FP ramprasad 1.ఆరోగ్య ప్రాప్తిరస్తు.

1.ఆరోగ్య ప్రాప్తిరస్తు.

సగటు ఉద్యోగి అల్ప సంతోషి, చిన్న
హైకొస్తే చాలు సంబరపడతాడు.
కొద్దిపాటి ప్రశంసకే ఉబ్బితబ్బిబ్బవు
తాడు. కుటుంబంతో నెలకో
సినిమా, ఏడాదికో తీర్థయాత్ర.
చాలీచాలని సంపాదనలోనే
అందీ అందని సంతోషాలెన్నో
వెతుక్కుంటాడు. కానీ, చిన్న ఆరోగ్య
సమస్య అతని జీవితాన్నే
మార్చేస్తుంది. పట్టాలు తప్పిన
జీవిత రైలును మళ్లీ ట్రాక్ కి
తేవడానికి ఏండ్లు పట్టొచ్చు.

మనుషులు ఆచరించే ఆర్థిక విధానాలే వారి కుటుంబ స్థితిగతులను నిర్దేశి
స్తాయి. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నం
తలో ఉన్నతంగా బతకాలని ఆశిస్తుంటారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి
రూపాయి, రూపాయి కూడబెడుతుంటారు. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనే
దురాశతో అధిక వడ్డీల ఉచ్చులో చిక్కుకునే వాళ్లూ ఎందరో ఉంటారు! అయితే,
వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి
తనకు, తనను నమ్ముకున్న కుటుంబానికి రక్షణ కల్పించిన తర్వాతే.. ఇతర పెట్టు
బడుల గురించి ఆలోచించాలి.

ఆరోగ్య బీమాతో ధీమా.

ప్రతి కుటుంబానికి కావాల్సిన కనీస భద్రత ఆరోగ్య బీమా. ప్రతి ఖర్చునూ మనం నియంత్రిం
చవచ్చు. సంపాదనకు తగ్గట్టుగా అద్దె ఎంత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక శక్తి మేరకు
పిల్లలను ఏ బడికి పంపాలో తేల్చుకోవచ్చు. మన జేబు బరువును బట్టి రైలు ప్రయాణంలో ఏ
తరగతి టికెట్ కొనుక్కోవాలో కూడా మనమే నిర్ధారించుకోవచ్చు. మన చేతుల్లో లేనిది,
మనకు అందుబాటులో ఉండనివి దవాఖాన ఖర్చులు. ఆరోగ్యపరమైన సమస్యలు రానంత
వరకు ఆరోగ్య బీమా ప్రాధాన్యం తెలియదు. కానీ, అనారోగ్యం ఏర్పడే నాటికి బీమా లేక
పోతే, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులు అవ్వడానికి ఎంతో కాలం పట్టదు. వైద్యం

కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడటానికి ఒక్కోసారి పదేండ్ల సమయమూ
పట్టొచ్చు. విలువైన కాలమంతా రుణాలు తీర్చడానికి రుణం చేయాల్సి వస్తుంది. మంచి
ఆహార విధానం, సరైన జీవనశైలి పాటిస్తున్న తమకు అనారోగ్య సమస్యలు ఎందుకు తలెత్తు
తాయని కొందరు భావిస్తుంటారు. కానీ, ప్రమాదం రూపంలోనూ సమస్యలు చుట్టుముట్ట
వచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా మన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే.. 'ఏకైక మార్గం
ఆరోగ్య బీమా.

తప్పుడు సమాచారం ఇవ్వొద్దు.

బీమా గురించి సమాచారం తెలుసుకోవడంతోపాటు, పాలసీదారు సరైన సమాచారం
ఇవ్వాలి. బీమా ప్రీమియం పెరుగుతుందని పాత రుగ్మతలను దాచి పెడితే, క్లెయిమ్ రిజెక్ట్
అవ్వొచ్చు! ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలూ దాపరికం లేకుండా చెప్పాలి.
మధుమేహం, రక్తపోటు ఇలా అప్పటికే ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి తెలియ
జేయాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని బీమా ప్రీమియం నిర్ధారిస్తారు. చిన్నపాటి
వ్యత్యాసం కోసం ఉన్న రోగాలను దాచిపెడితే, అవసరానికి పాలసీ ఉన్నా ఉపయోగ
లేకుండా పోతుంది.

మధ్యలో ఆపొద్దు.

ఆరోగ్య బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోగానే చాలామందికి ఎలాగైనా
పాలసీ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ, పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత
ప్రీమియం చెల్లించేటప్పుడు ఉండదు. 'గడిచిన రెండేండ్లుగా ఏ ఆరోగ్య సమస్య తలెత్తలేదు
కదా!' అనుకొని మూడో సంవత్సరం ప్రీమియం చెల్లించడానికి వెనుకాడుతారు. కానీ, అదే
ఏడాది ఏదైనా సమస్య తలెత్తితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ప్రతి
కుటుంబానికి ప్రాథమిక రక్షణ ఆరోగ్య బీమా. పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా, మంచి
చదువుతోపాటు ఆరోగ్య రక్షణ కల్పించడం తల్లిదండ్రుల విధి.

ఎన్ని లక్షలు తీసుకోవాలి?

ఆరోగ్య బీమా తీసుకుంటే సరిపోదు, ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ముఖ్యం.
ప్రీమియం భారీగా ఉండొచ్చని చాలామంది తక్కువ మొత్తం కవరయ్యే బీమా చేస్తుంటారు.
ఓ రెండు లక్షలు వస్తే చాలు అనుకుంటారు. కానీ, వైద్యానికయ్యే ఖర్చులు భారీగా పెరుగుతు
న్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని నలుగురు సభ్యులున్న కుటుంబానికి కనీసం 25
లక్షల నుంచి  కోటి కవరయ్యే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. దీనికయ్యే ప్రీమియమ్
23 వేల 60 వేల వరకు ఉంటుంది. మన భవిష్యత్ అవసరాలకు అంటే 30
సంవత్సరాల తర్వాత అయ్యే మెడికల్ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయల
పాలసీ తీసుకోవడం ఉత్తమం.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim