testing.123
fff
ఆరోగ్య ప్రాప్తిరస్తు. సగటు ఉద్యోగి అల్ప సంతోషి, చిన్న హైకొస్తే చాలు సంబరపడతాడు. కొద్దిపాటి ప్రశంసకే ఉబ్బితబ్బిబ్బవు తాడు. కుటుంబంతో నెలకో సినిమా, ఏడాదికో తీర్థయాత్ర. చాలీచాలని సంపాదనలోనే అందీ అందని సంతోషాలెన్నో వెతుక్కుంటాడు. కానీ, చిన్న ఆరోగ్య సమస్య అతని జీవితాన్నే మార్చేస్తుంది. పట్టాలు తప్పిన జీవిత రైలును మళ్లీ ట్రాక్ కి తేవడానికి ఏండ్లు పట్టొచ్చు. మనుషులు ఆచరించే ఆర్థిక విధానాలే వారి కుటుంబ స్థితిగతులను నిర్దేశి స్తాయి. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నం తలో ఉన్నతంగా బతకాలని ఆశిస్తుంటారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి రూపాయి, రూపాయి కూడబెడుతుంటారు. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనే దురాశతో అధిక వడ్డీల ఉచ్చులో చిక్కుకునే వాళ్లూ ఎందరో ఉంటారు! అయితే, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తనకు, తనను నమ్ముకున్న కుటుంబానికి రక్షణ కల్పించిన తర్వాతే.. ఇతర పెట్టు బడుల గురించి ఆలోచించాలి. ఆరోగ్య బీమాతో ధీమా. ప్రతి కుటుంబానికి కావాల్సిన కనీస భద్రత ఆరోగ్య బీమా. ప్రతి ఖర్చునూ మనం నియంత్రిం చవచ్చు. సంపాదనకు తగ్గట్టుగా అద్దె ఎంత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక శక్తి మేరకు పిల్లలను ఏ బడికి పంపాలో తేల్చుకోవచ్చు. మన జేబు బరువును బట్టి రైలు ప్రయాణంలో ఏ తరగతి టికెట్ కొనుక్కోవాలో కూడా మనమే నిర్ధారించుకోవచ్చు. మన చేతుల్లో లేనిది, మనకు అందుబాటులో ఉండనివి దవాఖాన ఖర్చులు. ఆరోగ్యపరమైన సమస్యలు రానంత వరకు ఆరోగ్య బీమా ప్రాధాన్యం తెలియదు. కానీ, అనారోగ్యం ఏర్పడే నాటికి బీమా లేక పోతే, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులు అవ్వడానికి ఎంతో కాలం పట్టదు. వైద్యం ------ కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడటానికి ఒక్కోసారి పదేండ్ల సమయమూ పట్టొచ్చు. విలువైన కాలమంతా రుణాలు తీర్చడానికి రణం చేయాల్సి వస్తుంది. మంచి తాయని కొందరు భావిస్తుంటారు. కానీ, ప్రమాదం రూపంలోనూ సమస్యలు చుట్టుముట్ట ఆహార విధానం, సరైన జీవనశైలి పాటిస్తున్న తమకు అనారోగ్య సమస్యలు ఎందుకు తలెత్తు వచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా మన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే.. 'ఏకైక మార్గం ఆరోగ్య బీమా. తప్పుడు సమాచారం ఇవ్వొద్దు బీమా గురించి సమాచారం తెలుసుకోవడంతోపాటు, పాలసీదారు సరైన సమాచారం __ ఇవ్వాలి. బీమా ప్రీమియం పెరుగుతుందని పాత రుగ్మతలను దాచి పెడితే, క్లెయిమ్ రిజెక్ట్ అవ్వొచ్చు! ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలూ దాపరికం లేకుండా చెప్పాలి. మధుమేహం, రక్తపోటు ఇలా అప్పటికే ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి తెలియ జేయాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని బీమా ప్రీమియం నిర్ధారిస్తారు. చిన్నపాటి వ్యత్యాసం కోసం ఉన్న రోగాలను దాచిపెడితే, అవసరానికి పాలసీ ఉన్నా ఉపయోగ లేకుండా పోతుంది. మధ్యలో ఆపొద్దు ఆరోగ్య బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోగానే చాలామందికి ఎలాగైనా పాలసీ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ, పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత ప్రీమియం చెల్లించేటప్పుడు ఉండదు. 'గడిచిన రెండేండ్లుగా ఏ ఆరోగ్య సమస్య తలెత్తలేదు కదా!' అనుకొని మూడో సంవత్సరం ప్రీమియం చెల్లించడానికి వెనుకాడుతారు. కానీ, అదే ఏడాది ఏదైనా సమస్య తలెత్తితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ప్రతి కుటుంబానికి ప్రాథమిక రక్షణ ఆరోగ్య బీమా. పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా, మంచి చదువుతోపాటు ఆరోగ్య రక్షణ కల్పించడం తల్లిదండ్రుల విధి. ఎన్ని లక్షలు తీసుకోవాలి? ఆరోగ్య బీమా తీసుకుంటే సరిపోదు, ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ముఖ్యం. ప్రీమియం భారీగా ఉండొచ్చని చాలామంది తక్కువ మొత్తం కవరయ్యే బీమా చేస్తుంటారు. ఓ రెండు లక్షలు వస్తే చాలు అనుకుంటారు. కానీ, వైద్యానికయ్యే ఖర్చులు భారీగా పెరుగుతు న్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని నలుగురు సభ్యులున్న కుటుంబానికి కనీసం రూ.25 లక్షల నుంచి రూ. కోటి కవరయ్యే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. దీనికయ్యే ప్రీమియమ్ రూ.23 వేల రూ.60 వేల వరకు ఉంటుంది. మన భవిష్యత్ అవసరాలకు అంటే 30 సంవత్సరాల తర్వాత అయ్యే మెడికల్ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయల పాలసీ తీసుకోవడం ఉత్తమ. ---------------- ఏ బీమా ఆరోగ్యకరం? ఆనందమైన జీవితంలో అగాధం సృష్టించడానికి చిన్నపాటి వ్యాధి చాలు, ఆరోగ్య బీమా ఉందని భీమాగా ఉన్నారా? అయితే, అగ్గువ ప్రీమియంలో వస్తుందని బ్యాంకులు ఆఫర్ చేసే గ్రూప్ పాలసీ తీసు కుంటే.. పొరబడినట్టే! కష్టం చెప్పిరా దన్నట్టే.. కొన్ని బ్యాంకుల బీమాలు అకస్మాత్తుగా అక్కరకు రాకుండా పోయే ప్రమాదమూ ఉంది. ఇంతకీ బ్యాంకు ద్వారా తీసుకున్న గ్రూప్ ఇన్సూరెన్స్ మంచిదేనా? బీమా రంగంలో రోజుకో మార్పు చోటుచేసుకుంటున్నది. కొత్తకొత్త సంస్థలు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సైతం మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొస్తు న్నాయి. తక్కువ ప్రీమియంతో ఊరిస్తుండటంతో బీమా సంస్థలను కాదని చాలా మంది డైరెక్ట్ గా బ్యాంకుల ద్వారా పాలసీని తీసుకుంటున్నారు. బ్యాంకులు ఆఫర్ చేసే పాలసీలకు తక్కువ ప్రీమియం ఉండటానికి చాలా కారణాలున్నాయి. వేలాది మంది వినియోగదారులతో ఒక బృందంగా బ్యాంకులు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తున్నాయి. ఇందుకోసం బ్యాంకులు బీమా సంస్థలనే ఆశ్రయిస్తాయి. సదరు బీమా సంస్థలు భారీ స్థాయిలో వినియోగదారులు లభించడంతో తక్కువ ప్రీమియంకే పాలసీ ఇవ్వ డానికి అంగీకరిస్తాయి. అయితే, ఒకటి, రెండేండ్లలో భారీగా క్లెయిమ్స్ ఇవ్వాల్సి వస్తే.. పాల సీని కొనసాగించకుండా నిలుపుదల చేయవచ్చు. ఈ క్రమంలో వినియోగదారుల పరిస్థితి అగ మ్యగోచరంగా తయారవుతుంది. పొడిగించలేం.. బ్యాంకు పాలసీల్లో ఇన్సూరెన్దారుల దయాదాక్షిణ్యాలపై మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సురేంద్రకు 40 ఏండ్లు. అతని తల్లికి 60 ఏండ్లు, తక్కువలో వస్తుంది కదా అని తల్లిపేరిట బ్యాంకు ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. రెండేండ్ల --- తర్వాత కిడ్నీ జబ్బు తలెత్తింది. డయాలసిస్ మొదలైంది. ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ ఖర్చులు సురేంద్ర నెత్తిన పడలేదు. మరో రెండేండ్లకు పాలసీ రెన్యువల్ చేయలేమని బ్యాంక్ నుంచి సందేశం వచ్చింది. అప్పటికి అనారోగ్యంతో ఉన్న సురేంద్ర తల్లికి బయట బీమా సంస్థలు కూడా పాలు పాలసీ ఇవ్వలేమని తేల్చి చెప్పేది. ఐదేళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న ప్పుడే బీమా సంస్థలకు చెందిన డైరెక్ట్ పాలసీ తీసుకొని ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు! పోర్టబిలిటీ డౌటే! సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పాలసీదారుడి హెల్త్ డైరీ కీలక భూమిక పోషి స్తుంది. ఒక బీమా సంస్థ తరపున పాలసీ తీసుకున్నారు అనుకుందాం! వారి సేవలు నచ్చని పక్షంలో పాలసీ పోర్టబిలిటీకి అవకాశం ఉంటుంది అంటే కొత్త పాలసీ తీసుకున్నట్లుగా కాకుండా దీనికి సీనియారిటీ వర్తిస్తుంది. దీంట్లో సీనియారిటీతో ఏం పని అనుకోకండి?ఉదాహరణకు 40 ఏండ్ల వ్యక్తి మొదటిసారి హెల్త్ ఇన్సురెన్స్ తీసుకున్నాడు! నాలుగేండ్ల పాటు సాగించాడు. ఐదో ఏడాది ఇప్పుడున్న సంస్థ కాదని మరో సంస్థకు చెందిన పాలసీ తీసుకోవా లని భావించాడు. ఇలాంటి సందర్భంలో గతంలో ఎలాంటి క్లెయిమ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ పోర్టబిలిటీకి అంగీకరిస్తాయి. పాలసీ అందజేసిన తర్వాతి రోజు నుంచే ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మళ్లీ కొత్తగా పాలసీ తీసుకోవాల్సి వస్తే మొదటి నెల రోజులు ప్రమాదం జరిగితే తప్ప క్లెయిమ్ చేసుకునే వీలు ఉండదు. పైగా మొదటి రెండేండ్లూ కొన్ని శస్త్ర చికిత్సలకూ, కొన్ని రుగ్మతలకు క్లెయిమ్ వర్తించదు. ఈ మేరకు మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సి వస్తే వినియోగదారుడు రిస్క్లో పడ్డట్టే! పోర్టబిలిటీ ఉంటే.. ఈ సమస్య తలెత్తదు!! బ్యాంకు ద్వారా తీసుకున్నప్పుడు గ్రూప్ పాలసీలో ఈ పోర్టబిలిటీ అవకాశాలు తక్కువ. కొన్ని బ్యాంకులు పోర్టబిలిటీ అవకాశం కల్పిస్తామని అంటున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలవుతున్నట్లు కనిపించడం లేదు . వీట న్నిటినీ పరిశీలించిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో బ్యాంకులు, నా బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల పాలసీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విశ్వనీయత ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఐదేండ్లు పాలసీ కొనసాగిన తర్వాత ఆరో ఏడాది నిలు పుదల చేస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పాలసీ తీసు కోవాల్సి వస్తుంది. ఈ ఐదేండ్లలో ఆ వ్యక్తి ఆరోగ్యం దెబ్బ తింటే.. కొత్త పాలసీ దొరకడం కష్టంగా మారవచ్చు, అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోయినా వయసు పెర గడం వల్ల ప్రీమియం భారం కావొచ్చు. అందుకే, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నేరుగా బీమా సంస్థలను ఏజెంట్ ద్వారా ఆశ్రయించడమే తెలివైన పని. --- ఆ ఒక్కటీ చాలు! అలవాటు చేసే చిన్న పొరపాటు జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆరోగ్య బీమా విషయంలో సగటు ఉద్యోగి ప్రదర్శించే నిర్లిప్త ధోరణి.. అతని జీవితాన్ని ఉన్నపళంగా అగాథంలోకి నెట్టేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? ఆఫీస్ వాళ్లు ఐదు లక్షల రూపాయల కవరేజీ ఇచ్చాక మరో బీమా దేనికి? అని తర్కిస్తే... చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది. కల్తీలతో పల్టీలు కొడుతున్న నేటి మనిషి ఆరోగ్యం మేడిపండు చందమే! తాగు తున్న పాలు తింటున్న ఆహారము అన్ని రసాయన అవసాస్లతో అందుతున్నాయి న్నాయి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. ఊహించని రోగాలు మనిషిని పలకరిస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఆరోగ్యం బాగున్నా.. ఉరుకుల పరుగుల జీవి తాల్లో ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయని మర్చిపోవద్దు. ఇలాంటి విప త్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడే శక్తినిచ్చే ఏకైక అస్త్రం హెల్త్ ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ప్రధానం. మూడింతల భారం. నాలుగైదు లక్షల రూపాయలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని గుండెల మీద చేయి వేసుకొని తృప్తిగా పడుకునే రోజులను దాటొచ్చేశాం. ఒకప్పుడు మోకాలు చిప్ప మార్పిడికి రూ.70 వేల వరకు అయ్యేది. ఇప్పుడది రూ.3 లక్షలకు పెరిగింది. ఇలా పదేండ్లకు ఒకసారి దవాఖాన ఖర్చులు మూడు, నాలుగు రెట్లు పెరుగుతున్నాయి. కంపెనీ వాళ్లు ఇచ్చే రూ.5 లక్షల ఇన్సు రెన్స్ చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు సరిపోతుందేమో! కానీ, తీవ్ర జబ్బులు తలెత్తినప్పుడు ఈ మొత్తం ఏ మూలకూ రాదు. పైగా ఉద్యోగంలో ఉన్నంత వరకే ఈ పాలసీలు వర్తిస్తాయి. ఉద్యోగం చేసి యాభయ్యో పడిలో జాబ్ మానేస్తే... అప్పుడు పరిస్థితి ఏంటి? --- నో గ్యారెంటీ.. ఉద్యోగంలో ఉన్నప్పుడే వ్యక్తిగతంగా కుటుంబసభ్యుల పేరిట ఆరోగ్య బీమా తీసుకోవడం అత్యావశ్యకం. 'కీడెంచి మేలెంచాలి' అన్న సూత్రం ఆరోగ్యం విషయంలో ఆలోచించడానికి ఉద్యోగంలో ఉన్నప్పుడే వ్యక్తిగతంగా కుటుంబసభ్యుల పేరిట ఆరోగ్య బీమా తీసుకోవడం కట్టలేని వ్యక్తి.. ఆస్పత్రి పాలైనప్పుడు బిల్లు ఎలా కడతాడో మాత్రం ఆలోచించడు. పైగా ఈ మనిషి అంగీకరించడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ రూ. యాభై లక్షలు, రూ. కోటి బీమా తీసు కోమని సూచించగానే, 'అంత ప్రీమియం కట్టలేను' అనేస్తాడు. అయితే, ప్రీమియం మొత్తం రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ లేనంత కాలం మీ ఆస్తులకూ, బంగారానికీ, మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని గుర్తుంచుకోండి. అంతులేని విశ్వాసం. ఆరోగ్యబీమా ఉంటే ఎంతటి భరోసా ఉంటుందో మల్లికార్జున రావు కథ చదివితే తెలుస్తుంది. ఆయన ఓ కార్పొరేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు బాగా చదువుకుంటున్నారు. ఏ చింతా లేకుండా భార్యాపిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తు న్నాడు. తను పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ వెసులుబాటు ఉన్నప్పటికీ రెండేండ కిందట వ్యక్తిగత రూ.50 లక్షల విలువైన ఆరోగ్య బీమా తీసుకున్నాడు. మరుసటి ఏడాది ఒంట్లో నలతగా ఉంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేలింది. ఇమ్యూనో థెరపీకి సిద్ధమయ్యాడు. ఒక్కో సిట్టింగ్కు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు అయింది. ఇప్పటివరకు దాదాపు రూ.35 లక్షలు వైద్యానికి వెచ్చించాడు. ముందుచూ పుతో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఆయన ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యేది. వైద్యానికి అయిన ప్రతి రూపాయి క్లెయిమ్ చేయడంతో.. ఆయన సంపద నయా పైసా కరిగిపోలేదు. ఆర్థికంగా ఏ ముప్పూ లేదన్న విశ్వాసం ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఎవరన్నది కాదు.. హెల్త్ ఇన్సూరెన్స్... ఏ సంస్థ నుంచి తీసుకున్నామన్నది ప్రాధాన్యం కాదు. ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ముఖ్యం. ఈ రోజుల్లో దాదాపు అన్ని బీమా సంస్థలు మెరుగైన క్లెయిమ్ రికార్డును కలిగి ఉన్నాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. రూ.10 లక్షల పాలసీకి, రూ.కోటి విలువైన పాలసీకి ప్రీమియంలో వ్యత్యాసం ఏడాదికి రూ.15వేల వరకు మాత్రమే ఉంటుంది. ఆ మొత్తానికే జంకితే.. జరగరానిది జరిగినప్పుడు మీరే కాదు.. మీ కుటుంబమూ రోడ్డునపడే ప్రమాదం ఉంది. ఆర్థిక మాంద్యం ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ తరుణంలో... ద గ్యారెంటీ లేదు. ఒక కొలువు పోయి.. మరో కొలువు చూసుకునేలోప వొద్దంటే.. రూ. కోటికి తక్కువ కాకుండా మీకు, మీ కుటుంబానికి వ్యక్తిగత ఆరోగ్య బీమా ! అనారోగ్యం తలెత్తితే, ప్రమాదం జరిగితే... పరిస్థితి ఏంటి? ఇలాంటి దుస్థితి మీకు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం! -- మనం దూరమైతే?! దివాకరం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. నెల జీతం రూ.60వేలు. భార్య చిరుద్యోగి. ఆమె జీతం నెలకు రూ.20వేలు. పిల్లల భవిష్యత్ కోసం దివాకరం ఓ పాలసీ తీసుకు న్నాడు. అయితే, ఓ ప్రమాదంలో దివాకరం కన్నుమూశాడు. ఓ నెల రోజుల్లో బీమా మొత్తం నాలుగు లక్షలు అతని భార్యకు చేరింది. అది దివాకరం ఏడాది సంపాదన కన్నా తక్కువ! తర్వాత ఆ కుటుంబం బతికేది ఎలా? ఈ ప్రశ్నకు సమాధానమే టర్మ్ ఇన్సూరెన్స్. 'కీడెంచి మేలెంచు' అంటారు పెద్దలు. ఈ సూత్రం అంతటా వర్తించకపోవచ్చు కానీ, జీవిత బీమా విష యంలో నూటికి నూరుపాళ్లూ నప్పుతుంది. 'మనం దూరమైతే?!' సగటు మని షిని ఈ ప్రశ్న నిరంతరం తొలుస్తూనే ఉంటుంది. కుటుంబం పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఉద్యోగార్జితంపైనే ఆధారపడిన వ్యక్తికి అందుబాటులో ఉన్న ఏకైక సమాధానం 'జీవిత బీమా'! అదే దివాకరం రూ.50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకొని ఉంటే.. ఆ కుటుంబానికి పాతి కేండ్ల రక్షణ కల్పించి ఉండేవాడు. చాలామంది జీవిత బీమా అనగానే.. 'ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?' అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపిం చుకోదు. అది ఒకరకంగా పెట్టుబడే అవుతుంది. ఆరోగ్య బీమా తర్వాత మనిషికి అత్యంత | ముఖ్యమైనది జీవిత బీమా, ఒక పాలసీ తీసుకొని, ఓ ఇరవై ఏండ్లు ప్రీమియమ్లు కట్టి.. మరో ఐదేండ్లకు మెచ్యూరిటీ మొత్తం చేతిలో పడగానే ఏదో సాధించిన అనుభూతి కలుగు తుంది. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి అనుభూతికి లోనవడం సబబుగానే ఉంటుంది. అందుకు భిన్నంగా ఊహించని కష్టం ఎదురైనప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏమిటి? అనిపిస్తుంది. --- కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జరగరానిది జరిగితే, రెండు రకాల నష్టాలు కలుగుతాయి. మొదటిది అన్నీనే అనుకున్న వ్యక్తి దూరం కావడం. ఆ లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. ఎందరు సానుభూతి వ్యక్తం చేసినా పోయిన మనిషి ఎప్పటికీ తిరిగిరాడు. రెండో నష్టం ఆర్థి నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుంది. కానీ, చాలామంది 'మనం పోతేగానీ రాని డబ్బులు కటుంబం చితికిపోయే ప్రమాదం ఉంది. జీవిత బీమా తోడుగా ఉంటే ఆర్థికపరమైన కారు కొనగానే ఇన్స్యూరెన్స్ చేయిస్తాడు. కారుకు ఏ ప్రమాదం జరగకూడదని కోరుకుంటూనే ఎందుకు?' అని భావిస్తుంటారు. టర్మ్ పాలసీ తీసుకోవడానికి ఇష్టపడరు ! అదే వ్యక్తి కొత్త ప్రతీ సంవత్సరం టంచనుగా ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. ఏటా ప్రీమియం చెల్లిస్తున్నాం ఉండదు. అలాగని ప్రీమియం కట్టకుండా వదిలేయలేం కదా! జీవిత బీమా కూడా అంతే! | ఒక సగటు ఉద్యోగి తన జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగాలంటే రెండు బీమాలు తప్పనిసరి. మొదటిది ఆరోగ్య బీమా అయితే, రెండోది జీవిత బీమా. ఈ రెండూ తీసుకున్న తర్వాతే ఆదాయ వనరులను బట్టి ఇతర పెట్టుబడులు ఎంచుకోవాలి. ఆస్తులు కూడబెట్టుకో వాలి. ఈ ఒక్క బీమా మనతో జీవితం పంచుకున్న భాగస్వామికి, మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరికీ అండగా ఉంటుంది. పిల్లల చదువుల కోసం, పెండ్లి కోసం, పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం కోసం రకరకాల పాలసీలు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిదే అయినా, కుటుంబానికి అండగా ఉండే జీవిత బీమా తర్వాతే మరేదైనా అన్న విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. పక్కాగా ప్రీమియం. జీవిత బీమా ఇవ్వడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వ్యక్తి ఆరోగ్యం, ఆదాయం, వయసు ఆధారంగా పాలసీ ఇస్తారు. ఉదాహరణకు 30 ఏండ్ల వ్యక్తి, నెలకు రూ.40 వేలు సంపాది స్తుంటే రూ.50 లక్షల టర్మ్ పాలసీకి ఏడాదికి ప్రీమియం రూ.9,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ఒకసారి తీసుకున్న తర్వాత టర్మ్ పాలసీ స్థిరంగా ఉంటుంది. ప్రీమియం పెరగదు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వయసును బట్టి ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. సదరు వ్యక్తికి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నా.. ప్రీమియం మరింత ప్రియం అవుతుంది. ఐఆర్డీఏ షరతులకు లోబడి దాదాపు అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు టర్మ్ పాలసీని ఆఫర్ చేస్తున్నాయి. మేలైన వాటిని ఎన్నుకొని వెంటనే బీమా తీసు కోండి. --- ఆఖరి మలుపులో.. గెలుపు. భవిష్యత్తు దర్శించకుండా వర్తమా నంలో తీసుకునే నిర్ణయాలు సగటు మనిషి శేష జీవితాన్ని నిస్సారంగా మార్చేస్తాయి. కొలువులో ఉన్నప్పుడు కాలరెగరేసుకొని తిరిగిన వ్యక్తి కూడా.. సరైన రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోకపోతే వయసుడిగిన కాలంలో పరాధీనం కాకతప్పదు! పదవీ విరమణ తర్వాత మీ బతుకు జట్కాబండి పగ్గాలు మీ చేతుల్లో ఉండాలంటే ఈ సూత్రాలు ఫాలో అయిపోండి.. ప్రతి మనిషికీ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. ఇల్లు, కారు, పిల్లల చదువు, వాళ్ల సెటిల్మెంట్, పెళ్లిళ్లు ఇలా జీవిత గమనంలో ఎన్నో మలుపులు ఎదు రవుతాయి. ప్రతి మలుపులోనూ గెలుపు చూసిన వాళ్లలో చాలామంది రిటైర్మెంట్ మలుపు దగ్గర స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దూరదృష్టి లోపమే ఇందుకు ప్రధాన కారణం. ఆర్థిక లక్ష్యాల్లో రిటైర్మెంట్ ప్లాన్ ఆఖరిది అని భావిం చిన చాలామంది పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతున్నది! ఆరోగ్య బీమా ఓ ధైర్యం. 'రిటైర్ అయ్యాక ఇంటి పట్టునే ఉండే మా ఇద్దరికీ లక్షలు కావాలా?' ఈ భావన చాలామం దిలో కనిపిస్తుంది. కానీ, అసలు ఖర్చులన్నీ అప్పుడే తడిసి మోపెడవుతాయి. కొడుకులూ, కోడళ్లూ దూరంగా ఉన్నా.. అనారోగ్యం మాత్రం తరుచూ పలకరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటే ఎంతటి ఆరోగ్య సమస్య తలెత్తినా ధైర్యం ఉంటుంది. 'రిటైర్ అయ్యాక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాంలే!" అనుకుంటే పొరపాటు. అప్పుడు సవాలక్ష షరతులు పుట్టుకొ స్తాయి. చికిత్సకైన ఖర్చు బీమాలో కవర్ కాకపోతే, మలి వయసులో ఆర్థికంగా దెబ్బతిని, మానసికంగా మరింత కుంగిపోయి, పిల్లలకు భారంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. అందుకే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఆస్పత్రికి కూడా వెకేషన్ వెళ్లిరావచ్చు. -- చరాస్తి ప్రధానం. పదవీ విరమణకు చేరువ అవుతుండగానే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ఒకటి 1 ఇవ్వని ఆస్తులను ఉంచుకోవడం వల్ల ఎలాంటి లాభమూ ఉండదు. ఉన్న స్థిరాస్తుల్లో నిరర్ధక స్థిరాస్తులను తగ్గించుకోవడం, అలాగని ఉన్న ఆస్తులన్నీ అమ్మేయమని కాదు. నెలనెలా రాబడి -యితే వస్తున్న పెన్షన్ ఎంతవరకు సరిపోతుందో అంచనాకు రావాలి. లోటు బడ్జెట్ ఉన్నట్ల మైనవాటిని అమ్మి పేపర్ అసెట్స్ (చరాస్తి)గా మార్చుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినట్ల యితే దాన్ని పూడ్చుకునేలా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలి. పెన్షన్ రానివాళ్లు మరింత జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడే సరైన మార్గాల్లో మదుపు చేసి రిటైర్ అయ్యేనాటికి పెద్దమొత్తంలో నిధులు సమకూర్చుకోవాలి. భార్యాభర్తలిద్దరూ నెలంతా హాయిగా గడపడానికి ఎంత కావాలో, అంత వడ్డీ రూపంలో వచ్చేంత మొత్తాన్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. లేదా మ్యూచువల్ ఫండ్స్ సిస్టమేటిక్ విత్ పెన్షన్, యాన్యుటీ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. భావోద్వేగాలకు లొంగొద్దు. కండ్లకు కనిపించేసరికి ఏదో స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన చాలామందికి కలుగు తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రిటైర్ అయ్యాక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడే అను కుందాం. ఆ ఇంటి మీద గరిష్ఠంగా రూ.30 వేల అద్దె వస్తుంది. అదే కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా నెలకు రూ.60వేల వరకూ వడ్డీ వస్తుంది కదా ! దీనికి తోడు స్థిరాస్తులు ఉన్న ట్లయితే, 'మా పేరు మీదికి ఎప్పుడు మారుస్తారు' అని పిల్లల నుంచి ఒత్తిడి కూడా రావచ్చు. అత్యవసర పరిస్థితుల్లో.. ఇల్లు అమ్ముదాం అనుకున్నా కొనేవాళ్లు దొరక్కపోవచ్చు. అదే లిక్విడ్ క్యాష్ రూపంలో ఉన్నట్లయితే, మీ తదనంతరమే ఆ డబ్బు గురించిన ఆలోచన కలుగు తుంది. ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు ఎంత కావాలనుకుంటే అంత తీసుకునే వెసు లుబాటూ ఉంటుంది. అందుకే ఆస్తుల పెంపకం, పంపకం ఈ రెండూ రిటైర్మెంట్ తర్వాత చేయకూడని పనులు, ఆర్థికంగా బలంగా ఉంటేనే శేష జీవితం ప్రశాంతంగా సాగుతుంది!! మీరు రిటైర్ అవుతారు కానీ, ద్రవ్యోల్బణానికి పదవీ విర మణ ఉండదు. ఏటికేడూ పెరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఖర్చులూ పెరుగుతాయి. వైద్య వ్యవ "" స్థలో వస్తున్న మార్పుల కారణంగా.. రిటైర్ అయ్యాక కూడా మరో పాతికేండ్లు బతికే రోజులు ఇవి. ఈ 25 ఏండ్లు ప్రశాంతంగా జీవించాలంటే ఆర్థికంగా స్వావలం బన కలిగి ఉండటం ఒక్కటే మార్గం. --- ఇల్లు కొనాలా..? ఎఫ్ డిచేయాలా? 'నా దగ్గరే కోటి రూపాయలు ఉంటేనా..?' జేబులో కాణీ లేకున్నా ఈ ఆలోచన తెరలు తెరలుగా వచ్చి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిజంగా కోటి రూపాయలు చేతిలో ఉన్నప్పుడు తెలివిగా నిర్ణయం తీసు కోకపోతే ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చే ప్రమాదం ఉంది. అందుకే, గత అనుభవాలను దృష్టిలో ఉంచు కొని.. భవిష్యత్ అవసరాలను గుర్తె రిగి.. వర్తమానం సజావుగా సాగేలా డబ్బు ఇన్వెస్ట్ చేయడం మంచిపని. కోటి రూపాయలు చేతిలో ఉంటే ఇల్లు తీసుకోవడం మంచిదా ! బ్యాంకులో ఎల్డీ చేయడం ఉత్తమమా! ఎవరు ఏం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం.. ప్రైవేట్ కంపెనీలో పాతికేండ్లు పనిచేసి రిటైర్ అయ్యాడు రామకృష్ణ. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, కుటుంబ బాధ్యతలతో వచ్చిన జీతంలో సింహభాగం ఇట్టే ఖర్చయ్యేది. పొదుపరి కావడంతో కాస్తోకూస్తో వెనకేశాడు. దీనికితోడు ఊళ్లో ఉన్న ఆస్తి అమ్మకం ద్వారా రిటైర్ అయ్యేనాటికి కోటి రూపాయలు కండ్ల చూశాడు. ఇప్పుడు ఆ కోటి ఏం చేయాలో అరవై ఏండ్ల రామకృష్ణకు పెద్ద సవాలుగా మారింది. బాగా ఆలోచించి ఇల్లు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. అంతలోనే.. ఉన్న ఒక్క కోటీ ఇంటికే పెట్టేస్తే బతకడం ఎలా? ఈ ప్రశ్న తలెత్తింది. దానికి పరి ష్కారమూ ఆయనకే తట్టింది. ఈ కోటిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించు కున్నాడు. అదే విషయం తన భార్య పద్మావతితో చెప్పాడు. ఆమె పెదవి విరిచింది. 'ఎన్నున్నా ఎందుకు దండగా! నా బతుకు కిరాయికొంపలో ముగిసిపోవాలని దేవుడు రాసిపెట్టాడు..' అని రుసరుసలాడింది పద్మావతి. జీతంలా వడ్డీ. భోజనాల వేళ కోపంగానే వడ్డిస్తున్న పద్మావతితో 'నేను చెప్పేది విను! ఆ తర్వాత నువ్వు ఇల్లు నువ్వు ఇల్లు కొనమంటే ఇల్లే కొంటాను. అన్నాడు రామకృష్ణ . చెప్పమన్నట్టుగా చూసింది ఆమె. మన -- దగ్గర కోటి ఉన్నాయి. ఈ హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉంటున్న ఇలాంటి ఫ్లాట్ కొనా లన్నా కోటికి తక్కువలో రాదు! అయినా కొన్నామే అనుకో, తర్వాత మన బతుకులు ఎలా? నా పింఛన్ రాదు. మరో ఆదాయమూ లేదు!' అని ఊరుకున్నాడు రామకృష్ణ, అవునన్న తలూపింది ఆమె. మళ్లీ రామకృష్ణ భార్యకు నచ్చచెబుతున్న ధోరణిలో.. 'మనమా ఇంకో పది హేనేండ్లు బతుకుతాం. మహా అయితే ఇంకో ఐదేండ్లు! ఈ కోటి ఎఫ్ఎ చేశామనుకో! నెలకు రూ.70వేలు జీతం వస్తుంటాయి. ఇంటి అద్దె రూ.15వేలు పోగా మిగతా దాంట్లో మనం అప్పు చేయాల్సిన పని ఉండదు! రేపు నాకేమైనా అయితే.. ఆ రూ.70వేలు నీకు వచ్చేలా కాలం వెళ్లదీయొచ్చు. ఏడాదికో విహారానికి వెళ్లొచ్చు. పిల్లలు పండుగకు వచ్చినప్పుడు ఏర్పాటు చేస్తాను ! నువ్వు నా దగ్గరికి వచ్చేశాక.. ఆ కోటితో పిల్లలు ఏం చేసుకుంటారో వాళ్లు 'ఇష్టం' అన్నాడు రామకృష్ణ. 'తింటున్నప్పుడు ఏంటండీ ఆ మాటలు! ఎల్డీ చేయడమే | మంచిది అనిపిస్తుంది. ఇల్లు కొన్నా.. మనం కట్టుకుపోతామా ఏంటి?' అంటూ శ్రీవారికి ప్రేమగా గడ్డ పెరుగు వడ్డించింది పద్మావతి. సంపాదించే శక్తి ఉంటే.. అరవై ఏండ్ల రామకృష్ణ సంగతి కాసేపు పక్కన పెట్టండి. నలభై ఏండ్ల దీపకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా అంటే నప్పదనే చెప్పాలి! దీపక్కు బోలెడంత భవిష్యత్తు ఉంది. సంపా దించే శక్తి కూడా ఉంది. కాబట్టి, ఆయన కోటి రూపాయలతో నచ్చిన ఇల్లు తీసుకోవడం మంచిది. పైగా కోటి రూపాయలు మొత్తం ఇంటిపై పెట్టకుండా, రూ.70 లక్షలు ఇంటికి కేటా యించి, మిగతా రూ.30 లక్షలు మరెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ఉభయతారకంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎఫ్ఎ వడ్డీరేట్లు తగ్గినా దీపకు వచ్చే ఇబ్బందేం ఉండదు. కాలక్రమంలో ఇంటి ధర కూడా పెరుగుతుంది. ఎలా చూసినా ప్రయోజనమే! అందుకే, దీపక్ వయసులో ఉన్న వారు రూ.కోటి చేతిలో ఉంటే వెంటనే సొంతింటి కలను నెరవేర్చుకోవడం తెలివైన పని. రాజాలా బతికేస్తే.. రూ.కోటి అకౌంట్లో ఉంటే వడ్డీ గురించి మాట్లాడటం ఏంటి? ఎంచక్కా నెలకు లక్ష ఖర్చు పెట్టుకున్నా 100 నెలలు అంటే దాదాపు ఎనిమిదిన్నరేండ్లు రాజాలా బతుకొచ్చు అనుకునే వాళ్లూ ఉంటారు. కానీ, ఆ తర్వాత పరిస్థితి? నెలకు లక్ష ఖర్చు చేయడానికి అలవాటుపడి పోయి.. తర్వాత అకౌంట్లో చిల్లిగవ్వా లేకపోతే బతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని లేదు. అదే సమయంలో, రిటైర్ అవ్వగానే పిల్లలకు డబ్బులన్నీ పంచేసి బాధ అవసరం. కన్నబిడ్డల దగ్గర మోతాదు లేకుండా శేషజీవితం గడపాలంటే.. మీ తదనంతర ట్టుగా భావిస్తారు కొందరు పెద్దలు. కానీ, ఈ రోజుల్లో ఆర్థికంగా బలంగా ఉండటం చాలా ఆస్తిపాస్తులు పిల్లలకు చెందేవిధంగా ఏర్పాటు చేయడం విజ్ఞత అనిపించుకుంటుంది. --- ముందస్తుగా తీర్చాలా? వద్దా? సుధాకర్, ప్రభాకర్ ఇద్దరూ సహో ద్యోగులు. ఇద్దరి వయసూ 35 ఏండ్లు. ఇద్దరి జీతాలూ సుమారు రూ.70 వేలు. ఒకే అపార్ట్మెంట్లో ఎదురెదురు ఫ్లాట్లు తీసుకున్నారు. హోమ్ లోన్ వీలైనంత త్వరగా తీర్చేయాలని నిశ్చయించుకున్నాడు సుధాకర్. ప్రతినెలా వాయిదాలు కడితే చాలు అనుకున్నాడు ప్రభాకర్. అయితే, ఈ కథ చదివాక గృహ రుణం ముందస్తుగా తీర్చాలో, వద్దో అర్థమవుతుంది. సుధాకర్, ప్రభాకర్ ఇద్దరి ఫ్లాట్ల విలువ కూడా రూ.40 లక్షలు, రూ.10 లక్షలు బయానా ఇచ్చారు. 25 ఏండ్లకు బ్యాంక్ నుంచి రూ.30 లక్షలు గృహ రుణం తీసుకున్నారు. 7.5 శాతం వడ్డీతో నెల వాయిదా రూ.22,188గా తేలింది. సుధాకర్ లెక్కలు వేసుకున్నాడు. పాతికేండ్లపాటు వాయిదాలు చెల్లిస్తూ పోతే దాదాపు రూ.66,50,700 చెల్లిస్తున్నట్టుగా తేలింది. పదేండ్లలో బాకీ మొత్తం కట్టేయాలనుకున్నాడు. అప్పుడు నెలకు వాయిదా రూ.35,610గా తేలింది. పదేండ్లలో రూ.42,73,200 కట్టాడు. కేవలం రూ.12,73,200 మాత్రమే వడ్డీ కట్టానని సంతోషించాడు సుధాకర్. అదే సమయంలో ప్రభాకర్ గృహరుణానికి నెలవారీ వాయిదా రూ.22,169 పోనూ రూ.14,400 లార్డ్క్యప్ మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. పదేండ్ల తర్వాత, ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా రూ.35,00,000 రిటర్న్ వచ్చింది. అప్పటికి ఆయన గృహరుణ బకాయి రూ.23,91,000, మ్యూచువల్ ఫండ్ రాబడి నుంచి ఇంటి లోన్ పూర్తిగా కట్టేసిన తర్వాత ప్రభాకర్ దగ్గర రూ.11 లక్షలు నికరంగా మిగిలాయి. ఉద్యోగం పోతే.. వీరిద్దరి విషయంలోనే మరో కోణం చూద్దాం. ఏడేండ్ల తర్వాత ఇద్దరూ పనిచేస్తున్న సంస్థ మూతపడింది. సుధాకర్, ప్రభాకర్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇంటి లోన్ త్వరగా తీర్చేయా -- లని పొదుపు మంత్రం పక్కనపెట్టి బ్యాంక్కు అధిక మొత్తంలో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. సుధాకర్. అదే ఏడేండ్ల తర్వాత ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్లో రూ.19.50 లక్షలు ఉన్నాయి. ఆ మొత్తాన్ని నెలకు రూ.60 వేల చొప్పున వాడుకున్నా 32 నెలలు ఏ ఒత్తిడి లేకుండా రోజులు గడిచిపోతాయి. ఈలోపు మరో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు! | గడవడానికి, బ్యాంక్ రుణం తీర్చడానికి బయట అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒత్తిడి పెరిగింది. ఆ ప్రభావం ఆరోగ్యంపైనా పడింది. మంచి అప్పు.. ఈ ఇద్దరి మిత్రుల కథ.. విలువైన ఆర్థిక పాఠం. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగులు రుణ బాధలు ఉండకూడదని భావిస్తూ ఉంటారు. గృహప్రవేశం చేసిన రోజు నుంచే హోమ్ లోన్ వీలైనంత త్వరగా తీర్చేయాలని ఆరాటపడుతుంటారు. 25 ఏండ్లు వాయిదాలు కడుతూ పోతే తీసుకున్న లోన్ పై రెండింతలు కట్టాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటారు. ఆ చిక్కుల్లోంచి త్వరగా బయటపడాలని వాయిదాతోపాటు అదనంగా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. కానీ, గృహరుణాన్ని మంచి అప్పుగా పరిగణించాలి. హోమ్ లోన్పై వడ్డీరేటు 7 నుంచి 8.5 శాతం కన్నా మించదు. పైగా, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. దానిని పరిగణనలోకి తీసుకుంటే ఇంటి రుణంపై వడ్డీ 5.5 శాతం నుంచి 6 శాతం దాటదు. అంటే యాభై పైసల వడ్డీ అన్నమాట. ఇంత తక్కువ వడ్డీకి మరెక్కడా అప్పు దొరకదు. అలాంటి రుణాన్ని త్వరగా తీర్చడం అంటే, ఆర్థిక విధానాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే కదా! నగదు రూపంలో.. ఆస్తులు కొనుగోలు చేయడం తప్పుకాదు. స్థిరాస్తులు అవసరానికి అమ్మాలంటే అనుకున్నంత డిమాండ్ ఉండకపోవచ్చు. అందుకే కొంత ఆస్తి లిక్విడ్ అసెట్ (నగదు రూపంలో) ఉండటం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ ఈ రకమే! ఆదాయాన్ని ఇచ్చే స్థిరాస్తులు కూడా మంచివే! కానీ, అలాంటి ఆస్తులను వాయిదాల రూపంలో కొనుగోలు చేయడం సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు ఎస్ఐపీ వైపు మొగ్గుచూపడం ఉత్తమం. అవకాశం ఉంటే, ఆదాయం పెరిగే కొద్దీ, ఎస్ఐపీ వాయిదా మొత్తం పెంచడం ద్వారా మరింత లాభం పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీకు అవసరం ఉన్నంత మొత్తం తీసుకోవచ్చు. ఆ డబ్బు మూడు రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. సిబిల్, జీతంతో సంబంధం లేకుండా గంటల వ్యవధిలో లోను తీసుకోవచ్చు. నగదు రూప ఆస్తిగా బంగారం కూడా కొనొచ్చు. అయితే, బంగారాన్ని చాలామంది సెంటిమెంట్ గా భావిస్తారు. అవసరం వచ్చినప్పుడు అమ్మడం కన్నా, కుదువ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడు ఇన్నాళ్లూ పోగు చేసిన ఆస్తి మీద వడ్డీ భారం తప్పదు!! --- అందరికీ ఒకేలా పారదు. ఇన్వెస్ట్మెంట్ అనగానే.. ముందుగా లాభాలను ఊహించేస్తుంటారు. ఇందుకోసం ఇంటర్నెట్లో ఆర్థికవేత్తలు సూచించిన ఫార్ములాలను సెర్చింగ్ చేస్తుంటారు. కానీ, పర్పస్ లేకుండా ఇన్వెస్ట్ చేసే డబ్బులు అవస రానికి అక్కరకు రాకుండా పోతాయని గుర్తెరగాలి. అన్నిటికీ మించి పేరు మోసిన ఆర్థికవేత్తలు సూచించిన విధానాలు కూడా సర్వజనీనం, సర్వకా లీనం కాదు. మనిషి ఆదాయం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ముందు కుసాగవు. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి మార్గాలు అన్వేషించాలి. చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పడం లేదు. మనకు తాహతు లేదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండొద్దు. రాబడి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా కన్నవారి అండదండలు లభిం చడం, సంపాదన స్థిరంగా ఉండటం మంచిదే! కానీ, ఇలాంటి వ్యక్తులు తాము ఏం చేసినా చెల్లుతుందనే వైఖరితో ఉంటే ప్రమాదం. ఎందు కంటే.. లేని హెచ్చులకు పోయి బొక్కబోర్లాపడ్డ కుటుంబాలు ఎన్నో! --- మర్డర్ చేసే కత్తి. సర్జరీ చేసే కత్తితో మర్దర్ చేయొచ్చు. కానీ, మర్డర్ చేసే కత్తితో సర్జరీ చేస్తా . నంటే కుదరదు. రియల్ ఎస్టేట్లో వస్తున్న బ్లాక్ మనీ కూడా మర్డర్ చేసే కత్తిలాంటిదే! దాంతో సర్జరీ చేయలేం. భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకూ, మార్కెట్ ధరకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. మర్కెట్ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకునే ఉద్దేశం ఎవరికీ ఉండదు. కొనుగోలు చేసే వ్యక్తి ప్రభుత్వ ధరకు సంబంధించిన మొత్తం చెక్కు రూపంలో చెల్లిస్తాడు. మిగతా మొత్తం బ్లాక్ మనీగా ఇస్తాడు. ల్యాండ్ అమ్మిన వ్యక్తి ఈ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి నానా అగచాట్లు పడాల్సిందే! ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఆస్పత్రిలో కూడా రెండు లక్షల వరకే లిక్విడ్ క్యాష్ తీసుకుంటున్నాయి. అంతకుమించి చెల్లింపులు చేయాల్సి వస్తే.. నో క్యాష్.. ఓన్లీ చెక్ అంటున్నాయి. ఆ సొమ్మును మళ్లీ స్థలంలోనే పెట్టాలి. లేదా, ఆర్థిక నేరాలకు పాల్పడి, కమీషన్లు చెల్లించి వైట్గా మార్చుకుంటున్నారు. ---- ఇంటి అప్పు.. తప్పా..? ఒప్పా..? సొంతింటి కల నెరవేరిన మరుక్షణం నుంచి వాయిదాల పీడకలలు కంటున్నారా? రుణపాశం బిగుసుకు పోయిందే బాధపడుతున్నారా? ముందుగానే రుణం తీర్చేయాలని ఫిక్సయ్యారా? ఇలా ఆలోచిస్తే గృహరుణంపై మీకు పూర్తిస్థాయి అవగాహన లేనట్లే! వడ్డీ లెక్కలు నడ్డి విరిచేస్తాయన్న అపోహతో సొంతింటిని దూరం చేసుకోకండి. జయంత్ కథ చదివితే ఎందుకన్నది మీకే తెలుస్తుంది.. జయంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అదే కంపెనీలో పనిచేసే కల్యాణిని పెండ్లి చేసుకు న్నాడు. ఇద్దరికీ కలిసి నెలకు రెండు లక్షల వరకు ఆదాయం ఉంది. జయం త్కు కుటుంబ బాధ్యతలూ ఉన్నాయి. పొదుపుగా ఖర్చు చేస్తూ ఇద్దరూ రూ.15 లక్షలు కూడ బెట్టారు. ఇల్లు తీసుకోవాలని అనుకున్నారు. మంచి ఏరియాలో ఒక ఫ్లాట్ చూశారు. అన్నీ కలిపి రూ.60 లక్షలు అవుతుందన్నాడు బిల్డర్. రిజిస్ట్రేషన్ అదనం. జయంత్, కల్యాణి ముచ్చటపడ్డారు. బయానా ఇచ్చి రుణం కోసం బ్యాంకు తలుపుతట్టారు. వాళ్ల జీతభత్యాలకు రూ.50 లక్షలు రుణం రెండు రోజుల్లో మంజూరు అవుతుందని చెప్పాడు మేనేజర్. తగ్గేది రూ.5 లక్షలేనా.. మర్నాడు గృహరుణం, వాయిదాల చెల్లింపు వివరాలు విడమర్చి చెప్పాడు బ్యాంకు అధికారి. రూ.50 లక్షల రుణం, 15 సంవత్సరాల కాలపరిమితి, 9 శాతం వడ్డీ ఆధారంగా రుణంపై నెలకు రూ.50,713 వాయిదా చెల్లించాల్సి వస్తుందని వివరించాడు. మస్తిష్కంలోనే లెక్కలన్నీ వేసుకున్నాడు జయంత్. అంటే రూ.50 లక్షల రుణానికి 15 ఏండ్లలో రూ.91లక్షలకుపైగా చెల్లిస్తామని అంచనావేశాడు. అంటే అసలు పోనూ రూ.41 లక్షలు అదనంగా కడతామా? ఆని బెంబేలెత్తిపోయాడు. ఆ దంపతుల ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ముందుగా 5 చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుందా అన్నాడు జయంత్ ! 'మీరు మూడేండ్ల తర్వాత రుణం పూర్తిగా --- చెల్లించదలిస్తే రూ. 45 లక్షలు కట్టాల్సి ఉంటుంది' అన్నాడు బ్యాంకు అధికారి. మళ్లీ హతాశుడు | యాడు జయంత్. అంటే మూడేండ్లలో రూ.18 లక్షలు కడితే.. అసలులో తగ్గేది రూ. 5 లక్ష లేనా అని విస్తుపోయాడు. అసలు తరగదు. మర్నాడు తన స్నేహితుడు సుధీర్తో పరిస్థితి అంతా వివరించాడు జయంత్. 'ఈ విషయాలేవీ తెలియకుండానే నేను లోన్ తీసుకున్నానా ?' అన్నాడు సుధీర్. ప్రశ్నార్థకంగా చూశాడు. జయంత్. 'వాయిదాలో ఎంతమొత్తం వడ్డీకి పోతున్నది, ఎంత అసలు తగ్గుతున్నది అని రూ.50 లక్షలు తెచ్చుకున్నావే అనుకో! నెలకు వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది' అడిగాడు సుధీర్. రూ.50 వేలు అన్నాడు జయంత్. 'నెలకు రూ.50 వేల చొప్పున ఎన్ని నెలలు కడుతూ పోయినా.. అసలు గోరంత కూడా తరగదు కదా!' అని స్నేహితుడి వంక చూశాడు సుధీర్. అంతే అన్నట్టుగా తలూపాడు జయంత్. 'అదే బ్యాంకులో రుణం.. వడ్డీతోపాటు అసలు కూడా తగ్గుతూ పోతుంది. 15 సంవత్సరాలు అంటే 180 నెలలు. అసలు తగ్గే కొద్దీ వడ్డీ మొత్తమూ తగ్గుతూ వస్తుంది. మనం చెల్లించే వాయిదాలో అసలు వాటా పెరుగుతూ ఉంటుంది' అని వివరించాడు. వడ్డీ బారాణే.. ఇన్ని చెప్పినా అర్థం కానట్టుగానే ముఖం పెట్టాడు జయంత్. 'నీ డౌట్ ఇంకా క్లియర్ కాలేదా! ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంటి అద్దె ఎంత?' అని అడిగాడు. 'పదహారు వేలు..' అన్నాడు జయంత్. 'ఇల్లు తీసుకుంటే ఆ పదహారు వేలు తప్పినట్టే కదా! అంటే నువ్వు ఎక్కువ కడుతు న్నాను అని భావిస్తున్న వడ్డీ ఇంటి అద్దెకు సరిపోయినట్టే! నువ్వు లోన్ తీసుకుందాం అనుకు న్నది ఐదోపదో కాదు. యాభై లక్షలు. అంతపెద్ద మొత్తం ఎవరు మాత్రం నీకు సాయం చేయగ లరు. ఊళ్లో పొలం అమ్మి కట్టొచ్చు. కానీ, ఇంత చిన్న ఆస్తి కొనడానికే ఇంతలా ఇదైపోతు న్నావు. ఆ ప్రాపర్టీ మళ్లీ కొనగలవా? సంవత్సరానికి 9 శాతం వడ్డీ అంటే.. నెలకు 75 పైసలు మాత్రమే! దీనికి తోడు ఆదాయపన్ను మినహాయింపులోనూ ఇంటిరుణం చూపించుకునే వెసులుబాటు ఉంది. మరేం ఆలోచించక.. గృహరుణం తీసుకో" అని సలహా ఇచ్చాడు సుధీర్. “ఇంత క్లియర్గా చెప్పావు. మా గృహప్రవేశానికి నువ్వే ముఖ్య అతిథి' అని బ్యాంకుకు బయల్దే రాడు జయంత్. ---- కారు ఎప్పుడు కొనాలి? ధనవంతులు కావడానికి కష్టపడే వాళ్లు తక్కువమందే ఉంటారు, కానీ, శ్రీమంతులుగా కనిపించడానికి తపించేవారే ఎక్కువ. ఇలాంటి వాళ్ళు మూరెడు ఆస్తి లేకపోయినా బారెడు ఆశలను మోస్తుంటారు. వాటిని నెరవేర్చుకునే క్రమంలో భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంటారు. కొత్త కారు కొనడం, ఉన్న కారును మార్చడం ఈ కోవలోకే వస్తాయి. అసలు కారు ఎప్పుడు కొనాలి? ఎంతలో కొనాలి?.. మనం మన ఆనందాలను, అవసరాలను కోల్పోవద్దు. అదే సమయంలో, ఆ మాయలో పడిపోయి జీవిత అవసరాలను తక్కువ అంచనా వేయకూ డదు. ఇంకా చెప్పాలంటే స్వల్పకాలిక ఆనందాల కోసం దీర్ఘకాలిక అవసరాలను పణంగా పెట్టొద్దు. కారు కొనడాన్ని తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే నిర్ణయాల జాబి తాలో చేర్చవచ్చు. ప్రస్తుత రోజుల్లో సొంతంగా కారు ఉండటం అనివార్యమని భావిస్తున్నారు. అందులో తప్పు కూడా ఏం లేదు. కానీ, ఆ కారును ఎప్పుడు కొన్నాం, ఎలా కొన్నాం అన్నది ముఖ్యం. ఆ రెండూ తర్వాతే.. పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లాన్ దీర్ఘకాలిక అవసరాలు. వీటి తర్వాతే ఇల్లు, కారు, మరేదైనా! దీర్ఘకాలిక అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికోసం పక్కాగా ప్రణాళిక అమలు రామే! రానున్న రోజుల్లో పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్ చదివించాలంటే నాలుగేండ్లకు చేయాలి. ఈ రోజుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహా రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు కావొచ్చు. ఆ మేరకు ఆర్థిక వనరులు సమ కూర్చుకోవాలి. ఎవరికైనా రిటైర్మెంట్ ప్లాన్ ముఖ్యమైనది. భార్యాభర్తలు ఇద్దరూ బతకడానికి శ్రీ ప్రస్తుతం నెలకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతున్నది. మరో ఇరవై ఏండ్ల తర్వాత ఇ బతకాలంటే కనీసం రూ.50వేలు ఉండాల్సిందే! నెలకు అంతమొత్తం వచ్చేలా పెట్టుబడలు -------- పెట్టాలి. అయితే, చాలామంది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నిర్దేశించిన నిధులను కారు కొన్న నికో, ఇంటి నిర్మాణానికి బదలాయిస్తుంటారు. ఫలితంగా భవిష్యత్ ప్రయోజనాలు దెబ్బ ప్రమాదం ఉంటుంది. వాయిదాలు పూర్తి కాకుండానే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.40 వేల జీతం వస్తున్న ఉద్యోగికి దాదాపు రూ.6 లక్షల కారు లోన్ నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆ వ్యక్తికి ఉన్న కమిట్మెం అంతకుమించి ఆదాయం ఉన్న వ్యక్తికి కారు కొనడం పెద్ద విషయం కాదు. కానీ, రికి కారణం. నలుగురి మెప్పు కోసమో, స్థితి మంతుడు అనిపించుకోవాలనో కారు పట్ల ఆలోచనల్లో పడుతుంటారు కొందరు. కారును స్టేటస్ సింబల్ గా భావించడమే ఈ వైఖ ఉత్సాహం కనబరుస్తుంటారు. ఇందుకోసం అప్పటివరకు పదిలంగా దాచుకున్న డబ్బును డౌన్పేమెంట్ కట్టడం ఒకటైతే, ఆ మరుసటి నెల నుంచి కారు వాయిదాలు మొదలవడంతో సేవింగ్స్ను కొన్నాళ్లు వాయిదా వేస్తారు. మీరేంటో కారు చెప్పదు. మనస్థాయి ఎవరికీ తెలియాల్సిన పన్లేదు. నలుగురి మెప్పు కోసం, పదిమందిలో డాబు కోసం కారు కొనాలనుకోవడం తప్పే. రోల్స్ రాయిస్ అయినా, మారుతి అయినా ప్రయాణ సాధనం మాత్రమే! స్థాయిని బట్టి కారు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, కారు మన స్థాయిని పెంచుతుందని భావించొద్దు. మీ దీర్ఘకాలిక అవసరాలు నెరవేర్చడానికి సరైన పెట్టుబడులు పెట్టారా, లేదా అన్నది చూసుకోవాలి. ఆ తర్వాతే.. ఇల్లు, కారు, ఇతర లగ్జరీలు. ధనవంతులుగా కనిపించడం, ధనవంతులు కావడం.. రెండూ ఒకటి కాదు. ఈ సత్యాన్ని గ్రహిస్తే మేలు. ఇలా ఆలోచిస్తే తప్పు. " నా పక్క ఫ్లాట్ ఓనరు పెద్దకారు ఉంది, అంతకన్నా పెద్దకారు నాకు ఉండాల్సిందే అనుకోవడం. ఆ కొడుకో, కూతురో ముచ్చటపడ్డారని అప్పటికప్పుడు ఉన్న కారును అమ్మకా నికి పెట్టి, లగ్జరీ కారు కొనాలనుకోడం. ఆ అవసరం లేకపోయినా అప్పటికే ఉన్న ఫైవ్ సీటర్ కారును కాదని సెవెన్ సీటర్ కారు బేరం చేయడం. 'నీ లెవెల్కు ఈ కారేంటి.. ఇన్నోవా అయినా ఉండాల్సిందే' అనే స్నేహితుల మాటలకు బోల్తాపడటం. ఆ వీధి చివర ఇంట్లో కనిపించిన కారు నచ్చిందని, బంధువుల్లో కారు లేకపోతే నామోషీగా ఉంటుందని.. ఇలాంటి కార ణాలతో కారు కొనాలనుకోవడం. ధనవంతులుగా కనిపించడానికి పెద్ద కారు కొనాలనుకోవడం. ------- అలా.. ఫ్లాట్ అయిపోకండి! ప్రతీ ఉదయం ప్రశాంతంగా సాగిపోవాలే కానీ, 'అప్పు-డే' తెల్లారిందా అని భారీ నిట్టూర్పుతో మొదలు కావొద్దు. అవసరానికి వ్యక్తి గత రుణం తీసుకోవడం నేరం కాదు. ఆ రుణం మన పరపతికి మించొద్దు. వడ్డీ పరిమితిని దాటొద్దు. బ్యాంకులో కొర్రీలకు వెరిచి నానబ్యాంకింగ్ సంస్థల తలుపు తడితే.. వడ్డీ భారం తడిసి మోపెడవ్వడం ఖాయమని గుర్తుంచుకోండి! సొంతంగా ఒక ఇల్లు ఉండాలని చాలామంది బలంగా కోరుకుంటారు. కొందరు పైసాపైసా కూడబెట్టి ఇంటి నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూర్చుకుంటారు. ఇంకొందరు ఊళ్లో ఉన్న ఆస్తిలో కొంతభాగం అమ్మి, ఆ మొత్తంతో పట్నంలో ఇల్లు కట్టుకుంటారు. మధ్య తరగతి ఉద్యోగులు మాత్రం ఇల్లు కొనాలంటే బ్యాంకు అప్పు మీద ఆధారపడాల్సిందే! గృహ రుణం మంచి అప్పుగా పరిగణించవచ్చు. అయితే, వ్యక్తిగత రుణం విషయంలో ఆలో చించాలి. ఆ రుణం మంచిదా, మిమ్మల్ని ముంచేదా అని అంచనాకు రావాలి. సాధారణంగా వ్యక్తిగత రుణం రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్, ఫ్లాట్ ఇంట్రెస్ట్ విధానంలో ఇస్తుంటారు. ఈ రెండిట్లో రెడ్యూస్ట్ ఇంట్రెస్ట్ పద్ధతి రుణగ్రహీతపై భారం తగ్గిస్తుంది. దాదాపు బ్యాంకులన్నీ ఈ ప్రక్రి యను అనుసరించే రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఎన్బీఎఫ్సీ (నాన్బ్యాంకింగ్ ఫైనాన్షి యల్ కంపెనీలు) ఫ్లాట్ ఇంట్రెస్ట్ కూడా ఆఫర్ చేస్తుంటాయి. కట్టిన మొత్తానికీ మిత్తి. వడ్డీరేటులోనూ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య వ్యత్యాసం ఉంటుంది. దీనికితోడు రెడ్యూస్డ్ ప్లాట్ పద్ధతుల్లోనూ తేడా అధికంగానే ఉంటుంది .ఉదాహరణకు రెడ్యూస్ ఇంట్రెస్ట్ కింద బ్యాంకులో లక్ష రూపాయలు రుణం తీసుకున్నాం అనుకోండి. నెలకు వాయిదా రూ.3,000గా తేలింది. మొదటి నెల వాయిదా చెల్లించిన తర్వాత అందులో రూ.2,500 వడ్డి ---- కింద పోగా రూ.500 అసలు జమ చేసుకున్నారు. రెండోనెల రూ.99,500కు మాత్రమేవడ్డీ పడుతుంది. అంటే నెలలు గడిచే కొద్దీ మనం చెల్లించే వాయిదాలో వడ్డీ మొత్తం తగ్గుతూ ' వస్తుంది. అసలు వాటా పెరుగుతుంది. ఇక ప్లాట్ విధానానికి వస్తే.. 10 శాతం వడ్డీ కింద, ఐదేళ్ల కాల పరిమితికి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకోండి ! సంవత్సరానికి వడ్డీ 10,000, ఐదేండ్లకు రూ.50,000. ఈ వడ్డీ మొత్తాన్ని అసలుకు కలిపి వాయిదా ఎంత నేది నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియలో మనం కట్టిన అసలుకు కూడా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. రెడ్యూస్డ్ విధానంలో రుణం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ్లాట్ 10 ప ఫలితంగా రుణగ్రహీతపై 15 నుంచి 20 శాతం వరకు అదనపు భారం పడుతుంది. అందుకే రెడ్యూస్డ్ విధానములో రుణం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ్లాట్ 10% రెడ్యూస్డ్ విధానంలో 15 సాతానికి సమానం. మన తప్పులే కారణం.. రెడ్యూస్డ్ విధానము ఉండగా, ఎక్కువ భారం చెల్లించాల్సి వచ్చే రెండో పద్ధతిని ఎందుకు ఎంచు ? అంటారా ! మన ఆర్థిక క్రమశిక్షణ ఇలాంటి తప్పు చేయడానికి కారణమవుతుంది. స్కోర్ సరిగ్గా లేకపోతే రుణ పరపతి తగ్గుతుంది. గతంలో తీసుకున్న రుణాలు తీర్చ నిర్లక్ష్యం వహించి, వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకుల్లో కావాల్సినంత అప్పు పుట్టదు. దీంతో వడ్డీ ఎక్కువైనా పర్లేదు అనుకొని ఎన్బీఎఫ్సీ తలుపు తట్టాల్సివస్తుంది. బ్యాంకులో ఉన్నన్ని షరతులు ఎన్బీఎఫ్సీల్లో ఉండవు. రుణం త్వరగా మంజూరు అవు తుంది. కానీ, లక్ష రూపాయల రుణానికే రూ.20వేల వరకూ తేడా కనిపిస్తుంటే.. రూ.10 లక్షణ విషయంలో ఈ వ్యత్యాసం జీవితకాలం పూడ్చుకోలేనంత ఉండొచ్చు. అందుకే, వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు కాకుండా బ్యాంకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ విధానాన్ని ఎంచుకోవాలి. అప్పుడే దా'రుణ' పరిస్థి తులు ఎదురుకావు!! మార్జిన్ ఆధారంగా.. బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు వడ్డీ రేట్లలోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. బ్యాంకుల కన్నా వీటిలో రెండు నుంచి మూడున్నర శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. బ్యాంకులైనా, ఎన్బీఎఫ్సీలైనా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంటాయి. ఉదాహ ణకు ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్) మీద 5.5 నుంచి 6 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంటాయి. ఈ మొత్తంలో నుంచి 7.5 శాతం నుంచి 9.5 శాతం శాతం వరకూ వడ్డీ ఇస్తుంటాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్టిన్ 3 శాతం అనుకున్నా ఇవిచ్చే రుణాలపై / వరకు వడ్డీ మీద రుణగ్రహీతలకు లోన్లు ఇస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్ సీలు ఎఫ్ డీలపై 7 వడ్డీ 10 శాతానికి పైగా ఉంటుంది. పైగా ఫ్లాట్ ఇంట్రెస్ట్ కావడంతో చెల్లించిన వడ్డీ కట్టాల్సివస్తుంది. --- గృహ రుణం ఎక్కడ తీసుకోవాలి? మధ్యతరగతి మానవుడు ఇంటి రుణం కోసం బ్యాంకులన్నీ తిరుగు తాడు. ఫైనాన్షియల్ కంపెనీలనూ ఆశ్రయిస్తాడు. అడిగిన డాక్యుమెంట్లు అన్నీ ఇస్తాడు. చెప్పిన చోటల్లా సంత కాలు చేస్తాడు. అనుకున్నంత రుణం మంజూరై, కలల సౌధం సొంతమ య్యాక వాయిదాల భారాన్ని బాధ్య తగా మోస్తాడు. అయితే, ఈ రుణ పాశం మరింత బిగుసుకోవద్దంటే.. లోన్ ఎక్కడ తీసుకున్నామన్నది చాలా ముఖ్యం! దయానిధి ఓ ప్రైవేట్ ఉద్యోగి. తన బడ్జెట్లో ఓ ఫ్లాట్ చూశాడు. బాగుందని పించింది. ఇంట్లోవాళ్లకూ నచ్చింది. తన పొదుపు మొత్తాన్ని బయానాగా చెల్లించాడు. రూ.40 లక్షలు రుణం వస్తే గానీ, ఇల్లు సొంతం కాదు! 'నాన్బ్యాం కింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లో తెలిసినవాళ్లు ఉన్నారు.. ఇట్టే పని అయిపోతుంద'ని బిల్డర్ చెప్పాడు. అన్నట్టుగానే పదిహేను రోజుల్లో రుణం మంజూరైంది. వడ్డీ రేటు 8.5 శాతంగా తేల్చారు. ఫర్వాలేదు అనుకున్నాడు దయానిధి! ఏడాది గడిచింది. ఏవో పత్రాల కోసం ఫైనాన్షియల్ సంస్థను సంప్ర దించాడు ఆయన. సదరు పత్రాల్లో వడ్డీ రేటు 11 శాతంగా ఉండటం చూసి అవా క్కయ్యాడు. వివరణ అడిగితే.. వడ్డీరేట్లు పెరిగాయని చెప్పారంతే! వడ్డీలో వ్యత్యాసం.. ఇది దయానిధి ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదు! చాలామంది గృహరుణం విషయంలో అవగా హన లేమితో ఫైనాన్షియల్ సంస్థలపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకులకు వెళ్తే త్వరగా | వేరే మార్గాలు చూసుకుంటున్నారు. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఇంటి రుణంపై వడ్డీ కొద్దిగా వ్యత్యాసం ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ సంస్థలతో పోలిస్తే ఫర్వాలేదు కానీ, చాలామంది తమకు రుణం మంజూరైంది బ్యాంకు నుంచో, బ్యాంకు అనుబంధంగా ఉన్న హోమైఫైనాన్స్ సంస్థ నుంచో తెలియని పరిస్థితిలో ఉంటు -- న్నారు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ అయితే, ఐసీఐసీఐ హోమైనాన్స్ గృహరుణ సంస్థ దాదాపు అన్ని బ్యాంకులు హోమ్ ఫైనాన్స్ సంస్థలు కలిగి ఉంటాయి. బ్యాంకులో వడ్డీ రేట్లకు, ఈ ఫైనాన్స్ సంస్థల్లో ఉండే రేట్లకు మధ్య తేడాను గమనించవచ్చు. లక్షల్లో నష్టం. బ్యాంక్ రుణాల వడ్డీరేట్లను ఆర్బీఐ సమీక్షిస్తుంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రెపో రేట్లలో మార్పులకు అనుగుణంగా వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం ఉంటుంది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మేరకు రెపో లింక్డ్ లోన్ రేట్ (ఆర్ఎల్ఎస్ఆర్) ఆధారంగా వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వాళ్ల సంస్థ నిర్దేశిత వడ్డీ రేట్లను - నిర్దేశిస్తాయి. బ్యాంకు వడ్డీ రేట్లకు, ఆ బ్యాంకుకు చెందిన హోమ్ ఫైనాన్స్ సంస్థల మధ్య వడ్డీ రేట్లలో ఒకటి నుంచి రెండున్నర శాతం వరకు తేడా ఉండే అకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు మరింత వడ్డీ వసూలు చేస్తాయి. దీర్ఘకాలం కొనసాగే హోమ్లోన్లో వడ్డీ రేటు ఒక శాతం పెరిగినంత మాత్రాన మొత్తంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, ఇల్లు సొంతమైతే చాలనుకొని ఆదరాబాదరాగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలను ఆశ్రయించడం సరికాదు. ఇప్పటికే ఎన్బీఎఫ్సీలో రుణం తీసుకుని ఒకటి రెండేండ్లు దాటకపోయి ఉంటే.. దానిని బ్యాంకుకు బదిలీ చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది! లేకపోతే బాదుడు తప్పదు. అన్నీ కుదిరితేనే.. ఇంటిరుణాన్ని సెక్యూర్డ్న్ గా పరిగణిస్తారు. అంటే, కోటి రూపాయల విలువ ఉన్న ఇంటికి బ్యాంకు వాళ్లు రూ.80 లక్షలకు మించి రుణం ఇవ్వరు. మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక పోతే.. ఇంటి యజమానికి నోటీసు ఇచ్చి, ఇంటిని వేలం వేసి రుణం వసూలు చేసుకునే వెసులుబాటు బ్యాంకు అధికారులకు ఉంటుంది. ఆ రుణం ఇవ్వడానికి ముందుగానే ప్రాపర్టీకి సంబంధించిన అన్ని పత్రాలూ బ్యాంకు అధికా రులు పరిశీలిస్తారు. ఆస్తి విలువ, న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా అని నిపుణు లతో పరిశీలించి ఏ సమస్యా లేకుంటేనే లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఈ ప్రక్రి యలో ఒక్కోసారి రుణం మంజూరు ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి అనుకున్న దానికన్నా తక్కువ రావొచ్చు. ఆర్థిక లావాదేవీల్లో గానీ, ఇంటికి సంబంధించి పత్రాల్లో గానీ లీగల్ గా తేడా కనిపిస్తే రుణం నిలిపి వేస్తారు. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణం ఆలస్యం అవుతుందనే అపోహతో కొందరు నాబ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. వీళ్లు కూడా అన్నీ సరిచూసుకు న్నాకే లోన్ ఇస్తారు. కాకపోతే, పట్టువిడుపులు ప్రదర్శిస్తారు. రుణం త్వరగా వస్తే చాలు అనుకునే బలహీనత సామాన్యులను ఎన్బీఎఫ్సీల తలుపుతట్టేలా చేస్తున్నది. బ్యాంకులో లోను రానిపక్షంలోనే వీటిని ఆశ్రయించాలి. -- ఇల్లు పెట్టుబడి కాదు! ప్రతి సామాన్యుడి కల సొంతిల్లు, దాన్ని నెరవేర్చుకోవడమే జీవిత లక్ష్యంగా భావిస్తారు కొందరు, కొలువులో చేరింది మొదలు నచ్చిన నెలవు కోసం వెతుకులాట మొదలు పెడతారు ఈ రకం. జీతం అరంకెలు అందుకున్నా ఇంట్లోవాళ్లు 'ఇల్లు కొండాం' అనగానే రంకెలు వేసే వారు మరో రకం. ఈ రెండు ఆలోచనలూ సరైనవి కావు. ఇంటిని పెట్టుబడిగా భావించొద్దు. అత్యవసరమని తీర్మానించుకోవద్దు. ఓ ముప్పయ్ ఏండ్లు వెనక్కి వెళ్తే.. సగటు ఉద్యోగి పదవీ విరమణ వయ సుకు దగ్గర పడ్డప్పుడు గానీ, సొంతింటి గురించి ఆలోచించేవాడు కాదు. పిల్లల చదువు, వారి పెండ్లిళ్లు మొదటి ప్రాధాన్యంగా ఉండేవి. ఆ తర్వాతే ఇంటి సంగతి! ఇప్పుడు ట్రెండ్ మారింది! పెండ్లికి ముందే ఓ ఇంటివాడు కావాలని భావించేవారి సంఖ్య పెరుగుతున్నది. వేతనం రూ.60 వేలు దాటిందో లేదో సొంతింటి మీదికి మనసు మళ్లుతున్నది. కొందరైతే పెండ్లిచూపుల నాడే 'ఫలానా చోట ఫ్లాట్ చూశాను. నువ్వు చూసి ఓకే అంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాను' అని మాట్లాడేస్తున్నారు. పిల్లనిచ్చే అత్తామామ కూడా అబ్బాయికి తన కంటూ సొంతిల్లు ఉందా? అని అడుగుతున్నారు. మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో సొంతింటి కలను వీలైనంత త్వరగా నెరవేర్చుకునే వారు చాలామంది కనిపిస్తారు. పక్కాగా లెక్కలు... పెద్దగా ఉండవు. అలాగని చెడ్డవాళ్లు కాదు. లెక్కలు ఎక్కువగా వేసుకుంటారు. ప్రతి విషయం ఇప్పుడు కాస్త భిన్నమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల గురించి చర్చిద్దాం! వీళ్లకు ఎమోషన్స్ లోనూ లాభనష్టాలు బేరీజు వేసుకుంటారు. కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇవ్వరూ అను కుంటే పొరపాటు. వాళ్లు చేసే ప్రతి పనీ ఇంట్లోవాళ్ల బాగు కోసమే ఉంటుంది. కానీ, అది ఆ ఇంట్లోవాళ్లకే రుచించదు. వీళ్ల ఈక్వేషన్ ఎలా ఉంటుదంటే.. రూ.60 లక్షల్లో ఇల్లు తీసుకోవా -- లంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు డౌన్ పేమెంట్ కావాలి. మరో రూ.3 లక్షల వరకు రిజిస్ట్రేషన్ ఇతరత్రా ఖర్చులు, రూ.45 లక్షల రుణానికి గానూ ఇరవై ఏండ్లపాటు నెలకు పోతుంది. గృహరుణం వాయిదా కడుతున్నాం అనుకొని నెలకు రూ.25వేలు ఎస్ఐపీ రూ.40 వేల చొప్పున వాయిదాలు చెల్లించాలి. అదే అద్దె ఇంట్లో ఉంటే రూ.15 వేలల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇదే 20 ఏండ్లు ఇన్వెస్ట్ చేస్తూపోతే.. కనీసం రూ.3.20 కోట్ల నికర కాబట్టి నెలకు రూ.30వేలు ఎస్ఐపీలో పెడితే రూ.4 కోట్ల రాబడి వస్తుందని లెక్కలు వేసుకుం లాభం చేతికి వస్తుంది అని లెక్కకడతారు. ముందస్తుగా డౌన్ పేమెంట్ గట్రా ఏమీ ఉండవు . ఈ ఆలోచన మంచిదే! ఆ నాలుగు కోట్లతో పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితం గడుపొచ్చని భావిస్తారు! ఈయనగారి వైఖరినీ తప్పపట్టలేం. తాహతుకు మించి సాహసం. మూడోరకం మనుషులు మరింత వింతగొలుపుతారు. వీళ్లు సమాజంలో గుర్తింపు కోసం తమ లక్ష్యాలను సవరించుకుంటారు. ఒకరకంగా విస్మరిస్తుంటారు కూడా! 'ఎంత చెట్టుకు అంత గాలి' అనే ప్రాథమిక విషయాన్ని కూడా కాదని గాల్లో మేడలు కడుతుంటారు. 'ఫలానా బంధువు ఇంటికన్నా నాది గొప్పగా ఉండాలి' అని పులిని చూసి నక్క వాతలు పెట్టు కున్నట్టుగా తాహతుకు మించి ప్రయత్నాలు చేస్తారు. బ్యాంకు రుణంతోపాటు డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ కోసం అప్పోసొప్పో చేస్తారు. ఇవన్నీ తడిసి మోపెడు అవుతాయి. ఆర్థిక లావాదే వీలు మోయలేనంతగా మారతాయి. జీవితకాలం రొటేషన్ చక్రవర్తులుగా మిగిలిపోతారు. ఫలితంగా పిల్లలను మంచి కాలేజీలో చేర్పించే శక్తిలేక, సాదాసీదా చదువు చెప్పిస్తారు. ఆ ప్రభావం వారి జీవితాలపైనా పడుతుంది. అందుకే ఇంటి విషయంలో భావోద్వేగాలకు గురై శక్తికి మించి సాహసం చేయొద్దు. అదే సమయంలో సామర్థ్యం ఉన్నా సొంతింటి కల నెరవేర్చుకోవడానికి తటపటాయించొద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంటిని పెట్టుబడిగా భావించొద్దు! ఇల్లు కొనడం వల్ల 'జీవితంలో ఇంకేదైనా మిస్ అవుతామా?' అని ఆలోచించాలి. పిల్లల చదువు, ఇతర లక్ష్యాలకు ఆటంకం రావొచ్చు అనుకుంటే ఇంటి 66 కొనుగోలు వాయిదా వేయండి. కానీ, ఇల్లు కొనకుండా ” సంపద సృష్టిస్తానంటే సరికాదు. వ్యక్తిగా కుటుంబాన్ని సంతోషపర్చడం మీ బాధ్యత! జీవిత భాగస్వామితో బాగా ఆలోచించి మీ ఆదాయానికి లోబడి తెలివైన నిర్ణయం తీసుకోండి. --- ఇల్లు కొనండి.. టెన్షన్స్ కాదు! చాలామందికి సొంతిల్లు అనుకున్నదే తడవుగా తీరిపోయే కలగా మారిపో యింది. చిన్నవయసులోనే ఘనమైన ఉద్యోగాల్లో చేరుతుండటంతో.. సాంతింటిపై మనసుపడుతున్నారు. కొందరైతే పెండ్లికన్నా ముందుగానే గృహప్రవేశం చేస్తున్నారు. అయితే ఇల్లు ఎప్పుడు కొనాలనే స్పష్టత చాలా అవసరం. ఎందుకు తీసుకో వాలో కూడా తెలిసి ఉండాలి. ఈ రెండూ సరైనవని అనిపిస్తేనే ముందడుగు వేయాలి. ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలు' ఎప్పుడో దశాబ్దాల కిందట వచ్చిన సినిమా ఇది. ఈ టైటిల్ను ఆదర్శంగా తీసుకుంటున్నది ఈ తరం. ఉద్యోగంలో చేరింది మొదలు.. ఓ ఇంటివాడు అనిపించుకోవాలనీ, జీవిత భాగస్వామి తన సొంతింట్లో కాలు మోపాలని కోరుకుంటున్నారు చాలామంది. అయితే, ఈ ఆశలు, ఆశయాలు అత్యుత్సాహానికి దారితీస్తున్నాయి. ఎలాగూ బ్యాంకర్ చూసుకుంటాడులే అన్న ధీమాతో చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. సొంతింటి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. నచ్చిన లోగిలి కంటపడగానే టోకెన్ సొమ్ము బిల్డరికిచ్చి గృహరుణంపై ఆధారపడుతున్నారు. జీతం బాగుండటంతో రుణం సులభంగానే దొరుకొచ్చు కానీ, పాతికేండ్లు వాయిదాలు చెల్లించాలన్న విషయం ఆ క్షణం విస్మరిస్తున్నారు. మీ చేతిలో ఎంతుంది? ఇల్లు కొనడానికి ఆదాయం మాత్రమే ప్రాతిపదిక కాదు. సంసిద్ధత చాలా అవసరం. నెలకు సంపాదించే వ్యక్తికి కోటి రూపాయల ఇల్లు కొనడం పెద్ద కష్టమేం కాదు. అయితే, 85 చేస్తారన్నది ముఖ్యం. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, మార్గే గేజ్ రుసుము.. ఇలా మరో రూ.3 అవుతుంది. గృహప్రవేశం ఖర్చు మరో లక్ష వేసుకున్నా... మొత్తంగా రూ. 20 -- లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం రూ.85 లక్షలు గంటల్లోనే మంజూరు అవుతుంది. కానీ, ఈ 20 లక్షల మాటేమిటి! అప్పటికే సంపాదించి ఉంటే ఏ సమస్యా లేదు. కానీ, పైన సర్దుబాటు చేయాల్సినవి కూడా రుణంగా తీసుకొస్తే మాత్రం.. సొంతింట్లో మనశ్శాంతిగా ఉండలేరు. అబ్బల్లో ఉంటే... నట్టు చేతిలో రూ.5 లక్షలు పెట్టుకొని కోటి రూపాయల విలువ చేసే ఇంటి కోసం ప్రయత్నిస్తే ఏ. పెట్టుబడైనా ప్రశాంతతను ఇవ్వాలి కానీ, ఉన్న ఆనందాన్ని చెడగొట్టకూడదు. పైన చెప్పి ఈ రోజుల్లో తప్పు చేసినట్టే! కనీసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు కూడ బెడితేనే ఆ ధైర్యం చేయండి. తమ్ముడు ఓ ఇంటివాడు అవుతున్నాడని అక్క నాలుగైదు లక్షల రూపా యలు సర్దుబాటు చేయొచ్చు. స్నేహితుడు ప్రయోజకుడు అయ్యాడని మిత్రుడూ పెద్ద మొత్తమే సాయం చేయొచ్చు. కానీ, ఇవన్నీ అప్పులే కదా! ఎంత మనవాళ్లయితే మాత్రం వడ్డీ అడక్క పోవచ్చు. కానీ, ఏడాది తర్వాతైనా అసలు ఇవ్వమని అడిగే రోజు వస్తుంది కదా! ఆ రోజు రావొద్దని ఇంట్లోకి వెళ్లిన మర్నాటి నుంచి పోరాటం మొదలుపెడితే ప్రశాంతంగా ఉండగ లరా? బంగారం అమ్మి, చీటీ ఎత్తుకొని డౌనేపేమెంట్, రిజిస్ట్రేషన్ గండం నుంచి గట్టెక్కారే అనుకోండి. కానీ, ఎత్తుకున్న చీటీ అయిపోయే వరకూ కట్టాల్సిందే కదా! మరో ముఖ్య విషయం బయట అప్పులు ఉన్నట్లయితే ఇల్లు కొనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం హెచ్చులకు పోకుండా. శుభమా అంటూ ఇల్లు కొనడం గురించి ఆలోచిస్తుంటే.. ఈ ప్రతికూల వ్యాఖ్యానాలు ఏమిటి అనుకోకండి. ఈ విశ్లేషణ అంతా సొంతింట్లోకి వెళ్లాక మీరు సంతోషంగా ఉండటానికే ! ఇన్వెస్ట్ మెంట్గా భావిస్తే.. ఇల్లు కొనలేం. ఉండటానికి మీ స్తోమతకు తగ్గ ధరలో, కోరుకున్న హంగులు అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఇల్లు కొనుక్కుంటే.. ఆఫర్గా ఆనందం రావాలి కానీ, టెన్షన్స్ రావొద్దు కదా! ఎవరో కొన్నారని మనం ఇల్లు కొనాలనుకోవద్దు. కొనడం తప్ప నిసరైనా హెచ్చులకు పోవద్దు. మీపై ఆధారపడి ఉన్న కుటుంబసభ్యులు, వయసు పైబడిన తల్లిదండ్రుల అవసరాలు, పిల్లల చదువు ఇవన్నీ బేరీజు వేసుకొని ఎంత మొత్తంలో అయితే వర్కవుట్ అవుతుందో.. అందులోనే సొంతిల్లు కల నెరవేరేలా చూసుకోండి. అది కూడా డౌన్ పేమెంట్ సిద్ధం చేసుకున్నా తర్వాతే సుమా!! --- ఫైర్ ఎందుకు సార్? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ -రిటైర్ ఎర్లీ.. ఈ మాటకు సంక్షిప్త రూపం ఫైర్, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనుకో వడం స్వాగతించాల్సిన విషయమే. జీతం మీద ఆధారపడాల్సిన పన్లే కుండా.. నెలనెలా మన బ్యాంకు ఖాతాలో డబ్బు వచ్చి పడేలా పక డ్బందీగా ఏర్పాట్లు చేసు కోవడం గొప్ప నిర్ణయమే. కానీ, సమస్యంతా 'రిటైర్ ఎర్లీ’తోనే! ఉద్యోగ విరమణ.. చురుకైన జీవితం నుంచి శాశ్వత విరమణ కాకూడదు. పాతికేళ్లలోపే కొలువులో చేరతారు. తొలి ఉద్యోగం.. తొలి జీతం నుంచే రిటై ర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటారు. ఇంక్రిమెంట్లు.. ప్రమోషన్లు వచ్చి నకొద్దీ ఉద్యోగ విరమణ నిధికి కేటాయింపులు పెంచుకుంటారు. నలభై అయిదేళ్లు నిండగానే.. కెరీర్కు మంగళం పాడేసి.. ప్రపంచాన్ని చుట్టొస్తూనో, పడక్కుర్చీలో కునుకుతీస్తూనో బతికేయాలని కొందరి ఆలోచన. ఇక్కడే సమస్య! వైద్య సదుపాయాలు పెరిగాయి. జీవన నాణ్యత పెరిగింది. దీంతోపాటు జీవన ప్రమాణాలూ పెరిగిపోతున్నాయి. వీటన్నిటివల్లా నలభై అయిదేళ్ల వయసు 'మలి యవ్వనం' కిందికే వస్తున్నది. అరవై అచ్చమైన 'నడి వయసు'. డెబ్భై దాటితేకానీ 'వృద్ధాప్యం' మన శరీరంలో ప్రవేశించదు.. పడక కుర్చీ అవసరమూ రాదు. 'తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ'.. అన్నట్టు రాని వృద్ధాప్యాన్ని కొనితెచ్చుకోవడం ఎందుకు? ఏ రోజుకు ఆరోజు, ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల.. ఏదో ఓ లక్ష్యం సవాలు విసురుతున్నప్పుడే మెదడు చురుగ్గా ఉంటుంది. ఆలోచనలు ఉత్తేజాన్ని పొందుతాయి. ఆ సవాళ్లకు తగినట్టు శరీరమూ సర్వసన్నద్ధం అవుతుంది. మళ్లీ పడుకోడానికే నిద్రలేస్తూ, అరిగించుకోడానికి ఆహారం తింటూ, గడియారం వైపు చూస్తూ కాలాన్ని కరిగించుకుంటూ.. బతికే బతుకూ ఓ బతుకేనా? ఆ శ్రమలేని జీవితంతో శరీరం సర్వీసింగ్కు వచ్చేస్తుంది. బుర్ర దయ్యాల కార్ఖానా అనే మాట ఎలా ఉన్నా.. ఖాళీ మనిషి మాత్రం అనారోగ్యాల ------ పుట్టే! కాబట్టి, మీకు మీరు రిటైర్మెంట్ ఇచ్చుకోవద్దు. అవసరమైతే చట్టబద్ధమైన రిటైర్మెంట్ కొంత కేటాయించండి. ఆత్మసంతృప్తిని మించిన ఆనందం ఉండదు. దీనివల్ల శరీరంలో తర్వాత కూడా మీ అనుభవాన్ని, నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. సమాజం కోసమూ పాజిటివ్ హార్మోన్ల ఊట పెరుగుతుంది. అలా అయితే ఓకే.. రిలాక్సేషన్, రిటైర్మెంట్ కో కాకుండా.. అటకెక్కిన ఆశల్ని బతికించుకోడానికి, అర్ధంతరంగా ఆగిపోయిన కలల్ని నిజం చేసుకోడానికి.. ఫైర్ ఓ మంచి అవకాశం. ఆర్థిక సమస్యల కార బాధ్యతల బరువు వల్ల పేరు పక్కన ఎంబీయే అనే మూడక్షరాల్ని చూడలేకపోయిన వెలితిని ఇప్పుడు పూడ్చుకోవచ్చు. పాతికేళ్ల వయసులో పెట్టుబడికి పైసల్లేక వ్యాపార ఆలోచన | ప్రాణం పోయవచ్చు. నటన, రచన, సంగీతం.. ఇలా నచ్చిన అభిరుచికి ఓటేయవచ్చు. నీళ్లు వదులుకుని ఉంటే.. స్టార్టప్ ఆలోచనకు 'స్టాండ్ అప్' చెప్పవచ్చు. అంకుర సంస్థకు | సౌందర్య వ్యాపార దిగ్గజం నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ యాభై ఏళ్ల వయసులో ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు అడుగేశారు. కాకపోతే, ఓ వయసు తర్వాత ఓ కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నపుడు.. ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మలిసంధ్యలో రిస్క్ తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. మళ్లీ సున్నా నుంచి జీవితాన్ని ఆరంభించడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి 'ప్లే సేఫ్' ఫార్ములా అనుసరించాలి. రిటైర్మెంట్ నిధి జోలికి వెళ్లకుండా.. ఇత రత్రా సేవింగ్స్్స్న పెట్టుబడిగా పెట్టాలి. ఆ స్థాయిలో నిధులు సమకూరిన తర్వాతే.. ఫైర్ దిశగా అడుగులేయాలి. ఫైర్ అయ్యాక.. ముందస్తు పదవీ విరమణ తర్వాత.. కొన్నాళ్లు రిలాక్స్ ఉండాలి. ఆ తర్వాత అప్పటికే తమకు అనుభవం ఉన్న రంగాన్ని ఎంచుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలి. లాభాల వెంట పడకుండా ఆనందాన్ని ఆస్వాదించడానికే పనిచేయాలి. కొన్ని కలలు దూరపుకొండలు. దిగాకే లోతు తెలుస్తుంది. అధిరోహించడం ఆరంభించాకే పరిమితులు అర్థం అవుతాయి. ఆ పరిస్థితే వస్తే అక్కడితో పరుగు ఆపడం మేలు. దారి మార్చుకోవడం ఉత్తమం. ఫైర్.. మనకు దారిచూపే కాగడా కావాలే కానీ, మన బతుకులో నిప్పులు పోయకూడదు. సుదూర భవిష్య త్తులో మనం కోరుకున్న జీవితాన్ని గడపడం కోసం.. వర్తమానాన్ని వృథా చేసుకోకూడదు. సంపాదనలో సింహభాగం.. ఎర్లీ రిటైర్మెంట్ పెట్టుబడులకు కేటాయించి.. మొక్కుబడిగా బతికి యకూడదు. నేడు నిజం. రేపు అనూహ్యం. ఈ క్షణం అనుభవించాల్సిన ఆనందాల్ని అనుభ వించాల్సిందే. ఇల్లు, కారు, పిల్లల చదువులు, టూర్లు.. ఏ విషయంలోనూ రాజీ వద్దు. ---------------- పులిని చూసి.. వాతలొద్దు. రియల్ రంగంలో చాలామంది భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, స్థలాలను కాపాడుకోవడం కత్తిమీద సాములాంటింది. ప్రైమ్ ఏరి యాలో మంచి స్థలం ఉందంటే.. పది మంది కండ్లూ దానిమీదే ఉంటు న్నాయి. ప్రతి పది ఓపెన్ హార్ట్ సర్జరీలో రెండు కేసులు ఆస్తి తగాదాలు, ల్యాండ్ ఇష్యూల వల్లే అన్నది నిష్ఠుర సత్యం. మరోవైపు చాలామంది ఎన్ ఆర్ఎలు, భారీ వేతనాలు అందుకునే ఉద్యోగులు పెద్ద మొత్తం స్థలాలపై కుమ్మరించారు. పదేండ్లు తిరిగేసరికి ఆ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఊహించని ధరకు అమ్ముకున్నా.. ఎవరూ ప్యూర్ వైట్ మనీ ఇవ్వలేదు. ఆ వచ్చిన లిక్విడ్ క్యాషు అకౌంట్లో చూపించడం ఎవరి తరం కాదు! దీనికి పరిష్కారంగా చాలామంది డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసి, ఈ మొత్తాన్ని అటు తిప్పుతున్నారు. ఇటీవల డెయిరీలు విపరీతంగా వెలుస్తుండటం వెనుక అసలు కారణమిదే! ఇప్పుడున్న పరిస్థి తుల్లో డెయిరీ ఫామ్ నిర్వహణ అనుకున్నంత తేలికైనది కాదు. వాళ్లంటే భూముల మీద వచ్చిన లాభాలను ఇందులో కుమ్మరిస్తున్నారు. మూడేండ్లు అన్నీ సలక్షణంగా సాగితే.. డెయిరీలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆ తర్వాతే లాభాల స్వీకరణకు అవకాశం ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉంది! కానీ, చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు డెయిరీఫా మన్ను కామధేనువుగా భావించి ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ రంగంలోకి వస్తున్నారు. ఉద్యోగంలో సంపాదించినదంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్యాంకులో అప్పు తీసుకొచ్చి మరీ ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు. దిగితే గానీ లోతు తెలియదు అన్నట్టుగా ఉంది చాలామంది పరిస్థితి. డెయిరీలో సక్సెస్ నిష్పత్తి పది శాతం లోపే ఉండటం గమనార్హం! -- ఆస్తిలో 'రియల్' వాటా.. ముఖ్యంగా భూములపై ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడి పెట్టి ఆశించిన లాభాలు రాక కొందరు, అవసరానికి ఆ స్థలం పనికిరాక ఇంకొందరు 'రి యల్' కష్టాల పాలవుతున్నారు. అలాగని భూములు, ప్లాట్లు కొనుగోలు చేయడం తప్పని చెప్పడం కాదు! మీ ఆస్తిలో 'రియల్' వాటా ఎంత ఉండాలన్నది ముఖ్యం. ఒక వ్యక్తి నికర ఆస్తిలో యాభై శాతం కన్నా ఎక్కువ మొత్తం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే తప్పులో కాలేసినట్టే! రియల్ రంగంలో కోట్లు కుమ్మరించి అవసరానికి అమ్ముకోక ఎందరో తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు. ఆస్తులు సంపాదించడం కన్నా.. ఏ రూపంలో కూటబెట్టామన్నది చాలాముఖ్యం. రియల్ ఎస్టేట్ లోనే నాలు గైదు రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓపెన్ ప్లాట్, పొలాలు, ఇండిపెండెంట్ ఇల్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్, కమర్షియల్ స్పేస్ ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, చాలామంది స్థలాలు కొనుగోలు చేయడమే నిజమైన పెట్టుబడిగా నమ్ముతారు. అక్కడైతేనే దండిగా లాభాలు వస్తాయని భ్రమలో ఉంటారు. కానీ, రియల్ మార్కెట్ ఎప్పుడు కుదేలు అవుతుందో అస్సలు అంచనా వేయలేం. ఒకవేళ మార్కెట్ స్థిరంగా ఉన్నా రిటర్న్ శాతం గరిష్ఠంగా 12 దాటదని రియల్ గణాంకాలు చెబుతున్నాయి. --- ఆస్తి అమ్మేయండి.. అప్పుడే బాగుంటారు! ఉర్విజనులకెల్ల ఉండు అప్పు.. అప్పు ఉండుటేల తప్పు? అంటారా.. కానీ, రాత్రిళ్లు దిగులు చెందేలా, పగలు తల దించుకునేలా చేసేదే అప్పు, అలాంటి అప్పు ఉన్నవారు ఆస్తి కలిగి ఉండుట అతి పెద్ద తప్పు. అదేంటి? అప్పు ఉంటే ఆస్తి ఉండొద్దా?? అంటే.. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోమంటారా? ఔను, మారు ఆలోచించకుండా అమ్మకానికి పెట్టేయండి. అమ్మే ముందు ఇది చదవండి... అప్పు లేనివాళ్లు ఈ రోజుల్లో ఎవరున్నారు? నిజమే, అప్పు అనే తెప్ప సహాయం లేకుండా సంసార సాగరాన్ని ఈదటం అసంభవమే. అయితే, అప్పు చేయకుండా జీవించటం అసాధ్యం. కానీ, మరీ 'అప్పుల అప్పారావు' అన్న పేరు పడిపోయేంతగా రుణాలు చేస్తేనే సమస్య, లోతుపాతులు తెలియక.. అప్పు గురించి లోతుపాతులు తెలియక చాలా మంది ఎడాపెడా రుణాలు చేసేస్తూ ముప్పుతి ప్పలు పడుతుంటారు. ఇంకో విచిత్రమేమిటంటే అప్పు ఏ ఏటికాయేడు పెరిగిపోతున్నా సరే ఆస్తులను అమ్మే ఆలోచనే చేయరు. ఎందుకంటే ఆస్తులు అమ్మి అప్పు తీర్చటం అనేది పరు వుకు సంబంధించిన విషయం. అందుకే అలా అప్పుల మూట నెత్తినెట్టుకొని అలా బతుకు బండి లాగించేస్తూ ఉంటారు. కొన్ని జీవితాలైతే అప్పుల కుప్పు కిందే మిగిలిపోతాయి. దీనంత టికీ కారణం రుణాల విషయంలో పూర్తిస్థాయి అవగాహన లేకపోవటమే. అప్పు తీర్చకుండా.. ఆస్తి ఎందుకు? ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం అతిపెద్ద తప్పు, ఎవరైనా అప్పు కలిగి ఉంటే అది తీర్చే వరకు వేరే పెట్టుబడి పెట్టడానికి, ఒక ఆస్తిని ఉంచుకోవడానికి అర్హులు కాదు. ఈ ఆ మాట ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ అప్పు లేనివారు, ఆరోగ్య సమస్య లేనివారే అధిక ధనవం --- తులు అని అంటారు. ఈ మాటను గుర్తుకు తెచ్చుకుంటే ఏకీభవించకుండా ఉండలేరు. అప్పు చేసి, తీరా వాయిదాలు దాటవేస్తుంటే.. ఆ అప్పు ఇచ్చినవారు ఒక మాటైనా అనకుండా ఉంటారా? దాన్ని భరిస్తూ ఇంకా ఏదో భ్రమలో ఉండి.. ఎలాగైనా తీర్చేస్తానంటారు. ఏ నమ్మ చెప్తారో తెలియదు. ఉదాహరణకు.. ఓ వ్యక్తికి రూ.10 లక్షల విలువైన స్థలం ఉంది. మరోవైపు 10 లక్షల అప్పూ చేసి ఉన్నాడు. ఆ మొత్తాన్ని రూ.2 చొప్పున వడ్డీకి తెచ్చుకు న్నాడు. ఉన్న స్థలం అమ్మి, అప్పు తీర్చేయొచ్చు కదా. నేను స్థలం అమ్మను అంటాడు! అ నా పరువుకు సంబంధించిన విషయం అని చెప్తాడు. అయితే ఆ వ్యక్తి మొదట తన స్థలం విలువ ఎంత పెరగవచ్చు అనేది తెలుసుకోవాలి. సాధారణంగానైతే అన్నీ బాగున్న పరిస్థితుల్లో కాశం ఉంది. మా స్థలం విలువ ఏడాదిలోనే డబుల్ అయింది కదా అని వాదిస్తారు. కానీ అలా ప్రతి సంవత్సరం స్థలం విలువ పెరగటం అనేది అసాధ్యం. ఎన్నేండ్లకోసారి విలువ మారుతుందనేదే ఇక్కడ ప్రామాణికం. కాబట్టి స్థలం విషయంలో ప్రతి ఆరు సంవత్సరాలకు మారే విలువే ప్రధానం. రెండు రూపాయల వడ్డీకి తెచ్చుకున్న రూ.10 లక్షల అప్పు నాలు గేండ్ల నాటికి రూ.20 లక్షలు అయిపోతుంది. అప్పటికి కూడా ఆస్తి ముట్టకోను, అప్పు ఎలా గైనా తీరుస్తాను అనడం కన్నా పిచ్చి ప్రేలాపన మరొకటి ఉండదు. అలా మొండికేస్తే ఉన్న ఆస్తి పోతుంది, ఆపై అప్పూ అలాగే ఉండిపోతుంది. ఏ అప్పు మంచిదంటే.. అప్పు ఉన్నవాళ్లు చాలా మందే ఉంటారు. ఏ రకమైన రుణం కలిగి ఉన్నారన్నది ముఖ్యం. ఉదాహరణకు బ్యాంక్ ద్వారా తీసుకున్న హోమ్ లోన్ అనేది మంచి అప్పు. బ్యాంకేతర మార్గాల ద్వారా పొందిన ప్రైవేటు అప్పు ఎప్పటికైనా ముప్పే. తక్కువ వడ్డీకే హోమ్ లోన్ తీసుకున్నప్పుడు.. దాన్ని తీర్చడమెందుకు? కానీ, హోమ్ లోన్ తీర్చేయాలని ఆందోళన పడు తుంటారు. రూ.50 లక్షలు లోన్ తీసుకున్న ఓ వ్యక్తి 20 సంవత్సరాల పాటు వాయిదాలు చెల్లించడానికి అంగీకరిస్తాడు. తర్వాత ఈఎంఐలు కడుతున్న క్రమంలో 'నేను మొత్తం లోన్ పూర్తయ్యేసరికి అసలు రూ.50 లక్షలైతే, వడ్డీ రూ.70 లక్షలు చెల్లిస్తున్నా' ఇది అవసరమా? అని నిర్ణయానికి వచ్చేస్తాడు. కానీ, రూ.50 లక్షల అప్పుకు నెలనెలా కడుతున్నది రూ.48 వేలే కదా. పైగా రూ.50 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కొని, ఆ ఇంటిని అనుభవిస్తూనే కదా ఈఎంఐ కడుతున్నది. ఒకవేళ రూ.50 లక్షల విలువైన ఇంట్లో ఎవరైనా ఉండాలంటే ఈరోజుల్లో కనీసం రూ.13 వేలు అద్దె చెల్లించాలి. ఓ పదేండ్లు పోతే అదే ఇంటి అద్దె రెట్టింపు రూ.26 వేలు అవు తుంది. కానీ మీరు తీసుకున్న రూ.50 లక్షల అప్పు తీర్చడానికి మొదటి నెల నుంచి ఆఖరి నెల దాకా మీరు చెల్లిస్తున్న ఈఎంఐలో ఎలాంటి మార్పూ ఉండదు కదా?! అద్దె విలువ మారుతూ వచ్చిన పదేండ్లలో ఒకే ఈఎంఐ కడుతున్నారు కదా. అలాంటప్పుడు టెన్షన్ పడటం ఎందుకు ? ఇదే 'రూ.48 వేలు ప్రతి నెలా చెల్లిస్తా..' అంటే ఎవరైనా రూ.50 లక్షల అప్పు ఇవ్వగలరా? --- మాంద్యం ముంచుకొచ్చినా.. సగటు ఉద్యోగికి భయం.. మాంద్యం వస్తే తన కొలువు పోతుందేమోనని! వ్యాపారికి వణుకు.. అమెరికాలో మాంద్యం ప్రకంపనలు సృష్టిస్తే.. ఇక్కడ తన పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందని! పది, పదిహేనేండ్లకు ఒకసారి మాంద్యం ప్రపంచాన్ని తాకుతుంది. అంతమాత్రాన టెంటేలెత్తిపోవద్దు, ఒకవేళ ఆర్థిక మాంద్యం ఏర్పడినా.. బతుకు భారం కాకుండా జాగ్రత్తలు తప్పనిసరి, ఆర్థిక మాంద్యానికి నిపుణులు రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు. అయితే, ఉన్న ఉద్యోగాలు కోల్పోవడం, కొత్త కొలువులు లభించకపోవడం మాంద్యం వల్ల తలెత్తే ప్రధాన సమస్య. ఇలాంటి పరిస్థితులు ప్రపంచానికి కొత్తం కాదు. 1929లో అమెరికా మాంద్యంలో కూరుకుపోయింది. 2000 సంవత్స రంలో, 2008లోనూ ప్రపంచ ఆర్థిక రంగం దీని బారినపడింది. అయితే, మాంద్యం ప్రభావం ఏడాది నుంచి ఏడాదిన్నర వరకే కొనసాగుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ కొలువులో కుదురుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ, మాంద్యం పడగలో ఏడాది గడపడా నికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అత్యవసరం. అనుకోని సెలవులు. మిగతా రంగాలతో పోలిస్తే మాంద్యం ప్రభావం అత్యధికంగా ఉండేది ఐటీ సెక్టార్పైనే! గడి గడిచిన రెండేళ్లలో ఐటి ఉద్యోగుల వేతనాలు అంచనాలకు మించి పెరిగాయి పైగా ఈ రంగంలో రికార్డు స్థాయిలో నియమకాలు జరుగుతున్నాయి. మూడ్ లైట్ పేరుతో జంట ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు. అన్నిటిని మించి ఆర్థికంగా క్రమశిక్షణ పాటించేవారికి ఉన్న ఫలానా ఉద్యోగం ఊడిన మిల్లు విరిగి మీద పడేదే ఉండదు. ఏదో జరిగిపోయిందని హైరానా పడాల్సిన అవసరం అంతకన్నా లేదు పొదుపు చేసుకున్న డబ్బులను పదిలంగా -- వాడుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. మాంద్యం ప్రభావం గరిష్ఠంగా 18 నెలలకు మించి పోయిన ఏడాదిన్నర తర్వాత మళ్లీ కొత్త ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకంతో ఉండదని నిపుణుల మాట. అదృష్టం బాగుంటే ఈలోపుగానే మరో ఉద్యోగం దొరకొచ్చు. రాక ఉండాలి. తీరిక లేని బిజీలైఫ్లో అనుకోకుండా సెలవులు వచ్చాయని భావిస్తే ఉద్యోగం పోయిందన్న దిగులు ఉండదు. 'పొదుపు'గా వాడుకుంటే.. చనా సరళిని బట్టి జీవితం ఉంటుంది. మాంద్యమే వచ్చి ఉద్యోగం పోతే.. చేయగలిగేది ఏం ఉద్యోగ ఇదైపోతుంటే.. సెలవులు అనుకోవడం ఏంటి? అంటారా! మన ఆలో ఉండదు. అలాంటప్పుడు బెంగపడి సాధించేది ఏం ఉంటుంది! ఈ సమయంలో అపా _యాన్ని ముందే పసిగట్టి ఉపాయంతో గట్టెక్కినవాళ్లే సమర్థులు అనిపించుకుంటారు. భవిష్యత్ అవసరాలకు దాచుకున్న డబ్బును ఇప్పుడు నెలవారీగా వాడుకోవడం ఒక పరిష్కారం. 'బతి కుంటే బలుసాకు తినొచ్చు' అనే నానుడి ఉండనే ఉందిగా! ఇంట్లో ఆభరణాలు ఉంటే వాటిని కుదువ పెట్టి కష్టకాలాన్ని దాటేయొచ్చు. పిల్లల చదువుకని, ప్లాటు కొందామని దాచుకున్న డబ్బును సైతం నిర్మొహమాటంగా వాడుకోవచ్చు. మళ్లీ ఉద్యోగంలో చేరాక అన్నీ సమకూర్చు కోవచ్చు. అంతేకానీ, ఉద్యోగం పోయిందని, ఇక రాదని నీరుగారిపోతే వ్యక్తిగత సామర్థ్యం మసకబారుతుంది. మాంద్యం ప్రభావం తగ్గిపోయిన తర్వాత కూడా ఉద్యోగాల రేసులో వెనక బడే ప్రమాదం ఉంటుంది! కాకపోతే జీతం వస్తున్నప్పుడు ఖర్చు చేసినట్టు కాకుండా ఆచి తూచి వ్యవహరించాలి. అమెజాన్ సీఈవో బెజోస్ చెప్పినట్టు ఆర్భాటాలకు పోతే పొదుపు మొత్తం ఒక్క నెలలోనే కర్పూరంలా కరిగిపోతుంది. అలాకాకుండా, అందుబాటులో ఉన్న డబ్బును అత్యవసరాలకు వినియోగిస్తూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మాంద్యం లోనూ బేఫికర్ !! రుణం కాదు భారం.. ఉద్యోగం పోయిందని తెలిస్తే ఆప్తులు కూడా అప్పు ఇవ్వని రోజులు ఇవి. అందుకే, ఉద్యోగం కోల్పోతామని బలంగా భావించే వాళ్లు, జాబ్లో ఉండగానే పర్సనల్ లోన్ తీసుకోవడం ఒక మార్గం. ఉదాహరణకు నెలకు రూ.70వేలు వేతనం ఉందనుకోండి. రూ.10 లక్షల వరకు రుణం ఇట్టే పుడుతుంది. ఈఎమ్ఐ నెలకు రూ.23వేల వరకు ఉంటుంది. కుటుంబ ఖర్చులకు నెలకు రూ.50 వేలు, రుణం వాయిదా కోసం రూ.23 వేలు వాడుకున్నా.. ఏడాది గడిచిపో తుంది. ఇంకాస్త పొదుపుగా ఉండగలిగితే ఏడాదిన్నర గడిపేయొచ్చు. కొన్ని ఆర్థిక సంస్థలు ఓవర్ డ్రాఫ్ట్లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. మంజూరైన రుణం నుంచి వాడుకున్న మొత్తానికే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఏడాది తిరిగేసరికి మాంద్యం ప్రభావమూ తగ్గుతుంది. ఉద్యోగమూ వస్తుంది. తర్వాత తీరుబడిగా రుణ వాయిదాలు చెల్లిస్తే సరిపోతుంది. --- బంగారం కొనాలా? వద్దా? అలంకరించుకుంటే ఆభరణం. అప్పు పుట్టించే సాధనం. పెట్టుబడికి సువర్ణావకాశం బంగారం, భోషాణంలో ఎన్ని నగలు ఉన్నా.. కొత్తది కంటపడితే, దానినీ కొనాలని కోరుకోవడం సహజం. నాలుగు కాసులు వెనకేసుకోవాలని భావించేవాళ్లు అవి బంగారం రూపంలో అయితే మేలని భావిస్తుం టారు. ఇంతకీ పుత్తడి మీద పెట్టు బడి లాభదాయకమేనా? పసిడిని ఎప్పుడు ఒడిసి పట్టుకోవాలి? రతీయ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే భామన దేశంలో సీజన్తో సంబంధం లేకుండా పుత్తడి కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. ఆభరణాలుగా, కాయిన్లుగా, బిస్కెట్లుగా ఇలా రకరకాల రూపాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారాన్ని పెట్టుబడి వనరుగానూ చాలామంది భావిస్తుంటారు. అయితే, ఎప్పుడు కొనాలనే విషయంలో తర్జన భర్జ నలు పడుతుంటారు. రకరకాల సూత్రాలు పాటిస్తుంటారు. స్టాక్ మార్కెట్ జోరు మీదున్నప్పుడు పసిడి ధరలు తగ్గుతాయనీ, షేర్ మార్కెట్ బేర్ మంటే పుత్తడి ధరలకు రెక్కలొస్తాయని అంచనాలు వేస్తుంటారు. కానీ, బంగారం ధరలు స్టాక్ మా ర్కెట్ హెచ్చుతగ్గుల మీద కాకుండా, బ్యాంక్ వడ్డీ రేట్లపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయని నిపుణుల విశ్లేషణ, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు తగ్గినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగు తుంది. వడ్డీరేట్లు పెరిగినప్పుడు బంగారం కంటే.. ఎల్డీ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపు కుంటారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుంటుంది. భారీ లాభాలు ఉత్తమాటే. బంగారాన్ని చూస్తిగా పరిగణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో నష్టపోకుండా అమ్ముకు కాశం ఉంటుంది. అవసరానికి కుదువ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది! అయితే, భారీ బాలు ఆకాంక్షించేవారికి బంగారంపై పెట్టుబడుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపో --- వచ్చు. 2012లో తులం బంగారం ధర (10 గ్రాములు) రూ.31,000గా ఉంది. ఇప్పుడు రూ. 70,000 వరకు పెరిగింది. అంటే బంగారం ధర పుష్కర కాలానికి 2.25 రెట్లు రాబడి రాలేదు. కాకపోతే, రిస్క్ లేని పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తారు. అందుకే, ధరలు పెరిగిందన్నమాట! గత పదేండ్ల గణాంకాలు పరిశీలిస్తే.. బంగారంపై 8 శాతానికి మించి కాస్త. తగ్గాయని వార్తలు గుప్పుమనగానే పుత్తడి కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తారు. మంచి పెట్టుబడే.. లాభం ఎంత శాతం అనేది తర్కం పక్కన పెడితే.. బంగారంపై పెట్టుబడి మంచిదే! అయితే, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్తో పోలిస్తే దీర్ఘకాలంలో భారీ లాభాలైతే ఉండవు. కాక పోతే రిస్క్ చాలా తక్కువ. షేర్ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుంటుంది. కాకపోతే, ఉన్నాయంటే.. ఏ బ్యాంకు లాకర్లోనో భద్రపరిచే వరకు నిద్ర పట్టదు. ఏదేమైనా పుత్తడిని సమస్యగా భావించేవాళ్లు బాండ్ల రూపంలో కొంటుంటారు. ఇక ఇంట్లో పాతిక తులాల నగలు కేవలం పెట్టుబడి వనరుగానే పరిగణించొద్దు. స్థితిమంతులైనా, మధ్యతరగతి వాళ్లయినా బంగారాన్ని ఇష్టంగా కొంటారు. సొంతంగా అలంకరించుకోవాలని, కూతురు పెండ్లికని అడ పాదడపా ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. చిన్నదో, పెద్దదో నగానట్రా చేయిస్తూ ఉంటారు. అయితే బంగారాన్ని ఖరీదైన లోహంగానే చూడాలి తప్ప, దాని మీద వచ్చే లాభాల గురించి ఆలోచించొద్దు. నిగనిగలాడే నగను వేసుకున్నప్పుడు కలిగే సంతోషం ఎంత పెట్టుబడి పెట్టినా రాదు కదా! అంటే బంగారం కొనొద్దు అనుకోకండి. ఒకేసారి లక్షలు వెచ్చించొద్దు. కూతురు ప్రతి పుట్టిన రోజుకు తులమో, అరతులమో కొనండి. ఆమె పెండ్లినాటికి పదిహేను నుంచి ఇరవై తులాల బంగారం సిద్ధంగా ఉంటుంది. పెండ్లి సమయంలో పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి రాదు. శక్తి ఉంటే, అప్పటి వరకు దాచిన బంగారానికి మరింత జోడించి పెండ్లి కూతురును 'కనక మహాలక్ష్మిలా ముస్తాబు చేయొచ్చు. మీరూ అవునంటారు కదా!! అమెరికాలో పెరిగింది గోరంతే! 2012 ప్రాంతంలో అమెరికాలో ఔన్స్ బంగారం (28.34 గ్రాములు) ధర సుమారు 1,664 డాలర్లు. అప్పుడు మనదేశంలో బంగారం ధర సుమారు రూ.31,000. 2022లో అదే ఔన్స్ బంగారం ధర అమెరికాలో 2684 డాలర్లు మాత్రమే! మన దగ్గరికి వచ్చేసరికి రూ. 54,500గా ఉంది. పదేండ్లలో అక్కడ పెరిగింది వంద డాలర్ల లోపే! ఇక్కడ మాత్రం 75 శాతం వరకు పెరిగింది. బంగారంపై దిగుమతి సుంకం పెరగడం, డాలర్తో రూపాయి 5. మారకం విలువ దిగజారిపోవడం మనదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం. ---- స్కోర్ ఉంటేనే సరిపోదు! ఓ సగటు ఉద్యోగి లక్ష్యాల్లో 'సిబిల్ స్కోర్ కూడా ఒకటి. 'నా సిబిల్ స్కోర్ 750 ప్లస్ ఉందంటూ' ఘనంగా చెబుతుంటారు! ఇంతలా గర్వపడే వ్యవహారం ఏముందని అడిగితే 'ఈ స్కోర్ బాగుంటే ఏ లోన్ అయినా చిటికెలో వచ్చేస్తుంది' అని నమ్మకంగా చెబుతారు. కానీ, 'సిబిల్ స్కోర్'కు, రుణానికి మధ్య మనం ఊహిస్తున్నంత ప్రత్యక్ష సంబంధం ఏమీ ఉండదు! ఇంతకీ ఏమిటీ 'సిబిల్ స్కోర్'? ఒక వ్యక్తి రుణ పరపతికి సిబిల్ స్కోర్ అద్దం పడుతుంది. పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ఆధారంగా సదరు వ్యక్తి తీసుకునే రుణాలు, వాటిని తీర్చే తీరును బట్టి సిబిల్ స్కోర్ మార్పులు ఉంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) దీనిని నిర్వహిస్తుంటుంది. రుణం మంజూరు చేయ డానికి ముందు బ్యాంకులు వ్యక్తి రుణ పరపతి, వాయిదాలు చెల్లించే క్రమాన్ని సిబిల్ ఇచ్చే స్కోర్ ఆధారంగా అంచనా వేస్తాయి. అలాగని, ఈ స్కోర్ తక్కువ ఉంటే రుణం రాదనుకోవద్దు. స్కోర్ 800 ప్లస్ ఉన్నంత మాత్రాన దరఖాస్తు చేసు కున్న రుణాలన్నీ వస్తాయనీ భ్రమపడొద్దు. అవినాశ్, అనుదీప్ కథ చదివితే సిబిల్ స్కోర్ కథా కమామిషు కొంతవరకు అర్థమవుతుంది. చెల్లించే తాహతు ఉంటేనే.. ఆవినాక్, అనుదీప్ ఇద్దరు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులు. ఇద్దరికీ నెలకు చెరో రూ.60వేల జీతం వస్తున్నది. అవినాశ్ తన ఖర్చులు పోను నెలకు పదోపరకో పొదుపు చేసే రకం. క్రెడిట్ కార్డు ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించాడు. అనుదీప్ ఒక పర్సనల్ లోన్ తీసుకు నా రెండు క్రెడిట్ కార్డులు వాడుతున్నాడు. ఒక కార్డు మీద వ్యక్తిగత రుణం కూడా తీసుకు . ఇద్దరూ ఇండ్లు తీసుకుందాం అనుకున్నారు. బయానా ఇచ్చి గృహ రుణం కోసం బ్యాంకులను సంప్రదించారు. అవినాశ్ సిబిల్ స్కోర్ జీరో! అనుదీప్ స్కోర్ 820. చిత్రంగా.. -- సిబిల్ స్కోర్జీరో ఉన్న అవినాశ్కు గృహరుణం మంజూరైంది. మంచి స్కోర్ కలిగిన అనుదీప్ కు రుణం రాలేదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు! ప్రతినెలా క్రెడిట్ కార్డుల 1 బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎమ్ఐలు పక్కాగా తీరుస్తుండటంతో పాయింట్ల ఆధారంగా అను సిబి స్కోర్ పెరిగింది. కానీ, అతని ఆదాయంలో సగభాగం రుణాలు కట్టడానికే సరిపో తున్నది. కొత్తగా తీసుకునే రుణానికి వాయిదా చెల్లించే తాహతు అతనికి లేదని బ్యాంకువారు రుణం తిరస్కరించారు. అవినాశ్ విషయంలో సిబిల్ స్కోర్ లేకపోయినా.. వేతనం ఆధారంగా రుణం మంజూరు చేశారు బ్యాంకు అధికారులు, ఆ అనుభవం 'సిబిల్ స్కోర్' ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. తరచూ వద్దు... కొన్ని ప్రైవేట్ సంస్థలు 'చెక్ యువర్ సిబిల్ స్కోర్' అంటూ సందేశాలు పంపుతుంటాయి. వాటిని పట్టించుకోవద్దు! కానీ, కొంతమంది అత్యుత్సాహంతో అలా సందేశం రాగానే.. ఇలా తమ స్కోర్ ఎంతుందో చూసుకుంటూ ఉంటారు. వినియోగదారుడు వాడుతున్న క్రెడిట్ కార్డులు, తీసుకున్న లోన్లు, కడుతున్న వైనం ఇవన్నీ ఆ రిపోర్ట్ ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అతనికి ప్రత్యేకంగా ఒనగూరేది ఏమీ ఉండదు. కానీ, ఇలా తరచూ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తూ ఉండటం వల్ల ఆ వ్యక్తి గోప్యత ప్రమాదంలో పడొచ్చు. బ్యాంకు లోన్లకు, సిబిల్ స్కోర్కు ప్రత్యక్షంగా సంబంధం లేనప్పుడు ఆ స్కోర్ తెలుసుకొని మాత్రం చేసేది ఏముంటుంది!? అందుకే, సిబిల్ స్కోర్ డేంజర్ బెల్స్ మోగించొద్దు అంటే.. దాని గురించి పెద్దగా పట్టించుకోక పోవడం మంచిది. తీసుకున్న రుణానికి కచ్చితంగా వాయిదాలు చెల్లిస్తూ ఉంటే ఏ సమస్యా రాదు. మళ్లీ రుణం పుడుతుంది. ఎంత కచ్చితంగా కడుతున్నా.. ఆదాయంలో సింహభాగం వాయిదాలకే పోతే, సిబిల్ స్కోర్ 850 దాటినా చిల్లిగవ్వ అప్పు పుట్టదు !! పాయింట్లు ఇలా.. రుణ గ్రహీత కట్టే ఒక్కో వాయిదాకు ఇన్ని పాయింట్ల చొప్పున సిబిల్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. వాయిదా చెల్లింపు ఆలస్యమైనా, కట్టకపోయినా కొన్ని పాయింట్లు తగ్గుతుం టాయి. అయితే, కొందరు గృహ రుణం వాయిదాలు, కారు లోన్ ఈఎమ్ఐలు కచ్చితంగా కడుతుంటారు. క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎమ్ఐ విషయంలో చెల్లింపు తేదీ దాటాక నింపాదిగా కట్టడం, ఒక నెల కట్టకపోవడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల సిబిల్ స్కోర్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాదు, రుణదాతకు సెక్యూర్డ్లోన్స్ (ఇంటి రుణం, వాహన రుణం) సమయానికి చెల్లిస్తున్నా.. అన్సెక్యూర్డ్ లోన్స్ (వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు బిల్లులు) విషయంలో నిలకడ లేదని గుర్తించి పిల్లల చదువుకు, ఇతర ప్రత్యేక అవసరాల్లో రుణం దొరకని పరిస్థితి ఏర్పడవచ్చు. --- ష్యూరిటీ.. రియాలిటీ. ఒక సంతకం.. ఆటోగ్రాఫ్ బుక్ లో పెడితే మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే సంతకం హామీపత్రం మీద పెడితే.. హాని కొనితెచ్చుకున్నట్టే. 'నేను జిమ్మేదారు' అనే ఒక్కమాట అత్యవసర పరిస్థి తుల్లో సదరు హామీదారుడి దారులు మూసుకుపోయేలా చేసే ప్రమాదం ఉంది. ష్యూరిటీలో ఉండే రియాలిటీ తెలుసుకుంటే.. చిన్న సంతకం ఎలాంటి విపత్తులను తీసుకొస్తుందో అవగతమవుతుంది. రంగారావు పొదుపరి, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నగర శివారులో అంద చూశాడు. నచ్చగానే బిల్డర్కు బయానా ఇచ్చేశాడు. వారం తిరక్కుండా తను పొదుపు చేసుకున్న పది లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. పత్రాలన్నీ తీసుకొని గృహ రుణం కోసం బ్యాంకు తలు పుతట్టాడు. రంగారావు ఉద్యోగ వివరాలు, పే స్లిప్ చూసి మేనేజరు 'పక్షం రోజుల్లో ఇల్లు మీ పక్షం అవుతుంద'ని చెప్పాడు. తీరా పదిహేను రోజుల తర్వాత తను దరఖాస్తు చేసుకున్న రుణం తిరస్కరణకు గురైనట్టు వచ్చిన మెసేజ్ చూసి రంగారావు కంగుతిన్నాడు. కంగారుగా బ్యాంకుకు వెళ్లాడు. విషయం ఏంటని అడిగాడు. 'సిబిల్' స్కోర్ సరిగ్గా లేకపోవడంతో మీ రుణం తిరస్కరణకు గురైంది' అన్నాడు బ్యాం మేనేజర్ ఆరా తీస్తే గతంలో రంగారావు పెట్టిన హామీ సంతకం.. ఇప్పుడు ఆయనకు రుణం రాకుండా అడ్డుపడింది సిబిల్ స్కోర్పై ప్రభావం. మధ్యతరగతి ఉద్యోగికి సంపాదన తక్కువ.. బాధ్యతలు ఎక్కువ. దీనికితోడు మొహమా టమూ ఎక్కువే! తను మంచివాణ్ని అని రుజువు చేసుకోవడానికి అడిగిందే తడవుగా ష్యూరి లు ఇచ్చేస్తుంటాడు. ఒక వ్యక్తికి హామీ ఇవ్వడం అంటే.. తర్వాత జరిగే పరిణామాలకు -- పూర్తిగా తనే బాధ్యుడు అని ఒప్పుకోవడమే! సాధారణంగా చిట్స్, వ్యక్తిగత రుణం విష యంలో సంస్థలు గ్యారెంటీ అడుగుతుంటాయి. తమ పైకంలో పైసా కూడా నష్టపోవొద్దని సంస్థలు హామీ కోరుతాయి. అంటే, రుణగ్రహీత వాయిదాలు చెల్లించకున్నా, అనుకోకుండా మరణించినా ఆ సొమ్మంతా పూచీకత్తు ఇచ్చిన వ్యక్తి దగ్గర వసూలు చేసుకునేలా చట్టపరమైన భద్రత ఆ సంస్థలకు ఉంటుంది. అంతేకాదు, రుణం పొందిన వ్యక్తి వాయిదాలు ఆలస్యంగా చెల్లించినా.. ఆ ప్రభావం ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి సిబిల్ స్కోర్పై పడుతుంది. పైన పేర్కొన్న రంగారావు విషయంలో అచ్చంగా జరిగింది ఇదే! అతనికి ఎలాంటి రుణాలు లేకున్నా.. ఎవ రికో హామీ ఇవ్వడం, అతను సరిగ్గా వాయిదాలు చెల్లించకపోవడం రంగారావు సిబిల్ స్కోర్ పతనానికి కారణమయ్యాయి. మనవాడే అనుకుంటే.. బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీ కోరుతాయి. 'మనవాడే కదా!' అనే చిన్న ష్యూరిటీల విషయంలో చాలాసార్లు ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంటుంది. చిట్స్, అభిమానం ముందూవెనుకా ఆలోచించకుండా గ్యారెంటీ సంతకం చేయిస్తుంది. మంచివ్యక్తికే ష్యూరిటీ ఇచ్చినా.. ఆ తర్వాత అతని పరిస్థితి తలకిందులు అవ్వదన్న గ్యారెంటీ ఏముంది ? అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అప్పు ఇచ్చిన సంస్థలు చట్టపరంగా వాయిదాలు వసూలు చేసుకోవడం మొదలుపెడతాయి. ఒక్కోసారి అసలు లక్ష రూపాయలే అయినా.. వడ్డీతో మూడు లక్షలు కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. స్నేహితుడికి ఇచ్చిన హామీ.. కుటుంబానికి హానిగా పరిణమించే ప్రమాదం ఉంది. ఒక్కసారి పూచీకత్తు ఇస్తే ఆ ఉచ్చు తొలగిపోయే వరకు మెడమీద కత్తి వేలాడుతున్నట్టే అని గుర్తించాలి. నొప్పింపక తానొవ్వక. ఆ 'అంత్య నిష్టూరం కన్నా.. ఆది నిష్టూరం మేలు' అని పెద్దల మాట. ఎవరైనా పూచీకత్తు ఇవ్వమని అడిగినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి వారికి వివరించండి. హామీ ఇవ్వలేనని నిర్మొహమాటంగా చెప్పేయండి. అవతలి వ్యక్తి మెహర్బానీ కోసం సంతకం చేస్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే! స్నేహితులు అన్నాక ఒకరికొకరు ఆ మాత్రం సాయం చేసుకోలేరా అనుకోవచ్చు. అంతగా కావలసినవాడు అయితే, ఉన్నదాంట్లో లక్షో, రెండు లక్షలో అప్పుగా ఇవ్వండి. వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించమని చెప్పండి. ఆ 'గ్యారెంటీ ఇవ్వకపోతే మిత్రత్వం, బంధుత్వం దెబ్బతినవచ్చు' అని భయపడుతున్నారా? ఆర్థికాంశాలే ప్రధానంగా భావించే వ్యక్తులు ఇలాగైనా మీకు దూరమవడం మంచిదే కదా! = హామీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడితే.. ఆ అప్పు మీదిగా భావించి సంతకం పెట్టండి. రుణం తీరే వరకు మీరు, మీ కుటుంబం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారన్న సంగతి విస్మరించవద్దు. -- అప్పుడే అది.. లాభసాటి పెట్టుబడి! రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఓ పూట పస్తున్నా.. భవిష్యత్తు బాగుండాలనే! అయితే, భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయ లేకపోతే.. మనం చేసే కష్టం బూడిదలో పోసిన పన్నీరే! సుదూర లక్ష్యాలను నిర్దేశించుకొని, జీవితాన్ని పణంగా పెడతారు కొందరు. ఏండ్ల కేండ్లు నిరీక్షిస్తారు. తీరా అంతిమ ఫలితం రుచించకపోవచ్చు. ద్రవ్యోల్బణంతో బేరీజు వేయకుండా చేసే పెట్టుబడులు ఫలవంతం కావు. రోజుల్లో అయితే.. నేనూ, మీ వదిన పది రూపాయల్లో సినిమాకు వెళ్లి, ఆఇంటర్వెల్లో పాప్కార్న్ తిని, రిక్షాలో ఇంటికి వచ్చేవాళ్లం. ఇప్పుడు ఇద్దరు సినిమాకు వెళ్లాలంటే వెయ్యికి తక్కువ కావడం లేదు' అన్నాడు కాంతా రావు దీనంగా. రోజులు మారుతున్నకొద్దీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కానీ, ఊహించని పెరుగుదలకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే! కాంతారావు చిరకాల వాంఛ కారు కొనడం. అది తీరని కోరికగా మిగిలిపోయింది. 1986లో ఆయన లక్ష రూపాయల పాలసీ తీసుకున్నాడు. అప్పుడు అతని జీతం నెలకు రూ.870. ఆ పాలసీ మీద గంపెడాశతో చిన్నచిన్న అవసరాలనూ కాదనుకున్నాడు. ఏడాదికి రూ.4,000 ప్రీమియం చెల్లించడం మొదలుపెట్టాడు. 'ఎందుకండీ, ఇన్ని పాట్లు?' అని కాంతారావు భార్య కాంతమ్మ పెదవి విరిస్తే.. 'మొద్దూ, మూడు లక్షలు వస్తాయే' అన్నాడు. దానికి ఆమె ముక్కున వేలేసుకొని 'మూడు లక్షలా? ఆ మూడు లక్షలు ఏం చేద్దాం?' అని అడిగింది. 'రెండు లక్షలు పెట్టి రెండు కార్లు కొంటాను. ఒకటి నీకు, ఒకటి నాకు. ఇంకో లక్షపెట్టి ఈ పెంకుటిల్లు పడగొట్టి డాబా కట్టించేస్తాను' అనేవాడు ఛాతి వెడల్పు చేసుకొని. ఇలా పాతికేండ్లు కండ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూశాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. బీమా కార్యాలయం నుంచి పాలసీ మొత్తం చెక్కు రూపంలో వచ్చింది. అక్షరాలా మూడు లక్షల రూపాయలు. పాతికేండ్లుగా ఎదురుచూస్తున్న పైకం అది. --- కారు కొందామని ఆరాతీస్తే.. బేసిక్ మాడల్ కారే రూ.3.50 లక్షలుగా తేలింది. బీమా డబ్బుతో రెండు కార్లు, ఒక ఇల్లు కట్టేయొచ్చు అని బలంగా భావించిన కాంతారావుకు ఆ. క్షణం ప్రపంచం అంతా మిథ్యగా తోచింది. కారు కల కలగానే మిగిలి పోయింది. అర్థం కాని వారికి ప్రపంచమంతా మిథ్యే! సరిగ్గా అర్థం చేసుకుంటే.. ధనం విలువ ద్రవ్యోల్బణంపైనే ఆ రపడి ఉందని బోధపడుతుంది. పాలసీ రిటర్న్ గానీ, పెట్టుబడికి వచ్చే లాభ శాతం గానీ ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా ఉందో బీమా పాలసీ తీసుకున్నా, పెట్టుబడి పెట్టినా భవిష్యత్ అవసరాల కోసమే! అయితే, సదరు లేదో చూసుకోవాలి. లాభ శాతం ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా ఉంటేనే పెట్టుబడి సార్థకమై నట్టు భావించాలి. పదేండ్ల కిందట రూ.10 వేలలో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా బతికే వారు. అదే ఇప్పుడు రూ.25 వేలు లేనిదే ఒక జంట బతకలేని పరిస్థితులు ఉన్నాయి. కారణం ద్రవ్యోల్బణమే! కొనే వస్తువులు, పొందుతున్న సేవల ధరలు ఇన్షన్ మీద ఆధారపడి మనం పెట్టే పెట్టుబడిపై లాభం ఏడుశాతానికి మించి ఉంటేనే నిజమైన లాభం పొందగలం. విద్యారంగంలో ఫీజుల పెరుగుదల ఏడాదికి 12 శాతంగా నమోదవుతున్నది. వైద్యరంగంలో ఇది 14 శాతంగా ఉంది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే.. ఒక వ్యక్తి పెట్టుబడి ద్వారా పొందే లాభం కనీసం 12 శాతంగా ఉంటేనే గానీ, ఆ పెట్టుబడి గిట్టుబాటు కాదని తెలుసుకోవాలి. ఫ్యూచర్ ప్లాన్స్.. " మన ఖర్చులు ఆదాయంలో యాభై శాతం దాటకుండా చూసుకోవడం కన్నా గొప్ప ఆర్ధిక సూత్రం లేదు. మిగిలిన యాభై శాతం కొంత మేరకు, మిగతా ఇన్వెస్ట్మెంట్ డబ్బును బ్యాంకులో ఎల్డీ చేసినా.. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. = ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 7 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వచ్చే నమ్మకమైన రంగాల్లో పెట్టు బడి పెట్టొచ్చు. షార్టర్మ్ రిస్క్ ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్. భవిష్యత్తును అంచనా వేయాలి. పదేండ్ల కిందటికి, ఇప్పటికి పరిస్థితులు ఎంత మారాయో.. కనిపిస్తూనే ఉంది. రాబోయే పదేండ్లలో ఎలా ఉంటాయో కూడా అంచనా వేయవచ్చు. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. పదేండ్ల తర్వాత చేయాలనుకున్న కూతురు పెండ్లి కోసం ఇప్పుడు పది లక్షలు దాచిపెటే సరిపోదు. ఆ పది లక్షలు పెండ్లినాటికి పాతిక లక్షలు అయ్యేలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల విషయంలో స్పష్టత ఉండాలి. --- స్వచ్ఛంద ఆనందం. అన్ని బాధలు తీరి, కృష్ణారామా అనుకుంటూ కాలం గడపడమే శేష జీవితమని అందరి నమ్మకం. అరవై దాటాక ఆరోగ్యంగా ఉంటే దాన్ని విశేష జీవితం అని గొప్పగా అభివ స్తారు. కానీ, కాలంతో పరిగెత్త కుండా నచ్చిన పనులను బేషరతుగా చేయడమే నిజమైన పదవీవిరమణ అంటున్నారు ఆధునికులు. దీపం ఉన్నప్పుడు ఇల్లు మాత్రమే కాదు, భవిష్యత్తును చక్కదిద్దుకొని ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. కొలువులో చేరిన నాడే సగటు ఉద్యోగి రిటైర్మెంట్ ప్లాన్ వేసుకుంటాడు. తీరిక దొరికినప్పుడల్లా కుర్చీలో సాగిలపడి 'ఆఫ్టర్ రిటైర్మెంట్..' అను కుంటూ ఏవేవో ఊహించేసుకుంటాడు. చిన్నపొలం, అందులో ఓ కుటీరం, మంచు కురిసే ఉదయం, చిక్కటి కాఫీ సిప్ చేస్తూ భార్యతో కులాసాగా కబుర్లా డటం.. ఇలా సహోద్యోగి తట్టి లేపే వరకూ పగటి కలల్లో మునిగిపోతాడు. పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ సాధ్యమే! నలభై ఏండ్లు గొడ్డులా చాకిరి చేసి, అరవై ఏండ్లకు పదవీ విరమణ పొందిన సగటు ఉద్యోగికి చిన్నపొలం పెద్ద విషయం కాదు. అందులో కుటీరమూ ఊహించిన దానికన్నా గొప్పగా కట్టు కోవచ్చు. కానీ, దట్టంగా కురిసే మంచు ఆ వయసులో శరీరానికి పడకపోవచ్చు! చిక్కటి కాఫీ చేయడానికి ముందు 'షుగర్ టాబ్లెట్ వేసుకున్నారా?' అని జీవిత భాగస్వామి గుర్తు చేయాల్సి రావొచ్చు! మరి ఇన్ని సంపాదించి ఏం ప్రయోజనం? ఈ ప్రశ్నకు సమాధానంగా స్వచ్ఛంద పదవీ విరమణ దిశగా అడుగులు వేస్తున్నారు నేటి ఉద్యోగులు. శేష జీవితాన్ని | విశేషంగా గడపాలని ముందస్తుగా కొలువుకు టాటా చెబుతున్నారు. ఆనందం కోసం.. ఏదైనా సాధించాలంటే ఫైర్ ఉండాలి' అంటుంటారు పెద్దలు. అదే ఫైర్ జీవితాన్ని తీర్చిది కుంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్-రిటైర్ ఎర్లీ (ఫైర్).. ఇప్పుడు ఇదే సూత్రాన్ని --- ఫాలో అవుతున్నారు. పదవీ విరమణ అంటే పనికి విరమణ కాదు. భారంగా బతుకీడ్చడం అంతకన్నా కాదు. కుటుంబ అవసరాలు, బాధ్యతలు అన్నిటికీ సరిపడా ఆర్థిక వనరులు ముందస్తుగా సిద్ధం చేసుకోవడం. అలాగని, పదికోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పనీపాటా లేకుండా వడ్డీ మీద జల్సారాయుడిలా బతకడం అస్సలు కాదు. ఆర్థికంగా కావాల్సినంత వెసు లుబాటు ఉండాలి. ఉద్యోగమూ చేయాలి. 'రిటైర్ అయ్యాక ఇంకా ఉద్యోగం ఏమిటి?' అంటారా! ఇన్నాళ్లూ చేసింది పొట్టకూటికి, ఇప్పుడు చేసేది ఆత్మతృప్తికి. 9 టు 5.. జాబ్ చేయాలనేం లేదు. మీ శక్తియుక్తులు చాటుకునే ఉద్యోగం ఏదైనా చేయవచ్చు. ఒకరకంగా ఆది క్షేపానికి కొలువు చేయాలి. డబ్బు కోసం కాకుండా ఆనందం కోసం చేయాలి. నచ్చిన పని చేసుకుపోవడమే. నచ్చనప్పుడు మానేయడం. నచ్చిన చోటుకు వెళ్లిపోవడం. నచ్చినన్ని రోజులు గడపడం, వీటన్నిటికీ సరిపడా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడమే ఫైర్! అసాధ్యం కాదు! అరవైలో రిటైర్మెంట్ సహజమే! కానీ, పాతికేండ్ల వయసులో ఉద్యోగంలో చేరినవాళ్లు 20 ఏండ్లు పనిచేసి 45కే కొలువుకు టాటా చెబుతున్నారు. పిల్లల చదువులు, పెండ్లిండ్లకు సరిపడా డబ్బును బాండ్లు, ఎల్డీ రూపంలో దాస్తున్నారు. రాబడి వచ్చే స్థిరాస్తులు పోగు చేసుకుంటు న్నారు. నడివయసులోనే బాధ్యతలన్నీ తీర్చేసుకొని జీవితాన్ని తీరిగ్గా అనుభవిస్తున్నారు. చిన్న ప్పటి కలలన్నిటినీ నెరవేర్చుకుంటున్నారు. ఉద్యోగంలో చేరి మొదటి జీతం అందుకున్నప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే 'ఫైర్' అసాధ్యమేమీ కాదు. ముందస్తు పదవీ విర మణ వల్ల.. వెల కట్టలేని సమయం మీ చేతుల్లో ఉంటుంది. కాలాన్ని ఆరోగ్యవంతంగా, ఆహ్లా దకరంగా ఆస్వాదించడమే కదా విశేష జీవితం'. ముప్పయ్ ఏండ్ల తర్వాత.. ఆర్థిక అవసరాలను తక్కువ అంచనా వేయడం కూడా మంచిది కాదు. 1990లో కిలో బియ్యం ధర రూ.5. ఇప్పుడు రూ.50 పైమాటే! అంటే పదింతలు పెరిగింది. ఇదే సూత్రాన్ని ఇంటి ఖర్చులకు అన్వయిస్తే 1990 ప్రాంతంలో రిటైర్ అయిన భార్యా భర్తల జీవనయానానికి రూ.1,000 లోపే ఖర్చేయ్యేది. 2020కి వచ్చేసరికి అది కాస్తా రూ.10,000 వరకు ఉంది. ముప్పయ్ ఏండ్ల తర్వాత ఈ మొత్తం లక్షన్నర రూపాయలకు చేరుకుంటుందంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఇరవై ఏండ్ల తర్వాత.. అంటే 2042లో రిటైర్మెంట్ అనుకుంటే, తర్వాత మరో ర జీవితం ఉంటుంది. అంటే 2062లో ఇద్దరు బతకడానికి రూ. 3లక్షలు అవసరం కావచ్చు. అందుకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తప్పనిసరి ఆ ఏడాదికి రూ. మూడు లక్షలు వచ్చే పాలసీ చేసి, పాతికేండ్ల తర్వాత ఫర్వాలేదులే అనుకుంటే ఎలా? అప్పుడు మీ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. --- రిటర్న్స్ చూడు గురూ.. బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచిలాభాలే వస్తాయి. పాతి కేండ్ల కిందట ఓ ఐదు తులాల బంగారం తీసుకున్నారే అనుకుందాం! అప్పటికీ, ఇప్పటికీ ధరలో ఊహించని మార్పే వచ్చింది. కానీ, పాతికేండ్ల సుదీర్ఘ కాలాన్ని విస్మరిస్తే ఎలా? ఆర్థిక గణాంకాల ప్రకారం బంగారం మీద లాంగ్టర్మ్ వచ్చే రిటర్న్స్ ఎనిమిది శాతం దాటదు. ఇంత తక్కువ మార్జిన్ కోసం శుద్ధమైన బంగారం కొని బీరువాలో భద్రపరిస్తే ఎవరికి ప్రయోజనమో ఆలోచించండి? అదే కాలవ్యవధిలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్టర్మ్లో 18 శాతం వరకు రిటర్న్స్ అందిస్తున్నాయి. గోల్డ్ ధర పెరగడమే మనకు గుర్తుంటుంది. తగ్గడాన్ని మాత్రం గుర్తించం. 1995 నుంచి 2003 మధ్య బంగారం ధరలో పెద్ద వ్యత్యాసమే లేదు. ఎనిమిదేండ్లు నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చాయన్న సంగతి విస్మరించొద్దు. ఇటీ వల బంగారం ధర బాగానే ఎగబాకింది! ఇది ఇలాగే కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. ధర పెంపును చూడటం కాదు.. దీర్ఘకాలంలో రిటర్న్స్ పర్సంటేజీని పరిగణనలోకి తీసుకోవాలి. బంగారంపైనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే.. ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం ఉత్తమమైప పద్ధతి అనిపించుకుంటుంది. బిస్కెట్ బంగారం కొన్నారే అనుకుందాం! ఆర్నమెంట్స్ తప్ప బిస్కెట్ గోల్డ్పై బ్యాంకులు రుణాలు ఇవ్వవని గుర్తుంచు కోండి. ఎంతో కష్టపడి కూతురు పెండ్లి కోసం ఏడాదికో తులం చొప్పున బిస్కెట్ గోల్డ్ కొనుగోలు చేశారే అనుకుందాం. ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడింది! ఆ బిస్కెట్లు బ్యాంకుకు తీసుకెళ్తే.. నగలు మలిచి తీసుకురమ్మని చెబుతారు. అదేదో ముందునుంచే ఏటా ఓ ఆర్నమెంట్ తీసుకొని ఉంటే.. సమస్యే ఉండదు! బంగారం ధర పెరిగితే సంతోషం! పెరగకపోయినా ఆ వస్తువు ఉంటుంది. దాన్ని మనం అనుభవిస్తూ ఆనందిస్తాం. వస్తువైతే తరిగిందన్న బాధ ఉండదు. ఎమోషనల్ సాటిఫ్యాక్షన్ ఉంటుంది కదా! --- భవిష్యత్తు తలుచుకో.. ఈ రోజు మోకాలి చిప్పల మార్పిడి చికిత్సకు సుమరు ఐదు లక్షల రూపా.. యలు చెల్లించాల్సి వస్తున్నది. పదేండ్ల కిందట ఇదే సర్జరీ లక్షన్నరలో అయిపోయింది. ఇప్పుడు మోకాళ్ల శస్త్రచికత్సకు ఐదు లక్షలు అవుతుంటే.. ముప్పయ్ ఏండ్ల తర్వాత కోటి రూపాయలు దాటిపోతుందంటే నమ్ము తారా! వైద్యరంగంలో ద్రవ్యోల్బణం మార్కెట్ రేటును మించి ఉంటుంద న్నది సత్యం. ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం. 1994 ప్రాంతంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వ్యక్తితో ఏజెంట్ ముప్పయ్ ఏండ్ల తర్వాత మోకాలి కీళ్ల మార్పిడికి రూ.5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెబితే.. అతను నమ్మి ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడు అదే నిజమైందిగా! మరో ముఖ్య విషయం హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకో వాలి. వయసు పెరిగే కొద్దీ రోగాలు పలకరిస్తాయి. రుగ్మతలు కలిగితే.. ప్రీమియం పెరుగుతుందని భావిస్తారు కానీ, అసలు పాలసీ వచ్చే అవ కాశం ఉండదు. అందుకే ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఆరోగ్య బీమా తీసుకో వాలి. 'ఆరోగ్య బీమా మాకు అవసరం రావొద్దు' అనుకుంటూనే దస్త్రంపై సంకతం పెట్టండి. ఒకవేళ ఏ ప్రమాదమో, అనారోగ్యమో పలకరించినా.. మీ ఆర్థిక మూలాలకు ఏ అపాయమూ వాటిల్లదు. లేకపోతే.. ఆస్పత్రి పాలయ్యాక బాధపడాల్సి వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండి మీ పాలసీ వాడుకోలేదంటే.. దానర్థం, మీరు కట్టిన ప్రీమియమ్ డబ్బులు.. పాలసీ క్లెయిమ్ చేసుకున్న వ్యాధిగ్రస్థుడికి ఉపయోగపడ్డాయన్నమాట!హెల్త్ ఇన్సూరెన్స్ అంటే.. పూలింగ్ ఆఫ్ రిస్క్! ఇది నిజమైన చారిటీ. అందరి డబ్బూ కలెక్ట్ చేసి.. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం అన్నమాట! అలా పరోక్షంగా మీరు వారికి సాయం చేస్తున్నారు! తిరుపతి హుండీలో డబ్బు వేస్తే ఎలాగైతే పుణ్యం వస్తుందో.. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టినా అలా మీరు ధన్యులు కావొచ్చు.! --- ఆస్తి బారెడు.. అవసరం తీరదు! తరాలకు తరగని ఆస్తులు ఉన్నా.. అవసరానికి డబ్బు లేక, అప్పు కోసం పడిగాపులు కాస్తుంటారు. నిజమైన ఆస్తి ఏంటో తెలియకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఆస్తులు బారెడు ఉన్నా.. అవసరానికి డబ్బు అందుబాటులో లేకపోవడాన్ని ఆర్థిక పరిభాషలో 'అసెట్ రిచ్.. క్యాష్ పూర్' గా చెబుతారు. ఈ పదజాలం సంగతి తెలుసుకుంటే నిజమైన ఆస్తి అంటే ఏంటో అర్థమవుతుంది. దొరలు దోచలేని, దొంగల ఎత్తుకుపోలేని నిజమైన ఆస్తి విద్య, పంచేకొద్దీ పెరుగుతుంది ఇది. మిగిలిన ఆస్తులన్నీ కాలంతో కరిగిపోయేవే! అదేంటి, స్థిరాస్తుల విలువ కాలంతో పరుగులు తీస్తూ పెరుగుతుంది కదా! అంటారేమో!! కానీ, 'అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి' నానుడి ఉండనే ఉందిగా! స్థిరాస్తులు కూడబెట్టడం విజయవంతమైన మదుపు విధానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, సంపాదించినదంతా స్థిరాస్తి రూపంగా మారిస్తేనే సమస్య! ఆస్తిపరుడు, ధనవంతుడు.. ఈ రెండిటి మధ్య హస్తిమశకాంతరం తేడా కనిపిస్తుంది. ఊరు చివర మామిడితోపుల్లో 5 అవసరానికి ఈ ఆస్తులు తనఖా పెడితేగానీ లక్ష రూపాయల అప్పు పుట్టదు. అదే మన మూడెకరాలు, నగర శివారులో ఓ ప్లాటు ఇలా లెక్కకు మించిన స్థిరాస్తులు ఎన్ని ఉన్నా.. | సంపాదనలో స్థిరాస్తితోపాటు లిక్విడ్ అసెట్ (నగదు రూపంలో ఆస్తి) కొంత భాగం కేటాయిం చగలిగితే అత్యవసర పరిస్థితుల్లో అడ్డెకు పావు సేరుగా ఆస్తులు అమ్ముకునే దుస్థితి తలెత్తదు. కొనేవాడు ఉండాలి.. చేతిలో డబ్బు ఉన్నవాడే నిజమైన శ్రీమంతుడని అంటారు ఆర్థిక రంగ నిపుణులు. ఎంత ఆస్తి ఉన్నా.. అప్పు కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగేవారు చాలామంది తారసపడుతుం . అవసరానికి 'దేహీ' అనాల్సివస్తే ఎన్ని ఆస్తులు ఉన్నా ఏం ప్రయోజనం? ఆస్తుల విష --- యంలో చాలామంది రెగ్యులర్ ఫార్ములాను ఎంచుకుంటారు. భవిష్యత్ అవసరాల కోసం సైసాపైసా కూడబెట్టి ప్లాట్లు, పొలాలు, ఇల్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. చిట్టీలు కన్ అప్పులు చేసి మరీ ఆస్తులు కొంటారు. ఫలానా ప్లాటు పెద్దకూతురు పెండ్లికని, ఇంకో ప్లాటు చిన్నకూతురు మెడిసిన్ కోసం అని మురిసిపోతారు. తీరా ఆ అవసరాలు ముందుకు అన్నీ ఆ ప్లాటు మీదే పెట్టుకుంటే తాంబూలాలిచ్చేశాక ఆ యజమాని పడే పాట్లు అన్నీ కావు. మంచి సంబంధం తప్పిపోతుందని, ముహూర్తం దగ్గర పడుతుందని మార్కెట్ వి నలో సగానికే బేరం కుదుర్చుకుని మానసికంగానూ కుంగిపోవాల్సి వస్తుంది. దీనికితోడు కోట్ల విలువ చేసే భూముల విషయంలో ఒక్కోసారి లీగల్ సమస్యలు ఉత్పన్నమై అసలుకే ఎసరు రావొచ్చు. ఏ మహానుభావుడో అనుకున్న ధరకు ప్లాటు కొన్నా.. ఆ మొత్తాన్ని ఖాతాలోకి పంపుతాడన్న నమ్మకం లేదు. లక్షలాది రూపాయలను నగదు రూపంలో చిన్నకూతురు మెడి నీ ఫీజుగా చెల్లించే అవకాశం ఉండదు. ఇచ్చిన డబ్బుకు లెక్కా పత్రం చూపలేకపోతే కొత్త ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదమూ ఉంది. రాబడినిచ్చే ఆస్తులు. రాబడి బాగుం కాలానికి తగ్గట్టుగా, రొటీన్క భిన్నంగా ఆలోచిస్తే మీ సంపాదనను బహుళార్ధ ప్రయోజనకా రిగా మార్చుకోవచ్చు. ఆర్థిక లక్ష్యాల పరంగా ఆస్తులను సమకూర్చు కోవాలి. కొంత స్థిరాస్తి కొనుగోలు చేయాలి. ఆదాయాన్ని ఇచ్చే స్థిరాస్తి అయితే మరీ మంచిది. ఇల్లు తీసుకుంటే నెలకు అద్దె ఆదాయంగా వస్తుంది. దుకాణాల్లాంటి కమర్షియల్ ఆస్తుల ద్వారా టుంది. పొలం తీసుకుంటే.. పెట్టిన పెట్టుబడికీ, వచ్చే ఆదాయానికీ పొంతన కుదరదు. ఆదా యంలో కొంత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మార్కెట్లో హెచ్చుతగ్గు లను అంచనావేస్తూ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, అవసరానికి కాస్త ముందుగానే నగదు రూపంలోకి మార్చుకోవడం తెలివైన పని. అన్నిటికీ మించి మీ స్థాయికి తగ్గట్టుగా కొంత మొత్తం నగదు రూపంలో మీ ఎల్డీలో ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఈ ఆర్థిక సూత్రాన్ని పాటిస్తే 'అసెట్ రిచ్.. క్యాష్ రిచ్' కేటగిరీలో ఉంటారు కాబట్టి, ఏ అవసరం వచ్చినా.. ఎవరి దగ్గరో చేయి చాచాల్సిన అవసరం ఉండదు. మూడేండ్ల ముందుగానే. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆస్తులను నమ్ముకుంటే ఎంతోకొంత నష్టం తప్ప ఉదాహరణకు కూతురు పెండ్లికి రెండు నెలల ముందు భూమి అమ్మకానికి పెడితే, అనుకున్న నప్పుడు స్థిరాస్తిని అమ్మేయడం మంచిది. వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ / పెండ్లికి మూడేండ్ల ముందుగానే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. మార్కెట్లో మంచి ధర పలికి మొత్తం వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. కూతురు పెండ్లీడుకు వచ్చినప్పటి నుంచి అంటే చేసుకుంటే.. గంటల వ్యవధిలో మీ నగదు మీ చేతుల్లో ఉంటుంది. --- స్థలం కొనాలా.. ఇల్లు కొనాలా? ఇల్లు కట్టించాలా ? ప్లాట్ తీసుకో నగర శివారులో స్థలం కొనాలా?.. చాలామంది ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతుం టారు. దేనికో కట్టుబడి పట్టుదలతో పెట్టుబడి పెట్టేస్తారు. ధర పెరిగితే సంతోషమే! కానీ, తేడా జరిగితేనే కష్టార్జితం బూడిదపాలై పోయిందని బాధపడాల్సి వస్తుంది. స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందులో ఉండే సాధకబాధకా లేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఒక సగటు ఉద్యోగి జీవితంలో కాస్త కుదురుకున్నాక ఇల్లు కొనాలనుకోవడం సహజం. మొదటి పెట్టుబడి సొంతిల్లే కావాలి. అది ఇండిపెండెంట్ ఇల్లా, ఫ్లాటా అన్నది వారివారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా నిర్ణయించుకోవాలి. సొంతింటి కల నెరవేరిన తర్వాత.. చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి పక్కాగా ఆలోచిం చాలి. 'ఎందులో ఎక్కువ లాభం' వస్తుంది అనుకోవడం కన్నా.. మన అసలుకు ఎసరు రాకుండా చూసుకోవడం ప్రధానం అని గ్రహించాలి. ప్లాట్, ఫ్లాట్ రెండూ మంచి ఇన్వెస్ట్మెంట్లే! అయితే, రెండిటి లాభాల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లే.. రిస్క్ లోనూ వ్యత్యాసం ఉంటుంది. ప్లాట్ కొనాలంటే.. రియల్ఎస్టేట్లో పెట్టుబడికి అందరూ మొగ్గుచూపుతారు. కారణం మూడునాలుగేండ్లలో రెండింతలు అవుతుందన్న నమ్మకం. అయితే, మొదటి రెండేండ్లు ఉన్నంత జోరు తర్వాత ఉండకపోవచ్చు. మార్కెట్ అంచనాల ప్రకారం ప్లాట్ ధర సరాసరి ఆరేండ్లకు రెం అవుతుంది. అంటే ఏడాదికి 12 శాతం వడ్డీ గిట్టుబాటు అవుతుందన్నమాట. అధిక లాభం కున్నా.. న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొందరైతే తక్కువ ధరకు ఉన్నచోటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ప్లాట్ కొనుగోళ్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసు వస్తుంది కదా! అని లిటిగేషన్ ప్లాట్లు కొనడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్లాట్ కొనేవరకూ ఉన్న --- ఉత్సాహం కొన్నాళ్లకు తగ్గిపోతుంది. ఎక్కడో ఉన్న స్థలాన్ని తరచూ వెళ్లి చూడటం కుదరదు. చుట్టుపక్కల పరిస్థితులు ఎలా మారుతున్నాయో పట్టించుకునే తీరిక కూడా ఉండదు. ఓ పదేండ్ల తర్వాత వెళ్తే.. మన ప్లాట్ ఎక్కడుందో తెలుసుకోవడం గగనమే! ఎంత కాదన్నా భూముల విషయంలో ఇలాంటి రిస్క్లలు ఎప్పుడూ ఉంటాయి. అలాఅని ప్లాట్ కొనొద్దని కాదు! ధర కాస్త ఎక్కువగా ఉన్నా అప్రూవ్డ్ లేఅవుట్లో కొనడం మంచిది. భూమి కొన్న వెంటనే దాని చుట్టూ కాంపౌండ్ వాల్ గానీ, ఫెన్సింగ్ గానీ చేయిస్తే మరీ మంచిది. అన్నిటి కన్నా ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు ఏమీ లేవని తేలాక గానీ, భూమిపై పెట్టుబడి పెట్టాడు. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు రియల్ మార్కెట్ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందడుగు వేయాలి. ఫ్లాట్ కొనేముందు. నగరజీవికి యాభై, అరవై లక్షల్లో ఇల్లు కావాలంటే.. ఫ్లాట్ ఒక్కటే మార్గం! అయితే, ఫ్లాట్ మీద పెట్టుబడి పెట్టొచ్చా? లేదా? అన్నది చాలామంది అనుమానం. ప్లాట్తో పోలిస్తే ఫ్లాట్ మీద రిస్క్ తక్కువనే చెప్పొచ్చు. కబ్జా జరిగే అవకాశం దాదాపు ఉండదు. పొజిషన్లో (అదే ఫ్లాట్) ఉంటారు కాబట్టి రిస్క్ ఉండదు. అద్దెకు ఇచ్చినా నెలకు రూ.15,000 వరకు డ్లలో రెట్టింపు కాకపోవచ్చు. కానీ, మార్కెట్ విలువ, నెలకు వచ్చే అద్దె కలిపి లెక్కిస్తే ఏడా వస్తుంది. అంటే ఫ్లాట్ను ఆదాయాన్నిచ్చే ఆస్తిగా పరిగణించాలి. భూమిలా ఫ్లాట్ విలువ ఆరేం 10 శాతం వడ్డీ చొప్పున ఫ్లాట్ ధర పెరుగుతుంది. ఇరవై ఏండ్లు పోతే ఫ్లాట్ పాతబడిపోతుంది. కదా! అంటారా? అన్లివైడెడ్ షేర్ కింద వచ్చే స్థలం ధర అప్పటికి మూడింతలు పెరుగు తుంది కాబట్టి ఇబ్బందేం ఉండదు. ఇక ఇండిపెండెంట్ ఇల్లు కొనే స్తోమత ఉంటే.. ఇంటిపైన ఇల్లు వేసే అవకాశం ఉంటుంది. నెలవారీ రాబడితోపాటు, ఇంటి విలువ పెరుగుతుంది. అయితే, ఇల్లంతా అద్దెకు ఇవ్వడం కన్నా.. అందులో ఉంటూ, పై పోర్షన్లు అద్దెకిస్తే రిస్క్ లేకుండా ఉంటుంది. లెక్క చూపించాల్సిందే! మామూలుగా ప్రభుత్వ ధరకు, మార్కెట్ విలువకు ఓపెన్ ప్లాట్ల ధరల్లో భారీ వ్యత్యాసం కడు స్తుంది. తక్కువ ధరకు ప్లాట్ కొన్నా.. దాని విలువ ఊహించనంతగా పెరిగినా.. దాన్ని విక యించినప్పుడు యజమానికి ఓ చిక్కు ఉంటుంది. ప్లాట్ లావాదేవీలు నగదు రూపంలో క గితే.. ఆ మొత్తాన్ని ఖాతాలో చూపించలేకపోతారు. అలాగని ధరంతా చెక్కు రూపంలో మండ జెప్పాలని చెబితే.. అంత మొత్తం న్యాయ సమ్మతంగా బదిలీ చేసే బయ్యర్ దొరకడు. కాళ మీ పూర్తి ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ ఆస్తులు యాభై శాతానికి మించకుండా జాగ్రత్తపడటం | అత్యావశ్యకం. --- నలభైలో నడుం బిగించాలి! ఒక విద్యార్థికి పదో తరగతి తర్వాత నాలుగు మార్గాల కూడలి తారసప డుతుంది. తన ఆసక్తి మేరకు దారి ఎంచుకుంటాడు. ఉద్యోగి జీవన గమనంలో 40 ఏండ్లప్పుడు కీలక కూడలి ఎదురవుతుంది. బాధ్యతలు, భవిష్యత్ అవసరాలు హెచ్చరిస్తుం టాయి. వీటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు నడిస్తే ఏ ఇబ్బందీ ఉండదు! అప్పుడు దారి తప్పితే, యాభైలలో 'అమ్మో! ఒకటో తారీఖు' అనుకునే పరిస్థితి వస్తుంది. నడి వయసుకు నాంది నలభైతోనే మొదలవుతుంది. ఆర్థికంగా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాల్సిన వయసు అది. గతంలోని పెట్టుబడులను సమీక్షిం చుకొని, భవిష్యత్ అవసరాలను బేరీజు వేసుకోవాలి. నలభైలో ఉన్న వ్యక్తికి కుటుంబ బాధ్యతలు అధికంగానే ఉంటాయి. 27 ఏండ్లప్పుడు పెండ్లయి ఉంటే.. నలభైకి వచ్చేసరికి పిల్లల వయసు కాస్త అటూ ఇటూగా 12-14 ఏండ్ల వరకు ఉంటుంది. ఇంకో ఆరేండ్లు గడిస్తే పై చదువులు మొదలవుతాయి. నలభయ్యో పడిలో ఉన్న వ్యక్తి తల్లిదండ్రులు డెబ్బైకి చేరువగా ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి అండగా ఉండాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే.. నడి వయసులో నడుం బిగించాల్సిందే! జరిగిందేదో.. ముప్పయిల్లో ఉన్నప్పుడు ఉడుకు రక్తం పరవళ్లు తొక్కుతుంటుంది. ఉద్యోగంలో అంచెలం లుగా పైకి ఎదగాలనే పట్టుదల ఉంటుంది. నలభైకి వచ్చేసరికి ఆ పట్టు కొంత సడలుతుంది. ఎన్నాళ్లని ఉద్యోగం చేస్తాం' అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, కుటుంబ పరిస్థి తులు ఉద్యోగం నుంచి తప్పుకోనివ్వవు సరికదా అదనపు రాబడి మార్గాల గురించి ఆలోచిం చేలా చేస్తుంది. పిల్లలు పదో తరగతికి వచ్చే వరకు వాళ్ల పై చదువుల గురించి ఆలోచించకపోతే తల్లిదండ్రులుగా వెనకబడ్డట్టే! 'జరిగిందేదో జరిగిపోయింది' అని మెట్ట వేదాంతం వల్లించినా.. -- పిల్లలకు కలిగే నష్టాన్ని పూడ్చలేం! అందుకే, పిల్లలు కలిగిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే పదహా రేండ్ల తర్వాత వాళ్ల చదువులకు అందొచ్చే విధంగా పాలసీ గానీ, మ్యూచువల్ ఫండ్స్లో గానీ - ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అన్నిటికీ మించి ఆరోగ్య బీమా, జీవిత బీమా తప్పనిసరిగా తీసుకోవా ! మరో రెండేండ్లు పోతే బీమా షరతులు మరింత పెరుగుతాయి. ఆస్తులు పెంచుకునేలా.. సరైన అవగాహన లేకుండా చేసే ఇన్వెస్ట్మెంట్ అవసరానికి ఆదుకోకపోవచ్చు. 'నడి వయ వచ్చి ఏం ఇన్వెస్ట్ చేయలేదు.. ఎలా?' అని బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. విద్యాభ్యాసంలో కాలేజీ ఏజ్ ఎంత ప్రాధాన్యమైనదో, సగటు ఉద్యోగికి 40 ఏండ్ల తర్వాత వృత్తిగత జీవితం అంత ముఖ్యమైనది. 40 నుంచి 55 ఏండ్ల మధ్య ఎంత ప్రణాళికా నడుచుకుంటే.. పదవీ విరమణ తర్వాత అంత హాయిగా జీవితం సాగి పోతుంది. పిల్లల చదు అయిపోగానే, వాళ్ల పెండ్లిళ్లు ముందుకొస్తాయి. వాటన్నిటినీ అంచనా వేస్తూ ఆర్థిక మూలాలను బలపర్చుకోవాలి. ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తుండాలి. మిగులు బడ్జెట్ ఉండేలా చూసుకోవాలి. లిక్విడ్ అసెట్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పు ఒక ఇల్లు ఉండి రెండో ఇల్లు కొనుగోలు చేసే శక్తి కూడా ఉన్నట్లయితే తీసుకోవడం మంచిది. దానిని పిల్లల పేరిట కాకుండా.. పదవీ విరమణ తర్వాత అద్దె రూపంలో మీకు సీలలో మంచిదాన్ని ఎంపిక చేసుకొని కష్టమైనా ప్రీమియమ్లు చెల్లిస్తూ ఉండాలి. ఇవన్నీ అండగా ఉండేవిధంగా మీ పేరిటే ఉండేలా చూసుకోవాలి. అందు బాటులో ఉన్న పెన్షన్ పాల చేయడానికి నలభై సరైన వయసు. సగం జీవితం అయిపోయిందని పరుగు ఆపకుండా. అందుబాటులో ఉన్న దారుల్లో మన్నికైన దాన్ని ఎంచుకోండి. మీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాననే తృప్తితో యాభైలోకి అడుగుపెట్టండి. ముందస్తుగా స్పందిస్తేనే.. బిడ్డ పుట్టగానే ఓ ప్లాట్ తీసుకొని 'హమ్మయ్య! వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఇది ఉంది' అన కుంటారు చాలామంది. అమ్మాయికి మెరిట్ లో ఎంబీబీఎస్ సీటు రాలేదు అనుకోండి! ప్లాట్ ఉందిగా మేనేజ్మెంట్ కోటాలో చదివిస్తా! అని భావిస్తారు. ఉద్దేశం మంచిదే! ప్లాట్ ధర కూడా అనుకున్న దానికన్నా రెండింతలు పెరగొచ్చు! కానీ, అది అమ్మితే వచ్చిన భారీ సొమ్మను ఖాతాలో చూపించే పరిస్థితులు ఉండక పోవచ్చు! అలా చూపించాలంటే సదరు లావాదేవీ పూర్తిగా అకౌంట్ టు అకౌంట్ జరగాలి. అందుకు మీరు సంసిద్ధంగా ఉన్నా.. వాళ్లు ముందుకు రాకపోవచ్చు. అందుకే, ఆస్తులు అమ్మే విషయంలో అవసరానికన్నా రెండేండ్ల ముందుగానే పావులు కదపడం మంచిది! మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉంటే... ఆరు నెలల ముందుగానే సెటిల్ చేసుకోవడం ఉత్తమం. --- ఎస్ఐపీ పజిల్ ఎప్పుడు ఆడాలంటే.. ప్రణాళిక లాంటిది. పదకేళిలో అడ్డం గళ్లు, నిలువు గళ్లు ఎదురుబొదురుగా తారసపడిన సందర్భాలను సద్వినియోగం చేసుకోకపోతే ఆదివారం కాలక్షేపం నిస్తేజంగా మారుతుంది. అడ్డంలో మొదటిది, నిలువులో రెండోది పూరించకుండా అడుగేస్తే పదాల పద్మవ్యూహంలో చిక్కుకుంటాం. అలాగే.. పెట్టుబడి యాత్రలో ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే.. చివరికి ఏ లాభమూ చేకూరదు. జీతం రాళ్లు నాలుగు మిగలగానే అందరి ఆలోచనా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ), మ్యూచువల్ ఫండ్స్పనే! వీటిని బంగారు గుడ్డు పెట్టే బాతుగా భావిస్తుంటారు. తమతమ ఆర్థిక అవసరాలు, భవిష్యత్ ప్రయోజనాలపై దృష్టి సారించకుండా ఇన్వెస్ట్మెంట్ అనగానే తాహతుకు మించి తహతహలాడు తున్నారు. కానీ, ఓటు హక్కు రావడానికి 18 ఏండ్లు నిండాలన్న నియమం ఉన్నట్టే.. ఈ తరహా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రాథమికంగా కొన్ని అర్హతలు ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీ ఎవరు చేయాలో, ఎవరు చేయకూడదో తెలుసుకోవడం మీ ఆర్థిక సమస్యల పూరణకు ప్రేరణగా నిలుస్తుంది! ఇన్సూరెన్స్ లేకుంటే.. పునాది బలంగా ఉంటేనే నిర్మాణం దృఢంగా నిలబడుతుంది. మధ్యతరగతి ఉద్యోగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పెట్టుబడులు ఒక్కటే మార్గం అనుకుంటే పొరపాటు. ఊహించని విపత్తులు ఎదురైనా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. కుటుంబానికి ఆరోగ్య బీమా, వ్యక్తిగ తంగా జీవిత బీమా తప్పనిసరి. ఈ రెండు రక్షణ కవచాలు లేకుండా ఏ పెట్టుబడి అ ప్రయోగించినా అవి వికటించే ప్రమాదం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా ఎపీ చేయొద్దు. ఇప్పటికే ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే వాటిని బ్రేక్ చేసైనా ఈ రెండు బీమాలు తీసుకోవాలి. -- ఏ అండా లేకుండా వద్దు.. నెలకు పదిహేను వేల చొప్పున పదిహేనేండ్లు కడితే.. కోటి రూపాయల నిధి తయారవుతుంద . న్నది ఎస్ఐపీ సూత్రం! ఈ ఫార్ములా వినగానే అందరికీ ఆశ పుడుతుంది. నెలకు ముప్పయ్ వేలు కడితే రూ.2 కోట్లు కూడబెట్టొచ్చు అన్న అత్యాశ కలుగుతుంది. అందుకే ప్రాథమిక అవ సరాలను తోసిరాజని ఆకాశానికి నిచ్చెన వేస్తుంటారు. ఇది ఆ వ్యక్తికే కాదు, వారి కుటుంబా నికీ భారంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఉదాహరణకు నెలకు లక్ష రూపాయల వేతనం కడుతున్నాడు. రెండేండ్లు గడిచాయి. అనుకోని ప్రమాదం అతణ్ని ఆస్పత్రిపాలు చేసింది. ఉన్న ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ చేయకుండా.. ఎస్ఐపీ మొదలుపెట్టాడు. నెలకు రూ.15 వేలు లకు మించి రావని తేలిపోయింది. ఆ వ్యక్తి నెలకు రూ.15వేలు ఎస్ఎస్ఐపీ చేయకుండా, ఏడా సర్జరీ చేయాలంటే రూ.10 లక్షలు అవుతుందన్నారు వైద్యులు. ఎస్ఎస్ఐపీ బ్రేక్ చేస్తే రూ.5 దికి రూ.30 వేలలోపు వెచ్చిస్తే.. రూ. 15 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేతిలో ఉండేది. నయా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యేవాడు. ఒక వేళ ప్రాణానికే ప్రమాదం ఏర్పడితే, ఈ రెండేండ్లలో కూడబెట్టిన మొత్తం కుటుంబానికి ఎన్నాళ్లు అండగా ఉంటుంది? అప్పు తెచ్చి ఎందుకు? ఎస్ఐపీ, మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఊహించని లాభాలు వస్తాయని కొందరి అంచనా! అందుకే అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. పర్సనల్ లోన్ తీసుకొని దానిని పెట్టుబడిగా ఐపీ రిటర్న్స్ గరిష్టంగా 14 శాతం వరకు ఉంటుంది. 14 శాతం వడ్డీకి అప్పు తెచ్చి.. ఇక్కడ మలిచి ఘనత సాధించిన వారిగా బావిస్తుంటారు. కానీ, మార్కెట్ అనుభవాల దృష్ట్యా ఎస్ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. అన్నిటికీ మించి ఈ తరహా స్ట్మెంట్ వ్యక్తిగత ఇష్టాల కన్నా, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఒకట్రెండ సంవత్సరాల్లో అవసరం ఉన్నట్లయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఆరోగ్య బీమా, జీవిత బీమాకు సరిపడా నిధులు కేటాయించుకున్న తర్వాతే ఇతర పెట్టుబడుల గురించి ఆలోచిం చాలి. అప్పుడే మీరు తెలివైన ఇన్వెస్టర్ అనిపించుకుంటారు. ఆర్థిక ప్రహేళిక చివరి గడినీ సమ ర్థంగా పూరిస్తారు. మినిమమ్ కడుతూ ఉంటే.. క్రెడిట్ కార్డు బిల్లు మినిమమ్ కడుతూ రోజులు వెళ్లదీసే వాళ్లు ఏ తరహా పెట్టుబడి పెట్టడానికి అర్హులు కారు. క్రెడిట్ కార్డుపై 40 శాతం వరకూ వడ్డీ కడుతూ, పదిహేను శాతానికి మించి లాభాలు ఇవ్వని చోట అదృష్టాన్ని పరీక్షించుకుంటే దురదృష్టం ఎదురవుతుంది. ఇంటిలో మీద టాప్ అప్ తీసుకొని ఏదో ఇన్వెస్ట్ చేయడం అమాయకత్వమే! కానీ, దీనివల్ల తీవ్రంగా నష్టపోయినట్టు కొన్ని నెలలు గడిచిన తర్వాత గానీ బోధపడదు!! -- మీ పిల్లలకు ఈ లెక్కలు చెప్పారా? మీ బుజ్జయికి అక్షరాభ్యాసం నాడు ఓనమాలు దిద్దించి ఊరుకుంటే సరిపోదు! చక్కటి విద్యాబుద్ధులు నేర్పించాలి. అర్థం చేసుకునే వయసు ఆర్ధిక పాఠాలు బోధించాలి. రూపాయి రాకపోకల గురించి చెప్పాలి. అప్పుడే వాళ్లకు పెద్దయ్యాక డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుస్తుంది. ఆర్థిక విషయాలపై అవగాహన ఉన్నప్పుడే పెద్దయ్యాక వాళ్లు ప్రయోజకులు అవుతారు. పొదుపు మంత్రం పఠించడమే ఆర్థిక విజయానికి మూలధనం. ఆ సత్యం మదుపు సూత్రాలు ఏమని బోధించగలం? ఇంట్లో ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా.. విత్త విధానాలు చిత్తగించమంటే ఎవరు మాత్రం ఆలకిస్తారు? ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఆర్ధిక పాఠాలు బోధించే కార్పొరేట్ కోర్సులు కూడా వెలుస్తున్నాయి. లక్షల్లో ఫీజు కడితే గానీ, ఇందులో చేర్పించలేం. తమ పిల్లలకు లెక్కాపత్రం పక్కాగా రావాలని ఆశించిన తల్లిదండ్రులు ఈ కోర్సులకు జై కొడుతున్నారు. ఈ తరహా పాఠశాలల్లో ప్రత్యేకమైన కరికులం పాటిస్తూ ఎనిమిదో తరగతి నుంచే ఆదాయ, వ్యయాల గురించి చెబుతున్నారు. అయితే, కొందరు సంపన్నులను మినహాయిస్తే.. ఆర్థిక సూత్రాలు వంట బట్టించు కోవడానికి అంతగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని గమనించాలి. బ్రహ్మ పదార్థం కాదు.. |అర్ధశాస్త్రం పుస్తకాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ అర్థం కాని బ్రహ్మపదార్థంగా భావిస్తారు. ప్రతి వ్యక్తీ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అంత ఆర్థిక పండితుడు అనిపించుకుం చాలామంది. కానీ, 'లెక్కల బడి'లో ప్రాథమిక విషయాలను విస్మరించకుండా ఉండగలిగితే.. టాడు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టాలన్నది ప్రాథమిక సూత్రం. ఖర్చులను తగ్గించుకోలేనప్పుడు ఆదాయం పెంచుకోవాలన్నది రెండో నియమం. అపాత్ర దానం పనికిరా --- దన్నది మూడో సూత్రం. ఈ మూడింటినీ పాటిస్తే.. ఏ ఇంటా ఆర్థిక సంక్షోభం అనే మాటే తలె తదు. ఇంకా చెప్పాలంటే ఖర్చులపై అదుపు ఉన్నప్పుడే పొదుపైనా, మదుపైనా సాధ్యమవు రించి, వారినీ తమ దారిలోనే నడవమని చెప్పవచ్చు. పిల్లలు మనం చెబితే నేర్చుకోరు. తుంది. ఈ దిశగా ఆలోచించే తల్లిదండ్రులు తాము ఎదుర్కొన్న పరిస్థితులను పిల్లలకు వివరి మనల్ని చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు విచ్చల విడిగా ఖర్చులు చేస్తుంటే వారి వారసులూ అదే పాటిస్తారు. పొదుపుగా వ్యవహారం నడుపుతుంటే వారికీ అదే అభ్యాసం అవుతుంది. ఆదాయం ఎంత? ఖర్చులు ఎంత? ఇన్వెస్ట్ చేస్తున్నది ఎక్కడ? అందుకు కారణం ఇవన్నీ వాళ్లు అం చేయడం మంచిది! అప్పు చేయడం వల్ల కలిగే అనర్థాలు వారికి వివరించాలి. అపజయాలూ పంచుకోండి.. ఆర్థికంగా మీ విజయాలు మాత్రమే కాదు, అపజయాలనూ పిల్లలతో షేర్ చేసుకోండి. ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నది, దానివల్ల ఎంత నష్టపోయింది ఈ విషయాలన్నీ వివరిం• అలా పిల్లలను నిరాశలోకి నెట్టమని చెప్పడం కాదు! ఆ తప్పును దిద్దుకోవడానికి తామెంత కష్టపడాల్సి వచ్చిందో తల్లిదండ్రులు వివరిస్తే.. భవిష్యత్తులో పిల్లలు మళ్లీ ఆ త ఉంటారు. లక్షల్లో వేతనం అందుకున్నా.. రాబడికి మించి ఖర్చులుంటే.. నెలలో రెండోవారం నుంచే క్రెడిట్ కార్డు స్వైప్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అడ్వాం బిడ్డలప్పుడే ఆర్థిక విధానాల గురించి వివరించండి. మీకు జీవితంలో ఎదురైన ఒడుదొడుకుల మీ పిల్లలకు సోపానాలై, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తాయి. వాళ్లకే అప్పగించండి. • పాఠాల కన్నా ప్రయోగాలే ఎక్కువ నేర్పుతాయి. చిన్నప్పటి నుంచి ఇంటి ఖర్చులపై పిల్ల లకు అవగాహన కల్పించడం అవసరం. సూపర్ మార్కెట్కు వెళ్లినప్పుడు, అవసరమైన వస్తువులు వాళ్లనే తీసుకోమని చెప్పండి. కావాల్సిన పదార్థం ధరలు బేరీజు వేసి, మంచివే ఎంపిక చేయమనండి. బిల్ కౌంటర్ దగ్గరికి వారినే వెళ్లమని చెప్పండి. * ఏదైనా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశారే అనుకోండి. మీ బడ్జెట్ ఎంతో చెప్పి.. అందులోనే చర్చ టన ప్రణాళిక తయారుచేయమని టాస్క్ ఇవ్వండి. * అడిగిన ప్రతిసారీ డబ్బు ఇవ్వకండి. కారణం సహేతుకమైనది అయితేనే ఇవ్వడం మంచిది. వారి పేరిట మీరు ఎక్కడ పొదుపు చేస్తున్నదీ, స్కూల్ ఫీజ్ ఎలా కడుతున్నది, పై చదువు లకు ఎలా ప్రణాళిక చేస్తున్నది.. ఇవన్నీ వారితో చెప్పడం వల్ల తమ చదువు కోసం తల్లిదం డ్రులు ఎంతలా కష్టపడుతున్నారన్నది తెలుస్తుంది. భవిష్యత్తులో తాము ఎలా ఉండాలో కూడా తెలిసివస్తుంది. --- వారసులకు.. అప్పులు పంచొద్దు! మన పిల్లలు 'ఇది నాన్న ఇల్లు', 'ఇవి నాన్న కారు'.. అని సగర్వంగా చెప్పుకోవాలే కానీ.. 'ఇది నాన్న బకాయిపడిన షావుకారు అప్పు', ఇది నాన్న కట్టలేకపోయిన పర్సనల్ లోన్' అంటూ తిట్టుకునే పరిస్థితి ఉండకూడదు. మనం ఉన్నా లేకపోయినా, మన అప్పులు మనమే తీర్చేయాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. రాంబాబు మధ్యతరగతి జీవి, వనస్థలిపురంలో అద్దె ఫ్లాట్. బంజారాహి ల్స్ ఆఫీసు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లల్ని చదివించాలి. ఇంటికి ఎంతోకొంత పంపాలి. ఆస్తులు కొనకున్నా, అప్పులు చేయకుండా బతికితే చాల నుకునే మనస్తత్వం. అంతలోనే తండ్రి మరణ వార్త. కుటుంబంతో హుటాహు టిన ఊరికి వెళ్లాడు. ఉన్నంతలో దశదిన ఖర్మ ఓ మోస్తరుగా చేశాడు. తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేస్తూ ఉండగా.. ఇద్దరు అపరిచితులు ఇంటిముందు వాలారు. తాము ఫలానా బ్యాంకు క్రెడిట్కార్డు విభాగం ఉద్యోగులమని చెప్పారు. 'మీ నాన్నగారికి మా బ్యాంకు క్రెడిట్ కార్డు ఉండేది. రెండేళ్ల నుంచీ అసలు, వడ్డీ బకాయి పడిపోయింది. ఆయన మరణించారు కాబట్టి, చెల్లించాల్సిన బాధ్యత మీదే' అని కాఫీ తాగుతూ తాపీగా చెప్పారు. కప్పులో చిక్కుకున్న ఈగ పరిస్థితి రాంబాబుది. అవునననలేడు. కాదనలేడు. అంత డబ్బు తానెక్కడి నుంచి తెస్తాడు? ఆస్తులమ్మేసి తీరుద్దామా అంటే.. పల్లెలోని ఇల్లు కూడా సొంతం కాదు. వాటాలు వేసుకుని వదిలించుకోడానికి తోబు ట్టువులు కూడా లేరు. భర్త కష్టం చూడలేని ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకుంది. కన్నతల్లి మనసులోనే కుమిలిపోయింది. వెంకట్రావు ఉదాహరణ కూడా ఇలాంటిదే. జూదానికి అలవాటు పడిపో తండ్రి కుటుంబాన్ని అప్పుల కుప్పల్లో వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. రుణదాతలు, క్రెడిట్కార్డు కంపెనీవారు వెంకట్రావు ఇంటిమీద పడ్డారు. శాపనార్థాలు, హెచ్చరికలు, నోటీసులు..ఆ ఒత్తిడికి ఆయనకు గుండెపోటు వచ్చినంత పనైంది. -- తీర్చాల్సిందేనా? కన్నవారి అప్పులకు పిల్లలు ఎంత వరకు బాధ్యులు అనేది రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. తండ్రి లేదా తల్లి పిల్లల అనుమతితోనో, పూచీకత్తుతోనో అప్పు చేసినట్టు ఆధా రాలు ఉంటే మాత్రం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిందే. స్వయంగా పిల్లలే సహ-రుణగ్రహీ తలు అయినప్పుడు కూడా తప్పించుకోలేని పరిస్థితి. కొడుకులు, మనవళ్లు, మునిమనవళ్లు... ఎవరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. కానీ కొన్నిసార్లు 'అప్పులు తీరకపోతే పెద్దల ఆత్మ శాంతించదు. మీకు మంచి జరగదు. ఆ తర్వాత మీ ఇష్టం' అంటూ రుణదాతలు వారసుల్ని ఎమోషనల్గా దారికి తెచ్చుకుంటారు. దీంతో, బాధ్యత తీసుకుంటూ లిఖితపూర్వకంగా రాసి చేస్తారు కొంతమంది. అదే కనుక జరిగితే, ఆరునూరైనా చెల్లించాల్సిందే. ఇంటినో, పొలాన్నో తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను తనఖా రుణాలు లేదా సెక్యూర్డ్ లోన్స్ అంటారు. నిర్ణీత వ్యవధిలో ఆ అప్పు తీరకపోతే.. కోర్టు జోక్యంతో జప్తు చేసి, వేలం వేసి బకాయిలను రాబట్టు కునే హక్కు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, వ్యక్తిగత రుణదాతలకూ ఉంటుంది. అప్పు తీరగా మిగిలిన వేలం సొమ్మును చట్టపరమైన వారసులకు ఇచ్చేస్తారు. ఏ పూచీకత్తూ లేని వ్యక్తిగత రుణాలు, క్రెడిట్కార్డు చెల్లింపుల విషయంలో మాత్రం వారసుల్ని వేధించడం అనైతికం. కాకపోతే, ఆ సంస్థలు కోర్టులను ఆశ్రయించినప్పుడు మాత్రం, విషయం న్యాయ స్థాన పరిధిలోకి వెళ్తుంది. అంతిమ తీర్పును ఇరువర్గాలూ శిరసావహించాల్సి ఉంటుంది. ఆదా యపన్ను బకాయిలు మాత్రం చెల్లింపుదారు మరణంతో పూర్తిగా రద్దయిపోతాయని గత అను భవాలు చెబుతున్నాయి. అప్పులకు బీమా. మనం లేకపోయినా మన జీవితబీమా సొమ్ముతో మన కుటుంబం నిశ్చింతగా బతికేయాలి. అప్పులేవైనా మిగిలి ఉంటే.. నయాపైసాతో సహా తీర్చేయగలగాలి. సాధ్యమైనంత ఎక్కువ మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడే ఇదంతా సాధ్యం అవుతుంది. దాదాపు అన్ని బ్యాంకులూ గృహరుణంలాంటి పెద్ద అప్పులకు అను బంధంగా వివిధ బీమా సంస్థల నుంచి ఆ రుణ మొత్తానికి సమానమైన లోన్ కవర్/ లయబిలిటీ కవర్ ఇప్పిస్తున్నాయి. దీనివల్ల, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు.. బీమా సొమ్మును లోన్ అకౌంట్ు జమ చేసుకుం టారు. ఫలితంగా కుటుంబానికి ఆర్థిక బాధ్యత ఉండదు, బ్యాంకు మీద బరువూ పడదు. 'ప్రతి రుణానికి ఒక లోన్/ లయబిలిటీ కవర్'.. సూత్రమూ అనుసరించదగినదే. దీనివల్ల వారసులు ఇబ్బంది పడరు. తీర్చగలిగే స్తోమత ఉంటే.. ఆస్తుల్ని తెగనమ్మి అయినా వదిలించు కునే అవకాశం ఉంటే.. రుణబంధాన్ని తెంచుకోవడమే న్యాయం, నైతికం. అదే సమయంలో తాను చేయని అప్పును నెత్తినేసుకుని భార్యాపిల్లల్ని వీధిపాలు చేయడమూ మంచిది కాదు. మన పెద్దల సంగతి ఎలా ఉన్నా.. మనమూ ఇలాంటి పెద్ద తప్పు చేయకూడదు. వీలైతే, ఎన్నోకొన్ని ఆస్తులు వదిలిపోవాలే కానీ, వారసుల్ని అప్పుల్లో ముంచేసి మన మానాన ముసుగు అనంత లోకాలకు ప్రయాణం కాకూడదు. పిల్లల్ని ప్రేమించే ఏ కన్నవారూ ఇలా చేయరు. --- పని చేయకుండా.. బతికేద్దామిలా!! ఆర్థిక పరిభాషలో పాసివ్ ఇన్కమ్ అనే పదం ఇప్పుడు తెగ వైరల్ అవు తున్నది. ఈ తరహా సంపాదనతో కులాసాగా కాలం గడిపేయొచ్చన్న భావన చాలామందికి వచ్చేసింది. ఇంతకీ పాసివ్ ఇన్కమ్ (నిష్క్రియా ఆదాయం) అంటే పని చేయకుండా వచ్చే పైసలు అన్న మాట! అయితే కాలు కదపకుండా కాసులు రాలా లంటే.. అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ దండిగా సంపాదిస్తే గానీ, పాసివ్ ఇన్కమ్ను అనుభవించలేం. చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ నియమం. బలం ప్రయోగిస్తేనే శక్తి ఉత్పన్నం అవుతుందని మరో భౌతికశాస్త్ర సూత్రం. అదే కెమిస్ట్రీకి వస్తే.. ఒక రసాయన చర్యలో క్రియా జనకాలు సమపాళ్లలో కలిసినప్పుడే నిర్దేశిత క్రియా జన్యాలు వస్తాయి. ఆర్థిక శాస్త్రానికి వస్తే కష్టపడితేనే పైస పుడుతుంది. క్రియ ఉన్న ప్పుడే ఫలితం వస్తుంది. కానీ, నవీన ఆర్థశాస్త్ర పండితులు నిష్క్రియా పరత్వాన్ని సైతం ఫైనాన్షియల్ ఫార్ములాగా అభివర్ణిస్తున్నారు. ఈజీ మనీ సూత్రాలన్నీ పాసివ్ ఇన్కమ్ నుంచి పుట్టుకొచ్చినవే! యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చు, ఇన్స్టాలో ఇన్స్టాంట్గా వైరల్ అయిపో శ్రీ నార్మల్ పోస్టు పెట్టినంత ఈజీ కాదు. పాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా ఆహరహం శ్రమించాల్సి ఉంటుంది. ఎఫ్బీలో ఇన్ఫ్లూయెన్సర్గా కాసులు కొల్లగొట్టడం.... సంపాదనకు షార్ట్కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు... ఆరు లైకులకు మించి సాధించేదేం ఉండ దని ఆనక తెలుస్తుంది. ప్రణాళికాబద్దంగా బతకడమే.. ఇంతకి నిష్క్రియా ఆదాయం అంటే ఏమిటి? పని చేయకుండా ఉండటం మాత్రం కాదు బద్దంగా పొదుపు చేసుకొని ఏ రందీ లేకుండా జీవితాన్ని వెళ్లదీయడం ఒక కళ! జీవి | -- తంలో ఒక్కొక్క ఖర్చు గురించి ఇంత మొత్తం ఆదాయాన్ని సిద్ధం చేసుకోవడమే పాసివ్ ఇన్ కమ్. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ముందస్తుగా పొదుపు చేయడం అన్నమాట! అందరూ అలాగే చేస్తారుగా ఇందులో వింతేముంది అనుకోవచ్చు. ఇదీ అలాంటిదే. కానీ, ఇంకాస్త పక బిల్లు రూ.650 కట్టాల్సి ఉందనుకోండి. ఓ లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ దీగా వ్యవహరించడమే ఇందులో ఉన్న పరమార్థం. ఉదాహరణకు ప్రతినెలా ఇంటర్నెట్ రెట్ బిల్లు కట్టేయాలి. అప్పుడు మీ లక్ష బ్యాంకులో పదిలంగా ఉంటుంది. వచ్చే ఇంట్రెస్ట్ చేయాలి. దానిపై నెలకు రూ.650 వరకు వడ్డీ వస్తుంది కదా! అలా వచ్చే మిత్తి సొత్తుతో ఇంట మీద మీ అవసరం తీరిపోతుంది. మీ రెగ్యులర్ ఆదాయంపై ఇంటర్నెట్ బిల్లు భారం పడ కుండా ఉంటుంది. ఇలా మూలధనం నుంచి గానీ, ఆస్తి ద్వారా గానీ అవసరాలకు తగ్గట్లుగా ఆదాయం సమకూర్చుకోవడమే పాసివ్ ఇన్కమ్. సంపాదన బలంగా ఉన్నప్పుడు ప్రత్యేక సందర్భాల కోసం డబ్బును పదిలపరచి, ఆయా సమయాల్లో వినియోగించుకునే సొత్తు కూడా ఈ కోవకే చెందుతుంది. ముందస్తు అంచనాతో.. డబ్బు సంపాదించడం తేలికే! దానిని కాపాడుకోవడమే కష్టంతో కూడుకున్న పని. ఏ అవ సురం ఎప్పుడు వస్తుందో ముందుగానే అంచనా వేయగలగాలి. ఊహించని పరిణామాల సంగతి పక్కన పెడితే.. పిల్లల చదువు, పెండ్లిల్లు, సెటిల్మెంట్, రిటైర్మెంట్ ఇలాంటి విష యాల్లో పక్కా ప్రణాళికతో ఉండాలి. ఆదాయాన్ని పొదుపు, మదుపు చేయడం ద్వారా భారీ ఖర్చులు కూడా తేలికైపోతాయి. ఆదాయం ఘనంగా ఉన్నప్పుడు మూలధనాన్ని కదిలించకుం డానే ఈ పనులన్నిటినీ చక్కబెట్టొచ్చు. పాసివ్ ఇన్కమ్ ప్రిన్సిపుల్ పదవీ విరమణ తర్వాత చక్కగా ఉపయోగమవుతుంది. నెలవారీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వచ్చేలా చేసు కుంటే... విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగించొచ్చు. చిన్నచిన్న పనులకే మూలధనాన్చి కదిలిస్తూ ఉంటే.. భారీ అవసరం ఏర్పడినప్పుడు నిధుల కొరత రావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని యాక్టివ్గా ఉన్నప్పుడే పావివ్ ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం తెలివిము తుల పని!! నెలవారీ రాబడి. రెండు ఇండ్లు ఉన్నాయనుకోండి. ఒకదాంట్లో మీరు ఉంటే.. రెండో ఇంటిని అద్దెకు ఇస్తే ఆస్తి ద్వారా నెలవారీ ఆదాయం సమకూరుతుంది. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే.. విలువ భారీ గానే పెరుగుతుండొచ్చు. కానీ, దాన్నుంచి ప్రతినెలా రాబడి వచ్చే అవకాశం ఉండదు. ఆ యాన్నిచ్చే స్థిరాస్తులు ఉదాహరణకు వ్యవసాయ క్షేత్రాలు, ఇండ్లు లాంటివి, ఫిక్స్డ్ డిపాజి ఇతర ఇన్వెస్ట్మెంట్ల ద్వారా పక్కా ఆదాయం సమకూర్చుకోగలిగితే.. అంతకన్నా ది ఏముంటుంది చెప్పండి? --- ఆ సొమ్ముతో ఇల్లుకొంటే.. నో ట్యాక్స్ సెన్సెక్స్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరాయనీ, మదుపరుల సంపద కోట్లలో పెరిగిందన్న వార్తలు తరచూ వింటుంటాం. అలా వచ్చిన సంపద తోపాటు దానిపై కట్టే పన్ను కూడా పెరుగుతుంది. అయితే, ఈక్విటీల్లో రూ.కోట్లు వచ్చినా.. చట్టసమ్మతంగా రూపాయి పన్ను కట్టకుండా లబ్ధి పొందొచ్చు. ఈక్విటీ, డెట్, బంగారు ఆభరణాలపై వచ్చిన లాభాలకు పన్ను దెబ్బలేకుండా వెసులుబాటు మార్గం ఒకటుంది. అదేంటంటే... దేశంలో అభివృద్ధి, సంక్షేమం జోడుగా సాగాలంటే సుంకాలు కచ్చితంగా ఖజానాకు చేరాల్సిందే! దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాల్లో పన్నులు ప్రధానమైనవి. వాటిని వసూలు చేయడంలో ప్రభుత్వమూ కొంత కఠి నంగానే వ్యవహరిస్తుంటుంది. అయితే, అదే ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్కు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అలాంటిదే 1983లో చేసిన ఆదాయపు పన్ను చట్టం లోని 54ఎఫ్ ప్రొవిజన్. ఇది ఏం చెబుతుందంటే... ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, డెట్, జువెలరీ మీద వచ్చిన లాభాలతో ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. 54ఎఫ్ నియమం మదుపర్లకు మహదానందాన్ని కలిగించేదే అయినా, కొన్ని షరతులు వర్తిసాయి. మినహాయింపు ఇలా.. 10 54 ఎఫ్ ప్రొవిజన్ మదుపర్లకు ఎలా వర్తిస్తుందంటే... సుధాకర్ ఈక్విటీలో కోటి రూపాయలు | ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. 12శాతం రిటర్న్స్ లెక్కన ఆరేండ్లలో ఆ కోటి రూపాయలు కాస్తా రూ.2 కోట్లు అయింది. మరో ఆరేండ్లకు రూ.4కోట్లకు పెరిగింది. సుధాకర్ ఇన్వెస్ట్ చేసింది. రూ. కోటి వచ్చిన లాభం రూ.3 కోట్లు, చట్టప్రకారం ఈక్విటీ లాభాలపై 12.5 శాతం పన్ను కట్టాల్సిందే! అంటే రూ.3 కోట్ల లాభానికి గానూ రూ.37.5 లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలి. లాభం మూడింతలు వచ్చినా అందులో 12.5 శాతం పన్ను కట్టడానికి సుధా -- కర్కు మనసొప్పలేదు. అప్పుడు అతని సమస్యకు 54ఎఫ్ నియమం పరిష్కారం చూపింది. దీని ప్రకారం ఈక్విటీ లాభంతోపాటు పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకొని, ఆ మొత్తంతో ఏదైనా ఇల్లు తీసుకున్నట్లయితే ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. సుధాకర్ అదే చేసాడు. తను పొందిన లాభం రూ.3 కోట్లు, మూల ధనం రూ.కోటి కలిపి మొత్తం రూ. 4 కోట్లతో ఇల్లు కొన్నాడు. అలా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందాడు. షరతులు వర్తిస్తాయి. ఇదేదో బాగానే ఉంది సుధాకర్ ఎలా ఈ కుటీలు లాభాలు వచ్చినప్పుడు ఇల్లు కొనేస్తే ఇన్కమ్ టాక్స్ తప్పించుకోవచ్చు అనుకుంటే పొరపాటే ఈ వెసులుబాటు మొదటి రెండు ఇండ్లకు మాత్రమే వర్తిస్తుంది వివరంగా చెప్పాలంటే ఎక్కువ ట్రీ లాభాలతో వ్యక్తి మొదటి ఇంటిని గాని రెండో ఇంటిని గాని తీసుకోవచ్చును అప్పటికే రెండు ఇండ్లున్న వ్యక్తి.. ఈ లాభాలతో కొంటానంటే కుదరదు. అలాగే తెలివిగా ఆ లాభాలతో ఇల్లుకొని నాలుగు నెలలు గడిచిన తర్వాత అమ్మేసి సొమ్ము చేసుకుందామంటే 54ఎఫ్ వర్తించదు. ఈక్విటీ ప్రాఫిట్తో కొనుగోలు చేసిన ఇంటిని కనీసం మూడేండ్లు అమ్మకూడదు. అప్పుడే పన్ను పోటు ఉండదు. ఈ క్రమంలో చాలామంది ఈక్విటీ ఇన్వెస్టర్లు వారు జీవితభాగస్వామి పేరు మీద గానీ, పిల్లల పేరు మీద గానీ ప్రాపర్టీలు కొంటుంటారు. కొందరు ఈక్విటీ పెట్టుబడిని తన పేరుతోపాట జీవితభాగస్వామి పేరుమీద కూడా పెడుతుంటారు. వచ్చిన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్లో డిపాజిట్ చేసి, దాన్నుంచి కొనుగోలు వ్యవహారాలు నడిపించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆదాయ పన్ను చట్టంలోని 54ఎఫ్ ప్రొవిజన్ ఇన్వెస్టర్లకు వరమైందని చెప్పొచ్చు. వన్ టైమ్ సెటిల్ మెంట్. కొందరు ఉద్యోగులకు తరచూ బదిలీలు అవుతుంటాయి. పట్టుమని మూడేండ్లు ఒక ఊ ఉండరు. అలాంటి వాళ్లు ఇంటి మీద ఇన్వెస్ట్ చేయకుండా.. ఈక్విటీలో గానీ, మ్యూచువల్ ఫండ్స్లో గానీ పెట్టుబడి పెడితే మంచిది. రిటైర్ అయ్యేవరకు ఆ సొత్తు కొండంత పెరుగు తుంది. పదవీ విరమణ తర్వాత ఎక్కడ సెటిల్ అవుదామని ఫిక్సవుతారో.. ఈక్విటీ లాభాలతో అక్కడ ఇల్లు తీసుకోవచ్చు. పన్ను తప్పుతుంది. ఇన్నేండ్ల పొదుపునకు ఒక అందమైన రూపమూ వస్తుంది. -- మీ ఆస్తిని అప్పుగా మారనిస్తారా! అ అంటే.. అప్పు, ఆ అంటే ఆస్తి.. ఇవి ఆర్థిక పాఠాలు. ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లు.. బి ఆస్తిగా అందిస్తారా! అప్పుగా మిగు ల్చుతారా! అన్నది యజమాని దూర దృష్టిపై ఆధారపడి ఉంటుంది. ప్రొడక్ట్ లయబిలిటీ కవర్ ఇన్సూరెన్స్ (ఆస్తి బీమా) తీసుకున్నట్లయితే, ఊహించని ప్రమాదం ఎదురైనా ఆస్తి నిలబడుతుంది. లేకపోతే, అదే ఆస్తి గుదిబండగా పరిణమించే ప్రమాదం ఉంది. సోమశేఖరం ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. నెలసరి వేతనం రూ.80 వేలు, ఆఫీస్కు దగ్గర్లో రూ.50 లక్షలకు కొత్త ఫ్లాట్ కొన్నాడు. కూడబెట్టుకున్న రూ.10 లక్షలు అడ్వాన్స్కు, రిజిస్ట్రేషను వెచ్చించాడు. రూ.43 లక్షలు బ్యాంకు రుణం తీసుకున్నాడు. లోన్ అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుంటే.. బ్యాంకు మేనేజర్ 'ప్రొడక్ట్ లయబిలిటీ కవర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది' అన్నాడు. 'అదేంటి? ' అన్నాడు సోమశేఖరం. 'బ్యాంకు రుణంపై ఇన్సూరెన్స్. భవిష్యత్తులో మీకు ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే మీ ఇంట్లోవాళ్ల మీద పడదు. బీమా సంస్థ పూర్తిగా చెల్లిస్తుంది' అని వివరించాడు. మేనేజర్. 'శుభమా అంటూ ఇల్లు కొంటుంటే చావు కబుర్లేంటి?' అని బీమా తీసుకోవడానికి నిరాకరించాడు. రుణం మంజూరైంది. ఇల్లు సొంతమైంది. కానీ, రుణం పూర్తయ్యే వరకూ అది పూర్తిగా సొంతిల్లు కానట్టే! ఐదేండ్ల తర్వాత ఓ ప్రమాదంలో సోమశేఖరం కన్నుమూ ఉద్యోగం చేసిన కంపెనీ నుంచి వచ్చిన కొద్ది మొత్తంతో అతని కుటుంబం కుటుంబం చెల్లించే పరిస్థితిలో లేదు. మూడు నెలలు గడిచాయి. ఇల్లు వేలానికి వెళ్లింది. సోమ శేఖరం కుటుంబానికి నిలువ నీడలేకుండా అయింది. గృహరుణం మంజూరైన నాడే.. లయబి లిటీ ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది! -- ఏకకాల ప్రీమియం. బిటిలీ ఇన్సూరెన్స్ ప్రయోజనం ఎలా ఉంటుందో సోమశేఖరం కథ చదివితే కోవడం శ్రేయస్కరం. రుణగ్రహీత కన్నుమూసే నాటికి ఉన్న లోన్ ఔటాండింగ్ మొత్తం తెలుస్తుంది. ఎన్నేండ్లకు రుణం తీసుకుంటామో.. అన్ని సంవత్సరాలకు సరిపడా బీమా తీసు బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇంటి రుణం, కాలపరిమితిని బట్టి ఏకకాల ప్రీమియం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గృహరుణం ఎన్ని సంవత్సరాల కాలప రిమితితో తీసుకుంటారో, బీమా కూడా అన్నేండ్లకూ వర్తించేలా తీసుకోవడం మంచిది. జీవిత బీమా ఉందా.. గృహరుణం తీసుకున్న వారంతా లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పకుండా ఎంచుకోవాల్సిందేనా? అడిగితే అవసరం లేదనే చెప్పొచ్చు. జీవిత బీమా పెద్దమొత్తంలో ఉంటే, లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోకున్నా ఇబ్బంది రాదు. ఇదే సోమశేఖరం రూ.1.50 కోట్లకు జీవిత బీమా తీసుకొని ఉండి ఉంటే, ఆ మొత్తంలోంచి గృహరుణం పోగా రూ.1.15 కోట్లు కుటుంబానికి వచ్చేవి. రూ.2 కోట్లు అంతకుపైగా జీవితబీమా ఉన్న వ్యక్తులు లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి రుణం తీసుకునేటప్పుడే బీమా కూడా తీసుకో వాలి. మధ్యలో కావాలంటే అన్ని సంస్థలూ ఇవ్వవు. ఇప్పటికే గృహరుణం తీసుకొని, లయబి టీ పాలసీ తీసుకోకపోయి ఉన్నట్లయితే, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం ఒక మార్గం. యాక్సిడెంట్ లో మరణిస్తేనే బీమా మొత్తం కుటుంబానికి అందుతుంది. ఈ బీమా ప్రీమియానికి అదనంగా రూ.800 నుంచి రూ.1,000 వరకు చెల్లిస్తే ఇంటి రుణానికి సైతం రక్షణ కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ పాలసీ తీసుకుంటే ప్రమాదవశాత్తు జరగరానిది జరి గితే.. ఇంటి భారం ఇంట్లోవాళ్ల మీద పడదు. ఇవి గమనించండి లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికంగా ఉందని, తగ్గించమని అడుగుతుంటారు చాలామంది. ప్రీమియం తగ్గించే కొద్దీ బీమా కాలపరిమితి తగ్గుతుందని తెలుసుకోవాలి. దానివల్ల ఆశించిన ప్రయోజనం దక్కకపోవచ్చు. # టర్మ్ ఇన్సూరెన్స్ భారీగా తీసుకోవాలంటే అందుకు తగ్గ ఆదాయం చూపించాల్సి ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ లో రుణం మొత్తానికి వర్తించే పాలసీ లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ రూ.2 కోట్లకు మించి ఉండి, ఇంటి రుణం రూ. కోటిలోపు ఉంటే లయ లిటీ ఇన్సూరెన్స్ కచ్చితంగా తీసుకోవాల్సిన పనిలేదు. * పిల్లలు పూర్తిగా సెటిల్ అయినా, జీవిత భాగస్వామి కూడా సంపాదిస్తున్నా, జీవిత బీమా కలిగి ఉన్నా.. గృహరుణంపై బీమా ధీమా అవసరం లేదు. -- ఇల్లు పెట్టుబడి కాదు. ఇల్లు కొనడం పెట్టుబడి కాదు. దాన్నుంచి రిటర్న్స్ ఆశించొచద్దు, ఇల్లు అనేది ఓ ఎమోషన్ అనే విషయాన్ని ముందు యాక్సెప్ట్ చేయాలి. అమ్మ గారో, భార్యో ఏదైనా అడిగితే ఎలా కాదనలేమో.. ఇల్లు కూడా అంతే! సొంత గూడు ఎప్పుడూ లెక్కలేయలేని స్థిరమైన ఆస్తి అనుకోవచ్చు. ఓ సెంటిమెంట్ అడ్డాగా మన లైఫ్ లోకి వచ్చే ఖరీదైన గిఫ్ట్ ఇల్లు, సంపాదనతో పొంతన లేకుండా ఇల్లు కొనడమే లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇల్లు తలకు మించిన భారం అవుతుంది, కొనడం వల్ల జీవి తంలో మరింత ముఖ్యమైంది ఏదైనా కోల్పోతామా? అనేది చెక్ చేసుకో వాలి. అలాంటి కమిట్మెంట్స్ ఏం లేకపోతే... ఇల్లు కొనే ప్లానింగ్ స్టార్ట్ చేయొచ్చు, భవిష్యత్తులో బోలెడన్ని కమిట్మెంట్స్ పెట్టుకొని,, ఆదరాబాద రాగా ఇల్లు కొంటే మాత్రం తప్పులో కాలేసినట్టే! నెలకొచ్చే తక్కువ జీతంతో ఎక్కువ ఈఎంఐ పెట్టుకుని ఇల్లు కొనే సాహసం చేయొద్దు. అప్పుడు ఇంట్లో అనివార్యమైన ఖర్చులకు సంపాదన సరి పోదు, పిల్లల చదువుల్ని, ఇతర కుటుంబ అవసరాల్ని రిస్క్ పెట్టినట్టు అవుతుంది. ఈ విషయాన్ని ఇంట్లోవాళ్లకి అర్థమయ్యేలా చెప్పండి. ముందున్న ఓ 20 ఏళ్ల జీవితాన్ని అంధకారంలోకి నెట్టినట్లు అవుతుంది అనే విషయాన్ని వారు గ్రహిస్తారు. ఎందుకంటే.. ఇంట్లో భార్య. మొదటి ఫైనాన్షియల్ సలహారు అని మర్చిపోవద్దు. --- ముందస్తుగా వద్దు. సగటు ఉద్యోగి చేసే తప్పుల్లో ఒకటి గృహరుణం వీలైనంత వేగంగా తీర్చేం కోవడం హోమ్ లోన్ ఈఎమ్ఐల చట్రం నుంచి బయటపడా అని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. ఎవరో కొలీగ్ ముందస్తుగా ఇంటి రుణం తీర్చేశాడని ఆరాటపడుతుంటారు. పీఎఫ్ విత్ డ్రా చేసి మరీ హోమ్ లోన్ క్లోజ్ చేస్తుంటారు కొందరు. వాయిదాతోపాటు అదనంగా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు మరికొందరు. కానీ, గృహరుణాన్ని మంచి అప్పుగా పరిగణించాలి. హోమ్ నైపై వడ్డీరేటు 9.5 శాతం కన్నా మించదు. పైగా, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. దానిని పరి గణనలోకి తీసుకుంటే ఇంటి రుణంపై వడ్డీ 7 శాతం దాటదు. అంటే 80 పైసల కన్నా తక్కువ వడ్డీకే మనకు రుణం లభించినట్టు. ఇంత తక్కువ వడ్డీకి మరెక్కడా అప్పు దొరకదు. అలాంటి రుణాన్ని త్వరగా తీర్చడం అంటే, ఆర్థిక విధానాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. మంచి అప్పును వీలైనంత ఎక్కువ కాలం కట్టడమే ప్రయోజనకరం. శరీ రంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా! హోమ్లోన్ మంచి కొవ్వు లాంటిది. అది శరీరంలో ఉంటే ఆరోగ్యానికి మంచిది. హోమ్లోన్ దీర్ఘకాలం కొనసాగిస్తే.. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అరవై పైసల వడ్డీ ఉన్న గృహరుణం క్లోజ్ చేయడం కన్నా.. ఆ మొత్తాన్ని రూపాయి వడ్డీ వచ్చే చోట ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని అనిపించుకుం టుంది. భవిష్యత్తులో ఏదైనా అవసరం ఏర్పడితే.. ఆ పెట్టుబడిని ఉపసం హరించుకొని, ఉపయోగించుకునే వీలుంటుంది! --- 15×15x15= కోటి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడుదొడుకులకు లోబడి ఉంటాయన్నది అక్షర సత్యం. ఎందుకు? ఎప్పుడు? అన్న స్పష్టత ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లాభాలను అందిస్తాయని నిపుణుల మాట! మార్కెట్ హెచ్చుతగ్గులు లాభశాతాన్ని తగ్గించవచ్చు కానీ, నష్టాల్లోకి మాత్రం నెట్టేయవని నమ్మకంగా చెబుతున్నారు. మ్యూచు వల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి స్పష్టత ఉండాలంటే... పర్సనల్ ఫైనాన్స్ అనగానే చాలామంది ఎక్కడ పెడితే డబ్బులు పెరుగు తాయా అనే ఆలోచిస్తారు. నెలల వ్యవధిలో లాభాల వర్షం కురవాలని ఆశి స్తుంటారు. ఇలాంటి ఆత్రుత మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పనికిరాదు. తొందరపాటు వల్ల లాభాలు రాకపోగా నష్టాలు చవిచూనే ప్రమాదమూ ఉంటుంది. సరళతరమైన పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్ చక్కని మార్గం అంటారు ఆర్థిక వేత్తలు. మార్కెట్ క్రాష్ అయితే పరిస్థితి ఏమిటి? అనే అను మానం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రిస్క్ అంతటా ఉంటుంది. గడిచిన పదేండ్లుగా మ్యూచువల్ ఫండ్స్ ఏటా రమారమీ 14 శాతం రిటర్న్స్ సాధిస్తుండటం విశేషం. లక్ష్యానికి తగ్గట్టుగా.. ఏ పెట్టుబడి ఎందుకు పెడుతున్నామో తెలిస్తే.. దాని ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలు, హత్కాలిక అవసరాలకు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే ఆశించిన లాబాలు రావు. అని ష్యత్ అవసరాలు ముందుగానే ఊహించి, అందుకు తగ్గట్టుగా ప్రూక చేసుకోవాలి. ఉ రణకు కూతురి రెండేండ్ల వయసులో మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించారనుకోండి. చిన్నారి . సెక్స్ ఇంటర్ పూర్తయ్యాక.. ఉన్నత విద్యకు అంటే 17 ఏండ్ల వయసులో రిటర్న్స్ వచ్చేలా చూసుకో వాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చే ప్రయోజనాలు ఆశించినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపికే అవుతుంది. అలాగని -- ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని తీయకూడదు అని భీష్మించుకోవద్దు. ఇల్లు గడవలేని స్థితి ఏర్పడినప్పుడు అధిక లాభాల గురించి ఆలోచించకుండా పెట్టుబడులు ఉపసంహరించడం విజ్ఞత అనిపించుకుంటుంది. కోటికి చేరువగా.. 1515x15 ఒక కోటి' ఈ కొటేషన్ మార్కెట్ లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. పదిహే రిటర్న్స్ పొందగలిగితే.. అచ్చంగా రూ. కోటి కూడబెట్టినట్టే! అంటే పదిహేనేండ్లలో రూ.27 నేండ్లపాటు నెలకు రూ.15వేల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి, 15 శాతం హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మార్కెట్ భారీగా క్రాష్ అయి 20 శాతం పడిపోయినా రూ.80 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. కోటి వస్తాయి. రిటర్న్ శాతం కాస్త అటూఇటుగా మారితే.. కోటికి కాస్త ఇన్వెస్టర్ సొమ్ముకు భద్రత పెరుగుతుంటుంది. రిస్క్ తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేక సందర్భాలు ఎదురైతే లాభశాతం తగ్గుతుందే కానీ, నష్టపోయే పరిస్థితులు ఉండవు. తొందరపాటు చేటు. ఇన్వెస్టర్ ప్రధానంగా తన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. అందుకు తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో దేనిని ఎంచుకోవాలో అవగాహనకు రావాలి. కొన్ని ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగేవీ ఉంటాయి. కొన్ని ఏడాదిలో సగానికి పడిపోవచ్చు. విలువ బాగా పెరిగిందని, భారీగా పడిపోయిందని తొందరపాటుతో రెండు మూడేండ్లకే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారు. కొందరు. దీనివల్ల ఆశించిన ప్రయోజనం చేకూరదు. ఇన్వెస్ట్ చేశాక మొదటి రెండుమూడేండ్లు పడిపోయినా పట్టించుకోవాల్సిన పన్లేదు. కనీసం ఎనిమిదేండ్లు కొనసాగిస్తే పెట్టిన పెట్టుబడికి తప్పకుండా ఎంతోకొంత గిట్టుబాటు అవుతుంది. అదృష్టం కలిసివస్తే అంచనాలకు మించిన ఆదాయం సమకూరుతుంది. చివరగా.. నిపుణుల సలహా మేరకు మ్యూచువల్ ఫండ్స్న ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడికి ముందు అన్ని పత్రాలు జాగ్రత్తగా చదవడం మాత్రం మర్చిపోకండి. మూడేండ్ల ముందుగానే.. సాఫీగా సాగుతున్న ప్రయాణం గమ్యానికి చేరడానికి ముందు అనుకోని విధంగా ఇబ్బందిక రంగా మారవచ్చు. టైర్ పంక్చర్ కావడమో, ఇంధనం అయిపోవడమో, రోడ్డు మరమ్మతు జరుగుతుండటమో.. ఇలా రకరకాల సమస్యలు ఎదురవ్వొచ్చు. అంతమాత్రానికి వెనక్కి వెళ్లిపోం కదా! మ్యూచువల్ ఫండ్స్క ఇదే సూత్రం వర్తిస్తుంది. పదిహేనేండ్ల ప్రణాళికతో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. పన్నెండేండ్లు గడిచిపోయాయి కూడా ! తర్వాత మార్కెట్ పరి స్థితి ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఉంటే.. మూడేండ్ల ముందుగానే వెనక్కి తీసుకో వాలి. ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో వేయడం మంచిది. కొంత మొత్తాన్ని మరోచోట ఇన్వెస్ట్ చేయొచ్చు. --- ఈ ఏడాదైనా.. ఇలా చేద్దాం! నూతన సంవత్సరం వచ్చీరాగానే అనుకుంటాం. ఆహారం, వ్యాయామం, నిద్ర.. ఇలా ఎన్నో విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. వాటిని పక్కాగా అమలుచేస్తున్నారా? ఆ సంగతులు ఎలా ఉన్నా.. కొత్త పెట్టుబడుల విషయంలో పట్టుదలకు పోవద్దని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. తాత్కాలిక లబ్ధి కన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం రాగానే ఎంతోకొంత మారాలనుకుంటాం. ఎన్నో మార్చే యాలనుకుంటాం. ఖర్చులు తగ్గించాలని, పొదుపు మంత్రం పఠించాలని, ఎలాగైనా మదుపు చేయాలని బలంగా కోరుకుంటాం. అన్నీ మంచి నిర్ణయాలే! అయితే, ఆర్థిక పరమైన స్పష్టత లేకపోతే.. మదుపు అదుపు తప్పే ప్రమాదం ఉంది. తక్కువ కాల పరిమితితో పెట్టుబడి పెట్టాలనుకోవడం సరైనది కాదు. జనవ రిలో ఇన్వెస్ట్ చేసి డిసెంబర్లో లాభాలు కొల్లగొడతాను అనుకుంటే అన్ని సంద ర్భాల్లో సాధ్యమయ్యే పనికాదు. రైతు నారుపోయగానే దిగుబడి చేతికి రాదు కదా! నాలుగు నెలలు గడిస్తే గానీ.. పంట పండదు! పెట్టుబడుల విషయంలోనూ అంతే. ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఏడాది తిరిగేలోపు రెండింతలు, మూడింతల లాభాలు రావాలంటే అది ఉత్తమాటే! ఒక ప్రయోజనాన్ని ఆశించి పెట్టుబడులు పెట్టాలి. లాభాల కోసం నిర్దేశిత సమయం వేచి ఉండాలి. ప్రయోజనాన్ని ఆశించి.. . మన అవసరాలు గుర్తెరిగి అందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. పిల్లల చదువు, * పెండ్లి, రిటైర్మెంట్ ప్లాన్.. ఇవన్నీ దీర్ఘకాలికమైనవి. భారీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఒక్క ఏ లో పైన పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా లాభాలు పొందలేరు. ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తే అంత పెద్ద మొత్తమూ ఏడాదిలో కరిగి -- పోతుంది. చిన్న మొత్తంతో పెద్ద ప్రయోజనం పొందాలంటే.. కనీసం పదేండ్ల కాల పరిమితితో శాతం వడ్డీ లభిస్తుంది. డబ్బుకు రక్షణ ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునే ఇన్వెస్ట్ చేయాలి. ఒకట్రెండేండ్లు చాలు అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది. ఆరు మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో దాదాపు 14 శాతం రిటర్న్స్ పొందే అవకాశాలు ' ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకు కలిసివస్తుంది. పదేండ్లలో మంచి లాభాలను అందించే మరో మార్గం రియల్ ఎస్టేట్. ఆరేండ్లలోనే భూముల ధరలు రెండింతలు అవుతాయని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్లో సగటు రిటర్న్స్ 12 శాతంగా ఉంది. రిస్క్ తప్పదు.. లాభాలు ఉన్నచోట రిస్క్ ఉంటుంది రిస్కు వద్దంటే లాభ శాతం తగ్గుతుంది జరుగకాలిక పెట్టుబడుల కు ఫిక్స్డ్ డిపాజిట్ను ఎంచుకోకూడదు. అందులో రిటర్న్స్ 6 శాతం మించవు. మదుపు చేయడం ప్రయోజనకారి కాదు. అదే సమయంలో, పదేండ్లుగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉన్న ఈ రోజుల్లో.. దానికన్నా తక్కువ రిటర్న్స్ వచ్చేచోట దీర్ఘకాలం మ్యూచువల్ ఫండ్స్ను కదిలించి.. మరోచోట అదృష్టాన్ని పరీక్షించుకుంటానన్నా తప్పే! 14 నుంచి 16 శాతం రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసి, 12 శాతం రిటర్న్స్ ఇచ్చే భూమిపై పెట్టడం గొప్ప ఎత్తుగడ అనిపించుకోదు. పెట్టుబడిగా కాకుండా.. ఒక స్థిరాస్తిగా భూమి గానీ, ఇల్లు గానీ కొనాలనుకుంటే పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలో అర్థముంది. అంతేకానీ, ఆ భూమినీ తిరిగి అమ్మేసే ఉద్దేశం ఉంటే మ్యూచువల్ ఫండ్స్న ముట్టుకోకండి. ఒకట్రెండు ఏండ్లకైతే ఎల్డీ ఉత్తమం. పదేండ్లు, అంతకుమించిన కాల పరిమితితో పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మంచిమార్గాలు. రిస్క్ ను ఎదు ర్కొనే ధైర్యం ఉంటే.. స్వల్ప, దీర్ఘకాలిక పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎంచుకోవచ్చు. వెయిట్ అండ్ విన్. ఒక స్థితిమంతుడు 1995 సంవత్సరంలో కొంత భూమిని రూ.60 వేలకు కొన్నాడు. ఇప్పుడు మార్కెట్లో దాని విలువ రూ.60 లక్షలు. తన పెట్టుబడి వంద రెంట్లు పెరిగిందని ఆయన సంబురపడ్డాడు. అయితే అదే సంవత్సరం అతని స్నేహితుడు రూ.60 వేలు నిప్పాన్ ఇండియా గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అది 400 రెట్లు పెరిగి రూ.2.40 కోట్లయింది. ఈ ఇద్దరూ లాభపడ్డవారే! రెండిట్లో ఉన్న కామన్పాయింట్ ఇద్దరూ దాదాపు 29 ఏండ్లు పెట్టుబడిని ముట్టుకోలేదు. అందుకే ఇద్దరూ మంచి లాభాలే అందుకున్నారు. --- ఎంత కాలం? ఎంత మొత్తం? ఇప్పుడు మార్కెట్లో గట్టిగా వినిపి అయితే అందరూ కోటి రూపాయల జీవిత బీమా దగ్గరే ఆగిపోతున్నారు. జరగరానిది జరిగితే ఆ కోటి తమ కుటుంబాన్ని నిలబెడుతుందని భావిస్తున్నారు. కానీ, ఈ రోజు కోటి పెద్ద మొత్తమే కావచ్చు. ఇరవై ఏండ్ల తర్వాత కోటి విలువ పాతిక లక్షలు దాటదు. ఈ క్రమంలో జీవిత బీమా ఎవరు, ఎంతకు తీసుకోవాలో స్పష్టత చాలా అవసరం. జీవిత బీమా అనగానే సుదూర భవిష్యత్తును ఊహించేసుకొని 80 ఏండ్ల వరకూ తీసుకుంటారు చాలామంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా బీమా కాల పరిమితిని నిర్ణయించాలి కానీ, పాలసీదారుడి వయసు ఆధారంగా కాదు. బీమా తీసుకునే వ్యక్తి తన కనిష్ఠ సంతానానికి 30 ఏండ్లు వచ్చేవరకు పాలసీ కొనసాగేలా కాలపరిమితిని నిర్ణయించాలి. ముఖ్యంగా జీవిత బీమా అంటే పాలసీదారుడు అనుభవించేది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అతనికి ఏమైనా అయినప్పుడు బీమా మొత్తం కుటుంబానికి భరోసా ఇస్తుంది. పిల్లలు జీవితంలో స్థిరపడిన తర్వాత బీమా మొత్తంతో పనే ఉండదు! విలువలో తరుగు. బీమా మొత్తం ఎంత తీసుకోవాలి అనే విషయంలోనూ స్పష్టత చాలా అవసరం. కోటి రూపా ల బీమా చేశానని భరోసాతో ఉంటారు. కానీ, ఇప్పటికిప్పుడు కోటి గొప్పే కావచ్చు. పాతిక యలు వెచ్చిస్తే నాలుగు కిలోల బియ్యం వచ్చేవి. మరి ఇప్పుడు రెండు కిలోలకు మించి కేండ్ల తర్వాత అదంత పెద్ద మొత్తంగా కనిపించకపోవచ్చు. పదేండ్ల కిందట వంద రూపా రావడం లేదు. ఇంకో పదేండ్లు పోతే.. కిలో వస్తే మహాభాగ్యం. పదేండ్ల కిందట వంద రూపా యలే, ఇప్పుడూ అంతే, పదేండ్లయ్యాకా అదే వంద.. కానీ, దాని విలువ పడిపోతూనే ఉంది. 30 ఏండ్ల తర్వాత రూ. 100కు ప్లేట్ ఇడ్లీ కూడా రాదేమో! ఇదే సూత్రాన్ని టర్మ్ ఇన్సూరెన్స్కు --- వర్తింప జేసుకోవాలి. సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా కన్నుమూస్తే అతని కుటుంబం ఏ లేకుండా జీవితాన్ని కొనసాగించే భరోసా ఇవ్వగలిగే మొత్తానికి జీవిత బీమా తీసుకోవాలి. వడ్డీతో నడవాలి.. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వేతనం నెలకు రూ.1.60 లక్షలు, తల్లి, భార్య, ఇద్దరు సంతానంతో కలిపి ఏడాదికి రూ.3 లక్షలు ఫీజు చెల్లించేవాడు. లోన్లో ఇల్లు తీసుకున్నాడు. కోటి రూపా సంతోషంగా జీవితం గడిపేవాడు. పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించేవాడు. ఇర _యల ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఊహించని ప్రమాదంలో అతను కన్నుమూశాడు. నెల వ్యవ ధిలో పాలసీ మొత్తం కోటి రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజి చేసి వడ్డీ మీద సంసారం నడపాలని నిర్ణయించుకుంది ఆ ఇల్లాలు. పన్ను మినహాయించగా నెలకు రూ.45 వేలు రావడం మొదలైంది. గృహరుణానికి కూడా ఇన్సూరెన్స్ ఉండటంతో పిల్లల స్కూల్ ఫీజు రూ.3 లక్షలు పోతే ఇక మిగిలేది ఏముంటుంది? క్లాసు పెరిగే కొద్దీ రూపాయలు పెద్ద మొత్తం కూడా ఆ కుటుంబ కనీస అవసరాలకు సరిపోలేని పరిస్థితి. ఇలాంటి ఫీజులూ పెరుగుతాయి. అలాగని అసలు ఖర్చుపెడితే భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కోటి దుస్థితి ఏర్పడకూడదు అంటే పాలసీదారుడు తన ఆదాయాన్ని, కుటుంబ అవసరాలకు ఆను బీమా మొత్తం ఎంతో నిర్ణయించుకోవాలి. తర్వాతి రోజు తనకు ఏదైనా ఆపద వస్తే.. కుటుంబ పరిస్థితి తలకిందులు కాకుండా అండగా ఉండేలా బీమా మొత్తం ఉండాలి. ఫిక్స్ డిపాజిట్ వడ్డీపై కుటుంబ అవసరాలు తీరేంత డబ్బుకు పాలసీ తీసుకోవాలి. నెలకు లక్షకు పైగా జీతం సంపాదిస్తున్న వ్యక్తి రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు బీమా చేయాలి. కాల పరిమితి పాలసీదారుడి వయసు 65 ఏండ్లు దాటకుండా చూసుకోవాలి. అప్పుడు తక్కువ ప్రీమియంతో కుటుంబానికి అధిక ప్రయోజనం కలిగించిన వాళ్లం అవుతాం. అవసరాలకు అనుగుణంగా.. 1992లో లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ఉంటే అద్భుతం. ఇప్పుడు అదే లక్షతో నెల గడవడం కష్టం. ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ప్రకారం కోటి రూపాయల విలువ 30 ఏండ్ల తర్వాత 12.50 లక్షలే! ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడాదికి 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాడు. అనుకుందాం. ఏడాదికి 7 శాతం చొప్పున అతని జీతం పెరిగినా.. పదేండ్లకు రూ.20 లక్షలు అవుతుంది. అతని వార్షిక ఆదాయం 20 ఏండ్లకు రూ.40 లక్షలు, 30 ఏండ్లకు రూ.80 లక్షలు అవుతుంది. అదే వ్యక్తి రూ. కోటికి జీవిత బీమా తీసుకుంటే.. 30 ఏండ్ల తర్వాత అతని సంవత్సర ఆదాయానికి దాదాపు సమానం. ఇప్పుడు ఏడాదికి పది లక్షలకుపైగా ఆదాయం ఉన్న వ్యక్తి కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు జీవిత బీమా తీసుకుంటే గానీ, కుటుంబ ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని అందించలేడు. -- జీవిత పరీక్షలో కాపీలొద్దు! సినిమాలో కాపీ సీన్ కనిపిస్తే ఆ దర్శ కుడిపై ట్రోల్స్తో విరుచుకుపడతాం! కట్టుబొట్టు వ్యవహారాల్లోనూ ఎవరి నైనా అనుకరిస్తే.. 'కాపీ క్యాట్' అని ఆటపట్టిస్తాం. ఆర్థిక విషయాల దగ్గరికి వచ్చేసరికి ఇతరుల విధానాలను అనుకరించే ప్రయత్నం చేస్తుంటాం. ఎక్కడైనా 'మక్కీకి మక్కీ' కాపీ కొట్టొచ్చేమో కానీ, పొదుపు- మదుపు దగ్గర ఇతరులను గుడ్డిగా ఇమిటేట్ చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది. ధనవంతులు కావడం, ధనవంతుల్లా కనిపించడం ఈ రెండిటికి హస్తిమశకాం తరం తేడా ఉంది. శ్రీమంతులు కావడం కష్టమైన పని. కలవారిలా కనిపిం చడం తేలికే! అందుకోసం వారిని అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. పరీక్షల్లో ఎదుటివారి జవాబు పత్రాన్ని తొంగితొంగి చూడటం సాధార ణంగా జరిగేదే. కాపీ కొట్టడం తప్పే అయినప్పటికీ, ఆ ఇద్దరు విద్యార్థుల ప్రశ్న పత్రం ఒకటే కాబట్టి.. బాగా రాసిన విద్యార్థికి, అందులోంచి కాపీ చేసిన విద్యార్థికి మంచి మార్కులే వస్తాయి. కానీ, ఈ కాపీ సూత్రం పైసల ముచ్చట్లకు పనికిరాదు. ఎందుకంటే, ఏ ఇద్దరి జీవితాలూ ఒకేలా ఉండవు! ఏ రెండు కుటుంబాల అవస రాలు ఒకేవిధంగా ఉండవు!! అలాంటప్పుడు ఎదుటివారి ప్రణాళికలు పాటిస్తే ఆశించిన ప్రయోజనం సిద్ధించకపోగా, అసలుకే ఎసరొచ్చే ప్రమాదమూ ఉంది. ప్రాధాన్యం ఎరిగి.. మీ అవసరాలు ఏమిటి? ఏ సమయానికి ఎంత అవసరం అనే స్పష్టత ఉండాలి. ఆర్థిక ప్రణాళి కలో రెండు 'పీ'లు.. ప్రయారిటీస్ (ప్రాధాన్యాలు), ప్రాబబిలిటీస్ (ప్రమాదాలు) ముఖ్యమై నవి. జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటో నిర్దేశించుకోవాలి. ఆయా సమయాలకు తగ్గ ట్టుగా ఆర్థిక ప్రయోజనం పొందే విధంగా ప్రణాళికలు వేసుకోవాలి. పిల్లల చదువు, పెండ్లి, మీ రిటైర్మెంట్ వీటిని ప్రధాన లక్ష్యాలుగా పరిగణించాలి. కూతురు పైచదువుల్లోకి ఏ సంవత్సరం -- వెళ్తుంది, అప్పుడు ఫీజు ఎంత ఉండొచ్చన్న అంచనా ఉండాలి. 20 ఏండ్ల తర్వాత రిటైర్ అవుతున్నారనుకోండి, అప్పుడు నెలవారీగా ఎంత మొత్తం అవసరం అవుతుందన్న కనీస అవగా ఉండాలి. అందుకు తగ్గట్టు ఆదాయం వచ్చేలా ఇన్వెస్ట్ చేయాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. ఆర్థికంగా ఎంత క్రమశిక్షణతో ఉన్నా, ఊహించని ఇబ్బందులు ప్రణాళికలను తలకిం అనారోగ్యం పాలైతే ఈ రోజుల్లో ఖర్చు లక్షల్లో పైమాటే! ఈ భారం మీద పడొద్దంటే..ఆ దులు చేస్తాయి. అలాంటి అనుకోని సమస్యల్లో ప్రధానమైనది అనారోగ్యం. సంపాదించే వ్యక్తి _బీమా తప్పనిసరి. దీంతోపాటు జీవిత బీమా తోడుంటే నిశ్చింతగా ఉండొచ్చు.. అంచనా వేసి.. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశిస్తే సరిపోదు, అప్పుడు ఉండే పరిస్థితులను కూడా సరిగ్గా అంచనా వేయగలగాలి. ఉదాహరణకు హెల్త్ ఇన్సూరెన్స్ రూ.5 లక్షలకు తీసుకొని 'హ మ!' అనుకుంటారు. కానీ, ఈ రోజు ఉన్న ధరలు పదేండ్లకు రెట్టింపు అవుతాయి. కిందట కీళ్ల మార్పిడికి రూ.60 వేలు ఉంటే సరిపోయేది. ఇప్పుడు రూ.3 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇంకో పదేండ్లు పోతే రూ.9 లక్షలు కావొచ్చు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవడం ముఖ్యం. ఎక్కువ కవరేజీ పాలసీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువగా కట్టాల్సి వస్తుంది కదా? అంటారా! రూ.5 లక్షల పాలసీకి, రూ.50 లక్షల పాలసీకి ప్రీమియంలో వ్యత్యాసం ఏడాదికి సుమారు రూ.15 వేలే! అంటే నెలకు రూ.1250 మాత్రమే! అలాంటప్పుడు ఎక్కువ కవరేజీ ఉండే ఆరోగ్య బీమా తీసుకోవడమే మంచిది! పిల్లల చదువు విషయంలోనూ పదేండ్ల తర్వాత ఫీజులు ఎంత ఉండొచ్చనే అంచనాకు వచ్చి, అందుకు తగ్గ ఆదాయం సమకూరే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ప్రశాంతత కోల్పోవద్దు. ఎవరినో చూసి సంపద కోసం పరుగులు తీయడం సరైన పద్ధతి కాదు. రాత్రికి రాత్రే రెండిం తల లాభాలు రావాలని ఆశించి పెట్టు బడులు పెడుతుంటారు. అయాచితంగా లాభాలు వచ్చి పడే చోట ఊహించని ప్రమాదాలూ ఉంటాయి. డబ్బుల గురించి అతిగా ఆలోచించి జబ్బులు తెచ్చుకోవద్దు. జీవితానికి ముఖ్యంగా కావాల్సింది ప్రశాంతత. దాన్ని పణంగా పెట్టి ఎన్ని సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం? పిల్లలకు మంచి చదువు చెప్పించడం బాధ్యత. శేష జీవితం విశేషంగా సాగేలా ఏర్పాటు చేసుకోవడం వ్యక్తిగత అవసరం. ఈ రెండిటినీ సాధించిన తర్వాతే మరేదైనా!! ‘పక్కింటి వాళ్లకు కోట్లు ఉన్నాయి, బంధువులకు బంగ్లాలు ఉన్నాయి. అని కాసుల వేటలో పడితే ఆస్తులు పెరగొచ్చు కానీ, సంతృప్తి మిగలదు! -- పడిపడి లేచే మార్కెట్. సెన్సెక్స్ సూచీలు పతాక స్థాయికి చేరగానే వెలిగిపోయే ముఖాలు కొన్నయితే, మార్కెట్ పతనంతో కుదేలయ్యేవాళ్లు ఇంకొందరు. కానీ, షేర్ బజార్ జోరు మీదున్నప్పుడు తప్పులో కాలేస్తే ముప్పు తప్పదు. దలాల్ స్ట్రీట్ ఈక్వేషన్లు మహా భారతంలోని శకుని పాచికల కన్నా ప్రమాదకరమైనవి! మాయా శశి రేఖలా కనికట్టు చేస్తే గానీ, ఇక్కడ లాభాలు ఒడిసిపట్టలేం! కాలంతో కలబడితే గానీ నిలబడలేం!! ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఊపు మీదుంది. ఆల్టైమ్ హయ్యెస్ట్ మార్క్్న అందుకున్న వార్తలు మదుపరులను విచిత్ర పరిస్థితిలోకి నెడుతాయి. మార్కెట్ ఉరుకులమీద ఉందని తెలియగానే పరుగు ఆపడమే మేలని కొందరు భావిస్తారు. చేతిలో ఉన్న స్టాక్స్న చకచకా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని భావి స్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాంలే అనేది కొందరి పట్టుదల! స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సాధారణంగా చోటుచేసుకునేవే! సూచీల స్థాయి లతో పేచీ పడకుండా మనం ఎందుకు ఇన్వెస్ట్ చేశామో, దాన్ని బట్టి నిర్ణయం తీసు కోవాలి. అంతేకానీ, మార్కెట్ స్థితిగతులకు లోబడి నిర్ణయాలు తీసుకుంటే పూర్తి స్థాయి ప్రయోజనం పొందలేరు. ఊగిసలాడొద్దు.. సెన్సెక్స్ సూచీలు గరిష్ఠ మార్కును అందుకున్నాయని తరచూ వింటుంటాం. ఉదాహరణకు కొద్దిరోజుల కిందట 85వేల మార్కును దాటి రికార్డు నెలకొల్పింది. మరో వారానికి ఇది తెర మరుగు కావొచ్చు. కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని మనం తొందరపడాల్సిన పనిలేదు. బేర్ విజృంభణ మొదలైందని బెంబేలెత్తిపోయి అగపడి చేతులు కాల్చుకోవద్దు. మార్కెట్ హైలో ఉందన్నంత మాత్రాన అన్ని స్టాక్ లూ అదే రేంజ్లో ఉన్న కాదు. ర్యాలీ సాదాసీదాగా సాగితే ఊగిసలాడొద్దు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచు --- వల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఇదంతా చేస్తారు. లేని గరిష్ట స్థాయికి చేరిందని పెట్టుబడి ఉపసంహరించుకోవడం తెలివైన పని కాదు. సూచీల పాయింట్లు ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటాయి. సూచీలు నేల చూపులు చూసినంత మాత్రాన అన్ని స్టాక్స్ పడిపోయినట్టు కాదు. అలాగని దిగువకు షేర్ ధరలు అక్కడే తిష్టవేసి కూర్చుంటాయనీ అనుకోవద్దు. మీ ప్రణాళికలకు అనుగు ంగా పెట్టుబడి ఉపసంహరించుకోవాలే కానీ, బుల్ రంకెలేస్తుందనో, బేర్ కాచుకుందనో మాత్రం కాదు! టైమింగ్ కాదు ముఖ్యం.. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు టైం కి నవ్వుకోవద్దు ఎంతకాలం ఉందన్న దాన్ని బట్టి విలువ పెరుగుతుంది. కరోనా మార్కెట్ను కుదిపేసినా మళ్లీ పుంజుకుంది. మన దేశంలో ప్రభుత్వం మారినప్పుడు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పుడు కూడా మార్కెట్ ప్రభావితమవుతుంది. అంతమాత్రానికే ఏదో చేటు కలగబోతున్నదని ఊహించు కొని అమ్మకాలకు సిద్ధపడితే దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతినవచ్చు. అవసరం లేనప్పుడు పెట్టుబడి ఉపసంహరించడం అంటే ఆకలి లేనప్పుడు అన్నం తినడం లాంటిదే! తీరా ఆకలి వేసినప్పుడు తినడానికి ఏమీ లేకుండా పోతుంది. సహజంగా ప్రతి పెట్టుబడికీ ఓ లక్ష్యం ఉంటుంది. కూతురు పై చదువులకో, కొడుకు సెటిల్మెంట్్క, సొంతింటికి పెట్టుబడి కోసమో ఇన్వెస్ట్ చేశారే అనుకుందాం! ఆయా అవసరాలు రాకముందే మార్కెట్ ప్రకంపనలకు భయ పడి, ఇంతటి లాభాలు మున్ముందు రావేమోనని అనుమానించి పెట్టుబడులు ఉపసంహరిం చొద్దు. కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు షేర్లను హోల్డ్ చేయడమూ మంచిదే! మీ లక్ష్యాన్ని నెర వేర్చుకునే క్రమంలో ఆరు నెలల ముందునుంచి మార్కెట్ స్థితిగతులు పరిశీలించి మంచి సమయం చూసి లాభాలు స్వీకరిస్తే.. మీ నిరీక్షణ విజయవంతం అవుతుంది. ఇక్కడా పసిడి సూత్రమే! 2009లో సెన్సెక్స్ 9వేలు 10వేల పాయింట్ల మధ్య కొనసాగింది. 14 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం 64 వేల నుంచి 65 వేల మధ్య ట్రేడ్ అవుతున్నది. ఈ లెక్కన ఏడాదికి సగటున 15 శాతం వృద్ధి నమోదైంది. కనీసం 12 శాతం వృద్ధిగా లెక్కగట్టినా మరో ఐదేండ్ల తర్వాత సెన్సెక్స్ లక్ష మార్కు దాటి సెన్సేషన్ సృష్టిస్తుంది. మరో ముఖ్యమైన విషయం బంగారం ధర పెరుగుతుంటే ఇంకా పెరగవచ్చని కొనుగోలుకు మొగ్గుచూపుతారు. పసిడి ధర పడిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని కొంటారు. ఇదే కాన్సెప్ట్ మార్కెట్కు కూడా అమలుపరిస్తే విజయం మీ సొంతం అవుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల కన్నా మీ అవసరాలకు గుణంగా ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం! --- షరతలకు లోబడి.. రాబడి! ఆర్థికాంశాల్లో ఆచితూచి అడుగు వేయడం ముఖ్యం. అలాగని మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా కరిగిపోతుంది. అందుకే పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు, ఆలస్యమూ కూడదు. 'మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?' ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, 'ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి' అంటే మాత్రం సవివరంగా విశ్లేషించరు. ఒకరు రియల్ఎస్టేట్లో పెట్టమని సలహా ఇస్తారు. మరొకరు షేర్స్ కొనమని ఒచెబుతారు. ఇంకొకరు మ్యూచువల్ ఫండ్స్ ద బెస్ట్ అంటారు. బంగారం ఉత్తమం అని మరికొందరి ఉవాచ. అన్ని రంగాల్లోనూ ఆగమేఘాల మీద ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు.. మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదో కాని పని అన్నట్టుగా కంగారుపడుతుంటారు. షరతులకు లోబడి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అత్యవసర సమయాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నిర్దుష్టమైన ఫలితాన్ని ఆశించే ఏ పని అయినా మొదలుపెడతాం. పెట్టుబడి విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఫలితం ముందస్తుగా ఊహించి, కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మదుపు చేయడం చాలా అవసరం. భూమి కొన్నా, మరేదైనా ఆస్తి కొనుగోలు చేసినా ఏ ప్రయోజనం ఆశించి కొంటున్నామన్నది. ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్కు అనుకూలమైన వేదికే! కానీ, మార్కెట్ హెచ్చుతగ్గులు లాభాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయనే ఉద్దేశంతో చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. అన్నిట్లో అదే రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అనే భావన చాలామందిలో ఉంటుంది. నెలవారీగా కొంత మొత్తాన్ని ఆర్డీ చేసుకుంటే తప్ప.. మరే పెట్టుబడి అయినా ఎంతోకొంత రిస్క్తో కూడుకున్నదే. --- ఉదాహరణకు పది లక్షల పెట్టి ఒక స్థలం తీసుకున్నారు పది సంవత్సరములకు దాని విలువ మార్కెట్లో రూ.30 లక్షలకు పెరిగింది! అయితే అత్యవసరం వచ్చిందే అనుకుందాం! అప్పటిక ప్పుడు మార్కెట్లో అమ్మకానికి పెడితే రూ.20 లక్షలు వస్తుందన్న గ్యారెంటీ లేదు! పైగా సరైన ఈలోపు మీ అవసరం మాటేమిటి? అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. ఎస్ఐపీ బయ్యర్ దొరికి ఆ ప్లాట్ అమ్ముడుపోవడానికి కనీసం రెండు నెలల సమయమైనా పట్టొచ్చు. ఈ లోపు మీ అవసరం మాటేమిటి అదే మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఎస్ఐపి ద్వారా నెలకు రూ.50వేలు ఇన్వెస్ట్ చేశారే అనుకుందాం. అంటే సంవత్సరానికి రూ.6 లక్షలు. పదేం డ్లకు రూ.60 లక్షలు అవుతుంది. రిటర్న్స్తో కలుపుకొంటే రూ.కోటి వరకూ వస్తుంది. - మైన పరిస్థితులు ఏర్పడితే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మాత్రమే కాదు.. కోట్లు వెచ్చించి మార్కెట్ ఒడుదొడుకులకు గురైనా రూ.80 లక్షల వరకూ రావొచ్చు. కరోనా వంటి దుర్భర భూములు కొనే వ్యక్తులూ ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉద్యోగం పోయినా.. మ్యూచువల్ ఫండ్స్లో అయితే డబ్బులు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మూడు రోజుల్లో నగదు మీ ఖాతాలో జమవుతుంది. ఇల్లు గడవడానికి ఆ గడవడానికి ఆ సొమ్ము ఉపయోగపడుతుంది. ఉన్నదంతా వద్దు.. అలాగని ఉన్నదంతా మ్యూచువల్ ఫండ్స్లో పెడతామంటే పొరపాటు. మీ ఆదాయంలో కొత్త వాటికి కేటాయించాలి. ఎంత అనేది మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణ యించుకోవాలి. ఉదాహరణకు మూడేండ్ల కూతురు ఉంటే.. తను ఇంటర్ పూర్తయ్యేసరికి సుమారు పదిహేనేండ్ల సమయం ఉంటుంది. ఈ కాలపరిమితితో పై చదువు కోసం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు వచ్చే ప్లాన్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పెండ్లికే అనుకోండి మరో ఐదేండ్లు కాలపరమితి పెంచుకోవచ్చు. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, ఇతరత్రా అన్నీ పోయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఎస్ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే.. సమయోచితంగా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా షరతులకు లోబడి ఇన్వెస్ట్ చేస్తే.. ఆశించిన రాబడి తప్పకుండా లభిస్తుంది! బంగారం బంగారమే! మ్యూచువల్ ఫండ్స్ కాలపరిమితి ఎంత ఉండాలన్నది ముఖ్యం. మీ అవసరం కనీసం ఎనిమి దేండ్ల కాలపరిమితి తర్వాత అయితే మ్యూచువల్ ఫండ్స్ మంచిదే! మీ ఇన్వెస్ట్మెంట్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు రియల్ ఎస్టేట్ మంచి ఎంపిక. అయితే, మీ అవసరాన్ని ముందుగానే అంచనావేసి అందుకు తగ్గట్టుగా అది మంచి ధర పలికినప్పుడు అమ్మాల్సి ఉంటుంది. బంగారం మీద పెట్టుబడి కాలానికి సంబంధం లేని ఇన్వెస్ట్మెంట్. బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులకు లోనైనా పెట్టుబడికి గిట్టుబాటు అవుతుంది. పైగా బంగారం అయితే అమ్మకుండానే అవసరాలు తీర్చుకోవచ్చు. బ్యాంకులో కుదువపెడితే.. అప్పటికప్పుడు అప్పు పుడుతుంది. మరీ తప్పని పరిస్థితుల్లో అమ్ముకున్నా మార్కెట్ ధర పలుకుతుంది. --- వాయిదాల బాట.. బంగారు మూట! పుత్తడిపై అతివల వలపును తమ గెలుపు సూత్రంగా ఎంచుకుంటు ఆభరణాల తయారీదారులు. గోల్డ్ స్కీమ్స్ పేరిట వాయిదాల పద్ధతిలో సొమ్ము తీసుకొని.. వాళ్లకు నచ్చిన సొమ్ములు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తరుగు లేదు, మజూరీ లేదన్న ప్రచారం ఈ స్కీమ్స్ ఆదరణకు కారణం. ఇంతకీ వాయిదాల పథకం మంచిదేనా? దీనిని ఎంచుకోవడం వల్ల అదనంగా కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? మీ శ్రీవారి పుట్టిన రోజుకు బహుమతిగా ట్రేస్లెట్ ఇచ్చి షాక్ ఇవ్వాలనుకుంటున్నారా ?పెండ్లిరోజు మీ శ్రీమతి రవ్వల గాజుల ముచ్చట తీర్చాలని భావిస్తున్నారా? 'అనుకున్నామని జరగవు కొన్ని..' అని నిర్లిప్తత వద్దు. గోల్డ్ స్కీమ్ చేరితే 'అనుకోకున్నా ఆగవు కొన్ని!! సాధారణ బంగారం దుకాణాలు మొదలుకొని పేరుమోసిన జువెలరీ షోరూమ్ల వరకు ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి. మరి వీటిని నమ్మొచ్చా? అని సందేహం రావచ్చు. సెక్షన్ 73 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం.. ఒక ప్రైవేట్ కంపెనీ వినియోగదారుల నుంచి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డబ్బులు వసూలు చేసి.. దానికి తగ్గ వస్తువులు గానీ, సేవలు గానీ అందించే వెసులుబాటు ఉంది వీటిని 11 నెలలు పూర్తయ్యే లోపు ఇవ్వాలి. ఏడాది కావద్దన్న మాట! అందుకే గోల్డ్ స్కీమ్స్ అన్నీ 11 నెలల కాలపరిమితితో ఉంటాయి. చట్టబద్ధత ఉన్నంత 5 మాత్రాన భద్రత ఉందనుకుంటే పొరపాటు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ప్రమాదం చేయడన్న గ్యారెంటీ లేదు కదా! ఇది కూడా అంతే!! 20 శాతం అదనపు లబ్ధి. గోల్డ్ స్కీమ్ నెలవారీ చెల్లింపులతో ఇటు వినియోగదారుడికి, అటు దుకాణాదారుకు ఇద్దరికీ ప్రయోజనమే! ఒకేసారి రెండు తులాల నగ చేయించుకోవాలంటే రమారమి రూ.1.20 లక్షలు అవుతుంది. ఈ మొత్తాన్ని నెలకు రూ.11వేల చొప్పున 11 నెలలు వాయిదాలు చెల్లిస్తే -- తరుగు, మజూరీ ఉండదు కాబట్టి రూ.1.21 లక్షలతో రెండు తులాల కన్నా ఎక్కువ బరు వుండే ఆభరణం సొంతం చేసుకోవచ్చు. తరుగు, మజూరీ మినహాయింపు వల్ల కనీసం 11. శాతం వరకు రిటర్న్ పొందినట్టు అవుతుంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కూడా లెక్క లోకి తీసుకుంటే ఈ లబ్ధి దాదాపు 20 శాతం వరకు ఉంటుంది. స్కీమ్ లో వాయిదా చెల్లించు రోజు ఉన్న ధరను బట్టి ఎంత బంగారం వస్తుందో లెక్కకడతారు. ఇక, వాయిదాలు మొదలుపె మొత్తానికి ఎక్కువ బంగారం వస్తుంది కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. ధర పెరిగిందే ట్టిన మూడు నెలలకు బంగారం ధర తగ్గిందే అనుకోండి, తర్వాతి పద్దు చెల్లించేటప్పుడు అంటే అనుకోండి, ముందు నెలల్లో పొందిన బంగారం విలువ కూడా పెరుగుతుంది కాబట్టి.. సమస్య లేదు. రొటేషన్తో లాభం. నాలు ఇస్తుంటాయి పలు జువెలరీ సంస్థలు, వినియోగదారులకు ఇంత లాభం చేకూరితే, తరుగు, మజూరీ భారం తగ్గించడమే కాదు ఈ స్కీమ్ను ఎంచుకున్నవారికి మరిన్ని ప్రయోజ తయారీదారులకు నష్టం వాటిల్లదా? అన్న అనుమానం సహజం. వినియోగదారులు చెల్లిం వాయిదాలను దుకాణాదారులు తమ వ్యాపారంలో పెట్టుబడిగా వాడుకుంటారు. పద కొండు నెలల కాలపరిమితిలో ప్రతినెలా సమకూరే మొత్తంతో బంగారం కొనుగోలు చేసి, ఆభ రణాల రూపంలో విక్రయిస్తుంటారు. ఆ క్రమంలో లాభాలు గడిస్తారు. ఆ లాభాలను మళ్లీ పెట్టుబడిగా మలుస్తారు. ఇలా కస్టమర్లు చెల్లించే వాయిదాలు రొటేషన్ అవుతూనే ఉంటాయి. ఎంపిక మీదే. గోల్డ్ స్కీమ్స్ ఎంచుకునే క్రమంలో ఆఫర్ల కన్నా డిజైన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ దుకా ణంలో వెరైటీ డిజైన్లు ఉంటాయో అక్కడే స్కీమ్లో జాయిన్ అవ్వాలి. అంతేకానీ, రూ.10 వేల వరకు కలిసొస్తుందని మామూలు ఆభరణాలు అమ్మేచోట ఎంత మంచి స్కీమ్లో చేరినా ప్రయోజనం ఉండదు. మీరు కొనుగోలు చేసే ఆభరణం మనసుకు నచ్చేదై ఉండాలి. అందు కనే ముందుగానే, నాలుగైదు జువెలరీ దుకాణాలకు వెళ్లి, మార్కెట్లో వాటి స్థితిగతులు పరిశీ లించాలి. మీరు ఏ నగ కొనాలో అంచనాకు వచ్చి అందుకు తగ్గట్టుగా ఇన్స్టాల్మెంట్ నిర్ణ యించుకోవాలి. ఎందుకంటే? డబ్బు ఎవరికీ ఊరికే రాదు! బంగారంపై మోజు ఎప్పటికీ తీరదు!! రిస్క్ తగ్గించుకోండి 'చక్కని స్కీమ్ ఉంది కదా! అని వచ్చిన జీతంలో సింహభాగం దానికి కట్టేసి రిస్క్ కొనితెచ్చుకోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దల మాట, స్కీమ్ లో చెల్లించే మొత్తు నెల జీతంలో పది శాతం మించకూడదు. నాలుగు నెలల తర్వాత దుకాణాదారు బోర్డు తిప్పే నా భారీగా నష్టపోయే పరిస్థితి రాదు. మీ ఇష్టాల కన్నా.. అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగల ఎంపిక ఉండాలి. ఆడపిల్లలు ఉన్నట్టయితే వారు పెండ్లీడుకు వచ్చేసరికి పది తులాం నగలైనా సమకూర్చుకోవాలి. -- వేలంలో ఇల్లు కొంటున్నారా? సొంతింటి కల నెరవేరడం అంత తేలికేం కాదు! కోరుకున్న ఇంటి ధర అనుకున్న రేంజ్లో ఉండదు. తక్కువ బడ్జెట్ ఇల్లు కోరుకున్నట్టు ఉండదు! మార్కెట్ ధర కన్నా తక్కువలో మంచి ఇల్లు సొంతం చేసుకునే అవకాశం కోసం అందరూ ఎదురుచూస్తుం టారు. అలాంటి వారికి ఆశాదీపం బ్యాంకర్లు నిర్వహించే ఆస్తుల వేలం. అయితే, బ్యాంకు వేలం వేసే ఇల్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తే అదనపు లబ్ధి కలుగుతుందా? బ్యాంకు వేలం వేసే ఇండ్లు బహిరంగ మార్కెట్ ధర కంటే.. సుమారు 20 శాతం వరకు తక్కువగానే ఉంటాయి! బయటికన్నా తక్కువ ధర పలుకుతుండటంతో వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఇలా తక్కువ ధర పలకడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ బ్యాంక్ అయినా ఇంటి విలువలో 80 శాతం వరకు (రూ.30 లక్షల కన్నా ఎక్కువ ఉంటే) మాత్రమే రుణం మంజూరు చేస్తుంది. దీనికితోడు సదరు ఇంటి యజమాని ఒకట్రెండు ఏండ్లు గృహరుణం వాయిదాలు చెల్లించడంతో రుణం మొత్తం కొంత తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వేలం వేసే ఇండ్ల ధరలు మార్కెట్ ధర కన్నా తక్కువగా ఉంటాయి. దీంతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఈ-బిడ్డింగ్ ఎవరు ఎక్కువ కోట్ చేస్తే ఇల్లు వాళ్లకు సొంతం అవుతుంది. భవిష్యత్ ఆలోచించి.. తక్కువ ధరకు మంచి ఇల్లు పొందడం కన్నా ఆనందం ఏముంటుంది? కానీ, వేలంలో కొన్న వాటికి అన్ని బ్యాంకులూ రుణం మంజూరు చేయకపోవచ్చు. దీంతో ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లో అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఇంటి ధర తక్కువ పలికినా.. వడ్డీ అది కంగా ఉండటంతో, చెల్లించే మొత్తంలో మార్పు ఉండకపోవచ్చు! దానివల్ల తక్కువ ధరకు -- మంచి ఆస్తి దక్కిందన్న సంతృప్తి ఆవిరైపోతుంది. వేలం పాటలో కొన్న ఇంటికి బ్యాంకర్ సేల్ పెండ్లి కోసమో ఇంటి మీద రుణం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. నిరాశ ఎదురుకావచ్చు. డీ ఇవ్వరు. సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల చదువుల కోసమో, అందుకే ఒకే ఒక ప్రాపర్టీ కొనేవాళ్లు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేలం ఇండ్లను కొనకపోవడమే మంచిదని చెబుతారు నిపుణులు, ఒకటికి మించి ఆస్తులు ఉన్నవాళ్లు వేలంలో ఇంటిని కొన్నప్పటికీ ఇబ్బందేం ఉండదని పేర్కొంటారు. అన్నీ పరిశీలించాకే.. అంతకన్నా ముందు, ఆస్తికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. బ్యాంకువాళ్లు అమ్ముతున్నారు కాబట్టి లీగల్ సమస్యలు ఉండవని గుడ్డిగా రించుకున్న తర్వాతే వేలంలో పాల్గొనాలి. ఇంటి విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. నమ్మడానికి వీల్లేదు! ప్రాపర్టీ వివరాలు న్యాయ నిపుణుడికి చూపించి ఏ చిక్కులూ లేవని స్ప సదరు ఆస్తి యజమాని వాయిదాలు చెల్లించకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడం మంచిదే! ఆ వ్యక్తి ఆర్థికంగా చితికిపోయాడా, మరేమైనా సమస్యలు ఎదుర్కొన్నాడా అన్నది తెలుసుకుంటే వేలంలో పాల్గొనవచ్చో లేదో.. ఓ అంచనాకు రావచ్చు. నమ్మకాల సంగతి అటుంచితే, మార్కెట్ ధర కన్నా తక్కువలో ఇల్లు వస్తుంటే కాదనుకోవడం సరైనది కాదు! కానీ, కొనదలచిన ఇల్లు నచ్చినప్పుడే వేలంలో పాల్గొనాలి! అంతేకానీ, తక్కువలో వస్తుందని నచ్చని ఇంటిపై ఇన్వెస్ట్ చేసి, జీవితకాలం రుణ వాయిదాలు చెల్లిస్తూ పోవడం మానసిక అశాం తికి దారితీస్తుంది. అనవసరంగా కొత్త కొత్త బరువు నెత్తిన వేసుకున్నట్టు అవుతుంది. ఎప్పుడు వేలం వేస్తారంటే.. ఇంటి యజమాని మూడు నెలలు వాయిదా చెల్లించకపోతే, బ్యాంకువాళ్లు నోటీసులు పంపు తారు. దానికి కూడా స్పందించకపోతే సుమారు మూడు నెలలు గడువు ఇచ్చి.. 'ప్రాపర్టీని వేలం వేస్తామ'ని నోటీసులు పంపుతారు. అప్పటికీ స్పందన కరువైతే.. న్యాయబద్ధంగా చర్యలు తీసుకొని వేలంలో ఉంచుతారు. ఆ ఇంటిపై అప్పటివరకు ఉన్న రుణం మొత్తాన్నీ వెలగా నిర్ణయిస్తారు! వేలం నిర్వహణ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. వేలంలో పాల్గొన దలచిన వాళ్లు ముందుగా ఐదు శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో ఎక్కువ బిడ్ చేసిన వారికే ప్రాపర్టీ దక్కుతుంది. ఇంటిని సొంతం చేసుకున్న వాళ్లు బ్యాంకు నిర్దేశించిన సమయం లోగా 20 శాతం చెల్లించాలి. తర్వాత 40 రోజుల్లోగా మిగతా మొత్తం చెల్లిస్తే ఆస్తి వారి సొంతం అవుతుంది. -- కొత్త కారా? పాత కారా? ఒకప్పుడు సంపన్నుల చివరి కోరికగా ఉన్న కారు.. మధ్యతరగతి బకెట్ లిస్ట్ లోకి వచ్చి చేరింది. కొత్త కారు కొనాలని కొందరి ఆశ. పాత కారుతో సరిపెట్టుకుందామని మరికొందరి భావన. ఇంతకీ ఏ కారు కొనాలి? ఎప్పుడు కొనాలి? ఎందుకు కొనాలి? ఈ విషయాలపై స్పష్టత లేకుండా బలవంతంగా వాహనయోగాన్ని తగిలించుకుంటే.. చేతి చమురు వదలడం తప్ప, ఆశించిన ప్రయోజనం ఉండదు. మారిన సమాజం మనిషిపై చాలా ప్రభావం చూపుతున్నది. దూరపు బంధువులెవరో కారు కొన్నారని తెలిసింది మొదలు.. అంతకన్నా పెద్ద బండి కొనేయాలని కొందరు తపిస్తుంటారు. నలుగురిలో గొప్పగా కనిపించ డానికి శక్తికి మించి తాపత్రయపడుతుంటారు. ఏ ఆలోచననైనా వాయిదా వేసుకో గలరు కానీ, బుర్రలో కారు కొనాలనే పురుగు చేరితే మాత్రం అంత తేలిగ్గా దాన్నుంచి తప్పించుకోలేరు. కారు మీదికి మనసు మళ్లింది మొదలు షోరూమ్ లకు వెళ్లడం, కొటేషన్లు తీసుకోవడం దినచర్యలో భాగమైపోతుంది. ఆన్లైన్ కారు సేలింగ్ లో ధరలు వాకబు చేయడం అత్యవసర కృత్యంగా మారిపోతుంది. కొత్తదా? పాతదా? మైలేజీ ఎంత? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. అయినవారికి, కానివా ఆ రికి ఫోన్లు చేసి కార్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకోవడం కర్తవ్యంగా భావిస్తుంటారు. కానీ, కారు మనకు అవసరమో, లేదోనన్న విషయాన్ని మాత్రం పక్కనపెడుతుంటారు. ఇవి గమనించండి.. బ్యాంకు రుణాలు సులభంగా మంజూరు అవుతున్న ఈ రోజుల్లో కారు కొనడం పెద్దపనేం కాదు. నెలకు రూ.40వేల ఆదాయం ఉంటే చాలు.. ఆరేడు లక్షల రూపాయల కారు సాయం త్రానికి ఇంటి ముందుకు తెచ్చుకోవచ్చు. అయితే, కొత్త కారు కొనాలో, పాత కారును ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మీరే! టెక్నికల్ విషయాలు పక్కనపెడితే.. ఒకట్రెండు -- ఏండ్లకు తీసేసే ఉద్దేశం ఉంటే పాత కారుకు ఓటు వేయడం మంచిది. కనీసం ఐదేండ్లు నడవ లని ఫిక్సయితే కొత్త కారుకొనడం మేలు. కొందరు ముందుగా ముందుగా పాత కోరుకుని డ్రైవింగ్ లో నైపుణ్యం సంపాదించి, తర్వాత కొత్త కారు తీసుకోవడం తెలివైన పని అని భావిస్తుంటారు. కానీ, లోతుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప నిర్ణయం కాదని తెలుస్తుంది. వెయ్యి రూపాయల క్లయిమ్ చార్జెస్తో కొత్త కారుకు ఏదైనా డ్యామేజ్ అయితే 100 శాతం మరమ్మతు చేసుకో వచ్చు. అదే ప్రమాదాలు జరిగినప్పుడు పాత కారుకు యాభై శాతానికి మించి బీమా సంస్థలు చెల్లించవు. కొత్తదైనా, పాతదైనా.. రెండు నెలల్లో కారు డ్రైవింగ్ రాకమానదు. అలాంటప్పుడు డ్రైవింగ్ కోసం పాత కారు కొనడం సరైన ఎంపిక అనిపించుకోదు. రుణంలో కోత. కొత్త కారు ధర ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. అందులో సగం ధరకే పాతది . వస్తుంది కదా అని సెకండ్ హ్యాండ్ వైపు మొగ్గు చూపుతారు. ఉదాహరణకు రూ.పది లక్షల కొత్త 90 శాతం వరకు రుణం మంజూరు అవుతుంది. అంటే యజమాని పది శాతం డౌన్ పేమెంట్ కడితే చాలు. అదే పాతకారు ధర రూ.6 లక్షలు ఉందనుకోండి. ల్సిందే. పైగా సెకండ్ హ్యాండ్ కారు రుణంపై వడ్డీ రేట్లు ఫస్ట్యండ్తో పోలిస్తే కొంత అధికంగా రుణ నికి మించి రాదు. అంటే డౌన్ పేమెంట్గా రూ.2.40 లక్షలు చెల్లించా . ఉంటాయి. దీంతో ఈఎమ్ఐస్ఐ భారం పెరుగుతుంది కూడా. బేరీజు వేసుకోండి. కారు కొనేముందు.. ఎన్నేండ్లు వాడుతామన్నది ముఖ్యం. రెండేండ్లకే ముచ్చట తీరిందని కొత్త కారు అమ్మకానికి పెడితే మీరు ఊహించిన ధర వచ్చే అవకాశం ఉండదు. అమ్మబోతే అడవి తయారవుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల కొత్త కారు రెండేండ్లు వాడి మార్కెట్లో అమ్మకానికి పెడితే గరిష్టంగా రూ.6 లక్షలకు మించి పలకదు. అదే రూ.6 లక్షల సెకండ్ హ్యాండ్ కారు రెండేండ్లు వాడుకొని అమ్మకానికి పెడితే రూ.3.5 లక్షలు పలుకొచ్చు. ఈ క్రమంలో నష్టశాతం కొత్త కారుకే ఎక్కువగా ఉంటుంది. పాత కారుకు తక్కువగా ఉంటుంది. కనీసం ఐదేండ్లు మార్చకుండా ఉంటామని ఫిక్సయితే గానీ, కొత్త కారు కొనొద్దు! కొత్తకారు, పాత కారు నిర్వహణ ఖర్చులను బేరీజు వేసుకోవడం ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. రెండిటి మైలేజీలో వ్యత్యాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడుగానీ కొత్త కారు తీసుకోవాలో, పాత కారు తీసుకోవాలో.. ఒక నిర్ణయానికి రావాలి! అవసరమైతేనే.. కొడం తేలికే! కానీ, అది మనకు అవసరమో, లేదో ముందుగా తెలుసుకోవాలి. రాబడి బలంగా ఉంటే పెద్దకారు కొనుక్కోవచ్చు. జీతం తప్ప వేరే ఆదాయం లేకపోతే చిన్నకారుతో సరిపెట్టుకోవచ్చు. పిల్లల ఫీజులు, గృహ అవసరాలు, కనీస అవసరాలు.. వీటన్నిటికీ ఇబ్బంది లేకుంటే మీ శక్తి, ఆసక్తి మేరకు కొత్తదో, పాతదో ఏదో ఒక కారు కొనుగోలు చేయొచ్చు. -- పిల్లల పేరిట కొంటున్నారా..! పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలని అందరు తల్లిదండ్రులూ కోరుకుంటారు. పిల్లల పేరిట ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు. ఎన్డీలు మొదలు పెడతారు. పాల నీలు కట్టేస్తుంటారు. ఇవన్నీ పిల్లల పేరిట కాకుండా.. పిల్లల కోసం చేయడమే సరైన ఆర్థిక విధానం అనిపించుకుంటుంది. సరైన ఎంపిక ద్వారా తల్లిదండ్రుల బాధ్యత భారం కాకుండా ఉంటుంది. అమ్మానాన్నల మొదటి ప్రాధాన్యం పిల్లలే ! బిడ్డల ఆరోగ్యం, చదువులు.. వీటి 'తర్వాతే మరే విషయమైనా ఆలోచిస్తారు. తమ పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉందో గమనించి.. అందులో రాణించడానికి వాళ్ల కన్నా ముందుగానే సిద్ధపడిపో తుంటారు. పదో తరగతికి వచ్చేసరికి ఇంటర్మీడియెట్ కాలేజీలు జల్లెడ పడతారు. ఇంటర్ అయిపోయేనాటికి ఇంజినీరింగ్ కాలేజీల లిస్ట్ ముందేసుకొని శోధిస్తుం టారు. డాక్టర్ చదువుతానంటే ఫ్రీ సీటు రాకపోతే.. విదేశాలకైనా పంపడానికి సిద్ధ పడతారు. మధ్యతరగతి అనుభవాలు ఆర్థికంగా తట్టుకోలేరని వారిస్తున్నా. పిల్లల భవిష్యత్తు ముందు వాటన్నిటినీ భరించడానికి సిద్ధపడతారు. ఈ క్రమంలో పిల్లల కోసం మని వారిపేరిటే పెట్టు బడులు పెడుతుంటారు కొందరు. స్థలాలు తీసుకోవడం, ఇండ్లు కొనడం, కూతురు, కొడుకు పేరిట ఎల్డీ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే, పిల్లలు 4 మైనర్లుగా ఉన్నప్పుడైనా, మేజర్లు అయ్యాక గానీ వారి పేరిట ఆస్తులు పోగు చేయడం ఆర్థి కంగా సరైన పనికాదు. ఇలా వద్దు.. నరహరి ప్రభుత్వోద్యోగి, ఒక కూతురు, కొడుకు, బిడ్డ పుట్టినప్పుడు కలిసిరావడంతో అగ్గు వలో ఓ ప్లాటు కొన్నాడు. కూతురు పేరిటే దానిని రిజిస్ట్రేషన్ చేయించాడు. సంవత్సరాలు గడి చిపోయాయి. కొడుకును, కూతురును సమానంగా చదివించాడు. పిల్లల చదువులు, కుటుంబ --- బాధ్యతలు పెరగడంతో మరే ఆస్తి కూడబెట్టలేకపోయాడు. కూతురుకు ప్రభుత్వోద్యోగం వచ్చింది. అంతలోనే పెండ్లి నిశ్చయమైంది. అప్పోసొప్పో చేసి వియ్యాలవారు అడిగిన క నుకలు సమర్పించి ఘనంగానే పెండ్లి చేశాడు. కొడుకును విదేశాలకు పంపించాలనుకున్నాడు.. చేతిలో చిల్లిగవ్వ లేదు. బిడ్డ పెండ్లికి చేసిన అప్పు ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు కూతురు పేరిట కొన్న ప్లాటు అమ్మితేగానీ అవసరాలు తీరేలా లేవు. ఇదే విషయం కూతురుతో చెప్పాడు. 'సరే నాన్నా!' అన్నదామె. రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాక విషయం అత్తారింట్లో తెలిసింది. 'మా కోడలు పేరుమీద ఉన్నది మీరెలా అమ్ముతారు?' అన్నారు ఆ ఇంటి పెద్దలు. దఫ పాల చర్చల తర్వాత నరహరికి 30 శాతం ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. ఈ మొత్తం వ్యవహా రంలో తనను ఇంతదాన్ని చేసిన తండ్రిని ఇబ్బందిపెట్టానని కూతురు బాధ పడింది.వియ్యంకుల తో అభిప్రాయ భేదాలు వచ్చి నందుకు నరహరి కుమిలిపోయాడు. ఇదంతా ఆయన ప్లాటున కూతురు పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్లే జరిగింది. అదేదో తన పేరిటే ఉండి ఉంటే.. అప్పు చేయకుండా కూతురు పెండ్లి చేసేవాడు. కొడుకుకూ కొంత ముట్టజెప్పేవాడు. మీరే హక్కుదారు.. ఒక్క నరహరి మాత్రమే కాదు.. చాలామంది తల్లి దండ్రులు పిల్లల పేరిట ఇన్వెస్ట్ చేస్తుం టారు. ఇది తప్పు కాకపోవచ్చు. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నప్పుడు అలా చేయడం సబబు అనిపించుకుంటుంది. కానీ, ఉన్న ఒకటి రెండు ఆస్తులను పిల్లల పేరిట పెట్టడం భవిష్యత్తులో విపరీత పరిస్థితులకు దారితీయొచ్చు. డబ్బుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న ఈ రోజుల్లో ఆస్తులు పిల్లలకు ధారపోయడం శేష జీవితాన్ని రిస్క్ పెట్టినట్టే అవుతుంది. వారి కోసం కూడబె ట్టడం న్యాయం. కానీ, వారి పేరిటే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. కూతురు మెడిసిన్ చదువు కోసం ఓ ఆస్తి కొన్నా, పదిలక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దానికి హక్కుదారు మీరే ఉండాలి. అవసరానికి వాటిని పిల్లల చదువుకో, పెండ్లికో, వాళ్ల వ్యాపారానికో ఇవ్వడం మీ చేతుల్లో పని! అదే వారి పేరుమీదే ఉంటే.. ఆస్తిని మీకు తెలియకుండా అమ్మేయనూ వచ్చు. అప్పుడు మీరు వారిని నైతికంగా నిలదీయొచ్చేమో కానీ, చట్టపరంగా దానిని సవాలు చేయలేరు. 'కీ డెంచి మేలెంచు' అని పెద్దలు ఊరికే చెప్పలేదు. పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టండి. అవి మీ పేరిటే ఉండేలా చూసుకోండి. అవసరాలకు తగ్గట్టు.. పిల్లల ఉన్నత విద్య కోసం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు లక్ష రూపా యలు ఉన్న ఇంజినీరింగ్ ఫీజు.. పదిహేనేండ్ల తర్వాత నాలుగు లక్షలు అవుతుంది. నాలు గేండ్ల కోర్సుకు కనీసం పదిహేను లక్షలు అవసరం అవుతాయి. అందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయాలి. పిల్లల చదువుకు అందివచ్చేలా భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను గుర్తించి పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టండి. ఎంత మొత్తం అవసరమవుతుందో అంచనా వేయకుండా చేసే మదుపు లక్ష్యాన్ని నెరవేర్చదని గుర్తించండి. --- థింక్ కమర్షియల్.. ఉండటానికి ఇల్లు ఒకటి ఉంటే పోదా? అంటే చాలు అని . కానీ, భవిష్యత్ అవసరా లను దృష్టిలో ఉంచుకుంటే.. ఇంకోటి కూడా ఉంటే బాగుండు ఇనిపిస్తుంది. ఆ రెండో ఆస్తి ఏదై ఉండాలి? భూమ్మీద పెట్టుబడి పెడితే లాభం రావచ్చు. కానీ, ప్లాటుకు సరిపడా సొమ్ము ఉండాలి కూ! బ్యాంకు లోన్ ద్వారా మరో ఇల్లు తీసుకోవచ్చు. ధైర్యం చేసి కమర్షియల్ ప్రాపర్టీ కొనొచ్చు. వాడికేం.. హైదరాబాద్లో రెండు ఇండ్లున్నాయ్..' ఈ డైలాగ్ చాలా మంది అనడం మామూలే! అయితే, ఆ రెండో ఇంటి ద్వారా రాబడి ఎంత వస్తుందన్నది ప్రశ్న. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు మానసికంగా కొంత ధైర్యం చేయగలిగితే.. కాస్త ఎక్కువ లాభం పొందవచ్చు. రెండో ఇంటిస్థా నంలో ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే కిరాయి బాగా వస్తుందని చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. సంపన్నుల విషయానికి వస్తే రెండుతో ఆగరు, నాలుగైదు ఆస్తులు కొనగలిగే సత్తా కలిగి ఉంటారు. మధ్య తరగతి స్థితి నుంచి కాస్త పైకి ఎదిగిన కుటుంబాలు రెండో ప్రాపర్టీ ఏది తీసుకోవాలో.. తెలియక తికమకపడుతుంటాయి. ఆర్థికంగా కాస్త కుదురుకున్నా.. వారి ఆలోచనలు మాత్రం పొదుపు చుట్టూనే భయం భయంగా తిరుగుతుంటాయి. రిస్క్ లేకుండా అపార్ట్మెంట్లో ఫొటో, నగర శివారులో ఇండిపెండెంట్ ఇల్లో తీసుకుంటే లొల్లిపోతుందని అనుకుంటారు. తీసుకున్న దానికన్నా, కమర్షియల్ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల నెలవారీ ఆదాయం మెరుగవు | అంతేకానీ, రోడ్డుకు జాగా తీసుకొని రెండు షెట్టర్లు వేద్దామనే ఆలోచన చేయరు. కానీ, ఇల్లు ని గుర్తుంచుకోండి. ఇల్లు అయితే.. కోటి రూపాయలతో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు అనుకోండి. ఎంత టైమ్ ఏరియాలో --- ఉన్నా అద్దె మహా అయితే రూ.30 వేలు దాటదు. అంటే ఏడాదికి రూ.3.60 లక్షల ఆదాయం ఉండదు. ఈ క్రమంలో ఏడాదికి ఒకటి రెండు నెలలు ఇల్లు ఖాళీగానూ ఉండొచ్చు. పైగా సమకూరుతుంది. కిరాయిదారులు అదే ఇంట్లో నాలుగైదు ఏండ్లు కొనసాగుతారన్న గ్యారెంటీ అగ్రిమెంట్ ప్రకారం రెండేండ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచొచ్చు. కానీ, రెండేండ్లలోపే ఇంట్లో ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా బాధ్యత యజమానిపైనే ఉంటుంది ! రెంటల్ వ్యక్తి ఖాళీ చేస్తే.. కొత్తగా వచ్చేవాళ్లు పాత అద్దెకే దిగొచ్చు. దీనికితోడు, ఈ కిరాయిదార్ల వ్యవహారం ఉంటే ఇరుగుపొరుగుకు మీరే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ఆ ఇరుగుపొరుగే సమస్యగా మారితే.. మీ ఇంట్లో ఉన్నవాళ్లకు మీరే నచ్చజెప్పాల్సి రావచ్చు. మొత్తంగా రెండో ప్రాపర్టీ ఇల్లు అయితే ఇదిగో ఇన్ని సమస్యలు రావొచ్చు. కమర్షియల్ ప్రాపర్టీ అయితే.. కాస్త ఎక్కువైనా.. కమర్షియల్ ప్రాపర్టీ కొనడం వల్ల యజమానికి కొంత అధిక లాభం చేకూరు | రావొచ్చు. అంటే ఏడాదికి రూ.4.80 లక్షల రాబడి వస్తుంది. నగరంలో రాకపోతే.. జిల్లా కేంద్రంలోనో, మరేదైనా పట్టణంలోనో కోటి రూపాయల్లో రెండు నుంచి మూడు దుకాణాలు వేయడం అసాధ్యం కాదు. మూడు దుకాణాలు ఉంటాయి కాబట్టి, ఎప్పు డైనా ఒకటి ఖాళీ అయినా మిగతా రెండు దుకాణాల అద్దెతో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దుకాణా 5. వ్యాపారం బాగా క్లిక్ అయిందో.. వాళ్లు ఖాళీ చేసే అవకాశం ఉండదు. కనీసం పదేండ్ల పాటూ అద్దె ఆగదు. ఇటీవలి కాలంలో చిన్నా, పెద్దా మాల్స్ లో 300 చదరపు అడుగల విస్తీర్ణం మొదలుకొని వేలాది చ.అ. విస్తీర్ణం వరకు అమ్మకానికి పెడుతున్నారు. ప్రాసెస్ అంతా పక్కా లీగల్గా ఉంటుంది. శక్తిమేరకు 500 చదరపు అడుగులు కొనుగోలు చేయగలిగితే.. అద్దె రూ.50వేల వరకూ రావచ్చు. ఏటికేడూ అద్దె పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో రెట్టింపు లాభానికి అమ్ముకోవచ్చు కూడా! ఉండటానికి ఇప్పటికే ఓ ఇల్లు ఉన్నట్లయితే.. మీ బడ్జెట్లో కమర్షియల్ స్పేస్ తీసుకోవడం వల్ల రెట్టింపు లాభం పొందొచ్చు. అయితే, ప్రాపర్టీ డిప్రిసియే షన్ లెక్కలు బేరీజు వేసుకుంటే అంతిమంగా ఏటా 12 శాతం రిటర్న్కు లోటుండదు. రెండో ప్రాపర్టీకి కూడా బ్యాంకు లోన్ అవకాశం ఉంటుంది. ఇంటికి అయితే తక్కువ వడ్డీకే లభిస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీకి వడ్డీరేటు కాస్త ఎక్కువగా 66 ఉంటుంది. ఇంటికి 85 శాతం వరకు రుణం తీసుకో వచ్చు. కమర్షియల్ ఆస్తి విషయంలో అంత రాకపోవచ్చు. ఆ మాత్రం సర్దుబాటు చేసుకోగలిగితే.. రెండో ఆస్తి రెట్టింపు ఆదాయవనరుగా మారుతుంది. పదవీ విరమణ తర్వాత ప్రధాన ఆదాయంగా ఆదుకుంటుంది కూడా. --- ఉద్యోగమా? వ్యాపారమా? పట్టా చేతికి రాగానే.. పుట్టెడు ఆలోచనలు. గూగుల్ గూబ అదర గొట్టే ఐడియాలు తన్నుకొస్తుం వారెన్ బఫెట్ మనల్ని చూసి 'వారెవ్వా' అనుకోవాలన్న ఆరాటం. ఇనోసిస్ నారాయణమూర్తి నుంచి భవిష్ అగర్వాల్ వరకు... మూడు తరాల ఆంత్రప్రెన్యూర్స్ కథలు మనకు ఈస్ట్మన్ కలర్ సినిమాలా కనిపిస్తాయి. ఇక ఉండబట్టలేక, ఉగ్గబట్టుకోలేక నాన్న ముందు ఓ ప్రతిపాదన పెడతాం. కట్ చేస్తే.. బాల్కనీలో ఆరాం కుర్చీలో కూర్చుని పురుషోత్త గా పేపర్ చదువుతూ..గంట కోసారి అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ.. రెండేళ్లలో రిటైర్ కావడానికి మానసికంగా, ఆర్థికంగా సిద్ధపడుతున్న పితాశ్రీకి మన ప్రతిపాదన బాంబు మోతలా అనిపిస్తుంది. 'ఏమిటీ? బిజినెస్ చేస్తావా? అందుకేనా నిన్ను ఇంజినీ రింగ్ చదివించింది. వ్యాపారం మనవల్ల అవుతుందా? దిగ్గజాలే దిక్కులేక చస్తు న్నారు. చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగినవాళ్లకు కూడా చాయ్ పైసలకు గతిలేని పరిస్థితి. వద్దురా బాబూ!' అంటూ బుర్ర తోమేస్తాడు. చేసేదేముంది. 'రిచ్గాడ్.. పూర్ డాడ్ బుక్లో పూర్లాడ్ టైపు మన నాన్నలంతా! యూత్ కలలు అస్సలు అర్ధం ' కావు' అని నిట్టూరుస్తూ వీధి చివర ఇరానీ కేఫ్ వైపు అడుగులేస్తాం. ఏది మేలు? బిజినెస్ వర్సెస్ జాబ్.. దశాబ్దాలుగా యువతను వేధిస్తున్న ప్రశ్న. వ్యాపారంలో రిస్క్ ఉంటుంది. ఉద్యోగంలో కంఫర్ట్ ఉంటుంది. వ్యాపారంలో దెబ్బతింటే కోలుకోడానికి జీవితకా మైనా సరిపోదు. అదే ఉద్యోగమైతే.. ఒక కొలువు పోతే మరొకటి, మహా అయితే జీతంలో తేడా రావచ్చు. నాన్న మనకు ఇచ్చే సలహా కొత్తదేం కాదు. వాళ్ల నాన్న కూడా ఇలానే ఉపదేశం చేసుంటాడు. నిజమే, ఉద్యోగాన్ని మించిన కంఫర్ట్ జోన్ లేదు. నాన్నను మించిన శ్రేయోభిలాషి కనిపించడు. వ్యాపారంలో తొంభైశాతం ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఉద్యోగంలో -- తొంభైశాతం మినిమమ్ గ్యారెంటీ ! కానీ, మేనేజ్మెంట్ పుస్తకాలు, మోటివేషన్ స్పీచ్లు.. ఇందుకు విరుద్ధంగా వాదిస్తాయి. 'ఉద్యోగం అనేది ఓ శాశ్వత సమస్యకు తాత్కాలిక పరి ష్కారం మాత్రమే' అని హెచ్చరిస్తాయి. 'వందమందిలో ఒకడిగా కాదు.. వందమందికి ఒక జీవించాలి' అంటూ స్పూర్తినిస్తాయి. మన తాతలు అంబానీలో, అదానీలో అయిన ప్పుడు.. ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిందే. అన్నీ వదిలేసి ఎక్స్వైజెడ్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ చేరడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ, పక్కా మధ్య తరగతి నుంచి వచ్చి ఎన్నో కొన్ని బాధ్యతలను భుజానికి వేసుకుని భారంగా నడుస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగానే ' అడుగులు వేయాలి. వ్యాపారాన్ని ఉద్యోగంలా.. అవును, వ్యాపారాన్ని సైతం ఓ ఉద్యోగంలా మార్చుకోవచ్చు. వ్యాపార సంపదనంతా.. మళ్లీ వ్యాపారానికే ఖర్చు పెట్టుకుంటూ వెళ్లడం మంచిది కాదు. కుటుంబం వేరు, వ్యాపారం వేరు అనుకోవాలి. అందులోంచి నెలనెలా జీతంలా తీసుకోవాలి. వ్యాపార లాభాలతో వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేయాలి. దీనివల్ల వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చినా.. మనకంటూ భరోసా ఉంటుంది. పేరున్న సంస్థల ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా కూడా.. వ్యాపారాన్ని ఉద్యోగంలా చేసుకోవచ్చు. లాభాలు పరిమితమే కానీ, రిస్క్ తక్కువ. వ్యాపారంలో విజయం సాధిస్తేనే జీవితంలో విజయం సాధించినట్టు కాదు. ఉద్యోగం బానిస లక్షణమూ కాదు. ఏ ఉపాధి మార్గమైనా మనకు సంతృప్తిని ఇవ్వాలి. వృత్తి, వ్యాపారం మన వ్యక్తిగతం. ఎవర్నీ జడ్జ్ చేయొద్దు. మీరూ ఆత్మన్యూనతకు గురికావద్దు. మధ్యే మార్గం? వ్యాపారంలో రిస్క్ ఉంది. దాంతోపాటే లాభం ఉంది. ఉద్యోగంలో ఎదుగుదల జానాబెత్తెడే. అయితేనేం భద్రత ఉంది. ఈ రెండిటిలోని మంచి లక్షణాలతో మనదైన హైబ్రీడ్ మాడల్ సృష్టించుకుంటే తిరుగే ఉండదు. ఎస్.. ఉద్యోగంలాంటి వ్యాపారం, వ్యాపారం లాంటి ఉద్యోగం! ఉదాహరణకు.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు, సీనియారిటీ ఆధా రంగా ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ స్కీమ్ (ఈఎస్ఓపీ) కింద వాటాలు ఇస్తాయి. అంటే, ఆ సంస్థలో మనకు ఎంతోకొంత భాగం ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రత్యక్షంగా ఉద్యోగం చేస్తూ, పరోక్షంగా వ్యాపారం చేస్తున్నట్టే. షేర్ విలువ పెరిగేకొద్దీ వాటాదారుగా మన సంపద కూడా పెరుగుతుంది. ఈ స్కీమ్ పుణ్యమాని కుబేరులుగా మారిన సాధారణ ఉద్యోగులు ఎంతో మంది. అలాంటి సంస్థలలో చేరే అవకాశం వస్తే వదులుకోకూడదు. అందరికీ ఆఫరు రాకపో వచ్చు. మిగతా వాళ్లు.. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న రంగాలను ఎంచుకోవాలి. అవసరమైతే ఉద్యోగాలు మారాలి. నగరాలు, దేశాలు మారాలి. దీనివల్ల జీతభత్యాలు చకచకా పెరిగిపో తాయి. వ్యాపారంలో కంటే ఎక్కువే సంపాదించవచ్చు. కాకపోతే, ఇలాంటి ప్రయోగాలు సాధ్యమైనంత చిన్న వయసులోనే మొదలుపెట్టాలి. వ్యాపార వ్యూహంతో ఉద్యోగం చేయడం మంటే ఇదే. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కూడా ఉద్యోగులే కదా!! -- ప్రవాసుడా.. ప్రయాస ఎందుకు? కోటి కలలతో అమెరికా విమానం ఎక్కేస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిర డాలర్ల జీతం అందుకుం టారు, పోగేయాల్సినంత పోగేస్తారు. అంతలోనే మనసు స్వదేశం మీదికి మళ్లుతుంది. సొంతూళ్లో వ్యవసాయ భూమి, పొరుగునే టేకు ప్లాంటేషన్, సిటీలో ఇంకేదో స్థిరాస్తి బేరం చేయా లని ఉవ్విళ్లూరతారు. ఆలోచన మంచిదే? అదే సమయంలో రిజర్వు బ్యాంకు చట్టాలు, ఫెమా నిబంధ నలు విస్మరించడం సరికాదు. ఓ తెలుగు వ్యక్తి పదహారేండ్ల క్రితం యూకే వెళ్లాడు. ఉద్యోగం.. వ్యాపారం చేశాడు. బాగా సంపాదించుకున్నాడు. ఆస్తులు కూడబెట్టాడు. అక్కడితో ఆగకుండా మాతృభూమిలోనూ స్థిరాస్తులు కొనాలని భావించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం. అనేకానేక ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఎక్కడైతే ఎంతలో వస్తుంది? ఏ వైపు అయితే బావుంటుంది? ఫ్లాట్ కొనాలా, ప్లాటు కొనాలా, వ్యవ సాయ భూమి కొనాలా?.. ఇలా రకరకాల సందేహాలు. ఇదీ పరిస్థితి. భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనలు, ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం ప్రవాస భారతీయులు మాతృదేశంలో వ్యవసాయ భూములు, టేకు-ఎర్రచందనం తదితర ప్లాంటేషన్, ఫామ్హౌసులు కొనకూడదు. కాదని కొంటె నిబంధనకుల్లంగన అవుతుంది. నోటీసులు జారీ అవుతాయి. సదరు ఆస్తి విలువకు మూడురెట్ల వరకూ జరిమానా ముక్కు పిండి వసూలు చేస్తారు .దురదృష్టవశాత్తు చాలామంది ఈ విషయంలో అవగాహన ఉండటం లేదు. సాక్షాత్తు రియల్ ఎస్టేట్ వ్యాపారులే ప్రవాసులను లక్ష్యం చేసుకుని వెంచర్లు చేస్తున్నారు. అందులోనూ క్రిస్మస్ సెలవులకు మనవాళ్లు గుంపులు గుంపులుగా విమానాలు దిగేస్తారు. ఇదే అవకాశం అన్నట్టు బంధుమిత్రుల్లోని భూ వ్యాపారులు చుట్టు ముడతారు. ఊరిస్తారు. రెచ్చగొడతారు. ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు మాట్లాడతారు. దీంతో అడ్వాన్సులు ముట్టజెప్పి అగ్రిమెంట్లు కూడా రాయించుకుంటారు. అక్కడక్కడా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతాయి. ----- బ్యాంకులకూ చెప్పండి.. మీకు ప్రవాస భారతీయుడి హోదా వచ్చేయగానే.. బంధువులకు చెబుతారు. మిత్రులకు సమాచారం ఇస్తారు. అంతవరకూ బాగానే ఉంది. మరి, బ్యాంకులకు చెబుతున్నారా? చాలా మంది విషయంలో 'లేదు' అనే సమాధానమే వస్తుంది. మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. చెప్పండి? తీరా మీ లావాదేవీలు గమనించాక, మీ ఖాతాలో లక్షలకు లక్షలు పోగుపడ్డాక.. ఆయా ఆర్థిక సంస్థలు భూతద్దంలో గమనించడం ప్రారంభిస్తాయి. ఆదాయ పన్ను రిటర్న్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీస్తాయి. తేడా వస్తే నోటీసులు జారీ చేస్తాయి. ఆ తలనొప్పి అవసరమా? లేదు కదా. కాబట్టి, మీరు ప్రవాస భారతీయుడిగా మారగానే.. మాతృదేశంలోని మీ బ్యాంకులకు సమాచారం ఇవ్వండి. వెంటనే వాళ్లు మీ ఇండియన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ట్ను నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్గా మార్చుకుంటారు. భారతదేశంలో వచ్చే రాబడులన్నీ ఈ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. విదేశీ లావాదేవీల ద్వారా సంపాదించే సొమ్మును నాన్ రెసిడెంట్ ఎటర్నల్ అకౌంట్లో జమ చేసుకోవచ్చు. దాన్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకెళ్లొచ్చు. అదే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ ఖాతాలోని డబ్బును భారత్ నుంచి వెనక్కి తీసుకెళ్లడం కష్టం. కాబట్టి పల్లెలో పలుకుబడి పెంచుకోడానికో, మన ఘనతలు నలుగురికి చాటుకోడానికో పెట్టు బడులు పెట్టకూడదు. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోడానికి ముందు.. స్థానిక చట్టాలను, నిబంధనలను అధ్యయనం చేయాలి. అనుభవం ఉన్న న్యాయవాదులను కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ను కానీ సంప్రదించడం ఉత్తమం. మనం ఆస్తుల్ని కొనాలే కానీ చిక్కుల్ని కాదు. ఆస్తి విలువ పెరగాలి కానీ, రక్తపోటు పెరిగిపోకూడదు. అందులోనూ అది మన కష్టా ర్జితం. నిబంధనలు వర్తిస్తాయి. అవును. ఇగ్నొరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్సుక్యూజబుల్. చట్టాలు తెలియకపోవడం అమాయ కత్వం కాదు.. అక్షరాలా అజ్ఞానం. అందులోనూ మనం సమాచార యుగంలో ఉన్నాం. ఏ చట్టాలైనా ఒక్క క్లిక్తో తెరమీద ప్రత్యక్షమైపోతాయి. అయినా అర్థం కాకపోతే న్యాయవాదు లను సంప్రదించవచ్చు. ఆ ప్రయత్నమే లేకుండా.. తీరా నోటీసులు అందుకున్నాక 'అలాగా.. మాకు తెలియదే? ఎవరూ చెప్పలేదే?' అంటే అధికారులు ఒప్పుకోరు. పెద్దల నుంచి వారస త్వంగా వచ్చే వ్యవసాయ భూములకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. మనం కొనాలనుకున్న భూమి.. రికార్డుల ప్రకారం వ్యవసాయేతర భూమిగా బదిలీ అయిన తర్వాతే.. రిజిస్ట్రేషన్లూ, లావాదేవీలు. స్థలాలు, ఇళ్లు, వాణిజ్య భవనాలు మొదలైన వాటి విష యంలో మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. నిక్షేపంగా కొనుక్కోవచ్చు. నిరభ్యంతరంగా రిజి షన్ చేయించుకోవచ్చు. ఆరునూరైనా వ్యవసాయ భూములే కొనాలనుకుంటే.. భారతీయ రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. --- అపాత్రదానం వద్దు! ఎవరి సంపాదన వారిది. ఎవరి ఖులు వారివి. చివరగా మిగిలిన సొమ్ములోంచి కాస్తంత మొత్తాన్ని వచ్చంద సంస్థలు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇవ్వాలనుకునేవారూ ఉంటారు. మంచి ఆలోచనే. మరో కోణంలో చూస్తే.. మానసిక సంతృప్తి కోసం మనం పెడుతున్న పెట్టుబడి అది. అందులో ప్రతి రూపాయీ మన స్వార్జితమే. ఆ సొమ్ము దుర్విని యోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాతృత్వం అనేది బలమైన పాజిటివ్ ఎమోషన్. పంచుకోవడంలోని ఆనందం అనిర్వచనీయం. దీనివల్ల మన జీవితానికి సార్థకత లభించిన అనుభూతి కలుగుతుంది. లేనివారితో పంచుకోవడం ఉన్నవారి బాధ్యత కూడా. కాబట్టే, ఆర్థిక మానసిక వేత్తలు దాతృత్వాన్ని 'మానవీయ పెట్టుబడి'గా అభివర్ణి స్తారు. “ఓ అనాథ శరణాలయానికి నేనిచ్చిన విరాళమే నా జీవితంలో అత్యుత్తమ పెట్టుబడి' అంటారు వారెన్ బఫెట్. కానీ, సమాజం కోసం మనం కేటాయించిన సొమ్ము అందాల్సినవారికి అందినప్పుడే.. ఆ అనుభూతి, ఆనందాలకు సార్థకత, సరైన ఎన్జీవో కోసం.. దినపత్రికలలో ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారాలు, తరచూ పలకరించే ఎస్సెమ్మె స్లు, కూడళ్ల దగ్గర పంచే కరపత్రాలు.. సాయం కోసం చేసే విజ్ఞప్తులు ఏదో ఓ రూపంలో మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. దేశంలో ముప్పై లక్షలకు పైగా ఎన్జీవోలు (ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు) ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పేదల కోసం, అనాథల కోసం, వృద్ధుల కోసం, పర్యావరణం కోసం.. ఇలా తమదైన రంగంలో నిజాయతీగా పని చేస్తున్న సంస్థలు అనేకం. దాతృత్వ ప్రధాన ఉద్దేశం ఆత్మసంతృప్తి. మనకు ఇష్టమైన, మన జీవితంతో ముడిపడిన సత్కార్యానికి డబ్బు కేటాయించినప్పుడు.. ఆ సంతృప్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి తగిన ఎన్జీవోనే కాదు ఆ సంస్థ కార్యకలాపాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. --- కళ్లారా చూడండి.. అవార్డులు, బ్యాలెన్స్ షీట్, పత్రికలలో కథనాలు.. అన్నీ ఒక ఎత్తు. అంతిమంగా మీరు కళ్లారా చూసిందే నిజం. మీకు నచ్చితేనే నచ్చినట్టు. కాబట్టి, మనసుకు దగ్గరగా అనిపించిన ఎన్జీవోను ఎంచుకోగానే.. ఓ పూట ఆ ఆవరణకు వెళ్లండి. అక్కడి పిల్లలు, అనాథలు, నిర్భాగ్యులతో మాట్లాడండి అదే రంగంలో పనిచేస్తున్న మిగతా సంస్థలనూ సందర్శించండి. ఏ సంస్థ ఎక్కువ జీవితాలను ప్రభావితం చేస్తున్నది, ఏ సంస్థకు బతుకులను మార్చే శక్తి ఉంది, ఎవరి చేతిలో పెడితే కనుక మీ కష్టార్జితం సద్వినియోగం అవుతుంది.. అనేది కోణంలో ఆలోచిం చండి. కొన్ని సంస్థలు.. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చుచేస్తున్నది. ఎవరికి సాయం చేస్తున్నది తెలియజేస్తూ న్యూస్ లెటర్ కూడా ఇస్తాయి.ఇలాంటి సమాచారం వల్ల మనకు ఎన్జీవో పట్ల నమ్మకం పెరుగుతుంది. ఆత్మీయులకు సిఫారసు చేస్తాం కూడా. దాతృత్వానికి పెట్టుబడి సూత్రాలను జోడిస్తున్నవారూ ఉన్నారు. నెలనెలా కొంత మొత్తాన్ని సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు మళ్లించి.. దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. దీనివల్ల మరింత మొత్తం పోగవుతుంది. మరిన్ని జీవితాలు బాగుపడుతాయి. ప్రతినెలా గుర్తుంచుకుని చెల్లించడం కష్టం అనిపిస్తే.. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ (ఈసీఎస్) ద్వారా నెలనెలా ఫలానా తేదీన నిర్ణీత మొత్తాన్ని ఏదైనా ఎన్జీవో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయవచ్చు. ఎంచుకున్న సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడమూ ఒక పద్ధతి. నేరుగా డబ్బు ఇవ్వకపో యినా.. మన వృత్తి నైపుణ్యాన్ని ఆయా ఎన్జీవోల కోసం వినియోగించడం ద్వారానూ ఆత్మసంతృప్తి పొందవచ్చు. ఇది ఆర్థికేతర సేవ. మనం గీసిన పెయింటింగ్స్, మనం రాసిన పుస్తకాలు, మనం చెక్కిన శిల్పాలు.. విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా నలుగురి కోసం మళ్లించవచ్చు. మనకు సేద్యం ఉంటే, పంటలో కొంత భాగాన్ని పేదలకు పంచవచ్చు. మన సుంటే మార్గాలు అనేక దారి ఏదైనా దాతృత్వం గొప్ప లక్షణం. పన్ను మినహాయింపు.. విరాళాల ద్వారా ఆదాయపన్ను ప్రయోజనాన్నీ పొందొచ్చు. ఇన్కమ్ టాక్స్ యాక్ట్-1961 లోని సెక్షన్ 80 జీ ప్రకారం.. యాభై నుంచి నూరు శాతం పన్ను వినహాయింపు లభిస్తుంది. కానీ, ఆ విరాళం మన మొత్తం ఆదాయంలో పదిశాతానికి మించకూడదు. అయితే, ఇక్కడో నిబంధన ఉంది. మనం విరాళం అందించిన సంస్థలకు 80 జీ రిజిస్ట్రేషన్ తప్పక ఉండాలి. అప్పుడే, నోటిఫైడ్ సంస్థల జాబితాలో చోటు లభిస్తుంది. మినహాయింపులకు వీలూ ఉంటుంది. కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకునేవారికి ఈ మినహాయింపు వర్తించదు. పాత పద్ధ తినే ఎంచుకున్నా.. రెండు వేల రూపాయలకు మించిన నగదు విరాళాలు ఈ పరిధిలోకి రావు., దుస్తులు, వస్తువులు, ఆహారం, పుస్తకాల రూపంలో ఇచ్చిన విరాళాలు కూడా 80 జీ కింద అనర్హమైనవే. --- బీమా తర్వాతే ఏదైనా.. మీ జీవన సౌధానికి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ రెండు పిల్లర్స్ లాంటివి. ఆ తర్వాత మీరు చేసే పెట్టుబడులు అన్నీ స్లాబుల్లాంటివి. పిల్లర్స్ బలంగా లేకుండా ఎన్ని అంతస్తులు కడితే మాత్రం ఏం ప్రయో జనం! ఒక్క కుదుపుతోనే మీ జీవితం కుప్పకూలిపోతుంది. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి, సగటు ఉద్యోగి అందరూ ఆరోగ్య బీమా కాన్సెప్టు లోతుగా అర్థం చేసుకోవాలి. పాతికేండ్ల తర్వాత వైద్యాని కయ్యే ఖర్చులను అంచనా వేసి.. ఆ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత కుటుంబ వ్యవహారానికయ్యే ఖర్చులు ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. లేకపోతే ఊహించని ప్రమాదం జరిగి ఆస్పత్రిపాలైనా, దీర్ఘకాలిక వ్యాధిబారిన పడినా.. మీ కుటుంబం ఆర్థికంగా ఇరవై ఏండ్లు వెనకపడిపోతుందని గుర్తుంచుకోండి. కుటుంబసభ్యులు నలుగురు ఉన్నట్లయితే.. రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం. ఈ నలుగురు ఫ్యామిలీ రూ.10 లక్షల పాలసీ తీసుకున్న దానికీ, రూ.50 లక్షల పాలసీ తీసుకోవడానికి మధ్య ప్రీమియం వ్యత్యాసం గట్టిగా రూ. 10 వేలకు మించదు. కానీ, చాలామంది ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకుంటే పదివేల భారం అదనంగా పడుతుందని భావిస్తారు. అయితే, ఆస్పత్రి బిల్లు పదిలక్షలు దాటి మరో నాలుగైదు లక్షలు ఎక్కువ అయితే.. అవి ఎక్కడ్నుంచి తేగలుగుతారు? హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకున్నవారిలో 90 శాతం మంది రూ.10 లక్షల లోపు పాలసీ కట్టినవారే! పాలసీ అవసరం రాకపోవడంతో దానినే కొనసాగిస్తున్నారు. కానీ, భవిష్యత్తులో ఇబ్బంది ఎదురైతే.. అప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ మీ కవరేజీని పెంచదు. కాబట్టి, ఈ పూటే మీ హెల్త్ ఇన్సూరెన్స్కవరేజీని రూ.50 లక్షలకు పెంచుకోండి. ఇందుకోసం ఇన్సూరెన్స్ ఏజెంటును సంప్రదించి, అన్ని విషయాలు చర్చించి, సరైన పాలసీని ఎంచుకోండి. -- వ్యవస్థను నమ్ముకుంటే.. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లను విపరీతంగా ఆకర్షించే వాటిల్లో ఒకటి షేర్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ గా లాభాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి, ట్రెండ్ సృష్టిస్తామని భావిస్తుం టారు. అసలు మ్యూచువల్ ఫండ్స్క, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు మధ్య వ్యత్యాసం ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం. ఎవరికి వారు పరిశోధించి, పరిశీలించి, స్టాక్ మార్కెట్ ఆనుపానూ తెలుసుకునే సత్తా ఉన్నవాళ్లు ట్రేడింగ్ చేయాలి. అప్పటికీ మార్కెట్ ఎప్పుడెలా స్పందిస్తుందో తలలు పండిన మేధావులు కూడా అంచనా వేయలేరు. దశాబ్దాలుగా మార్కెట్లో పాతుకుపోయిన దమానీలు, అగర్వాల్లు కూడా గత ఇరవై ఏండ్లలో సాధించిన రిటర్న్స్ ఏడాదికి రమారమి 18 శాతమే (లాంగ్ ర్మ్లో ఏడాదికి 18 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి)! మార్కెట్లో పెట్టుబడికి మీ కోసం ఓ వ్యవస్థ పనిచేస్తే అది మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకా లంలో ఇది సేఫ్ గేమ్ అన్నమాట! పెట్టుబడికి లాంగ్ టర్మ్ ఢాకా ఉండదు. స్టాక్స్లో వచ్చే లాభం ఇక్కడ కూడా దర్జాగా పొందొచ్చు. పైగా ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా, మీరెలాంటి పరిశోధనలు చేయకుండా, మీ సమయాన్ని మీ కుటుంబానికి వెచ్చిస్తూ కూల్గా రిటర్న్స్ సంపాదించొచ్చన్నమాట! స్పష్టంగా చెబితే.. స్టాక్స్ వ్యవహారం సముద్రంలో ఈత నేర్చుకోవడం లాంటిది. ఒక్క పెద్ద అల వస్తే.. మనిషి గల్లంతే! అదే మ్యూచువల్ ఫండ్స్ అంటే స్విమ్మింగ్పల్లో ఈత నేర్చు కోవడం అన్నమాట. ఎంత లోతు ఉందో తెలుస్తుంది. అలల అలజడి ఉండదు. సేఫ్గ స్విమ్మింగ్ చేయొచ్చు. --- ఎంతైనా ఖర్చుపెట్టండి! ఖర్చు విషయంలో రెండే పరిష్కారాలు. అవసరాలు తగ్గించు కోవడం, సంపాదన పెంచుకోవడం. అవసరాలను తగ్గించుకుంటూ పోతే.. చివరికి కూడు, గూడు, బట్ట విషయంలోనూ రాజీపడాల్సి వస్తుంది. అదే, సంపాదన పెంచుకుంటే జీవితం సంతోష మయం అవుతుంది. కాబట్టి, సంపాదనకు పరిమితి పెట్టుకోకండి, అవసరమైన ఖర్చులకూ పరిమితులు విధించుకోకండి. ఏం ఫర్వాలేదు.. సినిమాలు చూడండి. షికార్లు చేయండి. షాపింగ్ వెళ్లండి. అవసరమైనవన్నీ కొనేయండి. ఖర్చు చేయడంలో తప్పు లేదు. ఖర్చు వృథా కానేకాదు. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తే నెట్వర్క్ విస్తరిస్తుంది. ఫీజు కొంత ఎక్కువైనా మంచి స్కూల్స్ చేర్పిస్తే బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లం అవుతాం. ఇరుకిరుకు పోర్షన్ నుంచి విశాలమైన ఇంటికి మారడం వల్ల.. గాలి, వెలుతురు ఆస్వాదిస్తాం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ మనకోసం మనం పెట్టుకునే అత్యుత్తమ పెట్టుబడులు. కాబట్టి, అస్సలు రాజీపడకూడదు, ఏమాత్రం వెనుకాడకూడదు. పొదుపు పేరుతో నాసిరకం జీవితానికి అలవాటు పడకూడదు. కాకపోతే ఆ ఖర్చుకు పరిమితి ఉండాలి. రేపటి సంపాదనతో కాదుమన ప్రస్తుత సంపాదననే మనం ఖర్చు చేయాలి. నెల రాబోయే జీతాన్ని పరిగణనలోకి తీసుకుని, రెండు నెలల తర్వాత మేనేజ్మెంట్ ప్రక లెక్కగట్టి అర్థంలేని ఖర్చులు చేయడం మాత్రం ఘోరమైన తప్పు. సరిగ్గా అక్కడినుంచే మన బోనస్ను దృష్టిలో ఉంచుకుని, మూడునెలల తర్వాత చేతికందే వ్యవసాయ రాబడిని ఆర్థిక అపసవ్య దిశ మొదలవుతుంది, నీ జీతం ఎంతైనా కావచ్చు. కానీ, దానికి సరిపడా | అసాధ్యం. బోనస్ అంటారా? కొవిడ్ తర్వాత యాజమాన్యాల ఆలోచనా విధానం మారిపో ఉంటాయి. అదనపు రాబడి లేకుండా, అదనపు ఖర్చులను సర్దుబాటు చేయడం యింది. ఉదారగుణం తగ్గిపోయింది. భవిష్యత్తు పట్ల భయం మొదలైంది. చట్టపరంగా తప్పని -- సరి అయితే తప్ప బోనస్లు, ప్రోత్సాహకాల జోలికి వెళ్లడం లేదు. ఆ 'తప్పనిసరి'ని తప్పించు కునే చిట్కాలూ వెతుక్కుంటున్నారు. కాబట్టి, బోనస్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోకండి. దన్న భరోసా లేదు. కాబట్టి, నీ ఖాతాలో ఉన్న డబ్బు మాత్రమే నీది. అది కూడా.. బ్యాంకు వాయిదాలు, బీమా ప్రీమియంలు, అద్దెలు, స్కూలు ఫీజులు, మందులు, పాలబిల్లు, కేబుల్ బిల్లు, సిప్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్.. వగైరా వగైరా కేటాయింపుల తర్వాత మిగిలేదే నీది. సొమ్ముతో షాపింగ్ చేస్తావో, మాలే కొంటావో నీ ఇష్టం. ప్లాస్టిక్ మనీ వద్దు. వ్యక్తుల ఖర్చుల వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కొత్త కంపెనీలు వస్తాయి. నలుగురికి ఉపాధి లభిస్తుంది. దేశానికి కూడా మంచిదే. కాకపోతే ముందుగా మన అవసరాలకు, బాధ్యతలకు ఖర్చు పెట్టాలి. ఆ తర్వాతే వినోదాలు, విలాసాలు, జీవనశైలి వ్యయాలు. అందు తేదీలోగా చెల్లించలేక.. ఆ మొత్తాన్ని ఈఎమ్ఐగా మార్చుకుంటాం. దీంతో నెలవారీ చెల్లిం ప లేనంత భారంగా మారిపోతాయి. కొత్త అప్పులు అవసరం అవుతాయి. వడ్డీల మోత మొదలవుతుంది. ఖర్చు పెట్టాలన్న కోరిక ఉండటంలో తప్పులేదు. అదే సమయంలో సంపాదించాలనే తపన కూడా ఉండాలి. అదనపు సంపాదన మార్గాల గురించి ఆలోచించాలి. కొత్త అవకాశాల వైపు అడుగులు వేయాలి. అంతేకానీ, గాల్లో లెక్కలేసుకుంటూ.. కాలిమీద కాలేసుకుని కూర్చోవడం మంచిది కాదు. ఆ బాధ్యతలేని తనమే ఏదో ఒకరోజు మనల్ని ముంచేస్తుంది. నిజానికి మనం స్వతహాగా జాగ్రత్తపరులమే. ఎస్ఐపీ పెట్టుబడులు రూ.25 వేల కోట్లకు చేరాయి. బీమా రంగం బలపడింది. రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇవన్నీ మంచి పరిణామాలే. కాకపోతే, చేతిలోని సంపాదనలోంచే ఖర్చుపెట్టాలి. ఆ మాత్రం బాధ్యత ఉంటే చాలు. జీవితానికి పొదుపు-మదుపు ఎంత అవసరమో, ఖర్చులూ అంతే అవసరం. ప్రతిదా నికీ రాజీపడుతూ కూర్చుంటే.. ఆత్మన్యూనత నెత్తినెక్కుతుంది. జీవితంలో సర్దుబాటు సరి కాదు. మనం సాంకేతిక యుగంలో ఉన్నాం.. చేతిలో నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు. నైపుణ్యం లేకపోయినా బాధపడుతూ కూర్చోవాల్సిన పన్లేదు. నైపుణ్యం పెంచుకునే మార్గాలు అనేకం. ఆన్లైన్ కోర్సులున్నాయి. ఆఫ్లైన్ చదువులున్నాయి. మీరిప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటి హీరో కాదు. దారిద్ర్యాన్ని తిట్టుకుంటూనో, నిరుద్యోగాన్ని ఎత్తిచూపుతూనో, పేదరికాన్ని ప్రేమిస్తూనో, కుబేరుల్ని ద్వేషిస్తూనో బతికేయడానికి. సంతోషంగా జీవించడానికి ఎంత ఖర్చు చేయాలో అంత చేయండి. సంతృప్తిగా జీవించడానికి ఎంత డబ్బు అవసరమో అంత సంపాదించండి. ఖర్చు తగ్గించుకుని కోటీశ్వరులైనవారు ఎక్కడా కనిపించరు. సంపాదన పెంచుకున్నవారే ఆర్థిక విజేతలు అవుతారు. కుటుంబసభ్యుల ప్రేమను, బంధువులు ఆదరాన్ని పొందుతారు. --- చిట్ వేద్దామా.. ఎస్ఐపీ చేద్దామా.. చిట్ మంచిదా? మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమా? చాలామందిని ఈ ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు దేన్ని ఎంచుకోవాలి? తాత్కాలికమైన అవసరాలకు ఏది మంచిది? చిట్లో రిస్క్ ఎంత? మ్యూచువల్ ఫండ్స్లో సమస్యలు ఉండవా? ఈ సందేహాలు తలెత్తడం సహజం. అయితే, ఈ రెండిట్లో ఏది మేలు, ఎవరు దేన్ని ఎంచుకోవాల న్నది వ్యక్తిగత ఆర్థిక వెసులు బాటు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికీ ఆర్థికంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటిని చేరుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. కొన్ని పెట్టు బడులు భవిష్యత్ అవసరాల కోసమైతే, మరికొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం. అయితే, ఈ రెండిటినీ ఒకే గాటన కడితే మదుపు అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఈ ధర్మ సూక్ష్మం తెలియక చాలామంది పెట్టుబడి పక్కదారి పడుతుంటుంది. ఈ క్రమంలో వేతన జీవుల వెతలు షరా మామూలే! అన్ని ఖర్చులూ పోగా మిగిలిన కొద్ది మొత్తంలో చీటీలు కట్టడం రివాజు. అయితే, ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే చిట్స్ ప్రమాదమని తెలిసినా దీన్ని నిలువరించలేకపోతున్నారు. ఈ ప్రశ్నే అడిగితే రిస్క్ లేనిది ఎక్కడ అని బదులిస్తారు. కానీ, ఎందరో చిట్ నిర్వాహకులు రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసిన ఉదంతాలు పూటకో చోట చోటుచేసుకుంటూనే ఉంటాయి. తెలిసి మరీ... సాధారణ ప్రజలు ప్రైవేట్ చిట్స్ వైపు మొగ్గు చూపడానికి కారణాలు కోకొల్లలు. అవసరానికి చేతికి అందుతుందన్న ఒకే ఒక కారణం చిట్స్ నిర్వాహకులకు బలం చేకూరుస్తున్నది. దీనికి చీటీ కాలపరిమితి తక్కువ. గరిష్ఠంగా 60 నెలల వరకు ఉంటుంది. మన ఆర్థిక ఉన్నాయి. తెలిసిన వ్యక్తులే నిర్వాహకులుగా ఉండటంతో, అత్యవసర సమయాల్లో చీటీ -- పాడుకునే అవకాశం ఉంటుందని చాలామంది వీటిని ఎంచుకుంటారు. ఆర్బీఐ నిబంధన లోబడి, ప్రభుత్వ అనుమతులతో పలు సంస్థలు చిట్స్ నిర్వహిస్తున్నాయి. అయితే, వీటిలో చిట్స్ వేయడానికి ఆలోచించే ప్రజలు పూచీకత్తు గొడవలు ఉండవనే సాకుతో వ్యక్తిగత చిట్స్ వైపు చూస్తుంటారు. పైగా అసంఘటిత రంగంలో ఉన్నవారికి బ్యాంకు రుణాలు తేలిగ్గా మంజూరు కావు. సంస్థలు నిర్వహించే చిట్స్ గురించి పూర్తిస్థాయి అవగాహన కూడా చేతులు ఎత్తేశాక.. మోసపోయామని లబోదిబోమంటారు. ఇంత రిస్క్ ఉందని తెలిసినా.. తులు బాగాలేకపోతే నెలవారీ వాయిదా ఆలస్యంగానైనా చెల్లించవచ్చనే నమ్మకమే ఇందుకు చాలామంది తమ ఆలోచన మార్చుకోరు. అవసరానికి డబ్బు అందుతుందన్న ఆశ, పరిస్థి కారణం. దీర్ఘకాలమైతేనే.. చిట్స్లో రిస్క్ సంగతి పక్కన పెడితే... ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. తక్కువ కాలపరిమితి కావ డంతో 10 శాతం వరకు రిటర్న్ ఉంటుంది. ముందుగానే చిట్ ఎత్తుకున్నా వడ్డీ భారం 18 శాతం వరకు మాత్రమే! ఎప్పుడూ ఒక రన్నింగ్ చిట్ ఉండేలా చూసుకోవడం మంచిది. అయితే, వ్యక్తుల దగ్గర కాకుండా సంస్థల్లో వేయడం మంచిది. ఇక మ్యూచువల్ ఫండ్స్ ను దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం ఎంచుకోవాలి. ఒక్కోసారి ఏడాది నిడివిలోనే రిటర్న్స్ రెండింతలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. రెండుమూ డేండ్ల కాలపరిమితితో ఎస్ఐపీ (మ్యూచువల్ ఫండ్స్) ఎంపిక మంచి పెట్టుబడి అనిపించు కోదు. మార్కెట్ ఒడుదుడుకులకు గురైతే పెట్టింది కూడా చేతికి అందని పరిస్థితి తలెత్తవచ్చు. ఈ రంగాన్ని ఎంచుకుంటే మీ పెట్టుబడిని కనీసం ఎనిమిదేళ్లు కొనసాగించాలి. ఎనిమిదేళ్ల తర్వాత మీ అవసరాలు ఏమిటి? అందుకు ఎంత మొత్తం కావాలో, దానికోసం నెలవారీగా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో దాని ఆధారంగా ఎస్ఎస్ఐపీ కొనసాగించాలి. ఇక్కడా రిస్క్ ఉంటుంది. కానీ, మల్టీ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ కావడం, దీర్ఘకాలం ఉండటంతో మీ పెట్టుబడిపై 12-18 శాతం వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ లేనిది ఎక్కడ? అని మొండిగా ముందుకు వెళ్తే చిట్స్ అయినా, ఎస్ఐపీ అయినా చివరికి తలకుమించిన భారమే అవుతుంది. రుణబాధలు ఉన్నవాళ్లు చీటీ 6 ద్వారా వాటినుంచి బయటపడటం మంచిది. క్రెడిట్ కార్డు బిల్లు మినిమమ్ కడుతూ రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తామనడం హాస్యాస్పదం! మీ రాబడిలోంచి ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని సమయానుకూలంగా ఇన్వెస్ట్ చేయడమే సరైన ఆర్థిక విధానం. --- ఇల్లు ఎప్పుడు కొందాం? ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఒక కల మాత్రమే! కాలం మారింది. ఇప్పుడు కలల సాధాన్ని పెట్టుబడికి మార్గంగా ఎంచుకుంటున్నారు కొందరు. భవిష్యత్తులో అమ్మితే ఏ మేరకు లాభాలు వస్తాయో లెక్కలు వేసుకొని మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే అధిక లబ్ధి చేకూరుతుందా? పూర్తయిన ఇంటిని ఎంచుకుంటే ఉత్తమమా? ఏ ఎంపిక యజమానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.. కొంటాన వరుణ్, చరణ్ ఒకే సంస్థలో ఉద్యోగులు. ఇద్దరివీ మంచి జీతాలు. పెండ్లిళ్లు అయ్యాయి. హాయిగా జీవనం గడుపుతున్నారు. ఒకరోజు మాటల్లో ఇల్లు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. వరుణ్ నిర్మాణం పూర్తయిన ఇల్లు న్నాడు. చరణ్ నిర్మాణంలో ఉన్న ఇల్లయితే తక్కువలో వస్తుందని చెప్పుకొచ్చాడు. అన్ని విషయాల్లో ఏకతాటి మీద ఉండే ఈ స్నేహితులు ఇంటి విషయంలో ఏకాభి ప్రాయానికి రాలేకపోయారు. కొన్నాళ్లకు వరుణ్ ఆఫీసు దగ్గర్లో రూ. కోటిలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. గృహ ప్రవేశానికి చరణ్ దంపతులనూ పిలిచాడు. సరదాగా కాలక్షేపం చేశారు. వరుణ్ గృహప్రవేశం నాడే చరణ్ నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ చూశాడు అందులో తన బడ్జెట్లో ఉన్న ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం నాలుగేండ్ల తర్వాత ఆ ఫ్లాట్ చరణ్ సొంతమైంది. ముందుగా బుక్ చేసుకోవడం వల్ల మార్కెట్ ధర కన్నా తనకు తక్కువ ధరకే ఫ్లాట్ వచ్చిందని చెప్పుకొన్నాడు చరణ్. ఎవరికెంత లాభం? ఇద్దరు మిత్రుల కథ చదివారుగా! ఇద్దరూ ఎంతోకొంత లాభపడ్డవాళ్లే! కానీ, ఎవరు ఎంత అబ్ధి పొందారో ఇప్పుడు చూద్దాం. వరుణ్ కోటి రూపాయలు పెట్టి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్లాటు తీసుకున్నాడు 15 లక్షల భయానా ఇచ్చి మిగతా 85 లక్షలు 20 -- సంవత్సర కాల పరిమితితో బ్యాంకులో గృహ రుణం తీసుకున్నాడు. గృహప్రవేశమైన మరుసటి నెల నుంచీ రుణ వాయిదా రూ.77 వేలు చెల్లించడం మొదలుపెట్టాడు. అంతకుముందు రూ.25 వేలు ఇంటి అద్దె కట్టేవాడు. దానికి అదనంగా రూ.52వేలు కలిపి వాయిదా చెల్లిం లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించాడు. మిగతా రూ.60 లక్షలకు గానూ నాలుగు వాయిదాల్లో చడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చరణ్ సంగతి చూద్దాం. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కు రూ.10 రూ.15 లక్షల చొప్పున రుణం మంజూరైంది. విడుదలైన రుణానికి మాత్రమే వడ్డీ చెల్లించేలా. ఒప్పందాలు జరిగాయి. అంటే మొదటి రుణ వాయిదా రూ.15 లక్షలకు చరణ్ ఆ ఏడాదికి లక్షల వడ్డీ చెల్లించాడన్నమాట. రెండో ఏడాది రూ.3 లక్షలు, మూడో ఏడాది రూ.4 లక్షలు, నాలుగో ఏడాది రూ.6 లక్షలు ఇలా ఇల్లు సొంతమయ్యే నాటికి రూ.15 లక్షలు రూ.6 లక్షల ఇంటి యజమాని అద్దె పెంచడంతో తర్వాతి రెండేండ్లకు నెలకు రూ.30వేల చొప్పున రూ.7.2 లక్షలు అద్దె చెల్లించాడు. మొత్తంగా నాలుగేండ్లలో రుణం మీద వడ్డీ, ఇంటి అద్దె రూపంలో రూ.32 లక్షలు కట్టాడు. ఫ్లాట్ చరణ్ సొంతమయ్యేనాటికి దాని విలువ రూ.1.40 కోట్లకు పెరిగింది. ఇన్నేండ్లూ అతను కట్టింది మినహాయిస్తే పొందిన నికర లాభం. రూ.13 లక్షలు మాత్రమే! అదే సమయంలో ఫ్లాట్ ఎప్పుడు పూర్తవుతుందా అని పడిగాపులు కాయడం, పనులు ఆగినప్పుడల్లా బిల్డర్ను కలవడం ఇదీ తంతు! వరుణ్ విషయానికొస్తే.. నాలుగేండ్లుగా సొంత ఫ్లాట్లో ఏ రందీ లేకుండా నెలనెలా వాయిదా చెల్లిస్తూ నింపాదిగా కాలం గడిపాడు. పెట్టుబడిగా చూడొద్దు. ఈ ఇద్దరి ఎంపికా సరైనదే! కానీ, వీరిలో ఎక్కువ సంతృప్తిగా ఉన్నది మాత్రం వరుణ్ అని చెప్పక తప్పదు. ఇంటిని పెట్టుబడిగా భావించినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మనం ఉండాల్సిన ఇంటిని ఇన్వెస్ట్మెంట్ గా భావించొద్దు. ఇల్లు తీసుకోవాలని ఫిక్సయ్యాక వీలైనంత త్వరగా అది సొంతమవ్వాలి. పేరుమోసిన నిర్మాణ సంస్థలు అనుకున్న సమయానికి ఇంటిని అప్పగిస్తాయి. మరికొన్ని సంస్థలు మాత్రం గడువు ముగిసినా ఇంటికి గడప కూడా పెట్టవు. అలాంటి సమయాల్లో ఇల్లు సొంతమయ్యే నాటికి దాని మీద ఉన్న మోజు కాస్తా తీరి పోతుంది. అలాగని, నిర్మాణంలో ఉన్న ఇల్లు తీసుకోవద్దని కాదు! కొన్ని నిర్మాణ సంస్థలు ఫ్రీలాంచ్ సమయంలో తక్కువ ధర ఆఫర్ చేస్తుంటాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా సందర్భాల్లో లాభం పొందొచ్చు. కానీ, అది మీ సొంతింటి కల నెరవేరిన తర్వాత అద నపు పెట్టుబడి అయితే సరైన ఎంపిక అనిపించుకుంటుంది. అందుకే, ఇల్లు తీసుకునేటప్పుడు వీలైనంత త్వరగా మీ చేతికొచ్చే నెలవుకే ఓటేయండి. -- మధ్యతరగతి మహాభారతం. ఉద్యోగికి ఒక తారీఖు కలిగే సంతోషం.. మర్నాటికి ఉండదు. పదో తేదీ వచ్చేసరికి చేబదుళ్లు, నెలాఖరున చేతిలో చిల్లిగవ్వ లేక 'ఈ మధ్యతరగతి బతుకులింతే!' అని ఇదై పోవడాలు రొటీన్! మిడిల్ క్లాస్ పరీక్షలు తట్టుకొని నిలబడితే గానీ, అప్పర్ మిడిల్ క్లాస్లోకి ఎంట్రీ దొరకదు. అక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండగలిగితే రిచ్ క్లాస్లో ఎంట్రీ దొరుకుతుంది. మావి మధ్యతరగతి జీవితాలు బాబు! రాస్తే రామాయణమంత.. వింటే భారతమంత!' అంటూ కడుపేదవాడి కన్నా దీనంగా మహా నటులు చెప్పిన డైలాగులు ఎన్నో సినిమాల్లో చూశాం. విన్నాం! ఇంతకీ ఎవరీ మిడిల్ క్లాస్? వీరిలో బోలెడన్ని రకాలు! లేని ధనాన్ని ముందుగానే ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించే వాళ్లు ఒకరకం. రాబోయే అదృష్టాన్ని తలుచుకుంటూ చేతిలో ఉన్నదంతా ఊడ్చి పెట్టుకునేవాళ్లు రెండో రకం. రాబడికి మించి పెరుగుతున్న ఖర్చులను అదుపు చేయలేనివాళ్లు మూడో రకం. ఎల్లకాలం పొదుపు మంత్రాన్ని పఠిస్తూ.. ఆశలను అదుపుచేసుకుంటూ భారంగా బతుకీడ్చేవాళ్లు మరో రకం. ఈ రకరకాల మనస్తత్వాల కలగాపులగమే మిడిల్ క్లాస్ ప్రపంచం. హెచ్చులకు పోయి.. వెనక్కి వెళ్తే... మధ్యతరగతి బతుకులు నిబ్బరంగా సాగేవి. ఉన్నంతలో ఫర్వా లేదు అనేలా ఉండేవి. కానీ, ఇప్పటి మిడిల్ క్లాస్ నిర్వచనం ఇంటికో తీరుగా తయారైంది. నెలకు లక్ష ఉన్నవ్యక్తిని కూడా మధ్యతరగతి కింద జమకట్టేస్తున్నారు. ఆదాయాన్ని బట్టి పెరగదు. ఆస్తులు, ఆదాయం, కుటుంబసభ్యులు, భవిష్యత్ అవసరాలు, బాధ్యత లను అన్నిటినీ బేరీజు వేసుకొని అంచనాకు రావాలి. అయితే, చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు సంపన్నులుగా కనిపించాలని భావిస్తుంటారు. పులిని చూసి నక్క వాత పెట్టుకు -- న్నట్టుగా.. లేని హెచ్చులకు పోయి జీవితాన్ని అగమ్యగోచరంగా చేసుకుంటారు. పైగా, ఈఎ మ సంస్కృతి ప్రబలడంతో ఇల్లు, కారు, గృహోపకరణాలు అన్నీ రుణం ద్వారా సమకూర్పు వాటిని కూడా ఓన్ భావిస్తూ శ్రీమంతులుగా భ్రమపడుతుంటారు. తీరా రుణవిముక్తులు. అయ్యేనాటికి మిడిల్ క్లాస్ నే మిగిలిపోతారు. ఎప్పుడు రిచ్ అంటే.. నెలవారీ ఆదాయం ఖర్చులకు సమానంగా ఉంటే మధ్య తరగతి. ఖర్చులకు మించి రెట్టింపు ఆదాయం ఉన్నట్లయితే ఎగువ మధ్య తరగతిగా భావించొచ్చు. ఆదాయం స్థిరంగా ఉండదు. ద్రవ్యోల్బణ శాతానికి మించి ఆదాయం పెరగడం లేదంటే.. మిడిల్ క్లాస్ నుంచి పేదవారి జాబితాలోకి చేరుతున్నట్టే అని భావించాలి. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ధరలూ మండుతాయి. ఖర్చులు అధికమవుతాయి. రాబడిలో మారకుండా ఖర్చులు తడిసి మోపెడైతే.. ఆర్థికంగా ఎద అసాధ్యం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. చెప్పి తేలిక కాదు. ఆదాయంలో మిగులుబాటు సాధిస్తే.. ఆర్థిక నిల్వలు నిదానంగా పెరుగు తాయి. ఉద్యోగం చేయకపోయినా.. ఐదేండ్లపాటు కుటుంబాన్ని పోషించగలిగే స్థితికి చేరుకు న్నారంటే మీరు ఓ మోస్తరు ధనవంతులు అయినట్టే. అంటే, నగదు కూడబెట్టడంతోపాటు స్థిరచరాస్తుల ద్వారా ఎంతోకొంత రాబడి సమకూర్చుకోవడం అన్నమాట! ఇలాంటి రాబడి లక్షల్లో ఉన్నవాళ్లు శ్రీమంతులు. ఆదాయం పెరిగినా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఊరుకోదు! దాన్ని మరోచోట ఇన్వెస్ట్ చేయమంటుంది. అక్కడినుంచీ లాభాలు పొందేలా చూస్తుంది. ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా పాటించకున్నా, ఊహించని పరిణామాలు ఎదురైతే తప్ప ధనవం తులు మిడిల్ క్లాస్కు పడిపోరు. కానీ, ఆర్థిక క్రమశిక్షణ, దూరదృష్టి ఉన్న మధ్యతరగతి కుటుం బాలు ఎప్పటికైనా సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటాయి. తేడా.. దవాఖాన ఖర్చంత. మధ్యతరగతి ర్యాంకును మెరుగుపర్చుకోవాలంటే చాలా ఏండ్లు కష్టపడాలి. కానీ, చిన్న తప్పు చేసినా దిగువ మధ్యతరగతికి జారిపోవడం ఖాయం. మధ్యతరగతికి, నిరుపేదకూ మధ్య తేడా ఆస్పత్రి ఖర్చంత! ఇంట్లో ఏ ఒక్కరికైనా ఊహించని అనారోగ్య సమస్య తలెత్తితే.. అన్ని రోజులూ కడుపు కట్టుకొని కూడబెట్టిందంతా కర్పూరంలా కరిగిపోవచ్చు. ఆరోగ్య బీమా లేకుండా జీవితాన్ని వెళ్లదీసుకోవచ్చు అనుకుంటే పొరపాటు. ఆరోగ్య బీమాతో మీరు రిచ్ కాక పోవచ్చేమో కానీ, నిరుపేదలు కాకుండా ఉండగలుగుతారు. దీంతోపాటు జీవిత బీమా కూడా తోడుంటే.. దురదృష్టవశాత్తు ఇంటి యజమాని దూరమైనా.. ఆ కుటుంబ పరిస్థితిలో మార్పు ఉండదు. పిల్లల చదువులు ఆగవు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదు! --- తోబుట్టువే అసలైన ఆస్తి. పిల్లాపాపలతో చల్లగా ఉండండి' అనే దీవెనకు కాలదోషం పట్టిం దేమో! ఈ తరం దంపతులు ఒకరే చాలు అని ఫిక్సవుతున్నారు. ఇంట్లో పెద్దలు నచ్చజెబుతున్నా.. ఆ టాపిక్ రాగానే ఏదో చెప్పి తప్పించుకుంటు న్నారు!! గట్టిగా అడిగితే.. 'ఇప్పు డున్న ధరలతో ఒక్కరిని పోషించ డమే కష్టం.. ఇంకో బిడ్డ అంటే మావల్ల కాదు' అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మానవీయ బంధాల విషయంలో లెక్కలు వేసుకుంటే.. మీ బిడ్డకు ఆస్తి కూడబెట్టి ఇవ్వగలరేమో కానీ, అందమైన జీవితాన్ని దూరం చేసినవారు వుతారని గుర్తుంచుకోండి. ఎందుకు ఒక్క బిడ్డ చాలు అను కుంటున్నారు? ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఈ ప్రశ్న ఉదయించిన ప్రతిసారీ పక్కాగా సమాధానమూ వస్తున్నది. 'ఈ రోజుల్లో ఒక్కరిని పోషించడమే గగనం' ఓ తండ్రి మాట! 'మళ్లీ కాన్పు అంటూ మరో ఏడాది ఇంట్లో కూర్చుంటే నా కెరీర్ ఏం కాను' అంటుంది తల్లి. నర్సరీకే రెండు లక్షలు డొనేషన్ కట్టాల్సి వస్తుంది!' అని దంపతులిద్దరూ ఒక్కరుంటే చాలు అని బలంగా వాదిస్తున్నారు. కారణం ఉద్యోగ అభద్రత! లక్షల్లో వేతనం అందుకుంటున్నా.. ఇక్కడ కొలువు ఊడిపోతుందని భయం. పోనీ, బాగా సంపాదించే రోజుల్లో ఆస్తులు అంటే అక్కడా సంతృప్తికరమైన సమాధానం రాదు. తమ తప్పులను కప్పిపు చుకునేలా పెరుగుతున్న ధరలు అంటూ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. వ్యత్యాసం ఉంటే.. ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి నెలకు రూ.5 లక్షలు సంపాదించినా.. అవసరానికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఈ ధోరణే నేటితరం తల్లిదండ్రులు ఒక్కరే ముద్దు అనుకునేలా చేస్తున్నది. నాణ్య మైన విద్య అందించాలని ఆలోచన మంచిదే అందుకోసం పిల్లలు వద్దనుకోవడం సరైన -- నిర్ణయం కాదు. జీవితంలో అన్నిటినీ డబ్బులతో ముడిపెట్టలేం. ఆదాయ మార్గాలు పెంచుకో డంతోపాటు ప్రణాళికా బద్దంగా సాగితే ఇద్దరు పిల్లలు భారం కారు, పిల్లల మధ్య మూడు, నాలుగేండ్లు వ్యత్యాసం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల చదువు, పెండ్లి, సెటిల్మెంట్ వరకు అన్ని సందర్భాల్లోనూ ఈ వ్యత్యాసం తల్లిదండ్రులు ఆర్థికంగా ఊపిరి తీసుకునే వెసులు బాటు కల్పిస్తుంది. ఉన్నత చదువులు, పెండ్లి సమయాల్లో డబ్బు సమకూరేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే ఒత్తిడి ఉండదు! ఒకరికొకరు. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా.. తోడు ఇవ్వడం అత్యంత ఆవశ్యకం. తోబుట్టువును మించిన .. ఆస్తి మరొకటి ఉండదు. తోబుట్టువు లేని బాల్యం నిస్తేజంగా సాగుతుంది. తల్లిదండ్రులు య్యాక చదువు, కెరీర్ విషయంలో ఒకరి కొకరు మార్గనిర్దేశనం చేసుకుంటారు. తల్లిదండ్రు ఎంత స్నేహితుల్లా ఉన్నా.. అన్నతోనో, చెల్లితోనో గడిపే సమయం చాలా గొప్పది. కాస్త పెద్ద లతో చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుతో పంచుకుంటారు. అంతేకాదు, అన్నదమ్ములే కానీ, అక్కాతమ్ముళ్లే కానీ, అన్నాచెల్లో కానీ ఒకరి విషయంలో మరొకరు బాధ్యతగా ఫీలవు తారు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటారు. అన్నిటికీ మించి ఒంటరి బతుకు అనే భావన రాకుండా తనకంటూ ఒకరున్నారన్న భావన ఎంతటి ఒత్తిడిని అయినా జయించేలా చేస్తుంది. తోబుట్టువు ఉంటేనే పంచుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. భావోద్వేగాలను ఎవరితో ఎలా పంచుకోవాలో అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఆర్థికంగా భారమవుతుందనీ, కెరీర్ రేస్ వెనుకబడతామనీ ఒక్కరితో చాలు అనుకుంటే పొరపాటే! ఆ బిడ్డకు మంచి చదువు, ఐశ్వర్యం ఇవ్వగలరేమో కానీ, అందమైన బాల్యాన్ని దూరం చేసినవాళ్లు అవుతారు. మీ తదనంతరం మీ వారసుడి కుటుంబం ఒంటరిగా మిగిలిపోవద్దు అనుకుంటే.. చిన్నప్పుడే తోబుట్టువును కానుకగా ఇవ్వండి. ప్రణాళిక ముఖ్యం. ఆర్థిక విజయానికి మూల సూత్రం ప్రణాళిక, భవిష్యత్ అవసరాలు ముందుగానే గుర్తించగలి గితే.. ఈ కాలంలోనే కాదు, మరో పాతికేండ్ల తర్వాతైనా ఇద్దరు పిల్లలను పెంచడం పెద్దకష్ట మైన పనేం కాదు. పిల్లలు పుట్టగానే వారిపేరిట అందుబాటులో ఉన్న మంచి పాలసీని తీసుకో వాలి. వాళ్లు ఉన్నత విద్యలోకి ప్రవేశించే సమయంలో ఆ పాలసీ మొత్తం చేతికి అందేలా ప్రణాళిక వేసుకోవాలి. అన్నిటికీ మించి పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి. కష్టమైనా మంచి విద్య అందించాలి. ఇతర పెట్టుబడులు ఎన్ని ఉన్నా.. నాణ్యమైన చదువు చెప్పించక పోతే పిల్లల భవిష్యత్తు రిస్క్ లో పెట్టినట్టే అని గుర్తుంచుకోండి. -- క్విట్.. క్విక్ మనీ! కోల్పోయేది ఏమీ లేనప్పుడు తెగించడంలో అర్థం ఉంది. కానీ, మేధస్సును మరిగించి, కాలాన్ని కరిగించి ఆర్జించిన సొమ్మును క్విక్ మనీ రేసులో కుమ్మరిస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు కొందరు. రెక్కలు పూర్తిగా తొడగకముందే రివ్వున ఎగిరి, శక్తిచాలక కుదేలవుతు న్నారు. అడ్డాలనాడు బిడ్డలకు తల్లి దండ్రుల అండ ఉంటుంది. ఆ బిడ్డలే గడ్డాలనాడు తడబడితే.. ఆదుకునేవారు ఉండరు!! పైసా కమానా నహీ.. బనాయా జాతా హై' ఓ వెబ్ సిరీస్లోని డైలాగ్ ఇది. పైసలను సంపాదించడం కాదు, సృష్టించాలి' అని అర్థం! ఈ తరం పోకడ అచ్చంగా ఇలాగే తయారైంది. పొదుపు మంత్రం పఠించడం మంచిదే! మదుపు చేయడమూ ఉన్నతమైనదే! కానీ, ఎంచుకున్న మార్గం ప్రధానం. చాలామంది ఉద్యోగంలో చేరింది మొదలు అలవి కాని లక్ష్యాలను నిర్దేశించు కుంటున్నారు కెరీర్ గాడిలో పడకముందే.. నయా గాడీ కొనడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. పెద్దలు పారామంది ఉద్యోగంలో చేరింది మొదలు అలవికాని లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. వారిస్తే.. 'వాయిదా పద్ధతుంది దేనికైనా..' అని సర్దిచెబుతున్నారు. పెండ్లి, పిల్లల ముచ్చట తీర ముందే లంకంత ఇల్లు కొనేస్తున్నారు. చేతిలో నయా పైసా లేకున్నా... మూడు నెలల పే ఇంటివారవుతున్నారు. పాతికేండ్లకే వాయిదాల ఉచ్చులో చిక్కుకొని.. ఒత్తిళ్లతో కుస్తీ పడుతు న్నారు. పైగా తామంతా జాగ్రత్తపరులమనీ, జీవితాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నామన్న - భావన వ్యక్తం చేస్తుంటారు. అయితే, వీరిలో చాలామంది రోజులు గడిచే కొద్దీ 'అమ్మో! ఒకటో తారీఖు' అనుకుంటున్నారు. ఖాతాలో జీతం క్రెడిట్ అయ్యిందన్న ఆనందంలో ఉండ గానే ఈఎమ్ఐ డెబిట్ సందేశాలతో వేతన జీవులు వేదనకు గురవుతున్నారు. ఈజీ మనీ ట్రాప్ .. వాయిదాల రావుల సంగతి కాసేపు పక్కన పెట్టి, ఈజీ మనీ కోసం వెంపర్లాడే క్రేజీ ఫెలోస్ -- గురించి చర్చించుకుందాం. డబ్బు విలువ బాగా తెలుసనే భ్రమలో ఉంటారు వీళ్లు. రూపాయి నాణెం నాటి దానికి కరెన్సీ కట్టలను పూయిస్తామని గప్పాలు కొడుతుంటారు. రిస్క్ లేని క్కడా ? అంటూ లెక్చర్లు దంచుతారు. అయితే వీరిలో చాలామందికి ప్రత్యక్షంగా పనిచేసే మేధస్సు ఉండదు. బుర్రలో తొలిచే ఆలోచనలు అమలుచేసే సామర్థ్యం అంతకన్నా ఉండదు. అప్పనంగా రావాలంటే ఏం చేయాలో అని మాత్రం సదా అన్వేషిస్తూ ఉంటారు. మాలు తెలియకుండానే ట్రేడింగ్లో ట్రెండ్ సృష్టిస్తామని బీరాలు పలుకుతుంటారు. అనుకో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీరికి బోరింగ్ సబ్జెక్టులు, ఓన కుండా ఒకరోజు లాభాలు కండ్ల చూడగానే.. ప్రతిరోజూ కాసులపంట పక్కా అని తీర్మానించు. కుంటారు. పెట్టుబడికి నిధులు లేకపోతే ట్రేడింగ్లో కింగులమని చెబుతూ అందిన చోటల్లా అప్పు చేస్తారు. అవగాహనా రాహిత్యం, మితిమీరిన విశ్వాసంతో తప్పటడుగు వేసి ట్రేడింగ్ గంట మోగిన నిమిషాల్లోనే సర్వం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతారు. స్టాక్ మార్కెట్పై పట్టు లేకుండా స్టార్ను నమ్ముకున్న వారిలో చాలామంది పరిస్థితి ఇదిగో ఇలాగే తయారవుతుంది. అయినా, ఎప్పుడో ఒకసారి తగిలే జాక్పాట్ మత్తులో ప్రతిరోజూ రిస్క్ చేస్తూ రెస్ట్ లెస్ గా మిగిలిపోతుంటారు. ఈజీ మనీ ఈజ్ నాట్ సేఫ్. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు.. డబ్బులు సంపాదించొచ్చు అనే ధోరణి ఇంకొందరిది. ఆన్లైన్ గేమింగ్ను అల్లావుద్దీన్ దీపంగా భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ నడమంత్రపు సిరి వస్తుం దని ఆశిస్తున్నారు. అప్పు తెచ్చి మరీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దురదృష్టం వెక్కిరిం చడంతో బొక్కబోర్లాపడుతున్నారు. దీనికితోడు గతంలో అప్పు పుట్టాలంటే చెప్పులు అరిగే దాకా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు నిమిషాల్లో రుణాలు మంజూరు అవుతున్నాయి. అప్పులు తీర్చడానికీ అప్పులిచ్చే యాప్లు వచ్చేశాయి. క్రెడిట్ కార్డులు ఎలాగూ ఉన్నాయి. క్రెడిట్కార్డు నుంచి బ్యాంకు అకౌంట్కు నగదు బదిలీ చేసుకునే సౌలభ్యమూ ఉంది. ఇవన్నీ నేటి తరాన్ని ఈజీ మనీ దిశగా పరుగులు పెట్టిస్తున్నాయి. ఒక్కసారి ఈ చట్రంలో ఇరుక్కుపోయారో.... పులి మీద స్వారీ చేసినట్టే ! తాహతుకు మించి సాహసాలు చేస్తే.. బతుకు పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పుకాదు. లాభనష్టాలు అంచనా వేయగలగాలి. నష్టపోతే... ఎలా బయటపడాలో తెలిసి ఉండాలి. పూర్తి అవగాహనతో చేసే వ్యవహారాలు ఆర్థి కంగా మాత్రమే ప్రభావం చూపుతాయి కానీ, మీ వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని తలకిందులు చేయ వని గుర్తుంచుకోండి. -- అదనంగా సంపాదిస్తేనే..! సంపన్నులు కావడానికి ఈక్విటీలు దగ్గరి దారులు. మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైన సంపద మార్గాలు. సంపన్నులు కావడానికి మిడిల్స్టాస్ పరుషులు ప్రయత్నించే అవకాశాలు ఇవి. కానీ, అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు పెట్టుబడులు పెట్టొద్దా..? షేర్ మార్కెట్ జోలికి రావొద్దా? ఎస్ఐపీ ఊసెత్తోద్దా? ఆదాయం ఉన్నవాళ్లకే అవి పరిమి తమా? మరి లేనివాళ్ల సంగతేంటి.. ఎంతచెట్టుకు అంత గాలి!”.. ఈ సూత్రం కుటుంబ ఆర్థిక వ్యవహారాలకూ వర్తిస్తుంది. సరిపడా సంపాదించకుండా, ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అను కుంటూ ఉంటే... దశాబ్దాలు గడుస్తున్నా ఆర్థిక పరిస్థితి మారదు. మూరెడు సంపా దనతో బారెడు ఆస్తులు సృష్టిస్తామని అనుకోవడం పొరపాటే! నెలకు వచ్చే రూ.15 వేలల్లో 30 శాతం అంటే రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తానంటే.. మిగిలింది కుటుంబానికి ఏ మూలకు సరిపోతుంది. అందుకే, దిగువ మధ్యతరగతి కుటుం బాలు పొదుపుపై దృష్టి సారించాలే కానీ, మదుపు చేస్తామంటే పరిస్థితి మరింత అదుపు తప్పుతుంది. ఉద్యోగానికి బై.. ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలు ఎన్నో! డిగ్రీ పట్టా చేతిలో పట్టుకొని గుమాస్తాగా వెళ్లదీస్తా.. నంటే.. బతుకు జట్కాబండీలా తయారవుతుంది. సంపద సృష్టించాలి. రిస్క్ తీసుకోను.. తక్కువైనా నమ్మకంగా ఖాతాలో పడే జీతం చాలనుకుంటే.. ఏండ్లు గడిచినా బతుకు మారదు. రూ.18 వేలు ,రూ.20 వేలు జీతం ఉన్నవాళ్లు ముందుగా ఆ కొలువులోంచి బయటపడాలి. సొంత కాళ్ళ మీద నిలబడాలి హైదరాబాదు లాంటి మహానగరాల్లో టీ కొట్టు పెట్టుకున్న నెలకు రూ.30వేల ఎటూపోవు! ఉద్యోగం వదులుకోవడానికి మనసొప్పకపోతే.. మీ టాలెంట్ను గుర్తించి దాని ఆధారంగా ఎంతోకొంత అదనపు సంపద సృష్టించుకోవచ్చు. -- రాబడి మార్గాలు బోలెడు. ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయితే.. సాయంత్రాలు ట్యూషన్ చెప్పుకోవచ్చు. సంగీతంలో పరి ఉంటే.. మ్యూజిక్ స్కూల్ నడపొచ్చు. వంటల్లో ఆరితేరిన వారైతే పొడులు, పచ్చళ్లు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మీ ప్రత్యేకత ఏమిటో తెలుసుకొని.. దాని ద్వారా కూడా ఆదాయం ఆర్జించినప్పుడే ఎదుగుతాం. అంతేకానీ, వచ్చే ఇరవై వేలల్లో నాలుగు వేలు ఎస్ఐపీ కడతానంటే.. ఈ పదహారు వేలతో మీ ఇల్లు గడవడం దుర్బరం అవుతుంది. తినే తిండి, కట్టు కునే బట్ట, పిల్లల చదువు ఇలా అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఉత్సాహమే పెట్టుబడి.. ఒక ముప్పయ్యేండ్ల వ్యక్తి గృహ నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ ఆదాయం రూ.900. నెలకు రూ.21 వేల వరకు వస్తుంది. అతని భార్య కుట్టుమిషన్ కుడుతుంది. ఆమెకు నెలకు రూ.4వేలు వస్తాయి. జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఓ లక్షన్నర కూడబెట్టారు. ఈ పాతికవేలల్లో రూ.5వేలు ఎస్ఐపీ చేశాడనే అనుకుందాం. ఇరవై ఏండ్ల తర్వాత అతనికి 11.50 లక్షలు చేతికొస్తాయి. అయితే.. పదేండ్ల తర్వాత 40 ఏండ్లకు వచ్చే ఆ వ్యక్తి, ఇప్పుడు న్నంత ఉత్సాహంగా పనిచేయకపోవచ్చు. పిల్లలు పెరుగుతారు. ఖర్చులూ అధికమవుతాయి. అప్పుడు ఆదాయం సరిపోకపోవచ్చు. ఇలాంటప్పుడు ఎలా మదుపు చేయగలడు. కూడబె ట్టిన లక్షన్నరకు, ఓ ప్రైవేట్ చిట్ ద్వారా రెండు లక్షలు జతచేసి.. గృహ నిర్మాణ సామగ్రి తీసుకో వచ్చు. వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. నిర్మాణ రంగం లోనే ఉన్నాడు కాబట్టి గిరాకీ ఉండదన్న సమస్య రాదు. పదేండ్లు పూర్తయ్యే నాటికి రోజుకు రూ.3వేలు అద్దె వచ్చేలా పరికరాలు సమకూర్చుకోగలిగితే.. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పదిరోజులు ఎవరూ అద్దెకు తీసుకోలేదు అనుకున్నా నెలకు దాదాపు రూ.60వేలు సమకూరు తాయి. దీనికి దంపతుల ఆదాయం కలిస్తే.. ఆ కుటుంబం మధ్యతరగతి జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. డబ్బులు సంపాదించాలనే ఉత్సాహం ఉండాలి. చాలీచాలని బతుకుల నుంచి గట్టెక్కాలన్న ఆలోచన రావాలి. దానిని పక్కాగా అమలు చేస్తే... దిగువ మధ్యతరగతి దగ్గరే ఆగిపోవాల్సిన పరిస్థితి ఉండదు. కుటుంబానికి భరోసా. దిగువ మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. వైద్యం ఖర్చుల గురించి బెంగ అవసరం లేదు. ఎందుకైనా మంచిది అనుకుంటే.. ఆరోగ్యబీమా తీసుకోవచ్చు. ఐఆర్డీఏ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) నియమాలను అనుస రించి బీమా కంపెనీలు పరిమిత మొత్తంతో జీవిత బీమా ఆఫర్ చేస్తున్నాయి. ఆదాయం తక్కు వైనా, చదువు లేకున్నా రూ. 25 లక్షల వరకు జీవిత బీమా ఇస్తున్నాయి. దీనికి నెలకు రూ.200 నుంచి రూ.600 వరకు ప్రీమియం చెల్లిస్తే చాలు. దీంతో కుటుంబానికి భద్రత కలు గుతుంది. పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, మీ కోసం అటల్ పెన్షన్ యోజన తదితర ప్రభుత్వ ఆధారిత స్కీమ్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తుపై బెంగ లేకుండా ఉండొచ్చు. -- వాటా వెనక్కి.. లాభం పైపైకి! కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా.. వదిలేయడమే ఉత్తమ నిర్ణయం అనిపించుకుంటుంది. రాజ్యం వదులుకొని వనవాసానికి వెళ్లిన పాండవులను అక్షయ పాత్ర ఆదుకున్నట్టు.. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఎస్ఓబ్ల్యూపీ అండగా నిలుస్తుంది. ఈ సిస్టమేటిక్ విత్ డ్రా యల్ ప్లాన్తో మూలధనాన్ని ముచ్చటగా పెంచుకుంటూనే.. ప్రతి నెలా మీ కోటా నుంచి కోరుకున్నంత వాటాను పెన్షన్ అందుకోవచ్చు. ఎస్ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారు. మార్కెట్ పెరిగితే ఆగ మేఘాల మీద పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలని ఆరాటపడతారు. మార్కెట్ కుదేలైతే.. పెట్టిన కష్టమంతా వృథా అయిందని బావురుమంటారు. దీర్ఘ కాలిక ప్రయాణంలో ఈ తాత్కాలిక భావోద్వేగాలకు లోనుకావొద్దు. మార్కెట్ పెరి గినా, తగ్గినా మ్యూచువల్ ఫండ్స్ కొనసాగించాలి. పదిహేనేండ్లపాటూ ఎస్ఐపీ కొనసాగించిన తర్వాత.. అప్పుడు అందుబాటులో ఉన్న మూలధనం ఆధారంగా ఎస్ఓబ్ల్యూపీని యాక్టివేట్ చేయాలి. నెలకు ఇంత చొప్పున ఎస్ఐపీ చేసినట్టుగానే.. ప్రతి నెలా ఫిక్స్డ్ శాతం మొత్తం మీ ఖాతాలో పడుతుంది. ఉదాహరణకు మీ మ్యూచువల్ ఫండ్స్లో రూ.25 లక్షలు ఉన్నాయనుకోండి. అందులో ఆరు శాతం ఎస్ డబ్ల్యూ పి పెట్టుకుంటే నెలకు 12,500 మీ ఖాతాలో జమ వుతుంది. ఏడాదికి రూ.1.50 లక్షలు మీకు అందుతాయి. అదే సమయంలో 19 శాతం రిటర్న్ చొప్పున లెక్కేసుకున్నా మీ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం రూ.26 లక్షల వరకు చేరుకుం టుంది. నెలకు రూ.15వేలు అందుకుంటున్నా మూలధనం పెరగడం గొప్ప విషయమే కదా! ప్రతి నెలా ఆదాయం. నెలవారీగా ఎస్ఐపీ చేయని వారికి ఎస్ డబ్ల్యూపీ వర్తించదన్న అనుమానం వద్దు, బ్యాంకులో ఎల్డీ చేసినట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో పెద్దమొత్తం ఒకేసారి పెట్టగలిగితే.. ప్రతినెలా -- ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. కోటి ఎంచుకున్నాడు. అతనికి నెలకు రూ.50 వేలు ఆదాయం సమకూరుతుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. ఈ ఏడాదిలో మార్కెట్ గణనీయంగా పడిపోతే.. ఆ ప్రభావం మూలధనంపై లేదు. ఆ మరుసటి బుల్ గట్టిగా పరిగెత్తితే పరిస్థితి సెట్ అయిపోతుంది. బుల్ రంకెలకు, బేర్ దూకుడుకు వెరవకుండా మ్యూచువల్ ఫండ్స్ కొనసాగించగలిగితే... రూ. కోటి ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి నెలకు ఎబ్ల్యూపీ ద్వారా రూ.50 వేలు (6 శాతం) తీసుకున్నా... పదేండ్లు గడిచేసరికి అతని మూలధనం సుమారు రూ.2 కోట్లకు చేరుతుంది. ఏడాదికి రూ.6 లక్షల చొప్పున పదేం ఆ వ్యక్తి రూ.60 లక్షలు తీసుకున్నా.. మూలధనం డబుల్ అవుతుండటం గమనించా ల్సిన విషయం. ఎప్పుడైతే మూలధనం రెండు కోట్లకు చేరుకుంటుందో.. అప్పుడు ఎస్ఓ బ్ల్యూ ద్వారా నెలకు రూ.లక్ష (6 శాతం) వస్తుంది. మళ్లీ పదేండ్లలో మూలధనం రమారమి | రూ.4 కోట్లకు పడగలెత్తుతుంది. నెలకు రూ.లక్ష చొప్పున ఈ పదేండ్లలో రూ.1.20 కోట్లు అందుకున్నామంటే నమ్మబుద్ధి కాదు. రూ. కోటి పెట్టుబడితోనే ఇవన్నీ సాధ్యం. ప్రయత్నించి చూడు.. రూ.కోటి ఇన్వెస్ట్ చేసే స్థాయి లేదనుకుంటే.. రూ.25 లక్షలతో ప్రయత్నించండి. అదీ కాకపోతే రూ.10 లక్షలతో మొదలుపెట్టండి. రిటైర్మెంట్ ఫండ్లోంచి సగం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి... ఎడబ్ల్యూపీ ఎంచుకోండి. రూ.10 లక్షలకు నెలకు రూ.5,000 (పదేండ్లకు రూ.6 లక్షలు) మీ ఖాతాలో జమవుతాయి. పదేండ్లలో మీ పది లక్షలు కాస్త ఇరవై లక్షలు అవు తాయి. ఇవే పది లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారే అనుకోండి. నెలకు గరిష్ఠంగా రూ.6,000 వరకు వస్తుంది. పదిహేనేండ్ల తర్వాత కూడా మీ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం రూ.10 లక్షలుగానే ఉంటుంది. అందుకే, పట్టుకోవడం కన్నా.. వదిలేయడం కూడా అదృష్టా న్నిస్తుంది. రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా జరగాలంటే ఓ పెద్దమొత్తం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి... దాన్ని కాలానికి వదిలేయండి. ఆ మొత్తం అక్కడున్నంత వరకూ కొంత వాటా వెనక్కి తీసు కుంటూనే.. మూలధనాన్ని కొండంత పెంచుకోవచ్చు. నో టెన్షన్స్. మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, ఎంత తరిగిందన్న విషయా లను పక్కన పెట్టండి. గడిచిన ఇరవై ఏండ్ల గణాంకాలు పరిశీలిస్తే మ్యూచువల్ ఫండ్స్ సగటు రిటర్న్స్ 13 శాతానికి పైచిలుకే ఉంటుందన్నది. ఈ లెక్కన దాన్ని ముట్టుకోకుంటే.. ఐదేండ్లకో సారి మూలధనం దాదాపు రెట్టింపు అవుతుంది. అదే ఎన్డబ్ల్యూపీ ఆప్షన్ ను ఎంచుకుంటే గరి పదేండ్లకు ఒకసారి మూలధనం రెట్టింపు అవుతుంది. ఓ ఏడాది మార్కెట్ ఊహాతీ తంగా పడిపోయినా, మరుసటి ఏడాది నిదానంగా పెరిగినా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశిం చేవారు గాబరా పడాల్సిన పనిలేదు. --- చిన్నారికి.. పెద్దగా చదివిద్దాం! కడుపున పుట్టిన పిల్లలకు నిండై ప్రేమ పంచడమే నిజమైన బాధ్య కుంటే సరికాదు. వాళ్లకు జీవితం ఉండాలంటే ఆర్థిక విషయాల్లో కాస్త మొండిగా వ్యవహరించాల్సిందే! మీ పిల్లలను ఉన్నతంగా చదివించాలన్నా, వారి పెండ్లిళ్లకు భారీగా చదివించా లన్నా... వారు బాల్యంలో ఉండగానే పొదుపు మంత్రంతో దిష్టి ష, మదుపు యంత్రంతో తాయత్తు కట్టండి. చిన్నారి నామకరణం నాడే వారి పేరిట ఇన్వెస్ట్మెంట్ కు శ్రీకారం చుట్టండి. ఇందుకోసం రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్ఐపీ చేసినా, సుకన్య సమృద్ధి యోజనను ఎంచుకున్నా పిల్లల ప్రయోజనాలే పరమావ ఉండాలి. పై చదువులకు, పెండ్లి, సెటిల్మెంట్ వ్యవహారాలకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలను ఎంచుకొని మీ బాధ్యతలను ఆనందంగా పంచుకోండి. జనన ధ్రువీకరణ పత్రం చేతికి అందగానే ఆధార్ తీసుకోవాలి. పాన్ కార్డు కూడా ముందుగా పాన్ కార్డు ఉండటం చాలా అవసరం. ఫామ్ 49ఏ దరఖాస్తుతో పాటు పిల్లల ఆధార్, తల్లి తీసుకోవడం మంచిది. తర్వాత బ్యాంకు లావాదేవీలకు, ఇతరత్రా పెట్టుబడుల నిర్వహణక దండ్రుల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎసీఎల్) - పుణె కేంద్రానికి పంపితే.. పాన్ కార్డు పొందవచ్చు. బ్యాంకు ఖాతాతో మొదలు. పెట్టుబడులు పద్దతిగా సాగాలంటే అది పిల్లల పేరిట ఉండటమే శ్రేయస్కరం. తల్లిదండ్రుల సేవింగ్స్ ఖాతాలో వాటిని జమ చేసి పొదుపు చేస్తున్నాం కదా అనుకుంటే సరిపోదు. ఏదైనా అవసరం రాగానే.. ముందుగా ఖాతాలో ఉన్న డబ్బులు వాడుకుందామన్న ఆలోచన వస్తుంది. అదే పిల్లల పేరిట ఉన్న ఖాతాలో జమ చేస్తే.. అత్యవసరమైతే తప్ప వాటి మీదికి మనసు మళ్లదు. మైనర్లకు అకౌంట్ ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా తేలిక. బర్త్ సర్టిఫికేట్, -- ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. తల్లిదండ్రుల పాన్, ఫోన్ నంబర్ జతచేయాల్సి ఉంటుంది. మీ ఖాతా ఉన్న బ్యాంకులోనే అయితే ఆ అవసరం కూడా ఉండదు. మైనర్ల బ్యాంకు ఖాతాలో రూ.2,500 నుంచి రూ.10,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్. బ్యాంకు ఖాతా తీసుకున్న తర్వాత.. వారి పేరిట మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ నిర్వహించడం చాలా తేలిక, మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి చిన్నమొత్తంతో ఎస్ఐపీ ప్రారంభించండి. వల్ ఫండ్స్ అకౌంట్ తెరవడానికి బర్త్ సర్టిఫికెట్ చాలు. పేరెంట్స్ అకౌంట్కు సంబంధించిన క్యాన్సల్డ్ చెక్ జత చేయాల్సి ఉంటుంది. పిల్లలు కాస్త పెద్దవాళ్లయితే వాళ్ల ఖాతాకు చెందిన క్యాన్సల్డ్ చెక్ ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అనుకుంటే.. ఆడపిల్ల అయితే సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు ఇన్ని వేల చొప్పున ఆ పథకంలో పెట్టు బడి పెడితే.. పిల్లలు ఎదిగే కొద్దీ లాభాలు వృద్ధి చెందుతాయి. నెలనెలా మీరు పొదుపు చేసిన చిన్నమొత్తమే వారికి పెద్ద సాయమవుతుంది. పుత్తడిపై పెట్టండి. పెట్టుబడికి పుత్తడిని మించిన మెరుగైన మార్గం మరొకటి ఉండదు. మీ కూతురు ప్రతి పుట్టిన రోజుకు తులం బంగారం కొనగలిగినా.. పాపాయికి పాతికేండ్లు వచ్చేసరికి పావుకిలో పసిడి జమవుతుంది. దీంతో అమ్మాయి పెండ్లికి బంగారం భారం మీపై పడకుండా ఉంటుంది. పైచదువుల సమయంలో నిధులు అవసరమైతే... బంగారంపై రుణం తీసుకునే వెసులుబాటూ ఉంటుంది. బంగారం ఇంట్లో భద్రపర్చడం ఇబ్బంది అనుకుంటే.. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మేలు. ఆరోగ్యానికి రక్షణ. ‘కీడెంచి మేలెంచమ’ని పెద్దల మాట. మీ పిల్లల పేరిట ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసినా.. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి తలకిందులైతే.. ఆ పెట్టుబడులు కొనసాగించే పరిస్థితి ఉండకపో వచ్చు. అలాంటి రోజు రావొద్దనుకుంటే.. మీ ఆరోగ్యానికి రక్షణ కవచం ఉండాల్సిందే! మీ పిల్లల పేరిట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందే మీ కుటుంబం పేరిట ఆరోగ్యబీమా, మీ పేరిట జీవిత బీమా చేయండి. సుకన్య సమృద్ధియోజన నెలకు: రూ.5,000 రిటర్న్స్ : 8.2 శాతం (ఏడాదికి) 18 ఏండ్లకు వచ్చే మొత్తం: సుమారు రూ.23.91 లక్షలు ఎస్ఐపీ. నెలకు : రూ.5,000 (నిఫ్టీ 50 ఇండెక్స్) రిటర్న్స్: 12.44 శాతం (సుమారు) 18 ఏండ్లకు వచ్చే మొత్తం: సుమారు రూ.37.29 లక్షలు --- క్లైమాక్స్ లో కష్టాలెందుకు? శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయ్యిం కదా? ఎన్నేళ్లయ్యిందిరా సంతృప్తిగా రెండుపూటలా భోజనం చేసి?..' శంకరాభరణం సినిమాలో అల్లు పాత్ర శంకరశాస్త్రిని నిలదీస్తూ అనే మాటలివి! సినిమాలో అంటే.. సంగీతంపై మమకారంతో శంకర శాస్త్రి అన్ని మాటలూ అనిపించుకు న్నాడు. కానీ, నిజ జీవితంలో శేష జీవితాన్ని విశేషంగా గడిపే అవకా శాలు ఉన్నా... కడుపు మాడ్చుకునే పెద్దమనుషులు ఎందరో కనిపిస్తారు. లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బతు కీడుస్తుంటారు. రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టింది అంతా వారసులకు ధారపోసి అనామకంగా మిగిలిపోతున్నారు! అలాంటి కష్టం మీకు రావొద్దంటే ఇలాంటి షరతులకు లోబడకండి... భారతదేశంలో సీనియర్ సిటిజన్లు పేదరికంలో బతుకుతున్నారు... ధనవంతులుగా పోతు న్నారు' అని ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. పేదరికంలో ఉన్న మనిషి పోయాక శ్రీమంతుడు కావడం ఏమిటి అనే సందేహం రావచ్చు ఆస్తులు కూడబెట్టడం ప్రథమ కర్తవ్యం గా భావించకుండా వాటిని తమ సొంతానికి అనుభవించడానికి తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఆస్తులను కూడా పెట్టే క్రమంలో ఆచరించిన కఠిన నియమాలే ఆ తర్వాత కొనసాగిస్తారు. సంపాదనంతా ప్రాపర్టీల రూపంలో ఉండటంతో... రోజువారీ ఖర్చులకు కావాల్సిన డబ్బు అందుబాటులో ఉండదు. దీంతో ఆస్తిపత్రాల్లో అష్టలక్ష్ములు కొలువుదీరినా.. కరెన్సీ దగ్గర పరిస్థితులు తలెత్తిన సెంటు భూమి అమ్మి సొమ్ము చేసుకోవడానికి సాహసించరు తరతరా లకు తరగని ఆస్తులు సంపాదించిన వీరిని వారసులు సరిగ్గా గౌరవిస్తారా అంటే.. కొందరి విషయంలో అది అత్యాశే అవుతుంది. సినిమాల్లో చూపినట్టు.. 'ఈ మనిషి పోతేగానీ, ఆస్తి మనకు దక్కదు' అన్నట్టు వ్యవహరిస్తుంటారు! -- ఆస్తి- ఆదాయం.. అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి! కష్టాలపాలు కాకుండా చేసేదే ఆ లైన సంపద నష్టకాలంలో ఆదుకునేదే సిసలైన ఆస్తి. ఈ రెండిటికీ పనికిరానప్పుడు ఎన్ని ఉండి ఏం లాభం. ఆస్తులను బట్టి జీవన విధానం ఉండదు. ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేసినప్పుడు దాని నుంచి ఎంతో కొంత ఆదాయం వస్తుండాలి. సంపద సృష్టించని ప్రాపర్టీలు ఎన్ని ఉన్నా నిరర్థకమే! ఒక వ్యక్తి జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో కుకూ సమాన వాటాలుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఓయ్యి గజాల ప్లాట్ కొన్నాడు! తన తదనంతరం దాన్ని ఇద్దరి బిడ్డలకు, కొడు అంతంతమాత్రమే విలువ ఇస్తున్న ఈ రోజుల్లో.. ఎప్పుడో వచ్చే ఆస్తి కోసం డబ్బులో కొంత మొత్తం ఓ పొలం కొంటే పంట రూపంలో, ఇల్లు తీసుకుంటే అద్దె రూపంలో సమాన వాటాలు ఇవ్వాలన్న డిమాండ్లు మాత్రం రోజూ వినిపిస్తూ ఉంటాయి. ఇదే మనిషి ఆ ఆయన జరిగిపోయే వరకూ నెలవారీ ఆదాయం సమకూరుతుంది. మిగిలిన సగం మొత్తాన్ని బ్యాంకులో ఎల్డీ చేస్తే.. వడ్డీ వస్తుంటుంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో బతకాల్సిన అవ సరం ఉండదు. రిలీఫ్ ఇవ్వండి.. సినిమా హిట్టు కొట్టాలంటే... ఫస్టాఫ్ ఎలా ఉన్నా, సెకండాఫ్ పక్కాగా కుదరాలి. క్లైమాక్స్ లోనూ కష్టాలే ఉంటే.. ప్రేక్షకులు పెదవి విరుస్తారు. జీవిత చరమాంకం కూడా సజావుగా సాగాలి. ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలంటే ప్రతి నెలా పక్కా ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. జీవనశైలికి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. వృద్ధాప్యంలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. రిటైర్మెంట్ డబ్బులు రాగానే, కొడుకులు-కోడళ్లు, కూతుళ్లు-అల్లు ళ్లను పిలిచి వచ్చిందంతా ఇచ్చేసి.. బాధ్యత తీరిపోయిందనుకుంటే.. పొరపాటు. ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి రిటైర్మెంట్ లైఫ్ ఒక రిలీఫ్ కావాలి. అలా అవ్వాలంటే.. మీ సొత్తు మీ చెప్పుచేతల్లో ఉండాలి. అది నిరర్థకమైన ఆస్తులుగా కాకుండా.. ఆదాయాన్ని సమకూర్చేవిగా, లిక్విడ్ అసెట్స్ రూపంలో ఉండేలా చూసుకోవాలి. కోటి రూపాయలు ఉన్నాయనుకోండి.. బ్యాంకులో ఎఫ్ఎ చేస్తే నెలకు రూ.60 వేలు వస్తుంది. దాంతో దర్జాగా బతికేయొచ్చు. మీ తదనంతరం ఆ కోటీ నామినీలకే దక్కుతుంది కదా! ముందే ఆ కోటీ పంపకాలు చేసేస్తే.. మీ జీవిత కథ విషా దాంతం అవుతుందని గుర్తుంచుకోండి. -- మలిసంధ్యలో మనీ గ్యారెంటీ! బంగారు గుడ్డు పెట్టే బాతు కథ తెలుసు కదా! బాతు ఉన్నంత కాలం గుడ్డు గ్యారెంటీ, అత్యాశకు పోతన 'అసలు' సమస్య. ఈ స్పిరిట్లో వచ్చిందే గ్యారెంటీ ఇన్కమ్ సూత్రం, దీన్ని ఆధారంగా చేసుకొని.. బీమా సంస్థలు గ్యారెంటీడ్ మనీ స్కీమ్, యాన్యుటీ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి, ఒక్కసారి ధైర్యం చేస్తే.. రిటైర్ అయ్యాక ప్రతి నెలా భరోసా పొందొచ్చు. ఇంతకీ ఏంటీ గ్యారెంటీ, యాన్యుటీ ప్లాన్స్.. జగన్నాథం ప్రభుత్వ ఉద్యోగి, రామనాథం ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరూ స్నేహి జతులు, రెండు నెలల తేడాతో ఇద్దరూ పదవీ విరమణ పొందారు. జగన్నాథా నికి గ్రాట్యుటీ డబ్బులు బాగానే వచ్చాయి. పెన్షన్ కూడా వస్తుంది. రామనాథానికి కంపెనీ నుంచి ఏదో కంటితుడుపుగా కొంత మొత్తం అందింది. పెన్షన్ వెసులు బాటు లేదు. కొన్నాళ్లు గడిచాయి. శ్రీ జగన్నాథం ఒకరోజు రామనాథం ఇంటికి వెళ్లాడు. తన స్నేహితుడు దిలాసాగా కనిపించాడు. 'ఏరా! పెన్షన్ వస్తున్న నాకు రోజులు గడవడం కష్టంగా ఉంది. నువ్వేంటి ** ఉన్నావ్! ఏదైనా లాటరీ తగిలిందా?' అని ప్రశ్నించాడు. 'పెన్షన్ రాకపోతేనేం గ్యారెంటీడ్ నికి, పెన్షన్ రాని రామనాథం జాలీగా ఉండటానికి కారణం వాళ్లు ఎంచుకున్న ఆర్థిక ప్రణాళికలే ! ఫిక్స్ చేసుకోవచ్చు.. ఈ స్నేహితుల కథను కాసేపు పక్కన పెడితే.. గ్యారెంటీ ఇన్కమ్ ఉండటం అందరికీ అవసరం. ఈ సత్యం తెలుసుకోక చాలామంది... సీనియర్ సిటిజన్స్ అయ్యాక సీరియస్ గా బాధపడు తుంటారు. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, కుటుంబ బాధ్యతలను బొటాబొటీగా నెట్టుకొచ్చిన వ్యక్తి ఆశలన్నీ రిటైర్ అయ్యాక వచ్చే గ్రాట్యుటీ పైనే ఉంటాయి. పదవీ విరమణ నాటికి బాధ్య సేవల ముచ్చట్లు** -- తలన్నీ తీరిపోతే... ఆ పైకాన్ని పోస్టాఫీస్లోనో, బ్యాంకులోనో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి హమ్మయ్య అనుకుంటారు. పదేండ్లు గడిచిన తర్వాత రిటర్న్ రేట్ తగ్గుతుంది. ముందస్తు ప్రణాళిక లేనప్పుడు ఎఫ్ మంచి ఆప్షన్. కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడే కొన్ని చక్కదిద్దుకో వాలి. అలాంటి వాటిలో రిటైర్మెంట్ ప్లాన్ కూడా ఒకటి. దీనికి బీమా సంస్థలు రకరకాల గ్యారెంటీ ఇన్కమ్ ప్లాన్లు అందుబాటులోకి తెచ్చాయి. ఒక్కసారి భారీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే.. మీరు రిటైర్ అయిన నాటి నుంచి వార్షికంగా గానీ, నెలనెలా గానీ పెన్షన్ పొందొచ్చు. ఉదాహ ముప్పయ్ ఏండ్ల పాటు 9 శాతం రిటర్న్స్ ఇచ్చే స్కీములూ ఉన్నాయి. గ్యారెంటీడ్ రిటర్న్ ప్రొడక్క పన్ను నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. అయితే, ప్రీమియం మొత్తం ఏడా దికి రూ.5 లక్షల వరకు ఉంటేనే ఇది వర్తిస్తుంది. జీవితకాలం ఆదాయం. గ్యారెంటీడ్ మనీ స్కీమ్లలో యాన్యుటీ ప్లాన్ ఒక రకం. ఒకేసారి పెద్దమొత్తం కడితే.. నిర్ణీత కాలవ్యవధి తర్వాత నిర్దేశిత మొత్తం నెలనెలా అందుకునే వీలు ఉంటుంది. ఈ ప్లాన్లో 6.5 శాతం వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని స్కీమ్లు జీవితకాలం వర్తిస్తాయి. వ్యక్తి తదనంతరం జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఆమె తదనంతరం నామినీకి పర్చేజ్ ప్రైస్ (ప్లాన్ కొనుగోలు ధర) మొత్తం చెందుతుంది. అయితే, పర్చేజ్ ప్రైస్ ఎవరికీ ఇవ్వకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతినెలా అందుకునే పెన్షన్ మొత్తం పెరుగుతుంది. యాన్యుటీ ప్లాన్ తీసుకున్న వ్యక్తి వయసు ఆధారంగా పెన్షన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 65 ఏండ్ల వ్యక్తి రూ.కోటితో యాన్యుటీ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. మరుసటి ఏడాది నుంచి ఏటా రూ.7 లక్షలు (ఏడు శాతం) పెన్షన్ గా అందుతుంది. ఆ వ్యక్తి పోయిన తర్వాత జీవిత భాగస్వామికీ అంతే మొత్తం పెన్షన్ అందుతుంది. ఆమె పోయిన తర్వాత రూ.కోటి వారసులకు వస్తుంది. తన తదనంతరం ఎవరికీ పర్చేజ్ ప్రైస్ చెందనవసరం లేదని పాలసీదారుడు కోరితే... ఏటా రూ. పదిలక్షల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ తరహా గ్యారెంటీ మనీప్లాన్స్ దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. మీ ఆదాయా నికి తగ్గ ప్లాను ఎంచుకొని శేషజీవితం ప్రశాంతంగా సాగేలా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసు కోండి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ వర్తించని ఈ రోజుల్లో ఇలాంటి ప్లాన్లు ఎంచుకో వడం సదా శ్రేయస్కరం. -- స్వతంత్రంగా ఉందాం! డబ్బు డాబు! ఆర్థికంగా చతికి ఆపడితే.. జీవితం దుర్భరమే! ఎంత పోయే మనస్తత్వం ఉన్నా.. నెలకు ఇంతని ఆదాయం లేకుంటే మాటకు విలువ ఉండదు. లోకం లోకువ కడుతుంది. వాళ్లంతా చౌకబారు మనుషులు అనుకున్నా... మనకు మనం చెప్పుకొందామంటే సమాధానం దొరకదు. ఈ పరిస్థితి ఎదురవ్వొద్దన్నా, ఎదురులేకుండా నిలబడాలన్నా.. ఆర్థికంగా విజయం సాధించడమే మార్గం.. సుజాతమ్మకు డెబ్బై ఏండ్లు. విమానంలో ఢిల్లీకి వెళ్తున్నది. సహ ప్రయాణికు రాలు ఆమెతో మాట కలిపింది. ఢిల్లీలో ఎవరుంటారని అడిగింది. మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది సుజాతమ్మ. 'హైదరాబాద్ లో ఎవరుం టారు?' అని ప్రశ్నించిదామె. 'నేనొక్కదాన్నే!' అందీమె. మరి మీ చిన్నబ్బాయ్ అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసింది. 'చిన్నోడు చెన్నైలో ఉంటాడు' అన్నది సుజా తమ్మ. 'ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడం ఏంటి?' అని ఉండబ ట్టలేక అడిగేసింది! సుజాతమ్మ చిన్నగా నవ్వి.. 'అమ్మాయ్! తొందరపడి నా బిడ్డల్ని నిందించకు. నేనే స్వతంత్రంగా ఉండాలనుకున్నా. వాళ్లను చూడాలనిపిం చినప్పుడు ఇలా వెళ్లొస్తుంటా' అని బదులిచ్చింది. ''ఈ వయసులో...' అని తోటి ప్రయాణికురాలు ప్రశ్న అడిగేంతలోనే.. 'నా ఒంట్లో శక్తి ఉంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. పిల్లల దగ్గరుంటే.. వాళ్లకు తగ్గట్టు నా జీవనశైలి మార్చుకోవాలి. అలా చేయలేకపోతే.. నన్ను వాళ్లు భారంగా భావించే ప్రమాదమూ ఉంది. అందుకే ఒంట్లో కింది. సుజాతమ్మది మొండితనం కాదు! ఆత్మవిశ్వాసం!! ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా | ఉన్నన్నాళ్లూ.. స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను' అని చర్చకు ముగింపు పలి పనిచేసి రిటైర్ అయింది. నెలకు రూ.అరవై వేల పెన్షన్ వస్తుంది. భర్త పోయాక ఒక్కతే ఉండా లనినిర్ణయించుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణం. స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన అన్ని అర్హతల్లో ముఖ్యమైనది ఆర్థిక స్వాతంత్య్రం. ఇరవైలో చేతిలో పైసా లేకపోయినా ఇబ్బం -- దిలేదు. కండలు కరగదీసే దిల్ ఉంటే చాలు. నలభైలో ఆదాయం కాస్త అటూ ఇటూ అయినా ఉంటుంది. అరవైకి చేరువయ్యాక కూడా ఆర్థిక విషయాలు ఆందోళనకరంగా లేదు రెండు ఇంక్రిమెంట్లు, ఒక్క బోనస్ వస్తే అన్నీ సర్దుకుంటాయన్న నమ్మకం చింతించాల్సిందే! ఈ పరిస్థితి రావొద్దంటే.. ముప్పయ్లోకి రాగానే జాగ్రత్తపడాలి. ప్రణాళికా బంగా భవిష్యత్ రచన చేస్తే.. రిటైర్ అయ్యాక సుజాతమ్మలా ధీమాగా జీవనం సాగించొచ్చు. నెలవారీ ఆదాయం. ఉన్నాయంటే.. స్కీమ్, ఎస్ఐపీ, ఎడబ్ల్యూపీ, రిటైర్ అయినప్పటి ఇలా దేన్ని ఎంచుకున్నా.. మీరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా.. పెన్షన్ ఇచ్చే రోజులు కావివి. కాబట్టి, ముప్పయ్ ఏండ్ల తర్వాత మీ అవసరానికి తగ్గట్టుగా ఆదాయం సమకూరే పాలసీలను ఎంచుకోవాలి. గ్యారంటీడ్ మనీ స్కీమ్, ఎస్ఐపీ, ఎడబ్ల్యూపీ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇలా దేన్ని ఎంచుకున్నా.. మీరు నుంచి కాలం చేసేవరకు నెలకు స్థిర ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఎస్ఐపీలో నెలకు రూ.15వేలు చొప్పున 20 ఏండ్లపాటు కట్టారే అనుకోండి. 12 శాతం రిటర్న్ అనుకున్నా... ఇరవై ఏండ్ల తర్వాత మీ సంపద ఆచ్చంగా రూ.1.50 కోట్లకు పడగలెత్తు తుంది. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా.. నెలకు రూ.80 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది. రాబడి ఇచ్చే ఆస్తి. నగర శివారులో 200 గజాల ప్లాటు తీసుకునే బదులు, నగరంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే నెలకు రూ.20వేల వరకు అద్దె వస్తుంది. కమర్షియల్ స్పేస్ తీసుకుంటే.. తరతరా లకూ నెలవారీ ఆదాయం సమకూరుతుంది. రిటైర్ అయ్యేనాటికి ఒకే ఇల్లు ఉంది. పెన్షన్ రాదు. అంతమాత్రాన కొడుకుల దగ్గర దేహీ అనాల్సిన అవసరం లేదు. పైగా ఇన్నాళ్లూ పెంచి పోషించాం కాబట్టి మమ్మల్ని చూడాల్సిన బాధ్యత మీదే అని డిమాండ్ చేయొద్దు. అదే ఇంటిని బ్యాంకులో రివర్స్ మార్ట్ గేజ్ పెడితే నెలకు పాతికవేల వరకు ఆదాయం సమకూరు తుంది. మీ తదనంతరం.. ఆ ఇంటిని కావాలనుకుంటే మీ వారసులు విడిపించుకుంటారు! సాఫీగా సాగిపోవాలంటే.. అరవైలోకి అడుగుపెట్టగానే.. అన్నీ ఆపేయాలి అనుకుంటే జీవితం ముగించినట్టే! రిటైర్మెంట్ అంటే.. పని చేయకపోవడం కాదు! ఇష్టమైన పని చేయడం. నచ్చిన వ్యాపకం చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలంటే.. ముప్పయ్ నుంచే జాగ్రత్తపడాలి. ఆహార నియ మాలు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తేనే.. శేష జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒంట్లో శక్తి ఉన్న ప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. రోగాలతో కుస్తీ పట్టడంతోనే ముసలితనమంతా మూలిగిపో తుంది. అందుకే సూత్రాలతో పాటు ఆరోగ్యమంత్రాన్ని పఠిస్తూ వృద్ధాప్యంలోనూ స్వతంత్రంగా బతికేద్దాం! --- ఓడలు బండ్లయితే..! 'ట్రింగ్.. ట్రింగ్...' ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి ‘హాలో!’ అన్నాడు జమీందారు పెదపాలేరు. 'జమీందార్ గారి అల్లుడున్నాడా?’ అని అడిగాడా అవతలి వ్యక్తి. ‘ఉన్నారు బాబు..” అని అల్లుడు గారికి ఫోన్ ఇచ్చాడు సాంబయ్య. అప్పటిదాకా కులాసాగా ఉన్న అల్లుడుగారు ఫోన్లో మాట్లాడుతుం డగానే దిగాలుగా ముఖం పెట్టేశాడు. ఉన్నపళంగా కుదేలయ్యాడు. నిల్చున్నచోటే కూలబడిపోయాడు. కారణం.. ఆ ఫోన్ చేసిన వ్యక్తి.. 'సింగపూర్ నుంచి బయల్దేరిన సరుకు కా ఓడలు తుఫాన్ ధాటికి సముద్రంలో మునిగిపోయాయని చావు కబురు చల్లగా చెప్పాడు. మామగారి ఆస్తిపై కూడా అప్పు చేసి పెట్టిన పెట్టుబడంతా కడలి పాలవ్వడంతో ఒక్క ఫోన్కాల్తో కోటీశ్వరుడు కాస్తా బికారిగా మారిపోయాడు. ఇలాంటి సన్నివేశాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చాలాసార్లు చూసే ఉంటాం. ఆగర్భ శ్రీమంతులైనా, నడమంత్రపు సిరి కలిసొచ్చినా... ఐశ్వర్యం శాశ్వతం కాదన్న సత్యం గుర్తెరిగి ఉండాలి. 'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాల'న్న సామెత మర్చిపోతే.. దురదృష్టం వెంటాడిన నాడు అప్పటిదాకా అండగా ఉన్న అదృష్టం కూడా ముఖం చాటే స్తుంది. ఊహించని అద్భుతాలు జరిగితే నిరుపేద బతుకుల్లో, మధ్యతరగతి జీవితాల్లో రాత్రికి రాత్రి పెద్దగా మార్పులేం జరగవు. అదే మార్పు సిరిగలవాడింట చోటు చేసుకుంటే.. ఆ చేటును తట్టుకునే చేవ వారికి ఉండకపోవచ్చు. అలా జరగొద్దంటే... గల్లాపెట్టెలో కాసులు గల గలలాడుతున్నా, బోషాణంలో ఏడువారాల నగలు నిగనిగలాడుతున్నా, ట్రంకు పెట్టెలో దస్తా వేజులు దుమ్ముకొట్టుకుపోతున్నా... అనుక్షణం అప్రమత్తమై ఉండాల్సిందే! చిన్న ఏమరు పాటు వీటన్నిటినీ లాక్కెళ్లిపోయే ప్రమాదం ఉంది. ముప్పులు ముంచుకొచ్చే దాకా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే.. స్వీయ పతనానికి నాంది పలికినట్టే! --- ఉద్యోగి సేఫ్.. ఆదాయం ఎలా వస్తుందన్న దానిపై కూర్చో ఆధారపడి ఉండాలి స్థలమైన ఆదాయం అంటే ఉద్యోగ అర్జితమై స్థిర చరవస్తుల ద్వారా సమకోరే సంపద ధైర్యాన్నిస్తుంది లక్షల్లో వేతనం వస్తున్న ఉద్యోగులు ఖర్చులు దగ్గర కాస్త తికమొక్క పడ్డ కొంపలో మునిగిపోవు తొందరపాటుతో ప్రయోజనం లేని పెట్టుబడి పెట్టినా తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. రూ.3 లక్షల వేతనం పొందుతున్న కార్పొరేట్ ఉద్యోగికి ఈపీఎఫ్ కటింగ్ నెలకు రూ.40 వేల వరకు ఉంటుంది. అంటే నెలకు ఏదోరకంగా రూ.40వేలు పొదుపు చేస్తున్నట్టే కదా! కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ హెల్త్కేర్ కవర్ ఉంటుంది. వాళ్లు ఇతర ఇన్వెస్ట్మెంట్లు భారీగా చేయకపోయినా ప్రమాదం ఏం ఉండదు. వచ్చిన జీతంలో ఓ ఇల్లు, కారు, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. స్థిరమైన ఆదాయం లేనివాళ్లే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తాత్కాలిక ఆనందాలొద్దు.. దందాలు* వ్యాపారంలో ఊహించిన దానికన్నా అధిక రాబడే వస్తుంది. అయితే ఆ వ్యాపారం సంఘటిత రంగానికి సంబంధించినదైతే పెద్దగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండదు. అసంఘటిత రంగాల్లో పెట్టుబడులు పెడుతూ, అయాచితంగా లాభాలు పొందుతున్న వారి విషయంలోనే ఎప్పుడేం ఉపద్రవం వచ్చిపడుతుందో చెప్పలేం. కొన్నేండ్లుగా రియల్ ఎస్టేట్ రంగం ఊహిం లోకి వచ్చారా? అంటే స్పష్టమైన సమాధానం దొరకదు. కారణం, జీరో బడ్జెట్తో చని పురోగతి సాధిస్తున్నది. కానీ, ఈ రంగాన్ని ఆశ్రయించిన వారందరూ అదే స్థాయిలో వృద్ధి చేస్తూ, కమీషన్ల మీద కాలం వెళ్లదీసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వీరి ఆదాయం స్థిరంగా ఉండదు. ఎప్పుడో నక్కతోక తొక్కినట్టు ఓ డీల్లో బలంగా డబ్బు చేతికి అందుతుంది. ఆ సొమ్మును అవగాహనా రాహిత్యంతో వృథా చేస్తున్నవాళ్లే ఎక్కువ మంది ఉంటారు! కష్టం లేకుండా వచ్చే సొమ్ము తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేకూర్చదు. ఎలా సంపాదించిందీ పక్కన పెడితే... మీ ఆదాయాన్ని సుస్థిరం చేసుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం స్థిరాస్తి కొనుగోళ్లు ఒకమార్గం! ఆస్తులు జాస్తిగా ఉన్నా.. అవసరానికి రూపాయి పుట్టాలంటే లిక్విడ్ అసెట్ రూపంలోనూ ఆస్తులు కూడగ ట్టాలి. ఆదాయంలో ముప్పయ్ శాతానికి తగ్గకుండా పిల్లలు, జీవిత భాగస్వామి పేరిట స్థిరచ రాస్తులు సమకూర్చుకోవాలి. ఈ ముప్పయ్ శాతంలో సింహభాగం పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా లిక్విడ్ అసెట్స్ రూపంలో సమకూర్చుకుంటే.. ఓడలు బండ్ల యినా, రాత్రికి రాత్రి నసీబు మారిపోయినా.. 'ఎంత చెట్టుకు అంతగాలి' అని బ్లాక్ అండ్ వైట్ సినిమా డైలాగ్లు చెప్పాల్సిన పరిస్థితి రాదు. -- ఏది బంగారమంటి పెట్టుబడి? తలపండిన ఆర్థిక మేధావులకూ అర్ధం కాని బ్రహ్మపదార్థం పెట్టుబడి, అధిక లాభాలు వస్తాయని ఆశించి పెట్టిన పెట్టులు దులన్నీ రాత్రికి రాత్రి ఆవిరైపో తాయి. ఒకరి విషయంలో గోరంత పెట్టుబడికి కొండంత లాభం ఇచ్చిన రంగం.. మీ కొండంత పెట్టుబడిని రవ్వంత చేయొచ్చు, ఆర్థిక సూత్రాలకు సంబంధం లేకుండా మీ పెట్టుబడి పదిలంగా పెరగాలంటే ఇలా చేయండి.. దివాకరానికి ఒక్కగానొక్క కూతురు. తన పెండ్లి కోసం నగర శివారులో ఎప్పుడో మూడు వందల గజాల స్థలం కూడా తీసుకున్నాడు. అనుకో కుండా మంచి సంబంధం దొరికింది. ముహూర్తమూ కుదిరింది. ఆ ఒక్క ప్లాట్ అమ్మితే వచ్చే డబ్బులతో కట్నకానుకలు, పెండ్లి ఖర్చులన్నీ వెళ్లిపోతాయని భావిం చాడు. మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. ఒకరిద్దరు ఇన్వెస్టర్లూ వచ్చారు. ఇంతలో ఎన్నికల కోడ్ కూసింది. తెల్లారేసరికి దివాకరం ఇంటి నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలో రెండు చెకోపోస్టులు వెలిశాయి. ప్లాట్ ధరంతా వైట్లో చెల్లించడానికి కొనుగోలుదారులు సిద్ధంగా లేరు. బ్లాక్లో ఇచ్చిన డబ్బును ఇంటిదాకా తీసుకెళ్లే ధైర్యం దివాకరానికి లేదు. ఆయనలో ఒత్తిడి పెరిగింది. అతని అవసరం గుర్తించిన ఇన్వెస్టర్లు సగం ధరకు బేరాలు సాగించారు. ఒకవైపు పెండ్లి పనులు, మరోవైపు తనిఖీలు.. ప్లాట్ అమ్మకం అటకెక్కింది.. అందినచోటల్లా అప్పులు చేసి. బరువుగా బాధ్యత తీర్చుకున్నాడు. అనుకున్నదే తడవుగా. దివాకరానికి ఆ క్షణంలో అండగా నిలిచిన స్నేహితుడి పేరు విశాల్. ఇతను కూడా భూమ్మీత పెట్టుబడి పెట్టినవాడే! అలాగని ఉన్నదంతా దానిమీద సమ్మరించలేము!! తెలివిగా బంగారం.. మీద పెట్టుబడి పెడుతూ పోయాడు. అధికారిక గోల్డ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి నలభై తులాల --- వరకూ బంగారం కూడబెట్టగలిగాడు. తన స్నేహితుడికి అవసరంలో అధికారికంగా సాయం చేశాడు. ఈ ఆపత్కాలంలో ఆదుకున్న మరో స్నేహితుడు లక్ష్మీపతి. ఏ గత్యంతరం లేక.. చేశాడు. 30 తులాల బంగారం బ్యాంకులో కుదువపెట్టి పదిహేను లక్షల రూపాయలు సాయం పెండ్లికి పది రోజుల ముందు మిత్రుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు దివాకరం. 'మై హూం' నా' అన్నాడు లక్ష్మీపతి. నాలుగు రోజుల్లో రూ.25 లక్షలు దివాకరం బ్యాంకు ఖాతాలో జమ శాడు. తావీజు మహిమేం లేదు ఇక్కడ, మ్యూచువల్ ఫండ్స్లో ఏండ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్న లక్ష్మీ పతికి పాతిక లక్షలు పెద్ద మ్యాటర్ అనిపించలేదు. అదృష్టవశాత్తు మార్కెట్ కూడా బాగా ఉండ టంతో తన ఫంచి పాతిక లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. మూడు రోజుల్లో డబ్బులు అతని ఖాతాలో పడ్డాయి. మర్నాడు స్నేహితుడికి అందాయి. మూడూ మంచివే.. ముగ్గురు స్నేహితులూ మంచి ఇన్వెస్టర్లే! ఒకరు భూమి మీద పెట్టారు. ఇంకొకరు బంగారాన్ని నమ్ముకున్నారు. వేరొకరు మ్యూచువల్ఫండ్స్ను ఎంచుకున్నారు. వీరి అవసరానికి ఆదుకు న్నది మాత్రం బంగారం, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే! అలాగని భూమి మీద పెట్టుబడి పెట్టొద్దు అనుకోవద్దు. స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో ముందస్తు జాగ్రత్త తప్పనిసరి. మీ అవసరానికి కనీసం ఆరు నెలల ముందునుంచే అమ్మకానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే, కొన్నిసార్లు ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో వాళ్లకు శస్త్రచికిత్స అవసరం పడొచ్చు! అనుకోకుండా కూతురును విదేశాలకు పంపించాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థి తుల్లో.. బంగారాన్ని మించిన కొంగుబంగారం లేదు! మ్యూచువల్ ఫండ్స్న మించిన ఫండ్స్ లేవు. నేల మీద పెట్టుబడి ఎల్లవేళలా మంచిదే! కానీ, అక్కరకు రాని చుట్టమే కాదు, పెట్టుబడిని కూడా గ్రక్కున విడువంగ వలయు సుమతి !! చివరిగా, మార్కెట్ లెక్కల ప్రకారం దీర్ఘకాలంలో బంగారంపై 8-11 శాతం రిటర్న్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో 12 శాతం వరకు వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ 14 శాతం వరకు రిటర్న్స్ ఇస్తున్నాయి. ఎందులో ఇన్వెస్ట్ చేసినా లాభమే! కానీ, అవసరానికి ఏది ఆదుకుంటుందో అందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఉత్తమ పెట్టుబడి అనిపించుకుంటుంది. మార్కెట్ క్రాష్ అయితే మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏమిటి? అనొచ్చు! ముప్పయ్ శాతం క్రాష్ అయినా.. 70 శాతం పదిలంగా ఉంటుంది. ఏడాదిలో మళ్లీ కుదు రుకుంటుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ భారీగా పతనం అయ్యే అవ కాశాలు ఉన్నాయి. అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మీ స్థిరాస్తిని మార్కెట్ ధరకు కొనుగోలు చేసే పెట్టుబడిదా రులు కూడా అంత తేలిగ్గా దొరకరని గుర్తుంచుకోండి. -- అంతా ఒకేచోట.. చేటు. హయ్యర్ ఇన్కం వస్తున్నవారు గొప్పలకు పోయి గోతిలో పడ్డ మద్భూలు కోకొల్లలు. పెట్టుబడులు పెంచాలనీ, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తపనతో అగ్రెసివ్ స్టెప్ తీసుకుం టారు. ఏదైనా తేడా కొడితే మొత్తం పేక మేడలా కూలిపోతుంది. ఇలా ఓసారి పోగొట్టుకుంటే మళ్లీ రావడ మనేది చాలా కష్టం. ఉన్నదంతా ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే! కొవివిడ్కు ముందు రోజులవి.. ఓ పేరున్న బిజినెస్కు ప్రొప్రైటర్షిప్ తీసుకు న్నాడు ముకుందరావు. ఒకటి కాదని రెండు షాపులు నిర్వహిస్తున్నాడు.. బాగా నడుస్తున్నాయి. ఖర్చులన్నీ పోను నెలకు ఐదారు లక్షల దాకా మిగులుతు న్నది. పెద్దగా ఇష్టం లేకున్నా స్నేహితుడు ఆనందరావు ఇచ్చిన సలహా మేరకు మంత్లీ రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కడుతున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్న మరో మిత్రుడు విలాస్రావు అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిం చాడు.. పైపాటుగా యుద్ధాలు వస్తే మనం పెట్టిన ఫండ్ సంగతేంటి? అన్న ప్రశ్నను సంధించాడు. ముకుందరావు లేవనెత్తిన సందేహాలన్నీ విలాస్ రావు తీర్చ డంతో చిన్నగా నెలకు రూ.30 వేలతో ప్రారంభిద్దాం అని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాడు. కట్ చేస్తే.. కొవిడ్ తర్వాత, నాలుగేళ్లకు ఓ సందర్భంలో.. విలాస్ రావు, ముకుందరావు మ్యూచువల్ ఫండ్స్ప రివ్యూ చేసుకుంటున్నారు. గతంలో ప్రతినెలా పెట్టిన రూ.30 వేలు యింది. అప్పుడే లక్షల్లో పెట్టుబడి పెడితే కోట్లల్లో వచ్చేది కదా! అంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశాడు ముకుందరావు. 'అయ్యో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇప్పుడు పెట్టు'.. అన్నాడు విలాస్ రావు. ఇది విన్న ముకుందరావు 'ఇప్పుడు పెట్టే పరిస్థితి. లేదు. షాప్స్ ప్రొప్రైటర్షిప్ కాకుండా మ్యాన్యుఫ్యాక్చరింగ్లోనూ ఇన్వెస్ట్ చేశాను. బిజినెస్ అంతా పోయింది. చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాను'.. అని సమాధానమిచ్చాడు. -- ... ఒక్క ముకుందరావు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఒంటరిగా బిజినెస్ చేస్తూ అధి కంగా సంపాదిస్తున్న చాలా మందిదీ ఇదే పరిస్థితి. ఇప్పుడున్న బిజినెస్ నే ఏడాది తిరిగేకల్లా కనీసం రెండు మూడు రెట్లయినా పెంచేద్దామంటూ అప్పటివరకు సంపాదించిందంతా పెట్టుబ కుంటే మళ్లీ మొదటికొచ్చి పడ్డామన్న సంగతి అప్పుడు బోధ పడుతుంది. టెన్త్ , ఇంటర్మీడియట్ కూడా చదవకుండా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించేవారు చాలా వారి సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే ఉంటున్నది ఈ రోజుల్లో! ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే తున్నారు. అధికంగా సంపాదించే స్థాయికి ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమైన ఇందుకు కారణం. ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్ చేసేసి ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నప్పుడు వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంటుంది. అందుకే వచ్చిన లాభాల్లోనుంచి కొంత మరో విధంగా సేవింగ్స్ చేయడంపై దృష్టి పెట్టరు. ఇలాంటి మొండి ధైర్యంతో ఉండటమే వారి కొంప ముంచుతుంది. ఆదాయం వస్తుంది కదా అన్న ఉత్సాహంలో చాలా మంది లెక్కా పత్రం లేకుండా పెట్టుబడి పెట్టేస్తూ చివరకు మళ్లీ అయిపోతుంటారు. హయ్యర్ ఇన్కం ఉన్నవాళ్లు రెండు క్యాటగిరీలు ఉంటారు. ఉద్యోగులు.. వ్యాపారులు. వ్యాపారంలో సంఘటిత, అసంఘటిత అని మళ్లీ రెండు రకాలు. అసంఘటిత రంగ వ్యాపారులకు ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువ. దీంతో చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడులు, ఖర్చులకు పోతారు. చివరికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు. ఇలాంటి వాళ్లకు మ్యూచు వల్ ఫండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి మంచివి. అంతేకాకుండా అధిక ఆదాయ వర్గాల వాళ్లు తన లాభాల్లో నెలకు కనీసం 30 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఉన్న బిజినెస్ వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని మరోచోట పెట్టుబడి పెట్టడం కన్నా మంచి మార్గం లేదు. ఒక ఉద్యోగి నెలకు రూ.3 లక్షల దాకా డ్రా చేస్తున్నట్ల యితే ప్రతి నెలా ఓ ముప్పయ్ వేల రూపాయలైనా ఈపీ ఎఫ్ ఖాతాలో జమ అవుతుంటాయి. కంపెనీ షేర్స్, ఈ- షాప్స్ ఉంటే ఆ మార్గంలో కూడా ఆదాయం సమకూరు 66 తుంటుంది. కుటుంబమంతటికీ ఇన్సూరెన్స్ కవరేజీలు ఉంటాయి. ఇలాంటివేవీ అసంఘటితరంగ వ్యాపారులకు ఉండవు. స్వయంగా ప్రొప్రైటర్షిప్ చేసేవాళ్లు వారి బిజినె స్లో వారే కింగ్. పరిస్థితుల కారణంగా ధైర్యం పెరిగిపో తుంది. నాకేంటి ఖర్చులన్నీ పోనూ నెలకు ఐదారు లక్షలు మిగులుతున్నది కదా అన్న ధీమాతో తప్పులు చేస్తారు. --- కాలంతోపాటే.. కాసుల విలువ. నెలకు కేవలం వెయ్యి రూపాయలు పెట్టుబడితో నలభై ఏండ్ల తర్వా మూడు కోట్ల రూపాయలు వచ్చే మార్గం ఉందన్నమాట వాస్తవమే. కూర్చున్నచోట మొబైల్లో ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కట్టే లెక్కలు బాగానే ఉంటాయి. వచ్చిన సమస్యంతా నిజ జీవితం గురించే. ఊహల్లో బతికేవాళ్లు ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకోవాలి. కాలంతోపాటే డబ్బు విలువ కూడా మారుతుందని గ్రహించాలి. నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే నలభై ఏండ్ల తర్వాత రూ. మూడు కోట్లు. అదే 60 ఏండ్లపాటు చేస్తూ ఉంటే 50 కోట్లు! ఔను, ఇది నిజమే! మీరు చదివింది వాస్తవమే. ఈ లెక్కలన్నీ శుద్ధ ఒప్పులే. నెల నెలా పెట్టుబడి పెడుతూ ఉంటే దాని విలువ ప్రతి ఐదేండ్లకోసారి రెట్టింపు అవుతుంది. అది ఎలా గంటే ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 40 ఏండ్లకు దాని విలువ రూ.3 కోట్లు. అదే 45 ఏండ్లకు రూ.6 కోట్లు, 50 ఏండ్లకు రూ.12 కోట్లు, 55 ఏండ్లకైతే రూ.25 కోట్లు. ఇక 60 ఏండ్లపాటు ప్రతి నెలా రూ.1000 డిపాజిట్ చేస్తే అప్పుడు వారి చేతికి వచ్చే మొత్తం 50 కోట్లకు పైమాటే! ఇలా లెక్క చాలా సులువు. కానీ, అరవై ఏండ్ల తర్వాత 50 కోట్లకు ఉండే విలువ ఎంత? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు విలువ కాలంతోపాటు మారుతూ ఉంటుంది. ఆ మాటకొస్తే భారతదేశంలో దాని విలువ మరింత పడిపోతుందే తప్ప పెరగడంలేదు. ఇది మరిచిపోయి చాలా మంది టైం వ్యాల్యూ (విలువ) చూడటంలేదు. మనీ వాల్యూమ్ (పరి మాణం) మాత్రమే చూస్తున్నారు. భవిష్యత్తు గురించి రందిపడుతూ ఈ రోజు ఎలా బతకాలో మర్చిపోతున్నారు. ఈ రోజు ధైర్యంగా బతకడానికి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ, నలభై ఏండ్ల తర్వాతి జీవితాన్ని ఇప్పట్నుంచి ఆలోచిస్తారు. ఒక పూట తినీ మరో పూట తినక డబ్బు అలా దాచిపెడుతూ అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మూడు కోట్లకు ఉన్న -- విలువ నలభై ఏండ్ల తర్వాత ఎంత ఉంటుందో తెలిస్తే ఇలాంటి లెక్కలేయడం, ఇలాంటి పొదు పులు చేయడం, పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించరు. డ్రీమ్ సాలరీ దొల్లతనం. ఒక 35 ఏండ్ల వయస్కుడు ఇప్పుడు రూ.50 వేలు సంపాదిస్తుంటే గొప్ప ఆదాయంగా భావిం చేవారు చాలామంది ఉన్నారు. గొప్ప జీతం అంటే ఎంత? 20 ఏండ్ల వయసులో డ్రీమ్ సాలరీ 20 వేలు. మరి ఇప్పుడు 50 వేలు సంపాదిస్తున్నాడు. అంటే రెట్టింపు జీతం వస్తున్నది. కానీ ఏమైంది అతను తన కళ నెరవేర్చుకున్నాడు కదా ?అయినా సంతృప్తిగా బతుకుతున్నడా అంటే , లేదు. దీన్నిబట్టి ఏం అర్థమైంది? 15-20 ఏండ్ల క్రితం తాను అనుకున్నంత సంపాదిస్తున్నప్పటికీ అసంతృప్తే మిగులుతున్నది. తేడా ఎక్కడొచ్చింది. ఇరవై ఏండ్ల క్రితం వేసుకున్న లెక్క తప్పు. ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఇరవై ఏండ్ల క్రితమే ఉన్న డబ్బు విలువను బట్టి అతను అలా ఊహించుకున్నాడు. అతను సంపాదించే రోజుల్లోకి వచ్చేసరికి డబ్బు విలువ తగ్గిపోయింది. వాళ్లే ధన వంతులు... 1980ల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగం చేసే టీచర్లకు అలవెన్సులన్నీ కలిపి రూ.820 వచ్చేది. ఆరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి వేతనం 400-600, గెజిటెడ్ ఆఫీసర్ జీతం 1200-1500. అలాంటి రోజుల్లో అద్భుతమైన బతుకు బతకడానికి నెలకు 500 సరిపో యేది. 40 ఏండ్ల కాలం గడిచింది.. అప్పటి ఉద్యోగికి ఇప్పుడు వస్తున్న పెన్షన్ రూ.30 వేలు. అదే 40 ఏండ్ల క్రితం ఖర్చు పెట్టినట్టు నెలకు 500లతో సరిపెట్టుకోగలుగుతున్నాడా? కాదు కదా! నెలకు రూ.50 వేలు కావాల్సి వస్తున్నది. నలభై ఏండ్లు వెనక్కి వెళ్తే 500 గొప్పగా అని పించింది.. ఇప్పుడు దానికి విలువే లేదు. 80ల్లో లక్ష ఉంటే లక్షాధికారి. 90ల్లో కోటీశ్వరుడు. ఇప్పుడు.. ఈరోజు ఖాతాలో కోటి రూపాయలుంటే పెద్ద విషయం కాదు. మరి 40 ఏండ్ల తర్వాత రూ. మూడు కోట్లు, 60 ఏండ్ల తర్వాత రూ.50 కోట్ల మాటేంటి? కాబట్టి డబ్బుకు ఇప్పుడున్న విలువ భవిష్యత్తులో కొన్ని రెట్లు పెరుగుతుందన్న ఎరుకతో మసులుకునే వాళ్లే ధనవంతుల కింద లెక్క. --- కంగారొద్దు బంగారం ! ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు.. పక్కంటి పిన్నిగారి కాసులపేరు చూడు..' అంటూ సాగిపోయే ఈ పాట గుర్తుందిగా? అదేనండీ ''శుభలగ్నం' సినిమాలో హీరోయిన్ ఆమని, హీరో జగపతిబాబు దగ్గర ఇరుగు పొరుగు వారి ఆదంబరాలను గుర్తుచేస్తూ మొగుణ్ని దెప్పి పొడిచే సన్నివేశాలతో సాగే ఈ పాట ద్యంతం నవ్వులు పూయిస్తుంది. అంతేకాదు ,ఈ పాట ద్వారా సగటు మధ్యతరగతి ఇల్లాలి ఆలోచన విధానాన్ని అద్భుతంగా వ్యక్తిగరించారు రచయిత.తమ ఆర్థిక పరిస్థితి గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా ఇరుగమ్మ పొరుగమ్మలతో పోల్చుకుంటూ సంసారాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టుకోకూడదన్న సందేశాన్ని ఇస్తుంది ఈ పాట. నగనిగ లపై మనసు పడే అతివలకు బంగారంపై మోజు ఉండటం మామూలే. అంతే కాదు.. కాసుల వేటలో ఉన్నవారు పుత్తడిని పెట్టుబడి కోణంలో చూడటమూ సహజమే! ఈ ఉద్దేశాలు ఎలా ఉన్నా.. పసిడి ధరలు చుక్కలనంటిన వేళ.. కొన్ని షరతులు గుర్తుంచుకోవాలి. నలుగురు స్త్రీమూర్తులు కలిస్తే.. కబుర్లాడేది కాంచనం గురించే! ఇద్దరు ఇన్వెస్టర్ల భేటీలోనూ పసిడి ప్రస్తావన రాక మానదు. రోజురోజుకూ ప్రియమవుతున్న బంగారం మీద ఎందుకంత ప్రేమంటే సరైన సమాధానం దొరకదు. పైగా చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బంగారం ధరలు పెరు గుతున్నాయన్న వార్త విన్నప్పుడల్లా కంగారు. 'అయ్యో! బంగారం ధర పెరిగిపోతున్నది.. వచ్చే ఏడాది మీ అమ్మాయి పెండ్లి చేస్తామంటున్నారు.. ఇప్పుడే కొనుక్కొని పెట్టుకో రాదు?.. అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లూ ఉంటారు. ఈ మాట చెవిలో పడీ పడకముందే నగల దుకాణాలకు పరుగులు తీస్తుంటారు చాలా మంది. ఇలాంటి పరిస్థితిని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. -- మనదేశంలో బంగారం పట్ల మోజు ఎక్కువ. అయితే, ఇటీవల బంగారం ధర భారీగా పెరుగు తున్న మాట వాస్తవమే. కానీ, ఎంత పెరిగిందన్నదీ చూసుకోవాలి కదా! ఏడాది క్రితం 10 అంటే ధర దాదాపు 20 శాతం పెరిగిందన్నమాట. ఏ పెట్టుబడి నుంచైనా స్వల్పకాలిక గ్రాముల బంగారం ధర రూ.63 వేలు ఉంటే ఇప్పుడు సుమారు రూ.75 వేలకు చేరుకున్నది. లాభాలు ఆశించొద్దు. దీర్ఘకాలిక లాభాలనే లెక్కలేసుకోవాలి. యుద్ధాలు వస్తాయనో, ఎన్ని ఉన్నా జరిగే ప్రచారాలను నమ్మి ఎడాపెడా పెట్టుబడులు పెట్టడం, తీయడం నష్టా తగ్గేది కాదన్న అపోహలో ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి గతాన్ని నెమరువేసుకోవాలి. 1996లో 10 గ్రాముల బంగారం ధర రూ.5,160 ఉంటే 2001లో అది రూ.4,300లకు చేరింది. ఇలా ఆ ఆరేండ్ల మధ్యకాలంలో ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. 1997లో 725 1998లో రూ.4,045, 1999లో రూ.4,234, 2000లో రూ.4,400 ఉంటే 2001 సంవత్సరం కల్లా రూ.4,300లకు చేరింది. మొత్తంగా ఏడు సంవత్సరాలపాటు ధర రూ.800 తగ్గింపులోనే ఉంది. 12 ఏండ్ల క్రితం అంటే.. 2012లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,050 ఉంది. 2013లో రూ.29,600; 2014లో రూ.28,006; 2015లో రూ.26,343; 2016లో రూ.28,623; 2017లో రూ.29,667గా ఉంది. అంటే ఆ ఐదేండ్లపాటు రూ.2000 తగ్గు తూనే వచ్చింది. ఇలా తగ్గుముఖం పట్టిన ధరల్లోనే కొన్నేండ్లపాటు ఉంటుంది. ఇందుకు ఒకరి జీవితంలో ఎదురైన అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. 2012లో పెండ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆరేండ్ల తర్వాత అంటే 2018లో తన సోదరి పెండ్లి చేశాడు. ఇక్కడ విచిత్ర మేమంటే.. రెండు సందర్భాల్లోనూ బంగారం ధర ఒకేలా ఉంది. ధర పెరిగినా, తగ్గినా బంగారం బరువు మాత్రం తగ్గదు కదా?! కాబట్టి అవసరం ఉంటే తప్ప బంగారం కొనుగోలు చేయొద్దు, నగల కోసం అయితే ధర గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నిర్భయంగా కొను క్కోవచ్చు. బంగారాన్ని నగల రూపంలో వాడుకోవడానికైతేనే కొనాలి. దాచుకోవడానికైతే ప్రత్యేకంగా అప్పోసొప్పో చేసి, క్రెడిట్ కార్డు వినియోగించి, పర్సనల్ లోన్ తీసుకొని మరీ కొనాల్సిన అవసరం లేదు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఆందోళనలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏమంత మంచిది కాదు. పుత్తడి మీద పెట్టుబడి ఎప్పుడూ తప్పు కాదు. అలాగని దాన్ని అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ గా భావించొద్దు. బంగారం సెంటిమెంట్ తో ముడిపడితే.. అమ్మడానికి చేతులు రావు. '' కుదువ పెట్టడానికి మనసొప్పదు. అందుకే, కాంచనాన్ని ” అవసరంగా భావించాలి. విలాస వస్తువుగానే గుర్తించాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయాలి. అందుకోసం అప్పు చేస్తేనే తప్పు, --- థింక్ ఎమర్జెన్సీ. అత్యవసర పరిస్థితులు చెప్పి రావు. అవి ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కో వడానికి సిద్ధంగా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. విపత్కర పరిస్థితుల్లో ఒడ్డున పడటానికి ఈ ప్రత్యేక నిధి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఆ నిధి ఏ రూపంలో ఉండాలి? నగదుగా ఉండాలా? మరేదైనా రూపంలో ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుంటుందా? అసలు అత్యవసర నిధి అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వహించుకోవాలి? మన సంపాదనలో ఎంత భాగాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోవాలి? తదితర సందేహాలు చాలామందిని తరుచూ తొలిచివేస్తూ ఉంటాయి. ఒకరిద్దరు మినహా అత్యవసర సమయాల్లో చాలామంది అప్పు కోసం రాక్షస ప్రయత్నం చేస్తుంటారు. చివరికి 'వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు' అని అందినకాడికి అప్పులు చేస్తుంటారు. సంపన్నులు సైతం అత్యవసర పరిస్థితుల్లో చేతిలో సరిపడా క్యాష్ లేక ఆస్తులను అడ్డెకు పావుసేరు రేటుకు అమ్ముకుంటుంటారు. అయితే, ప్రతి వ్యక్తికీ, కుటుంబానికీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అలాగని నగదు రూపంలోనే ఈ ఫండ్ ఉండాలన్న నియమం లేదు. ఏ రూపంలో ఉన్నా.. అవసరానికి అక్కరకు రావాలి. ఒక వ్యక్తి జీవితంలో ఏది అత్యవసర పరిస్థితికి దారితీస్తుందో ఆలోచించాలి. చెడిపో యిందా.. రెండు వారాల్లో బాగు చేసుకోవచ్చు. ఉద్యోగం పోయిందా.. మహా అయితే నాలుగు నెలల్లో తిరిగి సంపాదించుకోవచ్చు. ఇవన్నీ ఈ రోజుల్లో అత్యవసర పరిస్థితులు అనలేం. ఇంటి ఖర్చులే కాకుండా, ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతలను నెరవేర్చేందుకు కొన్ని నెలలకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకో వాలని కొందరు సూచిస్తుంటారు. ఎంత చెట్టుకు అంత గాలి. వ్యాపారులు మినహా.. మూడు నెలల ఖర్చులకు సరిపడా నగదు ఏ ఉద్యోగీ బ్యాంకు ఖాతాలో ఉంచలేడు. ఏ నెల ఖర్చులు ఆ -- నెల ఎగిరిపోతూనే ఉంటుంది సేవింగ్ ఖాతా చెక్కుపోతే క్రెడిట్ కార్డుతో అవసరాలు తీర్చుకుంటారు మరిసమస్యాత్మకమైతే అయితే బంగారం కొదువ పెడితే ఎమర్జెన్సీ పాటు సబర్ కుర్చుకుంటారు న్నారు. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే.. మన కుటుంబ పరిస్థితి తారుమారు కాకుండా కాపాడే నిధి. మనం పోయిన తర్వాత కూడా కుటుంబాన్ని భద్రంగా ఉంచే మొత్తం. ఆరోగ్య బీమా, జీవిత బీమా ఈ రెండిటినీ మించిన ఎమర్జెన్సీ ఫండ్స్ లేవు. ప్రాణాలను నిలబెట్టుకోవడం కన్నా అత్యవసర పరిస్థితి ఏముంటుంది? కుటుంబాన్ని కాపాడుకోవడం కన్నా గొప్ప అవసరం ఏముంటుంది? కానీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు వీటి గురించి ఎవరూ ఆలోచించరు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకొని అత్యవసర నిధి రెన్స్ చేసి ఉంటే బాగుండేది కదా! అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. ఈ రోజుల్లో రకరకాల వ్యాధులు మనిషి వెన్నంటే ఉంటున్నాయి. హెల్త్ చెకప్ కోసం వెళ్లిన వ్యక్తి.. కార్పొరేట్ ఆస్పత్రిలో జాయిన్ అవుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. కిడ్నీ, గుండె, లివర్ రుగ్మతలతో ఆస్పత్రి గుమ్మం తొక్కితే.. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. పాతికేండ్లు ఉద్యోగం చేసినా... దవాఖాన ఖర్చుకు వెరచి వెనుదిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. ఎప్పుడో అగ్గువకు కొన్న ప్లాటు బేరానికి పెడితే.. బయ్యర్ దొరికే వరకు చికిత్స అందేదెలా? ఏడాదికి పాతికవేలు ఖర్చుపెట్టి ఓ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. ఆ భరోసా వైద్యం కన్నా వేగంగా గుణం చూపిస్తుంది కదా! ఎమర్జెన్సీ ఫండ్ అనేది నేచర్ ఆఫ్ వర్ను బట్టి మారిపోతుంది. సూటిగా చెప్పాలంటే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు మీదా రూ.50 లక్షలకు తగ్గని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే ఎమర్జెన్సీ ఫండ్. అలా అవుతుంటారు. ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలైనప్పుడు హెల్త్ ఇన్సూ అత్యవసరం అనే పదానికి అర్థం.. అన్ ఎక్స్పెక్టెడ్, డేంజరస్ సిచువేషన్, రిక్వైరింగ్ ఇమిడి యట్ యాక్షన్ అని! ఏదైనా ప్రమాదం జరగడం, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడి పోవడం లాంటివి అత్యవసర పరిస్థితులు. ఇలాంటప్పుడు కదా ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగప డాల్సింది. మరి ఆర్నెల్లకు సరిపడా ఖర్చులు పక్కన పెట్టుకోవడానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? జాబ్ పోవడం అనేది సీరియస్, అన్ ఎక్స్పెక్టెడ్, డేంజరస్ సిచువేషన్ కాదు. ఈ జాబ్ పోతే మరో జాబ్ వస్తుంది. నగదు రూపేణా బ్యాంకుల్లో దాచుకునేది, స్థిర ఆస్తుల రూపంలో నిర్వహించేది అత్యవసర నిధి కాదు. కుటుంబంలో ఎవరికి ప్రాణాపాయ స్థితి వచ్చినా కాపాడుకోగల 'పాలసీ' ఏదైనా అసలు సిసలు అత్యవసర నిధే. కనీసం ఐదేం డ్లకు సరిపడా సొమ్ము, దానంత విలువైన సంపదే అత్యవసర నిధి. -- స్వదేశమా... విదేశమా..? ఉద్యోగం ఇండియాలో చేయాలా? బయటి దేశంలోనా?.. అని చాలా చర్చలే జరుగుతుంటాయి. అయితే అవన్నీ ఒడిసే ముచ్చట్లు కాదు. ఈ విషయంలో చాలామంది తమకు ఏమాత్రం అనుభవం లేకున్నా ఏవేవో లెక్కలేసేస్తుంటారు. ఏదేదో చెప్పేస్తుంటారు. ఉద్యోగం ఎక్కడైతే బాగుంటుందనేది నిర్ణయించాల్సింది ఎవరు? అని ఒక్కసారి ప్రశాంతంగా ఎవరికి వారు ఆలోచించినట్టయితే సరైన సమాధానం దొరుకుతుంది. ఇండియాలో కన్నా బయట దేశంలో జాబ్ చేసినవారు ఆర్థికంగా బాగున్నార నేది అంగీకరించాల్సిన మాట. కానీ ఈ విషయంలో చాలామంది వాదించేది ఏమిటంటే కాస్ట్ ఆఫ్ లివింగు, పన్నులను దృష్టిలో పెట్టుకుంటే అక్కడా ఇక్కడా మిగులుబాటయ్యేదంతా గంతేనని! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇండి యాలో కన్నా మిగతా ఏ దేశంలో, ఏ స్థాయి ఉద్యోగం చేసినవారైనా ఆర్థికంగా, కెరీర్ పరంగా ముందంజలో ఉన్నారు. ఇందుకు కారణం ఏమిటి? ఇందులో ఉన్న మతలబు ఏమిటి? దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోని ప్రజల జీవన విధానాన్ని, కుటుంబాల ఆర్థికాభివృద్ధి తీరును పరిశీలిస్తే కచ్చితంగా విదేశీ ఉద్యోగానికే ఓటేయక మానరు. అంతదాకా ఎందుకు ? తెలంగాణ లోని కొన్ని పల్లెల జీవన విధానాన్ని పరిశీలించిన వారి అభిప్రాయాన్ని, ఫారిన్, గల్ఫ్ వంటి విదేశాల్లో ఏదో ఒక ఉద్యోగం చేసి వచ్చినవారి జీవితాలను దగ్గర నుంచి చూసినవారిని ఓ సారి పలుకరించినట్టయితే అసలు విషయం తెలుస్తుంది. ఇండియాలో 30 లక్షలు సంపాదిం చినా.. అమెరికాలో కోటి రూపాయల వేతనం వచ్చినా.. అంతా సరిసమానమే, అంతా ఒక్కటే అంటారు చాలామంది. ఇది వాస్తవమే. అక్కడ టాక్స్లు, లివింగ్ కాస్ట్ ఎక్కువ. అందుకే అక్కడ కోటి రూపాయలు ఆర్జించే వ్యక్తికి ఎంత మిగులుతున్నదో.. ఇక్కడ 30 లక్షలు సంపాదించినవారికి అంతే మిగులుతుంది, కాదనలేం! -- జమీన్ ఆస్మాన్ ఫరఖ్. కానీ ఇది చాలా తప్పుడు పోలిక, పోల్చే తీరులో లోపం ఉందన్న విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇండియాలో రూ.30 లక్షల వేతనం ఎంతమంది తీసుకుంటు నా అతి కొద్దిమందికి మాత్రమే ఇంత పెద్దమొత్తంలో జీతాలు ఉంటున్నాయంటే కాదంటారా ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అమెరికా ఉద్యోగాలను ఉదాహరణ తీసుకుందాం అక్కడ ఎంఎస్ చేసిన ప్రతి ప్రెషర్ కు ప్యాకేజీ వస్తుంది అంటే సుమారు ఒక లక్ష 25 వేల డాలర్లు ప్రతి సంవత్సరం అన్నమాట ఇప్పుడు చెప్పండి కోటి రూపాయల స్టార్టింగ్ ప్యాకేజ్ ఎక్కడ? ఎన్నో డక్కామొక్కీలు తిని, ఎన్నో ఏండ్ల అనుభవాన్నంతా లెక్కగట్టి ఇచ్చే 30లక్షలు ప్యాకేజ్ ఎక్కడ. ఇంకా చెప్పాలంటే.. ఇక్కడ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదివినవారికో, పది పదిహేనేండ్ల సీనియారిటీ ఉన్నవారికో ఇంత మొత్తం మార్కెట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ సాధ్యపడదన్నది గ్రహించాలి. జీతాలు పొందే అవకాశం దక్కుతుందే కానీ ఇదే విద్యాసంవత్సరమే డిగ్రీ పట్టా పుచ్చుకొని ఇద్దరూ ఉద్యోగులైతే భారతీయ కరెన్సీలో నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తున్న భార్యాభర్త లను చాలామందిని చూస్తున్నాం కదా! అలా అమెరికాలో 15 ఏండ్లపాటు ఉండి మంచి అను భవం, బ్యాంక్ బ్యాలెన్స్తో సమాజంలో స్థితిమంతులుగా పేరు, కీర్తి పొందుతున్న కుటుంబా లకూ కొదువ లేదు. విదేశాల్లో వివిధ రంగాల్లో సర్వెంట్లుగా, డ్రైవర్స్ గా, చిన్నచిన్ని ఉద్యోగాలు చేసేవారిని ఎవరినైనా కదపండి.. ఇక్కడి ఆదాయానికీ, అక్కడి ఆదాయానికీ.. జమీన్ ఆస్మాన్ ఫరఖ్ ఉందని చెబుతారు. చిన్నవయసులోనే సంపాదన. ఓ పుష్కర కాలం క్రితం ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లినవారు, అక్కడే ఉద్యోగాల్లో చేరడం ద్వారా గ్రీన్కార్డులు, సిటిజెన్ షిప్ లు వచ్చాయి. వాళ్లలో చాలామంది పది పన్నెం డేండ్లు అక్కడ ఉద్యోగం చేసి ఇండియా వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓవర్సిస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాగా చెలామణి అవుతూ స్థానికంగానే ఎంచక్కా యూఎస్ కంపెనీల్లో పనిచేసుకుంటు న్నారు. ఇక్కడ రెండేండ్లు కష్టపడ్డా సంపాదించలేని ఆదాయం అక్కడ నాలుగు నెలల కాలంలో కూడబెడుతున్నారు. నూటికి ఐదు శాతం ఫెయిల్యూర్స్ ఉంటాయి, కాదనలేం. కానీ 95 శాతం మంది ఇండియాలో కన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. బయటి దేశాల్లో పదేండ్ల కష్టం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నూటికి తొంభై శాతం కుటుంబాలు సెటిల్ అవుతున్నాయి. విదేశాలకు వెళ్లి పనిచేసేవాళ్లు స్కిల్డ్ లేబర్ కానీ, ఐటీ ఉద్యోగి కానీ పదేండ్ల లోనే ఇండియాలో రిటైర్మెంటు సరిపడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్క యూఎస్ అనే కాదు ఆఫ్రికా దేశాల్లోనూ ఎక్కువమొత్తంలో సంపాదిస్తున్నవారు ఉన్నారు. అలా వాళ్లు తమ కుటుంబాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.. తద్వారా ఒక తరాన్ని మార్చగలుగుతున్నారు. అర్హత, ఓపిక, కోరిక ఉంటే మాత్రం ఓ పదేండ్లు విదేశీ కరెన్సీ వెంట పరుగులు పెట్టి, స్వదే శంలో కుటుంబ స్థితిగతులను మార్చుకోవడం కన్నా మంచి మార్గం లేదు. --- లైఫ్ లో జంకొద్దు.. డింక్ లో దూకొద్దు.. పెండ్లయిన మూడోనెల కోడలమ్మ మామిడి కాయ కోరాల్సిందే! ఇది పాత రోజుల సంగతి. దాంపత్య జీవితాన్ని ఓ రెండేండ్లు ఎంజాయ్ చేసి పిల్లలను ప్లాన్ చేద్దాం... ఇది నిన్నటి ఈక్వేషన్. అసలు పిల్లలే వద్దనుకోవడం ఇవాల్టి ఫ్యాషన్. రెండు రెండ్ల నాలుగు చేతులా సంపాదిస్తున్నా... పిల్లలు వద్దనుకుం టున్నారు కొందరు. 'డ్యూయెల్ ఇన్కం నో కిడ్స్' (డింక్) మాయలో పడిపోతున్నారు. డింక్ లైఫ్ స్టైల్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో చాలా ఏండ్ల క్రితం నుంచే ఉంది. ఇప్పుడు మన దగ్గర యువత 'డింక్'పై మోజుపడుతున్నారు. మన దేశంలో కొత్తజంటల్లో ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నవారి సంఖ్య 30 శాతానికి చేరువగా ఉందని 'గిట్నెక్స్' డేటా ఉవాచ! ఈ రోజుల్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం ఆర్థికంగా మోయలేని భారమని చాలామంది యువజంటల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే పిల్లల్ని కనే ముందు లెక్కలు వేసుకుంటు న్నారు. పుట్టిన పిల్లలకు 18 ఏండ్లు నిండేసరికి సగటున రూ. కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా ఖర్చవుతున్నదని ఓ అంచనా. ఒక బిడ్డను సెటిల్ చేయాలంటే జీవితాన్ని పణంగా పెట్టాల్సిందేనని భావిస్తున్నారు. ఖర్చులకు వెరసి. నార్మల్ డెలివరీ జరిగితే ఓకే! కానీ, సిజేరియన్ అయినా, నెలలు నిండకుండానే కాన్పు వచ్చినా బిల్లు తడిసి మోపెడవుతున్నది. తల్లికి ప్రసూతి సెలవులు అయిపోగానే పాపను డే కేర్ సెంటర్లో చేర్చేందుకు మళ్లీ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఆ తర్వాత స్కూల్లో అనేదిలక్షల్లో చదివించు కోవడమే. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో చేర్పించా రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చుపెట్టాలి. ఇలా లక్షలతో కూడుకున్న చదు వును పిల్లలకు అందించాలంటే ఈ రోజుల్లో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎంత ఉన్నతో -- ద్యోగం చేస్తున్నా ప్రైవేట్ కొలువు రాత్రికి రాత్రి ఊడిపోవచ్చన్న బెంగ వారిని మరింత కంగారు పెడుతున్నది. ఇలాంటి ఆలోచనల్లో నుంచే పిల్లలు వద్దనుకొని డింక్ లైఫ్సల్కు మారిపోతు న్నారు కొందరు. అమ్మకు అదనం. 'డింగ్' పై మనసు పారేసుకోవడానికి అమ్మాయిలు చెప్తున్న కారణాలు ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. మన దేశంలో పేరెంటింగ్ అనేది అమ్మ బాధ్యతే అని చాలామంది భావన. ఈ పోవడంతో.. పెద్దల అండాదండా కరువైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులే పిల్లలను చూసుకో తరుణంలో తల్లిగా ఇంటిని, పిల్లలను బ్యాలెన్స్ చేయాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఊసే లేక వాల్సి వస్తున్నది. ఇద్దరిలో అమ్మ నెత్తిన అదనపు బాధ్యతలు పడుతున్నాయి. తన ఉద్యోగాన్ని వదులుకొని పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి ఈ తరం ఆడవాళ్లు సిద్ధంగా ఉండటం ^ పెంపకం కోసం 30 ఏండ్లకే ఉద్యోగాలను వదిలేసుకుంటున్నారట. ఒకవేళ తిరిగి ఉద్యోగంలో చేరితే కనీసం నాలుగు నెలలైనా తిరక్కుండానే రిజైన్ చేస్తున్న మహిళా ఉద్యోగుల సంఖ్య 48 శాతంగా ఉన్నదట. ఆ పాపం మాకెందుకు? పిల్లల్ని కని పెంచే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, వ్యక్తిగతంగా లైఫ్ మిస్ అవుతామన్న భ్రమల్లో కొందరు ఉంటున్నారు. అందుకే ఒత్తిళ్లతో కూడిన జీవితం తమకు వద్దని డింక్ లైఫ్ స్టైల్ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్ వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. డింక్ కపుల్స్ పిల్లలు వద్దనుకోవడానికి మరో పెద్ద కారణం.. జనాభా పెరిగిపోవటం, పర్యావరణానికి ముప్పేనట. ఆధునిక ప్రపంచంలో ఆహార కొరత వెన్నాడుతున్నది. నీళ్ల కొరత ఉండనే ఉంది. స్వచ్ఛమైన గాలి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కల్తీ లేని ఆహారం కాసులు పోసి కొందామన్నా దొరకని దుస్థితి. ఇలాంటి సమస్యల మధ్యకు మళ్లీ మేం పిల్లల్ని కని తీసుకురావటం కన్నా పాప కార్యం లేదని యువ జంటలు ఆలోచిస్తున్నాయి. అంతేకాదు, తాము పిల్లల్ని వద్దనుకోగా.. 'పిల్లల్ని కనకండి' అని ప్రచారం చేస్తున్నారు. వీళ్లను యాంటీ నేటలిస్టులుగా పిలుస్తుంటారు. వీళ్లు చెప్పే మాట ఏంటంటే.. 'త ల్లిదండ్రులు కావాలనుకుంటే మీరే పిల్లల్ని కనాల్సిన పనిలేదు. దేశంలో అనాథ పిల్లలకేం కొరత లేదు. వాళ్లను దత్తత తీసుకొని వారికి జీవితం ఇవ్వండి' అని చెబుతున్నారు. కానీ, యువశక్తే భారత్కు బలం. ఆ యువతే పిల్లల్ని కనడానికి ఇష్టపడని పరిస్థితి. ఇదే ట్రెండ్ కొన సాగితే మరో 30 ఏండ్లనాటికి దేశ జనాభా పూర్తిగా తగ్గిపోతుంది. వృద్ధ భారతంతో అభివృద్ధి కుంటుపడుతుంది. డింక్ ఉచ్చులో చిక్కుకోకుండా ఉన్నంతలో ఉన్నతంగా బతకడం అల వాటు చేసుకుంటే పిల్లలను కనడం, పోషించడం పెద్ద కష్టమేం కాదు! --- అందరికీ ఒకేలా పారదు. ఇన్వెస్ట్మెంట్ అనగానే.. లాభాలను ఊహిస్తారు. ఇందుకోసం ఆర్థికవేత్తలు సూచించిన ఫార్ములాలను పాటిస్తారు. వయసు ఎంత ఉంటే అంత డెట్లో దాచాలనీ, వందలోంచి వయసు తీసే యగా వచ్చిన మొత్తం ఈక్విటీలో పెట్టాలనీ ఫిక్సయిపోతారు. కొంద రేమో.. నికర ఆస్తిలో ఇంత మొత్తం పెట్టుబడిగా పక్కన పెట్టాలని భావి స్తారు. కానీ, పర్పస్ లేకుండా ఇన్వెస్ట్ చేసే డబ్బులు అవసరానికి అక్కరకు రాకుండా పోతాయని గుర్తెరగాలి. పేరుమోసిన ఆర్థికవేత్తలు సూచించిన విధానాలు కూడా సర్వజనీనం, సర్వ కాలీనం కాదని గుర్తుంచుకోవాలి. ప్రమోద్, ప్రణీత్ పరిస్థితులు దీనిని తేటతెల్లం చేస్తాయి. ప్రమోద్ ఎగువ మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇద్దరికీ పెన్షన్ వస్తుంది. ఊళ్లో సొంతింట్లో ఉంటారు. అక్కడ పొలం చూసుకుంటూ.. శేష జీవితం హాయిగా గడుపుతున్నారు. తల్లిదండ్రుల బాధ్యత ప్రమోదు లేదు. నెలకు ఒకసారి ఫ్యామిలీతో ఊరికి వెళ్తాడు. రెండు రోజులు సరదాగా గడిపి తిరుగు ప్రయాణం అవుతాడు. అతగాడి నెల వేతనం రూ.80 వేలు. భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమెకు నెలకు రూ.80 వేలు వస్తుంది. హైదరాబాద్లో ఫ్లాట్ కొటంటే.. పాతిక లక్షలు తల్లిదండ్రులు సర్దుబాటు చేశారు. మరో రూ.40 3 లక్షల లోన్ తీసుకున్నాడు. భార్య, తన సేవింగ్స్లో రిజిస్ట్రేషన్, వుడ్వర్క్ చేయించాడు. ఇద్దరి జీతంలో పావువంతు ఈఎమ్ఐస్ఐ చెల్లిస్తున్నాడు ప్రమోద్. ఇక ప్రణీత్ విషయానికి వద్దాం! అతనూ ప్రమోద్ పనిచేసే సంస్థలోనే ఉద్యోగి. జీతం నెలకు రూ.90 వేలు. భార్య చిన్న ఉద్యోగం చేస్తుంది. ఆమెకు రూ.30 వేల వరకు వస్తాయి. ప్రణీత్ తల్లిదండ్రులు కొడుకుతోపాటే ఉంటారు. వయసు పైబడటంతో ఇద్దరికీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. పైగా అతని తండ్రి ప్రైవేట్ సంస్థలో గుమాస్తాగా పనిచేసి రిటైర్ కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులకు అతని సంపాదన అంతంత మాత్రంగా -- సరిపోయేది. వెనక వేసిందేమీ లేదు. పైగా చెల్లెలు పెండ్లి బాధ్యత ప్రణీతే! ఉద్యోగం చేస్తున్న చెల్లి సంపాదనను ఆమె పేరిట జాగ్రత్త చేసేవాడు. ప్రణీత్ దంపతుల సంపాదన ఇంటి వ్యవ హారాలు, ఇద్దరి పిల్లల చదువులకు సరిపోయేది! చిన్నాచితకా చీటీలు, పాలసీలు గట్రా మినహా పెద్దగా ఇన్వెస్ట్ చేసేందుకు కూడా అతని దగ్గర ఏం లేవు. ఈ ఇద్దరూ ఒకే వయసు వారు. సంపాదన విషయంలోనూ ఇద్దరిదీ ఒకే రేంజ్. కానీ, ప్రమోద్ తన జీతంలో పాతిక శాతం రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. తండ్రి సపోర్ట్ ఊళ్లో పొలంలో పామాయిల్ తోట వేశాడు. భార్య పేరిట గోల్డ్ స్కీమ్ కడుతున్నాడు. ఆడంబ రాలకు పోకుండా, అదే సమయంలో కక్కుర్తి పడకుండా... పొదుపు, మదుపు చేస్తూనే జీవి తాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రమోద్ లీడ్ చేస్తున్న జీవితం ప్రణీతకు సాధ్యం అవుతుందా! ఆర్థికవేత్తలు సూచించిన ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాలు ఇద్దరికీ ఒకేలా వర్తించవు కదా ! కేవలం మనిషి ఆదాయం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ముందుకుసాగవు. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి మార్గాలు అన్వేషించాలి. చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పడం లేదు. మనకు తాహతు లేదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండొద్దు. రాబడి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా కన్నవారి అండదండలు లభించడం, సంపాదన స్థిరంగా ఉండటం మంచిదే! కానీ, ఇలాంటి వ్యక్తులు తాము ఏం చేసినా చెల్లుతుందనే వైఖ రితో ఉంటే ప్రమాదం. ఎందుకంటే.. లేని హెచ్చులకు పోయి బొక్కబోర్లాపడ్డ కుటుంబాలు ఎన్నో! ఎందుకు.. ఎక్కడ? జీవితం సాఫీగా సాగాలంటే.. ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సిందే! అది ఎందుకు చేస్తున్నా మన్న లక్ష్యం ఉండాలి. ఎక్కడ చేయాలో విజ్ఞతతో ఆలోచించాలి. కూతురు ఉంటే.. బంగా రంపై ఇన్వెస్ట్ చేయాలి. బిస్కెట్ బంగారం కొని.. బీరువా లాకర్లో పెట్టడం సరికాదు! చిన్నదో పెద్దదో నగ చేయించి.. మీ కూతురికి బహుమానం చేయండి. అది ధరించినప్పుడు మీ బిడ్డ కండ్లలో కనిపించే ఆనందం మీ పెట్టుబడికి పదింతల లాభాన్ని ఇచ్చిన అనుభూతిని కలిగి స్తుంది. అదే కూతురును డాక్టర్ చదివించాలని భావించారు అనుకుందాం. మొదటి బర్త్ డే నుంచి తనకు పదహారో పుట్టిన రోజు దాకా.. ఏటా తులం బంగారం కొని దాచారే అను కుందాం! అప్పటికి పదహారు తులాలకు చేరుతుంది. అప్పుడు ఎంబీబీఎస్ ఫీజుకు ఏమైనా డబ్బు తక్కువైతే.. ఈ బంగారం కుదువ పెడితే, మీ బిడ్డ చదువుకు ఆటంకం తొలగిపోతుంది కదా! బంగారం కాకుండా.. ఓ స్థలం తీసుకున్నారే అనుకుందాం. మీ బిడ్డకు 24వ ఏట పెండ్లి చేయాలని భావించారు. ముహూర్తాలు పెట్టుకున్నాక.. ప్లాట్ అమ్మకానికి పెడితే అడ్డెకు పావు పేరు వస్తుంది. ఏడాది ముందునుంచే మార్కెట్లో బేరసారాలు సాగిస్తే.. మంచి లాభాలు వస్తాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈక్విటీ షేర్లు అయినా.. ఎప్పటికి, ఎందుకు అవసరమో స్పష్టత వచ్చాకే ఇన్వెస్ట్ చేయండి. -- కష్టాలు కొనితెచ్చుకోవద్దు. ఊరి పొలిమేరలో ఓ స్థలం. అక్కడ గడ్డి కోస్తూ కనిపించాడో వ్యక్తి. 'ఇ క్కడ గడ్డి కోస్తున్నావూ, ఎవరు నువ్వూ?! అంటే.. 'నా జాగాలో నేను ఏంచేస్తే మీకేం..' అని సమా ధానం ఇచ్చాడా వ్యక్తి. అది విన్న ఆ ఎన్నారైకి గుండె ఆగినంత పని అయింది. తర్వాత ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఏడాది క్రితం కొన్న స్థలం వైపు తాను అసలే రాక పోవటం, తన స్థలం పరాయి పరమైందని అర్థమైంది! విదేశాల్లో స్థిరపడినవారు భారతీయులు ఇక్కడ స్థిర ఆస్తులు కొనడం అనేది రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఎన్నారైలు భారతదేశంలో సాయ భూములు, ప్లాంటేషన్ ల్యాండ్, ఫాంహౌస్లు కొనాలా? వద్దా? అనే విష యమై చాలా మందికి సందేహాలున్నాయి. కానీ సింహభాగం ఎన్నారైలు ఈ విష యంలో సరైన వ్యక్తుల సలహాలు తీసుకోకుండా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటారు. . ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం విదేశాల్లో స్థిరపడినవారు భారతదే శంలో వ్యవసాయ భూములు, ప్లాంటేషన్ ల్యాండ్, ఫాంహౌస్లు కొనవద్దు. ఎన్నారై కొనుకో వచ్చనీ, ఓసీఐ మాత్రమే కొనకూడదనీ వాదిస్తారు. కానీ ఈ వాదనలో నిజం లేదు. అలా కొనపక్షంలో ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ట్రాన్సాక్షన్స్ మీద పెనాల్టీ మూడు రెట్లు వేస్తారు. ఎన్నారైలు భారతదేశంలో రియల్ ఎస్టేట్పై దృష్టి సారించినప్పుడు.. కమర్షియల్ ప్రాపర్టీస్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొంటారు. ఇంకా చెప్పాలంటే విల్లాలు ఎక్కువగా కొంటారు. కానీ, స్థలం తప్ప మరేదైనా కొనుక్కోవడం ఉత్తమం. కొన్ని అంచనాల ప్రకారం చూస్తే ఈ రోజుల్లో చూస్తే న్యాయపరమైన సమస్యలన్నీ ఎన్నారైల స్థలాలవే అయి ఉంటున్నాయి. మీకు స్థలం అమ్మిన వ్యక్తి, మధ్యవర్తి మంచివాళ్లే కావొచ్చు. కానీ మీరేమో విదేశాల్లో ఉంటున్నారు. ఈ -- స్థలానికి రక్షణగా ఉండేదెవరు? కొనడమే కాదు దాన్ని కాపాడుకోవడానికీ సమయం కావాలి కదా?! అలాగనీ, ఇప్పుడు స్థలాలేవో కబ్జాకు గురవుతాయని కాదు. రెగ్యులేటివ్ బాగానే ఉంది. స్థలం కొంటే వచ్చే లాభం ఎంత? ఆరేండ్ల దాకా రెట్టింపు అయ్యే పరిస్థితి లేదు. ఆరేండ్ల లోపు పెరిగే ధరలు ప్రామాణికం కానేకాదు. అదే ఆరేండ్లకు రెట్టింపు ధర పలికినా, 'రూల్ ఆఫ్ 72' ప్రకారం.. 12 శాతం వచ్చినట్టు కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రియల్ ఎస్టేట్, బ్యాంకర్, ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, ముందు సీఏను కలవాలి. విషయం ఏమిటంటే.. ఏదో ప్రాపర్టీ కొనడానికి ఇండియాకు వచ్చీ రాగానే కలవాల్సింది . అపార్ట్మెంట్ అయితే.. దానికి బదులు ఎక్కడ అపార్ట్మెంట్ కొన్నా, ఎంత పాతదిగా మారుతున్నా వచ్చే నష్టమేమీ ఉండదు. ప్రతి పదేండ్లకి దాని విలువ రెట్టింపు అవుతుంది. మీరు కొన్న అపార్ట్మెంట్కి సంవ త్సరానికి 3 శాతం దాకా అద్దె వస్తుంది. ఉదాహరణకు కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొంటే నెలకు రూ.25 వేలు అద్దె వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి 3 లక్షలు అన్నమాట. అదే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నది కొంటే.. అక్కడ లీగల్ ఇష్యూస్ అసలే ఉండవు. ఈరోజుల్లో ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి. వీరి సహాయం తీసుకుంటే ఇంకా టెన్షన్ ఉండదు. 5 నుంచి 9 శాతం వరకు చార్జీ చేస్తారు. మొత్తం వాళ్లే చూసుకుంటారు. మీరు ఎక్కడున్నా డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. విల్లాతో విలవిల.. విల్లా డిఫరెంట్ కాన్సెప్ట్. ఎంత కమ్యూనిటీ విల్లా అయినా అద్దె తక్కువగానే వస్తుంది. ఓ ఏరి యాలో మార్కెట్ విలువ 12 కోట్లు ఉన్న విల్లాను.. దాని యజమాని నెలకు లక్ష చొప్పున అద్దెకు ఇచ్చాడు. అంటే, కోటి రూపాయలు పెట్టుబడి పెడితే.. ఏడాదికి 12 లక్షలు (1 శాతం) మాత్రమే వస్తున్నది కదా. దీన్నిబట్టి ఏం తెలుస్తున్నది.. విదేశాల్లో ఉన్నవారు వచ్చి ఉండాలను కున్నప్పుడే ఇక్కడ విల్లా కొనుక్కోవాలి తప్ప, లాభాల కోణంలో దాని గురించి ఆలోచన చేయొద్దు. కమర్షియల్ ప్రాపర్టీ అయితే మాత్రం కొంచెం అద్దె ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అది వేరే విషయం. ఎన్నారై స్టేటస్లో కొంటే 30 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది ప్రవాస భారతీయులు ఇంకా ఇండియన్ సేవింగ్స్ అకౌంట్నే కొనసాగిస్తున్నారు. దాన్ని ఎన్ఆర్వో స్టేటస్లోకి మార్చుకోలేదు. ఇది చాలా తప్పు. సేవింగ్స్ అకౌంట్స్ నుంచే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నవారూ ఉన్నారు. అలాంటివి భవిష్యత్తు క్రయవిక్రయాలు జరపటం చాలా కష్టమవుతుంది. మొత్తమ్మీద.. ప్రవాసులు స్వదేశంలో ప్రాపర్టీ కొనాలను కుంటే బలమైన కారణమైతే ఉండాలి. -- ఖర్చులు తగ్గొద్దు.. రాబడి ఆగొద్దు! ఖర్చులు తగ్గించుకుంటే లక్షాధి కారులం అయిపోతామనే భ్రమలో ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. అయితే, అనివార్య ఖర్చులకు కళ్లెం వేయడం పొదుపు అనిపించుకోదు. దుబారా ఎంత ప్రమాదమో... బలవంతంగా వ్యయాన్ని కట్టడి చేయాలనుకోవడమూ అంతే నష్టం కూడా! రూపాయి వచ్చేందుకు మార్గాలు అన్వేషించాలే కానీ, రూపాయి పోయే దారులు మూసేయొద్దు. పోదుపుగా బతకడం అంటే.. పిసినారితనాన్ని పెంచి పోషించడమనే అను కుంటారు చాలామంది. కానీ, పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదు పాజ్ఞల్లో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ తేడా తెలియక మధ్యతరగతి భారతం అంతా ఆశలను చంపుకొని భారంగా బతుకీడుస్తున్నది. ఇందుకు ఉదాహరణే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన శివరామ్ జీవితం. ఆయన భార్య సులోచన గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఒకటో తారీఖునే జీతం వచ్చేది. పల్లెటూర్లో నివాసం. సొంతూళ్లో నాలుగెకరాల పొలం. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు. ఊరి నుంచి బియ్యం వచ్చేవి. పల్లెలో అగ్గువకు పాలు దొరికేవి. ఒక కుటుంబం రిచ్గా బతకడానికి ఇంతకన్నా ఏం కావాలి! మూడు పూటలా మృష్టాన్న భోజనం చేయగలిగే శక్తి ఉన్నా... పచ్చడి మెతుకులే పరమాన్నంగా భావించేవాళ్లు. పండుగలో పంపాలలో తప్ప ఆ ఇంట్లో పప్పు ఉండేది కాదు ఇలా ఇంటిళ్లపాది కడుపు కట్టుకొని బాగానే కూడా పెట్టారు.ఏండ్లు గడిచాయి పిల్లలకు 30 ఏళ్లు వచ్చేసరికి రకరకాల రుగ్మతలు మొదలయ్యాయి. సరైన పోషకాహారం లేక తరచూ అనారోగ్యం పాలవడంలో,ఆ ఇంట ఇప్పుడు రివాజు,ఏళ్ళు తరబడి పోగుచేసుకున్న సొమ్మంతా వైద్యానికి చెల్లిస్తూ ఖర్చులను నియంత్రించలేకపోతున్నానే అని నేటికీ బాధపడుతుంటాడు శివరామ్. -- ఎప్పుడూ ఉండేవే.. మన సమాజంలో శివరామ్ లాంటివాళ్లు ఎందరో కనిపిస్తారు. ఖర్చులకు భయపడటం మానవ నైజం అనిపించుకోదు. ఖర్చులు ఎప్పుడూ ఉండేవే! అందుకు తగ్గ ఆర్థిక వనరులు | సమకూర్చుకోవడమే నిజమైన మనిషి లక్షణం అనిపించుకుంటుంది. ఉదాహరణకు ఒక టుంబం రోజుకు లీటరు పాలు కొనుగోలు చేస్తుంది. ఖర్చుల నియంత్రణ పేరుతో అర లీట రకు పరిమితమైంది. అంతకన్నా తగ్గించుకుందామంటే కుదరదు. పాల కోట సగమయ్యేస రికి.. పిల్లలకు పోసే వాటిలో నీళ్లు వచ్చి చేరుతాయి. మంది ఎక్కువ కాకుండానే మజ్జిగ పల్చగా మారుతుంది. కానీ, నెలకు అదనంగా రూ. 900 సంపాదించగలితే.. లీటరు పాలు కొనసాగిం చొచ్చు. పిల్లలకు గ్లాసు నిండుగా చిక్కటి పాలు ఇవ్వొచ్చు. గడ్డ పెరుగు కాకపోయినా.. చిక్కటి మజ్జిగ అందించవచ్చు. సంపాదన ఎక్కువగా ఉందని లీటరు పాలు తీసుకునే చోట రెండు నర లీటర్లు తీసుకుంటామంటే దుబారా చేసినట్టు అవుతుంది. అవసరాలకు లోటు రాకుండా చూసుకోవాలి, అదే సమయంలో అనవసరమైన ఖర్చులను పరిహరించుకోవాలి. ఛిన్నాభిన్నం చేసుకోవద్దు.. ఖర్చు అన్న కనీస అవగాహన అవసరం. నాణ్యమైన వెచ్చాలు, తాజా కూరగాయలు, పండ్లు కాస్త ధర ఎక్కువున్నా తీసుకోవాలి. దానివల్ల ఇంట్లోవాళ్లకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది. అదే సమయంలో పిజ్జాలు, బర్గర్ల దగ్గర ఇదే సూత్రం పాటిస్తానంటే కుదరదు. ఇంట్లో ఓ వేడుక ఉంది. మీ శక్తిమేరకు అతిథులను పిలవడం మంచిది. అంతేకానీ, మరపురాని వేడుక అనుకొని అప్పుచేసి మరీ వందల్లో అతిథులను పిలిచి మీ ఆర్థికస్థితిని ఛిన్నాభిన్నం చేసుకోవడం క్షమించరాని తప్పిదమే అవుతుంది. ఒక్కగానొక్క కూతురు. ఆమె పెండ్లి గ్రాండ్గా చేయాలనుకోవడంలో తప్పు లేదు. అందుకు పదేండ్ల ముందు నుంచే ప్రణా ళిక సిద్ధం చేసుకోవాలి. మీ ఆదాయంలో కొంత భాగం జాగ్రత్త చేయాలి. ఆ మొత్తంతో వీలై నంత ఘనంగా పెండ్లి చేయాలి. అంతేకానీ, అందినకాడికి అప్పులు చేసి అంగరంగ వైభవంగా పెండ్లి చేశామని జబ్బలు చరుచుకుంటే ఎవరికి నష్టం!! ఆదాయం పెంచుకుందాం.. ఊరు దాటను, ఉద్యోగం మారను అంటే ఆదాయం వీసమెత్తు పెరగదు. 'ధైర్యే సాహసే లక్ష్మి' అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఉద్యోగంలో పురోగతికి అవసరమైతే పురం మారాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. సమయోచితంగా సంస్థలు మారాలి. సంపాదన పెంచుకోవడంపై దృష్టి సారించాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పొదుపు, మదుపు మంత్రాలు పఠించాలి. అంతేకానీ, బుజ్జిబాబు డైపర్స్ దగ్గర, పిల్లాడి స్కూల్ ఫీజ్ దగ్గర, ఆహారం విషయంలో కక్కుర్తిపడి ఖర్చు తగ్గించుకున్నాం అనుకున్నంత మాత్రాన మీ రాబడి పెరగదని గుర్తుంచుకోండి!! -- ఆ ఖాతాలు ఖర్చయిపోతాయ్. 'మావాడు అమెరికా డాలర్లు పంపి స్తున్నాడు..' అని భారత్లో ఉన్న ఓ తండ్రి గొప్పలు చెప్పుకోవడం మామూలే! 'మా అమ్మాయి యూరోలు పంపిస్తుంటే.. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను' అని ఆ పిల్ల తండ్రి భవిష్యత్తుకు బాటలు పరుస్తుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. దేశం కానీ దేశంలో కష్టపడి సంపాదించిన సొమ్ము సద్వినియోగం అయితేనే కదా.. ఫలితం! కానీ, ఈ సొమ్ము భారత్కు ఎలా వస్తుందన్నది ప్రశ్న. ఎన్నారైలుగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు భారత్లో అదే పల్లెటూరి బ్యాంకులో ఉన్న సేవింగ్స్ అకౌంట్ కు డబ్బులు పంపొచ్చా? ఆ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ లాంటివాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం... కాదు.. వీలు పడదు.. సమస్యాత్మకం అని చెప్పక తప్పదు! విదేశాల్లో ఒళ్లు విరగ కష్టపడి సంపాదించిన సొత్తును సేవింగ్స్ ఖాతాలోకి మళ్లించడం ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది. ప్రతి పైసాకూ లెక్కున్నట్టే.. ప్రతి ఖాతాకూ షరతులు వర్తి స్తాయి. భారత్లో ఉన్నప్పుడు తెరిచిన ఖాతానే.. విదేశాల నుంచి కొనసాగిస్తానంటే ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజ్ మేనెజ్మెంట్ యాక్ట్) ఒప్పుకోదు. విదేశాల్లో సంపాదించింది డాలర్లు అయినా యూరోలు అయినా, మరే రూపంలో అయినా.. వాటిని భారత్లో దాచుకోవడానికి నిబంధనలు పాటించాలి. అవి తెలియక సేవింగ్స్ ఖాతాను విచ్చలవిడిగా వాడితే ఐటీ ఉచ్చు బిగుసుకోవచ్చు. ఆర్బీఐ నుంచి తాకీదులూ రావొచ్చు. అప్గ్రేడ్ చేసుకోండి.. ఎన్ఆర్ఐలకు బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఆర్బీఐ ప్రత్యేకమైన వెసులుబాటు కల్పి కాశం ఇచ్చింది. ఎన్ఆర్వో - నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్, ఎన్ఆర్ఆ- నాన్ రెసిడెంట్ చింది. వారికోసం ఎన్ఆర్తో, ఎన్ఆర్డస్ఈ, ఎఫ్సీఎస్ఆర్ఆ వంటి ఖాతాలు తెరుచుకునే అవ ఎక్స్టర్నల్ ఖాతా, ఎఫ్సీఎన్ఆర్- ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ ఖాతాలు ఎన్ఆర్ఐ -- సేవల కోసం ఏర్పాటుచేసినవే! వీటి ద్వారా విదేశాల్లో సంపాదించే మొత్తాన్ని ఇండియాలో ఉన్న ఖాతాల్లో పొదుపు చేసుకోవచ్చు. ఆర్డినరీ అకౌంట్ విషయానికి వస్తే.. ఈ ఖాతాకు సంబంధించి లావాదేవీల్లో కొన్ని పరిమితులు ఉంటాయి. రోజువారీగా ఎంత వేయాలో, ఎంత తీయాలో బ్యాంకు షరతులకు లోబడి ఉంటాయి. ఒకరకంగా దీనిని సాధారణ సేవింగ్స్ ఖాతాగా పరిగణించాలి. విదేశాల్లో ఉండి.. భారత్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టా లన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎస్ఐపీ లాంటి ఆప్షన్స్ ఎంచుకోవా లన్నా.. ఎన్ఆర్ఈ ఖాతా కలిగి ఉండాలి. ఇక అదేరూపంలో భారతీయ బ్యాంకులో పొదుపు చేయాలన్నా, వాటిని అదే లో మరెక్కడైనా ఇన్వెస్ట్ చేయదలచుకున్నా.. ఎఫ్సీఎస్ఆర్ ఖాతాను ఎంచుకోవాలి. అప్పుడే మీరు కష్టపడి సంపాదించే సొమ్ము చట్ట సమ్మతం అవుతుంది. అందుకే, ఎన్ఆర్ఐ హోదా పొందగానే మీ ఖాతా ఉన్న బ్యాంకుకు సమాచారం అందించి, వాటిని ఎన్ఆర్ఆ, ఎన్ ఆ అకౌంట్లుగా అప్గ్రేడ్ చేయమని కోరండి. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పంపండి. ఎవరు అడుగుతారులే అని పాత సేవింగ్స్ ఖాతా నుంచే వ్యవహారాల్ని చేస్తానంటే మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, మీ చిట్టా అంతా పంప మని ఐటీ నిలదీసే వరకూ వెళ్లొచ్చు. అలాగైతే చట్ట సమ్మతం.. ఎన్ఆర్ఎస్ఐ ఖాతాలకూ వడ్డీ సూత్రం వర్తిస్తుంది. మీ నిల్వలకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. ఒక వేళ కొన్నేండ్ల తర్వాత మీరు ఎన్ఆర్ఐ హోదా వదులుకుని, స్వదేశానికి వచ్చిన తర్వాత ఎన్ ఆర్ అకౌంట్లను ఆర్ఎఫ్సీ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఖాతాలో ఉండే మీ డాలర్లను, యూరోలను రూపాయలుగా మారకం చేసి లావాదేవీలు కొనసాగించే వీలు ఉంటుంది. ఈ ఎన్ఆర్ ఖాతాలను జాయింట్గానూ ఓపెన్ చేయొచ్చు. పార్టనర్ ఖాతా దారుడికి పూర్తిస్థాయి లావాదేవీల హక్కులు ఉండవు. ఏతావాతా విషయమేంటంటే.. కష్టపడి చదివి, విదేశాలకు వెళ్లింది.. ఊహించనంత సంపాదించడానికే! అక్కడ వేతన రూపంలో వచ్చే దంతా ప్యూర్వైట్ మనీ. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా మీరు దర్జాగా ఖాతాలో వేసుకున్న సొమ్ము చట్ట సమ్మతం కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే, ఫెమా నిబంధనలు తెలుసుకొని, బ్యాంకు అధికారులను సంప్రదించి.. ఎన్ఆర్ఎస్ఐ ఖాతాలను చట్టబద్ధంగా నిర్వహించుకుంటే ఎవరికీ ఏ సమస్యా రాదు! --- అపార్ట్మెంట్ లో ఫ్లాట్ విలువ.. అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలా.. ఇండిపెండెంట్ ఇల్లు కొనాలా.. రెండూ కాదు ఓపెన్ స్థలం కొనాలా..ఇల్లు కొనే ఆలోచన ఉన్న వారింట్లో ఇదే చర్చ. అపార్ట్మెం ట్లో ఫ్లాట్ కొంటే పదేండ్ల తర్వాత పెట్టిన ధర రాదని కొందరి ఉవాచ. కాలంతోపాటు అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు నేల చూపులు చూస్తాయన్న వాదనలో ఎంత నిజముంది? సుందరం మాస్టారు కథ చదివితే, అసలు విషయం బోధపడుతుంది! సుందరం మాస్టారు 1993లో పదవి విరమణ చేశాడు. గ్రాడ్యుటీ మొత్తం, అన్నాళ్లూ ఆయన పొదుపు చేసిన సొమ్ము అన్నీ లెక్క చూసుకుంటే రూ.3 లక్షలు అయ్యాయి. ఒక లక్ష కూతురు పెండ్లికి ఖర్చు చేశాడు. రూ.50 వేలు కొడుకు పై చదువులకు దాచాడు. భార్య పేరిట రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మిగిలిన లక్ష రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. దాన్ని రూ.450కి అద్దెకు ఇచ్చాడు, కొన్నాళ్లకు ఆయన కాలం చేశారు. పదేండ్లలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దె పెరుగుతూ పెరుగుతూ రూ.1,200కు చేరింది. మాస్టారు కొడుకు శ్రీనివాస్ ఆ ఫ్లాట్లోకి మకాం మార్చాడు. మరో ఇరవై ఏండ్లు గడిచాయి. ఒకరోజు శ్రీనివాస్ తల్లితో వాదులా దిగాడు. 'నాన్న ఆ రోజుల్లో లక్ష పెట్టి ఎక్కడైనా ఓ స్థలం కొనుంటే.... ఇప్పుడు కోటి రూపాయలకు తక్కువ వచ్చేవి కావు. ఈ అపార్టుమెంటు తీసుకు న్నాడు. ఇప్పుడు చూడు ఇది పాడుబడిపోయింది. అమ్ముదామంటే కొనేవాడు . లేడు. అపార్టుమెంట్వాసులంతా దీన్ని పునర్నిర్మించాలని తీర్మానించారు. రూ.20 లక్షలు కడితే తప్ప.. మనకు కొత్త ఫ్లాట్ రాదట' అని ఊగిపోతున్నాడు. ఈ మాటలు పక్కింట్లో ఉన్న సుందరం మాస్టారు శిష్యుడు రాజు చెవిన పడ్డాయి. తన మాస్టారి నిర్ణయాన్ని తప్పుబడుతున్న శ్రీనివాస్ ఒంటరిగా మాట్లాడాలని ఫిక్సయ్యాడు. ఆరోజు సాయంత్రం అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో వాకింగ్ చేస్తున్న శ్రీనివాస్ను పలక - రించాడు. 'వారం నుంచి గమనిస్తున్నాను మీ ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది' నవ్వి... 'మన అపార్ట్మెంట్ మొత్తం పడగొట్టి.. రెండేండ్లలో కొత్త ప్లాట్ ఇస్తే మంచిదేగా!' అన్నాడు. 'ఏ మంచి.. రూ.20 లక్షలు కట్టాలి కదా!' అన్నాడు. అప్పుడు రాజు 'మన ఏరి యాలో కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖరీదు ఎంత ఉంటుందో చెప్పగలరా?' అని ప్రశ్నిం రూ.75 లక్షలకు పైమాటే' అన్నాడు. 'బిల్డర్ మిమ్మల్ని రూ.20 లక్షలు ఇస్తే కొత్త ఫ్లాట్ కట్టిస్తున్నాడుగా! మీకు రూ.55 లక్షలు లాభమే కదా! అంటే మీ నాన్నగారు ముప్పయ్ ఏండ్ల కిందట పెట్టిన లక్ష రూపాయలు ఇప్పుడు రూ.55 లక్షలకు పెరిగిందన్నమాటే కదా! పైగా మీకు 1 ఇన్నాళ్లుగా మీకు నీడనిస్తూ, అద్దె భారం తప్పించింది కూడా! అద్దె కొంపలో అగచాట్లు మనకు అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీనివాస్ ఒక్క క్షణం ఆలోచనలోపడ్డాడు. 'ని జమేనండోయ్ ! నేను ఇలా ఆలోచించలేదు. నగర శివారులో కూడా కొత్త ఫ్లాట్ ధరలు రూ.50 లక్షలకు తక్కువ పలకడంలేదు. అలాంటిది రూ.20 లక్షలకే మళ్లీ నయా ప్లాట్ సిటీ మధ్యలో వస్తుంది' సంబురపడ్డాడు. అని అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనగానే కాలంతోపాటు విలువ తరిగిపోతుందని చాలామంది భావన. అదే ఓపెన్ స్థలమైతే అంచెలంచెలుగా పెరుగుతుందని బలంగా నమ్ముతారు. దీర్ఘకాలంలో ఓపెన్ స్థలాల విలువలు గమనిస్తే ఆరేండ్లకు ఒకసారి రెండింతలు అవుతాయి. అదే ఇండిపెం డెంట్ ఇంటి విలువ దీర్ఘకాలంలో దాదాపు ఎనిమిదేండ్లకు రెండింతలు అవుతుంది. అపార్ట్ మెంట్ ఫ్లాట్ విలువ దగ్గరికి వచ్చేసరికి పదేండ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంది. ఎంత పాతబ డిపోయినా దాని విలువ తగ్గదు. యాభై ఏండ్లు దాటితే.. అపార్ట్మెంట్ అసోసియేషన్ సమ ష్టిగా ఉండి మంచి బిల్డర్ను ఎంచుకుంటే కాణీ ఖర్చు లేకుండా కొత్త ఫ్లాట్ సొంతం చేసుకో వచ్చు. నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్ ధరలో మూడోవంతు ఇచ్చినా కొత్త ఫ్లాట్ మళ్లీ సొంతం అవుతుంది. అంతేకాదు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ గానీ, ఇండిపెండెంట్ ఇల్లు గానీ అద్దె భారాన్ని తగ్గిస్తుంది. అదే భూమి నుంచి నెలవారీగా ఎలాంటి ఆదాయమూ రాదు! పైగా భూమిని అమ్మగా వచ్చిన డబ్బు బ్లాక్ లోనే ఎక్కువగా ముడుతుంది. దాన్ని మీ ఖాతాలో చూపించలేరు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా దానిని మీరు అధికారికంగా వాడటం కష్టంతో కూడు కున్న పని. అదే మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మితే కొనుగోలుదారులు బ్యాంకు లోను ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అంటే అకౌంట్కు బదిలీ అవుతుంది. దానిని మీరు స్వేచ్ఛగా ఉపయోగిం చుకోవచ్చు. కానీ, స్థలాల విక్రయాల్లో ఇప్పటికీ చాలామంది బ్లాక్ మనీ లావాదేవీలే చేస్తుం డటం గమనార్హం! ఇక్కడ భూమిని కొనుగోలు చేయొద్దని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ, అపార్ట్ మెంట్ ఫ్లాట్ విలువ పడిపోతుంది అనడంలో పస లేదని సుందరం మాస్టారు కథ నిరూపి స్తుంది. అపార్ట్మెంట్లో స్థలం (అన్జివైడెడ్ షేర్) తక్కువగా వస్తుందని అందరూ భావిస్తుంటారు. కానీ, నిజానికి ఇక్కడ స్థలం ప్రస్తావన అప్రస్తుతం. అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎంతకు కొన్నారు, --- ఎంతకు అమ్ముతున్నారన్నదే ముఖ్యం. ఒక ఏరియాలో పాత అపార్ట్మెంట్ ప్లాట్ రూం లక్షలు విలువ చేస్తే, అదే ప్రాంతంలో కొత్తది రూ.80 లక్షలు పలుకుందని కొందరు లెక్కలు చెబుతారు. ఆ పోలిక కూడా సహేతుకం అనిపించుకోదు. పాతదాన్ని అప్పుడు మీరు కొను గోలు చేసిన ధరతో పోల్చిచూడాలే కానీ, కొత్తదాని ధరతో ఎలా కంపేర్ చేస్తారు? పదేండ్లు దాటిన అపార్ట్మెంట్ ప్లాట్సుకు బ్యాంకు లోను రాదనే అపోహ చాలామందిలో ఉంది. కానీ, అది తప్పు!! బ్యాంకు లోను అపార్ట్మెంట్ వయసును బట్టి ఉండదు. మార్కెట్ ధరలో 80శాతం లోను బ్యాంకులు ఎప్పుడైనా ఇస్తాయి. 66 24 ఏళ్లు పైబడినా.. 2000 సంవత్సరం ప్రాంతంలో కొత్తపేట, దిల్సుఖ్ నగర్, వారాసిగూడా తదితర ఏరియాల్లో రూ.5 లక్షలకు 1,000 చదరపు అడుగుల ఫ్లాట్ వచ్చేది. ఫ్లాట్ల విషయంలో డిప్రి సియేషన్ నిజమైతే.. ఇప్పుడు ఆ ఫ్లాట్ విలువ రూ.2.5 లక్షలకు పడిపోవాలి. కానీ, ఇప్పుడు అదే ఏరియాలో 20 ఏండ్లు పైబడిన ఫ్లాట్ విలువ రూ.35 లక్షలకు తక్కువ లేదు. కొత్త ఫ్లాట్ ధర రూ.75 లక్షలకు పైమాటే! ముప్పయ్ ఏళ్లు దాటినా.. అమీర్పేట్లోని కీర్తీ అపార్ట్మెంట్, లాల్బంగ్లా దగ్గర్లోని దివ్యశక్తి అపార్ట్మెంట్, సోమాజిగూడలోని క్రాంతి శిఖర అపార్ట్మెంట్ కట్టినప్పుడు రూ. లక్షకే అందులో ఫ్లాట్ తీసు కున్నారు. 35 ఏండ్లు గడిచిపోయాయి. ఫ్లాట్స్కు డిప్రిసియే 66 షన్ ఉండి ఉంటే ఇప్పుడు వాటి ధర వేలల్లో ఉండాలి. కానీ, ఇప్పటికిప్పుడు అమ్మకానికి పెడితే రూ.45 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ధర పలుకుతాయి. పైగా ఈ ఫ్లాట్స్ మీద సంవత్సరానికి రూ.3 లక్షల వరకు అద్దె వస్తుం డటం విశేషం. దీనిని బట్టి ఫ్లాట్ విలువ కాలంతోపాటు తగ్గుతుందన్న వాదనలో పసలేదని తేలిపోతుంది. -- మాకెందుకు అనుకోవద్దు.. 'ఆరోగ్య బీమానా!.. మాకెందుకు?' అని చాలామంది మహిళల అభి ప్రాయం. పెండ్లయ్యాక పెనిమిటి చూసుకుంటాడులే అని కొందరి భావన. కానీ, అలా ఆలోచించడం సరైనది కాదు. దీపిక కథ చదివితే ఈ తరం ఆడపిల్లలకు ఆరోగ్య బీమా ఎంత అవసరమో తెలుస్తుంది. దీపిక వయసు 27 ఏండ్లు. పెండ్లికి ముందు ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేది. నెలకు లక్షకుపైగా జీతం అందుకునేది. కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండటంతో ప్రత్యేకంగా మరో హెల్త్ పాలసీ తీసుకోలేదు. పైగా ఇంత చిన్న వయసులో తనకేం సమస్యలు వస్తాయనే ధీమాతో ఉండేది. అనుకో కుండా ఆమెకు పెండ్లి కుదిరింది. నెలలో ముహూర్తం ఫిక్సయింది. అత్తవా రింటి కోరిక మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసింది దీపిక. అంగరంగ వైభవంగా పెండ్లి జరిగింది. మూడేండ్లుగా కూడబెట్టిందంతా పెండ్లికి ఖర్చు చేసింది. రెండు లక్షల రూపాయల బ్యాంకు నిల్వతో అత్తవారింట అడుగుపెట్టింది. నెల తర్వాత దంపతులు ఇద్దరూ హనీమూన్ కు వెళ్లారు. వస్తుండగా ఓ ప్రమాదం. అందులో ఇద్దరికీ తీవ్రమైన గాయాలయ్యాయి. దీపిక భర్తకు ఆఫీస్ వారిచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ లభించింది. నెల రోజులే కావడంతో భార్య పేరు అందులో నమోదు చేయలేకపోయాడు. దీపిక ఉద్యోగం మానేయడంతో ఆమెకు ఆఫీస్ వారిచ్చిన బీమా చెల్ల కుండా పోయింది. ఆమె వైద్యానికయ్యే ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వచ్చింది. ఆ దంపతులు డిశ్చార్జ్ అయ్యేసరికి దీపిక బిల్లింగ్ చూసి ఆమె ఇంట్లోవాళ్లకు కండ్లు తిరిగినంత పనైంది. ఆదే దీపికకు ఆరోగ్య బీమా ఉండి ఉంటే.. ఏ సమస్యా వచ్చేది కాదు! --- ఉన్నది ఒకటే జిందగీ. సంపాదించడం తెలిసినవాళ్లకు ఖర్చు చేయడంపై కూడా అవగా హన ఉండాలి. లేకపోతే ఆనందం దక్కకుండా పోతుంది! పొదుపు, మదుపు చేసిన మొత్తం ముందుతరా లకు ఇచ్చేస్తే.. మీ తలరాతకు పరులు కూడా జాలిపడే పరిస్థితి వస్తుంది. జీవిత చరమాంకంలో అయినా, ఖుషీ చేయకపోతే ఎలా? ఉన్నది ఒక్కటే జిందగీ! మీ లైఫ్ సుఖాంతం కావాలంటే.. సంపాదించింది ప్లాన్డ్ గా ఖర్చు చేయడమే మార్గం! ప్రతి మనిషి జీవితం గందరగోళంగానే మొదలవుతుంది. తల్లి కడుపు నుంచి బయటపడగానే ఏడ్చేస్తాం. అది ప్రకృతి ధర్మం కాబట్టి... తెలియకపో యినా పాటిస్తాం. ఆకలి కాగానే తల్లిపాలు తాగుతాం. అది సృష్టివింత కాబట్టి.. తెలియకుండానే చేసేస్తాం. పెరిగి పెద్దయ్యేకొద్దీ మనలో ఆలోచనలు మొదలవు తాయి. చేయాల్సింది చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం. చేయకూడనివి చేయాలని తాపత్రయపడతాం. అలా తప్పుల మీద తప్పులు చేస్తూ పెరిగి పెద్ద వు. ఏళ్లొచ్చాక ఎక్కడ తప్పు చేసినా చెల్లుతుందేమో కానీ, ఆర్థిక విషయాల్లో పొరపాట్లకు తావిస్తే, జీవితం గ్రహపాటుగా మిగిలిపోతుంది. జీవితం అంతా కుటుంబం కోసం పనిచేసిన వ్యక్తులు.. తమకంటూ ఓ లైఫ్ ఉందని అర్థం. చేసుకోరు. అలా అర్థం చేసుకున్నవాళ్లు.. ఇదిగో ఈ పార్థసారథి గారిలా జిందగీని ముచ్చటగా ఎంజాయ్ చేస్తారు. అందుకు ఆయనేం కోట్లు ఖర్చు చేయలేదు. ఒక్కటంటే ఒక్క కోటి రూపా యలు పదిలం చేశాడు. పార్థసారథి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. అనుకూలవతి అయిన ఇల్లాలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లలను బాగా చదివించాడు. సర్వీసులో ఉన్నప్పుడే పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజినీర్, కూతురు, అల్లుడూ బ్యాంకులో పనిచేస్తారు. రెండేండ్ల కిందట రిటైర్ అయ్యాడు, శేష జీవితం మనవలు, మనవరాళ్లతో -- ఎంజాయ్ చేయాలని ఫిక్సయ్యాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపితే రూ. కోటి దాకా వచ్చాయి. ఈ మొత్తాన్ని ఏం చేయాలో పార్థసారథికి అర్థం కాలేదు. అప్పటికే ఇల్లు ఉంది. ఒకటి రెండు ఆస్తులున్నాయి. 'ఈ కోటి ఏం చేయాలంటూ?' నా సలహా అడిగారు. జీవితం అంతా కష్టపడిన ఆయన్ను ఈ కోటి రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?' అని అడిగాను. 'ఓc ఎస్' అన్నారు. ఈ కోటి రూపాయలను కరిగించకుండా.. యలూ హైబ్రిడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. ఏటా మే 1వ జీవితాన్ని ఎంజాయ్ చేసే మార్గం ఉందని చెప్పడంతో.. ఆశ్చర్యంగా చూశారు. ఆ కోటి రూపా తేదీన ఆ కోటిపై వచ్చే రిటర్న్స్ మొత్తాన్నీ రూపాయి మిగల్చకుండా విత్ డ్రా చేసి, ఖర్చు చేయా లనే షరతును ఆయన అంగీకరించారు. అలా ఏడాది (2023-24) తిరిగే సరికి ఆ కోటి రూపాయలపై అచ్చంగా రూ.30 లక్షల రిటర్న్స్ వచ్చింది (అన్నిసార్లూ ఇలా రూ.30 లక్షలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు తక్కువ రావొచ్చు, అసలేం రాకపోవచ్చు కూడా! అయినా ఈ సొమ్ము వెకేషన్ నిమిత్తం కాబట్టి రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు). అంత పెద్ద అమౌంట్ను ఏం చేయాలని మళ్లీ అడిగారు. ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ వెకేషన్కి వెళ్లమని చెప్పాను. కుటుంబంతో పదిరోజులు రెండు దేశాలు చుట్టొచ్చారు పార్థసా రథి. అప్పటికీ రూ.30 లక్షల్లో సగమే ఖర్చయ్యాయి. దీన్ని ఏం చేయమంటారు?' అని మళ్లీ సలహా కోరారు. 'కొడుకు, కోడలు, కూతురు, అల్లుడిని పిల్లలతో సహా డిన్నర్కు పిలిచి, ఇకపై నేను ఉన్నంత వరకు మీ పిల్లల చదువు ఖర్చు ఎంతైనా బాధ్యత నాదేనని' చెప్పమన్నాను! మార్కెట్ క్రాష్ అయినప్పుడు.. రిటర్న్స్ కొంత కోత పడుతుందేమో కానీ, ఆ కోటి పదికా లాల పాటూ అలాగే ఉంటుంది. తన పూర్తి పరివారంతో ఏడాదికి ఒక దేశం చుట్టేస్తూ జాయ్ పుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పార్థసారథి. మనవలు, మనవరాళ్లనూ చదివిస్తూ మలిసం జెలో భారం లేకుండా బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు. అందరికీ ఇంత ఈజీగా సొల్యూషన్ దొరక్కపోవచ్చు. కానీ, విదేశాల్లో 'డై విత్ జీరో' కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉంది. పోయేలోపు ఉన్నదంతా ఖర్చు చేసి లైఫ్ ఎంజాయ్ చేయ డమన్నమాట. అలాగని జల్సాలకే ఖర్చు పెట్టాలన్న నియమం లేదు. నలుగురికీ సాయం చేయొచ్చు. పది మంది ఆకలి తీర్చొచ్చు. ఇలా మీ కష్టార్జితం మీ ఇష్టం వచ్చి నట్టు వెచ్చించడం అన్నమాట! పార్థసారథి కూడా ఈ సూత్రాన్నే ఎందుకున్నారు. వారసులకు ఇవ్వాల్సింది ఆస్తుల మూటలు కాదు. మంచి భవిష్యత్తు. బుద్ధిమంతులు ఏ ఆస్తి ఇవ్వకున్నా.. హాయిగా బతికేస్తారు. బుద్ధిహీనులకు ఏడు తరాలకు సరిపడా ఆస్తి ఇచ్చినా ఊడ్చిపడేస్తారు. సో, మీ కష్టార్జితాన్ని ఎలా వినియోగిస్తారో ఇక మీ ఇష్టం!! --- మీరు? వాచ్మ్యనా? ఓ మధ్యతరగతి మనిషికి పొదుపు అంటే... ఖర్చులు తగ్గించుకోవడం వరకే ఆలోచిస్తాడు. ముచ్చటపడి కట్టుకున్న ఇంట్లో మురిపెంగా ఉండాలని ఉన్నా.. ఇంకేదో ఆశిస్తాడు. రూపాయి, రూపాయి కూడబెట్టి ఇల్లు మీద ఇల్లు కట్టి.. యజమానిగా చెలామణీ కావాలని ఆశిస్తాడు. ఈ రకంగా ఆలోచించిన ఎందరో.. యజమానులుగా కన్నా జీతం భత్యం లేని వాచ్మెన్లుగా మిగిలిపోతున్నారు. ఏ పెట్టుబడి అయినా మనల్ని ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుతోపై ఉండాలి. కానీ, ఆ పెట్టుబడే గుదిబండగా మారితే, ఆశించిన లాభాలు రావు సరికదా, తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. నడివయసులోనే సొంతింటి కలను నిజం చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులే వానికి తృప్తి చెంది.. ఇతర పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మేలైన జీవితాన్ని పాలంతం చేసుకో వచ్చు, కానీ, చాలామంది మూసపద్ధతికి అలవాటుపడినవాళ్లే ఉంటారు. వాళ్లు చేసే తప్పులు ఎలా ఉంటాయో పరపరామ్ కథ చదివితే అర్థమవుతుంది. పరశురామ్ ప్రైవేట్ ఉద్యోగి. మంచి జీతం వస్తుంది. ఊళ్లో కొద్దిగొప్పు అం ఇద్దరు పిల్లలు. జీవితం ఉన్నంతలో రిచ్గానే సాగిపోతుంది. పిల్లలు బడి మయుడు వాటి కాలేజీ లోకి ప్రవేశించారు. ఒకరోజు పరశురామ్ అత్తామాను నాన్నారు. అత్తగారేమో తన కూతు రుతో వంటింట్లో సొంతిళ్లు సాద మొదలుపెట్టింది. మామగారేమో అల్లుడితో అనే విషయాన్ని / తన అనుభవాన్నంతా రంగరించి చెప్పనారంభించాడు. అల్లుడుగారూ సొమ్ముతో మంచి స్థలం తీసుకోండి. మంచి బిల్డర్కు ఇచ్చి లోను మీద ఇల్లు కట్టుకోవచ్చు. మూడంతస్తులు వేసి.. పై పోర్టన్లో మీరు ఉండి, మిగతావి అద్దిగిస్తే తిరిగి కూర్చోవచ్చు ఏమంటారు?" అన్నాడు. మామగారి ఆలోచన సబబుగానే తోచించి పరశురాంకు. తల్లి బోధతో అతని భార్య కూడా ఆలోచించండి అన్నట్టుగా చూసింది. -- కోరికలు.. ఫిర్యాదులు.. ఇల్లు కట్టాలని ఫిక్సయిన పరశురామ్ అప్పటి వరకు తను కూడబెట్టుకున్న డబ్బంతా వెలికితీ శాడు. ఈపీఎఫ్ లో ఉన్న మొత్తాన్ని తీసుకున్నాడు. కొంత బంగారం కుదువపెట్టాడు. వెంచ ర్లో చిన్న స్థలాన్ని అమ్మేసి రూ. కోటి సర్దుబాటు చేసుకున్నాడు. ఆ మొత్తంతో నగర శివా రులో 220 గజాల స్థలం కొన్నాడు. బిల్డర్ను సంప్రదిస్తే మరో కోటిలో జీ+2తోపాటు పైన తీసుకున్నాడు. అప్పటికే 45 ఏండ్లు ఉండటంతో, లోను టెన్యూర్ 15 ఏండ్లు పెట్టుకున్నాడు. ఈఎమ్ఐ రూ.1.20 లక్షలుగా ఫిక్సయింది. అంటే అతని జీతంలో సగం వాయిదాకు చెల్లించా లని ఫిక్సయ్యాడు! ఇల్లు పూర్తయింది. ఆరు పోర్షన్లు అద్దెకిస్తే నెల తిరిగేసరికి రూ.60 వసూలు అవుతున్నాయి. పరశురామ్ ఆనందానికి అవధుల్లేవ్. మూడు నెలలు గడిచాయో లేదో.. అద్దె దారులు పరస్పరం గొడవలకు దిగడం, తీర్పు కోసం పరశురామ్ తలుపు తట్టడం కామన్ అయిపోయింది. తప్పు చేసిన వారిని ఇల్లు ఖాళీ చేయించడమో, అలా చేయలేకపోతే తమదే ఒప్పు అనుకున్న వాళ్లు మరో ఇంటికి మకాం మార్చడమో జరుగుతూ వచ్చింది. ఆరు పోర న్లలో ఎప్పుడూ రెండు ఖాళీగానే ఉంటున్నాయి. ఇది చాలదన్నట్టు.. నీళ్లు రావడం లేదనీ, కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తున్నదనీ, మంచి నీళ్లు పైకి వచ్చేలా ఏర్పాటు చేయమనీ, వాష్రూ మ్లో నీళ్లు పోవడం లేదనీ.. ఇలా రోజుకో ఫిర్యాదు రావడం మొదలైంది. వాళ్ల కోరికలు మన్నించలేక, ఫిర్యాదులు పరిష్కరించలేక.. పరశురామ్కు సొంతింట్లో ఉంటున్న ఆనందం రెండేండ్లకే ఆవిరైంది. అప్పటి వరకు తన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టి, బ్యాంకు లోను తీసు కుని ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతో బతువు వెళ్లదీ యొచ్చు అని భావించాడు. కానీ, వెలకట్టలేని మనశ్శాంతిని దూరం చేసుకున్నాడు. పైగా, బీపీ షుగర్ లెవల్స్ పెరిగాయి. ఆరోగ్యం నిదానంగా దెబ్బతినడం మొదలైంది. ఈఎమ్ఐ భారంతో పిల్లల పైచదువులప్పుడు పూర్తి స్థాయిలో అండగా నిలవలేపోయాడు. స్పష్టంగా చెప్పాలంటే.. రెండు కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన యజమాని కాస్త ఆ ఇంటికి వాచ్ మ్యాన్గా మారిపోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి.. రూ.2.20 కోట్ల పెట్టుబడి పెట్టి.. ఇల్లు తీసుకున్న వ్యక్తి దర్జాగా బతక్కుండా, ఇలా నీరుగారిపోవడాన్ని ఏ ఆర్థిక సూత్రం మాత్రం ఆమోదిస్తుంది. ఇదే పరశు రామ్ రూ.కోటితో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్గానీ, అదే నగర శివారులో డూప్లెక్స్ ఇల్లు గానీ తీసుకుంటే.. 'అనుభవించు రాజా!' అని పాడుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసేవాడు. తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. శాశ్వత ఆదాయం మాయలోపడి జీవితంలో ప్రశాంతతకు దూరమయ్యాడు. -- మీ దీపాన్ని ఆరనివ్వరు. వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకుండా, ఎవరినీ దేహీ అనకుండా జీవితం సాగాలంటే మాత్రం అది మీ చేతుల్లోనే ఉంది. వయసులో ఉన్నప్పుడు ముందుచూపు లేకుండా వ్యవహరిస్తే.. ముదిమి వయసులో దేవుడు కూడా మిమ్మల్ని ఉద్దరించ లేడు. రిటైర్మెంట్ ప్లాన్ కచ్చితంగా చేసుకుంటే.. అనాయాసేన మరణం మాటేమిటో గానీ, వినా దైన్యేన జీవితానికి మాత్రం గ్యారెంటీ లభిస్తుంది. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనిషి జీవితం రాజమౌళి సినిమాలా కల ర్పుల్గా అనిపిస్తుంది. వయసు పైబడే కొద్దీ... ముగింపు లేని డైలీ సీరియల్లా భారంగా సాగుతుంది. జీవిత చరమాంకం కూడా సూపర్హి హిట్ కావాలంటే.. రిటైర్మెంట్ ప్లాన్ పక్కాగా ఉండాలి. మీ శేష జీవితాన్ని విశేషంగా గడపాలంటే.. ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టడం కాదు! నెలకు లక్ష రూపా యల దాకా పెన్షన్ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే... గడ్డాల నాడు బిడ్డలు కూడా మీ మాటలు వింటారు. ఇప్పుడంటే లక్ష వస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ముప్పయ్ ఉంటే మాత్రం ఈ లెక్క సరిపోదు. మీకు అరవై వచ్చేనాటికి నెలనెలా కచ్చితంగా రూ.2 లక్షలు మీ ఖాతాలో పడితేగానీ.. ప్రశాంత జీవితం గడిపే ఆస్కారం ఉండదు. పైసా మే పరమాత్మ.. ఈ మాటలు కాస్త కఠినంగా అనిపించినా, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటే తెలివైన వారు అనిపించుకుంటారు. మానవ సంబంధాలన్నీ ఆర్థికం చుట్టూనే తిరుగుతున్నాయి. నెలకు ఎలాంటి ఆదాయం లేకుండా, కేవలం ఆస్తులు మూటగట్టుకొని ముసలితనంలోకి ప్రవే శిస్తే ఆశించిన ఆదరణ దక్కకపోవచ్చు. ముసల్ది, ముసలోడు ఎప్పుడు పోతాడో అని గోతికాడ నక్కల్లాగా ఎదురుచూస్తుంటారు వారసులు. అదే మీరు కామధేనువు అయితే! అంటే, మీరు బతికి ఉన్నంత కాలం నెలనెలా పెన్షన్ వస్తుందంటే మాత్రం మీ ప్రాణం అదే వారసులకు -- | అపురూపంగా మారుతుంది. ఆస్తుల కోసం హత్యలు చేసే కిరాతకులు కూడా.. పెన్షన్ సొమ్ము . కోసం తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుంటారు. పొద్దునే కొడుకు గుడ్ మార్నింగ్ చెబుతాడు. 'తాతయ్యా, బామ్మా బై!' అంటూ మనవలు బడికి దారితీస్తారు. 'ఏం టిఫిన్ చేయమంటారు . అత్తయ్యా' అని కోడలు మీ సలహా కోరుతుంది. 'పైసా మే పరమాత్మా హై' అంటే ఇదే! ఆయుష్షు పెంచుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వాళ్ల చేతులు కాలినా మీ దీపాన్ని ఆరనివ్వరన్నమాట. ఒంట్లో నలతగా ఉందంటే చాలు.. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తారు. బైపాస్ సర్జీరీ చేయిస్తారు. లక్ష ఆస్పత్రి బిల్లు కట్టి.. మీ ఆయుష్షును పెంచితే.. మరో రెండేండ్లు పెద్ద ప్రాణం ఉంటుందని ఇద్దరు కొడుకులు ఉంటే స్టంట్లు నేను వేయిస్తానంటే నేను వేయిస్తానంటూ స్టంట్లు చేస్తారు. ఓ వారి నమ్మకం. ఆ రెండేండ్లూ నెలకు లక్ష వస్తుందనే ఆశ. ప్రస్తుతం మన దేశంలో పెన్షన్ అందుకుంటున్న వారిలో వందేండ్ల పైబడినవారు ఆరువేల మంది వరకు ఉన్నారు. వీళ్లకు ప్రతినెలా వస్తున్న పెన్షన్ లక్షకు పైమాటే! ఆ వారసులు వీళ్లను ఎంత ఆరోగ్యంగా చూసుకుం టున్నారో అర్థం చేసుకోవచ్చు. అందరూ అలా ఉంటారని కాదు! ఈ రోజుల్లోనే చాలామంది కాసులకు విలువ ఇచ్చేవాళ్లే కనిపిస్తున్నారు. మరో పాతికేండ్లకు ఇంటికో ఈ తరహా వ్యక్తి ఉండొచ్చు. వారి దురాశ పెన్షనర్క శ్రీరామ రక్ష! స్పష్టంగా చెప్పాలంటే... రిటైర్ అయ్యాక మీరు బంగారు గుడ్డు పెట్టే బాతులా ఉండాలన్నమాట. అంటే మీరున్నంత కాలం ఆదాయం రావాలి. మీరు పోతేనే ఆదాయం వచ్చేపనైతే.. సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. కూడబెట్టిన సొమ్మును ఒక్కసారిగా తీసుకోకుండా.. నెలవారీగా వచ్చే ఏర్పాటు చేస్తే.. మీ లెవల్ మరోలా ఉంటుంది. కొత్త పెన్షన్ విధానంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత కచ్చితమైన పెన్షన్ వచ్చే అవ కాశం లేకుండా పోయింది. ప్రైవేట్ ఉద్యోగుల సంగతి సరే సరి. ఏ ఉద్యోగం చేస్తున్నా అరవై దాటాక నెలకు కనీసం రూ. లక్ష వచ్చేలా పెన్షన్ ప్లాన్ చేసుకోవడం చాలా అవ సరం. మీరు, మీ తదనంతరం మీ జీవిత భాగస్వామికి కూడా అంతే మొత్తం పెన్షన్ వచ్చేలా ప్లాన్ తీసుకోవాలి. నలభై ఏండ్ల వ్యక్తి... నెలకు కనీసం రూ.20 వేల చొప్పున ఎస్ఐపీ కడితే.. రిటైర్మెంట్ నాటికి అది దాదాపు రూ.2 కోట్లకు చేరుతుంది. అప్పుడు ఆ మొత్తాన్ని ఇతర పెట్టుబడి సాధనాల్లో మేలైన దాన్ని ఎంచుకొని ఇన్వెస్ట్ చేసి ప్రతినెలా మీకు గ్యారెంటీగా పెన్షన్ వచ్చేలా చూసుకోవాలి. -- భరోసా కాదు.. భవిష్యత్తు ఇద్దాం! తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్తేనే వారి పిల్లల ప్రగతి సాధ్యమవుతుంది. పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం లక్షలు కూడబెట్టడం, భూములు సంపాదిం చడం, గొప్పగా చదివించడం ఇవన్నీ పేరెంట్స్ బాధ్యతలు. అయితే, చదువు విషయంలో పరిధులు విధించుకుంటే మాత్రం.. మీరు మొదలుపెట్టిన చోటే, మీ పిల్లల ప్రయాణం స్టార్ట్ అవుతుందని గుర్తించుకోండి. కాలం ఎంత మారినా.. తల్లిదండ్రుల మైండ్సెట్ మారడం లేదు. అబ్బాయి చదువు కోసం పొదుపు చేసే చాలామంది, అమ్మాయిల విషయంలో పెళ్లి కోసమని డబ్బు దాస్తుంటారు. మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్లు పాతిక లక్షల వరకు కూడబెడుతుంటారు. అదే సమయంలో ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి రెండు, మూడు లక్షల్లో లక్ష్యం అందుకోవాలని భావిస్తుంటారు. పెండ్లికి కేటాయించిన మొత్తాన్ని మీ అమ్మాయి చదువుపై ఇన్వెస్ట్ చేసి చూడండి! ఆమె ప్రయాణం జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది!! దీప్తి కథ చదివితే మీకు ఈ విషయం మరింత లోతుగా అర్థమవుతుంది. దీప్తి చలాకీ అమ్మాయి. ఆమె చెల్లెలు ఇంటర్ చదువుతున్నది. వీళ్ల నాన్న బ్యాంకు ఉద్యోగి. తల్లి కూడా బ్యాంకులోనే పనిచేసేది. ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. రెండు ఫ్లాట్లు ఉన్నాయి. పిల్లల కోసం ముందస్తుగా ఉద్యోగానికి పదవీ విరమణ చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్గాTO లక్షలు వచ్చాయి. ఈ మొత్తంతో స్థలం తీసుకున్నారు. దీప్తి ఎంబీఏ చదువుతానంది. వి తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరించారు. రూ.3 లక్షల్లో ఎంబీఏ అయిపోతుంది. చిన్నమ్మాయి చదువుకు మరో ఐదారు లక్షలు సరిపోతాయి అనుకున్నారు. రెండు ఫ్లాట్స్లో ఏ ఒక్కదాన్ని విక్రయించినా రూ.60 లక్షలు వస్తాయి. ఆ మొత్తంతో ఇద్దరు బిడ్డల వివాహాలు ఘనంగా చేసేయొచ్చు అని భావించారు. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. పైపైన చూస్తే ఈ -- ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉందని కూడా అనిపిస్తుంది. కానీ, దీప్తి తల్లిదండ్రులు కాస్త డిఫరెంట్ ఆలోచిస్తే.. ఆ పిల్లల జీవితాలు మరింత ఉన్నతంగా ఉంటాయి. పెళ్లి దగ్గరే ఆగిపోవద్దు.. దీప్తి తండ్రి ఇలా చేస్తే.. బిడ్డకు మహోన్నతమైన లైఫ్ను అందించినట్టు అవుతుంది. అదెలా ఎలాగంటే కూతురు పెళ్లికోసం అనుకున్న రూ.30 లక్షలు ఆమె చదువుకు బదలాయిస్తే ఫలితం పదింతలు ఉంటుంది. ఎంబీఏకు రూ.30 లక్షలు ఏంటి? అంటారా! సాదాసీదా కాలేజీలో చదివితే.. పాతికవేల ఉద్యోగంతో సరిపెట్టుకోవాలి. అదే ప్రముఖ బిజినెస్ స్కూల్స్లో చదివిస్తే ఆరంభ వేతనమే రూ. 15 లక్షల (సంవత్సరానికి) వరకు ఉంటుంది. చాలా తర్జనభర్జనల తర్వాత దీప్తి తండ్రి సాహసం చేశాడు. ఆమెను ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో ఎంబీఏలో చేర్పించాడు. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో దీప్తి ఏడాదికి పాతిక లక్షల రూపాయల ప్యాకేజీ అందు ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయం దీప్తి జీవితాన్ని మాత్రమే కాదు.. ఆమె తర్వాతి తరాల జీవితాలనూ ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అనడంలో సందేహం లేదు. ఏతావాతా విషయం ఏంటంటే.. ఆడపిల్లల సెటిల్మెంట్ పెళ్లి దగ్గరే ఆగిపోవద్దు. విలువైన చదువు చెప్పించాలి. ద బెస్ట్ యూనివర్సిటీలో చదివించాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ సెటిల్మెంట్ అనిపించుకుంటుంది. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నప్పుడే.. ఫెయిల్యూర్స్కు చిరునామాగా మిగిలిన ఓ తండ్రి కథ ఇది. సంపన్న కుటుంబంలో పుట్టినా.. అందుకు తగ్గట్టుగా ఆయన ఏనాడూ వ్యవహరించలేదు. భార్యను నానా అగచాట్లకూ గురిచే శాడు. దాదాపు ఆస్తులన్నీ కరిగిపోయాక అతనికి జ్ఞానోదయం అయింది. అప్పటికే కూతురు నీట్ రాసింది. అనుకున్నంత ర్యాంకు రాలేదు. ఉన్న ఆస్తంతా అమ్మేసి కూతురిని ప్రైవేట్లో ఎంబీబీఎస్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. కూతురు వద్దు నాన్న! నేను బీఫార్మసీ చేస్తా నంది. అందుకు ఆ తండ్రి ఒప్పుకోలేదు. 'నా తప్పులకు నీ భవిష్యత్తు భారం కావొద్ద'న్నాడు. 'నేను మీ అమ్మను ఎన్ని రకాలుగా హింసించానో నాకు తెలుసు. ఆమె స్థానంలో ఎవరున్నా.. నన్ను వదిలిపెట్టేవారే! నీ తల్లి నాకన్నా అందగత్తె! పెళ్లి సమయంలో ఆస్తులు కూడా తెచ్చింది. అన్నీ ఉన్నా.. సంపాదించే శక్తిలేక, ఆమె కాళ్లమీద నిలబడి బతకగలనన్న నమ్మకం లేక.. ఈ నరకంలోనే ఉండిపోయింది. నీ కోసం నన్ను భరించింది. సొంతంగా సంపాదించలేని ఆమెకు నిన్ను పోషించే శక్తి లేదు. రేపు నీకు అలాంటి దుస్థితి రావొద్దు. ఉన్నతంగా చదివి, మంచి పొజిషన్లో ఉంటే.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలుగుతావు. ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది' అని నచ్చజెప్పాడు. ఉన్న ఒక్క ఆస్తినీ అమ్మేసి కూతురును మంచి కాలేజీలో మెడిసిన్లో చేర్పించాడు. --