౧౦౦, శతము, 100.
ఈ గ్రంథము పేరును మూడు సంఖ్యలుగా వ్రాశాము. గణిత
శాస్త్ర సంబంధముగా ఒకటి, రెండు సున్నాలను చూపడము జరిగినది.
గణితములో మూడు సంఖ్యలుగా యున్న పేరును తెలుగు అక్షరములలో
వంద, నూరు, శతము అని మూడు విధముల చెప్పవచ్చును. గణితములో
మూడు సంఖ్యలు ఉండుట వలన అదే పదమును తెలుగులో మూడు
అక్షరముల శతము అను పదమును తీసుకొందాము. తెలుగు భాషలో
శతము అనగా, గణిత సంఖ్యలో మూడు సంఖ్యలుగ యున్నది. ఇప్పుడు
మనము చెప్పుకోవలసినది ఆధ్యాత్మికము. కావున తెలుగులో శతము
గానీ, సంఖ్యలలో 100 గానీ ఈ గ్రంథము పేరు. శతము అను పదము
శాతము అను పదము నుండి పుట్టినది. శాతము అనగా నూరు భాగము
లుగా విభజింపబడినదియని అర్థము. తెలుగు అన్ని భాషలకంటే ముందు
పుట్టిన భాషయని ముందు నుండి చెప్పుచున్నాను. ప్రపంచములో ఒకరి
భావమును మరియొకరు తెలియుటకు భాష ఏర్పడినది. భావమును
అనుసరించి పుట్టినదానిని భాష అంటున్నాము. భావములను మనిషి
ఎన్ని భాషలలోనయినా చెప్పవచ్చును. భావముతో కూడుకొన్నది భాషగానీ
భావములేనిది భాష కాదు.
పూర్వము ఒక మనిషి తన ఉద్దేశ్యమును తెలుపుటకు చేతి సైగల
ద్వారా తెల్పెడివారు. అట్లే నటనల ద్వారా తెలిపెడివారు. ఎలా తెలిపినా
ఒక మనిషి యొక్క భావము ఇంకొక మనిషికి చేరుటకు కొంత కష్టముగా
ఉండేది. ఒక మనిషి తన భావమును నూటికి నూరు శాతము సైగల
ద్వారా తెలియజేస్తే అది ఎదుటి మనిషికి 20 నుండి 30 శాతము అర్థము
అయ్యేది. ఇంకా కొందరికి 20 నుండి 40 శాతము అర్థమయ్యేది. కొంత
తెలివైన వారికి 20 నుండి 50, 60, 70, 80 శాతము వరకు అర్థమయ్యేది.
చివరకు 20 శాతము అర్థమయ్యేది కాదు. అటువంటి పరిస్థితులలో
జంతువులను చూసి వాటివలె తాము కూడా శబ్దముతో భావమును
ప్రకటించాలని అనుకొన్నారు. ఒకరోజు కోతులు చెట్టుక్రింద పడిన
ఆకులను, గింజలను తినుకొంటూ అప్రమత్తముగా ఉన్నప్పుడు
గుంపులోని కోతి ఒకటి నాయకుడుగా ఉండి బయట ప్రమాదములను
గమనిస్తూయుండి, ఏదయినా ప్రమాదము అని తెలిసినప్పుడు నోటితో
గుర్మని శబ్దము చేస్తే, మిగతా కోతులన్నీ ఆ భావమును గ్రహించి వెంటనే
అక్కడ నుండి పారిపోయి చెట్టు ఎక్కి ప్రమాదము నుండి తప్పించుకోవడము
భాషలేని కాలములోనే మనిషి చూచాడు.
అంతేకాక కోడి తన పిల్లలకు ఆహారముంది ఇక్కడకు రండి అని
చెప్పుటకు ఒక రకముగా శబ్దము చేస్తే, ఆ శబ్దములోని భావమును
గ్రహించిన కోడిపిల్లలు వెంటనే తల్లియొద్దకు పరిగెత్తి పోవడము జరుగు
చుండును. అట్లే కోడి తన పిల్లలకు ప్రమాదమును గురించి తెల్పుటకు
పైన గద్దలు కనిపిస్తూనే ప్రమాదము అన్నట్లు మరియొక రకమైన శబ్దమును
చేయును. అప్పుడు ఆ శబ్ద భావమును గ్రహించిన కోడిపిల్లలు వెంటనే
తమకు దగ్గరగా యున్న రక్షణ స్థలములోనికి పారిపోవును. అప్పుడు
పిల్లలు తల్లివద్దకు రాలేవు. వాటికి దగ్గరగాయున్న చాటుకు పరుగెత్తి
గద్దకు కనిపించకుండా ఉండును. దీనినిబట్టి చూస్తే మనిషికంటే తెలివి
తక్కువవి అనుకొన్న జంతువులు, పక్షులు మనిషికంటే ముందే భాషను
కల్గియున్నాయనీ, భాషను నేర్చియున్నాయనీ తెలియుచున్నది. జంతువుల
కంటే, పక్షులకంటే తెలివైన మనిషికి భాష లేదు, భాష రాదు అనడము
సిగ్గుచేటుగా కనిపించి, అప్పుడు పశువులు, పక్షులవలె భాషను కల్గియుండ
వలెనను నిర్ణయానికి మనుషులు వచ్చారు. తమకు భాష అంటే ఏమిటో
తెలియని పరిస్థితులలో ఆధ్యాత్మిక ధ్యానములో ఉండే గురువువద్దకు పోయి
పశువులను, పక్షులను చూపించి వాటివలె తమకు భాష కావలెనని సైగల
ద్వారా తెలుపుకొన్నారు.
అప్పుడు ఆత్మజ్ఞానులయినవారు కొన్ని శబ్దములను చెప్పి, ఈ
శబ్దమునకు ఈ అర్థము అని అర్థమగునట్లు చేశారు. అలా మొదట
నేర్పిన లేక మొదట చెప్పిన శబ్దము “ఓం” మొదట అందరూ నేర్చిన
అక్షరము ఓం. ఓం అంటే దేవుడు అని మొదట అర్థమగునట్లు చేశారు.
తర్వాత ఆకాశమును చూపి “న” అని గుర్తు చూపారు. అట్లే “మ”
శబ్దమును చెప్పి గాలిని చూపించారు. తర్వాత అగ్ని, నీరు, భూమి
కనిపించునవే కావున వాటికి శి వా య అను మూడు అక్షరములను
చూపారు. పంచ భూతములయిన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి
అను వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దమును చెప్పి, ఆ శబ్దమునకు
తగినట్లు అప్పుడే లిపిని కూడా తయారు చేసి, ఐదు భూతములకు ఐదు
అక్షరములను తయారు చేసి, వీటికంటే మొట్టమొదట చెప్పిన “ఓం” ను
కూడా కలిపి చూపడమైనది. ప్రపంచములో మానవుడు మొట్టమొదట
నేర్చిన భాష తెలుగు భాష. ఆ తెలుగు భాషలో దేవున్ని “ఓం” గా చూపించి,
దాని తర్వాత మిగతా ఐదు అక్షరములను చూపించి వాటిని ప్రకృతికి
గుర్తుగా చెప్పారు.
ఇక్కడ బాగా గమనించితే ప్రకృతి అయిన ఐదు భాగములకు
పెద్దయని తెలియునట్లు, దేవునికి గుర్తుగా “ఓం” ని చూపారు. దీనిని
పద్ధతిగా వ్రాస్తే “ఓమ్” అని ఉంటుంది. మిగతా ప్రకృతియైన ఐదు
భూతములకు న, మ, శి, వా, య అని గుర్తులు కలవు. పంచభూతములకు
ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరమును ఉంచగా దేవుని గుర్తుకు మాత్రము
రెండు అక్షరములతో కూడిన (సంయుక్తాక్షరమైన) ఓమన్ను ఉంచడము
జరిగినది. అట్లుంచడములో పంచ భూతములన్నీ దేవునికి తక్కువ అన్నట్లు
ఒక అక్షరముతో చూపించారు. దేవుడు వీటికంటే పెద్దయగుట వలన
వాటికంటే అధికముగా రెండు అక్షరములు కలసిన అక్షరమును చూపడ
మైనది. ఈ విధముగా తెలుగు భాషా ప్రస్థానము దేవుడు, ప్రకృతితో
మొదలయినది. ఆ రోజు చెప్పినవారు ఆత్మజ్ఞానమును తెలిసిన ఆధ్యాత్మిక
వేత్తలయిన దానివలన మొదట దేవుని విధానములోని బీజాక్షరములను
నేర్పి, తర్వాత వాటివలన తయారయిన మిగతా భాషను నేర్పడము జరిగినది.
అందువలన తెలుగు భాషలో ప్రతి పదము భావయుక్తమైన అర్థము
కల్గియుండును. తర్వాత తయారయిన మిగతా భాషలలో పదములో భావము
ఇమిడియుండదు. తెలుగులో అట్లుకాకుండా ప్రతి శబ్దము ఆధ్యాత్మిక
భావమునకు దగ్గరగాయుండును.
భావము అను పదము నుండి పుట్టిన పేరే భాష. అందువలన
మొదట పుట్టిన తెలుగు భాష భావముతో ముడిపడియుండును. తెలుగు
భాషలో అన్ని పదములు, అన్ని శబ్దములు ఆధ్యాత్మికమునకు దగ్గర
సంబంధము కల్గియుండును. మనిషిలో ఆత్మజ్ఞానము కల్గుకొలది తెలుగు
భాష యొక్క మాధుర్యము తెలియును. తెలుగు భాష దేవునికి ఎంత
దగ్గరగా యున్నదో తెలియును. తెలుగు భాష వలననే ఆత్మ విషయము
(దేవుని విషయము) తెలియును అనునట్లు మొదటనే 'ఓం నమశివాయ'
అను ఆరు అక్షరములను నేర్పించారు. అంతేకాక ప్రకృతికి సంబంధించిన
పంచ భూతములకు నాశనము కానివాడు దేవుడు అన్నట్లు, మొదట
రెండు శబ్దములతో కూడిన సంయుక్తాక్షరమును పెట్టారు. అట్లు పెట్టిన
'ఓమ్' ను 'పంచాక్షరి' అని అన్నారు. పంచాక్షరి అనగా! ఐదుకు నాశనము
కానిదియని అర్థము. అనగా పంచభూతములకు నాశనము కానివాడు
దేవుడు అని అర్థము. పంచ అనగా ఐదు అనియు, అక్షరీ అనగా నాశనము
కానిదని అర్థము. ఇట్లు ఓమ్ నమశివాయ అను మొదట నేర్పిన వాటిలో
అర్థముండగా, మిగతా భాషలలో కూడా లోతుగా చూస్తే అంతో ఇంతో
ఆధ్యాత్మికమే కనిపించును. ఓమ్ అను శబ్దము మొదట పుట్టినది కావున
దానిని ప్రథమ అక్షరమనేవారు. ప్రథమ అక్షరము కాలక్రమమున
కొంతమార్పు చెంది ప్రణవ అక్షరముగా మారిపోయినది. ఎక్కడయినా
ప్రణవ అక్షరము అంటే అది ప్రథమ అక్షరముగా మీరు లెక్కించుకోండి.
ఓమ్ అనేది దేవుడు అయితే మిగతా ఐదు అక్షరములు జీవులు
అని అర్థము. జీవులను భూతములు అని చెప్పెడివారు. మొదట తెలుగు
భాష ప్రారంభములో ఆత్మకు (దేవునికి) గుర్తయిన ఓమ్ ను దేవుడు
పుట్టించాడు. తర్వాత ఐదు ముఖ్యమైన మహా జీవులను పుట్టించాడు.
మహా భూతములు, భూతములు అనునవి రెండు రకములు గలవు. మహా
భూతములనగా భూతములకు ఆధారమైనవని అర్థము. ఆ మహా భూతములే
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ ఐదు మనుషులవలె ఉండు
జీవులు కావు. జీవులకు పెద్ద అయిన అనగా మనుషులకు మరియు
సమస్త జీవరాసులకు పెద్ద అయిన ఆత్మను (దేవున్ని) అట్లే సమస్త జీవ
రాసులకు ఆధారమైన మహాభూతములను దేవుడు ప్రజలకు తెలియునట్లు
ఓమ్, న, మ, శి, వా, య అను అక్షర రూపములో పుట్టించాడు. తెలుగు
భాష మిగతా అన్ని భాషలలాంటిది కాదు. దైవజ్ఞానమును తన వెంట
పెట్టుకొని పుట్టిన భాషయని చెప్పవచ్చును. నేను చెప్పునది మీకు
అర్థమవుతూవుంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చి తీరవలెను. అలా
ఏదయినా ప్రశ్నను మీరు అడిగితే మీకు నేను చెప్పునది అర్థమవుతూ
ఉందని అనుకుంటాను. మీరు ప్రశ్న అడగలేకపోతే ఇప్పుడు నేను చెప్పినది
అర్థము కాలేదు అని అనుకుంటాను.
ప్రశ్న :- స్వామీ! మీరు చెప్పునది అరటిపండు వలిచి ఇచ్చి
నట్లున్నది. ఇంకా అర్థము కాలేదు అంటే మా అంత అజ్ఞానులే
ఉండరు. మాకు బాగా అర్థమయినది. ఇప్పుడు అడుగవలసిన
ప్రశ్న కూడా వెంటనే మాకు స్ఫురణకు వచ్చినది. అది ఏమనగా!
ఓమ్ అనే దేవున్ని తర్వాత ముఖ్యమైన జీవులను పుట్టించినవాడు
ఎవడు? దేవుడు అనగా ఓమ్ రూపములో పుట్టాడని, ఆ దేవుడే
జీవరాసులకు పెద్దయని చెప్పారు కదా! తర్వాత ఇంకొక దేవుడు
లేడు కదా! ప్రపంచానికి ఉన్నది ఒకే దేవుడయినప్పుడు ఆ
దేవున్ని, పంచభూతములను ఎవరు సృష్టించారు అని అడుగు
చున్నాను. ఇది ప్రపంచములో ఎవరికయినా వచ్చు ప్రశ్నయే
అగుటవలన మీరు చెప్పు జవాబు ప్రపంచమునకు జవాబు
కాగలదు.
జవాబు :- సందర్భమును బట్టి అడుగవలసిన ప్రశ్ననే అడిగావు. ఇప్పుడు
చెప్పబోయే జ్ఞానమును కూడా బాగా అర్థము చేసుకోమని చెప్పుచున్నాను.
సృష్ట్యాదిలో జరిగిన విధానము తెలుగు భాష పుట్టుకలో వచ్చినది.
సృష్ట్యాదిలో మొదట పంచభూతములయిన ప్రకృతిని తయారు చేసినవాడు
దేవుడే. అట్లే పంచభూతములతో పాటు దేవున్ని కూడా సృష్టించాడు. ఆ
దేవునికి గుర్తుగా ఓమ్ అను అక్షరమును శబ్దముతో తయారు చేశాడు.
అట్లే పంచ భూతములయిన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిని తయారు
చేసి, వాటికి వేరు శబ్దములను సృష్టించి వేరు అక్షరములుగా దేవుడే చూపాడు.
అయితే ప్రపంచమయిన పంచ భూతములను సృష్టించినవాడే వాటికి
పెద్దయిన దేవున్ని సృష్టించాడు అని చెప్పాము. అంటే సృష్ఠింపబడిన
వారు ఐదు మహా భూతములు మరియు వాటికి పెద్దయిన దేవుడు అని
చెప్పడము జరిగినది. అయితే దేవున్ని మరియు పంచ మహా భూతములను
తయారు చేసినవానిని ఏమనాలి? అతడు ఎవరు? అతని పేరు ఏమి?
అతని ఆకారము ఎట్లున్నది? అతని పని ఏమి? అని ప్రశ్నించుకొని చూస్తే
దానికి జవాబు ఈ విధముగా కలదు.
దేవుడు మరియు జీవులు అను వారు సృష్టించబడినారు. అయితే
సృష్టించిన సృష్టికర్త ఎవరు? అనగా ఆయనకు పేరు లేదు, ఆకారము
అంతకూ లేదు. ఏ పనీ చేయనివాడు. దీనినిబట్టి రూప, నామ, క్రియలు
లేనివాడు అని చెప్పవచ్చును. ఆయనే ఐదు ముఖ్యమైన జీవుళ్ళను, వారికి
దేవుడయిన వానిని సృష్టించాడు. ఆయనకు పేరు లేదు కావున అతనిని
సృష్టికర్త అని అంటాము. అయితే పని చేయనివాడు అని అన్నారు కదా!
సృష్ఠి అనే పనిని ఎలా చేశాడు అని కొందరు అడుగవచ్చును. దానికి
జవాబు ఏమనగా! ప్రపంచము లేకముందు ఆయన ఆ పనిని చేశాడు.
తర్వాత జీవరాసులు, ప్రపంచము, వాటికి దేవుడు అన్నీ వచ్చిన తర్వాత
సృష్టికర్తయిన ఆయన ఒక్క పనిని కూడా చేయలేదు. అందువలన ఆయనను
పనిలేనివాడు యని చెప్ప వచ్చును. మనకు దేవుడయిన వానిని సృష్టించిన
వానిని ఏమని పిలువాలి అంటే దానికి ఒక మార్గము ఉంది. ఎవరికీ
తెలియబడనివానిని, వెతకబడే వానిని అనగా దేవులాడబడే వానిని దేవుడు
అని అనవచ్చును. ముందు పంచభూతములతోపాటు పుట్టినవాడు కూడా
తెలియబడేవాడు కాదు, కావున ఆయనను దేవుడు అని అంటున్నాము.
ఈ లెక్కప్రకారము మనకు ఇద్దరు దేవుళ్ళు అవుతారు. ఒక దేవుడు
సృష్ఠించాడు, ఇంకొక దేవుడు సృష్టించబడినాడు అని తెలియుచున్నది.
సృష్ఠించబడిన దేవుడు, సృష్ఠించిన దేవుడు ఇద్దరిలో సృష్టించిన
వాడు పెద్దయని, సృష్ఠింపబడినవాడు చిన్నయని తెలియుచున్నది. సృష్ఠింప
బడినవానికి సృష్టించినవాడు తండ్రియగును. అందువలన సృష్టింప
బడినవానిని కుమారుడుయనీ, సృష్టించినవానిని తండ్రియనీ ఇంజీలు
గ్రంథములో పేర్కొన్నారు. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీత (తౌరాతు)
లో చూస్తే సృష్టింపబడిన దేవున్ని ఆత్మయనీ, సృష్టించిన దేవున్ని పరమాత్మ
యనీ అన్నాడు. పరమాత్మయనునది పేరు కాదు. ఆత్మకంటే వేరుగా,
(ఆత్మకంటే పరముగా) యున్నది పరమాత్మయని తెలియునట్లు చెప్పారు.
ఆత్మ అను దేవున్ని సృష్టించిన తర్వాత పరమాత్మ అను ఆయన ఏ పనినీ
చేయలేదు. చేయవలసిన పనులన్నిటినీ తన కుమారుడైన ఆత్మకే అప్ప
జెప్పాడు. అప్పటి నుండి ఆత్మే అన్ని కార్యములను చేయుచున్నది. పరమాత్మ
ఏమీ చేయక సాక్షిగా చూస్తూయున్నాడు.
అప్పటి నుండి పరమాత్మ తండ్రి అప్పజెప్పిన పనులు కుమారుడైన
ఆత్మ చేస్తూ వస్తున్నాడు. ప్రపంచములో నిత్యము పుట్టు జీవరాసులను
ఆత్మే పుట్టించుచున్నది. ఆత్మే పోషిస్తున్నది. చివరకు ఆత్మే చంపుచున్నది.
అలా చనిపోయినవానిని పాపపుణ్యములను లెక్కవేసి, వానిని వాని
కర్మప్రకారము ఆత్మే పుట్టించుచున్నది. ఏ జీవుడు ఏ జన్మకు పోవాలను
నిర్ణయము (తీర్పు) చేసి ఆత్మే పంపుచున్నది. ఈ విధముగా పరమాత్మ
చేయవలసిన పనులన్నిటినీ ఆత్మే చేయుచున్నది. అట్లే ఆత్మ సర్వ
జీవరాసులకు దేవుడుగా యున్నది. జీవరాసులకు సృష్టికర్త అయినవాడు
ఆత్మే కావున ఆత్మ అందరికీ దేవుడుగా యున్నాడు. ఆత్మగా యుండి
నిన్ను పుట్టించువానిని, పోషించువానిని, మరణింప చేయువానిని దేవునిగా
అందరూ ఆరాధించవలెను. అతడు ఒక్కడే మనుషులకు ఆరాధ్య దైవము.
అందువలన వేరే దేవున్ని ఆరాధించకూడదనీ అంతిమ దైవ గ్రంథము
ఖుర్ఆన్లో కూడా చెప్పియున్నారు. ఇదే విషయమునే ద్వితీయ దైవ
గ్రంథము యోహాన్ సువార్త ఐదవ అధ్యాయమునందు 19 నుండి 27వ
వాక్యము వరకు చూడుము.
(19) తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదేకాని
తనంతట తాను ఏదీ చేయనేరడు. ఆయన వేటిని చేయునో
వాటినే కుమారుడును అలాగే చేయును.
(20) తండ్రి కుమారున్ని ప్రేమించుచూ, తాను చేయు
కార్యములనెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడు
నట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
(21) తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే
కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును.
(22) తండ్రి ఎవనికి తీర్పు తీర్చడుగానీ, తీర్పు తీర్చుటకు
సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు.
(23) తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని
ఘనపరచవలెనని, కుమారుని ఘనపరచనివాడు ఆయనను
పంపిన తండ్రిని ఘనపరచడు.
(24) నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాస
ముంచువాడు నిత్య జీవముగలవాడు. వాడు తీర్పులోనికి రాక
మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో
నిశ్చయముగా చెప్పచున్నాను.
(25) మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ
వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు
జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
(26) తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై
యున్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము
గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అను
గ్రహించెను.
(27) మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు
తీర్పుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.
ఆధ్యాత్మిక జ్ఞానమునకు అనుసంధానము చేసి, ఆధ్యాత్మికవేత్తల
చేత తెలుగు భాష చెప్పబడినది. అందువలన మొదట ప్రథమాక్షరమును
తర్వాత పంచభూతముల అక్షరములను దేవుడు సృష్టించాడని తెలియునట్లు
తెలుగు భాష మొదటిలో ఓమ్ న, మ, శి, వా య అని వ్రాసుకొనెడి
వారము. ఈ మధ్య కాలములో చరిత్ర తెలియని మనుషులు వచ్చి, తెలుగు
భాషలోయున్న మొదటి ఆరు అక్షరములను తీసివేసి అచ్చులు, హల్లులు
అను అక్షరముల నుండి అనగా అ ఆ ల నుండి చెప్పుచున్నారు. అందువలన
నేడు ప్రజలలో ఆధ్యాత్మికమే లేకుండా పోయినది. మొదటి అక్షరముల
జ్ఞానమే లేకుండా పోయినది.
తెలుగు భాషను తయారు చేయడములో ఆధ్యాత్మికవేత్తలు
ప్రకటించిన అక్షర జ్ఞానము ప్రకారము, అనగా ఓమ్ నమశివాయ అను
దాని ప్రకారము దేవుడయిన ఆత్మ, మహా జీవులయిన ప్రకృతి భాగములు
ఐదు పుట్టినవని తెలిసినది. తర్వాత మిగతా అక్షరములు అన్నీ
తయారయినవి. పరమాత్మయను పేరులేని దేవుడు, ఆత్మ అను దేవున్ని
మరియు జీవరూపమైన ప్రకృతి భాగములను తయారు చేసి, అప్పటి నుండి
తాను ఏమీ పని చేయక క్రియారహితుడుగా ఉండిపోయాడు. దీనినిబట్టి
చూస్తే సృష్ఠి ఆదిలోని కొంత రహస్యము తెలియడమేకాక, ఓమ్ నమ
శివాయ ఒక భాగముగా యుండి తర్వాత అచ్చులు, హల్లులు అనునవి
తయారయినవి. అచ్చులు అనగా అ, ఆ, ఇ, ఈ నుండి అం, అః వరకు
ఉండునవి. తర్వాత హల్లులు క, ఖ నుండి మొదలై య, ర, ల, వ నుండి
ళ, క్ష, ఱ వరకు ఉండును.
తెలుగు భాషను మూడు రకములుగా విభజించి మన తత్త్వవేత్త
లయిన వారు చెప్పారు. మొదట చెప్పిన ప్రథమ అక్షరము ఆత్మయిన
దేవుడుకాగా, మిగతా న, మ, శి, వా, య ప్రకృతి శక్తులుగా యున్నవి.
ఆత్మ, ప్రకృతి రెండూ ఉన్నత స్థానములో యున్నట్లు ఈ ఆరు అక్షరములు
మొదట వ్రాసి తర్వాత అచ్చులు అనేవాటిని వ్రాస్తారు. అచ్చులు మొత్తము
18 గలవు. ఈ అచ్చులు 18 కాగా, 1+8 కలిపితే 9 అవుతున్నది.
1+8=9 దీనినిబట్టి రెండవ వరుసలో యున్న 18 అక్షరములు సంపూర్ణ
జ్ఞానులుగా యున్న జీవరాసులకు గుర్తుగా యున్నది. వాటి మొత్తము
తొమ్మిది అయినదానివలన జ్ఞానము గల జీవుల గుంపుగా లెక్కించు
చున్నాము. తర్వాత వరుసలో క ఖ నుండి ప ఫ బ భ మ వరకు మొత్తము
27 అక్షరములు గలవు. వీటి సంఖ్యను కూడా కలిపితే తొమ్మిదే వచ్చును.
అందువలన ఈ గుంపును భక్తి మార్గములో యున్నవారిగా చెప్పవచ్చును.
తర్వాత నాల్గవ వరుసలో య ర ల వ నుండి ళ క్ష ఱ అను పదకొండు
అక్షరములు గలవు. ఈ గుంపు అక్షరములను పూర్తి అజ్ఞానులుగా,
నాస్తికులుగా చెప్పవచ్చును.
ఈ విధముగా ఆధ్యాత్మికవేత్తలయినవారు పూర్వము తెలుగు
అక్షరములను నాలుగు గుంపులుగా తయారు చేశారు.
1) మొదటి గుంపు 1+5 ను ఒకటి ఆత్మయనీ, ఐదు మహా జీవులనీ చెప్పారు.
2) రెండవ గుంపు అచ్చులు 18. 1+8=9 వీటిని పూర్తి జ్ఞానులుగా చెప్పారు.
3) మూడవ గుంపు హల్లులు 27. 2+7 = 9 వీటిని భక్తులుగా చెప్పారు.
( చీ జే ఈ రెండు హల్లులు పూర్వము ఉండేటివి. ఇప్పుడు కాలగర్భములో
కలిసిపోనవి.)
4) నాల్గవ గుంపులో 11. 1+1=2 వీటిని పూర్తి అజ్ఞానులుగా చెప్పారు.
భూమిమీద పుట్టిన మనుషులలో జ్ఞానమును, అజ్ఞానమును
సూచించుచూ 1) ఆత్మ జ్ఞానులు 2) భక్తులు 3) అజ్ఞానులుగా గుర్తుండు
నట్లు చేశారు. వాటన్నిటికీ పెద్ద దేవుడు, ప్రకృతియని తెలుపుచూ ప్రత్యేక
భాగముగా 1+5 ఆరు అక్షరములను తయారు చేశారు. అందులో ఒకటి
దేవుడయిన ఆత్మ. రెండవ గుంపు ప్రకృతియైన ఐదు మహా భూతములు
అని చెప్పారు. ఈ విధముగా దేవుడు, ప్రకృతిని, మనుషులను తయారు
చేయడమేకాక, మనుషులలో జ్ఞానులు, భక్తులు, అజ్ఞానులు అని మూడు
రకములుగా ఉన్నారని తెలియునట్లు తెలుగు అక్షరములను తయారు చేసి
చూపారు. ఈ విధానము ప్రపంచములో ఏ భాషలోను లేదు. ప్రపంచములో
మొట్టమొదట పుట్టిన భాషగా తెలుగు భాష ఉండడమేకాక దైవ జ్ఞానముతో
కూడుకొన్న ఏకైక భాషగా తెలుగుభాష ఉన్నదని చెప్పవచ్చును. ఈ మధ్య
కాలములో చరిత్ర తెలియని కొందరు మేము పండితులమను అహము
చేత ఎంతో అర్థముతో కూడుకొన్న అక్షరములలో కొన్నిటిని తొలగించి
అర్థరహితము చేశారు.
ఏది ఏమయినా పూర్వము అక్షరములను తెలుగు భాషగా తయారు
చేసి, తెలుగు భాష ఆధ్యాత్మిక భావముతో యున్నదని తెలియజేశారు.
ఇంతవరకు మనము తెలుసుకొన్న భాషలో ఆత్మదేవున్ని, ఐదు ప్రకృతి
భాగములను, సర్వజీవరాసులను పరమాత్మయను దేవుడు సృష్టించాడని
తెలియుచున్నది. ప్రథమ దైవ గ్రంథమయిన తౌరాతులో అనగా భగవద్గీతలో
ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మూడు యున్నట్లు తెలియుచున్నది. భగవద్గీత
జ్ఞానమే బైబిలులో యున్నది. అక్కడ చూచిన ప్రకారము పరమాత్మను
వారు పరిశుద్ధాత్మయని చెప్పుచున్నారు. పరిశుద్ధాత్మకు ఆత్మ కుమారుడుగా
యున్నాడని, కుమారుడైన ఆత్మ సర్వజీవరాసులను సృష్టించుచూ, మరణింప
జేయుచూ, తీర్పుతీర్చి మరుజన్మకు పంపుచున్నదనీ, అటువంటి ఆత్మనే
మనుషులు ఆరాధించవలెననీ పరమాత్మ అయిన దేవుడు చెప్పియున్నాడు.
దీనినిబట్టి మనకు (మనుషులకు) తండ్రి ఆత్మ యనియు, ఆత్మకు తండ్రి
పరమాత్మ (పరిశుద్ధాత్మ) యనియు తెలియుచున్నది. ఈ విధముగా
లెక్కించితే పరమాత్మ మనకు తాతగా యున్నాడనీ, తాతకు మనకు మధ్యలో
తండ్రియైన ఆత్మ ఉన్నాడనీ, పరిశుద్ధాత్మయిన అనగా పరమాత్మయిన దేవుని
వద్దకు (మోక్షమునకు) చేరాలంటే తండ్రి ద్వారానే పోవాలని తెలియు
చున్నది. అందువలన పరమాత్మయిన దేవున్ని తెలియాలంటే ఆత్మయిన
దేవున్ని తెలియవలసిందే. ఆత్మను తెలియడము లేక ఆత్మను అధ్యాయనము
చేయడమును ఆధ్యాత్మికము అంటున్నాము. ఆధ్యాత్మికమును తెలియనిదే
ఎవడుగానీ మోక్షమును చేరలేడు. ఏ జీవుడయినాగానీ మొదట ఆత్మను
తెలియగలిగినప్పుడే తర్వాత పరమాత్మను తెలియవచ్చును. ఆత్మను
తెలియుటకంటే ముందు ప్రకృతి వలన తయారయిన మాయను తెలియ
వలసి యుంటుంది.
ప్రకృతి జనితమైన మాయను తెలియాలంటే ముందు తాను ఎవరో
తెలియాలి. ఎందుకనగా! జీవుడే మోక్షమునకు పోవలసియున్నది.
అందువలన జీవుడయిన తనవద్ద నుండి మొదలు పెట్టి గమ్యమయిన
పరమాత్మ వద్దకు చేరవలసియుంటుంది. గమ్యము పరమాత్మ (మోక్షము)
అయితే ప్రారంభ స్థలము జీవాత్మయని తెలియవలెను. ప్రారంభము నుండి
మొదట తనను తాను (జీవాత్మను) తెలియవలెను, జీవాత్మ తర్వాత మాయను
తెలియ వలెను, తర్వాత ఆత్మను తెలియాలి. ఆ తర్వాత పరమాత్మ
తెలియబడును. దానినే మోక్షము అనియు, దానినే పరలోకము అనియు,
దానినే ముక్తి అనియు అనేక విధముల చెప్పుచున్నారు. జీవుడు తన
స్థలము నుండి ప్రారంభమయి జ్ఞానమార్గములో ప్రయాణించాలి. గమ్య
స్థానము చివరిగా పరమాత్మకాగా, మధ్యలో దాటవలసిన ఊర్లు రెండు
గలవు. ఒకటి మాయ, రెండు ఆత్మ. ఈ రెండిటిని చూడగలిగి, ఈ
రెండిటిని దాటగలిగితే అప్పుడు ముక్తి అయిన పరమాత్మను పొందవచ్చు.
అలా పొందినప్పుడు ఆ జీవుడు తిరిగి పుట్టడు. ఆత్మ చేతిలో ఉన్నంతవరకు
జన్మలు ఎత్తుచుండవలెను. అట్లే మాయను దాటనంతవరకు మనిషికి
కష్టసుఖములు తప్పవు. ఎప్పుడయితే మనిషి శరీరములో యున్న జీవాత్మ
మాయను దాటి ఆత్మను అర్థము చేసుకొని, ఆత్మను దాటి ముందుకు పోతే
ముక్తి దొరుకుతుంది. అదే చివరి గమ్యమవుతుంది.
ఈ విధానమంతయు తెలియుటకు తెలుగు భాషలో ఒక గుంపుగా
యున్న ఆరు (6) అక్షరములను, అట్లే రెండవ గుంపులో యున్న పదునెనిమిది
(18) అక్షరములను, మూడవగుంపుగా యున్న ఇరువది ఏడు (27)
అక్షరములను, చివరి నాల్గవగుంపుగా యున్న పదకొండు (11) అక్షరము
లను తెలియవలసి యున్నది. అలా తెలిసినప్పుడే తెలుగు భాష తెలియును.
తెలుగు భాష మనిషికి జ్ఞాన సందేశముగా యున్నది. తెలుగు భాష మనిషిని
ఆలోచింపజేసి, ముక్తి మార్గములో ముందుకు పోవుటకు అవకాశమును
ఇచ్చుచున్నది. అయితే మనిషి తెలుగు భాషను నేర్చినప్పటికీ దానిలో
ఇమిడియున్న ఆధ్యాత్మిక భావమును తెలియలేకున్నాడు. అందువలన
భాషలో ఇమిడియున్న కొన్ని పదములు మిమ్ములను జ్ఞానమార్గములో
నడిపించి, మూడు ఆత్మలను గురించి తెలియజేయును. మూడవ ఆత్మయిన
పరమాత్మ అంతుచిక్కనిది, ఎవరికీ తెలియనిది అని సూచించునట్లున్న
పదములను ఇప్పుడు చూస్తాము.
మనిషికి దగ్గరగా కొందరే యుంటారు. వారిని కుటుంబ సభ్యులు
అంటాము. మనిషితో ఎక్కువగా సంబంధ బాంధవ్యములను కల్గియున్న
వారు కొందరుంటారు. వారిలో కొందరిని చెప్పుకొంటే మగవారిలో
నలుగురిని, ఆడవారిలో నలుగురిని చూపుచూ వారిని ఇట్లు చెప్పారు.
అమ్మ అను పదము అందరికీ తెలిసినదే. అమ్మలేని మనిషి భూమిమీద
ఉండడు. చిన్నవయస్సులో శిశువుగా యున్నప్పుడు మొదట చెప్పు పదము
అనగా బాలుని నోటికి వచ్చు మొదటి భాషా పదము అమ్మ, లేకపోతే
అత్త. అమ్మ అనిగానీ, అత్త అనిగానీ చిన్నవయస్సులో పదములలో ఎంతో
జ్ఞానము ఇమిడి యున్నది. దాని వివరము చూస్తే ఇలా కలదు.
అమ్మ, అత్త, అక్క, అవ్వ ఈ నాలుగు పదములు మొదట మనిషి
చేత ఉచ్ఛరింపజేయుచున్నారు. కొంత పెద్దయిన తర్వాత అన్న, అప్ప,
అయ్య, అబ్బ అను పదములను నేర్చి చెప్పుచున్నాము. ఈ ఎనిమిది
పదములు మనిషి సులభముగా పలుకు పలుకులుగా యున్నవి. ఇందులో
అనగా ఈ పదములలో గమనించితే మొదట అన్ని పదములకు “అ”
అను అక్షరము సాధారణముగా యున్నది. తర్వాత రెండవ అక్షరమును
చూస్తే అమ్మలో మ అను అక్షరమునకు మ వత్తు ఉండడము విశేషము.
అట్లే రెండవ అక్షరముగా యున్న అమ్మ, అక్క, అవ్వ, అత్తలో ఏ దానికది
దాని వత్తులే చెప్పబడి యున్నాయి. స్త్రీలకు చెప్పిన అమ్మ, అత్త, అక్క,
అవ్వలో అలాగే ఉండడమేకాక, పురుషులకు చెప్పిన అన్న, అయ్య, అప్ప,
అబ్బలో కూడా అట్లే ఉన్నాయి. భాషను తయారు చేసిన ఆధ్యాత్మికవేత్తలు
అలా ఎందుకు తయారు చేశారు అనగా! మనుషులు ఈ పదాలను
గురించి ఆలోచిస్తే దాని మూలముగా కొంత ఆత్మల జ్ఞానము తెలియునని
వారి ఉద్దేశ్యమై యున్నది. వారి ఉద్దేశ్యమును తెలియుటకు ముందు ఒక
పదమును తీసుకొని చూస్తాము.
అమ్మ అను శబ్దములో ఉన్న మొదటి అక్షరము అయిన అ యొక్క
అర్థము లేదు, కాదు అని గలదు. బద్దము అనగా సక్రమమైనది, సత్యమైనది
అని తెలియుచున్నది. అటువంటి బద్దము అను పదమునకు అ ను చేర్చితే
బద్దము కానిది అబద్దము అని తెలియుచున్నది. సత్యమునకు అ ను
చేర్చితే అది అసత్యముగా మారిపోవుచున్నది. విశ్వాసము అనగా నమ్మకము
అని అందరికి తెలుసు. ఆ పదమునకు అ అను శబ్దమును చేర్చితే అది
కాస్తా అవిశ్వాసము అయిపోవును. నమ్మకము లేదు అన్నట్లు అగును.
వివేకము అనగా తెలివి అని అర్థము గలదు. దానికి అ ను చేర్చితే
అవివేకము అగును. అప్పుడు తెలివిలేదు అని అర్థము వచ్చుచున్నది.
ఇట్లు ఎన్నో పదముల ముందర అ ను ఉపయోగించి, ఆ పదమునకు
వ్యతిరేఖ భావమును వచ్చునట్లు చేయుచున్నారు. కొన్ని పదములను చూస్తే
ఇలా కలవు. వ్యక్తము అనగా తెలియునది లేక కనిపించునది అని అర్థము
కలదు అయితే దానికి అ ను చేర్చితే అవ్యక్తము అగుచున్నది. అప్పుడు
తెలియనిది, కనిపించనిది అని వ్యతిరేఖ భావము వచ్చుచున్నది. అట్లే
శ్రద్ధకు అశ్రద్ధ అనియు, జ్ఞానమునకు అజ్ఞానమనియు, ద్వైతమునకు
అద్వైతమనియు, మృతము అనుటకు అమృతము అనియు, నిశ్చయమునకు
అనిశ్చయము అనియు, సంశయమునకు అసంశయము అనియు క్షరము
నకు అక్షరము అనియు, ప్రతిష్టకు అప్రతిష్ట అనియు, ఏకమునకు అనేకము
అనియు చెప్పడము వలన వాటికి పూర్తి వ్యతిరేఖ భావము వచ్చుచున్నది.
ఇటువంటి శక్తిగల అనగా అర్థముగల “అ” అను అక్షరమును
చేర్చి ప్రక్కన అమ్మయనీ, అత్తయనీ, అవ్వయనీ, అక్కయనీ చెప్పడములో
అర్థమును చూస్తే ఇలా కలదు. ఇంతవరకు అ అను శబ్దమునకు ఎంత
భావమున్నదో తెలిసిపోయినది. ఇప్పుడు మ అను అక్షరమునకు మ వత్తే
యుండడము వలన ఒక అక్షరములో రెండు అక్షరములు కలిసియున్నట్లు
తెలియుచున్నది. అట్లే క్క, వ్వ, త్తా అను అక్షరములు కూడా రెండు
అక్షరములు కలిసియున్న యుక్తాక్షరములుగా యున్నవి. ఇందులో ఏ
అక్షరమున్నా అదే అక్షరముగా దాని వత్తే ఉండడములో విశేష అర్థము
కలదు. అన్య అనుటలో న కు వేరే య వత్తు కలిసినది. ఇక్కడ అట్లుకాక
వ్వ కు వ వత్తే, క్క కు క వత్తే, త్త కు త వత్తే ఉండడము వలన ఆనాటి
ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు అలా ఉంచారని ఆలోచిస్తే దానికి సమాధానము
ఈ విధముగా దొరుకుచున్నది.
మనిషి శరీరములో దేవుడయిన ఆత్మ కలదు. ఆత్మే శరీరము
అంతయూ ఆక్రమించుకొని శరీరములో మొదటి ఆత్మగా కనిపించుచున్నది.
ఆత్మ చేత పుట్టినది జీవాత్మ. జీవాత్మ శరీరములో ఒకచోట కదలక మెదలక
యున్నది. ఆత్మ చాటున యున్న జీవాత్మను చిన్న ఆత్మ అనియు, ఆత్మకు
పుట్టినదనియు చెప్పుచున్నాము. అట్లే ఇప్పుడు రెండు శబ్దములు కలిసియున్న
మ్మ ను తీసుకొని చూస్తే మ మొదటి ఆత్మగా యుండగా, జీవాత్మ కూడా
శరీరములో రెండవ ఆత్మగా, ఆత్మ వెనుకయున్నది. అందువలన ఇప్పుడు
అమ్మలో మ ను ఆత్మగా చెప్పితే, జీవాత్మను మ వత్తుగా చెప్పవచ్చును. మ
కు మకార వత్తే యుండుట వలన మ ఆత్మకాగా, మకార వత్తు జీవాత్మగా
రెండు ఆత్మలను సంయుక్తాక్షరముగా యున్న మ్మ గానీ, వ్వ గానీ, త్త గానీ,
క్కగానీ తెలియజేయుచున్నవి. ఈ విధముగా సూచన చేయు యుక్తాక్షరము
ముందర అ ఉండుట వలన ఆత్మ, జీవాత్మ రెండూ కాదు నేను ముఖ్యము
అని చెప్పినట్లు కలదు. వాస్తవముగా శరీరములో ఆత్మ, జీవాత్మలు రెండూ
యున్నా, సర్వకార్యములను ఆత్మే చేయుచున్నా, అవి కాదు నేను ఉన్నాను
అన్నట్లు తెలియజేయు పరమాత్మగా అ అను శబ్దమును పోల్చుకోవాలి.
అప్పుడు మనిషి శరీరములో మూడు ఆత్మలు ఉన్నట్లు తెలియుచున్నది.
మూడు ఆత్మలను తెలియడమే త్రైతము అంటాము. అందువలన అమ్మ
అను పదములో
29వ పేజీలో చిత్రములు చూడండి.
ఈ విధముగా ఒక పదములో మూడు అక్షర శబ్దములున్నట్లు,
ఒక శరీరములో మూడు ఆత్మలున్నట్లు చెప్పవచ్చును. స్త్రీలయందుగానీ,
పురుషులయందు గానీ శరీరములలో ఇదే విధముగా మూడు ఆత్మలున్న
వని తెలియునట్లు అమ్మ, అక్క, అత్త, అవ్వ అని స్త్రీలను చెప్పియున్నారు.
అట్లే అన్న, అప్ప, అయ్య, అబ్బ యని పురుషులను కూడా చెప్పియున్నారు.
దీనినిబట్టి తెలుగు భాషా పదములలో మనము నిత్యము పలుకు పదములలో
ఇంత జ్ఞానమును తెలియునట్లు మన పెద్దలు తెలుగు భాషను తయారు
చేశారు.
తెలుగు భాష తర్వాత ఎన్నో భాషలు తయారయినాయి. అయినా
వాటిలో భావమును తెలియు పదములే గలవు గానీ, ఆత్మ జ్ఞానమును
తెలియు సారాంశము లేదు. ఈ విధముగా తెలుగు గడ్డలో పుట్టి, తెలుగు
నేర్చినవారు కొంత ఆలోచిస్తే ఈ భాషలో ఇమిడియున్న జ్ఞానము
తెలియగలదు. అందువలన తెలుగు భాషను దైవభాషగా నేను ముందే
చెప్పియున్నాను. మొదట ఆధ్యాత్మికవేత్తలయిన వారు తెలుగు భాషను
ఆత్మజ్ఞానముతో ఇమిడ్చి చెప్పిన ఘనత వారికే దక్కినది. నేడు తెలుగు
రాష్ట్రములు రెండు ఉండగా, అందులో తెలుగు నేర్చినవారు 90
శాతమున్నారు. ఈ 90 శాతము మందిలో ఒక్కశాతమువారు కూడా
తెలుగు భాష గొప్పతనమును తెలియలేకపోయారు. ఇప్పుడు ఉన్న కొన్ని
కోట్ల తెలుగువారిలో ఒక ముస్లీమ్ తెలుగు భాషను ఎంతగానో ప్రేమిస్తూ,
దానిని గురించి గొప్పగా మాట్లాడడము చూచాను. లౌకికముగా తెలుగు
భాషను పొగడుచున్న వ్యక్తి హిందువులలో కనిపించకున్నా ముస్లీమ్లలో
కనిపించడము ఆశ్చర్యకర విషయము. అటువంటివారు తొందరలో తెలుగు
భాష దైవజ్ఞాన భాషయని తెలియగలరు.
సజీవమైన శరీరములో పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు
ఉన్నాయను భావమును అమ్మ పదములో చూపారు. మనిషికి తాను
జీవుడని కూడా తెలియని పరిస్థితిలో యున్నాడు. తన పేరే తనకు తెలియక
యున్న జీవునికి ఆత్మను గురించి, తర్వాత పరమాత్మను గురించి ఏమాత్రము
తెలియదు. అందువలన మూడు దైవ గ్రంథములలో ఈ మూడు ఆత్మలను
గురించి ప్రత్యేకమైన విధానముగా చెప్పియున్నారు. ముందు ప్రథమ దైవ
గ్రంథమయిన తౌరాతులో (భగవద్గీతలో) చూస్తాము.
పురుషోత్తమ ప్రాప్తి యోగములో 16వ శ్లోకము :
ద్వావిమౌ పురుషా లోకే
క్షర శ్చాక్షర ఏవచ |
క్షర స్సర్వాణి భూతాని
కూటస్థో క్షర ఉచ్యతే ॥
పురుషోత్తమ ప్రాప్తి యోగములో 17వ శ్లోకము :
ఉత్తమః పురుష స్వన్యః
పరమాత్మే త్యుదాహృతః |
యో లోకత్రయ మావిశ్య
బిభర్తవ్యయ ఈశ్వర ః ॥
అని రెండు శ్లోకములలో మూడు ఆత్మల విధానమును గురించి
వ్యాసుడు పేరు పెట్టిన భగవద్గీతలో, స్వయముగా భగవంతుడయిన కృష్ణుడు
పేరు పెట్టిన తౌరాతులో చెప్పడమైనది. మొదటి శ్లోకములో భూమిమీద
రెండు రకముల పురుషులు ఉన్నారనీ, అందులో ఒకరి పేరు క్షరుడు అని
(నాశనమగువాడు యని) చెప్పుచున్నాము. క్షరుడు సర్వజీవరాసులలో
ఉన్నాడు. అక్షరుడు (నాశనము కానివాడు) నాశనమయ్యే జీవునితో సహా
కూడియున్నాడు.
ఒక శరీరములో నాశనము చెందు జీవాత్మయుండగా, అదే
శరీరములోనే నాశనము కాని ఆత్మ కూడా జీవాత్మతో కలిసి నివాసము
చేయుచున్నాడు. అయితే జీవాత్మకు, ఆత్మకు మించి ఉత్తముడయిన మరొక
పురుషుడు గలడు, అతనినే పరమాత్మయని అంటున్నాము. ఈ మూడవ
పురుషుడే శరీరము లోపల, శరీరము బయట మొత్తము ముల్లోకములు
అవహించి, అధిపతియని చెప్పబడుచున్నాడు. ఈ మూడవ పురుషున్నే
కొందరు పురుషులలో ఉత్తమమైన వాడు కావున పురుషోత్తమ అని అన్నారు.
అంతేకాక ఆత్మకంటే వేరుగా యున్నవాడు కనుక ఆయనను పరమాత్మ
అని అన్నారు. పర అనగా వేరుగాయున్న అని అర్ధము. ఆ అర్థము
ప్రకారము పర+ఆత్మ= పరమాత్మగా చెప్పుచున్నారు. ఈ విధముగా ముగ్గురు
పురుషులు శరీరములో యున్నారు. అయితే శాశ్వితముగా జీవాత్మ, ఆత్మ
ఇద్దరూ శరీరములోనే ఉండగా, పరమాత్మ మాత్రము శరీరము లోపల,
శరీరము బయట ఉన్నాడు. శరీరము బయట అణువణువున వ్యాపించి
యున్నాడు, ఆయన లేని స్థలమంటూ లేదు. పరమాత్మ ఆ విధముగా
విశ్వమంతా వ్యాపించి యుండగా, ఆత్మ శరీరము లోపల శరీరమంతా
వ్యాపించి శరీర బయటి అంచువరకు నిండుకొని యున్నది. ఆత్మ
శరీరమంతా యుండగా, జీవాత్మ శరీరములో తలయందు తల మధ్యలోగల
నాల్గుచక్రములలో క్రింది చక్రములో యున్నాడు. క్రింది చక్రము మూడు
భాగములుగా యున్నది. తామస, రాజస, సాత్త్విక అను మూడు భాగము
లలో ఏదో ఒక భాగమున ఒక్కచోట రవ్వంతగా జీవుడు యున్నాడు. ఈ
వివరము భగవద్గీతలో చెప్పియుండగా,
ద్వితీయ దైవగ్రంథమయిన ఇంజీలు (బైబిలు)లో ఈ మూడు
ఆత్మల విషయమును చెప్పియున్నారు. బైబిలులో మత్తయి సువార్త 28వ
అధ్యాయములో 19వ వాక్యములో ఇలా కలదు చూడండి.
మత్తయి. 28–19. “మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా
చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశు
ద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచూ
పొమ్ము అని కలదు.
తర్వాత అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ సూరా 50లో
ఆయత్ 21 నందు ఇదే మూడు ఆత్మల విషయము చెప్పబడియున్నది.
అయితే ముస్లీమ్లు అక్కడ చెప్పిన జ్ఞానమును తమ బుద్ధి చేత గ్రహించు
కోలేక పోయారు. ఖుర్ఆన్లో చెప్పిన విషయమును చూస్తే 3వ సూరా
18వ ఆయత్లోను, 16వ సూరా 51వ ఆయత్లోను మూడు ఆత్మల
విషయము కలదు. అయితే దానిని ఏమాత్రము ఇంతవరకు గుర్తించినవారు
లేరు అని చెప్పవచ్చును. ఇప్పుడు ఖుర్ఆన్లో చెప్పిన ఆయన్ను చూస్తాము.
50వ సూరా 21వ ఆయత్లో :- “ప్రతి ఆత్మ (ప్రాణి) ఒక
తోలేవాడితో, మరొక సాక్షమిచ్చే వాడితో సహా వస్తుంది."
మరొక గ్రంథము అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ ఇలా వ్రాశారు
చూడండి.
50వ సూరా 21వ ఆయత్లో :- “ప్రతి వ్యక్తి తనవెంట తనను
తీసుకొచ్చేవాడొకడు, సాక్షమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో
హాజరవుతాడు.”
ఈ విధముగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను గురించి మూడు
గ్రంథములలో వ్రాశారు.
ప్రశ్న :- భగవద్గీత పుట్టి 5160 సంవత్సరములు, బైబిలు పుట్టి
దాదాపు 2010 సంవత్సరములు, చివరి గ్రంథము ఖుర్ఆన్
పుట్టి దాదాపు 1400 సంవత్సరములు అయినది కదా! ఈ
మూడు దైవ గ్రంథములలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ యను
మూడు ఆత్మలను చెప్పినప్పుడు భగవద్గీతను చదివిన హిందువులు
గానీ, బైబిలును చదివిన క్రైస్థవులుగానీ, ఖుర్ఆన్ గ్రంథమును
చదివిన ముస్లీమ్లుగానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు ఈ మూడు
ఆత్మల విషయమును గ్రంథములలో ఎందుకు గ్రహించలేక
పోయారు? ఇప్పుడు మీరు చెప్పునంత వరకు ఈ విషయము
బయట తెలియకపోవడానికి కారణమేమిటి? ఐదువేల
సంవత్సరముల నుండి తెలియని మూడు ఆత్మల విషయము
ప్రత్యేకించి మీకు ఎందుకు తెలిసినది?
జవాబు :- ఐదువేల సంవత్సరముల నుండి ఎక్కడా దాచి పెట్టకుండా
మూడు దైవ గ్రంథములలోను మూడు ఆత్మలను గురించి చెప్పియున్నారు.
అయినప్పటికీ ఇటు హిందువులుగానీ, అటు క్రైస్తవులుగానీ, మిగతా
ముస్లీమ్లు గానీ ఈ విషయమును గ్రహించలేకపోయారు. ఒక
విషయమును వినినా, లేక చదివినా అది కొందరికి తక్కువ శాతము,
కొందరికి ఎక్కువ శాతము అర్థమవడము జరుగుతాయున్నది. ఒక్కొక్కరికి
ఒక్కొక్క శాతములో అర్థము అవుచుండును. అయితే మూడు ఆత్మల
విషయము మూడు మతములవారిలో చదివినవారికి ఎవరికీ కనీసము
ఒక్కశాతము కూడా అర్థము కాలేదని చెప్పవచ్చును. అందువలన ఇంత
వరకు ఏ మతములోగానీ మూడు ఆత్మల విషయమే ప్రస్తావనకు రాలేదు.
అట్లు అర్థము కాకపోవడమేకాక దానికి వ్యతిరేఖముగా అర్థమయిన
సందర్భములు కూడా కలవు. ఎందుకు ఆ విధముగా జరిగినదో
తెలియడము లేదు. ఇంతమందికి అర్థము కాని విషయము నాకు ప్రత్యేకించి
అర్థము కావడము నాకే విచిత్రముగా తోచుచున్నది. ఆధ్యాత్మిక రంగములో
అద్వైతమును బోధించినవారున్నారు. అట్లే ద్వైతమును, విశిష్టాద్వైతమును
బోధించినవారున్నారు. వారు ఆయా సిద్ధాంతకర్తలుగా యున్నారు. మొదటి
సిద్ధాంతకర్తయిన ఆది శంకరాచార్యుల వారు హిందువులలోని వాడే. అట్లే
ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులవారు కూడా హిందువులలోని వాడే.
విశిష్టాద్వైత సిద్ధాంతకర్త కూడా హిందువే కావడము విశేషము. ఈ ముగ్గురికీ
హిందువులకు సంబంధించిన భగవద్గీతలో గల క్షర, అక్షర, పురుషోత్తముల
విషయము ఎందుకు అర్థము కాలేదో?
గీత తర్వాత మూడువేల సంవత్సరములకు వచ్చిన బైబిలులో
కొందరు త్రిత్వము అని గుర్తించి చెప్పారుగానీ, అది కూడా పూర్తి అర్థము
కాని విషయమైపోయి పూర్తి ప్రచారము కాలేదు. ఇకపోతే ముస్లీమ్లు
తమ గ్రంథమును చదివినా, దేవుడు మూడు ఆత్మలుగా విభజింపబడి
యున్నాడను విషయము తెలియలేకపోయారు. అంతేకాక దేవుడు ఒక్కడే
యను నినాదమును వారు పైకి తెచ్చారు. క్రైస్థవులు త్రిత్వము అని చెప్పినా
వారిలో ఎవరు దేవుడు, ఎవరు జీవుడు అని తెలియలేకపోయారు.
హిందువులయితే కొందరు మాత్రము జీవుడు, దేవుడు అను రెండు
విషయములను చెప్పుచున్నారు. మూడవ వానిని పూర్తి మరచిపోయారు.
మధ్యలోయున్న ఆత్మ విషయము హిందువులు గుర్తించలేకపోయారు.
హిందువులు పూర్తి ఆధ్యాత్మికమును వదలి దేవతల పూజలలో పడిపోయారు.
ఇట్లు మూడు మతముల వారు వారి గ్రంథములలోని త్రైత సిద్ధాంతముగా
యున్న మూడు ఆత్మలను తెలియలేకపోయారు.
దేవుడు అనుకుంటే ఏమయినా జరుగుతుంది యన్నట్లు నేను
పండితున్ని కాకపోయినా, సామాన్య మనిషిగా యున్నా, మా వంశములో
ఎవరూ ఆధ్యాత్మికముతో సంబంధము లేకున్నా, నన్ను మాత్రము
ఆధ్యాత్మికములోనికి దేవుడే తెచ్చి ఎవరికీ అర్థముకాని జ్ఞానమును నాకు
అర్థమగునట్లు చేసి, చివరకు త్రైతముగా యున్న మూడు ఆత్మలను మూడు
గ్రంథములలో యున్నట్లు గుర్తింప చేసి, హిందుమతములో అద్వైత, విశిష్టా
ద్వైత, ద్వైత సిద్ధాంతకర్తల ప్రక్కన నన్ను త్రైత సిద్ధాంతకర్తగా నిలబెట్టడము
నాకే పెద్ద విచిత్రముగా తోచుచున్నది. దేవుడు అనుకుంటే ఏదయినా
చేయగలడు అను మాట నా యెడల నెరవేరిందని నాకు తెలిసింది. నేడు
నేను ఏ జ్ఞానమునయినా త్రైత సిద్ధాంతముతో జోడించి చెప్పుచున్నాను.
అందువలన మూడు దైవ గ్రంథములలోని జ్ఞానము నాకు సులభముగా
అర్థమయినది. మూడు మతములలోని జ్ఞానము మొదటి నుండి త్రైతమయిన
మూడు ఆత్మలతో కూడుకొని యుండుట వలన త్రైతము తెలియనివారికి
అర్థము కాలేదు. త్రైత సిద్ధాంతకర్తనయిన నాకు మూడు గ్రంథముల
జ్ఞానము సులభముగా అర్థమయినది.
ప్రశ్న :- మీరు సృష్ఠి రహస్యమును చెప్పుచూ మూడు ఆత్మల
చేతనే ప్రపంచము తయారయినదని చెప్పుచూ, కొంతవరకు
ఆత్మ, జీవాత్మ, పరమాత్మల విషయమును వివరించారు.
కొందరు మీ మాటను లెక్కచేయక త్రిమూర్తులయిన విష్ణు,
ఈశ్వర, బ్రహ్మ వలన ప్రపంచము ఏర్పడినదని, వీరు ముగ్గురు
తనకు తానుగా పుట్టిన స్వయంభులని చెప్పుచున్నారు. ముగ్గురు
మూర్తుల చేత ప్రపంచము సృష్టింపబడగా, మీరు మాత్రము
ముగ్గురు మూర్తులయిన విష్ణు, ఈశ్వర, బ్రహ్మలతో సంబంధము
లేకుండా మూడు ఆత్మల సృష్ఠి ప్రపంచము అనడము అసత్యము
అంటున్నారు. పుట్టించువాడు బ్రహ్మ, పోషించువాడు విష్ణువు,
మరణము కలుగజేయువాడు హరుడు లేక శివుడు అని
అంటారని, వీరి ముగ్గురి వలన పుట్టడము, జీవించడము,
మరణించడము జరుగుతూయున్నదని చెప్పుచున్నారు. అయితే
ఈ ముగ్గురిని ఎవరూ పుట్టించలేదని వారకు వారుగా పుట్టిన
స్వయంభువులని అంటున్నారు. దీనిని గురించి మీరు
ఏమంటారు?
జవాబు :- ఉన్న సత్యము ఒకటయితే మరొకరకముగా అనుకోవడము
పూర్వము నుండి ఉన్న విషయమే. ఆధ్యాత్మికము అను పేరుతోనే కొందరు
జ్ఞానమును బోధించుచున్నా వారు దారితప్పి ఇతర దారిలో బోధించు
చుందురు. దైవమార్గములు రెండు రకములుగా యున్నవి. ఒకటి
స్వచ్ఛమయిన సత్యమైన మార్గముకాగా, రెండవది స్వచ్ఛతలేనిది అసత్య
మైనదిగా యుండును. స్వచ్ఛమయిన సత్యమైన మార్గము శాస్త్రబద్దముగా
యుండును. ఆత్మలతో కూడియుండును. రెండవ మార్గము శాస్త్రబద్దము
కానిదిగా యుంటూ దేవతల భక్తితో కూడుకొనియుండును. మొదటి
సత్యమైన మార్గము బ్రహ్మవిద్యతో కూడినదై, మూడు ఆత్మలతో కలిసి
యుండును. రెండవ మార్గము వేదములు, పురాణములతో కూడినదై
దేవతలతో కలిసియుండును. ప్రపంచములో రెండవ మార్గమయిన దేవతల
మార్గములో పోవువారు 99 శాతము ఉండగా, బ్రహ్మవిద్యా శాస్త్రమును
అనుసరిస్తూ ఆత్మల మార్గములో పోవువారు ఒక శాతము కూడా అరుదుగా
ఉందురని చెప్పవచ్చును.
రెండవ మార్గములో పోవువారు త్రిమూర్తులయిన విష్ణు, ఈశ్వర,
బ్రహ్మలే పెద్ద దేవతలనీ, వారి ద్వారానే సృష్టి అంతా ఉందని చెప్పుచుందురు.
ఇదంతా పురాణములలో, వేదములలో ఉండే విషయమే. ముందు విష్ణువు
తర్వాత ఈశ్వరుడు, ఆ తర్వాత బ్రహ్మ వారుకు వారుగా పుట్టారని
అందువలన వారిని స్వయంభువులని అంటున్నామని చెప్పుచున్నారు. సరే
ఇప్పుడు వారి మాటప్రకారమే పోతే వారే పెద్ద దేవుళ్ళని వారే ప్రపంచమును
సృష్ఠించి, పాలించుచున్నారని చాలామంది చెప్పుచున్నారు. ఆ విధముగానే
ఒప్పుకొన్నా వారే పెద్ద దేవుళ్ళు, వారి తర్వాత పెద్దవారు లేరు వారు
ఎవరి చేత సృష్టింపబడలేదు అంటే నిజమని మనము ఒప్పుకొనినా ఈ
మాటను విష్ణు, ఈశ్వర, బ్రహ్మలే ఒప్పుకొనేటట్లు లేరు. ఎందుకనగా!
వారు నిత్యము దేవున్ని గురించి చింతచేయుచూ ముగ్గురు మూడు విధముల
జపములు చేయుచున్నారు. శివుడు జపమాల చేతిలో పట్టుకొని దేవున్ని
108 మార్లు స్మరించుచున్నాడు. అట్లే బ్రహ్మ కూడా కమలములో కూర్చొని
జపమాలతో ఆరాధించుచున్నాడు. త్రిమూర్తులలో పెద్దవాడయిన విష్ణువు
కూడా ఒక ప్రక్కకు పడుకొని కళ్ళు మూసుకొని దేవున్నే ధ్యానించుచున్నాడు.
త్రిమూర్తులే దేవుళ్ళయినప్పుడు వాళ్ళు ఏ దేవున్ని ధ్యానించు
చున్నారు? అని వారినే అడిగితే మమ్ములను సృష్టించిన దేవున్ని మేము
ధ్యానించుచున్నాము. మాకు ఈ జన్మ నుండి తొలగించి మోక్షమును
చేర్చమని ప్రార్థిస్తున్నాము అని అంటున్నారు. అటువంటప్పుడు మనము
స్వయంభువులనుకోవడము పొరపాటు కాదా! శరీరముతో ఎవడున్నా వాడు
తల్లిగర్భము నుండే పుట్టాలి. వాని శరీరములో మూడు ఆత్మలుండాలి.
శరీరముతోయున్న ఎవడయినా గానీ వాడు జీవుడుగా కర్మలు అనుభవించు
చుండగా అతనిని ఆత్మ నడుపుచుండును. ఇట్లు ఆత్మ, జీవాత్మ పని చేయని
సజీవ శరీరములు భూమిమీద ఎక్కడా వుండవు. శరీరములో కనిపించని
జీవాత్మ యుండగా, కనిపించని ఆత్మ ఆ జీవున్ని ఆదేశించి నడుపుచున్నది.
అట్లు నడచు జీవుడు వాని శరీరములో కర్మబద్ధుడై యున్నాడు. అందువలన
వేమన యోగి శరీరముతో పుట్టిన బ్రహ్మ కర్మ వ్రాత ఎట్లు వ్రాయును?
అన్నాడు. అతనికి కూడా కర్మ వ్రాతను అమలు చేయు ఆత్మ యున్నాడు.
ముగ్గురు మూర్తులకు కూడా జననము ఉన్నట్లే మరణము కూడా కలదు.
అందువలన వారు దేవుళ్ళు అనుటకు వీలులేదు. అట్లే వారు స్వయముగా
పుట్టినవారు కారు. శరీరములో ఒకడు పుట్టాడు అంటే వానికి కర్మ
ఉంటేనే ఆత్మ చేత పుట్టించబడుచున్నాడు. అందువలన బ్రహ్మ ఇతరులను
పుట్టించలేదు. అట్లే విష్ణువు ఇతరులను పోషించలేదు. శివుడు ఎవరినీ
చంపలేదు. ఇవి వారి పనులు కావు. మనుషులు తెలియని అజ్ఞానముతో
విష్ణు, ఈశ్వర, బ్రహ్మను పెద్ద దేవుళ్ళుగా భావించుకొంటున్నారు. అందరినీ
పుట్టించువాడు, పోషించువాడు, మరణింపజేయువాడు ఆత్మయేనని
తెలియవలెను.
ప్రశ్న :- ఈ ప్రపంచమును సృష్టించినవాడు ఎవరు?
జవాబు :- మొట్టమొదట ఈ ప్రపంచమును సృష్టించినవాడు పరమాత్మ.
ప్రకృతి ఐదు భాగములను మరియు ఆత్మను సృష్టించినవాడు ఒకే ఒక
పరమాత్మయని చెప్పవచ్చును. ఎప్పుడయితే ప్రకృతి పుట్టిందో అప్పుడే
ఆత్మ పుట్టింది. ఎప్పుడయితే ఆత్మ పుట్టిందో అప్పుడే కనిపించే ప్రపంచము
పుట్టినది. అప్పుడు ప్రపంచమంతా యుండినా అది జీవులు లేకుండా
ఉండేది. అందువలన పరమాత్మ జీవరాసులుగల సృష్ఠిని సృష్టించలేదని
తెలియుచున్నది. ప్రకృతిని ఆత్మను సృష్టించిన పరమాత్మ ప్రకృతిని
ఉపయోగించుకొని శరీరములను తయారు చేసి, అందులో జీవాత్మలను
నింపి సజీవమైన సృష్టిని తయారు చేయమని ఆత్మకు ఆదేశించగా, అప్పటి
నుండి ఆత్మ శరీరముగల జీవరాసులను తయారు చేసింది. ఇట్లు
మనుషులను పుట్టించినవాడు ఆత్మయని తెలిసిపోయింది. ఆత్మ శరీర
సహితముగా జీవరాసులను మనుషులను పుట్టించుచూ, అంతటితో ఆగక
వాటిని నిత్యము పోషించుచూ చివరికి ఏదో ఒకరోజు మరణము కలుగజేయు
చున్నది. ఈ విధముగా మనిషి జీవితములనుగానీ, ఇతర జంతు
జీవితములనుగానీ ఆత్మే క్షణక్షణము నడిపించుచున్నది. శరీరములో జీవుడు
ఏమి చేయనివాడై యుండగా, ఆత్మనే వానిని కర్మప్రకారము నడుపుచున్నది.
జీవాత్మ శరీరములో ఆత్మ చేత కల్గిన సుఖములను దుఃఖములను
అనుభవించుచున్నాడు. ఆత్మ అన్నీ చేయుచుండగా, జీవాత్మ వచ్చిన
అనుభవములను అనుభవించుచుండగా, పరమాత్మ అన్నిటినీ సాక్షిగా
చూస్తుయున్నది. దీనినిబట్టి ప్రపంచమును తయారు చేసినవాడు పరమాత్మ
కాగా, జీవరాసులను తయారు చేసినవాడు ఆత్మయని తెలియుచున్నది.
ప్రపంచమును ఆత్మను సృష్టించినవాడు పరమాత్మ. అట్లు మొదట జీవరహిత
ప్రపంచము తయారుకాగా, తర్వాత ఆత్మచేత జీవముగల శరీరములు
తయారుకాగా, మనుషులు జంతువులు, పక్షులు మొదలగునవన్నియు
తయారైనవి.
ప్రశ్న :- దీనినంతటిని గమనిస్తే పరమాత్మకంటే ఆత్మయే
ఎక్కువగా చేసినట్లున్నది. ఇప్పుడు ఆత్మ, పరమాత్మలలో మనకు
ఎవరు ముఖ్యులు అని చెప్పాలి?
జవాబు :- ఆత్మ, పరమాత్మలలో మనుషులకు ఆత్మయే ముఖ్యము. ఆత్మ
మనుషులను పుట్టించి, పోషించి, మరణింపజేయుచున్నది. తర్వాత జీవునకు
క్రొత్త జన్మను కల్గించి, తిరిగి ప్రపంచములో మనుగడ సాగునట్లు చేయు
చున్నది. అందువలన అన్ని విధముల పరమాత్మకంటే ఆత్మయే మనకు
గొప్ప. దానివలన ఆత్మనే ఆరాధించవలెనని మూడు గ్రంథములలో చెప్పారు.
ప్రశ్న :- ఆత్మ, పరమాత్మ ఇద్దరూ దేవుళ్ళే, ఇద్దరూ సృష్టికర్తలే
అయితే ఆత్మను సృష్టించిన పరమాత్మ ఆత్మకు తండ్రియగును.
మనలను సృష్టించిన ఆత్మ మనకు తండ్రియగును. ఆ లెక్క
ప్రకారము పరమాత్మ మనకు తాత అవుతాడు. ఆరాధన
విషయమై అడిగితే వారిలో ఎవరిని ఎక్కువ పూజించాలి?
పరమాత్మకంటే ఆత్మయే అన్ని విధముల మనలను పోషించు
చున్నది. మనకు పరమాత్మ ఏమి చేయలేదు. అందువలన
ఆయనను ఎందుకు ఆరాధించాలి? అని ఒక ప్రక్క అనిపించినా
మరొక ప్రక్క తండ్రియైన ఆత్మకు తండ్రి అయినందున మొదట
ఆయనను పూజించి తర్వాత ఆత్మను పూజించినా ఫరవాలేదా?
యని అడిగితే దానికి ఇలా జవాబు కలదు.
జవాబు :- ఇది అడుగవలసిన ప్రశ్నయే. ఈ అనుమానము ఎవరికయినా
రావచ్చును. అయితే దాని విషయము ఎవరో ఒకరు తేల్చి చెప్పాలి.
అలా చెప్పకపోతే ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు చేయగలరు. ఈ
విషయమును గురించి బ్రహ్మవిద్యా శాస్త్రమే చెప్పాలి. అందువలన బ్రహ్మ
విద్యా శాస్త్రములో ఒక భాగమయిన ఖుర్ఆన్లో 3వ సూరా 18వ ఆయత్లో
ఇలా కలదు.
3-18 : అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవము లేడని
స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన
సంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వము,
సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు.
సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప
మరొకరు ఎవరూ ఆరాధనకు అర్హులు కారు.
ఈ వాక్యము ముస్లీమ్లకే సరిగా అర్థము కాలేదు. ఒక్క దేవున్నే
ఆరాధించాలి అనునదే వారి ఉద్దేశ్యమయినా దానికి వారి వద్ద వివరణ
లేదు. అయితే ఈ ఆయత్లో చెప్పిన విషయము చూస్తే ఇద్దరు అల్లాహ్ లో
ఎవరు ఆరాధనకు అర్హులు అన్నదియున్నా, ఇద్దరు దేవుళ్ళు అంటే వారు
వినడము లేదు. ఆ వాక్యమును మనమే తప్పుగా చెప్పుచున్నామని, ఖుర్ఆన్
గ్రంథములో ఇద్దరు అల్లాహు అనేమాట లేనేలేదు అని కొందరు
అంటున్నారు. అయితే ఒక అల్లాహ్ ఇంకొక అల్లాహ్ ఆరాధనకు
అర్హుడని చెప్పుచున్నాడు. ఎవరు ఎవర్ని అర్హుడని చెప్పుచున్నాడనగా
'అల్లాహ్, అతని దూతలు' అని వాక్యములో చెప్పియున్నారు. కాబట్టి
సులభముగా అర్థమయిపోతుంది. దేవదూతలు శరీరములోని అల్లాహ్కు
(దేవునికి) లేరు. దేవదూతలు మొదటి దేవుడైనవానికి, ప్రపంచమంతా
వ్యాపించియున్నవానికి మాత్రమే యున్నారు. అందువలన మొదటి
దేవుడయిన పరమాత్మ తాను సృష్టించిన అల్లాహు (ఆత్మను) ఆరాధనకు
అర్హుడు అని చెప్పుచున్నాడు.
శరీరములో 25 భాగములు ఉండగా వాటికన్నిటికి అధిపతి
(ఆత్మ) అయినందున 'సర్వాధిక్యుడు' అని ఆయనకు పేరు వచ్చినది.
అంతేకాక శరీరములో అన్ని భాగములలో సమానముగా వ్యాపించి, శరీర
మంతటా సమతూకము కల్గినవాడు శరీరములోని ఆత్మే అయినందున
ఆయనే అన్ని విధముల ఆరాధనకు అర్హుడు అని చెప్పియున్నాడు. ఈ
ఆయతో ఇద్దరు అల్లాహ్ ు ఉన్నట్లు ముస్లీమ్ లోకము గ్రహించలేక
పోయినది. ఈ వాక్యములో కూడా మీకు ఆరాధ్యదైవము ఒక్కడేయని
చెప్పారుగానీ, వేరే ఏమి చెప్పలేదు గదా! ఈ వాక్యము ప్రకారము ప్రజలకు
ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవున్నే ఆరాధించాలి అని చెప్పడము జరిగినది.
ఈ వాక్యము ఎంతో జ్ఞానముతో కూడుకొన్నదయినా, ప్రజలు దీనిని అర్థము
చేసుకోకపోవడము ప్రజలకు పెద్ద నష్టమే. దేవుడు చెప్పిన దానిని నమ్మకుండా
మా మతపెద్దలు చెప్పినదే నమ్ముతామనుట పెద్ద అజ్ఞానమగును.
దేవుళ్ళు ఇద్దరు కలరని, అందులో మొదటివాడు నిర్జీవమైన
ప్రపంచమును సృష్టించి, దానితో పాటు ఇప్పుడు మనకు దేవుడయిన వానిని
కూడా సృష్టించాడు. అలా సృష్ఠింపబడిన దేవుడు (ఆత్మ) మొదటి దేవుడుకు
(పరమాత్మ) కు కుమారుడు అని చెప్పవచ్చును. మొదటి దేవుడయిన
పరమాత్మ తన కుమారుడైన రెండవ దేవుని చేత సజీవమైన ప్రపంచమును
సృష్టించాడు. మొదటి దేవుడు పరమాత్మ జీవరాసిలేని విశ్వమును
సృష్టించగా, సృష్ఠింపబడిన రెండవ దేవుడయిన ఆత్మ ప్రకృతిని ఉపయోగించు
కొని సమస్త జీవరాసులను తయారు చేసినాడు. ఈ విధముగా ఇద్దరు
సృష్ఠికర్తలు ఉన్నారని చెప్పవచ్చును. సజీవమైన మనుషులను తయారు
చేసినవాడే మనకు ఆరాధ్య దైవముయని, మొదటి దేవుడయిన పరమాత్మను
ఎవరూ ఆరాధించకూడదని స్వయముగా పెద్ద అల్లాహ్ అనగా మొదటి
అల్లాహ్ చెప్పిన విషయము 3వ సూరా, 18వ ఆయత్లో ఉన్నదానిని
చూచాము. ఇదే విషయమునే అందరూ నమ్మునట్లు ప్రత్యేకమైన మొదటి
అల్లాను నేనున్నానన్నట్లు నన్ను కాకుండా, నేను సృష్టించిన దేవున్నే మీరు
ఆరాధించాలని అదే ఖుర్ఆన్ గ్రంథములో మరొకచోట సూరా 16, ఆయత్
51లో ఇలా చెప్పియున్నారు చూడండి.
16-51 : అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు “ఇద్దరు ఆరాధ్య
దైవములను కల్పించుకోకండి. ఆరాధ్య దైవము ఆయన
ఒక్కడే. కాబట్టి మీరంతా కేవలము నాకే భయపడండి"
అని అన్నాడు.
(“దివ్య ఖుర్ఆన్ సందేశము” తెలుగులో అనే గ్రంథములో కూడా ఈ
వాక్యమును ఇలా వ్రాశారు చూడండి.)
16-51 : అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు “ఓ మానవు
లారా) ఇద్దరిని ఆరాధ్యదైవములుగా చేసుకోకండి.
నిశ్చయముగా ఆరాధ్యదైవము ఆయన (అల్లాహ్) ఒక్కడే.
కావున నాకే భీతిపరులై ఉండండి.”
ఈ ఆయత్ 3-18లో చెప్పిన ఆయత్కు బలమును చేకూర్చు
చున్నది. ఇద్దరు దేవుళ్ళు ఉన్నారనుటకు ఈ ఆయత్ పెద్ద సాక్షముగా
యున్నది. "ఆయనను ఆరాధించండి, నాకు భయపడండి” అని చెప్పడము
వలన చెప్పేవాడు పెద్ద దేవుడని సులభముగా అర్థము కాగలదు. ఇక్కడ
కూడా ఒక ముస్లీమ్లకే కాక సమస్త మానవులకు ఆరాధ్యదైవము ఒక్కడే
యని ఆయననే ఆరాధించవలెనని చెప్పుచూ మొదట ప్రపంచమును మరియు
మీరు ఆరాధించు దేవున్ని సృష్టించిన నాకు భయపడండి అని చెప్పాడు.
ఇందులో అర్థముకాని విషయము ఏమీ లేదు. మీ ఆరాధ్య దైవము
ఒక్కడేగానీ ఇద్దరు కారు అని చెప్పాడు. ఇంకా లోతుగా ఆలోచిస్తే మనము
మాటల సందర్భములో వీనికి భయము, భక్తి రెండూ లేవు అని అప్పుడప్పుడు
ఇతరులను గూర్చి చెప్పుచుందుము. అందులో మొదటిది భయము అని
చెప్పాము కదా! తర్వాత రెండవది భక్తి అని కూడా చెప్పాము. దీనినిబట్టి
భయము అనేది మొదటి సృష్టికర్తయిన పెద్ద దేవుని మీద ఉండాలి. తాతయిన
దేవున్ని ఆరాధించక ఆయనకు భయపడి ఉండడము మంచిది. రెండవ
సృష్టికర్త అనగా సమస్త జీవరాసులను సృష్టించిన సృష్టికర్తయిన ఆత్మను
ఒక్కడినే దేవునిగా ఆరాధించాలని చెప్పియున్నారు. ఈ ఆయత్లో ఇద్దరు
దేవుళ్ళనీ నమ్మనివారకు నమ్మునట్లు చెప్పియున్నారు. దీనివలన మనుషులకు
ఇద్దరు దేవుళ్ళున్నారని సాక్ష్యము దొరుకుచున్నది. అందులో సృష్టింపబడిన
దేవుడు ఆరాధ్యమునకు అర్హుడని, ఆరాధ్య దైవమును సృష్టించిన మొదటి
సృష్ఠికర్త పెద్ద దేవుడే అయినా, ఆయనను ఆరాధించకూడదని, ఆయన
ఉన్నాడని తెలిసినందుకు గుర్తుగా ఆయన ఎడల భయము కల్గియుండడము
మంచిదని తెలియుచున్నది. ఖుర్ఆన్ గ్రంథములో ఆరాధ్యదైవమైన
అల్లాహ్ ను చాలాచోట్ల చెప్పగా, ఆరాధ్య దైవము కాని మొదటి అల్లాహు
గురించి అక్కడక్కడ చెప్పారు. ఆయన ఏ పనినీ చేయడని, ఆయన
అనుకుంటే అన్నీ అయిపోతాయని చెప్పినది పెద్ద అల్లాహ్ ను గురించే.
అంతేకాక 112వ సూరాలో గల నాలుగు ఆయత్లు మొదటి అల్లాహ్ను
గురించి చెప్పినవేయని తెలియవలెను.
ఇద్దరు దేవుళ్ళను గురించి అంతిమ దైవగ్రంథములో 3-18,
16-51 లో చెప్పిన విషయమును చెప్పాము. మూడు దైవగ్రంథములలోనూ
ఒకే జ్ఞానము ఒకే విషయము చెప్పియున్నా, వ్రాసిన పద్ధతి వేరువేరుగా
యుండుట వలన రెండు గ్రంథములలో వ్రాసినది ఒక్కటేయని కొందరు
గ్రహించలేకపోవుచున్నారు. కొంత లోతుగా అర్థము చేసుకొంటే అన్ని
గ్రంథములలో చెప్పినది ఒకటే జ్ఞానమని తెలియగలదు. అంతిమ దైవ
గ్రంథము ఖుర్ఆన్లో చెప్పిన విషయమే ద్వితీయ దైవగ్రంథము ఇంజీలు
(బైబిలు)లో కూడా యోహాన్ సువార్తలో ఐదవ అధ్యాయమందు 23, 24
వాక్యములలో చెప్పియున్నారు. ఇప్పుడు ఆ వాక్యములను చూస్తాము.
యోహాన్. 5–23 : తండ్రిని ఘనపరుచునట్లుగా అందరూ
కుమారుని ఘనపరచవలెనని, తీర్పు తీర్చుటకు సర్వాధికారము
కుమారునికి అప్పగించియున్నాడు. కుమారుని ఘనపరచని
వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
యోహాన్. 5–24: నా మాట విని నన్ను పంపిన వాని
యందు విశ్వాసముంచువాడు నిత్యజీవనము గలవాడు.
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి
దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాన్ సువార్తలోని రెండు వాక్యములు, ఖుర్ఆన్లోని రెండు
వాక్యములకు సమానముగా యున్నవని కొంత బుద్ధిని ఉపయోగించి
చూచిన వారికి అర్థము కాగలదు. 23వ వాక్యములో 'తండ్రియని’
చెప్పియున్నారు కదా! మొదట ప్రకృతిని, ఆత్మను తయారు చేసిన సృష్టికర్తనే
ఇక్కడ తండ్రియని చెప్పియున్నారు. కుమారుడు అనగా పరమాత్మ చేత
సృష్ఠింపబడిన ఆత్మనే కుమారుడు అని అనుచున్నారు. మొదటి సృష్టికర్తయిన
పరమాత్మ లేక పరిశుద్ధాత్మ చేత తయారయిన కుమారుడగు ఆత్మను అందరూ
ఆరాధించవలెనని చెప్పియున్నారు. పరమాత్మను ఆరాధించకుండ భక్తి
భావములను ఆయన కుమారుడైన ఆత్మ మీద చూపవలెనని, ఆత్మనే
ఆరాధించవలెనని అట్లు కుమారుడైన ఆత్మను ఆరాధిస్తే సృష్టికర్త అయిన
పరమాత్మను ఆరాధించినట్లేయని, కుమారుడైన ఆత్మను ఆరాధించక పోతే
పరమాత్మను ఆరాధించనట్లేయని చెప్పారు. దీని సారాంశమును చూస్తే
“మీరు నన్ను ఆరాధించకూడదు, నా కుమారున్నే ఆరాధించమని”
ఖుర్ఆన్లో చెప్పినట్లుగలదు. “నా కుమారున్ని ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్లే
యని, నా మాట ప్రకారము నా కుమారున్ని ఆరాధించక పోతే నన్ను
ఆరాధించనట్లేయని” కూడా చెప్పారు. ఇక్కడ 23వ వాక్యములో చెప్పిన
విషయమును చూస్తే ఖుర్ఆన్ 3-18లో చెప్పిన సారాంశమే గలదు.
‘మీకు ఒక్కడే ఆరాధ్యదైవము' అని చెప్పినట్లు ఇక్కడ కూడా 'మీరు కుమారున్నే
ఆరాధించండి, ఆయనే మీకు ఆరాధ్యదైవము' అని చెప్పినట్లు గలదు.
బైబిలులో యోహాన్ 5-24లో గల వాక్యమును చూస్తే, ఖుర్ఆన్లో
“నేను కూడా ఉన్నాను నాకు భయపడి ఉండండి" అన్నట్లు, “నన్ను పంపిన
వానియందు నమ్మకము ఉంచువాడు” అని మొదటి సృష్టికర్త అయిన దేవున్ని
గురించి చెప్పినట్లు గలదు. అలా మొదటి దేవుని మాట మీద విశ్వాసముంచి
రెండవ దేవున్ని ఆరాధన చేయువాడు మరణించిన తర్వాత రెండవ జన్మకు
తీర్పులోనికి రాకుండా నిత్య జీవమైన మోక్షమును పొందును అని
చెప్పియున్నాడు. ఖుర్ఆన్ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని చెప్పినట్లే ఈ
రెండు వాక్యములలో తండ్రి, కుమారుడు ఇద్దరు దేవుళ్ళున్నారని చెప్పి
యున్నారు. పరమాత్మకు భయపడి ఆయన మాటప్రకారము ఆత్మను
ఆరాధిస్తే వానికి మోక్షము కల్గునని కూడా చెప్పారు. మొదటి దేవున్ని
నమ్మి రెండవ దేవున్ని ఆరాధించవలెనని రెండు గ్రంథములలో చెప్పి
యున్నారు. ఖుర్ఆన్లో మొదటి దేవునికి భయపడండి అన్నారు. బైబిలులో
ఆయన మీద విశ్వాసముంచండి అన్నారు. అట్లే మొదటి సృష్ఠికర్తను లేక
పరిశుద్ధాత్మను తెలిసియుండి, ఆయన తయారు చేసిన దేవున్ని ఆరాధించమని
చెప్పాడు. ఎటు తిరిగి ఇద్దరు దేవుళ్ళ ప్రస్తావన రెండు గ్రంథములలో
వచ్చినది. కావున ఒక దేవుడు ఆరాధింపబడేవాడు. ఒక దేవుడు గుర్తు
ఉండవలసిన వాడు. విశ్వమును సృష్టించిన పరమాత్మను నమ్మి ఆయన
చెప్పిన జ్ఞానము ప్రకారము జీవరాసులను సృష్టిస్తూ, పోషిస్తూ, మరణింప
జేయుచూ, తిరిగి పాపపుణ్యముల లెక్కలో తీర్పు తీర్చి తిరిగి పుట్టునట్లు
చేయుచున్న ఆత్మను ఆరాధించవలెనని రెండు గ్రంథములలలోని నాలుగు
వాక్యముల సారాంశము గలదు.
ఇదే విషయమే ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో కలదు.
భగవద్గీతలోని జ్ఞానసారాంశమే మిగతా రెండు గ్రంథములలో ఉండుట
వలన మూడు గ్రంథములలో ఇద్దరు దేవుళ్ళ విషయము ఉంది. అని
చెప్పవచ్చును. భగవద్గీతలో మొదటి సృష్టికర్తను పురుషోత్తముడు మరియు
పరమాత్మయని చెప్పారు. రెండవ దేవున్ని ఆత్మయని చెప్పారు. పరమాత్మ
ఆత్మ విషయములను అనేక శ్లోకములలో చెప్పియున్నారు. అయితే ఏ
శ్లోకము ఏ ఆత్మకు అని చాలామందికి తెలియకపోవడము వలన, తర్వాత
మొదటికే భగవద్గీత జ్ఞానము హిందువులకు అర్థము కాకపోవడము వలన,
హిందువులు భగవద్గీతకంటే ముందునుండి అనేక దేవతలకు, దయ్యములకు,
చెట్లకు, పుట్లకు భక్తులుగా యుండి వాటినే ఆరాధించడము వలన
దేవుళ్ళు ఇద్దరనిగానీ, అందులో ఒకే దేవున్ని ఆరాధించవలెననిగానీ
తెలియకుండా పోయినది. బైబిలు, ఖుర్ఆన్ జ్ఞానమునకు మూలాధారము
తౌరాత్ (భగవద్గీత) అయినా క్రైస్తవులకు ముస్లీమ్లకు అర్థమయినంత
జ్ఞానము కూడా హిందువులకు అర్థము కాలేదు. వారు గ్రుడ్డిగా ఒకే
దేవుడు అన్నట్లు కూడా చెప్పలేకపోవుచున్నారు.
నేను ఈ రోజు ప్రతిపాదించిన త్రైత సిద్ధాంతము సత్యమైనదని
తెలియునట్లు త్రైత సిద్ధాంత సూత్రములు భగవద్గీతలోను, బైబిలులోను,
ఖుర్ఆన్లోను గలవు. నాకంటే ముందు హిందూమతములో ముగ్గురు
సిద్ధాంతకర్తలు వచ్చారు. మొదటివాడు ఆది శంకరాచార్యులవారు (కేరళ
నివాసి), రెండవవాడు విశిష్టాద్వైతమును ప్రతిపాదించారు ఈయన తమిళ
నాడు నివాసి. మొదట శంకరాచార్యుల వారు అద్వైతమును ప్రచారము
చేయగా, తర్వాత రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతమును ప్రచారము
చేశారు. తర్వాత కొంత కాలమునకు కర్నాటక నివాసి అయిన మధ్వాచార్యుల
వారు ద్వైతమును ప్రతిపాదించి చెప్పారు. ఈ మూడు సిద్ధాంతములలో
నేడు భూమిమీద అద్వైత, విశిష్టాద్వైతమే ఎక్కువగా యున్నది. ద్వైతము
పేరుకు మాత్రమే కలదు. ప్రస్తుత కాలములో ఆంధ్ర రాష్ట్రములో నివశించు
ప్రబోధానంద యోగీశ్వరులుగా యున్న నా చేత త్రైత సిద్ధాంతము ప్రతి
పాదించబడినది. నా చేత చెప్పబడిన త్రైత సిద్ధాంతమునకు శాస్త్రాధారము
గలదు. ముందు ప్రకటించబడిన మిగతా మూడు సిద్ధాంతములకు
శాస్త్రాధారము లేదు.
బ్రహ్మవిద్యా శాస్త్రముగా యున్న ప్రథమ దైవగ్రంథము తౌరాతు
(భగవద్గీత) లోను, ద్వితీయ దైవగ్రంథము ఇంజీలు బైబిలులోనూ, అంతిమ
దైవగ్రంథము ఖుర్ఆన్లోను మాచే చెప్పబడిన త్రైత సిద్ధాంతమునకు
ఆధారములున్నవి.
భగవద్గీత :
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున గల 16, 17 శ్లోకములలో
త్రైత సిద్ధాంతము కలదు.
క్షరుడు -జీవాత్మ (ఆరాధించే వాడు) సృష్టింపబడిన వాడు
అక్షరుడు - ఆత్మ (ఆరాధ్య దైవము) రెండవ సృష్టికర్త
పురుషోత్తముడు- పరమాత్మ (పరిశుద్ధాత్మ) మొదటి సృష్టికర్త
బైబిలు
బైబిలులో మత్తయి 28–19వ వచనములో త్రైత సిద్ధాంతము కలదు.
కుమారుడు - జీవాత్మ (ఆరాధించే వాడు) సృష్టింపబడిన వాడు
తండ్రి - ఆత్మ (ఆరాధ్య దైవము) రెండవ సృష్టికర్త
పరిశుద్దాత్మ -పరమాత్మ (అల్లాహ్) మొదటి సృష్టికర్త
ఖుర్ఆన్ :
ఖుర్ఆన్లో 50వ సూరా, 21వ ఆయత్లో త్రైత సిద్ధాంతము కలదు.
తోలబడేవాడు: జీవాత్మ (ఆరాధించే వాడు) సృష్టింపబడిన వాడు
తోలేవాడు:ఆత్మ (ఆరాధ్య దైవము) రెండవ సృష్టికర్త
సాక్షిగ ఉండేవాడు:పరమాత్మ (అల్లాహ్) మొదటి సృష్టికర్త
ఈ విధముగా మూడు దైవగ్రంథములలో మూడుచోట్ల త్రైత
సిద్ధాంతము చెప్పబడినది. అయినా త్రైత సిద్ధాంతమును గురించి హిందువు
లకు, క్రైస్తవులకు, ముస్లీమ్లకు తెలియకుండా పోయినది. ప్రజలకు
తెలియని దైవ సిద్ధాంతమును నేడు నా ద్వారా దేవుడు బహిర్పరచాడు.
నేడు త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినవారు ప్రబోధానంద యోగీశ్వరులు
అను పేరు వచ్చినది. ఐదువేల సంవత్సరములప్పుడు త్రైత సిద్ధాంతము
భగవద్గీత గ్రంథరూపములో యున్నా, ఈ త్రైత సిద్ధాంతమును సృష్ఠిఆదిలోనే
దేవుడు చెప్పాడు. సృష్ఠిఆదిలో చెప్పిన అదే సిద్ధాంతమే మూడు దైవ
గ్రంథములలో ఐదువేల సంవత్సరముల నుండి యున్నా, అది మనుషులలో
తెలియకుండా పోయిన దానివలన నేడు శాస్త్రబద్దముగా మా చేత చెప్పించ
బడినది. నేడు మేము త్రైత సిద్ధాంతమును చెప్పినా త్రైత సిద్ధాంతములో
గల ముగ్గురు పురుషుల మాట 1400 సంవత్సరముల పూర్వమే ఖుర్ఆన్
5వ సూరా 73వ ఆయత్లో వ్రాయబడియున్నది చూడండి.
సూరా 5, ఆయత్ 73 : అల్లాహ్ ముగ్గురిలో మూడవ
వాడు అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి
పాల్పడినట్లే, వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో
ఆరాధ్య దైవము లేనేలేడు. ఒకవేళ వారు తమ
మాటలను మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై
ఉండేవారికి బాధాకరమైన శిక్ష తప్పక యుంటుంది.
ఈ వాక్యము 1400 సంవత్సరములప్పుడు అంతిమ దైవగ్రంథము
ఖుర్ఆన్లో వ్రాయబడి యున్నది. అంటే ముగ్గురు పురుషులున్నారని
నేడు నేను చెప్పినమాట ఆనాడు వాక్యములో ఉందంటే నాకు కూడా
సంతోషమే. అయితే ఇక్కడ దైవము వేరు, ఆరాధ్యదైవము వేరు అని
రెండు రకముల దేవుళ్ళు కలరు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ముగ్గురి
వరుసలో మూడవవాడు నిజమైన పెద్ద దేవుడు అయినా, ఆయన ఆరాధ్య
దైవము కాదు అని చెప్పియున్నారు. మూడవవాడు నేను సృష్ఠికర్తనే అయినా
మీకు రెండవ వాడయిన ఆత్మే ఆరాధ్యదైవము అని సూరా 3, ఆయత్ 18
లోను, సూరా 16, ఆయత్ 51లో చెప్పియున్నారు. నేను కూడా అదే
విషయమునే చెప్పుతూ రెండవ ఆత్మే ఆరాధ్యదైవము అని చెప్పుచున్నాను.
రెండవవాడు కాదు అని మూడవవాడు అని అంటే అతడు సత్యతిరస్కారుడు
అని అన్నారు. అంటే సత్యమును ఒప్పుకోనివాడు అని అర్థము. త్రైత
సిద్ధాంతమును తెలిసినవాడు దేవుడు మూడవవాడు అనినా, ఆరాధ్య దైవము
రెండవవాడేయని చెప్పినట్లు మేము ముందే బోధించాము. నేడు త్రైత
సిద్ధాంతమును మా ద్వారానే ఇతరులు తెలియుచున్నారు. కావున మూడవ
ఆత్మయిన పరమాత్మను ఆరాధ్యదైవము అని ఎవరూ చెప్పరు. మనుషులను
సృష్టించిన ఆత్మనే ఆరాధ్య దైవముగా చెప్పునట్లు మేము ముందే విశధీకరించి
చెప్పాము. అందువలన త్రైత సిద్ధాంతములో ఆరాధ్యదైవము రెండవ
దేవుడయిన ఆత్మేనని, త్రైతము తెలిసిన అందరికీ తెలుసు. అయితే త్రైత
సిద్ధాంతము తెలియనివారు ఎందరో ఉన్నారు, వారు దేవుడు ఎవరు?
ఆరాధ్య దైవము ఎవరు? అని తెలియకపోవడము వలన దేవుని శిక్ష వారికి
తప్పదు.
ప్రశ్న :- భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగములో మీరు
ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పుచున్నారు. అక్కడ 16వ
శ్లోకములో క్షర, అక్షర అన్నప్పుడు క్షరము అనగా నాశనమయ్యేది
శరీరము, అక్షరము అనగా నాశనము కానివాడు జీవాత్మయని
అన్ని భగవద్గీతలలో వివరము వ్రాసియున్నారు. దాదాపు మూడు
వందల భగవద్గీతలలో ఎంతో పెద్ద స్వామీజీలు ఆ మాట
వ్రాసియున్నప్పుడు మీరు మాత్రము క్షరుడు అంటే జీవుడు,
అక్షరుడు అంటే ఆత్మయనీ క్రొత్త అర్థమును తెచ్చారు. ఎంతో
పెద్ద హేమాహేమీలయిన స్వామీజీలు చెప్పినదానికి మీరు
వ్యతిరేఖముగా ఎందుకు వ్రాశారు? అంతమంది చెప్పినది తప్పు,
మీరు చెప్పినది ఒప్పు అగునా? క్షరము అనగా నాశనమయ్యే
శరీరము అని అందరికీ తెలుసు కదా! దీనికి మీరు ఏమంటారు?
జవాబు :అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.
అను సూత్రము ప్రకారము ఎంతోమంది స్వాములు చెప్పినది
సత్యమని మీరు ఎందుకు అనుకోవాలి. వారంతా ముందు పుట్టినవారు,
పెద్దవారు అంటే నేను వారికంటే ముందునుండి ఉన్నవాడిని అని మీరు
ఎందుకు అనుకోకూడదు? నేను మొదటి నుండి హిందువులకు భగవద్గీత
అర్థము కాలేదని చెప్పుచునే యున్నాను. ఇప్పుడు భగవద్గీతను అందులోని
త్రైత సిద్ధాంతమును చిక్కు తీసినట్లు వివరముగా చెప్పుచున్నా అర్థము
చేసుకోకుండా ఎవరో ఏమో చెప్పారని అంటున్నారు. ఈ విషయమును
నన్ను అడగకుండా నేను చెప్పినది తప్పా, వారు చెప్పినది తప్పాయని
మీరు భగవద్గీతలోనే వెదకి చూడవచ్చును కదా! ఎన్నో సంవత్సరముల
నుండి ఎందరో పండితులు, స్వామీజీలు భగవద్గీతను వ్రాసి గొప్ప పేరు
పొందినది నిజమే! అంతమాత్రమున వారు చెప్పినది సత్యము అనుకోవడము
పెద్ద పొరపాటు. వారు సంస్కృత భాషలో పాండిత్యమును కల్గియుండ
వచ్చును గానీ జ్ఞానమును తెలిసియుండరు కదా! భగవద్గీతలో “ద్వావిమౌ
పురుషా” అని అన్నప్పుడు ఇద్దరు పురుషులు అని అర్థము కదా! తర్వాత
“ఉత్తమః పురుష స్వన్యః” అని చెప్పినప్పుడు ఉత్తమమైన పురుషుడు అన్యుడు
మరొకడు కలడని అతనినే పరమాత్మ అని అంటున్నామని చెప్పాడు.
మొదటి శ్లోకములో ఇద్దరు పురుషులని చెప్పారు. రెండవ
శ్లోకములో ఇద్దరికంటే ఉత్తమ పురుషుడు పరమాత్మయని చెప్పారు. అప్పుడు
ముగ్గురు పురుషులగుచున్నారు కదా! మిగతా అన్ని భగవద్గీతలలో ముగ్గురు
పురుషులని ఒప్పుకొని చెప్పుచున్నా మొదటి క్షర పురుషున్ని నాశనమయ్యే
శరీరము అని చెప్పుచున్నారు. ఇదెట్లున్నదంటే ఒకాయన ఇతరులతో
మాట్లాడుచూ “నాకు ముగ్గురు కొడుకులు, మొన్ననే ఒక కొడుకుకు పెళ్ళి
చేశాను. అయినా వచ్చిన అల్లుడు మంచివాడు కాదు. ప్రతిరోజు సారాయి
త్రాగి వచ్చి నా బిడ్డను కొట్టుతాడు" అన్నట్లున్నది. కొడుకులు ముగ్గురయితే
అల్లుడు ఎక్కడి నుండి వచ్చాడు అని ప్రశ్న వేయకుండా మనము వింటే
చెప్పేవానికంటే తెలివితక్కువవాడు వినేవాడు అవుతాడు. అదే విధముగా
ముగ్గురు పురుషులయినప్పుడు నాశనమయ్యేవాడు ఒకడు, నాశనము
కానివాడు మరొకడు అన్నప్పుడు, నాశనము అయ్యేవాడు అంటే రేపా,
ఎల్లుండా, సంవత్సరమునకా లేక ప్రళయములోనా అని ఆలోచించక ఈ
రోజే లేకుండా పోతాడు అనుకుంటే అది సత్యముకావచ్చు, కాకపోవచ్చు.
అట్లే నాశనమయ్యేవాడు అన్నప్పుడు ఎప్పుడు అని ఆలోచించక, ఎట్లు
అని ఆలోచించక నాశనమగునది శరీరము అన్నారు.
శరీరము ప్రకృతితో తయారగునది. ప్రకృతి స్త్రీతత్త్వము కలది.
నాకు భార్యలాంటిది. సర్వ జీవరాసులకు తల్లి అని చెప్పినప్పుడు శరీరము
ప్రకృతి అయిన స్త్రీ అని తెలిసినప్పుడు క్షర పురుషునిలోనికి స్త్రీ అయిన
శరీరమును ఎందుకు చెప్పాలి అని ఎవరూ ఆలోచించకుండా పోయారు.
పురుషోత్తమ ప్రాప్తి యోగముకంటే ముందు గల గుణత్రయ విభాగ
యోగములో మొదటి మూడు నాలుగు శ్లోకములలో ప్రకృతి జీవులకు
తల్లిలాంటిదని చెప్పారు. అప్పుడు ప్రకృతితో తయారయిన శరీరమును
స్త్రీగా పోల్చవచ్చును. స్త్రీ లింగమయిన శరీరమును పులింగమయిన క్షర
పురుషుని స్థానములో చెప్పడము తప్పని, వింతగా యుండునని ఆలోచన
చేయకుండా, ఎవరో పెద్దలని పేరు పెట్టుకొన్నవారు వ్రాస్తే, కొంతయినా
ఆలోచించక అదే సత్యము, మీదే అసత్యమని ప్రశ్నించుట ఎట్లున్నదో మీరే
ఆలోచించండి. క్షర పురుషుడు మోక్షము పొందినప్పుడు నాశనమయి
పోయి పరమాత్మగా మారునను ఉద్దేశ్యముతో ఆ మాటను క్షరుడు అని
చెప్పారుగానీ వేరే అర్థము తీసుకోకూడదు. శరీరములో నివశించువాడు
క్షర పురుషుడైన జీవాత్మ, మరణములో శరీరము నాశనమగునుగానీ క్షర
పురుషుడైన జీవాత్మ నాశనము కాదు. జీవాత్మ ఆత్మ చేత వేరే శరీరమును
చేరుచున్నాడు. మరణములో శరీరము నాశనమవగా, మోక్షములో జీవాత్మ
నాశనమగును. ఈ తారతమ్యము తెలియనివారు జీవాత్మను శరీరము
అనడము తప్పు.
మూడు ఆత్మలను ముగ్గురు పురుషులుగా చెప్పారు. ఇద్దరు
పురుషులు ఒక శరీరములో కొంత కాలముండి, తర్వాత జననములో
క్రొత్త శరీరమును చేరి, మరణముతో పాత శరీరమును వదలివేయుచున్నారు.
జీవాత్మ శరీరములో ఒకచోట ఉండగా, ఆత్మ శరీరమంతా వ్యాపించి
శరీరమునకు అధిపతిగా యున్నది. అంతేకాక శరీరములోని ప్రతి పనిని
ఆత్మే చేయుచున్నది. ఆత్మ చేయు ప్రతి పనిని పరమాత్మ చూస్తూయుండగా
జీవాత్మ ఆ పనిలోని కష్టసుఖముల అనుభవములను అనుభవించుచున్నాడు.
పరమాత్మ శరీరములో జీవాత్మ ఆత్మకు సాక్షిగాయుంటూ శరీరము బయట
అణువణువునా వ్యాపించియున్నది. అందువలన పరమాత్మను సర్వవ్యాపి,
సర్వదర్శియని అంటున్నారు.
తెలుగు భాషతో మొదలయిన ఆత్మజ్ఞానము చివరకు ముగ్గురు
పురుషుల వరకు ప్రాకినది. అయితే మనుషులు తెలుగు భాషను నేర్చు
కొన్నారుగానీ అందులో నిక్షిప్తమైయున్న జ్ఞానమును తెలియలేకపోయారు.
కొందరు తెలుగు భాషలో పండితులుగా పేరు పొందినా, వారికి కూడా
ఆత్మ, పరమాత్మల విషయము తెలియకుండా పోయినది. తెలుగు భాష
రెండు రకములుగా యున్నది. ఒకటి అంకెలుగా, రెండు సంఖ్యలుగా.
తెలుగు అంకెలనే తెలుగు అక్షరములు అని చెప్పవచ్చును. తెలుగు అంకెల
ద్వారా అనగా తెలుగు అక్షరముల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానమును తెలియ
గలిగాము. అట్లే తెలుగు సంఖ్యల ద్వారా కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును
తెలియుటకు అవకాశముండునట్లు మన పెద్దలు సంఖ్యలను అమర్చి
పెట్టారు. ఇంతవరకు తెలుగు భాషలోని అక్షర జ్ఞానమును సంపూర్ణముగా
తెలియగలిగాము. ఇప్పుడు సంఖ్యల జ్ఞానమును కూడా ఎలా కలదో
పరిశీలిద్దాము.
ఈ ప్రపంచము లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడూ
ఉన్నాడు, అప్పుడూ యున్నాడు. అయితే ఆయన ఎట్లుండేది ఎవరికీ
తెలియదు. ఆయన అన్నిటికీ అతీతుడు, దేనికీ తెలియువాడు కాడు.
అటువంటి దేవుడు తన ఉనికిని బయటికి తెలియజేయాలనుకొన్నాడు.
అప్పుడు ఆయన సంకల్పము జరుగుచూ వచ్చినది. ఎవరికీ తెలియని
ఆది దేవుడు మొదట తననుండి ప్రకృతిని విడుదల చేయాలనుకొన్నాడు.
తర్వాత తాను స్వయముగా మూడు భాగములుగా తెలియాలనుకొన్నాడు.
తర్వాత అట్లే ప్రకృతిని తయారు చేశాడు. తర్వాత వెంటనే మూడు ఆత్మలను
తయారు చేశాడు. తెలియని దేవుని నుండి తెలిసే విధముగా నాలుగు
భాగములు వచ్చినవి. ఆ నాలుగులో మూడు పురుషతత్త్వము మరియొకటి
స్త్రీ తత్త్వముగా ఉండునట్లు చేశాడు. దీనినిబట్టి దేవుడు రెండు విధములుగా
బయటికి తెలిసాడు అని చెప్పవచ్చును.
ఈ విధముగా తయారు కాకముందు తయారు అయ్యే వాటికి
అనుగుణముగా కొన్ని గుర్తులు తయారైనవి. ఆ గుర్తులనే సంఖ్యలు అని
అన్నాము. అట్లే మరియొక విధమైన గుర్తులు కూడా తయారైనవి. వాటిని
అంకెలు అన్నారు. ఈ విధముగా దేవుడు వ్యక్తమగు జ్ఞానమును తెలియ
జేయుటకు దేవుడు ఏర్పరచిన రెండు రకముల గుర్తులనే సంఖ్యలు, అంకెలు
అన్నారు. భూమిమీద దేవుని జ్ఞానము సంఖ్యలు, అంకెల రూపములో
తయారైనది. ఈ అంకెలు, సంఖ్యలు కలిపి బ్రహ్మవిద్యా శాస్త్రము అని
అంటాము. సంఖ్యలు, అంకెల రూపములో తయారయినదే బ్రహ్మవిద్యా
శాస్త్రము. ఈ బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి దేవున్ని కనుగొనునట్లు,
దేవున్ని తెలియునట్లు అవకాశమును కల్పించాడు. ఈ గ్రంథము
మొదలులోనే మొదట తయారయిన అంకెలను చూపించి వాటిలో దైవ
జ్ఞానము ఇమిడియున్నదని చెప్పాము. ఓం అనునది ప్రథమాక్షరము అంకెల
రూపములో యున్న తెలుగు భాషగా యున్నది. ఇంతకుముందే “లు”
అను పేరుతో ఒక గ్రంథమును ఇచ్చాము. అందులో తెలుగు అను
పదములో 'లు' అను అక్షరము ఎంత విలువగా యున్నదో కూడా చెప్పాము.
ఆ రోజు తెలుగు భాషగా గుర్తింపబడిన గుర్తులలో దైవజ్ఞానము ఇమిడి
యున్నదని చెప్పుకొన్నాము.
అంకెల విధానములో ఓమ్, న, మ, శి, వా, య అను ఆరు
అక్షరములు మొదట తయారైనవని చెప్పాము. ఏ విధముగా మొదట
ఓమ్ దేవుని గుర్తుగా అంకెలతో తయారయినదో, అదే విధముగా సంఖ్యలలో
మొదట ప్రకృతి గుర్తుగా ఒక చిహ్నము తయారైనది. అంకెలలో ఓమ్
దేవుని గుర్తుకాగా, సంఖ్యలలో మొదట ప్రకృతి గుర్తు తయారయినది.
దీనినిబట్టి దేవుడు సంపూర్ణముగా తెలియాలి అంటే ప్రకృతిని తెలిసినప్పుడు
అసలయిన దేవుడు తెలియబడును. అందువలన దేవుడు రెండు విధములుగా
వ్యక్తము అయినాడు. అంకెల విధానములో భాష తయారు కాగా దాని
పేరు తెలుగు భాషయని పేరు పెట్టుకొన్నాము. ఆ విధముగా తెలుగు
అను పేరు పెట్టుకొనేదానికి ఎంతో అర్థము కలదని ఇంతకుముందే “లు”
“తెలుగు” అను గ్రంథములో చెప్పుకొన్నాము. ఇప్పుడు రెండవ ప్రకృతి
విధానములో అనగా ప్రకృతివైపు నుండి చూస్తే దేవుడు ఎట్లు తెలియునో,
సంఖ్యల ద్వారా వివరించి తెలుసు కొందాము.
ఇదంతా ఎప్పుడో సృష్ఠి ఆదిలో జరిగింది అని మీరే అంటున్నారే,
అప్పుడు జరిగిన విషయమును ఇప్పుడు మీరు ఎలా తెలియజేయగలరు.
మీరు చెప్పినదంతా అభూతకల్పన కాదా!యని ఇతరులు నన్ను ప్రశ్నించుటకు
అవకాశము గలదు. వాస్తవమే! ఎప్పుడో జరిగినది, ఎవరికీ తెలియనిది
నీకెట్లు తెలియును మేమెందుకు నమ్మాలి అని ఇతరులు నన్ను అడగడములో
న్యాయము గలదు. ఇదంతయు సృష్ట్యాదిలో జరిగినదే ఆనాడు నేను లేను
నీవు లేవు, ఎవరూ లేరు. అటువంటి సమయములో జరిగిన విధానము
నాకే కాదు ఎవరికీ తెలియుటకు అవకాశమే లేదు. నాకు ఏమాత్రము
తెలియదని పూర్తిగా ఒప్పుకొంటున్నాను. అయినా నాకు తెలియని దానిని
నేను చెప్పడము నాకు కూడా వింతగానేయున్నది. ఈ విషయమును నేను
నమ్మాలా లేదా అను సంశయము కూడా ఒకమారు వచ్చినది. అయినా
ఇదంతయు పూర్తి సత్యమని నమ్ముచున్నాను. మిమ్ములను నమ్మమని నేను
చెప్పడము లేదు. మొదట మీరు ఇది నమ్మదగిన విషయమా కాదా!యని
ఆలోచించండి. మీ ఆలోచనలో నమ్మవచ్చు అని తెలిస్తే నమ్మండి లేకపోతే
నమ్మవద్దండి. నేను బలవంతము చేసి మీరు నమ్మండని చెప్పడము లేదు.
ద్వితీయ దైవగ్రంథము ఇంజీలు (బైబిలు)లో మత్తయి సువార్త
10వ అధ్యాయమందు 20వ వచనములో ఈ విధముగా కలదు.
మత్తయి. 10-20 “మీ తండ్రి ఆత్మ మీలో యుండి మాటలాడు
చున్నాడేగానీ మాటలాడువారు మీరు కాదు”
అని యున్నది. ఈ వాక్యమునుబట్టి ఏ మనిషి స్వయముగా మాట్లాడడము
లేదు అనీ, ఆత్మ పలికిస్తేనే పలుకుతున్నాడని తెలియుచున్నది. అట్లే
అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో “మీ శరీరములో నేను
కార్యకర్తగా యున్నానని, అన్ని పనులు నేనే చేయు
చున్నానని” సూరా 2, ఆయత్ 255 లోను మరియు సూరా 6,
ఆయత్ 102 లోను ఇంకను చాలాచోట్ల చెప్పియున్నారు. భగవద్గీతలో
కూడా “నీవు ఏమీ చేయడము లేదు, అన్నీ నేనే చేయు
చున్నానని” చెప్పియున్నాడు. దీనినిబట్టి నాకు తెలియని విషయము
నాలోనుండి చెప్పబడినా అది నేను చెప్పునది కాదు అని నేను తెలుసుకో
గల్గినాను. శరీరములోని దేవుడు చెప్పినది సత్యమేయని నేను పూర్తిగా
నమ్ముచున్నాను. మీ విషయము నాకు తెలియదు.
ఆధ్యాత్మికమును అనగా ఆత్మ విధానమును తెలియుటకు కొంత
ప్రకృతిని కూడా తెలియవలసియున్నది. ఆత్మ పురుషుడు అనుటకు స్త్రీ
ఉన్నప్పుడే అలా చెప్పుటకు వీలగును. అందువలన స్త్రీ తత్త్వమైన ప్రకృతిని
దేవుడు తయారు చేసి, పురుషతత్త్వమైన ఆత్మను తయారు చేశాడు. దేవుని
నిర్ణయము ప్రకారము ప్రపంచము తయారైనది. ప్రపంచములో ఆత్మకు
గుర్తుగా పురుషులు, ప్రకృతికి గుర్తుగా స్త్రీలు కనిపించుచున్నారు. ప్రకృతికి
ఆత్మకు తయారైనవే జీవరాసులు అని చెప్పవచ్చును. అనగా స్త్రీ తత్త్వముతో
మరియు పురుషతత్త్వముతో సర్వజీవరాసులు తయారైనవి. అదే నేడు
కనిపించే జీవరూపమైన విశ్వము. స్త్రీలు ప్రకృతికి గుర్తుకాగా, పురుషులు
ఆత్మకు గుర్తుకాగా ప్రకృతి పురుషుల వలన పుట్టిన జీవుల గుర్తుగా
నపుంసకులను దేవుడు తయారు చేసియుంచాడు. తల్లి తండ్రికి పుట్టిన
వ్యక్తిలో తల్లి పోలికలు కొన్ని, తండ్రి పోలికలు కొన్ని ఉండడము
చూస్తున్నాము. అలాగే ప్రకృతి పురుషులకు పుట్టిన జీవునికి గుర్తుగా
కొంత స్త్రీ, కొంత పురుష లక్షణములుగల నపుంసకున్ని దేవుడు చూపడము
జరిగినది. నపుంసకుడు జీవునికి గుర్తుకాగా, స్త్రీ ప్రకృతికి గుర్తుకాగా,
పురుషుడు ఆత్మకు గుర్తుగా యున్నాడు. ప్రకృతికంటే దేవుడయిన వాడే
గొప్ప అని తెలియునట్లు స్త్రీ శరీరము బలములో తక్కువగాయుండగా,
పురుష శరీరము బలములో, ఆకారములో కూడా పెద్దగా దృఢముగా
ఉండును. స్త్రీల శరీరములు పురుషునికంటే ఆకారములో బలహీనముగా
యుండును. ప్రకృతి పురుషులకు (ఆత్మకు) పుట్టిన నపుంసకుడు
మధ్యరకముగా ఉండడము కూడా చూస్తున్నాము. ఇదంతా బయటికి
కనిపించే విధానము. కనిపించని విధానమును సృష్ఠిఆదిలో జరిగిన
మార్పును చూస్తే, అంకెల విధానము ఒక భాషగా ఏర్పడినది. అట్లే
భాషలో భాగముగా సంఖ్యల విధానము కూడా ఏర్పడినది. దానిని ఇప్పుడు
తెలుసుకొందాము.
చిత్రం కొరకు 60 పేజీ చూడండి.
ఆదిలోని కనిపించని దేవుడు మొదట ప్రకృతి విధానమును
చూపుచూ ఒకే గీత గుండ్రని వలయముగా యున్నట్లు చూపాడు. దాని
ఆకారము క్రింది చిత్రముగా ఉన్నది.
ప్రకృతిని గుర్తుగా చూపుచూ ఒక వలయాకారమును దేవుడు
తయారు చేశాడు. ఆ వలయము ఎటువైపు చూచినా ఐదు గీతలు ఉన్నట్లు
తెలియుచున్నది. దీనినిబట్టి ప్రకృతి ఐదు భాగములుగా యున్నదని తెలియు
చున్నది. ప్రకృతి ఐదు భాగములకు ఐదు వలయములు గలవని అర్థమగు
చున్నది. తర్వాత ప్రకృతి నుండి అనగా స్త్రీ నుండే తయారు కావలెనని
లేక పుట్టుచున్నవని తెలియునట్లు ఆ వలయములోని రెండు గుర్తుల రెండు
రేఖలను తీసుకొని ఒక గుండ్రని ఆకారముగా తయారు చేశాడు. తర్వాత
రెండు గుర్తుల రేఖలను కలిపి గుండ్రని ఆకారమును తయారు చేశాడు.
మిగిలిన ఒక గుండ్రని గుర్తును సగము గుండ్రని ఆకారముగా తయారు
చేశాడు. రెండు గుండ్రని రేఖలను ఇలా ఒక గుండ్రని ఆకారముగా
తయారు చేశాడు దానిని అర్థమగుటకు చిత్రరూపములో చూస్తాము.
ఈ విధముగా నాలుగు గుర్తుల రేఖలను, రెండు గుండ్రని
ఆకారములుగా తయారు చేశాడు. స్త్రీ నుంచే పురుషుడు పుట్టుచున్నా
డనుటకు గుర్తుగా ప్రకృతిగా చూపిన ఐదు వలయముల నుండి నాలుగు
వలయములతో తయారయిన రెండు గుండ్రని భాగములను రెండు ఆత్మలుగా
పోల్చి చెప్పాడు. తర్వాత మిగిలిన ఒక వలయమును తీసి సగము సున్నాగా
చూపాడు. అది ఇలా కలదు.
చిత్రం కొరకు 62 పేజీ చూడండి.
ఈ విధముగా తయారయిన సగము సున్నాను రెండు సున్నాల
ప్రక్కన యుంచాడు. అప్పుడు ఇలా కనిపిస్తావుంది.
ఈ విధముగా మూడు సంఖ్యలు తయారైనాయి.
సంఖ్యలను కలిపి చూడగా అదియే శతముగా (వందగా) నూరుగా
తయారైనది. సంఖ్యలలో ఒకటి దానిప్రక్కన రెండు సున్నాలను పెట్టితే
నూరు లేక వంద అని అంటాము. అట్లే శతము అని కూడా అంటాము.
అంకెలు బ్రహ్మవిద్యా శాస్త్రముగా తయారుకాగా, దానిలోని భాగముగా
సంఖ్యాశాస్త్రము తయారైనది.
1) ఆకాశము 2) గాలి 3) అగ్ని 4) నీరు 5) భూమి. ఒకటవ
నంబరు ఆకాశము పైన ఉండగా, దానిక్రింద రెండవ నంబరు గాలి కలదు.
గాలి క్రింద మూడవ నంబర్ అగ్ని కలదు. దానిక్రింది నాల్గవ నంబరు
నీరు కలదు. దానిక్రింద ఐదవ నంబర్ భూమి కలదు. క్రింద భూమి
ఉండగా భూమిమీద నీరు చెరువుల రూపములో, నదుల రూపములో,
సముద్రముల రూపములో ఉండడము చూస్తూనే ఉన్నాము. ఈ విధముగా
ఒకదాని తర్వాత ఒకటి ఉండగా చివరిలో ఆకాశము గలదు. దీనినే
ప్రకృతి గుర్తుగా దేవుడు వలయమును తయారు చేసి, ఆ వలయముల
నుండి తీసుకొన్న గీతలతో ౧౦౦ ను తయారు చేసాడు.
చిత్రం కొరకు 63 పేజీ చూడండి.
చిత్రం కొరకు 64 పేజీ చూడండి.
ఈ విధముగా ప్రకృతి నుండి ముగ్గురు పురుషులు తయారైనట్లు
సూచించారు. ఇక్కడ మూడు గుర్తులను ప్రక్క ప్రక్కగా వ్రాస్తే...
శతముగా కనిపించుచున్నది. అనగా జీవాత్మ, దానిప్రక్కన ఆత్మ, దాని
ప్రక్కన పరమాత్మ యున్నట్లు తెలియుచున్నది. ఈ విధముగా శతము
అను మూడు సంఖ్యల నుండి మూడు ఆత్మలను గుర్తించవచ్చును. రెండు
సున్నాలు సంపూర్ణముగాయుండి ఆత్మ పరమాత్మగా యుండగా, సగము
సున్న రెండు ఆత్మలకంటే తక్కువదన్నట్లు అదే జీవాత్మ అని తెలియునట్లు
జ్ఞానులు సంఖ్యాశాస్త్రమును తయారు చేసి శతమును చూపారు. సంఖ్యా
శాస్త్రము బ్రహ్మవిద్యా శాస్త్రమునకు అనుబంధముగా యున్నది. సంఖ్యా
శాస్త్రమునే నేడు గణిత శాస్త్రము అని కూడా అంటున్నాము. ఈ గణితములో
జీవాత్మకు, ఆత్మకు, పరమాత్మకు గుర్తుగా యున్న సంఖ్యలు కూడా కలవు.
వాటిని ఇంకొక పద్ధతిలో అర్థము చేసుకొందాము.
మూడు ఆత్మల సిద్ధాంతమే త్రైత సిద్ధాంతము. ఆ త్రైత సిద్ధాంతము
నకు గుర్తుగా మూడు సంఖ్యల గుర్తును పెద్దలు నిర్ణయించడము జరిగినది.
జీవాత్మగా యున్న మనము దేవుడుగా యున్న ఆత్మను, ఆత్మ దేవున్ని
సృష్టించిన పరమాత్మను తెలియవలసియున్నది. అయినా వారు తెలియబడని
వారుగా యున్నారు. తెలియబడనివారుగా యున్నందున వారిరువురినీ
రెండు సున్నాలుగా చూపి, తెలియవలసిన జీవున్ని సగము సున్నాగా
చూపడమైనది. ఈ విధముగా చూపిన మూడు సంఖ్యల గుర్తును మూడు
అక్షరముల శతముగా చెప్పడమైనది. మూడు సంఖ్యలు మూడు ఆత్మలకు
గుర్తులుగా చెప్పారు క్రింద చూడండి.
జీవాత్మ
ఆత్మ
పరమాత్మ.
ఇట్లు మూడు గుర్తులను జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా చూపడమే
గాక పూర్తి వివరముగా సంఖ్యలలో ఇంతకుముందే 3, 6, 9 అని చెప్పి
యున్నాము. 3, 6, 9 తెలుగు భాష కాదు ఇవి ఆంగ్ల భాష సంఖ్యలు.
తెలుగు భాషలో 3, 6, 9 ప్రత్యేకముగా యుంటూ, ప్రత్యేకమైన జ్ఞానమును
బోధిస్తున్నవి. ఆంగ్ల భాషలో యున్న 3, 6, 9 సంఖ్యలను తెలుగులో
వ్రాసుకొంటే 3 ౬ అని కలదు. తెలుగు భాషలో సంఖ్యలను
వ్రాసుకొంటే ౧౨౩౪౩౫౬౭౮౯౧౦ అని వ్రాయవచ్చును.
ఇంగ్లీష్ భాషలో సంఖ్యలకంటే తెలుగు భాషలో సంఖ్యలు విశేష అర్థము
కల్గియున్నవి. ౧౧౨౩౪ ౫౬౭౮౯ ఇందులో మొదటి రెండు
సంఖ్యలను వదలి చూస్తే మూడు కలదు. తర్వాత రెండు సంఖ్యలను
వదలి చూస్తే ఆరు కలదు. దాని తర్వాత రెండు సంఖ్యలను వదలి చూస్తే
తొమ్మిది కలదు. మూడు సంఖ్యను జీవాత్మగా, ఆరు సంఖ్యను ఆత్మగా,
తొమ్మిది సంఖ్యను పరమాత్మగా చెప్పుకొన్నాము.
3౬౯ అంటే జీవాత్మకు గుర్తుగా, ౯౬3 అంటే పరమాత్మకు
గుర్తుగా చెప్పుకొన్నాము. అంతేకాక ౬౬౬ ని మాయకు నంబర్గా,
౯౬౩ను సృష్టికర్త గుర్తుగా చెప్పుకొన్నాము. అంతేకాక అన్నిటికీ మధ్యలో
గల ఆరును ఆరాధ్యదైవమైన దేవుడుగా అనగా ఆత్మగా చెప్పుకొన్నాము.
ఈ విధముగా గణితములో యున్న సంఖ్యలను ఆధ్యాత్మికముతో
పోలియుండునట్లు మన పెద్దలు అమర్చి సంఖ్యాశాస్త్రమైన గణిత శాస్త్రమును
తయారు చేశారు.
ఈ గ్రంథముతోపాటు “దేవుని గుర్తు 963” అను గ్రంథమును
చదివితే ఇక్కడ చెప్పిన జ్ఞానము కూడా బాగా అర్థమగును. అట్లే “లు”,
“తెలుగు” అను గ్రంథమును చదివితే తెలుగు భాష గొప్పతనము పూర్తిగా
తెలియగలదు. ఈ రెండు గ్రంథములు గతములో మా చేత వ్రాయబడినవే
యని చెప్పుచున్నాము.
ప్రశ్న :- మీరు దైవజ్ఞానమని, ఆధ్యాత్మిక జ్ఞానమని ఎన్నో
విధముల అర్థమగునట్లు విశధీకరించి చెప్పుచున్నారు. అయితే
కొందరు పూర్తి ధనము, పూర్తి అధికారము లేకున్నా కొద్దిపాటి
ధనము, కొద్దిపాటి అధికారమున్న చిన్న ఉద్యోగములు చేయు
వారు కూడా మిమ్ములను హేళనగా మాట్లాడుచూ, జ్ఞానము
అను పేరుతో అమాయకులను మోసము చేస్తున్నారు అని
అంటున్నారు. పోలీస్ డిపార్టుమెంట్లో చిన్నపాటి ఉద్యోగము
లయిన S.I, C.I లుగా ఉంటూ కొద్దిపాటి అధికారముతోనే ఎంతో
గొప్ప యోగీశ్వరులయిన మీలాంటి వారిని కూడా లెక్కచేయక,
ఏమాత్రము గౌరవమును కూడా ఇవ్వక వాడు వీడు అని
మాట్లాడు చున్నారు. మీలాంటి వారి దగ్గర జ్ఞానము తెలుసుకొనే
వారిని చూచి, మీరు ఇంత టెక్నాలజీ అభివృద్ధియైన కాలములో
కూడా వెనక్కు రాతియుగములోనికి పోవుచూ, దేవుడు జ్ఞానము
అంటున్నారు. మీలాంటి వారు జ్ఞానము అనుచు ఇతరుల
దగ్గర మోసపోవుచున్నారు అని జ్ఞానము తెలుసుకొంటున్న వారిని
చులకనగా మాట్లాడుచున్నారు. వారు మాట్లాడు మాటలను
చూస్తే జ్ఞానులు తలదించుకోవలసి వస్తున్నది. ఇటువంటి వారిని
గురించి మీరేమంటారు?
జవాబు :- ఈ విధముగా మాట్లాడువారు త్రేతాయుగము నుండి కనిపిస్తూనే
యున్నారు. ప్రతి దానిని దేవుడు అనగా వారి శరీరములలోని ఆత్మగా
యున్నవాడు గమనిస్తూనే యున్నాడు. దీనికంతటికీ తీర్పు చనిపోయిన
రోజు వుంటుంది అని మనకు కూడా తెలుసు. పూర్వజన్మలో కొంత
పుణ్యమును సంపాదించుకొన్న దానివలన కొంత బాగా బ్రతికే జీవితాన్ని
దేవుడిస్తే, దేవుడను విశ్వాసము లేకున్నా, వారి బ్రతుకువారు బ్రతుకుతున్నా
ఫరవాలేదు. అట్లు కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానులను హేళనగా మాట్లాడడము
వలన వారు తర్వాత జన్మలో భయంకరమైన జీవితమును గడుపవలసి
వచ్చునని దైవ గ్రంథములలో దేవుడు ముందే చెప్పియున్నాడు. వారి
విషయమును మనము చెప్పుకొన్నా ఏమీ ప్రయోజనము లేదు. వారు ఏ
విధముగా మారరు. దేవుడు అటువంటివారికి ఎటువంటి శిక్షలు నిర్ణయించి
పెట్టినది దైవగ్రంథములలో చెప్పియున్నారు. వారి విషయము అటుంచి
మనము దైవమార్గము నుండి ప్రక్కకు పోకుండునట్లు, దేవున్ని వేడుకొని
దేవునిమార్గములో ప్రయాణించునట్లు ప్రయత్నిద్దాము.
దేవుడు ప్రథమ దైవగ్రంథములో దైవాసుర సంపద్విభాగ యోగము
అను అధ్యాయములో 18, 19, 20 శ్లోకములలో ఎలా చెప్పాడో చూడండి.
“అటువంటి వారికి అహంకారము ఎక్కువై, గర్వముతో తమ శరీరములోను,
ఇతరుల శరీరములోను ఉన్న నన్ను అసూయతో ద్వేషించి మాట్లాడు
చుందురు. వారు మంచిని ద్వేషిస్తూ, జ్ఞానమును దూషిస్తూయుందురు.
అటువంటివారిని అజ్ఞానులందే పుట్టించుచూ, మాయలోనే మునిగి యున్నట్లు
చేసి, జన్మ జన్మకు అజ్ఞానమువైపు పోవుచుందురు. వారికి నా జ్ఞానము
యొక్క గట్టు ఏమాత్రము దొరకకుండా చేసి, అంతకంతకు అధమగతికి
పంపుదును” అని చెప్పాడు. అదే ద్వితీయ దైవగ్రంథములో “ఆత్మను,
ఆత్మజ్ఞానమును దూషించినవానికి రెండు యుగముల పర్యంతము
నిత్యపాపమును అనుభవించునట్లు చేస్తాను” అని కూడా చెప్పాడు. ఈ
విధముగా దైవ గ్రంథములలో వారికి శిక్షలు నిర్ణయించబడియున్నాయి.
అటువంటివారిని మనలాంటి వారు ఏమీ చేయలేము. దేవుడే వారిని తన
శిక్షలలోనికిలాగును. లోకములో అజ్ఞానులు జ్ఞానులను హేళనగా
మాట్లాడడము త్రేతాయుగము నుండి జరుగుచున్నది. ఇప్పుడు కూడా
ఉన్నారు కదా! వారిని వదలి మీరు జ్ఞాన సంబంధ ప్రశ్నలు అడగండి.
ప్రశ్న : మేము అడిగేది జ్ఞానసంబంధ విషయమే కదా!
మీరు సామాన్యమైన మనిషి కాదని మాకు తెలుసు. మేము
చూచినంతలో మీరు చెప్పితే భయంకరమైన రోగములు
ఇతరులకు లేకుండా పోయాయి. ఎందరో దేవతలు మీ
మాటలను గౌరవించారు. మీ జీవితములో జ్ఞానమును చెప్పడమే
కాక ఎన్నో అద్భుతమైన జ్ఞాన రహస్యాలను చెప్పారు. మీ
గ్రంథాలలో ప్రత్యక్షముగా ఎన్నో మహత్యములను చూచాము.
అందులో ఒక్కటి కూడా చేతకాని అజ్ఞానులు మిమ్ములను
ఎదురించి మాట్లాడడము చూచాము. ఇతరులు రోగములను
పోగొట్టిన మీరు, మీ రోగములకు మందులు ఎందుకు వాడు
చున్నారని అడిగారు. నేను ఎంతటివాడినైనా సర్వసాధారణ
మనిషిగా యుంటానని చెప్పిన విషయము వారికి తెలియకనే
మాట్లాడుచున్నారు. మీరు అటువంటి దుర్మార్గులను ఏమీ
చేయలేరా?
జవాబు :- నేను ప్రతీకారముగా ఏమయినా చేయుటకు అందరిలాంటి
మనిషిని కాదు. నేను బొమ్మలాంటివాడిని. ఆడించేవాడు నా శరీరములో
యున్న దేవుడు. నా ద్వారా గొప్ప కార్యములు జరిగియుండడము వాస్తవమే.
అది నాలోయున్న దేవుని మహిమేగానీ, నా ప్రమేయమేమి లేదు అని
చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా అన్నిటినీ దేవుడే చూస్తాడు అని చెప్పు
చున్నాను.
మేము ఎంతటివారము మా గొప్పతనమేమి, మా మనస్తత్వము
ఏమిటియని తెలియుటకు సాక్ష్యముగా మా గ్రంథములు చదివిన బెంగుళూరు
జైలులో యున్న ఇద్దరు ఖైదీలు వ్రాసిన విధానమును చూస్తే ఎవరికైనా
అర్థము కాగలదు. మా విషయము ఏమాత్రము తెలియనివారు, ఎంత
అరచినా వారిని మేము మొరిగే కుక్కలుగా లెక్కించుకుంటాము. అజ్ఞానులే
మమ్ములను విమర్శించుచున్నారు గానీ, జ్ఞానులు అందరూ నన్ను
ప్రశంసించుచున్నారు.
చిత్రం కొరకు 70 పేజీ చూడండి.
చిత్రం కొరకు 71 పేజీ చూడండి.
మేము ఇంతవరకు 3 69 అను అంకెలను ఆధ్యాత్మిక భావముతో
కూడిన అర్థమును తెలియజేస్తూ వచ్చాము. అయితే 3 6 9 ని గురించి
మిగతా శాస్త్రవేత్తలు కూడా వారి భావమును ప్రకటించి యుండడమును,
గణిత శాస్త్రములో ఎంతో విజ్ఞానమును సంపాదించుకొన్న శాస్త్రవేత్తలు,
పరిశోధకులు 3, 6, 9 ని గురించి వ్రాసియున్న చిత్రపటములను ఇప్పుడు
మీకు చూపుటకు ప్రచురించాము. అవి అన్నియూ మేము చెప్పిన దానికి
బలమును చేకూర్చునట్లుండుట వలన, వారు చెప్పిన విషయములను
ప్రచురించడము జరిగినది. ఇక్కడ మొదటయున్న శాస్త్రవేత్త పేరు నికోలా
టెస్లా (Nikola Tesla). ఈయన కరెంటును కనుగొన్న వ్యక్తి. ఆయన “3,
6, 9 యొక్క విశేషతను తెలుసుకొంటే విశ్వమును గురించి తెలుసుకొను
అవకాశము గలదు" అని వ్రాసియుండడము ఖగోళశాస్త్రమునకు
సంబంధించిన విషయమైనా, అది బ్రహ్మవిద్యాశాస్త్రమునకు చాలా దగ్గర
సంబంధమున్నది. అలాగే ప్రపంచములో పెద్ద సైంటిస్టని పేరుగాంచిన
ఐన్స్టీన్ (Einstein) గణిత శాస్త్రము ప్రకారము 6-3=6 అని వ్రాసిన
అంకెలను చూస్తూనే ఆధ్యాత్మికము గుర్తుకు వచ్చుచున్నది. ఇద్దరు
శాస్త్రవేత్తలు వారి భావములలో ఏ అర్థముతో చెప్పినా, మా భావములో
దేవుడు విశ్వములో 3, 6, 9 గా యున్నాడనీ, 3, 6, 9 నే జీవాత్మ, ఆత్మ,
పరమాత్మగా చెప్పుచున్నామనీ ఈ గ్రంథములో మొదటనే చెప్పుకొన్నాము.
అదే ప్రకారమే ఇప్పుడు ఈ చిత్రపటములకు వివరమును చెప్పుకొందాము.
మొదటి చిత్రములోని శాస్త్రవేత్తను గమనించితే ఒక చేతితో
వెలుగుచున్న లైటును చూపుచూ మరియొక చేతితో ఒక వ్రేలిని తలలోని
మెదడువైపుకూ, మరియొక వ్రేలిని నోటివైపుకూ, మూడవ వ్రేలిని శరీరము
వైపుకూ చూపుచున్నాడు. ఆ దినము ఆ వ్యక్తిలో ఆరుగాయున్న రెండవ
ఆత్మ ఏ భావమును అందించినదో నాకు తెలియదుగానీ, ఇప్పుడు మనకు
అవసరమైన ఆధ్యాత్మిక భావమునే నాలో ఆరుగా యున్న రెండవ ఆత్మ
అందించిన విషయమునే తెలియజేస్తున్నాను. జీవమున్న శరీరమును
వెలుగుచున్న బల్బుతో సమానముగా పోల్చి ఒక చేతితో చూపుచున్నాడు.
వెలగని బల్బు జీవము లేని శరీరములాంటిది. ఒక బల్బు వెలగాలంటే
దానికి పాజిటివ్, నెగిటివ్, ఎర్త్ అను మూడు అమరికలుంటాయి. అలాగే
ఒక శరీరము సజీవము కావాలంటే దానిలోపల జీవాత్మ, ఆత్మ, పరమాత్మ
అను మూడు ఆత్మలుండాలి. ముఖ్యముగా బల్బు వెలుగుటకు పాజిటివ్,
నెగిటివ్ (ధన ధృవము, ఋణధృవము) అను రెండు అమరికలున్నా మూడవ
అమరిక ఎర్త్ (భూమి) అను అమరిక తప్పనిసరిగా అనుసంధానమై
యుండును. దీనిని గురించి తెలియుటకు ఒక ప్లగ్ సాకెట్ను తర్వాత
పేజీ పటములో చూస్తే బాగా అర్థమగును.
చిత్రం కొరకు 73 పేజీ చూడండి.
ఒక వెలుగుచున్న బల్బును చూపిన నికోలా టెస్లా సజీవముగా
యున్న శరీరములో మూడు ఆత్మలున్నవని తెల్పుచున్నాడు. అంతేకాక
మూడు వ్రేళ్ళను చూపుచూ ఒక దానిని పైకి మెదడువైపుకు, రెండవ
దానిని నోటి వైపుకు, మూడవ దానిని శరీరము వైపుకు చూపుచున్నాడు.
ఎవరికీ తెలియకుండా ఆజ్ఞలనిచ్చు మెదడును పరమాత్మ గుర్తుగా, కదిలి
పని చేయుచూ మాట్లాడు నోటిని ఆత్మగా, కొంత కాలము పెరిగి ఎప్పటికైనా
నశించు శరీరమును జీవాత్మ గుర్తుగా సూచిస్తూ ఆ విధముగా ఒక వ్రేలిని
పైకి, రెండవ వ్రేలిని మధ్యకు, మూడవ వ్రేలిని క్రిందివైపుకు చూపడము
జరిగినది. దీనినిబట్టి వెలుగుచున్న బల్బు (దీపము) లాంటిది సజీవముగా
యున్న శరీరమని చూపించునట్లు కలదు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను
మూడు ఆత్మల విషయము తెలుసుకొంటే జీవముతో కూడుకొన్న ప్రపంచము
అనగా విశ్వము యొక్క వివరము తెలియునని 3, 6, 9 ని చూపించి
వీటిని గురించి తెలియగల్గితే ప్రకృతి పరమాత్మతో కూడియున్న విశ్వమును
(ప్రకృతి+ఆత్మలు=విశ్వము) తెలియవచ్చునని నికోలా టెస్లా తెలిపాడు.
ఇక ఐన్స్టీన్ తెలిపిన విషయానికి వస్తే ఆయన 6-3=6 అని
వ్రాసియున్నాడు. అలా వ్రాయడమేకాక, ఒకవైపు చేతితో 6-3ను అండర్
లైన్ చేసి (6-3 కు క్రింద గీత గీచి) చూపుచూ, మరియొక ప్రక్క నోటితో
నాలుకను పూర్తి బయటికి పెట్టి చూపుచున్నాడు. ఈ దృశ్యమంతయూ
ఒక వింతగా కనిపించినా, ఆత్మ విషయములో (ఆధ్యాత్మిక విషయములో)
ఎంతో జ్ఞానముతో కూడుకొన్న అర్థము గలదని ఆత్మే తెల్పుచున్నది చూడండి.
మనము గ్రంథములో వ్రాసుకొన్న అర్థము ప్రకారము ఆరు (6) ఆత్మకు
గుర్తుయనీ, మూడు (3) జీవాత్మకు గుర్తనీ చెప్పుకొన్నాము. సజీవ
శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మయను మూడు ఆత్మలున్నా పరమాత్మ
రూప, నామ, క్రియలు లేనిదై శరీరములోయున్నా అది లేనట్లే, ఎక్కడా
లెక్కించబడదు. శరీరములో తెలియబడునవి ఆత్మ, జీవాత్మ అను రెండే
కనుక, ఐన్స్టీన్ ఆరును, మూడును మాత్రమే చూపాడు. శరీరములో
ఆత్మకు జీవాత్మకు రెండిటికీ గుర్తుగా నాలుక గలదు. ఒక పనిని చేసినప్పుడు,
ఆ పనిని జీవున్ని అయిన నేను చేసినట్లు మీకు కనిపించినా, దానిని నేను
చేయలేదు, నాలోయున్న ఆత్మ చేసిందని తెలుపు నిమిత్తము, పూర్వము
ఒక కార్యమును చేసిన వ్యక్తి అది తనకు సంబంధము లేదని అర్థమగునట్లు
నాలుకను బయటికి పెట్టి చూపెడివాడు. ప్రస్తుత కాలములో కర్మయోగ
సారాంశమును తెలియజేయు నాలుకను బయటికి చూపు విధానము ఎవరికీ
తెలియకుండా పోయినది. అయినా నా మాటకు సాక్ష్యము నేటికీ కొన్ని
చోట్లగలదనీ, దానిప్రకారమే అమెరికా రెజ్లింగ్ కింగ్ అయిన అండర్టేకర్
తాను మ్యాచ్ గెలిచినప్పుడంతా గెలిచినది నేను కాదు, ఆత్మశక్తి వలననే
గెలువడము జరిగినదని తెలియునట్లు, మ్యాచ్ అయిపోయిన తర్వాత
మోకాళ్ళమీద కూర్చొని తన నాలుకను పూర్తి బయటికి పెట్టి చూపడము
జరుగుచున్నది. మీకు అర్థము కావాలంటే ఇంటర్ నెట్లో అండర్ కర్
గెలిచిన మ్యాచ్లను చూడవచ్చును. నాలుక మనిషి అల్లాడిస్తే అల్లాడు
చున్నది. అలాగే మనిషి కదిలించకున్నా కదలుచున్నది. మనిషి
అనుకొన్నప్పుడు అల్లాడిస్తే అల్లాడు నాలుక, ఎటు కదిలిస్తే అటు కదలు
నాలుక, మిగతా సమయములలో మనిషికి తెలియకుండా, మనిషి
ప్రమేయము లేకుండా దానంతకదే కదలుచున్నట్లు కనిపించుచున్నది. అలా
మనిషి ప్రమేయము లేకుండా కదలుటకు కారణము మనకు తెలియకుండా
శరీరములోనున్న ఆత్మేనని తెలియుచున్నది. ఆత్మ తన శక్తితో నాలుకను
పళ్ళ మధ్యలో వేగముగా కదిలించుచూ తన శక్తికి సాక్ష్యము నిచ్చుచున్నది.
అందువలన మనిషి ప్రమేయముతో కదలు నాలుక జీవాత్మకు గుర్తనీ,
మనిషి ప్రమేయము లేకుండా, జీవునికి తెలియకుండా కదలు నాలుక
ఆత్మకు గుర్తనీ తెలియవచ్చును. ఇటు జీవునికీ అటు ఆత్మకూ రెండిటికీ
గుర్తు అయిన నాలుకను ఐన్స్టీన్ చూపుచూ, జీవాత్మకు, ఆత్మకు గుర్తయిన
మూడు ఆరునే అండర్న్ చేసి చూపాడు. మనిషి శరీరములో జీవునికి
తెలిసి పని జరిగినప్పుడు ఉపయోగపడు శక్తి ఆత్మశక్తేననీ, జీవునికి
తెలియకుండా జరుగునప్పుడు కూడా ఉపయోగపడు శక్తి ఆత్మశక్తేననీ,
అందరికీ తెలియునట్లు ఆత్మ గుర్తయిన ఆరులో మూడును తీసివేసినా,
ఆరే వున్నదని 6-3=6 అని చూపడము జరిగినది.
ఇక మూడవ చిత్రములో తెలుపులో నల్లని గుర్తుగా మూడును,
నలుపులో తెల్లని గుర్తుగా ఆరును చూపడము జరిగినది. శరీరములో
జీవాత్మ (3), ఆత్మ (6) రెండూ వేరువేరుగాయున్నా రెండిటిలో పరమాత్మ
కలిసి అణువణువున శరీరమంతా వ్యాపించియున్నదని తెలియునట్లు, తెలుపు
నలుపు రెండు రంగులు కలిసిన లేత తెలుపు, లేత నలుపు రంగు గీతను
మూడుకు ఆరుకు మధ్యలోనూ, మూడుకు ఆరుకు చుట్టూనూయున్నట్లు
చూపడము జరిగినది. అలా చూపడమేకాక గీతగాయున్న నలుపు తెలుపు
కలిసియున్న లేత రంగు గీతను తొమ్మిది (9) గా గుర్తించి చూపడము
జరిగినది. ఆ దినము వారు ఏ భావముతో చూపినా, ఈ దినము ఆత్మ
తన జ్ఞానము తెలియునట్లు ఆ బొమ్మలకు పూర్తి వివరమును ఇచ్చినది.
ఉత్తరములు.
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి
పాద పద్మములకు నా సాష్టాంగ వందనములు.
నా పేరు సాకా ధనుంజయ, S/O అచ్చప్ప, వయస్సు 48 సం||లు,
కులము పద్మశాలి, నివాసము బెంగుళూరు, యలహంక అగ్రహార లేఅవుట్.
నేను ప్రస్తుతము బెంగుళూరు సెంట్రల్ జైల్నందు గత నాలుగు
సంవత్సరముల నుండి జైల్ నందు సజా ఖైదిగా ఉన్నాను. నాకు జీవిత
ఖైదీగా కోర్టు శిక్ష విధించింది. నా సజా ఖైది నెంబర్. 9203 (Convict
Prison) రూమ్ నెంబర్ C-7 (Block No-7) నందు ఉంటున్నాను.
నేను బాల్యము నుండి రాముడు మరియు ఆంజనేయ భక్తునిగా
ఉంటూ, నా జీవితములో వచ్చే సమస్యలకు, బాధలకు అనుగుణముగా
వేరే ఇతరత్రా దేవతలను కూడా పూజించేవాడిని. కానీ ఎంతమంది
దేవతలను పూజించినా నా సమస్యలు, బాధలు పోలేదు. నేను బాల్యము
నుండి దైవభక్తితో జ్ఞానము తెలుసుకోవాలని చాలా శ్రద్ధతో కొన్ని ఆశ్రమాలకు
కూడా వెళ్ళి, జ్ఞానబోధలు వినుచుండేవాడిని. అందులో భాగముగా కైవారం
తాతయ్య మఠములో (పోతులూరి వీరబ్రహ్మయ్య గారి అనుబంధ మఠం)
వెళ్ళి తత్త్వ జ్ఞానబోధలను శ్రద్ధగా వింటుండేవాడిని. కానీ నా బాధలు
ఇంకా పెరుగుతూనే ఉండేవి.
నేను జ్ఞానము అని, భక్తి అని తిరుగుతూ ఉంటే మా కుటుంబము
వారంతా వ్యతిరేఖించుతూ ఉండేవారు. అయినా నేను అలాగే చేస్తూ
ఉండడము వలన, నా కుటుంబమువారు, బంధువులు అందరూ
దూరమయ్యారు. నేను పెళ్ళి కూడా చేసుకోలేదు. నాకు జీవితముపై
నిరాశ కలుగుతుండేది, బాధలు భరిస్తూ, జ్ఞానము తెలుసుకోవాలనే శ్రధ్ధతో
చాలాచోట్లకు వెళ్ళి, గురువుల వద్దకు, పండితుల వద్దకు, బాబాల వద్దకు
కూడా వెళ్ళి చాలా బోధలు వింటుండే వాడిని. నాకు జ్ఞాన సంబంధ ఎన్నో
ప్రశ్నలు వస్తుండేవి, వారిని అడిగితే వారు చెప్పే సమాధానములో నాకు
తృప్తిగా సమాధానము దొరికేది కాదు.
ఈ విధంగా నేను జీవితము గడుపుచుండగా, నేను పని చేసే
చింతామణి టౌన్ లో ఉన్న కొనకపల్లి గ్రామంలో హ్యాండ్లూమ్ మగ్గం
పరిశ్రమలో మా పరిశ్రమ యజమానికి, అతని భార్యకు మధ్య గొడవ
వచ్చి ఆమె నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొనగా, ఆ నేరం నాపై
మోపబడి నాకు జీవిత ఖైదీగా శిక్ష పడింది. జైలు జీవితము గడుపుతూ
చదువు పెద్దగా రాని కారణముగా ఇంకా చదువుకోవాలనే కోరిక కల్గి
కన్నడ, తెలుగు భాషలు నేర్చుకొని వార్తా పత్రికలు, ఇతర దైవ గ్రంథాలు
చదువుతూ, చదువును కొనసాగిస్తూ, కేసు ట్రైల్ నడుపుకుంటూ, భగవద్గీతను
చదువుకుంటున్నాను.
జైలుకు వచ్చిన ఒక సంవత్సరము కాలమునకు ఒకరోజు మా జైల్లో మా *
రూమ్కు క్రైస్తవ బోధకులు వచ్చి బైబిల్ గురించి, ఏసు గురించి బోధించారు.
నేను బోధ తర్వాత ఫాదర్ని కలవాలని అనిపించింది. ఎందుకంటే వారి
బోధలో మీ పాపాలు పోతాయి, బాధలు, కష్టాలు పోయి కేసులో నుండి
కూడా పోతారు అని చెప్పినారు. అది విన్న నేను ఫాదర్గారికి నా బాధలు
చెప్పుకున్నాను. అప్పుడు ఫాదర్గారు ఏసుప్రభువును నమ్ముకొని, బైబిల్
చదువుకుంటూ, రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండమని ఒక బైబిల్ ఇచ్చి
దీవించారు. అప్పటి నుండి ఏసుభక్తునిగా మారిపోయి, హిందూ గ్రంథాలను,
దేవతలను వదిలివేసినాను. నేను పూర్తి విశ్వాసిగా మారి, ఏసుభక్తునిగా
ఉంటూ, బైబిల్ చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, చర్చికి వెళ్ళి క్రైస్తవ బోధలు
వింటూ, ఇతరులకు కూడా బోధలు చెప్పుతూ నా జీవితం గడుపుతున్నాను.
అయిన నా బాధలు, సమస్యలు అలాగే ఉన్నాయి. కేసు కూడా పరిష్కారము
కావటం లేదు. ఈ విషయము గురించి ఫాదర్ను అడుగగా, ఎన్నో సం॥ల
నుండి ఉన్నవారికే సమస్యలు పోలేదు. నీకు అప్పుడే పోతాయా? ఇంకా
కొన్నాళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ వుండమని చెప్పగా నేను అలాగే
చేస్తూ ఉండేవాడిని. నా కేసు ట్రైల్ అయిపోయి నేను క్రైస్తవునిగా మారిన
ఒకటిన్నర సం॥నకు కేసు జడ్జిమెంట్ జరిగి, నాకు జీవిత ఖైదు శిక్ష
పడింది. ఈ విషయము గురించి ఫాదర్ని అడుగగా వారు ఫలానా వారు
ఏసుని విశ్వసించినందువలన తరువాత బెయిల్ దొరికింది అని, ఒక అతను
కేసు కొట్టివేయబడిందని వారిని గురించి చెప్పారు. నేను అలాగే బైబిల్
చదువుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, జ్ఞాన బోధలు వింటూ కొన్ని
అర్థము కాని వాక్యములను అడిగితే ఎందుకో వారి సమాధానం తృప్తిగా
అనిపించకపోయేది. ఈ విధముగా నా జీవితము సాగుతుండగా!
ఒక రోజు సుమారు 7 లేదా 8 నెలల క్రితం మా రూమ్ ప్రక్కన
ఉన్న రూమ్ లో ఉన్న దిలీప్ అనే వ్యక్తితో ఒక వ్యక్తి దైవజ్ఞానము గురించి
తెలుగులో బోధిస్తుండగా, నేను విని ప్రక్కనే పోయి నిలబడి వింటూ, ఈయన
ఎవరు గడ్డము పెట్టుకొని ముస్లీమ్గా అనిపిస్తూ తెలుగులో దైవజ్ఞానము
చెప్పుతున్నాడని కొంత శ్రద్ధ పెట్టి విన్నాను. ఆయన మాటలలో నమ్మకము
సత్యము చెప్పినట్లుగా అనిపించి, కూర్చోని బోధ అయిపోయే వరకు శ్రద్ధగా
విన్నాను. ఆయన చెప్పిన బోధ ఇంతవరకు ఎక్కడా వినలేదనిపించింది.
బోధ అయిపోయిన తరువాత ఆయనతో పరిచయము చేసుకోగా, ఆయన
పేరు అమీర్ అలి అని చెప్పారు. ఆ తరువాత ఆయన నాతో మీకు దేవుని
మీద భక్తి, జ్ఞానం మీద శ్రద్ధ ఉంటే, దీలీప్ దగ్గర జ్ఞానగ్రంథములు
ఉన్నాయి. అందులో మీకు నచ్చింది ఒకటి తీసుకొని చదవమని చెప్పారు.
అయినా నాకు గ్రంథము చదవడము ఇష్టముగా అనిపించలేదు. ఎందుకంటే
బైబిల్ చదువుతూ ఉండేవాడిని, వేరే గ్రంథాలు చదవవద్దని మా ఫాదర్
కూడా చెప్పినారు. కానీ అమీర్ అలి చెప్పిన బోధ నాకు అదే రోజు పదే
పదే గుర్తుకు వస్తావుంది. ఆయన చెప్పిన బోధ సత్యము అనిపించింది.
నా మనసులో అదే రోజు సాయంత్రం ఆయన చెప్పిన గ్రంథము
చదవాలనిపించి, దీలీప్ దగ్గరకు వెళ్ళి ఆ గ్రంథాలు చూసి అందులో
“దేవాలయ రహస్యాలు” అనే గ్రంథమును తీసుకొని వచ్చి చదివినాను.
దేవాలయములో ఉన్న రహస్యాలు గ్రంథము ద్వారా తెలిసి అద్భుతం
అనిపించింది. అప్పుడు దేహమే దేవాలయమని, దేవుడు దేహములోనే
ఉన్నాడని తెలిసి నా హృదయములో ఎంతో ఆనందము, తృప్తి కల్గినాయి.
నా మనసులో మిగతా గ్రంథాలు కూడా చదవాలనే ప్రేరణ పెరిగింది.
తరువాత అమీర్ అలితో రెండవసారి కలిసినపుడు జ్ఞానపరముగా
చర్చించిన తరువాత నాలో ఉన్న కొన్ని ప్రశ్నలకు ఆయన ద్వారా తెలిసిన
సమాధానములో సత్యమున్నదనే నమ్మకము, విశ్వాసం కలిగినది. అప్పుడు
ఆయన నాతో స్వామివారి గ్రంథాలు మిగతావి కూడా చదవండి,
ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియని జ్ఞానరహస్యాలు స్వామి వారి
గ్రంథముల ద్వారా తెలుస్తాయి అని చెప్పి మళ్ళీ కలుద్దాము, అప్పటివరకు
గ్రంథాలు చదువుతూ ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు నేను
చదివిన గ్రంథాలు 1. దేవాలయ రహస్యాలు 2. ప్రబోధ 3. సుబోధ
4. శిలువా దేవుడా? 5. ఏసు చనిపోయాడా చంపబడ్డాడా? 6. తల్లి
తండ్రి 7. సమాధి 8. త్రైతాకార రహస్యం 9. శ్రీకృష్ణుడు దేవుడా
భగవంతుడా? 10. దయ్యాల భూతాల యధార్థ సంఘటనలు 11. జనన
మరణ సిద్ధాంతము 12. వార్తకుడు వర్తకుడు 13. ప్రతిమ × విగ్రహ
14. సత్యాన్వేషి కథ 15. యజ్ఞములు 16. మన పండుగలు 17. ఇందూ
సాంప్రదాయాలు 18. భగవద్గీత 19. దేవుని గుర్తు 963, మాయ గుర్తు
666 20. ప్రసిద్ది బోధ 21. నాస్తికులు. ఆస్తికులు 22. కర్మపత్రం
23. దేవుని చిహ్నం 24. దేవుని ముద్ర 25. మతాతీత దేవుని మార్గం
26. నిగూఢ తత్త్వార్థ బోధిని 27. చెట్టుముందా, విత్తుముందా?
28. ఒక్కడే ఇద్దరు 29. కృష్ణ మూస 30. ద్వితీయ దైవగ్రంథములో రత్న
వాక్యములు 31. హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా? 32. ఆధ్యాత్మిక
ప్రశ్నలు జవాబులు. 33. భగవాన్ రావణ బ్రహ్మ.
ఈ గ్రంథాలు అన్నీ అమీర్ అలి ద్వారా తీసుకొని చదవినాను.
ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తుల గురించిన గ్రంథాలు ఇచ్చినారు. చదువు
తున్నాను. ఇంకా గ్రంథాలు చదవాలనే కాంక్ష పెరుగుతూ ఉంది. ఈ
గ్రంథాల ద్వారా తెలిసిన నిజమైన జ్ఞానము ఏమనగా జీవాత్మ, ఆత్మ,
పరమాత్మ అని మూడు ఆత్మల జ్ఞానం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు
అని తెలిసింది. దేవునికి, భగవంతునికి తేడా తెలిసినది. ఆత్మ పని తెలిసినది.
పరమాత్మ అంశయే భగవంతునిగా కృష్ణునిగా వచ్చినాడు అని తెలిసింది.
ధర్మములు, అధర్మములు తెలిసినాయి. నిరాకారము, సాకారము గురించి
తెలిసింది. ముఖ్యముగా శరీరం 24 భాగాలు ప్రకృతి అని అందులో
మూడు ఆత్మలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు ఉన్నాయని నేను జీవాత్మ
కర్మలు అనుభవించేవాడినని, ఆత్మ అనుభవింపజేసేదని, పరమాత్మ సాక్షి
భూతుడని తెలిసింది బ్రహ్మయోగం, కర్మయోగం, భక్తియోగం కూడా
తెలిసినది.
ద్వితీయ దైవగ్రంథము బైబిల్ ద్వారా రాబోయే ఆదరణకర్త సాక్షాత్తు
యోగీశ్వర్లువారే, పరిశుద్ధాత్మ అని తెలిసినది. భగవద్గీత శ్లోకాల
సారాంశము మొత్తము శరీరములో ఉన్న జ్ఞానం గురించే చెప్పిందని
తెలిసినది. భగవద్గీతలో భాగమే బైబిల్ జ్ఞానము అని తెలిసినది. సాకార
రూపంలో భగవంతుడు చెప్పినదే నిజమైన జ్ఞానము అని, అధర్మముల
ఆచరణ ద్వారా కర్మలు అంటుకొని జన్మలు కల్గుతాయని, ధర్మముల ఆచరణ
ద్వారా కర్మలు నాశనము చేసి, మోక్షము ప్రాప్తింపజేస్తాయని తెలిసింది.
దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే, దేవుని మోక్షము ఒక్కటే అనే
నిజము తెలిసినది. మతాలు మానవుల సృష్ఠి అని తెలిసినది. ప్రపంచములో
ఏ మానవుడు ఇంత గొప్ప జ్ఞానము చెప్పలేడని, దైవశక్తి తప్ప మానవ శక్తి
చెప్పిన జ్ఞానము కాదు అని, ఈ జ్ఞానము ద్వారా సాక్షాత్తు పరమాత్మ అంశ
అయిన భగవంతుడే యోగీశ్వరుల వారు అని, “భగవాన్ రావణ బ్రహ్మ”
మరియు "వేదములు మనిషికి అవసరమా?" అన్న గ్రంథములపై ఉన్న
నాలుగు దైవాంశలు 1. భగవాన్ రావణ బ్రహ్మ 2. శ్రీకృష్ణుడు 3. ఏసు
ప్రభువు 4. యోగీశ్వరులు వీరు నలుగురు సాక్షాత్తు పరమాత్మ అంశ
అయిన భగవంతులని తెలిసినది. ప్రపంచ మూఢులను జ్ఞానులజేయ
వచ్చిన భగవంతులని పూర్తిగా విశ్వసిస్తున్నాను. త్రిమత ఏకైక గురువు,
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అని, మీ గ్రంథాలపై ఉన్న విషయం 100%
నిజము. తమరి దైవజ్ఞాన గ్రంథముల ద్వారా మా జీవితం ధన్యమయినది.
మిగిలిన జీవితము కూడా జ్ఞానము తెలుసుకుంటూ, ఆచరిస్తూ ధర్మ ప్రచారం
చేస్తూ గడపాలని నిశ్చయించుకొని సంపూర్ణ జ్ఞానాన్ని ఆచరించే శక్తిని
అనుగ్రహించమని నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ
ఆత్మతో సాకార రూపము అయిన యోగీశ్వరుల వారి పాద పద్మముల
పైన శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. భగవద్గీత శ్లోకాలు 3-9
మరియు 17-66 ప్రకారం సాకార రూపము అయిన మీరు మాకు
పాపవిమోచన చేసి ముక్తిని చెయ్యమని ఈ జన్మలో మీ దర్శన భాగ్యము
కల్గించి, ధన్యున్ని చేయ్యమని మరి ఒక్కసారి సాష్టాంగ వందనం మీ
పాదపద్మములకు చేయుచూ....
మీ సంపూర్ణ విశ్వాసి
ధనుంజయ్.
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి
పాద పద్మములకు నా సాష్టాంగ వందనములు.
సాక్ష్యాత్తూ ఖుదాకు (సజ్దా కర్తాహు) సాష్టాంగ వందనములు
సమర్పించుకుంటున్నాను.
నేను అనగా జీవాత్మగా ఉన్న నా శరీరము యొక్క పేరు సయ్యద్
సల్మాన్ S/o సయ్యద్ ముస్లీషా నా వయస్సు 34 సం॥లు. వృత్తి
అక్వేరియం (షోకేసులలో చేపలు పెంచి అమ్మటం) మతము ముస్లీమ్,
చదువు 9వ తరగతి ఇంగ్లీషు మీడియము, నివాసము బెంగుళూరు
(వివేక్నగర్).
ప్రస్తుతము సెంట్రల్ జైల్ బెంగుళూరులో అండర్ ట్రైల్ ఖైదిగా
(UTP) ఉన్నాను. నా ఖైది నెంబర్ : 7579 / 14 రూమ్ నెంబర్ 10లో
జైలు జీవితము అనుభవిస్తూ ఉన్నాను. నా కుటుంబ వివరాలు ఏమనగా
మా కుటుంబము వారు గత ఏడు తరాల నుండి ముస్లీమ్ పండితులుగా
(అనగా హాఫిజె ఖుర్ఆన్, ఆలిమె ఖుర్ఆన్) ఉన్నారని తెలిపినారు. ప్రస్తుతం
నేను తప్ప మా కుటుంబము వారు అందరూ ముస్లీమ్ పాండిత్యము
కల్గినవారే. (తమ గ్రంథముల ద్వారా జ్ఞానము తెలిసిన తర్వాత ఎవరు
పండితులు అనే విషయము తెలిసింది).
నేను సాధారణ ముస్లీముగా ఉంటూ, నమాజ్ చేసుకుంటూ, రోజా
ఉంటూ జీవితం గడుపుతూ ఉండేవాడిని. నాకు సాధారణముగా సహనము
తక్కువ, కోపం ఎక్కువగా ఉండేది. ఎక్కువ అసహనముతో, ఆవేదనతో
బాగా వత్తిడికి లోనౌతూ ఉండేవాడిని. జ్ఞానమునకు సంబంధించిన
ఆలోచనలు వస్తూ వుండేవి. ఆ క్రమంలో నేను మా ఇంటి నుండి ఎవరికీ
చెప్పకుండా వెళ్ళిపోయాను. హిందూ పుణ్య స్థలాలైనా ద్వారకా (గుజరాత్)
నగరమునకు వెళ్ళినాను. ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ (అమృత్సర్),
హరిద్వార్, ఋషికేష్, డిల్లీలో ఉన్న ఆశ్రమాలు, మందిరములు, దర్గాలను
సందర్శించుకుంటూ, హిందువుల జీవిత విధానాలు, ఆచరణలు, పూజా
విధానాలు మరియు ముస్లీముల జీవిత విధానాలను పరిశీలించుకుంటూ,
తెలుసుకుంటూ, 12 సం॥లు మా కుటుంబమువారితో సంబంధము
లేకుండా గడిపి, తిరిగి 2008 సం॥లో ఇంటికి వచ్చాను. ఇంటిలో
ఉంటూ రెండు సం||లు ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ ఉండగా, ఒక ముస్లీమ్
అమ్మాయితో ప్రేమలో పడి, మా కుటుంబమువారితో ఆమెతో పెళ్ళి
గురించిన విషయము చర్చించితే వాళ్ళు తిరస్కరించారు. అమ్మాయి వాళ్ళ
తల్లి తండ్రులు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు నేను అమ్మాయిని హైద్రాబాద్
తీసుకెళ్ళి, అక్కడ పెళ్ళి చేసుకొని, బాగ్ అంబర్పేట్, హైద్రాబాద్ లో నాలుగు
నెలలు ఉండి తిరిగి బెంగుళూర్కి వచ్చినాను. నేను మా ఇంటికి వెళ్ళకుండా
కిరాయి ఇంటిలో ఉండేవాడిని. అప్పటి వరకు నేను ముస్లీము గ్రంథాలు
ఏవీ చదవలేదు. 2013 సం॥ వరకు నేను సాధారణ జీవితము గడుపు
చుండగా కుటుంబ కలహాల కారణముగా, మా బాబాయిని హత్య చేయటం
జరిగింది. అది నేను చేశానని ఎవరికీ తెలియదు. మరలా కుటుంబ
తగాదాల కారణముగా 2014 లో 7 సం॥లు గల నా చెల్లెలు కూతురుని
కూడా నా భార్య సహాయముతో హత్య చేయడము జరిగింది. అప్పుడు
పాత హత్య విషయము కూడా తెలిసిపోయింది. ఈ రెండు హత్యల
కారణముగా నేను, నా భార్య 2014 సం॥ము జులై నెల 14వ తారీఖున
జైలుకు రావడము జరిగింది. అప్పటి నుండి అనగా 14.07.2014
నుండి ఇప్పటి వరకు అనగా నాలుగు సం॥ల నుండి ఇద్దరము కూడా
జైల్లోనే ఉన్నాము.
నేను జైలుకు వచ్చిన తరువాత జైల్లోఉన్న కొంతమంది ముస్లీమ్లతో
పరిచయమై, 2014 జులై నుండి 2016 డిసెంబర్ వరకు హదీసులు
చదువుకుంటూ, నమాజ్ చేస్తూ, రోజా ఉంటూ గడుపుతున్నాను. నేను
చదివిన హదీసులు 1. సహీ బుఖారి (9 వాల్యూమ్లు), 2. అబుదావూద్
3. తిర్మిజి 4. సహి ముస్లీమ్ మరియు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర
(సరాతున్నబి), వారి శిష్యుల ఖలీఫాల చరిత్రలు చదివాను. కానీ హదీసులు
కొన్ని విషయాలలో ఒక దానిలో చెప్పిన దానికి, మరొక దానికి వ్యతిరేఖంగా
ఉండేవి. నమాజ్ విధానము ఒక హదీసు వేరొక హదీసు చెప్పే విధానానికి
వ్యతిరేఖంగా ఉండేది. జైల్లో కూడా నాలుగు, ఐదు (ఫిర్కే) వర్గాల వారు
ఉన్నారు. మొత్తం ముస్లీమ్ సమాజము 73 వర్గాలుగా ఉన్నారని, 73వ
వర్గం ఒకటి మాత్రమే జన్నత్ (స్వర్గం) లోకి వెళ్ళుతుందని చెప్పేవారు.
73 వర్గాలలో ఆ ఒక్కటి ఏది అంటే అందరూ మాది మాది మాత్రమే
జన్నత్లోనికి వెళ్ళుతుంది. మిగతావర్గాలవారు వెళ్ళరు అనేవారు. ఏ వర్గము
జన్నత్లో వెళ్ళదని నమ్మకము, రుజువు ఏమిటి అంటే ప్రళయ దినము
అల్లాహ్ వద్దకు వెళ్ళిన తరువాత తెలుస్తుంది గాని ఇప్పుడు చెప్పలేము,
ఎవరికీ తెలియదు అని చెపుతున్నారు. నమాజ్ చేసుకుంటూ, రోజా
ఉంటూ, బోధలు వింటూ ఉంటే, పాపాలన్నీ క్షమించబడి స్వర్గంలోకి
వెళ్ళుతాము అని చెప్పేవారు. జ్ఞానం గురించి ఎంత తెలుసుకుంటుంటే,
హదీసులు చదువుతున్నప్పుడు ప్రశ్నలు, సందేహాలు ఉంటుంటే పెరుగుతూ
ఉన్నాయి గానీ స్పష్టమైన సమాధానము దొరకడము లేదు. తెలిసినవారని
పెద్దలని అడిగితే వారు చెప్పే సమాధానము అసంపూర్తిగా ఉండేది. ఒకరు
చెప్పేదానికి మరొకరు చెప్పేదానికి పొంతన లేకుండా ఉండేది.
ఇలా నా జీవితం సాగుతుండగా 2016 సం॥ సెప్టెంబర్ నెలలో
నేనున్న రూమ్ (బ్యారక్) కు అమీర్ అలి అనే వ్యక్తి వచ్చాడు. అతను
ఎప్పుడూ ఏదో చదువుతూ, రాసుకుంటూ ఉండేవాడు, ఎవరితో ఎక్కువగా
మాట్లాడేవాడు కాదు. నాకు 2016 సం॥ నవంబర్ నెలలో విపరీతమైన
బ్యాక్పెయిన్ వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాను. అప్పుడు నాకు వేరే
వారి ద్వారా అమీర్ అలికి చూపించు, అతను ఏదో ట్రీట్మెంట్ చేస్తాడట
అని తెలిసి అతనికి నా ప్రాబ్లమ్ గురించి చెప్పాను. అప్పుడు అతను
నన్ను చెక్ చేసి ఏదో పాయింట్ల పైవత్తి ట్రీట్మెంట్ చేశాడు. అప్పుడు
వెంటనే నొప్పి తగ్గి రిలీఫ్ అయింది. దానితో వారితో పరిచయము పెరిగి
జ్ఞానము గురించి అడగడము జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానము గురించి
తెలుసుకోవాలని ఉంటే వచ్చి కూర్చోండి చర్చిద్దాము అని అన్నాడు. అప్పటి
నుండి (2016 డిసెంబర్ నుండి) ప్రతి రోజు సాయంత్రము లాకప్ తరువాత
7 గంటల నుండి 9 గంటల వరకు, నాకున్న డౌట్స్కి ఖుర్ఆన్ ఆయత్ల
ద్వారా చూపించి వివరించేవారు. ఒక నెల రోజులలో నా సందేహాలకు
చాలా జవాబులు దొరికేవి. అంతేకాక ఎన్నో తెలియని రహస్యాలు కూడా
తెలియజెప్పేవారు. ఖుర్ఆన్లో శరీరము గురించిన ఆయత్లు ఇలా
ఉన్నాయని, అల్లాహ్ విధానము ఇలా ఉంది అని వివరించేవారు. ఇప్పటి
వరకు ఎవరూ చెప్పనివి, ఎవరికీ తెలియనివి చెప్పుతూవుంటే మొత్తం
సత్యము, నిజమైనదని అనిపించింది. అప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞాన
విషయాలు తెలుసుకోవాలని పగలు కూడా జ్ఞానము గురించి చెప్పమని
అడిగినాను.
అప్పుడు ఆయన సురా 3-7 ఆయన్ను చూపించి ఖుర్ఆన్
ముహ్కమాత్ మరియు ముతషాబిహాత్ (స్థూల, సూక్ష్మ) ఆయత్లు ఉన్నాయి,
ఇవి ఇప్పటి వరకు ముస్లీమ్లకు తెలియక ఖుర్ఆన్ మొత్తము ఆయత్లను
స్థూలముగా రాసుకున్నారు. అందుకే ఖుర్ఆన్ ఎవరికీ సరిగా అర్థము
కాక, ఎవరికి అర్థమైనది వారు హదీసుల రూపములో రాసుకొని, 72
వర్గాలుగా చీలిపోయారు. ఈ సూక్ష్మ ఖుర్ఆన్ ఆయతులను ప్రబోధానంద
యోగీశ్వరులు అనే ఒక స్వామివారు వీటి గురించి వివరణ గ్రంథములో
వ్రాశారు. వారి ద్వారానే నాకు ఈ జ్ఞానం దొరికిందని, వారు మూడు
మతాల జ్ఞానం చెబుతారు, చాలా గ్రంథాలు వ్రాశారు. నీకు శ్రద్ధవుంటే
జ్ఞానం తెలుసుకోవాలని అనిపిస్తే, నీకు స్వామివారు రాసిన గ్రంథాలు నా
దగ్గర ఉన్నాయి. చదువుతానంటే ఇస్తాను అవి తెలుగు మరియు కన్నడ
భాషలలోనే ఉన్నాయి. కొన్ని ఉర్దూలో ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు
నేను నాకు కన్నడ భాష వస్తుందని చెప్పాను. అప్పుడు నాకు మొదటిసారిగా
2017 సం॥ జనవరిలో "ధర్మశాస్త్రం ఏది (ధర్మశాస్త్ర యావదు)” అనే
గ్రంథము ఇచ్చారు. అప్పటి వరకు నాకు ధర్మం అంటే, శాస్త్రము అంటే
కూడా ఏమీ తెలియదు. కానీ ఈ గ్రంథము చదివిన తరువాత ధర్మము,
శాస్త్రము అంటే ఏమిటో తెలిసింది. అంతేకాక చాలా జ్ఞాన విషయాలు
తెలిసినాయి. అన్నీ నిజాలుగా అర్థము అయ్యాయి. మిగతా గ్రంథాలు
కూడా చదవాలని శ్రద్ధ పెరిగింది. నేను 2017 సం॥ జనవరి నుండి
2018 సం|| ఏప్రిల్ వరకు చదివిన మొత్తం గ్రంథాలు 1. ధర్మశాస్త్రం
ఏది? 2. ప్రవక్తలు ఎవరు? 3. కర్మపత్రం 4. ఒక మాట మూడు గ్రంథాలు
5. దేవుని తీర్పు (జడ్జిమెంట్ ఆఫ్ గాడ్) 6. మూడు గ్రంథములు ఇద్దరు
గురువులు ఒక బోధకుడు 7. ఒక్కడే ఇద్దరు 8. దేవుని రాకకు ఇది
సమయము కాదా? 9.ఏసు చంపబడ్డాడా? చనిపోయాడా? 10. త్రైతాకార
రహస్యం 11. నీకు నాలేఖ 12. గీతా పరిచయం 13. సాయిబాబా దేవుడా
కాదా? 14. మంత్రం- మహిమ 15. దేవాలయ రహస్యాలు 16. ఇందూ
సాంప్రదాయాలు 17. దయ్యాల-భూతాల యధార్థ సంఘటనలు
18. 1058 ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు 19. భగవద్గీత 20. స్వర్గం
ఇంద్రలోకమా! నరకం యమలోకమా? 21. దేవుని చిహ్నం 22. ఏది
నిజమైన జ్ఞానం 23. మరణం తరువాత జీవితం 24. జనన మరణ
సిద్ధాంతం 25. పునర్జన్మ రహస్యం 26. సమాధి 27. విశ్వవిద్యాలయం
28. సుబోధ 29. శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా? 30. హిందూమతంలో
సిద్ధాంతకర్తలు 31. ధ్యానం- ప్రార్థన - నమాజ్ 32. సామెతల జ్ఞానం
33. హేతువాద ప్రశ్నలు- సత్యవాద జవాబులు 34. హిందూమతంలో
కుల వివక్ష 35. శిలువ దేవుడా? 36. వార్తకుడు-వర్తకుడు 37. ప్రబోధ
38. మన పండుగలు 39. తల్లి తండ్రి 40. త్రెతారాధన 41. భగవాన్
రావణ బ్రహ్మ 42. ఒక వ్యక్తి రెండు కోణములు 43. ప్రథమ దైవ గ్రంథం
భగవద్గీత 44. మతం పథం 45. అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన
వాక్యములు, రెండవది వజ్ర వాక్యములు మరియు 46. ద్వితీయ గ్రంథము
బైబల్ కూడా తెలుగులోవి ఉర్దూలో ట్రాన్స్ లేషన్ చేసి ప్రతిరోజు రెండు
గంటలు చెప్పేవారు. మిగతా గ్రంథాలలో ఉన్న డౌట్స్ కూడా అమీర్
అలితో అడిగి తెలుసుకొనేవాడిని.
పైన తెలిపిన గ్రంథాలు ఒక్కొక్క గ్రంథము చదువుతూ ఉంటే
నాకు ప్రతి ఒక్క గ్రంథములో తెలియబడే జ్ఞానముతో ఆనందముతో క్రొత్త
అనుభూతులు పొందుతూ నా హృదయం పులకించిపోయేది. నా గత
జీవితములో ఉన్న కోపం తగ్గిపోయింది, సహనము పెరిగింది. నాలో
ఊహించని మార్పు వచ్చింది. నాకు తమరి జ్ఞానము ద్వారా కొత్త జన్మ
(అంటే బిందు పుత్రునినుండి నాద పుత్రుని జన్మ) ప్రసాదించబడిందని
ఆనందముగా ఉన్నాను.
సాక్షాత్తూ ఖుదా చెప్పిన జ్ఞానము ద్వారా తెలియబడిన నిగూఢ
రహస్య నిజాలు ఏమనగా మూడు ఆత్మల జ్ఞానం (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
మూడు గ్రంథాలలో ఉన్నదని భగవద్గీత 14-16, 17 శ్లోకాలు బైబిల్
మత్తయి సువార్త 28-19 వాక్యము, ఖుర్ఆన్ 50-21 ఆయతుల
ద్వారా తెలిసింది. మూడు దైవ గ్రంథాలలో చెప్పబడిన జ్ఞానము దేవుడు
ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే, దేవున్ని చేరవలసిన గమ్యము కూడా
ఒక్కటే అనే విషయము తెలిసిపోయింది. మతాలను మానవులు తయారు
చేసుకున్నారని అర్థము అయింది.
నేను ముస్లీముగా నా బాధ్యత నమాజ్, రోజా, జకాత్, హజ్ చేసి,
హదీసులలో తెలిపిన ప్రవక్త ఆదేశాలను (సున్నత్లను ఆచరిస్తే నేను
నిజమైన ముస్లీముగా మారి జన్నత్ (స్వర్గం)లో చేరిపోతానని నమ్మినాను.
కానీ ఖుదా రాసిన గ్రంథాలు చదివిన తరువాత నిజమైన జ్ఞానము తెలిసిన
తరువాత, అసలు నిజమైన ముస్లీమ్ ఎవరో తెలిసిపోయింది. నిజమైన
నమాజ్, జకాత్, రోజా, హజ్, అల్లాహ్ సృష్ఠిఆదిలో ఉన్న పేర్లు అని వాటి
గురించి వివరణ చదినిన నాకు ఏదో రహస్య నిధి (దైవనిధి) దొరికినంత
ఆనందం కల్గినది. జన్నత్ దోజఖ్ (స్వర్గం, నరకం) అంటే ఏమిటి?
మోక్షం (ఆఖిరత్) అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి?
అనే విషయము తెలిసింది. మా ముస్లీములకు తెలియని మోక్షం (ఆఖిరత్,
నజాత్) కూడా ఉన్నదని స్వామి వారి గ్రంథముల జ్ఞానము ద్వారా తెలిసి
ఆనందభరితుడైనాను.
తౌరాత్ అంటే భగవద్గీత అని ప్రపంచానికే తెలియని గొప్ప రహస్య
జ్ఞానము చెప్పిన ప్రపంచములోనే మొదటి వ్యక్తిగా కీర్తికెక్కినారు. ఖుర్ఆన్లో
తౌరాత్ అంటే ఏమిటో 5-44, 46, 48, 68 మరియు 62-5 ఆయతుల
ద్వారా రుజువు చేసినారు. ఖుర్ఆన్లో 25-1, 2-53, 8-8 ప్రకారం
ఫుర్ఖాన్ (గీటురాయి) మహమ్మద్ ప్రవక్తకు ఇచ్చిన గీటురాయి, మూసాకు
ఇచ్చిన గీటురాయి (ఫుర్ఖాన్) ఒక్కటే అని, ఆ ఆయత్ల ద్వారా తౌరాత్
(భగవద్గీత) లో ఉన్న జ్ఞానము, ఖుర్ఆన్లో ఉన్న జ్ఞానం ఒక్కటేనని మరియు
తౌరాత్ ఖుర్ఆన్కు మాతృ గ్రంథము (ఉమ్ముల్ కితాబ్) అని, బైబిల్ కూడా
భగవద్గీతలో భాగమేనని పరమ రహస్యం తెలిసింది. మూడు గ్రంథములు
ఒకే దైవము గురించి, మూడు ఆత్మల గురించి చెప్పినవని జీవాత్మలమైన
మాకు ముక్తిని ప్రసాదించేవే మూడు గ్రంథాలు అని స్వామి వారి జ్ఞానము
ద్వారా తెలిసింది.
తౌరాత్ (భగవద్గీత) లో చెప్పిన ప్రకారం ధర్మములు, అధర్మములు
అంటే ఏమిటి, ధర్మాలు (బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు) ఆచరిస్తే మోక్షం
వస్తుందని, అధర్మాలు (దానాలు, వేదాలు, యజ్ఞములు, తపస్సులు) ఆచరిస్తే
పాప, పుణ్యకర్మలు అంటుకొని జన్మలు కలుగుతాయని తెలిసింది. ధర్మములు
తెలిసి ఆచరిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అని, ఈ విషయమే ఖురాన్లో
ఉందని తెలిసినది.
భగవద్గీతయే తౌరాత్ గ్రంథము అని, తౌరాత్ పేరుతో గ్రంథము
ఎక్కడా లేదని బైబిల్లో మోషేకు, ఖుర్ఆన్లో మూసాకు ఇవ్వబడినదే
భగవద్గీత గ్రంథము అని ఖురాన్ 6-91 ఆయత్ ద్వారా తెలిసింది. సృష్ఠి
ఆదిలో దేవుని జ్ఞానము భగవద్గీత శ్లోకం 4-1 ద్వారా పరమాత్మ మొదట
సూర్యునికి చెప్పాడు అని, సూర్యుడు మనువుకు చెప్పాడని, మనువు ద్వారా
ఇక్ష్వాకుడు అను రాజుకు తెలియబడినది అని, అదే జ్ఞానం (జపర జ్ఞానం)
5000 సం॥ల క్రితం అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్పారని, శ్రీకృష్ణ భగవానే
మోషే (మూసా) కు స్వప్నంలో భగవద్గీత గ్రంథాన్ని తౌరాత్ పేరుతో ఇచ్చారని
తరువాత శ్రీకృష్ణ భగవానే ఏసుప్రభువుగా వచ్చి బైబిల్ (ఇంజిల్) జ్ఞానము
చెప్పినారు అని తరువాత సూర్యుడే పేరు మార్చుకొని జిబ్రయిల్గా తెర
చాటు నుండి మహమ్మద్ ప్రవక్తకు చెప్పినారు అని తమరి గ్రంథాల ద్వారా
తెలిసింది. ఎవరికీ తెలియని పరమ రహస్యాలు తెలిసి ఆనందభరితుడైనాను.
తౌరాత్ (భగవద్గీత) ప్రకారం నాకు తెలిసిన నిగూఢ జ్ఞానము
సృష్ఠి ఆదిలో పరమాత్మ నాలుగు భాగాలు (ప్రకృతి, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
గా విభజింపబడినాడు అని, ప్రకృతి అనేది చర, అచర ప్రకృతిగా రెండు
భాగాలుగా మారిందని, చర ప్రకృతిగా 24 భాగాల శరీరం, అందులో
జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు కలిపి 27 భాగాలు అని, ప్రకృతియే మాయగా
గుణాల రూపంలో (సైతాన్) తలలో ఉంది అని, బ్రహ్మ, కాల, కర్మ, గుణ
చక్రాలు మనిషి కర్మలు అనుభవించడానికి మూలము అని, జీవాత్మ అయిన
నేను గుణచక్రములో రవ్వంతగా ఉన్నానని, ఆత్మ శరీరము అంతా వ్యాపించి
ఉంది అని, పరమాత్మ శరీరము లోపల, బయట అణువు అణువు వ్యాపించి
ఉందని, ఖురాన్ 6-95 ఆయత్ ప్రకారం జీవాత్మల జన్మలు మూడు
విధాలు అండజ, పిండజ, ఉద్భిజాలుగా ఉన్నాయని, కర్మలు మూడు విధాలు
ప్రారబ్ద, ఆగామిక, సంచిత కర్మలని, మరణాలు కూడా (మూడు +ఒకటి)
నాలుగు అని కాల, అకాల, తాత్కాలిక, ఆఖరి మరణములు అని అద్భుతమైన
అగోచర జ్ఞానము తెలిసినది.
నేను జీవాత్మనని, పరమాత్మ అంశనని, కర్మ బంధములో చిక్కుకొని
ప్రకృతి చేతిలో ఉన్నానని, కర్మలు నాశనం చేసుకుంటేనే జన్మ, కర్మ బంధాల
నుండి ముక్తి కలుగుతుందని, ముక్తి కలగాలంటే భగవద్గీతలో భగవానుడు
చెప్పిన ధర్మాలు బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది
అని తెలిసినది. 1. బ్రహ్మయోగం మనసును నియంత్రించడం అని
2. కర్మయోగం అహము (అహంభావం) లేకుండా, నేనే కార్యములు
చేస్తున్నాననే భావం లేకుండా కార్యములు చేయడం అని 3. భక్తియోగం
ధర్మముల ప్రచారము, దైవసేవ అని ఈ మూడింటి ద్వారానే కర్మలు
నాశనం చేసుకొని, జన్మలు లేకుండా చేసుకొని మోక్షం పొందాలని
తెలిసింది.
సూక్ష్మములో మోక్షం అంటే భగవంతుడిని తెలిసి సాకారాన్ని
ఆరాధించడము భగవద్గీత శ్లోకాలు, 4-9, మరియు18-66 ద్వారా
తెలిసినాయి. శిశువు జన్మించిన తరువాత మొదటి శ్వాసలో జీవాత్మ
ప్రవేశించిన తరువాతనే ప్రాణం వస్తుందని, మనిషికి స్థూల, సూక్ష్మ రెండు
శరీరములు ఉన్నవని అలాగే స్థూల, సూక్ష్మ కర్మలు కూడా రెండు రకములు
అని, దయ్యాలు, భూతాలు గురించి రహస్యాలు తెలిసినాయి. బ్రహ్మవిద్యా
శాస్త్రం ఆధ్యాత్మిక జ్ఞాననిధి అని తెలిసిపోయినది. మనిషి శరీరములోని
బ్రహ్మనాడిలోనే, విశ్వము ఇమిడి ఉన్నదని, షట్ శాస్త్రములు, సర్వవిద్యలు,
బయటి సమస్త ప్రపంచము, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మోక్షప్రాప్తి
కూడా, సర్వము బ్రహ్మనాడిలో ఇమిడి ఉన్నాయనే నిజము తెలిసింది.
ఖుర్ఆన్ మరియు ముస్లీమ్ల విషయములో వారు అజ్ఞానముతో,
అపోహలతో, భ్రమలతో ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానాన్ని ఎలా తప్పుడు
భావము చెప్పుకుంటున్నారో, తమరి జ్ఞాన గ్రంథాల ద్వారా నిజాలు తెలిసి
విస్మయం, ఆశ్చర్యం కల్గినది. ఖుర్ఆన్లో దాగి ఉన్న రత్నాలు, ముత్యాలను
సాధారణ రాళ్ళుగా భావించిన మా ముస్లీమ్లకు పంచి పెట్టిన జ్ఞాన
ప్రదాతగా మీకు నా సాష్టాంగ సుమాంజలులు తెల్పుతున్నాను.
సురా 3 ఆయత్ 7 ద్వారా ఖురాన్లో ముహ్కమాత్ (స్థూల),
ముతషాబిహాత్ (సూక్ష్మ) ఆయత్లు ఉన్నాయని, శరీరములో దాగివున్న
సూక్ష్మజ్ఞానం గురించి తెలియని జ్ఞానాన్ని అంతిమ గ్రంథములో, జ్ఞాన
వాక్యాలు, వజ్ర వాక్యాలు అనే రెండు జ్ఞాన గనులను మా ముస్లీమ్
సమాజానికి అందించిన తమరి రుణం తీర్చుకోలేనిది. మొత్తము ముస్లీమ్
సమాజానికే తెలియని అగోచర జ్ఞానాన్ని తెలిపిన ఖుదాకు (అల్లాహ్ జ్ఞానము
అల్లాహు తప్ప ఎవరికీ తెలియదు) భగవంతునికి, ఆదరణకర్తకు నా సజా
చేస్తున్నాను.
ఏడు ఆకాశాలు, భూమి వాటి మధ్య ఉన్న సమస్తము అంటే
శరీరము అని 30-8, 11-123, 74-30, 31 ఆయతుల ద్వారా,
ముస్లీమ్లకు ఇంతవరకు తెలియని గొప్ప రహస్యం తెలిపినారు. శరీరము
లోనే మూడు ఆత్మలు ఉన్నాయని ఖురాన్ ఆయత్ 50-21 ద్వారా “తోలబడే
వాడు జీవాత్మ, తోలేవాడు ఆత్మ, సాక్షిగా చూసేవాడు పరమాత్మ" అని,
ఇవి భగవద్గీతలో 14-16, 17 మరియు బైబిల్లో మత్తయి సువార్తలో
28-19 నందు మూడు దైవగ్రంథాలలో ఉన్న విషయం ముస్లీమ్ సమాజానికి
ఒక కనువిప్పుగా ఉన్నది. ముస్లీమ్లు ఆచరించే నమాజ్ తపస్సు అని,
నిజమైన నమాజ్ శరీరములోనే ఉందని 4-103, 3-191 ఆయతుల
ద్వారా తెలిసింది. జకాత్ అంటే వందరూపాయలకు 2.50 రూపాయలను
బీదలకు పంచడము కాదని దైవసేవ, ధర్మ ప్రచారమని (భగవద్గీతలో చెప్పిన
బ్రహ్మ,కర్మ,భక్తి యోగాలు అని ఖురాన్ 48-15, 16, 17 ఆయతులని,
రోజా అంటే అన్నం తినకుండా ఉండుట కాదని, ఖుర్ఆన్ 2-187 ఆ
యత్ ద్వారా ఆత్మని పొందడము ఉపవాసమని తెలిసినది. హజ్లో చేసే
ఆచరణ సఫా,మర్వా చర, అచర ప్రకృతికి గుర్తులు అని తెలియని రహస్యము
తెలిసింది.
ముస్లీమ్లకు ఖుర్ఆన్లో సూక్ష్మ ఆయత్లు అర్థముకాక స్థూలముగా
చెప్పుకొని మొత్తము ముస్లీము సమాజానికి ఖుర్ఆన్ దూరము చేసి ఆయత్
2-79 ప్రకారం మనుషులు హదీసులను వ్రాసుకొని అవి మాత్రమే బోధిస్తూ
మొత్తము ముస్లీమ్ సమాజాన్ని 72 వర్గాలుగా చీల్చి, ఖుర్ఆన్క, అల్లాకు
దూరం చేసి ఖుర్ఆన్ ఆయత్లు 2-159, 41-40 ప్రకారం అల్లాహ్
శాపానికి గురైనారు. స్వర్గమే జీవిత లక్ష్యముగా పెట్టుకున్నారు. ముస్లీములకు
స్వర్గము, నరకము తప్ప, పరలోకము (మోక్షము) అంటే ఏమిటో అవి
ఎక్కడ ఉంటాయో తెలియకున్నారు. ఆయన్లు 10-106, 107, 108
స్వర్గం, నరకం గురించి, 3-14, 6-127, 13-24, 30-7,8, 40-
39, 40 పరలోకము గురించి ఖుర్ఆన్లో ఉన్నప్పటికీ, ముస్లీమ్ పెద్దలకు
తెలియకపోవడము దురదృష్టకరము.
ముస్లీములకు పునర్జన్మలు ఉన్నాయని ఖుర్ఆన్ ఆయతులు
7-29, 22-66, 36-68, 40-11 చెప్పుతున్నాయి. గత జన్మలో
చేసుకున్న కర్మలు అనుభవించడానికే జన్మలు ఉన్నాయని ఆయత్ 10-4
చెప్పుతుంది. ముస్లీములకు తద్దీర్ (కర్మ) అంటే పూర్తిగా తెలియదు. ఆయత్
9-51, 57-22 పుట్టుక ముందే అన్నీ రాయబడి ఉన్నాయంటే ఏమి
వ్రాయబడి ఉన్నాయో తెలియక అయోమయములో ఉన్నారు. 7-187,
30-56 ప్రళయము గురించి, 9-5, 5-32 జీహాద్ గురించి, 72-6,
3-41 జిన్నాతుల గురించి, 40-40, 48-5 స్త్రీలకు స్వర్గము గురించి
ఖురాన్లో స్పష్టముగా ఉన్నప్పటికీ తెలియకున్నారు.
97-1, 2, 3, 4, 5 ఖుర్ఆన్ ఆయత్ల ద్వారా సృష్టి రహస్యము
తెలియబడింది. దానికి భిన్నముగా ముస్లీములు లైల తుల్ ఖద్రి
అంటే రంజాన్ అవతరించిన రోజు అని చెప్పుకుంటూ అధర్మ ఆచరణ
చేస్తున్నారు. తమరి గ్రంథముల జ్ఞానము ద్వారా నిజమైన ముస్లీముగా
మారినాను. తమరికి సాష్టాంగ నమస్కారములు.
ముస్లీమ్ సమాజానికి నా విజ్ఞప్తి ఏమనగా!
మొత్తము ముస్లీమ్ సమాజము ఖుర్ఆన్లో అల్లాహ్ చెప్పిన సురా
3 ఆయత్ 7 ప్రకారం ముహ్కమాత్, ముతషాబిహాత్ అంటే స్థూలవాక్యములు,
సూక్ష్మవాక్యములు అంటే ఏమిటో తెలియక అజ్ఞానముతో, ఖుర్ఆన్ ప్రవక్తకే
అర్థమవుతుంది మనకు అర్ధము కాదని, ప్రవక్త జీవిత విధానమే మనము
ఆచరించాలని ముస్లీము పెద్దలు హదీసులు వ్రాసి వాటిని మాత్రమే బోధిస్తూ
ఖుర్ఆన్ జ్ఞానానికి, అల్లాహ్కు మొత్తము ముస్లీమ్ సమాజాన్ని దూరము
చేసి, తీరని అన్యాయము చేసి అల్లాహ్ శాపానికి గురైనారు (ఆయతులు
2-159, 41-40). ఖుర్ఆన్ ఆయత్ 6-91లో మీ పెద్దలకు తెలియని
విషయాలు ఎన్నో తౌరాత్లో తెలియబడ్డా యని ఉంది. ఖుర్ఆన్ ఆయత్
2-79 ప్రకారం మనుషులు వ్రాసిన హదీసులను వదలి, నిజమైన అల్లాహ్
భక్తులుగా, ఖుర్ఆన్ ఆయతు 51-56 ప్రకారము అల్లాహ్ను, నిజజ్ఞానం
తెలిసి ఆరాధించుదాము. ముస్లీమ్ పెద్దలు వారికే ఖుర్ఆన్ ప్రకారము
నిజ జ్ఞానము తెలియక తత్తీర్ గురించి, పునర్జన్మల గురించి, ప్రళయము
గురించి, జీహాద్ గురించి, స్వర్గము, నరకము, మోక్షము గురించి,
ముఖ్యముగా నమాజ్, జకాత్, రోజా, హజ్ గురించి అర్థముకాక తప్పు
భావముతో హదీసులను వ్రాసి, ఖుర్ఆన్ జ్ఞానము తప్పు భావము చెప్పి,
ముస్లీమ్ సమాజాన్ని 72 వర్గాలుగా చీల్చినారు. స్వర్గము పొందటమే జీవిత
లక్ష్యముగా హదీసులు బోధిస్తున్నారు.
ముస్లీములారా! ఇప్పటికైనా మేల్కోండి. అల్లాహ్ మన కోసము
ఖుర్ఆన్ ఆయత్ 2-186 ప్రకారం ఒక వ్యక్తిలో దైవశక్తి ద్వారా నిజమైన
జ్ఞానాన్ని తెలియపరచడానికి పంపి మనలను నిజమైన ముస్లీములుగా,
సంపూర్ణ ముస్లీములుగా చేయటానికి పంపి, యోగీశ్వరుల వారి ద్వారా
“అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు, వజ్ర వాక్యములు” అని
ముస్లీము సమాజానికి తెలియని ఖుర్ఆన్ సూక్ష్మ ఆయతుల జ్ఞానాన్ని అల్లాహ్
ప్రేరణతో (సంకల్పముతో) మనకు రెండు గ్రంథాలను వాటికి అనుబంధ
గ్రంథాలను వ్రాసి ఇచ్చారు. కాబట్టి స్వర్గానికి తీసుకువెళ్ళే హదీసులను
వదలి, మోక్షానికి తీసుకువెళ్ళే ఖుర్ఆన్ ఆయత్ 40-39, 41 ను తీసుకొని
ఆచరించి, 72 వర్గాలను వదలి నిజమైన అల్లాహ్ మార్గములోనికి రావాలని
అందుకోసము యోగీశ్వరులవారి గ్రంథములను అసూయ లేకుండా చదివి,
అర్థము చేసుకొని ఆచరించి నిజమైన 73వ అల్లాహ్ వర్గములోకి వచ్చి
మోక్షము పొందుదాము (ఖుదా హాఫిజ్). ఖుదాకు మీ ప్రియ భక్తుడి
విన్నపము. నాకు సంపూర్ణ జ్ఞానము ప్రసాదించమని, భగవద్గీత శ్లోకము
17-66 ప్రకారం శరణు వేడుకుంటున్నాను. నా జీవిత ధ్యేయము దైవ
జ్ఞానము తెలుసుకుంటూ దైవసేవగా ధర్మప్రచారము చేసుకోవాలని
నిశ్చయించుకొన్నాను. దానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించ
మని, మీ దర్శన భాగ్యము కల్పించమని, ఈ జ్ఞానము చెప్పింది. సాక్ష్యాత్తూ
ఖుదా, భగవంతుడే, ఆదరణకర్తేనని సంపూర్ణముగా విశ్వసిస్తూ.... సాష్టాంగ
నమస్కారము చేస్తున్నాను.
ఇట్లు మీ ప్రియ భక్తుడు,
సయ్యద్ సల్మాన్షా.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.