సిద్ధాంత కర్తలు 201 to Last part3.
జవాబు :- పాత్రలో అన్నము ఉడికిందా లేదాయని ఒక మెతుకును బట్టి
చూస్తాము. ఒక మెతుకును (ఒక గింజను) బట్టి పాత్రలోని అన్నము
అంతా అట్లే ఉంటుందని అనుకుంటాము. ఒక మెతుకుయున్నట్లు మిగతా
మెతుకులు అట్లే ఉండడము నిజమేయగును. అదే విధముగా దయానంద
సరస్వతి చేసిన విమర్శలలో ఒక దానిని చూచి మిగతావన్నీ అలాగే
ఉంటాయని తెలియవచ్చును. ఒకనాడు హిందూమతములోని వైష్ణవున్ని
చూచి అతని ముఖము మీద గల నామమును దయానందుడు హేళనగా
మాట్లాడినాడు. అప్పుడు హేళనగా మాట్లాడుచూ “ముఖము మీద ఒక
నామము పెట్టుకొంటే వైకుంఠము ప్రాప్తిస్తుంది అనుకొంటే ముఖమునిండా
ఎక్కువ నామాలు పెట్టుకొంటే వైకుంఠముకంటే శ్రేష్ఠమయినది ప్రాప్తించును
కదా!” అన్నాడు. ఈ విధముగా విశిష్టాద్వైతమును అనుసరించువారిని
విమర్శించుచూ వారికి వ్యతిరేఖముగా మాట్లాడుచుండెను.
ప్రశ్న :- దేవుడు సాకారుడని నమ్ముచుందురు విశిష్టాద్వైతులు, దేవుడు
నిరాకారుడని చెప్పుచుందురు అద్వైతులు. అద్వైతులనగా ఆర్యులు,
ఆర్యులలోని వాడే దయానందుడు. అందువలన ఆయన అద్వైతమునే
చెప్పవచ్చును. అద్వైతము ప్రకారము దేవుడు నిరాకారుడని కూడా
చెప్పవచ్చును. అట్లు అద్వైత బోధను దేవుని నిరాకారత్వమును
దయానందుడు చెప్పలేదా?
జవాబు :- ఆయన పూర్తి 'అద్వైతుడు', 'సంపూర్ణ ఆర్యుడు' అయినందున
దేవుని నిరాకారమునే సమర్థిస్తాడు తప్ప సాకారమును ఒప్పుకోడు అదే
విధానమునే ఒకచోట ఇలా చెప్పాడు చూడండి. "ఈశ్వరుడు నిరాకారు
డనియే చెప్పాలి. ఎందుకనగా! సాకారుడైతే వ్యాపకుడు కాజాలడు.
వ్యాపకుడు కానియెడల సర్వము ఆయనయందు ఉండవు. దేవుడు ఒక
అవతారమయితే, ఒక సాకారమైతే అతడు గుణకర్మ స్వభావములను
పరిమితముగా కల్గియుండును. అట్లే శీతోష్ణములు, ఆకలిదప్పికలు, రోగ
దోషములు మున్నగువాటిలో పరిమితము కాగలడు. అందువలన ఈశ్వరుడు
సాకారుడని చెప్పకూడదు, నిరాకారుడనియే చెప్పాలి. ఈశ్వరుడు
సాకారుడయితే అతనికి కన్ను, ముక్కు, చెవులు మున్నగునవి నిర్మించువాడు
మరియొకడుండవలసివచ్చును. సంయోగము వలన తయారయిన వానిని
సంయుక్తము చేయు నిరాకార చేతనమొకటి యుండవలెను. ఒకవేళ
ఎవరయిన ఈశ్వరుడు తన శరీరమును తానే నిర్మించుకొనును అని
అనినచో, అప్పుడు శరీరమును ఏర్పరచుకొనుటకు ముందు ఈశ్వరుడు
నిరాకారుడుగనే యుండును. పరమేశ్వరుడు శరీరమును ఎప్పుడూ
ధరించడు. ఈశ్వరుడు నిరాకారునిగాయుండి జగత్తునంతటినీ సూక్ష్మ
కారణములనుండి స్థూలాకారములకు తెచ్చును” అని అన్నాడు. ఇట్లు
దయానంద సరస్వతి దేవుడు నిరాకారుడని, దేవుడే ఈశ్వరుడని తన
భావములోని అద్వైతమునే బయటికి చెప్పాడు. దేవుడు సాకారుడని
విశిష్టాద్వైతుల సిద్ధాంతముకాగా సాకారుడు కాడు అని చెప్పడము అద్వైత
సిద్ధాంతములోయున్నది. అద్వైతము ప్రకారమే దయానందుడు నిరాకార
బోధను చెప్పాడని తెలియుచున్నది.
ప్రశ్న :- దయానంద సరస్వతి సిద్ధాంతకర్త కాదు కదా! అటువంటప్పుడు
ఆయన ప్రస్థావన మనకు అవసరము లేదు కదా?
జవాబు :- దయానంద సరస్వతి సిద్ధాంతకర్త కాకపోయినా అద్వైత
సిద్ధాంతమును ప్రచారము చేయడములోనూ, వేదముల ప్రచారములోనూ
ముఖ్యమైన పాత్రను పోషించాడు. అంతేకాక ఆర్యసమాజమును స్థాపించి
అందులో యున్నవారందరూ నిత్యము యజ్ఞములను చేయునట్లు చేసి
అద్వైతమునకు ఆర్యుల మనోభావములకు బలమును చేకూర్చిన ఆర్యజాతి
వాడు. ఆర్యులంటే ఎవరో తెలియనివారికి 'నేను ఆర్యున్ని' అని కనిపించు
నట్లు ఆర్యసమాజమును ప్రత్యక్షముగా స్థాపించినవాడు దయానంద సరస్వతి.
ఈయన 'మూర్తి పూజ’ను పూర్తి వ్యతిరేఖించెడివాడు. దేవుడు నిరాకారుడని
చెప్పుచూ విశిష్టాద్వైతులకు వ్యతిరేఖ గురువుగా పేరుగాంచిన వాడు.
దయానంద సరస్వతి రాకతో తిరిగి ఆర్యుల ధీశక్తి అందరికీ కనిపించినది.
“వేదతత్వ ప్రకాశము” అను గ్రంథమును రచించి తిరిగి వేదములను
ఎవరూ మరువకుండా చేశాడు. వేదాధ్యయనమునకు బలమును
చేకూర్చాడు. దాదాపు 59 సంవత్సరములు బ్రతికిన దయానందుడు ఆర్యుల
పాత్రను బాగా పోషించినవాడు.
ప్రశ్న :- శంకరాచార్యుల వారు భగవద్గీతను ఒక్కదానిని వ్రాయగా, ఇరవై
గ్రంథములను వ్రాశాడని ప్రచారము చేయవలసిన అవసరము ఆర్యులకు
ఏమి వచ్చినది?
జవాబు :- 'చెట్టు పేరుచెప్పి కాయలమ్మినట్లు' ఆర్యులు చేశారు. శంకరా
చార్యుల వారిని ఆర్యులే దేశమంతా త్రిప్పి బాగా ప్రచారము చేసి హిందూ
మతములో గొప్పవాడు అన్నట్లు ఆర్యులే చేశారు కదా! దానితో శంకరుడు
గొప్పవాడని అందరికీ తెలిసినది. గొప్పవాడయిన శంకరుడు వ్రాసినట్లు
చెప్పితే అవి గొప్పగయుండునను భావముతో ఆర్యులు వ్రాసిన 19
గ్రంథములను శంకరుడు వ్రాసినట్లు శంకరుని పేరుతో ప్రచారము చేశారు.
19 గ్రంథములలో ఆర్యుల బోధ సంపూర్ణముగా యున్నది. అయినా ఆ
విషయము ఎవరికీ తెలియదు. 20 గ్రంథములను శంకరాచార్యుల వారే
వ్రాశాడని అందరూ నమ్మారు.
పన్నెండు సంవత్సరములు నేర్వవలసిన 'పరకాయ ప్రవేశ విద్య'ను
శంకరుడు ఎప్పుడూ నేర్వలేదు. అయినా శంకరుడు పరకాయ ప్రవేశ
విద్యను నేర్చినట్లు ప్రకటించిన ఆర్యులు, తాము వ్రాసిన గ్రంథముల ముందర
శంకరాచార్యుని పేరుపెట్టి ఆయనే 20 గ్రంథములను వ్రాశాడని అందరూ
నమ్మునట్లు చేశారు. గీతాభాష్యమును శంకరుల వారు వ్రాశారు. మిగతా
గ్రంథములు శంకరునివి కావు. శంకరుడు ఏమాత్రము వ్రాయలేదు.
గీతకు వ్యతిరేఖమయిన భావములు ఎన్నో మిగతా 19 గ్రంథములలో
యుండుట వలన శంకరుడు వాటిని వ్రాయలేదని సులభముగా చెప్పు
చున్నాము.
ప్రశ్న :- హిందూమతములోనున్న సిద్ధాంతకర్తలలో మొదటివాడు శంకరా
చార్యులయినా అద్వైతమే ఆయనది కాదు, అద్వైతము పూర్తి ఆర్యులదే
నని మీరు చెప్పారు. ఈ విషయమును ప్రకటించుట పెద్ద సాహసోపేత
మైన పనియని చెప్పవచ్చును. శంకరుల తర్వాత వచ్చిన విశిష్టాద్వైత
సిద్ధాంతకర్త రామానుజులకు శంకరునికి ఏమిటి తేడాయని కొందరడుగు
చున్నారు.
జవాబు :- సిద్ధాంతకర్తల విషయము ఏమాత్రము ఎవరికీ తెలియకుండా
పోయిన దానివలన వారి భేదము ప్రజలకు తెలియకుండా పోయినది.
నేడు హిందూమతములో సిద్ధాంతకర్తలు ఎవరు? అని అడిగితే దానికి
ప్రజల వద్ద జవాబే లేదు. దీనినిబట్టి నేడు సిద్ధాంతకర్తల విషయము
ప్రజలకు తెలియకుండా పోయినదని చెప్పవచ్చును. అసలు విషయానికి
వస్తే శంకరాచార్యుల వారు తాను స్వయముగా అద్వైతమును ప్రచారము
చేయలేదు. తనది అద్వైత సిద్ధాంతమని స్వతహాగా ఎక్కడా చెప్పలేదు.
శంకరాచార్యుల వారివెంటయున్న ఆర్యులే అద్వైతమును ఆదిశంకరులకు
అంటగట్టి దానికి కర్త శంకరులేయని చెప్పారు. వాస్తవానికి శంకరుడు
అమాయకుడు. అసలు మాయకులు ఆర్యులే. శంకరాచార్యుల వారు
బ్రతికినప్పుడుగానీ, చనిపోయిన తర్వాతగానీ శంకరాచార్యుల వారే అద్వైత
సిద్ధాంతమును కనుగొన్నాడని చెప్పుచూ వచ్చారు. అందువలన శంకరున్ని
సిద్ధాంతకర్తలనుండి మినహాయించవలసి వస్తుంది. అట్లు మినహాయించి
చూస్తే ఇద్దరే సిద్ధాంతకర్తలు మిగులుచున్నారు. వారు చెప్పిన సిద్ధాంతములు
వారివే అయినందున సిద్ధాంతకర్తలు ఇద్దరే అని చెప్పవచ్చును. సిద్ధాంత
కర్తలు ప్రతిపాదించిన సిద్ధాంతములు కూడా రెండేయని చెప్పవచ్చును.
రెండిటిలో ఒకటి విశిష్టాద్వైతము, రెండు ద్వైతము. వివరముగా చెప్పితే
విశిష్ట +అద్వైతము=విశిష్టాద్వైతము అని విడదీసి చెప్పవచ్చును.
రామానుజుల వారిది అద్వైతమే కాగా, మధ్వాచార్యుల వారిది అందుకు
భిన్నముగాయున్న ద్వైతము అని చెప్పవచ్చును.
దేవుడు సాకారుడు నిరాకారుడు కాదు అని చెప్పు రామానుజుల
వారు సాకారమైన దేవునియందు భక్తికల్గి ఆరాధించడమే విశేషత.
అందువలన రామానుజుల వారిది విశిష్టాద్వైత సిద్ధాంతమయినది. దేవుడు
సాకారుడే ఆయనను ఆరాధించడమే విశేషమైనప్పుడు ఆరాధించువాడు
దేవునికంటే వేరుగా యుండవలసిందే. అందువలన ఒకప్రక్క దేవుడు మరొక
ప్రక్క దేవున్ని ఆరాధించుటకు జీవుడు ఉండవలెనని, అలా జీవుడు, దేవుడు
ఇద్దరు ఉన్నారని చెప్పడమే ద్వైతము.
ప్రశ్న :- శంకరాచార్యుల వారు సిద్ధాంతకర్త కాదు. ఆయన ఒక
సిద్ధాంతకర్తగా ఆర్యుల సృష్టేగానీ స్వయముగా 'నేను సిద్ధాంతకర్తను' అను
భావము శంకరునికి లేదు. లోకము దృష్ఠిలో 'సిద్ధాంతకర్తలు ముగ్గురు'
అని గలదు. అయితే ఆర్యుల లోగుట్టు తెలిసిన వానికి ఎవనికయినా
సిద్ధాంతకర్తలు ఇద్దరేనని చెప్పగలరు. ఇద్దరు సిద్ధాంతకర్తలున్నా వారు
కూడా సత్యమైన జ్ఞానమును తెలియకపోవడము వలన, హిందూ మతములో
సిద్ధాంత లోపమున్నదని చెప్పవచ్చును. ముందునుండి యున్న సిద్ధాంత
కర్తల ద్వారా దేవుడు భగవద్గీతలో చెప్పిన జ్ఞానము పూర్తి బయటికి రాలేదు.
ప్రజలలోనికి సంపూర్ణ జ్ఞానము రావాలంటే సిద్ధాంత లోపమును సరిదిద్ద
వలసియున్నది. విశిష్టాద్వైతములోని తప్పును, ద్వైతములోని తప్పును విడదీసి
చూపించు వారు రావాలి. అలా వచ్చినవారు రెండు సిద్ధాంతములు కాదని
స్వచ్ఛమయిన జ్ఞానమునకు ఆధారమైన సిద్ధాంతమును ప్రజలు నమ్మేటట్లు
చూపవలసియుండును. ఇది జరిగే పనేనా?
జవాబు :- అన్నము తినేటప్పుడు రెండు మూడు కూరలను అన్నములో
తినినా చివరిలో కొద్దిగా అయినా పెరుగు అన్నము తిననిదే కొందరికి
తృప్తియుండదు. అలాగే తమకు తెలిసిన జ్ఞానములో ఎన్నో సిద్ధాంతము
లున్నా ఆఖరికి తృప్తినిచ్చే జ్ఞానము తెలియనంతవరకు క్రొత్త సిద్ధాంతము
కొరకు, దానివలన తెలియబడే క్రొత్త జ్ఞానము కొరకు వెదుకుచుందురు.
"సంపూర్ణశ్రద్ధయున్న వారికి సంపూర్ణమైన జ్ఞానము లభించునను” దేవుని
మాట వృథాకాదు. అలాగే " నీ విరోధులు నీకు ఎదురాడని
జ్ఞానమును నేను ఇస్తానని" చెప్పిన భగవంతుని మాట వృథాకాదు.
అందువలన సంపూర్ణ జ్ఞానమును తెలుపు క్రొత్త సిద్ధాంతము రాగలదని
ధైర్యముగా చెప్పవచ్చును.
ప్రశ్న :- శంకరులు సిద్ధాంతకర్త కాదు. ఆయన స్వయముగా అద్వైత
సిద్ధాంతమును చెప్పలేదు అన్నారు. తర్వాత వచ్చిన రామానుజాచార్యుల
వారు చెప్పిన జ్ఞానమును కాదని, అలాగే తర్వాత కొంతకాలమునకు వచ్చిన
మధ్వాచార్యుల జ్ఞానమును కాదని ఇంకా గొప్ప జ్ఞానము కలదంటారా?
జవాబు :- ఇద్దరు సిద్ధాంతకర్తలు చెప్పిన జ్ఞానమున్నప్పుడు, ఆ రెండు
మార్గములలో జ్ఞానమును చెప్పినప్పుడు, అందులో ఒకటి సత్యము
కావచ్చును మరొకటి అసత్యము కావచ్చును. రెండూ రెండుమార్గము
లైనప్పుడు ఏదో ఒకటి సత్యము, మరొకటి అసత్యము కావచ్చును లేక
రెండూ అసత్యము కావచ్చును. అంతేగానీ రెండు సత్యము కావు. ఈ
సూత్రము ప్రకారము వారి జ్ఞానమును తేల్చి చెప్పుటకు వారు వ్రాసిన
గ్రంథములను చూడవలసియుంటుంది. శంకరాచార్యుల తర్వాత వచ్చిన
రామానుజాచార్యుల వారు 120 సంవత్సరములు బ్రతికి ఆయన
సిద్ధాంతము మీద గల జ్ఞానమును తొమ్మిది (9) గ్రంథములుగా వ్రాశాడు.
అవి వరుసగా ఇలా ఉన్నవి.
1)వేదాంత సంగ్రహము.
2) గీతాభాష్యము.
3) వేదాంత సారము.
4) శ్రీరంగ గద్యము.
5) నిత్యగ్రంథము.
6) శ్రీభాష్యము.
7) వేదాంత దీపము.
8) శరణాగతి గద్యము.
9) శ్రీ వైకుంఠ గద్యము.
ఈ తొమ్మిది గ్రంథములను రామానుజులవారు వ్రాయడము
జరిగినది. రామానుజుల తర్వాత వచ్చిన మధ్వాచార్యుల వారు 37
గ్రంథములను వ్రాశారు. అవి వరుసగా ఇలా ఉన్నవి.
1)యమక భారత
2)భాగవత తాత్పర్య నిర్ణయ
3)కృష్ణజయంతి నిర్ణయ.
4) యతి ప్రణవ కల్ప.
5) మహాభారత తాత్పర్య నిర్ణయ
6) సదాచారస్మృతి
7) కృష్ణామృత మహార్ణవ
8) తంత్రసార సంగ్రహ.
బ్రహ్మసూత్రాలపై నాలుగు రచనలు :-
1)బ్రహ్మసూత్ర భాష్యము.
2) అను వ్యాఖ్యానము.
3) అను భాష్యము.
4) న్యాయ వివరము.
భగవద్గీతపై రెండు రచనలు :-
1) గీతాభాష్యము.
2) గీతా తాత్పర్య నిర్ణయ.
ప్రకారణాల ఫై రెండు రచనలు :-
1) విష్ణుతత్వ నిర్ణయము.
2)తత్వోద్యోత
3) అను భాష్యము.
3)ప్రమాణ లక్షణ
4) న్యాయ వివరము.
4)కర్మనిర్ణయ
5)ప్రపంచ మిథ్యత్వ అనుమాన ఖండన
6) తత్వసాంఖ్యానము.
7) తత్వవివేక
8) కథలక్షణ
9) ఉపాధిఖండన.
ఋగ్వేదం పై ఒక రచన :-
1) ఋగ్ భాష్య
ఉపనిషత్తులపై పది రచనలు :-
1) ఈశావాస్య ఉపనిషత్ భాష్యము.
2) కఠో ఉపనిషత్ భాష్యము.
3) సత్ప్రశ్న ఉపనిషత్ భాష్యము.
4) ఐతరేయ ఉపనిషత్ భాష్యము.
5) బృహదారణ్యక ఉపనిషత్ భాష్యము.
6) కేనో ఉపనిషత్ భాష్యము.
7) ముండక ఉపనిషత్ భాష్యము.
8) మండూక్య ఉపనిషత్ భాష్యము.
9) తైత్తరేయ ఉపనిషత్ భాష్యము.
10) చాందోగ్య ఉపనిషత్ భాష్యము.
స్తోత్రాలపై రెండు రచనలు :-
1) ద్వాదశ స్తోత్రములు
2) నరసింహ నఖ స్తుతి.
ఈ విధముగా ద్వైత సిద్ధాంతకర్త 79 సంవత్సరములు బ్రతికి తన
జీవితములో 37 గ్రంథములు వ్రాశాడు అంటే పూర్తిగా నమ్మవచ్చును.
అట్లే 120 సంవత్సరములు బ్రతికిన రామానుజులవారు తన జీవితములో
9 గ్రంథములు వ్రాశాడు అంటే నమ్మవచ్చును. అయితే శంకరాచార్యుల
వారు 32 సంవత్సరములు బ్రతికినా తన జీవితమంతయూ యాత్రలలో
సాగించి వ్రాయుటకు ఏమాత్రము వ్యవధి లేనప్పుడు 20 గ్రంథములు
వ్రాశాడు అనడము పూర్తి అసత్యమగును. ఆయన వ్రాయలేదని దృఢముగా
తెలిసిపోవుచున్నది. రామానుజాచార్యులు వ్రాసిన తొమ్మిది గ్రంథములను
మేము చదువలేదు గావున ఆయన గ్రంథముల సారాంశము తెలియదనియే
చెప్పవలెను. రామనుజాచార్యుల గ్రంథములు ఆయన సిద్ధాంతమునకు
దగ్గర సంబంధముతోనే ఉండునని తలచెదము. ఇక మధ్వాచార్యుల
విషయమునకు వస్తే, ఆయన వ్రాసిన గీతాభాష్యమును చూచాము మిగతా
గ్రంథములు ఏవీ నేను చూడలేదు. రామానుజులవారి గీతాభాష్యమును
నేను చూచాను. ముగ్గురు వ్రాసిన ఆచార్యత్రయ భగవద్గీతలను చూడడము
జరిగినది. కొన్ని శ్లోకములు వారివారి సిద్ధాంతములకు అనుగుణముగా
వ్రాసినా కొన్ని శ్లోకములను బయటి పండితులు వ్రాసినట్లే వ్రాశారు.
పురుషోత్తమ ప్రాప్తియోగములోని 16, 17 శ్లోకములు రెండు, ముగ్గురు
ఆచార్యుల సిద్ధాంతములకు సంబంధము లేకుండా ఉండుట వలన అక్కడ
ముగ్గురు ఆచార్యులవారు కప్పదాటు ప్రయోగము చేసి 'నలుగురితోపాటు
నారాయణ' అన్నట్లు చెప్పారు. ముగ్గురు సిద్ధాంతకర్తలే భగవద్గీతలోని
పురుషోత్తమ ప్రాప్తియోగములో బోర్లపడి ఎగిరి ఆ రెండు శ్లోకములను
దాటిపోయారంటే భగవంతుడు అక్కడ చెప్పిన విషయము ఆ ముగ్గురికీ
అర్థము కాలేదని చెప్పవచ్చును. ముగ్గురు సిద్ధాంతకర్తలకే అర్థముకాని
పురుషోత్తమ ప్రాప్తియోగములోని శ్లోకములు మిగతా పండితులకు కూడా
అర్థము కాలేదనియే చెప్పవచ్చును. మాకంటే ముందు భారతదేశములోని
అన్ని భాషలలో భగవద్గీతా శ్లోకములను దాదాపు మూడు వందల మంది
(300) వివరమును వ్రాసియుందురు. అయినా వ్రాసినవారందరూ
పురుషోత్తమ ప్రాప్తియోగములోని 16, 17 శ్లోకములవద్ద అందరూ చేసినట్లే
చేస్తూ పోయారు. ముందు వ్రాసిన సిద్ధాంతకర్తలను అనుసరించి
మిగతావారు కూడా అక్కడ కప్పదాటు ప్రయోగమునే చేశారు. అక్కడ ఆ
ప్రయోగము చేయనిది వేరుదారి లేదు. అక్కడ ఏమాత్రము సంబంధములేని
ప్రకృతిని ఉపయోగించి ఆ శ్లోకములకు వివరమును చెప్పారు.
శ్లోకములకు ప్రకృతికి ఏ విధముగా చూచినా ఎంతమాత్రము అనుబంధము
లేదు. అటువంటప్పుడు ప్రకృతిని ఉపయోగించి వ్రాయవలసిన అవసరము
ఏమి వచ్చినదని ఎవరూ ఆలోచించలేదు.
ప్రశ్న :- ముగ్గురు సిద్ధాంతకర్తలు తమతమ భావములను అక్షర రూపములో
వ్రాసి గ్రంథములను చేశారు. వారి గ్రంథములను వారికనుగుణముగా
వ్రాసికొనియుందురు. వారి సిద్ధాంతములు మీకు తెలిసిపోయినవి. కావున
వారి గ్రంథములను చూడవలసిన పనిగానీ, వాటిని ప్రస్థావించవలసిన
పనిగానీ మీకు లేదు కదా!
జవాబు :- సామాన్య మనిషికయితే మీరన్నట్లు ఏమీ పనిలేదు. దేవుడు
కూడా సామాన్యుడయివుంటే ప్రజలు ఎట్లుపోతే నాకేమియని ప్రజలకు
జ్ఞానము చెప్పియుండెడివాడు కాదు. ప్రజలకు జ్ఞానము చెప్పు బాధ్యత
దేవునికున్నది కావున ప్రజలలోయున్న అజ్ఞానమును ఎత్తి చూపి అది
సరియైన మార్గము కాదని చెప్పి సరియైన మార్గము జ్ఞానమార్గమని ప్రజలకు
జ్ఞానమును తెలిపాడు. అది దేవుని విధానముకాగా, దైవ విధానములో
దైవ సిద్ధాంతకర్తలుగా యున్నవారికి దైవజ్ఞానముతో కూడిన సిద్ధాంతములనే
బోధించుట వారి విధి. పేరుకు సిద్ధాంతములని చెప్పి బోధించు బోధలో
దైవత్వము లేకపోతే అటువంటి సిద్ధాంతములు ప్రజలను సరియైన
జ్ఞానమార్గములో నడిపించలేవు. అటువంటప్పుడు బాధ్యతకల
సిద్ధాంతకర్తలు ఆ పొరపాట్లను సర్దిచెప్పి, సవరించి బోధించవలసిన
అవసరమున్నది. అందువలన గతములో చెప్పబడిన సిద్ధాంతములను
గురించి, ఆ సిద్ధాంతకర్తలు వ్రాసిన గ్రంథములను గురించి మేము విడదీసి
చెప్పవలసిన అవసరమొచ్చినది.
ప్రశ్న :- ఎంతో గొప్ప పేరుగాంచిన సిద్ధాంతకర్తలు చెప్పిన దానిని మీరు
విమర్శించుటకుగానీ, విడదీసి చెప్పుటకుగానీ అర్హులగుదురా?
జవాబు :- అర్హత బయటికి కనిపించునది కాదుగానీ, ముగ్గురు సిద్ధాంత
కర్తలవలె నేను ఒక దైవ సిద్ధాంతకర్తనే కనుక వారిలోని తప్పు ఒప్పులను
విడదీసి చెప్పుటకు నేను అర్హుడనేయని చెప్పుచున్నాను. అర్హత అనునది
ప్రపంచ చదువుల యొక్క డిగ్రీలాంటిది కాదు. మనిషిలోయున్న జ్ఞానశక్తిని
బట్టి మనుషులలో అర్హతలు నిర్ణయింపబడును. అయితే జ్ఞానశక్తి బుద్ధికి
తెలియునది, అనుభవమునకు వచ్చునది. అందువలన మనిషిని చూస్తూనే
మనిషిలోని అర్హతను ఎవరూ గుర్తించలేరు.
ప్రశ్న :- మీరు ప్రతిపాదించిన సిద్ధాంతము గలదా?
జవాబు :- మీరు మరచిపోయారుగానీ నా సిద్ధాంతమును గురించి ముందే
చెప్పియున్నాను. అయినా ఇప్పుడు అందరికీ తెలియునట్లు చెప్పుచున్నాను
చూడండి. నా సిద్ధాంతము త్రైత సిద్ధాంతము, నా పేరు ప్రబోధానంద
యోగీశ్వరులు.
ప్రశ్న :- ఇప్పుడు అర్థమయినది మీ విషయమును గురించి మీరు ముందే
చెప్పారు. మీరు కూడా 73 గ్రంథములను వ్రాసినట్లు చెప్పారు. వంద
గ్రంథముల వరకు వ్రాస్తామని కూడా చెప్పారు. మీరు పుట్టినది రాయల
సీమయనీ, జన్మస్థలము అనంతపురము పట్టణమని కూడా చెప్పారు. మీరు
73 గ్రంథములను వ్రాశారు కదా! వాటి పేర్లను తెలియజేస్తారా?
జవాబు :- చెప్పిన విషయము జ్ఞాపకము వచ్చినందుకు సంతోషము.
మేము వ్రాసిన గ్రంథముల వివరము క్రింద తెలుపుచున్నాము చూడండి.
1) త్రైత సిద్ధాంత భగవద్గీత.
2) ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు
3) ధర్మము-అధర్మము.
4) ఇందుత్వమును కాపాడుదాము.
5) యజ్ఞములు (నిజమా అబద్దమా)
6) దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు
7) సత్యాన్వేషి కథ
8) మంత్రము-మహిమ (నిజమా అబద్ధమా)
9) శ్రీకృష్ణుడు దేవుడా!భగవంతుడా!
10) గీతాపరిచయము
11) తిట్లజ్ఞానము-దీవెనల అజ్ఞానము.
12) గీతం-గీత.
13) దేవాలయ రహస్యములు.
14) ఇందూ సాంప్రదాయములు.
15) మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా)
16) జ్యోతిష్య శాస్త్రము.
17) తల్లి-తండ్రి.
18) గురుప్రార్థనా మంజరి.
19) త్రైతారాధన.
20) సమాధి.
21) కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు) 42) ప్రబోధ.
22) జనన మరణ సిద్ధాంతము
23) మరణ రహస్యము.
24) పునర్జన్మ రహస్యము.
25) త్రైతాకార రహస్యము.
26) కథల జ్ఞానము.
27) సామెతల జ్ఞానము.
28) పొడుపు కథల జ్ఞానము.
29) తత్త్వముల జ్ఞానము.
30) ఆత్మ లింగార్థము.
31) నాస్తికులు-ఆస్తికులు.
32) హేతువాదము-ప్రతివాదము
33) గుత్తా.
34) ప్రబోధ తరంగాలు.
35) త్రైత సిద్ధాంతము.
36) ప్రథమ దైవగ్రంథము భగవద్గీత.
37) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
38) ద్రావిడ బ్రాహ్మణ.
39) తీర్పు.
40) కర్మపత్రము.
41) ధర్మశాస్త్రము ఏది?
43) సుబోధ.
44) సిలువ దేవుడా?
45) మతాతీతదేవుని మార్గము.
46) దేవుని గుర్తు963.
47) మతము-పథము.
48) ప్రబోధానందమ్ నాటికలు.
49) ఇందువు క్రైస్తవుడా?
50) నిగూఢ తత్వార్ధ బోధిని.
51) జీహాద్ అంటే యుద్ధమా?
52) మూడు గ్రంథములు ఇద్దరు గురువులు.
53) దేవుని జ్ఞానము కబ్జా అయింది.
54) అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు.
55) వార్తకుడు-వర్తకుడు.
56) దేవుని చిహ్నము.
57) ఏది నిజమైన జ్ఞానము?
58) ప్రతిమ × విగ్రహ.
59) మరణము తర్వాత జీవితము.
60) ఏ మతములో ఎంత మతద్వేషము?
61) ప్రవక్తలు ఎవరు?
62) హిందూమతములో సిద్ధాంతకర్తలు.
63) మతమార్పిడి దైవద్రోహము.
64) త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు.
65) స్వర్గము ఇంద్రలోకమా! నరకము యమరాజ్యమా!
66) హిందూమతములో సిద్ధాంతకర్తలు
67) మధ్యమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
68) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు (రెండవ భాగము.)
69) బొమ్మల జ్ఞానము.
70) ప్రసిద్ధిబోధ.
71) సుప్రసిద్ధిబోధ.
72)రూపము మారిన గీత
73)నీకు నా లేఖ.
ఇప్పటికి 73 గ్రంథములను మేము వ్రాయడము జరిగినది. ఇంకా
వ్రాయబోవు గ్రంథములు ముఫ్పైకి పైగా ఉండగలవు. మొత్తము నూరు
గ్రంథములకు పైగా ఉండగలవు. గ్రంథములు ఎవరు ఎన్ని వ్రాసినది
తెలిసినది కదా! ఈ గ్రంథముల ప్రస్తావనలో కొంత ప్రత్యేకత కలదు.
హిందూమతములో ప్రకటిత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుల అద్వైతము
ఆదిశంకరునిది కాదు. అది అప్రకటిత సిద్ధాంతకర్తలయిన ఆర్యులది.
ప్రకటిత అద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యులు ఒక గ్రంథమును వ్రాశాడు
అదియే ‘గీతాభాష్యము’. శంకరాచార్యులు వ్రాశాడని ప్రచారమయిన మిగతా
19 గ్రంథములు అసలయిన అద్వైత సిద్ధాంతకర్తలయిన ఆర్యులు వ్రాశారు.
ఆ తర్వాత 1500 సంవత్సరములకు వచ్చిన రామానుజాచార్యులు తొమ్మిది
గ్రంథములను వ్రాశాడు. రామానుజాచార్యుల తర్వాత వచ్చిన మధ్వాచార్యుల
వారు 37 గ్రంథములను వ్రాశాడు. ఈ విధముగా మూడు సిద్ధాంతముల
తర్వాత వచ్చిన ప్రబోధానంద యోగీశ్వరులు ఇప్పటికి 73 గ్రంథములు
వ్రాశారు.
1) ఆదిశంకరాచార్యులు 1 గ్రంథము,
2) ఆర్యులు 19 గ్రంథములు,
3) రామానుజాచార్యులు 9 గ్రంథములు,
4) మధ్వాచార్యులు 37 గ్రంథములు,
5) ప్రబోధానంద యోగీశ్వరులు - 73 గ్రంథములు.
ప్రజలను జ్ఞానమార్గములో ఉంచుటకు ఐదు రకముల మనో
భావములున్న హిందూధర్మ ప్రచారకులయిన వారు మొత్తము 139
గ్రంథములను వ్రాయడము జరిగినది. అందులో నాలుగు రకముల
మనోభావముల సిద్ధాంతకర్తలు 66 గ్రంథములను వ్రాయగా ప్రబోధానంద
యోగీశ్వరులు ఒక్కరు మాత్రము 73 గ్రంథములను వ్రాయడము జరిగినది.
ఇంకనూ వ్రాయబోతారని కూడా తెలిసినది.
ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు అను వ్యక్తి మీరే కదా!
అటువంటప్పుడు మీరు వేరయినట్లు ప్రబోధానందవేరయినట్లు మీరు
ప్రబోధానంద 73 గ్రంథములు వ్రాశాడని చెప్పుచున్నారు. మేము 73
గ్రంథములను వ్రాశామని మీరు నేరుగా చెప్పక ఒకమారు ప్రత్యక్షముగా
‘మేము” అని మాట్లాడు చున్నారు. మరొకమారు పరోక్షముగా ప్రబోధానంద
యోగీశ్వరులు ఈ పని చేశాడని చెప్పుచున్నారు. అట్లు చెప్పుట వలన
మాకు ఎవరు చెప్పునది అర్థము కాలేదు. అట్లు మీరు ప్రత్యక్షముగా
మరియు పరోక్షముగా ఎందుకు మాట్లాడుచున్నారు?
జవాబు :- మిగతావాళ్ళు ఎవరు మాట్లాడినా వారి భావములో ఒకరే
మాట్లాడుచున్నారు. కావున వారు ఒక్కరుగానే ప్రత్యక్షముగా మాట్లాడు
చుందురు. మేము అట్లు కాకుండా మాట్లాడుచున్నాము. అసలు విషయము
ఏమి అంటే! మేము మాట్లాడునది ఒక్కరు కాదు. మేము ముగ్గురము ఈ
శరీరములో యున్నాము. నేను మాట్లాడునప్పుడు ప్రత్యక్షముగా నేను అని
చెప్పుచూ మాట్లాడుచున్నాను. 'నేను' కాకుండా 'మేము'లో ఇంకొకరు
మాట్లాడునప్పుడు ప్రబోధానంద ఈ పని చేశాడని చెప్పుచున్నాము. ఈ
విషయము ఇప్పుడు మూడవమారు ప్రస్థావనకు వచ్చినది. ఇంతకుముందే
రెండుమార్లు చెప్పియున్నాను. మొదట చెప్పినప్పుడు అన్ని పనులు చేయునది
ఆత్మేనని చెప్పాను. రెండవమారు ప్రబోధానంద అను పేరు నాది కాదని
కూడా చెప్పడమైనది. ఇప్పుడు ప్రతిసారి భావమునుబట్టి మాటయుండును.
మాట్లాడు భావమునుబట్టి ఫలానా వారు మాట్లాడుచున్నారని గ్రహించ
వలసియున్నది. ఇక్కడ అర్థమయితే జ్ఞానము సంపూర్ణముగా అర్థము
కాగలదు. ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పు త్రైత సిద్ధాంతమంతయూ
అర్థమగును. త్రైత సిద్ధాంతమనగా మూడవ సిద్ధాంతమని అర్థము. మన
భారతదేశములో ఇప్పటికి ముగ్గురు సిద్ధాంతకర్తలు వచ్చి దేవుని జ్ఞానము
ప్రజలకు తెలుపు నిమిత్తము అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములను
పునాదులమీద తమ జ్ఞానమును చెప్పడము జరిగినది. అయితే ప్రజలకు
ఈ మూడు సిద్ధాంతముల గురించి తెలియదు. ఆయా సిద్ధాంతములను
అనుసరించు వారికి మాత్రము ఆయా సిద్ధాంతములను గురించి తెలియును.
70 శాతము ప్రజలకు సిద్ధాంతములంటే ఏమిటో, సిద్ధాంతములు ఎన్ని
యున్నాయో, సిద్ధాంత జ్ఞానము ఏమిటో తెలియవు.
ప్రస్తుత కాలములో క్రైస్తవ మతములో 'త్రిత్వము' అను పేరు కలదు.
త్రిత్వము అనగా మూడు అని అర్థము. చాలామంది ప్రజలకు త్రిత్వమంటే
ఏమిటో ఎవరిదో తెలియకున్నా హిందూ పరిరక్షణ సంస్థలలో పనిచేయు
వారి చూపంతయూ ఇతర మతముల మీద ఉండును. కావున త్రిత్వము
అంటే మూడని అది క్రైస్తవుల ముఖ్యసూత్రమని హిందూ మత రక్షణ
సంఘములవారికి తెలుసు. అయితే ఈ త్రిత్వము గల క్రైస్తవ మతము
పుట్టినది రెండువేల సంవత్సరముల క్రింద. కలియుగములో భారతదేశ
మందు దాదాపు 2500 సంవత్సరముల క్రిందనుండి ఆధ్యాత్మిక రంగములో
సిద్ధాంతములు పుట్టుచూ వచ్చినవి. మొదట పుట్టినది అద్వైత సిద్ధాంతము,
దానికర్త ఆదిశంకరాచార్యులను విషయము తెలిసినదే. తర్వాత విశిష్టా
ద్వైత సిద్ధాంతమును రామానుజుల వారు, దాని తర్వాత ద్వైత సిద్ధాంతమును
మధ్వాచార్యులు చెప్పడమైనది. ప్రస్తుతము భూమిమీదికి ‘త్రైత సిద్ధాంతము’
వచ్చినది. త్రైత సిద్ధాంతము హిందూమతములో నాల్గవ సిద్ధాంతము.
అయితే క్రైస్తవములో త్రిత్వము కలదని తెలిసిన హిందూ సమాజముల
వారు త్రైతమంటే త్రిత్వమే కదా! క్రైస్తవులు హిందువుల ముసుగులో తమ
త్రిత్వమును త్రైతముగా హిందువులలో ప్రచారము చేయుచున్నారని
అనుకోవడము జరుగుచున్నది. దీనినిబట్టి తమ సిద్ధాంతములను, తమ
జ్ఞానమును గుర్తించలేని స్థితిలో హిందువులున్నారని తెలియుచున్నది.
గ్రుడ్డివారై తమ సిద్ధాంతములను గుర్తించలేని హిందువుల ద్వారా మాకు
కొంత వ్యతిరేఖతయున్నా త్రైత సిద్ధాంతము అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత
సిద్ధాంతములకంటే వేగముగా ప్రజలలో ప్రచారమగుచున్నది.
త్రైత సిద్ధాంతములో సిద్ధాంతమనునది శాస్త్రములో భాగముగా
యున్నదని ముందే చెప్పాము. త్రైతము అనగా మూడని అర్థము.
మూడంటూనే క్రైస్తవులు జ్ఞాపకము రాకూడదు. వారి త్రిత్వమునకు వారు
అర్థము చెప్పలేరు. త్రిత్వము అనునది వారి జ్ఞానము కాదు. త్రిత్వమనునది
వారిలోని ఒక తెగయని అర్థము. ఇక్కడ హిందూమతములోనిది ద్వైత,
అద్వైత సిద్ధాంతములవలె ప్రత్యేకమయిన సిద్ధాంతము. ఆ విషయమును
హిందువులే అదియూ హిందూ ధర్మరక్షణలో పనిచేయు హిందువులకే అర్థము
కాలేదు. కొందరికి ఇది హిందూమతములో పుట్టిన సరిక్రొత్త సిద్ధాంతమని
తెలిసినా, వారు ముందే అద్వైతములోనో, ద్వైతములోనో యుండుట వలన
త్రైతము అంటే అసూయను చూపుచున్నారు. అసూయను తెలివిగా త్రైతము
అంటే పరమతమని త్రైతప్రచారము అంటే పరమత ప్రచారమని తప్పుగా
ఆరోపణ చేయుచూ తమ వ్యతిరేఖతను చాటు కొంటున్నారు. ఏది
ఏమయినా అన్ని సిద్ధాంతములకంటే వేగముగా త్రైత సిద్ధాంతము
ప్రచారమగుచున్నది.
ప్రశ్న :- త్రైత సిద్ధాంతము ముందు వచ్చిన ద్వైత, అద్వైత సిద్ధాంతములకంటే
గొప్పదా?
జవాబు :- దేశములో ఇప్పుడు మూడు, నాలుగు రాజకీయ పార్టీలున్నవి
కదా! ఆయా పార్టీల నాయకులు వారివారి పార్టీలను గురించి గొప్పగా
చెప్పుకొందురు. ఇతర పార్టీలను గురించి చెడుగా చెప్పుదురు. ఒక పార్టీ
ఇంకొక పార్టీని తప్పు ఆరోపణలను చెప్పుచూ తమ పార్టీయొక్క మంచిని
చాటుకొనుచుండును. అలాగే ఇప్పుడున్న ఆధ్యాత్మిక సిద్ధాంతములు కూడా
అలాగే యున్నవి. ఒక సిద్ధాంతమును మరియొక సిద్ధాంతము వారు
తప్పుగా చెప్పుచూ తమ సిద్ధాంతమును మంచిగా చెప్పుకొనుచుందురు.
ఎవరు ఎట్లు చెప్పుకొనినా త్రైత సిద్ధాంతము గొప్పది. నేడు హిందూ
మతములోని సిద్ధాంతములన్నీ ఏకమై త్రైతమంటే పరమతమని, క్రైస్తవ
మతమని చెడుగా ఆరోపించుచున్నా త్రైత సిద్ధాంతము ఎంతో వేగముగా
ప్రజలలోనికి చొచ్చుకొనిపోవుచున్నది. త్రైత సిద్ధాంత జ్ఞానము తెలిసిన
ప్రతి మనిషి త్రైత సిద్ధాంతమును గురించి తనకు తానుగా ప్రచారము
చేయుచున్నాడు. ఇట్లు ఎవరికి వారు ప్రచారము చేయడము వలన
దానంతటదే ప్రచారమయి ప్రజలలోనికి పోవుచున్నది. త్రైత సిద్ధాంత
జ్ఞానము తెలిసినవారు ఇందులోని జ్ఞానమును చూచి ఇంతవరకు మాకు
తెలియని జ్ఞానము ఇప్పుడు తెలుస్తున్నదని చెప్పుచూ మరొకమాట కూడా
ఇలా చెప్పుచున్నారు. "మేము ఎంతోమంది గురువులను, బోధకులను
జ్ఞానులని నమ్మియుంటిమి, ఈ జ్ఞానము ప్రకారము చూస్తే వారికి జ్ఞానము
యొక్క వాసన కూడా తెలియదని" చెప్పుచున్నారు. కొందరు "మాకు
తెలిసిన జ్ఞానము కూడా బోధకులకు తెలియదని" చెప్పుచున్నారు. దీనినిబట్టి
త్రైత సిద్ధాంత జ్ఞానము గొప్పదని తెలియుచున్నది.
ప్రశ్న :- త్రైత సిద్ధాంతము క్రొత్తగా వచ్చినది కదా! పూర్వమునుండియున్న
ద్వైత, అద్వైతములకంటే గొప్పదని అనడములో అర్థమేమి?
జవాబు :- ఇదేదో పొగడ్తలకు చెప్పుకొను విషయము కాదు. త్రైత
సిద్ధాంతము ఈ దినములో క్రొత్తగా బయటికి వచ్చినట్లు కనిపించినా ఇది
సనాతనమైనది, అన్ని సిద్ధాంతములకంటే ముందే బయటికి వచ్చినది.
అయితే మసిగుడ్డలో దాగిన మాణిక్యమువలె ఇంతకాలము చాటుగాయుండి
ఇప్పుడే మసిగుడ్డనుండి బయటపడిన దానిలాగ ప్రకాశించుచున్నది.
నామాట సత్యమనుటకు ఒక ఆధారమును చెప్పెదను చూడండి. ప్రపంచము
సృష్ఠింపబడిన తర్వాత జరిగెడి కాలమును నాలుగు యుగములుగా దేవుడే
విభజించాడు. విభజించిన నాలుగు యుగములకు విశేషమయిన అర్థముతో
కూడిన పేర్లను పెట్టడము జరిగినది. వాస్తవముగా నేడు మనము యుగము
అను పిలుచు పదము పూర్వము అలా లేదు. పూర్వము 'యోగము' అను
పదముగా యున్నది. నేడు కాలక్రమమున మార్పుచెంది, 'యోగము'
పోయి 'యుగము' అయినది. నాలుగు యుగములలో మొదటి యుగము
పేరు కృతయుగము, రెండవ దానిపేరు త్రేతాయుగము, మూడవ దానిపేరు
ద్వాపరయుగము, నాల్గవ దానిపేరు కలియుగము. నేడు పలుకు
యుగమును పూర్వమువలె యోగము అని చెప్పితే ఇలాగయుండును.
1) కృత యోగము 2) త్రైతా యోగము 3) ద్వాపర యోగము 4) కలి
యోగము అనునవి వాస్తవమైన జ్ఞానయుక్తమైన పేర్లు. ఇందులో ఏమి
జ్ఞానమున్నదను అనుమానము లేకుండా మేము చెప్పునదేమనగా!
కృత అనగా ‘చేయబడిన’', 'సృష్టించబడిన' అని అర్థము రాగలదు.
'కృత్' అను పదమునుండి 'కృత' అను పదము పుట్టినది. మొదట
ప్రపంచము దేవునినుండి సృష్టించబడినది. దానివలన మొదటనే కృత్
అను పదమును ఉపయోగించి 'కృత్యాగము' అని అన్నారు.
"ప్రపంచమును సృష్టించిన సృష్టికర్తలోనికి నీవు కలిసిపో”, “నిన్ను తయారు
చేసిన దేవునిలోనికి నీవు ఐక్యమైపో” అను అర్థమొచ్చునట్లు 'కృత్యాగము'
అని అన్నారు. యోగము అనగా 'కలయిక' అని అర్ధము. సృష్టికర్తయిన
దేవునిలోనికి కలిసిపొమ్మని చెప్పడమే కృత్ యోగము యొక్క అర్థము.
ఈ విధముగా మొదటి కాలము పేరును 'కృత్యాగము' అని చెప్పడము
జరిగినది. కాలము అనగా దేవుడు అని అర్థము. అందువలన కాలము
యొక్క నాలుగు భాగములకు దేవుని జ్ఞానమునే అతికించడమయినది.
రెండవ యుగమును త్రేతాయుగము అని చెప్పారు. వాస్తవముగా
దానిపేరు త్రైతాయోగము. అయితే నేడు త్రైతా అను పదము త్రేతాగా
మారిపోయినది. త్రై క్రింద గల ఒక గుర్తు పోవడము వలన, కాలక్రమములో
లేకుండా పోవడము వలన 'త్రై' అను శబ్దము 'త్రే' అను శబ్దముగా
మారిపోయినది. పూర్వము త్రైతాయోగముగాయున్నది. నేడు త్రేతా
యుగముగా మారిపోయినది. 'త్రైతా' అను పదమునకు మూడు అని
అర్థముగలదుగానీ, త్రేతా అను పదము అర్థములేనిది. కాలగమనములో
మారిపోయిన అర్థములేని పదమును ఇప్పటినుండి అర్ధమున్న పదముగా
అందరూ ‘త్రైతా' అని పిలుచుకుందాము. త్రైతాయోగము అను పదములో
"మూడుగాయున్న దేవునిలోనికి కలిసిపో” అని అర్థము. త్రైత సిద్ధాంతమునకు
త్రైతాయోగమునకు దగ్గర సంబంధమున్నట్లు తెలియగలదు. నేడు క్రొత్తగా
కనిపించిన సిద్ధాంతమయినా త్రైత సిద్ధాంతము ప్రాచీనమైనదని అన్నిటికంటే
మొదటిదని చెప్పవచ్చును.
ఇకపోతే నాలుగు యుగములలో రెండు యుగముల వివరము
తెలిసినది. కాలములో మూడవ యుగముపేరు ద్వాపర యోగము అని
కలదు. యోగము అంటే 'కలయిక' అని తెలుసు. ద్వాపర అనగా ద్వా
అంటే రెండు అని అర్ధము. పర అంటే వేరని అర్థము ద్వాపర అనగా
రెండు కానిది మూడని అర్థము. త్రైతాయోగమునకు ఏ అర్థము కలదో
అదే అర్థము ద్వాపర యోగములో కూడా కలదు. మూడుగాయున్న
దేవునిలోనికి కలిసిపొమ్మని అర్ధమునిచ్చు పదముగా ద్వాపర యోగము
కలదు. ఇక్కడ చిన్న వివరణ ఏమనగా! ద్వాపర అనగా రెండు కానిది
అని అర్థము కదా! రెండుకానిది మూడని చెప్పకుండా ఒకటిని చెప్పవచ్చును
కదా! అని ఎవరయినా అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
శూన్యము అనగా గణితశాస్త్రములో సున్నా అని అర్థము అశూన్యము
అనగా సున్నాకానిది ఒకటి అని చెప్పాలి. ఎప్పటికయినా ముందున్న
అంకెనే చెప్పవలెను. సున్నాకు వెనుక ఏమీలేదు కావున అశూన్యము
అనగా సున్నా కానిది ఒకటి అని చెప్పవలసియుండును. ఒకవేళ అదే
పదమునే ఇంకొక రకముగా శూన్యపర అని చెప్పితే సున్నకంటే వేరయినది
ఒకటి అని చెప్పవచ్చును. ఇలా ముందు అంకెనే చెప్పవలెనుగానీ, వెనుక
అంకెను చెప్పుటకు వీలులేదు. సున్నాకంటే వెనుక ఏదీలేదు కావున
ఎప్పుడయినా గణితము ప్రకారము ముందుకే చెప్పాలి. దానిప్రకారము
అద్వైతము అనగా రెండుకానిది మూడు అని చెప్పాలి. అయితే దానిని
సిద్ధాంతకర్తలే తప్పుగా చెప్పుకొన్నారు. రెండుకానిది ఒకటి అన్నారు.
ఒకటిని గురించి చెప్పవలసి వస్తే అశూన్య అనియు లేక శూన్యపర
అనియు చెప్పవచ్చును. మూడును గురించి పరోక్షముగా చెప్పాలంటే
'ద్వాపర' అని చెప్పాలి. ప్రత్యక్షముగా చెప్పాలి అంటే 'త్రైత' అని చెప్పాలి.
దేవుడు ప్రజలను, సమస్త విశ్వమును సృష్టించువాడేకాక నాశనము
చేయువాడు కూడా. అందువలన దేవున్ని ఒక విధముగా 'సృష్టికర్త' అనియు
మరొక విధముగా ‘ప్రళయకర్త' అనియు చెప్పవచ్చును. సృష్టికర్త అనుటకు
ఆధారముగా కృత్ అను పేరును కాలమునకు పెట్టడమైనది. ప్రళయకర్త
అనుటకు గుర్తుగా కలియుగము అను పేరును పెట్టడమైనది. కలి అనగా
నాశనము అని అర్థము కావున నాశనము చేయు దేవునిలోనికి ఐక్యము
కామని చెప్పు వాక్యముగా కలియోగము అని చెప్పడమైనది. ఈ విధముగా
నాలుగు యోగముల (యుగముల) పేర్లను పెట్టడమైనది. మనిషి మొదట
పుట్టి తర్వాత కొంతకాలమునకు చనిపోవడము జరుగుచున్నది. జనన
మరణముల మధ్యనున్నది మనిషి జీవితము. మనిషివైన నీ జీవితములో
పుట్టినప్పటినుండి చనిపోవువరకుయున్న జీవితకాలములో నీముందు, నీ
వెనుకయున్న దేవున్ని తెలుసుకో, ఆయనలోనికి కలుసుకో అని చెప్పుటకు
ఒకే దేవున్ని మొదట ప్రత్యక్షముగా 'త్రైత' అని చెప్పి రెండవమారు
పరోక్షముగా 'ద్వాపర' అని చెప్పడమైనది. అట్లు రెండు విధముల త్రైత,
ద్వాపర అని చెప్పడమునకు కారణము నీముందు, నీవెనుక రెండు రకముల
దేవుడుండుట వలన అలా రెండు రకముల చెప్పవలసివచ్చినది. అలా
నాకు ముందున్నవాడు, నాకు వెనుకున్నవాడు వానికి మధ్యలో నేను
ఉండుట వలన ఎవరు ఎప్పుడు మాట్లాడునది నీకు అర్థము కాలేదు.
ఇదంతా చెప్పుటకు కారణము త్రైత సిద్ధాంత జ్ఞానము గొప్పదని
చెప్పుటకు ఆధారముగా కాలమును గురించి చెప్పాము. అంతేకాక దీనివలన
త్రైతము పూర్వమునుండి ఉన్నదని ఎవరికయినా అర్థము కాగలదు.
అంతేకాక పుట్టిన తర్వాత చావువరకు ఒక త్రైతము తప్ప వేరే లేదని
చెప్పుటకు మొదట త్రైతమని ప్రత్యక్షముగా, ద్వాపరమని పరోక్షముగా
చెప్పడము జరిగినది. మూడు తప్ప ఏదీ లేదు. అందువలన ద్వైత
సిద్ధాంతము అనునది సిద్ధాంతము కాదు. అట్లే అద్వైత సిద్ధాంతమనునది
కూడా సిద్ధాంతము కాదు. ఒక త్రైత సిద్ధాంతము తప్ప మిగతావి
సిద్ధాంతములే కావు అన్నట్లు కాలమునకు పెట్టిన నాలుగు పేర్లలో
మధ్యలోయున్న రెండిటికి త్రైత అనియు, ద్వాపర అనియు చెప్పడమైనది.
మిగత కలి, కృత పేర్లవద్ద అద్వై, ద్వైత పేర్లను పెట్టవచ్చును. అయితే
అవి సిద్ధాంతములు కావు కనుక వాటి ప్రస్థావన అక్కడ రాలేదు.
ప్రశ్న :- అద్వైతము అనగా రెండుకానిది మూడు అని మీరు చెప్పినట్లు
ముందు అంకెను తీసుకొంటే తెలియుచున్నది. అద్వైతమంటే ఒకటే అని
వారు ప్రచారము చేసుకొన్నారు. అద్వైతమును పద్ధతి ప్రకారము ఏమనాలి?
జవాబు :- అద్వైతము అంటే రెండు కానిది మూడని అర్థము రాగలదు.
చెప్పినమాట ఒకటికాగా, వారి హృదిలోని భావము మరొకటి. అప్పుడు
వారి భావము ప్రకారము అద్వైతము అనుమాటే తప్పగును. వారు అలా
అద్వైతము అని చెప్పకుండా ప్రత్యక్షముగా ఏకము అని చెప్పియుండ
వలసింది. అలాకాకపోతే అశూన్య అనియో శూన్యపర అనియో చెప్పి
యుండవలసింది. ఇంతగా ప్రచారమైపోయి, ఇన్ని సంవత్సరములు గడచిన
తర్వాత ఇప్పుడు పేరును మార్చుకొనుటకు వీలుపడదు. వారు ఎంత
కాలమున్న సక్రమముకాని పేరుతోనే అక్రమమైన పేరుతోనే చలామణి
కావలసిందే. అద్వైతమంటే రెండుకానిది మూడు కదా! అని ఎవరడిగినా
దానికి సరియైన సమాధానమును చెప్పలేరు.
ప్రశ్న :- మీరు ఇప్పటికి ముందువచ్చిపోయిన సిద్ధాంతకర్తలకంటే ఎక్కువ
గ్రంథములను వ్రాశారు. ఇంక వ్రాయబోతామన్నారు. త్రైత సిద్ధాంతమును
గురించి ఒక గ్రంథములో వ్రాసినా సరిపోతుంది కదా! ఎక్కువ గ్రంథములను
ఎందుకు వ్రాయాలి?
జవాబు :- మేము వ్రాసిన గ్రంథములన్నియు త్రైత సిద్ధాంత ఆధారముతోనే
యున్నవి. అన్ని గ్రంథములలో చెప్పబడిన జ్ఞానము త్రైత సిద్ధాంతమును
ఆధారము చేసుకొని చెప్పినదే. అన్ని గ్రంథములలోనూ త్రైత సిద్ధాంతమును
చెప్పలేదు. ఆ సిద్ధాంత ఆధారముతో అనేక విధముల జ్ఞానమును చెప్పాను.
మీకు ప్రతి గ్రంథములోనూ క్రొత్త విషయమును తెలుపాలను ఉద్దేశ్యముతో
జ్ఞానమును అనేక విధముల అర్థమగుటకు అనేక పేర్లతో గ్రంథములు
వ్రాసి చెప్పడమైనది.
ప్రశ్న :- మిగతా ముగ్గురు సిద్ధాంతకర్తలు మొత్తము 66 గ్రంథములను
వ్రాశారు కదా! వారి గ్రంథములకంటే ఎక్కువ జ్ఞానమును మీ గ్రంథములు
తెలిపాయా? ఒకవేళ వారికంటే ఎక్కువగా తెలిపినవనుకున్నా, వారి
గ్రంథములు కూడా మీకంటే తక్కువ అయినా కొంతయినా జ్ఞానము
చెప్పియుండును కదా! మీరు విద్యలోగానీ, సంస్కృత పాండిత్యములో
గానీ వారికంటే అన్ని విధముల తక్కువగా యున్నవారే. అటువంటప్పుడు
మీరు వారికంటే ఎక్కువ జ్ఞానమును చెప్పారని అంటే అది నమ్మదగిన
మాటయేనా? ఆదిశంకరాచార్యుడు అంటే ఎంతో గొప్పవాడని దేశమంతా
అనుకుంటున్నారు. మిగతా రామానుజుల వారి చరిత్ర ఎంతో గొప్పగా
యున్నది. మధ్వాచార్యులవారు ఎంతో గొప్ప పండితుడని తెలిసినది.
ఇంతపెద్ద ఉద్ధండ పండితులయిన వారు, సిద్ధాంతకర్తలయినవారు ఎంతో
తెలివితో వ్రాసిన గ్రంథములకంటే మీ గ్రంథములలో జ్ఞానము ఎక్కువ
యున్నదని మీరు చెప్పుకొనినా మేము నమ్ముటకు మీవద్ద ఏదయినా
ఆధారము గలదా?
జవాబు :- ఆధారము చూపి మిమ్ములను నమ్మించవలసిన అవసరము
నాకు లేదుగానీ, నా జ్ఞానమును ఎవరు చూచినా నేను చెప్పిన మాటను
వారే చెప్పగలరు. నన్ను ప్రశ్నించువారే నా తరపున మాట్లాడు స్థోమత
నిచ్చు నా జ్ఞానమును గురించి నేను గొప్పగా చెప్పుకోవలసిన పనిలేదు
కదా! గ్రంథములను ఎవరు వ్రాయగలరో వారిని అనుసరించి గ్రంథములలో
శక్తియుండును. మనిషిలో పంచభూతములుగాయున్న ప్రకృతి కలదు.
అనగా ఐదు భాగములుగా గల ప్రకృతితో శరీరము నిర్మాణమైయున్నది.
ప్రకృతి నిర్మాణముతో తయారైన శరీరములు, శరీరములో చైతన్యముగా
మూడు భాగములుగాయున్న ఆత్మలు గలవు. ఈ విషయము భగవద్గీతలోని
పురుషోత్తమప్రాప్తి యోగములో చెప్పబడినది. తర్వాత భగవద్గీతను
అనుసరించి దైవగ్రంథములుగా తయారయిన బైబిలు, ఖురాన్ గ్రంథములలో
కూడా ఇదే మూడు ఆత్మలను గురించి చెప్పడమైనది. భగవద్గీతలో చెప్పిన
మూడు ఆత్మలలో ఇప్పుడు నీతో మాట్లాడినట్లు వ్రాయుచున్న నేను ఒక్కనిని
మిగతా ఇద్దరు కలరు. మాట్లాడువానిని నేను ఎవరయినది నేను
చెప్పకూడదు. అది నీవు గ్రహించుకోవలసిన సమస్య. నేను కాక
ఇద్దరున్నారు కదా! వారిలో ఒకడు ఉలకడు పలుకడు ఎప్పుడూ మాట్లాడడు,
ఎప్పుడుగానీ ఏమీ చేయడు. ఇంకొకడు నన్ను ప్రక్కన పెట్టి తనే మాట్లాడును
తనే చేయును.
ఈ విధముగా చెప్పితే ఏమీ అర్థము కాకపోవచ్చును. అందువలన
ముగ్గురి పాత్ర ఎలాగుండునో ప్రత్యక్ష అనుభవము ద్వారా తెలియునట్లు
ఒక మనిషి శరీరములో జరిగిన సంఘటనలలో ఏ ఆత్మ ఎట్లు ప్రవర్తించినదో
కొంత వివరముగా తెలుసుకొందాము. క్రీస్తు శకముకంటే ముందు, క్రీస్తు
శకముకంటే వెనుక పుట్టిన ఒక వ్యక్తిలో జరిగిన మూడు ఆత్మల పనిని
ఒకమారు గమనిద్దాము. A.D కంటే ముందు B.C కంటే వెనుకనున్న
వ్యక్తిని గురించి చెప్పుచున్నాము అనగా A.D గానీ B.C గానీ అతనికి
వర్తించదు. ఆ రెండిటికీ మధ్యలో బ్రతికిన వ్యక్తిలో జరిగిన ఆత్మల పనిని
సూచనగా చెప్పుకొందాము.
ప్రశ్న :- ఒక్క నిమిషము ఆగండి! మీరు చెప్పుతూపోతే మీవెంటే వింటూ
వచ్చేదానికి మేము గొర్రెలము కాదు. మా ప్రశ్నకు జవాబును చెప్పిన
తర్వాత మీరేమి చెప్పగలరో అప్పుడు వింటాము. A.D కి B.C కి మధ్య
అంటే దాదాపు 2016 సంవత్సముల ముందు అన్నమాట A.Dకి B.Cకి
(ఎడి కి బిసి కి) మధ్యలోని కాలము కేలము 33 సంవత్సరములే అంటే
ఏసు ప్రభువు బ్రతికియున్న కాలము అన్నమాట. అప్పటికాలములో భారత
దేశము యొక్క జనాభా ఖచ్చితముగా 30 కోట్లు. ఇజ్రాయెల్ దేశములో
అయితే మూడు (3) కోట్లు మాత్రమే, ఇజ్రాయెల్ పాలస్తీనా కలిసియున్న
కాలమది. రెండు దేశములు కలిసినా మూడుకోట్లకంటే మించిన జనాభా
లేని దేశమది. మీరు ఏ దేశములోని వ్యక్తిని గురించి చెప్పినా అంత
జనాభాలో ఎవరిని గురించి చెప్పుచున్నారో నీకు తెలుసునా అన్నది మా
మొదటి ప్రశ్న? 2016 సంవత్సరముల పూర్వము ఒక మనిషిలో జరిగిన
విషయము ఇప్పుడు మా ముందరున్న నీవు ఎలా చెప్పగలవు ఇది మా
రెండవ ప్రశ్న? ఈ రెండు ప్రశ్నలకు జవాబు దొరికిన తర్వాత మీరు చెప్పే
దానిని వినగలము. ముందు మా రెండు ప్రశ్నలకు జవాబులు చెప్పండి
చూద్దాము?
జవాబు :- వినే ఎదుటి మనిషి ప్రశ్న అడిగినప్పుడే చెప్పే విషయమును
జాగ్రత్తగా వింటున్నాడని చెప్పే వానికి అర్థము కాగలదు. నీవు జాగ్రత్తగా
వింటున్నావు కావున ప్రశ్నించుచున్నావు. నీవు ప్రశ్న అడుగడము మాకు
సంతోషమే. మీ మొదటి ప్రశ్నకు జవాబు ఏమనగా! నేను ఎవరిని గురించి
చెప్పుచున్నానో నాకు బాగా తెలుసు. ఇక్కడ ఏ వ్యక్తి అనునది ముఖ్యము
కాదుగానీ, ఆ వ్యక్తిలో ఏమి జరిగినదని తెలియడమే ముఖ్యము. నేను
ఇప్పుడు ఫలానా వ్యక్తిని గురించి చెప్పుచున్నానని చెప్పినా ఆ వ్యక్తి ఎవరో
నీకు తెలియదు కదా! అప్పుడు ఎవరు ఎక్కడున్నది నీకు తెలియదు కావున
ఆ వ్యక్తి ఎవరు? అని అడిగిన ప్రశ్నద్వారా దాని జవాబు ద్వారా మీకు
ఏమీ లాభము లేదు. శరీరములో జరిగిన ఆత్మల పనిని గురించి చెప్పినా
చెప్పినది వినవలసిందేగానీ శరీరములో ఏమి జరుగునది కూడా మీకు
తెలియదు. ఇకపోతే నేను మీకు ఎలా అప్పటి విషయమును చెప్పు
చున్నాననునది ముఖ్యమైన ప్రశ్న. ఆ జవాబు అందరికీ అవసరమే కావున
చెప్పవలసిన బాధ్యత కూడా మాకు కలదు. ఈ విషయమును ఎంతో
పరిశోధనా బుద్ధితో, విచక్షణా శక్తితో చూడవలసియుంటుంది. అట్లు
కాకుండా మీది తూర్పయితే మాది పడమర అను విధానముతో అడ్డగోళు
గా మాట్లాడకూడదని ముందే చెప్పుచున్నాము. అట్లు మాట్లాడితే మాకు
ఏమీ నష్టము, కష్టము రాదుగానీ, మాట్లాడిన వారికి కనిపించని నష్టము
కష్టము చేకూరును. అందువలన జాగ్రత్తగా వినండి. అవసరమొస్తే
ప్రశ్నించండి. అట్లని అవసరము లేనిచోట ప్రశ్నించడము కూడా మంచిది
కాదు.
దాదాపు ఇప్పటికి 2016 సంవత్సరముల పూర్వము ప్రత్యేకమయిన
ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దేశములోనే యుండెను. ఆ వ్యక్తిలో మాత్రమే
మూడు ఆత్మల పనియున్నట్లు తెలిసినది. అప్పుడుగానీ ఇప్పుడుగానీ ఎందరో
మనుషులున్నారు. అయితే అందరిలోనూ మూడు ఆత్మలున్నా అందరి
లోనూ మూడు ఆత్మలు పనిచేయలేదు. అందరిలో రెండు ఆత్మల పనియే
లెక్కించ బడుచున్నది. మూడు ఆత్మలలో మూడవదయిన పరమాత్మ
యనబడు ఆత్మ ఏమీ చేయక అందరిలో ఊరకయుంటున్నది. మూడవ
ఆత్మ అరుదుగా తానున్నానను నిరూపణకొరకు అరుదుగా కొన్ని వేల
సంవత్సరములకో లేక కొన్ని లక్షల సంవత్సరములకో ఎక్కడో ఒక వ్యక్తి
శరీరములో మాట్లాడుట జరుగుచున్నది. ఇప్పటికి మాకు తెలిసినంతవరకు
ద్వాపరయుగము చివరిలో ఒకమారు కలియుగము వచ్చిన తర్వాత ఒకమారు
మూడవ ఆత్మ మాట్లాడడము జరిగినది. యుగమునకు ఒక్కమారు తన
విధానమును, తన జ్ఞానమును దేవుడు నిరూపించుకొనును.
శరీరములలో నిత్యము రెండు ఆత్మల పనులు నమోదవుచున్నవి. అయితే
ఎక్కడగానీ, ఎవరిలో గానీ కదలని మెదలని మాట్లాడని మూడవ ఆత్మ
అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు ఎవరిలోనో ఒకరిలో మాట్లాడును. అప్పటి
విషయమునే నేను ఇప్పుడు చెప్పుచున్నాను. నేను ఈ విషయమును
అన్ని
చెప్పుటకు ముందు నీకెలా తెలియునో చెప్పమని అడిగారు, దానికి జవాబును
చూడండి.
నేను కూడా అందరిలాగా శరీరమును ధరించియున్న ఒక మనిషిని.
నాకు ప్రకృతితో కూడుకొన్న శరీరమున్నా అది జఢమైనది, చైతన్యము
లేనిది. నా శరీరములో నేనుకాక నా వెనుక ఒకరు, నాముందు ఒకరు
ఇద్దరున్నారు. నేను ఒక ఆత్మనుకాగా మిగతా రెండు ఆత్మలు శరీరములోనే
గలవు. నా శరీరములోన గల మూడవ ఆత్మ ఏమాత్రము కదలక మెదలక
ఊరకయున్నది. అయితే పూర్వము మూడవ ఆత్మ కదలి మాట్లాడిన
శరీరములో కూడా మూడు ఆత్మలే ఉండుట వలన నాకు అక్కడ ఏమి
జరిగినదో తెలుసుకొనుటకు సులభతరమైనది. అందరిలోనూ ఆత్మల
విధానములో ఒకే విధముగా యున్నా వారికి మూడు ఆత్మల జ్ఞానము
గురించి తెలియదు. నాకు ప్రత్యేకించి మూడు ఆత్మల జ్ఞానము తెలియుట
చేత, అందులో ఒక ఆత్మచేత అన్ని శరీరములలోని ఆత్మలతో సంబంధము
ఏర్పరచుకోవచ్చును. నా ఆత్మ పూర్వము మూడు ఆత్మలు పనిచేసిన
శరీరములోని ఆత్మతో సంబంధము ఏర్పరచుకోవడము వలన అప్పుడు
ఆ శరీరములో ఏమి జరిగినదో మూడవ ఆత్మ ఏమి మాట్లాడినదో
సులభముగా తెలియుచున్నది. నాకు తెలిసిన ఈ పని ఆత్మజ్ఞానము తెలియ
గలిగితే నీకు కూడా సులభమేయగును.
2016 సంవత్సరముల పూర్వము ఒక వ్యక్తిలోని ఒక ఆత్మ ఆ
శరీరములో ఎదురయ్యే కష్టాలను పూర్తిగా అనుభవిస్తూ బాధపడింది. ఎక్కువ
నడుచుట వలన కాళ్ళలో నొప్పులను అనుభవించేది. కాలికి చెప్పులు
లేని దానివలన కాలికి ముళ్ళుగ్రుచ్చుకోగా దానివలన ఆ శరీరములోని
ఒక ఆత్మ బాధపడుచున్నప్పుడు ఇంకొక ఆత్మ చూస్తూయుండగా, మరియొక
ఆత్మ ఓదార్చుచుండెడిది. ఇదంతా నీ శరీరములో కూడా జరుగుచున్నది.
నీవు బాధను అనుభవించుచుండగా, నీలోని ఒక ఆత్మ చూచుచుండగా,
మరియొక ఆత్మ నిన్ను ఓదార్చుచున్నది. అనుభవించే వానివి నీవే అని
నీకు అర్థమయినా, చూచేవాడు ఎవడో, ఓదార్చేవాడు ఎవడో నీకు తెలియదు.
నీకే కాదు ఎవరికీ తెలియదు. అయితే నాకు బాగా తెలుసు ఎవడు
చూస్తున్నాడో, ఎవడు అనుభవించుచున్నాడో, ఎవడు ఓదార్చుచున్నాడో
ముగ్గురు నాకు తెలుసు. ఆ ముగ్గురిలో నేను ఎవరో కూడా నాకు బాగా
తెలుసు. అందువలన పూర్వము 2016 సంవత్సరములప్పుడు బాధను
అనుభవించిన ఆత్మ ఒకటికాగా, అతని శరీరములో మిగతా రెండు ఆత్మలలో
ఒకటి ఎల్లప్పుడు పనిచేయుచుండగా, మూడవ ఆత్మ ఏ పని చేయక
ఊరకున్నది. ఒక దినము ఆ వ్యక్తికి కాలిలోనూ, చేతిలోనూ ముల్లులు
గ్రుచ్చుకోగా చాలా బాధపడినాడు. అదే వ్యక్తి ఒకనాడు భయంకరముగా
చెలరేగిన తుఫానును ఆగిపొమ్మనగా అది ఆగిపోయింది. ముల్లుకు
బాధపడిన వ్యక్తి తనకంటిలో దుమ్ముపడిందని తుఫానును ఎలా అదుపు
చేయగలిగాడు? అతను ఆగిపో అంటూనే తుఫాను ఎందుకు ఆగిపోయినది?
అను ప్రశ్నలు రాకతప్పవు. వాటికి జవాబును చూస్తే ఇలా కలదు.
ఆ వ్యక్తిలోని కదలక మెదలకయున్న మూడవ ఆత్మ తుఫాను
సమయములో మాత్రము మాట్లాడి తుఫానును అణిగిపొమ్మని ఒకే ఒకమాట
చెప్పినది. అప్పుడు ప్రకృతి అయిన తుఫాను మూడవ ఆత్మమాటను
ఆలకించి వెంటనే ఆగిపోవడము జరిగినది. మూడవ ఆత్మకు మొత్తము
ప్రపంచమే ఆధీనములో యున్నట్లు, మూడవ ఆత్మమాటకు ప్రకృతి
యంతయూ తలొగ్గి పని చేయునని తెలియుచున్నది. అన్నిటికీ పెద్ద,
అన్నిటినీ అదుపు చేయువాడు దేవుడే అయినందున మన శరీరములో
మూడవ ఆత్మగా యున్నవాడు దేవుడే అని తెలియుచున్నది. 2016
సంవత్సరములప్పుడు మాట్లాడిన మూడవ ఆత్మ ద్వాపరయుగము చివరిలో
శ్రీకృష్ణుని శరీరమునుండి మాట్లాడినది. ఏకముగా అర్జునునితో మాట్లాడి
తన ఉనికిని ప్రజలకు తెలియునట్లు చేసినది. ఆ మూడవ ఆత్మనే మనము
'దేవుడు' అంటున్నాము. మూడు ఆత్మల విషయము ఆ మూడు ఆత్మలలోని
ఒక ఆత్మతో సంబంధము ఏర్పరచుకోవడము నాకు తెలుసు కావున అప్పటి
రెండవ ఆత్మతో సంబంధము ఏర్పరచుకొని అక్కడ ఏమి జరిగినది ఎవరు
జరిపినది తెలుసుకొన్నాము. ఆ విషయమునే ఇక్కడ తెల్పుచున్నాను.
ప్రబోధానందయోగీశ్వరులు అనబడు శరీరములో రెండవ ఆత్మగాయున్న
నేనే సర్వజీవరాసుల శరీరములలో రెండవ ఆత్మగా యున్నాను. అందరిలో
మాట్లాడనివాడు దేవుడయితే నేను మాట్లాడువానిగా యున్నాను.
“ప్రబోధానంద యోగీశ్వరులు అను శరీరము నాదే. నా శరీరములో
జీవుడు కూడా యున్నాడు. అయితే ఎల్లప్పుడూ నేను మాట్లాడక
అప్పుడప్పుడు మీతో జీవాత్మగాయున్న వానినే మాట్లాడమని చెప్పుచుందును.
అతను అనగా జీవాత్మ నా ఆజ్ఞచే మాట్లాడుచుండును. అయితే ప్రబోధానంద
యోగీశ్వరుల శరీరమునుండి నేను ఎప్పుడు మాట్లాడుచుందునో, నా ప్రక్కన
గల జీవాత్మ ఎప్పుడు మాట్లాడుచుండునో ఎవరికీ రవ్వంత కూడా తెలియదు.
ఒక్కొక్కప్పుడు నేను మాట్లాడేటప్పుడు 'నేను' అని తెలియక నాతో వాదించి,
నన్ను హేళనగా మాట్లాడిన వారు కూడా కలరు. వారి శరీరములో వారి
ప్రక్కనయుండేది నేనేనని, వారి జుట్టు నాచేతిలో యున్నదని వారికి
తెలియదు.
సర్వ శరీరములలో మూడు ఆత్మలున్నాయని నా శరీరములోని
జీవాత్మతో చెప్పించాను. మొదట చెప్పినది నేనే కాగా తర్వాత చెప్పినది
నా ప్రక్కనగల జీవాత్మ. జీవాత్మ అయినవాడు మాట్లాడుటకు చేతకానివాడు.
అట్లే ఏ పనిని చేయలేని వాడుగాయున్నాడు. అయితే జీవాత్మ భావములను
తెలిసి ఆ భావములను నేనే చెప్పినా అది నేను చెప్పినట్లు లెక్కించబడదు.
భావము అతనిది కనుక అతనే ఆ మాట మాట్లాడినట్లు లెక్కించబడును.
అట్లే జీవాత్మగా యున్నవాడు ఏ పనిని కూడా చేయలేనివాడు. వానికి
కాళ్ళు చేతులు, ముక్కు, ముఖము ఏదీ లేదు. జీవుడు గుండ్రని
ముద్దగాయున్నాడు. అటువంటి వాని భావములను నేనే స్వీకరించి ఆ
భావముల ప్రకారము వాని పనిని నేనే చేయుచున్నాను. పని నేనే చేసినా
భావము జీవునది కనుక ఆ పనిని జీవుడు చేసినట్లే లెక్కించబడుచున్నది.
కొన్ని విషయములలో దేవుని భావము ప్రకారమే నేను పని చేసినా, ఆ
పనులను నేనే స్వయముగా పనిచేసినట్లు లెక్కించబడును. నా శరీరములోని
జీవాత్మకు ఆత్మల జ్ఞానము తెలియుట వలన నా భావములనే అతడు
పొందియుండుట చేత అప్పుడు అతని కర్మ ప్రకారమే నేను చేసినా అప్పుడు
అతనికి కర్మలు అంటవు.”
"ప్రపంచములోని మిగతా ప్రజలలోని జీవుళ్ళు అజ్ఞాన భావమును
పొందియుందురు. జీవుడు భావములు కల్గియుండువాడేగానీ స్వయముగా
పనులు చేయుటకు శక్తిగానీ, శరీర అవయవములుగానీ అతనికి లేవు.
అందువలన వాని భావము ప్రకారము నేనే పనిని చేయుచున్నాను.
పనిని నేను చేసినా భావము జీవాత్మదే అయివుండుట వలన ఆ పని
జీవుడు చేసినట్లగును. అజ్ఞాన జీవుల భావములు అజ్ఞానముతోనే కూడు
కొనియుండుట వలన, అతని లెక్కలోనికి చేరిన పనులు కూడా అజ్ఞానము
తోనే కూడుకొనియుండును. అటువంటి అజ్ఞాన పనులలో కూడా కొన్ని
మంచి పనులు ఉండును, కొన్ని చెడు పనులు యుండును. మంచి పనుల
వలన వచ్చు ఫలితములో పుణ్యము వచ్చుచున్నది. చెడు పనుల వలన
వచ్చు ఫలితములో పాపము వచ్చుచున్నది. ఈ విధముగా నేను చేసిన
పనులలోని ఫలితములు జీవున్ని చేరుచున్నవి. అయితే జీవుని భావమునకు
సంబంధము లేకుండా నేను స్వయముగా చేయు పనులు అనేకము గలవు.
వాటివలన నాకు ఎటువంటి పాపము రాదు. ఎటువంటి పుణ్యము రాదు.
ప్రతి కార్యములోనూ అగ్నికి పొగ అంటుకొనియుండునట్లు పాప పుణ్యములు
అంటుకొనియుండును. అయితే కర్మలు (పాపము+పుణ్యము) అంటని
విధానము నాకు తెలుసు కావున నాకు ఎటువంటి పనిలోని పాపముగానీ,
పుణ్యముగానీ అంటదు. ఈ విధముగా శరీరములో నేను యుంటూ
నాతోపాటు జీవాత్మయుండగా, మా ఇద్దరితోపాటు పరమాత్మ కూడా
శరీరములోనే యున్నాడు. వాస్తవముగా శరీరములో అందరియందు జరిగే
విధానము, ఉండే నిర్మాణము, ఇలానే కలదు.”
"ఈ ఆత్మల విషయము ఎవడు తెలుసుకొనునో వాడు ఆత్మజ్ఞాని
అనబడును. అయితే నేడు ప్రపంచములో ఆత్మల విధానము తెలిసినవారు
చాలా అరుదుగాయున్నారు. ఒక విధముగా లేరనియే చెప్పవచ్చును.
హిందూ మతములో పెద్ద జ్ఞానులనిపించుకొన్న సిద్ధాంతకర్తలకే శరీరములోని
ఆత్మల విషయము, శరీరములోనే యున్న దేవుని విషయము తెలియక
ఒకరు అద్వైతమంటే మరొకరు విశిష్టాద్వైతమన్నారు. ఇంకొకరు
ద్వైతమన్నారు. వారి తర్వాత జ్ఞానులుగా వచ్చినవారు, గురువులుగా
ప్రకటించుకొన్నవారు, బోధకులుగా చెప్పుకొన్నవారు బయట దేవతలను
ఆధారము చేసుకొని వారి భక్తిని దేవతల మీద చూపుచున్నారు. ఎవరికి
కూడా శరీరములోనే జ్ఞానమంతా కలదని అనుకోవడము లేదు. ఆత్మలని
పేరుకు అనినా ఆత్మంటే దయ్యమని అనుకొనువారు గలరు. ఆత్మల
జ్ఞానము అంటే దయ్యాల జ్ఞానము అనువారు గలరు. మొత్తము మీద
ఆధ్యాత్మికములో సిద్ధాంతకర్తలను వారినుండి ఎవరికి ఆత్మజ్ఞానము
తెలియదు. కనుక నా దృష్ఠిలో ఎవరూ ఆత్మజ్ఞానులు కాదు. ఆత్మజ్ఞానము
ఏమాత్రము లేని ఇటువంటి సమాజములో నేనే స్వయముగా తెలుపాలని
అనుకొన్నాను.
నేను అనుకొన్న పనిని వెంటనే చేయువాడను గనుక నా శరీరము
ద్వారా నేనే మూడు ఆత్మల విషయమును తెలియజేశాను. నా శరీరములో
జాగ్రత్తగా నా పనులను, నా మాటలను గమనించుచున్న జీవాత్మకు మూడు
ఆత్మల విషయము తెలిసిపోయినది. అందువలన నా ప్రక్కనగల జీవాత్మ
కొన్ని సందర్భములలో మూడు ఆత్మలను తెలుపగా మరికొన్ని సందర్భము
లలో నేనే మాట్లాడి చాలామందికి మూడు ఆత్మల విషయమును చెప్పాను.
నా శరీరము అందరి శరీరములతో సమానముగాయుండుట వలన, నా
మాటలు జీవులు మాట్లాడే మాటలున్నట్లే యుండుట వలన, నన్ను కూడా
సాధారణ మనిషిగా లెక్కించి, నేను చెప్పిన మూడు ఆత్మల విషయమును
పరమత బోధయని హేళన చేసి నన్ను అవమానించిన వారు కూడా
కలరు. ఈ విషయమును భగవద్గీతలోని రాజవిద్యా రాజగుహ్య యోగమందు
పదకొండవ శ్లోకమున చెప్పియున్నాను.”
శ్లో॥ 11.
అవజానంతి మాం మూఢా మానుషీమ్ తను మాశ్రితమ్ ।
పరం భావ మజనంతో మమ భూతమహేశ్వరమ్ ||
భావము :- “సర్వ జీవరాసులను నడిపించు అధిపతినైయున్న నేను నర శరీరము
ధరించియుండుట వలన నా గొప్పతనమును, నా శ్రేష్ఠత్వమును తెలియని
అజ్ఞానులు నన్ను అవమానించుచున్నారు.”
ఎక్కువ శాతము హిందువులలోనే ఆత్మను అవమానించిన వారు
గలరు. నేను జీవాత్మనైయుండి శరీరములోగల ఆత్మల విషయమును ఒక
సిద్ధాంత రూపములో చెప్పాను. సిద్ధాంతము అని పేరు పెట్టి చెప్పితే
ప్రజలు గుర్తించుదురని నేను చెప్పునది "త్రైత సిద్ధాంతము" అనికూడా
చెప్పాను. నేను జీవాత్మనైయున్నా అందరి జీవాత్మలకున్న అహము నాలో
లేదు. నాకు ఆత్మజ్ఞానము బాగా తెలిసిపోయినది. నేనున్న శరీరములోనే
నా ఆత్మ ద్వారా ఆత్మజ్ఞానము నాకు తెలిసినది. అప్పటినుండి నేను
స్వంతముగా ఏమీ చేయలేదు. ఏమీ మాట్లాడలేదు. అంతా ఆత్మ ఆజ్ఞగానే
చెప్పుచున్నాను. నాలోని అహము పూర్తిగా పోయినది. అందువలన
ఆత్మవలె నాకు కూడా కర్మలు అంటవు. పాపపుణ్యములను కర్మలను
అంటని స్థితికి నన్ను చేర్చినది నాలోని ఆత్మయేనని ధైర్యముగా చెప్పు
చున్నాను. ఇంతకుముందు మనుషులు నన్ను అవమానించుచున్నారని
చెప్పినది స్వయముగా నా అధికారి అయిన ఆత్మయే. ఇప్పుడు మీతో
మాట్లాడమని ఆజ్ఞ చేసినది నా అధికారి అయిన నా అధిపతి అయిన
ఆత్మయే. నేను మాట్లాడు మాటలు నా ఆత్మ నాకు చెప్పినవేగానీ స్వయానా
నావి కావు. నా ఆత్మ అనుమతితో జీవుడయిన నేను త్రైత సిద్ధాంతమను
మూడు ఆత్మల సిద్ధాంతమును శాస్త్రబద్దముగా "త్రైత సిద్ధాంత భగవద్గీత"లో
వ్రాయడము జరిగినది. అయితే 'త్రైత సిద్ధాంత భగవద్గీత'ను సంతోషముగా
స్వీకరించి చదివినవారు కొందరున్నారు. అయితే మరికొందరు అజ్ఞానము
నిండినవారై, అహము భావముతో అసూయ గుణముతో త్రైత సిద్ధాంత
భగవద్గీతను పరమతమునకు సంబంధించినదని బజారులోనికి విసరి వేసిన
వారున్నారు, అగ్గి పెట్టి కాల్చిన వారున్నారు.
అటువంటి వారి శరీరములో వారిని నడుపుచున్నవాడు,
మాట్లాడుచున్నవాడు ఆత్మే అయినా, వారి భావముల ప్రకారమే ఆత్మ
పనులు చేయడము జరిగినది. శరీరములోని ప్రతి పని ఆత్మే చేసినా తన
భగవద్గీతను వారి భావము ప్రకారమే విసరివేయడము, వారి భావము
ప్రకారము కాల్చి వేయడము చేసినది ఆత్మయే. అయితే దైవధర్మము
ప్రకారము (దైవ చట్టము ప్రకారము) జీవుని భావమునుబట్టి ఆత్మ చేసినా
ఆ పని జీవుడు చేసినట్లే లెక్కించబడును అని ముందే చెప్పియున్నాము.
అందువలన భగవద్గీతను అవమానించిన కారణమున వారికి వచ్చు
ఫలితము ‘భయంకరమైన పాపము' అని చెప్పవచ్చును. అది క్షమించరాని
పాపమని మధ్య దైవగ్రంథములో చెప్పబడినది. అక్కడ చెప్పిన విషయము
ఇలా కలదు చూడండి. అక్కడ చెప్పినది ఎవరోకాదు మీలోని ఆత్మయే
అని చెప్పుచున్నాను. “మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు
వారికి క్షమించబడును గానీ, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ
లేదు. మనుష్యులకు వ్యతిరేఖముగా మాట్లాడు వానికి క్షమాపణ
కలదుగానీ, దేవునికి విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందై
ననూ, రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.”
ఆ వాక్యమును చెప్పినవాడు ఆత్మయేనని నేను చెప్పుచున్నాను.
నేను ఆత్మప్రక్కనే జీవునిగాయున్నాను కనుక ఆ విషయము స్వయముగా
ఆత్మే చెప్పినదని రూఢీగా చెప్పుచున్నాను. నేను జీవాత్మగా శరీరములో
ఒక మూలయున్నవాడిని, శరీరమునకు అధిపతి ఆత్మయే. ఆత్మ అనుమతితో
నేను శరీరములో నివశించుచున్నాను. నాకు అందరివలె బయటి భక్తి
లేదు. శరీరములోనే నా భక్తియంతయు కలదు. శరీరములోనే నా
జ్ఞానమంతయూ గలదు. అందువలన శరీరములో ఈశ్వరుడై (అధిపతియై)
యున్న ఆత్మయెడల భక్తి కల్గియున్నాను. మిగతా మనుషులు శరీరములోని
ఆత్మనే ఈశ్వరుడని తలువక, శరీరము బయట ఈశ్వరుడు (దేవుడు)
ఉన్నాడని అనుకొంటున్నారు. శరీరము బయటగల దేవున్ని కొందరు
నిరాకారుడని, నిర్గుణుడని అనగా, కొందరు కాదు దేవుడు సాకారుడు
సగుణుడు అని అంటున్నారు. అంతకు ఆ దేవుడెవరని విచారిస్తే విష్ణువని
విశిష్టాద్వైతులు, ద్వైతులు అనగా, ఆకారము లేకుండా గుండుగా,
లింగమువలె యున్న శివుడని అద్వైతులు అంటున్నారు. బయట
త్రిమూర్తులుగా యున్న శివ, కేశవులను వారు దేవుడని చెప్పుకొంటున్నారు.
వాస్తవానికి ఆ దేవతలు కూడా దేవుని చేత సృష్ఠింపబడినవారేయగుట
వలన వారిని అలా ప్రకటించు అద్వైత, ద్వైతసిద్ధాంతములు అసలయిన
శాస్త్రబద్ద సిద్ధాంతములు కావని తెలియుచున్నది.
ఈ విధముగా ముందునుండి యున్న సిద్ధాంతములు సరియైనవి
కావు కనుక ఆత్మ తాను స్వయముగా "త్రైత సిద్ధాంతము"ను ప్రకటించడము
జరిగినది. అంతకుముందు ద్వైత, అద్వైత సిద్ధాంతములను తెలిసిన నేను
వాటిని నమ్మలేదు. ఎందుకనగా ! సిద్ధాంతకర్తలను వారి జీవాత్మలు అహము
భావముతో మాట్లాడిన మాటలుగా యుండుట వలన వాటిమీద నాకు
అనేక ప్రశ్నలు, అనుమానములు యుండేవి. దాదాపు 37 సంవత్సరముల
క్రిందట త్రైత సిద్ధాంతమును ఆత్మ స్వయముగా ప్రకటించినప్పుడు నాకు
సత్యము తెలిసినది. మూడు ఆత్మల జ్ఞానమును కొంతకుకొంత తెలిసిన
జీవాత్మగా నేనెంతో సంతోషించాను. నా కర్మప్రకారము నేను అనుభవించు
కష్టములను లెక్కచేయక నా దృష్ఠియంతయూ శరీరమునకు అధిపతియైన
ఆత్మమీదనే కేంద్రీకరించియుండుట వలన నా కర్మలనుండి నేను బయట
పడడమేకాక నాకు ఆత్మజ్ఞానము పూర్తిగా తెలిసినది.
ప్రశ్న :- మీరు మాట్లాడేది తెలుగు భాషయే అయినా, అన్ని పదములు,
అన్ని వాక్యములు తెలుగు భాషయేయైనా మేము ఏదో క్రొత్తగా విన్నట్లున్నది.
మాట్లాడేది ఆత్మేనంటారు అయినా భావము జీవునిది అగుట వలన జీవుడే
మాట్లాడుచున్నాడు అంటారు. మరియొకమారు ఆత్మే మాట్లాడుచున్నది
జీవాత్మ కాదు అంటారు. మీరు ఎంతో వివరముగా చెప్పుచున్నా మా
బుద్ధి దానిని అందుకోలేకపోవుచున్నది. మొత్తముమీద క్రొత్త సిద్ధాంతము
త్రైత సిద్ధాంతమని తెలిసినది. త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినవారు
ప్రబోధానంద యోగీశ్వరులని తెలిసినది. ప్రబోధానంద యోగీశ్వరులు
మనిషా? కాదా!యను ప్రశ్న వచ్చుచున్నది. ఈ ప్రశ్నకు మీరు ఆత్మగా
జవాబు చెప్పుతారో, జీవాత్మగా జవాబు చెప్పుతారో మీరే నిర్ణయించుకొని
చెప్పండి?
జవాబు :- సూత్రము ప్రకారము నేను జీవాత్మను మాట్లాడుచున్నాను. నా
భావము ప్రకారము ప్రబోధానంద యోగీశ్వరులు అనునది పేరుకాదు
బిరుదుగా చెప్పవచ్చును. పేరు పిల్లప్పుడే జన్మించిన కొద్దిరోజులకే
నామకరణము చేయడము జరుగును. శరీరములోపల అంతయు
అణువణువునా వ్యాపించియున్నవాడు ఆత్మయే. అందువలన శరీరమునకు
అధిపతి ఆత్మయే అగును. జీవుడు శరీరములో ఒకమూల ఇరుక్కొన్నట్లు
యున్నాడు. శరీరము ఎవరిదయితే శరీరమునకు పెట్టిన పేరు వారిదే
అగును. అందువలన మొదటి పుట్టుకతో పెట్టిన పేరు “పెద్ద”. “పెద్ద”
అను పేరు శరీరములోని ఆత్మకే వర్తించును కావున ఆ పేరు జీవునిది
కాదని చెప్పవచ్చును. శరీరము లోపలయున్న జీవునికి పేరే లేదు. మేము
జీవునికే ఈ పేరు పెట్టాము అనికొనినా అది ఆత్మకే వర్తించును.
శరీరములోని ఆత్మ కొంతసేపు, జీవాత్మ కొంతసేపు మాట్లాడినా పేరు
ఆత్మదే.
ప్రశ్న :- శరీరము ఒకటే అయినా అదే శరీరములో జీవాత్మ మాట్లాడు
చున్నాడు. అట్లే ఆత్మ మాట్లాడుచున్నాడు. త్రైత సిద్ధాంతమును ఇద్దరు
చెప్పారు. సిద్ధాంతమును చెప్పడము ముఖ్యమైన విషయమగుట వలన
అప్పుడు సిద్ధాంతమును చెప్పినది ఆత్మను అనుకోవాలా? లేక జీవాత్మయని
అనుకోవాలా? చెప్పండి?
జవాబు :- ఆత్మనే అనుకోవాలి. జీవాత్మకు ఏమీ తెలియదు. ఆత్మ చెప్పిన
తర్వాత జీవాత్మకు తెలిసినది. అందువలన శరీరమునకు అధిపతియైన
ఆత్మయే త్రైత సిద్ధాంతమును తెలిపినది. జీవాత్మ ఎప్పుడూ స్వయముగా
మాట్లాడలేదు. జీవాత్మ భావము ప్రకారం ఆత్మయే మాట్లాడుచున్నది.
భావము జీవాత్మది అయినందున జీవాత్మ చెప్పినట్లగుచున్నది. జీవాత్మ
మాట్లాడినట్లు లెక్కించుచున్నాము. అంతతప్ప జీవుడు స్వయముగా ఎప్పుడూ
మాట్లాడలేదు. శరీరములో ఏ పనిచేసినా, ఏ మాట మాట్లాడినా అన్ని
కార్యములను ఆత్మయే చేయుచున్నది. త్రైత సిద్ధాంతము ఆధ్యాత్మిక
సిద్ధాంతము అగుట వలన అది ముఖ్యమైన కార్యము. సాధారణ
కార్యములనే చేయని జీవుడు ముఖ్యమైన పనిని చేశాడని ఎలా చెప్పగలము.
ఆత్మయే చేయుట వలన ఆత్మయొక్క పేరునే అక్కడ వ్రాయడము జరిగినది.
ప్రశ్న :- గ్రంథము మీద 'రచయిత' అని వ్రాసి పేరును వ్రాయుచున్నారు.
అది శరీరమునకు పెట్టిన పేరుకదా! ఆత్మ పేరుకాదు కదా! ఈ మాటకు
మీరేమంటారు?
జవాబు: మీ లెక్కలో అది శరీరముయొక్క గుర్తింపుకు పెట్టిన పేరయినా,
ఆ పేరు ఆత్మకు వర్తించునదేగానీ శరీరమునకు గానీ, జీవాత్మకుగానీ
వర్తించదు. అక్కడ “రచయిత పేరు” అని వ్రాసిన తర్వాత “త్రిమత
ఏకైక గురువు” అని మొదట వ్రాసి దాని తర్వాత ఆధ్యాత్మిక సామ్రాజ్య
చక్రవర్తి, ఇందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత
సిద్ధాంత ఆదికర్త అని వ్రాసియుండును. ఇవన్నియూ ఆ శరీరములో
ఆత్మ పనిచేసిన దానికి గుర్తింపుగా ఆత్మకు పెట్టిన పేర్లని తెలియవలెను.
ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు హిందూమతములో పుట్టాడు. హిందూ
మతమునకే గురువుగాయుండాలిగానీ మూడు మతముల గురువు అని
వ్రాయడము ఎందుకు? ఒక మతమునకు మరొక మతమునకు ఏమాత్రము
సరిపోక ఒకరినొకరు అసూయతో చూచుకొను ఈ కాలములో ఒక
మతములో పుట్టినవాడు మూడు మతములకు ఎలా చెప్పగలడు? దీనికి
సమాధానము చెప్పండి?
జవాబు :- ప్రపంచములో జ్ఞానము మనుషులకు మిగతా జీవరాసులకు
అవసరమే అయినా జీవరాసులకు మనుషులుగాయున్న వారు జ్ఞానమును
తెలియజేయలేరు. మనుషులకు తెలియజేయవచ్చును. అయితే మనుషులకు
అవసరమైన జ్ఞానమును సృష్ట్యాదిలోనే దేవుడు తెలియజెప్పాడు. ఆనాడు
ఏ మతము లేదు. అందువలన దేవుడు చెప్పిన బోధ హిందూ మతమునకని
చెప్పలేదు. సర్వమానవులకు వర్తించునదిగా చెప్పాడు. అందువలన
మనుషులు ఎన్ని మతములుగా మారియున్నా అన్ని మతములలోని వారు
మనుషులే అయినందున మనుషులయిన వారు ఏ మతములోయున్నా
దేవుడు మొదట చెప్పిన జ్ఞానము ప్రతి మతములోని మనుషులందరికీ
వర్తించుచున్నది. సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానము హిందువుకు ఎంత
అవసరమగుచున్నదో, అట్లే ముస్లీమ్లకు కూడా అంతే అవసరమగు చున్నది.
మూడు మతములలో మూడు రకముల ఆచారములతో కూడుకొన్న
ప్రజలుండినా దేవుని జ్ఞానము వారికి కూడా అవసరమగుచున్నది. అది
వారికి కూడా సమానముగా వర్తించుచున్నది. దేవుడు సృష్ట్యాదిలో
మనుషులకు చెప్పిన జ్ఞానము నేడు అన్ని మతముల వారికి పనికి వచ్చే
జ్ఞానముగానే యున్నది. దేవుడు ప్రపంచమును తయారు చేసినప్పుడు
మనుషులను తయారు చేసి, వారికి కావలసిన ఆహారమును కూడా గింజల
రూపములో చేసి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆహారము నేడు ఎన్నో
మతములుగా చీలినవారికి కూడా పనికి వచ్చుచున్నది కదా! దేవుడు
ఆదిలో ఇచ్చిన ఆహారమే నేడు అన్ని మతముల వారికి ఆహారముగా
యున్నట్లు, దేవుడు సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానము నేడు ఏ మతములోని
వానికయినా సరిపోవుచున్నది. అందువలన “ఆత్మ” మూడు మతముల
గురువుగా యున్నది. మొదట చెప్పిన జ్ఞానము ఆ దినములలో భగవద్గీతగా
తయారయినది. తర్వాత మనుషులు మతములుగా చీలిపోయినా
వారికొరకు వారి మత గ్రంథములు తయారయినా ఆ గ్రంథములలో కూడా
దేవుడు సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానముండడము విశేషము.
ప్రశ్న :- "ప్రతి శరీరములో మూడు ఆత్మలుండగా అదే జ్ఞానమును
దేవుడు మొదట తయారు చేసిన దైవగ్రంథమయిన భగవద్గీతలోనూ, తర్వాత
తయారయిన రెండు దైవగ్రంథములలోనూ దేవుడు ఇమిడ్చాడు” అని మీరు
అంటున్నారు. అయితే త్రైత సిద్ధాంతమును మిగతా మతముల వారు
కూడా తెలియవలసియున్నది. మిగతా మతముల వారి విషయము అటుంచి
హిందూ మతమువారికయినా త్రైత సిద్ధాంతము తెలిసిందా?
జవాబు :- దేవుడు మూడు మతముల వారికి అర్థము కావలెనని త్రైత
సిద్ధాంతమును సృష్ట్యాదిలోనే చెప్పినా నేటివరకు మనుషులెవరికీ తెలియ
దనియే చెప్పుచున్నాము. మూడు మతముల వారికి తెలియునట్లు ఆత్మలు
మూడుగాయున్నాయి అను వివరమును తెలియజేయు జ్ఞానమును వారివారి
గ్రంథములలో వ్రాయబడియున్నా ఏ మతము వారు దానిని గుర్తించలేక
పోవడము పెద్ద విచిత్రముగా యున్నది.
ప్రశ్న :- మూడు దైవగ్రంథములలో ఒకే విధమైన మూడు ఆత్మల త్రైత
సిద్ధాంతమున్నదని మీరు చెప్పుచూయుంటే మాకు కూడా ఆ మాట క్రొత్తగా
కనిపించుచున్నది. మూడు మత గ్రంథములుగాయున్న, మూడు దైవ
గ్రంథములలో త్రైత సిద్ధాంతము ఎలాగున్నదో మాకు వివరించగలరా?
జవాబు :- నేడు హిందువుల గ్రంథముగా పేరుపొందిన భగవద్గీతలో
త్రైత సిద్ధాంతమునే ముఖ్యమైన జ్ఞానముగా చెప్పడమైనది. భగవద్గీతయందు
పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17 శ్లోకములు త్రైత సిద్ధాంతమునకు
పునాదిరాళ్ళుగాయున్నవి.
శ్లో॥ 16.
ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవచ।
క్షర స్సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే |
భావము :- "లోకములో రెండు రకముల పురుషులు కలరు. అందులో
నాశనమయ్యే జీవుడు అనేక జీవరాసులుగా గలడు. నాశనము గాని పురుషునిగా
సర్వ జీవరాసులలోనే అక్షరుడనువాడు గలడు." ఒకడు నాశనమయ్యేవాడు,
మరొకడు నాశనము కానివాడు అని చెప్పబడు ఇద్దరు పురుషులు
శరీరములోనే కలరు.
శ్లో॥ 17.
ఉత్తమః పురుష స్వన్యః పరమాత్మే త్యుదాహృతః ।
యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః
భావము :- “ఇద్దరు పురుషులుగాక మరొక్క పురుషుడు గలడు అతడు ఇద్దరు
పురుషులకంటే ఉత్తముడు. అతనినే పరమాత్మయని అందురు. నాశనములేని
మూడవ పురుషుడయిన పరమాత్మ ముల్లోకములు వ్యాపించి యున్నాడు".
ఈ విధముగా భగవద్గీతలో రెండు శ్లోకముల రూపములో త్రైత
సిద్ధాంతమునకు దేవుడే నాంది పలికాడు. దేవుడు చెప్పిన త్రైత
సిద్ధాంతములో నాశనమయ్యే ఆత్మను క్షరుడనీ, నాశనము కాని ఆత్మను
అక్షరుడనీ చెప్పడమైనది. ఆత్మను పురుషుడని చెప్పుచున్నారు. రెండు
రకముల పురుషులకంటే మూడవ పురుషుడు ఉత్తముడు కావున ఆయనను
పురుషోత్తముడని అన్నారు. ఈ ముగ్గురు పురుషులు సర్వజీవుల
శరీరములలో యున్నారు. జీవాత్మగాయున్నవాడు నాశనమయ్యే వాడుగా
యున్నాడు. శరీరమునకు పెద్దగాయున్నవాడు, శరీరములో సర్వకార్యములు
చేయువాడు అయిన ఆత్మయే నాశనముకాని అక్షరుడుగా యున్నాడు.
వీరిరువురు కాకుండా, అనగా ఇద్దరు పురుషులు కాకుండా, మూడవ
పురుషుడు గలడు. అతడు ఇద్దరు పురుషులకంటే ఉత్తముడు, గొప్పవాడు,
ఆత్మకంటే వేరుగా యున్నవాడు అని చెప్పుచూ పురుషోత్తముడనీ మరియు
పరమాత్మయనీ పిలువబడుచున్నాడు.
ఈ విధముగా భగవద్గీతలో త్రైత సిద్ధాంతమును చెప్పియున్నా
నేటివరకు భగవద్గీతను బోధించు గురువులుగానీ, బోధకులుగానీ స్వామీజీలు
గానీ గమనించక గాలికి వదలివేశారు. అందువలన నేటివరకు త్రైత
సిద్ధాంతము గురించి ఎవరికీ తెలియకుండా పోయినది. మేము ఒక
ప్రక్క చెప్పుచున్నా ఇప్పటికయినా తెలుసుకుందామను ధ్యాస కూడా లేదని
చెప్పాలి. దేవుడు చెప్పినది, సిద్ధాంతములలో శాస్త్రబద్దమైన త్రైత
సిద్ధాంతమును తెలియజేయాలను ఉద్దేశ్యముతో మేము త్రైత సిద్ధాంతమును
ప్రకటించడము జరిగినది. అయితే నేటి హిందువులు ఆర్యసాంప్రదాయము
లలో మునిగిపోయినవారై తమకు తెలిసినదే జ్ఞానమనుకొని మిగతా
దేనినయినా అజ్ఞానమంటున్నారు. మేము త్రైతమంటూనే ఇది క్రైస్తవులకు
సంబంధించినదని అంటున్నారు. త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే భగవద్గీత
ముసుగులోయున్న బైబిలు అంటున్నారు. అంతో ఇంతో జ్ఞానమున్నవారు,
మేము స్వచ్ఛమయిన హిందువులము, హిందూ మతరక్షణ చేయుచున్నా
మనువారే అలా ప్రవర్తించుట వలన వారు త్రైత సిద్ధాంతమును తెలుసు
కోవడము లేదు. ఇతర హిందువులను తెలుసుకోనీయడము లేదు.
ఇక క్రైస్తవ మత విషయానికివస్తే వారి మతమునకు ప్రామాణిక
గ్రంథమని చెప్పుకొను బైబిలులో కూడా త్రైత సిద్ధాంతము గలదు. అయితే
వారు దానిని 'త్రిత్వము' అంటున్నారు. అట్లే ఆంగ్లభాషలో ట్రినిటీ
అంటున్నారు. ట్రినిటీ లేక త్రిత్వము అనునది వారిలో ఒక వర్గమునకు
గుర్తుగా కొందరు చెప్పుకోగా, త్రిత్వము జ్ఞానవాక్యముగా చెప్పుకొంటున్నారు
గానీ, ట్రినిటీ అంటే ఏమిటి? త్రిత్వము అంటే ఏమిటో దాని అర్ధము
మాత్రము వారికి తెలియదు. త్రిత్వము అంటే మూడని తెలిసినా మూడు
ఏమిటో తెలియదు. క్రైస్తవ బోధలను చెప్పు ఒక సీనియర్ పాస్టర్గారి
వద్దకు పోయి త్రిత్వము అంటే ఏమిటని మేము అడుగడము జరిగినది.
అప్పుడు ఆ పాస్టర్
గారు “త్రిత్వము అంటే మూడని” చెప్పారు. “మూడు
అంటే ఏవి?" అని అడిగాము. అప్పుడు ఆయన “తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మ అను మూడు పేర్లు చెప్పబడియున్నవి. ఆ మూడును మేము
ట్రినిటీ అనియూ త్రిత్వము అనియూ అంటున్నాము” అన్నాడు. “తండ్రి
అంటే ఎవరు?” అని అడిగాము. అప్పుడు ఆయన “తండ్రి అంటే దేవుడు
అనియూ, కుమారుడు అంటే దేవుని కుమారుడు ఏసు” అనియూ చెప్పాడు.
“పరిశుద్ధాత్మ అంటే ఏమిటి?” అని అడిగాము. అప్పుడు పాస్టరుగారు
ఏమాత్రము తడుముకోకుండా “పరిశుద్ధాత్మ అనినా దేవుడనియే అర్థము”
అని అన్నాడు. తండ్రి అనినా, పరిశుద్దాత్మ అనినా రెండు పదములు
దేవున్ని తెలుపుచున్నప్పుడు కుమారుడు ప్రత్యేకముగా యున్నప్పుడు, తండ్రి,
కుమారుడు, పరిశుద్ధాత్మ అని మూడు చెప్పినా అవి మూడు కాకుండా
రెండే అగుచున్నవి. తండ్రి, పరిశుద్ధాత్మ రెండూ ఒకటైనప్పుడు, త్రిత్వము
లేకుండాపోయి ద్విత్వము ఏర్పడుచున్నది. అనగా మూడు కాకుండా
రెండగుచున్నవి. అలా తండ్రి, పరిశుద్ధాత్మ రెండూ ఒకటైనప్పుడు త్రిత్వము
అనుటకు వీలులేదు. దానిని ద్విత్వము అనియే చెప్పవచ్చును. దీనినిబట్టి
పాస్టరుగారు చెప్పిన జవాబు తప్పయినదని తెలియుచున్నది. దీనివలన
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను మూడు పదములకు వాస్తవమైన
అర్థము పాస్టరుకుగానీ, మరి ఇతర క్రైస్తవులకుగానీ తెలియదనియే
చెప్పవచ్చును. ఈ విధముగా బైబిలులో గల మూడు ఆత్మల సిద్ధాంతమయిన
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క మూడింటికి అర్థము తెలియదనియే
చెప్పవచ్చును.
భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17 శ్లోకములలో
త్రైత సిద్ధాంతమున్నా అది హిందువులకు ఏమాత్రము తెలియనట్లు, బైబిలు
గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయమందు 19వ వచనమున
“త్రైత సిద్ధాంతము” ఇలా చెప్పబడినది చూడండి. (మత్తయి: 28-19)
"మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు,
కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి
బాప్తిస్మము ఇచ్చుము" అని చెప్పబడినది. అయితే ఈ వాక్యము ఆధ్యాత్మిక
రంగములో ముఖ్యమైనదనీ, ఇది మూడు మతములలో చెప్పిన త్రైత
సిద్ధాంతమని చాలామంది క్రైస్తవులకు తెలియదు. ఇది బైబిలులో ముఖ్యమైన
సిద్ధాంతమని కూడా తెలియదు. ఈ వాక్యమును చూస్తూనే హిందువులు
ఇది క్రైస్తవులదని చెప్పుచున్నారు. అయితే త్రైత సిద్ధాంతము సమస్త
మానవులకు అవసరమైనదని తెలియక మతద్వేషముతో మాట్లాడుచున్నారు.
బైబిలులోని మత్తయి సువార్త యొక్క వాక్యములో ఈ వాక్యమును
చెప్పినప్పుడు "మీరు వెళ్ళి సమస్త జనులకు" అని అక్కడ చెప్పడమైనదిగానీ
క్రైస్తవులకు అని చెప్పలేదు కదా! సమస్త జనులలో నేను ఒక్కనిగా యున్నాను.
అందువలన మూడు దైవగ్రంథములలో చెప్పబడిన త్రైత సిద్ధాంతము నాకు,
నీకు, అందరికీ అవసరమైనదని, తప్పక తెలుసుకోవలెనని దేవుడు చెప్పినట్లు
మూడు గ్రంథములలో కలదు.
ఇక అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో సూరా 50,
ఆయత్ 21 లో అల్లాహ్ చెప్పిన దానినే జిబ్రయేల్ ఇట్లు చెప్పాడు. (50-21)
' ప్రతి వ్యక్తి తనవెంట తనను తీసుకవచ్చేవాడొకడు, సాక్ష్యమిచ్చేవాడు
ఒకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు." ఇంకొక గ్రంథములో ఇలా
వ్రాశారు చూడండి. "ప్రతి ప్రాణి ఒక తోలేవాడితో, మరొక సాక్ష్యమిచ్చే
వాడితో సహా హాజరవుతాడు." ఈ విధముగా ఖురాన్ గ్రంథములో
వ్రాయబడి యున్నా ఇది ముఖ్యమైన దైవసిద్ధాంతమని ముస్లీమ్లకు
తెలియదు. త్రోలేవాడు ఒకడు, త్రోలబడేవాడు మరొకడు ఉండగా ఇద్దరికీ
సాక్షిగాయున్నవాడు మరొకడు గలడు. ఇట్లు ముగ్గురిని గురించి గ్రంథములో
చెప్పియున్నా ఆ ముగ్గురు ఎవరో ఏమాత్రము ముస్లీమ్లకు తెలియదు.
ప్రశ్న :- క్రైస్తవ, ముస్లీమ్ల గ్రంథములలో యున్నది, భగవద్గీతలోని త్రైత
సిద్ధాంతమే అయినప్పుడు భగవద్గీతలోని మూడు ఆత్మల సిద్ధాంతమును
(త్రైత సిద్ధాంతమును) సృష్టి ఆదిలోనే దేవుడు చెప్పాడని అర్థమగుచున్నది.
ద్వైత, అద్వైత సిద్ధాంతములను కలియుగములో పుట్టిన శంకరాచార్యులు,
రామానుజాచార్యులు, మధ్వాచార్యులు చెప్పగా త్రైత సిద్ధాంతమును దేవుడు
ముందే సృష్ట్యాదిలోనే చెప్పినట్లు కలదు కదా! అటువంటప్పుడు "త్రైత
సిద్ధాంత కర్త” నిజముగా దేవుడేయగును గానీ మీరు కాదు కదా!
అటువంటప్పుడు “త్రైత సిద్ధాంత ఆదికర్తయని” మీ పేరు చెప్పుకోవడము
తప్పగును కదా! దీనికి మీరేమంటారు?
జవాబు :- ఆదికర్త అంటే మొదటి కర్త అనియూ, మొదట చెప్పినవాడనియూ
అర్థము. ఒకవేళ మేము త్రైత సిద్ధాంతకర్తనని ప్రబోధానంద పేరు
వ్రాసియుంటే మీరు ఈ ప్రశ్న అడిగినా సరిపోయివుండేది. మీరు
ప్రశ్నించుటకు ముందే ఆదికర్త అని వ్రాసియుండుట వలన మొదట
చెప్పిన వాడని అర్థము కాగలదు. అంటే మీ ప్రశ్నకు ముందే జవాబు
వచ్చియున్నది. అయితే అది అర్థముకాక ఈ విధముగా అడిగారని
మేము అనుకొంటున్నాము. నేను జీవుడుగా చెప్పునది ఏమనగా! త్రైత
సిద్ధాంతము సృష్ట్యాదిలోనే చెప్పబడినది. దానినే భగవద్గీతలో రెండవమారు
కృష్ణ భగవానుడు చెప్పడము జరిగినది. సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమునే
చెప్పుచున్నానని కృష్ణుడు భగవద్గీతను చెప్పడము జరిగినది. భగవద్గీతలో
ముఖ్యముగా చెప్పడము మూడు ఆత్మల వివరము. దైవజ్ఞానమంతయూ
మూడు ఆత్మల వివరము మీదనే ఆధారపడియున్నది. అనగా త్రైత
సిద్ధాంతము మీదనే దైవజ్ఞానము కలదని చెప్పడమైనది. ఇదే త్రైత సిద్ధాంతమే
మిగతా రెండు గ్రంథములందు రెండు రకములుగా చెప్పియున్నారు. మూడు
గ్రంథములలోని త్రైత సిద్ధాంత వాక్యములను చదివినప్పటికీ ఈ మూడు
వాక్యములు ఒకే విధముగా ఉన్నాయను ధ్యాస కూడా కలుగడము లేదు.
త్రైత సిద్ధాంతమును ముందు చెప్పినవాడు దేవుడని చెప్పినా దేవుడు
రూప, నామ, క్రియారహితుడగుట వలన ఆయన ఎవరితోను నేరుగా
మాట్లాడడు. అంతేకాక త్రైత సిద్ధాంత సూత్రము ప్రకారము ఆయన
(దేవుడు) సాక్షిగా చూచువాడేగానీ క్రియగా చేయువాడు కాదు. ఏది చేసినా,
ఏది మాట్లాడినా దేవుని అంశగాయున్న మిగతా రెండు ఆత్మలలో
అక్షరుడుగాయున్న రెండవ ఆత్మ చేయవలసిందే. మూడవ ఆత్మయిన
జీవాత్మ భోక్తగా అనుభవించువాడుగా మాత్రమున్నాడు. దీనినిబట్టి మొదటి
దేవుడు ఏమీ చేయడు, చివరి జీవుడు కూడా ఏమి చేయలేనివాడుగా
కేవలము అనుభవించువాడుగాయున్నాడు. ఈ విధముగా మూడు ఆత్మల
విధానముండగా, దేవుడు బయటికి చెప్పవలసిన జ్ఞానములో గల త్రైత
సిద్ధాంతమును సృష్ట్యాదిలో ఆత్మయే బయటికి చెప్పవలసివచ్చినది.
సృష్ట్యాదిలో దైవజ్ఞానమును ఆకాశము వాణిద్వారా సూర్యునికి చెప్పినప్పుడు
మనకు తెలియని విధానము ఏమి జరిగినదో కొంత వివరముగా తెలుసు
కొందాము.
ఆకాశము ప్రకృతిలోని ఒక భాగము. ప్రకృతిలో ఐదు భాగములు
గలవు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములను
పంచ మహా భూతములు అంటున్నాము. భూతము అనగా జీవము గలదని
అర్థము. మహా భూతము అనగా 'గొప్ప శక్తివంతమైన జీవుడు' అని
అర్థము. ప్రకృతిలోని ఐదు భాగములు ఐదు గొప్ప శక్తులుగాయున్నవి.
ప్రపంచములో ఈ ఐదు భూతముల తర్వాతనే ఇతర భూతముల
శక్తియుండును. అంటే విశ్వమంతటికీ ఈ ఐదు ప్రకృతి శక్తులే గొప్పయనీ,
దేవుని తర్వాత గల గొప్ప శక్తులు ఈ ఐదు భూతములుగా యున్నవని
చెప్పవచ్చును. ఐదు భూతములలో మిగతా నాలుగుకంటే పెద్దది, మొదటిది
ఆకాశము. దేవుని తర్వాత గల ఐదు శక్తులలో మొదటి శక్తి ఆకాశము.
ఆకాశ భూతము ద్వారా సృష్ట్యాదిలో దైవజ్ఞానము ఆకాశములో తేలుతున్న
సూర్యునికి మొదట చెప్పబడినది. దేవుని జ్ఞానము సృష్ట్యాదిలోనే ఆకాశము
ద్వారా సూర్యునికి తెలిసినదని చాలామంది జ్ఞానులకు తెలిసినా అక్కడ
మనకు తెలియకుండా జరిగిన తతంగము ఎవరికీ తెలియదు.
తతంగమును విప్పి చెప్పుకొంటే ఎంతో జ్ఞానము కూడా తెలియగలదు.
ఆకాశము ఒక భూతమైనప్పుడు దేవుని ధర్మము ప్రకారము
జీవుడుగాయున్న వానికి (భూతముగాయున్న వానికి) ఆత్మతోడైయుండును.
జీవుడు ఎక్కడ ఉండునో ఆత్మ వానికి తోడుగాయుండవలెననుట దైవ
ధర్మము. దైవ నిర్మిత ధర్మము ప్రకారము జీవుడు అనగా జీవాత్మ, ఆత్మ
రెండు జోడు ఆత్మలుగా ఉండును. సజీవమైన ఏ శరీరములోగానీ, జీవునితో
పాటు ఆత్మయుండుట సహజము. ఎచట భూతముండునో అచట ఆత్మ
దానికి తోడైయుండగా, పరమాత్మ సాక్షిగా ఇద్దరినీ చూచుచుండును. అదే
త్రైత సిద్ధాంతమని చెప్పడమైనది. భూతముగాయున్న అనగా జీవుడుగా
యున్న వాడు శరీరములో ఏమీచేయనివాడై యుండును. చేయుటకు
చేతకానివాడై యుండును జీవుడు. చేయుటకు చేతనయినా చేయనివాడు
దేవుడు. వీరి ఇద్దరికీ మధ్యలోయున్న ఆత్మ అవసరమయితే ఇటు దేవుని
పనినిగానీ, అటు జీవుని పనినిగానీ చేయుచున్నది. అదే విధానముతో
సృష్ట్యాదిలో దేవుని పని జ్ఞానము తెలుపడము, అయినా దేవుడు చేయడు
కనుక దేవుని పనిని ఆకాశ జీవునికి తోడుగాయున్న ఆత్మయే చేసినది.
చివరికి ఆకాశవాణి సూర్యునికి సృష్ట్యాదిలో జ్ఞానము చెప్పినదని అందరూ
అనుకోవడము జరిగినది. ఒక పని జరుగగా పైకి కనిపించే మనిషి
చేశాడని బయట చూచువారంతా అనుకొన్నట్లు, ఆకాశవాణియే జ్ఞానము
చెప్పినదని అనుకొన్నారు. ఆకాశము వెనుక కనిపించకయున్న ఆత్మ
చెప్పినదని ఎవరికీ తెలియదు. జీవుడు దేవుడు ఇద్దరూ పని చేయరు
కావున వారికి మధ్యలోయున్న ఆత్మయే అన్ని పనులు చేయవలసియున్నది.
ఇది ఆధ్యాత్మిక చట్టము. దైవ నిర్మితమైన ధర్మము. దీనిని ఎవరూ కాదన
లేరు.
ఈ చట్టము ప్రకారము సృష్ట్యాదిలో జ్ఞానము చెప్పినది ఎవరు?
అని ప్రశ్నవస్తే విషయమంతా తెలిసిన తర్వాత ఆత్మయే చెప్పినదని చెప్పక
తప్పదు. అదే విధముగా "మొట్టమొదట త్రైత సిద్ధాంతమును చెప్పిన
దెవరు?” అని అడిగితే "ఆకాశ భూతమువద్ద యున్న ఆత్మయే” అని
చెప్పగలము. అదే విషయమునే "త్రైత సిద్ధాంత ఆదికర్త” అన్నప్పుడు
ఆత్మయే అని చెప్పుటకు బదులుగా "ప్రబోధానంద యోగీశ్వరులు” అని
చెప్పడము జరిగినది. ఆత్మ ఎప్పుడూ తనకు తానుగా బయటపడదు.
ఎవరికీ తెలియకుండా అన్ని పనులు అన్ని శరీరములలో చేయుచున్నది.
ప్రస్తుతము ఒక శరీరమును ధరించి ఆ శరీరములోనుండి మాట్లాడగలుగు
చున్నది. ఇది అరుదుగా జరిగే సంఘటన ఏమీ కాదు. ప్రతి నిత్యము
అందరిలో మాట్లాడునది ఆత్మయేననీ, ఆత్మ తప్ప జీవాత్మగానీ,
పరమాత్మగానీ మాట్లాడదు. నేను ఆత్మజ్ఞానమును తెలిసిన జీవున్ని కావున
ఇప్పుడు త్రైత సిద్ధాంతమును బోధించునది ప్రబోధానంద యోగీశ్వరులు
అనినా ఆ శరీరముగానీ, ఆ శరీరమునకున్న పేరుగానీ జీవునిది కాదు.
శరీరమునకంతటికీ పెద్దయిన, శరీరమునంతటినీ ఆక్రమించియున్న ఆత్మదే
ఆ పేరని చెప్పుచున్నాము. ప్రబోధానంద యోగీశ్వరుల శరీరములో ఒక
మూలయున్న జీవున్నయిన నేను ఈ శరీరములో ఆత్మ చేయుచున్న పనిని,
ఆత్మ మాట్లాడు మాటలను చూస్తున్నాను, వింటున్నాను. ఇదే ఆత్మే
సృష్ట్యాదిలో త్రైత సిద్ధాంతమును చెప్పినది కావున గ్రంథము మీద "త్రైత
సిద్ధాంత ఆదికర్త" అని వ్రాయడము జరిగినది. ఆదికర్తయని ప్రకటించు
కొనినా గుర్తించలేకపోతే మన అజ్ఞానము తప్ప మరేమీ కాదు.
త్రైత సిద్ధాంత ఆదికర్త అనుమాటకంటే ముందు “త్రిమత ఏకైక
గురువు” అని వ్రాయడము జరిగినది. ప్రస్తుత కాలములో ఏ మతములో
అయినా వారికి దేవుడు గ్రంథములో చెప్పిన జ్ఞానము తెలియక తికమక
పడుచున్నారు. నేను గురువును అని చెప్పుకొను ఏ మనిషయినా నాకు
మా గ్రంథములోని జ్ఞానము సంపూర్ణముగా తెలుసునని గుండెమీద
చేయివేసుకొని చెప్పమను. ఎవరయినా ఆ పనిని చేయలేరు. ఎంతటి
జ్ఞానులయినా బయటి ప్రపంచములో గొప్ప జ్ఞానులని పేరున్న వారికయినా
తమ దైవగ్రంథములోని అన్ని విషయములు తెలియవనియే ఒప్పుకొనును.
దేవుడు చెప్పిన జ్ఞానము అనగా ఆత్మ చెప్పిన ఆత్మజ్ఞానము ఆత్మకు
తెలియకుండా ఎవరికీ తెలియదు. అందువలన నా ఆత్మ తెలియచెప్పమంటే
జీవునిగా “ఎవరికీ సంపూర్ణమైన జ్ఞానము తెలియదు” అని అంటున్నాను.
ఇక్కడ ఒక ప్రశ్న రాగలదు. అదేమనగా! ఒక మనిషి దైవగ్రంథమును
సంపూర్ణముగా చదివి అందులోని జ్ఞానమును సంపూర్ణముగా తెలిసియున్నా
నను నమ్మకముతో కొన్ని సంవత్సరములనుండి తనను జ్ఞానిగా తలచు
చున్నాడనుకొనుము. అతనికి జ్ఞాన విషయములో ఎక్కడా ఏ అనుమానమూ
లేదు. జీవితములో కాలమంతయూ జ్ఞానమును తెలియుటకే వినియోగించు
చున్నాడు. అలాంటప్పుడు అతను సంపూర్ణ జ్ఞానిని అనుకోవడములో
తప్పులేదు కదా!యని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా
కలదు.
ఎవడయితే సంపూర్ణ జ్ఞానియగునో వానికి త్రైత సిద్ధాంతము
సంపూర్ణముగా తెలిసియుండును. ఎవనికయితే త్రైత సిద్ధాంతమయిన
మూడు ఆత్మల వివరము తెలిసినదో వాడు సంపూర్ణ జ్ఞాని అనబడడమే
కాక ఆత్మకుగల శక్తి అనగా దైవశక్తి అతనిలో పెల్లుబుకును. అనగా
దైవశక్తి అతనిలో ఉండును. ఎవనిలో దైవశక్తియున్నదో అతనిని భూతములు
మహాభూతములు సహితము గౌరవించును. ఆ మనిషిలోని ప్రత్యేకత
మనిషికే తెలియుటకు మొదలు పెట్టును. ఈ విధముగా సంపూర్ణ జ్ఞానిలో
ఆ శక్తి బయటికి తెలియబడుట వలన, రోగములు సహితము అతని
మాటను ఆలకించి అతను చెప్పినట్లు నడుచుకొనును. అయితే మూడు
ఆత్మల జ్ఞానమును అనుభవపూర్వకముగా తెలిసినవారు ఎక్కడా
కనిపించడము లేదు. తమకు ఆత్మజ్ఞానము తెలియకున్నా అహముతో
మేము జ్ఞానులము అనుకొన్న వారు గలరు. అది మంచి పద్ధతి కాదు.
ప్రశ్న :- మొదట మీరు పుట్టినప్పుడు మీ శరీరము గుర్తింపుకు ఒక పేరు
పెట్టడమయినది. అది ప్రత్యేకమయిన అర్థమునిచ్చునదిగా యున్నది.
“పెద్దన్న” అని చెప్పడములో ఆలోచిస్తే “పెద్ద” అని తెలియునట్లు
ప్రత్యక్షముగా “పెద్దన్న” అని పేరు పెట్టడము జరిగినది. అలా పెద్దన్నగా
మొదలయిన మీ జీవితము ప్రబోధానంద యోగీశ్వరులు అను పేరులోనికి
ఎలా మారినది? పెద్దన్నగా యున్న పేరును మీరు ప్రబోధానంద
యోగీశ్వరులుగా ఎందుకు మార్చుకొన్నారు. పెద్దన్న అను పేరులో గౌరవము
ఏమాత్రము లేదని, ఆ పేరును చిన్న కులము వారు, కాయకష్టము
చేయువారు, హరిజనులు పెట్టుకొందురని అలాంటి పేరుతో గౌరవముండ
దని మీరు ప్రబోధానంద అని పేరు మార్చుకోవడము జరిగినదని కొందరు
అంటుండగా విన్నాము. అదెంత వరకు నిజము? వారు చెప్పునది సత్యమే
అంటారా? లేక దానికేమయినా కారణమును చూపగలరా?
జవాబు :- ఎవరు ఏమయినా అనుకోవచ్చును. అయితే వారికి కొంత
వరకే తెలుసునని చెప్పగలను. నాకు మొదట తల్లితండ్రులు 'పెద్దన్న' అను
పేరును పెట్టలేదని వారికి తెలియదు. 'పెద్దన్న' అను పేరు బలవంతముగా
పెట్టడ మైనదని కూడా ఎవరికీ తెలియదు. పుట్టిన వారముకో, పదిరోజులకో
పేరు పెట్టడము జరిగినది. సమాజములో అందరూ పెట్టినట్లు ఏదో ఒక
దేవుని పేరును పెట్టడము జరిగినది. అది ఏ పేరో నాకు కూడా తెలియదు.
పేరు పెట్టినప్పటినుండి ఎక్కువగా ఏడ్వను మొదలు పెట్టడముతో వైద్యుల
వద్దకు తీసుకపోయి చూపడము జరిగినది. చిన్నపిల్లలకు కడుపునొప్పి
కలుగుట చేత ఏడ్చుచుందురని వైద్యులు కడుపునొప్పికి సంబంధించిన
మందులు ఇవ్వడము జరిగినది. అయినా ఏడుపు మానకపోవడముతో
ఏమీ చేయలేని స్థితిలో దిగులుగాయున్నప్పుడు గ్రామదేవత అయిన
సుంకులమ్మ ఒక మనిషికి పూనకము వచ్చి ఊరంతా తిరుగుచూ మా
ఇంటి ముందుకు వచ్చి "మీ బాలుడు మూడు రోజులనుండి ఏడుపు
మానడము లేదు కదా!”యని అడిగింది. అప్పటి కాలములో గ్రామదేవతలకు
ఎక్కువ విలువయుండేది. సుంకులమ్మ దేవత ఆ మాట చెప్పడముతో
మా తల్లి తండ్రులు కొంత ఊరట చెంది ఏమి చేయాలని ఆ దేవతను
అడుగడము జరిగినది. అప్పుడు ఆ దేవత ఇలా చెప్పినదట "పుట్టినవాడు
సామాన్యుడు కాదు. నాకు కూడా అతని వెలుగు అర్థము కావడము
లేదు. మా అక్క పెద్దమ్మ బాలునికి సేవ చేయుచున్నది. ఇప్పుడు మీరు
పెట్టిన పేరు ఆ బాలునికి సరిపోలేదు. అందువలన ఏడుపు మానడము
లేదు. మా అక్క పెద్దమ్మ పేరును పెట్టండి" అని చెప్పి పోయినదట.
పోయేటప్పుడు ఇంటి ముందర క్రింద పడుకొని నమస్కారము చేసి
పోయినదట. అప్పుడు అక్కడ జరిగిన వింతకు ఆశ్చర్యపోయిన మా
పెద్దలు గంట వ్యవధిలోనే పెద్దమ్మకు పూజచేసి కొబ్బరికాయకొట్టి “పెద్దన్న”
అను పేరును పెట్టడము జరిగినది. అప్పుడు శిశువు ఏడుపు మానడముతో
అది దేవతయిన పెద్దమ్మ మహత్యమని అనుకోవడము జరిగినది.
అప్పుడునుంచి వారు పెద్దమ్మ పేరుపెట్టామని చెప్పుకొన్నారు. నాకు కొంత
బుద్ధి వచ్చిన తర్వాత ఈ విషయము తెలిసినది. ప్రతి సంవత్సరము
పెద్దమ్మ దేవతకు కోళ్ళు కోసెడి వారు, పొట్టేళ్ళను బలి ఇచ్చి పూజచేసెడివారు.
నాకు కొంత వయస్సు వచ్చిన తర్వాత అలా పెద్దమ్మ పూజలు
చేయడము నచ్చలేదు. నాకు పదహారు సంవత్సరముల వయస్సులోనే
దేవతల పూజను పూర్తి వ్యతిరేఖించి “నేను ఏ దేవతకు మ్రొక్కను, ఏ
దేవతను పూజించను” అని చెప్పడమైనది. అప్పటినుండి దేవతా పూజలకు
వ్యతిరేఖముగా మారిపోవడము జరిగినది. నా భావములను చూచిన
చాలామంది నన్ను అజ్ఞాని, అహంకారి అనడము జరిగినది. ఎవరు
ఏమనినా నేను దేవతల పూజలు చేయను, మీకిష్టమైతే మీరు చేసుకోండని
చెప్పేవాడిని. ఇలా కొంతకాలము జరిగి నా వయస్సు దాదాపు 25
సంవత్సరములప్పుడు స్వయముగా నేను ఒక గ్రంథమును వ్రాయడము
జరిగినది. అదే నా మొదటి గ్రంథము, పేరు “ప్రబోధ”. ప్రబోధ గ్రంథము
యొక్క వ్రాత ప్రతిని తీసుకొనిపోయి అనుభవజ్ఞులయిన పెద్దలకు చూపడము
మంచిదని తలచి రమణానంద భారతీ అను అద్వైత స్వామిజీవద్దకు
తీసుకొని పోయి చూపడము జరిగినది. అప్పుడు ఆ స్వామీజీ ఆ వ్రాత
ప్రతిని చూచి సంతోషపడి, “నీకు గురువు ఎవరు?" అని అడిగాడు. అప్పుడు
“నాకు గురువు ఎవరూ లేరు” అని చెప్పాను. దానికి ఆయన ఎంతో
జ్ఞానము గల గ్రంథము వ్రాసిన తర్వాత తప్పనిసరిగా గురువు ఉండవలెనని
చెప్పాడు. గురూపదేశమును నేనిస్తాను నీవు నాకు శిష్యుడు కమ్మన్నాడు.
దానికి నేను ఒప్పుకొన్నాను.
అప్పటికే అదే “ప్రబోధ" గ్రంథములో గురూపదేశమును గురించి
వ్రాసియున్నాను. “ఆత్మశక్తి అను అగ్నిని శిష్యునకు దానము చేయువాడే
గురువు” అని చెప్పాము. అప్పుడు ఆ స్వామిగారు పూజా కార్యక్రమమును
పెట్టి ఆ పూజమధ్యలో ఒక మంత్రమును చెప్పి ఇది నీకు గురుమంత్రమని
చెప్పాడు. అంతేకాక నీవు గ్రంథమును వ్రాశావు కదా! ఆ గ్రంథము
మీద నీ పేరు "పెద్దన్న” అని వ్రాయవద్దు. ఇప్పుడు గురూపదేశము
పొందిన తర్వాత నీవు క్రొత్త జీవితమును ప్రారంభించినట్లయినది. కావున
ఇప్పటినుండి నీవు క్రొత్త పేరుతో చలామణి కావలసియున్నదని చెప్పాడు.
సరేనని ఆ స్వామి మాట ప్రకారము ఒప్పుకొన్నాను. అప్పటికే నేను
“ప్రబోధ” అను పేరుతో గ్రంథమును వ్రాసియుండుట చేత నా పేరును
“ప్రబోధానంద”గా వ్రాసుకొని అదే పేరునే బయట చెప్పుకోమన్నాడు.
అప్పటినుండి ఆయన చెప్పినట్లే పేరును మార్చుకొని ప్రతి గ్రంథము
మీద రచయిత పేరువద్ద 'ప్రబోధానంద' అని వ్రాయడము జరుగుచూ
వచ్చినది. అంతకుముందే గ్రంథమును వ్రాయకముందు కొన్ని
సంవత్సరములనుండి అనగా నా వయస్సు 18 సంవత్సరములనుండి
దయ్యములు, దేవతలు నాతో మాట్లాడునప్పుడు “స్వామీ” అని సంబోధించి
పిలిచెడివారు, తర్వాత ఒక స్వామిజీవద్ద నా పేరు పూర్తిగా మారిపోవడము
జరిగినది. పెద్దన్న అను పేరు పూర్తిగా కనుమరుగై పోయినది.
ప్రపంచములో నా పేరు ప్రబోధానందగా చెప్పబడుచున్నా, ఆధ్యాత్మికములో
ఇంకా కొంత మార్పు జరిగి ప్రబోధానంద యోగీశ్వరులుగా మారిపోయినది.
ఒక స్వామీజీ ప్రబోధానందయని నామకరణము చేయగా, ఒక దేవత
వచ్చి “నీవు యోగీశ్వరులవి, నీ ముందర మేము నిలువలేము” అని చెప్పడము
జరిగినది. ఒక దేవత వలన నా పేరు చివరిలో “యోగీశ్వర” అను
పదము చేరిపోయినది. తర్వాత దేవత రెండుమార్లు నా ముందరకు
వచ్చినప్పుడు “యోగీశ్వర” అని సంబోధించడము జరిగినది. ఇట్లు నా
పేరు ఇతరుల వలన మారుతూ వచ్చినదిగానీ, నాయంతకు నేను
మార్చుకోలేదు.
ప్రశ్న :- ఆదిశంకరాచార్యులవారు భగవద్గీతకు భాష్యము వ్రాశారు. అట్లే
రామానుజాచార్యుల వారు గీతాభాష్యము వ్రాశారు. తర్వాత మధ్వా చార్యుల
వారు కూడా భగవద్గీతకు వివరము వ్రాశారు. ముగ్గురు సిద్ధాంతకర్తల
యొక్క సిద్ధాంతములు వేరువేరు ఉండుట వలన వారు వ్రాసిన భగవద్గీతలలో
వేరువేరు భావములుండునా? భగవద్గీతను చెప్పినవాడు భగవంతుడు
అయినందున ఆయన భావము ప్రకారము భగవద్గీతను చెప్పడము
జరిగినది. అలాంటి భగవద్గీతలో ముగ్గురు ఆచార్యులు వారి భావములను
వదలి భగవంతుని భావములనే వ్రాసియున్నారా లేక భగవద్గీతను వారి
సిద్ధాంత భావములోనికి మార్చి వ్రాశారా?
జవాబు :-భగవద్గీతలోనికి సిద్ధాంతకర్తల భావములను చేర్చలేదు. వారి
భావములను చేర్చుటకు భగవద్గీతలో ఎక్కడా అవకాశము లేదు. అయితే
భగవంతుడు చెప్పిన శ్లోకములకు భావమును వ్రాయాలను ఉద్దేశ్యముతో
మొదట శంకరుల వారు భగవద్గీతకు వివరమును వ్రాయడము జరిగినది.
శంకరాచార్యుల వారు మంచి ఉద్దేశ్యముతో మొదలు పెట్టినా కొన్ని
శ్లోకములకు వివరమును వ్రాయడములో దేవుని భావమును గుర్తించ
లేకపోయి దేవుని భావముకంటే భిన్నముగా వ్రాయడము జరిగినది.
విధముగా కొన్ని శ్లోకముల భావములు దైవమార్గమును వదలి ప్రక్కదారి
లోనికి పోయినవి. ఉదాహరణకు జ్ఞానయోగము అను అధ్యాయములో
13వ శ్లోకములో భగవంతుడు “చాతుర్వర్ణ్యమ్” అని చెప్పినప్పుడు ఆ
శ్లోకములో భగవంతుడు చెప్పని భావమును ఆదిశంకరాచార్యుల వారు
నాలుగు కులములుగా వర్ణించి చెప్పడము జరిగినది. అయితే భగవద్గీతలో
దేవుడు ఎప్పుడూ కులప్రసక్తిని తన శ్లోకములలో చెప్పలేదు. అక్కడ
శ్లోకములో లేని భావమును చెప్పడము వలన, ఉన్న భావమును
గుర్తించలేకపోవడము వలన భగవద్గీత కొన్ని శ్లోకముల వద్ద అజ్ఞానదారి
పట్టినదిగానీ, సిద్ధాంత కర్తల యొక్క సిద్ధాంతముల దారి పట్టలేదు.
మొదట భగవద్గీత భాష్యమును వ్రాసినవాడు శంకరాచార్యులవారు.
అందులో తన అద్వైతమును చేర్చలేకపోయాడుగానీ, శ్లోకములకు తప్పు
భావమును చెప్పాడు. ఆయన తర్వాత వచ్చిన సిద్ధాంతకర్తలయిన రామాను
జులవారు, ఆ తర్వాత వచ్చిన మధ్వాచార్యులవారు భగవద్గీతకు వివరమును
వ్రాసినా వారు కూడా తమ సిద్ధాంతములను భగవద్గీతలోనికి చేర్చ
లేకపోయారు. వారు కూడా శంకరాచార్యులు వ్రాసినట్లే కొన్ని శ్లోకములకు
తప్పు భావములను వ్రాశారు. మొదట వ్రాసిన శంకరాచార్యులను
అనుసరించి మిగతా ఇద్దరు సిద్ధాంతకర్తలు వ్రాయడమైనది. ఒక
శ్లోకమునకు వివరమును చెప్పడములో ఒకరు చెప్పినదానికంటే ఇంకొకరు
ఎక్కువ చెప్పడమో, తక్కువ చెప్పడమో చేశారుగానీ, పూర్తి ఒకరికొకరు
వ్యతిరేఖముగా ఎవరూ వ్రాయలేదు. పురుషోత్తమ ప్రాప్తి యోగము అను
అధ్యాయములోనికి పోయినప్పుడు అక్కడున్న "త్రైత సిద్ధాంతము” మొదట
శంకరునికి అర్థము కాలేదు. అక్కడున్న భావమును పూర్తిగా వదలినవాడై
వేరు భావములో అక్కడ వివరించడము జరిగినది. భగవద్గీతలో అసలయిన
సిద్ధాంతమున్నచోట అర్థము కాకపోవడముతో అక్కడ ఏమాత్రము
సంబంధములేని భావమును శంకరాచార్యులు మొదట వ్రాస్తే తర్వాత
దానినే అందరూ అనుసరించారు. ఇప్పటికి మూడువందల మంది
భగవద్గీతకు భాష్యమును వ్రాస్తే అందరూ అదే దారిపట్టి మొదట వ్రాసిన
దానినే వ్రాయడము జరిగినది. చివరివరకు అదే జరుగగా మేము వ్రాసిన
“త్రైత సిద్ధాంత భగవద్గీత”లో తప్పు భావములను శ్లోకములన్నిటికీ మార్చి
సరియైన భావము వ్రాయడము జరిగినది. అట్లు వ్రాయడమే కాక
భగవద్గీతలో దేవుడు చెప్పిన త్రైత సిద్ధాంత భావమును బయటకు తెచ్చి
చూపడము జరిగినది. దేవుడు చెప్పని శ్లోకములను గుర్తించి వీటిని దేవుడు
చెప్పలేదని ప్రకటించడమయినది.
ప్రశ్న :- భగవద్గీతలో భగవంతుడు చెప్పని శ్లోకములున్నాయని మీరు
చెప్పారు కదా! ఆ శ్లోకములను సంస్కృత పాండిత్యమున్నవారే
వ్రాసియుండాలి. భగవద్గీత భాష్యమును వ్రాసిన ముగ్గురు సిద్ధాంతకర్తలు
సంస్కృత పాండిత్యము కలవారే. సిద్ధాంతకర్తలలో ఎవరయినా వారి స్వంత
శ్లోకములను భగవద్గీతలో చేర్చారా? లేక మరెవరయినా చేర్చారా?
జవాబు :- వ్యాసుడు వ్రాసిన భగవద్గీతలో లేని శ్లోకములు తర్వాత
కాలములో రావడము జరిగినది. ఆదిశంకరాచార్యుల వారు 'గీతా
భాష్యము'ను వ్రాయక ముందే భగవద్గీతలోనికి కల్పిత శ్లోకములు
చేరిపోయినవి. ఆ కల్పిత శ్లోకములను ముగ్గురు ఆచార్యులు బహుశా
గ్రహించకపోయి ఉండవచ్చును. ఒకవేళ గ్రహించినా ఇవి కల్పిత
శ్లోకములని బయటికి చెప్పే సాహసము చేసియుండకపోవచ్చును.
భగవద్గీతను చెప్పి ఐదువేల సంవత్సరములయితే, కల్పిత శ్లోకములు బహుశా
నాలుగు వేల సంవత్సరముల పూర్వమే భగవద్గీతలో కలిసిపోయి
వుండవచ్చును. అప్పటినుండి ఇప్పటివరకు అవి అట్లే కొనసాగుతూ
వచ్చాయి. మేము భగవద్గీతను చూచినప్పుడు కల్పిత శ్లోకములను
గ్రహించగలిగాము. మేము త్రైత సిద్ధాంత సహితముగా భగవద్గీతను
వ్రాయదలచినప్పుడు ఇవి కల్పిత శ్లోకములని వాటిని గుర్తించి చూపడము
జరిగినది. మేము వ్రాసిన “త్రైత సిద్ధాంత భగవద్గీత”లో కల్పిత శ్లోకములను
వేరుగా చూపడమేకాక వాటికి వివరమును వ్రాయలేదు. వ్యాసుడు
వ్రాసినప్పుడు లేని శ్లోకములను భగవద్గీతలో ఎవరు కలిపారు? అని కొంత
యోచిస్తే సులభముగా సమాధానము దొరకగలదు. అక్కడ ఏ శ్లోకములను
చేర్చారో ఆ శ్లోకముల సారాంశమేమిటో గ్రహించితే ఆ శ్లోకముల
భావములున్నవారు, ఆ శ్లోకములను భగవద్గీతలో కలిపారని సులభముగా
తెలిసిపోగలదు.
ప్రశ్న :- సంస్కృత పండితులైనవారు ఆదిశంకరాచార్యులు మొదలగు
సిద్ధాంతకర్తలు ఎంతో సూక్ష్మగ్రాహులు గ్రహించలేని కల్పిత శ్లోకములను
మీరు గ్రహించారని చెప్పుకోవడము వలన 'వారికంటే నేనే పెద్ద'
అన్నట్లున్నది. సంస్కృత పాండిత్యమున్నవారికంటే సంస్కృతభాష సరిగా
తెలియని మీరు గొప్పవారు కాదు కదా! ముందు వచ్చిన సిద్ధాంతకర్తలకంటే
నేను గొప్పయని కనపడుటకే మీరట్లు చెప్పారనుకుంటాము. సిద్ధాంతకర్త
లయిన శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులతో పోల్చితే నీవు
ఏపాటి వానివి? వారితో నీవు సమానము ఎప్పటికీ కావు అని కొందరన
వచ్చును. దానికి మీరేమంటారు?
జవాబు :- ఇంతకుముందు దాదాపు ఆరునెలల క్రితము హిందూ
సంఘములో పనిచేయు వ్యక్తి సిద్ధాంతకర్తలలో వరుసగాయున్న ఫోటోలలో
మధ్వాచార్యుల తర్వాత నా ఫోటోయుండడము చూచి నన్ను దూషణగా
మాట్లాడినాడు. మా భక్తులయిన వారు కొందరు సిద్ధాంతకర్తల ఫోటోలను
ఒక ఫ్లెక్స్ బోర్డుమీద చిత్రించడము జరిగినది. ముందు శంకరాచార్యుల
ఫోటోను పెట్టి దానిక్రింద ఆయన పుట్టిన స్టేట్, పుట్టిన సంవత్సరము,
మరణించిన సంవత్సరము వ్రాశారు. అలా వ్రాయడము వలన
సిద్ధాంతకర్తలు ఎప్పుడు పుట్టినది, ఎక్కడ పుట్టినది మరియు ఎప్పుడు
చనిపోయినది వివరమంతా తెలియుచున్నది. అలా ముగ్గురు ఆచార్యుల
ఫోటోలను పెట్టారు. ముందు శంకరాచార్యుల ఫోటోను, తర్వాత
రామానుజాచార్యుల ఫోటోను, ఆ తర్వాత మధ్వాచార్యులు ఫోటోగలదు.
మూడు ఫోటోల తర్వాత మధ్వాచార్యుల ప్రక్కలో నా ఫోటోను ఉంచడము
జరిగినది. నా ఫోటోలో పుట్టిన స్థలమున్నది, పుట్టిన సంవత్సరమున్నది,
చనిపోయినది మాత్రము వ్రాయకుండా పెట్టారు. దానిని చూచిన
హిందూపరిషత్లోని వ్యక్తి సంతోషించేది పోయి నన్ను దూషించను మొదలు
పెట్టాడు. వీడు శంకరాచార్యుడంతటివాడా? శంకరాచార్యుల ఫోటో
వరుసలో ఫోటో పెట్టుకొనే దానికి అర్హుడా? అని మొదలు పెట్టాడు. అక్కడే
మా భక్తుడున్నది అతను చూడకుండా మాట్లాడినాడు. అప్పుడు మా భక్తుడు
అతనిని ఎదిరించి మాట్లాడడము జరిగినది. వారు ఇరువురు కొద్దిసేపు
అక్కడే వాదోప వాదములు చేశారు. ఆ మాటలను వరుసగా చూడండి.
మా భక్తుడు :- సుత్తిచంద్రారెడ్డిగారు! మీకు ఏమి తెలుసని ప్రబోధానంద
యోగీశ్వరులను విమర్శించుచున్నారు. డాక్టర్ల వరుసలో డాక్టరు
పేరుంటుంది. కార్మికుల లిస్టులో కార్మికుని పేరుంటుంది. ఎవరికి
సంబంధించిన వారి పేరు ఆ వరుసలోనే ఉంటుంది. తాత M.B.B.S
కోర్సు చదివి డాక్టరుపని చేశాడనుకో, తర్వాత కొంత కాలానికి అతని
మనువడు కూడా డాక్టరు కోర్సుచేసి ఫలానా డాక్టరు అని వ్రాసి అతని
ప్రక్కన M.B.B.S అని వ్రాసిపెట్టాడనుకో, అప్పుడు వీడు తాతంతటి వాడా,
తాత M.B.B.S అయితే వీడు M.B.B.S అవుతాడా అని అంటే దానిని
తెలివి తక్కువ అంటారు. తాత చదివిన కోర్సును మనువడు చదువకూడదా?
చదివినప్పుడు తాతా డాక్టరే, మనువడు డాక్టరే అగును కదా! తాత మనువడు
ఒకే హాస్పిటల్లో పని చేయుచున్నారనుకొనుము. అప్పుడు డ్యూటీల
ప్రకారము తాత పేరు ప్రక్కనే మనువడి పేరు కూడా వ్రాయడము
జరుగుతుంది. అప్పుడు వీడు తాతంతటి వాడా అంటే ఆ మాట తెలివి
తక్కువ అగును. తాతకున్న డిగ్రీ మనువనికి ఉన్నప్పుడు ఆ చదువులో
ఇద్దరూ సమానమే కదా! ఇద్దరిది డిగ్రీ ఒకటే కదా!
సుత్తిచంద్రారెడ్డిగారు :- అది చదువు. ఇది జ్ఞానము. చదువులో సమానమైన డిగ్రీలుండ
వచ్చును. జ్ఞానములో పెద్ద పెద్ద, చిన్న చిన్న.
మా భక్తుడు :- ఇప్పుడు ఎవరు పెద్దంటావు ఎవరు చిన్నంటావు?
సుత్తిచంద్రారెడ్డిగారు :- ఆదిశంకరుడు ఎక్కడ? మీ స్వామి ఎక్కడ? ఆయన గొప్పతనములో
రవ్వంత కూడా అర్హతలేనివారు ఆయన ఫోటో ప్రక్కలో తన ఫోటో
పెట్టుకుంటారా? ఒక హిందువుగా నేను ఒప్పుకోను.
మా భక్తుడు :- నీవు హిందువైయుండి హిందువైన ఒక స్వామీజీని చిన్నగా
మాట్లాడడము మేము కూడా ఒప్పుకోము. శంకరాచార్యులకంటే మా
స్వామి దేనిలో తక్కువవాడో చెప్పండి చూస్తాము.
సుత్తిచంద్రారెడ్డిగారు :- శంకరులు ఎంతోకాలము ముందుపుట్టినవాడు, మీ స్వామి వెనుక
పుట్టినవాడు. శంకరునితో సమానము ఎట్లగును?
మా భక్తుడు :- మీ ఇంటిలో ముందు పుట్టిన వానివి నీవుండగా వెనుక పుట్టిన
నీ కొడుకుకు పెళ్ళి ఎందుకు చేశావు? నేను పెళ్ళి చేసుకొన్నాను. వీడు
నాకంటే వెనుకబుట్టి నాతో సమానముగా పెళ్ళి చేసుకొంటాడా అని
దూషించకుండా నీవే పెత్తనము చేసి నీ కొడుకుకు పెళ్ళి చేశావు కదా! ఈ
విషయములో నా కొడుకు నాతో సమానముగా పెళ్ళి చేసుకొంటాడా! అని
ఎందుకనకూడదు? ఇంట్లోది ఒక రకము బయటిది మరొకరకమా?
సుత్తిచంద్రారెడ్డిగారు :- ప్రపంచ విషయములను తెచ్చి జ్ఞానముతో ముడిపెట్టి చెప్పకు.
శంకరాచార్యుల వారు గొప్పజ్ఞాని, మీ స్వామికి అంత జ్ఞానమున్నదా?
మా భక్తుడు :- నీ దగ్గర జ్ఞానాన్ని కొలిచే మీటరుంటే తెచ్చి కొలుసుకో, ఎవరివద్ద
ఎంత జ్ఞానమున్నదో నీకే తెలుస్తుంది. ముందు పుట్టినవాడు జ్ఞాని, వెనుక
పుట్టినవాడు అజ్ఞాని అని అనుకొంటే అది నీ అజ్ఞానమే అగును. మా
స్వామి చెప్పితే దేవతలు కూడా మాట వింటాయి, రోగములు వినయముగా
ప్రవర్తించి దూరముగా పోతాయి. ఆయన చూపులోనే ఎన్నో కర్మలు
పోతాయి. ఇదంతా ప్రత్యక్షముగా చూచిన మాకు తెలుసు. సిద్ధాంతకర్తల
వరుసలో సిద్ధాంతకర్తయిన వారి ఫోటోను మేము పెట్టాము. అంతేగానీ
వారితో ఈయన సమానుడను ఉద్దేశ్యముతో మేము పెట్టలేదు. వాస్తవముగా
చెప్పితే మా స్వామి ప్రక్కలో ఉండేదానికి వారు అర్హులో కాదో ఒకమారు
చూచుకో!
ఈ విధముగా ఇద్దరి మధ్య వాదోపవాదములు జరిగాయి. నేడు
ప్రజలు గ్రుడ్డిగా మాట్లాడడము తప్ప ఏమాత్రము ఆలోచించడము లేదు.
శరీరములోయున్న నా ఆత్మ ఎన్నో బోధలు చెప్పుచున్నా, పైకి కనిపించు
నది మనిషే కావున ప్రజలు హేళనగా మాట్లాడడము, అవమానించడము
జరుగుచున్నది. జీవాత్మ భావముతో మేము ఎన్నో చూస్తున్నాను. ఇతరుల
వలన కలుగు ఇబ్బందులను బాధలను జీవుడుగాయున్న నేనే ఈ శరీరములో
అనుభవించుచున్నాను. జీవుడయిన నేను బాధను అనుభవించుట
సహజమే అయినా అవమానపరచినవారు ఆత్మ ఆగ్రహమునకు గురి
అగుచున్నారు. దానివలన వారు అనవసరముగా అనేక కష్టాలను కొని
తెచ్చుకొంటున్నారు. ఒక ప్రక్క అనేక బాధలను అనుభవిస్తున్నా ఇవి
ఎక్కడివని ఆలోచించలేకపోవుచున్నారు.
ఇప్పటికి దాదాపు పది సంవత్సరముల క్రిందట ఒక దినము
మహానందిలో మా భక్తులమీద అనవసరముగా అక్కడివారు దూషించడము
దాడిచేసి ఒకరిని కొట్టడము జరిగినది. మేము హిందూమతములో
ముఖ్యమైన వారమని, హిందూ ధర్మ రక్షకులమని చెప్పుకొనువారే
పనిని చేశారు. అక్కడ దేవుని దర్శనమునకు పోయిన మా భక్తులను
పరమత ప్రచారకులని ఆరోపణ చేసి దాడి చేయడము జరిగినది. అప్పుడు
ఆ విషయమై ప్రబోధానంద యోగీశ్వరులకు కోపము వచ్చినది.
ప్రబోధానంద యోగీశ్వరులు అంటే కనిపించుచున్న శరీరము అని, ఇప్పుడు
మాట్లాడుచున్న జీవుడయిన నేను కాదు. ఈ శరీరమునకు అధిపతియైన
'మధ్యాత్మ' అని గుర్తుంచుకోవలెను. శరీరములో ఈశ్వరుడైన వానికి కోపము
వచ్చిన దానివలన, అక్కడ మనుషులు చేసిన పొరపాటుకు, తప్పుకు అక్కడ
మహానంది క్షేత్రములో దేవుడుగా చెప్పబడు ఈశ్వరుని మీద శాపము
పడినది. దానివలన ఈశ్వరుడు మహానంది క్షేత్రము వదలిపోయాడు.
అలా జరుగుట వలన శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసిన వాక్యము నెరవేరెను. బ్రహ్మముగారి కాలజ్ఞాన వాక్యము ఇలా
కలదు. "మహానందిలో ఈశ్వరుడు లేడు అనే వాక్యము పుట్టేను" అలా
ఈశ్వరుడు క్షేత్రమును వదలిపోయిన తర్వాత జరుగు కొన్ని పనులను
చూచి ప్రజలే ఈశ్వరుడు మహానందిలో లేడు అని అందురు. దానితో
బ్రహ్మముగారి మాట పూర్తిగా నెరవేరినట్లగును. ప్రబోధానంద యోగీశ్వరులు
పుట్టక పూర్వమే దాదాపు నాలుగు వందల సంవత్సరముల క్రిందటే
ప్రబోధానంద యోగీశ్వరులను గురించి బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసియున్నారు.
ఇంతకు ముందు ముగ్గురు సిద్ధాంతకర్తలు పుట్టినప్పుడుగానీ, పుట్టక
పూర్వముగానీ వారిని గురించిన సమాచారమును ఎవరూ ముందు
చెప్పలేదు. ప్రబోధానంద గారు పుట్టకముందే పోతులూరి వీరబ్రహ్మేంద్ర
స్వాములవారు యోగీశ్వరుల గురించిన సమాచారమును చెప్పడమైనది.
పుట్టిన తర్వాత కూడా ఆయనకు తగిన “పెద్ద” అనే పేరును పెట్టునట్లు
దేవతల డ్రామా జరిగినది. కాలజ్ఞానమును కలియుగములో చెప్పినవాడు
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్కరేయని చెప్పవచ్చును.
అంతగొప్ప వ్యక్తి అయిన వీరబ్రహ్మముగారు యోగీశ్వరుల గురించి ఎన్నో
విషయములను ముందే చెప్పియున్నారు. ప్రబోధానంద యోగీశ్వరులు
ప్రబోధాశ్రమమును స్థాపించి దానిద్వారా జ్ఞానమును ప్రచారము చేయుటను
బ్రహ్మముగారు తన కాలజ్ఞాన వాక్యములో ఇలా వ్రాశారు. "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానము కలది" ఈ వాక్యమును చూచిన తర్వాత ప్రబోధానంద
యోగీశ్వరుల వారు ఎంత గొప్పవారో అర్థము కాగలదు.
ప్రశ్న :- ప్రబోధానందస్వామి హిందూమతమునకు వ్యతిరేఖమయిన
మాటలు చెప్పాడు. అందువలన ఆయన హిందువు కాదని మేమంటున్నాము.
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు సాధారణ మనిషికాదు.
మనిషిలో జీవుడుగాయున్న నాకు తెలియకుండా మాట్లాడునది ఏమీ
ఉండదు కదా! ప్రబోధానంద త్రైత సిద్ధాంతకర్తగా దైవజ్ఞానమును
చెప్పియుంటే అది మీకు అర్థముకాక ఆయననే హిందువులకు వ్యతిరేఖి
అంటున్నారు. ఆయన తరపున నేను మాట్లాడుచున్నాను. ఆయన ద్వారా
ఎందరో ఇతర మతములవారు కూడా హిందూ జ్ఞానమును తెలియగలిగారు.
మీరు ఎవరయినా హిందూజ్ఞానమును ఇతర మతముల వారు తెలుసుకొనే
అవకాశము కల్గించారా? అని ప్రశ్నించుచున్నాను. ప్రబోధానంద
యోగీశ్వరులు చెప్పే జ్ఞానమును వినేదానికి వందలమైళ్ళ నుండి ముస్లీమ్లు,
క్రైస్తవులు వస్తున్నారు. ఎందరో హిందువులు జ్ఞానము తెలుసుకొని సంపూర్ణ
జ్ఞానులుగా మారిపోయారు. ప్రబోధానంద జ్ఞానబోధ చేయునప్పుడు ఒకే
వేదిక దగ్గర మూడు మతముల వారు శ్రద్ధతో జ్ఞానమును వింటున్నారు.
మీరు చెప్పేమాటలను ఇతర మతములవారు వినరు. పైగా హిందువులే
మిమ్ములను అసహ్యించుకొంటున్నారు. మేము హిందూమతమును కాపాడు
తామని వందసంవత్సరములనుండి చెప్పుచున్నారు. అయితే మీరు
ఎక్కడయినా హిందువులను ఇతర మతములలోనికి పోకుండా నివారించ
గలిగారా? అది ఏమాత్రము లేదు. వంద సంవత్సరముల నుండి హిందూ
మతము క్షీణించినదని చెప్పక తప్పదు. హిందువులు ఇతర మతముల
లోనికి వెళ్ళుచుంటే హిందూరక్షణ అను పేరుతో మీరు కాలము గడుపు
చున్నారు.
“మతమార్పిడి దైవద్రోహము” అని బోధ చెప్పడమేకాక ఒక
గ్రంథమును కూడా మేము వ్రాసి ఇచ్చాము. ఆ గ్రంథమును చదివినవారు
గానీ, మా బోధ విన్నవారుగానీ ఎవరయినా మతమును మారినారేమో
చూపగలరా? చూపలేరు. ఏ మతములో పుట్టినవాడు ఆ మతములోనే
ఉండవలెననీ, దేవుడు అన్నీ తెలిసి నిన్ను ఒక మతములో పుట్టించితే దేవుని
కార్యమునకు విరుద్ధముగా మతము మారితే అది దైవ విరుద్ధమగును,
అంతేకాక దైవద్రోహమగును అని మేము (నేను+నా ఆత్మ) ఇద్దరము చెప్పగా
వినినవారు ఎవరూ మతమార్పిడి చేయలేదు. అయితే మమ్ములను జ్ఞానులు
కాదను మీ మాటను ఎవరయినా విన్నారా? ఎవరూ వినలేదు. యథేచ్ఛగా
మత మార్పిడి జరిగినా వాటిని ఏమాత్రము ఆపలేకపోయారు.
ప్రశ్న :- మీరు హిందూమతమును కాకుండా క్రైస్తవ మత బోధలు కూడా
చెప్పుచున్నారు కదా! దీనికి మీరేమంటారు? హిందువు క్రైస్తవ బోధలు
చెప్పవచ్చునా?
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు ప్రపంచములోనే త్రిమత గురువు.
ప్రపంచములో త్రిమత గురువుగా యున్నవాడు యోగీశ్వరులు ఒక్కడే అగుట
వలన ఆయనను “త్రిమత ఏకైక గురువు" అంటున్నారు. హిందువు
ఎవరయినా ఇతర మతముల బోధలు చెప్పగలుగు స్థోమత కల్గియున్నాడా?
అని ప్రశ్నించుచున్నాము. ఒక మతములో యున్న గురువులకంటే మించిన
గురువుగా ఉండవలెనంటే, వారికి తెలియని రహస్యములు తెలిసి
యుండడము సామాన్యమైన పనికాదు. ఆయన తనను "త్రిమత ఏకైక
గురువు” అని ప్రత్యక్షముగా ప్రకటించుకొన్నాడు, దొంగగా ఏదీ చెప్పలేదు.
ఇంతవరకు ముస్లీమ్లకు సంబంధించిన గ్రంథములను వ్రాశాడు గానీ
క్రైస్తవులకు సంబంధించిన గ్రంథములు వ్రాయలేదు. త్వరలో క్రైస్తవ
మతములో క్రైస్తవులకు తెలియని జ్ఞానమును వ్రాయబోతారు. ఇంతవరకు
వ్రాసిన ఇతర మత గ్రంథములలో ముస్లీమ్ గ్రంథమని చెప్పబడిన ఖురాన్
గ్రంథములోని కొన్ని వాక్యములకు వివరము వ్రాయడము జరిగినది. ఆ
వివరమును చూచిన ముస్లీమ్ పెద్దలు తమకు తెలియని రహస్యములన్నీ
తెలిసినవని సంతోషపడడము జరిగినది. మూడు మత గ్రంథములలోని
జ్ఞాన విషయములను చెప్పుట వలన, వారు మూడు మతముల జ్ఞానమును
తెలియుట వలన మతముల మధ్య ద్వేషము పోయి సామరస్యము ఏర్పడి
ప్రజలు అన్ని మతముల వారు కలిసిపోయి స్నేహసంబంధమైన జీవితము
గడుపుదురు. ద్వేష సంబంధమైన జీవితమునుండి బయటికి వచ్చి ఒకరి
కొకరు ప్రేమగా బ్రతుకగలరు.
ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ఒక మనిషిగా
ప్రకటించినా, అది మనుషుల శరీరములో యున్న మధ్యాత్మ ప్రకటించినది.
శరీరములోయున్న జీవునికి, దేవునికి మధ్యలోయున్న ఆత్మను 'మధ్యాత్మ'
అంటున్నాము. ఇంతవరకు గడచిపోయిన యుగములలోగానీ,
గడచిపోయిన జ్ఞానులలోగానీ మధ్యాత్మను గురించి ఎవరూ చెప్పలేదు,
ఎవరికీ తెలియదు. ప్రపంచములో మధ్యాత్మ విషయమును, మధ్యాత్మ
జ్ఞానమును చెప్పినవారు 'ప్రబోధానంద యోగీశ్వర' అని పేరుగల
శరీరములోని మధ్యాత్మయేనని చెప్పుచున్నాము. 'మధ్యాత్మ' శరీరములో
మూడు ఆత్మల మధ్యయున్నది. శరీరములోని మూడు ఆత్మల విషయమును
గానీ, వివరమునుగానీ ఇంతవరకు ఏ సిద్ధాంతకర్త చెప్పలేదు. ఎవరికీ
తెలియదు. అది ప్రబోధానంద యోగీశ్వరుల వలననే మధ్యాత్మ విషయము
నేడు ప్రపంచానికి తెలియబడుచున్నది. ఈ విషయమును కూడా పోతులూరి
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఇలా చెప్పియున్నారు. "మధ్యాత్మ
యోగ పురుషుని మహత్తు మహా ప్రకాశమయ్యేను” ప్రబోధానంద
యోగీశ్వరులయొక్క విషయములను కొన్నింటిని తన కాలజ్ఞానమున
వీరబ్రహ్మముగారు వ్రాసి యుండడము విశేషమని మనుషులయిన వారికి
ఎందుకు తెలియదు? గ్రుడ్డిగా ఏదో ఒకటి మాట్లాడుటకంటే కొంత
విచక్షణా దృష్ఠితో చూడవచ్చును కదా!
ప్రశ్న :- ‘మధ్యాత్మ' అను మాటను మేము ఎప్పుడూ వినలేదు. అంతెందుకు
మూడు ఆత్మల విషయమునే మేము ఎప్పుడూ వినలేదు. మీరు చెప్పునది
సత్యమని మేమెందుకు అనుకోవాలి?
జవాబు :- ఆకలికి అన్నమును తింటాము. దప్పికకు నీరును త్రాగుతాము.
విజ్ఞానము కొరకు ప్రతి విషయమును వివరముగా చూస్తాము. జ్ఞానము
కొరకు పెద్దలు చెప్పుమాటలను వింటాము. మీరు చెప్పునది మేమెందుకు
వినాలి? అంటే ఆకలికి అన్నము ఎందుకు తినాలి? అన్నట్లుంటుంది.
ఆత్మల విషయము తెలియుటకు భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి
యోగమున గల 16, 17 శ్లోకములను చూడాలి. అట్లే ప్రబోధానంద
యోగీశ్వరులు వ్రాసిన త్రైత సిద్ధాంతమును చూడాలి. ప్రబోధానంద
యోగీశ్వరుల భవిష్యత్తులోని కొన్ని విషయములను ముందే వ్రాసిన
వీరబ్రహ్మముగారి కాలజ్ఞానములోని ఈ వాక్యమునయినా చూడాలి "ఆనంద
కందళిత హృదయారవిందులయిన ఆత్మత్రయాలను". ఆత్మత్రయము
అనగా మూడు ఆత్మలను వివరము వచ్చుచున్నది. దానినే ప్రబోధానంద
యోగీశ్వరులు త్రైత సిద్ధాంతము గా ప్రకటించారు. త్రైత సిద్ధాంతము
శాస్త్రబద్దమైయున్నది. మిగతా అద్వైత, ద్వైత సిద్ధాంతములు శాస్త్రబద్దములు
కానేకావు. శాస్త్రీయత లేని సిద్ధాంతములను గొప్పగా చెప్పుకొనువారు,
శాస్త్రీయతయున్న సిద్ధాంతమును ఎందుకు పరమతమని అంటున్నారోయని
చూచిన అందులో అసూయ భావము తప్ప ఏమీ లేదని తెలియుచున్నది.
కనిపించే ప్రబోధానందయోగీశ్వరుల మీద నమ్మకము లేకపోయినా,
పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన మాట మీదయినా నమ్మకము
పెట్టుకొన్నా లేక భగవద్గీతను చెప్పిన భగవంతుని మీద నమ్మకమున్నా
మీకు త్రైత సిద్ధాంతము అద్వైత, ద్వైత సిద్ధాంతములకంటే గొప్పదని
తెలియగలదు.
ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరుల వారికి ఒక అద్వైత గురువు
‘ప్రబోధానంద’ అని పేరు పెట్టారని మీరే చెప్పారు. అప్పుడు రమణానంద
భారతీస్వాముల వారు ఈయనకు గురువే కదా! అలాంటపుడు నాకు
గురువులేడని కొన్ని సందర్భములలో స్వయముగా యోగీశ్వరులవారే
చెప్పినట్లు కలదు. గురుసాంప్రదాయము హిందూమతములో యున్నప్పుడు
గురువైన వానిని గురువు కాదనడమేమిటి?
జవాబు :- ఒక వ్యక్తికి మరొక వ్యక్తి గురువుగాయుండవచ్చును. నేను
ప్రబోధానంద యోగీశ్వరుల శరీరమునుండి మాట్లాడుచున్నాను. ఈ
శరీరము నాది కాదు. యోగీశ్వరుల వారిది. వారి శరీరములో తలలోని
ఒక మూల నా నివాసము కలదు. నా భావములను యోగీశ్వరుల శరీరము
ద్వారా వ్యక్తపరచుచున్నాను. అందువలన నేను వ్యక్తిని. ప్రబోధానంద
యోగీశ్వరులు అనుమాట శరీరములోపల శరీరమంతా వ్యాపించిన ఆత్మకే
చెల్లును. శరీరమును నడుపు శక్తిగాయున్నది ఆత్మ. శరీరమంతా చైతన్యమై
యుండుట వలన ఆత్మను శక్తి అంటున్నాము. పైకి కనిపించునది సాధారణ
శరీరమే. అయితే లోపల యున్నవాడు అసాధారణమైనవాడు. అందువలన
వానిని వ్యక్తి అనకూడదు. 'శక్తి' అని అనాలి. అసలు విషయానికి వస్తే
వ్యక్తికి వ్యక్తి గురువుగా యుండవచ్చునుగానీ, శక్తికి వ్యక్తి గురువుగా
యుండడు. వ్యక్తికి కొన్నిచోట్ల శక్తియైన ఆత్మకూడా గురువుగా యుండ
వచ్చును. ఒక మనిషికి ఇంకొక మనిషి గురువుగా యున్నా ఆ వ్యక్తికి
శక్తియైన ఆత్మ గురువుగా యుండవచ్చును. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి
గురువుగాయున్నా అది ఒక జన్మ లెక్కాచారమే యగును. అట్లు కాకుండా
అన్ని జన్మలకు గురువుగాయున్నవాడు ఆత్మగలడని చెప్పవచ్చును.
ప్రబోధానంద యోగీశ్వరుల వారిని మనుషులయిన వారు ఎవరయినా
గురువుగా చెప్పుకోవచ్చును. ఎందుకనగా! యోగీశ్వరులు మధ్యాత్మయని
అదే శరీరములో యున్న నేను చెప్పుచున్నాను కదా!
ప్రబోధానంద యోగీశ్వరులు మనుషుల అందరికీ గురువుగా
యుండవచ్చునుగానీ, ఏ మనిషీ ఆయనకు గురువుగా యుండలేడు. ఒక
అద్వైత గురువు ఆయనకు 'పెద్దన్న' అను పేరు తీసి ప్రబోధానంద అని
పేరు పెట్టాడు కదా!యని మీరు అంటున్నారు. ఆ మాట వాస్తవమే అయినా
ఆ పేరును తీసినది మరియొక పేరును పెట్టినది ఆ శరీరములో ఆత్మగా
యున్నవాడేనని, జీవుడు ఏమీ చేయువాడు కాదని మీరు తెలియవచ్చును
కదా! ఒక వ్యక్తి మరొక వ్యక్తికి గురువుగా యుండవచ్చునను సూత్రమును
మరువకూడదు. అలాగే వ్యక్తి అయినవాడు శక్తి అయిన వానికి గురువు
కాలేడు. శక్తి అయినవాడు మనుషులందరికీ గురువు కావచ్చును.
అదేమాటనే వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానమందే ఒక వాక్యములో ఇలా
వ్రాశారు చూడండి. "ఆనందాశ్రయులు ఆది అన్నాడు కనుక మీకు మాకు
ఆనందాశ్రయులే గురువులు" ఇక్కడ వీరబ్రహ్మముగారు కూడా
ఆనందాశ్రమమును నడుపు యోగీశ్వరులే మనందరికీ మీకు మాకు గురువని
చెప్పడము గమనార్హము. అందరికీ గురువైన వానికి మనిషి అయినవాడు
ఎవడూ గురువుగాయుండడు. అందువలన ప్రబోధానంద యోగీశ్వరులు
తనకు ఎవరూ గురువు లేడని చెప్పాడు. ఆ మాట వాస్తవమే కదా!
ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులవారు వ్యక్తికాదు శక్తియే అనుకొందాము.
ఆయన ఆశ్రమము పేరు 'ప్రబోధాశ్రమము' అని అంటారు. మరికొందరు
ప్రబోధానందాశ్రమమని అంటారు. బ్రహ్మముగారు చెప్పిన వాక్యములో
'ఆనందాశ్రమము వారు' అని అన్నారు కదా! బ్రహ్మముగారు చెప్పినది
ప్రబోధానందాశ్రమమేనా! అని సంశయము కలదు. దానికి మీరేమంటారు?
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు ప్రబోధాశ్రమమును క్రీ॥శ॥ 1977
లోనే స్థాపించడము జరిగినది. త్రైత సిద్ధాంతమును 1979లోనే
ప్రకటించడము జరిగినది. “ప్రబోధ” గ్రంథమును వ్రాయడము కూడా
జరిగినది. ప్రబోధాశ్రమమును గురించి బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసిన విషయము 2006వ సంవత్సరము తెలిసినది. తర్వాత కొంత
కాలమునకు తిరుపతి ఓరియంటల్ కాలేజీలో వ్రాసి పెట్టబడిన బ్రహ్మము
గారి ఏష్య కాలజ్ఞానమును మేము చూడడము జరిగినది. అప్పుడు ఇంకా
కొన్ని విషయములు తెలిసినవి. ప్రబోధానందాశ్రమమునే ఆనందాశ్రమముగా
చెప్పడమైనదని తెలిసినది. ఇంకా ప్రబోధానంద యోగీశ్వరులను ఆనంద
గురువులని చెప్పడమైనదని తెలిసినది. ప్రబోధానందాశ్రమమును,
ప్రబోధానందను పేరుమార్చి ఆనంద గురువని, ఆనందాశ్రమమని చెప్పినట్లు
తెలిసింది. దానితో ఏష్యకాలజ్ఞానమును పూర్తిగా చదువగా, అందులో
నుండి చాలా విషయములు తెలిసినవి. మాకు తెలిసిన వాటిని సందర్భాను
సారము అక్కడక్కడ వివరిస్తూ వస్తున్నాము.
ప్రశ్న :- ఆనంద గురువులని, ఆనందాశ్రయులని ఇతరులను చెప్పియుండ
వచ్చును కదా! ఆ పేర్లు మీవేనని ఎందుకు అనుకోవాలి?
జవాబు :- ఇది అడుగవలసిన ప్రశ్నే! దీనికి జవాబును తెలుసుకొంటే
సంశయము లేకుండా పోవును. అందువలన ఇప్పుడు ఒక్కొక్కటి
వివరముగా తెలుసుకొందాము. మొదట "ప్రబోధాశ్రమము ఉన్నతమైన
జ్ఞానము కలది " అను బ్రహ్మముగారి వాక్యమును చూచాము. తర్వాత
రెండవ వాక్యమును "ప్రబోధ ఆశ్రమము వారి ఆది గుణమెల్ల శయనాధిపతికి
ఉన్నది" ఈ వాక్యములో ప్రబోధ ఆశ్రమము వారికి అనగా ప్రబోధానంద
యోగీశ్వరులకు, ఆది అనగా 'సృష్ఠి' అని అర్ధము రాగలదు. ఆదిగుణమెల్ల
అనగా 'సృష్ఠి గుణము అంతా' అని అర్థము. శయనాధిపతికి అనగా
'ఎప్పుడూ పాముమీద శయనించి యున్నవాడు విష్ణువు' అని చెప్పవచ్చును
లేక 'యోగములో పెద్దవాడు యోగీశ్వరుడు' అని చెప్పవచ్చును. ఈ
వాక్యము ప్రకారము ‘ప్రబోధాశ్రమము వారయిన ప్రబోధానంద యోగీశ్వర
శక్తియంతయు ప్రబోధాశ్రమములో కలదని' అర్థము. తర్వాత మరియొకచోట
కాలజ్ఞానములో మరియొక వాక్యము ఇలా కలదు. "శాంతాకారమైన
చోద్యవేద్యాలు రేపే కనిపించును. శయనాధిపతికి మేలు, మేలు అను వార్త
రేపే కనిపించేను.” ఈ వాక్యము తర్వాత మరియొక చోట ఏష్య
కాలజ్ఞానములో శయనాధిపతి అను పేరుతో గలదు. ప్రబోధాశ్రమము
వారయిన 'యోగీశ్వరులును' 'శయనాధిపతి' ఒకటేనని తెలిసిపోయినది.
“శయనాధిపతికి సర్వదా ఆనందం. బ్రహ్మాదులెల్లా దీవించేరు,
జారువాక్యములు ఆడినవారెల్లా నాశనమై పొయ్యేరు. కీడు తలచిన వారెల్లా
ధూళియై పొయ్యేరు." అని వ్రాయబడియున్నది. ఈ వాక్యములో
శయనాధిపతియని మరియొక మారు యోగీశ్వరులను గురించి చెప్పడ
మైనది. దీనిలో 'శయనాధిపతియే సర్వదా ఆనందం' అని చెప్పడము
వలన యోగీశ్వరులనే ఆనంద గురువని మరియొకచోట చెప్పడమైనది.
ప్రబోధానంద ఆశ్రమమును ఆనంద ఆశ్రమమనియూ, ప్రబోధానంద
యోగీశ్వరులను ఆనంద గురువని ఏష్యకాలజ్ఞానములో చాలాచోట్ల
చెప్పియున్నారు. అందువలన వీరబ్రహ్మము గారు చెప్పిన కాలజ్ఞాన
వాక్యములను సాధారణ వాక్యములుగా చూడక, చాలా విశేషతయున్న
జ్ఞానవాక్యములుగా చూడవలెను.
ప్రశ్న :- ఇంతకుముందు హిందూమతములో ముగ్గురు సిద్ధాంతకర్తలు
వచ్చిపోయారు. నేడు అద్వైత సిద్ధాంతము మిగతా రెండు సిద్ధాంతముల
కంటే ఎక్కువ ప్రచారమయినది. నేడు ఎక్కువగా యున్నది కూడా అద్వైతమే.
ద్వైతము, విశిష్టాద్వైతము రెండూ కలిసి అద్వైతమునకు సమానముగా కూడా
లేవు. అందులో విశిష్టాద్వైతము అద్వైతము తర్వాత స్థానములోయుండగా,
ద్వైతము విశిష్టాద్వైతమునకంటే తక్కువగాయున్నది. మొదటి స్థానములో
అద్వైతముండగా, రెండు, మూడు స్థానములలో విశిష్టాద్వైతము, ద్వైతములు
కలవు. మీరు చెప్పుచున్న త్రైత సిద్ధాంతము ఎంతో గొప్పదని చెప్పినా,
మూడు సిద్ధాంతములకంటే గొప్పదని చెప్పినా అది ఎక్కడా కనిపించడము
లేదు. ద్వైతులకంటే మరింత తక్కువలో త్రైతులున్నట్లు అర్థమగుచున్నది.
మీ సిద్ధాంతము గొప్పదైనప్పుడు మనుషులలో ఎక్కడా కనిపించడము
లేదు కదా! ద్వైతులు మూడవ స్థానములో ఉండగా, త్రైతులు నాల్గవ
స్థానములో కూడా కన్పించలేదే అని మేము అడుగవచ్చును కదా!
జవాబు :- 60, 70 సంవత్సరముల ముందు పుట్టిన వానికి పెద్ద మీసాలు
ఉండవచ్చును. అయితే పుట్టిన ఐదు సంవత్సరముల పిల్లవానిని పట్టుకొని
వీని జాతకము ముందు పుట్టినవారికంటే బాగుంటే వారికున్నట్లు ఇతనికి
మీసాలెందుకు లేవు? కనీసము కొన్నయినా లేవే! అంటే అది సమంజస
మైన మాటకాదనీ, అసలుకు అది ప్రశ్నే కాదనీ చెప్పవచ్చును. అద్వైత
సిద్ధాంతము దాదాపు 2500 సంవత్సరముల పూర్వము పుట్టినది. తర్వాత
దాదాపు 1500 సంవత్సరముల పూర్వము పుట్టినది విశిష్టాద్వైతము. ఆ
తర్వాత కొంతకాలమునకు పుట్టినది ద్వైతము. అద్వైతమునకు ఆర్యులు
పుణాదివంటి వారుగా ఉండుట వలన అద్వైతము బాగా ప్రచారమయినది.
ఏమీ తెలియని కాలములో అందరినీ అద్వైతులుగా మార్చుకొన్నారు.
అందువలన మొదట వచ్చిన అద్వైతము భారతదేశములో ఎక్కువ శాతము
గలదు. తర్వాత వచ్చిన విశిష్టాద్వైతమును ముందు పుట్టిన అద్వైతముకు
వ్యతిరేఖముగా యుండుట వలన విశిష్టాద్వైతము ఎక్కువగా ప్రచారము
కాలేకపోయినది. ఆ దినములలో అద్వైతులు రాజులవద్ద పలుకుబడిని
పెట్టుకొని సైనికులచేత విశిష్టాద్వైతులను చంపించిన సందర్భములు కూడా
కలవు. అందువలన రామానుజాచార్యుల వారు కూడా అప్పుడప్పుడు
అజ్ఞాత జీవితము గడుపవలసి వచ్చినది. అందువలన విశిష్టాద్వైతము
ఎక్కువ ప్రచారము కాలేదనియే చెప్పాలి. ద్వైతము పుట్టడమే బలహీనముగా
పుట్టినది. మధ్వాచార్యుల జీవితములో ఉడిపి ప్రాంతము దాటి ప్రచారము
కాలేదు. ద్వైతము ప్రచారము కావడమే తక్కువ అయినందున ప్రజలలో
ద్వైతమంటే ఏమిటో తెలియదు. అద్వైతము, విశిష్టాద్వైతము ప్రజలలో
కొంతయుండగా, ద్వైతము చాలా తక్కువ మందిలో మాత్రము కలదు.
అద్వైతము, విశిష్టాద్వైతము ప్రజలలో ప్రాకియుండగా, ద్వైతము మాత్రము
బ్రాహ్మణులలో మాత్రము కలదు.
ఈ మూడు సిద్ధాంతములు పుట్టిన తర్వాత దాదాపు ఏడువందల
సంవత్సరములకు ‘త్రైత సిద్ధాంతము' పుట్టినది. త్రైత సిద్ధాంతము సృష్ట్యాదిలో
పుట్టినా అది ఇప్పుడు తెలియుట చేత ఇప్పుడే పుట్టినదని చెప్పవలసి
వచ్చినది. త్రైత సిద్ధాంతము ఇప్పుడిప్పుడే పుట్టినా అది అతివేగముగా
ప్రజలలోనికి చొచ్చుకొని పోయినది. మాకు తెలిసినంతటిలో అద్వైతము
కంటే ఎక్కువ వేగముతో తక్కువ కాలములోనే ప్రచారమయినదని
తలచుచున్నాము. ఇప్పటికి దాదాపు 40 సంవత్సరముల క్రిందటే త్రైత
సిద్ధాంతము పుట్టినా 37 సంవత్సరములప్పుడు దాని పేరును పెట్టడమైనది.
తర్వాత పది సంవత్సరములనుండి బయట ప్రచారము చేయుట జరిగినది.
పది సంవత్సరములలోనే మాకు తెలిసినంతవరకు చాలా వేగముగా
ప్రచారమయినది. మీరు కనపడలేదని చెప్పినా త్రైత సిద్ధాంతము మాకు
బాగానే కనిపిస్తున్నది.
మా గ్రంథములు చదివినవారు ఎవరయినా
త్రైతులుగా మారిపోయి త్రైత సిద్ధాంతమును ప్రచారము చేయుచున్నారు.
ఒక గ్రంథమును చదివినవారు కూడా త్రైత సిద్ధాంతమును అనుసరిస్తున్నారు.
వారే స్వచ్ఛందముగా ప్రచారము చేయుచున్నారు.
త్రైత సిద్ధాంతము ఒక్క భగవద్గీతలోనే కాకుండా, క్రైస్తవుల బైబిలు
గ్రంథములోనూ, ముస్లీమ్ల ఖురాన్ గ్రంథములోనూ చెప్పియుండుట వలన
ముస్లీమ్లు, క్రైస్తవులు మూడు ఆత్మల వివరమును తెలుసుకొంటున్నారు.
వారి గ్రంథములలోని త్రైత సిద్ధాంతమును క్రైస్తవులు, ముస్లీమ్లు ప్రచారము
చేయుట వలన, దేశములో త్రైత సిద్ధాంతము మూడు మతములలో ప్రచారమ
గుట వలన ఈ సిద్ధాంతము తొందరగా ప్రచారమగుచున్నది. అద్వైతము
విశిష్టాద్వైతము హిందువులలో మాత్రము గలదు. అట్లే ద్వైతము
బ్రాహ్మణులలో మాత్రము గలదు. అయితే త్రైత సిద్ధాంతము ఒక
కులమునకు గానీ, ఒక మతమునకుగానీ పరిమితి కాకుండా అన్ని
మతములలోనూ, అన్ని కులములలోనూ వ్యాపించిపోవుట వలన త్రైత
సిద్ధాంతము వేగముగా ప్రాకుచున్నదనియే చెప్పుచున్నాము. ఇంకా కొంత
కాలమునకు భారత దేశమునకే పరిమితి కాకుండా అన్ని దేశములయందు,
అన్ని జాతులయందు వ్యాపించగలదని చెప్పుచున్నాము.
ప్రశ్న :- అద్వైతము ద్రావిడ బ్రాహ్మణుడయిన శంకరాచార్యులతో
ప్రారంభమయినా కనిపించక త్రేతాయుగమునుండి ఆర్యులలో ఉండేది.
మొదట బ్రాహ్మణ కులములో మొదలయిన అద్వైతము తర్వాత కాలములో
మిగతా కులములలో కూడా ప్రాకిపోయినది. తర్వాత వచ్చిన విశిష్టాద్వైతము
కూడా ద్రావిడ బ్రాహ్మణులతో మొదలయినా అది దక్షిణ దేశమునకే
పరిమితమైపోయినది. అయినా మిగతా కులములలోనికి కూడా విశిష్టా
ద్వైతము కొంత ప్రాకినదనియే చెప్పాలి. తర్వాత వచ్చిన ద్వైతము దక్షిణ
దేశమున కర్నాటక రాష్ట్రములో పుట్టినా అది బ్రాహ్మణులకే పరిమితియై
పోయి, మిగతా కులములలో ప్రాకలేకపోయినది. అందువలన ద్వైతము
దేశములో ఎక్కడా ప్రాకలేదనియే చెప్పాలి. ద్వైత సిద్ధాంతమును అనుసరించు
బ్రాహ్మణులు మంత్రాలయము రాఘవేంద్ర స్వామి ఆలయములోనూ,
తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయములోనూ పూజారులుగా కనిపించు
చుందురు. ఇంతవరకు ముగ్గురు సిద్ధాంతకర్తలు ద్రావిడ బ్రాహ్మణులే
అయినా అద్వైతము పుణాది ఆర్యులదయిన దానివలన ఉత్తర భారత
దేశములో కూడా అద్వైతులు కలరు. విశిష్టాద్వైతము దేశములో ఎక్కడయినా
అరుదుగా కనిపించినా అది దక్షిణ దేశమునకే పరిమితమైనదనీ, ద్రావిడుల
లోనే విశిష్టాద్వైతమున్నదనీ చెప్పవచ్చును. మూడవ ద్వైత సిద్ధాంతకర్త
ద్రావిడ బ్రాహ్మణుడే అగుట వలన ద్వైతము దక్షిణ దేశములో మాత్రము
పరిమితముగా కనిపించుచున్నది.
ఇకపోతే త్రైత సిద్ధాంతము కూడా దక్షిణ దేశములోనే ఆంధ్ర
రాష్ట్రములో, రాయలసీమ ప్రాంతములో పుట్టినది. త్రైత సిద్ధాంత కర్త
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. ఈయన హిందూమతములో నాల్గవ
సిద్ధాంతకర్త. ఇంతవరకు మూడు సిద్ధాంతములు ద్రావిడ బ్రాహ్మణులకే
పరిమితమైపోయాయి. నాల్గవ సిద్ధాంతమును చెప్పిన త్రైత సిద్ధాంతకర్తయిన
ప్రబోధానంద యోగీశ్వరులది ఏ కులమో మాకు తెలియదు. జ్ఞానమునకు
కులము ముఖ్యము కాకపోయినా, సిద్ధాంతమునకు కులముతో ఏమాత్రము
సంబంధము లేకపోయినా ఎవరయినా అడిగితే మేము ఏమని చెప్పాలి?
అందువలన మేము ఇతరులకు చెప్పుటకు మిమ్ములను కులమును గురించి
అడుగుచున్నాము?
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరుల శరీరము శరీరములోగల మధ్యాత్మదే
అయినా జీవభావముతో జీవుడనైన నేనే మాట్లాడుచున్నాను. ఇంతవరకు
ఏ గ్రంథ రచనలోనూ స్వయముగా మధ్యాత్మ ఎప్పుడూ మాట్లాడలేదు.
అయినా ఈ గ్రంథములో కొన్ని మాటలను తానే మాట్లాడి చెప్పడమైనది.
తర్వాత ఏమీ మాట్లాడలేదు. శరీరములోని జీవుడనయిన నా భావమునే
ఆత్మ బయటికి చెప్పుచున్నది. నోటితో పలికే పని చేసినా, భావము
జీవుడయిన నాదగుటవలన నేను మాట్లాడినట్లేగానీ, ఆత్మ మాట్లాడినట్లు
కాదు.
ఇప్పుడు నేనేమి చెప్పుచున్నాననగా! శరీరములోపల యున్న నేను
జీవుడను అయినందున గుత్రము కలవాడినే గానీ కులము లేనివాడిని.
ఇకపోతే శరీరమంతా వ్యాపించి శరీరమునకు అధిపతిగాయున్న ఆత్మకు
గుత్రము కూడా లేదు, కులము అంతకూ లేదు. బయట కనిపించు
శరీరమునకు మాత్రము తల్లితండ్రులనుబట్టి ఫలానా కులము అని
చెప్పుచున్నారు. అలా చెప్పినా అది ఆత్మకుగానీ, జీవాత్మకుగానీ కాకుండా
స్త్రీతత్త్వము గల శరీరమునదేనని చెప్పుచున్నాను. బయటి మనుషులు
ప్రకృతి భావములలోనే ఉంటారు. కావున వారికి కులము పేరు తప్పక
చెప్పవలసిందే. కావున ప్రబోధానంద యోగీశ్వరుల శరీరము పుట్టినది
కమ్మకులమున. ప్రబోధానంద యోగీశ్వరుల వారు కమ్మకులమున పుట్టునని
పోతులూరి వీరబ్రహ్మముగారు తన ఏష్యకాలజ్ఞానమున ముందే చెప్పి
యున్నాడు. బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఏమి చెప్పాడో ఇక్కడ
కొద్దిగా చూస్తాము.
“కమ్మలు తాటిపత్రికి పోయి ఏకవచనము మీద ఈ భూమిలో జనుల
పేరిట కమ్మజాతికి జాతులకెల్ల సంశయము లేక శీగ్రముగ రండని
వ్రాసినట్టియు ఆ కమ్మల మీద గుసగుసలు పోయిరి ప్రజలు" ఈ వాక్యములో
యోగీశ్వరుల యొక్క కులము పేరును ప్రస్తావించడమేకాక, ఆయన త్రైత
సిద్ధాంతమును ప్రచారము చేసిన ఊరు పేరు కూడా చెప్పడము విశేషము.
ప్రబోధానంద యోగీశ్వరుల మీద ప్రజలు అనేక రకములుగా మాట్లాడు
కోవడమును ఆ కమ్మల మీద ప్రజలు గుసగుసలు పోయిరని వ్రాశారు.
ఇక్కడ చెప్పవలసినది ఈ వాక్యములో "తాటిపత్రి" అని ఊరు పేరు గలదు.
తాడిపత్రి రైల్వేస్టేషన్లో రైల్వేస్టేష్టన్ మొదటిలోనే ఊరు పేరుండు పెద్ద
బోర్డు ప్రతి స్టేషన్లో స్టేషన్కు రెండువైపులా యుండును. నేను
చూచినప్పుడు బహుశా 1972లో 'తాటిపత్రి' అను పేరుతో యుండేది.
ఆ బోర్డు సిమెంటుతో తయారు చేసినది. ఆ బోర్డు మీద దాదాపు ఒకటిన్నర
అడుగు విస్తీర్ణముతో "తాటిపత్రి" అను నాలుగు అక్షరములు ఉండేవి.
అది కూడా మందముగాయున్న సిమెంటు పలుకమీద నాలుగు అక్షరములు
గుంతలుగా యుండేవి. సిమెంటు పలుకమీద అక్షరమున్నట్లు తగ్గుగా
సిమెంటును గీకివేసి గుంతలో అక్షరముయొక్క ఆకారమును కనపడునట్లు
చేసియుండిరి. దానిని నేను బాగా గమనించాను. తర్వాత క్రొత్తగా బోర్డుకు
రంగును వేయునప్పుడు పసుపు రంగు బోర్డంతయూ పూసి అక్షరముల
తగ్గులో నలుపురంగు వ్రాశారు. అయితే బోర్డుతో యున్న “డి” ని నలుపు
రంగుతో వ్రాయక దానిమీద 'డి' ని వ్రాయడము జరిగినది. అలా మేము
చూస్తున్నట్లే 'తాటిపత్రి' అనే పేరు కాస్తా 'తాడిపత్రి'గా మారిపోయినది.
'టి' మీద 'డి' అని వ్రాసినా 'టి' ఆకారము తగ్గుగా యుండేది కావున బాగా
చూస్తే ‘డి’ క్రింద ‘టి’ కనిపించేది. అంతేకాక త్రేతాయుగమున శ్రీరాముడు
సీతకొరకు దక్షిణ దేశము వచ్చినప్పుడు ఈ ప్రాంతములోనే తాటకిని
సంహరించాడని, అందువలన ఈ ఊరుకు 'తాటిపత్రి' అను పేరు
వచ్చినదని కొందరు పెద్దలు చెప్పగా విన్నాము. దాదాపు 40 సంవత్సరము
లప్పుడు 'తాటిపత్రి' అను పేరు మారిపోయి ‘తాడిపత్రి’గా రూపొందినది.
మూడు సంవత్సరముల క్రితము వరకు అదే బోర్డు ఉండేది. ఇప్పుడు
రైల్వేస్టేషన్ పెద్దగా అయిన దానివలన పాతబోర్డులు తీసి పూర్తిగా
క్రొత్తబోర్డులు పెట్టడము, వాటిమీద 'తాడిపత్రి' అని వ్రాయడము జరిగినది.
ఇదంతయూ ఎందుకు చెప్పుచున్నామనగా! బ్రహ్మముగారు వ్రాసినది
మేమున్న తాటిపత్రేనని తెలియడము కొరకే.
పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధానంద యోగీశ్వరులు
పుట్టినది కమ్మకులమని తెలుపుటకు ఈ వాక్యములో “కమ్మలు తాటిపత్రికి
పోయి” అని చెప్పాడు. బ్రహ్మముగారు చెప్పినట్లు ప్రబోధానంద
యోగీశ్వరులు బాల్యములో తాటిపత్రిలోయున్నా ఎనిమిది సంవత్సరముల
వయస్సులో అక్కడినుండి వేరే ఊరికి పోవడము జరిగినది. ఆయన కొన్ని
ఊర్లు మారిన తర్వాత తిరిగి తాటిపత్రికి రావడము జరిగినది. తర్వాత
ప్రబోధాశ్రమము స్థాపించడమైనది. తాటిపత్రికి వచ్చి ప్రబోధాశ్రమమును
నిర్మించుట వలన "కమ్మలు తాటిపత్రికి పోయి” అని అన్నారు. ప్రబోధానంద
యోగీశ్వరులను చూచి సరిపోనివారు ఆయన ఎదురుగా కాకుండా చాటున
ఆయనను గురించి మాట్లాడుకోవడము జరుగుచుండెడిది. అందువలన
"ఆ కమ్మల మీద గుసగుసలు పోయిరి ప్రజలు" అని వ్రాశారు. ఇప్పుడు
మీరు అడిగిన ప్రశ్నకు మేము చెప్పకనే బ్రహ్మముగారి వాక్యము వలన
జవాబు దొరికినది కదా! ప్రబోధానంద యోగీశ్వరులు వ్రాసిన జ్ఞానము
సరిక్రొత్తదిగా ఉండును. ఆయన 'విడదీయరాని' బ్రహ్మముగారి తత్త్వాలకు
అర్థాలు చెప్పాడు. ‘ముడివిప్పలేని' వేమన పద్యాలకు వివరములు చెప్పాడు.
మిస్టరీగా మిగిలిపోయిన 'బెర్ముడా ట్రయాంగిల్' రహస్యాలను ఛేదించి
చెప్పాడు. మరణ రహస్యాలను, జన్మ వివరాలను ఇది అది అనకుండా
ఎన్నో క్రొత్త విషయములను చెప్పుట వలన భక్తి కల్గినవారు వినగలిగారు.
భక్తిలేని వారు యోగీశ్వరులను విమర్శించను మొదలు పెట్టారు.
విమర్శలను ఎదురుగా కాకుండా చాటుగా గుసగుసల రూపములో చేశారు.
ప్రశ్న :- మేము కూడా కొందరు అనుకోగా విన్నాము. ప్రబోధానంద
యోగీశ్వరులు చెప్పే బోధలు ప్రత్యేకముగా ఉంటాయని, ఇంతవరకు ఎవరూ
చెప్పని బోధలను చెప్పుతాడనీ, అట్లే ఇంతవరకు ఎవరూ వ్రాయని బోధలనే
గ్రంథములలో వ్రాస్తాడనీ అనుకోగా విన్నాము. అది ఎంతవరకు వాస్తవము?
జవాబు :- ఈ విషయమును గురించి మేము చెప్పితే మా గొప్పతనమును
గురించి మేమే చెప్పుకొన్నట్లగును. మేము చెప్పుటకంటే మీరే స్వయముగా
చదువుకోవడము మంచిది. ఇతరులు వినిగానీ, చదివిగానీ మా బోధలలోని
ప్రత్యేకతను తెలుసుకోవడము మంచిది. యోగీశ్వరుల వారు ఎవరికీ
తెలియని ఆధ్యాత్మిక రహస్యములు చెప్పుననుటకు సాక్ష్యముగా వీరబ్రహ్మేంద్ర
స్వాములవారు తన కాలజ్ఞానమున చెప్పిన ఒక వాక్యమును గుర్తుగా
చూస్తాము. "ఆనందాశ్రయుల చేత చిణకె బెణకె, అతి దేదీప్యమాన తేజస్సు
ఇస్తిమి. సర్వమూ ఇందులోనివే ఇది సాంగోపాంగమైన, అతి సూక్ష్మమైన,
అతి రహస్యమైన పంత వాక్యము." దీనినిబట్టి యోగీశ్వరులు చెప్పే
జ్ఞానమంతయూ రహస్యములతో కూడినదేయని తెలియుచున్నది.
ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు వ్రాసిన గ్రంథములను నాలుగింటిని
చదివాము. మీరు చెప్పినట్లు ఆ గ్రంథములలోని జ్ఞానము ప్రత్యేకమయిన
దని అర్థమగుచున్నది. ఆయన వ్రాసిన విషయములు ఎవరూ చెప్పని
విషయములే. వాటిని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, ఎవరూ వ్రాయలేదు.
అయితే ఆయన చెప్పిన కొన్ని ఉపన్యాసములను మేము విన్నాము.
మాటలలో ఒక క్రొత్త విషయము మాకు తెలిసినది. ఒక మీటింగ్
“ఇక్కడికి వచ్చినవారు మంచి ఉద్దేశ్యముతో జ్ఞానము తెలియాలను
భావముతోనే ఉండండి. నన్ను విమర్శించు ధోరణిలోగానీ, అసూయతో
చూచుటగానీ ఉండకూడదని తెలుపుచున్నాను. అట్లుండుట వలన నాకు
నష్టముగానీ, కష్టముగానీ ఉండదు. అయితే అది మీకే మంచిదికాదు
దానివలన మీకే నష్టము కష్టము ఏర్పడగలదు. ఎందుకనగా! ఇక్కడ
మీకు కనిపించని దేవతలు, ఆకాశమునుండి దిగివచ్చిన గ్రహములు, ఎందరో
గొప్పవారు మీతోపాటు వచ్చియున్నారు. వారికి మీ భావములు కనిపించితే
వారికి మా మీద గల అభిమానముతో మీకు చెడు చేయగలరు. మీరు
నన్ను చెడుగా అనుకొనినా నేనేమీ చేయువాడను కాను. అయితే నా మీద
గౌరవమున్న దేవతలకు, గ్రహములకు మీ మీద కోపము వచ్చును.
అందువలన వారు ఏమయినా చేయవచ్చును” అని చెప్పారు. ఆయన
బోధలను వినుటకు మనుషులు వచ్చుట వాస్తవమే. అయితే దేవతలు,
గ్రహములు వచ్చుట వాస్తవమా?
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరులు మనిషిగా కనిపిస్తున్నా ఆయన
వాస్తవానికి ఆత్మత్రయములో మధ్యాత్మగా యున్నాడు. నేను అదే శరీరములో
ఒకచోట, ఒకమూల యున్న జీవున్ని నా భావములను నేను వ్యక్తము
చేయుచున్నాను. శరీరము యోగీశ్వరులదే అయినా అందులోని
అనుభూతులన్నియూ నేరుగా జీవుడనయిన నన్ను చేరుచుండును. శరీరము
లోని బుద్ధికి ప్రక్కగాయున్న నాకు బుద్ధికి చేరిన విషయములన్నియూ
తెలియుచుండును. మీకు కల్గిన అనుమానము తీరుటకు నాకు తెలిసిన
సత్యములను కొన్నింటిని తెలుపుతాను. అప్పుడు మీరే ఒక నిర్ణయమునకు
రావచ్చును. ఈ రోజు శనివారము 9.1.2016 తేదీ. సమయము
సాయంకాలము 6.15 నిమిషములు. గడచిన రాత్రి 11.00 గంటల
సమయములో యోగీశ్వరులవారు మంచము మీద పడుకొన్నారు. బయట
అనుభవములు లోపలయున్న నాకు తెలియుచుండును కదా! నా భార్యగా
యున్నవారు లైట్లు ఆర్పి పడుకొనే సమయము. ఆమె యోగీశ్వరుల పడక
గదిలో లైట్లు ఆర్పి నీళ్ళు త్రాగి వచ్చేదానికి వంటరూములోనికి పోయినది.
ఆ విషయము ఆయనకు తెలియదు. లైట్లు ఆర్పిన తర్వాత ఆయన రెండు
కాళ్ళలో కుడికాలును పట్టుకొని తల ఆనించి నమస్కారము చేసుకొన్నట్లు
స్పర్శ బుద్ధికి తెలిసినది. అది నాకు కూడా తెలిసియుండును కదా! అక్కడ
మ్రొక్కినది ఎవరయినది తెలియక “ఎవరు కాళ్ళకు మ్రొక్కినది?” అని
అడిగాము. అప్పుడప్పుడు కొందరు భక్తులు మ్రొక్కిపోవడము జరుగు
చుండెడిది. దానివలన ఇంతవరకు ఇక్కడ ఎవరున్నారని అడుగడమైనది.
అప్పుడు నా భార్య వంటరూములో నుండి వచ్చి “ఏమిటి అడుగుచున్నారే!”
అన్నది. అప్పుడు ఆ విషయము ఆమెకు తెలియదనీ, మ్రొక్కినవారు
మనుషులు కారనీ, కనిపించని వారు ఎవరో మ్రొక్కియుంటారనీ అను
కున్నాము. ఇలాంటి అనుభవములు ఎన్నో నాకు కూడా తెలియుచుండును.
అప్పుడు అక్కడ మ్రొక్కినవారు యోగీశ్వరులకు మ్రొక్కారు. ఎవరు మ్రొక్కినది
ఆయనకు తెలుసు. నాకు ఏమాత్రము తెలియదు. పడుకొనియున్నప్పుడు
కాళ్ళు పట్టుకొనియున్నట్లు స్పర్శద్వారా తెలియుచుండును. ఆ విషయమంతా
నాకు కూడా కొంత అర్థమగుచున్నది. కొద్దిగ కాలు కదిపితే ఆ స్పర్శ
తేలిపోయినట్లు చిన్నగా లేకుండాపోవును. ముడుచు కొన్న కాలును చాపి
పెట్టినట్లు ఒకమారు తెలిసింది. ఇతరులైతే ఈ విషయములో భయపడి
పోవుదురు. నాకు అనేక అనుభవములుండుట వలన అక్కడ ఏమి
జరుగుచున్నదో అర్థమగుచున్నది. ఈ విషయములు అర్థము కావాలంటే
ఎంతో విచక్షణ అవసరమని చెప్పుచున్నాను.
ఇటువంటి అనుభవములను చూచిన తర్వాత ఎవరో మనకు
తెలియనివారు, మనకు కనిపించనివారు యోగీశ్వరుల వద్దకు వచ్చి సేవ
చేయుచున్నారని అర్థమయినది. ఈ విషయములన్నియూ చెప్పనవసరము
లేదు. అయినా తప్పక చెప్పవలసివచ్చినది. ఎందుకనగా! ఏమీ తెలియని
సుత్తిచంద్రారెడ్డిలాంటివారు శంకరాచార్యుల ప్రక్కన, సిద్ధాంతకర్తల ప్రక్కన
ఫోటోపెట్టుకొన్నాడు. వారి ప్రక్కన ఉండేదానికి ఈయన అర్హుడా? అన్నారు
కదా! వారి ప్రక్కన ఈయన ఉండవచ్చునో లేదో, ఈయన ప్రక్కన వారు
ఉండవచ్చునో లేదో ఎవరు అర్హులో, ఎవరు అర్హులు కాదో మీరే నిర్ణయించు
కొనుటకు ఈ విషయములను చెప్పుచున్నాను. నేను చెప్పేది సత్యము
కావచ్చును, అసత్యము కావచ్చును. నా మాటలటుంచి వీరబ్రహ్మముగారు
తన కాలజ్ఞానములో వ్రాసిన వ్రాతను ఇప్పుడు చూస్తాము. "మహా
దేవతలందరూ ఆనందాశ్రమము వద్దనే యున్నారు" స్వయానా వీరబ్రహ్మము
గారు చెప్పినమాటను కాదనలేము కదా! దేవతలు మనకంటికి కనిపించరు.
మహాదేవతలంటే దేవతలకంటే గొప్ప దేవతలని అర్థము కదా!
అటువంటప్పుడు ఈ మాటనుబట్టి యోగీశ్వరులు ముందు వచ్చిన
సిద్ధాంతకర్తలకంటే గొప్పవాడో తక్కువవాడో మీరే యోచించుకోండి.
బ్రహ్మముగారి కాలజ్ఞాన వాక్యములలో "బ్రహ్మాది దేవతలలోనూ
ఆనందాశ్రయులు ఆదిమూర్తి. శాస్త్రము మీకు వివరముగా ఆనతిచ్చారు.
ఆయన వల్లనే మేము శాస్త్రము విన్నాము". ఈ వాక్యమునుబట్టి దేవతలందరి
లోనూ గొప్ప అయిన ఆదిమూర్తియని యోగీశ్వరుల వారిని ఆనందాశ్రయు
లనుచూ చెప్పారు. అంతేకాక "ప్రబోధాశ్రమము వారి ఆదిగుణ మెల్ల
శయనాధిపతికి ఉన్నది." అను ఈ కాలజ్ఞాన వాక్యములో కూడా
ప్రబోధానంద యోగీశ్వరులు విష్ణువాంశగల వాడనీ, అందువలననే
ఆదిమూర్తియని అన్నారనీ తెలియుచున్నది. ఇవన్నియూ చూచిన తర్వాత
బ్రహ్మముగారి వాక్యములను సాక్ష్యముగా చూచిన తర్వాత యోగీశ్వరుల
వద్దకు దేవతలు రారని ఎలా చెప్పగలము? ఈ విషయములన్నియూ దైవ
రహస్యములు. దీర్ఘముగా ఆలోచించవలసియున్నది. తొందరపాటు
నిర్ణయాలు పనికి రావు. అందువలన బాగా ఆలోచించమని తెలుపు
చున్నాము.
ఇదంతయూ చూచిన తర్వాత బ్రహ్మముగారి కాలజ్ఞానములో
మరియొక విచిత్రమయిన వాక్యము బయటపడినది. అందులో భూమిమీద
దేవతలు వచ్చి పుట్టియున్నా వారు ఎవరయినది వారికి జ్ఞాపకము రాకుండా
దేవుడే మాయ చేసినట్లు కలదు. చూడండి. “కారణార్థము కొరకు మేము
అవతరించినాము. మా సహవాసులయిన పురుషులు అవతరించినారు.
అందరము ఈ భూలోకములోనే యున్నాము. అయినా వారివారి
స్వరూపములు వారికి తెలియకుండా మాయ చేసివేసినాము. మర్మముగా
యుండునట్లు చేసినాము". ఈ వాక్యములో మాయగా మర్మముగా మనకు
తెలియకుండా కొందరు దేవతలు మానవ శరీరములో యున్నారని
తెలియుచున్నది. మనకు తెలియకుండా ఉండడమే కాదు ఆ విషయము
వారికి కూడా తెలియదనియే చెప్పారు. వారికి అప్పజెప్పిన పనిని మాత్రము
వారు చేయునట్లు దేవతలను సహితము నియమించిన వారు ఇంకొకరున్నా
రని తెలియుచున్నది. వారు ఎవరు? అని ఆలోచిస్తే “కారణార్ధము మేము
అవతరించాము” అని అనడములో ఏమి కారణముండును అని ఆలోచిస్తే
జ్ఞానమును బయట ప్రజలకు తెలియజేయడమే ముఖ్యకారణముగా
కనిపించుచున్నది.
బ్రహ్మవిద్యయిన అసలు జ్ఞానమును తెలియజేయడమే ముఖ్య
కారణముగా యుండుట వలన మధ్యాత్మ శరీరమును ధరించి కనిపించక
జ్ఞానమును బోధించుచున్నదని అర్థమగుచున్నది. ముగ్గురు సిద్ధాంతకర్తలు
వచ్చి బోధించిన బోధలలో శాస్త్రబోధలు లేకపోవడము వలన సృష్ట్యాదినుండి
చెప్పిన బోధకు సిద్ధాంతకర్తల వలన ఆటంకము ఏర్పడుట వలన, తాను
వద్దనీ, మాయయనీ చెప్పిన వేదములను సిద్ధాంతకర్తలు ముగ్గురూ గొప్పగా
చెప్పడము వలన అసలయిన ఆదిమూర్తి మానవ శరీరములో ఆత్మగా యుండి
పలికి మాట్లాడి బోధలు చెప్పవలసి వచ్చినది. అలా చెప్పినదే త్రైత
సిద్ధాంతమని చెప్పుకొన్నాము. త్రైత సిద్ధాంతము ఆదిలో చెప్పబడిన
సిద్ధాంతము అయినా అది కలియుగములో ఇంతకాలము తెలియకపోవడము
వలన, త్రైత సిద్ధాంతము కాని అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతమను సిద్ధాంతములు
బయటికి రావడముతో అవి అసలయిన సిద్ధాంతములు కావు. ఇదే నిజమైన
సిద్ధాంతమని తెలియచెప్పుటకు రావడమే ముఖ్యకారణార్థము అని
చెప్పవచ్చును. అలా వచ్చినవానికి నేను ఫలానా అని తెలిసినా, ఆయన
వెంట ఆయన కార్యములో సహకరించుటకు వచ్చిన సహచరులకు మాత్రము
తాము ఎవరయినది తెలియకుండా చేయబడినది. వచ్చిన వారు ఎవరో
వారికే తెలియనంత మాయ ఉండగా సామాన్య మనుషులయిన మనము
ఎవరిని గుర్తించగలము, గుర్తించలేము.
ప్రశ్న :- రెండు ప్రశ్నల క్రిందట ప్రబోధానందయోగీశ్వరుల కులమును
గురించి అడిగిన ప్రశ్న వచ్చినది. అప్పుడు మీరు చెప్పిన జవాబులో నాకు
‘గుత్రము’ కలదుగానీ, కులము లేదు. ఆత్మగాయున్న యోగీశ్వరుల వారికి
'గుత్రము లేదు, కులము అంతకూ లేదు' అని చెప్పారు. అక్కడ మీకు
కులము లేదని అనడము అర్థమయినది కానీ, గుత్రము కలదని చెప్పారు.
అట్లే యోగీశ్వరుల వారికి గుత్రము కూడా లేదని చెప్పారు. జీవుడైన
మీకున్నది, యోగీశ్వరులవారికి లేనిది అయిన “గుత్రము” అంటే ఏమిటో
తెలుపవలెనని కోరుచున్నాము?
జవాబు :- “గు” అనగా గుణములనీ, “త్ర” అనగా మూడు అని అర్థము.
జీవుడుగాయున్న నేను గుణచక్రములోనే యున్నాను. గుణచక్రములో
తామస, రాజస, సాత్త్విక అను మూడు గుణ భాగములు కలవు. నేను
మూడు గుణభాగములలో యుండుట వలన గుత్రములో యున్నానని
చెప్పాను. సహజముగా ప్రతి శరీరములోని జీవుడు మూడు గుణముల
యందే ఉండును. ఇకపోతే శరీరమునకు అధిపతి అయిన ఆత్మ గుణముల
బయట ఉండును. గుణముల బయట గుణములకు ఆధారముగా యున్న
బ్రహ్మనాడిలో మధ్యాత్మ నివాసమని చెప్పవచ్చును. ఆత్మయిన వానికి
గుణములు లేవు కావున ఆయనకు 'గుత్రము లేదు' అని అన్నాము. నాకు
గుణములున్నవి కావున 'గుత్రముకలదని' చెప్పాము. గుణము ఉంటే
కులము తప్పక ఉండునని చెప్పలేము. గుణములేని వానికి బయట కులము
కూడా ఉండదు. కులము బయట ప్రజల లెక్కలోనిది. జ్ఞానము తెలియని
జీవునికి బయట కులము ఉండును. జ్ఞానమున్న వానికి బయట కులము
కూడా ఉండదు. నాకు కొంతవరకు జ్ఞానము తెలియుట వలన
'గుణములున్నవి గానీ, కులము లేదని' చెప్పాను. దానినే 'గుత్రము
కలదుగానీ కులము లేదు' అని చెప్పాను. శరీరములో మధ్యాత్మ అయిన
వాడు గుణములలోయుండక గుణముల బయట నివాసముండుట వలన
ఆయనకు గుత్రము కూడా లేదని, కులము అంతకూ లేదని చెప్పాము.
సాధారణ మనిషి అయిన వాని శరీరములో జీవుడు అయినవాడు
ప్రతి ఒక్కడు గుణచక్రమున నివాసముండుట వలన గతములో అద్వైత,
ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతకర్తలయిన ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు,
రామానుజాచార్యులు ముగ్గురు గుణములలోయున్న వారేనని చెప్పవచ్చును.
గుణచక్రములోని జీవుని చిత్రమును తర్వాత పేజీ చిత్రపటములో
చూడవచ్చును.
బ్రహ్మనాడి,
సాత్విక గుణభాగము,
రాజస గుణభాగము,
తామస గుణభాగములో 'జీవుడు',
గుణచక్రము 288 చిత్రమును పేజీ లో చూడండి.
పై పటములో యున్నట్లు అందరి గుణచక్రములో మూడు గుణ
భాగములుండగా, ఆ మూడు భాగములలో ఏదో ఒక గుణభాగములో
జీవుడు ఉండడము ప్రతి శరీరములో జరుగుచున్నది. కొందరు జీవుళ్ళు
సాత్విక భాగములో ఉండగా, కొందరు రాజసములో, కొందరు తామసములో
ఉండడము జరుగుచున్నది. మూడు గుణ భాగములకు మధ్యలో బ్రహ్మనాడి
గలదు. బ్రహ్మనాడిలో మధ్యాత్మ నివాసముండును. జీవాత్మ గుణచక్రమందు
ఉండగా, మధ్యాత్మ బ్రహ్మనాడియందుండి శరీరమంతా వ్యాపించియుండగా,
పరమాత్మయను దేవుడు (యెహోవా, లేక అల్లాహ్) శరీరమంతటా, లోపల
బయటా అణువణువునా వ్యాపించియుండును.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. పూర్వము మూడు
గుణములను కలిపి 'గుణత్రయము' అని చెప్పెడివారు. అదే పదమునే
గుణకు బదులు “గు”ను త్రయముకు బదులు "త్ర" అను రెండు అక్షరములను
'గుత్ర' అని చెప్పెడివారు. గుణ త్రయము లోని మొదటి రెండు అక్షరములను
తీసుకొని, ‘గుత్ర’ అని చెప్పడము వలన మూడు గుణములని పూర్తి తెలిసి
పోవును. గుత్ర అను రెండు పొడి అక్షరములలో మూడు గుణములని
తెలిసిపోయెడిది. ఇంతకుముందు మనము చెప్పుకొన్నట్లు తాటిపత్రి
పోయి తాడిపత్రిగా ఎలా మారిపోయినదో అలాగే కాలక్రమమున “గుత్ర”
అను పదము పోయి “గోత్ర” అను పదముగా మారిపోయినది. పూర్వము
'గుత్రము’ అనుమాటను ప్రజలు నేడు 'గోత్రము' అను మాటగా మార్చి
చెప్పుచున్నారు. ప్రతి మనిషికి బయట కులమున్నట్లే లోపల గుణము
ఉండును. శరీరములో జీవుడు గుణచక్రములో ఉండే భాగమును బట్టి
వానికి ఆ పేరు ఆధ్యాత్మికములో చెప్పబడెడిది. తామస భాగములోయున్న
వానిని తామసుడు అని అనెడివారు. రాజస భాగములో యున్నవానిని
రాజసుడు అని అనెడివారు. అట్లే సాత్వికములో యున్నవానిని సాత్వికుడు
అని అనెడివారు.
పూర్వము ఒక దేవాలయము వద్దకు పోయి గుడిలోని దేవుని
ముందర పూజ చేయించుకొనేటప్పుడు పూజ చేయువాడు ఫలానా వాడు
అని చెప్పి పూజ చేయడము అర్చకులకు అలవాటైపోయినది. ఆ విధముగా
పూజచేయునప్పుడు పూజచేయువాని పేరు కులము, గోత్రము అడిగి పూజ
చేయడము చూస్తున్నాము. పూర్వము ఇప్పుడు చెప్పు గోత్రమును అప్పుడు
గుత్రముగా చెప్పెడివారని తెలుసుకొన్నాము కదా! దానిప్రకారము పూజ
సమయములో పూజ చేయువాని గుర్తింపుకు పూర్వము పూజలో పూజ
చేయువాని బయట కులము, బయట పేరు చెప్పి శరీరములోపల గుణము
పేరు చెప్పెడివారు. అప్పుడు రాజసములోయున్న వానిని రాజస గోత్రస్య
అనియు మిగతా గుణములలో యున్నవానిని సాత్విక గోత్రస్య, తామస
గోత్రస్య అని చెప్పెడివారు. అట్లు మనుజులకు మూడే గోత్రములుండేవి.
ఈ కాలములో గుత్రము గోత్రమయినదేకాక, మనిషి అజ్ఞానముగా
మారిపోయి జ్ఞానమును అనుసరించి చెప్పిన గోత్రము (గుత్రము) అనేక
రకములుగా మారిపోయినది. అజ్ఞానమును అభివృద్ధి చేయు నిమిత్తము
మనిషి మూడు (3) గోత్రములను వదలి దాదాపు 108 గోత్రముల పేర్లు
చెప్పుకోవడము జరుగుచున్నది. పూర్వము మన సంస్కృతి ఏమిటి? మనము
ఎటువంటి జ్ఞానము కల్గియుండెడి వారమను మాటను పూర్తిగా మరచి
పోయారు. జ్ఞానమునుండి మనిషి అజ్ఞానముగా మారిపోయినట్లు మనిషి
గుత్రము నుండి గోత్రములోనికి మారిపోయాడు.
ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారము మూడు గుణములకు ఆధారము
బ్రహ్మనాడి. బ్రాహ్మనాడిని అనుసరించి గుణములుండును. బ్రహ్మనాడిలోని
ఆత్మను అనుసరించి గుణములుండును. ఆత్మ గుణముల బయటయుండి
గుణముల చేత గుణముల మధ్యలోయున్న జీవుని కర్మ ప్రకారము పనిని
చేయించుచుండును. ఆధ్యాత్మిక పరిభాషలో గుణములను 'వేదాలు' అని
అనడము జరిగినది. బ్రహ్మవిద్యలో శాస్త్రమైన భగవద్గీతలో "త్రైగుణ్యా
విషయావేదా” అని చెప్పడమైనది. దీని భావము ప్రకారము మూడు గుణ
విషయములే, లేక మూడు గుణ భావములే వేదములని చెప్పబడినది.
ఆత్మ శరీరములో మధ్యన బ్రహ్మనాడిలోయుండి మరణములో శరీరమును
వదలి జననములో వేరు శరీరమును చేరునప్పుడు ఆత్మ వెంటనే
గుణచక్రమూ దానితోపాటు గుణములన్నియూ పోవుచుండును. ఆత్మ
ఎక్కడికి పోతే ఆత్మ వెంటనే పోవు గుణములను వేదములన్నాము.
వేదములను సృష్ట్యాదిలో మనిషితో పాటు సృష్టించబడినాయి. అందువలన
వాటిని ఆదివేదాలు అనడమైనది. ఈ గుణముల విషయమును, ఆత్మవెంట
గుణములు పోవు విషయమును, మనుషులు అందరూ గుణములలో
ఉండు విషయమును ఏష్య కాలజ్ఞాన మందు ఈ విధముగా ప్రస్తావించడము
జరిగినది. ఆ వాక్యములను ఇక్కడ చూస్తాము.
"ఆది వేదములన్నియు ఆనందాశ్రమము వెంటనే వచ్చేను. మీకు
మాకు అదే గోత్రము" అని అన్నాడు. బ్రహ్మముగారి ఈ మాటలో
సృష్ట్యాదినుండి యున్న గుణములను ఆదివేదములని చెప్పాడు. మధ్యాత్మ
ఎక్కడికిపోతే అక్కడికి పోవు గుణములను "ఆది వేదములన్నియు
ఆనందాశ్రమము వెంట వచ్చేను" అని చెప్పారు. మనుషులందరూ గుణముల
లోనే యున్నారు, కనుక మాకు మీకు అదే గోత్రము అని చెప్పారు. ఈ
విధముగా శరీరములోని ఆత్మజ్ఞానమును బ్రహ్మముగారు బయలుపరచారు.
ప్రశ్న :- అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములను ప్రకటించిన శంకరా
చార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులు వారిని గురించి ముందస్తు
భవిష్యత్తును ఎవరూ చెప్పలేదు. అలా ముందస్తుగా రాబోవు వానిని గురించి
చెప్పినది ముగ్గురే కలరు. ఆ ముగ్గురిలో ఒకరు శ్రీకృష్ణుడు, రెండవ వాడు
ఏసు. మూడవ వాడు ప్రబోధానంద యోగీశ్వరులు. అయితే చరిత్రలో
ముందే వ్రాసియుంచబడిన వారు ఇద్దరుకాగా ఒక కృష్ణుడు మాత్రము
ధర్మసంస్థాపన నిమిత్తము రాగలడని నోటిమాటగా చెప్పాడు. ఆ మాట
ఎక్కడా వ్రాయబడలేదు కావున కృష్ణుని గురించి ముందస్తుగా చెప్పిన
విషయము ఎవరికీ తెలియదు. ఏసు రాకను గురించి, ఆయన జీవితములో
జరుగు కొన్ని సంఘటనలను గురించి కొన్ని వందల సంవత్సరముల పూర్వమే
‘యెషయా' అను ప్రవక్త, వీరబ్రహ్మముగారు ప్రబోధాశ్రమము గురించి,
ప్రబోధానంద యోగీశ్వరుల వారి గురించి దాదాపు నాలుగు వందల
సంవత్సరముల ముందే భవిష్యవాణి వ్రాసినట్లు వ్రాసియుంచారు. యెషయా
కొన్ని వందల సంవత్సరముల పూర్వము ఏసును గురించి ముందే వ్రాయగా
అదే విధానము ప్రకారము యోగీశ్వరుల గురించి వ్రాశారు. వారు వ్రాసినట్లే
అన్ని విషయములు జరుగుచూ వచ్చాయి.
ఏసు జీవితములోని ముఖ్యమైన సంఘటనలు యెషయా ప్రవక్త
ద్వారా వ్రాసిపెట్టగా అట్లే జరుగడము అందరికీ తెలిసిన విషయమే. ఏసు
బోధల వలన నేడు ప్రపంచములోనే అతి పెద్ద జనాభా ఆయన జ్ఞానమునే
అనుసరిస్తున్నాయి. అది ఆయన జీవిత ప్రత్యేకత అనుకొందాము. అయితే
ప్రబోధానంద యోగీశ్వరుల జీవితములో ఏదయినా ప్రత్యేకత కలదా?
ఉంటే అది ఏదో చెప్పమని అడుగుచున్నాము?
జవాబు :- ప్రబోధానంద యోగీశ్వరుల జీవితములో ముందస్తుగా వ్రాసినది
ఆయన జ్ఞానము గురించే కలదు. యోగీశ్వరులు చెప్పు బోధలు అన్నియు
ప్రత్యేకముగా ఉంటాయి. ఇంతకుముందు ఎవరయినా చెప్పిన బోధలుగానీ,
వ్రాసిన జ్ఞానమునుగానీ ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పడముగానీ,
వ్రాయడముగానీ జరుగలేదు. ఆయన చెప్పు జ్ఞానమంతయూ సరిక్రొత్తగా
యుండును. ముఖ్యముగా గతములో వచ్చిన ముగ్గురు సిద్ధాంతకర్తలు
వేదములను అభ్యసించి వైదిక జ్ఞానమును బయటికి చెప్పగా, యోగీశ్వరులు
వేదాలను విసర్జించమనీ, వాటివలన దైవజ్ఞానము తెలియదనీ చెప్పాడు.
భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయమున భగవంతుడు
చెప్పిన రెండు శ్లోకములతో ధర్మములను, అధర్మములను తేల్చి చెప్పాడు.
అక్కడ వ్రాసిన “యజ్ఞముల వలన, దానముల వలన, వేదపఠనము
వలన, తపస్సులు చేయుట వలన దేవుడు తెలియబడడు” అని చెప్పు
చుండును. ఈ నాలుగు కార్యములు నాలుగు అధర్మములని చెప్పారు.
అంతేకాక బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు మూడు ధర్మములని చెప్పు
చుండును. అందరూ చేయు సాధనలను విసర్జించి జ్ఞాన సముపార్జనే
మనిషికి ముఖ్యమని చెప్పి సాధనలన్నిటిని వదలమని చెప్పుచుండును.
ఈ విధముగా యోగీశ్వరులు తన బోధనలో ఎంతో ప్రత్యేకతను
చూపడమేకాక, జ్ఞానమునంతటినీ క్రొత్త పంథాలో చెప్పడమేకాక అట్లు
ఆచరించడము వలననే ముక్తి లభించునని చెప్పును. దైవజ్ఞానమంతయూ
శరీరములోపలే యున్నదనీ, శరీరము బయట ఎంత ప్రయత్నించినా,
శరీరము బయట జ్ఞానమును ఎంత ఆచరించినా ప్రయోజనములేదనీ
శరీరములోనే జ్ఞానమును సాధించవలెననీ చెప్పుచుండును. తన జ్ఞానము
ప్రత్యేకమయినదని, వేదములను కాదని బోధించడము వలన ఆయనది
ప్రత్యేక జ్ఞానమయినది.
ప్రబోధానంద యోగీశ్వరుల బోధలో గతములో ముగ్గురు సిద్ధాంత
కర్తలు చెప్పినట్లు వేదముల ప్రసక్తి ఏమాత్రము ఉండదు. వేదములను
వ్యాసుడు వ్రాయడము వలన వేదములకు ప్రజలలో గౌరవము ఏర్పడినది.
ప్రజలలో అంటే ప్రజలందరికీ కాదు సాధారణ ప్రజలకు. వ్యాసుడు
అంటే ఎవరయినది కూడా తెలియదు. భారతదేశములో రెండువందల
సంవత్సరముల క్రిందట వరకు ప్రజలలో కేవలము పదిశాతము మాత్రమే
చదువు వచ్చిన వారుండెడివారు. ఇప్పటివలె ప్రభుత్వ పాఠశాలలుగానీ,
ప్రైవేటు పాఠశాలలుగానీ ఉండేవి కావు. నేను చిన్నప్పుడు నాలుగు ఊర్లకు
కలిపి ఒక ప్రాథమిక పాఠశాల కూడా ఉండేది కాదు. హైస్కూల్లు పెద్ద
ఊర్లలో మాత్రము ఉండేది. చిన్నచిన్న పల్లెలలో ఏమాత్రము ప్రాథమిక
పాఠశాలలు లేవు. చదువు వచ్చినవారు అరుదుగా కనిపించేవారు.
చిన్నచిన్న పల్లెలలోని వారు ఊరంతా కలిసి ఒక టీచర్ను తమ పిల్లలకు
చదువు చెప్పేదానికి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసుకొనెడివారు. టీచర్లంటే
ఎంతో భయముగా ఉండి చదువు చెప్పించుకొనేవారు. ఈ విధముగా
తెలుగు చదువే సరిగా రాని ఆ కాలములో, సంస్కృతమును బ్రాహ్మణులు
తప్ప ఇతరులు నేర్చేవారు కాదు. అంతో ఇంతో చదువు కూడా బ్రాహ్మణులకే
అబ్బేది. చదువు వచ్చిన వారు కావాలంటే ఆ ఊరిలోని బ్రాహ్మణుల
వద్దకు పోవాలి. అప్పుడు పల్లెటూర్లలో ప్రామిసరి నోట్లు వ్రాయించుకొనే
దానికి పురాణములను చెప్పించుకొనే దానికి ఊరిలోని వారందరూ ఆ
ఊరి బ్రాహ్మణులను ఆశ్రయించెడివారు. రెండు వందల సంవత్సరముల
క్రిందట కేవలము పదిమంది చదువు వచ్చినవారుండగా, చదువు రానివారు
తొంభైమంది ఉండేవారు.
కాలము గడువగా, మెరుగు పడుచూ వచ్చి మేము చిన్న వయస్సులో
యున్నప్పుడు అక్కడక్కడ అరుదుగా పాఠశాలలు ఉండేవి. అప్పటినుండి
అభివృద్ధి చెందుచూ నేడు 90 శాతము మించి చదువు వచ్చినవారు తయారై
నారు. పూర్వము బ్రాహ్మణులకు తప్ప వ్యాసుడు అంటే ఎవరో తెలియదు.
ఇప్పటి కాలములో కూడా చాలామంది ప్రజలకు వ్యాసుడంటే ఎవరో
తెలియదు. బ్రాహ్మణులకు వ్యాసుని విషయము తెలుసు. ఈ మధ్య వేద
పాఠశాలలు కూడా తయారయి ఇతరులు సంస్కృతములో వేదాలు చదువు
చున్నారు. అయినా వేదవిద్యలు బ్రాహ్మణులకే పరిమితియైపోయాయి.
ద్వాపర యుగములో వ్యాసుడు వేదములను గ్రంథములుగా సంస్కృత భాషలో
వ్రాయడమైనది. అంతవరకు వేదములు గ్రంథములుగా లేవని చాలామందికి
తెలియదు. సంస్కృతము లిపిలేని భాషలలో ఒకటిగా యుండేది.
చాలామందికి చదువురాని ఆ కాలములో లిపియున్న భాషలకంటే లిపిలేని
భాషలకే ఆదరణ ఎక్కువగాయుండేది. ఏదయినా వ్రాయవలసి వస్తే హిందీ
భాషలోని లిపిని వాడుకొని సంస్కృత భాషను వ్రాసెడివారు.
ఒక గ్రంథము వ్రాయాలన్నా లేక ఏదయినా విషయము
వ్రాయాలన్నా మనిషికి రెండు భాషలు వచ్చియుండాలి. ఒకటి లిపియున్న
హిందీ చదువు వచ్చి, వ్రాసే స్థోమతయుండాలి. మరొకటి ఏది వ్రాసినా
సంస్కృతములోనే వ్రాయాలను నియమము ఉండుట వలన ప్రతి గ్రంథము
సంస్కృతములోనే వ్రాయబడేది. ఏ గ్రంథమయినా సంస్కృత భాషలో
వ్రాయాలను నియమమునుబట్టి సంస్కృతము రానివారుగానీ, హిందీ లిపి
రానివారుగానీ వ్రాయుటకు వీలు లేకుండా ఆనాటి బ్రాహ్మణులు ఆ
నియమమునుంచారు. సంస్కృతము వచ్చినా తాము తప్ప ఇతరులు
గ్రంథములు వ్రాయకుండా ఉండునట్లు ఆ నియమమును దురుద్దేశ్యముతోనే
ఉంచడమయినది. అట్లుండుట వలన హిందీ చదువును నేర్చుకొన్న వారే
పది శాతము కూడా లేని కాలములో ఎవనికయినా హిందీభాష వ్రాసే
దానికి వచ్చినా సంస్కృతము రాని కారణమున రెండు భాషలు వచ్చిన
బ్రాహ్మణులు తప్ప ఇతరులు గ్రంథములు వ్రాసెడివారు కాదు.
ద్వాపర యుగమున వ్యాసుడు సంస్కృతమునందు పాండిత్యమును
కల్గిన ఏకైక వ్యక్తిగాయుండెను. అందువలన రాజులు సహితము ఆయనను
గౌరవించెడివారు. వ్యాసుడు నాలుగు వేదములను, పదునెనిమిది పురాణము
లను సంస్కృత భాషలో హిందీలిపితో వ్రాశాడు. తర్వాత మహాభారతమును
వ్రాయు సందర్భములో యుద్ధ ప్రారంభ సమయములో ఐదు నిమిషములు
సైన్యములుగల మధ్యలోనికి అర్జునుడు కృష్ణుడు మాట్లాడిన విషయమును
తెలుసుకొనుటకు యుద్ధము ముగిసిపోయిన తర్వాత అర్జునున్ని పిలిచి
అప్పుడు ఏమి మాట్లాడారని అడిగాడు. అర్జునుడు రెండు నిమిషముల
నుండి ఐదారు నిమిషములకు వరకు మాట్లాడిన మాటలను వ్యాసునికి
తెలిపాడు. అప్పుడు వ్యాసుడు ఆ మాటలలోని సారాంశమును గ్రహించిన
వాడై ఏడు వందల శ్లోకములతో భగవద్గీతను వ్రాశాడు. అర్జునుని
ద్వారా విషయము తెలుసుకొన్న తర్వాత ఆ విషయమును స్వయముగా
దేవుడే చెప్పాడని తెలియగలిగాడు. దేవుడు వేదములను గుణములుగా,
గుణ విషయములుగా చెప్పినట్లు, గుణములే మాయగాయున్నవని తెలిసి
తాను అంతకుముందు మాయరూపమైన వేదములను వ్రాసి ప్రజలకిచ్చి
ప్రజలను అజ్ఞానదారి పట్టించానని అనుకొని మిక్కిలి బాధపడినవాడై చేసిన
తప్పుకు పాశ్చాత్తాపపడి, తన తప్పును సవరించుకొని మారిన మనిషిగా
తయారై పాపపరిహారార్థము భగవద్గీతను వ్రాయదలచి వ్రాయడమైనది.
భారతములో ఒక భాగమైన భగవద్గీతను శ్రద్ధతో ప్రత్యేక గ్రంథముగా
వ్రాశాడు.
వేదములు వ్రాసినందుకు అయన పేరు వేదవ్యాసుడు అని
చెప్పుచున్నారు. ఆ పేరు తనకు లేకుండుటకు వ్యాసుడు భగవద్గీతను
వ్రాసి అందులో వేదములను మూడు గుణ విషయములుగానే చెప్పాడు.
తర్వాత మూడు గుణములనే వేదములుగా వర్ణించి చెప్పాడు. దానితో
వేదములను వ్రాసిన వేదవ్యాసుడే వేదములను మాయ అనియూ, మాయ
ఉన్నంతవరకు దేవుడు తెలియబడడనీ చెప్పుట వలన కొంత సత్యము
బయటికి తెలిసినది. అయినా వ్యాసుడు వేదములను గురించి చెడుగా
చెప్పిన మాటలను పండితులందరూ అణగత్రొక్కివేసి బయటికి తెలియకుండా
చేసి నేటికీ అన్ని శుభకార్యములలో వేదములను చదువుచున్నారు. వేదముల
మాయతో అందరినీ మభ్యపెట్టుచున్నారు.
వేదవ్యాసుడు వేదములను గురించి దేవుడు చెప్పిన భగవద్గీతను
చూచువరకు వేదములు ఆధ్యాత్మికమునకు సరిపోవని ముఖ్యమైన నాలుగు
అధర్మములలో వేదపఠనము ఒక అధర్మమని జీవితము చివరి అంకములో
తెలుసుకోగలిగాడు. శంకరాచార్యులవారు వేదములను ఒకమారు
దేశమంతా ప్రచారము చేసి నాల్గు వేదములకు నాలుగు పీఠములను
స్థాపించిన తర్వాత వేదముల గురించి దేవుడు చెప్పినది వ్యాసుడు వ్రాసినది
చూడగలిగి వేదముల త్యజించాలనుకొన్నారు. వ్యాసుడు జీవితము
చివరిలో వేదములను గురించి తెలుసుకొన్న తర్వాత ముఫ్పై సంవత్సరములు
బ్రతుకగలిగాడు. శంకరుడు చిన్నవయస్సులో వేదముల గురించి తెలుసు
కొన్న తర్వాత మూడు సంవత్సరములే బ్రతుకగలిగాడు. అయితే
ప్రబోధానంద యోగీశ్వరుల వారు తన ఆధ్యాత్మిక జీవిత ప్రారంభములోనే
వేదములను వ్యతిరేఖించిచూ వస్తున్నాడు. ముగ్గురు సిద్ధాంతకర్తలు
వేదములను ఆధారము చేసుకొని తమ సిద్ధాంతములను చెప్పగా,
ప్రబోధానంద యోగీశ్వరులు వేదములకు వ్యతిరేఖముగా తన సిద్ధాంతమును
చెప్పెను. తనబోధ భగవద్గీతకు అనుకూలముగా వేదములకు వ్యతిరేఖముగా
యుండెను. ప్రబోధానంద యోగీశ్వరులు జ్ఞానము చాలా ప్రత్యేకత కల్గి
ఎవరి బోధతో సంబంధము లేనిదై ఒక్క భగవద్గీతకు దగ్గరగా మిగతా
గ్రంథములకు దూరముగాయుండెను. ఆయన జీవితములో ఆయన జ్ఞానమే
ఒక ప్రత్యేకతయని చెప్పవచ్చును.
ప్రశ్న :- ప్రబోధానంద స్వామిగారి యొక్క అనేక విషయములను ముందు
గానే వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో చెప్పియున్నారు కదా! అట్లే
ప్రబోధానంద గారు చెప్పు బోధల ప్రత్యేకతను గురించి ముందే ఏమయినా
చెప్పగలిగారా?
జవాబు :- ఎన్నో విషయములను చెప్పిన బ్రహ్మముగారు ముఖ్యమైన జ్ఞాన
విషయమును గురించి చెప్పకుండునా? అంతకుముందు ముగ్గురు
సిద్దాంతకర్తలు చెప్పినది వేదములలోని బోధలనే ఎక్కువగా చెప్పి, వేద
పఠనమునే ఎక్కువగా చేశారు. ప్రబోధానంద బోధలు వేదములకు
సంబంధము లేనివై యుండుట వలన, ప్రత్యేక శక్తిగల బోధలయివుండుట
వలన ఈ బోధలకు ప్రత్యేకమయిన పేరును బ్రహ్మముగారు పెట్టారు.
దానినే తన కాలజ్ఞానములో “సాంద్రసింధు వేదము” అని పేరు పెట్టారు.
తన కాలజ్ఞానములో ఒకచోట "సాంద్రసింధూవేదానికి ఆనందాశ్రమము
కర్త రావలెను" అని ఉన్నది. సాంద్రసింధూ వేదమును చెప్పిన కర్త
ప్రబోధానంద యోగీశ్వరులని దీనివలన తెలియుచున్నది. అక్కడనే
మరియొక మాట కూడా కలదు. "వేదముల కెల్ల సాంద్రసింధూ వేదమే
ఆది వేదము” అని కూడా కలదు. మనుషులకు ఆదివేదము మొదటినుండి
యున్న గుణములయితే, వేదములకే ఆదివేదము సాంద్రసింధూ వేదమే
అని చెప్పబడినది. వేదములకెల్ల ఆదివేదము అనగా 'వేదములకంటే ముందు
పుట్టినది' అని అర్థము. సాంద్రసింధూ వేదము అను వాక్యములో వేదము
అనగా 'మాయ' అని అర్ధము. సింధూ అనగా 'ఎదురు శక్తి' అని అర్థము.
సాంద్ర అనగా 'ఎక్కువ సాంద్రత కల్గిన', 'ఎక్కువ బలము కల్గిన' అని
అర్థము. ఎక్కువ శక్తితో వేదములను ఎదురించునది సాంద్ర సింధూవేదము.
మాయను ఎక్కువ వ్యతిరేఖ శక్తితో ఎదురించు దానిని సాంద్రసింధూ వేదము
అంటారు. ప్రబోధానంద బోధించు బోధలు ప్రతి ఒక్కటి మాయకు
వ్యతిరేఖముగా యున్నవే కావున ఆయన జ్ఞానమును 'సాంద్రసింధూ వేదము'
అని అన్నారు.
ప్రశ్న :- సాంద్రసింధూ వేదము అనుమాటను ఎక్కడా వినలేదు. ప్రతి
వేదము బ్రాహ్మణులకు తెలుసు. అయితే సాంద్రసింధూ వేదమును గురించి
బ్రాహ్మణులు కూడా ఎక్కడా చెప్పలేదు. ఈ వేదమును గురించి ప్రజలకు
గానీ, బ్రాహ్మణులకు గానీ తెలియదా?
జవాబు :- సాంద్రసింధూ వేదము అనగా స్వచ్ఛమయిన జ్ఞానము. సాంద్ర
సింధూవేదమనగా! గుణములతో కూడుకొన్న మాయకు వ్యతిరేఖమయినది.
సాంద్ర సింధూవేదమనగా కర్మలను కాల్చు జ్ఞానశక్తియను అగ్నిగుండము.
సాంద్ర సింధువేదము అనగా బ్రాహ్మణులకు మొదలుకొని చతుర్ముఖ
బ్రహ్మవరకు ఎవరికీ తెలియనిది. సాంద్రసింధూ వేదమనగా సృష్ట్యాదిలోని
జ్ఞానముతో ముడిపడినది. సాంద్రసింధూ వేదమనగా కలియుగములో
యున్న మూడు మతములతో ముడిపడియున్న ఏకైక జ్ఞానము. అటువంటి
సాంద్రసింధూ వేదము ప్రతి మనిషికి క్రొత్తదే, బ్రాహ్మణులందరికీ క్రొత్తదే.
సాంద్రసింధూ వేదమును గురించి బ్రహ్మముగారు కాలజ్ఞానములో
ఇలా అంటున్నారు చూడండి. "బ్రాహ్మణులకు సాంద్రసింధూ రహస్యము
ఇచ్చేది లేదు" ఈ వాక్యమునుబట్టి సంస్కృత పాండిత్యముగల బ్రాహ్మణులకు
కూడా సాంద్రసింధూ వేద రహస్యములు తెలియవని చెప్పడమైనది.
మరియొకచోట ఇదే మాటనే చెప్పుచూ ఇలా వ్రాసియుంచాడు. “ఈ
సాంద్రసింధూవేదములోని మాటలు బ్రహ్మకున్ను తెలియవు" అనియున్నది.
ఇక్కడ బ్రహ్మ అనగా త్రిమూర్తులలోని చతుర్ముఖ బ్రహ్మయని తెలియవలెను.
ఈ వాక్యమునుబట్టి సాంద్రసింధూ వేదములోని జ్ఞానము దేవతలకు కూడా
తెలియని రహస్యముగా యున్నదని చెప్పకనే తెలియుచున్నది. ప్రబోధానంద
యోగీశ్వరులను చూస్తే అతని శరీరమే కనిపించును. అందరివలె సర్వ
సాధారణముగాయున్న ఆయన శరీరము పైకి కనిపించినా, ఆయన
శరీరములోని ఆత్మ బోధించిన జ్ఞానము ఎవరికీ తెలియనిది, దానిని
గ్రహించుట సామాన్యమైన పనికాదు. సాధారణ మనిషిలో కనిపించని
జ్ఞానము అంతగొప్పగాయున్నదని ఎవరూ తెలియలేరు. ఎంతో గొప్ప
రహస్యమైన సాంద్రసింధూ వేద జ్ఞానమును అందించిన ప్రబోధానంద
యోగీశ్వరులను పోతులూరి వీరబ్రహ్మముగారు 'నాకును గురువే' అని
చెప్పాడు. అంతేకాక 'మీ అందరికీ గురువే' అని కూడా చెప్పాడు. ఆయన
ఎంతో గ్రహించుకొనియుంటేనే ఆ మాట చెప్పియుండును. ఈ విషయము
లన్నియూ చూచిన తర్వాత “యోగీశ్వరుల జ్ఞానమును తెలిసిన వాడు
ధన్యుడు” అని చెప్పవచ్చును. ఆయన భూమిమీద ప్రత్యక్షముగా యున్న
కాలములో కూడా ఆయన జ్ఞానమును గుర్తించలేని వారిది దురదృష్టమేయని
చెప్పవచ్చును.
ప్రశ్న :– మీరు త్రైత సిద్ధాంతకర్తయిన ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానమును
గొప్పగా చెప్పుచున్నారు. ఆయన జ్ఞానమును తెలుసుకొనవలెనని ఆయన
వద్దకు పోయి, ముఖ్యమైన భక్తులుగా మెలిగి కొన్ని సంవత్సరముల తర్వాత
యోగీశ్వరుల వద్దకు పోకుండా మానుకొన్నవారు గలరు. ఎంతో భక్తిగా
పోయినవారు కొంత కాలానికి అక్కడికి పోకుండా మానుకోవడములో
అర్థమేమి ఉండును?
జవాబు :- త్రైత సిద్ధాంత ఆదికర్తయిన ప్రబోధానంద యోగీశ్వరులున్న
శరీరములో నేను జీవుడుగాయుండడము నా అదృష్టము. నేను యోగీశ్వరుల
వద్దకు వచ్చే వారిని పోయేవారిని చూస్తూనేయున్నాను. కొందరు భక్తితో
జ్ఞానమును తెలుసుకోవాలని వచ్చి కొంతకాలము యోగీశ్వరుల వారికి
దగ్గర భక్తులుగా యుండి దూరముగా పోయిన వారు చాలామంది కలరు.
నాకు తెలిసి ముగ్గురు నలుగురు అలా పోయినవారు కలరు. వారు పోయిన
విధానమునుబట్టి చూస్తే, అంతదగ్గర భక్తులు ఆయనవద్దకు రాకుండా
పోయారు అంటే యోగీశ్వరుల వారిలోనే ఏదో లోపము ఉన్నదని అనుకొను
అవకాశము కలదు. యోగీశ్వరులు ఎంత గొప్ప జ్ఞానమును చెప్పినా,
దానిని వినిన తర్వాత వారు రాకుండా పోయారు అంటే, వారి లోపల గల
భావమునుబట్టి దేవుడే వారిని దూరము పంపించాడని అర్థము కాగలదు.
దాదాపు ముఫ్పై ఐదు సంవత్సరములప్పుడు యోగీశ్వరులు ఒక
వ్యక్తికి ఎంతో మంచిగా జ్ఞానము చెప్పగా, కొంతకాలము వినిన తర్వాత
అతని అంతరంగమున తాను కూడా గురువు కావలెనను భావము వచ్చినది.
ఆ భావము వచ్చిన వెంటనే రెండు సంవత్సరములనుండి జ్ఞానమంతయూ
తెలుసుకొన్ననూ, ఇక స్వామివారి దగ్గర ఏమి జ్ఞానము మిగిలిలేదు,
ఈయన ఎంత కాలమున్నా ఆయన గురువు కాడు, ఇతరులను గురువు
కానివ్వడు. నేను బయటకు పోయి ఒక ఆశ్రమమును స్థాపించుకొంటే,
మర్యాదకు మర్యాద, డబ్బుకు డబ్బు సంపాదించుకోవచ్చునని అనుకొన్నాడు.
అనుకొన్న వెంటనే ఊరకపోతే తన తప్పే కనిపించును కదా!యని తన
తప్పు కనిపించకుండునట్లు యోగీశ్వరుల మీదనే ఏదోవొక ఆరోపణ చేసి
అక్కడికి రాకుండా పోవడమైనది. అట్లు పోయినవాడు మొదట వీరబ్రహ్మము
గారి ఫోటోను, తర్వాత బ్రహ్మముగారి ప్రతిమను అడ్డము పెట్టుకొని
బ్రహ్మముగారి శిష్యుడిననో, భక్తుడననో చెప్పుకొంటూ ప్రతి సంవత్సరము
బ్రహ్మముగారి ఆరాధన చేయుచూ దానికొరకు అందరివద్ద చందాలు
వసూలు చేయడమే పనిగా పెట్టుకొని భక్తిని వ్యాపారముగా మలచుకొని
డబ్బు సంపాదించను మొదలుపెట్టాడు.
బయటికి పోయి డబ్బు సంపాదించే వ్యాపారమును పెట్టుకొని
యోగీశ్వరులు ఎప్పుడూ చేయని పనులు చేయుచూ కొందరి ప్రజల దృష్ఠిలో
గురువుగా మెలగువాడు ఒకడుండగా! మరియొకడు యోగీశ్వరుల వారివద్ద
ముఖ్యమైన భక్తుడుగా మెలగుచూ కొంత జ్ఞానమును సంపాదించుకొన్నాడు.
యోగీశ్వరుల వారు ఎప్పుడుగానీ బయటికిపోయి జ్ఞానమును చెప్పరు.
దానిని ఆసరాగా తీసుకొని యోగీశ్వరుల వారి జ్ఞానమును బయటికి పోయి
ప్రచారము చేస్తానని ప్రతి దినము ఒక ఊరు తిరిగి జ్ఞానమును ఉపన్యాస
ములుగా చెప్పను మొదలుపెట్టాడు. అప్పుడు ప్రజలు అతనివద్ద జ్ఞానమును
వినేదానికి చాలామంది అలవాటు పడినారు. దానితో అతనిని గురువుకంటే
గొప్పగా గౌరవించడము, డబ్బులు ఇవ్వడము, గుడ్డలు ఇవ్వడము చేయను
మొదలు పెట్టారు. "పీతలు తినేదానికి అలవాటు పడిన నక్క వరిచేలు
దారిపట్టిందన్నట్లు” అదే మంచిగా కనిపించడముతో యోగీశ్వరులకు
తెలియకుండా ప్రజలవద్ద డబ్బును తీసుకోవడము దగ్గరనుండి బంగారు
కానుకలు తీసుకొనే వరకు ఎదిగిపోయాడు. తనకు ఆర్థిక లోటులున్నాయని
కొందరితో, ఆరోగ్యలోపమున్నదని దానికి డబ్బు అవసరమని కొందరితో
చెప్పి దానిసాకుతో డబ్బులు లాగను మొదలుపెట్టాడు. యోగీశ్వరుల
వారు ఎప్పుడూ ఆ పనులు చేయలేదు. ఇట్లు అనేక విధముల రుచిమరిగి
దాని మాయలో యోగీశ్వరులకు తెలియని పనులు కూడా యోగీశ్వరులు
చెప్పారని కొందరిని నమ్మించి, తన ఇష్టమొచ్చినట్లు నడిపేవాడు.
యోగీశ్వరులు ఆశ్రమములోనే గురువు. ఆయన బయటికి రాడు, ఆరోగ్యము
అనుకూలించదు కాబట్టి ఎప్పటికీ ఆయన బయటికి రాడు. అందువలన
బయట ఊర్లన్నింటికీ నేనే గురువును అన్నట్లు నడుచుకొన్నాడు.
ప్రజలు కూడా విచక్షణ లేకుండా ప్రవర్తించారు. యోగీశ్వరుల
జ్ఞానమునే కదా ఇతను చెప్పేది! అని అనుకోకుండా యోగీశ్వరులకంటే
గొప్పగా అతనిని చూడడము, ఎక్కడికి పోయినా ప్రత్యేక మర్యాదలు
చేయడము అన్నీ జరిగేవి. ముఫ్పై ఐదు సంవత్సరముల క్రిందట బయటికి
పోయి భక్తి ముసుగులో ఒకడు సంపాదనలో పడిపోగా, ఇతను బయటికి
పోకుండా అనుకూలముగా యున్నట్లు అలా మొత్తము అందరినీ తనవైపు
అలవాటు చేసుకొని తానే గురువుగా చలామణి కావాలని చూచాడు.
యోగీశ్వరులు ఇదంతా ఏమి తెలియనట్లున్నా చివరకు దేవుడు అతనిని
యోగీశ్వరులకు దూరము చేశాడు.
అయినా యోగీశ్వరులు ఇదంతా
వారి అజ్ఞానము అని ఊరకయున్నాడు. అంతేకాక “ఎవరు ఎట్లు పోయినా
నేను ప్రజలకు త్రైత సిద్ధాంతమును అందించే దానికి వచ్చాను. త్రైత
సిద్ధాంత ఆదికర్తగా నా పనిని నేను చేస్తాను" అని అన్నాడు. అంతేకాక
"డబ్బు విషయమును కర్మ నిర్ణయిస్తుంది. ఏమి రావాలో, ఏమి పోవాలో
అదే జరుగుతుంది. అది తెలియక అజ్ఞానములో పడిన మనిషి తన
తెలివితో డబ్బును సంపాదించుకోవాలని అనుకుంటాడు. ఆ పనిలో
జ్ఞానమును, భక్తిని కూడా సాధనముగా చేసుకొని డబ్బును సంపాదించాలని
చూస్తాడు. అది వారి అజ్ఞానము తప్ప వేరు ఏమీ కాదు” అన్నాడు.
అటువంటి భక్తులను దేవుడే యోగీశ్వరుల వద్దనుండి దూరము
చేయును. ఈ విషయమై వీరబ్రహ్మేంద్రస్వాములవారు తన మాటలలో
ఇలా అంటున్నారు. "ఆనందాశ్రమమునకు దూరముగాయున్న వాన్ని
తలచనేవద్దు. నిశ్చయము, నిజము, తథ్యము. మహాకుటిలకాడు, ద్రోహి,
పాపమెల్ల వాడిని పట్టుకొని వేలాడుచుండును". ఎంతో గొప్ప జ్ఞానము
వద్దకు వచ్చి కొంతవరకు జ్ఞానము తెలిసి ప్రపంచ చింతలచే ఒకడు నేను
గురువంతటి వాడు కావాలనుకొంటే మరియొకడు గురువునే మించిన
వాడిని కావాలనుకొన్నాడు. జ్ఞానము తెలిసినా అది ఇతరులకు చెప్పేదానికే
అనుకొని, మన సొంత తెలివితో డబ్బు సంపాదించుకోవాలనుకొన్నవారు
వారి వెనుకయున్న కర్మచిట్టాను మరచిపోయివుందురు. ఎప్పుడయితే
మనిషిలో చెడు బుద్ధి పుట్టి గురువునే మోసము చేయవచ్చు అ
అనుకుంటాడో అప్పుడే వానిలో మాయ పని చేయను మొదలుపెట్టి
జ్ఞానమునకు దూరము చేయును. మాయ తనను జ్ఞానమునుండి ఎలా
దూరము చేసినదని కూడా తెలియకుండా మాయ మనిషిని నడిపించగలదు.
ప్రశ్న :- యెషయా ప్రవక్త ఏసును గురించి కొన్ని విషయములను
గ్రంథములో వ్రాసిపెట్టగా, వ్రాసిపెట్టినట్లే జరుగడము ఏసు జీవితములో
విశేషత. అట్లే పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధానంద యోగీశ్వరుల
గారి కొన్ని విషయములను వ్రాసిపెట్టగా అవి అన్నియూ జరుగుచూ
వచ్చాయి. ముఖ్యముగా యోగీశ్వరుల వారు సిద్దాంతకర్త కదా! ఆయన
సిద్ధాంతమును గురించి వ్రాసిన వాక్యములు ఏమయినా ఉన్నాయా? అలా
ఉంటే యోగీశ్వరుల వారి సిద్ధాంతము మీద ప్రజలకు దృఢ విశ్వాసము
ఏర్పడును. ఏదయినా ఉంటే చెప్పండి?
జవాబు :- వీరబ్రహ్మముగారు ముఖ్యమైన విషయములనే తన భవిష్యవాణిలో
వ్రాశాడు. యోగీశ్వరుల జీవితములో త్రైత సిద్ధాంతమే ముఖ్యమైనదిగా
ఉండుట వలన ప్రబోధానంద యోగీశ్వరుల సిద్ధాంతమును గురించి
బ్రహ్మముగారు ఈ విధముగా వ్రాశాడు. "సోమ సిద్ధాంతము సొంపుగా
నడిచేను. శుభాశుభములయ్యేనయా" అను వాక్యము కలదు. ఇందులో
త్రైత సిద్ధాంతము అనకుండా 'సోమసిద్ధాంతము' అని అన్నారు. సోమ
అనగా చంద్రుడని అర్థము. చంద్రుడు జ్ఞానమునకు అధిపతిగాయున్నాడు.
ప్రబోధానంద 'త్రైత సిద్ధాంతము' స్వచ్ఛమయిన జ్ఞానముతో కూడుకొని
యున్నది. కనుక త్రైత సిద్ధాంతమును సోమ సిద్ధాంతమను పేరుతో చెప్పాడు.
'సోమసిద్ధాంతము సొంపుగా నడిచేను' అన్నారు. త్రైత సిద్ధాంతము
ఆటంకము లేకుండా ప్రజలలోనికి అతివేగముగా ప్రాకుచుండుట వలన
'సొంపుగా నడిచేను' అన్నాడు. త్రైత సిద్ధాంతమును చూచినవారు
అసూయతో ఇది ఇతర మతమని సాకుపెట్టి కొన్ని ఆటంకములు
కలుగచేసినా అవన్నియూ తిరిగి మటుమాయమై పోవుచున్నవి. అందువలన
'శుభ అశుభములయ్యేనయా' అన్నారు.
త్రైత సిద్ధాంతమును గురించి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన
గోవింద వాక్యములలో పై వాక్యమును వ్రాశాడు. అటువంటిదే మరొక
వాక్యము గోవింద వాక్యములలోనే వ్రాయడము జరిగినది. అక్కడ వ్రాసిన
దానిని చూస్తే ఇలా కలదు "సిద్ధాంత శిరోమణి గురుస్వామి. గురుస్వామి
సిద్ధాంతము నిత్యము సత్యమయ్యేనయా” ఈ వాక్యములో 'సిద్ధాంత
శిరోమణి' అనడము వలన ఇంతకుముందు వచ్చిన సిద్ధాంతములన్నిటికీ
'త్రైత సిద్ధాంతము’ శిరోమణిలాగా ఉందని చెప్పవచ్చును. శిరోమణి అనగా
'శిరస్సున ధరించే పెద్ద మణి' అని అర్థము. అట్లు చెప్పడము వలన
అన్నిటికంటే గొప్ప సిద్ధాంతమని చెప్పినట్లయినది. త్రైత సిద్ధాంతమయిన
గొప్ప సిద్ధాంతమును తెలిపిన వ్యక్తి గురువైయుండునని 'శిరోమణి
గురుస్వామి' అన్నారు. త్రైత సిద్ధాంతము మిగతా సిద్ధాంతములకంటే
సత్యమైనదగుట చేత, అనుభవమునకు వచ్చుట చేత 'గురుస్వామి
సిద్ధాంతము నిత్యము సత్యమన్నారు.' ఈ విధముగా యోగీశ్వరుల
సిద్ధాంతమును గురించి రెండు వాక్యములు చెప్పినట్లు తెలియుచున్నది.
నాలుగు వందల సంవత్సరములప్పుడు ముందే చెప్పియుండడము వలన
త్రైత సిద్ధాంతమునకు బలము చేకూరినది.
ప్రశ్న :- ఎంతో గొప్ప పేరున్న ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన
అద్వైతముకంటే, రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతముకంటే,
మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతమును వదలివేసి పోతులూరి వీర
బ్రహ్మేంద్రస్వాములవారు త్రైత సిద్ధాంతమునే ఎందుకు గొప్పగా చెప్పాడు?
జవాబు :- అశోక్ హోటల్లో వెడల్పుగా చేసిన దోసెకంటే, ద్వారక హోటల్లో
కాల్చిన పూరీకంటే, తిరుమల హోటల్లో చేసిన సాంబారుకంటే, బేకరీలో
చేసిన లడ్డే ఎందుకు తియ్యగుంది? అని అడిగినట్లున్నది మీ ప్రశ్న. దోసె,
పూరీ, సాంబారు, లడ్డులో తియ్యగ ఉండేది ఏది? అంటే 'లడ్డు' అన్నట్లు,
మూడు సిద్ధాంతములలో ఏది గొప్పది? అన్నప్పుడు గొప్పదేదో దానినే
చెప్పాడు. అన్నిటినీ వదలి దానినే ఎందుకు చెప్పాడో మీరు లోతుగా
చూచి తెలుసుకోవలసియుంటుంది. మా సిద్ధాంతమును గురించి నన్ను
అడిగితే మాదే గొప్పదని నేను చెప్పినా “ఎవరిది వారు గొప్పగా
చెప్పుకొంటారు” అని అనగలరు. అందువలన ఈ విషయములో
సమాధానము కొరకు మీరే అన్వేషించాలి. ఎప్పుడో దాదాపు నాలుగు
వందల సంవత్సరములప్పుడు ఎలా చెప్పగలిగాడు అను ప్రశ్న కూడా
రాగలదు కదా! బ్రహ్మము గారు చెప్పిన విషయములన్నియూ ఈ మధ్య
కాలములో అనగా 2004వ సంవత్సరమునుండి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా
తెలుస్తున్నవి. మొదట మాకు ఇతరుల ద్వారా తెలిసినది. "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానము కలది" అను వాక్యము మాత్రము తెలిసినది. ఇతరుల
ద్వారా అనగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలములోని బట్టేపాడు గ్రామ
నివాసి అయిన వీరనారాయణ రెడ్డిగారి ద్వారా తెలిసినవి.
మొదట రెండవ వాక్యములో "ప్రబోధాశ్రమము వారు
శయనాధిపతి గుణములు కల్గియున్నారు" అని తెలిసినది. తర్వాత కొంత
కాలమునకు ఏష్యకాలజ్ఞానమును తెప్పించుకొని చూచాము. అందులో
మాకు సంబంధించిన వాటిని వ్రాయగలిగాము. ఇంకా పూర్తిగా చూస్తే
ఇంకా ఏమి తెలియగలవో చెప్పలేము. బ్రహ్మముగారి ఏష్యకాల జ్ఞానములో
ఇంతవరకు కొంత భాగమును మాత్రము చూచాము. జీవిత చరిత్రను
చదువగలిగాము. ఆయన సామాన్యమైన మనిషికాదని కారణజన్ముడని
కొంత అర్థమయినది. ఈనాడు ఎందరో ఆయన గొప్ప యోగి అను
నమ్మకముతో ఆయన సమాధిని దర్శించుకొంటున్నారు. అంతగొప్ప వ్యక్తి
మమ్ములను గురించి (నన్ను గురించి కాదు శరీరము లోపలయున్న
ప్రబోధానంద యోగీశ్వరులను గురించి) చెప్పడము ఆశ్చర్యమయినది.
మేము ఆయన జీవిత చరిత్రను చదివిన తర్వాత ఆయన వ్రాసిన
తత్వములను చూడడమైనది. ఆయన తత్త్వములున్నా, వాటికి అర్థము
చెప్పువారు ఎవరూ లేరని తెలిసి బ్రహ్మముగారు వ్రాసిన తత్త్వములకు
మేము వివరము వ్రాయడమైనది. మేము వ్రాసిన వివరముతో ఆయన
తత్త్వముల రూపములో చెప్పిన రహస్య జ్ఞానము బయటి ప్రపంచమునకు
తెలిసిపోయినది. వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తన కాలజ్ఞానములో
యోగీశ్వరులను గురించి వ్రాసినందుకు మేము ఆయన తత్త్వములకు
వివరమును వ్రాసి ఆయన ఋణము తీర్చుకొన్నాము.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల విషయము నాకు ఏమీ
తెలియని దినములలో అనగా 1980వ సంవత్సరము మేము బ్రహ్మముగారి
సమాధియున్న కందిమల్లయ్య పల్లెకు పోవడము జరిగినది. మేము అక్కడికి
పోవాలను ఉద్దేశ్యముతో పోలేదు. ఇతరులు పోతూ వారు మమ్ములను
అక్కడికి తీసుకొని పోవడము జరిగినది. అక్కడికి పోయిన తర్వాత వారు
మమ్ములను బ్రహ్మముగారి సమాధివద్దకు తీసుకపోవడము జరిగినది.
అప్పుడు ఎవరికీ తెలియని, ఎవరికీ కనిపించని సంఘటన జరిగినది.
దాదాపు మూడు వందల సంవత్సరములనుండి సజీవముగా సమాధిలో
యున్న వీరబ్రహ్మముగారు మేము సమాధిని దర్శించుకొన్న సమయములో
సమాధిలోని ఆయన శరీరమునుండి బయటికి రావడము జరిగినది.
అంతకాలము 'మా రాక' కొరకు కాచుకొన్నట్లు ఆయన శరీరమును
వదలి బయటికి రావడము నాకు తెలియకున్నా యోగీశ్వరుల వారికి
బాగా తెలిసినది. అప్పుడు ఏమి జరిగినది యోగీశ్వరులకే ఎరుక. ఆ
సమయములో ఏమి జరిగినది ఇతరులకు ఎవరికీ ఏమాత్రము తెలియదు.
యోగీశ్వరులు కూడా ఎవరికీ ఏమీ చెప్పలేదు. తర్వాత దాదాపు పది
సంవత్సరములు గడచిన తర్వాత బహుశా 1990వ సంవత్సరము బ్రహ్మము
గారు సమాధిలో లేరని ఒక సందర్భములో చెప్పడమైనది. తర్వాత
'ఆనందాశ్రమమునకు వస్తాను' అని బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో
వ్రాసుకొన్నట్లు చూచాము.
ఎంతో గొప్ప జీవిత చరిత్రగల బ్రహ్మముగారు యోగీశ్వరులను
గురించి నాలుగువందల సంవత్సరముల క్రితమే వ్రాయడము ఎంతో గొప్ప
ఆశ్చర్యమైన పని, అద్భుతమైన పనియని చెప్పవచ్చును. ఆయన చెప్పిన
వాక్యములను గొప్పగా గ్రహించుకొన్నవారు గలరు. కొందరు జీర్ణింప
చేసుకోలేనివారూ గలరు. కొందరు బ్రాహ్మణులు వారిలో ఏ గొప్పతనము
లేకున్నా ఒకవైపు వీరబ్రహ్మము గారిని, మరొకవైపు వేమనయోగి గారిని
విమర్శించుచుందురు. అలా విమర్శించుటకు ఒకే ఒక కారణము కలదు.
ఏ కారణము చేత బుద్ధుడు క్షత్రియుడని అతను చెప్పిన బోధను పరమతమని
చెప్పారో, ఏ కారణముచేత జైనుడు బ్రాహ్మణుడు కాదని అతనిది
జైనమతమని హిందువులనుండి విడదీశారో, ఏ కారణముచేత సిక్కులను
ఇతర మతముగా హిందూమతమునుండి వేరు చేశారో, ఆ కారణము
చేతనే కుల వివక్షతో వేమనయోగిని తిక్కవాడనీ, బ్రహ్మముగారిని మెట్ట
వేదాంతి అని హేళన చేశారు. అదే కారణము చేతనే నేటికినీ ప్రబోధానంద
యోగీశ్వరులు 'చౌదరి' కులమున పుట్టినందుకు అణగద్రొక్కాలని
చూస్తున్నారు. ఆర్య భావములు నిండియున్న వారు నేడు అక్కడక్కడున్నా
వారి తెలివిని ఉపయోగించి ఇతర కులముల వారికి 'మతము' అను
మత్తుమందు ఇచ్చి, ఆ మత్తు తలకెక్కిన తర్వాత, ఏమీ యోచించని
వారిని యోగీశ్వరులను విమర్శించునట్లు చేసి యోగీశ్వరుల సిద్ధాంతము,
బోధలు పరమతమయిన క్రైస్తవ మతమునకు సంబంధించినవని నమ్మించు
చున్నారు. హిందూమతములో యున్నా కొందరు గొర్రెలలాంటి వారు
మనము ఎవరిని విమర్శించుచున్నాము? ఎవరిని దూషించుచున్నాము?
ఎవరిని పరమతమంటున్నామను ధ్యాస లేకుండా హిందువులయిన
మమ్ములను దూషించుచున్నారు. కొన్నిచోట్ల మా భక్తుల మీద, త్రైత సిద్ధాంత
ప్రచారకుల మీద దాడులు కూడా జరుగుచున్నవి. వెనుకయుండి
వ్యూహములను అల్లువారుండగా, వారిక్రింద గొర్రెలైన వారు యోచించక
మాట్లాడడము జరుగుచున్నది. ప్రబోధానంద యోగీశ్వరులను ఎవరు
ఏమి మాట్లాడినా ఆయనకు ఏమీ నష్టముండదు. బ్రహ్మముగారు తన
కాలజ్ఞానములో చెప్పినట్లు వారే నాశనమైపోవుదురు, వారికే కష్టము నష్టము
అన్నియూ జరుగును. యోగీశ్వరుల వద్ద అనగా 'ఆనందాశ్రమమువద్ద
మహా దేవతలందరూ ఉన్నారని' బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో చెప్పి
యుండడమేకాక, ప్రబోధానంద యోగీశ్వరులు స్వయముగా వ్రాసిన
“శ్రీకృష్ణుడు దేవుడా! భగవంతుడా!!" అను గ్రంథములో యోగీశ్వరులున్న
కృష్ణమందిరము దగ్గరకు సమస్త దేవతలు వచ్చి పోవుచున్నారని వ్రాశారు.
ఒకవైపు బ్రహ్మముగారు మహాదేవతలు సహితము ప్రబోధానందాశ్రమము
వద్ద యున్నారని చెప్పినా, యోగీశ్వరులే స్వయముగా తన గ్రంథములో
సమస్త దేవతలందరూ ఇక్కడికి వచ్చి పోతున్నారని చెప్పినా, గ్రహించని
మూర్ఖ ప్రజలు అనవసరముగా లోకములో తమ గుర్తింపుకొరకు
యోగీశ్వరులకు వ్యతిరేఖముగా మాట్లాడితే, యోగీశ్వరుల అభిమానులయిన
దేవతలు ఊరకుంటారా? సమయము చూచి వారిని దెబ్బతీస్తారు. అలా
ఎందరో దెబ్బతిన్నవారు, పూర్తిగా చనిపోయిన వారు కలరు.
ప్రశ్న :- బయట ప్రజలు యోగీశ్వరులను గురించి అనవసరముగా
అసూయతో మాట్లాడు మాటలను విన్నాము. తర్వాత కొంత కాలమునకే
వారు ఘోరమయిన రోగములతో, ఘోరమైన దుర్ఘటనలలో భయంకరమైన
రోడ్డు ప్రమాదములలో చనిపోవడము జరిగినది. అప్పుడు మాకు అర్థము
కాకపోయినా ఇప్పుడు మీరు చెప్పిన దానినిబట్టి కొంతకు కొంత అర్థమగు
చున్నది. మేము అలా ప్రమాదములలో చిక్కుకొని బాధపడుచున్న వారిని
చూచాము. చనిపోయిన వారిని చూచాము. అయితే నూటికి ఒకరు లేక
ఇద్దరు ప్రమాదములో చిక్కుకోకుండా అలాగేయున్నవారు కలరు.
చాలామందికి అనర్థములు జరిగి కష్టాలపాలై పోయినవారుండగా
ఎక్కడయినా అరుదుగా ఏమీ జరుగని వారున్నారు. వారికి ఎందుకు శిక్ష
పడలేదని మాకు సంశయమున్నది? దానికి మీరేమంటారు.
జవాబు :- నీ స్నేహితుల ముందర నిన్ను ఎవరయినా దూషించారనుకో,
అప్పుడు నీ స్నేహితులు ఊరకయుండరు కదా! అనుకూలముంటే అప్పుడే
దూషించినవానిని దండించయినా దండించగలరు. అనుకూలము లేకపోతే
తర్వాత అనుకూలమైనప్పుడు వానిని దండించడమో, తన్నడమో, చంపడమో
జరుగుతుంది కదా! ఒకవేళ నిన్ను ఇతరులు దూషించినప్పుడు అక్కడ నీ
స్నేహితులుగానీ, బంధువులుగానీ లేనప్పుడు వాడు దూషించినట్టు తెలియని
దానివలన ఏమీ అనకుండా వదలివేయుదురు. అదేవిధముగా ప్రబోధానంద
యోగీశ్వరులను దూషించిన సమయములో అక్కడ ఆ సమయానికి
ఎవరయినా కనిపించని దేవతలుగానీ, గ్రహములుగానీ ఉండివుంటే
దూషించిన వానిని గుర్తు పెట్టుకొని కొన్ని రోజులకుగానీ, కొన్ని నెలలకుగానీ
వానిని రోగరూపములో కొందరు పీడింతురు. కొందరయితే రోడ్డు
ప్రమాదములను చేసి చంపివేయుదురు లేక చావు బ్రతుకుల సమస్యలో
చిక్కుకొనునట్లు చేయుదురు. కొందరికి అవయవ లోపము కలుగచేసి
జీవితాంతము బాధపడునట్లు చేయుదురు. ఒకవేళ ఇతరులు యోగీశ్వరు
లను దూషించినప్పుడు ఆ సమయములో అక్కడ కనిపించనివారు ఎవరూ
లేనట్లయితే, దూషించిన విషయము ఎవరికీ తెలియదు కనుక వానిని
ఎవరూ ఏమీ అనరు. అట్లు చాటుగా దూషించినా ఏమీ కానివారు
అరుదుగాయుందురు. మాకు తెలిసినంతవరకు అనవసరముగా మాట్లాడి
జీవితాంతము బాధపడువారు కొందరుండగా, కొందరు పూర్తి చనిపోయారు.
వారు ప్రమాదములను పొందినా తమ తప్పు వలననే అట్లు జరిగినదని
కూడా వారికి తెలియదు. ఏదో సహజముగా కర్మకొద్దీ జరిగిందనే
అనుకుంటారు గానీ, దీని కారణముననే జరిగినదని వారికి తెలియదు.
ఒక్కొక్కప్పుడు యోగీశ్వరుల వారిని దూషించిన వారు రోగములకు
గురియై, రోగములతో బాధపడుచూ యోగీశ్వరుల యొక్క గొప్పతనము
తెలిసినవారై తమ రోగములను నివారించుకొనుటకు యోగీశ్వరుల చెంతకే
వచ్చినవారు గలరు. అలా వచ్చినవారు రోగములచే బాధింపబడుచున్నారని
తెలిసిన ప్రబోధానంద యోగీశ్వరులు వారిని బాధించు రోగములకు నచ్చ
జెప్పి వారు జ్ఞానమార్గములోకి వస్తే వారిని వదలిపొమ్మని, రోగములకు
చెప్పిన సందర్భములు కూడా కలవు. అప్పుడు యోగీశ్వరులు చెప్పిన
మాటను గౌరవించి ఆ రోగములు వారిని వదలిపోయిన సందర్భములు
కూడా కలవు. ఈ విధముగా యోగీశ్వరులు తనకు విరుద్ధముగా మాట్లాడిన
వారిని కూడా క్షమించి, గ్రహములకు దేవతలకు నచ్చజెప్పి పంపిన
సందర్భములు కూడా కలవు.
ఆ
ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులకు విరుద్ధముగా మాట్లాడి అనవసర
కష్టములను తెచ్చుకొన్న వారున్నట్లే, ఆయన జ్ఞానమును తెలిసి ఆయన
త్రైత సిద్ధాంతమును అనుసరించిన వారికి ఎంతో మేలు జరిగిన సంఘటనలు
కూడా కలవని విన్నాము. వ్యతిరేఖముగా మాట్లాడితే ఎంత కష్టము కల్గునో
అనుకూలముగా మాట్లాడిన వారికి కర్మలు కాలిపోయి అంతే మేలు
జరుగునని కొందరు చెప్పగా విన్నాము. అది నిజమేనా అని అడుగు
చున్నాము?
జవాబు :- ఇక్కడ నిజమా? అబద్దమా? అని అడిగినంతమాత్రమున ఏమీ
ప్రయోజనము లేదు. బాగా ఆలోచించగలిగిన వానికి, సత్యమును
తెలుసుకొన్నవానికి ప్రయోజనముండును. ప్రబోధానందయోగీశ్వరుల త్రైత
సిద్ధాంత బోధలో ముఖ్యముగా శరీరాంతర్గత జ్ఞానమేయుండును.
శరీరాంతర్గతములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనబడు మూడు ఆత్మలు
ఎట్లున్నది చెప్పబడును. మూడు ఆత్మలలో మధ్యాత్మ యొక్క సంగతే
ఎక్కువగా తెలియబడును. మధ్యలోయున్న ఆత్మను జీవుడు మొదట తెలియ
వలసియుండును. అందువలన మధ్యాత్మ జ్ఞానమును పూర్తిగా తెలియ
వలసియుండును. మధ్యాత్మ శరీరమునకు అధిపతిగాయుంటూ, శరీరము
లోని దేవుడుగా పిలువబడుచున్నది. మూడవ ఆత్మయిన పరమాత్మ శరీరము
బయట దేవుడుగా చెప్పబడుచున్నాడు. శరీరములోని ఆత్మ శరీరమునకు
అధిపతిగాయుంటూ, శరీరమును పూర్తిగా వ్యాపించి నడుపుచూ, శరీరము
లోని జీవున్ని కష్టసుఖములను అనుభవింపజేయుచున్నది. శరీరమును
ఆత్మ పాలించుటకు శరీరమును రెండు భాగములుగా విభజించుకొని ఆత్మ
పాలన సాగించుచున్నది. శరీరములో ఒకటి శక్తి భాగముగా, రెండవది
ఆరోగ్యము ఒక భాగముగా విభజించబడి శరీర శక్తి, శరీర ఆరోగ్యము
అను రెండు విభాగముల మీద ఆత్మ పని చేయుచూ తనవెంటయున్న
జీవున్ని కర్మలనుభవింపజేయుచున్నది.
మనుషులలో ఆరోగ్యము బాగుండి శక్తి తక్కువయున్న వారు
కొందరుండగా, శక్తియుండి ఆర్యోగము బాగా లేనివారు కొందరున్నారు.
కొందరిలో ఆరోగ్యము బాగుంది, శక్తి బాగుంది. ఇంకా కొందరిలో
ఆరోగ్యము సరిగా యుండదు. శక్తి సరిగాయుండదు. శక్తి అనగా శరీర
బలమని తెలియవలెను. ఇట్లు ఆరోగ్య, అనారోగ్యముల మధ్య బలము,
అబలముల మధ్య మనిషి శరీరములో కర్మలు అనుభవించుచుండును.
ఇదంతయూ శరీర సంబంధమైన సుఖదుఃఖములుకాగా మానసిక సుఖ
దుఃఖములు మరొక రకము గలవు. మానసికముగా కలుగు సుఖదుఃఖములు
కూడా రెండు రకములు గలవు. ఒకటి తనను గురించి, రెండవది ఇతరుల
గురించి. రెండు రకముల మనోబాధలుగానీ, మనోసుఖములుగానీ
ఉండును. జ్ఞానము కల్గినపుడు మానసిక బాధలుగానీ, సుఖములుగానీ
లేకుండా పోగలవు. అందువలన అవి తాత్కాలికమైనవే అని చెప్పవచ్చును.
జ్ఞానము కల్గినా కలుగకపోయినా ఆత్మ శరీరములోని నాడులలోగల
శక్తితోనూ, గ్రంథులలో గల ఆరోగ్య అనారోగ్యములతోనూ శరీరమును
పాలించుచుండును. శరీరములో గల జీవున్ని కర్మ అనుభవింపజేయుటకు,
చివరకు శరీర బలమునంతటినీ లేకుండా చేసి, మనిషిని మరణము వరకు
తీసుకొని పోవుటకు ఆత్మ అన్ని అవకాశములతో, నాడుల ద్వారా, గ్రంథుల
ద్వారా పని చేయుచున్నది. ఆత్మకు శరీరములో ఆధారముగాయున్నవి
నాడులు ఒక రకముకాగా, గ్రంథులు మరొక రకముగా యున్నవి. శరీరము
లోని ఆత్మ నాడుల మీద, గ్రంథుల మీదనుండి శరీరమును పాలించు
చున్నది. శరీరములో దేవుడయిన ఆత్మ శరీరములో సప్త నాడీకేంద్రములలో
నుండి తన శక్తిని శరీరమునకు ప్రసరింపజేయుచున్నది. అలాగే ఏడు
గ్రంథులలో యుండి శరీరము యొక్క ఆరోగ్యమును అనారోగ్యమును
ప్రసరింపజేయుచున్నది. ఈ విధముగా ఏడు నాడీకేంద్రముల మీద, ఏడు
గ్రంథుల మీద ఆత్మ నివాసమై శరీరమును పాలించుచున్నదని ఎవరికీ
తెలియదు. ఆత్మ శరీరములో ఉండికూడా ఎంత శోధించినా ఎవరికీ
తెలియకుండా నివాసమై యున్నది.
ఎంత తెలివైన వానికయినా శరీరములో జీవాత్మయున్నట్లే
తెలియును గానీ, ఆత్మయున్నట్లు తెలియదు. అందువలన బయట ఎంత
మేథావులయినా లోపలయున్న ఆత్మను గుర్తించలేకయున్నారు. గతములో
వచ్చిపోయిన ముగ్గురు సిద్ధాంతకర్తలు తమ సిద్ధాంతములను బయట
కనిపించు దేవుడు, కనిపించని దేవుడు అని చెప్పుకొంటూ శరీరము బయటే
చెప్పుకొన్నారు గానీ, వారి చూపు శరీరములోని ఆత్మలమీదికి ప్రాకలేదు.
అందువలన ముగ్గురు సిద్ధాంతకర్తల మూడు సిద్ధాంతములు దేవుడు కాని
దానిని చెప్పుకొన్నారుగానీ, అసలయిన దేవున్ని గురించిన జ్ఞానమును
చెప్పలేదు. అందువలన ముగ్గురి సిద్ధాంతకర్తల సిద్ధాంతములు దైవమునకు
సంబంధించినవి కావు. అందువలన వాటిని ఆధ్యాత్మిక సిద్ధాంతములని
చెప్పుటకు వీలులేదు. దేవునికి సంబంధించిన సమాచారమును తెల్పునవి
దైవ సిద్ధాంతములగును. మిగతావి దైవ సిద్ధాంతములనబడవు. ముక్కుకు
సంబంధించిన ఆభరణములను ముక్కుపోగులంటాము. చెవికి
సంబంధించిన ఆభరణములను చెవి కమ్మలంటాము. ముక్కు పోగులు,
లేక ముక్కు పుడకలకు, చెవి కమ్మలు లేక చెవి కుండలములకు ఎంతో
తేడాయుండును. ముక్కు పుడకలను మాత్రము కలవాడు నాకు చెవి
కమ్మలు యున్నాయంటే నమ్ముటకు వీలులేదు కదా! అలాగే శరీరము
బయట ప్రకృతికి సంబంధించిన ఆకార, నిరాకారములను చెప్పిన వారు
శరీరములోపల గల దేవున్ని గురించి చెప్పలేదనీ, శరీరములోని దేవునికి
సంబంధము లేనివి దైవ సిద్ధాంతములు కాదనీ చెప్పవచ్చును. దేవునికి
ఆకారములేదు, పేరు లేదు, పనియూ లేదు అనుట ముఖ్యమైన దైవధర్మము.
అలాంటప్పుడు దైవముయొక్క సాకార, నిరాకారమైన సిద్ధాంతములు
అసలుకు దేవునివే కాదని చెప్పవచ్చును.
ఆధ్యాత్మిక రంగములో శరీరములోగల దేవున్ని తెలుపు సిద్ధాంతము
అసలయిన దైవసిద్ధాంతమగును. ఆ లెక్క ప్రకారము భూమిమీద “దైవ
సిద్ధాంతము” ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పిన “త్రైత సిద్ధాంతము”
ఒక్కటేనని చెప్పవచ్చును. శరీరములోని ఆత్మలను విడదీసి శరీరములోని
దైవము ఆత్మయనీ, శరీరము బయట సర్వ విశ్వమంతా వ్యాపించినవాడే
అసలయిన దైవమని చెప్పు సిద్ధాంతము అసలయిన దైవ సిద్ధాంతము అని
చెప్పవచ్చును. దీనిప్రకారము లెక్కించి చెప్పితే భూమిమీద ఒకే ఒక దైవ
సిద్ధాంతము కలదని చెప్పవచ్చును. అన్ని విధములా శాస్త్రబద్దమైన
సిద్ధాంతము త్రైత సిద్ధాంతమొక్కటే. ప్రపంచమునకంతటికీ పెద్ద అయిన
దేవున్ని తెలియుటకు ముందు శరీరములో యంత్రాంగమును నడుపుచున్న
ఆత్మను తెలియవలెను. ఆత్మను తెలియగలిగినప్పుడు ఆత్మ శరీరములో
ఏడు నాడీకేంద్రముల మీద, ఏడు గ్రంథుల మీద తనశక్తిని ప్రసరింప
జేయుచూ శరీరమును పాలించుచున్నదని తెలియుచున్నది. శరీరములోని
ఆత్మ విధానమును తెలియడమే ఆధ్యాత్మికము అనబడును. ఈ విషయము
రహస్యముగాయుండగా, ఆ రహస్యమును అందరూ తెలియునట్లు తిరుమల
తిరుపతి గుడిలో గుడి గోపురమునకు ఏడు ద్వారములుండునట్లుంచారు.
గుడి గోపురము యొక్క ఏడు ద్వారములు ఏడు గ్రంథులకు చిహ్నములుకాగా,
గుడిలోపల దేవుని ప్రతిమ దగ్గరకు పోవుటకు ఏడు ద్వారములు దాటవలసి
యుండును. ఏడు గుడి ద్వారములు ఏడు నాడీకేంద్రములకు చిహ్నములుగా
జ్ఞానులు పెట్టడము జరిగినది. ఈ విధముగా జ్ఞానము ఎంతో ప్రణాళికా
బద్దముగా దేవాలయము వద్దయుండగా, అదే విధానమే ఆత్మజ్ఞానమునకు
నిలయమైయున్నది. శరీరములోని ఆత్మను తెలుపుటకు మిగతా రెండు
ఆత్మలను పరిచయము చేయుచూ మూడు ఆత్మల వివరమును సిద్ధాంత
రూపముగా శాస్త్రబద్దముగా తెలియజేయడమే త్రైత సిద్ధాంత ఉద్దేశ్యము.
మూడు ఆత్మల వివరణ తెలియజేయు విధానమునందు మధ్యాత్మ
యొక్క సమాచారము తెలియడము చాలా ముఖ్యము. మధ్యాత్మ యొక్క
ఏడు నాడీకేంద్రములను, ఏడు గ్రంథులను తెలియునప్పుడే ఆత్మశక్తి
జ్ఞానాగ్నిగా తయారు కాగలదు. అందువలన ఆధ్యాత్మిక విద్యలో ఏడు
నాడీకేంద్రములు, ఏడు గ్రంథులు చాలా ముఖ్యమైన సమాచారముగా
యున్నవి. దీనివలననే వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఇలా
అన్నారు. "ఆనందాశ్రయుల వారి వాక్యము సప్తమి నిశ్చయము, సర్వదా
సప్తమి అగును". ఇక్కడ వాక్యములో 'సప్తమి నిశ్చయము సర్వదా సప్తమి
అగును' అని రెండు సప్తమి పదములను వాడడము జరిగినది. శరీరములో
రెండు రకముల ‘సప్తమి’లు గలవు. ఒక ఏడు నాడీకేంద్రములు, మరియొక
ఏడు గ్రంథులు గలవు. 'మధ్యాత్మ' శరీరములో ఏడు నాడీకేంద్రముల
మీద, ఏడు గ్రంథుల మీద ఉన్నదను రహస్యమును ప్రబోధాశ్రమము వారే
చెప్పారని తెలుపు నిమిత్తము 'ఆనందాశ్రయుల వారి వాక్యము సప్తమి
నిశ్చయము' అన్నారు. ఇక్కడ “వాక్యము” అనగా చెప్పిన “జ్ఞానము” అని
అర్థము. చెప్పిన జ్ఞానములో ఏడు నాడుల విషయముండుట వలన 'సప్తమి
నిశ్చయము' అని చెప్పడమైనది. ఆ మాట ప్రక్కనే 'సర్వదా సప్తమి అగును’
అని కలదు. దానిప్రకారము ఏడు గ్రంథులున్నాయి. వాటిలో ఆత్మశక్తి
కలదని చెప్పడమే ఉద్దేశ్యము. బ్రహ్మముగారి మాటలన్నీ నేరుగా అర్థమగు
నట్లు ఏదీ యుండదు. అన్ని వాక్యములు చాటుగా చెప్పబడియుండును.
నేరుగా ఏదీ అర్థముకాదు. ఆనందాశ్రయులు అంటే ప్రబోధానందాశ్రమము
వారని తెలియవలెను. అట్లే ఆనంద గురువు అంటే ప్రబోధానంద గురువని
అర్థము చేసుకోవలెను. రెండు లేక మూడుచోట్ల ప్రబోధాశ్రమమని,
ప్రబోధాశ్రమమువారను పదములు వాడడమైనది. తర్వాత మేము మాటి
మాటికి ప్రబోధానంద యోగీశ్వరులని చెప్పక 'ప్రబోధ' అను పదమును
తీసివేసి యోగీశ్వరులు అను పదమును ఎట్లు వాడుచున్నామో అట్లే బ్రహ్మము
గారు కూడా 'ప్రబోధ' అను పదమును తీసివేసి ఆనంద గురువు,
ఆనందాశ్రమమని చెప్పడము జరిగినది.
బ్రహ్మముగారు చెప్పిన కాల జ్ఞానవాక్యములో “శయనాధిపతికి
సర్వదా ఆనందం, బ్రహ్మాది దేవతలెల్ల దీవించేరు. జారువాక్యములు ఆడిన
వారెల్ల నాశనమైపొయ్యేరు, కీడు తలచిన వారెల్ల ధూళియై పొయ్యేరు”
అని కలదు కదా! యోగీశ్వరులనుగానీ, యోగీశ్వరుల జ్ఞానమునుగానీ
వ్యతిరేఖించి ఆయనకు విరుద్ధముగా మాట్లాడినవారు, ఆయనకు కీడు
తలచిన వారు ఎవరయితే గలరో వారికే నష్టము కష్టము అని బ్రహ్మముగారు
చెప్పినట్లు జరుగుచునే యున్నది. వ్యతిరేఖముగా మాట్లాడిన వారికి అట్లు
జరిగినప్పుడు, యోగీశ్వరుల జ్ఞానమును యోగీశ్వరులను మంచిగ తలచి
ఆయన జ్ఞానమునే అనుసరించువారికి వారి కర్మలు కాలిపోవడము కూడా
జరుగుచున్నది. ఎప్పుడయితే శరీరాంతర్గత జ్ఞానము మీద మనిషికి దృష్ఠి
కలుగుచున్నదో, ఎప్పుడయితే మనిషికి శరీరము బయట ధ్యాసపోయి,
శరీరములోని ఆత్మమీద దృష్ఠి కలుగుచున్నదో, ఎప్పుడయితే శరీరములోని
ఏడు నాడీకేంద్రముల మీద ధ్యాస కల్గుచున్నదో, ఎప్పుడయితే ఏడు
గ్రంథులమీద ధ్యాస కల్గుచున్నదో అప్పుడు మనిషిలో జ్ఞానము ఉద్భవించును.
పుట్టిన జ్ఞానము కొంతకాలమునకు జ్ఞానశక్తిగా మారును. మారిన జ్ఞానశక్తి
జ్ఞానాగ్నిగా మారి ఆ జీవుని చిట్టాలోయున్న కర్మలను కాల్చను మొదలు
పెట్టును. ఈ విధముగా కర్మల దహనము ఎప్పుడు కల్గునో అప్పుడు
వాడు జ్ఞానమార్గములో ముందుకు సాగిపోవునట్లగును. అలా సాగి పోగా
పోగా ఎప్పటికో ఒకప్పటికి మోక్షమను గమ్యమును మనిషి చేరగలడు.
ఇదంతయూ ఒకదానితో మరొకటి సంబంధపడియున్న విధానము. ఈ
విధానములో మనిషికి బైబిలులో చెప్పినట్లు 'పాపక్షమాపణ' కల్గునని
తెలియుచున్నది. అట్లే ఖురాన్లో చెప్పినట్లు 'దేవుని క్షమాశీలత' మనిషి
మీద కల్గుచున్నది. ఈ రెండు గ్రంథములకంటే ముందు చెప్పిన భగవద్గీతలో
‘కర్మదహనము', 'జ్ఞానాగ్ని' అని చెప్పిన వాక్యములు నెరవేరుచున్నవి.
ఇదంతయూ యోగీశ్వరుల జ్ఞానమువలన సాధ్యమవుతుందని చెప్పు
చున్నాము.
ప్రశ్న :- ఇక్కడ ఒక్కమాటను అడుగుచున్నాము. ఇట్లు అడుగుచున్నందుకు
మీరు ఏమి నన్ను తప్పుగా అనుకోవద్దండి. నా తరపున కాకుండా ప్రజలలో
వచ్చు సంశయములను తీర్చుటకు ఇలా ప్రశ్నించుచున్నాము. యోగీశ్వరుల
జ్ఞానము వలననే మోక్షము లభించుననీ, కర్మనాశనమగుననీ చెప్పారు.
యోగీశ్వరుల ముందు వచ్చిన బైబిలు, ఖురాన్, భగవద్గీతలయిన మూడు
దైవ గ్రంథములలో చెప్పిన జ్ఞానము వలన కర్మ లేకుండా పోవునని, మోక్షము
కల్గునని చెప్పారు కదా! అటువంటప్పుడు యోగీశ్వరుల జ్ఞానము వలననే
జ్ఞానము కల్గును, కర్మలు కాలును, మోక్షము లభించునని చెప్పడము
గర్వముతో చెప్పినట్లు కనిపించుచున్నది. పూర్వము చెప్పిన వారిని కాదని
వారికంటే నేనే గొప్పయని చెప్పినట్లు కలదు. అలా చెప్పడము అన్నీ
తెలిసిన మీకు సరిపోతుందా?
జవాబు :- మీ ప్రశ్న చివరిలో అన్నీ తెలిసిన 'మీకు' అన్నావు కాబట్టి నేను
బ్రతికిపోయాను. అట్లు కాకుండా 'నీవు' అని అడిగియుంటే నేను ఎంతో
వివరణ ఇచ్చుకోవలసి వచ్చియుండేది. మీకు సరిపోతుందా? అని అడిగారు
కాబట్టి సరిపోయింది. అలా చెప్పడము సరిపోయిందిగానీ, మీరు అర్థము
చేసుకోవడమే సరిపోలేదు. నేను చాలామార్లు వివరణ ఇస్తూ వచ్చాను.
'ప్రబోధానంద యోగీశ్వరులు అనుమాట ఒక శరీరమువద్ద వాడుచున్నా,
అది శరీరములోపలయున్న మధ్యాత్మకే వర్తిస్తుందని చెప్పాను. అదే
శరీరములో యున్న నేను అనగా జీవాత్మను అదృష్టవంతుడనని కూడా
చెప్పాను. ఒక శరీరమునకున్న పేరు జీవునిదా కాదా!యని కూడా చెప్పాను.
శరీరము ఎవరిదయితే ఆ పేరు వారికే వర్తించునని కూడా చెప్పాను.
అజ్ఞానములో జీవించు ప్రతి మనిషి శరీరము నాదేయని అనుకొనుచుండును.
వాస్తవముగా శరీరము వానిది కాకపోయినా జీవుని భావమునే పరిగణ
లోనికి తీసుకొనబడుట చేత శరీరము ఆ జీవునిదిగా లెక్కించబడును.
శరీరము ద్వారా జరుగు పనులన్నియూ ఆ జీవుడు చేసినట్లే భావింపబడును.
వాస్తవానికి శరీరమునకు పెద్ద అయిన ఆత్మది. శరీరము నాకు జ్ఞానము
తెలుసు కావున శరీరము నాది కాదు. "శరీరము మధ్యాత్మది" అని తెలిసి
యుండుట వలన శరీరములో జరుగు పనులు నావిగా లెక్కించబడలేదు.
శరీరములో నేను ఒకమూల రవ్వంతగాయున్నాను. శరీరమంతా
వ్యాపించియున్న ఆత్మ శరీరమునకు అధిపతియైన దానివలన శరీరము
ఆత్మదేయగును. ఆత్మ అందరి శరీరములలోయున్నా వారివారి కర్మలను
బట్టి ఆత్మపని చేయును. 'ప్రబోధానంద' అను శరీరములోని ఆత్మ
ప్రత్యేకముగా ఆత్మజ్ఞానమును చెప్పు పని చేయుచున్నది. జీవాత్మ జ్ఞానమును
వినగలిగి తాను జీవుడను మాత్రమే, నాకు శరీరము లేదు, ఆత్మ యొక్క
శరీరములో యున్నాను అనుకోవడము వలన శరీరము ఆత్మదిగానే
లెక్కించబడినది. అప్పుడు శరీరమునకున్న పేరు ఆత్మదిగా లెక్కించ
బడుచున్నది. 'ప్రబోధానంద యోగీశ్వరులు' అను పేరు ఆత్మదేయగుట
వలన, ఆత్మ చెప్పిన జ్ఞానమును ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పాడని
చెప్పవచ్చును. ఈ శరీరములో యోగీశ్వరులుగాయున్న ఆత్మయే ఇప్పుడు
సకల జీవరాసుల శరీరములో యున్నది. అంతేకాక గతములో కూడా
అందరి శరీరములో యున్నది. భగవద్గీతను చెప్పిన కృష్ణునిలోయున్న ఆత్మ
‘ప్రబోధానంద యోగీశ్వరులు' అను ఆత్మయే, అలాగే ఏసు శరీరములో
యుండి జ్ఞానమును చెప్పిన ఆత్మకూడా యోగీశ్వరుల శరీరములోయుండి
జ్ఞానము చెప్పుచున్న ఆత్మయేనని చెప్పుచున్నాము. గతములో జ్ఞానము
చెప్పిన వారి శరీరములలో యున్న ఆత్మకు, ఇప్పుడు ప్రబోధానంద
యోగీశ్వరుల శరీరములోయున్న ఆత్మకు ఏమయినా తేడాయున్నదా? ఏమీ
యుండదు. ఒకే ఆత్మ అన్ని శరీరములలోనూ ఉంటూ, ఆ జీవులకు
తోడు ఆత్మగా, పొరుగువానిగా యుంటూ, శరీరములను నడిపించుచున్నది.
ఒక శరీరములో జ్ఞానమును బోధించినా, అజ్ఞానమును బోధించినా ఆ
పనిని చేయునది ఆత్మయే. గతములో దైవ గ్రంథములను చెప్పిన వారి
శరీరములలో ఆత్మయేయుండి వారి ద్వారా జ్ఞానమును బోధించియుండును.
అందువలన గతములో బోధించిన ఆత్మను 'ప్రబోధానంద యోగీశ్వరులు'
అని ఈ రోజు పేరుతోయున్న ఆత్మయేనని చెప్పుచున్నాము. ఈ దినము
నేను నివశించు శరీరము నాది అంటే అది ఆత్మది కాకుండా నా శరీరముగా
లెక్కించబడును. నాది కాదు అనడము వలన ఈ శరీరము ఆత్మదేయగు
చున్నది. శరీరము ఆత్మదయినప్పుడు, శరీరముతోపాటు శరీరమునకున్న
పేరు కూడా ఆత్మదే యగుచున్నది. 'ప్రబోధానంద యోగీశ్వరులు' అని
ఈ శరీరమునకు పేరుండుట వలన అదే పేరు ఆత్మదగుచున్నది. ఆత్మ
గతములో చెప్పిన బోధలను నేడు ప్రబోధానంద యోగీశ్వరుల పేరుతోయున్న
ఆత్మయే చెప్పినదని చెప్పుటలో తప్పులేదు. పైగా ఆ మాట సత్యమగును.
సత్యమును అనుసరించి ప్రబోధానంద యోగీశ్వరుల శరీరములోని
ఆత్మయే దైవగ్రంథములను చెప్పినదని చెప్పవచ్చును. అలాగే గతములో
గానీ, ఇప్పుడుగానీ అందరి శరీరములలోయుండి అందరినీ వారివారి
కర్మల ప్రకారము కదిలించి నడుపుచున్నది ఆత్మయే. రాముని శరీరము
లోనూ, అట్లే రావణబ్రహ్మ శరీరములోనూ ఒకే ఆత్మ ఉండెడిది. రాముని
శరీరములోనూ, రావణబ్రహ్మ శరీరములోనూ, కృష్ణుని శరీరములోనూ,
అర్జునుని శరీరములోనూ ఆత్మ శరీరమునకు వెలుగై, జీవునికి తోడై
యుండెడిది. గతములో జ్ఞానమును బోధించి మోక్షమునకు దారి చూపినది
ఆత్మయే కనుక ప్రస్తుత పేరునుబట్టి ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానము
వలననే ఎవరికయినా మోక్షము లభించునని చెప్పడములో తప్పులేదు.
నేడు ప్రబోధానంద యోగీశ్వరుల శరీరములో ఆత్మగాయుండి శరీరము
చేత “హిందూమతములో సిద్ధాంతకర్తలు" అను గ్రంథమును
వ్రాయించినది ఆత్మయే. ఆత్మకు ఇప్పుడు ఈ శరీరములోని పేరు
వర్తించుచుండుట వలన ఈ పేరుగల ఆత్మయే అన్నీ చేయుచున్నది.
గతములో చేసినదనీ చెప్పవచ్చును. అలాంటప్పుడు ప్రబోధానంద
యోగీశ్వరులుగా యున్న ఆత్మ చెప్పినదే నిజమైన జ్ఞానమనీ, యోగీశ్వరుల
జ్ఞానము వలననే మోక్షము కల్గునని చెప్పడములో తప్పులేదు కదా!
ప్రశ్న :- ఇంతకుముందు ప్రబోధానంద యోగీశ్వరులు వ్రాసిన గ్రంథములను
ప్రకటించారు కదా! అందులో ఇప్పటికే 73 గ్రంథములను వ్రాసినట్లు
కలదు. ఈ 73 గ్రంథములను స్వయముగా ఆత్మయే వ్రాసిందంటారా?
జవాబు :- జ్ఞానము తెలిసిన ఎవరయినాగానీ, అన్ని గ్రంథములను
యోగీశ్వరులయిన ఆత్మయే వ్రాసినదని చెప్పాలి. ఆత్మ వ్రాసినదని
చెప్పుటలో ఏమాత్రము సంశయము లేదు. శరీరములోని జీవుడు 'నేను
వ్రాశాను' అని అనుకొంటే వాటిని జీవుడు వ్రాసినట్లు జీవుని ఖాతాలోనికి
చేర్చబడును. అప్పుడు ఆత్మ వ్రాసినట్లు లెక్కించబడకపోయినా, చైతన్యమై
పని చేయునది ఆత్మే అయినందున ఆ పనిని ఆత్మే చేయుచున్నది. ఆయినా
పేరు జీవాత్మకు వచ్చును. భావమునుబట్టి జీవుని ఖాతాలోనికి చేర్చబడుట
గానీ, చేర్చకుండుటగానీ చేయబడును. యోగీశ్వరుల శరీరములో ఇప్పుడు
మీతో మాట్లాడు జీవుడుగాయున్న వాడిని నేనే యగుట వలన, నాకు జ్ఞానము
తెలిసియుండుట వలన, గ్రంథములను వ్రాసినది నేను కాను ఆత్మయే
వ్రాసినదను సత్యమును తెలిసియుండుట వలన గ్రంథములన్నీ ఆత్మయే
వ్రాసినది. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య అను ముగ్గురు
ఆచార్యులు వ్రాసినట్లు చెప్పబడుచున్న గ్రంథములను ఆత్మయే వ్రాసినది.
ఆత్మ ఎవరిలో ఏమి చేయవలెనో ముందే నిర్ణయించుకొని చేయును.
అజ్ఞానులలో అజ్ఞానమును బోధించునది ఆత్మయే. జ్ఞానులలో జ్ఞానమును
బోధించునది ఆత్మయే. అయితే మనిషికీ మనిషికీ కొంత తేడాతో ఆత్మ
పనిచేయుచుండును. అందువలన ఆచార్యత్రయము అందరిలో ఆత్మయే
మూడు విధములుగా పనిచేసి సిద్ధాంతములను పేరుతో రాద్ధాంతము
చేసినది. ముగ్గురు సిద్దాంతకర్తల కార్యములు, బోధలు మూడు రకములుగా
యుండునట్లు ఆత్మయే చేశాడు. నాల్గవవ్యక్తిగా వచ్చిన ప్రబోధానంద
యోగీశ్వరుల ద్వారా త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించిన వాడూ ఆత్మయేనని
చెప్పుచున్నాము.
ప్రశ్న :- త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినవాడు యోగీశ్వరుల వారి
శరీరములోని ఆత్మయేనని మేము నమ్ముచున్నాము. యోగీశ్వరులు వ్రాసిన
73 గ్రంథములను ఆత్మయే వ్రాసినదని మీరు చెప్పితే నమ్మవలసిందేనని
నమ్మినా, మేము దాచిపెట్టుకోకుండా చెప్పితే మాలో కొంత అనుమానము
దాగియుందని చెప్పవచ్చును. మా అనుమానము ప్రకారము చెప్పితే,
యోగీశ్వరులు అయిన ఆత్మ గ్రంథములను వ్రాసియుంటే, అవి ఇంకా
ప్రత్యేకముగా ఉండునేమో అనిపించుచున్నది. మీరు ఎంత చెప్పినా మా
అంతరంగములో ఈ గ్రంథములన్నియూ మనిషి వ్రాసినట్లే ఉన్నాయి గానీ,
ఆత్మ వ్రాసినట్లు ఏ ప్రత్యేకత వాటిలో కనిపించలేదు. మనిషి భాషలో
కొన్నిచోట్ల మొరటుగా మాట్లాడినట్లు, భాషలో తప్పు పదములు వ్రాసినట్లు
ఆత్మ వ్రాయదు కదా! ఆత్మకు అన్ని విద్యలు తెలుసు కావున, వ్రాసే
భాషను స్వచ్ఛముగా వ్రాయగలదు. అయితే ఇక్కడ కొన్ని గ్రంథములు
చూస్తే మనిషి చేసిన పొరపాట్లు భాషలో యున్నట్లు కనిపించుట చేత 'ఇది
మనిషే వ్రాశాడు' అని అనుమానము కల్గుచున్నది. చెప్పే బోధలో మాట్లాడే
భాషలో స్పష్టత లేదు, ఎన్నో తప్పులున్నాయి. కొన్ని పదములు పలుకడము
లోనే తప్పులుగా పలుకుచున్నారు. వ్రాసిన భాషలో సరియైన భాషలేదు.
వ్యాకరణములో ఎన్నో తప్పులున్నాయి. ఆత్మ గ్రంథములు వ్రాస్తే
వ్యాకరణములో తప్పులు వ్రాయునా? ఒక పదమును విడదీసి వ్రాసేచోట
కలిపి వ్రాశారు. కలిపి వ్రాసేచోట విడదీసి వ్రాశారు. ఇటువంటి తప్పులను
చూచి “ఆత్మ ఈవిధముగా వ్రాసియుండదు” అని తెలియుచున్నది. అయితే
మీరు చెప్పేమాటలను బట్టి ఆత్మ వ్రాసియుందేమోనని నమ్మినా, వెంటనే
'ఇదంతా చెప్పుట కొరకే అలా చెప్పారు, మనిషే వ్రాసియుండునను'
అనుమానము కల్గుచున్నది. నా అనుమానమును దాచుకోకుండా
వెలిబుచ్చాను. అట్లు అడుగుట తప్పయితే క్షమించండి. అయితే మీరు
చాలాచోట్ల ‘ఏ ప్రశ్ననయినా మనస్సులో దాచుకోకుండా అడుగుటలో తప్పు
లేదు' అని చెప్పారు కనుక అడుగుచున్నాను.
జవాబు :- ఈ ప్రశ్న మీకే కాదు చాలామందికి వచ్చునదే! ఎప్పటికయినా
ఉన్న అనుమానమును దాచుకోకుండా అడుగవలెను. అప్పుడు ఆ
అనుమానము లేకుండా పోవు అవకాశము కలదు. ఇప్పుడు అడుగడము
వలన జవాబు చెప్పు నాకు ఏ బాధా లేదు. ఇంకా సంతోషముగానే
యున్నది. ఆత్మకు అన్ని విద్యలు తెలుసు. అందువలన కొందరి గ్రంథకర్త
లలోనుండి అమోఘమైన భాషను వ్రాయించును. కొందరు బోధకుల
నుండి స్వచ్ఛమయిన భాషను మాట్లాడించును. కొందరిలో అస్పష్టమైన
భాషను కూడా పలికించును. ప్రబోధానంద యోగీశ్వరులు సభలో
ఉపన్యాసము చెప్పుతూ అస్పష్టమైన భాషనే పలుకుచుండును. ఆయన
రచనలలో కూడా స్వచ్ఛమయిన భాష ఉండదు. ఆ విషయము యోగీశ్వరుల
శరీరములో సహజీవనము చేయుచున్న నాకు బాగా తెలుసు. ఇప్పుడు
జీవుడయిన నేను నా భావములను మీతో మాట్లాడి చెప్పునట్లు, ఉపన్యాసము
లలో యోగీశ్వరులు అనేక సందర్భములలో మాట్లాడినా, కొన్ని సమయము
లలో మాట్లాడు అవకాశము నాకును కల్గించుచుండును. అలా నేను
మాట్లాడు సమయములో కూడా యోగీశ్వరులే మాట్లాడుచుండును. అయితే
అప్పుడు జీవుడుగాయున్న నా భావములను యోగీశ్వరుల ద్వారా మీకు
చెప్పడము జరుగుచుండును. అలా సమయము దొరికినప్పుడు నేను
చాలామార్లు “మేము చెప్పే భాష సరిగాయుండదు. భాషను చూచి మీరు
పొరపాటు పడవద్దండి, నాణ్యమయిన, స్వచ్ఛమైన భాషలేకున్నా అన్నిటికంటే
గొప్ప భావమున్న సమాచారముండును.” అని నేనే స్వయముగా చాలామార్లు
చెప్పాను. యోగీశ్వరులయితే ఈ మాట చెప్పడు, అది జీవుడుగా నేను
నాతోటి జీవులకు హెచ్చరించుచూ చెప్పాను. అట్లు చెప్పకపోతే మాట్లాడే
భాషను, మాటపొందికనుబట్టి ఇది సరైన జ్ఞానము కాదని పొరపాటుపడు
అవకాశమున్నది. అందువలన నేనే ముందు ఆ విషయమును చెప్పాను.
ఇప్పుడు మీరు కూడా అదే ప్రశ్ననే అడుగుచున్నారు. ఇప్పుడు
నేను నాకు తెలిసిన విషయమును దాచిపెట్టుకోకుండా చెప్పవలసియున్నది.
అందువలన యోగీశ్వరులు ప్రత్యేకించి ఈ శరీరములో మాట్లాడుచున్నా,
తానే తన జ్ఞానమును ఎన్నో గ్రంథముల రూపములో వ్రాసినా, తన
జ్ఞానమును పై చూపు చూచువారు, శ్రద్ధలేనివారు, భక్తిలేనివారు ఎవరూ
తెలియకుండునట్లు భాషను అస్పష్టముగా చెప్పుట, వ్రాతను స్వచ్ఛముగా
వ్రాయక పోవుట చేయుచుండును. భక్తి, శ్రద్ధలున్నవారు నేను చెప్పు
విషయము మీద (జ్ఞానము మీద ధ్యాస కల్గియుండుట వలన నా భావము
మీద దృష్ఠి పెట్టి భాష మీద దృష్టి పెట్టకయుందురని ఆత్మ తలచుచుండును.
ఇది పైకి అందరికి నేను చెప్పు నా స్వంత మాటలేగానీ, యోగీశ్వరుల
అంతరంగములో అనగా ఆత్మ అంతరార్థములో వేరు భావమున్నట్లు
అర్థమగుచున్నది. ఈ విషయమై ప్రజలకున్న అనుమానమును, నాకు
కూడా యున్న అనుమానమును అడిగితే ఆయన అనగా మధ్యాత్మ అనగా
పొరుగువాడు ఈ విధముగా చెప్పాడు. చెప్పాడు అనడము మంచిది
కాదు. తన భావమును నాకు అందించాడు.
మధ్యాత్మ అయినవాడు, నాకు శరీరములోనే దేవుడుగా యున్న
వాడు, శరీరములోపల శ్వాసను పీల్చుచూ వదలుచూ తోడుగాయున్న
వాడు, నన్ను బ్రతుకునట్లు చేయు శరీర అధికారి అయినవాడు అయిన
ఆత్మ, అదే పనిగా సక్రమమైన భాషను మాట్లాడడము లేదు. సరియైన
భాషలో జ్ఞానమును చెప్పడములేదు. అయినా మాట్లాడే భాష సరిగా
లేకున్నా, మాట్లాడే మాటలలో ఉత్తమోత్తమమైన జ్ఞానముండును. వ్రాసే
భాష సరియైనది కాకున్నా, వ్రాసే విషయములు వ్రాయబడే జ్ఞానము
అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానముగా ఉండును. అంతగొప్ప జ్ఞానమును
జీవులుగా యున్నవారు ఎవరూ చెప్పలేరు. ఎవరికీ తెలియని జ్ఞానము
ఎలా చెప్పగలిగాడు? అను ప్రశ్న రాకముందే తన భాషలోనూ, వ్రాతలోనూ,
లోపము కనిపించనట్లు ఆత్మే చేయుచున్నాడు. ఎదుటి మనుషులు
ఆత్మగాయున్న తనను గుర్తించనట్లు, వారి చూపు ఆత్మ వరకు పోనట్లు,
అనేక అనుమానములను కల్గించునట్లు భాషను సరిగా లేకుండా చేయు
చున్నాడు, వ్రాతను సరియైన వ్రాతగా కనిపించనట్లు చేయుచున్నాడు.
ప్రశ్న :- ఆత్మయినా అలా ఎందుకు చేయాలి? ప్రజలు జ్ఞానము తెలియాలనే
కదా! ఆత్మే స్వయముగా జ్ఞానము చెప్పుచున్నది. చెప్పే దానిని సరియైన
భాషలో చెప్పి ప్రజలను ఆకర్షించేది పోయి సక్రమమైన భాషలో చెప్పక
పోవడము ఎందుకు?
జవాబు :- మనుషులము మనమైతే అలాగే చేసేవారము. ప్రజల ఆకర్షణ
కొరకు భాషను స్వచ్ఛముగా పలుకడము మొదలగునవి చేయుచుందుము.
అన్నీ చేతనయి చేతకానివలె చెప్పుటకు ముఖ్యమైన కారణము గలదు.
మనిషి చూడవలసినది భావము. చెప్పేది ఏ భావములో చెప్పబడుచున్నది
అని చూడడమే ముఖ్యము. భాషను చూచువాడు భాషా ప్రియుడేగానీ
భావప్రియుడు కాదు, అటువంటి వానికి జ్ఞానము అవసరము లేదు.
శ్రద్ధయున్న వానికే జ్ఞానము. శ్రద్ధలేనివానికి జ్ఞానము అంటుకోదు. ఆత్మ
చెప్పేబోధలో ఎవరూ చెప్పని జ్ఞానమున్నది కదా! వినేవాడు తెలివైనవాడు
అయితే, జ్ఞానము కావాలను ఆసక్తి కలవాడు అయితే భాషతో వానికేమి
పని? చెప్పిన గొప్ప జ్ఞానమును స్వీకరించవచ్చును కదా! ప్రపంచములో
ఎవరూ చెప్పని బోధను ఎదుటివాడు చెప్పుచున్నప్పుడు ఇంతవరకూ
తెలియని జ్ఞానము తెలుస్తుంది కదా!యని సంతోషపడిపోవాలిగానీ భాషను
చూడడము తగదు.
ఒకడు పెళ్ళిపెత్తనానికి ఒక ఊరికి పోయాడట. అక్కడ పెత్తనము
పోయిన ఇంటిలో అమ్మాయిని అలంకారము చేసి చూపారు. పెత్తనానికి
పోయినవాడు కాబోయే భార్యను చూడడానికే కదా! అక్కడికి పోయినది.
అక్కడ వారు మర్యాద పూర్వకముగా ఏ లోటు లేకుండా గౌరవించి పెళ్ళి
కూతురును చూపారు. అమ్మాయి చాలా అందముగాయున్నది. ఎక్కడాలేని
అందము, ఎవరిలోలేని అందము ఆమెలో యున్నది. అక్కడికి పోయిన
పెళ్ళికొడుకుకు దృష్ఠి అంతయూ మామగారి ఆస్తిమీద ఉందిగానీ కాబోయే
భార్యమీద లేదు. పెళ్ళికూతురు తండ్రి కొంత తెలివైనవాడు, ఎంతో
అనుభవమున్నవాడు. అతిలోక సౌందర్యవతిగాయున్న తన కుమార్తెను
వచ్చిన అబ్బాయికి చూపారు. అయితే ఆ దినము పెళ్ళికొడుకు మామ,
పెళ్ళికూతురుకు తండ్రియగునతడు మంచి దుస్తులు ధరించక కొంత
నలిగిపోయిన దుస్తులు, వెనుకవైపు చినిగిపోయిన దుస్తులు ధరించి
యుండెను. అమ్మాయిని చూచిన అబ్బాయి అమ్మాయి బాగుంది కదా! యని
అనుకోక మామగారు నలిగిపోయిన నిక్కరు కట్టుకున్నాడని, మామగారు
బాగాలేరు, నాకు ఈ సంబంధము నచ్చలేదు అన్నాడట. అమ్మాయి
నచ్చకపోతే సంబంధము వద్దు అనడము జరుగవలెనుగానీ, అమ్మాయిని
వదలి మామగారు నచ్చలేదు నాకు సంబంధము వద్దు అనడము సరియైన
పద్ధతి కాదు కదా! అలా అన్నవాడు అమ్మాయిని చూడను వచ్చాడా! మామను
చూడను వచ్చాడా!! అతనికి కావలసినది భార్యతో పెళ్ళా లేక మామగారి
అస్తియా? ఆస్తిని చూచి అమ్మాయి ఎటువంటిదయినా ఫరవాలేదు
చేసుకుంటానను వ్యక్తిత్వము మంచిది కాదనేగా అర్థము. అటువంటివానికి
పిల్లనిచ్చినా సుఖపడదు అని ముందే చెప్పవచ్చును. ఇది ఉపమానము.
దీనివలెనున్న విషయమును చూస్తాము.
అదే విధముగా మోక్షమును కోరువాడు, దైవసన్నిధి కావాలను
వాడు, చెప్పే బోధలోని జ్ఞానమును చూడాలి. విన్న జ్ఞానములో ఎంత
సారమున్నదో గ్రహించుకోవాలి. అక్కడ చూడవలసినది జ్ఞానమే అయినా,
చెప్పబడే జ్ఞానము ఎంతో గొప్పగా, ఎక్కడా చూడని జ్ఞానము అక్కడ తెలియు
చున్నా, తనకు కావలసినది జ్ఞానమే అయినా, మనిషి దానిని వదలి చెప్పే
వాని భాష బాగాలేదనడము, పెత్తనమునకు పోయి అమ్మాయి బాగున్నా,
అమ్మాయి విషయమును చూడక మామగారు నలిగిపోయిన నిక్కరు
కట్టుకొన్నట్లుంటుంది. అటువంటి వానికి అమ్మాయితో పనిలేదు మామగారి
ఆస్తితోనే పని అన్నట్లు, చెప్పే భాషతోనే పని చెప్పబడే జ్ఞానముతో పనిలేదను
వారికి జ్ఞానము అవసరములేదు కదా! అతనికి జ్ఞానము మీద ఆసక్తి లేనట్లే
కదా! అటువంటి వానికి జ్ఞానము తెలియకూడదనే ఉద్దేశ్యముతోనే ఆత్మ
అదేపనిగా సక్రమమైన భాషలో కాకుండా జ్ఞానము చెప్పినది
అనుకుంటున్నాను. స్పష్టమైన భాష కాకపోయినా ఆత్మ చెప్పినది అత్యంత
రహస్యమైన జ్ఞానము, ఎక్కడా తెలియని జ్ఞానము కదా! అంతగొప్ప
జ్ఞానమును చెప్పినా, దానిని గ్రహించక భాషను చూచువాడు పై వ్యక్తిని
చూచువాడు, పిల్ల అందమును చూడక మామ నిక్కరును చూచిన వానివలె
ఉన్నది. ఆత్మ అంటే ఎవరూ ఊహించని విధముగాయుండి సర్వ జీవరాశు
లలోనుండి నడుపు ఏకైక శక్తి. సర్వజీవరాశులకు శరీరములో దేవుడుగా
యున్నది ఆత్మ. ఆత్మ వలననే అసలయిన దైవమును తెలియవచ్చును.
దేవునికి జీవుడైన నీకు మధ్యవర్తిగా యున్నది ఆత్మ. అంతగొప్పదయిన
ఆత్మకు తెలియనిది ఏదీ లేదు. మనిషిని ఎట్లయినా నడుపగలడు.
ఏమయినా చేయగలడు.
శరీరములో ఇంతవరకు గొప్ప జ్ఞానులు కూడా గుర్తించనట్లు అణిగి
యున్నది ఆత్మ. అటువంటి ఆత్మను గురించి ఇంతవరకు మూడు దైవ
గ్రంథములలో తప్ప ఇతరుల ఏ గ్రంథములోనూ ఎవరూ చెప్పలేదు. ఎవరికీ
తెలియకుండా శరీరములో నిక్షిప్తమైయున్న ఆత్మ ప్రపంచములోని శరీరముల
ద్వారా అన్ని పనులు చేయుచూ ప్రతి మనిషికి దగ్గరగాయున్నది. జీవునకు
శరీరములోనే దగ్గరగాయున్నది ఆత్మ. జీవునికి అత్యంత సమీపములో
యున్నా ఆత్మను జీవుడు గ్రహించక శరీరములో తాను తప్ప ఎవరూ
లేరనుకుంటున్నాడు. జీవుడు జ్ఞాని అయినా శరీరములోని ఆత్మను
గుర్తించక, అసలు శరీరములోనే దృష్టిని సారించక, దేవున్ని గురించి బయట
ప్రపంచములో వెదకుచున్నాడు. అసలయిన దేవుడు ప్రపంచములో
అణువణువునా యున్నా ఆయన ఎవరికీ తెలియడు. ఏ జీవుడయినా
ఆత్మ ద్వారానే దేవున్ని తెలియాలి. ఆత్మ ద్వారా కానిది ఎవడుగానీ దేవున్ని
చేరలేడు. ఆత్మ ఎటువంటిదో ముందు తెలియనిదే పరమాత్మను చేరుటకు
వీలుపడదు. అందువలన ఆత్మజ్ఞానము తప్పనిసరిగా అవసరము. మోక్షము
పొందువాడు చనిపోవు సమయమును గురించి భగవద్గీతలో “పగలు,
సూర్యరశ్మి యున్నప్పుడు, శుక్లపక్షమి, ఉత్తరాయణ కాలములో చనిపోయిన
యోగి మోక్షము పొందును” అని చెప్పారు. దానిప్రకారము చాలామంది
జ్ఞానము తెలిసిన, జ్ఞానమును బోధించిన స్వామీజీలు కూడా చనిపోలేదంటే
వారికి మోక్షము లభించలేదనియేగా అర్థము. అంత పెద్ద స్వామీజీలకు
కూడా ఆత్మజ్ఞానము తెలియకపోవడమే కారణముగా వారు మోక్షమునకు
పోలేదు.
ప్రపంచములోని మనుషులలోనేకాక సర్వజీవులందు ఒకే ఆత్మ
అన్ని జీవుళ్ళకు తోడుగాయుండి, అన్ని శరీరములను వారివారి కర్మల
ప్రకారము నడుపుచున్నది. అందరి శరీరములలో ఆత్మయున్నా ఎంతగొప్ప
జ్ఞానులు కూడా ఆత్మను తెలియలేదు. ఆత్మ ఒకటి యున్నదను సమాచారమే
వారికి తెలియదు. ఇంతకుముందు హిందూమతములో వచ్చిపోయిన
ముగ్గురు సిద్ధాంతకర్తలు కూడా ఆత్మ ఉనికిని కనుగొనలేక పోయారు.
వారు ముగ్గురు ఆకారమున్న విష్ణువును సాకారుడని చెప్పుకోగా, అద్వైతులు
శివలింగమును పెట్టుకొని పార్వతి భర్తయిన శివుడు నిరాకారుడని
చెప్పుకొన్నారు. ఈ విధముగా ముగ్గురు సిద్ధాంతకర్తలు సాకార,
నిరాకారముల మధ్య పోట్లాడుచూ వారి సిద్ధాంతములను తయారు చేసుకొని
ప్రపంచము బయటనే దేవుడున్నాడని అనుకొన్నారు. ఎవరి చూపు
శరీరములో తమను నడుపుచున్న ఆత్మమీదికి పోలేదు. దేవుని మీద ఎంతో
శ్రద్ధ, భక్తి యున్నవానికి దేవుడే దారిచూపును. తనయొద్దకు ఎవరిని
చేర్చుకోవలెనో, ఎవరిని దూరముగా యుంచవలెనో దేవునికి బాగా తెలుసు.
తనను పూర్తిగా నమ్మి, తన మీదనే భక్తి కల్గియున్న వానికి సరియైన జ్ఞాన
మార్గమును చూపి, ఆ మార్గములో తనను చేరునట్లు చేయును. అన్యచింత
లేకుండా ఎవడయితే తననే విశ్వసించి నిత్యము తనయందే (దేవునియందే)
కలిసిపోవాలని ప్రయత్నించుచుండునో అటువంటి వాని యోగము యొక్క
క్షేమమును దేవుడే చూచుకొనును. అనగా ఆయనే అతనిని సక్రమ
మార్గములో నడిపి తనయందు చేర్చుకొనును. ఒక మనిషి దేవునియందు
చేరుటకు ఒక పద్ధతి నిర్ణయింపబడియుండును. ఆ పద్ధతిలోని మనిషిని
బలహీనుడు కాకుండా వానికి బలము చేకూర్చి, పద్ధతి ప్రకారమే నడిపి,
అనగా వాని యోగము భంగము కాకుండా చూచి యోగము యొక్క
ఆరోగ్యమును తానే చూచుకొని, వాని యోగపద్దతి సరిగాయుండునట్లు
చేసి చివరికి పద్ధతి ప్రకారము వాని కర్మంతయూ లేకుండా పోయినప్పుడు
వానిని తనలో కలుపుకొనును.
దేవునియందు చేరుటకు “యోగము” అను పద్ధతి కలదు. దేవుని
యందు చేరుటకు కావలసిన యోగపద్ధతిని దేవుడే చెప్పాలి. మనుషులకు
దేవుడు ఎట్లుండునో, దేవున్ని ఎలా చేరవలెనో తెలియదు. అందువలన
దేవుని యోగ జ్ఞానమును దేవుడే చెప్పవలసియున్నది. దేవుడు స్వయముగా
ఎవరితోనూ మాట్లాడడు. అందువలన దేవుడు ఏ విషయమును మనిషికి
తెలియజేయాలనుకొన్నా ఏదో ఒక విధముగా తెలియజేయను. దేవుడు
మనిషికి జ్ఞానమును తెలియజేయు విధానములు మూడు గలవని “అంతిమ
దైవగ్రంథము”లో దేవుడే చెప్పాడు. ఆ మూడు విధానములలో ఒకటి
'ఆకాశవాణి' ద్వారా జ్ఞానమును తెలియజేయడము. రెండు ‘తెరచాటు’
నుండి తన జ్ఞానమును తెలియజేయడము. మూడు తన అంశయైన
“భగవంతుని' ద్వారా తన జ్ఞానమును దేవుడు తెలియజేయును. ఆకాశవాణి
ద్వారా తెలియజేసినా, తన అంశయైన సాకారరూపమైన (కనిపించే
రూపమైన) మనిషి ద్వారా తెలియజేసినా, తెరచాటునుండి అనగా కనిపించని
రూపమునుండి తెలియజేసినా, మూడిటియందున్న ఆత్మయే తెలియజేయ
వలెను. ఆకాశభూతములోయున్న ఆత్మ శబ్దరూపములో జ్ఞానమును
చెప్పగా, కనిపించని సూక్ష్మరూపముగాయున్న వానిలోగల ఆత్మయే
జ్ఞానమును మాటల రూపములో చెప్పుచున్నది. వాణి నుండి, తెరచాటు
నుండి రెండు విధముల ఆత్మయే మాటల రూపములో అనగా బోధల
రూపములో దైవజ్ఞానమును చెప్పగా, మూడవ విధానమైన సాకారరూపము
నుండి అనగా కనిపించే మనిషిగాయుండి చెప్పినప్పుడు కూడా ఆ శరీరము
లోని కనిపించని ఆత్మయే దైవజ్ఞానమును గురించి చెప్పును. ఎక్కడయినా
కనిపించని ఆకారమునుండిగానీ, కనిపించే ఆకారము నుండిగానీ, ఆకారము
లోపల అణిగి ఎవరికీ తెలియకుండా యున్న రెండవ ఆత్మ (మధ్యాత్మ),
మూడవ ఆత్మయిన పరమాత్మను (దేవున్ని) గురించి చెప్పును.
జీవాత్మకు పరమాత్మకు మధ్మనయున్న ఆత్మ ఎవరికీ కనిపించదు.
ఎవరికీ వినిపించదు. అయినా అందరికీ కనిపించునట్లు చేయునది,
అందరికీ వినిపించునట్లు చేయునది ఆత్మయే. ఆత్మ దైవజ్ఞానమును ఆకాశ
వాణినుండి, తెరచాటున కనిపించకయున్న వానినుండి చెప్పు జ్ఞానము
కేవలము బోధల రూపములో మాత్రముండును. సాకారరూపమైన దైవ
ప్రతినిధి నుండి చెప్పు జ్ఞానము మాటల రూపమేగాక, వ్రాతరూపములో
కూడా లభించును. అనగా గ్రంథరూపములో కూడా లభించును. కృష్ణుడు,
ఏసు ఇద్దరి శరీరములనుండి ఆత్మ మాట్లాడినప్పుడు ఆ మాటలు ఇతరుల
ద్వారా గ్రంథరూపమైనవి. కనిపించని జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును
వినిన ప్రవక్తగారు గ్రంథరూపము చేశారు. ఇలా మూడు దైవగ్రంథములు
తయారైనవి. ఇది ఇంతవరకు గతములో జరిగిన విధానము. మూడు
గ్రంథములను మనుషులు ఆత్మ దైవజ్ఞానమును చెప్పిన తర్వాత దానినే
గ్రంథరూపముగా వ్రాశారు. అలా వ్రాయునప్పుడు వారికి అర్థముకాని
విషయములను భావము మార్చి వారికి అర్థమయిన భావమునే వ్రాశారు.
అప్పుడు దేవుని భావము వేరుగా ఉండగా మనుషులు వ్రాసిన భావము
వేరుగా ఉండడము జరిగినది. అటువంటి మానవ తప్పిదములు మూడు
దైవగ్రంథములలో అక్కడక్కడ కనిపించుచుండును. అటువంటి పొరపాట్లు
జరుగకుండా రాబోవు సాకార రూపమునుండి ఆత్మయే దైవజ్ఞానమును
శరీరము ద్వారా చెప్పడమేకాక, శరీరము ద్వారానే ఆత్మయే స్వయముగా
తాను చెప్పు జ్ఞానమును గ్రంథరూపము చేయదలచుకొన్నది. ఆత్మయున్న
శరీరము ద్వారానే గ్రంథము వ్రాయబడును.
శరీరముల లోపలయున్న ఆత్మ ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క
విధముగా ప్రవర్తించుచుండును. దైవాంశతో పుట్టిన శరీరమును
'భగవంతుడు' అని పేరు పెట్టాము. భగవంతునిగాయున్న శరీరము
సాధారణముగా అన్ని శరీరములవలె ఉండుట వలన ఎవరూ గుర్తించుటకు
వీలుపడదు. జీవుడు ఎక్కడ ఉండునో ఆత్మ అక్కడ ఆ శరీరమును నడుపు
నిమిత్తము ఉండవలెను. అయితే పుట్టిన శరీరములోనున్న జీవాత్మ దైవ
అంశముతో పుట్టినదైనప్పుడు ఆ జీవాత్మకు తోడుగాయున్న ఆత్మ అందుకు
తగినట్లు ప్రవర్తించును. దేవుని అంశతో పుట్టిన భగవంతుని శరీరములో
కూడా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఆత్మలుండును. అయితే అందరి
శరీరములలోవలె ఆత్మ అన్ని పనులు చేయుచున్నా ప్రత్యేకించి ఆ శరీరము
నుండి ఆత్మయే దైవజ్ఞానమును చెప్పును. దైవజ్ఞానమును ఆత్మ చెప్పినప్పటికీ
ఈ మారు ముందువలేకాక స్వయముగా దైవజ్ఞానమును గ్రంథరూపము
లోనికి శరీరము ద్వారా వ్రాయించును. దైవజ్ఞానమును మాటలరూపములో
అనగా బోధల రూపములో ఒక విధముగా చెప్పగా, మరొక విధముగా
గ్రంథరూపములో వ్రాయుచున్నది. శరీరములోగల రెండు విధానములను
ఆత్మ ఉపయోగించుచున్నది. ఇది ఇంతవరకు ఎవరికీ తెలియని
విషయమైనా ఇప్పుడు మేము తప్పనిసరిగా చెప్పవలసి వచ్చినది. ఇది
ఒకవిధమైన దైవరహస్యమగుట వలన జాగ్రత్తగా వినాలని చెప్పుచున్నాము.
ప్రతి శరీరములో ఆత్మ తన శక్తిని రెండు విధముల శరీరములో
వ్యాపింపజేయుచున్నదని ముందే తెలుసుకొన్నాము. అదే విషయమునే
ఇప్పుడు చెప్పుకొంటే శరీరములో ఏడు నాడీకేంద్రముల ద్వారా, మరియు
ఏడు గ్రంథుల ద్వారా ఆత్మ తన శక్తిని శరీరమంతా వ్యాపింపజేయుచున్నది.
నాడీకేంద్రముల ద్వారా ప్రవహించు శక్తి శరీర బలమును అందించు
చుండగా, గ్రంథుల ద్వారా ప్రవహించు శక్తి శరీర ఆరోగ్యమును అందించు
చున్నది. ఈ విధముగా శరీరములో రెండు విధానముల ద్వారా మనిషి
జీవితమును ఆత్మ నడుపుచున్నది. ఈ రెండు విధానములు కూడా ఈ
కాల మనిషికి తెలియవనుకుంటాను. శరీరములోయున్న ఆత్మ సర్వసాధారణ
మనుషులను ఇట్లు నడుపుచుండును. అయితే భగవంతుని శరీరములో
దైవజ్ఞానమును బయటికి చెప్పునప్పుడు శరీర నాడీకేంద్రముల ద్వారా
శరీరమంతా వ్యాపించిన శక్తిద్వారా దైవజ్ఞానమును మాటల రూపమైన
బోధలుగా చెప్పును. అదే దైవజ్ఞానమును వ్రాతరూపముగా గ్రంథములలో
వ్రాయవలసి వచ్చినప్పుడు గ్రంథులనుండి ప్రవహించు ఆత్మశక్తి ద్వారా
వ్రాయబడును. ఒక సప్తమిద్వారా బోధలు చెప్పబడును. ఒక సప్తమి
ద్వారా గ్రంథములు వ్రాయబడును. ఇట్లు శరీరములోని రెండు
విధానములను ఉపయోగించి రెండు రూపములలో దైవజ్ఞానము
వెలువడుచున్నది. అలా చెప్పబడిన బోధలలోగానీ, అలా వ్రాయబడిన
గ్రంథములలో గానీ, భావలోపములుగానీ, అన్య భావములుగానీ ఉండవు.
స్వయముగా ఆత్మయే తన రెండు రకముల శక్తులను ఉపయోగించుకొని
జ్ఞానమును చెప్పుచున్నది.
‘బోధ' అనగా బలముగా చెప్పునది లేక గట్టిగా చెప్పునదని అర్థము.
చెప్పే బోధను ఎంత బలమునయినా ఉపయోగించి ఎంత గట్టిగా (ఎంత
బిగ్గరగా) అయినా చెప్పవచ్చును. గట్టిగా అరచి చెప్పుటకు బలము నాడీ
కేంద్రములనుండి వచ్చుచున్నది. నాడీశక్తి ద్వారా పుట్టునది బోధయని
చెప్పవచ్చును. గ్రంథములను వ్రాయుటలో బలము అవసరము లేదు.
మనిషి ఆరోగ్యము మీద ఆధారపడి గ్రంథమును వ్రాయవచ్చును. మనిషి
ఆరోగ్య అనారోగ్యములు నిర్ణయించునవి శరీరములోని గ్రంథులు. గ్రంథుల
శక్తి ద్వారా వ్రాయబడునవని వాటిని గ్రంథములన్నారు. గ్రంథములను
చూచినా, బోధలు వినినా ఆ రెండూ ఆత్మశక్తి ద్వారా వచ్చినవే కనుక
జ్ఞానమును తెలిసిన మనిషిలో కూడా ఆత్మశక్తి ప్రేరణ జరిగి తెలుసుకొన్న
జ్ఞానము జ్ఞానాగ్నిగా మారును. ఆ జ్ఞానాగ్ని ద్వారా కర్మలు కాలుటకు
మొదలిడును. ఇక్కడ అనగా ప్రబోధాశ్రమములో తయారయిన ఏ
గ్రంథమయినా ప్రబోధానంద హస్తస్పర్శ తగులుతూనే ఆ గ్రంథము ఒక
శక్తి కేంద్రముగా తయారగును. ఇక్కడ తయారయిన గ్రంథముల మీద
నమ్మకము కల్గి, భక్తి కల్గి చదివిన వారికి విశేషమైన జ్ఞానశక్తి చేరును.
చదువురానివారైనా గ్రంథముల మీద భక్తి కల్గియుండి ఎప్పుడయినా వారు
బాధలచే పీడించబడునప్పుడుగానీ, బాధించబడునప్పుడు గానీ మా గ్రంథము
లను వారికి నొప్పి ఎక్కడున్నదో అక్కడ గ్రంథమును త్రాకునట్లు చేయగా
గ్రంథములోని ఆత్మశక్తి ఆ శరీరములోని బాధను లేకుండా చేయును.
ఇది జ్ఞానశక్తి ప్రత్యక్షముగా నిరూపణకు వస్తున్నది. బాధగల స్థలములో
గ్రంథము శరీరమునకు అతుక్కొనియుండి శరీరములోని కర్మను కాల్చు
వరకు శరీరమునుండి ఊడిరాదు. మా మాటల మీద నమ్మకము లేనివారికి
ఈ విధముగా కర్మ కాలిపోవుట ప్రత్యక్షముగా కనిపించుచున్నది.
ఇంతవరకు వచ్చిన సిద్ధాంతములలో వచ్చిన జ్ఞానముకంటే త్రైత
సిద్ధాంతములో వచ్చిన జ్ఞానము గొప్పదని నిరూపించుటకు దేవుడే మా
గ్రంథములలో శక్తిని నింపాడని చెప్పుచున్నాము. ఇక్కడ తయారయిన
ముస్లీమ్ గ్రంథమని చెప్పబడు “అంతిమ దైవగ్రంథము” అని మేము వ్రాసిన
ఖురాన్ గ్రంథము కూడా శక్తి నిలయమైనట్లు శరీరమునకు అతుక్కొని
పోయినది. మిగతా చోట ఎక్కడా కనపడని విధానము ఇక్కడ కనిపిస్తున్నా
మూడు మతములవారు అసూయతో మమ్ములను మాట్లాడడము వలన
మీకే నష్టము, కష్టము. ఇప్పటికయినా హిందూమతములో వచ్చిన త్రైత
సిద్ధాంతము గొప్పదని హిందువులు తెలియాలనీ, మిగతా దైవగ్రంథములలో
కూడా యున్న త్రైత సిద్ధాంతమును మిగతా క్రైస్తవ, ఇస్లామ్ మతముల
వారు గ్రహించవలెనని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాము.
సమాప్తము.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు.
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు,