FP ramprasad 25. ఎస్ఐపీ పజిల్ ఎప్పుడు ఆడాలంటే..

25. ఎస్ఐపీ పజిల్ ఎప్పుడు ఆడాలంటే..

ఆర్థిక ప్రణాళిక ప్రహేళిక లాంటిది.
పదకేళిలో అడ్డం గళ్లు, నిలువు గళ్లు
ఎదురుబొదురుగా తారసపడిన
సందర్భాలను సద్వినియోగం
చేసుకోకపోతే ఆదివారం కాలక్షేపం
నిస్తేజంగా మారుతుంది. అడ్డంలో
మొదటిది, నిలువులో రెండోది
పూరించకుండా అడుగేస్తే పదాల
పద్మవ్యూహంలో చిక్కుకుంటాం.
అలాగే.. పెట్టుబడి యాత్రలో
ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే..
చివరికి ఏ లాభమూ చేకూరదు.


జీతం రాళ్లు నాలుగు మిగలగానే అందరి ఆలోచనా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్
ప్లాన్ (ఎస్ఐపీ), మ్యూచువల్ ఫండ్స్పనే! వీటిని బంగారు గుడ్డు పెట్టే
బాతుగా భావిస్తుంటారు. తమతమ ఆర్థిక అవసరాలు, భవిష్యత్ ప్రయోజనాలపై
దృష్టి సారించకుండా ఇన్వెస్ట్మెంట్ అనగానే తాహతుకు మించి తహతహలాడు
తున్నారు. కానీ, ఓటు హక్కు రావడానికి 18 ఏండ్లు నిండాలన్న నియమం
ఉన్నట్టే.. ఈ తరహా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రాథమికంగా కొన్ని అర్హతలు
ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీ ఎవరు చేయాలో, ఎవరు చేయకూడదో
తెలుసుకోవడం మీ ఆర్థిక సమస్యల పూరణకు ప్రేరణగా నిలుస్తుంది!

ఇన్సూరెన్స్ లేకుంటే..

పునాది బలంగా ఉంటేనే నిర్మాణం దృఢంగా నిలబడుతుంది. మధ్యతరగతి ఉద్యోగి ఆర్థికంగా
నిలదొక్కుకోవాలంటే పెట్టుబడులు ఒక్కటే మార్గం అనుకుంటే పొరపాటు. ఊహించని
విపత్తులు ఎదురైనా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. కుటుంబానికి ఆరోగ్య బీమా, వ్యక్తిగ
తంగా జీవిత బీమా తప్పనిసరి. ఈ రెండు రక్షణ కవచాలు లేకుండా ఏ పెట్టుబడి అస్త్రం
ప్రయోగించినా అవి వికటించే ప్రమాదం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా
ఎస్ ఐ పి చేయొద్దు. ఇప్పటికే ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే వాటిని బ్రేక్ చేసైనా ఈ రెండు
బీమాలు తీసుకోవాలి.


ఏ అండా లేకుండా వద్దు..

నెలకు పదిహేను వేల చొప్పున పదిహేనేండ్లు కడితే.. కోటి రూపాయల నిధి తయారవుతుంద
న్నది. ఎస్ఐపీ సూత్రం! ఈ ఫార్ములా వినగానే అందరికీ ఆశ పుడుతుంది. నెలకు ముప్పయ్
వేలు కడితే 2 కోట్లు కూడబెట్టొచ్చు అన్న అత్యాశ కలుగుతుంది. అందుకే ప్రాథమిక అవ
సరాలను తోసిరాజని ఆకాశానికి నిచ్చెన వేస్తుంటారు. ఇది ఆ వ్యక్తికే కాదు, వారి కుటుంబా
నికీ భారంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఉదాహరణకు నెలకు లక్ష రూపాయల వేతనం
కడుతున్నాడు. రెండేండ్లు గడిచాయి. అనుకోని ప్రమాదం అతణ్ని ఆస్పత్రిపాలు చేసింది.
ఉన్న ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ చేయకుండా.. ఎస్ఐపీ మొదలుపెట్టాడు. నెలకు 15 వేలు
సర్జరీ చేయాలంటే 10 లక్షలు అవుతుందన్నారు వైద్యులు. ఎస్ఎస్ఐపీ బ్రేక్ చేస్తే 5 లక్ష
లకు మించి రావని తేలిపోయింది. ఆ వ్యక్తి నెలకు 15వేలు ఎస్ఎస్ఐపీ చేయకుండా, ఏడా
దికి 30 వేలలోపు వెచ్చిస్తే..  15 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేతిలో ఉండేది. నయా పైసా
ఖర్చు లేకుండా ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యేవాడు. ఒక వేళ ప్రాణానికే ప్రమాదం ఏర్పడితే, ఈ
రెండేండ్లలో కూడబెట్టిన మొత్తం కుటుంబానికి ఎన్నాళ్లు అండగా ఉంటుంది?

అప్పు తెచ్చి ఎందుకు?

ఎస్ఐపీ, మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఊహించని లాభాలు వస్తాయని కొందరి అంచనా!
అందుకే అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. పర్సనల్ లోన్ తీసుకొని దానిని పెట్టుబడిగా
మలిచి ఘనత సాధించిన వారిగా బావిస్తుంటారు. కానీ, మార్కెట్ అనుభవాల దృష్ట్యా ఎస్
ఐపీ రిటర్న్స్ గరిష్టంగా 14 శాతం వరకు ఉంటుంది. 14 శాతం వడ్డీకి అప్పు తెచ్చి.. ఇక్కడ
ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. అన్నిటికీ మించి ఈ తరహా ఇన్వె
స్ట్మెంట్ వ్యక్తిగత ఇష్టాల కన్నా, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఒకట్రెండ
సంవత్సరాల్లో అవసరం ఉన్నట్లయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఆరోగ్య బీమా, జీవిత
బీమాకు సరిపడా నిధులు కేటాయించుకున్న తర్వాతే ఇతర పెట్టుబడుల గురించి ఆలోచిం
చాలి. అప్పుడే మీరు తెలివైన ఇన్వెస్టర్ అనిపించుకుంటారు. ఆర్థిక ప్రహేళిక చివరి గడినీ సమ
ర్థంగా పూరిస్తారు.

మినిమమ్ కడుతూ ఉంటే..

క్రెడిట్ కార్డు బిల్లు మినిమమ్ కడుతూ రోజులు వెళ్లదీసే వాళ్లు ఏ తరహా పెట్టుబడి పెట్టడానికి
అర్హులు కారు. క్రెడిట్ కార్డుపై 40 శాతం వరకూ వడ్డీ కడుతూ, పదిహేను శాతానికి మించి
లాభాలు ఇవ్వని చోట అదృష్టాన్ని పరీక్షించుకుంటే దురదృష్టం ఎదురవుతుంది. ఇంటిలో
మీద టాప్ అప్ తీసుకొని ఏదో ఇన్వెస్ట్ చేయడం అమాయకత్వమే! కానీ, దీనివల్ల తీవ్రంగా
నష్టపోయినట్టు కొన్ని నెలలు గడిచిన తర్వాత గానీ బోధపడదు!!

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

chatgpt explanation: all retry messages in sap cpi, with example using jms sender.