56.స్వతంత్రంగా ఉందాం!
డబ్బు ఉంటేనే డాబు! ఆర్థికంగా చతికిల పడితే.. జీవితం దుర్భరమే! ఎంత పోయే మనస్తత్వం ఉన్నా.. నెలకు ఇంతని ఆదాయం లేకుంటే మాటకు విలువ ఉండదు. లోకం లోకువ కడుతుంది. వాళ్లంతా చౌకబారు మనుషులు అనుకున్నా... మనకు మనం చెప్పుకొందామంటే సమాధానం దొరకదు. ఈ పరిస్థితి ఎదురవ్వొద్దన్నా, ఎదురులేకుండా నిలబడాలన్నా.. ఆర్థికంగా విజయం సాధించడమే మార్గం..
సుజాతమ్మకు డెబ్బై ఏండ్లు. విమానంలో ఢిల్లీకి వెళ్తున్నది. సహ ప్రయాణికు రాలు ఆమెతో మాట కలిపింది. ఢిల్లీలో ఎవరుంటారని అడిగింది. మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది సుజాతమ్మ. 'హైదరాబాద్ లో ఎవరుం టారు?' అని ప్రశ్నించిదామె. 'నేనొక్కదాన్నే!' అందీమె. మరి మీ చిన్నబ్బాయ్ అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసింది. 'చిన్నోడు చెన్నైలో ఉంటాడు' అన్నది సుజా తమ్మ. 'ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడం ఏంటి?' అని ఉండబ ట్టలేక అడిగేసింది! సుజాతమ్మ చిన్నగా నవ్వి.. 'అమ్మాయ్! తొందరపడి నా బిడ్డల్ని నిందించకు. నేనే స్వతంత్రంగా ఉండాలనుకున్నా. వాళ్లను చూడాలనిపిం చినప్పుడు ఇలా వెళ్లొస్తుంటా' అని బదులిచ్చింది.
''ఈ వయసులో...' అని తోటి ప్రయాణికురాలు ప్రశ్న అడిగేంతలోనే.. 'నా ఒంట్లో శక్తి ఉంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. పిల్లల దగ్గరుంటే.. వాళ్లకు తగ్గట్టు నా జీవనశైలి మార్చుకోవాలి. అలా చేయలేకపోతే.. నన్ను వాళ్లు భారంగా భావించే ప్రమాదమూ ఉంది. అందుకే ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్లూ.. స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను' అని చర్చకు ముగింపు పలి కింది. సుజాతమ్మది మొండితనం కాదు! ఆత్మవిశ్వాసం!! ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయింది. నెలకు అరవై వేల పెన్షన్ వస్తుంది. భర్త పోయాక ఒక్కతే ఉండా లనినిర్ణయించుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణం. స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన అన్ని అర్హతల్లో ముఖ్యమైనది ఆర్థిక స్వాతంత్య్రం. ఇరవైలో చేతిలో పైసా లేకపోయినా ఇబ్బం దిలేదు. కండలు కరగదీసే దిల్ ఉంటే చాలు. నలభైలో ఆదాయం కాస్త అటూ ఇటూ అయినా పర్వాలేదు. రెండు ఇంక్రిమెంట్లు, ఒక్క బోనస్ వస్తే అన్నీ సర్దుకుంటాయన్న నమ్మకం ఉంటుంది. అరవైకి చేరువయ్యాక కూడా ఆర్థిక విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి అంటే చింతించాల్సిందే! ఈ పరిస్థితి రావొద్దంటే.. ముప్పయ్లోకి రాగానే జాగ్రత్తపడాలి. ప్రణాళికా బంగా భవిష్యత్ రచన చేస్తే.. రిటైర్ అయ్యాక సుజాతమ్మలా ధీమాగా జీవనం సాగించొచ్చు.
నెలవారీ ఆదాయం.
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా.. పెన్షన్ ఇచ్చే రోజులు కావివి. కాబట్టి, ముప్పయ్ ఏండ్ల తర్వాత మీ అవసరానికి తగ్గట్టుగా ఆదాయం సమకూరే పాలసీలను ఎంచుకోవాలి. గ్యారంటీడ్ మనీ స్కీమ్, ఎస్ఐపీ, ఎడబ్ల్యూపీ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇలా దేన్ని ఎంచుకున్నా.. మీరు రిటైర్ అయినప్పట్నుంచి కాలం చేసేవరకు నెలకు స్థిర ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఎస్ఐపీలో నెలకు 15వేలు చొప్పున 20 ఏండ్లపాటు కట్టారే అనుకోండి. 12 శాతం రిటర్న్ అనుకున్నా... ఇరవై ఏండ్ల తర్వాత మీ సంపద ఆచ్చంగా 1.50 కోట్లకు పడగలెత్తు తుంది. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా.. నెలకు 80 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది.
రాబడి ఇచ్చే ఆస్తి.
నగర శివారులో 200 గజాల ప్లాటు తీసుకునే బదులు, నగరంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే నెలకు 20వేల వరకు అద్దె వస్తుంది. కమర్షియల్ స్పేస్ తీసుకుంటే.. తరతరా లకూ నెలవారీ ఆదాయం సమకూరుతుంది. రిటైర్ అయ్యేనాటికి ఒకే ఇల్లు ఉంది. పెన్షన్ రాదు. అంతమాత్రాన కొడుకుల దగ్గర దేహీ అనాల్సిన అవసరం లేదు. పైగా ఇన్నాళ్లూ పెంచి పోషించాం కాబట్టి మమ్మల్ని చూడాల్సిన బాధ్యత మీదే అని డిమాండ్ చేయొద్దు. అదే ఇంటిని బ్యాంకులో రివర్స్ మార్ట్ గేజ్ పెడితే నెలకు పాతికవేల వరకు ఆదాయం సమకూరు తుంది. మీ తదనంతరం.. ఆ ఇంటిని కావాలనుకుంటే మీ వారసులు విడిపించుకుంటారు!
సాఫీగా సాగిపోవాలంటే..
అరవైలోకి అడుగుపెట్టగానే.. అన్నీ ఆపేయాలి అనుకుంటే జీవితం ముగించినట్టే! రిటైర్మెంట్ అంటే.. పని చేయకపోవడం కాదు! ఇష్టమైన పని చేయడం. నచ్చిన వ్యాపకం చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలంటే.. ముప్పయ్ నుంచే జాగ్రత్తపడాలి. ఆహార నియ మాలు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తేనే.. శేష జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒంట్లో శక్తి ఉన్న ప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. రోగాలతో కుస్తీ పట్టడంతోనే ముసలితనమంతా మూలిగిపో తుంది. అందుకే సూత్రాలతో పాటు ఆరోగ్యమంత్రాన్ని పఠిస్తూ వృద్ధాప్యంలోనూ స్వతంత్రంగా బతికేద్దాం!