FP ramprasad 27. వారసులకు.. అప్పులు పంచొద్దు!


27. వారసులకు.. అప్పులు పంచొద్దు!

మన పిల్లలు 'ఇది నాన్న ఇల్లు',
'ఇవి నాన్న కారు'.. అని సగర్వంగా
చెప్పుకోవాలే కానీ.. 'ఇది నాన్న
బకాయిపడిన షావుకారు అప్పు',
ఇది నాన్న కట్టలేకపోయిన పర్సనల్
లోన్' అంటూ తిట్టుకునే పరిస్థితి
ఉండకూడదు. మనం ఉన్నా
లేకపోయినా, మన అప్పులు
మనమే తీర్చేయాలి. అందుకు తగిన
ఏర్పాట్లు చేసుకోవాలి.


రాంబాబు మధ్యతరగతి జీవి, వనస్థలిపురంలో అద్దె ఫ్లాట్. బంజారాహి
ల్స్ ఆఫీసు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లల్ని చదివించాలి. ఇంటికి
ఎంతోకొంత పంపాలి. ఆస్తులు కొనకున్నా, అప్పులు చేయకుండా బతికితే చాల
నుకునే మనస్తత్వం. అంతలోనే తండ్రి మరణ వార్త. కుటుంబంతో హుటాహు
టిన ఊరికి వెళ్లాడు. ఉన్నంతలో దశదిన ఖర్మ ఓ మోస్తరుగా చేశాడు. తిరుగు
ప్రయాణానికి టికెట్ బుక్ చేస్తూ ఉండగా..

ఇద్దరు అపరిచితులు ఇంటిముందు వాలారు. తాము ఫలానా బ్యాంకు క్రెడిట్కార్డు విభాగం
ఉద్యోగులమని చెప్పారు. 'మీ నాన్నగారికి మా బ్యాంకు క్రెడిట్ కార్డు ఉండేది. రెండేళ్ల నుంచీ
అసలు, వడ్డీ బకాయి పడిపోయింది. ఆయన మరణించారు కాబట్టి, చెల్లించాల్సిన బాధ్యత
మీదే' అని కాఫీ తాగుతూ తాపీగా చెప్పారు. కప్పులో చిక్కుకున్న ఈగ పరిస్థితి రాంబాబుది.
అవునననలేడు. కాదనలేడు. అంత డబ్బు తానెక్కడి నుంచి తెస్తాడు? ఆస్తులమ్మేసి తీరుద్దామా
అంటే.. పల్లెలోని ఇల్లు కూడా సొంతం కాదు. వాటాలు వేసుకుని వదిలించుకోడానికి తోబు
ట్టువులు కూడా లేరు. భర్త కష్టం చూడలేని ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకుంది. కన్నతల్లి మనసులోనే
కుమిలిపోయింది. వెంకట్రావు ఉదాహరణ కూడా ఇలాంటిదే. జూదానికి అలవాటు పడిపోయిన
తండ్రి కుటుంబాన్ని అప్పుల కుప్పల్లో వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. రుణదాతలు,
క్రెడిట్కార్డు కంపెనీవారు వెంకట్రావు ఇంటిమీద పడ్డారు. శాపనార్థాలు, హెచ్చరికలు,
నోటీసులు..ఆ ఒత్తిడికి ఆయనకు గుండెపోటు వచ్చినంత పనైంది.


తీర్చాల్సిందేనా?


కన్నవారి అప్పులకు పిల్లలు ఎంత వరకు బాధ్యులు అనేది రకరకాల అంశాలపై ఆధారపడి
ఉంటుంది. తండ్రి లేదా తల్లి పిల్లల అనుమతితోనో, పూచీకత్తుతోనో అప్పు చేసినట్టు ఆధా
రాలు ఉంటే మాత్రం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిందే. స్వయంగా పిల్లలే సహ-రుణగ్రహీ
తలు అయినప్పుడు కూడా తప్పించుకోలేని పరిస్థితి. కొడుకులు, మనవళ్లు, మునిమనవళ్లు...
ఎవరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. కానీ కొన్నిసార్లు 'అప్పులు తీరకపోతే పెద్దల ఆత్మ
శాంతించదు. మీకు మంచి జరగదు. ఆ తర్వాత మీ ఇష్టం' అంటూ రుణదాతలు వారసుల్ని
ఎమోషనల్గా దారికి తెచ్చుకుంటారు. దీంతో, బాధ్యత తీసుకుంటూ లిఖితపూర్వకంగా రాసి
చేస్తారు కొంతమంది. అదే కనుక జరిగితే, ఆరునూరైనా చెల్లించాల్సిందే. ఇంటినో, పొలాన్నో
తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను తనఖా రుణాలు లేదా సెక్యూర్డ్ లోన్స్ అంటారు. నిర్ణీత
వ్యవధిలో ఆ అప్పు తీరకపోతే.. కోర్టు జోక్యంతో జప్తు చేసి, వేలం వేసి బకాయిలను రాబట్టు
కునే హక్కు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, వ్యక్తిగత రుణదాతలకూ ఉంటుంది.

అప్పు తీరగా మిగిలిన వేలం సొమ్మును చట్టపరమైన వారసులకు ఇచ్చేస్తారు. ఏ పూచీకత్తూ
లేని వ్యక్తిగత రుణాలు, క్రెడిట్కార్డు చెల్లింపుల విషయంలో మాత్రం వారసుల్ని వేధించడం
అనైతికం. కాకపోతే, ఆ సంస్థలు కోర్టులను ఆశ్రయించినప్పుడు మాత్రం, విషయం న్యాయ
స్థాన పరిధిలోకి వెళ్తుంది. అంతిమ తీర్పును ఇరువర్గాలూ శిరసావహించాల్సి ఉంటుంది. ఆదా
యపన్ను బకాయిలు మాత్రం చెల్లింపుదారు మరణంతో పూర్తిగా రద్దయిపోతాయని గత అను
భవాలు చెబుతున్నాయి.

అప్పులకు బీమా.

మనం లేకపోయినా మన జీవితబీమా సొమ్ముతో మన కుటుంబం నిశ్చింతగా బతికేయాలి.
అప్పులేవైనా మిగిలి ఉంటే.. నయాపైసాతో సహా తీర్చేయగలగాలి. సాధ్యమైనంత ఎక్కువ
మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడే ఇదంతా సాధ్యం అవుతుంది. దాదాపు అన్ని
బ్యాంకులూ గృహరుణంలాంటి పెద్ద అప్పులకు అను బంధంగా వివిధ బీమా సంస్థల నుంచి
ఆ రుణ మొత్తానికి సమానమైన లోన్ కవర్/ లయబిలిటీ కవర్ ఇప్పిస్తున్నాయి. దీనివల్ల,
అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు.. బీమా సొమ్మును లోన్ అకౌంట్ు జమ చేసుకుం
టారు. ఫలితంగా కుటుంబానికి ఆర్థిక బాధ్యత ఉండదు, బ్యాంకు మీద బరువూ పడదు.
ప్రతి రుణానికి ఒక లోన్/ లయబిలిటీ కవర్'.. సూత్రమూ అనుసరించదగినదే. దీనివల్ల
వారసులు ఇబ్బంది పడరు. తీర్చగలిగే స్తోమత ఉంటే.. ఆస్తుల్ని తెగనమ్మి అయినా వదిలించు
కునే అవకాశం ఉంటే.. రుణబంధాన్ని తెంచుకోవడమే న్యాయం, నైతికం. అదే సమయంలో
తాను చేయని అప్పును నెత్తినేసుకుని భార్యాపిల్లల్ని వీధిపాలు చేయడమూ మంచిది కాదు.
మన పెద్దల సంగతి ఎలా ఉన్నా.. మనమూ ఇలాంటి పెద్ద తప్పు చేయకూడదు. వీలైతే,
ఎన్నోకొన్ని ఆస్తులు వదిలిపోవాలే కానీ, వారసుల్ని అప్పుల్లో ముంచేసి మన మానాన ముసుగు
అనంత లోకాలకు ప్రయాణం కాకూడదు. పిల్లల్ని ప్రేమించే ఏ కన్నవారూ ఇలా చేయరు.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim