సత్యాన్వేషి కథ_384 cloud text updated 1st Oct 24 part2

 


మాంత్రికుడు. వాని పేరు నాగోతుల నాగభూషణమ్. మునెప్ప మనుషులు

నాగభూషణముతో మాట్లాడుచూ వారివద్దనున్న పాముల సమీపమునకు

పోయారు. అతని వద్దనున్న పాముల సమీపమునకు పోయిన వెంటనే

వెంకు దగ్గరున్న సెన్సార్ కొద్దిగ శబ్దము చేయను మొదలుపెట్టింది. అలా

సెన్సార్ శబ్దము చేయడము వలన తమకు కావలసిన వజ్రాలపాము

అక్కడున్నదని వెంకు గ్రహించాడు. మునెప్ప మనుషులు ఆ పామును

ఎలాగైనా నాగభూషణ్ దగ్గరనుండి దొంగిలించాలనుకొన్నారు. అలా


చేయడము ఒకేమారుగా సాధ్యముకాదు. అందువలన మొదట నాగోతుల

నాగభూషణ్ చిన్నగా స్నేహము చేశారు. తమకు కావలసిన పాము

విషయమును తెలుసుకొనుటకు నాగభూషణముతో మాట్లాడను మొదలు

పెట్టారు.)


వెంకు :- నీవద్ద ఒకటి రెండు పాములు కాకుండ వందపాముల వరకు

ఉన్నాయి కదా! ఇవన్నీ ఎలా దొరికాయి. ఎలా పట్టగలిగావు. కొద్దిగ

చెప్పు వింటాము.


నాగభూషణ్ :- ఇవన్నిటిని నా పెద్దకొడుకు సరదాగా పట్టుకొన్నాడు. నేను

వీటిలో కొన్నిటిని మాత్రమే పట్టాను.


నూక :- అయితే నీ కొడుకుకు కూడా పాములను పట్టే విద్యను నేర్పినావన్న

మాట. అతను నీవద్ద ఎంతకాలము తర్ఫీదు అయినాడు.

నాగభూషణ్ :- నేను ఏమీ నేర్పలేదయ్యా! అది నేర్పితే వచ్చే విద్యకాదు.

దానికి ధైర్యముండాలి, వానికి ధైర్యముంది. పాములను పట్టుకోగలుగు

చున్నాడు. ఈ పనే వద్దని చెప్పినా ఆయన నా మాట వినలేదు.

వెంకు :- ఇవి విష సర్పాలు కదా! పాములు పట్టడములో ఏమీ ప్రమాదము

లేదా? పాము కరిస్తే ఏమి చేస్తారు?


నాగభూషణ్ :- లేకేమి, పాములే ప్రమాదకరమైనవి. ఒకవేళ ఏదైనా

ప్రమాదవశాత్తు పాముకాటువేస్తే, తెల్ల ఈశ్వరి చెట్టు పుల్లను నూరి మింగు

తాము. దానితో విషము పనిచేయకుండా పోతుంది.


నూకా :- మీవద్దనున్న పాములకు కోరలు పెరికివేయరా?


నాగభూషణ్ :- తప్పనిసరిగా పెరికి వేస్తాము. ఇక్కడున్న పాములన్నిటికీ

కోరలు పెరికేసినాము. నిన్న పట్టిన పాముకు ఒక్కదానికే ఇంకా కోరలు

తీయలేదు. అది ఒకటే విషమున్న పాము.


(మునెప్ప మనుషులు పాములన్నిటిని చూచి తమకు కావలసిన

పాము ఏదో గుర్తించుకోవాలనుకొన్నారు. అందుకొరకు నాగభూషణముతో

మంచిగ మాట్లాడుచూ ఇలా అడిగాడు.)


వెంకు :- నీవద్దనున్న పాములన్నిటిని ఒకమారు చూచి ఆనందించాలను

కొన్నాము. చూపిస్తారా?


(అందులకు నాగభూషణ్ సరే చూపిస్తానని చెప్పి అతని వద్దగల

పాములనన్నిటిని ఒక్కొక్క దానిని చూపిస్తూ, వాటి పేరును కూడా చెప్పుచూ,

వాటి విష ప్రభావమునూ, ఆ జాతి పేరునూ చెప్పుచుండెను. మునెప్ప

మనుషులు నాగభూషణము ఇతర జాతుల పాములను గురించి చెప్పునపుడు

విన్నట్లు నటిస్తుండిరి. కేవలము నాగుపాములను గురించి చూపి చెప్పునపుడు

శ్రద్ధగా వినుచుండిరి. నాగభూషణము చివరిగా చూపిన నాగుపామును

వారు గుర్తించారు. అది వారి చేతినుండి తప్పించుకొని పారిపోయిన

పాముగా తెలుసుకొన్నారు.)


వెంకు :- ఈ పామును మేము పట్టుకొని చూడవచ్చునా.

నాగభూషణ్ :- నిన్ననే పట్టిన పామన్నానే అదే ఇది. దీనికి ఇంకా విషకోరలు

పెరకలేదు. ఇప్పుడు దీనిని మీరు పట్టుకోవడము ప్రమాదము.


(విషకోరలు పెరకలేదంటూనే మునెప్ప మనుషులకు కొద్దిగ

భయమైనది. ఇంతకుముందు పాముకాటుకు గురైనారు. కావున నాగ

భూషణము దానికోరలు పెరికేంతవరకు ఆ పామును దొంగలించ కూడదను

కొన్నారు.)


నూకా :- పాముకు కోరలు పెరికేది మేము ఎప్పుడూ చూడలేదు. ఎలా

పెరుకుతారో మేము చూడవచ్చునా?


నాగభూషణ్ :- ఓ! చూడవచ్చును. సమయము చూచుకొని ఈ దినముగానీ,

రేపుగానీ పెరికేస్తాను. అప్పుడు చూడవచ్చు.


(వెదక పోయిన తీగ కాలికి తగిలినట్లు, తాము వెదకుచున్న వజ్రాల

పాము కనిపించడము మునెప్ప మనుషులకు సంతోషమైనది. దానికి

ఎప్పుడు కోరలు పెరికితే అప్పుడు దానిని దొంగలించుకొని

పోవాలనుకొన్నారు. ఆ దినము నాగభూషణమునకు తీరికలేక ఆ పాముకు

కోరలు పెరకలేదు. రెండవరోజు పెరుకుతానని నాగభూషణము చెప్పగా,

రేపు ఉదయమే వస్తామని మునెప్ప మనుషులు నాగభూషణమునకు చెప్పి

ప్రక్క ఊరికి పోయి హెూటల్లో భోజనము చేసి లాడ్జిలో పడుకొన్నారు.


నాగోతుల నాగభూషణము అన్నము తిన్న తర్వాత పడుకోవాలని

మంచమును వేసుకొను ప్రయత్నములో ఉండెను. అది ఒక చిన్నపల్లెటూరు.

ఆ ఊరు ప్రక్కనే అడవి కూడా కలదు. ప్రక్కనేవున్న అడవిలోని పులి

ఆకలిగొని ఆ పల్లెలోనికి ప్రవేశించి, ఒక ఇంటిలో దూరి ఆవును పట్టుకో

బోయింది. ఆ ఆవు తప్పించుకొని పారిపోతూ రక్షణ కొరకు నాగభూషణము

ఇంటిలోనికి దూరినది. ఆవును వెంబడించిన పులికూడా ఆ ఇంటిలోనికి

వచ్చింది. ఆవు, పులినుండి తప్పించుకోవాలని అటు ఇటు ఇంటిలో


డి పాములన్నీ చెల్లా

పరుగిడడము వలన పాములున్న బుట్టలన్నీ క్రిందపడి పాములన్నీ చెల్లా

చెదురైనాయి. అపుడు నాగభూషణము ఇంటిలోని 20 అడుగుల పొడవున్న

కొండశిలువ పులినిపట్టి చుట్టివేసింది. ఆవు మాత్రము బయటికి

పారిపోయింది.


హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు ఆ ఊరిలోని ప్రజలందరూ

నాగభూషణము ఇంటివద్దకు వచ్చారు. పులి బయటకు రాకుండ పోవడము

పాములన్ని ఇష్టమొచ్చినట్లు పారిపోవడము అందరూ చూచారు. ఇంటిలోని

పులి కొండశిలువ చేతికి దొరికినట్లు తెలిసి అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.

కొండ శిలువ తన పట్టును విడవకుండా పట్టుకొని పులికి శ్వాస ఆడకుండా

చేసి దానిని చంపివేసి చిన్నగా మింగను మొదలు పెట్టింది. ఆ గందర

గోళములో వజ్రములున్న పాము తప్పించుకొన్నదని నాగభూషణమునకు

తెలియదు. ఆ పాములో వజ్రములున్న విషయము కూడా అతనికి తెలియదు.

ప్రక్క ఊరిలో పడుకొన్న మునెప్ప మనుషులు ఉదయమే లేచి కాలకృత్యములు

తీర్చుకొని నాగభూషణము వద్దకు వచ్చారు. రాత్రి అక్కడ జరిగిన విషయ

మంతయూ తెలుసుకొన్నారు. విషపు కోరలు తీయాలనుకొన్న పాముకూడా

పారిపోయిందని అప్పుడే నాగభూషణము తెలుసుకొని ఆ విషయమును

మునెప్ప మనుషులకు చెప్పాడు. ఆ పాము పోయిన సంగతి తెలిసి మునెప్ప

మనుషులు తెల్లముఖము వేశారు. చివరకు నాగభూషణము నకు తమ

విషయము చెప్పారు. తాము విషపుకోరలు తీయని పాము కొరకే వచ్చామనీ,

దానిని పట్టిఇస్తే పదివేల రూపాయలిస్తామన్నారు. ఆ పాముకు ఎందుకు

అంత ప్రాధాన్యత ఇస్తున్నారని నాగభూషణము అడుగగా! అది ముందు

మా సర్కస్ లో పని చేసిన పామనీ, దానికి ఎన్నో వినోదములు చేయుట


తెలియుననీ, అందువలన ఆ పాము కావాలనీ చెప్పారు. అందులకు

నాగభూషణము ఇలా అన్నాడు.)


నాగభూషణ్ :- ఒకవేళ అదే పాము కనిపించినా దానిని మనమెలా గుర్తు

పట్టగలము.


వెంకు :- ఆ చింత నీకువద్దు. నీ వెంట మేముంటాము. దానిని మేము

గుర్తించగలము. అది దొరికేంత వరకూ నీ ఖర్చు కూడా మేమే భరిస్తాము.

అది దొరికిన వెంటనే పదివేల రూపాయలు ఇస్తాము.


(అది సర్కస్ పామేనని నమ్మిన నాగభూషణము వారు డబ్బు

ఇస్తామన్నారు కావున దానిని ఎలాగైనా పట్టివ్వాలనుకొన్నాడు. అప్పుడు

మునెప్ప మనుషులతో ఇలా అన్నాడు.)


నాగభూషణ్ :- నావద్ద గజ్జాలాంజనము ఉన్నది. ఆ అంజనములో

చూస్తే ఆ పాము ఎక్కడున్నదో తెలియగలదు. ఆ అంజనమును చూడాలంటే

ముందు దానికి పూజ చేయాలి. ఆ పూజకు ఐదువందల (500)

రూపాయలు ఖర్చు అగును. (ఆ మాటను విన్న మునెప్ప మనుషులకు

సంతోషమైనది. పోయిన పామును తొందరగా పట్టుకోగలమను ధైర్యము

వచ్చినది. వెంటనే 500 డబ్బును మునెప్పకు ఇచ్చి పూజను మొదలు

పెట్టమన్నారు. నాగ భూషణము అంజనమును చూచుటకు కావలిసిన

సన్నాహములన్నీ చేసుకొని, పూజ ముగించుకొని మునెప్ప మనుషులలో

వెంకు చేతనే అంజనమును చూపించాలనుకొన్నాడు. వెంకూను

పూజముందర కూర్చోబెట్టి అంజనము యొక్క డబ్బీ మూత తీసి

కనురెప్ప కొట్టకుండా అంజనమును చూడమన్నాడు. వెంకు అంజనము

చూస్తున్నాడు.)



(రాజయోగానంద స్వామి ఆశ్రమము వద్దకు వచ్చి బాగా తన్నులు

తిని పోయిన జగన్నాథ్ కుల్లాయమ్మలు స్వామివారు ఉన్నంతవరకు

రాధేశ్వరిని ఏమీ చేయలేమని అనుకొన్నారు. ఒకవైపు తమచేత ఏమీకాదని

తెలిసినా తమకు జరిగిన అవమానమునకు ఏదో ఒకటి చేయాలని,

ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రత్యక్షముగా ఏమీ

చేయలేమని పరోక్షముగా ఏమైనా చేయవచ్చునని, గొప్ప మాంత్రికుని చేత

చేతబడి చేయించాలను కొన్నాడు. చేతబడులను చేయు సామర్థ్యమున్న

మంత్రశక్తి గలవాడు నాగోతుల నాగభూషణము ఒక్కడేనని ఎవరో చెప్పగా

నాగభూషణము వద్దకు పోయి ఎలాగైనా అతనిని ఒప్పించి

రాజయోగానందస్వామికి మంత్రశక్తి చేత చేతబడి చేయించాలనుకొన్నాడు.

అలా యోచించిన జగన్నాథ్, నాగభూషణము కొరకు బయలుదేరి

పోయాడు.)



(తాను గ్రంథరూపములో ప్రచారము చేసిన ఆత్మజ్ఞానమును

గురించి ప్రజలు ఏమనుకొనుచున్నారో స్వయముగా తెలుసుకోవాలనుకొన్న

రాజయోగనంద స్వామి కొన్ని రోజులు, కొన్ని ఊర్లు తిరిగి రావాలను

కొన్నాడు. తర్వాత బయలుదేరి మొదట మద్రాసనగరమును చేరాడు.

అక్కడ తన గ్రంథములు చదివినవారు ఎందరో కలరని స్వామికి తెలుసు.

వారి అడ్రసులు స్వామివద్ద ఉన్నాయి. మొదట రాయపేటలోనున్న రవి

కుమార్ ఇంటికి పోయాడు. నేను ఫలానా ఊరినుండి వచ్చాను. నేను

రాజయోగానంద స్వామి శిష్యుడను. ఈ ఊరిలో కొన్ని సామాన్లు కావలెను.

ఆశ్రమములో స్వామివద్ద మీ అడ్రస్ చూచి వచ్చాను. నాకు కావలసిన

సామాను ఏ బజారులో దొరుకుతుందో నాకు తెలియదు. ఇక్కడ బజారు

విషయము మీకు తెలిసివుంటుంది కదా! అందువలన ఏ బజారులో ఏ


సామాను దొరుకుతుందో మిమ్ములను అడిగి తెలుసుకోనే దానికి వచ్చానని

స్వామి పూర్తి అబద్దమాడేశాడు.)


స్వామివారి బోధలకు పూర్తి ఆకర్షితుడైన రవికుమార్, వచ్చినవాడు

రాజయోగానందస్వామి అని గుర్తించలేక పోయాడు. రాజయోగా

నందస్వామి శిష్యుడనని చెప్పగానే రవికుమార్ ఎంతో ఆప్యాయతగా

పలుకరించాడు. మీకు కావలసిన సామాను ఫలానా బజారులో దొరుకుతా

యని, ఆ బజారు అడ్రసు చెప్పాడు. తర్వాత స్వామి రవికుమార్ను ఇలా

అడిగాడు.



స్వామి :- మొదట మీరెలా రాజయోగానంద స్వామి వారి జ్ఞానమును

తెలుసుకొన్నారు.


రవికుమార్ :- మొదట నేను చాలా పురాణములు చదివాను. తర్వాత

ఎందరో స్వాములు వ్రాసిన రచనలను కూడా చదివాను. అవన్నిటినీ

చెప్పడము వారివంతు, వినడము మనవంతు అని అనుకుంటే సరిపోతుంది.

కానీ వాటిని గురించి ఆలోచిస్తే అన్నీ ప్రశ్నలే మిగులుతాయి. వాటిలో

అనుమానము లేని జ్ఞానము నాకు కనిపించలేదు. రామాయణములో

రామున్ని ఆదర్శముగా తీసుకొమ్మంటారు. బహుభార్యత్వము పాప

మంటారు. రాముడు ఏకపత్నీ వ్రతుడు. అతనిలాగ ఉండాలంటారు.

భారతము లోనికి వచ్చేటప్పటికి బహుభార్యలు గల కృష్ణున్ని భగవంతునిగ

చెప్పుతారు. అక్కడ బహు భార్యలుండడము పాపమైనపుడు, ఇక్కడ బహు

భార్యలున్న కృష్ణున్ని భగవంతుడని దేనికంటున్నారని ప్రశ్నిస్తే పెద్దలు

చెప్పిన దానిని విమర్శించకూడదంటారు.


పూజల విషయానికివస్తే భక్తి పారవశ్యముతో చేసే పూజలే లేవు.

అన్నీ అర్థములేని పూజలే, ఈ పూజ ఎందుకు? ఈ పూజలో ఈ విధాన


మెందుకు? అంటే ఎవరు చెప్పేవారేలేరు. ఎట్లు చెప్పి ఉంటే అట్లు చేయి

అనేవారే ఉన్నారు. ఇక పురాణ విషయాలలోనికి వస్తే అన్నీ కల్పిత

మాటలే ఉంటాయి. మొత్తము మీద ఏ జ్ఞానమును చూచినా, ఏ పుస్తకమును

చదివినా అన్నీ సంశయములతో కూడుకొని ఉండేవి. ఇపుడు రాజయోగ

నంద స్వామివారు వ్రాసిన గ్రంథముల వలన అన్ని అనుమానములు పటా

పంచలైపోతున్నవి. స్వామివారి రచనలలో అన్ని ప్రశ్నలకూ జవాబు

లుంటాయి. మిగత పుస్తకములు చదివి అందులోని అనుమానములు

పెరిగిపోయి, వాటికి జవాబులేక ఇక దేవుడేలేడను నాస్తికవాదము నాలో

పుట్టినపుడు స్వామివారి రచనలు నాకు దొరికనవి. వాటితో నేను సంపూర్ణ

జ్ఞానిగా మారిపోయాను. ఎవరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పు స్థోమత

లోనికి వచ్చాను. స్వామివారి జ్ఞానము వలననే నాలో అంత మార్పు

వచ్చినది. ఇంత జ్ఞానమును తెల్పిన స్వామివారిని చూడాలని ఉంది, కొద్ది

రోజులలో తప్పకవస్తాను. మీరు గురువుగారి దగ్గరకు పోయినపుడు నా

నమస్కారములు తెలియజేయండి.


(అలాగేనని చెప్పిన స్వామి తాను స్వామి శిష్యునిగానే నటిస్తూ అక్కడి

నుండి వచ్చేశాడు)


(తాటిమాను మునెప్ప మనుషులలో గజజ్జాలాంజనమును చూస్తున్న

వెంకూకు వజ్రములున్న నాగుపాము కనిపించింది. దానిని వెంకు గుర్తుపట్ట

గలిగాడు. కానీ దానిప్రక్కన మరియొక నాగుపాము కూడా కనిపించింది.

వెంకు అదే విషయమును ప్రక్కనేవున్న నాగభూషణముకు తెలిపాడు.

అందులకు నాగభూషణము “అది ఎక్కడున్నదో గుర్తుపట్టగలవా” అని

అడిగాడు. "గుర్తు పట్టలేను” అన్నాడు వెంకు “అలాగైతే ఈ పామున్న


స్థలమూ, ఊరు ఏదో తెలుపమని గజజ్జాల దేవిని మనస్సులోనే అడుగు”

అన్నాడు నాగ భూషణము. అప్పుడు వెంకు తన నే పాము ఏ

ఊరిలో ఉన్నదో, ఏ ప్రాంతములో ఉన్నదో తెలుపమని కోరాడు. అట్లు

అడిగిన తర్వాత నిమిషమునకు అంజనములో కొన్ని అక్షరములు కనిపించను

మొదలు పెట్టాయి. వాటిని వెంకు నిదానముగా చదవగలిగాడు. “ఇక్కడికి

425 కిలోమీటర్ల దూరములో, తోటమర్రి అను ఊరి బయట, ఉత్తరాన

ఒక పర్లాంగు దూరములో ఈ పాము ఉన్నది." అను విషయమును వెంకు

చదివాడు.


తప్పించుకొని 24 గంటలు కూడా పూర్తికాకముందే ఆ పాము

425 కిలోమీటర్ల దూరము ఎలా చేరిందో ఎవరికీ అర్థము కాలేదు.

నాగభూషణము ఆ విషయమును కూడా అంజనములోనే తెలుసుకోవాలను

కొన్నాడు. పాము అంత దూరము ఎలా చేరిందో మనస్సులోనే వెంకూను

అడగమన్నాడు. వెంకు అలాగే అంజనమును అడిగాడు. ఒక అర

నిమిషము తర్వాత ఇలా కనిపించను మొదలుపెట్టింది. పాము

నాగభూషణము ఇంటినుండి పారిపోతూ, ఆ ఊరికి అర్థకిలో మీటరు

దూరములోనున్న నేషనల్ హైవే రోడ్డు దగ్గరకు చేరింది. ఆ రోడ్డుమీద

ఒక ప్రక్కన నిలబడి వున్న లారీక్రింద దూరిపోతూ లారీకి వెనుకవైపు

క్రింద భాగమునగల స్టెప్నీ క్యారియర్లో టైరుమీద చిన్నకప్పను చూచింది.

పాము ఆకలితో ఉన్నందున ఆ టైరు మీదికి మెల్లగ ఎక్కి కప్పను నోటితో

పట్టకొని మ్రింగను మొదలు పెట్టింది. అంతలోనే డబ్బాతీసుకొని దొడ్డికి

పోయిన క్లీనర్ వచ్చి రైట్ చెప్పాడు. లారీ స్టార్టయింది. ఆ శబ్దమునకు

పాముకు కళ్ళు కనిపించలేదు. అక్కడే టైరుమీదనే ఉండిపోయింది. లారీ

రాత్రంతయూ ప్రయాణించింది. చివరకు తోటమర్రి గ్రామము దగ్గర


లారీ ఇంజను చెడిపోయి లారీ ఆగి పోయింది. వెంటనే పాము టైరు మీది

నుండి దిగిపోయినట్లు వెంకూకు తెలిసింది. ఆ విషయమునే

నాగభూషణమునకు తెలిపాడు.)


వజ్రములున్న పాము ప్రక్కనే ఉన్న మరో నాగుపాము సామాన్యమైన

పాముకాదని వారికి తెలియదు. ఆ పాముకు గుహలోని మహాత్ముడు శక్తి

నిచ్చి పంపాడు. మహాత్ముని ఆదేశానుసారము గుహనుండి బయటికి

వచ్చిన పాము తమను అంజనములో చూస్తున్నట్లు గ్రహించింది. వెంటనే

తోకతో కొట్టింది. ఆ వేటు ఇక్కడ అంజనము చూస్తున్న వెంకుకు తగిలింది.

వెంకు అబ్బా అని ముఖము విదిలించుకొన్నాడు. పాము కొట్టినదని తెలుసు

కొన్న నాగభూషణమునకు ఆశ్చర్యమైనది. అంజనమును మూసివేశాడు.

పిశాచములైన పాములే అంజనములో అలా కొట్టగలవు. కానీ ఈ పామెలా

కొట్టిందని నాగభూషణము యోచించసాగాడు. మునెప్ప ముఠావాళ్ళు

రెండవ పాముమీద ధ్యాస వుంచక, వజ్రములున్న పామును ఎలాగైనా

పట్టుకోవాలను పట్టుదలతో వెంటనే తోటమర్రి ఊరుకు బయలుదేరాలను

కొన్నారు. కానీ నాగభూషణము మాంత్రికుడు కావున రెండవ పామును

గురించి ఆలోచించ సాగాడు. పాముకు గొప్పశక్తి ఉంటే తప్ప అలా

కొట్టలేదని తెలిసిన నాగ భూషణమునకు లోపల కొద్దిగ భయము ఉండినా,

మునెప్ప మనుషుల వత్తిడికి సరే పోదాము అన్నాడు. మునెప్ప మనుషులు

కిరాయికి కారును తెచ్చేదానికి పోయారు. అంతలో జగన్నాథము అక్కడికి

వచ్చాడు. జగన్నాథము వెంటవచ్చిన మనిషి నాగభూషణమును పరిచయము

చేశాడు. అప్పుడు జగన్నాథము నాగభూషణముతో ఇలా అన్నాడు.

జగన్నాథము :- నీతో ముఖ్యమైన పనివుంది. విషయమంతా ఊరికి

పోయిన తర్వాత చెప్పుతాను. ఇప్పుడు వెంటనే నావెంట రావాలి.

నాగభూషణ్ :- లేదు. నాకు ఇప్పుడు వేరే పనివుంది రాలేను.


జగన్నాథమ్ :- నీవు ఇపుడే రావాలి. ముఖ్యమైన పని, లక్షరూపాయలు

ఇస్తాను.


నాగభూషణ్ :- ఏమాత్రము వీలుకాదు. నేను ఇప్పుడు ముఖ్యమైన పనిమీద

పోవుచున్నాను. ఇప్పుడు పోకపోతే మాకు దొరికేది జాగామారిపోతుంది.

అది జాగా మారిపోకనే అక్కడకు పోవాలి.


(అంతలో మునెప్ప మనుషులు కిరాయి జీపు తీసుకొని వచ్చారు.

జగన్నాథము మాటలు విని “నీవెవడవయ్యా పానకములో పుల్లలాగ? నాగ

భూషణము నీవెంటరాడు మావెంట వస్తాడు. నీవు వచ్చిన దారినే పో”

అన్నాడు. వారి మాటలువిని జగన్నాథమునకు కోపము వచ్చి ఇలా

అన్నాడు. )



జగన్నాథము :- ఏమిరా, వచ్చిన దారినే పో! అని మర్యాదలేకుండా మాట్లాడు

తావా! మీరు ఎవరో క్రొత్తవారుగా ఉన్నారు. నాకథ మీకు తెలియదను

కుంటా, జాగ్రత్త! మర్యాదగా మాట్లాడండి.

వెంకు :- ఒరేయ్ మేము నీ అబ్బలాంటివాళ్ళకు అరచేతిలో నీళ్ళు తాపిన

వాళ్ళము. మా పనికి అడ్డము వచ్చింది కాకుండా, మమ్ములనే జాగ్రత్త

అంటావా. నీ దగ్గర డబ్బుందని పెద్ద షావుకారిననుకున్నావేమో, నిన్ను

కూడా కొనే స్థోమత మాకుంది నీవే మాకు మర్యాద ఇచ్చి మాట్లాడు.


(అంతలో నాగభూషణము కలుగజేసుకొని జగన్నాథమునకు నచ్చ

జెప్పాడు. “వీళ్ళు సర్కస్ మనుషులు, వీరిని మంచి చేసుకోవాలి. చెడ్డ

చేసుకోకూడదు. వీరిలో పెద్ద బరువులు ఎత్తే పహిల్వాన్లు కూడా

ఉన్నారు. వీరితో ఎక్కువ మాట్లాడకూడదు” అని చిన్నగ చెప్పాడు. చాటుగా

నాగభూషణము చెప్పిన మాటలు విని జగన్నాథము తగ్గిపోయాడు. మునెప్ప

మనుషులకు క్షమాపణ చెప్పి సర్దుకపోయాడు. తర్వాత పది రోజులకు



తనతో కలువమని నాగభూషణము జగన్నాథముకు చెప్పి మునెప్ప మనుషు

లతో సహా బయలుదేరి పోయాడు.)



(రాజయోగానంద స్వామి తన జ్ఞానము ప్రజలలో ఏమి మార్పు

తెచ్చిందో చూడాలని ఆశ్రమము వదలి పోవునపుడు, తిరిగి తాను వచ్చేంత

వరకు రాఘవను, ఆటవికులను ఆశ్రమములోనే ఉండునట్లు నియమించి

పోయాడు. అందువలన రాఘవ మరియు ఆటవికులు ఆశ్రమములోనే

ఉన్నారు. రాఘవ తన విషయమును కూడా స్వామికి ఇంకా చెప్పలేదు.

అందువలన స్వామి వచ్చిన తర్వాతనే ఆయనకు విషయమును చెప్పవలె

ననుకొన్నారు. స్వామి రాకకొరకు ఎదురు చూస్తు కాలము గడుపుచుండిరి.

ఒక దినము దారిన పోయే ప్రయాణికులు, వారు వెంట తెచ్చుకొన్న

అన్నమును తినేందుకు, త్రాగునీరు కోసము ఆశ్రమానికి వచ్చారు.

ఆశ్రమము, దారికి కొద్ది దూరములో ఉండుట వలన అప్పుడప్పుడు మంచి

నీటికొరకు ఎవరైనా వస్తుంటారు. ఆరుమంది వచ్చారు. అందరూ అన్నము

తినేదానికి కూర్చున్నారు. కానీ ఒక్కడు మాత్రము అన్నము ముందర

కూర్చొని అన్నమును ఏమాత్రము తినకుండా తిరిగి లేచి ప్రక్కన

కూర్చొన్నాడు. మిగత ఐదుమంది భోజనము చేశారు. ప్రక్కన కూర్చున్న

వాడు కడుపునొప్పితో బాధపడుచుంటే మిగతవారు వానిని ఓదారుస్తున్నారు.

వారిని చూచిన రాఘవ ఏదో కడుపునొప్పిలే అనుకున్నాడు. కొద్దిసేపటికి

వాని కడుపు ఎక్కువ లావుగా తయారైనది. ముందు సాధారణముగా

ఉన్న కడుపు కొద్దిసేపటికే అలా లావుకావడము రాఘవకు విచిత్రముగా

కనిపించింది. అప్పుడు రాఘవ వారిలో ఒకరిని ఇలా అడిగాడు.)


రాఘవ :- ఆయన అన్నము కూడా తినలేదు. ఆకలి కడుపుతోయున్న


వానికి కడుపునొప్పి ఏమిటి? మరియు విచిత్రముగా కడుపు ఉబ్బిపోవడ

మేమిటి? ఇది ఏమి రోగము.


ప్రయాణికుడు :- ఇది రోగము కాదయ్య బాబూ! ఇది దయ్యము, మా

కర్మకొద్దీ దాపురించింది. మూడు సంవత్సరముల నుండి బాధపెట్టుచున్నది.

ఎవరూ నయము చేయలేక పోయారు. ఇపుడు ఈ ప్రక్క ఊరికి మళయాల

మాంత్రికుడు వచ్చాడట, ఆయన ఎటువంటి దయ్యమునైనా వదలగొట్టి

కాపాడగలడట, అందువలన ఆయనవద్దకు పోవుచున్నాము. అయితే

బయలుదేరినప్పటినుండి ఈ బాధ మాటిమాటికి వస్తున్నది. ఇప్పుడు

చూచారుగా అన్నమును కూడా తిననియ్యలేదు.


రాఘవ :- ఇది దయ్యము వలన వచ్చే బాధయని మీకెలా తెలుసు. కడుపులో

ఏదైన రోగముండి ఇలా కావచ్చును కదా!


ప్రయాణికులు :- లేదయ్యా బాబూ, ఇది నిజముగా దయ్యమే. మేము

కూడా మొదట మీలాగే అనుకొనివుంటిమి. కానీ ఇతనిలోని దయ్యమే

అతని మీదికి వచ్చి మాట్లాడింది. అప్పటినుండి ఇది రోగము కాదు

దయ్యమని తెలిసింది.

(దయ్యముల విషయములు తెలియని రాఘవకు వారి మాటలు

విచిత్రముగా తోచాయి. క్రొత్త విషయములలో సత్యమెంత, అసత్యమెంత

అని తెలుసుకొను రాఘవ దాని విషయము పూర్తిగా తెలుసుకోవాలను

కొన్నాడు. )


రాఘవ :- ఇలా దయ్యము బాధ మీకొకరికేనా లేక మీలా బాధపడువారు

ఇంకా ఉన్నారా?

ప్రయాణికుడు :- ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. ఎన్నో రకముల


బాధపడుచున్నాము. ఇటువంటి బాధలు డాక్టర్లకు, మందులకు అంతు

బట్టవు. వీటిని భూతవైద్యులు మాత్రమే నయము చేయాలి. ఆ భూత

వైద్యులు ఎక్కడో ఒకచోట ఉంటారు. అయినా వారు దానికని, దీనికని

డబ్బులు లాగుతారు. కానీ దయ్యము మాత్రము పోదు. ఒక భూతవైద్యుని

చేతిలో ఒక దయ్యము పోతే, పది దయ్యములు పోకుండా మొండికి

వేయుచున్నవి. ఇప్పటికి మేము చాలామంది భూతవైద్యుల వద్దకు

పోయాము. డబ్బులు పోయాయి కానీ మా బాధ తీరలేదు. ఏమయ్యా

పోలేదే అంటే మేము చేసేది చేశాము అంటారు. ఏ దేవునికి మ్రొక్కినా,

ఎన్ని ముడుపులు కట్టినా మా బాధ తీరలేదు. ఎక్కడ వైద్యుడున్నాడంటే

అక్కడికి పోవుచున్నాము. మా కర్మను ఏ మహానుభావుడు తీర్చగలడో.

ఉన్నది ఒకే కొడుకు పెళ్ళైయి నెలకూడా కాకుండానే ఈ బాధ తగులుకొన్నది.

వాడు భార్యతో కాపురము కూడా చేయలేకున్నాడు. ఇక్కడున్న వైద్యులందరూ

అయిపోయారు. కేరళనుండి ఎవరో వైద్యుడు వచ్చాడని విని పోవుచున్నాము.

బయలుదేరినప్పటినుండి అన్నము కూడా తినలేదు. వానిని చూస్తే ఏడుపు

మాకు వస్తావుంది.


(వారిని చూచి వారి బాధను అర్థము చేసుకొన్నాడు. కానీ అది

దయ్యము వలన కలిగే బాధయని రాఘవకు నమ్మకము లేదు. అందువలన

అది రోగమే అయివుంటుందని అనుకొన్నాడు. తనకు తెలిసిన మూలికలతో

కడుపునొప్పిని పోగొట్టవచ్చును అనుకున్నాడు. అయితే ఆ మూలికలు

ఇక్కడ దొరకవు. వాటికోసము తనవెంట వచ్చిన వారిని అడవికి పంపి

వాటిని తెప్పించుకోవాలనుకొన్నాడు. అయితే అంతవ్యవధి లేదు. అప్పుడు

ఏదో ఒకటి చేసి వానికి కడుపునొప్పిని తగ్గించాలనుకొన్నాడు. చేతితో

పొట్టను అదుముట వలన కొంత నొప్పిని తగ్గించవచ్చునని అనుకొని,


కడుపు నొప్పి ఉన్నవానివద్దకు పోయి నీ కడుపునొప్పి ఎక్కడున్నది, ఇక్కడనా

అని అతని కడుపుమీద తన చేతివ్రేలిని పెట్టి అడిగాడు. రాఘవ చేయి

పెట్టినచోటే అతనికి కడుపునొప్పి ఉండేది. అయితే రాఘవ తన చేతి

వ్రేలును కడుపు మీద పెట్టిన వెంటనే అతనికి నొప్పి ఏమాత్రము లేకుండా

పోయినది. వెంటనే ఆ వ్యక్తిలో మార్పువచ్చింది. అతను నాకు కడుపునొప్పి

పోయిందని సంతోషముగా చెప్పాడు. అతను అలా చెప్పడములో అతని

వెంట వచ్చిన వారు సంతోషించారు. అతని మాట విన్న రాఘవకు

ఆశ్చర్యమైనది. అతను నిజము చెప్పుచున్నాడా, అబద్ధము చెప్పుచున్నాడా

అని అనుమానము వచ్చినది. తాను ఏమీ చేయకనే అతని కడుపునొప్పి

ఎలా పోతుంది అని అనుమానము ఏర్పడినది. అంతవరకు కడుపునొప్పితో

బాధపడుచున్న వారి మనిషి ఒక్కమారుగా రాఘవ వలన నొప్పినుండి

బయటపడడము వారికి ఆశ్చర్యమైనది.


రాఘవకు మాత్రము అతని మాటమీద నమ్మకము కలుగలేదు.

నేను ఏమీ చేయలేదు కదా! నొప్పి ఎక్కడుందియని చేయిపెట్టాను. అంత

మాత్రముననే మొత్తము నొప్పి పోయిందంటాడేమిటి, వీడు ఏదో నటన

చేయుచున్నాడనుకొన్నాడు. అయినా వీరితో నాకెందుకు చర్చ అనుకొని

“బాగైనది కదా! ఇకపోయిరాండి” అన్నాడు. రాఘవ మాటవిన్నవారు

ఇలా అన్నారు. "ఇంత సులభముగా ఇంతవరకు ఎవరూ ఈ నొప్పిని

లేకుండా చేయలేదు. ఈ నొప్పి ప్రతి దినము వస్తుంది. రెండు రోజులు

ఇక్కడేవుండి ఇక ఆ నొప్పిని రాకుండ వైద్యము చేయించుకొని పోతాము.

మీరు ఎంత అడిగితే అంతడబ్బు ఇస్తాము. మాకు పూర్తి నయము చేసి

పంపండి" వారి మాట విన్న రాఘవ వీరిని బాగా కరిపించుకొంటినే

అనుకొన్నాడు. వీడేమో నొప్పి అని నటన చేస్తున్నాడు. వారేమో దయ్యము

బాధ అనుకొంటున్నారు. నన్నేమో పెద్ద వైద్యుడని అనుకొన్నారు. వీడు


రేపు మళ్ళీ నొప్పి వచ్చిందంటే నేనేమి చేయాలి. ఉన్న మర్యాద కాస్త

పోతుంది. అందువలన వీరిని ఇక్కడినుండి పంపివేయడము మంచిదనుకొని

ఇలా అన్నాడు. )


రాఘవ :- నేను చెయ్యిపెట్టిన తర్వాత ఆ నొప్పి ఎలా వస్తుంది. రేపురాదు,

మర్నాడు రాదు. ఊరక ఇక్కడెందుకుండాలి. మీరు పోవచ్చు.

ప్రయాణికుడు :- లేదయ్యా బాబూ, ఒక దినమైన నీవద్ద ఉంటే

బాగుంటుందనుకొన్నాము.


రాఘవ :- ఇక్కడ నిష్టతో పూజలు జరుగుచున్నవి. పూజ చేసే సమయములో

ఇక్కడ క్రొత్తవారు ఎవరూ ఉండకూడదు. అందువలన పొమ్మంటున్నాను.

నెలరోజుల వరకు క్రొత్తవారు ఎవరూ ఉండకూడదు.

ప్రయాణికుడు :- వీనికి నొప్పివస్తే మేము ఎక్కడికి పోవాలి? నెలరోజులు

రాకూడదంటే ఎలాగ?


రాఘవ :- నేను ఇక రాదని చెప్పానుగా, అది వస్తుందని మీరెందుకు

అనుకోవాలి? నా మాట మీద నమ్మకము పెట్టుకొని పోండి. అది ఇకరాదు.

(రాఘవ మాటవిన్నవారు అది రాకపోతే అంతకంటే సంతోషమేముంది

అనుకొని అక్కడినుండి పోయారు.)


(రాజయోగానంద స్వామి ప్రజల మధ్యలో తిరుగుచూ తన జ్ఞానము

మీద ప్రజలకు అవగాహన ఎలా ఉందో తెలుసుకోవడానికి మరియొక

భక్తుని ఇంటికి పోయాడు. తాను రాజయోగానంద స్వామి శిష్యుడనని

తెలిపి, స్వామివారు “ఈ గ్రంథమును మీకిమ్మన్నాడు. ఈ దారిన పోతున్నాను

కావున ఇస్తానని తెచ్చాను”. అని తాను రచించిన ఒక గ్రంథమును ఆ

భక్తునికి ఇచ్చాడు. ఆ భక్తుడు కూడా గ్రంథముల ద్వారా పరిచయమే.


కావున వచ్చిన వ్యక్తి రాజయోగానంద స్వామియేనని తెలుసుకోలేక

పోయాడు. గ్రంథమును తీసుకొన్న ఆ భక్తుడు స్వామితో ఇలా అన్నాడు.)


భక్తుడు :- స్వామివారు ఎంతో ఆప్యాయతతో ఈ గ్రంథమును పంపాడు.

చాలా సంతోషము స్వామివారికి నా నమస్కారములు తెలుపండి. మీరు

ఆశ్రమానికి గురువుగారి దగ్గరకు అప్పుడప్పుడు పోతుంటారా?


స్వామి :- అవును వారానికి రెండుమార్లు వెళ్ళుచుంటాము. అక్కడ గురువు

గారు చెప్పే జ్ఞానమును శ్రద్ధగా వింటుంటాము.


భక్తుడు :- అలాగా మీరెంతో అదృష్టవంతులు. దగ్గరవుండి గురువుగారి

ముఖత జ్ఞానమును వింటున్నారు. మేము చాలా దూరములో ఉన్నాము.

ఇంతవరకు గురువుగారిని చూడడానికి మేము నోచుకోలేదు. ఆయన

గ్రంథముల ద్వారా తెలిపిన సమాచారమును చదివి ఎంతో జ్ఞానాన్ని తెలుసు

కోగలిగాము. మొదట మాలో ఎంతో అజ్ఞానముండేది. మేము ఇతరులు

వ్రాసిన కొన్ని ఆధ్యాత్మిక పుస్తకములను చదివి మేము ఎంతో గొప్ప

జ్ఞానులము అనుకొనెడివారము. తర్వాత అదృష్టవశాత్తు స్వామిగారు వ్రాసిన

గ్రంథ మొకటి చదివాను. ఆ గ్రంథములో ఎన్నో నాకు తెలియని జ్ఞాన

విషయములను తెలుసుకొన్న తర్వాత అంతవరకు నాలో ఎంత

అజ్ఞానముండేదో అప్పుడు అర్థమైనది. అంతవరకు నేను గొప్ప జ్ఞానిని

అనుకొనే వానిని. స్వామివారి గ్రంథముతోనే నాకు ఎన్నో విషయములు

తెలియవనీ, నేను తెలుసుకోవలసింది చాలావున్నదనీ అప్పుడర్థమైనది.

అప్పటినుండి స్వామి వ్రాసిన గ్రంథములను చదువుచున్నాను. ఈనాడు

స్వామి రచనలు వలన నేను కొంత జ్ఞానిగా మారానని తృప్తిగా ఉన్నది.


స్వామి :- అలాగా! మీరు స్వామి వారి రచనలనుండి మీకు తెలియని

విషయములు ఏవి గ్రహించారు?


భక్తుడు : - ఒక్క విషయమేమిటి, ఎన్నో లెక్కలేనన్ని విషయములను తెలుసు

కొన్నాను. మొదట నేనొక భక్తునిగా దైవరాధన చేసెడివాడిని. విభూది

ధరించేవాడిని, కొబ్బరికాయలు కొట్టేవాడిని, గోవిందా అని గొంతెత్తి అరిచే

వాడిని. ఆనాడు నేను చేసేదే నిజమైన భక్తి అనుకొనెడివాడిని. కానీ

స్వామివారు తన గ్రంథములో నీవు ఏ అర్థముతో గోవిందా అంటున్నావు?

ఏ అర్థముతో విభూది ధరిస్తున్నావు, అని అన్నిటినీ నిలదీసి ప్రశ్నించినపుడు

నేను చేసే ప్రతి పని అర్థములేనిదని అప్పుడు తెలిసింది. ప్రక్కవారిని

చూచి చేస్తున్నాను తప్ప, ఇది ఫలానా అర్థముతో కూడుకొని ఉన్నదని

తెలిసి చేయడములేదు. ఇటువంటి పరిస్థితిలో అంతో ఇంతో భక్తిగలవారము

అనుకొన్న వారంతా గొర్రెల దాటి అన్నట్లు ఒకరును చూచి ఒకరు

చేయడము తప్ప ఇతరత్రా అర్థము తెలియదనుకొన్నాను. ఇటువంటి

సమయములో అన్నిటికీ ప్రశ్న జవాబులు రెండూ ఆయనే చెప్పుచూ, ఎవరికీ

తెలియని విషయములన్నీ గ్రంథరూపములో వివరించాడు. ఇప్పుడు పూజ

అంటే ఏమిటో వాటి ఆచరణాల అర్థమేమిటో పూర్తి తెలిసింది. ఒకనాడు

తెలియక ఎంత అజ్ఞానములో ఉంటినో, ఈనాడు తెలిసి ఎంత జ్ఞానములో

ఉన్నానో నాకే అర్థమైనది. ఈనాడు చాలామంది చేసే పూజల వెనుక

కోర్కెయే ముఖ్యమైన విషయముగా ఉన్నది. ఒకప్పుడు నేను కూడా ఏ

పూజ చేసినా ఏదో ఒక కోర్కెతోనే చేసేవాడిని. చేతులెత్తి నమస్కరిస్తున్నా

మంటే ఆ నమస్కారము దేవున్ని ఏదో ఒక కోర్కె కోరే నిమిత్తమే ఉంటుంది.

కానీ మనము చేసే పూజల వెనుక దైవసాన్నిధ్యమును చేరే అర్థమెంతో

ఉందనీ, ప్రతిపూజ ఎంతో అర్థముతో కూడుకొనివున్నదనీ నేడు స్వామి

వారి రచనల వలన తెలిసినది. స్వామివారు పూజా విధానముల నుండి

గొప్ప యోగ విధానముల వరకు అర్థము చెప్పారు. ఏది ఏమైనా స్వామి

వారి కృషి మాలాంటి వారిని ఎందరినో మార్చి సఫలీకృతమైనది.


(తన రచనలు కొందరి మీద ఎంతటి ప్రభావాన్ని చూపాయో,

ఎంతటి మార్పు తెచ్చాయో రాజయోగానంద స్వామి స్వయముగా

గమనించాడు. అతని నుండి ఇంకా కొంత సమాచారమును తెలుసుకొను

నిమిత్తము ఇలా అన్నాడు. )


రాజయోగా :- దేశములో ఎందరో భక్తి కల్గినవారున్నారు. వారందరు

బహుశ నీవన్నట్లు ఏదో ఒక పద్ధతిగా చేయువారే, కానీ నిజముగా వారికి

అర్థము తెలిసివుండదు. అలాంటివారు స్వామి గ్రంథములను చదవడము

వలన వారిలో కూడా మార్పువచ్చి సంపూర్ణ జ్ఞానులుగా మారివుంటారా?

భక్తుడు :- సత్యము తెలుసుకోవాలను దృష్టితో ఎవరు చదివినా తప్పకుండా

మారుతారు. మూర్ఖముగా మొండివాదన చేయువారు ఎప్పటికీ మారరు.

వారికి తెలుసుకోవాలని ఉండదు. తమకు అన్నీ తెలుసు అను ఉద్దేశములో

ఉంటారు. ముఖ్యముగా స్వామివారి రచనలు దాదాపు 40 సంవత్సరముల

వయస్సులోపలనున్న వారందరిని మార్చగలిగాయి. అంతకంటే ఎక్కువ

వయస్సున్నవారు తక్కువగా మార్పు చెందారు.


రాజయోగా :- అదేమిటి, వయస్సు గడచిన వృద్ధులకే జ్ఞానము బాగా

అర్థమైవుంటుందనుకొంటాను. మరి నీవేమో చిన్న వయస్సువారికే ఎక్కువ

వంటబట్టిందంటున్నావు. అందులోని విశేషమేమిటి?


భక్తుడు :- చిన్న వయస్సులో ఉండువారు తమకు అన్ని విషయాలు

తెలియవు. తెలియని విషయాలను తెలుసుకోవాలని ఉంటారు. మరి

పెద్దవయసు వారేమో మాకు అన్నీ తెలుసు, మేము తెలుసుకోవలసినది

ఏమీలేదు అనే ఉద్దేశ్యములో ఉంటారు. చిన్న వయస్సువారు కల్పిత

కథలనూ, పురాణ గాథలను చదివివుండరు. అందువలన వారి మనస్సులో

ఏమీ ఉండవు. కావున స్వామివారి జ్ఞానము స్వచ్ఛముగా వారి మనస్సుకు


అంటుకోగలదు. మరి వృద్ధులైతే వారు పురాణగాథలు చదివివుంటారు.

ఎన్నో కల్పిత కథలను కాలక్షేపము కొరకు వినివుంటారు. అవి వారి

మనస్సులో అంటుకొని వుంటాయి. అటువంటి వారికి సత్యమైన

విషయములు తెలిసినప్పటికీ ముందుగానే వారి మదిలోనున్న విషయముల

కంటే ఇవి రుచింపవు. అలాంటపుడు సత్యమైన విషయములనే హేళన

చేసి మాట్లాడుదురు. కానీ మనకు ముందు తెలిసిన వాటికీ వీటికీ ఏమి

తేడా అని యోచించరు. వారికి ముందు తెలిసిన అసత్యములను వదలలేరు,

సత్యమును గ్రహించ లేరు. కొంత జ్ఞానము తెలుసుననీ, కొంతమందిలో

పేరున్న మేమా ఇతరులు చెప్పిన దానిని తెలుసుకోవలసింది అను గర్వము

కూడా ఉండును. అందువలన వృద్ధులకంటే యువకులకే ఎక్కువగా

స్వామివారి జ్ఞానము అంటుకొన్నదని అనుకొంటున్నాను.


స్వామి :- మీరు ఊహించి చెప్పుచున్నారా, లేక ఏదైనా అనుభవము వలన

అంటున్నారా?


భక్తుడు :- కొన్ని అనుభవముల వలననే అంటున్నాను. స్వామివారి

గ్రంథములను నేను చదివిన తర్వాత కొంతమంది వృద్ధులకు మీరు చదవండి

అని ఇచ్చాను. కానీ వారు వాటినుండి గ్రహించినది ఏమీలేదు. వారు

విమర్శలు చేయడము తప్ప వారికి లాభించినది ఏమీ లేదు.


రాజయోగా :- పొగడ్తలకంటే విమర్శలనే ఎక్కువ స్వీకరించాలి. ఎదుటి

వారి విమర్శల ద్వారా మనలోని తప్పులను సరి చేసుకోవచ్చని స్వామి

వారు చాలామార్లు చెప్పారు. అలాంటపుడు విమర్శలను సేకరించి స్వామి

వారికి తెలియజేయవచ్చును కదా!


భక్తుడు :- స్వామివారి ఉద్దేశ్యము మంచిదే. వీరు చేయు విమర్శలు

ఏవైతే ఉన్నాయో అవి విమర్శల పద్ధతిలో లేవు. అసూయతో మాట్లాడు


మాటలు తప్ప అవి విమర్శలు కావు. తలతోక లేని ఆ మాటలను

స్వామిగారికి చెప్పేదానికంటే ఊరకుండడము మంచిది.

రాజయోగా :- స్వామిగారిని విమర్శించిన అటువంటి విమర్శలు ఏవైనా

మీ అనుభవములో ఉన్నాయా?


భక్తుడు :- ఉన్నాయి. అందులో ముఖ్యమైన దానిని గురించి చెప్పుతాను

విను. గుంతకల్లులో హిందూపరిషత్ ఆఫీసులో జరిగిన విషయమిది.

అక్కడ నేను, స్వామివారు వ్రాసిన జ్ఞానము చాలాగొప్పగా ఉన్నదనీ, ఆయన

మన మతములో పుట్టినందుకు మనమందరము గర్వించ తగ్గ విషయమని

చెప్పాను. అప్పుడు అక్కడున్న హిందూపరిషత్ సభ్యుడు మరియు కమ్మ

కులమునకు చెందిన రమేష్ చౌదరికి నాకు సంభాషణ జరిగింది.

రమేష్ :- రాజయోగానంద స్వామి హిందువు కాదు క్రైస్తవుడు. ఆయన

హిందువుల ముసుగులో క్రైస్తవ మతమును గురించి బోధిస్తున్నాడు.

నేను :- అంత మూర్ఖముగా మాట్లాడిన ఆ వ్యక్తిని చూచి, ఇంతకూ ఇతను

మనిషేనా అని అనుమానము వచ్చినది. మనిషే అయితే అంత మూర్ఖముగా

ఎలా మాట్లాడుచున్నాడని ఎందుకు అలా చెప్పుచున్నావని అడిగాను.

రమేష్ :- ఆయన సృష్టికర్త కోడ్ 963 అని ఒక పుస్తకము వ్రాశాడు. అది

క్రైస్తవ సంబంధమైనది.


నేను :- ఆ పుస్తకమును నేను చదివాను. నీవు చదివావా? చదవకనే

మాట్లాడుచున్నావా?


రమేష్ :- అటువం


నేను :- నీవు చదవకుండా హిందూమతమునకు వ్యతిరేఖమైనదని ఎలా

చెప్పగలుగుచున్నావు?


రమేష్ :- సృష్ఠికర్త అను పదమును క్రైస్తవులే వాడుతారు.

నేను :- సృష్ఠికర్త అను పదము ప్రపంచము పుట్టినప్పటినుండి ఉన్నది.

సృష్టికర్త అను పదమును పూర్వము ఎందరో ఎన్నో సందర్భములలో చెప్పారు.

అటువంటి పదమును చరిత్ర తెలియని నీవు మనది కాదు క్రైస్తవులది

అంటావా? అనాదిగానున్న సృష్ఠికర్త అను పదమును నిన్న మొన్న వచ్చిన

క్రైస్తవ మతమునకు నీవేమైనా లీజుకు ఇచ్చావా? ఈ మాటను నీవు

హిందువుగా ఉండి మాట్లాడడమే విచిత్రము.

రమేష్ :- నీకు ఆయన విషయము అర్థము కాలేదు. భగవద్గీతను అడ్డము

పెట్టుకొని హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నాడు.


నేను :- నా అనుభవముతో చెప్పుచున్నాను. హిందువులు బైబిలు చదువు

వారున్నారు. కానీ క్రైస్తవులు ఎప్పటికీ వారి బైబిలును వదలి వేరే పుస్తకమును

ముట్టుకోరు. క్రైస్తవుడు వారి బైబిలులోని విషయములు చెప్పి క్రైస్తవ

మతములోనికి మార్చుచున్నారంటే అర్థముంది. కానీ భగవద్గీతను అడ్డము

పెట్టుకొని క్రైస్తవులుగా మార్చడము ఇంతవరకు ఎక్కడా జరుగలేదు. ఏ

క్రైస్తవుడూ ఇంతవరకు భగవద్గీతను ముట్టుకోవడము నేను చూడలేదు.

భగవద్గీతను అడ్డము పెట్టుకొని క్రైస్తవమును చెప్పుచున్నాడనుటకు నీ దగ్గర

ఏమైనా ఆధారము కలదా?


రమేష్ :- నీకు అర్థము కాలేదు అంకుల్, ఆయన మన భగవద్గీతలో లేని

దానిని సృష్టికర్తకోడ్ 963 అని పురుషోత్తమ ప్రాప్తియోగము 16,17

శ్లోకములు అని వ్రాశాడు. అలాంటి నంబర్ మన గీతలో లేదు. దీనికి

ఏమంటావు?

నేను :- నీది తెలివి తక్కువ అంటాను. ఇంకా అంటే నీవు హిందువే

కాదు అంటాను. నాకు 70 సంవత్సరముల వయస్సు. నేను ఇంతవరకు


ఎన్నో భగవద్గీతలు చదివాను. స్వామివారు వ్రాసిన భగవద్గీతను కూడా

చదివాను. మనదేశములో వ్రాయబడిన మూడువందల ఇరవై (320)

భగవద్గీతలను మించిన జ్ఞానమును స్వామి వ్రాసిన గీత అందించింది.

ఈ మాటను నేను ఒక్కడినే కాదు. ఆయన వ్రాసిన గీతను చదివిన

ప్రతివాడు చెప్పే మాట ఇది. నీకు జ్ఞానము అంటే ఏమిటో తెలియదు.

అంతపెద్ద స్వామినే నీవు అజ్ఞానముగా మాట్లాడితే ఎలా? నీవు, నేను

హిందువును అని చెప్పుకొంటూ ఈనాడు ఎవరికీ తెలియని

హిందూధర్మములను తెలుపు స్వామిని విమర్శించి మాట్లాడడము ఒక

హిందువుగా నీకు తగిన పనేనా? ఆయన సృష్టికర్త కోడ్ 963 అని వ్రాసి

దానికి మూలమును భగవద్గీతలో వివరముగా చూపాడు. నీవు ఆ

పుస్తకమును చదివింటే నీకు అర్థమయ్యేది. ఒక క్రైస్తవ గురువు సృష్టికర్త

కోడ్ 666 అని పుస్తకము వ్రాస్తే హిందువులము అని పేరు పెట్టుకొన్న

ఎవరుగానీ దానిని ఖండించలేదు. స్వామి వారు స్పందించి సృష్ఠికర్త

మీకొక్కరికే కాదు. మీ మతము పుట్టకముందు నుండి ఉన్నవాడు

సృష్టికర్తయని చెప్పి వారు వ్రాసిన దానికి వ్యతిరేఖముగా సృష్టికర్త కోడ్

963 అని వ్రాశాడు. మీరు చేయలేని పనిని ఆయన చేశాడు. అంతేకాక

బైబిలులో ఆదికాండము అబద్దాల పుట్ట అని అదే పుస్తకములో వ్రాశాడు.

ఇంతవరకు మేము హిందువులము అని పేరు పెట్టుకొన్న వ్యక్తులుగానీ,

సంస్థలుగానీ ఆదికాండము అబద్ధాలపుట్ట అని ఎవరైనా అన్నారా? అలా

అనుటకు మీకు ధైర్యము లేకున్నా, ధైర్యముగా చెప్పిన స్వామీజీని క్రైస్తవుడని

ఎలా అంటున్నారు. నేను ఎన్ని రోజులు బ్రతికినా ఫరవాలేదు నా జ్ఞానము

చిరస్థాయిగా ఉండాలని ఇతర మతములను కూడ లెక్కచేయకుండా ఉ

న్నది ఉన్నట్లు చెప్పుచున్నాడు. మీరు హిందూ సంస్థలని పేరు పెట్టుకొని

రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారు. నేను చెప్పునది నిజమో కాదో

నీవే చెప్పు.


రమేష్ :- నీవు ఎన్నైనా చెప్పు అంకుల్. ఆయన మన మతము యొక్క

పేరే మార్చేశాడు. మనది హిందూమతమని ముందునుండి చెప్పుకొంటు

న్నాము కదా! అటువంటి దానిని ఆయన ఇందూమతమని అంటున్నాడు.

అంతేకాక మనది మతము కాదు పథము అంటున్నాడు.


నేను :- మనది మతము కాదు పథము అని జవహార్ లాల్ నెహ్రూ కూడా

అన్నాడు. వివేకానందుడు కూడా అన్నాడు. వివేకానందుడు, నెహ్రూ

అనగా తప్పుకానిది ఈయన అంటే తప్పు అయిందా! హిందూ అను

పదమును ఇందూ అని చెప్పాడు అంటున్నావు. అలా ఎందుకనాలో

“ఇందూ సాంప్రదాయము” లను గ్రంథములో వివరముగా చెప్పాడు కదా!

దానిని నీవు చూచావా చూడకనే మాట్లాడితే మంచిదా? ఇందూ అను

శబ్దము మొదట ఉండేదని కాలక్రమేపి హిందూగా మారినదని కూడా

చెప్పారు కదా! ముందు నీవు ఆయన వ్రాసిన గ్రంథములు చదువు. నీ

తెలివి ఎంతదో ఆయన జ్ఞానము ఎంతదో తెలుస్తుంది. నేను రెడ్డిని,

స్వామి చౌదరి, నేను ఆయన గొప్పతనమును గురించి చెప్పుచున్నాను.

నీవు చౌదరివై కొంతైనా అభిమానము కూడా లేకుండా ఆయనను గురించి

ఏమీ తెలియకుండా మాట్లాడము ఎట్లుందో చూచుకో. నేను చివరిగా

ఒకమాటను చెప్పుచున్నాను. మీ చౌదరి కులములో ఇంతవరకులేని

వజ్రము పుట్టిందనుకో. ఆయన మన దేశములో పుట్టిన సాటిలేని జ్ఞాని,

తిరుగులేని యోగి అనుకో.


రమేష్ :- ఆయనను అలా పోల్చుకోవడానికి ఆయనేమైనా, వివేకానందుడా

లేక వీరబ్రహ్మముగారా?


నేను :- సరే ఇప్పుడు నీవన్నమాట దగ్గరకే వస్తాను. రాజయోగానంద

వివేకానందాకాదు, వీరబ్రహ్మమూగాదు. స్వయాన వీరబ్రహ్మముగారే


నాలుగువందల సంవత్సరములనాడు వ్రాసిన కాలజ్ఞానములో “ప్రబోధా

శ్రమము ఉన్నతమైన జ్ఞానముకలది" అని వ్రాయడమేకాక, “ప్రబోధా

శ్రమము వారు శయనాధిపతి గుణము కల్గియున్నారు” అని వ్రాశాడు.

“శయనాధిపతి యైన ఆనందగురువే, నాకు మీకు గురువు" అని కూడా

వ్రాశాడు. స్వయాన బ్రహ్మముగారే రాజయోగానందను తన గురువుగా

చెప్పుకొన్నపుడు, ఈయన బ్రహ్మముగారని నేనెలా చెప్పగలను. ఇకపోతే

హిందూమతములో వివేకానందుని నీవు గొప్పగా చెప్పుకొనినా

రాజయోగానందస్వామి వివేకానందునికి సమానుడుకాదని నేను కూడా

చెప్పుచున్నాను. ఎందుకనగా వివేకానందునివలె ఏసుప్రభువును

నమస్కరిస్తానని రాజయోగానంద ఎప్పుడూ చెప్పలేదు. రాజయోగానంద

ఇందూధర్మములను బోధించు చుండగా ఈయనను మీరు క్రైస్తవమత

ప్రచారకులనినపుడు 1896 డిశంబర్ 25 తేదీన క్రిస్మస్ రోజు వాటికన్

సిటిలోని పీటర్స్ చర్చిలో ప్రభువు ప్రార్థనలో పాల్గొనిన వివేకానందున్ని

క్రైస్తవుడు అనాలా? అసూయతో మాట్లాడక ఒక్క విషయమును

యోచిస్తాము. స్వామి వివేకానంద సమగ్ర, సప్రమాణిక జీవితగాథ 2వ

భాగములో 17వ పేజీయందు రెండవ పేరాలో స్వయాన వివేకానందుడు

అన్న మాటలు ఇలా ఉన్నవి. "నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి

జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితోకాదు, నా హృదయ

రుధిరముతో కడిగి ఉండేవాన్ని ప్రభువు పాదాలను తన రక్తముతో కడిగి

ఉండేవాడినని వివేకానందుడు అన్నాడు కదా! అయితే ఆయన క్రైస్తవ

మతమును ప్రచారము చేసినట్లేనా? రాజయోగానంద ఒక్క దేవునికి తప్ప

ఎవరికి మొక్కుతాననలేదే!, ఎవరిని ప్రార్థన చేయలేదే! అలాంటపుడు

వివేకానందున్ని గొప్ప హిందువని చెప్పుకోవడమూ, రాజయోగనందను

క్రైస్తవ ప్రచారకుడనడములో అర్థము ఏమైనా ఉన్నదా? చెప్పు రమేష్ నా


మాటకు జవాబు చెప్పు. ఊరకనే నోరు ఉందని మాట్లాడితే దానివెనుక

ఎంత పాపము వస్తుందో మీకు అర్థము కాలేదు. నీవు ఇప్పుడు

రాజయోగానందను వివేకానందుడా, వీర బ్రహ్మముగారా అన్నావు కదా!

అంతటి వాడు కాడు అని నేను చెప్పాను నా జవాబు అర్థమైయిందా.



(ఈ విధముగా ఆ భక్తుడు స్వామిని గురించి తనలో దాగివున్న

అభిమానమునంతయూ ప్రస్తావించినట్లయినది. అప్పుడు స్వామి ఇట్లన్నాడు.)

స్వామి :- మీరు స్వామి కులమును గురించి చెప్పారు. స్వామి కులమునకు

విలువివ్వడు. అన్ని కులములను సమానముగా చూస్తాడు. ఆయన 

మాటలతో చెప్పునదే కాకుండా ఆయన ఇతర కులములో పెళ్ళి చేసు

కొన్నాడు. తాను ఎవరికి పెళ్ళి చేసినా కులాంతర వివాహములే చేయు

చున్నాడు. మీరు కులము అనుకొనినా ఆయనలో కులముల అభిమానము

లేదు.


భక్తుడు :- వాడు అన్నీ అజ్ఞానముగానే మాట్లాడుచున్నాడు. అందువలన

అజ్ఞానికి అజ్ఞానముతోనే చెప్పాలని అలా చెప్పాను.


(తర్వాత స్వామి తన పర్యటనలో మరొక చోటికి పోవాలనుకొని

బయలుదేరి పోయాడు)


(గజజ్జాలాంజనమును చూచిన తర్వాత మునెప్ప ముఠాతో సహా

నాగభూషణము కూడా బయలుదేరి తోటమర్రి అను గ్రామ ప్రాంతమునకు

చేరుకొన్నారు. అక్కడ పామును అన్వేషించసాగారు. చివరికి ఆ గ్రామము

నకు ఒక మైలు దూరములోనున్న పెద్దమర్రిచెట్టు దగ్గర ఆ పాము ఉన్నట్లు

గ్రహించారు. అందరూ అక్కడికి బయలుదేరి పోయారు. అక్కడికి పోయి


చూడగా అక్కడొక విశాలమైన మర్రిచెట్టు ఉన్నది. మర్రిచెట్టు కొమ్మలకు

ఊడలు దిగి భయంకరముగా ఉన్నదా వృక్షము. ఆ వృక్షము యొక్క

మొదలును చూస్తే పెద్దతొర్ర కలిగి రాక్షసగుహలాగ కనిపిస్తున్నది.

విశాలమైన మొదలుకు ఐదు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పుగా

కనిపిస్తున్న ఆ తొర్రమధ్యలో భూమిలోనికి కూడా కొంతలోతుగా వుండి

చీకటిగా కనిపిస్తున్నది. ఆ చెట్టు చాలా పురాతనమైనది. ఈ చెట్టును

బట్టియే ఆ ఊరికి తొర్రమర్రి అని పేరు పెట్టారు. ఆ పేరు కాలక్రమమున

తోటమర్రిగా మారినది. ఆ మహావృక్షము కొమ్మల ఊడలు భూమిలో దిగి

కొన్ని ఎకరముల విస్తీర్ణములో వ్యాపించి ఉన్నది. బయలుదేరి పోయిన

వారంతా ఆ చెట్టు క్రిందికి పోయారు. సూర్యరశ్మి క్రిందపడని ఆ చెట్టు

నీడలో నిలుచున్న మునెప్ప ముఠా మనుషులకు మాంత్రికుని మాయా

స్థలములోనికి పోయినట్లయినది. అక్కడ కొంత భయము కల్గినా ధైర్యము

తెచ్చుకొని చెట్టుకొమ్మలవైపు పైకి చూచారు. ఆ చెట్టు కొమ్మలలో ఎన్నో

వేల పక్షులు, అనేక జాతి పక్షులు నివాసము ఏర్పచుకొని ఉన్నాయి. ఆ

చెట్టు క్రింద ఇది పగలా లేక సంధ్యవేళా అన్నట్లు వెలుతురు తగ్గిన నీడ

ఆక్రమించి భయానకముగా కనిపిస్తున్నది.


చెట్టుక్రింద అక్కడక్కడ ఎత్తుగా పెరిగిన పుట్టలు కొన్ని ఉన్నాయి.

అక్కడికి స్మశానము దగ్గరగా ఉన్నందున నక్కలు, హైనాలు తెచ్చుకొన్న

శవాల పుర్రెలు, చేతి ఎముకలు అక్కడక్కడ కనిపిస్తున్నవి. ఎప్పుడూ ఎవరూ

ఆ చెట్టు సమీపమునకు గానీ, చెట్టుక్రిందికిగానీ వచ్చిన సూచనలు లేవు.

ప్రజలు ఎవరూ ఆ చెట్టు దరిదాపునకు రాకుండా పోవడానికి ఒక బలమైన

కారణము గలదు. అది ఏమనగా! ఆ చెట్టు దగ్గరకు పోయి దాని కొమ్మలు

విరిచిన వానికి శరీరములోని అవయవములు నిర్భలమై చచ్చు పడిపోవును.

కనీసము ఆ చెట్టు క్రిందికి పోయివచ్చినంత మాత్రమున అతనికి ఏదో



ఒక విచిత్ర జబ్బువచ్చి, ఏ మందులకు నయము కాకుండా పోవడము

జరుగుచున్నది. ఇటువంటి విచిత్ర సంఘటనలకు భయపడిన ప్రజలు,

ఆ వృక్షము యొక్క దరిదాపుకు పోయెడివారు కాదు. మనుషులు ఎవరూ

అక్కడికి రానందున ఆ స్థలము పక్షులకు, పాములకు, చిన్న చిన్న మృగము

లకు నివాసమై పోయింది. అక్కడికి పోయిన మునెప్ప మనుషులకు,

నాగభూషణమునకు పుట్టల ప్రక్కన నక్కలు త్రవ్వుకున్న రంధ్రములు

కనిపించాయి. చెట్టు మొదలు దగ్గరకు పోయి చీకటిగానున్న చెట్టు తొర్ర

లోనికి టార్చిలైట్ వెలిగించి చూచారు. భూమికి నాలుగు అడుగుల

లోతుగానున్న ఆ తొర్రలో ఒక హైనా (కొరనాసి) నిదురిస్తూ కనిపించింది.

మునెప్ప ముఠా మనుషులు ఒకరి ముఖము ఒకరు చూచుకొన్నారు. వారివద్ద

రివాల్వర్లు మొదలగు ఆయుధములున్నాయి. కావున వారు ధైర్యముగా

ఉన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలమను ధీమా వారికున్నది.

వారి మనస్సులో వారికి కావలసిన పాము యోచనతప్ప ఏమీలేదు. ఆ

విషయమును గురించి నాగభూషణమును ఇలా అడిగారు.)


వెంకు :- మనకు కావలసిన పాము ఎక్కడుంది? దానిని ఎలా మనము

కనుక్కోగలము.


నాగభూషణము :- మనము అంజనము ద్వారానే ఆ పామును కనుక్కోవాలి.

కానీ ఇక్కడ అంజనమును చూడడము అంత సులభముగా నాకు తోచడము

లేదు. ఇక్కడికి మనుషులు ఎవరూ వచ్చినట్లు కనిపించడము లేదు. ముందు

ఈ చెట్టును గురించి, ఈ ప్రాంతమును గురించి తెలుసుకోవడము మంచిది.

అందువలన దగ్గరగానున్న తోటమర్రి గ్రామములోనికి పోయి నేను ఈ

చెట్టు విషయము తెలుసుకొని వస్తాను. మీరు అంతవరకు ఇక్కడకానీ, లేక

ప్రక్కన గానీ ఉండండి.


వెంకు :- మేము ఇక్కడే ఉంటాము. నీవు పోయి తొందరగా తెలుసుకొనిరా.


(అలాగేనని నాగభూషణము అక్కడినుండి పోయాడు. నాగ

భూషణము పోయి కొంతసేపైనది. మునెప్ప మనుషులు జీపులో కొందరు

కూర్చున్నారు. జీపు ప్రక్కన రగ్గులు పరుచుకొని కొందరు కూర్చొని బిస్కెట్లు

తింటున్నారు. అంతలో ఎవరో తరిమినట్లు పక్షులన్నీ ఒక్కమారుగా బెదిరి

పోయి కొమ్మల మీదనుండి లేచాయి. అవి లేచిన వైనమును చూచి మునెప్ప

మనుషులకు భయము ఆశ్చర్యము రెండూ కల్గినవి. ఎందుకు లేచాయో

అని అనుకొని తిరిగి వారి పనిలో లగ్నమైనారు. అంతలో గుడ్లగూబ

బెదిరిస్తూ మూల్గింది. గుడ్లగూబ మూల్గుడు ఎన్నో మార్లు, ఎన్నోచోట్ల

వారు విన్నారు. కావున దానిని గురించి వారు పట్టించుకోలేదు. వారు

ఒకరి ముఖము ఒకరు చూచుకొని ఇక్కడ అన్నీ భయములాగే ఉన్నాయి.

అందుకే ఇక్కడికి ఎవరూ రావడములేదనుకుంటాను, అని అనుకుంటూ

మాట్లాడుకొనుచున్నారు. అంతలో సంధ్యవేళ కావొచ్చినది. చెట్టు క్రింద

ముందుగానే వెలుతురు తగ్గిపోను మొదలు పెట్టింది. నాగభూషణము

ఇంకా రాలేదే అని వారు ఊరి ప్రక్క చూస్తున్నారు.


అంతలో చెట్టు పైనుండి ఏదో దభీమని పడిన శబ్దమైనది. అందరూ

అటు తిరిగి చూచారు. ఒక్కమారు అందరూ భయపడిపోయారు. చిరు

చెమటలు పోశాయి. వారికి ఐదు లేక ఆరు గజముల దూరములో

నుండి ఒక అస్థిపంజరము పడినది. అది మనిషి అస్థిపంజరము. అది

పూర్తి ఎముకల రూపములో లేకుండా, దాని ఎముకలకు అక్కడక్కడ ఇంకా

కొన్ని మాంసపుకండలు కరుచుకొని పచ్చిగా ఉన్నది. భయమును పుట్టించు

ఆ అస్థిపంజరమును చూస్తూనే మునెప్ప మనుషులు భయపడి పోయారు.

వారు ఆ భయమునుండి తేరుకోకముందే ఆ అస్థిపంజరము కదలి లేచి


కూర్చుంది. ఆ దృశ్యమును చూచినవారు అందరు కొన్ని అడుగులు వెనక్కి

వేసి అటువైపే చూస్తున్నారు. కూర్చున్న అస్థిపంజరము చిన్నగ కదలి లేచి

నిలబడింది. అది నిలబడగానే మునెప్ప మనుషులలో భయము మరీ

ఎక్కువైనది. అంతలో చిన్నగ రెండు కాళ్ళను నేల మీద ఈడ్చుకొంటూ

ఆ అస్థిపంజరము కొద్దికొద్దిగా ముందుకు రాజొచ్చింది. వెంటనే వారు

కాలికి బుద్ధి చెప్పారు. వారి పరుగు నేను ముందో నీవు ముందో

అన్నట్లున్నది. రెండు ఫర్లాంగుల దూరము పోవువరకు వారు వెను తిరిగి

చూడలేదు. వారికి ఎప్పుడూ ఇటువంటి అనుభవము ఎదురుకాలేదు.

అందువలన పూర్తి భయపడి పోయారు. రెండు ఫర్లాంగులు అలా పరుగిడిన

తర్వాత వెంకు ధైర్యము చేసి వెనుతిరిగి చూచి నిలబడ్డాడు. తర్వాత

అందరూ నిలబడినారు. వారికి అక్కడినుండి ఏమీ కనిపించలేదు. రెండు

నిమిషములు నిలబడిన తర్వాత వారిలో వారు ఇలా అనుకొన్నారు.)


ఒకడు :- మనము పరుగెత్తకుండా అందరము అక్కడే ఉండివుంటే

బాగుండేది. ఏమి జరుగునో చూస్తావుంటిమి.


రెండవవాడు :- అక్కడే ఉంటే బాగుండేదని ఇప్పుడు అంటున్నావు. అక్కడ

ఉంటే బాగుండదనేగా నీవు పరిగెత్తినది. ఏమి జరుగుతుందో చూస్తా

వుంటిమి అంటున్నావు. ఏమి జరిగేది అక్కడే తెలిసింది కదా! అది

నేరుగా మనమీదికి రావడము జరిగింది కదా!


మూడవవాడు :- బ్రతికిన మనుషులకే భయపడని వాళ్ళము చచ్చిన మనిషిని

చూచి భయపడడము దేనికి?


నాల్గవవాడు :- అయితే నీవు అక్కడే ఉండకుండా ఎందుకు పరుగెత్తావు?

మూడవవాడు :- మీరు అందరూ పరుగెత్తుచుంటే నేనూ పరిగెత్తాను.

అంతేకానీ దానికి నేను భయపడలేదు.


నాల్గవవాడు :- అయితే మేమేనా భయపడేది. అందరము కలిసి పోదాము

పదండి దాని కథ తేలుద్దాము.

వెంకు :- వద్దు. మూర్ఖముగా ప్రవర్తించకూడదు. అందరము ఇక్కడే

ఉందాము. అదేదో పిశాచముల నిలయమైనట్లున్నది. నాగభూషణము

వచ్చేంత వరకు ఇక్కడే ఉందాము. ఎందుకు తొందరపడాలి.


(అలా వెంకు మాటలు విని అందరూ అక్కడే ఉన్నారు. పది

నిమిషముల తర్వాత నాగభూషణము వచ్చాడు. వెంకు మిగతావారు

అక్కడుండడమును చూచి ఇదేమి ఇక్కడున్నారని అడిగాడు. వాళ్ళు జరిగిన

విషయమంతా చెప్పారు. ఆ విషయమును విన్న నాగభూషణముకు ఏమీ

అర్థము కాలేదు. నీవేమి తెలుసుకొని వచ్చావని వెంకు నాగభూషణమును

అడిగాడు. అప్పుడు నాగభూషణము వెంకు వైపు చూచి "ఈ చెట్టువద్దకు

ఎవరూ రారంట, ఒకవేళ వస్తే వచ్చినవానికి ఏదో ఒక వ్యాధివచ్చి బాధింప

బడుతారని మనలను కూడా అక్కడికి పోవద్దని గ్రామస్థులు చెప్పుచున్నారు.

అంతేకాక ఆ చెట్టు కొమ్మలను విరచిన వారికి శరీరములో అవయవములు

పని చేయకుండ చచ్చుపడి పోతాయట” అని అన్నాడు.


గ్రామస్థులు చెప్పిన విషయములనూ, ఇప్పుడు మునెప్ప మనుషుల

ముందర జరిగిన సంఘటనలనూ చూస్తే ఇక్కడేదో తెలియని రహస్యమున్నట్లు

నాగభూషణమునకు అర్థమైనది. ఆ రహస్యమును తెలుసుకొని, ఆ వృక్షము

దగ్గరకు పోయి, ఆ పామును పట్టుకోవాలంటే తనకు తెలిసిన ఉపాయము

ఒక్కటే గలదు. అది ఏమంటే "పొట్టిసైతాన్" అను ఒక శక్తిని ఒక

మనిషిలోనికి ఆవహింపజేసి దానిద్వారా ఆ చెట్టు రహస్యమును తెలుసు

కోవాలనుకొన్నాడు. ఆ విషయమునే మునెప్ప మనుషులకు చెప్పాడు.

చెట్టు యొక్క రహస్యమును తెలుసుకొని పామును పట్టాలంటే, పొట్టిసైతాన్


తప్ప మరియొకటి దిక్కులేదని మాంత్రికుడైన నాగభూషణము తెలిపాడు.

“ఎంత ఖర్చయినా ఫరవాలేదు ముందు పొట్టి సైతాన్ న్ను పిలిచి ఆ

విషయమేమిటో తెలుసుకో” మళ్ళి చెప్పారు మునెప్ప మనుషులు.


నాగభూషణము స్మశానములో పూజ చేయాలంటే దానికి కావలసిన

సామాగ్రి మొదలగు ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు రాత్రి పొట్టి సైతాన్

పూజ మొదలు పెట్టాలనుకొన్నాడు. నాగభూషణము మునెప్ప మనుషులను

తనకు రక్షణగా పెట్టుకొని పూజ సాగించాలనుకొన్నాడు. పొట్టిసైతాన్

వచ్చేముందు చాలా భయంకరమైన మొదలగు శబ్దములు ఏర్పడుతాయి.

కానీ వాటికి భయపడకూడదని మునెప్ప మనుషులకు నాగభూషణము

ముందే చెప్పాడు. కొన్ని భయంకర శబ్దముల తర్వాత పొట్టి సైతాన్

ఛాయగా ప్రత్యక్షమౌతుంది. అపుడు ఒక మనిషిలోనికి దానిని

ఆవహింపజేస్తాను. అపుడు ఆ మనిషికి వేడిరక్తముతో కలిపిన అన్నము

పెట్టాలి. అలా పెట్టిన తర్వాత అది శాంతించి మనము అడిగిన

విషయములన్నీ చెప్పగలదని నాగభూషణము తెలిపి ఆవాహనకు తగిన

మనిషిని మునెప్ప మనుషులలోనే ఒకరిని ఏర్పాటు చేసి పెట్టుకొన్నాడు.


మరుసటి దినము మధ్యరాత్రినుండి ప్రారంభమైన పూజ గంటసేపు

సాగింది. అంతవరకు భయానక వాతావరణము మధ్య స్మశానములో

లేని ధైర్యమును తెచ్చుకొని మునెప్ప మనుషులు జాగ్రత్తగా ఉన్నారు. కొద్ది

సేపటికి వారికి కొద్ది దూరములో భయంకరమైన చిత్రవిచిత్ర శబ్దాలు

వినిపించను మొదలు పెట్టాయి. ముందే ఈ విషయమును నాగభూషణము

చెప్పివుండుట వలన ఆ శబ్దములకు ఎవరూ భయపడలేదు. జంతువుల

అరుపులు, పులుల గాండ్రింపులు కూడా వినిపించాయి. అలా జరిగిన

కొద్దిసేపటికి “ఢాం” అను శబ్దము కనులు మిరుమిట్లుగొల్పు వెలుగు వెలిగి


వినిపించింది. అందరూ అటువైపు చూచారు. వారి ముందర మండుచున్న

అగ్ని వెలుతురులో ఛాయగా మూరెడు పొడవున్న మరుగుజ్జు ఆకారము

కనిపించింది. ఆ ఆకారమును గమనించిన మాంత్రికుడైన నాగభూషణము

పూజముందర కూర్చున్న మనిషిలోనికి చేరమని దానిని ఆజ్ఞాపించాడు.

వెంటనే ఆ ఆకారము కనిపించకుండ పోయి ఎదురుగా కూర్చున్న మనిషి

లోనికి చేరిపోయింది. అప్పుడు ఆ మనిషి ఊగేదానికి మొదలు పెట్టాడు.

వెంటనే వేడి రక్తమును కలిపిన అన్నమును అతని ముందర పెట్టమని

నాగభూషణము చెప్పాడు. వేడిరక్తము కొరకు సిద్ధముగా ఉంచుకొనిన

కోడిపుంజును వారు గొంతుకోయుటకు ప్రయత్నించారు. అప్పుడు ఆ

కోడిపుంజు రెక్కలు గట్టిగా అల్లాడించి వారి చేతినుండి తప్పించుకొన్నది.

దానిని పట్టుకొనుటకు కొందరు ప్రయత్నించగా అది వారికి దొరకకుండా

చీకటిలోనికి పారిపోయింది.


అంతలో మనిషిలోనికి ఆవహించిన పొట్టిసైతాన్ కళ్ళు తెరిచింది.

కళ్ళు తెరిచిన వెంటనే తనకు ఆహారము లేనిదానివలన అక్కడున్న మనుషుల

వేడిరక్తమును త్రాగాలని పైకి లేచింది. ఇదంతా గమనించిన నాగభూషణము

కూడా భయపడ్డాడు. ఆ సమయములో దానిని ఎవరుగానీ, ఏ మంత్రము

గానీ ఆపలేదని నాగభూషణమునకు బాగా తెలుసు. పొట్టి సైతాన్

ఆవహించిన మనిషిని గట్టిగ పట్టుకొమ్మని మునెప్ప మనుషులకు చెప్పాడు.

అపుడు పొట్టిసైతాన్ ఆవహించిన మనిషిని పట్టుకొనేదానికి మునెప్ప

మనుషులు ప్రయత్నించారు. అయినా ఫలితము లేకపోయింది. వారు

ప్రమాదమును కొని తెచ్చుకొన్నట్లయినది. ఎంతమంది అదిమిపట్టుకొనినా

అందరిని విదిలించివేయుచున్నది. పొట్టి సైతాన్ ఆవహించిన మనిషి

పట్టుకొన్న వారిని విదిలిస్తే వారు గాలిలో తేలియాడి క్రిందపడుచున్నారు.


బలమైన మనుషులను కూడా విసిరి వేయడమును చూచి వారంతా భయపడి

పోయారు. పొట్టిసైతాన్ ఆవహించిన మనిషి ముఖము భయంకరముగా

మారిపోయింది. కాళికాదేవిలాగ నాలుకను బయట పెట్టివున్నాడు. ఆ

మనిషి శరీరములో ఎన్నో రెట్లు ఎక్కువ బలము వచ్చి చేరింది. మునెప్ప

మనుషులకు ఎటూ దిక్కుతోచని స్థితిలో అందరూ వచ్చి నాగభూషణము

వెనుక చేరారు. ఆ సైతాన్ చేతిలో తమచావు తప్పదనుకొన్నారు. ఒక

చిన్న తప్పుకు ఎంత పని జరిగిందను చింత నాగభూషణములో కూడా

చోటు చేసుకొన్నది. వారందరిలో బలము లేనట్లయింది, వారు కదలకుండ

అలాగే నిలిచిపోయారు. పొట్టి సైతాన్ ఒక్కొక్క అడుగు వారివైపు

వేయసాగింది.


అప్పుడు నాగభూషణమునకు ఒక యోచన వచ్చింది. వెంటనే

ప్రక్కనేవున్న కత్తి తీసుకొని, తన చేతిని గాయపరుచుకొని, రక్తముకారునట్లు

చేసి, ఆ రక్తమును ప్రక్కనున్న నైవేద్యపు అన్నములోనికి కలిపి పొట్టి సైతాన్

ముందరకు త్రోసాడు. వెంటనే పొట్టిసైతాన్ ఆ నైవేద్యమును తిని కొద్ది

సేపటికి శాంతపడినది. తర్వాత ఏమి చేయాలో తెలిసిన నాగభూషణము

మంత్రించిన కొబ్బరికాయను దానిముందర పగులకొట్టాడు. అపుడది

భయపడుచు “ఎవరు నా అధికారి, నన్నెందుకు పిలిచారు?" అన్నది. ఆ

మాటకు జవాబుగా నాగభూషణము “నేనే నీ అధికారిని, నేనే పిలిచాను”

అన్నాడు. "నన్ను ఎందుకు పిలిచారు, నా వలన మీకు ఏ పనికావాలి?”

అని పొట్టి సైతాన్ అడిగింది. ఆ మాట విన్న నాగభూషణము పొట్టి

సైతాన్ పూర్తి తన ఆధీనములోనికి వచ్చిందని తెలుసుకొని, నిర్భయముగా

దానితో ఇలా అన్నాడు. “నాకు ఇక్కడున్న మర్రిచెట్టు విషయము తెలియాలి,

తర్వాత మేము వెదుకుచూ వచ్చిన సర్కస్ పాముకావాలి, దానికి తోడుగానున్న


పాము విషయము కూడా మాకు తెలియాలి. అందుకే నిన్ను పిలిచాము.

ఆ మాటవిన్న పొట్టిసైతాన్ కొద్దిసేపు కళ్ళుమూసుకొని తర్వాత కళ్ళు తెరిచి

ఇలా చెప్పను మొదలుపెట్టింది.


ఆ మర్రి చెట్టులో కాటేరి అను పిశాచి నివాసమున్నది. ఆ చెట్టు

యొద్దకు ఎవరు పోయినా, వారి శరీరములో చేరి నరములలో వత్తిడి

కల్పించి వారికి తీరని రోగము వచ్చునట్లు చేయుచున్నది. ఒకవేళ ఆ

చెట్టు కొమ్మలను ఎవరైనా త్రుంచితే, వానికి శరీరములో బలము లేకుండ

చేసి, అవయవములను కృశించిపోవునట్లు చేయుచున్నది. నిన్న మీవారు

అక్కడున్నపుడు జంతువులు తెచ్చుకొని తిని వదలి వేసిన పచ్చికళేబరము

పైనుండి క్రిందపడినది. ఆ కళేబరమును చెట్టుపైకి చేర్చినదీ, చెట్టు

మీదనుండి క్రిందికి వేసినదీ ఆ కాటేరి పిశాచియే. క్రిందపడిన అస్థి

పంజరమును కూర్చోబెట్టినదీ, తర్వాత నిలబడునట్లు చేసినదీ, ఆ తర్వాత

ముందుకు వచ్చునట్లు ఆ కాటేరియే చేసినది. ఆ చెట్టుదగ్గరకు ఎవరూ

రాకుండునట్లు కాటేరియే అలా చేయుచున్నది. అంతకుమించి ఆ చెట్టులో

ఏ రహస్యమూ లేదు. తర్వాత మీరు సర్కస్ పామును కావాలన్నారు.

మీకు కావలసిన సర్కస్పాము ఏదీ అక్కడలేదు.


ఆ మాటలు విన్న నాగభూషణము “ఆ పాము అక్కడే ఉన్నట్లు

మేము అంజనములో చూచాము. దానికోసమే మేము ముఖ్యముగా ఇక్కడికి

వచ్చాము. దాని విషయము నీవు తప్పక చెప్పాలి” అన్నాడు. “తప్పక

చెప్పుతా మరి నాకు ఆహారము” అని పొట్టిసైతాన్ అడిగింది. కొద్దిసేపుకు

ఒకమారు కోడిగ్రుడ్లు ఆహారముగా పెట్టాలని తెలిసిన నాగభూషణము

వెంటనే ఐదు కోడిగ్రుడ్లను దానిముందర ఉంచాడు. వెంటనే అది వాటిని

తిని ఇలా చెప్పను మొదలు పెట్టింది. మీరు వచ్చినది సర్కస్ పాము


కొరకు కాదు. మీరు ఏ పాము కొరకు వచ్చారో ఆ పాము సర్కస్

పాముకాదు. దానికి ఏ సర్కస్ విద్యలూరావు. ఆ పాము కడుపులో

వజ్రములున్నాయి. ఆ వజ్రాల కొరకు పామును పట్టుకోవాలని వచ్చారు.”

ఆ మాట విన్న నాగభూషణముకు ఏమీ అర్థముకాక మునెప్ప మనుషులవైపు

చూచాడు. "అవును నిజమే నీకు అబద్దము చెప్పాము. దానిలో వజ్రాలే

ఉన్నాయి. ఆ విషయము ఎవరికీ తెలియకూడదు. అందువలన సర్కస్

పామని నీకు చెప్పాము. నీవు అడిగిన డబ్బుకంటే రెండింతలు ఇస్తాము.

మాకు ఆ పాము కావాలి. అది మా చేతులనుండి తప్పించుకొని పారిపోయి

వచ్చింది.” అన్నాడు వెంకు.


అప్పుడు నాగభూషణమునకు వారితో మాట్లాడేదానికి వ్యవధి లేదు.

అందువలన వెంటనే పొట్టిసైతాన్ వైపు తిరిగి “ఆ పామే మాకు కావాలి.

అది ఎక్కడున్నది." అన్నాడు. దానికి జవాబుగా అది ఇలా చెప్పింది. “ఆ

పాము మర్రిచెట్టు క్రింద పెద్ద ఊడ ప్రక్కన గల పుట్టలో ఉంది. అది

ఒక్కటేకాక దానికి తోడుగా మరియొక పాముకూడా ఉన్నది. తోడున్న

పాము సామాన్యమైనదికాదు. ఏదో దైవశక్తి దానియందు ఇమిడి ఉన్నది.

ఆ పాము దాని ప్రక్కనున్నంత వరకు ఆ వజ్రాలపాము మీకు దొరకదు.

ఆ పామే మీరు అంజనము చూస్తున్నపుడు తోకతో కొట్టింది.” ఆ మాటలు

విన్న నాగభూషణముకు ఏమీ అర్థముకాలేదు. పాములో వజ్రాలున్నా

యంటున్నారు. ప్రక్కనున్న పామేమో శక్తిగల పాము. ఇదేమి గొడవ,

చిన్నగ ఆ పనిని వదలి ఇంటికి పోవడము మంచిదని తలచిన నాగ

భూషణము నేను పిలిచినపుడు రమ్మని పొట్టిసైతాన్కు చెప్పి దానిమీద

నీటిని మంత్రించి చల్లినాడు. అట్లేనని చెప్పి అది మనిషిలో అణిగిపోయింది.

కొద్దిసేపటికి మనిషి తేరుకొన్నాడు. అప్పుడు నాగభూషణము మునెప్ప

మనుషులతో ఈ విధముగా చెప్పాడు.)


నాగభూషణము :- చూడండి! ఇదేదో నాకు అర్థముకాని విషయముగ

ఉన్నది. చెట్టుక్రిందికి కాటేరు పిశాచి రానివ్వదు. అయినప్పటికీ మనము

అక్కడికి పోయామనుకో, అక్కడ దానికి మరియొక పాము తోడున్నది.

తోడున్న పాము గొప్పశక్తి గలదట. అందువలన ఇది నా చేతకాని పని.

ఈ పనికి మీరు ఎవ్వరినైనా పెట్టుకోండి.



వెంకు :- ఇప్పుడు నీకు పాము రహస్యమంతా తెలిసిపోయింది. మా

విషయము తెలిసిన తర్వాత నిన్ను వదలితే మాకే ముప్పు. అందువలన

నిన్ను మేము వదలము. నీవు ఏ విధముగనైనా ఆ పామును పట్టి ఇవ్వాలి.

అందుకు నీకు కావలసినంత డబ్బు తీసుకో. నీకు సహాయముగా మేమంతా

ఉన్నాము. నీవు అలా ఒప్పుకోకపోతే, నిన్ను ఇంటికి పోనివ్వము. పాము

రహస్యము తెలిసిన తర్వాత ఎవరైనా మాతోనే ఉండాలి. నీవు ఒప్పుకోక

పోతే నిన్ను చంపడము తప్ప మాకు వేరే దారిలేదు.


నూకా :- మేము ఎవరైనది నీకు పూర్తిగా తెలియదు. మేము ఆరితేరిన

దొంగలము. మేము అనుకొనిన పనిని ఎలాగైనా సాధించగలము. నీవు

ఈ పనిని చేసి పెట్టితే నీవు మాకు మిత్రుడవు అవుతావు. నీకు ఏ సహాయము

నైనా చేస్తాము. లేకపోతే నీవు మాకు శత్రువు అవుతావు. అప్పుడు నీ

పట్ల మేము కఠినముగా ప్రవర్తించవలసి ఉంటుంది. బాగా ఆలోచించుకో.


(వారి మాటలు విన్న నాగభూషణమునకు ముందు నుయ్యి వెనుక

గొయ్యి అన్నట్లయింది. వారి మాటలు వినకపోతే ఎలాగైనా నన్ను వదలరని

గ్రహించిన నాగభూషణము విధిలేని పరిస్థితిలో సరేనని పామును పట్టి

ఇచ్చుటకు ఒప్పుకొన్నాడు. అలా ఒప్పుకొన్నందుకు సంతోషించిన వెంకు

నాగభూషణముతో ఇట్లన్నాడు.)


వెంకు :- మేము ఎవరైనది, మాకు కావలసిన పాములో వజ్రములున్నది

ఎవరికీ తెలియకూడదు. ఆ రహస్యమును కాపాడవలసిన బాధ్యత నీదే.

నీకు తెలిసిన ఈ రహస్యము బయటికి తెలిస్తే మాకు ప్రమాదము వస్తుంది.

అప్పుడు నిన్ను బ్రతుకనివ్వము. అందువలన నేటినుండి నీవు జాగ్రత్తగా

మసలుకో.


(వెంకు మాటలు విన్న నాగభూషణము తన మనస్సులో ఇలా

యోచించసాగాడు. వీరితో స్నేహము చేసి కొరివితో తలగోక్కున్నట్లున్నది.

పామును పట్టివ్వకపోతే చంపుతాము అంటారు. పామును పట్టించి వీరి

పీడ వదలించుకుందామనుకుంటే, అదేదో కాటేరి పిశాచి చెట్టు దగ్గరకు

రానివ్వదంట. పెద్ద చిక్కులో ఇరుక్కొన్నాను. ఎలాగైనా నా మంత్ర

బలమంతా ఉపయోగించి వీరికి ఆ పామును పట్టి ఇచ్చి వీరినుండి దూరము

కావలెను. లేకపోతే వీరు నన్ను మట్టుపెట్టేలాగున్నారు, అని అనుకొని

వెంకుతో ఇలాగ అన్నాడు.)


నాగభూషణము :- మీ పనిని నేను కష్టపడి చేసి పెట్టుతాను. నాకు

కావలసిన సహాయమును మీరు అప్పుడప్పుడు చేస్తూవుండాలి.

వెంకు :- నీకు ఏ సహాయమునైనా చేస్తాము. నీకు ఎప్పుడైనా డబ్బు

కావలసినా ఇస్తాము. నిన్ను మా నాయకునికి కూడా పరిచయము చేస్తాము.

(తప్పని పని అనుకొన్న నాగభూషణము కాటేరి పిశాచిని ఎలా

స్వాధీనము చేసుకోవాలి? వజ్రాల పాము ప్రక్కనేవున్న పామును ఎలా

తొలగించాలి? వజ్రాలున్న పామును ఎలా పట్టాలి? అను యోచనలను

చేయుటకు మొదలు పెట్టాడు. అప్పటికి రాత్రి రెండు గంటలు కావస్తున్నది.

నాగభూషణము మరియు మునెప్ప మనుషులు అందరూ స్మశానమునుండి

బయటికి వచ్చారు. స్మశానమునకు కొంత దూరములో మర్రిచెట్టు వైపువున్న


బయలు ప్రాంతములో మునెప్ప మనుషులు పడుకొన్నారు. ఒకడు మాత్రము

నాగభూషణము మీద నిఘావేసి మేల్కొని ఉన్నాడు. నాగ భూషణముకు

నిద్రరాలేదు. ముందు ఏమి చేయాలి? ఎట్లు చేయాలి? అను యోచనలలో

పడినాడు. ఆ సమయములో తోటమర్రి నుండి వచ్చు దారిలో ఒక ఆకారము

వచ్చుట కనిపించినది. ఆ రోజు అమావ్యాస కావున సరిగా కనిపించడము

లేదు. మొదట ఆ ఆకారమును గమనించిన నాగభూషణము తనతోపాటు

మేల్కొన్న మనిషికి కూడా చూపించాడు. వారిద్దరూ చూస్తున్నట్లే

ఆకారము మర్రిచెట్టు వైపు పోసాగింది. నాగభూషణము మరియొక ఇద్దరిని

నిద్రలేపి నలుగురు కలిసి ఆ ఆకారము వెనుక పోయారు. ఆ ఆకారము

సరాసరి మర్రిచెట్టు క్రిందికి పోయింది. ఆ వేళలో అంత భయంకరమైన

చెట్టుకిందికి ఎవరు పోతారు అని యోచిస్తున్నట్లే చెట్టుక్రిందికి పోయిన

ఆకారము అగ్గిపుల్లను గీచి బీడిని వెలిగించింది. అప్పుడు అగ్గిపుల్ల వెలుగులో

అంతవరకు చూచిన ఆకారము యొక్క ముఖము కనిపించింది. అప్పుడు

అక్కడికి వచ్చినది ఒక ముసలివాడని వారికి తెలిసింది.


ఆ ముసలివాడు నెలకొకమారు అమావాస్య రోజున, రాత్రి రెండు

గంటల సమయములో ఆ చెట్టు క్రిందికి వచ్చి పోయేవాడు. ఆ చెట్టు

దగ్గరున్న కాటేరి పిశాచికి ఇష్టమైన పాయసమును, బొరుగులను తనవెంట

తెచ్చి కాటేరికి సమర్పించి పోయేవాడు. ఆ ముసలి వానికి కాటేరి వశమై

వుండేది. అది ముసలివాని ఆదేశానుసారము పనిచేసేది. దానికి కావలసిన

ఆహారమును నెలకొకమారు అమావాస్య రోజున అతను తెచ్చిపెట్టి

పోయేవాడు. ఆ విధముగా పాయసము, బొరుగులు తెచ్చిన ముసలివాడు

చెట్టుక్రిందికి పోయిన తర్వాత ఏమి జరుగుతుందోనని నాగభూషణము

మునెప్ప మనుషులు చూస్తూవుండిరి. మొదట దీపమును వెలిగించి పెట్టిన

ముసలివాడు తన సంచిలోనుండి బొరుగులు, పాయసమును బయటికి



తీసిపెట్టి ఆ పాత్రలచుట్టు గీత గీచి నల్లటి బొగ్గుపొడిని ఆ గీతచుట్టు

వేశాడు. తన శరీరము మీద నూలుపోగుకూడా లేకుండా తన గుడ్డలన్నీ

తీసి నగ్నముగా కూర్చున్నాడు. ఏవో మంత్రములు చదవను మొదలు

పెట్టాడు. పది నిమిషములు తర్వాత సుడిగాలి చెట్టుక్రింద తిరగను

మొదలు పెట్టింది. దానిని చూచిన నాగభూషణమూ మిగతావారూ

ఆశ్చర్యపడి పోయారు. సుడిగాలి సాధారణముగా పగటి పూట వస్తుంది,

కానీ రాత్రిపూట రావడము ఎక్కడా జరుగదు. కానీ అక్కడ సుడిగాలి

రావడము ఏదో మంత్రప్రభావమే అనుకొన్నారు. వారు చూస్తున్నట్లే

సుడిగాలి ముసలి వాడు ఉంచిన పాత్రల వరకు వచ్చింది. పాత్రలమీద

గాలి తిరుగుచున్నది. పాత్రలు గాలికి వణికినట్లు కదలుచున్నవి. కానీ

కొద్దిగ ప్రక్కనున్న దీపము మీదికి గాలిపోలేదు. ప్రక్కనే సుడిగాలి

ఉన్నప్పటికీ దీపము ఆరిపోలేదు. కొద్దిసేపటికి గాలిలేకుండా పోయింది.

ఆ ముసలివాడు తనముందరవున్న ఖాళీ గిన్నెలను తీసుకొన్నాడు. సుడిగాలి

గిన్నెల మీద తిరగడమూ, ఆ గిన్నెలు ఖాళీ కావడము నాగభూషణముకు

ఆశ్చర్యమైనది. దానినంతటిని చూచిన తర్వాత ఆ ముసలివాడు

సామాన్యుడుకాడని వారనుకొన్నారు. ముసలివాడు తిరిగి పోతున్నాడు.

అప్పుడు ఆ విశాలమైన చెట్టుక్రింద ఒక ప్రక్కన చీకటిలో జీప్ నిలబడి ఉ

౦డడము చూచాడు. ఇది ఎవరిది? ఇక్కడెందుకున్నదనుకొనుచూ జీపు

సమీపమునకు పోయి చూడసాగాడు. అంతలో నాగభూషణము అతని

వెంటవున్న మనుషులు చిన్నగ ఆ ముసలి వాని దగ్గరకు పోయారు.

అలా వచ్చిన వారిని చూచి అతను ఇలా అన్నాడు.)


ముసలివాడు :- మీరు ఎవరు? ఇక్కడెందుకున్నారు (ముసలివాడు అడిగిన

ప్రశ్నకు ఏమి జవాబు చెప్పాలో తెలియక తడబడుచూ ఇలా అన్నారు.)

నాగభూషణము :- మేము యాత్రికులము. మా ఊరు చాలా దూరములో

ఉన్నది.


ముసలివాడు :- మీ ఊరు దూరముంటే ఏమి, దగ్గరుంటే ఏమి. మీరు

ఇక్కడెందుకున్నారు? ఏమి చేయుచున్నారు?

నాగభూషణము :- ఏమీలేదు. మాకు వైద్యమునకు కావలసిన తీగ ఈ

ప్రాంతములో ఉన్నదని విని ఇక్కడికి వచ్చి దిగినాము.


(ఉపాయముగ సమాధానము చెప్పాడు నాగభూషణము.

మాటవిన్న ముసలివాడు అనుమానముతో వారివైపు చూచి ఇలా అన్నాడు.)

ముసలివాడు :- ఏమిటి ఒకమారు యాత్రికులమన్నారు. రెండవమారు

వైద్యము కొరకు తీగకావాలంటున్నారు. అసలుకు మీరు ఎవరు?

ఉన్నదున్నట్లు చెప్పండి.


నాగభూషణము :- వీరు యాత్రికులే, నేను మాంత్రికుడను. తీగ నాకు

కావాలి.

ముసలివాడు :- నీవు ఏమి చెప్పుచున్నావో నీకే అర్థముకాలేదు. ఒకమారు

యాత్రికులము అని, మరొకమారు మాంత్రికులమని అంటున్నావు. నీవు

మాంత్రికునివైతే నీవెంటవున్న వీరు యాత్రికులెలా అయినారు. నీవు ఏదో

దాచి చెప్పుచున్నావు. మీరు యాత్రికులైనా, మాంత్రికులైనా ఎవరైనా

ఫరవాలేదు. ఆ విషయము నాకు అవసరములేదు. కానీ ఈ రాత్రివేళ

ఈ ప్రదేశములో ఉండకూడదు. ఇది అతి ప్రమాదకరమైన స్థలము.

ముందు ఇక్కడినుండి వెళ్ళిపోండి.


(అని హెచ్చరించి చెప్పాడు. ఆ ముసలివానితో స్నేహము చేయుట

మంచిదని తలచిన నాగభూషణము అతనితో ఇలా అన్నాడు.)


నాగభూషణము :- అయ్యా! మీతో నేను కొంత మాట్లాడాలి. దయచేసి

మీరు మాకు కొంత సహాయము చేయాలి.


ముసలివాడు :- ఇంత రాత్రివేళ కనిపించి ఏవేవో మాట్లాడుచున్నావు.

నిజము చెప్పు మీరెవరో తెలిస్తే సహయపడతాను.


(అప్పుడు మునెప్ప మనుషులు చెప్పినట్లే నాగభూషణము కూడా

మేము సర్కస్ కంపెనీ మనుషులమనీ, తాను సర్కస్ లో మ్యాజిక్ చేయు

వాడనని మిగతవారు కూడా సర్కస్లో పనిచేయువారేనని, తమవద్ద సర్కస్లో

పనిచేయు పాము తప్పించుకొనివచ్చినదనీ, అది ఈ చెట్టు దగ్గర చేరిందనీ,

దానికొరకే మేము వచ్చామని చెప్పాడు.)


ముసలివాడు :- దానికి నా సహాయమెందుకు?


నాగభూషణము :- నీవు అన్ని విద్యలు తెలిసినవానివిగా ఉన్నావు. నీవు

దయచేసి ఆ పామును మాకు పట్టి ఇవ్వాలి. అందుకు నీకు అంతో ఇంతో

డబ్బు ఇవ్వగలము.


ముసలివాడు :- సరే అట్లే చేస్తాను. కానీ పాములు పట్టేది మాత్రము నాకు

తెలియదు. ఆ పామును మీరే పట్టుకోవాలి. నేను చేయగల సహాయము

ఒకటే ఉన్నది. అది ఏమంటే ఈ చెట్టు క్రిందికి ఎవరూ రాలేరు. వస్తే

వారికి జబ్బులు వస్తాయి. అలా కాకుండా మీరు అక్కడికి వచ్చినా జబ్బులు

రాకుండ చేయగలను. ఇక్కడ ఎన్నో దయ్యాలు, పిశాచాలు నివసిస్తున్నాయి.

మీరు ఇక్కడికి వచ్చినపుడు వాటి బాధను లేకుండా చేయగలను. దానికి

అంతో ఇంతో నాకు ఇచ్చుకోవలసి ఉంటుంది.


నాగభూషణము :- సరే అలాగే ఇస్తాము.


ముసలివాడు :- అయితే మీరు ఇక్కడినుండి కొంత దూరము పోయి

ఉండండి. నేను ఇంటికిపోయి ఉదయము ఎనిమిది గంటలకు వస్తాను.

అప్పుడు నా సహాయముతో మీరు పామును పట్టుకోవచ్చును.

(అలాగేనని అందరూ అక్కడినుండి పోయారు.)


(ఎనిమిది గంటలకు వస్తానన్న మాంత్రిక ముసలివాని కోసము

మునెప్ప మనుషులు, నాగోతుల నాగభూషణము వేచి చూస్తున్నారు. తొమ్మిది

గంటలకు ముసలివాడు వచ్చాడు. కొంత ఆలస్యముగా వచ్చిన ముసలివాడు

వస్తూనే నాగభూషణము నుదిటి మీద పెట్టుకొన్న చంద్రవంక ఆకారముగల

బొట్టును చూచాడు. అది నల్లని కాటుకతో పెట్టిన దానివలన దానిమీద

ముసలివానికి అనుమానము వచ్చినది. ఎదుటివానిని వశపరుచుకొనే దానికి

మరియు ఎదుటివానిలోని శక్తిని లాగుకొనేదానికి ఇటువంటి కాటుక

బొట్టును మాంత్రికులు పెట్టుకుంటారని తెలిసిన ముసలివాడు ఇలా

అన్నాడు. )


ముసలివాడు :- ఏమిరా! నాముందరే నీవు కాటుక బొట్టు పెట్టుకుంటావా,

ముందు ఆ బొట్టును తుడచివేయి (అని కోపముతో అన్నాడు.)


ఆ మాట విన్న నాగభూషణము ముసలివాడు తన కాటుకను

పసికట్టాడని తెలిసి ఏదో నచ్చచెప్పవలెనని ఇలా అన్నాడు.)


నాగభూషణము :- ఈ బొట్టు నీకేమి ఆటంకముకాదు. నా పద్ధతి ప్రకారమే

నేను పెట్టుకొన్నాను.



(కానీ ముసలివాడు ఆ బొట్టును తుడచివేయాలని పట్టుబట్టాడు.

తుడచివేయుట తన మంత్రశక్తికే అవమానమని తలచిన నాగభూషణము

నేను తుడచివేయనని, ఆ వృద్ధుని మాటను నిరాకరించాడు. అలా

నిరాకరించడము వలన నాగభూషణము మంత్రశక్తిని తన మంత్రశక్తికంటే

పెద్దదిగా వృద్ధుడు ఒప్పుకున్నట్లగును. ఆ విషయము తెలిసిన వృద్ధుడు

వీనికంటే మంత్రశక్తిలో నేనే పెద్ద, నాకంటే వీడు పెద్దవాడు కాదు. నేనూరక

వుంటే వానినే నేను పెద్దగా ఒప్పుకోవలసివచ్చును. ఎలాగైనా అతని

బొట్టును తుడిపించాలని ఆ వృద్ధుడు ఇలా అన్నాడు.)


ముసలివాడు :- నాగభూషణము! నీవు అలా బొట్టు పెట్టుకొనుట వలన


మంత్రవిద్యలో మంత్రయోగములందున్న అర్థము నాకు తెలియదను

కొన్నావా? నీవు పెట్టుకొన్న బొట్టు ఎదుటివానిని వశము చేసుకొనే దానికి,

ఎదుటి వాని మంత్రములు తనమీద పని చేయకుండావుండే దానికీ మరియు

ఎదుటివానిశక్తిని తనలోనికి లాగుకొని ఎదుటివానిని తనకంటే తక్కువ

శక్తిగలవానిగా చేయడానికని నాకు తెలియదనుకొన్నావా! నేను ఒక

మాంత్రికుడనై, అందులోనూ కాటేరి ఉపాసకుడనై నిన్ను నా ముందర

బొట్టు పెట్టుకోనిస్తే, నాకు నా మంత్రశక్తికి చిన్నతనము. కావున నీవు

వెంటనే తుడిచివేసి నాకు దాసోహమంటావా లేక నాతో పోటీకి వచ్చి నీ

శక్తి ఎంతటిదో నిరూపించుకుంటావా.


(వారి మాటలు వింటున్న మునెప్ప మనుషులకు మన పని

కాకుండా మధ్యలో ఈ బొట్టు తతంగము ఏమిరా దేవుడా, అనుకొని

నాగభూషణముకు నచ్చచెప్పాలని ఇలా అన్నారు.)


వెంకు :- అయ్యా! నాగభూషణముగారూ, ఆ బొట్టును గురించి ఎందుకంత

రాద్ధాంతము? దానిని తుడిచివేసి ఆయనచేత మన పనిని

చేయించుకోవడము మంచిది కదా!


నాగభూషణము :- నేనలా తుడిచివేయను. ఇది మా గురువు ఆజ్ఞ. మా

గురువు నేర్పిన విద్య అన్నిటికంటే గొప్పది. నేను దీనిని తుడచివేస్తే నాకూ,

నా గురువుకూ అవమానమగును. మీరు ఎందరు చెప్పినా, ఏమి చెప్పినా

మీ మాటవినను, నేను నా బొట్టును తుడిచివేయను. నేను బొట్టును

తుడచివేస్తే నా తలను నేనే నరుక్కున్నట్లగును.


(నాగభూషణము అన్న మాటలకూ, మొండి పట్టుదలకూ మునెప్ప

మనుషులకు కోపము వచ్చింది. అప్పుడు ఇలా అన్నారు.)

నూకా :- నీ పంతాలకు, పరువులకు ఇది సమయముకాదు. నీ మొండి


పట్టుదల వదలి ఈ పెద్దాయన మాటను విను. లేకపోతే మన పని చెడి

పోతుంది. నీవు మొండిగ ఉంటే బాగుండదు.


నాగభూషణము :- మీరు ఇంతవరకు బెదిరించిన బెదిరింపులకు భయ

పడినాను. కానీ ఇప్పుడు భయపడను. అసలుకు మీకు నాకు ఏమి

సంబంధము. మీ కొరకు ఇంతవరకు అబద్దమాడి నేను కూడా సర్కస్

వాడినన్నాను. నిజానికి మీరు సర్కస్వరా? ఆ పాము సర్కస్ పామా? మీ

స్వార్థము కొరకు నన్ను కూడా ఆడించాలనుకోవడము మీ పొరపాటు.

ఏదో పోనీలే అని ఇంతవరకు మీ మాట విన్నాను. ఇకమీదట వినను.

ఇప్పటినుండి మీదారి మీది, నాదారి నాది.


(నాగభూషణము అనిన మాటలను విన్న మునెప్ప మనుషులకు

అతనిమీద పూర్తి కోపము వచ్చింది. ఆ ఆ మాటలు విన్న ముసలివానికి

ఇదేమి క్రొత్తనాటకము? ఇంతవరకు అందరము సర్కస్వరమే అన్నారు.

ఇప్పుడేమో సర్కస్వరు మీరు కాదు, నేను కాదు అంటున్నారు. ఈ

సర్కస్ నన్ను వీరెందుకు వాడుకొన్నారు. నిజానికి ఈ ఆరుమంది ఎవరు?

ఈ మాంత్రికుడు ఎవడు? ఇట్లు ముసలివానికి అనేక ప్రశ్నలు వచ్చినవి.

తర్వాత వీరు ఈ మాంత్రికుని చేత పని చేయించుకొనేదానికి మాంత్రికుని

పిలుచు కొని వచ్చారని అర్థమైనది. అపుడు వృద్ధుడు మునెప్ప మనుషులతో

ఇలా అన్నాడు.)


ముసలివాడు :- మీకు నేను సహాయము చేస్తాను. వీనితో మీకు పనిలేదు.

వెంకు :- ఒరే నాగభూషణము, నీవు మా రహస్యములను తెలుసుకొని

బయటపడి బ్రతుకుతాననుకొన్నావా. నీ చావు మా చేతిలోవుంది.

ముసలివాడు :- అది మీకు వద్దు, వానిని నాకు వదలివేయండి. వాడు

బొట్టు తుడిచి నాకు లొంగిపోతాడో లేక నా చేతిలో చస్తాడో చూస్తాను.


నాగభూషణము :- మీరెంతో మీ స్థోమత ఎంతో తెలియక నాతో వాదనకు

దిగినారు. నన్ను మీరేమీ చేయలేరు. నాతో పోటీపడి మీ చావును మీరే

తెచ్చుకొన్నారు. నాతో మోడి (మంత్రముల పోటి) పెట్టుకొనేదానికి నీకు

ధైర్యముందా ముసలివాడా? ఓహెూ మీరు మునెప్ప మనుషులు కదా!

నా మంత్ర ప్రయోగములకు (చేతబడులకు) తట్టుకొని ప్రపంచములో బ్రతికే

స్థోమత మీకుందా! ఏమోలే అని మీ మాటలు వింటే, నన్ను మరీ తక్కువ

వానిగా చూస్తారా.


(మునెప్ప మనుషులకు కథ అడ్డము తిరిగినందుకు ఏమీ తోచలేదు.

అంతలో ముసలివాడు ఇట్లన్నాడు.)


ముసలివాడు :- నీకు గర్వము ఎక్కువగా ఉన్నది. నీతో మోడికి నేను

సిద్ధము. ఇపుడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి మా మోడిలో ఎవరు చనిపోయినా,

అది హత్యకాదని మోడీ పత్రము వ్రాయించుకొందాము. పోదాము రా.


(సరేనన్నాడు నాగభూషణము. మునెప్ప మనుషులవైపు చూచిన

ముసలివాడు మీరు నిదానపడండి. వీని అంతు తేల్చి మీకు పామును

నేను పట్టిస్తానని చెప్పగా, దానికి మునెప్ప మనుషులు సరేనని

ఒప్పుకొన్నారు.)



(రాజయోగానందస్వామి తన పర్యటనలో భాగముగా తనవద్ద

యున్న అడ్రస్ ప్రకారము ముక్తేశ్వరము అనే ఊరికి పోయాడు. అక్కడ

తన పుస్తకములను తెప్పించుకొని చదివిన రామవ్ అను భక్తుని ఇంటికి

పోయి, అక్కడ కూడా స్వామి వారు ఇమ్మన్నారని ఒక గ్రంథమును ఇచ్చి,

ఇంతకు ముందు చదివిన స్వామి రచనలను గురించి అడిగాడు. దానికి

రామవ్, స్వామి రచనలను గురించి చాలా అమోఘమైన జ్ఞానమని

చెప్పాడు. మేము 30 సంవత్సరములనుండి తెలుసుకొన్న జ్ఞానముకంటే


మించిన దానిని, స్వామి గ్రంథముల ద్వారా మూడునెలల్లో

తెలుసుకొన్నాము. ఈ జ్ఞానము ముందర, మేము ఇంతవరకు ఇన్ని

సంవత్సరములనుండి తెలుసుకొన్న జ్ఞానము, ప్రయోజనము లేనిదని

తెలిసింది. స్వామివారి జ్ఞానముతో ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి

జవాబును చెప్పవచ్చును. అంతేకాక స్వామివారి జ్ఞానము ఏ

మతమువారికైన సరియైన జవాబును చెప్పగలదు. ఇలా చెప్పుకొంటూ

పోతే చెప్పే దానికి మాటలు చాలవు అందువలన ఒకే మాటలో చెప్పాలి

అంటే, ఆయన జ్ఞానము భూమండలము లోనే గొప్పజ్ఞానమనవచ్చును.


ఈ దినము హిందూ సంఘమువారు హిందూమతము క్షీణించి

ఇతర మతములు అభివృద్ధయితున్నాయను దానిమీద పెద్ద బహిరంగ సభ

చేయుచున్నారు. దానిలో పాల్గొనుటకు ఉపన్యసించుటకు నాకు ఆహ్వానము

వచ్చినది. మనము అక్కడికిపోయి వస్తాము అని స్వామివారిని కూడ ఆ

సభకు తీసుకపోవడము జరిగినది. అక్కడ సభలో రామ్జీవ్ను మాట్లాడ

మన్నారు. రామ్హవ్ స్టేజిమీదకు పోయి నేను మాట్లాడేది మీకు తెలుసు

అందువలన నా మాటలకంటే గొప్పగా రాజయోగానంద స్వామి దగ్గర

నుండి వచ్చిన వ్యక్తి చెప్పగలడు. ఆయన మాటలను విందాము అని

అక్కడ మాట్లాడు అవకాశమును రాజయోగానంద స్వామికి ఇచ్చారు. కానీ

అక్కడికి వచ్చినది స్వామి అని ఎవరికీ తెలియదు. వచ్చిన అవకాశము

స్వామి తీసుకొని స్టేజి మీదకు పోయి చెప్పను మొదలు పెట్టాడు.)


"ఇక్కడ సమావేశమైన అందరికీ వందనము. ఇప్పుడు ఇక్కడ

జరుగుచున్న సమావేశములో కొందరు ముఖ్యులు మాట్లాడినారు. మొత్తము

మీద అందరూ క్రైస్తవులు తమ మతమును అభివృద్ధి చేసుకొనుటకు

హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నారని చెప్పారు. అలా హిందువులు

క్రైస్తవులుగా మారకుండావుండాలంటే, క్రైస్తవులను మత ప్రచారము


చేయకుండా చూడాలన్నారు. వారు హిందువులను ప్రలోభపెట్టకుండా

చూడాలన్నారు. అలా చూచుటకు క్రైస్తవుల మీద అనేక చోట్ల హిందూ

పరిరక్షణ సంఘము వారు దాడులు చేసి, వారి ప్రచారమును ఆపివేసిన

సంఘటనలు కలవు. క్రైస్తవులు వారి మతమును అభివృద్ధి చేసుకొనుటకు

అనేకపాట్లు పడుచున్నమాట వాస్తవమే. గత యాభై సంవత్సరములలో

నూటికి ముఫ్పైమంది హిందువులు క్రైస్తవులుగా మారిపోయారు. అదే

కొలతతోనే ఇప్పటికీ మారుచునే ఉన్నారు. ఇలాగే మరోయాభై సంవత్స

రములు గడచిపోతే భారతదేశములో నూటికి అరవైమంది క్రైస్తవులే

ఉంటారు. హిందూమతమును కాపాడవలెనను హిందూసంఘములు

అనేకములు గతములో కూడా పని చేశాయి. ఇప్పుడు కూడా పని

చేస్తున్నాయి. క్రైస్తవుల ప్రచారములను అడ్డుకుంటూనే ఉన్నారు. అయినా

హిందువులు క్రైస్తవులుగా మారిపోవుచూనే ఉన్నారు.


“కొన్ని హిందూ సంఘములు, క్రైస్తవులు హిందువులను ప్రలోభ

పెట్టుచున్నారని అంటున్నవి. ప్రలోభములకు ఆశపడి మతము మార్చు

కొన్నవారు నూటికి ఐదుమంది కూడాలేరు. కూటికి గుడ్డకు లేని హిందువులు

ఎవరైనా వారి ప్రలోభములకు మతము మారివుండవచ్చుననుకుంటాము.

నూటికి 25 మంది బ్రతికే స్థోమతవున్న కుటుంబాలు ఆ మతములోనికి

ఎందుకు పోయాయి? అని ప్రశ్నించుకోవలసిన అవసరమున్నది. ఒక

ఊరిలో వంద దేవాలయములుంటే పది చర్చిలు ఉంటాయి. మన హిందూ

మతములో ఆధ్యాత్మిక విద్యకు సంబంధించినవి వంద గ్రంథములుంటే

వారిది ఒకేఒక గ్రంథమున్నది. హిందూమతములో కోట్లాది దేవతలు

ఉంటే వారి మతములో కేవలము ఒకే దేవుడున్నాడు. గుడులలోనూ,

గ్రంథాలలోనూ, దేవుళ్ళలోనూ అన్నిటియందు సంఖ్యాబలము ఎక్కువ


ఉన్న ఈ మతమును వదలి సంఖ్యాబలములేని,   ఆ మతములోనికి

దేనికి పోయారు? అని ప్రశ్నించుకోవలసిన అవసరమున్న ఇంతవరకు

చెప్పిన వారంతా హిందువులు క్రైస్తవులుగా మారుచున్నారు. అలా మత

మార్పిడులు జరుగకుండా చూడాలని చెప్పారు. కానీ మారిన వారు ఏ

కారణముచేత మారారు. అలాగే మారబోయేవారు కూడా ఉన్నారు. వారు

ఏ కారణము వలన మారుతారు అని ఆ కారణములను వెతికి చూపలేదు.

ఒక హిందూ కుటుంబము క్రైస్తవమతమును తీసుకొన్నదని,

ఏరియాలోవుండే ఫాదర్ నో, పాస్టర్ నో కొట్టినా బెదిరించినా ఏమి

ప్రయోజనము లేదు. అటువంటి దాడుల వలన, బెదిరింపుల వలన మత

మార్పిడిలు ఆగిపోలేదు. ఇంకా రెట్టింపుగానే జరుగుచున్నాయి. హిందూ

సంఘములు ఎన్ని రకముల నివారించాలనుకొనినా, ఎందుకు

నివారించలేకపోతున్నాము అంటే, దానికి ఒకేఒక కారణము కలదు.

హిందూమతములోని హిందువులకు దైవజ్ఞాన మేదో తెలియదు. ఇప్పటికీ

హిందువుల పవిత్ర గ్రంథమేదో యాభైశాతము మందికి తెలియదు. ఇప్పటికీ

భగవద్గీత ఫోటోను ఇంటిలో పెట్టుకోకూడదు, అది ఉంటే అన్నీ కొట్లాటలే

వస్తాయి. దానిని తీసుకొని పోయి దేవాలయములో పెట్టు. లేకపోతే

నదిలో వేయమని చెప్పేవారున్నారు. ఇప్పటికీ భగవద్గీత పుస్తకమును

చదవకూడదు, చదివితే అన్నీ కష్టాలే వస్తాయని చెప్పువారున్నారు. ఈ

విధముగా ఆధ్యాత్మిక విద్యకు దైవజ్ఞానమునకు హిందువులు పూర్తి దూరమై,

జ్ఞానము ఏమిటో తెలియని స్థితిలో ఉన్నపుడు “మా గ్రంథములో

జ్ఞానమున్నది. మా దేవుడు మిమ్ములను పిలుస్తున్నాడు” అని చెప్పేమాటలనే

హిందువు వినవలసి వచ్చింది. అలా విన్న తర్వాత ఆ మతములోనికి

పోవడము జరిగినది. దైవజ్ఞానములేని హిందువులు ఒక్కొక్కరు

క్రైస్తవులుగా మారిపోవుటకు మొదలుపెట్టారు. హిందూమతములో

దేవాలయములున్నాయి, అయితే అందులోని దైవత్వము తెలియదు.


హిందూమతములో దైవ గ్రంథాలున్నాయి అయితే అందులోని జ్ఞానము

తెలియదు. హిందూమతములో దేవుళ్ళున్నారు అయితే ఎవరు పెద్ద దేవుడో

తెలియదు. ఇట్లు ఏమీ తెలియనిస్థితిలోనే హిందువు తన ఇష్టముతోనే

క్రైస్తవునిగా మారుచున్నాడు. కానీ ఎవరి బలవంతముతోను క్రైస్తవునిగా

మారలేదని తెలియుచున్నది. క్రైస్తవుల బోధల వలన, వారి ప్రచారమువలన

హిందువులు క్రైస్తవులుగా మారారు అనే దానికంటే, హిందువులలోని

కొందరు, హిందువులను జ్ఞానమార్గమువైపు పోకుండా చేయుట వలన,

హిందుత్వములో లేని జ్ఞానము క్రైస్తవములో దొరుకుతుందని హిందువులు

క్రైస్తవులుగా మారుచున్నారని చెప్పవచ్చును. నేను చెప్పిన దానిని

విజ్ఞులైనవారు అర్థము చేసుకోగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను” అన్నాడు.


ఆ సభలోని వారందరు స్వామివారు చెప్పిన మాటలను

సమర్థించారు. రాన్దేవ్ స్వామిని బాగా చెప్పారని పొగడాడు. తర్వాత

స్వామి ఆశ్రమానికి రావలెనని బయలుదేరాడు. ఈ విధముగా రాజయోగా

నంద స్వామి తన పర్యటనను ముగించుకొని తిరిగి ఆశ్రమమునకు వచ్చాడు.

ఆశ్రమములోనున్న రాఘవ, ఆటవికులు, మల్లుదొర, రాధేశ్వరి అందరు

స్వామి రాకతో సంతోషించారు. స్వామివారు మరుసటి దినమున తన

పర్యటనలోని ముఖ్యవిషయములన్నిటిని అక్కడున్నవారికి బోధించాడు.

రాఘవ తన మనస్సులోని విషయాన్ని చెప్పాలని సమయము కోసము

చూచి స్వామి విశ్రాంతిగనున్నపుడు గూడెము వారినందరిని పరిచయము

చేసి మల్లుదొర వచ్చిన విషయమును కూడా చెప్పెను. దానికి స్వామి

ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- జీవితములో జరుగు ప్రతి సంఘటన, ముందే కర్మ

పట్టీలో వ్రాసిపెట్టబడివుండును. ఆ కర్మప్రకారమే అన్నీ జరగును. అలాగే


నీ జీవితములో పెళ్ళి జరుగు సమయము కర్మప్రకారము వచ్చివుంటుంది.

అయితే ఒక్క విషయము నీ జాతకము నీకు తెలియదు కదా! నీకు

తెలియకున్నా, నీ జాతకము కొంత ప్రత్యేకత కల్గియున్నది. నీ జన్మ

లగ్నమునకు ఏడవస్థానములో రాహువు ఉండుట వలన నీ జీవితములో

రెండు వివాహములు జరుగునని తెలియుచున్నది. నీకు రెండవ వివాహము

కూడా భవిష్యత్తు కాలములో జరుగవచ్చును. ఈ విషయము నీకుగానీ,

నీకు బిడ్డనిచ్చు మల్లుదొరకుగానీ తెలియదు.  మీరు ఇరువురూ ఈ రాత్రికి

ఆ విషయమును చర్చించుకొని, రేపు ఉదయము నాకు మల్లుదొర

ఉద్దేశ్యమును తెలుపుము. అతనికేకాదు నీ జాతకములో ఉండే విషయము

నీకే తెలియుట మంచిది.



(రాజయోగానందస్వామి చెప్పినది నూటికి నూరుపాళ్ళు సత్యమై

ఉంటుందని విశ్వసించిన రాఘవ మల్లుదొరతో ఆ రాత్రికి చర్చించాడు.

రాఘవ ఆ విషయమును గురించి కొంత ఆందోళనగా యోచించినా

మల్లుదొర ఏమాత్రము దానిని గురించి ఆలోచించలేదు. ఉదయము

తొమ్మిది గంటలకు రాజయోగానందస్వామి సమావేశములోనికి వచ్చినపుడు

రాఘవను ఇలా అడిగాడు.)


రాజయోగానంద :- రాఘవా నీకు రెండు పెళ్ళిళ్ళు జరిగి తీరునని నీ

జాతకము చెప్పుచున్నది కదా! ఈ దినము మల్లుదొర బిడ్డను ఇవ్వడానికి

గానీ, నీవు చేసుకోవడానికిగానీ అభ్యంతరములు ఏమీ లేవుకదా!

రాఘవ :- కర్మలో జరుగవలసినది ఉన్నపుడు మనము తప్పించుకొనుటకు

వీలులేదు కదా! ఇప్పుడు మల్లుదొర బిడ్డను చేసుకోక పోయినా, తర్వాత

ఎవరిని చేసుకొనినా, రెండు పెళ్ళిళ్ళు తప్పవు కదా స్వామీ!

రాజయోగానంద :- రెండు పెళ్ళిళ్ళు అంటే భార్య చనిపోయిన తర్వాత


రెండవ పెళ్ళి చేసుకొనువారు కూడా కలరు. వారికి కూడ రెండు

పెళ్ళిళ్ళు అయినట్లే. నీకు అలాకాదు, నీ జాతకములో ఇద్దరి భార్యలతో

కాపురము చేయవలసివున్నది. ఒక భార్య ఉన్నట్లే, రెండవ భార్యను కూడా

చేసుకోవాలి. ఇది నీకు చెప్పేదానికంటే మల్లుదొరకు చెప్పేది మంచిది.


మల్లుదొర :- అన్నీ తెలిసినవారు మీరు చెప్పిన తర్వాత జరగనిది ఏదీ

ఉండదు. నా విషయానికివస్తే ఇద్దరు భార్యలతో రాఘవ కాపురము

చేయడము సంతోషమే. ఇప్పుడు నాబిడ్డనిచ్చుటకు నాకు ఏ అనుమానము

లేదు. మా గూడెములో ఇద్దరు భార్యలతో కాపురము చేయడము శుభ

సూచకముగా భావిస్తాము. అందువలన రాఘవ రెండవ పెళ్ళి చేసుకుంటే

నేను దగ్గరుండి చేస్తాను.


(అప్పుడు రాజయోగానంద స్వామి రాఘవను పెళ్ళి చేసుకొమ్మని

చెప్పగా! రాఘవ ఆశ్రమములోనే స్వామి సమక్షములోనే తన పెళ్ళి

జరుగులాగున చేయమన్నాడు. ఆ విషయమును స్వామి మల్లుదొరను

అడుగగా మల్లుదొర ఒప్పుకొనెను. మల్లుదొర ఆటవికులు సంతోషముగా

తమ గూడెముకు పోయిరి. రాఘవ పెళ్ళికి ఒక నెల వ్యవధి ఉండుట

వలన ఎవరి ఏర్పాట్లు వారు చేసుకొనుచుండిరి. ఒక దినము రాజయోగా

నందస్వామి తీరికగా ఉన్నపుడు రాఘవ ఒక విషయమును స్వామితో

అడిగెను.)


రాఘవ :- మీరు ఆశ్రమములో లేకుండా పర్యటనలో ఉన్నపుడు దారిన

పోయే ప్రయాణికులు మంచినీళ్ళకోసము వచ్చారు. ఇక్కడే అన్నము

తిన్నారు. వారిలో ఒక యువకుడు అన్నము కూడా తినకుండా

కడుపునొప్పితో బాధ పడుచుండెను. అతనిని గమనించిన నేను ఈ

యువకుడు ఎందుకు బాధ పడుచున్నాడని అడిగాను. అపుడు మిగతావారు


అతనిని దయ్యము బాధించు చున్నదని చెప్పారు. కానీ ఆ విషయమును

నేను నమ్మలేదు. అతనికి ఏదో రోగముందని, నాకు తెలిసిన వైద్యమును

చేయతలచి, కడుపు మీద చేయిపెట్టాను. అప్పటికి నేను ఏ వైద్యము

మొదలు పెట్టలేదు. కానీ ఏ వైద్యమును చేయకనే చేయి తగిలిన వెంటనే

అతని నొప్పి వెంటనే పోయింది. అది ఎలా పోయిందో నాకు తెలియదు.

నేను చేయివుంచుట వలననే పోయింది అని వారు అన్నారు. కానీ నాకు

ఆ విషయము ఏమాత్రము అర్థము కాలేదు. అప్పుడు అక్కడ నాకు తెలియని

విషయమేదో ఉన్నదనీ, దానిని మీరే చెప్పగలరనీ అనుకొన్నాను.

రాజయోగానంద :- అది నమ్మలేనిది ఏమీకాదు. దయ్యాలూ ఉన్నాయి,

మనుషులకు వాటి బాధలూ ఉన్నాయి. ఆ బాధ ఎలా పోయింది అను

విషయము నీకు తెలియాలి కదా! నీకు తెలియకున్నా, నీవు ఏ వైద్యము

చేయకున్నా, ఆ బాధ నీ చేతి స్పర్శతోనే పోయిందనుట వాస్తవము.

వాస్తవములోని వివరము నీకు కావాలి అంటే దానిని నేను చెప్పవచ్చును.

కానీ నేను చెప్పుటకంటే ఆ రోజు యువకుని శరీరమును బాధించుచున్న

దయ్యము చెప్పితే మరీ బాగుంటుంది. వారి అడ్రస్ నీకు తెలిసివుంటే

వారికి కబురు చేసి రమ్మని చెప్పు. వారు వచ్చిన తర్వాత అప్పుడు ఆ

బాధ ఆ వ్యక్తికి ఎందుకు వచ్చినదీ, ఎలా పోయినదీ అన్నీ వివరముగా

తెలియగలవు.


అతనికి ఏదో రోగముందని, నాకు తెలిసిన వైద్యమును

(రాజయోగానంద స్వామి చెప్పినట్లు ఆ దినము వచ్చిన వారిని

రాఘవ పిలువనంపాడు. వారు రెండవరోజు అక్కడికి వచ్చారు. మొదట

వచ్చిన వారందరూ ఆ యువకునితో సహా వచ్చారు. )


(నాగోతుల నాగభూషణము, ముసలివాడు (మంత్రాల మల్లయ్య

తాత) పోలీస్ అధికారులవద్దకు పోయి తాము మోడీప్రదర్శన చేయుచున్నా

మని, తమ ప్రదర్శనకు అనుమతిని తీసుకొన్నారు. అంతేకాక ఆ మోడీ

ప్రదర్శన ప్రజల వినోద నిమిత్తము చేయుదుమనీ, ఒకవేళ ఆ ప్రదర్శనలో

ఎవరికైనా గాయములైనా లేక చనిపోయినా దానికి తాము బాధ్యులము

కాము అనీ ముందే వ్రాయించి వచ్చారు. మల్లయ్య తాత పెట్టిన మోడీని

నాగభూషణము ఎత్తివేస్తానని దండోరా వేయించాడు. ఆ మోడీని

చూడడానికి చుట్టుప్రక్కల గ్రామముల ప్రజలందరూ వచ్చారు. మోడీ

అంటే ఎట్లుంటుదో చాలామందికి తెలియదు. అందువలన కొన్ని వేలమంది

తోటమర్రి గ్రామానికి చేరుకొన్నారు. ఆదివార దినమున మోడీ పెట్టుటకు

కావలసిన సదుపాయములన్నిటిని ముసలివాడు ముగించుకొన్నాడు.

శనివారము రాత్రియే తయారు చేసిపెట్టిన మోడీస్థలము చూపరులకు

విచిత్రముగా కనిపించింది. ఊరి మధ్యలో గల బయలులో పది అడుగుల

చతురస్రాకార స్థలములో చుట్టూ ముగ్గు వేయబడి, మధ్య స్థలము పేడతో

అలుకబడి వున్నది. పది అడుగుల పొడవు, వెడల్పుగల చతురస్రాకారము

చుట్టు అర్థ అడుగు వెడల్పుతో నలుపు, ఎరుపు, తెలుపు రంగుల ముగ్గులు

వేయబడి ఉన్నాయి. మధ్య స్థలము శుభ్రముగా అలుకబడి ఉన్నది. ఈ

విధముగా తయారు చేయబడిన చతురస్ర స్థలములు ఐదు కనిపించాయి.

ప్రతి చతురస్ర ఆవరణములోను నాలుగు మూలల నాలుగు పచ్చి

కొబ్బరికాయ లను పసుపు, కుంకుమ పూసి అలంకారము చేసి పెట్టారు.

ఆ విధముగా అలంకరించిన మొదటి ఆవరణము మధ్యలో ఒక చీపురుకట్టను

పెట్టారు. అట్లే రెండవ ఆవరణము మధ్యలో పొడవైన కత్తిని పెట్టారు.

మూడవ చతురస్రపు ఆవరణ మధ్యలో మట్టిమూకుడు (మట్టితో చేయబడిన

ప్లేటు) లో నిమ్మకాయను పెట్టారు. నాల్గవ ఆవరణము మధ్యలో గుడ్డలతో


తయారు చేసిన మూడు అడుగుల ఎత్తున్న బొమ్మను నిలబెట్టారు. ఐదవ

చదరపు ఆవరణము మధ్యలో పదిశేర్లు బియ్యమును కుప్పపోసి, ఆ కుప్పమీద

రూపాయి నాణెమును ఉంచారు.


మొదటి ముగ్గుకు, రెండవ ముగ్గుకు మధ్యలో సందు నాలుగు

(4) అడుగులున్నది. రెండవ ముగ్గుకు, మూడవ ముగ్గుకు మధ్య సందు

ఎనిమిది (8) అడుగులున్నది. మూడవదానికి నాల్గవదానికి మధ్య సందు

పన్నెండు (12) అడుగులు గలదు. అట్లే నాల్గవ ముగ్గుకు, ఐదవ ముగ్గుకు

మధ్య సందు పదహారు (16) అడుగులు కలదు. మొదటి ముగ్గుకు

ముప్పయి (30) అడుగుల ముందర పది అడుగుల ఎత్తు, ఆరు అడుగుల

వెడల్పు గల ముఖ ద్వారము కొయ్యలతో చేయబడినది. ఆ ద్వారమునకు

ఇరువైపులా కొబ్బరి పట్టలతో అలంకారము చేయబడివున్నది.  ఆ

ద్వారముపైన ఆకాశమోడి అని పెద్ద అక్షరములతో వ్రాయబడివున్న బోర్డు

కలదు. ఆ బోర్డు క్రింది భాగమున మామిడి ఆకులతో అలంకరించిన

తోరణములు గలవు. మామిడి ఆకు తోరణము క్రింద ఒక మట్టి కడవ

తల్లక్రిందులుగా వ్రేలాడదీయబడి ఉన్నది. అగరుబత్తుల వాసన ఆ

ప్రాంతమంతా నిండివున్నది.



కొన్ని వేలమంది కలసిన చోట ఏ అవాంఛనీయ సంఘటనలు

జరుగకుండా పోలీస్ బందోబస్తు కూడా చేయబడినది. మాంత్రికవృద్ధుడు

మంత్రాలమల్లయ్య తాత క్రొత్త గుడ్డలు ధరించి, చేతికి ఇత్తడి వెండి కడెములు

ధరించి చేతిలో కొరడా పట్టుకొని, నొదుట విశాలమైన బొట్టు పెట్టుకొని

అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన మల్లయ్య తాతను చూచి అతని

అనుచరులు చప్పట్లుకొట్టారు. తర్వాత నిముషమునకు నాగోతుల నాగ

భూషణము కూడ అక్కడికి వచ్చాడు. నాగభూషణము పంచకట్టు కట్టి



ఆకాశ మోడి : చిత్రమును 1-6  248-249 పేజీ లో చూడండి. 



పైన అంగీ ధరించకుండా వచ్చాడు. అంగీలేని దానివలన అతని నడుము

కున్న మొలత్రాడు కనిపిస్తున్నది. ఆ మొలత్రాడుకు కట్టిన వివిధ తావెత్తులు

కనిపిస్తున్నవి. నాగభూషణము వచ్చిన తర్వాత మల్లయ్య తాత అక్కడగల

చిన్న వేదికను ఎక్కి బిగ్గరగా ఇట్లన్నాడు.)


మల్లయ్య :- ఇక్కడికి వచ్చిన జనమందరికి నా నమస్కారములు. ఇప్పుడు

ఇక్కడ నాకూ, నాగభూషణమునకూ మోడీ జరుగబోతుంది. మోడీ అంటే

ఏమిటో చాలామందికి తెలియదనుకొంటాను. ఇది ఒక విధముగా మాలో

నున్న మంత్రశక్తుల పోటీ అని తెల్పుచున్నాను. ఈ మోడీ వలన ఎవరు

గొప్ప మాంత్రికులో తెలిసిపోతుంది. నాకు, నాగభూషణమునకు మధ్య

నేను పెద్ద అంటే, కాదు నేను పెద్ద అని తగాదా వచ్చినది. అందువలన

ఎవరు పెద్ద అయినదీ తెలిసిపోవాలని ఈ మోడీని పెట్టుకొన్నాము. నేను

పెట్టిన ఈ మోడీని నాగభూషణము ఎత్తివేస్తానని సవాలు చేశాడు. అలా

అతను ఎత్తి వేయగలిగితే, మీ అందరి సమక్షములోను అతనికంటే మంత్ర

విద్యలో నేను చిన్నవాడినని ఒప్పుకొని, ఇప్పటినుండి అతను చెప్పిన పనులు

చేయుటకు సిద్ధముగా ఉంటాను. నాగభూషణము ఈ మోడీని తీయలేకపోతే

అతను నాకంటే తక్కువ వాడని ఒప్పుకొని, అతను నేను కోరినపుడు నా

పనులు చేయవలెనని ఒప్పందము చేసుకొన్నాము.


ఇపుడు ఇక్కడ మీకు కనిపించునట్లు మోడీకి ముఖ ద్వారమున్నది.

ఆ ముఖ ద్వారము మీద ఒక మట్టికడువ తల్లక్రిందులుగా వేలాడదీయబడి

ఉన్నది. పోటీ దారుడైన నాగభూషణము మొదట ఆ కడవను పగులగొట్టి

ముఖద్వారము ద్వారా మోడీలోపలికి రావలసివుండును. తర్వాత చుట్టూ

ముగ్గు వేయబడి, మధ్యలో పేడతో అలికి పూజచేసి పెట్టిన ఐదు స్థలములు

ఉన్నవి. అందులో మొదటి చదరములో చీపురుకట్ట కనిపిస్తున్నది.


చీపురు కట్టను నాగభూషణము తీసి బయటికి పారవేయవలెను. దాని

తర్వాత గల రెండవ చదరములో మధ్యన నిలబెట్టిన కత్తి కలదు. దానిని

కూడా నాగభూషణము తీసి బయట వేయవలెను. అట్లే మూడవ చదరపు

స్థలములో ఒక నిమ్మకాయ కలదు. దానిని తీసి బయటికి వేయవలెను.

దాని తర్వాత నాల్గవ ముగ్గులో మూడు అడుగుల ఎత్తున్న గుడ్డబొమ్మను

తీసి, ఆ ముగ్గు బయటికి వేయవలెను. చివరిలోనున్న ఐదవ చదరములో

బియ్యము కుప్పమీద రూపాయి నాణెమున్నది. దానిని తీసుకవచ్చి ఈ

వేదిక మీద అందరికీ చూపాలి. అట్లు అన్ని పనులు చేయగలిగితే, అప్పుడు

అతను ఈ మోడీని ఎత్తివేసి గెలిచినవాడగును. ఇదేమి పెద్దపని అని

అందరూ అనుకోవచ్చును. కానీ ఇది అంత సులభమైన పనికాదు.

ఇంతవరకు నేను చెప్పిన వస్తువులను తీసివేయాలని నాగభూషణము

ప్రయత్నించితే, నేను నా విద్యతో అతను వాటిని తీయకుండా చేయు

చుందును. ఈ మోడీని తీయుటలో అతనికిగానీ, తీయకుండా చేయుటలో

నాకుగానీ ఏ ప్రమాదమైనా సంభవించవచ్చును. అందుకు మేము

సమ్మతించే ఈ మోడీ ప్రదర్శన పెట్టామని తెల్పుచున్నాను.


(అని చెప్పి నమస్కారము చేసి మంత్రాలమల్లయ్య తాత వేదిక

దిగివచ్చాడు. వెంటనే నాగభూషణము వేదికను ఎక్కి ఇలా అన్నాడు.)


నాగభూషణము :- మోడీని ఎత్తి వేయడము చాలా కష్టమైనపని మరియు

ప్రమాదకరమైన పని అని కూడా చెప్పవచ్చును. అయినప్పటికీ మీరు

చూస్తున్నట్లే ఈ మోడీని ఎత్తివేయగలనను నమ్మకము నాకున్నది. అందుకు

మీ అందరి ఆశీర్వాదము కావలెనని కోరుచున్నాను.


(అని అందరికీ నమస్కరించాడు. అప్పుడు అందరూ చప్పట్లు

కొట్టారు. చప్పట్లు విన్న నాగభూషణము రెట్టింపు ఉత్సాహముతో మోడి


ముఖ ద్వారము ముందుకు వచ్చాడు. ముఖ ద్వారమునకు పది అడుగుల

దూరములో ఒక కర్రను చేతిలో పట్టుకొని నిలబడి, ఏదో మంత్రమును

జపించుచూ, ఒక నిమిషము తర్వాత ఉన్నట్లుండి ఒక్క పరుగున వచ్చి

కడవను పగులగొట్టి ముఖ ద్వారమును దాటవలెనని ప్రయత్నించాడు.

పరుగు మొదలు పెట్టిన వెంటనే ముసలివాడు పసుపు కలిపిన బియ్యమును

కడవమీద చల్లాడు. అలా చల్లిన వెంటనే పైన తలక్రిందులుగా వేలాడదీసిన

కడవనుండి తేనెటీగలు ఏకదాటిగా బయటికి రాను మొదలుపెట్టాయి.

వందలు వేలుగా వచ్చి తేనెటీగలు నాగభూషణమును చుట్టుముట్టి గందర

గోళము చేశాయి. కడవ ఎక్కుడున్నది కూడా కనిపించకుండా ముఖము

మీద కుట్టను మొదలు పెట్టాయి. దట్టమైన పొగమేఘములాగ కమ్ముకొన్న

ఈగల గుంపులో అక్కడ చూచువారికి కూడా ద్వారమూ కనిపించలేదు,

కడవా కనిపించలేదు. తేనెటీగల ధాటికి నాగభూషణము తట్టుకోలేక

వెనక్కి పరుగెత్తాడు. ఇదంతా చూస్తున్న వారికి ఆ దృశ్యము మహా

అద్భుతముగా కనిపించింది. నాగభూషణము 40 అడుగుల దూరములోనికి

పోయి నిలబడ్డాడు. అప్పుడు తేనెటీగలన్ని కడవలోనికి పోయాయి. బయట

ఒక్కటి కూడ కనిపించలేదు. కొన్ని వేలు లక్షలుగా కనిపించిన తేనెటీగలు

అన్ని ఆ కడవలో ఎలా పట్టాయో అర్థముకాలేదు. వాస్తవముగా యోచిస్తే

ఆ ఈగలకు ఆ కడవలోని జాగా ఏమాత్రము సరిపోదు. అయినా ఆ

కడవలోనికి అన్నీ దూరిపోవడము చూస్తున్న అందరికీ ఆశ్చర్యమును

కలిగించినది. మొదట ద్వారము వద్దనే నాగభూషణమునకు మల్లయ్య

తాత మంత్రబలమేమిటో అర్థమైనది. రెండవమారు నాగభూషణము

ద్వారము వద్దకు వచ్చాడు. ద్వారమునకు ఆరు అడుగుల దూరములో

వస్తూనే రెండవమారు కూడా తేనెటీగలు దాడిచేయడమూ అతను వెనక్కి

పోవడమూ జరిగినది. ఇలా ముఖ ద్వారము వద్దనే నాగభూషణముకు


చేదు అనుభవము ఎదురైనది. రెండవమారు వెనక్కిపోయన నాగభూషణము

కొంత యోచించి తన నడుముకున్న తావెత్తులలో ఒకదానిని తీసుకొని

ఒక ప్లేట్ పెట్టి దానిమీద ఇసుకను పోశాడు. అలా తావెత్తును కనిపించ

కుండా ఆ ప్లేట్లో ఇసుకను పోసి, ఆ ప్లేట్ ఎడమచేతిలో పెట్టుకొని

కర్రను నడుములో పెట్టుకొని, కుడిచేతితో కడవమీద ఇసుకను చల్లుచూ

వచ్చాడు. అతను ఇసుకను కడవమీద చల్లుచూ ద్వారము మధ్యలోనికి

వచ్చి నిలబడ్డాడు. అప్పుడు కడవలోనుండి ఒక ఈగకూడ బయటికి

రాలేదు. నాగభూషణము వెంటనే తన నడుములో పెట్టుకొన్న కర్రతో

కడవను పగులగొట్టాడు. అలా కడవను పగులగొట్టి ద్వారము దాటి

మొదటి ముగ్గువద్దకు పోయాడు. ద్వారము వద్దనున్న కడవను

పగులగొట్టినపుడు కడవ ముక్కలై పగిలిపోయింది. అయినా ఒక్క తేనెటీగ

కూడ కడవలో కనిపించలేదు. కడవనుండి తేనెటీగలు రావడము, తిరిగి

కడవలోనికి పోవడము చూచిన ప్రజలు పగిలిపోయిన కడవలో ఒక్క ఈగ

కూడ కనిపించకుండా పోవడము పెద్దవింతగా తోచింది. అదేపనిగా

చూడాలని వచ్చిన కొందరు హేతువాదులకు, నాస్తికవాదులకు అదెలా

జరిగిందో అర్థము కాలేదు. ఆ పనితో మంత్రాల మీద నమ్మకము లేనివారు

కూడా దానిని చూచి విస్తుపోయారు. ఆ మోడీని చూచుటకు కలెక్టరు,

యస్.పి గారు కూడా వచ్చారు. తేనెటీగల ప్రయోగమును చూచిన వారు

ఒకరి ముఖము ఒకరు చూచుకొన్నారు. మోడీ అంటే ఏమిటో తెలియనివారు

మోడి ఇంత అద్భుతముగా ఉంటుందా అనుకొన్నారు.


బహుకష్టము మీద ముఖ ద్వారమును దాటిన నాగభూషణము

మొదటి ముగ్గువద్దకు వచ్చాడు. మొదటి చదరపు స్థలములో మధ్యన ఒక

చీపురుకట్టవుంది. ఆ చీపురుకట్టకు మల్లయ్య తాత తనవద్దనున్న కాటుకను


కొద్దిగ పూసి బయటికిపోయి ఇక రమ్మని నాగభూషణమునకు సైగ చేశాడు.

అప్పుడు నాగభూషణము మంత్రోచ్ఛాటన చేయుచు ముగ్గులోనికి ప్రవేశించి

చీపురును తీయబోయాడు. వెంటనే ఆ చీపురు గాలిలోనికి పైకి లేచింది.

నాగభూషణము చేతికి దొరకుండా వెనుకవీపు మీద కొట్టను మొదలు

పెట్టింది. ఆ చీపురుకట్ట తన్నులు తినలేక నాగభూషణము ముగ్గు బయటికి

పరిగెత్తాడు. అతను బయటికి పోతూనే ఆ చీపురు తిరిగి తన మొదటి

స్థానములో పోయి నిలచింది. తన నడుముకున్న తావెత్తును ఒకదానిని

చేతితో పట్టుకొని రెండమారు లోపలికి పోయాడు. అప్పుడు కూడా ఆ

చీపురు పైకి లేచి అతనిని మోదను మొదలుపెట్టింది. అది కొట్టే దానివలన

నాగభూషణము చేయి అడ్డము పెట్టాడు. అప్పుడు చీపురు చేతిమీద కొట్టింది.

ఆ దెబ్బకు చేతిలోని తావెత్తు క్రింద పడిపోయింది. రెండవమారు కూడా

నాగభూషణము వెనుతిరిగి బయటికి వచ్చాడు. ప్రాణములేని సాధారణ

చీపురు అలా కొట్టడమును చూచి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యచకితులై

నారు. మంత్రాలకు చింతకాయలు రాలవను మాట అక్కడక్కడ విన్నవారు

కూడా ఈ దృశ్యమును చూచి మంత్రాలకు చింతకాయలేమిటి

తుమ్మకాయలు కూడా రాలేటట్లున్నాయని అనుకొన్నారు. ఇంకా అక్కడ

ఏమి వింతలు జరుగునోయని శ్రద్ధగా చూస్తున్నారు.


రెండవమారు కూడా వెనక్కు వచ్చిన నాగభూషణము దానికి

విరుగుడు యోచిస్తూ నిలుచున్నాడు. తాను నేర్చిన విద్యలన్నిటిని జ్ఞప్తికి

తెచ్చుకొని కోడిని తెప్పించి, దానితోక ఈకలను పెరికి ఆ ఈకలను చేత

పట్టుకొని ముందుకు పోయాడు. మొదటి మాదిరే ఆ చీపురు పైకి లేచి

కొట్టను మొదలుపెట్టింది. మూడవమారు కూడా తన ఎత్తు ఫలించక

తన్నులు తిని వెనక్కు వచ్చాడు. అపుడు ముసలివాడు నవ్వను మొదలు


పెట్టాడు. అలా ఐదుమార్లు మాత్రమే ప్రయత్నము చేయాలి. ఐదుమార్లు

కాకపోతే ఆరవమారు చేయకూడదు. ఐదుమార్లు చేతకాని వారు

ఓడిపోయినట్లు ఒప్పుకోవాలి. మూడుమార్లు విఫలమైన నాగభూషణము

నకు ఇక రెండుమార్లు కూడ చేతకాదని ముసలివాడు నవ్వాడు. అక్కడ

చూచేవారు కూడా ఆ చీపురును తీయలేడేమోనని అనుకొన్నారు. అప్పుడు

నాగభూషణము మెదడులో ఒక ఆలోచన తోచింది. వెంటనే అతను వేప

కొమ్మలను తెప్పించుకొని నడుము చుట్టు కట్టుకొని, కొన్ని కొమ్మలను చేతితో

పట్టుకొని నాల్గవమారు లోపలికి పోయి చీపురును తీయబోయాడు. నాల్గవ

మారు కూడా చీపురు పైకి లేచివచ్చింది. అది కొట్టను వచ్చినపుడు వేప

మండలతో నాగభూషణము కూడా దానిని కొట్టాడు. వేపాకు వేటు చీపురుకు

తగిలిన వెంటనే చీపురు క్రింద పడిపోయింది. వెంటనే దానిని తీసుకొని

బయటికి విసిరి గట్టిగ కేక వేశాడు. చూస్తున్నవారు చప్పట్లు కొట్టారు.


ఇక రెండవ ముగ్గులోనికి పోవలసిన నాగోతుల నాగభూషణము

ముసలివాడైన మంత్రాల మల్లయ్య తాతతో నేను తయారుగా ఉన్నాను

అన్నాడు. ముసలివాడు తన చేతిలోని అక్షింతలను రెండవ చదరములోని

కత్తిమీద చల్లి ఇక రమ్మని సైగ చేశాడు. నాగభూషణము తన నడుముకున్న

తావెత్తులను అన్నిటిని తాకి మంత్రములు చదువుచూ ముందున్న

ముగ్గులోనికి వచ్చాడు. అప్పుడు ఆ ముగ్గులోనున్న కత్తి గుండ్రముగా

చక్రమువలె వేగముగా తిరుగను మొదలు పెట్టింది. దానికోసము చేయి

ముందుకు పెట్టితే చేయి తెగిపోతుందను భయము అతనికి ఏర్పడినది.

చూచువారు ఏమి జరుగునోయని చూస్తున్నారు. నాగభూషణము ఒక

కట్టెను తీసుకొని వచ్చి కత్తికి అడ్డము పెట్టగా ఆ కట్టెను రెండు ముక్కలుగా

కత్తి నరికివేసింది. మల్లయ్యతాత ఆ చదరము ముగ్గు బయట మంత్రిస్తూ


నిలుచున్నాడు. నాగభూషణము ముందుకు పోతే కత్తి తెగుతుందని తెలిసి

ముందుకు పోకుండా, తాను కూడా భేతాళ మంత్రమును మంత్రించి

ముసలివానివైపు చూచాడు. అపుడు కంటికి కనిపించని భేతాళుడు

ముసలివానిని త్రోయను మొదలుపెట్టాడు. మంత్రములు చదువుచున్న

మల్లయ్యతాత క్రిందపడి పోయాడు. క్రిందపడిన వాడు ఎవరో దొర్లించునట్లు

నూరు అడుగుల దూరము పొర్లుచూ పోయాడు. అంతలో నాగభూషణము

ఒక కోడిని తెచ్చి కత్తికి అడ్డము పెట్టాడు. కోడి తెగిపోయి దానిరక్తము

కత్తికైనది. అప్పుడు కత్తి వేగము తగ్గిపోయి నిదానముగా తిరుగుచున్నది.

నిదానముగా తిరుగుకత్తిని సులభముగా పట్టుకోవచ్చునని నాగభూషణము

అనుకొన్నాడు. అలా వేగము తగ్గిన కత్తిని సులభముగా పట్టుకోగలడని

తలచిన మల్లయ్య తాత వెంటనే లేచి వచ్చి, తనవద్దగల సంచిలోనుండి

ఏదో ఆకును తీసి మంత్రించి ముగ్గులోనికి చల్లాడు. అలా చల్లబడిన

ఆకులన్నియు తేళ్ళుగా మారిపోయి ముగ్గంతయు నిలుచున్నాయి.

నాగభూషణము తేళ్ళను లెక్కచేయక ముగ్గులోనికి అడుగుపెట్టగానే అతనికి

దగ్గరగానున్న ఒక తేలు పరుగున వచ్చి నాగభూషణము కాలికి కుట్టింది.

తేలు కుట్టగానే అగ్గినిప్పు కాలినట్లయినది. వెంటనే అతను ముగ్గు బయటికి

పోయి తేలు విషమునకు బాధపడుచు క్రింద కూర్చున్నాడు. అది విపరీతమైన

బాధగా ఉన్నది. ఆ బాధను నివారించుకొనుటకు విషనివారణ మంత్రము

మంత్రించుకొని బాధను నివారింపచేసుకొని లేచి ముందుకు పోయాడు.

అక్కడున్న తేళ్ళు చూపాకారానికి తయారైనవి కావు. అన్నీ విషము నిండుకొని

ఉన్న తేళ్ళని తెలిసిపోయింది. కావున దానికి పై ఎత్తుగా నాగభూషణము

భూమిమీద ఒక ముక్కోణ ఆకారమును గీచి దానియందు బీజాక్షరములు

వ్రాసి మంత్రించగా, వెంటనే ఆకాశమునుండి పక్షుల గుంపువచ్చి

తేళ్ళనన్నిటిని ఎత్తుకొని పోయినవి. అది ప్రేక్షకులకు వింతగా కనిపించింది.


అపుడు నిదానముగా తిరుగుచున్న కత్తిని నాగభూషణము సులభముగా

పట్టుకోగలిగి బయటికి పారవేశాడు.


రెండు ముగ్గులను జయించిన నాగభూషణము మూడవ ముగ్గులోని

నిమ్మకాయను తీయుటకు నేను సిద్ధమేనన్నాడు. అపుడు మంత్రాల మల్లయ్య

తాత మూడవ ముగ్గుచుట్టు తిరిగివచ్చి, ఒక కొరడా చేతిలో పట్టుకొని

దూరముగా నిలబడి ఇక ప్రారంభించమని చెప్పాడు. అప్పుడు నాగ

భూషణము నిమ్మకాయవున్న ముగ్గులోనికి వచ్చాడు. ప్రక్కన నిలబడిన

ముసలివాడు తన కొరడాను గాలిలోనికి కొట్టినట్లు విసిరాడు. దూరముగా

గాలిలో కొట్టిన కొరడా వేటు నాగభూషణముకు తగిలి శరీరము వాత

పడింది. అలా ముసలివాడు గాలిలో కొట్టుచుండగా ముగ్గులోని నాగ

భూషణమునకు ఆ దెబ్బలు తగులుచునే ఉన్నవి. వాటిని లెక్కచేయని

అతను నిమ్మకాయను తీసుకోబోయాడు. కానీ ఆ నిమ్మకాయ ఆకాశము

లోనికి ఎగిరిపోయింది. అది పైకి పోగా క్రింద కొరడా వేట్లకు తట్టుకోలేక

నాగభూషణము ముగ్గు బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన

నాగభూషణము తాను కూడా ఏదో మంత్రోచ్ఛాటన చేయగా ముసలివాని

కొరడా ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. ఆకాశములోనికి ఎగిరిపోయిన

నిమ్మకాయ తిరిగి క్రిందికి వచ్చి మూకటిలో నిలచిపోయింది. అపుడు

తిరిగి నాగభూషణము ముగ్గులోనికి పోయాడు. అప్పుడు మల్లయ్యతాత

నా ఆకాశమోడీ ఫలించునుగాక అనగానే నిమ్మకాయ పైకి ఎగిరి పోయింది.

కనిపించకుండా ఆకాశములోనికి ఎగిరిపోయిన నిమ్మకాయను ఎలా

రప్పించాలో నాగభూషణమునకు తెలియక పైకి చూస్తూవుండిపోయాడు.

భూమిమీద అన్ని మోడీలను చూచిన నాగభూషణమునకు అకాశమోడీ

విధానము ఏమీ అర్థము కాలేదు. కావున ముగ్గులోనుండి బయటికి వచ్చాడు.


అతను బయటికి వచ్చిన వెంటనే నిమ్మకాయ తిరిగి వచ్చి మూకటిలో

నిలిచినది. మూడవ మారు ప్రయత్నించవలెనని అనుకొన్న నాగభూషణము

నకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మారు నిమ్మకాయ ఆకాశములోనికి

ఎగిరిన వెంటనే క్రింద మూకటిని తీసివేయాలనుకొన్నాడు. అతను మూడవ

మారు ముగ్గులోనికి పోయాడు. అప్పుడు కూడా ముందువలె నిమ్మకాయ

పైకి ఎగిరిపోయింది. అలా అది పైకి పోయిన వెంటనే అక్కడున్న మూకటిని

తీసుకొని బయటికి వచ్చాడు. నాగభూషణము బయటికి వస్తూనే నిమ్మకాయ

క్రిందికి వచ్చి నేలమీద నిలచింది. నాల్గవమారు అతను ముగ్గులోనికి

పోయిన నిమ్మకాయ పైకి ఎగిరిపోలేదు. దాని కిటుకంత మూకటిలోనే

ఉన్నదనుకొన్న నాగభూషణము నిమ్మకాయను బయటికి వేశాడు. అప్పుడు

అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టారు. నాగభూషణము తెలివిగా పని చేశాడని

అందరూ అనుకొన్నారు.


నాల్గవ ముగ్గులోనికి పోవడానికి నేను సిద్ధమేనని నాగభూషణము

చెప్పాడు. మల్లయ్య తాత ప్రయత్నించమని చెప్పి ముగ్గు ప్రక్కన కూర్చొని

కాటేరి, మంత్రమును చదవను మొదలుపెట్టెను. ఆ వృద్ధునికి వశములోనున్న

కాటేరి మల్లయ్య తన మంత్రమును చదివిన వెంటనే మర్రివృక్షము దగ్గర

నుండి ఒక్క క్షణములో అక్కడికి వచ్చి, నాల్గవ ముగ్గులోనున్న గుడ్డబొమ్మ

లోనికి ఆవహించింది. ఇక ప్రారంభించమని మల్లయ్య తాత చెప్పగ

నాగభూషణము ముగ్గులోనికి వచ్చి బొమ్మను పట్టుకోపోయాడు. ఆ బొమ్మ

చేయిచాచి ఒక్కవేటు కొట్టింది. ఆ దెబ్బకు నాగభూషణము కళ్ళు తిరిగి

ముగ్గు బయట పడినాడు. క్రిందపడిన నాగభూషణము స్పృహ తప్పి

పోయాడు. అది గమనించిన వారు నీళ్ళు తెచ్చి ముఖము మీద చల్లగ

అతనికి స్పృహ వచ్చినది. స్పృహ వచ్చిన తరువాత ఏవో మంత్రములు


చదువుచూ ముగ్గులోనికి రాగానే బొమ్మలో చేరుకొన్న కాటేరి తిరిగి ఒక

వేటుకొట్టింది. ఆ వేటుకు నాగభూషణముకు ఎముకలు విరిగినట్లయినవి.

నోటినుండి రక్తము బయటికి వచ్చినది. కాళ్ళ క్రింద భూమి కదలినట్లయి

నది. రెండవమారు కూడా క్రిందపడిపోయాడు. లేచేదానికి తన శరీరములో

శక్తిలేదు. ఇక నా చేతకాదనుకొనిన అతను చాలా కష్టము మీద పైకి లేచి

భైరవమంత్రమును ఉపయోగించాడు. భైరవమంత్ర ప్రయోగము చేత

బొమ్మ కదలక ఒకచోట నిలిచిపోయింది. అదే అదను అనుకొన్న

నాగభూషణము ముగ్గులోనికి పోయి బొమ్మను పట్టుకోగలిగాడు. అప్పుడది

అతనిని ఏమీ చేయలేదు. అప్పుడు నాగభూషణముకు కొంత ధైర్యము

వచ్చింది. బొమ్మను ఎత్తి బయటికి వేయాలనుకొన్నాడు. కానీ బొమ్మ

ఏమాత్రము కదలలేదు.


అంతలో బయటనున్న మల్లయ్య తాత “కాటేరీ నీ బలము ఏమిటో

ఇపుడే చూపించు, నా మంత్రబలము ఎంతటిదో నిరూపించు” అన్నాడు.

ఆ మాటను విన్న బొమ్మ నాగభూషణమును విదిలించింది. ఆ విదిలింపుకు

తాను విసరివేసినట్లు దూరముగాపడ్డాడు. దూరముగా పడిన అతను

నీరసముగా పైకిలేచి ఈ మారు భైరవమంత్రమును మరియు భేతాళ

మంత్రమును జపిస్తూ బొమ్మమీదికి ఇసుకను చల్లి, ముగ్గులోనికి వచ్చి

బొమ్మను పట్టుకోవాలనుకొన్నాడు. అతని మంత్రబలము చేత భైరవుడు,

భేతాళుడు ఇద్దరూ వచ్చినాగానీ కాటేరిని ఏమీ చేయలేకపోయారు.

ముసలివాడు. మంత్రించిన మంత్రమునకు వారు కట్టుబడి పోయారు.

నాల్గవమారు ముగ్గులోనికి వచ్చి తనను పట్టబోయిన నాగభూషణమును

కాటేరిశక్తి మరియొక తన్ను తన్నింది. ఆ దెబ్బకు అతను అరుస్తూ బయటపడి

రెట్టింపు కోపముతో లేచి నిలబడి తన నడుముకు వున్న మొలత్రాడును


త్రెంచి, చేతిలో పట్టుకొని, ఆ త్రాడుకు గల తావెత్తులన్నిటిని విదిలించి

చూపుచూ నాగభైరవ మంత్రమును చదివి ముసలివానిమీద ప్రయోగించాడు.

అప్పుడు మల్లయ్య తాత శరీరమంతా మంటలు వచ్చాయి. పాముచుట్టు

కొన్నట్లు శరీరమంతా మెలికలు తిరిగి పోసాగాడు. పాము కరిచిన వానికి

నోటిలో నురుగు వచ్చినట్లు నురుగువచ్చి స్పృహకోల్పోయాడు. ఇదే అదను

అనుకొన్న నాగభూషణము ఏవేవో మంత్రములు చదువుచూ ముగ్గులోనికి

పోయి బొమ్మను పట్టుకోపోయాడు. ఆ బొమ్మ ఈ మారు గట్టిగ తన్నింది.

ఆ దెబ్బలకు మూల్గి బయటపడి స్పృహకోల్పోయాడు. ఇటు ముసలివాడు,

అటు నాగ భూషణము ఇద్దరూ స్పృహలో లేరని తెలిసిన ప్రజలు వైద్యులను

తెచ్చి వైద్యము చేయించారు. ఇద్దరూ అరగంట తర్వాత స్పృహలోనికి

వచ్చారు. అప్పుడు ఎవరు గెలిచినదీ అర్థముకాక మీలో ఎవరు గెలిచారు

అని ప్రజలు అడిగారు. అప్పుడు మల్లయ్య తాత వేదికనెక్కి “ఐదుమార్లు

ప్రయత్నించి చివరకు బొమ్మను తీయలేక నిర్బలముగా బయటపడిపోయిన

నాగభూషణము ఓడిపోయాడు. నాల్గవమారు బొమ్మను బయటకు తీసి

చివరనున్న ఐదవ ముగ్గులో కూడా రూపాయని బయటికి తెచ్చినపుడే

గెలిచినట్లగును. నాగభూషణము నాల్గవముగ్గులోనే చేతకానివాడై నీరసించి

పోయాడు. బొమ్మను బయటికి తీయలేక పోయాడు. అందువలన అతను

ఓడిపోయినట్లే” నని చెప్పగా, నాగభూషణము కూడ వేదికను ఎక్కి “నేనొక

గొప్ప మాంత్రికుడననీ, నాకంటే మించినవాడులేడని అనుకొను నా

గర్వమంతయూ నేడు పటాపంచలై పోయింది. మంత్రవిద్యయందు ఈ

వృద్ధుని చేతిలో నేను పూర్తిగా ఓడిపోయానని ఒప్పుకొంటున్నాను. ఇటువంటి

మోడీని నేనెప్పుడూ చూడలేదు. కదలని వస్తువులకు కదలికలను చేకూర్చి,


వాటిచేత తంతు నడిపించిన ఈ మల్లయ్య తాతను పొగడకుండా

వుండలేను.” అన్నాడు. అప్పుడు జనమంతా చప్పట్లు కొట్టారు.


అంతలో మల్లయ్య తాత మాట్లాడుచూ “మీ అందరి మధ్య

నాగభూషణము నన్ను గొప్పగా చెప్పడము నాకు ఎంతో సంతోషముగా

ఉన్నది. ప్రాణముల మీదికొచ్చినా చివరి ప్రయత్నము వరకు సాగునది

మోడీ. ఇందులో ఒక్కొక్కపుడు మరణమైన సంభవించవచ్చును. అలాంటి

స్థితి మాకు ఏర్పడినపుడు మీరు వైద్యము చేసి కాపాడినందుకు మీకు

ఎంతో రుణపడి ఉన్నాము. ఇది ఆకాశమోడీ, ఈ మోడీలో మొదటి

నాలుగు ముగ్గులు దాటి వచ్చినప్పటికీ, ఐదవ ముగ్గులో నెగ్గి రూపాయిని

బయటికి తేలేరు. ఐదవముగ్గులో ప్రవేశించిన ఎంతటి మాంత్రికునకైనా

కళ్ళు కనిపించవు. తల పగిలిపోవునంత శబ్దము వానికి

వినిపించుచుండును. ఆ శబ్దమునకు ఎవరు లోపల ఉండలేరు. క్రింద

కాళ్ళు మంచుగడ్డ మీద మోపినట్లుండును. శరీరములో శూలములు

పొడిచినట్లగును. రూపాయి నాణెము ఆకాశములోనికి పోవును. అప్పుడు

బియ్యము వందమైళ్ళ వేగముతో వచ్చి ముఖమునకు కొట్టుకొనుచుండును.

చెప్పాలంటే మొత్తము మీద ఈ ఆకాశమోడీ చాలా కష్టమైనది. అయినప్పటికి

ఒక ద్వారము మూడు ముగ్గులు దాటి వచ్చిన నాగభూషణము ఓడిపోయినా

అతను గొప్పవాడేనని చెప్పగలను" అన్నాడు. అందరి సమక్షములో ఇద్దరూ

కౌగిలించుకొన్నారు. ప్రజలందరు మాంత్రికులను ఇద్దరినీ పొగడుచుండగా,

మునెప్ప మనుషులు చిన్నగ వారి ప్రక్కన చేరి " మీ పని అయిపోయింది

కదా! ఇక మా పని చూడండి.” అని జ్ఞప్తి చేశారు. ఇద్దరు మాంత్రికులు

తోడైన దానివలన తమపని సులభముగా అయిపోతుందనుకొన్నారు.


(కడుపు నొప్పితో ఆ దినము వచ్చిన యువకున్ని రాజయోగానంద

స్వామికి రాఘవ చూపాడు. రాజయోగానంద స్వామి ఆ యువకున్ని

పిలిచి తన ముందర కూర్చోమన్నాడు. స్వామి చెప్పినట్లు ఆ యువకుడు

స్వామి ముందర స్వామికి ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు రాజయోగా

నందస్వామి అతని వైపు చూస్తూ అతని లోపలవున్న గ్రహ ఎవరో బయటికి

రమ్మని చెప్పాడు. స్వామి ఆ మాట చెప్పిన వెంటనే ఆ యువకునికి శ్వాస

ఎక్కువ కాజొచ్చినది. తర్వాత అతనికి జ్ఞప్తి లేకుండా పోయింది.

లోపలనున్న గ్రహ బయటికి వచ్చి మాట్లాడను మొదలు పెట్టింది.)

దయ్యము :- నన్ను ఎందుకు పిలిచారు?

స్వామి :- నీతో మాట్లేడే అవసరముండి పిలిచాము. నీవు ఎవరో చెప్పు.

ఈ మనిషిలో ఎందుకున్నావో చెప్పు.

దయ్యము :- మీరు అడిగితే నేను చెప్పాలా! నేను చెప్పను. నీ ఇష్టమొచ్చిన

పని చేసుకో.

స్వామి :- నేనెవరో నీకు తెలియక అలా మాట్లాడుచున్నావు. ఒకమారు

నావైపు చూడు నేనెవరో తెలుస్తుంది.

(అప్పుడా గ్రహ తల ఎత్తి స్వామి ముఖమువైపు చూచింది. వెంటనే

తల దించుకొని చూడలేనని చెప్పింది.)

స్వామి :- ఇప్పుడు చెప్పు. నీవు ఎంతకాలము నుండి ఇతని శరీరములో

ఉన్నావు? ఎందుకొచ్చావు.

దయ్యము :- నేనొక స్త్రీని, నాపేరు సత్యవతి. నేను బ్రతికివున్నపుడు ఒక

వ్యక్తి చేతిలో మోసపోయి, వివాహముకాకనే గర్భవతినై సమాజములో

బ్రతకలేక, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన దానిని. చనిపోక ముందు

జీవితమును గూర్చి ఎన్నో కలలు కనిన నేను ఈ విధముగా సూక్ష్మరూపములో


దయ్యముగా బ్రతుకవలసి వచ్చినది. నాలాగ ఎవరూ కాకూడదని నా

ఉద్దేశము. ఇపుడు మీ ముందున్న యువకుడు కూడా ఒక యువతిని

మోసము చేసి, ఎన్నో తియ్యని మాటలు చెప్పి, ఆమెను తన వెంట దూర

ప్రాంతమునకు తీసుకవెళ్ళి, ఆమెను ఒంటరిగా వదలిపెట్టి వచ్చాడు. ఆ

నిర్భాగ్యురాలు క్రొత్తప్రాంతములో దిక్కుతెలియని స్థితిలో బాధపడుచుండగ,

నేను గ్రహించి ఆమె శరీరమందు చేరి, ఇలాంటి ఒక ఆశ్రమమునకు

తీసుకువెళ్ళి, అక్కడున్న స్వామిని అయిన మాతాజీవద్ద వదలి వచ్చాను.

ఆమె మాతాజీ దగ్గర శిష్యురాలిగా ఉండిపోయింది. ఆమెను మోసము

చేసిన వ్యక్తిని ఆమె ద్వారా తెలుసుకొని, అక్కడనుండి ఇతనివద్దకు వచ్చాను.

ఇతను డబ్బుగల కుటుంబములోని అమ్మాయిని ఎక్కువ కట్నము తీసుకొని

వివాహము చేసుకొన్నాడు. కానీ అతని భార్యతో ఒక్కరోజు కూడా గడపలేదు.

ఆమె ఇప్పటికీ కన్యగానే ఉన్నది.


ఒకప్పుడు నేను చెడిపోయినదానినై బ్రతికే ధైర్యములేక చని

పోయాను. చనిపోతే ఇక నేను ఈ లోకములో లేకుండా పోతానను

ఉద్దేశ్యముతో చనిపోయాను. కానీ చనిపోయినది బాహ్య శరీరమొకటేనని

చనిపోయాక తెలిసింది. నేను, నేనుగానే మిగిలి ఉన్నాను. కనిపించని

రూపములో తిరుగుచున్న నేను, నన్ను మోసము చేసిన వ్యక్తి మీద కక్ష

తీర్చుకోవాలనుకొన్నాను. కానీ అతను అప్పటికే నా గురించి మనస్సులో

బాధపడినవాడై జీవితము మీద విరక్తి కల్గి మారిపోయి ఉన్నాడు. చివరకు

అతను దైవజ్ఞానమును తెలుసుకొనుచు జీవితమును గడుపుచున్నాడు.

కావున అతని మీద నాకు కోపము తగ్గిపోయినది. అతనిని ఏమీ చేయలేక

నాలాగా ఎవరూ బాధపడకూడదను ఉద్దేశములోనున్న నాకు ఈ ద్రోహి

కనిపించాడు. ఇతను చేసిన తప్పుకు శిక్షగా వీనికి పెళ్ళైనా వీని భార్యకు


దూరముగా ఉండునట్లు చేశాను. ఎప్పటికైనా వీడు తన మొదటి యువతిని

కలుసుకోవాలని నా ఉద్దేశము.


ఇంతవరకు ఇతనికున్న రోగమునుబట్టి ఎంతో మంది భూతవైద్యులు

కూడా వైద్యము చేశారు. కానీ ప్రయోజనములేదు. కొందరు మాంత్రికులు

నన్ను వదిలించాలని చూచారు. వారిచేత కాలేదు. నా ఉద్దేశ బలము

ముందు వారి మంత్ర బలము ఏమీ చేయలేకపోయంది. నా భావము

అర్థము చేసుకొనే విశాల హృదయము వారికుండదు. కావున వారికి

ఎవరికీ ఈ విషయము ఇంతవరకు చెప్పలేదు. ఇతను మోసము చేసిన

యువతిని ఇతనితో కలుపునట్లు బాహ్యముగా మీలాంటి వారి సహాయము

తోనే జరగాలి. ఇపుడు ఆ యువతిని కలుసుకొనునట్లు మీరు ఇతనితో

ఒప్పించుకుంటే, నేను ఇతని శరీరమునుండి బయటికి పోగలను. ఇక

మీ ఉద్దేశమేమిటో మీరే చెప్పండి.


ఆ గ్రహ చెప్పిన మాటలు విన్న అక్కడున్న వారంతా ఆశ్చర్య

పోయారు. ముఖ్యముగా అతని వెంట వచ్చిన వారికి ఈ విషయము

తెలియదు. రాఘవ ఎంతో ఆసక్తిగా ఈ విషయమును విన్నాడు. రాజయోగా

నందస్వామి ఆ గ్రహ చెప్పిన మాటలలో నిజమున్నదని గ్రహించి ఆ

యువకునిలోని ఆమెతో ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- సరే నీవు చెప్పినదంతా విన్నాను. అతనేమి చెప్పుతాడో

అతనినే అడుగుతాను. అతనితో నేను మాట్లాడాలంటే నీవు లోపలికి

పోవాలి కదా! అందువలన నీవు అణిగిపో. తర్వాత నేను పిలిచినపుడు

బయటికి రా. అప్పుడు ఇతని విషయము నీకు తెలుపుతాను.


(స్వామి మాటవిన్న ఆ గ్రహ సరేనని లోపలికి అణిగి పోయింది.

ఆ యువకునికి మెలుకువ వచ్చినది. అప్పుడు అతనిని స్వామి అడిగాడు.)


రాజయోగానంద :- ఏమయ్యా! నీవు నీ పెళ్ళికాకముందే ఒక అమ్మాయితో

సంబంధము పెట్టుకొని, ఆమెను మోసము చేసినదే కాక దూరముగా

విడిచి వచ్చిన మాట నిజమే కదా!


(ఆ మాట విన్న అతడు ఒక్కమారు అదిరిపడినట్లయ్యాడు. మీకెట్లు

ఈ విషయము తెలిసిందని అనుమానముగా స్వామి వైపు చూచాడు.)


రాజయోగానంద :- అన్ని విషయములూ మాకు తెలుసు. నీవు చేసిన

మోసము నీవే చెప్పితే, నీకు రోగము పోవు ఉపాయము మేము చెప్పుతాము.

(దాచిన గుట్టంతయు వీరికి తెలిసిపోయినదని ఆ యువకునికి

అర్థమైనది. తమ బంధువులవైపు చూచి తల దించుకొన్నాడు. ఇక దాచితే

లాభములేదని మీరు చెప్పినది నిజమేనని తన తప్పును ఒప్పుకొన్నాడు.)

రాజయోగానంద :- నీవు వదలివచ్చిన అమ్మాయిని తిరిగి తెచ్చుకొని ఆమెను

గౌరవముగా వివాహమాడి, ఆమెతో నీవు కాపురము చేయగల్గితే, నీకున్న

రోగము పోతుంది లేకపోతే నీకు ఈ రోగము పోదు.


యువకుడు :- నాకిప్పుడు పెళ్ళైయినది కదా!


రాజయోగానంద :- అందువలన నీవు, నీ భార్యతో ఈ విషయమంతా

చెప్పి ఆమెను ఒప్పించుకొని, నీవు మోసము చేసిన యువతిని తిరిగి తెచ్చు

కోవాలి. అలాకాకపోతే ఇపుడు నీకు పట్టిన దయ్యము నీ భార్యతో కాపురము

చేయనివ్వదు తెలుసా?


(స్వామి మాటలు విన్న అతను చేయునది లేక తన రహస్యమంతా

అందరికి తెలిసిపోయిందనీ, తన భార్యకు కూడా తెలిసిపోతుందనీ,

దానికంటే ముందు తానే ఆమెకు విషయమంతా చెప్పుట

మంచిదనుకొన్నాడు. అందువలన మీరు చెప్పినట్లే నా భార్యకు చెప్పి

ఎలాగైనా నచ్చజెప్పుతానని ఒప్పుకొన్నాడు. అప్పుడు స్వామి లోపలనున్న

గ్రహను పిలిచి ఇలా చెప్పాడు.)


రాజయోగానంద :- అతని చేత నీవు చెప్పిన విషయమును ఒప్పించాను.

నీవు దయ్యముగా మారికూడా మంచిపని చేయుచున్నందుకు మాకు

సంతోషముగా ఉన్నది. ఇతను ఆ యువతిని తిరిగి తెచ్చుకొనేంత వరకు

ఇతనియందేవుండి, నీ ఆశయము నెరవేరిన తర్వాత నీవు కాలమును

వృథాగా గడుపక ఆత్మజ్ఞానమును తెలుసుకో. జ్ఞానము తెలియని జీవితము

వ్యర్థము.


(స్వామి మాటలు విన్న ఆమె కళ్ళనీళ్ళు కారుస్తూ ఇలా అన్నది.)


దయ్యము :- నేను శరీరముతో బ్రతికివుంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలను

పెడచెవిన పెట్టివుండేదానినేమో. చచ్చి దయ్యమయ్యాను. కావున మీరు

చెప్పుమాటల యొక్క విలువను గ్రహించగలుగుచున్నాను. తెరమీద

బొమ్మలను చూచినట్లు ప్రక్కనుండి బ్రతికివున్న మనుషులను చూచి వారి

యందు ఏమి లోపమున్నదో గ్రహించగల్గుచున్నాను. జ్ఞానమంటే ఏమిటో,

దాని విలువ ఏమిటో ఈ బ్రతికిన మనుషులకంటే దయ్యముగానున్న నాకే

బాగా తెలియును. కావున మీరు చెప్పిన మాటలను తప్పక విని జ్ఞానమును

తెలుసుకొంటాను. అంతేకాదు నన్ను దయ్యమని ఎందరో అసహ్యించు

కొన్నారు, కొట్టారు, తిట్టారు, హింసలు పెట్టారు, హీనముగా మాట్లాడారు.

చనిపోయినప్పటికీ నేనూ మనిషినేనని వారు గుర్తించక ఏదో పీడగ తలచారు.

మనుషులతో సంబంధము లేని ఏదో పిశాచముగా భావించి మాట్లాడారు.

ఇపుడు మీరు మాట్లాడినట్లు, నన్ను ఒక మనిషిగా భావించి ఎవరూ మాట్లాడ

లేదు. మీరు నన్ను గౌరవముగా మాట్లాడించి, నా కార్యమును మెచ్చుకొని,

తర్వాత నా కర్తవ్యమును గుర్తుచేశారు. నా జన్మకు సార్థకత చేకూర్చు

మార్గములో నడువమన్నారు. అందుకు నేను ధన్యురాలిని, కానీ జ్ఞానమంటే

ఏమిటో తెలియకుండా చిన్నతమునుండి అజ్ఞాన వాతావరణములో

పెరిగాను. తల్లి తండ్రులైన పెద్దలు కూడా ఏనాడూ దైవజ్ఞానమును గురించి


చెప్పడము కానీ లేక వారు మాట్లాడుకోవడముగానీ జరుగలేదు. అందువలన

జ్ఞానమను విషయము ఏమాత్రము తెలియని నేను, ఎలా జ్ఞానమును

తెలుసుకోవాలో నాకు తెలియదు. దానికి మార్గము మీరే చెప్పాలని

కోరుచున్నాను.


రాజయోగా :- అలాగే! నీకు జ్ఞానమును తెలియుటకు మేము మార్గ

దర్శకులుగా ఉందుము. ఇప్పటికైనా నీవు సంతోషించి నీ కార్యము నెరవేరిన

తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడేవుండి, జ్ఞానమును సంపూర్ణముగా

తెలుసుకొని పవిత్రురాలిగా మారిపో.


దయ్యము :- స్వామి నాకు చిన్న అనుమానము నాకు శరీరము లేదు

కదా! నా సంశయములను గురించి మిమ్ములను ఎలా అడుగగలను?

రాజయోగా :- ఈ విషయములో నీవు చింతచేయవలసిన అవసరములేదు.

నీవు ఇప్పుడున్నట్లే ఉంటూ జ్ఞానమును వినవచ్చును. ఏదైనా అర్థముకాని

విషయమును అడగవలసి వచ్చినపుడు, నేను చెప్పిన శరీరములో దూరి

ఆ శరీరమునుండి నీవు నీ ప్రశ్నను అడిగి తెలుసుకోవచ్చును.

దయ్యము :- ధన్యురాలిని స్వామీ! ఈనాడు నాకు ఎంతో సంతోషముగా

ఉన్నది.


రాజయోగా :- ఇప్పుడొక విషయమును అడుగుతాను, దానికినీవు జవాబు

చెప్పవలెను. గతములో ఇతనికి కడుపునొప్పి ఉన్నపుడు దారిలో పోతూ

ఇక్కడకి వచ్చారట. అప్పుడు మా రాఘవ ఇతని కడుపు మీద చేయి పెట్టి

నపుడు, నొప్పి ఏమాత్రము లేకుండ పోయిందట. నేను ఏమీ చేయలేదు

నొప్పి ఎలా పోయిందని అనుమానము రాఘవకు ఉన్నది. ఆ దినము

ఏమి జరిగిందో నీవే చెప్పితే రాఘవకు అర్థమవుతుంది.


దయ్యము :- ఆ దినము వీరు అందరూ మాంత్రికుని వద్దకు పోవాలని

నిర్ణయించుకొన్నారు. ఆ మాంత్రికుడు కేరళనుండి వచ్చాడనీ, అతను

చాలా పెద్ద మళయాల మాంత్రికుడనీ వీరు చెప్పుచుండడము వలన నాకు

కోపము వచ్చి, ఈ యువకుడిని మరీ బాధించను మొదలుపెట్టాను.

వీరందరూ అన్నము తినేదానికి మంచినీరు కోసము ఇక్కడ ఆశ్రమములోనికి

వచ్చారు. అప్పుడు ఇతనిని నేను అన్నము కూడా తిననియ్యలేదు. ఇతని

బాధను చూచిన మీ ఆశ్రమవాసి రాఘవ ఇతనికి ఉండేది రోగమనుకొన్నాడు.

ఇతనికి ఏదో ఒక విధముగ కడుపు నొప్పిని తగ్గించాలనుకొన్నాడు. కడుపును

వత్తడము వలన కొంత నొప్పి కనిపించకుండ పోతుందని అతను కడుపును

వత్తడము కొరకు చేయిని కడుపు మీద పెట్టాడు. అప్పుడు అతను సాధారణ

మనిషికాదనీ, అతనిలో కొంత జ్ఞానశక్తి ఉందనీ, అతని స్పర్శ ద్వారా

నాకు తెలిసి వెంటనే నొప్పి లేకుండా చేశాను. అలా నొప్పి కనిపించక

పోవడము రాఘవకు అర్థము కాకపోయినా, వీరు మాత్రము ఈ పీడ

ఇంతటితో పోయిందనుకొన్నారు. అప్పటి నుండి నేను కడుపును నొప్పించక

ఇతని శరీరములోనే ఉన్నాను. ఇప్పుడు మీరు పిలిస్తే వచ్చాను. అది ఆ

దినము జరిగినది.


రాజయోగా :- సరే నీవు ఇప్పుడు పోయి, తర్వాత కొంత కాలమునకు

వచ్చి నాకు తెలియజేయి.


(అప్పుడు సత్యవతి అను దయ్యము ఆ యువకుని శరీరములోనికి

అణిగిపోయింది. యువకుడు స్పృహలోనికి వచ్చాడు. స్వామి, వారినందరినీ

పోయిరమ్మనాడు. స్వామికి నమస్కారములు తెలిపి అందరూ బయలు

దేరారు. అంతవరకు రాఘవ అక్కడ జరిగిన విషయమునంతటిని శ్రద్దగా

విన్నాడు. వారు పోయిన తర్వాత స్వామితో ఇలా అన్నాడు.)


రాఘవ :- ఆ దినము సత్యవతి చెప్పినట్లే జరిగినది. కానీ నాలో ఉన్న

శక్తి ఏమిటో నాకు తెలియదు. అది ఆమెకు ఎలా తెలిసిందో కూడా

తెలియదు. నా జాతకచక్రమును తెలిసిన వారు నాలోవున్న శక్తి ఏమిటో

మీకు తెలిసి వుంటుందనుకుంటాను.


రాజయోగా :- సత్యవతికి తెలిసినప్పుడు నాకెందుకు తెలియదు? నీకే

కాదు ఇప్పుడు నీవు పెళ్ళాడపోయే దుందుభికి కూడా కొంతశక్తి ఉన్నది.

ఇదంతా తర్వాత సమయమొచ్చినపుడు తెలియజేస్తాను. ఇపుడు నీ

వివాహము దగ్గరకు వచ్చినది ఆ పనులు చూచుకోండి.


(రాజయోగానంద ఆశ్రమములో గూడెమునుండి ఆటవికులందరూ

రాగా స్వామి సమక్షములో రాఘవ పెళ్ళి జరిగింది. రాఘవతో తన

కూతురు పెళ్ళిని స్వామి దగ్గరుండి జరిపించడము మల్లుదొరకు

సంతోషమైనది. మిగత గూడెము మనుషులందరు పెళ్ళి అయిపోయిన

తర్వాత తమ గూడెము కు పోయారు. మల్లుదొర, యోగ, మేఘ, చక్రి

మరికొందరు ముఖ్యమైన ఆడ మగవారు ఒక నెలరోజులు దుందుభికి

తోడుగా ఉండాలనుకొన్నారు.)


(నాగోతుల నాగభూషణము, మాంత్రిక మల్లయ్య తాత, తాటి

మానుమునెప్ప మనుషులు అందరు కలిసి మర్రిమాను వద్దకు పోయారు.

అక్కడ పాములు ఎక్కడున్నాయోనని తెలుసుకొనుటకు వారివద్దనున్న

అంజనములో చూచారు. అంజనములో వారికి పాములు కనిపించలేదు.

మర్రిచెట్టు క్రిందినుండి ఎక్కడికైనా పోయినా అవి ఎక్కడున్నది, ఎంత

దూరములో ఉన్నది అంజనములో తెలియును. కానీ పాముల జాడే

అంజనములో కనిపించక పోవడమేమిటని నాగభూషణమునకు అర్థము

కాక వృద్ధుడైన మల్లయ్యను ఇలా అడిగాడు.)


నాగభూషణము :- మల్లయ్య తాతా! అంజనములో పాములు ఎక్కడున్నా

కనిపించాలి కదా! ఎందుకు కనిపించలేదు?

మల్లయ్య :- అంజనములో ఎక్కడున్నా కనిపించాలి. అలా కనిపించలేదు

అంటే దానికి ఒక కారణము ఉంటుంది. మంత్రశక్తి, అంజనశక్తికంటే

మించిన శక్తి సమీపములో పాములు ఉంటే అక్కడికి అంజనము పారదు.

అక్కడున్న దానినిగానీ, ఆ ప్రాంతమునుగానీ చూపలేదు. మంత్రశక్తులు

కూడా అక్కడ పని చేయవు. అటువంటి చోట పాములుంటే అవి

కనిపించవు.



(మల్లయ్య తాత మాటలు విన్న మునెప్ప మనుషులకు నెత్తిన

గుండు పడినట్లయినది. ఎటులనైన పామును పట్టివ్వవలెనని

నాగభూషణమును, మల్లయ్యను వారు ప్రాధేయపడి అడిగారు. “అది

ఎక్కడున్నదో తెలిస్తే కదా మేము పట్టిచ్చేది." అని మల్లయ్య అన్నాడు.

మునెప్ప మనుషులకు ఏమీ అర్థముకాక తమ నాయకునికి ఆ విషయము

ఎలా చెప్పాలో తెలియక మీరే ఈ విషయమును మా నాయకునికి చెప్పండి

అని అడిగారు. సరేనని ఒప్పుకొన్న నాగభూషణము, మల్లయ్య అందరూ

మునెప్ప దగ్గరికి పోయారు. మునెప్ప అడవిలో నివాసమేర్పరుచుకొన్న

దానివలన అందరూ సులభమూ గనే అక్కడికి చేరారు.

మందిరమువద్ద పోలీస్లు వెంబడించినప్పటి నుండి మునెప్ప పోలీస్లకు

దొరకకుండా అడవిలో నివాసము చేసుకొన్నాడు. జనం మధ్యలో అయితే

మునెప్ప దగ్గరికి పోవాలంటే చాలాకష్టము. అడవిలో ఉండుట వలన

మునెప్పను సులభముగా కలుసుకోగలిగారు. మునెప్పకు నాగభూషణము,

మల్లయ్య తాతను పరిచయము చేశారు. తర్వాత వెంకు, నూకా ఆ ఇద్దరి

మాంత్రికులతోనే పాములు అంజనము యొక్క కన్నుకు కూడా

బాబా


కనిపించడము లేదని చెప్పించారు. అంజనమునకు కూడా ఎందుకు

కనిపించవో, దానికి గల కారణమును కూడా చెప్పారు. దానిని విన్న

మునెప్పకు ఏమీ తోచక ఆ విషయమును వెంటనే తపస్విబాబాకు తెలియ

జేయాలనుకొన్నాడు. అపుడు ఆ విషయమును తపస్వి బాబాగారికి తెలియ

జేయడానికి ప్రత్యేకముగా ఏర్పరుచుకొన్న గుడిసెలోనికి పోయాడు.

పోలీసుల చూపు తపస్విబాబా ఆశ్రమము వద్ద మునెప్ప మీద

పడినప్పటినుండి మునెప్ప బాబాగారితో వయర్స్ ద్వారా సంబంధము

పెట్టుకొన్నాడు.


ముందుగా నిర్ణయించుకొన్న ప్రకారము ప్రతి వారము వయర్లెస్

ఫ్రీక్వెన్సీ మార్చి వారి మాటలు ఏ పోలీస్ వయర్లెస్ సెట్స్లో తగులు

కొననట్లు జాగ్రత్తగ మాట్లాడేవారు. మునెప్ప తన గుడిసెలో అమర్చుకొన్న

వయర్లెస్ సెట్ ఆన్చేసి, ఫ్రీక్వెన్సీ సవరించి సిగ్నల్ పంపాడు. తపస్వి

బాబాగారి ప్రత్యేక గదిలో ఒక టేబుల్కు అడుగు భాగమున అమర్చిన

స్పీకర్ నుండి వస్తున్న సిగ్నల్స్ను బాబాగారు విన్నారు. ఆ సిగ్నల్స్ కూడా

బాబాగారి గదిలో ఫ్యాన్ తిరుగుచున్నపుడు మాత్రమే శబ్దమవుతాయి. ఫ్యాన్

ఆఫ్ట్చేస్తే స్పీకర్నుండి శబ్దమురాదు, అట్లే వయర్లెస్ సెట్ పనిచేయదు.

ఆ గదిని పోలీస్ ఆఫీసర్లు చెక్ చేసినపుడు ఫ్యాన్ ఆఫ్ లో ఉంది కావున

ఎవరూ ఆ సెట్ను గుర్తించలేకపోయారు. అలా రహస్యముగ ఉన్న సెట్

నుండి వచ్చిన సిగ్నల్స్ విన్న బాబా వెంటనే పెన్లాంటి మైకును అందుకొని

"హలో త్రీవన్! టువన్ హియర్ సమాచారము ఏమిటి ఓవర్” అన్నాడు.

అప్పుడు మునెప్ప “హలో టువన్! మనవాళ్ళు తిరిగి వచ్చారు. వారికి

ఇద్దరు మాంత్రికులు సహాయపడినప్పటికీ పని జరుగలేదు. ఆ పాముతో

పాటు మరియొక పాముకూడా ఉన్నదట. ఆ రెండు పాములు జాడ


తెలియకుండా పోయాయి. మాంత్రికులు అంజనము కూడ వేసి చూచారట.

అయినా అంజనమునకు కూడా కనిపించలేదట. మనవారికి ఏమీ తోచక

మాంత్రికులను కూడా తీసుకొని వచ్చారు. నాకు ఏమీ అర్థము కాలేదు

ఓవర్” అన్నాడు. అప్పుడు బాబాగారు " హలో త్రీవన్! అవి ఎక్కడున్నది

చెప్పగలను. అంతవరకు ఆ మాంత్రికులను తలా పదివేలు ఇచ్చి నీదగ్గరే

పెట్టుకో. రేపు నేను మెసేజ్ పంపగలను. సెట్ ఆఫ్ ఓవర్” అని తపస్వి

బాబాగారు సెట్ ఆఫ్ చేశారు. ఈ విషయము ఎవరు మాట్లాడుచున్నదీ

తెలియునట్లు మునెప్ప పేరు '3,1' అని, బాబాగారి పేరు ‘2,1’ అని

గుర్తుతో మాట్లాడారు. మునెప్ప నాగభూషణమునకు మల్లయ్యకు తలా

పదివేలు డబ్బు ఇచ్చి పది రోజులు తనవద్దే ఉండమన్నారు. మాంత్రికులిద్దరు

ఎప్పుడూ అంతడబ్బును చూడలేదు కావున వారికి సంతోషమైనది. మునెప్ప

చెప్పినట్లు ఉంటామని ఒప్పుకొని అక్కడే ఉన్నారు.


వయర్లెస్ సెట్ ఆఫ్ చేసిన తపస్వి బాబాగారు కొద్దిసేపు యోచించి

తన ఆధీనమందుగల సూక్ష్మరూపములను పిలిచి పాముల వివరము

కావాలనీ, అవి ఎక్కడున్నది తెలుపాలనీ, అందుకొరకు ఇంతకాలము తనను

వీడకుండ ఉండిన వారికి, ఈ ప్రాంతమును వదలి వెళ్ళుటకు అనుమతి

ఇస్తున్నానని, 24 గంటలలోపల పాములను అన్వేషించి తిరిగి వచ్చి వాటి

విషయము తెలుపాలని ఆదేశించాడు.


సూక్ష్మరూపములు తనవద్దలేకపోతే తాను మామూలు మనిషేనని,

అవి ఉన్నంతవరకే తనకు ప్రత్యేకత కలదని తెలిసివున్న బాబా వాటిని

ఎప్పుడూ బయటికి పంపలేదు. చివరకు ఆ దినము ఏ దారీలేదనీ, వాటిని

బయటికి పంపకపోతే వజ్రాల విషయము తెలియకుండా పోవుననీ,

గత్యంతరము లేక తనకు ఇష్టము లేకున్ననూ ఆ విధముగా ఆదేశించి


పంపవలసి వచ్చినది. బాబాగారివద్ద సూక్ష్మరూపములోనున్న శక్తులకు

కన్నులేదు. కానీ చూపువున్నది. అందువలన కంటి పరిమితిని మించి

సూక్ష్మములు ఎక్కువ దూరము చూడగలవు. బాబాగారి ఆదేశము తీసుకొన్న

సూక్ష్మశరీరములు ఆశ్రమమును వదలి బయటికి వచ్చి ఒక్కొక్కమారు పది

మైళ్ళ దూరము వరకు చూస్తూ పోతున్నవి. అట్లు చూస్తూపోతున్న

సూక్ష్మములకు రాజయోగానంద స్వామి ఆశ్రమ ఆవరణములో ఆ రెండు

పాములు కనిపించాయి. వజ్రాలున్న పామును రెండవ పాము తన వెంట

తీసుకొని అక్కడ చేరినట్లు తెలుసుకొన్న ఆ సూక్ష్మములు వెంటనే వెను

తిరిగి తపస్విబాబాగారి ఆశ్రమము చేరి, ఉన్న విషయము బాబాగారికి

తెలియ జేశాయి. అంతేకాక ఆ ఆశ్రమము గొప్ప జ్ఞానశక్తితో కూడుకొన్నదని

కూడా తెలిపాయి.



ఆ విషయమును తెలుసుకొన్న తపస్విబాబాగారు వెంటనే వయర్

లెస్ సెట్ ద్వారా తాటిమాను మునెప్పకు సమాచారమును పంపాడు.

పాములు రాజయోగానంద ఆశ్రమ ఆవరణములో ఉన్నాయనీ, అది

దివ్యమైన జ్ఞానశక్తికి నిలయమైనప్రాంతమనీ, అందువలననే మాంత్రికుల

అంజనములు అక్కడి దృశ్యమును చూపలేకపోయాయనీ, మీరు అక్కడికి

తెలివిగ పోయి పాములను తేవాలని మునెప్పకు చెప్పాడు. మునెప్ప

అలాగేనని చెప్పి ఆ విషయమును తన మనుషులకు తెలిపి, రాజయోగానంద

స్వామి ఆశ్రమము ప్రత్యేకతను కూడా తెలిపి జాగ్రత్తగా పోయిరమ్మన్నాడు.

రాజయోగానంద స్వామి ఆశ్రమము ఐదు ఎకరముల ఆవరణములోనున్నది.

కావున పగలు పోవుటకు వీలుపడదని గ్రహించిన మునెప్ప మనుషులు,

రాత్రి సమయమున ఎవరూ చూడకుండా ఆ ఆవరణములో ప్రవేశించి

పామును వెదకసాగారు. మునెప్ప మనుషులు ఆ రాత్రి వచ్చారని గ్రహించిన


రెండవ పాము, ఆరుబయట పడుకొన్న ఆటవికులను నిద్రలేపాలని తలచి

వారివద్దకు చేరి యోగను తోకతో కొట్టింది. ఆ వేటుకు నిద్రనుండి లేచిన

యోగ తమ ఆవరణములో ఎవరో ఉన్నట్లు గమనించి, మిగతావారిని

కూడా లేపాడు. ఎనిమిది మంది ఆటవికులు లేచిన తర్వాత తమ

ఆవరణములోనున్న వారిని జగన్నాథము మనుషులనుకొన్నారు. ఒకమారు

తమచేతిలో దెబ్బలు తిని పోయిన జగన్నాథము రాత్రిపూట తమ మీదికి

దాడిచేయడానికి మనుషులను పంపాడని అనుకొన్నారు. ఈ మారు వారికి

బాగా బుద్ధి చెప్పాలనుకొన్నారు. అందువలన వారిని బంధించుటకు వారికి

తెలియకుండా వారి సమీపమునకు చేరారు.


తమకు తెలియకుండా చాటుగా తమ సమీపమునకు వచ్చిన

ఆటవికులను చూచిన మునెప్ప మనుషులు అచటనుండి ముందు తప్పించు

కొని పోవాలనుకొని పారిపోవుటకు ప్రయత్నించారు. కానీ వారు పారి

పోకుండ అడ్డగించి వారిని ఆటవికులు పట్టుకోగలిగారు. అలా చీకటిలో

పట్టుకొన్న తర్వాత వారిని ఆశ్రమము వద్ద వెలుతురులోనికి లాక్కొని వచ్చారు.

వెలుతురులో వారి ముఖములు కనిపించాయి. ఒకనాడు రైల్వేకట్టవద్ద

నిమ్మతోటలో సూట్కేస్ కొరకు తమతో పోట్లాడి తర్వాత పాముకాటుకు

గురియైనవారని ఆటవికులు గుర్తించారు. మునెప్ప మనుషులు కూడా

ఆటవికులను గుర్తించారు. ఆటవికులు తమ మనస్సులో మునెప్ప

మనుషులు ఇక్కడెందుకు వచ్చారని అనుకోగా, మునెప్ప మనుషులు

ఆటవికులు ఇక్కడెందుకు ఉన్నారని అనుకొన్నారు. అంతలో రాఘవ అక్కడికి

వచ్చాడు. పట్టుబడినది ఎవరైనదీ తెలుసుకోవాలని ఎవరు మీరని మునెప్ప

మనుషులను అడిగాడు. మునెప్ప మనుషులకు ఏమి చెప్పాలో తెలియలేదు.

వారు మౌనముగా ఉండి పోయారు. అప్పుడు యోగ, మేఘ కలుగజేసుకొని

ఇంతకుముందు మేము నీ కోసము వెదుకుచు వచ్చినపుడే వీరిని చూచామని


చెప్పుచూ, అప్పుడు వారితో ఘర్షణ జరిగిన విషయమూ, పాము

విషయమూ, అది కరచిన విషయమూ, రావిచెట్టు ఆకులతో

విషప్రమాదమునుండి వారిని తప్పించిన విషయమూ అన్నీ చెప్పారు.

అంతా విన్న రాఘవకు వారి విషయము విచిత్రముగా తోచినది.

అంతలో అక్కడికి రాజయోగానందస్వామి కూడా వచ్చాడు. స్వామికి రాఘవ

తనకు ఆటవికులు చెప్పిన విషయమంతా చెప్పాడు. రాజయోగానంద

స్వామి అంతావిన్న తర్వాత మునెప్ప మనుషులను ఇక్కడికి ఎందుకు

వచ్చారని అడిగాడు. అపుడు వెంకు మాట్లాడుచు మేము కుందేలు వేటకు

వచ్చాము. ఒక కుందేలు కనిపించింది. అది దొరకకుండా పరుగిడుచూ

మీ ఆవరణములోనికి వచ్చింది. దానివెంట పరిగెత్తి వచ్చిన మేము

కుందేలుకై వెదకుచుండగా మీవారు వచ్చి మమ్ములను దొంగలనుకొని

పట్టుకొన్నారు అని అన్నాడు. వారి మాటలు విన్న రాఘవ ఇలా అన్నాడు.)


రాఘవ :- “ఒకప్పుడు సూట్కేస్ లో పామును పెట్టి పోట్లాడిన మీరు,

కుందేలు వేటకొచ్చామంటే మేము ఎలా నమ్మాలి? ఆ రోజు మావారి

ద్వారా మీ పాము పోయిందని మీరు కక్షతో ఇపుడు మావారి మీద దెబ్బ

తీయటానికి వచ్చి ఉంటారు. ఆ రోజు ప్రాణానికి తెగించి పామును

పట్టుకోవాలని ప్రయత్నించిన మీరు మావారున్న చోటికే వచ్చారంటే

ఇందులో ఏదో ఆంతర్యముంటుంది. అసలైన విషయమును దాచి మాకు

సాకులు చెప్పుచున్నారు. నిజము చెప్పకపోతే మిమ్ములను వదలము.”


వెంకు :- చెప్పుటకు మావద్ద ఏమీలేదు. మేము పాములు, కుందేళ్ళు

పట్టుకుంటూ ఉంటాము. చర్మాల కొరకు పాములనూ, మాంసము కొరకు

కుందేళ్ళనూ పట్టుకుంటాము. ఇప్పుడు కుందేలు వెంబడిపడి మీ ఆవరణ

ములోనికి వచ్చాము. అంతేతప్ప వేరే ఉద్దేశము మాకు లేదు. మేము

ఏమీ దొంగతనము చేయలేదు కదా!


రాజయోగానంద :- మా ఆశ్రమము బయలుప్రాంతములో ఉన్నది. ఇక్కడ

చెట్ల పొదలులేవూ, రాళ్ళ కుప్పలూ లేవు. అలాంటపుడు ఈ ప్రాంతములో

కుందేళ్ళను వేటాడడమేమిటి? కుందేళ్ళుగానీ, పాములుగానీ చెట్లపొదలూ,

రాళ్ళ గుట్టలున్న చోట ఉండవచ్చును. వాటికి నివాస యోగ్యముకాని ఈ

ప్రాంతములో ఎందుకుంటాయి?

వెంకు :- మీ ఆశ్రమము బయలుప్రాంతములో ఉండుమాట నిజమే.

అయితే ఇక్కడ పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నది. కావున కుందేళ్ళు గడ్డికొరకు

దూరము నుండి రావచ్చును. పాములు కూడా ఉండవచ్చును. మేము

ఇక్కడ పాములను చూచాము. మీరు అనుమతి ఇస్తే పాములను కూడా

పట్టి చూపగలము. అపుడైనా నమ్మగలరు కదా!

రాజయోగా :- మా ఆశ్రమ ప్రాంతములో పాములున్నా మాకు భయము

లేదు. కానీ మేము లేవు అంటే మీరు ఉన్నాయి పట్టిచూపగలము

అంటున్నారు. ఉంటే పట్టిచూపండి.


(వెంకు తెలివినుపయోగించి సులభముగా పామును పట్టుకోవచ్చని

వేసిన పాచికను స్వామి ఒప్పుకోవడము వలన సరిపోయింది. ఇక

అందరి ఎదుట పామును పట్టుకొని చూపి దానిని తీసుకొని సులభముగా

తీసుకు పోవచ్చునని అనుకొన్నాడు. వెంటనే పామును వెదకను

ఆరంభించారు. ఆటవికులు కూడా వారిని అనుసరిస్తున్నారు. అక్కడ

పరిస్థితిని గ్రహించిన రెండవపాము యోచించి సమయానుకూలముగా

తన నోరును పెద్దగా తెరిచింది. అప్పుడు నోటిలోపల పై పెదవికి

అతికియున్న మాణిక్యము యొక్క కాంతి తెల్లని ట్యూబ్ లైట్ కాంతివలె

ఎక్కువగా ప్రకాశముగా కనిపించింది. ఆ కాంతిని దూరమునుండి అందరూ

చూచారు. ఆ పాము నోరు తెరిచి తిరిగి మూసుకోవడము వలన చీకటి


ఏర్పడింది. ఉన్నట్లుండి అలా కాంతి కనిపించి తిరిగి మాయమై పోవడము

మునెప్ప మనుషులకు ఏమీ అర్థముకాలేదు. వారిలోనున్న నాగభూషణము

నకు పాముల విషయము తెలిసినప్పటికీ మణి పాముల విషయము

తెలియదు. ఆటవికులు మాత్రము అది పాముయొక్క మణి వెలుగై

ఉంటుందనుకొన్నారు. కానీ అదేనని దృఢపరుచుకోలేక పోయారు.

రాఘవకు తాను గుహలో చూచిన జ్ఞాపకము వచ్చినది. ఇక రాజయోగానంద

స్వామి తాను కూడా దూరమునుండి వెలుగును చూచినవాడై అది పాము

యొక్క మాణిక్య కాంతియేననీ, ఆ పామును పట్టుకొనుటకే వీరు దొంగలుగా

వచ్చారనీ అనుకొన్నాడు.



తలలో మాణిక్యమున్న పాము, కడుపులో వజ్రములున్న పామును

పిలుచుకొని పాము కొరకు వెదకుచున్న మునెప్ప మనుషులవైపే వచ్చినది.

వజ్రాల పాము పది అడుగుల దూరమున్నట్లే మునెప్ప మనుషుల వద్ద

సెన్సార్ మ్రోగను మొదలు పెట్టింది. ఆ శబ్దమును విన్న వెంకూకు సంతోష

మైనది వారివద్దనున్న టార్చిటైట్లు వెలిగించి చూచారు. వారికి దగ్గరగా

వచ్చిన మాణిక్య పాము వజ్రాల పామును వదలి లైట్లు వెలగకనే ప్రక్కకు

తప్పుకుంది. వజ్రాల పాము దొరకాలనే అదలా చేసింది. అంతవరకు

వారికి దొరకకుండా తప్పించిన మాణిక్యపాము ఇక్కడ అదేపనిగా దొరికే

టట్లు చేసి అది కనిపించకుండా పోయింది. టార్చిలైట్ల వెలుగులో వజ్రాలున్న

పాము కనిపించింది. అప్పుడు నాగభూషణము ఆ పామును సులభముగా

పట్టుకోగలిగాడు. దానికోసము అనేక కష్టాలుపడిన తర్వాత ఆ పాము

దొరకడము మునెప్ప మనుషులకు సంతోషమైనది. పాములోపల వజ్రాలున్న

విషయము రాఘవకు గానీ, స్వామికిగానీ ఎవరికీ తెలియదు. కావున

దానిని వారికి చూపి సులభముగా తీసుకపోవచ్చుననుకొన్న వెంకు

పామును రాజయోగానంద స్వామికి చూపి ఇలా అన్నాడు.)


వెంకు :- చూడండి! ఇక్కడ పాములు కూడా ఉండవన్నారు. పామును

పట్టుకొన్నాము. ఇప్పటికైనా మేము దొంగలు కాదని తెలిసింది కదా!

(అంతకు ముందే మాణిక్యము యొక్క వెలుగును చూచిన స్వామి

వారు పట్టినది మాణిక్యమున్న పామేనని అనుకొన్నాడు. వారు దాని వేటకే

వచ్చారని తలచిన స్వామి ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- మీరు పట్టినది సామాన్యమైన పాముకాదు. దాని

యందు ఖరీదైన వస్తువున్నది. కావున దానికోసమే మీరు పొంచివచ్చారు.

మావద్ద ఏదో సాకులు చెప్పి చివరకు ఆ పామును పట్టుకున్నారు. అంతేకదా!


(ఆ మాటలు విన్న మునెప్ప మనుషులు అదిరిపడ్డారు. కథ

అడ్డము తిరిగిందనుకొన్నారు. మా విషయము ఈయనకెలా తెలిసిందని

అనుకొన్నారు. వీరికి అంతా తెలిసిపోయిందనుకొని, ఇక ఏమి చెప్పినా

ప్రయోజనములేదని, అక్కడినుండి తప్పించుకొని పోవాలని తలచి ఇలా

అన్నాడు.)


వెంకు :- అవును మీరన్నట్లు ఈ పాముకడుపులో ఖరీదైన వజ్రములున్నవి.

దీనికోసమే మేము వచ్చాము. మా పని నెరవేరింది. ఈ విషయమును

ఎక్కడైనా చెప్పారంటే మీ ప్రాణాలు దక్కవు జాగ్రత్త.


(అని బయలుదేరపోయారు. స్వామి మాటలు, వారి మాటలు

విన్న రాఘవకు ఏమీ అర్థము కాలేదు. పాములో వజ్రాలేమిటి? స్వామి

వాటిని ఎలా పసికట్టాడు? అని రాఘవ ఆలోచనలోపడ్డాడు. వెంకు

మాటలువిన్న స్వామి, నేను పాము తలలో మాణిక్యముందనుకొంటే, వీడు

పాముకడుపులో వజ్రాలంటున్నాడు. అంతేకాక మమ్ములనే బెదిరించి మీ

ప్రాణాలు దక్కవని అంటున్నాడు. వీరిని వదలకూడదనుకొని వీరినందరిని

వదలకుండ కట్టివేయండని తనవారికి చెప్పాడు. ఆ మాటలు వింటూనే

ఆటవికులూ, రాఘవా, ఆశ్రమవాసులు అందరూ కలిసి కొద్దిసేపు వారితో


పోరాడి చివరకు బంధించగలిగారు. వారివద్ద బుట్టలోనున్న పామును

కూడా బుట్టతో సహా లాగుకొన్నారు. తాము ఊహించని విధముగా

జరుగడము వలన చింతించిన మునెప్ప మనుషులు తమ నాయకునికి

ఈ విషయము ఎలా తెలుస్తుందని అనుకోసాగారు.


ఆ వింత సంఘటనకు ఆశ్రమములోనున్న దుందుభి, రాధేశ్వరి

మొదలగువారంతా ఆశ్చర్యపోయారు. రాఘవ భార్య అయిన దుందుభి ఏ

పామునైనా తన చేతిలోనికి తీసుకోగలదు. పాములు ఆమెను కాటువేయవు.

ఏ పామైనా సంతోషముగా ఆమె చేతిలో ఆడుకోగలదు. పాములతో ఆమె

చిన్నప్పటినుండి స్నేహము చేసెడిది. అందువలన ఆమె బుట్టలోని పామును

బయటికి తీసింది. రాజయోగానంద స్వామివద్దకు తెచ్చి, స్వామికి దానిని

చూపింది. మునెప్ప మనుషులను ఒక గదిలో బంధించివుండడము వలన

తర్వాత ఏమి జరుగుచున్నది వారికి తెలియదు. దుందుభి తన దగ్గరకు

తెచ్చిన పామును చూచిన స్వామి ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- ఇది తలలో మాణిక్యముగల పాము. ఈ పాము

రాత్రి నోరు తెరువడము వలన దాని కాంతిని గ్రహించాను. వీరు ఈ

పాము కొరకే వచ్చివుంటారని అప్పుడే అనుకొన్నాను. కానీ వారు మనలను

మోసము చేయుటకు వజ్రాలని అబద్దము చెప్పి బెదిరించి తప్పించుకొని

పోవాలనుకొన్నారు.


(ఆ మాటలు విన్న రాఘవ కొద్దిగ జ్ఞాపకము తెచ్చుకొని ఇలా

అన్నాడు. )


రాఘవ :- మాణిక్య వెలుగును నేను కూడా ఒకమారు భూగర్భ గుహలో

చూచాను. రాత్రిచూచిన వెలుగు కూడా అదేలాగున్నది. ఆ కాంతి

మాణిక్యముదే అయివుండవచ్చును.

దుందుభి :- ఇది మీరనుకొన్నట్లు మాణిక్యము గల పాముకాదు. దీని

నోటిలో మాణిక్యములేదు.


(అని దుందుభి పాము నోరును తెరిచి చూపించింది. పాము

నోటిలో మాణిక్యములేదు. అపుడు మునెప్ప మనుషులు చెప్పిన

విషయమును దుందుభికి చెప్పాడు. అప్పుడు ఆమె పామునంతటిని పరీక్షించి

దాని కడుపు భాగములో చర్మము క్రింద వజ్రాలున్నాయని గ్రహించి, ఆ

విషయమును స్వామి వారికి తెలిపింది. దానిని రాఘవ, స్వామి ఇద్దరూ

పరిశీలించి నిజమేనని తెలుసుకొన్నారు. తర్వాత పామును పట్టుటకు

వచ్చినవారెవరో తెలుసుకోవాలనుకొన్నారు. దుందుభి, స్వామి సలహా

మేరకు పాముచర్మము క్రిందినుండి పది వజ్రములను బయటికి తీసి

భద్రపరిచింది. పామును తనవద్దనే ఉంచుకొన్నది. ఇదంతయూ చాటునుండి

గ్రహిస్తున్న మాణిక్యపాము తన ధ్యేయము నెరవేరినట్లు తలచి, అక్కడి

నుండి బయలు దేరి భూగర్భగుహలోనికి చేరింది. మాణిక్య పాము

ఇంతపాత్ర నిర్వహించినదని రాఘవకుగానీ, స్వామికిగానీ తెలియదు.

అవసరమొచ్చినపుడు ఈ పాము బయటికి వస్తుంది అని గుహలో మహాత్ముడు

రాఘవకు చెప్పిన మాట నెరవేరింది.)


(తమ మనుషుల నుండి సమాచారమూలేదు, వారు రానూ లేదు

అని యోచిస్తున్న మునెప్ప తన మనుషులలో ఒకనిని వెంకు గుంపు ఎందుకు

రాలేదో సమాచారమును సేకరించి తెలుపమని పంపాడు. అట్లు బయలు

దేరినవాడు వైద్యునివలె వేషము వేసి కొన్ని ఆకులనూ, మూలికలనూ తన

భుజమునకు తగిలించుకొన్న సంచిలో వేసుకొని, మునెప్ప చెప్పిన ప్రాంతము

నకు చేరుకొని, కాళ్ళనొప్పులకూ, కడుపునొప్పులకూ, వాయినొప్పులకూ,

మూర్ఛలకూ పత్యములేకుండా మందుఇస్తామని చెప్పుచూ ఆ ప్రాంతములో

తిరుగుచూ రాజయోగానంద ఆశ్రమములోనికి ప్రవేశించాడు. అక్కడున్న


ఆటవికులకు తాను వైద్యుడనని చెప్పి, వనమూలికలతో వైద్యము పత్యము

లేకుండా చేయుదునని చెప్పెను. తనతో మాట్లాడినది అడవిలో నివసించు

వారని, వారికి వనమూలికలను గురించి బాగా తెలుసునని వీనికి తెలియదు.

అప్పుడు వారు నీవద్ద ఏమి మూలికలున్నాయని అడిగారు. దానికి వాడు

“నావద్ద గ్రంథి, అశ్వగ్రంథి, రసగ్రంథి, బ్రహ్మదండి, యమదండి, తెల్ల

ఈశ్వరి, నల్ల ఈశ్వరి, స్త్రీరత్న, పురుషరత్న, జాజి, జాపత్రి, మధురము,

అతిమధురము, పునుగుకొవ్వు, కణితి మూలము ఎన్నో ఉన్నాయి”. అని

ఏకధాటిగా చెప్పాడు. వాడు చెప్పిన మాటతీరు చూస్తే ఎవరైన వానిని

నిజమైన వైద్యునిగా ఒప్పుకోక తప్పదు. వాని మాటలు విన్న ఆటవికులు

ఒకరి ముఖము ఒకరు చూచుకొని బ్రహ్మదండి ఉన్నది, కానీ యమదండి

ఎక్కడా లేదే! అనుకొని ఇలా అన్నారు.)


యోగ :- మేము కూడా ఎన్నో మూలికలను చూచాము, కానీ బ్రహ్మదండి

ఉన్నది కానీ యమదండిని ఎక్కడా చూడలేదు. నిజముగా ఆ మూలిక

ఉన్నదా? అది దేనికి పనికివస్తుంది?


వైద్యుడు :- ఆ! ఉంది, ఎందుకులేదు? అది హిమాలయాల్లో దొరుకుతుంది.

కష్టపడి తెచ్చాను. ఆ మూలికను ఉపయోగించి మనిషిలోని నిజాన్ని

చెప్పించవచ్చును. రహస్యముగా దాచుకొన్న విషయములన్నీ బయట

పడగలవు. దానిని ఉపయోగిస్తే ఎవరూ అసత్యమును చెప్పలేరు.

యోగ :- మావద్ద నిజము చెప్పని వారున్నారు. వారితో నిజము చెప్పిస్తావా?

వైద్యుడు :- ఓ! చెప్పిస్తాను. ముందు వారిని చూపండి. వారిని పడుకోబెట్టి,

వారి ఎదమీద యమదండి మూలికను పెట్టితే వారికి తెలియకుండానే

తప్పక ఉన్నదున్నట్లు చెప్పుదురు.


(అయితే వారిని నీకు చూపుతాము రా, అని ఆటవికులు వానిని

పిలుచుకొని పోయి తాము బంధించియుంచిన వారిని చూపారు. వారిని

చూచినవెంటనే వైద్యుడు తమ మనుషులు బంధించబడివున్నారని అర్థము

చేసుకొన్నాడు. ఆ వైద్యున్ని చూచిన మునెప్ప మనుషులు తమ మనిషి

మారువేషములో వచ్చాడని గ్రహించారు. ఆటవికులకు తెలియకుండా మీరు

భయపడవద్దన్నట్లు సైగ చేశాడు. “వీరేనా నిజము చెప్పనివారు, నా

మూలికను ఉపయోగించి వీరితో నిజము చెప్పిస్తా” అని బయటికి వచ్చి

“మూలికకు కొద్దిగ పంది రక్తమును పూసి ఉపయోగించాలి. నేను పోయి

పంది రక్తమును తెచ్చుకుంటాను.” అని చెప్పి చిన్నగ అక్కడినుండి

వెళ్ళిపోయాడు. ఆ దినము సాయంకాలము వరకు కాచుకొన్న ఆ వైద్యుడు

తిరిగి రాలేదు. ఇక వాడు రాడని నిశ్చయించుకొని, వైద్యుడు వచ్చినదీ,

వాడు చెప్పినదీ, వాడు పోయినదీ వాడు తిరిగిరానిదీ, అన్ని విషయములు

రాఘవకు యోగ చెప్పాడు. యోగ మాటలను విన్న రాఘవకు వైద్యుడుగా

వచ్చినది కూడా వీరి మనిషే అయివుంటాడు, వీరి ఆచూకీ తెలుసుకొనే

దానికి వచ్చివుంటాడని అనుకొన్నాడు. ఆ విషయమునే రాఘవ ఆటవికులకు

తెలుపగా వారు ఆశ్చర్యపోయారు.


వైద్యుని వేషములో పోయి వచ్చిన వాని ద్వారా తమ మనుషుల

విషయమును తెలుసుకొన్న మునెప్ప, ఆ సమాచారమును తపస్విబాబాగారికి

వయర్లెస్లో తెలియజేశాడు. తర్వాత బాబాగారు చెప్పిన ప్రకారము

తనకు పరిచయమున్న గిరిజనుల చేత, కుందేలు వేటకు పోయిన తమ

గిరిజనులను రాజయోగానంద స్వామి బంధించాడని పోలీస్ స్టేషన్లో

కేసు వ్రాయించునట్లు చేశాడు. కేస్ వ్రాసుకొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలప్ప

పోలీసులను వెంటపెట్టుకొని రాజయోగానంద స్వామి ఆశ్రమానికి వచ్చాడు.


ఆశ్రమములో రాజయోగానంద స్వామి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. రాఘవ

చాపమీద క్రింద కూర్చొని ఉన్నాడు. ఆటవికులు కూడా రాఘవ ప్రక్కనే

ఉన్నారు. ఆశ్రమ ఆవరణములోనికి వచ్చిన ఇన్స్పెక్టర్ బాలప్పకు రాఘవ

లేచి ఎదురు పోయాడు. అతనిని సమీపించిన రాఘవ ఇలా అడిగాడు.)

రాఘవ :- ఎవరు కావాలండి?


ఇన్స్పెక్టర్ :- (రాఘవను బిర్రుగా చూస్తూ) ఎవడురా ఇక్కడ స్వామి?

(ఆ మాటకు రాఘవ ఉలిక్కిపడ్డాడు. రాజయోగానంద స్వామి

ఆ మాట విని కనబొమ్మలు పైకెత్తి వచ్చిన ఆ వ్యక్తివైపు చూచాడు. రాఘవ

ఏమి మాట్లాడకుండా, రాజయోగానంద స్వామివైపు చేయి చూపాడు.

ఇన్స్పెక్టర్ స్వామివైపు వచ్చి స్వామి కూర్చొని ఉండడము చూచి “ఏయ్!

ముందు లేచినిలబడు” అన్నాడు. స్వామి మౌనముగా అతని వైపు చూచాడు.

కానీ లేవలేదు. అది చూచి రెచ్చిపోయిన ఇన్స్పెక్టర్ రెట్టింపు స్వరముతో

“ఏమి వినిపించలేదా?” అన్నాడు. ఆ మాటకు వెంటనే రాఘవ ఇలా

మాట్లాడాడు.)

రాఘవ :- ఆగవయ్యా ఆగు, ఎందుకు రెచ్చిపోయి అలా మాట్లాడుచున్నావు.

కొద్దిగా తగ్గి మాట్లాడు.

ఇన్స్పెక్టర్ :- ఏమిటిరా మీతో తగ్గి మాట్లాడేది? మీలాంటి దొంగస్వాములను

చాలామందిని చూచానురా, స్వాములని పేరు పెట్టుకొని మత్తు పదార్థములు

అమ్ముతారా? దానిని చూచిన వారిని మీ గుట్టు బయటపడకుండునట్లు

దాచి ఉంచుతారా, పైగా నన్నే తగ్గి మాట్లాడమంటారా?

(అని రాఘవ షర్టు పట్టుకొని లాగి కొట్టేదానికి చేయి పైకెత్తాడు.

అదంతా చూస్తున్న దుందుభి, రాధేశ్వరి పరుగిడుచు అక్కడికి వచ్చారు.


ఆ సంఘటన చూచిన ఆటవికులు ఒక్కమారు రాఘవ దగ్గరకు వచ్చి

నిలబడ్డారు. అదంతా చూచిన స్వామి ఇలా అన్నాడు.)

రాజయోగానంద :- పోలీస్ ఉదోగ్యము మనుషులను కొట్టే లైసెన్సు

అనుకోవద్దు. ముందు అతని షర్టు వదిలి నాతో మాట్లాడు.

(స్వామివైపు చూచిన ఇన్స్పెక్టర్ బాలప్ప వెంటనే రాఘవ షర్టు

వదిలి స్వామి వైపు తిరిగాడు. అప్పుడు స్వామి ఇలా అన్నాడు.)

రాజయోగానంద :- చూడుబాబు! పుట్టుకతో అందరము మనుషులమే

అయినప్పటికీ, నీ వంటిమీద ఖాకీడ్రస్సు, తలమీద టోపీ పెట్టుకొన్నంత

మాత్రమున నీవు ఒక మనిషివను సత్యమును మరువవద్దు. తల్లిపాలు

త్రాగకుండా, మనుషుల మమతలు పంచుకోకుండా ఏ వ్యక్తి భూమిమీద

ఉండడు. పుట్టినపుడు లేని ఈ డ్రస్సు, టోపీ ఇప్పుడు వచ్చినంతమాత్రమున

నేను ఒక మనిషినని మరిచిపోయి అమానుషముగా ప్రవర్తించడము మంచిది

కాదు. నీవు వచ్చిన పనేమిటో చెప్పు.


ఇన్స్పెక్టర్ :- ఏమిటి నీతులు చెప్పుచున్నావు? నీ హెూదా ఏమిటో, నా

హెూదా ఏమిటో తెలుసా?



రాజయోగానంద :- నేను చెప్పునది నీతులు కాదు, జ్ఞానము, నా హెూదా

తెలుసునా అంటున్నావు. నీకు ఎదురుగా ఒక బోర్డు వ్రాసి పెట్టాము.

అందులో "నీ హోదా, నీ పలుకుబడి, నీ బలము, నీ ధనము, నీ పదవి, నీ

ఉద్యోగము మధ్యలో వచ్చి మధ్యలో పోవునవే. చివరకు నీ శరీరము

కూడ నీ మాటవినని రోజుంది జాగ్రత్త!” అని వ్రాసి పెట్టాము. నీవు ఒక

ఉద్యోగివి. నేను ఒక యోగిని. వివరముగా చెప్పితే నీవు ఉత్తయోగివి,

నేను నిండు యోగిని. అన్ని విధాల నీకంటే నేనే గొప్ప. నా హోదా


ఏమిటో చెప్పితే నీకు కొత్త భాష వినినట్లుంటుంది. నీ హోదా విషయానికి

వస్తే నీవు ఒక చిన్న ఉద్యోగివి. నీకంటే ఎంతో పెద్ద హోదాలు

కల్గినవారున్నారు. వారికి నీవు సెల్యూట్ చేయవలసిందే. నాది అలాంటి

ఉద్యోగము కాదు. నా హోదాకు నీకంటే పెద్దవారు కూడా నన్ను గౌరవిస్తారు.

నీవు కొంతవరకు చదువుకొని, ఎంతగానో ప్రాకులాడి వాని కాలు, వీని

కాలు పట్టుకొని ప్రయత్నము చేసివుంటే నీకు ఉద్యోగము వచ్చినది. నేను

ఒక యోగిని, మానవతా మార్గమునుండి ప్రక్క అడుగులు వేసిన వారిని,

నీవు వేయుచున్నది తప్పటడుగని తెలిపి మంచిగ నడిపించునది నా బాధ్యత.

నీవు తప్పు చేసినవారెవరో తెలుసుకొని ఆధారములతో సహా వారిని

చట్టమునకు అప్పచెప్పడము నీ బాధ్యత. అలా కాకుండా, తప్పు చేసిన

వారెవరో తెలుసుకోకుండా, తప్పుచేసినట్లు ఆధారములు లేకుండా,

నేరస్థునిగా లెక్కించి మాట్లాడడము చట్టవిరుద్ధము. నీవు సభ్యతగా

మాట్లాడకుండ నీవెవడురా అనీ, స్వామి ఎవడురా అని పలుకుచు వచ్చావు.

నీ చదువు ఏ బడిలో నేర్చావు? పైగా మత్తు పదార్థములమ్ము దొంగ

స్వాములని దూషిస్తూ, అధికార మదమెక్కి రాఘవ మీదికి చేయి ఎత్తుతావా?

ఇన్స్పెక్టర్ :- ఏయ్ మర్యాదగా మాట్లాడు. నీవెవరు నన్ను దండించే

దానికి, నా పై అధికారివా?


రాఘవ :- ఇన్స్పెక్టర్..... ఇప్పటికైనా నీ తప్పును నీవు తెలుసుకో? హితము

బోధించు స్వామిని ఇంకొక్కమారు ఏయ్ అని అన్నావో, నీ శరీరములో

రక్తము నీ నాడులలో ప్రవహించదు. నీ అధికారాలు ఊడిపోతాయి.

నేనొక అధికారిననీ, నీ వెనుక డిపార్టుమెంటు బలమెంతో ఉందనీ, మీ

బలము ముందర మేమెంత అనుకున్నావేమో! పోయే ప్రాణమును

డిపార్టుమెంటు గానీ, ప్రభుత్వముగానీ నిలుపలేదు. నీవు ఛస్తే నీ


డిపార్టుమెంటు నీ భార్యకు పింఛను ఇవ్వగలదేమోగానీ మొగున్నివ్వలేదు.

నీవు ఇక్కడికొచ్చినది ఎవరు నేరస్థులని తెలుసుకొని, వారు లొంగకపోతే

నీవు దండించియైనా చట్టమునకు అప్ప చెప్పవచ్చును. ఎవరు నేరస్థులని

తెలియకనే నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, ఊరకవుండేదానికి ఇక్కడ

జంతువులులేవు. మానావమానములు తెలిసిన మనుషులమున్నాము. మా

మానమునకు, అభిమానమునకు లోపము ఏర్పడినపుడు, స్వామి

గౌరవమును భంగ పరిచినపుడు మేము బ్రతికి ప్రయోజనము లేదు.

నిన్ను చంపి ఆ నేరమును మేము ధైర్యముగా ఒప్పుకొంటాము.


(అని అక్కడున్న వారందరూ ఆవేశమును పొంది ఆయుధాలు

తీసుకోగా, ఆ ఇన్స్పెక్టర్ను ఏమి చేస్తారో అను సమయములో అక్కడేవున్న

పోలీసులు కలుగచేసుకొని, స్వామిని అలా మాట్లాడడము ఇన్స్పెక్టర్

తప్పే. మీరు శాంతించండని నచ్చచెప్పుటకు ప్రయత్నించారు. అప్పుడు

స్వామి తమవారిని ఊరక ఉండమన్నాడు. అపుడు అందరూ ఊరక

ఉండిపోయారు. ఇతనితో నేను మాట్లాడుతాను మీరు ఆవేశపడవద్దండని

నచ్చ చెప్పి స్వామి మాట్లాడడము మొదలు పెట్టాడు.)


రాజయోగానంద :- నేను మంచి చెప్పితే వినిపించుకోకుండా నీవెవరు

నాపై అధికారివా? అన్నావు. నేనెవరైనది ముందే చెప్పాను. అది విని

కూడా నీవు ఎవరు అన్నందుకు నేనెవరైనది నీకు బాగా అర్థమయ్యేటట్లు

చెప్పెద విను. నేను నీ ప్రతి విషయమును తెలిసినవాడిని. నీ పెళ్ళి

సమయములో పదిలక్షల కట్నములో పదివేలు తక్కువ ఉంటే పదివేలు

ఇచ్చేంతవరకు తాళికట్టనని బెదిరించి, పదివేలను కూడా పెళ్ళిలో వసూలు

చేసినవాడివి. నీవు ఒక రైతు కుటుంబము నుండి వచ్చి కూడా ఒక పేద

రైతు తన బక్కచిక్కిన ఎద్దులతో ధాన్యపు బస్తాలను అమ్ముకొనుటకు టౌనుకు


వచ్చినపుడు, రోడ్డుకు అడ్డము లేకుండా అంగడి ముందర బండిని

ఉంచుకొని బస్తాలను దించుకొనునపుడు, నీవు మోటర్ సైకిల్ మీద వచ్చి

నీ అధికార బలమును చూపి ఆ రైతును అనవసరముగా కొట్టగా అతను

కాలు విరిగి ఆస్పత్రిలో చేరాడు. కుక్కల సహాయముతో పులిని పట్టవచ్చును.

దానిని అందరూ ప్రశంసిస్తారు. కానీ పులి సహాయముతో కుక్కను

పట్టకూడదు. దానిని ఎవరూ ఒప్పుకోరు. స్మగ్లర్లనూ, అక్రమ రవాణా

దారులనూ, దొంగలనూ, రౌడీలను అరికట్టి ప్రజలకు మేలు చేయి. అప్పుడు

అందరూ నిన్ను పొగుడుతారు. అలాకాకుండ డబ్బుకొరకు మంచివారిని

చెడ్డవారిగా ఆరోపించి, దొంగలు కాని వారిని దొంగలుగా, సాత్వికులను

రౌడీలుగా వర్ణించి దుర్మార్గులను కాపాడాలనుకుంటే ఎవరూ నిన్ను పొగడరు.

అందరు నిన్ను చెడ్డవాడు అంటారు.


నీవు నీ ఉద్యోగమునకు తగినట్లు ఒక్కటి కూడా మంచిపని

చేయలేదు. నీవు చేసిన నీతిమాలిన పనులు ఎన్నో ఉన్నాయి. నీవు

ఎవరు నాకు నీతులు చెప్పేదానికి, నాపై ఆఫీసర్వా? అని అడిగావు కదా!

ఇప్పుడు నీవు ఇక్కడికి వచ్చి ప్రవర్తించిన విషయమును మీ డి.ఐ.జి కీ,

డి.జీ.పి కీ, హోమంత్రికీ తెలియపరచి, నీ ఇష్టమొచ్చినట్లు కొట్టుటకు,

దురుసుగా ప్రవర్తించుటకు స్వేచ్ఛను ఏ రాజ్యాంగము ఇచ్చిందో అడుగు

తాము. ఒక ఆశ్రమములోనికి వచ్చి, గురువు ఎదుట దురుసుగా

మాట్లాడడము, నచ్చచెప్పెడి వారిమీదికి రెచ్చిపోయి చేయి చేసుకోవడము

చట్టబద్ధమా? అని కోర్టులో కేసు పెట్టగలము.


మేము ఎంతో ఓర్పుతో ఇంతవరకు మాట్లాడినాము. నీవు ఒక

ఉద్యోగివి. నీ క్రిందవుండువాడు నీకు సెల్యూట్ కొట్టినా, నీవు నీ పై

ఉద్యోగికి సెల్యూట్ కొట్టవలసిందే. ఇక మేము ఎవరికీ నమస్కరించము.

మమ్ములనే అందరూ నమస్కరిస్తారు. మా జ్ఞానమును తెలుసుకొని


మానవత్వములో మార్పుచెంది, రెండవ జన్మవలె మార్పు చెందిన మా

మానసపుత్రులు ఎందరో గలరు. వారు మా విలువ తెలిసినవారై మా

కోసము ప్రాణము ఇచ్చేదానికైనా సంసిద్ధమే. నన్ను నీవు అసభ్యముగ

మాట్లాడిన మాటలకు నీవెనకున్న వారికి ఎవరికీ భయపడక నిన్ను ఏమైనా

చేయగలరు. కానీ నీకు ఉద్యోగమున్నంత వరకే నీ వెనుక నీ డిపార్టుమెంటు

ఉంటుంది. అవతల నీ గోడు వినేవారుండరు. నీ ఉద్యోగము పోయిన

తర్వాత రోడ్డులో కసువూడ్చుకొను వాడు కూడా నీకు నమస్కరించడు.

కానీ మాకు ఈనాడు ఉన్న మర్యాదే ఎప్పటికీ ఉండగలదు.


అంతేకాక ప్రతి పని వెనుక కనపడకవున్న పాపము, పుణ్యము

అనునవి నీకు తెలియవు. ఇప్పటికే నీ పాపము నీ కర్మచక్రములో నిండి

పోయినది. ఈ పోలీస్ ఉద్యోగము నీకు పది జన్మలకు సరిపడు పాపమును

తెచ్చిపెట్టింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జ్ఞానమంటే ఏమిటో తెలుసుకో.

నీ పుట్టుక మరియు చావు రహస్యము తెలుసుకో. అట్లుకాక పుట్టినాను,

డ్యూటీ చేసినాను అంటే ఆ పనులు పుట్టలోని చీమలు కూడా చేయుచున్నవి.

ఇప్పుడు నీవు గిరిజనులవద్ద పదివేలు డబ్బు తీసుకొని వారిచ్చిన రిపోర్టుతో

నన్ను అవమానించాలని వచ్చావు. నీ వెనుక ఎవరి ప్రోద్భలమున్నది

నాకు తెలుసు. మావద్దగల వజ్రాల దొంగల గురించి వచ్చావు. వాస్తవముగా

వజ్రాల విషయము నీకు కూడా తెలియదు. వారిని మా నిర్భందము

నుండి విడిపించి మమ్ములను అవమానించాలని వచ్చావు. కానీ వారు

మావద్ద ఎందుకు చిక్కుకొన్నారో నీకు తెలియదు. నిన్నటి దినమున

వైద్యునివలె వచ్చిపోయిన వ్యక్తి కూడా ఎవరో మాకు తెలుసు.


ఇన్స్పెక్టర్ :- మీరు అన్నీ తెలిసినవారు, అలా వారిని బంధించడము

నేరము అవుతుంది.



రాజయోగానంద :- ఒక దేశ పౌరునిగా నేరస్తులను యటపడుటకే అప్ప

చెప్పడము నా బాధ్యత. వారివెనుక గల అసలు నేరస్థులు బయటపడుటకే

మేము వారిని బంధించాము. ఒక విధముగా మీరు చేయలేని పనిని మేము

చేశాము.


ఇన్స్పెక్టర్ :- మీరు అన్ని విషయములు చెప్పగలుగుచున్నారు. అలాంటపుడు

అసలు నేరస్థులు ఎవరో కూడా మీకు తెలిసివుంటుందనుకొంటాను.

రాజయోగానంద :- నాకు తెలుసు అయితే నీవు నా మాటను నమ్ముతావా?

ఆధారము కావాలంటావు. ఆధారమును చట్టానికి చూపుటకు వారిని మా

వద్ద బంధించాము.


ఇన్స్పెక్టర్ : – మీరు ఇంతకుముందు మాట్లాడుచూ మీవద్ద బంధింపబడిన

వారు వజ్రాల దొంగలని అన్నారు. అవి ఏ వజ్రాలు?


రాజయోగానంద :- మన దేశములో పేరుగాంచిన దేవాలయములో పూర్వపు

రాజులు దాచివుంచిన వజ్రాలను దొంగిలించి వాటిని పోలీస్వరు పసి

కట్టకుండా తెలివిగా పాము కడుపులో పెట్టి, వేరొక స్థలమునకు చేర్చు

ప్రయత్నములో ఆ పాము మావద్దకు వచ్చి చేరింది. ఆ పాము కొరకు

వచ్చి దొరికిన వారే మా ఆధీనములో ఉన్నది. ఇప్పటికైనా అర్థమైందా

ఎవరు దొంగలో! నీవేమో మమ్ములను దొంగలకంటే హీనముగా మాట్లాడు

చూవచ్చావు.


ఇన్స్పెక్టర్ :- అలా దొరికిన వజ్రాలను మీరు ప్రభుత్వానికి అప్ప చెప్పక

పోవడము నేరము అవుతుంది.


రాజయోగానంద :- ఆ వజ్రాలు ఫలానా దేవాలయములోనివని తెలిసినపుడే

కదా మాది నేరమవుతుంది. పైగా అవి భూమిలో దొరికిన వజ్రాలు

కాదు. అందువలన మాది నేరమని మీరు నిరూపించలేరు.


ఇన్స్పెక్టర్ :- మీరే చెప్పారు కదా! పేరుగాంచిన దేవాలయములోనివని.

రాజయోగానంద :- ఆ దేవాలయమేదని మీరు తెలుసుకోవాలి. అప్పుడు

మేము మీకు అప్పజెప్పుతాము. అది ఏ దేవాలయమో గుర్తించనంత

వరకు అవి మావద్దే ఉంటాయి. అవి దేవాలయములోని దేవుని ఆస్తి.

ఇన్స్పెక్టర్ :- దేవాలయము వజ్రాల కథ అటుంచి మీవద్దనున్న మనుషులను

గురించి రిపోర్టు వచ్చింది కదా! దానిని గురించి ఏమంటారు?

రాజయోగానంద :- మీ రిపోర్టులో మేము గిరిజనులను బంధించామని

వ్రాసుకొన్నారు కదా! మావద్దవున్న వారు గిరిజనులైతే కదా! వారు

గిరిజనులే కాదు. నీవు విడిపించుకొని పోవాలంటే వారి పేర్లతో సహా

వారిది ఫలానా ఊరు స్వంత ఊరని నేట్యూసర్టిఫికేట్ తీసుకొనిరా అప్పుడు

వదులుతాము.


ఇన్స్పెక్టర్ :– అది కాదు స్వామిగారూ! అంతవరకైనా వారు మా ఆధీనములో

ఉండాలి. మీ ఆధీనములో ఉండకూడదు.

రాజయోగానంద :- మీరు పట్టుకొనివుంటే మీ ఆధీనములో ఉండాల్సిందే.

మేము పట్టుకొన్నాము కదా! వారు మా ఆధీనములో ఉంటారు. మీరు

తీసుకొని పోయి వారిని వదలివేయవచ్చు కదా!

ఇన్స్పెక్టర్ :- మీ దగ్గర ఉండుట చట్టము ఒప్పుకోదు స్వామీ.

రాజయోగానంద :- (యోగావైపు చూచి) నీవు చెప్పువారు మావద్ద వుంటే

చట్టము ఒప్పుకోదు. నీవు చెప్పేవారే మావద్ద లేనప్పుడు మేము చట్టానికి

విరుద్ధముగా నడిచినవారము కాదు కదా! ఒకవేళ మావద్ద గిరిజనులే

వుంటే అందుకు వారు గిరిజనులను ఆధారము చూపి తీసుకుపొమ్మని

చెప్పుచున్నాము కదా! అలా ధృవపత్రములను నీవు తీసుకరాలేకపోతే


నేను పోకముందే గంట క్రితమే వారిని వదలి పెట్టారని వ్రాసుకో. వాస్తవానికి

వారు ఎవరూ మావద్ద లేరు.


ఇన్స్పెక్టర్ :- నేను ఒకమారు చూడవచ్చా.



రాజయోగానంద :- నీవు వచ్చి మాట్లాడిన తీరును బట్టి ఇంతవరకు నీకు

తగినట్లు మాట్లాడాము. ఇప్పుడు మాట్లాడేదేమి అంటే నీవు ఇక్కడ

ఆశ్రమము అంతా చూచుకొనినా వారు ఎవరూ ఇక్కడ లేరని నీకే

అర్థమవుతుంది. నీవు గిరిజనులు అంటే వారిని మేము బంధించినా

సరియైన ధృవపత్రాలతో రమ్మన్నాము. మేము ఏ గిరిజనులనూ

బంధించలేదు. అందువలన మేము భయపడవలసిన పనిలేదు.


ఇన్స్పెక్టర్ :- మీరు ఇంతవరకు వజ్రాల దొంగలను బంధించాము అన్నారు

కదా!


రాజయోగానంద :- అవును, అన్నాను. మేము బంధించినది వజ్రాల

దొంగలనే, ఇప్పుడు కూడా అదే చెప్పుచున్నాను కదా! నీవు అడిగేది

గిరిజనులను. అదియూ మా ఆశ్రమములో బంధించామని అడుగుచున్నావు.

మా ఆశ్రమములో నీవు చెప్పుచున్న వారిని బంధించలేదు అని చెప్పు

చున్నాము. మేము బంధించినది వజ్రాల దొంగలను వారిని కూడా

ఆశ్రమములో బంధించామని చెప్పలేదే! ఇప్పుడు కూడా ఆశ్రమములో

బందీలు ఎవరూ లేరని చెప్పుచున్నాను. నా మాట మీద నమ్మకము

లేకపోతే నీవు ఆశ్రమమంతా ఒకమారు చూచి ఎవరైనా మావద్ద బందీలుగా

ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకొని పో.


(అప్పుడు ఇన్స్పెక్టర్ మరియు అతనితో పాటు వచ్చిన పోలీస్లు

స్వామియే స్వయముగా చెప్పుట వలన ఆశ్రమములో అన్ని గదులు జల్లెడ

పట్టినట్లు వెతికారు. ఫలానా గదిలోనే బంధించారని రిపోర్టులో వ్రాసిన


గదిలో కూడా చూచాడు, అక్కడ ఎవరూ లేరు. వారు అంతగా చెప్పి

పంపినారు. ఇక్కడ చూస్తే ఎవరూలేరని అనుకొన్న ఇన్స్పెక్టర్ ఏమీ తోచక

స్వామికి నమస్కారము చెప్పి అక్కడనుండి పోయాడు. స్టేషన్కు పోయిన

తర్వాత రిపోర్టు ఇచ్చిన గిరిజనులు వచ్చారు. వారిని చూచిన ఇన్స్పెక్టర్

ఇలా అన్నాడు.)


ఇన్స్పెక్టర్ :- ఏమిటయ్యా ఇది? నన్ను ఇరుకున పెట్టే కేసుగా ఉన్నది.

అక్కడికి పోతే వారు బెదిరిస్తే భయపడే మనుషులు కారు. మీరేమో మా

గిరిజనులు బందీ అయ్యారని అంటారు. వారేమో వజ్రాలు, దొంగలు

అంటారు. అక్కడ చూస్తే ఎవరూ లేరు. నా తల చెడిపోయింది. నిజానికి

ఏమి జరిగింది ఉన్నది ఉన్నట్లు చెప్పండి.


గిరిజనులు :- నిజము చెప్పేటట్లయితే నీకెందుకు పదివేలిస్తాము? మా

వారిని ఎలాగైనా విడిపించు.


ఇన్స్పెక్టర్ :- నావల్ల కాదు. మీది అంతుచిక్కని వ్యవహారములాగ ఉన్నది.

అక్కడికి పోయి అంతా వెదికినా మీరు చెప్పిన ఒక మనిషి కూడా లేడు.

వారేమో ఏదీ అంతుచిక్కకుండా మాట్లాడి నన్నే బెదిరించి పంపారు.

మీరేమో అసలు విషయము చెప్పకున్నారు. ఈ కేసులో నేనేమీ చేయలేను.


గిరిజనులు :- అక్కడ ఎవరూ లేకపోవడమేమిటి? ఈ ఉదయమే మా

మనిషి పోయి చూచివచ్చిన తర్వాతనే నీకు చెప్పాము. మా వారు అక్కడే

ఉన్నారు. ఇంకొక ఇరవై (20) వేలు డబ్బు ఇస్తాము మా వారిని అక్కడ

నుండి బయటికి తీసుకరా.



(ఇన్స్పెక్టర్ బాలప్పకు ఏమీ అర్థము కాలేదు. వీరేమో రెట్టింపు

డబ్బు ఇస్తామంటున్నారు. అక్కడేమో ఎవరూ లేరు. వీరు నిజము చెప్పరు.

వారు ఎటు కాకుండా ఏమీ అర్థము కాకుండా, మేము మనుషులను


పట్టుకున్నామంటారు. అయితే వారు గిరిజనులు కాదు అంటారు. మా

ఆధీనములో ఉన్నారు అంటారు. ఇక్కడ కాదు అంటారు. అని తికమక

పడిపోయాడు. అక్కడికి పోయి దురుసుగా మాట్లాడిన తనది చాలా తప్పని

తన మనస్సులో అనుకొన్నాడు. రాజయోగానంద ఆశ్రమములో స్వామి

ఇన్ స్పెక్టర్తో మాట్లాడుచూ యోగవైపు చూచినపుడు యోగ స్వామి

ఉద్దేశమును గ్రహించినవాడై అక్కడినుండి మునెప్ప మనుషులున్న గదిలోనికి

పోయి కట్టివేయబడివున్న వారి తలల మీద మోదుగ బదనికను తాకించాడు.

అప్పుడు వారు కనిపించకుండా అక్కడే వున్నారు. తాము ఎవరికీ కనిపించ

డము లేదనీ అదృశ్యముగా ఉన్నామనీ వారికి తెలియదు. ఇన్స్పెక్టర్ తమ

గది వాకిలి తీసి చూచినపుడు వారు పిలిచినా ఇన్స్పెక్టరుకు తెలియలేదు.

అలా అక్కడ ఇన్స్పెక్టరు తమను చూచి కూడా ఊరకే పోవడము వారికి

ఏమీ అర్థము కాలేదు.)


(గిరిజనులు తమ మాటను ఇన్స్పెక్టర్ విని సరిగా పనిచేయలేదని

ఆశ్రమానికి పోయివచ్చి అక్కడ ఎవరూ లేరంటున్నాడని, డబ్బు ఎంత ఇచ్చినా

మీ పని చేస్తాడని నమ్మకములేదని మునెప్పకు గిరిజనులు విషయమంతా

చెప్పారు. ఇన్స్పెక్టరు విషయమును విన్న మునెప్ప కథ అంతా అడ్డము

తిరిగిందని, తర్వాత వివరము కొరకు మునెప్ప తపస్విబాబాను వయర్లెస్

ద్వారా సంప్రదించాడు. విషయమును తెలుసుకొన్న బాబాగారు స్పందించి

వజ్రాల విషయము బయటపడి రట్టయి పోగలదనీ, తీగలాగితే డొంక

అంతా కదిలేలావుందనీ యోచించి వజ్రాలు పోయిన ఫరవాలేదు. ఈ

విషయము పోలీస్వారికి తెలియకూడదనీ, మీ వారిని గురించి ఏమీ

పట్టించుకోవద్దు. రాజయోగానంద స్వామి తర్వాత ఏమి చేయుటకు

పూనుకొంటారో చూచి తర్వాత ఆలోచిద్దాము అని చెప్పగా, మునెప్ప

ద్వారా సంప్రదించాడు.



అలాగేనని చెప్పాడు. మునెప్ప ఆ విషయమును అంతటితో అణచివేయుటకు

యోచించి తమవద్దయున్న గిరిజనులను తిరిగి ఇన్స్పెక్టర్ దగ్గరికి పోయి

మాట్లాడమని అక్కడ మాట్లాడ వలసిన విషయమంతా చెప్పి పంపాడు.


గిరిజనులు ఇన్ స్పెక్టర్ దగ్గరికిపోయి స్వామి ఆశ్రమములో

బందీలైనారనుకొన్న మావారు వచ్చారు. మావారు వేట పనిమీద దూర

ప్రాంతమునకు పోయి వచ్చారట. మావారు రాలేదని మేము అనుకొంటూ

వుంటే ఎవరో గిట్టని వారు మీవారిని ఆశ్రమములో బంధించారని చెప్పారు.

ఆ విషయమును మేము మీతో చెప్పడము, మీరు అక్కడికి పోయి రావడము

మొత్తానికి మాదే తప్పు అని చెప్పారు. ఆశ్రమములో ఎవరూ కనిపించ

లేదు కాబట్టి గిరిజనులు చెప్పునది నిజమేనని, వారు పొరపాటుగా చెప్పారని

ఇన్ స్పెక్టర్ కూడా అనుకున్నాడు. ఆ విషయము పోలీస్ స్టేషన్లో అంతటితో

అణిగి పోయింది. ఇన్ స్పెక్టర్ రెండవరోజు రాజయోగానంద స్వామి వద్దకు

పోయి తనను క్షమించమని ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారము వలన

మేము ఇక్కడికి రావడము జరిగిందని తన తప్పుకు క్షమాపణ కోరి వచ్చాడు.


రాజయోగానంద స్వామి మల్లుదొరకు సమాచారమును పంపించి

తనవద్దకు వచ్చునట్లు చేసుకొని జరిగిన విషయమంతా మల్లుదొరకు చెప్పి

వజ్రములను జాగ్రత్తగా తన సంరక్షణలో పెట్టుకొమ్మని చెప్పి ఒక మంచి

రోజు చూచి తీసుకుపొమ్మన్నాడు. తర్వాత మునెప్ప మనుషులవద్దకు పోయి

వారితో స్నేహపూర్వకముగా మాట్లాడుచూ "మిమ్ములను దోషులుగా మేము

లెక్కించడము లేదు. మీరు బ్రతుకుతెరువు కొరకు ఏదో ఒక పనిని చేయాలని

చేయుచున్నారు తప్ప ఇందులో మీ తప్పు ఏమీ లేదు. ఎవరో ఎక్కడో

కూర్చొని వారి లాభము కొరకు మిమ్ములను ఆడిస్తూవుంటారు. నిజమైన


దోషులు మీ వెనుక ఉన్నవారు తప్ప మీరు కాదు. ఇప్పటికీ మీరు ఈ

విషయములో చాలా కష్టపడివున్నట్లున్నారు. ఇప్పుడు మిమ్ములను విడిపించు

టకు ఎవరూ రారు. ఈ విషయము బయటికి పొక్కుతుందని కొన్ని

రోజులు ఊరక వుండడము మంచిదని అనుకొన్నారు. మీది ఇందులో ఏ

తప్పులేని దానివలన మేము మిమ్ములను వదలి పెట్టాలనుకొన్నాము.

ఇప్పటికైనా స్వామి ఎలాంటివాడో మీరు అర్థము చేసుకోగలరనుకుంటాను.”

అని స్వామి చెప్పగా అందరూ స్వామికి నమస్కరించి "స్వామి మేము

కడుపుకొరకు తప్పుడు పనులు చేయుచుండుట వాస్తవమే, మీరు ఎంతో

ఉదార స్వభావులు మేము తప్పుచేసినా, మాది తప్పుకాదు మిమ్ములను

నడిపించువారిది తప్పన్నారు. ఆ మాట మమ్ములను ఎంతో సంతోష

పరిచినది. మిమ్ములను ఎప్పుడూ మరిచిపోము” అని అక్కడి నుండి

పోయారు.


ఆ ముఠాలో డబ్బు ఆశకు వచ్చిన మాంత్రిక వృద్ధుడు, నాగ

భూషణము వారినుండి బయటపడి పోవాలనుకొన్నారు. అందరూ కలిసి

అడవిలో రహస్యముగనున్న మునెప్పవద్దకు వచ్చారు. మునెప్ప దగ్గరకు

పోయిన తర్వాత ఇద్దరు మాంత్రికులు తమ ఉద్దేశమును తెల్పగ మునెప్ప

సమ్మతించి ఒక కండీషన్ మీద వదలుతామని చెప్పాడు. ఆ నిబంధనలో

ఇంతవరకు ఇక్కడ చూచిన విషయములుగానీ, విన్న విషయములనుగానీ

బయట ఎక్కడా చెప్పకూడదు. ఎప్పుడైనా పని పడినపుడు పిలచిన వెంటనే

రావలయును అని చెప్పారు. దానికి నాగభూషణము, మల్లయ్య తాత

ఇద్దరూ  ఒప్పుకున్నారు.   ఆ నిబంధనకు ఒప్పుకొన్నందుకు వారికి మరి

కొంత డబ్బు ఇచ్చి పంపాడు)


(తాటిమాను మునెప్ప మనుషులు విడుదలై వచ్చారని తెలుసుకొన్న

తపస్విబాబా సంతోషించి, తెలివితక్కువగా ప్రవర్తించి ఎక్కడా ఇరుక్కోకుండా

మునెప్పను మందలించి మరొక పనిని అప్పగించుటకు వయర్లెస్లో ఇలా

అన్నాడు. )


తపస్విబాబా :- హలో 31 (మునెప్పా) ఇంతవరకు నీవు తెలివితక్కువగా

ప్రవర్తించి ఏ పనిని సరిగా చేయలేకపోయావు. నీవలన అపారమైన

నష్టము ఏర్పడినది. కోట్లు విలువచేసే వజ్రాలను చేజారవిడుచుకొన్నాము.

అవి ఎవరికి దొరకకూడదో వారికే దొరికాయి. వారు తిరిగి ఆ వజ్రాలను

దేవాలయానికే చేరుస్తారు. అవి ఎప్పటిలాగే దేవాలయములో భద్రపరుచ

బడును. అలా కథ తిరిగి మొదటికి రావడమేకాక, వాటికి భద్రత కూడా

ఎక్కువగును. మొదటి మాదిరి వాటిని మనము కబళించలేము. అంతేకాక

ఆ వజ్రాలమీద ఆశకల్గి వాటిని ఎలాగైనా తన హస్తగతము చేసుకోవాలను

కొన్న వ్యక్తి మరొకడున్నాడు. అతడే జఠాజూటస్వామి. ఈ మారు వాడు

మనకంటే తీక్షణముగా ఉండి, మన చేతబడకుండ వాటిని ఎగరేసుక పోయే

ప్రమాదమున్నది. ఇపుడు గడచినది చిన్న గండమే. జఠాజూటస్వామి

అను పేరుతో చలామణి అగుచూ, విశేష ప్రజల భక్తి విశ్వాసాల పాత్రుడై,

ఆలయములోనే నివాసమేర్పరుచుకొని వజ్రాలను కొట్టివేయాలనుకొన్న వాని

నుండి మనము కొట్టివేయడము చాలాకష్టము. అయినా మనము వానికంటే

చురుకుగా వుండి, ఆ వజ్రాలను ఎలాగైనా దక్కించుకోవాలి. ఏమంటావు

చెప్పు? ఓవర్!


మునెప్ప :- హలో 21 (తపస్విబాబా) మీమాటే మామాట. మీ నిర్ణయమే


మా నిర్ణయము, మీరు ఎలా చెప్పితే అలా చేస్తాము. మీరు అంతగా

చెప్పుచున్న ఆ జఠాజూటస్వామి ఎవరో, ఏమి చేస్తుంటాడో అతని

వివరమంతా తెలుపవలసిందిగా కోరుచున్నాను, ఓవర్!


తపస్విబాబా :- హలో 31, జఠాజూటస్వామి వేషములోనున్న వాడు పెద్ద

మాంత్రికుడు. వాడు సంపాదించిన మంత్రశక్తి వలన జరిగెడు పనులన్నీ

గొప్ప మహత్యములని తలచిన ప్రజలు, అతని మీద విశేషమైన భక్తి శ్రద్ధలు

చూపుచున్నారు. అతని మహత్యముల మీద ఎవరికీ అనుమానము రానట్లు

అతనివి అన్నీ దైవికములే అన్నట్లు అతని ప్రవర్తనా, మహత్యములు

ఉన్నవి. అతను మళయాల దేశమునకు సంబంధించినవాడు. మాంత్రిక

విద్యలకు మళయాల దేశము పుట్టినిల్లు. కావున వాటి వివరము తెలిసిన

వాడై చిల్లర మంత్రముల జోలికి పోకుండా, గొప్ప మంత్రమును ఎన్నుకొని

దాని ప్రకారము సాధన చేశాడు. ఆ సాధన 12 సంవత్సరములు

స్మశానములో చేశాడు. 12 సంవత్సరములు ఒక పూట భోజనముతో

తీవ్రమైన జపము చేయుట వలన స్మశాన వాటికలలోని రుద్రగణములైన

భూత, ప్రేత, పిశాచములు అన్నీ అతని వశమైపోయాయి. అలా వశమై

వుండుట వలన అతని పేరు మీద గానీ, అతని ఫోటో పెట్టుకొనిగానీ

భజనను చేస్తే, భజన జరిగేటప్పుడు, ఆ ప్రాంత భూత, ప్రేత, పిశాచ

గణములు అక్కడ భజనలోనున్న కొందరి శరీరములలో చేరి ఆనందముతో

గంతులు వేయడమూ, నాట్యము చేయడమూ, దొర్లడమూ మొదలగునవి

చేయును. ఆ విధముగ ఎవరి భజనలోనూ జరుగక, ఒక జఠాజూట

స్వామివారి భజనలోనే జరుగడము వలన ఆ స్వామిని నిజముగా గొప్ప

దైవశక్తి కలవాడనీ, కైలాసమునుండి దిగివచ్చిన శివునిగా భావించి శివుడే

ఇలా పుట్టాడని అనుకొనుచుందురు. అతని తలమీద వెంట్రుకలన్ని కలిసి


ఒకే జడగా ఏర్పడిన దానివలన అతనికి జఠాజూట స్వామి అను పేరు

వచ్చినది. అంతేకాక ఆయన కౌపీనము (గోచిగుడ్డ) ధరించి, జింక చర్మము

నడుముకు కట్టి, త్రిశూలము చేతపట్టివుండును. ఆ వేషముతో ఆయన

గొప్పవాడన్నట్లు కనిపించుచుండును. ఆయన ఎదుటగానీ, ఆయన

చిత్రపటము ఎదుటగానీ భజన చేయువారు కొందరు తమకు తెలియకనే

ఆడుచుందురు. అప్పుడు వారికి ఏమాత్రము జ్ఞప్తివుండదు. వారిలో చేరి

ఆడినవి భూత, ప్రేత, పిశాచములని ఎవరికీ తెలియదు.


అందువలన జఠాజూటస్వామి పేరుగాంచినవాడై అప్పుడప్పుడు

పర్యటన చేస్తూ, దేవాలయములలో మకాము వేస్తూ ఉండును. ఇప్పుడు

భువనేశ్వరి ఆలయములోనే ఉన్నాడు. వజ్రాలను కాజేయాలని ఆ

ఆలయానికి పోయాడు. అతనికంటే ముందు అక్కడినుండి ఆ వజ్రాలను

మనము దొంగిలించినట్లు ఆయనకు తెలియదు. అందువలన అతను

అక్కడే ఉండి వజ్రాల కొరకు పథకము వేయుచున్నాడు. ఇప్పుడు

రాజయోగానంద తిరిగి భువనేశ్వరి దేవాలయములో ఆ వజ్రాలనుంచితే

వాటిని మనకంటే ముందు ఆ జఠాజూట స్వామియే కొట్టివేయవచ్చును.

అందువలన మనము, మన మనుషులను ఆయన భక్తులుగా ఉండునట్లు

నటిస్తూ అతని ప్రతీ చర్యను గమనించి ఎప్పటికప్పుడు మనకు తెలియ

జేయునట్లు చేయవలెను. ధనమంటే ఆశలేని మనిషి రాజయోగానంద.

అతను వజ్రాలను తనవద్ద ఉంచుకోక తిరిగి భువనేశ్వరి ఆలయమునకే

చేర్చగలడు. అందువలన దేవాలయము మీద, జఠాజూటస్వామి మీద

నిఘా ఉంచండి. ఈ మారు జాగ్రత్తగా ప్రవర్తించండి. ఇంతవరకు

మనకు సహకరించిన మాంత్రికుల మీద కూడా నిఘావుంచండి. వారు

ఎక్కడైనా మన విషయము బయట పెట్టితే వారిని చంపివేయండి.

ముఖ్యముగా మన విషయము బయటపడకూడదు, ఓవర్!


మునెప్ప :- అలాగే 21 అవసరమైనపుడు కబురు చేయగలను, ఓవర్!


(అప్పుడు మునెప్ప తన వారినందరినీ పిలిచి, జఠాజూట స్వామి

వారి విషయమంతా తెలిపి, ఇక మీదట తెలివిగా ప్రవర్తించాలని చెప్పి,

నిఘా కొరకు భువనేశ్వరి దేవాలయమునకు ఇద్దరు మనుషులను పొమ్మని

చెప్పి భవిష్యత్తు కార్యాచరణను గురించి యోచిస్తూ, చిన్నగా నిద్రలోనికి

పోయాడు. ఉదయము లేచి దినపత్రికను చూచాడు. అందులో మొదటి

పేజీలోనే పెద్ద అక్షరములతో “భువనేశ్వరి దేవాలయములోని వజ్రాలు

మాయం" అను హెడ్డింగ్ను చూచాడు. దానిలో ఇలా ఉన్నది. "రాజుల

కాలము నాటి సంపదైన పది వజ్రములు భువనేశ్వరి కోశాగారములోనున్న

విషయము చాలామందికి తెలియక పోయినప్పటికీ, ఆలయ కమిటీకి పూర్తి

వివరములు తెలుసు. కోశాగారము యొక్క తాళములు ఆలయధర్మకర్త

దగ్గర మరియు కమిటీ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. వారిద్దరు కలిసి

తీస్తేగాని తాళము రాదు. వేసిన తాళము వేసినట్లేవుండి లోపలి వజ్రములు

మాయమైనట్లు రిపోర్టు ఇవ్వబడినది. ఉత్సవములో భువనేశ్వరి మాత

అలంకారమునకు కావలసిన ఆభరణముల కొరకు తలుపులు తీసినపుడు

కోశాగారములో వజ్రములు కనిపించనట్లు కమిటీ తెలిపినది. దీనివెనుక

తాటిమాను మునెప్ప దోపిడీ ముఠా హస్తమున్నట్లు పోలీసు వర్గాలు

అభిప్రాయపడుచున్నాయి. కొద్ది రోజులలో విశేషమైన దర్యాప్తు జరుపు

తామని పోలీసులు తెలిపారు.” అను వార్తను చదివి మునెప్ప నివ్వెర

పోయాడు. ఈ వార్తను పేపరులో చదివిన మునెప్ప స్నేహితుడు మరియొక

పెద్దదోపిడీ ముఠా నాయకుడైన “హీరో” అనునతడు మునెప్పవద్దకు వచ్చి

ఇలా అన్నాడు.)


హీరో :- ఏమిరా మునెప్ప, నీవు చాలా పెద్దపని చేసినట్లు పేపరులో

చూచాను. నిజమేనా?

మునెప్ప :- ఇప్పుడు నాకంటే నీవే మేలురా, నేను ఏమి ప్రయోజనము

లేనివాడనైనాను.

హీరో :- అదేమిటిరా. ఈ దోపిడీ నీకు తెలియదా!

మునెప్ప :- ఎందుకు తెలియదు. చేసింది నేనే కదా! కానీ వజ్రాలు

నాకు దక్కలేదు. అవి మధ్యలోనే నా చేయి జారిపోయాయి. మావారి

అశ్రద్ధ వలన నేను వేసిన ప్లానంతా వృథా అయింది.

హీరో :- ఏమిరా, ఎలా చేశావు. ఎలా విఫలమైంది, నాకు చెప్పరా!

మునెప్ప :- నేను శిక్షణ ఇచ్చిన రాజా అను చిన్న కోతిని ఆలయప్రాంతము

లోని కోతులలో కలిసిపోవునట్లు అలవాటు చేశాను. అది పగటిపూట

వాటితో కలిసివుండి రాత్రిపూట నావద్దకు వచ్చేది. బిక్షగాని వేషములో

నేను రెండు నెలలు ఆలయ మెట్లమీద ఉంటూ చివరకు ఒకరోజు నా

సూచన ప్రకారము ఆ కోతి గాలికొరకు ఉంచిన చిన్న కిటికీ ద్వారా

కోశాగారములోనికి ప్రవేశించి, నేను సూచించిన బీరువాను గుర్తించింది.

నేను ఇచ్చిన రబ్బరు క్యాప్సిల్ను బీరువారంధ్రములోనికి దూర్చింది. అప్పుడు

ఆ క్యాప్సిల్లోని కెమికల్ బీరువా తాళలమును కరిగించివేసింది. బీరువా

సులభముగా తెరుచుకొంది. నావద్ద తర్ఫీదు పొందిన తెలివైన కోతి బీరువా

యందు వెదురుబొంగులో దాచబడిన వజ్రములను తీసుకొని నోటి దవడలలో

పెట్టుకొని వచ్చి, చీకటి పడిన తర్వాత నాకందించింది. నాతోపాటు

పామును ఆడించు వాని వేషములోనున్న నా తమ్ముడు వెంకూకు నేను ఆ

వజ్రములను అందించాను. ఆ రాత్రి తనవద్ద కొత్తగా పట్టితెచ్చిన విషపు


కోరలు తీయని నాగుపాము చర్మము క్రింద వజ్రములను దాచి, ప్రయాణికుని 

వేషములో వచ్చిన నూకాకు సూట్కేస్  పామును పెట్టి ఇచ్చాడు. సి.ఐ.డీల


నిఘా ఆ సూట్కేస్ మీద పడిందని అనుమానించిన వెంకు, నూకా ఇద్దరూ

దానిని రైలునుండి క్రిందికి వేసి ప్రక్కస్టేషన్లో దిగి వెంటనే పోయారు.

ఎవరూ మనుషులు లేనిచోట చెట్ల పొదలలోనికి వేసిన సూట్కేస్ కనిపించ

కుండా పోయింది. అది ఇతరుల చేతిలో ఉందని, ఎంత ప్రయత్నించినా

మా ప్రయత్నము విఫలమైనది. పోలీసులేమో మమ్ములను అనుమాని

స్తున్నారు. వజ్రాలేమో మాకు దొరకలేదు. వాటికొరకు తిరిగి ప్రయత్నించా

లనుకొన్నాను. ఒరే హీరో! ఈ విషయములో నీవు కూడా మాకు

సహాయపడాలి.



(సరేనన్నాడు హీరో. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎలాగైనా నెరవేర్చాలనుకొన్నారు.)


(ఇన్స్పెక్టర్ బాలప్పకు న్యూస్పేపరు చదివాక అందులో భువనేశ్వరి

దేవాలయ దొంగతనమునకు, రాజయోగానంద చెప్పిన వజ్రాలకు ఏమైనా

సంబంధముందేమోనని అనుమానము వచ్చినది. ఈ న్యూస్ రాకనే

రాజయోగానంద ప్రముఖ దేవాలయములో దొంగతనము జరిగిందని

దొంగలను మేము పట్టుకొన్నామని చెప్పడము చూస్తే, ఈ దొంగతనము

ఆయన చెప్పినట్లే ముందే జరిగివుంటుంది. రాజయోగానంద చెప్పిన

విషయము తనకు తప్ప ఎవరికీ తెలియదని, ఈ సాకుతో కొంత డబ్బునైనా

సంపాదించవచ్చు లేకపోతే ప్రమోషనైనా పొందవచ్చుననుకొన్నాడు. వెంటనే

రాజయోగానంద ఆశ్రమమునకు బయలుదేరి పోయాడు. ఇన్స్పెక్టర్ బాలప్ప

రాకను చూచి ఆశ్రమములోని వారందరూ అతనివైపు వచ్చారు. బాలప్ప

స్వామితో ఇలా అన్నాడు.)


ఇన్స్పెక్టర్ : :- మీరు వజ్రాలు దొరికాయన్నారు కదా! అవి భువనేశ్వరి

దేవాలయములోవని ఈ రోజు న్యూస్ వచ్చినది. అవి దొంగిలించబడ్డాయి.

దొంగలు ఎవరో ఇంతవరకు తెలియదు. ఆ వజ్రాలే మీవద్ద ఉన్నాయని

మాకు అనుమానముగా ఉన్నది. మీవద్ద వజ్రాలున్న విషయము నాకొక్కనికే

తెలుసు. మా డిపార్టుమెంటుకు తెలిస్తే మిమ్ములను ఇంటరాగేషన్కు

లాగుతారు. అప్పుడు మీరే దొంగలని అనుమానించవచ్చును. ఆ

గొడవంతా లేకుండా నాకు 50వేల రూపాయలిస్తే దానిని కొందరికి

ఖర్చుపెట్టి, మీ మీదకు కేస్ రాకుండా చూచుకొంటాను. మీవద్దవుండే

వజ్రాలు కోట్ల విలువ చేస్తాయి. అవి మీవద్ద ఉంటేనే మంచిది. మీరు

మంచి పనికి ఉపయోగిస్తారు. అందువలన వాటిని గురించి నేను

పట్టించుకోను. అవి మీవద్ద ఉన్నట్లు కూడా తెలుపను. ఈ కేసు

అణచివేసేదానికి కొంత ఖర్చవుతుంది. ఆ ఖర్చు నాకిస్తే మీకు కేస్ లేకుండా

చేయగలను.


రాజయోగానంద :- ఏమయ్యా ఇన్స్పెక్టర్, మాకు మేలు చేసినట్లు మీకు

కేస్ లేకుండా చేస్తాను యాభైవేలు ఇమ్మంటావా! అట్లయిన జాగ్రత్తగా

విను. అసలు దొంగలు మావద్ద దొరికారనీ, వారివద్దనున్న వజ్రాలను

మేము స్వాధీనము చేసుకొన్నామనీ, ఆ దొంగలతో లాలూచిపడి

దొంగలను నీవే విడిపించుక పోయావని స్టేట్మెంట్ ఇచ్చి అసలు దొంగలను

విడిపించి నందుకు నీవే బాధ్యుడవని నీ మీద కేస్ పెట్టగలము. అప్పుడు

ఇరుక్కొనేది నీవే! మేముకాదు. ఒకవేళ నీ మంచికోరి నీ మీద మేము

కేసు పెట్టకుండా ఉండాలంటే, నీవు మాకు యాభైవేలు డబ్బు ఇచ్చి నోరు

మూసుకొని ఉండవలయును. ఇపుడు చెప్పు నీవు యాభైవేలు డబ్బు

ఇస్తావా లేక దొంగలకు సహాయపడినందుకు ఇరుక్కొని శిక్షను

అనుభవిస్తావా?


(రాజయోగానంద చెప్పిన మాటలు విన్న ఇన్స్పెక్టర్ బాలప్పకు

గోడకు విసిరిన బంతి తిరిగి వచ్చి తన ముఖానికే తగిలినట్లయినది.

కొద్దిసేపు అయోమయ స్థితిలో పడిపోయి తిరిగి కోలుకొని ఇట్లన్నాడు.)

ఇన్ స్పెక్టర్ :- నేను దొంగలను విడిపించానని మీ దగ్గర సాక్ష్యమేమున్నది?


రాఘవ :- మావద్ద వజ్రాలున్నాయనుటకు నీ దగ్గర సాక్ష్యమేమి ఉన్నది?


ఆ మాటకు బాలప్ప తల గిర్రున తిరిగింది. ఇదేమిటి నేను డబ్బు

అడిగితే, వారు నన్నే డబ్బు అడుగుతారు. నేను వజ్రాలని అంటే వారు

దొంగలని అంటారు. వీరివద్ద వజ్రాలున్నాయని డిపార్టుమెంటుకు తెలిపితే,

ఆ వజ్రాల వివరమంతా తెలిపి నన్ను ఇరికించగలరు. అని తనలో తాను

అనుకొని ఏదో ఒక రకముగా వారిని బెదిరించే ఉద్దేశముతో ఇలా అన్నాడు.)


ఇన్స్పెక్టర్ :- నన్ను మీరు ఇరికించితే మీవద్దనున్న వజ్రాలు వెంటనే

ఎందుకు ప్రభుత్వానికి స్వాధీనము చేయలేదని మిమ్ములను దండించగలము.

రాఘవ :- తెలివి నీ ఒక్కని సొమ్ము అనుకోకు మిష్టర్ ఇన్స్పెక్టర్. మేము

వెంటనే స్వాధీనము చేయుటకు అవి దొంగలనుండి దొరకలేదు. పాము

నుండి లభించాయి. అది భూమినుండి దొరికిన నిధి కూడా కాదు వెంటనే

తెలుపుటకు.


రాజయోగానంద :- ఆ వజ్రాలు భువనేశ్వరి దేవాలయములోనివని మాకు

తెలుసు. వాటి రక్షణ బాధ్యత ఒక గురువుగా మీకంటే మాకే ఎక్కువ

ఉన్నది. మీరు తోడు దొంగలుగా మారి, లంచాలు తీసుకొని కేసులు

మాఫీ చేయగలరు, సొమ్మును మ్రింగగలరు. ఈ వజ్రాలను కూడా

మాయము చేయగలరు. మీ మీద నమ్మకము మాకు పూర్తిగా పోయింది.

అందువలన మీ డిపార్టుమెంటు ఈ దొంగతనమును ఎలా బయటికి


లాగగలదో, ఎవరిని దోషులుగా గుర్తించగలదో, తెలుసుకొనేంతవరకు ఆ

వజ్రాలు మావద్దనే ఉంటాయి. నీ చేతనైతే అసలు దొంగలను పట్టుకొని

అటు చట్టానికి ఇటు దేవాలయానికి మేలు చేయి. లేకపోతే చేతులు

ముడుచుకొని కూర్చో, అట్లు కాకుండా మమ్ములనే బెదిరించుటకు మొదలు

పెట్టితే అన్ని విధములా నీకే ప్రమాదము.


ఇన్స్పెక్టర్ :- మీ మేలు కోరి చెప్పాను. అంతేకానీ మీ మీద నాకు

ఎటువంటి చెడు ఉద్దేశము లేదు.


(అని అక్కడినుండి బాలప్ప వెళ్ళిపోయాడు. బాలప్ప జ్ఞానమనినా,

స్వాములనినా చాలా హేళనగా మాట్లాడే స్వభావముగలవాడు. గురువులను

చాలా తక్కువ వారిగా మాట్లాడు బాలప్ప రాజయోగానంద స్వామిని

చూచి ఈయన అందరి గురువులవలె లేడే అనుకొని కొద్దిగ జంకినప్పటికీ

తర్వాత ఆయనను కూడా తక్కువ అంచనా వేసుకొన్నాడు. మొదటిమారు

ఆశ్రమానికి వచ్చి స్వామిని తక్కువగా మాట్లాడినపుడు, స్వామి బాలప్ప

విషయములన్నీ చెప్పి ఎక్కడ ఏ తప్పుచేసినది గుర్తు చేసి చెప్పినపుడు,

స్వామిని గొప్పవాడనుకొన్న బాలప్ప, తిరిగి కొన్ని గంటలకే జ్ఞానము

చెప్పేవారంతా మోసగాళ్ళేనని అనుకొన్నాడు.


నేటి ప్రపంచములో జ్ఞానమంటే ఏమిటి? అజ్ఞానమంటే ఏమిటని

తెలియని మనుషులు చాలామంది బాలప్పవలె ఉన్నారు. అటువంటి వారికి

జ్ఞానముగానీ, జ్ఞానమును తెలుపు గురువులుగానీ సరిపడరు.


సరిపోవు వారెవరనగా! పరస్త్రీలను గురించి మాట్లాడువారు, నాకు

బలమున్నది కదాయని ఇతరుల మీద దౌర్జన్యము చేయువారు, సమాజములో

పేరుండి ఎన్ని చెడుపనులు చేయుచున్న వాడైననూ వీరికి మహా ఇష్టులుగా

ఉందురు. పోలీస్ ఇన్స్పెక్టరుగా పనిచేయు బాలప్ప మనస్థత్వము నీచమైనది


కాగా, అతని భార్య మధుమతి ఉత్తమురాలు. భర్త చేయు పనులు ఆమెకు

ఇష్టముండెడివి కావు. ఆమె చాలా దైవభక్తికలది. ఐదు సంవత్సరముల

క్రితము ఆమె రాజయోగానంద స్వామిని చూచింది. అప్పుడు తన

కుమారునికి జబ్బు చేసి ఉండెడిది. ఆ జబ్బు నివారణకు ఎన్ని ఆసుపత్రులు

తిరిగినా, ఎందరి డాక్టర్లను కలిసినా, చివరకు ఫలితము లేకుండాపోయింది.

వైద్యము మీద ఆశ వదలిన మధుమతి తన కుమారున్ని రక్షించుకొనుటకు

తనకున్న సహజ భక్తి ప్రకారము కనిపించిన దేవునికంతా పూజలు చేసింది,

ముడుపులు కట్టింది. అయినా ఫలితము లేకుండా పోయినది. తన

కుమారుడు మృత్యువును సమీపించాడని తెలిసిన ఆ తల్లి తల్లడిల్లి పోయింది.

తనకున్న భక్తి అంతయూ విరక్తిగా మారగా కనికరించని ఈ దేవతలనెందుకు

మ్రొక్కాలి? ఇంతగా తల్లడిల్లి పోవుచున్ననూ ఒకమాటయినా పలుకని ఈ

దేవతలు బొమ్మలేనని తలచి, ఆవేశము పెల్లుబికి రాగా, తాను ప్రతి దినము

మ్రొక్కి వస్తున్న ఊరిబయట పాండురంగని దేవాలయమునకు పోయి,

గర్భగుడి తలుపులు తెరచి, తనలోని కోపము చల్లారేటట్లు ప్రతిమనే

పగులగొట్టాలని పూనుకొంది. ఆ సమయములో అచటనేవున్న రాజయోగా

నందస్వామి అడ్డుకొని ఆమెను ఆ పని నుండి విరమింప చేశాడు. ఆమె

చేయుచున్న పని విచక్షణారహితమైనదని స్వామి చెప్పగా ఆమె భోరున

ఏడ్చి తన ఆవేశమునకు కారణమును చెప్పింది. ఆమె బాధను అర్థము

చేసుకొన్న స్వామి ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- చావు పుట్టుకలు కర్మను అనుసరించి ఉంటాయి.

మనము చేయు పూజలనుబట్టి ఉండవు. గత జన్మలో చేసుకొన్న కర్మ

ప్రకారము మన చేత ప్రతి అడుగు వేయించబడుతుంది. అలాగే రోగములు

కూడా కర్మచేతనే పీడించబడుతాయి. ఏ సమయములో ఏ కర్మ


అనుభవించాలో, ఆ సమయమునకు ఆ కర్మను అనుభవించి తీరాలి. కర్మ

అనునది ఏ దేవతల ఆధీనములోనూ లేదు. కావున ఏ దేవతలూ కర్మనుండి

కాపాడలేరు. ప్రారబ్ధకర్మ ప్రకారము మరణము ఆసన్నమైనపుడు

సహస్రదేవతలూ గుంపుగా వచ్చిననూ రక్షించలేరు. కర్మ వివరము

తెలియకపోతే ఎవరైనా నమ్మిన దేవుళ్ళను నిందించగలరు. కానీ దానివలన

ఇంకా కొంత పాపమును అంటగట్టుకోవడము తప్ప ఫలితము ఏమీ

ఉండదు. ఈ పాండురంగడు ఎప్పుడైనా, ఎవరినైనా పిలిచాడా? వచ్చి

పూజలు చేయమని, గుడి కట్టమని అడిగాడా? తనకు నామము పెట్టమని

చెప్పాడా? అంతెందుకు నీవు పూజ చేస్తే నీ కుమారున్ని రక్షిస్తానని చెప్పాడా?


ఆ మాటలు విన్న ఆమె స్వామివైపు ఆశ్చర్యముగా చూచింది.

చూచుటకు సామాన్య మనిషివలెనున్న ఆయనెవరో సామాన్యుడు కాదని

ఊహించిన మధుమతి “మీరెవరు?” అని సూటిగా స్వామిని ప్రశ్నించింది.

అపుడు స్వామి ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- నేను ఎవరైనా నీకేమీ లాభములేదు. కానీ నీవు

ఎవరు అని నిన్ను నీవు తెలుసుకో. ఇపుడు నీవు చేయుచున్న పని ఏమిటో

ఆలోచించు.


(స్వామి మాటలలో ఏదో గొప్పతనము ఉన్నట్లు అనిపించిందామెకు.

అపుడు తనలోని బాధనంతా అణుచుకొని స్వామితో వినయముగా

మాట్లాడను ప్రారంభించినది.)


మధుమతి :- మీరు ఎవరో గొప్ప వ్యక్తులుగా నాకు తోస్తున్నారు. మీకు

నా నమస్కారములు, పుత్రశోకముతో మునిగివున్నాను. ఉన్న ఒక్క

కుమారునికి దూరమగుదునేమోనన్న బాధతో అలా ఉద్రేకపడినాను.


నిజానికి మీరన్నట్లు ఏ దేవతలూ ఏమీ చేయలేరు. అలాంటి వారిని

ఎందుకు పూజించాలి?


రాజయోగానంద :- ఆ మాటను నేను నిన్ను అడగాలి. నీవు జవాబు

చెప్పాలి. ఎందుకనగా పూజ చేయుచున్నది నీవే కనుక.

మధుమతి :- అందరూ చేయుచున్నారు కదా! అని అలా చేస్తే ఆ దేవతలు

కష్టాలు కలగకుండా చేస్తారని నమ్మకముతో చేశాను. కానీ పూర్తిగా తెలిసి

చేయలేదు.


రాజయోగానంద :- నీలా ఎందరో ఎన్నో దేవతలకు ఆశలతోటే మ్రొక్కు

చున్నారు. అసలు దేవుడంటే ఏమిటని వివరము తెలియకున్ననూ అందరూ

ఎలా చేస్తే అలా చేయుచూ లాభము కల్గితే పొగడడము, కల్గకపోతే

దూషించ డము సహజమైపోయింది. అందువలన జ్ఞానమంటే ఏమిటో

తెలియక, దానితో అవసరమే లేదనుకొని అజ్ఞానిగా మానవుడు దిగజారి

పోయాడు.


మధుమతి :- జ్ఞానమంటే ఏమిటి?

రాజయోగానంద :- దేవుని యొక్క వివరమును తెలుసుకొనుటే జ్ఞానము.

మధుమతి :- అది ఎక్కడ తెలుస్తుంది?

రాజయోగానంద :- దేవుని వివరము తెలిసిన వారివద్దే తెలుస్తుంది.

మధుమతి :- దేవుని వివరము తెలిసిన వారెవరు? వారిని ఎలా గుర్తించ

గలము?


రాజయోగానంద :- దైవత్వ వివరము తెలిసినవారు ఫలానావారని చెప్పుటకు

నాకు తెలియదు. కానీ వారు తెలియజేయు జ్ఞాన విషయములను బట్టి

వారిని గుర్తించవచ్చును.

మధుమతి :- అసలు జ్ఞానమంటే ఏమిటో తెలియని మాబోటివారు దొంగ

స్వాములు చెప్పు దానిని కూడా జ్ఞానమనే నమ్మగలము. వారినే జ్ఞానులను


కోగలము. అలా జ్ఞానులు కానివారిని జ్ఞానులు అనుకోవడము వలన,

అసలైన జ్ఞానము తెలియకుండా పోవును కదా! ఈ కాలములో జ్ఞానులు

కానివారెందరో జ్ఞానుల వేషము వేసి బాగా తెలిసిన జ్ఞానులవలె చలామణి

అగుచున్నారు. ఆ విధముగానున్నపుడు వీరు జ్ఞానులని, వీరు అజ్ఞానులని

మాబోటివారు గుర్తించడము కష్టము కదా! మాబోటివారు జ్ఞానులను

గుర్తించుటకు ఏదైనా సూత్రబద్ధమైన మార్గమున్నదా?


(ఆమె మాట విన్న స్వామి ఆమె యోచనాశైలికి సంతోషిస్తూ ఇలా

అన్నాడు.)


రాజయోగానంద :- నీవన్న మాట నిజమే. దొంగలూ, హంతకులూ

కాషాయవస్త్రములు ధరిస్తే చాలు. వారిని స్వాములని గ్రుడ్డిగ నమ్మే

సమాజము మనది. నీవలె సూత్రబద్దముగా స్వాములంటే ఎవరని

యోచించరు. నీవు అడిగావు కావున నేను చెప్పుచున్నాను. నేను నిజముగా

స్వామినే అయినప్పటికీ నీవు ఊహించని రీతిలో కాళ్ళకు బూట్లు, శరీరము

నకు మంచి దుస్తులు ధరించి ఉండడము వలన ఎవరూ నన్ను స్వామి

అని గుర్తించలేరు. నావద్ద ఎంతో ఉన్నతమైన జ్ఞానమున్నప్పటికీ పై

వేషములో అది కనిపించదు. తెల్లనివన్నీ పాలని నమ్ము ఈ మనుషులు

సాధారణ దుస్తులు ధరించిన నన్ను సాధారణ వ్యక్తిగానే తలచి, ఈయనెలా

స్వామియగు నని హేళనగా మాట్లాడుచుందురు. జ్ఞానము లేకున్ననూ

కాషాయవస్త్రములు ధరించడము వలనా, రుద్రాక్షలు ధరించుట వలన

వారిని స్వాములని పడిపడి మ్రొక్కుచుందురు.


ఈ విధముగా చూచువారికి జ్ఞానము పైకి కనిపించదు. వినువారికి

అది జ్ఞానమో కాదో తెలియదు. అలాంటపుడు నిజ జ్ఞానమునెలా గుర్తించ

గలరను ప్రశ్న ఎవరికైనా రాగలదు. దీనికి దేవుడే జవాబు చెప్పవలసి


వున్నది. కావున జ్ఞానులను గుర్తించునట్లు రెండు సూత్రములను భగవంతుడే

చెప్పాడు. ఆ రెండు సూత్రములు భగవద్గీతలో ఆత్మసంయమ యోగమను

అధ్యాయమున మొట్టమొదటి శ్లోకములోనే చెప్పాడు. ఒకటి పనులు

మానుకొనువాడు యోగికాడు. రెండవమాటలో అగ్ని లేనివాడు యోగికాడు

అన్నాడు. నిజమైన జ్ఞానమును తెలిసి సాధించిన యోగి అన్ని పనులు

సర్వ సాధారణముగా చేయుచుండునన్నాడు. అందువలన నేను పెళ్ళి

చేసుకోకూడదు, నేను ఫలానా పనులు చేయకూడదని పనులకు దూరముగా

ఉండువాడు యోగికాడు. అట్లని ఇతరులను చూచి అన్ని పనులు అజ్ఞానులు

కూడా చేయుచుందురు. కావున వారిలో జ్ఞానులను గుర్తించలేము. ఇక

రెండవ సూత్రములో అగ్ని లేనటువంటివాడు యోగికాడు అన్నపుడు, అగ్ని

అంటే కర్మనుకాల్చు శక్తియని అర్థమగుచున్నది. ఆ అగ్ని అంటే ఏమిటో

జనులకు తెలియదు. ఆ అగ్ని కనిపించునది కాదు. అటువంటపుడు

అగ్నివున్న వారినెలా గుర్తించగలమను ప్రశ్న ఉద్భవించగలదు. దానికి

జవాబుగా ఎదుటివారు గుర్తించునట్లు ఆ అగ్ని ఏమిటో తెలియునట్లు దైవమే

యోగులనుండి ఆ అగ్నిని బహిర్గతము చేసి ఇతరుల కర్మలు కాలిపోవునుట్లు

చేయుచున్నాడు. ఏ వైద్యము లేకుండా ఎవని స్పర్శచేత మనిషికున్న

భయంకర రోగములు సహితము పోవుచున్నవో, అతని వద్దనే అగ్ని

ఉందనీ, అతనే నిజయోగి, నిజ సన్యాసి అని మానవులు గ్రహించాలి.

యోగి అంటే ఏమిటో అక్కడక్కడ కొందరి నుండి వచ్చిన అగ్ని ఎదుటివాని

కర్మలను కాల్చిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. ఈ విధముగ

యోగులను గుర్తించవచ్చును. అటువంటి యోగులను గుర్తించి వారివలన

జ్ఞానమును తెలుసుకోవడము వలన దైవమంటే ఏమిటో తెలియును.

అప్పుడు ప్రపంచ సంబంధ కోర్కెలను మనము కోరము. అవి నెరవేరక

పోయినా దేవున్ని నిందించము. అదియే అసలైన జ్ఞానము యొక్క పని.


మధుమతి :- కోర్కెలే దేవున్ని కోరనపుడు మనకు దేవునితో పని ఏమి?

రాజయోగానంద :- ఇంతకుముందు కూడా చెప్పాను. దేవుడు కోర్కెలు

నెరవేర్చుటకు లేడని, ఆయన ఎవరి కోర్కెలను నెరవేర్చుతానని చెప్పలేదని.

దేవుడు ఏ పని చేయనివాడనీ, దేవునికీ, కోర్కెలకూ సంబంధములేదని

తెలియుటకే మనకు జ్ఞానము అవసరము. జ్ఞానము తెలిస్తే, కర్మప్రకారము

అన్నీ జరుగుననీ, మనము కోరుట వలనగానీ, కోరక పోవుట వలనగానీ

ఒరిగేది ఏమీలేదనీ, పుట్టినపుడే ప్రతిదీ నిర్ణయించబడివుండి జీవితములో

దాని ప్రకారమే జరుగునని తెలియును.


(ఆ మాటలు విన్న మధుమతి స్వామి చెప్పిన జ్ఞాన సంబంధమైన

విషయములకు ఎంతో ఆశ్చర్యపోయింది. పైకి చూస్తే సాధారణ దుస్తులు

ధరించి, అందరిలాగా సాధారణ వ్యక్తివలె కనిపించు స్వామిని చూచి, నివురు

గప్పిన నిప్పులాగ ఎవరికీ తెలియకుండా స్వామి ఉన్నాడని గ్రహించింది.

తమవద్ద జ్ఞానము లేకున్ననూ, ఉన్నవారివలె వేషము వేసి నటించువారున్న

ఈ కాలములో, ఎంతో జ్ఞానమున్ననూ లేనివానివలె కనిపించు స్వామిని

చూచి ఈయన సాధారణ వ్యక్తికాదని తెలుసుకొన్న ఆమె వెంటనే స్వామి

పాదాల మీద పడి నమస్కరించి ఇలా అన్నది.)


మధుమతి :- స్వామీ! మీరు నిజమైన జ్ఞానులనీ, నిజమైన యోగులనీ మీ

మాటలనుబట్టియే తెలిసింది. దైవమంటే ఏమిటో తెలుపు స్థోమత మీకే

ఉన్నది. ఇప్పటి నా మనోక్షోభ తీర్చి, నాకు జ్ఞానమును కల్గించమని వేడుకొను

చున్నాను. నా మనవిని ఆలకించి నాకు దైవసన్నిధిని చేరు జ్ఞానమును

తెలుసుకొనునట్లు చేయండి.


(ఆమె మనోవ్యథను అర్థము చేసుకొన్న స్వామి, వెంటనే తన

కుమారున్ని తీసుకురమ్మని ఆమెకు చెప్పగ, ఆమె పరుగున పోయి మంచము




మీదనున్న తన కుమారున్ని స్వామివద్దకు తెచ్చింది. ఆమె ముఖములో

విషాధ ఛాయలు పోయి సంతోష ఛాయలు మెరియసాగాయి. తన

కుమారున్ని తీసుక రమ్మని స్వామి చెప్పగానే ఆమెలో క్రొత్త సంతోషము

పొంగివచ్చింది. తన కుమారునికి హర్టుఎన్లార్జ్ (గుండెలావు) అయిందనీ,

ఇక బ్రతకడని డాక్టర్లు చెప్పగా నిరుత్సాహపడిన మధుమతికి, స్వామి నీ

కుమారున్ని తీసుక రమ్మని చెప్పగానే క్రొత్త ధైర్యము వచ్చింది. 20

సంవత్సరముల తన కుమారున్ని స్వామి ముందర కూర్చోబెట్టింది. అప్పుడు

స్వామి తన ముందర కూర్చున్న మధుమతి కుమారున్ని రెప్పవాల్చకుండా

ఒక నిమిషము చూచాడు. ఇక అతనిని ఇంటికి తీసుక పొమ్మన్నాడు.

స్వామి అతనివైపు చూచి ఇక ఇంటికి తీసుకుపొమ్మని చెప్పడము అర్థముకాక

ఆమె స్వామితో ఇలా అన్నది.)


మధుమతి :- స్వామీ నా కుమారున్ని రక్షించండి.


రాజయోగానంద :- ఏమమ్మా ఇంకా నామీద నీకు నమ్మకము కలుగలేదా!

నీ కుమారుడు రక్షింపబడినాడు. అతని వ్యాధికి కారణమైన కర్మ కాలి

పోయింది. లోపలనున్న గుండెవాపు ఇపుడు సగము తగ్గిపోయినది. మీరు

ఇంటికి పోవు లోపల మిగతా సగము కూడా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్య

వంతుడై పోగలడు. ఇతని దిగులు వదలి జ్ఞానమును తెలుసుకొని

దైవత్వమును పొందుటకు ప్రయత్నించు. ఇది మహత్యముకాదు. జ్ఞానము

నకు ఇంత శక్తి ఉందని నిరూపించుటకు చూపిన నిదర్శనము.


(స్వామి మాటవిన్న ఆమె ఆశ్చర్యపోయింది. డాక్టర్లు బ్రతకడని

చెప్పిన వ్యాధిని ఒక నిమిషములో నయమైపోయిందని వినడము ఆశ్చర్యమే

కదా! అయినప్పటికీ స్వామి మాట నిజమో కాదో, ఆ వ్యాధి పోయిందో

లేదోనని అనుమానము కూడా ఒకవైపు మెదలసాగింది. అనుమానము


ఒకవైపు ఉన్ననూ, స్వామిమాట మీద నమ్మకము పెట్టుకొని బాగైనట్లు

తలచిన ఆమె ఇలా అన్నది.)


మధుమతి :- స్వామీ తమ పేరు ఏమిటో, తమరు ఎచటివారో నాకు

తెలియదు. నేను తెలుసుకోవచ్చునా?


రాజయోగానంద :- అడిగావు కాబట్టి చెబుతాను నా పేరు రాజయోగానంద

అంటారు. కానీ నేను ఎచటివాడనో ఇప్పుడు చెప్పను. సమయము

వచ్చినపుడు నీకే తెలుస్తుంది.


మధుమతి :- మీరు ఎక్కడివారో తెలియకపోతే నేను ఎలా జ్ఞానమును

తెలుసుకోగలను. జ్ఞానము కొరకు ఎచటికి రాగలను?


రాజయోగానంద :- ఆ సందేహము నీకు అవసరములేదు. నేను

తెలియజేయు జ్ఞానమేదో గ్రంథరూపము చేసి ఉంచాను. ఆ గ్రంథములు

చదివితే జ్ఞానము నీకు తెలియగలదు.


మధుమతి :- మీరన్నట్లు మీ గ్రంథముల ద్వారా జ్ఞానమును తెలుసుకో

గలను. కానీ మీ దర్శనము మాకు కావాలంటే ఎలాగ స్వామి!

రాజయోగానంద :- తర్వాత నేనెచటవున్నది నేను చెప్పకున్ననూ నీకే

తెలుస్తుందని చెప్పాను కదా!


(స్వామిని తన ఇంటికి ఆహ్వానించదలచి ఆయన పాదము తన

ఇంటిలో మోపితే మంచిదని తలచి ఇలా అన్నది.)


మధుమతి :- స్వామీ! మా మీద దయవుంచి మీరు మా ఇంటికి ఒకమారు

రండి, మా ఆతిథ్యము స్వీకరించండి.


రాజయోగానంద :- నీవు పిలిచావు. నేను రాగలను. అయితే స్వాములంటే

నీ భర్తకు పూర్తి చులకన భావమున్నది. సాధారణ మనిషివలెనున్న నన్ను


చూచి వీడెవడని నీ భర్త నిన్నే దండించగలడు. ప్రాణము లేని పటములకు

మ్రొక్కు నీ భర్త ప్రాణములున్న నన్ను చూచి నమస్కారమని కూడా చెప్పడు.

నన్ను గురించి నీవు గొప్పగా చెప్పినా, అతను నమ్మకపోగా నిన్ను కూడా

దూషించును. నీ కుమారున్ని ఈయనే రక్షించాడని నీవు నన్ను గురించి

పెద్దగా చెప్పినా, ఆయనేమో నన్ను చిన్నగనే లెక్కించి ఆపద మ్రొక్కులవాడైన

వెంకటేశ్వరుడే తన కుమారున్ని కాపాడాడు అని అంటాడు. జ్ఞానము

విలువ తెలియని నీ భర్తకు జ్ఞానమంటే ఏమిటో తెలిసిననాడు నేను మీ

ఇంటికి రాగలను.


(స్వామి మాటలు విన్న ఆమె విస్తుపోయింది. తన భర్తను చూడకనే

విస్తుపోయింది. తన భర్తను చూడకనే

తన భర్తలోని మూర్ఖత్వమును గురించి చెప్పిన స్వామి సామాన్యుడుకాడని

తలచి ఇలా అన్నది.)


మధుమతి :- స్వామీ, నా భర్త మీకు తెలుసా?

రాజయోగానంద :- తెలుసు. పోలీస్ డిపార్టుమెంటులో ఉండి అవినీతికి

పాల్పడు ఒక ఉద్యోగి.


మధుమతి :- ఆయన మీకెలా తెలుసు స్వామీ.


రాజయోగానంద :- ఎలా అన్న ప్రశ్నకు నావద్ద సమాధానము లేదు.

ఉన్నా చెప్పను. నీవు గత జన్మలో చేసుకొన్న పాపఫలితముగా నీకు ఆ

భర్త దొరికాడు. నీవు అనుభవింపక తప్పదు. అటువంటి చోటికి నేను

రావడము సరికాదు.


(స్వామి చెప్పినది సత్యమని తలచి తనలో దుఃఖము వస్తున్ననూ

ఆపుకొనుచూ ఇలా అన్నది.)


మధుమతి :- స్వామీ తమ దర్శనము తిరిగి ఎప్పుడు లభించునో.

రాజయోగానంద :- ఎప్పుడో ఒకప్పుడు తప్పక లభిస్తుంది.


(మధుమతి కుమారునికి ఆ కొద్దిసేపటికే తన ఆరోగ్యము ఎంతో

మేలనిపించిది. అందువలన అతను స్వామి పాదాలకు మ్రొక్కుకొన్నాడు.

మధుమతి కూడా నమస్కారము చేసుకొని, స్వామివద్ద సెలవు తీసుకొని

ఇద్దరూ ఇంటికి బయలుదేరి పోయారు. ఇంటికి వచ్చిన కుమారుడు అన్ని

విధములా ఆరోగ్యముగా కనిపించాడు. అతనిలో రోగమున్న ఛాయలే

కనిపించలేదు. మధుమతి తన కుమారున్ని డాక్టర్లవద్దకు తీసుకపోయి

చూపించింది. డాక్టర్లు అతని గుండెను పరీక్షించి చూచారు. అతనిలోని

వ్యాధి నయమైపోయి గుండె మంచి కండీషన్లో ఉండడమును చూచి

ఆశ్చర్యపోయి ఆ విషయమును మధుమతికి తెలిపారు. ఆమె పట్టలేనంత

సంతోషపడినది. కుమారునికి వ్యాధి నయమైపోయినట్లు తన భర్త ఇన్స్పెక్టర్

బాలప్పకు తెలిపింది. కానీ స్వామి బాగు చేశాడని చెప్పలేదు. చెప్పినా

అతడు నమ్మడని చెప్పలేదు. అప్పటినుండి రాజయోగానంద స్వామి ఇచ్చిన

గ్రంథమును చదువుచూ అందులోని జ్ఞానమును బాగా తెలుసుకోగల్గింది.

ఆమె కుమారుడు కూడా స్వామి జ్ఞానము ఎడల విధేయత కల్గివున్నాడు.


దాదాపు రెండు సంవత్సరములు గడిచింది. స్వామి ఎక్కడున్నాడను

విషయము ఏమాత్రము మధుమతికి తెలియలేదు. స్వామి ఇచ్చిన గ్రంథము

మీద ఆయన అడ్రసు కూడా లేదు. ముందర నాలుగు కాగితములు లేని

గ్రంథమును ఇచ్చాడు కనుక దానిమీద అడ్రసులేదు. గ్రంథము చదవక

ముందుకంటే చదివిన తర్వాత ఆమెలో స్వామి దర్శనము కావాలను

కాంక్ష ఎక్కువైనది. తన మనస్సులో స్వామిని ఎన్నోమార్లు తలచుకొని

దర్శనము కొరకు వేడుకొన్నది. ఒక దినము రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు.

ఎలాగైనా స్వామి దర్శనము చేసుకోవాలని ఆలోచిస్తున్నది. స్వామి అడ్రస్


ఎలా సంపాదించాలి. నీకే నా అడ్రస్ తెలుస్తుందని స్వామి అన్నాడు.

అది ఎట్లు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అని యోచిస్తూ నిద్రరాక

లేచి కూర్చున్నది. రాత్రి 12 గంటలైనది. ఇంకా భర్త పడుకోలేదెందుకని

చూడగా ముందర హాల్లో ఎవరితోనో మాట్లాడడము ఆమెకు వినిపించింది.

అంతలో వారి మాటలలో “రాజయోగానంద స్వామి" అను మాట

వినిపించింది. వెంటనే! ఏమిటా అని జాగ్రత్తగా వినసాగింది.)


జగన్నాథము :- మీకే కాదు బాలప్పా, ఆ రాజయోగానంద స్వామి నాకు

కూడా పెద్ద మోసము చేశాడు. వాడసలుకు స్వామివలె ఉన్నాడా?

స్వామి అయితే మిగతా విషయాలలోనికి తలదూర్చక ముక్కుమూసుకొని

కూర్చుంటారు. వీడు అలాకాదు. నేను రాధేశ్వరి అను కన్యపిల్లమీద

ఆశపడితే, ఆ పిల్లను కాపాడి నా చేతికి దొరకకుండా చేశాడు. ఆ పిల్ల

ఇప్పుడు ఆశ్రమములోనే ఉన్నది. వాన్ని నేను అంత సులభముగా వదలి

పెట్టుతానా?

(రాజయోగానంద స్వామిని గురించి అతను అనిన ఆ మాటలు

వినుచుండగానే ఆమెలో విపరీతమైన కోపము వచ్చింది. తోక తొక్కిన

పాము బుసకొట్టి పడగవిప్పి లేచినట్లు పైకిలేచి విసురుగా పోయి తన

భర్తతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి షర్టును పట్టిలాగి క్రిందికి త్రోసి కాలితో

తన్నింది. )


మధుమతి :- ఏమి కూసావురా గాడిదా! నిర్బలులైన అమాయక ఆడపిల్ల

మీద అత్యాచారము చేయాలనుకొన్న నీవు నీతిమంతుడవా? ఆ పిల్లను

కాపాడి నీకు దొరకకుండా ఆశ్రయమిచ్చి ఆశ్రమములో పెట్టుకొన్న స్వామి

మోసగాడా?


(ఊహించని ఆ పరిణామమునకు బాలప్ప తేరుకోకముందే

వరుసగా కాలితో తన్నిన ఆమెను బాలప్ప లేచి పట్టుకొన్నాడు. ఆడవారిని

ఆట బొమ్మలుగా చూచు జగన్నాథమునకు ఆమె ఎందుకు తన మీదికి

వచ్చిందో అర్థముకాక బాలప్ప వైపు చూచాడు. బాలప్ప తన భార్యవైపు

కోపముగా చూచి ఇలా అన్నాడు.)


బాలప్ప :- నీకు పిచ్చి ఏమైనా పట్టిందా, ఆయనెవరనుకున్నావు. అతనొక

పెద్దమనిషి.


మధుమతి :- వీడు ఎవడో నాకు బాగా తెలుసు. ఒకమారు తన ఊరిలోని

ఆడవారి మీద అఘాయిత్యాలు చేయబోయి, అదే ఊరిలోని హరిజనుల

చేత తన్నులు తిన్నవాడు కాదా వీడు? వీడు నీకు పెద్ద మనిషా? స్వామిని

అనవసరముగా నీచముగా మాట్లాడుతాడా? స్వామిని అలా మాట్లాడినందుకే

కాలితో తన్నింది. ఇకముందు ఎప్పుడైనా స్వామి పేరు ఎత్తితే చెప్పు

తెగిపోయేంతవరకు కొట్టుతా!


(ఆమె మాటలకు జగన్నాథము భయపడి, తర్వాత కలుస్తానని

బాలప్పతో చెప్పి అక్కడినుండి పోయాడు. తన భార్య ప్రవర్తన అర్థముకాక

ఈమె ఏమిటీ, రాజయోగానంద స్వామి పేరు వింటూనే రెచ్చిపోవడమేమిటి?

అని ఆశ్చర్యపడిన బాలప్ప తన భార్యను లాక్కొని పోయి బెడ్రూములోనికి

త్రోసి బయట తలుపులు వేసివచ్చాడు. తన భార్యను కోపముగా చూస్తూ

“ఆ మోసగాడు రాజయోగానంద స్వామి నీకు తెలుసా” అనేంతలోపల

బాలప్ప చెంప ఛెల్లుమన్నది. మధుమతి కొట్టిన వేటుకు అతని బుర్ర

గిర్రున తిరిగింది.)


(న్యూస్ పేపరులో వచ్చిన వార్తను చూచిన తర్వాత భువనేశ్వరి

దేవాలయములో వజ్రములు దొంగలించబడినట్లు ప్రజలందరికీ తెలిసి


పోయింది. వాటి మీద ఆశతోనే దేవాలయములో పాగావేసిన జఠాజూట

స్వామికి నిరాశైనది. తపస్విబాబాగారికి ఆ వజ్రాలను ఎలాగైనా సాధించాలను

తపన ఎక్కువైనది. మునెప్ప అతని స్నేహితుడు హీరో కలిసి రాజయోగానంద

స్వామివద్దగల వజ్రాలు ఎపుడు బయటికి వస్తాయా? అని వేచియున్నారు.

పోలీస్ యస్.పి గారు ఈ విషయములో శ్రద్ధ తీసుకొని మునెప్ప ముఠామీద

అన్ని చోట్ల నిఘావేసి ఉంచారు. రాజయోగానందస్వామి అందరినుండి

వజ్రాలను కాపాడి వాటిని యథాప్రకారము భువనేశ్వరి దేవాలయములో

భద్రపరుచుటకు తీవ్ర యోచన చేస్తున్నాడు. ఇక నాగభూషణము, మల్లయ్య

తాత ఇద్దరు మాంత్రికులూ కలిసి మంత్రముల చేత మునెప్ప మనుషులకు

కూడా తెలియకుండా, వజ్రాలు దొరికితే కొట్టేయాలనుకొన్నారు. ఇంతమంది

వజ్రములను గూర్చి రకరకముల ప్రయత్నములు చేయుచుండగా, రాజ

యోగానందస్వామి పిలుపుమేరకు ఆశ్రమానికి వచ్చిన గూడెము నాయకుడైన

మల్లుదొర ద్వారా, గూడెములో వజ్రములను కొన్ని రోజుల వరకు భద్ర

పరచుటకు రాజయోగానంద స్వామి పంపాలనుకొన్నాడు. ఒక దినము

పది వజ్రములను చిన్న పెట్టెలో పెట్టి నాయకుని చేతికిచ్చి పంపెను.

ఆయనతో పాటు మరికొందరు ఆశ్రమమునుండి బయలుదేరి పోయారు.


వజ్రాలు దొంగలించబడినవని తెలిసిన తర్వాత పది దినముల

వరకు వాటిని గురించిన ఎటువంటి ఆచూకి పోలీసులకు తెలియక

పోవడముతో వారు వాటి సమాచారము కొరకు ప్రయత్నము తీవ్రతను

చేశారు. రాజయోగానందస్వామి మీద కక్షగనున్న ఇన్స్పెక్టర్ బాలప్ప

యస్.పి.గారికి ఫోన్ చేసి తనెవరైనది చెప్పకుండా వజ్రాల సమాచారము

అందిస్తున్నామనీ, వజ్రాలు రాజయోగానందస్వామి ఆశ్రమములో

ఉన్నాయని, వాటిని రాజయోగానంద స్వామియే అపహరించాడని చెప్పాడు.


రాజయోగానంద స్వామి మంచివ్యక్తి అని యస్.పి.గారికి కూడా తెలిసిన

దానివలన ఆ ఫోన్ మాటలు దురుద్దేశమైనవనీ, తమను తప్పుదారి

పట్టించుటకు అసలైన దొంగలే అలా చెప్పివుంటారనుకొన్నాడు. ఆ ఫోన్

ఎవరు చేసివుంటారని యోచించాడు.)


(మాంత్రికులు ఇద్దరూ అంజనము ఉపయోగించి వజ్రములను

గూడెము నాయకుడు అడవిలోని తన గూడెమునకు తీసుకొని పోవుచున్నా

డని తెలుసుకొన్నారు. ఆ వజ్రాలను తమ స్వంతము చేసుకొనుటకు అదే

అదనుగా భావించిన ఆ ఇద్దరు బయలుదేరి అడవివైపు పోయారు. గూడెము

నాయకుడు మరియు అతనితో పాటు మరికొందరు మార్గమున కాలి నడకన

పోవుచు మధ్యాహ్న సమయములో ఒకచోట ఆగి ఒక చెట్టు క్రింద కూర్చొని

వెంటతెచ్చుకొన్న ఆహారమును తిని విశ్రాంతి తీసుకొంటున్న సమయములో

మాంత్రికులిద్దరు వారి ఉనికిని తెలుసుకొన్నారు. ప్రక్కన కొంత దూరములో

పొదలమాటున నక్కివుండి, ఆ నాయకుడు ఒక్కడు పెట్టెతో సహా ప్రక్కకు

వస్తే బాగుండునని తలచి తమ ఆధీనములోనున్న ఒక విగ్రహను ఆ

నాయకునియందు చేరి కడుపునొప్పి వచ్చి మలవిసర్జనకు పోవునట్లు

చేయమని చెప్పిపంపారు. వారి ఆజ్ఞమేరకు ఆ విగ్రహ మల్లుదొర శరీరములో

దూరి అలానే చేసింది. కానీ మల్లుదొర వజ్రాల పెట్టెను తమ మనుషులకు

అప్పచెప్పి బహిర్భూమికి పోయాడు. దానివలన మాంత్రికుల యోచన

ఫలించలేదు.


తర్వాత మల్లుదొర మిగతావారు అందరూ కలిసి అక్కడినుండి

బయలుదేరి పోయారు. వారిని మాంత్రికులు ఇద్దరూ వెంబడిస్తూ పోయారు.


ఆ రాత్రికి మల్లుదొర మార్గమధ్యలో విడిది చేయాల్సి వచ్చింది. సరియైన

ప్రాంతము చూచుకొని ఆ రాత్రికి గడిపి తిరిగి ఉదయమే బయలుదేరి

పోవాలను కొన్నారు. వన్యమృగముల దాడిలేని స్థలములో కొన్ని కట్టెలు

కుప్పవేసి నిప్పుపెట్టి, ఆ నిప్పుచుట్టు అందరూ పడుకొనునట్లు ఏర్పాటు

చేసుకొన్నారు. చాటుగా మల్లుదొరను, అతని మనుషులను వెంబడిస్తున్న

మాంత్రికులు ఇద్దరూ ఆ రాత్రికి ఎటులైనా వారినుండి వజ్రాలను

కాజేయాలనుకొన్నారు. అదును కొరకు వేచి చూస్తున్న మాంత్రికులు వారు

నిద్రించారని తెలుసుకొన్న తర్వాత తమ వశములోనున్న కాటేరి అను

శక్తిని పిలచి మల్లుదొర దగ్గరయున్న వజ్రాల పెట్టెను తమవద్దకు చేర్చమని

చెప్పి పంపారు. వారి ఆదేశానుసారము కాటేరి, పడుకొన్న మల్లుదొర

వైపు పోయింది. అడవిలో పడుకొన్నదానివలన మరియు వారివద్ద విలువైన

వజ్రములుండుట వలన అందరూ పడుకొని నిద్రపోకుండా కాపలాగా

ఇద్దరు మేల్కొనివుండిరి. అదృశ్యరూపమునున్న కాటేరిని, మేల్కొనివున్న

ఇద్దరూ గమనించ లేకపోయారు. కాటేరి కూడా ముసుగులు వేసుకొని

మౌనముగా కూర్చున్న ఇద్దరూ మేల్కొనివున్నారని గమనించలేదు. కాటేరి

నేరుగా మల్లుదొర దగ్గరికి పోయి అతని ప్రక్కనవున్న వజ్రాలపెట్టెను

తీసుకొని మాంత్రికులవద్దకు వస్తున్న సమయములో అక్కడే మేల్కొనివున్న

ఇద్దరు వ్యక్తులకు పెట్టె గాలిలో తేలిపోవుచున్నట్లు కనిపించింది. రాత్రిపూట

మండుచున్న మంట వెలుగులో వారు పెట్టె పోవడమును చూచి మల్లుదొరను

మిగతావారిని లేపార అంతలో అది చీకటిలో కనిపించకుండా పోయినది.


ఈ తతంగమును ప్రక్కన చాటుగా ఉండి గమనిస్తున్న ఇద్దరు

మాంత్రికులు కాటేరి తమవద్దకు పెట్టెను తెస్తూనే దానిని తీసుకొని అక్కడ

నుండి వెంటనే పారిపోయారు. తమ పెట్టె గాలిలో తేలిపోయినట్లు

కనిపించడము, చివరకు అది ఏమైనది తెలియకపోవడము విచిత్రముగా


తోచినది. ఉదయము తెల్లవారిన తర్వాత ఆ చుట్టుప్రక్కలంతా పెట్టె కొరకు

వెతికి చూచారు. పెట్టె కనిపించలేదు, కానీ మాంత్రికులు నక్కియున్న

ప్రాంతము మాత్రము కనిపించింది. అక్కడ ఎవరో ఉండినట్లు పాదముల

గుర్తులు, వారు కాల్చివదలివేసిన చుట్టముక్కలు కనిపించాయి. ఆ చుట్ట

ముక్కలను తీసుకొని వారందరు బయలుదేరి వెనక్కు పోయి రాజయోగా

నంద స్వామికి విషయమంతా తెలిపారు. ఆ విధముగా జరిగినందుకు

స్వామి నివ్వెరపోయాడు. పెట్టె గాలిలో తేలిపోవడమేమిటని యోచించ

సాగారు. వజ్రములు పోయిన తీరునుబట్టి ఆ వజ్రాల విషయము తెలిసిన

మనుషులే దుష్టశక్తులచేత ఈ పనిని చేయించి, వజ్రములను అపహరించి

వుంటారని రాఘవ రాజయోగానంద స్వామికి చెప్పాడు. వజ్రములను

గురించి అందరూ ఆలోచించసాగారు.)


(వజ్రాలను కాటేరి ద్వారా దొంగలించిన మాంత్రికులు మరుసటి

దినము వజ్రాలను పెట్టెనుండి తీసి చిన్న గుడ్డలో మూటకట్టుకొని, ఆ

పెట్టెను మార్గమధ్యలో ఒక బావిలోనికి వేసి తమ నివాసమునకు

పోవుచుండిరి. అంతలో సాయంకాలమైనది. దారిలో ఒక మామిడితోట

ఉండెను. ఆ తోటలోనికి పోయి, ఆ తోట వారిని పరిచయము ఏర్పరుచుకొని

దారిన పోయేవారమని, ఈ రాత్రికి ఇక్కడుండి పోతామని చెప్పగా వారు

సరేనని ఒప్పుకొన్నారు. ఇద్దరు మాంత్రికులు ఆ రాత్రికి తోటలో పడు

కొన్నారు. వారు నిదురించినా తమవద్దనున్న వజ్రాలను ఎవరూ తీయకుండా

కాటేరిని కాపలా పెట్టి నిద్రించారు. తెల్లవారిన తర్వాత వారు లేచి

నడుముకున్న తమ వజ్రముల మూటను ఒకమారు చేతితో తడిమి

చూచుకొన్నారు. వారికి వారి మూట నడుముకు లేనట్లు తెలిసిపోయింది.


తమవద్దనున్న మూటను ఎవరూ తీయలేరు. ఎందుకనగా కాటేరి కాపలాగా

ఉన్నది. వారు నిద్రించునపుడు ఎవరైనా తీసుకొను ప్రయత్నము చేస్తే

కాటేరి వారిని భయపెట్టి పంపేది. అందువలన ఎవరూ తీసుకొనుటకు

వీలులేదు. కాటేరికి తెలియకుండా ఏమి జరిగివుండదని తెలిసిన

మాంత్రికులు కాటేరిని అడిగారు. అప్పుడు కాటేరి ా ఇక్కడికి రాలేదు,

ఎవరూ వజ్రములను తీసుకపోలేదని తెలిపింది.

ఎవరూ తమవద్దనున్న

వజ్రాలను తీయనిది, అవి ఎలా పోయాయి? అని కాటేరిని అడిగారు. ఏ

విధముగా చూచినప్పటికి వజ్రాల విషయము నాకు ఏమీ అర్థముకాలేదని

కాటేరి కూడా చెప్పింది.)


(రాజయోగానంద స్వామివద్దకు యస్.పి గారు పోలేదనీ, ఎలాంటి

విచారణ జరుపలేదని, అదే డిపార్టుమెంటులో వుండి గమనిస్తున్న ఇన్ స్పెక్టర్

బాలప్ప వజ్రాల విషయమై రెండవమారు యస్.పి గారికి ఫోన్ చేసి

రాజయోగానంద స్వామియే దొంగయని చెప్పాడు. రెండవమారు కూడా

ఫోన్ రావడముతో ఆ విషయమును ఒకమారు స్వామితో కలిసి మాట్లాడేది

మంచిదనుకొని యస్.పి గారు వెంటనే బయలుదేరి రాజయోగానంద స్వామి

వద్దకు పోయాడు. స్వామివద్దకు పోయిన యస్.పి ఇలా అన్నాడు.)


యస్.పి :- భువనేశ్వరి దేవాలయములో పోయిన వజ్రముల గురించి మీ

పేరును చెప్పుచూ రెండు ఫోన్కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసినవారు మీరే

దొంగ అని చెప్పారు. అయినా మేము ఆ విషయమును నమ్మలేదు.

అయినా ఒకమారు మీతో కలిసిపోతే బాగుంటుందని వచ్చాను. దాని

విషయము మీకేదైనా తెలిసివుంటే చెప్పండి.


రాజయోగానంద :- ఆ ఫోన్ చేసినది ఎవరో కాదు. మీ డిపార్టుమెంట్

లోనే పని చేయుచున్న ఇన్స్పెక్టర్ బాలప్ప.


యస్.పి :- అతనెందుకు ఫోన్లో చెప్పుతాడు? తనవద్ద ఏదైనా ఇన్ఫర్మేషన్

వుంటే నేరుగా వచ్చి నాతోనే చెప్పుతాడు.


రాజయోగానంద :- వజ్రాలు మావద్ద ఉన్నట్లు బాలప్పకు ముందునుండి

తెలుసు. ఆ విషయము మీకు తెలియునట్లు తెలివిగా మీకు ఫోన్లో

చెప్పాడు.


యస్.పి :- ఏమిటి మీ దగ్గర వజ్రాలున్నాయా? మీరు తెలిసే మాట్లాడు

చున్నారా?


రాజయోగానంద :- అవును తెలిసే చెప్పుచున్నాను. ఆ వజ్రములు

భువనేశ్వరి దేవాలయములో దొంగలించబడినవని మీకు తెలియకముందే

ఆ వజ్రములు మా చేతికి వచ్చాయి. విషయమంతా తెలిసిన మేము

వాటిని కొంతకాలము మా రక్షణములోనే పెట్టుకొని అసలు దొంగలను

బయటికి లాగాలనుకొన్నాను. వాటి విషయము బాలప్పకు కొంత తెలుసు.

ఆ వజ్రముల కొరకు ఇక్కడికి వచ్చిన దొంగలను కూడ మేము పట్టి

బంధించాము. అప్పుడు ఆ దొంగలను మా నుండి విడిపించే దానికి

వచ్చాడు. అయినా మేము వదలలేదు. డబ్బు తీసుకొని దొంగల పక్షమున

వచ్చినదికాక, మమ్ములను దురుసుగా మాట్లాడినందుకు ఇక్కడి మావారు

ఎదురు తిరిగారు. అప్పుడు ఇక్కడినుండి పోయాడు. న్యూస్పేపర్

సమాచారము వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి 50 వేలు డబ్బులు ఇస్తే

మీపేరు బయటికి రాకుండా చూస్తాను అన్నాడు. దానికి మేము ఒప్పు

కోలేదు. అందువలన అతని పేరు తెలియకుండా ఫోన్ చేసివుంటాడు.


యస్.పి :- వజ్రాలు మీవద్ద ఉంచుకోవడము నేరమవుతుంది. వెంటనే

మాకు ఎందుకు అప్పగించలేదు. వాటిని మీవద్ద ఉంచుకోవడము చట్టము

ఒప్పుకోదు.


రాజయోగానంద :- చట్టము ఒప్పుకొనినా ఒప్పుకోకపోయినా వజ్రాలు

ఇప్పుడు మాదగ్గర కూడా లేవు. అవి ఈ రోజు రాత్రే మానుంచి కూడా

దొంగిలించబడ్డాయి. వాటిమీద చూపున్న వారెందరో ఉన్నారు. అందువలన

వాటిని మా రక్షణలోనే ఉంచుకొని అసలైన దొంగలను పట్టించిన తర్వాత

వాటిని అప్పగించాలనుకొన్నాము. అయినా మానుండి వాటిని

సునాయాసముగా దొంగిలించారు.


యస్.పి :- మీ మాట మాకు కట్టుకథగా తోచుచున్నది. మీవద్దనుండి

ఎవరో దొంగిలించారని అంటే చట్టము ఒప్పుకోదు. మేము మిమ్ములను

అరెస్టు చేయవలసి వస్తుంది.


(అరెస్టా! అని స్వామి నవ్వి చట్టము ఒప్పుకోదు అంటున్నావు.

చట్టము ఒప్పుకొంటే అరెస్టు అవసరములేదు కదా! అవసరము వచ్చింది

కాబట్టి నీ చట్టముతోనే మాట్లాడు అని స్వామి ఫోన్ చేసి రిసీవర్ యస్.పి

గారికి ఇచ్చాడు. ఫోన్లో వినిపించిన దానినిబట్టి యస్.పి గారు నేను

అలా మాట్లాడినందుకు క్షమించండి స్వామి అని క్షమాపణ చెప్పాడు. తర్వాత

నేను ఇక్కడికి రావలసిన పని లేదు. వెళ్లొస్తానని చెప్పి పోయాడు.)



(కాటేరి శక్తిని కాపలా పెట్టినప్పటికీ అర్థము కాకుండా వజ్రాలు

పోవడము మాంత్రికులకిద్దరికీ అంతుబట్టలేదు. చివరికి ఇద్దరూ కలిసి

వారి వద్దనున్న అంజనములో చూడాలనుకొన్నారు. అంజన పూజచేసి

అంజనము డబ్బీ మూతతీసి దానిలో నాగభూషణము చూడను మొదలు

పెట్టాడు. కొద్దిసేపు తర్వాత అంజనములో దృశ్యములు కనిపించను మొదలు

పెట్టాయి. మొదటి దృశ్యములో వజ్రాలు కనిపించలేదు. పొడవాటి పాము

కనిపించింది. ఆ పాము అంజనములోనుండి నాగభూషణము వైపు సూటిగా


చూచి తన తోకతో కొట్టింది. అంజనములో తోకను జాడిస్తే ఇక్కడ

చూచే నాగభూషణ మునకు దెబ్బతగిలింది. ఆ దెబ్బకు నాగభూషణము

ఎగిరి ప్రక్కన పడిపోయాడు. వెంటనే ప్రక్కన వున్న మాంత్రిక వృద్ధుడు

మల్లయ్య అంజనములో ఏదో ప్రమాదము జరిగినదని తలచి అంజనమును

మూసివేశాడు. ప్రక్కన పడిపోయిన నాగభూషణమునకు మల్లయ్య ఏదో

మంత్రము ద్వారా ఉపశమనమును చేశాడు. మూర్ఛనుండి తేరుకొన్న

నాగభూషణము జరిగిన విషయమును చెప్పాడు. మల్లయ్య అంజనము

నుండి పాము కొట్టడమేమిటి? అని యోచించాడు. చివరకు వారికి ఏమీ

అర్థముకాలేదు. అందువలన వారు వజ్రముల కొరకు ప్రాకులాడక

కొంతకాలము మౌనముగా ఉండడము మంచిదనుకొన్నారు.)


(జఠాజూట స్వామి తన ఆధీనమందున్న భూత, ప్రేత, పిశాచముల

నన్నిటినీ ఉపయోగించి వజ్రముల ఆచూకీ తెలుసుకోవాలనుకొన్నాడు. గొప్ప

యోగియైన రాజయోగానంద స్వామిగారి మనోదృష్ఠికే గోచరము కాని

వజ్రములు తాంత్రికులకు తెలియునా? జఠాజూట స్వామి ఒక దినము

వేకువ జామునే లేచి స్నానపానాదులు చేసి తన ఆసనమున ఆసీనుడై

తన శిష్యులలో ఒకనిని తన ఎదుట కూర్చోమని చెప్పి తన ఆధీనములోని

ఒక పిశాచమును పిలిచి ఎదురుగానున్న తన శిష్యునిలో చేరి మాట్లాడమని

చెప్పగా అది అట్లే చేసెను. ఎదురుగానున్న తన శిష్యుని శరీరము నుండి

పిశాచి మాట్లాడేదానికి మొదలు పెట్టింది. అప్పుడు వజ్రాల విషయమును

జఠాజూట స్వామి అడిగాడు. అప్పుడు ఆ పిశాచి కొద్దిగా ఊగుచు, తనకేమి

గోచరము కాలేదని, గొప్ప వెలుగుమాత్రమే కనిపిస్తున్నదని, ఆ వెలుగును

దాటి తన దృష్టి ముందుకు పోలేదని, ఆ వెలుగును చూడలేకున్నానని


చెప్పి వెంటనే తేలిపోయింది. జఠాజూట స్వామికి ఏమీ అర్థము కాలేదు.

దానివలన కొంత కాలము మౌనముగా ఉండడము మంచిదనుకొన్నాడు.)


(రాజయోగానంద స్వామి వద్దనుండి కూడా వజ్రములు చేజారి

పోయాయని తెలిసిన తపస్విబాబాగారికి రాజయోగానంద స్వామి

దగ్గరనుండి పోయినందుకు కొంత సంతోషమైనా, అవి పూర్తి

అంతుచిక్కకుండా పోయినందుకు కొంత బాధ కలిగినది. వయర్స్

ద్వారా ఆ విషయమును మునెప్పకు తెలియజేసి, కొంతకాలము

| వజ్రాలకోసము ఏ ప్రయత్నము చేయకుండా చెప్పెను. ఇలా

వజ్రాల కోసము ప్రయత్నించు వారందరు ఎవరికి వారు కొంతకాలము

ఊరకుండుట మంచిదని ఊరక వుండగా, రాజయోగానంద స్వామి

ఆశ్రమములోని రాఘవకు అలా ఊరకుండుట ఏమాత్రము ఇష్టములేదు.

ఎందుకనగా! తమవద్దనుండే వజ్రాలు మాయమైపోయాయి. కావున

వాటి ఆచూకీని ఎలాగైనా తెలియాలి అను పట్టుదలతో ఉండెను. రాఘవ

రాజయోగానంద స్వామివద్దకు పోయి ఇలా అన్నాడు.)

రాఘవ :- స్వామీ! మీరు ఎన్నో విషయములను మనోనేత్రముతో చెప్పినారు,

ఒక్క వజ్రాల విషయములో మాత్రము తెలియక పోవడానికి కారణము

ఏముంటుంది?

రాజయోగానంద :- కర్మకు అందరమూ ఆధీనులమే. కావున కర్మ

ప్రకారము మనమందరము ఆడించబడుచున్నాము. ఈ ఆటలో పవిత్రమైన

దేవాలయము యొక్క వజ్రాల ఆచూకీ తెలియకుండా పోవడము కొంత

బాధాకరమైన విషయమైనప్పటికీ, దైవశక్తి ముందర దుష్టశక్తి ఆటలు సాగవు.

అందువలన మనము మౌనముగా ఉండడము మంచిదన్నాను.


రాఘవ :- స్వామీ మీరు మౌనముగా ఉండడములో ఎంతో అర్థముంటుంది.

కానీ మేము మీ సేవకులుగా మీ ధ్యేయమును నెరవేర్చాలను పట్టుదలతో

ఉన్నాము. కావున నేను వాటి ఆచూకీ కొరకు ప్రయత్నించవలయునని

అనుకొన్నాను. దానికి మీ ఆజ్ఞకొరకు వేచి ఉన్నాను. మీరు మంచిదని

సెలవిస్తే ఈ దినమే నా ప్రయత్నము నేను చేయగలను.



(రాఘవ పట్టుదలకు సంతోషించిన స్వామి, కొంత యోచించి

సరే నీ ప్రయత్నము నీవు చేయి అన్నాడు. ఆ మాటకు సంతసించిన

రాఘవ తనకు తోడుగా కొందరిని పిలుచుకొని, తాను ఎక్కడికి పోవుచున్నది

దుందుభికి కూడా చెప్పకుండా ఆశ్రమమునుండి బయలుదేరి 

పోయాడు. కొంతమందితో బయలుదేరిన రాఘవ అడవి మార్గము

ద్వారా ఒక దినమంతా ప్రయాణించి ఒక ప్రాంతమును చేరిన తర్వాత

అక్కడే తన అనుచరులను ఉండమని చెప్పి తాను ఒక్కడే అడవిలో ముందుకు

పోయెను. తన వెంటవచ్చిన వారిని వదలిన చోటునుండి పది నిమిషములు

పోయిన తర్వాత మహత్యములుగల మర్రిచెట్టు వద్దకు చేరాడు. ఆ మర్రి

చెట్టువద్ద గల త్రిశూలమును, పాదుకలను తాకి మ్రొక్కుకున్నాడు.  ఆ

త్రిశూలమునకు ముందు కూర్చొని ధ్యానమందు లగ్నమైనాడు. కొద్దిసేపటికి

ఆకాశములో మేఘములు వచ్చి ఉరుములు మెరుపులు రాజొచ్చాయి. రాఘవ

కళ్ళు తెరిచి చూచాడు వర్షము ప్రారంభమైనది. కొద్దిసేపటికి వర్షము

నిలిచి పోయినది. తర్వాత నిశ్శబ్దము ఏర్పడినది. అప్పుడు మొదట

పిలిచినట్లే “నీవు నావద్దకురా!” అను శబ్దము వినిపించినది. ఇది రెండవ

అనుభవము కనుక రాఘవ భయపడక మొదటివలె భూమిని త్రవ్వి, ఇటుకలు

తీసి సొరంగమార్గము ద్వారా లోపలికి పోయెను. చీకటి నుండి పోయిన

రాఘవకు లోపల గొప్ప వెలుగు కనిపించింది. రాఘవ ఇదివరకే ఒకమారు


పోయి వచ్చిన దానివలన భయపడక ముందుకు పోయి ఆసీనుడైయున్న

మునికి నమస్కరించాడు. అప్పుడా మునీశ్వరుడు చిరునవ్వు నవ్వి

ఇట్లన్నాడు. )


ముని :- నీరాక ఆంతర్యము తెలిసినది, నీవు భువనేశ్వరి దేవాలయమునుండి

పోయిన వజ్రాల విషయమై వచ్చావు.


రాఘవ :- మహాత్మా మీరు సర్వజ్ఞులు. వజ్రాల విషయమై స్వయాన

రాజయోగానంద స్వామియే తనకర్థము కాలేదన్నాడు. బయట ప్రపంచములో

గొప్పవారిగా మీరు సూచించిన రాజయోగానంద స్వామికే తెలియనపుడు

ఆ విషయము మీకు తప్ప ఎవరికీ తెలియదనుకొన్నాను. అందువలననే

మీవద్దకు ఒంటరిగా వచ్చాను. ఇక ఆ విషయము మీరే తెల్పవలసియున్నది.


ముని :- (అప్పుడా ముని తన ప్రక్కనేవున్న వజ్రాల మూటను చూపుచూ)

ఇవిగో ఆ వజ్రాలు. దుష్టుల చేతినుండి ఈ పామే నావద్దకు తెచ్చినది.

ఇవి నా వద్ద ఉండుట వలన గొప్పవాడైన రాజయోగానంద ఊహకు కూడా

అందకుండాపోయాయి. ఎవరికీ తెలియనట్లు నేనే సంకల్పించాను. కనుక

వీటిని గురించి ఎవరి యోచనా పారలేదు. ఈ వజ్రాలున్న పామును

మొదట మీ ఆశ్రమము వరకు చేర్చినది ఈ పామే! అది మీనుండి చేజారి

పోయిన తర్వాత సాహసించి ఇక్కడికి తెచ్చినది కూడా ఈ పామే. ప్రస్తుతము

వాటి కోసము ఎందరో ప్రయత్నించుచున్నారు. వారి ముందర మీ

సదుద్దేశము ఎంతమాత్రము పనిచేయదు. వీటిని దేవాలయమునకు చేర్చ

వలయునను మీ యోచన మంచిదే, అయినప్పటికీ ప్రస్తుతము మీరు కూడా

ఊరకవుండడము మంచిదను తలంపు నాకు కల్గినది. అందువలన మీ

చేతినుండి పోయిన వజ్రాలను మీవద్దకు రాకుండా, నావద్దకు వచ్చునట్లు

చేసుకొన్నాను. వీటికోసమై నాతో సంప్రదించవలెనను యోచన నీకు

వచ్చి, నీవు ఇక్కడికి రావడము ఒక విధముగా మంచిదే. నీవు వచ్చావు

కనుక నీకు కొంత క్రొత్త విషయమును చెప్పెదను శ్రద్ధగా విను.



రాబోవు నెలలో అష్టగ్రహకూటమి జరుగును. అష్టగ్రహకూటమి

దాదాపు అరగంటకాలముండును. అప్పుడు ఆకాశమంతా మేఘావృత

మౌతుంది, పెనుగాలులు వీస్తాయి. కొన్నిచోట్ల భూమి కంపిస్తుంది. కుండ

పోతగా వర్షము కురుస్తుంది. సునామీలు రావచ్చును. సూర్యుడు మేఘాల

చాటున ఉండుట వలనే ప్రొద్దు గ్రుంకినదా! అని అనుకొందురు. ఈ

విధముగా భూమి మీదగానీ, సముద్రము మీదగానీ వాతావరణములో ఎంతో

మార్పు చోటు చేసుకుంటుంది. ఆ అష్టగ్రహకూటమి సమయములో

మొట్టమొదట పుట్టిన మగశిశువు చాలా ప్రత్యేక జాతకబలము కల్గివుంటాడు.

ఎందుకనగా! అష్టగ్రహ కూటమి కన్యాలగ్నములో జరుగుచున్నది.

లగ్నములో మొట్టమొదట పుట్టిన శిశువుకు బుధగ్రహము, ఆ రాశిలోని

మొదటి నక్షత్రములో, మొదటి పాదములో మొదటనే ఉన్నది. కావున బుధ

గ్రహము ఆధీనములోనివన్నియూ ఆ బాలునికి సులభముగా లభ్యము

కాగలవు. అదియూ అష్టగ్రహ కూటమి సమయము అయినందున కొన్ని

అసాధారణ శక్తులు ఆ బాలునికి ఉంటాయి. మొత్తము మీద ఆ బాలుడు

సాధారణ వ్యక్తికాదు అని చెప్పవచ్చును. ఆ సమయములో మొదట పుట్టిన

వానికి ఎలాంటి ప్రత్యేకత ఉన్నదీ భూమిమీద కొందరికి తెలుసు. అలా

తెలిసిన వారు ఆ బాలున్ని ఉపయోగించుకొని లోకములో అసాధారణ

పనులు చేయబూనుతారు. వారు చేయు దుష్టకార్యములను నీవు

రాజయోగానంద సలహాతో ధైర్యముగా ఎదుర్కొని విఫలము చేయాలి.

అలా చేయకపోతే భూమిమీద క్షుద్రశక్తుల ప్రాబల్యము ఎక్కువై పోయి,

అనేక రోగాలు బయలు దేరి ప్రజలను గుంపులు గుంపులుగా చనిపోవునట్లు

చేయును. అంతేకాక ఆ బాలునియందుండు శక్తిని గ్రహించినవారు ఆ

బాలున్ని ఉపయోగించి ఏమైనా చేయగలరు. వారు చేయలేని పనిగానీ,

వారికి చేతకాని పనిగానీ ఏదీ ఉండదు. ప్రజలనందరిని భయోత్పాతులుగా


చేయగలరు. అందువలన నీవు మరియు రాజయోగానంద స్వామి ఇద్దరూ

కలిసి వారికి అట్టిశక్తి చేకూరకుండా చేయాలి. ఈ కార్యములో మీకు

ఎన్నో ప్రాణాపాయ స్థితులు కలుగవచ్చును. మీకు అలాంటి స్థితి

ఏర్పడినపుడు నేనే స్వయముగా రక్షించగలను. మిగతా పనులను మీరు

స్వయముగా చూడవలసివుంటుంది.


వజ్రములు బయట ఉండడము మంచిదికాదని ఇక్కడికి చేరునట్లు

చేశాను. అన్ని సుఖములుండీ, ప్రపంచములో గొప్పవారు అనిపించుకొన్న

కొందరు ఈ వజ్రములను కాజేయాలని చూస్తున్నారు. అంతేకాక ప్రపంచా

ధిపత్యమును సంపాదించాలనుకొని అష్టగ్రహకూటమి కోసము వేచి

యున్నారు. నేను చెప్పిన ఈ విషయములన్నిటినీ రాజయోగానంద స్వామికి

తెలియజేయి.


రాఘవ :- మహాత్మా! ఆ వజ్రాలు మావద్ద ఉండేవని తర్వాత అవి మా

చేతినుండి అపహరింపబడినాయని మేము చెప్పినా పోలీసు వారు కొంత

మమ్ము అనుమానించి మేము అబద్దము చెప్పుచున్నామని భావించారు.

వజ్రములను భువనేశ్వరి దేవాలయమునకు అప్పచెబుతామని రాజయోగా

నందస్వామి చెప్పారు. తర్వాత అవి మానుండి దొంగలించబడినాయని

చెప్పగా వారు మమ్ములను అనుమానిస్తున్నారు. ఈ ఇబ్బంది నుండి

బయటపడుటకు దారిని మీరే చూపాలి.


ముని :- వజ్రాలను కాపాడి దేవాలయమునకు చేర్చాలనుకొన్న మిమ్ములను

వారు ఏమీ చేయలేరు. రాజయోగానంద స్వామి మొదటనే డి.జి.పి గారికి

వజ్రాల విషయము తెలియజేశాడు. ఇది డిపార్టుమెంటుకు పెద్దయిన

డి.జి.పి మరియు రాజయోగానంద ఇద్దరూ కలిసి అసలైన దోషులను

బయటికి లాగానుకొన్నారు. ఇద్దరూ కలిసి చేస్తున్న పని మిగతా ఆఫీసర్లకు

అందువలన ఒక దినము యస్.పి. వచ్చి స్వామిని

కూడా తెలియదు.


అరెస్టు చేస్తానన్నాడు. తర్వాత ఫోన్లో మాట్లాడి తోకముడుచుకొని

పోయాడు. ఆ దినము యస్.పి తో డి.జి.పి ఫోన్లో మాట్లాడాడని మీకు

కూడా తెలియదు. డి.జి.పి సలహాతోనే వజ్రాలు మావద్ద ఉన్నాయని రాజ

యోగానందస్వామి చెప్పాడు. అందువలన ఏ అధికారి మిమ్ములను

అనుమానించినా వారు ఏమీ చేయలేరు. ఇక నీవు ఇక్కడినుండి వెళ్ళిపో.

తర్వాత నే చెప్పిన విషయమంతా రాజయోగానందకు చెప్పు.


ఆ మహాత్ముడు చెప్పిన మాటలు విని రాఘవ గుహనుండి బయటికి

వచ్చాడు. తర్వాత యథాతముగా ఆ ద్వారమును కప్పిపెట్టి, అక్కడినుండి

కొంత దూరములోనున్న తన వారితో కలిసి తిరుగు ప్రయాణము

సాగించాడు. ఆశ్రమానికి వచ్చిన వెంటనే భూగర్భములోని మునీశ్వరుడు

చెప్పిన సమాచారమును రాజయోగానంద స్వామికి తెలియజేశాడు.

విషయము తెలుసుకొన్న స్వామి విస్తుపోయాడు. తను డి.జి.పి కలిసి

అసలైన దొంగలను బయటికి లాగాలనుకొన్న విషయము ఎక్కడో భూగర్భము

లోనున్న వ్యక్తి చెప్పడము ఆశ్చర్యమైనది. తర్వాత అష్టగ్రహకూటమిని

గురించి ఆలోచిస్తూ అప్పటి నవగ్రహముల స్థితి ఎట్లుంటుందోనని

యోచించాడు. అష్టగ్రహ కూటమిని అనుకూలముగా మార్చుకోవాలను

కొన్నవారు ఎవరైవుంటారని కూడా స్వామి యోచించసాగాడు.)



(తపస్వి బాబా అష్టగ్రహ కూటమి వచ్చుచున్నదని తెలిసినవాడై

మరియు ఆ సమయములో మొదట జన్మించు వానికి విశేషశక్తి ఉండునని

తెలిసినవాడై, ఆ బాలుడు ఎక్కడ జన్మిస్తాడనీ, ఆ బాలున్ని ఎలా

అపహరించాలనీ, ఆ బాలున్ని ఎక్కడ ఉంచాలనీ, ఎవరివద్ద పెంచాలనీ


యోచించసాగాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంతకుముందు

తమ పనికి ఉపయోగపడినారని చెప్పిన ఇద్దరి మాంత్రికులకు పెద్ద

మొత్తములో డబ్బు ఇచ్చి, తర్వాత వారికి కొంత శిక్షణ నేర్పించి వారి

ద్వారా తమ పనిని సాధించవచ్చునని తపస్వి బాబా అనుకొన్నాడు. వెంటనే

మునెప్పతో వయర్లెస్లో మాట్లాడి, ముందు తమకు ఉపయోగపడిన

మాంత్రికులను ఇద్దరినీ పిలిచి తలా ఒక లక్ష రూపాయలు ఇచ్చి తాను

చెప్పినట్లు నడుచుకొనుటకు ఒప్పించుకోమన్నాడు. తపస్విబాబా ద్వారా

విషయమును తెలుసుకొన్న మునెప్ప మాంత్రికులకొరకు తన మనుషులను

పంపి వారిని రప్పించుకొన్నాడు. ఒక్కొక్కరికి లక్షరూపాయలు డబ్బులు

ఇస్తామని, వారికి ఏ కష్టము లేకుండా చూస్తామని, తాము చెప్పినట్లు

చేయాలని చెప్పగా, లక్షరూపాయలన్న మాటవినగానే మాంత్రికులు ఇద్దరూ

ముందూ వెనుక ఆలోచించకుండా అలాగేనని ఒప్పుకొన్నారు. పెద్ద

మొత్తములో డబ్బు చూడని మాంత్రికులిద్దరూ లక్షరూపాయలను మాటకు

పూర్తి వశులై పోయారు. అప్పుడే ఇచ్చిన 50 వేలను చూచి సంబరపడి

పోయి, ఆ దినము నుండే మునెప్ప చెప్పినట్లు నడుచుకొనుటకు పూను

కొన్నారు. ఈ విధముగా తపస్విబాబా ముందుగానే తన వ్యూహమును

సిద్ధము చేసి పెట్టుకొని ఆ సమయము కొరకు వేచి చూస్తున్నాడు. ఆ

సమయములో మొదట పుట్టువాడెవడో తెలుసుకొనుటకు తమ ఆధీన

మందున్న మనుషులను వినియోగించడమే కాకుండా, అదృశ్యరూపమున

తనవద్ద ఉన్న సూక్ష్మశరీరముగల వారిని కాపలాకు సిద్ధముగా ఉంచాడు.

అష్టగ్రహకూటమి నాడు పుట్టు శిశువును మాంత్రికులు వారి మాయ

జాలముతో అపహరించవలయునని ఆదేశమిచ్చారు.)




(రాబోవు అష్టగ్రహకూటమి గురించి జఠాజూట స్వామి

తెలిసినవాడై, ఆ దినమంతయూ ప్రజలు యోగనిష్టలో ఉన్నాడనుకొనునట్లు,

తాను మంత్ర జపములో ఉండవలెనని అనుకొన్నాడు. ఆ దినము తాను

మంత్ర ధ్యానమందుండుటకు కావలసిన ఏర్పాట్లు తన శిష్యుల చేత

చేయించుకొని ఆ దినము కొరకు వేచియున్నాడు. అష్టగ్రహ కూటమి

రోజున పుట్టువాని ప్రత్యేకత ఏమిటో జఠాజూట స్వామికి తెలియదు.

తపస్విబాబాగారు ఆ దినము పుట్టు బాలుని కోసము వేసిన పథకము

తెలియదు. తపస్విబాబాగారి పథకము తెలియకున్నా, తన పద్దతి ప్రకారము

తాను విశేషమంత్ర శక్తిని ఆ దినము సాధించవలెననుకొన్నాడు. ప్రస్తుతము

తన ఆధీనమందుండు భూత ప్రేత పిశాచములకంటే గొప్ప శక్తిని సాధించి

దాని ద్వారానైనా వజ్రముల కొరకు ప్రయత్నించవలయుననుకొన్నాడు.

అందువలన రాబోవు అష్టగ్రహకూటమి కొరకు వేచియున్నాడు.)


(భార్యచేత చెంపదెబ్బతిన్న సి.ఐ. బాలప్ప రెచ్చిపోయిన తన భార్యను

ఏమీ అనలేక అప్పటికి ఊరకుండినప్పటికీ, తాను తన భార్యచేత చెంప

దెబ్బ తినటానికి కారణము రాజయోగానంద స్వామియేనని తలచి, ఆయన

మీద ఎలాగైనా కక్ష సాధించాలనుకొని సమయము కోసము వేచివుండెను.

కొన్ని దినములు గడచిన తర్వాత ఒక ఇంటిలో దొంగతనము జరిగింది.

అందులో పదితులముల బంగారు దొంగలించబడినదని ఆ ఇంటి

యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు బాలప్ప ఆ

అవకాశమును రాజయోగానంద స్వామి మీద కక్షసాధింపుకు

వినియోగించుకోవాలను కొన్నాడు. దానిలో భాగముగా ఒక పాత నేరస్థుడను

అరెస్టు చేసి విచారణ జరిపాడు. ఆ పాతనేరస్థుడు వాస్తవముగ ఆ


దొంగతనము చేయకున్ననూ, బలవంతముగా ఆ నేరమును ఒప్పుకొనునట్లు

చేశాడు. ఆ బంగారమును రాజయోగానంద స్వామికి అమ్మినట్లు చెప్పమని

ఆ నేరస్థున్ని ఒప్పించాడు. చేయునది లేక ఆ నేరస్థుడు అలాగేనని

ఒప్పుకొన్నాడు.)




అలా ఒప్పించిన సి.ఐ. బాలప్ప మరుసటి దినము పాతనేరస్థున్ని

పిలుచుకొని రాజయోగానంద స్వామివద్దకు పోయి, నేరస్థుని దగ్గర కొనిన

బంగారమును ఇమ్మని స్వామిని అడిగాడు. అలా అడగడములో బాలప్ప

ఉద్దేశము స్వామికి అర్థమైనది. బాలప్ప ఉద్దేశపూర్వకముగా తనను

నేరస్థునిగా చేయాలనుకొన్నాడనీ, తన అధికార బలముచేత తనను కోర్టుకు

పోవునట్లు చేయడమే అతని పథకమనీ, తనమీద ద్వేషముతో అలా

చేయుచున్నాడనీ స్వామి అనుకొన్నాడు. అప్పుడు అక్కడేవున్న రాఘవవైపు

స్వామి చూచాడు. స్వామి చూపులోని ఆంతర్యమును గ్రహించిన రాఘవ

తన అనుచరులైన ఆటవికులకు చెవిలో ఏదో చెప్పాడు. అందరూ

అలాగేనన్నట్లు తలవూపారు. అప్పుడు స్వామి రాఘవతో “మీవద్ద ఉన్న

బంగారును సి.ఐ బాలప్పకు ఇవ్వండి" అన్నాడు. ఆ మాటవిన్న రాఘవ

బాలప్ప వైపు తిరిగి “రండి” అని ప్రక్క గదిలోనికి పిలుచుకొనిపోయారు.

బాలప్ప వెంట వచ్చిన పాత దొంగ బయటే ఉండిపోయాడు. గదిలోనికి

పోయిన బాలప్ప అరవనూ మూల్గనూ మొదలుపెట్టాడు. గదిలోపల గొడ్డును

బాదినట్లు శబ్దము వినిపిస్తున్నది. బయటవున్న దొంగ “లోపల ఏమి

జరుగుచున్నది” అని అడిగాడు. అప్పుడు స్వామి నవ్వి " మేము నీ దగ్గర

కొనిన బంగారును ఇమ్మన్నాడు కదా! కావున అతనికి మావారు వేడివేడి

తన్నులు వడ్డిస్తున్నారు. అతను మూల్గి, మూల్గి తింటున్నాడు. లోపల

జాగాలేదు, అందువలన అతనికి ఒక్కనికే వడ్డిస్తున్నారు. అతడు కడుపునిండా


తిని వచ్చిన తర్వాత, మాకు బంగారమును అమ్మానని చెప్పిన నిన్ను

పిలుచుకొని పోయి వడ్డిస్తారు” అన్నాడు. ఆ మాటవిన్న పాతనేరస్థుడు

స్వామి కాళ్ళమీద పడి సి.ఐ గారే అలా చెప్పమన్నారనీ, తనకు ఏ కర్మ

తెలియదనీ, తాను ఈ దొంగతనమే చేయలేదని చెప్పాడు. అప్పుడే

బాలప్పను గదినుండి బయటికి తెచ్చారు. బాలప్ప గతి చూచిన దొంగ

భయపడి పోయాడు. అపుడు స్వామి ఆ దొంగతో ఇలా అన్నాడు.


రాజయోగానంద :- నీవు ఏమీ భయపడవద్దు, ఇపుడు బాలప్ప నీవు దొంగ

తనము చేశావని అనడు. (బాలప్ప వైపు చూచి) ఏమి బాలప్పా! ఇతను

దొంగతనము చేశాడా? బంగారు మాకు అమ్మాడా?


బాలప్ప :- లేదు, ఇతను దొంగతనము చేయలేదు. ఈ బంగారు విషయము

మీకు తెలియదు.


రాఘవ :- ఇక ఎప్పుడైన తప్పుడు కేసులు బనాయించాలని చూచావో,

నిన్ను చంపి మేము జైలుకు పోతాము. జాగ్రత్త!

బాలప్ప :- వద్దు, మీరు ఏమైనా చేయగలరు. నేను ఎప్పటికీ మీ జోలికి

రాను. నన్ను వదలండి పోతాను.

రాజయోగానంద :- నీవు మీ యస్.పి. గారు వచ్చేంతవరకు మావద్ద

ఉండాలి.


(యస్.పి గారికి కబురు చేయగా అతను వెంటనే బయలుదేరి

వచ్చాడు. యస్.పి.గారు రాజయోగానంద స్వామి వద్దకు వస్తానే తన్నులు

తిన్న బాలప్ప కనిపించాడు. స్వామి జరిగిన విషయమంతా కూలంకశముగా

చెప్పాడు. బాలప్పకు, స్వామికి ముందే తగాదా ఉన్నదని తెలిసిన యస్.పి

గారు పాతనేరస్థుని కూడా విచారించి, అన్ని విధముల బాలప్పది తప్పని


గ్రహించి యస్.పిగారు బాలప్పను మందలించి సస్పెండ్ చేస్తున్నానని

చెప్పాడు. బాలప్ప తలవంచుకొని అక్కడినుండి పోయాడు.)

యస్.పి :- స్వామీ వజ్రాల విషయము ఏమైనా తెలిసిందా?

రాజయోగానంద :- నిన్ననే కొంత విషయము రాఘవ ద్వారా తెలిసింది.

దానిని ఇప్పుడు మీకు చెప్పలేము. ఎందుకనగా చెప్పినా మీరు ఆ

విషయమును నమ్మలేరు. పైగా ఆ విషయము ఎవరికీ తెలియకూడదను

నిబంధన కూడా మా మీద ఉన్నది. మొత్తము మీద వజ్రాలు మావద్ద

ఉన్నట్లే పూర్తి రక్షణలోనే ఉన్నవి. అవి ఏ దుర్మార్గుని చేతిలో పడలేదు.

విషయమంతా సమయమొచ్చినపుడు చెప్పగలము.


(స్వామి మాటవిన్న యస్.పి.గారు స్వామి మాటమీద నమ్మకము

కలవాడై అలాగేనని చెప్పి బయలుదేరిపోయాడు.)


(అష్టగ్రహ కూటమి జరుగునని తెలిసినవారందరూ వారి దృష్టిని

దానిమీదికి మళ్ళించుకొన్నారు. అప్పుడు వజ్రాల విషయమునకు ఎక్కువ

ప్రాధాన్యత ఇవ్వకుండా, అష్టగ్రహ కూటమిమీదనే ఎక్కువ శ్రద్ధ కల్గి

యున్నారు. మంత్రశక్తికి పదును పెట్టి రెట్టింపు చేసుకొనుటకు జఠాజూట

స్వామి చూచుచుండగా, ఆ సమయములో మొదట పుట్టిన బాలున్ని స్వాధీన

పరుచుకొని ప్రపంచమునే తన చేతులలోనికి తీసుకోవాలని తపస్విబాబా

తలచుచున్నాడు. ఇపుడు వారి యోచనలలో వజ్రాలకు ప్రాధాన్యత లేదు.)


రాఘవ రాజయోగానంద స్వామి సలహాలను తీసుకొంటూ తపస్వి

బాబాగారి ప్రయత్నమును వ్యర్థము చేసి దుష్టశక్తుల బారినుండి ప్రజలను

కాపాడవలెనను పట్టుదలతో ఉన్నాడు. అంతలో గ్రహకూటమి దగ్గర


పడింది. రేపటి దినము కూటమి జరుగునని అన్ని రేడియో కేంద్రాలు,

మిగత టీవీ వార్తాప్రచార ఛానళ్ళు ప్రజలకు తెలిపాయి. వాతావరణములో

మార్పు ఉంటుందని, సముద్రము మీదికి చేపలు పట్టేవారు పోవద్దని కూడా

తెలిపాయి. పాఠశాలలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు గ్రహకూటమిని

గురించి తెలుపుచూ, ఇది మూడు వేల ఐదువందల సంవత్సరముల క్రితము

జరిగిందని, దేశములో ఇప్పుడున్న నాగరికత అప్పుడు లేక కాగితము లేక

పోవుట వలన అప్పటి విషయములు గ్రంథరూపముగా మన పెద్దలు

వ్రాయలేకపోయారని, అప్పుడు కొందరు మునులు తాటి ఆకుల మీద

వ్రాసిన కొన్ని విషయములు మాత్రము దొరికాయని, అవియూ కొన్ని చెదలు

పట్టిన ఆకులు కనుక అందులోని పూర్తి విషయములు గ్రహించలేక

పోయామని, కొంతవరకు తెలిసిన విషయమునుబట్టి చూస్తే అష్టగ్రహ

కూటమి అంటే సామాన్యమైనది కాదనీ, అప్పుడదివున్న అరగడియ (12

నిమిషములు) కాలములో భూమిమీద ఎన్నో సంఘటనలు జరిగినట్లు

వ్రాశారనీ తెలిపి, రేపటి దినము అన్ని విద్యాకేంద్రములకు సెలవు

ప్రకటించినట్లు చెప్పారు. అత్యవసర ఉద్యోగాలకు తప్ప మిగత

ఉద్యోగస్తులందరికీ ఆ దినము ప్రభుత్వము సెలవు దినముగా ప్రకటించింది.


రేపు అష్టగ్రహ కూటమి జరుగునని తెలిసిన బ్రాహ్మణులు ఆ

సమయము చెడు కాలమని, ఆ సమయములో వేదమంత్రములు చదువుట

వలన ఆ చెడును కొంత హరించవచ్చుననీ, వేదపఠనమునకు కావలసిన

పూజా సామాగ్రిని సమకూర్చుకోవడములో లగ్నమై ఉన్నారు. మంత్ర

గాళ్ళు తమ ఆచారానుసారము కంఠము వరకు భూమిలో పూడ్చపడి జపము

చేయుటకు గొంతు లోతువరకు గుంతలు త్రవ్వించుకొనుచుండగా, కొందరు

గొంతు లోతువరకు నీటిలో దిగి జపించుకోవాలను ఉద్దేశముతో దానికి


అనుకూలమైన బావులను, చెరువులను వెతుకుచుండగా, సాధారణ జపము

చేసుకొనుటకు జమ్మిచెట్టు నీడ, మర్రిచెట్టు నీడను కొందరు వెతుకుచున్నారు.

ఇట్లు ఎందరో ఎన్నో విధములుగా గ్రహకూటమిని ఉపయోగించుకోవాలని

ప్రయత్నిస్తుండగా రాజయోగానంద ఆశ్రమములో రాఘవ స్వామివద్ద చేరి

ఇలా అన్నాడు.)


రాఘవ :- స్వామీ పంచాంగము ప్రకారము రేపటి దినమున మధ్యాహ్నము

మూడు గంటలకు అష్టగ్రహ కూటమి జరుగుచున్నది. ఎందరో ఎన్నో

విధముల వారివారి సాధనకు కావలసిన ఏర్పాట్లు చేసుకొనుచున్నారు.

రేపు మన పనేమిటో తెలియజేస్తే దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాము.


రాజయోగానంద :- మనము అందరివలె జపతపములు చేయము. కానీ

రేపు పుట్టబోవువాడు ఎక్కడ పుట్టునన్న విషయము తెలియకున్నది. ఈ

విషయములో లాభము పొందవలెననుకొన్నది ముఖ్యముగా తపస్విబాబాగారే.

కనుక వారు ఈ విషయమును మనకంటే ముందుగ తెలుసుకొనుటకు

చురుకుగా ప్రయత్నించుచుందురు. మనము రేపు తపస్విబాబాగారి మీద

నిఘా వేసివుంచడమే ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి. ఇంత భూమిమీద

ఎవడు ఎక్కడ పుట్టునో మనకు తెలియకున్నది. కనుక వారి వలననే

మనము సులభముగా గ్రహించవచ్చును.


రాఘవ :- స్వామీ! స్వామీ! తపస్విబాబాగారు ఒక్కరే ఈ విషయము కొరకు

ప్రయత్నించడు కదా! అతని మనుషులు ఎవరైనా ప్రయత్నించవచ్చును.

అపుడు ఆయన మీద నిఘా వేయుట వలన మనకు ఏమీ తెలియకుండా

పోవునేమో. బహుశా ఆయన ఈ కార్యములో ఎటూ కదలకవుండి తనవారి

చేత పనిని చేయించుకుంటాడు.

రాజయోగానంద :- చూడు రాఘవ! నీవు ఇప్పుడే తెలివిగా యోచించాలి.



నీవను కొన్నట్లు నేను కూడా ఊహించాను. అలా ఆ కార్యము చేయువారు

తపస్వి బాబాకు వేయిమంది ఉండవచ్చును. అపుడు మనము వేయిమందిని

కాపు కాచి చూడగలమా? అది సాధ్యముకాని పనియగును. ఎందరు

ఆయన కార్యములో లగ్నమైవున్నా, చివరకు వారికి తెలిసిన విషయమేమిటో,

వారు చేస్తున్నదేమిటో బాబాగారికి చెప్పకమానరు. కేంద్రము తపస్విబాబా

అయినపుడు అచటనే అన్ని విషయములూ తెలియును. కావున ముఖ్యమైన

తపస్విబాబాగారి దగ్గరే ఉండినట్లయితే, వారికి కావలసినది ఎచటగలదో,

ఏ విధముగ తెలుసుకొనుచున్నారో, ఏ విధముగ చేయుటకు పథకము

వేయుచున్నారో, మనకు సులభముగా తెలియగలదు. అప్పుడు వారి

కార్యములను విఘ్నపరుచుటకు మనము తయారు కాగలము.


రాఘవ :- తపస్విబాబాగారి దగ్గర నిఘావేసి సమాచారమును సేకరించ

వలయునంటే చాలాకష్టమైన పని అనుకుంటాను. క్రొత్తవారిని వారు నమ్మరు,

దగ్గరికి కూడా రానివ్వరు. అటువంటపుడు తపస్విబాబాగారి దగ్గర ఆంతరంగి

కముగా జరుగు విషయములను మనము తెలుసుకోవాలంటే వీలుపడదేమో

నని అనుమానము వస్తున్నది.


రాజయోగానంద :- ఆ అనుమానమును నీవు పెట్టుకోవద్దు. దానికి

కావలసిన ఏర్పాట్లు ఆరునెలలు ముందే చేసివుంచాను. మన మనిషి నా

ఆదేశానుసారము బాబాగారి భక్తులలో ఒక ముఖ్యమైన భక్తుడై పోయాడు.

అతడు రేపటి దినము బాబాగారిని వేయికళ్ళతో కాచుకొనివుంటాడు.

బాబాగారికి అందు ఏ సమాచారమైనా మన మనిషికి తెలియగలదు. అక్కడ

తెలిసిన వెంటనే ఆ విషయమును ఒక కాగితములో వ్రాసి మన ఆశ్రమము

నుండి తీసుకపోయిన పావురమునకు కట్టి పంపుతాడు. భూమిమీద పోవు

అన్ని వాహనములకంటే మన పావురము వేగముగా ప్రయాణించి మన


ఆశ్రమము చేరగలదు. అపుడు వారి విషయము ఆ పావురము తెచ్చిన

కాగితములో ఉంటుంది.


(ఆ మాటవిన్న రాఘవ ఆశ్చర్యచకితుడై తనలో తాను ఇలా

అనుకొనెను. నేను నెలక్రిందటే కదా గ్రహకూటమిని గురించి గుహలోని

మునీశ్వరుడు చెప్పాడని చెప్పాను. ఈ విషయము ఈయనకు ముందే

తెలుసా? వజ్రాల విషయము అర్థముకాలేదన్న తర్వాత గుహలోని మహాత్ముని

వద్దకు నేను పోయాను. ఈయనకు అర్థముకాని విషయము ఆయన

చెప్పాడు. తర్వాత గ్రహకూటమిని గురించి రాజయోగానందస్వామికి

చెప్పమన్నాడు. ఫలానా తపస్విబాబాగారు ఈ విషయమునకే వేచివున్నాడని

అప్పుడు ఆయన చెప్పలేదు. ఎవరో గ్రహకూటమి కొరకు కాచుకొని

ఉన్నాడని మాత్రమే చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పలేని విషయమును

ఈ స్వామి ముందే తెలుసుకొన్నాడు. గుహలోని స్వామికి తెలియని

విషయములు బయటి స్వామికి తెలుసు. బయటి స్వామికి తెలియని

వజ్రాల విషయము గుహలోని స్వామికి తెలుసు. దీనినిబట్టి చూస్తే

ఆయనకంటే ఈయన గొప్పవాడా! ఈయనకంటే ఆయన గొప్పవాడా! అని

ప్రశ్నరాక తప్పదు అని యోచిస్తున్న రాఘవను చూచి స్వామి ఇలా అన్నాడు.)

రాజయోగానంద :- ఏమి రాఘవ! ఏమీ మాట్లాడక యోచిస్తున్నావు. నీ

సంశయమేమిటో నాకు చెప్పు.


రాఘవ :- ఏమీ లేదు స్వామీ, గుహలోని స్వామి జ్ఞప్తికి వచ్చాడు.

రాజయోగానంద :- ఇప్పుడాయనెందుకు జ్ఞాపకానికి వచ్చాడు. నేను

చెప్పు విషయము వేరుకదా!


రాఘవ :- తపస్విబాబాగారు అష్టగ్రహకూటమి కొరకు ప్రయత్నిస్తున్నాడని

ఆయన చెప్పక ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. ఆయన ఫలానా

బాబా అని చెప్పలేదు. ఆయనకు తెలియని బాబాగారి విషయము మీకు

ముందే తెలిసి ఆరునెలలు ముందే ఏర్పాటు చేశారు. దానినిబట్టి గుహలోని

స్వామికి తెలియని విషయము మీకు ముందే తెలుసుననీ ఆయనకంటే

మీరు గొప్పవారని అర్థమగుచున్నది. అట్లే వజ్రాల విషయానికి వస్తే మీకు

తెలియని విషయము ఆయనకు తెలిసి వాటిని తనవద్దకు తెచ్చుకున్నాడు.

ఇక్కడ మీకు తెలియనిది ఆయనకు తెలిసినది. దీనినిబట్టి మీకంటే ఆయనే

గొప్పను యోచన వస్తున్నది. ఒక విషయములో మీరు, మరొక విషయములో

వారు, గొప్పగా ఉండుట వలన ఎవరు గొప్ప అను ప్రశ్నకు సమాధానము

లేకుండా పోవుచున్నది. దానిని గురించే యోచిస్తున్నాను.

రాజయోగానంద :- ఎవరు గొప్ప అనునది తర్వాత తెలుస్తుంది. ఇపుడది

అవసరములేదు. ఇపుడు మనకు కావలసినది విషయసేకరణ.

రాఘవ :- స్వామీ! మీరు గ్రహకూటమికి ఆరునెలలు ముందే విషయ

సేకరణకు చేసిన ఏర్పాటు చాలాగొప్పది. తపస్విబాబాగారిని కేంద్రముగా

చేసుకొని వారి విషయమును సేకరించడము గొప్ప పథకము. రేపటి

దినమున మనకు వచ్చు సమాచారమునకై వేచి చూద్దాము. తదుపరి

యోచన మీరే చెప్పితే నేను చేయువాడను.


నే రాఘవ తన అనుచరులను సమయము వచ్చినపుడు

ఎట్టి పని చేయుటకునైన సర్వ సన్నద్ధము చేసివుంచాడు. అతనివద్దయున్న

ఆటవికులు అతనేది చెప్పితే అది చేయుటకు వెనుకాడకున్నారు. మరుసటి

దినము తెల్లవారింది. ఆ దినము బుధవారము కావడము మరీ విశేషము.

ఉదయమంతా బాగున్నప్పటికీ మధ్యాహ్నము రెండు గంటల నుండి



ఆకాశములో మేఘములు కమ్ముకొనుటకు మొదలుపెట్టాయి. సముద్రములో

అలలు ఎత్తుగా లేవను మొదలుపెట్టాయి. మూడు గంటల సమయమునందు

వాతావరణము పూర్తి చల్లబడినది. ఆకాశములో అష్ట గ్రహకూటమి మూడు

గంటల మూడు నిమిషములకు జరిగినది. మూడు గంటల సమయములో

పెనుగాలులు వీచసాగాయి. మూడు గంటల మూడు నిమిషములకు వర్షము

కూడా ప్రారంభమైనది. గాలివానకు ప్రజలు ఎవరూ బయటికి రాలేక

ఇళ్ళలో ఉండిపోవసివచ్చినది. ఆకాశములో పిడుగు తీగలు పైనుండి

భూమివరకు మెరువసాగాయి. రోడ్లమీద ప్రయాణించు వాహనములు

అనేకముగా ప్రమాదానికి గురియైనాయి. సూర్యుడు మొదలు కొని మిగత

ఏడు గ్రహములు రాహువుతో కలియుట వలన అక్కడక్కడ పుట్టరంధ్రముల

నుండి ఊహించని రీతిలో విషవాయువులు బయటికి రాసాగాయి.

వాయువు ప్రభావమున పుట్టలకు దగ్గరున్న వారందరికి కొద్దిగ మైకమేర్పడి

నది. చర్మమునందు మంటలు కలుగజొచ్చాయి. కొందరికి ఆ వాయువు

వలన చర్మముమీద బొబ్బలు వచ్చాయి. విష సర్పాలు తమ నివాసముల

నుండి బయటికి వచ్చి విచ్చల విడిగా సంచరించను మొదలు పెట్టాయి.


ఇట్లు ఎన్నో విధముల భూమిమీద వింతలు జరుగుచున్నప్పటికీ,

తపస్విబాబా యోచన మొట్టమొదట పుట్టు శిశువును గురించే మెదలు

చున్నది. అంతలో ఆయన ఆధీనమువుండి ఆదేశింపబడిన సూక్ష్మరూప

మొకటి వచ్చి ఇలా తెలియపరచినది. ఆ విషయము కాగితము మీద

వ్రాతగా ఉన్నది. "బాబాగారికి వందనము తమ ఆదేశానుసారము బయలు

దేరిపోయి, అన్ని ప్రాంతములలో గర్భిణీ స్త్రీలు ఉన్న చోటంతా చూడగల్గు

చున్నాము. గ్రహకూటమి సమయములో ఇక్కడికి 60 మైళ్ళ దూరానవున్న

మాలసముద్రము అను ఊరిలో, ఒక అనాధస్త్రీ ఆ ఊరి చివరన ఉన్న


ముత్యాలమ్మ అను డాక్టరు వద్ద ప్రసవించినదని, ఆ మగ శిశువే మొదట

పుట్టిన బిడ్డ అని తమకు తెలుపుచున్నాము.” అని వ్రాయబడివుంది. గాలికి

తనముందుకు వచ్చిపడిన కాగితము మీద వ్రాతను చూచిన బాబాగారు

వెంటనే తన భక్తులను పిలచి “మాలసముద్రమను ఊరికిపోయి, ఆ ఊరి

చివరిలో ముత్యాలమ్మ అను డాక్టరువద్ద ప్రసవింపబడిన మగ శిశువును

ఎలాగైనా తీసుకురండి” అని చెప్పెను.


ఆ విషయమును విన్న రాజయోగానంద స్వామికి సంబంధించిన

మనిషి వెంటనే తన గదిలోనికి వచ్చి తెలిసిన విషయమును కాగితము

మీద వ్రాసి ఒక తావెత్తులో ఆ కాగితమును మడిచిపెట్టి, బుట్టలోని

పావురమును బయటికి తీసి, దాని కాలికి తావెత్తును కట్టి వదలాడు.

పావురము పైకి లేచి రాజయోగానంద స్వామి ఆశ్రమమువైపు రాసాగింది.

అప్పటికి అష్టగ్రహ కూటమి అయిపోయి వర్షము నిలిచిపోయింది. కావున

పావురము సులభముగా ప్రయాణించసాగింది. తపస్విబాబాగారి

ఆదేశానుసారము ఆయన మనుషులు మాలసముద్రమునకు బయలుదేరి

పోయారు.)



(మాల సముద్రములో ముత్యాలమ్మ డాక్టరువద్ద ప్రసవించిన

అనాథ కావడమువలన, ఆ శిశువును ప్రసవించిన వెంటనే ఆమె చని

పోవడము వలన, ఆ మగ శిశువు ఒంటరిగా డాక్టరువద్ద నిలిచిపోయాడు.

అక్కడికి సమీపములోనున్న ఒక పెద్ద జమీందారుకి సంతతి లేని కారణమున,

ఆ జమీందారు ముత్యాలమ్మ డాక్టరుతో మేము పెంచుకొనే దానికి మాకు

ఒక మగశిశువు కావాలని అనేకమార్లు చెప్పేవాడు. ఈ విషయము

డాక్టరమ్మకు వెంటనే జ్ఞాపకము వచ్చి, ఆ జమీందారుకు ఫోన్ చేసి


తనవద్దనున్న శిశువు విషయము చెప్పింది. ఎవరో అనాధకు మగ శిశువు

పుట్టాడు ఆమె చనిపోయింది. ఆమె తాలూకు వారు ఎవరూ లేరని డాక్టరమ్మ

చెప్పిన వెంటనే జమీందారు మిక్కిలి సంతోషించి, అతనూ, అతని భార్యా

ఇద్దరు కారులో బయలుదేరి మాలసముద్రము చేరుకొని, ఆ శిశువును

డాక్టరునుండి తీసుకొని వారి ఊరికి బయలుదేరి పోయారు.


అలా వారు పోయిన ఐదు నిమిషములకు తపస్విబాబాగారి

మనుషులు వచ్చి, ముత్యాలమ్మ డాక్టరును కలిసి అనాధగ ప్రసవించిన

తమ బంధువని చెప్పి ఆమెనూ, ఆమె ప్రసవించిన శిశువునూ గురించి

అడుగుతారు. అప్పుడు ఆమె జరిగిన విషయమంతా తెలిపి, ఆ శిశువు

సమీప పట్టణమైన చెన్నపట్టణము అను ఊరిలో ఉన్నాడని చెప్పుతుంది.

ఆ మాట విన్న తపస్విబాబాగారి మనుషులు నిరుత్సాహపడి వెంటనే

చెన్నపట్నమునకు బయలుదేరి పోతారు.)


(పావురము వేగముగా సాగిపోయి తొందరగా రాజయోగానంద

స్వామి ఆశ్రమములో వాలుతుంది. ఆ పావురము కొరకు వేచి చూస్తున్న

రాఘవ మరియు మిగతావారు, పావురము కాలికి కట్టిన గుండ్రని గొట్టముగా

నున్న తావెత్తును తీసి అందులో గుండ్రముగా చుట్టిపెట్టిన కాగితమును

బయటికి తీసి చదివారు. అందులోని విషయమును రాజయోగానందస్వామి

గారికి తెలిపారు. స్వామి ఆదేశానుసారము రాఘవ మరియు ఆటవికులు

అందరు కలిసి మాలసముద్రమువైపు బయలుదేరి పోయారు. తపస్వి

బాబాగారి మనుషులు ముత్యాలమ్మ డాక్టరు దగ్గరి నుండి పోతున్న

సమయములో రాఘవ వారికి ఎదురౌతాడు. బాబాగారి మనుషులు, స్వామి

మనుషులు ఒకరికొకరు ఎదురై చూచుకొన్ననూ, వీరు ఎవరైనది వారికి,


వారు ఎవరైనది వీరికి తెలియదు. కావున వారు బయటికి, స్వామి

మనుషులు లోపలికి పోతారు. ముత్యాలమ్మ డాక్టరు వారు పోవుచున్నదీ,

వీరు వస్తున్నది చూచినది. వచ్చిన స్వామి మనుషులు ప్రసవించిన అనాధకు

తాము బంధువులమని ఆమెనూ, ఆమె ప్రసవించిన శిశువునూ గురించి

అడుగుతారు.


ఆ మాట విన్న డాక్టరమ్మకు అనుమానము వచ్చినది. ముందు

వచ్చినవారు బంధువులమన్నారు. తర్వాత వచ్చినవారు బంధువులమన్నారు.

ఒకరికొకరు ఎదురైనప్పటికీ వారిని వీరుగానీ, వీరిని వారుగానీ పలుకరించు

కోలేదు. నిజముగా బంధువులైతే ఎందుకు పలకరించుకోరు? అంతేకాక

మొదట వచ్చినవారు అనాధస్త్రీకి బంధువులమన్నారు. కానీ శవముగా

ఇంకనూ అచటనేనున్న ఆనాధ స్త్రీని చూడకుండ శిశువుకోసము ఆతృతగా

ఎందుకు వెళ్ళారు? ఇట్లు ఆలోచించిన ముత్యాలమ్మ డాక్టరుగారికి, వచ్చిన

వారు ఎవరూ అనాధకు బంధువులు కారని అర్థమైనది. అయినప్పటికీ

తన అనుమానము బయటపడకుండా స్వామి మనుషులకు కూడా

చెన్నపట్నము అడ్రస్ చెప్పి పంపుతుంది. రాఘవ కూడా హుటాహుటిన

చెన్న పట్టణమునకు బయలుదేరి పోయాడు. ఇద్దరికి అడ్రస్ చెప్పి పంపిన

డాక్టరమ్మ, వారు బయటికి పోతూనే జమీందారుకు ఫోన్ చేసి, బంధువులు

కాని వారు బంధువులమని అబద్ధము చెప్పి ఆ శిశువు కోసము వస్తున్నారు.

వారికి ఆ శిశువును ఇవ్వవద్దని చెప్పింది. ఆ మాట విన్న జమీందారు

కోపముతో నిండివున్న వాడై అక్కడికి ఎవరు వస్తారోనని చూస్తూవుండెను.

చీకటి పడేలోపల బాబాగారి మనుషులు అక్కడికి చేరి శిశువును గురించి

అడుగుతారు. అప్పుడు జమీందారు శిశువు దారిలోనే చనిపోయాడనీ,

చనిపోయిన శిశువును దారి ప్రక్కనేవున్న నది ఒడ్డున పూడ్చి పెట్టామని


చెప్పాడు. ఆ మాట విన్న బాబా మనుషులు చేయునది లేక వెనుతిరిగి

వచ్చిన దారినే పోయారు. కొంతసేపుకు రాఘవ తన మనుషులతో

చెన్నపట్నముకు చేరి, జమీందారు ఇంటికిపోయి శిశువును గురించి

అడిగాడు. అప్పుడు ఆ జమీందారు మొదటివారికి చెప్పినట్లే శిశువు

చనిపోయాడని చెప్పాడు. ఆ శిశువు చనిపోవువాడు కాదనీ, గొప్ప

శక్తివంతుడని రాఘవకు తెలుసు. అందువలన అతని మాటలను రాఘవ

నమ్మలేదు.


శిశువు చనిపోయాడన్న మాట అసత్యమని, ఆ బాలున్ని ఎక్కడో

దాచి తమకు అబద్దము చెప్పుచున్నారని, తెలిసిన రాఘవ చేయునది లేక

వెనుతిరిగి పోయాడు. విషయమును తెలుసుకొన్న రాజయోగానంద స్వామి

సంతానము లేనివారి చేతిలోనున్న బిడ్డ క్షేమముగా ఉంటాడనీ, ప్రస్తుతము

ఆ శిశువు జమీందారు రక్షణలో ఉండడమే మంచిదనీ, అట్లుండుట వలన

తపస్విబాబాగారికి కూడా దొరకక క్షేమముగా పెరుగగలడనీ రాఘవకు

చెప్పాడు. అంతేకాక ఈ దినము తెలియకపోయినా, ఇంకా కొద్ది రోజులకైనా

ఒకవేళ తపస్విబాబాగారు తెలుసుకోగల్గితే, ఆ బాలుని కొరకు ప్రయత్నిస్తాడు.

అపుడు అతని కార్యములను కనిపెట్టి విఘ్నము చేయుచుండవలెను. తపస్వి

బాబా దగ్గర భక్తునిగావున్న మన మనిషి, బాలుని విషయములు బాబాగారికి

తెలిస్తే, ఆ విషయమును మనకు చేరవేస్తూవుండును. అలా ఏదైనా తెలిస్తే

అప్పుడు ఆలోచిస్తాము. ప్రస్తుతానికి ఆ బాలుడు బాబాగారి దగ్గరకు

చేరకుండా పోవడము మనకు సంతోషకరమైన విషయమేనని స్వామి చెప్పగా,

రాఘవ కూడా ప్రయత్నము చేయుచున్న బాబాగారికి దొరకకుండా దైవము


ఆ బాలున్ని జమీందారు దగ్గరకు చేర్చడము చాలా విచిత్రమైనదనీ, ఇంకా

ఏమి జరుగుతుందో చూడాలనుకొన్నాడు.)


(తపస్విబాబాగారి మనుషులు జమీందారు చెప్పిన మాటలు నమ్మిన

వారై, అదే విషయమును మునెప్పకు చెప్పగా, మునెప్ప బాబాగారికి తెలియ

చేస్తాడు. ఆ విషయము తెలిసిన బాబాగారు తన మనుషులు తెలివి

తక్కువ తనానికి కోప్పడి మునెప్పతో “ఆ శిశువు అంత సులభముగా చనిపోవు

వాడు కాదు. వారు మనవారిని మోసగించుటకు అలా చెప్పారు. ఆ శిశు

వు క్షేమముగా వారిదగ్గరే ఉంటాడు. ఆ శిశువు కొరకు చేసిన మొదటి

ప్రయత్నమే నెరవేరకుండా పోయినది. ఇక రెండవ ప్రయత్నమునైనా

తెలివిగా చేయాలి” అని చెప్పాడు. బాబాగారి మాటలు విని మునెప్ప తన

మనుషులను మందలించాడు. వారు అబద్దము చెప్పితే నమ్మి

వచ్చేయడమేనా! అని కోపముగా చెప్పి, ఈ మారు మరియొక పద్ధతిని

అనుసరించి ప్రయత్నిస్తాము, అపుడైనా జాగ్రత్తగా చేయాలి! అని చెప్పాడు.

రెండు రోజుల తర్వాత మునెప్పకు తపస్వి బాబాగారి దగ్గరినుండి

సమాచారము వయర్ లెస్ ద్వారా తెలిసింది. అందులో మునెప్పకు

బాబాగారు చెప్పిన విషయమును మునెప్ప తన మనుషులతో ఇలా చెప్పాడు.)

మునెప్ప :- ఈసారి మనము చేయవలసిన పద్ధతి చాలా సులభమైనది.

మీలో ఒకరు బొమ్మలను అమ్మువారివలె నెలరోజుల తర్వాత చెన్నపట్నముకు

పోయి నేనిచ్చిన బొమ్మలను ఆ జమీందారు ఇంటిలో అమ్మిరావలెను. అమ్మే

అవకాశము లేకపోతే, వారు కొనకపోతే దానిని వారికి ఉచితముగానైనా

ఇచ్చిరావలెను. చివరకు ఎటులనైనా ఆ బొమ్మను ఆ ఇంటిలోనికి చేర్చి

రావలయును. పిల్లవాడు మనవద్దకు రాకుండినా, మన బొమ్మ అక్కడికి

చేరవలెను. మన బొమ్మ అక్కడికి చేరుట వలన మన కార్యము సులభముగా

నెరవేరును.


నూకా :- మన బొమ్మలు అక్కడికి చేరినంతమాత్రమున మన కార్యము

సరిపోవునంటారా?


మునెప్ప :- అవి సాధారణ బొమ్మలు కాదు. మనము చెప్పిన పనిని చేసి

పెట్టు కంప్యూటర్లలాంటి మన ఏజంట్లనుకో. అవి అక్కడవుంటే ఇక్కడినుండి

మన పనులను వాటి ద్వారా చేయించవచ్చును. మనుషులు చేయలేని

పనులను బొమ్మలు చేయుననుటలో ఆశ్చర్యము తప్పకకల్గును. వాటిమీద

ఎవరికీ అనుమానము కూడా రాదు. ఎందుకనగా అవి మామూలు పిల్లలు

ఆడుకొను బొమ్మలవలెనే ఉండును. ఆ బొమ్మలను తెలివిగా అక్కడకు

చేర్చడమే మీ పని. తర్వాత మనిషికంటే తెలివైన పనిని అవి చేయగలవు.


(ఆ మాటలువిన్న అందరూ ఆశ్చర్య పోయి అవి ఎలాంటి బొమ్మలో

చూడాలనుకొన్నారు. )


(ఒక అనాథ బాలున్ని తెచ్చుకొన్న తర్వాత ఆ బాలునికోసము

రెండు గుంపుల మనుషులు వచ్చి పోవడము, రావుబహుదూర్ అను ఆ

జమీందారునికి అర్థము కాలేదు. బంధువులమని చెప్పి తల్లి శవమును

కూడా చూడకుండా, బిడ్డకోసము వచ్చి పోవడములో మర్మమేమిటో

తెలియలేదు. అటువంటి పరిస్థితిలో ఆ జమీందారు యోచించి బాలున్ని

కంటికి రెప్పలాగ పెంచుకోవాలని, ఆ బాలున్ని ఎవరూ అపహరించకుండా,

తగిన బందోబస్తు కొరకు నలుగురు వస్తాదులను జీతమిచ్చి రావుబహుదూర్

జమీందారు నియమించాడు. భారీ శరీరముగల ఆ నల్గురు వస్తాదుల

రక్షణలో ఎటువంటి భయములేకుండా ఆ బాలుడు పెరుగుచున్నాడు.

రావుబహుదూర్ గారు తమ వంశ ఆచారము ప్రకారము ఆ బాలునికి


నామకరణము చేయాలనుకొన్నాడు. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము ఆ శిశు

వుకు పేరును నిర్ణయించుటకూ, అట్లే ఆ శిశువు జాతకము వ్రాయించుటకు

సుప్రసిద్ధ జ్యోతిష్యున్ని పిలువవలెననుకొన్నాడు. నామకరణము చేయుటకు,

జాతకము వ్రాయటకు తనకు సమీపబంధువూ వరుసకు చిన్నాన్నా,

జ్యోతిష్యములో గొప్ప పండితుడూ అయిన శివబహుదూర్ అను

ముసలివానిని రప్పించి బాలుని నామకరణమునకు ముహూర్తము

పెట్టించాడు. నామకరణ ముహూర్తము దాదాపు నెలన్నర దినములకు

కుదిరినది. అంతలో తపస్విబాబా చెప్పినట్లు మునెప్ప చెన్నపట్నములోనికి

తన మనుషులను బొమ్మలను అమ్ముటకు పంపెను.


బొమ్మలు అమ్మువారు ఆ ఊరిలోనికి వచ్చి జమీందారు ఇంటిలో

బొమ్మలు అమ్ముటకు తగిన సమయమునకై వేచివుండి బొమ్మలు అమ్ముచూ

తిరుగుచుండెను. జమీందారు ఇంటిలో అమ్మవలసిన బొమ్మలను ప్రక్కన

పెట్టుకొని దిన దినమూ ప్రయత్నము చేయుచుండగా, ఒక దినము రావు

బహుదూర్ పిల్లవానిని తీసుకొని డాక్టరువద్దకు కారులో బయలుదేరి

వచ్చాడు. అదే అదననుకొన్న బొమ్మలవాడు జమీందారును అనుసరించి

వెళ్ళాడు. డాక్టరువద్ద పిల్లవాడు ఏడ్వడము మొదలు పెట్టాడు. ఏడుస్తున్న

బాలున్ని డాక్టరు దగ్గరనుండి బయటికి తెస్తూనే కాచుకొనివున్న బొమ్మలవాడు

బొమ్మలను చూపిస్తూ బొమ్మలను కొనమని రావుబహుదూర్ను అడిగెను.

పిల్లవాడు ఏడ్చుచుండుట వలన బొమ్మలను చూపించి ఏడ్పు మాన్పించాలని

జమీందారు బొమ్మలను పిల్లవానికి చూపగా వాటిని చూచి పిల్లవాడు ఏడ్పు

మానివేశాడు. అప్పుడు జమీందారు, బొమ్మలవాడు ఇచ్చిన బొమ్మలను

తీసుకొని వాటికి డబ్బు ఇచ్చి పంపాడు. జమీందారుకు బొమ్మలు అమ్మడమే


ఉద్దేశముగా వచ్చిన మునెప్ప మనిషి, తన పని సులభముగా నెరవేరినందుకు

సంతోషించి ఆ విషయమును మునెప్పకు తెల్పుటకు బయలుదేరి పోయెను.


కొనిన బొమ్మలు సాధాణముగా పిల్లలు ఆడుకొను బొమ్మలులాగే

ఉన్నాయి. అందులో చిన్న పిల్లలాడుకొను హెలీక్యాప్టర్ ఒకటి, కాళ్ళకు

కీళ్ళు అమర్చిన కుక్క బొమ్మ, కోతి బొమ్మ. అట్లే కాళ్ళు చేతులు అల్లాడు

నట్లుండు అడుగు పొడవున్న ప్లాస్టిక్ మనిషి బొమ్మ. ఆ బొమ్మ చేతిలో కత్తి

లాంటిది కలదు, మరియు రబ్బరుతో చేసిన అడుగు పొడవున్న మొసలిబొమ్మ

బాలుని కొరకు కొన్న వాటిలో ఉన్నవి. మొత్తము అన్నీ కలిపి ఐదు

బొమ్మలే. అవి చూచుటకు సాధారణ బొమ్మలే అయినప్పటికీ, వాటియందు

ప్రత్యేకత వున్నదని చూస్తూనే అర్థమగునట్లున్నవి. కానీ ఏమి ప్రత్యేకత ఉ

న్నది ఎవరికీ తెలియదు. అంతలోనే నామకరణ దినము వచ్చినది. ఆ

రోజు పెద్ద పండుగను చేయదలచిన జమీందారు గొప్పగా ఏర్పాట్లన్నీ చేశాడు.

అనేక మంది బంధుమిత్రులు బాలుని చూచిపోవాలని వచ్చారు. జ్యోతిష్యము

తెలిసిన తన బంధువు కూడావచ్చి, ఆ దినము జాతకరీత్యా ఆ బాలునికి

ఈశ్వర్ అను పేరును పెట్టాడు. ఆ దినము రాత్రికి జ్యోతిష్యము తెలిసిన

రావుబహుదూర్ చిన్నాన్న తన గదిలో కూర్చొని, జమీందారు తెచ్చుకొన్న

పిల్లవాని జాతకమును వ్రాయుటకు తెల్లని కాగితములో మొదట గ్రహ

కుండలిని గీశాడు. తర్వాత పంచాంగములో బాలుడు పుట్టిన సమయమును

చూడగా, ఆ సమయములో అష్టగ్రహ కూటమి జరిగినట్లు తెలిసింది.

అటువంటి సమయములో పుట్టినవానికి ఏదో ఒక ప్రత్యేకత ఉండునని

తలచిన ఆ జ్యోతిష్యుడు, ఆ సమయములోని ఒక్కొక్క గ్రహమును కుండలిలో

వ్రాస్తు జాతకము వ్రాయను మొదలు పెట్టాడు. జాతకమును పూర్తిగా

వ్రాస్తే ఆ బాలుని ప్రత్యేకత ఏమిటో తెలియునని అనుకొన్నాడు. అయితే


ఆ జ్యోతిష్యుని పెన్ను వ్రాయకుండా ఆగిపోయింది. కాగితము మీద వ్రాత

పడలేదు. అదే పెన్నుతో ప్రక్కనున్న కాగితము మీద వ్రాస్తే అది సులభముగా

వ్రాస్తున్నది. జ్యోతిష్యుడు జాతకము యొక్క పేపరు మీద తిరిగి వ్రాయుటకు

చూస్తే అప్పుడు కూడా అది వ్రాయలేదు. ప్రక్కన వ్రాసే పెన్ను, జాతకమును

వ్రాసే కాగితము మీద వ్రాయకపోవడము ఆ ముసలివానికి ఆశ్చర్యమైనది.

ఇక్కడేదో కనిపించని శక్తి పని చేయుచున్నదని అనుకొని, తాను అక్కడ

ఒంటరిగా ఉండడము మంచిది కాదనుకొని, వెంటనే అక్కడనుండి ప్రక్క

గదిలోనికి పోవాలని లేచి పోబోయాడు. అంతలో పిల్లవాని కొరకు కొనిన

బొమ్మలలోనున్న హెలీక్యాప్టర్ రుయ్మని లేచివచ్చింది. దాని రెక్కలు

మూడు అంగుళాల పొడవుగా ఉన్నప్పటికీ, ఆ సమయములో దాని రెక్కలు

మూడు మీటర్ల పొడవుగా కనిపిస్తున్నాయి. ఆ విచిత్రమును చూచి

ముసలివాని నోటివెంట మాటరాలేదు. కాళ్ళు చేతులు ఆడక నిశ్చేష్టుడై

నిలబడిపోయాడు. అతివేగముగా రెక్కలు తిరుగుచుండగా హెలీక్యాప్టర్

తనవైపే వచ్చింది. చూస్తున్నట్లే దాని రెక్కలు ముసలి వాని మెడ భాగములో

తగిలి తల ఎగిరిపడింది.


నమ్మశక్యముకాని, ఎవరూ ఊహించని పని అక్కడ జరిగిపోయింది.

ముసలివాని తల, మొండెము వేరువేరుగా పడివున్నాయి. ఇదెట్లా జరిగిందని

చెప్పువారు కూడా లేరు. అందువలన ముసలివాడు చనిపోయిన విషయము

తెల్లవారేవరకు ఎవరికీ తెలియదు. ముసలివాని చావుకు కారణమైన బొమ్మ

మునుపటివలె బొమ్మగా ఎక్కడున్నది తిరిగి అక్కడేవుంది. తెల్లవారిన తర్వాత

ముసలివాడు చనిపోయివుండడము చూచి జమీందారు ఆశ్చర్యపడి

పోయాడు. పిల్లవాని నామకరణము రోజే అలా జరుగడము ఆయనకు

చాలా బాధ అయినది. తలవేరై ఉండడము వలన దానిని పోలీసులు


అటువంటి

హత్యగా లెక్కించారు. ఆ హత్యను ఎవరు చేశారన్నది, అటువంటి

అవసరము ఎవరికున్నది జమీందారు చెప్పలేక పోయాడు. చనిపోయిన

వ్యక్తికి ఎవరి తోనూ శతృత్వములేదు. ఎవరైనా దొంగలు చేశారా అనుటకు

ఆ ఇంటిలోనికి దొంగలు వచ్చిన ఆనవాళ్ళు ఏమీ లేవు. పైగా ఆ ఇంటిలో

ఏ వస్తువూ దొంగలించబడలేదు. అన్ని రకముల యోచించిన పోలీసులకు

అదియొక మిస్టరీలాగా నిలిచిపోయింది. వారి దర్యాప్తు ముందుకు సాగే

దానికి అవకాశమే లేకుండా పోయింది.)


(తమ మనిషి సులభముగా బొమ్మలను జమీందారు ఇంటిలో

చేర్చి రావడము తపస్విబాబాకు సంతోషమైనది. ఆ బొమ్మల ద్వారా ఆ

బాలుని రహస్యము ఎవరికీ తెలియనట్లు చేయవచ్చును. ఒకవేళ ఎవరైనా

ఆ బాలుని రహస్యమును తెలియాలని ప్రయత్నిస్తే, వారిని హతమార్చుటకు

కూడ ఆ బొమ్మలలో ఏర్పాట్లు అమర్చబడివున్నాయి. మంత్రశక్తిచే నిర్మిత

మైన ఆ బొమ్మల ద్వారా ఆ రోజు రాత్రి జాతకము వ్రాయాలని చూచిన

ముసలివాని విషయము తెలుసుకొన్న బాబాగారు, తాను తన మందిరము

నుండియే మంత్రప్రయోగము చేసి హెలీక్యాప్టర్ బొమ్మతో ముసలివానిని

చంపించాడు. ముసలివాడు చనిపోయాడను వార్తను విన్న బాబా సంతోషిస్తూ

ఈ పద్ధతి ద్వారా ఏమైనా చేయగలను అనుకొన్నాడు. అడ్డు వచ్చిన వారిని

ఎవరినైనా హతమార్చి ఆ బాలుని రహస్యము ఎవరికీ తెలియకుండా

చేసి, ఆ బాలునికి యుక్తవయస్సు వచ్చిన తర్వాత తన కార్యమును

నెరవేర్చుకోవాలనుకొన్నాడు. భువనేశ్వరి దేవాలయములోని వజ్రాల

విషయములో అడ్డుకొని వాటిని దక్కకుండా చేసిన రాజయోగానంద స్వామి,

ఈ విషయములో కూడా ఆటంకమై తన కార్యములను విఘ్నము చేయుటకు


సిద్ధముగా ఉన్నాడని తపస్విబాబాకు తెలియదు. ఒకే ఒక హత్యతో సర్వము

సాధించినంత ఉప్పొంగి పోయాడు.)


(విచిత్రముగా చంపబడిన రావుబహుదూర్ గారి బంధువు

మరణము రాఘవకు, రాజయోగానంద స్వామికి తెలిసినది. ఇది బాలుని

విషయములో బాబాగారి పనియే అయివుంటుందని స్వామి అనుకున్నాడు.

బాలుని కోసము ప్రయత్నించినపుడు, ఆ ప్రయత్నములో ఆ ముసలివాడు

ఆటంకపడివుండివుంటే, తమ ఆచూకీ బయటపటకుండా ఉండుటకు చేసిన

హత్యయే అది అయివుంటుదనుకొన్నాడు. వాస్తవముగా ఎట్లు చనిపోయి

నదీ, అతని చావుకు ఒక బొమ్మ కారణమైనదీ రాజయోగానంద స్వామికి

కూడా తెలియదు. అయితే ఏదో ఒక విధముగా తపస్విబాబా మీదనే

రాజయోగానంద స్వామికి అనుమానము వచ్చినది. స్వామికి తప్ప ఎవరికీ

బాబాగారి మీద అనుమానమే రాలేదు. వచ్చుటకు కూడా వీలులేదు.

పోలీసు వారికి కూడా ఏ ఆధారము దొరకక, ఎవరినీ అనుమానించలేక

పోతున్నారు. బాలుని విషయములో తాము కొంత కాలము వేచివుండ

వలయునని అనుకోవడము పొరపాటైనదని రాజయోగానందస్వామి

రాఘవతో అన్నాడు. అంతేకాక తమ అశ్రద్ధవలననే ఒక ప్రాణమును

బాబాగారు బలితీసుకొన్నారనీ, ఇక మీదట అటువంటిది జరుగకుండా

చూడవలెననీ, రాజయోగానంద స్వామి నిర్ణయించుకొని రాఘవతో ఇలా

అన్నాడు.)



రాజయోగానంద :- రాఘవా! ఇప్పటినుండి మనము బాబాగారి

దురాగతమును అడ్డుకోవడానికి పూర్తి సమర్థత కల్గివుండాలి.


రాఘవ :- స్వామీ! మేము ఈ విషయములో మా ప్రాణము నిచ్చుటకైనా


సంసిద్ధముగా ఉన్నాము. ఇందులో ఏ అనుమానమూ వలదని మనవి

చేసుకొంటున్నాను. మీరు ఏమి చెప్పినా అది చేయుటకు వెనుకాడము.

రాజయోగానంద :- నీవు సంసిద్ధముగా ఉన్నావని చెప్పినప్పటికీ, నేనే

నీవు ఇలా చేయమని చెప్పలేకపోవుచున్నాను. కానీ అటువైపు జరిగే

అన్యాయమును చూచి చెప్పకుండా ఉండలేక పోవుచున్నాను.


రాఘవ :- స్వామీ! మీ ఆజ్ఞయే మాకు శిరోధార్యమైనపుడు, మీ సేవయే

నాకు భాగ్యమైనపుడు, మీ కార్యసాధనకై నా ప్రాణమునైనా ఇచ్చుటకు

నేను సిద్ధముగా ఉన్నపుడు, మీరు నాతో చెప్పుటకు ఎందుకు సంశయపడు

చున్నారు. నామీద ప్రేమతో నాకు మీరనుకొన్న బాధ్యతను అప్ప చెప్పలేక

పోవుచున్నారు. ఏ కష్టమైనా ఎదుర్కొను శక్తి తమ వలననే నాకు

లభించినది. కావున మీరు సంశయపడక నేను చేయవలసిన ఆ పని

ఏమిటో చెప్పండి.


రాజయోగానంద :- నీ మీద నాకు ఆ నమ్మకమున్నది. నీవు చేయవలసిన

పనికంటే ముందు నీవు తెలుసుకోవలసిన విషయము కొంత ఉన్నది. తపస్వి

బాబాగారు ఒక పెద్ద స్వామీజీగా చలామణి అగుచూ, ఎందరి చేతనో

ప్రశంసింపబడుచున్నప్పటికీ, ఆయనవద్ద అనేక ధనరాశులున్నప్పటికీ,

బయటి ప్రపంచములో తనమాట వేదవాక్కుగా చలామణి అగుచున్నప్పటికీ,

మాయకు వశుడై అది ప్రేరేపించిన ఆశ అను గుణములో పూర్తి

మునిగినవాడై, వజ్రాలను అపహరించాలని ఇంతవరకు ప్రయత్నించడమూ,

అది భంగమై పోవడము జరిగినది. ఆ ప్రయత్నము భంగమైనప్పటికీ

కొంతైనా యోచించక, భూమండలమునకే అధిపతి కావాలన్న ఆశతో ఎన్నో

అరాచక కార్యములను చేయుచూ, హింసామార్గమును అవలంభించి తన


అనుచరుల తోనూ మరియు తన ఆధీనమందున్న దుష్టశక్తులతోనూ

ఇటువంటి నీచమైన పనులు చేయిస్తూ, తనకేమీ తెలియనట్లు ప్రపంచమునకు

కనిపిస్తున్నాడు. తాను, తన అనుచరులతో చేయుపనులను బాహ్యముగా

మనము ఎదుర్కొని భంగము చేయవచ్చును. కానీ అతని మంత్రశక్తులతో

పనిచేయు క్షుద్రశక్తుల ఆగడాలను అహర్నిశలు మనము భంగము

చేయలేము.


అతను ఏ బాలుని కోసము ప్రయత్నము చేయుచున్నాడో, ఆ

బాలుడు కన్యారాశిలో బుధగ్రహము మొదటిపాదములో ఉండగా అష్టగ్రహ

కూటమి రోజున పుట్టాడు. కావున క్షుద్రశక్తులు ఆ బాలున్ని సులభముగా

ఆకర్షించగలవు. ఆ బాలునికున్న ప్రత్యేకతల వలన తపస్విబాబాగారు

తన ఆధీనమందున్న సూక్ష్మరూప శక్తులతో ఆ బాలున్ని సులభముగా తన

ఆధీనములోనికి తెచ్చుకోగలడు. ఆ బాలుడు బాబాగారి ఆధీనములోనికి

పోయిన తర్వాత మనము బాబాగారిని ఎదుర్కోవడము చాలా కష్టమవు

తుంది. ఎందరి ప్రాణములతోనైయినా ఆయన చెలగాటమాడగలడు.

ప్రపంచము నంతటికీ తానే అధిపతిననిపించుకోవడానికి ఎన్ని ప్రాణములైనా

అతనికి లెక్కలేదు. మనము అప్పుడు అతనిని నిర్భలున్ని చేయాలంటే

కుదరక పోవచ్చును. కనుక అతను అంతదూరము పోకముందే అతనిని

మనము అడ్డుకోవాలి. అందుకు నేనొక ఆలోచన చేసిపెట్టాను. ఆ యోచన

ఒక్కటే మనకిపుడు మార్గము.


అది ఏమనగా! బాబాగారి ఆశకు ముఖ్యసూత్రమైన బాలుడు

అష్టగ్రహ కూటమి రోజున పుట్టాడు కదా! ఆ దినము రాహువుతో మిగతా

ఏడు గ్రహములు చేరిన దానివలన ఎనిమిది గ్రహములు కూటమి ఏర్పడినది.

ఆ గ్రహముల కూటమికి ముఖ్యకారకుడు రాహువు. ఆ గ్రహకూటమి


గల శక్తి ఆ బాలునియందు నిక్షిప్తమై ఉన్నది. ఆ బాలునియందు

నిక్షిప్తమైయున్న శక్తికి ముఖ్యకారకుడు రాహువు. ఇదంతయూ ఎందుకు

చెప్పుచున్నాననగా! ముల్లును ముల్లుతోనే తీయాలన్నది సూత్రము. కావున

వారు చేయుచున్న కార్యమును మనము భంగము చేయాలంటే, దానికి

తగిన ఉపాయము అవసరము. అందువలన ముందు నవగ్రహములలోని

రాహువు యొక్క కిరణములను మనమీద ఎక్కువగా పడునట్లు చేసుకోవాలి.

అపుడు మనము చేయుపనులు మనకు సులభమగును. తపస్విబాబాగారు

చేయుపనులు ఆయనకు కష్టమగును. ఖగోళములోని రాహుగ్రహము

యొక్క కిరణము లను ఎక్కువగ మనమీద పడునట్లు చేసుకొనుటకు తగిన

వ్యక్తి అవసరము. అందుకు సరిపోవు వ్యక్తివి నీవు ఒక్కనివే ఇక్కడున్నావు.

(స్వామి మాటలువిన్న రాఘవకు, తాను ఒక్కడినే ఆ పనికి అర్హుడ

నను మాట సంతోషము కల్గించినది. వెంటనే ఇలా అన్నాడు.)

రాఘవ :- చెప్పండి స్వామి నేనేమి చేయాలి, రాహుగ్రహము యొక్క

కిరణములను ఎలా ఆకర్షించుకోవాలి?


రాజయోగానంద :- నీవు రెండవ పెళ్ళి చేసుకోవాలి.


(స్వామిగారు అనిన మాట వింటూనే రాఘవకు కొంత ఆశ్చర్య

మైనది. తన రెండవ పెళ్ళికి ఈ కార్యమునకు సంబంధమేమిటో అర్థము

కాలేదు. స్వామివారు నిర్ణయించి చెప్పినమాటను ఏమాత్రము తీసివేయని

తాను రెండవ పెళ్ళిలోని రహస్యమేమిటో తెలుసుకోవాలనుకొని స్వామితో

ఇలా అన్నాడు.)


రాఘవ :- స్వామీ! తమమాటకు నా ప్రాణమైన ఇచ్చుటకు సంసిద్ధపడిన

నేను, మీ ఆజ్ఞప్రకారము రెండవ పెళ్ళిని చేసుకోవడములో నాకు ఏమీ



ఇబ్బంది లేదు. కానీ నా రెండవ పెళ్ళికి, మన కార్యమునకు సంబంధమేమిటి

అను సంశయము ఏర్పడినది. కావున ఆ సంశయమును తీర్చవలెనని

ప్రార్థిస్తున్నాను.


రాజయోగానంద :- తపస్విబాబాగారి దుష్టకార్యములను ఎదుర్కోవడానికి

నీ మీద రాహుగ్రహ యొక్క కిరణములను ఎక్కువపడునట్లు చేసుకోవాలని

అందుకు నీవు ఒక్కడివే అర్హుడవని తెల్పాను కదా! అందువలన నీవు

పెళ్ళి చేసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడినది. భూతద్దమును సూర్యకాంతిలో

పెట్టినపుడు దాని క్రింద ఒక కేంద్రములో సూర్యకిరణములన్నీ ఒక్కచోట

చేరును. అలా చేరుటవలన అక్కడ వేడి ఏర్పడి అగ్గిపుట్టి అక్కడున్న వస్తువు

కాలిపోవుటకు అవకాశము గలదు. భూతద్దము యొక్క కారణమున సూర్య

కిరణములన్నీ ఒకచోట చేరుటకు అవకాశము ఏర్పడినట్లు, నీ రెండవ

పెళ్ళి వలన రాహు గ్రహముయొక్క కిరణములు నీమీద ఎక్కువ ప్రసరించ

గలవు. ఇంకొక ఉదహరణను కూడా తెలిపెదను వినుము. మత్తు

పానీయమునకు శుక్రగ్రహము అధిపతి. శుక్రగ్రహము శత్రువుగానున్నవారు

మత్తు పానీయము త్రాగితే అది శరీరములో ఉన్నంతవరకు శుక్రగ్రహ

కిరణములు వారిమీద ఎక్కువగా ప్రసరించి వారికి కీడుచేయును. అటువంటి

వారికి త్రాగుడు వలననే ఎక్కువ ధననష్టము ఏర్పడును. అదే శుక్రుడు

మిత్ర గ్రహమైతే త్రాగనివానికంటే త్రాగినవానిమీదనే ఎక్కువ శుక్రగ్రహ

కిరణములు పడి వానికి ధనము చేకూరును.అందువలన త్రాగి

చెడిపోయిన వారిని, బీదవారైన వారిని చూస్తున్నాము. అలాగే త్రాగినా

ధనికులైనవారిని ప్రత్యక్షముగా చూస్తున్నాము.


ముఖ్యముగా చెప్పునదేమనగా! రెండవ పెళ్ళికి రాహువు అధిపతి.

దుందుభిని నీవు పెళ్ళి చేసుకొను సమయములో నేను నీకు రెండవ పెళ్ళి


యోగమున్నదని ముందే చెప్పాను. నీవు తులా లగ్నములో పుట్టిన వానివి.

నీ జాతకములో ఏడవస్థానమున రాహుగ్రహము ఉన్నందువలన ప్రత్యేకత

గల భార్యయే నీకు లభించినది. ఆమెతో విషసర్పములు స్నేహముగా

ఉండుట నీకు తెలిసిన విషయమే. రాహువు విషమునకు, విషసర్పములకు

అధిపతి అయిన దానివలన నీ భార్యకు కూడా విషసర్పములు స్నేహముగా

ఉంటున్నాయి. రాహుగ్రహము ఏడవస్థానములో ఉండుట వలన నీ

జీవితములో రెండవపెళ్ళి తప్పక జరుగవలసి ఉన్నది. నీవు రెండవ పెళ్ళి

చేసుకోవడము ద్వారా నీకు రాహుగ్రహకిరణములు ఎక్కువకాగలవు.

అష్టగ్రహ కూటమి రోజున కేతువు తప్ప రాహువుతో మిగత గ్రహములన్నీ

కలిసి ఉండుట వలన, ఆ దినము ఏర్పడిన శక్తి అంతటికీ రాహువుయే

అధిపతి. ఆ దినమున పుట్టిన బాలునికి కలిగెడు మహత్తర శక్తులన్నియూ

రాహుగ్రహము యొక్క ఎరుకలేనిదే కలుగవు. అందువలన ఆ శక్తులను

నిరోధించు కార్యమును చేపట్టిన మనము రాహువు యొక్క కిరణములను

ఆకర్షించవలసి ఉన్నది. ఇంత బలవత్తర కారణముండుటవలన నిన్ను

రెండవ పెళ్ళి చేసుకోమన్నాను.


(సావధానముగా విన్న రాఘవకు విషయమంతా అర్థమైనది.

జ్యోతిష్య శాస్త్రవేత్తలు కూడా చెప్పలేని గ్రహముల విషయములను

సులభముగా అర్థమగునట్లు చెప్పిన స్వామివైపు చూచి రాఘవ ఇలా

అన్నాడు.)


రాఘవ :- స్వామీ. నా రెండవ పెళ్ళికి వధువు ఎవరో మీరే నిశ్చయించి,

మీ ఇష్టప్రకారమే చేయవలెనని కోరుచున్నాను.


(రాఘవ తన రెండవ పెళ్ళి విషయము స్వామిగారికే అప్పచెప్పి


తనభక్తిని మరొకమారు నిరూపించుకొన్నాడు. రాఘవ, స్వామి చెప్పినట్లు

నడుచుకొందునని చెప్పినందుకు రాజయోగానంద స్వామి సంతోషించి

మరొక విషయము తెల్పుచూ ఇలా అన్నాడు. )


రాజయోగానంద :- నీవు రెండవ పెళ్ళి చేసుకోవలసిన వధువు జాతకము

కూడా కొంత ప్రత్యేకత కల్గివుండాలి. ఆమె జాతకములో ఐదవస్థానము

శుభస్థానమై, ఆ స్థానము శని పక్షముదై ఉండాలి. ఆ ఐదవస్థానము

బుధగ్రహముయొక్క స్వస్థానములైన మిథున, కన్యలగ్నములై ఉండాలి. అలా

ఉండుట వలన మంచి సంతానవతియైవుండి, ఆ సంతానము మంత్ర

తంత్ర శక్తులకు అతీతమైన వ్యక్తిచే కల్గునను జ్యోతిష్య సూత్రము కలదు.

నీ ఆయుస్సుకు ఎటువంటి ముప్పు రాకూడదంటే సౌభాగ్యము, సంతాన

భాగ్యము ఉన్న స్త్రీ భార్యయగుట ముఖ్యము. ఆమె సంతానమునకు భర్త

కారకుడగుట చేత భర్త ఆయుస్సుకు డోకా ఉండదు. భార్య ఐదవ స్థానము

బుధస్థానమగుటవలన, ఆమెకు కల్గు సంతానమునకు కారకుడైన భర్త

మంత్రతంత్ర శక్తులను సులభముగా జయించువాడగును.


అందువలన ఆ జాతకముగల అమ్మాయి మనకవసరము.

జాతకముగల అమ్మాయిని మనము వెతకవలసివుండగా, మనకు అటువంటి

పనిలేకుండా, ఆమె ఇచ్చటనే ఉండుట మన అదృష్టము. జాతకరీత్యా

అన్ని విధముల మనకు అనుకూలమైన అమ్మాయి మనవద్దనున్న

రాధేశ్వరియే. కనుక నీవు ఆమెనే చేసుకోవలసి ఉంటుందని తెలుపు

చున్నాను.


రాఘవ :- ఈ విషయము నేను చెప్పుటకంటే మీరే దుందుభితో చెప్పడము

మంచిదనుకుంటాను. సహజముగా స్త్రీలకు ఈ విషయములో అసూయ


భావముంటుంది. కానీ దుందుభి అలాకాదనుకుంటాను. అయినప్పటికీ

మీరే చెప్పడము మంచిది.


రాజయోగానంద :- అలాగే రాఘవ, ఈ విషయమును నేనే దుందుభితో

చెప్పుదును. దుందుభి అందరిలాంటి మనిషికాదు. జరుగబోవు కాలములో

ఆమె పాత్ర చాలా ఉన్నది. ఆమె నీతో సమానముగా జ్ఞానమును తెలుసు

కొన్నది. ఆమెకు ఈ విషయమును చెప్పడములో కష్టములేదు. ఆమె ఈ

విషయములో పూర్తి సహకరించగలదు. కానీ రాధేశ్వరికి నచ్చ చెప్పడములో

మనకు కొంత కష్టముండును. ఎందుకనగా! ఆమె తన జీవితములో

పెళ్ళియే చేసుకోకూడదని నిశ్చయించుకొన్నది. కావున ఈ విషయము

సమూలాగ్రముగా అంతయూ వివరించి చెప్పవలసి ఉంటుంది. ఈ

విషయము పూర్తి తెలిస్తే ఆమె మనకు సహకరించగలదు. ఈ విషయమును

రేపు ఆమెకు వివరించి చెప్పుదును. అంతేకాక ఈ విషయములో దుందుభి

అభిప్రాయమును కూడా తెలుసుకొంటాను.




(రావుబహుదూర్ తన చిన్నాన్న గారు చనిపోవడము ఏదో అశు

భముగా తలచాడు. పైగా ఆయన మరణము ఎలా జరిగిందో ఎవరికీ

అర్థము కాలేదు.

ఈ విషయమును తెలుసుకొనుటకు తనకు తెలిసిన

జ్యోతిష్యునివద్దకు రావుబహుదూర్ పోవాలనుకొన్నాడు. అక్కడికి వంద

కిలోమీటర్ల దూరములోనున్న జ్యోతిష్యునివద్దకు పోవాలనుకొన్న జమీందారు

తన స్నేహితునితో సహా కలిసి బయలుదేరి పోయాడు. వారు దారిలో

దాదాపు 80 కిలోమీటర్ల దూరము ప్రయాణించిన తర్వాత వారు

ప్రయాణించు కారు యొక్క ముందర టైరు పగిలిపోయి, కారు ప్రక్కకు

పోయి చెట్టుకు గ్రుద్దుకుంది. అలా కారు ప్రమాదమునకు గురియగుట


వలన కారులోనున్న జమీందారు స్నేహితుడు పూర్తి గాయాలపాలై

చనిపోవడము జరిగింది. తన చిన్నాన్న చావును గురించి తెలుసుకోవడానికి

ప్రయత్నించిన జమీందారుకు, తన స్నేహితుని మరణముతో ఏమీ అర్థము

కాకుండా పోయినది. ఆ బాలున్ని ఇంటికి తెచ్చుకొన్న తర్వాత తనకు

అన్నీ అశుభములే జరుగుచున్నవని మనస్సులో అనుకొన్నాడు. ప్రస్తుతము

అప్పటికి వెనక్కి పోయి, జ్యోతిష్యుడైన తన పినతండ్రి చనిపోవడానికి,

ఇప్పుడు తన స్నేహితుడు చనిపోయినదానికి ఏదైనా తనకు తెలియని

కారణమున్న దేమోనని యోచించి, దాని విషయమును తెలుసుకొనుటకు

ఒక దినము జ్యోతిష్యున్ని తనవద్దకే పిలుచుకొని ఎవరులేని సమయములో

తన మనస్సులోని విషయమును జ్యోతిష్యునికి తెలియజేసెను. అప్పుడు

ఆ జ్యోతిష్యుడు తనకు తెలిసిన గణితమును చూచుకొని, తన గణితము

ప్రకారము చనిపోయిన ఇద్దరి మరణములు అసాధారణముగ జరిగినవేననీ,

వారి మరణము వెనుక ఎవరికీ తెలియని రహస్యమున్నదనీ, ఆ రహస్యమును

తాను కూడా చెప్పలేననెను. ఆ మాటలు విన్న జమీందారు “అసలైన

కారణమును తెలుసుకొనుటకు వేరే దారేలేదా” అని అడుగగా

జ్యోతిష్యుడు బాగా యోచించి ఇలా అన్నాడు.)


జ్యోతిష్యుడు :- మా గణితముకు కూడా తెలియని రహస్యమును తెలుసుకొను

ఏకైక వ్యక్తి ఒకరున్నారు. ఆయనయే రాజయోగానంద స్వామి; కానీ

ఆయన ఎవరికీ భవిష్యత్తును గురించి చెప్పడు.


జమీందారు :- నాకు కావలసింది భవిష్యత్తు కాదు. ప్రస్తుతమున్న ఆపద

ఏమిటో తెలుసుకొని, దానినుండి బయటపడు ఉపాయము.


జ్యోతిష్యుడు :- అలాగైతే నేనే ఆయనవద్దకు పోయి అడిగి తెలుసుకొంటాను.

నీవు పోతే ఆయన ఏమీ చెప్పడు.


జమీందారు :- ఎలాగైతేనేమి. నాకు కావలసింది విషయమును తెలుసు

కోవడమే. అదేదో మీరేపోయి అడిగిరాండి. దానికి కావలసిన ఖర్చును

నేను మీకు ఇచ్చుకొంటాను.


జ్యోతిష్యుడు : :- ఆ స్వామివారు ప్రపంచ విషయములను తనవద్దకు

రానివ్వడు. అందువలన నేను రెండు రోజుల తర్వాత పోయి తీరికగా

అక్కడేవుండి, సమయము, సందర్భము వచ్చినపుడు అడిగి తెలుసుకొంటాను.

(అని చెప్పి జమీందారుని సమాధానపరచి అక్కడినుండి వెళ్ళి

పోయాడు. ఆ జ్యోతిష్యుని మాటలు విన్న తర్వాత రావుబహుదూర్ తనకు

తెలియనిదేదో ఉన్నదనుకొని, చివరకు రాజయోగానంద స్వామి ఏమి

చెప్పునో చూడాలనుకొన్నాడు. )


(మునెప్పవద్దకు తనను తీసుకుపొమ్మని నాగోతులు నాగభూషణము,

మంత్రాల మల్లయ్య తాత వెంకూను అడిగారు. వెంకు వారి మాటలను

ఒప్పుకోలేదు. ఏమైనావుంటే తనతోనే చెప్ప మనగా, ఇద్దరు మాంత్రికులు

మునెప్పతోనే చెప్పుతామని చెప్పారు.  అపుడు చేయునది లేక వెంకూ

ఇద్దరి మాంత్రికులను అడవిలోనున్న మునెప్ప దగ్గరికి తీసుకపోగా మొదట

నాగభూషణము మునెప్పతో ఇట్లన్నాడు.)


నాగభూషణము :- అయ్యా! మాకు మా దేవత కలలోనికి వచ్చి మీరు

వెంటనే వారివద్దనుండి బయటపడి మీ ఇంటికి పొమ్మని చెప్పింది.


మునెప్ప :- అలా ఎందుకు చెప్పింది. మీకు మేము ఏమి తక్కువ చేశాము.

మీరు అడగకున్నా ఎక్కువ డబ్బు ఇచ్చాము కదా!


నాగభూషణము :- డబ్బు విషయములో మాకు ఎలాంటి ఇబ్బందిలేదు.


ఈ పనిని మీరు చేయలేరని మా ఇష్టదేవత చెప్పింది. వజ్రాల విషయములో

అపాయములేదు. కానీ అబ్బాయి విషయములో పెద్ద అపాయమున్నదనీ,

ఆ అపాయమును జయించుకోవాలంటే ఇప్పుడు మాకున్న శక్తి చాలదనీ

చెప్పింది.


మునెప్ప :- మీరు ఇంకా ఏమైనా చేసి ఇంకా కొంత శక్తిని సంపాదించు

కోవచ్చును కదా!


నాగభూషణము :- అలా శక్తిని పొందుటకు దాదాపు ఒక సంవత్సరము

మేము మంత్రసాధనలు చేయవలసి వస్తుంది. ఆ మంత్ర సాధన చేయుటకు

కొన్ని లక్షల డబ్బు ఖర్చవుతుంది. ఎక్కువగా ప్రతి దినమూ జంతుబలులూ,

పక్షిబలులూ  ఇవ్వవలసి వుంటుంది.

 మునెప్ప-:మీకు ఎంత డబ్బయినా ఖర్చు పెడతాము. మీరు ఆ మంత్ర

సాధన చేయుటకు పూనుకోండి.


మల్లయ్యతాత :- మేము కూడా మీరు చెప్పినట్లే చేయాలని నిర్ణయించు

కొన్నాము. కానీ మేము సంపాదించుకొను శక్తి ఒక్క జ్ఞానశక్తిని తప్ప

దేనినైనా ఎదుర్కొంటుంది. ఒకే ఒక దైవశక్తి (జ్ఞానశక్తి) వద్ద మా శక్తి

పని చేయదు. అందువలన మేము దైవశక్తివున్న వారిని ఎప్పుడూ

ఎదిరించలేము. ఒకవేళ అలా మేము జ్ఞానశక్తికి పోటిపడితే మాలోని శక్తి

అంతయూ లేకుండా పోవును. మేము ఎటువంటి మంత్రశక్తినైనా

ఎదురించగలము. జ్ఞానశక్తి వద్ద మా శక్తి పని చేయక పోవడమేకాక

ఉన్నది కూడా పోవును. అందువలన ఆ విషయమును ముందే మీకు

చెప్పుచున్నాము.


మునెప్ప :- సరే మీరు కొంత డబ్బును తీసుకొని పోయి, మీ సాధన మీరు

చేయండి.


(రెండు లక్షల రుపాయలను ఆ ఇద్దరి మాంత్రికులకు ఇచ్చి పంపిన

తర్వాత తపస్విబాబాగారితో మునెప్ప రహస్యముగా మాట్లాడెను.

మాంత్రికులు చెప్పిన విషయమునంతటిని బాబాగారికి చెప్పెను. దానికి

బాబాగారు మాంత్రికులను ఇద్దరిని తమ వద్దనే పెట్టుకొమ్మని వారితో

కొన్ని పనులు చేయించుకోవలసి వస్తుందని చెప్పాడు.)




(రెండవ రోజు రాజయోగానంద స్వామి రాధేశ్వరిని, దుందుభిని

పిలిచి తనగదిలో ప్రత్యేకముగా వారితో మాట్లాడజొచ్చెను.)


రాజయోగానంద :- రాధేశ్వరీ! నీతో ముఖ్యమైన విషయమును

మాట్లాడవలసి ఉన్నది. ఇది నీ జీవితానికి సంబంధించిన సమస్య,

అందువలన నీతో తప్పక చెప్పవలసివచ్చినది. దానికంటే ముందు మీరు

ఇద్దరూ కలిసి తెలుసుకోవలసిన సమాచారము కొంతవుంది అది ఏమనగా!

మనము మన స్వార్థముకొరకు బ్రతకడములేదు. బయటి సమాజ శ్రేయస్సు

కొరకు బ్రతుకుచున్నాము. అందులో కొందరు దుర్మార్గులను అణచివేచి,

సన్మార్గమైన దైవజ్ఞానమును తెలపడము మన పనిగా ఎంచుకొన్నాము.

జరుగబోవు కాలములో కొంతమంది దుర్మార్గులను లేకుండా చేయుటకు,

ఇప్పటినుండే జాగ్రత్త పడవలసివస్తున్నది. రాబోవు కాలములో కొన్ని

దుష్టశక్తులను వశ పరుచుకొని, వాటి ద్వారా ప్రపంచమును అల్లకల్లోలము

చేసి, తమకంటే మించినవారు లేరనుకొని, దేవుడెవరు? అని ప్రశ్నించు

పరిస్థితి వస్తున్నది. అటువంటి పరిస్థితి రాకూడదనీ, మనిషి అన్ని

బలములను పుంజుకొని దేవున్ని ప్రశార్థకము చేయకూడదనీ మనము

అనుకొంటున్నాము.


ముఖ్యముగా చెప్పునదేమంటే, రాబోయే విపత్తు కాలములో

రాఘవతో కొన్ని పనులు చేయించి, ఆ దుర్మార్గమైన విపత్తునుండి ప్రజలను

కాపాడవలెనని అనుకొన్నాను. దానికి రాఘవ బలము తక్కువ వస్తుంది.

రాఘవతో పాటు మరికొందరు కూడా ఆ సమయానికి అసవరము.

అటువంటి వారు ఇప్పుడు ఎవరూలేరు. జాతక చక్రములో ఐదో స్థానమైన

సంతాన స్థానము బలముగానున్న స్త్రీ గర్భమునుండి జన్మించువారు కొంత

శక్తివంతులుగావుండి, రాఘవకు తోడుగా ఉండగలరు. మొదట రాఘవ

పెళ్ళి సమయములో కూడా రాఘవకు రెండవ పెళ్ళి యోగమున్నదని

చెప్పాను. ఆ విషయమును తెలిసి దుందుభి కూడా రాఘవను పెళ్ళి

చేసుకొన్నది. ఇపుడు రాఘవకు రెండవ పెళ్ళి జరుగు కాలము దగ్గరవు

చున్నది. రెండవ పెళ్ళిని, సంతానస్థానమైన ఐదవస్థానము అనుకూలమైవున్న

కన్యతో చేయాలనుకొంటున్నాను. ఇప్పుడు అందరము ఆ కన్య కొరకు

వెదకవలసివున్నది.


దుందుభి :- మీరు సర్వము తెలిసినవారు, మీరు ఏమి చేయాలనుకొంటే

అదే చేయవచ్చును. ప్రపంచ మేలునుకోరి చేయు మీ పనికి ఎవరూ

ఆటంకము చెప్పరు. మీరు మాతో చెప్పి చేయించుకోవలెనని, మా సలహా

ఏమి అవసరములేదని తెల్పుచున్నాను.


రాధేశ్వరి :- దుందుభి చెప్పినది వాస్తవము. మీరు మాకు ఏది చెప్పవలసి

నది లేకుండా, మీ పనిలో భాగముగా మమ్ములను వినియోగించుకోండి.

మేము చేయవలసిన కార్యమేదో చెప్పండి. మేము ఆ పనిలో నిమగ్నమై

చేస్తాము.


రాజయోగానంద :- మీరు ఆ మాట చెప్పినందుకు మాకు సంతోషము.

నేను చెప్పబోయేపని మీతోనే ముడిపడివున్నది. రాఘవకు మంచి

సంతానమునిచ్చు భార్యను చేయడము వలన రాఘవకు మంచి సంతానము


లభించును. కానీ రాఘవకు మొదటి భార్యగానున్న దుందుభికి సంతాన

యోగములేనిదానివలన ఆమెకు సంతానము కలుగదు. రెండవ భార్యకు

పుట్టిన సంతానమును తన సంతానముగానే పెంచవలెను.


దుందుభి :- ఇందులో బాధపడవలసినది ఏమీలేదు. నాకు సంతానము

కలుగదని ముందే తెలుసు, అంతేకాక ఆయనకు రెండవ వివాహమున్నదని

కూడా మీరే చెప్పారు. ఇదేమి క్రొత్త విషయము కాదు. నాకు కొంత

దైవజ్ఞానము మీ ద్వారా తెలిసింది. కావున ఈ విషయము ద్వారా నాకు

ఎటువంటి బాధాలేదు.


రాధేశ్వరి :- మీరు చెప్పిన జాతకముగల అమ్మాయి ఎక్కుడుందో చెప్పండి.

అది మా ముఖ్యమైన పనిగా తలచి పోయి వారితో మాట్లాడివస్తాము.

రాజయోగానంద :- మీరు ఎక్కడికి పోయి మాట్లాడవలసిన పని లేదు.

అన్ని విధముల జాతకము సరిపోయిన అమ్మాయి ఇక్కడే ఉందని మీతో

చెప్పుచున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు. మన రాధేశ్వరియే. కానీ

ఆమె వివాహము చేసుకోనని చెప్పడము వలన ఈ విషయమును చెప్పుటకు

కొంత ముందు, వెనుక చెప్పవలసివచ్చినది.

రాధేశ్వరి :- స్వామీ! నా విషయములో మీరు ముందువెనుక చూడవలసిన

పనిలేదు. నేను వివాహము చేసుకోనని నా ఉద్దేశ్యమును చెప్పిన మాట

నిజమే. మీరు సమాజ శ్రేయస్సుకొరకు మా జీవితాన్ని అర్పించమనినా

దానికి మేము సిద్ధముగా ఉన్నాము. మీ మాట ముందర మా ఉద్దేశము

విలువైనది కాదు. అందువలన మీరు చెప్పినట్లు చేయుటకు నాకు ఏ

అభ్యంతరమూలేదు. నేను ఇక్కడికి రావడముతోనే నా జీవితమునకు

మంచి దశ వచ్చిందనుకొన్నాను. మీవద్ద జ్ఞానము తెలుసుకొన్న తర్వాత

నా జీవితమును దైవసేవకే వినియోగించాలనీ, అదీ మీరు ఎట్లు చెప్పితే

అట్లు చేయాలని అనుకున్నాను.


రాజయోగానంద :- నీవు నామీద విశ్వాసముతో ఆ విధముగా నిర్ణయము

తీసుకోవడము మంచిదే. మేము అన్ని విషయములను కూలంకషముగా

ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. పైగా అన్ని విధముల నీ జాతకము

సరిపోయింది. రాఘవ కూడా మీరు చెప్పినట్లే మీ నిర్ణయము ఎట్లుంటే

అట్లు చేయమని చెప్పాడు. దుందుభి కూడా దీనికి సహకరించేందుకు

ఒప్పుకోవడము సంతోషము. ఇక ఈ విషయమును ఆలస్యము లేకుండా

మల్లుదొరకు తెలియజేస్తాను.


(జమీందారు రావుబహుదూర్ గారితో మాట్లాడిన జ్యోతిష్యుడు

రెండు రోజుల తర్వాత రాజయోగానంద స్వామి ప్రబోధాశ్రమానికి

వచ్చాడు. జమీందారు తనవద్దకు వచ్చిన విషయమూ, జమీందారులోని

అనుమానమూ, తాను చెప్పిన విషయము అన్నీ చెప్పాడు. చివరకు ఆ

బాలునిలోని విశేషమేముందో, ఆ చావులకు కారణమేముందో తమరే

చెప్పాలని అడిగాడు. అప్పుడు రాజయోగానంద స్వామి అన్నీ విన్న తరువాత

జ్యోతిష్యునితో ఇలా అన్నాడు.)


రాజయోగానంద :- జమీందారు రావుబహదూర్ వద్దనున్న అబ్బాయి

ప్రత్యేకమైన జాతకము కలవాడు. అతడు అష్టగ్రహ కూటమి రోజున

పుట్టిన మొదటి బిడ్డ. ఆ బిడ్డ చిన్న వయస్సులో సర్వసాధారణముగా

ఉండినప్పటికీ వయస్సు పెరుగుకొలది అతనిలో ఎన్నో మార్పులు వస్తాయి.

ఆ బాలుడు పెరిగి 16 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత రాబోవు

ఆరు అమావాస్యలు చాలా ముఖ్యమైనవి. ఎందుకనగా! ప్రతి అమావాస్య

దినము ఒక ప్రత్యేకమైన శక్తి అతనిలో చేరిపోవును. ఆ విధముగా ఆరు

అమావాస్యల దినములలో ఆరు శక్తులు చేరిపోవడము జరుగును. మొదటి

మూడు అమావాస్యలలో మొదటి అమావాస్య దినమున ఈశ్వర్ శరీరము


లోనికి చేరు శక్తి మాత్రము లోక వినాశనమునకు కాకుండా లోకోద్ధరణ

కొరకు పనికి వచ్చును. మిగతా రెండు అమావాస్య దినములలో వచ్చు

రెండు శక్తులూ లోక వినాశనము కొరకు పనిచేయును. మొదటి అమావాస్య

రోజున వచ్చు శక్తి లోకోద్ధరణకు ఉపయోగపడునది కాగా, తర్వాత

వచ్చు రెండవ మరియు మూడవ అమావాస్యలలో వచ్చు శక్తులు మాత్రము

భూమిమీద వినాశనము చేయునవై ఉన్నవి. రెండు, మూడు అమావాస్యలలో

వచ్చు శక్తికంటే తర్వాత వచ్చు నాలుగు, ఐదు, ఆరు అమావాస్యల

దినములలో ఈశ్వర్లోనికి వచ్చు శక్తులు ఇంకా భయంకరమైనవి. చివరి

మూడు అమావాస్యల శక్తులు భూమిమీద ప్రళయమునే సృష్టించి సర్వమును

నాశనము చేయగలవు. ఈ విధముగా మొదటి అమావాస్య తర్వాత

వచ్చు ఐదు అమావాస్యలు వినాశనము చేయునవి కాగా, వాటిలో చివరి

మూడు అతి భయంకరమైనవని చెప్పవచ్చును.


ఈ విధముగా రావుబహదూర్ కుమారుడైన ఈశ్వర్ జాతకము

ప్రకారము జరుగవలసివున్నది. అట్లు జరగకుండా ఎవరూ ఆపలేరు.

ఆరు అమావాస్యలలో ప్రమాదభరితమైన ఐదు అమావాస్యల శక్తులను

ఈశ్వర్ తన జీవితములో ఎప్పటికీ బయటికి ఉపయోగించడు. అయితే

ఇతరులు ఆ శక్తులను తమ వశము చేసుకొను అవకాశముకలదు. ఎవరైతే

ఆ శక్తులను వశము చేసుకొందరో, వారు ఆ శక్తులను ఉపయోగించి

భూమిమీద ప్రళయమునే సృష్టించగలరు. ఆ శక్తులు ఇతరుల వశమైతే

16వ సంవత్సరము వచ్చు మిగతా ఆరు నెలలు మాత్రము ఈశ్వర్

ఉండగలడు. తర్వాత అతనికి ప్రాణహాని ఉన్నట్లు తెలియుచున్నది.

దీనినిబట్టి ఈశ్వర్ తన 16వ సంవత్సరము చివరిలో గానీ లేక ఏడవ

నెలనుండి చివరి పన్నెండు నెలల లోపల ఎప్పుడైనా చనిపోగలడని

చెప్పవచ్చును. ఒకవేళ అతనిలో చేరు ఆరు అమావాస్యల శక్తులను ఎవరూ


వశపరుచుకోకపోతే ఈశ్వర్ సంపూర్ణ ఆయుస్సుతో బ్రతకగలడని కూడా

చెప్పవచ్చును. కానీ ఆ శక్తులను తన వశము చేసుకొనుటకు ఒక వ్యక్తి

కాచుకొని ఉండుటవలన, అతను ఆ శక్తులను వశము చేసుకొనుటకే

ప్రయత్నించును. ఆరు నెలల శక్తులను వశపరుచుకోకపోయినా, కేవలము

ఒక నెల శక్తిని వశపరుచుకొనినా ఈశ్వరు మాత్రము మరణము తప్పదు.


ఈశ్వర్లో చేరు శక్తిని వశపరుచుకోవాలని కాచుకొనివున్నవారు

వాటిని ఎలా అయినా వశపరుచుకోగలిగితే అప్పుడు అతను ఏ దేశమునైనా

పూర్తిగా నాశనము చేయగలడు. అతను చాలా దేశములను నాశనముచేసి,

మిగిలిన దేశములన్నిటికీ అధిపతి కాగలడు. దుష్టబుద్ధితో ఆధిపత్యమును

చెలాయించువాడు చివరకు నేనే దేవున్నని ప్రకటించుకొని అసలైన సృష్ఠికర్తకే

ప్రశ్నార్థకమగును. ఈ విషయములు తెలిసినవారు ఆ బాలుని విషయము

ఎవరికీ తెలియకుండునట్లు జాగ్రత్తపడుచుందురు. మొదట ఆ బాలుని

జాతకమును వ్రాయాలనుకొన్న వృద్ధున్ని ఆ బాలుని విషయము తెలియ

కూడదనుకొన్నవారే చనిపోవునట్లు చేశారు. అది ఎవరికీ అర్థముకాలేదు.

ఎవరికీ తెలియకుండా ఆ బాలున్ని కాచుకొని కొన్ని శక్తులున్నవి.

శక్తులు ఆ బాలుని మీద ఎప్పటికీ నిఘా ఉండుట వలన ఆ బాలుని

గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే వారిని ఆ పని నుండి విరమించు

కొనునట్లు ఆటంకములు కలుగజేయును. అప్పటికీ మొండిగా ప్రవర్తిస్తే

చివరకు వారిని ఆ శక్తులు చంపివేయును. ఇప్పటికి ఆ బాలుని విషయము

తెలుసుకో కోవాలనుకొన్న వారిలో ఇద్దరిని ఆ శక్తులు చంపివేశాయి. తర్వాత

కూడా ఎవరు ప్రయత్నము చేసినా వారిని కూడా వదలవు. ఇపుడు ఈ

విషయము నావలన నీకు తెలిసింది. నీకు తెలిసిన ఈ విషయమును


నీవు జమీందారుకు తెలుపాలనుకొంటే అతనికి తెలుపకముందే ఆ శక్తులు

నిన్ను కూడా చంపగలవు. నా వలన నీకు తెలిసింది కావున ఇంతటితో

నీకు ఏ ముప్పు ఉండదు. ఒకవేళ ఈ రహస్యమును బయటికి చెప్పాలను

కొంటే మాత్రము నీకు ప్రమాదము తప్పదు. అందువలన నీవు జమీందారు

వద్దకు పోకుండా నేరుగా ఇంటికి పోయి, ఏమీ తెలియనట్లు ఉండిపో.


జ్యోతిష్యుడు :- ఈ విషయమును బయటికి చెప్పితే నా ప్రాణాలకే ముప్పు

ఉన్నప్పుడు, నేనెందుకు చెప్పాలి. నాకేమీ తెలియనట్లు ఉండిపోతాను.


(రాజయోగానందస్వామి చెప్పిన మాటలు విని ఆ జ్యోతిష్యుడు

భయపడి ఇంటికి పోయాడు. స్వామి చెప్పుచున్నపుడు ఆ సమాచారమును

అంతావిన్న రాఘవ, దుందుభి, రాధేశ్వరి ముగ్గురూ ఆశ్చర్యపోయారు.

అప్పుడు రాఘవ ఈ విధముగా అడిగాడు.)


రాఘవ :- ఇంతపెద్ద రహస్యమును తెలుసుకోవడమేకాక, ఆ బాలునికి

కొన్ని శక్తులను కాపలాగా పెట్టిన వ్యక్తి సామాన్యుడై ఉండడు. ఎవరో

గొప్ప శక్తిగల వ్యక్తే అయివుంటాడు.


దుందుభి :- బాలుని విషయము తెలుసుకోవాలని ప్రయత్నిస్తేనే చంపివేయు

అతను ఎవరో ప్రమాదభరితమైన వ్యక్తి అయివుంటాడు.

రాధేశ్వరి :- బాలుని మీద ఆశపెట్టుకొన్న అతని శక్తిని అణచివేసేందుకు

చేసే ప్రయత్నములోని భాగమే నాపెళ్ళి అని తెలియుచున్నది. లోకములను

హింసించు వారిని అణచివేయుటకు మీరు చేయు ప్రయత్నములో మేము

భాగస్తులమై ఉపయోగపడుచున్నందుకు మేము అదృష్టవంతులమని అను

కొంటున్నాను.


రాజయోగానంద :- మనవద్ద కొంత జ్ఞానశక్తి ఉన్నది, కాబట్టి అతని


మంత్ర శక్తులు మనమీద పని చేయలేవు. ఇంకొక విషయమేమంటే ఆ

మంత్ర శక్తులు మనమీద పని చేయలేవు. ఇంకొక విషయమేమంటే

బాలుని విషయము మనకు తెలుసునని అతనికి తెలియదు. అతడు ఇంకా

కొంత శక్తిసంపన్నుడు కాబోతున్నాడు. చివరి సమయములో అతనిని

ఎదుర్కోవ డము మనకు కూడా కష్టముగా ఉంటుందేమో చెప్పలేను. అతను

ఇప్పటికే కొంత శక్తికల్గిన వ్యక్తిగా ఎన్నో కార్యములను సాధించాడు. అయినా

అతని ఆశకు పరిమితిలేదు. ఎన్నో దుష్టకార్యములను చేయుటలోనూ

ఆరి తేరినవాడు. ఇంతవరకు ఆయన అందరకీ మంచివానిగానే

కనిపిస్తున్నాడు. ఆయన చేసే మంచిపనులు పది (10) ఉండగా, తొంభై

(90) చెడు పనులే ఉన్నాయి. ఆయన పెద్ద స్వామిగా పేరుగాంచిన

తపస్విబాబాగారు. ఇది వరకే ఆయన భువనేశ్వరి దేవాలయములో

కాజేయాలనుకొన్న వజ్రముల విషయములో మనము అడ్డు తగిలాము.

ఆ విషయములో ఆయనకు మనము పూర్తి శత్రువులుగా కనిపించాము.

కానీ ఈ బాలుని విషయములో మాత్రము ఇంతవరకు మన ఉద్దేశము

ఆయనకు తెలియదు. ఆ బాలుని విషయము మనకు తెలిసినట్లు కూడా

ఆయనకు తెలియదు. పదహారు (16) సంవత్సరములకు ఆ బాలునికి

యుక్తవయస్సు వచ్చునప్పటికి మనము బహిరంగముగా ఆ బాలుని

విషయములో అడ్డుపడవలసి వస్తుంది. అప్పుడు బాబాకు మనము

ముఖ్యమైన శత్రువులుగా మిగిలిపోతాము. అప్పుడు ఆయన మనలను

అంతము చేయాలని చూస్తాడు. అందువలన అలా జరుగుటకు

వీలులేకుండా ముందే జాగ్రత్తపడుచున్నాము.


(రాజయోగానంద స్వామి ముందు జాగ్రత్తగా రాఘవ, రాధేశ్వరి

వివాహమును జరిపించాడు. మల్లుదొర, దుందుభి దగ్గరుండి రాఘవకు

పెళ్ళి చేయడము జరిగినది.)





(తపస్విబాబాగారు అష్టగ్రహ కూటమి రోజున పుట్టిన బాలుని

ద్వారా శక్తిని పొందుటకు ఆ బాలునికి యుక్తవయస్సు 16 సంవత్సరములు

వచ్చు వరకు వేచి ఉండవలసిందే. అన్ని సంవత్సరములు ఆ బాలున్ని

కాచుకొని ఉండునట్లు తన శక్తులను నియమించి, ఇక వజ్రాల విషయమును

చూడాలనుకొన్నాడు. అప్పుడు మునెప్పతో ఇలా మాట్లాడాడు.)


తపస్విబాబా :- మునెప్పా, నీవు మాంత్రికులను ఉత్సాహపరిచి వారిద్వారా

వజ్రముల ఆచూకీ తెలుసుకో, నేను నా శక్తుల ద్వారా ప్రయత్నిస్తే ఏమాత్రము

తెలియడములేదు.


మునెప్ప :- బాబాగారూ, ఈ మాంత్రికులు వజ్రాలకొరకు అంజనములో

చూచి పాముకొట్టిందని భయపడిపోయారు. అంజనము కూడా పోలేని

జాగాలో ఆ వజ్రాలున్నాయి. అందువలన అవి కనిపించడములేదు

అంటున్నారు. పైగా పాము భయముతోవారు వజ్రాల విషయమంటేనే

వణికి పోవుచున్నారు.


తపస్విబాబా :- అలాగైతే ఒకపనిని ఉపాయముగా ఎవరికీ తెలియకుండా

చేయాలి. అదేమనగా నకిలీ వజ్రములను తీసుకొనివచ్చి భువనేశ్వరి

దేవాలయములో భువనేశ్వరి దేవి ప్రతిమ ముందర పెట్టండి. నకిలీ వజ్రము

లను కవరులో పెట్టి, అదే కవరులోనే ఒక ఉత్తరము కూడా పెట్టండి.

ఉత్తరములో "మేము ఈ వజ్రములను దొంగిలించినది తప్పు. మేము

వీటిని తీసుకపోయినప్పటి నుండి మాకు అనారోగ్యమైనది. అందువలన

వీటిని నీ ముందరే పెట్టుచున్నాము. మమ్ములను క్షమించి మా ఆరోగ్యము

బాగుపడునట్లు చేయి తల్లీ" అని వ్రాసివుంచండి. అలా ఉంచడమువలన

తిరిగి వజ్రముల విషయము బయటికి తెలుస్తుంది. అలా తెలియడము

వలన అసలైన వజ్రములు ఎక్కడున్నదీ వాటి వివరమును తెలిసినవారు


మాట్లాడుకొందురు. అప్పుడు గోకర్ణ విద్యలోని కర్ణపిశాచిని ఆదేశించి

వజ్రముల సమాచారమును తెలుసుకోవచ్చును. అందువలన నీవు వెంటనే

నకిలీ వజ్రములను తయారు చేయించి భువనేశ్వరి దేవాలయములో పెట్టే

ఏర్పాటు చేసిపెట్టు.


మునెప్ప :- మనవారు వజ్రాల విషయమంటేనే విసిగిపోయారు. ఇంతేకాక

ముందు పోయినవారు ఆ గుడిదగ్గరకు పోవడము మంచిది కాదు.

అందువలన ఈ పనికి ఎవరిని వినియోగించాలో మీరే చెప్పండి.


తపస్విబాబా :- ఈ పనిని తెలివితక్కువ వారు చేయకూడదు. మారు

వేషములో పోతారు కావున ముందు పోయినవారు పోయినా ఫరవాలేదు.

ఒకరిని పని కొరకు, ఒకరిని సమాచారమును సేకరించుటకు, ఒకరిని పై

నిఘా కొరకు పంపవలెను.


(బాబాగారు చెప్పినట్లే మునెప్ప తన మనుషులను మారువేషములో

భువనేశ్వరి దేవాలయమునకు పంపాడు. భువనేశ్వరి ఆలయమునకు

పోయిన మునెప్ప మనుషులు, మునెప్ప చెప్పినట్లే చేశారు. ఆ రోజు రాత్రి

అక్కడి పూజారులు కవరునూ, అందులోని వజ్రములనూ, దొంగలు వ్రాసిన

జాబునూ చూచి వెంటనే పోలీస్వరికి తెలిపారు. ఆ విషయము

తెలుసుకొన్న పోలీస్లు గుడికి వచ్చి విషయమును తెలుసుకొని, ఆ

విషయమును మీడియాకు చెప్పారు. వెంటనే భువనేశ్వరి దేవాలయములో

దొంగిలించ బడిన వజ్రములు తిరిగి ఆలయము చేరాయని అన్ని పత్రికలలో

వార్తలు వచ్చాయి. ఆ వార్తలను చూచిన బాలప్ప ఇదెలా సాధ్యము? ఇదేదో

మోసమను కొన్నాడు. కానీ తాను చెప్పినా డిపార్టుమెంటులో ఎవరు తన

మాటను నమ్మరని తెలుసు. అందువలన ఊరక ఉండిపోయాడు.

విషయమును చూచిన రాజయోగానంద స్వామి తపస్విబాబాగారి


కుతంత్రమును గ్రహించి వజ్రముల విషయమును మాట్లాడకూడదను

కొన్నారు. వజ్రాల వార్త చివరికి డి.జి.పి గారి దగ్గరకు కూడా పోయింది.

డి.జి.పి గారు ఇదెలా సాధ్యమగు నని, వజ్రాలు దొంగల చేతులలో లేనిది,

దొంగలు ఎలా తెచ్చి గుడిలో ఉంచుతారని అనుకొన్నాడు. ఇది దొంగలు

పన్నిన పన్నాగమని డి.జి.పి గారు ఆలోచించలేకపోయాడు. మొదటినుండి

వజ్రములు ఎక్కడున్నది తనకు తెలుసు. వజ్రములు మాయము కావడములో

ఎవరి పాత్రవున్నది కూడా తెలుసు. చివరికవి రాజయోగానంద స్వామివద్ద

వున్న విషయము కూడా తెలుసు. అయినా ఈ వార్త ఏమిటి? అను

సందిగ్ధములో పడి ఒకమారు రాజయోగానంద స్వామితో మాట్లాడితే

విషయమంతా తెలుస్తుంది కదా అనుకొన్నాడు. అప్పుడు డి.జి.పి ఫోన్

దగ్గరకు పోయి రింగ్ చేయాలనుకొన్నాడు. అలా ఆయన ఫోన్ తీయకనే

రింగ్ మ్రోగింది. వెంటనే డి.జి.పి రిసీవర్ తీసుకొని హలో డి.జి.పి హియర్

అన్నాడు. “నేను రాజయోగానందను మీరు నన్ను ఏ విషయము

అడగవద్దండి. మీరు విన్నది కుట్రలోని భాగము" అని ఫోన్ పెట్టేశాడు.

డి.జి.పి.కి అప్పటికి కొంత అర్థమై నాదే పొరపాటని అనుకున్నాడు.)


(జమీందారు రావుబహదూర్ జ్యోతిష్యుని కోసము కాచుకొని నెల

రోజులు చూచాడు. చివరకు ఆ జ్యోతిష్యుడు కూడా భయపడి పోయాడని

అనుకొన్న జమీందారు చివరకు అతని కొరకు ఎదురు చూడడము మానివేసి

వేరే ప్రయత్నము చేయాలనుకొన్నాడు. అంతలో ఆ బాలునికి ఒక

సంవత్సరము వయస్సు వచ్చింది. బాలుడు ఈశ్వర్ చిన్నగా నడుస్తూ

ఇంటి బయటికి పోయాడు. ఆ రోజు అమావాస్య అయినా ఎవరికి దానిమీద

ధ్యాసలేదు. ఈశ్వర్ను ఎత్తుకొని లోపలికి తీసుకురావాలని పని మనిషి

బయటికి వచ్చింది. అంతలో ఒక తిక్కపట్టిన గుర్రము పరుగిడుచూ


వచ్చింది. అది ఊరంతా, బజార్లవెంట పరుగెత్తుచూ అడ్డువచ్చిన వారిని

కరవడము, కాళ్ళతో తన్నడము చేస్తూవుంది. అటువంటి పిచ్చి గుర్రమును

ఊరునుండి తరిమి వేయాలని చాలామంది దానిని తరమగా, అది ఎవరికి

దొరకకుండా ఈశ్వర్ ఉన్న దారిలో వేగముగా పరుగెత్తుతూ వచ్చింది.

అదివచ్చే వేగమునకు అందరూ భయపడి ప్రక్కకు పారిపోయారు. ఈశ్వర్ను

తీసుకపోవాలని బయటికి వచ్చిన పని మనిషి గుర్రమును చూచి ముందుకు

పోలేక వెనక్కు అడుగువేసింది. ఆ గుర్రము వేగముగా ఈశ్వర్వైపు వచ్చింది.

దానిని చూచిన అందరూ ఈశ్వర్ గుర్రము కాళ్ళక్రింద పడిపోతాడని

అనుకున్నారు. వేగముగా వచ్చిన గుర్రము ఈశ్వర్కు ఆరు అడుగుల

దూరములో కుప్పకూలి క్రిందపడిపోయింది. గుర్రము ఈశ్వర్ దగ్గరికి

రాకనే క్రింద పడిపోవడము జరిగిన వెంటనే అక్కడున్న వారు ఈశ్వర్ను

ఇంటిలోపలికి తెచ్చారు. క్రింద పడిన గుర్రము కాళ్ళు విదిలిస్తూ లేవలేక

క్రిందనే పడివుంది. కొద్దిసేపటికి అది చనిపోయింది. ఈశ్వర్వైపు

వచ్చిన గుర్రము అలా చనిపోవడము అందరికీ విచిత్రముగా తోచింది.

ఈ విషయమును రావుబహదూర్ విని అప్పటినుండి ఆ బాలున్ని గొప్పగానే

చూచుకొనేవాడు. బాలున్ని జాగ్రత్తగా చూచుకొమ్మని ఒంటరిగా వదలవద్దని

అతని పని మనుషులకు చెప్పాడు.)



(రాఘవ పెళ్ళైన తర్వాత సంవత్సరమునకు కొడుకు పుట్టాడు.

రాఘవ కొడుకుకు రాజయోగానంద స్వామి అక్షయ్ అని పేరు పెట్టాడు.

తర్వాత రెండు సంవత్సరములకు ఒకరు చొప్పున అమర్, అక్షుత్ అను

ఇద్దరు కొడుకులు పుట్టారు. రాఘవకు ముగ్గురు కొడుకులు పుట్టడము

అక్కడి వారందరికి సంతోషమైనది. దుందుభికి సంతానములేదు, కనుక


రాధేశ్వరి కొడుకులను తన స్వంత కొడుకులుగా భావించి పెంచసాగింది.

ఈ విధముగా సంతోషముగా కాలము గడచి పోవుచున్నది.)


(తపస్వి బాబాగారు తన ఆశ్రమములో వజ్రాల విషయమును

గురించి చింతిస్తూ, నకిలీ వజ్రములను దేవాలయములో ఉంచితే అంతటితో

ఆ విషయము ఆగిపోయింది. కానీ అసలైన వజ్రాల విషయము తెలియ

కుండా పోయినది. దాదాపు ఏడు సంవత్సరముల కాలమైనా వాటి ఆచూకీ

తెలియకుండా పోయినది. ఎప్పుడు ఎన్ని ప్రయత్నములు చేసినా అవి

ఎక్కడున్నది కూడా తెలియకుండా పోయింది. ఇంత ధనబలము, మంత్ర

బలము ఉండికూడా ఏమీ ప్రయోజనము లేకుండా పోయినది అనుకొన్నాడు.

అలా అనుకొంటూనే తర్వాత ఒక సంవత్సరము గడిచి పోయింది. అప్పటికి

ఎనిమిది సంవత్సరములు గడిచిపోయింది. ఉన్నట్టుండి ఒకరోజు భువనేశ్వరి

దేవాలయములో ఆభరణములు వజ్రములు దొంగలు ఎత్తుకు పోయినట్లు

వార్తలు వచ్చాయి. రాజయోగానంద స్వామి ఆ వార్తలకు స్పందించలేదు.

తపస్విబాబాకు, మునెప్పకు ఆ వార్త తెలిసి మాకంటే మించిన దొంగలు

ఎవరున్నారని ఆలోచించసాగారు. ఈ మారు గుడిలోనికి పోయి చూచిన

పోలీసులకు కొన్ని ఆధారములు దొరికాయి. దొరికిన ఆధారముల ద్వారా

దొంగలను పట్టుకోవచ్చని పోలీసులు తలచారు.


భువనేశ్వరి దేవాలయములో దొంగతనము జరిగిన రోజు రాత్రి

పదకొండు గంటల వరకు భజన కార్యక్రమము ఉండెను. ఆ రోజు గుడిలో

జఠాజూట స్వామి కూర్చొని ఉండగా, ఆ స్వామి భక్తులు వందలాది మంది

వచ్చి భజన చేశారు. ఆదివారము రోజున భజన కార్యక్రమము సాయం

కాలము ఐదు గంటలనుండి రాత్రి పదకొండుగంటల వరకు, ఉదయము


ఐదు గంటలనుండి పగలు పదకొండుగంటల వరకు జఠాజూట స్వామి

ఆధ్వర్యములో జరుగును. జఠాజూటస్వామి భజనలో చాలామంది భక్తులలో

పూనకాలు వస్తాయని ముందే చెప్పుకొన్నాము కదా! స్వామి ఆధీనములో

నున్న భూత, ప్రేత, పిశాచములు కొందరి భక్తులలోనికి వచ్చి ఇష్టము

వచ్చినట్లు ఎగిరి, నాట్యమాడునని తెలుసు. ఆ రాత్రి భజన సమయములో

చాలామందికి పూనకాలు వచ్చాయి. కొందరు ఎగురుచుంటే, కొందరు

పరుగిడుచుంటే, కొందరు వివిధ రకముల నాట్యములు చేయుచు వుంటే,

కొందరు తూగుతూ, కొందరు ఊగుతూ ఉన్నారు. అలాంటి గందరగోళ

సమయములో భజన అయిపోతుంది. అదే సమయములో పూజారి తీర్థము

కొరకు చాలామంది ప్రాకులాడుచున్నపుడు, పూజారి గమనించకుండా

ఒకరు పూనకము వచ్చినట్లు నటిస్తూ గర్భగుడిలోనికి పోయాడు. అందరి

కన్నుగప్పి పోయిన వ్యక్తి లోపలనున్న వాకిలి పరదాగుడ్డలను తనమీద

వేసుకొని ఒకమూల కూర్చున్నాడు. అంతలో భజన అయిపోవడము గుడి

తలుపులు వేయడము జరిగింది. గర్భగుడిలోనికి పోయినది జఠాజూట

స్వామి యొక్క మనిషే! అతనికి అలా పొమ్మని జఠాజూట స్వామియే

చెప్పాడు.


అలా తన మనిషిని గర్భగుడిలోనికి ఆ రాత్రి జఠాజూటస్వామి

ఎందుకు పొమ్మని చెప్పాడనగా! భువనేశ్వరిదేవి యొక్క వజ్రములు

గతములో ఎనిమిది సంవత్సరముల క్రితము దొంగతనమునకు గురి అయిన

విషయము అందరికీ తెలుసు. తర్వాత వజ్రములను చీటీ వ్రాసి కవరులో

పెట్టి పోవడము కూడా అందరికి తెలుసు. అలా పెట్టి పోయిన వజ్రములు

నకిలీవని దేవాలయము వారుగానీ, పోలీసులుగానీ గుర్తించలేక పోయారు.

ఆ విషయము జఠాజూట స్వామికి కూడా తెలియదు. తిరిగి వచ్చిన



వజ్రములను ముందు దాచినచోట దాచకుండా, ఈమారు గర్భగుడిలో

పైన ఉంచిన పెట్టెలో దాచడం జరిగినది. గర్భగుడిలోనికి పోయినా ఎవరూ

పైకి చూడరను ఉద్దేశముతో ఆలోచించి కొన్ని ఆభరణములను వజ్రములను

దాచడము జరిగింది. అలా దాచిన విషయము కొన్ని సంవత్సరములకు

జఠాజూట స్వామికి తెలిసింది. మొదటినుండి వజ్రాలను కాజేయాలను

ఉద్దేశముతో నున్న జఠాజూట స్వామికి ముందు జరిగిన దొంగతనముతో

కొంత నిరుత్సాహము ఏర్పడినా, తిరిగి వజ్రములు ఆలయములోనికి

చేరినప్పటినుండి వాటిని తస్కరించవలెనను చింతలోనే ఉండెను. అయినా

అవి ఎక్కడున్నదీ తెలియక ఇంతకాలము ఆగివున్న జఠాజూట స్వామికి

వజ్రములు గర్భగుడి లోనే ఉన్నవను విషయము చివరకు తెలిసిపోయింది.

అప్పుడు తెలివిగా వాటిని దొంగలించాలను ఉద్దేశ్యముతో భజన కార్యమును

పెట్టి, పథకము ప్రకారము ఆ రోజు రాత్రి తన మనిషిని గర్భగుడిలోనికి

పంపాడు. రాత్రి పదకొండు నుండి తెల్లవారు జామున ఐదుగంటల వరకు

వ్యవధి ఉండుట వలన లోపలికి పోయిన మనిషి వాటిని తీసుకొని

ఉండడము జరిగినది. ప్రాంతఃకాలములోనే ఐదు గంటలకు గర్భగుడి

తలుపులు తీసినపుడు లోపల వున్న వ్యక్తి ఎవరు గమనించకుండ బయటికి

రావడానికి సరిగ్గా గర్భగుడి తలుపులు తీసినపుడు తమవద్ద దాచుకొన్న

పామును గుడిలో వదలి జఠాజూట స్వామి భక్తులు గందరగోళ పరిస్థితిని

సృష్టించారు. అలా జరుగుచున్న గందరగోళములో కొందరు స్వామి భక్తులు

గర్భగుడిలోనికి పాము భయముతో పోవునట్లు చేసి, అలా లోపలికి పోయిన

వారిలో వజ్రములను దొంగిలించిన మనిషి కలిసి వచ్చునట్లు చేశాడు.

ఈ విధముగా ఆ రోజు రాత్రి జఠాజూట స్వామి తన పథకము ప్రకారము

వజ్రాలను సంపాదించాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ వజ్రములను



బాగా గమనించిన జఠాజూట స్వామి అవి అసలైన వజ్రములు కావనీ,

తాము దొంగిలించిన వజ్రములు నకిలీవని తెలుసుకోగలిగాడు. తమ

దగ్గర ఉన్నవి నకిలీ వజ్రములైతే అసలైన వజ్రములెక్కడ ఉన్నాయని

ఆలోచించాడు. దేవస్థానము యొక్క ధర్మకర్తయే అసలైన వజ్రములను

తీసుకొని నకిలీ వజ్రములను ఆలయములో ఉంచాడని అనుకొన్నాడు.


ఆలయ ధర్మకర్తమీద జఠాజూట స్వామికి అనుమానము వచ్చిన

తర్వాత ధర్మకర్త మోసమును బయటపెట్టాలనుకొన్నాడు. రెండు రోజుల

తర్వాత న్యూస్ పేపర్ వాళ్ళకు ఆకాశరామన్న ఉత్తరము వ్రాసాడు. అందులో

భువనేశ్వరి ఆలయములోని నగలు నకిలీవని, అసలైన వజ్రములను ధర్మకర్త

నొక్కేశాడని, గుడిలోని వజ్రములను దొంగిలించిన తర్వాత అవి నకిలీవని

తెలిసినదనీ, తాము కష్టపడి దొంగతనము చేసినా ప్రయోజనము లేక

పోయిందని వ్రాసి, ఆ ఉత్తరమును పోలీస్ వారికి పంపాడు.   ఆ

ఉత్తరమును చూచిన పోలీస్లకు గుడిలోని వజ్రములు దొంగలించబడ్డాయని

తెలిసింది. ఆలయమునకు సంబంధించిన వారు ఎవరూ తమకు

దొంగతనమును గురించి చెప్పలేదే అనుకొని, ఆ విషయమును

విచారించదలచి సి.ఐ భువనేశ్వరి దేవాలయమునకు పోయి వజ్రములను

గురించి విచారించాడు. ఆలయము వారు అసలుకు దొంగతనమే

జరుగలేదని చెప్పారు. అప్పుడు తనకు వచ్చిన ఉత్తరమును సి.ఐ

దేవాలయము వారికి చూపించాడు. దానిని చూచిన ధర్మకర్త సి.ఐ తో

ఇలా అన్నాడు.


ధర్మకర్త :- మొదట ఎనిమిది సంవత్సరముల క్రితము దొంగతనము జరిగిన

తర్వాత మేము కొంతమంది ఆలోచించి అమ్మవారికి వాడే నగలను

ఒకచోటా, వాడని నగలనూ వజ్రములను మరియొకచోట


 ఉంచాలనుకొన్నాము. తర్వాత వజ్రములనూ, మరికొన్ని అలంకారమునకు

పనికిరాని నగలనూ కలిపి మరియొక చోట పెట్టాము. రెండవమారు

వజ్రములు ఎక్కడ పెట్టినది బయటివారికి ఎవరికీ తెలియదు. తెలిసినా

వాటిని దొంగిలించుటకు వీలుకాదు. వాటిని మేము తీయాలన్నా ఒకగంట

కాలము పట్టుతుంది.


సి.ఐ :- అయితే ఈ ఉత్తరమును దొంగలే వ్రాసినట్లు ఉందికదా!

ధర్మకర్త :- అలా వ్రాస్తే మీరు మేము వాటిని చూచే ప్రయత్నము చేస్తాము

కదా! అప్పుడు అవి ఎక్కడున్నది తెలుసుకోవచ్చని అలా వ్రాసి ఉండవచ్చును.

లేకపోతే ధర్మకర్తమీద బురద చల్లేదానికి ఆలయమునకు సంబంధించిన

వారే అసూయతో అలా వ్రాసి ఉండవచ్చును.

సి.ఐ :- అయితే ఒక పనిని చేయండి. మేము వచ్చి విచారించినట్లు,

ఆలయములో ఎటువంటి దోపిడీ జరుగలేదన్నట్లు మీరు మాకు వ్రాసి

ఇవ్వండి.


ధర్మకర్త :- అలాగే వ్రాసి ఇస్తాము. మేము చెప్పేమాట నిజమని తెలియుటకు

వజ్రములను ఎలా దాచామో కూడా మీకు చూపుతాము రండి..


(అని చెప్పి సి.ఐ.ని పిలుచుకొని గర్భగుడిలోనికి పోయి పైన కట్టి

పెట్టిన పెట్టెను చూపాడు. సి.ఐ కూడా గర్భగుడిలో భద్రముగానున్న పెట్టెను

చూచారు. వజ్రములను గురించి తప్పుడు సమాచారమును ఇచ్చారని

సి.ఐ అనుకొని అక్కడినుండి బయలుదేరిపోయి, యస్. పిగారితో కలిసి

విషయమంతా చెప్పాడు అప్పుడు పోస్టులో వచ్చిన ఆ లెటర్ను యస్.పి

గారు చదివి, తర్వాత లెటర్వెనుక వైపువున్న పోస్టు ముద్రను చూచాడు.

అలా చూడడము వలన ఆ జాబు ఎక్కడినుండి వచ్చినదో తెలుస్తుందని

చూచాడు. దానిమీద రెండు ముద్రలు అదే ఊరికి సంబంధించినవిగా


ఉండడము గమనించాడు. దానినిబట్టి ఆ ఉత్తరము స్థానికులే వ్రాసినట్లు

అర్థమైనది. దానిని చూచిన తర్వాత సి.ఐతో యస్.పి గారు ఇలా అన్నాడు.

యస్.పి :- ఈ జాబు ఇదే ఊరునుండి స్థానికులే వ్రాసారనుటకు

ఆధారమున్నది. కానీ దొంగతనము జరుగలేదనుటకు ఆధారమున్నదా?

సి.ఐ :- నేను పోయి చూచి వచ్చాను కదా సార్.

యస్.పి :- నీవు చూచినది పెట్టెను మాత్రమే, ఆ పెట్టెలో వజ్రములున్నదీ

లేనిదీ నీవు చూడలేదు కదా!

సి.ఐ :- లేదుసార్, వారు ఏమి జరగలేదని చెప్పారు.

యస్.పి :- వాళ్ళు కూడా నీవు చూచినట్లే పై పెట్టెను చూచి చెప్పివుంటారు.

లెటర్ వచ్చిన తర్వాత కూడా నీవు పూర్తిగా చూడలేదంటే నీవు పోలీస్

డిపార్టుమెంట్లో పనికిరావు. మేము కష్టపడి దొంగతనము చేసినా ఫలితము

లేకుండాపోయిందని వ్రాశారు. అసూయతో ధర్మకర్తను ఇబ్బంది పెట్టుటకే

అయితే, వజ్రములు నకిలీవున్నాయి, ధర్మకర్త వాటిని మార్చి ఉండవచ్చును

అని మాత్రమే వ్రాసి ఉండేవారు. ఇక్కడ వ్రాసిన వారు స్థానికులే, కావున

వారికి అన్ని అనుకూలములు సరిపోయినపుడు దొంగతనము చేసివుండ

వచ్చును. ముందు నీవు పోయి వజ్రములున్నవో లేదో చూచుకొనిరా.

(ఆ మాటతో ఖంగుతిన్న సి.ఐ అక్కడినుండి భువనేశ్వరి

దేవాలయము వద్దకు పోయి, ధర్మకర్త సమక్షములో పెట్టెను దించి చూచారు.

పెట్టెలోపల వజ్రములు లేకుండ పోయినది చూచిన వారంతా ఆశ్చర్య

పోయారు. అంతేకాక ఆ పెట్టెలో దొంగతనము చేయబడిన దినము

పేరూ, తేదీ వ్రాసిన చీటీ కూడావుంది. ఆ చీటిని సి.ఐ తీసుకొనిపోయి

యస్.పి గారికి కూడా చూపించారు. కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు

ప్రారంభించాడు.)


(రావుబహదూర్ జమీందారు ఇంటిలో ఈశ్వర్ ఆరోగ్యముగా

పెరుగుచున్నాడు. జమీందారు ఆర్థిక పరిస్థితి కూడా ఆ బాలుడు ఇంటికి

వచ్చినప్పటినుండి చాలా అభివృద్ధి అయినది. రావుబహదూర్ కూడా ఈశ్వర్

వలన సంతోషముగా ఉన్నాడు. అతని మీద ఉన్న అనుమానములన్నిటిని

లేకుండా చేసుకొన్నాడు. అలా జరిగిపోతున్న కాలములో ఒక దినము ఆ

ఊరిలోనికి కాటికాపరి (స్మశానములో కాపలావుండి శవాలకు డబ్బు వసూలు

చేయువాడు) వచ్చాడు. అతను తన మంత్రవిద్యను ప్రదర్శిస్తూ, ఊరంతా

ఇంటింటికి తిరిగీ, కొందరు ఇచ్చిన డబ్బులు తీసుకొని పోయేవాడు.

ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే తన మంత్రములతో తేళ్ళను, పాములను

సృష్టించి భయపెట్టి డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని లేకుండా

చేసిపోయెడివాడు. అలా ఇల్లిల్లూ తిరుగుతూ కాటికాపరి చివరకు జమీందారు

ఇంటికి వచ్చి తనకు దక్షిణ ఇవ్వమన్నాడు. ఆ సమయానికి జమీందారు,

ఆయన భార్య ఇద్దరూ ఇంటిలో లేరు. కావున తర్వాత రమ్మని ఇంటిలోని

పనిమనుషులు చెప్పారు. అయినా ఆ కాటికాపరి ఇల్లు వదిలి పోలేదు.

అప్పుడు ఈశ్వర్ కూడా బయటికి వచ్చి అమ్మానాన్న లేరని చెప్పినా

వినకుండా మొండిగా ఉంటూ, తేళ్ళను సృష్టించి వదలితే డబ్బులు ఇచ్చి

పంపుతారని, ఒక మంత్రమును చెప్పుచూ వేప ఆకును పెరికి చల్లాడు.

అలా ఆకులను చల్లుట వలన ఆకులన్నీ తేళ్ళుగా కనిపించును. కానీ

అక్కడ వేపాకు తేళ్ళుగా మారలేదు. ఈశ్వర్ వింతగా చూస్తూ అక్కడే

నిలుచున్నాడు. కాటికాపరి రెండవ మారు పాములను కనిపించునట్లు

చేయాలనుకొన్నాడు. అప్పుడు కూడా అతని మంత్రము పని చేయలేదు.

అప్పుడు కాటికాపరికి ఏమీ అర్థముకాక అక్కడినుండి వెళ్ళిపోయాడు.


అదే ఊరిలోనే మరొక ఇంటిదగ్గర తన మంత్రమునకు పాములు,

తేళ్ళు తయారైనవి. కానీ ఒక్క జమీందారు ఇంటివద్ద మాత్రమే పని

చేయకుండా పోయినట్లు కాటికాపరి గ్రహించాడు. ఆ ఇంటిలో ఏదో

పెద్దశక్తి ఉంటేనే తన మంత్రశక్తి అక్కడ పనిచేయలేదనుకొన్నాడు.

ఇంటిలోని శక్తి ఏమిటో తెలుసుకొనుటకు తన గురువు పెద్ద కాటికాపరి

వద్దకు పోయి ఆ విషయమును చెప్పాడు. ఆ విషయమును విన్న పెద్ద

కాటికాపరి తనకున్న శక్తితో ఆ ఇంటిలోని ఈశ్వర్ ద్వారా అట్లు జరిగిందని

తెలుసుకొన్నాడు. అతనికి తెలిసిన విధానము ప్రకారము ఆ బాలున్ని

చనిపోవునట్లు చేసి, అతనిని స్మశానములో పూడ్చి పెట్టిన తర్వాత, ఆ

బాలుని కుడి చేతి ఎముకను తీసి పెట్టుకొంటే తమకు కూడా అటువంటి

శక్తులు లభించునని తెలుసుకొన్నాడు. ఆ బాలున్ని చంపుటకు తమకు

తెలిసిన చేతబడిని చేసి, 40 దినములకు అతనిని చనిపోవునట్లు చేసి,

తర్వాత ఆ ఇంటివారు తెచ్చి స్మశానములో పూడ్చిపెట్టిన 30 రోజులకు

పూజచేసి చేతి ఎముకను తీసుకోవాలనుకొన్నాడు. వెంటనే దానికి కావలసిన

ఏర్పాట్లన్నీ చేసిపెట్టుకొని, ఒక దినము ఈశ్వర్ మీద చేతబడి ప్రయోగించి,

అతను చనిపోవునని 40 రోజుల వరకు కాచుకొని ఉన్నాడు. ఈ పనిని

ఇద్దరు కాటికాపర్లు చేశారు. చివరకు 40 రోజులు గడచి పోయాయి.

అయినా ఈశ్వర్ చనిపోలేదు. ఈశ్వర్ చావుకొరకు అన్నీ సిద్ధము చేసుకొన్న

వారికి ఏమీ అర్థముకాలేదు. అలా ఈశ్వర్ మీద చేతబడి చేసిన వెంటనే,

ఈశ్వర్ను అనుసరించివున్న శక్తులు కాటికాపర్ల మంత్రములను లేకుండా

చేశాయి. ఆ దినముతో వారు ఖాళీ మనుషులు అయిపోయారు. అలా

వారి మంత్రములు ఒక్క దెబ్బతో పోయాయి.


ఈశ్వర్ తన పదవ ఏట హైస్కూల్కు పోయి చదువుచున్నాడు.

అతనికి ప్రతి సబ్జెక్ట్ ను మంచి మార్కులు వచ్చేవి. స్కూల్లోనూ, క్లాస్


లోనూ మంచి పేరు తెచ్చుకొన్న ఈశ్వర్ మార్కులలోనూ అందరికంటే

మొదటనే ఉన్నాడు. అతని ప్రవర్తన మరియు చదువును చూచిన టీచర్లందరూ

ఈశ్వర్ను మెచ్చుకొనేవారు. ఒక దినము తన స్నేహితులతో కలిసి

స్కూల్నుండి వస్తున్నపుడు, ఆ దారిలోనే ఒక దయ్యము ఒక ఆడ మనిషిని

ఆవహించివుంది. ఆమె ముందర ఒక మాంత్రికుడు ఆ దయ్యమును

వదలించు పనిలో ఉన్నాడు. తనను వదిలి పొమ్మని మాంత్రికుడు చెప్పగా,

ఆ దయ్యము ఆ మాంత్రికుని మీదికి తిరగబడింది. నేను వదలిపోను అని

చెప్పింది. దానికి మాంత్రికునికి కోపము వచ్చి వేపమండలతో దయ్యము

పూనిన ఆడ మనిషిని కొట్టాడు. అప్పుడు ఆ దయ్యమునకు మాంత్రికుని

మీద కోపము వచ్చి అతనిని తిరిగి కొట్టను మొదలు పెట్టింది. అక్కడున్న

వారు అడ్డువచ్చినా ఆ దయ్యము అతనిని వదలకుండా కొట్టుచున్నది.

ఇలాంటి గందరగోళము అక్కడ జరుగుచుండగా ఈశ్వర్ ఆ దారిలో పోతూ

అక్కడికి వచ్చి ఏమి జరుగుచున్నదో చూడాలను కొన్నాడు. ఈశ్వర్ అక్కడికి

రాగానే ఆ దయ్యము ఈశ్వర్ను చూచింది. అంతవరకు ఎవరు అడ్డువచ్చినా

మాంత్రికుని వదలకుండా కొట్టుచున్న దయ్యము ఈశ్వర్ను చూస్తూనే

ఒక్కమారుగా ఆగిపోయింది. భయముతో వణకుచూ నేను పోతాను అని

అరుస్తూ కొంత దూరము పరిగెత్తి క్రిందపడిపోయి ఆమెనుండి బయటికి

పోయింది. అంతవరకు ఎవరిమాటా వినని దయ్యము ఈశ్వర్ అక్కడికి

వస్తూనే అలా పారిపోవడముతో ఈశ్వర్ గొప్పవాడని అక్కడున్న వారు

అనుకొన్నారు. ఈ విధముగా చిన్నచిన్న సంఘటనలు అప్పుడప్పుడు

జరుగుచుండేవి.


ఈశ్వర్కు చదువు చెప్పు స్కూల్ టీచరు రావుబహదూర్ గారిని

లక్ష రూపాయలు అప్పు అడిగాడు. ఆ సమయానికి అంత డబ్బులేని


దానివలన మరియు ఇచ్చినా తిరిగిరాదను అనుమానముతోనూ జమీందారు

డబ్బులేదని చెప్పాడు. తనకు డబ్బు ఇవ్వలేదని ఆ టీచర్ జమీందారు

మీద కోపముతో ఉండెను. ఒక దినము రావుబహదూర్ మీద కోపముతో

ఈశ్వర్ ఏ తప్పు చేయకున్ననూ, ఈశ్వరు చెంపమీద కొట్టాడు. ఈశ్వర్కు

చెంపమీద దెబ్బతగిలిన వెంటనే ఆ టీచర్కు కుడిచేయి, కుడికాలు, నోరు

స్వాధీనములో లేకుండా పోయాయి. పార్శవాయువు వచ్చి క్రిందపడి

పోయాడు. ఈశ్వర్ను కొట్టినందుకే ఆ టీచర్కు అలా జరిగిందని అక్కడున్న

వారంతా అనుకోవడము జరిగింది. అందువలన స్కూల్లోకూడా తోటి

పిల్లలుగానీ, టీచర్లుగానీ ఈశ్వర్ను గౌరవించేవారు. )


(రాజయోగానంద స్వామి భువనేశ్వరి దేవాలయములోని నకిలీ

వజ్రాల విషయము విని మొదట వాటిని గురించి ఏమీ స్పందించి మాట్లాడక

ఊరకవుండెను. రెండవమారు వజ్రములు దొంగిలించబడ్డాయి అను వార్త

స్వామికి విచిత్రముగా కనిపించింది. అసలైన వజ్రములు తమకు తెలిసిన

స్థలములో క్షేమముగా ఉండగా, నకిలీ వజ్రముల విషయమేమిటి? తర్వాత

అవి దొంగిలించబడడమేమిటి? అని యోచించసాగాడు. అంతలో రాఘవ

అక్కడికి వచ్చాడు. అప్పుడు రాఘవతో రాజయోగానంద స్వామి ఇలా

అన్నాడు.)


రాజయోగానంద :- విన్నావా రాఘవా! వజ్రములు దొరికాయి అనుమాట

కల్పితమనీ, అసలైన వజ్రాల విషయమును తెలుసుకొనుటకు అలా

వజ్రములు దొరికాయి అంటున్నారని మనము అనుకొన్నాము కదా!

ఇప్పుడేమో వజ్రాలు నకిలీవని వాటిని దొంగిలించిన దొంగలు చెప్పారనీ,

దొంగలు చెప్పేంత వరకు దొంగతనము జరిగినట్లు కూడా దేవాలయము


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024