FP ramprasad 50. క్విట్.. క్విక్ మనీ!

50. క్విట్.. క్విక్ మనీ!

కోల్పోయేది ఏమీ లేనప్పుడు
తెగించడంలో అర్థం ఉంది. కానీ,
మేధస్సును మరిగించి, కాలాన్ని
కరిగించి ఆర్జించిన సొమ్మును క్విక్
మనీ రేసులో కుమ్మరిస్తూ సమస్యలు
కొనితెచ్చుకుంటున్నారు కొందరు.
రెక్కలు పూర్తిగా తొడగకముందే
రివ్వున ఎగిరి, శక్తిచాలక కుదేలవుతు
న్నారు. అడ్డాలనాడు బిడ్డలకు తల్లి
దండ్రుల అండ ఉంటుంది. ఆ
బిడ్డలే గడ్డాలనాడు తడబడితే..
ఆదుకునేవారు ఉండరు!!


పైసా కమానా నహీ.. బనాయా జాతా హై' ఓ వెబ్ సిరీస్లోని డైలాగ్ ఇది.
పైసలను సంపాదించడం కాదు, సృష్టించాలి' అని అర్థం! ఈ తరం
పోకడ అచ్చంగా ఇలాగే తయారైంది. పొదుపు మంత్రం పఠించడం మంచిదే!
మదుపు చేయడమూ ఉన్నతమైనదే! కానీ, ఎంచుకున్న మార్గం ప్రధానం.

చాలామంది ఉద్యోగంలో చేరింది మొదలు అలవి కాని లక్ష్యాలను నిర్దేశించు కుంటున్నారు
కెరీర్ గాడిలో పడకముందే.. నయా గాడీ కొనడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. పెద్దలు
వాదిస్తే.. 'వాయిదా పద్ధతుంది దేనికైనా..' అని సర్దిచెబుతున్నారు. పెండ్లి, పిల్లల ముచ్చట తీర
కముందే లంకంత ఇల్లు కొనేస్తున్నారు. చేతిలో నయా పైసా లేకున్నా... మూడు నెలల 
పే స్లిప్పులు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ రుణ సదుపాయం పొంది. ఉపాయంగా ఓ
ఇంటివారవుతున్నారు. పాతికేండ్లకే వాయిదాల ఉచ్చులో చిక్కుకొని.. ఒత్తిళ్లతో కుస్తీ పడుతు
న్నారు. పైగా తామంతా జాగ్రత్తపరులమనీ, జీవితాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నామన్న
భావన వ్యక్తం చేస్తుంటారు. అయితే, వీరిలో చాలామంది రోజులు గడిచే కొద్దీ 'అమ్మో!
ఒకటో తారీఖు' అనుకుంటున్నారు. ఖాతాలో జీతం క్రెడిట్ అయ్యిందన్న ఆనందంలో ఉండ
గానే ఈఎమ్ఐ డెబిట్ సందేశాలతో వేతన జీవులు వేదనకు గురవుతున్నారు.

ఈజీ మనీ ట్రాప్ ..

వాయిదాల రావుల సంగతి కాసేపు పక్కన పెట్టి, ఈజీ మనీ కోసం వెంపర్లాడే క్రేజీ ఫెలోస్
గురించి చర్చించుకుందాం. డబ్బు విలువ బాగా తెలుసనే భ్రమలో ఉంటారు వీళ్లు. రూపాయి
నాణెం నాటి దానికి కరెన్సీ కట్టలను పూయిస్తామని గప్పాలు కొడుతుంటారు. రిస్క్ లేని
క్కడా ? అంటూ లెక్చర్లు దంచుతారు. అయితే వీరిలో చాలామందికి ప్రత్యక్షంగా పనిచేసే
మేధస్సు ఉండదు. బుర్రలో తొలిచే ఆలోచనలు అమలుచేసే సామర్థ్యం అంతకన్నా ఉండదు.
అప్పనంగా రావాలంటే ఏం చేయాలో అని మాత్రం సదా అన్వేషిస్తూ ఉంటారు.
మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీరికి బోరింగ్ సబ్జెక్టులు, ఓన
మాలు తెలియకుండానే ట్రేడింగ్లో ట్రెండ్ సృష్టిస్తామని బీరాలు పలుకుతుంటారు. అనుకో
కుండా ఒకరోజు లాభాలు కండ్ల చూడగానే.. ప్రతిరోజూ కాసులపంట పక్కా అని
తీర్మానించు కుంటారు. పెట్టుబడికి నిధులు లేకపోతే ట్రేడింగ్లో కింగులమని చెబుతూ అందిన
చోటల్లా అప్పు చేస్తారు. అవగాహనా రాహిత్యం, మితిమీరిన విశ్వాసంతో తప్పటడుగు వేసి
ట్రేడింగ్ గంట మోగిన నిమిషాల్లోనే సర్వం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతారు.
స్టాక్ మార్కెట్పై పట్టు లేకుండా స్టార్ను నమ్ముకున్న వారిలో చాలామంది పరిస్థితి ఇదిగో
ఇలాగే తయారవుతుంది. అయినా, ఎప్పుడో ఒకసారి తగిలే జాక్పాట్ మత్తులో ప్రతిరోజూ
రిస్క్ చేస్తూ రెస్ట్ లెస్ గా మిగిలిపోతుంటారు.

Popular posts from this blog

praveen samples: idoc2edi: step by tpm configuration, with payloads

50 questoins of grok questions.

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format