72. మీ దీపాన్ని ఆరనివ్వరు.


72. మీ దీపాన్ని ఆరనివ్వరు.

వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకుండా, ఎవరినీ దేహీ అనకుండా జీవితం సాగాలంటే మాత్రం అది మీ చేతుల్లోనే ఉంది. వయసులో ఉన్నప్పుడు ముందుచూపు లేకుండా వ్యవహరిస్తే.. ముదిమి వయసులో దేవుడు కూడా మిమ్మల్ని ఉద్దరించ లేడు. రిటైర్మెంట్ ప్లాన్ కచ్చితంగా చేసుకుంటే.. అనాయాసేన మరణం మాటేమిటో గానీ, వినా దైన్యేన జీవితానికి మాత్రం గ్యారెంటీ లభిస్తుంది.

యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనిషి జీవితం రాజమౌళి సినిమాలా కలర్పుల్గా అనిపిస్తుంది. వయసు పైబడే కొద్దీ... ముగింపు లేని డైలీ సీరియల్లా భారంగా సాగుతుంది. జీవిత చరమాంకం కూడా సూపర్హి హిట్ కావాలంటే.. రిటైర్మెంట్ ప్లాన్ పక్కాగా ఉండాలి. మీ శేష జీవితాన్ని విశేషంగా గడపాలంటే.. ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టడం కాదు! నెలకు లక్ష రూపా యల దాకా పెన్షన్ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే... గడ్డాల నాడు బిడ్డలు కూడా మీ మాటలు వింటారు. ఇప్పుడంటే లక్ష వస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ముప్పయ్ ఉంటే మాత్రం ఈ లెక్క సరిపోదు. మీకు అరవై వచ్చేనాటికి నెలనెలా కచ్చితంగా 2 లక్షలు మీ ఖాతాలో పడితేగానీ.. ప్రశాంత జీవితం గడిపే ఆస్కారం ఉండదు.

పైసా మే పరమాత్మ..

ఈ మాటలు కాస్త కఠినంగా అనిపించినా, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటే తెలివైన వారు అనిపించుకుంటారు. మానవ సంబంధాలన్నీ ఆర్థికం చుట్టూనే తిరుగుతున్నాయి. నెలకు ఎలాంటి ఆదాయం లేకుండా, కేవలం ఆస్తులు మూటగట్టుకొని ముసలితనంలోకి ప్రవే శిస్తే ఆశించిన ఆదరణ దక్కకపోవచ్చు. ముసల్ది, ముసలోడు ఎప్పుడు పోతాడో అని గోతికాడ నక్కల్లాగా ఎదురుచూస్తుంటారు వారసులు. అదే మీరు కామధేనువు అయితే! అంటే, మీరు బతికి ఉన్నంత కాలం నెలనెలా పెన్షన్ వస్తుందంటే మాత్రం మీ ప్రాణం అదే వారసులకు

అపురూపంగా మారుతుంది. ఆస్తుల కోసం హత్యలు చేసే కిరాతకులు కూడా.. పెన్షన్ సొమ్ము . కోసం తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుంటారు. పొద్దునే కొడుకు గుడ్ మార్నింగ్ చెబుతాడు. 'తాతయ్యా, బామ్మా బై!' అంటూ మనవలు బడికి దారితీస్తారు. 'ఏం టిఫిన్ చేయమంటారు . అత్తయ్యా' అని కోడలు మీ సలహా కోరుతుంది. 'పైసా మే పరమాత్మా హై' అంటే ఇదే!

ఆయుష్షు పెంచుతారు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. వాళ్ల చేతులు కాలినా మీ దీపాన్ని ఆరనివ్వరన్నమాట. ఒంట్లో నలతగా ఉందంటే చాలు.. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తారు. బైపాస్ సర్జీరీ చేయిస్తారు. ఇద్దరు కొడుకులు ఉంటే స్టంట్లు నేను వేయిస్తానంటే నేను వేయిస్తానంటూ స్టంట్లు చేస్తారు. ఓ లక్ష ఆసుపత్రి బిల్లు కట్టి మీ ఆయుష్షును పెంచుతే మరో రెండేళ్లు పెద్ద ప్రాణం ఉంటుందని ఓ వారి నమ్మకం. ఆ రెండేండ్లూ నెలకు లక్ష వస్తుందనే ఆశ. ప్రస్తుతం మన దేశంలో పెన్షన్ అందుకుంటున్న వారిలో వందేండ్ల పైబడినవారు ఆరువేల మంది వరకు ఉన్నారు. వీళ్లకు ప్రతినెలా వస్తున్న పెన్షన్ లక్షకు పైమాటే! ఆ వారసులు వీళ్లను ఎంత ఆరోగ్యంగా చూసుకుం టున్నారో అర్థం చేసుకోవచ్చు. అందరూ అలా ఉంటారని కాదు! ఈ రోజుల్లోనే చాలామంది కాసులకు విలువ ఇచ్చేవాళ్లే కనిపిస్తున్నారు. మరో పాతికేండ్లకు ఇంటికో ఈ తరహా వ్యక్తి ఉండొచ్చు. వారి దురాశ పెన్షనర్క శ్రీరామ రక్ష! స్పష్టంగా చెప్పాలంటే... రిటైర్ అయ్యాక మీరు బంగారు గుడ్డు పెట్టే బాతులా ఉండాలన్నమాట. అంటే మీరున్నంత కాలం ఆదాయం రావాలి. మీరు పోతేనే ఆదాయం వచ్చేపనైతే.. సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. కూడబెట్టిన సొమ్మును ఒక్కసారిగా తీసుకోకుండా.. నెలవారీగా వచ్చే ఏర్పాటు చేస్తే.. మీ లెవల్ మరోలా ఉంటుంది.


కొత్త పెన్షన్ విధానంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత కచ్చితమైన పెన్షన్ వచ్చే అవ కాశం లేకుండా పోయింది. ప్రైవేట్ ఉద్యోగుల సంగతి సరే సరి. ఏ ఉద్యోగం చేస్తున్నా అరవై దాటాక నెలకు కనీసం  లక్ష వచ్చేలా పెన్షన్ ప్లాన్ చేసుకోవడం చాలా అవ సరం. మీరు, మీ తదనంతరం మీ జీవిత భాగస్వామికి కూడా అంతే మొత్తం పెన్షన్ వచ్చేలా ప్లాన్ తీసుకోవాలి. నలభై ఏండ్ల వ్యక్తి... నెలకు కనీసం 20 వేల చొప్పున ఎస్ఐపీ కడితే.. రిటైర్మెంట్ నాటికి అది దాదాపు 2 కోట్లకు చేరుతుంది. అప్పుడు ఆ మొత్తాన్ని ఇతర పెట్టుబడి సాధనాల్లో మేలైన దాన్ని ఎంచుకొని ఇన్వెస్ట్ చేసి ప్రతినెలా మీకు గ్యారెంటీగా పెన్షన్ వచ్చేలా చూసుకోవాలి.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024