47. ఇల్లు ఎప్పుడు కొందాం?
ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఒక కల
మాత్రమే! కాలం మారింది. ఇప్పుడు
కలల సాధాన్ని పెట్టుబడికి మార్గంగా
ఎంచుకుంటున్నారు కొందరు.
భవిష్యత్తులో అమ్మితే ఏ మేరకు
లాభాలు వస్తాయో లెక్కలు వేసుకొని
మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే,
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే
అధిక లబ్ధి చేకూరుతుందా?
పూర్తయిన ఇంటిని ఎంచుకుంటే
ఉత్తమమా? ఏ ఎంపిక యజమానికి
మేలు చేస్తుందో తెలుసుకుందాం..
వరుణ్, చరణ్ ఒకే సంస్థలో ఉద్యోగులు. ఇద్దరివీ మంచి జీతాలు. పెండ్లిళ్లు
అయ్యాయి. హాయిగా జీవనం గడుపుతున్నారు. ఒకరోజు మాటల్లో ఇల్లు
తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. వరుణ్ నిర్మాణం పూర్తయిన ఇల్లు కొంటాన
న్నాడు. చరణ్ నిర్మాణంలో ఉన్న ఇల్లయితే తక్కువలో వస్తుందని చెప్పుకొచ్చాడు.
అన్ని విషయాల్లో ఏకతాటి మీద ఉండే ఈ స్నేహితులు ఇంటి విషయంలో ఏకాభి
ప్రాయానికి రాలేకపోయారు.
కొన్నాళ్లకు వరుణ్ ఆఫీసు దగ్గర్లో కోటిలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. గృహ ప్రవేశానికి
చరణ్ దంపతులనూ పిలిచాడు. సరదాగా కాలక్షేపం చేశారు. వరుణ్ గృహప్రవేశం
నాడే చరణ్ నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ చూశాడు అందులో తన బడ్జెట్లో ఉన్న
ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం నాలుగేండ్ల తర్వాత ఆ ఫ్లాట్
చరణ్ సొంతమైంది. ముందుగా బుక్ చేసుకోవడం వల్ల మార్కెట్ ధర కన్నా తనకు తక్కువ
ధరకే ఫ్లాట్ వచ్చిందని చెప్పుకొన్నాడు చరణ్.
ఎవరికెంత లాభం?
ఇద్దరు మిత్రుల కథ చదివారుగా! ఇద్దరూ ఎంతోకొంత లాభపడ్డవాళ్లే! కానీ, ఎవరు ఎంత
లబ్ధి పొందారో ఇప్పుడు చూద్దాం. వరుణ్ కోటి రూపాయలు పెట్టి గృహప్రవేశానికి సిద్ధంగా
ఉన్న ప్లాటు తీసుకున్నాడు 15 లక్షల భయానా ఇచ్చి మిగతా 85 లక్షలు 20
సంవత్సర కాల పరిమితితో బ్యాంకులో గృహ రుణం తీసుకున్నాడు. గృహప్రవేశమైన మరుసటి
నెల నుంచీ రుణ వాయిదా 77 వేలు చెల్లించడం మొదలుపెట్టాడు. అంతకుముందు
25 వేలు ఇంటి అద్దె కట్టేవాడు. దానికి అదనంగా 52వేలు కలిపి వాయిదా చెల్లించడం
మొదలుపెట్టాడు. ఇప్పుడు చరణ్ సంగతి చూద్దాం. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కు 10
లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించాడు. మిగతా 60 లక్షలకు గానూ నాలుగు వాయిదాల్లో
15 లక్షల చొప్పున రుణం మంజూరైంది.
విడుదలైన రుణానికి మాత్రమే వడ్డీ చెల్లించేలా.
ఒప్పందాలు జరిగాయి. అంటే మొదటి రుణ వాయిదా 15 లక్షలకు చరణ్ ఆ ఏడాదికి
1.75 లక్షల వడ్డీ చెల్లించాడన్నమాట. రెండో ఏడాది 3 లక్షలు, మూడో ఏడాది
4 లక్షలు, నాలుగో ఏడాది 6 లక్షలు ఇలా ఇల్లు సొంతమయ్యే నాటికి 15 లక్షలు
వడ్డీ చెల్లించాడు. ఈ నాలుగేళ్లలో మొదటి రెండేళ్లు ఇంటి అద్దె నెలకు 25వేల చెప్పనా
6 లక్షల ఇంటి యజమాని అద్దె పెంచడంతో తర్వాతి రెండేండ్లకు నెలకు 30వేల
చొప్పున 7.2 లక్షలు అద్దె చెల్లించాడు. మొత్తంగా నాలుగేండ్లలో రుణం మీద వడ్డీ, ఇంటి
అద్దె రూపంలో 32 లక్షలు కట్టాడు. ఫ్లాట్ చరణ్ సొంతమయ్యేనాటికి దాని విలువ
1.40 కోట్లకు పెరిగింది. ఇన్నేండ్లూ అతను కట్టింది మినహాయిస్తే పొందిన నికర లాభం.
13 లక్షలు మాత్రమే! అదే సమయంలో ఫ్లాట్ ఎప్పుడు పూర్తవుతుందా అని పడిగాపులు
కాయడం, పనులు ఆగినప్పుడల్లా బిల్డర్ను కలవడం ఇదీ తంతు! వరుణ్ విషయానికొస్తే..
నాలుగేండ్లుగా సొంత ఫ్లాట్లో ఏ రందీ లేకుండా నెలనెలా వాయిదా చెల్లిస్తూ నింపాదిగా
కాలం గడిపాడు.
పెట్టుబడిగా చూడొద్దు.
ఈ ఇద్దరి ఎంపికా సరైనదే! కానీ, వీరిలో ఎక్కువ సంతృప్తిగా ఉన్నది మాత్రం వరుణ్ అని
చెప్పక తప్పదు. ఇంటిని పెట్టుబడిగా భావించినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.
మనం ఉండాల్సిన ఇంటిని ఇన్వెస్ట్మెంట్ గా భావించొద్దు. ఇల్లు తీసుకోవాలని ఫిక్సయ్యాక
వీలైనంత త్వరగా అది సొంతమవ్వాలి. పేరుమోసిన నిర్మాణ సంస్థలు అనుకున్న సమయానికి
ఇంటిని అప్పగిస్తాయి. మరికొన్ని సంస్థలు మాత్రం గడువు ముగిసినా ఇంటికి గడప కూడా
పెట్టవు. అలాంటి సమయాల్లో ఇల్లు సొంతమయ్యే నాటికి దాని మీద ఉన్న మోజు కాస్తా తీరి
పోతుంది. అలాగని, నిర్మాణంలో ఉన్న ఇల్లు తీసుకోవద్దని కాదు! కొన్ని నిర్మాణ సంస్థలు
ఫ్రీలాంచ్ సమయంలో తక్కువ ధర ఆఫర్ చేస్తుంటాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల
చాలా సందర్భాల్లో లాభం పొందొచ్చు. కానీ, అది మీ సొంతింటి కల నెరవేరిన తర్వాత అద
నపు పెట్టుబడి అయితే సరైన ఎంపిక అనిపించుకుంటుంది. అందుకే, ఇల్లు తీసుకునేటప్పుడు
వీలైనంత త్వరగా మీ చేతికొచ్చే నెలవుకే ఓటేయండి.