ఒక్కడే ఇద్దరు. cloud text all lang 25th sep24
ఒక్కడే ఇద్దరు.
ప్రపంచములో అతిపెద్ద ప్రశ్న, జవాబు లేని ప్రశ్న ఒక్కటే ఒక్కటి గలదు. దేవుడెవరు? అనునదే పెద్ద ప్రశ్న మరియు ప్రపంచములో జవాబు లేని ప్రశ్న. ప్రపంచములో ఏ ప్రశ్నకయినా జవాబు చెప్పవచ్చును గానీ, దేవుడెవరు? అను ప్రశ్నకు జవాబు చెప్పుటకు వీలులేదు. ఎందుకనగా! దేవున్ని తెలిసినవాడు భూమిమీద ఎవడూ లేడు. భూమిమీద బ్రతికినవాడు, అనగా శరీరముతో సజీవముగా యున్నవాడు ఎవడుగానీ దేవున్ని చూచి యుండలేదు, సంపూర్ణముగా తెలిసియుండలేదు.
ప్రశ్న :- మధ్యలో ప్రశ్న అడుగుచున్నందుకు క్షమించండి. నేటి కాలములో చాలామంది క్రైస్తవుల బోధకులు “మేము దేవున్ని చూచాము, దేవునితో మాట్లాడినాము” అని అంటున్నారు. కొందరు హిందువులలో కూడా అట్లే చెప్పుచున్నవారు కలరు. రామకృష్ణ పరమహంస అనబడు వివేకానందగారి గురువుగారు “నేను దేవున్ని చూచాను, నీకు కూడా చూపిస్తాను” అని స్వయముగా వివేకానందునితోనే చెప్పినట్లు గలదు. మీరేమో “భూమిమీద బ్రతికినవాడు ఎవడూ చూడలేదు” అని అంటున్నారు. మేము మధ్యలో ఎవరి మాటను వినాలి? ఎవరి మాట సత్యమో మీరే చెప్పండి.
జవాబు :- ఎవరికి వారు మా మాట సత్యమని చెప్పుచుందురు. అయితే వినేవారే విచక్షణతో ఆలోచించి, శాస్త్రముతో పోల్చుకుని, హేతుబద్దముగా ప్రతిమాటకు జవాబు దొరికినప్పుడు దానినే నమ్మవలసియుండును. అంతేగానీ చెప్పేవాడు గొప్పవాడనో, చెప్పేవాడు సత్యవంతుడనో నమ్మి విశ్వసించితే అది మూఢనమ్మకమగును. అది విచక్షణ లేని నమ్మకమగును. అందువలన వినేవాడు ప్రతి దానిని హేతుబద్దముగా ఆలోచించవలసి
యుండును. దేవుని ధర్మములని చెప్పబడు వాటిలో “దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడు” అనుమాట చాలా ముఖ్యమైనది. దేవునికి రూపము లేదు అట్లే దేవుడు కనిపించువాడు కూడా కాదు. అటువంటప్పుడు దేవున్ని నేను చూచాను అని ఎవడయినా అంటే అది శుద్ధ అసత్యమని చెప్పవచ్చును. 'దేవుడు' అను పదములోనే 'దేవులాడబడేవాడు (వెతకబడేవాడు' అని అర్థము గలదు.ఈ మాట ప్రకారము దేవుడు మనిషి చేత ఎప్పటికీ వెతకబడేవాడే గానీ తెలియబడేవాడు కాడనీ, దొరికేవాడు కాడనీ తెలియు చున్నది. అందువలన భూమిమీద సూక్ష్మశరీరముతో గానీ, స్థూలశరీరముతో యున్నవాడు ఎవడుగానీ దేవున్ని చూడలేదని చెప్పుచున్నాము.
దేవుడు ఈ ప్రపంచమును సృష్టించకముందు దేవుడని కూడా చెప్పబడేవాడు కాదు. దేవున్ని దేవుడని చెప్పే దానికి మరియొక మనిషంటూ లేడు. దేవుని స్థితి ఏమిటో! ఎట్లుండెడివాడో! ప్రపంచము పుట్టిన తర్వాత కూడా ఎవరికీ తెలియదు. దేవుడు సృష్టించిన సృష్ఠిలోని మనుషులకు దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏమిటో తెలియుటకు దేవున్ని గురించిన సమాచారము అవసరము. దేవున్ని గురించిన సమాచారమునే 'దేవుని జ్ఞానము' అని అంటున్నాము. దేవుని జ్ఞానము ఇదియని తెలియుటకు దేవుని సమాచారము కొద్దిగా తెలిసినవాడు ఎవడూ లేడు. అందువలన దేవుని జ్ఞానము ఏమిటో? భూమిమీద పుట్టిన ఏ మనిషికీ తెలియదు. అటువంటప్పుడు దేవుని జ్ఞానమును దేవుడే చెప్పాలిగానీ మరి ఇతర మానవుడు ఎవడూ చెప్పలేడు. అందువలన అంతిమ దైవగ్రంథములో చెప్పబడిన ఒక వాక్యము ఇలా కలదు చూడండి. సూరా 3 ఆయత్ 7 (3–7) “ఆయన (అల్లాహ్) యే నీపై ఈ గ్రంథమును (ఖురానను)
అవతరింపజేశాడు. ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే (ముహ్కమాత్) ఆయత్లు ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైన (ముతషాబిహాత్) ఆయత్ లు ఉన్నాయి. అయితే తమ హృదయాలలో వక్రతయున్నవారు సంక్షోభమును రేకెత్తించడానికి, గూఢార్థములను కల్పించి ఎల్లప్పుడు అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థము అల్లాహికు తప్ప (దేవునికి తప్ప) ఇతరులెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానము కలవారు “మేము దీనిని విశ్వసించాము ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్దనుంచి వచ్చినదే!" అని అంటారు. శ్రద్ధ, జ్ఞానము యున్నవారు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.
ఈ వాక్యమును బట్టి దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులెవరికీ తెలియదని అర్థమగుచున్నది. దేవుని జ్ఞానము తెలియాలంటే దేవుడు చెప్పిన గ్రంథములోనే చూడవలసియుండును. 'దేవుడు స్వయముగా ఏ పని చేయడు” అని చెప్పినా, దేవుడు చేయకుండా తన ప్రకృతి చేత అన్ని కార్యములను చేయిస్తున్నాడు. దేవుడు తన జ్ఞానమును సృష్ట్యాదిలోనే ప్రకృతిలో ఒక భాగమయిన ఆకాశమునుండి చెప్పించాడు. ప్రకృతిలో ఆకాశ భూతము అను ఒక భాగము చేత దేవుని జ్ఞానము మొట్టమొదట చెప్పబడినది. మొదట చెప్పినది ఆకాశమయినా, పైకి అందరికీ తెలిసినది ఆకాశ భూతమైనా, ఆకాశ భూతములో అణిగి ఎవరికీ తెలియకుండా యున్న ఆత్మయే జ్ఞానమును చెప్పినదని చెప్పుచున్నాము. అణిగియున్న ఆత్మ చెప్పినదని ఎవరికీ తెలియదు, అందువలన మొదట ఆకాశము తన వాణిచేత (శబ్దము చేత) దేవుని జ్ఞానమును చెప్పినదని అర్థమయినది.
ప్రశ్న :- దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడైనందున ఇతరులకు కనిపించడు, ఫలానా వాడను పేరు లేకపోవచ్చును. అయితే క్రియ అయిన కార్యములను చేయకపోయినా ఫరవాలేదు. తన జ్ఞానమును తానే స్వయముగా చెప్పవచ్చును కదా! ఆకాశము ద్వారా చెప్పించినా, ఇతరులకు తెలియదను తన మాట వ్యర్థమైపోవును. ఆకాశమునకు దేవుని జ్ఞానము తెలిసినట్లు ఇతరులకు అర్థమగును కదా! దానివలన దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులకు తెలియదను మాట అసత్యముగా కనిపించును కదా! దీనికి మీరేమంటారు?
జవాబు :- దేవుని మాట ఎప్పటికీ అసత్యము కాదుగానీ, మనము దేవుని మాటను అర్థము చేసుకోవడములో పొరపాటు పడియుండవచ్చును. ఇటువంటి ప్రశ్నలు రాబోతాయని దేవుడు ముందే అంతిమముగ చెప్పిన బోధలో ఇలా చెప్పాడు. సూరా 42 ఆయత్ 51 (42-510) “దేవుడు ఏ మానవునితోనూ ప్రత్యక్షముగా మాట్లాడడు. దేవునితో మాట్లాడడము మనిషికి సాధ్యమయ్యే పనికాదు. దేవుడు తన జ్ఞానమును వాణి ద్వారా లేక తెరవెనుకనుండి మనిషికి చేరవేస్తాడు లేదా తాను కోరినది తన ఆజ్ఞతో సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడు. ఆయన మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు". ఈ మాటలను గ్రహించితే దేవుడు తన జ్ఞానమును మూడు విధములుగా భూమిమీద గల మనుషులకు తెలియ జేయునని తెలియుచున్నది. దేవుడు చెప్పిన మూడు విధానములు దేవుడు నిర్ణయించినవే అయినందున, దేవుడు ఏ విధానములో జ్ఞానము చెప్పినా అది దేవుడు చెప్పినట్లేయగును. ఒక విధముగా దేవుడు తాను స్వయముగా పని చేయకున్నా, తన సంకల్పము చేత ఇతరుల ద్వారా పని చేయించి ప్రజలకు తన జ్ఞానమును తెలియజేయుచున్నాడు. దేవుని జ్ఞానము దేవునికి
తప్ప ఇతర మనుషులకు ఎవరికీ తెలియదని చెప్పాడు. అంతేగానీ తనలో భాగముగాయున్న ఆత్మకు లేక తన ప్రతినిధిగాయున్న భగవంతునికి తెలియదని చెప్పలేదు కదా!
ఆకాశ శబ్దము ద్వారా చెప్పినప్పుడుగానీ, తెరవెనుకనుండి చెప్పినప్పుడుగానీ, తన ప్రతినిధి చెప్పినప్పుడుగానీ తెలియజేసిన జ్ఞానము దేవుని ఆత్మ తెలియజేసినదే అగుట వలన స్వయముగా తానే (దేవుడే) జ్ఞానమును తెలిపినట్లు అగుచున్నది. దేవుడు తననుండి రెండు ఆత్మలను బయటికి తీశాడు. అందులో ఒకటి జీవాత్మకాగా రెండవది ఆత్మగా యున్నది. ఈ రెండు ఆత్మలనే భగవద్గీతయందు ఒకడు నాశనమయ్యే వాడు, మరియొకడు నాశనము కానివాడని చెప్పాడు. వారినే గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగము అను అధ్యాయములో క్షరుడు, అక్షరుడని చెప్పారు. జీవున్ని నాశనమగు వాడని 'క్షరుడు' అని అన్నారు. దేవుని జ్ఞానము చెప్పుటకు దేవుని ప్రతినిధిగా అక్షరుడయిన ఆత్మయే పనిచేయుచున్నది. అక్షరుడైన ఆత్మ ఇటు జీవాత్మ పనిని, అటు దేవుని పనిని రెండిటినీ చేయుచున్నది. అందువలన దేవుడు, జీవుడు పని చేయకున్ననూ పని చేసిన వారిగానే లెక్కించబడుచున్నారు. ముఖ్యముగా ఆత్మ దేవుని పనిని చేసి దేవుని జ్ఞానమును మూడు విధముల ప్రపంచములో తెలియజేయుచున్ననూ, ఆత్మ అణిగియుండుట వలన ఆత్మను ఎవరూ గుర్తించలేకపోవుచున్నారు. మొదట ఆకాశములో అణిగియున్న ఆత్మయే పరమాత్మయొక్క జ్ఞానమును చెప్పినా చివరకు ఆకాశము చెప్పినట్లే అందరూ గ్రహించారు. ఎవరికీ తెలియని ఆత్మను తెలియనట్లు ఉంచుటకు దేవుడు కూడా ఆకాశవాణి ద్వారా జ్ఞానమును తెలియజేశానని చెప్పాడు తప్ప తన ఆత్మ చెప్పినదని చెప్పలేదు.
ప్రశ్న :- ఆత్మ దేవుని ప్రతినిధి అని అన్నారు కదా! దేవునికి, ఆత్మకు ఏమి భేదము కలదు?
జవాబు :- పరమాత్మ ఖాళీ బోర్డులాంటిది. ఆత్మ ఖాళీ బోర్డులో గీయబడిన గోళీ బొమ్మలాంటిది. ఖాళీ బోర్డును శూన్యముగా పోల్చవచ్చును. అందులోని (బోర్డులోని) గోళీ బొమ్మను ఆత్మగా పోల్చవచ్చును. ఖాళీబోర్డుకు ఆకారము లేదు. ఖాళీ బోర్డులో యున్న గోళీ బొమ్మకు ఆకారమున్నది. అందువలన పరమాత్మ అయిన దేవునికి ఆకారము లేదు, ఆత్మకు ఆకారమున్నదని చెప్పవచ్చును. పరమాత్మకు ఆత్మ ప్రతినిధిగాయుండి దేవుని పనులను ఆత్మయే చేయుచున్నది. పరమాత్మను ఖాళీ బోర్డుగా చెప్పితే, ఆత్మను బోర్డులో గోళీ బొమ్మగా పోల్చి చెప్పవచ్చును. పరమాత్మ ప్రపంచమంతటా జీవమున్న, జీవములేని వాటియందు వ్యాపించియుండగా, ఆత్మ జీవమున్న శరీరములలో జీవాత్మకు తోడుగా యున్నది. జీవములేని పదార్థములలో ఆత్మ లేదు. పరమాత్మ జీవమున్న, జీవములేని వాటియందు అణువణువునా వ్యాపించియుండగా, ఆత్మ కేవలము జీవమున్న వాటియందు మాత్రమే కలదు. ఆత్మకు ఆకారముండగా పరమాత్మకు ఆకారము లేదు. దేవుడయిన పరమాత్మ పని చేయడు. పరమాత్మ పనిని చేయుటకే ఆత్మ బ్రతికిన శరీరములలో జీవునితోపాటు ఉంటున్నది. శరీరములోయుంటున్న ఆత్మ జీవునితో కర్మను అనుభవింపజేస్తూ అవసరమొచ్చినప్పుడు దైవ ఆజ్ఞను నెరవేర్చుచున్నది.
సృష్ట్యాదిలో మొట్టమొదట ఆకాశము దైవజ్ఞానమును చెప్పినప్పుడు ఆకాశము అను భూతము (జీవుడు) నుండి దైవజ్ఞానమును ఆత్మయే చెప్పినది. పరమాత్మనుండి విడివడివచ్చినది ఆత్మ కావున పరమాత్మ
జ్ఞానమంతయూ ఆత్మకు తెలియును. సముద్రములో ఉన్నదంతా నీరే అయినా సముద్రము నుండి ఎగిరివచ్చిన నీటి బిందువులో కూడా నీరే యున్నది. నీటిలోయున్న తేమ నీటి బిందువులో కూడా యుండుట వలన పరమాత్మలోని జ్ఞానము ఆత్మలో కూడా యున్నది. అందువలన దేవుని జ్ఞానము దేవునికే కాకుండా దేవుని జ్ఞానము ఆత్మకు కూడా తెలియును. అందువలన దేవుని జ్ఞానమును దేవుడు చెప్పకున్నా దేవుని జ్ఞానమును ఆత్మయే చెప్పుచున్నది. దేవుడు పనిచేసి తన జ్ఞానమును మనుషులకు చెప్పకున్నా దేవుని స్థానములో ఆత్మ పనిచేసి దేవుని జ్ఞానమును మనుషులకు తెల్పుచున్నది. ఈ విధముగా ఆత్మ దేవుని కార్యమును చేయుచుండుట వలన దేవుని పని దేవుడు చేయకున్నా దేవుడు చేసినట్లే జరిగిపోవుచున్నది. అందువలన దేవుడు అనుకుంటే అనుకున్నది అనుకున్నట్లు అయిపోవును. దేవుడు మూడు విధముల తన జ్ఞానమును మనుషులతో తాను ప్రత్యక్షముగా మాట్లాడకుండా తెలుపుదునని చెప్పినది ఈ పద్ధతి ప్రకారమేయని తెలియవలెను.
దేవుడు మనుషులతో ప్రత్యక్షముగా సంబంధమును పెట్టుకోక ఆత్మద్వారా పరోక్ష సంబంధము కల్గియున్నాడు. అదే పద్ధతిలోనే మనుషులకు మూడు విధముల జ్ఞానమును తెలియజేశాడు. తెరచాటునుండి జ్ఞానమును చెప్పినప్పుడుగానీ, తన ప్రతినిధిని ప్రత్యక్షముగా పంపి జ్ఞానమును చెప్పినప్పుడు గానీ ఎవరికీ తెలియకుండా ఆత్మయే ముఖ్యపాత్ర పోషించి ఆ కార్యములను చేయగలిగినది. ఈ విషయము నేడు అందరికీ క్రొత్తగా కనిపించినా గతములో జరిగిన సత్యము అదియే. ఇప్పుడు జరుగుచున్నది కూడా అదియే. ఆత్మ లేనిది ఏ శరీరములో కూడా ఏమీ జరుగదు. ప్రథమ దైవ గ్రంథమునుండి చివరిదైన అంతిమ దైవగ్రంథము వరకు
చెప్పబడిన జ్ఞానములో ఈ విషయము స్పష్టముగా తెలియుచున్నది. దేవునికి తెలియకుండా ఏదీ జరుగలేదు. అయినా దేవుడు ఏదీ చేయలేదు.
ప్రశ్న :- మీరు ప్రథమ దైవగ్రంథము, మధ్యమ (ద్వితీయ) దైవగ్రంథము, అంతిమ దైవగ్రంథమని మూడు పేర్లు చెప్పుచున్నారు. మీరు తప్ప లోకములో ఎవరూ ఇంతవరకు ఈ మూడు పేర్లు చెప్పలేదు. 'అంతిమ దైవగ్రంథము ఖురాన్' అని చాలామంది ముస్లీమ్ పెద్దలు చెప్పుచున్నారు. అంతేకాక జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి ఖురాన్ జ్ఞానాన్ని చెప్పినప్పుడే ఖురాన్ ను అంతిమ దైవగ్రంథమని చెప్పడము జరిగినది. దీనిప్రకారము ఖురాన్ గ్రంథమును అంతిమ దైవగ్రంథమని చెప్పుటకు ఆధారమున్నది. అయితే మీరు చెప్పుచున్నట్లు ప్రథమ దైవగ్రంథము భగవద్గీతయనీ, ద్వితీయ దైవగ్రంథము ఇంజీలు (బైబిలు) అని ఇంతవరకు ఏ గ్రంథములో ఎవరూ చెప్పలేదు. ఎవరూ చెప్పని దానిని మీరు చెప్పడములో మీ ఉద్దేశ్యమేమి?
జవాబు :- ఎవరూ చెప్పని విషయమునే నేను బోధ రూపములో చెప్పుచూ వచ్చాను. అట్లే ఎవరూ వ్రాయని జ్ఞానమునే నేను గ్రంథ రూపములో వ్రాయుచూ వచ్చాను. ఇంతవరకు 144 ఉపన్యాసములను చెప్పాను, అట్లే 75 గ్రంథముల వరకు వ్రాశాను. ఎక్కడయినా ఇతరులు చెప్పిన దానిని నేను ప్రవచనాలలో చెప్పానా? అలాగే ఏ గ్రంథములో అయినా ఇతరులు వ్రాసిన దానిని వ్రాశానా? ఇంతవరకూ తెలియని విషయమును తెలుపుటయే నా పనిగా పెట్టుకున్నాను. ఇంతవరకు ఎవరికీ తెలియని విషయమును తెలుపుటే నా కర్తవ్యము అయినందున దైవగ్రంథములు ఎన్ని? అవి ఏవి? అను విషయమును మీకు తెలుపుటయే నా ఉద్దేశ్యమయి నది. ఆ ప్రయత్నములోనే మిగతా రెండు దైవగ్రంథములను మీకు తెలియ
జేయడమైనది. ఇంతవరకు మీకు తెలిసినది అంతిమ దైవగ్రంథము ఖురాన్ అన్న విషయము ఒక్కటి మాత్రమే. ఖురాన్ అంతిమ దైవగ్రంథము అనుమాటను నేను కూడా ఒప్పుకొంటున్నాను. అయితే ఖురాన్ను అంతిమ దైవగ్రంథమని ఏ లెక్కప్రకారము అంటున్నారని ప్రశ్నించి చూచాను. అందరి వద్ద దానికి ఇంతవరకు పొంతనలేని సమాధానము మాత్రమే దొరికినది. శాస్త్రబద్దమైన, ఖచ్చితమైన, ఎవరూ ఖండించలేని విధముగా జవాబు దొరక లేదు.
ఖురాన్ గ్రంథమును అంతిమ దైవగ్రంథమని గ్రుడ్డిగా ఒప్పుకుంటే దానివెనుక ఎన్నో ప్రశ్నలు రాగలవు. అందువలన దానిని ఒక లెక్కప్రకారము, తగిన విధానము ప్రకారము అంతిమ దైవగ్రంథమని చెప్పగలిగినప్పుడు ఎవరికీ దానిని గురించి ప్రశ్నరాకపోవును. ఖురాను అంతిమ దైవగ్రంథమని మనుషులు పేరుపెట్టలేదు. దేవుడే ఆ పేరును పెట్టడము వలన అది వాస్తవముగా అంతిమ దైవగ్రంథమనుటకు ఏ సంశయము లేదు. అంతిమ దైవగ్రంథమని చెప్పినా కొందరు వారిలోనున్న అనుమానము కొద్దీ ప్రశ్నలను అడుగుచుందురు. ఆ ప్రశ్నలు ఇలా ఉన్నవి. 1) ఖురాన్ అంతిమ దైవ గ్రంథమయితే దానికంటే ముందు ఎన్ని గ్రంథములు గలవు? 2) ఆఖరీ దైవగ్రంథమంటే దైవగ్రంథములలో తక్కువ జ్ఞానమున్నదని అనుకోవచ్చునా? 3) దైవగ్రంథములు ఎన్నియున్నా వాటన్నిటికంటే చివరిదైనందున చివరి దానికంటే ముందున్నవే వరుసలో గొప్పవని అర్థము కదా! అని లేనిపోని ప్రశ్నలను అడుగవచ్చును. అయితే అంతిమ దైవగ్రంథమని దేవుడే చెప్పి యుండుట వలన దానికి ఒక హద్దు పద్దు ప్రకారము జవాబును చెప్పవచ్చును. అంతిమ దైవగ్రంథముకంటే ముందు ఎన్ని గ్రంథములు ఉన్నాయి? మొత్తము దైవగ్రంథములు ఎన్ని? చివరి దైవగ్రంథములోని
జ్ఞానము యొక్క స్థాయి ఎంత? అను ప్రశ్నలన్నిటికీ ఖురాన్ గ్రంథములోనే 42వ సూరా, 51వ ఆయత్నందు సంపూర్ణమైన జవాబు గలదు.
42వ సూరా, 51వ ఆయత నందు దేవుడు తన జ్ఞానమును మూడు విధముల భూమిమీద మనుషులకు తెలియజేయునని చెప్పి యుండుట వలన దైవగ్రంథములు మూడేనని చెప్పవచ్చును. ఒక్కొక్క విధానము ప్రకారము చెప్పిన జ్ఞానము ఒక్కొక్క గ్రంథముగా మారిపోవుట వలన ప్రపంచములో మూడే దైవగ్రంథములు గలవని గంటాపథముగా చెప్ప వచ్చును. చెప్పినవాడు ఒక్కడే, చెప్పబడిన జ్ఞానము ఒక్కటే అయినందున మూడు దైవగ్రంథములలోని జ్ఞానము ఒక్క దేవున్ని గురించి చెప్పినదే అయినందున మూడు గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానము ఎక్కువ తక్కువ అనకుండా ఒకే స్థాయిలోయున్నదని చెప్పవచ్చును. భూమిమీద చెప్పబడిన వరుస క్రమములో ముందు వెనుక యుండుట వలన ప్రథమ దైవగ్రంథమనీ, మధ్యమ లేక ద్వితీయ దైవగ్రంథమనీ, అంతిమ లేక తృతీయ దైవగ్రంథమనీ చెప్పవచ్చును. దేవుడు తన జ్ఞానమును తెలిపిన మూడు విధానముల ప్రకారము మూడు దైవగ్రంథములుగా చెప్పుచున్నాము.
దేవుడు ఆకాశవాణి ద్వారా, తెరవెనుకనుండి, తన ప్రతినిధి ద్వారా మూడు విధముల జ్ఞానము తెలియజేసినా మనకు తెలిసి ఆకాశవాణి ద్వారా ఒకమారు తెలియజేసినట్లు చెప్పగలము. అలాగే తెరవెనుక నుండి రెండుమార్లు తెలియజేసినట్లు చెప్పగలము. ఇంకా మూడవ విధానము ప్రకారము తన ప్రతినిధిని పంపి రెండుమార్లు జ్ఞానమును చెప్పించాడు. ఇవన్నియూ గమనిస్తే ఆకాశము ద్వారా ఒకటి, తెరచాటునుండి రెండు, ప్రతినిధి ద్వారా రెండుమార్లు మొత్తము ఐదుమార్లు చెప్పడమైనది. అయినా
మూడు గ్రంథములే తయారయినవి. చెప్పబడిన విధానమునుబట్టి, వ్రాయబడిన వరుసనుబట్టి దైవగ్రంథములు మూడేయని, అంతకుమించి దైవగ్రంథములు తయారగుటకు వీలులేదని చెప్పవచ్చును. చివరిలో వ్రాయబడిన గ్రంథమగుట వలన ఖురాన్ ను అంతిమ దైవగ్రంథమను పేరు ఎప్పటికీ స్థిరస్థాయిగా యుండును. అట్లే మొదట వ్రాయబడిన గ్రంథమగుట వలన భగవద్గీత ఎప్పటికీ ప్రథమ దైవగ్రంథముగానే యుండును. అట్లే బైబిలు ద్వితీయ దైవగ్రంథముగానే యుండును. ప్రపంచములో ఏది మారినా దైవగ్రంథముల వరుస మాత్రము మారదు. ప్రథమ, మధ్యమ, అంతిమ అనునవి వరుస క్రమమేగానీ జ్ఞానస్థాయిని బట్టి పెట్టిన పేర్లు కాదు.
దేవుడు నిర్ణయించిన మూడు విధానముల ప్రకారము ఎన్నిమార్లు చెప్పినా ఒకే దేవుని జ్ఞానమునే చెప్పుచుండుట వలన, ప్రపంచములో వేరే దేవుడు మరొకరు లేనిదానివలన, ప్రపంచమునకంతా సృష్టికర్త ఒక్కరే అయిన దానివలన, మూడు గ్రంథములలో యున్నది ఒకే దేవుని జ్ఞానమని సూటిగా చెప్పవచ్చును. మొదట సృష్ట్యాదిలోనే ఆకాశము ద్వారా దేవుని జ్ఞానము చెప్పబడినది. దేవుడు చెప్పిన మూడు విధానములలో మొదటిది ఆకాశ శబ్దము ద్వారా చెప్పబడినది. తర్వాత తెరచాటునుండి చెప్పబడినది. తర్వాత దైవ ప్రతినిధి ద్వారా చెప్పబడినది. ఇక్కడ చెప్పబడిన విధానములే ముఖ్యముగానీ, ఎవరు ఎన్నిమార్లు చెప్పారు అన్నది ముఖ్యముకాదు. అలాగే గ్రంథములు తయారయిన వరుస క్రమమే ముఖ్యముగానీ, చెప్పిన విధానము యొక్క వరుస ముఖ్యము కాదు.
ఆకాశము మొదట జ్ఞానమును చెప్పినా తర్వాత ఎన్నోమార్లు ఆకాశము తన శబ్దము ద్వారా జ్ఞానమును చెప్పడమైనది. అలాగే
తెరచాటునుండి కనిపించక జ్ఞానమును చెప్పినది మనకు తెలిసి రెండుమార్లే అయినా ఎన్నోమార్లు ఆ పని జరిగియుండునని చెప్పుచున్నాము. ఇకపోతే దైవప్రతినిధి అయిన భగవంతుడు మనకు తెలిసి రెండుమార్లు చెప్పియుంటే, మనకు తెలియకుండా ఎన్నోమార్లు చెప్పియున్నాడు. ఇంకా మనము గమనించవలసిన విషయమేమంటే ఆకాశము ఎన్నిమార్లు చెప్పినా మొదట చెప్పిన జ్ఞానమునే చెప్పుచుండును. ఒకే జ్ఞానమునే అనేక రకములుగా మార్చి చెప్పుచుండుట వలన సరిగా గ్రహించుకోలేని వారు ముందు చెప్పిన జ్ఞానము వేరు తర్వాత చెప్పిన జ్ఞానము వేరని అనుకొను అవకాశము గలదు. ఉదాహరణకు ఒకమారు చెప్పిన వాక్యములో “అహంభావము లేకుండా ఎంతమందిని చంపినా వానికి హత్యాపాపము రాదు, వాడు హంతకుడు కాడు” అని చెప్పబడిన జ్ఞానమే మరొకమారు చెప్పినప్పుడు కొంత మార్పుచేసి “ఒక స్త్రీని మోహపు (కామపు) చూపుతో చూచినట్లయితే అతడు వ్యభిచరించినట్లేయగును” అని ఉండుట వలన ఒకచోట భావము లేకుండా చేసిన పని చేయనట్లేయని చెప్పి, మరొకచోట భావముతో చేస్తే చేయకున్నా చేసినట్లేయని చెప్పడము వలన ఈ రెండు వాక్యములలోనిది వేరువేరు జ్ఞానమని అనుకొను అవకాశము గలదు. రెండుచోట్ల చెప్పినది ఒకే జ్ఞానమని ఎవరూ గుర్తించలేరు. ఇక్కడ భావమును గురించి చెప్పిన ఒకే జ్ఞానమును రెండు విధములుగా యున్నదని చాలామంది తెలియలేక పోయారు. అదే విధముగా మొదట చెప్పిన జ్ఞానమే తర్వాత ఎన్నిమార్లు చెప్పినా, ఎన్ని విధముల చెప్పినా మారకుండా యున్నదని అందరూ గ్రహించ వలసియున్నది.
ప్రపంచమునకంతటికీ ఒకే దేవుడు, ఒకే జ్ఞానము యున్నదని గ్రహించలేని మనుజులు తమతమ జ్ఞానములు వేరువేరని తలచి తాము
వేరువేరు మతములను సృష్టించుకొన్నారు. వేరువేరు మతముల వారు వారి వారి దేవుడు వేరని అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా ముఖ్యమైన మూడు మతముల వారు వారివారి దేవుళ్ళు వేరువేరుగా యున్నారని వారి దేవుళ్ళ పేర్లు వేరువేరుగా చెప్పుకొంటున్నారు. వాస్తవానికి ముగ్గురు దేవుళ్ళు లేరు, మూడు రకముల జ్ఞానము లేదు, ఉన్నది ఒకే దేవుడే, ఒకే జ్ఞానమే. అయితే దేవుని ఆజ్ఞతో ప్రవర్తించు మాయ, దేవుని అనుమతితోనే కొందరిని దేవుని వైపు రాకుండా చేయుటకు, వారికి వేరు వేరు దేవుళ్ళుగా, వేరు వేరు మతములుగా అర్థమగునట్లు చేసినది. దానివలన చాలామంది మనుషులు తమకు తెలియకుండానే మాయ ధర్మమైన మను ధర్మములను ఆచరించుచున్నారు. తమకు తెలియకుండానే మతములనా శ్రయించి దేవుని వైపు పోతున్నామని అనుకొనుచూ దేవునికి దూరముగా పోవడము జరుగుచున్నది.
అయితే దేవునికి ఇష్టమైన వారిని మాత్రము దేవునివైపు పోవునట్లు మాయ చేయుచున్నది. దేవుని జ్ఞానము మీద శ్రద్ధగలవారందరినీ, దేవుని మీద ఇష్టత కల్గిన వారినందరినీ మాయ ఏమాత్రము ఆటంకము చేయడము లేదు. కొందరికి జీవిత అనుభవముల వలన దేవుని జ్ఞానము మీద శ్రద్ధ కల్గినా, వారికి తాజాగా చెప్పబడిన జ్ఞానము తెలియుటకు ఒకే జ్ఞానము అనేకమార్లు భూమిమీద చెప్పబడుచున్నది. దేవుడు తెల్పిన మూడు విధానములు కూడా అనేకమార్లు మనముందుకు వచ్చి జ్ఞానమును తెల్పి పోయినవి. ఆకాశము శబ్దరూపములో ఎన్ని ఉరుములు ఉరిమినా, వాటి జ్ఞానము మనకు తెలియకుండా పోయినది. అలాగే మనకు కనిపించని తెరచాటుగాయున్న గ్రహములు సూక్ష్మముగా ఎన్నిమార్లు జ్ఞానమును తెల్పినా వాటిని గ్రహించుకొను శక్తి మనుషులకు లేకుండా పోయినది. ఉరుముల
శబ్దము వినిపించినా వాటిని గ్రహించుశక్తి ఆకాశములోని గ్రహములకే కలదు. అలాగే కనిపించని తెరచాటునయున్న సూక్ష్మముగాయున్నవారు చెప్పు బోధను ప్రవక్తలకు మాత్రమే చెప్పుచున్నారు. దేవుడు తెల్పిన మూడు విధములలో బోధల రూపములో ఆకాశవాణి చెప్పు బోధను ఆకాశ గ్రహములు, తెరచాటునుండి చెప్పు బోధలను ప్రవక్తలు యోగ్యత యున్న వారు మాత్రము తెలియగలరు. సాధారణ మనుషులలో మానవులుగా యున్నవారు గానీ, ప్రజలుగా యున్నవారుగానీ ఎవరుగానీ పైన చెప్పిన రెండు విధానముల జ్ఞాన బోధలను తెలియలేరు. కావున మనుషులు ఎవరూ దైవ జ్ఞానమును తెలియుటకు అవకాశము లేదు. అందువలన సాధారణ మనుషులు ఎవరయినా జ్ఞానమును తెలియుటకు అవకాశ ముండునట్లు సాధారణ మనిషివలె యున్నవాడు బోధించునట్లు ఏర్పరచిన విధానమే దేవుని మూడవ విధానము. దేవుని మూడవ విధానములో దేవుని ప్రతినిధి స్వయముగా సాధారణ మనిషివలె మనుషుల మధ్యలోనికి వచ్చి దైవ జ్ఞానమును చెప్పిపోవడము జరుగుచున్నది. దేవుడు మారు వేషములో వచ్చి తనను ఎవరూ గుర్తుపట్టనట్లు ప్రపంచములో మనుషుల మధ్య మనిషివలె నటించి పోవుచున్నాడు. మనిషివలె వచ్చి పోయిన తర్వాత కొంతకాలానికి కొందరు వచ్చిన వానిని గుర్తించగలిగినా, వచ్చినవాడు దేవుని ప్రతినిధియని తన జ్ఞానములోనే చెప్పాడు. ప్రతినిధియని చెప్పినా అది ధర్మవిధానము ప్రకారము చెప్పినది మాత్రమేయని తెలియుచున్నది.
విశ్వములో దేవుడు తప్ప దేవుని ప్రతినిధిగానీ, దేవుని గుమాస్తాగానీ, దేవుని కుమారుడుగానీ ఎవరూ లేరని దేవుని జ్ఞానమును పూర్తిగా అర్థము చేసుకొన్న వానికి తెలియగలదు. దేవుని జ్ఞానమును సంపూర్ణముగా అర్థము చేసుకోగలిగినవాడు ఎవడయినా దేవుని ప్రతినిధిగా వచ్చిపోయిన వాడు
దేవుడేగానీ ఇతరులు ఎవరూ కాదని అర్థము చేసుకోగలడు. గతచరిత్రలో దేవుడు ఎన్నిమార్లు మనిషిగా (భగవంతునిగా) వచ్చిపోయాడో ఖచ్చితముగా చెప్పలేకపోయినా నాకు తెలిసినంత వరకు రెండు అవినాభావ సంబంధమున్న జన్మలను గుర్తించగలిగాము. సృష్ట్యాదినుండి దేవుడు భగవంతునిగా అనగా మనిషి రూపములో ఎన్నోమార్లు వచ్చియుండవచ్చును. అయితే వెంట వెంటనే వచ్చిన జన్మలు, రెండూ ఒకే పోలికయున్న జన్మలు మా దృష్టికి రాగా వాటిని సులభముగా గుర్తించగలిగాము. మనుషులకు జ్ఞానమును తెలియజేయు నిమిత్తము దేవుడు మనిషిగా ఒకమారు కాకుండా ఎన్ని మార్లయినా రావచ్చును. ఎన్నిమార్లు మనిషిగా వచ్చినా అది దేవుడు మనుషులకు జ్ఞానము తెలుపు మూడు విధానములలో ఒక్క విధానమే యగును. దేవుడు తన ప్రతినిధి ద్వారా జ్ఞానము తెలుపుదునని చెప్పిన ప్రకారము, ద్వాపరయుగమున దేవుడు కృష్ణుని రూపమున వచ్చిపోయాడు. అలా రావడము వలన ఆయన చెప్పిన జ్ఞానము ఒక దేశమునకే పరిమితియై పోయినది. ద్వాపరయుగము చివరిలో వచ్చిన కృష్ణుని వలన కొంత జ్ఞానము మనుషులు తెలియగలిగినా, మిగతా దేశములలో ఆసక్తియున్న వారికి జ్ఞానమును తెలుపు నిమిత్తము వెంటనే కలియుగము మొదటిలోనే దేవుడు రెండవమారు రావడము జరిగినది. దగ్గరదగ్గరగా వచ్చినదయిన దానివలన, ప్రక్క దేశములోనే అవతరించడము వలన, ఆ రెండు జన్మల మీద కొంత ధ్యాస కల్గి గుర్తించుటకు అవకాశము ఏర్పడినది.
మానవునిగా భగవంతుని రూపములో వచ్చునని కొందరికయినా తెలియుటకు దేవుడు అటువంటి అవకాశమిచ్చాడని అనుకొంటున్నాము. దేవుడు భూమిమీద మనిషిగా వచ్చునను వాదనకు సాక్ష్యముగా యుండుటకు, దేవుడు తన జన్మలు తెలియజేయుటకు, ఒకే పోలిక యున్నటు
వంటి మూడువేల సంవత్సరములకు రెండవ జన్మ తీసుకోవడము జరిగినది. సాధారణముగా దేవుడు కొన్ని లక్షల సంవత్సరములకొకమారు రావలసి యుండగా, ఇక్కడ రెండు జన్మలలో తక్కువ వ్యవధిలో మూడు వేల సంవత్సరములకే భగవంతుని రెండవ రాక జరిగినది. సామాన్యముగా ఎవరుగానీ, దేవుని జన్మ అయిన భగవంతున్ని గుర్తించలేరు. దేవుని జన్మను గుర్తించుటకు వీలులేకుండా మాయ అందరినీ మభ్యపెట్టగలదు. ఎవడయినా భగవంతుని గుర్తించినా, వానిలో అనుమానములను పుట్టించి చివరికి వానిచేతనే అతను భగవంతుడు కాదు అని అనిపించును. మాయ మనిషిని ఏమయినా చేయగలదు. అందువలన దేవుని జన్మను గుర్తించనట్లు మనిషిని మాయ ప్రేరేపించుచున్నది. మనిషికి తెలిసిన జ్ఞానము చేత దేవునికి జన్మలు లేవు, దేవుడు పుట్టువాడు కాదని వాదించునట్లు చేయును.
ఎవడు దేవునికి ఇష్టుడుగాయుండునో వానికి మాత్రమే దేవుడు భగవంతుడుగా వచ్చునని నమ్మునట్లు మాయ చేయుచున్నది. మిగతా వారికి వారివారి మతముల జ్ఞానమును ప్రేరేపించి, మా జ్ఞానము వలన దేవుడు పుట్టడని తెలియునట్లు మాయయే చేయుచున్నది. అటువంటి వారు అనగా మాయా ప్రభావములో పడిపోయిన వారిని, వారి దైవగ్రంథము లలో దేవుడు అవతరిస్తానని చెప్పినా, ఆ మాటను లెక్కచేయనట్లు వారిని ప్రేరేపించి దేవుడు పుట్టడని చెప్పించుచున్నది. అటువంటప్పుడు అసలయిన సత్యము వారికి తెలియకుండా పోవుచున్నది. మాయ మమ్ములను మాత్రము సక్రమ మార్గములో నడిపించి దేవునికి జన్మలున్నాయని తెలియునట్లు చేసినది. అంతేగాక ఫలానా జన్మలు దేవునివేనని గుర్తించునట్లు చేసినది. భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయమున పదకొండవ శ్లోకమును గుర్తుగా చూపి దానివలన దేవునికి జన్మలున్నట్లు తెలియజేసినది.
రాజవిద్యా రాజగుహ్య యోగము :- శ్లో॥ 11. అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్| పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ॥
భావము :- “సర్వ జీవరాసులకు మహేశ్వరుడనయ్యు, మానవ శరీరము ధరించిన నన్ను జూచి నా శ్రేష్ఠత్వమును తెలియని మానవులు అజ్ఞానులై నన్ను అవమానించు చున్నారు”
జ్ఞాన యోగము :- శ్లో॥ 9. జన్మ కర్మద మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః ॥ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున! ॥
భావము :- కొద్దిమాత్రమయినా నా యొక్క దివ్యమైన జన్మలను, నా పనులను తెలియగలిన మనిషి ఎవడయినా మరణించిన తర్వాత వాడు పునర్జన్మ పొందడు. అట్టివాడు నాలోనికి ఐక్యమగును, నాశనము లేని మోక్షమును పొందును. ఈ రెండు శ్లోకముల భావమును చూచిన తర్వాత దేవునికి జన్మలు లేవని, దేవుడు పుట్టడని ఎవడూ చెప్పడు. ఈ విషయము ప్రథమ దైవ గ్రంథములోయుండగా, మిగతా రెండు గ్రంథములలో కూడా దేవుడు పుట్టునను బోధయే కలదు. అయితే మాయ ప్రభావము వలన కొందరికి ఆ విషయమే అర్థము కాలేదు. వారి విషయమును వదలి, దేవుడు పుట్టునని మనము చెప్పుకోగలిగితే, కొంతవరకు గొప్ప జ్ఞానము తెలిసినట్లేయగును. ప్రపంచమునకు అంతటికీ దేవుడు ఒక్కడే విశ్వరాజ్యాధిపతిగా యున్నాడు. మనము ఇప్పుడు ఆయనను దేవుడని చెప్పుచున్నా సృష్ట్యాదిలోనే ఆయనకు సృష్టికర్త, పరమాత్మ, అల్లాహ్ అను మూడు బిరుదులు గలవు. ఆయనే ఇప్పుడు మనము చెప్పుచున్న దేవుడని తెలియవలెను.
'పనిని బట్టి బిరుదు ఉండును' అను సూత్రము ప్రకారము దేవుడు ఉన్న విధానమునుబట్టి ఆయనకు ఆనాడే సృష్ట్యాదిలోనే బిరుదులు లభించినవి. దేవులాడబడేవాడు దేవుడు అన్నట్లు, సృష్టిని సృష్టించిన ఏకైక కర్త అయిన దానివలన దేవున్ని “సృష్టికర్త” యని చెప్పబడినది. అలాగే ఆత్మకంటే వేరుగా యున్నవాడు దేవుడు అయినందున అదే అర్థముతో “పరమాత్మ' అని అనడము జరిగినది. ఆత్మకంటే పరముగా యున్నవాడని దాని అర్థమని చాలామందికి తెలియక అదియొక పేరని కొందరు అనుకోవడము అయినది. అలాగే నేడు ముస్లీమ్ల దేవుని పేరని అందరూ అనుకొను “అల్లాహ్” అను బిరుదు సృష్ట్యాదిలోనే అర్థసహితముగా యుండేది. “ల్లాహ్” అనగా అంతుయని, గట్టుయని చెప్పవచ్చును. “అల్లాహ్” అనగా అంతులేనివాడని వివరమునిచ్చునది. “అల్లాహ్” పదము యొక్క అర్థము స్వచ్ఛమయిన తెలుగు భాషలోనిదని కూడా చాలామందికి తెలియదు. పూర్వమే సృష్ట్యాదిలోనే అర్థముతో కూడుకొన్న బిరుదాంకితుడు దేవుడని ఎవరికీ తెలియక దేవునికి పేర్లున్నాయని అందరూ అనుకోవడము జరిగినది. దేవునికి పేర్లవలెయున్నవన్నీ బిరుదులేనని, పేరు ఒక్కటి కూడా లేదని తెలిసిన వారికి దేవుడు నామరహితుడని తెలియగలదు. వెతకబడేవాడే గానీ కనిపించేవాడు కాడని తెలిసిన వారికే దేవుడు రూపము లేనివాడని తెలియగలదు. చైతన్యవంతమై అన్ని కార్యములు చేయు ఆత్మయు కాకుండా, ఆత్మకంటే వేరుగా సాక్షిగా దేవుడున్నాడని తెలిసిన వారికే పరమాత్మయంటే క్రియారహితుడని తెలియగలదు.
రూప, నామ, క్రియారహితుడైన దేవుడు ఖురాన్ గ్రంథములో 42వ సూరా, 51వ ఆయత్నందు చెప్పినట్లు “తనకు తప్ప ఇతరులకు తెలియని తన జ్ఞానమును తానే పరోక్షముగా మూడు విధముల
తెలియజేతునని” చెప్పినట్లు తన సృష్ఠిలో ఆకాశ ఉరుముల ద్వారా ఒక విధముగా, సూక్ష్మ రూపముగా మరొక విధముగా తెలిపినా, ఆ బోధ నేరుగా మనుషులకు చేరక ఆకాశములోని గ్రహములకు ఆకాశబోధ, సూక్ష్మమును గ్రహించు ప్రవక్తలకు తెరచాటునుండి తెల్పిన బోధ చేరిపోగా, దేవుడు చెప్పినది చెప్పినట్లు మనుషులకు చేరకపోవడము వలన, చివరకు ప్రవక్తలు మనుషులకు తెల్పిన జ్ఞానము కూడా కొంత కాలమునకు కలుషితమై పోవుటకు అవకాశముండుట వలన, దేవుని ప్రతిరూపమైన (ప్రతినిధియైన) భగవంతుని ద్వారా మూడవ విధానమును అనుసరించి ప్రజలకు జ్ఞానమును చెప్పడము జరిగినది. ఆకాశమునుండి చెప్పినప్పుడు గానీ, తెరచాటునుండి సూక్ష్మరూపములో చెప్పినప్పుడు గానీ దేవున్ని గుర్తించుటకు అవకాశము లేదు. అయితే మూడవ విధానమైన దేవుని ప్రతినిధి వచ్చి జ్ఞానమును బోధించినప్పుడు నేరుగా ప్రజలకే బోధించుచూ, మనుషులతో సంబంధపడి, మనుషుల మధ్యలోనే ఉండుట వలన, వచ్చిన ప్రతినిధినిబట్టి దేవుని నిజ భావమును కొంతవరకు తెలియుటకు అవకాశము గలదు. అందువలన ఇప్పుడు మనము దేవునిచేత పంపబడిన దేవుని ప్రతినిధిని గురించే చర్చించుకొందాము.
అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో సూరా 42, ఆయత్ 51లో చెప్పిన విషయమందు చివరి వాక్యములో “తాను కోరినది తన ఆజ్ఞతో సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడు" అని గలదు. అంతేగాక అదే మాట చివరిలో మరొక ముఖ్యమైన మాట చెప్పడమైనది. అది ఏమనగా! అలా తన ప్రతినిధిగా వచ్చినవాడు “మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు” అని చెప్పడమైనది. దేవుడు రూప, నామ, క్రియారహితుడు. అంతేకాక ఆయన వెదికితే కనిపించువాడు కాడు. పనిచేయు ఆత్మయు
కాడు (పరమాత్మ), అంతుగానీ, హద్దుగానీ లేనివాడు (అల్లాహ్) ఏ అంచనాకు తెలియనివాడు అయినందున దేవున్ని ప్రత్యక్షముగా ఎవరూ తెలియలేరు. అయితే దేవుడు తన ప్రతినిధిని పంపుతానని చెప్పి పంపినప్పుడు వచ్చినవాడు దేవుని ప్రతినిధిగా యున్నా, ఆయన దేవుడేనని మనకు జ్ఞానము వలన అర్థమయినప్పుడు, ఆయన ప్రతినిధియైన భగవంతున్ని మానవా కారములో చూచినప్పుడు, ఆయన ద్వారా దేవుని భావమును తెలియుటకు అవకాశము గలదు.
ఖురాన్ వాక్యములో చివరిగా చెప్పినమాటలో మరీ చివరిగా యున్న మాటలలో ఆయన “మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు” అని గలదు. స్వల్పమైన మనుషుల ప్రక్కలో దేవుని ప్రతినిధిగా వచ్చిన వానిని చూస్తే స్వల్పమైన మనుషులకంటే, కనిపించు మనిషిగా యున్న భగవంతుడు 'ఎంతో ఉన్నతుడు' అని తెలియుచున్నది. అలాగే కనిపించే మనుషుల వివేకము (తెలివి) కంటే భగవంతుని వివేకము ఎంతో గొప్పగాయుండును. అందువలన ఆయనను 'ఎంతో వివేకవంతుడు' అని చెప్పడమైనది. కనిపించే మనిషిగాయున్న భగవంతున్ని కనిపించే మనుషులతో పోల్చి చూచినప్పుడు దేవుని ప్రతిరూపమైన లేక దేవుని ప్రతినిధియైన వాడు మనుషుల భావము కంటే ఉన్నతమైన భావము కలవాడనియూ, మనుషుల వివేకముకంటే ఎంతో ఎక్కువ వివేకము గలవాడని తెలియుచున్నది. కనిపించని దేవుడు కనిపించే మనిషిగా వచ్చినప్పుడు మాత్రమే ఆయనను మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడని చెప్పుటకు అవకాశము గలదు. అదే దేవున్ని అలా చెప్పుటకు ఏమాత్రము వీలులేదు. దేవుడు కనిపించనివాడు, ఏదీ కానివాడు అయినందున ఆయనను ఎవరితో పోల్చి చూచుటకు అవకాశము లేదు. అందువలన దేవున్ని ఉన్నతుడని చెప్పుటకు, వివేకవంతుడని చెప్పుటకు అవకాశము లేదు. ఏదీ కానివానిని ఏమనీ చెప్పలేము.
దేవుడు అవతరించి మానవ రూపములో వచ్చినప్పుడు ఆయనను మనిషియని అనకూడదు. దేవుడు మానవునిగా మన మధ్యయుండినా ఆయనను మానవుడనిగానీ, మనిషియనిగానీ, ప్రజ అనిగానీ చెప్పుటకు వీలులేదు. ఎందుకనగా! ప్రత్యక్షముగా మనిషివలె కనిపించినా ఆయన మనిషికాడు, ఆయనను మనిషి అని అనకూడదు. ప్రస్తుతానికి ఆయన భూమిమీద ఉన్నప్పుడు ఆయన దేవుని అవతారమని తెలియకపోవడము వలన తెలియక మనిషిగా పోల్చుకొనినా, తర్వాత ఎప్పుడయినా ఆయన దేవుని అవతారమని తెలిసిన తర్వాత భగవంతుడని చెప్పవలెను. భగవంతుడను పేరు ఒక్క దేవుని అవతారమునకు మాత్రమే ఉండును. అటువంటి అవతారములు నాకు రెండు తెలిసినవి. అందువలన ఇప్పుడు నేను వారిని భగవంతుడని చెప్పుచున్నాను. తెలియనప్పుడు భగవంతున్ని ఎవరూ గుర్తించలేనప్పుడు ఆయనను ఎలా పిలిచినా ఫరవాలేదు. అయితే ఆయన జన్మను గురించి తెలిసిన తర్వాత దేవుని జన్మను తప్పక భగవంతుడని పిలువవలెను అలా పిలిచినప్పుడే దేవుని జన్మను గురించి తెలిసినవాడగుదురు.
ప్రశ్న :- భగవంతుడని దేవుని జన్మను అనాలని మీరు చెప్పుచున్నారు. మీరు చెప్పే ప్రకారమైతే దేవుని జన్మ భూమిమీద చాలా అరుదుగా జరుగు చుండునని తెలియుచున్నది. భగవద్గీతలో కూడా అధర్మములు చెలరేగి ధర్మములకు ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే దేవుడు అవతరించి ధర్మ ప్రతిష్టాపన చేయునని చెప్పియున్నారు. ఇదంతయూ చూస్తే కొన్ని లక్షల సంవత్సరములకో, తక్కువ అంటే కొన్ని వేల సంవత్సరములకొకమారు దేవుని జన్మయుండవచ్చునని తెలియుచున్నది. అలా ఎంతో కాలమున కొకమారు దేవుని జన్మయున్నా దానిని మనుషులు గుర్తించుట చాలా
దుర్లభము. భగవంతుని రాక అరుదైనప్పుడు, భగవంతుని గుర్తింపు బరువైనప్పుడు నేడు భూమిమీద ఎందరో 'భగవాన్' అను పేరు కల్గిన వారు, 'భగవాన్' అని పిలిపించుకొనువారు చాలామంది కనిపించుచున్నారు. వీరిలో ఎవరు భగవంతుడని మేము అనుకోవాలి? భూమిమీద భగవంతుడు ఉన్నప్పుడు తెలియబడడు. ఆయన వచ్చిపోయిన ఎన్నో సంవత్సరములకు గానీ, ఆయన చేసిన పనులనుబట్టి, చెప్పిన జ్ఞానమునుబట్టి ఫలానావాడు భగవంతుడని గుర్తుపట్టుటకు అవకాశముండును. అటువంటి ఎంతో కష్టమైనదిగా భగవంతుని గుర్తింపుయుండగా, ప్రత్యక్షముగా కనిపించు భగవంతులు ఇంతమంది యుండుటను మీరేమంటారు? ఒక గొప్ప స్వామీజీ దగ్గరనుండి సాధారణ మనిషి వరకు వారి పేరుకు ముందో లేక వెనుకో భగవాన్ అను పేరు కరిపించుకొన్నారు. వీరు నిజముగా భగవంతులా లేక ఇంకా ఏమయినా అర్థము గలదా?
జవాబు :- భూమిమీద ప్రత్యక్షముగా బ్రతికియున్నవారు భగవంతుడను పేరును వారి పేరుకు ముందో వెనకో పెట్టుకొనియుండుట నిజమే. నీవు అడిగినట్లే నేను ఒక స్వామీజీని నీవు భగవంతునివా? అని అడిగాను. ఆ స్వామీజీ తన పేరుకంటే ముందే భగవాన్ అని చెప్పుకోవడము జరిగెడిది. ఆయన పేరు "భగవాన్ గోపికా శ్రీవర్ధన్ స్వామీజీ” అని యుండెడిది. ఆయన ఉత్తర దేశము స్వామీజీ అయినందున హిందీ భాషనే మాట్లాడేవాడు. అప్పుడు ఆయన నాతో ఈ విధముగా మాట్లాడాడు.
భగవాన్ :- నేను 'భగవాన్' అను పేరును నా పేరు ముందు పెట్టుకుంటే నీకు ఏమనిపించినది? చెడుగా ఏమయినా కనిపించినదా? నీవు భగవాన్వేనా అని ఎందుకు ప్రశ్నించావు?
నేను :– దేవుడు భూమిమీద పుట్టినప్పుడు ఆయనను భగవంతుడు అనడము సహజము. జ్ఞానమును తెలిసినవారు మాత్రమే భగవంతుని జన్మను గుర్తించి, మనిషిగా వచ్చిన దేవున్ని భగవంతుడని అనవచ్చును. అటువంటి 'భగవాన్' అను పేరును మీరు పెట్టుకోవడము వలన దాని విషయమేమని, ఎందుకు అలా పెట్టుకొన్నారని అడిగాము.
భగవాన్ :- కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనకు 'భగవాన్' అను పేరు లేదు. ఆయన తర్వాత కొంత కాలమునకు ఆయనను భగవాన్ అని అందరూ అనడము జరిగినది. 'భగవాన్' అను పదములో అర్థమును పరిశీలించితే 'భగము' అనగా 'స్త్రీయొక్క గర్భము' అని అర్థము. గర్భమునుండి పుట్టినవాడు కనుక ఆయనను 'భగవంతుడు' అని అన్నారు. మొదట శ్రీకృష్ణున్ని మనిషి కాదు దేవుడని, ఆయన తల్లిగర్భమునుండి పుట్టలేదనీ, కృష్ణుడు ఆకాశము నుండి శిశువుగా భూమిమీదకు వచ్చాడని అందరూ అనుకొనెడివారు. అయితే కొంత కాలమునకు కృష్ణుడు ఆకాశమునుండి దిగి రాలేదని, దేవకీ దేవి గర్భమునుండి పుట్టివచ్చాడని అందరికీ తెలిసిపోయినది. అప్పుడు అందరూ కృష్ణున్ని 'శ్రీకృష్ణ భగవాన్' అని అన్నారు. అది కృష్ణుని విషయము కాగా నా విషయములో నేను తల్లిగర్భమునుండి పుట్టానని నాకు బాగా తెలుసు, నేను మొదట తల్లిగర్భమునుండి పుట్టిన తర్వాత నాకు పేరు పెట్టారు. ఇప్పుడు స్వామీ అని అంటున్నారు. నేను మొదట తల్లిగర్భములో పుట్టానని అందరికి తెలియుటకు నేను నా పేరు ముందరనే 'భగవాన్’ అను పేరును పెట్టుకొన్నాను. నేను పుట్టిన తర్వాత నాకు పేరు పెట్టబడినది. అందువలన భగవాన్ పేరు తర్వాత 'గోపికా శ్రీవర్ధన్' అను పేరును వ్రాయడము జరుగుచున్నది.
కృష్ణుడు పుట్టిన చాలా రోజులకు, ఆయనకు కృష్ణుడు అని పేరు పెట్టిన తర్వాత ఎంతో కాలమునకు కృష్ణుడు పైనుండి దిగి రాలేదని, ఆయన తల్లిగర్భమునుండి పుట్టాడని అందరికీ తెలిసినది. అందువలన ఆయన పేరును ముందు చెప్పి తర్వాత భగవాన్ అని చెప్పుచూ 'కృష్ణభగవాన్' అని అనడము జరుగుచున్నది. నేను ముందు పుట్టానని తర్వాత పేరు పెట్టబడినదని తెలుపుటకు నా పేరుముందు భగవాన్ పేరుండగా, కృష్ణునికి పేరు పెట్టిన తర్వాత గర్భమునుండి పుట్టాడని తెలియుట వలన ఆయన పేరు తర్వాత భగవాన్ అని పేరుపెట్టి 'కృష్ణభగవాన్ అని చెప్పుచున్నాము. నా పేరు అలా కాకుండా ‘భగవాన్ గోపికా శ్రీవర్ధన్ స్వామీజీ' అని చెప్పబడు చున్నది. కృష్ణుని పేరు వెనుక భగవానోయుండగా మా పేరుముందర భగవాన్ అనియుండడమును మీరు గమణించకుండా అడిగారు. భగవాన్ ముందువుంటే ఒక అర్థము, వెనుకయుంటే మరొక అర్థముంటుందని తెలియక నీవు నన్ను అడిగావని తెలియుచున్నది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వివరముగా అర్థమయిందా!
నేను :- భగవాన్ అంటే భగమునుండి పుట్టినవాడనియు లేక తల్లిగర్భము నుండి పుట్టినవాడని మీరే చెప్పుచున్నారు కదా! గోపికా శ్రీవర్ధన్ స్వామీజీ అని పేరుపెట్టబడిన మీరు తల్లిగర్భము నుండి పుట్టారా? అని నేను మిమ్ములను ప్రశ్నించుచున్నాను.
భగవాన్ :- తల్లిగర్భము నుండి పుట్టాననియే తెలియునట్లు భగవాన్ అని పేరు పెట్టుకొన్నాను. అందరూ తల్లిగర్భమునుండియే పుట్టుచున్నారని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడు నన్ను ప్రత్యేకముగా నీవు తల్లి గర్భమునుండి పుట్టావా! అని అడగడములో అర్థమేమిటి? అలా అడుగవలసిన పనేముంది?
నేను :- భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కడు తాను తల్లిగర్భము నుండి పుట్టానని
అనుకోవడము సహజము. అయితే నేనుగానీ మరి ఎవడుగానీ జన్మించిన ప్రతి ఒక్కడు తల్లిగర్భమునుండి సజీవముగా పుట్టలేదు. శిశుశరీరము తల్లిగర్భము నుండి పుట్టిన తర్వాత 'జీవుడు' అనబడు ప్రతి ఒక్కడు శిశు శరీరములో చేరి జన్మను తీసుకోవడము జరుగుచున్నది. ఇది జగమునకు తెలియని సత్యము. ఆ సత్యము మీకు కూడా తెలియదనియే మిమ్ములను ప్రశ్నించడము జరిగినది. ఉన్న విషయము చెప్పాను కదా! ఇప్పుడు చెప్పండి నీవు నీ శరీరముతో సహా తల్లిగర్భమునుండి పుట్టావా? లేక పుట్టిన శరీరములో కొంతసేపటికి ప్రవేశించి జన్మించావా చెప్పగలవా? మీ విషయము మీకు జ్ఞాపకము లేని సమయములో జరిగిపోయినది. కావున మీకు మీ విషయము మీద అవగాహన లేకపోయి ఉండవచ్చును. ఇప్పుడు ప్రస్తుత కాలములో ఎందరో ప్రతి క్షణము పుట్టుచున్నారు కదా! పుట్టుచున్న వారివద్దకు పోయి ప్రత్యక్షముగా చూచినట్లయితే నేరుగా తల్లిగర్భమునుండి ఎవరూ పుట్టలేరని తెలియగలరు. తల్లిగర్భమునుండి నేరుగా ప్రాణముతో జీవము గల్గి పుట్టువాడు ఎవడయినా ఉన్నాడేమో చెప్పగలరా? పుట్టువారిని వంద సంవత్సరములు గమణించి చూచినా, తల్లిగర్భము నుండి పుట్టిన వానిని ఒక్కనిని కూడా చూపలేవు.
ఒక్క దేవుడు తప్ప తల్లిగర్భమునుండి సజీవముగా పుట్టువాడు ఎవడూ లేడు. ఆ విషయము నీకు తెలియక నీ పేరుముందర ‘భగవాన్’ అని చెప్పుకొనుచున్నావు. ప్రపంచములో సర్వవ్యాపి అయిన దేవుడు ఒక్కడు తల్లిగర్భము నుండి భగవంతునిగా పుట్టగలడు. మిగతా వారందరూ తల్లిగర్భము బయట శిశు శరీరములో చేరడము వలన ఎవరూ భగవంతుడను పేరుకు అర్హులు కారు. కృష్ణుడు నిజమైన భగవంతుడు అయినా ఆయన ఉన్నప్పుడు ఆయన భగవంతుడని ఎవరికీ తెలియదు. ఆయన వచ్చి పోయిన తర్వాత నిజమైన భగవంతుడు, నిజమైన దేవుడు అని తెలిసినది.
ఆయన పోయిన తర్వాత ఎంతో వెనుక కాలములో ఆయన భగవంతుడని తెలియుట వలన కృష్ణుడు అను పేరు వెనుక భగవాన్ అని చెప్పడము జరిగినది. ఆయన ఎవరయినది ముందే తెలిసియుంటే, ఆయన బ్రతికి యున్నప్పుడే తెలిసియుంటే ఆయన పేరుముందర భగవాన్ అని చెప్పి యుండేవారము. ముందు తెలియదు, ఆయన వచ్చి పోయిన తర్వాత వెనుక తెలిసినది కావున ఆయన పేరు వెనుక భగవాన్ చేర్చి “శ్రీకృష్ణ భగవాన్” అని చెప్పాము. పేరు వెనుక భగవాన్ అని ఎందుకన్నామో మీకు ఇప్పుడు తెలిసిందా?
మీరు రూపాయలో ఒక పైసా భాగము కూడా భగవంతుడు కాకపోయినా భగవంతుడని అక్రమముగా పేరు పెట్టుకోవడమేకాక ముందు పెట్టుకొన్నందుకు తప్పు అర్థమును చెప్పుచున్నారు. మొదటికే మీరు భగవంతులు కాకపోయినా భగవంతుడని దేవుని బిరుదును తగిలించు కోవడము పెద్ద తప్పగును. నిన్ను నీవు దేవుడంతటి వానిగా చెప్పుకొన్నట్ల గుచున్నది. అది మీకు మంచిదేమో మీరే చెప్పండి. తెలియక చేసిన తప్పును లేకుండునట్లు ఇప్పటికయినా మీరు వెంటనే 'భగవాన్' అనే మొదటి హోదాను తీసివేయండి. 'భగవాన్' అను పదమునకు నిజమైన అర్థమును తెలిసి అది దేవుని జన్మకే అర్హమైనదని తెలిసి దేవుని జన్మను భగవంతుడని చెప్పుట మంచిది. దేవుడు సర్వవ్యాపి ఆయన అంతటా అణువణువునా నిండిన వాడు తల్లిగర్భములో కూడా యున్న పరమాత్మ గర్భములోని శిశు శరీరములో కూడా వ్యాపించియుండుట వలన ఆయన ఇంకొకచోటు నుండి వచ్చి పుట్టువాడు కాడు. దేవుడు సర్వవ్యాపి అయినందున తల్లిగర్భమునుండి సజీవముగా పుట్టుచున్నాడు. సాధారణ జీవాత్మ ఇంకొకచోట మరణించి అక్కడనుండి వచ్చి ప్రసవించబడిన శరీరములో పుట్టుచున్నది.
భగవద్గీతయందు నాల్గవ అధ్యాయమైన జ్ఞానయోగములో ఏడు, ఎనిమిది శ్లోకములలో దేవుడు ధర్మసంస్థానకొరకు పుట్టునని తెలియజేయ బడినది. అంతేకాక అదే అధ్యాయములో ఈ రెండు శ్లోకములకంటే ముందు ఆరవ శ్లోకమందు తన పుట్టుకను గురించి దేవుడు భగవంతుని రూపములో చెప్పిన శ్లోకమును చూస్తే దేవుడు చావు, పుట్టుకలు లేనివాడైనా ఎలా పుట్టుచున్నాడో తెలియగలదు. ఒకమారు ఆ శ్లోకమును చూడండి. జ్ఞానయోగము 6వ శ్లోకము...
అజోపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపి సన్। ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా మ్యాత్మ మాయయా॥
భావము : “నాకు పుట్టుకగానీ, మరణముగానీ లేవు. నేను సర్వజీవరాసులకు ఈశ్వరుడయిన (దేవుడయిన) వాడిని. అయినా నా ప్రకృతిని నేను అదిష్ఠించి శరీరమును తయారు చేసుకొని అందులో గుణముల మాయతో మరియు ఆత్మతో సహా భూమిమీద పుట్టుచున్నాను."
జ్ఞానయోగము 7వ శ్లోకము... యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! ॥ అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || భావము :- “ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పు కలిగి భూమిమీద అధర్మము వృద్ధి చెందునో అప్పుడప్పుడు భూమిమీద నన్ను నేను తయారు చేసుకొని శరీరముతో పుట్టుచున్నాను.” ఈ రెండు శ్లోకముల భావమును తెలిసిన తర్వాత ఎవడుగానీ దేవుడు పుట్టడని చెప్పుటకు అవకాశము లేదు. ఈ శ్లోకములు ప్రథమ
దైవగ్రంథములోయుండగా, ద్వితీయ దైవగ్రంథములో యున్న వాక్యమును బట్టి కూడా దేవుడు మనిషిగా పుట్టునని తెలియుచున్నది. ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలులో (ఇంజీలులో) రాబోవు అనగా పుట్టబోవు దేవున్ని “ఆదరణకర్తయని” చెప్పినట్లు తెలియవలెను. యోహాను సువార్త 14వ అధ్యాయమందు 16, 17 వాక్యములు (యోహాన్ 14-16,17) “నేను తండ్రిని వేడుకొందును, మీవద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియైన ఆత్మను మీకు అను గ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు మాత్రము ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివశించును, మీలో ఉండును." (25, 26) “నేను మీవద్ద యుండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును." (యోహాన్ 15-26) “తండ్రి వద్దనుండి మీ వద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రివద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును." (యోహాన్ 16-12, 13) “నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు గలవుగానీ, ఇప్పుడు వాటిని మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును." (25) ". ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడును గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది.”
ఈ విధముగా ఎనిమిది వాక్యములలో రాబోవు భగవంతున్ని గురించి ద్వితీయ దైవగ్రంథములో చెప్పడమైనది. అంతేకాక తృతీయ దైవగ్రంథమయిన అంతిమ దైవగ్రంథమని పేరుగాంచిన “ఖురాన్” గ్రంథములో దేవుని రాకను గురించి చెప్పిన వాక్యములను ఒకమారు గమనిస్తాము. సూరా 89, ఆయత్ 21, 22లో ఇలా వ్రాయబడియున్నది. (89-21,22) “భూమిని ఎడాపెడా దంచి తుత్తునియలుగా చేయడము జరిగినప్పుడు మీ ప్రభువు అవతరిస్తాడు. (22) “దేవదూతలు బారులు తీరియుండగా దేవుడు అవతరిస్తాడు"
అదే అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో సూరా 15, ఆయత్ 28, 29, 30 లలో ఇలా కలదు చూడండి. (15-28, 29, 30) నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్నాడు. (28) “నిశ్చయముగా నేను మ్రోగేమట్టి రూపాంతరము చెందిన జిగటబురదతో మానవున్ని సృష్టించబోవు చున్నాను. (29) “ఇక నేను అతనికి పూర్తి ఆకారమిచ్చి అతనిలో నా తరపు నుండి నా ఆత్మను ఊదిన తర్వాత మీరంతా అతనిముందు సాష్టాంగ నమస్కారము చేయాలి. (30) “అప్పుడు దేవదూతలు అందరూ కలిసి సాష్టాంగ నమస్కారము చేశారు. (31) “ఒక్క ఇబ్లీసు (మాయ) తప్ప అతడు సాష్టాంగపడేవారిలో చేరనని మొండికేశాడు." (ఈ వాక్యములు "దివ్య ఖురాన్ సందేశము తెలుగు భాషలో” అను గ్రంథములో గలవు. ఇవే వాక్యములు తెలుగు అనువాదమైన మరి రెండు గ్రంథములలో చూస్తాము. మొదట “అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్" అను గ్రంథము లోనూ, తర్వాత “ఖుర్ఆన్ భావామృతము" అను గ్రంథములోని వాక్యములను వ్రాయుచున్నాము చూడండి. ) (15-28) "కుళ్ళి బాగా ఎండిపోయిన (నల్లని) మట్టితో నేను ఒక మానవున్ని సృష్టించబోతున్నాను." అని నీ ప్రభువు
దేవదూతలతో అన్నాడు. (29) “నేను అతన్ని పూర్తిగా తయారు చేసి, అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి." (30) “దూతలందరూ సాష్టాంగ పడ్డారు. (3) “ఒక్క ఇబ్లీసు తప్ప! సాష్టాంగ పడేవారిలో చేరటానికి వాడు నిరాకరించాడు".
(ఖుర్ఆన్ భావామృతము) (15-28) “ఆ సందర్భములో నీ ప్రభువు దైవదూతలతో అన్నమాటలు గుర్తుచేసుకో, నేను కుళ్ళి ఎండిపోయిన మట్టితో ఒక మానవున్ని సృజిస్తున్నాను (సృష్టిస్తున్నాను). మానవున్ని సృష్టించడము పూర్తయిన తర్వాత అతని (దేహము)లో నా ఆత్మ (నొకదాని) ని ఊదుతాను. అప్పుడు మీరంతా అతనికి గౌరవసూచకంగా అభివాదము (సాష్టాంగ నమస్కారము) చేయాలి" అన్నాడు నీ ప్రభువు. (30,31) “దానిప్రకారము దైవదూతలంతా (మానవునికి) అభివాదము చేశారు, ఇబ్లీసు తప్ప. ఇబ్లీసు వారందరితో పాటు అభివాదము చేయటానికి నిరాకరించాడు."
ఈ విధముగా మూడు దైవగ్రంథములలోనూ దేవుడు భగవంతునిగా పుట్టునని కలదు. అయినా క్రైస్తవ, ముస్లీమ్ సమాజముల వారు దేవుడు పుట్టడని చెప్పుచున్నారు. వారి గ్రంథములలో వ్రాసిన దానికంటే వారి మత పెద్దలు చెప్పినదే గొప్పయని వారనుకోవడము వలన గ్రంథములలో కూడా ఆ విషయము లేదని అనుకొంటున్నారు. గ్రంథములలో దేవుడు పుట్టడని వ్రాసినట్లు వారి పెద్దలు చెప్పగా వారిమాటయే సత్యమని అనుకొన్నారు. గ్రంథములలో యున్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో చాలా శ్లోకములలో దేవుడు మనిషిగా పుట్టి తన ధర్మములను బోధించి పోవునని చెప్పియున్నారు. అదే విషయమే ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలు గ్రంథములో కొంత భాష తేడాతో కలదు.
భగవద్గీతలో నేరుగా దేవుడే తన జన్మను గురించి చెప్పినట్లుయుండగా, బైబిలులో దేవుడు చెప్పినట్లు కాకుండా ప్రస్తుత జన్మలోయున్న భగవంతుడు రాబోవు భగవంతుని జన్మను గురించి చెప్పినట్లు గలదు. భగవద్గీతలో దేవుడే చెప్పినట్లు, బైబిలులో భగవంతుడు చెప్పినట్లు యున్నా దేవుడు భగవంతునిగా వచ్చునను విషయమే స్పష్టముగాగలదు. ఇక అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ విషయములోనికి వస్తే 89వ సూరాలో 21, 22 ఆయత్లయందు “దేవుడు తల్లిగర్భమునుండి అవతరిస్తాడను” సూచన చేయుచు తల్లిగర్భమును భూమిగా చెప్పి, ప్రసవ సమయములో గర్భములో కలుగు బాధను అనగా ప్రసవవేదనను 'భూమిని దంచి తుత్తునియలు చేసినప్పుడు' అని చెప్పి భగవంతుడు పుట్టునని చెప్పుటకు “దేవుడు అవతరించును” అని చెప్పడము జరిగినది. సూరా 15, ఆయత్ 28, 29, 30ల లో “దేవుడే స్వయముగా తను ఒక మానవున్ని తయారు చేయబోవు చున్నానని పుట్టబోవు భగవంతున్ని మానవుడు” అని చెప్పాడు. దేవుడే స్వయముగా చెప్పిన వాక్యములో దేవుడు మనిషిగా పుట్టునని చెప్పు విషయమై నేను మట్టితో ఒక మనిషిని చేసి, అందులో నా ఆత్మనే ఊది పంపుదునని చెప్పాడు. అలా పంపబడువాడు దైవాంశ అయిన భగవంతుడు అయినందువలన “అతనికి అందరూ నమస్కరించమని” చెప్పాడు. అంతేకాక "దేవదూతలు కూడా నమస్కరింతురు” అని చెప్పాడు. మొత్తము మీద భగవంతుని సమాచారము భగవద్గీతలోవలె 15వ సూరాలో స్వయముగా దేవుడే చెప్పినట్లు గలదు.
ఈ విషయమును ముస్లీమ్ల వద్ద ప్రస్తావించినప్పుడు దేవుడు ఎప్పటికీ పుట్టడు అని చెప్పుచూ 15వ సూరాలోని విషయమును వివరిస్తూ ఒక మానవున్ని అని చెప్పినది ఆదామున్ను గురించి అని చెప్పుచున్నారు. ఆదాము సృష్ట్యాదిలోని మొదట దేవుని చేత సృష్టించబడిన మనిషియనీ,
మొదట ఆదామ్ ద్వారానే తర్వాత మానవ సంతతియంతా కల్గినదని, మనుషులంతా ఆదామ్ సంతతని చెప్పుచుందురు. ఇక్కడ సూరా 15లో 28, 29, 30 వాక్యములలో చెప్పిన విషయము పదునాల్గువందల సంవత్సరముల క్రిందటయను విషయమును మరచిపోయారు. ఈ మధ్య కాలములో నేను ఒక మనిషిని చేసి నా ఆత్మను అతనిలో నింపి పంపుదునని జరుగబోవు సమాచారమును దేవుడు చెప్పినట్లు జిబ్రయేల్ ఆత్మ (గ్రహము) చెప్పి యుండగా, ఆ విషయమును ప్రక్కనబెట్టి ఎప్పుడో సృష్ట్యాదిలో జరిగిపోయిన విషయమును తీసుకవచ్చి ఇప్పటి సమాచారముగా చెప్పు చున్నారు. కొంత విచక్షణ కల్గి యోచించు వారికి అది ఆదామ్ను గురించి చెప్పినది కాదనీ, ఆదాత్రి జరిగిపోయిన కాలమనీ, ఇక్కడ చెప్పినది జరుగబోవునదని సులభముగా తెలిసిపోవును. దేవుడు తాను చెప్పినది తన ఆత్మనే ఊది పంపబడు తన అంశయైన భగవంతున్ని గురించని సులభముగా తెలిసి పోవుచున్నది. ఈ విధముగా ప్రథమ, అంతిమ దైవగ్రంథములలో దేవుడే స్వయముగా చెప్పినట్లుయుండగా, మధ్యమ దైవగ్రంథమయిన బైబిలులో భగవంతుడే రాబోవు భగవంతున్ని గురించి చెప్పినట్లుయున్నది. ఇంతగా మూడు దైవగ్రంథములలో చెప్పియున్నా చాలామంది దేవుని పుట్టుకను గురించి ఏమాత్రము ఆలోచించడము లేదు. దేవుడు భగవంతునిగా కనిపించే మనిషిగా వచ్చి ఎవరికీ తెలియని దేవుని జ్ఞానమును చెప్పినా గ్రహించని వారు గలరు. అందువలన భగవంతున్ని గురించిన సమాచారము భూమిమీద సరిగా తెలియకుండా పోయినది.
దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మనిషికీ తెలియనప్పుడు దేవుని సమాచారమైన జ్ఞానమును దేవుడే భూమిమీద తెలుపవలసియున్నది. అయితే దేవుడు పని చేయువాడు కాదు, అట్లే కనిపించువాడు కాదు. అందువలన దేవుడు నేరుగా మనుషులకు జ్ఞానమును తెలుపలేదు.
అందువలన దేవుడు తనకు మనుషులకు మధ్యలో భగవంతుని పాత్రను పోషించుచున్నాడు. భగవంతుడు అటు దేవుడుకాడు, ఇటు మనిషికాడు. దేవుడు కాని ఎడల దేవుని ధర్మములు మనిషిగాయున్న భగవంతునికి వర్తించవు. అందువలన భగవంతుడు ఇతరులకు కనిపించవచ్చును. ఇతరులతో మాట్లాడి దేవుని ధర్మములను తెలుపు కార్యమును చేయవచ్చును. భగవంతునిగాయున్న దేవునికి రూప, నామ, క్రియలు ఉన్నవని చెప్పవచ్చును. అదే దేవునికి రూప, నామ, క్రియలు లేవు. దేవునిగాయుండి దేవుడు తన జ్ఞానమును ఇతరులకు చెప్పలేడు. అలా చెప్పవలెనంటే దేవుని ధర్మములకే లోపము ఏర్పడును. అలా దేవుని ధర్మములకు లోపము ఏర్పడకుండా దేవుని జ్ఞానమును దేవుడే చెప్పవలెనంటే దేవుడు భగవంతుని వేషము ధరించ వలసివచ్చును. మనిషివలె యున్నా మనిషి కానటువంటి భగవంతుని రూపములో దేవుని ధర్మములను సులభముగా మనుషులకు తెలియజేయ వచ్చును. భగవంతుడు మనిషిగా కనిపించినా మనిషివలె కర్మలు లేనివాడు మరియు కర్మలు అంటనివాడుగాయున్నాడు. అందువలన ఇటు దేవుడు కాడని, అటు మనిషి కాడని భగవంతున్ని చెప్పవచ్చును. ఇటు దేవునికి అటు మనిషికి విభిన్నమైనవాడు భగవంతుడు.
దేవుడు భగవంతునిగా జన్మించితే మనిషివలెయుండును, కనుక మనుషులెవరూ ఆయన దేవుని అవతారమైన భగవంతుడని గుర్తించలేరు. భగవంతుడు మనిషిగాయున్నా ఆయన మనిషి ఆకారములోయున్న దేవుడేయనీ, దేవుని జ్ఞానమంతయు భగవంతునిగా యున్నవానికి తెలియునని చెప్పవచ్చును. దేవుడు తన జ్ఞానమును ప్రజలకు వివరించుటకు భగవంతునిగా ఎన్నిమార్లయినా జన్మించవచ్చును. ధర్మములకు ముప్పుకల్గి ధర్మములు తెలియకుండా పోయినప్పుడు దేవుడు మనిషి అయిన భగవంతునిగా వచ్చి జ్ఞానమును చెప్పవచ్చును. అందువలన దేవుడు
భగవంతునిగా ఎన్నిమార్లయినా రావచ్చును, అట్లే ఎప్పుడయినా రావచ్చును. సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా తెలిపిన జ్ఞానము మనుషులలో చేరకపోయి నందున, దానిని తెలుపు నిమిత్తము మనిషియైన కృష్ణునిగా దేవుడు అవతరించడము జరిగినది. అయినా కృష్ణుడు భూమిమీదయున్నప్పుడు ఒక్క భీష్ముడు తప్ప ఆయనను ఎవరూ గుర్తించలేకపోయారు. కృష్ణుడు తన జీవితము యొక్క చివరిలో తన జ్ఞానమును అనగా ఆకాశవాణి ద్వారా చెప్పిన జ్ఞానమును చెప్పిపోవడము జరిగినది. భగవద్గీతను చెప్పి ఇప్పటికి దాదాపు 5150 సంవత్సరములయినది. ఇప్పుడు భగవద్గీతను చదివిన మేము ఆయన చెప్పిన జ్ఞానమునుబట్టి కృష్ణుడు భగవంతునిగా వచ్చిన దేవుడని తెలియగలిగాము. దేవుడు ఎప్పుడు కనిపించే వానిగా వచ్చినా ఆయన భగవానుడేయగును. అట్లే భగవానుడు ఎప్పుడు వచ్చినా ఆయన దేవుడేయగును. దీనిప్రకారము కృష్ణుడు దేవుడేయని, దేవుని అవతారమని చెప్పవచ్చును.
దేవుడు ద్వాపరయుగము చివరిలో కృష్ణునిగా జన్మించి, వాణి ద్వారా వచ్చిన జ్ఞానమును విశధీకరించి చెప్పిపోయాడు. తర్వాత మూడు వేల సంవత్సరములకు మరియొక జన్మ తీసుకొని జ్ఞానమును బోధించవలసి వచ్చినది. అలా వచ్చిపోయి ఇప్పటికి రెండువేల సంవత్సరములయినది. దేవుడు ఒక్కడే అయినా ఐదువేల సంవత్సరముల వ్యవధిలో రెండుమార్లు భగవంతునిగా వచ్చి పోవడము జరిగినది. మొదట కృష్ణునిగా వచ్చి జ్ఞానమును చెప్పిపోయినా, అదే జ్ఞానమునే ఏసుగా భూమిమీదికి వచ్చిన భగవంతునిగా కనిపించి చెప్పాడు. దేవుడు ఒక్కడే అయినా కృష్ణునిగా, ఏసుగా వచ్చినవాడు ఒక్కడే అయినా, భూమిమీద ఇద్దరిగా వచ్చి పోయాడు. భారతదేశములో మొదట కృష్ణునిగా వచ్చినవాడే తర్వాత మూడు వేల సంవత్సరములకు ఇజ్రాయెల్ దేశములో ఏసుగా రావడము జరిగినది.
భగవంతునిగా ఎన్నిమార్లు వచ్చినా వచ్చినవాడు ఒక్కడేయగును. దేవుడు అవతారమైన కృష్ణునిది హిందూమతములో యుండగా, తర్వాత వచ్చిన ఏసుది క్రైస్తవమతములో ఉండిపోయినది. ఏసు చెప్పిన జ్ఞానము కృష్ణుడు చెప్పిన జ్ఞానము ఒక్కటే అయినా, ఇద్దరిగా వచ్చినవాడు ఒక్కడే అయినా కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒక్కడేయని మనుషులకు తెలియదు. ఇద్దరు ఒక్కరేయని తెలియక పోవడము వలన కృష్ణుని పేరు వింటూనే క్రైస్తవులు అసూయ పడుచున్నారు. అట్లే ఏసు పేరు వింటూనే హిందువులు అసూయతో మండిపోతున్నారు. ఇద్దరు చెప్పిన జ్ఞానము ఒక్కటే అయినా, వాస్తవానికి ఇద్దరు ఒక్కటే అయినా, ఇటు హిందువులుగానీ, అటు క్రైస్తవులు గానీ 'ఇద్దరు ఒక్కటే' అను విషయమును ఏమాత్రము తెలియలేకపోయారు.
దేవుడు ఎప్పుడు వచ్చినా ఆయనొక్కడే రావలసియున్నది. వేరేవాడు భగవంతునిగా వచ్చుటకు ఆయన (దేవుడు) ఒక్కడు తప్ప ఇతరులు ఎవరూ లేరు. దేవుని జ్ఞానము దేవునికే తెలుసు ఇతరులకు తెలియదు, కావున దేవుడే మనిషివలెనున్న భగవంతునిగా రావలసియున్నది. ఎప్పుడు వచ్చినా, ఏ ఆకారములో వచ్చినా, ఏ పేరుతో వచ్చినా బోధించు బోధ ఒక్కటే, బోధించు వాడు ఒక్కడే. అందువలన ద్వాపర యుగము చివరిలో వచ్చిన కృష్ణుడు, కలియుగములో వచ్చిన ఏసు ఇద్దరు ఒక్కడేయని చెప్పుచున్నాము. మనుషులలోగల అజ్ఞానము వలన ఇద్దరు వేరువేరు వ్యక్తులుగా కనిపించినా వారిలోయున్న వాడు ఒక్కడేయని తెలియవలెను.
ప్రశ్న :- దేవుడు ఒక్కడే ఒకే కాలములో ఇద్దరు భగవంతులుగా రెండు శరీరములను ధరించి ఇద్దరు మనుషులుగా రావచ్చునా? వేరువేరు దేశములలో వేరువేరు శరీరములను ధరించిన భగవంతుడు ఒకే కాలములో ఉండుటకు అవకాశముగలదా?
జవాబు :- దేవుడు ఎక్కడయినా ఒక్కకాలములో ఒక్క అవతారముగానే యుండును. ఒకే కాలములో రెండు, మూడుచోట్ల ఉండుటకు వీలుపడదు. ఒక దేశములో ఒకమారు బోధించి పోయిన తర్వాత కొంతకాలమునకు అనగా కొన్ని వేల సంవత్సరములకు మరియొక దేశములో భగవంతునిగా అవతరించి జ్ఞానమును చెప్పవచ్చును. అంతేగానీ ఒకే కాలములో భగవంతుడు రెండు చోట్ల అవతరించడు. ఒక భగవంతడు పోయిన తర్వాత రెండవమారు భగవంతుడు వచ్చుటకు అవకాశము గలదు. అందువలన మధ్య దైవగ్రంథములో యోహాన్ సువార్త 16వ అధ్యాయమందు 7వ వచనములో ఈ విధముగా చెప్పియున్నారు చూడండి. (యోహాన్ 16-7) "నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీవద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీవద్దకు పంపుదును". ఈ వాక్యమునుబట్టి భగవంతునిగా యున్న ఏసు పోయిన తర్వాత కొంతకాలమునకు ఆదరణకర్తయను భగవంతుడు వచ్చునని తెలియుచున్నది. ఒకరు ఉండగానే ఇంకొకరు రారని "నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు” అని కూడా వాక్యములో చెప్పిన దానినిబట్టి ఒక భగవంతుడు భూమిమీదయుండగా ఇంకొక భగవంతుడు రాడని తెలియుచున్నది.
ప్రశ్న :- ఒకమారు భగవంతుడు వచ్చినప్పుడు ఆయన చెప్పిన జ్ఞానమును వినినవారు కర్మ పూర్తి అయిపోక, వారు కూడా పూర్తి జ్ఞానులు కాకపోవడము వలన, ఇంకా తెలియవలసినది ఉండుట వలన, వారు మోక్షమును పొందక జనన మరణములు పొందుచూ రెండు వేల సంవత్సరములు గడిపారను కొనుము. రెండువేల సంవత్సరములకు దేవుడు భగవంతునిగా క్రొత్త
శరీరముతో, క్రొత్త పేరుతో పుట్టాడనుకొనుము. అప్పుడు ముందు జ్ఞానము వినిన భక్తులు రెండవమారు వచ్చిన భగంతున్ని మొదట రెండు వేల సంవత్సరములప్పుడు చూచినట్లే ఆయనను గుర్తించగలరా? పేరు, ఆకారము మారిపోయి ఉండుట వలన గుర్తించగలరా?
జవాబు : జ్ఞానముతో సంబంధములేని వారు ఎవరూ రెండవమారు వచ్చిన భగవంతున్ని గుర్తించలేరు. అయితే పూర్వము జ్ఞానము విన్నవారు భగవంతుడు రెండవమారు వచ్చినప్పుడు, వారు ఎన్నో జన్మలోయున్నా భగవంతున్ని గుర్తించగలరు. ఆయనే ఈయన అని చెప్పగలరు. విషయమును గురించి ద్వితీయ దైవగ్రంథములో ఇలా యున్నది చూడండి. (యోహాన్ 14-16,17,18,19) "నేను తండ్రిని వేడుకొందును. మీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియైన ఆత్మను మీకను గ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివశించును. మీలో ఉండును. (18) మిమ్ములను అనాథలుగా విడువను. మీ వద్దకు వత్తును. కొంత కాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. (19) అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. (యోహాన్ 15-26, 27) తండ్రి యొద్దనుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యము ఇచ్చును. మీరు మొదటినుండి నావద్దయున్నారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.
పై వాక్యములను బట్టి దేవుడు భగవంతునిగా రావడమును అప్పుడున్న వారే ఇప్పుడుండుట వలన ఆయనను గుర్తుపట్టగలరని చెప్పి
యున్నారు. పై వాక్యములలో ఆదరణకర్త అను పేరును భగవంతుడని చెప్పుటకై వినియోగించినదని తెలియవలెను. చివరిలో చెప్పిన వాక్యమందు “తండ్రియొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును” అని చెప్పబడియున్నది. రెండవమారు వచ్చిన ఆదరణకర్త (భగవంతుడు) ముందువచ్చి పోయిన భగవంతున్ని గురించి చెప్పగలుగును. అట్లు చెప్పకపోతే ముందు వచ్చిన భగవంతుడు ఎవరో మనుషులకు తెలియదు. తర్వాత వచ్చినవాడు మొదట వచ్చినవాడే అయివుండుట చేత మొదట వచ్చిపోయిన భగవంతుడు ఫలానావాడని చెప్పగలుగును. అలా సాక్ష్యమిచ్చుట వలన ముందు వచ్చిపోయిన భగవంతుడు ఎవరయినది మనుషులకు తెలియును. లేకపోతే మొదటివానిని గుర్తించుటకు మనుషులకు సాధ్యము కాదు. భగవంతునిగా వచ్చినవాడు తాను ఎవరయినది తెలియకుండా నటించి, మనిషివలె ప్రవర్తించి జ్ఞానమును చెప్పిపోవును. అయినా ఆయన చెప్పిన జ్ఞానమును చూడకుండా, ఆయన అనుభవించిన కష్టసుఖములను మనుషులు చూచుట వలన వచ్చినవాడు దేవుడేయని గుర్తించలేరు. దేవుడు భగవంతునిగా వచ్చిపోయిన విషయము రెండవమారు వచ్చిన భగవంతుడు చెప్పినప్పుడే తెలియునని పై వాక్యములో చెప్పడమైనది.
ఇక్కడ ద్వితీయ దైవగ్రంథములో ఏసు పేరుతో వచ్చినవాడు ఆదరణ కర్తయేనని (భగవంతుడేనని) అర్థమగునట్లు రాబోయే ఆదరణకర్త తెలుపునని చెప్పడమైనది. మొదటివాడు ఆదరణకర్తయేనని తెలుపు నిమిత్తము ఇక్కడ యోహాన్ 14వ అధ్యాయము 16వ వచనములో ఇలా యున్నది. చూడండి. (యోహాన్ 14-16) “మీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన 'వేరొక ఆదరణకర్తను' అనగా సత్యస్వరూపియైన ఆత్మను మీకు అనుగ్రహించును".
ఈ వాక్యమునుబట్టి వేరొక ఆదరణకర్తను అని చెప్పుట వలన ప్రస్తుతము మాట్లాడు వాడు కూడా ఆదరణకర్తయేనని అర్థము కాగలదు. దీనినిబట్టి ద్వితీయ దైవగ్రంథములోయున్న ఆదరణకర్తను అనగా భగవంతున్ని తర్వాత రాబోయే ఆదరణకర్త చెప్పగలడని తెలిసిపోయినది. అదే విధానము ప్రకారమే ఏసుకంటే ముందు వచ్చి భగవద్గీతను చెప్పిపోయిన భగవంతున్ని ఏసు గుర్తించి కృష్ణుడు దేవుడయిన భగవంతుడని చెప్పవలసియున్నది. ద్వాపర యుగములో వచ్చిన కృష్ణున్ని గురించి ఏసు సాక్ష్యమిచ్చియున్నాడు. ఆయన ఎలా సాక్ష్యమిచ్చినది ఆయన జీవితమును చూచినట్లయితే అర్థము కాగలదు. ఏసు జీవిత చరిత్రను, కృష్ణుని జీవిత చరిత్రను ఒకదానితో ఒకటి పోల్చి చూచినట్లయితే ఏసు, కృష్ణుడు ఒక్కడే ఇద్దరుయని తెలియగలదు. ఒకే దేవుడు ఇద్దరిగా వచ్చియున్నాడని తెలియడమేకాక మూడవ మారు వచ్చిన ఆదరణకర్త ఏసు ఫలానా వాడని చెప్పుట వలన ఏసు ఎవరయినది సులభముగా తెలియగలదు. కృష్ణున్ని ఏసును చూచి ఒక్కడే ఇద్దరని చెప్పవచ్చును. అలాగే ఏసును రాబోయే ఆదరణకర్తను చూచి ఇద్దరు ఒక్కరేయని చెప్పవచ్చును. ముందు ఒక్కడే ఇద్దరుయను విషయమును గురించి సాక్ష్యముగా గతములో మేము వ్రాసిన “శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా” అను గ్రంథములోని ఒక విభాగమైన “శ్రీకృష్ణుని మరణము లోకమునకు కనువిప్పు" అను సమాచారమును చూస్తాము. ఈ గ్రంథములోని సమాచారమంతయు చూచిన తర్వాత ఒక్కడే ఇద్దరు అని పూర్తిగా తెలియగలదు. తర్వాత వచ్చిన ఆదరణకర్త, వచ్చిపోయిన ఏసు ఇద్దరు ఒక్కడేయని కూడా తెలియగలదు. దీనినిబట్టి పూర్తి వివరముగా చెప్పితే ద్వాపరయుగములో వచ్చిన ఆదరణకర్త కృష్ణుడు, కలియుగములో వచ్చిన ఆదరణకర్త ఏసు, కలియుగములోనే రాబోవు లేక వచ్చియున్న ఆదరణకర్త
ముగ్గురు ఒక్కరేయని కూడా చెప్పవచ్చును. ఒక్కడే ఇద్దరు అను విషయమును గురించి ముందు వ్రాసిన గ్రంథములోని సమాచారమును ఇప్పుడు చూస్తాము.
కృష్ణుని మరణము లోకమునకు కనువిప్పు.
క్రీస్తుపూర్వము 02-02-3102వ సంవత్సరము కృష్ణుడు మరణించాడు. జనవరి 14వ తేదీ తర్వాత ఉత్తరాయణ కాలము వస్తుంది. కావున కృష్ణుడు చనిపోయినది ఉత్తరాయణములోనని తెలియుచున్నది. ఒకనాడు కృష్ణుడు ఒక చెట్టుపొదవద్ద కాలు మీద కాలు పెట్టుకొని పడుకొని కాలును కదిలించుచుండగా, ఆ ప్రాంతమునకు వేటకై వచ్చిన బోయవాడు పొదచాటున కాలు కదులుటను చూచి, అక్కడ జింక కదులుతున్నదని తలచి పొరపాటుగా బాణమును వేయగా, అది కృష్ణుని కుడికాలు బొటన వ్రేలుకు తగిలింది. బొటనవ్రేలుకు చిక్కుకొన్న బాణము వలన కృష్ణుని శరీరము నుండి రక్తము కారిపోయి ఆయన చనిపోవడము జరిగినది. విశ్వవ్యాప్తమై అణువణువునా ఉన్న శక్తి ఏదో, ఆ శక్తిలోని భాగము ఒక శరీరమును ఏర్పరచుకొని వచ్చి, 126 సంవత్సరములు మానవులతో సహజీవనము చేసి తన ధర్మములను తెలిపి, శరీరములో లేకుండా అంతటావున్న తనశక్తిలో కలిసిపోయింది. అలా వచ్చి పోయినది సాధారణ జీవాత్మకాదు, పరమాత్మ శక్తి అని ఒక భీష్మునికి తప్ప ఎవరికీ తెలియదు. భీష్ముడు కృష్ణునికంటే ముందే చనిపోయాడు. అందువలన కృష్ణుడు చనిపోయినపుడు ఆ శరీరములోని జీవాత్మగా ఇంతకాలమున్నది దైవశక్తి అని ఎవరికీ తెలియదు. 126 సంవత్సరములు శరీరముతో బ్రతికిన ఆ
శక్తిపేరు “కృష్ణ” అను రెండక్షరములు మాత్రమే. కృష్ణ అను శబ్దము యొక్క అర్థము నల్లని రంగు అని తెలియుచున్నది. కృష్ణ పదము నల్లని రంగును తెలుపుచున్నది. చీకటి నల్లగా ఉండును. కటిక చీకటిలో ఏమీ కనిపించక నల్లని రంగు మాత్రము అగుపడుచున్నది. మనిషి ఎల్లప్పుడు ఏదో ఒకటి కనిపించు వెలుతురునే కోరుకొంటాడు. కానీ ఏమీ కనిపించని చీకటిని కోరుకోడు. అదే విధముగ భూమిమీద ప్రతి మనిషి ఏదో ఒక విషయమును తెలియజేయు మాయనే కోరుకొంటాడు. కానీ ఏ విషయము లేని, ఏ గుణములేని దైవమును కోరుకోడు. దేవుడు ఎవరికీ కనిపించువాడు కాడు. దేవున్ని ఎవరూ కోరుకోవడము లేదు అని తెలియుటకు గుర్తుగా భగవంతుడు తన పేరుగా నల్లని రంగుకు గుర్తు అయిన నలుపు (కృష్ణ) అను పేరును పెట్టుకొన్నాడు.
విశ్వమంతా వ్యాపించి ఎవరికీ తెలియని శక్తియే కృష్ణ శరీర మందుండి చివరికి మరణించింది. కృష్ణ శరీరములోని శక్తియూ బయట విశ్వమంతా అణువణువునా వ్యాపించియున్న శక్తియూ రెండూ ఒకటే. కావున నీరు నీరులో కలిసి పోవునట్లు, బయటి శక్తి, కృష్ణ శరీరములోని శక్తి రెండు ఒకటిగా కలిసిపోయినవి. పుట్టిన మనిషి ఎవడైనా చనిపోయిన తర్వాత జన్మించకుండా మోక్షమును పొందాలంటే అనగా దేవునిలో కలిసిపోవాలంటే భగవద్గీతలో చెప్పిన సూత్రము ప్రకారము చనిపోయిన వ్యక్తి యోగియై ఉండాలి. చనిపోయిన యోగి ఉత్తరాయణము, శుక్లపక్షము, పగలు, సూర్యరశ్మి కలిగిన సమయములో చనిపోయి ఉండాలి. అటువంటి వాడు మాత్రము మోక్షమును పొందును. ఈ సూత్రమును చెప్పిన కృష్ణుడు ఈ సూత్రము ప్రకారము చనిపోయాడా? అని అడుగవచ్చును. దానికి సమాధానము ఏమనగా! గీతలో చెప్పిన సూత్రము ప్రకారము కృష్ణుడు
కర్మయోగియై ఉన్నాడు. ఉత్తరాయణములోనే పగటిపూటే, సూర్మరశ్మి కలసిన సమయములోనే చనిపోయాడు. కానీ ఆయన చనిపోయినది శుక్లపక్షములో కాదు. కృష్ణపక్షములో చనిపోయాడు. మోక్షము పొందవలసిన యోగి శుక్లపక్షములో చనిపోవలసివుంది. కానీ కృష్ణుడు కృష్ణపక్షములో చనిపోవడము వలన, భగవద్గీతలో భగవంతుడైన కృష్ణుడు చెప్పిన సూత్రము ప్రకారము కృష్ణుడే మోక్షమునకు పోలేదని, తిరిగి జన్మకే పోయాడని చెప్పవచ్చును. అయితే కృష్ణుడు దేవునిలోనికే పోయాడు, కానీ జన్మకు పోలేదు. ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన సూత్రము కృష్ణునికి వర్తించదా అని కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నీరు నీరులో కలిసే దానికి ఏ అడ్డంకు లేదు. కానీ మంచు ముక్కలు నీటిలో కలియాలంటే అవి నీరుగా మారుటకు కొంత ఉష్ణోగ్రత అవసరము. కృష్ణుడు చెప్పినది మంచుముక్కలు నీరుగా మారుటకు ఉష్ణోగ్రత అవసరమన్నట్లు “మనుషులు దేవునిగా మారుటకు ఫలానా సమయములోనే మరణము పొందాలి" అని చెప్పాడు. కృష్ణుడు నీరులాంటివాడు కావున మరణకాల నియమము ఆయనకు లేదు. కానీ మనుషులు మంచుముక్కలులాంటి వారు వారికి ఉష్ణము అను జ్ఞానము అవసరము. కావున వారికి మరణకాల నియమము ఉన్నది. "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల” అన్నట్లు కాలమే తానైన వానికి మరణకాల నియమము వర్తించదు. కర్మ అను చలికి గడ్డకట్టిన మనుషులకు వేడి అను జ్ఞానము అవసరము. అందువలన సాధారణ మనుషులకు మాత్రమే మరణకాల నియమము వర్తించునని తెలియాలి. మరణకాలము తనకు వర్తించదని తెలుపు నిమిత్తమే ఆయన కృష్ణపక్షము లోనే చనిపోయాడు.
పొదమాటున చల్లని నీడలో పడుకొనివున్న కృష్ణున్ని బోయవాడు వేట నిమిత్తము అక్కడికి వచ్చి, కదలుచున్న కాలును లేడి అనుకొని బాణము వేయగా, అది కృష్ణుని కుడికాలు బొటనవ్రేలిని తాకి రక్తము కారుచున్న సమయములో, ఆ బోయవాడు వచ్చి చూచి నేను ఎంత పనిచేశానని రోదిస్తున్నపుడు, కృష్ణుడు ఇలా “నీవు బాధపడవలసినది ఏమీ లేదు. నిర్ణయము ప్రకారమే అన్నీ జరుగుచున్నవి. నా పుట్టుక, చావు రెండూ జరుగుటకు ఒక కారణమున్నది. నేను అశుభ్రమైన స్థలములో జైలునందు తల్లిప్రక్కన తండ్రి తప్ప ఎవరూ లేకుండ పుట్టవలెనను నిర్ణయమున్నది. ఆ నిర్ణయము ప్రకారమే దీనస్థితిలో పుట్టాను. అలాగే మరణము కూడా ఒంటరినైన సమయములో, ఇతరుని ఆయుధము వలన గాయపడినవాడినై రక్తముకారి చనిపోవలెనని నిర్ణయము కలదు. దాని ప్రకారమే ఇపుడు ఒంటరిగానున్న నన్ను నీ బాణము గాయపరిచినది. పుట్టుక, చావు రెండూ ఇలా జరుగవలెనని ఉన్నది. కావున నీవు బాధపడవలదు” అన్నాడు. ఆ మాటలు విన్న బోయవాడు "మీరు ఎంతో కలిమి, బలిమి రెండూ కలవారు. మీరు ఏమీలేని వారివలె దీనస్థితిలో పుట్టడము, అలాగే ఒంటరిగా గాయపడి ప్రక్కన ఎవరూ లేకుండా చనిపోవడము మీరు నిర్ణయమనినా నాకు చెప్పలేని బాధ కల్గుచున్నది" అన్నాడు. అలా బాధగా మాట్లాడిన బోయవానిని ఓదారుస్తూ కృష్ణుడు “దీనస్థితిలో పుట్టిన నా జననము, గాయపడి ఒంటరినై మరణించు నా మరణము భావితరమునకు అవసరము. ఇప్పటి నుండి కలియుగము ప్రారంభమగుచున్నది. కలియుగములో ఇంతవరకు లేని అజ్ఞానము ప్రారంభమగును. ఇంతవరకు లేని మతములు కలియుగములో పుట్టుకొచ్చును. సృష్ట్యాదినుండి ప్రపంచ వ్యాప్తముగ ఉన్న ఇందూ ధర్మములు క్షీణించి పోయి, మచ్చుకు మాత్రము ఇందూదేశము
లోనే మిగిలి అదియూ బలహీనముగా ఉండును.ఇందువులు తమ ధర్మములను తామే తెలియక, తమను తాము హిందువులుగా చెప్పుకొందురు. ఇందూపథమును (జ్ఞానమార్గమును) హిందూమతముగా ప్రకటించు కొందురు. 'పథము' అను శబ్దము చివరకు 'మతము' అను పదముగా మారిపోవును. పథము అనగా మార్గము, మతము అనగా ఇష్టము ఇది నా మార్గము అను అర్థమును వదలి, ఇది నా ఇష్టము అను మాటను చెప్పుదురు.
ఆదినుండి ఇందూ ధర్మములు విశ్వవ్యాప్తముగా ఉన్నవి. కలి యుగములో మతములు తయారై ఇందూపథము యొక్క స్థానమును క్రైస్తవ మతము ఆక్రమించుకొనును. హిందువులందరు ఒక్కొక్కరుగా ఆ మతములో చేరిపోవుచూ హిందూమతము క్షీణించిపోవును. అటువంటి సందర్భములో హిందూమతమును కాపాడుకొనుటకు కొన్ని సంఘములు ఏర్పడును. అటువంటి హిందూసంఘములకు, తమ మతమునకు సంబంధించిన ధర్మములు తెలియక పోవడము వలన, వారి వలన హిందూ మతమునకు నష్టము ఏర్పడును. జ్ఞానములేని హిందూసంఘముల పనులను చూచి హిందువులే ఏవగించుకొందురు. హిందూ దేశములో కూడ క్రైస్తవ మతము విరివిగా వ్యాపించి పోవును. అట్లు పెరిగి పోవుచున్న మతమును చూచి ఆ మతప్రవక్తకు పూర్తి వ్యతిరేఖులుగా హిందువులు తయారగుదురు. తమ మతమును హిందువులు కించపరుస్తున్నారని హిందువుల ప్రవక్తనైన నా గురించి క్రైస్తవమతము వారు అసూయగా వ్యతిరేఖముగా మాట్లాడుదురు. 'మా దేవుడు గొప్ప, మీ దేవుడు దిబ్బ' అని హిందువులు అనగా, “మా దేవుడే గొప్ప' అని క్రైస్తవులు అందురు. క్రైస్తవమత ప్రవక్త అయిన ఏసును చూచినా, ఆయన పేరును వినినా హిందువులు
కొందరు మండిపడుదురు. అట్లే హిందువుల దేవున్ని, దేవతలను క్రైస్తవులు తక్కువ భావముతో మాట్లాడుదురు. ఇట్లు మా దేవుడు గొప్ప అని క్రైస్తవులు అనగా, హిందూసంఘములోని వారు కొందరు మీ దేవుడు దేవుడే కాదని ఏసును దూషించుచుందురు. హిందువులు క్రైస్తవ ప్రవక్త అయిన ఏసును దూషించే కొలది, క్రైస్తవులు తమ బైబిలులోని వాక్యములను చెప్పుచూ, వారి మతప్రచారము చేయుదురు. జ్ఞానమును బోధిస్తూ మా మతములో రక్షణ ఉన్నదని చెప్పుచుండుట వలన, దేవతా భక్తి తప్ప దేవుని భక్తి హిందూమతములో లేనిదానివలన, చాలామంది హిందువులు క్రైస్తవులుగా మారిపోవుదురు. చివరకు హిందువులు తమ మతమును రక్షించుకొను ప్రయత్నములో పడిపోగా, క్రైస్తవులు తమ మతమును పెంచుకొందురు. పరమతమని హిందువులు క్రైస్తవమతమును, దాని ప్రవక్తను దూషించగా, క్రైస్తవులు హిందూమతము మాయ (సాతాన్) మతమని హిందూమతమును, హిందువుల దేవుళ్ళను దూషించుదురు. ఈ విధముగా మత ద్వేషములు ఏర్పడి, దాని వలన భూమిమీద మతహింసలు ఏర్పడును. భూమిమీద మతముల కొరకు యుద్ధములే వచ్చును. వీటన్నిటికి మనిషి ఆచరించదగిన ధర్మములేవో, మనిషి తెలుసుకోదగిన జ్ఞానమేమిటో, మతముల పేర్లు పెట్టుకొన్న మనుషులకు తెలియకుండ పోవడమే ముఖ్య కారణము. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి యుక్తవయస్సు వరకు బ్రతుకు తెరువుకొరకు చదువుకొని, దాని తర్వాత ధనార్జనలో పడిపోయి, మిగత కాలములో మతమును మతభక్తిని, మత ప్రచారమును చేయుచు నా మతము గొప్ప, నా మతము గొప్ప అని ద్వేషములు పెంచుకొందురు. క్రైస్తవులను చూస్తే హిందువులు, హిందువులను చూస్తే క్రైస్తవులు ఒకరికొకరు అజ్ఞానులమను కొను స్థితి ఏర్పడును. ప్రతి మతము వాడు దేవుని పేరే చెప్పుచు, దేవునివద్దకే
చేరాలని చెప్పినా వారివారి ప్రవక్తలు, వారివారి మతములు వేరువేరైన దానివలన వారివారి దేవుడు కూడా వేరువేరని చెప్పు కాలమువచ్చును.
ఈ విధముగ భూమిమీద కలియుగమునందు మతముల పేరుతో అధర్మములు పెరిగి పోవును. వేరు మతములు లేని ద్వాపరయుగములో ఒక్క ఇందువులకు సంబంధించిన ధర్మములనే నేను చెప్పాను. నేను చెప్పిన ధర్మములు సర్వమానవులకు, సర్వమతములకు సంబంధించినవని ఎవరికీ, ఏ మతము వారికీ తెలియకుండా పోవుట వలన, క్రైస్తవులు మా జ్ఞానము, మా ధర్మములు ప్రత్యేకమైనవని, మా ప్రవక్త చెప్పినవి కృష్ణుడు చెప్పినవి వేరని అనుకొందురు. ద్వాపరయుగములో కృష్ణుడు చెప్పిన ధర్మములనే తమ ప్రవక్త చెప్పాడని ఎవరూ గుర్తించలేరు. ఇందూధర్మము లను దేవుడు చెప్పాడని, ఇందూ ధర్మములులేని మతము భూమిమీద లేదని ఎవరూ గ్రహించలేరు. ఇందూధర్మములు దైవజ్ఞానము తెలియాలనుకొను ప్రతి మతస్థునికీ అవసరమైనవే. ఎందుకనగా వారి మత గ్రంథములలో ఏమి చెప్పారో అవియే నేను చెప్పిన ఇందూ ధర్మములు, ఇందూ అనగా దైవ జ్ఞానము అని తెలియని ప్రతి మతము, తమ మతములకు ప్రత్యేకమైన పేర్లు పెట్టుకొందురు. చివరకు దైవజ్ఞానము (ఇందుత్వము) తెలియని ఇందువులు కూడా తమది కూడా ఒక మతమని, దానిపేరును హిందూ మతమని చెప్పుకొందురు. నేను చెప్పిన ధర్మములను తెలియక వేదములను ఆశ్రయించి, మేము హిందువులము అని కొందరు చెప్పగా, అలాగే నేను చెప్పిన ధర్మములనే తమ ప్రవక్త చెప్పాడని తెలియక, తమది క్రైస్తవ మతమని కొందరు చెప్పుకొందురు. నేను చెప్పిన ధర్మములలో కూడ కొన్ని అధర్మములు కలిసిపోయి భగవద్గీతగా మీముందు నా బోధ ఉండును. నా బోధ అయిన భగవద్గీతలో కూడా అధర్మములు కలిసి ఉండుట వలన, వాటినే కొందరు
హిందువులు ఆశ్రయించి, నేను చెప్పిన ధర్మములను అర్థము చేసుకోలేరు. ఆ విధముగ భగవద్గీత ఎవరికీ అర్థము కాకుండా పోతుంది.
జగతిలో అతి పెద్ద మతముగా క్రైస్తవమతము పేరుపొందినా, ఆ మత ప్రవక్త చెప్పిన బైబిలు గ్రంథములో కూడా అధర్మములు కలిసిపోయి క్రైస్తవులు కూడా దైవజ్ఞానమును (ఇందుత్వమును) తెలియలేరు. బైబిలును చదివిన ప్రతి క్రైస్తవుడు, బైబిలును బోధించిన ప్రతి బోధకుడు, అందులో వున్న నా ధర్మములను తెలియలేరు. అందువలన క్రైస్తవ ప్రవక్త అయిన ఏసు ప్రజలనుద్దేశించి ఒక మాట చెప్పి పోవును. నేను చెప్పిన ధర్మములు మీకిప్పుడు అర్థము కావు. నా తర్వాత కొంతకాలమునకు ఒక వ్యక్తి వచ్చి నేను చెప్పిన నా మాటలనే వివరముగా చెప్పును. అప్పుడు నేను చెప్పిన మాటలు అర్థమగును అని చెప్పును. ఏ వ్యక్తి అయితే బైబిలు వాక్యములను వివరించి చెప్పునో, అదే వ్యక్తి భగవద్గీతలో శ్లోకరూపములోనున్న నా ధర్మములను కూడా వివరించి చెప్పును. అంతవరకు భగవద్గీతకానీ, బైబిలు గానీ సరిగా ఎవరికీ అర్థము కావు. ఇటు బైబిలును అటు భగవద్గీతను ఏక కాలములో చెప్పునతడే రెండు గ్రంథములలోని ధర్మములు ఒక్కటేనని, ఆ రెండు గ్రంథములను ఒక్కడే చెప్పాడని సంచలన మాటను చెప్పును. రెండు గ్రంథముల లోను దేవుడు చెప్పిన ధర్మములతోపాటు, మనుషులు వ్రాసిన అధర్మములు కూడా ఉన్నాయని, వాటిని వదలి ధర్మములకు మాత్రమే వివరమును చెప్పును. ఆ వ్యక్తి గురువుగా గానీ, స్వామిగా గానీ చలామణి కాడు. ఏ ఆధారములేని ఆయనను గుర్తించుట చాలాకష్టము” అని కృష్ణుడు బోయవానికి చెప్పాడు.
ఇక్కడ మనము ఆలోచింపదగిన విషయమేమంటే దైవధర్మములను గీతరూపములో ధనస్సు, బాణములు ధరించిన అర్జునునికి మాత్రము చెప్పాడు. అక్కడ కృష్ణుడు అర్జునుడు తప్ప మూడవ వ్యక్తి లేడు. పైగా అర్జునుడు ధర్మములను గురించి అడుగనూ లేదు. దారిన పోయేవానికి పిలిచి పిల్లను ఇచ్చినట్లు, ధర్మముల మీద ధ్యాసలేని అర్జునునికి ధర్మములను గురించి కృష్ణుడు చెప్పాడు. అట్లే కలియుగములో జరుగబోవు భవిష్యత్తును గురించి, క్రైస్తవ మతమును గురించి, హిందూమతము క్షీణించి పోవడమును గురించి, ధనస్సు బాణములు ధరించియున్న బోయవానికి చెప్పాడు. అర్జునునకు గీతా జ్ఞానమును చెప్పినట్లు, భవిష్యత్తును గురించి అడుగకున్నా బోయవానికి కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి చెప్పాడు. కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి చెప్పునపుడు అక్కడ కృష్ణుడు, బోయవాడు తప్ప మూడవ వ్యక్తి ఎవరూ లేరు. యుద్ధరంగమున గీతను చెప్పినపుడు కృష్ణుడు అర్జునునికి చెప్పగా, తర్వాత అర్జునుడు వ్యాసునికి చెప్పుట వలన గీత అర్జునుని ద్వారా బయటపడినదని చెప్పవచ్చును. కానీ కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును కృష్ణుడు బోయవానికి చెప్పినపుడు అక్కడ మూడవ వ్యక్తి లేడు. చెప్పిన కృష్ణుడు వెంటనే చనిపోయాడు. ఇక బోయవాడు మాత్రము మిగిలాడు కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు ఒక్క బోయవాని ద్వారానే బయటికి రావాలి. కానీ బోయవాడు కూడా తాను చేసిన తప్పుకు అప్పుడే నిరాహారదీక్ష చేసి అక్కడ కృష్ణుని ముందరే చనిపోయాడని వ్రాశారు. ఇక్కడ ప్రత్యేకించి నేను అడిగే ప్రశ్న ఏమంటే! నీ తప్పు ఏమీ లేదని, అంతా నా కర్మ ప్రకారము జరిగిందని కృష్ణుడు బోయవానితో చెప్పినా, అతను వినకుండా నేను చేసిన తప్పుకు శిక్ష ఉండాలని, నిరాహారదీక్ష చేసి వెంటనే చనిపోయాడని, తర్వాత కృష్ణుని రథసారథియైన దారకుడు
అక్కడికి వచ్చాడని వ్రాశారు. నిరాహారదీక్ష చేసి ఒక మనిషి చనిపోవాలంటే కనీసము 40 రోజులైనా పడుతుంది. అలాంటిది నిరాహారదీక్ష చేసి నిమిషానికే చనిపోయాడని చెప్పడము పచ్చి అబద్దము కాదా? భాగవతములో కృష్ణున్ని బాణముతో బోయవాడు కొట్టినట్లు వ్రాసిన వారు, జరిగిన సంఘటనను చూచి కృష్ణుడు నివారించినా వినకుండా, నిరాహార దీక్షతో చనిపోయాడని వ్రాశారు. కృష్ణుడు, బోయవాడు తప్ప అక్కడ ఎవరూలేని సమయములో ఏమి జరిగిందో, ఏమి మాట్లాడారో ఎవరికీ తెలియదు. వాస్తవానికి బోయవాడు చనిపోలేదు. బోయవాడు బాధపడగా కృష్ణుడు అంతా కర్మప్రకారమే జరిగిందని ఓదార్చిన తర్వాత కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి కృష్ణుడు బోయవానికి చెప్పి, ఈ విషయమును నేను నీకు తప్ప ఎవరికీ చెప్పలేదన్నాడు. కృష్ణుడు చెప్పిన చివరి సందేశమైన కలియుగములో ఆధ్యాత్మిక భవిష్యత్తును వినిన బోయవాడు, నేనెంతో అదృష్టవంతున్ని అని సంతోషపడినాడు. నా జీవిత అంత్య భాగములో నేను చెప్పు పెద్ద రహస్యము ఇది. దీనిని నీవు తప్ప వినినవాడు ఎవరూ లేరని కృష్ణుడు చెప్పిన మాటను బట్టి నేను గొప్పవాడినని బోయవాడు అనుకొన్నాడు. యుద్ధరంగమున కృష్ణుని ద్వారా గీతను విని, ఈ రహస్యము నీకు తప్ప ఎవరికీ తెలియదని కృష్ణుడు చెప్పగా, అర్జునుడు తనకు తాను గొప్పగా ఊహించుకొన్నట్లు కృష్ణుడు చెప్పిన కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు, దైవజ్ఞాన రహస్యమును విన్న బోయవాడు కూడా అర్జునుడు అనుకొన్నట్లు అనుకొన్నాడు. ఆ కాలములో యుద్ధము అయిపోయిన తర్వాత అర్జునుడు వ్యాసునికి చెప్పగా, అది వ్యాసుని ద్వారా అందరికీ తెలిసినది. కృష్ణుడు చెప్పిన గీతను అర్జునుడు వ్యాసునికి చెప్పినట్లు, భారతములోగానీ, భాగవతములోగానీ వ్రాయలేదు. అయినా ఇట్లే జరిగింది,
అర్జునుడే స్వయముగా వ్యాసునికి చెప్పాడని మేము చెప్పాము. ఇక్కడ బోయవానికి కృష్ణుడు చెప్పిన విషయము కూడా భారత, భాగవతములలో వ్రాయలేదు. అయినా ఈ విధముగా జరిగిందని మేమే చెప్పుచున్నాము. ఈ నా మాటవిన్న కొందరు పండితులు, కవులు ఈయన ఎవరు? స్వయముగా ఇట్లే జరిగిందని చెప్పడానికి? అని అడుగవచ్చును. దీనికి జవాబును తర్వాత చెప్పెదము, కానీ ఈ ప్రశ్నలో ఈయన ఎవరు? అను ప్రశ్న నాకు బాగా నచ్చింది.
నేను సత్యమును చెప్పితే విశ్వసించలేని వారు నిరాహారదీక్షతో బోయవాడు చనిపోయాడన్నపుడు, నిరాహారదీక్షకు నిమిషాలలో ఎవరు చనిపోరు కదా! అని ఎందుకు అడుగలేకపోయారు? కృష్ణుడు రక్తస్రావము వలన చనిపోయాడని సత్యమును మేము చెప్పితే నమ్మలేని వారు, కృష్ణుడు రథమునెక్కి వైకుంఠమునకు పోయాడు అని భాగవతములో వ్రాసిన మాటను ఎలా నమ్మారని అడుగుచున్నాము. నిరాహారదీక్షతో నిమిషాల వ్యవధిలో చనిపోతాడను మాటగానీ, కృష్ణుడు రథము మీద వైకుంఠమునకు పోయాడనుట గానీ పూర్తి అశాస్త్రీయము, అసత్యము. కల్పిత పురాణములను గ్రుడ్డిగా నమ్మువారు ఆధారపూరిత విషయములను ఎందుకు నమ్మరని మేము అడుగుచున్నాము. కృష్ణుడు బోయవానికి ఇంకా కొన్ని విషయము లను చెప్పాడు. ఆ విషయములు క్రైస్తవ, హిందూమతములకు రెండిటికీ కనువిప్పు కల్గించు విషయములుగా ఉన్నవి. కృష్ణుడు దేవుని ధర్మములను తెలియబరచుటకు అవతరించి వచ్చాడు. ద్వాపరయుగ అంత్యములో దైవ ధర్మములను భారతదేశములో తెలియబరిచాడు. అలాగే కలియుగ ప్రథమములోనే వచ్చి మరియొకమారు ధర్మములను ఇతర దేశములో తెలియబరుస్తానని చెప్పాడు. ఇజ్రాయెల్ దేశములో ఏసుగా ఉద్భవించి
ధర్మములను చెప్పిపోతానని, అవసరమునుబట్టి తర్వాత కూడా వస్తానని చెప్పాడు. బోయవానిని అడ్డము పెట్టుకొని చెప్పిన మాటలు నేటికి సత్యములుగా కనిపిస్తున్నవి. ఇంకా ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నవి. "కృష్ణునిగా వచ్చిన నేను కలియుగ ప్రథమాంకములోనే ఏసుగా వస్తాను. అలా వచ్చిన నన్ను ఎవరూ గుర్తించలేరు. ఇప్పుడు చెప్పిన గీతగానీ, అప్పుడు చెప్పు వార్తగానీ రెండు నా ధర్మములనే తెలియబరుచును. ఎక్కడ ఏ వాక్యము బేధము కల్గియుండదు. నేనే ఏసును, ఏసే నేను అయినప్పటికీ శరీరములు, పేర్లు వేరైనా ఇద్దరు ఒక్కరేనని ఎవరికీ తెలియదు. నా బోధ, ఏసు బోధ రెండూ ఒక్కటే అయినప్పటికీ, గ్రంథములు వాటి పేర్లు వేరువేరైనప్పటికీ, రెండూ ఒక్కటేనని ఎవరూ గుర్తించలేరు. అంతేకాక నేను చెప్పిన గీత, ఏసు చెప్పిన నాలుగు సువార్తలు తిరిగి వివరముగా మరొక వ్యక్తి చెప్పేంత వరకు ఎవరికీ అర్థముకావు. వ్యక్తిని గురించి ఏసు చెప్పిన వార్తలలో ఆదరణకర్త అని వ్రాయబడివుండును. ఏసు చెప్పిన “ఆదరణకర్త” అను పేరులోని మొదటి అక్షరము, చివరి అక్షరము రెండు అక్షరములు మొదటిది మొదలులోను, చివరిది చివరిలోను ఉండు పేరు ఆయనకుండును. ఆ.....ర్త అను రెండక్షరముల పేరు కల్గినవాడే నేను చెప్పిన బోధనూ, అలాగే ఏసు చెప్పిన వార్తలనూ ఏక కాలములో వివరించి చెప్పును. అలా చెప్పువాడే కాలజ్ఞానమును చెప్పిన వీరబ్రహ్మముగారికి, సమస్త మానవులకు గురువగును.
ఏసుప్రభువును విశ్వసించిన వాడు నన్ను (కృష్ణున్ని) విశ్వసించడు. అలాగే గీతను చదివినవాడు ఏసును విశ్వసించడు. ఇటు నేను అటు ఏసు ఉత్తర దక్షిణ ధృవములవలె కనిపించుచుండుట వలన హిందువులు క్రైస్తవులను, క్రైస్తవులు హిందువులను ఏవగించుకొను స్థితిలో ఉందురు.
ఆ సమయములో ఏసు చెప్పిన ఆదరణకర్త తప్ప ఎవరూ రెండు మతములకు సమాధానములు చెప్పలేరు. అలాగే సమన్వయపరచలేరు. క్రైస్తవులలో ఆదరణకర్త, హిందువులలో ఆ.....ర్త అయిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడే రెండు మతములలోని ఏసు చెప్పిన వాక్యములకు, నేను చెప్పిన గీతకు సరియైన భావమును చెప్పి, రెండు బోధలను ఒక్కటిగానే చూపును. రెండు మతములలో చెప్పిన నన్ను, ఏసును ఒక్కనిగానే చూపించును. నేను మూడు వేలసంవత్సరముల తర్వాత పుట్టి, ఈ జన్మలో చెప్పినది తిరిగి అప్పుడు చెప్పగలను. అలా చెప్పిన నేనే, ఏసు పేరుతో కొంతకాలముండి పోగలను. తర్వాత కొంత కాలమునకు వచ్చినవాడే రెండు జన్మలలో ఉన్నది నేనేనని, చెప్పినది నేనేనని తెలియజెప్పును. అలా చెప్పుట వలన ఆయన ఇటు హిందువులకు, అటు క్రైస్తవులకు వ్యతిరేఖియై కనిపించును. సమాజములో ఎంత వ్యతిరేఖత వచ్చినా నా పని ఇదేనన్నట్లు ఆయన మాత్రము ఎవరికీ జంకక తాను చెప్పవలసినది చెప్పి పోవును. రెండు బోధలను వివరించి చెప్పువాడు ప్రత్యేకించి రెండు మతములలో ఇటు నేను, అటు ఏసు చెప్పక వదలివేసిన బోధలను తెలియజెప్పును. అంతేకాక ఆదినుండి తెలియని ఆధ్యాత్మిక రహస్యములను తెలియజెప్పి, ఆయన ప్రత్యేకత ఏమిటో ఇతరులకు అర్థమగునట్లు చేసినా, ఆయనను ఎవరూ గుర్తించలేరు. మానవునికి కావలసిన జ్ఞానమును నేను ఒక విధానముతో చెప్పగా, ఏసు దానినే మరొక విధముగా చెప్పగా, రెండూ ఒకటేనని చెప్పిన ఆదరణకర్త, రెండిటినీ వివరించి చెప్పుచూ, రెండిటియందు ఉన్నదానినే తన విధానముతో చెప్పి పూరించును.” అని చెప్పాడు. కృష్ణుడు చెప్పిన విధానమును చూస్తే వచ్చే మూడవ వాడు ఎలా ఉంటాడో కొద్దిగా అర్థమవుతుంది.
మనిషి బ్రతుకుటకు ఆహారము తినాలి. ఆహారములో మనము అన్నమును తింటున్నాము. అన్నమును ఒక్క దానినే తినినా ఆకలి తీరును. కానీ అన్నములోనికి కూరను కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. అన్నము లోనికి కూరను కలుపుకొని తిని ఆకలి తీర్చుకొనువారు చాలామంది ఉన్నా, కొంతమంది అన్నమును కూరతో తిన్న తర్వాత చివరిలో మజ్జిగతో తింటారు. అలా మజ్జిగతో తింటే పూర్తి తృప్తిగా తిన్నట్లగును. ఈ విధముగా ఆహారమును మూడు భాగములుగా చెప్పుకోవచ్చును. ఒకటి అన్నము, రెండు కూరలు, మూడు మజ్జిగ. ఈ మూడింటిని సంపూర్ణమైన ఆహారమని చెప్పవచ్చును. అన్నమును, కూరను, మజ్జిగను మూడింటిని తిన్నవాడు సంపూర్ణ ఆరోగ్యముతో ఉండును. మూడు ఆహార భాగములలోనూ పోషక పదార్థములు సంపూర్ణముగా ఉండుట వలన మూడు భాగముల ఆహారమును తిన్నవాడు శరీరములో తృప్తిగా ఆరోగ్యముతో జీవించును. అన్నము, కూర, మజ్జిగను గురించి ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరమే మొచ్చిందని కొందరనుకోవచ్చును. దీనిని ఉపమానముగా చెప్పుచున్నాము. ద్వాపర యుగములో కృష్ణుడు గీతను చెప్పాడు. గీతను ఆధారము చేసుకొని ముందుకు పోవువారుండినా, కలియుగములో ఏసు కూడా జ్ఞానమును చెప్పాడు. ఏసు చెప్పిన జ్ఞానమును ఆధారము చేసుకొని పోవువారు కూడా ఎందరో కలరు. ఈ రెండు జ్ఞానములను ఆహారములోని రెండు భాగములుగా పోల్చి చూచుకొందాము. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానమును ఆహారములో ఒకటవదైన అన్నముగా పోల్చుకొందాము. అన్నము ఆహారములో ముడిపదార్థములాంటిది. అన్నము ఒకే రంగుకలిగి, ఒకే రుచికల్గివుంటుంది. అన్నమును ఒక దానినే తినాలంటే కొంత కష్టముగా ఉంటుంది. అన్నమును ఒక దానినే కడుపునిండా తినవచ్చును. అట్లు
ఒక అన్నమును కడుపునిండా తినినా మనిషి బ్రతుకవచ్చును. కానీ తినే ఆహారము రుచిగా ఉండుటకు, దేవుడు కృష్ణున్ని పంపి గీతాజ్ఞానమును చెప్పించినట్లు, ఏసును పంపి వార్తా జ్ఞానమును చెప్పించును. ఏసు చెప్పిన వార్తా జ్ఞానము అన్నముతో సహా అన్నము కలుపుకొని తిను కూరలాంటిది. అన్నము రుచివేరు, కూర రుచివేరు అయినా రెండూ మనిషికి అవసరమైన ఆహారపదార్థములే. ఏసు చెప్పిన జ్ఞానమును, కృష్ణుడు చెప్పిన జ్ఞానమును అర్థము చేసుకోగలిగితే, అన్నమును వడ్డించిన వ్యక్తి, కూరను వడ్డించిన వ్యక్తి వేరు వేరైనా, అన్నము కూర వేరువేరైనా రెండూ తినే పదార్థములేనని తెలుసుకోగలిగితే, రెండు పదార్థములను కలుపుకొని తినగలిగిన వాడు పొందు రుచివలె, గీతా జ్ఞానమును, వార్తా జ్ఞానమును రెండిటినీ సమన్వయముగా అర్థము చేసుకోగల్గితే, ఎంతో అభిరుచి తృప్తి ఏర్పడును. అట్లు కాకుండా అన్నము తెల్లగున్నది, కూర నల్లగున్నది అది వేరు ఇది వేరు నేను అన్నమును ఒకదానినే తింటానని, అన్నమును మాత్రము తినినా కడుపు నిండును. అలాగే కూరను మాత్రము తింటానని కూరనొకదానినే తినినా కడుపు నిండును. అలా తినడములో గల రుచివేరుగా ఉండును. రెండిటినీ కలుపుకొని తినడము వలన రుచి వేరుగావుండి బాగుండును.
ఇప్పుడు భూమిమీద మేము అన్నమును మాత్రము తింటామన్నట్లు కృష్ణునియొక్క గీతా జ్ఞానమును మాత్రము చదువగల్గిన హిందువులనువారు కొందరున్నారు. అలాగే మేము కూరను మాత్రము తింటామన్నట్లు ఏసు యొక్క వార్తా జ్ఞానమును మాత్రము చదువగల్గిన క్రైస్తవులను వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయములో అన్నము కూర రెండిటి విషయము తెలిసిన ఆదరణకర్త వచ్చి రెండిటి వివరమును వివరించి రెండిటినీ కలుపు కొమ్మన్నట్లు గీతలోని జ్ఞానమును, వార్తలలోని జ్ఞానమును వివరించి
చెప్పును. అంతవరకు కృష్ణుడు వేరు, ఏసు వేరని అట్లే గీతాజ్ఞానము వేరు, వార్తాజ్ఞానము వేరని అనుకొనుచుందురు. భూమిమీద క్రైస్తవ పాస్టర్, ఫాదర్లను బోధకులకు, హిందూ గురువులను బోధకులకు విభిన్నముగా అంతవరకు రెండిటియందు ఎవరికీ తెలియని వివరమును ఆదరణకర్త బోధించగా, వివరము తెలిసినందుకు కొందరు మాత్రము సంతోష పడుదురు. చాలామంది బోధకులు ఆయనను వ్యతిరేఖిస్తారు. ఆయన మీద దాడులు కూడా చేస్తారు. అయినా ఆయన ఎవరికీ భయపడకుండా తన పనిని తాను చేయునని కృష్ణుడు కూడా చెప్పాడు. రెండిటికీ సమన్వయకర్త అయిన ఆయనను ఏసు ఆదరణకర్త అని చెప్పగా, ఆయన పుట్టుక హిందూమతములో ఉండుట వలన మరియు ఆయన రెండు మతములకు ఆదర్శముగా ఉన్న దానివలన, ఏసు చెప్పిన ఆదరణకర్త, హిందువులలో “ఆదర్శకర్త” అను పేరుతో చలామణి అగునని కృష్ణుడు బోయవానికి చెప్పి పోయాడు. కృష్ణుడు చెప్పిన ఆదర్శకర్త, ఏసు చెప్పిన ఆదరణకర్త ఇద్దరు ఒక్కరేనని తెలిసిపోయినది. ఆదరణకర్త అయిన ఆదర్శకర్త అను పేరు ఎవరికున్నదో వెతికితే ఆ పేరును బట్టి సులభముగా మూడవవ్యక్తిని గుర్తించగలము. ఆ పేరున్న వాడు వచ్చిపోయాడా, లేక వచ్చివున్నాడా, లేక రాబోవు కాలములో వస్తాడా? అను విషయము మాత్రము అర్థముకాని విషయము.
'ఆదర్శకర్త' అను పేరున్నవాడు ఆదరణకర్తగా ఇటు ఏసు, అటు కృష్ణుని జ్ఞానమును వివరించి చెప్పునదేకాక, ఇంకా అర్థము కాకుండా మిగిలియున్న ధర్మములను అనగా ఇంకా తెలియకున్న ధర్మములను క్రొత్త విధానములో తెలిపి పూరించునని కృష్ణుడు చెప్పిపోయాడు కదా! ఆయన పూరించు ధర్మములను ఎలా పోల్చవచ్చునో వివరించుకొందాము. మనిషికి
సంతృప్తినిచ్చు పూర్తి భోజనము మూడు భాగములుగా ఉండునని, ఆ మూడు భాగములను అన్నము, కూర, మజ్జిగ (పెరుగు) అని చెప్పుకొన్నాము. అన్నమును రుచికరమైన కూరతో తినినా, చివరిలో మజ్జిగతో తింటేనే తృప్తిగా ఉంటుంది, పూర్తి భోజనము అయినట్లు ఉంటుంది. అలాగే రాబోవు ఆదర్శకర్త, కృష్ణుడు గీతను చెప్పగా అందులో కూడా తెలియనిది ఏదైతే ఉందో, అట్లే ఏసు తన వార్తను చెప్పగా అక్కడ కూడా తెలియనిది ఏదైతే ఉందో, రెండు చోట్ల తెలియక మిగిలిన దానిని పూర్తిగా తెలియజేయును. దేవుని ధర్మముల విషయములో ఎవరివద్ద ప్రశ్న అనునది గానీ, సంశయమనునది గానీ లేకుండా చేయును. దీనినిబట్టి ఆదర్శకర్త అను పేరుతో వచ్చువాడు నాస్తికులవద్దగానీ, హేతువాదులవద్దగానీ దేవుని గురించి అడుగు ప్రశ్నే లేకుండా చేయును. అందువలన ఆదర్శకర్త ఇటు నాస్తికులకు, అటు ఆస్తికులకు తెలియని జ్ఞాన విధానమును తెలుపునని అర్థమగుచున్నది. ద్వాపరయుగములో కృష్ణుడు చనిపోతూ చెప్పిన ఆదర్శకర్త, కలియుగములో ఏసు బోధిస్తూ చెప్పిన ఆదరణకర్త, ఎంతో గొప్ప జ్ఞానము కలిగి క్రైస్తవులకు, హిందువులకు మ్రింగుడు పడనివాడై ఉండును. ఆదరణ కర్త, ఆదర్శకర్త అయినవాడు చెప్పిన బోధను గ్రహించిన హిందువులు, క్రైస్తవులు ఆయనలోనే కృష్ణున్ని, ఆయనలోనే ఏసును చూచుకొందురు. నేను ఇప్పుడు చెప్పిన విషయములు హిందూ మత ప్రచారమునకో, లేక క్రైస్తవ మతప్రచారము కొరకో కాదు. రెండు మతములకు అతీతమైన దేవున్ని గురించి తెలుపు విధానమని తెలియాలి.అంతేకాక కృష్ణుడు పోతూ పోతూ చివరిగా చెప్పిన కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తులో ఆదర్శకర్త పేరుండడము విశేషము. ఈ దినము భూమిమీదవున్న జ్ఞానమును గురించి, అజ్ఞానమును గురించి, పుట్టుకొచ్చిన మతముల గురించి కృష్ణుడు ఆనాడే
చెప్పాడు. ఇదంతయూ కృష్ణుడు చివరి రోజున చెప్పిన భవిష్యత్తు వివరమని తెలియవలెను.
ఇప్పుడొక ప్రశ్నరాక తప్పదు. అదేమనగా! కృష్ణుడు యుద్ధ రంగములో బోధ చెప్పగా వినిన అర్జునుడు తర్వాత వ్యాసునికి చెప్పాడనీ, వ్యాసుని ద్వారా అందరికీ తెలిసిందని చెప్పారు. దానిని ఒక విధముగా సత్యమేనని ఒప్పుకోవచ్చును. కానీ కృష్ణుడు చనిపోవు చివరి సమయములో కలియుగ ఆధ్యాత్మికమును గురించి చెప్పాడని, దానిని బోయవాడు విన్నాడని చెప్పారు. అక్కడ ఎవరూలేని ఆ సమయములో కృష్ణుడు చెప్పిన సమాచారమును వినిన బోయవాడు ఆ విషయమును తర్వాత ఎవరికీ చెప్పినట్లు ఆచూకీ లేదు. బోయవాడు చెప్పినట్లు ఎక్కడా లేనపుడు అక్కడ జరిగిన విషయము మీకెలా తెలిసింది? మీరెలా ఈ విషయములన్నిటినీ చెప్పగలుగుచున్నారని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! అర్జునుడు గీతను వ్యాసునికి చెప్పినట్లు కూడా భారతములోగానీ, భాగవతములోగానీ లేదు. అక్కడ వ్యాసుడు తెలివిగా ప్రవర్తించి, అర్జునుడు చెప్పినట్లు తెలియకుండా చేసి, సంజయుడు దృతరాష్ట్రునికి చెప్పినట్లు వర్ణించాడు. ఎలాగైతే ఏమి, చివరకు కృష్ణుడు అర్జునునికి చెప్పిన విషయము బయటికి వచ్చినది. కానీ ఇక్కడ భాగవతములో బాణముతో కొట్టిన బోయవాని పాత్రను చంపివేసి బోయవానిని పూర్తిగా లేకుండా చేశారు. అందువలన కృష్ణుడు చెప్పిన విషయము ప్రస్తావనకే రాలేదు, తర్వాత ఎవరికీ తెలియకుండా పోయినది. ఆ బోయవాడు తనకు కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు తెలిసినా, ఆ విషయమును ఎవరికీ చెప్పాలనుకోలేదు. తనకు పరిచయమున్న వారంతా నిత్యము వేటకు పోయి బ్రతుకువారే, కావున వారికి ఈ విషయము అవసరము లేదనుకొన్నాడు. ఎవరికైనా
చెప్పాలనుకొనినా వీనికి చెప్పే దానికీ కుదరలేదు. ఈ విధముగ ఆ విషయము వానితోనే లేకుండా పోయినది. అలా వాడు ఆ జన్మలో చనిపోయి తర్వాత జన్మలో పుట్టుతూవస్తూ అప్పటినుండి ఇప్పటి వరకు ఎన్నో జన్మలు ఎత్తాడు. ఆ విధముగా ఆ జీవుడు జన్మిస్తూ, మరణిస్తూ ఎన్నో జన్మలను ధరించినా అతని వెంట ఆత్మ వస్తూనే ఉండును. ఆ జీవుడు ఎన్ని జన్మలు మారినా వానితో పాటు శాశ్వతముగా వున్న ఆత్మకూడా వాని వెంటనే ఉంటూ అన్ని జన్మలకు సాక్షిగా ఉండును. వెనుకటి జన్మ విషయము కూడా జీవునికి తెలియదు. కానీ ఆది నుండి అన్ని జన్మలకు సాక్షిగానున్న ఆత్మకు అన్ని జన్మల విషయములు తెలియును. ద్వాపరయుగ అంత్యములో చివరిగా కృష్ణుడు బోయవానికి చెప్పిన విషయమంతా అతని ఆత్మకు తెలియును. అతను ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఒక రోగముతో బాధపడుచూ నావద్దకు రావడము జరిగినది. అప్పుడు నేను అతనికి కర్మను ఉదహరించుటకు దైవజ్ఞానమును చెప్పు సమయములో, ఆ జీవుడు నిద్రావస్థలోనికి పోయి లోపలనున్న ఆత్మయే వినుటకు మొదలు పెట్టింది. నేను కృష్ణున్ని గురించి ఆయన చెప్పిన జ్ఞానమును గురించి చెప్పు సమయములో, అతనిలోని ఆత్మ కృష్ణుని మరణ సమయములో జరిగిన వృత్తాంతమునంతటిని వివరముగా నాకు చెప్పింది. కావున దానినే నేను మీకు చెప్పాను.
ఇదేదో కాకమ్మ గువ్వమ్మ కథలాంటిది అనుకోవద్దండి. మనిషికి జన్మలున్నది వాస్తవము, పునర్జన్మలో జ్ఞాపకము అరుదుగా ఎవరికైనా రావచ్చును. అలా వచ్చిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. జరిగి పోయిన జన్మలలోని విషయములు జ్ఞాపకము వచ్చుటకు ఒకే ఒక ఆత్మయే కారణము. జీవునికిగానీ, మనస్సుకుగానీ, బుద్ధికిగానీ గతజన్మ జ్ఞాపకాలు
ఉండవు. విషయములను జ్ఞాపకము పెట్టుకొను స్థోమత శరీరములోని మనస్సుకు మాత్రముండును. మనస్సు చనిపోయిన జన్మలోనే పోతుంది. తర్వాత జన్మలో క్రొత్త మనస్సు వస్తుంది. కావున ప్రస్తుత జన్మలో గతజన్మ జ్ఞాపకాలు ప్రస్తుతమున్న మనస్సుకు తెలియవు. మనస్సు తర్వాత జ్ఞాపకమును కలుగజేయునది ఆత్మ. ఒక మనిషి నిద్రపోవు సమయములో మనస్సు బయట అవయవముల సంబంధము కోల్పోయి, బ్రహ్మనాడిలో అణిగి ఉండును. అప్పుడు ఆ శరీరములోని ఆత్మ మనస్సువలె పనిచేసి ఎవరైనా పిలిస్తే, ఆ పిలుపును బుద్ధికి జీవునికి చేర్చి నిద్రనుండి లేచునట్లు చేయుచున్నది. అంతేకాక ఆత్మ శరీరములో రాత్రింబగళ్ళు అన్ని విషయములకు సాక్షిగా ఉన్నది. ఒక మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా వానిని వీడకుండా ఉండునది ఆత్మ ఒక్కటియే. ఆనాడు కృష్ణుడు చనిపోయినపుడు బోయవాని శరీరములో జీవునితో పాటు ఉన్న ఆత్మ, కృష్ణుని మరణ సమయములో ఏమి జరిగినది, ఏమి సంభాషణ జరిగినది అన్నిటినీ చూచి ఉన్నది. ఇది సర్వ మానవులలో జరుగు ప్రక్రియయే. కానీ ఎవరికీ శరీరములోపల జరుగు తతంగము తెలియదు. బోయవాని శరీరములోని ఆత్మ నాకు తెలియజెప్పడము కొందరికి వింతగా కనిపించినా, వాస్తవముగా కొన్ని సందర్భములలో జరుగునదే. కృష్ణుని మరణమునకు ఆత్మ సాక్షి అయినందున అప్పటి విషయము ప్రస్తుత జన్మనుండి, ప్రస్తుత వ్యక్తినుండి చెప్పడము జరిగినది. ఇక్కడ ఇంకొక విశేషము కూడా ఉన్నది. అదేమనగా! ద్వాపరయుగములో కృష్ణుని మరణ సమయమున ఉన్న అప్పటి బోయవాడు అప్పటినుండి ఎన్నో జన్మలు ధరిస్తూ వచ్చి, చివరికి ప్రస్తుత జన్మలో నా ముందరకు రావడము జరిగినది. అలా నా ముందరకు వచ్చిన ప్రస్తుత వ్యక్తి క్రైస్తవ మతమునకు చెందిన వాడు. అప్పటి హిందూమతములోని బోయవాడు ఇప్పటి క్రైస్తవమతములోని వ్యక్తి అని తెలియుచున్నది. ఇది
ఇప్పటి క్రైస్తవుడు అప్పటి విషయమును చెప్పడమేమిటి? అని ఆశ్చర్య పోనవసరములేదు. మనిషి బ్రతికి ఉన్నంతవరకే మతము, చనిపోయిన తర్వాత ఎవరు ఏ మతములోనైనా కర్మప్రకారము పుట్టవచ్చును. గత జన్మలోని క్రైస్తవులు ఈ జన్మలో హిందువులుగా పుట్టవచ్చును. ఈ జన్మలోని హిందువులు రాబోవు జన్మలో క్రైస్తవులుగా పుట్టవచ్చును. ఒక మనిషి ఏ మతములో మనుగడ సాగించాలో వాని కర్మే నిర్ణయిస్తుంది. దానిప్రకారమే కొందరు హిందువులుగా, కొందరు క్రైస్తవులుగా పుట్టు చున్నారు. ఎవనికైనా పుట్టుకతో వచ్చిన మతము దేవుని సమ్మతితో వచ్చిన దానిగా లెక్కించాలి. ఎవడైనా ఒక హిందువు, క్రైస్తవ మతములోనికి మారాలని తలచినా, ఒకవేళ క్రైస్తవునిగా మారినా, అది దేవునికి వ్యతిరేఖ చర్య అగును. దేవుని పరిపాలనను ధిక్కరించినట్లగును. అట్లే ఒక క్రైస్తవుడు హిందువుగా మారాలనినా, ఒకవేళ మారినా అతను కూడా దేవునికి వ్యతిరేఖి అగును. దేవుని పాలకులు అతని మీద కోపము కల్గియుందురు. అందువలన మతమార్పిడి మహాపాపమని, దైవ నిర్ణయమునకు విరుద్ధముగా చేసినట్లగునని తెల్పుచున్నాము. నేటి కాలములో మత మౌఢ్యము అన్ని దేశములలో ప్రాకిపోయినది. దానివలననే యుద్ధములు జరుగుచున్నవి. హింస చెలరేగుచున్నది. ఒకరినొకరు కొట్టుకొని చస్తున్నారు. చివరకు మాలాంటివారిని కూడా అగౌరవముగా మాట్లాడుచున్నారు. ఇటువంటి కాలము వస్తుందని ద్వాపరయుగములోనే కృష్ణుడు చెప్పాడు, అలాగే వచ్చింది. నాది క్రైస్తవము నీది హిందుత్వము అను అజ్ఞాన రోగము పోవుటకు, ఆ రోజే మందును కూడా తయారుచేసి ఇచ్చిపోయినట్లు తెలియుచున్నది. ఆనాడు కృష్ణుడు రాబోవు మత రోగమును గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ రోగము వచ్చింది. అయితే రోగమును
గురించి చెప్పినపుడే, రోగము వ్యాప్తి చెందకుండా, రోగము పూర్తి నివారణ అగుటకు ఔషధ జ్ఞానమును కూడా తెలిపాడు. మతమను రోగమునకు, జ్ఞానమను ఔషధము ఏమిటో ఆ రోజు ఆయన సూచించినా, ఈ రోజు దానిని తెలియలేని స్థితిలో ఉన్నాము. అందువలన మత రోగము ముదిరి పోవుచున్నది. అలా కాకుండా ఇప్పుడు మనము కృష్ణుడు సూచించిన విధానమును తెలుసుకొందాము.
దేవుడు మతాన్ని సృష్ఠించలేదు. దేవుడు తన జ్ఞానాన్ని ధర్మముల రూపములో తెలిపాడు. దేవుడు తన శక్తిని తన వ్యక్తిగ మలచి భూమిమీద జ్ఞానాన్ని బోధించునట్లు చేశాడు. అలా వచ్చిన వ్యక్తిని భగవంతుడని హిందువులు, ప్రవక్త అని క్రైస్తవులు అంటున్నారు. ఎవరు ఏమనినా వచ్చిన వ్యక్తి దేవుని శక్తియేనని జ్ఞాపకముంచుకోవలెను. అపారమైన దైవశక్తిలో కొంత భాగము వ్యక్తిగా వచ్చినపుడు, ఆ వ్యక్తికి కూడా ప్రపంచములో గుర్తింపు కొరకు పేరుండును. ఒక కాలములో ఒక ఊరిలో ఉన్న ప్రవక్తకు గానీ, భగవంతునికి గానీ ఒక పేరుండును. ద్వాపరయుగములో దైవ భాగములలో ఒక భాగమై వచ్చిన వ్యక్తి పేరు కృష్ణ. కృష్ణుడు ద్వాపర యుగములో ఉత్తర భారతదేశమున మధురలో పుట్టాడు. భగవంతుడైన కృష్ణుడు దేవుని ధర్మములను తెలిపిపోయాడు. ఆయన పోయిన తర్వాత దాదాపు మూడు వేల సంవత్సరములకు దైవశక్తి కలియుగమున ఇజ్రయేల్ దేశమున జెరూసలేము నగరమున ఒక వ్యక్తిగా పుట్టినది. ఆ వ్యక్తి ఏసు అను పేరుతో పిలువబడినాడు. ద్వాపరయుగములో పుట్టిన దైవశక్తి పేరు కృష్ణ అను రెండు అక్షరములు. కలియుగములో పుట్టిన దైవశక్తి పేరు ఏసు అను రెండక్షరములు. దైవశక్తి భూమిమీదకు రావడమే అరుదు. కొన్ని లక్షల సంవత్సరములకొకమారు వచ్చు దైవశక్తి, మూడువేల
సంవత్సరములకు రెండవమారు రావడము ఆశ్చర్యపడవలసిన విషయము. భగవద్గీతలో కూడా ధర్మములకు ముప్పు ఏర్పడినపుడు, అధర్మములు చెలరేగినపుడు, అధర్మములను అణచివేసి తిరిగి ధర్మములను తెలియజేయుటకు యుగ యుగమందు వస్తానన్నాడు. ఆయన మాట ప్రకారము చూచినా ఒక్కొక్క యుగము కొన్ని లక్షల సంవత్సరముల కాలముంటుంది. అలాంటపుడు అవసరమొచ్చి ప్రతి యుగమునందు వచ్చినా, ఒక రాకడకు మరొక రాకడకు కొన్ని లక్షల సంవత్సరముల వ్యవధి ఉండును. అలాంటిది ద్వాపరయుగము అంత్యములో వచ్చిన భగవంతుడు, వెంటనే కలియుగమున కేవలము మూడువేల సంవత్సరములకే రావడము ఆశ్చర్యపడవలసిన విషయమే అగును. ఒకమారు భూమిమీదకు దైవశక్తి అయిన భగవంతుడు వచ్చి ధర్మములను నెలకొల్పి పోతే, తిరిగి అవి అధర్మములుగా మారుటకు కొన్ని లక్షల సంవత్సరములు పట్టును. ఆ నేపథ్యములో ఒక్కొక్కమారు భగవంతుని రాక దాదాపు పది యుగములకు ఒకమారు ఉండవచ్చును. అటువంటిది కృష్ణుడు చనిపోతూనే కలియుగము వెంటనే ప్రారంభమైనది. భగవంతుడు వచ్చి ధర్మములను తెలియజేసి పోయిన తర్వాత మూడు వేల సంవత్సరములకే తిరిగి దైవశక్తి భూమిమీద పుట్టిందని చెప్పితే, మూడు వేల సంవత్సరములకే ధర్మములు అధర్మము లైనాయా? అను ప్రశ్నరాగలదు. ఒకవేళ అంత తొందరగా ధర్మములు, అధర్మములుగా మారిపోతే, దైవశక్తి భగవంతునిగా ధర్మములను తెలియ జేయుటకు ఒక యుగములోనే ఎన్నో వందలమార్లు భూమిమీదకు రావలసి వస్తుంది. అలా జరుగుతుందా? ఒక యుగములోనే ధర్మములు అధర్మములుగా ఎన్నో వందల మార్లు మారిపోవునా? అని ప్రశ్నించుకొంటే దానికి జవాబు ఈ విధముగా గలదు.
దైవశక్తి భగవంతునిగా రావాలంటే అధర్మములు ఒక స్థాయికి పెరగాలి. అధర్మములు ఒక స్థాయిని అందుకొంటూనే భగవంతుని జన్మ తనకు తానుగా వచ్చును. అలా భగవంతుడు భూమిమీదకు వచ్చి ఒకమారు ధర్మములను నెలకొల్పిపోతే తిరిగి అవి అధర్మములుగా మారుటకు కొన్ని యుగముల కాలము పట్టును. ఒక అంచనా ప్రకారము దాదాపు పది యుగములకు ఒకమారు దైవశక్తి మనిషిగా భూమిమీదకు రావచ్చును. దీనినిబట్టి దాదాపు ఒక కోటి సంవత్సరముల తర్వాత 8 లక్షలనుండి 10 లక్షల సంవత్సరముల లోపల భగవంతునిరాక ఉండవచ్చునని అను కుంటాము. ఒకమారు భూమిమీద ధర్మములను నెలకొల్పిపోతే తిరిగి అవి అధర్మములుగా మారుటకు దాదాపు పదియుగముల కాలము పట్టునని తెలియుచున్నది. దీనినిబట్టి భగవంతుని రాక తొందరగా ఉండదని తెలియు చున్నది. అలాంటపుడు కృష్ణుని తర్వాత కేవలము మూడువేల సంవత్సరము లకే తిరిగి ఏసుగా పుట్టాడని చెప్పడమేమిటి? అని కొందరు నన్ను ప్రశ్నించ వచ్చును. దానికి మా వద్దనుండి వచ్చు జవాబు ఏమనగా! దేవుడు భూమిమీద ఒకమారు ధర్మములను నెలకొల్పుటకు కొంతకాలము పట్టును. ద్వాపరయుగ అంత్యములో కృష్ణుడు వచ్చి ఒకమారు అర్జునునికి మాత్రము ధర్మములను తెలిపాడు. అదియూ ఆయన వచ్చిన తర్వాత, సమయమును చూచి దాదాపు 90 సంవత్సరముల వయస్సులో కేవలము ఒక్కమారు చెప్పడము జరిగినది. ధర్మములను నెలకొల్పుటకు దాదాపు కోటి 10 లక్షల సంవత్సరములకు ఒకమారు వచ్చు భగవంతుడు కేవలము పది నిమిషముల లోపల ధర్మములను బోధించునా? అలా బోధించడము సంపూర్ణముగా అధర్మములను లేకుండా చేసినట్లగునా? ధర్మములను నెలకొల్పడము ఎంతో ఉన్నతమైన పనికాగా, ఆ పని కృష్ణుని జన్మలోనే
చేశాడా? ఒకమారు నెలకొల్పబడు ధర్మములు పది కాలములకు పైగా అనగా పది యుగములకు పైగా ఉండవలసి వస్తున్నది. అంత దీర్ఘ కాలము ఉండవలసిన ధర్మములు అంత సులభముగా కేవలము కొన్ని నిమిషములలో బోధించునా? అని యోచించవలసిన పని ఉన్నది.
అలా యోచిస్తే తెలియు రహస్యమొకటి కలదు. ఈ రహస్యము సులభముగా తెలియుటకు ఒక చిన్న ఉదాహరణను తీసుకొందాము. ఒక వ్యక్తికి పది లీటర్ల పాలను అమ్మవలెనని అతని యజమాని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒక ఊరిలోనికి పోయి పాలను అమ్మడము మొదలు పెట్టాడు. పాలు ఎవరికి అవసరమో అడిగి పాలను అమ్మినాడు. కానీ ఆ ఊరిలో కేవలము ఐదులీటర్ల పాలనే అమ్మినాడు. ఇంకా ఐదు లీటర్ల పాలు మిగిలి ఉన్నాయి. అప్పుడు ప్రక్క గ్రామానికి పోయి మిగిలిన పాలను అమ్మాడు. అమ్మిన పాలు పది లీటర్లు, తిరిగిన ఊర్లు రెండు, అమ్మినవాడు ఒక్కడే. కానీ ఇక్కడ ఒక తతంగమును గమనిద్దాము. మొదట పాలు అమ్మిన ఊరిలో అందరు శూద్రులే ఉన్నారు. కాబట్టి అమ్మేవాడు ఏ ఆటంకం లేకుండా అమ్మేశాడు. రెండవ ఊరిలో అందరు బ్రాహ్మణులే ఉన్నారు. వారు బ్రాహ్మణులు అమ్మే పాలనే కొంటారు. కానీ శూద్రులు అమ్మే పాలను కొనరు. అమ్మేవాడు బ్రాహ్మణుడు కాడు. కానీ అమ్మవలసిన పాలు ఐదు లీటర్లు మిగిలి ఉన్నాయి. అందువలన అమ్మవలసిన వ్యక్తి పై అంగీని తీసివేసి, ఒక జంధ్యమును మెడలో వేసుకొని, పంచెకట్టుకొని ఊరిలోనికి పోయి పాలను అమ్మినాడు. అంగీ లేకుండా క్రింద పంచె మాత్రము కట్టుకొని వుండుట వలన, అతను బ్రాహ్మణునివలె కనిపిస్తున్నాడు. పైగా తన పేరు శంకరయ్య అయితే శంకరశాస్త్రి అని చెప్పుకొన్నాడు. పేరులోను, ఆకారములోను బ్రాహ్మణునిగా కనిపించి అమ్మడము వలన
అతని ఐదు లీటర్ల పాలను అక్కడి బ్రాహ్మణులు కొన్నారు. పది లీటర్ల పాలను అమ్మిన తర్వాత పాలవానికి జంధ్యముతో పనిలేదు అలాగే పంచెతో పనిలేదు. అందువలన వాడు ఇంటికి పోయి జంధ్యమును, పంచెను తీసివేసి తాను ఎప్పుడూ కట్టుకొనే లుంగీని కట్టుకొని పడుకొన్నాడు. అక్కడ పది లీటర్ల పాలను అమ్మడము ముఖ్యమైన ఉద్దేశము. ఎన్ని ఊర్లలో అమ్మినావు అనిగానీ, ఎంతసేపుకు అమ్మినావు అనిగానీ పాల యజమాని అడగడము లేదు. పాల యజమాని యొక్క పాలను పాలవాడు (పాలను అమ్మువాడు) అమ్మి పెట్టాలి అన్నది నియమము. అంతేగానీ ఈ వీధిలోనే అమ్మాలి, ఆ ఆ ఊరిలోనే అమ్మాలి, గంటలోపే అమ్మాలి, అరగంటలోపే అమ్మాలి అను నియమము లేదు. అందువలన పాలవాడు పది లీటర్ల పాలను అమ్మితే పాల యజమాని లెక్కలో పాలవాడు ఒకరోజు పని చేసినట్లగును.
పై విధముగా పోల్చుకుంటే పాలయజమాని ఉన్నట్లు పరమాత్మ ఉన్నాడు. పాలవాడు ఉన్నట్లు భగవంతుడున్నాడు. పాలవాడు అమ్ము పాలు పాలయజమానివి అయినట్లు, భగవంతుడు బోధించు ధర్మములు పరమాత్మవి (దేవునివి). అమ్మవలసిన పాలు పదిలీటర్లు అయినట్లు తెలుప వలసిన ధర్మములు నూరు శాతము. పాలవాడు పాలను రెండు ఊర్లలో అమ్మినా ఫరవాలేదు అన్నట్లు, భగవంతుడు నూరు శాతము ధర్మములను రెండు దేశములలో చెప్పినా ఫరవాలేదు. పదిలీటర్ల పాలను అమ్మినపుడే పాలవానికి ఒకరోజు పని అయినట్లు లెక్కించబడును. నూరు శాతము ధర్మములను తెలిపినపుడే భగవంతునికి ఒకమారు ధర్మములను బోధించినట్లగును. పాలవాడు పది లీటర్ల పాలను అమ్ముటకు రెండు ఊర్లలోనికి పోయి రెండు ఊర్లలో కనిపించినట్లు, భగవంతుడు నూరుశాతము ధర్మములను తెలుపుటకు రెండు దేశములలోనికి పోయి రెండు దేశములలో
కనిపించును. ఒక ఊరిలో శూద్రునిగా, ఒక ఊరిలో బ్రాహ్మణునిగా కనిపించినట్లు ఒక దేశములో ఒక హిందువుల ప్రవక్తగా, మరొక దేశములో క్రైస్తవ ప్రవక్తగా కనిపించును. పాలవాడు ఉదయము ఆరు గంటలకు ఒక ఊరిలో కొన్ని పాలను అమ్మి, తర్వాత కొంతసేపటికి ఏడు గంటలకు రెండవ ఊరిలోనికి పోయి అక్కడ వారి కులస్థునిగా కనిపించి, ఏడు గంటలకు పాలను అమ్మినట్లు, భగవంతుడు కృష్ణునిగా ద్వాపరయుగ చివరిలో దేవుని ధర్మములను బోధించి తర్వాత కొంత కాలమునకు (మూడువేల సంవత్సరములకు) ఇజ్రాయెల్ దేశములోనికి పోయి అక్కడ వారి మతప్రవక్తగా కనిపించి, కలియుగములో దైవధర్మములను బోధించాడు. పది లీటర్ల పాలను రెండు ఊర్లలో అమ్మినపుడు పాలవానికి ఒకరోజు పని అయినట్లు, భగవంతుడు వేరు వేరు సమయములలో వేరు వేరు దేశములలో నూరుశాతము ధర్మములను బోధించినపుడే ఆయనకు ఒక అవతారము పనిపూర్తి అయినట్లగును. పాలవాడు యజమాని పాలను ఎన్ని ఊర్లలో అమ్మినా, ఎంత సమయములో అమ్మినా పదిలీటర్ల పాలను అమ్మినపుడే యజమాని దృష్ఠిలో ఒకరోజు పాలవాడు పనిచేసినట్లు లెక్కించబడును. అదే విధముగ భగవంతుడు ఎన్ని దేశములలో ధర్మములను చెప్పినా, ఎంత కాలములో చెప్పినా, నూరుశాతము ధర్మములను తెలియజేసినపుడే, దేవుని దృష్ఠిలో భగవంతుడు ఒకమారు భూమిమీద ధర్మములను బోధించినట్లగును.
పాల యజమాని - ధర్మములకు అధిపతి అయిన దేవుడు
పాలు - ధర్మములు
పాలవాడు - భగవంతుడు
పదిలీటర్ల పాలు - నూరుశాతము ధర్మములు
రెండు ఊర్లు - రెండు భూ భాగములు
శంకరయ్య - కృష్ణ
శంకరశాస్త్రి - ఏసు
పాలవాడు (శూద్రుడు) - భగవంతుడు కృష్ణుడు
పాలవాడు (బ్రాహ్మణుడు) - భగవంతుడు ప్రవక్త
అమ్మిన సమయము - బోధించిన కాలము
ఆరు గంటలపుడు - ద్వాపరయుగములో
ఏడు గంటలపుడు - కలియుగములో
పాలను అమ్మడము - ధర్మములను బోధించడము
ఒక రోజు పని - ఒక అవతారము యొక్క పని
పాలను కొన్నవారు - ధర్మములను తెలుసుకొన్న వారు
పాలను కొన్న ఒక ఊరు - మొదట ధర్మములను తెలిసిన దేశము భారత దేశము.
పాలను కొన్న రెండవ ఊరు - - తర్వాత ధర్మములను తెలిసిన దేశము ఇజ్రాయెల్ దేశము.
ఒక పొడుగాటి సరళరేఖ ఉందనుకొనుము. ఆ రేఖకు రెండు ధృవములుండును. ఆ రెండు ధృవములను కలుపు మధ్యరేఖ ఉండును. రేఖ అనగా గీచిన గీత అని అందరికి తెలుసు. ఒక గీతకు రెండు ధృవములు, ఆ రెండు ధృవములను కలుపు గీత ఉండును. క్రింది చిత్ర పటములో చూడుము. చిత్ర పటము 75పేజీ లో చూడండి .
చిత్రములో కనిపించు ఒకటవ కొన ఉత్తర ధృవము, అలాగే రెండవకొన దక్షిణ ధృవము. ఒకటి రెండు కొనలను కలుపుచున్న రేఖను
రెండు ధృవములను ఏకస్థాయిగా సమతలముగా చూపుగీత అని అంటున్నాము. గీత ఉంది అంటే ధృవములుంటాయి. రెండు ధృవములు ఉన్నాయి అంటే చూచే దానికి అవి ఒకదానికొకటి వ్యతిరిక్త దిశలలో ఉండును. వ్యతిరేఖ దిశలలో రెండు ధృవములున్నా, రెండిటినీ సమానముగా చూపు గీత ఉండును. మొత్తము మీద చెప్పాలంటే ఒక గీత మూడు భాగములుగా ఉన్నదని చెప్పవచ్చును. దీనినిబట్టి గీయబడిన గీత కూడ త్రైతముతో కూడుకొని ఉన్నదని తెలియుచున్నది. ఇపుడు అసలు విషయానికి వస్తాము. భగవంతుడు తెలియ చెప్పినది భగవద్గీత, భగవంతుడు చెప్పిన గీతకు కూడా త్రైతము వర్తిస్తున్నది. భగవంతుని గీత మూడు భాగములుగా ఉంటూ ముగ్గురు పురుషులను తెలియజేస్తున్నది. భగవంతుని చేత గీయ బడిన గీతకు కూడా రెండు ధృవములు కలవు. భగవద్గీత కూడా ఒకకొన ఉత్తర ధృవముగా, రెండవకొన దక్షిణ ధృవముగా ఉన్నది. ఉత్తర ధృవము దేవుడు, దక్షిణ ధృవము జీవుడని దీని అర్థము. ఉత్తర ధృవముగానున్న మొదటి కొన భాగము పరమాత్మయనీ, దక్షిణ ధృవముగానున్న రెండవ కొన భాగము జీవాత్మయనీ, వాటికి మధ్యలోనున్న గీత జీవాత్మను పరమాత్మను ఏకము చేయు ఆత్మ అనీ తెలియుచున్నది. సమస్త జగతిలో ఏ జీవాత్మ అయిన పరమాత్మను చేరాలంటే ఆత్మ ద్వారానే సాధ్యమగును. జీవాత్మకు దారి ఆత్మయే. ఆత్మ దారిలో ప్రయాణిస్తేనే పరమాత్మ అను గమ్యమును చేరవచ్చును. అందువలన దేవున్ని చేరాలను ఏ జీవుడైనా ఆత్మను అధ్యయనము చేసి తీరాల్సిందే, ఇది శాసనము. ఆత్మను గూర్చి ఆధ్యయనము చేయడమునే “ఆధ్యాత్మికము” అంటాము. ఆధ్యాత్మికము తెలియనిది జగతిలో ఎవనికీ ముక్తి లభించదు.
గీయబడిన గీత మూడు భాగములుగా ఉన్నట్లు, చెప్పబడిన గీత మూడు భాగములుగా ఉన్నది. తన గీత త్రైతముతో కూడుకొన్నదనీ, మూడు భాగములుగా ప్రజలకు తెలియబడునని తెలిసిన కృష్ణుడు, ఆ రహస్యమును చివరిలో బోయవానికి చెప్పిపోయాడు. పాలవాడు రెండు ఊర్లలో పాలు అమ్మినట్లు, భగవంతుడు రెండు సమయములలో రెండు దేశములలో తన బోధను తెలుపవలసి ఉన్నది. భోజనము చేయువాడు మజ్జిగతో తిన్నపుడే అది సంపూర్ణ భోజనమని అనుకొనునట్లు, చివరిలో మూడవ మారు బోధయొక్క వివరమును తెలిపినపుడు సంపూర్ణముగా చెప్పినట్లు అగును. గీయబడిన గీత మూడు భాగములున్నట్లు, చెప్పబడిన గీత మూడు భాగములుగా ఉండాలి. అలాగే చెప్పబడిన గీత మూడు ఆత్మలను తెలుపునదిగా ఉండాలి. ఈ సూత్రము వర్తించినపుడు అది భగవంతుడు మానవునికి బోధించిన బోధ అగును. ఎప్పుడైతే కృష్ణుడు అర్జునునకు ధర్మములను యుద్ధరంగములో తెలియజేశాడో, అప్పుడు పాలవాడు తన పాలను ఒక ఊరిలో అమ్మినట్లైనది. ఇంకా కొన్ని ధర్మములనుగానీ లేక ఒక ధర్మమునుగానీ మరియొక కాలములో మరియొక దేశములో చెప్పవలెనని కృష్ణునికి తెలుసు. అలా రెండవ మారు రెండవ చోట తానే చెప్పవలెనని, అలా చెప్పిన దానినే మూడవమారు తానే వివరించవలెననీ కూడా కృష్ణునికి తెలుసు. అలా మూడుమార్లు చేసినపుడు తాను ఒకమారు భూమిమీద ధర్మములను తెలియజేసినట్లగును. అందువలన తన ప్రణాళికను లేక పథకమును ముందే తెలియజేసినట్లు ఆధారము కొరకు, బోయవానికి తన రెండవ రాకను, మూడవ రాకను గురించిన సమాచారమును తెలియజెప్పి పోయాడు. ఆ సమాచారముతో బోయవానికి ఏమాత్రము అవసరము లేదు. అయినా కృష్ణుడు తన
మరణకాలములో చెప్పాడు. రెండవమారు వచ్చినపుడు ఈ సమాచారమును చెప్పితే ఎవరూ నమ్మరు. కృష్ణుని పేరు చెప్పుకొని ఏసు గొప్పవాడనిపించు కొన్నాడని ఎవరైనా అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మనకు తెలిసిన ఒక ఉద్యోగి నేను పోయిన జన్మలో మహాత్మాగాంధీనని చెప్పుకొంటే ఎవరూ నమ్మరు. ఆ ఉద్యోగి చెప్పినట్లు, అతను పోయిన జన్మలో నిజంగా గాంధీయే అయినప్పటికీ ఎవరూ నమ్మే స్థితిలో ఉండరు. పైగా ఆ మాటను చెప్పుట వలన వీడు తన అధికారుల వద్ద గౌరవమును సంపాదించుకొనుటకు అలా బొంకుచున్నాడని అందురు. అట్లుకాక గాంధీ బ్రతికి ఉన్నపుడు, చనిపోకముందు రాబోవు జన్మలో ఫలానా వ్యక్తిగా పుట్టి, ఫలానా ఉద్యోగము చేస్తానని చెప్పియుంటే ప్రస్తుత కాలములో ఆ వ్యక్తి ఆ ఉద్యోగిగా ఉన్నప్పుడు, ఎవరైనా ఈయన ఫలానా గాంధీ అని గుర్తించగలరు మరియు గౌరవముగా చూడగలరు.
ఏదైనా జరుగకముందు చెప్పితే చెప్పినవానికి జరిగిన కార్యమునకు విలువ ఉంటుంది. అట్లుకాక జరిగిన తర్వాత చెప్పితే జరిగిన పనికి గానీ, చెప్పిన వ్యక్తికిగానీ విలువ ఉండదు. అందువలన కృష్ణుడు జరుగబోవు దానిని గురించి ముందే చెప్పాడు. ఆ విలువైన సమాచారమును వినిన వ్యక్తి అప్పుడే బయటికి చెప్పకపోయినా, తర్వాత చెప్పుట వలన కృష్ణుడు చెప్పిన సమాచారమునకు విలువ చేకూరినది. కృష్ణుడు బ్రతికివున్నపుడు చెప్పిన గీతయందు, “నేను ధర్మములను సంస్థాపన చేయుటకు యుగ యుగమునందు, నన్ను నేను సృజించుకొని వస్తానని” చెప్పాడు. అలాగే ఏసుగా వచ్చిన సమయములో కూడా తర్వాత నేను వస్తానని చెప్పాడు. కృష్ణునిగా వచ్చినశక్తి ఏసుగా వస్తానని భగవద్గీతలోను, ఏసుగా వచ్చిన
వ్యక్తి ఆదరణ కర్తగా ఫలానా అడ్రస్ లో వస్తానని బైబిలులోనూ చెప్పలేదు. ముఖ్యముగా ఈ కారణము చేత కృష్ణుని భక్తులైన వారు ఏసును, ఏసు భక్తులైన వారు కృష్ణున్ని ఏమాత్రము నమ్మకున్నారు. కృష్ణున్ని, ఏసును వేరు వేరు వ్యక్తులుగా లెక్కించి కృష్ణున్ని క్రైస్తవులు, ఏసును హిందువులు అసూయతో దూషిస్తున్నారు. ఇరువురి రెండు మతాలను సృష్టించుకొని మతముల మబ్బులో ఒక మతమునకు మరొక మతము విరోధము అన్నట్లు ప్రవర్తించుచున్నారు. దీనికంతటికీ కారణము కృష్ణ అను పేరుతో ఐదువేల నూట పదిహేడు (5117) సంవత్సరముల క్రితము వచ్చిన వ్యక్తియే, రెండువేల పదహారు (2016) సంవత్సరముల క్రిందట ఏసుగా వచ్చాడని ఎవరూ గుర్తించలేక పోయారు. ఇపుడు నేను చెప్పు ఈ సమాచారము కొంతమంది క్రైస్తవులకు నచ్చక పోవచ్చును. అలాగే కొంతమంది హిందువులకు కూడా నా మీద కోపమును తెప్పించును. అయినా దేవుని విషయమును తెలిసి, సత్యమును మూసిపెట్టి బయటికి చెప్పకపోతే అది భయంకర పాపమగును. అందువలన ఎవరు ఏమనుకొనినా తప్పనిసరిగా చెప్పవలసి వచ్చినది.
"సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యముకాదు” అను సూత్రమును అనుసరించి చూస్తే, ఎందరు కాదు లేదు అనినా సత్యము జీవించియే ఉంటుంది. చివరకు ఎవరైనా సత్యమును ఒప్పుకోక తప్పదు. కృష్ణుడు ఏసుగా వచ్చాడని చెప్పుట సత్యము, కనుక ఆ మాటను ఆలోచించి చూస్తే ఎవరికైనా సత్యముగా కనిపించును. కృష్ణుని జీవితము గడిచిపోయి 5117 సంవత్సరములైనది. అలాగే ఏసు జీవితము గడచిపోయి ఇప్పటికి 2016 సంవత్సరములైనది. ఇద్దరి జీవితములు గడచిపోయినవే కనుక గడచిన వారి చరిత్రను ఎవరూ కాదనలేరు. కృష్ణుడు పుట్టాడు, అలాగే
ఏసు పుట్టాడు. ఎవరికైనా జీవితములో జననము మరియు మరణములు రెండు ముఖ్యమైన ఘట్టములు. ఇపుడు ముఖ్య ఘట్టమైన కృష్ణుని పుట్టుకను, ఏసు పుట్టుకను గమనించి చూస్తాము. కృష్ణుడు పాతబడిన చెఱసాలలో, అశుభ్రమైన చోట, తల్లి ప్రక్కన తండ్రి తప్ప ఎవరూలేని దీనస్థితిలో పుట్టాడు. ఏసు కూడా పాతబడిన పశువులశాలలో, అశుభ్రమైన చోట, తల్లి ప్రక్కన తండ్రి తప్ప ఎవరూ లేని దీనస్థితిలో పుట్టాడు. జీవితము యొక్క ప్రారంభ ఘట్టములో జరిగిన విధానమును ఇటు హిందువులు, అటు క్రైస్తవులు యుక్తినుపయోగించి యోచిస్తే కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒక్కరే అనుటకు మొదటనే సాక్ష్యము దొరుకుచున్నది. తర్వాత చూస్తే కృష్ణుడు పుట్టడము ప్రమాద సమయము, అలాగే ఏసు పుట్టడము కూడా ప్రమాద సమయమే. కృష్ణుడు పుట్టాడని తెలియగానే అతనిని చంపుటకు ఆ దేశరాజు సిద్ధముగా ఉన్నాడు. అలాగే ఏసు పుట్టాడని తెలియగానే అతనిని చంపుటకు కూడా ఆ దేశరాజు సిద్ధముగా ఉన్నాడు. కృష్ణుడు పుట్టగానే కొద్దిసేపటికే పుట్టిన చోట లేకుండా తండ్రిగానున్న వసుదేవుడు ప్రక్క ప్రాంతమునకు తీసుకెళ్ళాడు. అలాగే ఏసు పుట్టిన కొద్దిసేపటికే ఆయన తండ్రిగానున్న యోసేపు, పుట్టిన చోట లేకుండ ప్రక్క ప్రాంతమునకు తీసుకెళ్ళాడు. కృష్ణుడుగానీ, ఏసుగానీ ఇద్దరూ రాత్రిపూటే పుట్టారు. రాత్రిపూట పుట్టినవారు ఆ రాత్రికే పుట్టిన స్థలములో లేకుండా పోయి అక్కడికి దూరముగా కొంతకాలము అజ్ఞాతముగా పెరిగారు. కృష్ణుడు ఏసు ఇద్దరు ఒకటేనని తెలియుటకు ఒకే పోలికగల సంఘటనలు వారు పుట్టిన రోజు చోటు చేసుకొన్నాయి. కొంచెము తెలివిని ఉపయోగించి చూచినా, వారిరువురి జనన రహస్యము తెలిసిపోతుంది. వారు ఇద్దరు ఒక్కరు కాదు అనుటకు వీలులేకుండా, వారిరువురి పుట్టుకలు ఒకే విధముగా జరిగాయి.
తర్వాత కృష్ణునికి ముప్పయి సంవత్సరముల వయస్సులో అతని జీవితమందు చెప్పుకోదగిన మార్పువచ్చింది. అలాగే ఏసుకు కూడా ముప్ఫయి సంవత్సరముల వయస్సులో మార్పు కనిపిస్తున్నది. ముప్ఫయి సంవత్సరముల వయస్సులో కృష్ణుడు మధురను వదలి ద్వారకకు పోయాడు. అలాగే ఏసు కూడా తనకు ముప్ఫయి సంవత్సరముల వయస్సు రాగానే తల్లి తండ్రులను వదలి వెళ్ళిపోయాడు. చివరిలో ముఖ్య ఘట్టమైన మరణములో కృష్ణుడు గాయపడి రక్తము కారి చనిపోయాడు. అలాగే ఏసు కూడా గాయపడి రక్తముకారి చనిపోయాడు. కృష్ణుడు చనిపోవు సమయములో తనవారు ఎవరూ కృష్ణునివద్ద లేరు. అలాగే ఏసు చని పోవునపుడు కూడా ఆయనవద్ద తనవారు ఎవరూ లేరు. కృష్ణుడు మరణించునపుడు ఆయన త్రాగేదానికి నీళ్ళు కూడా అక్కడ లేవు. అలాగే ఏసుకు కూడా నీరు దొరకలేదు. కృష్ణుడు తన కాలికి బలముగా నాటుకొన్న బాణము వలన చనిపోయాడు. అలాగే ఏసు తన కాళ్ళకు బలముగా నాటుకొన్న సీల వలన చనిపోయాడు. ఈ విధముగా కృష్ణుని మరియు ఏసు జనన మరణములు ఒకే స్థితిగా జరిగిపోయినవి. భూమిమీద ఆ విధముగా ఎవరికీ జరుగకుండ, కేవలము వీరిద్దరి విషయములలోనే అలా జరగడము, వీరిరువురు విశేషముగా ఇద్దరు ప్రవక్తలుగా ఉండడము వలన వీరి జనన మరణములను విశ్లేషించి చూడవలసి వచ్చినది. అలా చూస్తే వీరు ఇద్దరు ఒక్కరేనని తెలియనివారు కూడా తెలుసుకొనునట్లు అలా జరిగిందని తెలియుచున్నది. కృష్ణుడు చనిపోతూ చెప్పిన మాట సత్యమని తెలియుటకు ఏసు జననము, మరణము రెండూ కృష్ణుని జనన మరణములతో సరితూగునట్లు జరిగినవి. కనిపించని దానిని నమ్మము. కనిపించు దానినే నమ్ముతామను హేతువాదులకు, కనిపించనిది అసత్యము
కనిపించునదే సత్యము అను నాస్తికవాదులు కూడా ఒప్పుకొనునట్లు కనిపించు సంఘటనలుగానే కృష్ణుని, ఏసుని జనన మరణములు జరిగినవి.
భౌతికముగా కృష్ణుడు ఏసుగా పుట్టాడనీ, కృష్ణుడుగానీ ఏసుగానీ ఇద్దరు ఒక్కరేనని, ఆ ఒక్కరు దైవమునందలి శక్తియేనని, ఆ దైవశక్తియే, ఒక వ్యక్తియై, అదియే రెండు కాలములలో, రెండు ఆకారములలో, రెండు పేర్లతో చలామణి అయినదని తెలియుచున్నది. ఒకే దైవశక్తి ధర్మములను పూర్తిగా తెలియజేయుటకు, ధర్మములు అందరికీ తెలియజేయుటకు మొదట ఒక కృష్ణునిగా పుట్టి, తర్వాత రెండవసారి ఏసుగా పుట్టవలసి వచ్చినది. కనిపించు దానినే నమ్ము ప్రజలు, వేరు వేరుగా కనిపించు కృష్ణున్ని, ఏసును వేరు వేరుగానే భావించుకొనుచున్నారు. కృష్ణుడుగానీ, ఏసుగానీ చెప్పని మతములను మనుషులు ఏర్పరచుకొని, ఇది కృష్ణునిది, ఇది ఏసుది అంటున్నారు. అజ్ఞానుల దృష్టిలో కృష్ణుడు, ఏసు ఇద్దరు వేరు వేరు వ్యక్తులైనా, జ్ఞానుల దృష్ఠిలో ఇరువురు ఒకే శక్తిగానున్న వ్యక్తులని తెలియుచున్నది. నేటి కాలములో జ్ఞానుల సంఖ్య తగ్గిపోయి, అజ్ఞానుల సంఖ్య పెరిగి పోయినది. అజ్ఞానుల సంఖ్యను తగ్గించి, జ్ఞానుల సంఖ్యను పెంచుటకు ఎత్తిన ప్రారంభ అవతారమే శ్రీకృష్ణునిది. అలా ప్రారంభమైన అవతారము మూడు అవతారములతో ముగియును. ఇప్పటికి పరమాత్మ శక్తి మొదటి అవతారముగా కృష్ణుని రూపములో వచ్చి ధర్మములను తెలియచెప్పినది. భూమిమీద మనుషులయందు అజ్ఞానమును తీసివేసి జ్ఞానమును కల్గించు కార్యములో మొదటి భాగము ద్వాపరయుగమున జరిగినది. మూడు భాగములలో ఒక భాగము కృష్ణుని రూపములో నెరవేరినది. రెండవ భాగము కూడా ఏసు రూపములో నెరవేరినది. ఇప్పటికి రెండు భాగముల
కార్యము పూర్తి అయినది. రెండు భాగముల యందు ధర్మములు చెప్పబడినవి. ఇప్పటికి ప్రత్యక్షముగా ధర్మ సంస్థాపన కార్యము రెండు భాగములుగా, రెండు దేశములలో, రెండు శరీరముల ద్వారా, రెండు పేర్లు కల్గిన వ్యక్తుల ద్వారా జరిగినప్పటికీ మేము జ్ఞానులము అనుకొను వారు ఎవరు కూడా ఇంత పెద్ద మహత్కార్యమును గుర్తించలేక పోయారు.
ఒక గీత మూడు భాగములున్నట్లు, త్రైతముతో కూడిన ధర్మములు, త్రి భాగములుగా, త్రి వ్యక్తులద్వారా బోధించబడును. బోధించువాడు ఒక్కడేనని, బోధించబడునవి ఒకే దేవుని ధర్మములని జ్ఞప్తికుంచుకోవాలి. దైవ ధర్మములను పూర్తిగా బోధించుటకు కొన్ని వేలసంవత్సరముల కాలము అవసరము. ఇప్పటికి మొదట కృష్ణుడు బోధించినప్పటినుండి దాదాపు ఐదువేల సంవత్సరములు గడచిపోయినవి. అట్లని ఐదువేల సంవత్సరముల పొడవునా ధర్మములు బోధించబడలేదు. ద్వాపరయుగ అంత్యములో కృష్ణుని ద్వారా కొన్ని నిమిషముల కాలము ధర్మములు బోధింపబడినవి. అది మొదటి భాగముకాగా, అప్పటినుండి మూడు వేల సంవత్సరముల తర్వాత ఏసు ద్వారా మూడు సంవత్సరముల కాలము ధర్మములు బోధింపబడినవి. ఏసు బోధించినది రెండవ భాగముకాగా, అప్పటినుండి ఇప్పటికి రెండు వేల సంవత్సరములు గడచినవి. మూడవ భాగములోని ధర్మబోధ కృష్ణుడు ఆదర్శకర్త ద్వారా బోధింపబడునని చెప్పగా, ఏసు ఆదరణకర్త ద్వారా బోధించ బడునని తెలియజేశాడు. ఆదరణకర్త గానీ, లేక ఆదర్శకర్త గానీ ఎప్పుడు ఎన్ని సంవత్సరములకు వస్తారో, ఏ దేశములో బోధిస్తారో ఎక్కడ చెప్పబడి ఉండలేదు. ఎప్పటికైనా మూడవ బోధకుడు వస్తాడు, ఈ మారు పూర్తి ధర్మములను తెలియబరుస్తాడు. అలా మూడవ పురుషునితో ధర్మముల
పునరుద్ధరణ, అధర్మముల అణచివేత కార్యము పూర్తి కానున్నది. మూడు కాలములలో, ముగ్గురు బోధకుల రూపములో చెప్పబడునవి ఒకే దేవుని ధర్మములని తెలియవలెను. మొదట కృష్ణుడు చెప్పినవి ఒక దేవుని ధర్మములు, తర్వాత ఏసు చెప్పినవి మరొక దేవుని ధర్మములు కానేకావు. ఇద్దరు చెప్పినవి తర్వాత రాబోవు మూడవవాడు చెప్పబోవునవి, అన్నియూ ఒకే దేవుని ధర్మములని తెలియవలెను. కృష్ణుడు చెప్పినవి హిందూమత ధర్మములని, ఏసు చెప్పినది క్రైస్తవ మత ధర్మములని పొరపాటున కూడా అనుకోకూడదు. కృష్ణుడుగానీ, ఏసుగానీ మతధర్మములను బోధించలేదు. వారు ఇరువురు బోధించినవి ఒకే దేవుని ధర్మములు మాత్రమేనని జ్ఞాపకముంచుకోవాలి.
ధర్మముల పునరుద్ధరణ కార్యమును మొదలుపెట్టింది కృష్ణుడు. కృష్ణుడు చాలా తెలివైనవాడు. ముందుగానే తనయందున్న, తనకు తెలిసిన, తన ధర్మముల ప్రచార కార్యక్రమ పథకమును ఎవరికీ చెప్పక తనయందే నిగ్రహించి పెట్టుకొని, చివరకు చనిపోయే ముందు బోయవానికి చెప్పాడు. బోయవాడు ఆ విషయమును ఎవరికీ చెప్పడని కృష్ణునికి తెలుసు. బోయవానికి తప్ప ఎవరికి చెప్పినా, అది వెంటనే అందరికీ తెలిసిపోయి, కొంత కాలమునకు బలహీనపడిన రహస్యమై, చివరకు తెలియకుండా పోవునని కృష్ణుని భావము. అందువలన జీవితకాలమంతయు తనయందే దాచుకొన్నాడు. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో కృష్ణునికి బాగా తెలుసు. అందువలననే అడుగకున్నా అర్జునునకు గీతను చెప్పాడు. నీవు నాకు ప్రియుడవు, స్నేహితుడవు కావున నీకు చెప్పుచున్నానని అర్జునున్ని ఉబ్బిపోవునట్లు చేశాడు. వాస్తవానికి కృష్ణునికి అర్జునుడు ప్రియుడేమి
కాదు. కృష్ణునికి జరుగబోవు విషయములన్నీ తెలుసు. ముందే తెలిసిన వాడు కనుక ఎవరితో ఎట్లు మాట్లాడాలో, ఎట్లు మాట్లాడితే జరుగబోవు పనికి సరిపోతుందో తెలిసి మాట్లాడేవాడు. కృష్ణునికి జరుగబోవు విషయములు తెలుసుననుటకు ఆధారముగా గీతలో విజ్ఞానయోగమందు 26వ శ్లోకమున ఇలా కలదు.
శ్లో॥ 26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున । భవిష్యాణిచ భూతాని మాంతు వేద న కశ్చన 1.
భావము :- జగతిలో సర్వ జీవరాసులకు జరిగినది, జరుగుచున్నది, జరుగ బోవు విషయములు నాకు తెలుసు. అయితే నేను ఇటువంటి వానినని ఎవరికీ తెలియదు.
కృష్ణుడే స్వయముగా పై శ్లోకమున నాకు మూడు కాలములు తెలియునన్నాడు. కానీ ఆయన అంతటి గొప్పవాడని, ఆయన సాక్ష్యాత్తూ దైవములోని అంశ అనీ, జరుగబోవు విషయములు ఆయనకు తెలియునని ఎవరికీ తెలియదు. జ్ఞానము మీద ఆసక్తి ఉన్నవారు ఎందరో భూమిమీద ఉండగా జ్ఞానము మీద ఆసక్తిలేని అర్జునునికి గీతను చెప్పాడు. అలా చెప్పాడంటే అన్నీ ముందే తెలిసిన కృష్ణుడు అలా చెప్పడమే మంచిదని తలచి చెప్పి వుంటాడు. అలాగే బోయవానికి కూడా చెప్పియున్నాడు. జరుగబోవు కాలములో ఏమి జరుగును అని కృష్ణునికి తెలియును. అందువలన అన్నిటినీ ఆయన తెలిసే చేశాడని చెప్పవచ్చును. ఆ జన్మ అయిపోయిన తర్వాత మూడువేల సంవత్సరములకు తానే ఏసుగా వస్తానని కృష్ణునికి తెలుసు. ఆ రహస్యమును బోయవానికి చెప్పినా, అది బయటికి పొక్కదని కూడా తెలుసు. తర్వాత చివరికి ఆ రహస్యము ఎవరికి తెలుస్తుందో
కూడా ఆయనకు తెలుసు. ఐదువేల సంవత్సరములకు తన మాట క్రొత్తగా తెలిసినపుడు తెలిసినవారు గ్రంథ రూపములోనికి ఈ విషయమును వ్రాస్తారని కూడా తెలుసు. కృష్ణుడు చెప్పిన రహస్యము ఏసు వచ్చి పోయిన తర్వాత తెలియడమే మంచిదని కృష్ణుడు అనుకొన్నాడు. కృష్ణుడు స్వయముగా ఏసుగా జన్మించి అక్కడ కూడా తాను ఎంతటివాడైనదీ, ఎవరైనదీ, ఎవరి అంచనాకు కూడా దొరకకుండా చేశాడు. అలా చేయుటకు కారణము ఏమనగా! కృష్ణ, ఏసు పాత్రలలో కేవలము దైవధర్మములను చెప్పిపోవడమే అక్కడి ఉద్దేశము. అక్కడ ఆయన ఎవరనునది తెలియుట అవసరము లేదు.
జరిగిపోయినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి తెలిసిన కృష్ణుడు తాను ఎవరైనది కేవలము జ్ఞానులకు, యోగులకు మాత్రమే తెలియాలనీ, అజ్ఞానులకు ఏమాత్రము తెలియకూడదనుకొన్నాడు. అందువలన కృష్ణుడు ఎవరో, అజ్ఞానులైన వారికి ఎవరికీ తెలియకుండా పోయినది. కృష్ణుడు తన పథకమును జ్ఞానులకు, యోగులకు మాత్రము తెలియునట్లు చేశాడు. జ్ఞానులకు, యోగులకు ఏసుగా రాకముందే తెలిస్తే జ్ఞానుల వలన, యోగులవలన తన పనికి ఆటంకమేర్పడునని, తాను రచించుకొన్న పథకము ప్రకారము ఏసుగా తన జీవితము సాగదని తెలిసి, ఏసు పోయిన తర్వాత రెండువేల సంవత్సరములకు తన జన్మల రహస్యమును తెలియునట్లు చేశాడు. అలా చేయుట వలన కృష్ణునికి మూడవరాక, ఏసుకి రెండవ రాక అయిన ఆదరణకర్త విషయము జ్ఞానులకు, అజ్ఞానులకు తెలిసినా ఫరవాలేదనుకొన్నాడు. కృష్ణుని మొదటి రాకలో ఆయన గొప్ప ధనికుడుగా వచ్చాడు. ఆయనకు రెండవ రాకలో ఏసు చాలా బీదవాడు, కట్టుకొనే
దానికి రెండవ వస్త్రము కూడా లేనివాడు. కృష్ణుడు బంగారు ఆభరణములు ధరించి పట్టువస్త్రములు కట్టినవాడు, ఏసు జన్మలోనున్నపుడు నూలువస్త్రము కూడా సరిగాలేనివాడుగా కనిపించాడు. ఇక మూడవ అవతారములో ఎవరికీ తెలియకుండునట్లు ధనికుడుకాక, బీదవాడుకాక మధ్య రకముగా ఉండునని తెలియుచున్నది.
భగవంతుడి మొదటి జన్మయందు కృష్ణుడు అర్జునునికి చెప్పిన భగవద్గీతలో తాను దేవుడనని ప్రకటించుకొనినా, విశ్వరూపమును చూపినా దానిని ఎవరూ నమ్మకుండునట్లు ప్రవర్తించాడు. రెండవ జన్మ అయిన ఏసుగా వచ్చినపుడు తాను దేవుడు పంపగా వచ్చిన దేవుని కుమారుడనని ఒక ప్రక్క చెప్పుచూనే, మరొక ప్రక్క తాను దేవుడు ఇద్దరము ఒక్కటేనను సత్యమును చెప్పాడు. మూడవరాక అయిన ఏసు చెప్పిన ఆదరణకర్త తాను దేవుడనని కానీ, దేవుడు పంపగా వచ్చిన వాడననిగానీ ఏమాత్రము చెప్పకుండ సాధారణ వ్యక్తిగానే ప్రకటించుకొనును. సాధారణ వ్యక్తిగానున్న ఆదరణకర్తను కనుగొనుటకు వీలుకాదు. కానీ కృష్ణుడు ఆయన పేరును గురించి చెప్పాడు, మూడవ వాడు “ఆదర్శకర్త” అను పేరుతో చలామణి అగునని చెప్పుట వలన మూడవ అవతారమును గుర్తించుటకు అవకాశము గలదు. దైవ ధర్మములను తెలుపు సుదీర్ఘకార్యము మూడవ రాకతో అయిపోవును. మూడవ రాకతో దైవమార్గములో అంతవరకు తెలియని విధానమంతయు తెలియబడును. దైవధర్మములలో అతి చిన్న సూత్రములు కూడా తెలియబడును. అట్లు తెలియబడడమే కాక మూడవరూపములో వచ్చిన భగవంతుడు తన మొదటి జన్మ అయిన కృష్ణావతారముతో తెలిపిన ధర్మములను, రెండవ జన్మ అయిన ఏసు అవతారములో చెప్పిన వాక్యములను, తన మూడవ జన్మలో వివరించి చెప్పును. మూడవ జన్మతో
దైవధర్మములను తెలుపు కార్యము ముగియుచున్నది. అంతవరకు ఏమి తెలియకుండినా తెలియ చెప్పవలసిన బాధ్యత మూడవ జన్మలోనే ఉన్నది.
ఐదువేల సంవత్సరముల పూర్వము భగవద్గీతను చెప్పినా, అది వ్యాసుని చేత సంస్కృతములో వ్రాయబడినా, వ్యాసుడు వ్రాసిన దానిని ఎందరో పండితులు, స్వాములు తమ తమ భాషలలోనికి మార్చి వివరించి వ్రాసినా, కృష్ణుడు మూడవ అవతారముగా వచ్చు వరకు దాని నిజార్థము ఎవరికీ తెలియదు. అంతవరకు అందరూ చెప్పుకొన్నది కృష్ణుడు చెప్పిన భావము కాదు. ఎంత పెద్ద పేరుపొందిన స్వామీజీలు చెప్పినా, వ్రాసినా “దేవుని ధర్మముల వాస్తవ భావము దేవునికే తెలుసు మనుషులకు తెలియదు” అను సూత్రము ప్రకారము భగవద్గీత సరిగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఈ మాటతో స్వామీజీలందరు నాకు వ్యతిరేఖులై పోతారని తెలుసు. అయినా సూత్రము ప్రకారము చెప్పుచున్నానని, ఎవరినీ కించపరచుటకు కాదని గ్రహించవలెను. భగవద్గీత పుట్టి ఐదువేల సంవత్సరములైనా, అది మనకు అర్థము కాలేదని ఒప్పుకోక తప్పదు. భగవద్గీత అర్థము కావాలంటే తిరిగి కృష్ణుడే వచ్చి, ఆనాడు ఏ భావములో చెప్పాడో ఆ భావమును వివరించి చెప్పితే, అప్పుడు భగవద్గీత యొక్క భావము తెలియును. అందువలన కృష్ణుడు మూడవ అవతారములో, మూడవ పురుషునిగా వచ్చినపుడు గీతను సంపూర్ణముగా తెలియజెప్పును. కృష్ణుడు చెప్పిన మాటను కృష్ణుడే వివరించి చెప్పితే అప్పుడు అర్థమగును తప్ప వేరేవారు ఎవరు చెప్పినా చెప్పువారికి కూడా తెలియదనే చెప్పవచ్చును. కావున అది మనకు కూడా తెలియదు.
రెండవ అవతారమైన ఏసు జన్మలో తాను చెప్పినదంతా చెప్పి చివరిలో ఇలా అన్నాడు. “ఇప్పుడు నేను చెప్పినది మీకు ఎవరికీ అర్థము కాదు. నా తర్వాత వచ్చు ఆదరణకర్త నేను చెప్పిన విషయములను తీసుకొని వివరించి చెప్పును. అప్పుడు మీకు నా మాటలు అర్థమవును” అన్నాడు. కృష్ణుడు ఏసుగానున్నపుడు చెప్పిన ఈ మాటను బట్టి రెండు వేల సంవత్సరముల నుండి ఏసు చెప్పిన మాటలు అర్థము కాలేదని తెలియు చున్నది. కృష్ణుని మూడవ అవతారములోనే ఏసు చెప్పిన మాటలు కూడా వివరించి చెప్పబడును. అప్పుడు ఏసు ఎవరో, ఆయన చెప్పిన మాటలు ఏమిటో, ఆయన మాటలకు భావము ఏమిటో తెలియును. అంతవరకు మేము బోధకులము అని ఏసు పేరును చెప్పుకొనుచు, ఆయన బోధలను వివరించినా, ఏసు చెప్పినట్లు ఆదరణకర్త చెప్పువరకు అర్థముకావు. ఏసు మాటప్రకారము ఆదరణకర్త ద్వారానే ఏసు చెప్పిన మాటల వివరము ఏమిటో తెలియును. కానీ అంతవరకు ఏ బోధకుడు చెప్పినా అర్థము కావు. అట్లు అర్థమైనాయంటే ఏసు మాట అసత్యమగును. ఏసు మాట ఎప్పటికీ అసత్యముకాదు. కావున మనకు ఇంతవరకు ఏసు చెప్పిన మాటలు ఎంత విలువైనవో అర్థము కాలేదని ఒప్పుకోవడము మంచిది.
ఏసు చెప్పిన మాటలేకాదు, కృష్ణుడు చెప్పిన గీత కూడా అర్థము కాలేదని ఒప్పుకోక తప్పదు. మనకు ద్వాపరయుగములోని గీత, కలియుగములోని ఏసు వాక్యములను వివరించి చెప్పుటకే మూడవ అవతారమున్నదని తెలియవలెను. మూడవ అవతారములో కృష్ణుడు, ఏసు కలిసివున్నారు. కావున కృష్ణుని మాటకు కృష్ణుడు, ఏసు మాటలకు ఏసు మూడవ పురుషుని నుండి వివరించి చెప్పగలరని అనుకోవచ్చును. మూడవ వాడు అలా గతములోని వాక్యములకు వివరమును చెప్పుచూ, సందర్భాను
సారము తాను చెప్పవలసిన దానిని కూడా చెప్పుచూ పోవును. ఒకవైపు గతములో తానే చెప్పిన గీతకు, వాక్యములకు సరియైన భావమును తెలియజేస్తూ మధ్య మధ్యలో అంతవరకు మిగిలిపోయిన ధర్మములను, సృష్ట్యాదినుండి తెలియని క్రొత్తగానున్న ధర్మముల వివరమును తెలియజేస్తూ పోవును. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అది ఏమనగా! మూడవ అవతారములో కృష్ణుడు, ఏసు కలిసి ఉన్నారు. గతములో కృష్ణుడు చెప్పిన మాటకు కృష్ణుడు, ఏసు చెప్పిన మాటలకు ఏసు మూడవ అవతారము నుండి చెప్పునన్నారు. ఒక మనిషిలో రెండు దయ్యాలు దూరుకొని వుండి మాట్లాడినట్లు మూడవ అవతారమైన మనిషిలో దయ్యాలవలె కృష్ణుడు, ఏసు ఇద్దరు ఉన్నారా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మీకు సులభముగా అర్థమగుటకు మేము అలా చెప్పాము. కానీ మూడవ అవతారములో ప్రత్యేకించి కృష్ణుడు, ఏసు ఉండరు. ద్వాపర యుగములో ధర్మ ప్రచార నిమిత్తము దేవుని నుండి భగవంతునిగా ఏ శక్తి కేటాయించ బడిందో, ఆ శక్తియే రెండవమారు పుట్టింది. అప్పుడు గుర్తింపుకొరకు ఆ శరీరమునకు ఏసు అని పేరు పెట్టబడింది. పాలవాడు బ్రాహ్మణ వీధిలోనికి పోయి శంకరయ్య అను తన పేరును శంకరశాస్త్రి అని మార్చుకొని పాలను అక్కడ అమ్మినట్లు, కృష్ణుడే ఇజ్రాయెల్ దేశమున తన పేరును ఏసుగా చెప్పుకొని ధర్మములను తెలియజెప్పాడని గ్రహించవలెను. అలా పేరును మార్చుకొని చెప్పిన శక్తి అయిన కృష్ణుడే, మూడవ అవతారములో “ఆదర్శకర్త” అను పేరును పెట్టుకొని వస్తాడని ద్వాపరయుగములో చివరి సమయములో బోయవానికి చెప్పి పోవడము జరిగినది. ఏసుగానున్నపుడు “ఆదరణకర్త” వస్తాడని చెప్పిన కృష్ణుడు మొదట ద్వాపరయుగములో బోయవానికి చెప్పినపుడు వచ్చే మూడవ వాడు “ఆదర్శ కర్త” అను పేరు కల్గివుంటాడని
చెప్పాడు. ఇక్కడ ఆదరణకర్త, ఆదర్శకర్త అను రెండు పేర్లు కనిపిస్తున్నవి. చెప్పినవాడు ఒకే శక్తి (ఒకే వ్యక్తి) అయినపుడు రెండు పేర్లు చెప్పడమేమిటి? ఏది నిజమని నమ్మాలి? అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా!
ఈ ప్రపంచమును, అందులోని జీవరాసులను సృష్టించిన దేవుడే సాక్ష్యాత్తూ భగవంతునిగా అవతరించినపుడు, తన మూడు అవతారములలో ఒక దానిలో ఒక పేరును చెప్పి, రెండవ దానిలో మరొక పేరును చెప్పడ మేమిటి? అని నా బుద్ధికి కూడా మీకు వచ్చిన ప్రశ్నే వచ్చింది. మీకు బాగా అర్థమగుటకు శరీరములో ప్రశ్న ఎలా పుట్టుచున్నది. దానికి జవాబు ఎలా వస్తున్నదో, శరీరము లోపల జరుగు దానిని వివరిస్తూ చెప్పుకొందాము. నాలోని బుద్ధి రెండు పేర్లు ఎందుకు చెప్పాడని ఒక ప్రక్క ప్రశ్నించింది, అదే బుద్ధే దేవుడు నిజమే చెప్పుతాడు అబద్దము ఎందుకు చెప్పుతాడని మరొక ప్రక్కనుండి జవాబు చెప్పింది. నేను నా బుద్ధికి ప్రక్కన వుండి చూస్తున్నాను. నా బుద్ధి ఒక ప్రక్క ప్రశ్నవేసింది. మరొక ప్రక్క జవాబు చెప్పింది. తర్వాత వెంటనే బుద్ధి మరొక ప్రశ్నను ప్రశ్నించింది. నీవన్నట్లు దేవుడు నిజమే చెప్పితే ఏదో ఒక దానిని చెప్పవచ్చును కదా! బుద్ధియే ఇలా జవాబు చెప్పుచున్నది. అలా రెండు పేర్లు చెప్పుటకు కారణము ఉంటుంది. దానికి నా బుద్ధియే మళ్ళీ అడిగింది. ఆ కారణమేదో చెప్పు లేకపోతే భగవంతుడు చెప్పింది తప్పు అని ఒప్పుకో అన్నది. ఆ మాటకు భగవంతుడు తప్పు చెప్పునా ఎప్పటికీ చెప్పడు. అలా రెండు పేర్లు చెప్పడానికి కారణమును చెప్పుతాను విను అని బుద్ధి బుద్ధికే చెప్పింది. నేను గమనిస్తుండగా నా ప్రక్కనున్న బుద్ధి రెండు రకములుగా ప్రశ్న జవాబుగా మాట్లాడుకోవడము జరిగింది. నా ఒక్కనికే కాదు ప్రతి శరీరములోను బుద్ధి రెండు రకములుగా ప్రతి విషయమును విడదీయును. ప్రస్తుతానికి నా శరీరములో నేను నా
చూస్తుండగా నా బుద్ధి భగవంతుడు రెండు పేర్లను ఎందుకు చెప్పాడో దానినే బయటికి మీకు తెలియునట్లు వివరిస్తున్నాను వివరిస్తుంది. చూడండి.
భూమి మీదున్న మనుషులలో మూడు రకములవారున్నారని చెప్పవచ్చును. ఒక రకము మనుషులు దేవుని మీద విశ్వాసము కలవారు, రెండవ రకము వారు దేవుని మీద విశ్వాసములేనివారు. మూడవ రకము వారు దేవుడను విషయమే తెలియక తటస్థముగా ఉండువారు. మూడవ రకము వారు త్రవ్వేది లేదు, పూడ్చేది లేదు అన్నట్లు దేవుని గురించి ఉన్నాడనిగానీ, లేడనిగానీ మాట్లాడరు. ఎవరైనా దేవుడున్నాడని చెప్పినా వింటారు. అంతేకాని తర్వాత ఆ మాటను పట్టించుకోరు. దేవుడు లేడని చెప్పే వారి మాటలను కూడా వింటారు. కానీ ఆ మాటలను కూడా పట్టించుకోరు. మేము అలాంటి వారిని చాలామందిని చూచాము. మంచి జ్ఞానముగల గ్రంథములను వారికి ఇచ్చాము. ఇస్తే తీసుకొంటారు కానీ వారు చదువరు. వారు చదువరని తెలిసి, మనమే జ్ఞానమును అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పాలని చెప్పితే వింటారు. కానీ విన్నదానికి ఏమాత్రము స్పందన ఉండదు. అటువంటివారు ఎవరు చెప్పినా వింటారు. కానీ వారిలో మార్పు ఉండదు. అటువంటి మనుషులందరినీ ఒక రకముగా చెప్పవచ్చును. అటువంటి వారు భూమిమీద ఎక్కువ శాతము మంది ఉన్నారు. వారి దారిలో వారు పోవడము తప్ప వారు ఎవరి దారికీ రారు. మిగతా మనుషులలో కొందరు దేవుని మీద విశ్వాసము గలవారు గలరు. అయితే వారికి దేవుని మీద విశ్వాసము ఉండినా, అందరూ ఒకే దారిలో పోకుండా అనేక రకములుగా వారు దేవున్ని ఆరాధిస్తున్నారు. వారిలో కొందరిది మంచి మార్గము కావచ్చు, కొందరిది అంత మంచి మార్గము
కాకపోవచ్చు. ఇట్లు విశ్వాసుల రకమే కాకుండా, అవిశ్వాసము గలవారు కూడా భూమిమీద కొందరున్నారు. వారే పూర్తి నాస్తికులు, అటువంటి వారు పూర్తిగా దేవుడే లేడనుచుందురు.
స్థూలమైన ప్రపంచ చదువులు చదివిన కొందరు, తమకు కొద్ది మాత్రము విజ్ఞానము తెలిసినంత మాత్రమున, విజ్ఞానమంతా తెలిసి పోయిందను భ్రమలో మునిగిపోయి, చివరకు దేవుడే లేడనుచుందురు. ‘దేవుడు” అనుమాట కేవలము కొందరి భ్రమయేనని చెప్పుచుందురు. అన్నీ తామే చేసుకొంటున్నామని, మనము కనుగొన్న యంత్రముల చేత పరికరముల చేత మనము సుఖములను అనుభవిస్తున్నామని చెప్పు కొంటున్నారు. మన మేథస్సు చేత ఎన్నో కనుగొన్నాము, తర్వాత ఎన్నో కనుగొంటాము అని చెప్పచూ, ఈ దినము సెల్ఫోన్లో మాట్లాడుచున్నా మన్నా, కంప్యూటర్ల చేత పనిని చేయిస్తున్నామనినా, విమానములో క్షణాలలో గమ్యమును చేరుచున్నామనినా ఇదంతయూ మనిషి కనుగొన్న సైన్సు వలన జరుగుచున్నది. సైన్సును తెలియని మనుషులు తమను తాము నమ్మక దేవున్ని మూఢముగా నమ్ముచున్నారని చెప్పుచూ, దేవున్ని నమ్మువారిని తెలివి తక్కువ వారిగా భావించుచుందురు. దేవున్ని అసూయతో మాట్లాడు చుందురు. ఇటువంటి వారిని గురించి ఒక ఉదాహరణను చెప్పుకొందాము. ఒకడు తన తమ్మునికి నీతిని చెప్పుచు నేను వేరొకరి మీద ఆధారపడి బ్రతుకడము లేదు, నా కాళ్ళమీద నేను నిలబడి బ్రతుకుచున్నాను. నీవు అలాగే నీ కాళ్ళ మీద నిలబడు అన్నాడట. ఆ మాటను విన్న వాని తమ్ముడు నీవు నీ కాళ్ళ మీద నిలబడలేదు, నేను నా కాళ్ళ మీద నిలబడలేదు. ఇద్దరము కలిసి భూమిమీద నిలబడినామని
అన్నాడట. తమ్ముడు తెలివి తక్కువవాడని అన్న తమ్మునికి తెలివిగా నీతిని చెప్పాడు. కానీ తమ్ముడు అడిగిన మాటను బట్టి అన్నయే తెలివి తక్కువవాడని తెలియుచున్నది. నా కాళ్ళ మీద నేను నిలబడినానను కోవడము కేవలము భ్రమ మాత్రమే. అట్లు అనుకొనువాడు తాము ముందునుండి భూమిమీద నిలబడినానను మాటను మరచి పోయాడు. దీని ప్రకారము విజ్ఞానము తెలిసినవాడు తమ విజ్ఞానమునకు ఆధారమైన మెదడును దేవుడే ఇచ్చాడని, దేవుడిచ్చిన మెదడు లేకుండా ఎవడూ విజ్ఞానికాడని, శరీరములోని మెదడే సమస్త విజ్ఞానములకు ఆధారమని తెలియక, నేను విజ్ఞానినని అనుకోవడము నేలను విడిచి సాము చేసినట్లగును. అలాగే భూమిమీద నిలబడిన విషయమును మరచిపోయి నా కాళ్ళ మీద నేను నిలబడినాను అన్నట్లుంటుంది.
సమస్త జ్ఞానమునకు, విజ్ఞానమునకు దేవుడే ఆధారమని తెలియక, మేము విజ్ఞానులమనుకొను వారి మెదడులోని ఆలోచనలను, ఊహలను దేవుడే అందిస్తుండగా, ఏ శాస్త్రజ్ఞుడు ఏది కనిపెట్టినా అతనికి ఆ ఊహను అందించిన వాడు శరీరములోని దేవుడే అయివుండగా, అది తెలియక నేనే కనుగొన్నాననుకోవడము, భూమిని వదలి తన కాళ్ళమీద తాను నిలబడినా నని చెప్పినట్లుంటుంది. అటువంటి వాడు తమ మేథస్సుకు తామే కారకులమను అహముతో నిండినవాడై, తమ శరీరములోని దేవున్ని కూడా నిందించుచున్నారు. నాకు తెలియకుండా నాలో ఎవడున్నాడని ప్రశ్నించు చుందురు. అటువంటి వారిని గురించి కృష్ణుడు భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము అను అధ్యాయమున 18వ శ్లోకమందు ఇలా అన్నాడు.
శ్లో॥ 18.
అహంకారం బలం దర్పం కామం కోధంచ సంశ్రితాః | మా మాత్మ పరదేహేషు ప్రద్విషన్తో భ్య సూయకాః ॥
భావము :- “అటువంటి వారిలో అహంకారము పూర్తిగ ఉండగా కామము, క్రోధము, గర్వము బలముగా పనిచేయగా, తమ శరీరములలోను మరియు ఇతరుల శరీరములలోను ఉన్నటువంటి నన్ను అసూయతో ద్వేషించు చున్నారు.” అని కృష్ణుడు చెప్పాడు. అటువంటి వారిని తాను ఏమి చేయునో కూడా ప్రక్క శ్లోకములలో చెప్పాడు.
20 శ్లో॥
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ । క్షిపా మ్యజస్ర మశుభా నాసురీ స్వేవ యోనిషు ॥
ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని | మా మప్రా స్ట్యైన కౌక్తేయ! తతోయాన్యధమాం గతిమ్ |
భావము : “కౄరులు, ద్వేషులు, శుభమును దూషించు ఆ నరాధములను అసుర యోనులయందే త్రోసి, సంసార దుఃఖగతులను పొందునట్లు చేయుదును. అట్లు అసుర యోనులందు జన్మించినవారు జన్మ జన్మకు అజ్ఞానులగుచు, నన్ను పొందు జ్ఞానము యొక్క విధానమే తెలియలేరు. అటువంటివారు జన్మ జన్మకు అధమగతిని పొందుచుందురు. వారికి నా జ్ఞానము యొక్క గట్టే దొరకదు" అని కృష్ణుడు నాస్తికవాదులను గురించి ముందే చెప్పాడు.
దేవుని మీద ఎటువంటి నమ్మకము లేకుండా దేవున్ని దూషించు వారు, దేవుని స్థాయిని కించపరుస్తూ మాట్లాడువారు, అన్ని పనులకు తమ తెలివి తప్ప దేవుని ప్రమేయము లేదనువారు, విజ్ఞానము (సైన్సు)ను అడ్డము
పెట్టుకొని సైన్సుకు ఆధారమైన దేవున్ని లేడనువారు ఎవరయితే ఉన్నారో, అటువంటి వారు ఎప్పుడైనా దేవుని జ్ఞానమేమిటో చూడాలనుకొనినా, వారికి తన జ్ఞానము యొక్క గట్టు దొరకకుండా చేస్తానని దేవుడే చెప్పాడు. నేటికాలములో దైవజ్ఞానము ఎన్నో గ్రంథరూపములలో మరియు దృశ్య రూపములైన డి.వి.డి లలోను దొరుకుచున్నది. అటువంటపుడు జ్ఞానమును తెలుసుకొనుటకు గురువు దగ్గరకు పోనవసరములేదు. దేవుడు నా జ్ఞానము మీకు దొరకదు అనినా, అది బజారులో డబ్బు పెట్టితే గ్రంథరూపములలో, దృశ్యరూపములలో దొరుకుచున్నది కదా! అని కొందరు తెలివైనవారు అనుకొనుచున్నారు. మేము గురువు దగ్గరకు పోకున్నా ఆయన జ్ఞానము మా ఇంటికే వస్తావుంది, మాకు జ్ఞానము తెలుస్తావుంది అనుకొను వారు కలరు. దేవుని మీద విశ్వాసము లేనివారికి, జ్ఞానము మీద శ్రద్ధ కలిగినా, గురువు మీద విశ్వాసము లేనివారికి గురువు యొక్క జ్ఞానము మీద శ్రద్ధ కలిగినా, ఆ జ్ఞానము గ్రంథరూపములలో దొరికినా గ్రంథములోని జ్ఞానము తలలోనికి ఎక్కదు. అది ఎందుకు ఎక్కదు అనగా! తెలియబడే జ్ఞానములో అనేక సంశయములు ఏర్పడి జ్ఞానము అర్థము కాకుండాపోవును. ఒకవేళ అర్థమైనా, దాని అనుభవము లేక ఆచరణ వారిలో లేకుండా పోవును. ఇట్లు రెండు రకములుగా జ్ఞానము వానికి అంటకుండా పోవుచున్నది.
ఇపుడు అసలు విషయానికి వస్తాము. పరమాత్మ శక్తి భగవంతునిగా భూమిమీదికి వచ్చినపుడు దాని కార్యము పూర్తి అగుటకు మూడుమార్లు భగవంతుడు అవతరించాలనుకొన్నాము. మొదటి అవతారముగా వచ్చిన వాడు కృష్ణుడు. రెండవ అవతారముగా వచ్చినవాడు ఏసు, తర్వాత మూడవ అవతారము వస్తుందని మొదటి అవతార కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు మూడవ అవతారమును గురించి “ఆదర్శకర్త” అను పేరును చెప్పాడు.
ఏసు రెండవ అవతారమును గురించి “ఆదరణకర్త” వస్తాడని చెప్పాడు. ఈ విధముగా కృష్ణుడు, ఏసు రెండు వేరు వేరు పేర్లను చెప్పడము వలన కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒకటికాదు అని తెలిసిపోవును. ఇద్దరు ఒకటైతే మూడవ అవతారమును గురించి వేరు వేరు పేర్లను ఎందుకు చెప్పుదురను ప్రశ్నవచ్చును. ప్రత్యక్షముగ ఏసు, కృష్ణుడు వచ్చే వ్యక్తి పేరును వేరువేరుగా చెప్పుట వలన, చెప్పిన వీరు ఇరువురు ఒకటికాదని నిరూపణగా తెలిసిపోవు చున్నది. అలా కృష్ణుడు, ఏసు వేరు వేరని ఆధారముతో తెలియడము వలన అజ్ఞాన ద్వారము తెరుచుకొన్నట్లే, జ్ఞాన ద్వారము మూసుకొన్నట్లే అగుచున్నది. దీనినిబట్టి అవిశ్వాసులకు, నన్ను దూషించు అసూయవరులకు నా జ్ఞానము లభించదు అనుమాట ఇక్కడ జ్ఞాపకము వస్తున్నది. 'దేవుని మీద అసూయ కల్గి జ్ఞానము మీద ప్రేమకల్గినంత మాత్రమున వారికి జ్ఞానము లభించదు' అను వాక్యము ఇటువంటి చోట నెరవేరుతుందని అర్థమగుచున్నది. వాస్తవముగా కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒకటేనని చెప్పుకొంటూ, మనము ఎన్నో ఆధారములను చూపుకొంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు కృష్ణుడు, అటు ఏసు అదే పనిగా ఇద్దరూ రాబోవు వానిని గురించి వేరువేరు పేర్లను చెప్పారు. ఇక్కడ అలా చెప్పవలసిన పని ఏమొచ్చింది అని యోచిస్తే, అవిశ్వాసులకు తమ జ్ఞానము దొరక కూడదని, వారికి వీరి మీద అనుమానము వచ్చి వారు ఇద్దరు ఒకటికాదని నిర్ణయించుకొనుటకు అలా పేర్లను ముందుగా చెప్పారని తెలియుచున్నది. కృష్ణుడు మేథావి అగుట వలన, తనకు ఇష్టము లేనివారిని దూరము చేయుటకు అల్లిన పథకమే మూడవవాని పేరును రెండు రకములుగా చెప్పడమని అర్థమగుచున్నది. ఈ పేర్లు అజ్ఞానులకు, అవిశ్వాసులకు తప్ప జ్ఞానులకు, విశ్వాసులకు అవసరములేదు.
మూడవ అవతారముగా రాబోవు వాడు ఆదర్శకర్త అయినా, ఆదరణ కర్త అయినా సృష్ఠికర్తలోని భాగమే అగును. ఆదరణకర్త, ఆదర్శకర్త అను పేర్లు అజ్ఞానుల కొరకు కృష్ణుడు, ఏసు తెలివిగా చెప్పారు. అజ్ఞానులకు అనుమానము వచ్చుటకు, ఆ అనుమానము పెనుభూతమై జ్ఞానమార్గము నకు ఆటంకమేర్పరచుటకు ఉద్దేశపూర్వకముగా కృష్ణుడు, ఏసు రెండు పేర్లను చెప్పారు. ఆ పేర్లు అజ్ఞానుల మీద ప్రభావము చూపును, జ్ఞానులు ఆ పేర్ల మాయలో చిక్కుకోకుండా ఒక నిర్ణయానికి వస్తారు. కృష్ణుడు, ఏసు చెప్పిన రెండు పేర్లను ఏక పేరుగా మార్చుకొంటారు. అదెలా అనగా! కృష్ణుడు చెప్పిన “ఆదర్శకర్త" లోనూ, ఏసు చెప్పిన “ఆదరణకర్త” లోనూ సమానముగానున్న అక్షరములు, సమానముగా లేని అక్షరములు గలవు. రెండిటిలోను సమానముగానున్న అక్షరములు ఆ... కర్త, రెండిటియందు సమానముగా లేనివి దర్శ, దరణ. రెండు పేర్లలోను సమానముగా లేని అక్షరములను తొలగించి చూస్తే రెండిటియందు “ఆకర్త” మాత్రము మిగులును. దీనిప్రకారము జ్ఞానులైనవారు మూడవ అవతారములో వచ్చువానిని “ఆకర్త” అను పేరుతో చెప్పుకుంటే సరిపోతుంది. “ఆకర్త” అను పదము కృష్ణుడు చెప్పిన దానికి, ఏసు చెప్పిన దానికి సరిపోవును. రెండు పేర్లను వడపోస్తే వచ్చినది “ఆకర్త” ఇక ఆయనవస్తే ఎట్లుంటుందో?
మూడవ అవతారము కృష్ణుని లెక్కలో “ఆదర్శకర్త", ఏసు లెక్కలో “ఆదరణకర్త” ఇప్పటినుండి మా లెక్కలో “ఆకర్త”. కృష్ణుడు, ఏసు ఇద్దరు చెప్పిన రెండు పేర్లలోను దర్శ, దరణ అను శబ్దములను తీసివేస్తే మిగిలినది ఆకర్త. కావున ఆకర్త అను పేరు ఇద్దరు చెప్పిన దానికి సంబంధించినదేనని అనుకోవలెను. భగవంతుని మూడవరాకలో ఒకమారు దైవ ధర్మముల
ప్రచార కార్యము పూర్తి అగును. దీనినిబట్టి “దేవుడు మూడు ఆత్మలుగా (జీవాత్మ, ఆత్మ, పరమాత్మలుగా) ఉన్నాడు.” అని తెలియుచున్నది. “భగవంతుడు మూడు (కృష్ణ, ఏసు, ఆకర్త) అవతారములుగా ఉన్నాడు." అని తెలియుచున్నది. "మనిషి మూడు మాయలు (తామస, రాజస, సత్వగుణములు) గా ఉన్నాడు.” అని తెలియు చున్నది.
మూడు మాయలలో చిక్కుకొన్న మనిషికి దైవ ధర్మములను తెలుపుటకు, మూడు అవతారములుగా భగవంతుడు వచ్చి, మూడు ఆత్మల త్రైతమును (భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16,17 శ్లోకముల భావమును) తెలుపుచున్నాడు. అందువలన భగవంతున్ని ఒక అవతారము నకు పరిమితి చేయకూడదు. రెండు మూడు వేల సంవత్సరముల తేడాతో ఆయన మూడు అవతారములు అయిపోవును. ఆ లెక్క ప్రకారము ఐదు ఆరు వేల సంవత్సరములలోనే భగవంతుని మూడు రాకలు ఒకమారు అయిపోవును. అలా ఒకమారు మూడు రూపములతో వచ్చిన భగవంతుడు ప్రతిష్ఠించిన ధర్మములు దాదాపు పది యుగముల కాలమునకు తిరిగి అధర్మములుగా మారవచ్చును. అప్పటికి తిరిగి భగవంతుని అవసరము ఏర్పడవచ్చును. ప్రస్తుతము ధర్మప్రతిష్ఠాపన కార్యక్రమములో భగవంతుని రెండు అవతారములు వేరువేరు దేశములలో, వేరువేరు పేర్లతో, వేరువేరు మతములయందు వచ్చి పోయినవి. ఇక మిగిలినది కృష్ణుడు చెప్పిన ఆదర్శకర్త, ఏసు చెప్పిన ఆదరణకర్త, మేము చెప్పిన ఆకర్త యొక్క అవతారము. మూడవ అవతారము ముఖ్యమైనదిగా ఉంటుంది. ఎందుకనగా! కృష్ణుడు గీత రూపములో చెప్పిన జ్ఞానము గానీ, ఏసు వాక్యము రూపములో చెప్పిన జ్ఞానముగానీ ఇంతవరకు ఎవరికీ అర్థము కాలేదు.
అర్థము కాలేదు అని చెప్పుటకు ఆధారము ఆ రెండు జ్ఞానములు రెండు మతములుగా మారిపోయినవి. మతము ఎప్పటికీ దేవున్ని తెలుపలేదు. దేవుడు చెప్పిన జ్ఞానము, మతము నీడలో ఎప్పటికీ అర్థము కాదు. అందువలన “మతాభిమానులు ఎప్పటికీ జ్ఞానాభిమానులు కాలేరు” అను సూత్రము ప్రకారము, ఏ మతములోనైనా మతమును గురించి గొప్పగా చెప్పుకొను వాడుకానీ, మతవ్యాప్తి చేయాలనుకొను వాడుగానీ, దేవుని జ్ఞానమును తెలియలేడు.
భగవంతుడు రెండుమార్లు భూమిమీదకు వచ్చి దైవధర్మములను రెండు దేశములలో తెలిపిపోయినా, ఇప్పటికి కూడా వాటి సారాంశము తెలియబడలేదు. మతముల ప్రభావము ఎక్కువగావున్న ఈ కాలములో, దైవముకంటే ధనమునే ఎక్కువ విలువగా చూచు ఈ కాలములో, భగవంతుని మూడవ రాక రావలసియున్నది. భగవంతుని మూడవ రాకలో భగవంతుడు ఎక్కువ మతఛాందస్సులతో ఇబ్బందులు పడవలసి వస్తుంది. అంతేకాక ఇంతవరకు మిగిలిపోయిన ధర్మములను కూడా తెలుపవలసియున్నది. ఒక ప్రక్క మాయా ప్రభావముతో బాగా ప్రచారమైన, కొన్ని లక్షలమంది అభిమానమును పొందిన గురువుల మధ్యలో, వారికి వ్యతిరేఖమైన ధర్మము లను వివరించవలసియున్నది. “ఆకర్త” తెలుపు ధర్మములు ఇటు నాస్తికులకు కానీ, అటు ఆస్తికులకుకానీ మ్రింగుడుపడవు. మూడవ అవతారమైన ఆకర్త యొక్క బోధలు కొందరికి అర్థముకానివై, ఈయన దేవుడున్నాడని ఆస్తికత్వమును బోధిస్తున్నాడా? లేక దేవుడు లేడని నాస్తికత్వమును బోధిస్తున్నాడా? అని అనుకొందురు. మరికొందరు మూడవ రూపములో భగవంతుడు చెప్పు బోధలను అందుకోలేక అవగాహన లోపముతో, ఈయన
పరమతమును బోధిస్తున్నాడా? లేక స్వమతమును బోధిస్తున్నాడా? అని అర్థము కాని స్థితిలో ఆయనను గురించి చర్చించుకొందురు. బయటి గురువులను పోల్చిచూచితే వారివద్ద లక్షలమంది చేరి గొప్పగ కనిపిస్తుంటే, వారికంటే అన్నివిధముల తక్కువగా కనిపించి, జ్ఞానములో గురువుల అందరి కంటే గొప్పగా కనిపించును. దేశములోని గురువులు, గురు శిష్యులు ఏదో ఒక సాధన చేసి మోక్షమును పొందాలని ప్రయత్నము చేయుచుండగా, ఆకర్త మాత్రము దేవుని జ్ఞానమును తెలుసుకొనుట ముఖ్యమైన పని, ధ్యానము చేయుట వృథాపని అని బోధించును. భూమిమీద గురువులు వారివారి మత సాంప్రదాయములను వారు అనుసరిస్తూ, వారి శిష్యులను అనుసరించునట్లు చేయుచుండగా, ఆకర్త మాత్రము అన్ని మతములవారిని ఒకే దేవుని జ్ఞానము క్రిందికి తెచ్చి, నాది ఫలానా మతము అని చెప్పకుండ, అందరిది ఒకే మతమన్నట్లు చేయును. అన్ని మతముల వారు ఆకర్త వద్ద ఏకమతముగా ప్రవర్తించుదురు. “ఒకే జ్ఞానము, ఒకే దేవుడు” అను సూత్రమునకు కట్టుబడి యుందురు.
సృష్ఠి మొదటి కాలములో మనుషులయందు మతము అనునది లేదు. తర్వాత కాలములో మాయ ప్రభావము వలన మనిషి మేథస్సులో మతము అనునది ముఖ్య స్థానమును ఆక్రమించినది. ఆకర్త దృష్టిలో మనిషిని దేవుని మార్గమునుండి తప్పించునది మతమని, మొదట తన జ్ఞానము ప్రారంభించడములో మతమును నిర్మూలించడమే ధ్యేయముగా పెట్టుకొనును. మతము లేని మనిషిగా ఎవడు మారగలడో వాడు నావాడని ఆకర్త చెప్పును. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రాగలదు. అదేమనగా! రాబోవు భగవంతుని మూడవ అవతారము పేరు “ఆకర్త” లేక “ఆదర్శకర్త” లేక “ఆదరణకర్త” అని చెప్పుకొన్నాము. ఆకర్త రాబోతాడని మీరే చెప్పారు.
ఆకర్త వచ్చిన తర్వాత మిగిలిన ధర్మములను బోధించును, ముందు బోధించిన ధర్మములను వివరించును అన్నారు. ఇప్పుడేమో ఆయన రాక ముందే ఆయన ఈ విధముగా తన బోధలను చెప్పునని, ఈ విధముగా మతముల నుండి మనిషి దృష్టిని దేవునివైపు మరల్చునని, మతములేని మనుషులను తయారు చేయునని చెప్పుచున్నారు. ఈ విషయములన్నిటిని ఆకర్త మీకు నిద్రయందు కలలో చెప్పాడా? మెలుకువయందు చెవిలో చెప్పాడా? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నాకు ఆకర్త చెవిలో చెప్పలేదు, కలలో చెప్పలేదు. ఆకర్తగా రాబోవు కృష్ణుడు ఆకర్తను గురించి బోయవానికి కొన్ని విషయములను చెప్పిపోయాడు. ఆ విషయములనే బోయవాని ఆత్మ నాకు చెప్పగా, నేను మీకు చెప్పుచున్నాను తప్ప స్వయముగా నేను చెప్పలేదు. ఈ నా మాటలను వినిన తర్వాత కూడా బుద్ధిలో చురుకుదనము కలవారు, పెద్దగా మెదడును ఉపయోగించువారు కొందరు ఇంకొక విధముగ కూడా అడుగవచ్చును. అదేమనగా! భారత, భాగవతములలో కూడా చెప్పని బోయవాని పాత్రను నీవే కల్పించి, కృష్ణుడు బోయవానికి చెప్పాడని, బోయవాని ఆత్మ నాకు చెప్పిందని నమ్మించి మీస్వంత భావములను మాకు చెప్పుచున్నారు తప్ప కృష్ణుడు బోయవానికి చెప్పలేదు, బోయవాడు నీకు చెప్పలేదు అని నన్ను నిలదీసి అడుగవచ్చును. దానికి నా జవాబు ఏమనగా!
పూర్వము పెద్దలు, ఒక సామెతను చెప్పేవారు, “కడుపు చించు కొనినా గారడివిద్య అనే వారుంటారు.” అని పెద్దలు చెప్పిన సమత (సామెత) నాకు ఇక్కడ జ్ఞాపకము వచ్చింది. అంతేకాక “అతి తెలివి దురిత లక్షణము” అని కూడా పెద్దలనెడివారు. ఏ దానికైనా ఒక పరిమితి ఉంటే బాగుంటుంది. అందువలన గీతలో కృష్ణుడు కూడా 'మితమైన నిద్ర, మితమైన ఆహారము,
మితమైన పని' అని అన్నాడు. మితమైన పని అనగా శరీరముతో చేసేది కాదు. బుద్ధితో చేసే పనిని కూడా లెక్కించుకోవాలి. అందువలన పెద్దలు 'అతి తెలివి దురిత లక్షణము' అన్నారు. ఒక పరిమితి లేకుండా అతిగా యోచిస్తే అది చెడుకు దారితీస్తుంది. ఎంతో వివరముగా శాస్త్రబద్దముగా చెప్పుచున్నప్పటికీ చెప్పిన దానిని గురించి ఇందులో మంచివుందా, చెడువుందా అని తెలుసుకోక, నాకు తెలివివుంది అని ప్రశ్నించడము చెడుకు దారితీస్తుంది తప్ప మంచికి దారితీయదు. వాలి వాలము (తోక) దగ్గర పుట్టాడు అని రామాయణములో వ్రాస్తే ప్రశ్నించని వారు, ద్రోణుడు దొన్నెయందు (కుండయందు) పుట్టాడు అని భారతములో చెప్పితే విని ప్రశ్నించనివారు, హనుమంతుడు పర్వతమును ఎత్తుకొని వచ్చాడని వ్రాస్తే అడ్డముగా నమ్మేవారు, భీముడు గాలికి పుట్టాడు, కర్ణుడు చెవిలో పుట్టాడు అంటే వినేవారు అక్కడ ప్రశ్నించకుండా, ఆ మాటలు శాస్త్రబద్దత కాదని తెలిసినా ఊరకుండి, ఇక్కడ నేను చెప్పిన మాటలు అశాస్త్రీయము కాకున్నా ప్రశ్నించడము మంచిదా? అని అడుగుచున్నాను. ఇటువంటి సందర్భము లోనే పెద్దలు "కడుపు చించుకొనినా గారడివిద్య అనువారుంటారు” అని అన్నారు.
గారడివిద్యలో మనిషిని అడ్డముగా సగభాగానికీ రంపముతో కోసి రెండు ముక్కలుగా విడదీసి చూపుతారు. అలా చూపినపుడు మనిషి నడుము భాగమునుండి విడిపోయి రెండు భాగములుగా కనిపించును. కానీ అక్కడ రక్తము కారదు. రక్తము కారలేదంటే మనిషి రెండు ముక్కలుగా తెగి పోయాడు అన్నది అసత్యము. మనకు తెలియని పద్ధతిని ఉపయోగించి అసత్యమును సత్యముగా చూపుచున్నారు. అయినా అది అసత్యమని చెప్పుటకు అక్కడ రక్తము కారలేదు. అది నిజము కాదని, అలా చూపడము
గారడివిద్య యొక్క పనితనమని మనందరికీ తెలుసు. మనిషిని రెండు ముక్కలుగా చేయడము స్టేజి (వేదిక) మీద గారడివిద్య కావచ్చును. అదే నడి బజారులో ఒకరు ఇంకొకరిని కత్తితో రెండు ముక్కలు చేస్తే అక్కడ రక్తము కారిపోతుంది. ముక్కలైన వాడు చనిపోతాడు. అప్పుడు అది గారడివిద్య కాదు, జరిగినది సత్యమని తెలియుచున్నది. అలా జరిగిన దానిని గారడివిద్య అని ఎందుకు అనలేదనగా, ముక్కలైనవాడు చనిపోయాడు. వానినుండి రక్తము కారిపోవడము వలన వాడు చనిపోయాడు. చంపినవానిని హంతకుడు అంటాము. జరిగిన దానిని హత్య అంటాము. అప్పుడు చంపినవాడు గారడివాడు కాదు, జరిగినది గారడివిద్య కాదు. ఇన్ని విపులముగా తెలిసినపుడు, దాని ప్రకారమే శాస్త్రబద్దముగానున్న విషయములను మేము చెప్పినపుడు, మా మాటలు సత్యమా, అసత్యమా అని ఎందుకు తెలియలేదని ప్రశ్నించుచున్నాను. కొన్ని ఆధారములతో యోచిస్తే ఏది నిజమో, ఏది నిజము కాదో మీకే అర్థమవు తుంది. ఎదురుగా కనిపిస్తున్నా త్రొంగి చూడడము, నిక్కి చూడడము, ఎగిరి చూడడమునకు అర్థమే లేదు.
ఈ అధ్యాయము మొదటిలో “కృష్ణుని మరణము లోకానికి కనువిప్పు” అని మొదలుపెట్టి చెప్పాము. నరకాసురుడు చనిపోతే ప్రజలకు సంతోష మైనది. కానీ ఇక్కడ కృష్ణుడు చనిపోతే లోకానికి కనువిప్పు అని మేము చెప్పలేదు. కృష్ణుని మరణము లోకానికి కనువిప్పా? అన్నాము. దానినిబట్టి మరణ సమయములో ఏదో గొప్ప రహస్యమున్నదనీ, అది తెలిస్తే ఇంతవరకు కన్నులు మూసుకొన్నవారు కళ్ళు తెరుచుకొంటారని అర్థమవుచున్నది. ఇక్కడ ముఖ్యమైన ఘట్టము ఏమనగా! ఇంతవరకు ఏ విషయములో గ్రుడ్డిగా ఉన్నాము? ఇప్పటినుండి దేనియందు చూపుకల్గి
వుండాలి? అని ప్రశ్న వచ్చుచున్నది. మనకు ఇంతవరకు వున్న గ్రుడ్డి తనమేమిటో, అది కృష్ణుని మరణమును తెలుసుకొనుట వలన ఎలా చూపుగల్గుతుందో, అందరము తెలుసుకోవాలి. నేడున్న ప్రపంచ జనాభాలో 80 శాతము క్రైస్తవులున్నారు. రెండవస్థానమును ఆక్రమించినది ఇస్లామ్మతము. తర్వాత బౌద్ధమతము, ఆ తర్వాత హిందూమతము. హిందూమతము నేడు చివరి స్థానములో ఉన్నది. కృతయుగము, త్రేతాయుగము గడిచిపోగా ద్వాపరయుగము మొదటిలో హిందూమతము ప్రపంచ వ్యాప్తంగా ఖండాంతరముల వరకు వ్యాపించి ఉండెడిది. నేడు మనము హిందూమతముగా పిలుచుకొనునది ఆనాడు హిందూమతము అను పేరుతో లేదు. ద్వాపరయుగము మొదటి కాలములో “మతము” అనుపేరు భూమిమీదనే లేదు. అప్పటికాలములో “పథము” అను పేరుండెడిది. హిందూ అను పదము 'ఇందూ' అను పదముగా, అర్థముతో కూడుకొన్నదై ఉండెడిది. ఆనాడు ఇందూపథము అనునది ప్రపంచ వ్యాప్తముగా ఉండెడిది. ప్రపంచములోని మనుషులందరు మేము ఇందువులము అని చెప్పుకొనెడివారు. పథము అనగా మార్గము అని అర్థము ‘ఇందు’ అనగా చంద్రుడు అని అర్థము. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము జ్ఞానమునకు చంద్రుడు అధిపతియైన దానివలన, ఆ రోజు దైవ జ్ఞానము కలవారిని ఇందువులు అని చెప్పెడివారు. జ్ఞానమార్గములో నడిచేవారందరిని జ్ఞానపథములోని వారని అనెడివారు. అందువలన జ్ఞానులు మాది ఇందూ పథము అని చెప్పెడివారు. మేము ఇందువులము, మాది ఇందూపథము అని తల ఎత్తి చెప్పుకొను రోజులు పూర్వముండెడివి. కాలక్రమమున మాయా ప్రభావము ఎక్కువై పోయి, మనుషులందరు గ్రుడ్డివారై పోయి పథమును మతముగా, ఇందువును హిందువుగా మార్చుకొన్నారు.
ఒకానొకరోజు ప్రపంచ వ్యాప్తముగానున్న ఇందువులకు కేంద్ర బిందువుగా భారతదేశముండెడిది. దైవజ్ఞానము మొదట భారతదేశములోనే పుట్టింది. అది పెరిగి విశ్వవ్యాప్తమైనది. కానీ నేడు అది తరిగిపోయి చివరకు భారతదేశములో కూడా 'ఇందువు' అను పేరు కనిపించకుండా పోయినది. భారతదేశములో మిగిలిన కొద్దిమంది తమ చరిత్రను మరచి పోయి, మేము హిందువులము అని అర్థమేలేని పేరును చెప్పుకొంటున్నారు. దైవజ్ఞానమునకు సంబంధించిన ఇందువు అను పేరును వదలిపెట్టి, భౌగోళిక సంబంధమైన ఒక ప్రాంతము పేరును, ఒక నది పేరును చెప్పుకొంటూ మేము హిందువులము అంటున్నారు. “అలా చెప్పుకోవడము తప్పు. మనలను మనము తగ్గించుకొని చెప్పుకొంటున్నాము. మనది ఉన్నతమైన పేరు, ఉన్నతమైన పథము” అని మేము చెప్పినా వినే స్థితిలో లేని చెవిటివారై పోయారు. మన చరిత్ర ఇది, మనము ఇందువులము, మనది ఇందూ పథము అని మేము ఒక గ్రంథమును వ్రాసి ఉచితముగా పంచితే, మహానందిలో మేము పరమతమును గురించి ప్రచారము చేస్తున్నామని మా మీద కేసులు పెట్టి కోర్టుకు త్రిప్పుచున్నారంటే, మనది పూర్వపు ఇందూ జాతేనా అని అనుమానము రాక తప్పదు. ఇవి మన సాంప్రదాయములు అని "ఇందూ సాంప్రదాయములు” అను పేరుతో ఒక గ్రంథమును వ్రాసి విడుదల చేస్తే, ఇందూ అని పేరు పెట్టడము తప్పు అని విశ్వహిందూ పరిషత్వారు గుంతకల్లులో మామీద భౌతిక దాడులకు పూనుకోవడము పర మతముల ముందర సిగ్గుచేటు కాదా! అడిగితే వివరముగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పుతామనినా వినకుండా, మేము వ్రాసిన “త్రైత సిద్ధాంత భగవద్గీత” ను చూపించినా, ఆ భగవద్గీతను నడి బజారులో హిందూ సమాజమువారే నిప్పుపెట్టి కాల్చారంటే, పూర్వమున్న ఇందువుల ఆత్మలు ఆ దృశ్యమును చూచి వారిని శపించకుండా వదలరనిపిస్తుంది.
నేడు ఏమాత్రము ఇందూ సంస్కృతిని తెలియని హిందూసంస్థలు అనేకము పుట్టుకొచ్చాయి. ఆ సంస్థలలో ఉన్నవారికి పూర్వము ఇందూ మతము విశ్వవ్యాప్తముగా వుండెడిదనిగానీ, ఈశ్వరుడు తన తలమీద చంద్రవంకను ధరించడము వలన, మనకు ఆ రోజు సంపూర్ణ జ్ఞానముండుట వలన, మనము ఇందువులుగా ఉండెడివారమని గాని తెలియదు. ఇందూ మతము (ఇందూపథము) యొక్క పుట్టు పూర్వోత్తరములు తెలియనివారు, కృష్ణుడు చెప్పిన భగవద్గీతకు విలువనివ్వనివారు, మేము హిందువులమని, మతాన్ని రక్షించేదానికి మేము సంఘములుగా ఏర్పడినామని చెప్పు కొంటున్నారు. హిందూమతము ఎందుకు క్షీణించుచున్నదో, దానికిగల కారణమేమిటో ఏమాత్రము అర్థము చేసుకోవడము లేదు. ఇతర మతములవారు వారి ప్రవక్తలు చెప్పిన మాటలను చెప్పి, వారి మతములను అభివృద్ధి చేసుకొంటూ పోతుంటే, దిన దినమునకు హిందూమతము క్షీణించి పోవుచున్నది. హిందూసంస్థలు తమ జ్ఞానమును తెలుసుకొని, జ్ఞానమును బోధించి క్షీణించి పోవుచున్న మతమును రక్షించుకోవాలి. కానీ అలా కాకుండా పర మతముల మీద దాడులను చేస్తు హిందూమతమును రక్షిస్తామనడము, రోగానికి మందు ఇవ్వకుండ విషము ఇచ్చినట్లవుతుంది. మేము చెప్పు బోధలు నేడు ఎంతో ప్రశంసింపబడుచున్నవి. దీనిని మించిన జ్ఞానములేదు అని ప్రజలందరూ అనుచుండగా, మా జ్ఞానమును ఏమాత్రము చూడకుండ, చదువకుండా మమ్ములను అవమానపరిస్తే నేడున్న హిందూ సమాజము గ్రుడ్డిది అనక ఏమనాలి?
'మతము' అను పేరుతో అజ్ఞానము నిండిన మనుషులు గుంపులుగా చేరి, హిందువులే ఇందుత్వమునకు సమాధికట్టు సమయము వచ్చినది.
కావున భగవంతుని మూడవ అవతారమైన ఆకర్త రాక ఇంతలోనే ఉంటుందనుకొంటాము. ఇందూ ధర్మములకు పూర్తి ముప్పు ఏర్పడిన ఈ సమయములోనే, భగవంతుని రాక ఉంటుందని అనుకుంటున్నాము. నేడు హిందూసంఘములు జ్ఞానములేనివైన దానివలన, ఇప్పటికే ఉత్తరాంధ్ర సగానికి సగము హిందూమతమును వదలి పోయినది. కావున హిందువుల సంఘములకు ఇప్పటికైనా కనువిప్పు కలిగి, జ్ఞాన ప్రచారముతోనే హిందూ మతము రక్షించబడుతుందని, జ్ఞానములేకుండా సంఘములు పెట్టుకొని రాజకీయపార్టీలవలె మెలిగితే ప్రజలు ఛీకొట్టి పరాయి మతములోనికి పోవుదురని తెలియాలి. అందువలన ఇప్పటికైనా జ్ఞానులకు, గురువులకు విలువనిచ్చి వారి సలహాలతో జ్ఞానమును ప్రచారము చేసి, దానిద్వారా హిందుత్వమును కాపాడు ప్రయత్నము చేయమని చెప్పుచున్నాము. రాబోవు కాలములో ప్రజలు మతముల భ్రమలో మునిగిపోయి, దైవత్వమును మరచి పోవుదురను ఉద్దేశముతోనే మతముల విషయమును తన మరణములో కృష్ణుడు చెప్పి పోయాడు.
నేడు మతములను మార్చుకొను వారికి కనువిప్పు కలుగులాగున కృష్ణుడు తన మరణములో బోయవానికి రాబోవు క్రైస్తవమతమును గురించి చెప్పి దాని ప్రవక్తను నేనేనని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమగుటకు మేము మతము అను పదమును వాడుచు చెప్పుచున్నాము. ఆనాడు కృష్ణుడు మతమను పేరును ఉపయోగించలేదని జ్ఞప్తికుంచుకోవలెను. ధర్మములను నెలకొల్పు కార్యములో మూడుమార్లు, మూడు కాలములలో చెప్పవలసిన బాధ్యత కృష్ణునికున్నది. అందువలన రెండవ అవతారముగా ఏసు పేరుతో వస్తానని చెప్పాడు. ఏసు పేరుతో వచ్చి అక్కడ కూడా ధర్మములను తెలియజేస్తానన్నాడు తప్ప ఒక మతమును స్థాపిస్తానని ఆయన
చెప్పలేదు. ఏసు చెప్పిన బోధ నలుగురు శిష్యులు వ్రాసిన నాలుగు సువార్తల రూపములో ఉన్నది. కానీ మొత్తము బైబిలు రూపములో లేదు. అందువలన ఈ గ్రంథములో ఎక్కడా బైబిలు అను పదమును వాడలేదని గ్రహించాలి. ఏసు చెప్పిన వాక్యములను ఎవడు గ్రహించునో వాడు నిజముగా ఏసు భక్తుడగును. ఏసు భక్తుడు అయినవాడు కృష్ణుడు ఏసు ఇద్దరూ ఒకరేనని గ్రహించును. అట్లు గ్రహించని వానికి ఏసు చెప్పిన జ్ఞానము అర్థము కాలేదని, వాడు ఏసు భక్తుడుకాదని అర్థమగును. నేడు ఎవరైనా నేను ఏసును విశ్వసిస్తున్నాను అనినా, వాడు నేను క్రైస్తవున్ని అని ఏసు క్రైస్తవ దేవుడని, హిందువుల దేవుడు వేరని అనుకోవడము వలన వాడు ఏసును విశ్వసించిన వాడు కాదని, కనుక నిజమైన క్రైస్తవుడు కాదని అర్థమగు చున్నది. దీనికంతటికీ మూలము కృష్ణుని మరణములో జరిగిన సమాచారము ఎవరికీ తెలియక పోవడము వలన, కృష్ణుడు ముందే చెప్పినట్లు ఏసుగా వచ్చినా, ఏసు నా దేవుడనుచు కృష్ణున్ని దూషించువారు కలరు. అలా ఏసు భక్తులు కృష్ణున్ని దూషిస్తే ఏసును దూషించినట్లే అగును. అదే విధముగ కృష్ణుని భక్తులు ఏసుని దూషించినా, ఏసే కృష్ణుడైన దానివలన వారు కృష్ణున్ని దూషించినట్లగును. కృష్ణుడు ఏసుగా పుట్టుతానని ముందే చెప్పినట్లు తెలియుట వలన, ఇటు హిందువులకు అటు క్రైస్తవులకు కనువిప్పు కలిగి, ఇప్పటి నుండి తమ ప్రవర్తనను మార్చుకొని, ఎవరు ఏ మతములో ఉండినా దేవుడే అందులో పుట్టించాడని తలచి, మతమును మారకుండా వుండి కృష్ణున్ని, ఏసును సమానముగా చూచు హిందువులు, ఏసును కృష్ణున్ని సమానముగా చూచు క్రైస్తవులు సమాజములో తయారు కాగలరని తలచుచున్నాను. ఏసు చెప్పిన నాలుగు సువార్తలను మాత్రము క్రైస్తవులు చదవాలి. నాలుగు సువార్తలతో సహా మొత్తము బైబిలును చదువువాడు
ఏసును గౌరవించనట్లే, ఆయన బోధలకు ప్రాధాన్యత ఇవ్వనట్లే. అటువంటి వాడు క్రైస్తవుడు కాడు. అదే విధముగా కృష్ణుడు చెప్పిన కేవలము 17 అధ్యాయముల భగవద్గీతను హిందువులు చదవాలి. గీతతో సహా వేదములను చదివినా లేక గీతను వదలి వేదములను చదివినా వాడు కృష్ణున్ని గౌరవించనట్లే. ఆయన బోధలకు ప్రాధాన్యత ఇవ్వనట్లే. అటువంటివాడు హిందువు (ఇందువు) కాడు. ఈ విధముగా లెక్కించి చూచితే ఈనాడు సరియైన హిందువు లేడు. అలాగే సరియైన క్రైస్తవుడు లేడు. అందువలన నేడు ఈ గ్రంథమును చదివి కృష్ణుని మరణ సమయములో జరిగిన రహస్యమును ఎవరైతే తెలుసుకొందురో వారందరికీ కనువిప్పు కల్గును. మనము నీది ఆ మతము, నాది ఈ మతమని చెప్పుకోవడము ఒకే వంశములో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు తమ వంశమును గురించి తెలియక అన్న ఒక వంశము పేరు, తమ్ముడు మరొక వంశము పేరు చెప్పితే స్వంత తండ్రినే మార్చినట్లుగును కదా! అందువలన ఇప్పటినుండైనా కొన్ని వేల సంవత్సరముల వెనుక ఏమి జరిగినదని యోచించి, తమ తమ మతములు పూర్వము లేనేలేవని గ్రహించి, అప్పుడున్నది ఒకే ఒక పథము మాత్రమేనని, అదియే “ఇందూ పథమని” తెలిసి, ఇందూపథములోనే నేడున్న క్రైస్తవులు, హిందువులు పూర్వముండెడి వారిని, ఆ ఇందూపథమును మరచిపోయిన దానివలన హిందూమతము, క్రైస్తవమతమని వేరువేరుగా చీలిపోయాయని తెలుసుకొంటే, ఈనాటికీ రెండిటియందు ఒకే బోధ ఉన్నదనీ, రెండిటినీ తెలిపినవాడు ఒకే భగవంతుడని తెలియగలదు.
జరుగబోవు విషయమును తెలిసిన కృష్ణుడు తన మరణ సమయము వరకు రాబోవు తన జన్మలను గురించి తెలుపలేదు. చివరి మరణ సమయములో బోయవానిని అడ్డము పెట్టుకొని, భవిష్యత్తు అవతారములను
గురించి చెప్పాడు. బోయవాడు విన్న దానిని తిరిగి చెప్పు సమర్థుడు కాదని తెలిసి కృష్ణుడు వానికే చెప్పాడు. అట్లు చెప్పుట వలన వాని ఆత్మ ఆ విషయమును స్వీకరించి, తన మూడవ అవతార సమయము సమీపించి నపుడు ఆత్మే ఆ విషయమును బయటికి తెలుపునట్లు భగవంతుడు నిర్ణయించాడు. అప్పటికి పెరగవలసిన అజ్ఞానమంతా పెరిగి, మత ద్వేషములు ఎక్కువై మానవుడు ఆధ్యాత్మికమను దారిని వదలి, మాయ దారిన పోవునపుడు, మూడవ పురుషుడుగా వచ్చినవాడు తన జ్ఞానమును తెలియబరచి ధర్మములను పూర్తిగా నెలకొల్పును. ఇక్కడ ముఖ్యముగ గమనించ వలసిన విషయమేమనగా! నేను అన్నదానము చేస్తాను. నేను అన్నమును పెట్టడము వలన మా దగ్గరున్నవారంతా ఆకలి లేనివారగుదురు. ఎవరికీ ఆకలి లేకుండా చేస్తానన్నపుడు, నావద్దనున్న వారందరికి ఆహారము దొరకకుండ పోయి పూర్తి ఆకలికొనిన వారైనపుడు, నేను ఇచ్చిన ఆహారము వలన వారి ఆకలి పూర్తిగా తీరిపోతే, అప్పుడు నేను చెప్పినట్లు అందరి ఆకలి తీర్చినట్లగును. నేను అన్నమును వండి సిద్ధముగా పెట్టుకొనినా, ఆ సమయానికి ఆకలికొనిన వారు ఎవరూ లేకపోతే నేను ఎవరి ఆకలీ తీర్చనట్లే కదా! అందువలన ఎదుటివారు ఆకలితోనున్నపుడే నా కార్యము నెరవేరును. అదే విధముగానే దేవుడు నేను భగవంతునిగా వచ్చి అధర్మములను లేకుండ చేస్తానన్నాడు. ఆయన పని అధర్మములను రూపుమాపి ధర్మములను తెలియపరచడమైనపుడు, ఆయన వచ్చినపుడు ధర్మములను ఆహారము లేకుండాపోయి అధర్మములను ఆకలి వుండాలి. అపుడు ధర్మములను ఆహారముతో అధర్మములను ఆకలిని తీర్చినవాడగును. అప్పుడు ప్రక్కవారి దృష్ఠిలో ఎదుటివాని ఆకలి తీర్చినవాడగును. భగవంతుడు కృష్ణుని రూపములో ఉన్నపుడు చెప్పిన మాట నెరవేరుటకు, తన మూడవ
అవతార సమయమునకు భూమిమీద పూర్తి అజ్ఞానమును పెరుగునట్లు చేశాడు. ఇక దాన్ని రూపుమాపి ధర్మములను నెలకొల్పి తనమాటను నిలబెట్టుకొనును. ఈ విధముగా దేవుడు భూమిమీదకు భగవంతుడుగా వచ్చి, మూడు అవతారములను ధరించి తిరిగి దేవునిగా మారిపోవుచున్నాడు. ద్వాపర యుగములో దేవుడు కృష్ణునిగావచ్చి, ధర్మములను గీత రూపములో చెప్పి పోయి, తర్వాత మూడు వేల సంవత్సరములకు ఏసుగా వచ్చి అప్పుడు కూడ ధర్మములను తెలియజేసి, మూడవ అవతారముగ 'ఆకర్త' రూపములో వచ్చి తనకార్యమును అంతటితో పూర్తి చేయును. అలా పూర్తి చేసిన భగవంతుడు తిరిగి దేవునిగా మారిపోవును. అందువలన మొదట కృష్ణుడు దేవుడు, తర్వాత కృష్ణుడు భగవంతుడు ఆ తర్వాత కృష్ణుడు దేవుడగును. అందువలన కృష్ణుడు దేవుడు మరియు భగవంతుడని చెప్పవచ్చును.
ఇంతవరకు చదివిన సమాచారమును బట్టి కృష్ణుడు తర్వాత ఏసుగా వచ్చాడని అనేక సాక్ష్యముల వలన తెలియుచున్నది. ఈ విషయములన్నియూ క్రోడీకరించి చూచిన తర్వాత ఒకే దేవుడు ఇద్దరిగా వచ్చాడని తెలియు చున్నది. అయితే ఈ జ్ఞానమును లోకములోని మనుషులు జీర్ణింప చేసుకోలేరు. సులభముగా అర్థమగు విషయమున్నా మధ్యలో వచ్చిన మతములు మనుషులలో చిచ్చుపెట్టి ఒక మతమువారు మరొక మతము వారితో ద్వేషించుకొనుచున్నారు. అంతటితో ఆగక వారి ప్రవక్తలని చెప్పబడు చున్న ఇద్దరు భగవంతులను దూషించుచున్నారు. హిందువులు ఏసును దూషించితే, క్రైస్తవులు కృష్ణున్ని దూషించుచున్నారు. ఇద్దరు కలిసి ఒకే దేవున్ని దూషిస్తున్నామను విషయము వారికి తెలియకుండా పోయినది. కృష్ణుడు చెప్పినది భగవద్గీతగాయుండగా, ఏసు చెప్పినది బైబిలుగా యున్నది. ఈ రెండిటియందు ఒకే దేవుని జ్ఞాన విషయమున్నా రెండు గ్రంథములు
వేరువేరు దేవున్ని గురించి చెప్పినవని అజ్ఞానము చేత మనుషులు అనుకోవడము జరుగుచున్నది. మేము సంపూర్ణముగా జ్ఞానమును తెలియగలిగి మతము అను మాయలో చిక్కుకోలేదు. మనుషుల తలలోని గుణముల ప్రభావము వలన అనగా మాయ ప్రభావము వలన 'మతము’ అనునది మనుషుల మధ్యలోకి వచ్చి మనుషులను అజ్ఞానమువైపు లాగుకొని పోవుచున్నది. మతము యొక్క మత్తులో పడినవాడు విచక్షణ కోల్పోయి తాను ఏమి చేయుచున్నానను స్పృహను కోల్పోవుచున్నాడు. అటువంటి స్పృహ లేని మనిషి దేవునివైపు పోవునట్లు భ్రమించుచూ తాను వినాశనము వైపు, అజ్ఞానమువైపు పోవుచున్నాడు. మతము అను ముసుగులో ఎన్నో కౄర కార్యములను చేయుచున్నాడు. ఎందరి మరణమునకో కారణమగు చున్నాడు. దానివలన భయంకరమైన పాపమును మూటగట్టుకొని దానినే అనేక జన్మల వరకు అనుభవించుచున్నాడు.
నేడు మేము త్రిమతములను ఒక్క తాటిమీదికి తెచ్చి అందరికీ 'ఒకే దేవుడు, ఒకే జ్ఞానము' అని చెప్పుచున్నా మమ్ములను కూడా అనేక ఇబ్బందులకు గురిచేయుచున్నారు. ఏమాత్రము దైవజ్ఞానము తెలియనివారు మత పెద్దలుగా, మత సంస్కర్తలుగా, మతరక్షకులుగా చెప్పుకొనుచూ మేమే నిజమైన హిందువులమని కొందరు, మేమే నిజమైన క్రైస్థవులమని కొందరు, మేమే నిజమైన ముస్లీమ్లమని కొందరు చెప్పుకొనుచూ దేశభక్తియని కొందరు, సమాజ భక్తియని కొందరు చెప్పుకొనుచూ వారివారి మతములను పెంచు కొనుటకు ప్రయత్నించుచున్నారు. నేడు భక్తియని గానీ, జ్ఞానము అనిగానీ లేక దైవగ్రంథములోని జ్ఞానప్రచారమనిగానీ ఎక్కడయినాయుంటే అక్కడ దేవుడూ, దేవుని జ్ఞానము ఉండదుగానీ, వారివెనుక మత అభివృద్ధే ధ్యేయముగాయుండును. వారివారి మతములు అభివృద్ధికి అందరూ
ప్రయత్నించుచుండగా, మేము మాత్రము త్రిమత ఏకైక గురువుగా మూడు మతములకు సామరస్యమును బోధించుచున్నా, మూడు మతముల లోని జ్ఞానము ఒక్కటేయని మరియు దేవుడు ఒక్కడేయని చెప్పుచున్నా అందరూ పెడచెవిన పెట్టుచున్నారు.
మొత్తము భూమిమీద ఎక్కడయినా మతప్రచారము తప్ప దైవజ్ఞాన ప్రచారమే లేదని చెప్పవచ్చును. అందరిలో మతము, మతప్రచారము, మత అభివృద్ధి తప్ప జ్ఞానము అనుమాటయే లేకుండా పోయినది. పైకి మాత్రము అందరూ జ్ఞానము పేరునే చెప్పుచున్నా, చివరికి వారిలో మత ఉద్దేశ్యము తప్ప మిగతాది ఏదీ లేదని తెలియుచున్నది. మతాతీత జ్ఞానము ఎక్కడా కనిపించడము లేదు. దేవుడు ఆకాశము చేత చెప్పిన జ్ఞానమునే తెరచాటున నుండి చెప్పించినా, తన ప్రతినిధియైన భగవంతుని (ఆదరణకర్త) చేత చెప్పించినా, మనుషులు మాత్రము దేవుడు చెప్పిన జ్ఞానమును వినినట్లే నటించుచూ, చివరికి మతమువైపే మొగ్గు చూపుచున్నారు. దేవుని జ్ఞానమును కూడా మత ప్రచారమునకే వినియోగించుచున్నారు.
కృతయుగములోగానీ, త్రేతాయుగములోగానీ, ద్వాపర యుగములో గానీ మరియు కలియుగములో మూడువేల సంవత్సరముల వరకు మతముల ప్రసక్తి లేదు, మనుధర్మ ప్రసక్తే ఎక్కువగా యుండెడిది. అప్పుడు అధర్మములు అంటే నాలుగే ముఖ్యముగా ఉండేవి. ఆ నాలుగు అధర్మములను అణచి వేయుటకు దేవుడు ముఖ్యముగా మూడు ధర్మములను ప్రచారమగునట్లు బోధించాడు. మూడు ధర్మములను మూడు యోగములుగా చెప్పడమైనది. దేవుని పుట్టుకయిన భగవంతుని బోధలన్నియూ మను ధర్మములనిపించు కొన్న నాలుగు అధర్మములను, వాటికి అనుబంధమైన ఆచరణలను అణచి
వేయడానికే మూడు యోగముల ధర్మములను తెలుపునవైయున్నవి. దేవుడు ఒక పథకము ప్రకారము చెప్పిన జ్ఞానములో మను ధర్మములని ప్రచారమయిన అధర్మములను లేకుండా చేయు ఉద్దేశ్యము తప్ప మరి ఏమీ లేదు. అధర్మములను లేకుండా చేయుటకు ధర్మములను బోధించవలసి వచ్చినది. దేవుడు తన బోధలో అధర్మ ఖండన, ధర్మ ఉద్ధరణను ముఖ్యముగా పెట్టి చెప్పడమైనది. దేవుడు మూడు విధములుగా భూమిమీద తన జ్ఞానమును చెప్పినా నాలుగు అధర్మములను లేకుండా చేయుటకే చెప్పాడుగానీ ఆనాడు లేని మతములను ఖండించి చెప్పలేదు.
నాలుగు యుగములలో మూడు యుగములనుండి మను ధర్మములే దేవుని జ్ఞానమునకు, దేవుని ధర్మములకు ఆటంకముగా యుండగా, నేడు కలియుగములో నాలుగు అధర్మములకంటే పెద్ద ఆటంకమైనది 'మతము’ అనునది. మూడు యుగములలో మనుధర్మములు దేవుని జ్ఞానము ఎడల అధర్మములుగా యున్నా, అవి మనుషులందరిలో లేకుండా కొందరిలో మాత్రమే ఉండెడివి. మిగతా మనుషులకు అధర్మముల విషయముగానీ, ధర్మముల విషయముగానీ తెలియకుండా ఉండెడిది. మను ధర్మములు నాలుగు అధర్మములుగా యున్నా అవి పూర్వమునుండియున్న ఇందూ (హిందూ) సమాజములో ఒకటి లేక రెండు కులములలో మాత్రము ఉండెడివి. ముఖ్యముగా అగ్రకులములో మాత్రము నాలుగు అధర్మములైన యజ్ఞ, దాన, వేద, తపస్సులు అనునవి ఉండేవి. ఇందూ సమాజము తప్ప ఆనాడు ఏ మత సమాజము లేదు. ఆనాడు మూడు యుగములనుండి కుల వ్యవస్థలు, వాటి అజ్ఞానము ఉండెడిది. అయినా దేవుని జ్ఞానమునకు ఆటంకముగా ఏ కుల వ్యవస్థ లేకుండెడిది. ఒకే కులమువారు మాత్రము నాలుగు అధర్మములను ఆచరించుచూ, అందరిచేత ఆచరింపజేయుచూ
వాటి వలననే తమ జీవితమును సాగించుచుండిరి. ఒక అగ్రకులము వారే రాజులకు సహితము గురువులుగా యుండి, రాజుల చేత మరియు మిగతా మనుషుల చేత యజ్ఞ, దాన, వేదాధ్యయణ, తపస్సులను ఆచరింప చేయుచుండిరి. ఈ నాలుగు నేడుగానీ, ఆనాడుగానీ అందరికీ ముఖ్య కార్యములుగా కనిపించుచున్నవి. నేడు మేము ఈ నాలుగు ఆచరణలను అధర్మములనినా సహింపని బాధ కొందరిలో కలుగవచ్చును. అధర్మముల పేరును మేము చెప్పినా అవి వారిలో ధర్మములుగా నిండియుండుట వలన మా మాట రుచింపక వారిలో ద్వేషమును పెంచుచున్నవి.
ఇందూ సమాజము నేడు హిందూమతముగా మారిపోయి ఇతర మతములముందర బలహీనమైపోవుచుండుట, ఇతర మతములు అభివృద్ధి చెందుట అందరికీ తెలిసిన విషయమే. నేడు హిందువులలో మతరక్షణ ముఖ్యమైయుండగా దానికొరకు కొన్ని మత సంఘములు ఏర్పడినవి. మిగతా మతములలో మత అభివృద్ధి ముఖ్యధ్యేయమై అదే కార్యమును చేయుచున్నవి. ఇట్లు మత రక్షణలో కొందరు, మత అభివృద్ధిలో కొందరు కాలము గడుపు చున్నారు తప్ప పూర్వమునుండి దేవుడు ఏమి బోధించాడనిగానీ, నేడు మన మత గ్రంథములుగా చెప్పబడుచున్న మూడు దైవగ్రంథములలో ఏమున్నదని కళ్ళుతెరచి చూడకున్నారు. దేవుడు మనిషిగావచ్చి చెప్పిన బోధలు అజ్ఞాన గ్రుడ్డితనములో ఏమాత్రము తెలియకుండా పోయాయి. కొందరయితే 'దేవుడు పుట్టడు' అని కూడా వాదించుచున్నారు. మొత్తము మీద దేవుని జ్ఞానము భూమిమీద కరువైపోయినది.
పూర్వము అధర్మములని చెప్పబడునవి ఒక్క హిందూమతమునకు మాత్రము పరిమితమైపోగా, మిగతా మతములకు అధర్మములులేవు
కదా!యని కొందరడుగవచ్చును. దానికి జవాబును చెప్పితే ఇలాగున్నది. యజ్ఞ, దాన, వేద, తపస్సులు ఒక్క హిందూమతమునకే పరిమితమై పోయినా, మిగతా మతములలో ఈ నాలుగు మాటలే వినిపించకయున్నా వారిలో అన్నిటికంటే పెద్ద అధర్మమయిన 'మతము' వచ్చి చేరినది. పూర్వము నుండి యున్న నాలుగు అధర్మముల మీద రావణబ్రహ్మ మొదలగు వారు పోరాడి వాటిని లేకుండా చేయవలెనని తలచి లోకములో హీరో అయిన రావణబ్రహ్మ విలన్గా మారిపోయినాడు. హిందూమతములోని వారికి ఏది ధర్మము, ఏది అధర్మము అని తెలియకుండా పోయినది. ధర్మములను అధర్మములుగా, అధర్మములను ధర్మములుగా భావించుకొన్నారు. ఇదంతా నేటి హిందువుల అగచాట్లుకాగా, ఇతర మతములలోనికి 'తపస్సు' అను అధర్మము రూపము మార్చుకొని, పేరు మార్చుకొని చేరిపోయినది. వారిచేత వారికి తెలియకుండా తపింపజేయుచున్నది. ఆ విషయమును ఇతర మతముల వారు గ్రహింపలేకున్నారు. హిందువులకున్న నాలుగు అధర్మములలో దానము, తపస్సు అన్ని మతములలో చేరిపోయి వారిని కూడా అధర్మ మార్గములో ప్రయాణించునట్లు చేయుచున్నవి. ఇది ఇట్లుండగా నేడు అన్నిటికంటే పెద్దగాయున్న అధర్మము మతమనునది. మతము అనునది మూడు యుగములలో లేకున్నా నేడు కలియుగములో వచ్చి చేరినది.
ద్వాపర యుగము చివరిలో, కలియుగము మొదటిలో దేవుడు భగవంతునిగా వచ్చి కృష్ణుని రూపములో మూడు యుగములనుండి యున్న నాలుగు అధర్మములకు స్వస్తి పలుకుటకు ఎంతో నైపుణ్యముగా భగవత్ గీతను బోధించాడు. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమున 48వ శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ త్రేతాయుగములో
రావణబ్రహ్మ ఎదిరించిన నాలుగు అధర్మములను అణచివేయుటకు ఈ రెండు శ్లోకములలో నాలుగు అధర్మములకు ఉచ్చు బిగించాడు. ఆ రెండు శ్లోకములను ఇక్కడ చూస్తాము.
48వ శ్లో॥ నలేద యజ్ఞాధ్యయ నైర్న దానైర్న చక్రియాభిర్న తపోభిరు గైః ఏవం రూపశ్యక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర!॥ భావము :- “భూమిమీద నీవు తప్ప ఈ విశ్వరూపమును చూచినవారు లేరు. యజ్ఞముల వలనగానీ, వేదాధ్యయణము వలనగానీ, దానముల చేతగానీ, ఉగ్రతపస్సుల చేతగానీ నా దర్శనము దొరకుటకు శక్యము కాదు".
53వ శ్లో॥ నాహం వేదైర్న తపసా నదానేన న చేజ్యయా । శక్యం ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా భావము :- “తపస్సు చేతగానీ, దానముల చేతగానీ, యజ్ఞముల వలనగానీ, వేదముల వలన గానీ ఇప్పుడు నీవు చూచిన ఈ విశ్వరూపము దొరుకుట శక్యము కాదు".
ఈ విధముగా భగవద్గీత రెండు శ్లోకములలో అధర్మ ఖండన చేయడమే కాకుండా వీటివలన దేవున్ని తెలియుటకు శక్యము కాదని ఖండించి చెప్పడము జరిగినది. దేవుడు తన భగవద్గీతతో ఈ కార్యములు పనికి రావు, వీటి వలన నేను తెలియబడనని చెప్పినా మనుషులు మాత్రము అజ్ఞానముగానే అధర్మములనే ఆచరించుచున్నారు. యజ్ఞములు చేయుట,
వేదాధ్యయనము చేయుట, ధ్యానము (తపస్సు) చేయడమును అందరూ చేయుచున్నారు. హిందూ మతములో ఈ నాలుగు కార్యములకంటే మించిన జ్ఞానము లేదన్నట్లు మనుషులు ప్రవర్తించుచూ దేవుడు వద్దని చెప్పిన వాటినే చేయుచున్నారు. త్రేతాయుగములోనే రావణబ్రహ్మ ఈ నాలుగు కార్యములను పూర్తి వ్యతిరేఖించి, ఆనాడే వీటిని అధర్మములుగా ప్రకటించాడు. అయితే రావణబ్రహ్మను అందరూ యజ్ఞములను భంగము చేసినవాడు దుష్టుడని చెప్పారు. మనుషులకు మంచేదో చెడేదో తెలియక పోవడము వలన అధర్మములకు పూర్తిగా అలవాటు పడిపోయినందున రావణబ్రహ్మను ఆనాడు దుష్టుడని దూషించారు. అదే విషయమునే కృష్ణ భగవానుడు తన భగవద్గీతలో చెప్పితే దానిని తెలియనట్లు నిశ్శబ్దముగా యున్నారు.
ఆనాడు మూడు యుగములనుండి నాలుగు అధర్మములే రాజ్య మేలుట వలన మనుషులకు ధర్మములేవో తెలియకుండా పోయినవి. నాలుగు అధర్మములనే మనుషులందరూ ధర్మములనుకొని ఆచరించడము జరిగినది. చివరకు ద్వాపర యుగములో ధర్మములకు పూర్తిగా ముప్పు ఏర్పడి, అధర్మములు తారాస్థాయిలో చెలరేగిపోవడము వలన, దేవుడు అధర్మములను అణచివేసి ధర్మములను పునరుద్ధరించుటకు భూమిమీద మనిషివలె రావలసి వచ్చినది. భూమిమీద మనిషిగా పుట్టిన దేవుడు అధర్మములను తేల్చి ఇవియని భగవద్గీతలో చెప్పడమైనది. అయితే ఆనాడు మతములు లేనిదానివలన అప్పటికి అవియే అధర్మములుగా మనుషులను దేవునివైపు పోకుండా చేసెడివి. నేడు పూర్వమునుండి యున్న అధర్మములను మించిన ‘మతము’ అనునది వచ్చి అన్ని మతముల మనుషులను దేవుని మార్గమునుండి తప్పించి అజ్ఞాన మార్గములో పంపుచున్నది. నాలుగు
అధర్మముల ప్రభావము ఒక్క హిందూమతములోనే కనిపించగా, 'మతము’ అను పెద్ద అధర్మము అన్ని మతములలో కనిపించుచున్నది.
దేవుడు చెప్పిన దైవజ్ఞానము మూడు గ్రంథములుగా రూపుదిద్దు కోగా, ఆ మూడు దైవగ్రంథములకు కూడా 'మతము' అను రంగుపూసి, ఇది హిందువులది, అది ముస్లీమ్లది, ఇంకొకటి క్రైస్తవులది అని చెప్పుచున్నారు. చివరకు దైవగ్రంథములు కూడా మతగ్రంథములుగా మారిపోయి అలాగే ప్రజలలో ప్రచారమైనాయి. ఇక మూడు గ్రంథములు మినహా వేరొక దైవగ్రంథము వచ్చుటకు వీలులేదు. దేవుడు చెప్పిన మూడు విధానముల ప్రకారము ముందు వెనుక మూడు గ్రంథములు వచ్చినవి. అవి వచ్చిన వరుస క్రమములోనే వాటికి ప్రథమ, మధ్యమ, అంతిమ దైవగ్రంథములని పిలువడమైనది. మూడు దైవగ్రంథములు ముందు వెనుక వచ్చినా వాటికి మతమను రంగుపూసి, వాటిని దైవగ్రంథముల స్థాయినుండి మతగ్రంథముల స్థాయికి మనుషులే దించివేశారు. కలియుగములో పుట్టిన ‘మతము' అను అధర్మము పూర్వమునుండి యున్న నాలుగు అధర్మములకంటే పెద్దది.
పూర్వమునుండి యున్న అధర్మములు ఒక్క హిందూమతము మీద ప్రత్యక్షముగా ప్రభావము చూపినవి. కలియుగములో క్రొత్తగా వచ్చిన మతముల మీద 'దానము', ‘ధ్యానము' అను రెండు పరోక్షముగా ప్రభావమును చూపినవి. యజ్ఞములు, వేదములు నేటికినీ హిందూ మతమును వదలక పీడించుచూ మనుషులను తప్పుదారి పట్టించుచుండగా కృష్ణుడు తన జ్ఞానములో వాటిని ఖండించాడు. తర్వాత వచ్చిన భగవంతుడు (ఆదరణ కర్త) ఏసు అప్పటి శాస్త్రులకు వ్యతిరేఖమైన బోధలను చెప్పగా
వారు ఏసు మరణమునకే కారణమయ్యారు. చరిత్ర అంతయూ గమనించగా కృష్ణుడు మరియు ఏసు ఇద్దరూ భగవంతులేనని తెలియుచున్నది. ఏసు భగవంతుడని ఏసు తర్వాత వచ్చు భగవంతుడు బోధించును. కృష్ణుడు భగవంతుడని కృష్ణుని తర్వాత వచ్చిన ఏసు చెప్పవలసియున్నది. అయితే ఏసు కృష్ణున్ని గురించి ఎక్కడా చెప్పినట్లు కనిపించలేదు. అయినా ఏసు కృష్ణున్ని పోలిన జీవితమును కొంత గడుపుట వలన ఏసు నేను కృష్ణుడు ఒక్కడేయని చెప్పినట్లయినది. ఏసు పుట్టినప్పుడు, కృష్ణుడు పుట్టినప్పుడు ఒకే విధమైన అనుభవములు ఇద్దరి జీవితములో వచ్చినవి. కృష్ణుడు అశుభ్రమైన జైలులో ప్రక్కలో తండ్రితప్ప ఎవరూ లేనప్పుడు పుట్టగా, అదే విధముగా ఏసు పశువుల పాకలో ప్రక్కలో తండ్రి తప్ప ఎవరూ లేని సమయములో పుట్టాడు. పుట్టిన వెంటనే ఇద్దరికీ ప్రాణాపాయముండుట వలన పుట్టిన స్థలమును ఇద్దరూ వదలిపోయారు. ఇద్దరిని చంపుటకు ఆయా దేశముల రాజులు ప్రయత్నించి చివరకు రెండు సంవత్సరముల చిన్నవయస్సు పిల్లలను చంపడము రెండుచోట్లా జరిగినది. కృష్ణుని జననములో జరిగిన సంఘటనలు మొత్తము ఏసు జీవితములో జరుగుట వలన కృష్ణుడు కూడా ఆదరణకర్తయేనను సూచనను ఏసు జీవితము
చూపించినట్లయినది. ఏసు పుట్టుకయేకాక మరణము కూడా కృష్ణునివలె జరిగినది. ఏసు పాదములలో ములుకులు కొట్టగా రక్తము కారి చనిపోయాడు. అదే విధముగనే కృష్ణుని పాదమునకు బాణము తగిలి రక్తము కారి చనిపోయాడు. ఈ విధముగా ఏసు మరియు కృష్ణుని జనన, మరణములు రెండూ ఒకే రకముగా యుండుట వలన ఏసు, కృష్ణుడు ఇద్దరు ఒకే దేవుని అవతారమని తెలియుచున్నది.
ఆదరణకర్త వస్తాడు, వచ్చిన తర్వాత ఏసు దేవుడేయని, అతను భగవంతుడని తెలియజేయునని ఉన్నది. అయితే ఆదరణకర్త ఎప్పుడు వస్తాడు అని ఖచ్చితముగా చెప్పలేదు. ఆదరణకర్తగా వచ్చినవాడు ముందు వచ్చిన ఏసేనని, ఏసుగా వచ్చినవాడు ముందు వచ్చిన కృష్ణుడేయని మనము తెలియుటకు అనేక ఆధారములు దొరికినవి. ఇద్దరే కాదు రాబోయే వాడు కూడా ముగ్గురు ఒక్కడేనని తెలియుచున్నది. రాబోయే ఆదరణకర్త నన్ను గురించి చెప్పునని ఏసు చెప్పినట్లు కలదు. ఆయనే ఈయన అయినప్పుడు, ఆయనను గురించి ఈయన సులభముగా చెప్పగలడు. మొదట హిందూ సమాజములో దేవుడు మానవాకారములో వస్తే 'భగవంతుడు' అని అన్నారు. అదే 'భగవాన్' అనే పదమును ఇక్కడ బైబిలులో ఉపయోగించక ఆదరణకర్తయని చెప్పడమైనది. ప్రపంచములో అన్ని ఆదరణలకంటే జ్ఞానములో ఆదరించడమే గొప్ప. డబ్బు ఆదరణ దొరికినా, బంగారు ఆదరణ దొరికినా, ఏ విషయములో ఆదరణ దొరికినా అవన్నియూ అశాశ్వితమైన ఆదరణలేయగును. జ్ఞానములో ఆదరణ దొరికితే జీవితమే ధన్యమగును. అందువలన జ్ఞానములో ఆదరించువాడు ఒక్క దేవుడే ఉండును. జ్ఞాన ఆదరణ దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. దేవుడు
అన్నిటికి కర్తయిన దానివలన మనిషి రూపములో వచ్చిన భగవంతున్ని ఆదరణకర్తయని చెప్పడమైనది. దేవుడు రెండు జన్మలలో ఆదరణకర్తగా వచ్చాడని కృష్ణుడు, ఏసు ఇద్దరూ ఒక్కడేయని మాకు తెలిసిన సత్యమును అనేకమార్లు చెప్పాము. దానిని అర్థము చేసుకోనివారు మాది మత ప్రచారమని క్రైస్తవ మతమును చెప్పుచున్నారని ఆరోపించారు. మేము మతముల సామరస్యమునకు ప్రయత్నించుచున్నాము. మతములకు అతీతమైన బోధలు చెప్పుచున్నాము. దానిని అర్థము చేసుకోలేని వారు
అజ్ఞాన ఆరోపణలు ఎన్ని చేసినా మేము లెక్కచేయము. జ్ఞానుల ఆరోపణలను మేము చూస్తాము. మా తప్పులేమయినా ఉన్నా సరిదిద్దు కుంటాము. అయితే అజ్ఞానుల ఆరోపణలను మేము పట్టించుకోము. అందువలన మేము చెప్పవలసినది చెప్పెదము. కృష్ణుడు ఏసు ఇద్దరు ఒక్కడేయని చెప్పాము. ఇప్పుడు మా వాదనను బలపరిచే విధముగా గాడేపల్లి కుక్కుటేశ్వర రావుగారు వ్రాసిన “ఏసు కృష్ణయం" అను పద్య కావ్యమును క్రింద జతపరచుచున్నాము.
ఏసు కృష్ణుడు ఒక్కడేయంటే హిందువులు ఏసును ఎంతగా అసహ్యించుకొంటున్నారో, అంతకు రెండితలుగా కృష్ణున్ని క్రైస్తవులు అసహ్యించుకొంటున్నారు. అట్లని ఏసులోయున్న చెడు ఏమిటో హిందువులకు తెలుసాయంటే అదేమీ తెలియదు. అట్లే కృష్ణునిలోయున్న చెడేమిటో క్రైస్థవులకు తెలుసాయంటే అదేమీ వారికి కూడా తెలియదు. ఏమీ తెలియకుండా, వారిలో ఏమీ చెడు లేకున్నా ఎందుకు దేవుడయిన ఇద్దరినీ రెండు మతములవారు ఏవగించుకొంటున్నారో తెలియదు. అట్లు తెలియకపోవడము వలన స్వయముగా నేరుగా దేవున్ని దూషించినట్లగు చున్నది. ఆ దూషణ వలన భయంకరమైన పాపము మనిషికి అంటుకోగలదు. అటువంటి పాపము నా తోటి మనుషులకు రాకూడదను ప్రయత్నములో ఇద్దరు ఒక్కడేయను ఈ విషయములను ఇంత లోతుగా చెప్పవలసి
వచ్చినది.
యేసు పరముగా...
గీ.
మరియ, లోలత నెలలు సమాప్తినమర
జంతుసాక్షిక నిర్బంధశాలలోన
దేవ కీలాభమూర్తియై దేవదేవుఁ
డవనిఁ బ్రభవించె దైవజ్ఞు లాత్మ నలర.
అర్థము : మరియ=మరియమ్మయను కన్య, లోలతన్=
ఆందోళనతో, నెలలు సమాప్తిన్ = గర్భవతియై నెలలు నిండుటచే,
అమరన్=ఒప్పి యుండఁగా, జంతు సాక్షిక=పశువులు నిల్చి చూచు
చున్న, నిర్బంధ శాలన్ =ఆ పశువులు బంధింపఁబడిన పాకయందు,
దేవ= దైవసంబంధమైన, కీలా= అగ్ని తేజస్సుతో, ఆభ= సమానమైన,
మూర్తియై=ఆకారము కలవాఁడై, దేవదేవుఁడు=దేవతలకే దేవుఁడని
చెప్పఁబడిన క్రీస్తు, అవనిన్ = భూమిపై, దైవజ్ఞులు=దివ్యనక్షత్రము
ననుసరించి వచ్చిన మువ్వురు తూర్పు దేశ జ్ఞానులు, ఆత్మన్=వారివారి
మనస్సులయందు, అలరన్=సంతోషింపఁగా, ప్రభవించెన్=జన్మించెను.
తాత్పర్యము : మరియమ్మ ఆందోళన చెందుచుండఁగా నెలలు
నిండినవి. అగ్ని తేజస్సుగల దేవదేవుఁడైన యేసు పశువులపాకలో
ఆమె కడుపున జనించెను. ప్రభు జననమునకు తూర్పుదేశ జ్ఞానులు
సంతోషించిరి.
కృష్ణపరముగా...
ဘာ
మరి యలోలత నెలలు సమాప్తి నమర
జంతుసాక్షిక నిర్బంధశాలలోన
దేవకీ లాభమూర్తియై దేవుదేవుఁ
డవనిఁ బ్రభవించె దైవజ్ఞు లాత్మనలర.
అర్థము : నెలలు=తొమ్మిది మాసములు, మరి+అలోలతన్=
ఏమాత్రము భంగపాటు లేకుండ, సమాప్తిన్-నిండుటచే, అమర=ఒప్పి
యుండఁగా, జంతు సాక్షిక=వసుదేవుఁడు కాళ్ళుపట్టుకొనిన గాడిదనిల్చి
చూచుచున్న, నిర్బంధశాలన్=చెఱసాలయందు, దేవకీ=దేవకీ దేవికి,
లాభ-మూర్తియై=లభించినవాఁడై, దేవదేవుఁడు=విష్ణువు, అవనిన్=
భూమిపై, దైవజ్ఞులు=దైవతత్త్వము నెఱిఁగిన అక్రూరుఁడు మొదలగు
వారు, ఆత్మన్ = వారివారి మనస్సులయందు, అలర=సంతోషింపఁగా,
ప్రభవించెన్ = జన్మించెను.
తాత్పర్యము :- గర్భ విషయమున నెట్టితొట్రుపాటు లేకుండ
నెలలు నిండినవి. ఎట్టెదుట గాడిదనిల్చి చూచుచున్న చెఱసాలయందు,
విష్ణువు దేవకీ దేవికి జన్మించెను. కృష్ణతత్త్వము నెఱిఁగిన అక్రూరాదులు
సంతోషించిరి.
యేసు పరముగా...
గీ.
హె హె! హెరైదుఁడు, భూజాని, హేయబుద్ధి,
మాతులుఁడు, రేఁగి శిశుపరంపరను దునిమె,
దైవ మగుపట్టి మర్త్యుఁడౌ తద్విరోధి
కన్నులం గప్పి పితతోడఁ గదలి చనియె.
అర్థము : హె హె!=హి హీ! (పరిహాసవాచకము), హెరైదుఁడు=
హెరోద్ అనునతఁడు, భూజాని= ఆ దేశపు రాజు, హేయ బుద్ధి=నీచ
బుద్ధిగలవాఁడు, మా+అతలుఁడు=లక్ష్మిచే (సంపదచే) సాటిలేనివాఁడు, రేఁగి=
విజృంభించి, శిశుపరంపరను= (రెండేండ్ల వయస్సునకు లోఁబడియున్న)
బిడ్డల నెల్లరను, తునిమెన్-చంపించెను, దైవము+అగు=దేవుఁడైన, పట్టి=
శిశువు (యేసు), మర్త్యుఁడౌ=మరణశీలుఁడై కేవలము=నరుఁడైన, తత్ +
విరోధి=ఆ శత్రువుయొక్క (హెరోద్ యొక్క), కన్నులన్+కప్పి =కన్నులకు
మాయ కల్పించి, పితతోడన్=తండ్రితో (జోసెపుతో), కదలి-చనియెన్-వెడలి
పోయెను.
తాత్పర్యము :- హెరోద్ రాజు నీచబుద్ధిగలవాఁడు, సాటిలేని
సంపద గలవాఁడు. అప్పటికి రెండేండ్ల వయస్సునకు లోఁబడియున్న బిడ్డల
నెల్లరను జంపించెను. కానీ యేసు దైవము, విరోధి మానవమాత్రుఁడు.
కావున హెరోద్ రాజు కన్నులుగప్పి యేసు, తండ్రి వెంటఁ గదలి ఎటకో
వెడలి పోయెను.
కృష్ణపరముగా...
హెహెహె! రైదుఁడు, భూజాని, హేయబుద్ధి,
మాతులుఁడు రేఁగి శిశుపరంపరను దునిమె;
దైవమగు పట్టి మర్త్యుఁడౌ తద్విరోధి
కన్నులంగప్పి పితతోడఁ గదలి చనియె;
అర్థము
:- హెహెహె!=హిహిహీ! (పరిహాస వాచకము)
రైదుఁడు = (ఆశ్రితులకు) ధనములనిచ్చు వాఁడు, భూజాని= రాజు,
హేయబుద్ధి=నీచ బుద్ధికలవాఁడు, మాతులుఁడు=కృష్ణుని మేనమామ
యైన కంసుఁడు, రేఁగి= విజృంభించి, శిశు-పరంపరను= దేవకీదేవి
బిడ్డల నెల్లరను, తునిమెన్ = ఖండించెను, దైవము+అగు = దేవుఁడైన,
పట్టి=శిశువు (కృష్ణుడు), మర్త్యుఁడౌ= మరణశీలుఁడైన, తత్+విరోధి =ఆ
శత్రువైన కంసునియొక్క, కన్నులన్ + కప్పి =కన్నులకు మాయ కల్పించి,
పితతోడన్=తండ్రియైన వసుదేవునితో, కదలి-చనియెన్=వెడలి
పోయెను.
తాత్పర్యము :- ఆశ్రితులకు ధనములనిచ్చు రాజును, మేన
మామయు నైన కంసుఁడు నీచబుద్ధి కలవాఁడు, దేవకీదేవి బిడ్డలను
వరుసగా ఖండించెను. కానీ దైవమైన శ్రీకృష్ణుఁడు మరణశీలియైన
కంసుని కన్నులకు మాయ కల్పించి తండ్రియైన వసుదేవునితోఁ గదలి
తప్పించుకొని పోయెను.
యేసు పరముగా...
ఆతఁ డానంద జనకత నల్ల పెరిగి,
యేసు జనరక్షకఖ్యాతి నెసఁగి, గొల్ల
డై నిజాధీన పశువుల నరసికాచి
కొనుచు విహరించెఁ గొండలఁ గోనలందు.
అర్థము : అతఁడు= ఆ బిడ్డఁడు, ఆనంద జనకతన్ =
ఆనందమును చేకూర్చువాఁడగుచు, అల్లన్=క్రమముగా, పెరిగి=ఎదిగి,
యేసు=యేసు అను పేరుచే, జనరక్షక - ఖ్యాతిన్ = జనులకు రక్షకుఁడు
అనుకీర్తి చేత, ఎసఁగి =ఒప్పి, గొల్లఁడై=గొల్లవారి వృత్తి నవలంబించి
నట్టివాఁడై, నిజ+ఆధీన=తనవశమైయున్న, పసువులన్ =గొట్టెలను,
అరసి=జాగ్రత్తగాఁజూచి, కాచికొనుచున్ = కాపాడు కొనుచు, కొండలన్=
కొండలయందును, కోనలన్ = కోనలయందును, విహరించెన్ =
సంచరించెను.
తాత్పర్యము :-
:- ఆ బిడ్డఁడు ఎల్లరకు ఆనందము చేకూర్చుచు
పెరిగెను. యేసు అను పేరుగల్గి జనరక్షకుఁడను కీర్తిని గడించి గొల్లవాని
వలె గొట్టెలను కాచుకొనుచు కొండలలో కోనలలో విహరించెను.
కృష్ణపరముగా...
ఆతఁడా నందజనకత నల్ల పెరిగి
యే, సుజన రక్షకఖ్యాతి నెసఁంగి, గొల్లఁ
డైనిజాధీన పశువుల నరసికాచి
కొనుచు విహరించె కొండలఁ గోనలందు.
అర్థము : అతఁడు=ఆ బిడ్డఁడు ఆ ఆ విధముగా,
నందజనకతన్ =నందుఁడే జనకుఁడుగాఁ గల్గియుండి (అనఁగా
నందునకు కుమారుఁడై), అల్లన్ = క్రమముగా, పెరిగియే=ఎదిగిన
వాఁడగుచునే, సుజనరక్షక ఖ్యాతిన్ = సజ్జనులను రక్షింపఁగలఁడను
కీర్తిచే, ఎసఁగి=ఒప్పి, గొల్లఁడై=గొల్లవాఁడై, నిజ+ఆధీన=తనవశము
నందుండు, పశువులన్=ఆవులను, అరసి=జాగ్రత్తగాఁ జూచి, కాచి
కొనుచున్=త్రోలికాపాడుకొనుచు, కొండలన్ = కొండల యందును,
కోనలందు=కోనలందును, విహరించెన్ = సంచరించెను.
తాత్పర్యము : :- ఆ బిడ్డఁడు నందుఁడే తండ్రిగా పెరిగెను.
సుజన రక్షకుఁడను కీర్తిని గడించి, ఆవులను కాచుకొనుచు కొండలలో
కోనలలో విహరించెను.
యేసు పరముగా...
ఆ పుడమిజేఁడు దశ్శాసనాభిమాని
రాక్షసుఁడు, దేవసూతిపై రవులు కక్షఁ
బట్టి బంధించి శిక్షింపవలయు ననుచుఁ
బన్ను నతఁడింక నేమి కానున్నవాఁడో!
అర్థము : ఆపుడమి తేఁడు = ఆ (యూదువంశపు రాజు,
దుశ్శా సన=చెడ్డ శాసనములు చేయుటయందు, అభిమాని = ఇచ్ఛగల
వాఁడు, రాక్షసుఁడు=మహాక్రూరుఁడు, దేవసూతిపై= దేవుని కుమారుఁ
డైన యేసు పై, రవులు-కక్షన్ రగులుచున్న ద్వేషముతో, పట్టి-
బంధించి=పట్టుకొని నిర్బంధించి, శిక్షింపవలయున్ + అనుచు =
దండింపవలెనని, పన్నున్ = ప్రయత్నించుచున్నాఁడు, అతఁడు=ఆ
యేసు, ఇంకన్=ఇంకమీఁదట, ఏమి కానున్న వాఁడొ!=ఏమి
కాఁబోవుచున్నాఁడో! (మృత్యువునకు గుఱి కానున్నడు గదా! అని ధ్వని.)
తాత్పర్యము : :- ఆ యూదువంశపు రాజు మహాక్రూరుఁడు,
భయంకర శాసనములు చేయు స్వభావము కలవాఁడు. దేవుని
కుమారుఁడైన యేసుపై కక్షఁ బూనియున్నాఁడు. ఎట్లైనను పట్టి బంధించి
శిక్షింపవలెనని ప్రయత్నించుచున్నాఁడు. పాపము! ఆ యేసు ఏమి
కానున్నవాఁడోకదా!
కృష్ణపరముగా...
8.
=
=
ఆ పుడమితేఁడు దుశ్శాసనాభిమాని
రాక్షసుఁడు, దేవసూతిపై రవులు కక్షఁ
బట్టి బంధించి శిక్షింప వలయు ననుచుఁ
బన్ను నతఁడింక నేమి కానున్నవాఁడొ!
అర్థము : ఆ పుడమిజేఁడు=రాజైన ఆ దుర్యోధనుఁడు, దుశ్శాసన
తమ్ముఁడైన దుశ్శాసనునకు, అభిమాని=గౌరవపాత్రుఁడు, రాక్షసుఁడు
రాక్షసాంశతో జన్మించిన వాఁడు, దేవసూతి పై =వసుదేవ
కుమారుఁడైన కృష్ణునిపై (నామమునందు ఏక దేశగ్రహణము
శాస్త్రసమ్మతము), రవులు కక్షన్=రగులుచున్న ద్వేషముచే, (కృష్ణుఁడు
రాయబారమునకు వెళ్ళినపుడు) పట్టి బంధించి=పట్టుకొని త్రాళ్ళతోఁ
గట్టి, శిక్షంపవలయును+అనుచున్ = దండింపవలెనని, పన్నున్=
ప్రయత్నించుచున్నాఁడు, ఇంకన్ =ఇంక మీఁదట, అతఁడు =ఆ
దుర్యోధనుఁడు, ఏమి కానున్నవాఁడొ ! ఏమి కాఁబోవు చున్నాఁడో కదా!
(మృత్యువునకు గుఱికానున్నాఁడని ధ్వని)
తాత్పర్యము :- దుర్యోధన నృపతి రాక్షసాంశతో జన్మించిన
వాఁడు, దుశ్శాసనునకు గౌరవపాత్రుఁడు, వసుదేవ సుతుఁడైన కృష్ణునిపై
కక్షను బూని పట్టుకొని త్రాళ్ళతో బంధించి శిక్షింపవలెనని ప్రయత్నించు
చున్నాఁడు. ఆ దుర్యోధనుఁ డేమి కానున్నాఁడో కదా!
యేసు పరముగా...
క. శ్రీకలిత విశ్వరూప
ప్రాకట దర్శనము గ్రుడ్డివానికి నిడె సు
శ్లోకుండు, బాపురె! యహో
వా కన్నయ్యకు సముండు ప్రభుఁడు కలండే!
అర్థము : సుశ్లోకుండు=మిక్కిలి కీర్తింపఁ దగినవాడు, శ్రీకలిత=
శోభావంతమైన, విశ్వ=ఈ ప్రపంచము యొక్క రూప=ఆకారమును,
ప్రాకట-దర్శనము=చక్కఁగా, దర్శింపఁగల చూపును, గ్రుడ్డివానికిన్ +
ఇడె = ఒకానొక అంధున కిచ్చెను, బాపురె! = ఔరా!, యాహోవా-
కన్నయ్యకు = యహోవా కుమారుఁడైన యేసునకు, సముండు =
సాటియైనవాఁడు, ప్రభుఁడు=దైవము, కలండే!=ఎక్కడనైననున్నాఁడా!
(లేఁడనుట)
తాత్పర్యము :- మిక్కిలిగా కీర్తింపఁదగిన యేసు, ఒకానొక
అంధునకు ప్రపంచమును దర్శించు నిమిత్తము చూపు నొసంగెను.
ఆహా! యహోవా కుమారుఁడైన యేసునకు సాటివచ్చు దైవమే లేడు.
కృష్ణపరముగా..
శ్రీకలిత విశ్వరూప
ప్రాకట దర్శనము గ్రుడ్డివానికి నిడె సు
శ్లోకుండు, బాపురె! యహో !
వా! కన్నయ్యకు సముండు ప్రభుఁడు గలండే !
అర్థము : సుశ్లోకుండు=మిక్కిలి కీర్తింపఁదగినవాఁడు, శ్రీకలిత=
శోభావంతమైన, విశ్వరూప= (తనయందలి) విశ్వరూపముయొక్క,
ప్రాకట-దర్శనము=చక్కఁగా దర్శింపఁ గల చూపును, గ్రుడ్డివానికిన్ +
ఇడె = ధృతరాష్ట్రునకు ప్రసాదించెను, బాపురె!=ఔరా!, అహో!=ఆహా!,
వా!=వహ్వా! (ఈ మూడును ప్రశంసా వాచకములు), కన్నయ్యకు -
సముఁడు=కృష్ణునకు సాటియైన వాఁడు, ప్రభుఁడు- కలండే! = దైవము
కలఁడా! (లేడనుట. )
తాత్పర్యము :- కీర్తింపఁదగిన శ్రీకృష్ణుఁడు మహాశోభావంత
మైన తన విశ్వరూపమును ధృతరాష్ట్రునకుఁ జూపెను. ఆహా! కృష్ణునకు
సాటియైన దైవము మటొకడు లేడు కదా!
యేసు పరముగా...
సత్య భామా కరగ్రహ సరససత్త్వుఁ
డగుచు, ధర్మజయమున నిత్యాభిమాన
మొదవ నాశీలి యరివర్గవిదళనమున
దండి మగఁడాయె, నరబోధకుండు నాయె.
అర్థము : ఆశీలి=శీలవంతుఁడైన ఆ పురుషుఁడు, సత్య=
సత్యము అను, భామా=స్త్రీని, కరగ్రహ చేపట్టుటచే, సరస=(దయా)
రసముతోఁ గూడిన, సత్త్యుఁడు+అగుచున్=సత్త్వగున ప్రధానుఁడై,
ధర్మ-జయమునన్ = ధర్మమే జయించి తీరవలెనను విషయమున,
నిత్య+అభిమానము+ ఒదవన్ = ఎడతెగని అభిమానము కలుగఁగా,
అరివర్గ =కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అను
అరిషడ్వర్గమును, విధళనమునన్ =(తనయందు) కొట్టివైచుటచే,
దండి=ఉద్దండుఁడైన, మగడు+ఆమె=వీరుఁడైనాడు, (అట్లే) నర=తన
తోడి వారైన జనులకు, బోధకుండు+ఆయె-బోధకుఁడు కూడనైనాఁడు.
తాత్పర్యము :- ఆ శీలవంతుఁడు సత్యము అను స్త్రీని చేపట్టి,
దయారసము గలవాఁడై సత్త్వగుణ ప్రధానుఁడై, ధర్మమే జయింపఁ
గలదను నిశ్చయముతో నుండెను. కామ క్రోధాది అరిషడ్వర్గమును
జయించి తన తోడి జనులకు బోధకుఁడై విలసిల్లెను.
కృష్ణపరముగా..
సత్యభామా కరగ్రహ సరస సత్త్వుఁ
డగుచు, ధర్మజ యమున నిత్యాభిమాన
మొదవ నా శీలి అరివర్గవిదళనమున
దండి మగఁడాయె, నరబోధకుండు నాయె.
అర్థము : ఆ శీలి=శీలవంతుఁడైన ఆ పురుషుడు, సత్యభామా=
సత్యభామను, కరగ్రహ=వివాహమాడుటచే, సరస=(శృంగార)
రసముతోఁ గూడిన, సత్త్యుఁడగుచు=దేవగుణమైన సత్త్వగుణముచే
విశిష్టుఁడై, ధర్మజ = ధర్మరాజుయొక్కయు, యమున=యమునా నదీ
దేవతయొక్కయు, నిత్య+అభిమానము=ఎడ తెగని పూజ్య భావము,
ఒదవన్=తనయందు కల్గియుండఁగా, అరివర్గ=శత్రువులైన కౌరవాదు
లను, విదళనమునన్ = సంహరించు విషయమునందు, నర=అర్జును
నకు, బోధకుండున్=గీత బోధించినవాఁడును, దండి - మగడున్ =
గొప్పవీరుఁడను, ఆయె= అయినాఁడు.
తాత్పర్యము :-
:- ఆ శీలవంతుఁడు సత్యభామను వివాహమాడి
సరసుఁడై, సత్త్వగుణ విశిష్టుఁడై, ధర్మరాజు యొక్కయు యమునానదీ
దేవత యొక్కయు అభిమానమును పొందెను. కౌరవాది శత్రుసంహార
విషయమున అర్జునునకు భగవద్గీత బోధించెను.
యేసు పరముగా...
పాపభారము బుజమున వైచికొనిన
దైవ మకట! కిరాత యూధపతి బారి
యినుపశూలము పాదభంజన మొనర్పఁ
బ్రాణములు వాసె, స్తంభరూపత వహించె.
అర్థము : పాపభారము=ఎల్లజనుల పాపము అను భారమును,
భుజమున=తన భుజముపై, వైచికొనిన=వహించిన, దైవము=దేవుఁ
డైన యేసు, అకట!=అయ్యో!, కిరాత=కసాయి హృదయముగల,
యూధపతి= యూదువంశపు రాజుయొక్క, బారి=వశముననున్న,
ఇనుప-శూలము= శూలము వంటి యినుపమేకు, పాద-భంజనము+
ఒనర్పన్=రెండు పాదములను చీల్చుకొనుచు దిగఁగా, ప్రాణములు +
పాసెన్=ప్రాణములు విడిచెను, స్తంభ- రూపతన్=శిలువ యొక్క
ఆకారమును, వహించెన్ = యేసు ధరించిన వాఁడాయెను.
తాత్పర్యము :- సకల జనుల పాపభారమును మోసికొనివచ్చిన
యేసు, క్రూరుఁడైన యూదుల రాజునకుఁజిక్కెను. ఇనుపమేకును
రెండు పాదములనుండి దించి కొయ్యకునాటఁగా యేసు ప్రాణములు
విడిచి శిలువ రూపమును ధరించిన వాఁడాయెను.
కృష్ణపరముగా...
పాప-భారము, బుజమున వైచికొనిన
దైవమకట! కిరాతయూధపతి బారి
యినుపశూలము పాదభంజన మొనర్పఁ
బ్రాణములు వాసె, స్తంభరూపత వహించె.
అర్థము : భారము=భూభారమును, పాపన్=తొలఁగించుట,
బుజమున వైచుకొనిన=తన బాధ్యతగా స్వీకరించిన, దైవము=కృష్ణుఁడు,
అకట!=అయ్యో!, కిరాత -యూధ=బోయవారి సమూహమునకు, పతి=
నాయకుఁడైన వానియొక్క, బారి=వశమునందున్న, ఇనుపశూలము=
ఇనుముతోఁజేయబడిన ముసల శకలము, పాద -భంజనము+
ఒనర్పన్ = పాదమును చీల్చుకొనిపోఁగా, ప్రాణములు+పాసెన్=
ప్రాణములు విడిచెను; స్తంభ-రూపత=
స్తంభము అను నిశ్చేష్టస్థితిని,
వహించె= పొందిన వాఁడాయెను.
తాత్పర్యము :- భూభారమును బాపుట తన బాధ్యతగా
స్వీకరించిన కృష్ణుఁడు, కిరాతుఁడు ప్రయోగించిన ఇనుప ములుకుగల
బాణము పాదమును చీల్చివైనఁగా ప్రాణమును విడిచి నిశ్చేష్టస్థితిని
బొందెను.
యేసు పరముగా...
'తనువు చాలించి యవతారమును ముగించి
నంత తీరెనె? నావారలార! నాకు
నేన పునరుత్థాతుఁడ నౌదు నిక్క' మనియె
జేసు, దామాభినంద్యుఁడు, శ్రీకరుండు.
అర్థము : దామ+అభినంద్యుఁడు=పూలమాలలచే గౌరవింపఁదగిన
వాఁడును, శ్రీకరుండు=శుభమును చేకూర్చు వాఁడును (ఐన), జేసు=యేసు,
తనువు చాలించి=శరీరమును త్యజించి, అవతారమును ముగించినంతన్=
అవతారమును చాలించుటతోనే, తీరెనె!=అయినదా?, నావారలార!= ఓ
నా శిష్యులారా!, నాకు-నేన-నాయంతట నేనే, పునః + ఉత్తితుఁడనౌదు=
(మూఁడునాళ్ళకు) తిరిగి సమాధినుండి లేచి వచ్చెదను, నిక్కము+అనియె
=ఇది నిజము అని చెప్పెను.
తాత్పర్యము :- పూలమాలలచే నభినందింపఁ దగిన వాఁడును
శుభప్రదుఁడును నైన జేసు “శరీరమును విడుచుచున్నాను, ఐనను నా
జీవయాత్ర ముగిసినట్లు కాదు, మూడునాళ్ళ తరువాత నాకు నేనే సమాధి
నుండి లేచి వచ్చెదను” అని తన శిష్యులతోఁ జెప్పెను.
విశేషము :- శ్రీకరుఁడు అనఁగా “శోభావంతమైన నల్లని మచ్చలు
గల కరములు కలవాడు" అనియు చెప్పుకొననగును. సమాధినుండి లేచి
వచ్చిన యేసు చేతులయందు, మేకులు దిగఁగొట్టిన నల్లని మచ్చలు
శిష్యులకు కన్పించినవి. అందుచేత అతఁడు శ్రీకరుఁడు, "శ్రీకంఠుఁడు”
అని శివునకు ప్రసిద్ధ నామము. అనఁగా 'శోభావంతమైన నల్లని మచ్చ
కంఠమునందు కలవాఁడు' అని గదా వ్యుత్పత్యర్థము. అట్లే యేసు విషయము
నందును.
కృష్ణపరముగా...
“తనువు చాలించి యవతారమును ముగించి
నంతతీరెనె! నావారలార! నాకు
నేన పునరుత్థాతుఁడనౌదు నిక్క” మనియె
జే! సుదామాభినంద్యుఁడు, శ్రీకరుండు.
అర్థము : జే!=జయము జయము!, సుదామ+అభినంద్యుడు=
భక్తుఁడైన సుదామునిచే అభినందింపఁదగినవాఁడును, శ్రీకరుండు=
(కరగ్రహణ హేతువుగా) లక్ష్మీదేవి చేతియందుఁగలవాఁడునైన కృష్ణుఁడు,
తనువు చాలించి=శరీరమును త్యజించి, అవతారమును=కృష్ణావతారమును,
ముగించినంత=చాలించుటతోనే, తీరెనె!=అయినదా?, నావారలార! =నన్నే
విశ్వసించియున్న భక్తులారా!, నాకు-నేన-నాయంతట నేనే, పునరుత్థాతుఁడ
నౌదు=తిరిగి తిరిగి యవతరించుచుందును, నిక్కము+అనియె = నిజమని
చెప్పెను.
తాత్పర్యము :- జయము జయము! సుదామునిచే నభినందింపఁ
దగిన కృష్ణుఁడు తనను విశ్వసించిన భక్తులతో 'అవతారమును ముగించు
టయే అంతము కాదు. తిరిగి తిరిగి నేను అవతిరించుచునే యుందును.
ఇది నిజము' అని చెప్పెను.
విశేషము :- 'యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థాన
మధర్మస్య, తదాత్మా నాం సృజామ్యహం' అన్నది భగవద్వాక్యము. (ఎపుడు
ధర్మమునకు గ్లానియు, అధర్మమునకు విజృంభణమును కలుగునో అపుడు
నాకు నేనే సృష్టించుకొని అవతరించుచుందును అని శ్లోకార్థము.)
'నాకు నేను పునరుత్థాతుఁడనౌదు' అను మాటకు ఏతత్ గీతా
శ్లోకమే ప్రమాణము.
యేసు పరముగా...
పరలోక హారిమోక్ష
స్థిరపదపిత, దేవదేవ చిహ్నితుఁడౌ నీ
కరుణామయు చరితము నే
పురుషుఁడు వినుఁ జదువు నతఁడు పొందఁ డఘమ్ముల్ .
అర్థము : పరలోక=పరలోకమునందలి, హారి=మనోజ్ఞమైన,
మోక్ష=మోక్షమనెడు, స్థిరపద=నిశ్చలమైన స్థానమునకు, పిత=తండ్రి
యైన వాఁడు (అనగా పరలోకమునందున్న తండ్రి), దేవదేవ=దేవునికే
దేవుఁడని, చిహ్నితుఁడు+ఔ=పేరు తెచ్చుకొన్నవాఁడైన, ఈ కరుణా
మయు=ఈ యేసు క్రీస్తుయొక్క, చరితమున్=కథను, ఏ పురుషుఁడు =
ఎవఁడు, వినున్=వినునో, చదువున్ = చదువునో, అతఁడు=అట్టివాఁడు,
అఘమ్ముల్=పాపములను, పొందఁడు = కలిగియుండఁడు.
తాత్పర్యము :- మనోహరమైన మోక్షస్థానముగల పరలోకము
నందున్న తండ్రియు, దేవునకే దేవుఁడైన వాఁడును కరుణామయుఁడు
నైన ఈ యేసు చరిత్రము నెవఁడు వినునో యెవఁడు పఠించునో
అట్టివాఁడు పాపరహితుఁడు కాఁగఁలడు.
క.
పరలోకహారి, మోక్ష
కృష్ణపరముగా...
స్థిరపదపిత, దేవదేవ చిహ్నితుఁడౌ నీ
కరుణామయు చరితము నే
పురుషుఁడు వినుఁ జదువు నతఁడు పొందఁ డఘమ్ముల్ .
అర్థము : పర-లోక=శత్రుసమూహమును, హారి=సంహరించిన
వాడును (అనఁగా శిశుపాల దంతవక్రాది శత్రువులను చంపిన
వాఁడును), మోక్ష-స్థిర-పద=మోక్షము అను నిశ్చల స్థానమునకు,
పిత=తండ్రివలె కారణమైనవాఁడును, దేవదేవ= దేవతలకే దేవుఁడని,
చిహ్నితుఁడు +ఔ= పేరుగాంచినట్టివాఁడైన, ఈ కరుణామయు=
దయాస్వరూపుఁడైన యీ కృష్ణుని యొక్క చరితమున్ = కథను, ఏ
పురుషుఁడు=ఎవఁడు, వినున్ = వినునో, చదువున్=చదువునో,
అతఁడు=అట్టివాడు, అఘమ్మల్= పాపములు, పొందఁడు = కలిగి
యుండఁడు.
తాత్పర్యము :- శత్రుసంహారకుఁడును, మోక్షస్థానమునకు
కారణ భూతుఁడును, దేవదేవుఁడును, దయాస్వరూపుఁడునగు ఈ
కృష్ణుని చరిత్రను ఎవఁడు వినునో ఎవఁడు పఠించునో అతఁడు
పాపరహితుఁడు కాఁగలడు.
ప్రశ్న :- చివరిగా ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆదరణకర్త వస్తాడు అని ద్వితీయ దైవగ్రంథములో ఉండుట వలన ఆయన వచ్చుట సత్యమేయగును. అయితే మూడు దైవగ్రంథములలో అధర్మములను ఖండించి, దేవుడు ధర్మసంస్థాపన చేసినట్లు సంపూర్ణముగా జ్ఞానము చెప్పబడినది. ఇంత జ్ఞానము చెప్పిన తర్వాత కూడా దేవుడు తిరిగి మనిషిగా రావలసిన అవసరమేమున్నది?
జవాబు :- ద్వితీయ దైవగ్రంథములో ఆదరణకర్త వస్తాడని చెప్పియుండుట నిజమే. అయినా ఆదరణకర్త అంటే ఎవరు? ఎట్లుంటాడు? అను విషయము మనుషులకు అర్థముకాక ఒక మతమువారు “ఆదరణకర్త మా ప్రవక్తయే” అని చెప్పుచున్నారు. అలా వచ్చియుంటే మాకు కూడా సంతోషమే. ఈ విషయములో వారు పొరపాటు పడియుండవచ్చును. ముహమ్మద్ ప్రవక్తగారే ఆదరణకర్తయని కొందరు ముస్లీమ్లు చెప్పుచున్నా ఖురాన్ గ్రంథములో జిబ్రయేల్ బోధించునప్పుడు “నీవు మనుషులను హెచ్చరించువాడవే”యని 13వ సూరా 7వ ఆయత్లో చెప్పారు. అంతేకాక సూరా 3, ఆయత్ 80లో (3-80) “దూతలను, ప్రవక్తలను దేవునిగా చేసుకొమ్మని మీకు ఎప్పుడూ చెప్పలేదు" అని ఉన్నది. ఆదరణకర్తయనగా భారతదేశ భాషలో భగవంతుడని అర్థము. దేవుడే ఆదరణకర్తగా వచ్చుట వలన ప్రవక్తగారికి ఆదరణకర్తకు సంబంధము లేదని చెప్పవచ్చును. అంతిమ దైవగ్రంథము వచ్చినది కావున ఇంకొక దైవగ్రంథము వచ్చుటకు కూడా వీలుపడదు. ఇంకా గొప్ప జ్ఞానమున్న గ్రంథము వచ్చినా వాటిని జ్ఞాన గ్రంథములుగా చెప్పవచ్చును గానీ దైవగ్రంథము అనుటకు వీలులేదు.
సృష్ట్యాదిలో జ్ఞానము చెప్పబడినా ఈ మధ్య ఐదువేల సంవత్సరముల నుండి మూడు దైవగ్రంథములు బయటికి వచ్చినవి. మూడు దైవ గ్రంథములలో నాలుగు అధర్మముల అణచివేత, మూడు ధర్మముల ప్రతిష్ట గలదు. ఈ విధానము గడచిన మూడు యుగములకు సరిపోగలదు. నేడు నడుస్తున్న కలియుగములో మూడు గ్రంథములలో చెప్పిన జ్ఞానముకంటే కొంత వేరుగాయున్న జ్ఞానము అవసరము. గడచిన మూడు యుగములలో ముఖ్యమైన 'మతము' అను అధర్మము
లేదు. ఇప్పుడు ముందుయున్న నాలుగు అధర్మములకంటే మించినది 'మతము’ అనబడు అధర్మము వచ్చినది. ఇంతకుముందు దేవుడు అవతరించినది మూడు యుగములనుండి మనుషులలో పాతుకొనియున్న అధర్మములను తీసివేయుటకు. అయితే ఇప్పుడు అప్పటి అధర్మములకంటే మించినది, బలమైనదియైన ‘మతము’ అను పెద్ద అధర్మము పుట్టుకొచ్చినది. దానిని లేకుండా చేయుటకు అప్పటి బోధలకంటే, అప్పటి జ్ఞానముకంటే మించిన జ్ఞానము అవసరమనిపిస్తున్నది. పూర్వము వేయిమంది జనాభాలో కేవలము పదిమంది లేక పదిహేనుమంది ఒక కులమునకు చెందిన వారుండెడివారు. వేయిమందిలో అన్ని కులములు ఉండగా ఒక అగ్రకులము వారు ఒకటి లేక రెండు లేక మూడు కుటుంబముల వారుండేవారు. అగ్రకులము వారికే చదువు వచ్చెడిది. వారికే ధర్మములుగానీ, అధర్మములుగానీ తెలిసెడివి. మిగతా మనుషులందరూ చదువు లేనివారై, ధర్మాధర్మములు తెలియనివారై సాధారణ జీవితమును గడిపెడివారు.
పూర్వము అధర్మములను ఆచరించువారు కొంతమందే యుండెడి వారు. వారికొరకే దైవగ్రంథములలోని జ్ఞానము చెప్పబడినది. అయితే పూర్వము వేయికి పదిలేక ఇరవైమంది మాత్రమే ధర్మాధర్మముల ఆచరణ కల్గియున్న వారుండగా, నేడు వేయిమందికి 999 మంది 'మతము' అనబడు అధర్మమును కల్గియున్నారు. మతము పూర్వపు నాలుగు అధర్మములకంటే ఎక్కువ సాంద్రతగా మనుషులలో అంటుకొని పోయి వున్నది. మతము అను జాఢ్యము ఏడు లేక ఎనిమిది సంవత్సరముల బాల్యము వద్దనుండి ప్రారంభమగుచున్నది. మతము అను రోగము జాఢ్యము రూపములో అంటుకొనియుండుట వలన, దానినుండి మనుషులను బయటికి లాగటానికి దేవుడు ముందు చెప్పిన బోధలకంటే మించిన జ్ఞానమును చెప్పవలసియున్నది. దీని విషయమై ద్వితీయ దైవ గ్రంథములో ఏసు ముందే ఒక మాట చెప్పియున్నాడు. ఏసు భూమిమీద ఉన్నప్పుడే మతాల, కులాల మాయను గురించి చూడగలిగాడు. అవియే ఆయన మరణమునకు కారణమైనాయని చెప్పవచ్చును. వాటి అసూయలు ఏసు మీద బాగా పని చేశాయి. అందువలన ఆయన ముందే తన మాటలలో చెప్పినది చూస్తాము.
(యోహాను 16-12, 13) “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవు. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.”
ఈ వాక్యము అప్పటికేయున్న మతమను అధర్మమును గురించి చెప్పినదేయని అర్థమగుచున్నది. అప్పుడు మతమును గురించి అది పెద్దమాయ యని చెప్పినా, మనుషులు సహింపలేని విధముగా మత మాయలో కూరుక పోయి ఉండుట వలన ఆయన అలా చెప్పాడు. రాబోవు భగవంతుడు తప్పక మతము అను మాయను తొలగించుటకే వచ్చును, కనుక “మిమ్ములను మతరహితమైన సత్యములోనికి నడిపించును” అని సూచనప్రాయముగా చెప్పాడు. ఆయన స్వయముగా తనంతట తాను బోధించక అప్పటి కాలములోయున్న మత అరాచకములను, మత పోరాటములను, మతము వలన జరుగు యుద్ధ వినాశనములను చూచి, అప్పుడు ఏమి జరుగుచున్నదో దానిని విని, దానిని గురించే బోధించును. అనగా మతము యొక్క అధర్మమును గురించి చెప్పునని చెప్పడమైనది. ఈమారు వచ్చు దేవుడు మూడు దైవగ్రంథముల జ్ఞానమును మించిన జ్ఞానమును చెప్పవలసియుండును. అందువలన “రాబోవు ఆదరణకర్త నేను చెప్పని వాటిని కూడా చెప్పునని” ద్వితీయ దైవగ్రంథములో చెప్పడమైనది. ఇప్పుడు రాబోవు భగవంతుడు మత మాయను గురించి ముందు చెప్పిన బోధలకంటే ఎక్కువ బోధలు చెప్పవలసియున్నది. అందువలన దేవుని సేవలో భాగముగా మేము ముందే మతరహిత జ్ఞానమును బోధించుచున్నాము. మతమును
వీడండి, పథమును అనుసరించండి.
సమాప్తము.