FP ramprasad 26. మీ పిల్లలకు ఈ లెక్కలు చెప్పారా?

26. మీ పిల్లలకు ఈ లెక్కలు చెప్పారా?

మీ బుజ్జయికి అక్షరాభ్యాసం నాడు
ఓనమాలు దిద్దించి ఊరుకుంటే
సరిపోదు! చక్కటి విద్యాబుద్ధులు
నేర్పించాలి. అర్థం చేసుకునే వయసు
ఆర్ధిక పాఠాలు బోధించాలి.
రూపాయి రాకపోకల గురించి
చెప్పాలి. అప్పుడే వాళ్లకు పెద్దయ్యాక
డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని
ఎలా కాపాడుకోవాలో కూడా
తెలుస్తుంది. ఆర్థిక విషయాలపై
అవగాహన ఉన్నప్పుడే పెద్దయ్యాక
వాళ్లు ప్రయోజకులు అవుతారు.

పొదుపు మంత్రం పఠించడమే ఆర్థిక విజయానికి మూలధనం. ఆ సత్యం
తెలియకుండా మదుపు సూత్రాలు ఏమని బోధించగలం? ఇంట్లో ఆర్థిక
క్రమ శిక్షణ పాటించకుండా.. విత్త విధానాలు చిత్తగించమంటే ఎవరు మాత్రం
ఆలకిస్తారు? ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఆర్ధిక పాఠాలు బోధించే కార్పొరేట్
కోర్సులు కూడా వెలుస్తున్నాయి. లక్షల్లో ఫీజు కడితే గానీ, ఇందులో చేర్పించలేం.
తమ పిల్లలకు లెక్కాపత్రం పక్కాగా రావాలని ఆశించిన తల్లిదండ్రులు ఈ
కోర్సులకు జై కొడుతున్నారు. ఈ తరహా పాఠశాలల్లో ప్రత్యేకమైన కరికులం
పాటిస్తూ ఎనిమిదో తరగతి నుంచే ఆదాయ, వ్యయాల గురించి చెబుతున్నారు.
అయితే, కొందరు సంపన్నులను మినహాయిస్తే.. ఆర్థిక సూత్రాలు వంట బట్టించు
కోవడానికి అంతగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని గమనించాలి.

బ్రహ్మ పదార్థం కాదు..

అర్ధశాస్త్రం పుస్తకాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ అర్థం కాని బ్రహ్మపదార్థంగా భావిస్తారు.
చాలామంది. కానీ, 'లెక్కల బడి'లో ప్రాథమిక విషయాలను విస్మరించకుండా ఉండగలిగితే..
ప్రతి వ్యక్తీ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అంత ఆర్థిక పండితుడు అనిపించుకుం
టాడు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టాలన్నది ప్రాథమిక సూత్రం. ఖర్చులను
తగ్గించుకోలేనప్పుడు ఆదాయం పెంచుకోవాలన్నది రెండో నియమం. అపాత్ర దానం పనికిరా


దన్నది మూడో సూత్రం. ఈ మూడింటినీ పాటిస్తే.. ఏ ఇంటా ఆర్థిక సంక్షోభం అనే మాటే తలె
త్తదు. ఇంకా చెప్పాలంటే ఖర్చులపై అదుపు ఉన్నప్పుడే పొదుపైనా, మదుపైనా సాధ్యమవు
తుంది. ఈ దిశగా ఆలోచించే తల్లిదండ్రులు తాము ఎదుర్కొన్న పరిస్థితులను పిల్లలకు వివ
రించి, వారినీ తమ దారిలోనే నడవమని చెప్పవచ్చు. పిల్లలు మనం చెబితే నేర్చుకోరు.
మనల్ని చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు విచ్చల విడిగా ఖర్చులు చేస్తుంటే వారి
వారసులూ అదే పాటిస్తారు. పొదుపుగా వ్యవహారం నడుపుతుంటే వారికీ అదే అభ్యాసం
అవుతుంది. ఆదాయం ఎంత? ఖర్చులు ఎంత? ఇన్వెస్ట్ చేస్తున్నది ఎక్కడ? అందుకు కారణం
ఇవన్నీ వాళ్లు అం చేయడం మంచిది! అప్పు చేయడం వల్ల కలిగే అనర్థాలు వారికి
వివరించాలి.

అపజయాలూ పంచుకోండి..

ఆర్థికంగా మీ విజయాలు మాత్రమే కాదు, అపజయాలనూ పిల్లలతో షేర్ చేసుకోండి. ఎక్కడ
తప్పుడు నిర్ణయం తీసుకున్నది, దానివల్ల ఎంత నష్టపోయింది ఈ విషయాలన్నీ వవివరించండి.
అలాగని పిల్లలను నిరాశలోకి నెట్టమని చెప్పడం కాదు! ఆ తప్పును దిద్దుకోవడానికి
తామెంత కష్టపడాల్సి వచ్చిందో తల్లిదండ్రులు వివరిస్తే.. భవిష్యత్తులో పిల్లలు మళ్లీ ఆ తప్పు 
చేయకుండా ఉంటారు. లక్షల్లో వేతనం అందుకున్నా.. రాబడికి మించి ఖర్చులుంటే.. నెలలో
రెండోవారం నుంచే క్రెడిట్ కార్డు స్వైప్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అడ్వాం
బిడ్డలప్పుడే ఆర్థిక విధానాల గురించి వివరించండి. మీకు జీవితంలో ఎదురైన ఒడుదొడుకుల
మీ పిల్లలకు సోపానాలై, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తాయి.

వాళ్లకే అప్పగించండి.

పాఠాల కన్నా ప్రయోగాలే ఎక్కువ నేర్పుతాయి. చిన్నప్పటి నుంచి ఇంటి ఖర్చులపై పిల్ల
లకు అవగాహన కల్పించడం అవసరం. సూపర్ మార్కెట్కు వెళ్లినప్పుడు, అవసరమైన
వస్తువులు వాళ్లనే తీసుకోమని చెప్పండి. కావాల్సిన పదార్థం ధరలు బేరీజు వేసి, మంచివే
ఎంపిక చేయమనండి. బిల్ కౌంటర్ దగ్గరికి వారినే వెళ్లమని చెప్పండి.

ఏదైనా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశారే అనుకోండి. మీ బడ్జెట్ ఎంతో చెప్పి.. అందులోనే చర్చ
టన ప్రణాళిక తయారుచేయమని టాస్క్ ఇవ్వండి.

అడిగిన ప్రతిసారీ డబ్బు ఇవ్వకండి. కారణం సహేతుకమైనది అయితేనే ఇవ్వడం మంచిది.

వారి పేరిట మీరు ఎక్కడ పొదుపు చేస్తున్నదీ, స్కూల్ ఫీజ్ ఎలా కడుతున్నది, పై చదువు
లకు ఎలా ప్రణాళిక చేస్తున్నది.. ఇవన్నీ వారితో చెప్పడం వల్ల తమ చదువు కోసం తల్లిదం
డ్రులు ఎంతలా కష్టపడుతున్నారన్నది తెలుస్తుంది. భవిష్యత్తులో తాము ఎలా ఉండాలో
కూడా తెలిసివస్తుంది.

Popular posts from this blog

praveen samples: idoc2edi: step by tpm configuration, with payloads

50 questoins of grok questions.

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format