FP ramprasad 49. తోబుట్టువే అసలైన ఆస్తి.

49. తోబుట్టువే అసలైన ఆస్తి.

పిల్లాపాపలతో చల్లగా ఉండండి'
అనే దీవెనకు కాలదోషం పట్టిం
దేమో! ఈ తరం దంపతులు ఒకరే
చాలు అని ఫిక్సవుతున్నారు. ఇంట్లో
పెద్దలు నచ్చజెబుతున్నా.. ఆ టాపిక్
రాగానే ఏదో చెప్పి తప్పించుకుంటు
న్నారు!! గట్టిగా అడిగితే.. 'ఇప్పు
డున్న ధరలతో ఒక్కరిని పోషించ
డమే కష్టం.. ఇంకో బిడ్డ అంటే
మావల్ల కాదు' అని కరాఖండిగా
చెప్పేస్తున్నారు. మానవీయ బంధాల
విషయంలో లెక్కలు వేసుకుంటే..

మీ బిడ్డకు ఆస్తి కూడబెట్టి ఇవ్వగలరేమో కానీ, అందమైన జీవితాన్ని దూరం
చేసినవారు వుతారని గుర్తుంచుకోండి. ఎందుకు ఒక్క బిడ్డ చాలు అను
కుంటున్నారు? ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఈ
ప్రశ్న ఉదయించిన ప్రతిసారీ పక్కాగా సమాధానమూ వస్తున్నది. 'ఈ రోజుల్లో
ఒక్కరిని పోషించడమే గగనం' ఓ తండ్రి మాట! 'మళ్లీ కాన్పు అంటూ మరో
ఏడాది ఇంట్లో కూర్చుంటే నా కెరీర్ ఏం కాను' అంటుంది తల్లి.

నర్సరీకే రెండు లక్షలు డొనేషన్ కట్టాల్సి వస్తుంది!' అని దంపతులిద్దరూ ఒక్కరుంటే చాలు
అని బలంగా వాదిస్తున్నారు. కారణం ఉద్యోగ అభద్రత! లక్షల్లో వేతనం అందుకుంటున్నా..
ప్రైవేటు ఉద్యోగులు ఏప్పుడు వేటు పడుతుందో తెలియని పరిస్థితి. అమెరికాలో మాంద్యం వస్తే
ఇక్కడ కొలువు ఊడిపోతుందని భయం. పోనీ, బాగా సంపాదించే రోజుల్లో ఆస్తులు
అంటే అక్కడా సంతృప్తికరమైన సమాధానం రాదు. తమ తప్పులను కప్పిపుచ్చుకొనే
లా పెరుగుతున్న ధరలు అంటూ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు.

వ్యత్యాసం ఉంటే..

ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి నెలకు 5 లక్షలు సంపాదించినా.. అవసరానికి చేతిలో చిల్లిగవ్వ
ఉండదు. ఈ ధోరణే నేటితరం తల్లిదండ్రులు ఒక్కరే ముద్దు అనుకునేలా చేస్తున్నది. నాణ్య
మైన విద్య అందించాలని ఆలోచన మంచిదే అందుకోసం పిల్లలు వద్దనుకోవడం సరైన
నిర్ణయం కాదు. జీవితంలో అన్నిటినీ డబ్బులతో ముడిపెట్టలేం. ఆదాయ మార్గాలు పెంచుకో
డంతోపాటు ప్రణాళికా బద్దంగా సాగితే ఇద్దరు పిల్లలు భారం కారు, పిల్లల మధ్య మూడు,
నాలుగేండ్లు వ్యత్యాసం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల చదువు, పెండ్లి, సెటిల్మెంట్
వరకు అన్ని సందర్భాల్లోనూ ఈ వ్యత్యాసం తల్లిదండ్రులు ఆర్థికంగా ఊపిరి తీసుకునే వెసులు
బాటు కల్పిస్తుంది. ఉన్నత చదువులు, పెండ్లి సమయాల్లో డబ్బు సమకూరేలా ప్రణాళికలు
ఏర్పాటు చేసుకుంటే ఒత్తిడి ఉండదు!

ఒకరికొకరు.

పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా.. తోడు ఇవ్వడం అత్యంత ఆవశ్యకం. తోబుట్టువును మించిన
ఆస్తి మరొకటి ఉండదు. తోబుట్టువు లేని బాల్యం నిస్తేజంగా సాగుతుంది. తల్లిదండ్రులు
ఎంతో స్నేహితుల్లా ఉన్న, అన్న తన చెల్లితో గడిపే సమయం చాలా గొప్పది. కాస్త పెద్ద
య్యాక చదువు, కెరీర్ విషయంలో ఒకరి కొకరు మార్గనిర్దేశనం చేసుకుంటారు. తల్లిదండ్రు
లతో చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుతో పంచుకుంటారు. అంతేకాదు, అన్నదమ్ములే
కానీ, అక్కాతమ్ముళ్లే కానీ, అన్నాచెల్లో కానీ ఒకరి విషయంలో మరొకరు బాధ్యతగా ఫీలవు
తారు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటారు. అన్నిటికీ మించి ఒంటరి బతుకు అనే భావన
రాకుండా తనకంటూ ఒకరున్నారన్న భావన ఎంతటి ఒత్తిడిని అయినా జయించేలా చేస్తుంది.
తోబుట్టువు ఉంటేనే పంచుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. భావోద్వేగాలను ఎవరితో ఎలా
పంచుకోవాలో అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఆర్థికంగా భారమవుతుందనీ, కెరీర్ రేస్
వెనుకబడతామనీ ఒక్కరితో చాలు అనుకుంటే పొరపాటే! ఆ బిడ్డకు మంచి చదువు, ఐశ్వర్యం
ఇవ్వగలరేమో కానీ, అందమైన బాల్యాన్ని దూరం చేసినవాళ్లు అవుతారు. మీ తదనంతరం
మీ వారసుడి కుటుంబం ఒంటరిగా మిగిలిపోవద్దు అనుకుంటే.. చిన్నప్పుడే తోబుట్టువును
కానుకగా ఇవ్వండి.

ప్రణాళిక ముఖ్యం.

ఆర్థిక విజయానికి మూల సూత్రం ప్రణాళిక, భవిష్యత్ అవసరాలు ముందుగానే గుర్తించగలి
గితే.. ఈ కాలంలోనే కాదు, మరో పాతికేండ్ల తర్వాతైనా ఇద్దరు పిల్లలను పెంచడం పెద్దకష్ట
మైన పనేం కాదు. పిల్లలు పుట్టగానే వారిపేరిట అందుబాటులో ఉన్న మంచి పాలసీని తీసుకో
వాలి. వాళ్లు ఉన్నత విద్యలోకి ప్రవేశించే సమయంలో ఆ పాలసీ మొత్తం చేతికి అందేలా
ప్రణాళిక వేసుకోవాలి. అన్నిటికీ మించి పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి. కష్టమైనా
మంచి విద్య అందించాలి. ఇతర పెట్టుబడులు ఎన్ని ఉన్నా.. నాణ్యమైన చదువు చెప్పించక
పోతే పిల్లల భవిష్యత్తు రిస్క్ లో పెట్టినట్టే అని గుర్తుంచుకోండి.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim