62. థింక్ ఎమర్జెన్సీ
62. థింక్ ఎమర్జెన్సీ.
అత్యవసర పరిస్థితులు చెప్పి రావు. అవి ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కో వడానికి సిద్ధంగా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. విపత్కర పరిస్థితుల్లో ఒడ్డున పడటానికి ఈ ప్రత్యేక నిధి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఆ నిధి ఏ రూపంలో ఉండాలి? నగదుగా ఉండాలా? మరేదైనా రూపంలో ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుంటుందా?
అసలు అత్యవసర నిధి అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వహించుకోవాలి? మన సంపాదనలో ఎంత భాగాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోవాలి? తదితర సందేహాలు చాలామందిని తరుచూ తొలిచివేస్తూ ఉంటాయి. ఒకరిద్దరు మినహా అత్యవసర సమయాల్లో చాలామంది అప్పు కోసం రాక్షస ప్రయత్నం చేస్తుంటారు. చివరికి 'వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు' అని అందినకాడికి అప్పులు చేస్తుంటారు. సంపన్నులు సైతం అత్యవసర పరిస్థితుల్లో చేతిలో సరిపడా క్యాష్ లేక ఆస్తులను అడ్డెకు పావుసేరు రేటుకు అమ్ముకుంటుంటారు. అయితే, ప్రతి వ్యక్తికీ, కుటుంబానికీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అలాగని నగదు రూపంలోనే ఈ ఫండ్ ఉండాలన్న నియమం లేదు. ఏ రూపంలో ఉన్నా.. అవసరానికి అక్కరకు రావాలి.
ఒక వ్యక్తి జీవితంలో ఏది అత్యవసర పరిస్థితికి దారితీస్తుందో ఆలోచించాలి. కారు చెడిపో యిందా.. రెండు వారాల్లో బాగు చేసుకోవచ్చు. ఉద్యోగం పోయిందా.. మహా అయితే నాలుగు నెలల్లో తిరిగి సంపాదించుకోవచ్చు. ఇవన్నీ ఈ రోజుల్లో అత్యవసర పరిస్థితులు అనలేం. ఇంటి ఖర్చులే కాకుండా, ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతలను నెరవేర్చేందుకు కొన్ని నెలలకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకో వాలని కొందరు సూచిస్తుంటారు. ఎంత చెట్టుకు అంత గాలి. వ్యాపారులు మినహా.. మూడు నెలల ఖర్చులకు సరిపడా నగదు ఏ ఉద్యోగీ బ్యాంకు ఖాతాలో ఉంచలేడు. ఏ నెల ఖర్చులు ఆ నెల ఎగిరిపోతూనే ఉంటుంది సేవింగ్ ఖాతా చెక్కుపోతే క్రెడిట్ కార్డుతో అవసరాలు తీర్చుకుంటారు . మరిసమస్యాత్మకమైతే అయితే బంగారం కొదువ పెడితే ఎమర్జెన్సీ పాటు సబర్ కుర్చుకుంటారు న్నారు.
అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే.. మన కుటుంబ పరిస్థితి తారుమారు కాకుండా కాపాడే నిధి. మనం పోయిన తర్వాత కూడా కుటుంబాన్ని భద్రంగా ఉంచే మొత్తం. ఆరోగ్య బీమా, జీవిత బీమా ఈ రెండిటినీ మించిన ఎమర్జెన్సీ ఫండ్స్ లేవు. ప్రాణాలను నిలబెట్టుకోవడం కన్నా అత్యవసర పరిస్థితి ఏముంటుంది? కుటుంబాన్ని కాపాడుకోవడం కన్నా గొప్ప అవసరం ఏముంటుంది? కానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు వీటి గురించి ఎవరూ ఆలోచించరు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకొని అత్యవసర నిధి దొరక్క అతలాకుతలం అవుతూ ఉంటారు. ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిపాలైనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఉంటే బాగుండేది కదా! అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు.
ఈ రోజుల్లో రకరకాల వ్యాధులు మనిషి వెన్నంటే ఉంటున్నాయి. హెల్త్ చెకప్ కోసం వెళ్లిన వ్యక్తి.. కార్పొరేట్ ఆస్పత్రిలో జాయిన్ అవుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. కిడ్నీ, గుండె, లివర్ రుగ్మతలతో ఆస్పత్రి గుమ్మం తొక్కితే.. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. పాతికేండ్లు ఉద్యోగం చేసినా... దవాఖాన ఖర్చుకు వెరచి వెనుదిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. ఎప్పుడో అగ్గువకు కొన్న ప్లాటు బేరానికి పెడితే.. బయ్యర్ దొరికే వరకు చికిత్స అందేదెలా? ఏడాదికి పాతికవేలు ఖర్చుపెట్టి ఓ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. ఆ భరోసా వైద్యం కన్నా వేగంగా గుణం చూపిస్తుంది కదా! ఎమర్జెన్సీ ఫండ్ అనేది నేచర్ ఆఫ్ వర్క్ బట్టి మారిపోతుంది. సూటిగా చెప్పాలంటే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు మీదా 50 లక్షలకు తగ్గని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే ఎమర్జెన్సీ ఫండ్.
అత్యవసరం అనే పదానికి అర్థం.. అన్ ఎక్స్పెక్టెడ్, డేంజరస్ సిచువేషన్, రిక్వైరింగ్ ఇమిడి యట్ యాక్షన్ అని! ఏదైనా ప్రమాదం జరగడం, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడి పోవడం లాంటివి అత్యవసర పరిస్థితులు. ఇలాంటప్పుడు కదా ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగప డాల్సింది. మరి ఆర్నెల్లకు సరిపడా ఖర్చులు పక్కన పెట్టుకోవడానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? జాబ్ పోవడం అనేది సీరియస్, అన్ ఎక్స్పెక్టెడ్, డేంజరస్ సిచువేషన్ కాదు. ఈ జాబ్ పోతే మరో జాబ్ వస్తుంది. నగదు రూపేణా బ్యాంకుల్లో దాచుకునేది, స్థిర ఆస్తుల రూపంలో నిర్వహించేది అత్యవసర నిధి కాదు. కుటుంబంలో ఎవరికి ప్రాణాపాయ స్థితి వచ్చినా కాపాడుకోగల 'పాలసీ' ఏదైనా అసలు సిసలు అత్యవసర నిధే. కనీసం ఐదేం డ్లకు సరిపడా సొమ్ము, దానంత విలువైన సంపదే అత్యవసర నిధి.