missed topics in b.gita ;
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ జ్ఞాన యోగము
☞
(3) శ్లో।। 35: యథ్ జ్ఞా త్వాన పునర్మోహ మేవం యాస్యపి పాండవ ।
యేన భూతాన్య శేషేణ ద్రక్ష్య స్యాత్మన్యథో మయి ।।
(బ్రహ్మయోగము)
భావము : ఏ జ్ఞానము చేత మోహము కలుగదో, ఏ జ్ఞానము చేత సమస్త జీవరాసులలో ఆత్మను, ఆత్మలో జీవరాసులున్నట్లు తెలియునో అట్టి జ్ఞానము పొందగలవు.
వివరము:- తత్త్వవేత్తలైన గురువులవద్ద జ్ఞానమార్జించితే, అట్టి జ్ఞానము చేత సాధనా పరులై తనలోని ఆత్మదర్శనమును పొందుదురు. ఆత్మ విషయము తెలిసి పోయిన తర్వాత ఆత్మలేని జీవరాసిలేదని, తనయందున్నట్లే అన్ని శరీరరములోను ఆత్మ ఉన్నదని సులభముగ తెలియును. శరీరములో ఆత్మ, ఆత్మలో శరీరమున్నట్లు తెలిసిపోవును. గురువుగారి వద్ద కర్మలు పోవు జ్ఞానము తెలుసుకొమ్మని చెప్పాము కదా! అలా గురువు కర్మ నిర్మూలనా విధానములు రెండునూ బోధించిన పిమ్మట, అందులో ఒకటైన బ్రహ్మయోగములో ఆత్మను చూడగలరు. కంటితో కాదు జ్ఞానదృష్ఠికి ఆత్మ తెలియును. రెండవదైన కర్మయోగములో ఆత్మదర్శనము అనుమాటయే ఉండదు. కర్మయోగములో సాధారణముగా పనులు చేయుట తప్ప ఏ సాధన ఉండదు. కర్మయోగములో లోపలి సాధన తప్ప బయట కనిపించునట్లు ఏమీ ఉండదు. బ్రహ్మయోగము బయటికి కనిపించు సాధనగాయుండును. ఆత్మను తెలియుట బ్రహ్మయోగములోనే సాధ్యమని తెలియాలి.
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ జ్ఞాన యోగము
☞
(3) శ్లో।। 36: అపి చేదసి పాపేభ్యస్సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనై వ వృజినం సంతరిష్యసి ।।
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము:- అఖిల పాపాత్ములందు నీవెంత అధమ పాప యుతుడవైనప్పటికి, పాపమను సముద్రమును జ్ఞానమను చిన్న ఓడచే దాటగలవు.
వివరము:- ఎన్నో జన్మల నుండి పాపము సంపాదించుకొని సంచితకర్మ సముద్రమువలె ఉన్నప్పటికి, కర్మలు కాల్చు విధానము తెలుసుకొనుటవలన, యోగమను ఓడచే కర్మలను సముద్రమును సులభముగ దాటగలవు. ఎంత పెద్దకర్మలు కలవాడైనను దిగులుపడవలసిన అవసరము లేదు. ఎందుకనగ గురువువద్ద నుంచి తీసుకొన్న అగ్నితో జ్ఞానయజ్ఞము శరీరములో జరుగులాగున, కర్మయోగము ఆచరించు విధానము తెలిసియున్నపుడు భయపడవలసిన పనిలేదు. కర్మలనుంచి సులభముగ బయటపడగలవు. పెద్ద సముద్రమునైనా చిన్న పడవతో దాటునట్లు ఎంత కర్మనైనా చిన్న అగ్నితో కాల్చివేయవచ్చును. ఆ విషయమే క్రింది శ్లోకములో చెప్పుచున్నాడు.