59.అంతా ఒకేచోట.. చేటు.
హయ్యర్ ఇన్కం వస్తున్నవారు గొప్పలకు పోయి గోతిలో పడ్డ సందర్భాలు కోకొల్లలు. పెట్టుబడులు పెంచాలనీ, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తపనతో అగ్రెసివ్ స్టెప్ తీసుకుం టారు. ఏదైనా తేడా కొడితే మొత్తం పేక మేడలా కూలిపోతుంది. ఇలా ఓసారి పోగొట్టుకుంటే మళ్లీ రావడ మనేది చాలా కష్టం. ఉన్నదంతా ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే!
కొవివిడ్కు ముందు రోజులవి.. ఓ పేరున్న బిజినెస్కు ప్రొప్రైటర్షిప్ తీసుకు న్నాడు ముకుందరావు. ఒకటి కాదని రెండు షాపులు నిర్వహిస్తున్నాడు.. బాగా నడుస్తున్నాయి. ఖర్చులన్నీ పోను నెలకు ఐదారు లక్షల దాకా మిగులుతు న్నది. పెద్దగా ఇష్టం లేకున్నా స్నేహితుడు ఆనందరావు ఇచ్చిన సలహా మేరకు మంత్లీ 2 లక్షల ఇన్సూరెన్స్ కడుతున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్న మరో మిత్రుడు విలాస్రావు అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిం చాడు.. పైపాటుగా యుద్ధాలు వస్తే మనం పెట్టిన ఫండ్ సంగతేంటి? అన్న ప్రశ్నను సంధించాడు. ముకుందరావు లేవనెత్తిన సందేహాలన్నీ విలాస్ రావు తీర్చ డంతో చిన్నగా నెలకు 30 వేలతో ప్రారంభిద్దాం అని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాడు.
కట్ చేస్తే.. కొవిడ్ తర్వాత, నాలుగేళ్లకు ఓ సందర్భంలో.. విలాస్ రావు, ముకుందరావు మ్యూచువల్ ఫండ్స్ప రివ్యూ చేసుకుంటున్నారు. గతంలో ప్రతినెలా పెట్టిన 30 వేలు ఆరింతలు యింది. అప్పుడే లక్షల్లో పెట్టుబడి పెడితే కోట్లల్లో వచ్చేది కదా! అంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశాడు ముకుందరావు. 'అయ్యో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇప్పుడు పెట్టు'.. అన్నాడు విలాస్ రావు. ఇది విన్న ముకుందరావు 'ఇప్పుడు పెట్టే పరిస్థితి. లేదు. షాప్స్ ప్రొప్రైటర్షిప్ కాకుండా మ్యాన్యుఫ్యాక్చరింగ్లోనూ ఇన్వెస్ట్ చేశాను. బిజినెస్ అంతా పోయింది. చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాను'.. అని సమాధానమిచ్చాడు. ... ఒక్క ముకుందరావు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఒంటరిగా బిజినెస్ చేస్తూ అధి కంగా సంపాదిస్తున్న చాలా మందిదీ ఇదే పరిస్థితి. ఇప్పుడున్న బిజినెస్ నే ఏడాది తిరిగేకల్లా కనీసం రెండు మూడు రెట్లయినా పెంచేద్దామంటూ అప్పటివరకు సంపాదించిందంతా పెట్టుబ పెట్టుబడిగా పెట్టిస్తారు అంతే. ఏదో నష్టం వాటిల్లుతుంది. అంత డబ్బులు వెనక్కి తిరిగి మూడు. కుంటే మళ్లీ మొదటికొచ్చి పడ్డామన్న సంగతి అప్పుడు బోధ పడుతుంది.
టెన్త్ , ఇంటర్మీడియట్ కూడా చదవకుండా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించేవారు చాలా చాలా మంది ఉన్నారు. అంత ఇన్నోవేటివ్ గా బిజినెస్ చేస్తారు కాబట్టి వారంతాగా ఇన్కమ్ పొందు తున్నారు. అధికంగా సంపాదించే స్థాయికి ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమైన వారి సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే ఉంటున్నది ఈ రోజుల్లో! ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణం. ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్ చేసేసి ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నప్పుడు వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంటుంది. అందుకే వచ్చిన లాభాల్లోనుంచి కొంత మరో విధంగా సేవింగ్స్ చేయడంపై దృష్టి పెట్టరు. ఇలాంటి మొండి ధైర్యంతో ఉండటమే వారి కొంప ముంచుతుంది. ఆదాయం వస్తుంది కదా అన్న ఉత్సాహంలో చాలా మంది లెక్కా పత్రం లేకుండా పెట్టుబడి పెట్టేస్తూ చివరకు మళ్లీ జీరో అయిపోతుంటారు.
హయ్యర్ ఇన్కం ఉన్నవాళ్లు రెండు క్యాటగిరీలు ఉంటారు. ఉద్యోగులు.. వ్యాపారులు. వ్యాపారంలో సంఘటిత, అసంఘటిత అని మళ్లీ రెండు రకాలు. అసంఘటిత రంగ వ్యాపారులకు ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువ. దీంతో చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడులు, ఖర్చులకు పోతారు. చివరికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు. ఇలాంటి వాళ్లకు మ్యూచు వల్ ఫండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి మంచివి. అంతేకాకుండా అధిక ఆదాయ వర్గాల వాళ్లు తన లాభాల్లో నెలకు కనీసం 30 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఉన్న బిజినెస్ వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని మరోచోట పెట్టుబడి పెట్టడం కన్నా మంచి మార్గం లేదు.
ఒక ఉద్యోగి నెలకు 3 లక్షల దాకా డ్రా చేస్తున్నట్ల యితే ప్రతి నెలా ఓ ముప్పయ్ వేల రూపాయలైనా ఈపీ ఎఫ్ ఖాతాలో జమ అవుతుంటాయి. కంపెనీ షేర్స్, ఈ- షాప్స్ ఉంటే ఆ మార్గంలో కూడా ఆదాయం సమకూరు తుంటుంది. కుటుంబమంతటికీ ఇన్సూరెన్స్ కవరేజీలు ఉంటాయి. ఇలాంటివేవీ అసంఘటితరంగ వ్యాపారులకు ఉండవు. స్వయంగా ప్రొప్రైటర్షిప్ చేసేవాళ్లు వారి బిజినె స్లో వారే కింగ్. పరిస్థితుల కారణంగా ధైర్యం పెరిగిపో తుంది. నాకేంటి ఖర్చులన్నీ పోనూ నెలకు ఐదారు లక్షలు మిగులుతున్నది కదా అన్న ధీమాతో తప్పులు చేస్తారు.