63. స్వదేశమా... విదేశమా..?

63. స్వదేశమా... విదేశమా..?

ఉద్యోగం ఇండియాలో చేయాలా? బయటి దేశంలోనా?.. అని చాలా చర్చలే జరుగుతుంటాయి. అయితే అవన్నీ ఒడిసే ముచ్చట్లు కాదు. ఈ విషయంలో చాలామంది తమకు ఏమాత్రం అనుభవం లేకున్నా ఏవేవో లెక్కలేసేస్తుంటారు. ఏదేదో చెప్పేస్తుంటారు. ఉద్యోగం ఎక్కడైతే బాగుంటుందనేది నిర్ణయించాల్సింది ఎవరు? అని ఒక్కసారి ప్రశాంతంగా ఎవరికి వారు ఆలోచించినట్టయితే సరైన సమాధానం దొరుకుతుంది.

ఇండియాలో కన్నా బయట దేశంలో జాబ్ చేసినవారు ఆర్థికంగా బాగున్నార నేది అంగీకరించాల్సిన మాట. కానీ ఈ విషయంలో చాలామంది వాదించేది ఏమిటంటే కాస్ట్ ఆఫ్ లివింగు, పన్నులను దృష్టిలో పెట్టుకుంటే అక్కడా ఇక్కడా మిగులుబాటయ్యేదంతా గంతేనని! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇండి యాలో కన్నా మిగతా ఏ దేశంలో, ఏ స్థాయి ఉద్యోగం చేసినవారైనా ఆర్థికంగా, కెరీర్ పరంగా ముందంజలో ఉన్నారు. ఇందుకు కారణం ఏమిటి? ఇందులో ఉన్న మతలబు ఏమిటి?

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోని ప్రజల జీవన విధానాన్ని, కుటుంబాల ఆర్థికాభివృద్ధి తీరును పరిశీలిస్తే కచ్చితంగా విదేశీ ఉద్యోగానికే ఓటేయక మానరు. అంతదాకా ఎందుకు ? తెలంగాణ లోని కొన్ని పల్లెల జీవన విధానాన్ని పరిశీలించిన వారి అభిప్రాయాన్ని, ఫారిన్, గల్ఫ్ వంటి విదేశాల్లో ఏదో ఒక ఉద్యోగం చేసి వచ్చినవారి జీవితాలను దగ్గర నుంచి చూసినవారిని ఓ సారి పలుకరించినట్టయితే అసలు విషయం తెలుస్తుంది. ఇండియాలో 30 లక్షలు సంపాదిం చినా.. అమెరికాలో కోటి రూపాయల వేతనం వచ్చినా.. అంతా సరిసమానమే, అంతా ఒక్కటే అంటారు చాలామంది. ఇది వాస్తవమే. అక్కడ టాక్స్లు, లివింగ్ కాస్ట్ ఎక్కువ. అందుకే అక్కడ కోటి రూపాయలు ఆర్జించే వ్యక్తికి ఎంత మిగులుతున్నదో.. ఇక్కడ 30 లక్షలు సంపాదించినవారికి అంతే మిగులుతుంది, కాదనలేం!

జమీన్ ఆస్మాన్ ఫరఖ్.

కానీ ఇది చాలా తప్పుడు పోలిక, పోల్చే తీరులో లోపం ఉందన్న విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇండియాలో 30 లక్షల వేతనం ఎంతమంది తీసుకుంటున్నారు.? అతి కొద్దిమందికి మాత్రమే ఇంత పెద్దమొత్తంలో జీతాలు ఉంటున్నాయంటే కాదంటారా ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అమెరికా ఉద్యోగాలను ఉదాహరణ తీసుకుందాం అక్కడ ఎంఎస్ చేసిన ప్రతి ప్రెషర్ కు ప్యాకేజీ వస్తుంది అంటే సుమారు ఒక లక్ష 25 వేల డాలర్లు ప్రతి సంవత్సరం అన్నమాట ఇప్పుడు చెప్పండి కోటి రూపాయల స్టార్టింగ్ ప్యాకేజ్ ఎక్కడ?  ఎన్నో డక్కామొక్కీలు తిని, ఎన్నో ఏండ్ల అనుభవాన్నంతా లెక్కగట్టి ఇచ్చే 30లక్షలు ప్యాకేజ్ ఎక్కడ. ఇంకా చెప్పాలంటే.. ఇక్కడ టాప్ మోస్ట్  యూనివర్సిటీలో చదివినవారికో, పది పదిహేనేండ్ల సీనియారిటీ ఉన్నవారికో ఇంత మొత్తం మార్కెట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ సాధ్యపడదన్నది గ్రహించాలి. జీతాలు పొందే అవకాశం దక్కుతుందే కానీ ఇదే విద్యాసంవత్సరమే డిగ్రీ పట్టా పుచ్చుకొని మార్కెట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి సాధ్య పడుతుందని గ్రహించాలి.

ఇద్దరూ ఉద్యోగులైతే భారతీయ కరెన్సీలో నెలకు 12 లక్షలు సంపాదిస్తున్న భార్యాభర్త లను చాలామందిని చూస్తున్నాం కదా! అలా అమెరికాలో 15 ఏండ్లపాటు ఉండి మంచి అను భవం, బ్యాంక్ బ్యాలెన్స్తో సమాజంలో స్థితిమంతులుగా పేరు, కీర్తి పొందుతున్న కుటుంబా లకూ కొదువ లేదు. విదేశాల్లో వివిధ రంగాల్లో సర్వెంట్లుగా, డ్రైవర్స్ గా, చిన్నచిన్ని ఉద్యోగాలు చేసేవారిని ఎవరినైనా కదపండి.. ఇక్కడి ఆదాయానికీ, అక్కడి ఆదాయానికీ.. జమీన్ ఆస్మాన్ ఫరఖ్ ఉందని చెబుతారు.

చిన్నవయసులోనే సంపాదన.

ఓ పుష్కర కాలం క్రితం ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లినవారు, అక్కడే ఉద్యోగాల్లో చేరడం ద్వారా గ్రీన్కార్డులు, సిటిజెన్ షిప్ లు వచ్చాయి. వాళ్లలో చాలామంది పది పన్నెం డేండ్లు అక్కడ ఉద్యోగం చేసి ఇండియా వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓవర్సిస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాగా చెలామణి అవుతూ స్థానికంగానే ఎంచక్కా యూఎస్ కంపెనీల్లో పనిచేసుకుంటు న్నారు. ఇక్కడ రెండేండ్లు కష్టపడ్డా సంపాదించలేని ఆదాయం అక్కడ నాలుగు నెలల కాలంలో కూడబెడుతున్నారు. నూటికి ఐదు శాతం ఫెయిల్యూర్స్ ఉంటాయి, కాదనలేం. కానీ 95 శాతం మంది ఇండియాలో కన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. బయటి దేశాల్లో పదేండ్ల కష్టం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నూటికి తొంభై శాతం కుటుంబాలు సెటిల్ అవుతున్నాయి. విదేశాలకు వెళ్లి పనిచేసేవాళ్లు స్కిల్డ్ లేబర్ కానీ, ఐటీ ఉద్యోగి కానీ పదేండ్ల లోనే ఇండియాలో రిటైర్మెంటు సరిపడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్క యూఎస్ అనే కాదు ఆఫ్రికా దేశాల్లోనూ ఎక్కువమొత్తంలో సంపాదిస్తున్నవారు ఉన్నారు. అలా వాళ్లు తమ కుటుంబాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.. తద్వారా ఒక తరాన్ని మార్చగలుగుతున్నారు. అర్హత, ఓపిక, కోరిక ఉంటే మాత్రం ఓ పదేండ్లు విదేశీ కరెన్సీ వెంట పరుగులు పెట్టి, స్వదే శంలో కుటుంబ స్థితిగతులను మార్చుకోవడం కన్నా మంచి మార్గం లేదు.
  

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024