68. ఆ ఖాతాలు ఖర్చయిపోతాయ్.

ఆ ఖాతాలు ఖర్చయిపోతాయ్.

'మావాడు అమెరికా డాలర్లు పంపి స్తున్నాడు..' అని భారత్లో ఉన్న ఓ తండ్రి గొప్పలు చెప్పుకోవడం మామూలే! 'మా అమ్మాయి యూరోలు పంపిస్తుంటే.. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను' అని ఆ పిల్ల తండ్రి భవిష్యత్తుకు బాటలు పరుస్తుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. దేశం కానీ దేశంలో కష్టపడి సంపాదించిన సొమ్ము సద్వినియోగం అయితేనే కదా.. ఫలితం! కానీ, ఈ సొమ్ము భారత్కు ఎలా వస్తుందన్నది ప్రశ్న.

ఎన్నారైలుగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు భారత్లో అదే పల్లెటూరి బ్యాంకులో ఉన్న సేవింగ్స్ అకౌంట్ కు డబ్బులు పంపొచ్చా? ఆ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ లాంటివాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం... కాదు.. వీలు పడదు.. సమస్యాత్మకం అని చెప్పక తప్పదు!

విదేశాల్లో ఒళ్లు విరగ కష్టపడి సంపాదించిన సొత్తును సేవింగ్స్ ఖాతాలోకి మళ్లించడం ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది. ప్రతి పైసాకూ లెక్కున్నట్టే.. ప్రతి ఖాతాకూ షరతులు వర్తి స్తాయి. భారత్లో ఉన్నప్పుడు తెరిచిన ఖాతానే.. విదేశాల నుంచి కొనసాగిస్తానంటే ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజ్ మేనెజ్మెంట్ యాక్ట్) ఒప్పుకోదు. విదేశాల్లో సంపాదించింది డాలర్లు అయినా యూరోలు అయినా, మరే రూపంలో అయినా.. వాటిని భారత్లో దాచుకోవడానికి నిబంధనలు పాటించాలి. అవి తెలియక సేవింగ్స్ ఖాతాను విచ్చలవిడిగా వాడితే ఐటీ ఉచ్చు బిగుసుకోవచ్చు. ఆర్బీఐ నుంచి తాకీదులూ రావొచ్చు.

అప్గ్రేడ్ చేసుకోండి..

ఎన్ఆర్ఐలకు బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఆర్బీఐ ప్రత్యేకమైన వెసులుబాటు కల్పి చింది. వారికోసం ఎన్ఆర్తో, ఎన్ఆర్డస్ఈ, ఎఫ్సీఎస్ఆర్ఆ వంటి ఖాతాలు తెరుచుకునే అవ కాశం ఇచ్చింది. ఎన్ఆర్వో - నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్, ఎన్ఆర్ఆ- నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఖాతా, ఎఫ్సీఎన్ఆర్- ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ ఖాతాలు ఎన్ఆర్ఐ సేవల కోసం ఏర్పాటుచేసినవే! వీటి ద్వారా విదేశాల్లో సంపాదించే మొత్తాన్ని ఇండియాలో ఉన్న ఖాతాల్లో పొదుపు చేసుకోవచ్చు. ఆర్డినరీ అకౌంట్ విషయానికి వస్తే.. ఈ ఖాతాకు సంబంధించి లావాదేవీల్లో కొన్ని పరిమితులు ఉంటాయి. రోజువారీగా ఎంత వేయాలో, ఎంత తీయాలో బ్యాంకు షరతులకు లోబడి ఉంటాయి. ఒకరకంగా దీనిని సాధారణ సేవింగ్స్ ఖాతాగా పరిగణించాలి. విదేశాల్లో ఉండి.. భారత్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టా లన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎస్ఐపీ లాంటి ఆప్షన్స్ ఎంచుకోవా లన్నా.. ఎన్ఆర్ఈ ఖాతా కలిగి ఉండాలి.

ఇక అదేరూపంలో భారతీయ బ్యాంకులో పొదుపు చేయాలన్నా, వాటిని అదే రూపంలో మరెక్కడైనా ఇన్వెస్ట్ చేయదలచుకున్నా.. ఎఫ్సీఎస్ఆర్ ఖాతాను ఎంచుకోవాలి. అప్పుడే మీరు కష్టపడి సంపాదించే సొమ్ము చట్ట సమ్మతం అవుతుంది. అందుకే, ఎన్ఆర్ఐ హోదా పొందగానే మీ ఖాతా ఉన్న బ్యాంకుకు సమాచారం అందించి, వాటిని ఎన్ఆర్ఆ, యన్ ఆర్ ఈ  అకౌంట్లుగా అప్గ్రేడ్ చేయమని కోరండి. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పంపండి. ఎవరు అడుగుతారులే అని పాత సేవింగ్స్ ఖాతా నుంచే వ్యవహారాల్ని చేస్తానంటే మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, మీ చిట్టా అంతా పంప మని ఐటీ నిలదీసే వరకూ వెళ్లొచ్చు.

అలాగైతే చట్ట సమ్మతం..

ఎన్ఆర్ఎస్ఐ ఖాతాలకూ వడ్డీ సూత్రం వర్తిస్తుంది. మీ నిల్వలకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. ఒక వేళ కొన్నేండ్ల తర్వాత మీరు ఎన్ఆర్ఐ హోదా వదులుకుని, స్వదేశానికి వచ్చిన తర్వాత ఎన్ ఆర్ అకౌంట్లను ఆర్ఎఫ్సీ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఖాతాలో ఉండే మీ డాలర్లను, యూరోలను రూపాయలుగా మారకం చేసి లావాదేవీలు కొనసాగించే వీలు ఉంటుంది. ఈ ఎన్ఆర్ ఖాతాలను జాయింట్గానూ ఓపెన్ చేయొచ్చు. పార్టనర్ ఖాతా దారుడికి పూర్తిస్థాయి లావాదేవీల హక్కులు ఉండవు. ఏతావాతా విషయమేంటంటే.. కష్టపడి చదివి, విదేశాలకు వెళ్లింది.. ఊహించనంత సంపాదించడానికే! అక్కడ వేతన రూపంలో వచ్చే దంతా ప్యూర్వైట్ మనీ. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా మీరు దర్జాగా ఖాతాలో వేసుకున్న సొమ్ము చట్ట సమ్మతం కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే, ఫెమా నిబంధనలు తెలుసుకొని, బ్యాంకు అధికారులను సంప్రదించి.. ఎన్ఆర్ఎస్ఐ ఖాతాలను చట్టబద్ధంగా నిర్వహించుకుంటే ఎవరికీ ఏ సమస్యా రాదు!

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024