FP ramprasad 33. ఎంత కాలం? ఎంత మొత్తం?


ఎంత కాలం? ఎంత మొత్తం?

ఇప్పుడు మార్కెట్లో గట్టిగా వినిపిస్తున్న
పదం టర్మ్ ఇన్సూరెన్స్.
అయితే అందరూ కోటి రూపాయల
జీవిత బీమా దగ్గరే ఆగిపోతున్నారు.
జరగరానిది జరిగితే ఆ కోటి తమ
కుటుంబాన్ని నిలబెడుతుందని
భావిస్తున్నారు. కానీ, ఈ రోజు కోటి
పెద్ద మొత్తమే కావచ్చు. ఇరవై ఏండ్ల
తర్వాత కోటి విలువ పాతిక లక్షలు
దాటదు. ఈ క్రమంలో జీవిత బీమా
ఎవరు, ఎంతకు తీసుకోవాలో
స్పష్టత చాలా అవసరం.


జీవిత బీమా అనగానే సుదూర భవిష్యత్తును ఊహించేసుకొని 80 ఏండ్ల
వరకూ తీసుకుంటారు చాలామంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా
బీమా కాల పరిమితిని నిర్ణయించాలి కానీ, పాలసీదారుడి వయసు ఆధారంగా
కాదు. బీమా తీసుకునే వ్యక్తి తన కనిష్ఠ సంతానానికి 30 ఏండ్లు వచ్చేవరకు
పాలసీ కొనసాగేలా కాలపరిమితిని నిర్ణయించాలి. ముఖ్యంగా జీవిత బీమా
అంటే పాలసీదారుడు అనుభవించేది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అతనికి
ఏమైనా అయినప్పుడు బీమా మొత్తం కుటుంబానికి భరోసా ఇస్తుంది. పిల్లలు
జీవితంలో స్థిరపడిన తర్వాత బీమా మొత్తంతో పనే ఉండదు!

విలువలో తరుగు.

బీమా మొత్తం ఎంత తీసుకోవాలి అనే విషయంలోనూ స్పష్టత చాలా అవసరం. కోటి రూపా
యలు బీమా చేశానని భరోసాతో ఉంటారు. కానీ, ఇప్పటికిప్పుడు కోటి గొప్పే కావచ్చు. పాతి
కేండ్ల తర్వాత అదంత పెద్ద మొత్తంగా కనిపించకపోవచ్చు. పదేండ్ల కిందట వంద రూపా
యలు వెచ్చిస్తే నాలుగు కిలోల బియ్యం వచ్చేవి. మరి ఇప్పుడు రెండు కిలోలకు మించి
రావడం లేదు. ఇంకో పదేండ్లు పోతే.. కిలో వస్తే మహాభాగ్యం. పదేండ్ల కిందట వంద రూపా
యలే, ఇప్పుడూ అంతే, పదేండ్లయ్యాకా అదే వంద.. కానీ, దాని విలువ పడిపోతూనే ఉంది.
30 ఏండ్ల తర్వాత  100కు ప్లేట్ ఇడ్లీ కూడా రాదేమో! ఇదే సూత్రాన్ని టర్మ్ ఇన్సూరెన్స్కు
వర్తింప జేసుకోవాలి. సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా కన్నుమూస్తే అతని కుటుంబం ఏ లోటు
లేకుండా జీవితాన్ని కొనసాగించే భరోసా ఇవ్వగలిగే మొత్తానికి జీవిత బీమా తీసుకోవాలి.

వడ్డీతో నడవాలి..

ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వేతనం నెలకు 1.60 లక్షలు, తల్లి, భార్య, ఇద్దరు సంతానంతో
సంతోషంగా జీవితం గడిపేవాడు. పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించేవాడు. ఇద్దరికీ
కలిపి ఏడాదికి 3 లక్షలు ఫీజు చెల్లించేవాడు. లోన్లో ఇల్లు తీసుకున్నాడు. కోటి రూపా
యల ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఊహించని ప్రమాదంలో అతను కన్నుమూశాడు. నెల వ్యవ
ధిలో పాలసీ మొత్తం కోటి రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజి
చేసి వడ్డీ మీద సంసారం నడపాలని నిర్ణయించుకుంది ఆ ఇల్లాలు. పన్ను మినహాయించగా
నెలకు 45 వేలు రావడం మొదలైంది. గృహరుణానికి కూడా ఇన్సూరెన్స్ ఉండటంతో
వాయిదాలు బాగా తప్పింది. ఇప్పుడు ఆ కుటుంబంసంవత్సర ఆదాయము 5.40 లక్షల
పిల్లల స్కూల్ ఫీజు 3 లక్షలు పోతే ఇక మిగిలేది ఏముంటుంది? క్లాసు పెరిగే కొద్దీ
ఫీజులూ పెరుగుతాయి. అలాగని అసలు ఖర్చుపెడితే భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కోటి
రూపాయలు పెద్ద మొత్తం కూడా ఆ కుటుంబ కనీస అవసరాలకు సరిపోలేని పరిస్థితి. ఇలాంటి
దుస్థితి ఏర్పడకూడదు అంటే పాలసీదారుడు తన ఆదాయాన్ని, కుటుంబ అవసరాలకు ఆను
గుణంగా బీమా మొత్తం ఎంతో నిర్ణయించుకోవాలి తర్వాత రోజు తనకు ఏదైనా ఆపద వస్తే
కుటుంబ పరిస్థితి తలకిందులు కాకుండా అండగా ఉండేలా బీమా మొత్తం ఉండాలి. ఫిక్స్
డిపాజిట్ వడ్డీపై కుటుంబ అవసరాలు తీరేంత డబ్బుకు పాలసీ తీసుకోవాలి. నెలకు లక్షకు
పైగా జీతం సంపాదిస్తున్న వ్యక్తి 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు బీమా చేయాలి. కాల
పరిమితి పాలసీదారుడి వయసు 65 ఏండ్లు దాటకుండా చూసుకోవాలి. అప్పుడు తక్కువ
ప్రీమియంతో కుటుంబానికి అధిక ప్రయోజనం కలిగించిన వాళ్లం అవుతాం.

అవసరాలకు అనుగుణంగా..

1992లో లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ఉంటే అద్భుతం. ఇప్పుడు అదే లక్షతో నెల గడవడం
కష్టం. ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ప్రకారం కోటి రూపాయల విలువ 30 ఏండ్ల తర్వాత
12.50 లక్షలే! ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడాదికి 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాడు.
అనుకుందాం. ఏడాదికి 7 శాతం చొప్పున అతని జీతం పెరిగినా.. పదేండ్లకు 20 లక్షలు
అవుతుంది. అతని వార్షిక ఆదాయం 20 ఏండ్లకు 40 లక్షలు, 30 ఏండ్లకు 80
లక్షలు అవుతుంది. అదే వ్యక్తి  కోటికి జీవిత బీమా తీసుకుంటే.. 30 ఏండ్ల తర్వాత అతని
సంవత్సర ఆదాయానికి దాదాపు సమానం. ఇప్పుడు ఏడాదికి పది లక్షలకుపైగా ఆదాయం
ఉన్న వ్యక్తి కనీసం 3 కోట్ల నుంచి 5 కోట్లకు జీవిత బీమా తీసుకుంటే గానీ,అతని
కుటుంబ ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని అందించలేడు.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

chatgpt explanation: all retry messages in sap cpi, with example using jms sender.