54. క్లైమాక్స్ లో కష్టాలెందుకు?
శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయ్యిం దిరా? ఎన్నేళ్లయ్యిందిరా సంతృప్తిగా రెండుపూటలా భోజనం చేసి?..' శంకరాభరణం సినిమాలో అల్లు పాత్ర శంకరశాస్త్రిని నిలదీస్తూ అనే మాటలివి! సినిమాలో అంటే.. సంగీతంపై మమకారంతో శంకర శాస్త్రి అన్ని మాటలూ అనిపించుకు న్నాడు. కానీ, నిజ జీవితంలో శేష జీవితాన్ని విశేషంగా గడిపే అవకా శాలు ఉన్నా... కడుపు మాడ్చుకునే పెద్దమనుషులు ఎందరో కనిపిస్తారు.
లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బతు కీడుస్తుంటారు. రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టింది అంతా వారసులకు ధారపోసి అనామకంగా మిగిలిపోతున్నారు! అలాంటి కష్టం మీకు రావొద్దంటే ఇలాంటి షరతులకు లోబడకండి...
భారతదేశంలో సీనియర్ సిటిజన్లు పేదరికంలో బతుకుతున్నారు... ధనవంతులుగా పోతు న్నారు' అని ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. పేదరికంలో ఉన్న మనిషి పోయాక శ్రీమంతుడు కావడం ఏమిటి? అనే సందేహం రావచ్చు. ఆస్తులు కూడబెట్టడం ప్రథమ కర్తవ్యం గాభావించే కొందరు వాటిని తమ సొంతానికి అనుభవించడానికి తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఆ ఆస్తులను కూడా పెట్టే క్రమంలో ఆచరించిన కఠిన నియమాలే ఆ తర్వాత కొనసాగిస్తారు. సంపాదనంతా ప్రాపర్టీల రూపంలో ఉండటంతో... రోజువారీ ఖర్చులకు కావాల్సిన డబ్బు అందుబాటులో ఉండదు. దీంతో ఆస్తిపత్రాల్లో అష్టలక్ష్ములు కొలువుదీరినా.. కరెన్సీ దగ్గర పరిస్థితులు తలెత్తిన సెంటు భూమి అమ్మి సొమ్ము చేసుకోవడానికి సాహసించరు. తరతరా లకు తరగని ఆస్తులు సంపాదించిన వీరిని వారసులు సరిగ్గా గౌరవిస్తారా అంటే.. కొందరి విషయంలో అది అత్యాశే అవుతుంది. సినిమాల్లో చూపినట్టు.. 'ఈ మనిషి పోతేగానీ, ఆస్తి మనకు దక్కదు' అన్నట్టు వ్యవహరిస్తుంటారు!
ఆస్తి- ఆదాయం.
నిజమైన ఆస్తి అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి! కష్టాలపాలు కాకుండా చేసేదే అస లైన సంపద నష్టకాలంలో ఆదుకునేదే సిసలైన ఆస్తి. ఈ రెండిటికీ పనికిరానప్పుడు ఎన్ని ఉండి ఏం లాభం. ఆస్తులను బట్టి జీవన విధానం ఉండదు. ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేసినప్పుడు దాని నుంచి ఎంతో కొంత ఆదాయం వస్తుండాలి. సంపద సృష్టించని ప్రాపర్టీలు ఎన్ని ఉన్నా నిరర్థకమే! ఒక వ్యక్తి జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఊరి చివర ఓయ్యి గజాల ప్లాట్ కొన్నాడు! తన తదనంతరం దాన్ని ఇద్దరి బిడ్డలకు, కొడు కుకూ సమాన వాటాలుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఆప్యాయతలకు అంతంతమాత్రమే విలువ ఇస్తున్న ఈ రోజుల్లో.. ఎప్పుడో వచ్చే ఆస్తి కోసం ఈ మనిషి బాగోగులు చూసే పరిస్థితులు లేవు పైగా ఎప్పుడో చేతుకొచ్చే భూమిలో ఆ ముగ్గురికి సమాన వాటాలు ఇవ్వాలన్న డిమాండ్లు మాత్రం రోజూ వినిపిస్తూ ఉంటాయి. ఇదే మనిషి ఆ డబ్బులో కొంత మొత్తం ఓ పొలం కొంటే పంట రూపంలో, ఇల్లు తీసుకుంటే అద్దె రూపంలో ఆయన జరిగిపోయే వరకూ నెలవారీ ఆదాయం సమకూరుతుంది. మిగిలిన సగం మొత్తాన్ని బ్యాంకులో ఎఫ్డి చేస్తే.. వడ్డీ వస్తుంటుంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో బతకాల్సిన అవ సరం ఉండదు.
రిలీఫ్ ఇవ్వండి..
సినిమా హిట్టు కొట్టాలంటే... ఫస్టాఫ్ ఎలా ఉన్నా, సెకండాఫ్ పక్కాగా కుదరాలి. క్లైమాక్స్ లోనూ కష్టాలే ఉంటే.. ప్రేక్షకులు పెదవి విరుస్తారు. జీవిత చరమాంకం కూడా సజావుగా సాగాలి. ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలంటే ప్రతి నెలా పక్కా ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. జీవనశైలికి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. వృద్ధాప్యంలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. రిటైర్మెంట్ డబ్బులు రాగానే, కొడుకులు-కోడళ్లు, కూతుళ్లు-అల్లు ళ్లను పిలిచి వచ్చిందంతా ఇచ్చేసి.. బాధ్యత తీరిపోయిందనుకుంటే.. పొరపాటు. ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి రిటైర్మెంట్ లైఫ్ ఒక రిలీఫ్ కావాలి. అలా అవ్వాలంటే.. మీ సొత్తు మీ చెప్పుచేతల్లో ఉండాలి.
అది నిరర్థకమైన ఆస్తులుగా కాకుండా.. ఆదాయాన్ని సమకూర్చేవిగా, లిక్విడ్ అసెట్స్ రూపంలో ఉండేలా చూసుకోవాలి. కోటి రూపాయలు ఉన్నాయనుకోండి.. బ్యాంకులో ఎఫ్ డి, చేస్తే నెలకు 60 వేలు వస్తుంది. దాంతో దర్జాగా బతికేయొచ్చు. మీ తదనంతరం ఆ కోటీ నామినీలకే దక్కుతుంది కదా! ముందే ఆ కోటీ పంపకాలు చేసేస్తే.. మీ జీవిత కథ విషా దాంతం అవుతుందని గుర్తుంచుకోండి.