1.ఆరోగ్య ప్రాప్తిరస్తు.
సగటు ఉద్యోగి అల్ప సంతోషి, చిన్న
హైకొస్తే చాలు సంబరపడతాడు.
కొద్దిపాటి ప్రశంసకే ఉబ్బితబ్బిబ్బవు
తాడు. కుటుంబంతో నెలకో
సినిమా, ఏడాదికో తీర్థయాత్ర.
చాలీచాలని సంపాదనలోనే
అందీ అందని సంతోషాలెన్నో
వెతుక్కుంటాడు. కానీ, చిన్న ఆరోగ్య
సమస్య అతని జీవితాన్నే
మార్చేస్తుంది. పట్టాలు తప్పిన
జీవిత రైలును మళ్లీ ట్రాక్ కి
తేవడానికి ఏండ్లు పట్టొచ్చు.
మనుషులు ఆచరించే ఆర్థిక విధానాలే వారి కుటుంబ స్థితిగతులను నిర్దేశి
స్తాయి. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నం
తలో ఉన్నతంగా బతకాలని ఆశిస్తుంటారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి
రూపాయి, రూపాయి కూడబెడుతుంటారు. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనే
దురాశతో అధిక వడ్డీల ఉచ్చులో చిక్కుకునే వాళ్లూ ఎందరో ఉంటారు! అయితే,
వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి
తనకు, తనను నమ్ముకున్న కుటుంబానికి రక్షణ కల్పించిన తర్వాతే.. ఇతర పెట్టు
బడుల గురించి ఆలోచించాలి.
ఆరోగ్య బీమాతో ధీమా.
ప్రతి కుటుంబానికి కావాల్సిన కనీస భద్రత ఆరోగ్య బీమా. ప్రతి ఖర్చునూ మనం నియంత్రిం
చవచ్చు. సంపాదనకు తగ్గట్టుగా అద్దె ఎంత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక శక్తి మేరకు
పిల్లలను ఏ బడికి పంపాలో తేల్చుకోవచ్చు. మన జేబు బరువును బట్టి రైలు ప్రయాణంలో ఏ
తరగతి టికెట్ కొనుక్కోవాలో కూడా మనమే నిర్ధారించుకోవచ్చు. మన చేతుల్లో లేనిది,
మనకు అందుబాటులో ఉండనివి దవాఖాన ఖర్చులు. ఆరోగ్యపరమైన సమస్యలు రానంత
వరకు ఆరోగ్య బీమా ప్రాధాన్యం తెలియదు. కానీ, అనారోగ్యం ఏర్పడే నాటికి బీమా లేక
పోతే, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులు అవ్వడానికి ఎంతో కాలం పట్టదు. వైద్యం
కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడటానికి ఒక్కోసారి పదేండ్ల సమయమూ
పట్టొచ్చు. విలువైన కాలమంతా రుణాలు తీర్చడానికి రుణం చేయాల్సి వస్తుంది. మంచి
ఆహార విధానం, సరైన జీవనశైలి పాటిస్తున్న తమకు అనారోగ్య సమస్యలు ఎందుకు తలెత్తు
తాయని కొందరు భావిస్తుంటారు. కానీ, ప్రమాదం రూపంలోనూ సమస్యలు చుట్టుముట్ట
వచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా మన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే.. 'ఏకైక మార్గం
ఆరోగ్య బీమా.
తప్పుడు సమాచారం ఇవ్వొద్దు.
బీమా గురించి సమాచారం తెలుసుకోవడంతోపాటు, పాలసీదారు సరైన సమాచారం
ఇవ్వాలి. బీమా ప్రీమియం పెరుగుతుందని పాత రుగ్మతలను దాచి పెడితే, క్లెయిమ్ రిజెక్ట్
అవ్వొచ్చు! ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలూ దాపరికం లేకుండా చెప్పాలి.
మధుమేహం, రక్తపోటు ఇలా అప్పటికే ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి తెలియ
జేయాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని బీమా ప్రీమియం నిర్ధారిస్తారు. చిన్నపాటి
వ్యత్యాసం కోసం ఉన్న రోగాలను దాచిపెడితే, అవసరానికి పాలసీ ఉన్నా ఉపయోగ
లేకుండా పోతుంది.
మధ్యలో ఆపొద్దు.
ఆరోగ్య బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోగానే చాలామందికి ఎలాగైనా
పాలసీ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ, పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత
ప్రీమియం చెల్లించేటప్పుడు ఉండదు. 'గడిచిన రెండేండ్లుగా ఏ ఆరోగ్య సమస్య తలెత్తలేదు
కదా!' అనుకొని మూడో సంవత్సరం ప్రీమియం చెల్లించడానికి వెనుకాడుతారు. కానీ, అదే
ఏడాది ఏదైనా సమస్య తలెత్తితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ప్రతి
కుటుంబానికి ప్రాథమిక రక్షణ ఆరోగ్య బీమా. పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా, మంచి
చదువుతోపాటు ఆరోగ్య రక్షణ కల్పించడం తల్లిదండ్రుల విధి.
ఎన్ని లక్షలు తీసుకోవాలి?
ఆరోగ్య బీమా తీసుకుంటే సరిపోదు, ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ముఖ్యం.
ప్రీమియం భారీగా ఉండొచ్చని చాలామంది తక్కువ మొత్తం కవరయ్యే బీమా చేస్తుంటారు.
ఓ రెండు లక్షలు వస్తే చాలు అనుకుంటారు. కానీ, వైద్యానికయ్యే ఖర్చులు భారీగా పెరుగుతు
న్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని నలుగురు సభ్యులున్న కుటుంబానికి కనీసం 25
లక్షల నుంచి కోటి కవరయ్యే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. దీనికయ్యే ప్రీమియమ్
23 వేల 60 వేల వరకు ఉంటుంది. మన భవిష్యత్ అవసరాలకు అంటే 30
సంవత్సరాల తర్వాత అయ్యే మెడికల్ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయల
పాలసీ తీసుకోవడం ఉత్తమం.
2.ఏ బీమా ఆరోగ్యకరం?
ఆనందమైన జీవితంలో అగాధం
సృష్టించడానికి చిన్నపాటి వ్యాధి
చాలు, ఆరోగ్య బీమా ఉందని
భీమాగా ఉన్నారా? అయితే, తక్కువ
ప్రీమియంలో వస్తుందని బ్యాంకులు
ఆఫర్ చేసే గ్రూప్ పాలసీ తీసు
కుంటే.. పొరబడినట్టే! కష్టం చెప్పిరా
దన్నట్టే.. కొన్ని బ్యాంకుల బీమాలు
అకస్మాత్తుగా అక్కరకు రాకుండా
పోయే ప్రమాదమూ ఉంది. ఇంతకీ
బ్యాంకు ద్వారా తీసుకున్న గ్రూప్
ఇన్సూరెన్స్ మంచిదేనా?
బీమా రంగంలో రోజుకో మార్పు చోటుచేసుకుంటున్నది. కొత్తకొత్త సంస్థలు
సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, నాన్
బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సైతం మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొస్తు
న్నాయి. తక్కువ ప్రీమియంతో ఊరిస్తుండటంతో బీమా సంస్థలను కాదని చాలా
మంది డైరెక్ట్ గా బ్యాంకుల ద్వారా పాలసీని తీసుకుంటున్నారు.
బ్యాంకులు ఆఫర్ చేసే పాలసీలకు తక్కువ ప్రీమియం ఉండటానికి చాలా కారణాలున్నాయి.
వేలాది మంది వినియోగదారులతో ఒక బృందంగా బ్యాంకులు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ
అందిస్తున్నాయి. ఇందుకోసం బ్యాంకులు బీమా సంస్థలనే ఆశ్రయిస్తాయి. సదరు బీమా
సంస్థలు భారీ స్థాయిలో వినియోగదారులు లభించడంతో తక్కువ ప్రీమియంకే పాలసీ ఇవ్వ
డానికి అంగీకరిస్తాయి. అయితే, ఒకటి, రెండేండ్లలో భారీగా క్లెయిమ్స్ ఇవ్వాల్సి వస్తే.. పాల
సీని కొనసాగించకుండా నిలుపుదల చేయవచ్చు. ఈ క్రమంలో వినియోగదారుల పరిస్థితి అగ
మ్యగోచరంగా తయారవుతుంది.
పొడిగించలేం..
బ్యాంకు పాలసీల్లో ఇన్సూరెన్దారుల దయాదాక్షిణ్యాలపై మన అదృష్టం ఆధారపడి
ఉంటుంది. ఉదాహరణకు సురేంద్రకు 40 ఏండ్లు. అతని తల్లికి 60 ఏండ్లు, తక్కువలో
వస్తుంది కదా అని తల్లిపేరిట బ్యాంకు ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. రెండేండ్ల
తర్వాత కిడ్నీ జబ్బు తలెత్తింది. డయాలసిస్ మొదలైంది. ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ
ఖర్చులు సురేంద్ర నెత్తిన పడలేదు. మరో రెండేండ్లకు పాలసీ రెన్యువల్ చేయలేమని బ్యాంక్
నుంచి సందేశం వచ్చింది. అప్పటికి అనారోగ్యంతో ఉన్న సురేంద్ర తల్లికి బయట బీమా
సంస్థలు కూడా పాలు పాలసీ ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. ఐదేళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న
ప్పుడే బీమా సంస్థలకు చెందిన డైరెక్ట్ పాలసీ తీసుకొని ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు!
పోర్టబిలిటీ డౌటే!
సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పాలసీదారుడి హెల్త్ డైరీ కీలక భూమిక పోషి
స్తుంది. ఒక బీమా సంస్థ తరపున పాలసీ తీసుకున్నారు అనుకుందాం! వారి సేవలు నచ్చని
పక్షంలో పాలసీ పోర్టబిలిటీకి అవకాశం ఉంటుంది. అంటే కొత్త పాలసీ తీసుకున్నట్లుగా
కాకుండా దీనికి సీనియారిటీ వర్తిస్తుంది. దీంట్లో సీనియారిటీతో ఏం పని అనుకోకండి?ఉదాహరణకు
40 ఏండ్ల వ్యక్తి మొదటిసారి హెల్త్ ఇన్సురెన్స్ తీసుకున్నాడు! నాలుగేండ్ల పాటు
సాగించాడు. ఐదో ఏడాది ఇప్పుడున్న సంస్థ కాదని మరో సంస్థకు చెందిన పాలసీ తీసుకోవా
లని భావించాడు. ఇలాంటి సందర్భంలో గతంలో ఎలాంటి క్లెయిమ్స్ లేకపోతే ఇన్సూరెన్స్
సంస్థలు పాలసీ పోర్టబిలిటీకి అంగీకరిస్తాయి. పాలసీ అందజేసిన తర్వాతి రోజు నుంచే ఏదైనా
అనారోగ్య సమస్య తలెత్తితే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మళ్లీ కొత్తగా
పాలసీ తీసుకోవాల్సి వస్తే మొదటి నెల రోజులు ప్రమాదం జరిగితే తప్ప క్లెయిమ్ చేసుకునే
వీలు ఉండదు. పైగా మొదటి రెండేండ్లూ కొన్ని శస్త్ర చికిత్సలకూ, కొన్ని రుగ్మతలకు క్లెయిమ్
వర్తించదు. ఈ మేరకు మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సి వస్తే వినియోగదారుడు రిస్క్లో పడ్డట్టే!
పోర్టబిలిటీ ఉంటే.. ఈ సమస్య తలెత్తదు!! బ్యాంకు ద్వారా తీసుకున్నప్పుడు గ్రూప్ పాలసీలో
ఈ పోర్టబిలిటీ అవకాశాలు తక్కువ. కొన్ని బ్యాంకులు పోర్టబిలిటీ అవకాశం కల్పిస్తామని
అంటున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలవుతున్నట్లు కనిపించడం లేదు
. వీట న్నిటినీ పరిశీలించిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో బ్యాంకులు, నా బ్యాంకింగ్
ఫైనాన్స్ సంస్థల పాలసీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విశ్వనీయత ఉన్న హెల్త్
ఇన్సూరెన్స్ సంస్థల పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం.
ఐదేండ్లు పాలసీ కొనసాగిన తర్వాత ఆరో ఏడాది నిలు
పుదల చేస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పాలసీ తీసు
కోవాల్సి వస్తుంది. ఈ ఐదేండ్లలో ఆ వ్యక్తి ఆరోగ్యం దెబ్బ
తింటే.. కొత్త పాలసీ దొరకడం కష్టంగా మారవచ్చు,
అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోయినా వయసు పెర
గడం వల్ల ప్రీమియం భారం కావొచ్చు. అందుకే, హెల్త్
ఇన్సూరెన్స్ కోసం నేరుగా బీమా సంస్థలను ఏజెంట్
ద్వారా ఆశ్రయించడమే తెలివైన పని.
3.ఆ ఒక్కటీ చాలు!
అలవాటు చేసే చిన్న పొరపాటు
జీవితాన్ని తలకిందులు చేస్తుంది.
ఆరోగ్య బీమా విషయంలో సగటు
ఉద్యోగి ప్రదర్శించే నిర్లిప్త ధోరణి..
అతని జీవితాన్ని ఉన్నపళంగా
అగాథంలోకి నెట్టేస్తుంది.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్
ఇన్సూరెన్స్ ఎందుకు? ఆఫీస్ వాళ్లు
ఐదు లక్షల రూపాయల కవరేజీ
ఇచ్చాక మరో బీమా దేనికి?
అని తర్కిస్తే... చేతులు కాలాక
ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది.
కల్తీలతో పల్టీలు కొడుతున్న నేటి మనిషి ఆరోగ్యం మేడిపండు చందమే! తాగు
తున్న పాలు తింటున్న ఆహారము అన్ని రసాయన అవసాస్లతో అందుతున్నాయి
న్నాయి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. ఊహించని రోగాలు మనిషిని
పలకరిస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఆరోగ్యం బాగున్నా.. ఉరుకుల పరుగుల జీవి
తాల్లో ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయని మర్చిపోవద్దు. ఇలాంటి విప
త్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడే శక్తినిచ్చే ఏకైక అస్త్రం హెల్త్
ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఎంత మొత్తానికి
తీసుకున్నామన్నది ప్రధానం.
మూడింతల భారం.
నాలుగైదు లక్షల రూపాయలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని గుండెల మీద చేయి వేసుకొని
తృప్తిగా పడుకునే రోజులను దాటొచ్చేశాం. ఒకప్పుడు మోకాలు చిప్ప మార్పిడికి 70 వేల
వరకు అయ్యేది. ఇప్పుడది 3 లక్షలకు పెరిగింది. ఇలా పదేండ్లకు ఒకసారి దవాఖాన
ఖర్చులు మూడు, నాలుగు రెట్లు పెరుగుతున్నాయి. కంపెనీ వాళ్లు ఇచ్చే 5 లక్షల ఇన్సు
రెన్స్ చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు సరిపోతుందేమో! కానీ, తీవ్ర జబ్బులు తలెత్తినప్పుడు
ఈ మొత్తం ఏ మూలకూ రాదు. పైగా ఉద్యోగంలో ఉన్నంత వరకే ఈ పాలసీలు వర్తిస్తాయి.
ఉద్యోగం చేసి యాభయ్యో పడిలో జాబ్ మానేస్తే... అప్పుడు పరిస్థితి ఏంటి?
నో గ్యారెంటీ..
ఉద్యోగంలో ఉన్నప్పుడే వ్యక్తిగతంగా కుటుంబసభ్యుల పేరిట ఆరోగ్య బీమా తీసుకోవడం
అత్యావశ్యకం. 'కీడెంచి మేలెంచాలి' అన్న సూత్రం ఆరోగ్యం విషయంలో ఆలోచించడానికి
కూడా మనిషి అంగీకరించడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ యాభై లక్షలు, కోటి బీమా తీసు
కోమని సూచించగానే, 'అంత ప్రీమియం కట్టలేను' అనేస్తాడు. అయితే, ప్రీమియం మొత్తం
కట్టలేని వ్యక్తి.. ఆస్పత్రి పాలైనప్పుడు బిల్లు ఎలా కడతాడో మాత్రం ఆలోచించడు. పైగా ఈ
రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ లేనంత
కాలం మీ ఆస్తులకూ, బంగారానికీ, మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని గుర్తుంచుకోండి.
అంతులేని విశ్వాసం.
ఆరోగ్యబీమా ఉంటే ఎంతటి భరోసా ఉంటుందో మల్లికార్జున రావు కథ చదివితే తెలుస్తుంది.
ఆయన ఓ కార్పొరేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు బాగా
చదువుకుంటున్నారు. ఏ చింతా లేకుండా భార్యాపిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తు
న్నాడు. తను పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ వెసులుబాటు ఉన్నప్పటికీ రెండేండ
కిందట వ్యక్తిగత 50 లక్షల విలువైన ఆరోగ్య బీమా తీసుకున్నాడు. మరుసటి ఏడాది
ఒంట్లో నలతగా ఉంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని
తేలింది. ఇమ్యూనో థెరపీకి సిద్ధమయ్యాడు. ఒక్కో సిట్టింగ్కు దాదాపు 3 లక్షల వరకు
ఖర్చు అయింది. ఇప్పటివరకు దాదాపు 35 లక్షలు వైద్యానికి వెచ్చించాడు. ముందుచూ
పుతో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఆయన ఆర్థిక పరిస్థితి అతలాకుతలం
అయ్యేది. వైద్యానికి అయిన ప్రతి రూపాయి క్లెయిమ్ చేయడంతో.. ఆయన సంపద నయా
పైసా కరిగిపోలేదు. ఆర్థికంగా ఏ ముప్పూ లేదన్న విశ్వాసం ఆయన్ను త్వరగా కోలుకునేలా
చేసింది.
ఎవరన్నది కాదు..
హెల్త్ ఇన్సూరెన్స్... ఏ సంస్థ నుంచి తీసుకున్నామన్నది ప్రాధాన్యం కాదు. ఎంత మొత్తానికి
తీసుకున్నామన్నది ముఖ్యం. ఈ రోజుల్లో దాదాపు అన్ని బీమా సంస్థలు మెరుగైన క్లెయిమ్
రికార్డును కలిగి ఉన్నాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. 10 లక్షల పాలసీకి,
కోటి విలువైన పాలసీకి ప్రీమియంలో వ్యత్యాసం ఏడాదికి 15వేల వరకు మాత్రమే
ఉంటుంది. ఆ మొత్తానికే జంకితే.. జరగరానిది జరిగినప్పుడు మీరే కాదు.. మీ కుటుంబమూ
రోడ్డునపడే ప్రమాదం ఉంది. ఆర్థిక మాంద్యం ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ తరుణంలో...
ఉద్యోగం గ్యారెంటీ లేదు. ఒక కొలువు పోయి.. మరో కొలువు చూసుకునేలోపు
ఏదైనా అనారోగ్యం తలెత్తితే, ప్రమాదం జరిగితే... పరిస్థితి ఏంటి? ఇలాంటి దుస్థితి మీకు
రావొద్దంటే.. కోటికి తక్కువ కాకుండా మీకు, మీ కుటుంబానికి వ్యక్తిగత ఆరోగ్య బీమా !
తీసుకోవడం ఒక్కటే పరిష్కారం!
4. మనం దూరమైతే?!
దివాకరం ఓ ప్రైవేట్ సంస్థలో
ఉద్యోగి. నెల జీతం 60వేలు.
భార్య చిరుద్యోగి. ఆమె జీతం నెలకు
20వేలు. పిల్లల భవిష్యత్
కోసం దివాకరం ఓ పాలసీ తీసుకు
న్నాడు. అయితే, ఓ ప్రమాదంలో
దివాకరం కన్నుమూశాడు. ఓ నెల
రోజుల్లో బీమా మొత్తం నాలుగు
లక్షలు అతని భార్యకు చేరింది.
అది దివాకరం ఏడాది సంపాదన
కన్నా తక్కువ! తర్వాత ఆ కుటుంబం
బతికేది ఎలా?
ఈ ప్రశ్నకు సమాధానమే టర్మ్ ఇన్సూరెన్స్. 'కీడెంచి మేలెంచు' అంటారు
పెద్దలు. ఈ సూత్రం అంతటా వర్తించకపోవచ్చు కానీ, జీవిత బీమా విష
యంలో నూటికి నూరుపాళ్లూ నప్పుతుంది. 'మనం దూరమైతే?!' సగటు మని
షిని ఈ ప్రశ్న నిరంతరం తొలుస్తూనే ఉంటుంది. కుటుంబం పరిస్థితి ఏమిటన్న
ఆందోళన ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఉద్యోగార్జితంపైనే
ఆధారపడిన వ్యక్తికి అందుబాటులో ఉన్న ఏకైక సమాధానం 'జీవిత బీమా'! అదే
దివాకరం 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకొని ఉంటే.. ఆ కుటుంబానికి పాతి
కేండ్ల రక్షణ కల్పించి ఉండేవాడు.
చాలామంది జీవిత బీమా అనగానే.. 'ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?' అని లెక్కలు
వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపిం
చుకోదు. అది ఒకరకంగా పెట్టుబడే అవుతుంది. ఆరోగ్య బీమా తర్వాత మనిషికి అత్యంత
ముఖ్యమైనది జీవిత బీమా, ఒక పాలసీ తీసుకొని, ఓ ఇరవై ఏండ్లు ప్రీమియమ్లు కట్టి..
మరో ఐదేండ్లకు మెచ్యూరిటీ మొత్తం చేతిలో పడగానే ఏదో సాధించిన అనుభూతి కలుగు
తుంది. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి అనుభూతికి లోనవడం సబబుగానే ఉంటుంది.
అందుకు భిన్నంగా ఊహించని కష్టం ఎదురైనప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితి
ఏమిటి? అనిపిస్తుంది.
కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జరగరానిది జరిగితే, రెండు రకాల నష్టాలు కలుగుతాయి.
మొదటిది అన్నీనే అనుకున్న వ్యక్తి దూరం కావడం. ఆ లోటు ఎన్నటికీ పూడ్చలేనిది.
ఎందరు సానుభూతి వ్యక్తం చేసినా పోయిన మనిషి ఎప్పటికీ తిరిగిరాడు. రెండో నష్టం ఆర్థికంగా
కటుంబం చితికిపోయే ప్రమాదం ఉంది. జీవిత బీమా తోడుగా ఉంటే ఆర్థికపరమైన
నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుంది. కానీ, చాలామంది 'మనం పోతేగానీ రాని డబ్బులు
ఎందుకు?' అని భావిస్తుంటారు. టర్మ్ పాలసీ తీసుకోవడానికి ఇష్టపడరు ! అదే వ్యక్తి కొత్త
కారు కొనగానే ఇన్స్యూరెన్స్ చేయిస్తాడు. కారుకు ఏ ప్రమాదం జరగకూడదని కోరుకుంటూనే
ప్రతీ సంవత్సరం టంచనుగా ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. ఏటా ప్రీమియం చెల్లిస్తున్నాం
ఉండదు. అలాగని ప్రీమియం కట్టకుండా వదిలేయలేం కదా! జీవిత బీమా కూడా అంతే!
ఒక సగటు ఉద్యోగి తన జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగాలంటే రెండు బీమాలు
తప్పనిసరి. మొదటిది ఆరోగ్య బీమా అయితే, రెండోది జీవిత బీమా. ఈ రెండూ తీసుకున్న
తర్వాతే ఆదాయ వనరులను బట్టి ఇతర పెట్టుబడులు ఎంచుకోవాలి. ఆస్తులు కూడబెట్టుకో
వాలి. ఈ ఒక్క బీమా మనతో జీవితం పంచుకున్న భాగస్వామికి, మన రక్తం పంచుకొని
పుట్టిన పిల్లలకు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరికీ అండగా ఉంటుంది. పిల్లల
చదువుల కోసం, పెండ్లి కోసం, పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం కోసం రకరకాల
పాలసీలు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిదే అయినా, కుటుంబానికి అండగా ఉండే
జీవిత బీమా తర్వాతే మరేదైనా అన్న విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
పక్కాగా ప్రీమియం.
జీవిత బీమా ఇవ్వడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వ్యక్తి ఆరోగ్యం, ఆదాయం, వయసు
ఆధారంగా పాలసీ ఇస్తారు. ఉదాహరణకు 30 ఏండ్ల వ్యక్తి, నెలకు 40 వేలు సంపాది
స్తుంటే 50 లక్షల టర్మ్ పాలసీకి ఏడాదికి ప్రీమియం 9,000 నుంచి 10,000
వరకు ఉంటుంది. ఒకసారి తీసుకున్న తర్వాత టర్మ్ పాలసీ స్థిరంగా ఉంటుంది. ప్రీమియం
పెరగదు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వయసును బట్టి ప్రీమియం పెరుగుతూ
ఉంటుంది. సదరు వ్యక్తికి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నా.. ప్రీమియం
మరింత ప్రియం అవుతుంది. ఐఆర్డీఏ షరతులకు లోబడి దాదాపు అన్ని ఇన్సూరెన్స్
సంస్థలు టర్మ్ పాలసీని ఆఫర్ చేస్తున్నాయి. మేలైన వాటిని ఎన్నుకొని వెంటనే బీమా తీసు
కోండి.
5.ఆఖరి మలుపులో.. గెలుపు.
భవిష్యత్తు దర్శించకుండా వర్తమా
నంలో తీసుకునే నిర్ణయాలు సగటు
మనిషి శేష జీవితాన్ని నిస్సారంగా
మార్చేస్తాయి. కొలువులో
ఉన్నప్పుడు కాలరెగరేసుకొని తిరిగిన
వ్యక్తి కూడా.. సరైన రిటైర్మెంట్ ప్లాన్
చేసుకోకపోతే వయసుడిగిన
కాలంలో పరాధీనం కాకతప్పదు!
పదవీ విరమణ తర్వాత మీ బతుకు
జట్కాబండి పగ్గాలు మీ చేతుల్లో
ఉండాలంటే ఈ సూత్రాలు ఫాలో
అయిపోండి..
ప్రతి మనిషికీ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. ఇల్లు, కారు, పిల్లల చదువు,
వాళ్ల సెటిల్మెంట్, పెళ్లిళ్లు ఇలా జీవిత గమనంలో ఎన్నో మలుపులు ఎదు
రవుతాయి. ప్రతి మలుపులోనూ గెలుపు చూసిన వాళ్లలో చాలామంది రిటైర్మెంట్
మలుపు దగ్గర స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దూరదృష్టి లోపమే
ఇందుకు ప్రధాన కారణం. ఆర్థిక లక్ష్యాల్లో రిటైర్మెంట్ ప్లాన్ ఆఖరిది అని భావిం
చిన చాలామంది పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతున్నది!
ఆరోగ్య బీమా ఓ ధైర్యం.
'రిటైర్ అయ్యాక ఇంటి పట్టునే ఉండే మా ఇద్దరికీ లక్షలు కావాలా?' ఈ భావన చాలామం
దిలో కనిపిస్తుంది. కానీ, అసలు ఖర్చులన్నీ అప్పుడే తడిసి మోపెడవుతాయి. కొడుకులూ,
కోడళ్లూ దూరంగా ఉన్నా.. అనారోగ్యం మాత్రం తరుచూ పలకరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా
బలంగా ఉంటే ఎంతటి ఆరోగ్య సమస్య తలెత్తినా ధైర్యం ఉంటుంది. 'రిటైర్ అయ్యాక హెల్త్
ఇన్సూరెన్స్ తీసుకుందాంలే!" అనుకుంటే పొరపాటు. అప్పుడు సవాలక్ష షరతులు పుట్టుకొ
స్తాయి. చికిత్సకైన ఖర్చు బీమాలో కవర్ కాకపోతే, మలి వయసులో ఆర్థికంగా దెబ్బతిని,
మానసికంగా మరింత కుంగిపోయి, పిల్లలకు భారంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది.
అందుకే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అప్పుడు ఏ ఇబ్బంది
వచ్చినా ఆస్పత్రికి కూడా వెకేషన్ లా వెళ్లిరావచ్చు.
చరాస్తి ప్రధానం.
పదవీ విరమణకు చేరువ అవుతుండగానే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ఒకటి
స్థిరాస్తులను తగ్గించుకోవడం, అలాగని ఉన్న ఆస్తులన్నీ అమ్మేయమని కాదు. నెలనెలా రాబడి
ఇవ్వని ఆస్తులను ఉంచుకోవడం వల్ల ఎలాంటి లాభమూ ఉండదు. ఉన్న స్థిరాస్తుల్లో నిరర్ధక
మైనవాటిని అమ్మి పేపర్ అసెట్స్ (చరాస్తి)గా మార్చుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినట్ల
యితే వస్తున్న పెన్షన్ ఎంతవరకు సరిపోతుందో అంచనాకు రావాలి. లోటు బడ్జెట్ ఉన్నట్ల
యితే దాన్ని పూడ్చుకునేలా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలి. పెన్షన్ రానివాళ్లు మరింత
జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడే సరైన మార్గాల్లో మదుపు చేసి రిటైర్
అయ్యేనాటికి పెద్దమొత్తంలో నిధులు సమకూర్చుకోవాలి. భార్యాభర్తలిద్దరూ నెలంతా
హాయిగా గడపడానికి ఎంత కావాలో, అంత వడ్డీ రూపంలో వచ్చేంత మొత్తాన్ని బ్యాంక్లో
ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. లేదా మ్యూచువల్ ఫండ్స్ సిస్టమేటిక్ విత్ పెన్షన్,
యాన్యుటీ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు.
భావోద్వేగాలకు లొంగొద్దు.
పదవి విరమణ కాగానే పెద్ద మొత్తంలో డబ్బులు చేతిలో ఉంటుంది. ఒక్కసారిగా భారీగా డబ్బు
కండ్లకు కనిపించేసరికి ఏదో స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన చాలామందికి కలుగు
తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రిటైర్ అయ్యాక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడే అను
కుందాం. ఆ ఇంటి మీద గరిష్ఠంగా 30 వేల అద్దె వస్తుంది. అదే కోటి రూపాయలు ఫిక్స్డ్
డిపాజిట్ చేసినా నెలకు 60వేల వరకూ వడ్డీ వస్తుంది కదా ! దీనికి తోడు స్థిరాస్తులు ఉన్న
ట్లయితే, 'మా పేరు మీదికి ఎప్పుడు మారుస్తారు' అని పిల్లల నుంచి ఒత్తిడి కూడా రావచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో.. ఇల్లు అమ్ముదాం అనుకున్నా కొనేవాళ్లు దొరక్కపోవచ్చు. అదే
లిక్విడ్ క్యాష్ రూపంలో ఉన్నట్లయితే, మీ తదనంతరమే ఆ డబ్బు గురించిన ఆలోచన కలుగు
తుంది. ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు ఎంత కావాలనుకుంటే అంత తీసుకునే వెసు
లుబాటూ ఉంటుంది. అందుకే ఆస్తుల పెంపకం, పంపకం ఈ రెండూ రిటైర్మెంట్ తర్వాత
చేయకూడని పనులు, ఆర్థికంగా బలంగా ఉంటేనే శేష జీవితం ప్రశాంతంగా సాగుతుంది!!
మీరు రిటైర్ అవుతారు కానీ, ద్రవ్యోల్బణానికి పదవీ విర
మణ ఉండదు. ఏటికేడూ పెరుగుతూనే ఉంటుంది.
దానికి తగ్గట్టుగా ఖర్చులూ పెరుగుతాయి. వైద్య వ్యవ
స్థలో వస్తున్న మార్పుల కారణంగా.. రిటైర్ అయ్యాక
కూడా మరో పాతికేండ్లు బతికే రోజులు ఇవి. ఈ 25
ఏండ్లు ప్రశాంతంగా జీవించాలంటే ఆర్థికంగా స్వావలం
బన కలిగి ఉండటం ఒక్కటే మార్గం.
6.ఇల్లు కొనాలా..? ఎఫ్ డిచేయాలా?
'నా దగ్గరే కోటి రూపాయలు
ఉంటేనా..?' జేబులో కాణీ లేకున్నా
ఈ ఆలోచన తెరలు తెరలుగా వచ్చి
మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
నిజంగా కోటి రూపాయలు చేతిలో
ఉన్నప్పుడు తెలివిగా నిర్ణయం తీసు
కోకపోతే ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటి
కొచ్చే ప్రమాదం ఉంది. అందుకే,
గత అనుభవాలను దృష్టిలో ఉంచు
కొని.. భవిష్యత్ అవసరాలను గుర్తె
రిగి.. వర్తమానం సజావుగా సాగేలా
డబ్బు ఇన్వెస్ట్ చేయడం మంచిపని.
కోటి రూపాయలు చేతిలో ఉంటే ఇల్లు తీసుకోవడం మంచిదా !
బ్యాంకులో ఎల్డీ చేయడం ఉత్తమమా! ఎవరు ఏం చేస్తే ఎలాంటి
ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం..
ప్రైవేట్ కంపెనీలో పాతికేండ్లు పనిచేసి రిటైర్ అయ్యాడు రామకృష్ణ. పిల్లల చదువులు, పెండ్లిళ్లు,
కుటుంబ బాధ్యతలతో వచ్చిన జీతంలో సింహభాగం ఇట్టే ఖర్చయ్యేది. పొదుపరి కావడంతో
కాస్తోకూస్తో వెనకేశాడు. దీనికితోడు ఊళ్లో ఉన్న ఆస్తి అమ్మకం ద్వారా రిటైర్ అయ్యేనాటికి
కోటి రూపాయలు కండ్ల చూశాడు. ఇప్పుడు ఆ కోటి ఏం చేయాలో అరవై ఏండ్ల రామకృష్ణకు
పెద్ద సవాలుగా మారింది. బాగా ఆలోచించి ఇల్లు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు.
అంతలోనే.. ఉన్న ఒక్క కోటీ ఇంటికే పెట్టేస్తే బతకడం ఎలా? ఈ ప్రశ్న తలెత్తింది. దానికి పరి
ష్కారమూ ఆయనకే తట్టింది. ఈ కోటిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించు
కున్నాడు. అదే విషయం తన భార్య పద్మావతితో చెప్పాడు. ఆమె పెదవి విరిచింది. 'ఎన్నున్నా
ఎందుకు దండగా! నా బతుకు కిరాయికొంపలో ముగిసిపోవాలని దేవుడు రాసిపెట్టాడు..'
అని రుసరుసలాడింది పద్మావతి.
జీతంలా వడ్డీ.
భోజనాల వేళ కోపంగానే వడ్డిస్తున్న పద్మావతితో 'నేను చెప్పేది విను! ఆ తర్వాత నువ్వు ఇల్లు
కొనమంటే ఇల్లే కొంటాను. అన్నాడు రామకృష్ణ . చెప్పమన్నట్టుగా చూసింది ఆమె. మన
దగ్గర కోటి ఉన్నాయి. ఈ హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉంటున్న ఇలాంటి ఫ్లాట్ కొనా
లన్నా కోటికి తక్కువలో రాదు! అయినా కొన్నామే అనుకో, తర్వాత మన బతుకులు ఎలా?
నా పింఛన్ రాదు. మరో ఆదాయమూ లేదు!' అని ఊరుకున్నాడు రామకృష్ణ, అవునన్న
తలూపింది ఆమె. మళ్లీ రామకృష్ణ భార్యకు నచ్చచెబుతున్న ధోరణిలో.. 'మనమా ఇంకో పది
హేనేండ్లు బతుకుతాం. మహా అయితే ఇంకో ఐదేండ్లు! ఈ కోటి ఎఫ్ఎ చేశామనుకో! నెలకు
70వేలు జీతం వస్తుంటాయి. ఇంటి అద్దె 15వేలు పోగా మిగతా దాంట్లో మనం
అప్పు చేయాల్సిన పని ఉండదు! రేపు నాకేమైనా అయితే.. ఆ 70వేలు నీకు వచ్చేలా
కాలం వెళ్లదీయొచ్చు. ఏడాదికో విహారానికి వెళ్లొచ్చు. పిల్లలు పండుగకు వచ్చినప్పుడు
ఏర్పాటు చేస్తాను ! నువ్వు నా దగ్గరికి వచ్చేశాక.. ఆ కోటితో పిల్లలు ఏం చేసుకుంటారో వాళ్లు
'ఇష్టం' అన్నాడు రామకృష్ణ. 'తింటున్నప్పుడు ఏంటండీ ఆ మాటలు! ఎఫ్డి చేయడమే |
మంచిది అనిపిస్తుంది. ఇల్లు కొన్నా.. మనం కట్టుకుపోతామా ఏంటి?' అంటూ శ్రీవారికి
ప్రేమగా గడ్డ పెరుగు వడ్డించింది పద్మావతి.
సంపాదించే శక్తి ఉంటే..
అరవై ఏండ్ల రామకృష్ణ సంగతి కాసేపు పక్కన పెట్టండి. నలభై ఏండ్ల దీపకు కూడా ఇదే
సూత్రం వర్తిస్తుందా అంటే నప్పదనే చెప్పాలి! దీపక్కు బోలెడంత భవిష్యత్తు ఉంది. సంపా
దించే శక్తి కూడా ఉంది. కాబట్టి, ఆయన కోటి రూపాయలతో నచ్చిన ఇల్లు తీసుకోవడం
మంచిది. పైగా కోటి రూపాయలు మొత్తం ఇంటిపై పెట్టకుండా, 70 లక్షలు ఇంటికి కేటా
యించి, మిగతా 30 లక్షలు మరెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ఉభయతారకంగా ఉంటుంది.
భవిష్యత్తులో ఎఫ్ఎ వడ్డీరేట్లు తగ్గినా దీపకు వచ్చే ఇబ్బందేం ఉండదు. కాలక్రమంలో ఇంటి
ధర కూడా పెరుగుతుంది. ఎలా చూసినా ప్రయోజనమే! అందుకే, దీపక్ వయసులో ఉన్న
వారు కోటి చేతిలో ఉంటే వెంటనే సొంతింటి కలను నెరవేర్చుకోవడం తెలివైన పని.
రాజాలా బతికేస్తే..
కోటి అకౌంట్లో ఉంటే వడ్డీ గురించి మాట్లాడటం ఏంటి? ఎంచక్కా నెలకు లక్ష ఖర్చు
పెట్టుకున్నా 100 నెలలు అంటే దాదాపు ఎనిమిదిన్నరేండ్లు రాజాలా బతుకొచ్చు అనుకునే
వాళ్లూ ఉంటారు. కానీ, ఆ తర్వాత పరిస్థితి? నెలకు లక్ష ఖర్చు చేయడానికి అలవాటుపడి
పోయి.. తర్వాత అకౌంట్లో చిల్లిగవ్వా లేకపోతే బతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో
ఊహించుకోవచ్చు. అందుకే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు ఊరికే అన
లేదు. అదే సమయంలో, రిటైర్ అవ్వగానే పిల్లలకు డబ్బులన్నీ పంచేసిబాధ్యత తీరింది, అన్న
ట్టుగా భావిస్తారు కొందరు పెద్దలు. కానీ, ఈ రోజుల్లో ఆర్థికంగా బలంగా ఉండటం చాలా
అవసరం. కన్నబిడ్డల దగ్గర మోతాదు లేకుండా శేషజీవితం గడపాలంటే.. మీ తదనంతరమే
ఆస్తిపాస్తులు పిల్లలకు చెందేవిధంగా ఏర్పాటు చేయడం విజ్ఞత అనిపించుకుంటుంది.
7. ముందస్తుగా తీర్చాలా? వద్దా?
సుధాకర్, ప్రభాకర్ ఇద్దరూ సహో
ద్యోగులు. ఇద్దరి వయసూ 35
ఏండ్లు. ఇద్దరి జీతాలూ సుమారు
70 వేలు. ఒకే అపార్ట్మెంట్లో
ఎదురెదురు ఫ్లాట్లు తీసుకున్నారు.
హోమ్ లోన్ వీలైనంత త్వరగా
తీర్చేయాలని నిశ్చయించుకున్నాడు
సుధాకర్. ప్రతినెలా వాయిదాలు
కడితే చాలు అనుకున్నాడు
ప్రభాకర్. అయితే, ఈ కథ చదివాక
గృహ రుణం ముందస్తుగా తీర్చాలో,
వద్దో అర్థమవుతుంది.
సుధాకర్, ప్రభాకర్ ఇద్దరి ఫ్లాట్ల విలువ కూడా 40 లక్షలు, 10
లక్షలు బయానా ఇచ్చారు. 25 ఏండ్లకు బ్యాంక్ నుంచి 30 లక్షలు
గృహ రుణం తీసుకున్నారు. 7.5 శాతం వడ్డీతో నెల వాయిదా 22,169గా
తేలింది. సుధాకర్ లెక్కలు వేసుకున్నాడు. పాతికేండ్లపాటు వాయిదాలు చెల్లిస్తూ
పోతే దాదాపు 66,50,700 చెల్లిస్తున్నట్టుగా తేలింది. పదేండ్లలో బాకీ
మొత్తం కట్టేయాలనుకున్నాడు. అప్పుడు నెలకు వాయిదా 35,610గా
తేలింది. పదేండ్లలో 42,73,200 కట్టాడు. కేవలం 12,73,200
మాత్రమే వడ్డీ కట్టానని సంతోషించాడు సుధాకర్.
అదే సమయంలో ప్రభాకర్ గృహరుణానికి నెలవారీ వాయిదా 22,169 పోనూ
14,400 లార్డ్క్యప్ మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు.
పదేండ్ల తర్వాత, ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా 35,00,000 రిటర్న్ వచ్చింది.
అప్పటికి ఆయన గృహరుణ బకాయి 23,91,000, మ్యూచువల్ ఫండ్ రాబడి నుంచి
ఇంటి లోన్ పూర్తిగా కట్టేసిన తర్వాత ప్రభాకర్ దగ్గర 11 లక్షలు నికరంగా మిగిలాయి.
ఉద్యోగం పోతే..
వీరిద్దరి విషయంలోనే మరో కోణం చూద్దాం. ఏడేండ్ల తర్వాత ఇద్దరూ పనిచేస్తున్న సంస్థ
మూతపడింది. సుధాకర్, ప్రభాకర్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇంటి లోన్ త్వరగా తీర్చేయా
లని పొదుపు మంత్రం పక్కనపెట్టి బ్యాంకుకు అధిక మొత్తంలో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు.
సుధాకర్. అదే ఏడేండ్ల తర్వాత ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్లో 19.50 లక్షలు
ఉన్నాయి. ఆ మొత్తాన్ని నెలకు 60 వేల చొప్పున వాడుకున్నా 32 నెలలు ఏ ఒత్తిడి
లేకుండా రోజులు గడిచిపోతాయి. ఈలోపు మరో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు!
సుధాకర్ మాత్రం ఇల్లు గడవడానికి, బ్యాంక్ రుణం తీర్చడానికి బయట అధిక వడ్డీలకు
రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒత్తిడి పెరిగింది. ఆ ప్రభావం ఆరోగ్యంపైనా పడింది.
మంచి అప్పు..
ఈ ఇద్దరి మిత్రుల కథ.. విలువైన ఆర్థిక పాఠం. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగులు రుణ
బాధలు ఉండకూడదని భావిస్తూ ఉంటారు. గృహప్రవేశం చేసిన రోజు నుంచే హోమ్ లోన్
వీలైనంత త్వరగా తీర్చేయాలని ఆరాటపడుతుంటారు. 25 ఏండ్లు వాయిదాలు కడుతూ పోతే
తీసుకున్న లోన్ పై రెండింతలు కట్టాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటారు. ఆ చిక్కుల్లోంచి
త్వరగా బయటపడాలని వాయిదాతోపాటు అదనంగా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. కానీ,
గృహరుణాన్ని మంచి అప్పుగా పరిగణించాలి. హోమ్ లోన్పై వడ్డీరేటు 7 నుంచి 8.5 శాతం
కన్నా మించదు. పైగా, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. దానిని
పరిగణనలోకి తీసుకుంటే ఇంటి రుణంపై వడ్డీ 5.5 శాతం నుంచి 6 శాతం దాటదు. అంటే
యాభై పైసల వడ్డీ అన్నమాట. ఇంత తక్కువ వడ్డీకి మరెక్కడా అప్పు దొరకదు. అలాంటి
రుణాన్ని త్వరగా తీర్చడం అంటే, ఆర్థిక విధానాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే కదా!
నగదు రూపంలో..
ఆస్తులు కొనుగోలు చేయడం తప్పుకాదు. స్థిరాస్తులు అవసరానికి అమ్మాలంటే అనుకున్నంత
డిమాండ్ ఉండకపోవచ్చు. అందుకే కొంత ఆస్తి లిక్విడ్ అసెట్ (నగదు రూపంలో) ఉండటం
మంచిది. మ్యూచువల్ ఫండ్స్ ఈ రకమే! ఆదాయాన్ని ఇచ్చే స్థిరాస్తులు కూడా మంచివే!
కానీ, అలాంటి ఆస్తులను వాయిదాల రూపంలో కొనుగోలు చేయడం సాధ్యపడకపోవచ్చు.
అలాంటప్పుడు ఎస్ఐపీ వైపు మొగ్గుచూపడం ఉత్తమం. అవకాశం ఉంటే, ఆదాయం పెరిగే
కొద్దీ, ఎస్ఐపీ వాయిదా మొత్తం పెంచడం ద్వారా మరింత లాభం పొందవచ్చు. అత్యవసర
పరిస్థితుల్లో మీకు అవసరం ఉన్నంత మొత్తం తీసుకోవచ్చు. ఆ డబ్బు మూడు రోజుల్లో మీ
బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. సిబిల్, జీతంతో సంబంధం లేకుండా గంటల వ్యవధిలో
లోను తీసుకోవచ్చు. నగదు రూప ఆస్తిగా బంగారం కూడా కొనొచ్చు. అయితే, బంగారాన్ని
చాలామంది సెంటిమెంట్ గా భావిస్తారు. అవసరం వచ్చినప్పుడు అమ్మడం కన్నా, కుదువ
పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడు ఇన్నాళ్లూ పోగు చేసిన ఆస్తి మీద వడ్డీ భారం
తప్పదు!!
అందరికీ ఒకేలా పారదు.
ఇన్వెస్ట్మెంట్ అనగానే.. ముందుగా లాభాలను ఊహించేస్తుంటారు.
ఇందుకోసం ఇంటర్నెట్లో ఆర్థికవేత్తలు సూచించిన ఫార్ములాలను
సెర్చింగ్ చేస్తుంటారు. కానీ, పర్పస్ లేకుండా ఇన్వెస్ట్ చేసే డబ్బులు అవస
రానికి అక్కరకు రాకుండా పోతాయని గుర్తెరగాలి. అన్నిటికీ మించి పేరు
మోసిన ఆర్థికవేత్తలు సూచించిన విధానాలు కూడా సర్వజనీనం, సర్వకా
లీనం కాదు. మనిషి ఆదాయం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ముందు
కుసాగవు. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా
పెట్టుబడి మార్గాలు అన్వేషించాలి. చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పడం
లేదు. మనకు తాహతు లేదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండొద్దు. రాబడి
పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా కన్నవారి అండదండలు లభిం
చడం, సంపాదన స్థిరంగా ఉండటం మంచిదే! కానీ, ఇలాంటి వ్యక్తులు
తాము ఏం చేసినా చెల్లుతుందనే వైఖరితో ఉంటే ప్రమాదం. ఎందు
కంటే.. లేని హెచ్చులకు పోయి బొక్కబోర్లాపడ్డ కుటుంబాలు ఎన్నో!
మర్డర్ చేసే కత్తి.
సర్జరీ చేసే కత్తితో మర్దర్ చేయొచ్చు. కానీ, మర్డర్ చేసే కత్తితో సర్జరీ చేస్తా .
నంటే కుదరదు. రియల్ ఎస్టేట్లో వస్తున్న బ్లాక్ మనీ కూడా మర్డర్ చేసే
కత్తిలాంటిదే! దాంతో సర్జరీ చేయలేం. భూముల విషయంలో ప్రభుత్వం
నిర్ణయించిన ధరకూ, మార్కెట్ ధరకూ చాలా వ్యత్యాసం ఉంటుంది.
మర్కెట్ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకునే ఉద్దేశం ఎవరికీ ఉండదు.
కొనుగోలు చేసే వ్యక్తి ప్రభుత్వ ధరకు సంబంధించిన మొత్తం చెక్కు
రూపంలో చెల్లిస్తాడు. మిగతా మొత్తం బ్లాక్ మనీగా ఇస్తాడు. ల్యాండ్
అమ్మిన వ్యక్తి ఈ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి నానా అగచాట్లు
పడాల్సిందే! ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్,
ఆస్పత్రిలో కూడా రెండు లక్షల వరకే లిక్విడ్ క్యాష్ తీసుకుంటున్నాయి.
అంతకుమించి చెల్లింపులు చేయాల్సి వస్తే.. నో క్యాష్.. ఓన్లీ చెక్
అంటున్నాయి. ఆ సొమ్మును మళ్లీ స్థలంలోనే పెట్టాలి. లేదా, ఆర్థిక
నేరాలకు పాల్పడి, కమీషన్లు చెల్లించి వైట్గా మార్చుకుంటున్నారు.
8. ఇంటి అప్పు.. తప్పా..? ఒప్పా..?
సొంతింటి కల నెరవేరిన మరుక్షణం
నుంచి వాయిదాల పీడకలలు
కంటున్నారా? రుణపాశం బిగుసుకు
పోయిందే బాధపడుతున్నారా?
ముందుగానే రుణం తీర్చేయాలని
ఫిక్సయ్యారా? ఇలా ఆలోచిస్తే
గృహరుణంపై మీకు పూర్తిస్థాయి
అవగాహన లేనట్లే! వడ్డీ లెక్కలు నడ్డి
విరిచేస్తాయన్న అపోహతో
సొంతింటిని దూరం చేసుకోకండి.
జయంత్ కథ చదివితే ఎందుకన్నది
మీకే తెలుస్తుంది..
జయంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అదే కంపెనీలో పనిచేసే కల్యాణిని పెండ్లి చేసుకు
న్నాడు. ఇద్దరికీ కలిసి నెలకు రెండు లక్షల వరకు ఆదాయం ఉంది. జయం
త్కు కుటుంబ బాధ్యతలూ ఉన్నాయి. పొదుపుగా ఖర్చు చేస్తూ ఇద్దరూ 15
లక్షలు కూడ బెట్టారు. ఇల్లు తీసుకోవాలని అనుకున్నారు. మంచి ఏరియాలో ఒక
ఫ్లాట్ చూశారు. అన్నీ కలిపి 60 లక్షలు అవుతుందన్నాడు బిల్డర్. రిజిస్ట్రేషన్
అదనం. జయంత్, కల్యాణి ముచ్చటపడ్డారు. బయానా ఇచ్చి రుణం కోసం
బ్యాంకు తలుపుతట్టారు. వాళ్ల జీతభత్యాలకు 50 లక్షలు రుణం రెండు
రోజుల్లో మంజూరు అవుతుందని చెప్పాడు మేనేజర్.
తగ్గేది 5 లక్షలేనా..
మర్నాడు గృహరుణం, వాయిదాల చెల్లింపు వివరాలు విడమర్చి చెప్పాడు బ్యాంకు అధికారి.
50 లక్షల రుణం, 15 సంవత్సరాల కాలపరిమితి, 9 శాతం వడ్డీ ఆధారంగా రుణంపై
నెలకు 50,713 వాయిదా చెల్లించాల్సి వస్తుందని వివరించాడు. మస్తిష్కంలోనే లెక్కలన్నీ
వేసుకున్నాడు జయంత్. అంటే 50 లక్షల రుణానికి 15 ఏండ్లలో 91లక్షలకుపైగా
చెల్లిస్తామని అంచనావేశాడు. అంటే అసలు పోనూ 41 లక్షలు అదనంగా కడతామా?
ఆని బెంబేలెత్తిపోయాడు. ఆ దంపతుల ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ముందుగా
చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుందా అన్నాడు జయంత్ ! 'మీరు మూడేండ్ల తర్వాత రుణం పూర్తిగా
చెల్లించదలిస్తే 45 లక్షలు కట్టాల్సి ఉంటుంది' అన్నాడు బ్యాంకు అధికారి. మళ్లీ హతాశుడు
యాడు జయంత్. అంటే మూడేండ్లలో 18 లక్షలు కడితే.. అసలులో తగ్గేది 5 లక్ష
లేనా అని విస్తుపోయాడు.
అసలు తరగదు.
మర్నాడు తన స్నేహితుడు సుధీర్తో పరిస్థితి అంతా వివరించాడు జయంత్. 'ఈ విషయాలేవీ
తెలియకుండానే నేను లోన్ తీసుకున్నానా ?' అన్నాడు సుధీర్. ప్రశ్నార్థకంగా చూశాడు.
జయంత్. 'వాయిదాలో ఎంతమొత్తం వడ్డీకి పోతున్నది, ఎంత అసలు తగ్గుతున్నది అని
50 లక్షలు తెచ్చుకున్నావే అనుకో! నెలకు వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది' అడిగాడు సుధీర్.
50 వేలు అన్నాడు జయంత్. 'నెలకు 50 వేల చొప్పున ఎన్ని నెలలు కడుతూ
పోయినా.. అసలు గోరంత కూడా తరగదు కదా!' అని స్నేహితుడి వంక చూశాడు సుధీర్.
అంతే అన్నట్టుగా తలూపాడు జయంత్. 'అదే బ్యాంకులో రుణం.. వడ్డీతోపాటు అసలు
కూడా తగ్గుతూ పోతుంది. 15 సంవత్సరాలు అంటే 180 నెలలు. అసలు తగ్గే కొద్దీ వడ్డీ
మొత్తమూ తగ్గుతూ వస్తుంది. మనం చెల్లించే వాయిదాలో అసలు వాటా పెరుగుతూ
ఉంటుంది' అని వివరించాడు.
వడ్డీ బారాణే..
ఇన్ని చెప్పినా అర్థం కానట్టుగానే ముఖం పెట్టాడు జయంత్. 'నీ డౌట్ ఇంకా క్లియర్ కాలేదా!
ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంటి అద్దె ఎంత?' అని అడిగాడు. 'పదహారు వేలు..' అన్నాడు
జయంత్. 'ఇల్లు తీసుకుంటే ఆ పదహారు వేలు తప్పినట్టే కదా! అంటే నువ్వు ఎక్కువ కడుతు
న్నాను అని భావిస్తున్న వడ్డీ ఇంటి అద్దెకు సరిపోయినట్టే! నువ్వు లోన్ తీసుకుందాం అనుకు
న్నది ఐదోపదో కాదు. యాభై లక్షలు. అంతపెద్ద మొత్తం ఎవరు మాత్రం నీకు సాయం చేయగ
లరు. ఊళ్లో పొలం అమ్మి కట్టొచ్చు. కానీ, ఇంత చిన్న ఆస్తి కొనడానికే ఇంతలా ఇదైపోతు
న్నావు. ఆ ప్రాపర్టీ మళ్లీ కొనగలవా? సంవత్సరానికి 9 శాతం వడ్డీ అంటే.. నెలకు 75 పైసలు
మాత్రమే! దీనికి తోడు ఆదాయపన్ను మినహాయింపులోనూ ఇంటిరుణం చూపించుకునే
వెసులుబాటు ఉంది. మరేం ఆలోచించక.. గృహరుణం తీసుకో" అని సలహా ఇచ్చాడు సుధీర్.
ఇంత క్లియర్గా చెప్పావు. మా గృహప్రవేశానికి నువ్వే ముఖ్య అతిథి' అని బ్యాంకుకు బయల్దే
రాడు జయంత్.
9. కారు ఎప్పుడు కొనాలి?
ధనవంతులు కావడానికి కష్టపడే
వాళ్లు తక్కువమందే ఉంటారు, కానీ,
శ్రీమంతులుగా కనిపించడానికి
తపించేవారే ఎక్కువ. ఇలాంటి వాళ్ళు
మూరెడు ఆస్తి లేకపోయినా బారెడు
ఆశలను మోస్తుంటారు. వాటిని
నెరవేర్చుకునే క్రమంలో భవిష్యత్తును
ప్రశ్నార్థకంగా మార్చుకుంటారు.
కొత్త కారు కొనడం, ఉన్న కారును
మార్చడం ఈ కోవలోకే వస్తాయి.
అసలు కారు ఎప్పుడు కొనాలి?
ఎంతలో కొనాలి?..
మనం మన ఆనందాలను, అవసరాలను కోల్పోవద్దు. అదే సమయంలో,
ఆ మాయలో పడిపోయి జీవిత అవసరాలను తక్కువ అంచనా వేయకూ
డదు. ఇంకా చెప్పాలంటే స్వల్పకాలిక ఆనందాల కోసం దీర్ఘకాలిక అవసరాలను
పణంగా పెట్టొద్దు. కారు కొనడాన్ని తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే నిర్ణయాల జాబి
తాలో చేర్చవచ్చు. ప్రస్తుత రోజుల్లో సొంతంగా కారు ఉండటం అనివార్యమని
భావిస్తున్నారు. అందులో తప్పు కూడా ఏం లేదు. కానీ, ఆ కారును ఎప్పుడు
కొన్నాం, ఎలా కొన్నాం అన్నది ముఖ్యం.
ఆ రెండూ తర్వాతే..
పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లాన్ దీర్ఘకాలిక అవసరాలు. వీటి తర్వాతే ఇల్లు, కారు, మరేదైనా!
దీర్ఘకాలిక అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికోసం పక్కాగా ప్రణాళిక అమలు
చేయాలి. ఈ రోజుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహా
రామే! రానున్న రోజుల్లో పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్ చదివించాలంటే నాలుగేండ్లకు
30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు కావొచ్చు. ఆ మేరకు ఆర్థిక వనరులు సమ
కూర్చుకోవాలి. ఎవరికైనా రిటైర్మెంట్ ప్లాన్ ముఖ్యమైనది. భార్యాభర్తలు ఇద్దరూ బతకడానికి
శ్రీ ప్రస్తుతం నెలకు 20 వేల వరకు ఖర్చు అవుతున్నది. మరో ఇరవై ఏండ్ల తర్వాత ఇ
బతకాలంటే కనీసం 50వేలు ఉండాల్సిందే! నెలకు అంతమొత్తం వచ్చేలా పెట్టుబడలు
పెట్టాలి. అయితే, చాలామంది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నిర్దేశించిన నిధులను కారు కొన్న
నికో, ఇంటి నిర్మాణానికి బదలాయిస్తుంటారు. ఫలితంగా భవిష్యత్ ప్రయోజనాలు దెబ్బ
ప్రమాదం ఉంటుంది.
వాయిదాలు పూర్తి కాకుండానే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 వేల జీతం వస్తున్న ఉద్యోగికి దాదాపు 6 లక్షల కారు
లోన్ నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆ వ్యక్తికి ఉన్న కమిట్మెం
కమిట్మెంట్స్ లో కారు వాయిదాలు నిర్వహణ భారం కావచ్చు, లక్ష వేతనంగా తీసుకుంటున్న
ఉద్యోగి అంతకుమించి ఆదాయం ఉన్న వ్యక్తికి కారు కొనడం పెద్ద విషయం కాదు. కానీ,
గతంలో తీసుకున్న కారు వాయిదాలు పూర్తిగా కాకముందే దాని అమ్మేసి కొత్త కారు తీసు
కునే ఆలోచనల్లో పడుతుంటారు కొందరు. కారును స్టేటస్ సింబల్ గా భావించడమే ఈ వైఖ
రికి కారణం. నలుగురి మెప్పు కోసమో, స్థితి మంతుడు అనిపించుకోవాలనో కారు పట్ల
ఉత్సాహం కనబరుస్తుంటారు. ఇందుకోసం అప్పటివరకు పదిలంగా దాచుకున్న డబ్బును
డౌన్పేమెంట్ కట్టడం ఒకటైతే, ఆ మరుసటి నెల నుంచి కారు వాయిదాలు మొదలవడంతో
సేవింగ్స్ను కొన్నాళ్లు వాయిదా వేస్తారు.
మీరేంటో కారు చెప్పదు.
మనస్థాయి ఎవరికీ తెలియాల్సిన పన్లేదు. నలుగురి మెప్పు కోసం, పదిమందిలో డాబు కోసం
కారు కొనాలనుకోవడం తప్పే. రోల్స్ రాయిస్ అయినా, మారుతి అయినా ప్రయాణ
సాధనం మాత్రమే! స్థాయిని బట్టి కారు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, కారు మన
స్థాయిని పెంచుతుందని భావించొద్దు. మీ దీర్ఘకాలిక
అవసరాలు నెరవేర్చడానికి సరైన పెట్టుబడులు పెట్టారా, లేదా అన్నది చూసుకోవాలి. ఆ
తర్వాతే.. ఇల్లు, కారు, ఇతర లగ్జరీలు. ధనవంతులుగా కనిపించడం, ధనవంతులు కావడం..
రెండూ ఒకటి కాదు. ఈ సత్యాన్ని గ్రహిస్తే మేలు.
ఇలా ఆలోచిస్తే తప్పు.
నా పక్క ఫ్లాట్ ఓనరు పెద్దకారు ఉంది,
అంతకన్నా పెద్దకారు నాకు ఉండాల్సిందే
అనుకోవడం.
ఆ కొడుకో, కూతురో ముచ్చటపడ్డారని
అప్పటికప్పుడు ఉన్న కారును అమ్మకా
నికి పెట్టి, లగ్జరీ కారు కొనాలనుకోడం.
అవసరం లేకపోయినా అప్పటికే ఉన్న
ఫైవ్ సీటర్ కారును కాదని సెవెన్ సీటర్
కారు బేరం చేయడం.
నీ లెవెల్కు ఈ కారేంటి.. ఇన్నోవా
అయినా ఉండాల్సిందే' అనే స్నేహితుల
మాటలకు బోల్తాపడటం.
ఆ వీధి చివర ఇంట్లో కనిపించిన కారు
నచ్చిందని, బంధువుల్లో కారు లేకపోతే
నామోషీగా ఉంటుందని.. ఇలాంటి కార
ణాలతో కారు కొనాలనుకోవడం.
ధనవంతులుగా కనిపించడానికి పెద్ద
కారు కొనాలనుకోవడం.
10.అలా.. ఫ్లాట్ అయిపోకండి!
ప్రతీ ఉదయం ప్రశాంతంగా
సాగిపోవాలే కానీ, 'అప్పు-డే'
తెల్లారిందా అని భారీ నిట్టూర్పుతో
మొదలు కావొద్దు. అవసరానికి వ్యక్తి
గత రుణం తీసుకోవడం నేరం
కాదు. ఆ రుణం మన పరపతికి
మించొద్దు. వడ్డీ పరిమితిని
దాటొద్దు. బ్యాంకులో కొర్రీలకు
వెరిచి నానబ్యాంకింగ్ సంస్థల
తలుపు తడితే.. వడ్డీ భారం తడిసి
మోపెడవ్వడం ఖాయమని
గుర్తుంచుకోండి!
సొంతంగా ఒక ఇల్లు ఉండాలని చాలామంది బలంగా కోరుకుంటారు.
కొందరు పైసాపైసా కూడబెట్టి ఇంటి నిర్మాణానికి కావాల్సిన నిధులను
సమకూర్చుకుంటారు. ఇంకొందరు ఊళ్లో ఉన్న ఆస్తిలో కొంతభాగం అమ్మి, ఆ
మొత్తంతో పట్నంలో ఇల్లు కట్టుకుంటారు. మధ్య తరగతి ఉద్యోగులు మాత్రం
ఇల్లు కొనాలంటే బ్యాంకు అప్పు మీద ఆధారపడాల్సిందే!
గృహ రుణం మంచి అప్పుగా పరిగణించవచ్చు. అయితే, వ్యక్తిగత రుణం విషయంలో ఆలో
చించాలి. ఆ రుణం మంచిదా, మిమ్మల్ని ముంచేదా అని అంచనాకు రావాలి. సాధారణంగా
వ్యక్తిగత రుణం రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్, ఫ్లాట్ ఇంట్రెస్ట్ విధానంలో ఇస్తుంటారు. ఈ రెండిట్లో
రెడ్యూస్ట్ ఇంట్రెస్ట్ పద్ధతి రుణగ్రహీతపై భారం తగ్గిస్తుంది. దాదాపు బ్యాంకులన్నీ ఈ ప్రక్రి
యను అనుసరించే రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఎన్బీఎఫ్సీ (నాన్బ్యాంకింగ్ ఫైనాన్షి
యల్ కంపెనీలు) ఫ్లాట్ ఇంట్రెస్ట్ కూడా ఆఫర్ చేస్తుంటాయి.
కట్టిన మొత్తానికీ మిత్తి.
వడ్డీరేటులోనూ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య వ్యత్యాసం ఉంటుంది. దీనికితోడు
రెడ్యూస్డ్ ప్లాట్ పద్ధతుల్లోనూ తేడా అధికంగానే ఉంటుంది .ఉదాహరణకు రెడ్యూస్ ఇంట్రెస్ట్
కింద బ్యాంకులో లక్ష రూపాయలు రుణం తీసుకున్నాం అనుకోండి. నెలకు వాయిదా
3,000గా తేలింది. మొదటి నెల వాయిదా చెల్లించిన తర్వాత అందులో 2,500 వడ్డి
కింద పోగా 500 అసలు జమ చేసుకున్నారు. రెండోనెల 99,500కు మాత్రమేవడ్డీ
పడుతుంది. అంటే నెలలు గడిచే కొద్దీ మనం చెల్లించే వాయిదాలో వడ్డీ మొత్తం తగ్గుతూ '
వస్తుంది. అసలు వాటా పెరుగుతుంది. ఇక ప్లాట్ విధానానికి వస్తే.. 10 శాతం వడ్డీ కింద,
ఐదేళ్ల కాల పరిమితికి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకోండి ! సంవత్సరానికి వడ్డీ
10,000, ఐదేండ్లకు 50,000. ఈ వడ్డీ మొత్తాన్ని అసలుకు కలిపి వాయిదా ఎంత
నేది నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియలో మనం కట్టిన అసలుకు కూడా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
ఫలితంగా రుణగ్రహీతపై 15 నుంచి 20 శాతం వరకు అదనపు భారం పడుతుంది.
అందుకే రెడ్యూస్డ్ విధానములో రుణం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఫ్లాట్ 10% రెడ్యూస్డ్ విధానంలో 15 సాతానికి సమానం.
మన తప్పులే కారణం..
రెడ్యూస్డ్ విధానము ఉండగా, ఎక్కువ భారం చెల్లించాల్సి వచ్చే రెండో పద్ధతిని ఎందుకు ఎంచుకుంటారు
? అంటారా ! మన ఆర్థిక క్రమశిక్షణ ఇలాంటి తప్పు చేయడానికి కారణమవుతుంది.
స్కోర్ సరిగ్గా లేకపోతే రుణ పరపతి తగ్గుతుంది. గతంలో తీసుకున్న రుణాలు తీర్చ
నిర్లక్ష్యం వహించి, వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకుల్లో కావాల్సినంత అప్పు
పుట్టదు. దీంతో వడ్డీ ఎక్కువైనా పర్లేదు అనుకొని ఎన్బీఎఫ్సీ తలుపు తట్టాల్సివస్తుంది.
బ్యాంకులో ఉన్నన్ని షరతులు ఎన్బీఎఫ్సీల్లో ఉండవు. రుణం త్వరగా మంజూరు అవు
తుంది. కానీ, లక్ష రూపాయల రుణానికే 20వేల వరకూ తేడా కనిపిస్తుంటే.. 10
లక్షణ విషయంలో ఈ వ్యత్యాసం జీవితకాలం పూడ్చుకోలేనంత ఉండొచ్చు. అందుకే, వ్యక్తిగత
రుణం తీసుకునేటప్పుడు ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు కాకుండా బ్యాంకులకు
ప్రాధాన్యం ఇవ్వాలి. రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ విధానాన్ని ఎంచుకోవాలి. అప్పుడే దా'రుణ' పరిస్థి
తులు ఎదురుకావు!!
మార్జిన్ ఆధారంగా..
బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు వడ్డీ రేట్లలోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. బ్యాంకుల కన్నా
వీటిలో రెండు నుంచి మూడున్నర శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. బ్యాంకులైనా,
ఎన్బీఎఫ్సీలైనా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంటాయి. ఉదాహ
ణకు ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్) మీద 5.5 నుంచి
6 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంటాయి. ఈ మొత్తంలో నుంచి 7.5 శాతం నుంచి 9.5 శాతం
వరకు వడ్డీ మీద రుణగ్రహీతలకు లోన్లు ఇస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్ సీలు ఎఫ్ డీలపై 7
శాతం వరకూ వడ్డీ ఇస్తుంటాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్టిన్ 3 శాతం అనుకున్నా ఇవిచ్చే రుణాలపై
వడ్డీ 10 శాతానికి పైగా ఉంటుంది. పైగా ఫ్లాట్ ఇంట్రెస్ట్ కావడంతో చెల్లించిన
వడ్డీ కట్టాల్సివస్తుంది.