FP ramprasad 16.మాంద్యం ముంచుకొచ్చినా..


16.మాంద్యం ముంచుకొచ్చినా..

సగటు ఉద్యోగికి భయం..
మాంద్యం వస్తే తన కొలువు
పోతుందేమోనని! వ్యాపారికి
వణుకు.. అమెరికాలో మాంద్యం
ప్రకంపనలు సృష్టిస్తే.. ఇక్కడ తన
పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందని!
పది, పదిహేనేండ్లకు ఒకసారి
మాంద్యం ప్రపంచాన్ని తాకుతుంది.
అంతమాత్రాన టెంటేలెత్తిపోవద్దు,
ఒకవేళ ఆర్థిక మాంద్యం ఏర్పడినా..
బతుకు భారం కాకుండా
జాగ్రత్తలు తప్పనిసరి,


ఆర్థిక మాంద్యానికి నిపుణులు రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు. అయితే,
ఉన్న ఉద్యోగాలు కోల్పోవడం, కొత్త కొలువులు లభించకపోవడం
మాంద్యం వల్ల తలెత్తే ప్రధాన సమస్య. ఇలాంటి పరిస్థితులు ప్రపంచానికి కొత్త ఏమి 
కాదు. 1929లో అమెరికా మాంద్యంలో కూరుకుపోయింది. 2000 సంవత్స
రంలో, 2008లోనూ ప్రపంచ ఆర్థిక రంగం దీని బారినపడింది. అయితే,
మాంద్యం ప్రభావం ఏడాది నుంచి ఏడాదిన్నర వరకే కొనసాగుతుందని గత
అనుభవాలు చెబుతున్నాయి. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ కొలువులో
కుదురుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ, మాంద్యం పడగలో ఏడాది గడపడా
నికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అత్యవసరం.

అనుకోని సెలవులు.

మిగతా రంగాలతో పోలిస్తే  మాంద్యం ప్రభావం అత్యధికంగా ఉండేది ఐటీ సెక్టార్పైనే! 
గడిచిన రెండేళ్లలో ఐటి ఉద్యోగుల వేతనాలు అంచనాలకు మించి పెరిగాయి. పైగా ఈ 
రంగంలో రికార్డు స్థాయిలో నియమకాలు జరుగుతున్నాయి. మూడ్ లైట్ పేరుతో జంట 
ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు. అన్నిటిని మించి ఆర్థికంగా క్రమశిక్షణ పాటించేవారికి 
ఉన్న ఫలానా ఉద్యోగం ఊడిన మిల్లు విరిగి మీద పడేదే ఉండదు. ఏదో జరిగిపోయిందని 
హైరానా పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. పొదుపు చేసుకున్న డబ్బులను పదిలంగా
వాడుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. మాంద్యం ప్రభావం గరిష్ఠంగా 18 నెలలకు మించి
ఉండదని నిపుణుల మాట. అదృష్టం బాగుంటే ఈలోపుగానే మరో ఉద్యోగం దొరకొచ్చు. రాక
పోయిన ఏడాదిన్నర తర్వాత మళ్లీ కొత్త ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకంతో
ఉండాలి. తీరిక లేని బిజీలైఫ్లో అనుకోకుండా సెలవులు వచ్చాయని భావిస్తే ఉద్యోగం
పోయిందన్న దిగులు ఉండదు.

'పొదుపు'గా వాడుకుంటే..

ఉద్యోగం ఊడుతుందనిఇదైపోతుంటే.. సెలవులు అనుకోవడం ఏంటి? అంటారా! మన ఆలో
చనా సరళిని బట్టి జీవితం ఉంటుంది. మాంద్యమే వచ్చి ఉద్యోగం పోతే.. చేయగలిగేది ఏం
ఉండదు. అలాంటప్పుడు బెంగపడి సాధించేది ఏం ఉంటుంది! ఈ సమయంలో అపా
యాన్ని ముందే పసిగట్టి ఉపాయంతో గట్టెక్కినవాళ్లే సమర్థులు అనిపించుకుంటారు. భవిష్యత్
అవసరాలకు దాచుకున్న డబ్బును ఇప్పుడు నెలవారీగా వాడుకోవడం ఒక పరిష్కారం. 'బతి
కుంటే బలుసాకు తినొచ్చు' అనే నానుడి ఉండనే ఉందిగా! ఇంట్లో ఆభరణాలు ఉంటే వాటిని
కుదువ పెట్టి కష్టకాలాన్ని దాటేయొచ్చు. పిల్లల చదువుకని, ప్లాటు కొందామని దాచుకున్న
డబ్బును సైతం నిర్మొహమాటంగా వాడుకోవచ్చు. మళ్లీ ఉద్యోగంలో చేరాక అన్నీ సమకూర్చు
కోవచ్చు. అంతేకానీ, ఉద్యోగం పోయిందని, ఇక రాదని నీరుగారిపోతే వ్యక్తిగత సామర్థ్యం
మసకబారుతుంది. మాంద్యం ప్రభావం తగ్గిపోయిన తర్వాత కూడా ఉద్యోగాల రేసులో వెనక
బడే ప్రమాదం ఉంటుంది! కాకపోతే జీతం వస్తున్నప్పుడు ఖర్చు చేసినట్టు కాకుండా ఆచి
తూచి వ్యవహరించాలి. అమెజాన్ సీఈవో బెజోస్ చెప్పినట్టు ఆర్భాటాలకు పోతే పొదుపు
మొత్తం ఒక్క నెలలోనే కర్పూరంలా కరిగిపోతుంది. అలాకాకుండా, అందుబాటులో ఉన్న
డబ్బును అత్యవసరాలకు వినియోగిస్తూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మాంద్యం
లోనూ బేఫికర్ !!

రుణం కాదు భారం..

ఉద్యోగం పోయిందని తెలిస్తే ఆప్తులు కూడా అప్పు ఇవ్వని రోజులు ఇవి. అందుకే, ఉద్యోగం
కోల్పోతామని బలంగా భావించే వాళ్లు, జాబ్లో ఉండగానే పర్సనల్ లోన్ తీసుకోవడం ఒక
మార్గం. ఉదాహరణకు నెలకు 70వేలు వేతనం ఉందనుకోండి. 10 లక్షల వరకు
రుణం ఇట్టే పుడుతుంది. ఈఎమ్ఐ నెలకు 23వేల వరకు ఉంటుంది. కుటుంబ ఖర్చులకు
నెలకు 50 వేలు, రుణం వాయిదా కోసం 23 వేలు వాడుకున్నా.. ఏడాది గడిచిపో
తుంది. ఇంకాస్త పొదుపుగా ఉండగలిగితే ఏడాదిన్నర గడిపేయొచ్చు. కొన్ని ఆర్థిక సంస్థలు
ఓవర్ డ్రాఫ్ట్లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. మంజూరైన రుణం నుంచి వాడుకున్న
మొత్తానికే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఏడాది తిరిగేసరికి మాంద్యం ప్రభావమూ తగ్గుతుంది.
ఉద్యోగమూ వస్తుంది. తర్వాత తీరుబడిగా రుణ వాయిదాలు చెల్లిస్తే సరిపోతుంది.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim