FP ramprasad 52. వాటా వెనక్కి.. లాభం పైపైకి!


52. వాటా వెనక్కి.. లాభం పైపైకి!

కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా.. వదిలేయడమే ఉత్తమ నిర్ణయం అనిపించుకుంటుంది. రాజ్యం వదులుకొని వనవాసానికి వెళ్లిన పాండవులను అక్షయ పాత్ర ఆదుకున్నట్టు.. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఎస్ఓబ్ల్యూపీ అండగా నిలుస్తుంది. ఈ సిస్టమేటిక్ విత్ డ్రా యల్ ప్లాన్తో మూలధనాన్ని ముచ్చటగా పెంచుకుంటూనే.. ప్రతి నెలా మీ కోటా నుంచి కోరుకున్నంత వాటాను పెన్షన్ అందుకోవచ్చు.


ఎస్ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారు. మార్కెట్ పెరిగితే  ఆగ మేఘాల మీద పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలని ఆరాటపడతారు. మార్కెట్ కుదేలైతే.. పెట్టిన కష్టమంతా వృథా అయిందని బావురుమంటారు. దీర్ఘ కాలిక ప్రయాణంలో ఈ తాత్కాలిక భావోద్వేగాలకు లోనుకావొద్దు. మార్కెట్ పెరి గినా, తగ్గినా మ్యూచువల్ ఫండ్స్ కొనసాగించాలి. పదిహేనేండ్లపాటూ ఎస్ఐపీ కొనసాగించిన తర్వాత.. అప్పుడు అందుబాటులో ఉన్న మూలధనం ఆధారంగా ఎస్ఓబ్ల్యూపీని యాక్టివేట్ చేయాలి.

నెలకు ఇంత చొప్పున ఎస్ఐపీ చేసినట్టుగానే.. ప్రతి నెలా ఫిక్స్డ్ శాతం మొత్తం మీ ఖాతాలో పడుతుంది. ఉదాహరణకు మీ మ్యూచువల్ ఫండ్స్లో 25 లక్షలు ఉన్నాయనుకోండి. అందులో ఆరు శాతం ఎస్ డబ్ల్యూ పి పెట్టుకుంటే నెలకు 12.5వేలు మీ ఖాతాలో జమ వుతుంది. ఏడాదికి 1.50 లక్షలు మీకు అందుతాయి. అదే సమయంలో 13 శాతం రిటర్న్ చొప్పున లెక్కేసుకున్నా మీ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 26 లక్షల వరకు చేరుకుం టుంది. నెలకు 15వేలు అందుకుంటున్నా మూలధనం పెరగడం గొప్ప విషయమే కదా!

ప్రతి నెలా ఆదాయం.

నెలవారీగా ఎస్ఐపీ చేయని వారికి ఎస్ డబ్ల్యూపీ వర్తించదన్న అనుమానం వద్దు, బ్యాంకులో ఎఫ్డి చేసినట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో పెద్దమొత్తం ఒకేసారి పెట్టగలిగితే.. ప్రతినెలా ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి  కోటి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. 6% ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ ఎంచుకున్నాడు. అతనికి నెలకు 50 వేలు ఆదాయం సమకూరుతుంది. అంటే ఏడాదికి 6 లక్షలు. ఈ ఏడాదిలో మార్కెట్ గణనీయంగా పడిపోతే.. ఆ ప్రభావం మూలధనంపై లేదు. ఆ మరుసటి బుల్ గట్టిగా పరిగెత్తితే పరిస్థితి సెట్ అయిపోతుంది. బుల్ రంకెలకు, బేర్ దూకుడుకు వెరవకుండా మ్యూచువల్ ఫండ్స్ కొనసాగించగలిగితే...  కోటి ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి నెలకు ఎబ్ల్యూపీ ద్వారా 50 వేలు (6 శాతం) తీసుకున్నా... పదేండ్లు గడిచేసరికి  అతని మూలధనం సుమారు 2 కోట్లకు చేరుతుంది. ఏడాదికి 6 లక్షల చొప్పున పదేండ్లు లో ఆ వ్యక్తి 60 లక్షలు తీసుకున్నా.. మూలధనం డబుల్ అవుతుండటం గమనించా ల్సిన విషయం. ఎప్పుడైతే మూలధనం రెండు కోట్లకు చేరుకుంటుందో.. అప్పుడు ఎస్డ బ్ల్యూ ద్వారా నెలకు లక్ష (6 శాతం) వస్తుంది. మళ్లీ పదేండ్లలో మూలధనం రమారమి  4 కోట్లకు పడగలెత్తుతుంది. నెలకు లక్ష చొప్పున ఈ పదేండ్లలో 1.20 కోట్లు అందుకున్నామంటే నమ్మబుద్ధి కాదు.  కోటి పెట్టుబడితోనే ఇవన్నీ సాధ్యం.

ప్రయత్నించి చూడు..

కోటి ఇన్వెస్ట్ చేసే స్థాయి లేదనుకుంటే.. 25 లక్షలతో ప్రయత్నించండి. అదీ కాకపోతే 10 లక్షలతో మొదలుపెట్టండి. రిటైర్మెంట్ ఫండ్లోంచి సగం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి... ఎడబ్ల్యూపీ ఎంచుకోండి. 10 లక్షలకు నెలకు 5,000 (పదేండ్లకు 6 లక్షలు) మీ ఖాతాలో జమవుతాయి. పదేండ్లలో మీ పది లక్షలు కాస్త ఇరవై లక్షలు అవు తాయి. ఇవే పది లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారే అనుకోండి. నెలకు గరిష్ఠంగా 6,000 వరకు వస్తుంది. పదిహేనేండ్ల తర్వాత కూడా మీ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం 10 లక్షలుగానే ఉంటుంది. అందుకే, పట్టుకోవడం కన్నా.. వదిలేయడం కూడా అదృష్టా న్నిస్తుంది. రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా జరగాలంటే ఓ పెద్దమొత్తం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి... దాన్ని కాలానికి వదిలేయండి. ఆ మొత్తం అక్కడున్నంత వరకూ కొంత వాటా వెనక్కి తీసు కుంటూనే.. మూలధనాన్ని కొండంత పెంచుకోవచ్చు.

నో టెన్షన్స్.

మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, ఎంత తరిగిందన్న విషయా లను పక్కన పెట్టండి. గడిచిన ఇరవై ఏండ్ల గణాంకాలు పరిశీలిస్తే మ్యూచువల్ ఫండ్స్ సగటు రిటర్న్స్ 13 శాతానికి పైచిలుకే ఉంటుందన్నది. ఈ లెక్కన దాన్ని ముట్టుకోకుంటే.. ఐదేండ్లకో సారి మూలధనం దాదాపు రెట్టింపు అవుతుంది. అదే swp ఆప్షన్ ను ఎంచుకుంటే గరిష్టంగా పదేండ్లకు ఒకసారి మూలధనం రెట్టింపు అవుతుంది. ఓ ఏడాది మార్కెట్ ఊహాతీ తంగా పడిపోయినా, మరుసటి ఏడాది నిదానంగా పెరిగినా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశిం చేవారు గాబరా పడాల్సిన పనిలేదు.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim