73. భరోసా కాదు.. భవిష్యత్తు ఇద్దాం!

73. భరోసా కాదు.. భవిష్యత్తు ఇద్దాం!

తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్తేనే వారి పిల్లల ప్రగతి సాధ్యమవుతుంది. పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం లక్షలు కూడబెట్టడం, భూములు సంపాదిం చడం, గొప్పగా చదివించడం ఇవన్నీ పేరెంట్స్ బాధ్యతలు. అయితే, చదువు విషయంలో పరిధులు విధించుకుంటే మాత్రం.. మీరు మొదలుపెట్టిన చోటే, మీ పిల్లల ప్రయాణం స్టార్ట్ అవుతుందని గుర్తించుకోండి.

కాలం ఎంత మారినా.. తల్లిదండ్రుల మైండ్సెట్ మారడం లేదు. అబ్బాయి  చదువు కోసం పొదుపు చేసే చాలామంది, అమ్మాయిల విషయంలో పెళ్లి కోసమని డబ్బు దాస్తుంటారు. మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్లు పాతిక లక్షల వరకు కూడబెడుతుంటారు. అదే సమయంలో ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి రెండు, మూడు లక్షల్లో లక్ష్యం అందుకోవాలని భావిస్తుంటారు. పెండ్లికి కేటాయించిన మొత్తాన్ని మీ అమ్మాయి చదువుపై ఇన్వెస్ట్ చేసి చూడండి! ఆమె ప్రయాణం జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది!! దీప్తి కథ చదివితే మీకు ఈ విషయం మరింత లోతుగా అర్థమవుతుంది.

దీప్తి చలాకీ అమ్మాయి. ఆమె చెల్లెలు ఇంటర్ చదువుతున్నది. వీళ్ల నాన్న బ్యాంకు ఉద్యోగి. తల్లి కూడా బ్యాంకులోనే పనిచేసేది. ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. రెండు ఫ్లాట్లు ఉన్నాయి. పిల్లల కోసం ముందస్తుగా ఉద్యోగానికి పదవీ విరమణ చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్గా 45 లక్షలు వచ్చాయి. ఈ మొత్తంతో స్థలం తీసుకున్నారు. దీప్తి ఎంబీఏ చదువుతానంది. వి తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరించారు. 3 లక్షల్లో ఎంబీఏ అయిపోతుంది. చిన్నమ్మాయి చదువుకు మరో ఐదారు లక్షలు సరిపోతాయి అనుకున్నారు. రెండు ఫ్లాట్స్లో ఏ ఒక్కదాన్ని విక్రయించినా 60 లక్షలు వస్తాయి. ఆ మొత్తంతో ఇద్దరు బిడ్డల వివాహాలు ఘనంగా చేసేయొచ్చు అని భావించారు. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. పైపైన చూస్తే ఈ ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉందని కూడా అనిపిస్తుంది. కానీ, దీప్తి తల్లిదండ్రులు కాస్త డిఫరెంట్ ఆలోచిస్తే.. ఆ పిల్లల జీవితాలు మరింత ఉన్నతంగా ఉంటాయి.

పెళ్లి దగ్గరే ఆగిపోవద్దు..

దీప్తి తండ్రి  ఇలా చేస్తే.. బిడ్డకు మహోన్నతమైన లైఫ్ను అందించినట్టు అవుతుంది. అదెలా ఎలాగంటే కూతురు పెళ్లికోసం అనుకున్న 30 లక్షలు ఆమె చదువుకు బదలాయిస్తే ఫలితం పదింతలు ఉంటుంది. ఎంబీఏకు 30 లక్షలు ఏంటి? అంటారా! సాదాసీదా కాలేజీలో చదివితే.. పాతికవేల ఉద్యోగంతో సరిపెట్టుకోవాలి. అదే ప్రముఖ బిజినెస్ స్కూల్స్లో చదివిస్తే ఆరంభ వేతనమే  15 లక్షల (సంవత్సరానికి) వరకు ఉంటుంది. చాలా తర్జనభర్జనల తర్వాత దీప్తి తండ్రి సాహసం చేశాడు. ఆమెను ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో ఎంబీఏలో చేర్పించాడు. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో దీప్తి ఏడాదికి పాతిక లక్షల రూపాయల ప్యాకేజీ అందుకుంది. పాతికేళ్ల సర్వీస్ చేసిన తన తండ్రి జీవితం ఖన్నా దీప్తి ప్రారంభ వేతనం ఎక్కువ.  ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయం దీప్తి జీవితాన్ని మాత్రమే కాదు.. ఆమె తర్వాతి తరాల జీవితాలనూ ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అనడంలో సందేహం లేదు. ఏతావాతా విషయం ఏంటంటే.. ఆడపిల్లల సెటిల్మెంట్ పెళ్లి దగ్గరే ఆగిపోవద్దు. విలువైన చదువు చెప్పించాలి. ద బెస్ట్ యూనివర్సిటీలో చదివించాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ సెటిల్మెంట్ అనిపించుకుంటుంది.

ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నప్పుడే..

ఫెయిల్యూర్స్కు చిరునామాగా మిగిలిన ఓ తండ్రి కథ ఇది. సంపన్న కుటుంబంలో పుట్టినా.. అందుకు తగ్గట్టుగా ఆయన ఏనాడూ వ్యవహరించలేదు. భార్యను నానా అగచాట్లకూ గురిచే శాడు. దాదాపు ఆస్తులన్నీ కరిగిపోయాక అతనికి జ్ఞానోదయం అయింది. అప్పటికే కూతురు నీట్ రాసింది. అనుకున్నంత ర్యాంకు రాలేదు. ఉన్న ఆస్తంతా అమ్మేసి కూతురిని ప్రైవేట్లో ఎంబీబీఎస్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. కూతురు వద్దు నాన్న! నేను బీఫార్మసీ చేస్తా నంది. అందుకు ఆ తండ్రి ఒప్పుకోలేదు. 'నా తప్పులకు నీ భవిష్యత్తు భారం కావొద్ద'న్నాడు. 'నేను మీ అమ్మను ఎన్ని రకాలుగా హింసించానో నాకు తెలుసు. ఆమె స్థానంలో ఎవరున్నా.. నన్ను వదిలిపెట్టేవారే! నీ తల్లి నాకన్నా అందగత్తె! పెళ్లి సమయంలో ఆస్తులు కూడా తెచ్చింది. అన్నీ ఉన్నా.. సంపాదించే శక్తిలేక, ఆమె కాళ్లమీద నిలబడి బతకగలనన్న నమ్మకం లేక.. ఈ నరకంలోనే ఉండిపోయింది. నీ కోసం నన్ను భరించింది. సొంతంగా సంపాదించలేని ఆమెకు నిన్ను పోషించే శక్తి లేదు. రేపు నీకు అలాంటి దుస్థితి రావొద్దు. ఉన్నతంగా చదివి, మంచి పొజిషన్లో ఉంటే.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలుగుతావు. ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది' అని నచ్చజెప్పాడు. ఉన్న ఒక్క ఆస్తినీ అమ్మేసి కూతురును మంచి కాలేజీలో మెడిసిన్లో చేర్పించాడు.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024