయాలి.
వెంకు :- స్వామీ! మావెంట పాములను పట్టువారిని పెట్టుకుంటాము.
బాబా :- అలా ఎవరినీ ఉంచుకోవద్దండి. ఈ పనిలో ఎటువంటి వారికి
అవకాశమివ్వకూడదు. మీ గుంపులోనివారే ఈ పనిని చెయ్యండి.
వెంకు :- పాములు ప్రమాదకరమైనవి కదా! ఒకవేళ ఇంతకు ముందు
నేను పాముకాటుకు గురియైనట్లు జరిగితే కష్టము కదా! దీనికి మీరే
ఉపాయమును చెప్పాలి.
బాబా :- అలాంటిది జరిగితే దాని నివారణ కొరకు మీవద్ద తెల్లఈశ్వరి
తీగయొక్క మూలికను ఉంచుకోండి. తెల్లఈశ్వరి పుల్ల గంధమునుగానీ,
పొడినిగానీ కడుపులోనికి ఇస్తే పామువిషము నివారింపబడును. ఒకవేళ
విషము తలకెక్కి అపస్మారక స్థితిలోనున్న వానికి, తెల్లఈశ్వరి మూలిక
యొక్క గంధమును కొద్దిగా కళ్ళలో పెడితే తలనుండి పాము విషము
క్రిందికి దిగును. తర్వాత మూలికను కడుపులోనికి ఇవ్వవచ్చును. ఈ
మూలిక ఉండుట వలన పాముకాటుకు భయము ఉండదు. ఇంతకంటే
ఎక్కువ ఏమీ చెప్పనవసరములేదు. నీవు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు.
నీవు వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపో...
(వెంకు వెంటనే అక్కడినుండి బయటికి వచ్చాడు. బయటనున్న
భక్తులు కొందరు వెంకు దగ్గరకు వచ్చి నీకు బాబాగారి దర్శనము దొరికినది.
అదృష్టవంతునివి. నీకు బాబాగారు ఏమని ఆశీర్వాదమిచ్చారు అని
అడిగారు. వారి మాటలకు వెంకు తెలివిగ సమాధానమిస్తూ “నాకు చాలా
కాలము నుండి కడుపునొప్పి ఉండేది. దానిని గురించి బాబాగారికి
చెప్పుకోగా ఆయన నా కడుపు మీద చేయి పెట్టి తీశాడు. వెంటనే నొప్పి
నయమై పోయింది” అని చెప్పి వెంకు వారినుండి బయటపడి తమ
నాయకునివద్దకు బయలుదేరి పోయాడు.)
(విధివశాత్తు ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.
పనిమీద బయలుదేరిన ఆటవికులకు అన్నీ ఆటంకాలే ఎదురైనవి.
అయినప్పటికీ వారు పట్టువీడని ధైర్యము కల్గియున్నారు. అటవీ అధికారులు
చిన్న జీపులో వచ్చిన దానివలన ఎనిమిది మంది ఆటవికులను అందులో
తీసుకపోవుట కష్టమని, వ్యాన్ కొరకు కేంద్రానికి జీపు పంపారు. అంతలో
సాయంకాలమై చీకటి పడింది. రాత్రివేళ అయిన దానివలన ఆటవికులకు
అక్కడే అన్నము పెట్టించి, అధికారులు వ్యాన్ కొరకు ఎదురుచూస్తున్నారు.
చాలా రాత్రి గడిచింది. ఆటవికులను ఆధీనమందుంచుకొనిన ముగ్గురు
అధికారులకు నిద్ర రాజొచ్చినది. వారు ఇద్దరు చూస్తున్నారులే అని ఆ
ముగ్గురిలో ఒకడు కూర్చొని నిద్రపోయాడు. అట్లే అనుకొని ఇంకొకడూ
నిద్రపోయాడు. బాగా మెలుకువగానున్న మూడవ అధికారి కూడా
తూగుటకు మొదలు పెట్టాడు. అదే అదనుగా భావించిన ఆటవికులు
ఎనిమిది మంది, ఒకరికొకరు సైగ చేసుకొని చిన్నగా చీకటిలోనికి జారు
కొన్నారు. కళ్ళు మూస్తూ తెరుస్తూ తూగుచున్న మూడవ అధికారి తేరుకొని
చూచేలోగా ఆటవికులు కనిపించకుండా పోయారు. వెంటనే లేచిన ఆ
అధికారి మిగత ఇద్దరిని లేపి ఆటవికుల కొరకు వెదకను ప్రారంభించారు.
అది పల్లెటూరు అయిన దానివలన కరెంటులైట్లు కూడా లేవు. బాగా
చీకటిగా ఉన్నదానివలన ఆటవికులను గుర్తించలేక పోయారు. అదే
అదునుగా ఎనిమిదిమంది, ఆటవికులు ఊరి బయటకు పరుగిడివచ్చి
అక్కడినుండి దారిని వదలి పొలాలమధ్యలో అడ్డముగా నడిచి పోయారు.
అధికారులు ఏ దారివెంట పరుగిడి చూచినా ఫలితము లేకపోయింది.
తెల్లవారే లోపల చాలా దూరము పోవాలనుకొన్న ఆటవికులు వేగముగా
నడకను సాగించుచుండిరి. వారి నడకకు రైలుమార్గము అడ్డము రాగా
దానిని దాటి అవతలి వైపుకు పోవుచుండిరి. అపుడు దూరముగా రైలు
మార్గము వెంట ఎవరో వస్తున్నట్లు మసకగా కనిపించింది. వెంటనే
రైలుమార్గము ప్రక్కనేవున్న చెట్ల పొదలమాటున నక్కి కూర్చొని వచ్చేవారు
ఎవరని చూస్తుండిరి. అంతలో ఒకవైపునుండి రైలు వస్తుండుట వలన
లైట్ ఫోకస్ వలన రైలుమార్గము పొడవునా కనిపించసాగింది. ఎవరో
వస్తున్నట్లు అగుపించిన ఆకారము పూర్తిగా కనిపించింది. ఒక యువతి
ఆందోళనగా అటువస్తున్నట్లు ఆటవికులు గమనించారు. ఆమె వెంటనే
రైలుమార్గము మీదికి పోయి రైలు పట్టాలమీద పడుకొన్నది. ఆమె ఆత్మహత్య
చేసుకొనే దానికి ఆ విధముగా రైలుపట్టాలమీద పడుకొన్నదని గ్రహించిన
ఆటవికులు, పరుగున పోయి ఆమెను ప్రక్కకు లాగి తెచ్చారు. రైలు వెళ్ళి
పోయింది. వెంటనే చీకటి ఆవహించింది. ఆమె చుట్టు చేరిన ఆటవికులు
రోదిస్తున్న ఆమెను ఓదార్చుచూ ఇలా అన్నారు.)
యోగా :- ఎవరమ్మా నీవు? చూస్తే చిన్న వయస్సులాగుంది. నీవు ఎందుకు
రైలుక్రింద పడబోయావు?
యువతి :- నన్ను ఎందుకు చావనివ్వలేదు. నేను చనిపోవాలి, నేను బ్రతుక
కూడదు. (అన్నది ఏడుస్తూ)
మేఘ :- ఏదైనా కష్టమొస్తే ధైర్యముగా నిలువాలి. కానీ భయపడి చని
పోకూడదు. అది పద్ధతి కాదు.
యువతి :- ధైర్యముగా నిలువడానికి, బ్రతకడానికి నాకు ఎవ్వరూ లేరు.
నేను బ్రతకాలనుకొన్నా నన్ను ఎలాగైనా చంపుతారు.
యోగా :- నీకు ఏ కష్టమున్నదో మాకు తెలియదు. నీవు చనిపోకూడదని
మేము కోరుచున్నాము. మేము అడవిలో నివసించు మనుషులము. నీకు
ఈ సమాజములో ఉండుటకు కష్టమైతే, కల్లాకపటములేని మా గూడెము
మనుషుల మధ్యలో ఏ చింతా లేకుండా ఉండవచ్చును. మేమిప్పుడు ఒక
మనిషి కొరకు వెదకుచూ వచ్చాము. అతనిని తీసుకొని మా గూడెము
నాయకుని వద్దకు పోవాలి. నీవుకూడా మా వెంటవుండు, నీకు ఏమీ
భయములేనట్లే. నీకు మేము ఎనిమిది మంది అన్నగార్లు ఉన్నారనుకో.
(ఏ దిక్కూలేని ప్రాణాపాయస్థితిలోనున్న ఆమెకు ఆదరముగా
మాట్లాడిన వారిమాటలు కొంత ఓదార్పునిచ్చాయి. అలాగేనని సమ్మతించి
చీకటిలో వారివెంట నడిచింది.)
(తెల్లవారక ముందే లేచిన రాఘవ స్నానముచేసి, వంటకట్టెల
కొరకు పోవు ఆశ్రమభక్తుల వెంట తానుకూడా పోయి తనవంతు సేవ
చేయాలనుకొన్నాడు. అక్కడి వారు నీవువద్దులేనని చెప్పినా తాను కూడా
సేవ చేయవలెనని బయలుదేరి వారివెంట పోయెను. అది వానల కాలమైన
దానివలన ఎండుకట్టెల కొరకు దూరముగా పోవలసివుంటుందని
అనుకొంటూ రాఘవ మరియు అతని ఆశ్రమ స్నేహితులు పోవుచుండిరి.
కొంతదూరము పోయిన తర్వాత ఆకాశములో మేఘములు కమ్ముకొన్నాయి.
వర్షము వస్తే ఉండేదానికి ఏమీలేదే అని చూస్తుండగా కొద్ది దూరములో
ఒక సత్రములాంటి పాతగుడి కనిపించింది. అంతలో వర్షము పడను
మొదలుపెట్టింది. రాఘవతో సహా అందరూ ఆ సత్రమువద్దకు పోయి
తడవకుండా నిలుచున్నారు. అక్కడికి సమీపములో నడకసాగించు
ఆటవికులు కూడా కొద్దిగ తడిసినవారై, అక్కడ సత్రమును చూచి పరుగిడుచూ
సత్రములోని వచ్చారు. అంతకు ముందే అక్కడికి వచ్చియున్న రాఘవను
ఆటవికులు చూచారు. ఆటవికులను రాఘవ కూడా చూచాడు. అక్కడున్న
రాఘవను చూచిన ఆటవికులు ఆశ్చర్యపోయారు. అప్పుడు వారికి
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. రాఘవ కనిపించడము ఆటవికు
లకు సంతోషమైనది. వారిని చూచిన రాఘవ కూడా సంతోషించాడు.
విధి చేసిన ఆ వింత చాలా విచిత్రమనుకొన్నారు. వర్షము రాకపోతే తాము
కలిసే వారమేకాదను కొన్నారు.)
రాఘవ :- మీరెలా ఇక్కడికి వచ్చారు.
మేఘ :- నీ కోసమే వెదుకుచూ వచ్చాము.
రాఘవ :- నా కొరకా!
యోగ :- అవును నీ కొరకే నాయకుడు పంపగా వచ్చాము.
రాఘవ :- నాయకుడు మల్లుదొర బాగున్నాడా?
యోగ :- అందరూ బాగున్నారు. (వారితో పాటు అక్కడికి వచ్చిన యువతిని
చూచి రాఘవ ఇలా అన్నాడు.)
రాఘవ :- ఈమె ఎవరు?
మేఘ :- ఈమె విషయము పూర్తిగా మాకు కూడా తెలియదు. రాత్రి
ఈమె ఆత్మహత్య చేసుకోబోయి మాకంటబడినది. మేము అడ్డుపడి అలా
చేయడము మంచిదికాదని నచ్చచెప్పి మా వెంట తీసుకవచ్చాము. ఆమె
విసిగిపోయిన మనస్సుతో ఉన్నది. అందువలన ఆమెను ఏమీ అడుగలేదు.
రాఘవ :- నేను మీతో ఏమీ చెప్పకుండా బయలుదేరి వచ్చాను. నేను
అలా రావలసివచ్చినది. కొంతకాలము తర్వాత అక్కడికి వచ్చి విషయమంతా
తెలియజేయాలనుకొన్నాను. అంతలోనే మీరే నా కొరకు వచ్చారు.
నేనిప్పుడు ఇక్కడికి దగ్గరగా నివాసముంటున్న రాజయోగానంద స్వామి
వద్దయున్నాను. అక్కడికిపోయి గురువుగారికి విషయము చెప్పి ఆయన
అనుమతిని తీసుకొని గూడెమునకు పోదాము.
(అందరూ కలిసి ఆశ్రమమునకు బయలుదేరారు. మార్గములో
యోగా, మేఘ తమకు కలిగిన ఆటంకములనన్నిటిని రాఘవకు వివరముగా
చెప్పారు. తమాషాగా జరిగిన ఆ సంఘటనలకు అందరూ నవ్వుకొంటూ
ఆశ్రమము చేరారు. రాఘవ ఆటవికులనందరిని రాజయోగానంద స్వామికి
పరిచయము చేశాడు. వారు తనకొరకు వచ్చినట్లు తెలిపాడు. ఆటవికు
లందరి విషయము తెలుసుకొన్న స్వామి, వారివెంట వచ్చిన యువతి
విషయమును అడిగాడు. ఆటవికులు ఆమెను గూర్చి తమకు తెలిసిన
విషయమునంత తెలిపారు. అపుడు రాజయోగానందస్వామి ఆమెతో ఇలా
మాట్లాడాడు.)
రాజయోగా :- నీ పేరు ఏమిటమ్మా?
యువతి :- నాపేరు రాధేశ్వరి. నా ఊరు స్థంబాపురము. నాకు ఇంకా
వివాహము కూడా కాలేదు.
రాజయోగా :- నీవు చనిపోవాలనుకొన్నంత అవసరమేమివచ్చింది. నీకు
నేను తండ్రిలాంటివాడిని. నాతో చెప్పుట వలన నీకు మంచియే
జరుగుతుంది.
రాధేశ్వరి :- మాదొక పెద్ద జమిందారు కుటుంబము. ఆస్తిపాస్తులు చాలా
ఉన్నాయి. ఒకరోజు మా కుటుంబము తీర్థయాత్రలకు పోయి రోడ్డు
ప్రమాదములో అందరూ చనిపోయారు. ఆ రోజు నాకు ఆరోగ్యము బాగా
లేనందున నేను పోలేదు. మా కుటుంబానికంతా మా తాతయ్య నేను
మిగిలాము. మా తాతయ్యకు ఆరోగ్యము బాగాలేక ఈ మధ్యనే
చనిపోయాడు. తాతయ్య చనిపోకముందు తనపేరుమీదనున్న ఆస్తినంతటినీ
నాకు చెందేటట్లు వీలునామా వ్రాసి పోయారు. తాతయ్య చనిపోయినప్పటి
నుండి నేను ఒంటరిదానినైపోయాను. ఆస్తి అంతా నా పేరు మీద
ఉండుట వలన, మధ్య వయస్సుగల నా మేనమామకు దుర్బుద్ధి పుట్టింది.
అతను అన్ని రకముల చెడిపోయిన వ్యక్తి. అన్ని వ్యసనములు ఆయనకు
ఉన్నాయి. అతనికి భార్యకూడా లేదు. ఎవరూ అతనిని దగ్గరకు రానివ్వరు.
అటువంటి వ్యక్తి నన్ను బలవంతముగా పెళ్ళి చేసుకోవాలని చూస్తున్నాడు.
అలా చేసుకోవడము వలన ఆస్తిని పొందవచ్చునని అతని అభిప్రాయము.
నేను ఏమాత్రము ఒప్పుకోలేదు. దానితో అతను నన్ను చంపుటకు పథకము
వేశాడు. ఇప్పటికి మూడు నెలలనుండి నాలుగుసార్లు నన్ను చంపాలని
చూచాడు. నాలుగుమార్లు అతని ప్రయత్నము విఫలమైనది. అతను
నన్ను చంపుటకు కిరాయి హంతకులను ఏర్పాటు చేశాడు. నా మేనమామకు
మద్దతుగా ఎప్పుడో మానాన్న వదలివేసిన సవతితల్లి కూడా తోడైనది.
వారినుండి తప్పించుకొనుటకు నేను ఇల్లువదలి నెలరోజులనుండి బయటనే
తప్పించుకొని తిరుగుచున్నాను. నావద్ద డబ్బు కూడాలేదు. ఎంతో ఆస్తి
ఉండికూడా ఆకలితో బాధపడవలసివచ్చింది. చివరకు ఎటూ వారు నన్ను
చంపుతారు. వారు చంపేదానికంటే ముందే నేను చనిపోవాలనుకొన్నాను.
ప్రయత్నములో కూడా విఫలమైపోయాను. చివరకు ఈ అన్నగారు
ధైర్యము చెప్పి ఆదరణగా మాట్లాడి మీవద్దకు తెచ్చారు. ఇది నా జీవిత
చరిత్ర. నేను బాగా చదువుకొన్న దానిని. నేను జమీందారు ఇంటిలో
పుట్టినా నాలో మంచి భావములున్నాయి.
రాజయోగా :- భూమిమీద చావు బ్రతుకులు ఎవరి చేతిలో లేవు. అన్నీ
కర్మచేతిలో ఉన్నాయి. కర్మ ప్రకారము ఏమి జరగవలెనో అదే జరుగుతుంది.
భవిష్యత్తు అంధకారమయము. అది ఎవరికీ కనిపించదు, జరిగేకొద్దీ
తెలుస్తూ పోతుంటుంది. నీవు చావాలనుకొన్నా చావలేక పోయావు కదా!
ఇంకొకరు చంపాలనుకొన్నా చంపలేకపోయారు కదా! మన వెనుక మనకు
తెలియకుండా కర్మ అనునది ఒకటున్నదని, అదియే అందరి జీవితములను
నడుపుచున్నదని తెలియకపోవడము అజ్ఞానము. కర్మ విధానము తెలియని
అజ్ఞానము వలన మనిషి తాను అనుకొన్నట్లు జరుగునని అనుకొనును.
ప్రస్తుతము నీవు కూడా అలాగే అనుకున్నావు. మనిషి ఎలా అనుకొనినా
అన్నీ కర్మప్రకారమే జరుగును. కర్మప్రకారము జరగనివీ, మనము
అనుకొన్నట్లు జరుగునవీ కూడా కలవు. అవి కర్మకు అతీతమైన జ్ఞాన
విషయములు. ప్రపంచ విషయములన్నియూ కర్మ ఆధీనములో ఉండును.
కనుక కర్మ ప్రకారము జరుగును. దైవమునకు సంబంధించిన జ్ఞాన
విషయములు కర్మ ఆధీనములో ఉండవు. జ్ఞానవిషయములలో మాత్రము
మనిషికి స్వతంత్రత కలదు. ఎందుకనగా అవి కర్మాధీనములో ఉండవు.
వాటికి కర్మ అనునది ఉండదు. అందువలన మనిషి శ్రద్ధను బట్టి జ్ఞానము
యొక్క పనులు జరుగును. కర్మ పనుల మీద మనిషి ఎంత శ్రద్ధ పెట్టినా
జరగవచ్చు, జరగకపోవచ్చును. ఈ విషయమును తెలిసినవారు తమ
ఆధీనములోలేని వాటిమీద శ్రద్ద పెట్టక, తమ ఆధీనములోనున్న జ్ఞానము
మీద శ్రద్ధ పెట్టి తెలుసుకొనెడివారు. వారు దైవజ్ఞానమును ఎంత
సంపాదించుకోవాలనుకుంటే అంత సంపాదించుకొనెడి వారు. అందువలన
భగవద్గీతలో కూడా భగవంతుడు "శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్" అన్నాడు.
ఇదంతా ఎందుకు చెప్పుచున్నానంటే చిన్న వయస్సులో దైవ
జ్ఞానమును తెలుసుకొనుటకు మంచి అవకాశము గలదు. ఈ వయస్సులో
నీవు ఎంత శ్రద్ధవహిస్తే అంతజ్ఞానమును తెలుసుకోగలవు. నీ చేతిలో
లేని ప్రపంచ విషయములను వదలివేసి, జ్ఞానమును సంపాదించుకోవడము
మంచిది. జ్ఞానము తెలియుట వలన ప్రపంచ సంబంధ విషయములు
మనిషిని అంతగా బాధించలేవు. ఇప్పుడు నీకున్న మనోవ్యథకు జ్ఞానమే
మందు అనుకో. జ్ఞానము వలన మనో ఉల్లాసము కల్గి ప్రపంచ చింతలు
సమసిపోతాయి. వాటిని అనుభవించు శాతము తగ్గిపోతుంది. అలా
జ్ఞానము తెలుసుకొనుటకు మేము అన్ని విధముల సహకారమును
అందిస్తాము.
రాధేశ్వరి :- మీరు చెప్పినది నాకు బాగా అర్థమైనది. ప్రపంచ విషయములు
మన చేతిలో లేవు అనుటకు, నా జీవితములో నా ఇష్టములేకుండా జరిగిన
సంఘటనలే నిదర్శనము. అన్నీవున్నా అందరిని పొగొట్టుకోవడము నేను
అనుకొన్నట్లు జరుగలేదు. ఇప్పుడు అన్నీ ఉన్నా కొన్ని పూటలు తిండికూడా
లేకుండా పోవడమును నేను కోరుకోకనే జరిగినవి. ఇట్లు లెక్కించి చూచితే
మీరు చెప్పినట్లు నా జీవితము నా చేతిలో లేదని బాగా అర్థమగుచున్నది.
నా ఇష్టము ప్రకారము జరుగని ప్రపంచ విషయముల శ్రద్దను వదలివేసి
మీరు చెప్పిన ప్రకారము జ్ఞానము మీద శ్రద్ధను పెంచుకొంటాను. మీలాంటి
ఉన్నతమైన వ్యక్తులవద్దకు నేను చేరినందుకు నాకు చాలా సంతోషము
కల్గుచున్నది. నాకు నా ఆస్తిపాస్తులు ఏమీ వద్దు మీవద్ద నాకు జ్ఞానము
లభిస్తే అదే నాకు పెద్ద ఆస్తి అగును.
(తపస్వి బాబావద్దనుండి బయలుదేరిన వెంకు తమ నాయకుడైన
మునెప్ప దగ్గరకు పోయి బాబాగారు పాము కోసము వెదకమన్న
విషయమును చెప్పాడు. బాబాగారు చెప్పినట్లు చేయుట మంచిదని తలచిన
తాటిమాను మునెప్ప తన మనుషులను పిలిచి బాబాగారు చెప్పిన
విషయమంతయూ వారికి చెప్పాడు. ఎవరికీ అనుమానము రాకుండా
మారువేషములు ధరించి వజ్రములున్న పాము కొరకు వెదకమని చెప్పాడు.
విషయమంతా తెలుసు కొన్న మునెప్ప ముఠా మనుషులు రెండు
గుంపులుగా తయారై పామువేటకు బయలుదేరిపోయారు. మొదట గుంపు
పాము తప్పించుకొన్న ప్రాంతము నుండి ఒకవైపుకూ, రెండవగుంపు
మరియొక వైపుకూ వెతకవలెనని నిర్ణయించుకొన్నారు. ఒక గుంపుకు
వెంకు నాయకుడుకాగా, మరియొక గుంపుకు నూకా నాయకుడుగా ఉ
న్నారు. వారివద్ద కుక్కలను కూడా పాము అన్వేషణ కొరకు పెట్టుకొన్నారు.
ఎవరికీ అనుమురానట్లు ప్రతి దినము కుందేళ్ళ వేటకని
బయలుదేరిపోయి పామును వెదకుచుండిరి. సాయంత్రము వరకు పాముల
వేట సాగించుచుండిరి. వారికి చిన్నపాములు కనిపిస్తే వాటి జోలికి
పోకుండా కేవలము పారిపోయిన పాము పొడవున్న వాటినే
పట్టుకొనుచుండిరి. వారి అన్వేషణ కేవలము నాగుపాములు, కావున వేరే
జాతిపాములను చూచినా వాటిజోలికి పోకుండా, తమకు కావలసిన పాము
కొరకే వెదకుచుండిరి. పాములను సులభముగా పట్టుటకు ఒక అంగుళము
పొడవు, ఒక అంగుళము వెడల్పు పంగ (చీలిక) గల ఒక కట్టెను తయారు
చేసుకొన్నారు. బారెడు పొడవున్న కర్రకు ఒక కొన పంగచీలివుండుట
వలన ఎక్కడైనా నాగుపాము కనిపిస్తే దాని తలవద్ద చీలికగల కర్రతో
అదిమి పట్టెడివారు. అలా భూమికేసి అదిమిపట్టి కదలకుండా చేసి ఒక
జానెడు (9 అంగుళములు) పొడవున్న దబ్బలమును (ఇనుప కడ్డీని) పాము
తలమీద పెట్టి దాదాపు మూడు అంగుళములు భూమిలోనికి దిగునట్లు
కొట్టుచుండిరి. అలా కొట్టుట వలన పాము పై పెదవి క్రింది పెదవులతో
దబ్బలము దిగి పాము నోరు తెరచుటకు వీలులేకుండా పోవును. అలా
దబ్బలమును కొట్టిన తర్వాత అదిమిపట్టిన పంగకర్రను తీసివేసి దబ్బలమును
పైకి లాగితే భూమినుండి దబ్బలము వచ్చును. కానీ పాము తలలో
దబ్బలము దిగివుండుట వలన దబ్బలమునకు తల అంటుకొని పాము
నోరు తెరువకుండా ఉండును. అప్పుడు నిర్భయముగా ఎవరైనా పామును
పట్టుకొనుటకు వీలుండును. అలా పట్టుకొన్న పాములను సాయంకాలము
తమ గుడిసెలకు తెచ్చి వాటి కడుపును చించి చూచుచుండిరి. కడుపుకింద
చర్మమును చీల్చి చూచిన తర్వాత వాటి కడుపులో వజ్రములు లేకపోతే ఆ
పాములను చంపివేసెడి వారు. ఇట్లు వారి అన్వేషణలో ఎన్నో పాములు
బలియైపోయాయి.
అలా వారి పాముల వేట సాగుచుండెను. పదిరోజులైనా తప్పించు
కొన్న పాము కనిపించలేదు. ఒక దినము వెంకు నాయకత్వములోని
గుంపు అన్వేషిస్తూ ఒక పొదను కట్టెతో కదిలించి చూచారు. ఆ పొదనుండి
ఒక నాగుపాము బయటికి విచ్చినది. ఆ పొదకు 20 అడుగుల దూరములో
మరియొక పొదవుండెను. మొదట పొదనుండి వచ్చిన పామును పట్టాలని
అందరూ దానిచుట్టూ చేరారు. అంతలోనే రెండవ పొదనుండి మరియొక
నాగుపాము బయటికి వచ్చినది. ఒకేమారు అలా రెండు పాములు రావడము
అదే మొదటిసారి జరిగినది. ఆ రెండు పొదలనుండి వచ్చిన రెండు పాములు
ఒకే చోటికి చేరి, రెండు పాములు పడగలు విప్పి నిలబడ్డాయి. ఆపదను
గ్రహించి ఆ పాములు రెండు ధైర్యముగా ఎదురుదాడి చేయడానికి
నిలబడడమును చూచిన వెంకు మనుషులు ముందుకు పోలేక పోయారు.
ఆ రెండు పాములు తప్పిపోయిన పాము సైజువుండుట వలనా, వాటి
కడుపులు కొద్దిగ లావుగా ఉండుట వలనా, అందులో తమవద్దనుండి
పోయిన పాము తప్పక ఉంటుందని వెంకు అనుకొన్నాడు. అలా వాటిమీద
అనుమానము రావడము వలన వాటిని ఎలాగైనా పట్టుకోవలెనని ముందుకు
పోయారు. వారిలో ఒకడు పంగలకట్టెతో వాటి తలను అదిమి పట్టాలని
చూచాడు. అంతలో మగపాము (కోడెనాగు) బుసకొట్టి విషమును ముందుకు
పోయిన వ్యక్తి మీదపడునట్లు చేసింది పాము బుసకొట్టినపుడు చిమ్మిన
విషము ముందుకు పోయిన వాని కళ్ళలో పడినది. కళ్ళలో పడిన విష
ప్రభావము వలన కళ్ళు మంటవేసాయి. అలా కోడెనాగు విషమును
జిమ్మడముతో ముందుకు పోయినవారు కొద్దిగ వెనక్కి తగ్గారు. అప్పుడు
త్రాచుపాము (ఆడపాము) తప్పించుకొని ప్రక్క పొదలోనికి పోయినది.
అప్పుడు మగపాము ఒంటరిదై పోవడము వలన దానిమీద అందరూ కలిసి
దాడిచేసి దానిని చంపారు. దానిలో కూడా వజ్రములు లేవని
తెలిసిపోయింది. ఈ మారు వారి చూపంతా పొదలోనికి పారిపోయిన
పాము మీదనేవుంది. ఆ పొదచుట్టు గుమికూడి పామును వెదకను
ఆరంభించారు. అంతలో ఆ పాము కూడా బయటికివచ్చింది. దానిని
కూడా అందరూ కలిసి చంపడము జరిగింది. తర్వాత ఎంతో ఆశగా
దాని కడుపును కూడా చూచారు. కానీ దానిలో కూడా వజ్రములు
దొరకలేదు.
సాయంకాలానికి కళ్ళలో విషము పడిన వ్యక్తికి పూర్తిగా చూపు
పోయింది. అలా కంటి చూపుపోవడము వలన అందరూ భయపడి
పోయారు. ఇక పాముల జోలికి పోకూడదని నిర్ణయించుకొని, తిరుగు
ముఖముపట్టి తమ నాయకుని వద్దకు పోయి జరిగిన విషయమును తెలిపి
తమ భయమును వ్యక్తము చేశారు. వారి మాటలను విన్న మునెప్ప
ఇప్పటికి ఇలా వెదికే పనిని ఆపి వేరే ఉపాయమును ఆలోచిస్తానని చెప్పాడు.
ఆ పామును ఎలా పట్టాలో అది ఎక్కడుందో అర్థము కాని విషయమును
మునెప్ప తానే స్వయముగా తపస్వి బాబా దగ్గరకు పోయి అడిగి
రావాలనుకొన్నాడు. మునెప్ప అనుకొన్నట్లు, తపస్విబాబా దగ్గరకు పోయి
పాము ఎక్కడుందో తెలియనిది దానిని పట్టుకొనుట సాధ్యముకాదనీ,
అనుమానముతో ఇప్పటికే చాలా పాములను చంపి చూశామని అలా మిగతా
పాములను చూడడములో అపాయము కల్గుచున్నదనీ, తమ మనిషికి ఒకనికి
విషము కళ్ళలో పడి కళ్ళు పోయి గ్రుడ్డివాడైనాడనీ, తప్పిపోయిన పాము
ఎక్కడుందో తెలిస్తే పట్టవచ్చునని దానిని కనుగొనుటకు మీరే ఉపాయమును
చెప్పమని కోరాడు. అతని మాటలను విన్న బాబాగారు యోచించి ఇలా
అన్నాడు.)
పోయారు. ఇక పాముల జోలికి పోకూడదని నిర్ణయించుకొని,
బాబా :- సరే, నీవు మూడురోజులు ఇక్కడే ఉండు. మూడురోజుల తర్వాత
నేనొక పరికరమును తెప్పించి నీకిస్తాను. అది చిన్న బ్యాటరీ సెల్సుతో
పనిచేయు ఒక చిన్న సెన్సార్ యంత్రము. ఆ యంత్రము పది గజముల
దూరములోనున్న వజ్రాలను గుర్తించును. అందువలన అ చిన్న
యంత్రముతో వజ్రములున్న పామును గుర్తించవచ్చును. అది వజ్రముల
సెన్సార్ యంత్రమగుట వలన, వజ్రముల పాము మీకు ముప్పయి (30)
అడుగుల దూరములో ఉన్నపుడు, ఈ యంత్రములో ముల్లు కదిలి “గీ”
అను శబ్దము వచ్చును. పాముకు దగ్గరగా పోవుకొలది యంత్రము యొక్క
శబ్దము ఎక్కువగును. అందువలన పామును సులభముగా గుర్తుపట్ట
వచ్చును. ఈ యంత్ర సహాయముతో మీరు పామునుపట్టుకొని వజ్రాలను
తెచ్చి ఇవ్వండి. (అని చెప్పి మారువేషములోనున్న మునెప్పను బయటికి
పంపివేసెను.)
రాజయోగా :- నీది చిన్నవయస్సయినా ప్రపంచ ధనముకంటే జ్ఞానధనమునే
గొప్పగా గుర్తించావు. దానికి మాకు సంతోషము. ప్రపంచరీత్యా చేయు
పనులను కూడా మేము జ్ఞానమును అనుసరించే చేస్తాము. ప్రపంచ
కార్యములన్నీ కర్మవలననే జరిగినా తిరిగి కర్మ అంటని విధముగా కర్మయోగ
పద్ధతి ప్రకారము చేస్తుంటాము. నీ తండ్రీ తాతల ఆస్థులు కూడా నీకు
తప్పక లభిస్తాయి. అవి లభించుటకు నీకు మేము పూర్తిగా సహకరిస్తాము.
రాధేశ్వరి :- నా మేనమామ తాగుబోతు, తిరుగుబోతు. అతనికి కిరాయి
హంతకులతో సంబంధాలున్నాయి. నేను మీవద్ద ఉన్నానని అతనికి తెలిస్తే
నా వలన మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నాకు భయముగా
ఉన్నది. మీరు ఆశ్రమవాసులు, సౌమ్యముగా ఉండువారు అతను ఒక
రౌడి. అతను దేనికైనా తెగిస్తాడు. అందువలననే నేను చనిపోవాలనుకొని
వుంటిని. నా వలన ఈ ఆశ్రమమువారికి గానీ, జ్ఞానమునకుగానీ
ఇబ్బందులు వస్తే నేను మీకు కూడా కష్టాలు తెచ్చి పెట్టినదానినవుతాను.
రాజయోగా :- లేదు, నీవు చావకూడదు. నీకు రక్షణ ఇవ్వడములో
మాకు ఏ కష్టమొచ్చినా ఎదుర్కోగలము. అసహాయస్థితిలో మరణమే
శరణ్యమను స్థితి కల్గిన సాటి వ్యక్తికి సహాయము చేయలేనంత దౌర్భాగ్యస్థితిలో
మేము లేము. నీకు తప్పక మా సహాయముంటుంది.
(స్వామి మాట్లాడిన మాటలు విన్న రాఘవకు తన శరీరములో
క్రొత్త ఉత్తేజము వచ్చి ఈ విధముగా అనుకొన్నాడు. “పురుషుడైన తనకే
సమాజములో విసుగొచ్చి అడవికి పోయినట్లు, స్త్రీ అయిన రాధేశ్వరి
కూడా సమాజములోని రాక్షసత్వమునకు, కౄరత్వమునకు విసిగి శరీరమునే
వదలి పోవాలనుకొన్నది. ఈ రోజు ఆమె మరణాన్ని కోరడమూ, ఆ రోజు
నేను అరణ్యవాసమును కోరడమూ మాలో ధైర్యము లేకనేనని
అర్థమగుచున్నది. మాలాంటి అధైర్యము కలవారిని ఈ లోకము
తరుముతూనే ఉంటుంది. సమాజమునకు బెదిరిపోవడము మంచిదికాదు.
ఈ దుష్టసమాజమునకు భయపడకుండా ఎదిరించి నిలబడడములోనే
గొప్పతనమున్నదని రాజయోగానందస్వామి గారి మాటలలో అర్థమగు
చున్నది. అంతటి స్వామియే ఆపదలోనున్న వారిని ఆదరించుటకు ఎంతటి
కష్టమొచ్చినా ఎదుర్కోగలమని అంటుంటే, నాలో నిద్రాణమైవున్న ధైర్యము
పొంగి బయటికి వచ్చింది. ఇప్పటినుండి నేను పాత రాఘవను కాను,
క్రొత్త రాఘవగా ఉంటాను. ఎవరికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాగే
చెప్పుతాను. అయినా నేను అనుకొను పద్ధతి జ్ఞానమార్గమునకు
ఆటంకమేమో! ఎందుకైనా మంచిది స్వామి గారిని అడిగి తెలుసుకొందాము”
అని అనుకొన్నాడు.)
మని అంటుంటే, నాలో విరాణమైవున్న ధైర్యము
రాఘవ :- స్వామీ! మీరు మాట్లాడిన మాటలు నాకు క్రొత్త ఉత్తేజమును
ఇచ్చాయి. అయితే ఈ సమాజములో నరరూప రాక్షసులను అణచి
వేయడానికి కొంత హింసా మార్గములో పోవలసివస్తుందేమో! అందువలన
జ్ఞానమార్గమునుండి త్రప్పి పోతానేమోనను అనుమానము వస్తున్నది. అట్లని
పూర్తిగా హింసా మార్గమును వదలి అహింసామార్గములో పోతే, గాలిలోని
పక్షులూ, భూమిమీదున్న చీమలు కూడా బెదిరించేటట్లున్నాయి. హింస
లేకపోతే మనుగడయే సాగదేమోననిపిస్తున్నది. హింస పాపమంటారు
కొందరు, హింసలేనిదే మనలను మనము కూడా రక్షించుకోలేము. పూర్తిగా
హింసను విడనాడి భూమిమీద బ్రతుకగలమా? కొందరు ప్రేమ వలన
దేనినైనా సాధించవచ్చునన్నారే అది నిజమా? మనము ప్రేమించినా దానిని
అర్థము చేసుకోలేని వారున్నపుడు వారి లెక్కలో అది ప్రేమే కాదు కదా!
మీరే చెప్పండి స్వామీ! నాకు కల్గిన జీవిత అనుభవాల వలన నేను హింసా
మార్గమును అనుసరించాలో లేక హింస పాపమని అహింసామార్గమున
పోవాలా? చెప్పండి.
(రాఘవ మెదడులో బుద్ధియొక్క యోచన మధ్య జరుగుచున్న
ఘర్షణను గ్రహించిన రాజయోగానందస్వామి ఇలా అన్నాడు.)
రాజయోగా :- ఒకనాడు ఇదే విధముగా అర్జునుడు కృష్ణున్ని ప్రశ్నించాడు.
ఆనాడు కృష్ణుడు హింసతో కూడుకొన్న యుద్ధమే చేయమన్నాడు. అయితే
జ్ఞానమును తలయందుంచుకొని కర్మయోగపద్ధతిలో చేయమన్నాడు.
జ్ఞానము లేకుండా అజ్ఞానములో యోగపద్ధతి కాకుండా చేయమని చెప్పలేదు.
నీవు ఏమి చేస్తున్నావనునది ముఖ్యము కాదు, ఎట్లు చేస్తున్నావనునది
ముఖ్యము. ఈ ప్రపంచములో సమయానికి సరిపోవు గుణములు వాడుకొని
పని చేసినా ఫరవాలేదు. అయితే అది జ్ఞానయుక్తముగా ఉండవలెను.
ప్రపంచములో పూర్తి ప్రేమభావమును చూపిన మహాత్ములను కూడా ఈ
మనుషులు హింసించి ప్రాణములను కూడా తీశారు. ఎందరినో స్వస్తపరిచి,
కుష్ఠు రోగులను కౌగిలించుకొన్న కరుణామయుడు అని పేరుగాంచిన ఏసును
ఆనాటి అజ్ఞాన మనుషులు కుట్రపన్ని కాళ్ళు చేతులకు ములుకులు కొట్టి
హింసించి చంపారు. అహింసే పరమధర్మమని చాటి చెప్పిన గాంధీని
నిర్ధాక్షిణ్యముగా తుపాకీ గుళ్ళకు బలిచేశారు. అందువలన ఈ లోకములో
బ్రతకాలంటే పూర్తి అహింసను అనుసరించి బ్రతకలేము. తన్ను తాను
రక్షించుకొనుటకైనా హింసను చేయవలసివస్తుంది.
రాఘవ :- బ్రతకాలంటే సమయానుకూలముగా హింసకూడా అవసరమే
అనుమాట అర్థమైనది. కానీ జ్ఞానముతో చేయాలి అన్నారు. కర్మయోగ
పద్ధతి ప్రకారము చేయాలి అన్నారు. యోగపద్ధతిని అనుసరించి
చేయడమను నది నాకు అర్థముకాలేదు.
రాజయోగా :- ఎవడో తింటే నేను తిన్నానని అనుకోవు కదా! అట్లే
ఎవడో నిద్రిస్తే నేను నిద్రించానని అనుకోవు కదా! ఒకవేళ వేరేవాడు
చేసిన పనిని నేను చేశాను అనుకోవడము తెలివితక్కువ పనియే అగును
కదా! ఇపుడు మనుషులందరూ తెలివి తక్కువగానే ప్రవర్తించుచున్నారు.
ఎలా అనగా శరీరములో జీవుడు నివసిస్తున్నాడు. శరీరము మొత్తము 24
భాగములుగా ఉన్నది. జీవుడు 25వ వానిగా ఉన్నాడు. శరీరములో
ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని చేయుచున్నవి. జీవుడు శరీరములో
కష్టసుఖములను అనుభవించు పనిని మాత్రము చేయుచున్నాడు. బుద్ధి
వేరు, జీవుడు వేరు భాగములుగా ఉన్నారు. బుద్ధి యోచించు పనిని
చేస్తుంది. అయితే జీవుడు నేనే యోచించాను అనడము తప్పు. జీవుడు
తాను యోచించకున్నా బుద్ధి చేసిన పనిని తానే చేసినట్లు చెప్పుకోవడము
అజ్ఞానమే అవుతుంది. అజ్ఞాన ములోనున్న జీవులందరూ శరీరములో
తాము చేయని పనులన్నిటిని మేమే చేశాము అంటున్నారు.
హింసాకార్యములను శరీరములోని భాగములు చేస్తే, యోగముతో
కూడుకొన్న జీవుడు నేను చేయలేదు అనుకొంటున్నాడు. జ్ఞానములేని
జీవుడు నేనే చేశాను అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా?
రాఘవ :- బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు. ఒకరు చేస్తే దానిని మరొకరు
చేశాననడము తప్పే. జీవుడు ఆ తప్పును తెలియక చేస్తున్నాడు కదా!
తెలిసి చేస్తే తప్పు అనవచ్చును. తెలియక చేస్తే పొరపాటు అనవచ్చును.
ఇక్కడ తప్పుకు పొరపాటుకు తేడావున్నది కదా!
రాజయోగా :- తప్పునూ, పొరపాటునూ వేరువేరుగా చూడాలని నీవు
అంటున్నావు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అగును.
పొరపాటుగా లెక్కించబడదు అని నేను అంటున్నాను. ఉదాహరణకు
అగ్నిని తెలిసి ముట్టుకొన్నా కాలుతుంది, తెలియక పొరపాటుగా ముట్టుకొన్నా
కాలుతుంది.
రాఘవ :- అగ్గి కాలేదానికి, తప్పు పొరపాటు అను బేధము లేదని తెలుస్తూ
వుంది. అయినా దేవుడు కూడా తప్పునూ పొరపాటునూ ఒకటిగా లెక్కించు
కోవడము న్యాయము కాదు కదా! అన్యాయమే అగును కదా!
రాజయోగా :- నీవు బాగా గుర్తుంచుకోవలసిన విషయము ఏమనగా!
దేవుని చట్టములో న్యాయఅన్యాయములు లేవు. వాటి స్థానములో ధర్మమూ,
అధర్మము మాత్రమే ఉన్నాయి. నీతి, న్యాయములు లోకసంబంధమూ,
జ్ఞానమూ, ధర్మములు దైవసంబంధము. దేవుడు నిర్మించిన శరీరములో
ఉండి దేవుని చట్టమును (ధర్మములను) తెలుసుకోకుండా నాది పొరపాటు
అంటే ఎలా? ముఖ్యముగా ఈ పొరపాటు పనుల వలననే మనిషికి పాప
పుణ్యములు తగులుకొనుచున్నవి. ఈ విషయము నాకు తెలియదు అని
ఎవరూ అనకుండా దేవుని చట్టము గ్రంథరూపములో, మన మధ్యలో
భగవద్గీత రూపములో ఉన్నప్పటికీ, దానిని చూచేదానికి నాకు ఓపిక లేదు,
నాకు తీరికలేదు, నాకు ఇష్టములేదు అని అంటూ అన్నీ తప్పులు చేస్తూ
తెలియని పొరపాట్లు అంటే ఎలా? ఒకదానినైతే పొరపాటు అనవచ్చును.
నూటికి నూరు తప్పులు చేసి పొరపాట్లు అంటే ఎలా? అట్లు ఎవరూ
అనకుండా ఉండేదానికే మనిషి పుట్టుకముందే, దేవుడు తన జ్ఞానాన్ని
భూమిమీద ఉంచాడు. మనిషి చేయు తప్పులనూ, ఒప్పులనూ తెలియ
జేయు నిమిత్తము దేవుడు సృష్ఠి ఆదిలోనే తన ధర్మములను సూర్యుని
ద్వారా భూమిమీదికి పంపాడు. దేవుడు అంత జాగ్రత్తగా మనము
పుట్టకముందే పని కల్పించుకొని మన కొరకు జ్ఞానాన్ని చెప్పితే, మనము
పుట్టిన తర్వాత దేవుని జ్ఞానానికి విలువనివ్వకపోతే, మనము దేవునికే
విలువనివ్వని వారమగుచున్నాము.
రాఘవ :- భూమిమీద కొందరికి దేవుని ధర్మములు ఇలా ఉన్నవని కూడా
తెలియదు కదా! వారికి ఈ విషయమెలా తెలుస్తుంది?
రాజయోగా :- భూమిమీద ప్రభుత్వ చట్టమున్నట్లే, దేవుని చట్టము కూడా
కలదు. ప్రభుత్వ చట్టము ప్రకారము కూడా ఒక మనిషి తాను చేయని
హత్యను చేశాను అంటే 302 సెక్షన్ ప్రకారము వానికి హత్యానేరపు శిక్షను
ఖరారు చేస్తారు. జడ్జికి ఆ వ్యక్తి హత్య చేయలేదని ముందే తెలిసినా,
కోర్టులో అతను నేనే చేశానని చెప్పడము వలన, వానినే శిక్షించాల్సిన పని
ఏర్పడినది. అలాగే ఒక మనిషి తాను చేయని పనిని చేశాననడము వలన,
దేవుని చట్టములోని సెక్షన్ 369 ప్రకారము శిక్షపడును. ప్రపంచ ప్రభుత్వము
యొక్క చట్టములో సెక్షన్లు ఎన్నో ఉండగా, దేవుని చట్టములోని సెక్షన్లు
మూడే మూడు కలవు. ఒకటి 369, రెండవది 666, మూడవది 963.
వీటిని తెలియాలి అంటే త్రైత సిద్ధాంత భగవద్గీతను చదువవలసిందే.
ఇప్పుడు దేవుని చట్టములోని సెక్షన్లను గురించి చెప్పలేను. ముందు
చట్టము తెలుసుకొంటే తర్వాత సెక్షన్లు తెలుస్తాయి.
(అక్కడే వింటున్న రాధేశ్వరికి స్వామివారు చెప్పిన జ్ఞానము బాగా
అర్థమైనది. కానీ అక్కడేనున్న ఆటవికులకు ఏమాత్రము అర్థము కాలేదు.
తర్వాత ఆటవికులు వచ్చిన విషయమును తెలుసుకొన్న రాజయోగానంద
స్వామివారు రాఘవను వారి వెంటపోయి రమ్మన్నాడు. స్వామి ఆజ్ఞ
ప్రకారము రాఘవ ఆటవికుల వెంట బయలుదేరి అడవికి పోయాడు.)
(తపస్వి బాబావద్ద మూడు రోజులు కాచుకొనివున్న మునెప్పకు
నాల్గవరోజు బాబాగారి కలయిక దొరికింది. బాబాగారు ఇచ్చిన సెల్ఫోన్
లాంటి చిన్న మిషన్ తీసుకొని బనియన్ జేబులో పెట్టుకొని బయటికి
వచ్చాడు. అలా బయటికి వచ్చిన మునెప్పకు తాను ఊహించని రీతిలో
పోలీసులు కనిపించారు. పోలీసులు వలపన్ని మునెప్ప కోసమే కాచుకొని
ఉన్నారు.అది గ్రహించిన మునెప్ప తప్పించుకోవాలనుకొన్నాడు, కానీ
సాధ్యపడలేదు. దిక్కుతోచని స్థితిలో మునెప్ప తన రివాల్వర్ను బయటికి
తీసి పోలీస్ ఇన్స్పెక్టర్ కాలికి గురిపెట్టి కాల్చి, వెనుతిరిగి బాబాగారి
మందిరములోనికే పారిపోయాడు. రివాల్వర్ ప్రేలిన శబ్దమును విన్న
తపస్వి బాబాగారు ఏమి జరిగిందోనను గాబరాతో బయటికి వచ్చాడు.
బాబాగారి మందిరాన్ని పోలీసులు చుట్టుముట్టి మునెప్ప పారిపోకుండా
జాగ్రత్తపడ్డారు. అంతలో అక్కడ భక్తులంతా గుమికూడారు. పోలీసులు
బాబాగారి మందిరములో ఒక్కొక్క గదిని జాగ్రత్తగా వెదకను ఆరంభించారు.
తపస్వి బాబాగారి మందిర రహస్యమంతయూ మునెప్పకు బాగా తెలుసు.
మునెప్ప తప్పించుకొనుటకు బాబాగారి మందిరములో అన్ని అనుకూలములు
ఉన్నాయి. అందువలన మునెప్ప దొరకడని బాబాగారికి తెలుసు. పోలీసులు
మాత్రము మందిరమును చుట్టుముట్టి కాపలావుంటూ, కొందరు మందిర
మంతయూ జాగ్రత్తగా పరిశీలించుచున్నారు. విశాలమైన రాజభవనము
లాగవున్న బాబాగారి మందిరమంతయూ వెదికారు. కానీ మునెప్ప కనిపించ
లేదు. బాబాగారి మందిరము మధ్యలో కొంత మైదానమందు అందమైన
చెట్లతో నిండిన వనమున్నది. దానిమధ్యలో చిన్నబావి కూడా ఉన్నది.
చుట్టూ మందిరముండగా, మందిరములోలేని మునెప్ప మందిరము మధ్యలో
నున్న ఉద్యానవనములో దాగివుంటాడని పోలీసులు నిశ్చయించుకొన్నారు.
మునెప్పను లొంగిపొమ్మని మైక్ ద్వారా చెప్పారు. పది నిమిషములలో
లొంగిపోకపోతే వెదికి కాల్చివేస్తామని కూడా చెప్పారు. అయినప్పటికీ
మునెప్ప బయటికి రాలేదు. లాభము లేదనుకొన్న యస్.పి గారు అదనపు
బలగాలను నియమించి వెదకనారంభించారు. ఒక గజము జాగా కూడా
వదలకుండా వెదకినప్పటికీ పోలీసులకు మునెప్ప కనిపించకుండా
పోవడము వారికి ఆశ్చర్యమైనది. చివరకు మిగిలింది, వనము మధ్యలో
గల బావి మాత్రమే. ఆ బావిలోనికి తొంగిచూచారు. కొంత లోతులో
నిశ్చలముగా కదిలిక లేకుండా నిలచిన నీరూ, అందులో పై నుండి తొంగి
చూచువారి ప్రతిబింబము కనిపిస్తున్నది. చెట్లకు నీటి సరఫరా కొరకు
అమర్చిన మోటరూ, దాని పైపులూ నీటిలోనికి ఉన్నవి. అంతేతప్ప అక్కడ
ఏమీ కనిపించలేదు. పోలీసులు ఎంత యోచించిన మునెప్ప ఎక్కడ తప్పించు
కొన్నాడను విషయము ఏమాత్రమూ అర్థము కాలేదు. అప్పుడు యస్.పి
గారు బాబాగారివద్దకు వచ్చి ఇలా అన్నాడు.)
యస్.పి :- స్వామిగారూ! మునెప్ప మీ మందిరములోనికి పోయి కనిపించ
లేదు. మీరేమైనా చెప్పగలరా?
బాబా :- నాకు కూడా ఆశ్చర్యముగానే ఉన్నది. అతను ఇక్కడే ఎక్కడైనా
దాగి ఉంటాడు. మరియొకమారు బాగా వెతకండి.
యస్.పి :- మీరు ఏమీ అనుకోకపోతే మిమ్ములను ఒకమాట అడుగుతాను.
బాబా :- అందులో తప్పేమున్నది. మీకు అన్ని విధముల సహకరించుటే
మా పని. మీకు ఏమికావాలో అడగండి.
యస్.పి :- ఇపుడు పారిపోయిన మనిషి ఒక దొంగల ముఠాకు నాయకుడు.
ఎన్నో నేరాలు అతని మీద ఉన్నాయి. అతను ఎందుకు మీ మందిరానికి
వచ్చాడు.
(బాబాగారు చిరునవ్వు నవ్వి యస్.పి.గారివైపు చూచి ఇలా అన్నాడు.)
బాబా :- సమాజములో అన్నిరకముల మనుషులు నావద్దకు వస్తుంటారు.
వారందరూ నా మీద భక్తి (విశ్వాసము) మీదనే వస్తారు. వారియందు నా
ఎడల భక్తినే నేను చూస్తున్నాను. కానీ వారు ఎటువంటివారని నేనెప్పుడూ
చూడలేదు. అందరిలాగా అతను కూడ నా దర్శనమును కోరాడు. అదృష్ట
వశాత్తు నా పిలుపు ఆయనకు అందింది. అతని సమస్యలు చెప్పుకొనే
దానికి వచ్చాడు.
యస్.పి :- అందరిలాగ అంటే ఎలాగ?
బాబా :- మేము బయటికి అందరి దర్శనార్థము వచ్చినపుడు చాలామంది
వారివారి సమస్యలను పేపరు మీద వ్రాసుకొని నాకు అందిస్తుంటారు.
దగ్గరున్న వారివీ, చేతికందిన వారివి మాత్రమే నేను తీసుకొని నా మందిరము
లోనికి పోయిన తర్వాత వాటిని నేను మాత్రమే చదువుతాను. సమంజస
మైన కోర్కెలుకల కొందరిని పిలిచి మాట్లాడి పంపుతుంటాము.
యస్.పి :- ఇపుడు మాయమైపోయిన వ్యక్తి వ్రాసి ఇచ్చిన సమస్య ఏమిటో
ఆ కాగితమును చూపుతారా?
బాబా :- అలా ఏ కాగితమునూ చూపము. ఆ కాగితములు విప్పి చూచేది
నేనొక్కనిని మాత్రమే. ఎన్నో వ్యక్తిగత సమస్యలూ, కుటుంబ సమస్యలూ,
ఆరోగ్య సమస్యలూ, చివరకు మానావమాన సమస్యలూ ఎన్నో ఉంటాయి.
నన్ను దేవునిగా భావించుకొని ఏమాత్రము దాచుకోకుండా అన్ని సమస్యలు
నాకు విన్నవించుకొని ఉంటారు. అందువలన వాటిని ఎవరికీ చూపడము
లేదు. నేను మాత్రము చూచి అందులో కొందరిని మాత్రము పిలిచి
మాట్లాడి పంపడము జరుగును. వారు వ్రాసుకొన్న కాగితములను నేను
చదివిన వెంటనే కాల్చివేయడము ఇక్కడి సాంప్రదాయము. వ్రాసుకొన్న
విషయములు బయటికి ప్రాకితే ఎవరూ నాకు వారి సమస్యలు చెప్పుకోరు.
యస్.పి :- స్వామిగారు! దయచేసి మీరు మాకు కొద్దిగా అయినా
సహకరించండి. ఇపుడు పారిపోయిన వ్యక్తి ఏమి వ్రాశాడో అదయినా
చెప్పగలరా?
బాబా :- చెప్పగలము. అదేమీ దాచవలసిన సమస్యకాదు. తన భార్యకు
జబ్బు చేసిందనీ, ఆరు నెలలనుండి ఎందరు డాక్టర్లు చూచినా నయము
కాలేదనీ, దానికి మా కరుణ అవసరమనీ, మాచేతి విభూది చేత జబ్బు
నయమవగలదను నమ్మకముందనీ వ్రాశాడు. అందువలన అతనికి విభూది
ఇచ్చుటకే మా దర్శనము కొరకు పిలిచాము. అతను వచ్చి అదే సమస్య
చెప్పుకొన్నాడు. అతనికి విభూది ఇచ్చి పంపాము. బయటికి పోయాడు.
తర్వాత కాల్పుల శబ్దము వినిపించింది. బయట ఏదో గందరగోళపు సమస్య
ఏర్పడినదని గాబరాగా నేను బయటికి వచ్చాను. తర్వాత విషయము
తెలిసింది.
(బాబాగారు ఏమాత్రము యస్.పి గారికి అవకాశమివ్వకుండా
తెలివిగా మాట్లాడాడు. బాబాగారి మాటలు విన్న యస్.పి గారికి ఏమి
మాట్లాడాలో తోచలేదు. అంతలోనే బాబాగారే ఇలా అన్నారు.)
బాబా :- మీరు ఇలాంటి దొంగలనూ, హంతకులనూ మా మందిరము
వరకు రానివ్వకూడదు. అటువంటి వారిమీద నిఘావేసి బయటనే ఎప్పడో
బంధించివేసి ఉండాలి. మా మందిరము వద్ద మీరు ఇంత గందరగోళము
చేయుట వలన మాకూ మరియు మా భక్తుల మనోభావములకూ,
మనశ్శాంతికీ భంగము వాటిల్లినది. దేవాలయములకు అన్ని రకముల
వారు వచ్చి కోర్కెలు కోరినట్లు, మా వద్దకు కూడా అన్ని రకముల మనుషులు
వారివారి కోర్కెల నిమిత్తము వస్తుంటారు. వారు వచ్చే దానికి మేము
బాధ్యులము కాదు. ఇపుడు మా ఆశ్రమ ప్రాంతములో జరిగిన ఈ
గందరగోళమునకు మీరే బాధ్యులు. మా ఆశ్రమప్రాంతములో ప్రశాంతత
ఉండాలి. కానీ గందరగోళ పరిస్థితి ఉండకూడదు.
యస్.పి :- ఆ దొంగవెధవ రాకపోతే మేము వచ్చేవారము కాదు కదండీ.
బాబా :- వాడు దొంగో, దొరో మీరు ఆశ్రమము బయట తేల్చుకోవాలి.
మా ఆశయాలకు విరుద్దముగా ఇక్కడ గందరగోళము ఏర్పడడమేకాక మీరు
వానిని పట్టుకోలేక పోయారు. వాడు ఇక్కడే ఎక్కడైన దాగి ఉంటాడు. ఆ
భయము ఇక్కడున్న వందల భక్తుల మనస్సులో నిలిచివుంటుంది.
(దొంగ దొరకక బాధపడుచున్న యస్.పి గారికి పట్టుకోలేక
పోవడము మీ అసమర్థత అని తపస్విబాబాగారు మందలించడము మరింత
బాధయినది. బాబాగారికి ఏదో ఒకటి చెప్పాలికదాయని ఇలా అన్నాడు)
యస్.పి : – స్వామీ! మీరు ఎవరూ భయపడవలసిన పనిలేదు. మా
పోలీసులు బందోబస్తుగ ఇక్కడే ఉంటారు.
బాబా :- వద్దయ్యా! వద్దు. అలా ఉంటే ఇటు పోలీసులు కాలుస్తారేమోననీ,
అటు వాడు కాలుస్తాడేమోననీ మాభక్తులు భయపడుచు వారి మనస్సు
పాడు చేసుకొంటారు. మీరు ఆశ్రమము బయట కాపలా ఉండండి. లోపల
మాత్రము వద్దు.
(అందులకు యస్.పి గారు సరేన్నట్లు తలూపి ఆశ్రమము బయట
పోలీసులను కాపలావుంచి వెళ్ళిపోయాడు. తన ఆఫీస్కు పోయిన యస్.పి
గారి బుర్రలో అనేక ఆలోచనలు తరంగాలుగా వస్తున్నాయి. మునెప్ప
బాబాగారి మందిరములోనే మాయమవడము చాలా విచిత్రము. అలా
మాయమవడానికి ముందే ఏదైనా ఏర్పాటు చేసివుంటారను యోచన యస్.పి
గారికి వచ్చినది. వెంటనే వయర్లెస్ ద్వారా ఆశ్రమము వద్దనున్న
ఇన్స్పెక్టర్లకు ఆశ్రమములోపలికి పోవువారిని, వచ్చు వారిని చెక్చేసి
పంపమనీ అంతేకాక మునెప్ప లోపలే దాగివున్నాడనీ, లోపలి నుండి
మునెప్ప బయటికి మారువేషములో రావచ్చుననీ, జాగ్రత్తగా కాపలా
కాయమనీ సమాచారమును పంపాడు. అలాగే పోలీసులు చురుకుగా
కాపలా కాస్తున్నారు.
పట్టుకోబోయిన పోలీసులనుండి తప్పించుకోవడము మునెప్పకు
గండము గడచినట్లయినది. తాను బావిలో దాగివున్నట్లు బాబాకు తప్ప
ఎవరికీ తెలియదు. స్వామి తనను బయటికి రమ్మని సమాచారము పంప
నంతవరకు బావినుండి బయటికి రాకూడదనుకొన్నాడు. బావిలో పూర్తి
మునిగి నీటిలో ఉండినప్పటికి ఊపిరాడునట్లు మరియు బయటి
సమాచారము తెలియునట్లు ఆక్సిజన్ పైపు, వాటర్ ప్రూఫ్ ఫోన్ రెండూ వుండు
ఫేస్ మాస్క్ (తలకు తగిలించుకొనునది) నీళ్ళ మోటర్ నుండి వచ్చు పైపు
ద్వారా బావిలో ఏర్పాటు చేసి పెట్టినందుకు బాబాగారికి మునెప్ప మనస్సు
లోనే జోహర్లు చెప్పుకొన్నాడు. రాత్రి సమయము వరకు మునెప్ప బావిలోనే
ఓపికగా ఉన్నాడు. రాత్రి పదకొండుగంటల సమయములో మునెప్ప చెవులకు
అమర్చుకొన్న రిసీవర్ల ద్వారా తపస్వి బాబాగారి గొంతు వినిపించిది.)
బాబా :- హలో! మునెప్ప
మునెప్ప :- హలో! స్వామీ చెప్పండి.
బాబా :- చెప్పేదంతా జాగ్రత్తగ విను. నీవు కరెక్టుగా పది నిమిషాలకు
బయటికిరా. బయటికి వచ్చిన వెంటనే బావిప్రక్కనే పడివున్న టవలుతో
తేమలేకుండా శరీరమంతా తుడుచుకో. నీ బట్టలు విడిచివేసి నీరు
కారకుండా పిండుకో. అక్కడేవున్న వేరే గుడ్డలు వేసుకో. నీ బట్టలు
తీసుకొని టవలు భుజము మీద వేసుకొని కుడిప్రక్క మందిరములోనికి
ప్రవేశించు. మందిరమునకు కుడిప్రక్కనే గల వరండా దగ్గర బ్యానెట్
ఎత్తి నిలబడిన జీప్ ఉంటుంది. జీప్ క్రింద డ్రైవర్ పడుకొని ఏదో రిపేర్
చేస్తున్నట్లుండును. నీవు ఆ జీపు దగ్గరకు పోయి టవలు తలకు చుట్టుకొని
ఇంజన్కు కుడి ప్రక్కన మనిషి వంగి కాళ్ళు ముందుకు పెట్టుకొనుటకు
జాగావున్నది. అక్కడ నీవు ముందు కూర్చొని కాళ్ళు ముందుకు చాపి
పెట్టుకొని వంగివుండు, అంతలో నిన్నే గమనిస్తున్న డ్రైవర్ వచ్చి బ్యానెట్ను
మూసి జీపును స్టార్ట్ చేసి బయలుదేరి పోతాడు. ఆశ్రమము వెలుపల
పోలీసులు జీపును ఆపి చెక్ చేస్తారు. వారికి ఇంజన్ ముందర అనుమానము
రాదు. కావున వారి చూపునుండి నీవు తప్పించుకోవచ్చును. పోలీస్ లకు
నేను వేసిన ప్లాన్ మీద అనుమానము రాదు. కావున నీవు సులభముగా
బయట పడవచ్చును. అక్కడి నుండి కొంత దూరము వరకు పది నిమిషాల్లో
పోయి జీపు నిలబడుతుంది. డ్రైవర్ బ్యానెట్ లాక్ క్లిప్పులు తీసి బ్యానెట్
ఎత్తుతాడు. వెంటనే నీవు బయటకు వచ్చి అక్కడే నిలబడి వున్న కారు
ఎక్కు. కారు ఎక్కేముందు నీ వెంటవున్న నీ గుడ్డలు రోడ్డు ప్రక్కన పడవేసి
కారు ఎక్కి కూర్చుంటూనే కారు కదలిపోతుంది. ఆ కారు నీ స్థావరమునకు
ఐదు కిలోమీటర్ల దూరములోనే ఆగిపోతుంది. అక్కడ దిగుతూనే ఒక
సైకిల్ మోటర్ వచ్చి ఆగి లిఫ్టు కావాలా అంటారు. అవును అను, అపుడు
ఆ సైకిల్ మోటరుతో వచ్చిన వ్యక్తి దానిని నీకే ఇచ్చి కారులో పోతాడు.
అప్పుడు దగ్గరలోనున్న నీ స్థావరమునకు సులభముగా చేరిపోగలవు. నీవు
పోయిన తర్వాత నీకిచ్చిన సెన్సార్ సహాయముతో పాము అన్వేషణ
సాగించండి. ఇప్పుడు నిన్ను పోలీసులు పసికట్టారు. కనుక ఇక మీదట
నీవు ఇక్కడికి రావద్దు. అవసరమొస్తే నీ అనుచరులను పంపించు.
చెప్పిందంతా అర్థమైందా.
మునెప్ప :- అర్థమైంది స్వామీ! మీరు చెప్పినట్లే అన్నీ జరుగుతాయి.
(తపస్వి బాబాగారు చెప్పినట్లు మునెప్ప బావినుండి బయటికి
వచ్చి బాబాగారు చెప్పినట్లే తేమ తుడుచుకొని, తన గుడ్డలు విప్పి పిండి
పెట్టుకొని అక్కడేనున్న గుడ్డలు ధరించి కుడి ప్రక్క మందిరము గుండా,
కుడిప్రక్క వరండావద్ద గల జీపులో ఇంజన్ ప్రక్కన అణిగి పోయాడు. ఆ
జీపు కదలి పోయింది. బయట పోలీసులు ఆపి తనిఖీ చేయను మొదలు
పెట్టి డ్రైవర్ను ఇలా ప్రశ్నించారు.)
పోలీస్ :- ఎక్కడికి పోతుంది?
డ్రైవర్ :- అర్ధగంట క్రితమే కదాసార్ లోపలికి వెళ్ళాము. అప్పుడు మీరు
చూచారు కదా! నా జీప్ వచ్చిన వారిని దింపి తిరిగి ఖాళీగా వెళ్ళు
చున్నాను.
పోలీస్ :- ఇది అర్ధగంట క్రిందట వచ్చిన బండి కదా! గుంటూరు నుండి
వచ్చామని చెప్పావు కదా!
డ్రైవర్ :- అవున్ సార్! వచ్చిన వారు నెలవరకు ఇక్కడే ఉంటారు. నెల
తర్వాత నేనే వచ్చి వారిని తీసుకుపోతాను. ఇది కిరాయి (బాడుగ) బండి
కావున తిరిగి వెళ్ళుచున్నాను.
పోలీస్ :- సరె వెళ్ళు.
డ్రైవర్ :- నమస్తే! వస్తాను సార్.
(జీపు కదిలి పోయింది. పోలీస్ బారినుండి తప్పించుకొన్నందుకు
మునెప్ప సంతోషించాడు. అక్కడినుండి పది నిమిషములు పోతూనే జీపు
ఆగింది. డ్రైవర్ బ్యానెట్ ఎత్తాడు. అప్పుడు మునెప్ప తన గుడ్డలను రోడ్డు
ప్రక్కవేసి ప్రక్కనే నిలబడివున్న కారులో ఎక్కాడు. మునెప్ప ఎక్కగానే కారు
బయలుదేరింది. తెల్లవారక మునుపే ఒకచోట ఆగింది. మునెప్ప
దిగి మూత్రవిసర్జన చేసేలోపే అక్కడికి ఒక సైకిల్మెటరు వచ్చి ఆగి లిఫ్టు
కావాలా అన్నాడు. అపుడు అవును అన్నాడు మునెప్ప. వెంటనే మునెప్పకు
బండి ఇచ్చి వచ్చిన వ్యక్తి కారులో పోయాడు. మునెప్ప మోటారుసైకిల్లో
తెల్లవారకనే తన స్థావరమును చేరుకొన్నాడు.
ఆ రాత్రే తెల్లవారు జామున నాలుగుగంటలకు యస్.పి గారి
ఆదేశము మేరకు మద్రాస్ (చెన్నై) నుండి పోలీస్ కుక్కలు వచ్చాయి.
తెల్లవారిన తర్వాత ఆరుగంటలకే యస్.పి గారు కుక్కలతో సహా బాబాగారి
ఆశ్రమమునకు వచ్చాడు. బాబాగారి అనుమతి తీసుకొని మునెప్ప పరుగిడిన
అడుగుల వాసనను కుక్కలకు చూపించారు. ఆ కుక్కలు వాసన చూస్తూ
మందిరమునకు తర్వాత లోపలి వనములోనికి పోయాయి. కానీ బావివద్దకు
పోకుండా తిరిగి బయటికి వచ్చాయి. కుడిప్రక్క వరండా వద్దకు వచ్చి
ఆగిపోయాయి. ఏమి అర్థముకాని పోలీస్లు కుక్కలను తిరిగి వ్యాన్లో
తీసుకపోతుండగ మునెప్ప గుడ్డలు పడిన స్థలమువద్దకు వ్యాన్ చేరుకోగానే
కుక్కలు మొరిగి క్రిందికి దిగాలని చూచాయి. అది గ్రహించిన పోలీస్లు
వెంటనే వ్యాన్ను ఆపి కుక్కలను క్రిందికి దించగా, అవి నేరుగా పోయి
రోడ్డు ప్రక్కనే మునెప్ప గుడ్డలను పట్టుకొన్నాయి. పోలీసులు ఆ గుడ్డలను
స్వాధీనము చేసుకొని, అవి తాము వెంబండించినపుడు మునెప్ప ధరించిన
గుడ్డలని నిర్ధారించుకొన్నారు. ఇన్స్పెక్టర్ ఆ సమాచారమును యస్.పి
గారికి తెలిపాడు. అయితే యస్.పి గారు మునెప్ప పారిపోయినట్లు
నమ్మలేదు. అప్పుడు ఇన్స్పెక్టర్తో ఇలా అన్నాడు.
యస్.పి :- మునెప్ప మందిరములోనికి పారిపోయింది కళ్ళారా చూచాము.
అతను బయటపడే అవకాశములేనట్లు చుట్టూ కాపలా ఉన్నాము. వచ్చి
పోయేవారిని తనిఖీ చేస్తున్నాము. కానీ బట్టలు మాత్రము బయట
కనిపించడము మునెప్ప పారిపోయినట్లు మనలను నమ్మించడానికి వేసిన
ప్లాన్ తప్ప వేరుకాదు.
ఇన్స్పెక్టర్ :- అలాగంటారా సార్!
యస్.పి :- అవును. బట్టలు కూడా మీ అజాగ్రత్త వలననే బయటికి
వచ్చాయి. రాత్రి అనుమానాస్పద వెహికల్ ఏదైనా బయటికి పోయిందా?
ఇన్స్పెక్టర్ :- రాత్రి పదకొండు గంటల సమయములో ఒక జీప్ పోయింది.
దానిని బాగా చెక్చేసి పంపాము. అది అంతకు ముందే గుంటూరు
నుండి కిరాయికి మనుషులను తీసుకవచ్చి వదలి వెళ్ళిపోయింది. అది
వచ్చినపుడు పదిమంది భక్తులతో వచ్చింది. పోయేటప్పుడు ఖాళీగా
పోయింది. అది పదిన్నర సమయములో లోపలికి పోయింది. లోపలే
భోజనము చేసిన తర్వాత అది ఖాళీగా వెళ్ళి పోయింది. వచ్చిన అర్ధగంట
లోపలే తిరిగి వెళ్ళి పోయింది. అందులో డ్రైవర్ తప్ప లగేజి కూడా
ఏమీలేదు. జీపు ఖాళీగా వెళ్ళింది. అంతతప్ప రాత్రంతా ఏదీ లోపలికి
రాలేదు. బయటికి కూడా పోలేదు.
యస్.పి :- అలాగా! అయితే ఆ జీప్లోనే మునెప్ప గుడ్డలు రహస్యముగా
వెళ్ళివుంటాయి. ఇది మనలను తప్పుదారి పట్టించడానికి వేసిన ప్లాన్.
మునెప్ప గుడ్డలు బయటికి పోయినంతమాత్రమున మునెప్ప బయటికి
పోయాడని మనము నమ్మకూడదు.
ఇన్స్పెక్టర్ :- ఇపుడేమి చేయాలి సార్!
యస్.పి :- మీరు తపస్విబాబాగారి దగ్గరకు పోయి మునెప్ప పారిపోయినట్లు
చెప్పండి. దానితో మనము పూర్తి నమ్మినట్లు వారికి తెలుస్తుంది. కాపలా
కూడా ఎత్తివేసి రహస్యముగా నిఘా వేసివుంచండి. కాపలా లేదని మునెప్ప
సులభముగా బయటికి రాగలడు. మనము నిఘా వేసివుంచినట్లు అతనికి
తెలియదు. కావున సులభముగా దొరుకుతాడు.
(రాఘవ, యోగ, మేఘ, చక్రి మొదలగు ఆటవికులు అడవి
మార్గమున ప్రయాణించి చివరకు తమ గూడెమును చేరుకొనిరి. రాఘవను
పిలుచుకొని వచ్చినందుకు గూడెము నాయకుడు మల్లుదొర సంతోష
పడినాడు. ఆ దినము రాఘవ విశ్రాంతి తీసుకొన్న తర్వాత మరుసటి
దినము మల్లుదొర రాఘవను పిలిచి ఇలా అన్నాడు.)
మల్లుదొర :- రాఘవా! నిన్ను చూచినప్పటినుండి నీలో ఏదో గొప్పతనము
ఉన్నదని నాకు తోచుచున్నది. నిన్ను చూచింది ఒక దినమే అయినా, ఆ
దినమునుండి నా మనసంతా నీ మీదనే ఉన్నది. అందువలననే మా
మనుషులను నీ కొరకు పంపాను. ముఖ్యముగ నేను నీకు ఒక విషయమును
చెప్పాలి. నాకు ఒకే ఒక కూతురున్నది. మేము అడవిలో ఉన్నా ఆమెను
పట్టణములో పెద్ద చదువులే చదివించాను. ఆమెకు యుక్తవయస్సు వచ్చినది.
ఆమె కూడా తెలివైనది. ఆమె చదువుకొన్నది మా గూడెములోనున్న
వారంతా చదువులేని వారే. చిన్నప్పటినుండి మా గూడెము వారందరు
ఆమెను ప్రత్యేకముగా గౌరవముగా చూచుచున్నారు. వాస్తవానికి మా
గూడెములో ఆమెను పెళ్ళాడువారు ఎవరూ లేరు. ఆమె పెళ్ళి విషయము
నాకు సమస్యగానే ఉన్నది. నిన్ను చూచిన తర్వాత నా మనస్సులో ఒక
యోచన వచ్చింది. ఆమెకు తగిన వరుడుగా నీకు అన్ని అర్హతలున్నాయి.
ఇది నా ఉద్దేశ్యము మాత్రమే. నా ఉద్దేశ్యము మంచిదో కాదో నాకు
తెలియదు. నీవు అన్ని విధముల యోచించి నీ ఉద్దేశ్యము నాకు తెలుపు.
ఇందులో ఏ బలవంతమూ లేదు.
(మల్లుదొర చెప్పిన మాటలను విని రెండు నిమిషములు రాఘవ
యోచించాడు. తనకు పిల్లనిచ్చుటకు కూడా నిరాకరించి అవమానముపాలు
చేసిన సమాజమునకు దూరముగా వచ్చాను. ఇక్కడివారు కల్లా కపటము
లేని ప్రజలు. వారు గౌరవించి పిల్లనిస్తానంటే వారు చూపు ఆప్యాయతకు
నేను తప్పనిసరిగ ఒప్పుకోవలసిందే అనుకున్నాడు. తర్వాత రాఘవ మల్లు
దొరతో ఇట్లన్నాడు.)
రాఘవ :- మీరు పెద్దవయస్సున్నవారు. మీరు అన్ని విధముల మంచినే
యోచించివుంటారు. మీరు అంతగా అడిగితే నేను కాదనలేను. మీ
మాటను గౌరవించడము నాకర్తవ్యము. అయితే నాది చిన్న మనవి.
అదేమనగా నాకు ఒక గొప్ప గురువు లభించాడు. అతనే రాజయోగానంద
స్వామి. నేనిప్పుడు ఆయన దగ్గర నుండే వచ్చాను. ఈ విషయము
ఆయనకు తెలిపి, ఆయన ఆశీర్వాదముతోనే మీరు చెప్పినట్లు చేసుకొంటాను.
ముందు మనమందరము పోయి స్వామిగారికి ఈ విషయమును తెలియ
జేయాలి. ఈ విషయమును స్వామిగారికి నేను చెప్పే దానికంటే పెద్దలు
మీరు చెప్పేదే మంచిది.
(రాఘవ మల్లుదొర మాటను గౌరవించి ఒప్పుకోవడముతో
గూడెములోని అందరూ సంతోషించారు. తర్వాత అందరూ కలిసి రాజ
యోగానంద స్వామి వారికి విషయమును తెలుపుటకు బయలుదేరారు.)
(రాజయోగానంద స్వామి ఆశ్రమములో రాధేశ్వరి నిత్యము
జ్ఞానమును తెలుసుకొనుచూ కాలము గడుపుచుండెను. రాజయోగానంద
స్వామి దృష్ఠిలో రాధేశ్వరికి మంచి స్థానము ఏర్పడినది. ఆమె కొద్ది
కాలమునకే గొప్ప జ్ఞాన సంపన్నురాలు కాగలదని అనుకొన్నాడు. కొద్ది
రోజులకు రాధేశ్వరి మేనమామకు, రాధేశ్వరి రాజయోగానంద స్వామివద్ద
ఉన్నట్లు తెలిసింది. స్వాములు అంటే తక్కువ భావముగలవాడు ఆమె
మేనమామ. అతని పేరు జగన్నాథ్. రాధేశ్వరి పినతల్లి పేరు కుల్లాయమ్మ.
ఒక దినము జగన్నాథ్, కుల్లాయమ్మ ఇద్దరు రాజయోగానంద స్వామి
ఆశ్రమానికి వచ్చి స్వామిని బెదిరించి రాధేశ్వరిని తీసుకపోవాలని
అనుకొన్నారు. ఒకరోజు వారు ఇద్దరూ వారితో పాటు నలుగురు రౌడీలను
వెంటబెట్టుకొని రాజయోగానందస్వామి వద్దకు బయలుదేరి వచ్చారు.
స్వాములు అంటే బిక్షగాళ్ళ కిందికి జమకట్టుకొన్న వారు స్వామిని బెదిరించి
గానీ, కొట్టిగానీ రాధేశ్వరిని తీసుకపోవాలనుకొన్నారు. ఒక దినము
ఉదయము తొమ్మిది గంటలకే నలుగురు రౌడీలతో వచ్చిన జగన్నాథ్,
కుల్లాయమ్మ ఇద్దరూ స్వామి విషయము తెలియనివారై అక్కడ స్వామిని
గురించి దురుసుగా మాట్లాడినారు. స్వామివారు రాధేశ్వరి లోపల
ఉండుట వలన వారికి ఈ విషయము తెలియదు. వారు దురుసుగా
మాట్లాడినందుకు ఆశ్రమములోనున్న భక్తులకు వారి మీద కోపము వచ్చింది.
జగన్నాథ్్నూ, కుల్లాయమ్మానూ, వారితో పాటు వచ్చిన రౌడీలనూ, ఆరు
మందినీ అక్కడున్న అరవైమంది భక్తులు తలా ఒక దెబ్బ కొట్టారు. వారిని
చితకబాదడమేకాక తాళ్ళతో వారి చేతులు కాళ్ళు కట్టిపడవేసినారు.
అంతవరకు స్వామిని, స్వామి భక్తులను తక్కువగా తలచిన వారికి స్వామి
భక్తులు యమకింకరులవలె కనిపించారు. అంతవరకు ఎక్కడా వారు
తన్నులు తినలేదు. ఇక్కడికి వచ్చి బాగా తన్నులు తిన్నారు. విడిచిపెట్టితే
చాలు, ఎప్పటికీ ఈ ప్రాంతమునకు కూడా రాకూడదనుకొన్నారు. స్వామి
లోపలనుండి బయటికి రాకనే స్వామికి ఈ విషయము తెలియకనే,
సంఘటన జరిగిన పది నిమిషాలకే రాఘవా, రాఘవతోపాటు మల్లుదొర,
యోగ, మేఘ, చక్రి మొదలగు ముఖ్యమైన ఆటవికులందరు అక్కడికి వచ్చారు.
అక్కడ అప్పుడే జరిగిన విషయము తెలుసుకొన్నారు. అంతలో స్వామికూడా
బయటికి వచ్చాడు. అందరిని చూచాడు. అక్కడ కట్టివేయబడివున్న
వారిని కూడా చూచాడు. విషయమంతా అర్థమైనది. జగన్నాథ్, కుల్లాయమ్మ
ఇద్దరూ అప్పుడు స్వామిని చూచారు. స్వామి అంటే అడుక్కొని బ్రతికేవాడు
అని తక్కువ అంచనా అంతవరకు వారికి ఉండేది. స్వామి చెప్పకనే తన్ని
కట్టివేశారు. స్వామి చెప్పితే చంపివేసేదానికైనా అక్కడున్నవారు వెనుకాడరను
కొన్నారు. అంతలో స్వామి, వారి కట్లు విప్పమని చెప్పారు. అప్పుడు
వారితో ఇలా అన్నాడు.)
రాజయోగ :- మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చినవారు స్వామిని
ఎందుకు దూషించారు?
జగన్నాథ్ :- మా అమ్మాయి ఉన్నదని తెలిసి వచ్చాము. మాకు
తెలియకుండా ఇక్కడ పెట్టుకుంటారా, అని కొద్దిగా తప్పుగానే మాట్లాడినాను.
రాజయోగ :- మీకు తెలియకుండా మేము దాచిపెట్టవలసిన అవసరము
మాకు లేదు. మాకు రాధేశ్వరి మీ విషయమంతా చెప్పింది. ఇంతకు
ముందు మీ ఆటలుసాగేవి. అప్పుడు రాధేశ్వరి ఒంటరిది. ఇప్పుడు ఆ
అమ్మాయి ఒంటరిది కాదు. ఆమెకు తండ్రిగా నేనున్నాను. ఇప్పటినుండి
రాధేశ్వరి విషయములో ఎక్కడ చెడుగా ప్రవర్తించినా నేను మీ విషయములో
ఊరక ఉండనని అర్థము చేసుకోండి. (అంతలో రాధేశ్వరి కూడా అక్కడికి
వచ్చినది. అక్కడ పరిస్థితిని అంతా అర్థము చేసుకొని మౌనముగా ఉండి
పోయినది. అక్కడున్న ఆటవికులు వారి కట్లను విప్పారు.)
జగన్నాథ్ :- మేము అన్యాయముగా ఇక్కడికి రాలేదు. మమ్ములను అనవసర
ముగా కొట్టారు.
కుల్లాయమ్మ :- మా అమ్మాయిని పంపండి. మేము పోతాము.
(స్వామి వారు ఏమి మాట్లాడలేదు. మీరే మాట్లాడండి అన్నట్లు
రాఘవవైపు చూచి అక్కడినుండి పోయాడు. అప్పుడు రాఘవ వారితో
ఇలా అన్నాడు.)
రాఘవ :- ఇప్పుడు మీ ఉద్దేశ్యము ఏమి?
జగన్నాథ్ :- మా అమ్మాయిని మావెంట పంపండి.
(అప్పుడు ఆటవికులు రాఘవను మాట్లాడవద్దని చెప్పి వారితో
మేము మాట్లాడుతామని ఇలా అన్నారు.)
యోగ :- రాధేశ్వరిని ఇక్కడికి తెచ్చి స్వామివద్ద ఉంచినది మేమే. రాధేశ్వరికి
మేమంతా అన్నగార్లుగా ఉన్నాము. ఆమె మీ విషయమంతా చెప్పినది.
మీరు ఆమె ఆస్తికొరకు అఘాయిత్యాలు చేస్తునట్లు మాకు తెలిసినది. మీ
నుండి రాధేశ్వరికి ఎటువంటి కష్టమొచ్చినా దానికి మొదటవుండి ఆ
కష్టమును లేకుండా చేస్తాము. అంతేకాదు తర్వాత మిమ్ములను
బ్రతుకనివ్వము.
మేఘ :- రాధేశ్వరి ఇంట్లో మీరున్నట్లు, ఆ ఇల్లును మీరు ఆక్రమించు
కొన్నట్లు మాకు తెలిసింది. ఇప్పటినుండి మూడు రోజులలోపల ఆ ఇల్లును
మీరు వదలిపోవాలి. లేకపోతే నీవు ఎంతమంది రౌడీలను పెట్టుకొన్నా
నిన్ను మాత్రము వదలము. రౌడీలు నిన్ను కాపాడలేరు, జాగ్రత్త.
యోగ :- ఇది మొదటిమారు నీవు మమ్ములను చూచావు, మేము మిమ్ములను
చూచాము. అందువలన ఇప్పుడు మాటలతోనే చెప్పి పంపుచున్నాము.
రెండవమారు మేము మీకు కనిపిస్తే మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఏకంగా
యమపురికే పంపుతాము.
(అంతవరకు అక్కడ యోగా, మేఘా మాట్లాడిన మాటలను విన్న
తర్వాత రాధేశ్వరికి క్రొత్త ధైర్యము వచ్చింది. అంతవరకు జగన్నాథ్ను
చూస్తే భయపడు రాధేశ్వరి అప్పుడు ఇలా అన్నది.)
రాధేశ్వరి :- ఇంతవరకు మీరు ఎన్నో ఆగడాలు చేశారు. చివరకు నన్ను
చంపాలని చూచారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఏమీ సాగవు. ఇప్పుడు
నాకు దేవుడిచ్చిన తండ్రి, సోదరులు దొరికారు. ఇప్పటికైనా మంచి బుద్ధి
తెచ్చుకొని బ్రతకండి. నా అన్నగారు చెప్పినట్లు ఇల్లునూ, ఇంటిలో
సామానులను వదిలిపోండి. ఇప్పటినుండి నా ఆస్తికి మీకు ఎటువంటి
సంబంధమూ ఉండదు.
మేఘ :- మీతో మేము ఎక్కువగా మాట్లాడము. మూడు రోజులలో అన్ని
వదిలిపోవాలి. లేకపోతే మీ మెడకు మీరే ఉరి వేసుకొన్నట్లే. మూడు
రోజుల తర్వాత మీకు చావో బ్రతుకో మీ చేతులలోనే ఉంది. ముందు
ఇక్కడినుండి వెళ్ళిపొండి.
(అలా యోగా, మేఘ గట్టిగా హెచ్చరిక చేసి పంపారు. వారు
వదలితే చాలు అనుకొన్న కుల్లాయమ్మ, జగన్నాథ్ ఇద్దరూ భయపడి
పోయారు. వారు పొమ్మంటేనే ఏమాత్రము ఆలస్యము చేయకుండా అక్కడి
నుండి వెళ్ళిపోయారు.)
(తాటిమాను మున్నెప్ప పోలీసులు ఉచ్చునుండి తప్పించుకొని
సులభముగా తన స్థావరమును చేరుకొన్న తర్వాత తన ముఠాలోని
మనుషులకు విషయమంతా చెప్పి, వజ్రాలను కనుగొను సెన్సార్ మిషన్
ఇచ్చి, వజ్రాలున్న పామును వెతకడానికి పొమ్మన్నాడు. ఇది సులభమైన
పద్ధతి అనుకొన్న వెంకు, సెన్సార్ తీసుకొని మొదట పాము పారిపోయిన
స్థలము నుండి వెతకాలనుకొని అక్కడికి పోయారు. ఆ విధముగా పోయిన
మునెప్ప మనుషులకు ఒక దినము పాములు పట్టువాడు కనిపించాడు.
వానివద్ద అనేక పాములున్నాయి. వాడు పాములు పట్టేవాడేకాక పెద్ద