FP ramprasad 61.కంగారొద్దు బంగారం !


61.కంగారొద్దు బంగారం !

ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు.. పక్కంటి పిన్నిగారి కాసులపేరు చూడు..' అంటూ సాగిపోయే ఈ పాట గుర్తుందిగా? అదేనండీ ''శుభలగ్నం' సినిమాలో హీరోయిన్ ఆమని, హీరో జగపతిబాబు దగ్గర ఇరుగు పొరుగు వారి ఆదంబరాలను గుర్తుచేస్తూ మొగుణ్ని దెప్పి పొడిచే సన్నివేశాలతో సాగే ఈ పాట ద్యంతం నవ్వులు పూయిస్తుంది.

అంతేకాదు ,ఈ పాట ద్వారా సగటు మధ్యతరగతి ఇల్లాలి ఆలోచన విధానాన్ని అద్భుతంగా వ్యక్తిగరించారు రచయిత. తమ ఆర్థిక పరిస్థితి గురించి  ఏమాత్రం పట్టింపు లేకుండా ఇరుగమ్మ పొరుగమ్మలతో పోల్చుకుంటూ  సంసారాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టుకోకూడదన్న సందేశాన్ని ఇస్తుంది ఈ పాట. నగనిగ లపై మనసు పడే అతివలకు బంగారంపై మోజు ఉండటం మామూలే. అంతే కాదు.. కాసుల వేటలో ఉన్నవారు పుత్తడిని పెట్టుబడి కోణంలో చూడటమూ సహజమే! ఈ ఉద్దేశాలు ఎలా ఉన్నా.. పసిడి ధరలు చుక్కలనంటిన వేళ.. కొన్ని షరతులు గుర్తుంచుకోవాలి.


నలుగురు స్త్రీమూర్తులు కలిస్తే.. కబుర్లాడేది కాంచనం గురించే! ఇద్దరు ఇన్వెస్టర్ల భేటీలోనూ పసిడి ప్రస్తావన రాక మానదు. రోజురోజుకూ ప్రియమవుతున్న బంగారం మీద ఎందుకంత ప్రేమంటే సరైన సమాధానం దొరకదు. పైగా చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బంగారం ధరలు పెరు గుతున్నాయన్న వార్త విన్నప్పుడల్లా కంగారు. 'అయ్యో! బంగారం ధర పెరిగిపోతున్నది.. వచ్చే ఏడాది మీ అమ్మాయి పెండ్లి చేస్తామంటున్నారు.. ఇప్పుడే కొనుక్కొని పెట్టుకో రాదు?.. అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లూ ఉంటారు. ఈ మాట చెవిలో పడీ పడకముందే నగల దుకాణాలకు పరుగులు తీస్తుంటారు చాలా మంది. ఇలాంటి పరిస్థితిని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.

మనదేశంలో బంగారం పట్ల మోజు ఎక్కువ. అయితే, ఇటీవల బంగారం ధర భారీగా పెరుగు తున్న మాట వాస్తవమే. కానీ, ఎంత పెరిగిందన్నదీ చూసుకోవాలి కదా! ఏడాది క్రితం 10 గ్రాముల బంగారం ధర 63 వేలు ఉంటే ఇప్పుడు సుమారు 75 వేలకు చేరుకున్నది. అంటే ధర దాదాపు 20 శాతం పెరిగిందన్నమాట.   ఏ పెట్టుబడి నుంచైనా స్వల్పకాలిక లాభాలు ఆశించొద్దు. దీర్ఘకాలిక లాభాలనే లెక్కలేసుకోవాలి. యుద్ధాలు వస్తాయనో, ఎన్ని కలు ఉన్నా జరిగే ప్రచారాలను నమ్మి ఎడాపెడా పెట్టుబడులు పెట్టడం, తీయడం నష్టా నష్టాలకు దారితీస్తుంది బంగారం పై పెట్టుబడి పెట్టేవారు చాలామంది దాని ధర పెరిగేదే గాని తగ్గేది కాదన్న అపోహలో ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి గతాన్ని నెమరువేసుకోవాలి. 1996లో 10 గ్రాముల బంగారం ధర 5,160 ఉంటే 2001లో అది 4,300లకు చేరింది. ఇలా ఆ ఆరేండ్ల మధ్యకాలంలో ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. 1997లో 4,045, 1998లో 4,045,1998లో 4,234, 2000లో 4,400 ఉంటే 2001 సంవత్సరం కల్లా 4,300లకు చేరింది. మొత్తంగా ఏడు సంవత్సరాలపాటు ధర 800 తగ్గింపులోనే ఉంది.

12 ఏండ్ల క్రితం అంటే.. 2012లో 10 గ్రాముల బంగారం ధర 31,050 ఉంది. 2013లో 29,600; 2014లో 28,006; 2015లో 26,343; 2016లో  28,623; 2017లో 29,667గా ఉంది. అంటే ఆ ఐదేండ్లపాటు 2000 తగ్గు తూనే వచ్చింది. ఇలా తగ్గుముఖం పట్టిన ధరల్లోనే కొన్నేండ్లపాటు ఉంటుంది. ఇందుకు ఒకరి జీవితంలో ఎదురైన అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. 2012లో పెండ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆరేండ్ల తర్వాత అంటే 2018లో తన సోదరి పెండ్లి చేశాడు. ఇక్కడ విచిత్ర మేమంటే.. రెండు సందర్భాల్లోనూ బంగారం ధర ఒకేలా ఉంది. ధర పెరిగినా, తగ్గినా బంగారం బరువు మాత్రం తగ్గదు కదా?! కాబట్టి అవసరం ఉంటే తప్ప బంగారం కొనుగోలు చేయొద్దు, నగల కోసం అయితే ధర గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నిర్భయంగా కొను క్కోవచ్చు. బంగారాన్ని నగల రూపంలో వాడుకోవడానికైతేనే కొనాలి. దాచుకోవడానికైతే ప్రత్యేకంగా అప్పోసొప్పో చేసి, క్రెడిట్ కార్డు వినియోగించి, పర్సనల్ లోన్ తీసుకొని మరీ కొనాల్సిన అవసరం లేదు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఆందోళనలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏమంత మంచిది కాదు.

పుత్తడి మీద పెట్టుబడి ఎప్పుడూ తప్పు కాదు. అలాగని దాన్ని అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ గా భావించొద్దు. బంగారం సెంటిమెంట్ తో ముడిపడితే.. అమ్మడానికి చేతులు రావు. కుదువ పెట్టడానికి మనసొప్పదు. అందుకే, కాంచనాన్ని ” అవసరంగా భావించాలి. విలాస వస్తువుగానే గుర్తించాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయాలి. అందుకోసం అప్పు చేస్తేనే తప్పు.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim