మన పండుగలు cloud text corrected 2nd sep 2024
1) మన పండుగలు.
2 )యుగాది.
3) భోగిమంటలు.
4) సంక్రాంతి.
5) దశరా.
6) శివరాత్రి.
7)శ్రీరామ నవమి.
8) శ్రీకృష్ణాష్టమి.
9) నాగుల చవితి.
10) వినాయక చవితి.
11) పాఠరనపండుగలు.
12) చివరి మాట.
-------
మన పండుగలు.
అనంత విశ్వములో శతకోటి జీవరాసులున్నాయని కొందరనుచుండగా వినియున్నాము. అది ఏదో
పాతయుగములోని మాటై ఉండవచ్చును. ఇపుడు ఒక భారతదేశములోనే 100 కోట్ల మనుషులే ఉన్నారు. ఎన్నో
జాతుల జీవరాసులనన్నిటిని కలిపి నూరుకోట్లు అన్నారంటే బహుశ ఆ సంఖ్య కృతయుగములోనిదై ఉండవచ్చును.
కృతయుగములోనే కొద్ది సంఖ్యలోనే మనుషులున్న కాలములోనే, మనుషులలో జ్ఞానము సన్నగిల్లిపోయి అజ్ఞానము
పెరిగి పోయినది. మానవుడు అంతర్ముఖ ధ్యాసను వదలిపెట్టి, బాహ్య ధ్యాసలో పడిపోయాడు. కోటి విద్యలు
కూటికొరకేనన్నట్లు అన్ని పనులు బయటి ఆహారమునకే చేయను మొదలు పెట్టాడు. అటువంటపుడు తన కంటికి
కనిపించు ఫలితము మీద ధ్యాసను పెంచుకొన్నాడు. కనిపించని ఫలితమైన పాపపుణ్యముల మీద ఏమాత్రము
ధ్యాసను పెట్టలేకపోయాడు. అటువంటి సమయములో మనుషులలో ఆధ్యాత్మిక దృష్ఠిని పెంచడము కొరకు మరియు
పాపభీతిని పెంచుటకొరకు ఆనాటి జ్ఞానులు ఎన్నో విధముల మనుషులలో జ్ఞాన చైతన్యమును కల్గించుటకు పూనుకొన్నారు.
అందులో భాగముగా ప్రతి మనిషి తన జీవితములో వెనుతిరిగి చూచుకొనునట్లు, తన గత జీవితములో ఏమి చేశాను,
ఏమి సాధించానని బేరీజు వేసుకొనునట్లు చేశారు. ఏ విషయమైనా మనిషికి బాగా అర్థము కావాలంటే దానిని ఇంకొక
దానితో పోల్చి చూపితే బాగుంటుందని తెలిసిన పెద్దలు చెట్టుకు వచ్చు ఫలితము లేక ఫలము అయిన పండును
ఉదాహరణగా చూపుచూ ఒక ప్రక్రియను మనుషుల మధ్యలో పెట్టారు. చెట్టుకు సంవత్సరమునకు కాయలు కాయడము,
పండుగ మారడము అందరికి తెలిసిన విషయమే. అందరికి తెలిసిన విషయముతో సమానముగా పోల్చి చూపడము
వలన అందరికి బాగా అర్థమగునను ఉద్దేశ్యముతో పెద్దలు ఆ ప్రక్రియను “పండుగ” అను పేరుతోనే ఆచరించునట్లు
చేశారు. ఒకప్పుడు ఒకే ఇందూమతముగా నున్న మానవజాతి నేడు అనేక మతములుగా చీలిపోయి ఉన్నప్పటికి
పూర్వము కృతయుగములోనే పెద్దలు పెట్టిన ఆచరణ ఈనాటికి చెక్కు చెదరక ఉన్నది. నేటికిని మనుషుల మధ్యలో
ఆచరణ ఉన్నప్పటికీ ముఖ్యమైన అర్ధము లేకుండ పోయినది. అర్థములేని ఆచరణ వలన ఎటువంటి ప్రయోజనము
లేకుండ పోయినది. నేడు మనుషుల మధ్యలో వ్యర్థముగా మిగిలిపోయిన ఆనాటి పెద్దల ప్రక్రియను అర్థమగునట్లు
వివరించు కొందాము.
కాలము పవిత్రమైనది మరియు దైవస్వరూపమైనది. ఒక మాటలో కాలమే నేనని దేవుడు కూడ గీతయందన్నాడు.
కాలమెంత గొప్పదైనా మనకు సహజమైనదిగ ఉన్నది. దానివిలువ ఏమాత్రము కనిపించకున్నది. ఎవరూ కాలమును
గురించి ఆలోచించడము లేదు. కొందరు పెద్దలు కాలము విలువైనదని గ్రహించి టైమ్ ఈజ్ మని (కాలము డబ్బుతో
సమానము) అన్నారు. ఆ మాటకంటే కూడ కాలము విలువైనదని మేమనుచున్నాము. ఎందుకనగా! పోయిన డబ్బును
తిరిగి సంపాదించ వచ్చును. కానీ జరిగిపోయిన కాలమును తిరిగి సంపాదించలేరు.
ప్రతి జీవరాసి కాలమును అనుభవిస్తూ ఉన్నది. ప్రతి జీవరాసి శరీరముతో ఎన్నో మంచి చెడుపనులయందు
కాలమును వినియోగించు చున్నది. జరిగెడి కాలమందు మంచిపని జరిగినా, చెడ్డపని జరిగినా చేసెడి జీవరాసికే వాటి
ఫలితమూ, అనుభవమూ దక్కును. కానీ కాలమునకు మంచి చెడ్డతో ఏమాత్రము సంబంధములేదు. అందువలన
కాలము దైవస్వరూపమైనదేననుటలో సందేహము లేదు. కాలము ఒక మనిషికి, ఒక జాతికి, ఒక దేశమునకే పరిమితమైనది
కాక యావత్ జగతికంతటికి వినియోగింపబడుచున్నది. ఉదాహరణకు ఇండియాలో ఉన్న వ్యక్తికి, అమెరికాలో ఉన్నవ్యక్తికి
కాలమొకే విధముగ ఉన్నది. అందరికి సమానమైన కాలములో వారివారి పనులూ, వారివారి అనుభవములూ
వేరువేరై ఉండవచ్చును అయినా కాలమందరికి ఒక్కటే. అందువలననే కాలము దైవస్వరూపమని చెప్పవచ్చును.
జన్మతో ప్రారంభమైన కాలము మరణముతో అంతమౌచున్నది. జన్మకు మరణమునకు మధ్యనున్న కాలమును
జీవితము లేక జీవిత కాలము అంటున్నాము. జీవిత కాలములో కొందరు మంచిగ, కొందరు చెడ్డగ జీవితమును
సాగించుచున్నారు. అనంతమైన కాలములో ఎవరు ఎన్ని విధముల బ్రతికినా చివరకు వారు కాలగర్భములో కలసిపోవువారే.
జీవితకాలములో ప్రత్యేకత కల్గిన వారిని చిరంజీవులని అనడము జరుగుచున్నది. వారి జీవితకాలము కొద్దియే
అయినప్పటికీ వారి జీవిత ధ్యేయము చాలా గొప్పదిగ ఉండును. వారు అందరిలాగకాక జీవితములో ప్రత్యేకమైనదియే
సాధించి ఉందురు. అటువంటి వారిని కారణజన్ములు, చిరంజీవులని అనుచున్నాము.
ఈ కాలములో కాలమంటే ఏమిటి? అని యోచించక వృథాగా కాలము గడిపి పుట్టలోని చెదలు పుట్టదా!
గిట్టదా! అనులాగున ఏమిటికి సార్థకము లేని జీవితమును చాలామంది గడుపుచున్నారు. క్షణ క్షణము మన శరీరములో
మార్పు జరుగుచున్నది. క్షణ క్షణ మార్పుల చేతనే బాల్యమునుండి వృద్ధాప్యమునకు శరీరము చేరుకొనుచున్నది.
దినదినమూ కాలము జరుగుకొలది మృత్యువు దగ్గరవుచున్నది. జరుగు కాలములో ఏదో ఒక దినము మృత్యువును
చేరవలసిందే. అయినప్పటికి జరిగిపోవు కాలమును దృష్టిలో పెట్టుకొని మరణము దగ్గరవుతున్నది కదా! అని ఎవరు
తలవడము లేదు. మనము తలచిన, తలవకుండిన కాలము ఆగునది కాదు, మృత్యువు రాకమానదు.
మానవుని దృష్ఠిలో విలువ లేని కాలమునకు విలువ కల్పించాలనీ, జరిగిన కాలము తిరిగిరాదని అర్థమగునట్లు
చేయాలనీ, నీ జీవిత కాలము కొద్ది పాటియేననీ, ఆ కొద్దిపాటి కాలము కూడ ఖర్చయిపోతున్నదని ఆలోచించాలనీ,
జరిగిన నీ జీవితకాలములో ఏమి సాధించానని యోచించాలనీ, అసలు కాలమంటే ఏమిటో కనువిప్పు కల్గించాలని
పెద్దలు మనుషుల చేత ఆచరింపజేసిన ప్రక్రియనే పండుగ అనుచున్నాము. కాయ కొంత కాలమునకు పండుగ
మారుచున్నది. కాయ అనునది పండుగ పరివర్తన చెందుట మనకు పూర్తిగ తెలిసిన విషయమే. మార్పువచ్చిన
పండునుండి పుట్టిన పదమే “పండుగ”.
సాధారణముగ ప్రకృతి సిద్ధముగ ప్రతి చెట్టు సంవత్సరమున కొకసారి పుష్పించి కాయలు కాయడము సహజము.
చెట్టునుండి కాయ కాచి పండుగ మారుటకు వ్యవధి సంవత్సర కాలము పట్టుచున్నది కదా! కావున చెట్టును ఉదాహరణగా
తీసుకొందాము. చెట్టు నిండు జీవితములో ఒకసారి కాయకాచి ఫలముగా మారుటకు ఒక సంవత్సర కాలము
గడచిపోవుచున్నది. అట్లే మానవుని జీవితములో ఒక సంవత్సర కాలము గడచిన దానిని పండుగ అనుచున్నారు.
కాయ పండుగ మారినంత కాలమని పండుగయని పేరు పెట్టారు. చెట్టులో కాయ పక్వమునకొచ్చినంత కాలమనీ,
అదియే మానవ జీవితములో పక్వదినమనెడివారు. ఇప్పుడు పక్వదినము అను మాటను పర్వదినము అంటున్నాము.
ఈ విషయమును వివరముగా తెలుసుకొంటే ఈ విధమైన అర్థము గలదు.
చెట్టు సంవత్సర కాలమునకు తన సారమైన ఒక పండునిచ్చి పరులకు ఉపయోగపడినది. నీవు ఇతరులకు ఏ
విధముగ ఉపయోగపడినావు అని గుర్తువచ్చునట్లు, సంవత్సర కాలములో తాను సాధించిన ఫలితమేమి అని యోచించునట్లు
ఒక దినమును పండుగ అను పేరుతో ఉంచారు. నిత్య జీవితములో మునిగి పోయిన మనిషి కాలమును మరచి
పోయాడు. కావున నీ జీవితములో కొంత కాలము గడచిపోయినదని గుర్తింపు వచ్చునట్లు కూడ పండుగనుంచారు.
ఉదాహరణకు యుగాది పండుగను తీసుకొందాము. పోయిన సంవత్సరము యుగాది పండుగ చేశాము, ఈ సంవత్సరము
కూడ చేయుచున్నాము. దీనినే క్రొత్త సంవత్సరము అని కూడ అనుచున్నాము. పూర్వము పెద్దలు తమ జీవితములో
ఒక సంవత్సరము గడిచిపోయినదనీ, మరియొక క్రొత్త సంవత్సరము జరుగబోవుచున్నదనీ, జరిగిన సంవత్సరములో
నేనేమి జ్ఞానమును సాధించానని వెనుతిరిగి చూచుకొనెడివారట. అందువలన ఆ యుగాది దినమందు నిత్య జీవిత
కార్యములలో లగ్నముకాక అన్ని వదలి విశ్రాంతి తీసుకొని, వెనుకటి కాలమును గూర్చి యోచించి ఈ సంవత్సర
కాలములో నేనేమి చేశాననీ, దైవమార్గములో ఏమి సాధించాననీ, ఈ కాలములో చెడుగా ప్రవర్తించానా, మంచిగా
ప్రవర్తించానాయనీ లెక్కవేసుకొనెడి వారు. ఆ దినమంతయు తన ఆధ్యాత్మిక జీవితమును గురించి యోచించుచు
గడిపెడివారు. మిగత దినములలో ఆహారమును గురించి యోచించినట్లు ఆ దినము ఏమాత్రము తిండి గుడ్డ ధ్యాస
రాకుండునట్లు, బయటి జీవితము యొక్క ఆలోచన ఏమాత్రము లేకుండునట్లు, కొంత కాలమునకు ముందే అన్ని
ఆహార పదార్థములు అన్ని దినములకంటే మంచిగ ఉండునట్లు సమకూర్చుకొనెడివారు. ఆహారమందు కానీ,
గుడ్డలందు కానీ చింతలేకుండ సమకూర్చుకొని ప్రక్క పనులు అన్నియు వదలివేసి జరిగిపోయిన కాలమును గూర్చి
యోచించడము ఆనాటి కర్తవ్యమై ఉండెడిది. ఆ దినము తన జీవిత కాలమును గూర్చి యోచించునది కావున జ్ఞాన
సంబంధమైన దినముగ భావించుకొనెడి వారు. నా జీవితము ఇంతకాలము ఈ విధముగ గడచిపోయినది, జరుగబోవు
పండుగ కాలము వరకు సారాంశమైన దైవసంబంధమైన జ్ఞానజీవితమును గడుపవలయునని కోరుచు
ప్రార్థనామందిరములలోనో ఇంటిలోనో దేవుని ఆరాధనలు జరిపెడివారు.
నీ జీవితము కొంత కాయనుండి పండుగ మారిపోయినదని, ఎప్పుడు రాలిపోతుందో చెప్పలేమని యోచించుటకు
గుర్తింపుగ ఆనాడు పెద్దలు పండుగనుంచారు. నిత్య జీవితములో లగ్నమైయున్న మానవునికి నీ ఆయుస్సు కొంత
గడిచిపోయినదనీ, గడిచిన కాలములో పుట్టి ఏమి సాధించావని తెల్పుటకే పెద్దలు పండుగ నుంచారు. ఈ పండుగలు
ఒక్క మతములో కాక అన్ని మతములందు ఉండడము గమనింపదగ్గ విషయము. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క
పండుగ నిర్ణయించబడి ఉన్నది. పూర్వము అన్ని మతముల పెద్దలు ఒకే భావముతో పండుగలు ఉంచారో లేదో
చెప్పలేము. అయినా పండుగ అంటే కాయలాంటి నీ జీవితము కొంత పరిపక్వతకు వచ్చి పండు అయినదని తెలుపునదే
పండుగ.
కాయ అనగా పక్వమునకు రానిదనీ, మాగక పచ్చిగయున్నదనీ అందరికి తెలుసు. కాయ అనునదేదైనవుంటే
అది తప్పక పండుగ మారితీరవలసిందే. ఎటువంటి కాయ అయినా పక్వానికి వచ్చినపుడు దానిని పండు అనుచున్నాము.
కాయ పండుగ మారవలసినది ఒక చెట్టుకే కాదు మనిషికి కూడ గలదు. జీవితమను కాయనుండి మోక్షమను
పండుగా మనిషి మారవలసియున్నది. ఒక జీవి మోక్షమను పండుగా మారనంతవరకు జీవితమను కాయగా
ఉండవలసినదేనని తెలుపుటకు జీవితములో జీవి నివసించు శరీరమును “కాయ” అని పెద్దలన్నారు. తెలుగు భాషలో
పదమునకు అందమును చేకూరునట్లు అనేక పదములకు చివరిలో “ము” ను చేర్చడము సహజము. ఉదాహరణకు
దీప అను పదమునకు ము ను చేర్చి దీపము అనినట్లు అదే విధముగా కాయ అను పదమునకు ము ను చేర్చి
“కాయము” అన్నారు. అందువలన కొన్ని పదములలో చివరి అక్షరమునకు అర్ధముండదని తెలియవలెను. దీపకాంతి
అన్నపుడు 'ము' ను అర్ధములేనిదిగా ప్రక్కన పెట్టాము కదా! అలాగే శరీరరంగు అనునపుడు అతని యొక్క కాయ
చాయ అనుచున్నాము కదా! అప్పుడు కాయము చాయ అనలేదు కదా! అంటే అక్కడ కాయ ప్రక్కన 'ము' కు
విలువలేదన్నమాట. కావున మానవ శరీరమును కాయము అని అనినప్పటికీ అది కాయగానే లెక్కించవలెను. మానవ
దేహము కాయ లాంటిదే అనుకొన్నాము కదా! అందువలననే కొందరు ఆత్మను తెలిసిన పెద్దలు ఆధ్యాత్మికపద్దతిలో
“కాయ” మను పుట్టలోన చందమామ అని ఒక తత్త్వమును కూడ వ్రాశారు. కావున మన శరీరము కాయలాంటిదే
అది “పండుగ” మారవలసిందే. ఆ విధానమును తెల్పు బయటి ప్రక్రియయే నేడు మన మధ్యలోనున్న పండుగ అని
తెలియవలెను.
ఇప్పటి కాలములో అన్ని మతముల పండుగలు ఒకే పద్ధతి, ఒకే భావముగ ఉన్నవనుకుంటాము. పండుగ
అంటే అన్ని మతముల వారు క్రొత్త దుస్తులు ధరించడము, మంచి తిండి తినడము, ఏదో ఒక దేవున్ని ఆరాధించడము,
మ్రొక్కడము పరిపాటిగ ఉన్నది. కొందరు మాత్రము తిండి కోసమే పండుగ అన్నట్లు అన్ని దినములకంటే ఆ దినము
ఎక్కువ తిని ఆయాసపడుచున్నారు. కొందరు ఊయల ఊగడమో, ఆటలు ఆడడమో చేయుచు సంతోషపడుచున్నారు.
కొందరు తాగి తందనాలాడుచున్నారు. కొందరు పేకాటయందే అన్యచింత లేకుండ దినమంతా గడుపుచున్నారు.
కొందరేమో దేవుని మ్రొక్కుటకు లైసెన్సు దినమన్నట్లు ఆ ఒక్క దినము ఇష్టముండినా లేకుండినా మ్రొక్కి చేతులు
దులుపుకొంటున్నారు. కొందరు ఉద్యోగస్తులు ఉద్యోగమునకు సెలవు దినముగ ఉండుననీ, పండుగంటే డ్యూటీ (పని)
లేని దినమని సంతోషిస్తున్నారు. కొందరు వ్యాపారస్తులు గడచిన సంవత్సరము ఎంత పాపము, ఎంత పుణ్యము
సంపాదించామని లెక్కించక, డబ్బు ఎంత సంపాదించామని లాభనష్టాల లెక్కలు చూచు కొనుచున్నారు.
పూర్వము పెద్దలు పెట్టిన భావమంతయు మట్టిపాలై పండుగంటే ఏమిటో అసలైన అర్థమే తెలియక పోయినది.
పూర్వము సంవత్సరమున కొక పండుగ ఉండెడిది. తర్వాత కొంత కాలమునకు మనిషి జ్ఞానిగా మారాలంటే మరికొన్ని
పండుగలవసరమని నిర్ణయించిన పెద్దలు కొన్ని ముఖ్యమైన పండుగలను ఉంచారు. పెద్దలు అర్థముతో కూడుకొన్న
పండుగలను ఉంచగా అర్థముతో ఆచరించని ప్రజలు పెద్దలు చెప్పని వాటిని కూడ పండుగలుగా ఆచరించుచున్నారు.
నేపద్యములోనే ఇపుడు సంవత్సరమునకెన్నియో లెక్కలేనన్ని పండుగలు ఉన్నవి. పూర్వమొక్కడే దేవుడను భావముండెడిది.
ఇపుడు అనేకమంది దేవుళ్ళైనారు, అనేక పండుగలైనవి. మానవ జీవితమునకు కొలబద్ద పండుగని ఏమాత్రము
యోచించని స్థితిలో మనము ఎన్నియో పండుగలు చేసాము, ఇక ఎన్నియో పండుగలురానున్నవి. ఇప్పటినుండి ఏ
విధముగ చేయదలచుకొన్నారో! మీరే బాగా యోచించుకొని పండుగలు చేయండి.
యుగాది.
కంటికి కనిపించు ఈ జగత్తంతయు ఒక రోజు ప్రారంభమై ఆనాటినుండి కొనసాగుతూనే ఉన్నది.
ప్రపంచములోని జీవరాసులన్నిటికి చావు పుట్టుకలు గలవు. అందువలననే ఈ జీవరాసులన్నిటినీ జగతి అంటున్నారు.
'జ' అనగ పుట్టునదని 'గతి' అనగా చావునదని అర్థము గలదు. జగతి అను శాశ్వత నామమును గల్గిన ఈ జీవ
సముదాయము ఏదో ఒక రోజు పుట్టి, ఏదో ఒక రోజు లేకుండ పోవునదని అందరు తెలుసుకోవలయును. ఒక
మనిషి పుట్టి కొంతకాలముండి చనిపోవుట అందరికి తెలిసిన సత్యమే. అతను ఉండు కొంత కాలమును అతని
ఆయుస్సు అంటున్నాము. మనిషి ఆయుస్సుకు కొలమానముగ నిమిషములు మొదలుకొని సంవత్సరముల వరకు
గలవు. అట్లే పుట్టి కొంత కాలముండి పోవు ప్రపంచమునకు కూడ ఆయుస్సు కలదు. దాని కొలమానము యుగముల
లెక్కలో ఉండును. మనిషి పుట్టిన దినమును జన్మదినమనియు, జాతకమనియు చెప్పుచుందురు. అట్లే ప్రపంచము
పుట్టిన దినమును 'యుగ ఆది' అనెడివారు. దానినే కొంతకాలమునకు 'యుగాది' అనెడివారు. కాలము జరుగుకొద్ది
యుగాది కూడ పోయి 'ఉగాది' అయినది. రాబోవు కాలమునకు ఇంకా ఏ పేరుగా మారిపోతుందో తెలియదు.
నేటి కాలములో కొందరు తమ పుట్టినరోజును ప్రతి సంవత్సరములో పండుగ చేసుకొనుచుందురు. తీపి
పదార్థములు పంచి తన పుట్టిన దినమని తెలియజేయుచుందురు. జన్మదిన వేడుకలు ప్రస్తుత కాలములో ప్రబలిపోయినవి.
కాని పూర్వము ఎవరూ తమ జన్మదిన వేడుకలు జరుపుకొన్నట్లు చరిత్రలో లేదు. శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి వారు
బ్రతికి ఉన్నపుడు వారు చేసుకొన్నట్లు ఆధారములు లేవు. పూర్వకాలములో వ్యక్తిగత పుట్టిన దినములు ఎవరు జరుపుకోక,
సమిష్టిగ ప్రపంచము యొక్క పుట్టిన దినమును చేసుకొనెడివారు. ఆ దినమునకే 'యుగ ఆది' అనిపేరు పెట్టి అన్నిటికంటే
మిన్నగా, దానికంటే మించిన పండుగలేనట్లు చేసుకొనెడివారు. కాలము జరుగుకొలది తర్వాత చాలా పండుగలు
తయారై అన్నిటిలాగే ఇదీ ఒక పండుగైనది. ఇంకనూ కొంతకాలము జరిగిపోతే ఈ పండుగ లేకుండ పోయే స్థితి
ఏర్పడుతుందేమో! ఇప్పటికే కొంత పేరు మారింది, కొంత ఆచరణయు మారినది. విదేశీ సాంప్రదాయమైన జనవరి
మొదటి తేదీ సంవత్సరాది అయినది. రాబోవు కాలములో హిందూ సమాజములో యుగాది ఉంటుందో లేదో చెప్పలేము.
ఇందువులు హిందువులుగ మారి వారి సంస్కృతినే మరచి పోయినా, ఆదిలో పుట్టిన ఇందువుల జాతి మరి
ఏ ఇతర మతములుగ మారిపోయినా, ఇందూ సంస్కృతిని మానవులు వీడినా, ఆ సంస్కృతి మనుషులను వదలలేదని
చెప్పుటకు కొన్ని తార్కాణములు మిగిలి ఉన్నవి. వాటిలో ముఖ్యమైన ఒకదానిని వివరించుకొందాము.
ప్రస్థుత కాలములో భూమండలములో ఎన్నో దేశములు గలవు. అట్లే ఎన్నో మతములూ, ఎన్నో సంస్కృతులూ,
ఎన్నో భాషలూ, ఎన్నో సాంప్రదాయములు గలవు. భూమి మీద మానవులందరు ఎన్ని రకములుగ ఉన్ననూ, అందరికి
పగలు రాత్రి ఒక్కటే. అంతేకాక వారమునకు ఏడు దినములు, నెలకు ముప్ఫైరోజులు, సంవత్సరమునకు పండ్రెండు
నెలలు సర్వసాధారణముగ ఉన్నాయి. ఇంకనూ ముఖ్యముగ తెలుసు కోవలసినదేమనగా! ప్రపంచమునకంతటికి
వారములోని పేర్లు ఒక్కటిగానే ఉన్నవి. ఏ దేశమువానికైన, ఏ మతమువానికైన వారములోని దినముల పేర్లు ఆది,
సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారములు కావడము విశేషము. ప్రపంచములో ఇందువులు మొట్టమొదట
ఏర్పరచిన పేర్లే మొత్తము ప్రపంచమునకంతటికి వర్తించడము ఇందువులెవరైన గర్వింపదగ్గ విషయము.
పూర్వము సృష్ఠి మొదలైన దినము ఆదివారము. ఆదివారము వారములో మొదటి దినమై ఉండుట వలన, ఆ
దినమును ప్రతివారము చిన్న పండుగగ చేసుకొనెడివారు. ప్రపంచము ఆదిలో మొదలైన దినమునకు ఆదివారమనే
పేరు పెట్టారు. ఆది అనగ మొదటిది అని అర్థము. సృష్ఠి ఆదివారముతో మొదలగుట వలన ఆ దినము అందరికి
చిన్న పండుగలాగ ఉండెడిది. ఆ దినము పనులు మాని సంతోషముగ కాలమును గడుపుచూ, పిండి వంటలను
చేసుకొని, దేవునికి నైవేద్యము పెట్టి తాము తినెడివారు. వారములో ఆరు దినములు పనిచేస్తూ, ఒక మొదటి దినము
పనిచేయక పండుగ చేసుకొనెడివారు. పూర్వము ప్రతి ఆదివారము పండుగ వాతావరణము కల్గియుండెడిది. ఇప్పటికీ
కొంతమార్పుతో ప్రతి ఆదివారము అందరికి విశ్రాంతి దినమై మాంసాహారులకు పండుగవలెనే ఉన్నది. పూర్వము
ఆదివారమంటే సృష్ఠి మొదటి దినమను పవిత్రభావము అందరికి ఉండి ఆ దినమును పవిత్రముగనే గడిపెడివారు.
నేడు ఆదివారమంటే దురభ్యాసపరులకు ఇష్టారాజ్యముగ ఉండును. ఎలాగైతేనేమి మొత్తము మీద ఆదివారము యొక్క
ప్రత్యేకత ఈ నాటికి మిగిలి ఉన్నది. ఇలా భూమి మీద అన్ని దేశముల ప్రజలకు వారములు ఏడై, అందులో
ఆదివారము మొదటివలె ప్రత్యేకత కల్గియుండడము గమనిస్తే, కాలగమనములో ఎవరెలా మారినా ఇందువుల
పవిత్రదినము నేటికినీ అందరికి సెలవుదినమై కొంత పండుగవలెనుండడము చూస్తే, మనుషులు సాంప్రదాయమును
వదలినప్పటికి, సాంప్రదాయము మనుషులను వదలలేదని తెలియుచున్నది. ప్రపంచము మొత్తము ఇందువుల
సాంప్రదాయములు ఇలా అందరి వద్ద ఉండడమును బట్టి సృష్ట్యాదిలో అంతటా ఇందువులే ఉండెడి వారని, తర్వాత
అది మారుచు చివరకు అనేక మతములైనప్పటికీ గుడ్డలోని ఇంగువ పోయినా గుడ్డకు ఇంగువవాసన పోనట్లు, మనుషులలో
ఇందుత్వము పోయినా ఇందుత్వ వాసన మనుషులలో పోకుండ కొంతైన వారముల రూపములో మిగిలి ఉన్నదని
తెలియుచున్నది.
ఆదిలో దేవునివలన నెలకొల్పబడిన జ్ఞానము చేత తయారయినదే ఇందుత్వము. ఇంత భూమండలము మీద,
ఇన్ని దేశముల మధ్య ప్రత్యేకించి మనము నివసించు ఈ దేశములోనే ఇందువులు ప్రకాశించారు. అందువలన ఈ
దేశము ఇందూదేశమైనది. ఈ గడ్డమీద మనము నివాసముండి, మన పూర్వీకులకు వారసులుగ ఉంటూ, మన
సాంప్రదాయమేమిటో మనకే తెలియకపోవడమూ, సృష్ట్యాదిలో ఏ దినము మొదలైనదో దాని ప్రత్యేకత ఏమిటో
తెలియకపోవడమూ, చివరకు వారమునకొకమారువచ్చు ఆదివారము కూడ ఏమిటో మనకు తెలియకుండ పోయి
కేవలము సెలవు దినమనుకోవడమూ, ఆదివారమే సెలవు దినమెందుకైనదని యోచించక పోవడమూ, ఈ విషయమును
స్వాములు, గురువులు, పీఠాధిపతులు చెప్పక పోవడమూ, అన్నిటిని పరిశీలించి చూచితే ఆది దినమును గురించి
తెలియని మనలను చూచి మన పూర్వీకులు బాధపడవలసిందే. వారి వారసులమైనందుకు మనము సిగ్గుపడాల్సిందే.
ఇప్పటికైన మించిపోయినది లేదు. 'ఆది' లో ప్రారంభమైనది కావున ఆ దినమునకు 'ఆది' వారమని పేరు
గల్గినదని తెలిసినవారమై, సృష్టి ఆదిలో మొదలైన ఆదివారమే యుగాదిగ అప్పుడప్పుడు తిరిగి వస్తున్నదనీ, మిగతా
దినములలో వచ్చు యుగాదులకంటే ఆదివారము వచ్చు యుగాదే స్వచ్ఛమైన 'యుగాది' అని నీవు తెలుసుకొని ఇతరులకు
తెల్పుటకు ప్రయత్నించవలెను. నీవు నిజముగ ఇందువు యొక్క వారసునివైతే, ఆదిలో ఆదివారముతో మొదలైన
యుగాది తిరిగి ఇపుడు వస్తుండడము వలన ఆ దినమును పవిత్రముగ గడుపవలెనని ప్రయత్నించుము. ఆదిలోని
రహస్యములను తెలుసుకొనుటకు ప్రయత్నించుము. ఆ దిన కాలమును కథలతో, కవిత్వములతో, పాటలతో, పద్యములతో,
నాటకములతో పంచాంగ శ్రవణముతో వ్యర్థముగ గడపక దేవుని జ్ఞానముతో గడుపవలెను. అసలైన ఇందూ
వారసుడవగుటకు, ఇందువుగ జీవించుటకు నీయందు ఇందుత్వము కొంచెమైన సజీవముగ ఉండుటకు, యుగాది
అను పేరు కూడ భ్రష్టు పట్టి ఉగాదిగ పిలువబడు నేటికాలములో తిరిగి 'యుగాది' యొక్క ప్రత్యేకతలను చాటి
చెప్పవలెను. ఆ దినము క్రొత్తగుడ్డలు ధరించడమే కాక, అది సృష్టి ఆదిలోనే క్రొత్తదినమనీ, మొదట మొదలైన
దినమని వివరించి, తెలియని వారికి తెలియజేయవలెను.
ఇందువులుగా (హిందువులుగా) నున్నవారు కొందరు నేటికినీ యుగాది పండుగను కొంత గొప్ప భావముతోనే
చేయుచున్నారు. యుగాది రోజు శుచిగా శుభ్రముగాయుంటూ భోజనమునకంటే ముందు యుగాది పచ్చడిని ప్రసాదముగా
తీసుకొంటున్నారు. యుగాది పచ్చడిని తప్పనిసరిగా ఆ దినము తీసుకోవలెనని పెద్దలు పూర్వమే తెలిపియున్నారు.
యుగాది అంటే అర్థము తెలిసినది, కానీ పచ్చడికి ఏమైనా ప్రత్యేకతయుందా అని కొందరడుగవచ్చును. దానికి మా
జవాబు ఏమనగా! పూర్వము ఇపుడు మనమనుకొను పచ్చడిని పచ్చడనక ప్రసాదము అని అనెడివారు. ప్రసాదము
పోయి పచ్చడైనది. వాస్తవానికి దానిని దేవుని పూజలో పెట్టి పూజ అయిపోయిన తర్వాత కుటుంబములోని వారందరికి
పంచెడివారు. అందరు గొప్ప భావముతో ప్రసాదముగా తీసుకొనెడివారు. అప్పటి కాలములో యుగాది ప్రసాదమును
గురించి వారి భావము ఏమిటో కొంత వివరించుకొందాము.
యుగాది సృష్ఠి ఆదికి గుర్తని అందరికి తెలుసు. సృష్ట్యాదిలోనే అన్నీ పుట్టాయనుటకు గుర్తుగా మామిడిచెట్లు,
వేపచెట్లు మొదలగు చాలా చెట్లు పూత పూయును. పూత పూసి పూతలోనుండి కాయ తయారగుట యుగాది
సమయములోనే జరుగును. పూత, కాయను క్రొత్త సృష్టికి నిదర్శనముగా దేవుడుంచాడు. పూతనుండి పుట్టినది
“కాయ”, గర్భమునుండి పుట్టునది “కాయ”ము. కాయగానీ, కాయముగానీ సృష్టి ఆదిలో దేవుని చేత తయారైనవే.
అందువలన దైవసృష్ఠి అయిన జగతి అంతయు యుగాదిలోనే పుట్టినవని తెలియజేయు నిమిత్తము చెట్లకు ఆ
సమయములోనే పూత పిందె వచ్చునట్లు దేవుడు చేశాడు. దేవుడు సృష్ఠించిన జీవులలో ఆరు మంచి గుణములు, ఆరు
చెడు గుణములున్నట్లు దేవుడే చేశాడు. జీవులనగా మనుషులు కావచ్చును, జీవమున్న చెట్లు కావచ్చును. మనుషులలో
ఆరు సంఖ్యలో గుణములనుంచిన దేవుడు అదే ఆరుసంఖ్యలో రుచులను చెట్లలో నింపి పంపాడు. వేపచెట్టులో చేదు,
చింతచెట్టులో పులుపు, తుమ్మచెట్టులో వగరు, మిరపచెట్టులో కారము మొదలగు ఆరు రుచులను వివిధ చెట్లలో దేవుడే
పెట్టాడు. యుగాది సమయములో పూయు పూతలు అన్ని రుచులు కల్గియున్నవి. అందువలన జ్ఞానమును తెలిసిన
పెద్దలు ఆరు రుచులు కల్గిన పూతలను తెచ్చి దేవుని ముందర పెట్టి వాటినే ప్రసాదముగా స్వీకరించుచున్నారు.
విధముగ చేయుటలో జ్ఞానుల భావము ఈ రకముగా ఉండెడిది. మాలోనున్న ఆరుగుణములకు ప్రతీకగా ఆరు
రుచులున్న పూతలను దేవుడవైన నీకు చూపించుచున్నాము. ఆరు రుచులను మేము తిని లేకుండ చేయుచున్నాము.
అదే విధముగా మాలోని ఆరు గుణములను లేకుండ చేసుకొంటామనీ, ఈ పని చేసి చూపించు చున్నామనీ పూర్వము
జ్ఞానులనెడివారు. ఆ విధముగా ఆ ఆరు గుణములకు బదులుగా ఆరు రుచుల పూతలను ప్రసాదముగా చేసి తిని
జీర్ణాశయములో జఠరాగ్నిలో కాల్చివేసినట్లు, ఆరు గుణముల కర్మలను తలలోని జ్ఞానాగ్నితో కాల్చివేయుదుమని వారి
భావముండెడిది. ఈ విధముగా జరుగు షట్ రుచుల ప్రసాదములు కాలక్రమేపి మారుతూవచ్చి ఒక్క వేపపూతను
మాత్రము తీసుకొని మిగత రుచులకోసము బెల్లము, చింతపండు మొదలగునవి అందులో కలిపి యుగాది పచ్చడి
రూపముతో తీసుకొంటున్నారు. కొందరైతే పేరుకు వేపపూతను వేసి ఏమాత్రము చేదు కనిపించకుండునట్లు చెక్కర
బెల్లము పెద్ద మోతాదులో వేసి పాయసము మాదిరి చేసుకొని దినమంతా తింటున్నారు. అట్లు చేయుట వలన
యుగాది ప్రసాదము యుగాది పచ్చడిగా మారిపోయి చివరకు యుగాది పాయసముగా మారిపోయినది. సనాతనముగా
వచ్చు యుగాది పండుగ ఇందూ సాంప్రదాయములలో ముఖ్యమైనది. ఇందూసాంప్రదాయములలోని ప్రతి పనికి
చాలా అర్ధముండును. పెద్దలు పెట్టిన అర్థమును వదలివేసి అర్థములేకుండ మన ఇష్టమొచ్చినట్లు చేయు పనులు
సాంప్రదాయములన బడవు. అందువలన యుగాదిని పెద్దలు చెప్పినట్లు, వారు చేసినట్లు ఇప్పటి నుండి మనమూ
చేద్దాము. యుగాదిలో పూత విశిష్టతను గుర్తెరిగి, జగతి యొక్క పుట్టుక ఆ దినమే జరిగినదని తెలిసి, పవిత్రభావముతో
ఆచరించితే అది నిజమైన యుగాది పండుగ అగును. అట్లు కాకపోతే యుగాది ఉగాదిగా, పండుగ దండుగగా
మారిపోగలదు. అట్లు కాకుండ యుగాదిని నిజమైన ఇందువుల పండుగగానే అర్థము చేసుకొని చేద్దాము.
భోగి - మంటలు.
భోగిమంటలను మాటను బహుశ సంక్రాంతి పండుగ సందర్భములో వింటుంటాము. యుగాది పండుగకు
ప్రత్యేకత ఉన్నట్లే భోగిపండుగకూ సంక్రాంతి పండుగకు కూడ ప్రత్యేకత గలదు. యుగాదికి గానీ, సంక్రాంతికి గానీ
ఆధ్యాత్మికతనూ, గ్రహముల ప్రయాణమునూ బట్టి ప్రత్యేకత గలదు. సూర్యుడు కాలచక్రములో కటకరాసియందు
ప్రవేశించినపుడు కటక సంక్రమణము అనియూ, అదే విధముగ సూర్యుడు మకరరాసిలో ప్రవేశించినపుడు మకర
సంక్రాంతి అనియూ మన పెద్దలు చెప్పుచుందురు. ఈ రాసులనునవి ఏమిటి, ఎందుకున్నవి? అని యోచిస్తే కొంత
సమాచారము తెలియగలదు. మనిషి యొక్క ఆధ్యాత్మిక పాఠములో కాలచక్రమనునది చాలా ప్రాముఖ్యము గలది.
కాలచక్రము మొత్తము పండ్రెండు భాగములుగ విభజింపబడి ఉన్నది. మానవుని జ్యోతిష్యము ఈ పండ్రెండు భాగములను
ఆధారము చేసుకొని ఉన్నది. కాలచక్రములోయుండి కర్మను పరిపాలన చేయు నవగ్రహములు నిర్ణీతకాలము ప్రకారము
ఈ కాలచక్రములోనే తిరుగుచుండును. అన్నిటికంటే ముఖ్యగ్రహము మరియు మొదటి గ్రహమైన సూర్యుడు కాలచక్రములో
ఎక్కువ ప్రసిద్ధి చెందినవాడు. సూర్యుడు మొదటి వాడైనందున ఆయనకు ఆదిత్యుడని కూడ పేరు గలదు.
జ్యోతిష్యశాస్త్రములో సూర్యున్ని బట్టి గ్రహచారము నిర్ణయింపబడుచున్నది. కాలచక్రములోని పండ్రెండు భాగముల
పేర్లు వరుసగ ఇలా కలవు. 1) మేషము 2) వృషభము 3) మిథునము 4) కర్కాటకము 5) సింహము 6) కన్య
7) తుల 8) వృశ్చికము 9) ధనస్సు 10) మకరము 11) కుంభము 12) మీనము. కాలచక్రమును దానిలోని
భాగములను తర్వాత పేజీ పటములో చూడవచ్చును.
కాలచక్రములోని సగభాగములో సూర్యుని సంచారమున్నపుడు దానిని "ఆయణము” అంటారు. దీనినిబట్టి
రెండు ఆయణములు గలవని, అవియే ఉత్తరాయణము, దక్షిణాయణము అని తెలియవలెను. సూర్యుడు కాలచక్రములోని
ఒక్క భాగమును దాటుటకు ఒక నెలదినములు పట్టును. దీనిని బట్టియే మనకు నెలల పేర్లు కూడ నిర్ణయించారు.
అవి వరుసగ 1) చైత్రము 2) వైశాఖము 3) జ్యేష్టము 4) ఆషాఢము 5) శ్రావణము 6) భాద్రపదము
7) ఆశ్వీయుజము 8) కార్తీకము 9) మార్గశీర్షము 10) పుష్యము 11) మాఘము 12) ఫాల్గుణము. కాలచక్రములో
సూర్యుడు మేషరాసి భాగములో ప్రయాణించు ముప్పది దినములను చైత్రమాసమన్నారు 2) వృషభరాసిలోనున్న
కాలమును వైశాఖమాసము అన్నారు. 3) మిథునరాసి కాలమును జ్యేష్టమాసము అన్నారు. 4) కర్కాటకరాసిలో
ఉన్నపుడు ఆషాఢమాసము అన్నారు. 5) సింహరాసిలో ఉన్నపుడు శ్రావణమాసము అన్నారు 6) కన్యారాసిలో ఉన్నపుడు
భాద్రపదమాసము అన్నారు 7) తులారాసిలో ఉన్నపుడు ఆశ్వీయుజమాసము అన్నారు 8) వృశ్చికరాసిలో ఉన్నపుడు
కార్తీకమాసము అన్నారు. 9) ధనస్సు రాసిలో ఉన్నపుడు మార్గశీర్షమాసము అన్నారు. 10) మకరరాసిలో ఉన్నపుడు
పుష్యమాసము అన్నారు. 11) కుంభరాశిలో ఉన్నపుడు మాఘమాసము అన్నారు. 12) మీనరాసిలో ఉన్నపుడు
ఫాల్గుణమాసము అన్నారు.
కాలచక్రములోని పండ్రెండు భాగములలో ఆరు భాగములను ఉత్తరాయణముగ, మిగత ఆరు భాగములను
దక్షిణాయణముగ లెక్కించడము జరుగుచున్నది. సూర్యుడు మకరరాసిలో ప్రవేశించిన పుష్యమాసము నుండి మిథునరాసిలో
ఉండు జ్యేష్టమాసము వరకు ఆరు నెలల కాలమును ఉత్తరాయణమనియు, అలాగే సూర్యుడు కటక రాసిలో ప్రవేశించిన
ఆషాఢమాసము నుండి ధనస్సురాసిలో ఉండు మార్గశీర్ష మాసము వరకు ఆరునెలల కాలమును దక్షిణాయణమనియు
చెప్పడము జరుగుచున్నది. కాలచక్రములో మొదటిదయిన మేషరాసిని ఒకటవ దానిగ తీసుకుంటే చివరిదైన మీనము
పండ్రెండవదగును. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము ఒకటవ రాసి మానవుని జన్మరాసి అగును, అలాగే పండ్రెండవది
మరణరాసి అగును. మనిషి పుట్టుక, శరీర లభ్యము యొక్క విషయములు ఒకటవ స్థానములో ఉండగ, చివరి
మరణము గురించిన విషయమంతయు పండ్రెండవ స్థానములో ఉండును. మనిషి పుట్టుక మరియు మరణముల
విషయములు ఉత్తరాయణ భాగములోనే కలవు. ఉత్తరాయణ భాగము జ్ఞానసంబంధమైనదనీ, దక్షిణాయణ భాగము
అజ్ఞాన సంబంధమైనదని కూడ చెప్పబడినది. ఉత్తరాయణ కాలములో చనిపోయినా, పుట్టినా మోక్షము పొంది
దేవునిలో ఐక్యమగుటకు అవకాశమున్నది. అంతేగాక ఉత్తరాయణ కాలములో పుట్టినవారు దైవసంబంధ జ్ఞానముపొంది
జ్ఞానిగా జన్మించుటకు కూడ అవకాశమున్నది. సూర్యుడు ఉత్తరాయణములో ప్రవేశించి ఉండు ఆరునెలల కాలము
దైవపరముగ ప్రాముఖ్యతచెంది ఉండుటవలన ఆ కాలమును ఉత్తరాయణ ఉత్తమకాలమని పూర్వము అనెడివారు.
కాలక్రమమున ఉత్తరాయణ ఉత్తమకాలము మార్పుచెంది ఉత్తరాయణ పుణ్యకాలమని పలుకబడుచున్నది.
మేషము, వృషభము, మిథునము ఈ మూడు రాసుల కాలమును, అలాగే మకర, కుంభ, మీనరాశులయందు
మూడు నెలల కాలమును ఉత్తరాయణమని చెప్పుకొన్నాము. మిగత ఆరునెలల కాలము దక్షిణాయణముగ
లెక్కించుకొనుచున్నాము. ఉత్తరాయణము ఉత్తమమైనదిగా దైవపరముగా లెక్కించుకోగా, దక్షిణాయణము ప్రపంచపరమైన
భోగములకు ప్రతీకగ చెప్పుకొనుచున్నాము. దక్షిణాయణము ప్రకృతి భోగములకు గుర్తుగ ఉన్నది. ప్రపంచములోని
అనుభవములను భోగములనుచున్నాము. ప్రపంచ సంబంధవిషయములను అనుభవించుటను భోగము అనుచుండగా!
దైవసంబంధ ఆత్మను అనుభవించుటను యోగము అంటున్నాము. భోగములో కర్మలు అనుభవింపబడుచున్నవి.
యోగములో కర్మలు కాల్చబడుచున్నవి. దక్షిణాయణమును భోగములకు గుర్తుగ చెప్పుకొన్నారు. భోగములు అజ్ఞానమునకు
సంబంధించినవి, కావున దక్షిణాయణమును ప్రపంచసంబంధ భోగముల చిహ్నముగ వ్యక్తపరిచారు. ఉత్తరాయణమును
దైవసంబంధ యోగములకు గుర్తుగ చెప్పుకొన్నారు. ఈ విధముగ చెప్పడమే కాక అందరికి కొంత గుర్తుండునట్లు
కూడ చేశారు. ప్రతి మనిషికీ భోగములను అనుభవించడము అలవాటై పోయినది. భోగములనగా కేవలము సుఖములే
అనుకోకూడదు. కష్టములను సుఖములను రెండిటిని భోగములే అంటున్నారు. భోగములనగా అనుభవించునవని
అర్థము.
అలాగే ప్రతి మనిషి యోగములను పొందలేకపోవుచున్నాడు. యోగములనగా భోగములకు వ్యతిరేఖములుగ
ఉన్నవి. కర్మానుభవము కానివి యోగములు, కర్మను కాల్చునవి యోగములు, జ్ఞానమను అగ్ని నిలయములు
యోగములు. కర్మలను కాల్చునది జ్ఞానాగ్ని మాత్రమేనని మరువకూడదు. జ్ఞానాగ్ని నిలయమైన యోగములకు గుర్తుగ
ఉత్తరాయణము, అనుభవములకు నిలయములైన భోగములకు గుర్తుగ దక్షిణాయణము జ్ఞాపకముండునట్లు సంవత్సరములో
ఒక పండుగను ఉంచారు. అదియే సంక్రాంతిపండుగ, దీనినే మకరసంక్రాంతి అందురు.
మకర రాసిలోనికి సూర్యుడు ప్రవేశించుటను మకర సంక్రాంతి అంటున్నాము. సాధారణముగ జనవరి 14వ
తేదిననే సంక్రాంతి వచ్చుచుండును. బహుశ కొన్ని సంవత్సరములకొకమారు జనవరి 15వ తేదీన సంక్రాంతి
జరుగుచుండును. జనవరి 13 తేది వరకు దక్షిణాయణముండగా, 14వ తేదీనుండి ఉత్తరాయణమగును. దక్షిణాయణము
భోగములకు గుర్తు కావున ఆ విషయము గుర్తుండునట్లు జనవరి 13వ తేదీని సంక్రాంతి ముందు రోజును భోగి
అన్నారు. భోగి తర్వాత సంక్రాంతి అనుట సహజముగ ఉన్నదే. భోగి దినమున రాత్రికి మంటలు వేసి భోగి
మంటలని పేరు పెట్టడము కూడ జరిగినది.భోగిని గుర్తింపుగ చెప్పుకోవడమూ
ఆ రాత్రికి మంటలు వేయడమూ అందరు చేస్తున్న పనియే కాని దాని అర్థము,
వివరము చాలామందికి తెలియదనుకొంటాము.
దక్షిణాయణము అజ్ఞాన సంబంధ, ప్రపంచ సంబంధ గుర్తు అని ముందే చెప్పుకొన్నాము. ప్రపంచ
అనుభవములకు తార్కాణముగ ఉన్న దక్షిణాయణమును భోగి అను పేరుతో చివరిదినమున గుర్తు చేసుకొనుచు, మా
జీవితములలో కూడ నేటి నుండి భోగములు పోయి యోగములు రావాలని పూర్వము కోరుకొనెడివారు. భోగములు
అనగ అనుభవములకు కారణమయిన కర్మపోవాలని, భగవద్గీతలో చెప్పినట్లు కర్మలను కట్టెలుగ, జ్ఞానమును అగ్నిగ
పోల్చి ఆ రాత్రికి మంటలు వేసెడివారు. అనుభవమునకు రాబోవు కర్మలను లేకుండ చేయడమునకు చిహ్నమే భోగి
మంటలు. దక్షిణాయణము చివరిలో భోగములకు స్వస్తిచెప్పడము, భోగిమంటలు మండించడము, అలాగే ఉత్తరాయణము
మొదటిలో యోగమునకు ఆహ్వానము పలుకడము సంతోషకరమైన విషయము. కావున ఆ దినమును సంక్రాంతి
ఉత్సవముగ పండుగ చేసుకొనుట పూర్వాచారము. పూర్వము పెద్దలు భావయుక్తముగ చేసిన ఆచారము నేటికిని
జరుగుచున్నప్పటికీ భోగి అని ఎందుకు అంటున్నామో, భోగిమంటలు ఎందుకు వేస్తున్నామో, సంక్రాంతి పండుగ
ఎందుకు చేస్తున్నామో తెలియదు.
“జ్ఞానాగ్ని సర్వకర్మాణాం భస్మసాత్" జ్ఞానమను అగ్నిచేత సర్వకర్మలు భస్మీపటలమగునని గీతయందు భగవంతుడు
చెప్పాడు. భోగికున్న కర్మలను జ్ఞానమను అగ్నికాల్చడమునే భోగి మంటలు అంటున్నాము. సంక్రాంతికంటే ముందు
దినము అజ్ఞానమునకు చివరిదినము కావలెననీ, సంక్రాంతి మొదటి దినము జ్ఞానమునకు ఆరంభ దినము
కావలెననీ, అంతరార్థమును బాహ్యార్థముగ తెల్పుచు పూర్వము భోగి మంటలు వేయగ ఆనాటి ఆచారము ఈనాటికి
ఉన్నది. ఆచారముంది అర్థము లేదు. ఈనాటి ఆచారమునకు ఆనాటి అర్థమును జోడించుకొని భోగిమంటలు వేయడము
చేస్తే ఎంతో విలువతో కూడుకొన్న పని అగును. కావున ఈరోజు ఉద్దేశ్యముతో పనిచేస్తే ఒకనాటికది నెరవేరును.
ఉద్ధ్యేశము లేని పని వ్యర్ధము, కావున బజారులో భోగిమంటలు మండించితే ప్రయోజనము లేదు. మన తలలో
భోగములకు కారణమైన కర్మలను జ్ఞానమంటలతో మండించవలెను. ఇప్పటికైన విలువ అర్ధము తెలిసి భోగిపండుగ
చేస్తాము. శరీరములో జ్ఞానమను అగ్నిని చేకూర్చుకొని కర్మలను కాల్చగలమను అర్థముతో బయట భోగి మంటలను
మండిస్తాము.
సంక్రాంతి.
సంక్రాంతి అను పదములో రెండు భాగముల అర్థము కలదు. “సం” అనగా మంచి అని చాలామార్లు
చెప్పుకొన్నాము. “సం”సారము అనగా మంచి సారముగలదనియు, “సం”బంధము అనగా మంచి బంధమనియు,
“సం”గీతము అనగా మంచి పాట అనియు తెలుసుకొన్నాము. దానిప్రకారమే ఇపుడు సంక్రాంతి అనగా మంచి క్రాంతి
అని చెప్పవచ్చును. క్రాంతి అనగా తిరుగుబాటు అని అర్ధము. క్రాంతివీరులు అనగా తిరుగుబాటు వీరులని అర్థము.
ఆ పద్దతి ప్రకారము సంక్రాంతి అనగా మంచి తిరుగుబాటు అనియు లేక మంచి పోరాటమనియు చెప్పవచ్చును.
సంక్రాంతి ఒక గొప్పపండుగ కాగా మీరేమో మంచి పోరాటము, ఉత్తమ తిరుగుబాటు అంటున్నారేమిటి? అని
కొందరు మమ్ములనడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! దాని అర్థమూ, అమలు జరుగుటా అన్నియు
వాస్తవమే. సంక్రాంతిలో మంచి తిరుగుబాటు ఉండుట సత్యమైన విషయమే. అట్లని ఈ తిరుగుబాటు బయట
ఎవరిమీద చేయునది కాదు, కొంత మందితో కలిసి చేయునదీకాదు. బయట తిరుగుబాటు మంచిదీకావచ్చును లేక
చెడుదీ కావచ్చును. అట్లుకాక ఎప్పటికీ మంచి తిరుగుబాటైనది సంక్రాంతియే! సంక్రాంతి వ్యక్తిగత తిరుగుబాటు,
కానీ సామూహిక తిరుగుబాటు కాదంటున్నాము. సంక్రాంతికంటే ముందు భోగిమంటలను చూపినవాడు దక్షిణాయణము
చివరిలో వాంఛలన్నిటినీ లేకుండ చేస్తున్నానను ఉద్దేశ్యమును బయటికి ప్రకటించిన తర్వాత ఉత్తరాయణము ప్రారంభములో
నేను భోగిగా కాకుండ ఇప్పటినుండి యోగిగా ఉంటానని ఆ దినము సంక్రాంతిని ప్రకటించుచున్నాడు. శరీరములోగల
అహము మీదగానీ, మనస్సుమీదగానీ జీవుడు తిరుగుబాటును ప్రకటించడమును మంచి తిరుగుబాటని సంక్రాంతి
అనుచున్నాము. మనస్సు మీద తిరగబడితే బ్రహ్మయోగిగా, అహము మీద తిరుగబడితే కర్మయోగిగా మనిషి మారగలడు.
ఇది వ్యక్తిగత తిరుగుబాటనియూ, వారివారి శరీరములో జీవుడు ఒక్కడే చేయు తిరుగుబాటనియూ ముందే చెప్పుకొన్నాము
కదా! జీవుడు తన శరీరములో అంతవరకు మనస్సు చెప్పినట్లు, అహము చెప్పినట్లు వినెడివాడు. ఆ విధముగా
వినడము వలన ప్రతి ఒక్కరూ అజ్ఞానస్థితిలో ఉన్నట్లేయగును. అంతేకాక అటువంటివాడు యోగికాడనీ, అతను భోగి
మాత్రమే అగునని పెద్దలు తెలియబరిచారు. అంతవరకు మనస్సు, అహము మాటలు వింటూయున్నవాడు ఒక్కసారిగా
వినకుండపోవడము మనో, అహముల మీద తిరుగుబాటు చేసినట్లు కాదా? మనస్సు, అహములు రెండూ వాటిమాటను
వినునట్లు చేసుకోవాలని ఎంతో బలమైన ప్రయత్నము చేసినా, జీవుడు వినకుండ పోవడము వాటిమీద పోరాటము
చేసినట్లు కాదా?
అహముమీద కానీ, మనస్సుమీద కానీ వ్యతిరేఖముగా ఉండడమూ, వాటి మాట వినకుండపోవడమూ చాలా
గొప్ప పని మరియు చాలా మంచిపని. అందువలన దానికి "సంక్రాంతి" అను పేరునుంచారు. చూచారా! సంక్రాంతి
పేరులోనే ఎంత అర్థముందో!! భగవద్గీతా శాస్త్రములో సారాంశమంతయు యోగిగా మారమనిగలదు. యోగిని
రెండు విధములుగా విభజించి కర్మయోగి, బ్రహ్మయోగి అని గీతలోనే తెలియజేశారు. దేవుని ధర్మములను ఆచరించితే
ఎవడైన యోగికాగలడు. దేవుని ధర్మములేవో తెలియకపోతే, ప్రకృతిధర్మములైన మనస్సుమాట, అహముమాట విని
ఆచరించితే ఎవడైనా భోగి కాగలడు. భోగి పండుగ రోజు భోగములను వదలునట్లు భోగిమంటలు వేయుట, సంక్రాంతి
పండుగరోజు యోగమును ఆచరించునట్లు కొద్దిసేపైన యోగసాధనలో కూర్చొనుట, భోగి సంక్రాంతి పండుగల రోజు
చేయవలసిన ముఖ్యమైన ఆచరణ. పూర్వము భోగి, సంక్రాంతిని “జోడు” పండుగలుగా ఆచరించెడి వారు. ఈ రెండు
పండుగలను ఆధ్యాత్మిక అర్ధముతో జ్ఞానులు ఏర్పరచారు. కావున అందరూ అర్థమును తెలిసి ఆచరించెడివారు. కర్మ
అనుభవములకు భోగి గుర్తుగా, కర్మ నాశనమైన యోగమునకు గుర్తుగా సంక్రాంతి ప్రతి సంవత్సరము ప్రజలు
చేసెడివారు. భోగములను వదలుకొమ్మని, యోగములను అలవరచుకొమ్మని ఆనాటి స్వామిజీలు, మహర్షులు, బోధకులు
చెప్పెడివారు. కుటుంబములో క్రొత్తగా పుట్టిన పిల్లలకు కొంత వయస్సువస్తూనే భోగి, సంక్రాంతి పండుగల వివరమును
తెలిపి వారిని సక్రమమార్గములో నడిచేటట్లు చేసెడివారు. ఈ విధముగ ఈ పండుగల వలన ప్రజలు కొంత జ్ఞానము
తెలిసి బ్రతికెడివారు. ఎవరిలోనైన అజ్ఞానము పెరుగుటకు మొదలిడినా పండుగ సమయములో అర్థసహితముగా
నడుచుకొనుట వలన వారిలోనున్న ఆ కొంత అజ్ఞానము పోయెడిది. అందువలన అందరూ శాంతిగా జ్ఞానయుతముగా
బ్రతికేవారు.
ఈనాడు జోడుపండుగలైన భోగి, సంక్రాంతి రెండు పండుగలు ఉన్ననూ, పూర్వకాలమున్న అర్థమూ ఆచరణలు
నేడు కరువైపోయినవి. భోగి అంటే గానీ, సంక్రాంతి అంటేగాని అర్థము తెలియని హిందూ సమాజము తయారైనది.
ఇది సామాన్యమనిషికే కాక హిందూమతములో మేము పెద్దలము అనుకొన్నవారికి కూడ సంక్రాంతి అర్థము తెలియదు.
నేడు అర్థము తెలియకపోయినా, ఆచరణ కొంతైనా మన మధ్యలో మిగిలియున్నది. భోగి దినము రాత్రికి భోగిమంటలు
వేయువారు కొన్ని ప్రాంతములలో గలరు. భోగిమంటల ఆచరణ అయితే చేయుచున్నారు, కానీ మంటల ముందర
పూర్వపు భావము ఎవరివద్ద లేకుండ మత్తుపానీయములు త్రాగి చిందులు వేయుచున్నారు. భోగములు వదులుకోవలసిన
ఆ సమయములో సరదాగా త్రాగుచు, తినుచు కాలము గడుపుచున్నారు. మరుసటి దినమైన సంక్రాంతిరోజు ఆ
పేరుకు తగినట్లు ఒక్క నిమిషము కూడ మనస్సును నిలుపువారుగానీ, అహమును అణచివేయువారుగానీ కనపడడములేదు.
సంక్రాంతి అంటే ఆడవారి ముగ్గులపండుగగ తలచి ప్రతి ఇంటి ముందర ముగ్గులువేయుచున్నారు. సంక్రాంతి
దినము కూడ మనో, అహముల మీద ఏమాత్రము “క్రాంతి” లేకుండ రంగుముగ్గులువేసి, రంగు గుడ్డలు ధరించి
వినోదములలోనే గడుపుచున్నారు. ఇదంతయు చూస్తే, పూర్వము పెద్దలు పెట్టిన భావము కొంతైనా లేకుండా పోయినదని
తెలియుచున్నది. ఇపుడు మేము తెల్పిన ఈ విధానమంతయు చదివినవారు కొంతకు కొంతైనా మారగలరని
తలచుచున్నాము. ఇదంతయు చదివిన తర్వాత మీరు మారకపోయినా పరవాలేదు, కానీ మమ్ములను విమర్శించి,
దూషించి మేమే నిజమైన హిందువులము, నీవు పరమతస్థునివి, పరమత బోధ చేస్తున్నావు అని మాత్రము అనవద్దండి.
మేము చెప్పునది ఆధ్యాత్మిక అర్థముతో కూడుకొనియుండును. కొందరికి సులభముగా అర్థముకాకపోవచ్చును.
అంతమాత్రమున మమ్ములను దూషించవద్దండి.
దశరా.
దశరా అను పదము మొదట “దశర” అను పదముగా ఉండెడిది. ప్రస్తుతకాలములో దశకు ప్రక్కన దీర్ఘము
“రా” ఉన్నది. పూర్వకాలములో దశకు ప్రక్కన దీర్ఘము కల్గిన “రా” కాకుండ కేవలము దీర్ఘములేని “ర” మాత్రముండెడిది.
అందువలన పూర్వమున్న “దశర” అను పదము ఇప్పుడు “దశరా” అని పలుకబడుచున్నదని తెలియవలెను. నేడు గల
పండుగలన్నియు పూర్వము బ్రహ్మజ్ఞానులు ఉద్దేశ్య పూర్వకముగా పెట్టినవేనని తెలుసుకొన్నాము. అందువలన అవి
అన్నియు ఆధ్యాత్మిక అర్థముతోనే కూడుకొని ఉండును. ఇపుడు మనము కూడ వారు నిర్ణయించిన అర్థముతోనే
వివరించుకోవలసియున్నది. పూర్వము “దశర” అను పేరు కొంత కాలమునకు “దశరా”గా మారిపోయినది. తర్వాత
కొంత కాలమునకు ఆధ్యాత్మికత తెలియకుండ పోయి కొన్ని పురాణముల కల్పనచేత “విజయదశమి" అయినది. ఈ
విధముగా దశర విజయదశమి అయినది. అలా మారిపోవడము చేత పెద్దలు నిర్ణయించిన దశర భావమునకు
విజయదశమి అర్థము పూర్తి వ్యతిరేఖమై పోయినది. పూర్వము దశర అను పదమునకు ఆధ్యాత్మిక అర్థము ఒకటే
ఉండెడిది. తర్వాత దశరాకు కూడ దాదాపు అదే అర్థముంది. కానీ విజయదశమి అను పేరుకు పూర్తి భావము
మారిపోయినది.
'శత' అనగా నూరు అనియూ, 'దశ' అనగా పది అనియు అందరికి తెలుసు. ఇక్కడ దశరలో “ర” అనగ
నాశనము అని అర్థము గలదు. మంత్ర ఉచ్ఛాటనలో కూడ “రం” అను అక్షరమును నాశనమునకు బదులు బీజాక్షరముగా
వాడుదురు. “హర” అను పదము యొక్క అర్థము నాశనము చేయువాడని అర్థము. అందులో 'ర' అనగా నాశనము
అనియు, 'హ' అనగా చేయువాడనియు హర అనగా నాశనము కల్గించువాడు అని కూడ చెప్పవచ్చును. '8' అనగా
పాలన అనియు, 'హరి' అనగా పాలన చేయువాడని అర్థము గలదు. ఇక్కడ ఒక 'ర' విషయానికి వస్తే దానియొక్క
అర్థము ప్రకారము లేకుండ చేయడము, కృశించునట్లు చేయడము, నాశనము చేయడమని చెప్పవచ్చును. దశరలో
‘ర” కు అనుసంధానముగ దశ అనియున్నది. దశ అనగ పది అని అర్థము కదా! దాని ప్రకారము పదింటిని నాశనము
చేయునది దశర అని అర్థమగుచున్నది. అర్థమంతా బాగానే ఉన్నది కానీ పది ఏమిటి? నాశనమేమిటి? అను ప్రశ్న
ఎవరికైనా రాగలదు. ఆ ప్రశ్నకు జవాబు ఏమనగా! మనము పండుగలకన్నిటికి ఆధ్యాత్మిక జవాబునే వెదకవలెనని
చెప్పుకొన్నాము కదా! దానిప్రకారము వివరించుకోవలసియున్నది. ఇక్కడ ఇంకా కొందరికి ఆధ్యాత్మికము అంటే
ఏమిటి? అను ప్రశ్న కూడ ఉండవచ్చును. దానికి కూడ కొద్దిగ వివరము చెప్పుకొందాము. ఆత్మను గురించి
తెలుసుకోవడమును ఆధ్యాత్మికము అనవచ్చును. ఇంకా వివరముగా చెప్పుకుంటే ఆత్మను గురించి ఆధ్యయనము
చేయడమును ఆధ్యాత్మికము అంటాము. ఆత్మ అనునది శరీరములోపలే జీవాత్మతోపాటు నివసిస్తున్నది. కావున
శరీరములోనే ఆధ్యాత్మికము గలదు. దొంగలుంటే పోలీసులుంటారు. అలాగే పోలీసులుంటే దొంగలున్నారని తెలిసినట్లు,
ఆత్మయుంటే జీవాత్మయుంటుంది, జీవాత్మ యుంటే ఆత్మయుంటుంది. ఏ విధముగా పోలీసులకు దొంగలకు అవినాభావ
సంబంధముందో, అదే విధముగా ఆత్మకు జీవాత్మకు సంబంధమున్నది. అందువలన ఆత్మను జీవాత్మను జోడు
ఆత్మలని అంటున్నాము. జోడు ఆత్మలున్న శరీరమునకు బయట పది శరీర భాగములు గలవు. వాటినే దశేంద్రియములు
అంటున్నాము. వాటిని వివరించుకొని చూస్తే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములని విభజించుకొని
చెప్పవచ్చును. కర్మేంద్రియములు ఐదు వరుసగా 1) కాళ్ళు 2) చేతులు 3) నోరు 4) గుదము 5) గుహ్యము అని
చెప్పవచ్చును. అలాగే జ్ఞానేంద్రియములు ఐదు వరుసగా 1) కన్ను 2) చెవి 3) ముక్కు 4) నాలుక 5) చర్మము అని
చెప్పవచ్చును. కర్మ, జ్ఞానేంద్రియములు మొత్తము పది కదా! ఈ పదింటినే “ర” చేయమన్నాడు, అంటే నాశనము
చేయమని చెప్పడమునే “దశర” అని చెప్పవచ్చును. ఇపుడు వెంటనే ఒక ప్రశ్న ఎవరికైనా రావచ్చును. అదేమనగా!
పదింటిని నాశనము చేయమంటే కన్నును పొడిచేయాలా? చెవును కోసేయాలా? నాలుకను కోసేయాలా? ముక్కును
నరికేయాలా? చర్మమును పెరికేయాలా? అలాగే కాళ్ళు, చేతులను తీసివేయాలా? అని అడుగవచ్చును. దానికి మా
జవాబు ఏమనగా!
కన్ను మొదలగు జ్ఞానేంద్రియములను గానీ, కాలు మొదలగు కర్మేంద్రియములనుగానీ పొడిచేయమనీ,
నరికేయమనీ ఎవరూ చెప్పలేదు. వాటిని లేకుండ చేయమంటే వాటి పనిని లేకుండ చేయమని అర్ధము. వాటి పనిని
లేకుండ చేస్తే అవి ఉన్నాలేనట్లే అగును. దీనిని గురించి చిన్న ఉదాహరణను చెప్పుకొందాము. ఒక ఇంటిలో విద్యుత్తు
బల్బులు చిన్నవి, పెద్దవి మొత్తము పది ఉన్నాయనుకొనుము. అవి పగటి పూట వెలగవలసిన పనిలేదు, రాత్రిపూట
పది బల్బులు వెలుగుచుండును. అది అందరి ఇళ్లలోను సహజముగా ఉండు విధానము. కానీ ఒక ఇంటి యజమానికి
రాత్రిపూట కూడ వెలుతురుతో అవసరములేదు. అపుడు అతను బల్బుల పనిని లేకుండ చేస్తాడా? బల్బులనూ, వైర్లనూ
పెరికి లేకుండ చేస్తాడా? పెరకకుండానే వాటి పనిని లేకుండ చేసి వెలుతురును లేకుండ చేయును. ఇల్లంతా చీకటై,
వెలుతురు ఏమాత్రము ఉండకూడదనుకుంటే పది బల్బులను ఆర్పివేసి వాటి పనిని లేకుండ చేయును. ఇది ఒక
విధానము కాగా, రెండవ విధానము కూడా మరియొకటి కలదు. అది ఏమనగా! ఇంటిలోని బల్బులన్నీ వెలుగుచున్ననూ,
తాను కళ్ళను గట్టిగా మూసుకొంటే వెలుతురు ఏమాత్రము కనిపించదు కదా! ఈ విధముగా కూడ వెలుతురు తనకు
తెలియనట్లు చేసుకోవచ్చును. ఇక్కడ ఒక విధానము ప్రకారము వెలుతురు లేకుండ చేసుకొనుటకు బల్బుల పనిని
లేకుండ చేస్తున్నాము, కానీ బల్బులను లేకుండ చేయడము లేదు. అలాగే మరియొక విధానములో బల్బుల పని
చేయుచున్నా తానే స్వయముగా చూడకుండా, వెలుతురును లేకుండ చేసుకొనుచున్నాడు. కానీ అప్పుడు కూడ బల్బులను
పెరికి వేయడముగానీ, పగులగొట్టడముగానీ చేయలేదు కదా! ఇక్కడ కొందరొక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా!
వెలుగును లేకుండ చేసుకొనుటకు మరియొక విధానముగా బల్బులన్నిటిని పగులగొట్టవచ్చును కదా! అట్లు కూడ
వెలుతురు లేకుండ పోవును కదా! అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఇంటి యజమాని
రాత్రిపూట ఏమి చేయక ఊరకుండవలయుననుకొన్నపుడు, వెలుతురుతో పనిలేనపుడు ఒక విధముగ బల్బులను పని
చేయకుండ ఆర్పివేయవచ్చును. మరొక విధముగా కన్నులను మూసుకోవచ్చును అని అనుకొన్నాము కదా! బల్బులను
మాత్రము పగులగొట్టడని కూడ చెప్పుకొన్నాము. ఎందుకలా పగులగొట్ట లేదనగా! రాత్రిపూట వెలుగు అవసరము
లేదనుకొన్న యజమాని అప్పుడప్పుడు రాత్రిపూట కూడ పని చేయవలసి వస్తున్నది. అలాంటి సమయములో
వెలుతురు అవసరము. వెలుగు అవసరమైనపుడు వెలిగే పరికరములైన బల్బులు తప్పనిసరిగ ఉండవలయును కదా!
అందువలన కరెంటు తీగలను, బల్బులను పెరికి వేయలేదు, పగులగొట్టలేదని తెలియవలెను.
అదే విధముగనే శరీరమను ఇంటిలో పని చేయు బయటి అవయవములు పది గలవు. కరెంటు బల్బులకు
పగటి పూట పనిలేనట్లు పది అవయవములకు కూడ రాత్రిపూట పనిలేదు. రాత్రిపూట బల్బులకు పని ఉన్నట్లు,
పగటిపూట మాత్రము పది అవయవములకు పని గలదు. శరీరములోనున్న జీవునికి పది అవయవముల పని
అవసరములేదు అనుకుంటే ఒక విధానము ప్రకారము ఇంటిలో లైట్ల పనిని నిలిపినట్లు అవయవముల పనిని
ఆపివేయవచ్చును. రెండవ విధానము ప్రకారము వెలుతురును వద్దనుకొన్నవాడు కళ్ళను మూసుకొన్నట్లు, పది
అవయవములు పని చేయుచున్ననూ జీవుడు అవయవముల పనియొక్క ఫలితము మీద ధ్యాసలేకుండ ఉండవలెను.
పది బల్బులు వెలుగుచున్ననూ కళ్ళను మూసుకొన్న వానికి బల్బుల వెలుతురు తెలియనట్లు, పది అవయవములు పని
చేయుచున్ననూ వాటి మీద ధ్యాసలేనివానికి అవయవముల పని యొక్క ఫలితకర్మ జీవునికి అంటదు. ఈ విధముగ
రెండు పద్ధతుల ప్రకారము జీవుడు పది అవయవములు అవసరము లేకుండ చేసుకోవచ్చును. అంతేకాని పది
అవయవములను పొడిచివేయడమూ, నరకివేయడమూ అవసరములేదు. అవసరమైనపుడు అప్పుడప్పుడు శరీర
అవయవములతో జీవుడు పని చేయవలసి వస్తుంది. కావున అవయవములు శరీరమునకు ఉండవలసిందే.
ఒక విధానము ప్రకారము పది అవయవముల పనిని ఆపివేయడమును బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో
బ్రహ్మయోగము అని అన్నారు. రెండవ విధానము ప్రకారము పది అవయవములు పని చేయుచుండగ జీవుడు వాటి
సంబంధములేకుండ ఫలితము మీద ధ్యాస లేకుండ ఉండడమును భగవద్గీతలోనే కర్మయోగము అన్నారు. ఈ రెండు
యోగములలో పది అవయవముల సంబంధమును తెంచుకోవడము రెండు పద్ధతులుగానే ఉన్నది. అందువలన
పదింటి ఫలితమును లేకుండ చేసుకొమ్మని తెలుపు యోగ సారాంశమును “దశర” అను పండుగ రూపములో పెద్దలు
పెట్టారు. దశర అనగా పదింటిని లేకుండ చేసుకొమ్మనియేగా అర్థము. పూర్వము ఈ విధముగా అర్థమును తెలిపి
పండుగనుంచారు. కాలక్రమేపి అజ్ఞానము పెరిగిపోయి ధర్మములు అధర్మములుగా మారిపోయినవి. అందువలన
నేడు “దశర”కు అర్థము తెలియకుండ పోయినది. బ్రహ్మ, కర్మయోగములకు ప్రతీకగా దశర ఉన్నదనియూ, పెద్దలు
దశరా అను పేరు పెట్టడములోని అంతరార్ధము యోగముల సూచనయేననియూ, ఇప్పటి కాలములో ఎవరికి తెలియకుండ
పోయినది. ఒకవేళ 'ర' కు అర్థము తెలియకపోయినా దశ అనే దానికి పది అను అర్థము అందరికి తెలుసు కదా!
అటులైనా దశరా అంటే పదిరా అని అర్థమౌతుంది కదా!! అపుడైనా పది అంటే ఏమిటి అని యోచించవచ్చును కదా!!!
దశరా అంటే పదిని గురించిన సమాచారము ఏదో ఉందని ఎవరూ అనుకోవడము లేదు. దశరా అంటూనే
కొందరు ఉద్యోగస్తులు దశరా మామూలు పేరుతో డబ్బు వసూలు చేయవచ్చని సంబరపడి పోవుచుందురు. ఈ
పండుగ వస్తే దశరా మామూళ్ళని చాలామంది డబ్బులు అడుగుతారనీ, అడిగినవారికి ఇవ్వకపోతే బాగుండదనీ,
ఇవ్వాలనుకుంటే తమవద్ద డబ్బులు లేవనీ తప్పనిసరిగ వడ్డిచెల్లించి బాకీచేసి మర్యాదకోసరము మామూళ్ళు ఇచ్చువారు
కొందరు గలరు. దశరా వస్తే మామూళ్ళు రూపములో వచ్చిన డబ్బుతో కొందరు పాతబాకీలను తీర్చుకోవడము
చేస్తుంటే, కొందరు మామూళ్ళరూపములో ఇతరులకు డబ్బు ఇచ్చిన దానివలన క్రొత్త బాకీలపాలగుచున్నారు. పూర్వము
పెద్దలు దశరా పండుగ మంచి జ్ఞాన సందేశమును ప్రజలకు ఇస్తుందనుకుకొంటే, అలాకాకుండ దశరాపండుగ ప్రజలలో
మామూళ్ళను దురభ్యాసమును నేర్పినట్లున్నది. ఎల్లపుడు హిందూసంస్కృతి రక్షించాలని పరమతస్థుల మీద
విరుచుకుపడుచున్న హిందూసంస్థలు తమ మతములో పండుగల సంస్కృతి మంటగలిసి పోతున్నదని గ్రహించలేకున్నారు.
ఈ మామూళ్ళు మంచిదికాదని చెప్పలేకున్నారు. హిందూమతములో ఏ స్వామిజీ కూడ మామూళ్ళ దురభ్యాసమును
ప్రత్యక్షముగాగానీ, పరోక్షముగా గానీ ఖండించడము లేదు. ఎవరూ ఖండించక పోయినా మేము కొన్ని సంవత్సరములుగా
ఈ విష సంస్కృతిని ఖండిస్తూనే ఉన్నాము. హిందూ సంస్కృతి బాగుపడాలని మేము చేయు ప్రయత్నమును, మేము
చెప్పు బోధలను చూచిన ప్రజలు జ్ఞానమంటే ఇదీ అని సంతోషపడుచుండగా, హిందూమతములో మేము ముఖ్యమైన
వారమని పదవులవలె కొన్ని పేర్లు పెట్టుకొన్న కొందరు మమ్ములను చూచి ఓర్వలేక మేము హిందువులమే కానట్లు,
పరమతములను గురించి బోధిస్తున్నట్లు ప్రచారము చేయుచున్నారు. అటువంటివారు ఏమి ప్రచారము చేసినా మేము
ఎవరైనది, ఏమి చేయుచున్నది ప్రజలకు కనిపిస్తున్నది కదా!
పూర్వమున్న దశర అనుపేరు కాలక్రమమున పలుకడములో దశరాగా మారపోయినదని తెలుసుకొన్నాము.
అంతేకాక దశరా అనుపేరు “విజయదశమి"గా కూడ పిలువబడుచున్నది. పూర్వము జ్ఞానులు పెట్టిన దశర అను
పేరులో పది నాశనమగుట అను అర్థమిమిడివుంటే, నేడు గల విజయదశమి యొక్క పేరులో పది విజయము పొందినవి
అను అర్థము గలదు. దశ అనినా దశమి అనినా పదియనియే అర్థము వచ్చును. కానీ 'ర' అనగా నాశనమని
అర్థముండగ, విజయ అంటే గొప్ప జయము, గొప్ప గెలుపు అని అందరికి తెలిసినదే. యుద్దములో ఒకడు నాశనమైతే
మరొకడు విజయమును పొందుతాడు. పూర్వమేమో పది నాశనము అయిన దినము దశర అని పెద్దలు చెప్పితే,
ఇపుడేమో పది విజయము పొందిన దినము విజయదశమి అంటున్నారు. ఏది సరియైనదో మీరే యోచించండి.
కొందరేమో ఆధ్యాత్మికత లేని పురాణమును సృష్టించి దుర్గాదేవి విజయము పొందిన దినమని, నవరాత్రుల పూజలు
దుర్గాదేవికి చేస్తూ చివరి పదవదినము దేవి విజయము పొందిన దినమని చెప్పుచున్నారు. మహిషాసురుడను రాక్షసున్ని
తొమ్మిదిమార్లు చంపగా వాడు బ్రతికాడనీ చివరిగా పదవసారి దుర్గాదేవి పూర్తి బ్రతకకుండ చంపివేసినదని, అందువలన
దానిని విజయదశమి అంటున్నామని కొందరు అంటున్నారు. దేవతలు ఇచ్చిన పది రకముల ఆయుధములతో
మహిషాసురున్ని చంపినది కాబట్టి విజయదశమని అంటున్నామని కొందరు చెప్పుచున్నారు. ఏది ఏమైన మనిషి
బాగుపడే ఆధ్యాత్మికత వారు చెప్పు కథలలో లేదనీ, దాని వలన తన విషయమై మనిషి ఆలోచించక దశరాను
దుర్గాదేవి విజయమని అనుకొంటున్నాడు. తనకు పెద్దలు తెలిపిన జ్ఞానసందేశమే దశరా అని అనుకోవడము లేదు.
దశరా పండుగ సమయములో ఆయుధాల పూజచేయడము కూడ ఇప్పటి కాలములో గలదు. కొందరు వారు
పనిచేయు పనిముట్లకు పూజ చేయగ కొందరు రౌడీలు, పార్టీలనాయకులు (ఫ్యాక్షన్నాయకులు) ఏకంగా
మారణాయుధములకే పూజలు చేయుచున్నారు. ఇట్లు ఆయుధాల పూజగా దశరా మారిపోవడము విచిత్రముగా
ఉంది. అలా మారణాయుధముల పూజలు చేయడమునకు కూడ కొందరు కొన్ని కథలు అల్లి చూపిస్తున్నారు. ఇలా
దశరా పండుగలో ఆధ్యాత్మికత ఏమాత్రము లేకుండపోయి పుక్కిడి పురాణముల ప్రాబల్యము ఏర్పడినది. అందువలన
పూర్వము పెద్దలు పెట్టిన ఆధ్యాత్మిక భావము లేకుండపోయి క్రొత్త పోకడలతో రూపముమారిన దశరా పండుగ నేడు
మనముందున్నది. పూర్వము బ్రహ్మవిద్యను తెలిసిన జ్ఞానులు, ప్రజలు అజ్ఞానములో పడకూడదను మంచి భావముతో
కొన్ని పండుగలను భావయుక్తముగా పెట్టగా, నేడు వారి భావమునకు వ్యతిరేఖముగా పండుగలు తయారైనవి.
ఇప్పటినుంచైనా పెద్దలు తెల్పిన జ్ఞానమార్గము ప్రకారము, వారు తెల్పిన అర్థముతోనే దశరా పండుగను చేసుకొందాము.
పండుగ వివరము తెలియని వారికి కూడ దాని వివరమంతటిని తెలిపి వారిని కూడ సక్రమముగా ఆచరించునట్లు
చేద్దాము.
దశరా పండుగ వర్షకాలముచివరిలో, చలికాలము మొదటిలో వస్తున్నది. శరీరము మీద ఉన్న స్థూల
శరీరమనబడు పది అవయవములు ఆ కాలములో అందరికి జ్ఞప్తికిరాగలవు. చలిపెట్టేది పైన పది అవయవములకే
కదా! అపుడు పామరునికైనా, పండితునికైనా చలి శరీరమును గుర్తు చేయుచున్నది. అప్పుడు చలి బాధనుండి
బయటపడుటకు పది అవయవములను వెచ్చని గుడ్డలతో కప్పిపెట్టి బయటికి కనిపించకుండ చేస్తాము. పది
అవయవములను కనిపించకుండ వెచ్చదనమను సుఖము కొరకు చేస్తున్నాము కదా! అలాగే పది అవయవముల పనిని
నిరోధించి వాటిని జ్ఞానమను గుడ్డలతో కప్పి, లేనట్లు చేసి మోక్షమను సుఖము కొరకు ప్రయత్నించుమని తెలియజేయుటకే
చలికాలము మొదటిలోనే దశరా పండుగ వస్తున్నది. చలికాలము మొదటిలోనే శరీరమును కప్పుకొనుటకు దుప్పట్లను
వెతుకుకొన్నట్లు, శరీర పది అవయముల పనితో సంబంధము లేకుండ జ్ఞానమును వెతుక్కోవలెను. ఈ విధముగ
దశరాపండుగ ఉన్నతమైన జ్ఞానమార్గమునకు నాంది పల్కుచున్నది. చలి బాధను లేకుండ చేసుకొనుటకు దుప్పటి
ఎట్లు అవసరమో అలాగే కర్మ బాధను లేకుండ చేసుకొనుటకు జ్ఞానమవసరమని దశరా చలికాల ప్రారంభములోనే
వస్తున్నది. ఇప్పటి నుండి చలి నివారణకు దుప్పటినుపయోగించినట్లు కర్మనివారణకు జ్ఞానమును వినియోగించుకొందాము.
శివరాత్రి.
ఆధ్యాత్మిక భావములున్న పండుగలలో యుగాది, దశరా, సంక్రాంతితో పాటు శివరాత్రి కూడ ముఖ్యమైన
పండుగగా మొదటినుండి చేయబడుచున్నది. యుగాది తర్వాత అన్ని పండుగలకంటే ప్రాచీనమైన పండుగ శివరాత్రియే!
భూమిమీద వెలసిన మొట్టమొదటి దేవస్థానము ఈశ్వరుని లింగమున్న గుడియే! ఏ ఇతర ప్రతిమ లేనపుడు మొట్టమొదటి
ప్రతిమ శివలింగమే!! ప్రపంచము మొత్తము మీద ఒక్క భారతదేశములోనే మొదటి లింగప్రతిష్ట కృతయుగములోనే
జరిగినది. ఈశ్వరలింగము ఎంతో అర్థముతో గొప్ప ఆధ్యాత్మిక భావముతో నిర్మింపబడినది. అప్పటి పెద్దల భావము
ఈనాడు మచ్చుకైనా లేదు. లింగమును ఎవరైన పువ్వులు పెట్టి నమస్కరించ వలసిందే, కానీ ఆరాధించకూడదు,
అభిషేకము చేయకూడదను నియమము ఆనాడు ఉండెడిది. ఈనాడు ఈశ్వరలింగమునకు అభిషేకములు, ఆరాధనలు
నియమమును తెలియక చేయుచున్నారు. ముఖ్యముగా ఈశ్వరలింగము గర్భగుడిలో ఉండకూడదు. పూర్వము పెద్దలు
ఏ ఉద్దేశ్యముతో శివలింగమును ఉంచారో ఆ ఉద్ధేశ్యము నేడు లేకుండా పోయినది. ఈశ్వరలింగమునకు పైన
ధారాపాత్ర తప్ప సింహతలాటము కూడ ఉండకూడదు. లింగమునకు తప్ప ఏ ప్రతిమలకైన గర్భగుడి ఉండవచ్చును.
అలాగే లింగమునకు తప్ప ఏ ప్రతిమకైన అభిషేకమూ ఆరాధన ఉండవచ్చును. కానీ నేడు అన్ని ప్రతిమలతోపాటు
లింగమునకు కూడ గర్భగుడిని కలుగచేసి అభిషేకములు చేయుచున్నారు. దీనిని బట్టి లింగమునకున్న ప్రత్యేకత ఈ
కాలములో తెలియకుండ పోయినది. పూర్వము లింగమును బయలు ప్రాంతములోనే ప్రతిష్ఠించెడివారు. లింగమును
గర్భగుడిలో పెట్టుట వలన, అభిషేకములు ఆరాధనలు చేయుట వలన, లింగమునకున్న ఆధ్యాత్మిక భావము పూర్తి
మంటకలిసి పోవుచున్నది. ఇటువంటి అజ్ఞానపు పనులు భవిష్యత్తులో ఎవరైనా చేస్తారేమోనని ఊహించిన బ్రహ్మజ్ఞానులు
అట్లు చేయనట్లు పూర్వమే శివరాత్రిపండుగను ఉద్దేశపూర్వకముగా పెట్టారు. అయినప్పటికీ శివరాత్రి యొక్క ఉద్దేశ్యము
కూడ తెలియనివారు పెద్దల భావమునకు వ్యతిరేఖముగా నడుచుచున్నారు. శివరాత్రి రోజే ఎక్కువగా అభిషేకములు,
ఆరాధనలూ చేయడము జరుగుచున్నది. ఈ కాలములో తెలియకుండ పోయిన పూర్వపు పెద్దల ఉద్ధేశ్యమేమిటో
తెలుసుకొందాము.
భూమిమీద ఏ దేవాలయములు లేని రోజున మొదటగా పరమాత్మ (దేవుని) ఉనికిని ప్రజలకు తెలియజేయుటకు,
దేవుడు రూపములేనివాడని తెలియ జేయుటకు ముక్కు ముఖములేని రాతిని చూపించారు. ఏ ప్రక్కన చూచినా
ముఖములేని లింగమును దేవునికి గుర్తుగా ఉంచారు. పూర్వము ఈశ్వర లింగము బయలు ప్రాంతములో ఉండెడిది.
పరమాత్మ పుట్టుక లేనివాడు కావున ఆయనకు గర్భమునుండి పుట్టు అవకాశములేదు.అందువలన పరమాత్మ
పుట్టువాడు కాదని తెలియజేయుటకు గర్భమను గుడిలో, అనగా గర్భగుడిలో లింగమునుంచెడివారు కాదు. రూపములేని
దేవునికి మనిషి ఆకారమున్న భార్యలేదు. దేవునికి భార్య ప్రకృతియే. కావున ప్రకృతిని లింగముకింద పాణిమట్టముగా
ఉంచారు.అందువలన ఆకారమున్న పార్వతిని ప్రక్కన ప్రతిష్ఠించెడివారు కాదు. కృతయుగములో పూర్తి దైవత్వ
సంబంధ విషయము తెలియునట్లు, ప్రకృతి, పరమాత్మ, వారిచే సృష్ఠించబడుచున్న జీవులను లింగప్రతిష్టలో చూస్తూనే
అర్థమగునట్లు ఉంచారు. పూర్వము జ్ఞానులు ఎంతో జ్ఞానముతో లింగప్రతిష్టను బయలులోనే చేసి, ప్రక్కన ఏ ప్రతిమ
లేకుండ ఉంచారు. దేవునికి వాహనము ఏది లేదు కావున ఈ కాలములోనున్న నందివాహనము కూడ పూర్వములేదు.
కాలక్రమమున మాయ ప్రభావము ఎక్కువైపోయి అజ్ఞానము పెరిగిపోయిన దానివలన లింగము గర్భగుడిలో పెట్టడమూ,
లింగము ప్రక్కలో పార్వతిని పెట్టడమూ, ఎదురుగా నందిని పెట్టడము జరిగినది. దీనినంతటిని సమర్థించుకొనుటకు
కొందరు పురాణముల పేరుతో కథలు కూడ అల్లుకొన్నారు. మెడలో పామున్న శంకరుడు మహర్షి శాపమువలన
రాయిగా మారాడనీ, ఆ రాయియే లింగమని ప్రచారము చేశారు. అమాయక ప్రజలు దానినే నిజమని నమ్మారు.
మెడలో పామున్న నటరాజైన శంకరునికి, లింగరూపములోనున్న ఈశ్వరుడైన పరమాత్మకు ఏమాత్రము
సంబంధములేదు. శంకరునికి భార్య పార్వతి ఉన్నది, అట్లే కొడుకులు కూడ ఉన్నారు. ఈశ్వరునికి ఆకారములేదు
శంకరునికున్నట్లు కుటుంబములేదు. చాలామంది ప్రజలు శంకరుడనినా, ఈశ్వరుడనినా, శివ అనినా ఒకటే అని
అనుకొంటున్నారు. అట్లు అనుకోవడము చాలా పొరపాటు. శంకరుడు త్రిమూర్తులలో ఒకడుకాగా, ఈశ్వరుడనినా,
శివుడనినా విశ్వమంతా ఆవహించిన పరమాత్మయని తెలియవలెను. పరమాత్మకు రూపమేకాదు పేరుకూడలేదు.
దానిప్రకారము 'ఈశ్వర' 'శివ' అనునవి పేర్లుకాదు. పరమాత్మయొక్క గొప్పతనమును తెలియ జేయు అర్థముతో
కూడుకొన్న పదములేగాని పేర్లు కావు. 'ఈశ్వర' అనగా అధిపతియని అర్థముగలదు. సర్వేశ్వరుడు అనగా సర్వమునకు
అధిపతి పరమాత్మయని అర్ధము. ''శివ' అనగ అగ్నికి నీరుకు గుర్తయిన బీజాక్షరములు అని తెలియవలెను.
ఓం నమః శివాయ అను శబ్దమును లింగము వద్దనే ఉచ్చరించవలెను. ఆకారమున్న శంకరునివద్ద ఉచ్చరించకూడదు.
శంకరునికి, పంచాక్షరి అని పేరుగాంచిన ఓం నమఃశివాయకు ఏమి సంబంధములేదు. పరమాత్మ ప్రకృతికి కూడ
నాశనము కానివాడని తెలుపుటకు పంచాక్షరి అను పదముగా ఓం నమఃశివాయ అన్నారు. ఈ శబ్దములో ప్రకృతి
అయిన పంచ భూతములకు పరమాత్మ నశించువాడు కాదని 'ఓం'ను పరమాత్మ యొక్క బీజాక్షరముగా పెట్టారు. అట్లే
న అను దానిని ఆకాశముయొక్క బీజాక్షరముగా, మః అనుదానిని గాలియొక్క బీజాక్షరముగా, శి అను అక్షరమును అగ్ని
యొక్క బీజాక్షరముగా, వ అను దానిని నీరు యొక్క బీజాక్షరముగా, య అను దానిని భూమియొక్క బీజాక్షరముగా పెట్టి
చూపించారు. ఐదు అక్షరములకు నాశనముకానిది పంచ అక్షరీ అన్నారు.
పంచ అనగా ఐదు అక్షరములనీ, ఆ ఐదు నమఃశివాయ అనునవి కాగ ఆరవ అక్షరముగా మొదటనే ఓం
గలదు. పంచభూతములకు అతీతమైన దైవమునకు గుర్తుగా ఓం ఉండగా, పంచభూతములైన ప్రకృతికి గుర్తుగ నమః
శివాయ గలవు. పూర్తి జ్ఞానము తెలిసిన జ్ఞానులు పరమాత్మను ఆశ్రయింతురు. జ్ఞానము తెలియనివారు ప్రకృతినే
ఆశ్రయించెదరు. ప్రకృతిని ఆశ్రయించిన అజ్ఞానులు కూడ దైవమును తలచునట్లు ప్రకృతిలోని అగ్ని, నీరు బీజాక్షరములను
తీసుకొని 'శివా' అన్నారు. దీని వలన జ్ఞానులు 'ఈశ్వరా' అనినా, అజ్ఞానులు 'శివా' అనినా ఇరువురూ దేవున్ని
తలచినట్లే అగుచున్నది. 'శి' అగ్నికీ, 'వా' నీటికి గుర్తు, లేక బీజాక్షరమనుకున్నాము కదా! ఇక్కడ అగ్ని నీరునే ఎందుకు
తీసుకొన్నారని ప్రశ్నరాగలదు. దానికి జవాబు ఏమనగా! అగ్నిని నీరు క్రింద పెట్టితే నీరు వేడెక్కి అవిరై కనిపించకుండ
పోవును. ఒకవేళ నీరునే అగ్నిమీద పోస్తే నీటికి అగ్ని ఆరిపోయి లేకుండ పోవును. ఈ విధముగా నీటి వలన అగ్ని,
అగ్ని వలన నీరు లేకుండ పోవు అవకాశము కలదు. అట్లే భూమి గాలినీ, గాలి భూమినీ లేకుండ చేయలేదు.
కనిపించని ఆకాశము దేనికి నాశనము కాదు. అందువలన ప్రకృతిలోని గుర్తులైన అగ్ని, నీరుకు మాత్రమే ఒకదానికొకటి
నాశనము చేసుకొను శక్తి కలదు. ఏమి జ్ఞానము తెలియనివారు కూడ కొంత జ్ఞానమును తెలుసుకొనుటకూ, వారు
కూడ పరమాత్మను తలచుటకు పెద్దలు నిర్ణయించిన శబ్దము 'శివా'. అందువలన పూర్వము జ్ఞానము బాగా తెలిసిన
పండితులు పరమాత్మను ఈశ్వరా అని పిలువగా, పూర్తి జ్ఞానము తెలియని అజ్ఞానులు శివా అని తలచెడివారు.
దీనివలన పిలిచెడి శబ్దమును బట్టి వీరు పూర్తి జ్ఞానులు, వీరు పూర్తి జ్ఞానులుకాదని వినినవారికి కూడ తెలిసిపోయెడిది.
పూర్వకాలమట్లుండగా నేడు శివా అని ఎవరనాలో, ఈశ్వరా అని ఎవరనాలో తెలియకుండ పోయినది. కర్ణాటక
రాష్ట్రములో జ్ఞానులు అజ్ఞానులు ఇరువురూ శివా అను పదమునే ఎక్కువగా పలుకుచున్నారు.
పూర్వము ఓం నమఃశివాయ అను ఆరు అక్షరముల శబ్దమును పంచాక్షరి అనుటలో ప్రకృతిలోని భాగములైన
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనునవి మొదటి అక్షరముగానున్న పరమాత్మను నాశనము చేయలేవు అని
అర్థము వచ్చునట్లు పంచాక్షరి అన్నారు. కానీ అది ఓం నమఃశివాయ అను పంచాక్షరి స్థూలముగా ఐదక్షరములు కాదు
ఆరక్షరములని తెలియుచున్నది. దైవము వైపు నుండి పలుకుచున్న ఈశ్వరా అనుటకు, ప్రకృతి వైపునుండి పలుకుచున్న
శివా అనుటకు అర్థమునెలా తెలియలేక పోయామో, అలాగే పంచాక్షరిలో ఆరు అక్షరములున్నాయనీ, దాని అర్థము
పంచ భాగములుగా ఉన్న ప్రకృతికి ఒక్క భాగముగా ఉన్న పరమాత్మ నాశనము కానివాడని కూడ తెలియలేక పోయాము.
ఈ విధముగా పూర్తి వివరము తెలియని పరిస్థితిలో మానవుడుండగా శివరాత్రి యొక్క అర్థము, దాని ఉద్దేశ్యము ఎలా
తెలుస్తుంది. అటువంటపుడు శివరాత్రి పండుగకు మనిషి పూర్తి న్యాయము చేయగలడా? అర్ధముతో కూడుకొన్న
ఆచరణను పండుగరోజు ఆచరించ గలడా? అందువలన పంచాక్షరి అనుమాటకు, ఈశ్వరా అనుమాటకు, శివా అను
శబ్దమునకు అర్థమును వివరముగా చెప్పుకోవలసివచ్చినది. అంతేకాక శంకరునికి, ఈశ్వరునికి సంబంధము లేదనీ,
శంకరుడు శరీరమున్నవాడని, పరమేశ్వరుడు శరీరములేనివాడని చెప్పవలసి వచ్చినది. ఇంకనూ చెప్పితే శంకరుడు
కూడ ఈశ్వరున్ని గురించి ధ్యానించెడివాడనీ, మోక్షము కొరకు ప్రార్థించెడి వాడనీ యోగదండమునుపయోగించి చర్మాసనము
మీద బ్రహ్మయోగమును ఆచరించెడివాడని చెప్పవలసి వచ్చినది. ఇవన్ని మొదట తెలిస్తేనే శివరాత్రి పండగకు
అర్థము సులభముగా తెలియగలదు. ఇపుడు మేము చెప్పినదంతయు క్రొత్త విషయమే కావున క్రొత్త ఆహారము
తిన్నవారికి అరగనట్లు కొందరికి ఈ విషయము జీర్ణము కాకపోవచ్చును. మీకు అర్థము కానంతమాత్రమున, మీకు
నచ్చనంత మాత్రమున మమ్ములను దూషించినా, అజ్ఞాని అనినా ఇంకా ఏమైనా చెడుగా అనినా నిమిత్త మాత్రుడైన
నేను మాత్రము ఓర్చుకోగలను. కానీ మాలో నేను కాక రెండవాడైన ఆత్మ ఉన్నాడు కదా! వాడు ఓర్చుకోడు. పెద్దపాపమును
మీకు అంటగట్టుతాడు. అది దేవుని జ్ఞానమునకు సంబంధించిన పాపము కావున అనుభవించేటపుడు చాలా
భయంకరముగా ఉంటుంది జాగ్రత్త!!
జీవుడు శరీరములో జీవిస్తున్నాడంటే పాపపుణ్యమను కర్మ ఉన్నదని తెలియుచున్నది. ఎపుడు కర్మ అయిపోతే
అపుడు జీవుడు ముక్తిపొంది దేవునియందైక్యమవుతాడు. ముక్తి పొందుటకే మనము జ్ఞానము తెలుసుకోవలసినది.
జ్ఞానము తెలుసుకొనుటకే పండుగలను ఆచరించ వలసినది. జీవునికి కర్మ అనునది కట్టెలులాంటిది. కట్టెలు లేని
వానికే ముక్తి అను ఇంటిలోనికి ప్రవేశముండును. కట్టెలున్న వానికి ప్రవేశము లేదు. కావున జ్ఞానమను అగ్నితో
కట్టెలను కర్మను లేకుండ చేసుకోవాలి. అందువలన జీవుడు ముక్తి పొందుటకు కావలసినది జ్ఞానమను అగ్ని. దానివలన
పంచభూతములలో కాల్చు అగ్నికి గుర్తయిన 'శి' అను అక్షరమును తీసుకొనీ, కాలిపోవు కట్టెలవలె ఆవిరియైపోవు
నీటికి గుర్తయిన 'వా' ను తీసుకొని శివా అన్నారు. దీని ప్రకారము 'శివా' అనడములో జ్ఞానాగ్నితో కర్మ అను కట్టెలను
లేకుండ చేసుకుంటానని అర్ధము. జ్ఞానము వలన కర్మపోతే ముక్తిని పొందవచ్చును, అనగా దైవమును పొందవచ్చును.
దేవుడు త్రిగుణరహితుడు. గుణములున్నది పగలని, రాత్రి గుణములుండవనీ, అందువలన మాయకు గుర్తు పగలనీ,
దేవునికి గుర్తు రాత్రియనీ 'సుబోధ' అను గ్రంథములో చెప్పుకొన్నాము. జ్ఞానమను అగ్ని వలన కర్మలను కట్టెలను
ఆహుతి చేసి, మూడు గుణములులేని రాత్రి అను దేవున్ని పొందుతాను అను భావముతో కాల్చే అగ్నికి గుర్తుగ 'శి'
అనియూ, కాల్చబడే కర్మకు గుర్తుగా 'వా' అనియూ, పొందబడే దేవునికి గుర్తుగా రాత్రి అనియూ అర్థముతో పూర్వము
యుగాది తర్వాత మొట్టమొదట పెట్టిన పండుగ “శివరాత్రి”. చూచారా! శివరాత్రిలో ఇమిడియున్న అర్థము ఎంత
గొప్పదో!!
మానవునికి మోక్షమును సూచించు శివరాత్రిని పెద్దలు మొదట పండుగగా పెట్టి చూపించగా, కృతయుగమునుండి
త్రేతాయుగము, త్రేతాయుగమునుండి ద్వాపరయుగము, ద్వాపరయుగము నుండి కలియుగము వచ్చేటప్పటికి మాయ
ప్రభావము వలన శివరాత్రికి అర్థమే తెలియకుండ పోయినది. శివరాత్రి అంటే శంకరున్ని పూజించు దినముగా, ఓం
నమఃశివాయ శంకరుని నినాదముగా అందరూ అనుకొనుచున్నారు. కానీ పరమాత్మనుగానీ, మోక్షమునుగానీ ఎవరు
గుర్తు చేసుకోవడములేదు.
రుద్రుడనినా, శంకరుడనినా ఇద్దరూ ఒక్కటే. శంకరుడు, నేను జ్ఞానిని అన్నట్లు జ్ఞానమునకు చిహ్నమైన
చంద్రవంకను తలమీద ఉంచు కొన్నాడు. ఆయనకు జ్ఞానము తెలిసిన దానివలన యోగమునకు కావలసిన చర్మమును
ఆసనముగా చేసుకొని, యోగదండమును ఉపయోగించుచు దైవమునందు మనస్సు లగ్నము చేసెడివాడు. ఈ విధముగా
రుద్రుడైన శంకరుడు, ఈశ్వరున్ని పొందవలెనని ప్రయత్నిస్తుండగా, ఆయన దారిలో మనము కూడ నడచి శివరాత్రిని
అసలైన అర్థముతో చేసుకోక, శివరాత్రిని శంకరుని దినముగా భావించడము పొరపాటు కాదా? పూర్వము నుండి
ఉన్న ఆచారము ప్రకారము ఈశ్వర లింగమును ఎదురుగా పెట్టుకొని దానిని శంకరునిగా తలుచుకోవడము పొరపాటు
కాదా? సృష్ఠి రహస్యమును తెలియజేయు లింగము ప్రక్కలో పార్వతిని భార్యగ, నందిని వాహనముగా పెట్టడము
పొరపాటు కాదా? దీనికంతటికి మూల కారణము అజ్ఞానమే. కట్టుకథలతో కూడుకొన్న పురాణములను కొందరు
ప్రచారము చేయుట వలన ఏర్పడిన మౌఢ్యము చేత, విశేష అర్థముతో మనముందరే లింగమున్నా దానిని శాపముతో
రాయిగా మారిపోయిన శంకరుడనుకొనుచున్నారు. రూపములేని లింగమునకు కొందరు అజ్ఞానముతో తెలియక
శంకరుని ముఖ ఆకారమున్న రేకును తగిలించుచున్నారు. లింగమునకు ముఖ ఆకారమును కరిపించడము వలన
లింగము యొక్క అర్థమునకే భంగము ఏర్పడుచున్నది. ఇంతవరకు ఎంతో అజ్ఞానముతో సృష్ఠికి మూల కారణమైన
దేవున్ని లింగాకారముతో చూడక శంకరునిగా తలచాము. ఇప్పటినుండైన ఈశ్వరున్ని లింగముగా, శంకరున్ని
రుద్రభూమినందు సంచరించు రుద్రునిగా చూడవలెను. శివరాత్రిని కర్మనాశనమైన మోక్షరాత్రిగా చూడవలెను.
ప్రస్తుత కాలములో శివరాత్రి దేశవ్యాప్త పండుగ అయినా ఒక ప్రాంతములో కూడా పూర్వమున్న
సాంప్రదాయమును అనుసరించి జరుగడములేదు. పూర్వము ఇందూ (హిందూ)త్వము జ్ఞానముతో ముడిపడి ఉండెడిది.
నేడు ఇందూత్వము రాజకీయముతో ముడిపడి ఉన్నది. దైవజ్ఞానములేని రాజకీయము హిందూత్వ ముసుగు వేసుకొని
మాలాంటి వారిని కూడ ఆత్మజ్ఞానమును చెప్పకుండ అడ్డుపడుచున్నది. మనుషులు నడిచే అజ్ఞానమార్గమును ఖండించి
జ్ఞాన మార్గమను బోధించడము మాధ్యేయము. హిందువులు దైవమార్గములో సరిగా లేకపోతే మీరు ఇక్కడ అజ్ఞానముగా
నడుస్తున్నారు. దేవుడు చెప్పిన భగవద్గీత గ్రంథానికే వ్యతిరేఖముగా ఉన్నారని చెప్పడము మా కర్తవ్యము. ఎందరో
వేదాంతులు కూడ జ్ఞానమునకు వ్యతిరేఖముగా నడుస్తుంటే, మేము వారికి కూడ వేదములు ప్రకృతి జనితములనీ
దైవజనిత భగవద్గీత అందరికీ ఆమోదయోగ్యమైనదనీ, అదియే నిజమైన జ్ఞానమని చెప్పాము. అలాగే హిందువులై
కూడ భగవద్గీత ప్రకారము నడువని వారికి పూర్వము పెద్దలు ఎలా చెప్పారో చూడండని సరియైన జ్ఞానమును
తెల్పుచున్నాము. జ్యోతిష్య శాస్త్రము ప్రకారమూ, మా జాతకము ప్రకారమూ భూమిమీద మేము చేయవలసిన పని
తెలియకుండ పోయిన జ్ఞానమును చెప్పడమే. మేము శాస్త్రబద్దముగా, పురాణరహితముగా జ్ఞానము తెల్పుచుంటే,
ఎన్నో తెలియని రహస్యములు వీరి ద్వారా తెలియుచున్నవి కదా!యని సంతోషపడక మమ్ములను జ్ఞానము చెప్పవద్దని
బెదిరించు హిందువులున్నారంటే, హిందువులు ఎంత అజ్ఞానములో చిక్కుకొని పోయారో అర్థమగుచున్నది. నేను
ఇందువు (హిందువు)గా పుట్టినందుకు, హిందువులకు సంపూర్ణ జ్ఞానమును కల్గించాలనునదే మా ఉద్దేశ్యము.
ప్రయత్నము లోపలి ఆత్మ చేయిస్తూ ఉంటే నేను చేస్తూవుంటాను. అంటే మేము జ్ఞానమును బోధిస్తూనే ఉంటాము.
శివరాత్రి కర్మనిర్మూలనకు, మోక్షప్రాప్తికి గుర్తుకావలెను. కానీ కర్మ సంపాదనకు గుర్తుకాకూడదు. నేటికాలములో
శివరాత్రి దినమున కొందరు జాగరణ అను పేరుతో రాత్రిపూట మేల్కొనుచున్నారు. ఆ దినము మేల్కొనవలెనని
తెలుసు, కానీ ఎందుకు మేల్కొవాలి? మేల్కొని ఏమి చేయాలని తెలియదు. శివరాత్రి దినమున రాత్రికి సినిమాలు,
షికార్లు, త్రాగడము, వేశ్యలతో గడపడము చేయుచున్నారు. కొందరైతే గర్ల్ ప్రెండ్తో ఎంజాయి చేశానని గర్వముగా
చెప్పుకొంటున్నారు. ఈ విధముగా నేటి సమాజములో యువత మారిపోవుచుండగా, పెద్దవారు ఏమి పట్టనట్లున్నారు.
ఎన్ని పాపములు చేసినా వేయిరూపాయలు ఖర్చుపెట్టి శివునికి అభిషేకము చేశాములే అవే పోతాయనుచున్నారు.
పూజలు చేయు పండితులు కూడా పాపపరిహారార్థము పూజలున్నాయనుచున్నారు. దానివలన పాపము యొక్క భయము
ఎవరికీ లేకుండాపోయి డబ్బులు ఖర్చుపెట్టి పూజలో, అభిషేకములో చేస్తే పాపము పోతుందను భావము అందరిలోను
ఉన్నది. దానితో శివరాత్రి దినమున కూడ ఆ పండుగ సరదాకోసమే అన్నట్లు చేయుచున్నారు. సాంప్రదాయము
ప్రకారము పండుగ రోజున, గడచిన కాలమును గురించి యోచించి, నేను ఎంత పండినానని లెక్క చూచుకోవలసి
యున్నది. కర్మను పోగొట్టుకొనుటకు కావలసిన జ్ఞానము కొరకు వెతుక్కోవలసియున్నది. తాము మాయనుండి
జాగృతిపడుచు ఎదుటివారిని కూడ జాగ్రత్త చేయవలసిన దినము కావున 'శివరాత్రి జాగరణ' అని ఆ రాత్రిని అన్నారు.
అంతేకాని నిద్ర పోకుండ మేల్కొనడము జాగరణ కాదని తెలియవలెను.
చదువురాని పామరులు ఏదైనా ఇతరులను అనుసరించి చేస్తున్నారంటే ఒప్పుకోవచ్చును. కానీ విద్యావంతులు,
విజ్ఞానవంతులు ఇతరులు చేయుచున్న దానిని వివరముగా తెలుసుకోక గ్రుడ్డిగ చేయుచున్నా రంటే దానికి అర్థమే లేదు.
శివరాత్రి యొక్క విషయములోగానీ, మరికొన్ని పండుగల విషయములో గానీ ఏమాత్రము వివరమడుగక, కనీసము
తెలుసుకుందామనే ప్రయత్నమూ చేయక, గ్రుడ్డిగ చేస్తూ పోతుండడము వలన, హేతువాదులడుగు ప్రశ్నలకు జవాబు
చెప్పలేక పోవుచున్నారు. విద్యావంతులు కూడ సరియైన జవాబు చెప్పలేక పోవడము వలన, ఇదంతయు మూఢభక్తి,
మూఢ నమ్మకమని హేతువాదులు కూడ దేవుడే లేడనుచున్నారు. ఇప్పటికే జ్ఞానమంటే ఏమిటని కొంత యోచించువారికి,
జవాబు దొరకక పరమతమును కొందరు ఆశ్రయించుచుండగా, కొందరు నాస్తికవాదులుగా మారిపోవుచున్నారు. ప్రజా
విజ్ఞాన వేదికలను పేరుతో దేవుడే లేడనీ, భగవద్గీత బూటకమనీ, జ్ఞానమును చెప్పువారంతా మోసగాళ్ళని కొందరు
అనుచున్నారు. మాలాంటి వారు జ్ఞానమును చెప్పుచుంటే అర్థముకాక మీది హిందూమతమునకు వ్యతిరేఖమైన
జ్ఞానమని మండిపడే కొన్ని సంస్థలకు ఇటువంటి హేతువాదులూ, విజ్ఞాన వేదికలు కనిపించలేదా? ఇప్పటికైన మేము
హిందువులమని రాజకీయ రంగు పూసుకోకుండ, మేల్కోని అజ్ఞానములో కూరుకుపోవుచున్న హిందువులను కాపాడాలని
మనవి చేయుచున్నాము. ముందు నీవు జ్ఞానము తెలుసుకో! తర్వాత ప్రక్కవానికి జ్ఞానము చెప్పు, అప్పుడైతేనే మనమూ
బాగుపడగలము, మన సంస్కృతిలోని పండుగలూ బాగుపడగలవు.
శ్రీరామ నవమి.
త్రేతాయుగములో దశరథమహారాజుకు కుమారునిగా రాముడు పుట్టాడు. ఆ రోజు గ్రహచారమును బట్టియో
లేక మహర్షుల మాటను బట్టియో "రామ" అను రెండక్షరముల పేరు దశరథపుత్రునికి పెట్టారు. ఆ పేరుకు ముందు
గౌరవప్రదముగ, శుభప్రదముగ "శ్రీ" అను అక్షరమును చేర్చి “శ్రీరామ” అని కొందరన్నారు. శ్రీ అనునది మధ్యలో
గౌరవమునకు చేర్చినదే కానీ అసలు పేరులోనిది కాదనీ, రామ అను రెండక్షరముల పేరు అసలైన పేరని తెలియాలి.
రామ అను రెండక్షరముల పేరు చాలా గొప్ప అర్థము నిచ్చునదై ఉన్నది. అందువలన కొందరు జ్ఞానమును తెలిసిన
పెద్దలు రామ అను పదమును అప్పుడప్పుడు అనుకొనమని చెప్పెడివారు. పెద్దలు చెప్పిన దానివలన కొందరు
కూర్చున్నపుడు, లేచినపుడు రామ అని అనడము అలవాటు చేసుకొని ఉండెడివారు. పూర్వము అలా రామ శబ్దమును
చాలామంది పలికెడివారు. నవీనకాలములో చదువులు ఎక్కువై విజ్ఞానము పెరిగిన కొలది పూర్వకాలము రామ
అన్నట్లు ఇపుడు ఎవరు అనడము లేదు. ఇందులో విశేషమేమంటే పూర్వకాల పద్దతి ప్రకారము ఎవరైనా అనేవారు
ఉండినా, వారు రామ అని రెండక్షరములనే అంటారు. కానీ శ్రీరామ అని మూడక్షరముల పదమును పలుకరు. ఉత్తర
భారతదేశములో చాలామంది ప్రస్తుతకాలములో కూడ ఒకరికొకరు పరిచయమున్నవారు ఎక్కడైన ఎదురైతే రాష్రమ్
అని చెప్పుకొనుట చూడవచ్చును. ఎదుటి వ్యక్తికి గౌరవముగ నమస్తే అని చెప్పుటకు బదులు రాష్రమ్ అనుట
గలదు. రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రములోని ప్రజలలో రాష్రమ్ అను అలవాటు పూర్తిగా కనిపిస్తున్నది. పూర్వము
నుండి అటువంటి మంచిపద్ధతిని మన పెద్దలు మనకు అలవాటు చేశారు. 'రామ' అను పదములోని విశిష్టత
అలాంటిది. కబీర్ దాస్ మొదలగు జ్ఞానులు కూడ రామ శబ్దమును విడువక తలచెడివారు.
ఇప్పటికాలములో కొందరు హేతువాదులు రామునిలో ఏమి గొప్పతనమున్నదని ప్రశ్నించుచున్నారు. రాముడు
దశరథ పుత్రుడుగా పుట్టి ఆస్తితగాదాలలో అడవికివెళ్ళి అనేక కష్టములు పడ్డాడు. సీతను పోగొట్టుకొని జాడతెలియక
కొన్ని సందర్భములలో రోదించాడు. సామాజిక న్యాయమును కూడ పాటించక భార్యను అదియు గర్భిణి మనిషిని
అడవిలో వదలివేశాడు. తండ్రి అని తెలియక ముందు రాముణ్ణి స్వంత కొడుకులే నిందించారు. భర్త అయిన
రాముడు సీతను తిరిగి ఇంటికి రమ్మంటే భార్య నిరాకరించింది. ఆయన స్వంత జీవితములోనే ఎన్నో కష్టములను
ఎదుర్కొన్న రాముడు దేనిలో గొప్పవాడు? ఆయనకే లేని విశిష్టత ఆయన పేరుకెలా వచ్చినది? అని కొందరు హేతువాదులు
ప్రశ్నించుచున్నారు. జీవిత కాలములో ఒక సంవత్సరము కూడ కలిసి కాపురము చేయనివారు ఆదర్శ దంపతులా?
శీలవతియైన భార్యను అనుమానించి అడవికి పంపినవాడు గొప్పవాడా? ఆయన దేవుడేకాదు అను నాస్తికులు కూడ
గలరు. అంతేకాక ఆ రామునికంటే మా రావణుడే గొప్ప అను దక్షిణదేశ ద్రావిడులు గలరు. ఇటువంటి వారందరికి
మేము జవాబు చెప్పలేము. ఎందుకనగా! చెప్పినా పూర్తి వినకుండానే అడ్డముగా మాట్లాడువారికి ఎవరూ జవాబు
చెప్పలేరు.
ప్రతి మనిషిలోను మరొకరి గురించి చెప్పుటలో మూడు భావములు వుంటాయి. ఈ మూడింటిని ప్రపంచ
భావములంటాము. అవి ఒకటి తటస్థ భావమూ, రెండు విమర్శ భావమూ, మూడు విశ్వాస భావము. ఈ మూడు
భావముల ప్రకారము ఏ మనిషైన మరొక మనిషిని లెక్కించు చుండును. అలాగే రాముణ్ణిగానీ, కృష్ణుణ్ణిగానీ
విమర్శించువారు గలరు, విశ్వసించువారూ గలరు. మరికొందరు అటు విమర్శించడముగానీ, ఇటు విశ్వసించడముగానీ
ఏమి లేకుండ, ఏమి మాట్లాడకుండ తటస్థముగా ఉండువారూ గలరు. ఎవరి భావము వారికి గొప్పగా ఉంటుంది.
కాబట్టి మన భావము వారికి నచ్చవచ్చును, నచ్చకపోవచ్చును. అందువలన నేను ప్రపంచ పద్ధతిలోనున్న ఈ మూడు
భావముల ప్రకారము ఏమి చెప్పక, ఈ మూడు భావములకు అతీతముగానున్న ఆధ్యాత్మిక భావము ప్రకారము
చెప్పదలచుకొన్నాను. అలా ఎందుకు చెప్పాలనుకొన్నామనగా! ఆధ్యాత్మిక భావములో విమర్శగానీ, విశ్వాసముగానీ,
తటస్థముగానీ ఉండదు. ఆధ్యాత్మిక భావము అందరికి సమానముగా ఉండును. ఈ భావము అందరికి సంబంధించినదై,
అందరియందు సమానముగా ఉన్నదై ఉండుట వలన శ్రద్ధ ఉన్నవారికి అర్థము కాగలదు. శ్రద్ధలేనివానికి అర్థముకాదు.
ఇపుడు మేము చెప్పు ఆధ్యాత్మిక భావమును శ్రద్ధగలిగి అందరు అర్థము చేసుకుంటారను ఉద్ధేశ్యముతో చెప్పుచున్నాము
శ్రద్ధగా చూడండి.
దశరథ పుత్రుడైన శ్రీరాముని పట్ల విశ్వాసమున్న రాముని భక్తులకు, విశ్వాసములేని నాస్తిక, హేతువాదులకు
తెలియని రహస్యమొకటి గలదు. అది ఏమనగా! త్రేతాయుగములోని దశరథ రామునికంటే ముందే కృతయుగములోనే
"రామ" అను రెండక్షరముల పదము గలదు. రామునికంటే ముందే 'రామ' అను పేరుండుట ఆశ్చర్యమే కదా! ఇపుడు
ఆ ఆశ్చర్యకరమైన విషయమును గురించి తెలుసుకొందాము. 'రామ' అను రెండక్షరముల శబ్దమును ప్రజలకు
కృతయగములోని జ్ఞానులే పరిచయము చేశారు. రాముడు పుట్టని ఆ కాలములో 'రామ' అను రెండక్షరములకు
ఆధ్యాత్మికరీత్యా విశేషమైన అర్ధముండెడిది. 'ర' అనగా అర్థము నాశనము అని ముందే తెలుసుకొన్నాము. 'ర' అనినా
'రా' అనినా రెండు ఒకే అర్థము నిచ్చుచున్నవని దశరా పండుగను గురించి చెప్పుకొన్నపుడే తెలుసుకొన్నాము. 'మ'
అనగా నేను లేక నా అను అర్థముగలదని మమ అనగా నాయొక్క అనియు “సుబోధ” గ్రంథములో 'మామ' ను గురించి
చెప్పుకొన్నపుడు తెలుసుకొన్నాము. ఆ ప్రకారము చూస్తే రామ అను మాటలో నా అనునది నాశనము కావలెనని
అర్థమిమిడియున్నది. నేను అనువాడినైన జీవున్ని నాశనమై పోవాలని అర్థము, ఆ రెండక్షరముల శబ్దములో గలదు.
జీవుడు నాశనమైతే దేవునిగా మారిపోగలడు. అనగా దేవునిలో కలిసిపోగలడు. ఒక జీవుడు జన్మరాహిత్యమును
కోరుకొంటూ, దేవునియందైక్యమగు అర్థము "రామ" అను శబ్దములో ఇమిడియున్నది. బ్రహ్మజ్ఞానము ప్రకారము ప్రతి
జీవుడు దేవునియందైక్యమగునట్లు కోరుకోవలెను. ఆ విధముగానే ప్రవర్తించవలెను. జీవుడు ఎప్పటికైనా దేవునియందు
చేరిపోవలసినవాడే. జీవుడు అను మాట లేకుండ పోయి దేవుడను మాటగా మార్పు చెందవలసినదే. అందువలన
భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి అను ఆధ్యాయమున జీవున్ని క్షరుడు అన్నారు. క్షరుడు అనగా నాశనమగువాడని
అర్థము. “నాశనము చెందువాడిని నేను" అను జ్ఞాపకమును ఎల్లపుడు మనిషి మరిచిపోకుండునట్లు “రామ” అను
మాటను సందర్భములోగానీ, అసందర్భములోగానీ అపుడపుడు పలుకునట్లు పెద్దలు అలవాటు చేశారు. పూర్వము
రెండక్షరముల రామ అను మాటలో ఎంత అర్థముందో అందరికి తెలిసియుండెడిది. కృతయుగములోనే రామ అను
శబ్దము ఆధ్యాత్మికమునకు ఆదర్శముగా ఉండెడిది. నేను నాశనమగువాడినని అందరిలో దృఢభావము రామ అను
రెండక్షరముల వలన ఉండెడిది. భగవద్గీతలో చెప్పిన క్షరభావము, అనగా నాశన భావము 'ర' వలన, నేను అను
భావము ‘మ’ వలన కల్గుచున్నది. కావున రామ శబ్దము పరమ పవిత్ర అర్థముతో కూడకొన్న శబ్దముగా పూర్వము
భావించెడివారు. గొప్ప భావమున్న రామ శబ్దమును దశరథపుత్రునికి నామధేయముగా పెట్టుకొన్నారు. ఆనాటినుండి
ఆధ్యాత్మిక జ్ఞానము ప్రజలలో తగ్గిపోవడము వలన రామ అను రెండక్షరములు శ్రీరామ అని మూడక్షరములుగా
మారిపోవడమూ, దశరథపుత్రునినుండే రామ అను పేరు వచ్చినదనీ, రామ అనగా దశరథ రాముడేనను భావము
అందరిలో ఉండిపోయినది. అదే భావము ఈనాటికి మిగిలిపోయినది.
రామ అంటే దశరథ పుత్రుడే అని రామదాసు అనుకొనగా, రామదాసుకంటే పెద్దవాడైన కబీర్ దాసు తాను
అనుకొను రామ దశరథ రాముడు కాదనుకొన్నాడు. అందువలన ఒక సందర్భములో దశరథ రాముడే కనిపించినా
నీవు నా రామునివి కాదు పో! అన్నాడట. నేను తలచు రామవు నీవుకాదు అని శ్రీరాముణ్ణి కబీర్ అన్నాడంటే కబీరు
పూర్వపు జ్ఞానము ఆధ్యాత్మికము ప్రకారము తెలుసునన్నమాట. రామదాసుకు ఆధ్యాత్మికము తెలియక రామ అను
మాట శ్రీరాముని పేరేననుకొన్నాడు. ఒక రామదాసే కాదు, ఆనాటి త్రేతాయుగమునుండి ఎందరో దశరథ రాముడే
నిజమైన రామ అని తలచిన వారు కలరు. అటువంటి వారందరు శ్రీరాముని మీద భక్తిచేత శ్రీరామనవమిని
పండుగగా చేయుచున్నారు. శ్రీరామనవమి ఈనాడు భారతదేశమంతా ఆచరించు పండుగగా ఉన్నది. దేవుని వద్దకు
చేరాలంటే ప్రథమ మెట్టు భక్తి, కావున భక్తిని శ్రీరాముని మీద పెంచుకొని శ్రీరామనవమిని చేయుటవలన భక్తిలో
పరిపక్వత చెందిన వారై చివరకు రామ పదమునకు అర్థము తెలియగలదు. అందువలన శ్రీరాముని మీద భక్తితోనైనా
అప్పుడప్పుడు రామ అనుకొనుటకు అలవాటు పడితే మంచిది. అలా అలవాటు పడడము వలన చివరకు ఏనాడైనా
రామ శబ్దమునకు అర్థము తెలుసుకొనుటకు అవకాశమొచ్చును. రామా అని ఏదో ఒక రూపముతో అనుకోకపోతే ఆ
రెండక్షరముల భావము తెలియుటకు అవకాశముండదు కదా! కావున రాముని మీద భక్తితోకానీ, కోపముతోగానీ
అహర్నిశలు రామ అను శబ్దమును పలుకుట మేలని పెద్దలన్నారు.
'రామ’ అనినా అదే పదమును త్రిప్పి 'మరా' అనినా అర్థము మాత్రము ఒకటే. కావున నారదమహర్షి వాల్మీకికి
మొదట “మరా” అను శబ్దమునే మంత్రముగా బోధించాడట. వాల్మీకికి నారదుడు, దశరథరాముడు పుట్టకముందే
'మరా' శబ్దమును మంత్రముగా ఉపదేశించాడు. అదే 'మరా' శబ్దమునే ఉచ్చరిస్తూ వాల్మీకి ఎన్నో సంవత్సరముల
ఘోరతపస్సు చేశాడు. మరా శబ్దమును ఉచ్చరిస్తూ ఎన్నో సంవత్సరములు ఉండిపోవుట వలన అతను కూర్చున్న
స్థలములో పుట్టపెరిగి పోయినది. పుట్టను వల్మీకము అంటారు. చాలాకాలము తర్వాత పుట్టనుండి బయటికి వచ్చినవాడు
కనుక అతనిని వాల్మీకి అన్నారు. వాల్మీకిని ఆదికవి అంటే అతను ఎంతటి ముందువాడో మిరే యోచించండి. రామ
అను పదము యొక్క అర్థము తెలిసిన వాల్మీకి ఆ పేరున్న రాముని చరిత్ర అయిన రామాయణమును వ్రాయగలిగాడు.
రామాయణముకంటే ముందు కూడ కొన్ని చరిత్రలు కవులు వ్రాసినవి గలవు, అంటే వాల్మీకి ఆదికవి కావున ఆయన
రామునికంటే చాలా ముందు కాలపువాడని సులభముగా అర్థమగుచున్నది. వేల సంవత్సరములు బ్రతికిన వాల్మీకి
వృద్ధాప్యములో రాముని చరిత్రను రామాయణముగా వ్రాశాడు.
త్రేతాయుగమునుండి ప్రాచుర్యములోనికి వచ్చిన శ్రీరామనవమిని పండుగగా ఆచరించడము వలన, రామ
అను శబ్దము పలుకుట వలన, ఆధ్యాత్మికము అంటే ఏమిటో తెలియని వారికి కూడ ఎప్పుడైనా తెలుసుకొనుటకు
అవకాశము రాగలదు. రామ అను పదము పవిత్రమైనదని తెలియగలదు. అందువలన శ్రీరామనవమిని పండుగగా
చేయువారందరూ ఆ దినము క్రొత్తగుడ్డలు ధరించి, క్రొత్తతిండి తినడమే కాక క్రొత్త జ్ఞానమును తెలుసుకొనుటకు
ప్రయత్నించవలెను. శ్రీరామనవమి దినము వడపప్పు, పానకమును ప్రసాదముగా పంచుకోవడమేకాక జ్ఞానమును,
యోగమును ప్రవచనముగా చెప్పుకోవలెను. ఈ విధముగా అటుల బయటి దశరథ రామున్ని ఆరాధించైనా లోపలి
ఆత్మారామున్ని తెలుసుకొనుటకు ప్రయత్నించండి. ఇప్పటి నుండి ఉత్తరాయణములో వచ్చు శ్రీరామనవమిని అర్థముతో
ఆచరించి సరియైన జ్ఞానఫలితమును పొందవలెనని తెల్పుచున్నాము.
శ్రీకృష్ణ జన్మాష్టమి.
శ్రీకృష్ణుడు పుట్టినది క్రీస్తు పూర్వము 3228 సం॥ జూలై నెల 19వ తేదిన బహుళ అష్టమి దినమున
వృషభలగ్నములో పుట్టాడు. దీనినిబట్టి ఇప్పటికి 5238 సంవత్సరముల పూర్వము కృష్ణుడు భూమిమీద పుట్టాడని
తెలియుచున్నది. అర్థము చేసుకొంటే ఆయన జీవితమే గొప్ప జ్ఞాన సందేశమని చెప్పుకొన్నాము కదా! దానిప్రకారము
ఆయన జన్మలో కూడ గొప్ప జ్ఞానము ఇమిడి ఉన్నదని చెప్పవచ్చును. కృష్ణుడు ఎదురు కాళ్ళతో పుట్టడమే ఒక
విశేషమైతే, ఆయన పుట్టిన అష్టమి దినము కూడ విశేషతను సంపాదించుకొన్నది. కృష్ణుని జన్మాష్టమి యొక్క విశేషమేమిటని
చూచిన ఈ విధముగా అర్థము కాగలదు. సర్వసాధారణముగ ఏమీ జ్ఞానము తెలియని ప్రజలు కూడ "అష్టమి కష్టము,
నవమి నష్టము” అని అంటూ అష్టమి, నవమి దినములలో కొన్ని పనులను చేయరు. కొన్ని పనులు ప్రారంభించే
ముందు ఈ రెండు తిథులను లేకుండ చూచుకొంటారు. నవమి నష్టము, అష్టమి కష్టము అనడములో మీ భావమేమి
అని కొందరినడిగితే వారు ఇలా చెప్పుచున్నారు. "అష్టమి రోజు పని ప్రారంభించితే ఆ పని కష్టముతో కూడుకొన్నదగును.
అలాగే నవమి రోజు ప్రారంభించితే ఆ పని నష్టములతో కూడుకొన్నదగును" ఇలా వారు అన్న మాటలను బట్టి చూస్తే
ఇది జ్యోతిష్యశాస్త్రము ప్రకారము జరుగునది కాదు. జ్యోతిష్యశాస్త్రములో అటువంటి సూత్రము ఏది లేదు. అయినప్పటికి
పూర్వకాలము ఈ మాట చాలా ప్రచారములో ఉండెడిది. దాదాపు యాభై సంవత్సరముల క్రిందటి వరకు అష్టమి,
నవమి అను మాటలు అక్కడక్కడ వినిపించెడివి. ప్రస్తుత నవీన కాలములో ఆ మాట కరువై పోయినది. ఇప్పటి
చదువులలో పడిన పిల్లలకు తిథులంటే కూడ ఏమిటో తెలియకుండ పోయినది. ఇప్పటికి కూడ ఎక్కడైన పల్లెప్రాంతములలో
ఈ రోజు అష్టమి, అష్టమి రోజు ప్రయాణమా అనుటగానీ, ఇంతకాలముండి ఇప్పుడు అష్టమి దినమునా ప్రారంభించేది
అనిగానీ అనుట గలదు. దీనిని బట్టి అష్టమి, నవమి అను రెండు తిథులలో ఒక తిథి నవమి గాలికి పోయింది.
అష్టమి మాత్రము మిగిలివుంది అని అర్థమగుచున్నది. పల్లె ప్రాంతములలో ఎక్కడో ఒకచోట ఇంతవరకు మిగిలిన
అష్టమి కూడ పది సంవత్సరముల కాలమునకు లేకుండ పోతుందని తెలియుచున్నది. అష్టమి కష్టము, నవమి నష్టము
అని ఉండెడిదని చెప్పు మా మాటలకు కొంత ఆధారముగా ఇప్పటికీ అష్టమి మిగిలి ఉన్నది. కాలగమనములో ఎన్నో
కనుమరుగై పోయాయి. అయినప్పటికీ జ్ఞానమునకు విలువను చేకూర్చే మాటలు కనుమరుగు కాకూడదని మా
అభిలాష. అందువలన అష్టమి కష్టము, నవమి నష్టము అను మాటను పెద్దలు ఎందుకు అమలులోనికి తెచ్చారు?
ఎప్పటినుండి అమలులోనికి వచ్చింది? అను ప్రశ్నలకు జవాబులు వెదుకుకొందాము.
అష్టమి కష్టము, నవమి నష్టము అనుమాట శ్రీకృష్ణుడు పుట్టక ముందు లేదు. కృష్ణుడు పుట్టిన తర్వాత 90
సంవత్సరములకు భగవద్గీతను చెప్పాడు. భగవద్గీతను చెప్పిన తర్వాత కృష్ణుడు గొప్పవాడను విషయము కొందరికి
అర్థమైనది. అప్పటినుండి కృష్ణుడు పుట్టిన దినమును గోకులము లోను, మధురలోను పండుగగ చేసుకోవడము
జరుగుచున్నది. భగవద్గీత యుద్ధరంగములో చెప్పబడినది. భారతయుద్ధము క్రీస్తు పూర్వము 3138వ సంవత్సరము
జరిగినది. దీనినిబట్టి ఇప్పటికి భగవద్గీత పుట్టి 5148 సంవత్సరములు అయినది. భగవద్గీత పుట్టిన తర్వాత కృష్ణుడు
సామాణ్య మనిషి కాదని కొందరు జ్ఞానులు గ్రహించగలిగారు. అప్పటి నుండి శ్రీకృష్ణ జయంతిని చేయుటకు పూనుకొన్నారు.
అలా ఏర్పడినదే శ్రీకృష్ణ జన్మాష్టమి. అప్పటినుండి శ్రావణమాస బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుని జన్మదినమును పెద్ద
పండుగగా చేసుకొనెడివారు. ఆ విధముగా దైవజ్ఞానము తెలిసినవారు ప్రారంభించిన శ్రీకృష్ణాష్టమి కొంత కాలమునకు
దేశవ్యాప్తముగా అందరు చేయుట మొదలుపెట్టారు. భగవద్గీతను చెప్పిన తర్వాత కృష్ణుడు 36 సంవత్సరములకు
చనిపోయాడు. కృష్ణుడు సజీవముగా ఉన్నప్పుడే కృష్ణ జయంతిని కృష్ణాష్టమిగా చేయుట జరిగినది. ద్వాపరయుగములోనే
కృష్ణాష్టమి పండుగ తయారైనది.
కృష్ణుడు చనిపోయిన రెండు సంవత్సరములకే కలియుగము ప్రారంభమైనది. కలియుగ ప్రారంభములో
దేశమంతా ముఖ్యమైన పండుగగా శ్రీకృష్ణాష్టమి జరిగెడిది. కలియుగములో కృష్ణాష్టమి దేశవ్యాప్తముగా ఐదు ఆరువందల
సంవత్సరముల వరకు ఉత్సవముగా జరిగినది. అప్పటినుండి మాయా ప్రభావముచేత క్రమేపి కృష్ణాష్టమి పండుగ
చేయడము ఒక్కొక్కరు మానివేస్తూ వచ్చారు. ఆ విధముగా నాలుగు లేక ఐదువందల సంవత్సరములకు కృష్ణాష్టమిని
చేయడము 90 శాతము మంది మానివేశారు. చివరకు కొంతకాలమునకు కేవలము ఐదుశాతము మంది మాత్రమే
అదియు మధుర, గోకులమైన నందగావ్ పరిసరప్రాంతములలో మాత్రము చేయడము, గొల్లవారు మాత్రము చేయడము
ఆనవాయితీగా ఉన్నది. గొల్లవాడలయందు కృష్ణుడు చిన్నతనములో చేసిన వెన్న దొంగ తనమును గుర్తు చేయుటకు
ఉట్టిని పగుల గొట్టడము మొదలగు కార్యములను పండుగ వాతావరణములో ఇప్పటికీ చేయుచున్నారు. కలియుగ
ప్రారంభములో ఎంతో పెద్ద ఎత్తున జరుపబడు కృష్ణాష్టమి పండుగ నేడు గుర్తుకు మాత్రము మిగిలియున్నది. ఇటువంటి
పరిస్థితి రాకూడదని ఆనాటి పెద్దలు ఒక ప్రయోగము చేశారు. ఆ ప్రయోగమే అష్టమి కష్టము, నవమి నష్టము
అనుమాట. ఈ పద ప్రయోగమేమిటని కొందరికి అర్థము కాకపోవచ్చును. ఆనాటి పెద్దలు ఏ ఉద్దేశముతో ఈ
పదములను వాడారో గమనిద్దాము.
పూర్వము కృష్ణుడు మధురానగరములో అష్టమి దినమున పుట్టాడు. మరుసటి దినము నందగావ్లో కనిపించాడు.
పుట్టిన రాత్రే వసుదేవుడు రహస్యముగా కృష్ణున్ని మధురానగరమునుండి ప్రక్కనేనున్న నందగావ్ లోనికి చేర్చాడు.
అందువలన రెండవ దినమున అనగా తెల్లవారిన తర్వాత కృష్ణుడు యశోదకు పుట్టాడని ఆ గ్రామమంతా తెలిసిపోయింది.
కృష్ణుడు పుట్టిన అష్టమిరోజు రాత్రిపూట, తెల్లవారిన తర్వాత తిథి నవమి వచ్చినది. గొల్లవాడలలో తెలిసినది నవమిరోజు.
నందాగావ్లో కృష్ణుడు నవమి రోజు తెలిసాడు. మధురలో కృష్ణుడు అష్టమిరోజు పుట్టాడు. కృష్ణుని యొక్క పుట్టుక
అష్టమి రోజు, కావున ఆత్మజ్ఞానము తెలిసిన వారందరు శ్రావణ బహుళ అష్టమి రోజును 'కృష్ణాష్టమి' అను పేరుతో
చేసెడివారు. నందగావ్ లోని గొల్లవారందరు కృష్ణుడు తమ గ్రామములో కనిపించిన నవమి రోజున 'గోకులాష్టమి'
అను పేరుతో నవమిరోజు ఉత్సవము చేసెడివారు. వారు కులాభిమానము తో తమ పేరు ఉండునట్లు 'గోకుల అష్టమి’
అని చేయడము జరుగుచున్నది. ఇప్పటికీ కూడా శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి రెండు పేర్లతో అష్టమి, నవమి రెండు
రోజులు పండుగలు చేయడం జరుగుచున్నది. అష్టమి రోజు జ్ఞానులు చేయునది కృష్ణాష్టమి, నవమి రోజు గోకులవంశము
వారైన నేడు యాదవులనబడు గొల్ల కులము వారు ప్రత్యేకముగా చేయునది గోకులాష్టమి అని తెలియవలెను. కృష్ణుని
పుట్టుక అష్టమి రోజే అయినా కృష్ణాష్టమి, గోకులాష్టమి అను రెండు పేర్లతో అష్టమి రోజు, నవమి రోజు పండుగ
చేయడము జరుగుచున్నది.
కృష్ణ జయంతిని నవమిరోజున చేసినా దానిపేరు గోకులాష్టమి అని అష్టమినే చూపిస్తున్నది. కావున శ్రీకృష్ణుని
జన్మ ఉత్సవము అష్టమి, నవమి రెండు రోజులు జరగడము ఆనందదాయకమైన పనిగా తలచ వచ్చును. కలియుగము
మొదటిలో దేశవ్యాప్తముగా కృష్ణాష్టమి, గోకులాష్టమి రెండు రోజులు జరిగెడివి. ఆ రెండు దినములలో అందరూ
తమతమ పనులను మానుకొని ఉత్సవము చేసెడివారు. ఆ దినములలో ఎవరినీ పనిలోనికి పంపెడివారు కాదు.
పనులుంటే కృష్ణుని ఉత్సవములో పాల్గొనరని అన్ని పనులకు స్వస్తి చెప్పెడివారు. ఆ దినములలో ఎవరికైన, ఏ
పనికైనా మంచి ముహూర్తముండినా దానిని చేయక మానుకొనునట్లు, ఎవరు ఏ పని జోలికి పోకుండ పెద్దలు ఒక
భయము పెట్టారు. అష్టమి రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో కష్టము ఏర్పడుతుందని, ఆ పని సక్రమముగా
సాగదని చెప్పారు. అలాగే నవమి రోజున పనిని ప్రారంభిస్తే దానివలన ఎక్కువ నష్టము వస్తుందని చెప్పారు.
కృష్ణాష్టమి, గోకులాష్టమి సక్రమముగా జరుగుటకు, అందరు పాల్గొనుటకు అవకాశము ఉండునట్లు ఆ విధముగా చెప్పి
భయమును ఏర్పరచి, ఆ రెండు దినములు పనిని మాన్పించారు. ఆ భయము అందరికీ తెలియునట్లు అష్టమి కష్టము,
నవమి నష్టము అను మాటను ప్రయోగముగా వాడి మనుషులలో అందరికీ తెలియునట్లు చేశారు. ఆనాడు వారు
చేసినది మంచి ఉద్దేశమే అయినప్పటికి అష్టమి కష్టము, నవమి నష్టము అనుమాట నేటికి ఎవరికీ తెలియకుండా
పోయినది. ఆ మాట తెలియకుండా పోవడమే కాక కృష్ణాష్టమిని చేయువారు 90 పాళ్ళు తగ్గి పోయారు.
మనము కృష్ణ జయంతిని పండుగగా చేసిన చేయకున్నా ఆయన అష్టమి తిథినాడే ఎందుకు పుట్టాడని యోచించితే
ఎంతో జ్ఞాన అర్థమున్నదని చెప్పుకొన్నాము కదా! దానిని గురించి వివరించుకొంటే ఈ విధముగా కలదు. అమావాస్య
నుండి పౌర్ణమి వరకు 15 రోజులు, అట్లే పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15 రోజులుండుట అందరికీ తెలిసిన
విషయమే. శ్రీకృష్ణుడు పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల 15 దినములందు మధ్యలో గల అష్టమి దినమునందు
జన్మించాడు. 15 దినములలో పాఢ్యమి నుండి సప్తమి వరకు 7 దినములు, మధ్యలో అష్టమి, తర్వాత నవమి నుండి
అమావాస్య వరకు 7 దినములు గలవు. 7+1+7=15 పదిహేను రెండు సమాన భాగములు చేయవలయునంటే 7
మరియు 7 దినములుగ విభజించగ ఒకటి శేషము మిగులును. ఆ ఒక్క దినము అష్టమిగ గుర్తించి అష్టమికి ముందు
7 దినములుగ, వెనుక 7 దినములుగ గుర్తించు కోవలయును. శ్రీకృష్ణుడు మధ్య దినమైన అష్టమియందే పుట్టుటకు
విశేషమైన అర్థము గలదు. అదేమనగా!
భగవంతుడైన శ్రీకృష్ణుడు జ్ఞానమునకు, అజ్ఞానమునకు సంధిలాంటి వాడు. అజ్ఞానము నుండి జ్ఞానమునకు,
జ్ఞానము నుండి అజ్ఞానమునకు పోవుటకు ఆయన కేంద్రములాంటివాడు. ఎందరో జ్ఞానులు సహితము ఆయన తన
జీవితములో నడుచుకొన్న పద్దతులనూ ఆచరణలనూ చూచి, ఆయన చెప్పిన గీత అంతా బాగుగానే ఉంది, కానీ
ఆయన ఆచరణ మాకు నచ్చలేదు. ప్రవర్తన ముఖ్యము కదా! లోపల గుణములనుబట్టియే కదా ఎవరైనా ఆచరించేది,
ఆయన ఎన్ని చెప్పినప్పటికీ శ్రీకృష్ణుడు చేసిన పనులను బట్టి చూస్తే, బోధలు చెప్పినంత గొప్పవాడుకాదని తెలుస్తుందని
అంటున్నారు. అటువంటి వారు జ్ఞానమునుండి కృష్ణుని ద్వారా అజ్ఞానములోనికి పోయినట్లే, వారికున్న జ్ఞానము
నిష్ప్రయోజనమన్నమాట. శ్రీకృష్ణుడేమి చెప్పాడో వారు అర్థము చేసుకోలేదన్నమాట. అటువంటపుడు శ్రీకృష్ణుడు
చెప్పిన అసలైన జ్ఞానము వేరు విధముగ అర్థమై ప్రవర్తనకు భిన్నముగ తోచినపుడు వారు శ్రీకృష్ణునికి భిన్నముగ
పోగలరు. శ్రీకృష్ణుడు జ్ఞానకేంద్రమైనపుడు, ఆయనకు భిన్నముగ పోవువారు అజ్ఞానమువైపు పోవుచున్నారనే తెలియాలి.
అట్లే శ్రీకృష్ణుని చూచి ఆయన చెప్పినది, చేయునది, చేయించునది అంతా ఒకటేనని తెలిసినవారు జ్ఞానమువైపు
సాగిపోగలరు. ఆయనను చూచి ఉన్న చోటునుండి కొందరు జ్ఞానమువైపుకు, కొందరు అజ్ఞానమువైపుకు పోవుచున్నారు.
కావున శ్రీకృష్ణుడు అటు జ్ఞానమునకు, ఇటు అజ్ఞానమునకు మధ్యగలవాడని తెలియునట్లు అష్టమిరోజునే ఎంచుకొని
పుట్టాడు. శ్రీకృష్ణుడు బహుళపక్ష అష్టమి రోజే ఎందుకు పుట్టాలి? శుక్లపక్ష అష్టమియందు ఎందుకు పుట్టలేదు?
దానికి కారణమేమై ఉండవచ్చునను సంశయము కొందరికి రావచ్చును. దానికి మా సమాధానమేమనగా!
కృష్ణుడు, అజ్ఞాని, జ్ఞాని చిత్రమును మన పండుగలు 67వ పేజీలో చూడండి.
జ్ఞానబోధలలో చంద్రున్ని జ్ఞానచిహ్నముగ చెప్పిన సందర్భములు గలవు. గీతయందు అక్షర పరబ్రహ్మయోగమున
25వ శ్లోకములో యోగులకు మరుజన్మ ఉంటే జ్ఞానవికాసముకల్గి పుట్టుదురని చెప్పుచూ "చాందమ్రసం జ్యోతిః”
చంద్రతేజస్సు కల్గిపుట్టుదురని జ్ఞానవికాసమును చంద్రుని వెన్నెలతో పోల్చి చెప్పారు. అందువలన వెలుగైన పౌర్ణమిని
జ్ఞానముగ, చీకటిమయమైన అమావాస్యను అజ్ఞానముగ సులభముగ పోల్చుకోవచ్చును. పరమాత్మ జ్ఞానయుతుడైవుండి
అజ్ఞానయుతమైన ప్రపంచములోనికి వచ్చి భగవంతునిగా పుట్టాడు. కావున జ్ఞాన చిహ్నమైన పౌర్ణమి నుండి చీకటిమయమై
పోవుచూ చివరకు అమావాస్యగా మారు బహుళ పక్షమిలో పుట్టాడు. అట్లు పుట్టిన ఆయన అటు జ్ఞానియో, ఇటు
అజ్ఞానియో ఎవరికి అర్థముకానట్లు, జ్ఞానము అజ్ఞానము రెండు నాలోనే ఉన్నాయన్నట్లు మరియు జ్ఞానమునకు అజ్ఞానమునకు
నేనే మార్గమును, నేనే ద్వారమును అన్నట్లు మధ్యలో అష్టమి రోజున పుట్టాడు. పౌర్ణమి గడచిపోయిన తర్వాత వచ్చు
అష్టమి రోజున పుట్టాడు. కావున పరమాత్మ జ్ఞానప్రకాశవంతమైన పరము నుండి అజ్ఞాన అంధకారమైన ప్రపంచము
లోనికి వచ్చాడని తెలియాలి. ఈ విధముగా ఆయన పుట్టిన దినమునందు కూడ ఎంతో విశేషమైన అర్థమిమిడి ఉన్నది.
కావున ఆయన పుట్టిన దినమును మహాపర్వదినముగ భావించి, ఆ దినమును శ్రీకృష్ణాష్టమి అని పేరు పెట్టి
పూజించుకొంటున్నాము.
ఎవరైతే సకల సృష్టికి ఆధారమై ఉన్నాడో, సకల దేవతలు ఎవరినైతే దేవుడని మ్రొక్కారో, అణువణువున
వ్యాపించి ఎవరికీ కనిపించని శక్తి ఏదైతే ఉన్నదో, క్షణ క్షణము జరుగుచున్న కాలమై, అందరికి ఆయువై ఆరోగ్యమై,
మరణమై ఎవరైతే ఉన్నాడో, ఆ దేవుడే కృష్ణునిగా పుట్టి, మనిషి వలె కదలాడిన ఒక వ్యక్తి అని చెప్పితే ఎవరైనా
నమ్మగలరా? నమ్మలేరు. అంతగొప్ప దేవుడే మనిషిగా పుట్టడమేమిటి? అను ప్రశ్నరాక తప్పదు. ఇక్కడ ఒక చిన్న
ఉపమానమును చెప్పుకొందాము. సముద్రము సకల భూఖండములను తాకి ఉంది. ఎంతో విశాలమైనది, దానియందు
ఇన్ని అని చెప్పలేని అసంఖ్యాకములైన జీవరాసులున్నవి. సముద్రములేనిది భూమికి మనుగడయే లేదు అని చెప్పబడు
సముద్రము నీ ఇంటిలో నీ ఒంటిలో ఉన్నది అంటే ఎవరైన నమ్మగలరా? దేవుడే కృష్ణుడు అంటే ఎట్లు నమ్మలేరో అట్లే
సముద్రము ఇంటిలో ఉన్నదంటే నమ్మలేరు. అంత పెద్ద దేవుడు ఇంత చిన్న మనిషా! అని ఎట్లు నమ్మమో, అట్లే అంత
పెద్ద సముద్రము ఇంత చిన్న ఇంటిలో ఉందా! అని నమ్మలేము. అయినా వివరించుకొని చూస్తే దేవుడు మనిషిలో
ఉన్నది నిజమే, అలాగే సముద్రము ఇంటిలో ఉన్నది నిజమే. అసాధ్యమనుకొన్న దానిని సుసాధ్యము అనునట్లు చేయు
వివరమేమిటి అని చూస్తే ఈ విధముగ వివరముగలదు.
నీరు సముద్రములో ఉన్నది. సముద్రమంతా నిండియున్న నీటికి కొన్ని ధర్మములు గలవు. అలాగే విశ్వములో
దేవుడున్నాడు. విశ్వమంతా నిండియున్న దేవునికి కొన్ని ధర్మములు గలవు. ఎన్నో లెక్కలేని నీటి బిందువుల కలయిక
సముద్రమంతా నిండివున్న నీరు. అలాగే ఎన్నో దైవ అంశముల కలయిక దేవుడు. సముద్రమంతా నిండియున్న నీటికి
ఏ ధర్మముకలదో, అదే ధర్మము నీటి బిందువుకు కూడ కలదు. అట్లే విశ్వమంతా నిండియున్న దైవమునకు ఏ
ధర్మముకలదో, అదే ధర్మము దైవ అంశకు కూడ కలదు. సముద్రములోని అఖండమైన నీటికి ఏ ధర్మమున్నదో, అదే
ధర్మము ఖండమైన నీటి బిందువుకు కూడ కలదని ఎట్లు చెప్పుచున్నామో, అలాగే విశ్వములోని అఖండమైన దైవమునకు
ఏ ధర్మముందో, అదే ధర్మము ఖండమైన దేవుని అంశకు కూడ ఉన్నది. గమనించవలసిన విషయమేమంటే అఖండముగా
ఉన్న నీటిని సముద్రము అంటున్నాము. సముద్రమునుండి ఖండమై బయలుపడిన ఒక నీటిచుక్కను నీటిబిందువు
అంటున్నాము. అలాగే అఖండముగా అంతటా వ్యాపించియున్న దైవశక్తిని దేవుడు అంటున్నాము. దైవమునుండి
విడివడి ఖండముగానున్న ఒక దైవ అంశను భగవంతుడు అంటున్నాము. సముద్రమునకు నీటి బిందువుకు ఒకే
ధర్మమున్నట్లు, దైవమునకు భగవంతునికి ఒకే ధర్మము గలదు. దేవుని ధర్మములు దేవునికే తెలుసును, దేవుడే మానవులకు
తెలియబరచాలి అను ధర్మము భగవంతుని పట్ల కూడ కలదు. అందువలన దేవుని ధర్మములు భగవంతునికి కూడ
తెలుసు. అలాగే దేవుడే మానవునికి తెలియబరచాలి అన్నట్లు భగవంతుడే మనుషులకు తెలియబరచును. ఈ
ఉపమానమును బట్టి దేవుడు, భగవంతుడు అను ఒక మనిషిగా వచ్చుననుటను ఎవరైనా విశ్వసించగలరు. దేవుడు
భగవంతుడు ఇద్దరూ ఒకటే అయినా ఉన్న స్థితినిబట్టి అపరిమితముగా ఉన్నపుడు దేవుడు, పరిమితముగా ఉన్నపుడు
భగవంతుడని అనుచున్నాము.
పరిమితి లేని దేవుడు పరిమితమైన శరీరములోనికి, ఆకారములేని దేవుడు ఆకారమున్న శరీరములోనికి,
పేరులేని దేవుడు పేరున్న శరీరము లోనికి, ఏ కార్యము చేయని దేవుడు పని చేయు శరీరములోనికి వచ్చినపుడు
శరీరమును భగవంతుడు అంటున్నాము. దేవుని అంశ శరీరధారియై వచ్చినదే శ్రీకృష్ణుడు. ఆయనే భగవాన్ శ్రీకృష్ణ.
అంత పెద్ద దేవుడు మానవాకారముతో వచ్చిన పుట్టుక సమయము చాలా పవిత్రమైనదని, గొప్పదని భగవంతుని
జన్మదినమును పండుగగాజేసుకొనుచున్నాము. అదియే కొందరికి కృష్ణాష్టమి, కొందరికి గోకులాష్టమి. కలియుగ
ఆరంభములో అందరు చేయు కృష్ణజయంతి నేడు కనుమరుగై పోవుచున్నది. దేవునికి వ్యతిరేకమైనది మాయ. మాయ
మానవునియందుండి దైవమువైపు పోకుండ చేయుచున్నది. అట్లు చేయుటకు కావలసిన ప్రత్యమ్నాయ ఏర్పాట్లన్నిటిని
చేసి పెట్టుచున్నది. మాయ చేయు ఆ కార్యక్రమములలో కృష్ణాష్టమిని లేకుండ చేయడము కూడ ఒక పని. అందులన
పూర్వము పెద్దలు పెట్టిన నానుడి మాట అయిన అష్టమి కష్టము, నవమి నష్టము ఈ కాలములో ఎవరికీ తెలియకుండా
చేసినది. ఆ మాట తెలియకుండ పోవుట వలన కృష్ణజయంతి యొక్క జ్ఞాపకము చాలామందికి లేకుండా పోయినది.
మాయా ప్రభావము చేత మనుషులు భగవంతున్ని ఏమాత్రము గుర్తించలేక పోయారు. ఆయనను సాధారణ మనుషులకంటే
తక్కువగా పోల్చుకొన్నారు. మాయ మనిషియందు గుణముల రూపములో ఉంటూ, దైవమార్గములోనికి మనిషిని
పోకుండ చేయుచున్నది. అట్లు చేయాలంటే మనిషిని దేవునివైపు పోతున్నట్లు నమ్మించి ప్రక్కదారి పట్టించాలి అన్నది
మాయ యొక్క పథకము. ఆ పథకములో భాగముగ కృష్ణాష్టమికి బదులుగా దాని స్థానములో మరొక పండుగను
తెచ్చిపెట్టి, అందరి దృష్ఠి దానివైపు సారించునట్లు చేసినది. దేవుడు చెప్పినట్లు మాయకు బలమెక్కువ అందువలన
కృష్ణాష్టమిని లేకుండ చేసి, మాయ తన పండుగను తెచ్చిపెట్టి చిన్నలను పెద్దలను దానియందు పాల్గొనునట్లు చేసినది.
పూర్వము కృష్ణాష్టమిని పదకొండు రోజుల పండుగగా చేసెడివారు. కృష్ణాష్టమి ఇంటిలోపల చేయు పండుగకాదు.
పూర్వమందరు వీధులలోనే చేసెడివారు. వీధులలోనే ఉట్ల ఆట ఆడెడివారు. వీధులలోనే మగవారు గోపికలవలె
ఆడవేషము వేసుకొని వెన్న దొంగలుగా వస్తే వారిని ఆడవారు చేటలతో, కట్టెలతో కొట్టెడివారు. ఆడవేషములో ఉన్న
మగవారిని ఆడవారు కొట్టడము కూడ ఉత్సవములో ఒక భాగముగా ఉండెడిది. వీధులలోనే పందిరికట్టి, ఆ పందిరిలో
కృష్ణుని ప్రతిమను పెట్టి, పదకొండు రోజులు పూజించెడివారు. వీధిలోని పందిరి ముందే కృష్ణలీలలను ప్రదర్శించుచు
ఉట్ల ఆట, వెన్నదొంగ ఆట మొదలగునవి ఆడుచు సంతోషముతో పదకొండు రోజులు ఉత్సవము చేసి, చివరి
పదకొండవరోజు అనగా చవితి రోజు పందిరిలోని కృష్ణప్రతిమను ఊరేగించి, ఆ ప్రతిమను ఇంటిలో పెట్టుకొని
ఉత్సవమును ముగించెడివారు. దేశములో మొట్టమొదటి వీధి ఉత్సవము కృష్ణాష్టమియేనని తెలియవలెను. కృష్ణాష్టమికంటే
ముందు ఏ వీధి ఉత్సవములు లేవు. తర్వాత మాయ ప్రభావముతో ఒక్కొక్కటిగా తయారైనవి. అందులో వినాయకచవితి
ఒకటి, తర్వాత దుర్గాష్టమి రెండవది. విశేషమే మంటే కృష్ణుని పండుగ అష్టమి తిథి పేరుతో ఉండగా దానికి
ప్రత్యమ్నాయముగా తిథుల పేర్లతోనే వినాయక చవితి, దుర్గాష్టమి వీధి పండుగలు తయారైనవని గ్రహించవలెను.
కృష్ణాష్టమికి బదులుగా మొదట తయారైన పండుగ వినాయక చవితికాగా, తర్వాత ఈ మధ్యకాలములో దుర్గాదేవి
పండుగ కూడ వీధి పండుగగా తయారైనది. దుర్గాదేవి పండుగ పూర్వకాలమునుండి భక్తితో గృహములయందే తొమ్మిది
దినములు చేసుకొనెడివారు. దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారముతో పూజించడము సాంప్రదాయముతో
కూడు కొన్నదని చెప్పవచ్చును. ఇప్పటికీ కూడ దుర్గాదేవి పండుగ అయిన దశరా సాంప్రదాయముతో కూడుకొన్న
పండుగయని చెప్పవచ్చును. కానీ వినాయక చవితి మాత్రము ఏ సాంప్రదాయములేని పండుగయని చెప్పవచ్చును.
మన సాంప్రదాయము కాని పండుగ మన మధ్యలోనికి ఎలా వచ్చింది? అని యోచిస్తే దానికి కొంత వివరముగలదు.
అష్టమిగానీ, చవితిగానీ తిథులని చెప్పాము కదా! పూర్వము ఇందూధర్మములను తెలిసిన పెద్దలు జ్యోతిష్య శాస్త్రములోని
తిథులను తీసుకొని, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విషయ ప్రాబల్యమును సమకూర్చి, ఆ తిథి రోజు ఆ విషయమునకు ఎక్కువ
ప్రాధాన్యత నిచ్చునట్లు తెలిపారు. దానిప్రకారము చవితి రోజు సమాజము నకు సంబంధించిన విషయమునకు
ప్రాధాన్యతనిచ్చారు. అట్లే సప్తమి యోగమునకు, అష్టమి మోక్షమునకు, దశమి ఏకాదశి రెండు తిధులు భక్తి, జ్ఞానమునకు,
అమావాస్య పౌర్ణమి రెండు పరమాత్మ విషయమునకు ప్రాధాన్యత నిచ్చునవి నిర్ణయించారు. అందువలన చవితి రోజు
పండుగ లైన నాగులచవితి, వినాయకచవితి రెండు సమాజము యొక్క శ్రేయస్సు విషయమును తెల్పునవిగా ఏర్పాటు
చేశారు. ముందుగా నాగులచవితిని గురించి చెప్పుకొంటే, అదే విధానము ప్రకారము వినాయక చవితి కూడ అర్థము
కాగలదు. అప్పుడు జ్ఞానమునకు, మాయకు తేడా తెలియాలంటే వినాయక చవితిని గురించి వివరించుకోవాలి.
వినాయక చవితిని గురించి సత్యమును చెప్పినప్పటికి మాయ ప్రభావము చేత మనుషులు అపార్థము చేసుకొను
అవకాశమున్నది. కావున అది సమాజశ్రేయస్సుకు ఎలా సంబంధించినదో అర్థము కావాలంటే, ముందు నాగులచవితిని
చెప్పు కోవలసివుంటుంది. నాగుల చవితిని పెద్దలు ఎందుకు మనుషుల మధ్యలో ఏర్పాటు చేశారో వివరించుకొని
చూద్దాము. ఈ వివరములను చెప్పేముందు మరొక మాటను ముందే చెప్పవలసివుంది. అదేమనగా! నాగులచవితి
ప్రజల శ్రేయస్సుకు ఏర్పరచినా, పెద్దల పని వృథా అయిపోయి ఆ శ్రేయస్సు ప్రజలకు అందడము లేదు. అలాగే
వినాయకచవితిని కూడ పెద్దలు యోచించి చేసి చూపించినా, మనుషులు ఆ ఫలితము యొక్క శ్రేయస్సును అందుకోక
పోవడమేకాక పెడత్రోవపట్టి పోయారని చెప్పుచున్నాము. ఈ రెండు చవితులను చెప్పితే కానీ కృష్ణాష్టమి యొక్క విలువ
తెలియదు. అందువలన ఇక్కడ నాగులచవితిని, వినాయకచవితిని గురించి చెప్పవలసి వచ్చినది.
నాగుల చవితి.
నాగులచవితిని గురించి చెప్పుచున్నాము చూడండి. ఇది సమాజ శ్రేయస్సుకని చెప్పాము కదా! అందువలన
దీనిని చదివే నీకు కూడ పనికి వచ్చునదే. కావున శ్రద్ధగా గమనించండి. నాగులు అనగా పాములు అని అర్థము, చవితి
అనగా నాలుగు అని అర్థము. నాగులచవితి అనగా పాముల నుండి పూర్తి రక్షణ పొందడమని అర్థము. అపాయము
నుండి బయటపడునట్లు జరగడమే శ్రేయస్సు అని చెప్పవచ్చును. పాముల కాటునుండి రక్షణ పొందితే ఎవరికైనా
అపాయమునుండి బయట పడినట్లే అవును కదా! అట్లు బయట పడు విధానమున్నది. కావున నాగులచవితి
సమాజశ్రేయస్సును తెలుపునదని చెప్పుచున్నాము. భూమిమీద 80 జాతుల పాములున్నాయి. అన్ని జాతులకు
విషముండదు. 15 జాతులకు మాత్రము విషముండును. వాటిలో నాగుపాము జాతి ఒకటి కలదు.
విషమున్న మిగత జాతుల పాములకంటే నాగుపాము జాతికే మనిషిని తొందరగ చంపు విష ప్రభావమున్నది.
అందువలన పూర్వపు వైద్యపండితులు నాగుపాము విషమునకు విరుగుడు వైద్యమును చెప్పితే అన్ని జాతుల పాము
వైద్యము చెప్పినట్లేనని తలచారు. పూర్వము ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన మూలికా వైద్యముండెడిది. పాము విషమునకు
విరుగుడైన మూలికలను ప్రతి ఊరులోను పెంచవలెనని వారు నిర్ణయించుకొన్నారు. ఆ పథకములోని భాగముగానే
ప్రతి ఊరులోను మొదట వేపచెట్టును, దానిప్రక్కననే రావిచెట్టును నాటారు. వాటి ముందర నాగుపాముల ప్రతిమలను
ఉంచారు. పూర్వము ప్రతి ఊరులోను వేప, రావిచెట్లు ఒకచోట ఉండడమూ, అక్కడ చాలామంది విశ్రాంతి తీసుకొనునట్లు
విశాలమైన అరుగునుంచడమూ, ఆ అరుగు మీద చెట్ల మొదటిలోనే ముందర నాగ ప్రతిమలుంచడము జరిగెడిది. ఆ
విధముగా నిర్మింపబడిన దానిని నాగులకట్ట అనెడివారు. ఇప్పటికీ కొన్ని ఊర్లలో రావి, వేపచెట్లున్న నాగులకట్టలు కనిపించును.
ఈ మధ్యకాలములో తయారైన కొన్ని ఊర్లలో నాగులకట్టలు లేవు. నాగులకట్టలు కొన్ని ఊర్లలో
ఎందుకు లేవో తర్వాత తెలుసుకొందాము.
పాము కరిచి విషము ఎక్కితే అనగా తలకు ఎక్కితే మొదట నాలుకకు రుచి తెలియకుండ పోవును. నాలుక
తెలుసుకొను ఆరు రుచు లలో మొదట చేదు తెలియకుండ పోవును. అటువంటి పరిస్థితిని తెలుసుకొనుటకు చేదు
రుచిగల వేపచెట్టును నాగులకట్టలో ఉంచారు. విషము తలకెక్కిన తర్వాత దానిని సులభముగా తీసివేయుటకు సాధ్యమగును.
అందువలన పాముకరచిన వ్యక్తికి, విషము తలకు ఎక్కిందా లేదా అని చూచుటకు వేప ఆకును నమిలించెదరు.
విషము ఎక్కినపుడు చేదు తెలియకుండ పోవుట వలన అపుడు తలనుండి విషమును తీసివేయుటకు ప్రయత్నించవచ్చును.
వేప ఆకుల ద్వార విషమును తెలుసుకొన్నవారు, దానిని తీసివేయుటకు రావి ఆకులను వాడుకొందురు. రావి ఆకుల
కాడలను విషమున్నవానికి చెవులలో పెట్టితే, రావి ఆకులు తమ కాడల ద్వారా తలలోని విషమును ఆకులలోనికి
లాగుకొనును. ఆ విధముగ రెండు లేక మూడు జతల ఆకులతో పూర్తి విషమును తీసివేయవచ్చును. తర్వాత వేప
ఆకును నమిలిస్తే అది చేదుగా ఉండుట వలన విషము దిగిపోయినదని తెలుసుకోవచ్చును. విషమును లాగుకొను
రావిఆకు పాము పడగవలె ఉండడము, క్రింద ఆకుకొన పాముతోకలా ఉండడమును గమనించవచ్చును. దీనినిబట్టి
ప్రతి ఆకు ఒక పాముతో సమానమనీ, పాము విషము పామే లాగుకొన్నట్లు, రావి ఆకు విషమును లాగుకొనుచున్నదని
తెలియుచున్నది. ఈ వైద్య విధానము అందరికీ తెలియునట్లు, పూర్వము ప్రతి ఊరిలోను రావి, వేపచెట్లను పెంచి
కట్టకట్టియుంచారు. అదే చెట్లక్రింద నాగుపాము ప్రతిమలను కూడ పెట్టుటకు కారణమేమనగా! ఈ పాములు కరిస్తే
ఈ చెట్ల ఆకులే వైద్యమన్నట్లు చెట్లక్రింద ముందరే పాము బొమ్మలనుంచారు. “ప్రతి ఆకు ఔషధమని” నానుడి గలదు.
రావి, వేపఆకు దేనికి ఔషధమని ప్రశ్న వస్తే వెంటనే పాములకు అని తెలియునట్లు ఆ చెట్ల క్రింద పాముల
ప్రతిమలనుంచారు. ప్రతి ఊరులోను ఆ విధముగా ఉంటే, అందరికీ ఆ వైద్యము తెలిసి, అందరూ పాముకాటునుండి
బయటపడగలరని ఆనాటి పెద్దలు తలచారు.
ప్రస్తుతకాలములో ఆనాటి పెద్దల ఉద్దేశము తెలియకుండ పోయినది. ఇప్పటికీ కొన్ని ఊర్లలో నాగులకట్టలు,
రావి, వేపచెట్ల సమేతముగా ఉండినప్పటికీ అవి వైద్య విధానముగా పెట్టినవనీ రావి, వేప చెట్లు పాము విషమునకు
మంచి ఔషధములని ఎవరికీ తెలియదు. విషమునకు ప్రతీకగా పాము బొమ్మలనూ, ఔషధమునకు ప్రతీకగా రావి,
వేపచెట్లనుంచితే ఆ భావము కాలగర్భములో కలిసిపోయినది. పాము ప్రతిమలు నాగదేవతలుగా, వేప, రావిచెట్లను
లక్ష్మీనారాయణులుగా భావించి ప్రజలు పూజలు చేయుచున్నారు. ఈ విధముగా వైద్యము భక్తిగా మారిపోయినది.
పాము ప్రతిమలకు రావి, వేపచెట్లు నీడ నిమిత్తమే ఉన్నాయనుకొన్న ప్రజలు, ప్రతిమలను చెట్లక్రింద లేకుండ గుడులలో
ప్రతిష్ఠించను మొదలుపెట్టారు. అందువలన నాగప్రతిమలు ఇప్పటి కాలములో గుడులలో కనిపిస్తున్నవి. గ్రామాల్లో
రావి, వేపచెట్లు జతగా ఉండడము కనిపించకుండ పోవుచున్నవి. ఇవి ప్రాణము తీసే పాములని పాము ప్రతిమలను,
ఇవి ప్రాణము పోసే చెట్లని రావి, వేపచెట్లను అందరికీ తెలియునట్లు పూర్వము ఎంతో పథకముగా వైద్యపండితులుంచితే,
ప్రాణము తీసే పాములు దేవతల స్థానములో ఉన్నాయి. ప్రాణము పోసే ఔషధచెట్లు అదృశ్యస్థానములో ఉన్నాయి.
పాములను గురించి, ఔషధవృక్షములను గురించి చర్చావేదికలు నాగులకట్టల మీదనే పెట్టి ప్రజలకు తెలియ జేయుటకు
నాగులచవితి అను పేరుతో శ్రావణమాస శుక్లపక్ష చవితిని పూర్వము నిర్ణయించారు. మొదట వైద్యపండితులు పెట్టిన
ఉద్దేశము కాలక్రమమున మారిపోయి, చివరకు నాగులచవితి ఒక భక్తి పండుగగ మారిపోయినది. మన పెద్దలు మన
శ్రేయస్సును కోరి ఒక అమోఘమైన ఔషధాన్నిస్తే దానిని అందుకోలేక కాలగర్భములో వారి ఉద్దేశమును సమాధి
చేశాము. పెద్దలు అందించిన ఫలితాన్ని మేము చెప్పిన తర్వాత ఇప్పటికీ కూడ అర్థము చేసుకోలేక అడ్డముగా
మాట్లాడు వారున్నారు. పూర్వము సమాజశ్రేయస్సుకు మనవారు అందించిన విధానమునకు మనము ఎంతో కృతజ్ఞులమై
ఉండాలి. అట్లుకాక వారు అందించిన విధానమును గాలికి వదలివేశాము. ఎప్పుడో తెలియకుండ పోయిన విధానము
ఈ రోజు తెలిసినా, ఇది మన శ్రేయస్సుకు సంబంధించినదని కూడ తలచడములేదు. ఈనాడు తెలియకుండ పోయిన
దానిని తెలిపినవారు గానీ, ఆనాడు ఎంతో పరిశోధన చేసి తెలిపినవారుగానీ ఏ ఫలితాన్ని ఆశించి తెలుపలేదు కదా!
అని కొంతైనా యోచించక, మూఢముగా నాగదేవతల పూజను మాన్పించుటే వీరి ఉద్దేశమని, వీరు హిందువులుకాదని
అనడము సరియైన పద్ధతేనా అని మీరే యోచించండి. మంచి ఏదో చెడు ఏదో తెలియకుండ, నిస్వార్థముగా సమాజ
శ్రేయస్సుకోరువారిని తప్పుగా మాట్లాడువారు కూడ నేడు కలరు. అందువలన ఇప్పుడు చదువుచున్న మీరైనా సత్యమును
తెలుసుకొమ్మని కోరుచున్నాము.
వినాయక చవితి.
ఇంతవరకు నాగులచవితిని గురించి చెప్పాము, ఇప్పుడు వినాయక చవితి గురించి చెప్పుచున్నాము. ఈ
విషయమును కూడ అపార్థము చేసుకొనుటకు అనేక అవకాశములు గలవు. అందువలన చదువుచున్న ప్రతి పాయింటును
జాగ్రత్తగా గమనించమని కోరుచున్నాము. ఒక మనిషి సక్రమమార్గములో నడవాలంటే మనిషికి ఆధ్యాత్మిక వికాసము,
వ్యక్తిత్వ వికాసము, సామాజిక వికాసము అవసరమని తెలిసిన పెద్దలు ఆ మూడు విధానములను పండుగల రూపములో
తెల్పుచు, అన్నింటియందు ఆధ్యాత్మికమునకే అతి ముఖ్యమైన ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు మనము చెప్పుకొన్న
మరియు చెప్పుకొనబోవు పండుగలన్నీ హిందూ(ఇందూ) మతములోనే గలవు. పూర్వము హిందూసంస్కృతి చాలా
గొప్పగ ఉండెడిది. ప్రస్తుత కాలములో హిందూసంస్కృతినే పరాయి సంస్కృతిగా, పరాయి సంస్కృతినే హిందూసంస్కృతిగ
భావించుకొను హిందువులు తయారైనారు. ఈ మామాటను మీరు నమ్మలేకపోతే, మేము చెప్పు ప్రత్యక్ష ప్రమాణమును
చూచిన తర్వాత అయినా మా మాట నిజమని నమ్మగలరు. క్రీస్తుశకము 2008, 8వ నెల, 8వ తేదీన, 8 గంటల, 8
నిమిషాలకు మంచి ముహూర్తమున్నదనీ, ఆ విధముగ సంవత్సరము మొదలుకొని నెల, దినమూ అన్నీ 8 సంఖ్యకావడము
విశేషమనీ, అనేక దేశాలు దీనిని శుభదినముగా పాటిస్తున్నవనీ, ప్రపంచము మొత్తము మీద చాలా వివాహములు
జరుగుచున్నవీ, చైనాలో ఒలంపిక్స్ వేడుకలు కూడా ఈ దినమే ప్రారంభిస్తున్నారనీ, టీవీ9 వారు చర్చావేదిక పెట్టి
అందులో జ్యోతిష్య శాస్త్రపండితులను, సంఖ్యాశాస్త్రపండితులను కలిపి వారి చర్చను ఆగష్టు 8వ తేదీన ఉదయము 8
గంటలకు ప్రసారము చేశారు. ఆ చర్చలో ఒక సందర్భమున కలియుగము 4,32,000 సంవత్సరముల పరిమితితో
ఉన్నది. ఆ సంఖ్యలో ఇపుడు గడచినది కేవలము 2000 సంవత్సరములు మాత్రమే, ఇంకా గడువవలసినది ఎంతో
ఉన్నదని స్వయాన పండితులే అన్నారు. ఆ విషయమును ప్రక్కనేయున్న మరియొక జ్యోతిష్య పండితుడు ఏమాత్రము
ఖండించకపోగా టీవీ9 వారు కూడ తటస్థముగా ఉన్నారు. అక్కడ కూర్చొన్న ఇద్దరు జ్యోతిష్యపండితులూ, టీవీ9 వారు
అందరూ హిందువులే! అయినప్పటికీ ఎవరూ పెదవి విప్పలేదు. అక్కడ కలియుగము యొక్క పరిమాణము 4,32,000
అయినపుడు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరములు గడిచిపోయి, కలియుగము ప్రారంభమై 5108
సంవత్సరములు కూడ గడిచిపోయి, 5109 వ సంవత్సరము జరుగుచున్నది. ఇజ్రాయిల్దేశములో పుట్టిన ఏసుప్రభువు
చనిపోయి క్రీస్తుశకము ప్రారంభమై 2007 సంవత్సరములు గడచి, 2008 సంవత్సరములో 7 నెలలు కూడ అయిపోయి
8వ నెల జరుగుచున్నది. అటువంటపుడు హిందువుల ధర్మము ప్రకారము యుగముల పరిమాణ ముండగా, అందులో
కలియుగ పరిమాణము 4,32,000 అన్నపుడు గడచినది 5108 సంవత్సరముల నాలుగు నెలలే అయినపుడు, క్రైస్తవ
మతస్థుల క్రీస్తుశకము యొక్క సంవత్సరములను చెప్పుకోవడము తప్పుకాదా! బ్రాహ్మణున్ని ప్రస్తావించి అతని పేరు
డేవిడ్ బ్రస్ అని చెప్పినట్లు, కలియుగ ఆయుఃప్రమాణమును ప్రస్తావించి, క్రీస్తుశక భుక్తిని (గడచిన దానిని) చెప్పితే
హిందూసంస్కృతిని వదలి క్రైస్తవ సంస్కృతిని చెప్పినట్లు కాదా! అక్కడున్న ముగ్గురికీ అందులో క్రైస్తవ సంస్కృతి కనిపించలేదా!
వారు మాట్లాడినది హిందూసంస్కృతియేనా?
ఇటువంటిదే మరొక ప్రత్యక్ష సత్యమును చెప్పెదను చూడండి. త్రైతశకము-30, కలియుగము 5109వ
సంవత్సరము, సర్వధారి నామ సంవత్సరము నెం-22, చైత్రమాసము నెల 1, వసంతఋతువు అని హిందూ సంస్కృతి
ప్రకారము యుగాది నుండి ప్రారంభమైన క్యాలెండరును మేము తయారు చేసి జనవరి నెలతో ప్రారంభమైన క్యాలెండరు
వద్దు, అది మన దేశ సంస్కృతికాదని, యుగాది నుండి ప్రారంభమైన మా క్యాలెండరును ఉచితముగా పంచితే,
మహానందిలో పరమత ప్రచారమని క్యాలెండరును టీవీలో దగ్గరగా చూపి, వరుసగా మూడు రోజులు ప్రసారము చేసిన
టీవీ9 వారికి మేమూ మా క్యాలెండరూ క్రైస్తవముగా కనిపిస్తే, తమ ఎదురుగా క్రైస్తవశకములోని 2000 సంవత్సరములను
కలియుగములో గడచిన సంవత్సరములుగా చెప్పువారు హిందువులుగా కనిపించారా? హిందూ ధర్మమును చెప్పువారిని
క్రైస్తవులుగా, క్రైస్తవమును చెప్పువారిని హిందువులుగా టీవీ9 వారు ప్రచారము చేయడము చూస్తే మీకేమనిపి స్తుందో
యోచించండి. టీవీ9 వారు యుగాది నుండి ప్రారంభమైన మా క్యాలెండర్ను పరమత ప్రచారమని టీవీలో క్లోసప్లో
చూపించగా, దానిలోని వాస్తవమెంత అని యోచించకుండానే కొందరు హిందువులు మా క్యాలెండర్లను అనంతపురము
జిల్లా గుంతకల్లులో నిప్పు పెట్టి కాల్చేశారు. మెరుగైన సమాజము కొరకు టీవీ9 అనువారు అసత్యమును ప్రసారము
చేయవచ్చునా? ఇదంతయు చూస్తే హిందువులు హిందూత్వమును గుర్తించలేని గ్రుడ్డివారుగా ఉన్నారో లేదో మీరే
యోచించండి.
ఇంకొక విషయమును చెప్పెదను చూడండి. పంచాంగము, నవ గ్రహములు, జ్యోతిష్యము పూర్వము నుండి
హిందువులు కనుగొన్నవి, హిందువులు లెక్కించునవి. హిందువులు కర్మ సిద్ధాంతముననుసరించి గ్రహచారముండునని
ఆధ్యాత్మికములో కూడ చెప్పుకొన్నాము. అటువంటిది క్రీస్తుశకము 2008, 8వ నెల, తేదీ 8 ప్రకారము హిందువులకు
మంచిదినమెలా అయినది. ఆ మూడు 8 లు ఒక్కమారు కలిసి రావడము క్రైస్తవులకు మంచిది కావచ్చునేమో కానీ,
హిందువులకు ఆ దినమెలా మంచిదైనది? జ్యోతిష్యశాస్త్రము ప్రకారము ఆ దినమునకు ఏ ప్రత్యేకత లేదు. అటువంటపుడు
ఆ దినమును గూర్చి ప్రత్యేకముగా టీవీలో ప్రచారము చేసి మాట్లాడడము క్రైస్తవశకము 2008 ని గురించి పొగిడినట్లు
కాదా? హిందువుల పంచాంగము ప్రకారము ఇది 8వ సంవత్సరమూ కాదు, 8వ నెలా కాదు, 8వ దినమూ కాదు.
అటువంటపుడు క్రైస్తవుల మూడు ఎనిమిదులను గురించి మాట్లాడువారు హిందువులైతే, మేము భగవద్గీత ప్రకారము
జ్ఞానమును చెప్పుచూ, యుగాది నుండి క్యాలెండరును తయారు చేసినవారము, పరమతస్థులమా? మా యుగాది
క్యాలెండరును చించినవారు, కాల్చినవారు, క్రైస్తవులదని చూపించిన టీవీ9 వారు, వారి ఇళ్ళలో జనవరి నుండి ప్రారంభమైన
క్యాలెండరును ఉంచుకోవడము సమంజసమా? జనవరి 1వ తేదీని క్రొత్త సంవత్సరమని సంతోషపడువారు, ఆ రాత్రికి
టీవీలలో చూపువారు పరమతమును అనుసరించినట్లు కాదా? ఇట్లు అడుగుచూ, వివరిస్తూ పోతే హిందూమతములో
దైవజ్ఞానము సన్నగిల్లిపోయి, హిందువులు తమ సంస్కృతిని, తమ జ్ఞానమును గుర్తించలేని స్థితిలో లేరని తెలియు
చున్నది. అటువంటి స్థితినుండి హిందువులు బయటపడుటకు, హిందూ సంస్కృతికి అద్దముపట్టు పండుగలను వివరిస్తూ
వచ్చాము. హిందువులకు ఆధ్యాత్మికమను అద్దములో పండుగల అర్థమును చూపిస్తూ వచ్చాము. సామాజిక సృహను
కలుగజేయు నాగులచవితిలో కూడ భక్తిని పెంపొందించుకొమ్మని చెప్పాము. అదే కోవలో సామాజిక న్యాయమును,
నీతిని చూపు వినాయకచవితిలో కూడ భక్తిని పెంచుకొమ్మని తెలుపు చున్నాము. నాగుల చవితి సమాజమునకు
ఆరోగ్యమును అందించు సూత్రమును తెలియజేయగా, వినాయకచవితి సమ సమాజమును నెలకొల్పు అంశమును
తెల్పునదై ఉన్నది. సమాజమునకు గొప్ప సందేశమునిచ్చు వినాయక చవితిని గురించి తెలుసుకొందాము.
మనము ప్రతి సంవత్సరము ఆగష్టు, సెప్టెంబరు మాసాలలో వచ్చు వినాయకుని పండుగను ఎంతో ఉత్సాహముతో
జరుపుకుంటాము. ఈనాడు ఇందూ (హిందూ) ప్రజలలో ఎంతో గాఢముగా నిలిచిపోయిన ఈ పండుగను గురించి
ఇతర మతస్థుల విమర్శలు కూడా ఎన్నో గలవు. అటువంటి విమర్శకులు మావద్దకు వచ్చి "మీరు ఎంతో ఖచ్చితముగా
సత్యమైన విషయములు తెలుపుచున్నారు గదా! అటువంటపుడు మీరు మా ప్రశ్నలకు సమాధానమిస్తారా” అని అడిగారు.
అందులకు సమాధానముగా మేము ఆధ్యాత్మికములో సత్యమైన జ్ఞానవిషయాలనే తెలుపుచు జీవితమును
సాగించాలనుకొన్నాము. కావున మీ ప్రశ్నలకు జవాబులు నాకు తెలిసి ఉంటే తెలుపగలను, లేకపోతే నాకు తెలియదని
చెప్పగలను అడగండి అని తెలిపాము. అపుడు వారు అడిగిన మాటలిలా ఉన్నవి.
1)ఇందూమతములో విఘ్నేశ్వర పండుగ అని చేస్తున్నారు కదా! విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములకధిపతియని
కదా అర్ధము. విఘ్నములంటే అడ్డంకులు, ఆటంకములు అని కదా అర్థము, అటువంటి ఆటంకములకు అధిపతియై,
ఆటంకములు కలుగజేయువానిని శత్రువుగా భావించి దూషించాలి, కానీ పూజించడమెందుకు? చెడ్డ చేయువాడు
బలమైనవాడైతే వానిని ఎవరు వ్యతిరేఖించక పొగిడినట్లు, మీరు చేయు భక్తి కూడ విఘ్నేశ్వరుడు విఘ్నములు కలిగిస్తాడని
భయపడి, భయముతో పూజ చేయు చున్నట్లున్నది. కానీ భక్తితో కాదని తెలియుచున్నది దీనికి మీరేమంటారు?
2) ఎంతో భక్తిగ, మరి ఎంతో ఖర్చుతో ఎంతో అందముగ తయారు చేసుకొన్న విఘ్నేశ్వరుని ప్రతిమలను మిగులభక్తిగ
పూజించుకొని, ముందు రోజు చూపిన భక్తినంతటిని ఏటిలో కలిపి, విఘ్నేశ్వరున్ని నీటిలోనికి విసిరి వేయడము మంచిదా?
ఇక చాలు నీ సహవాసము అన్నట్లు వినాయకున్ని నీటిలోనికి త్రోసి చేతులు దులుపుకోవడము భక్తి అంటారా?
3)పదిరూపాయలు పెట్టి దైవజ్ఞానము తెలుపు గ్రంథము కొనుక్కోవ డానికి బాధపడు వారిని మీరెందరో
చూచివుంటారు. అటువంటి వారు సహితము వేలు ఖర్చుపెట్టి వినాయక ప్రతిమలు చేసి వాటిని విరగగొట్టి వారి
డబ్బును వృథా చేసుకొనుచున్నారు. కొందరు బలవంతముగా ప్రతిమల ఖర్చుకని ఇతరులనుండి డబ్బును వసూలు
చేయుచున్నారు. ఇలా బలవంతముగ వసూలు చేయడము బలవంతపు భక్తి కాదా?
4) ఒకే రకముగ, ఒకే పద్ధతిగ, ఒకే విధముగ అవయవములు కల్గి పుట్టిన మనము, ఒకే దేవుని బిడ్డలమని
మరచి, మతద్వేషములను పెంపొందింపజేసుకొను అధ్యాయములో వినాయక పండుగను ఉపయో గించుకొనుచున్నాము.
జ్ఞానమును పొందిన యోగులుగ మీరేమంటారు?
ఈ విధముగ అడిగిన వారికి వినాయక చవితి పండుగ రహస్యము మేము చెప్పవలసి వచ్చినది. వారి
ప్రశ్నలకు సరైన జవాబులు అందివ్వక పోతే, వారి హృదయములో వినాయక పండుగ మీద ఉన్న భావము మార్చలేము.
మనకు గొప్పదైనప్పటికి అడుగువారికి చిన్నదిగనే కన్పిస్తుంటుంది. కావున నిజార్థాన్ని చెప్పక తప్పదు కావున ఇలా
చెప్పాను. ప్రపంచ పుట్టుక సమయములో మతములు అనునవి లేవు. దేవుళ్ళను వారూ లేరు, దేవుడొక్కడను విషయము
అందరికి తెలుసు. కొంత కాలమునకు అటువంటి అవగాహన మనుష్యులలో క్షీణింప మొదలిడినది. ఆ సమయమున
తత్త్వవేత్తలైన మహాత్ములు కొందరు యోచించి, అజ్ఞాన బీజమును తీసివేయుటకు, దైవత్వమును గూర్చి ప్రచారము
చేయబూనినారు. దేవునికి రూపములేదు, కావున ముక్కు ముఖములేని రాయిని (లింగమును) గుర్తుగా పెట్టి, దేవుడు
ఇట్లుంటాడని రూపములేని వానిగా బోధించారు. ఆయనకు (దేవునికి) పేరులేదు, కావున ఈశ్వరుడని పిలిచారు.
ఈశ్వరుడనగా అధిపతియని అర్థమేకాని పేరుకాదు. ఇట్లు సర్వమునకు అధిపతియైన వాడొకడున్నాడని రూపములేని
గుండును చూపించి, తెలియకుండ పోయిన దైవత్వమును గురించి ఆనాటి పెద్దలు తెలియజేశారు.
ఇట్లు జ్ఞానరీత్యానే కాక, సంఘరీత్యా కూడ రెండు విధముల మానవున్ని నడిపించుటకు ఆనాటి పెద్దలు కృషి
చేశారు. ఈనాడు మనము 'సామెత' అను పదమును ఆనాడు 'సమత' అనెడివారు. పెద్దలమాట మారనిదనీ, నిజమనీ,
చెడని వాక్యమనీ చెప్పుటకు సమానముగా "పెద్దలమాట పెరుగన్నము మూట" అనుట నేటికీ కలదు. పెద్దలమాటకు
సమతగా పెరుగన్నపు మూటను వాడినారు. సమత అంటే సమానమని అర్ధము. అట్లే "చింత లేనమ్మకు సంతలో
నిద్రవచ్చె” అనుట కూడ గలదు. చింత లేనమ్మకు సంతలో నిద్రకు సమానముగా (సమతగా) పోల్చి చెప్పడమన్న
మాట. ఇటువంటి సమత అను పదము కొంతకాలమునకు పలుకడములో 'సామత' గా మారినది. అట్లే మరి
కొంతకాలమునకు సామత పోయి 'సామెత' గా మారిపోయి నేడు మన ముందరున్నది. ఇటువంటి ముఖ్యమైన సామెతలను
ఎన్నిటినో పూర్వము మానవుని సంఘములో సక్రమముగా నడుపుటకు పెద్దలుంచారు. ఆ విధానము ప్రకారమే
సమాజములోని ఒక చెడును తీసివేయడానికి సమాన పోలికతో, సంఘములో బలహీనుని ఎలుకగా పోల్చి, బలవంతుని
ఏనుగుగా పోల్చి చెప్పెడివారు. బలవంతుడు బలహీనునిపై పెత్తనము చెలాయించి పీడించడమును “ఎలుకపై ఏనుగు
స్వారీ చేసినట్లు” అని సామెతను అనెడివారు. ఇది సంఘవిద్రోహ చర్య కావున ఇది మంచిదికాదనీ అందరికి తెలియునట్లు,
నోటితో చెప్పడమే కాకుండా దృశ్యరూపముగా కంటికి కనిపించెడి కార్యక్రమముగా చూపించెడి వారు.ఒక చిన్న
ఎలుకను ఉంచి, దానిమీద పెద్ద ఏనుగును ఆసీనమైనట్లు చేసి, అది అందరికి తెలియునట్లు ఊరంతా ఊరేగించి,
చివరకు ఈ పద్ధతి మంచిదికాదన్నట్లు ఆ దృశ్యమును నాశనము చేసెడివారు. వారు ఆ దినము మట్టితో చేసిన
బొమ్మలను అగ్నిలోవేసి కాలిస్తే ఇంకా గట్టిపడి చెక్కు చెదరకుండావుంటా యని, నీటిలో అయితే పూర్తిగా కరిగిపోతాయని
నీటిలో ముంచెడివారు. నీటిలోనికి వేసిన తర్వాత ఆ దృశ్యము తొందరగా నాశనమగుటకు నీటిలో వేయకముందే ఆ
బొమ్మకు కాళ్ళు, చేతులు విరగగొట్టి పూర్తి నీటిలో కలిసిపోయేటట్లు చేసెడివారు. ఇది ఆనాటి సంఘ సంస్కరణ నిమిత్తమైన
ఆచరణ. ఈ కార్యము ప్రతి సంవత్సరము ఒక ఆచరణగా చేయడము నేటికీ మిగిలివున్నది. కానీ అర్థము మాత్రము
తెలియకుండా పోయినది. ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు ఆ ఆచరణ చేయడమే నేడు తెలిసిన విధానము, అంతే తప్ప
అర్థమును గూర్చి ఎవరూ ఆలోచించడము లేదు. ఒక మతస్థులు చేయుచున్న ఆచరణ పూర్వము గొప్ప భావముతో
పెట్టినదని ఆ మతస్థులకే తెలియనపుడు, ఇతర మతస్థులు అపార్థము చేసుకోవడములో తప్పులేదు. కానీ నిజమైన
అర్థమునూ, ఆచరణనూ తీసుకొన్నపుడు అందులో విమర్శించునది ఏమీలేదు. ఎవరూ విమర్శించలేరు, అసలైన అర్ధము
తెలిసినపుడు అన్ని మతస్థుల మద్దతు లభిస్తుంది.
మేము ముందే చెప్పాముగా! పూర్వము మతమను పేరు లేని ప్రజలకు దేవుడొక్కడను భావముండేదనీ, దేవునికి
రూపము, పేరులేదను గుర్తింపుకే రాతిలింగమును ఉంచినారనీ, అయినప్పటికీ కాలక్రమమున ధర్మములు అధర్మములుగా
మారునను గీతావాక్యానుసారము, కొంత కాలమునకు మానవులలో అజ్ఞానవశమున ఏకత్వము పోయి, మేము మీరు
అను గుంపులుగ చీలిపోయిన వారికి కూడ పేర్లుండేవి. అట్లు కొంత కాలమునకు ఏర్పడిన గుంపులే వైష్ణవులు, శైవులు.
పూర్వము వైష్ణవులు, శైవులు సాంప్రదాయములను ఏర్పరుచుకొని, ఇవి మా సాంప్రదాయములు అనుచు, వాటి భద్రత
కొరకు కొన్ని పురాణములను వ్రాసి, అవి ప్రజలందరికీ తెలియునట్లు చేసి, వారి సాంప్రదాయములను భద్రము చేసుకొన్నారు.
అటువంటి పురాణములలో శైవుల సంబంధమైన “శివపురాణము” పుట్టినది.
ఇట్లు శైవమేర్పడు రెండువేల సంవత్సరములకు ముందే సమాజ ములో చెడును ఏనుగుగా, ఎలుకగా చూపించి
నీటిలో ముంచివేయు ఆచరణ గలదు. ఆ ఆచరణ చేస్తూ చేస్తూ పెద్దలు చనిపోతూరాగ, చిన్నలు వారిననుసరిస్తూ
చేస్తూ, చివరకు ఎందుకు ఈ కార్యక్రమము చేస్తున్నామను నది ఎవరికీ తెలియకుండా పోయినది. అర్థము ఇది అని
తెలియక ఎంతో మంది కలిసి ఆనందముగా ఎలుకను ఏనుగునూ ఊరేగిస్తున్నాము. ఇదేదో గొప్ప భక్తి కార్యమనుకొని
ఆ ఏనుగాకారానికి మ్రొక్కను మొదలిడినారు. అట్లు శైవముద్భవించు దినములకే ఎలుక ఏనుగు బొమ్మలను మ్రొక్కువారు
గలరు. కనుక శైవులు శివపురాణములో ఎలుకకు ఏనుగుకు విశిష్టత కల్పించి, ఏనుగు తల కల్గినవాడు వినాయకుడనీ,
పార్వతి కుమారుడనీ ఉన్న భక్తిని ఇంకొంత ఎక్కువగునట్లు మంచిపనియే చేశారు. అప్పటినుండి ఏనుగు బొమ్మపోయి
ఏనుగు తలమాత్రమున్న వినాయకుని బొమ్మవచ్చినది. ఉన్న భక్తిని ఎక్కువ చేయుటవలన వినాయకుని బొమ్మలు
చేయువారు ఎక్కువైనారు. డబ్బు ఖర్చుపెట్టి పూజించువారు ఎక్కువైనారు, కానీ నీళ్ళలో వేసి త్రొక్కే పూర్వ ఆచరణను
మాన్పించలేక పోయినారు. ఈ విధానమును మాన్పించలేని పెద్దలు వినాయక నిమజ్జనమును నీటిలోనే చేయుచున్నా
మన్నారు. నిమజ్జనమనగా స్నానమని అర్థము కానీ విరగగొట్టడము, పూజించిన దేవున్ని కాలదన్నడము కాదని
తెలియాలి. మీరడగిన మొదటి ప్రశ్నలో విఘ్నము కలిగించు విఘ్నేశ్వరున్ని దూషించాలి, కానీ పూజించ కూడదన్నారు
కదా! అసలుకు విఘ్నేశ్వరున్ని దూషించడానికి ఆయన మనకే విఘ్నముగానీ, ఏ చెడ్డగానీ చేయలేదు కదా! అందువలన
ఆయనను దూషించ వలసినది లేదు. భక్తి కలిగి విఘ్నేశ్వరుని పూజించడములో తప్పులేదు, కానీ పూజించిన వానిని
పూజించినట్లే ఉంచుకొని ఉంటే బాగుండేది. నీటిలో పారవేయడము మంచిది కాదు. ఒకమాటకొస్తే దానిని
దూషించుటకు, పూజించుటకు కాక సంఘములోనున్న అన్యాయము ను బహిర్గతము చేయడానికి ఊరేగించు
ఊరేగింపుయనీ, అట్లే దానిని లేకుండా చేయవలయునను ఉద్దేశమే ఆ బొమ్మను నీటిలో ముంచి నాశనము చేయడమనీ
అందరూ తెలియవలెను.
మీరడిగిన మరొక ప్రశ్న ప్రకారము బలవంతముగా డబ్బు వసూలు చేసి ఉత్సవము చేయడము పద్ధతికాదు.
భక్తిలో కూడ అది బలవంతపు భక్తి అగును, కానీ మనస్ఫూర్తి భక్తికాదు. ఇష్టము లేకుండా ఇచ్చినవారు అడిగిన
వారినేకాక, విఘ్నేశ్వరున్ని కూడ నిందించుటకు అవకాశము గలదు. అందువలన ఇంకొకరితో డబ్బు వసూలు చేయడము
మంచిది కాదు.
పూర్వకాలములో సమత అను పదము సామతగా మారి చివరకు సామెతగా మారినట్లు, ఆ రోజు పెద్దలుంచిన
సంఘసంస్కరణ పద్ధతియైన ఎలుక ఏనుగు ఊరేగింపు నేడు భక్తిరూపముగా మారిపోయినది. పురాణముల ప్రభావము
వలన ఏనుగు రూపు కాస్త వినాయకుని రూపుగా మారినప్పటికీ ఆచరణ పూర్తి మారక పూర్వాచరణే చేయుటవలన
ఇతర మతస్థులైన కొందరిచేత విమర్శింపబడుచున్నది. ఆచరణను పూర్తి భక్తి భావముగా మార్చుకున్ననూ ఫరవాలేదు,
లేక ముందుమాదిరే సంఘరీత్యా పెట్టుకొన్నా ఫరవాలేదు. కానీ అటు ఇటు కాక చేయుచున్న పనికి అర్థము
తెలియకపోవడము వలన ఇతర మతములచేత, చూచువారిచేత విమర్శింప బడు కార్యమైనది. వినాయకుని నిమజ్జనము
(స్నానము) అను పేరుతో చిన్న చిన్న బొమ్మలను నీటిలోనికి విసురుచుండుట చూస్తే, నిజముగా భక్తి అనిపించదు.
సరదాగా చేయుచున్న పనిగా కన్పిస్తున్నది, కానీ పూర్తి భక్తిగా కనిపించుపనిగా తోచడము లేదు. ఊరేగింపులందామా?
కొన్ని చోట్ల పీర్లపండుగ మాదిరి త్రాగి చిందులు వేయడము, కర్రసాములు చేస్తూ పోవడము చూస్తే అల్లరి
సాంప్రదాయమేగానీ, అర్థసాంప్రదాయము కాదనిపిస్తుంది. ఆనాడు మన పెద్దలు సమాజములోని చెడును తీసివేసి సమ
సమాజమును స్థాపించుటకు చేసి చూపిన దానిని అర్థము చేసుకోలేక, వారి అర్థమును తుంగలో త్రొక్కి, మన ఇష్టమొచ్చినట్లు
మనము వినాయక చవితిని చేసుకొనుచున్నాము. ఇటు చదువుకొన్నవారు, అటు చదువులేని వారు మూఢముగా పెద్దల
ఉద్దేశమును మట్టిలో కలిపివేసి అర్థరహితమైన వినాయకచవితిని చేస్తున్నారు.
ఇక్కడ ముఖ్యముగ చెప్పుకోవలసినదేమనగా! కృష్ణుడు భగవంతు డైనా, దేవుని అంశ కృష్ణునిగా భూమిమీదికి
వచ్చి మన జీవితముల సారాంశమైన భగవద్గీతను చెప్పినా, భగవంతుడుగానీ, భగవద్గీతగానీ నేటి మానవులకు గొప్పగ
కనిపించక, భగవంతుని పుట్టిన రోజు పండుగైన కృష్ణాష్టమిని చేయక, దాని స్థానములోనికి వినాయక చవితిని తెచ్చి
పెట్టుకొన్నారు. కృష్ణాష్టమి పదకొండు రోజుల పండుగని ముందే చెప్పుకొన్నాము. అంతేకాక కలియుగ ప్రారంభములో
పెద్ద ఎత్తున చేయు వీధి పండుగ కృష్ణాష్టమి ఒక్కటేనని కూడ చెప్పాము. మాయా ప్రభావము చేత ఒక్కరోజు చేయు
వినాయకచవితి పదకొండు రోజులైంది. పదకొండు రోజులు చేయు కృష్ణాష్టమి ఒక్కరోజుకు పరిమితమై పోయినది.
అంతేకాక పూర్వము కృష్ణాష్టమి పండుగ ముగింపు దినము భాద్రపదమాస శుక్లపక్ష చవితిరోజు అగును. సరిగ ఆ
దినమునే వినాయక చవితిగా లెక్కించడము వలన, కృష్ణాష్టమి ముగింపు పదకొండవ దినమునకు ఆటంకమేర్పడినది.
ఈ విధముగా కృష్ణాష్టమికి ఆటంకముగా వినాయకచవితి రావడము వలన హిందూ (ఇందూ) సంస్కృతిలోని ముఖ్యమైన
కృష్ణాష్టమి పోయి, ముఖ్యము కాని వినాయకచవితి వచ్చి చేరిపోయినది. కృష్ణాష్టమి ముగింపు దినమైన పదకొండవ
దినమే వినాయకచవితి ప్రారంభమగుట వలన, కొందరు వినాయకచవితిని వదలలేక కృష్ణాష్టమిని ఒక్కరోజు పండుగగా
కుదించి, శ్రావణ బహుళ అష్టమి రోజు మాత్రము కృష్ణాష్టమిని చేయుటకు మొదలు పెట్టారు. అలా చేయడము వలన
మనము మన ముఖ్యమైన సాంప్రదాయము తెలియకనే వదలుకొన్నట్లయింది. ఆ విధముగా సంవత్సరములో ఒక్కరోజు
పండుగగా కృష్ణాష్టమి మారిపోయి కొంతకాలము గడువగా, కాలక్రమమున ఆ ఒక్కరోజు పండుగను కూడ మరచిపోయి,
కృష్ణాష్టమి అంటే ఏమిటో తెలియనిస్థితికి మనము వచ్చాము. ఇంకా విశేషమేమంటే కొన్ని ప్రాంతము లలో కృష్ణుడు
పెరిగిన కులమైన యాదవులకు (గొల్లవారికి) కూడ కృష్ణాష్టమి గురించి తెలియకుండా పోయినది. సాక్షాత్తు దేవుడు
అవతరించి భగవంతునిగా వచ్చిన మొదటి దినమైన కృష్ణాష్టమి, నేడు ఆదరణలేనిదై, అర్థములేనిదై, ఆచరణలేనిదై
పోయివుంటే, దైవత్వముకాని ఒక సమాజ శ్రేయస్సు విషయము, మాయబలము వలన దైవస్థానమును ఆక్రమించి
అందరిచేత ఆదరణ పొందుతూ, అందరిచేత ఆచరింపబడుచున్నది. ఈ విధముగా సమాజములో వినాయకచవితి
వీధిపండుగగా మారిపోవడము, అంతేకాక పదకొండు రోజుల పండుగగా మారిపోవడము, కృష్ణాష్టమి అన్ని విధములుగ
ఆదరణలేకపోవడము మాకు చాలా బాధకల్గించిన విషయము. నాకే కాదు ప్రతి హిందువు (ఇందువు) బాధపడవలసిన
విషయము. ప్రతి ఒక్కరు వెనుతిరిగి చూచుకోవలసిన విషయము.
ఇందూ (హిందూ) ధర్మములకు పూర్వవైభవము రావాలంటే, ఇందుత్వము అందరికి ఆమోదయోగ్యము కావాలంటే,
ఈనాటి ఆచారము లను మానుకొని, ఆనాటి ఆచారములను అమలు చేయాలి. ఇంత చెప్పినా కొందరు మొండిగ
వాదిస్తూ, వినాయకచవితి కూడ హిందూ ధర్మములకు సంబంధించినదే కదా! పార్వతీదేవికి, శివునికి పుట్టినవాడే కదా!
వినాయకుడు అని అడుగవచ్చును. నేను మొదటినుండి మనకు శాస్త్రమే ఆధారమని చెప్పుచునే ఉన్నాను. పార్వతి,
వినాయకుడు భగవద్గీత కంటే ముందు వ్యాసునిచేత వ్రాయబడిన ఒక పురాణగాథ నుండి వచ్చినవారు. వినాయకుని
పుట్టుకే అశాస్త్రీయము, ప్రకృతికి విరుద్ధము అవుతుంది. తండ్రికి తెలియకుండ కొడుకు పుట్టడమేమిటని ఎవరైనా
ప్రశ్నించినా, తండ్రి సంబంధము లేకుండ తల్లి కొడుకును ఎలా పుట్టించుకొన్నదని ఎవరైనా అడిగినా, మనము సరియైన
శాస్త్రబద్ధమైన సమాధానము చెప్పలేము. అలా పుట్టినవాడు తల్లి కొడుకే అగును, కానీ తండ్రి కొడుకు కాడు. తల,
మొండెములు వేరువేరుగా ఉన్న నరసింహస్వామి, వినాయకుని కథలు పురాణములే అగును. కానీ శాస్త్రబద్దమైన
చరిత్రలు కావు. కవులు సృష్టించిన కథలను విడచి వాస్తవ చరిత్రగల విషయమునే స్వీకరించవలెను. నాగుల చవితికి
శాస్త్రీయత కలదు. అలాగే వినాయకచవితికి శాస్త్రీయత గలదు. ఈ రెండూ సమాజ శ్రేయస్సుకు సంబంధించినవని
తెలియుచుండినా, శాస్త్రీయతను వదలి నాగులచవితికి, వినాయకచవితికి అశాస్త్రీయతను అంటగట్టకూడదు.
కొందరు హిందూ (ఇందూ) మతమును రక్షించుతామని, హిందూ ధర్మములను కాపాడుతామని చెప్పుచు,
హిందూధర్మరక్షణ అను నినాదముతో కొన్ని పేర్లు గల సంఘములను స్థాపించుకొని, వారి ఆధిపత్యము కొరకు
హిందూ ధర్మములను భక్షించుచున్నారు. అటువంటి వారికి హిందూ ధర్మములంటే ఏమిటో, అవి ఎట్లుంటాయో కూడ
తెలియదు. అటువంటి వారా హిందూ ధర్మములను కాపాడేది? అటువంటి సంస్థలు ఇతర మతముల మీద దౌర్జన్యము
చేస్తూ హిందుత్వము శాంతి స్వరూపమైనది కాదు అనునట్లు చేయుచున్నారు. అటువంటివారు తమ పేరు ప్రఖ్యాతుల
కొరకు మాలాంటి వారిని కూడ అవమానిస్తున్నారు. అటువంటివారిని లెక్కచేయక, ఇందూ ధర్మముల ప్రకారమే
జ్ఞానము తెలిసినవారు ప్రవర్తించాలి. భగవద్గీత తెలిసిన తర్వాత పురాణములను వ్రాసిన వ్యాసుడే తాను పురాణములను
వ్రాసి తప్పు చేశానని బాధపడి పశ్చాత్తాపముతో కృంగిపోయాడు. వ్రాసిన వ్యాసుడే బాధపడితే, ఆ విషయము తెలియక
మనము ఆ పురాణముల ఆధారముతోనే నాగులచవితి, వినాయకచవితి ఇష్టానుసారము చేస్తే మనము దైవద్రోహము
చేసినట్లే. అసలైన హిందూ ధర్మములను కించపరిచినట్లే. అందువలన అధర్మములైన పద్ధతులను వదలి ధర్మములైన
పద్ధతులనే ఆచరించాలి. ఆ ప్రయత్నములో వినాయక చవితిని వదిలివేసి కృష్ణాష్టమిని చేద్దాము. కృష్ణాష్టమిని
పదకొండురోజులు జరిపితే వినాయకచవితిని చేసుకొను అవకాశము లేకుండ పోవును. పదకొండవ రోజు వినాయకచవితి
అగును. ఆ దినమున కృష్ణుడు పందిరిలో ఉండుట వలన వినాయకునికి పందిరే ఉండదు. అందువలన భగవంతుని
పండుగ కోసము భగవంతుడు కాని వినాయకుని పండుగను వదలివేసినా తప్పులేదు.
భూమిమీద చాలామందికేకాక ఒక విధముగ అందరికి తెలియని రహస్యమొకటి కలదు. అదియే దేవుని
పాలన. దేవుని పాలనలో మహా భూతములు, భూతములు, ఉపభూతములు పాత్రధారులుగా ఉండి భూమి మీద
పాలన సాగించుచున్నవి. ఈ విషయము భగవద్గీతలో శాస్త్రబద్దముగా కలదు. దేవుడు ఏమీ చేయడు, చేయునదంతా
మూడు రకముల భూతములే. దేవునికి వ్యతిరేఖమైన పనులు చేయువారి మీద భూతముల దృష్టి ఉండునని కూడ ఒక
గ్రంథమందు వివరముగా చెప్పడము జరిగినది. దేవతల దర్శనార్థము పోవునపుడు, వచ్చునపుడు పాల్గొన్నపుడు,
పెళ్ళిళ్ళలకు పోవునపుడు, వచ్చునపుడు ఎక్కువగా ప్రమాదములు జరుగుటకు భూతములే కారణమని కూడ చెప్పాము.
ప్రతి సంవత్సరము వినాయకచవితి పండుగలలో వినాయక నిమజ్జన సందర్భములో చాలా ప్రదేశములలో ఒకరు,
ఇద్దరు లేక ముగ్గురు ప్రమాదవశాత్తు చనిపోవడము జరుగుచున్నది. ప్రతి సంవత్సరము అలా జరుగుచున్నా ఎందుకిలా
జరుగుచున్నదని ఎవరికీ అర్థము కావడము లేదు. అది భూతముల పని అని ఎవరికీ తెలియడము లేదు. వినాయకచవితి
సందర్భములో దేశము మొత్తము వేలాదిమంది చనిపోతున్నారు. భూతములనుండి వచ్చు అటువంటి ప్రమాదములు
లేకుండ పోవాలంటే పంచభూతములకు ఇష్టములేని వినాయకచవితిని మానివేసి, భూతములకు ఇష్టమున్న దేవుని
ఆరాధన అయిన భగవంతుని జన్మదినమును పండుగగా చేసుకోవడము మంచిది.
అన్నిటిని గమనించిన తర్వాత ఈ గ్రంథమును చదివిన ప్రతి ఒక్కరు, కృష్ణాష్టమిని చేయుటకు, అందరికంటే
ముందుగా మొదలు పెట్టండి. కృష్ణాష్టమిలో వినాయకచవితివలె ఖర్చు ఉండదు, ప్రమాదము ఉండదు. ప్రతి సంవత్సరము
ప్రతిమలను కొను అవసరము లేదు. ఇంటిలోని ప్రతిమను వీధిలో పెట్టి, పదకొండురోజులు ఉత్సవములు చేసి ఆ
ప్రతిమను తిరిగి ఇంటిలో పెట్టుకోవలెను. ఎట్టి పరిస్థితిలోను కృష్ణ ప్రతిమను నీటిలో నిమజ్జనము చేయడముగానీ,
ఎక్కడైనా పారవేయడము గానీ జరుగకూడదు. చివరిరోజు ఊరేగింపు తర్వాత కృష్ణ ప్రతిమను ఇంటిలోనే పెట్టుకోవాలి.
వినాయకచవితి సమయములో చందాల వసూళ్ళే ఎక్కువగా జరుగుచున్నవి. అందులో వినాయక భక్తికంటే డబ్బుల
వసూళు ముఖ్యపాత్ర పోషిస్తున్నవి. ఇవ్వడానికి స్థోమతలేని వారివద్దకూడ బలవంతముగా డబ్బులు వసూలు చేయడము
జరుగుచున్నది. కృష్ణాష్టమిలో అటువంటి విధానముండదు. వర్షానికి తడవని విధముగా పందిరిని ఏర్పాటు చేసి
అందులో కృష్ణప్రతిమ పెట్టి, కొబ్బరి కాయకొట్టి ఆరాధిస్తే చాలు. కృష్ణుని ముందర వినాయకుని పందిరిలో పెట్టినట్లు
సినిమా పాటలను పెట్టడముగానీ, కాలక్షేపమునకు జూదమాడడముగానీ మంచిది కాదు. కర్ణాటక ప్రాంతములో ప్రతి
వినాయక పందిరిలోను జూదమాడడము అలవాటుగా ఉన్నది. అటువంటి పనులు కృష్ణప్రతిమ ముందర చేయకూడదు.
కృష్ణపందిరిలో పదకొండురోజులు ప్రత్యేకముగా గీతా పఠనము జరుగునట్లు ఏర్పాటు చేయవలెను. అదియు గాయకులు
గానము చేసిన భగవద్గీత రికార్డు పెట్టకూడదు. శుచిశుభ్రతలతో ఎవరైనా గీతను ఉదయము, సాయంకాలము పఠించవలెను.
కృష్ణుని పందిరిలో వేద మంత్రములు నిషేధము. కృష్ణుని పూజలో వేదమంత్రములను వాడకూడదు. మంత్రరహితమైన
సాధారణ పూజ చేయడము మంచిది. మత్తు పానీయములు త్రాగినవారు కృష్ణప్రతిమవున్న పరిసర ప్రాంతములోనికి
పోకూడదు. పోయినా అప్పుడు ఏమీకాదు, కానీ తర్వాత వాని ఆరోగ్యములో ఎంతో తేడావచ్చును. నయముగాని
రోగములు తగులు కొనును. రోగములు కూడ భూతములే కావున, భూతములు కృష్ణున్ని అనగా భగవంతున్ని కించపరచిన
వానిని వదలవు. ఇప్పటికే భగవంతున్ని వదలి ఇతర దేవతలను ఆరాధించువారిని ప్రమాదములలో చిక్కుకొనునట్లు
గానీ, ఆరోగ్యములో అనేక సమస్యలు వచ్చునట్లుగానీ భూతములు చేయుచున్నవి. అందువలన వారి కోపమునకు
గురికాకుండ అన్యదేవతలను వదిలి కృష్ణాష్టమిని చేసిన వారికి దేవుని పాలనలో పాత్రధారులైన భూతములు సహకరించును.
భగవంతుడు చెప్పిన జ్ఞానమును తెలుసుకొంటే, శరీరములో రోగములుగా వున్న భూతములు కూడ అటువంటి వారిని
గౌరవించి తమ రోగములను వానికి లేకుండాచేయును. అంతేకాక నేడు జరుగు ప్రకృతి వైపరీత్యములు చిన్నదాని
నుండి పెద్దదానివరకు అన్నియు దేవుని పాలకులైన భూతముల వలననే జరుగుచున్నవి. కృష్ణాష్టమిని భక్తితో చేయుట
వలన ఆ ప్రాంతములో ప్రకృతి (భూతముల) వైపరీత్యములు తగ్గిపోవును. వర్షము కూడ భూతముల వలననే వచ్చుచున్నది.
అందువలన భగవంతుని భక్తి కల్గియున్న ప్రాంతములో వర్షములు సక్రమముగా కురియును. ఇదంతయు కవిత్వము
కాదు, నగ్నసత్యము. భూతములంటే ఏమిటో, దేవుని పాలన అంటే ఏమిటో, ఎవరికీ తెలియదన్నాము కదా! ఆ
విషయములు తెలియాలంటే మేము రచించిన “దయ్యాల భూతాల యదార్థసంఘటనలు" అను గ్రంథము చదివితే
దేవుని పాలన అంటే ఏమిటో, భూతములు అంటే ఏమిటో తెలియును.
మీరు తెలివితక్కువ వారు మాత్రము కాదు. కానీ హేతుబద్దముగా ఆలోచించని దానివలన తెలివి తక్కువ
వారు ప్రవర్తించినట్లు ప్రవర్తించు చున్నారు. అదెలా అనగా! కృష్ణునికి చరిత్రవుంది, కృష్ణుడు మనలాగే పుట్టాడు,
ఆయన పుట్టిన తేదీవుంది. ఆయన చనిపోయిన సంవత్సరమూ ఉంది. కానీ విఘ్నేశ్వరుడు పుట్టిందే లేదు, ఆయన
చరిత్రే లేదు. కేవలము పురాణాలలో కల్పించబడ్డాడు. మాయచే కల్పించపబడి అసలైన భగవంతుని గా
పూజింపబడుచున్నాడు. వాస్తవానికి వినాయకుడు ఉన్నాడా లేడా? అని ఎవరూ యోచించక గ్రుడ్డిగా ప్రవర్తించడము
వలన, నాస్తికవాదులు హేతుబద్ధతలేని వినాయకున్ని లేడనడమేకాక, శాస్త్రములను తెలిపిన దేవున్నే లేడంటున్నారు.
వ్యాసుడు అజ్ఞాన దశలోనున్న వయస్సులో పురాణములు వ్రాయడము, అందులో వినాయక పాత్రను వ్రాయడము
జరిగినది. పురాణములన్నియు కాలక్షేపమునకు వ్రాయబడినవే తప్ప, కర్మక్షేపమునకు కాదు. వినాయకుని జీవితమును
గురించి ఏమాత్రము తెలియని మనుషులు వినాయకుని ఉత్సవములు చేయడములో ముందున్నారు. కృష్ణుని జీవితము
తెలిసినా, కృష్ణుడు మానవుల జీవితమునకు సంబంధించిన మరియు మనిషి కర్మలనుండి బయటపడు జ్ఞానమును
చెప్పినా, కృష్ణాష్టమి చేయనివారు, వినాయకుని జీవితమేమిటో తెలియకున్నా మరియు వినాయకుడు మనిషికి అవసరమైన
ఏ జ్ఞానమును చెప్పకున్నా, వినాయకచవితిని చేయుచున్నారు. నేను మిమ్ములను హిందూమతమును వదలి వేరే
మతములోనికి రమ్మని చెప్పడము లేదు. హిందూ (ఇందూ) పథములోని ఔన్నత్యమును తెలుసుకొని, ఇందూధర్మములను
తెలిపిన కృష్ణున్ని భగవంతునిగా గుర్తించి, ప్రతి సంవత్సరము కృష్ణాష్టమిని చేయమని, అట్లు చేయడము వలన మీ
కర్మలు పోవునని తెలుపుచున్నాము.
కృష్ణున్ని భగవంతునిగా గుర్తించక పోయిన కారణము వలన ఆయనను అశ్రద్ధ చేశాము. అంతేకాక కృష్ణున్ని
శృంగారపురుషునిగా కవులందరు వ్రాయడము వలన, కృష్ణున్ని చిల్లర మనిషిగా లెక్కించు కొన్నాము. భాగవతపురాణములో
కృష్ణుడు మధురకు పోయి కంసున్ని చంపకముందే గోపికలతో తిరిగే వాడని, వారితో శృంగారములో పాల్గొనెడి వాడని,
స్వయాన పోతన కవియే తెలుగులో వ్రాశాడు. సంస్కృతములో వ్యాసుడు కొంత విడ్డూరముగా వ్రాస్తే, దానిని తెలుగులోనికి
అనువదించిన పోతన ఇంకా కల్పితము చేసి మరీ విడ్డూరముగా వ్రాశాడు. కృష్ణుడు మధురకు పోయినది, కంసున్ని
చంపినది ఆయనకు పదకొండు సంవత్సరము ల వయస్సులో జరిగినది. పదకొండు సంవత్సరములకే ఏ మనిషైనా
స్త్రీలతో సంయోగము చేస్తాడా? శృంగారములో పాల్గొంటాడా? ఈ మాటలు విడ్డూరము కాదా! ఆ విధముగా కృష్ణున్ని
తప్పుగా వ్రాయడము వలన, దాని ఆధారముతో మనుషులలో మాయ గాఢంగా పనిచేసి, కృష్ణున్ని అల్లరి మనిషిగా
లెక్కించుకొనునట్లు చేసింది. అందువలన కృష్ణుని విషయము చాలామంది ఆలోచించలేక పోయారు. 90 ఏళ్ళవయస్సులో
కృష్ణుడు భగవద్గీతను చెప్పిన తర్వాత, పురాణములను వ్రాసిన వ్యాసుడు తన తప్పును తెలుసుకొని, పురాణములకు
వ్యతిరేఖమైన భగవద్గీతను సంస్కృతములో శ్లోకముల రూపముగా వ్రాశాడు. అంతటి వ్యాసుడే తన తప్పును తాను
తెలుసుకోగలిగి తన శ్లోకములలో కృష్ణుడు చెప్పిన ధర్మములను తెలియబరిచాడు. వేదపఠనము, తపస్సు, యజ్ఞములు
ధర్మములుకావని అధర్మములని తాను వ్రాసిన శ్లోకములలోనే చెప్పాడు. అంతపెద్ద కార్యములే అధర్మములైనపుడు,
మనము చేయు వినాయక చవితి కూడ అధర్మమే అగును. అందువలన ఇప్పటినుండి వాస్తవ విషయమును తెలుసుకొని,
విశ్వవ్యాపి, సృష్టికర్త అయిన దేవుడు, భగవంతుడై కృష్ణునిగా వచ్చాడని, దేవుడే భగవంతునిగా గీతాజ్ఞానము చెప్పాడని,
అదియే భగవద్గీతయని తెలిసి కృష్ణున్ని ఆరాధించి దేవునికి దగ్గరగుటకు ప్రయత్నిద్దాము. దేవుని దగ్గరకు చేరాలంటే
ఆయన చిరునామ(అడ్రస్) ఏమిటో మనకు తెలియదు. ఆ చిరునామాను చెప్పువాడు ఎవడో వాడే భగవంతుడు, ఆ
భగవంతుడే కృష్ణుడు. అందువలన కృష్ణుడు శరీరముతో మన మధ్యన ఉన్నపుడు ఆయన భగవంతుడైన దేవుడని, అట్లే
ఆయన మన మధ్య శరీరముతో లేనపుడు దేవుడైన భగవంతుడని చెప్పవచ్చును. అర్థము కాలేదేమో మరొకమారు
శ్రద్ధగా వినండి. కృష్ణుడు భూమిమీద ఉన్న ద్వాపరయుగములో భగవంతుడైన దేవుడు అనియు, కృష్ణుడు భూమిమీద
లేని కలియుగములో దేవుడైన భగవంతుడనియు చెప్పవచ్చును. ఇంతవరకు చాలామంది స్వామీజీలు, బోధకులు
దేవునికి, భగవంతునికి వ్యత్యాసము లేకుండా చెప్పివున్నారు. ఇప్పుడు అట్లు కాకుండ ఎవరు దేవుడో, ఎవరు భగవంతుడో
గుర్తించి చెప్పుకోవలెను.
ఇంతవరకు కృష్ణుని మీద మనకున్న అపోహలన్ని తొలగించివేసి భగవంతుడైన కృష్ణున్ని తెలుసుకొందాము.
ఇంతవరకు భగవంతుడు చెప్పిన జ్ఞానమును తెలియని మనము ఆయన తెలిపిన సారాంశమును గురించి తెలుసుకొందాము.
కృష్ణుని మీద భక్తిగల గోపి, గోపికలు ఆనాడే కాదు, ఈనాడు కూడ ఉన్నారని నిరూపిద్దాము. కృష్ణుని మీద భక్తి
భావమును పెంచుకొని అపార్థ భావమును లేకుండ చేసుకొందాము. భూమిమీద కృష్ణుడు ఒక్కడే భగవంతుడని
ఇతరులకు తెలియజేద్దాము. ఆ నేపధ్యములోనే వినాయక చవితిని వదలి, కృష్ణాష్టమిని చేద్దాము. మనము చేయడమే
కాక అందరిచేత చెప్పి చేయిద్దాము. హిందూత్వము మతముకాదు పథము (దారి) అని తెలియజేద్దాము. భూమిమీద
ఏ మతమువాడైనా ఈ పథములోనికి రావలసిందేనని తెలియపరుస్తాము. మీ మతములో ఏ దేవుడున్నాడో ఆ దేవుడే
ఈ భగవంతుడని అర్థమగునట్లు చేస్తాము. ఇతరులను మార్చాలంటే ముందు మనము మారాలి. మనము మారితే
మన దారినే ఇతరులు అనుసరిస్తారు. కావున మొదట మనము మారుటకు కృష్ణాష్టమితోనే మొదలు పెడదాము.
పారన పండుగలు.
పారనపండుగనునది వాస్తవానికి పండుగ కాదు. ఈ పండుగ కాని పండుగ ప్రజలలో పండుగలకంటే
ప్రాముఖ్యత చెందియున్నది. దీనికి అనేక ప్రాంతములలో అనేక పేర్లు గలవు. దీనిని కొన్ని చోట్ల కనుమపండుగ
అనుచుండగా, కొన్ని ప్రాంతములలో పారనపండుగ అనుచున్నారు. ఇది ప్రత్యేకమైన పండుగ కాకపోయిన ప్రాముఖ్యత
చెందినదని చెప్పుకొన్నాము కదా! అందువలన ఈ పండుగను ప్రతి పండుగ వెనుక ప్రజలు తగిలించుకొన్నారు.
ఇంతకుముందు మనము చెప్పుకొన్న యుగాది కానీ, సంక్రాంతి కానీ, దశరా కానీ అయిపోయిన మరుసటి దినము
ఈ పండుగను ఆర్య వైశ్యులు తప్ప అందరూ విధిగా ఆచరించుచుందురు. ఆ దినము మసాలాతో కూడిన
మాంసాహారమును ప్రీతిగా తీసుకొనుచుందురు. పండుగలను ఆడవారు ఆసక్తిగా చేస్తే పారన పండుగను మగవారు
కూడ ఆసక్తిగా చేయుదురు. పండుగరోజు లేని హుషారు పారన పండుగలలో కనిపించుచుండును. పారన (కనుమ)
పండుగ మొదట ఎలా ప్రారంభమైనదో కొంత తెలుసుకొందాము.
ముఖ్యముగా చెప్పుకొంటే పండుగలను రెండు రకములుగా విభజించుకోవచ్చును. పండుగలు తయారైనపుడు
రెండు రకముల పండుగలు లేవు. తర్వాత కొంతకాలమునకు మాయాప్రభావము పండుగల మీద కూడ ప్రాకడము
వలన, ఆధ్యాత్మిక అర్థముతో కూడుకొన్న పండుగలు మారిపోయి దేవతల పండుగలై పోయిన దానివలన, వాటిని
రెండు విధముల పండుగలని చెప్పుకోవలసి వచ్చినది. వాటినే క్షుద్రదేవతల పండుగలనీ, మహాదేవతల పండుగలనీ
చెప్పుకొంటున్నాము. ఇంతకు ముందు మనము చెప్పుకొన్న పండుగలన్నీ మహాదేవతల పండుగలు కాగా, అవి
కాకుండ గ్రామదేవతలను పూజించు పండుగలన్నీ క్షుద్రదేవతల పండుగలుగా చెప్పబడుచున్నవి. క్షుద్రదేవతలనబడు
గ్రామదేవతల పండుగలలో ఆరాధన పేరుతో జంతుబలులు జరుగుచుండును. ఆ దేవతలు కూడ జంతుబలులనే
కోరుచుందురు. బలి ఇచ్చిన జంతువుల మాంసమును ఆ దినము అందరూ తినడము ఇప్పటికీ జరుగుచుండుట
అందరికీ తెలిసిన విషయమే. గడచిన మూడు యుగములలో లేని క్షుద్రదేవతల పూజలూ, జంతుబలులు కలియుగము
మొదటినుండే ప్రారంభమైనవి. క్షుద్రదేవతల పూజలు కూడ మొదట ఎలా ప్రారంభమైనాయో కొంత తెలుసుకొందాము.
విశ్వము యొక్క పుట్టుకకు గుర్తుగా యుగాదిని మొదట పండుగగా అందరూ చేసుకొనెడివారు. యుగాది
పండుగ చైత్రమాసములో ఎండలకాలము జరుగుట అందరికీ తెలిసిన విషయమే. కృతయుగములో భూమిమీద
జనాభా తక్కువయున్న రోజులవి. ఇప్పుడున్నట్లు ఆ కాలములో పట్టణములు లేవు, రవాణా సౌకర్యము కూడ లేకుండెడిది.
అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు ఉండెడివి. ఇప్పటి మాదిరి ఉద్యోగాలు అప్పట్లో లేవు. అందరూ వ్యవసాయమునే
వృత్తిగా చేసుకొని బ్రతికెడివారు. వ్యవసాయభూములు తక్కువ, అడవిప్రాంతము ఎక్కువ ఉండెడిది. అడవిప్రాంతములలో
జంతువులు, పక్షులు సంవృద్ధిగా ఉండెడివి. ఎండల కాలము వ్యవసాయపనులన్ని అయిపోయి ప్రజలందరూ పనిలేకుండ
ఖాళీగా ఉన్న సమయములోనే యుగాది పండుగ వస్తున్నది. యుగాదిపండుగను చేసుకొన్న ప్రజలు మరుసటి దినము
పనిలేని దానివలన అందరు కూడి సరదాగా దగ్గరలోనున్న అడవికి వేటకు పండుగ అయిపోయిన రాత్రికి పోయెడివారు.
ఆ రాత్రి అందరూ సమిష్టిగా వేటాడెడివారు. రాత్రి దొరికిన జింకలను, దుప్పులను, అడవిపందులను, కుందేల్లను
మరుసటి దినము ఊరిలోనికి తెచ్చి వేటకు పోయినవారందరు సమానముగా వాటి మాంసమును పంచుకొనెడి వారు.
ఆ విధముగా వచ్చిన మాంసమును ఆ దినము వండుకొని తినెడివారు. అందువలన యుగాది పోయిన మరుసటి
దినమును వేట దినమని మొదట అనెడివారు. జంతువులు మనుషుల రాకను చూచి పారిపోతుంటే వాటి వెంట
పరిగెత్తి వేటాడుట వలన ఆ దినమును 'పారువేట' దినమని కూడ అనెడివారు. 'పారువేట' అను పదము చివరకు
‘పారేట’ అనుపదముగా మారినది. కాలక్రమున ‘పారేట' పదము కూడ మారిపోయి 'పారన' అను పదముగా మారినది.
'పారన' అను పదము రాయలసీమ ప్రాంతములో ఎక్కువగా కలదు.కొండలను కనుమలు అని కూడ
అనుచుందురు. నలమల కనుమలు అనగా నలమలకొండలని అర్థము. మల అనగా అడవి అనియు, కనుమ అనగా
కొండ అనియు తెలియుచున్నది. కొందరు యుగాది రాత్రికి దగ్గరలోనున్న కొండకు పోయి వేటాడి జంతువులు
తెచ్చుకొనుచుందురు. అందువలన ఆ దినమును కొన్ని ప్రాంతముల వారు 'కనుమపండుగ' అని కూడ అనుచుందురు.
ఈ విధముగా యుగాది మరుసటిదినము మొదలైన కనుమపండుగ లేక పారన పండుగ ఈనాడు అన్ని పండుగలకు
వెనుక దినము తప్పనిసరిగా ఉండడము జరుగుచున్నది. పూర్వము అడవికి పోయి జంతువులను వేటాడి పండుగ
చేసుకొనగా, నేడు ఊరిలోనే జంతువులను పెంచుకొని వాటిని చంపుకొని తింటున్నారు. ఆ దినములలో మాదిరి
అడవికి పోవలసిన పనిలేదు, పరిగెత్తి వేటాడవలసిన పనీలేదు. డబ్బులుంటే ఏ జంతువు మాంసమైన దొరుకుతుంది.
ఈ విధానము ద్వాపరయుగములోనే మొదలై అమలులో ఉండగా, కలియుగము ప్రారంభములోనే మరియొక విధానము
ప్రారంభమైనది.
కృతయుగములో లేని దేవతలు త్రేతాయుగమునుండి మనుషులలో స్థానము ఏర్పరచుకొన్నారు. ద్వాపరయుగ
చివరకు పండుగలలోనున్న ఆధ్యాత్మికత పోయి పండుగలంటే దేవతల ఆరాధనలన్నట్లు అయిపోయినవి. ఒక్కొక్క
పండుగలో ఒక్కొక్క దేవతా పూజ అమలగుచు వస్తున్నది. దశరా అంటే దుర్గాదేవిదనీ, శివరాత్రి అంటే శివపార్వతీలదనీ
అట్లు పండుగలన్నీ తయారైపోయినవి. కలియుగ ప్రారంభములో గ్రామదేవతలైన పెద్దమ్మ, సుంకులమ్మ, ఎల్లమ్మ,
పోలేరమ్మ అను మొదలగు ఆడ దేవతలు ప్రాంతావారీగా అనేక పేర్లతో తయారైనారు. ఆ సమయములోనే ముందునుండి
ఉన్న పండుగలన్నీ మహాదేవతల పండుగలనీ, తర్వాత తయారైన పండుగలన్నీ క్షుద్రదేవతల పండుగలనీ చెప్పబడినవి.
ద్వాపరయుగ అంత్యములోనే యుగాది, శివరాత్రి, దశరా, సంక్రాంతి మొదలగు పండుగలకు పారన (కనుమ) పండుగ
తోడై ఉండెడిది. కలియుగము మొదటి కాలములోనే మాంసప్రియులు ఎక్కువై ఏకంగా మాంసభక్షణకే ప్రాధాన్యతనిచ్చు
పండుగలను తయారు చేయాలనుకొన్నారు. ఆ ఉద్ధేశ్యముతోనే జంతు బలులున్న పండుగలను ప్రత్యేకముగా
సృష్ఠించుకొన్నారు. అవియే నేటి క్షుద్రదేవత లేక గ్రామదేవత పండుగలు. కృతయుగములో ఆధ్యాత్మికతగల పండుగలుండగా
త్రేతాయుగమునుండి మారుచువచ్చి, పండుగలలో దేవతా పాత్రలెక్కువై పోతూ వచ్చి, ద్వాపరయుగ అంత్యమునకు
ప్రతి పండుగకు పారన పండుగ తగులుకొని పండుగల అర్థమే చెడిపోగా, కలియుగము ప్రారంభములోనే గ్రామదేవతల
పండుగలు కూడ ప్రారంభమై ఆ పండుగలలో మాంసభక్షణ ప్రధానపాత్రగ ఉండిపోయినది. కలియుగము ప్రారంభములోనే
గ్రామదేవతల ప్రాబల్యము రాగ వారి పండుగలలో మాంస భక్షణయే కాక మత్తుపాణీయములు వాడడము కూడ
జరుగుచున్నది. పూర్వము ఎంతో ఆత్మజ్ఞానముతో మొదలైన పండుగలు నేడు ఎంతో అజ్ఞానములో చిక్కుకొని
పోయినవి. అందరూ ఏది చేస్తుంటే అదే చేయాలని చేస్తున్న మనుషులు అందరూ చేస్తున్న పని ఏమిటని కానీ, దాని
వివరమేమని కానీ ఏమాత్రము యోచించడములేదు. అనేక రంగములలో మేధావులైనవారు కూడ ఒకే ఒక భక్తి
విషయములో గ్రుడ్డిగా మూఢనమ్మకముల విూదనే ప్రయాణిస్తున్నారు. వీరిని చూచిన కొందరికి ఏమి అర్థముకాక
దేవుడే లేడను నిర్ణయానికి వచ్చారు.
మొదట ఆధ్యాత్మికతతో మొదలైన పండుగలు కాలక్రమేపి మారుతూ భక్తిలోనికి వచ్చి, భక్తినుండి మూఢభక్తిలోనికి
వచ్చి చివరకు నాస్తికత్వము వరకు వచ్చాయి. ఇంట్లో నాభార్య చేసుకొంటుంది కానీ పండుగలంటే నాకు నమ్మకము
లేదండి అనువారు కొందరు తయారైనారు. మహాపండుగల నుండి క్షుద్రదేవతా పండుగల వరకు వచ్చినవారు వాటిని
వదలానుకొనినా గ్రామదేవతలు వారిని వదలవు. మాఫియామూఠాలోనికి పోయిన వారు చచ్చేంత వరకు దానిలోనే
కొనసాగవలసిందే, బయటికి రావాలనుకొనినా మూఠానాయకులు బయటికి రానివ్వరు. బలవంతముగా బయటపడాలను
కొంటే మాఫియా మూఠావారి వలననే ప్రమాదముంటుంది. అలాగే గ్రామ దేవతల భక్తిలో పడినవాడు
గ్రామదేవతలనుండి బయటపడలేడు. బయటపడాలనుకొనినా ఆ దేవతలు పడనివ్వరు. ఒకవేళ ఆ భక్తిని పూర్తి
వదలుకొనినా వానికి ఆ దేవతలవలననే ప్రమాదముండును. ఈ విషయములో గ్రామదేవతల వలన బాధపడువారిని
చాలామందిని చూచాము. పూర్తి పోలీస్ రక్షణగలవానికి మాఫియాముఠా ఏమి హాని చేయలేనట్లు, పూర్తి ఆత్మజ్ఞానము
తెలిసిన వానిని ఏ క్షుద్రదేవతలు ఏ హాని చేయలేవు. అందువలన ఎవరైనా గానీ ఏ దేవతల వలలో చిక్కుకొనినా గానీ,
ఇప్పటినుండి ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించి జ్ఞానమును తెలుసుకొన్న తర్వాత క్షుద్రదేవతల భక్తిని
వదలుకోవచ్చును. అలాకాకుండ ఎవరూ వారినుండి బయటపడలేరు. జ్ఞానము లేనివారిని గ్రామదేవతలే కాదు
చిన్నచిన్న గ్రహాలు (దయ్యాలు) కూడ బాధించగలవు. ఆత్మజ్ఞానమున్న వారిని చిన్నదయ్యాలు గానీ, గ్రామదేవతలు
గానీ, మహాదేవతలుగానీ అందరూ భయముకల్గి గౌరవింతురు. జ్ఞానమున్న వారివద్ద వినయముగ ప్రవర్తింతురు.
అందువలన పూర్వమే మన పెద్దలు ఆత్మజ్ఞానమును ప్రజలకు తెలియజేయాలని పండుగలను మన మధ్యలో పెట్టారు.
ఇప్పటి అజ్ఞాన విధానమును వదలి, అజ్ఞాన వాతావరణములో చేయుచున్న పండుగలను భావములో మార్పు తెచ్చుకొని,
జ్ఞానమును కల్గించు వాతావరణములో చేసుకొందాము. మన జీవితములో జ్ఞానమును పండించుకొని జ్ఞాన పండితులుగా
తయారవుదాము.
దీపావళి.
ప్రపంచంలో ఇంతవరకు ఎవరి చేత గుర్తింపబడనిది, ఎవరూ
కనుగొననిది, ఎవరికీ తెలియనిది పరమాత్మ. పరమాత్మనే దేవుడు అనికూడా
అనవచ్చును. దేవుడు అనినా ఎవరికీ తెలియనివాడేనని అర్థము.
వివరముగా చెప్పుకొంటే దేవుడు అనగా, దేవులాడబడేవాడు లేక వెతకబడే
వాడు అని అర్ధము. వెతకబడేవాడు అని అంటే కనిపించనివాడని అర్ధము.
దేవుడు అనబడేవాడు ఎవడో, ఎట్లుంటాడో, అతని పేరేదో, అతని స్థానమేదో,
ఆయన పనేమిటో ఎవరికీ తెలియదు. అటువంటి వానితో మనకేమి పనిss
అనుటకు వీలులేదు. భూమిమీద బ్రతికే ప్రతి జీవరాశికీ, ప్రతి మనిషికీ
శక్తి అవసరము. శరీరములో శ్వాస పీల్చుటకు శక్తి కావాలి. ఆహారము
జీర్ణమగుటకు శక్తి కావాలి. శరీరములోని ప్రతి కదలికకూ, ప్రతి
భాగమునకు శక్తి అవసరము. శరీరములో ఎక్కడ శక్తి లేకపోతే అక్క
వ్యాధి ఏర్పడుతుంది. వ్యాధి ఏర్పడినప్పుడు శక్తి ఉండదనీ, బలహీనముగా
ఉండునను విషయము అందరికీ తెలుసు.
శరీరములో ఎక్కడైనా వ్యాధి లేకుండా పోవాలంటే, శరీరమునకు
శక్తి అవసరము. ఎప్పుడు శక్తి ఉందో, అప్పుడు వ్యాధి ఉండదు. మనిషి
శరీరమునకు శక్తి ఎక్కడనుండి లభించుచున్నది? అని ప్రశ్నించుకొని చూస్తే,
ప్రపంచములోనున్న ఏ జీవరాశికిగానీ, శక్తి అనునది ప్రకృతినుండి లభించు
చున్నదని చెప్పవచ్చును. ప్రకృతి శక్తి నిలయమా? అని అడిగితే శక్తి
ప్రకృతి యొక్క సొంతము కాదని తెలియుచున్నది. ప్రతి జీవరాశి శరీరము
ప్రకృతి చేత తయారు చేయబడినది. అయినా శరీరమునకు ఇచ్చు శక్తి
ప్రకృతి దగ్గరలేదు. ఇక్కడ ప్రకృతినుండి అందరికీ శక్తి లభించుచున్నదని
పై వాక్యములలో చెప్పి, ఇప్పుడు నిమిషము కూడా గడువకనే ప్రకృతి
దగ్గర శక్తే లేదని అసత్యము చెప్పితే ఎలాగ అని ఎవరైనా మమ్ములను
ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! శక్తి ప్రకృతినుండి
లభించుట వాస్తవమేగానీ, శక్తి ప్రకృతిదిగాదు. వాస్తవానికి శక్తి పరమాత్మది
(దేవునిది). ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా
పరమాత్మకు అడ్రస్ లేదు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. అందువలన
-----------------
శక్తి తనదే అయినా దేవుడు తాను ఎక్కడా తెలియబడకుండ తన శక్తిని
ప్రకృతి ద్వారా అందించుచున్నాడు. ప్రకృతి తనకు లభించిన శక్తిని మనిషికి
ఇస్తున్నది. దేవుడు లేడు అనుకొనువారందరూ శక్తి అంతయూ ప్రకృతిదే
అని చెప్పుచుందురు. దేవుడు ఏ మనిషికీ తెలియకుండుటకు, తనకూ
మనిషికీ మధ్యలో ప్రకృతిని పెట్టుకొన్నాడు. తాను ఏమీ చేయకుండా
ప్రకృతి చేత అంతా చేయిస్తున్నాడు. ప్రకృతి వెనుకయుండు వాడు దేవుడే,
అయినా దేవుడు ఎక్కడా ఎవరికీ తెలియదు, తెలియునదంతా ప్రకృతియే.
ప్రపంచమంతా శక్తితోనే నడుస్తున్నది. అయినా శక్తి దేవునిదని
ఎవరికీ తెలియదు. స్త్రీలింగమైన దేవతదే ప్రకృతిదే) అని అందరూ
అనుకొనునట్లు మనలోని మాయ భ్రమింపచేసినది. శక్తికలవాడు దేవుడు,
తాను పొందిన శక్తిని ఇచ్చునది దేవత (ప్రకృతి). దేవుడు అను పదమునుండి
దేవత అను పదము పుట్టినది. అలాగే పరమాత్మ ప్రకృతిలాగ ఉన్న
మరియొక జోడీని చూస్తాము. దీపము అనునది వెలుగునిచ్చునది అని
అందరికీ తెలుసు. వెలుగునిచ్చునది ఏదైనా తాను ప్రకాశిస్తూ, తన
ప్రకాశము ద్వారా ఇతరులకు వెలుగునిచ్చుచున్నది. ఎక్కడ వెలుగుయున్నా
అక్కడ దీపముందని చెప్పవచ్చును. వెలిగేది దీపమైనప్పుడు చిన్న కాంతి
ముక్కను కూడా దీపము క్రిందికే జమకట్టి చెప్పాలి. ఇక్కడ కొందరికి
అనుమానము వచ్చి ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! చిన్న
నిప్పు కణము కూడా కొద్దిపాటి వెలుగును ఇచ్చుచున్నది కదా!
అలాంటప్పుడు దీపమే వెలుగు నిచ్చును అనుటను అటుంచి, నిప్పు కూడా
వెలుగునిచ్చును అని చెప్పవచ్చును కదా! అని ప్రశ్నించవచ్చును. దానికి
మా సమాధానము ఏమనగా! దీపముగానీ, నిప్పుగానీ వెలుగు నిచ్చుట
వాస్తవమే! ఇక్కడ ఒక సూత్రమును అనుసరించి చెప్పుకొంటే వెలుగు
నిచ్చునది ఏదైనా దీపము అన్నాము. వెలుగు దీపముదేనని అందరూ
----------------------
శక్తి తనదే అయినా దేవుడు తాను ఎక్కడా తెలియబడకుండ తన స్మ
ప్రకృతి ద్వారా అందించుచున్నాడు. ప్రకృతి తనకు లభించిన శక్తిని మన్ని
ఇస్తున్నది. దేవుడు లేడు అనుకొనువారందరూ శక్తి అంతయూ ప్రకృతి
అని చెప్పుచుందురు. దేవుడు ఏ మనిషికీ తెలియకుండుటకు, శన
మనిషికీ మధ్యలో ప్రకృతిని పెట్టుకొన్నాడు. తాను ఏమీ చేయకుండా
(ప్రకృతి చేత అంతా చేయిస్తున్నాడు. (ప్రకృతి వెనుకయుండు వాడు దేవుడే
అయినా దేవుడు ఎక్కడా ఎవరికీ తెలియడు, తెలియునదంతా ప్రకృతిశే,
(ప్రపంచమంతా శక్తితోనే నడుస్తున్నది. అయినా శక్తి దేవునిదని
ఎవరికీ తెలియదు. స్త్రీలింగమైన దేవతదే (ప్రకృతిదే) అని అందరూ
అనుకొనునట్లు మనలోని మాయ (్రమింపచేసినది. శక్తికలవాడు దేవుడు,
తాను పొందిన శక్తిని ఇచ్చునది దేవత (ప్రకృతి). దేవుడు అను పదమునుండి
దేవత అను పదము పుట్టినది. అలాగే పరమాత్మ ప్రకృతిలాగ ఉన్న
మరియొక జోడీని చూస్తాము. దీపము అనునది వెలుగునిచ్చునది అని
అందరికీ తెలుసు. వెలుగునిచ్చునది ఏదైనా తాను ప్రకాశిస్తూ, తన
(ప్రకాశము ద్వారా ఇతరులకు వెలుగునిచ్చుచున్నది. ఎక్కడ వెలుగుయున్నా
అక్కడ దీపముందని చెప్పవచ్చును. వెలిగేది దీపమైనప్పుడు చిన్న కాంతి
ముక్కను కూడా దీపము క్రిందికే జమకట్టి చెప్పాలి. ఇక్కడ కొందరికి
అనుమానము వచ్చి ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! చిన్న
నిప్ప కణము కూడా కొద్దిపాటి వెలుగును ఇచ్చుచున్నది కదా!
అలాంటప్పుడు దీపమే వెలుగు నిచ్చును అనుటను అటుంచి, నిప్పు కూడా
వెలుగునిచ్చును అని చెప్పవచ్చును కదా! అని ప్రశ్నించవచ్చును.
దానికి మా సమాధానం ఏమనగా! దీపము గాని, నిప్పు గాని, వెలుగునిచ్చుట వాస్తవమే.
ఇక్కడ ఒక సూత్రం అనుసరించి చెప్పుకుంటే వెలుగునిచ్చినది ఏదైనా దీపం అన్నాము వెలుగు దీపముదేనని అందరూ
---------
అనుకోవడము సహజమే. ప్రకృతినుండే శక్తి లభించుచున్నదని అందరూ
అనుకొని శక్తి దేవునినుండి లభించుచున్నది. అలాగే దీపము నుండి
వెలుగు వస్తే అది వాస్తవముగా దీపముది కాదు. దీపమునకు వెనుక
ఎవరికీ తెలియకుండా ఉన్న అగ్నిది. అగ్ని వేరు, వెలిగే దీపము వేరు.
మండే దానిని మంట లేక దీపము అన్నట్లు దీపమునకు కారణమైన
దానిని అగ్ని అంటున్నాము. నిప్పురవ్వను లేక నిప్పు కణికను అగ్ని
అనవచ్చును కదా! అంటే, సూత్రము ప్రకారము అది వెలుగునిచ్చుచున్నది.
కావున దానిని అగ్ని అనకూడదు. వెలిగే దీపము అనాలి. దేవుడు ఎక్కడైనా
అంతా వ్యాపించి ఉన్నాడు, కానీ శక్తి మాత్రము ప్రకృతి ద్వారానే లభిస్తుంది.
అలాగే అగ్ని ఎక్కడైనా ఉంది, కానీ వెలుగు మాత్రము దీపము లేక రగిలే
నిప్పు ద్వారానే వస్తున్నది. కాంతి కిరణము అగ్నిదే అయినా, అది దీపము
ద్వారానే వచ్చుచున్నది. శక్తి దేవునిదే అని తెలిసినా, దేవుడు ఎవరికీ
తెలియకుండా ప్రకృతిని ఎలా తన ముందరుంచుకొన్నాడో, అలాగే వెలుగు
అగ్నిదేనని అందరికీ తెలిసినా అగ్ని కనిపించక దాని వెలుగును ముందుంచు
కొన్నది. దేవునికి అడ్డముగా ప్రకృతియున్నట్లు, అగ్నికి అడ్డముగా వెలిగేది
ఏదైనా ఉండవచ్చును. దానినే చిన్నదైతే దీపమని, పెద్దదయితే మంట
అని అంటున్నాము. దేవుడు అను పదమును మనము నిత్యమూ వాడినా,
దేవుడు ఎలా ఎవరికీ తెలియలేదో, అలాగే అగ్నిని మనము చూచామను
కొని, అగ్ని అను పదమును మనము ప్రతి దినము అనుచుండినా,
5. వాస్తవముగా అగ్ని ఎలాంటిదో ఎవరికీ తెలియదు. దేవుడు ఇంతవరకూ
ఎవరికీ తెలియనట్లే, అగ్ని కూడా ఇంతవరకూ ఎవరికీ తెలియదు.
దేవుడు అందరినీ సృష్టించుచున్నాడు, చివరకు అందరినీ హరించు
చున్నాడు అని ఎవరు చెప్పినా,ఆ మాట వాస్తవమే అయినా, దేవుడు
ఎవరో ఎవరికీ తెలియదు. అందరికీ తెలియునట్లు అందరినీ సృష్టించు
----------
చున్నది, హరించుచున్నది ప్రకృతియే. అదే విధముగా అగ్ని అన్నిటిని
దహించుచున్నదనీ మరియు వెలుగును కూడా ఇచ్చుచున్నదనీ ఎవరు చెప్పినా
ఆ మాట వాస్తవమే అయినా, అగ్ని ఏమిటో ఎవరికీ తెలియదు. కొన్నిటిని
తెలిసినట్లే మనము మాట్లాడినా, వాస్తవానికి వాటి పూర్తి విషయము తెలియ
దనియే చెప్పవచ్చును. ఇక్కడ కొందరు ఆశ్చర్యమును వ్యక్తము చేస్తూ,
మేము పొరపడినామా లేక మమ్ములను మీరు తప్పుదారి పట్టిస్తున్నారా?
అని అడుగవచ్చును. దానికి మా జవాబు మీరు అలా అనడములో
తప్పులేదు. ఎందుకనగా ఎవరికైనా తమమీద తమకుగానీ, లేక మామీద
గానీ అనుమానము రావచ్చును. వాస్తవముగా దేవున్ని గురించి ఎన్ని
సమాచారములు నేను చెప్పినా నిజంగా నాకు దేవుడు తెలియదు. అలాగే
ఒక శాస్త్రమును అందులో ఒక సూత్రమును అనుసరించి మాట్లాడకపోతే,
ఆ మాట మూఢనమ్మకముగా మాట్లాడినట్లగును. అలా కాకుండా వెలిగేది
దీపము అను సూత్రమును అధారము చేసుకొని చెప్పితే, నేను కూడ ఇంత
వరకు దీపమునే చూచానుగానీ నిజముగా అగ్నిని చూడలేదు. ఒకప్పుడు
నేను కూడా అగ్నిని చూచానని, మండకుండా కొంతకాలి ఎర్రగ కనిపించు
కొరివిని అగ్ని అని అనుకొనియుంటిని. ఇప్పుడది మూఢనమ్మకమనీ,
వాస్తవముగా నేను అగ్నిని చూడలేదని తెలిసిపోయినది. ఇలా ఎన్నో
మనకు తెలియని విషయములను తెలిసినామని మనము అనుకొంటున్నట్లు
ఇప్పుడు కొంత అర్థమైనది.
ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! ప్రకృతి
వేరు, దేవుడు వేరు. కనిపించనివాడు దేవుడు, కనిపించునది ప్రకృతి అని
చాలామార్లు మీరే చెప్పారు కదా! ఇప్పుడు ప్రకృతిలో భాగమైన అగ్నిని
కూడా కనిపించదు అంటున్నారేమిటి? అని అడుగవచ్చును. దానికి మా
జవాబు ఏమనగా! పరమాత్మ (దేవుడు) కనిపించడు. అలాగే ప్రకృతిలోని
-------
ఆకాశం, గాలి, అగ్ని మూడు భాగాలు కూడా కనిపిస్తాయి.
ఆకాశంను గాలిని ఎవరూ చూడరు. అలాగే అగ్నిని కూడా ఎవరూ
చూడరు. కానీ చాలామంది పొరపాటుగా అగ్నిని చూసారని
అనుకుంటున్నారు. వాస్తవంగా ఆకాశం, గాలి, అగ్ని మూడు కనిపిస్తున్నాయి
నవి కావు. నీరు, భూమి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ
మాటను అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అడిగితే, ఇప్పుడు చెప్పవలసి
యున్నది. కావున అప్పుడు చెప్పలేదని తెలుపుచున్నాను. చెట్టుకు పుట్టే
ఆకును పుట్టిన వెంటనే తినవచ్చును. అయితే అదే చెట్టుకు పుట్టే కాయను
పుట్టిన వెంటనే తినలేము. అలాగే ఆధ్యాత్మికములో కొన్ని విషయములను
అప్పుడే చెప్పినా అర్థమగును. కొన్ని విషయములు కొంత కాలము తర్వాత
చెప్పితేనే అర్థమగును. ఆకాశం, గాలి కనిపిస్తదు అంటే చెప్పిన వెంటనే
ఎవరైనా వినగలరు. వాటితోపాటు అప్పుడే అగ్ని కనిపిస్తదు అంటే
అతని మాటను అసత్యముగా లెక్కిస్తారు. అందువలన మేము కూడా
అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పుచున్నాము.
మాకు తెలుసు అనుకొనిన దేవున్నిగానీ, అగ్నినిగానీ మనముగానీ
ఎవరుగానీ చూడలేదని ఒప్పుకోక తప్పదు. మొదట దేవుని విషయములో
తెలియదని కొందరు ఒప్పుకొనినా, అగ్ని విషయములో తెలియదని
ఒప్పుకొనుటకు కొందరు కొంత వెనకడుగు వేసినా, కొంత వివరముగా
ఆలోచించిన తర్వాత ఒప్పుకొందురు. దేవుని విషయము మొదటిదికాగా,
అగ్ని విషయము రెండవది. ఇటువంటిదే మరొక్క విషయము కలదు.
మూడవ విషయములో కూడా మనుషులందరూ పొరబడియున్నారని
చెప్పవచ్చును. మొదటిదైన దేవుని విషయమును మనము చూడలేదని
సులభముగా ఒప్పించవచ్చును. రెండవదైన అగ్ని విషయములో మనము
పొరబడియున్నామని ఒప్పించుటకు కొంత కష్టమగును. ఇప్పుడు మూడవ
-----------
విషయములో ఒప్పించుటకు చాలాచాలాచాలా కష్టముగా ఉండునని.
చెప్పవచ్చును. ఆ మూడవ విషయము ఏమిటో, ఇప్పుడు చూస్తాము.
సుఖము, ఆనందము రెండూ సంతోషమునకు సంబంధించిన
సమాన పదములే, అయినా సుఖము వేరు ఆనందము వేరని చెప్పవచ్చును.
ఇంద్రియముల ద్వారా వచ్చునది సుఖము. మనోభావము ద్వారా వచ్చునది
ఆనందము. నాలుక ద్వారా 'మంచి ఆహారమును తింటూ ఎంత సుఖమును
అనుభవించినా, ముక్కుల ద్వారా ఎంతో మంచి సువాసనను పీల్చుతూ
సుఖమును ఆస్వాదించినా, కంటిద్వారా ఎంతో మంచి దృశ్యమును
చూచినప్పుడు జీవుడు ఎంత సుఖమును అనుభవించినా వాని కంటిలో
నీరు రాదు. అయితే మనోభావములో అనుభవమునకు వచ్చు ఆనందమును
పొందినప్పుడు ఎవనికైనా కంటిలో నీరు వచ్చును. మనో ఆనందము
వేరు, ఇంద్రియ సుఖము వేరు అని దీనినిబట్టి సులభముగా తెలియుచున్నది.
మనిషి ఐదు ఇంద్రియముల ద్వారా ఎంత సుఖము అనుభవించినా కంటిలో
ఆనంద బాష్పములు రావు. అలాగే మనిషి తన ఇంద్రియముల ద్వారా
మంచి జ్ఞానమును విన్నప్పుడు, లేక చదివినప్పుడు మనోభావములో
ఆనందము కల్గుట వలన కళ్ళలో ఆనంద బాష్పములు వచ్చును. చలన
చిత్రమును (సినిమాను) చూచినప్పుడు కొన్ని దుఃఖ సంఘటనలలో, చూచే
మనిషి కూడా అక్కడి భావముతో ఏకమై పోవుట వలన, చూచేవాని కళ్ళకు
నీరు రావడము జరుగుచుండును. దీనినిబట్టి మనిషి మనోభావమును
పొందినప్పుడు పొందిన భావము ఆనందమైనా, దుఃఖమైనా మనిషి కళ్ళలో
నీరు రావడము జరుగుచుండును. ఇంద్రియ కష్టసుఖములలో ఎవరికీ
కళ్ళలో నీరు రావు. మనోభావములైన ఆనంద దుఃఖములలోనే మనిషి
కళ్ళలో నీరు వచ్చును.
---------
ఇంతవరకు చెప్పినవన్నీ అందరికీ తెలుసు. ఇంద్రియముల కష్ట
సుఖములు, మనోభావ ఆనంద దుఃఖములు అందరి అనుభవములో
ఉండును. అయితే ఇంద్రియ సుఖములకు, మనో భావ ఆనందమునకు
పెద్ద వ్యత్యాసమేమి ఉండదనియే చెప్పవచ్చును. సుఖమూ, ఆనందమూ
రెండు అనుభవములే. అయితే నీళ్ళపాలు, చిక్కనిపాలు అన్నట్లు,
సుఖమునకు ఆనందమునకు కొంత తేడా మాత్రము గలదు. సుఖములో
కళ్ళనీళ్ళు రావు, ఆనందములో కళ్ళనీళ్ళు రావడము మాత్రమే తేడా కలదు.
అయితే ఇక్కడ ప్రత్యేకముగా చెప్పవలసిన విషయమొకటిగలదు. ప్రపంచ
భావములలో పొందే ఆనందమునకంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొందగలుగు
ఆనందము కూడా కలదు. అటువంటి ప్రత్యేకమైన ఆనందము ఒక్క దైవ
జ్ఞాన విషయములలో మాత్రము లభించును. ప్రపంచ సంబంధమైన భావ
ఆనందములను ఎన్నో పొందినవాడైనా, ఒక్కమారు ఆత్మానంద భావమును
పొందినప్పుడు, ఆ ఆనందము ఎంత గొప్పదో అప్పుడు తెలియును. ఆత్మా
నందమునకు హద్దులుండవు. మనిషి ఆత్మానంద భావమును పొందినంత
సేపు అతని కళ్ళలో ఆనంద బాష్పములు వస్తూనే ఉండును. అటువంటి
ఆనందమును మనిషి తన జీవితములో ఎప్పుడూ చవిచూచియుండడు.
ప్రపంచ విషయములలో భావ ఆనందము ఏర్పడినా, ప్రపంచ ఆనందము
నకూ ఆత్మ ఆనందమునకూ ఎన్నోరెట్లు తేడాయుండును. ప్రపంచములో
ఎప్పుడూ ఎక్కడా పొందని ఆనందమును పొందానని మనిషి తృప్తి పొందును.
అటువంటి ఆనందము కొన్ని కోట్లు డబ్బు ఖర్చుచేసినా రాదని దానిని
అనుభవించిన వానికి తెలిసిపోవును.
అంతపెద్ద ఆనందము మాకు ఎక్కడ లభించునని ఎవరైనా అడిగితే,
అది ఒక్క ఆత్మజ్ఞానములో మాత్రము లభించునని చెప్పవచ్చును. ఈ మాటకు
ప్రతి ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! మేము ఎన్నో-
--------
ఆధ్యాత్మిక గ్రంథములు చదివాము. ఎన్నో ఆధ్యాత్మిక ఉపన్యాసములను
విన్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేశాము. బాబాలకు, మహర్షులకు సేవ
చేశాము. ఎంతో కొంత జ్ఞానము మాకు తెలిసినదని అనుకొన్నాము.
అయినా మీరు చెప్పే ఆనందము మాకు కలుగలేదే అని అడుగవచ్చును.
దానికి మా జవాబు ఏమనగా! మేము ప్రత్యేకించి చెప్పుచూ, నీటిలో మునిగిన
వానికి శరీరమంతా తేమ అగును అని చెప్పాను. అయితే కొందరు
నూనెలో మునిగి మాకు మీరు చెప్పిన తేమ కాలేదే అని అడిగితే, దానికి
జవాబుగా మీరు మునిగినది నూనె, నేను చెప్పినది నీళ్ళు అని చెప్పగలను.
అయితే చాలామంది పెద్ద తొట్టిలో నిల్వయుంచిన నూనెను చూచి,
దానిలోనికి రాయివేసి, రాయి తాకిడికి అది కదలిన దానినిబట్టి నూనెను
నీరేనని భ్రమించి, అందులో మునిగితే శరీరమునకు తేమ అయినా అది
నీటి తేమ కాదు. నూనె జిడ్డు తగులుకొనుచున్నది. అందువలన మీరు
చదివేటివన్నీ ఆధ్యాత్మిక గ్రంథములో కాదో చూచుకోండి. అలాగే మీరు
వినేవన్నీ జ్ఞానవిషయములో కాదో పరిశీలించుకోండి. మీరు సేవించిన
వారు జ్ఞానులో కాదో, జ్ఞానవేషములోనున్నవారో! జాగ్రత్తగా చూచుకోండి.
మీకు ఆత్మానందము కలుగకపోతే మీరు చదివినది, మీరు విన్నది
ఆత్మజ్ఞానము కాదని తెలుసుకోండి. నిజమైన దైవజ్ఞానము కొరకు
అన్వేషించండి. మీరు విజ్ఞతతో శ్రమిస్తే తప్పక ఆధ్యాత్మిక జ్ఞానము
లభించును. దానివలన ఆత్మానందమును పొందవచ్చును. అదియే పెద్ద
ఆనందము, కావున దానిని బ్రహ్మానందము అని కూడా చెప్పవచ్చును.
ఇప్పుడు అసలు విషయమునకు వస్తాము. మనిషికి అతి పెద్దదైన
ఆనందము లభించాలంటే ఆత్మజ్ఞానము తెలియాలి. ఆత్మజ్ఞానము తెలియా
లంటే గురువు చెప్పినప్పుడే తెలియును. దైవజ్ఞానము (ఆత్మజ్ఞానము)
గురువు ద్వారా తెలియును. ప్రపంచములో గురువును సంపాదించు
---------
కోవడము పెద్ద కష్టమైన పనేమీకాదు. ఎందరో గురువులు రకరకాల
పేర్లతో ఉన్నారు. వారిలో కాషాయగుడ్డలు ధరించినవారు మొదలుకొని
దిగంబరుల వరకూ, జుట్టు గడ్డము పెంచుకొన్నవారూ మొదలుకొని గుండు
గీయించుకొన్న సన్న్యాసుల వరకూ, ఆది శంకరాచార్య మొదలుకొని అచల
సిద్ధాంతుల వరకూ, చెవులో మంత్రమును చెప్పు స్వాములు మొదలుకొని
ముక్కు మీద ధ్యాసను చూపే మహర్షుల వరకూ గురువులుగా ఎందరో
కలరు. ఇంతమంది గురువులలో ఒక గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానము
తెలియగల్గితే ఆనందము లభించునని చాలామంది అనుకోవచ్చును.
అయితే మేము చెప్పునదేమనగా! గురువులమని పేరు పెట్టుకొన్నవారు
ఎందరుండినా, వారిలో గురువు ద్వారానే జ్ఞానమూ, జ్ఞానము ద్వారా
ఆనందము లభించునని చెప్పాము. ఇంతమందిలో బాగా బోధించువానినీ,
పెద్ద పేరున్నవానినీ ఎంచుకొని అతనిని గురువుగా నీవు స్వీకరించినా
ఫరవాలేదు. నీరని నమ్మి నూనెలో దూకి శరీరమంతా జిడ్డును పూసు
కోకుండా, ముందే నీవు ఆశ్రయించిన వ్యక్తి గురువో కాదో, కొంత చూచు
కోవలసిన అవసరమున్నది. సూత్రము ప్రకారము గురువు వలననే జ్ఞానము
లభించును. కావున గురువు విషయములో కొంత జాగ్రత్త పడవలసి
యున్నది. గురువు విషయములో జాగ్రత్తపడేది ఏముంది, ఏ గురువు
చెప్పినా దైవజ్ఞానమే కదా! అని కొందరనుకొంటే, మండేది ఏదైనా అగ్నే
కదా అనుకొన్నట్లుండును. అగ్ని విషయములో పొరబడి అగ్నిని మేము
చూచాము అనుకొన్నట్లు, భూమిమీద చాలామంది మేము గురువును
చూచాము, మాకు గురువున్నాడు అని అనుకొనుచుందురు. వాస్తవానికి
దేవుడు, అగ్ని తెలియనట్లే గురువు కూడా ఎవరికీ తెలియడు. గురువు
తెలియకపోవడమేమిటి? మా ఊరిలో నలుగురు గురువులున్నారు. ప్రక్క
ఊరిలో పదిమందియున్నారని కొందరు చెప్పవచ్చును.
---------
ఎందరు జ్ఞానమును బోధించినా వారందరూ బోధకులే అవుతారు
గానీ, గురువులుకారు. నేడు భూమిమీద ఎవరు ఏమి బోధించినా అతనిని
మిగతా వారు గురువుగా భావించుచున్నారు. అయితే అతను చెప్పిన
మాటలు ముందే చెప్పబడినవనీ, ఉన్నదానిని చెప్పువాడు బోధకుడే
అవుతాడుగానీ, గురువుకాడని తెలియవలెను. గురువు అయినవాడు.
ప్రత్యేకమైనవాడు. వీడు గురువు అని గుర్తించుటకు వీలుకాదు. జ్ఞానము
ఎవర చేత చెప్పబడినా మొదట జ్ఞానము గురువునుండి వచ్చియుండును.
శక్తి దేవునిదే అయినా ప్రకృతినుండి వచ్చునట్లు, వెలుగు అగ్నిదే అయినా
దీపమునుండి వచ్చునట్లు, జ్ఞానము గురువుదే అయినా బోధకుని ద్వారా
చెప్పబడుచున్నది. అందువలన బోధించువాడు గురువు కాదు అని
చెప్పుచున్నాను. ఆ లెక్క ప్రకారము గురువును మనిషి ఎప్పటికీ తెలియలేదు.
ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచములో గురువు మనిషిగా వచ్చి బోధించును.
గురువుగా వచ్చిన మనిషి ఎవరు అని తెలియుటకు వీలులేదు.
బోధించువాడు బోధకుడు అను సూత్రము ప్రకారము, గురువు బోధించి
నప్పుడు కూడా అతనిని బోధకుని క్రిందికే జమకట్టవలసివచ్చును.
అందువలన భూమిమీద గురువును ఎవరూ గుర్తించలేరని చెప్పవచ్చును.
దేవుని జ్ఞానము గురువుకు తప్ప ఏ మానవునికీ తెలియదు అను సూత్రము
కలదు. మరియొక సూత్రము ప్రకారము దేవుని జ్ఞానము దేవునికే తెలుసు
అనుట కూడా కలదు. గురువు దేవుడు ఒక్కరే అని తెలియగలిగినప్పుడే
ఈ రెండు సూత్రములు సరిపోవును. దేవుడు తెలియబడువాడు కాదు.
. కావున గురువు కూడా తెలియబడువాడు కాడు. గురువును తెలియగలిగితే
దేవున్నే తెలిసినట్లగును. అందువలన గురువు ఎవడో తెలియదు, అట్లే
దేవుడు ఎవడో తెలియదు. ఈ విషయము "గురువు" అను గ్రంథములో
ముందే వ్రాసియున్నాము. భూమిమీద ఎవరైనా మేము గురువులమని
---
చెప్పినట్లయితే, వారు వాస్తవంగా బోధకులే అగుదురు. ఇంతవరకు శక్తి,
వెలుగు, ఆనందము ఎలా లభిస్తుందో తెలుసుకొన్నాము.
పరమాత్మ ,అగ్ని ,గురువు పట్టికను 111 పేజీ నందు చూడండి.
1. పరమాత్మ --> ప్రకృతి → శక్తి X వ్యాధి.
2. అగ్ని -->దీపము →వెలుగు X చీకటి.
3. గురువు → జ్ఞానము - ఆనందము X దుఃఖము
పూర్వము . మూడు యుగములలో తెలిసిన ఈ మూడు విధానములు
కలియుగము ప్రారంభములోనే తెలియకుండాపోయాయి.అలా
తెలియకుండా పోయిన దానివలన, ఆత్మజ్ఞానమునకు ముప్పు ఏర్పడునను
ఉద్దేశ్యముతో, కొందరు తెలిసిన పెద్దలు దేవుడు, గురువు అంటే ఎవరని
అందరికీ తెలియునట్లు, అట్లే ప్రకృతి మరియు దైవజ్ఞానము ఏమిటో
తెలియునట్లు, శక్తి ఆనందము ఎక్కడినుండి లభించుచున్నాయో
అర్థమగునట్లు వాటికి ఉదాహరణగా, గుర్తింపుగా దీపమును చూపడము
జరిగినది. ఈ విధానమంత తెలియుటకు ప్రత్యేకించి సంవత్సరములో
ఒక రోజును ఎన్నుకొని, ఆ దినమున ఇంటిలోపల మరియు ఇంటి బయట
దీపమును వెలిగించి దాని వివరమంతయు చెప్పడము జరిగినది. ఆ
దినము అందరు ఇంటి లోపల ఒక దీపము, బయట ఒక దీపము వెలిగించి
దాని అర్థమును చెప్పించుకొనెడివారు. మనిషిలోని అజ్ఞానమును తీసివేసి
జ్ఞానమును కల్గించుటకు చేయు ఆచార క్రియ కావున, ఆ కార్యమును ఒక
పండుగగా చేయడము జరిగినది. అజ్ఞానము చీకటికి గుర్తు, జ్ఞానము
వెలుగుకు గుర్తు. కావున చీకటి రోజయిన అమావాస్య రోజున దీపమును
పెట్టి చూపడము జరుగుచున్నది. ప్రతి సంవత్సరము ఆశ్వీయుజ
5 మాసములో వచ్చు అమావాస్య రోజున ఈ విధానము దీపావళి పండుగ
చేసుకోవడము జరుగుచున్నది.
---
మనిషి శరీరము లోపల, శరీరము బయట జ్ఞానమును కల్గియుండా
లను ఉద్దేశ్యముతో, శరీరమును మనము నివసించు గృహముగా పోల్చి
ఇంటిలోపల దీపము, ఇంటి బయట దీపము పెట్టునట్లు పెద్దలు చెప్పారు.
జ్ఞానము యొక్క ఉద్దేశ్యమును తెలుపు సాంప్రదాయ పండుగ కావున
పూర్వము ఇంటి లోపల ఒక దీపము, ఇంటి బయట ఒక దీపమును
ఉంచెడివారు. నేడు పూర్వము ఏర్పరచిన అర్థము ఆచారము తెలియకుండా
పోయి అలంకారము కొరకు ఎక్కువ దీపాలు పెట్టే దానికి మనుషులు
అలవాటు పడిపోయారు. దీపము ద్వారా వెలుగు వస్తున్నదనీ, దీపము
వెలుగుటకు కారణము అగ్నియనీ, అగ్ని దీపమునకు కారణమైనదిగా
ఉండి ఎవరికీ తెలియనిదిగా ఉన్నదనీ, అలాగే శక్తికి కారణమైన దేవుడుగానీ,
జ్ఞానమునకు కారణమైన గురువుగానీ ఎవరికీ తెలియకున్నారనీ, ఇటు
దేవున్ని, అటు గురువును తెలియునిమిత్తము ఈ విధానమైన దీపావళి
చేస్తున్నామని ఎవరూ నేడు అనుకోవడములేదు. దీపము వలన వెలుగు
వచ్చి చీకటిని పారద్రోలినట్లు, జ్ఞానము వలన ఆనందము లభ్యమై దుఃఖము
దూరమైపోవునని తెలియునట్లు, మంచి ఉద్దేశ్యముతో పూర్వము దీపావళి
పండుగను ఏర్పరచారని మరువకూడదు. అయితే నేడు నాగులచవితి,
వినాయకచవితి మారిపోయినట్లు దీపావళి అమావాస్య కూడా చివరకు
పురాణకథగా మారిపోయి నరకాసురుని సంహరించిన దినముగా చెప్పబడు
చున్నది. పూర్వము ప్రశాంతముగా జ్ఞానభావముతో చేసుకొను దీపావళి
నరక చతుర్దశిగా మారిపోయి, ధమాకా శబ్దము (టపాకాయల శబ్దము)
లతో ప్రశాంతతగానీ, జ్ఞానభావముగానీ లేకుండా పోయినది. ఇప్పటి
నుంచయినా టపాకాయల శబ్దము లేకుండా ప్రశాంతముగా, అర్థముగల
ఆచారముగా దీపావళి పండుగను చేసుకొందాము.
మా చివరి మాట.
ఒక విధముగా చెప్పితే మా రచనలన్నీ సంచలనాత్మక విషయములే నని చెప్పవచ్చును. మేము రచించిన ప్రతి
పుస్తకము ఎవరికీ తెలియని విషయములనే చెప్పుచూ క్రొత్తదనమును సంతరించుకొని ఉంటాయి. ఒకదానికొకటి
ప్రత్యేకత కల్గిన మా పుస్తకములన్నియు మనిషిని ఆధ్యాత్మికము వైపుకు నడిపిస్తూ దైవత్వమునకు దగ్గర చేయునవై
ఉంటాయి. అదేకోవలోనే 'మన పండుగలు' అను పుస్తకము కూడ పండుగలను గురించి విపులముగా చెప్పినది.
పండుగలను గురించి కొందరికి కొన్ని అభిప్రాయములుండ వచ్చును. అవి మేము చెప్పిన భావములతో ఏకీభవించక
పోవచ్చును. అటువంటపుడు మేము చెప్పినట్లు మీరు వినాలి అని మేము చెప్పడము లేదు. ఎవరికి ఏ
అభిప్రాయముండినా పరవాలేదు కానీ అది జీవితమును దైవత్వము వైపుకు నడిపించునదిగా ఉండవలెనని మాత్రము
చెప్పుచున్నాము. ఈ పుస్తకములో మేము చెప్పిన పండుగలన్నియు ఈ కాలములో ఉండినప్పటికీ వాటిలో భావమును
మాత్రము మార్చుకొమ్మని చెప్పాము. కానీ పండుగలను చేయవద్దని ఏమాత్రము చెప్పలేదు. కొన్ని ప్రాంతములలో
మేము చెప్పిన పండుగలుండవచ్చును, ఉండకపోవచ్చును. కొన్ని ప్రాంతములలో మేము చెప్పని పండుగలు కూడ
ఉండవచ్చును. మాకు తెలియని పండుగలను గురించి మేము చెప్పలేదు, తెలిసిన వాటిని మాత్రము చెప్పాము.
మేము చెప్పిన పండుగలన్నియు ఇందూ (హిందూ) సాంప్రదాయములకు సంబంధించినవి. కావున ఇతర మతస్థులు
వారి సాంప్రదాయములకు తగినట్లు పండుగలు చేసుకోవచ్చును. ఏది ఏమైన పండుగలో "పండు" అను పదమును
విశేషముగా తీసుకొని చూచినవాడు పండిన పండితుడు కాగలడని తెల్పుచు ముగిస్తున్నాము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.