FP ramprasad 19. ష్యూరిటీ.. రియాలిటీ.

19. ష్యూరిటీ.. రియాలిటీ.

ఒక సంతకం.. ఆటోగ్రాఫ్ బుక్ లో
పెడితే మరపురాని జ్ఞాపకంగా
మిగిలిపోతుంది. అదే సంతకం
హామీపత్రం మీద పెడితే.. హాని
కొనితెచ్చుకున్నట్టే. 'నేను జిమ్మేదారు'
అనే ఒక్కమాట అత్యవసర పరిస్థి
తుల్లో సదరు హామీదారుడి దారులు
మూసుకుపోయేలా చేసే ప్రమాదం
ఉంది. ష్యూరిటీలో ఉండే రియాలిటీ
తెలుసుకుంటే.. చిన్న సంతకం
ఎలాంటి విపత్తులను తీసుకొస్తుందో
అవగతమవుతుంది.


రంగారావు పొదుపరి, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నగర శివారులో
అందమైన విల్లా ఒకటి చూసాడు. చూడగానే నచ్చేసింది నచ్చగానే బిల్డర్ కు
బయానా ఇచ్చేశాడు. వారం తిరక్కుండా తను పొదుపు చేసుకున్న పది లక్షలు
అడ్వాన్స్ చెల్లించాడు. పత్రాలన్నీ తీసుకొని గృహ రుణం కోసం బ్యాంకు తలు
పుతట్టాడు. రంగారావు ఉద్యోగ వివరాలు, పే స్లిప్ చూసి మేనేజరు 'పక్షం
రోజుల్లో ఇల్లు మీ పక్షం అవుతుంద'ని చెప్పాడు. తీరా పదిహేను రోజుల తర్వాత
తను దరఖాస్తు చేసుకున్న రుణం తిరస్కరణకు గురైనట్టు వచ్చిన మెసేజ్ చూసి
రంగారావు కంగుతిన్నాడు. కంగారుగా బ్యాంకుకు వెళ్లాడు. విషయం ఏంటని
అడిగాడు.

'సిబిల్' స్కోర్ సరిగ్గా లేకపోవడంతో మీ రుణం తిరస్కరణకు గురైంది' అన్నాడు బ్యాంకు
మేనేజర్ ఆరా తీస్తే గతంలో రంగారావు పెట్టిన హామీ సంతకం.. ఇప్పుడు ఆయనకు రుణం
రాకుండా అడ్డుపడింది.

సిబిల్ స్కోర్పై ప్రభావం.

మధ్యతరగతి ఉద్యోగికి సంపాదన తక్కువ.. బాధ్యతలు ఎక్కువ. దీనికితోడు మొహమా
టమూ ఎక్కువే! తను మంచివాణ్ని అని రుజువు చేసుకోవడానికి అడిగిందే తడవుగా ష్యూరి
టీలు ఇచ్చేస్తుంటాడు. ఒక వ్యక్తికి హామీ ఇవ్వడం అంటే.. తర్వాత జరిగే పరిణామాలకు
పూర్తిగా తనే బాధ్యుడు అని ఒప్పుకోవడమే! సాధారణంగా చిట్స్, వ్యక్తిగత రుణం విష
యంలో సంస్థలు గ్యారెంటీ అడుగుతుంటాయి. తమ పైకంలో పైసా కూడా నష్టపోవొద్దని
సంస్థలు హామీ కోరుతాయి. అంటే, రుణగ్రహీత వాయిదాలు చెల్లించకున్నా, అనుకోకుండా
మరణించినా ఆ సొమ్మంతా పూచీకత్తు ఇచ్చిన వ్యక్తి దగ్గర వసూలు చేసుకునేలా చట్టపరమైన
భద్రత ఆ సంస్థలకు ఉంటుంది. అంతేకాదు, రుణం పొందిన వ్యక్తి వాయిదాలు ఆలస్యంగా
చెల్లించినా.. ఆ ప్రభావం ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి సిబిల్ స్కోర్పై పడుతుంది. పైన పేర్కొన్న
రంగారావు విషయంలో అచ్చంగా జరిగింది ఇదే! అతనికి ఎలాంటి రుణాలు లేకున్నా.. ఎవ
రికో హామీ ఇవ్వడం, అతను సరిగ్గా వాయిదాలు చెల్లించకపోవడం రంగారావు సిబిల్ స్కోర్
పతనానికి కారణమయ్యాయి.

మనవాడే అనుకుంటే..

ష్యూరిటీల విషయంలో చాలాసార్లు ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంటుంది. చిట్స్,
బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీ కోరుతాయి. 'మనవాడే కదా!' అనే చిన్న
అభిమానం ముందూవెనుకా ఆలోచించకుండా గ్యారెంటీ సంతకం చేయిస్తుంది. మంచివ్యక్తికే
ష్యూరిటీ ఇచ్చినా.. ఆ తర్వాత అతని పరిస్థితి తలకిందులు అవ్వదన్న గ్యారెంటీ ఏముంది ?
అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అప్పు ఇచ్చిన సంస్థలు చట్టపరంగా వాయిదాలు
వసూలు చేసుకోవడం మొదలుపెడతాయి. ఒక్కోసారి అసలు లక్ష రూపాయలే అయినా..
వడ్డీతో మూడు లక్షలు కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. స్నేహితుడికి ఇచ్చిన హామీ.. కుటుంబానికి
హానిగా పరిణమించే ప్రమాదం ఉంది. ఒక్కసారి పూచీకత్తు ఇస్తే ఆ ఉచ్చు తొలగిపోయే వరకు
మెడమీద కత్తి వేలాడుతున్నట్టే అని గుర్తించాలి.

నొప్పింపక తానొవ్వక.

'అంత్య నిష్టూరం కన్నా.. ఆది నిష్టూరం మేలు' అని పెద్దల మాట. ఎవరైనా పూచీకత్తు
ఇవ్వమని అడిగినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి వారికి వివరించండి. హామీ ఇవ్వలేనని
నిర్మొహమాటంగా చెప్పేయండి. అవతలి వ్యక్తి మెహర్బానీ కోసం సంతకం చేస్తే సమస్యలు
కొనితెచ్చుకున్నట్టే!

స్నేహితులు అన్నాక ఒకరికొకరు ఆ మాత్రం సాయం చేసుకోలేరా అనుకోవచ్చు. అంతగా
కావలసినవాడు అయితే, ఉన్నదాంట్లో లక్షో, రెండు లక్షలో అప్పుగా ఇవ్వండి. వాయిదాల
పద్ధతిలో తిరిగి చెల్లించమని చెప్పండి.

'గ్యారెంటీ ఇవ్వకపోతే మిత్రత్వం, బంధుత్వం దెబ్బతినవచ్చు' అని భయపడుతున్నారా?
ఆర్థికాంశాలే ప్రధానంగా భావించే వ్యక్తులు ఇలాగైనా మీకు దూరమవడం మంచిదే కదా!

హామీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడితే.. ఆ అప్పు మీదిగా భావించి సంతకం పెట్టండి.
రుణం తీరే వరకు మీరు, మీ కుటుంబం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారన్న సంగతి
విస్మరించవద్దు.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim