FP ramprasad 22. ఆస్తి బారెడు.. అవసరం తీరదు!

22. ఆస్తి బారెడు.. అవసరం తీరదు!

తరాలకు తరగని ఆస్తులు
ఉన్నా.. అవసరానికి డబ్బు లేక,
అప్పు కోసం పడిగాపులు
కాస్తుంటారు. నిజమైన ఆస్తి ఏంటో
తెలియకపోవడమే ఈ దుస్థితికి
కారణం. ఆస్తులు బారెడు ఉన్నా..
అవసరానికి డబ్బు అందుబాటులో
లేకపోవడాన్ని ఆర్థిక పరిభాషలో
'అసెట్ రిచ్.. క్యాష్ పూర్' గా
చెబుతారు. ఈ పదజాలం సంగతి
తెలుసుకుంటే నిజమైన ఆస్తి అంటే
ఏంటో అర్థమవుతుంది.

దొరలు దోచలేని, దొంగల ఎత్తుకుపోలేని నిజమైన ఆస్తి విద్య, పంచేకొద్దీ
పెరుగుతుంది ఇది. మిగిలిన ఆస్తులన్నీ కాలంతో కరిగిపోయేవే! అదేంటి,
స్థిరాస్తుల విలువ కాలంతో పరుగులు తీస్తూ పెరుగుతుంది కదా! అంటారేమో!!
కానీ, 'అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి' నానుడి ఉండనే ఉందిగా! స్థిరాస్తులు
కూడబెట్టడం విజయవంతమైన మదుపు విధానం అనడంలో ఎలాంటి సందేహం
లేదు. కానీ, సంపాదించినదంతా స్థిరాస్తి రూపంగా మారిస్తేనే సమస్య!

ఆస్తిపరుడు, ధనవంతుడు..

ఈ రెండిటి మధ్య హస్తిమశకాంతరం తేడా కనిపిస్తుంది. ఊరు చివర మామిడితోపుల్లో
మూడెకరాలు, నగర శివారులో ఓ ప్లాటు ఇలా లెక్కకు మించిన స్థిరాస్తులు ఎన్ని ఉన్నా..
అవసరానికి ఈ ఆస్తులు తనఖా పెడితేగానీ లక్ష రూపాయల అప్పు పుట్టదు. అదే మన
సంపాదనలో స్థిరాస్తితోపాటు లిక్విడ్ అసెట్ (నగదు రూపంలో ఆస్తి) కొంత భాగం కేటాయిం
చగలిగితే అత్యవసర పరిస్థితుల్లో అడ్డెకు పావు సేరుగా ఆస్తులు అమ్ముకునే దుస్థితి తలెత్తదు.

కొనేవాడు ఉండాలి..

చేతిలో డబ్బు ఉన్నవాడే నిజమైన శ్రీమంతుడని అంటారు ఆర్థిక రంగ నిపుణులు. ఎంత ఆస్తి
ఉన్నా.. అప్పు కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగేవారు చాలామంది తారసపడుతుం
టారు. అవసరానికి 'దేహీ' అనాల్సివస్తే ఎన్ని ఆస్తులు ఉన్నా ఏం ప్రయోజనం? ఆస్తుల విష
యంలో చాలామంది రెగ్యులర్ ఫార్ములాను ఎంచుకుంటారు. భవిష్యత్ అవసరాల కోసం
సైసాపైసా కూడబెట్టి ప్లాట్లు, పొలాలు, ఇల్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. చిట్టీలు
కట్టి అప్పులు చేసి మరీ ఆస్తులు కొంటారు. ఫలానా ప్లాటు పెద్దకూతురు పెండ్లికని, ఇంకో
ప్లాటు చిన్నకూతురు మెడిసిన్ కోసం అని మురిసిపోతారు. తీరా ఆ అవసరాలు ముందుకు
అన్నీ ఆ ప్లాటు మీదే పెట్టుకుంటే తాంబూలాలిచ్చేశాక ఆ యజమాని పడే పాట్లు అన్నీ
కావు. మంచి సంబంధం తప్పిపోతుందని, ముహూర్తం దగ్గర పడుతుందని మార్కెట్ వి
వలో సగానికే బేరం కుదుర్చుకుని మానసికంగానూ కుంగిపోవాల్సి వస్తుంది. దీనికితోడు కోట్ల
విలువ చేసే భూముల విషయంలో ఒక్కోసారి లీగల్ సమస్యలు ఉత్పన్నమై అసలుకే ఎసరు
రావొచ్చు. ఏ మహానుభావుడో అనుకున్న ధరకు ప్లాటు కొన్నా.. ఆ మొత్తాన్ని ఖాతాలోకి
పంపుతాడన్న నమ్మకం లేదు. లక్షలాది రూపాయలను నగదు రూపంలో చిన్నకూతురు మెడి
సిన్ ఫీజుగా చెల్లించే అవకాశం ఉండదు. ఇచ్చిన డబ్బుకు లెక్కా పత్రం చూపలేకపోతే కొత్త
ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదమూ ఉంది.

రాబడినిచ్చే ఆస్తులు.


కాలానికి తగ్గట్టుగా, రొటీన్క భిన్నంగా ఆలోచిస్తే మీ సంపాదనను బహుళార్ధ ప్రయోజనకా
రిగా మార్చుకోవచ్చు. ఆర్థిక లక్ష్యాల పరంగా ఆస్తులను సమకూర్చు కోవాలి. కొంత స్థిరాస్తి
కొనుగోలు చేయాలి. ఆదాయాన్ని ఇచ్చే స్థిరాస్తి అయితే మరీ మంచిది. ఇల్లు తీసుకుంటే
నెలకు అద్దె ఆదాయంగా వస్తుంది. దుకాణాల్లాంటి కమర్షియల్ ఆస్తుల ద్వారా రాబడి బాగుం
టుంది. పొలం తీసుకుంటే.. పెట్టిన పెట్టుబడికీ, వచ్చే ఆదాయానికీ పొంతన కుదరదు. ఆదా
యంలో కొంత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మార్కెట్లో హెచ్చుతగ్గు
లను అంచనావేస్తూ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, అవసరానికి కాస్త ముందుగానే
నగదు రూపంలోకి మార్చుకోవడం తెలివైన పని. అన్నిటికీ మించి మీ స్థాయికి తగ్గట్టుగా
కొంత మొత్తం నగదు రూపంలో మీ ఎఫ్డిలో ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఈ ఆర్థిక
సూత్రాన్ని పాటిస్తే 'అసెట్ రిచ్.. క్యాష్ రిచ్' కేటగిరీలో ఉంటారు కాబట్టి, ఏ అవసరం
వచ్చినా.. ఎవరి దగ్గరో చేయి చాచాల్సిన అవసరం ఉండదు.

మూడేండ్ల ముందుగానే.

అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆస్తులను నమ్ముకుంటే ఎంతోకొంత నష్టం తప్ప
ఉదాహరణకు కూతురు పెండ్లికి రెండు నెలల ముందు భూమి అమ్మకానికి పెడితే, అనుకున్న
మొత్తం వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. కూతురు పెండ్లీడుకు వచ్చినప్పటి నుంచి అంటే
పెండ్లికి మూడేండ్ల ముందుగానే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. మార్కెట్లో మంచి ధర పలికి
నప్పుడు స్థిరాస్తిని అమ్మేయడం మంచిది. వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ 
చేసుకుంటే.. గంటల వ్యవధిలో మీ నగదు మీ చేతుల్లో ఉంటుంది.

Popular posts from this blog

praveen samples: idoc2edi: step by tpm configuration, with payloads

50 questoins of grok questions.

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format