28. పని చేయకుండా.. బతికేద్దామిలా!!
ఆర్థిక పరిభాషలో పాసివ్ ఇన్కమ్
అనే పదం ఇప్పుడు తెగ వైరల్ అవు
తున్నది. ఈ తరహా సంపాదనతో
కులాసాగా కాలం గడిపేయొచ్చన్న
భావన చాలామందికి వచ్చేసింది.
ఇంతకీ పాసివ్ ఇన్కమ్ (నిష్క్రియా
ఆదాయం) అంటే పని చేయకుండా
వచ్చే పైసలు అన్న మాట! అయితే
కాలు కదపకుండా కాసులు రాలా
లంటే.. అంతకుముందు యాక్టివ్
ఇన్కమ్ దండిగా సంపాదిస్తే గానీ,
పాసివ్ ఇన్కమ్ను అనుభవించలేం.
చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ నియమం. బలం ప్రయోగిస్తేనే శక్తి
ఉత్పన్నం అవుతుందని మరో భౌతికశాస్త్ర సూత్రం. అదే కెమిస్ట్రీకి వస్తే.. ఒక
రసాయన చర్యలో క్రియా జనకాలు సమపాళ్లలో కలిసినప్పుడే నిర్దేశిత క్రియా
జన్యాలు వస్తాయి. ఆర్థిక శాస్త్రానికి వస్తే కష్టపడితేనే పైస పుడుతుంది. క్రియ ఉన్న
ప్పుడే ఫలితం వస్తుంది. కానీ, నవీన ఆర్థశాస్త్ర పండితులు నిష్క్రియా పరత్వాన్ని
సైతం ఫైనాన్షియల్ ఫార్ములాగా అభివర్ణిస్తున్నారు. ఈజీ మనీ సూత్రాలన్నీ పాసివ్
ఇన్కమ్ నుంచి పుట్టుకొచ్చినవే!
యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చు, ఇన్స్టాలో ఇన్స్టాంట్గా వైరల్ అయిపో
వచ్చు అని చెబుతున్నారు. కానీ యూట్యూబ్ కింగ్ అనిపించుకోవాలంటే దాని వెనక
ఆహరహం శ్రమించాల్సి ఉంటుంది. ఎఫ్బీలో ఇన్ఫ్లూయెన్సర్గా కాసులు కొల్లగొట్టడం....
నార్మల్ పోస్టు పెట్టినంత ఈజీ కాదు. పాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా
సంపాదనకు షార్ట్కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు... ఆరు లైకులకు మించి సాధించేదేం ఉండ
దని ఆనక తెలుస్తుంది.
ప్రణాళికాబద్దంగా బతకడమే..
ఇంతకి నిష్క్రియా ఆదాయం అంటే ఏమిటి? పని చేయకుండా ఉండటం మాత్రం కాదు
ప్రణాళికా బద్దంగా పొదుపు చేసుకొని ఏ రందీ లేకుండా జీవితాన్ని వెళ్లదీయడం ఒక కళ! జీవి
తంలో ఒక్కొక్క ఖర్చు గురించి ఇంత మొత్తం ఆదాయాన్ని సిద్ధం చేసుకోవడమే పాసివ్ ఇన్
కమ్. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ముందస్తుగా పొదుపు చేయడం అన్నమాట! అందరూ
అలాగే చేస్తారుగా ఇందులో వింతేముంది అనుకోవచ్చు. ఇదీ అలాంటిదే. కానీ, ఇంకాస్త పక
దీగా వ్యవహరించడమే ఇందులో ఉన్న పరమార్థం. ఉదాహరణకు ప్రతినెలా ఇంటర్నెట్
బిల్లు 650 కట్టాల్సి ఉందనుకోండి. ఓ లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్
చేయాలి. దానిపై నెలకు 650 వరకు వడ్డీ వస్తుంది కదా! అలా వచ్చే మిత్తి సొత్తుతో ఇంట
రెట్ బిల్లు కట్టేయాలి. అప్పుడు మీ లక్ష బ్యాంకులో పదిలంగా ఉంటుంది. వచ్చే ఇంట్రెస్ట్
మీద మీ అవసరం తీరిపోతుంది. మీ రెగ్యులర్ ఆదాయంపై ఇంటర్నెట్ బిల్లు భారం పడ
కుండా ఉంటుంది. ఇలా మూలధనం నుంచి గానీ, ఆస్తి ద్వారా గానీ అవసరాలకు తగ్గట్లుగా
ఆదాయం సమకూర్చుకోవడమే పాసివ్ ఇన్కమ్. సంపాదన బలంగా ఉన్నప్పుడు ప్రత్యేక
సందర్భాల కోసం డబ్బును పదిలపరచి, ఆయా సమయాల్లో వినియోగించుకునే సొత్తు కూడా
ఈ కోవకే చెందుతుంది.
ముందస్తు అంచనాతో..
డబ్బు సంపాదించడం తేలికే! దానిని కాపాడుకోవడమే కష్టంతో కూడుకున్న పని. ఏ అవ
సురం ఎప్పుడు వస్తుందో ముందుగానే అంచనా వేయగలగాలి. ఊహించని పరిణామాల
సంగతి పక్కన పెడితే.. పిల్లల చదువు, పెండ్లిల్లు, సెటిల్మెంట్, రిటైర్మెంట్ ఇలాంటి విష
యాల్లో పక్కా ప్రణాళికతో ఉండాలి. ఆదాయాన్ని పొదుపు, మదుపు చేయడం ద్వారా భారీ
ఖర్చులు కూడా తేలికైపోతాయి. ఆదాయం ఘనంగా ఉన్నప్పుడు మూలధనాన్ని కదిలించకుం
డానే ఈ పనులన్నిటినీ చక్కబెట్టొచ్చు. పాసివ్ ఇన్కమ్ ప్రిన్సిపుల్ పదవీ విరమణ తర్వాత
చక్కగా ఉపయోగమవుతుంది. నెలవారీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వచ్చేలా చేసు
కుంటే... విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగించొచ్చు. చిన్నచిన్న పనులకే మూలధనాన్చి
కదిలిస్తూ ఉంటే.. భారీ అవసరం ఏర్పడినప్పుడు నిధుల కొరత రావచ్చు. దీనిని దృష్టిలో
ఉంచుకొని యాక్టివ్గా ఉన్నప్పుడే పావివ్ ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం తెలివిము
తుల పని!!
నెలవారీ రాబడి.
రెండు ఇండ్లు ఉన్నాయనుకోండి. ఒకదాంట్లో మీరు ఉంటే.. రెండో ఇంటిని అద్దెకు ఇస్తే ఆస్తి
ద్వారా నెలవారీ ఆదాయం సమకూరుతుంది. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే.. విలువ భారీ
గానే పెరుగుతుండొచ్చు. కానీ, దాన్నుంచి ప్రతినెలా రాబడి వచ్చే అవకాశం ఉండదు. ఆదా
యాన్నిచ్చే స్థిరాస్తులు ఉదాహరణకు వ్యవసాయ క్షేత్రాలు, ఇండ్లు లాంటివి, ఫిక్స్డ్ డిపాజిట్లు
ఇతర ఇన్వెస్ట్మెంట్ల ద్వారా పక్కా ఆదాయం సమకూర్చుకోగలిగితే.. అంతకన్నా దిలాసా
ఏముంటుంది చెప్పండి?