FP ramprasad 9. కారు ఎప్పుడు కొనాలి?

9. కారు ఎప్పుడు కొనాలి?

ధనవంతులు కావడానికి కష్టపడే
వాళ్లు తక్కువమందే ఉంటారు, కానీ,
శ్రీమంతులుగా కనిపించడానికి
తపించేవారే ఎక్కువ. ఇలాంటి వాళ్ళు
మూరెడు ఆస్తి లేకపోయినా బారెడు
ఆశలను మోస్తుంటారు. వాటిని
నెరవేర్చుకునే క్రమంలో భవిష్యత్తును
ప్రశ్నార్థకంగా మార్చుకుంటారు.
కొత్త కారు కొనడం, ఉన్న కారును
మార్చడం ఈ కోవలోకే వస్తాయి.
అసలు కారు ఎప్పుడు కొనాలి?
ఎంతలో కొనాలి?..

మనం మన ఆనందాలను, అవసరాలను కోల్పోవద్దు. అదే సమయంలో,
ఆ మాయలో పడిపోయి జీవిత అవసరాలను తక్కువ అంచనా వేయకూ
డదు. ఇంకా చెప్పాలంటే స్వల్పకాలిక ఆనందాల కోసం దీర్ఘకాలిక అవసరాలను
పణంగా పెట్టొద్దు. కారు కొనడాన్ని తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే నిర్ణయాల జాబి
తాలో చేర్చవచ్చు. ప్రస్తుత రోజుల్లో సొంతంగా కారు ఉండటం అనివార్యమని
భావిస్తున్నారు. అందులో తప్పు కూడా ఏం లేదు. కానీ, ఆ కారును ఎప్పుడు
కొన్నాం, ఎలా కొన్నాం అన్నది ముఖ్యం.

ఆ రెండూ తర్వాతే..

పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లాన్ దీర్ఘకాలిక అవసరాలు. వీటి తర్వాతే ఇల్లు, కారు, మరేదైనా!
దీర్ఘకాలిక అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికోసం పక్కాగా ప్రణాళిక అమలు
చేయాలి. ఈ రోజుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహా
రామే! రానున్న రోజుల్లో పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్ చదివించాలంటే నాలుగేండ్లకు
 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు కావొచ్చు. ఆ మేరకు ఆర్థిక వనరులు సమ
కూర్చుకోవాలి. ఎవరికైనా రిటైర్మెంట్ ప్లాన్ ముఖ్యమైనది. భార్యాభర్తలు ఇద్దరూ బతకడానికి
శ్రీ ప్రస్తుతం నెలకు 20 వేల వరకు ఖర్చు అవుతున్నది. మరో ఇరవై ఏండ్ల తర్వాత ఇ
బతకాలంటే కనీసం 50వేలు ఉండాల్సిందే! నెలకు అంతమొత్తం వచ్చేలా పెట్టుబడలు
పెట్టాలి. అయితే, చాలామంది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నిర్దేశించిన నిధులను కారు కొన్న
నికో, ఇంటి నిర్మాణానికి బదలాయిస్తుంటారు. ఫలితంగా భవిష్యత్ ప్రయోజనాలు దెబ్బ
ప్రమాదం ఉంటుంది.

వాయిదాలు పూర్తి కాకుండానే..

ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 వేల జీతం వస్తున్న ఉద్యోగికి దాదాపు 6 లక్షల కారు
లోన్ నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆ వ్యక్తికి ఉన్న కమిట్మెం
కమిట్మెంట్స్ లో కారు వాయిదాలు నిర్వహణ భారం కావచ్చు, లక్ష వేతనంగా తీసుకుంటున్న
ఉద్యోగి అంతకుమించి ఆదాయం ఉన్న వ్యక్తికి కారు కొనడం పెద్ద విషయం కాదు. కానీ,
గతంలో తీసుకున్న కారు వాయిదాలు పూర్తిగా కాకముందే దాని అమ్మేసి కొత్త కారు తీసు
కునే ఆలోచనల్లో పడుతుంటారు కొందరు. కారును స్టేటస్ సింబల్ గా భావించడమే ఈ వైఖ
రికి కారణం. నలుగురి మెప్పు కోసమో, స్థితి మంతుడు అనిపించుకోవాలనో కారు పట్ల
ఉత్సాహం కనబరుస్తుంటారు. ఇందుకోసం అప్పటివరకు పదిలంగా దాచుకున్న డబ్బును
డౌన్పేమెంట్ కట్టడం ఒకటైతే, ఆ మరుసటి నెల నుంచి కారు వాయిదాలు మొదలవడంతో
సేవింగ్స్ను కొన్నాళ్లు వాయిదా వేస్తారు.

మీరేంటో కారు చెప్పదు.

మనస్థాయి ఎవరికీ తెలియాల్సిన పన్లేదు. నలుగురి మెప్పు కోసం, పదిమందిలో డాబు కోసం
కారు కొనాలనుకోవడం తప్పే. రోల్స్ రాయిస్ అయినా, మారుతి అయినా ప్రయాణ
సాధనం మాత్రమే! స్థాయిని బట్టి కారు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, కారు మన
స్థాయిని పెంచుతుందని భావించొద్దు. మీ దీర్ఘకాలిక
అవసరాలు నెరవేర్చడానికి సరైన పెట్టుబడులు పెట్టారా, లేదా అన్నది చూసుకోవాలి. ఆ
తర్వాతే.. ఇల్లు, కారు, ఇతర లగ్జరీలు. ధనవంతులుగా కనిపించడం, ధనవంతులు కావడం..
రెండూ ఒకటి కాదు. ఈ సత్యాన్ని గ్రహిస్తే మేలు.

ఇలా ఆలోచిస్తే తప్పు.

నా పక్క ఫ్లాట్ ఓనరు పెద్దకారు ఉంది,
అంతకన్నా పెద్దకారు నాకు ఉండాల్సిందే
అనుకోవడం.

ఆ కొడుకో, కూతురో ముచ్చటపడ్డారని
అప్పటికప్పుడు ఉన్న కారును అమ్మకా
నికి పెట్టి, లగ్జరీ కారు కొనాలనుకోడం.

అవసరం లేకపోయినా అప్పటికే ఉన్న
ఫైవ్ సీటర్ కారును కాదని సెవెన్ సీటర్
కారు బేరం చేయడం.

నీ లెవెల్కు ఈ కారేంటి.. ఇన్నోవా
అయినా ఉండాల్సిందే' అనే స్నేహితుల
మాటలకు బోల్తాపడటం.

ఆ వీధి చివర ఇంట్లో కనిపించిన కారు
నచ్చిందని, బంధువుల్లో కారు లేకపోతే
నామోషీగా ఉంటుందని.. ఇలాంటి కార
ణాలతో కారు కొనాలనుకోవడం.

ధనవంతులుగా కనిపించడానికి పెద్ద
కారు కొనాలనుకోవడం.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim