FP ramprasad 17.బంగారం కొనాలా? వద్దా?

17.బంగారం కొనాలా? వద్దా?

అలంకరించుకుంటే ఆభరణం.
అప్పు పుట్టించే సాధనం. పెట్టుబడికి
సువర్ణావకాశం బంగారం.
భోషాణంలో ఎన్ని నగలు ఉన్నా..
కొత్తది కంటపడితే, దానినీ
కొనాలని కోరుకోవడం సహజం.
నాలుగు కాసులు వెనకేసుకోవాలని
భావించేవాళ్లు అవి బంగారం
రూపంలో అయితే మేలని భావిస్తుం
టారు. ఇంతకీ పుత్తడి మీద పెట్టు
బడి లాభదాయకమేనా? పసిడిని
ఎప్పుడు ఒడిసి పట్టుకోవాలి?


భారతీయ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే
మన దేశంలో సీజన్తో సంబంధం లేకుండా పుత్తడి కొనుగోళ్లు జోరుగా
సాగుతుంటాయి. ఆభరణాలుగా, కాయిన్లుగా, బిస్కెట్లుగా ఇలా రకరకాల
రూపాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారాన్ని పెట్టుబడి వనరుగానూ
చాలామంది భావిస్తుంటారు. అయితే, ఎప్పుడు కొనాలనే విషయంలో తర్జన భర్జ
నలు పడుతుంటారు. రకరకాల సూత్రాలు పాటిస్తుంటారు.

స్టాక్ మార్కెట్ జోరు మీదున్నప్పుడు పసిడి ధరలు తగ్గుతాయనీ, షేర్ మార్కెట్ బేర్ మంటే
పుత్తడి ధరలకు రెక్కలొస్తాయని అంచనాలు వేస్తుంటారు. కానీ, బంగారం ధరలు స్టాక్ మా
ర్కెట్ హెచ్చుతగ్గుల మీద కాకుండా, బ్యాంక్ వడ్డీ రేట్లపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయని
నిపుణుల విశ్లేషణ, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు తగ్గినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగు
తుంది. వడ్డీరేట్లు పెరిగినప్పుడు బంగారం కంటే.. ఎఫ్డి చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపు
కుంటారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుంటుంది.

భారీ లాభాలు ఉత్తమాటే.

బంగారాన్ని చరాస్తిగా పరిగణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో నష్టపోకుండా అమ్ముకు
కాశం ఉంటుంది. అవసరానికి కుదువ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది! అయితే, భారీ
బాలు ఆకాంక్షించేవారికి బంగారంపై పెట్టుబడుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపో
వచ్చు. 2012లో తులం బంగారం ధర (10 గ్రాములు) 31,000గా ఉంది. ఇప్పుడు
 70,000 వరకు పెరిగింది. అంటే బంగారం ధర పుష్కర కాలానికి 2.25 రెట్లు
రాబడి రాలేదు. కాకపోతే, రిస్క్ లేని పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తారు. అందుకే, ధరలు
పెరిగిందన్నమాట! గత పదేండ్ల గణాంకాలు పరిశీలిస్తే.. బంగారంపై 8 శాతానికి మించి
కాస్త తగ్గాయని వార్తలు గుప్పుమనగానే పుత్తడి కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తారు.


మంచి పెట్టుబడే..

లాభం ఎంత శాతం అనేది తర్కం పక్కన పెడితే.. బంగారంపై పెట్టుబడి మంచిదే! అయితే,
మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్తో పోలిస్తే దీర్ఘకాలంలో భారీ లాభాలైతే ఉండవు. కాక
పోతే రిస్క్ చాలా తక్కువ. షేర్ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుంటుంది. కాకపోతే,
లాభాలు ఎచ్చు గానే ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో రిస్కు తక్కువే బంగారం భద్రతను
సమస్యగా భావించేవాళ్లు బాండ్ల రూపంలో కొంటుంటారు. ఇక ఇంట్లో పాతిక తులాల నగలు
ఉన్నాయంటే.. ఏ బ్యాంకు లాకర్లోనో భద్రపరిచే వరకు నిద్ర పట్టదు. ఏదేమైనా పుత్తడిని
కేవలం పెట్టుబడి వనరుగానే పరిగణించొద్దు. స్థితిమంతులైనా, మధ్యతరగతి వాళ్లయినా
బంగారాన్ని ఇష్టంగా కొంటారు. సొంతంగా అలంకరించుకోవాలని, కూతురు పెండ్లికని అడ
పాదడపా ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. చిన్నదో, పెద్దదో నగానట్రా చేయిస్తూ
ఉంటారు. అయితే బంగారాన్ని ఖరీదైన లోహంగానే చూడాలి తప్ప, దాని మీద వచ్చే లాభాల
గురించి ఆలోచించొద్దు. నిగనిగలాడే నగను వేసుకున్నప్పుడు కలిగే సంతోషం ఎంత పెట్టుబడి
పెట్టినా రాదు కదా! అంటే బంగారం కొనొద్దు అనుకోకండి. ఒకేసారి లక్షలు వెచ్చించొద్దు.
కూతురు ప్రతి పుట్టిన రోజుకు తులమో, అరతులమో కొనండి. ఆమె పెండ్లినాటికి పదిహేను
నుంచి ఇరవై తులాల బంగారం సిద్ధంగా ఉంటుంది. పెండ్లి సమయంలో పెద్దమొత్తం ఖర్చు
చేయాల్సిన పరిస్థితి రాదు. శక్తి ఉంటే, అప్పటి వరకు దాచిన బంగారానికి మరింత జోడించి
పెండ్లి కూతురును 'కనక మహాలక్ష్మిలా ముస్తాబు చేయొచ్చు. మీరూ అవునంటారు కదా!!

అమెరికాలో పెరిగింది గోరంతే!

2012 ప్రాంతంలో అమెరికాలో ఔన్స్ బంగారం (28.34 గ్రాములు) ధర సుమారు 1,664
డాలర్లు. అప్పుడు మనదేశంలో బంగారం ధర సుమారు 31,000. 2022లో అదే ఔన్స్
బంగారం ధర అమెరికాలో 2684 డాలర్లు మాత్రమే! మన దగ్గరికి వచ్చేసరికి 
54,500గా ఉంది. పదేండ్లలో అక్కడ పెరిగింది వంద డాలర్ల లోపే! ఇక్కడ మాత్రం 75
శాతం వరకు పెరిగింది. బంగారంపై దిగుమతి సుంకం పెరగడం, డాలర్తో రూపాయి
మారకం విలువ దిగజారిపోవడం మనదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన
కారణం.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim