8. ఇంటి అప్పు.. తప్పా..? ఒప్పా..?
సొంతింటి కల నెరవేరిన మరుక్షణం
నుంచి వాయిదాల పీడకలలు
కంటున్నారా? రుణపాశం బిగుసుకు
పోయిందే బాధపడుతున్నారా?
ముందుగానే రుణం తీర్చేయాలని
ఫిక్సయ్యారా? ఇలా ఆలోచిస్తే
గృహరుణంపై మీకు పూర్తిస్థాయి
అవగాహన లేనట్లే! వడ్డీ లెక్కలు నడ్డి
విరిచేస్తాయన్న అపోహతో
సొంతింటిని దూరం చేసుకోకండి.
జయంత్ కథ చదివితే ఎందుకన్నది
మీకే తెలుస్తుంది..
జయంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అదే కంపెనీలో పనిచేసే కల్యాణిని పెండ్లి చేసుకు
న్నాడు. ఇద్దరికీ కలిసి నెలకు రెండు లక్షల వరకు ఆదాయం ఉంది. జయం
త్కు కుటుంబ బాధ్యతలూ ఉన్నాయి. పొదుపుగా ఖర్చు చేస్తూ ఇద్దరూ 15
లక్షలు కూడ బెట్టారు. ఇల్లు తీసుకోవాలని అనుకున్నారు. మంచి ఏరియాలో ఒక
ఫ్లాట్ చూశారు. అన్నీ కలిపి 60 లక్షలు అవుతుందన్నాడు బిల్డర్. రిజిస్ట్రేషన్
అదనం. జయంత్, కల్యాణి ముచ్చటపడ్డారు. బయానా ఇచ్చి రుణం కోసం
బ్యాంకు తలుపుతట్టారు. వాళ్ల జీతభత్యాలకు 50 లక్షలు రుణం రెండు
రోజుల్లో మంజూరు అవుతుందని చెప్పాడు మేనేజర్.
తగ్గేది 5 లక్షలేనా..
మర్నాడు గృహరుణం, వాయిదాల చెల్లింపు వివరాలు విడమర్చి చెప్పాడు బ్యాంకు అధికారి.
50 లక్షల రుణం, 15 సంవత్సరాల కాలపరిమితి, 9 శాతం వడ్డీ ఆధారంగా రుణంపై
నెలకు 50,713 వాయిదా చెల్లించాల్సి వస్తుందని వివరించాడు. మస్తిష్కంలోనే లెక్కలన్నీ
వేసుకున్నాడు జయంత్. అంటే 50 లక్షల రుణానికి 15 ఏండ్లలో 91లక్షలకుపైగా
చెల్లిస్తామని అంచనావేశాడు. అంటే అసలు పోనూ 41 లక్షలు అదనంగా కడతామా?
ఆని బెంబేలెత్తిపోయాడు. ఆ దంపతుల ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ముందుగా
చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుందా అన్నాడు జయంత్ ! 'మీరు మూడేండ్ల తర్వాత రుణం పూర్తిగా
చెల్లించదలిస్తే 45 లక్షలు కట్టాల్సి ఉంటుంది' అన్నాడు బ్యాంకు అధికారి. మళ్లీ హతాశుడు
యాడు జయంత్. అంటే మూడేండ్లలో 18 లక్షలు కడితే.. అసలులో తగ్గేది 5 లక్ష
లేనా అని విస్తుపోయాడు.
అసలు తరగదు.
మర్నాడు తన స్నేహితుడు సుధీర్తో పరిస్థితి అంతా వివరించాడు జయంత్. 'ఈ విషయాలేవీ
తెలియకుండానే నేను లోన్ తీసుకున్నానా ?' అన్నాడు సుధీర్. ప్రశ్నార్థకంగా చూశాడు.
జయంత్. 'వాయిదాలో ఎంతమొత్తం వడ్డీకి పోతున్నది, ఎంత అసలు తగ్గుతున్నది అని
50 లక్షలు తెచ్చుకున్నావే అనుకో! నెలకు వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది' అడిగాడు సుధీర్.
50 వేలు అన్నాడు జయంత్. 'నెలకు 50 వేల చొప్పున ఎన్ని నెలలు కడుతూ
పోయినా.. అసలు గోరంత కూడా తరగదు కదా!' అని స్నేహితుడి వంక చూశాడు సుధీర్.
అంతే అన్నట్టుగా తలూపాడు జయంత్. 'అదే బ్యాంకులో రుణం.. వడ్డీతోపాటు అసలు
కూడా తగ్గుతూ పోతుంది. 15 సంవత్సరాలు అంటే 180 నెలలు. అసలు తగ్గే కొద్దీ వడ్డీ
మొత్తమూ తగ్గుతూ వస్తుంది. మనం చెల్లించే వాయిదాలో అసలు వాటా పెరుగుతూ
ఉంటుంది' అని వివరించాడు.
వడ్డీ బారాణే..
ఇన్ని చెప్పినా అర్థం కానట్టుగానే ముఖం పెట్టాడు జయంత్. 'నీ డౌట్ ఇంకా క్లియర్ కాలేదా!
ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంటి అద్దె ఎంత?' అని అడిగాడు. 'పదహారు వేలు..' అన్నాడు
జయంత్. 'ఇల్లు తీసుకుంటే ఆ పదహారు వేలు తప్పినట్టే కదా! అంటే నువ్వు ఎక్కువ కడుతు
న్నాను అని భావిస్తున్న వడ్డీ ఇంటి అద్దెకు సరిపోయినట్టే! నువ్వు లోన్ తీసుకుందాం అనుకు
న్నది ఐదోపదో కాదు. యాభై లక్షలు. అంతపెద్ద మొత్తం ఎవరు మాత్రం నీకు సాయం చేయగ
లరు. ఊళ్లో పొలం అమ్మి కట్టొచ్చు. కానీ, ఇంత చిన్న ఆస్తి కొనడానికే ఇంతలా ఇదైపోతు
న్నావు. ఆ ప్రాపర్టీ మళ్లీ కొనగలవా? సంవత్సరానికి 9 శాతం వడ్డీ అంటే.. నెలకు 75 పైసలు
మాత్రమే! దీనికి తోడు ఆదాయపన్ను మినహాయింపులోనూ ఇంటిరుణం చూపించుకునే
వెసులుబాటు ఉంది. మరేం ఆలోచించక.. గృహరుణం తీసుకో" అని సలహా ఇచ్చాడు సుధీర్.
ఇంత క్లియర్గా చెప్పావు. మా గృహప్రవేశానికి నువ్వే ముఖ్య అతిథి' అని బ్యాంకుకు బయల్దే
రాడు జయంత్.