58.ఏది బంగారమంటి పెట్టుబడి?
తలపండిన ఆర్థిక మేధావులకూ అర్ధం కాని బ్రహ్మపదార్థం పెట్టుబడి, అధిక లాభాలు వస్తాయని ఆశించి పెట్టిన పెట్టులు డలన్నీ రాత్రికి రాత్రి ఆవిరైపో తాయి. ఒకరి విషయంలో గోరంత పెట్టుబడికి కొండంత లాభం ఇచ్చిన రంగం.. మీ కొండంత పెట్టుబడిని రవ్వంత చేయొచ్చు, ఆర్థిక సూత్రాలకు సంబంధం లేకుండా మీ పెట్టుబడి పదిలంగా పెరగాలంటే ఇలా చేయండి..
దివాకరానికి ఒక్కగానొక్క కూతురు. తన పెండ్లి కోసం నగర శివారులో ఎప్పుడో మూడు వందల గజాల స్థలం కూడా తీసుకున్నాడు. అనుకో కుండా మంచి సంబంధం దొరికింది. ముహూర్తమూ కుదిరింది. ఆ ఒక్క ప్లాట్ అమ్మితే వచ్చే డబ్బులతో కట్నకానుకలు, పెండ్లి ఖర్చులన్నీ వెళ్లిపోతాయని భావిం చాడు. మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. ఒకరిద్దరు ఇన్వెస్టర్లూ వచ్చారు. ఇంతలో ఎన్నికల కోడ్ కూసింది.
తెల్లారేసరికి దివాకరం ఇంటి నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలో రెండు చెకోపోస్టులు వెలిశాయి. ప్లాట్ ధరంతా వైట్లో చెల్లించడానికి కొనుగోలుదారులు సిద్ధంగా లేరు. బ్లాక్లో ఇచ్చిన డబ్బును ఇంటిదాకా తీసుకెళ్లే ధైర్యం దివాకరానికి లేదు. ఆయనలో ఒత్తిడి పెరిగింది. అతని అవసరం గుర్తించిన ఇన్వెస్టర్లు సగం ధరకు బేరాలు సాగించారు. ఒకవైపు పెండ్లి పనులు, మరోవైపు తనిఖీలు.. ప్లాట్ అమ్మకం అటకెక్కింది.. అందినచోటల్లా అప్పులు చేసి. బరువుగా బాధ్యత తీర్చుకున్నాడు.
అనుకున్నదే తడవుగా.
దివాకరానికి ఆ క్షణంలో అండగా నిలిచిన స్నేహితుడి పేరు విశాల్. ఇతను కూడా భూమ్మీత పెట్టుబడి పెట్టినవాడే! అలాగని ఉన్నదంతా దానిమీద కుమ్మరించలేదు! తెలివిగా బంగారం.. మీద పెట్టుబడి పెడుతూ పోయాడు. అధికారిక గోల్డ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి నలభై తులాల వరకూ బంగారం కూడబెట్టగలిగాడు. తన స్నేహితుడికి అవసరంలో అధికారికంగా సాయం చేశాడు. 30 తులాల బంగారం బ్యాంకులో కుదువపెట్టి పదిహేను లక్షల రూపాయలు సాయం చేశాడు. ఈ ఆపత్కాలంలో ఆదుకున్న మరో స్నేహితుడు లక్ష్మీపతి. ఏ గత్యంతరం లేక.. పెండ్లికి పది రోజుల ముందు మిత్రుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు దివాకరం. 'మై హూం' నా' అన్నాడు లక్ష్మీపతి. నాలుగు రోజుల్లో 25 లక్షలు దివాకరం బ్యాంకు ఖాతాలో జమ శాడు. తావీజు మహిమేం లేదు ఇక్కడ, మ్యూచువల్ ఫండ్స్లో ఏండ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్న లక్ష్మీ పతికి పాతిక లక్షలు పెద్ద మ్యాటర్ అనిపించలేదు. అదృష్టవశాత్తు మార్కెట్ కూడా బాగా ఉండ టంతో తన ఫంచి పాతిక లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. మూడు రోజుల్లో డబ్బులు అతని ఖాతాలో పడ్డాయి. మర్నాడు స్నేహితుడికి అందాయి.
మూడూ మంచివే..
ముగ్గురు స్నేహితులూ మంచి ఇన్వెస్టర్లే! ఒకరు భూమి మీద పెట్టారు. ఇంకొకరు బంగారాన్ని నమ్ముకున్నారు. వేరొకరు మ్యూచువల్ఫండ్స్ను ఎంచుకున్నారు. వీరి అవసరానికి ఆదుకు న్నది మాత్రం బంగారం, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే! అలాగని భూమి మీద పెట్టుబడి పెట్టొద్దు అనుకోవద్దు. స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో ముందస్తు జాగ్రత్త తప్పనిసరి. మీ అవసరానికి కనీసం ఆరు నెలల ముందునుంచే అమ్మకానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే, కొన్నిసార్లు ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో వాళ్లకు శస్త్రచికిత్స అవసరం పడొచ్చు!అనుకోకుండా కూతురును విదేశాలకు పంపించాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థి తుల్లో.. బంగారాన్ని మించిన కొంగుబంగారం లేదు! మ్యూచువల్ ఫండ్స్న మించిన ఫండ్స్ లేవు. నేల మీద పెట్టుబడి ఎల్లవేళలా మంచిదే! కానీ, అక్కరకు రాని చుట్టమే కాదు, పెట్టుబడిని కూడా గ్రక్కున విడువంగ వలయు సుమతి !!
చివరిగా, మార్కెట్ లెక్కల ప్రకారం దీర్ఘకాలంలో బంగారంపై 8-11 శాతం రిటర్న్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో 12 శాతం వరకు వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ 14 శాతం వరకు రిటర్న్స్ ఇస్తున్నాయి. ఎందులో ఇన్వెస్ట్ చేసినా లాభమే! కానీ, అవసరానికి ఏది ఆదుకుంటుందో అందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఉత్తమ పెట్టుబడి అనిపించుకుంటుంది.
మార్కెట్ క్రాష్ అయితే మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏమిటి? అనొచ్చు! ముప్పయ్ శాతం క్రాష్ అయినా.. 70 శాతం పదిలంగా ఉంటుంది. ఏడాదిలో మళ్లీ కుదు రుకుంటుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ భారీగా పతనం అయ్యే అవ కాశాలు ఉన్నాయి. అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మీ స్థిరాస్తిని మార్కెట్ ధరకు కొనుగోలు చేసే పెట్టుబడిదా రులు కూడా అంత తేలిగ్గా దొరకరని గుర్తుంచుకోండి.