FP ramprasad 38. వేలంలో ఇల్లు కొంటున్నారా?

38. వేలంలో ఇల్లు కొంటున్నారా?

సొంతింటి కల నెరవేరడం అంత
తేలికేం కాదు! కోరుకున్న ఇంటి ధర
అనుకున్న రేంజ్లో ఉండదు. తక్కువ
బడ్జెట్ ఇల్లు కోరుకున్నట్టు ఉండదు!
మార్కెట్ ధర కన్నా తక్కువలో మంచి
ఇల్లు సొంతం చేసుకునే అవకాశం
కోసం అందరూ ఎదురుచూస్తుం
టారు. అలాంటి వారికి ఆశాదీపం
బ్యాంకర్లు నిర్వహించే ఆస్తుల వేలం.
అయితే, బ్యాంకు వేలం వేసే ఇల్లు,
ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తే
అదనపు లబ్ధి కలుగుతుందా?

బ్యాంకు వేలం వేసే ఇండ్లు బహిరంగ మార్కెట్ ధర కంటే.. సుమారు
20 శాతం వరకు తక్కువగానే ఉంటాయి! బయటికన్నా తక్కువ ధర
పలుకుతుండటంతో వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలామంది
ప్రయత్నిస్తుంటారు. ఇలా తక్కువ ధర పలకడానికి అనేక కారణాలు ఉంటాయి.
ఏ బ్యాంక్ అయినా ఇంటి విలువలో 80 శాతం వరకు (30 లక్షల కన్నా
ఎక్కువ ఉంటే) మాత్రమే రుణం మంజూరు చేస్తుంది. దీనికితోడు సదరు ఇంటి
యజమాని ఒకట్రెండు ఏండ్లు గృహరుణం వాయిదాలు చెల్లించడంతో రుణం
మొత్తం కొంత తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వేలం వేసే ఇండ్ల ధరలు మార్కెట్ ధర
కన్నా తక్కువగా ఉంటాయి. దీంతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఈ-బిడ్డింగ్ లో
ఎవరు ఎక్కువ కోట్ చేస్తే ఇల్లు వాళ్లకు సొంతం అవుతుంది.

భవిష్యత్ ఆలోచించి..


తక్కువ ధరకు మంచి ఇల్లు పొందడం కన్నా ఆనందం ఏముంటుంది? కానీ, వేలంలో కొన్న
వాటికి అన్ని బ్యాంకులూ రుణం మంజూరు చేయకపోవచ్చు. దీంతో ఏదైనా నాన్ బ్యాంకింగ్
ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లో అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. బ్యాంకులతో
పోలిస్తే ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఇంటి ధర తక్కువ పలికినా.. వడ్డీ అది
కంగా ఉండటంతో, చెల్లించే మొత్తంలో మార్పు ఉండకపోవచ్చు! దానివల్ల తక్కువ ధరకు
మంచి ఆస్తి దక్కిందన్న సంతృప్తి ఆవిరైపోతుంది. వేలం పాటలో కొన్న ఇంటికి బ్యాంకర్ సేల్
డీడ్ ఇవ్వరు. సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల చదువుల కోసమో,
పెండ్లి కోసమో ఇంటి మీద రుణం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. నిరాశ ఎదురుకావచ్చు.
అందుకే ఒకే ఒక ప్రాపర్టీ కొనేవాళ్లు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేలం
ఇండ్లను కొనకపోవడమే మంచిదని చెబుతారు నిపుణులు, ఒకటికి మించి ఆస్తులు ఉన్నవాళ్లు
వేలంలో ఇంటిని కొన్నప్పటికీ ఇబ్బందేం ఉండదని పేర్కొంటారు.


అన్నీ పరిశీలించాకే..

అంతకన్నా ముందు, ఆస్తికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయేమో
తెలుసుకోవాలి. బ్యాంకువాళ్లు అమ్ముతున్నారు కాబట్టి లీగల్ సమస్యలు ఉండవని గుడ్డిగా
నమ్మడానికి వీల్లేదు! ప్రాపర్టీ వివరాలు న్యాయ నిపుణుడికి చూపించి ఏ చిక్కులూ లేవని నిర్ధా
రించుకున్న తర్వాతే వేలంలో పాల్గొనాలి. ఇంటి విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.
సదరు ఆస్తి యజమాని వాయిదాలు చెల్లించకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడం
మంచిదే! ఆ వ్యక్తి ఆర్థికంగా చితికిపోయాడా, మరేమైనా సమస్యలు ఎదుర్కొన్నాడా అన్నది
తెలుసుకుంటే వేలంలో పాల్గొనవచ్చో లేదో.. ఓ అంచనాకు రావచ్చు. నమ్మకాల సంగతి
అటుంచితే, మార్కెట్ ధర కన్నా తక్కువలో ఇల్లు వస్తుంటే కాదనుకోవడం సరైనది కాదు!
కానీ, కొనదలచిన ఇల్లు నచ్చినప్పుడే వేలంలో పాల్గొనాలి! అంతేకానీ, తక్కువలో వస్తుందని
నచ్చని ఇంటిపై ఇన్వెస్ట్ చేసి, జీవితకాలం రుణ వాయిదాలు చెల్లిస్తూ పోవడం మానసిక అశాం
తికి దారితీస్తుంది. అనవసరంగా కొత్త కొత్త బరువు నెత్తిన వేసుకున్నట్టు అవుతుంది.

ఎప్పుడు వేలం వేస్తారంటే..

ఇంటి యజమాని మూడు నెలలు వాయిదా చెల్లించకపోతే, బ్యాంకువాళ్లు నోటీసులు పంపు
తారు. దానికి కూడా స్పందించకపోతే సుమారు మూడు నెలలు గడువు ఇచ్చి.. 'ప్రాపర్టీని
వేలం వేస్తామ'ని నోటీసులు పంపుతారు. అప్పటికీ స్పందన కరువైతే.. న్యాయబద్ధంగా
చర్యలు తీసుకొని వేలంలో ఉంచుతారు. ఆ ఇంటిపై అప్పటివరకు ఉన్న రుణం మొత్తాన్నీ
వెలగా నిర్ణయిస్తారు! వేలం నిర్వహణ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. వేలంలో పాల్గొన
దలచిన వాళ్లు ముందుగా ఐదు శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో ఎక్కువ బిడ్
చేసిన వారికే ప్రాపర్టీ దక్కుతుంది. ఇంటిని సొంతం చేసుకున్న వాళ్లు బ్యాంకు నిర్దేశించిన
సమయం లోగా 20 శాతం చెల్లించాలి. తర్వాత 40 రోజుల్లోగా మిగతా మొత్తం చెల్లిస్తే ఆస్తి
వారి సొంతం అవుతుంది.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

chatgpt explanation: all retry messages in sap cpi, with example using jms sender.