FP ramprasad 55. మలిసంధ్యలో మనీ గ్యారెంటీ!

55. మలిసంధ్యలో మనీ గ్యారెంటీ!

బంగారు గుడ్డు పెట్టే బాతు కథ తెలుసు కదా! బాతు ఉన్నంత కాలం గుడ్డు గ్యారెంటీ, అత్యాశకు పోతన 'అసలు' సమస్య. ఈ స్పిరిట్లో వచ్చిందే గ్యారెంటీ ఇన్కమ్ సూత్రం, దీన్ని ఆధారంగా చేసుకొని.. బీమా సంస్థలు గ్యారెంటీడ్ మనీ స్కీమ్, యాన్యుటీ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి, ఒక్కసారి ధైర్యం చేస్తే.. రిటైర్ అయ్యాక ప్రతి నెలా భరోసా పొందొచ్చు. ఇంతకీ ఏంటీ గ్యారెంటీ, యాన్యుటీ ప్లాన్స్..

జగన్నాథం ప్రభుత్వ ఉద్యోగి, రామనాథం ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరూ స్నేహి తులు, రెండు నెలల తేడాతో ఇద్దరూ పదవీ విరమణ పొందారు. జగన్నాథా నికి గ్రాట్యుటీ డబ్బులు బాగానే వచ్చాయి. పెన్షన్ కూడా వస్తుంది. రామనాథానికి కంపెనీ నుంచి ఏదో కంటితుడుపుగా కొంత మొత్తం అందింది. పెన్షన్ వెసులు బాటు లేదు. కొన్నాళ్లు గడిచాయి.

శ్రీ జగన్నాథం ఒకరోజు రామనాథం ఇంటికి వెళ్లాడు. తన స్నేహితుడు దిలాసాగా కనిపించాడు. 'ఏరా! పెన్షన్ వస్తున్న నాకు రోజులు గడవడం కష్టంగా ఉంది. నువ్వేంటి ఇంత కులాసాగా  ఉన్నావ్! ఏదైనా లాటరీ తగిలిందా?' అని ప్రశ్నించాడు. 'పెన్షన్ రాకపోతేనేం గ్యారెంటీడ్ స్కీమ్ ఉందిగా.. అన్నాడు రామనాథం. పెన్షన్  వస్తున్న జగన్నాధం జాలిపడేలాఉండటానికి, , పెన్షన్ రాని రామనాథం జాలీగా ఉండటానికి కారణం వాళ్లు ఎంచుకున్న ఆర్థిక ప్రణాళికలే !

ఫిక్స్ చేసుకోవచ్చు..

ఈ స్నేహితుల కథను కాసేపు పక్కన పెడితే.. గ్యారెంటీ ఇన్కమ్ ఉండటం అందరికీ అవసరం. ఈ సత్యం తెలుసుకోక చాలామంది... సీనియర్ సిటిజన్స్ అయ్యాక సీరియస్ గా బాధపడు  తుంటారు. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, కుటుంబ బాధ్యతలను బొటాబొటీగా నెట్టుకొచ్చిన వ్యక్తి ఆశలన్నీ రిటైర్ అయ్యాక వచ్చే గ్రాట్యుటీ పైనే ఉంటాయి. పదవీ విరమణ నాటికి బాధ్య తలన్నీ తీరిపోతే... ఆ పైకాన్ని పోస్టాఫీస్లోనో, బ్యాంకులోనో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి హమ్మయ్య అనుకుంటారు. పదేండ్లు గడిచిన తర్వాత రిటర్న్ రేట్ తగ్గుతుంది. ముందస్తు ప్రణాళిక లేనప్పుడు ఎఫ్.డి. మంచి ఆప్షన్. కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడే కొన్ని చక్కదిద్దుకో వాలి. అలాంటి వాటిలో రిటైర్మెంట్ ప్లాన్ కూడా ఒకటి. దీనికి బీమా సంస్థలు రకరకాల గ్యారెంటీ ఇన్కమ్ ప్లాన్లు అందుబాటులోకి తెచ్చాయి. ఒక్కసారి భారీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే.. మీరు రిటైర్ అయిన నాటి నుంచి వార్షికంగా గానీ, నెలనెలా గానీ పెన్షన్ పొందొచ్చు.  ఉదాహరణకు ఏడాదికి లక్ష చొప్పున 12 ఏండ్ల  లో 12,00,000 కట్టారనుకుందాం. తర్వాత ముప్పయ్ ఏండ్ల పాటు 9 శాతం రిటర్న్స్ ఇచ్చే స్కీములూ ఉన్నాయి. గ్యారెంటీడ్ రిటర్న్ ప్రొడక్క పన్ను నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. అయితే, ప్రీమియం మొత్తం ఏడా దికి 5 లక్షల వరకు ఉంటేనే ఇది వర్తిస్తుంది.

జీవితకాలం ఆదాయం.

గ్యారెంటీడ్ మనీ స్కీమ్లలో యాన్యుటీ ప్లాన్ ఒక రకం. ఒకేసారి పెద్దమొత్తం కడితే.. నిర్ణీత కాలవ్యవధి తర్వాత నిర్దేశిత మొత్తం నెలనెలా అందుకునే వీలు ఉంటుంది. ఈ ప్లాన్లో 6.5 శాతం వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని స్కీమ్లు జీవితకాలం వర్తిస్తాయి. వ్యక్తి తదనంతరం జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఆమె తదనంతరం నామినీకి పర్చేజ్ ప్రైస్ (ప్లాన్ కొనుగోలు ధర) మొత్తం చెందుతుంది. అయితే, పర్చేజ్ ప్రైస్ ఎవరికీ ఇవ్వకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతినెలా అందుకునే పెన్షన్ మొత్తం పెరుగుతుంది. యాన్యుటీ ప్లాన్ తీసుకున్న వ్యక్తి వయసు ఆధారంగా పెన్షన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 65 ఏండ్ల వ్యక్తి కోటితో యాన్యుటీ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. మరుసటి ఏడాది నుంచి ఏటా 7 లక్షలు (ఏడు శాతం) పెన్షన్ గా అందుతుంది. ఆ వ్యక్తి పోయిన తర్వాత జీవిత భాగస్వామికీ అంతే మొత్తం పెన్షన్ అందుతుంది. ఆమె పోయిన తర్వాత కోటి వారసులకు వస్తుంది. తన తదనంతరం ఎవరికీ పర్చేజ్ ప్రైస్ చెందనవసరం లేదని పాలసీదారుడు కోరితే... ఏటా  పదిలక్షల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ తరహా గ్యారెంటీ మనీప్లాన్స్ దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. మీ ఆదాయా నికి తగ్గ ప్లాను ఎంచుకొని శేషజీవితం ప్రశాంతంగా సాగేలా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసు కోండి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ వర్తించని ఈ రోజుల్లో ఇలాంటి ప్లాన్లు ఎంచుకో వడం సదా శ్రేయస్కరం.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim