34. జీవిత పరీక్షలో కాపీలొద్దు!
సినిమాలో కాపీ సీన్ కనిపిస్తే ఆ దర్శ
కుడిపై ట్రోల్స్తో విరుచుకుపడతాం!
కట్టుబొట్టు వ్యవహారాల్లోనూ ఎవరి
నైనా అనుకరిస్తే.. 'కాపీ క్యాట్' అని
ఆటపట్టిస్తాం. ఆర్థిక విషయాల
దగ్గరికి వచ్చేసరికి ఇతరుల
విధానాలను అనుకరించే ప్రయత్నం
చేస్తుంటాం. ఎక్కడైనా 'మక్కీకి మక్కీ'
కాపీ కొట్టొచ్చేమో కానీ, పొదుపు-
మదుపు దగ్గర ఇతరులను గుడ్డిగా
ఇమిటేట్ చేస్తే పులిని చూసి నక్క
వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది.
ధనవంతులు కావడం, ధనవంతుల్లా కనిపించడం ఈ రెండిటికి హస్తిమశకాం
తరం తేడా ఉంది. శ్రీమంతులు కావడం కష్టమైన పని. కలవారిలా కనిపిం
చడం తేలికే! అందుకోసం వారిని అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు చాలా
మంది. పరీక్షల్లో ఎదుటివారి జవాబు పత్రాన్ని తొంగితొంగి చూడటం సాధార
ణంగా జరిగేదే. కాపీ కొట్టడం తప్పే అయినప్పటికీ, ఆ ఇద్దరు విద్యార్థుల ప్రశ్న
పత్రం ఒకటే కాబట్టి.. బాగా రాసిన విద్యార్థికి, అందులోంచి కాపీ చేసిన విద్యార్థికి
మంచి మార్కులే వస్తాయి. కానీ, ఈ కాపీ సూత్రం పైసల ముచ్చట్లకు పనికిరాదు.
ఎందుకంటే, ఏ ఇద్దరి జీవితాలూ ఒకేలా ఉండవు! ఏ రెండు కుటుంబాల అవస
రాలు ఒకేవిధంగా ఉండవు!! అలాంటప్పుడు ఎదుటివారి ప్రణాళికలు పాటిస్తే
ఆశించిన ప్రయోజనం సిద్ధించకపోగా, అసలుకే ఎసరొచ్చే ప్రమాదమూ ఉంది.
ప్రాధాన్యం ఎరిగి..
మీ అవసరాలు ఏమిటి? ఏ సమయానికి ఎంత అవసరం అనే స్పష్టత ఉండాలి. ఆర్థిక ప్రణాళి
కలో రెండు 'పీ'లు.. ప్రయారిటీస్ (ప్రాధాన్యాలు), ప్రాబబిలిటీస్ (ప్రమాదాలు) ముఖ్యమై
నవి. జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటో నిర్దేశించుకోవాలి. ఆయా సమయాలకు తగ్గ
ట్టుగా ఆర్థిక ప్రయోజనం పొందే విధంగా ప్రణాళికలు వేసుకోవాలి. పిల్లల చదువు, పెండ్లి, మీ
రిటైర్మెంట్ వీటిని ప్రధాన లక్ష్యాలుగా పరిగణించాలి. కూతురు పైచదువుల్లోకి ఏ సంవత్సరం
వెళ్తుంది, అప్పుడు ఫీజు ఎంత ఉండొచ్చన్న అంచనా ఉండాలి. 20 ఏండ్ల తర్వాత రిటైర్ అవుతున్నారనుకోండి,
అప్పుడు నెలవారీగా ఎంత మొత్తం అవసరం అవుతుందన్న కనీస అవగా
ఉండాలి. అందుకు తగ్గట్టు ఆదాయం వచ్చేలా ఇన్వెస్ట్ చేయాలి. అన్ని రోజులూ ఒకేలా
ఉండవు. ఆర్థికంగా ఎంత క్రమశిక్షణతో ఉన్నా, ఊహించని ఇబ్బందులు ప్రణాళికలను తలకిం
దులు చేస్తాయి. అలాంటి అనుకోని సమస్యల్లో ప్రధానమైనది అనారోగ్యం. సంపాదించే వ్యక్తి
అనారోగ్యం పాలైతే ఈ రోజుల్లో ఖర్చు లక్షల్లో పైమాటే! ఈ భారం మీద పడొద్దంటే..ఆరోగ్య
బీమా తప్పనిసరి. దీంతోపాటు జీవిత బీమా తోడుంటే నిశ్చింతగా ఉండొచ్చు..
అంచనా వేసి..
దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశిస్తే సరిపోదు, అప్పుడు ఉండే పరిస్థితులను కూడా సరిగ్గా
అంచనా వేయగలగాలి. ఉదాహరణకు హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు తీసుకొని హమ్మయ్య
అనుకుంటారు. కానీ, ఈ రోజు ఉన్న ధరలు పదేండ్లకు రెట్టింపు అవుతాయి. పది ఏండ్ల
కిందట కీళ్ల మార్పిడికి 60 వేలు ఉంటే సరిపోయేది. ఇప్పుడు 3 లక్షల
వరకు ఖర్చు వస్తుంది. ఇంకో పదేండ్లు పోతే 9 లక్షలు కావొచ్చు. పెరుగుతున్న ధరలను
దృష్టిలో ఉంచుకొని వీలైనంత ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవడం ముఖ్యం. ఎక్కువ
కవరేజీ పాలసీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువగా కట్టాల్సి వస్తుంది కదా? అంటారా! 5
లక్షల పాలసీకి, 50 లక్షల పాలసీకి ప్రీమియంలో వ్యత్యాసం ఏడాదికి సుమారు 15
వేలే! అంటే నెలకు 1250 మాత్రమే! అలాంటప్పుడు ఎక్కువ కవరేజీ ఉండే ఆరోగ్య
బీమా తీసుకోవడమే మంచిది! పిల్లల చదువు విషయంలోనూ పదేండ్ల తర్వాత ఫీజులు ఎంత
ఉండొచ్చనే అంచనాకు వచ్చి, అందుకు తగ్గ ఆదాయం సమకూరే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం
శ్రేయస్కరం.
ప్రశాంతత కోల్పోవద్దు.
ఎవరినో చూసి సంపద కోసం పరుగులు తీయడం సరైన పద్ధతి కాదు. రాత్రికి రాత్రే రెండిం
తల లాభాలు రావాలని ఆశించి పెట్టు బడులు పెడుతుంటారు. అయాచితంగా లాభాలు వచ్చి
పడే చోట ఊహించని ప్రమాదాలూ ఉంటాయి. డబ్బుల గురించి అతిగా ఆలోచించి జబ్బులు
తెచ్చుకోవద్దు. జీవితానికి ముఖ్యంగా కావాల్సింది ప్రశాంతత. దాన్ని పణంగా పెట్టి ఎన్ని
సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం? పిల్లలకు మంచి చదువు చెప్పించడం బాధ్యత. శేష
జీవితం విశేషంగా సాగేలా ఏర్పాటు చేసుకోవడం వ్యక్తిగత అవసరం. ఈ రెండిటినీ సాధించిన
తర్వాతే మరేదైనా!! ‘పక్కింటి వాళ్లకు కోట్లు ఉన్నాయి, బంధువులకు బంగ్లాలు ఉన్నాయి.
అని కాసుల వేటలో పడితే ఆస్తులు పెరగొచ్చు కానీ, సంతృప్తి
మిగలదు!