pss గీత రత్నములు pss visitor requested.


విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మ తేజవదన భాసితుండు
సత్య శాంత రూప సద్గురు మూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.

అమృతంబు వంటి ఆత్మ బోధన వృష్టి శిష్య గణముపైన చింద జేసి
మృత్యు భయము తీర్చు అత్యున్న తాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.

జిహ్వ మీద వాణి జెలువార భక్తుల కాత్మ బోధ గరుప నలరువాడు
ముక్తిదాత యైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.

 కోటి జన్మలందు గూడిన కర్మల 
జ్ఞాన ఖడ్గ మిచ్చి నరక నేర్ప 
దివ్య బోధ చేయు ధీవిశారదుడైన
 శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
 
పాప భారమవని బాపంగ దలపోసి జన్మ మెత్తి నట్టి సాధుమూర్తి
కర్మ రహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.

ఓం వందే గురూణామ్ చరణావిందే సందర్శితస్యాత్మ సుఖావబోధే 
జనస్యయే జాంగళీ కాయమానే సంసారహాలాహల మోహష్యాంత్యై.

ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర :,
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః .

భావము : గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. ఇంకనూ సత్యము చెప్పాలంటే గురువే ఆత్మకంటే వేరైన మూడవ పురుషునిగానున్న పరమాత్మ. నిరాకారమైనవాడై సాకారముగా వచ్చియున్న గురువుకు నేను నమస్కరించుచున్నాను.

విశేషార్థము : దేవతలందరికీ సాకారమున్నది. బ్రహ్మకానీ, శివుడు కానీ, విష్ణువుకానీ శరీరమును ధరించి అందులోని ఆత్మను ఆధారము చేసుకొని చలించువారే. అందువలన ఆత్మ అన్ని దేహములలో ఉన్నది. గురువు ఆత్మస్వరూపుడై బ్రహ్మ శరీరములోను, విష్ణువు శరీరములోను, మహేశ్వరుని శరీరము లోను ఉన్నాడు. అందువలన గురుని బ్రహ్మగా, విష్ణువుగా, శివునిగా చెప్పడమైనది. గురువు ఒకటవ ఆత్మ (క్షరుడు) గా, రెండవ ఆత్మ (అక్షరుడు) గా, మూడవ ఆత్మ (పరమాత్మ) గా ఉన్నాడు. అందువలన గురువు సాకార జీవుడు, నిరాకార ఆత్మ మరియు జీవాత్మ ఆత్మలకంటే వేరైన పరమాత్మగా ఉన్నాడు. మూడు ఆత్మలుగా ఉన్నవాడే నిజమైన నిత్యమైన గురువు. ఆయన ధరించిన శరీరము పవిత్రమైనది. అందువలన ఆ సాకార గురువుకు నమసస్కరించుచున్నాము.

ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేనమః.

భావము : అండ. పిండ, బ్రహ్మాండమంతయు వ్యాపించి విశ్వ రూపమే తన ఆకృతి కల్గి ఆఖండముగా వ్యాపించి ఉన్నవాడు ఎవడో, కదలుచున్న కదలకున్న జీవరాశులందు మరియు మార్పు చెందని పంచభూతములలోను వ్యాపించియున్నవాడు ఎవడో. పరమాత్మ స్థానము తెలిసియున్నవాడు ఎవడో ఆ గురువుకు నమస్కరించుచున్నాను.

ఓం మన్నాథో శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు
మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువేనమః .

భావము : నా యొక్క నాథుడైన గురువే జగత్తంతటికి నాథుడు. నా యొక్క గురువే జగత్తులోని సర్వజీవరాశులకు అన్వయించు జ్ఞానమును బోధించు జగత్ గురువు. నా శరీరములో ఆత్మగా నున్న గురువే, సర్వ జీవుల శరీరములో ఆత్మగా ఉన్నాడు. ఆ గురువుకు నా నమస్కారము.

ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా 
చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురువేనమః.

భావము : అజ్ఞానమనే గ్రుడ్డితనమునకు జ్ఞానమనే కాటుకను దిద్ది, ఆత్మను దృశ్యముగా చూపించు గురువుకు నమస్కరించు చున్నాను. 

ఓం బ్రహ్మానందం, అచలపూర్ణం, త్రిగుణాతీతం, 
ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం 
ఆనంద నిత్యసద్గురం తం నమామి.

భావము: అన్నింటినీ మించిన ఆనందము కలవాడు, మార్పు చెందని దానితో నిండినవాడు, మూడు గుణముల కర్మ అంటని వాడు, ఆత్మను సాక్షాత్కరింపజేసుకొన్నవాడు. రెండు కాని ఒక్కటైన పరమాత్మలో మూర్తీభవించినవాడు. నిత్యము ఆత్మా నందమును పొందువాడైన సద్గురువుకు నేను నమస్కరించు చున్నాను.

ఓం నిత్యానందం, పరమసుఖదం, కేవలం 
జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, 
తత్త్యమస్యాది లక్ష్యం,
ఏకం నిత్యం విమల మచలం, సర్వధీ సాక్షిభూతం, 
భావాతీతం, త్రిగుణరహితం సద్గురుం తం నమామి. 

భావము : నిత్యము ఆత్మానుభవము అను ఆనందముతో కూడినవాడు, జీవునికంటే వేరుగాయున్న ఆత్మ సుఖము కలుగ జేయువాడు, కేవలము ఆత్మజ్ఞానమే స్వరూపముగ కలవాడు, పాప పుణ్యములైన ద్వంద్వములకతీతుడు, ఆకాశమువలె వ్యాపించి దేనినీ అంటనివాడు. తత్త్వమస్యాది వాక్యములు ధ్యేయముకలవాడు, ఎప్పటికీ ఏక స్వరూపుడైనవాడు, పాపపుణ్య మనే ఏ మాలిన్యము లేనివాడు. చలనము లేని మార్పులేని) సమస్త జీవరాసులు బుద్ధికి సాక్షిగనున్నవాడు, ఏ
వాడు.భావమునకు అందనివాడు, మూడు గుణములందుండినా వాటికి అతీతుడైన వాడును అయిన సద్గురువును నమస్కరించు చున్నాను.

అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురువేనమః.

భావము : బహుజన్మల నుండి పేర్కొనిన పాప. పుణ్యమి శ్రితము
లను జ్ఞానమను అగ్నిచేత దహింపజేయునట్టి గురుమూర్తికి నేను 
నమస్కరించుచున్నాను.

ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే
నమ శ్రీ గురునాథాయ ప్రకాశానంద మూర్తయే .

భావము : సత్తు చిత్తు యొక్క ఆనందమునే (చిత్తునందు సత్తును అనుభవించు ఆనందమునే స్వరూపముగా గలవాడును, జీవాత్మగయుంటూ ఆత్మస్థానమును, పరమాత్మ స్థానమును వ్యాపించినవాడును, అన్నింటికీ ప్రకాశమునిచ్చు శక్తిని అనుభవించువాడును ఐన గురువుకు నమస్కారము. 09. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ, విష్ణు, శివాత్మకం,
గురోః పరతరం నాస్తి తస్మాస్థం పూజయేద్గురుం భావము : గురువే బ్రహ్మ, విష్ణు, శివుల యొక్క ఆత్మగనున్న వాడు, గురువు ఒక్కడే జగత్తంతయూ నిండి సర్వమై ఉన్నవాడు, గురువుకంటే మించిన వేరైన మోక్షము లేదు. అందువలన గురువును అన్ని విధముల పూజింపవలయును.

శ్రీ సద్గురు పాదుకాస్తవమ్.

శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశమగోచరం 
భేదవర్జిత మప్రమేయ మనంత మాద్యమ కల్మషం! 
నిర్మలం నిగమాన్త మద్వయ మప్రతర్క్యమ బోధకం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! .

భావము : శుభకరమైనది, నాశనములేనిది, నీకంటే వేరుగా ఉండి నీకు తెలియకుండా ఉండునది, భేదము లేక అంతటా నిండినది. ప్రమాణములకు తెలియనిది. ఆది మొదలు లేనిది, కర్మ కాలుష్యములేనిది, నిర్మలమై, వేదాంతసారమై, ద్వంద్వ ములులేనిదై బోధించుటకు బుద్ధికి సాధ్యముకాని గురు పాదములను ప్రాతఃకాలముననే మనస్సునందు ధ్యానింతును. 

నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం 
మంత్రరాజ విరాజితం నిజమండలాన్తర్భాసితమ్ ! 
పంచమవర్ణమఖండ మద్భుత మాది కారణ మచ్యుతం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!

భావము : శబ్ద రూపమనుతన్మాత్రలకు శక్తినిచ్చు ఆత్మగ ఉన్నది. శబ్దమందు పది రకములైన నాదములను పుట్టించి వినోదము
కల్గించునది. మంత్రరాజమై "ఓం" కార శబ్దమును పుట్టించి దానియందు ప్రకాశించునది. నిజమండలమైన బ్రహ్మనాడి లోపల నివశించునది, పంచభూతములంతట అఖండముగ అద్భుతముగ వ్యాపించి మూలకారణమై అర్థము కాకుండా ఉన్నదియగు గురుపాదములను నిర్మలకాలమున మనస్సునందు ధ్యానింతును.

వ్యోమవద్భహిరంత రస్థిత మక్షరం నిఖిలాత్మకమ్ 
కేవలం పరిశుద్దమేకమజన్మహి ప్రతిరూపకం !
బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకమ్ 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! 

భావము : సర్వజీవరాసులయందు నాశనములేనిదై ఆకాశము వలె లోపల బయట వ్యాపించినది. ప్రతీది తన రూపముగ విశ్వ రూపమై, పవిత్రమై ద్వంద్వముకాని ఏకమైనది. నిరంతరము మోక్షమును బోధించుచూ బ్రహ్మతత్త్వమును నిర్ణయించునదైన
గురుపాదములను మనస్సునందు మొదట కాలముననే స్మరింతును.

బుద్ధిరూపమ బుద్ధికం త్రితయైకకూట నివాసినం
నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్ ! 
పశ్చిమాన్తర ఖేలనం నిజ సుద్దసంయమి గోచరం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! 

భావము : బుద్ధికి శక్తినిచ్చుచు బుద్ధికానిదై, మూడు నాడులు కలియు భూమధ్యమున నివాసము కలది, మార్పుచెందనిదై నిరంతరము, నిర్మలము సర్వకారణమై ప్రకాశించునది. బ్రహ్మ నాడిలో సహస్రార చక్రమున ఆడునది. ఏ గుణము లేని శుద్ధమైనవారికి గోచరించునది, అయిన గురుపాదములను నిర్మల కాలమున ధ్యానింతును.

హృద్గతం నిమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం 
నీల మధ్య సునీల సన్నిభ మాదిభిందు నిజాంశుకమ్ ! 
సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!

భావము : ప్రతి జీవరాసి హృదయమునందు నివాసమై, మలినము లేనిదై, పరమాణువై మనస్సుకు సాక్షిగ ఉన్నది. నల్లనిరంగు మధ్యలో నల్లనిదై ఉన్నది. మొదటి స్వరూపమై నిజమైన అంశ కలిగినది, శరీర మధ్యలో నుండి సూక్ష్మమైన దానిని కూడా వినుచు మిక్కిలి చురుకైనదిగనున్నది అయిన గురుపాదములను ప్రాతఃకాలముననే తలంచి నమస్కరించు చున్నాను.

పంచపంచ హృషీక దేహ మనశ్చ తుష్క పరస్పరం 
పంచభూతన కామషట్క సమీర శబ్దము ఖేతరమ్ ! 
పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మవిలక్షణం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!

భావము : ఐదైదు ఇరువదైదు ఇంద్రియములచే తయారయిన శరీరమున మనస్సు మొదలయిన అంతఃకరణములందు పరస్పరము సంబంధము కలుగజేయునది, పంచభూతములచే తయారయిన కామము మొదలగు ఆరు గుణములు, పంచ
వాయువులు, శబ్దము మొదలగు పంచతన్మాత్రలకు వేరుగ నున్నది. పంచకోశములకు, మూడు గుణముల ధర్మములకు విలక్షణమైనది అయిన గురుపాదములను మొదటనే మనస్సు నందు భక్తిచే ధ్యానింతును.

పంచముద్ర సులక్ష్యదర్శన భావమాత్ర నిరూపణం 
విద్యుదాది, ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్ధనమ్ ! 
చిన్ముఖాన్తర వర్తినం విలసద్విలాసమమాయకం 
ప్రాతరేవహి మాన సాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!

భావము : ఖేచరీ, భూచరీ, షణ్ముకీ మొదలగు పంచముద్రల లక్ష్యార్థ దర్శనభావముచే నిరూపణకు వచ్చునది. మెరుపులవలె ధగధగ మెరయు జ్యోతి స్వరూపముచే సంతోషమును కలుగ జేయునది, బ్రహ్మనాడి మొదటి భాగమైన సహస్రారము లోపలి వర్తించునది. మాయయందే ప్రకాశించునప్పటికీ మాయలేనిదైన గురుపాదములను ఉదయ కాలముననే ధ్యానింతును.

పంచవర్ల శుచిర్విచిత్ర విశుద్ధతత్త్వ విచారణమ్ 
చన్ద్రసూర్య చిదగ్ని మణ్డలమణ్ణితం ఘనచిన్మయమ్ ! 
చిత్కళా పరిపూర్ణన్తర చిత్సమాధి నిరీక్షణం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! 

భావము : తత్త్వ విచారణ చేసిన పంచభూతములందు విచిత్రముగ నున్నది. సూర్య, చంద్ర, అగ్ని మొదలగు వాటియందు సారాంశమై అనగా ప్రకాశమై మూల పదార్థముగ ఉండునది, చిత్కళచే నిండినది, శరీరాంతరమున జ్ఞాన సమాధిచే తెలియబడు గురుపాదముల మనో నిర్మలకాలమున భక్తిచే
నమస్కరించుచున్నాను.

హంసచార మఖణ్ణనాద మనేక వర్ణమ రూపకం 
శబ్దజాలమయం చరాచరజన్తుదేహ నివాసినమ్ ! 
చక్రరాజ మనాహతో ద్భవమేకవర్ల మతః పరం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ .

భావము : రూపము లేని శ్వాసరూపమున అఖండనాదమై అనేక శరీరములందు ఉండినది. "సోహం" అను శబ్ధముచేత చరాచర జీవరాసుల దేహములందు నివాసము చేయునది. అన్ని జీవరాసుల అనాహతస్థానమందు ఒకే విధముగా పుట్టినదై వాటికంటే వేరైనది అయిన గురుపాదముల భక్తిచే మనస్సునందు భావించి పూజింతును.

జన్మకర్మ విలీనకారణ హేతుభూతమ భూతకం 
జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం ! 
నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ .

భావము : జన్మకర్మల నాశనమునకు కారణమై జన్మలేనిదై ఉన్నది. జన్మకర్మల నివారించునది, సంసారసాగరమును దాటింపజేయు ప్రకాశజ్ఞానమైనది. పేరు, రూపములేనది, శుభకరమై అన్నింటికంటే గొప్ప నాయకత్వము గలదియైన గురుపాదములకు మనసంతర్భాగమున మొదటి కాలముననే నమస్కరింతును.

తప్తకాంచన దీప్యమాన మహాణుమాత్రమ రూపకం 
చన్దికాన్తరతారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్ ! 
నీలనీరద మధ్యమస్థితి విద్యుదాది విభాసితం 
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! .

భావము : కాంచిన బంగారు ప్రకాశము కలది, సూక్ష్మాణురూప మైనది. చంద్రుని వెన్నెలకంటెను, నక్షత్రకాంతికంటెను, తెల్లని కలువ అందముకంటెను గొప్పగ వేరైనది, నల్లని మేఘముల మధ్య మెరుపు తీగలవలె ప్రకాశించునది అయిన గురుపాదము లను మనస్సునందు భావించి పూజించుచున్నాను. 12. స్థూల 

సూక్ష్మసకారణాన్తరఖేలనం పరిపాలనమ్ 
విశ్వతైజపప్రాజ్ఞ చేత సమస్తరాత్మ నిజాంశుకమ్ ! 
సర్వకారణమీశ్వరం విటలాన్తరాళ విహారకమ్
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!.

భావము: స్థూల, సూక్ష్మ, కారణ శరీరములందు వ్యాపించి ఉండునది, విశ్వ, తైజస, ప్రాజ్ఞ (నిద్ర, మెలుకువ, స్వప్న అవస్థల)
సమస్త జీవుల అంతరమున నివశించునది. సూర్యచంద్రనాడుల మధ్యన ఉన్న బ్రహ్మనాడియందు ఉండి సర్వమునకు కారణమైన ఈశ్వరశక్తిగనున్న గురుపాదములకు మనస్సునందు తలంచి నమస్కరించుచున్నాను.

కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం 
గృహం బాంధవా సర్వమే తద్ధిజాతం 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతః కిం !! 

భావము : భార్య, ధనము, పుత్రులు, మనవళ్ళు. బంధువులు గృహము మొదలగునవన్నియు మానవునికుండినప్పటికీ గురు పాదపద్మముల మీద మనస్సు లగ్నము కానియెడల ఉన్నవన్నియు ఎందుకు? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?

షడంగాది వేదో ముఖేశాస్త్ర విద్యా 
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !! .

భావము : షడంగాది వేదములు, శాస్త్రవిద్యలు కంఠములోనే ఉన్నప్పటికీ కవిత్వాది గద్య పద్యములు సులభముగా కూర్చగల సామర్థ్యమున్నప్పటికీ గురుపాదపద్మముల మీద మనస్సు లగ్నము కాని వానికి అవి అన్నియూ ఉండినను ఏమి ప్రయోజనము? ఏమి సార్ధకము? అవి అన్నీ ఎందుకు?

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః 
సదాచార నిత్య సువృత్తిన్నచాన్యః 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !! .

భావము : మానవుడు విదేశములందు మహాపూజ్యుడుగ ఉండిననూ, స్వంతదేశమున ధన్యుడిగా ఉండిననూ, ఎల్లప్పుడూ
సదాచారములు సత్ప్రవర్తన కలిగి ఉండినప్పటికినీ గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కానివాడు ఎట్లుండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?

క్షమామండలే భూప భూపాల బృంధం 
సదా సేవ్యతే యస్యపాదార విందం 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!

భావము : నీవు భూమిమీద చక్రవర్తివైనప్పటికినీ, చిన్న రాజు లందరూ ఎల్లప్పుడు నీ పాదముల సేవ చేసినప్పటికినీ గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని ఎడల నీవు ఎంతటి వాడవైనా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?

నభోగే నయోగే నవారాజ్యభోగే 
సకాంతా ముఖేవైన విత్తేషు యుక్తః 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్నలగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !! 

భావము : ఎన్నియో భోగ సుఖములుండినా, గొప్ప యోగి అయినా, గొప్ప రాజ్యమును భోగించినా, మంచి అందమైన స్త్రీల సాంగత్య ముండినా గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని వానికి ఏమి ఉండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?

యశోమేగతం దిక్షుదాన ప్రతాప 
జగద్వస్తం సర్వం కరే యత్ ప్రసాదాత్ 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతః కిం తతఃకిం తతః కిం !!

భావము : తనయొక్క కీర్తి, ప్రతాపము, దానగుణము అన్ని దిక్కులయందు వ్యాపించినా. జగత్తంతయు తన స్వాధీనములో
ఉండినా, గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కానివానికి ఏమి ఉన్ననూ, ఎట్లు ఉండిననూ, ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?

అరణ్యే నివాసే స్వగేహేచ కార్య: 
నదేహే మనో వర్తతేమే అనార్వే
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్నలగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!

భావము : మానవుడు అరణ్యమందుండినా. స్వంత ఇంటిలో శరీర కార్యములలో మనస్సునుంచక విరక్తు డైనప్పటికీ గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని ఎడల ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?

అనర్థ్యాని రత్నాని యుక్తాని సమ్యక్ 
సమాలింగితా కామినీ యామినీసు 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !! 

భావము : వెలలేని గొప్పరత్నములు కలవాడైనను, సుందరమైన స్త్రీలను ఆలింగనము చేసుకొనువాడైననూ, గురుపాద పద్మముల మీద మనస్సునుంచనివాడైన ఎట్లుండినను, ఏమి ప్రయోజనము? ఏమి సార్ధకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?

శరీరం సురూపం, తథావాకళత్రం 
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం 
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతఃకిం తతఃకి !!

భావము: మానవునికి సుందరమగు శరీరము మరియు మంచి గుణవంతురాలగు భార్య విచిత్రమగు గొప్ప యశస్సు, మేరు పర్వతమును బోలు ధనము ఉండినప్పటికీ గురుపాద పద్మముల
మీద మనస్సు లగ్నము కానివానికి ఎన్ని ఉండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ఫలము? ఏమి ఉపయోగము.

ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులన్ జేయ బయల్పడిన ఓ గురురాయా ఇదే నా మనఃపూర్వక వందనమ్ .

ఓం మంగళం గురుదేవాయ మహానీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యయా సాధురూపాయ మంగళం ఓం తత్సత్.

ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళమ్ .
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి శ్రీకృష్ణవాసుదేవాయ మంగళమ్ .
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి అద్వితీయ కుమారాయ మంగళమ్ . 
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి రావణబ్రహ్మాయ మంగళమ్ .
.........
శ్లోకం 11: అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే,
గతాసూ నగతా సూంశ్చ నానుశోచన్తి పండితాః.
(ప్రకృతి, పరమాత్మ).
భావము: శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు.
శ్లోకం 13: దేహినోఽ స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా,
తథా దేహాన్తర ప్రాప్తి ర్ధీర స్తత్ర న ముహ్యతి.
(జీవాత్మ).
భావము: దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము,కౌమారము, ముసలి తనము వరుసగ ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను మరణము కూడ కల్గుచున్నది.
శ్లోకం 22: వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో ఽ పరాణి,
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి.
(జీవాత్మ).
భావము : మానవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాతదేహమును వీడి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నది.
శ్లోకం23: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః,
న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః.
(జీవాత్మ).
భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.
శ్లోకం 27: జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్యచ,
తస్మాద పరిహార్యే ఽ ర్థే న త్వం శోచితు మర్హసి.
(జీవాత్మ).
భావము:- పుట్టుట ఎప్పటికైన చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు.
శ్లోకం 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! ,
నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్.
(బ్రహ్మయోగము, కర్మయోగము).
భావము: మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.
శ్లోకం 47: కర్మణ్యే వాధి కార స్తే మాఫలేషు కదాచన,
మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సంజ్గోఽ స్త్వ కర్మణి .
(కర్మయోగము).
భావము: కర్మ సంపాదించుటయందే నీకు అధికారము కలదు. కర్మఫలము లందు ఆశపడవలదు. కర్మయగు పాపపుణ్య ఫలములైన కష్టసుఖములకు కారకుడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు.
శ్లోకం 5: నహికశ్చిత్ క్షణ మపి జాతుతిష్ఠత్యకర్మకృత్ ,
కార్యతే హ్యవశఃకర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః .
(ప్రకృతి).
భావము : ఎవ్వడుగాని ఎట్టి కర్మ ఆచరింపక ఒక్క క్షణమైన ఊరకయుండలేడు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కినవారై,కర్మముల వశులై పనులు చేయుచుందురు.
శ్లోకం 9:యజ్ఞార్థాత్కర్మణో ఽన్యత్ర లోకో ఽ యం కర్మబంధనః ,
తదర్థం కర్మ కౌంతేయ! ముక్త సంగస్సమాచర.
(కర్మ యోగము).
భావము: యజ్ఞ సంబంధము లేకుండ కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మబంధనములు కలుగుచుండును. కనుక అర్జునా! కర్మలయందు బంధింపబడక కార్యములు చేయుము.
శ్లోకం 27: ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ,
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే .
(ప్రకృతి).
భావము : ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కల్గు గుణప్రేరణ ద్వార జరుగు అన్ని పనులకు, కర్త తానేయని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును.
శ్లోకం 28: తత్త్వవిత్తు మహా బాహో ! గుణకర్మ విభాగయోః ,
గుణా ఽగుణేషు వర్తన్త ఇతి మత్వాన సజ్జతే .
(కర్మయోగము).
భావము : తత్త్వ జ్ఞానమును తెలిసినవారు, కర్మలు గుణముల యొక్క భాగములను తెలిసినవారై, గుణముల వలననే కార్యములు జరుగుచున్నవని తెలిసియుందురు.
శ్లోకం 35: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ,
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః .
(జీవుడు, కర్మ యోగము).
భావము : అనుష్ఠితమగు పరధర్మముకంటే గుణములేని స్వధర్మమే శ్రేయస్కరము. పరధర్మములో ఉన్న భయముకంటే స్వధర్మములోని మరణమే మేలు.
శ్లోకం 6: అజో ఽపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో ఽ పిసన్ ,
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా .
(నిరాకారము, సాకారము).
భావము : నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.
శ్లోకం 7: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! ,
అభ్యుత్థానమధర్మస్య తదా ఽ ఽత్మానం సృజామ్యహమ్ .
(నిరాకారము, సాకారము).
భావము : ఎపుడెపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధిచెందుచున్నదో, అపుడు నన్ను నేను తయారుచేసుకొని భూమిమీద పుట్టుచున్నాను.
శ్లోకం 8: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ ,
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే .
(సాకారము).
భావము : ధర్మాచరణ కల్గిన వారిని సంరక్షించుటకు, అధర్మ ఆచరణ కల్గిన వారిని లేకుండచేయుటకు, ధర్మసంస్థాపన మొనర్చుటకు యుగ యుగమందు పుట్టుచుందును.
శ్లోకం 9: జన్మ కర్మచ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః ,
త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో ఽర్జున! .
(సాకారము, నిరాకారము).
భావము : నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకొన్నవాడు మరణించిన తర్వాత, వేరు జన్మమునకు పోక నాలోనికి ఐక్యమగును.
శ్లోకం 13: చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః ,
తస్యకర్తార మపి మాం విద్ధ్యకర్తార మవ్యయమ్ .
(పరమాత్మ).
భావము : కర్మ, గుణ విభాగములను బట్టి నాల్గు వర్ణములు నాచేత సృష్ఠింపబడినవి. వాటి కర్తనైనను కాకుండ నాశనములేనివాడనై ఉన్నాను.
శ్లోకం  33: శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప! ,
సర్వం కర్మాఽఖిలం పార్థ!జ్ఞానే పరిసమాప్యతే .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము : ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. సర్వకర్మలు జ్ఞానయజ్ఞములో పరిసమాప్తమగును.
శ్లోకం 34: తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ,
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.
 శ్లోకం  36: అపి చేదసి పాపేభ్యస్సర్వేభ్యః పాపకృత్తమః ,
సర్వం జ్ఞానప్లవేనై వ వృజినం సంతరిష్యసి .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము:- అఖిల పాపాత్ములందు నీవెంత అధమ పాప యుతుడవైనప్పటికి, పాపమను సముద్రమును జ్ఞానమను చిన్న ఓడచే దాటగలవు.
శ్లోకం 37: యథైధాంసి సమిద్ధో ఽగ్ని ర్భస్మసాత్కురుతే ఽ ర్జున ,
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా .
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.
శ్లోకం 38: న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే ,
తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి .
(కర్మయోగము).
భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును.
శ్లోకం 39: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః ,
జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి .
(బ్రహ్మయోగము).
భావము : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు.
శ్లోకం 18: విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ,
శుని చైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః .
(బ్రహ్మయోగము).
భావము : విద్యయు వినయము కల్గు విప్రులందును, గోవులందును, ఏనుగు లందును, కుక్కలందును, కుక్కలను తిను చండాలునియందును పండితుల దృష్ఠి సమముగా ఉండును.
శ్లోకం 1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః ,
స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః.
(కర్మయోగము).
భావము : కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.
శ్లోకం  17 : యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు ,
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా .
(బ్రహ్మయోగము).
భావము : మితమైన భోజనము, మితమైన పనులు, మితమైన నిద్ర మెలుకవ కల్గువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు.
శ్లోకం  46 : తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ,
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున .
(జీవాత్మ).
భావము : తపస్వికులకంటే యోగి అధికుడు. అట్లే జ్ఞానులకంటే ఉత్తముడు కర్మములు చేయువారికంటే గొప్పవాడు. కావున నీవు యోగివేకమ్ము.
శ్లోకము  10 : బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ! సనాతనమ్‌ ,
బుద్ధిర్బుద్ధి మతా మస్మి తేజస్తే జస్వినా మహమ్‌ .
(పరమాత్మ).
భావము : సర్వ జీవరాశులకు శాశ్వతముగ బీజము నేనేయని తెలియుము. బుద్ధిమంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంబునేనై ఉన్నాను.
శ్లోకము  11 : బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్‌ ,
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్ష భ .
(పరమాత్మ).
భావము : కామ రాగ వివర్జిత మొనరించు బలవంతులయందలి బలము నేను. ధర్మమునకు విరుద్ధముగనున్న వారిలో ఆశయును నేను.
శ్లోకము  14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ,
మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే .
(పరమాత్మ).
భావము : దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.
శ్లోకము  19: బహూనాం జన్మనా మంతే జ్ఞాన వాన్మాం ప్రపద్యతే ,
వాసుదేవ స్సర్వ మితి స మహాత్మా సుదుర్లభః .
(జీవాత్మ, సాకారము).
భావము : జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది చివరకు వాసుదేవుడే సర్వమని తలచి నన్ను పొందగలుగుచున్నాడు. అట్టివాడు ఎంతో దుర్లభముగ లభించును.
శ్లోకము 4: అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతమ్ ,
అధియజ్ఞోఽహమే వాత్ర దేహేదేహ భృతాంవర .
(ఆత్మ).
భావము : నాశన స్వభావమున్న శరీరములు గల జీవరాసులకును, దేవతలకును ఆధారమైనవాడిని నేనే. దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని తెలియుము.
శ్లోకము 5 : అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్ ,
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః .
(ఆత్మ, పరమాత్మ).
భావము : చివరి కాలములో నన్నే స్మరించుకొంటు శరీరమును వదులువాడు నన్నే పొందగల్గుచున్నాడు. ఈ విషయములో ఏ మాత్రము సంశయము లేదు.
శ్లోకము 7 : తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ ,
మయ్యర్పిత మనోబుద్ధి ర్మామే వైష్యస్యసంశయః॥
(ఆత్మ, సాకారము).
భావము : కావున సర్వకాలము నీమనసునందు నన్ను స్మరించుచుండుము. బుద్ధి మనస్సు నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు. దీనిలో సంశయము లేదు.
శ్లోకము 16: ఆబ్రహ్మ భువనా ల్లోకాః పునరావర్తినోఽర్జున,
మా ముపేత్య తు కౌంతేయ! పునర్జన్మ న విద్యతే॥
(పరమాత్మ).
భావము : బ్రహ్మలోకము మొదలైన లోకములను పొందినప్పటికి పునర్జన్మ కలదు. నన్ను పొందువానికి పునర్జన్మలేదు.
శ్లోకము 23 : యత్రకాలే త్వనా వృత్తి మావృత్తిం చైవ యోగినః,
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ! .
(జీవాత్మ, మోక్షము).
భావము : యోగులు ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో, ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో, వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను.
శ్లోకము 24: అగ్నిర్జ్యోతి రహ శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణమ్,
తత్రప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః॥
(జీవాత్మ, మోక్షము).
భావము : యోగి అయినవాడు ఏ ప్రాంతములో ఉండి మరణము పొందుచున్నాడో ఆ ప్రాంతము మీద సూర్యప్రకాశము కల్గివుండాలి. మేఘముల నీడ ఉండకూడదు. యోగి మరణించు సమయము పగలుగ ఉండి, ఆ పగలు శుక్లపక్షములోనిదై ఉండాలి. ఆ శుక్లపక్షము ఉత్తరాయణములోనిదై ఉండాలి. ఈ విధముగ సూర్యతేజస్సు కల్గిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చేకూరినకాలములో చనిపోయిన యోగి జన్మించక మోక్షము పొంది పరమాత్మయందైక్యమగుచున్నాడు.
శ్లోకము 25 : ధూమో రాత్రి స్తథా కృష్ణష్షణ్మాషా దక్షిణాయనమ్,
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే॥
(జీవుడు).
భావము : యోగి మరణించు ప్రాంతము మేఘావృతమైవుండినా, రాత్రి సమయమైనా, కృష్ణపక్షము 15 రోజులలోనైనా, దక్షిణాయన ఆరునెలల కాలములోనైన యోగి మరణించిన ఎడల అతడు మోక్షము పొందక, జ్ఞానతేజస్సు కల్గినవాడై తిరిగి జన్మించును. ఈ మరణ సమయములను చాలా గీతలలో తప్పుదోవ పట్టించడము జరిగినది. ‘ప్రయాతాయాన్తితం కాలమ్’ అని 23వ శ్లోకములో చెప్పినప్పటికి కాలమును గూర్చి చెప్పక పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత పోవు దారిలో పోతే మోక్షము లభిస్తుందని వ్రాయబడివున్నది. అలా పగలు దేవతని శ్లోకములో లేని విషయమును తెచ్చి పెట్టడము వలన చాలామంది పొరబడి పోవుచున్నారు. పగలు దేవతను వ్రాసినవారు కూడ చూడలేదు. విన్నవారెక్కడ వెదకగలరు.
శ్లోకము 28 : వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలంప్రదిష్టమ్,
అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీపరంస్థాన ముపైతి చాద్యమ్॥
(జీవాత్మ, మోక్షము).
భావము : ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును.
శ్లోకం 4: మయా తత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా ,
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః .
(పరమాత్మ).
భావము : అవ్యక్తముగ ఈ ప్రపంచమంతయు వ్యాపించియున్నాను. నాయందే సర్వజీవరాసులున్నవి. నేను వాటియందులేను.
శ్లోకం 5: న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ,
భూతభృ న్న చ భూతస్థో మమాత్మా భూత భావనః .
(పరమాత్మ).
భావము : సర్వ జీవులు నాయందులేవు. నేను ఈశ్వరునిగ (అధిపతిగ) ఎట్లు కలిసి ఉన్నది చూడుము. జీవులు ధరించు శరీరములోని ఆత్మగను, భూతములుగ భావింపబడు జీవాత్మలుగను నేను లేను.
శ్లోకం 10: మయాఽధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్ ,
హేతునాఽ నేన కౌంతేయ! జగ ద్విపరివర్తతే .
(పరమాత్మ).
భావము : నా అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించు చున్నది. ఆ కారణముచేతనే జగత్తు పరివర్తించుచున్నది.
శ్లోకం 11: అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ,
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ .
(పరమాత్మ, సాకారము).
భావము : సర్వజీవరాసులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన, నాశ్రేష్ఠమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు.
శ్లోకం 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే ,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ .
(జీవాత్మ, పరమాత్మ).
భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.
శ్లోకం 23: యేఽప్యన్య దేవతాభక్తా యజన్తే శ్రద్ధయాఽన్వితాః ,
తేఽపి మామేవ కౌంతేయ! యజ్యన్త్య విధిపూర్వకమ్ .
(జీవాత్మ, పరమాత్మ).
భావము : ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలాచరించునో వాడు కూడ నన్నే దారి తప్పి ఆరాధించినవాడగుచున్నాడు.
శ్లోకం 25: యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృవ్రతాః ,
భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినోఽపి మామ్ .
(పరమాత్మ).
భావము : దేవతా పూజచేయువారు దేవతలందే చేరుదురు. పితృదేవతలను పూజించువారు వారియందే చేరుదురు. భూతముల పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు.
శ్లోకం 30: అపి చే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్ ,
సాధు రేవస మన్తవ్య స్సమ్యగ్వ్య వసితో హి సః .
(జీవుడు, పరమాత్మ).
భావము : పెద్ద దురాచారపరుడైనప్పటికి నన్ను మనస్సులో భజించుట వలన, వాడు నిశ్చయముగ నన్ను తెలియదగినవాడు, కనుక వానిని సాధువని చెప్పవచ్చును.
శ్లోకం 34: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,
మా మే వైష్యసి యుక్త్వై వ మాత్మానం మత్పరాయణః .
(సాకారము, నిరాకారము).
భావము : నీవు నా మీదనే మనస్సునుంచుము, నాకు భక్తునిగనుండుము. నన్నే నమస్కరించుము, నన్నే ఆరాధించుము. నా మీద ధ్యాస కల్గి ఆత్మతో కూడిన నన్నే పొందగలవు.
శ్లోకం 53: నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా ,
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా .
(నిరాకారము).
భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.
శ్లోకం. 10 : అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ , మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి .(భక్తియోగము).
భావము : మనస్సు నిల్పు అభ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును.
శ్లోకం. 12 : శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే , ధ్యానా త్క ర్మఫలత్యాగ స్త్యాగాచ్ఛాన్తి రనన్తరమ్ .(బ్రహ్మ, కర్మ యోగములు).
భావము : అభ్యాసముకంటే జ్ఞానము మేలు, ధ్యానము జ్ఞానముకంటే గొప్పది, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. మనిషికట్టి త్యాగముచే శాంతికల్గును.
శ్లోకం 21: కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే ,
పురుష స్సుఖదుఃఖానాం భోక్తృ త్వే హేతు రుచ్యతే .
(ప్రకృతి, జీవాత్మ).
భావము : కార్య కారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతువుగనున్నది. పురుషుడు సుఖదుఃఖములనుభవించుటకు కారణభూతునిగ ఉన్నాడని చెప్పవచ్చును.
శ్లోకం 22: పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ,
కారణం గుణ సంగోఽస్య సదసద్యోనిజన్మసు .
(ప్రకృతి, జీవాత్మ).
భావము : పురుషుడు ప్రకృతియందున్నవాడై ప్రకృతి సంభవములైన గుణములను అనుభవించుచున్నాడు. గుణములతో సంబంధపడియున్న కారణమువలన మంచి చెడు యోనులయందు జన్మించుచున్నాడు.
శ్లోకం   6: న త ద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః,
య ద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ.
(పరమాత్మ).
భావము:దానిని సూర్యుడు కాని, చంద్రుడు కాని , అగ్ని కాని ప్రకాశింప చేయలేరు. దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము.
శ్లోకం  7: మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః,
మనష్షష్టా ణీన్ద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి.
(పరమాత్మ).
భావము: బ్రతికివున్న జీవరాసులలో జీవాత్మ నా అంశమై, ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో ఆరవదైన మనస్సును ఆకర్షించుచున్నది.
శ్లోకం   8: శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామ తీశ్వరః ,
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధాని వాశయాత్.
(ఆత్మ, ప్రకృతి).
భావము : ఆత్మ శరీరమును వదిలి ఎప్పుడు పోవుచున్నదో, పోయి ఎక్కడ ప్రవేశిస్తున్నదో,అక్కడికి వాయువు వాసనను తీసుకుపోయినట్లు ఆత్మ గుణములను కూడ తీసుకొని పోవుచున్నది.
శ్లోకం  14 : అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః,
ప్రాణాపానసమాయుక్తః పచా మ్యన్నం చతుర్విధమ్.
(ఆత్మ).
భావము : నేను సకల జీవుల శరీరములందు వైశ్వానరుడను అగ్నిగ ఉండి, ప్రాణ అపాన వాయువులచేత మండుచు, నాల్గు విధములగు ఆహారములను పచనము చేయుచున్నాను.
శ్లోకం   15: సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ,
వే దైశ్చ సర్వైరహమేవ వేద్యోవేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ .
(ఆత్మ).
భావము : సర్వజీవరాసుల హృదయ స్థానములో నేనున్నాను. స్మృతి, ఙ్ఞానము, ఊహ దాని మరుపు నా వలననే కల్గుచున్నవి. వేదవేదాంతములు నన్నే తెల్పుచున్నవి. వేదముల తెలిసినవాడను నేనే.
శ్లోకం  16: ద్వా విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ,
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే.
(ఆత్మ, జీవాత్మ).
భావము : లోకములో రెండు రకముల పురుషులు కలరు. వారు క్షరుడనియు,అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరుడు సర్వభూతములందు కలడు. క్షరునితో కూటస్తునిగనున్న వాడు అక్షరుడని చెప్పుచున్నారు.
శ్లోకం   17 :ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః,
యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.
(పరమాత్మ).
భావము : ఉత్తముడగు పురుషుడు అన్యమైనవాడొకడున్నాడు. వాడే పరమాత్మయని చెప్పబడుచున్నాడు. అతడే ముల్లోకములను ఆవహించి అవ్యయుడై, అధిపతియై, భర్తయై ఉన్నాడు.
శ్లోకం  20: ఇతి గుహ్యతమం శాస్త్ర మిద ముక్తం మయాఽనఘ! ,
ఏత ద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యా త్కృతకృత్యశ్చ భారత .
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ).
భావము : ఈ ప్రకారముగ మిగుల రహస్యమైన శాస్త్రము నీకు నేను చెప్పితిని. దీనిని తెలుసుకొన్నవాడు బుద్ధిమంతుడును, కృతకృత్యుడగును.
శ్లోకం 6: ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్‌ దైవ ఆసుర ఏవ చ ,
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ! మే శృణు .
(దైవ, అసుర గుణములు).
భావము : లోకమున దైవ అసుర అను రెండు రకముల జీవులు పుట్టుచున్నారు. దైవ విషయముల వాటి గుణముల గురించి చెప్పివున్నాను. అసురులను గూర్చి చెప్పెదను వినుము.
శ్లోకం13: పంచైతాని మహాబాహో ! కారణాని నిబోధ మే ,
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తని సిద్ధయే సర్వకర్మణామ్॥
(ప్రకృతి).
భావము: సర్వకర్మలు ఆచరించుటకు సాంఖ్యసూత్రము ప్రకారము ఐదు కారణములు ఉన్నవని చెప్పబడినవి. వాటిని వివరింతును తెలుసుకొనుము.
శ్లోకం 61: ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జునతిష్ఠతి ,
భ్రామయన్ సర్వభూతాని యన్త్రా రూఢాని మాయయా .
(పరమాత్మ).
భావము : సర్వ జీవరాసుల శరీర హృదయములందు పరమాత్మ తిష్ఠవేసి ఉండి, యంత్రమునెక్కి ఆడించువానివలె తన మాయచేత సర్వభూతములను ఆడించుచున్నాడు.
శ్లోకం 65: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ,
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే .
(గీతా సారాంశము).
భావము : నన్ను నీ మనస్సున తలంపుము. నీవు నా భక్తునిగ ఉండుము. నన్నే పూజించుము. నన్నే నమస్కరింపుము. నన్నే పొందగలవు. ఇది సత్యము. నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.
శ్లోకం 66: సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ ,
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః .
(గీతా సారాంశము).
భావము : సర్వధర్మములను సంపూర్ణముగ వీడి నన్ను మాత్రమే నీవు శరణు కోరుము. నిన్ను పాపనియచంబులో నుండి ముక్తుని చేతును. దుఃఖింపకుము.
.........

01. సమస్త జీవరాసులందు కలిసియున్నది ఆత్మ!
02. అఖిల జీవులందు ఒకే చైతన్యముగనున్నది ఆత్మ!
03.గాలిలో గంధము కలిసి కనిపించనట్లు, శరీరములో కంటికి
కనిపించక ఉన్నది ఆత్మ!
04. సాక్షియై అన్ని శరీరములందున్న అందరిలో ఉన్నది ఆత్మ!
05. శక్తిరూపములో శరీరమంతయూ వ్యాపించియున్నది ఆత్మ!
06. సమస్త జీవులందు కార్యరూపమై ఉన్నది ఆత్మ!
07. సమస్త జీవులందు చైతన్యముగనున్నది ఆత్మ!
08.మూడు ఆత్మలలో రెండవదైనది మధ్యాత్మ!
09. అఖిల జీవరాసులందు అన్ని పనులు చేయిస్తున్నది ఆత్మ!
10. సమస్త జీవరాసులందు చైతన్యరూపమై ఖండ ఖండములుగా
శరీరములో వ్యాపించి ఉన్నది ఆత్మ!
11. సర్వ జీవరాసులందు నివశిస్తూ, ఆయా శరీర ఆకారము
కల్గియున్నది ఆత్మ!.
12. శరీరమను గుడిలో దీపమై శరీరమంతటికీ వెలుగు నిచ్చుచున్నది
ఆత్మ!
13. సమస్త శరీరములలో జీవునితోపాటు ఉంటూ, ఆ శరీరమునకు
శక్తినిచ్చుది ఆత్మ!
14. ముగ్గురు పురుషులలో అక్షర పురుషుడై శరీరములోనున్నది ఆత్మ!
15. ప్రతి శరీరములో జీవాత్మలకు సాక్షిగాయున్నది ఆత్మ!
16. ఇంద్రియములకు శక్తినొసగునది ఆత్మ!
17.కొలిమి మంటకు గాలితిత్తి, తిత్తిని కదిలించు కట్టె, కట్టెకు చివర
కూర్చొని కదిలించుచున్న వ్యక్తి, ఎలాగ అనుసంధానమై ఉన్నారో,
అలాగే శరీరములో ముక్కులలోని శ్వాసకు ఊపిరితిత్తులు, తిత్తులకు
బ్రహ్మనాడి, నాడికి చివరలోవుండి అన్నిటినీ కదిలించునది ఆత్మ!
18. శరీరములో శ్వాసను నడిపించునది ఆత్మ!
19. సమస్త జీవులందు ఒకేపని చేయుచున్నది ఆత్మ!
20. రెండవ ఆత్మయై శరీరములో అన్ని పనులూ చేయుచున్నది ఆత్మ!
21. శరీరములో నివాసముంటున్న మూడు ఆత్మలలో అహర్నిశలు జీవున్ని
కాచుకొనియుండునది, రెండవది ఆత్మ!
23.22. ముగ్గురు పురుషులలో మధ్యవాడై, పూజ్యుడైయున్నది ఆత్మ!
సమస్త సజీవ శరీరములందు నఖ, శిఖ పర్యంతమూ వ్యాపించి
శరీరములోని అన్ని అవయవముల చేత పనులు
చేయించుచున్నది ఆత్మ!
24.శరీరములోని జీవునికి సాక్షిగానున్నది ఆత్మ!
25. పూలహారములో ఆధారమై దాగియున్న దారమువలె శరీరములో
కనిపించక శరీరములకంతటికీ ఆధారమైయున్నది ఆత్మ!
26.శరీరాంతర్గతములలో ఉండి జ్ఞానము చేత పొగడబడునది ఆత్మ!
27.సమస్త జీవ శరీరములలో మూడు గుణముల మధ్య సాక్షిగా
యున్నది ఆత్మ!
28. అఖిల జీవులతో కూడియున్నది ఆత్మ!
29.సమస్త జీవరాసులయందు గల మూడు ఆత్మలలో మధ్యనున్నది
ఆత్మ!
30. చిన్న చీమలలోనూ పెద్ద ఏనుగులోనూ ఒకే విధానము కల్గి కర్మను
పాలించునది ఆత్మ!
31. శరీరములోని అన్ని భాగములకు శక్తి నిచ్చుచూ ఎవరికీ
తెలియకుండా వున్నది ఆత్మ!
32.అందరి శరీరములలో ఎవరికీ తెలియకుండా నిదురలోనూ,
మెలుకువలోనూ అందరియందూ పనిచేయుచున్నది ఆత్మ!
33. అద్వైతాది మహా మునులు శరీరములో ఉన్నది నేను ఒక్కడినేనని
చెప్పుకొనుచుండినప్పటికీ ఆత్మ మాత్రము వేరుగాయుండి జీవుని
కర్మ ననుసరించి శరీరమును కదిలించుచూ, జరిగెడి ఏ కర్మకూ బాధ్యుడు కానిది ఆత్మ!
34. శరీరములో అణువణువునా వ్యాపించి విధిని అనుసరించి శక్తినిచ్చునది ఆత్మ!
35. శరీరములో బాహ్య ప్రపంచముతో సంబంధము పెట్టుకొని ఎల్లవేళలా పనిచేయుచున్నది ఆత్మ!
36. శరీరములో ఏమాత్రము నిద్రలేకుండా ఎల్లప్పుడూ మేల్కొని పనిచేయుచున్నది ఆత్మ!
37. ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆత్మగా, జీవాత్మకు తోడున్నది ఆత్మ!
38. శరీరాంతర్గతమై బాహ్య దృష్ఠికి కనిపించక, జీవాత్మలైన స్వాములు, మునులు కూడా నేనే ఆత్మనని తలపోయునట్లు చేసి తాను మాత్రము వేరుగానున్నది ఆత్మ!
39. జీవాత్మకు పరమాత్మకు మధ్యనగలది ఆత్మ!
40. చెట్టులో తేమ వ్యాపించినట్లు, శరీరములో శక్తిగా వ్యాపించి యున్నది ఆత్మ!
41. ఇనుముతో కలిసిన అగ్నికి కూడా కొలిమి దగ్గర సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు, జీవునితో చేరి శరీరమంతా వ్యాపించి అప్పుడప్పుడు ఆకలికి శక్తిహీనత చెందుచున్నది ఆత్మ!
42. శరీరములో బ్రహ్మనాడిని కేంద్రముగా చేసుకొని శరీరమంతా వ్యాపించియున్నది ఆత్మ!
43. జీవాత్మకు పెద్దవాడు, పరమాత్మకు చిన్నవాడయినది ఆత్మ! జీవుని పాత్రదారునిగా ఆడించునది ఆత్మ!
44. సమస్త శరీరములలో నాశనమగు జీవాత్మతో కలిసి నివాసము చేయుచున్నా నాశనముకానిది ఆత్మ!
45. శరీరమందు మాత్రము శక్తిగయున్న రెండవది ఆత్మ! 
46. శరీరమందు కర్మానుసారము కదలికలిచ్చుచూ, కర్మానుసారము రోగములు కలుగజేయుచూ, వాటిని అనుభవింపజేయునది ఆత్మ!
47. శరీరములోని మూడు ఆత్మలలో మధ్య ఆత్మయై శరీరమును నడిపించు శక్తియున్నది ఆత్మ!
48.శరీరములో ఎవరూ గుర్తించలేని విధముగా శరీర ఆకృతిని పోలియుండునది ఆత్మ!
49. శరీరములోని బ్రహ్మనాడిని స్థావరముగ ఏర్పరచుకొని శరీర మంతటా నఖ శిఖ పర్యంతము వ్యాపించి శరీరాకృతిని పోలియున్నది ఆత్మ!
50. శరీరము లోపల జరుగు సమస్త కార్యములకు సాక్షియైయున్నది ఆత్మ!
51. అకాల మరణము పొందినవానికి శరీరము పోయినప్పటికీ అదే శరీరాకృతి కల్గి, సూక్ష్మముగా కనిపించక వాని కర్మానుసారము ఆడించునది ఆత్మ!
52.మరణముండి నాశనము లేనిది ఆత్మ!
53. ఆకాశముననున్న సూర్యుడొక్కడే ప్రపంచమంతటినీ తన వెలుగుచే ప్రకాశింపజేసినట్లు, బ్రహ్మనాడియందుండి శరీరమంతటా చైతన్యముగా వ్యాపించియున్నది ఆత్మ! 
54.శరీర గృహములో యజమానియైనది ఆత్మ!
55.హృది మధ్యలో నివాసముజేయుచూ సూత్రధారియైయుండి జీవుని పాత్రదారునిగా ఆడించునది ఆత్మ!
56.సమస్త జీవులందు ఏకకార్య స్వరూపుడయినది ఆత్మ! 
57.పురుషులందు రెండవ వాడయిన అక్షర పురుషుడు ఆత్మ!
58. సమస్త జీవులందు కదలిక శక్తినిచ్చునది ఆత్మ!

59. ముందు తానుండి తన వెనుక జీవున్ని పెట్టుకొనినది ఆత్మ!
60. పరమాత్మ ప్రక్కనుంచుకొని జీవునితో కలిసియుండి శరీరముతో
పనులు చేయునది ఆత్మ!
61. అన్ని జీవులందు వేరువేరుగా కలిసియున్నది ఆత్మ!
62. శరీరము వెలుపల ఏమాత్రము లేక లోపల మాత్రము
చైతన్యముగానున్నది ఆత్మ!
63. అఖిల జీవులందు కలిసియున్నది ఆత్మ!
64. మూడు గుణములకు వేరుగ వున్నది ఆత్మ!
65. జీవుల ప్రక్కనేనున్నది ఆత్మ!

66. కాగిన ఇనుములో అగ్నియున్నట్లు, సమస్త జీవుల శరీరములందు
ఇమిడియున్నది ఆత్మ!
67. సూర్యుడొక్కడు ఈ లోకమును ప్రకాశింపజేయునట్లు,
శరీరమంతటినీ తానొక్కడే ప్రకాశింపజేయునది ఆత్మ!
68. నాశరహితుడై నాశనముకాగల జీవాత్మతో కూడివున్నది ఆత్మ!
69. పూసల మధ్యలో దారమున్నట్లు, జీవుల శరీర మధ్యలో శరీరమంతటికీ
ఆధారమైయున్నది ఆత్మ!
70. ఎడతెరిపి లేకుండా ఎల్లకాలములందు జీవునితో కలిసియున్నది ఆత్మ!
71. చర ప్రకృతియైన శరీరమంతటా వ్యాపించియున్నది ఆత్మ!
72. పంచభూత నిర్మాణమైన శరీరమునకు ఆధారముగనున్నది ఆత్మ!
73. పరమాత్మయూకాక, జీవాత్మయూకాక కేవలము ఆత్మయై జీవాత్మతో
పాటు శరీరములోనున్నది ఆత్మ!
74. మొదటిదయిన జీవాత్మకు, మూడవదయిన పరమాత్మకు మధ్య
సంధానమైయున్న రెండవది ఆత్మ!
75. కాగిన ఇనుములో ఇనుమంతయూ అగ్ని వ్యాపించి యున్నట్లు,
శరీరమంతా వ్యాపించియున్నది ఆత్మ!
76. పరమాత్మ పాలించు విశ్వమను సామ్రాజ్యములో శరీరమను
సామంత రాజ్యమునకు రాజయినది ఆత్మ!
77. ప్రపంచమంతటికీ గల ముగ్గురు పురుషులలోనూ మధ్య పురుషుడుయై
అక్షర పురుషుడని పేరుగాంచి, క్షరపురుషునివద్ద నిలచినది ఆత్మ!
78. శరీరములో సకలేంద్రియములకు శక్తినిచ్చునది ఆత్మ!
79. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములకు ఇరుసుగ నున్నది ఆత్మ!
80. జ్ఞానులయందునూ, అజ్ఞానులయందునూ, మూర్ఖులయందునూ,
తెలివైన వారియందునూ, మంచివారియందునూ, చెడువారి
యందునూ, అన్ని మతములవారియందునూ ఒకే పద్దతి కల్గి, ఒకే
విధముగా రాగము (ప్రేమ) గానీ, ద్వేషముగానీ లేకుండా వర్తించునది
ఆత్మ!
81. పురుషాకృతియైన ఈశ్వరలింగము మీద ముగ్గురు పురుషుల
గుర్తుగయున్న మూడు విభూతి రేఖలలో మధ్య రేఖగా గుర్తింపబడి
యున్నది ఆత్మ!
82.శరీరములోనే దృష్ఠినిల్పి దేవుని తెలియవలెనని ప్రయత్నించు
యోగులకు తెలియబడు రెండవది ఆత్మ!
83. పూలమాలకు ఆధారమైన దారమువలె, శరీరమునకు ఆధారమై
యున్నది ఆత్మ!.


84.సకల శరీరములందు మూడవస్థలలో చైతన్యమునిచ్చునది ఆత్మ!
85.పాపము చేయునపుడు, పుణ్యము చేయునపుడు ఒకే విధముగా
శరీరమునకు శక్తినిచ్చి, ఏ కర్మ అంటకుండా ఉండునది ఆత్మ!

86. భువిలో ఎన్ని జీవరాసులున్నాయో అన్నిటిలోనూ అన్ని ఆత్మలుగా
విభజించబడి, పరమాత్మ ప్రతినిధిగా ప్రకృతిలో కలిసి శరీరములో
పనిచేయుచున్నది ఆత్మ!
87.ఏ విషయముతో సంబంధము లేకుండా శరీరములోని కర్మ
ప్రకారము శరీరమును నడిపించునది ఆత్మ!
88. శరీరములోని బ్రహ్మనాడి యొక్క ఏడు ద్వారముల ద్వారా
మరియు గ్రంథుల యొక్క ఏడు ద్వారముల ద్వారా శరీరమును
పాలించునది ఆత్మ!
89. సమస్త జీవరాశుల బుద్ధికి సమానముగా అర్థమగునది ఆత్మ!
90. అయమాత్మ బ్రహ్మమని సమస్తయోగుల చేత ఉచ్ఛరించబడునది
ఆత్మ!
91. జాగ్రత్త, స్వప్న, నిద్రయనబడు మూడవస్థలకు సాక్షిగనున్నది
ఆత్మ!
92.మూడు ఆత్మలయందు మధ్య ఆత్మయై, సమస్త యోగులచే
ఆరాధింపబడునది ఆత్మ!
93. శరీరములోని 25 భాగములకు అతీతముగాయుండి, శరీరమంతటికీ
శక్తినొసగునది ఆత్మ!
94. పరమాత్మకంటే తక్కువవాడై, జీవాత్మకంటే ఎక్కువ వాడైయున్నది
ఆత్మ!
95. ఇంటిలో విద్యుచ్ఛక్తిలాగా, శరీరములో చైతన్య శక్తియైయున్నది
96.ఆత్మ!యోగులయందునూ, భోగులయందునూ సమాన వృత్తి కలిగి
యున్నది ఆత్మ!
97. శరీరములో అణువణువునా వ్యాపించి శరీరాంతర్గత పనులకు
కారణశక్తియై యున్నది ఆత్మ!
98.
అండజ, పిండజ, ఉద్భిజములైన మూడు రకముల జీవరాశులలో
ఏ జీవరాశియందైనాగానీ, ఒకే సిద్దాంతము, ఒకే నిర్ణయముగా,
ఒకే పద్ధతిగా పనిచేయునది ఆత్మ!
99. జీవాత్మ ఏ శరీరములో ప్రవేశించినా, దానివెంట ఆ శరీరములో
ప్రవేశించి అక్కడ కర్మరీత్యా ఏమి జరుగవలెనో, ఆ పనులను శరీరము
ద్వార చేయించునది ఆత్మ!
100. శరీరములో పని తాను చేసి ఫలితమును జీవాత్మకు అందించేది
ఆత్మ!
101. శరీరములోని ప్రాణమునకు ఆధారమై ఆడించుచున్నది ఆత్మ!
102. నేను పుట్టినప్పటినుండి నాలో అన్ని పనులకు సాక్షిగయుంటూ
ప్రారబ్ధమును నాచేత అనుభవింపజేయునది ఆత్మ!
103. శరీరమనెడి రథమునకు సారథిగయుండి, ఇంద్రియములనెడి
గుఱ్ఱములను త్రోలు సారథియై, శరీర రథమును అధిష్ఠించి యున్న
జీవునికి సుఖదు:ఖములనెడి అనేక ప్రదేశములను చూపుచున్నది.
ఆత్మ!
104. చెట్టుకు తాట అనుబంధమై ఉన్నట్లు, శరీరములోని జీవాత్మకు శక్తి
రూపములో అనుబంధమైయున్నది ఆత్మ!
105. సంసారమను నాటకమునకు పరమాత్మ సూత్రధారికాగా,
నాటకమును వీక్షించుచూ నాటకములోని భావములను
అనుభవించు ప్రేక్షకుడు జీవుడుకాగా, నాటకమును ఆడునది ఆత్మ!
106. శరీరములో ఆత్మ చేస్తున్నప్పటికీ జీవాత్మ తాను చేసినట్లు తలచితే,
ఆ పనిలోని కర్మను జీవునికి అంటగట్టునది ఆత్మ!

107. శరీరములో ప్రారబ్దకర్మ ప్రకారము సుఖదు:ఖములను ఆడించుచూ,
అహము పొందిన జీవాత్మ పాలిట చిత్రగుప్తుడుయై, ఆగామి కర్మను
అంటగట్టునది ఆత్మ!
108. మంచి చెడు కర్మలను తారతమ్యము లేకుండా ఆచరించుచూ,
పాపపుణ్యములకు సంబంధము లేనిది ఆత్మ!
109. అజ్ఞానులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచూ ఆగామి కర్మను
అంటగట్టుచూ, జ్ఞానము తెలిసిన యోగులలో ప్రారబ్ధమును
అనుభవింపజేయుచూ, ఆగామి కర్మను అంతము చేయుచున్నది ఆత్మ!
110. శరీర యంత్రాంగములో 24 భాగములను ఒక్క జీవుని కొరకు
నడిపిస్తూ పరమాత్మకు బంటుగ నిలిచినది ఆత్మ!
111. శరీరములో ఆత్మ ఏమి చేయుచున్నది ఎవరికీ తెలియనీయకుండా
నిద్రించు సమయములో కూడా శ్వాసను నడుపుచున్నది.
అటువంటి ఆత్మ ఉనికిని తెలియక అన్ని నేనే చేయుచున్నానని
జీవుడు భ్రమిస్తున్నప్పటికీ ఏ పనినీ జీవునికి వదలక అన్ని
పనులనూ ఎంతో ఓర్పుగా చేయుచున్నది ఆత్మ!
112. శరీరములో తప్ప బయట ఎక్కడా ఏ వస్తువందూ లేనిది ఆత్మ!
113. శరీరములో బుద్ధికి తెలియని విద్యలయిన, జంతువు చిన్నతనము
లోనే నీటిలో ఈదడమును, దూడ పాలపొదుగును గుర్తించడమును,
ఐదు సంవత్సరముల చిన్నవయసు మనిషికి పాండిత్యము కలుగడము
మొదలగు వాటిని తెలియజేయుచూ ఏమీ తెలియని దానివలెనున్నది
ఆత్మ!
114. జీవుడు ధరించిన శరీరము ఎంత పరిమాణముండునో అంతే లావు,
అంతే ఎత్తు కల్గి ఆ శరీర ఆకృతిని కల్గియున్నది ఆత్మ!
115. శరీరములో అంతటా వ్యాపించియుండి, కర్మవుంటే చేతిలోనో,
కాలిలోనో శక్తి లేకుండా చేసి, అవిటివానిగా కనిపింపజేయుచూ
జీవునికి కర్మను అనుభవింపజేయునది ఆత్మ!
116. శరీరములో ప్రారబ్ధకర్మను జీవుని చేత అనుభవింపజేయు
యమధర్మరాజుయై, అహముగల వానికి ఆగామికర్మను తలకు
ఎక్కించడములో చిత్రగుప్తుడుయై చలామణి అగునది ఆత్మ!
117. మరణములోనూ, పుట్టుకలోనూ జీవునివెంట వుండి మరణము
నుండి పుట్టుక వరకు గుణములనూ, జీవుని కర్మ సముదాయమునూ
తీసుకువస్తున్నది ఆత్మ!

118. శరీరములో అన్ని పనులు చేయుచూ, ఏ ఒక్క పనిని కూడా నేను
చేశానని బయటికి తెలుపక, ఎన్నో విజ్ఞాన పరికరములను
కనిపెట్టించు యోచనను ఇచ్చినప్పటికీ ఏమీ తెలియని జీవుడు
నేను కనిపెట్టానని చెప్పుకొనుచున్నప్పటకీ ఊరక చూస్తుండినది
ఆత్మ!
119. చావులోనూ, పుట్టుకలోనూ సాక్షీభూతుడుయై ఆ సమయములో
ఏమి జరుగుచున్నదో ఎవరికీ తెలియని రహస్యమును తెలిసినది
ఆత్మ!
120. చెట్టులో చెట్టు ఆకృతిని పోలియుండి, జంతువులో జంతువు ఆకృతిని
పోలియుండి, మనిషిలో మనిషి ఆకృతిని పోలియుండి అనేక
శరీరములలో ఆ శరీరములవలె అనేక ఆకారములు కల్గియున్నది
ఆత్మ!

------------
only