64. లైఫ్ లో జంకొద్దు.. డింక్ లో దూకొద్దు..

64. లైఫ్  లో  జంకొద్దు.. డింక్ లో దూకొద్దు..

పెండ్లయిన మూడోనెల కోడలమ్మ మామిడి కాయ కోరాల్సిందే! ఇది పాత రోజుల సంగతి. దాంపత్య జీవితాన్ని ఓ రెండేండ్లు ఎంజాయ్ చేసి పిల్లలను ప్లాన్ చేద్దాం... ఇది నిన్నటి ఈక్వేషన్. అసలు పిల్లలే వద్దనుకోవడం ఇవాల్టి ఫ్యాషన్. రెండు రెండ్ల నాలుగు చేతులా సంపాదిస్తున్నా... పిల్లలు వద్దనుకుం టున్నారు కొందరు. 'డ్యూయెల్ ఇన్కం నో కిడ్స్' (డింక్) మాయలో పడిపోతున్నారు.

డింక్ లైఫ్ స్టైల్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో చాలా ఏండ్ల క్రితం నుంచే ఉంది. ఇప్పుడు మన దగ్గర యువత 'డింక్'పై మోజుపడుతున్నారు. మన దేశంలో కొత్తజంటల్లో ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నవారి సంఖ్య 30 శాతానికి చేరువగా ఉందని 'గిట్నెక్స్' డేటా ఉవాచ! ఈ రోజుల్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం ఆర్థికంగా మోయలేని భారమని చాలామంది యువజంటల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే పిల్లల్ని కనే ముందు లెక్కలు వేసుకుంటు న్నారు. పుట్టిన పిల్లలకు 18 ఏండ్లు నిండేసరికి సగటున  కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా ఖర్చవుతున్నదని ఓ అంచనా. ఒక బిడ్డను సెటిల్ చేయాలంటే జీవితాన్ని పణంగా పెట్టాల్సిందేనని భావిస్తున్నారు.

ఖర్చులకు వెరసి.

నార్మల్ డెలివరీ జరిగితే ఓకే! కానీ, సిజేరియన్ అయినా, నెలలు నిండకుండానే కాన్పు వచ్చినా బిల్లు తడిసి మోపెడవుతున్నది. తల్లికి ప్రసూతి సెలవులు అయిపోగానే పాపను డే కేర్ సెంటర్లో చేర్చేందుకు మళ్లీ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఆ తర్వాత స్కూల్లో వేయడం అనేదిలక్షల్లో చదివించు కోవడమే. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో చేర్పించాలంటే 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చుపెట్టాలి. ఇలా లక్షలతో కూడుకున్న చదు వును పిల్లలకు అందించాలంటే ఈ రోజుల్లో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎంత ఉన్నతో ద్యోగం చేస్తున్నా ప్రైవేట్ కొలువు రాత్రికి రాత్రి ఊడిపోవచ్చన్న బెంగ వారిని మరింత కంగారు పెడుతున్నది. ఇలాంటి ఆలోచనల్లో నుంచే పిల్లలు వద్దనుకొని డింక్ లైఫ్సల్కు మారిపోతు న్నారు కొందరు.

అమ్మకు అదనం.

'డింగ్' పై మనసు పారేసుకోవడానికి అమ్మాయిలు చెప్తున్న కారణాలు ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. మన దేశంలో పేరెంటింగ్ అనేది అమ్మ బాధ్యతే అని చాలామంది భావన. ఈ తరుణంలో తల్లిగా ఇంటిని, పిల్లలను బ్యాలెన్స్ చేయాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఊసే లేక పోవడంతో.. పెద్దల అండాదండా కరువైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులే పిల్లలను చూసుకో వాల్సి వస్తున్నది. ఇద్దరిలో అమ్మ నెత్తిన అదనపు బాధ్యతలు పడుతున్నాయి. తన ఉద్యోగాన్ని వదులుకొని పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి ఈ తరం ఆడవాళ్లు సిద్ధంగా ఉండటం  లేదు అనేక యూనివర్సిటీ చేసిన ఒక సర్వే ప్రకారం దేశంలో 50 శాతం మహిళలు పిల్లల పెంపకం కోసం 30 ఏండ్లకే ఉద్యోగాలను వదిలేసుకుంటున్నారట. ఒకవేళ తిరిగి ఉద్యోగంలో చేరితే కనీసం నాలుగు నెలలైనా తిరక్కుండానే రిజైన్ చేస్తున్న మహిళా ఉద్యోగుల సంఖ్య 48 శాతంగా ఉన్నదట.

ఆ పాపం మాకెందుకు?

పిల్లల్ని కని పెంచే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, వ్యక్తిగతంగా లైఫ్ మిస్ అవుతామన్న భ్రమల్లో కొందరు ఉంటున్నారు. అందుకే ఒత్తిళ్లతో కూడిన జీవితం తమకు వద్దని డింక్ లైఫ్ స్టైల్ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్ వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. డింక్ కపుల్స్ పిల్లలు వద్దనుకోవడానికి మరో పెద్ద కారణం.. జనాభా పెరిగిపోవటం, పర్యావరణానికి ముప్పేనట. ఆధునిక ప్రపంచంలో ఆహార కొరత వెన్నాడుతున్నది. నీళ్ల కొరత ఉండనే ఉంది. స్వచ్ఛమైన గాలి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కల్తీ లేని ఆహారం కాసులు పోసి కొందామన్నా దొరకని దుస్థితి. ఇలాంటి సమస్యల మధ్యకు మళ్లీ మేం పిల్లల్ని కని తీసుకురావటం కన్నా పాప కార్యం లేదని యువ జంటలు ఆలోచిస్తున్నాయి. అంతేకాదు, తాము పిల్లల్ని వద్దనుకోగా.. 'పిల్లల్ని కనకండి' అని ప్రచారం చేస్తున్నారు. వీళ్లను యాంటీ నేటలిస్టులుగా పిలుస్తుంటారు. వీళ్లు చెప్పే మాట ఏంటంటే.. 'త ల్లిదండ్రులు కావాలనుకుంటే మీరే పిల్లల్ని కనాల్సిన పనిలేదు. దేశంలో అనాథ పిల్లలకేం కొరత లేదు. వాళ్లను దత్తత తీసుకొని వారికి జీవితం ఇవ్వండి' అని చెబుతున్నారు. కానీ, యువశక్తే భారత్కు బలం. ఆ యువతే పిల్లల్ని కనడానికి ఇష్టపడని పరిస్థితి. ఇదే ట్రెండ్ కొన సాగితే మరో 30 ఏండ్లనాటికి దేశ జనాభా పూర్తిగా తగ్గిపోతుంది. వృద్ధ భారతంతో అభివృద్ధి కుంటుపడుతుంది. డింక్ ఉచ్చులో చిక్కుకోకుండా ఉన్నంతలో ఉన్నతంగా బతకడం అల వాటు చేసుకుంటే పిల్లలను కనడం, పోషించడం పెద్ద కష్టమేం కాదు!

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024