57. ఓడలు బండ్లయితే..!
'ట్రింగ్.. ట్రింగ్...' ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి ‘హాలో!’ అన్నాడు జమీందారు పెదపాలేరు. 'జమీందార్ గారి అల్లుడున్నాడా?’ అని అడిగాడా అవతలి వ్యక్తి. ‘ఉన్నారు బాబు..” అని అల్లుడు గారికి ఫోన్ ఇచ్చాడు సాంబయ్య. అప్పటిదాకా కులాసాగా ఉన్న అల్లుడుగారు ఫోన్లో మాట్లాడుతుం డగానే దిగాలుగా ముఖం పెట్టేశాడు. ఉన్నపళంగా కుదేలయ్యాడు. నిల్చున్నచోటే కూలబడిపోయాడు.
కారణం.. ఆ ఫోన్ చేసిన వ్యక్తి.. 'సింగపూర్ నుంచి బయల్దేరిన సరుకు ఓడలు తుఫాన్ ధాటికి సముద్రంలో మునిగిపోయాయని చావు కబురు చల్లగా చెప్పాడు. మామగారి ఆస్తిపై కూడా అప్పు చేసి పెట్టిన పెట్టుబడంతా కడలి పాలవ్వడంతో ఒక్క ఫోన్కాల్తో కోటీశ్వరుడు కాస్తా బికారిగా మారిపోయాడు. ఇలాంటి సన్నివేశాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చాలాసార్లు చూసే ఉంటాం. ఆగర్భ శ్రీమంతులైనా, నడమంత్రపు సిరి కలిసొచ్చినా... ఐశ్వర్యం శాశ్వతం కాదన్న సత్యం గుర్తెరిగి ఉండాలి. 'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాల'న్న సామెత మర్చిపోతే..
దురదృష్టం వెంటాడిన నాడు అప్పటిదాకా అండగా ఉన్న అదృష్టం కూడా ముఖం చాటే స్తుంది. ఊహించని అద్భుతాలు జరిగితే నిరుపేద బతుకుల్లో, మధ్యతరగతి జీవితాల్లో రాత్రికి రాత్రి పెద్దగా మార్పులేం జరగవు. అదే మార్పు సిరిగలవాడింట చోటు చేసుకుంటే.. ఆ చేటును తట్టుకునే చేవ వారికి ఉండకపోవచ్చు. అలా జరగొద్దంటే... గల్లాపెట్టెలో కాసులు గల గలలాడుతున్నా, బోషాణంలో ఏడువారాల నగలు నిగనిగలాడుతున్నా, ట్రంకు పెట్టెలో దస్తా వేజులు దుమ్ముకొట్టుకుపోతున్నా... అనుక్షణం అప్రమత్తమై ఉండాల్సిందే! చిన్న ఏమరు పాటు వీటన్నిటినీ లాక్కెళ్లిపోయే ప్రమాదం ఉంది. ముప్పులు ముంచుకొచ్చే దాకా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే.. స్వీయ పతనానికి నాంది పలికినట్టే!
ఉద్యోగి సేఫ్..
ఆదాయం ఎలా వస్తుందన్న దానిపై కూర్చో ఆధారపడి ఉండాలి స్థలమైన ఆదాయం అంటే ఉద్యోగ అర్జితమై స్థిర చరవస్తుల ద్వారా సమకోరే సంపద ధైర్యాన్నిస్తుంది లక్షల్లో వేతనం వస్తున్న ఉద్యోగులు ఖర్చులు దగ్గర కాస్త తికమొక్క పడ్డ కొంపలో మునిగిపోవు తొందరపాటుతో ప్రయోజనం లేని పెట్టుబడి పెట్టినా తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. 3 లక్షల వేతనం పొందుతున్న కార్పొరేట్ ఉద్యోగికి ఈపీఎఫ్ కటింగ్ నెలకు 40 వేల వరకు ఉంటుంది. అంటే నెలకు ఏదోరకంగా 40వేలు పొదుపు చేస్తున్నట్టే కదా! కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ హెల్త్కేర్ కవర్ ఉంటుంది. వాళ్లు ఇతర ఇన్వెస్ట్మెంట్లు భారీగా చేయకపోయినా ప్రమాదం ఏం ఉండదు. వచ్చిన జీతంలో ఓ ఇల్లు, కారు, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. స్థిరమైన ఆదాయం లేనివాళ్లే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
తాత్కాలిక ఆనందాలొద్దు..
వ్యాపారంలో ఊహించిన దానికన్నా అధిక రాబడే వస్తుంది. అయితే ఆ వ్యాపారం సంఘటిత రంగానికి సంబంధించినదైతే పెద్దగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండదు. అసంఘటిత రంగాల్లో పెట్టుబడులు పెడుతూ, అయాచితంగా లాభాలు పొందుతున్న వారి విషయంలోనే ఎప్పుడేం ఉపద్రవం వచ్చిపడుతుందో చెప్పలేం. కొన్నేండ్లుగా రియల్ ఎస్టేట్ రంగం ఊహిం చని పురోగతి సాధిస్తున్నది. కానీ, ఈ రంగాన్ని ఆశ్రయించిన వారందరూ అదే స్థాయిలో వృద్ధి లోకి వచ్చారా? అంటే స్పష్టమైన సమాధానం దొరకదు. కారణం, జీరో బడ్జెట్తో
చేస్తూ, కమీషన్ల మీద కాలం వెళ్లదీసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వీరి ఆదాయం స్థిరంగా ఉండదు. ఎప్పుడో నక్కతోక తొక్కినట్టు ఓ డీల్లో బలంగా డబ్బు చేతికి అందుతుంది. ఆ సొమ్మును అవగాహనా రాహిత్యంతో వృథా చేస్తున్నవాళ్లే ఎక్కువ మంది ఉంటారు! కష్టం లేకుండా వచ్చే సొమ్ము తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేకూర్చదు. ఎలా సంపాదించిందీ పక్కన పెడితే... మీ ఆదాయాన్ని సుస్థిరం చేసుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం స్థిరాస్తి కొనుగోళ్లు ఒకమార్గం! ఆస్తులు జాస్తిగా ఉన్నా.. అవసరానికి రూపాయి పుట్టాలంటే లిక్విడ్ అసెట్ రూపంలోనూ ఆస్తులు కూడగ ట్టాలి. ఆదాయంలో ముప్పయ్ శాతానికి తగ్గకుండా పిల్లలు, జీవిత భాగస్వామి పేరిట స్థిరచ రాస్తులు సమకూర్చుకోవాలి. ఈ ముప్పయ్ శాతంలో సింహభాగం పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా లిక్విడ్ అసెట్స్ రూపంలో సమకూర్చుకుంటే.. ఓడలు బండ్ల యినా, రాత్రికి రాత్రి నసీబు మారిపోయినా.. 'ఎంత చెట్టుకు అంతగాలి' అని బ్లాక్ అండ్ వైట్ సినిమా డైలాగ్లు చెప్పాల్సిన పరిస్థితి రాదు.