FP ramprasad 71. మీరు యజమాన? వాచ్మ్యనా?


71. మీరు యజమాన? వాచ్మ్యనా?

ఓ మధ్యతరగతి మనిషికి పొదుపు అంటే... ఖర్చులు తగ్గించుకోవడం వరకే ఆలోచిస్తాడు. ముచ్చటపడి కట్టుకున్న ఇంట్లో మురిపెంగా ఉండాలని ఉన్నా.. ఇంకేదో ఆశిస్తాడు. రూపాయి, రూపాయి కూడబెట్టి ఇల్లు మీద ఇల్లు కట్టి.. యజమానిగా చెలామణీ కావాలని ఆశిస్తాడు. ఈ రకంగా ఆలోచించిన ఎందరో.. యజమానులుగా కన్నా జీతం భత్యం లేని వాచ్మెన్లుగా మిగిలిపోతున్నారు.

ఏ పెట్టుబడి అయినా మనల్ని ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుతోపై ఉండాలి. కానీ, ఆ పెట్టుబడే గుదిబండగా మారితే, ఆశించిన లాభాలు రావు సరికదా, తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. నడివయసులోనే సొంతింటి కలను నిజం చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులే వానికి తృప్తి చెంది.. ఇతర పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మేలైన జీవితాన్ని పాలంతం చేసుకో వచ్చు, కానీ, చాలామంది మూసపద్ధతికి అలవాటుపడినవాళ్లే ఉంటారు. వాళ్లు చేసే తప్పులు ఎలా ఉంటాయో పరపరామ్ కథ చదివితే అర్థమవుతుంది.

పరశురామ్ ప్రైవేట్ ఉద్యోగి. మంచి జీతం వస్తుంది. ఊళ్లో కొద్దో గొప్పో ఆస్తి ఉంది . భార్య. ఇద్దరు పిల్లలు. జీవితం ఉన్నంతలో రిచ్గానే సాగిపోతుంది. పిల్లలు బడి వయస్సు దాటి  కాలేజీ లోకి ప్రవేశించారు. ఒకరోజు పరశురామ్ అత్తమామ ఊడిపడ్డారు. అత్తగారేమో తన కూతు రుతో వంటింట్లో సొంతిళ్లు సోద మొదలుపెట్టింది. మామగారేమో అల్లుడితో అనే విషయాన్ని  తన అనుభవాన్నంతా రంగరించి చెప్పనారంభించాడు. అల్లుడుగారూ కూడబెట్టిన సొమ్ముతో మంచి స్థలం తీసుకోండి. మంచి బిల్డర్కు ఇచ్చి లోను మీద ఇల్లు కట్టుకోవచ్చు. మూడంతస్తులు వేసి.. పై పోర్టన్లో మీరు ఉండి, మిగతావి అద్దిగిస్తే తిరిగి కూర్చోవచ్చు ఏమంటారు?" అన్నాడు. మామగారి ఆలోచన సబబుగానే తోచించి పరశురాంకు. తల్లి బోధతో అతని భార్య కూడా ఆలోచించండి అన్నట్టుగా చూసింది.

కోరికలు.. ఫిర్యాదులు..

ఇల్లు కట్టాలని ఫిక్సయిన పరశురామ్ అప్పటి వరకు తను కూడబెట్టుకున్న డబ్బంతా వెలికితీ శాడు. ఈపీఎఫ్ లో ఉన్న మొత్తాన్ని తీసుకున్నాడు. కొంత బంగారం కుదువపెట్టాడు. వెంచ ర్లో చిన్న స్థలాన్ని అమ్మేసి  కోటి సర్దుబాటు చేసుకున్నాడు. ఆ మొత్తంతో నగర శివా రులో 220 గజాల స్థలం కొన్నాడు. బిల్డర్ను సంప్రదిస్తే మరో కోటిలో జీ+2తోపాటు పైన పెంట్ హౌస్  నిర్మించేలా ఒప్పందం చేసుకున్నాడు. బ్యాంకులో 1.20కోట్ల గృహ రుణం తీసుకున్నాడు. అప్పటికే 45 ఏండ్లు ఉండటంతో, లోను టెన్యూర్ 15 ఏండ్లు పెట్టుకున్నాడు. ఈఎమ్ఐ 1.20 లక్షలుగా ఫిక్సయింది. అంటే అతని జీతంలో సగం వాయిదాకు చెల్లించా లని ఫిక్సయ్యాడు! ఇల్లు పూర్తయింది. ఆరు పోర్షన్లు అద్దెకిస్తే నెల తిరిగేసరికి 60 వసూలు అవుతున్నాయి. పరశురామ్ ఆనందానికి అవధుల్లేవ్. మూడు నెలలు గడిచాయో లేదో.. అద్దె దారులు పరస్పరం గొడవలకు దిగడం, తీర్పు కోసం పరశురామ్ తలుపు తట్టడం కామన్ అయిపోయింది. తప్పు చేసిన వారిని ఇల్లు ఖాళీ చేయించడమో, అలా చేయలేకపోతే తమదే ఒప్పు అనుకున్న వాళ్లు మరో ఇంటికి మకాం మార్చడమో జరుగుతూ వచ్చింది. ఆరు పోర న్లలో ఎప్పుడూ రెండు ఖాళీగానే ఉంటున్నాయి. ఇది చాలదన్నట్టు.. నీళ్లు రావడం లేదనీ, కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తున్నదనీ, మంచి నీళ్లు పైకి వచ్చేలా ఏర్పాటు చేయమనీ, వాష్రూ మ్లో నీళ్లు పోవడం లేదనీ.. ఇలా రోజుకో ఫిర్యాదు రావడం మొదలైంది. వాళ్ల కోరికలు మన్నించలేక, ఫిర్యాదులు పరిష్కరించలేక.. పరశురామ్కు సొంతింట్లో ఉంటున్న ఆనందం రెండేండ్లకే ఆవిరైంది. అప్పటి వరకు తన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టి, బ్యాంకు లోను తీసు కుని ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతో బతువు వెళ్లదీ యొచ్చు అని భావించాడు. కానీ, వెలకట్టలేని మనశ్శాంతిని దూరం చేసుకున్నాడు. పైగా, బీపీ షుగర్ లెవల్స్ పెరిగాయి. ఆరోగ్యం నిదానంగా దెబ్బతినడం మొదలైంది. ఈఎమ్ఐ భారంతో పిల్లల పైచదువులప్పుడు పూర్తి స్థాయిలో అండగా నిలవలేపోయాడు. స్పష్టంగా చెప్పాలంటే.. రెండు కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన యజమాని కాస్త ఆ ఇంటికి వాచ్ మ్యాన్గా మారిపోయాడు.

ఇప్పుడు మీరు ఆలోచించండి.. 2.20 కోట్ల పెట్టుబడి పెట్టి.. ఇల్లు తీసుకున్న వ్యక్తి దర్జాగా బతక్కుండా, ఇలా నీరుగారిపోవడాన్ని ఏ ఆర్థిక సూత్రం మాత్రం ఆమోదిస్తుంది. ఇదే పరశు రామ్ కోటితో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్గానీ, అదే నగర శివారులో డూప్లెక్స్ ఇల్లు గానీ తీసుకుంటే.. 'అనుభవించు రాజా!' అని పాడుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసేవాడు. తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. శాశ్వత ఆదాయం మాయలోపడి జీవితంలో ప్రశాంతతకు దూరమయ్యాడు.

Popular posts from this blog

praveen samples: idoc2edi: step by tpm configuration, with payloads

50 questoins of grok questions.

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format