69. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ విలువ..

69. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ విలువ..

అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలా.. ఇండిపెండెంట్ ఇల్లు కొనాలా.. రెండూ కాదు ఓపెన్ స్థలం కొనాలా..ఇల్లు కొనే ఆలోచన ఉన్న వారింట్లో ఇదే చర్చ. అపార్ట్మెం ట్లో ఫ్లాట్ కొంటే పదేండ్ల తర్వాత పెట్టిన ధర రాదని కొందరి ఉవాచ. కాలంతోపాటు అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు నేల చూపులు చూస్తాయన్న వాదనలో ఎంత నిజముంది? సుందరం మాస్టారు కథ చదివితే, అసలు విషయం బోధపడుతుంది!

సుందరం మాస్టారు 1993లో పదవి విరమణ చేశాడు. గ్రాడ్యుటీ మొత్తం, అన్నాళ్లూ ఆయన పొదుపు చేసిన సొమ్ము అన్నీ లెక్క చూసుకుంటే 3 లక్షలు అయ్యాయి. ఒక లక్ష కూతురు పెండ్లికి ఖర్చు చేశాడు. 50 వేలు కొడుకు పై చదువులకు దాచాడు. భార్య పేరిట 50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మిగిలిన లక్ష రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. దాన్ని 450కి అద్దెకు ఇచ్చాడు, కొన్నాళ్లకు ఆయన కాలం చేశారు. పదేండ్లలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దె పెరుగుతూ పెరుగుతూ 1,200కు చేరింది. మాస్టారు కొడుకు శ్రీనివాస్ ఆ ఫ్లాట్లోకి మకాం మార్చాడు. మరో ఇరవై ఏండ్లు గడిచాయి. ఒకరోజు శ్రీనివాస్ తల్లితో వాదులా దిగాడు. 'నాన్న ఆ రోజుల్లో లక్ష పెట్టి ఎక్కడైనా ఓ స్థలం కొనుంటే.... ఇప్పుడు కోటి రూపాయలకు తక్కువ వచ్చేవి కావు. ఈ అపార్టుమెంటు తీసుకు న్నాడు. ఇప్పుడు చూడు ఇది పాడుబడిపోయింది. అమ్ముదామంటే కొనేవాడు . లేడు. అపార్టుమెంట్వాసులంతా దీన్ని పునర్నిర్మించాలని తీర్మానించారు. 20 లక్షలు కడితే తప్ప.. మనకు కొత్త ఫ్లాట్ రాదట' అని ఊగిపోతున్నాడు.

ఈ మాటలు పక్కింట్లో ఉన్న సుందరం మాస్టారు శిష్యుడు రాజు చెవిన పడ్డాయి. తన మాస్టారి నిర్ణయాన్ని తప్పుబడుతున్న శ్రీనివాస్ ఒంటరిగా మాట్లాడాలని ఫిక్సయ్యాడు. ఆరోజు సాయంత్రం అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో వాకింగ్ చేస్తున్న శ్రీనివాస్ను పలక రించాడు. 'వారం నుంచి గమనిస్తున్నాను మీ ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది' అన్నాడు రాజు.పొద్దున్నఇంట్లో జరిగిందంతా చెప్పాడు శ్రీనివాస్. అప్పుడు రాజు చిన్నగా నవ్వి... 'మన అపార్ట్మెంట్ మొత్తం పడగొట్టి.. రెండేండ్లలో కొత్త ప్లాట్ ఇస్తే మంచిదేగా!' అన్నాడు. 'ఏ మంచి.. 20 లక్షలు కట్టాలి కదా!' అన్నాడు. అప్పుడు రాజు 'మన ఏరి యాలో కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖరీదు ఎంత ఉంటుందో చెప్పగలరా?' అని ప్రశ్నిం 75 లక్షలకు పైమాటే' అన్నాడు. 'బిల్డర్ మిమ్మల్ని 20 లక్షలు ఇస్తే కొత్త ఫ్లాట్ కట్టిస్తున్నాడుగా! మీకు 55 లక్షలు లాభమే కదా! అంటే మీ నాన్నగారు ముప్పయ్ ఏండ్ల కిందట పెట్టిన లక్ష రూపాయలు ఇప్పుడు 55 లక్షలకు పెరిగిందన్నమాటే కదా! పైగా మీకు ఇన్నాళ్లుగా మీకు నీడనిస్తూ, అద్దె భారం తప్పించింది కూడా! అద్దె కొంపలో అగచాట్లు మనకు తెలిసిందే కదా! అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీనివాస్ ఒక్క క్షణం ఆలోచనలోపడ్డాడు. 'ని జమేనండోయ్ ! నేను ఇలా ఆలోచించలేదు. నగర శివారులో కూడా కొత్త ఫ్లాట్ ధరలు 50 లక్షలకు తక్కువ పలకడంలేదు. అలాంటిది 20 లక్షలకే మళ్లీ నయా ప్లాట్ సిటీ మధ్యలో వస్తుంది' సంబురపడ్డాడు.

అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనగానే కాలంతోపాటు విలువ తరిగిపోతుందని చాలామంది భావన. అదే ఓపెన్ స్థలమైతే అంచెలంచెలుగా పెరుగుతుందని బలంగా నమ్ముతారు. దీర్ఘకాలంలో ఓపెన్ స్థలాల విలువలు గమనిస్తే ఆరేండ్లకు ఒకసారి రెండింతలు అవుతాయి. అదే ఇండిపెం డెంట్ ఇంటి విలువ దీర్ఘకాలంలో దాదాపు ఎనిమిదేండ్లకు రెండింతలు అవుతుంది. అపార్ట్ మెంట్ ఫ్లాట్ విలువ దగ్గరికి వచ్చేసరికి పదేండ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంది. ఎంత పాతబ డిపోయినా దాని విలువ తగ్గదు. యాభై ఏండ్లు దాటితే.. అపార్ట్మెంట్ అసోసియేషన్ సమ ష్టిగా ఉండి మంచి బిల్డర్ను ఎంచుకుంటే కాణీ ఖర్చు లేకుండా కొత్త ఫ్లాట్ సొంతం చేసుకో వచ్చు. నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్ ధరలో మూడోవంతు ఇచ్చినా కొత్త ఫ్లాట్ మళ్లీ సొంతం అవుతుంది. అంతేకాదు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ గానీ, ఇండిపెండెంట్ ఇల్లు గానీ అద్దె భారాన్ని తగ్గిస్తుంది. అదే భూమి నుంచి నెలవారీగా ఎలాంటి ఆదాయమూ రాదు! పైగా భూమిని అమ్మగా వచ్చిన డబ్బు బ్లాక్ లోనే ఎక్కువగా ముడుతుంది. దాన్ని మీ ఖాతాలో చూపించలేరు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా దానిని మీరు అధికారికంగా వాడటం కష్టంతో కూడు కున్న పని. అదే మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మితే కొనుగోలుదారులు బ్యాంకు లోను ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అంటే అకౌంట్కు బదిలీ అవుతుంది. దానిని మీరు స్వేచ్ఛగా ఉపయోగిం చుకోవచ్చు. కానీ, స్థలాల విక్రయాల్లో ఇప్పటికీ చాలామంది బ్లాక్ మనీ లావాదేవీలే చేస్తుం డటం గమనార్హం! ఇక్కడ భూమిని కొనుగోలు చేయొద్దని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ,  అపార్ట్ మెంట్ ఫ్లాట్ విలువ పడిపోతుంది అనడంలో పస లేదని సుందరం మాస్టారు కథ నిరూపి స్తుంది.

అపార్ట్మెంట్లో స్థలం (అన్జివైడెడ్ షేర్) తక్కువగా వస్తుందని అందరూ భావిస్తుంటారు. కానీ, నిజానికి ఇక్కడ స్థలం ప్రస్తావన అప్రస్తుతం. అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎంతకు కొన్నారు, ఎంతకు అమ్ముతున్నారన్నదే ముఖ్యం. ఒక ఏరియాలో పాత అపార్ట్మెంట్ ప్లాట్ రూం లక్షలు విలువ చేస్తే, అదే ప్రాంతంలో కొత్తది 80 లక్షలు పలుకుందని కొందరు లెక్కలు చెబుతారు. ఆ పోలిక కూడా సహేతుకం అనిపించుకోదు. పాతదాన్ని అప్పుడు మీరు కొను గోలు చేసిన ధరతో పోల్చిచూడాలే కానీ, కొత్తదాని ధరతో ఎలా కంపేర్ చేస్తారు? పదేండ్లు దాటిన అపార్ట్మెంట్ ప్లాట్సుకు బ్యాంకు లోను రాదనే అపోహ చాలామందిలో ఉంది. కానీ, అది తప్పు!! బ్యాంకు లోను అపార్ట్మెంట్ వయసును బట్టి ఉండదు. మార్కెట్ ధరలో 80శాతం లోను బ్యాంకులు ఎప్పుడైనా ఇస్తాయి.


24 ఏళ్లు పైబడినా..

2000 సంవత్సరం ప్రాంతంలో కొత్తపేట, దిల్సుఖ్ నగర్, వారాసిగూడా తదితర ఏరియాల్లో 5 లక్షలకు 1,000 చదరపు అడుగుల ఫ్లాట్ వచ్చేది. ఫ్లాట్ల విషయంలో డిప్రి సియేషన్ నిజమైతే.. ఇప్పుడు ఆ ఫ్లాట్ విలువ 2.5 లక్షలకు పడిపోవాలి. కానీ, ఇప్పుడు అదే ఏరియాలో 20 ఏండ్లు పైబడిన ఫ్లాట్ విలువ 35 లక్షలకు తక్కువ లేదు. కొత్త ఫ్లాట్ ధర 75 లక్షలకు పైమాటే!

ముప్పయ్ ఏళ్లు దాటినా..

అమీర్పేట్లోని కీర్తీ అపార్ట్మెంట్, లాల్బంగ్లా దగ్గర్లోని దివ్యశక్తి అపార్ట్మెంట్, సోమాజిగూడలోని క్రాంతి శిఖర అపార్ట్మెంట్ కట్టినప్పుడు  లక్షకే అందులో ఫ్లాట్ తీసు కున్నారు. 35 ఏండ్లు గడిచిపోయాయి. ఫ్లాట్స్కు డిప్రిసియే షన్ ఉండి ఉంటే ఇప్పుడు వాటి ధర వేలల్లో ఉండాలి. కానీ, ఇప్పటికిప్పుడు అమ్మకానికి పెడితే 45 లక్షల నుంచి 55 లక్షల వరకు ధర పలుకుతాయి. పైగా ఈ ఫ్లాట్స్ మీద సంవత్సరానికి 3 లక్షల వరకు అద్దె వస్తుం డటం విశేషం. దీనిని బట్టి ఫ్లాట్ విలువ కాలంతోపాటు తగ్గుతుందన్న వాదనలో పసలేదని తేలిపోతుంది.


మాకెందుకు అనుకోవద్దు..

'ఆరోగ్య బీమానా!.. మాకెందుకు?' అని చాలామంది మహిళల అభి ప్రాయం. పెండ్లయ్యాక పెనిమిటి చూసుకుంటాడులే అని కొందరి భావన. కానీ, అలా ఆలోచించడం సరైనది కాదు. దీపిక కథ చదివితే ఈ తరం ఆడపిల్లలకు ఆరోగ్య బీమా ఎంత అవసరమో తెలుస్తుంది. దీపిక వయసు 27 ఏండ్లు. పెండ్లికి ముందు ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేది. నెలకు లక్షకుపైగా జీతం అందుకునేది. కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండటంతో ప్రత్యేకంగా మరో హెల్త్ పాలసీ తీసుకోలేదు. పైగా ఇంత చిన్న వయసులో తనకేం సమస్యలు వస్తాయనే ధీమాతో ఉండేది. అనుకో కుండా ఆమెకు పెండ్లి కుదిరింది. నెలలో ముహూర్తం ఫిక్సయింది. అత్తవా రింటి కోరిక మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసింది దీపిక. అంగరంగ వైభవంగా పెండ్లి జరిగింది. మూడేండ్లుగా కూడబెట్టిందంతా పెండ్లికి ఖర్చు చేసింది. రెండు లక్షల రూపాయల బ్యాంకు నిల్వతో అత్తవారింట అడుగుపెట్టింది. నెల తర్వాత దంపతులు ఇద్దరూ హనీమూన్ కు వెళ్లారు. వస్తుండగా ఓ ప్రమాదం. అందులో ఇద్దరికీ తీవ్రమైన గాయాలయ్యాయి. దీపిక భర్తకు ఆఫీస్ వారిచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ లభించింది. నెల రోజులే కావడంతో భార్య పేరు అందులో నమోదు చేయలేకపోయాడు. దీపిక ఉద్యోగం మానేయడంతో ఆమెకు ఆఫీస్ వారిచ్చిన బీమా చెల్ల కుండా పోయింది. ఆమె వైద్యానికయ్యే ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వచ్చింది. ఆ దంపతులు డిశ్చార్జ్ అయ్యేసరికి దీపిక బిల్లింగ్ చూసి ఆమె ఇంట్లోవాళ్లకు కండ్లు తిరిగినంత పనైంది. ఆదే దీపికకు ఆరోగ్య బీమా ఉండి ఉంటే.. ఏ సమస్యా వచ్చేది కాదు!

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024