51. అదనంగా సంపాదిస్తేనే..!
సంపన్నులు కావడానికి ఈక్విటీలు దగ్గరి దారులు. మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైన సంపద మార్గాలు. సంపన్నులు కావడానికి మిడిల్స్టాస్ మనుషులు ప్రయత్నించే అవకాశాలు ఇవి. కానీ, అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు పెట్టుబడులు పెట్టొద్దా..? షేర్ మార్కెట్ జోలికి రావొద్దా? ఎస్ఐపీ ఊసెత్తోద్దా? ఆదాయం ఉన్నవాళ్లకే అవి పరిమి తమా? మరి లేనివాళ్ల సంగతేంటి..
ఎంతచెట్టుకు అంత గాలి!”.. ఈ సూత్రం కుటుంబ ఆర్థిక వ్యవహారాలకూ వర్తిస్తుంది. సరిపడా సంపాదించకుండా, ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అను కుంటూ ఉంటే... దశాబ్దాలు గడుస్తున్నా ఆర్థిక పరిస్థితి మారదు. మూరెడు సంపా దనతో బారెడు ఆస్తులు సృష్టిస్తామని అనుకోవడం పొరపాటే! నెలకు వచ్చే 15 వేలల్లో 30 శాతం అంటే 4,500 ఇన్వెస్ట్ చేస్తానంటే.. మిగిలింది కుటుంబానికి ఏ మూలకు సరిపోతుంది. అందుకే, దిగువ మధ్యతరగతి కుటుం బాలు పొదుపుపై దృష్టి సారించాలే కానీ, మదుపు చేస్తామంటే పరిస్థితి మరింత అదుపు తప్పుతుంది.
ఉద్యోగానికి బై..
ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలు ఎన్నో! డిగ్రీ పట్టా చేతిలో పట్టుకొని గుమాస్తాగా వెళ్లదీస్తా.. నంటే.. బతుకు జట్కాబండీలా తయారవుతుంది. సంపద సృష్టించాలి. రిస్క్ తీసుకోను.. తక్కువైనా నమ్మకంగా ఖాతాలో పడే జీతం చాలనుకుంటే.. ఏండ్లు గడిచినా బతుకు మారదు. 18 వేలు ,20 వేలు జీతం ఉన్నవాళ్లు ముందుగా ఆ కొలువులోంచి బయటపడాలి. సొంత కాళ్ళ మీద నిలబడాలి హైదరాబాదు లాంటి మహానగరాల్లో టీ కొట్టు పెట్టుకున్న నెలకు 30వేల ఎటూపోవు! ఉద్యోగం వదులుకోవడానికి మనసొప్పకపోతే.. మీ టాలెంట్ను గుర్తించి దాని ఆధారంగా ఎంతోకొంత అదనపు సంపద సృష్టించుకోవచ్చు.
రాబడి మార్గాలు బోలెడు.
ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయితే.. సాయంత్రాలు ట్యూషన్ చెప్పుకోవచ్చు. సంగీతంలో పరి ఉంటే.. మ్యూజిక్ స్కూల్ నడపొచ్చు. వంటల్లో ఆరితేరిన వారైతే పొడులు, పచ్చళ్లు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మీ ప్రత్యేకత ఏమిటో తెలుసుకొని.. దాని ద్వారా కూడా ఆదాయం ఆర్జించినప్పుడే ఎదుగుతాం. అంతేకానీ, వచ్చే ఇరవై వేలల్లో నాలుగు వేలు ఎస్ఐపీ కడతానంటే.. ఈ పదహారు వేలతో మీ ఇల్లు గడవడం దుర్బరం అవుతుంది. తినే తిండి, కట్టు కునే బట్ట, పిల్లల చదువు ఇలా అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది.
ఉత్సాహమే పెట్టుబడి..
ఒక ముప్పయ్యేండ్ల వ్యక్తి గృహ నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ ఆదాయం 900. నెలకు 21 వేల వరకు వస్తుంది. అతని భార్య కుట్టుమిషన్ కుడుతుంది. ఆమెకు నెలకు 4వేలు వస్తాయి. జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఓ లక్షన్నర కూడబెట్టారు. ఈ పాతికవేలల్లో 5వేలు ఎస్ఐపీ చేశాడనే అనుకుందాం. ఇరవై ఏండ్ల తర్వాత అతనికి 11.50 లక్షలు చేతికొస్తాయి. అయితే.. పదేండ్ల తర్వాత 40 ఏండ్లకు వచ్చే ఆ వ్యక్తి, ఇప్పుడు న్నంత ఉత్సాహంగా పనిచేయకపోవచ్చు. పిల్లలు పెరుగుతారు. ఖర్చులూ అధికమవుతాయి. అప్పుడు ఆదాయం సరిపోకపోవచ్చు. ఇలాంటప్పుడు ఎలా మదుపు చేయగలడు. కూడబె ట్టిన లక్షన్నరకు, ఓ ప్రైవేట్ చిట్ ద్వారా రెండు లక్షలు జతచేసి.. గృహ నిర్మాణ సామగ్రి తీసుకో వచ్చు. వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. నిర్మాణ రంగం లోనే ఉన్నాడు కాబట్టి గిరాకీ ఉండదన్న సమస్య రాదు. పదేండ్లు పూర్తయ్యే నాటికి రోజుకు 3వేలు అద్దె వచ్చేలా పరికరాలు సమకూర్చుకోగలిగితే.. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పదిరోజులు ఎవరూ అద్దెకు తీసుకోలేదు అనుకున్నా నెలకు దాదాపు 60వేలు సమకూరు తాయి. దీనికి దంపతుల ఆదాయం కలిస్తే.. ఆ కుటుంబం మధ్యతరగతి జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. డబ్బులు సంపాదించాలనే ఉత్సాహం ఉండాలి. చాలీచాలని బతుకుల నుంచి గట్టెక్కాలన్న ఆలోచన రావాలి. దానిని పక్కాగా అమలు చేస్తే... దిగువ మధ్యతరగతి దగ్గరే ఆగిపోవాల్సిన పరిస్థితి ఉండదు.
కుటుంబానికి భరోసా.
దిగువ మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. వైద్యం ఖర్చుల గురించి బెంగ అవసరం లేదు. ఎందుకైనా మంచిది అనుకుంటే.. ఆరోగ్యబీమా తీసుకోవచ్చు. ఐఆర్డీఏ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) నియమాలను అనుస రించి బీమా కంపెనీలు పరిమిత మొత్తంతో జీవిత బీమా ఆఫర్ చేస్తున్నాయి. ఆదాయం తక్కు వైనా, చదువు లేకున్నా 25 లక్షల వరకు జీవిత బీమా ఇస్తున్నాయి. దీనికి నెలకు 200 నుంచి 600 వరకు ప్రీమియం చెల్లిస్తే చాలు. దీంతో కుటుంబానికి భద్రత కలు గుతుంది. పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, మీ కోసం అటల్ పెన్షన్ యోజన తదితర ప్రభుత్వ ఆధారిత స్కీమ్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తుపై బెంగ లేకుండా ఉండొచ్చు.